
మే 20న దేశవ్యాప్త సమ్మె
మంచిర్యాలటౌన్: కేంద్ర ప్రభుత్వం అవలంబి స్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ని మార్క్స్ భవన్‌లో శుక్రవారం కార్మిక సంఘా ల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27న కార్మిక సంఘాల సదస్సును మార్క్స్ భవ న్‌లో నిర్వహిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు టి.శ్రీని వాస్, టీయూసీఐ జాడి దేవరాజు, టీఎన్టీయూసీ మణిరామ్‌సింగ్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు మిట్టపల్లి పౌలు, ఖలీందర్ అలీఖాన్, సీఐటీయూ రాజేశ్వరి, ఐఎఫ్‌టీయూ నాయకులు మేకల రాములు, చిన్నయ్య, రాజేశం, సు రేందర్, గణేశ్, తదితరులు పాల్గొన్నారు.