Mancherial District News
-
ట్రాక్టర్, ఆటో ఢీ.. ఐదుగురికి గాయాలు
భైంసారూరల్: భైంసా–బాసర జాతీయ రహదారిపై శుక్రవారం జరగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భైంసా నుంచి దేగాం వైపు ప్రయాణీకులతో ఆటో వెళ్తుంది. అదే మార్గంలో హరియాలీ కన్వెన్షన్ ముందున్న ట్రాక్టర్ యూటర్న్ చేస్తుండగా ఆటోఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇలేగాం గ్రామానికి చెందిన ఆకాశ్, సాయి, ఉమ్రి(కె) గ్రామానికి చెందిన చంద్రకాంత్, మహాగాం గ్రామానికి చెందిన గంగాధర్, శివలింగుకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108లో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై శంకర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంపై విచారణ చేపట్టారు. -
భక్తుల భద్రత.. గాలిలో దీపమే!
● బాసరలో ప్రధాన రోడ్లపై చీకట్లు ● రైల్వే స్టేషన్ బయట కానరాని సెక్యూరిటీ ● జిల్లాలోని ప్రధాన ఆలయాల వద్ద ఇదే పరిస్థితిభైంసా/బాసర: అక్షర జ్ఞానం అందించాలని.. ఆపదలను తొలగించాలని బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు వ,చ్చే భక్తుల భద్రత గాలిలో దీపంలాగే మారింది. తెలంగాణతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం భక్తులు బాసరకు వస్తారు. అయితే దైవ దర్శనం కోసం వచ్చిన వారి రక్షణ బాధ్యత అధికారులపై ఉంది. వందలాది మంది భక్తులు రాత్రి సమయంలో ఆలయ ప్రాంగణంలోనే నిద్రపోతుంటారు. ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలో ఓ మహిళపై సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నిందితులైన ఆలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగి, ఆటో డ్రైవర్, వంటవాళ్లు, ఎలక్ట్రీషియన్ తదిరులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ప్రముఖ ఆలయమైన బాసరకు వచ్చే భక్తుల భద్రత తెలుసుకునేందుకు ‘సాక్షి’ బాసర పట్టణాన్ని అర్ధరాత్రి సమయంలో విజిట్ చేసింది. ఈ సందర్భంగా భద్రతాలోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. పోలీసులు, విద్యుత్, ఆలయ అధికారుల మధ్య సమన్వయం లోపం భక్తులకు షాపంగా మారింది. వేసవి సెలవుల్లో ఆలయాల్లో భక్తుల సందడి పెరుగుతుంది. ఈ సమయంలో దొంగతనాలు, అఘాయిత్యాలు జరగకుండా జిల్లా పోలీసులు, దేవాదాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలోని ఆలయాల పరిస్థితి..నిర్మల్ జిల్లాలో బాసర సరస్వతి ఆలయం, లోకేశ్వ రం బ్రహ్మేశ్వర ఆలయం, కుంటాల గజ్జలమ్మ ఆలయం, కల్లూరు సాయిబాబా ఆలయం, కదిలి పాపహరేశ్వరాలయం, బీరవెల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, సారంగాపూర్ అడెల్లి పోచమ్మ ఆల యం, నిర్మల్ వెంకటేశ్వర ఆలయం, గండి రామన్న ఆలయం వంటి అనేక ఆలయాలు ఉన్నాయి. భక్తులకు సౌకర్యాల కొరత..ప్రముఖ ఆలయాల వద్ద వసతి, మూత్రశాలలు ఉన్నప్పటికీ, నిర్వహణ సరిగా లేదు. చిన్న ఆలయాల్లో కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. జాతరలు, ఉత్సవాల సమయంలో రాత్రిళ్లు ఆలయాలకు వెళ్లేవారు ఎక్కువ. ఖర్మకాండల కో సం కూడా ఆలయాల్లో నిద్రపోతుంటారు. గ్రామాలు, పట్టణాలకు దూరంగా ఉన్న ఆలయాల వద్ద సౌకర్యాలు, భద్రత లోపిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో చీకటి పడితే మద్యం ప్రియులు సంచరి స్తూ సీసాలు పగలగొడుతున్నారు. రాత్రి సమయంలో పోలీసు గస్తీ ఉంటే ఇలాంటి పరిస్థితులను నియంత్రించవచ్చని భక్తులు అభిప్రాయపడుతున్నారు. బాసర రైల్వేస్టేషన్ వద్ద రాత్రివేళలో వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం బాసరలోని ప్రధాన కాలనీతోపాటు రహదారుల్లో అక్కడక్కడ సెంట్రల్ లైటింగ్ వెలగడం లేదు. వీధి దీపాలు ఏర్పాటు చేసి రాత్రి సమయంలో వెలిగేలా చూస్తాం. పంచాయతీ సిబ్బంది ప్రధాన వీధుల్లో ఎప్పటికప్పుడు డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారు. గ్రామపంచాయతీ పరిధిలో ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూస్తాం. – పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌గౌడ్, బాసరభద్రతా లోపాలు..నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో రాత్రి సమయంలో భద్రత సరిగా కనిపించ డం లేదు. రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులు దిగే ప్రధాన రోడ్డుపై బస్టాండ్ లేదు, విద్యుత్ దీపాలు వెలగడం లేదు. గోదావరి నది ప్రాంతంలో చీకట్లు కమ్ముకున్నాయి. బాసర గ్రామంలో బస్టాండ్ వద్ద సెక్యూరిటీ లేదు, ఆలయానికి వెళ్లే ఏటీఎం వద్ద ప్రైవేట్ గార్డు కూడా కనిపించడం లేదు. పోలీసులు గస్తీ తిరుగుతున్నామని చెప్పినా ఆలయ ప్రాంగణంలో పికెటింగ్ కనిపించలేదు. ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గాల్లో సెంట్రల్ లైటింగ్ అలంకారప్రాయంగానే మారింది. రైల్వే స్టేషన్ ప్రాంతంలో రాత్రిళ్లు మందుబాబులు సంచరిస్తున్నారు. రాత్రి రైళ్లలో వచ్చే యాత్రికులు ప్రైవేట్ ఆటోలపై ఆధారపడాల్సి వస్తోంది. బాసర ఆలయానికి బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ, రాత్రి సమయంలో అది అందుబాటులో ఉండడం లేదు. రైలు మార్గంలో వచ్చే భక్తులు, ట్రిపుల్ఐటీ విద్యార్థులు, స్థానికులు ప్రధాన రోడ్డుపై గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. వందలాది ప్రయాణికులు ఉండే ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా లేవు. -
బెట్టింగ్ మత్తులో యువత
● రూ.లక్షల్లో పందెం.. ● యువకుల జేబులు ఖాళీ ● గ్రామీణ ప్రాంతాలకు చేరిన జూదం చెన్నూర్: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ యువతను చిత్తు చేస్తోంది. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా జోరుగా సాగుతోంది. జూదం వ్యసనంలా మారి జేబులు ఖాళీ చేస్తోంది. క్రికెట్, ఆటగాళ్లపై అభిమానం హద్దు మీరి యువతలో వ్యసనంగా మారుతోంది. ఆటను చూసి ఆనందించాల్సి పోయి ఏకంగా బెట్టింగ్‌కు పాల్పడుతూ ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. వేలాది రూపాయలు బెట్టింగ్ కాస్తూ కొందరు యువకులు అప్పుల పాలవుతున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలకూ చేరింది. బెంగళూరు రాయల్ చాలెంజ్, గుజరాత్ టైటాన్స్ జట్లపై కోటపల్లి మండలంలోని ఒక గ్రామంలో పది మంది యువకులు రూ.10వేల చొప్పున రూ.లక్ష బెట్టింగ్ పెట్టి డబ్బులు పోగొట్టుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన కోటపల్లిలోనే కాకుండా జిల్లాలో ఏ మేరకు బెట్టింగ్ సాగుతుందో చెప్పకనే చెబుతోంది. ‘‘మామ పది వేలు పోయినయిరా. బుధవారం ఆర్సీబీ గెలుస్తుందని పది వేలు బెట్టింగ్ పెట్టిన జీటీ గెలిచిందిరా. నా డబ్బులే కాదురా పది మందిమి ఆర్సీబీ గెలుస్తుందని పది వేల చొప్పున బెట్టింగ్ పెటినం. అందరి డబ్బులు పోయినయ్..’’ ఇదీ చెన్నూర్‌లో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ. ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా సాగుతుందనడానికి వీరి సంభాషణే ఉదాహరణగా చెప్పొచ్చు. ముందుగానే అంచనా..మ్యాచ్‌కు ముందుగానే జట్టు బలాలను అంచనా వేస్తూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. కొందరు అభిమాన కెప్టెన్లపై నమ్మకంతో బెట్టింగ్‌కు దిగుతుండగా.. మరికొందరు జట్టులోని క్రీడాకారులు ఆటతీరుపై బెట్టింగ్‌లు కాస్తున్నట్లు తెలిసింది. ఒక్కోసారి వారి అంచనాలు తారుమారై నష్టపోతున్నట్లు తెలిసింది. ఫోన్ పే ద్వారా చెల్లింపులు..బెట్టింగ్ చెల్లింపులు అన్నీ ఫోన్ పే ద్వారానే సాగుతున్నాయి. బెట్టింగ్‌లో పాల్గొనే వ్యక్తులు మధ్యవర్తికి ఫోన్ పే ద్వారా డబ్బులు పంపిస్తున్నారు. ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు తరపున బెట్టింగ్ కాచిన వ్యక్తికి మధ్యవర్తి డబ్బులు చెల్లించే విధంగా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. అధికారులు స్పందించి బెట్టింగ్‌లకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మే నెల 25న జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వరకు బెట్టింగ్‌ల జోరు కొనసాగే అవకాశాలున్నాయి. -
వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వేర్వేరు కారణాలతో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పురుగుల మందు తాగగా, ఒకరు ఉరేసుకున్నారు. మరొకరు భవనంపై నుంచి దూకారు.యజమాని దూషించాడని పాలేరు.. వేమనపల్లి: మండలంలోని మంగెనపల్లి గ్రామానికి చెందిన గిరిజనుడు నాయిని కన్నయ్య(35) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నయ్య గ్రామంలోని రైతు ఎనగంటి చిన్నన్న వద్ద పాలేరుగా పని చేస్తున్నాడు. శుక్రవారం పొలానికి పురుగుల మందు పిచికారీ చేశాడు. స్ప్రేయర్ పంపు చెడిపోయిందని, ఎవరు బాగు చేయిస్తారని చిన్నన్న కన్నయ్యతో గొడవపడ్డాడు. అసభ్య పదజాలంతో దూషించడంతో మనస్తాపం చెందిన కన్నయ్య అక్కడే పురుగుల మందు తాగాడు. 108 అంబులెన్స్‌లో చెన్నూర్‌కు తరలిస్తుండగా మృతిచెందాడు. యజమాని వేధింపుల వల్లే కన్నయ్య మృతి చెందాడని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం, జిల్లా అధ్యక్షుడు బాగాల రాజన్న, నాయకురాలు మల్లేశ్వరితో మృతుడి కుటుంబ సభ్యులు మంగెనపల్లి క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి ధర్నా చేశారు. మృతికి కారణమైన చిన్నన్న, భార్య లక్ష్మీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నీల్వాయి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తండ్రి బైక్ ఇవ్వలేదని కొడుకు..నార్నూర్: తండ్రి బైక్ ఇవ్వలేదని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నాగ్నాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. గాదిగూడ మండలం ఖడ్కి కొలాంగూడ గ్రామానికి చెందిన మాడవి భీంరావు(19) శుక్రవారం తన తండ్రి మాధవ్రావును బైక్ అడిగాడు. భీంరావు తాగిన మైకంలో ఉండడంతో బైక్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన భీంరావు పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. తండ్రికి ఫోన్ చేసి చెప్పగా.. ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిమ్స్ ఆసుపత్రిపై నుంచి దూకి వ్యక్తి..బెల్లంపల్లి: బెల్లంపల్లి కాంట్రాక్టర్ బస్తీకి చెందిన హన్మాండ్ల నారాయణ(55) శుక్రవారం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి పైనుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణ తండ్రి పోశం అనారోగ్యంతో బాధ పడుతుండగా చికిత్స చేయించడం కోసం నిమ్స్ ఆసుపత్రికి గత నెల 24న తీసుకెళ్లారు. అటెండర్‌గా వెళ్లిన నారాయణ ఆకస్మికంగా పైఅంతస్తు నుండి కిందికి దూకి మృతిచెందాడు. తాగుడు అలవాటు ఉన్న నారాయణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. మృతుడికి భార్య రేణుక, సోదరులు ఉన్నారు. మద్యానికి బానిసై యువకుడు..ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన భోరజ్ మండలం గూడ గ్రామంలో చోటుచేసుకుంది. జైనథ్ ఎస్సై పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దుమ్మ కార్తిక్ (19) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం మద్యం తాగడానికి డబ్బులు కావాలని తల్లి గంగమ్మతో గొడవకు దిగాడు. ఆమె నిరాకరించగా మనస్తాంపం చెంది ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అర కిలో బంగారం ఆశ చూపి..
● రూ.4.50 లక్షలు వసూలు ● గుప్తనిధుల పేరిట మోసం.. ● ముగ్గురి రిమాండ్.. పరారీలో ఒకరు ● రూ.1.47 లక్షలు రికవరీ.. ఖానాపూర్: అరకిలో బంగారం ఆశ చూపి రూ.4.50 లక్షలు వసూలు చేసిన ఉదంతం ఖానాపూర్ సర్కిల్ పరిధిలోని కడెం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏఎస్పీ రాజేశ్‌మీనా, సీఐ సీహెచ్.అజయ్, కడెం ఎస్సై కృష్ణసాగర్రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. ఖానాపూర్ మండలంలోని గోసంపల్లె గ్రామానికి చెందిన సాదుల నరేశ్ హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అక్బర్ వద్ద కొంతకాలంగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కడెం మండలం అటవీ ప్రాంతంలో గుప్తనిధులు ఉన్నాయని రూ.4.50 లక్షల చెల్లిస్తే అరకిలో బంగారం ఇస్తామని ఆశ చూపుతూ నమ్మబలికాడు. గత నెల 31న కడెం మండలానికి వచ్చిన అక్బర్‌ను నరేశ్తోపాటుమరో ముగ్గురు యువకులు కడెం మండలంలోని కొత్త మద్దిపడగ శివారులోని అటవీ ప్రాంతానికి కారులో తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక డబ్బులు లాక్కొని బెదిరించి వెళ్లగొట్టారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు అక్బర్ వెంటనే ఈ విషయమై అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారన్నారు. నరేశ్ తన తల్లికి ఆరోగ్యం బాగా లేదని రూ.4.50 లక్షలు అవసరం ఉందని అందుకు బదులుగా బంగారం, ఆస్తి పేపర్లు కుదువ పెడతానని తనకు చెప్పడంతో తాను పై నగదును నరేశ్‌కు ఇచ్చానని బాధితుడు ఫిర్యాదులో తమకు తెలిపాడని పోలీసులు వెల్లడించారు. గుప్త నిధుల కోసం సదరు యువకులతో కలిసి అన్వేషించి మోసపోయిన అక్బర్ తమను సైతం తప్పుదోవ పట్టించేలా తప్పుడు ఫిర్యాదు చేసినట్లు విచారణలో వెలుగు చూసిందన్నారు. ఈ ఘటనలో అక్బర్ నుంచి డబ్బులు వసూలు డబ్బుల నుంచి రూ.1.47 లలు రికవరీ చేయడంతోపాటు గోసంపల్లె గ్రామానికి చెందిన సాదుల నరేశ్, అదే గ్రామానికి చెందిన భూక్యా వంశీ, ఖానాపూర్ పట్టణానికి చెందిన మగ్గిడి నితిన్, పెంబి మండల కేంద్రానికి చెందిన ఆరె చింటుతోపాటు తప్పుడు ఫిర్యాదు చేసిన హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అక్బర్‌పై సైతం కేసు నమోదు చేశామని వివరించారు. శుక్రవారం వంశీతోపాటు నితిన్, చింటులను రిమాండ్ చేశామని తెలిపారు. నరేశ్ పరారీలో ఉన్నాడని వెల్లడించారు. నాలుగు రోజుల వ్యవధిలో సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్న ఖానాపూర్ సీఐతోపాటు కడెం ఎస్సై, పోలీస్ సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. -
వేద పాఠశాల విద్యార్థి అనుమానాస్పద మృతి
బాసర: నిర్మల్ జిల్లా బాసర క్షేత్రంలో వేద పాఠశాల విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన రాజేందర్ తనయుడు మణికంఠ(17) వేద పాఠశాలలో చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం గోదావరి నది పుష్కరఘాట్ వద్దకు వెళ్లిన మణికంఠ నది కింద భాగంలో బురదలో పడి ఉన్నాడు. గమనించిన భక్తులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది మణికంఠను బాసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ విషయం తెలుసుకున్న బాసర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్, సీఐ మల్లేశ్, ఎస్సై గణేశ్ పుష్కర ఘాట్లను పరిశీలించారు. విద్యార్థి విద్యుత్‌షాక్‌తో మరణించాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మణికంఠ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వచ్చిన తర్వాత కేసు నమోదు చేస్తామని తెలిపారు. గతనెల 21న వేద పాఠశాలకు చెందిన విద్యార్థి మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన లోహిత్‌పై దాడి జరిగింది. 13 గంటల తర్వాత గుర్తించి ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ప్రాథమిక చికిత్స తర్వాత హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. తాజాగా అదే పాఠశాలకు చెందిన విద్యార్థి మణికంఠ అనుమానాస్పదంగా మృతిచెందాడు. దీంతో వేదపాఠశాలలో ఏం జరుగుతుందో అని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
కాసిపేట: మండలంలోని పెద్దనపల్లి నాయకపుగూడకు చెందిన మేసినేని మల్లు(53) అనే మహిళ ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కాసిపేట ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం మల్లు ఈనెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని పురుగుల మందు తాగింది. వాంతులు చేసుకుంటుండగా గమనించిన కుటుంబ సభ్యులు బెల్లంపల్లి, మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రులకు అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందింది. ముఖం మీద పుండు కావడంతో నొప్పి తగ్గక మద్యానికి అలవాటు పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఆమె భర్త రాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. దండేపల్లి మండలంలో.. దండేపల్లి: మండలంలోని గూడెం గ్రామానికి చెందిన ముత్తినేని మొండయ్య(42) చికిత్స పొందుతూ వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో గురువారం మృతిచెందాడు. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. మొండయ్య భార్య పద్మ గత రెండు నెలల క్రితం అతడిని విడిచి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి దిగాలుగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉండలేక జీవితంపై విరక్తి చెంది గత నెల 29న పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించగా.. పరిస్థితి విషమించి చనిపోయాడు. మృతుడి మేనమామ ఉగ్గె రాజలింగు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
ఇంటర్ మూల్యాంకన వేతనం చెల్లించాలి
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియెట్ మూ ల్యాంకన వేతనం త్వరగా చెల్లించాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్–475 ఆధ్వర్యంలో శుక్రవారం డీఐఈవో అంజయ్యకు వినతిపత్రం అందజేశారు. మూ ల్యాంకనం పూర్తయిన వెంటనే ఎలాంటి కోతలు లేకుండా పూర్తి నగదును ఖాతాలో జమ చేయాలని కోరారు. ఇంటర్మీడియెట్ పరీక్షల వి ధులకు సంబంధించి సీఎస్, డీవోలు, సిట్టింగ్‌స్క్వాడ్ రెమ్యూనరేషన్ చెల్లించాలని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రసా ద్, కార్యదర్శి సందీప్‌కుమార్, కోశాధికారి సో మయ్య, అసోసియేటెడ్ ప్రెసిడెంట్ వెంకటస్వామి, జిల్లా మహిళా కార్యదర్శులు సత్తెమ్మ, శైల జ, సునీత తదితరులు పాల్గొన్నారు. -
గురుకుల ఫలితాల్లో సత్తా చాటారు
జన్నారం: ఉత్తమ విద్యాబోధన, ఉత్తమ ఫలితాలతో జిల్లాలోనే పేరు తెచ్చుకున్న మండలంలోని అక్కపెల్లిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గురుకుల ఫలితాల్లోనూ సత్తా చాటింది. పాఠశాల నుంచి 13 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు జాజల శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో మొదటి స్థానం సాధించిన పాఠశాల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌ను శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో యాదయ్య, ఎంఈవో విజయ్‌కుమార్ అభినందించారు. మండలంలోని రేండ్లగూడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు గురుకుల సీట్లు సాధించినట్లు హెచ్ఎం రాజన్న తెలిపారు. కలమడుగు వివేకానంద పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులు గురుకుల పాఠశాలలో సీట్లు సాధించినట్లు హెచ్ఎం సతీశ్‌గౌడ్ తెలిపారు. భీమారం: మండల కేంద్రంలోని బీసీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన నిహాన్, పూజ గురుకుల పాఠశాలకు ఎంపికై నట్లు హెచ్ఎం హరికృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. -
‘వక్ఫ్ బిల్లు ఆమోదం దేశానికి గర్వకారణం’
చెన్నూర్: వక్ఫ్ బిల్లు ఆమోదం పొందడం దేశానికి గర్వకారణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. శుక్రవా రం వక్ఫ్ బిల్లు ఆమోదంపై స్థానిక బీజేపీ కా ర్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చి త్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వక్ఫ్ బిల్లు సవరణతో అన్ని మతాలతోపాటు ముస్లింలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు జాడి తిరుపతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బత్తుల సమ్మయ్య, తుమ్మ శ్రీపాల్, కేవీఏం శ్రీనివాస్, మానికరావు శంకర్, దుర్గాప్రసాద్, వంశీగౌడ్, రాజన్న పాల్గొన్నారు. -
‘ముందస్తు’ రాయితీ
● గత ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు అంతంత మాత్రమే ● పూర్తి ఆస్తిపన్ను చెల్లించిన వారికి ఎర్లీబర్డ్ పథకం ● వసూలైతేనే మున్సిపాలిటీలకు నిధులుమంచిర్యాలటౌన్: మున్సిపాలిటీల్లో ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించేందుకు ప్రభుత్వం ‘ఎర్లీబర్డ్’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా చెల్లించిన వారికి పన్నులో 5శాతం రాయితీ కల్పిస్తుంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను వసూళ్లు మార్చి నెలాఖరున ముగిశాయి. నూతన ఆర్థిక సంవత్సరం ఆరంభంతో ముందస్తు పన్ను వసూళ్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో పన్ను బకాయిల వసూళ్లు అంతంత మాత్రంగానే రావడం, పన్ను వసూళ్లు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడడం వంటివి జరగకుండా ఉండేందుకు, 2025 మార్చి వరకు ఉన్న పూర్తి పన్ను బకాయిలను చెల్లించిన వారికి ముందస్తుగా 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను చె ల్లించేందుకు ఈ పథకాన్ని మరోసారి అమల్లోకి తీ సుకు వస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బకాయిలు పేరుకుపోకుండా ముందస్తు పన్ను చెల్లింపులను ప్రోత్సహించడమే ఈ పథకం ఉద్దేశ్యం. 5శాతం రా యితీ అందించనుండడంతో ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఏప్రిల్ 30లోపు పన్ను చెల్లిస్తేనే పథకం వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రచారం కల్పిస్తేనే.. ఎర్లీ బర్డ్ పథకంపై మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది ఇప్పటి నుంచే ప్రచారం చేపట్టి పన్నులు వసూలు చేయాలి. సరైన ప్రచారం లేక గత ఏడాది చాలామంది ఈ పథకం, రాయితీ విషయం తెలియక వినియోగించుకోలేదు. దీంతో మొన్నటి ఆర్థిక సంవత్సరంలో పన్నులు వసూలు చేయడం మున్సిపల్ అధికారులు, సిబ్బందికి సవాలుగా మారింది. పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలని ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లకు సీడీఎంఏ అధికా రులు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించి పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని సూచించింది. గత మార్చి 2025 వరకు పన్ను బకాయిలు పూర్తిగా చెల్లించని వారికి ఈ పథకం వర్తించదని, పూర్తి బకాయిలు చెల్లించిన వారు మాత్రమే అర్హులనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మున్సిపల్ అధికారులు సమాయత్తం అయ్యారు. సద్వినియోగం చేసుకోవాలిఅన్ని మున్సిపాలిటీల్లోనూ 31 మార్చి 2025 వరకు ఇంటి పన్ను పూర్తిగా చెల్లించిన వారికి ఎర్లీబర్డ్ స్కీం వర్తిస్తుంది. ఈ అవకాశం ఈ నెల 30వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం బకాయిలను చెల్లించని వారు ఆయా బకాయిలను చెల్లించి, ఎర్లీబర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకో వచ్చు. ఈ సదవకాశాన్ని పట్టణ ప్రజలు సద్విని యోగం చేసుకుని రాయితీ పొందాలి. – శివాజి, మంచిర్యాల నగరపాలక సంస్థ కమిషనర్ -
కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు మద్దతు
జైపూర్: మండలంలోని ఇందారం ఐకే ఓసీపీ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య, కాంట్రాక్ట్ వర్కర్స్ యూని యన్ రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర తిరుపతి, బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అప్రోజ్‌ఖాన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శుక్రవారం సమ్మె చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందారం ఓసీపీ గనిలో పనిభారం ఎక్కువని, వారాహ కంపెనీలో వాల్వో డ్రైవర్లకు కనీస వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు తప్పని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నారని, సమస్య పరిష్కారమయ్యే వరకు అండగా ఉంటామని తెలిపారు. వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీసైదా, ఉపాధ్యక్షుడు కొట్టే కిషన్‌రావు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు రవీందర్, కార్యదర్శులు పాల్గొన్నారు. -
‘పది’ మూల్యాంకనం
● 7నుంచి 15వరకు జవాబు పత్రాల దిద్దుబాటు ● కొనసాగుతున్న కోడింగ్ మంచిర్యాలఅర్బన్: పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో ఫలితాలు సకాలంలో విడుదల చేసేలా విద్యాశాఖ చర్యలు వేగవంతం చేస్తోంది. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతుండగా పదో తరగతి జవాబు పత్రాల మూ ల్యాంకనానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 49 పరీక్ష కేంద్రాల్లో 9,198 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గురువారం నాటితో ఒకేషనల్ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నెల 7నుంచి 15 వరకు స్థానిక కార్మెల్ హైస్కూల్లో జవాబు పత్రాల మూల్యాంక నం చేయనున్నారు. మధ్యాహ్నం గంటపాటు భోజ న విరామం మినహాయిస్తే ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహిస్తారు. ఉపాధ్యాయులు ఉ దయం 8గంటలకు రిపోర్టు చేయాల్సి ఉంటుందని డీఈవో యాదయ్య తెలిపారు. 1.34లక్షల జవాబు పత్రాలు ఇతర జిల్లాల నుంచి పరీక్షలకు సంబంధించిన 1.34 లక్షల పేపర్లకు గాను 1.20లక్షల జవాబు పత్రాలు జిల్లా కేంద్రంలోని మూల్యాంకన కేంద్రానికి చేరాయి. ఇంకా 14వేల జవాబు పత్రాలు రావాల్సి ఉంది. ఇప్పటికే పటిష్టమైన భద్రత మధ్య ఏడు సబ్జెక్టుల్లో ఐదు సబ్జెక్టులకు సంబంధించిన కోడింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, గణితం, భౌతికరసాయన శాస్త్రం, జీవశాస్త్రం కోడింగ్ ప్రక్రియ పూర్తి కాగా సాంఘిక శాస్త్రానికి సంబంధించిన జవాబు పత్రాలకు కోడింగ్ చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. డీఈవో యాద య్య శిబిరం అధికారిగా, పరీక్షల విభాగం సహాయ కమిషనర్ దామోదర్‌రావుతోపాటు మరో ఇద్దరు ఎంఈవోలు సహాయ క్యాంపు అధికారులుగా వ్యవహరిస్తారు. పేపర్ కోడింగ్ అధికారులుగా ఏడుగురు, చీఫ్ కోడింగ్ అధికారితోపాటు సహాయకులు ఆరుగురు ఉంటారు. అసిస్టెంట్ ఎగ్జామినర్(ఏఈ)లుగా 426మందిని నియమించారు. చీఫ్ ఎగ్జామినర్లుగా 71 మంది, ప్రత్యేక సహాయకులుగా 150 మంది ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించా రు. పోలీస్ బందోబస్తు మధ్య సమాధాన పత్రాలు స్ట్రాంగ్‌లో రూమ్‌లో భద్రపరిచారు. -
పని గంటలు తగ్గించాలి
మంచిర్యాలటౌన్: వేసవి కాలం దృష్ట్యా పని గంటలు తగ్గించాలని మంచిర్యాల నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు కమిషనర్ శివాజికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కార్మికులకు బట్టలు, చె ప్పులు, గ్లౌజులు ఇప్పించాలని, ప్రతీ కార్మికునికి కా ర్పొరేషన్ ఐడీ ఇవ్వాలని, డ్రైవర్లను పాత పద్ధతిలో నే వారి స్థానంలోనే పంపించాలని పేర్కొన్నారు. పీ ఎఫ్, ఈఎస్ఐ కార్మికుల ఖాతాల్లో జమ కావడం లే దని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ, అధ్యక్షుడు గోగర్ల ఆశయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శ్యాంకుమార్, కోశాధికారి శ్రీనివాస్, కార్మికులు గోగర్ల ఆశయ్య, ఆవునూరి లింగయ్య, చిప్పకుర్తి లింగయ్య, ఆవుల శ్రీనివాస్, రేగుంట రాయలింగు పాల్గొన్నారు. -
రెండు బార్లకు దరఖాస్తుల ఆహ్వానం
మంచిర్యాలక్రైం: జిల్లాలో రెన్యూవల్ చేసుకో కుండా ఆగిపోయిన రెండు బార్లకు తిరిగి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి కేజీ.నందగోపాల్ తెలిపారు. శుక్రవా రం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించా రు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో, బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఒక్కో బార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కలెక్టరేట్, ఆదిలాబా ద్‌లోని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం, హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయంలో ఈ నెల 26ఉదయం 10:30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు అందజేయవచ్చని తెలిపారు. 29న లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. రూ.లక్ష దరఖాస్తు ఫీజు చెల్లించాలని, ఎంపికై న వారు బార్లకు ఏడాదికి రూ.42లక్షలు ట్యాక్స్ రూంలో చెల్లించాల్సి ఉంటుందని తెలి పారు. సీఐలు గురువయ్య, సమ్మయ్య, ఇంద్రప్రసాద్, హరి పాల్గొన్నారు. -
చదువుతో జీవితంలో అన్నీ సాధించవచ్చు
కాసిపేట: చదువుతో జీవితంలో అన్నీ సాధించుకోవచ్చని, విద్యార్థినులు ఇష్టపడి చదివి భవిష్యత్‌లో తమ లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శుక్రవారం మండలంలోని దేవాపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓరియంట్ సిమెంటు కంపెనీ అందించిన స్కూల్ బ్యాగులను ఎమ్మెల్యేతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ముత్యంపల్లి రైతువేదికలో జిల్లా ఆరోగ్యశాఖ, వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. బుగ్గగూడలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కిషన్, తహసీల్దార్ భోజన్న, ఏంపీడీవో సత్యనారాయణసింగ్, ఏంపీవో సబ్ధర్ అలీ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించుకుందాం: ఎమ్మెల్యే వినోద్ మహాత్మాగాంధీ, అంబేడ్కర్, రాజ్యాంగాన్ని గౌరవించుకుందామని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ తెలి పారు. మండల కేంద్రంలో జై బాపు, జై భీం, జై సంవిధాన్, రాజ్యాంగ పరిరక్షణ సన్నాహక సమావేశం, పాదయాత్రలో పాల్గొని అంబేడ్కర్, మహాత్మాగాంధీ విగ్రహలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నం ప్రదీప్, మాజీ జెడ్పీటీసీ రౌతు సత్తయ్య, మైదం రమేష్, నస్పూరి నర్సింగ్ పాల్గొన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ -
● నెన్నెల రెవెన్యూ అధికారుల చిత్రాలు ● ఎమ్మెల్యే అనుచరుడి కోసం అధికారుల దాసోహం ● చిక్కులో పడ్డానని తెలిసి సెలవులో తహసీల్దారు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బతికి ఉండగానే చనిపోయినట్లుగా చిత్రీకరించి దొంగ పట్టా చేసి రెండెకరాలు కాజేసే ఉదంతమిది. ఎమ్మెల్యే అనుచరుడి కోసం రెవెన్యూ అధికారులు తప్పు చేసి చిక్కుల్లో పడ్డారు. నెన్నెల మండలంలో జరిగిన ఈ ఘటనను గత నెల రోజులుగా రెవెన్యూ అధికారులు, ఎమ్మెల్యే అనుచరులు బయటకు పొక్కకుండా తొక్కి పెడుతున్నారు. రెవెన్యూ అధికారుల బరితెగింపు మంచిర్యాలకు చెందిన కుందూరు అశోక్‌రెడ్డి కుటుంబానికి నెన్నెల మండలం చిన్నావెంకటాపూర్లో వారసత్వ భూములు ఉన్నాయి. వీటిలో 132సర్వేనంబరు నాలుగు ఎకరాలను గంగారానికి చెందిన చిర్రం రమేశ్‌కు 2020లో అమ్మాలని అనుకున్నారు. మొత్తం రూ.14.80లక్షలకు గాను రూ. 8.50లక్షలు ఇచ్చారు. మిగతా డబ్బులు ఇవ్వడంలో జాప్యంపై పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగా యి. చివరికి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తూ భూ అమ్మకం రద్దు చేసుకున్నారు. రెండేళ్ల క్రితమే ఇరుపక్షాలు స్థానిక సర్పంచ్‌లు, పెద్దల సమక్షంలో లిఖిత పూర్వకంగా అంగీకరించారు. ఇటీవల అశోక్‌రెడ్డి కోడలు శ్రావ్యరెడ్డి పేరుతో 132/2సర్వే నంబరులో ఉన్న రెండెకరాలు చిర్రం రమేశ్ పేరిట పట్టా కావడంతో ఆశ్చర్యపోయారు. గత నెల 13న తమ భూమి సర్వే కోసం ధరణిలో చూస్తే పట్టాదారు పేరు మారినట్లు వెలుగులోకి వచ్చింది. ఎలా జరిగిందని స్థానిక తహసీల్దారును అడిగితే తమ పరిధిలో జరగలేదని తెలిపారు. చివరకు సీసీఎల్ఏను సంప్రదిస్తే.. శ్రావ్యరెడ్డి చనిపోయిందని, ఆమె స్థానంలో వారసుడిగా చిర్రం రమేశ్‌ను పేర్కొంటూ నెన్నెల తహసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ చేశారని పేర్కొన్నారు. దీనిపై అశోక్‌రెడ్డి కలెక్టరేట్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, బెల్లంపల్లి ఆర్డీవో హరిక్రిష్ణ గుర్తించి, తహసీల్దార్‌తో గత నెల 22న శ్రావ్యరెడ్డి పేరుతో భూమి కోనుగోలు చేసినట్లు కొత్తగా 132/3సర్వే నంబరుపై ఆ రెండెకరాలను తిరిగి పట్టా చేశారు. మొదట పట్టాదారుకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేస్తూ అధికారులు ఇంత రిస్కు ఎందుకు చేశారనేది అంతుచిక్కని ప్రశ్న. అంతా తెలిసి చర్యల్లేవు శ్రావ్యరెడ్డి చనిపోయినట్లు సృష్టించిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ అశోక్‌రెడ్డి గత కొద్దిరోజులుగా ఫిర్యాదు చేస్తున్నా చర్యలు కరువయ్యాయి. సీసీఎల్ఏ, కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. చివరకు నెన్నెల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, చిర్రం రమేశ్‌పై చీటింగ్ కేసు నమోదైంది. -
ప్రతీ ఒక్కరికి సన్న బియ్యం అందాలి
● ఇబ్బందులు తలెత్తకుండా పంపిణీ చేయాలి ● రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిమంచిర్యాలఅగ్రికల్చర్: అర్హులైన ప్రతీ ఒక్కరికి సన్నబియ్యం అందించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సన్న బియ్యం పంపిణీ, రేషన్‌కార్డులు, ప్రజల స్పందనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రేషన్‌కార్డులు కలిగిన వారికి ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సన్నబియ్యంతో తయారు చేసిన ఆహారాన్ని స్వీకరించాలని, సన్న బియ్యం పంపిణీపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించారు. రేషన్ దుకాణాల వద్ద ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ప్రజాపాలన, గ్రామసభల్లో నూతన రేషన్‌కార్డులు, కార్డుల్లో పేర్లు మార్పులు, తొలగింపులకు అందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేసి అర్హులకు త్వరగా రేషన్‌కార్డులు అందించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ నూతన రేషన్‌కార్డులు, పేర్ల మార్పులు, తొలగింపులకు అందిన దరఖాస్తులను పరిశీ లించి అర్హులకు కార్డులు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ పాల్గొన్నారు. -
సహకార సంఘాలను బలోపేతం చేయాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నా రు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతిలాల్‌తో కలిసి జిల్లా అధికారులు, నూతనంగా ఏర్పాటైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జెడ్పీ సీఈవో గణపతి, జిల్లా సహకార అధికారి మోహన్, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి శంకర్ పాల్గొన్నారు. ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణి దరఖా స్తుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్‌తో కలిసి జిల్లా అధికారులతో ప్రజ వాణి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. -
‘పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం’
బెల్లంపల్లి: పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. గురువారం పట్టణంలోని బజారు ఏరియా, బుధాకలాన్లో కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సన్న బియ్యం అందించడం వల్ల పేదలు కడుపునిండా భోజనం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. కలెక్టర్ కు మార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో సరిపడా స న్నబియ్యం నిల్వలు ఎల్ఎంఎస్ పాయింట్లలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. బుధాకలాన్లో స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో పి.హరికృష్ణ, తహసీల్దార్ యు.జ్యోత్స్న, మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కారుకూరి రాంచందర్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జే.శ్వేత, టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ అధికార ప్రతినిధి బత్తుల రవి, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సింగతి సత్యనారాయణ, ముచ్చర్ల మల్ల య్య తదితరులు పాల్గొన్నారు. -
సోదాల కలకలం
● రవాణా శాఖ చెక్‌పోస్టులో ఏసీబీ తనిఖీలు ● రాత్రిపూట రంగంలోకి దిగిన వైనం ● వాంకిడి వద్ద రూ.45,100 నగదు లభ్యంనగదు ముట్టుకోకుండాఏసీబీ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులపైనే కేసులు నమోదు చేస్తూ విచారణ చేస్తుంటా రు. ఒకవేళ ప్రైవేటు వ్యక్తులు ఉంటే వారు ఏ అధికారి ప్రోద్బలంతో ఉన్నారు? వారివెనక ఎవరున్నారనేది స్పష్టమైన ఆధారాలు తీసుకుంటారు. లేకపోతే అధికారులపై కేసులు నమోదు చేసే అవకాశం లేదు. సాధారణంగా లంచం తీసుకునేటప్పుడు నేరుగా దొరికిన ఆ అధికారి చేతులు, నగదుతో రసాయన పరీక్ష చేసి, సాంకేతిక ఆధారాలతో కోర్టులో సమర్పిస్తారు. కానీ చెక్‌పోస్టుల్లో ఏ అధికారీ చేతితో పైసలు ముట్టుకోరు. దీంతో లెక్కచూపని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనేవి మిస్టరీగా మారుతోంది. అవినీతి కేసులో పక్కా ఆధారాలు ఉంటే కేసు ముందుకు వెళ్తుంది. గతంలో పట్టుబడిన నగదుపైనా ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. తా జాగా దొరికిన నగదుపైనా ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేయనున్నారు.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రవాణా శాఖ చెక్‌పోస్టుల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి. బుధవారం రాత్రి జరిపిన సోదాల్లో వాంకిడి చెక్‌పోస్టులో రూ.45,100 పట్టుబడ్డాయి. రాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారు జామున 3గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. ఆదిలాబాద్, కరీంనగర్ డీఎస్పీలు విజయ్‌కుమార్, రమణమార్తి, మరో నలుగురు సీఐలు ఏకకాలంలో అక్కడి రికార్డులు పరిశీలించారు. రెండు ఫోన్లు సీజ్ చేశారు. ఆ సమయంలో డ్యూటీలో ఏఎంవీ మాత్రమే ఉండగా, ఇంకా ప్రైవేటు వ్యక్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే తరహాలో గతేడాది మేలో భోరజ్ చెక్‌పోస్టు వద్ద రూ.11,630, గత డిసెంబర్ 4న రూ.62,500 నగదు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాయి. చెక్‌పోస్టుల్లో నిత్యం వాహనదారులు, డ్రైవర్లు, సహాయకుల నుంచి బండికో రేటుగా అనధికారికంగా ప్రైవేటు సిబ్బంది వసూళ్లు చేస్తున్నది బహిరంగ రహస్యమే. ఏసీబీ సోదాలతో గురువారం వాంకిడిలో ఎలాంటి తనిఖీలు లేకుండానే వాహనాలు రాకపోకలు సాగించాయి. మూడు చోట్ల ఇదే తంతు ఉమ్మడి జిల్లా మహారాష్ట్రకు సరిహద్దుతో, ఉత్తర, దక్షిణ భారతదేశానికి కీలక రోడ్డు మార్గంగా ఉంది. ఆదిలాబాద్‌లోని ఎన్‌హెచ్–44పై భోరజ్, ఆసిఫా బాద్ జిల్లా ఎన్‌హెచ్–363పై వాంకిడి, నిర్మల్ పరిధి ఎన్‌హెచ్–61 వద్ద తానూరు మండలం బెల్‌తరోడా వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఉన్నాయి. ఇక్కడే సమీకృత చెక్‌పోస్టులు ఉన్నాయి. రవాణా శాఖ చెక్‌పోస్టులో నిత్యం వందల వాహనాలను అన్ని ధ్రువపత్రాలు ఉన్నాయా? లేవా? అని తనిఖీలు చేస్తూ అధికారులు అనుమతి ఇవ్వాలి. అయితే పరిశీలన పేరుతో వాహనదారుల నుంచి అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నరనేది ప్రధాన ఆరోపణ. డ్యూటీకి కోసం పోటీ రవాణా శాఖలో చాలామంది అధికారులు, సిబ్బంది చెక్‌పోస్టుల్లో డ్యూటీకి మొగ్గు చూపుతున్నారు. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల నుంచి సీనియర్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబు ళ్లు, సిబ్బంది వరకు రాజకీయ, ఉన్నతాధికారుల పైరవీలతో అక్కడ డ్యూటీలు తెచ్చుకుని చేస్తున్నా రు. చెక్‌పోస్టు డ్యూటీకి వెళ్తే ‘లాభదాయకం’గా మారడంతో పోటీ పడుతున్నారు. అధికారుల సంఖ్యను బట్టి రోజువారీగా డ్యూటీల్లో ఉంటున్నారు. -
సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య
మంచిర్యాలఅగ్రికల్చర్: నిజాం నిరంకుళ పాలనలో ప్రజల సంక్షేమం, భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ సాయుధ ఉద్యమంలో దొడ్డి కొమురయ్య అలుపెరుగని పోరాటం చేశారని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలు నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్, జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, కుల సంఘాల నాయకుల ప్రతినిధులతో కలిసి దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రజల ఆహ్లాదం కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయి. నిర్వహణ లోపం.. నిర్లక్ష్యం వెరసి కళావిహీనంగా మారాయి. మొక్కలు ఎండిపోతుండడంతో పచ్చదనం కరువైంది. కొన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు గ్రామాలకు దూరంగా ఉండడంతో నిర్వహణ లోపించింది
● ఎండిపోతున్న వనాలు ● ఆహ్లాదం ఎండమావే..చెన్నూర్‌రూరల్: శివలింగాపూర్ వద్ద ప్రకృతి వనంలో ఎండిపోయిన మొక్కలుదండేపల్లి: కళావిహీనంగా నంబాల పల్లెప్రకృతివనంవేమనపల్లి: ప్రకృతివనంలో ఎండిపోయిన మొక్కలుభీమిని: వీగాంలో పిచ్చి మొక్కలతో నిరుపయోగంగా పల్లె ప్రకృతి వనందండేపల్లి/చెన్నూర్‌రూరల్/భీమిని/మందమర్రిరూరల్/తాండూర్/వేమనపల్లి: దండేపల్లి మండలం నంబాలలో పల్లె ప్రకృతి వనాన్ని గ్రామానికి దూరంగా ఏర్పాటు చేశారు. అప్పట్లో 2000 మొక్కలు నాటారు. నిర్వహణను పట్టించుకునే వారు కరువయ్యారు. ఫలితంగా నాటిన మొక్కల్లో సగానికిపైగా ఎండిపోవడంతో పచ్చదనం కరువైంది. చెన్నూర్ మండలం శివలింగాపూర్ గ్రామ సమీపంలో గత ప్రభుత్వ హయాంలో రూ.2.50లక్షలతో సుమారు ఐదు వేల మొక్కలు నాటి పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. మొక్కలకు నీరందించేందుకు బోరు వేశారు. బోరుకు అమర్చిన విద్యుత్ మోటారు కాలిపోవడంతో మొక్కలకు నీరందక ఎండిపోతున్నాయి. భీమిని మండలం వీగాం గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో కానుగ చెట్లు మినహా ఇతర మొక్కలు కనిపించడం లేదు. ఆహ్లాదం కరువై ప్రజలు అటువైపు వెళ్లకపోవడంతో పిచ్చిమొక్కలతో నిండి నిరుపయోగంగా మారింది. ● మందమర్రి మండలంలోని పది గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. శంకర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోనే చిర్రకుంట, ఆదిల్పేట్, సారంగపల్లి, శంకర్పల్లి బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో 20 ఎకరాల్లో ఉపాధి హామీ సిబ్బంది సుమారు 60వేల మొక్కలు నాటారు. రెండేళ్ల తర్వాత ఆడిట్ నిర్వహణ అనంతరం గ్రామ పంచాయతీలకు అప్పగించారు. నిర్వహణ లోపించడంతో మొక్కలన్నీ ఎండిపోయి పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నాయి. ● తాండూర్ మండలం మాదారం(పోచంపల్లి) ప్రకృతి వనం కళావిహీనంగా తయారైంది. తాండూర్, కిష్టంపేట, గోపాల్‌నగర్, మాదారం త్రీ ఇంక్లైన్తోపాటు పలు ప్రకృతి వనాల్లో పిచ్చిమొక్కలు పెరిగి, నాటిన మొక్కలు ఎండిపోయి నిర్వహణ లేక అధ్వానంగా తయారయ్యాయి. వినియోగానికి వీలు లేకుండా మారి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించలేకపోతున్నాయి. ● వేమనపల్లి మండల కేంద్రంలోని మంగెనపల్లి, ఒడ్డుగూడం ప్రకృతి వనాల్లో పర్యవేక్షణ లోపించింది. గొడ్డలి వేటుకు కొన్ని మొక్కలు నేలకూలగా.. మరికొన్ని నీళ్లు లేక ఎండిపోతున్నాయి. రెండేళ్లు మాత్రమే ఉపాధి హామీ ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ప్రకృతి వనాల్లో వసతులు లేక నిరుపయోగంగా ఉన్నాయి. పిచ్చిమొక్కలు, ముళ్లకంపలు పెరిగాయి. మందమర్రిరూరల్: శంకర్‌పల్లిలో.. -
బొగ్గు గనుల వేలంలో పాల్గొనవద్దు
శ్రీరాంపూర్: కేంద్రం తీసుకొచ్చిన బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనవద్దని, తద్వారా బొగ్గు పరిశ్రమపై తన హక్కును క్రమేణా కోల్పోతుందని ఏఐఎఫ్టీయూ నాయకులు తెలిపారు. గురువారం ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి జీ అంజయ్య, కార్యదర్శి మేకల పోశమల్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్‌లు నస్పూర్ –శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లోని సహజ సందపను దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను కాల్చి చంపుతుందని పేర్కొన్నారు. ఇతర ప్రజాసమస్యలపై చర్చించేందుకు ఈనెల 5న మంచిర్యాల పట్టణంలోని చార్వాక ట్రస్ట్‌భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ రాములు, నాయకులు రాజ్‌కుమార్, పీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు లావణ్య, నాయకులు దుర్గయ్య, యాకయ్య పాల్గొన్నారు. -
ఒకే వాహనం.. రెండు ఫీజులు
● దేవుడి దర్శనానికి వాహనదారుల తిప్పలు ● పంచాయతీరాజ్ శాఖ పార్కింగ్ రుసుము.. ● అటవీశాఖ ఎంట్రీ ఫీజు వసూలు దండేపల్లి: మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో కొలువైన పెద్దయ్య దేవుడిని చేరుకోవాలంటే వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. గురువారం పెద్దయ్య దేవుడి దర్శనానికి వెళ్లిన వాహనాలకు రెండు శాఖల వారు ఫీజులు వసూలు చేయడంతో భక్తులు ఖంగుతిన్నారు. పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తుండగా అటవీ శాఖ అధికారులు ఫారెస్టు ఎంట్రీ ఫీజు వసూలు చేశారు. రెండు శాఖలకు ఫీజు చెల్లించడంపై కొంతసేపు వివాదం నెలకొంది. విషయం తెలుసుకున్న ఎంపీడీవో ప్రసాద్ ఫారెస్టు చెక్‌పోస్ట్ వద్దకు చేరుకున్నారు. అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. పంచాయతీరాజ్ శాఖ నిబంధనల ప్రకారం పార్కింగ్ రుసుం వసూలు కోసం టెండర్లు నిర్వహించారని, వారు ఫీజు వసూలు చేస్తారని అటవీశాఖ సిబ్బందికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నామని వారు బదులిచ్చారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని అప్పటివరకు ఎవరూ కూడా ఫీజులు వసూలు చేయొద్దని ఎంపీడీవో చెప్పినా అటవీ అధికారులు వినకుండా ఎంట్రీఫీజు వసూలు చేశారు. దీంతో భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పంచాయతీ అధికారులు పార్కింగ్ ఫీజు వసూలు చేయలేదు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఎంపీడీవో ప్రసాద్ తెలుపగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఎంట్రీఫీజు వసూలు చేస్తున్నామని డీఆర్వో పోచమల్లు పేర్కొన్నారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
సారంగపూర్: మండలంలోని ధని గ్రామానికి చెందిన పంబాల లక్ష్మి (46) అనే మహిళ నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పంబాల లక్ష్మి, భర్త గంగాధర్‌తో కలిసి బుధవారం ద్విచక్రవాహనంపై నిర్మల్ వైపు వెళ్తుండగా ధని గ్రామ సమీపంలోని హనుమాన్ ఆలయం మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి జారిపడి తీవ్ర గాయాలపాలైంది. వెంటనే 108లో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
కేంద్ర మంత్రులను కలిసిన బీజేపీ నేతలు
నిర్మల్‌చైన్‌గేట్/భైంసాటౌన్/ఆదిలాబాద్: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పౌర విమానయా న శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడులను బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నేతలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉ మ్మడి జిల్లాలోని జాతీయ రహదారులు, ఆది లాబాద్‌లో విమానయానం ఏర్పాటుపై చర్చించారు. బాసర నుంచి మహారాష్ట్రలోని మహోర్ వరకు హైవే అభివృద్ధి చేయాలని ముధోల్ ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ నితిన్ గడ్కరీని కోరారు. కేంద్ర మంత్రులను కలిసిన వారిలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు ఉన్నారు. 5న నాగోబా దర్బార్‌హాల్‌లో చర్చా వేదికఇంద్రవెల్లి: మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయం సమీపంలో గుర్తు తెలియని దుండగులు హీరాసుక స్మారక జెండా తొలగించిన విషయంపై ఈనెల 5న నాగోబా దర్బార్ హాల్లో చర్చా వేదిక నిర్వహించనున్నట్లు నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ అన్నారు. గురువారం నాగోబా ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ మేధావులు, ఆయా గ్రామాల పెద్దలు, నాయకులు చర్చకు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో మెస్రం వంశీయులు మెస్రం కోసేరావ్, మెస్రం బాదిరావ్ పటేల్, మెస్ర దుర్గు, మెస్రం ఆనంద్‌రావ్ తదితరులు ఉన్నారు. -
ఆర్జీయూకేటీలో న్యాక్ సన్నాహక సమావేశం
బాసర: ఆర్జీయూకేటీలో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (ఎన్ఏఏసీ) మూల్యాంకనానికి సంబంధించిన సన్నాహక సమావేశాన్ని ఇన్చార్జి వీసీ ఎ.గోవర్ధన్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. సమావేశానికి ఓఎస్డీ, ఏవో, అసోసియేట్ డీన్లు, అధ్యాపకులు హాజరయ్యారు. ఇన్చార్జి వీసీ మాట్లాడుతూ న్యాక్ అక్రిడిటేషన్ ప్రక్రియ నిర్ధారించడానికి అధ్యాపకులు పూర్తివివరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. యూనివర్శిటీ అకడమిక్, పరిపాలన, మౌలిక సదుపాయాల ప్రమాణాలు మెరుగుపర్చేందుకు అధ్యాపకులకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేశారు. ఆర్జీయూకేటీ విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించేందుకు, ప్రణాళికబద్ధంగా ఈ ఎన్ఏఏసీ మూల్యాంకన ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పలు నూతన కోర్సులను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్శన్, ఏవో రణధీర్, అసోసియేటెడ్ డాక్టర్ విటల్, డాక్టర్ మహేశ్, డాక్టర్ చంద్రశేఖర్, హెచ్వోడీలు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
టోకెన్ సమ్మె విజయవంతం చేయాలి
శ్రీరాంపూర్: దేశవ్యాప్తంగా కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై అన్ని కార్మిక సంఘాలు కలిసి ఈనెల 20న దేశవ్యాప్త టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ సీతారామయ్య పిలుపునిచ్చారు. గురువారం ఆయన ఆర్కే 7గనిపై గేట్ మీటింగ్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమ్మె జరుగుతుందన్నారు. కార్మికవర్గం నడ్డివిరిచే కొత్త చట్టాల అమలును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఓపెన్‌కాస్ట్‌లలో బొగ్గు తీసే పనిని కాంట్రాక్టర్లకు ఇవ్వొద్దన్నారు. ఓసీపీల్లో ప్రైవేట్ వారికి ఇచ్చిన బొగ్గు తవ్వకాలను రద్దు చేయాలని పేర్కొన్నారు. తాడిచర్ల 2, భూపాలపల్లి, వెంకటాపూర్2 గనులను సింగరేణికి ఇవ్వాలన్నారు. యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వీరభద్రయ్య, ముష్కే సమ్మయ్య బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, కిషన్ రావు, బు చ్చయ్య, రామచందర్, చంద్రశేఖర్, అఫ్రోజ్ ఖాన్, సారయ్య, శ్రీనివాస్, సురేశ్, రాజేందర్, రాజ్‌కుమార్, రవీందర్, లింగమూర్తి, సంతోష్ పాల్గొన్నారు. -
ఆగని ఇసుక దందా
● ఇటీవల ఐదు ట్రాక్టర్లు పట్టివేత ● కొనసాగుతున్న అక్రమ రవాణా ● తాజాగా మరో ఐదు ట్రాక్టర్లపై కేసు దండేపల్లి: అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా మండలంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడంలేదు. అక్రమార్కులు అధికారులకు, పోలీసులకు ఏమాత్రం భయపడకుండా తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దండేపల్లి మండలం కాసిపేట గోదావరి తీరం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా, ఇటీవల ఐదు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. అయినా ఇవేమి పట్టించుకోకుండా గురువారం మళ్లీ ఇసుకాసురులు 15 ట్రాక్టర్లలో ఇసుకను తరలించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సంధ్యారాణి, ఆర్ఐ భూమన్న, సిబ్బందితో కలిసి గోదావరి తీరానికి చేరుకున్నారు. రెవెన్యూ, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకునేలోగా కొన్ని ఇసుక ట్రాక్టర్లను ధర్మపురి వైపు మళ్లించారు. దీంతో కేవలం ఐదు ట్రాక్టర్లు మాత్రమే పట్టుపడ్డాయి. కేసు నమోదు చేశామని, అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. -
స్నేహితుడిపై హత్యాయత్నం.. కేసు నమోదు
నిర్మల్‌టౌన్: తన స్నేహితుడినే హత్య చేసేందుకు ఓ వ్యక్తి ఇతరులతో కలిసి యత్నించిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా గురువారం వివరాలు వెల్లడించారు. స్థానిక బాలాజీవాడకు చెందిన రాజులదేవి ప్రమోద్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. అదే అమ్మాయిని దినేశ్ అనే మరో వ్యక్తి కూడా ప్రేమించాడు. ఈ విషయంపై వారిద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగాయి. ఈనెల 1న మరోసారి వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడికి యత్నించడంతో అక్కడే ఉన్న కోట్ల రాజేశ్ వారిని అడ్డుకుని ఇద్దరిని అక్కడి నుంచి పంపించాడు. దీంతో ప్రమోద్ తన మిత్రుడైన రాజేశ్, దినేశ్‌కు మద్దతు ఇస్తున్నాడని భావించి రాజేశ్‌పై కోపం పెంచుకున్నాడు. అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అదేరోజు అర్ధరాత్రి రాజేశ్‌ను రామ్రావు బాగ్‌లోని మైసమ్మ కుంట గుట్ట ప్రాంతానికి పిలిచి గొడవపడ్డాడు. ప్రమోద్ మరో మిత్రుడైన కార్తిక్ సింగ్‌తో కలిసి రాజేశ్‌పై దాడి చేశాడు. పగిలిన బీరు సీసాతో పొడిచి హత్యాయత్నం చేశారు. ఇందుకు బబ్లు అలియాస్ రాజ్‌కుమార్, సచిన్ సింగ్‌లు సహకరించారు. రాజేశ్ తల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 24 గంటల్లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. -
విద్యార్థులకు ఫౌండేషన్
● సంక్షేమ గురుకులాల్లో కొత్త కోర్సులు ● ఎనిమిదో తరగతి నుంచి శిక్షణకు నిర్ణయం ● మెరిట్ విద్యార్థులకు ప్రాధాన్యత ● వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం బెల్లంపల్లి: తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మహర్దశ రానుంది. ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా గురుకుల విద్యార్థులకు ఎనిమిదో తరగతి నుంచే ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) కార్యదర్శి అలుగు వర్షిణి ఫౌండేషన్ కోర్సులను ప్రారంభించనున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 10 గురుకుల కళాశాలల్లో ఫౌండేషన్ కోర్సులను ప్రారంభించనున్నారు. ఐఐటీ జేఈఈ, నీట్, యూపీఎస్సీ, సీయూఐటీ, సీఎల్ఏటీ వంటి తదితర అత్యంత ప్రాధాన్యత కలిగిన కోర్సులకు శిక్షణ ఇవ్వనున్నారు. 2025 –26 విద్యాసంవత్సరం నుంచి ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ప్రారంభించనున్నారు. ప్రవేశపరీక్ష ద్వారా ఎంపిక ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇప్పించడానికి ఆసక్తి కలిగిన ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు వచ్చే విద్యా సంవత్సరంలో 8వ తరగతిలో ప్రవేశం పొందనున్న విద్యార్థులకు సైతం పరీక్ష రాసే అవకాశం కల్పించనున్నారు. ప్రవేశపరీక్షలో మెరిట్ మార్కులు పొందిన విద్యార్థులను ఎంపిక చేసి ఫౌండేషన్ కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. తద్వారా ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నాయి. కళాశాలల ఎంపికపై ఆసక్తి ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇప్పించడానికి ఏయే కళాశాలలను ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. విద్యాబోధనలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న గురుకుల విద్యాలయాలను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీవోఈ ) కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గౌలిదొడ్డిలో ఉన్న ప్రధాన క్యాంపస్ తోపాటు కరీంనగర్ (అల్గనూరు)లో ఉన్న సీవోఈ కళాశాలల్లో ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. వీటితో పాటు కొత్తగా మరో 8 కళాశాలలను ఎంపిక చేయనున్నారు. అయితే రెండేళ్ల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా 10 ఉత్తమ కళాశాలలను గుర్తించగా అందులో బెల్లంపల్లి బాలుర సీవోఈ కళాశాలకు ప్రాధాన్యత దక్కింది. గతంలో గుర్తించిన కళాశాలలను ఎంపిక చేస్తారా.. కొత్త కళాశాలలకు ప్రాధాన్యత ఇస్తారా.. అందుకు ఎలాంటి విధివిధానాలను అనుసరిస్తారనేది తేలాల్సి ఉంది. కళాశాలల ఎంపిక జరగలేదు సంక్షేమ గురుకులాల్లో 8వ తరగతి నుంచి పోటీ పరీక్షల్లో నెగ్గడానికి వీలుగా ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇప్పించాలని సొసైటీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 కళాశాలలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఏఏ కళాశాలలను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారనేది ఇంకా తెలియదు. త్వరలోనే ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. – అరుణకుమారి, జోనల్ అధికారి, సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ -
లాడ్జిలో దాడికి పాల్పడిన వ్యక్తులు అరెస్ట్
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ గార్డెన్ సమీపంలోని ఓ లాడ్జిలో ఈనెల 1న రాత్రి జరిగిన దాడి కేసులో బుధవారం ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు స్థానిక సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం శ్రీరాంపూర్ భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఉషకోయల తరుణ్ తన బంధువులు శ్రావణ్, పర్వతాలు, శ్రీకాంత్, రేవంత్‌లు లాడ్జిలో రూమ్ తీసుకొని శ్రావణ్ కుటుంబ సమస్యపై మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో రేవంత్‌కు తెలిసిన వ్యక్తి అశోక్‌రోడ్‌కు చెందిన మురుమూరు సందీప్ తన స్నేహితులు తిగుళ్ల శివకుమార్, అబ్దుల్ అఫ్రోజ్, నిఖిల్, వివేక్, అచ్యుత్, సాకేత్‌లు రేవంత్‌తో పాటు ఇతరులపై దాడిచేశారు. పాత గొడవల కారణంగా సందీప్ రేవంత్‌పై దాడి చేయగా శ్రీకాంత్, తరుణ్, పర్వతాలుకు తీవ్ర గాయాలయ్యాయి. తరుణ్ ఫిర్యాదు మేరకు సందీప్, శివకుమార్, అబ్దుల్ అప్రోజ్, నిఖిల్, వివేక్, అచ్యుత్, సాకేత్‌లపై కేసు నమోదు చేయగా శివకుమార్, సాకేత్, అఫ్రోజ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిఖిల్, వివేక్, అచ్యుత్, సందీప్‌లు పరారీలో ఉన్నారన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల వాసి మృతి
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని రాంనగర్‌కు చెందిన పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ భర్త విజయ్ (53) బుధవారం హైదరాబాద్ రింగురోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం విజయ్ తన అన్న కూతురు సోనిని అమెరికా పంపించేందుకు ఈనెల1న అన్నయ్య రాములు, వదిన విజయ, మరో స్నేహితుడితో కలిసి తన కారులో వెళ్లాడు. బుధవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా రింగ్‌రోడ్డుపై కంటైనర్ లారీ ఢీకొనడంతో విజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అన్నయ్య రాములుకు, డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా రాములు భార్య విజయ తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతోంది. విజయ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
భార్య, అత్తపై దాడి.. వ్యక్తి అరెస్ట్
తాండూర్: భార్య, అత్తను చితకబాది గాయపర్చిన కేసులో ఓ వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ మండలం అచ్చులాపూర్ గ్రామపంచాయతీ కొమ్ముగూడెం గ్రామానికి చెందిన దాగం మల్లేశ్ గతనెల 16న మద్యం తాగి భార్య లావణ్యతో గొడవ పడ్డాడు. లావణ్యపై దాడి చేయడానికి సిద్ధపడగా అత్త రాజు అడ్డుపడింది. కోపోద్రిక్తుడైన మల్లేశ్ గరిటెతో ఇరువురు తలలపై బలంగా కొట్టి గాయపర్చాడు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చినట్లు ఎస్సై తెలిపారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ నేరడిగొండ: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. నిర్మల్ వైపు గంజాయి తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు సిబ్బందితో కలిసి బుధవారం బంధం ఎక్స్‌రోడ్ వద్ద తనిఖీలు చేపట్టగా నేరడిగొండ మండలం వాంకిడి గ్రామానికి చెందిన షేక్ మజార్, నిర్మల్ జిల్లాకు చెందిన షేక్ ఇమ్రాన్ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద 150 గ్రాముల గంజాయి లభించినట్లు తెలిపారు. వారిని విచారించగా నేరడిగొండ మండలంలోని ధన్నూర్(డి) గ్రామానికి చెందిన కాటరే తారాసింగ్ వద్ద నుంచి గంజాయి తీసుకొస్తున్నట్లు తేలిందన్నారు. వ్యక్తి రిమాండ్ బజార్హత్నూర్: గంజాయితో ఉన్న వ్యక్తిని రిమాండ్‌కు తరలించిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మోర్కండి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి పోలీస్పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో గులాబ్‌తండా గ్రామపంచాయతీ పరిధి ఇంద్రనగర్ గ్రామానికి చెంది న ఆడే రాజ్‌కుమార్ అనుమానాదస్పదంగా కన్పించాడు. అతడిని తనిఖీ చేయగా అతని వద్ద 100 గ్రాముల గంజాయి లభించింది. వెంటనే రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై అప్పారావు తెలిపారు. బుధవారం బోథ్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
అన్ని దానాలకన్నా రక్తదానం గొప్పది..
జైపూర్: అన్ని దానాలకన్నా రక్తదానం చాలా గొప్పదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెగా రక్తదా న శిబిరం నిర్వహించారు. బీజేవైఎం, ఎమ్మార్పీఎస్ యువత, ఛత్రపతిశివాజీ యువసేన యువకులు రక్తదానం చేశారు. మంచిర్యాల రె డ్‌క్రాస్ సొసైటీ నిర్వాహకులు కాసర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్తాన్ని సేకరించారు. రక్తదానం చేసిన యువతకు బీజేపీ నాయకులు పండ్లు అందజేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, పార్టీ మండల అధ్యక్షుడు దూట రాజ్‌కుమార్, కోట పల్లి మండల ఇంచార్జి కాసెట్టి నాగేశ్వర్రావు, నాయకులు రాంటెంకి సాయి, సుమన్, యువకులు పాల్గొన్నారు. -
పదోన్నతితో గౌరవం, బాధ్యత
మంచిర్యాలక్రైం: పోలీసు ఉద్యోగికి పదోన్నతి గౌరవాన్ని, బాధ్యతను పెంచుతుందని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రామగుండం పోలీసు కమిషనరేట్‌లో పని చేస్తున్న 51మంది కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించిన సందర్భంగా చిహ్నాలను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎలాంటి రిమార్క్ లేకుండా విధులు నిర్వర్తించాలని అన్నారు. వి ధుల్లో ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు, రివార్డులు అందిస్తామని తెలిపారు. ప్రజలతో సత్సంబంధాలు ఏర్పర్చుకుని నేర నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రాజు, ఎస్బీ ఏసీపీ రఘవేంద్రరావు, ఏఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నిరసనలో పాల్గొన్న ఎంపీ నగేశ్
ఆదిలాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సమీప ప్రభుత్వ భూముల వేలాన్ని నిలిపివేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట బుధవారం బీజేపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న జీహెచ్ఎంసీ మేయర్సారంగపూర్: మండలంలోని అడెల్లి మహాపోచమ్మ అమ్మవారిని బుధవారం జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మేయర్‌కు అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న మహాపోచమ్మ దేవాలయం, పరిసరాలను పరిశీలించారు. ఆమె వెంట నాయకులు గడ్డం అరవింద్‌రెడ్డి, నాయకులు ఉన్నారు. జొన్న పంట దగ్ధంముధోల్: ముధోల్‌కు చెందిన కోరి యోగేశ్‌కు చెందిన జొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. ఆయ న తెలిపిన వివరాల ప్రకారం... యోగేశ్ 10 ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న పంటలు సాగు చేశాడు. చేతికొచ్చిన జొన్న పంటను ఒకే చోట కు చేర్చి కుప్పలుగా పోశాడు. ఇటీవల వర్షం కురవడంతో రక్షణ కోసం కుప్పలపై టార్పాలిన్లు కప్పి ఉంచాడు. బుధవారం ఉదయం చేనుకు వచ్చే సరికి పంట కుప్పలు కాలిపోయి ఉన్నాయి. పంట కుప్పలు దగ్ధం కావడానికి గల కారణం ఎంటో తెలియడం లేదని బాధిత రైతు వాపోతున్నాడు. అప్పులు తెచ్చి పంట సాగు చేశానని అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తెల్లకల్లు షాపుపై పోలీసుల దాడిబేల: మండలంలోని జంగుగూడ (సైద్పూర్)లో లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న తెల్లకల్లు షాపుపై మంగళవారం రాత్రి జైనథ్ సర్కిల్ సీఐ సాయినాథ్, బేల ఎస్సై దివ్యభారతిలు సిబ్బందితో కలిసి దాడి చేశారు. తెల్లకల్లు షాపులోని 400 లీటర్ల తెల్లకల్లును ధ్వంసం చేసి, రూ.3వేల నగదును సీజ్ చేసినట్లు వారు పేర్కొన్నారు. షాపు యజమాని బేలకు చెందిన సత్యనారయణ్ గౌడ్, షాపు నిర్వాహకుడు తుకారాంతో పాటు అక్రమషాపు నిర్వహణకు రూ.12లక్షలకు అనుమతి ఇచ్చిన వీడీసీ చైర్మన్ ఆత్రం రాముడుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
తాండూర్: తన కంటిచూపు నయమవుతుందో లేదోననే బెంగతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తంగళ్లపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కిష్టంపేట గ్రామపంచాయతీ తంగళ్లపల్లి గ్రామానికి చెందిన గోవిందుల కవిత– సత్యనారాయణల పెద్ద కుమారుడు రవితేజ (23) హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నాడు. ఇటీవల కంటికి శస్త్రచికిత్స చేయించుకుని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. తనకు కంటి సమస్య తగ్గిపోతుందో లేదోనని మానసికంగా వేధనకు గురై బుధవారం మధ్యాహ్నం తాను చనిపోతున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం అందించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. కుటుంబసభ్యులు ఇంటికి వచ్చేసరికి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉండడంతో హుటా హుటిన బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే రవితేజ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. యువకుడి మేనమామ అనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రాత్రి పది తర్వాత రోడ్లపై కనిపిస్తే తాట తీస్తాం
● మంచిర్యాల డీసీపీ భాస్కర్ హెచ్చరిక ● ఎన్టీఆర్ నగర్లో నిర్బంధ తనిఖీలు ● ఇబ్బందులుంటే డయల్ 100కు సమాచారం ఇవ్వండిమంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలో రాత్రి పది గంటలు దాటిన తర్వాత రోడ్లపై కనిపిస్తే తాట తీస్తామని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ హెచ్చరించారు. స్థానిక ఎన్టీఆర్ నగర్లో బుధవారం సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 8గంటల వరకు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తనిఖీ చేశారు. అనుమానితుల ఆధార్‌కార్డు, సెల్‌నంబరు, ఫొటో తీసుకుని వివరాలు సేకరించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని కొందరి వాహనాలను స్టేషన్‌కు తరలించారు. అనంతరం డీసీపీ భాస్కర్ కాలనీ ప్రజలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే సమాచారం అందించాలని కోరారు. యువతీ, యువకులు తమ బంగారు భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దని సూచించా రు. డ్రగ్స్, గంజాయి, పేకాట, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. విద్యర్థులపై ఒక్కసారి కేసు నమోదైతే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు అర్హత కోల్పోతారని తెలిపారు. మహిళలను వేధించడం, చిన్న చిన్న తగాదాల్లో తల దూర్చి కేసుల పాలైతే నేరస్తునిగా ముద్ర పడుతుందని చెప్పారు. ఎవరికై నా ఇబ్బందులు ఎదురైతే డయల్ 100కు ఫోన్ చేస్తే క్షణాల్లో పోలీసులు మీ ముందుంటారని తెలిపారు. ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు, ఎస్సైలు పాల్గొన్నారు. -
రాజ్యాంగ పరిరక్షణకే పాదయాత్ర
నార్నూర్: రాజ్యాంగ పరిరక్షణకే జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణ అన్నారు. బుధవారం మండలంలోని పూసిగూడ గ్రామం నుంచి జిల్లా కోఆర్డినేటర్ ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్‌తో కలిసి పాదయాత్ర ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ దేశంలో నియంతృత్వ, అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రజలకు తెలుపాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ప్రజలతో, కార్యకర్తలతో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లోఖండే దేవురావు, మాజీ సర్పంచ్ బానోత్ గజానందు నాయక్, మాజీ ఎంపీటీసీ పరమేశ్వర్, మహిళ నాయకురాలు బానోత్ ప్రణీత, పీఏసీఎస్ డైరెక్టర్ కాంతారావు దుర్గే, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కోరేళ్ల మహేందర్, కాంగ్రెస్ పార్టీ యూత్ జిల్లా ఉపాధ్యక్షుడు నసీర్ తదితరులు ఉన్నారు. -
గంగిపల్లిలో వన్యప్రాణుల వేట
జైపూర్: అటవీప్రాంత సమీపంలో పంట పొలాలను కాపాడుకోవడానికి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల ఉచ్చుకు వన్యప్రాణులు బలయ్యాయి. ఉచ్చుకు రెండు చుక్కల దుప్పులు మృత్యువాతపడగా వాటి మాంసాన్ని విక్రయించేందుకు యత్నించిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. జైపూర్ మండలం గంగిపల్లి గ్రామ శివారులో గల పంట పొలాల్లో రైతులు అమర్చిన విద్యుత్ తీగలకు రెండు చుక్కల దుప్పులు మృతిచెందాయి. మాంసాన్ని విక్రయించేందుకు చిన్న ముక్కలుగా కోస్తుండగా గంగిపల్లి గ్రామానికి చెందిన పాలమాకుల శ్రీనివాస్‌రెడ్డి, గూడపాపన్నలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నట్లు మంచిర్యాల రేంజ్ అధికారి రత్నాకర్ తెలిపారు. ఇద్దరిపై వన్యప్రాణుల చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. -
ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ భీమారం: లేఅవుట్ లేని భూముల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్–2020లో భాగంగా అర్హుల నుంచి రుసుం వసూళ్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ఆయన మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ పనితీరును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ సకాలంలో రుసుం చెల్లించి భూములను క్రమబద్ధీకరించుకోవాలని తెలిపారు. ఇందుకోసం మున్సిపాలిటీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. వేసవి ఎండల దృష్ట్యా గ్రామాల్లో మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధికి చేయుత అందిస్తోందని, అర్హులు ఈ నెల 14లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని నర్సనిని సందర్శించారు. ఎంపీడీవో మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. విధుల్లో బాధ్యతగా వ్యవహరించాలి మంచిర్యాలటౌన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, వైద్య సిబ్బంది విధుల్లో బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలు, రిజిష్టర్లు, పరిసరాలను పరిశీలించిన అనంతరం సిబ్బందితో మాట్లాడారు. రోగులతో మర్యాదగా వ్యవహరించి మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. వేసవికాలంలో వడదెబ్బ బారిన పడకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నేడు జయంత్యుత్సవాల నిర్వహణపై సమావేశం మంచిర్యాలటౌన్: ఈ నెల 5, 14వ తేదీల్లో మహానీయుల జయంతి ఉత్సవాల నిర్వహణపై ఈ నెల 3న ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్లోని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పోటు రవీందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5న డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ 118వ జయంతి, 14న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ 134వ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆయా కార్యక్రమాల నిర్వహణ కోసం జిల్లాలోని వివిధ సంఘాల ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని కోరారు. -
● ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 11 మందికి ముగ్గురే.. ● వివిధ కారణాలతో సెలవులో ఇద్దరు, డిప్యూటేషన్‌లో ఒక్కరు ● ఎస్‌ఆర్‌లు, ఇతర వైద్య నిపుణులకు అదనపు బాధ్యతలు ● తాము చేయలేమంటూ ఇతర వైద్య నిపుణుల నిరసన
నియామకానికి ప్రయత్నిస్తున్నాం మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు 11 మంది ఉండాలి. అందులో ఒకరు బ్లడ్‌బ్యాంకుకు పనిచేస్తే, మిగతా 10 మంది అ త్యవసర విభాగంలోనే పనిచేయాల్సి ఉంటుంది. ముగ్గురు ఉద్యోగులు ఉన్నా పలు కారణాలతో సెలవులో, ఇతర విభాగాల్లో వెళ్లి పనిచేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్‌ఆర్‌లకు, ఇతర వైద్య నిపుణులకు సీఎంవోగా విధులు అప్పగించాల్సి వస్తోంది. ఇ ప్పటికే పలుమార్లు నోటిఫికేషన్ వేసినా ఎ వరూ ముందుకు రావడం లేదు. ఖాళీలు భర్తీ చేసి సీఎంవోల కొరతను తీర్చి రోగుల కు చికిత్స అందించేలా చూస్తాం. – డాక్టర్ హరీశ్‌చంద్రరెడ్డి, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రం మంచిర్యాలలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అత్యవసర విభాగంలో క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్(సీఎంవో) వైద్యులు కరువయ్యారు. జిల్లాతోపాటు కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లా, పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి నిత్యం వందలాది మంది రోగులు ఆస్పత్రికి వస్తుంటారు. అత్యవసర విభాగానికి వచ్చే వారిలో రోడ్డు ప్రమా ద క్షతగాత్రులు, ఆత్మహత్యాయత్నం చేసిన వారు, గొడవల్లో గాయపడిన వారు ఉంటారు. ఇలాంటి కేసులు ప్రతీ రోజు 10నుంచి 15వరకు వస్తుంటా యి. నెలలో 300కు పైగా ఇలాంటి కేసులే వస్తుండడంతో ఆయా రోగులకు అత్యవసర వైద్యం అందించి, అనంతరం అవసరమైన ప్రత్యేక వైద్య నిపుణుల వద్దకు రెఫర్ చేయాల్సిన బాధ్యత సీఎంవోలపై ఉంటుంది. కానీ అత్యవసర సమయంలో వైద్యంచే వారు లేకపోవడంతో ఇబ్బందిగా మారుతోంది. పేరుకే ముగ్గురు సీఎంవోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 11 మంది క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు ఉండాలి. కానీ ముగ్గురు మాత్రమే ఉండగా, వారిలో ఒకరు మెటర్నిటీ లీవ్‌లో, మరొకరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వెళ్లిపోవడంతో ఒక్కరే మిగిలారు. ప్రతీరోజు 10 నుంచి 15 అత్యవసర కేసులు వస్తుండడం, 24 గంటలు అందుబాటులో ఉండాల్సిన చోట మూడు షిఫ్టులకు ఒక్కరే పనిచేయడం కష్టంగా మారుతోంది. దీంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి వచ్చిన సీనియర్ రెసిడెంట్ల(ఎస్ఆర్)కు సీఎంవో విధులు అప్పగించారు. రెగ్యులర్‌గా ఉండే ఒక్క ఉద్యోగి అనారోగ్య కారణంతో సెలవుపై వెళ్లడం, ఎస్‌ఆర్‌లు మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేసేందుకు ఉన్న గడువు గత నెల 31వ తేదీతో ముగిసిపోయింది. ఒక్కరు కూడా అందుబాటులో లేరు. దీంతో మెడికల్ కాలేజీకి అనుబంధంగా కొనసాగుతున్న ఆసుపత్రి ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వైద్య నిపుణులు, మెడికల్ కాలేజీ ఫ్యాకల్టీలకు సీఎంవోగా అదనపు బాధ్యతలు అప్పగించాల్సి వస్తోంది. దీనిపై వారంతా కలిసి ఈ నెల 1న తమకు సీఎంవో బాధ్యతలు అప్పగించవద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. -
న్యాయం చేయాలని గంగపుత్రుల నిరసన
నిర్మల్‌చైన్‌గేట్: లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ డబ్ల్యూకు చెందిన గంగపుత్ర కులానికి చెందిన 10 కుటుంబాల వారు తమకు న్యాయం చేయాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ కుల సంఘానికి సంబంధించిన లెక్కలు అడిగినందుకు సంఘం అధ్యక్షుడు పడగేల మహిపాల్ తమ కుటుంబాలను కుల బహిష్కరణ చేశారన్నారు. గత పది నెలలుగా కలెక్టర్, ఎస్పీలను కలిసి సమస్య పరిష్కరించాలని కోరినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. సమస్య పరిష్కారానికి వచ్చిన పోలీసులు కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఇచ్చి కులంలో చేరాలని సలహా ఇచ్చారని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్, జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు గైని మురళీమోహన్, హెచ్ఆర్సీ సంఘం అధ్యక్షుడు సురకంటి ఎల్లారెడ్డి, బాధిత గంగపుత్రులు పుట్టి భీమన్న, పుట్టి ఎర్రన్న ఉన్నారు. -
మాలగురిజాలకు కిడ్నీ గండం!
