
వివాహితపై లైంగికదాడి
తానూరు: మండలంలోని మొగ్లి గ్రామానికి చెందిన యువకుడు సునీల్‌పై శుక్రవారం అత్యాచారం కేసు నమోదైనట్లు ఏఎస్సై భానుప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత ఉదయం 11 గంటల సమయంలో గ్రామ సమీపంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లింది. అక్కడే ఉన్న సునీల్ ఆమెను వంతెన పైపులోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. గాయాలతో ఇంటికి చేరకున్న బాధితురాలు భర్తకు విషయం తెలిపింది. అనంతరం తానూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్సై తెలిపారు. బాధితురాలిని చికిత్స కోసం భైంసా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
ఆత్మస్థైర్యంతో విధులు నిర్వర్తించాలి
చెన్నూర్: ఆత్మస్థైర్యంతో విధులు నిర్వర్తించాల ని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తని ఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. అనంత రం సంఘ విద్రోహ శక్తులు గుంపులుగా ఏర్ప డి గొడవలు సృష్టించే సమయంలో ఎలా చెదరగొట్టాలో మాక్ ఆపరేషన్ డ్రిల్ నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ.. పోలీసులు ప్రజలతో మమేక మై స్నేహపూర్వక వాతావరణంలో పని చేయాలని సూచించారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ దేవేందర్‌రావు, ఎస్సైలు సుబ్బారావు, వెంకటేశ్వర్‌రావు, సిబ్బంది ఉన్నారు.