
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
శ్రీరాంపూర్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ విమర్శించారు. నస్పూర్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ లను నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు. గెలిచిన తరువాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఎమ్మెల్యేలను మంత్రులు చేయడానికి గెలిపించలేదని, వారి హామీలు అమలు చేస్తారని నమ్మి గెలిపించారన్నారు. జిల్లాలో గంజాయి బ్యాచ్ పెట్రోగిపోతుందన్నారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల పై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండించారు. అధికా రులు కాంగ్రెస్ పార్టీ అడుగులకు మడుగులొత్తున్నారని, వారు తమ పద్ధతి మార్చుకుని నిస్పక్షపాతంగా పని చేయాలన్నారు. పదేళ్లలో జరిగిన అభివృద్ధిని ఇప్పటికి కాంగ్రెస్ జీర్ణించుకోవడం లేదన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆనవాళ్లు కనిపించుకుండా చేస్తున్నారన్నారు. పార్టీ రజతోత్సవ వేడుకల కోసం చెన్నూర్‌లో వాల్‌రైటింగ్, పోస్టర్లు వేస్తే చింపివేస్తున్నారన్నారు. ఈనెల 27 ఎల్కతుర్తిలో జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరా వాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, డాక్టర్ రాజారమేశ్, పార్టీపట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్‌కుమార్ పాల్గొన్నారు.