గ్రామ స్వరూపం జనాభా 1,684 సీ్త్రలు 846 పురుషులు 838 నివాసాలు 435 చేతిపంపులు 06 వాటర్ ట్యాంకులు 02 పంపు మోటార్లు 03ఈ ఫొటోలోని వ్యక్తి పేరు రత్నం పెద్ద బాపు. 66 ఏళ్ల వయస్సు ఉన్న ఆయన నాలుగున్నరేళ్ల క్రితం కిడ్నీ వ్యాధి బారిన పడ్డాడు. రెండు కిడ్నీలు పరిమాణం తగ్గి చురుగ్గా పని చేయడం మానేశాయి. ఏడాది క్రితం డయాలసిస్ చేయాల్సిన అవసరం ఏర్పడగా శరీరం సహకరించదేమోనని భయపడి వెనుకంజ వేశాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ వైద్యుడి వద్దకు వెళ్లి ప్రతీ నెల చికి త్స చేయించుకుంటున్నాడు. మందులు వాడు తూ కాలం వెళ్లదీస్తున్నాడు. నెలకు గరిష్టంగా రూ.5 వేల వరకు ఖర్చు చేస్తున్నాడు. ఈ ఫొటో కనిపిస్తున్న మహిళ పేరు రత్నం రాజక్క. 64 ఏళ్ల వయస్సు కలిగిన ఈమె గత ఆరు నెలల నుంచి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతోంది. రెండు కిడ్నీల్లో ఒకటి బాగానే ఉన్నా మరొకదాని పనితీరు మందగించింది. ఆమెకు డయాలసిస్ చేయించుకునే పరిస్థితి ఇంకా రానప్పటికీ ప్రతీ నెల మందులు వాడాల్సి వస్తోంది. ఈమె కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ వైద్యుడికి వెళ్లి చికిత్స చేయించుకుంటోంది. నెలకు ప్రయాణ ఖర్చులు కలుపుకొని గరిష్టంగా రూ.4 వేల వరకు ఖర్చవుతోంది. మృతులు.. కిడ్నీ సమస్యలతో గ్రామంలోని ఒకే ఇంటికి చెందిన కలాలి చిన్నరాజం, అంకుబాయి ఐదేళ్ల క్రితం మృతిచెందారు. వీరితోపాటు మరో కుటుంబానికి చెందిన గోలేటి పోశం, ఆయన కొడుకు గోలేటి శంకర్ కిడ్నీ జబ్బుల బారిన పడి మూడేళ్ల క్రితం చనిపోయారు. మరో ఇంట్లో అక్కాచెల్లెళ్లు గోమాస రాజుబా యి, కొండగొర్ల అనసూర్య ఏడాదిలోపు, వీరి తమ్ముడు దాగం మల్లేష్ కిడ్నీలు పాడైపోయి ఆరేళ్ల క్రితం తనువు చాలించారు. బెల్లంపల్లి: కిడ్నీ వ్యాధులతో ఆ గ్రామంలో ఇంటింటా మరణమృదంగం మోగుతోంది. యేటా ఒకరిద్దరు చనిపోతుండగా.. మరికొందరు మృత్యువుతో పోరాడుతుండడం కనిపిస్తోంది. తాగునీటి సమస్యే కారణమో.. మరేదో తెలియదు గానీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. బెల్లంపల్లి పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని మాలగురిజాల గ్రామం కిడ్నీ సమస్యలకు నెలవుగా మారింది. గత ఐదేళ్లలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో 20మంది వరకు చనిపోగా.. పలువురు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒక్కో ఇంట్లో ఇద్దరు గ్రామంలోని ఒక్కో ఇంట్లో ఇద్దరు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఆడామగ తేడా లేకుండా వ్యాధి బారి న పడుతున్నారు. 35ఏళ్ల నుంచి 70ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తులు కిడ్నీలు పనిచేయకుండా సతమ తం అవుతున్నారు. ఒక్కో ఇంట్లో తండ్రి లేదా కొడు కు లేదా తల్లి కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడి డయాలసిస్ స్థితికి చేరుకుంటున్నారు. కుటుంబ పెద్దలు జబ్బు బారిన పడి మంచానికి పరిమితం కావడంతో కుటుంబ బాధ్యతలు అనివార్యంగా ఇల్లాలిపై పడుతున్నాయి. పిల్లలు వేరే ప్రాంతాల్లో ఉన్న వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. వ్యవసాయదారులు, కూలీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి పక్షం రోజులకోసారి కొందరు, నెలరోజులకోసారి మరికొందరు డయాలసిస్ చేయించుకుంటున్నారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో గోలేటి సాలక్క డయాలసిస్ చేయించుకుంటోంది. డయాలసిస్ చేయించుకోవాలని మరో వ్యక్తికి వైద్యులు సూచించినా భయంతో మాత్రలతో నెట్టుకొస్తున్నాడు. బోరునీటిని తాగడం వల్లనే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడం, ఇతర వ్యాధుల బారిన పడుతున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నా తాగడానికి ఇష్టపడడం లేదు. అంతకు కొన్నేళ్ల ముందు రక్షిత మంచినీటి పథకం ద్వారా నీటి సరఫరా చేశారు. కానీ గ్రామస్తులంతా బోరు నీరు తాగడానికి అలవాటు పడడంతో ఒక్కొక్కరుగా కిడ్నీ సంబంధిత సమస్యలు కొని తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.నీటి సమస్యతోనే జబ్బులుగ్రామంలో చాలా ఏళ్ల నుంచి బోరు నీళ్లనే తాగుతున్నం. రుచికరంగా ఉండడంతో తాగడానికి ఇష్టపడుతున్నం. ఎందుకో, ఏమో తెలియదు కానీ ఆరోగ్యంగా కనిపిస్తూనే ఒక్కసారిగా ఒక్కొక్కరు కిడ్నీలు పాడైపోయి మంచం పడుతున్నారు. నీళ్ల కారణంగానే కిడ్నీ జబ్బులు వస్తున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. – రత్నం లింగయ్య, గ్రామస్తుడుచనిపోతున్నారు..కిడ్నీ సమస్యలు వచ్చి గ్రా మంలో చాలామంది చని పోతున్నారు. పలువురు కిడ్నీ సమస్యలతో సతమ తం అవుతున్నారు. వ్యాధి ముదిరాక కానీ బయట పడడం లేదు. దీంతో అనేక మంది ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఏటా కొంతమంది చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. కిడ్నీల సమస్యలు ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – దుగుట తిరుపతి, మాజీ సర్పంచ్సమగ్ర సర్వే చేయిస్తాం..కిడ్నీల సమస్యలు ఏర్పడడానికి పలు రకాల కారణాలు దోహదపడతాయి. గ్రామంలో ఎలాంటి నీరు తాగుతున్నారనేది గర్తించాల్సి ఉంది. కిడ్నీ జబ్బుల బారిన పడుతున్న వ్యక్తుల్లో ఎంతమంది డయాబెటిక్ పెషెంట్స్, మ రెంతమందికి మద్యం తాగే అలవాటు ఉందనేది గుర్తించాల్సి ఉంది. నిపుణులైన వైద్యులతో విశ్లేషణ చేయిస్తే కా నీ కిడ్నీ సమస్యలు ఎందుకు ఏర్పడుతున్నాయో నిర్ధారించలేం. ముందస్తుగా గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చే యించి రోగులకు వైద్యసేవలు అందించే విధంగా చూ స్తాం. ఓ మారు గ్రామంలో సమగ్ర సర్వే చేయించి కిడ్నీ సమస్యల నిర్ధారణ, నివారణకు చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ హరీష్‌రాజ్, డీఎంఅండ్‌హెచ్‌ఓ, మంచిర్యాల -
కొరవడిన పర్యవేక్షణ!
● అటవీ చెక్‌పోస్టుల వద్ద సీసీకెమెరాలు ఏర్పాటు ● తూతూ మంత్రంగా ఉన్నతాధికారుల పరిశీలన ● విధుల్లో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న సిబ్బంది జన్నారం: జన్నారం అటవీ డివిజన్లో స్మగ్లింగ్ నిరోధించేందుకు, అధికారుల పనితీరు పర్యవేక్షించేందుకు చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీకెమెరాలు తూతూ మంత్రంగా మారాయి. సీసీకెమెరాల నిర్వహణ చేపడుతున్నా ఉన్నతాధికారులు సీసీఫుటేజీలను పర్యవేక్షించకపోవడంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. చెక్‌పోస్టు వద్ద డ్యూటీలో ఉన్న సిబ్బంది సంతకం చేసిన తర్వాత అక్కడే 24 గంటలు పని చేయాల్సి ఉంటుంది. కానీ సంతకం చేసిన తర్వాత తమ సొంత పనుల కోసం వెళ్తున్నట్లు సమాచారం ఉంది. చెక్‌పోస్టుల వద్ద బీ ట్, సెక్షన్ అధికారులతో పాటు వాచర్లు కూడా విధులు నిర్వహిస్తుంటారు. అయితే వాచర్లకు బాధ్యతలు అప్పగించి అక్కడ డ్యూటీ చేసే ఇతర సిబ్బంది సొంత పనుల కోసం వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇలా పలు చెక్‌పోస్టుల్లో జరుగుతుండగా ఇటీవల ఉన్నతాధికారి గమనించి హెచ్చరించినట్లుగా సమాచా రం. గతంలో పని చేసిన ఎఫ్‌డీవో మాధవరావు సీసీ కెమెరాల్లోనే సిబ్బంది పనితీరు ఎప్పటికప్పుడు పరి శీలిస్తూ హెచ్చరికలు జారీ చేయడంతో ఎలాంటి ని ర్లక్ష్యం జరగలేదు. కానీ ప్రస్తుతం ఉన్నతాధికారులు సీసీకెమెరాలను పట్టించుకోకపోవడంతో సిబ్బంది పై పర్యవేక్షణ లేక ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఏర్పాటు.. జన్నారం అటవీ డివిజన్లో స్మగ్లింగ్ నిరోధించేందుకు, అధికారుల పనితీరు పర్యవేక్షించేందుకు మూడేళ్ల క్రితం చెక్‌పోస్టుల వద్ద సీసీకెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీకెమెరాల ఏర్పాటుతో చెక్‌పోస్టుల వద్ద జరుగుతున్న వాహనాల తనిఖీలు, రాత్రిపూట వాహనాల ప్రవేశంతో పాటు చెక్‌పోస్టుల వద్ద పని చేస్తున్న సిబ్బంది పనితీరు పర్యవేక్షించేవారు. డివిజన్లోని ఇందన్పల్లి, కలమడుగు, తపాలపూర్ చెక్‌పోస్టుల వద్ద సీసీకెమెరాలు ఏర్పాటు చేశారు. ఎన్నో ప్రయోజనాలు.. ప్రధాన రహదారిపై గల అటవీశాఖ చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీకెమెరాలతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధాన రహదారిపై స్మగ్లింగ్‌కు తగ్గిపోవడంత పాటు అనుమానిత వాహనాలను గుర్తించే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలకు పాల్పడిన వారిని గుర్తించడంలో ఈ సీసీ కెమెరాలు సహకరిస్తాయి. ఇప్పటి వరకు పలు కేసుల పరిష్కారంలో పోలీసులు అటవీశాఖ చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీకెమెరాలను పరిశీలించారు. నిత్యం పర్యవేక్షిస్తున్నాం.. జన్నారం డివిజన్లో నిఘా కోసం అటవీ చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. గతంలో కొంత పర్యవేక్షణ కొరవడింది. కానీ నేను విధుల్లో చేరినప్పటి నుంచి సీసీకెమెరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. సిబ్బంది పనితీరు కనిపెడుతున్నాం. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. – కారం శ్రీనివాస్, రేంజ్ అధికారి -
రైతుపై అడవిపంది దాడి
జన్నారం: అడవి పంది దాడిలో మండలంలోని పొనకల్ గ్రామానికి చెందిన రైతు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు చిరివేణి కిషన్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం పొనకల్ గ్రామ శివారులోని పంట పొలాలకు కిషన్ నీరు పెట్టేందుకు వెళ్లగా అడవిపంది ఒక్కసారిగా దాడి చేసింది. భయంతో కిషన్ కేకలు వేయగా సమీపంలో ఉన్న మరో వ్యక్తి రావడంతో అడవి పంది పారిపోయింది. దాడిలో కిషన్ కుడి భుజం, కుడి కన్ను కింద గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు జన్నారం ఆసుపత్రిలో చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. -
ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీస్
బాసర: గోదావరి నదిలో పిల్లలతో కలిసి దూకేందుకు యత్నించిన వ్యక్తికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటన మండలకేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా బోయగల్లికి చెందిన కోమటి గంగప్రసాద్, భార్య లక్ష్మి నిజామాబాద్‌లోని బట్టల దుకాణంలో పని చేస్తుంటారు. వారికి ఇద్దరు ఆడ పిల్లలు వర్షిణి, రషిత ఉన్నారు. కాగా కుటుంబ సమస్యల కారణంగా తన ఇద్దరు పిల్లలను తీసుకుని గంగప్రసాద్ బుధవారం బాసర మండల కేంద్రంలోని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మోహన్‌సింగ్ గమనించి హుటాహుటిన వారి వద్దకు చేరుకున్నాడు. ఆత్మహత్యకు యత్నిస్తున్న గంగప్రసాద్ను అతని ఇద్దరి పిల్లలను దగ్గరికి తీసుకొని ఓదార్చాడు. గంగప్రసాద్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారిని అప్పగించారు. కాగా చాకచక్యంగా వ్యవహరించి ఆత్మహత్య చేసుకోకుండా కాపాడిన కానిస్టేబుల్ మోహన్‌సింగ్‌ను ఎస్సై గణేశ్, ఇతర సిబ్బంది అభినందించారు. -
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
కోటపల్లి: మండలంలోని కొండంపేట గ్రామ సమీపంలో ఉపాధి హామీ పథకం కూలీలపై బుధవారం తేనెటీగలు దాడి చేశాయి. కూలీలు అటవీ ప్రాంతంలో పని ప్రదేశానికి వెళ్తుండగా ఒక్కసారిగా దాడి చేయడంతో పరుగులు తీశారు. తేనెటీగల నుంచి తప్పించుకునేందుకు తలోవైపు పరుగు పెట్టారు. దాడిలో గ్రామానికి చెందిన లింగయ్య, బానయ్య, రాజు, సమ్మక్క, అంకమ్మ, బాపు స్వల్పంగా, పి.స్వరూప తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి బాధితులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యుడు సత్యనారాయణకు సూచించారు. దాడిలో కూలీల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
ముగిసిన ‘పది’ పరీక్షలు
మంచిర్యాలఅర్బన్/నెన్నెల/కోటపల్లి: జిల్లాలో పదో తరగతి పరీక్షలు బుధవారం సాంఘికశాస్త్రం పేపరుతో ముగిసాయి. ఈసారి ఒక్క విద్యార్థి కూడా డిబార్ కాకుండా సాఫీగా పూర్తయ్యాయి. 99.70శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. చివరి రోజు రెగ్యులర్ విద్యార్థులు 9,209మందికి గాను 9,181మంది హాజరు కాగా, 49మంది గైర్హాజరయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 9,198 మందికి గాను 9,175మంది హాజరు కాగా 23మంది గైర్హాజరయ్యారు. గతంలో ఫెయిలైన వారిలో 11మందికి గాను ఐదుగురు రాలేదు. డీఈవో యాదయ్య ఐదు పరీక్ష కేంద్రాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ 15 పరీక్ష కేంద్రాలు తనిఖీ చేశారు. ఈ ఏడాది ముందస్తుగా పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా విద్యుత్, తాగునీరు సౌకర్యం కల్పించారు. ఆనందంలో మునిగితేలిన విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్షలు ముగియడంతో ఆనందంలో మునిగి తేలారు. చిరుదరహాసాలతో కేంద్రాల నుంచి బయట వేచి చూస్తున్న కుటుంబ సభ్యుల వద్దకు చేరారు. ఇదే చివరి రోజు కావడం, హైస్కూల్ విద్యకు స్వస్తి పలుకుతున్నామని చింతిస్తూనే మళ్లీ ఎప్పుడు కలుస్తామో అంటూ టాటా చెప్పుకోవడం, ఫోన్ నంబరు తీసుకోవడం కనిపించింది. హాస్టల్ విద్యార్థులు పెట్టె సర్దుకుని ఇంటిముఖం పట్టారు. కోటపల్లిలోని కేజీబీవీలో ఇన్నేళ్లు పాఠశాలతో ఉన్న బంధం ముగియడంతో విద్యార్థులు కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఉన్నత విద్య అభ్యసించి పాఠశాల, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఎస్వో హరిత, ఉపాధ్యాయులు సూచిస్తూ విద్యార్థులకు వీడ్కోలు పలికారు. -
ప్లాట్ల పంపిణీకి కృషి
కాసిపేట: నిర్వాసితులకు పది రోజుల్లో పునరావాస కాలనీలో ప్లాట్ల పంపిణీతో పాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ డబ్బులు చెల్లించేలా కృషి చేస్తామని బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ తెలిపారు. బుధవారం మండలంలోని ఓపెన్‌కాస్టు నిర్వాసిత దుబ్బగూడెం గ్రామస్తులతో సింగరేణి అధికారులతో కలిసి పునరావాస కాలనీలో సమావేశం నిర్వహించారు. కాలనీలో జరుగుతున్న పనుల్లో జాప్యం ఇతర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులతో సంబంధం లేకుండా ఈనెల 11న ప్లాట్ల కేటాయింపు అనంతరం నిర్వాసితులు నిర్మాణాలు చేసుకోవచ్చన్నారు. ఎస్‌ఓటూ జీఎం విజయప్రసాద్, సివిల్ ఎస్ఈ రాము, ఎస్టేట్ అధికారిణి నవనీత, దుబ్బగూడెం గ్రామస్తులు పాల్గొన్నారు. -
● కేబినెట్ బెర్త్‌పై వీడని ఉత్కంఠ ● ముహూర్తం ఖరారుతో నేతల్లో టెన్షన్ ● ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో చర్చ
గడ్డం వినోద్ వెడ్మ బొజ్జుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ నెల 3న ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. కేబినెట్ బెర్త్ ఎవరిని వరిస్తుందనే చర్చ సామాన్యుల నుంచి రాజకీయవర్గాల వరకు జరుగుతోంది. హైకమాండ్ నిర్ణయంపై ఆసక్తి పెరిగిన వేళ, నాయకులు, కార్యకర్తలు తమ ఎమ్మెల్యేకు అవకాశం వస్తుందా లేదా అనే టెన్షన్లో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా..ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఖానాపూర్ నుంచి మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వీరిలో మంచిర్యాల జిల్లాకు చెందినవారే ముగ్గురు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును కూడా పరిగణనలోకి తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హైకమాండ్ జాగ్రత్తలు..కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. పార్టీలో వ్యతిరేకత రాకుండా అభిప్రాయాలు సేకరిస్తూ, ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటోందని సమాచారం. మొదటి విస్తరణలోనే జిల్లాకు అవకాశం దక్కుతుందని భావించారు. తర్వాత ఈ ప్రక్రియ ఏడాదిన్నరగా వాయిదా పడుతూ వచ్చింది. లోక్‌సభ, ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఇప్పుడు ముహూర్తం ఖరారవడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ విస్తరణ ఉమ్మడి జిల్లా ప్రాతినిధ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఎవరికి అవకాశం దక్కుతుందనే ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడుతుందన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. గడ్డం వివేక్ ప్రేమ్‌సాగర్‌రావు పోటీలో ఎవరెవరు?బెల్లంపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గడ్డం వినోద్ తానే సీనియర్‌నని చెప్పుకుంటూ ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరారు. మరోవైపు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు పార్టీ కోసం కష్టపడిన తనకే పదవి రావాలని వాదిస్తున్నారు. ఒక దశలో ఆయనకు కేబినెట్ బెర్త్ ఖాయమని సంకేతాలు వచ్చాయి. తాజా పరిణామాలతో సందిగ్ధత నెలకొంది. ఆయన అనుచరులు మంత్రిపదవి కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇక చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన వర్గం ఉత్సాహంలో ఉంది. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి.. వివేక్‌ను మంత్రి వివేక్‌గారూ అని సంబోధించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. మాల సామాజిక వర్గం నుంచి ఆయనకు బెర్త్ దక్కినట్లు చర్చలు ఊపందుకున్నాయి. అయితే హైకమాండ్ నుంచి ఎవరికీ స్పష్టత రాలేదు. దీంతో తుది జాబితాలో ఎవరుంటారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. -
నిరుద్యోగుల కోసమే ‘రాజీవ్ యువ వికాసం’
మంచిర్యాలటౌన్/జైపూర్: నిరుద్యోగ యువత ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించిందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నగర పాలక సంస్థ కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లను, జైపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ల ప్రత్యేక కౌంటర్‌ను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఈ పథకం ద్వారా చేయూత అందించడం జరుగుతుందన్నారు. అర్హులైన వారు ఈనెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రూ.50 వేల లోపు రుణం 100 శాతం మాఫీ, రూ.లక్షలోపు రుణం తీసుకుంటే 90 శాతం రాయితీ, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు తీసుకుంటే 80 శాతం రాయితీ, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు తీసుకుంటే 70 శాతం రాయితీ లభిస్తుందని వివరించారు. రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణాల ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులకు ఏమైనా సలహాలు, సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. లేఅవుట్ క్రమబద్ధీకరణలో భాగంగా ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లింపుదారులకు అవగాహన కల్పించి, సకాలంలో చెల్లించేలా చర్యలను తీసుకోవాలని ఆదేశించారు.● కలెక్టర్ కుమార్ దీపక్ప్రతీ లబ్ధిదారుడికి సన్న బియ్యంనస్పూర్: జిల్లాలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతీ లబ్ధిదారుడికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. నస్పూర్ పట్టణంలోని పలు రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీని పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావుతో కలిసి ప్రారంభించారు. పేదల కడుపు నింపడానికే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యాక్రమం చేపట్టిందని తెలిపారు. అధికారులు సమన్వయంతో లబ్ధిదారులకు బియ్యం అందేలా చూడాలన్నారు. రేషన్ దుకాణాల వద్ద కళాజాత బృందాలు ప్రభుత్వ పథకాలను పాటల రూపంలో వివరించారు. రేషన్ షాపు తనిఖీ..జైపూర్ మండల కేంద్రంలోని రేషన్ షాపును జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావుతో కలిసి తనిఖీ చేశారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోందని తెలిపారు. లబ్ధిదారులందరికీ సన్న బియ్యం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో సత్యనారాయణ, మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు, ఏపీవో బాలయ్య, సంబంధిత అధికారులు ఉన్నారు. -
‘ఆస్తి పన్ను’లో లక్సెట్టిపేట ఫస్ట్..
నస్పూర్: 2024–25 ఆర్థిక సంవత్సరం ముగిసింది. పన్ను వసూళ్లలో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో సగటున 70.22 శాతం వసూలైంది. ఇందులో లక్సెట్టిపేట మున్సిపాలిటీ 86.31 శాతంతో మొదటిస్థానంలో నిలిచింది. బెల్లంపల్లి మున్సిపాలిటీ 56.25 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నాలుగో స్థానంలో నిలిచింది. మున్సిపాలిటీ అసెస్మెంట్ డిమాండ్ (కోట్లు ) వసూళ్లు (కోట్లు) శాతం లక్సెట్టిపేట 5,988 1.68 1.45 86.31 మందమర్రి 13,680 2.29 1.76 76.86 క్యాతన్‌పల్లి 12,159 3.94 3.00 76.14 మంచిర్యాల(కార్పొరేషన్) 45,372 26.28 17.01 64.73 చెన్నూర్ 7,231 2.85 1.74 61.05 బెల్లంపల్లి 16,246 4.16 2.34 56.25 బెల్లంపల్లి లాస్ట్.. -
శ్రీరాంపూర్‌లో 92 శాతం బొగ్గు ఉత్పత్తి
శ్రీరాంపూర్: సింగరేణి సంస్థ 2024–25 ఆర్థిక సంవత్సరానికి శ్రీరాంపూర్ ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యంలో 92 శాతం సాధించినట్లు ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు. జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. 2024, ఏప్రిల్ 1 నుంచి 2025, మార్చి 31 వరకు ఏరియా మొత్తానికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 63.1 లక్షల టన్నులకు 57.86 లక్షల టన్నులు సాధించినట్లు వివరించారు. కేవలం మార్చి నెలలో నిర్దేశించిన ఉత్పత్తిలో 147 శాతం ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కృషి చేసిన ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులకు అభినందనలు తెలిపారు. అధికారులతో సమీక్ష..ఏరియా అధికారులతో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం జరిగిన బొగ్గు రవాణా, ఇతర రికార్డులపై చర్చించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలో అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జీఎం యన్.సత్యనారాయణ, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అధికారి ఏవీ.రెడ్డి, టి.శ్రీనివాస్, ఏజెంట్లు రాజేందర్, వెంకటేశ్వర్లు, శ్రీధర్, డీజీఎంలు అరవిందరావు, చిరంజీవులు, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ రమేశ్‌బాబు, ప్రాజెక్ట్ ఇంజినీర్లు రామకృష్ణారావు, నాగరాజు, సర్వే అధికారి నర్సింగరావు, పర్యావరణ అధికారి హనుమాన్‌గౌడ్ పాల్గొన్నారు. లక్ష్మీ పూజలు..నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం సందర్భంగా జీఎం కార్యాలయంలోని ఫైనాన్స్ డిపార్టుమెంట్లో మంగళవారం లక్ష్మీ పూజలు నిర్వహించారు. ఏరియా జీఎం శ్రీనివాస్ ఈ పూజల్లో పాల్గొన్నారు. ఈ సంవత్సరం సంస్థ ఆర్థికంగా మరింత ముందుకు పోవాలని ఆకాంక్షించారు. క్వాలిటీ జీఎం సుసంత సాహూతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.డంప్‌యార్డును తరలించాలిసీసీసీలోని ముక్కిడి పోచమ్మ ఆలయం సమీపంలోని చెత్త డంపు యార్డును అక్కడి నుంచి తరలించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు కోరారు. మంగళవారం ఆ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా ఆధ్వర్యంలో నాయకులు జీఎం శ్రీనివాస్‌ను కలిసి వినతి పత్రం అందించారు. చెత్త కాల్చడం వలన పొగతో ఆర్కే 5 కాలనీ, బ్యారెక్స్, తాళ్లపల్లి సింగపూర్ ఆర్ అండ్ ఆర్ కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. డంప్‌యార్డును ఇక్కడి నుంచి దూరంగా తరలిచాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కొట్టే కిషన్‌రావు, జీఎం కమిటీ చర్చల ప్రతినిధులు బద్రి బుచ్చయ్య, గొల్లపల్లి రామచందర్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, ఫిట్ కార్యదర్శులు ఆకుల లక్ష్మణ్, సంఘం సదానందం, గునిగంటి నర్సింగరావు, సందీప్, మారుపెల్లి సారయ్య, నవీన్ రెడ్డి పాల్గొన్నారు. -
అత్యవసర వైద్యులను నియమించాలి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యవసర వైద్య అధికారులు(క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్)లు లేక ప్రత్యేక నిపుణులు, అధ్యాపకులను డీఎంఈ ఆదేశాల మేరకు సాధారణ అత్యవసర వైద్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో అత్యవసర వైద్యాధికారులను నియమించాలని ఆసుపత్రి వైద్యులు డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులు, అధ్యాపకులుగా పనిచేస్తున్న వారు మంగళవారం ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టారు. అత్యవసర విభాగాన్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు, అధ్యాపకులపై పనిభారం తగ్గించేందుకు వారి నియామకం తక్షణమే చేపట్టాలన్నారు. వైద్య నిపుణులపై అత్యవసర వైద్య బాధ్యతలను పెంచడంతో వారి అసలు విభాగాల్లో సేవల నాణ్యత తగ్గిపోతుందని, దీని కారణంగానే ఫ్యాకల్టీ సభ్యుల్లో నిరసన పెరిగి, కొత్తగా వచ్చే వారు ఆసక్తి చూపించడం లేదన్నారు. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లుగా తమకు విధులు అప్పగించవద్దని కోరారు. -
లింగ నిర్ధారణపై ఉక్కుపాదం
● చట్టవ్యతిరేకంగా స్కానింగ్ కేంద్రాల్లో నిర్ధారణ ● పెరుగుతున్న అబార్షన్లు.. ● తగ్గుతున్న ఆడపిల్లల జననం ● స్కానింగ్ కేంద్రాలపై నిఘా మంచిర్యాలటౌన్: లింగ నిర్దారణ పరీక్షలు చేయడం, చేయించుకోవడం లేదా ప్రోత్సహించడం చట్టవి రుద్ధం. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. మార్చి 25న జిల్లా కలెక్టరేట్లో అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. ‘బ్రూణ హత్యలను ఆపుదాం, ఆడపిల్లలను కాపాడుకుందాం‘ అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించి, ఒక్క ఆడ శిశువునూ కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆడ శిశువుల సంఖ్య తగ్గుదల..జిల్లాలో ఏటా పుట్టే శిశువుల్లో ఆడవారి కంటే మగవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆడ శిశువుల సంఖ్య క్షీణిస్తుండటంతో, లింగ నిర్దారణ పరీక్షలను నియంత్రించేందుకు పీసీపీఎన్డిటీ (ప్రీ–కాన్సెప్షన్ అండ్ ప్రీ–నాటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్) చట్టాన్ని కఠినంగా అమలు చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. రెండేళ్ల జిల్లా ప్రసవ గణాంకాల్లో మగ శిశువుల సంఖ్య ఆడవారి కంటే ఎక్కువగా ఉండటం లింగ నిర్దారణ పరీక్షలు జరుగుతున్నాయనే అనుమానాలకు దారితీసింది. స్కానింగ్ కేంద్రాల్లో లోపాలుతనిఖీల్లో స్కానింగ్ కేంద్రాల్లో పలు లోపాలు బయటపడ్డాయి. కొన్ని చోట్ల స్కానింగ్ వివరాలు సక్రమంగా లేవు, రిజిస్టర్ల నిర్వహణలో లోపాలు, వైద్యుల వివరాలు లేకపోవడం, ఫీజు వివరాల డిస్ప్లే లేకపోవడం గుర్తించారు. కొన్ని కేంద్రాల్లో గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు లేకుండా స్కానింగ్ జరుగుతోంది. ఇటువంటి కేంద్రాలను మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి మూడు నెలలకు తనిఖీలు, నెలవారీ నివేదికలు సమర్పించాల్సిన నిబంధన ఉన్నప్పటికీ, లోపాలు సరిచేయడం అవసరమని అధికారులు సూచిస్తున్నారు. ఈ చర్యలతో జిల్లాలో లింగ నిర్దారణ పరీక్షలను పూర్తిగా నిరోధించి, ఆడ శిశువుల రక్షణకు కలెక్టర్ కృషి చేస్తున్నారు.జిల్లా వ్యాప్తంగా రెండేళ్లుగా జరిగిన ప్రసవాల వివరాలుఏడాది మొత్తం ప్రసవాలు మగ శిశువులు ఆడ శిశువులు 2023–24 5,819 2,884 2,8692024–25 5,089 2,574 2,445మొత్తం 10,908 5,458 5,314సరిహద్దు రాష్ట్రాలపై దృష్టికొందరు జిల్లా సరిహద్దులో ఉన్నా మహారాష్ట్రకు వెళ్లి లింగ నిర్దారణ చేసుకుని, ఆడ శిశువులను అబార్షన్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై దృష్టి సారిస్తే జిల్లాలో ఆడ శిశువుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేసేందు కు పీసీపీఎన్డీటీ కమిటీని ఏర్పాటు చేసి, ఐదు టీంలను ఏర్పాటు చేశాం. స్కానింగ్ నిబంధనలు సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించేందుకు పీవో ఎంసీహెచ్ డాక్టర్ కృపాబాయిని నోడల్ ఆఫీసర్‌గా నియమించి, ఐదుగురు పారామెడికల్ ఆఫీసర్లను వేయడం జరి గింది. వీరితోపాటు, ఇతర ప్రోగ్రాం ఆఫీసర్లుతో నాలుగు టీంలను అదనంగా వేసి అన్ని స్కానింగ్ కేంద్రాల నిర్వహణ పరిశీలిస్తున్నాం. పరిశీలన పూర్తయ్యాక, స్కానింగ్ కేంద్రాల వారితో సమీక్ష నిర్వహించి, చట్టం గురించి వివరించి, ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. – డాక్టర్ హరీశ్‌రాజ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్కానింగ్ కేంద్రాలపై నిఘాజిల్లాలోని స్కానింగ్ కేంద్రాలపై కలెక్టర్ దృష్టి సారించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రోగ్రాం ఆఫీసర్, ఐదుగురు పారామెడికల్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, ఐదు బృందాలను రంగంలోకి దించారు. జిల్లాలో మొత్తం 52 స్కానింగ్ కేంద్రాలు ఉండగా, 4 ప్రభుత్వ ఆసుపత్రుల్లో, 48 ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 42 కేంద్రాలను తనిఖీ చేసిన కమిటీ, నిబంధనల పాటింపు, రిజిస్టర్ల నిర్వహణ, లింగ నిర్దారణ జరుగుతుందా లేదా అనే అంశాలను పరిశీలించింది. మిగిలిన 6 కేంద్రాల తనిఖీ తర్వాత, నిర్వాహకులతో సమీక్ష నిర్వహించి, చట్ట ఉల్లంఘనలపై చర్యలు తీసుకోనున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
సారంగపూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని వంజర్ గ్రామానికి చెందిన చాకపురం లచ్చన్న (72), చందాల రమేశ్, లక్ష్మణ్ మంగళవారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కుక్కలు అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కిందపడ్డారు. లచ్చన్న, రమేశ్‌కు తీవ్ర గాయాలు కావడంతో గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. ఈఎంటీ సాగర్, పైలట్ మహేష్ క్షతగాత్రులను నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ లచ్చన్న మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
● ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ● ఆదివాసీలతో ఆత్మీయ సమ్మేళనంఉట్నూర్రూరల్: ఆదివాసీ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం ఉట్నూర్ మండలంలోని కేబీ కాంప్లెక్స్ పీఎంఆర్సీ భవనంలో ఆదివాసీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆదివాసీలకు చెందిన తొమ్మిది తెగల నాయకులు, పెద్దలు, రాయిసెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గతంలో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారులందరూ ఆదిలాబాద్ జిల్లా ప్రాముఖ్యతను, విశిష్టతను తెలియచేశారన్నారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నాయన్నారు. ఆదివాసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే నేరం కావడంతో లెసెన్స్ మేళా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీని పలువురు నాయకులు శాలువాతో సత్కరించారు. అనంతరం ఆదివాసీ నాయకులతో కలిసి సామూహిక భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు గోడం నగేశ్, జిల్లా మేడి మెస్రం దుర్గు పటేల్, మెస్రం మనోహర్, కెస్లాపూర్ ఆలయ పీఠాదిపతి మెస్రం వెంకట్రావు, ఆదివాసీ సార్మేడీలు, పటేల్‌లు, 9 తెగల నాయకులు, పెద్దలు, ఉట్నూర్ సీఐ మొగిలి, జైనథ్ సీఐ సాయినాథ్, రూరల్ సీఐ ఫణిందర్, ఎస్సైలు మనోహర్, సునీల్, సిబ్బంది పాల్గొన్నారు. -
‘నాలెడ్జ్ ఆన్వర్డ్స్’తో చదువుపై ఆసక్తి
బెల్లంపల్లి: వేసవి సెలవుల్లో విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదువుపై ఆసక్తి పెంచుకునేందుకు బెల్లంపల్లికి చెందిన ఏకదంత మిత్రమండలి సభ్యులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సెలవుల్లో పిల్లలు సెల్‌ఫోన్, టీవీలకు అతుక్కుపోకుండా తమకు తెలియకుండానే విద్యాభివృద్ధి, విజ్ఞాన అంశాలు తెలుసుకునేలా, చదువుపై దృష్టిసారించేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభా పాటవాలు వెలికి తీయాలనే ఉద్దేశంతో ‘నాలెడ్జ్ ఆన్వర్డ్స్’ ప్రారంభించారు. విద్యార్థుల ను ఆకర్షించేలా బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 28వ వార్డులో గోడలపై విజ్ఞానం, విద్య, శాసీ్త్రయ అంశాలు, గణిత సూత్రాలు, దేశ, రాష్ట్ర చిత్రపటాలను రంగురంగులతో చిత్రీకరిస్తున్నారు. ఇందుకు అయ్యేఖర్చును ఏకదంత మిత్ర మండలి సభ్యులు తలా కొంత భరించుకుంటున్నారు. పదిమందికి పైగా ఉన్న సభ్యుల్లో ప్రైవేట్ టీచర్లు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు కావడం గమనార్హం. ప్రస్తుతం గోడలపై చిత్రీకరించిన అంశాలను తెలుసుకోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగానే ఏప్రిల్ చివరి వారం నుంచి ఈ కార్యక్రమాన్నీ లాంఛనంగా ప్రారంభించనున్నట్లు నిర్వాహకుడు బొంతల శ్రీనివాస్ తెలిపారు. -
గురువుకు ఘనంగా సెండాఫ్
తలమడుగు: మండలంలోని దేహగమలో పదవీ విరమణ పొందిన గురువుకు గ్రామస్తులు సెండాఫ్ ఘనంగా ఇచ్చారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సేవలందించిన ముస్కు సంజీవరెడ్డి దంపతులను మంగళవారం గ్రామస్తులు ఎడ్లబండిపై ఊరేగించారు. అనంతరం ఉపాధ్యాయ సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ లచ్చిరాం, జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ ముస్కు సంజీవరెడ్డి 27 ఏళ్లుగా పేద విద్యార్థులకు అందించిన సేవలు అభినందనీయమన్నారు. విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేశారన్నారు. ఆయన సేవలు ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో వెంకట్రావు, టీయూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జలంధర్‌రెడ్డి, లింగారెడ్డి, రామారావు, మౌనిష్‌రెడ్డి, రాంరెడ్డి, దేవన్న, త్రియంబక్, తదితరులు పాల్గొన్నారు. -
బడి బ్యాంక్ జాడేది?
