
యువతిని వేధించిన యువకుడి అరెస్ట్
బోథ్: మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని సోషల్ మీడియాలో వేధించిన నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలంలోని కందుకుర్తి గ్రామానికి చెందిన అలీమ్ బేగ్ అనే యువకుడిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు బోథ్ ఎస్సై ఎల్. ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బోథ్ మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అలీమ్‌బేగ్ వేధిస్తున్నాడు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి అలీమ్‌బేగ్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా అలీమ్‌బేగ్‌పై రౌడీషీట్ ఉన్నట్లు వారు పేర్కొన్నారు. రెంజల్ పోలీస్‌స్టేషన్‌లో నాలుగు కేసులు, డిచ్‌పెల్లి పోలీస్‌స్టేషన్‌లో 2023లో అలీమ్‌బేగ్ వద్ద నుంచి 17 బైక్‌లు రికవరీ చేసినట్లు తెలిపారు.