Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jagan Sri Rama Navami Wishes To Telugu People1
తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

సాక్షి, తాడేపల్లి: శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీసీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన అభిలషించారు.ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కల్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ శ్రీసీతారాముల అనుగ్రహం లభించాలని వైఎస్‌ జగన్‌ అభిలషించారు.

Indian Govt changed strategy on Regional Ring Road2
‘రింగు’ 6 వరుసలు!

సాక్షి, హైదరాబాద్‌: రీజినల్‌ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొలిదశలో నాలుగు వరుసలుగానే నిర్మించాలని నిర్ణయించి అందుకు వీలుగా ఇటీవల టెండర్లు పిలిచిన కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పుడు మనసు మార్చుకుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ను ఏకకాలంలో ఆరు వరుసలుగా నిర్మించాలనుకుంటోంది. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు ప్రారంభించి డిజైన్లు మారుస్తోంది. ప్రస్తుతం ప్రతిపాదిత అలైన్‌మెంట్‌ను ఆనుకొని ఉన్న రాష్ట్ర, జాతీయ రహదారులపై రోజుకు ఎన్ని వాహనాలు తిరుగుతు న్నాయో తేల్చే వాహన అధ్యయనం పూర్తిచేసి ఎన్‌హెచ్‌ఏఐ కేంద్రానికి నివేదించనుంది. దీని ఆధా రంగా ఆర్‌ఆర్‌ఆర్‌పై రానున్న 20 ఏళ్లలో వాహనాల సంఖ్య ఏ మేరకు పెరుగుతుందో అంచనా వేసి కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. ఆరు వరుసలుగా రోడ్డు నిర్మాణంతో ప్రధాన క్యారేజ్‌ వే మాత్రమే కాకుండా జాతీయ, రాష్ట్ర రహదారులను క్రాస్‌ చేసే 11 ప్రాంతాల్లో నిర్మించనున్న ఇంటర్‌ఛేంజ్‌ స్ట్రక్చర్ల డిజైన్లను కూడా ఎన్‌హెచ్‌ఏఐ మారుస్తోంది. దీంతో ఇంటర్‌ఛేంజ్‌ కూడళ్లను మరింత భారీగా నిర్మించాల్సి రానుంది. ఫలితంగా రోడ్డు నిర్మాణ వ్యయం సుమారు రూ. 2,500 కోట్ల మేర పెరగనుంది. ఒక్క ఉత్తరభాగం నిర్మాణానికే దాదాపు రూ. 19 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.వెంటనే విస్తరణ పరిస్థితి రావద్దని..ఏడేళ్ల క్రితం రీజినల్‌ రింగురోడ్డును ప్రతిపాదించాక దానిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2008లో ఔటర్‌ రింగురోడ్డు నిర్మించాక హైదరాబాద్‌ రూపు రేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. పురోగతి వేగం పుంజుకుంది. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ అంతకు మించిన ప్రభావం చూపుతుందన్న అంచనా నెలకొంది. దీంతో రీజినల్‌ రింగురోడ్డు అలైన్‌మెంట్‌ను ఆసరాగా చేసుకొని ప్రత్యేక ఆర్థిక మండళ్లు (ఎస్‌ఈజెడ్‌), శాటిలైట్‌ టౌన్‌షిష్‌ల ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అక్కడ పెట్టుబడులకు బహుళ జాతి సంస్థలు ముందుకొస్తున్నాయి. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ జనావాసాలు, సంస్థలు పెరిగి వాహనాల రద్దీ తీవ్రమవుతుందని కేంద్రం తాజాగా అంచనాకొచ్చింది. 