● అమలుకాని సంచయక పథకం? ● గతంలో పాఠశాలల్లో నిర్వహణ ● అమలు చేస్తే మేలంటున్న పోషకులు అనవసర ఖర్చులు చేస్తున్నాం పాఠశాలలో సంచాయక పథకం అమలులో లేకపోవడంతో మా తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులను అనవసర పనులకు ఖర్చు చేస్తున్నాం. దీంతో పొదుపు చేసుకునే అలవాటు లేకుండా పోతోంది. – సోను, విద్యార్థి, వడ్యాల్ ఉన్నత పాఠశాల పథకం అమలు చేయాలి గతంలో పాఠశాలలో సంచాయక పథకం ఉండేదని, విద్యార్థులకు తమ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులను వృథా ఖర్చులు చేయకుండా పొదుపు చేసుకునే వారని మా ఉపాధ్యాయులు చెప్పారు. కానీ ఇప్పుడలా చేయడంలేదు. ప్రభుత్వం స్పందించి ఈ పథకం అమలయ్యేలా చర్యలు చేపట్టాలి. – వైష్ణవి, విద్యార్థిని, పీచర ఉన్నత పాఠశాల అమలైతే విద్యార్థులకు మేలు గతంలో నేను పనిచేసిన పాఠశాలలో కిడ్డీ బ్యాంకులు ఏర్పాటు చేసి విద్యార్థులకు పొదుపు అలవాటు చేశా. కానీ ఇప్పుడు ఈ పథకం అమలులో లేకపోవడంతో మూలన పడింది. పథకం అమలైతే విద్యార్థులకు చిన్ననాటి నుండే దుబారా ఖర్చులు చేయడం మాని పొదుపు చేయడం అలవాటవుతుంది. – రాజు నాయక్, ప్రధానోపాధ్యాయుడు, లక్ష్మణచాంద ఉన్నత పాఠశాల లక్ష్మణచాంద(నిర్మల్): పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు పొదుపు అలవాటు చేసేందుకు గతంలో ప్రభుత్వం తీసుకువచ్చిన సంచయక పథకం ఉమ్మడి జిల్లాలోని ఏ పాఠశాలలోనూ అమలు కావడంలేదు. తల్లిదండ్రులు ఇంటి వద్ద తమపిల్లలు పాఠశాలలకు వెళ్లే సమయంలో ఇచ్చిన డబ్బులను ఎలా పొదుపు చేయాలి.. ఎంత వరకు ఖర్చు చేయాలి.. ఏ పనికి ఎంత ఖర్చు చేయాలి.. వంటి అంశంపై సంచాయక పథకం ద్వారా విద్యార్థులకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. పాఠశాలలో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. విద్యార్థులకు పొదుపుపై అవగాహన కల్పించడంతో పాటు వారితో పొదుపు చేయించేలా పోత్సహించే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రస్తుతం ఏ పాఠశాలలో ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో పథకం మూలనపడింది. విద్యార్థుల్లో పొదుపు అలవర్చడమే లక్ష్యం... తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న చిన్న ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులను చిరుతిండ్ల కోసం ఖర్చు చేస్తారు. దీంతో విద్యార్థులకు చిన్ననాటి నుండే అనవసర ఖర్చులు చేయడం అలవాటవుతుంది. ఇలాంటి దుబారా ఖర్చులు చేయకుండా సంచాయక పథకంలో భాగంగా ఆయా పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పోషకులు ఇచ్చిన డబ్బులను కిడ్డీ బ్యాంకులో జమ చేసేలా చేస్తారు. ఇందులో ఒక రూపాయి నుంచి మొదలు ఎంత వరకై నా జమ చేసుకునే వెసులుబాటు ఉంది. విద్యార్థి ఇంటి నుండి తెచ్చిన డబ్బులను రిజిస్టర్లో నమోదు చేసుకుని కిడ్డీ బ్యాంకులో వేస్తారు. అవసరం ఉన్నప్పుడు మళ్లీ రిజిస్టర్లో నమోదు చేసుకుని విద్యార్థి జమ చేసుకున్న డబ్బులు ఇస్తారు. ఇలా విద్యార్థులు సంవత్సరం పొడగునా జమ చేసిన పొదుపు డబ్బులను చివరన తీసుకునే అవకాశం ఉంది. అలాగే వచ్చే విద్యా సంవత్సరంలో మరింత మంది విద్యార్థులు కూడా ఇందులో డబ్బులను పోగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఒక విద్యార్థిని చూసి మరొక విద్యార్థి డబ్బులను పొదుపు చేసే అలవాటు నేర్పించడమే ఈ పథకం లక్ష్యం. కానీ ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ఏ ఒక్క పాఠశాలలో కూడా పథకం అమలు కావడం లేదు. దీంతో విద్యార్థులకు చిన్నతనం నుండి తమ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులను దుబారా ఖర్చులు చేస్తూ పొదుపు చేసే అలవాటుకు దూరం అవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సంచాయక పథకం అమలయ్యేలా చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల వివరాలు జిల్లా ప్రాథమిక విద్యార్థులు ప్రాథమికోన్నత విద్యార్థులు ఉన్నత విద్యార్థులు మొత్తం నిర్మల్ 577 23,398 89 6,373 164 37,019 67,790 మంచిర్యాల 511 13,678 97 4,234 108 23,442 41,354 కుమురంభీం 561 22,420 100 12,380 60 3,148 37,948 ఆదిలాబాద్ 500 – 119 – 120 – 65,000 -
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చంద్రమోహన్
మంచిర్యాలటౌన్: తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గల హోటల్ క్లేరియన్లో నిర్వహించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా హైకోర్టు జడ్జి పి.నవీన్‌రావు వ్యవహరించారు. ఉమ్మడి జిల్లా నుంచి 20 మంది ఓటర్లు పాల్గొనగా మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఉదారి చంద్రమోహన్‌గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర అసోసియేట్ సెక్రెటరీగా సుకుమార్ ఫ్రాన్సిస్ గెలుపొందారు. ఆర్టీసీ ఆర్ఎంకు పదోన్నతిఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ ఆర్టీసీ రీజి న ల్ మేనేజర్‌గా పనిచేస్తున్న సోలోమన్‌కు కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా పదో న్నతి కల్పిస్తూ బాధ్యతలు అప్పగించారు. అ యితే ఆదిలాబాద్ ఆర్ఎంగా ఇంకా ఎవరినీ ని యమించలేదు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తె లుస్తోంది. కాగా ఈ పదోన్నతి రావడంపై ఆర్ఎం కార్యాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సెల్‌ఫోన్ దొంగ రిమాండ్ఆదిలాబాద్టౌన్: సెల్‌ఫోన్ దొంగిలించిన వ్యక్తిని రిమాండ్ చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని అంబేద్కర్‌చౌక్ సమీపంలో గల రేణుక హోటల్లో పనిచేసే గెడం వినోద్ సెల్‌ఫోన్‌ను మహారాష్ట్రలోని కిన్వట్‌కు చెందిన జాదవ్ ప్రవీణ్ దొంగిలించాడు. మంగళవారం వినాయక్ చౌక్ ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి జాదవ్ ప్రవీణ్ పారిపోతుండడంతో అనుమానం వచ్చి పట్టుకుని విచారించగా సెల్‌ఫోన్ దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. -
మూతబడిన బార్ల పునరుద్ధరణ
● ఎకై ్సజ్ శాఖ నుంచి టెండర్ నోటిఫికేషన్ ● ఉమ్మడి జిల్లాలో ఐదింటి కోసం.. ● దరఖాస్తులు అధికంగా వస్తే లక్కీడ్రా యోచన సాక్షి,ఆదిలాబాద్: రెన్యూవల్ చేసుకోకపోవడంతో మూతబడిన మద్యం బార్లను పునరుద్ధరించాలని ఎకై ్సజ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ నుంచి రాష్ట్రంలో ఇలా మూతబడిన బార్లను ఇదివరకే గుర్తించారు. తాజాగా వాటి పునరుద్ధరణ కోసం రాష్ట్రంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇదిలా ఉంటే జిల్లాల వారీగా దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలా రెన్యూవల్ చేసుకోని బార్లు ఐదు ఉన్నట్లు గుర్తించారు. ఆదిలాబాద్ పట్టణంలో మూడు, బెల్లంపల్లి, నస్పూర్‌లలో ఒక్కొక్కటి చొప్పున మూతబడిన బార్లను పునరుద్ధరించే దిశగా ఎకై ్సజ్ శాఖ చర్యలు చేపట్టింది. ఈనెలలోనే దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ ఐదు బార్లకు రూ.42 లక్షల చొప్పున స్లాబ్ నిర్ణయించారు. ఇటీవల కాలంలో బార్లలో విక్రయాలు మందగించాయని పలువురు బార్ యజమానులు రెన్యూవల్‌కు ముందుకు రాలేదు. దీంతో గతేడాది నుంచి ఈ బార్లు మూతబడ్డాయి. తిరిగి తెరిపించాలని చూస్తున్న ఎకై ్సజ్ శాఖ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాల్సిందే. లక్కీడ్రా యోచన.. సాధారణంగా వైన్స్‌లకు టెండర్లు నిర్వహించినప్పు డు ప్రభుత్వం దరఖాస్తుదారుల నుంచి లక్కీడ్రా విధానంలో కేటాయింపు జరుపుతుంది. బార్ల కేటా యింపులో ఈ విధానం కనిపించదు. మధ్యలో లిక్క ర్ బార్ బిజినెస్ మందగించినప్పటికీ తాజాగా ప లువురు యువకులు వీటిని దక్కించుకునేందుకు ఆ సక్తి కనబర్చుతున్నారని ఎకై ్సజ్ శాఖ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో అధికంగా దరఖాస్తులు వస్తాయ ని చెబుతున్నారు. మూడు కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే దానికి సంబంధించి లక్కీడ్రా ద్వారా కేటా యింపు జరపనున్నట్లు శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి విధివిధానాలను త్వరలో రూపొందించి ప్రకటించనున్నట్లు తెలుస్తో ంది. వివరాలు అడిగేందుకు ఆదిలాబాద్ డీపీఈవో హిమశ్రీని మొబైల్లో సంప్రదించేందుకు యత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. -
వేలాడే తీగలు.. కర్రలే స్తంభాలు
విద్యుత్ వ్యవస్థ గాడిన పెడుతున్నామని అధికారులు చెబుతున్నారు. చేలల్లో విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్ కూడా నిర్వహించారు. కానీ, క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదు. సారంగాపూర్ మండలంలోని చాలా గ్రామాల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయి. మరో పక్షం రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్నాయి. హార్వెస్టర్లకు విద్యుత్ తీగలు ఇబ్బందిగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఇలా కర్రలతో స్తంభాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మండలంలోని చించోలి(బి), దేవితండా, రవీంద్రనగర్ తండాలకు వెళ్లే దారిలో ఇలాంటి దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. విద్యుత్ శాఖ అధికారులు మాత్రం రైతుల పొలాల్లో మిడిల్ పోల్స్ వేశామని, వేస్తున్నామని చెబుతున్నారు. – సారంగపూర్ -
సూపర్ స్పెషాలిటీలో గ్యాస్ట్రో సేవలు
● రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ఆదిలాబాద్టౌన్: రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో గ్యాస్ట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. మంగళవారం ఆస్పత్రిలో గ్యాస్ట్రో సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిమ్స్ ఆస్పత్రిలో ఇప్పటి వరకు పలు రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, కొత్తగా గ్యాస్ట్రో ఎంట్రనాలజీ సేవలు ప్రారంభించామన్నారు. రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో న్యూరోసర్జరీ, యూరాలజీ, క్యాన్సర్ తదితర వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. జిల్లా ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లనవసరం లేదని, ఇక్కడే అన్నిరకాల వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రతీ మంగళ, గురువారాల్లో గ్యాస్ట్రో సంబంధిత వైద్యులు డాక్టర్ వివేక్ రాథోడ్ అందుబాటులో ఉండి వైద్యసేవలు అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్, డాక్టర్ సత్యనారాయణ, ఆర్ఎంవో డాక్టర్ చంపత్రావు, తదితరులు పాల్గొన్నారు. -
జనావాసాల్లోకి చుక్కల దుప్పి
ఖానాపూర్: అటవీ ప్రాంతంలో నీరు లేకపోవడంతో జనావాసాల్లోకి వచ్చిన చుక్కల దుప్పిని అటవీ అధికారులు పట్టుకున్నారు. సోమవారం సాయంత్రం కుక్కలు వెంబడించడంతో దుప్పి ఓ నివాసంలో చొరబడి అందులోనే ఉండిపోయింది. దీంతో మంగళవారం విద్యానగర్‌లోని ఓ నివాసంలో దుప్పిని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎఫ్ఎస్వో రవీందర్, ఎఫ్‌బీవో సాధు ముత్యం అక్కడికి చేరుకుని పట్టుకునే ప్రయత్నం చేశారు. తప్పించుకున్న దుప్పి పలువురి నివాసాల్లోకి చొరబడింది. ఎట్టకేలకూ అరగంట సేపటికి ఓ ఇంట్లో బందించారు. కళ్లకు గంతలు, కాళ్లకు తాళ్లతో కట్టి బంధించారు. అనంతరం అటవీ శాఖ జీపులో అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. -
ఉరేసుకుని వృద్ధుడు ఆత్మహత్య
లక్సెట్టిపేట: ఉరేసుకుని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని పాతకొమ్ముగూడెం గ్రామానికి చెందిన గడికొప్పుల రామయ్య (65)తో అదే గ్రామానికి చెందిన వరుసకు అల్లుడైన సత్తయ్య కొంతకాలంగా గొడవపడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. గ్రామంలో కనిపించిన చోట బూతులు తిడుతూ వేధింపులకు గురిచేశాడు. దీంతో మనస్తాపానికి గురైన రామయ్య మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుమారుడు మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
గ్రూప్–1 లో మెరిసిన పొనకల్ వాసి
జన్నారం: ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు పట్టుదలతో చదివి గ్రూప్–1లో రాష్ట్రస్థాయిలో 161వ ర్యాంకు, మల్టీజోన్ 1లో 82వ ర్యాంకు సాధించాడు జన్నారం మండలం పొనకల్‌కు చెందిన నగూరి అనిల్‌కుమార్. నగూరి హరిదాసు, భాగ్య దంపతుల మూడో కుమారుడు అనిల్‌కుమార్ పదోతరగతి వరకు జన్నారం, ఇంటర్ కరీంనగర్ ప్రైవేట్ కళాశాలలో, బీటెక్ హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. పదేళ్ల క్రితమే హరిదాసు అనారోగ్యంతో మృతి చెందాడు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు గ్రూప్స్‌కు ప్రిపేరయ్యాడు. ఇటీవల విడుదలైన గ్రూప్–3లో రాష్ట్రస్థాయిలో 862వ ర్యాంకు, గ్రూప్–2 లో 382వ ర్యాంకు సాధించాడు. నాలుగు నెలల క్రితం విడుదలైన గ్రూప్–4లో ఎంపికై ఉస్మానియా యూనివర్శిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా చేస్తున్నాడు. ఈ సందర్భంగా మండలానికి చెందిన పలువురు అనిల్‌కుమార్‌ను అభినందించారు. చెక్‌బౌన్స్ కేసులో రెండేళ్ల జైలుచెన్నూర్: మండలంలోని కిష్టంపేటకు చెందిన బొమ్మ శ్రీనివాస్ వేసిన చెక్‌బౌన్స్ కేసులో చెన్నూర్ మండలంలోని బుద్దారం గ్రామానికి చెందిన ఆలం సత్తయ్యకు రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని మంగళవారం స్థానిక జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పర్వతపు రవి తీర్పునిచ్చారు. అకౌంట్లో డబ్బులు లేకుండా చెక్కులు ఇస్తే చట్టపరమైన శిక్ష తప్పదని జడ్జి పేర్కొన్నారు. -
సింగరేణి ఉద్యోగికి 552వ ర్యాంకు
మందమర్రిరూరల్: పట్టణానికి చెందిన దుర్గం క్రాంతి ఏరియాలోని శాంతిఖని గనిలో ఓవర్ మెన్‌గా ఉద్యోగం చేస్తూనే గ్రూప్–1కు ప్రిపేరయ్యాడు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో 452.5 మార్కులతో 552వ ర్యాంకు సాధించాడు. దుర్గం రమేశ్, సుజాత దంపతుల కుమారుడైన క్రాంతి పదోతరగతి వరకు స్థానిక లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో చదివాడు. గూడూరులో 2012 నుంచి 2015 వరకు మైనింగ్ డిప్లామా చేశాడు. 2016లో సింగరేణిలో నోటిఫికేషన్ వెలువడగా పరీక్షకు హాజరై ఓవర్‌మెన్ ఉద్యోగం సాధించాడు. విధులు నిర్వహిస్తూనే అంబేద్కర్ యూనివర్సిటీలో బీఏ, కాకతీయ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలో ప్రతిభ కనబర్చాడు. -
విద్యుత్ షాక్‌తో రైతు..
పెంబి: మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై హన్మాండ్లు తెలిపిన వివరాల మేరకు మండలంలోని వేణునగర్ గ్రామానికి చెందిన ఆత్రం నాగోరావు (37) సోమవారం ఉదయం మందపల్లి గ్రామ శివారులో గల తన మొక్కజొన్న పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. విద్యుత్ మోటార్ ఆన్‌చేసే క్రమంలో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మధ్యాహ్నం అయినా ఇంటికి రాకపోవడంతో అతని సోదరుడు చేనుకు వెళ్లి చూడగా చనిపోయి ఉండడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మృతునికి భార్య సురేఖ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
సైనిక్‌స్కూల్ ప్రవేశ పరీక్షలో స్టేట్‌ఫస్ట్
ఖానాపూర్: సైనిక్ స్కూల్లో ఆరోతరగతిలో ప్రవేశానికి ఫిబ్రవరి 23న నిర్వహించిన పరీక్షలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఎర్వచింతల్ గ్రామానికి చెందిన నస్పూరి వెంకటేశ్వర్ రాష్ట్రస్థాయిలో ఫస్ట్‌ర్యాంకు సాధించాడు. గ్రామానికి చెందిన గంగామణి, సంతోశ్ దంపతుల కుమారుడు వెంకటేశ్వర్ కడెం మండలంలోని లింగాపూర్‌లో గల శాంతినికేతన్ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. గ్రామస్తులతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. 3న పండ్ల తోటలకు వేలంఉట్నూర్రూరల్: కుమురంభీం జిల్లా కాగజ్‌నగ ర్ మండలంలోని జంబుగా ఉద్యాన నర్సరీ మామిడితోటలకు ఏప్రిల్ 3న వేలం వేయనున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సోమవా రం ఒక ప్రకటనలో తెలిపారు. తోటలో బంగిన పల్లి, దసేరీ, తోతాపరి, రసాలు, హిమాయత్ లాంగ్ర వంటి మామిడి హైబ్రిడ్ రకాలు ఉన్నాయన్నారు. 2025 నుంచి 2027 పంట కాలానికి కలిపి ఈ పండ్ల తోటల వేలం జరుగుతున్నట్లు తెలిపారు. ఆసక్తి కలవారు రూ.10 వేల ధరా వ త్ సొమ్ముతో ఏప్రిల్ 3న ఉదయం 11గంటలకు జంబుగా ఉద్యాన నర్సరీ లో జరిగే వేలంలో పాల్గొనాలని సూచించారు. వివరాల కు 8897478825 సంప్రదించాలని కోరారు. ఆటో బోల్తాపడి ముగ్గురికి గాయాలురెబ్బెన(ఆసిఫాబాద్): మండల కేంద్రం నుండి తుంగెడకు వెళ్తున్న ఆటో బోల్తాపడటంతో ముగ్గురికి తీవ్ర, నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. జుమ్మిడి శ్రీనివాస్ తన ఆటోలో సోమవారం రెబ్బెన నుండి తుంగెడకు ప్రయాణికులతో బయలుదేరాడు. మార్గమధ్యలో ముందు టైర్ పేలడంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న తుంగెడకు చెందిన జుమ్మిడి రవీందర్, జుమ్మిడి ల చ్చుంబాయి, జుమ్మిడి రాజుబాయిలకు తీవ్రంగా జుమ్మిడి సంతోష్, జుమ్మిడి శ్యాంరావ్, జుమ్మిడి విజయలక్ష్మి, జుమ్మిడి శ్రీనివాస్‌లకు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను రెబ్బెన పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అనంతరం బెల్లంపల్లికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. -
ఇక్కడ డ్యూటీ చేయలేం..!
మంచిర్యాలక్రైం: ఆ పోలీసుస్టేషన్లో ఖాకీ కొలువు కత్తిమీద సాములా మారింది. అటు పోలీసు ఉన్నతాధికారులు.. ఇటు రాజకీయ నాయకుల ఒత్తిడి మధ్య నలిగిపోవాల్సి వస్తోంది. పోలీసుశాఖలో బ దిలీల సందర్భంలో నచ్చిన చోట పోస్టింగ్ కోసం పోలీసులు రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణ చే స్తుంటారు. జిల్లాలో డిమాండ్ ఉన్న పోలీసుస్టేషన్లలో ఎస్‌హెచ్‌వో పోస్టింగ్ కోసం రూ.లక్షలు వెచ్చించడానికై నా విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఉన్నతా ధికారులు, రాజకీయ నాయకుల కనుసన్నల్లో ‘మామూలు’గా పని చేసుకుంటారు. పోలీసు శాఖలో ఇది సర్వసాధారణమే అయినా దీనికి భిన్నంగా జి ల్లాలోని ఓ పోలీసుస్టేషన్లో ఎస్‌హెచ్‌వోగా పని చే యాలంటే దమ్ము, ధైర్యం, అధికార బలం ఉండాల్సిందే. ఇక్కడికి వచ్చేందుకు ఎంతైనా ఖర్చు చేసి రావడానికి ఉత్సాహం చూపిస్తారు. విధుల్లో చేరి ఓ ఆరు నెలలు గడిచాక శాంతిభద్రతల పరిరక్షణ, రా జకీయ నాయకుల ఒత్తిడితో ఇక్కడ విధి నిర్వహణ కత్తి మీద సాములా మారుతుంది. ఎందుకు వచ్చా మా.. అనుకుంటూ మళ్లీ రూ.లక్షలు వెచ్చించి బది లీపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. శాంతిభద్రతలను అదుపులో ఉంచడంలో పోలీసుశాఖలో నిజా యతీ అధికారిగా పేరున్న ఓ అధికారి 2024 ఫిబ్రవరిలో ఇక్కడ ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు చేపట్టారు. నెల రోజులకే ఇక్కడ పని చేయాలేనంటూ ఉన్నతా ధికారులకు పరిస్థితి వివరించి బదిలీ కోసం దరఖా స్తు చేసుకున్నారు. ఆరోగ్య సమస్య అంటూ బదిలీపై వెళ్లిపోయారు. ఆయన తర్వాత బాధ్యతలు చేపట్టిన అధికారి ఒక వర్గానికే మద్దతు ఇవ్వడంతో అధికారులు బదిలీ వేటు వేశారు. ఓ అధికారి సాధారణ బదిలీల్లో భాగంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ పని చేయడం కష్టమేనని బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏడాది కాలంలో ముగ్గురు అధి కారులు మారారు. ప్రస్తుతం పని చేస్తున్న ఓ అధికా రితోపాటు మరో అధికారి సైతం ఎలాగైనా ఇక్కడి నుంచి మరోచోటికి వెళ్లేందుకై నా, లూప్లైన్లో విధులు నిర్వర్తించడానికై నా సిద్ధమేనంటూ ఉన్నతాధికారులకు అర్జీ పెట్టుకున్నట్లు సమాచారం. అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు జిల్లాలో జరిగిన కొన్ని దాడుల కేసుల్లో తీవ్రంగా పరిగణిస్తుండగా.. మరికొన్ని కేసుల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిడా.. ‘మామూలు’గా వ్య వహరిస్తున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. కొన్ని కేసుల్లో దాడులకు పాల్పడిన వారిపై కా కుండా గాయపడిన వారిపై కేసులు నమోదు చేయ డం, ఒకవేళ ఇరువర్గాలపై కేసులు చేయాల్సి వస్తే గాయడిన వారిపై నాన్‌బెయిలేబుల్ కేసులు, దాడి చేసిన వారిపై స్టేషన్ బెయిల్ కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారనే ఆరోపణలున్నా యి. జిల్లా కేంద్రంలోని శివాజీ గ్రౌండ్లో రౌడీషీటర్‌పై జరిగిన దాడిలో ఇప్పటికీ నిందితులను గుర్తించకపోవడం, పైగా గాయపడిన వ్యక్తి ఫిర్యాదు చే యలేదని పోలీసులు చేతులెత్తేయడం గమనార్హం. పోలీసు అధికారుల అనాసక్తి లూప్లైన్లోకి వెళ్లేందుకై నా సిద్ధమే.. -
పద్యాలాపనలో రాష్ట్రస్థాయి పురస్కారం
నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగి తిరునగరి లింబగిరి స్వామి రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో ఇటీవల మూడు రోజులపాటు క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న లింబగిరి స్వామి తనదైన శైలిలో పద్యాల పోటీలలో పాల్గొని రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించాడు. ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎంసీ లింగన్న చేతుల మీదుగా జ్ఞాపికతో పాటు ప్రశంసాపత్రం అందుకున్నారు. డ్రాగన్ తోట దగ్ధంఉట్నూర్రూరల్: మండలంలోని లింగోజి తాండ సమీపంలో ఉన్న డ్రాగన్ తోట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. గ్రామానికి చెందిన రైతు జాదవ్రాజు నాలుగు ఎకరాల్లో డ్రాగన్ తోటను సాగు చేస్తున్నారు. ఆదివారం బంధువు ఒకరు మృతి చెందడంతో అంత్యక్రియలకు వెళ్లాడు. తోటకు మంటలు ఎలా అంటుకున్నాయో అంతు పట్టడం లేదన్నాడు. ఈ ప్రమాదంలో రూ.12 లక్షల నష్టం వచ్చిందని రైతు వాపోయాడు. సోమవారం మాజీ సర్పంచ్ జాదవ్ హరినాయక్ తోటను పరిశీలించారు. -
పెరిగిన టోల్ చార్జీలు
● ఎన్‌హెచ్–363పై రూ.5నుంచి రూ.20వరకు పెంపు ● అర్ధరాత్రి నుంచే మందమర్రి, సరండి వద్ద అమలుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఆర్థిక సంవత్సరం ము గియడంతో సోమవారం అర్ధరాత్రి నుంచి టోల్ చా ర్జీలు పెరగనున్నాయి. జాతీయ, రాష్ట్రీయ రహదా రుల్లో కొన్ని చోట్ల పెరిగే అవకాశం ఉండగా, మ రి కొన్ని చోట్ల తగ్గే అవకాశం ఉంది. మంచిర్యాల నుంచి చంద్రాపూర్ వెళ్లే జాతీయ రహదారి–363పై చా ర్జీలు పెరగనున్నాయి. ఈ జాతీయ రహదారి మ హారాష్ట్ర సరిహద్దు వరకు మొత్తం 94కిలోమీటర్లు ఉండగా, మంచిర్యాల జిల్లా మందమర్రి, ఆసిఫా బాద్ జిల్లా వాంకిడి మండలం సరండి వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఈ రెండు చోట్ల పెరిగిన ధరలు వ చ్చే ఏడాది మార్చి 31వరకు అమల్లో ఉంటాయి. ఇ క్కడి ట్రాఫిక్, నిర్వహణ తదితరవన్నీ లెక్కగట్టి ఎన్‌హెచ్ అధికారులు పెంపు రుసుం కోసం ప్రతిపాదనలు పంపగా, ఆమోదించారు. గతేడాదితో పోలిస్తే కనీసం రూ.10నుంచి రూ.20వరకు పెరిగాయి. -
ప్రజలు భయాందోళన చెందవద్దు
తాంసి: భీంపూర్ మండలంలోని రాజ్ఘడ్ శివారులో ఉన్న అటవీ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఎక్కడ చిరుతపులి సంచరించినట్లు ఆనవాళ్లు లేవని, ప్రజలు భయాందోళనకు గురికావద్దని ఫారెస్ట్ సెక్షన్ అధికారి మోపత్రావు అన్నారు. ఆదివారం గ్రామానికి చెందిన రైతు తుకారాం పంటచేలకు వెళ్లే క్రమంలో అటవీ ప్రాంతంలో రైతుపై చిరుతపులి దాడిచేసి గాయపర్చినట్లు గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు తెలిపారు. సోమవారం అధికారులు గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. గ్రామస్తులతో కలిసి రైతుపై దాడిచేసిన స్థలాన్ని పరిశీలించారు. చిరుతపులి సంచరించినట్లు ఆనవాళ్లు లేవని నిర్ధారించారు. రైతుపై అటవీ జంతువు ఏదైనా దాడి చేసి ఉండవచ్చవని భావిస్తున్నామన్నారు. రైతులు చేలకు వెళ్లేటప్పుడు చప్పుడు చేస్తూ వెళ్లాలని సూచించారు. వారి వెంట బీట్ అధికారి సాయి కుమార్, గోపాల్, సిబ్బంది కృష్ణ, సోనేరావు ఉన్నారు. కళతప్పిన అడవులుజన్నారం: పచ్చదనంతో పర్యాటకులకు ఆహ్లాదం పంచుతున్న అడవులు కళ తప్పాయి. వేసవికాలంలో చెట్ల ఆకులు రాలిపోవడంతో అడవి మొత్తం కళావిహీనంగా మారింది. జన్నారం అటవీ డివిజన్లోని మల్యాల వాచ్ టవర్ ఎక్కి చూస్తే అడవి మొత్తం మోడువారి కనిపించింది. ఈ దృశ్యాన్ని అటవీ అధికారులు కెమెరాల్లో బంధించారు. -
ఎల్ఆర్ఎస్ ఆదాయం రూ.19.06 కోట్లు
మంచిర్యాలటౌన్: ఎల్ఆర్ఎస్ చెల్లింపులకు సోమవారం చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో చెల్లించి సద్వినియోగం చేసుకున్నారు. ప్లాట్ల క్రమబద్ధీకరణకు 2020లో అప్పటి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్లో దరఖాస్తులు స్వీకరించింది. జిల్లా వ్యాప్తంగా 55,697 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 31,093మంది దరఖాస్తులు ఎల్ఎస్ఎస్ ఫీజుకు ఆమోదం పొందాయి. మార్చి 31వరకు చెల్లించిన వారికే 25శాతం రాయితీ ప్రకటించగా.. రంజాన్ పండుగ రోజు కూడా జిల్లా వ్యాప్తంగా 924మంది ఎల్ఆర్ఎస్ ఫీజు రూ.2.27కోట్లు చెల్లించారు. 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోని వారికి నేరుగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించగా 243మంది సద్వినియోగం చేసుకున్నారు. మొత్తంగా 7,408 దరఖాస్తులకు సంబంధించిన ఎల్ఆర్ఎస్ ఫీజు ద్వారా రూ.19.06 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం లభించింది. -
గ్రూప్–1లో 434వ ర్యాంక్
మంచిర్యాలటౌన్: పట్టణంలోని హైటెక్‌సిటీ కాలనీలో నివాసం ఉంటున్న నిర్మలాదేవి, వైద్య రవీంద్రనాథ్ దంపతుల చిన్న కుమారుడు వైద్య సాయి వివేక్నాథ్ ఇటీవల ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో 434వ ర్యాంక్ సాధించాడు. బెంగళూరులో పోస్టల్ అసిస్టెంట్‌గా చేస్తూనే గ్రూప్స్‌కు ప్రిపేరయ్యాడు. తల్లి భీమిని మండలం వీగాం గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తండ్రి లక్సెట్టిపేట్ జూనియర్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగానే మృతి చెందాడు. తండ్రి ఆశయాల మేరకు చదువులో రాణిస్తూ ఎన్ఐటీ నాగ్‌పూర్‌లో బీటెక్ చదివాడు. సివిల్స్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్ కంప్లీట్ చేశాడు. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ప్రిపేరయ్యాడు. బీసీ విభాగంలో రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంకు, ఓవరాల్‌గా 434వ ర్యాంకు సాధించాడు. -
ఏషియన్ పారా త్రోబాల్ పోటీల్లో ప్రతిభ
భీమారం: ఏషియన్ పారా త్రోబాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో మండలంలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన ఉస్కమల్ల కళ్యాణ్ ప్రతిభ చాటాడు. మార్చి 28 నుంచి 30వరకు కాంబోడియా రాజధాని పీనంపెన్లో జరిగిన మొదటి ఏసియన్ పారా త్రోబాల్ పోటీల్లో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ పోటీల్లో ఎనిమిది దేశాలు పాల్గొనగా అందులో ఇండియా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. భారతజట్టులో ఆరెపల్లి గ్రామానికి చెందిన కళ్యాణ్ ప్రతిభ చాటాడు. కాగా, డిసెంబర్ 4, 5, 6వ తేదీల్లో కాంబోడియాల్లో జరిగిన సిట్టింగ్ పారా త్రోబాల్ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న కళ్యాణ్ అత్యుత్తమ ప్రతిభతో బంగారు పతకం సాధించాడు. కళ్యాణ్‌ను డీసీసీ నాయకుడు చేకూర్తి సత్యనారాయణరెడ్డి, క్రీడాభిమానులు అభినందించారు. -
పన్ను వసూళ్లలో పదో స్థానం
● జిల్లాలో ఇంటిపన్నులు 91శాతం వసూలు ● ప్రథమ స్థానంలో జైపూర్, కన్నెపల్లి మండలాలు ● చివరన జన్నారం మండలం మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో ఇంటి పన్ను వసూళ్ల లక్ష్యసాధనకు పంచాయతీ అధికారులు చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఇప్పటివరకు 91శాతం పన్నులు వసూలయ్యాయి. దీంతో జిల్లా రాష్ట్రంలో పదో స్థానంలో నిలిచింది. మిగతా 9శాతం పన్నులు వసూలు చేస్తామని అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల ఒత్తిడితో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఇంటి పన్నులు, వాణిజ్య పన్నులు, మంచినీటి కులాయి బిల్లులు వసూలు చేశారు. జిల్లాలోని 306 గ్రామ పంచాయతీల్లో ఇంటిపన్నులు, ఇతర పన్నుల ద్వారా రూ.6 కోట్ల 70లక్షల 81వేలు వసూలు చేయాలనే లక్ష్యంలో భాగంగా మార్చి 31వరకు రూ.6కోట్ల 9లక్షల 8వేలు వసూలు చేశారు. ఇంకా రూ.61.73లక్షలు వసూలు చేయాల్సి ఉంది. రానున్న ఆర్థిక సంవత్సరానికి జీరో శాతంతో ఉంటామని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు తెలిపారు. అన్ని మండలాల్లో 90శాతంపైగానే.. జిల్లాలోని 16 మండలాల్లో జైపూర్, కన్నెపల్లి మండలాలు 96శాతం పన్ను వసూళ్లతో మొదటి స్థానంలో నిలిచాయి. జన్నారం 86శాతం వసూళ్లతో చివరి స్థానంలో ఉంది. భీమారం, కోటపల్లి లక్సెట్టిపేట మండలాలు 94శాతం, భీమిని, కాసిపేట మండలా లు 93శాతం, హాజీపూర్, నెన్నెల 92శాతం, బెల్లంపల్లి, దండేపల్లి, వేమనపల్లి మండలాలు 91శాతం, చెన్నూర్ 90శాతం, మందమర్రి 89శాతం, తాండూర్ 87శాతం పన్నులు వసూళ్లు చేశాయి. -
వాగాయితండాకు చేరిన పాదయాత్ర
ఇంద్రవెల్లి: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి దీక్ష భూమి నుంచి ప్రేమ్‌సింగ్ మహరాజ్ ఆధ్వర్యంలో ఈ నెల 30న చేపట్టిన ఉమ్మడి జిల్లా సేవాలాల్ దీక్ష స్వాముల పాదయాత్ర సోమవారం సాయంత్రం ఇంద్రవెల్లి మండలంలోని వాగాయితండా గ్రామానికి చేరుకుంది. సుమారు నాలుగు వేలమంది స్వాములకు ఈశ్వర్‌నగర్, వాగాయితాండ గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి వాగాయితాండలో విశ్రాంతి తీసుకున్న స్వాములు మంగళవారం తెల్లవారు జామున పాదయాత్రగా బయలుదేరి ఏప్రిల్ 6న మహారాష్ట్రలోని పోరదేవి చేరుకొని శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొంటామని వారు తెలిపారు. -
అప్పు కట్టినా..‘రుణం’ తీరలే!
