
అమరులకు కొవ్వొత్తులతో నివాళి
ఐఎంఏ సభ్యుల కొవ్వొత్తుల ర్యాలీ
మంచిర్యాలటౌన్/మంచిర్యాలక్రైం: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలో బీజేపీ, ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ సామాన్య ప్రజలపై ఉగ్రవాదుల దాడులు సరికాదన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరం జగన్, వైద్యులు పి.రమణ, ఏ.వెంకటేశ్వరరావు, ఏ.స్వరూపరాణి, విద్యార్థులు పాల్గొన్నారు.

అమరులకు కొవ్వొత్తులతో నివాళి

అమరులకు కొవ్వొత్తులతో నివాళి