2021–22లో ప్రతిపాదిత రింగు ప్రాంతంలోని రోడ్లపై నిత్యం సగటున 14,850 ప్యాసింజర్‌ కార్‌ యూనిట్ల (పీసీయూ) చొప్పున వాహనాలు తిరుగుతున్నాయని తేలింది. తాజాగా ఓ ప్రైవేటు సంస్థతో నిర్వహిస్తున్న అధ్యయనంలో ఇందులో పెరుగుదల నమోదైంది. ఓఆర్‌ఆర్‌ నిర్మాణానికి ముందున్న అంచనాకు.. రోడ్డు నిర్మించాక వాస్తవంగా తిరుగుతున్న వాహనాల సంఖ్యకు పొంతన లేకుండా పోయింది. ఆర్‌ఆర్‌ఆర్‌ను నాలుగు వరుసల్లో నిర్మించి మరో 15–20 ఏళ్ల తర్వాత దాన్ని 8 వరుసలకు విస్తరించాలనేది ఇప్పటివరకు ఉన్న ప్రణాళిక. కానీ కేవలం ఐదేళ్లలోనే ఆర్‌ఆర్‌ఆర్‌పై రద్దీ రెట్టింపై నాలుగు వరుసల రోడ్డు ఇరుకుగా మారి దాన్ని వెంటనే విస్తరించాల్సిన పరిస్థితి వస్తుందన్న అభిప్రాయం నెలకొంది. ఒకవేళ ఐదేళ్లలోనే ఆర్‌ఆర్‌ఆర్‌ను విస్తరించాల్సి వస్తే నిర్మాణ వ్యయం పెరగనుంది. ఈ నేపథ్యంలో ఒకేసారి 6 వరుసలుగా ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మిస్తే కనీసం 15 ఏళ్ల వరకు దాన్ని విస్తరించాల్సిన అవసరం ఉండదన్నది కేంద్రం ఆలోచన. వాహనాల రాకపోకలు 30 వేల పీసీయూల లోపు ఉంటే 4 వరుసలు సరిపోతాయని... అంతకంటే పెరిగితే రోడ్డు ఇరుకు అవుతుందని నిర్ధారిత ప్రమాణాలు చెబుతున్నాయి. కానీ ఐదేళ్లలోనే ఈ సంఖ్య 40 వేలను మించుతుందని కేంద్రం తాజాగా అంచనా వేసింది.రోడ్డు నిర్మాణానికి రూ. 8,800 కోట్లు!నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి రూ. 6,300 కోట్ల వరకు ఖర్చవుతుందని టెండర్‌ నోటిఫికేషన్‌లో ఎన్‌హెచ్‌ఏఐ అంచనా వేసింది. ఇప్పుడు దాన్ని 6 వరుసలుగా నిర్మిస్తే ఆ మొత్తం రూ. 8,800 కోట్ల వరకు అవుతుందని భావిస్తోంది. అయితే ఒకేసారి 8 వరుసలకు సరిపడా భూసేకరణ జరుగుతున్నందున దాని వ్యయంలో ఎలాంటి మార్పు ఉండదు.తొలుత రెండు వరుసలు చాలనుకొని..రీజనల్‌ రింగురోడ్డును ప్రతిపాదించాక నాలుగు వరుసల రోడ్డుకు సరిపడా ట్రాఫిక్‌ ఉండదని భావించి కేంద్రం తొలుత రెండు వరుసలకే పరిమితమవుదామని పేర్కొంది. కానీ కనీసం నాలుగు వరుసలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఒప్పించింది. అయినప్పటికీ ఈ విషయంలో అనుమానం తీరకపోవడంతో ఉత్తర–దక్షిణ భాగాలను ఏకకాలంలో చేపట్టకుండా తొలుత ఉత్తర భాగాన్ని నిర్మించి తర్వాత దక్షిణ భాగం సంగతి చూద్దామనుకుంది. అలాంటి స్థితి నుంచి కేంద్రం ఏకకాలంలో ఆరు వరుసలను నిర్మించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా తాజాగా ఆదేశించడం విశేషం. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ట్రాఫిక్‌ స్టడీ నివేదిక అందాక దాన్ని నిపుణుల సమక్షంలో విశ్లేషించి కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. తుది నిర్ణయం ఆధారంగా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు అప్పటికప్పుడు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే పలిచిన టెండర్లను త్వరలో తెరిచి నిర్మాణ సంస్థను ఖరారు చేయనున్నారు.

