
నిర్వాసితులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి
జైపూర్: నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే 163 భూనిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, కిష్టాపూర్ వద్ద ఎగ్జిట్ ఇవ్వాలని వరంగల్–విజయవాడ హైవే రోడ్డు భూనిర్వాసితులు శనివారం కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం మా భూములను సైతం హైవే రోడ్డుకు ఇచ్చి మాకు ఉన్న ఉపాధి కోల్పోయామన్నారు. స్థానిక భూనిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇతర ప్రాంతాల వారికి అవకాశం కల్పిస్తే పనులను అడ్డుకుంటామన్నారు. స్థానిక కాంట్రాక్టు పనుల్లో కూడా అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులు సుందిళ్ల మల్లేశ్, రామారావు, రాంరెడ్డి, జనార్దన్‌రెడ్డి, కృష్ణమూర్తి, భూమయ్య, ప్రభాకర్, రాజారాం, సాగర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.