
అందాల పోటీలు రద్దు చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రపంచ సుందరి అందాల పోటీలు రద్దు చేయాలని మహిళా, విద్యార్థి, యువజన సాంస్కృతిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముష్క జ్యోతి, అరుణ మాట్లాడుతూ మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే మిస్ వరల్డ్ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింప చేయడానికి అనేక మర్గాలు ఉండగా మహిళలకు అవమానకరమైన, మహిళలను ప్రదర్శన వస్తువుగా చూపే సామ్రాజ్యవాద మార్కెట్‌కు ప్రయోజనాలు చేకూర్చే ఈ పోటీలకు హైదరాబాద్ వేదిక కావడం సిగ్గుమాలిన పని విమర్శించారు.