మంచిర్యాలఅగ్రికల్చర్: 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ 9 వరకు జిల్లాలో 94,200 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో పంటరుణం తీసుకున్నా రు. జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 65,176 మంది రైతులకు పంట రుణ మాఫీ జరిగింది. రూ.2 లక్షల లోపు, ఆపైన రుణాలు తీసుకుని అ న్ని అర్హతలు ఉండి మాఫీకాని రైతులు జిల్లాలో 29 వేల మంది వరకు ఉన్నారు. చివరి నాలుగో విడత జాబితాలో కేవలం కొంతమంది రైతులకు మాత్ర మే లబ్ధి చేకూరింది. అన్ని అర్హతలు ఉండి అధికారులు సైతం వివరాలు నమోదు చేసుకున్నా మాఫీ కాకపోవడానికి గల కారణాలను తెలవడం లేదని రైతులు వాపోతున్నారు. పలుమార్లు బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా రు. అర్హత ఉన్నా తమకు ఎందుకు రుణమాఫీ కావడంలేదో అధికారులు చెప్పడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండు లక్షలలోపు రుణం ఉన్న రైతులతో పాటు ఆపైన రుణం తీసుకున్న రైతులు వడ్డీలు చెల్లించి ఆరునెలలుగా మాఫీకోసం ఎదురు చూస్తున్నారు. రెండు లక్షల వరకు ఉన్న అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో త మకెందుకు మాఫీ కాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీకి నిబంధనలు లేవంటూనే ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతూ మాఫీ చేయకుండా నీరుగార్చిందని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో 29 వేల మంది వరకు.. 2018 డిసెంబర్ 12 నుంచి 2022 డిసెంబర్ 9 వరకు రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ వర్తించేలా ప్రభుత్వం కట్ ఆఫ్ డేట్ విధించింది. జిల్లాలో ఈ గడువులోగా వివిధ బ్యాంకుల ద్వారా రుణం తీసుకున్న రైతులు 94,200 మంది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రూ.1,258 కోట్ల మేర పంట రుణాలు తీసుకున్నారు. రుణమాఫీ ప్రక్రియలో భాగంగా జులై 16 నుంచి ఆగస్టు 15 వరకు మూడు విడతల్లో రుణమాఫీ అమలు చేసింది. ఆ తర్వాత డిసెంబర్లో నాలుగో విడుత రుణమాపీ నిధులు విడుదల చేసింది. మొత్తం నాలుగు విడుతల్లో 65,176 మంది రైతులకుగానూ రూ.550,72,67,585 మాఫీ జరిగింది. కుటుంబ నిర్ధారణ కానివారు, ఆధార్‌కార్డులో తప్పులున్నవారు, పంట రుణం తీసుకున్న ఖాతాపై ఒకపేరు, ఆధార్‌కార్డుపై మరోపేరు ఉన్నరైతులు, భర్త, భార్య పేరిట భూమి ఉండి ఇద్దరి పేరుతో రూ.2 లక్షలపైన తీసుకున్న రుణాలు, సరైన వివరాలు తేలని రైతుల పంట రుణాలు మాఫీ కాలేదు. నాలుగు విడతల్లో కూడా రుణమాఫీ కాని రైతులు వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి తమ రుణం మాఫీ కాలేదని మొర పెట్టుకుంటున్నారు. పలుమార్లు వ్యవసాయ అధికారులకు, బ్యాంకర్లకు, గ్రీవెన్స్లలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదని, తమ సమస్య పరిష్కారం కావడంలేదని వాపోతున్నారు. ఆరు నెలలుగా ఎదురు చూసినా నిరాశే.. రూ. 2 లక్షల పైబడి రుణాలు ఉన్న రైతులకు మొండిచేయి జిల్లాలో 29 వేల మంది వరకు మాఫీ లేనట్లే.. రుణమాఫీ కాలే.. రైతుభరోసా రాలే.. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో నా పేరు మీద, నా భార్య పేరుమీద రూ.2లక్షల 15 వేల పంటరుణం తీసుకున్నా. ఐదు నెలల క్రితమే రూ.15 వేలు చెల్లించిన. ప్రభుత్వం రూ.2లక్షల వరకు రుణాలు మాఫీ చేసింది. కానీ నాకు మాత్రం మాఫీ కాలేదు. – జాపాతి రాజన్న, నెన్నెల మాఫీ లేదు..సాయం లేదు.. మా కుటుంబంలో నేనొక్కడినే తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.1.60 లక్షల పంటరుణం తీసుకున్నా. నాకు రేషన్‌కార్డు కూడా ఉంది. ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌పుస్తకంలో అన్నీ కరక్టుగానే ఉన్నాయి. అయినా నాకు రుణమాఫీ కాలేదు. చెన్నూర్ ఏవో ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేసినా. ఇటు రుణమాఫీ కాలేదు. అటు పంట పెట్టుబడి సాయం అందలేదు..అప్పులు చేసి ఈయేడు పంటలు వేసుకున్నా. – కస్తూరి మల్లయ్య, పొన్నారం, చెన్నూర్ అర్హులకు మాఫీ అయ్యింది.. రెండు లక్షల వరకు పంట రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ అయ్యాయి. నాలుగు విడతల్లో జిల్లాలో మొత్తం 65,176 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. రూ.2 లక్షలకు పైన ఉన్న రైతుల రుణాల మాఫీకి సంబంధించి మాకు ఎలాంటి గైడ్‌లైన్స్ రాలేదు. – కల్పన, జిల్లా వ్యవసాయ అధికారి ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు ఆసంపల్లి రాజలింగు. మందమర్రి మండలంలోని సారంగపల్లి గ్రామానికి చెందిన ఇతను మందమర్రిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2021లో రూ.70 వేల రుణం తీసుకున్నాడు. రుణం మాఫీ కావాలంటే వడ్డీ చెల్లించాలని బ్యాంకు అధికారులు చెప్పడంతో రూ.31వేలు కట్టాడు. ప్రభుత్వం నాలుగు విడతల్లో రైతుల రుణాలు మాఫీ చేసినా ఈ రైతు రుణం మాత్రం మాఫీ కాలేదు. కుటుంబంలో తానొక్కడినే పంటరుణం తీసుకున్నానని, అధికారులకు అన్నిపత్రాలు సమర్పించానని, అయినా తనరుణం ఎందుకు మాఫీ కావడంలేదని ఆందోళన చెందుతున్నాడు. ఇతనొక్కడే కాదు జిల్లాలో పలువురు రైతులదీ ఇదే పరిస్థితి.జిల్లాలో రైతులు తీసుకున్న రుణాలు, మాఫీ వివరాలు విడతలు రైతులు (మాఫీ రూ.ల్లో) మొదటి 29,127 153,43,69,814 రెండవ 14,680 141,95,12,055 మూడవ 13,244 176,74,42,650 నాలుగవ 8,195 78,59,43,066 మొత్తం 65,176 550,72,67,585 -
బంజారా దీక్షభూమి చేరిన శోభాయాత్ర
నార్నూర్: సేవాలాల్ మహారాజ్ దీక్ష చేపట్టిన భక్తులతో మండలంలోని కొత్తపల్లి హెచ్ జాతీయ బంజారా దీక్ష భూమి సోమవారం జనసంద్రమైంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి సేవాలాల్ భక్తులు వేలాది సంఖ్యలో దీక్ష భూమికి తరలివచ్చారు. శ్రీరామనవమి రోజున మహారాష్ట్రలోని పౌరదేవి పుణ్యక్షేత్రానికి వెళ్లి జగదంబ దేవి, శ్రీ సంత్ రామారావు మహారాజ్ దర్శ నం అనంతరం మాల ధరించిన భక్తులు దీక్షలు విరమిస్తారు. జాతీయ బంజారా దీక్ష భూమి వద్ద శోభా యాత్రను దీక్ష గురువు శ్రీ ప్రేమ్ సింగ్ మహారాజ్ ప్రారంభించారు. పాదయాత్ర మహారాష్ట్రలోని పౌరదేవి పుణ్యక్షేత్రానికి శ్రీరామనవమి రోజున చేరుకుంటుందని దీక్ష గురువు తెలిపారు. -
అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం
తిర్యాణి: మండలంలోని మొర్రిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో గల లోయ గ్రామంలో టేకం జంగుకు చెందిన ఇల్లు ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. బాధితుడు తెలి పిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం ఇంట్లో దేవుళ్ల చిత్రపటాల వద్ద దీపం వెలిగించారు. ప్రమాదవశాత్తు ఇంట్లోని వివిధ వస్తువులకు అంటుకుని మంటలు చెలరేగడంతో ఇల్లు దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. తహసీల్దార్ సూర్యప్రకాష్ ఘటన స్థలానికి చేరుకుని పంచనా మా నిర్వహించారు. బాధిత కుటుంబానికి నిత్యావసరాలు అందజేశారు. నష్టం అంచనా వేసి ప్రభుత్వం నుండి ఆర్థికసాయం అందజేస్తామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు. -
అమ్మవారికి వెండివీణ బహూకరణ
బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి దాతలు ఆదివారం వెండివీణ బహూకరించారు. నిజామాబాద్ జిల్లాలోని నవ్యభారతి గ్లోబల్ హైస్కూల్ సంస్థ చైర్మన్ క్యాతం శ్రీదేవి–సంతోష్ దంపతులు రూ.5 లక్షలతో 4 కేజీల వెండితో తయారు చేయించిన వెండి వీణను బహూకరించారు. అర్చకులు దాతలకు తీర్థప్రసాదం అందజేసి వారిని శాలువా కప్పి సత్కరించారు. చిల్డ్రన్ గ్రౌండ్స్‌లో చీకట్లుశ్రీరాంపూర్: సింగరేణి చిల్డ్రన్ గ్రౌండ్స్‌లో చీక టి అలుముకుంది. చిన్నపాటి ఏర్పాట్లకు కూ డా అధికారుల నిర్లక్ష్యం వల్ల పిల్లలకు ప్రమాదంగా మారింది. శ్రీరాంపూర్ ఏరియా పరి ధిలోని నస్పూర్ కాలనీలోని రెండు చిల్డ్రన్ ప్లే గ్రౌండ్స్‌లలో లైటింగ్ సమస్య తీవ్రంగా ఉంది. నస్పూర్ కాలనీలోని మనోరంజన్ సముదా యం ఆవరణ, ఆర్కే5 కాలనీ వద్ద గల నందనవనం పార్కులోని చిల్డ్రన్ ప్లే గ్రౌండ్లు ఉన్నా యి. పిల్లల కోసం జారుడు బండ, ఉయ్యాలు, రంగుల రాట్నం తదితర ఆటలు ఆడుకోవడానికి ప్లేగ్రౌండ్లు ఏర్పాటు చేశారు. అయితే ఇందులో లైటింగ్ అధ్వానంగా ఉంది. ఉన్న కొన్ని పని చేస్తున్నాయి. మిగతావి చెడిపోయి వెలగడం లేదు. చీకటి పడితే చాలు పిల్లలు ఆడుకోవడానికి భయపడుతున్నారు. వేసవి కావడంతో సాయంత్రం వేళ పిల్లలతో మైదానాలు కిక్కిరిపోస్తున్నాయి. మరో పక్క పక్కనే చెట్ల పొదలు ఉండటంతో విషకీటకాలు, విషసర్పాలు వస్తున్నాయి. దీంతో ఎప్పుడేం ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
పండుగపూట విషాదం
నార్నూర్: ఉగాది పండుగ పూట విషాదం నెలకొంది. దైవ దర్శనానికి వెళ్లి శంకర్‌లోద్ది గుండంలో పడి యువకుడు మృతిచెందాడు. కుమురం భీం జిల్లా కెరమరి మండలం శంకర్‌లోద్ది గుండం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. నార్నూర్ మండలంలోని గంగాపూర్ తండా చెందిన పవార్ సంగీత–ఉత్తం దంపతులకు ఇద్దరు సంతానం. ఒక కూతురు పెళ్లయింది. ఒక కుమారుడు పవార్ శంకర్ (22) ఉన్నాడు. శంకర్ బొలెరో వాహన డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. దంపతులిద్దరు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ దీక్షలో ఉన్నారు. ఉగాది సందర్భంగా కెరమెరి మండలంలోని శంకర్లోద్దిలో శివలింగం గుహలో దర్శనంతోపాటు దీక్ష గురువు శ్రీ సద్గురు ప్రేంసింగ్ మహారాజ్ దీక్ష చేపట్టిన పుణ్యస్థలం కావడంతో సేవాలాల్ భక్తులు, మాలధరించిన వారు వందల సంఖ్యలో వెళ్లారు. దీక్షలో ఉన్న దంపతులిద్దరు ఆదివారం కుమారుడిని వెంట తీసుకెళ్లారు. గుహ ముందు ఉన్న వాగులో స్నానానికి బండపై నుంచి దూకాడు. నీటిలో రెండు రాయి మధ్య ఇరుక్కుని మునిగి చనిపోయాడు. గంగాపూర్ తండా గ్రామం శోకసంద్రంలో మునిగింది. కుమారుడు మృతితో కుటుంబ సభ్యుల కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్వాప్తు చేస్తున్నట్లు కెరమెరి ఎస్సై విజయ్ తెలిపారు. -
ఓలాలో భారీ అగ్నిప్రమాదం
● యంత్రాలు, కలప దగ్ధంకుంటాల: మండలంలోని ఓలా గ్రామంలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకులు వేల్పూర్ రంజిత్, రాజశేఖర్, రాకేశ్ వడ్రంగి కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంటి పక్కనే గల మూడు షెడ్లు వేర్వేరుగా ఏర్పాటు చేసుకుని అనుమతి పొందిన టేకు కలపతో గృహ నిర్మాణ, పెళ్లిళ్ల పనులకు అవసరమయ్యే ఫర్నిచర్‌ను తయారు చేస్తుంటారు. శనివారం ప్రమాదవశాత్తు షెడ్లలో మంటలు చెలరేగాయి. పక్కనే నిద్రిస్తున్న మహారాష్ట్ర కూలీలకు మంటల వేడిని గమనించి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశారు. అప్పటికే మంటలు ఎగిసిపడి షెడ్లలో ఉన్న టేకు కలప, యంత్రాలు, సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. రూ.34 లక్షల ఆస్తినష్టం.. ఉగాది అమావాస్య పురస్కరించుకుని శనివారం వేల్పూర్ రంజిత్, రాజశేఖర్, రాకేశ్‌లు రైతులకు అవసరమయ్యే అరక పనులు చేసి నిద్రించారు. ఒకేసారి షెడ్లలో మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న కలప, యంత్రాలు, వస్తువులు అగ్నికి బుగ్గిపాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలార్పి వేశారు. రంజిత్‌కు షెడ్ లో ఉన్న రూ.8 లక్షల కలప, రూ.3 లక్షల విలువ చేసే యంత్రాలు, సామగ్రి, రాజశేఖర్‌కు షెడ్లో రూ.10 లక్షల కలప, రూ.3 లక్షల యంత్రాలు, సామగ్రి, రాకేశ్ షెడ్లో ఉన్న రూ.5 లక్షల కలప, రూ. 5 లక్షల యంత్రాలు, పనిముట్లు కాలి బూడిదయ్యాయి. రూ.34 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. ఘటనా స్థలాన్ని ఎస్సై సి.అశోక్ పరిశీలించారు. ప్రభుత్వం తమను ఆదుకుని నష్టపరిహారం అందించాలని వేడుకున్నారు. -
బండల్‌నాగాపూర్ వాసి ప్రతిభ
తాంసి: మండలంలోని బండల్‌నాగాపూర్‌కు చెందిన సురుకుంటి సచిన్‌రెడ్డి గ్రూప్–1లో 454.5 మార్కులతో రాష్ట్రస్థాయిలో 503 ర్యాంక్ సాధించాడు. ఇప్పటికే గ్రూప్–4 ఫలితాల్లో ప్రతిభ కనబర్చి ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ముంబయిలో ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. సివిల్స్ సాధించడమే లక్ష్యమని సచిన్‌రెడ్డి పేర్కొన్నాడు. ఈయన తల్లిదండ్రులు మంజుల–శ్రీధర్ రెడ్డి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. గ్రూప్–1లో రాష్ట్రస్థాయిలో ర్యాంక్ సాధించిన సచిన్రెడ్డిని పలువురు అభినందించారు. -
వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగురు మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు, చికిత్స పొందుతూ వృద్ధుడు, మద్యానికి బానిసై మరొకరు మృతిచెందారు. దిలావర్పూర్: మండలంలోని న్యూలలోం సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. నిర్మల్–భైంసా రహదారిపై కాల్వ ఆలయ స్వాగత తోరణం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందగా వాహనదారులు గమనించి ఎస్సై సందీప్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకుని ప్రమాదం తీరుపై ఆరా తీశారు. మృతుడు నర్సాపూర్(జి) మండలం బామ్ని గ్రామానికి చెందిన గోడ్పె కిషన్‌రావు (55)గా గుర్తించారు. నిర్మల్ పట్టణానికి వెళ్లి కాలినడకన రోడ్డు గుండా వస్తుండగా వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ వృద్ధుడు.. మంచిర్యాలక్రైం: జీవితంపై విరక్తితో మద్యం మత్తులో గుర్తుతెలియని పురుగుల మందు తాగిన వృద్ధుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఏఎస్సై బి.సత్తయ్య కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని అశోక్‌రోడ్‌కు చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి జింక దుర్గయ్య(71) గత కొంతకాలంగా మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రిలో చూపించగా లివర్ పాడైపోయిందని వైద్యులు చెప్పారు. అయినా దుర్గయ్య మద్యం తాగేవాడు. జీవితంపై విరక్తితో ఈనెల 28న మద్యం మత్తులో గుర్తుతెలియని పురుగుల మందు తాగి భార్య సమ్మక్కకు విషయం చెప్పాడు. వెంటనే మంచిర్యాల ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతు ఆ దివారం మృతిచెందాడు. మృతురాలి భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. తాగుడుకు బానిసై వ్యక్తి.. ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన బోయ ర్ దేవిదాస్ (55) గత కొన్నేళ్లుగా తాగుడుకు బానిసయ్యాడు. ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పట్టణంలోని రోడ్లపై తిరుగుతూ జీవనం సాగించేవాడు. ఆదివారం భుక్తాపూర్‌లోని బి–రాములు కాంప్లెక్స్ సమీపంలో గల ఓ తోపుడుబండిపై చనిపోయి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమందించగా మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. ఈమేరకు వన్‌టౌన్ ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భైంసావాసికి 157వ ర్యాంకు
భైంసాటౌన్: పట్టణంలోని అయోధ్యనగర్‌కు చెందిన సుర్వే సాయికుమార్ గ్రూప్–1లో 157వ ర్యాంకు సాధించాడు. లోకేశ్వరం మండలం పొట్పెల్లి(బి)కి చెందిన రత్నమాల–సిద్ధేశ్వర్ దంపతులు కొన్నేళ్లుగా భైంసాలో నివాసముంటున్నారు. వీరి కుమారుడు సాయికుమార్ తిరుచ్చిలోని ఎన్ఐటీలో బీటెక్ పూర్తి చేశాడు. కొద్దిరోజులు గుర్గావ్లోని మారుతి సుజుకీ కంపెనీలో పనిచేశాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఈక్రమంలో గ్రూప్–2లో 1907, గ్రూప్–3లో 744 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం గ్రూప్–1లోనూ సత్తాచాటాడు. యూపీఎస్సీ(సివిల్ సర్వీసెస్) సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. -
గ్రూప్–1లో మనోళ్ల సత్తా
● జనరల్ ర్యాంకింగ్స్ జాబితాలో పలువురు.. ● ఈ ర్యాంకుల ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ● ఎంపికై నవారికి వ్యక్తిగతంగా సమాచారం తెలంగాణలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో ప్రొవిజనల్ మార్కులు, జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల విడుదల చేసింది. ఏడు పేపర్ల మార్కులు, జనరల్ ర్యాంకింగ్స్‌తో కూడిన జాబితాను వెబ్సైట్లో ప్రకటించారు. మార్కుల మెమోలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 5 సాయంత్రం 5 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు టీజీపీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ, ఓటీపీతో లాగిన్ చేసి మెమోలను పొందాలి. ఈ ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలుస్తామని టీజీపీఎస్సీ తెలిపింది. ఎంపికై నవారికి వ్యక్తిగతంగా సమాచారం అందజేస్తారని, అందుకోసం ఒరిజినల్ సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు యువకులు ర్యాంకులు సాధించారు. ఇందులో ఇప్పటికే కొందరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే ఉత్తమ ర్యాంక్‌లు సాధించడం గమనార్హం. డీఎస్పీగా ఎంపికై న మహేందర్ బాసర: మండలంలోని కిర్గుల్ (బి) గ్రామానికి చెందిన కరండే మహేందర్ గ్రూప్–1లో 471 మార్కులతో జనరల్ ర్యాంక్ 219 సాధించి డీఎస్పీగా ఎంపికయ్యాడు. ఉజ్వల–సంజీవ్ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుమారుడు మహేందర్ చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తూ, తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేవాడు. 2017లో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా, 2020లో సివిల్ ఎస్సైగా ఎంపికై సాధించాడు. నేరడిగొండలో ఎస్సైగా, నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం పరిధిలోని రుద్రూర్లో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం గుడిహత్నూర్ ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన గ్రూప్–1లో డీఎస్పీగా ఎంపికవడంపై స్వగ్రామంలో ప్రజలు అభినందనలు తెలిపారు. గురువులు నేర్పిన పాఠాలే నాకు ఆదర్శమని, అమ్మానాన్నల కష్టం వృథా కాకుండా పోలీసు ఉద్యోగం వచ్చినందుకు సంతోషంగా ఉందని మహేందర్ తెలిపాడు. -
తగ్గుతున్న ఎల్లంపల్లి నీటిమట్టం
ఎల్లంపల్లి జలాశయం ఎల్లంపల్లి(శ్రీపాదసాగర్) ప్రాజెక్ట్ నీటిమట్టం రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. ఇటు వేసవి కాలం పైగా ఇతర ప్రాంతాల అవసరాలకు నీటిని తరలిస్తుండటంతో తగ్గుతోంది. ప్రాజెక్ట్ మట్టం 148 మీటర్ల క్రస్ట్ లెవెల్ కాగా 143 మీటర్లకు చేరగా 20.175 టీఎంసీలకు గాను 10 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉంది. ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో లేకపోగా అవుట్ ఫ్లో కింద గూడెం ఎత్తిపోతల పథకానికి 290 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ సుజల స్రవంతి పథకానికి 324, ఎన్టీపీసీకి 242, నంది పంప్‌హౌజ్‌కు 3,150 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. – మంచిర్యాలరూరల్(హాజీపూర్) -
సత్తాచాటిన ఆవుడం యువకుడు
నెన్నెల: మండలంలోని ఆవుడం గ్రామానికి చెందిన మండల సుమంత్‌గౌడ్ సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో 286వ ర్యాంకు, మల్టీజోన్‌లో 126వ ర్యాంకు సాధించారు. గతంలో గ్రూప్–2, 3, 4లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గ్రూప్–2లో రాష్ట్ర స్థాయిలో 172వ ర్యాంకు, గ్రూప్–3లో 102వ ర్యాంకు, గ్రూప్–4లో 88వ ర్యాంకు దక్కించుకున్నారు. గ్రూప్–1 సాధించడమే లక్ష్యంగా కోచింగ్ లేకుండా రోజుకు 10 గంటలు కష్టపడి చదివానని తన కష్టానికి తగిన ర్యాంకు వచ్చిందని సుమంత్ సంతోషం వ్యక్తం చేశాడు. -
భావితరాలకు సేంద్రియసాగు అందించాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): భావి తరాలకు సేంద్రియ సాగును అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గ్రామ వికాస్ తెలంగాణ ప్రాంత ప్రముఖ్ జిన్నా సత్యనారాయణరెడ్డి అన్నారు. ఉగాది పురస్కరించుకుని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నర్సింగాపూర్ రాజేశ్వర్రావుపల్లెలో జిల్లా గ్రామ వికాస్ ఆధ్వర్యంలో భూ సుపోషణ్ కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. అంతకుముందు గ్రామంలోని పలువురు దంపతులు తీసుకువచ్చిన మట్టికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిన్నా సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, రైతులు క్రిమి సంహారక మందులు, ఫర్టిలైజర్ మందలు వాడి భూమిని, నీటిని, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారన్నారు. ఇది ఇలాగే కొనసాగితే భావితరాలు చౌడు నేలలు చూస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. భూమిని కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు ప్రత్యేక పద్ధతిలో పూజలు చేసి ఆ పూజా ద్రవ్యాలను నాలుగు దిక్కులుగా చల్లితే కొంతమేర అయినా కాలుష్యం తగ్గుతుందన్నారు. దీనిని ఉద్యమంగా చేపట్టాలని ముఖ్యంగా మన భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే రైతులు ఇకనైనా మేల్కొని ప్రకృతి వ్యవసాయం చేసేలా చూడాలని అన్నారు. ప్రకృతిలో లభించే వనరులను సద్వినియోగం చేసుకుని ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు. ఈ సందర్భంగా రసాయన ఎరువులు వినియోగించకుండా భూమిని ఆరోగ్యవంతంగా ఉంచాలనే లక్ష్యంపై రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ కృష్ణభాస్కర్, గ్రామ భారతి జిల్లా సంయోజక్ బొలిశెట్టి తిరుపతి, సహ సంయోజక్ వెంబడి కిషన్, జిల్లా సభ్యులు దుర్గం బక్కయ్య, కటుకూరి తిరుపతి, మండల సంయోజ్ లగిశెట్టి వెంకటి, సేంద్రీయ రైతులు వెంకటరెడ్డి, శంకరయ్య, నందయ్య, పర్వతాలు, రామయ్య, లచ్చయ్య, లక్ష్మయ్య, స్థానిక రైతులు పాల్గొన్నారు. గ్రామ వికాస్ ప్రముఖ్ జిన్నా సత్యనారాయణరెడ్డి ఘనంగా భూ సుపోషణ్ కార్యక్రమాలు -
పల్లెలకు పాలనాధికారులు
● రెవెన్యూ పటిష్టానికి జీపీవో పేరుతో కొత్తగా పోస్టులు ● పూర్వ వీఆర్వో, వీఆర్ఏల నుంచి ఇప్పటికే ఆప్షన్ల స్వీకరణ ● జీపీవో నియామకాలతో రెవెన్యూ వ్యవస్థ బలంమంచిర్యాలరూరల్(హాజీపూర్): రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను పటిష్ట చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పాలనాధికారి (జీపీవో) పేరిట కొత్త ఉద్యోగ నియామకాలతో గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలను మెరుగుపరచాలని సంకల్పించింది. గతంలో గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకుడు (వీఆర్ఏ) వ్యవస్థను రద్దు చేసి, వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన ప్రభుత్వం, ఈ నిర్ణయం వల్ల గ్రామాల్లో భూసమస్యలు, సంక్షేమ పథకాల గుర్తింపు, సర్వేలలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించింది. దీంతో జీపీవో పోస్టుల ద్వారా రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఇలా.. గతంలో వీఆర్వోలు, వీఆర్ఏలు గ్రామాల్లో ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేశారు. అయితే, 2022లో 167 మంది వీఆర్వోలను 37 శాఖల్లో, 2023లో 543 మంది వీఆర్ఏలను 11 శాఖల్లో సర్దుబాటు చేయడంతో గ్రామాల్లో భూసర్వేలు, హక్కు ల జారీ, విపత్తు సమాచార సేకరణ వంటి పనులు స్తంభించాయి. ఈ బాధ్యతలు పంచాయతీ కార్యదర్శులపై పడ్డాయి. ఈ లోటును గుర్తించిన ప్రభుత్వం, జిల్లాలోని 385 రెవెన్యూ గ్రామాల కోసం జీపీవోలను నియమించాలని నిర్ణయించింది. అయితే, ప్రతి గ్రామానికి ఒక జీపీవో ఉంటారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆప్షన్ల స్వీకరణ.. జీపీవో నియామకాల కోసం పూర్వ వీఆర్వో, వీఆర్ఏల నుంచి ఆప్షన్లు సేకరించగా, డిగ్రీ ఉన్నవారు లేదా ఇంటర్‌తో ఐదేళ్ల వీఆర్వో అనుభవం ఉన్నవారిని ఎంపిక చేస్తారు. వీరికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. అయితే, తిరిగి వచ్చేవారి సర్వీస్‌ను జీరో నుంచి ప్రారంభిస్తామని, గత సీనియారిటీని పరిగణనలోకి తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనను వీఆర్వో, వీఆర్ఏలు వ్యతిరేకిస్తున్నారు. జీవో 129 ప్రకారం, ఇతర శాఖల్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న 60 వీఆర్వోలు, 160 వీఆర్ఏలతో కలిపి 220 మంది ఆప్షన్లు ఇచ్చారు. సర్వీస్‌ను గుర్తించి, పరీక్ష లేకుండా తిరిగి తీసుకోవాలని వీఆర్వో సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వామిదాస్ డిమాండ్ చేశారు.గతంలో రెవెన్యూలో సిబ్బంది వివరాలు..గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్ఓలు) 167 గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏలు) 543 గ్రామ పాలనాధికారి(పీజీఓ) పోస్టులకు వచ్చిన దరఖాస్తులు 220 -
విశ్వావసు విజయం అందించాలి
అందరి జీవితాల్లో ఆనందం నిండాలిమంచిర్యాలటౌన్: కొత్త సంవత్సరంలో ప్రజల కు శుభం కలగాలని, అందరి జీవితాల్లో ఆనందం నింపాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శ్రీవిశ్వావసు నామసంవత్సర ఉగా ది పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కుమార్‌దీపక్, డీఎఫ్‌వో ఆశిష్‌సింగ్, పోలీసు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వీరికి ఉగాది పచ్చడిని అందించిన అనంతరం పంచాంగ శ్రవణం చేశారు.తెలుగు సంవత్సరాది.. విశ్వావసు నామ ఉగాది వేడుకను జిల్లా వాసులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. వేకువ జాము నుంచే ఊరూరా, వాడ వాడలా పండుగ సందడి కనిపించింది. ఇళ్ల గుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరించారు. అభ్యంగన స్నానం చేసి ఆలయాలకు వెళ్లారు. దైవ దర్శనాలు చేసుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. షడ్రుచులతో చేసిన పచ్చడిని ఇంటిల్లిపాది ఆరగించారు. పంచాంగ ఫలాలు తెలుసుకున్నారు. నూతన వాహనాలకు పూజ చేయించుకున్నారు. గ్రామాల్లో పెద్దలు, అర్చకులు పంచాంగశ్రవణం చేశారు. స్వచ్ఛంద సంస్థలు ఉగాది పచ్చడి పంపిణీ చేశాయి. గ్రామాల్లో రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. – మంచిర్యాలఅర్బన్చెన్నూర్ పంచాంగ శ్రవణంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి -
‘శిఖర’ ఉగాది పురస్కారాలు
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని పలు విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శిఖర సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. పట్టణంలోని శ్రీమంజునాథ గార్డెన్లో నిర్వహించిన ఈ కా ర్యక్రమానికి బీసీ సంక్షేమ అధికారి, వయోజనవిద్య జిల్లా అధికారి పురుషోత్తం నాయక్ హా జరై పురస్కారాలు అందజేశారు. శిఖర ఆధ్వర్యంలో ఏటా వివిధ రంగాల్లో రాణించిన పది మందిని గుర్తించి పురస్కారాలు అందించడం అభినందనీయమన్నారు. అనంతరం పంచముఖి హనుమాన్ టెంపుల్ అర్చకుడు డింగరి కృష్ణకాంతచార్యులు పంచాంగ శ్రవణం చేశారు. -
అదనపు కలెక్టర్ భార్యకు 68వ ర్యాంక్
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ స్థానిక సంస్థల అదనపుకలెక్టర్ పైజాన్ అహ్మద్ భార్య బరీరా ఫరీద్ రాష్ట్రస్థాయిలో 68వ ర్యాంక్ (బీసీ ఈ కేటగిరీలో ప్రథమ ర్యాంకు) సాధించింది. ఈమె..ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ డిగ్రీని పూర్తిచేసింది. సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమవుతూ 2022లో సివిల్స్‌లో ఇంటర్వ్యూ వరకు వెళ్లింది. హైదరాబాద్‌కు చెందిన షేక్ ఫరీరుద్దీన్, షమీన్ ఉన్నిసా దంపతుల ఏడుగురు సంతానంలో చివరి వ్యక్తి ఈమె. తండ్రి భారత వాయుసేనలో రిటైర్డ్ ఉద్యోగి. గ్రూప్–1లో 68వ ర్యాంక్ సాధించిన బరీర ఫరీద్‌కు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కుటుంబసభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. -
● పోలీసుల సేవలో మానవత్వం ● వివిధ కార్యక్రమాలతో ప్రజలతో మమేకం..
మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా పోలీసులు కాఠిన్యాన్ని వీడి కారుణ్యంతో ప్రజలతో మమేకమవుతున్నారు. సాధారణంగా పోలీసులంటే కఠినత్వమే గుర్తొస్తుంది, ఠాణా మెట్లెక్కడానికి జంకుతారు. కానీ, శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా ఉన్నప్పటికీ, తమలోని మానవత్వాన్ని జిల్లా పోలీసులు సేవా కార్యక్రమాల ద్వారా చాటుతున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా నాయకత్వంలో ‘విలేజ్ పోలీస్ ఆఫీసర్స్’ వ్యవస్థను ప్రవేశపెట్టి, ప్రజలకు స్నేహహస్తం అందించేందుకు సిద్ధమవుతున్నారు. గిరిజన, మావోయిస్ట్ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలతో ప్రజాచైతన్యానికి కృషి చేస్తున్నారు. గతేడాది నుంచి 3 మెడికల్ క్యాంపులు, 4 రక్తదాన శిబిరాలు నిర్వహించారు. 2022లో 200 యూనిట్ల రక్తదానం చేసినందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నుంచి అవార్డు అందుకున్నారు. యువత సన్మార్గంలో నడవాలని క్రీడాసామగ్రి అందజేస్తూ ప్రోత్సహిస్తున్నారు. డీసీపీ భాస్కర్ మారుమూల గ్రామాల్లో పర్యటిస్తూ, ‘‘మీ భద్రత, బాధ్యత మాదే’’ అంటూ భరోసా కల్పిస్తున్నారు. మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల్లో దర్బార్లతో సమస్యలను పరిష్కరిస్తూ, నిరుపేదలకు నిత్యావసరాలు, దుస్తులు పంచుతున్నారు. మచ్చుకు కొన్ని ఘటనలు.. ● మార్చి 12న రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను డీసీపీ భాస్కర్ ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ● మార్చి 15న మాదారం పరిధిలో 365 గిరిజన కుటుంబాలకు బియ్యం, దుప్పట్లు, క్రీడాసామగ్రి అందించారు. ● 2000 బ్యాచ్ కానిస్టేబుళ్లు స్థాపించిన మిలీనియం వెల్ఫేర్ సొసైటీ ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు రూ.3.63 లక్షల సాయం చేశారు. ● 2024 అక్టోబర్‌లో అమరవీరుల సంస్మరణలో 200 యూనిట్ల రక్తదానం చేశారు. ● ఖాకీలో కనిపించే ఈ మానవత్వం ప్రజలతో పోలీసుల అనుబంధాన్ని బలపరుస్తోంది.భరోసా కల్పిస్తున్నాంపోలీసులు కూడా సమాజంలో భాగస్వాములే. ‘కమ్యూనిటీ పోలీసింగ్’ ద్వారా పోలీసులంటే ప్రజల్లో నెలకొన్న భయాన్ని తొలగింపజేస్తున్నాం. శాంతిభద్రతలను కాపాడడంతోపాటు ఆపదసమయంలో మేమున్నామని భరో సా కల్పిస్తున్నాం. యువత పెడదోవ పట్ట కుండా చర్యలు తీసుకుంటున్నాం. – భాస్కర్, డీసీపీ మంచిర్యాల -
‘కడెం’ను సందర్శించిన డ్యాం సేఫ్టీ బృందం
కడెం: కడెం ప్రాజెక్ట్‌ను శుక్రవారం ‘స్టేట్ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్’ బృందం సభ్యులు రిటైర్డ్ సీఈ, ఐడ్రో మెకానికల్ ఎక్స్పర్ట్ కె.సత్యనారాయణ, స్టేట్ డ్యాం సేఫ్టీ చీఫ్ ఇంజనీర్ ప్రమీల సందర్శించారు. ప్రాజెక్ట్ వరద గేట్లు, కౌంటర్ వెయిట్లు, లిఫ్టింగ్ రోప్‌లను పరిశీలించారు. వరద గేట్ల ఆపరేటింగ్ సమస్యలు, ప్రాజెక్ట్ స్థితిగతులను ఎస్ఈ రవీందర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు చేశారు. ఇందులో ఈఈ విఠల్‌రాథోడ్, డీఈ నవీన్, విజయలక్ష్మి, గణేశ్, ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు. సీల్ట్ ఏజెన్సీ బృందం సందర్శన నీటిపారుదల శాఖ కడెం ప్రాజెక్ట్ పూడికతీత టెండర్ల ప్రక్రియను ఈనెల 27న, పూర్తి చేసి, పనులను ఏజెన్సీకి అప్పగించారు. శుక్రవారం ఏజెన్సీ సిబ్బంది కడెం ప్రాజెక్ట్‌ను సందర్శించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. ఏజెన్సీ పేరు, వివరాలు కరీంనగర్ సీఈ పరిధిలో ఉంటాయని, టెండర్ గురించి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఎస్ఈ రవీందర్ తెలిపారు. -
సరిహద్దు ప్రాంతంలో విస్తృత తనిఖీలు
కోటపల్లి: మండలంలోని రాపన్‌పల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద నార్కోటిక్ జాగిలంతో ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అంతరాష్ట్ర చెక్‌పోస్టు మీదుగా తెలంగాణలోకి వచ్చిపోయే వాహనదారులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయడంతో పాటు మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. గంజాయి సేవించిన, రవాణ చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై రాజేందర్, ఎకై ్సజ్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘మంత్రి ‘జూపల్లి’ వ్యాఖ్యలు సరికావు’
నస్పూర్: యాదవుల అస్థిత్వాన్ని దెబ్బతీసే విధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు శాసనమండలిలో వ్యాఖ్యలు చేయడం సరికాదని యాదవ ఒగ్గు పూజారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాజనమేన శ్యాంకుమార్యాదవ్ అన్నారు. నస్పూర్–శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన సంఘం నాయకులతో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్య క్షేత్రం కొమురవెల్లి మల్లన్న ఆలయంతోపాటు శ్రీశైలం, వేలాల, గొల్లగట్టు జాతరలో పూజారులుగా యాదవులే ఉన్నారని పేర్కొన్నారు. మంత్రిని ఎవరో తప్పుదోవ పట్టించారని, ఆయన మాటలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. నాయకులు చింతల రాయమల్లు, ఏ.మల్లేశ్, పరిస ఐల య్య, ఎగ్గె రమేశ్, బాసవేన భానేష్, అంగ మల్లేశ్, పున్నం పోషన్న పాల్గొన్నారు. -
అక్రమాలు లేకుండా సరఫరా
● ఇసుక అక్రమ రవాణాపై దృష్టి ● నిరంతరం కలెక్టర్, అధికారుల పర్యవేక్షణ ● ఇదే తీరుగా ఉంటే అక్రమాలకు అడ్డుకట్ట● ప్రయాణికులకు ఇబ్బందులు కలుగొద్దు ● కలెక్టర్ కుమార్ దీపక్ ● ఇసుక క్వారీల్లో తనిఖీసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఇసుక అక్రమ రవా ణాను అరికట్టడంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. రాష్ట్రస్థాయి నుంచి ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలనే ఆదేశాలు రావడంతో ఆ మేరకు జిల్లాలోని క్వారీలపై నిరంతరం నిఘా కొనసాగుతోంది. టీజీఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గో దావరి ఇసుక అమ్మకాల్లో అవకతవకల నివారణకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ కుమా ర్ దీపక్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు క్వారీల వద్దకు వెళ్లి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. క్వారీల్లో ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌తోపాటు ఉన్నతాధికారులు సైతం పలుమార్లు ఆకస్మిక తనిఖీలు చేయడం, అధికారులకు కలెక్టర్ హెచ్చరికలు జారీ చేయడంతో అక్రమ దందా నిలిచిపోయింది. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులతోపాటు కార్పొరేషన్, మైనింగ్, స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. బుకింగ్ చేసుకున్న వారికే బరువు సరి చేస్తున్నారు. అధికంగా తీసుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ప్రస్తుతం జిల్లాలో కోటపల్లి మండలం కొల్లూరు, పలుగుల ఎర్రాయిపేట పరిధిలో ఇసుక అమ్మకాలు సాగుతున్నాయి. శుక్రవారం రెండు స్టాక్ యార్డుల నుంచి 155ఆర్డర్లు రాగా, 4,940క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మకాలు జరిగాయి. ఆగినట్లేనా? ఇసుక రవాణాపై కలెక్టర్ కుమార్ దీపక్ నిత్యం అ ధికారులను అప్రమత్తం చేస్తున్నారు. రెండు రో జుల క్రితం ఇసుక అక్రమంగా రవాణా జరుగుతోందని ఓ యువకుడు వీడియో తీయగా, వెంట నే అధికారులు అప్రమత్తమై తనిఖీలు నిర్వహించారు. స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులతో తనిఖీలు చేశారు. గతంలో నిర్ధేశిత ఇసుక కన్నా అదనంగా బకెట్‌తో లారీల్లో వేస్తూ అదనంగా సొ మ్ము చేసుకునే వారు. రోజువారీగా నిత్యం వంద ల లారీలు వస్తుండేవి. అంతేగాక రాత్రివేళ ఎలాంటి తనిఖీలు లేకుండా ఇసుక జిల్లా దాటేది. చెక్‌పోస్టులు, పోలీసుస్టేషన్ల నుంచి అడ్డు చెప్పకపోవడంతో దందా నడిచింది. జైపూర్, చెన్నూరు, కోట పల్లి మండలాల పరిధిలో రాజకీయ పలుకుబడి, ప్రజాప్రతినిధులు, అధికారులకు పెద్ద ఎత్తున మామూళ్లు ముట్టడంతో అంతా సైలెంట్‌గా వ్యవహారం నడిచేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రా గానే పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రస్తుతం వేస వి ప్రారంభం కావడంతో ప్రస్తుతం రోజుకు వందకు పైగానే ఇసుక బుకింగ్ జరుగుతున్నాయి. గతంలో మాదిరి అక్రమాలు చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కొందరు ఇసుక దందాకు అడ్డు చెప్పకుండా ఓ ప్రజాప్రతినిధితో చెప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి. స్థానికులకు గోదావరి నుంచి ఇసుక తీసునేందు కు అనుమతి ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కోటపల్లి: ఇసుక రవాణాలో అక్రమాలు, లోటుపాట్లు లేకుండా సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలోని కొల్లూర్, ఎర్రాయిపేట ఇసుక క్వారీలను డీసీపీ భాస్కర్‌తో కలిసి తనిఖీ చేశా రు. కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక క్వారీలకు వచ్చే లారీల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇసుక లోడింగ్ ఆలస్యం కారణంగా జాతీయ రహదారిపై లారీలు నిలి చిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, లోడింగ్‌లో వేగం పెంచాలని, ఇసుక క్వారీల సామర్థ్యం త్వరలో పెంచుతామని తెలి పారు. రోజుకు 200వరకు లారీలు లోడింగ్ అ య్యేలా చూడాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టు కూడా రద్దు చేస్తామని హెచ్చరించా రు. అనంతరం కోటపల్లి తహసీల్దార్ కార్యాల యం, ఎస్సీ హాస్టల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాఘవేంద్రరావు, డాక్టర్ అరుణశ్రీ, డిప్యూటీ తహసీల్ధార్ నవీన్‌కుమార్ పాల్గొన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి చెన్నూర్: ప్రభుత్వ పాఠశాలు, సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం చెన్నూర్ పట్టణంలోని కస్తూర్భా గాంధీ విద్యాలయం, మండలంలోని పొక్కూర్, చెల్లాయిపేట, సుందరశాల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. అమ్మ ఆదర్శ పథకంలో నిర్మిస్తున్న గదులు, భోజనశాల, వంట గదులు పరిశీలించారు. తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీవో మోహన్, కస్తూర్బా పాఠశాల ప్రతేకాధికారి సుమలత పాల్గొన్నారు. కొల్లూరు క్వారీలో లారీలోని ఇసుకను తూకం సరి చేస్తున్న సిబ్బంది -
కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
జైపూర్: ఎస్టీపీపీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు ప రిష్కరించాలని, రూ.5వేలు అలవెన్స్ చెల్లించాలని బీఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి చైర్మన్ ఎన్.బలరాంను కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో బీఎంఎస్ బొగ్గు పరిశ్రమల ఇంచార్జి, జాతీయ సేఫ్టీ కమిటీ సభ్యుడు కొత్తకాపు లక్ష్మారెడ్డి, బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య వినతిపత్రం అందజేశారు. గత ఏడాది డిసెంబర్లో డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషన్ అధ్యక్షతన జరిగిన ఒప్పందం అమలు చేయాలని, కార్మికులకు బస్సు సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. బీఎంఎస్ ఎస్టీపీపీ జనరల్ సెక్రెటరీ దుస్స భాస్కర్, బీఎంఎస్ నాయకులు పులి రాజిరెడ్డి, మండ రమాకాంత్, శ్రీధర్, పెద్దిరెడ్డి కిషన్‌రెడ్డి, శివకృష్ణ, చిలకాని వెంకటేష్, సతీష్ పాల్గొన్నారు. -
గ్రామాల్లో సౌర వెలుగులు..!
● ‘పీఎం సూర్యఘర్ మస్త్ బిజిలీ యోజన’కింద ఎంపిక ● ఉమ్మడి జిల్లాలో రెండు మోడల్ గ్రామాలు ● పూర్తయిన సర్వే మంచిర్యాలఅగ్రికల్చర్: గ్రామీణ ప్రాంత ప్రజలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం లక్ష్యంగా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ‘సూర్యఘర్ మస్త్ బిజిలీ యోజన’ పథకం కింద సంపూర్ణ సౌరశక్తి గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతీ జిల్లాలో ఒక గ్రామాన్ని మోడల్ తీర్చిదిద్దనున్నారు. దీంతో ఆ గ్రామాల్లో సోలార్ వెలుగులు విరజిమ్మనున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం నర్సపూర్, మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట్ మండలం వెంకట్రావ్పేట్ను మోడల్ గ్రామాలుగా ఎంపిక చేశారు. కాగా ఆ గ్రామాల్లో ఎన్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేశారు. ఎన్ని ఇండ్లు, విద్యుత్ సర్వీస్ మీటర్లు, వ్యవసాయ కనెక్షన్లు, తదితర వివరాలపై సర్వే చేపట్టారు. ఈ వివరాలను ప్రభుత్వానికి నివేదించి, తదుపరి ఆదేశాలు రాగానే పనులు ప్రారంభించనున్నట్లు జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ చెబుతున్నారు. సంపూర్ణ సౌరశక్తి గ్రామాలుగా.. కేంద్ర ప్రభుత్వం, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ద్వారా, రాష్ట్రంలో రెడ్కో విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ప్రతీ జిల్లాకు ఒక గ్రామాన్ని ఎంపిక చేసి సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా తీర్చిదిద్దనున్నారు. సౌరశక్తి గ్రామంగా తీర్చిదిద్దేందుకు కేంద్రప్రభుత్వం రూ. కోటి సాయం అందిస్తుంది. స్థానిక ఉత్పత్తి చేయడం విద్యుత్ ఖర్చులు తగ్గనున్నాయి. ఇంటి యజమానికి ఆదాయం..రూప్ లెవల్ బిల్డింగ్‌పై కిలోవాట్ సోలార్ ఏర్పాటుకు 80 నుంచి 90 స్క్వేర్ ఫీట్లు, 2 కిలోవాట్స్ సోలార్ ప్లాట్ ఏర్పాటుకు 160 నుంచి 190 స్క్వేర్ ఫీట్లు, 3 కిలోవాట్స్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 270 స్క్వేర్ ఫీట్ల స్థలం అవసరం ఉంటుంది. వ్యవసాయ బోరుబావుల వద్ద 7.5 కిలోవాట్స్ ప్లాంట్ ఏర్పాటుకు బోరుబావుల నుంచి 100 మీటర్ల డీయషన్ పరిధిలో సరైన ప్రదేశం అవసరం ఉంటుంది. 2 కిలోవాట్స్ ప్లాంటు ఏర్పాటు అయితే ఇంటి యజమానికి నెలకు రూ. 2 వేల నుంచి రూ. 3 వేల ఆదాయం వరకు, బోరు బావుల వద్ద 7.5 కిలోవాట్స్ ప్లాంటుకు రూ. 5 వేల నుంచి రూ 6 వేల వరకు ఆదాయం యజమానికి చేరుతుంది. దీంతో పాటు రైతు గృహ అవసరాలకు విద్యుత్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది. సర్వే పూర్తి చేశాం.. ప్రధాన మంత్రి సూర్యఘర్ మస్త్ బిజిలీ యోజన పథకం ద్వారా సంపూర్ణ సౌరశక్తి గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించింది. మోడల్ గ్రామాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటుకు చేసేందుకు సర్వే చేశాం. ఏడీఈ, ఏఈ, సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటి వివరాలు, యాజమాని పేరు, ఆధార్‌కార్డు వివరాలు సేకరించారు. రైతులకు సోలార్ ప్లాంట్ ప్రయోజనాలను వివరించాం. – గంగాధర్, విద్యుత్‌శాఖ ఎస్ఈ, మంచిర్యాల ఎంపిక చేసిన గ్రామాల వివరాలు..గ్రామం విద్యుత్ కనెక్షన్లు రిజిస్ట్రేషన్ వ్యవసాయ కనెక్షన్లు రిజిస్ట్రేషన్ వెంకట్రావుపేట 1415 1405 346 340 నర్సపూర్ 131 128 76 75ఉమ్మడి జిల్లాలో రెండు గ్రామాలు.. సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం, సమాజం తమ ఇంధన అవసరాలకు తీర్చుకోవడంలో స్వావలంబన పొందేలా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మోడల్ సోలార్ విలేజ్ అనే పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం అమలుకు రాష్ట్రంలోని 17 జిల్లాలలో 8 గ్రామాలను ఎంపిక చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్ డివిజన్ పరిధిలో నర్సపూర్, మంచిర్యాల జిల్లా పరిధిలో లక్షేట్టిపేట మండలం వెంకట్రావ్‌పేట్ గ్రామాలను ఎంపిక చేశారు. నర్సపూర్‌లో 131 విద్యుత్ మీటర్లుకు 128ఇండ్లను అర్హతగా గుర్తించారు. వ్యవసాయ బోర్లు 75 నమోదు పూర్తి చేశారు. వెంకట్రావ్‌పేటలో 1415 విద్యుత్ మీటర్లకు 1405, 346 వ్యవసాయ బోరుబావుల కనెక్షన్లకు 340 నమోదు చేశారు. మొత్తం 1746 కనెక్షన్లు నమోదు చేశారు. ఇంటి యజమాని పేరు, బ్యాంకు ఖాతా నెంబర్, ఆధార్ నెంబర్, రూప్ లెవల్లో ఉన్న స్థలం వివరాలను సేకరించారు. ఎంత సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటు చేయాలో వివరాలు సేకరించారు. ఆ వివరాలను సూర్యఘర్ పోర్టల్‌లో నమోదు చేశారు. -
నీలుగాయిని హతమార్చిన వేటగాళ్ల అరెస్టు
● నిందితుల్లో ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు పెంచికల్పేట్: మండలంలోని లోడుపల్లి అటవీ ప్రాంతంలో నీలుగాయిని హతమార్చిన వేటగాళ్లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు పెంచికల్పేట్ రేంజ్ అధికారి అనిల్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. లోడుపల్లి అటవీ ప్రాంతంలోని సహజ నీటి వనరుల వద్ద నీలుగాయిని హతమార్చానే పక్కా సమాచారంతో రావడంతో సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించాం. కొండపల్లి గ్రామానికి చెందిన చప్పిడే వెంకటేశ్, ఎల్లూర్ గ్రామానికి చెందిన దుర్గం రవీందర్‌ల ఇళ్లల్లో తనిఖీలు చేయగా.. నీలుగాయి మాంసం లభ్యమైంది. వారిని విచారించగా కొండపల్లి గ్రామానికి చెందిన ఆత్రం రవి, గొర్లపల్లి మొండి, మన్నెపల్లి శ్రీహరి, ఆత్రం భీమయ్యలతో కలిసి నీలుగాయిని హతమార్చినట్లు ఒప్పుకున్నారు. వెంకటేశ్, దుర్గం రవీందర్‌ను కోర్టులో హాజరుపరచగా న్యాయముర్తి రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. దుర్గం రవీందర్ పెంచికల్పేట్ మండలంలోని మెరెగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. పరారీలో ఉన్న మిగతా నలుగురిని పట్టుకుంటామన్నారు. ఈ దాడుల్లో ఎఫ్ఎస్వో శంకర్, ఎఫ్‌బీవోలు సంగదీప్, సతీష్, లచ్చన్న, మనోహర్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధి లక్ష్యంగా ఏటీసీ
మంచిర్యాలఅర్బన్: నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక సంస్థ(ఐటీఐ)లను నవీకరించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలు(ఏటీసీ) సర్వం సిద్ధమవుతున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు అధునాతన, సాంకేతికతపై శిక్షణకు ఆయా కేంద్రాల్లో వచ్చే విద్యాసంవత్సరం(జూన్ 2025) నుంచి తరగతుల ప్రారంభానికి చర్యలు వేగవంతమయ్యాయి. డిమాండ్ ఉన్న కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం, శిక్షణ పూర్తయిన వారికి స్వయం ఉపాధి కల్పించేలా పని చేస్తాయి. గత ఏడాది రూ.4.76 కోట్లతో మంచిర్యాల ఐటీఐ కళాశాల ఆవరణలో నిర్మాణ పనులు చేపట్టగా పూర్తయ్యాయి. పరిశ్రమల డిమాండ్‌కు అనుగుణంగా టాటా టెక్నాలజీ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఆరు కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఏడాది, రెండేళ్ల కోర్సులకు సంబంధించి 172సీట్లు భర్తీ చేస్తారు. ఇప్పటికే ఏటీసీలకు 70శాతం ప్రయోగ పరికరాలు(యంత్రాలు) చేరగా బిగించారు. కోర్సులకు సంబంధించి ఏటీసీ భవనంలో డెల్వర్క్ స్టేషన్, ఐవోటీ కిట్, సర్వర్ రాక్, త్రీడీ ప్రింటర్, కార్ లిఫ్ట్, సిల్, ఫెయింట్ బాత్, ఇండస్ట్రియల్ రోబోటెక్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ సిస్టమ్(సీఎన్సీ), వీఎంసీ, ప్లంబింగ్ పరికరాలు బిగించారు. టాటా టిగోర్, టాటా ఏసీ, ఈవీ కిట్, మహేంద్ర త్రీవీలర్ ఇంకా రావాల్సింది. కోర్సులకు ఆదరణ ఐటీఐ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐలో 432 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 100, ఫిట్టర్ 100, ట ర్నర్ 40, ఎలక్ట్రానిక్ మెకానిక్ 24, మెకానిక్ 24, వె ల్డర్ 40, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(కోపా) 24, సోలార్ టెక్నీషియన్ 40, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ కోర్సులో 40 సీట్లు ఉ న్నాయి. ఇందులో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫ్యాషన్ డిజైన్, టెక్నాలజీ, సోలార్ టెక్నీషియన్ కోర్సులకు డిమాండ్ ఉంది. ఆరు కోర్సులతోపాటు మూ డు నెలల షార్ట్‌టర్మ్ కో ర్సుల్లో శిక్షణ ఇస్తారు. టూవీలర్ మెకానిక్, పెయిటింగ్, డెంటింగ్, లేజర్ కటింగ్(నాన్మెటల్), మార్కెట్లో డిమాండ్ ఉన్న వాటిల్లో తర్ఫీదు ఇస్తారు. శిక్షణ వల్ల ఉద్యోగం, స్వయం ఉపాధి పెరగనుంది. అధునాతన, సాంకేతికతపై శిక్షణ వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశాలు ఆరు కోర్సుల్లో 172 సీట్లువచ్చే ఏడాది ప్రవేశాలకు అవకాశం ఏటీసీల్లో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాలు జరుగనున్నా యి. 70శాతం యంత్రాలు అమర్చాం. శిక్షణ పొందిన విద్యార్థులను కంపెనీలు ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటాయి. ఉద్యోగాలు, స్వయం ఉపాధికి ఏటీసీలు దోహదపడనున్నాయి. 8వ తరగతి పాస్, 10వ తరగతి ఫెయిలైన వారు షార్ట్‌టర్మ్ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చు. – రమేష్, ప్రిన్సిపాల్, ఐటీఐ, మంచిర్యాలకొత్త కోర్సులు ఇవేకోర్సులు సీట్లు కాలవ్యవధి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషిన్ 40 ఏడాది ఇండస్ట్రియల్ రోబోటెక్స్, డిజిట్ మ్యానుఫ్యాక్చరింగ్ 40 ఏడాది ఆర్టీసియన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్ 20 ఏడాది బేసిక్డిజైనర్, వర్చువల్ వెరిఫయిర్ 24 రెండేళ్లు అడ్వాన్స్డ్ సీఎన్సీ మిషనింగ్ టెక్నీషియన్ 24 రెండేళ్లు మెకానిక్ ఎలక్ట్రానిక్ వెహికల్ 24 రెండేళ్లు -
జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జగన్
మంచిర్యాలక్రైం: జిల్లా బార్ అసిసోయేషన్ అధ్యక్షుడిగా బండవ రం జగ్గయ్య అలియాస్ జగన్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. జి ల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో శుక్రవారం ఎన్నికల కమిషనర్ అనిల్‌రాజ్ ఆధ్వర్యంలో పోలింగ్ నిర్వహించారు. 312మందికి గాను 287మంది ఓటు హ క్కు వినియోగించుకున్నారు. సత్తయ్యపై జగన్ 22ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా భుజంగ్‌రావు, ప్రధాన కార్యదర్శిగా కనుకుంట్ల మురళికృష్ణ, సంయుక్త కార్యదర్శిగా ఆ వునూరి సతీష్, కోశాధికారిగా చకినారపు దత్తాత్రేయ, లైబ్రరీ సెక్రెటరీగా వడ్లకొండ రంజిత్‌కుమార్‌గౌడ్, మహిళా ప్రతినిధిగా బోగే ఉమరా ణి, స్పోర్ట్స్, కల్చరల్ కార్యదర్శిగా రంగు వేణుకుమార్, కార్యవర్గ సభ్యులుగా లక్ష్మీప్రసన్న, సందెల మల్లేష్, కొట్టూరి సింధూజ, సోమ ప్ర దీప్చంద్ర, పెసర శ్రీకాంత్ ఎన్నికయ్యారు. -
ఇసుక అక్రమ రవాణపై కొరడా
జన్నారం: ఇసుక అక్రమ రవాణ చేస్తున్న వారిపై అటవీశాఖ అధికారులు కొరడా ఝులిపించారు. టైగర్‌జోన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఇందన్పల్లి రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. రేంజ్ పరిధిలోని బుట్టాపూర్ వాగులో నుంచి ఇసుక తోడుతున్నట్లు పక్కా సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. బుట్టపూర్కు చెందిన తిప్పని విశ్వాస్, జన్నారంకు చెందిన దాసిరి అన్వేష్, కలమడుగుకు చెందిన పిండి ముజ్జన్నలకు చెందిన ట్రాక్టర్లను సీజ్ చేసి రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. అదే విధంగా మొర్రిగూడ ప్రాంతంలో తనిఖీ చేయగా మరో ట్రాక్టర్ ఇసుకతో వస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఇసుక తవ్వడం, తరలించడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆన్లైన్ ప్రవేశాలు జరిగేనా..?
● ఇంటర్ విద్యలో అమలుపై స్పష్టత కరువు ● మాన్యువల్‌గానే ప్రవేశాలు ● విద్యార్థులపై ప్రైవేట్ యాజమాన్యాల ఒత్తిడి బోథ్: డిగ్రీలో అమలు చేస్తున్న దోస్త్ విధానం తరహాలోనే ఇంటర్ ప్రవేశాలపై పీటముడి నెలకొంది. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం వచ్చినా.. మాన్యువల్ గానే ప్రవేశాలు పొందుతున్నారు. ప్రైవేటు యాజమాన్యాలు తమ కళాశాలల్లో చేరాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు. ఫలితంగా విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైవేట్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థుల ప్రవేశాలపై స్పష్టత కరువైంది. ప్రైవేట్ కళాశాలల ఆగడాలను చెక్.. ఇంటర్ ప్రవేశాల్లో దోస్త్ తరహా ఆన్లైన్ విధానం అమలైతే విద్యార్థులకు మేలు జరుగుతుంది. విద్యార్థి తనకు నచ్చిన కళాశాలలను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసుకునే వీలుంటుంది. పదో తరగతిలో విద్యార్థికి వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా కేటాయింపులు జరుగుతాయి. ఈ విధానంతో విద్యార్థి తనకు నచ్చిన కళాశాలలో చదివే వీలు ఉంటుంది. వివిధ ఫేజ్‌లతో కూడిన ప్రవేశాలు ఉంటే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉండదు. ఇంటర్లో కూడా డిగ్రీ మాదిరిగానే ఆన్లైన్ ప్రవేశాలు చేపడితే ప్రైవేట్ కళాశాలల ఆగడాలను చెక్ పడనుంది. విద్యార్థుల వద్దకు పీఆర్వోలు.. పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంటర్లో ప్రవేశాలు పొందేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈక్రమంలో ప్రైవేట్ యాజమాన్యం క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ఇప్పటికే ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతీ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. తల్లిదండ్రులను కలిసి తమ కళాశాలల్లో చేరాలని కోరుతున్నారు. విద్యార్థులు ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. కాగా ఆయా కార్పొరేట్ కళాశాలలకు చెందిన పీఆర్వోలు విద్యార్థులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మొదట చేరి.. తరువాత తిరిగి వచ్చి.. పదో తరగతి పరీక్షలను విద్యార్థులు రాయకముందే పలు ప్రైవేట్ కళాశాలలకు చెందిన పీఆర్వోలు విద్యార్థుల అడ్మిషన్లు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులను కలిసి తమ కళాశాల గురించి వివరించి అడ్మిషన్లు చేస్తున్నారు. అడ్మిషన్ల సమయంలోనే వేలల్లోనే ఫీజులు కట్టించుకుంటున్నారు. ఇక పదో తరగతి పాస్ కాగానే విద్యార్థి కనీసం నెల రోజులు కూడా కళాశాలలో ఉండకుండా ఇంటికి వచ్చేస్తున్నారు. తాము కట్టిన ఫీజు వాపసు ఇవ్వకుండా కళాశాలల యాజమన్యాలు తల్లిదండ్రులను తిప్పించుకుంటున్నాయి. దీంతో తల్లిదండ్రులు నష్టపోతున్నారు. డిగ్రీ మాదిరిగా ఇంటర్లో ఆన్లైన్ ప్రవేశాలు చేపడితే ఇలాంటి నష్టాలు జరిగే అవకాశం ఉండదు. చెల్లించే ఫీజు వివరాలు కూడా ఆన్లైన్ అడ్మిషన్లో కనిపిస్తాయి. దీంతో ఎక్కువ ఫీజును కట్టే అవకాఽశం కూడా ఉండదు.కళాశాలల వివరాలు (ప్రభుత్వ, ప్రైవేట్)ఆదిలాబాద్ 76 నిర్మల్ 63 మంచిర్యాల 62 కుమురం భీం ఆసిఫాబాద్ 48 -
కుళ్లిన మాంసం.. కాలం చెల్లిన స్వీట్లు
● బల్దియా అధికారుల తనిఖీల్లో గుర్తింపు కై లాస్‌నగర్: ఆదిలాబాద్ బల్దియా పారిశుద్ధ్య విభా గం అధికారులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు హోటల్స్, స్వీట్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. కలెక్టర్చౌక్లోని ఓ హోటల్‌ను తనిఖీ చేసిన అధికారులు కుళ్లిన 6 కిలోల మాంసం, గడ్డ కట్టిన పాడైన చేపల ను గుర్తించారు. వాటిని నిల్వ ఉంచిన ఫ్రీజ్‌లో పురుగులు ఉండటంతో హోటల్ యాజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లిన మాంసతో పాటు ఆహా ర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. హోటల్ నిర్వాహకుడిని హెచ్చరించి, జరిమానా విధించారు. అనంతరం వినాయక్ చౌక్‌లోని వెంకటేశ్వర స్వీట్‌షాపు, స్వీట్ల తయారీ ప్రాంతం అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. కాలం చెల్లిన స్వీట్లను తయారు చేసిన స్వీట్లతో కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తించి, జరిమానా విధించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే చర్యలు తప్పవని పుడ్ ఇన్స్పెక్టర్లు ఎం.నరేందర్, బైరి శంకర్లు హెచ్చరించారు. -
విద్య, ఉపాధి కేంద్రంగా హాజీపూర్
● పర్యాటక కేంద్రంగానూ గుర్తింపు మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం విద్యాకేంద్రంగానే కాకుండా ఐటీ పార్కు, ఇండస్ట్రియల్ కారిడార్‌గా మారుతోంది. పర్యాటకంగానూ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రాథమి క, మాధ్యమిక, ఉన్నత విద్యతోపాటు గురుకుల, కస్తూరిభా పాఠశాలలతోపాటు ఇప్పుడు కేంద్రియ విద్యాలయం, వైద్య కళాశాలకు హాజీపూర్ మండలం వేదికగా మారింది. కేంద్రియ విద్యాలయం నూ తన భవన నిర్మాణం పూర్తి కాగా ప్రారంభానికి సిద్ధమైంది. ప్రభుత్వ వైద్య కళాశాల భవనం, హాస్టల్ భవన నిర్మాణాల పనులు చకచకా సాగుతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరంలోగా గుడిపేటలోనే కేంద్రి య విద్యాలయం, వైద్య కళాశాల తరగతులు ప్రా రంభం కానున్నాయి. త్వరలోనే యువత భవిష్యత్ భరోసా కోసం హాజీపూర్‌లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు జరుగుతోంది. ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందిన గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్‌లో వివిధ ప్రాంతాల యువత కానిస్టేబుల్, ఎస్సైలుగా శిక్షణ పొందుతూ ఉద్యోగాల్లో చే రుతున్నారు. వేంపల్లి, ముల్కల్ల శివారులోని 300 ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్, ఐటీ పార్కు ఏర్పాటు కు వేగంగా అడుగులు పడుతున్నాయి. పరిశ్రమల శాఖ నుంచి ఉన్నతాధికారులు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించగా.. జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్, రెవె న్యూ అధికారులు నివేదిక అందజేశారు. వేంపల్లి శివారులోని 159 సర్వే నంబర్లో ఉన్న దాదాపు 180 ఎకరాల స్థలాన్ని ఇందుకు సిద్ధం చేశారు. పర్యాటక కేంద్రంగా.. హాజీపూర్ మండలం పర్యాటక కేంద్రంగానూ గు ర్తింపు పొందుతోంది. మండలంలో ఎంసీసీ క్వారీ గుట్టలు దుర్గాదేవి జాతరతోపాటు పిక్నిక్, ఇతర కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోంది. ర్యాలీ గిరిజన గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని జలపాతానికి ప్రత్యేకత ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు దిగువన 30 ఎకరాల్లో బొమ్మె చేపల పెంపకం చేపడుతున్నారు. ముల్కల్లలో ర్యాలీవాగు ప్రాజెక్ట్ కనువిందు చేస్తుండగా.. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ప్రధాన ఆకర్షణగా నిలు స్తోంది. 62 గేట్లతో ఏకంగా 20టీఎంసీలకు పైగా నీటి సామర్థ్యంతో వర్షాకాలం భారీ వరదల సమయంలో గేట్లు తెరిచినప్పుడు దృశ్యాలు కనువిందు చేస్తాయి. ప్రాజెక్ట్‌లో బోటింగ్ సదుపాయం కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. జంగల్ సఫారీ.. గఢ్‌పూర్ గ్రామ శివారులోని ఎంసీసీ క్వారీలోని అట వీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గాంధారీ ఖిల్లా స ఫారీ 25 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. అడ వి అందాలు, వన్యప్రాణుల సందర్శన పర్యాటకులను మరింత కనువిందు చేస్తున్నాయి. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం
● డీసీపీ ఎగ్గడి భాస్కర్ ● అర్ధరాత్రి పెట్రోలింగ్ మంచిర్యాలక్రైం: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. గురువారం రాత్రి ముస్లింలు షబ్ ఏ ఖద్ర్ జుగ్నేకి రాత్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు చోటు చేసుకోకుండా డీసీపీ పోలీసు సి బ్బందితో కలిసి అర్ధరాత్రి నుంచి ఉదయం నాలుగు గంటల వరకు పెట్రోలింగ్ నిర్వహించారు. మజీద్లు, ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. బ స్టాండ్, రైల్వేస్టేషన్, బెల్లంపల్లి చౌరస్తా, ఐబీ చౌరస్తా ప్రధాన కూడళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను ప్రశ్నించి వివరాలు, ఆధార్, వేలిముద్రలు సేకరించా రు. మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, ఎస్సై కిరణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. పరీక్షా కేంద్రం సందర్శన నస్పూర్: పట్టణ పరిధిలోని సీసీసీ సింగరేణి హైస్కూల్లో పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని డీసీపీ భాస్కర్ శుక్రవారం సందర్శించారు. అధికారులతో మాట్లాడి పరీక్షల తీరుపై తెలుసుకున్నారు. -
ఆన్లైన్ ద్వారా చేపట్టాలి
ఇంటర్ ప్రవేశాలు పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించాలి. డిగ్రీ మాదిరిగా ప్రవేశాలు నిర్వహిస్తే విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. కార్పోరేట్ కళాశాలలకు చెందిన పీఆర్ఓలు గ్రామాల్లోకి వచ్చి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. దీంతో విద్యార్థుల నుండి అధిక ఫీజులు అడ్మిషన్ల సమయంలో వసూలు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఆన్లైన్లో ప్రవేశాలు జరిపితే విద్యార్థి మంచి కళాశాలలో చదివే అవకాశం ఉంటుంది. – బోయిడి ఆకాష్, ఏబీవీపీ నాయకుడు -
అక్రమ పట్టాలు రద్దు చేయాలి..
