
అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం
తాంసి: మండలంలోని జామిడికి చెందిన పర్ధాన్ దేవుబాయి ఇల్లు అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. ఒంటరిగా ఉంటున్న ఆమె గురువారం ఉదయం ఇంట్లో దేవుని చిత్రపటం వద్ద దీపం పెట్టి ఉపాధి పనికి కూలీలతో వెళ్లింది. వెలిగించిన దీపం వస్తువులకు అంటుకొని మంటలు వ్యాపించింది. గమనించిన గ్రామస్తులు వెంటనే మోటార్ల ద్వారా నీటిని చల్లి మంటలార్పివేశారు. అప్పటికే ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, దుస్తులు, రూ.20వేల నగదు కాలిపోయాయి. ఇంటి పైకప్పు దెబ్బతింది. దాదాపు రూ.లక్షకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్‌రెడ్డి ఘటనస్థలానికి చేరుకుని బాధిత మహిళను పరామర్శించారు. నెలకు సరిపడా సరుకులతోపాటు నగదు అందజేశారు. యూత్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ ఆర్థికసాయం అందజేశాడు.