Prabhas stays away from brand endorsements3
బ్రాండ్‌ ఎండోర్స్‌మెంట్లకు దూరంగా ప్రభాస్‌

మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ వంటి సమకాలీకులతో పోలిస్తే రెబల్ స్టార్‌ ప్రభాస్‌(Prabhas) మాత్రం బ్రాండ్‌ ఎండోర్స్‌మెంట్లకు దూరంగా వుంటారు. చాలా కాలం క్రితం ఓ ప్రముఖ కార్ల సంస్ధకు ప్రభాస్‌ బ్రాండ్‌ ఎండోర్స్‌మెంట్‌ చేశారు. ఆ తరువాత మళ్లీ ఏ బ్రాండ్‌కు తను పని చేయలేదు. అయితే ఇటీవల కాలంలో పలు ప్రముఖ బ్రాండ్ల నుండి ఆఫర్లు వచ్చినప్పటికీ ప్రభాస్‌ వాటిని సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఒక ప్రముఖ కోలా కంపెనీతో పాటు ఓ ఆటోమొబైల్‌ కంపెనీ వారు ప్రభాస్‌ను సంప్రదించగా తను వాటిపై ఆసక్తి చూపలేదట.ఓ యాడ్‌కు కేవలం మూడు రోజుల్లోనే 25 కోట్ల వరకు సంపాదించగలిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రభాస్‌ మాత్రం బ్రాండ్‌ ఎండోర్స్‌మెంట్‌లు చేయడానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఓ సెలబ్రిటీ మేనేజర్‌ తెలిపారు.మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరోలు ఇప్పటికే పలు బ్రాండ్‌తో ఒప్పందాలు చేసుకుని ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. కానీ ప్రభాస్‌ మాత్రం తన ఫోకస్‌ అంతా నటన, సినిమాలపైనే పెట్టారు. సినిమాలకే పూర్తి సమయం కేటాయిస్తున్నారు. ఇలా తనకు కోట్లలో భారీ మొత్తాలను చెల్లించేందుకు పలు బ్రాండ్‌లు సిద్ధంగా ఉన్నప్పటికీ డార్లింగ్‌ మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ కేవలం తన నటనపై మాత్రమే ఫోకస్‌ పెట్టారంటూ ఆ సెలబ్రిటీ మేనేజర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్న ప్రభాస్‌ ఒక్కో సినిమాకు వందల కోట్ల రెమ్యునిరేషన్‌ తీసుకుంటూ టాప్‌ స్టార్‌గా ఉన్నప్పటికీ బ్రాండ్‌ ఎండోర్స్‌మెంట్లకు దూరంగా ఉండటం ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను తెలిజేస్తుంది.

