
ఎల్‌ఆర్‌ఎస్ రుసుం వసూలు వేగవంతం చేయాలి
● రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్
మంచిర్యాలఅగ్రికల్చర్: ఎల్‌ఆర్‌ఎస్‌లో భాగంగా భూముల క్రమబద్ధీకరణ కోసం అందిన దరఖాస్తులకు సంబంధించి అర్హులైన లబ్ధిదా రుల నుంచి రుసుం వసూలు ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి ఇతర ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులతో ఎల్‌ఆర్‌ఎస్ రుసుం వసూలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులు ఈ నెల 30 లోగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, రు సుం చెల్లించిన వారికి ప్రొసీడింగ్స్ అందజేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.