కాసిపేట మండలం కోమటిచేను, గురువపూర్లోని జంగు సిపాయి భూములను కొందరు బినామీ ప ట్టాలతో ఆక్రమించుకున్నారు. 70 ఏళ్లుగా ఆదివాసీలం సాగు చేసుకుంటున్నాం. చెరువుల్లో మునిగిన కూడా అక్రమ పట్టాలు చేశారు. మందమర్రి మండలం తిమ్మపూర్లోనూ అక్రమ మార్గంలో కబ్జా చేస్తున్నారు. వీ టిపైన విచారణ చేసి ఓఆర్సీ ఇవ్వాలని పలుమార్లు ఆర్డీ వో, కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలే దు. కమిషన్ దృష్టి సారించి తక్షణమే చర్యలు తీసుకోవాలి. – కుర్సింగే వెంకటేష్, ఆదివాసీ తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
రెండు నెలల్లో కేసులు పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: భూ సమస్యలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు రెండు నెలల్లోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, సభ్యులతో కలిసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, భూ సంబంధిత కేసులు, జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యలు, సంక్షేమ ఫలాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 నుంచి అట్రాసిటి కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయని, ఎందుకు పరిష్కరించడం లేదని డీసీపీ భాస్కర్‌ను ప్రశ్నించారు. మే 30లోపు అట్రాసిటి కేసులు, భూ సంబంధిత కేసులన్నీ ఏప్రిల్ 30లోపు పరిష్కరించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల కోసం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ భూ సంబంధిత సమస్యల దరఖాస్తులను కనీసం 15రోజులు, గరిష్టంగా 31రోజుల్లోపు పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య ఎస్సీ, ఎస్టీ కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ అట్రాసిటి కేసుల్లో 60 నుంచి 70శాతం మాత్రమే నిజమైనవి ఉంటున్నాయని తెలిపారు. 2024లో 86 కేసులు కాగా ఇందులో 56 కేసులు కోర్టుకు పంపించామని, 2025లో 21 కేసులు నమోదు కాగా ఒక కేసు చార్జీషీట్ చేశామని, మిగతావి పరిశీలనలో ఉన్నాయని, కొన్ని కోర్టు స్టేలో కొనసాగుతున్నాయని వివరించారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు రేణుగుంట్ల ప్రవీణ్, కుస్రం నీలాదేవి, రాంబాబునాయక్, కే.లక్ష్మినారాయణ, జిల్ల శంకర్, జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణ, సింగరేణి కంపెనీ జీఎంలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఎందుకు..? ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు కృషి ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్యనిల్వ నీడ లేకుండా చేసిండ్రు..దివ్యాంగులమని కూడా చూడకుండా 30 గజాల్లో నిర్మించుకున్న ఇంటిని కూలగొట్టి అక్రమ కేసులు పెడుతూ పోలీసులు వేధిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని తిలక్‌నగర్‌లో దివ్యాంగులకు స్థలం కేటాయించారు. 90 గజాల స్థలంలో ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం. కొంతమంది దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై పలుమార్లు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా పోలీసు వేధింపులు ఆగడం లేదు. మాకు న్యాయం చేయాలి. – దివ్యాంగులు మల్లేష్, సుజాత, -
శేష జీవితం ఆనందంగా గడపాలి
మంచిర్యాలక్రైం: పోలీస్ శాఖలో ఇంతకాలం విధులు నిర్వర్తించి విరమణ పొందుతున్న పోలీస్ అధికారులు శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శుక్రవారం రామగుండం కమిషనరేట్‌లో పదవీ విరమణ ఎస్సై సీహెచ్.చక్రపాణి, ఏఎస్సైలు రవీందర్రావు, జీ.రవీందర్‌కుమార్, ఏఆర్ ఎస్సైలు కే.రాజయ్య, అహ్మద్ అలీబేగ్, హెడ్ కానిస్టేబుల్ ఏ.రమేష్‌లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రాజు, ఎస్బీ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఓ శ్రీనివాస్, ఆర్ఐ దామోదర్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బొర్లకుంట పోచలింగం పాల్గొన్నారు. -
బెల్టుషాపుపై పోలీసుల దాడి
నిర్మల్‌టౌన్: నిర్మల్‌రూరల్ మండలంలోని రాణాపూర్లో గురువారం బెల్ట్‌షాపుపై దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం పట్టుకున్నట్లు ఏఎస్పీ రాజేశ్ మీనా తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి గ్రామానికి చెందిన ఆడే చందులాల్ కిరాణా దుకాణంలో తనిఖీలు నిర్వహించగా కింగ్ ఫిషర్ బీర్ బాటిళ్లు–75, ఒరిజినల్ ఛాయిస్ 90 ఎంఎల్ బాటిళ్లు–110, రాయల్ స్టాగ్ 180 ఎంఎల్ బాటిళ్లు–47, ఎంసీ 180 ఎంఎల్ బాటిళ్లు–52, ఇంపీరియల్ బ్లూ 180 ఎంఎల్ బాటిళ్లు–58 లభ్యమైనట్లు ఆయన పేర్కొన్నారు. పట్టుకున్న మద్యం విలువ రూ.73,187 ఉంటుందన్నారు. బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
జీవితంపై విరక్తితో యువకుడు ఆత్మహత్య
బెల్లంపల్లి: జీవితంపై విరక్తితో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై జి.రాకేశ్ తెలిపారు. పట్టణంలోని హన్మాన్ బస్తీకి చెందిన మంతెన శివకుమార్ (30) హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో శివకుమార్ ఎడమకాలు విరిగింది. ఆరునెలల క్రితం శివకుమార్ భార్య అతన్ని వదిలివెళ్లి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఒంటరి జీవితం భరించలేక గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి మంతెన రామక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి..బెల్లంపల్లి: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు బెల్లంపల్లి రైల్వే హెడ్‌కానిస్టేబుల్ కె.సురేశ్‌గౌడ్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం సిర్పూర్ టౌన్ నుంచి భద్రాచలం రోడ్ వెళ్లే సింగరేణి ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మృతుడు గుండు చేయించుకుని ఉన్నాడని, సుమారు 45 ఏళ్ల వయస్సు ఉంటుందని, ఎల్లో కలర్ నెక్ టీ షర్ట్, గ్రీన్ కలర్ షార్ట్ ధరించి ఉన్నాడని, వివరాలు ఏమీ తెలియలేదన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచామని, సమాచారం తెలిసిన వారు 9948481902 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. ఆర్థిక ఇబ్బందులతో ఒకరు..ఉట్నూర్‌రూరల్: ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మనోహర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని శ్యాంపూర్‌కు చెందిన ఎం.బాబు (48) కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యానికి గురికావడంతో మనస్తాపం చెందాడు. గురువారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మృతుని భార్య దృపద కుష్ఠు వ్యాధితో బాధపడుతోంది. ఆమెను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని బీజేపీ నాయకులు కాటం రవీందర్ కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. భర్త మద్యం మానేయడంలేదని భార్య.. భర్త మద్యం మానేయడంలేదని భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని వంకతుమ్మలో చోటు చేసుకుంది. ఎస్సై మనోహర్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన ఆత్రం విమల (20) భర్త జ్ఞానేశ్వర్ తరచూ మద్యం సేవిస్తుండడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. మద్యం మానేయాలని ఎంతచెప్పినా వినిపించుకోకపోవడంతో మనస్తాపానికి గురైంది. బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉట్నూర్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. చిట్టీల పేరుతో మోసగిస్తున్న వ్యక్తి రిమాండ్ మండలంలోని నవోదయనగర్ గ్రామానికి చెందిన జావిద్ పలువురిని చిట్టీల పేరుతో మోసం చేస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై మనోహర్ తెలిపారు. పూర్తి విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
● మూడున్నర గంటల పాటు క్యాబిన్‌లోనే డ్రైవర్ కాసిపేట: రోడ్డుపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టిన ఘటనలో మూడున్నర గంటలపాటు డ్రైవర్ క్యాబిన్‌లోనే చిక్కుకుని నరకయాతన అనుభవించాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం ఫ్లై ఓవర్‌పై గురువారం తెల్లవారుజామున ఇనుపరాడ్ల లోడ్‌తో ఆగి ఉన్న లారీని ఛత్తీస్‌గఢ్‌లోని బిలాయి నుంచి ఐరన్ షీట్ల లోడుతో వచ్చిన మరోలారీ ఢీకొట్టడంతో క్యాబిన్ నుజ్జునుజ్జయి డ్రైవర్ గురుజీత్సింగ్ అందులోనే చిక్కుకున్నాడు. విషయం తెలుసుకున్న కాసిపేట ఎస్సై ప్రవీణ్ కుమార్, హైవే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మూడున్నర గంటలపాటు శ్రమించి చివరకు గ్యాస్ కట్టర్‌తో క్యాబిన్ కొంతభాగం కట్‌చేసి డ్రైవర్‌ను బయటకు తీశారు. తీవ్రగాయాలు కావడంతో అంబులెన్స్‌లో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్లాటు హాజీపూర్ మండలం సబ్బెపల్లి పరిధిలోనిది. ఇక్కడ కడెం కాలువ ఉండడంతో అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారందరివి ఎల్ఆర్ఎస్ పథకంలో నిలిపివేశారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, జాతీయ రహదారి పక్కనే ఉందని చాలామం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కొందరు రియల్ వ్యాపారులు ప్రభుత్వ, సాగునీటి వనరుల భూములు అని తేడా లేకుండా ఇష్టారీతిన అమ్మేయడంతో కొనుగోలుదారులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని అనేక చోట్ల చెరువు, శిఖం, కాలువలు, కోర్, బఫర్ తేడా లేకుండా ప్లాట్లుగా చేసి అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. నిబంధనల ప్రకారం అలాంటి భూ ములు కొనుగోలు, అమ్మకాలు చేయరాదు. అయితే జిల్లాలో కడెం, గూడెం ఎత్తిపోతలు, ర్యాలీవాగు ప్రాజెక్టు కాలువలతోపాటు చిన్న వాగులు, వంకలు, వందలాది చెరువులు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో చెరువుల సమీపం, కట్టలు, మత్తడి వరకు ప్లాట్లు చేసి అమ్మేశారు. ఇక ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంకు లెవల్) పరిధిలోనూ పట్టా భూములు ఉన్నాయని వెంచర్లు చేసి అమ్మేశారు. గతంలోనే కొన్ని చోట్ల సాగునీటి శాఖ అధికారులు అభ్యంతరాలు చెబుతూ నోటీసులు ఇచ్చారు. దీనిపై కొందరు కోర్టులకు వెళ్లి మరీ స్టేలు, ఆర్డర్లు తెచ్చుకున్నారు. పంట పొలాలనే వెంచర్లుగా మార్చడంతో చాలా చోట్ల సహజ వనరులు కబ్జాలయ్యాయి. పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ ఆక్రమణలు జరిగాయి. ఏడు మున్సిపాలిటీల్లో 39,512 ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు రాగా, ఇందులో 9500వరకు నిషేధిత భూముల్లో ఉన్నట్లు ప్రాథమిక దశలో నిలిపివేశారు. ఇక పంచాయతీల్లో 15,729 దరఖాస్తులు రాగా, వీటిలో 2500 నిషేధిత భూముల్లో ఉన్నట్లు అధికారులు పరిశీలనలో గుర్తించారు. ‘ఎన్వోసీ’లకు కష్టాలు.. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలంటే ప్రభుత్వ, సాగునీటి పరిధిలో భూములు లేకుండా ఉంటేనే ఆమోదం లభిస్తున్నాయి. ఎక్కడైనా పరిశీలనలో తేలితే షాట్పాల్ కింద నమోదు చేసి హోల్డ్‌లో ఉంచుతున్నారు. దీంతో ఆ ప్లాట్ల యజమానులు ఫీజు చెల్లించకుండా నిలిపివేస్తున్నారు. దీంతో అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్వోసీ(నో అబ్జక్షన్ సర్టిఫికేట్) ఇచ్చేందుకు రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే అధికారులు క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి ధ్రువీకరిస్తున్నారు. మరోవైపు కొంతమంది భూములు సాగు నీటిపరిధిలో లేకుండా సంబంధిత ఏఈలు సర్వే నంబరు మొత్తం నిలిపివేశారని ఆరోపిస్తున్నారు. సర్వే చేసేందుకు సిబ్బంది లేకపోవడం, ఎల్ఆర్ఎస్ గడువు ముగుస్తోందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మళ్లీ ప్లాట్ల యజమానుల అర్జీల మేరకు పునఃపరిశీలన చేస్తున్నారు. దీంతో ఎక్కడైనా పొరబాటుగా నమోదైతే తొలగిస్తున్నారు. అయితే ఆయా చోట్ల భూ యజమానులకు హోల్డ్‌లో ఉంటే తిప్పలు తప్పడం లేదు. నిషేధిత భూములపై అభ్యంతరాలు రెవెన్యూ, సాగునీటి పరిధిలో నిలిపివేత ‘ఎన్వోసీ’లకు భూ యజమానుల కష్టాలు ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు -
● టెండర్ ఖరారు? ● పనులు దక్కించుకున్న ఓ ప్రైవేటు ఏజెన్సీ
కడెం ప్రాజెక్టులో అనేక ఏళ్లుగా పేరుకుపోయిన పూడికతీత (సిల్ట్)కు టెండర్ ఖరారైనట్లు సమాచారం. పూడికతీతతో కడెం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం పెరుగనుందని ఆయకట్టు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. కడెం: కడెం నదిపై ఎత్తయిన సహ్యాద్రి కొండలను ఆనుకుని 9 వరద గేట్లతో 1958లో ప్రాజెక్ట్‌ను నిర్మించారు. అదే ఏడాది సామర్థ్యానికి మించి వరద రావడంతో ప్రాజెక్ట్ తెగిపోయింది. కడెం ప్రాజెక్ట్‌కు వచ్చే ఇన్‌ఫ్లో అంచనా వేసినా అప్పటి ప్రభుత్వం మరో 9 వరద గేట్లను పెంచి ప్రాజెక్ట్ ఔట్ ఫ్లో సామర్థ్యాన్ని 3 లక్షల వరకు పెంచింది. కడెం ప్రాజెక్టు నిర్మల్, మంచిర్యాల జిల్లాలోని కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, హాజీపూర్, లక్సెట్టిపేట, మంచిర్యాల మండలాల్లోని 68,150 ఎకరాలకు సాగు నీరందిస్తుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు(7.603 టీఎంసీ). ప్రాజెక్టుకు ఎగువ నుంచి వచ్చే వరదనీటితో చెత్తాచెదారం, మట్టిని ఎప్పటికప్పుడు బయటకు విడుదల చేసేందుకు అప్పటి ఇంజినీర్లు ప్రాజెక్ట్ అడుగుభాగాన గేట్లను ఏర్పాటు చేశారు. కానీ వాటిని ఆపరేట్ చేయకపోవడంతో తుప్పుపట్టిపోయాయి. దీంతో కాలక్రమేణా ప్రాజెక్ట్‌లో సుమారు 4 టీఎంసీల మేర పూడిక ఉన్నట్లు సమాచారం. ప్రాజెక్టు నిండా పూడిక పేరుకుపోవడంతో నీటినిల్వ సామర్థ్యం తగ్గి ఆయకట్టు కింద ఒకేపంటకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తుంది. ఎట్టకేలకూ మోక్షం.. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడిక తీయాలని గతేడాది అక్టోబర్‌లో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందుకు కడెం ప్రాజెక్ట్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. ఓ ప్రైవేట్ ఏజెన్సీ పూడికతీత పనులకు టెండర్ దక్కించుకున్నట్లు సమాచారం. ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికతీత 15 నుంచి 20 ఏళ్లలోపు దశలవారీగా చేపట్టనున్నారు. పూడికతీత ప్రక్రియలో భాగంగా పూడికలో ఇసుక, పొలాలకు సారవంతమైన మట్టి, గ్రావెల్ మూడు భాగాలుగా వేరు చేయనున్నారు. కడెం ప్రాజెక్టు పూడికతీత ద్వారా సుమారు రూ.200 కోట్ల ఆదాయం సమకూరనున్నట్లు సమాచారం. కడెం ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికసమాచారం లేదు కడెం ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడిక తీసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్ట్‌లో సిల్ట్ పేరుకుపోవడంతో నీటినిల్వ సామర్థ్యం తగ్గింది. టెండర్ ప్రక్రియ అనేది కరీంనగర్లో జరుగుతుంది. దీనిపై ఉన్నతాధికారుల నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు. – నవీన్, డీఈఈ, కడెం -
అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలి
మంచిర్యాలటౌన్: ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందించే విధంగా కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ అన్నారు. గురువారం సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్‌తో కలిసి జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా గ్రామీ ణాభివృద్ధి శాఖ, పౌరసరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూనిక్ డిజేబులిటీ ఐడీ కార్డుల జారీ, దివ్యాంగులకు సదరం శిబిరాల నిర్వహణ, మరణించిన వృద్ధాప్య పింఛన్‌దారుల స్థానంలో స్పౌజ్లకు పింఛన్ మంజూరు చేయాలని, మహిళా సంఘాలకు పెట్రోల్ బంకుల నిర్వహణ, ఏకరూప దుస్తుల తయారీ కేటాయించాలని తెలిపారు. జిల్లాలో చేపట్టిన చర్యలపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ రబీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో భాగంగా ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు ఎక్కువ సంఖ్యలో కేటాయించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి కిషన్, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, ఎల్డీఎం తిరుపతి పాల్గొన్నారు. -
మట్కా నిర్వాహకుడి అరెస్టు
ఆదిలాబాద్‌టౌన్: జైనథ్ మండలంలోని గిమ్మ గ్రామంలో మట్కా నిర్వాహకుడిని అరెస్టు చేసినట్లు జైనథ్ సీఐ డీ.సాయినాథ్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్సై వీ.పురుషోత్తం సిబ్బందితో కలిసి వెళ్లి దాడులు చేసి మట్కా నిర్వహిస్తున్న ఆవునూరి శ్రీనివాస్‌ను అదుపులోనికి తీసుకుని అతని వద్ద గల రూ.25,000 నగదు, సెల్‌ఫోన్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేసి వాటిని గిమ్మ గ్రామానికి చెందిన మాధవ్, మహారాష్ట్రకు చెందిన మట్కా వ్యాపారి అశోక్ సామ్రాట్‌కు పంపుతున్నట్లు గుర్తించారు. ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పేకాట, మట్కా, గుట్కా, గంజాయి వంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే జైనథ్ సీఐ 8712659916, ఎస్సై 8712659929 నంబర్లకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
నిర్మల్‌టౌన్: వికారా బాద్ జిల్లాలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో నిర్మల్‌కు చెందిన విద్యార్థిని హరిప్రియ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికై ంది. శుక్రవారం బీహార్ రాష్ట్రంలో జరుగనున్న సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొననుంది. జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, నిర్మల్ సబ్ జూనియర్ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ భూపతిరెడ్డి, ఇన్చార్జి ప్రెసిడెంట్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బర్కుంట సునీల్ ప్రత్యేకంగా అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. డీఎంహెచ్ఓ కార్యాలయ ఆవరణలో మంటలుఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయ ఆవరణలోని చెట్ల పొదల్లో గురువారం మంటలు చెలరేగాయి. గమనించిన కార్యాలయ సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యంసేవించిన ఇద్దరికి జరిమానాఆదిలాబాద్టౌన్: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన ఇద్దరికి ఆదిలాబాద్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గుండ రామస్వామి రూ.600 చొప్పున జరిమానా విధించినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ తెలిపారు. గురువారం వన్‌టౌన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 25న రామ్‌లీలా మైదానంలో బండి సత్యనారాయణ, స్థానిక డైట్ కళాశాల మైదానంలో చించేరి వాడకు చెందిన సల్ల రవితేజ బహిరంగంగా మద్యం సేవించడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విచారించిన మేజిస్ట్రేట్ జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. పట్టణంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. -
కొత్త ప్లాంటు నిర్మాణానికి సంసిద్ధం
● సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణరావు, సూర్యనారాయణ ● ఎస్టీపీపీలో బీహెచ్ఈఎల్, సింగరేణి అధికారుల సమావేశం జైపూర్: మండల కేంద్రంలో 1200మెగావాట్ల పవర్ ప్లాంటు విస్తరణలో భాగంగా కొత్తగా నిర్మించనున్న 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదిత స్థలం, అన్ని రకాల సదుపాయాల కల్పనకు సింగరేణి సంస్థ సంసిద్ధంగా ఉందని సంస్థ డైరెక్టర్లు సత్యనారాయణరావు, ఎల్వీ.సూర్యనారాయణ తెలిపారు. స్థానిక ప్లాంటులోని అడ్మిన్ భవన కార్యాలయంలో గురువారం బీహెచ్ఈఎల్, సింగరేణి అధికారుల సంయుక్త సమావేశం నిర్వహించారు. బీహెచ్ఈఎల్ ఈడీ వినోద్ జాకబ్ సామ్, సింగరేణి డైరెక్టర్లు పాల్గొన్నారు. ఫిబ్రవరిలో 800 మెగావాట్ల సామర్థ్యం గల మూడో యూనిట్ నిర్మాణానికి సింగరేణి, బీహెచ్ఈఎల్ మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి సమావేశంలో ముందస్తు ప్రణాళికలు, సాంకేతిక అంశాలపై సమీక్ష, నిర్మాణ ప్రణాళిక, నాణ్యత, ఆడిట్, బిల్లింగ్ విధివిధానాలపై చర్చించారు. అనంతరం డైరెక్టర్లు మాట్లాడుతూ నిర్ణీత సమయంలో నిర్మాణం పూర్తి చేయాలని, ఏప్రిల్ మొదటి వారంలో పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కే.వెంకటేశ్వర్లు, ఎస్టీపీపీ ఈడీ శ్రీనివాసులు, జీఎం కో ఆర్డినేషన్ సుభానీ, జీఎంలు సుబ్బారావు, సూర్యనారాయణ, ఏజీఎంలు విశ్వనాథరాజు, మురళీధర్, మదన్మోహన్, డీజీఎంలు అజ్జుల ఖాన్, ఆజ్మీర తుకరాం, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ఎంవీ.వేణుగోపాల్‌రావు, బీహెచ్ఈఎల్ అధికారులు ఆశా, శివ చరణ్‌వర్మ, మధు కిరణ్ పాల్గొన్నారు. -
నాలుగు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
దండేపల్లి: మండలంలోని కాసిపేట గోదావరినది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై తహసినొద్దీన్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు గురువారం పోలీసులు నదీ తీరానికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన కొందరు ట్రాక్టర్ డ్రైవర్లు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ట్రాలీనుంచి ఇంజన్‌ను వేరు చేసి ఇంజిన్లతో బయటకు వచ్చారు. అయినా పోలీసులు ఎవరినీ వదిలిపెట్టలేదు. ట్రాక్టర్ల యజమానులకు సమాచారం ఇచ్చి వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకురావాలని సూచించారు. దీంతో చేసేదేంలేక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరో ట్రాక్టర్ నదిలో దిగబడినట్లు సమాచారం. పట్టుబడిన నాలుగు ట్రాక్టర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఆటో బోల్తాపడి ఒకరికి తీవ్రగాయాలుబజార్హత్నూర్: మండలంలోని దేగామ క్రాస్ రోడ్డు వద్ద ఆటో బోల్తాపడి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని ఆందుగూడకు చెందిన కోవ రఘునాథ్ కుటుంబం గురువారం మాడగూడకు ఆటోలో వెళ్లివస్తుండగా దేగామ మూలమలుపు వద్ద ఆటో బోల్తా పడింది. కోవ దినేష్‌కు తీవ్ర, మిగతా వారికి స్వల్పగాయాలు కావడంతో స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. దినేష్‌ను మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తరలించారు. -
గ్లైసిల్ దందా ఆగేనా?
● సీజన్‌కు ముందే రైతుల చెంతకు ● ఏటా కోట్లలో వ్యాపారం ● మార్చిలోనే 1,126 క్వింటాళ్లు పట్టివేతమంచిర్యాలఅగ్రికల్చర్: ఈ ఏడాది సీజన్‌కు నాలుగు నెలల ముందుగానే నిషేధిత పత్తి విత్తనాల వ్యాపారం జోరందుకుంది. మార్చిలోనే ఆరుచోట్ల రూ.27,35,000 విలువగల 1,126 క్వింటాళ్ల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని 34 మందిపై కేసులు నమోదు చేశారు. కొంతమంది కొన్నేళ్లుగా అక్రమ దందా నిర్వహిస్తూ కోట్లలో వ్యాపారం సాగిస్తున్నారు. పోలీసులు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నా దందా మాత్రం ఆగడంలేదు. గ్లైసిల్ విత్తనాలుగా పిలువబడే బీటీ–3, హెచ్‌టీ పత్తి విత్తనాల విక్రయానికి ప్రభుత్వ అనుమతి లేదు. ఈ విత్తనం సాగు చేసిన రైతులు కలుపు నివారణకు ఉపయోగించే గ్లైఫోసెట్ మందు పిచికారీ చేస్తున్నా దిగుబడి తగ్గడంతో పాటు భూసారం కోల్పోతుంది. కలుపు నివారణకు కూలీల కొరతను అధిగమించడానికి రైతులు ఈ విత్తనాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. రైతుల అవసరాలను ఆసరా చేసుకుని సీజన్‌కు ముందస్తుగా ఆంధ్రప్రదేశ్ నుంచి విత్తనం, మహారాష్ట్ర నుంచి గ్లైఫోసెట్ జిల్లాకు చేరవేస్తున్నారు. కిలో రూ.2,500 నుంచి రూ.3 వేలు ఖరీఫ్ సాగులో 3.40 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంటుండగా ఇందులో పత్తి సాగు అధికంగా ఉంటుంది. రైతులు సొంతభూమితో పాటు పెద్దఎత్తున భూములు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నా రు. ఇప్పటికే పత్తి అమ్ముకున్న కొంతమంది రైతులు పంటను తొలగించి రానున్న ఖరీఫ్ సీజన్ కోసం భూమిని చదును చేస్తున్నారు. కలుపు నివారణ కో సం కొన్నేళ్లుగా రైతులు గుర్తింపు లేని విత్తనాలు వి నియోగిస్తున్నారు. పత్తి సాగు, రైతుల అవసరాలను అవకాశంగా చేసుకుని విత్తన దందా రాయుళ్లు ముందస్తుగానే విత్తనాలు డంపింగ్ చేసుకుంటున్నారు. ఏటా ప్రభుత్వం నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాలు నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా విత్తన విక్రయాలు సాగుతునే ఉన్నాయి. లూజ్‌గా కిలోల చొప్పున విత్తనాలను బస్తాలతో పాటు ఆకర్షనీయమైన ప్యాకింగ్లలో నాణ్యత విత్తనాలు పోలిన మాదిరి ప్యాకెట్లు సైతం చేరుతున్నాయి. కిలోకు రూ.1000 నుంచి రూ.1500 వరకు కొనుగోలు చేసి రైతులకు కిలోకు రూ.2,500 నుంచి రూ.3 వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఇందులో కొన్ని దిగుబడి వస్తుండగా ఎక్కువశాతం రైతులు నాణ్యత లేక నష్టపోతున్నారు. మోసపోయిన రైతులు బయటకు చెప్పుకుంటే కేసులు నమోదవుతాయని భావించి మిన్నకుండి పోతున్నారు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లోనే ఆంధ్రప్రదేశ్ నుంచి మంచిర్యాల, మందమర్రి, భీమిని, కన్నెపల్లి, బెల్లంపల్లి, తాండూర్ ప్రాంతాల్లో నిల్వ చేసినట్లు సమాచారం. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేస్తే రైతులు మోసపోకుండా ఉంటుంది. మూడేళ్లలో 3,975 క్వింటాళ్లు మూడేళ్ల కాలంలో 18 చోట్ల ఈ నకిలీ విత్తనాలు పట్టుబడగా రూ.95,04,4,000 విలువ గల 3,975 క్వింటాళ్ల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని 35 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది దిగుబడి వచ్చిన పంట విక్రయిస్తున్న సమయంలో నకి లీ కేటుగాళ్లు ముందస్తుగానే సరఫరా చేస్తే తనిఖీలు ఉండవని భావించి విత్తన దందాకు తెరలేపారు. ఈఏడాది ఇప్పటి వరకు ఆరుచోట్ల రూ.27,35,000 విలువ గల 1,126 క్వింటాళ్ల విత్తనాలు స్వాధీనం చేసుకుని 34 మందిపై కేసులు నమోదు చేశారు. కొంతమంది బడా వ్యాపారులు కిందిస్థాయిలో ఏజెంట్లను నియమించుకుని రైతుల చెంతకు చేరవేస్తున్నారు. పట్టుబడిన సమయంలో కిందిస్థాయి వ్యక్తులపైనే కేసులు నమోదు చేస్తుండడంతో ఆసలు సూత్రధారి తప్పించుకోవడం విమర్శలకు తావిస్తోంది. కొన్నేళ్లుగా అక్రమ దందా సాగిస్తున్న వ్యక్తులు ఇది మాకు ‘మామూలే’ అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో పూర్తిస్థాయిలో అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయడం లేదు. ఈ విత్తన సాగులో కలుపు నియంత్రణకు ఉపయోగించే గ్లైఫోసెట్ గడ్డినివారణ మందు వాడకం పెరిగిపోతోంది. దీని ద్వారా పర్యావరణం, భూసారం దెబ్బతినడంతో పాటు రైతుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విత్తనాలను నిషేధించాయి. సంబంధిత శాఖ అధికారులు నిషేధిత పత్తి విత్తనాలు రైతులకు చేరకుండా చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది మార్చిలో పట్టుబడిన విత్తనాలు ఈ నెల 2న దహెగాం మండలం అత్తిని నుంచి భీమిని మండలం వడాల గ్రామానికి 3 క్వింటాళ్ల (రూ.6.85 లక్షల విలువై న) నిషేధిత పత్తి విత్తనాలు తరలిస్తుండగా మల్లిడి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు పట్టుకుని ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. ఈనెల 9న కన్నెపల్లి మండలం సుర్జపూర్లో రూ.3.50 లక్షల విలువైన 140 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని ముగ్గు రు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈనెల 14న మంచిర్యాల రైల్వేస్టేషన్ స మీపంలో ఆటోలో తరలిస్తున్న రూ.1.70 లక్షల విలువైన 100 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని ఎనిమిదిమందిపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 23న తాండూర్ మండలం అచ్చులాపూర్, గోపాల్‌నగర్ సమీపంలో డీసీ ఎం వ్యాన్ నుంచి కారులోకి డంపు చేస్తు న్న రూ.6,17,500 విలువైన 247 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని తొ మ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 23న కాసిపేట మండలం కొండాపూర్‌లో రూ.1,25,000 విలువైన 50 కి లోల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకు ని ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. ఈనెల 26న బుధవారం కాసిపేట మండలంలోని దేవాపూర్‌లో రూ.7,87,500 విలువైన 315 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు.మూడేళ్లలో పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాలు, నమోదైన కేసులుసంవత్సరం కేసులు క్వింటాళ్లు విలువ(రూ.ల్లో) పట్టుబడిన వ్యక్తులు2022–23 5 1,193 34,50,000 10 2023–24 2 1,310 18,10,000 08 2024–25 11 1,562.5 42,44,400 17 2025–26 6 1,126 27,35,000 34 కఠిన చర్యలు తప్పవునిషేధిత పత్తి విత్తనా లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరుచోట్ల 27.35 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. 34 మందిపై కేసులు నమోదు చేశాం. వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు ని ర్వహిస్తున్నారు. ఈ విత్తనాల వల్ల జరిగే నష్టాలను రైతులకు వివరిస్తున్నాం. – కల్పన, జిల్లా వ్యవసాయాధికారి, మంచిర్యాల -
కోటిమంది ఖాతాదారులకు సేవలు
భీమారం/కాసిపేట: తెలంగాణ వ్యాప్తంగా కోటి మంది బ్యాంకు ఖాతాదారులకు సేవలు అందిస్తున్నామని టీజీబీ చైర్పర్సన్ శోభ అన్నారు. గురువారం భీమారం, కాసిపేట మండలం కొండపూర్ యాపలో బ్యాంకు బ్రాంచిలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలు అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వివిధ రకాల రుణాలు అందిస్తున్నామని, ఫిక్స్డ్ డిపాజిట్లపై అన్ని బ్యాంకుల కన్నా అధికంగా వడ్డీ ఇస్తున్నామని తెలిపారు. మంచిర్యాల రీజనల్ మేనేజర్ మురళీధర్‌రావు, చీఫ్ మేనేజర్ రవికిషోర్, భీమారం బ్రాంచి మేనేజర్ సతీష్ పాల్గొన్నారు. -
సమర్థవంతంగా ‘మహిళా శక్తి’ అమలు
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాలటౌన్: మహిళల ఆర్థిక స్వాలంబన దిశగా ఇందిరా మహిళా శక్తి పథకం సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, మెప్మా పీడీ మారుతిప్రసాద్లతో కలిసి ఏపీఎంలు, మండల సమాఖ్య నాయకులు, కార్యదర్శులు, స భ్యులు, ఆర్పీలు, సీవోలు, టీఎంసీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బ లోపేతం చేసేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపా రు. సూక్ష్మ పరిశ్రమల క్రింద 5,684 యూనిట్లు ప్రతి పాదించగా 90శాతం గ్రౌండింగ్ చేసినట్లు తెలిపా రు. మొబైల్‌ఫిష్, మిల్క్పార్లర్లు, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం విభాగాల్లో ప్రోత్సహిస్తున్నట్లు తెలి పారు. అనంతరం సీ్త్రనిధి పథకంలో మందమర్రి టౌన్ లెవల్ ఫెడరేషన్ సంస్థ రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానంలో నిలిచినందున సంస్థ సభ్యులకు అవార్డు అందజేశారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి మంచిర్యాలఅర్బన్: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో అన్నిరంగాల్లో రాణించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా విద్యాశాఖ, అలింకో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. అలింకో సంస్థ ద్వారా రూ. 17.50లక్షల విలువైన వినికిడి యంత్రాలు, ట్రైసైకిళ్లు, బ్రెయిలీ కిట్లు, సీపీ చైర్లు మొత్తం 215 ఉపకరణాలు 85 మందికి అందజేశారు. కార్యక్రమంలో డీఈవో యాదయ్య, ఎంఈవో మాలవీదేవి, సెక్టోరల్ అధికారులు చౌదరి, సత్యనారాయణమూర్తి, యశోధర, శ్రీనివాస్, ఏఎస్వో రాజుకుమార్, డీఎస్వో మధుబాబు, అలింకో ప్రతినిధులు డాక్టర్ రంజిత్‌రెడ్డి, రిషిగుప్తా, ఐఈఆర్పీలు పాల్గొన్నారు. -
హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని రెస్టారెంట్లు, హోటళ్లపై గురువారం మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. పరిశుభ్రత పాటించని హయాన్ బార్, రెస్టారెంట్, సితార గ్రాండ్ హోటల్‌కు రూ.500 జరిమానా విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రత పాటించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలన్నారు. నిబంధనలు పాటించని హోటళ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ రాజ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. చింతగూడ ఆలయంలో చోరీజన్నారం: మండలంలోని చింతగూడ శ్రీ లక్ష్మీదేవి ఆలయంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించినట్లు ఆలయ ఈవో ముక్త రవి తెలిపారు. గురువారం ఉదయం అర్చకుడు ఆలయానికి వచ్చేసరికి గేటు తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా అమ్మవారి వెండి ముక్కుపుడక కనిపించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజవర్థన్ తెలిపారు. -
నేడు షబ్–ఏ– ఖదర్
● ఖురాన్ అవతరణ దినం ● మహాత్తరమైన రాత్రిగా గుర్తింపు నెన్నెల: రంజాన్ మాసంలో ఇస్లాం చర్రితలోనే ముఖ్యమైన రాత్రి. ఈ మాసం ప్రారంభమై గురువారానికి 26వ రోజున అల్లా అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్ అవతరించింది. దీన్ని షబ్–ఏ–ఖదర్‌గా పిలుస్తారు. ఈ గ్రంథం మార్గనిర్ధేశం చేస్తుందని నెన్నెల జామా మసీదు మౌలానా షగీర్ అహ్మద్ బర్కద్‌వా చెప్పారు. ఖురాన్ సన్మార్గ బాటలో పయనించడానికి ఉపకరిస్తుందని వివరించారు. ఖురాన్ పఠనం చేసిన వారి సంఖ్య భారీగా ఉండటం దైవ సంకల్పానికి నిదర్శమన్నారు. పదేళ్ల వయస్సు చిన్నారులు దీన్ని పఠించడం విశేషమన్నారు. చరిత్ర పుఠల్లో ఏ పుస్తకాలను తిరగేసినా కాలానుగుణంగా మార్పు చెందుతాయని, అదే ఖురాన్ అవతరించి సుమారు 1450 ఏళ్లు దాటుతున్నా అక్షరం కూడా మార్పు చెందలేదన్నారు. ఖురాన్లో 30 ఫారాలు(పాఠాలు), 114 సూరాలు, 6666 వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. అశాంతి రాజ్యమేలిన నేపథ్యం.. అరబ్బుల హయాంలో అశాంతి రాజ్యమేలిన నేపథ్యమే దివ్య ఖురాన్ అవతరణకు మూలమని మౌలానాన షగీర్ అహ్మద్ బర్కద్‌వా తెలిపారు. అప్పట్లో ఎక్కడ కూడా ప్రశాంత వాతావరణం కనిపించేది కాదని, ఒకరి హక్కులు మరొకరు కాలరాస్తూ పరస్పరం దూషించుకుంటూ దాడులకు పాల్పడుతూ గడిపేవారని వివరించారు. ఈ నేరమయ సంస్కతిని చూసి మహ్మద్ ప్రవక్త చలించిపోయి మానసిక ఉపశమనం కోసం ‘ఘారెహిర’ అనే గుహలో ఒంటరిగా కూర్చొని అల్లాను స్మరించుకునేవారని, ఒకరోజు అల్లాహ్ తన దూత జిబ్రాయిల్ ద్వారా మహ్మద్ ప్రవక్తకు చేరవేసిన సందేశం చదివాక ప్రవక్త మనస్సు ఆలోచనతో ప్రపంచ గమనాన్ని చుట్టి వచ్చిందన్నారు. ఆ సందేశాలకు విస్తత ప్రచారం కలిగిస్తే ప్రజలకు చెడు నుంచి విముక్తి కలిగించి సన్మార్గంలో నడపొచ్చని ఆయన ప్రగాఢంగా విశ్వసించారని చెప్పారు. వాటి నుంచి అల్లాహ్ తన సందేశం వినిపించేవారని, అలా నలబై ఏటా నుంచి దశల వారీగా 30 ఏళ్ల పాటు అల్లాహ్ అందించిన భిన్న సందేశాల సమాహారమే ఖురాన్ మహాగ్రంథం. రంజాన్ మాసంలోని 26 నాడు అవతరించిందని వివరించారు. ఖురాన్ చదవడానికి ముందు విధిగా వజూ చేసి ఆపై ఖురాన్‌ను చేత పట్టుకుని ఖిబ్లా(పడమర) వైపు తిరిగి దైవనామస్మరణతో చదవాలని వివరించారు. వెయ్యి నెలల పుణ్యఫలం పవిత్ర గ్రంథం ఖురాన్‌ను ఈ రాత్రే అల్లాహ్ ప్రసాదించారని దీన్ని పవిత్రమైన రాత్రిగా పాటిస్తాం. వెయ్యినెలల రాత్రులకంటే ఎంతో ఘనమైంది. ఈ రాత్రి జాగరణ చేస్తూ నమాజ్‌ను ఆచరిస్తుంటాం. దివ్య ఖురాన్‌ను పఠిస్తాం. రాత్రి జాగరణతో ఫుణ్యఫలాలు లభిస్తాయనే విశ్వాసం ముస్లిం సోదరుల్లోలో ఉంది. –షగీర్ అహ్మద్ బర్కద్‌వా, మత గురువు, నెన్నెల -
రుణాల రికవరీలో ఆదర్శం
మందమర్రిరూరల్: రుణాల రికవరీలో ఆదర్శంగా నిలిచిన మందమర్రి సీ్త్రనిధికి రాష్ట్రస్థాయి ఉత్త మ అవార్డు దక్కింది. మందమర్రి మున్సిపాలిటీలో సీ్త్రనిధి ఆధ్వర్యంలో 2023–24 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.5 కోట్ల రుణాలు మంజూరు చేయడమే కాకుండా 98 శాతం రికవరీ చేసి రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచింది. బుధవారం ఆల్ ఇండియా ఇ నిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరి యమ్ (గచ్చిబౌలి)లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సీ్త్రనిధి మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్ చేతుల మీదుగా మందమర్రి మెప్మా టీఎంసీ రఘురాం, పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు మౌనిక, అసిస్టెంట్ మేనేజర్ మమత అవార్డు అందుకున్నా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందమర్రి మున్సిపాలిటీకి అవార్డు రావడానికి సహకరించిన మున్సిపల్ కమిషనర్ రాజలింగు, మహిళా సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
రోడ్ల వెంట మొక్కల పెంపకం
● అటవీశాఖ సీసీఎఫ్ శరవణన్తాంసి: హరితనిధిలో భాగంగా జిల్లావ్యాప్తంగా పలు రోడ్ల వెంట పచ్చదనం పెంచేందుకు మొక్కల పెంపకం చేపడుతున్నట్లు అటవీశాఖ సీసీఎఫ్ శరవణన్ తెలిపారు. తాంసి అటవీశాఖ సెక్షన్ పరిధిలో అంతరాష్ట్ర రోడ్డుకు ఇరువైపులా నాటిన అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శరవణన్ తనిఖీ చేశారు. మండలంలోని హస్నాపూర్ వద్ద నాటిన మొక్కలను డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్‌తో కలిసి పరిశీలించారు. నాటిన మొక్కల వివరాలు, పెంపకం, రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా శరవణన్ మాట్లాడుతూ హరిత నిధిలో భాగంగా జిల్లాలో 87 కి.మీ మేర రోడ్లు ఇరువైపులా మొక్కలు నాటినట్లు తెలిపారు. మొక్కల సంరక్షణ కోసం ట్రీగార్డులు ఏర్పాటు చేశామన్నారు. రేంజ్ అఫీసర్ గులాబ్, సెక్షన్ అధికారి అహ్మద్ ఖాన్,బీట్ ఆఫీసర్ సాయికుమార్ ఉన్నారు. నాటిన మొక్కలు ఎండిపోకుండా చూడాలి తలమడుగు: అంతర్రాష్ట్ర రహదారి ఇరువైపులా నాటిన మొక్కలు ఎండిపోకుండా చూడాలని అటవీ శాఖ సీసీఎఫ్ శరవణన్ అన్నారు. మండలంలోని సుంకిడి, లింగి, కుచులాపూర్, లక్ష్మింపూర్ గ్రామాల్లోని అంతర్రాష్ట్ర రహదారి ఇరువైపులా నాటిన మొక్కలను బుధవారం పరిశీలించారు. ఆంతర్రాష్ట్ర రహదారి పొడువునాటిన మొక్కలు వేసవిలో ఎండిపోకుండా నీటిని అందించాలన్నారు. మొక్కలను పశువులు తినకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం లింగి గ్రామంలోని వృద్ధాశ్రమంలో మొక్కలు నాటారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్, డీఆర్ఓ ప్రమోద్‌కుమార్ ఉన్నారు. -
315 కిలోల నకిలీ పత్తివిత్తనాలు పట్టివేత
మందమర్రిరూరల్: 315 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు. మందమర్రి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ శశిధర్‌రెడ్డితో కలిసి ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఇటీవల దేవాపూర్ పీఎస్‌లో నమోదైన నకిలీ పత్తినాల కేసులో గుడిమల్ల చంద్రయ్య, కూనారపు బాలకృష్ణ, మహమ్మద్ సాహెబ్ జానీ, ముల్కల్ల సుధీర్, గోవిందుల శంకర్‌ను అదుపులో తీసుకున్నారు. అదే కేసులో మరో నిందితుడు అబ్దుల్ రజాక్ పరారీలో ఉన్నాడు. పోలీసులు ప్రత్యేక టీమ్‌లుగా ఏర్పడి గాలించగా బుధవారం మందమర్రిలో పట్టుబడ్డాడు. అతన్ని విచారించగా గుజరాత్ రాష్ట్రం నుంచి నకిలీ పత్తి విత్తనాలు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు తెలిపాడు. పట్టణానికి చెందిన కాశిపాక తిరుపతి సహాయంతో పొన్నారానికి చెందిన బొలిశెట్టి జనార్దన్‌కు విక్రయించినట్లు ఒప్పుకున్నాడు. వారు అందించిన సమాచారంతో దేవాపూర్‌లోని చింతగూడ సల్పల వాగు పక్కన దాచిన 315 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. వీటి విలువ రూ.7,87,500 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. కాసిపేట ఏవో ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో పంచనామా నిర్వహించి అబ్దుల్ రజాక్, కాశిపాక తిరుపతి, బొలిశెట్టి జనార్దన్‌లపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో మందమర్రి ఎస్సై రాజశేఖర్, దేవాపూర్ ఎస్సై అంజనేయులు పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో భూ సమస్యల పరి ష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని క లెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీపీ భాస్కర్‌తో కలిసి మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు, బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలు, తహసీల్దార్లు, పోలీసు అధి కారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి క్షేత్రస్థాయిలో విచా రించాలని, కనీసం 15 రోజులు, గరిష్టంగా 21రో జులుగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకో వాలన్నారు. కోర్టులో పరిష్కారమయ్యే సమస్యల పై అర్జీదారులకు అవగాహన కల్పించి తగు సూచనలు చేయాలన్నారు. డివిజన్ స్థాయిలో వచ్చిన దరఖాస్తులను మండల స్థాయి కమిటీకి సిఫారసు చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాస్థాయి కమి టీలో కలెక్టర్, డీసీపీ పరిధిలో మండల, సబ్ డివిజన్ స్థాయి దరఖాస్తుల ప్రక్రియపై సమీక్షించి దరఖాస్తుల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. డీసీపీ మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాలో సింగరేణి, రెవెన్యూకు సంబంధించిన భూ సమస్యలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రక్తదానానికి ముందుకు రావాలికాసిపేట: రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రా వాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమగూడెం, బెల్లంపల్లి జాతీయ రహదారి పక్కనున్న కల్వ రీ మినిస్ట్రీ చర్చీలో ప్రవీణ్, షారోన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రక్తదాన శిబిరాలతో సికిల్‌సెల్, తలసేమి యా వ్యాధిగ్రస్తుల ప్రాణాలు కాపాడటం జరుగుతుందన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆస్పత్రి, నిత్యాన్నదానం ఏర్పాటు సిస్టర్ షారోన్ మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పేదల ఆకలి తీర్చేందుకు నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, ఏసీపీ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.● కలెక్టర్ కుమార్ దీపక్ -
ఇవేం గ్లౌజ్‌లు!
● కొద్దిరోజులుగా నాసిరకమైనవి పంపిణీ ● చిరిగిపోతున్నా పట్టింపేది ● నలిగిపోతున్న చేతులు ● ఇబ్బంది పడుతున్న కార్మికులు నాణ్యమైనవి తెప్పిస్తాం గ్లౌజ్‌లు నాసిరకంగా వస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. సరఫరా చేసే కంపెనీతో మాట్లాడి నాణ్యమైనవి తెప్పిస్తాం. – శ్రీధర్‌రావు, ఏఎస్ఓ, శ్రీరాంపూర్ శ్రీరాంపూర్: నాసిరకం చేతిగ్లౌజ్లతో కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గనుల్లో పని చేసేటప్పుడు చేతులకు గాయాలు కాకుండా వీటిని ఉపయోగిస్తారు. గతంలో నాణ్యమైనవి ఇచ్చినప్పటికి కొద్దిరోజులుగా నాసిరకంగా ఉంటున్నాయని పలువురు కార్మికులు పేర్కొంటున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనులు, డిపార్టుమెంట్లలో కార్మికులు వినియోగిస్తున్న గ్లౌజ్‌లు కొన్నిరోజులకే చిరిగిపోతున్నాయి. ప్రతీ డిజిగ్నేషన్ కార్మికుడు పని చేసేటప్పుడు చేతులు నలుగకుండా, గాయాలు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మూడేళ్లుగా చేతిగ్లౌజ్‌లు ఇస్తున్నాయి. ఎలక్ట్రీకల్ పనులు, భారీ యంత్రాలు, పనిముట్లతో పనిచేసేవారికి, ట్రామర్లు, లైన్మెన్లు, ఇంజినీరింగ్ డిపార్టుమెంట్, సివిల్ డిపార్టుమెంట్ ఉద్యోగులకు వేర్వేరు క్వాలిటీలతో కూడిన గ్లౌజ్‌లు ఇస్తారు. ఇందులో ఎక్కువ మంది ఉపయోగించే రెగ్యులర్ మోడల్ గ్లౌజ్‌లు నాసిరకంగా వస్తున్నాయి. వీటి టెండర్‌ను పొందిన సదరు కంపెనీ నాసిరకంవి సరఫరా చేస్తూ కంపెనీకి నష్టం చేస్తుందని కార్మికులు పేర్కొంటున్నారు. గతంలో ఇచ్చిన గ్లౌజ్‌లు కనీసం మూడునెలల వరకు పనిచేసేవని ఇప్పుడు నెల రోజులకే చిరిగిపోతున్నాయని వాపోతున్నారు. అధికారుల దృష్టికి.. జనవరిలో జరిగిన ఏరియా స్థాయి స్ట్రక్షరల్ మీటింగ్‌లో ఈ సమస్యను గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు అధికారుల దృష్టికి తెచ్చారు. నాసిరకంగా వస్తున్నాయని అధికారుల అంగీకరించారు. అయితే గ్లౌజ్‌లు సరఫరా చేస్తున్న కంపెనీ మార్కెట్లోనే టాప్ కంపెనీ అని వారివద్ద నుంచి కూడా ఇలాంటివి సరఫరా కావడంపై విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే ఈ నాసిరకం గ్లౌజ్‌లు చిరిగిపోయిన వెంటనే వాటి స్థానంలో కనీసం కొత్తది ఇవ్వాల్సి ఉండగా కొందరు గనుల అధికారులు ఇవ్వకుండా స్టాక్ లేదంటూ వాటితోనే పని చేయాలని ఒత్తిడి తెస్తున్నారని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు తెలిపారు. స్టోర్స్‌లలో స్టాక్ ఉన్న కూడా కొత్తవి ఇవ్వకపోవడం సరికాదంటున్నారు. ఇప్పటికై నా యజమాన్యం స్పందించి నాణ్యమైన గ్లౌజ్‌లు తెప్పించి ఇవ్వాలని కోరుతున్నారు. -
ఆర్జీయూకేటీ వీసీకి అరుదైన గౌరవం
బాసర: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విధులు నిర్వహిస్తున్న వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్‌కు బిజినెస్ టాక్జ్ మ్యాగజైన్లో అరుదైన గౌరవం దక్కింది. తాజా ఎడిషన్–140ని వెల్లడించగా.. అందులో భారతదేశ భవిష్యత్‌ను రూపొందించడంలో నాణ్యమైన విద్య, ఆవిష్కరణ, వ్యవస్థాపకత ప్రాముఖ్యతపై ప్రొఫెసర్ గోవర్ధన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీసీ గోవర్ధన్‌కు ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధరన్, ఏవో రణధీర్, అసోసియేట్ డీన్స్ డాక్టర్ విఠల్, విభాగాల అధిపతులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. అధ్యాపకులతో వీసీ సమీక్ష ఆర్జీయూకేటీ అధ్యాపకులతో ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అధ్యక్షతన బుధ వారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి వీసీ మాట్లాడుతూ నాక్ అక్రిడిటేషన్‌తో నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇన్స్టిట్యూషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ (ఐయూఏసీ), సెల్ఫ్ స్టడీ రిపోర్ట్స్ (ఎస్ఎస్ఆర్), వర్క్‌షాప్‌లు, సెమినార్లు, సమావేశాలు, అధ్యాపక విజయాలు, ప్రాజెక్ట్ వర్క్‌లను సమన్వయం చేయాలన్నారు. టెక్ ఫెస్ట్, స్పోర్ట్స్ డే, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంలో అధ్యాపకులు, కన్వీనర్లు సహకారం అందించారన్నారు. సమావేశంలో ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీ దర్శన్, ఎవో రణధీర్, అసోసియేట్ డీన్లు తదితరులు పాల్గొన్నారు. -
● ఆస్తిపన్ను వడ్డీలో 90శాతం రాయితీ ● ఓటీఎస్‌ను ప్రకటించిన ప్రభుత్వం ● పాత బకాయిలు వసూలయ్యేనా? ● ముంచుకొస్తున్న చెల్లింపు గడువు
లక్ష్య సాధనలో సింగరేణి కీలకంనస్పూర్: నగర పాలక ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్య సాధనలో సింగరేణి సంస్థ చెల్లింపే కీలకం కా నుంది. నస్పూర్ పరిధిలోని గనులు, క్వార్టర్లు, కార్యాలయాలు, ఫంక్షన్‌హాళ్లు, ఓసీపీలు, పాఠశాలలు, కళాశాలలు, సీవేజ్ ప్లాంటు, తదితర సింగరేణి ఆస్తులు మొత్తం 1,591 అసెస్మెంట్లు ఉ న్నాయి. వీటికి మున్సిపల్ అధికారులు రూ. 1.30 లక్షల ఆస్తిపన్ను విధిస్తుండగా సింగరేణి సంస్థ రూ.50 లక్షలు చెల్లిస్తోంది. కాగా నస్పూర్, తాళ్లపల్లి, సింగాపూర్, తీగల్పహడ్ను కలుపుకుని 2018 ఆగస్టులో నస్పూర్ మున్సిపాలిటీగా ఏర్పడింది. అనంతరం నూతనంగా ఏర్పడిన భవనాలకు మున్సిపాలిటీ లెక్కల ప్రకారం ఆస్తిపన్ను అమలు చేసేందుకు 2022లో భువన్ సర్వే చేశారు. సింగరేణి ఆస్తులకు సంబంధించి ఏడాదికి రూ.1.30 లక్షలుగా నిర్ధారించారు. సింగరేణి అధికారులు గతంలో మాదిరిగానే రూ.50 లక్షలు చెల్లిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ నగర పాలకంగా మారిన నేపధ్యంలో సింగరేణి సంస్థ రీ సర్వేకు అనుకూలంగా ఆస్తిపన్ను చెల్లిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. సింగరేణి సంస్థ తమకు నిర్ధేశించిన ఆస్తిపన్ను చెల్లిస్తేనే నగర పాలక సంస్థ లక్ష్యాన్ని చేరుతుంది. ఇదే విషయమై కమిషనర్ శివాజీని సంప్రదించగా సింగరేణి సంస్థ నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్తిపన్ను వివరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారన్నారు.మంచిర్యాలటౌన్: జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు, జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పన్ను వసూళ్ల కోసం అధికారులు, సిబ్బంది పడుతున్న తిప్పలు అంతా ఇంతా కావు. ఏటా ఫిబ్రవరి నుంచి మార్చి 31వ తేదీ వరకు అధికారులు, ఉద్యోగులు పన్ను వసూళ్ల కోసం బృందాలుగా ఏర్పడి తిరుగుతున్నా అంతంత మాత్రంగానే వసూలవుతున్నాయి. ఆస్తిపన్ను సక్రమంగా వసూలైతే కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయి. పన్ను బకాయిదారులకు రెడ్ నోటీసులను జారీ చేసి, ఆస్తులు జప్తు చేస్తామని చెప్పినా స్పందన రావడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను బకాయిలు చెల్లించిన వారికి 90 శాతం వడ్డీ మాఫీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఈ నెల 25న ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే ఉండేదని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇవే ఉత్తర్వులు మార్చి మొదటి వారంలోనే విడుదల చేసి ఉంటే పన్ను వసూళ్లు మరింత పెరిగేవి. కానీ ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉండడం.. అందులో ఉగాది, రంజాన్ పండుగలు రావడం పన్ను చెల్లింపులకు ఆటంకంగా మారనుంది. రెడ్ నోటీసులు ఇస్తున్నా ... ఆస్తి పన్ను చెల్లించాలని మున్సిపల్ అధికారులు పలు విధాలుగా కోరుతున్నా ఏళ్ల తరబడి పన్ను చెల్లించకుండానే కొందరు కాలం వెల్లదీస్తున్నారు. దీంతో కార్పొరేషన్, మున్సిపాలిటీలకు రావాల్సిన ఆదాయం సమకూరక పోవడంతో అభివృద్ధితో పాటు సిబ్బంది, కార్మికులకు వేతనాలు సైతం ఇవ్వలేని పరిస్థితి నెలకొంటోంది. జిల్లాలో గతంలో మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి మున్సిపాలిటీలు ఉండగా ఐదేళ్ల్ల క్రితం నస్పూరు, క్యాతన్‌పల్లి, లక్సెట్టిపేట్, చెన్నూరు కొత్తగా ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే సిబ్బంది వేతనాలు చెల్లిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో మంచిర్యాల, నస్పూరు మున్సిపాలిటీలతో పాటు, హాజీపూర్ మండలంలోని 8 గ్రామాలను కలిపి మంచిర్యాల కార్పొరేషన్‌గా మార్చారు. దీంతో పన్ను డిమాండ్ పెరగడంతో పన్ను వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కనీసం 50 శాతం కూడా వసూలు కాకపోవడంతో మిగిలిన ఐదు రోజుల్లో అనుకున్న లక్ష్యం చేరడం కష్టమే. అధికారులు ఇప్పటికే బకాయిదారులకు రెడ్ నోటీసులు ఇచ్చి పది రోజుల్లో చెల్లించాలని చెబుతున్నా స్పందన అంతంతే. చట్ట ప్రకారమే పన్ను వసూళ్లుమంచిర్యాలటౌన్: మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో పన్ను వసూలుకు టీంలను ఏర్పా టు చేసి పంపిస్తున్నామని, బకాయిదారులకు రెడ్ నోటీసులు ఇచ్చి గడువులోపు చెల్లించకుంటే చట్ట ప్రకారమే వసూలు చేస్తున్నామని కమిషనర్ శివాజీ అన్నారు. బుధవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వందఫీట్ల రోడ్డులో ఓ ఇంటి యజమాని కొన్నేళ్లుగా పన్ను చెల్లించడం లేదని, సిబ్బంది వెళ్లి అడిగితే దురుసుగా ప్రవర్తించారని చేస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. ప్రభుత్వం బకాయి వడ్డీపై 90 శాతం మాఫీ ప్రకటించిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్చి 31లోగా పన్నులు చెల్లించాలని కోరారు. -
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
మంచిర్యాలటౌన్/మందమర్రిరూరల్: మందమర్రికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి పళ్లెం రాజలింగు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యాడు. గోవాలో ఇటీవల జరిగిన 47వ యోనెక్స్ సన్‌రైజ్ ఆలిండియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకం సాధించాడు. 75 సంవత్సరాల విభాగంలో సింగిల్స్, డబుల్స్‌లో వరంగల్ క్రీడాకారుడు నర్సయ్యతో కలిసి పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించి, అంతర్జాతీయ పోటీలకు ఎంపికై న రాజలింగును బుధవారం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముఖేశ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సుధాకర్, జాయింట్ సెక్రటరీ రమేశ్ రెడ్డి, అడ్వైజర్ కృష్ణ, సీనియర్ క్రీడాకారుడు మురళీ అభినందించారు. ఈ సందర్భంగా రాజలింగు మాట్లాడుతూ ఽథాయిలాండ్లో నిర్వహించే అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యానని తెలిపారు. గతంలో రెండుసార్లు ఈ పోటీలకు ఎంపికయ్యానని ఆర్థిక స్థోమత లేక పోటీల్లో పాల్గొనలేదన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తే రాష్ట్రం నుంచి పతకం సాధిస్తాననిఽ తెలిపారు. -
కూతురిపై అసభ్యంగా ప్రవర్తించిన తండ్రి
● పోక్సో కేసు నమోదు ● మందమర్రిలో ఘటన మందమర్రిరూరల్: కూతురిపై అసభ్యంగా ప్రవర్తించిన తండ్రిపై పోక్సో కేసు నమోదైంది. పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుస్టేషన్లో ఎస్సై రాజశేఖర్ ఈమేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని యాపల్ ప్రాంతానికి చెందిన ఆకుదారి సతీశ్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకా లంగా భార్యతో గొడవలు జరుగుతున్నాయి. పెద్ద కూతురు (15) హాస్టల్లో చదువుతుండగా పోచమ్మకు చేసుకునేది ఉందని మంగళవారం తీసుకువచ్చాడు. సాయంత్రం మద్యం తాగి ఇంటికి చేరుకుని కూతురుు తనకు పుట్టలేదని అనుమానంతో ఆమైపె రాత్రి ఆసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యను గాయపరిచాడు. భార్య ఫిర్యాదుతో బుధవారం పోక్సో కేసు న మోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. బాధితురాలిని కౌన్సెలింగ్ నిమి త్తం భరోసా కేంద్రానికి పంపినట్లు పేర్కొన్నారు. -
జిల్లాలోని మున్సిపాలిటీల్లో పన్ను వసూళ్ల తీరు (రూ.లలో)
మున్సిపాలిటీ మొత్తం ఇళ్లు లక్ష్యం(రూ.కోట్లలో) వసూళ్లు(రూ.కోట్లలో) బకాయిలు మంచిర్యాల కార్పొరేషన్ 48,920 26.88 13 13.88 కోట్లు క్యాతన్‌పల్లి 12,159 4 2.57 1.43 కోట్లు బెల్లంపల్లి 15,408 3.80 2.10 1.70 కోట్లు మందమర్రి 13,3682.04 1.60 44 లక్షలు లక్సెట్టిపేట్ 5,988 1.69 1.35 34 లక్షలు చెన్నూరు 7,236 2.86 1.60 1.26 కోట్లు -
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
ఇంద్రవెల్లి: మండలంలోని బిక్కుతాండ గ్రామంలో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకులు, ఎస్సై సునీల్ తెలిపిన వివరాలు.. సెడ్మాకి చంద్రకాంత్(28) వ్యవసాయ కూలీ పని చేస్తున్నాడు. భార్య మంజుల గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా చేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు. చంద్రకాంత్ గత 10 రోజులుగా జ్వరం బాధపడుతున్నాడు. మతిస్థిమితం కోల్పోయినట్లు వ్యవహరించడంతో కుటుంబీకులు ముత్నూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో కుదుటపడింది. ఇంటికి వచ్చాక తనకు ఏదో అవుతుందని భయపడేవాడు. రాత్రి ఇంట్లో నిద్రపోయేవాడు కాదు. బుధవారం ఉదయం భార్యను డ్యూటీకి వెళ్లాలని చెప్పి ఆమె వెళ్లాక దూలానికి ఉరేసుకున్నాడు. చుట్టూపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పంచనామ అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైతెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
వాంకిడి: పెళ్లికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై ప్రశాంత్ కథనం ప్రకారం.. మండలంలోని కోమటిగూడ గ్రామానికి చెందిన కొట్రాంగి మహేశ్(29) కొత్త దుబ్బగూడలో బంధువుల పెళ్లికి మంగళవారం వెళ్లాడు. రాత్రి 10 గంటలు దాటాక మహారాష్ట్రలోని భారి గ్రామానికి చెందిన ముండె మానిక్‌రావు ఆటోలో తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఆటో ప్రమాదానికి గురైంది. గ్రామ సమీపంలోని రహదారిపై మూలమలుపు వద్ద ఉన్న స్తంభానికి వేగంగా ఢీకొట్టింది. దీంతో మహేశ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. భయందోళనకు గురైన మానిక్‌రావు బోల్తాపడ్డ ఆటోను లేపుకొని భారీ గ్రామానికి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం స్థానికులు అటుగా వెళ్తుండగా మహేశ్ పడి ఉండటాన్ని గమనించి కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలం వద్ద ఆటో నంబర్, పగిలిన అద్దాలు పడి ఉండటంతో రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన మానిక్‌రావును అదుపులో తీసుకున్నారు. కాగా, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మృతుడికి భార్యతోపాటు నాలుగేళ్ల కూతురు ఉంది. మృతుడి తండ్రి ఆనంద్‌రావు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మావల పోలీసుస్టేషన్ పరిధిలో.. ఆదిలాబాద్‌రూరల్: మావల పోలీసుస్టేషన్ పరిధిలోని పాలిటెక్నిక్ ప్రాంతంలో ఒకరు మృతిచెందినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో స్కావెంజర్‌గా పనిచేస్తున్న గంగన్న (42) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. మంగళవారం ఉదయం పని నిమిత్తం ఇంటి నుంచి బయల్దేరిన ఆయన తిరిగి రాలేదు. మద్యం మత్తులో పాలిటెక్నిక్ శివారు ప్రాంతంలోని చెత్తకుప్పలో ఆయన మృతదేహం లభ్యమైంది. మృతుడి కుమారుడు ఓంకార్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బంగారం గొలుసు చోరీ
ఇచ్చోడ: బస్సు కోసం వేచిచూస్తున్న మహిళకు బైక్‌పై నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మాయమాటలు చెప్పి బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. మండలంలోని బోరిగామకు చెందిన ముల్కల లక్ష్మి బుధవారం ఉదయం 11 గంటలకు గాంధీనగర్ బస్టాప్ వద్ద బస్సు కోసం వేచిచూస్తుంది. ఈక్రమంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె వద్దకు వెళ్లారు. భార్య బంగారం గొలుసు పోయింద ని, అందరి వద్ద చెక్ చేస్తున్నామని ఆమెకు మా యమాటలు చెప్పి నమ్మించారు. మహిళ మెడలో బంగారం గొలుసు తీసి ఇవ్వమని అడిగారు. వారి మాటలు నమ్మి గొలుసు ఇవ్వగానే చూసినట్లుగా నమ్మించి ఒక పేపర్లో చుట్టి ఆమె చేతికి ఇచ్చి పరారయ్యారు. ఆ పేపర్లో చూడగా బంగారు గొలుసు లేకపోవడంతో లబో దిబోమంది. పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. చోరీకి గురైన గొలుసు తులం వరకు ఉంటుందని తెలిపారు. నడుచుకుంటూ వెళ్తున్న మహిళను బెదిరించి.. ఉట్నూర్‌రూరల్: నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఎస్పీ సారూ పిలుస్తున్నారని ముగ్గు రు యువకులు బెదిరించి ఆమె మెడలో బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. మండల కేంద్రంలో బుధవారం పట్టపగలే ఈ ఘటన చో టు చేసుకుంది. ఇంద్రవెల్లి మండలానికి చెందిన ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉమా పని ని మిత్తం బుధవారం ఉట్నూర్‌కి వచ్చింది. స్థానిక జూనియర్ మున్సిఫ్ కోర్టు ముందు నడుచుకుంటూ వెళ్తుండగా ఎస్పీ సారూ పిలుస్తున్నారని గేటు వద్ద ముగ్గురు పోలీసులమని దూరం నుంచి ఐడీ కార్డు చూపెడుతూ బెదిరించారు. మాయమాటలతో ఆమె మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మనోహర్ తెలిపారు. కాగా, ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించారు. బైక్ చోరీఆదిలాబాద్టౌన్: పట్టణంలోని శాంతినగర్‌కాలనీకి చెందిన తబ్రేజ్ పాషా బుధవారం ఉదయం పాల కోసం వెళ్లి పాలు తెచ్చి ఇంటి ముందు బైక్ పార్కింగ్ చేశారు. 10:30 గంటల సమయంలో చూడగా బైక్ కనిపించకుండా పోయింది. చుట్టూపక్కల గాలించగా ఆచూకీ లభించలేదు. దీంతో బాధితుడు వన్‌టౌన్ పో లీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై ఇసాక్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్ బోల్తాసోన్: మండలంలోని గంజాల్ సమీపంలో బుధవారం 44వ జాతీయ రహదారి పక్కన కంటైనర్ బోల్తాపడింది. ఎస్సై గోపి కథనం ప్రకారం.. కంటైనర్ నాగపూర్ నుంచి చెట్ల మూలికలతో హైదరాబాద్ వైపు వెళ్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డ్రైవర్ దుర్గేష్ కుమార్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో కంటైనర్ బోల్తా పడింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పెట్రోకార్ విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మహిళలకు హక్కులపై అవగాహన ఉండాలి
● జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి మంచిర్యాలఅగ్రికల్చర్: సమాజంలో మహిళలు వారికి ఉన్న హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో బేటీ బచావో– బేటీ పడావో మహిళా సాధికారత కేంద్రం, జిల్లా మహిళ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి మెంటల్ హెల్త్ అండ్ లీగల్ రైట్స్ అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ, లోకల్ కంప్లయింట్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు. -
బెటాలియన్‌లో సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్‌లో హైదరాబాద్ కేర్ ఆస్పత్రి సహకారంతో మంగళవారం ఉచిత వైద్య శిబి రం ఏర్పాటు చేశారు. కమాండెంట్ పి.వెంకటరాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. బెటాలియన్ అధికారులకు, సిబ్బందికి, కుటుంబ సభ్యులకు సాధారణ వైద్య పరీక్షలతోపాటు ఎముకలు, కీళ్లు, జీర్ణాశయ, మూత్రపిండాలు తదితన ప్రత్యేక వైద్య చికిత్సలను కేర్ ఆస్పత్రి వైద్యులు ప్రభాకర్, ఆదిత్య, రమీజ్పంజ్వాని పరీక్షలు చేశారు. బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు ఆర్.నాగేశ్వర్రావు, కాళిదాసు, యూనిట్ మెడికల్ అధికారి డాక్టర్ సంతోష్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టు ఉత్పత్తిపై దృష్టిసారించాలి
చెన్నూర్: సెరీ కల్చర్ రైతులు దసలి పట్టు కాయలు పండించడంతోపాటు పట్టు వస్త్రాల ఉత్పత్తిపై దృష్టిసారించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. స్థానిక సెరికల్చర్ కార్యాలయం ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన దసలి పట్టు కృషి మేళాకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రూ.40 లక్షలతో నిర్మించి న సెరికల్చర్ భవనాన్ని ప్రారంభించారు. అనంత రం కృషి మేళాను ప్రారంభించారు. దసలి కాయలు పండించే రైతులు ధర కోసం బాధపడడం మానుకు ని దారం తీసి బట్టలు తయా రు చేస్తే ఆదాయంతో పాటు, ఉపాధి పెరుగుతుందన్నారు. చెన్నూర్ సెరి కల్చర్ పరధిలో రాష్ట్రంలోనే నాణ్యమైన దసలి కాయతోపాటు ఉత్పత్తి సైతం బాగుందన్నారు. అటవీ ప్రాంతంలో మద్ది చెట్ల పెంపకాన్ని చేపడితే రైతులకు మేలు జరుగుతుందని రైతులు కలెక్టర్ దృషికి తీసుకెళ్లారు. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి మద్ది చెట్ల పెంపకంతోపాటు రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దారం తీసి వస్త్రాలు తయారు చేసేలా శిక్షణ ఏర్పా టు చేయిస్తానని తెలిపారు. ప్రతిపాదనలు పంపించాలని సమర్థ్ పథకం ద్వారా నిధులు మంజూరవుతాయన్నారు. అనంతరం డైరెక్టర్ సెంట్రల్ సిల్క్ బోర్డు రాంచికి చెందిన డాక్టర్ ఎన్.బాలజీచౌదరి మాట్లాడుతూ దసలి గుడ్లు పంపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కాయ దిగుబడి పెంచాలన్నా రు. అనంతరం చెన్నూర్ సెరికల్చర్ పరిధిలోని ము ల్కలపేట, ఎదుల్లబంధం గ్రామాలకు చెందిన నలుగురు రైతులకు ప్రశంసాపత్రాలు మెమొంటోలను అందజేశారు. మేళాలో ప్రదర్శించిన దసలి పట్టు చీరలు, శాలువాలు, బునియాది మిషన్, స్పాన్ సిల్క్ మిషన్ దకట్టుకున్నాయి. డాక్టర్ సెల్వకుమార్, సెరికల్చర్ హైదరాబాద్ జేడీ లత, అసిస్టెంట్ సెక్రెటరీ డాక్టర్ మధుకుమార్, ఏడీ రాధోడ్ పార్వతి, డీహెచ్‌ఎస్‌వో కె.అనిత పాల్గొన్నారు.● కలెక్టర్ కుమార్ దీపక్ -
పాలన సౌలభ్యం కోసం ఒకే ఎన్నిక
వేమనపల్లి: పాలన సౌలభ్యం కోసమే వన్ నేషన్, వన్ ఎలక్షన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఒకే దేశం.. ఒకే ఎన్నిక అనే భా వన రాజకీయ, ఆర్థిక పరిపాలన సామర్థ్యాన్ని పెంపొదిస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా ఒకేసా రి లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికలు నిర్వహించడం ద్వారా సమర్థవంతమైన పాలనను అందించవచ్చని తెలిపారు. అధికార యంత్రాంగానికి కూడా సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే సమయం ఆదాతో పాటు పరిపాలనపై దృష్టి పెట్టడానికి అవకా శం ఉంటుందన్నారు. పోలింగ్ శాతం కూడా గణనీయంగా పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ముల్కలపేట, నాగారాం, వేమనపల్లికి చెందిన పలువురు బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో వెంకటేశ్, అజయ్‌కుమార్, శ్రీకాంత్, మొహిద్‌ఖాన్, మధునయ్య, చరణ్‌రాజ్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.