Handshake that feels like a shock4
హ్యాండ్‌షేక్‌.. షాక్‌

మీరెప్పుడైనా నిలబడి సరదాగా అప్పటిదాకా మాట్లాడుతున్న వ్యక్తితో వీడ్కోలు చెప్పబోతూ కరచాలనం ఇస్తే చేతికి షాక్‌ కొట్టిందా?. ఎవరో కూర్చున్న కుర్చిని వెనక్కో ముందుకో లాగబోతూ పట్టుకుంటే టప్పున షాక్‌ కొట్టిందా?. గుండ్రంగా వెండిరంగులో మెరిసే డోర్‌నాబ్‌ను పట్టుకోగానే చిన్నపాటి షాక్‌కు గురయ్యారా?. ఈ కరెంట్‌ ఎక్కడి నుంచి వచ్చిందనే డౌట్‌ మీలో ఉండిపోతే అలాంటి సైన్స్‌ ప్రియుల కోసం పరిశోధకులు కొన్ని సమాధానాలను సిద్ధంచేశారు. చదివేద్దామా మరి !! ఉపరితలం చేసే మేజిక్కుప్రతి వస్తువులో కణాలకు విద్యుదావేశశక్తి దాగి ఉంటుంది. అయితే ఆయా వస్తువుల ఉపరితలాల ఎలక్ట్రిక్‌ స్థిరత్వం అనేది వాతావరణాన్ని తగ్గట్లు మారతుంది. అంటే గాలిలో తేమ పెరగడం, తగ్గడం, ఎండాకాలం, వర్షాకాలం వంటి సందర్భాల్లో వస్తువుల ఉపరితల ఎలక్టిక్‌ స్థిరత్వం దెబ్బతిని అసమతుల్యత ఏర్పడుతుంది. ఉదాహరణకు ఒక ప్లాస్టిక్‌ కుర్చిని తీసుకుంటే దాని ఉపరితల ఎలక్టిక్‌ ఛార్జ్‌ అనేది ఎండాకాలంలో ఒకలా, చలికాలంలో మరోలా ఉంటుంది. అదే సమయంలో పాలిస్టర్, ఉన్ని ఇలా విభిన్న వస్త్రంతో తయారైన దుస్తులు ధరించి మనిషి శరీర ఉపరితల ఎలక్ట్రిక్‌ చార్జ్‌ సైతం భిన్నంగా ఉంటుంది. చలికాలంలో వాతావరణం చల్లబడటంతో గాలిలో తేమ శాతం తగ్గుతుంది. చల్లటి గాలి అధిక తేమను పట్టి ఉంచలేదు. దీంతో చల్లటి గాలి తగిలిన ప్లాస్టిక్‌ కుర్చీ ఉపరితలంలో అసమాన ఎలక్ట్రిక్‌ చార్జ్‌ ఉంటుంది. దీనిని విభిన్న ఎలక్టిక్‌ ఛార్జ్‌ ఉన్న మనిషి హఠాత్తుగా పట్టుకుంటే సమస్థాయికి తీసుకొచ్చేందుకు అత్యంత స్వల్పస్థాయిలో విద్యుత్‌కణాలు అటుఇటుగా రెప్పపాటు కాలంలో ప్రయాణిస్తాయి. ఉపరితలంలో కదిలే ఆ విద్యుత్‌ కణాల ప్రవాహ స్పర్శ తగిలి మనం షాక్‌ కొట్టిన అనుభూతిని పొందుతాం. మనిషి, ఇంకో మనిషికి షేక్‌ హ్యాండ్‌ ఇచి్చనప్పుడు కూడా ఇదే భౌతిక శాస్త్ర దృగ్విషయం జరుగుతుంది. అందుకే కొందరు మనుషుల్ని పొరపాటున పట్టుకున్నా మనకు వెంటనే షాక్‌ కొడుతుంది. అంతసేపు ఒకరు కూర్చున్న ఛైర్‌ను పట్టుకున్నా షాక్‌ రావడానికి అసలు కారణం ఇదే. చలికాలంలోనే ఎక్కువ! మిగతా కాలంతో పోలిస్తే చలికాలంలో వాతావరణంలో గాలిలో తేమ మారుతుంది. ముఖ్యంగా మనం కొద్దిసేపు ఆరుబయట గడిపి లోపలికి రాగానే అంతసేపు పాలిస్టర్, నైలాన్‌ వంటి సింథటిక్‌ దుస్తుల ధరించిన మన శరీర ఉపరితల చార్జ్‌ అనేది ధనావేశంతో లేదా రుణావేశంతో ఉంటుంది. గదిలోకి వచ్చి వెంటనే అక్కడి మనుషుల్ని, ఛైర్, డోర్‌నాబ్‌ వంటి వాటిని పట్టుకుంటే అవి అప్పటికే వేరే గాలి వాతావరణంలో భిన్నమైన ఆవేశంతో ఉంటాయి కాబట్టి మనకు షాక్‌ కొట్టే అవకాశాలే ఎక్కువ. తేమలేని గాలిలో చలికాలంలో ఈ షాక్‌ ఘటనలు ఎక్కువగా, తేమ అధికంగా ఉండే ఎండాకాలంలో ఈ షాక్‌ ఘటనలు తక్కువగా చూస్తుంటాం. దీనిని మనం పట్టుకునే, తగిలి, ముట్టుకునే వస్తువుల ఉపరితల ధనావేశం, రుణావేశమే కారణం. దీనిని తప్పించుకోలేమా? ఈ తరహా పరిస్థితుల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. మన శరీర ఉపరితల అత్యంత సూక్ష్మస్థాయి విద్యుత్‌స్థాయిలు ఒకేలా ఉండేలా చర్మానికి లోషన్‌ లాంటివి రాసుకోవచ్చు. సింథటిక్‌ వస్త్రంతో చేసిన దుస్తులకు బదులు సహజసిద్ధ కాటన్‌ దుస్తులు ధరించడం మంచిది. నేల, గడ్డిపై నడిచేటప్పుడు స్టాటిక్‌ విద్యుత్‌కు గురికాకుండా ఉండాలంటే చెప్పులు, షూ లాంటివి ధరించకుండా చెప్పుల్లేకుండా నడవండి. ఇకపై మీరెప్పుడైనా ఇంట్లో సాధారణ పరిస్థితుల్లో ఇలాంటి షాక్‌కు గురైతే సరదాగా తీసుకోండి. అద్భుత, విచిత్ర సైన్స్‌కు మీరూ సాక్షీభూతంగా నిలిచామని సంబరపడండి. స్టాటిక్‌ షాక్‌ ప్రమాదమా? స్థిర విద్యుత్‌తో మని షికి దైనందిన జీవితంలో ఎలాంటి ప్రమాదంలేదు. సెకన్‌ వ్యవధిలో షాక్‌ అనుభూతి వచ్చి పోతుంది. కానీ మండే స్వభావమున్న వస్తువుల సమీపంలో, అత్యంత సున్నితమైన ఎల్రక్టానిక్‌ వస్తువుల వద్ద మనిషికి స్టాటిక్‌ విద్యుత్‌ ప్రాణహాని కల్గించే అవకాశాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా గ్యాస్‌ స్టేషన్లు, కంప్యూటర్‌ చిప్‌ తయారీ కర్మాగారాల్లో స్టాటిక్‌ ఎలక్ట్రిసిటీ చాలా ప్రమాదకరం. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Strong country, yet weak reaction Zelensky slams US5
చెప్పుకోవడానికే బలమైన దేశం.. చేతల్లో ఏమీ లేదు: జెలెన్ స్కీ

