
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్ ● కొనుగోలు కేంద్రాల సందర్శన
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/లక్సెట్టిపేట/దండేపల్లి: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని బీజేపీ నాయకులు విమర్శించారు. శనివారం బీజేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన నిర్వహించారు. హాజీపూర్ మండలం పడ్తనపల్లి, కర్ణమామిడి, లక్సెట్టిపేట మున్సిపాల్టీ పరిధి ఇటిక్యాల, దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు రఘునాథ్, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని ధా న్యం కొనుగోలు విషయంలో అధికారులు, కేంద్రాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకూరి రమేష్, శ్రీనివాస్, పురుషోత్తం, రమణారావు, కృష్ణమూర్తి, స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.