రష్యా ఉక్రెయిన్ ల శాంతి ఒప్పందం(కాల్పుల విరమణ ఒప్పంద) ఇక కార్యరూపం దాల్చేలా లేదు. ఇందుకు అమెరికా చేసిన మధ్యవర్తిత్వం ఇప్పటికే గాడి తప్పింది. ఉక్రెయిన్ తో శాంతి ఒప్పందానికి ససేమేరా అంటున్న రష్యా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినా దానిని పెడ చెవినే పెట్టింది. ఈ విషయంలో అమెరికా ఇప్పటికే చేతులెత్తేసినట్లే కనబడుతోంది.తాజాగా అమెరికాను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చేసిన వ్యాఖ్యలు ఉదాహరణగా చెప్పొచ్చు. అమెరికా చెప్పుకోవడానికే బలమైన.. కానీ చేతల్లో ఏమీ ఉండదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.తమ దేశంపై మళ్లీ రష్యా విరుచుకుపడిన విషయాన్ని ఆమెరికాకు తెలియజేస్తే వారి నుంచి ఎటువంటి స్పందనా రాలేదన్నారు. రష్యా జరిపిన మిసైళ్ల దాడిలో 20 మంది తమ దేశ పౌరులు చనిపోయిన విషయాన్ని యూఎస్ ఎంబాసీకి తెలిపానని, అయితే వారు రష్యా పేరు పలకడానికి కూడా భయపడుతునం‍్నారని ఎద్దేవా చేశారు. రష్యా చేసిన దాడిలో చాలా వరకూ చిన్న పిల్లలు ఉన్నారని, ఈ విషయాల్ని పలు దేశాల ఎంబాసీలకు తెలిపినట్లు జెలెన్ స్కీ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే అమెరికాకు కూడా తెలిపితే. రష్యా పదాన్ని వారు పలకడానికి వణుకు పోతున్నారంటూ సెటైర్లు వేశాడు. మనం చెప్పుకోవడానికే బలమైన దేశం.. బలమైన ప్రజలు.. కానీ వారి యాక్షన్ లో మాత్రం ఏమీ పస ఉండదు’ అంటూ దెప్పిపొడిచారు జెలెన్ స్కీ.జపాన్, యూకే, స్విట్జర్లాండ్, జర్మనీ తదితర దేశాల ఎంబాసీలకు తమ దేశంపై మళ్లీ జరిగిన దాడిని చెబితే.. వారి నుంచి సానుకూలమైన స్పందన వచ్చిందని, అదే అమెరికాకు చెబితే చాలా నిరూత్సాహమైన సమాధానం చెప్పారన్నారు. తమ దేశంపై శుక్రవారం రష్యా జరిపిన మిసైళ్ల దాడిలో 11 మంది పెద్దవాళ్లు, 9 మంది చిన్నపిల్లలు ఉన్నారరన్నారు. ఈ ఘటనలో 62 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారని జెలెన్ స్కీ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ ద్వారా తెలియజేశారు.

IPL 2025: Punjab Kings vs Rajasthan Royals live updates and highlights6
పంజాబ్‌ను చిత్తు చేసిన రాజ‌స్తాన్..

IPL 2025 RR vs PBKS live updates and highlights: ఐపీఎల్‌-2025లో ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి.పంజాబ్‌కు తొలి ఓట‌మి..ఐపీఎల్‌-2025లో పంజాబ్ కింగ్స్ తొలి ఓట‌మి చ‌విచూసింది. ముల్లాన్‌పూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 50 ప‌రుగుల తేడాతో పంజాబ్ ప‌రాజ‌యం పాలైంది. 206 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 155 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో నేహాల్ వధేరా(62) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మాక్స్‌వెల్‌(30) ప‌ర్వాలేద‌న్పించాడు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో జోఫ్రా అర్చ‌ర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సందీప్ శ‌ర్మ‌, థీక్ష‌ణ త‌లా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు కార్తికేయ‌, హ‌స‌రంగా ఓ వికెట్ చొప్పున ప‌డ‌గొట్టారు. అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్‌(67) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజూ శాంసన్‌(38), రియాన్ పరాగ్‌(45), హెట్‌మెయిర్‌(20) రాణించారు. పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ రెండు, అర్ష్‌దీప్ సింగ్‌, మార్కో జాన్సెన్ తలా వికెట్ సాధించారు.వదేరా ఔట్‌..పంజాబ్ కింగ్స్ వ‌రుస క్ర‌మంలో రెండు వికెట్లు కోల్పోయింది. థీక్ష‌ణ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌(30) ఔట్ కాగా.. ఆ త‌ర్వాతి ఓవ‌ర్‌లో హ‌స‌రంగా బౌలింగ్‌లో వ‌ధేరా(62) ఔట‌య్యాడు. 16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి పంజాబ్ కింగ్స్‌.. 6 వికెట్ల న‌ష్టానికి 136 ప‌రుగులు చేసింది.వదేరా హాఫ్ సెంచ‌రీ..ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన త‌ర్వాత పంజాబ్ కింగ్స్ తిరిగి పుంజుకుంది. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్ల న‌ష్టానికి 121 ప‌రుగులు చేసింది. క్రీజులో నేహ‌ల్ వ‌ధేరా(53), గ్లెన్ మాక్స్‌వెల్‌(30) ఉన్నారు. క‌ష్టాల్లో పంజాబ్‌43 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. మూడో వికెట్‌గా స్టోయినిష్‌, నాలుగు వికెట్‌గా ఫ్ర‌బ్ సిమ్రాన్ ఔట‌య్యాడు. 7 ఓవ‌ర్లు ముగిసే స‌రికి పంజాబ్ 4 వికెట్ల న‌ష్టానికి 45 ప‌రుగులు చేసింది. క్రీజులో నేహాల్ వ‌ధేరా(9), మాక్స్‌వెల్‌(1) ఉన్నారు.పంజాబ్‌కు భారీ షాక్‌..206 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే భారీ షాక్ త‌గ‌లింది. తొలి ఓవ‌ర్‌లోనే పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయింది. ఆర్చ‌ర్ బౌలింగ్‌లో తొలి బంతికి ఆర్య ఔట్ కాగా.. ఆఖ‌రి బంతికి శ్రేయ‌స్ అయ్య‌ర్ క్లీన్ బౌల్డ‌య్యాడు. క్రీజులో ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్‌, మార్క‌స్ స్టోయినిష్ ఉన్నారు.చెలరేగిన రాజస్తాన్‌ బ్యాటర్లు.. పంజాబ్ ముందు భారీ టార్గెట్‌ ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్‌(67) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజూ శాంసన్‌(38), రియాన్ పరాగ్‌(45), హెట్‌మెయిర్‌(20) రాణించారు. పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ రెండు, అర్ష్‌దీప్ సింగ్‌, మార్కో జాన్సెన్ తలా వికెట్ సాధించారు.రాజ‌స్తాన్ మూడో వికెట్ డౌన్‌..నితీష్ రాణా రూపంలో రాజ‌స్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 12 ప‌రుగులు చేసిన రాణా.. జానెస‌న్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 15 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ 3 వికెట్ల న‌ష్టానికి 142 ప‌రుగులు చేసింది. క్రీజులో ప‌రాగ్‌(12), హెట్‌మెయిర్‌(4) ఉన్నారు.రాజ‌స్తాన్ రెండో వికెట్ డౌన్‌..య‌శ‌స్వి జైశ్వాల్ రూపంలో రాజ‌స్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 67 ప‌రుగులు చేసిన జైశ్వాల్‌.. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ రెండు వికెట్ల న‌ష్టానికి 135 ప‌రుగులు చేసింది. క్రీజులో రియాన్ ప‌రాగ్‌(11), నితీష్ రాణా(11) ఉన్నారు.రాజ‌స్తాన్ నాలుగో వికెట్ డౌన్‌..య‌శ‌స్వి జైశ్వాల్ రూపంలో రాజ‌స్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 67 ప‌రుగులు చేసిన జైశ్వాల్‌.. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ రెండు వికెట్ల న‌ష్టానికి 135 ప‌రుగులు చేసింది. క్రీజులో రియాన్ ప‌రాగ్‌(11), నితీష్ రాణా(11) ఉన్నారు.రాజ‌స్తాన్ తొలి వికెట్ డౌన్‌కెప్టెన్ సంజూ శాంస‌న్ రూపంలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 38 ప‌రుగులు చేసిన శాంస‌న్‌.. ఫెర్గూస‌న్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 12 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ వికెట్ న‌ష్టానికి 105 ప‌రుగులు చేసింది. క్రీజులో య‌శ‌స్వి జైశ్వాల్‌(56), రియాన్ ప‌రాగ్‌(5) ఉన్నారు.4 ఓవ‌ర్ల‌కు రాజ‌స్తాన్ స్కోర్‌:40/04 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 40 ప‌రుగులు చేసింది. క్రీజులో య‌శ‌స్వి జైశ్వాల్‌(25), సంజూ శాంస‌న్‌(15) ఉన్నారు.ఐపీఎల్‌-2025లో ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ త‌మ తుది జ‌ట్టులో ఎటువంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగింది. రాజ‌స్తాన్ మాత్రం త‌మ తుది జ‌ట్టులో రెండు మార్పులు చేసింది. కెప్టెన్ సంజూ శాంస‌న్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌చ్చాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా సంజూనే వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. మ‌రోవైపు తుషార్ దేశ్ పాండే గాయం కార‌ణంగా ఈ మ్యాచ్‌కు దూర‌మ‌య్యాడు. అత‌డి స్ధానంలో యుద్ద్‌వీర్ సింగ్ తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు.తుది జ‌ట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీప‌ర్‌), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్.రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్‌), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, సందీప్ శర్మ

Tata UK Based Jaguar Land Rover to Pause US Car Exports Amid Donald Trumps Tariff7
అమెరికాకు నెలరోజులు ఎగుమతులు బంద్!: జేఎల్‌ఆర్‌

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలను విధించిన తరువాత.. టాటా మోటార్స్ కంపెనీకి చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్.. బ్రిటన్‌లో తయారయ్యే కార్లను యూఎస్‌కు ఎగుమతి చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.అమెరికా అధ్యక్షుడు విధించిన 25 శాతం దిగుమతి సుంకం ఖర్చును ఎలా తగ్గించాలో పరిశీలిస్తున్న సమయంలో.. బ్రిటన్‌లోని అతిపెద్ద కార్ల తయారీదారులలో ఒకరైన జేఎల్‌ఆర్‌ (JLR) సోమవారం నుంచి ఈ చర్య తీసుకుంటున్నారని ది టైమ్స్ తెలిపింది. బ్రిటన్‌లో ఈ కంపెనీ సుమారు 38000 మందికి ఉపాధి కల్పిస్తోంది.జాగ్వార్ ల్యాండ్ రోవర్.. ట్రంప్ ప్రతీకార సుంకాలను తగ్గించుకోవడంలో భాగంగానే తమ కార్ల ఎగుమతులను ఒక నెల రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే రెండు నెలలకు సరిపోయే కార్లను కంపెనీ ఇప్పటికే అమెరికాకు ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్మార్చి 2024 వరకు 12 నెలల్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ 4,30,000 వాహనాలను విక్రయించిందని, వాటిలో దాదాపు నాల్గో వంతు ఉత్తర అమెరికాలో ఉన్నాయని కంపెనీ తన వార్షిక నివేదికలో తెలిపింది. అయితే ట్రంప్ సుంకాలను విధించిన తరువాత.. టాటా మోటార్స్ షేర్లు గణనీయంగా పతనమయ్యాయి.

Waqf Amendment Bill: Asaduddin Owaisi Fire On Chandrababu8
మోసం చేశావ్‌ చంద్రబాబూ.. అసదుద్దీన్‌ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: వక్ఫ్‌ బిల్లును అడ్డుకుంటామని చెప్పి చంద్రబాబు మోసం చేశారంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మండిపడ్డారు. చంద్రబాబు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకునే రకం కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘పిల్లనిచ్చిన మామనే మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. గుజరాత్‌ అల్లర్ల సమయంలోనూ బాబు ముస్లింలను మోసం చేశారు’’ అని అసదుద్దీన్‌ ఓవైసీ ఆరోపించారు.‘‘ఆ తర్వాత పదేళ్ల పాటు చంద్రబాబు అధికారానికి దురమయ్యాడు. ఇప్పటికే చంద్రబాబుకు 74 ఏళ్లు.. ఆయనకు భవిష్యత్‌ లేదు. చంద్రబాబు పాపాలకు లోకేష్‌ మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అంటూ అసదుద్దీన్‌ వ్యాఖ్యానించారు.కాగా, సీఎం చంద్రబాబు వక్ఫ్‌ సవరణకు బిల్లుకు మద్దతివ్వడం పట్ల టీడీపీకి చెందిన మైనార్టీ నేతల్లో కూడా తీవ్ర అసంతృప్తి రాజుకుంటోంది. బిల్లుకు అనుకూలంగా ఓటే­యడం ద్వారా ముస్లిం సమాజానికి టీడీపీ ఎంత ద్రోహం తలపెట్టిందో పార్లమెంట్‌ సాక్షిగా తేటతెల్లమైందనే చర్చ జరుగుతోంది. దీంతో పలువురు నేతలు పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు గ్రహించడంతో ఒత్తిడి పెరిగిన సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర తీశారు. ఈ క్రమంలో ఏమాత్రం ఉపయోగం లేని మూడు సవరణలను ప్రతిపాదించి గొప్పగా ప్రచారం చేసుకున్నారు.

YSRCP Leader Pratap Reddy Injured In Attack Nandyal9
వైఎస్సార్‌సీపీ నేతపై వేటకొడవళ్లతో దాడి

నంద్యాల: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఇందూరి ప్రతాప్ రెడ్డిపై టీడీపీ గూండాలు వేటకొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామంలోప్రతాప్ రెడ్డి గుడిలో ఉండగా దాడికి దిగారు. శనివారం జరిగిన ఈ దారుణ ఘటనలో ప్రతాప్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో నంద్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రతాప్ రెడ్డిని బ్రిజేంద్రారెడ్డి పరామర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డి గన్ మెన్ ను తొలగించడం కూడా దాడికి ముందస్తు ప్రణాళికలో భాగంగానే కనిపిస్తోందని బ్రిజేంద్రారెడ్డి మండిపడ్డారు.ఏపీలో శాంతి భద్రతలు అధ్వాన్నంచంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో శాంతి భద్రతలు అధ్వానంగా మారాయని వైఎస్సార్ సీపీ మండిపడింది చంద్రబాబు పాలనలో మళ్లీ ఫ్యాక్షన్ పడగవిప్పుతోందని, ప్రతాప్ రెడ్డిపై దాడి చేసిన వారంత టీడీపీ కార్యకర్తలేనని వైఎస్సార్ సీపీ ఆరోపిస్తోంది. గతంలో ప్రతాప్ రెడ్డి అన్న, బావమరిదిని హత్య చేసిన నిందితులే మళ్లీ ఇప్పుడు ప్రతాప్ రెడ్డిని టార్గెట్ చేశారని మండిపడుతోంది.

Cm Revanth Reddy Is Serious About Ai Fake Videos10
హెచ్‌సీయూ వివాదం: ఏఐ ఫేక్‌ వీడియోలపై సీఎం రేవంత్‌ సీరియస్‌

సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ యూనివర్సిటీ భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియా నెట్ వర్క్ కృత్రిమంగా వివాదం సృష్టించటం పట్ల రేవంత్‌ సర్కార్‌ ఆందోళన వ్యక్తం చేసింది.కంచ గచ్చిబౌలి లోని సర్వే నెంబర్ 25లో ఉన్న భూముల్లో గత 25 ఏండ్లుగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు. ఐఎస్‌బీతో పాటు గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ, ప్రైవేటు బిల్డింగ్ లు, రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ బిల్డింగ్‌లను నిర్మించారని.. వాటిని నిర్మించేటప్పుడు ఎలాంటి వివాదాలు, ఆందోళనలు జరగలేదని అధికారులు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకు వచ్చారు.అప్పుడు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం లాంటి వివాదాలు కూడా లేవన్నారు. అలాంటప్పుడు అదే సర్వే నెంబర్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసేటప్పుడు ఎందుకు వివాదాస్పదమైందని సమావేశంలో చర్చ జరిగింది. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫొటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.వాస్తవాలు వెల్లడించేలోగా అబద్ధాలు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో వైరల్ కావటం ప్రభుత్వానికి సవాలుగా మారిందని అధికారులు సీఎంకి వివరించారు. ఏకంగా నెమళ్లు ఏడ్చినట్లుగా ఆడియోలు, బుల్లోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్లుగా ఫేక్ ఫొటోలు, వీడియోలు తయారు చేశారని పోలీసు అధికారులు సీఎంకు వివరించారు. వివిధ రంగాల్లో పేరొందిన ప్రముఖులు కూడా వాటినే నిజమని నమ్మి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టడంతో అబద్ధాలకు ఆజ్యం పోసినట్లయిందని అన్నారు.ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ ధ్రువ్ రాఠీ, సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మీర్జా, రవీనా ఠండన్ లాంటి వాళ్లందరూ ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ ఫొటోలు, వీడియోల పోస్టు చేసి సమాజానికి తప్పుడు సందేశం చేరవేశారని సమావేశంలో చర్చ జరిగింది. ఈ భూములపై మొట్టమొదటగా ఫేక్ వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ సుమిత్ జా కొద్ది సేపట్లోనే తన పోస్టును తొలిగించి క్షమాపణలు చెప్పారని, కానీ మిగతా ప్రముఖులెవరూ ఈ నిజాన్ని గుర్తించకుండా అదే ఫేక్ వీడియో ప్రచారం చేశారని అధికారులు అభిప్రాయపడ్డారు. కంచె గచ్చిబౌలిలో ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాలు విసిరిందని ఈ సమావేశంలో చర్చ జరిగింది.ఇదే తీరుగా ఇండో పాక్, ఇండో చైనా సరిహద్దుల్లాంటి వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్ సృష్టిస్తే భవిష్యత్తుల్లో యుద్ధాలు జరిగే ప్రమాదముంటుందని చర్చ జరిగింది. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే ఫేక్ వీడియోలు, ఫొటోలు కరోనా వైరస్‌ను మించిన మహమ్మారిలాంటివని ఈ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది.సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు విజ్ఞప్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. ఏఐ ఫేక్ కంటెంట్ ను పసిగట్టేలా అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ టూల్స్‌ను సమకూర్చుకోవాలని సీఎం సూచించారు

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement