Jagtial
-
రెండు దశాబ్దాలుగా..
రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీ హనుమాన్‌నగర్‌కు చెందిన బైరి రాజేశం–జయలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు. అందరికి పెళ్లిళ్లయ్యాయి. కొడుకులు, కోడళ్లు, వారి పిల్లతో కలిసి రెండు దశాబ్దాల నుంచి ఉమ్మడిగానే ఉంటున్నారు. అంతా కలిసి పండుగలను సంతోషంగా జరుపుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పెద్ద కుమారుడు నాగరాజు, ఎమ్మెస్సీ బీఎడ్ చదివి ప్రైవేట్ టీచర్‌గా పని చేశారు. కరోనాతో స్కూల్ మూతపడడంతో ప్రస్తుతం యైటింక్లయిన్‌కాలనీలో నాగరాజు అండ్ బ్రదర్స్ అనే పేరుతో కిరాణం షాపు పెట్టుకుని ముగ్గురన్నదమ్ములు నాగరాజు, ప్రవీణ్‌కుమార్, సుమన్‌కుమార్ చుసుకుంటున్నారు. ఉమ్మడిగా కలిసి ఉంటేనే ఆనందం ఉంటుందని రాజేశం పేర్కొన్నారు. -
అందరూ ఒకే ఇంట్లో..
మల్యాల మండలం తాటిపల్లి గ్రామంలోని అట్ల భూమవ్వ–అర్జయ్య దంపతులకు ఇద్దరు కుమారులు తిరుపతి రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి. తండ్రి కొద్ది రో జుల క్రితం మృతిచెందాడు. అ న్నదమ్ములు ఎవరి పనులు వారు చే సుకుంటూ ఒకే ఇంట్లో ఉంటారు. తిరుపతిరెడ్డి–గాయత్రి దపంతుల కు ఇద్దరు కుమారులు అభినయ్, కార్తీక్‌రెడ్డి. శ్రీనివాస్‌రెడ్డి– సంధ్యకు ఇద్దరు కుమారులు అక్షిత్, జశ్వంత్. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. 15 ఎకరాల వ్యవసాయ భూమిని ఉమ్మడిగానే సాగు చేస్తున్నారు. పిల్లల చదువులుసైతం ఉ మ్మడిగానే భరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రోజూ పండుగే.. నా కొడుకులు ఎవరి పనులకు వారు వెళ్తారు. కోడళ్లు ఇంటి, వ్యవసాయ పనులు చేసుకుంటూ, అందరం కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. నాకు చేతనైనంత ఇంటి పనుల్లో సాయం చేస్తుంటా. కొడుకులు, కోడళ్లు, మనుమళ్లతో కలిసి ఉంటే రోజూ పండుగ వాతావరణం ఉంటుంది. – అట్ల భూమవ్వ, తాటిపల్లి -
అత్తాకోడళ్లు కాదు.. తల్లీకూతుళ్లు
రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన చెల్పూ రి రాజమ్మ– రాములుది ఆదర్శ ఉమ్మడి కుటుంబం. నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. అనోన్యత చాటే తోడికోడళ్లు. అత్త సారథ్యంలో కుటుంబ నిర్వహణ. తల్లీకూతుళ్ల వలె కలిసిమెలిసి ఉంటారు. వైషామ్యాలకు తావులేకుండా పండంటి కా పురాలుగా తీర్చిదిద్దుతున్నారు తోడికోడళ్లు సరిత, అంజలి, గాయత్రి, అంజలి. సరిత భర్త ఓదెలు, అంజలి భ ర్త గట్టయ్య, గాయత్రి భర్త రాజమౌళి, అంజలి భర్త లింగమూర్తి. అన్నదమ్ములందరూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరి ఉమ్మడి కుటుంబంలో ఎనిమిది మంది పిల్లలు సాయితేజ, సిందూజ, అమూల్య, అక్షిత, రేవంత్, రుత్విక్, రిషిత, కార్తీకేయ. ఇక ఆడబిడ్డలు శంకరమ్మ– శంకరయ్య, లక్ష్మీకాంత– రవి. వారి కుటుంబాలతో కలిసి ఉంటున్నారు. ఆడబిడ్డ కుమారుడైన లవకుమార్‌కు సిందూజతో వివాహం జరిగింది. ఆడబిడ్డలు, కూతురు వస్తే ఆ ఇంట్లో పండుగే. నలుగురు తోడికోడళ్లును చూసి ఆదర్శవంతమైన కుటుంబం అని గ్రామస్తులు కితాబునిస్తారు. -
ఒకే ఇల్లు.. ఒకే వంట
ఉమ్మడి కుటుంబమంటే కొండంత బలం. ఏ ఆపదొ చ్చినా ఒకరికొకరు సాయం చేసుకుంటూ మేమున్నామనే భరోసా ఉంటుంది.. ప్రస్తుత ఉరుకులు పరుగు ల జీవితంలో బంధాలు, బంధుత్వాలు భారమవుతున్నాయి. పెళ్లయిన కొన్నాళ్లకే వేరుకుంపటి వ్యవస్థ పె రుగుతోంది. ఎప్పుడో ఓసారి కలిసినప్పుడు నామమాత్రపు పలకరింపులు.. తర్వాత ఎవరిదారి వారి దే.. అయినా కొన్ని కుటుంబాలు ఉమ్మడిగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇంటి పెద్దల మాటకు కట్టుబడి, విభేదాలు లేకుండా కలిసిమెలిసి ఉంటున్నారు. ఉమ్మడి కుటుంబమే కొండంత అండా అన్నట్టు ఆదర్శంగా నిలుస్తున్నారు.భీమనాతి బలగంతరతరాలుగా ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా కాలం గడుపుతూ ఆదర్శంగా నిలుస్తుంది. ఈ కుటుంబం కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్లో నివాసముంటోంది. కుటుంబ పెద్ద భీమనాతి కాంతయ్య–గంగుబాయి దంపతులకు ఒక కుమార్తె, ఆరుగురు కుమారులు. భీమనాతి శ్రీనివాస్, వేణుగోపాల్, జనార్దన్, శ్రీధర్, దామోదర్, సాయికృష్ణ. కాంతయ్య ఇటీవల మృతిచెందినా ఆయన కొడుకులు తల్లి గంగుబాయితో కలిసే ఉంటున్నారు. వారసత్వంగా వస్తున్న ఐరన్హార్ట్వేర్ వ్యాపారంలో వీరంతా స్థిరపడ్డారు. వీరందరికీ పెళ్లిళ్లు కావడంతో పాటు పిల్లలు ఉన్నారు. తల్లి గంగుబాయితో కలిసి కొడుకులు–కోడళ్లు, మనుమలు, మనమరాళ్లు అంతా 27 మంది ఉన్నారు. వీరంతా ఒకే ఇంట్లో ఉండటమే కాదు.. ఒకే వంట కావడం విశేషం. రోజూ చిన్నపాటి ఫంక్షన్ తీరుగా ఇల్లంతా పెద్దలతో పాటు పిల్లాపాపలతో కళకళలాడుతుంది. తరతరాలుగా ఈ కుటుంబం ఉమ్మడిగా కాలం గడపటం నిజంగా ఈ కాలంలో ఓ వింతగానే తోస్తోంది. రెండు దశాబ్దాలుగా..రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీ హనుమాన్‌నగర్‌కు చెందిన బైరి రాజేశం–జయలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు. అందరికి పెళ్లిళ్లయ్యాయి. కొడుకులు, కోడళ్లు, వారి పిల్లతో కలిసి రెండు దశాబ్దాల నుంచి ఉమ్మడిగానే ఉంటున్నారు. అంతా కలిసి పండుగలను సంతోషంగా జరుపుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పెద్ద కుమారుడు నాగరాజు, ఎమ్మెస్సీ బీఎడ్ చదివి ప్రైవేట్ టీచర్‌గా పని చేశారు. కరోనాతో స్కూల్ మూతపడడంతో ప్రస్తుతం యైటింక్లయిన్‌కాలనీలో నాగరాజు అండ్ బ్రదర్స్ అనే పేరుతో కిరాణం షాపు పెట్టుకుని ముగ్గురన్నదమ్ములు నాగరాజు, ప్రవీణ్‌కుమార్, సుమన్‌కుమార్ చుసుకుంటున్నారు. ఉమ్మడిగా కలిసి ఉంటేనే ఆనందం ఉంటుందని రాజేశం పేర్కొన్నారు.ఇంటిపెద్ద మాటే వేదంజగిత్యాల పట్టణానికి చెందిన కొండేరి అర్జున్–భీమక్క దంపతులకు ఐదుగురు కుమారులు, కుమార్తె. పెద్దకొడుకు, కోడలు గంగాధర్–శారద. గంగాధర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. రెండో కొడుకు, కోడలు వేణుగోపాల్–అన్నపూర్ణ. వేణుగోపాల్ ప్రైవేటు జాబ్. మూడో కొడుకు, కోడలు రాము–సమత. రాము భవన నిర్మాణ రంగంలో పనిచేస్తుంటాడు. నాల్గో కుమారుడు, కోడలు దేవదాసు–భాగ్యలక్ష్మి. ఇతను తన తండ్రి అర్జున్ ఏర్పాటు చేసిన హోటల్ నిర్వహిస్తున్నాడు. ఐడో కొడుకు, కోడలు రాజేందర్–సంధ్య. ఈయన సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్. వీరందరికీ ఒకే ఒక్క ఆడపడుచు నవ్వాతు శోభ, బావ రవి. ఇతను మృతిచెందాడు. కోడళ్లు ఐదుగురు ఇంటి సేవలకే పరిమితమై ఇప్పటికీ అత్తామామల మాట జవదాటరు. వారి ఇంటికి ఆడబిడ్డ వచ్చిందంటే అన్నదమ్ములకు ఎనలేని సంతోషం. ప్రతి ఒక్కరూ తమ వృత్తుల్లో వస్తున్న ఆదాయాన్ని తండ్రికి ఇ వ్వడం విశేషం. ఐదుగురు అన్నదమ్ముల మధ్య ఏనాడు బేదాభిప్రాయాలు రా లేదు. అర్జున్–భీమక్కకు మనుమలు, మనుమరాళ్లు మొత్తం 38 మంది. తా ము ఇప్పటికీ సంతోషంగా ఉన్నామంటే తమ కొడుకుల మధ్య ఏనాడు చిన్న విభేదాలు పొడసూపలేదని, తాము చెప్పిందే వారికి వేదమన్న విధంగా నడస్తున్నారని పేర్కొన్నారు. అందరూ కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణతో ఉండడం మాకు కొండంత బలాన్ని ఇస్తుందని, వారి పిల్లలు కూడా కలిసి ఉంటున్నారని అర్జున్–భీమక్క చెప్పుకొచ్చారు.ఉప్పుల జాయింట్ ఫ్యామిలీ వారిది నిరుపేద వైశ్య కుటుంబం. అయినా బంధాలు, బంధుత్వాలను గౌరవిస్తారు. ముందునుంచి హోటల్ నడుపుకుంటూ జీవించే వసుధైక కుటుంబం. ప్రస్తుతం టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. పెంకుటింట్లో ఇరుకైన గదుల్లోనే వీరంతా ఉంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. వేములవాడ పట్టణంలోని ముదిరాజ్వీధిలో ఉంటున్న ఉప్పుల శ్రీరాములు– జయలక్ష్మి దంపతులకు నలుగురు కొడుకులు, ఏడుగురు కూతుళ్లు. కొడుకులు, కోడళ్లు కలిసే ఉంటున్నారు. ఇందులో శ్రీరాములు ఇటీవలే మరణించారు. వీరితోపాటు ఇద్దరు కూతుళ్లు ఇక్కడే ఉంటున్నారు. మిగతా ఐదుగురు కూతుళ్లు తమతమ అత్తావారిళ్లలో ఉంటున్నారు. ఈ ఉమ్మడి కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఈ ప్రాంతానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.సమష్టి కృషినాకు 13 ఏళ్లకే పెళ్లయింది. నలుగురు కొడుకులు, ఏడుగురు కూతుళ్లు. అందరికీ పెళ్లిళ్లు చేశా ం. ఇప్పటి వరకు ఉమ్మడిగానే ఉంటున్నాం. కుటుంబ సభ్యులమంతా సమష్టిగా కృషి చే స్తూ కాలం వెల్లదీస్తున్నాం. చిన్నపాటి ఇళ్లయినా అనురాగాలు, ఆప్యాయతల మధ్య సంతో షంగా గడుపుతున్నాం. ఇప్పటికీ నా కొడుకులు, కోడళ్లు మా మాటను జవదాటరు. ఉమ్మ డి కుటుంబంతో ఎన్నో లాభాలు ఉంటాయి. కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు, మనువలు, మనుమరాళ్లు, మునిమనువలు మొత్తం 44 మంది అయ్యాం. కానీ, నేటి తరం పెళ్లి కా గానే తల్లిదండ్రులను పట్టించుకోకుండా వేరు సంసారాలు పెడుతున్నారు. ఇది మన సంప్రదాయం కాదు.– ఉప్పుల జయలక్ష్మి, కుటుంబ పెద్దమల్యాల మండలం తాటిపల్లి గ్రామంలోని అట్ల భూమవ్వ–అర్జయ్య దంపతులకు ఇద్దరు కుమారులు తిరుపతి రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి. తండ్రి కొద్ది రో జుల క్రితం మృతిచెందాడు. అ న్నదమ్ములు ఎవరి పనులు వారు చే సుకుంటూ ఒకే ఇంట్లో ఉంటారు. తిరుపతిరెడ్డి–గాయత్రి దపంతుల కు ఇద్దరు కుమారులు అభినయ్, కార్తీక్‌రెడ్డి. శ్రీనివాస్‌రెడ్డి– సంధ్యకు ఇద్దరు కుమారులు అక్షిత్, జశ్వంత్. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. 15 ఎకరాల వ్యవసాయ భూమిని ఉమ్మడిగానే సాగు చేస్తున్నారు. పిల్లల చదువులుసైతం ఉ మ్మడిగానే భరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.రోజూ పండుగే..నా కొడుకులు ఎవరి పనులకు వారు వెళ్తారు. కోడళ్లు ఇంటి, వ్యవసాయ పనులు చేసుకుంటూ, అందరం కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. నాకు చేతనైనంత ఇంటి పనుల్లో సాయం చేస్తుంటా. కొడుకులు, కోడళ్లు, మనుమళ్లతో కలిసి ఉంటే రోజూ పండుగ వాతావరణం ఉంటుంది.– అట్ల భూమవ్వ, తాటిపల్లిఅత్తాకోడళ్లు కాదు.. తల్లీకూతుళ్లురామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన చెల్పూ రి రాజమ్మ– రాములుది ఆదర్శ ఉమ్మడి కుటుంబం. నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. అనోన్యత చాటే తోడికోడళ్లు. అత్త సారథ్యంలో కుటుంబ నిర్వహణ. తల్లీకూతుళ్ల వలె కలిసిమెలిసి ఉంటారు. వైషామ్యాలకు తావులేకుండా పండంటి కా పురాలుగా తీర్చిదిద్దుతున్నారు తోడికోడళ్లు సరిత, అంజలి, గాయత్రి, అంజలి. సరిత భర్త ఓదెలు, అంజలి భ ర్త గట్టయ్య, గాయత్రి భర్త రాజమౌళి, అంజలి భర్త లింగమూర్తి. అన్నదమ్ములందరూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరి ఉమ్మడి కుటుంబంలో ఎనిమిది మంది పిల్లలు సాయితేజ, సిందూజ, అమూల్య, అక్షిత, రేవంత్, రుత్విక్, రిషిత, కార్తీకేయ. ఇక ఆడబిడ్డలు శంకరమ్మ– శంకరయ్య, లక్ష్మీకాంత– రవి. వారి కుటుంబాలతో కలిసి ఉంటున్నారు. ఆడబిడ్డ కుమారుడైన లవకుమార్‌కు సిందూజతో వివాహం జరిగింది. ఆడబిడ్డలు, కూతురు వస్తే ఆ ఇంట్లో పండుగే. నలుగురు తోడికోడళ్లును చూసి ఆదర్శవంతమైన కుటుంబం అని గ్రామస్తులు కితాబునిస్తారు. – కోరుట్ల/సారంగాపూర్/యైటింక్లయిన్‌కాలనీ వేములవాడ/ముత్తారం/మల్యాల -
ఈత వనం.. గీత ఘనం
జగిత్యాల అగ్రికల్చర్: సాధారణంగా గ్రామాల్లో ఈత, తాటి చెట్ల కల్లు అమ్ముకుని గీత కార్మికులు జీవనోపాధి పొందుతుంటారు. కాగా, బీరు, బ్రాందీ, విస్కీ వంటి మద్యం గ్రామాల దరి చేరడంతో.. గీత కార్మికుల ఉపాధికి ఇబ్బందిగా మారింది. దీనికి తోడు, పల్లెల్లో ఈత, తాటి చెట్లు తగ్గుతుండటం.. కల్లు గీసే చెట్లకు రక రకాల తెగుళ్లు, పురుగులు సోకడంతో కల్లు పారడం లేదు, మరికొన్ని చోట్ల కల్లు పారే చెట్లే చనిపోతుండటం, గీత కార్మికుల ఉపాధికి దెబ్బగా మారింది. దీంతో, అయా గ్రామాల్లోని ఈత, తాటి చెట్లను పంచుకుంటే.. ఒక్కొక్క కుటుంబానికి నాలుగైదు ఈత, తాటి చెట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామ గీత కార్మికులు వినూత్న పద్ధతిలో ఈత చెట్లను పెంచుతున్నారు. దానిద్వారా ఒకవైపు ఈత నీర, మరో వైపు ఈత కల్లు గీస్తూ.. మిగతా గ్రామాల గీత కార్మికులకు ఆదర్శంగా నిలిచారు. అంతర్గాం ఈత వనాన్ని గత ప్రభుత్వంలోని మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, ఎక్సైజ్ అధికారులు సందర్శించడం విశేషం.డ్రిప్ ద్వారా ఈత వనం పెంపకంఅంతర్గాం గీత కార్మికులందరూ ఐకమత్యంతో 100 మంది సభ్యులు దాదాపు 8 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసారు. కానీ ఆ భూమి ఏళ్ల తరబడి వృధాగా పడిఉంది. గ్రామంలోని ఈత, తాటి చెట్లు చాలా వరకు చనిపోయి ఉపాధికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు జితేందర్ రావు నేతృత్వంలో గీత కార్మికులు వివిధ ప్రాంతాల్లోని ఈత వనాలను సందర్శించి, వృధా భూమిలో సంగారెడ్డి నర్సరీ నుండి దాదాపు 5 వేల ఈత మొక్కలను తెచ్చి నాటారు. వీటికి డ్రిప్ ద్వారా నీరు, పేడ వంటి సేంద్రియ ఎరువులను అందించారు. ఏటా ఈత చెట్ల కొమ్మలు భూమి మీదకు రాకుండా, ప్రూనింగ్ చేసారు. ఐదేళ్లలోనే ఈతవనం ఏపుగా పెరిగి, కల్లు గీతకు వచ్చింది.ఈత కల్లుకు భలే డిమాండ్ఈత వనంలోని దాదాపు 4 వేల చెట్ల వరకు కల్లు గీతకు రావడంతో, సంఘంలోని సభ్యులు కల్లు గీతకు తలా కొన్ని చెట్లు పంచుకున్నారు. గీత కార్మికులు తమకు కేటాయించిన చెట్ల నుంచి రోజూ కల్లు వచ్చేలా, కొన్ని చెట్లను ఒకరోజు, మరికొన్ని చెట్లను మర్నాడు గీయాలని నిర్ణయించుకున్నారు. రోజూ ఒక్కొక్క చెట్టుకు కనీసం 2 లీటర్ల కల్లు పారేలా చూసుకుంటున్నారు. రోజుకు కనీసం 1000–1500 లీటర్ల కల్లును ఉత్పత్తి చేస్తున్నారు. ఆ కల్లును అక్కడికక్కడే విక్రయిస్తూ మంచి ఉపాధి పొందుతున్నారు. ఈతవనం ఎక్కువగా ఉండటం, ప్రస్తుతం కల్లు కూడా ఎక్కువగా పారుతుండటంతో, జగిత్యాల చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఉదయాన్నే కల్లు కోసం అంతర్గాం పరుగెత్తే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు, కల్లు ఉత్పత్తి ఎక్కువై, అమ్మలేని పరిస్థితుల్లో ప్రభుత్వ సహకారంతో పల్లె కల్లు పట్నానికి పంపాలనే ఆలోచనలు సైతం చేస్తున్నారు. కల్లు ద్వారా అదాయం అంతంతే వస్తుండటంతో, గీత కార్మికులు సమావేశమై ఈతనీరాను సైతం అమ్మాలని యోచిస్తున్నారు.ఈత నీరా వైపు గీతన్నల చూపుఅంతర్గాంలో గీతన్నలు గీసిన కల్లు ద్వారా అయితే లీటర్‌కు రూ.50–రూ.60 వరకు వస్తుంది, ఈత నీరా అయితే లీటర్ రూ.100 వరకు అమ్ముతున్నారు. వేసవిలో చల్లదనానికి ఈతనీరాను తాగుతుంటారు. కొత్త కుండల్లో ఈతనీరాను గీస్తారు. ప్రభుత్వం సైతం అనుమతి ఇవ్వడంతో, నాలుగేళ్ల క్రితం, జిల్లా ఎక్సైజ్ అధికారులు ఈతనీరాను ప్రారంభించారు. పదిహేను లీటర్లకు పైగా ఆర్డర్ ఇస్తే.. ఇంటికి సైతం పంపగలమంటూ గీత కార్మికులు చెబుతున్నారు. ఈత నీరాను తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయంటూ వైద్యులు సైతం స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం సైతం ప్రాధాన్యం ఇస్తుండటంతో, జిల్లా కేంద్రంలో ఉదయం వేళల్లో ఓ స్టాల్ ఏర్పాటు చేసి విక్రయించాలని కూడా యోచిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేయాలని ప్రచారం చేయాలని గీతన్నలు భావిస్తున్నారు. -
కట్నం వేధింపులకు యువతి బలి
జగిత్యాలక్రైం/బుగ్గారం: కొడిమ్యాల మండలకేంద్రంలో వివాహిత దుబ్బాక జమున (23) కట్నం వేధింపులకు బలైంది. స్థానికుల కథనం ప్రకారం.. బుగ్గారం మండలకేంద్రానికి చెందిన జమునను ఏడాది క్రితం కొడిమ్యాలకు చెందిన దుబ్బాక రాహుల్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆ సమయంలో కట్నకానుకలతోపాటు సామగ్రి, ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. కొద్దికాలంగా రాహుల్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. వేధింపులు తాళలేక జమున క్రిమిసంహారక మందు తాగింది. అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జమనను కట్నం కోసం వేధించి భర్తతోపాటు అత్తమామలు హత్య చేశారంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ రఘుచందర్, మల్యాల సీఐ రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ ఘటన స్థలానికి చేరుకుని నిందితులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతురాలి తల్లి కొమ్ము పోశవ్వ ఫిర్యాదు మేరకు జమున భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. జమున మృతదేహానికి బుగ్గారంలో దహన సంస్కారాలు నిర్వహించగా.. తల్లి పోశవ్వ తలకొరివి పెట్టింది. -
‘చీట్’ఫండ్ వ్యాపారం
జగిత్యాల పట్టణంలోని ఓ షాపు నిర్వాహకుడు రాజు కరీంనగర్రోడ్లోగల లో చిట్‌ఫండ్‌లో రూ.2 లక్షలు డిపాజిట్ చేశాడు. కాల పరిమితి ముగిసి చాలా రోజులు అవుతున్నా డబ్బులు చెల్లించకపోవడంతోపాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. ఇటీవల బాధితులు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు సదరు చిట్‌ఫండ్‌పై కేసు నమోదు చేశారు. జగిత్యాల రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు కరీంనగర్రోడ్లోగల ఓ చిట్‌ఫండ్‌లో రూ.5 లక్షల డిపాజిట్ చేశాడు. కాల పరిమితి ముగిసి ఏడాది కావస్తున్నా డబ్బులు చెల్లించకపోవడంతో 15 రోజుల క్రితం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సదరు చిట్‌ఫండ్‌పై కేసు నమోదు చేశారు. ● జగిత్యాల జిల్లాలో ప్రతినెలా రూ.70 కోట్ల లావాదేవీలు ● కాలపరిమితి ముగిసినా డబ్బులు చెల్లించని నిర్వాహకులు ● న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్న ఖాతాదారులు 19జెజిఎల్51 : రఘుచందర్, డీఎస్పీ, జగిత్యాల జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాలో విచ్చలవిడిగా చిట్‌ఫండ్ వ్యాపారం కొనసాగుతోంది. ఇది చాలదన్నట్లు అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చే ఫైనాన్స్ కంపెనీలు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జిల్లాలో దాదాపు 33 చిట్‌ఫండ్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో కేవలం పదింటికి మాత్రమే లైసెన్స్ ఉంది. అలాగే జిల్లాలో 100కు పైగా ఫైనాన్స్‌లు నడుస్తున్నాయి. అనధికారికంగా మరో 150 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. చిట్ఫండ్ల వ్యాపారం రూ.80 కోట్ల వరకు.. ఫైనాన్స్ వ్యాపారం రూ.70 కోట్ల వరకు జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్స్ నిర్వాహకులు అయితే తెల్ల పేపర్లపై లేకుంటే ఖాళీచెక్కులపై సంతకాలు చేయించుకుని 4 నుంచి 8 శాతం వడ్డీకి అప్పులిస్తున్నారు. పెద్ద ఎత్తున వడ్డీ వసూలు చేస్తున్నా.. నిబంధనలకు విరుద్ధంగా చిట్స్‌ఫండ్ ఫైనాన్స్ కొనసాగిస్తున్నా.. వారిపై నిఘా కరువైంది. చిట్స్‌ఫండ్స్ మోసాలు జిల్లాలో ఉద్యోగులు, వ్యాపారులు, వైద్యులు, ఇతరత్రా వ్యక్తుల నుంచి లైసెన్స్డ్ చిట్స్‌ఫండ్ నిర్వాహకులు పెద్ద ఎత్తున చిట్టీలు వేయించుకొని కాలపరిమితి ముగిసినా డబ్బులు చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఓ చిట్‌ఫండ్ కార్యాలయంలో బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయినా పట్టించుకునే వారే కరువయ్యారు. చిట్‌ఫండ్స్ కంపెనీలో చిట్టీ తీసుకునే వారు ప్రభుత్వ ఉద్యోగితో ష్యూరిటీగా తీసుకొని డబ్బులు చెల్లిస్తారు. కానీ కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా సమయానికి డబ్బులు ఇవ్వకపోవడం చిట్స్‌ఫండ్ మోసాలకు దారితీస్తోంది. జిల్లాలో రిజిస్టర్ లేని చిట్టీలు కోట్ల వ్యాపారంలో కొనసాగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. కొందరు చిట్టీ నిర్వాహకులు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని పారిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాకట్టు వ్యాపారం జిల్లాలో తాకట్టు వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లాలో చాలామంది డబ్బులు అవసరమున్న వారు వాహనాల పేపర్లతోపాటు బంగారం, భూమి కాగితాలు పెట్టి అధిక వడ్డీకి అప్పు ఇస్తున్నారు. అప్పు తీసుకున్న వారు సకాలంలో చెల్లించకుంటే తాకట్టు పెట్టిన వస్తువులను వ్యాపారులు అమ్ముకుంటున్నారు. చాలా మంది వడ్డీ వ్యాపారులు తెల్లపేపర్లపై స్టాంప్ పేపర్లు, చెక్కులపై సంతకాలు చేయించుకుని ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. రిజిస్టర్డ్ అయిన చిట్‌ఫండ్స్ నిర్వాహకులు డిపాజిట్లు సేకరించి.. కాలపరిమితి ముగిసినా డిపాజిటర్లకు డబ్బులు చెల్లించకుండా సుమారు ఏడు కంపెనీలు తమ కార్యకలాపాలు నిలిపివేశాయి. ఫలితంగా బాధితులు పోలీస్స్టేషన్లు, కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అనుమతుల్లేని ఫైనాన్స్‌లపై చర్యలు జగిత్యాల జిల్లా కేంద్రంలో అనుమతులు లేని ఫైనాన్స్‌లు, చిట్‌ఫండ్స్‌పై కఠిన చర్యలు చేపడతాం. ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. మూతపడిన చిట్‌ఫండ్స్‌పై బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశాం. – రఘుచందర్, డీఎస్పీ, జగిత్యాల -
నాలుగు రోజులు ఎండలే
బయటకు వెళ్లలేని పరిస్థితి ఉదయం 8 గంటలకే ఎండలు మండుతున్నాయి. బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం ఆరుగంటల తర్వాత కూడా వేడిగాలులు వీస్తున్నాయి. వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే భయపడుతున్నాం. ఎండలకు కూలీలు కూడా వ్యవసాయ పనులకు రావడం లేదు. – ఏలేటి స్వామిరెడ్డి, శ్రీరాములపల్లె, గొల్లపల్లి(మం)మరో నాలుగు రోజులు వాతావరణ మార్పులతో రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇలాగే ఉండే అవకాశం ఉంది. వాతావా రణ విభాగం వారు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం భూమిలో తేమ శాతం ఎక్కువగా లేకపోవడంతో ఉష్ణోగ్రతలకే ప్రజలు అల్లాడిపోతున్నారు. వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. – శ్రీలక్ష్మి, వాతావరణ శాస్త్రవేత్త, పొలాస జగిత్యాలఅగ్రికల్చర్: కొద్దిరోజులుగా సూర్యుడు ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. ఇక మే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండవచ్చని పొలాస వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వడగాలులు వీస్తుండటం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నాలుగు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రతలు 28.8 డిగ్రీల సెల్సియస్‌లో కదలాడుతున్నాయి. రానున్న రెండుమూడు రోజుల్లో మరో రెండు డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యవసరమైతనే బయటకు వెళ్లాలి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుతం గంటకు 30 నుంచి40 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీస్తున్నాయి. మధ్యాహ్నం వేడితో కూడిన వడగాలులు వస్తుండటంతో ప్రజలు అతులాకుతలం అవుతున్నారు. గాలిలో తేమ శాతం తగ్గడంతో ఉక్కపోత మొదలైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండ తీవ్రంగా ఉంటోంది. వడదెబ్బతో విలవిల ఉష్ణోగ్రతలు పెరిగినకొద్దీ శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వెళ్తుంది. దీంతో నీరసం వస్తుంది. నీటి శాతం తక్కువ అయినప్పుడు వడదెబ్బకు గురయ్యే ఆస్కారం ఉంది. దీనికితోడు దురద, చెమటకాయ, పొక్కులు, నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కళ్లు మంటలు మండి ఎరుపుచారలు వస్తాయి. గ్రామాల్లో లోతైన బావుల నీరు తాగినప్పుడు విరోచనాలు, వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఎండకు వెళ్లినప్పుడు కళ్లజోళ్లతోపాటు చర్మం పూర్తిగా కప్పేలా బట్టలు ధరించడం మంచిదంటున్నారు వైద్యులు. శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు మజ్జిగ, పెరుగు, నిమ్మరసాలు తీసుకోవాలంటున్నారు. వాతావరణ మార్పులే కారణం వాతావరణంలో అప్పటికప్పుడు వస్తున్న మార్పులే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కార్బన్ డైఆక్సెడ్, మిథేన్, నైట్రస్ ఆకై ్సడ్, ఇతర గ్రీన్హౌస్ వాయువుల సాంద్రత విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా భూమి ఉపరితల ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుండటంతో పర్యావరణంలోనూ, వాతావరణంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలా.. జిల్లాలో ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. రాయికల్, ధర్మపురి మండలం నేరేళ్ల, కోరుట్ల మండలం అయిలాపూర్, గొల్లపల్లి మండలాల్లో 44.1 డిగ్రీలు, ఎండపల్లి మండలం మారెడుపల్లి, సారంగాపూర్, రాయికల్ మండలం అల్లీపూర్లో 44 డిగ్రీల సెల్సియస్ చొప్పున నమోదయ్యాయి. రానున్న నాలుగు రోజులు కూడా ఎండలు పెరిగే అవకాశం ఉండడంతో జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. జిల్లాకు రెడ్ అలెర్ట్ రోజురోజుకూ ఆగ్రహిస్తున్న సూర్యుడు బుధవారం 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత -
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని పోచమ్మవాడలో గంగధరి ప్రసన్నలక్ష్మీ (28) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పోచమ్మవాడకు చెందిన ఉప్పునీటి గంగాధర్ కుమార్తె ప్రసన్నలక్ష్మీని వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన గంగధరి తిరుపతికి ఇచ్చి 2023లో వివాహం చేశారు. వీరికి ఏడాది బాబు ఉన్నాడు. తిరుపతి వెళ్లేందుకని ఇటీవలే జగిత్యాలలోని పుట్టింటికి వచ్చింది. ఇంతలో ఏమైందో తెలియదుగానీ.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికొత్తపల్లి: కొత్తపల్లి మండలం నాగులమల్యాల గ్రామానికి చెందిన మొగిలిపాలెం గంగరాజు(42)బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కొత్తపల్లి పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు గంగాధర మండలం సర్వారెడ్డిపల్లిలో పనిచేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న నాగులమల్యాలకు చెందిన గంగారాజు ప్రతి రోజు తన ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తుంటాడు. బుధవారం సర్వారెడ్డిపల్లిలో పనిముగించుకొని తన వాహనంపై నాగులమల్యాలకు వస్తుండగా కొత్తపల్లి శివారులోని వెలిచాల ఎక్స్‌రోడ్ దగ్గర లారీ ఢీకొట్టింది. గంగారాజుకు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అజాగ్రత్తగా లారీ నడిపి తన తండ్రి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గంగరాజు కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కర్మకాండకు వెళ్లి యువకుడు గల్లంతుజగిత్యాలక్రైం: కర్మకాండకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో యువకుడు గల్లంతైన సంఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన నీలి మల్లికార్జున్ నానమ్మ ఇటీవల మృతిచెందింది. బుధవారం కర్మకాండ నిర్వహించారు. శ్మశాన వాటిక పక్కనే ఉన్న చింతకుంట చెరువులో స్నానం చేస్తుండగా మల్లికార్జున్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. మల్లికార్జున్ మృతిచెంది ఉంటాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. -
జిల్లాకు 12 మంది హెడ్‌కానిస్టేబుళ్లు
జగిత్యాలక్రైం: మల్టీజోన్–1లో పనిచేస్తున్న 28 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ మల్టీజోన్–1 ఇన్చార్జి, మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఒక కానిస్టేబుల్‌కు హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి రాగా.. 12 మంది ఇతర జిల్లాల్లో పదోన్నతి పొందిన వారిని జిల్లాకు కేటాయించారు. జగిత్యాలకు చెందిన వెంకటేశంకు హెడ్‌గా పదోన్నతి వచ్చింది. అలాగే ఆదిలాబాద్ నుంచి జిల్లాకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పి.శివాజీ, డి.వెంకటి, ఎ.వెంకటరమణ, నిజామాబాద్ నుంచి ఎస్.వేణుగోపాల్, ఎం.శంకర్రావు, ఆర్.నారాయణ, ఎండి.మహ్మద్ అలీ, ఎ.గంగాధర్, ఎ.మనోజ్, కృష్ణకుమార్, ఎస్.హరికృష్ణ రానున్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ రూరల్, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన మధ్యప్రదేశ్‌కు చెందిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్ బుధవారం తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. గతేడాది జూలైలో గుంటూరుపల్లిలో దొంగలు తాళంవేసి ఉన్న ఇంట్లో చొరబడి రూ.2.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ రోడ్డులోని రాజేంద్రప్రసాద్ ఇంటి తాళాలు పగుటగొట్టి మద్యం సీసాలు, బైక్ అపహరించారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన ప్రదీప్, హత్రుసింగ్, జితేన్లు ఈ దొంగతనాలకు పాల్పడినట్లు తేలిందని ఏసీపీ వివరించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ప్రదీప్‌ను గత నెలలో రిమాండ్‌కు పంపించామని, మరో నిందితుడైన హత్రుసింగ్ను కొత్తపల్లి ఎస్సై ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌లో దార్ జిల్లా నరవాలిలో అదుపులో తీసుకొని బుధవారం కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. ఈకేసులో మరో నిందితుడు జితేన్ పరారీలో ఉన్నాడని త్వరలోనే ఆయనూ పట్టుకుంటామని ఏసీపీ వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి, సిబ్బంది శ్రీనాథ్, అబ్దుల్ ఖదీర్, షరీఫ్, సాంబరెడ్డి, దేవేందర్‌ను అభినందించారు. -
‘భూ భారతి’తో భూ సమస్యలు పరిష్కారం
కథలాపూర్: భూ భారతి చట్టంతో భూ సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించారు. కొత్త చట్టంతో అర్హులకే భూములు దక్కే అవకాశముందన్నారు. రికార్డుల్లో తప్పులు దొర్లితే త్వరగా సవరణ చేయొచ్చన్నారు. కోరుట్ల ఆర్డీవో జివాకర్ రెడ్డి, తహసీల్దార్ వినోద్, ఏఎంసీ చైర్మన్ పూండ్ర నారాయణరెడ్డి, వైస్ చైర్పర్సన్ పులి శిరీషా, ఏవో యోగితా, ఏఈవోలు హరీశ్, మౌనిక, నాయకులు, రైతులు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇళ్లు అందేలా చూడాలి జగిత్యాల: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూడాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల అర్హత పరిశీలనపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించాలని, ప్రతి నియోజకవర్గ గెజిటెడ్ స్పెషల్ అధికారులు మండలాల వారీగా కమిటీలు వేసి అవకతవకలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. రెండున్నర ఎకరాలపైన వ్యవసాయ భూమి ఉండరాదని, కారు, ప్రభుత్వ ఉద్యోగం, వలస వెళ్లిన వారు, ఆదాయ పన్ను చెల్లించే వారు అనర్హులన్నారు. అదనపు కలెక్టర్ లత, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. -
26 క్రీడాంశాలు.. 889 సీట్లు
● కోచ్‌గా మారేందుకు కేరాఫ్ ఎన్ఎస్ ఎన్ఐఎస్ ● 26లోపు ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ కరీంనగర్‌స్పోర్ట్స్: దేశంలో క్రీడారంగానికి పెద్దన్న ఎన్ఐఎస్. క్రీడాకారులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణను అందించి ఒలింపిక్స్‌తో పాటు ప్రపంచ క్రీడావేదికల్లో భారత పతాకం రెపరెపలాడేలా తీర్చిదిద్దుతుంది. క్రీడాకారులకు ఎన్ఐఎస్ నుంచి పిలుపువచ్చిందంటే అదృష్టమే. దేశవ్యాప్తంగా కోచ్‌లను తయారు చేసేందుకు ఏటా కొన్ని క్రీడాంశాల్లో నిష్ణాతులైన క్రీడాకారులకు, అర్హులైన వారికి డిప్లొమా కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది. పీఈటీలుగా మారాలనుకునే వారు పీఈసెట్ రాసి ట్రైనింగ్ చేసి డీఎస్సీ ద్వారా డ్రిల్ మాస్టర్లుగా మారుతారు. దేశవ్యాప్తంగా ఉన్న స్టేడియాల్లో కోచ్‌లుగా నియామకం కావడానికి ఈ డిప్లొమా కోర్సులు దోహదపడుతుంటాయి. 2025–26 ఏడాదికి నేతాజీ సుభాష్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ నోటిఫికేషన్ విడుదలైంది. 63వ డిప్లొమా బ్యాచ్‌కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 26లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 26 క్రీడాంశాల్లో.. దేశవ్యాప్తంగా నాలుగు కేంద్రాల్లో డిప్లొమా కోచింగ్ కేంద్రాలు ఉన్నాయి. పంజాబ్‌లోని పాటియాలలో ఎన్ఎస్ ఎన్ఐఎస్ సెంటర్, బెంగళూర్‌లోని సాయ్ ఎన్ఎస్ఎస్సీ సెంటర్, కోల్‌కత్తాలోని సాయ్ ఎన్ఎస్ఈసీ సెంటర్, తిరువంతపురంలోని సాయ్ ఎల్ఎన్సీపీఈ సెంటర్లలో కోర్సుల కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 26 క్రీడాంశాల్లో శిక్షణనివ్వనున్నారు. మొత్తం 785 సీట్లతో పాటు 104 అదనపు సీట్లు (ఒలింపిక్స్, ప్రపంచస్థాలో ఆడిన వారికి) కలిపి మొత్తం 889సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీట్ల వివరాలు అర్చరీ(30), అథ్లెటిక్స్(75), బ్యాడ్మింటన్(20), బాస్కెట్‌బాల్(30), బాక్సింగ్(50), కనోయింగ్–కయాకింగ్(15), సైక్లింగ్(30), ఫెన్సింగ్(30), ఫుట్‌బాల్(50), జిమ్నాస్టిక్స్(20), హ్యాండ్‌బాల్(20), హాకీ(50), జూడో(30), కబడ్డీ(30), ఖోఖో(20), రోయింగ్ (10), షూటింగ్ (20), స్విమ్మింగ్(20), టేబుల్‌టెన్నిస్(40), తైక్వాండో(20), టెన్నీస్ (20), వాలీబాల్(30), వెయిట్ లిఫ్టింగ్ (30). రెజ్లింగ్(50), ఉషూ(25), యోగాసన(20) సీట్లు ఉన్నాయి. అర్హత వివరాలు... అభ్యర్థి వయస్సు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్, డిగ్రీ అర్హతతో పాటు ఒలింపిక్స్, ప్రపంచస్థాయి, జాతీయ స్పోర్ట్స్ ఆచీవ్‌మెంట్ సర్టిఫికెట్లు ఆన్లైన్ అప్లికేషన్లో నమోదు చేయాలి. రాత, ప్రాక్టికల్, మౌఖిక పరీక్షలతోపాటు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. సామర్థ్య పరీక్షలు పురుష, మహిళా అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు నిర్వహిస్తారు. 30 మీటర్ల ఫ్లయింగ్ స్ప్రింట్, స్టాండింగ్ బ్రాడ్‌జంప్, షటిల్రన్, బెండ్ అండ్ రీచ్ టెస్ట్, 1600మీటర్ల పరుగు పరీక్షలు నిర్వహిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 26 సవరణ తేదీ ఏప్రిల్ 27,28 పరీక్ష తేదీ జూన్ 6 -
● హరిత జగిత్యాల లక్ష్యం ● స్పెషల్ ఆఫీసర్ బీఎస్.లత
జగిత్యాల బల్దియా బడ్జెట్ రూ.58.41కోట్లుజగిత్యాల: జగిత్యాల హరిత లక్ష్యంగా మౌలిక సదుపాయల కల్పన, పట్టణాభివృద్ధే ధ్యేయంగా ఈ ఆర్థిక సంవత్సరం (2025–26) సంబంధించిన మున్సిపల్ బడ్జెట్‌ను స్పెషల్ ఆఫీసర్ బీఎస్.లత ప్రకటించారు. రూ.58.41 కోట్లతో బడ్జెట్‌ను ఆమోదించారు. ఇందులో గ్రీన్బడ్జెట్కు రూ.2.81 కోట్లు, పట్టణ పారిశుధ్య నిర్వహణకు రూ.2.37 కోట్లు కేటాయించారు. విలీన గ్రామాలు, వెనుకబడిన తరగతులు, ప్రాముఖ్యం కలిగిన వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించారు. పార్క్‌లు, ఆటస్థలాలు, పబ్లిక్ టాయిలెట్స్, ఓపెన్ జిమ్‌లు, స్ట్రీట్ వెండర్స్, జంతువధశాల, శాసీ్త్రయ పద్ధతిలో డంపింగ్‌యార్డు నిర్వహణ, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు రూ. 3.56 కోట్లు కేటాయించారు. కొత్తగా విలీనమైన గ్రామాల్లో వసతుల కల్పనకు రూ.1.18 కోట్లు కేటాయించారు. సమావేశంలో కమిషనర్ స్పందన పాల్గొన్నారు. రాయికల్ మున్సిపల్ బడ్జెట్ రూ.8.58 కోట్లురాయికల్: రాయికల్ బల్దియా 2025–26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.8.58 కోట్ల అంచనా వ్యయాన్ని ఆమోదించినట్లు మున్సిపల్ కమిషనర్ మనోహర్‌గౌడ్ తెలిపారు. క్యాపిటల్ గ్రాంట్స్ కింద రూ.5.39 కోట్లు, జనరల్ ఫండ్ రూ.3.14 కోట్లు చార్జ్డ్ వ్యయం రూ.3.06 కోట్లకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. -
రూటే సప‘రేటు’ఉద్యోగిపై విచారణ
● మెట్పల్లి మండల పరిషత్‌లో జెడ్పీ సీఈవో విచారణ ● కార్యదర్శులతో సమావేశమై వివరాలు ఆరా.. ● ఆయనను బదిలీ చేయాలని తేల్చిచెప్పిన కార్యదర్శులు మెట్‌పల్లిరూరల్: పంచాయతీ కార్యదర్శులను పలు పనుల విషయాల్లో ఇబ్బందులకు గురిచేస్తున్న మెట్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ అసిస్టెంట్ నవీన్‌పై అధికారులు విచారణ చేపట్టారు. సదరు ఉద్యోగి ఇబ్బందులు పడలేక కొందరు కార్యదర్శులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ‘సాక్షి’ ఈనెల 22న ‘ఆయన రూటే సపరేటు’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి మెట్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో బుధవారం సమావేశమయ్యారు. ఒక్కో కార్యదర్శిని పలు విషయాలపై అడిగి తెలుసుకున్నారు. జూనియర్ అసిస్టెంట్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న కొందరు జెడ్పీ సీఈవోకు పూర్తి విషయాలను వివరించారు. ఆయనను బదిలీ చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. విచారణకు హారైన కార్యదర్శులంతా ఆయనను ఇక్కడి నుంచి బదిలీ చేయాలని లిఖితపూర్వకంగా రాసిచ్చినట్లు సమాచారం. ప్రతి పనిలోనూ ఉద్దేశపూర్వకంగా కార్యదర్శులను ‘ముప్పుతిప్పలు’ పెట్టిన సబ్ ట్రెజరీ కార్యాలయంలోని మరో ఉద్యోగి విషయంపై మాత్రం అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం. సదరు ఉద్యోగితో కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న కారణంగా ఆయనపైనా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
మృతుల కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలి
● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ధర్మపురి: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల చేతిలో హతులైన మృతుల కుటుంబాలను కేంద్రప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఉగ్రవాద ముష్కరులు చేసిన దాడిలో 28 మంది మృతి చెందడం.. 20 మంది వరకు గాయపడడం బాధాకరమని తెలిపారు. బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాలి జగిత్యాల: పాకిస్థాన్ ముష్కరుల ఉగ్రవాదులు తుపాకులతో విచక్షణరహితంగా దాడిచేసి చంపడాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఖండించారు. బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాలని కోరారు. ఉగ్రవాదుల చేతిల్లో పర్యాటకులు మృతిచెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందని, వారిని తక్షణమే ఆదుకోవాలన్నారు. -
ఉగ్రముఠాకు తగిన గుణపాఠం చెప్పాలి
జగిత్యాల: పహల్గమ్‌లోని జైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన ఘటనను మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఖండించారు. పాకిస్తాన్ ఉగ్రవాద ముఠాకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసముందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించే ప్రజలకు భద్రత కల్పించాలని, కేంద్రప్రభుత్వం భరోసా ఇవ్వాలని సూచించారు. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ పర్యాటకులపై దాడికి పాల్పడినట్లు ప్రకటించుకున్న ఉగ్రముఠాను ఉపేక్షించవద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే సర్జికల్ స్ట్రైక్ చేపట్టాలన్నారు. దేశంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రచేస్తున్న పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కాల్పుల్లో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందించాలని, ఒక్కొక్కరికి ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. రజతోత్సవ సభకు తరలిరండి● జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతజగిత్యాలరూరల్: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం, చల్గల్ గ్రామాల్లో బుధవారం ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. అంతర్గాంలో తాగునీరు, సాగునీరు అంది పంటపొలాలు పచ్చగా ఉన్నాయంటే అది కేసీఆర్, కవిత ఘనతేనన్నారు. ఇల్లులేని నిరుపేదలకు 100 డబుల్బెడ్రూం ఇళ్లు ఇచ్చిన ఘనత కవితదేనని గుర్తు చేశారు. ఈనెల 27న వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభకు కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. మాజీమంత్రి రాజేశంగౌడ్, సింగిల్ విండో చైర్మన్ మహిపాల్‌రెడ్డి, నాయకులు ఆనందరావు, గంగాధర్, తిరుపతి, శ్రీనివాస్‌గౌడ్, షఫీ, మల్లేశ్, రాజయ్య, మహేశ్, పోచమల్లయ్య, రంజిత్ పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు పీపీఈ కిట్లుధర్మపురి: ధర్మపురి మున్సిపల్ కార్యాలయ కార్మికులకు బుధవారం శానిటేషన్ పరికరాలు, పీపీఈ కిట్లయిన తట్టలు, పారలు, చీపుర్లు, గ్లౌజులను కమిషనర్ రాజశేఖర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేనేజర్ గంగాధర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ గంగాధర్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మహేశ్, సిబ్బంది తదితరులున్నారు. -
ఓ పాఠం
గెలుపు ఓటమిఆవేశంతో జీవితాలను అంతం చేసుకోవద్దు.. ఆలోచన.. ధైర్యంతో అడుగు ముందుకేస్తే ఎన్నో విజయాలు మీ సొంతం. చరిత్ర.. గతం.. వర్తమానం చూస్తే అనేక విషయాలు ఇట్టే దోహదపడుతాయి. ఎందుకు పనికిరారు అని పలువురితో ఛీత్కారాలు ఎదుర్కున్నవారు కష్టపడి విజయ తీరాలకు చేరుతున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. గెలుపు.. ఓటమికి నాంది అనేదానిని మరవొద్దు. సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారు ఉండరు. పదోతరగతి కూడా పాస్కాలేని ఆయన బ్యాట్ ఝలిపిస్తే.. పరుగుల వర్షమే కురిసేది. క్రికెట్ ఆడితే లక్షల కళ్లు ఆయనవైపే ఉండేవి. ఎన్నో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆయన క్రికెట్ దిగ్గజంగా ఎదిగిన విషయం మరవొద్దు.. అంతేకాదు.. శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మోటార్ న్యూరాన్ అనే వ్యాధి బారినపడ్డా.. మనోధైర్యం కోల్పోలేదు. ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆయన గొప్ప పరిశోధకుడై ప్రపంచమే మెచ్చుకునే వాడయ్యాడు. ఫెయిలయ్యామని కుంగిపోవద్దు ● పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏమీలేదుఇంటర్ఈ ఏడాది ఇంటర్, పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్యహుజూరాబాద్: ప్రతిభ కొందరికే పరిమితం కాదు. ప్రతీ మనిషిలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని వెలికితీసి, కఠోర సాధన చేస్తే జీవితంలో గొప్పవ్యక్తిగా ఎదగొచ్చు. అలా కాదని నేనేం చేయలేను.. నాతో కాదు.. నేనింతే అంటూ కుంగిపోవద్దు. చదువూ అంతే.. పుస్తకాన్ని నేస్తంగా మలు చుకుని చదివితే విజయం నీ బానిస అవుతుంది. పరీక్ష నీతో స్నేహం చేస్తుంది. ఫలితం ఎప్పుడూ నీ వెంటే నడుస్తుంది. విద్యార్థులకు ‘పరీక్ష’కాలం ముగిసింది. ఫలితాల సమయం సా గుతోంది. మంగళవారం నాటి ఇంటర్ ఫలితాల్లో చాలా మంది ప్రతిభ చూపారు. కొందరు ఫెయిలయ్యా రు. త్వరలో పదోతరగతి ఫలితాలు రానున్నాయి. ఫలితాలను జీవితంలో ఒక భాగం మా త్రమే చూడాలి. ఓటమి గెలుపునకు గట్టి పునాది గా మారుతుందని గ్రహించాలి. మళ్లీ ప్రయత్నించి, తప్పులను సవరించుకుని, కన్నీళ్లు పెట్టుకు న్న చోట తలెత్తుకుని చూడాలి తప్పా.. విఫల మయ్యామని కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు. గెలుపైనా ఓటమైనా.. ఓ పాఠంగా నేర్చుకోవాలి.కరీంనగర్పెద్దపల్లిజగిత్యాలసిరిసిల్ల -
ఉగ్రవాదుల దిష్టిబొమ్మల దహనం
జగిత్యాల/మెట్పల్లి: జమ్ముకాశ్మీర్‌లో పర్యాటకులపై పాకిస్తాన్ ముష్కరులు చేసిన దాడిలో చనిపోయిన వారికి బీజేపీ, వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉగ్రవాదులను ఉపేక్షించొద్దన్నారు. మెట్‌పల్లిలోని పాత బస్టాండ్ వద్ద బీజేపీ నాయకులు ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేశ్, నాయకులు దొనికెల నవీన్ ఉన్నారు. పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
రాయికల్: రైతులకు ఇబ్బందులు కలగనీయకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని అల్లీపూర్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. గన్నీ సంచులు, లారీల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సింగిల్ విండో చైర్మన్ రాజలింగం, తహసీల్దార్ ఖయ్యూం, సీఈవో ఉపేందర్, నాయకులు ముఖీద్, తిరుపతిగౌడ్, మోర వెంకటేశ్, రత్నాకర్‌రావు, రామన్న, రవి, జీవన్‌రెడ్డి, గంగారాం, శంకర్ పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించండి జగిత్యాలరూరల్: జగిత్యాలరూరల్ మండలం క న్నాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు కన్నాపూర్, కుర్మపల్లి రైతులు వినతిపత్రం సమర్పించారు. స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్, ఉన్నతాకారులతో మాట్లాడారు. కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సైన్స్ ప్రయోగశాలకు భూమిపూజ జగిత్యాల: జిల్లాకేంద్రంలోని బాలికల హైస్కూల్లో రూ.13.5 లక్షలతో నిర్మించనున్న సైన్స్ ప్రయోగశాలకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని, విద్యాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. డీఈవో రాము, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, హెచ్ఎం రామానుజం, తపస్ జిల్లా అధ్యక్షుడు దేవయ్య పాల్గొన్నారు. డబుల్బెడ్రూం ఇళ్ల పరిశీలన నూకపల్లిలో నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇళ్లను ఎమ్మెల్యే బుధవారం పరిశీలించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 4,520 ఇళ్లను నిర్మించామన్నారు. నూకపల్లి కాలనీని జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేశామన్నారు. దాదాపు 25 వేల మంది పేదలకు వసతి కల్పించాలన్న లక్ష్యంగా ఇళ్లు నిర్మించామని తెలిపారు. -
భూ భారతితో రైతులకు మేలు
● త్వరితగతిన సమస్యలు పరిష్కారం ● కొత్త చట్టంపై రైతులకు అవగాహన సదస్సులు ● కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ల ఆధ్వర్యంలో నిర్వహణ ● ‘సాక్షి’తో కలెక్టర్ సత్యప్రసాద్ సాక్షి: భూభారతి చట్టంతో ఎలాంటి ఉపయోగాలున్నాయి?కలెక్టర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ చట్టం త్వరలో అమల్లోకి రాబోతోంది. ఇందులో ధరణిలో లేని పలు అంశాలు ఈ చట్టంలో ఉన్నాయి. వీటివల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. సాక్షి: జిల్లా రైతులు వివిధ భూ సమస్యలపై ధరణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఏమైనా పరిష్కారమవుతున్నాయా?కలెక్టర్: భూ సమస్యల పరిష్కారంలో జగిత్యాల జిల్లా ముందంజలోనే ఉంది. ధరణిలో వచ్చిన దాదాపు సమస్యలన్నీ పూర్తయ్యాయి. భూభారతి అమల్లోకి వచ్చేలోపు ధరణిలో వచ్చిన సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. సాక్షి: భూ హక్కుల రికార్డుల తప్పుల సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చా?కలెక్టర్: భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అర్హులైన వారు నూతన చట్టం వచ్చిన ఏడాదిలోపే దరఖాస్తు చేసుకునే వీలుంది. ఆర్డీవో, తహసీల్దార్లు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. సాక్షి: భూభారతి చట్టంపై రైతులకు ఎలా అవగాహన కల్పిస్తున్నారు?కలెక్టర్: భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి చట్టం గురించి వివరిస్తున్నాం. ఈనెల 30వరకు ప్రతి మండలంలో ఈ చట్టంపై వివరిస్తున్నాం. రైతులకు అనుమానాన్ని నివృత్తి చేస్తున్నాం. సాక్షి: సాదాబైనామాల క్రమబద్ధీకరణకు 8వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కొత్త చట్టంలో వాటిని పరిష్కరించే అవకాశం ఉందా? కలెక్టర్: కొత్త చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే దరఖాస్తులు చేసుకుంటున్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆర్డీవో స్థాయిలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. సాక్షి: ధరణి ఉన్నప్పుడు ఏదైనా సమస్య ఉంటే ట్రిబ్యునల్‌కు వెళ్లే అవకాశం లేదు. ఇప్పుడు ఈ చట్టంలో అవకాశం ఉందా?కలెక్టర్: కొత్త చట్టం ప్రకారం భూ హక్కుల నిరూపణకు అవసరమైన పత్రాలు జతచేస్తే ఆర్డీవో స్థాయిలో విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారు. ఎలాంటి ఇబ్బందులూ లేవు. సాక్షి: ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. వాటికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?కలెక్టర్: ఆబాది, గ్రామకంఠం వంటి భూములకు గుర్తింపు సంఖ్య ఉంటుంది. కబ్జాకు గురికాకుండా చూస్తాం. ఆధార్ కార్డు లాగే భూధార్ సంఖ్య కూడా ఇస్తాం. సాక్షి: వారసత్వ భూములకు మ్యుటేషన్ ఎలా?కలెక్టర్: వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ స్థాయిలో విచారణ జరిపి మ్యుటేషన్ చేస్తారు. ఈ చట్టం ద్వారా నిర్ణీత వ్యవధిలో కాకపోతే ఆటోమెటిక్‌గా మ్యుటేషన్ అయిపోతుంది. ఈ చట్టంలో చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి. సాక్షి: జిల్లాలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. వాటిని ఎలా పరిష్కరించే అవకాశాలున్నాయి?కలెక్టర్: రైతులకు సంబంధించిన ఏ సమస్య అయినా దరఖాస్తు చేసుకుంటే ఆర్డీవో, తహసీల్దార్, కలెక్టర్ స్థాయిలో సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలో ఈ అవకాశం లేదు. సాక్షి: చాలామంది రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. దరఖాస్తులు చేసుకున్నా రాలేదు. ఈ చట్టంలో వచ్చే అవకాశాలున్నాయా..?కలెక్టర్: పట్టాదారు పాస్బుక్ల కోసం దరఖాస్తులు చేసుకుంటే విచారణ చేపట్టి పాస్‌బుక్ జారీ చేస్తాం. రైతులకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన అనంతరం అన్ని సక్రమంగా ఉంటే బుక్ తొందరగానే వస్తుంది. జగిత్యాల: ‘ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి (రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్స్) చట్టంతో రైతులకు మేలు జరుగుతుంది. ధరణి పోర్టల్‌లో లేని పరిష్కార మార్గాలు కొత్తచట్టంలో పొందుపర్చారు. ఎలాంటి సమస్య అయినా పరిష్కరించే వీలుంది. గతంలో మాదిరిగా సీసీఎల్‌కు వెళ్లకుండా జిల్లాస్థాయిలోనే పరిష్కరించుకునే అవకాశం ఉంది. రైతులకు భూభారతి చట్టంపై వివరించేందుకు ఈనెల 17 నుంచి 29వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం..’ అని కలెక్టర్ సత్యప్రసాద్ వివరించారు. భూభారతి చట్టంపై ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. -
మోడల్‌స్కూల్ విద్యార్థుల ప్రతిభ
లజగిత్యాలరూరల్: ఇంటర్ ఫలితాల్లో జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి మోడల్ స్కూల్‌కు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. బోదాసు నాగరాణి 457, పాంపల్లి శ్రీజ 456, ఇమ్మడి అశ్విని 450, ద్వితీయ సంవత్సరంలో శేర్ల అక్షయ 975, పంబాల కావ్య 973, ఒడ్నాల అరుణ్‌కుమార్ 964 మరికొంత మంది ప్రతిభ కనబర్చినట్లు పాఠశాల ప్రిన్సిపల్ సరితాదేవి తెలిపారు. పెగడపల్లి విద్యార్థులు.. పెగడపల్లి: స్థానిక ఆదర్శ మోడల్ స్కూల్ విద్యార్థులు ఫస్టియర్‌లో 72శాతం, సెకండియర్‌లో 88 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సెకండియర్ ఎంపీసీలో రేవతి 968, ఫస్టియర్ బైపీసీలో కె.అక్షయ 425 మార్కులు సాధించారు. కేజీబీవీ విద్యార్థినులు కూడా ప్రతిభ కనబర్చారు. ప్రిన్సిపాల్ ప్రభాకర్‌రెడ్డి, మీనాక్షి, ఉపాధ్యాయులు అభినందించారు. ఫస్టియర్‌లో రాయికల్ విద్యార్థులు రాయికల్: రాయికల్ మండలం ఇటిక్యాల మోడల్‌స్కూల్ విద్యార్థులు ఎంపీసీలో రష్మిత 460, సీఈసీలో శ్రీనిధి 469, సౌమ్య బీపీసీలో 406, సెకండియర్‌లో త్రిష ఎంపీసీలో 951, రాజేశ్వరి బీపీసీలో 939, అక్షయ సీఈసీలో 949 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ సంతోష్ తెలిపారు. కేజీబీవీ విద్యార్థిని నక్క నందిని సీఈసీలో 492 సాధించినట్లు ప్రిన్సిపల్ శోభారాణి తెలిపారు. మల్లాపూర్ విద్యార్థినులు.. మల్లాపూర్: ఎంపీసీలో మల్లాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థిని జీ.లక్ష్మీనర్సయ్య 966 మార్కులు సాధించాడు. మోడల్ స్కూల్లో ఫస్టియర్‌లో 81.25 శాతం, సెకండియర్‌లో 92.37 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ భూమేష్ తెలిపారు. బైపీసీ టాపర్‌గా భావన 901, సీఈసీ టాపర్లుగా శరణ్య 882, భావన 882 మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో కీర్తన 358, బైపీసీలో చరీష్మా 308, సీఈసీలో రుచిత 361 మార్కులు సాధించారు. -
‘ట్రినిటి’ జయకేతనం
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్‌లోని ట్రినిటి విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. ఫస్టియర్ ఎంపీసీలో జి.మధురిమ 468 మార్కులు, సిరివైష్ణవ్య, ఉమాదేవి, వికాశ సాహి, శశాంక, లహరిక, అనూష, వైష్ణవి, అర్చన, వైష్ణవి, హారిక, శ్రీవర్ష, శ్రీజ, రిషిక, శరణ్య, ఫబిత ఐనాయత్, రశ్మిత, నేహ, నిఖిత 467మార్కులు సాధించారు. 48మంది 466 మార్కులు, 67 మంది 465 మార్కులు సాధించారు. బైపీసీలో పి.సహస్ర, ఎల్.హేమనందిని 438 మార్కులు, 16మంది 436 మార్కులు, 21మంది 435మార్కులు సాధించారు. సీఈసీలో వైష్ణవి 494మార్కులు, రాహుల్, దీపిక 490 మార్కులు, ఎంఈసీలో భువన విజయ్ 479, శ్రావణి 467మార్కులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో వి.రశ్మిత 995 మార్కులు, అజయ్, హితేష్, బాలాజీ, సంధ్య, ప్రణతి, సాయిసంహిత 994 మార్కులు, 13మంది 993, 21మంది 992, 27మంది 991మార్కులు సాధించారు. బైపీసీలో డి.జ్యోత్స్న 996, మహతి, పల్లవి 994మార్కులు, నలుగురు 993, ఏడుగురు 992మార్కులు, 12 మంది 991 మార్కులు సాధించారు. సీఈసీలో శృతి 981, ఎంఈసీలో రిషిక 980మార్కులు సాధించారు. వీరిని విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి అభినందించారు. -
కాంగ్రెస్ కార్యకర్తల కాళ్లలో కట్టె పెడుతున్నరు..
జగిత్యాలటౌన్: దశాబ్దకాలం బీఆర్ఎస్ పాలనలో పదవులు అనుభవించి.. స్వార్థ ప్రయోజనాల కోసం అభివృద్ధి పేరిట కాంగ్రెస్ ముసుగులో వచ్చి అసలైన కార్యకర్తల కాళ్లలో కొందరు కట్టెపెడుతున్నారని, వారి కట్టెలకన్న తమ కాళ్లు బలంగా ఉన్నాయని, కట్టెపెట్టాలని చూస్తే వారి కట్టె విరుగుతుందిగానీ తాము భయపడేదిలేదని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. జైభీం, జైబాపు, జైసంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని గాంధీనగర్ నుంచి మంచినీళ్ల బావి వరకు రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమం ఇన్చార్జి దినేష్ నాయకులు, కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నీతి, నిజాయితీ, నైతిక విలువలకు కట్టుబడి ఉందన్నారు. దశాబ్దకాలం పాటు బీఆర్ఎస్ అరాచక పాలనను ఎదిరించి పోరాడిన పార్టీ కార్యకర్తల కష్టంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, పదేళ్లు చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తామంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. అభివృద్ధి చేసేందుకు ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ బలోపేతానికి పనిచేస్తానని వెల్లడించారు. పీసీసీ కార్యదర్శి బండ శంకర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త మోహన్, గాజుల రాజేందర్, నక్క జీవన్ తదితరులు ఉన్నారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలిరాయికల్: రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. మండలంలోని అల్లీపూర్, ఉప్పుమడుగు, ఆలూరు, తాట్లవాయి, ఆల్యనాయక్‌తండా, రామాజీపేట గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల్లో వసతులు కల్పించాలని, గన్నీ సంచులు, లారీల కొరత లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ఆమె వెంట తహసీల్దార్ ఖయ్యూం ఉన్నారు. -
సత్తాచాటిన ‘రెసోనెన్స్’ విద్యార్థులు
కరీంనగర్/కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్‌లోని కోట ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలోని రెసోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించారని కళాశాల చైర్మన్ డి.అంజిరెడ్డి తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఎంపీసీలో టి.భావన, జి.సాయిఅక్షిత్, కె.సహనశ్రీ, యూ.అహన్య, ఎన్.శ్రీఅక్షిత, పి.సంజన 467/470 మార్కులు, కె.కీర్తన, ఎం.అక్షయ, కె.అక్షయవర్దన్, బి.సహశ్రీ, టి.విజయవర్దన్, ఎం.నివ్యరెడ్డి, కె.సాత్విక్, సిహెచ్ హాస్యరెడ్డి 466/470 మార్కులు, ఏడుగురు 465, 10 మంది 464 మార్కులు సాధించారన్నారు. బైపీసీలో ఎం.శ్రీష 436, బి.సాయిత్రిపుర 435, వై.వంశిక, ఎం.సంజనా నాయక్, ఎం.తేజస్వీనిలు432 మార్కులు సాధించారని తెలిపారు. సీనియర్ ఇంటర్లో ఎం.శ్రీనిత, ఎస్.శృతిలు 987/1000 మార్కులతో పాటు ఆరుగురు 980 ఆపై మార్కులు సాధించినట్లు తెలిపారు. -
భూభారతిలో రెండంచెల అప్పీల్ వ్యవస్థ పునరుద్ధరణ
● అవగాహన సదస్సులో కలెక్టర్ సత్యప్రసాద్ ● పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్సారంగాపూర్: భూభారతి చట్టంలో పట్టాదా రుడు నష్టపోయినప్పుడు తిరిగి అప్పీలు చేసుకోవడానికి రెండంచెల వ్యవస్థ పునరుద్ధరించనున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం సారంగాపూర్ రైతువేదికలో భూభా రతి చట్టంపై అవగాహన కల్పించారు. ఎమ్మె ల్యే సంజయ్‌కుమార్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ సాదాబైనామాలకు ధరణిలో పరిష్కారం దొరకలేదని, భూభారతిలో సంపూ ర్ణ పరిష్కారం లభిస్తుందన్నారు. భూమి ఇతరుల పేరిట బదలాయింపు అయితే పట్టా దారుడు మొదటి అప్పీల్ కింద ఆర్డీవో, రెండో ప్పీల్ కింద జేసీకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలి పారు. వివాదాల్లో ఉన్న భూములకూ పట్టాదా రుడు నష్టపోకుండా న్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతు ధరణిలోని లో పాలను సవరిస్తూ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఆర్డీవో మధుసూద న్, తహసీల్దార్ జమీర్, ఎంపీడీవో గంగాధర్, డెప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్ పాల్గొన్నారు. నాణ్యమైన ధాన్యం తేవాలి రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధా న్యం తేవాలని, తప్ప, తాలు లేకుండా చూడాలని కలెక్టర్, ఎమ్మెల్యే సూచించారు. కోనాపూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తూకం వేయడానికి సీరియల్ నంబర్ పాటించాలని, తేమ శాతం వస్తే తూకం వేయాలని పేర్కొన్నారు. కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకె ట్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు. జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్, విండో చైర్మన్లు గుర్నాథం మల్లారెడ్డి, ఏలేటి నర్సింహారెడ్డి ఉన్నారు. -
‘ఎస్వీజేసీ’ విజయదుందుబి
కరీంనగర్: ఇంటర్ ఫలితాల్లో ఎస్వీజేసీ విద్యార్థులు విజయదుందుబి మోగించారు. ఫస్టియర్‌లో ఎంపీసీలో సీహెచ్ రాజశేఖర్‌రెడ్డి 468, బి.వెన్నెల 466, బి.శ్రీనిత్య 466, బి.హరిణి 465, ఎన్.అరుణ్‌తేజ 464, కె.సహస్ర 463, ఎస్కే.తమన్నా 463, జె.సునీల్ 462, పి.సంజన 462, ఏ.హర్షవర్దన్ 462 మార్కులు సాధించారు. బైపీసీలో పి.సహస్ర 437, డి.శివకుమార్ 437, డి.శ్రీనిధి యాదవ్ 435, ఎం.స్పందన 434, అనికేత్ మిశ్రా 434,శ్రీవల్లి 432, బి.రుచిత 431, ఎన్.నిహారక 430 మార్కులు సాధించారు. సెకండియర్ బైపీసీలో పి.లిఖిత 992, ఎం.స్పూర్తి 992, ఎస్.రిషిక 991, టి.లిఖిత గౌడ్ 989, ఆర్.మేఘన 988, కె.కార్తీక్ 988, ఎస్.లావణ్య 987, ఎం.త్రిణిజ 987, ఎస్.రక్షిత 987 మార్కులు సాధించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ ఊట్కూరి మహిపాల్‌రెడ్డి అభినందించారు. ప్రిన్సిపాల్ కాంతాల రాంరెడ్డి, వెంకట వరప్రసాద్, డైరెక్టర్లు సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు. -
జగిత్యాల
న్యూస్రీల్నృసింహ స్వామి ఆలయం శుభ్రంధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయాన్ని మంగళవారం రాత్రి ఫైరింజన్‌తో శుభ్రం చేశారు. ఆలయం లోపలిభాగాన్ని కొన్నాళ్లుగా శుభ్రం చేయకపోవడంతో విషయాన్ని ఆలయ చైర్మన్ జక్కు రవీందర్ దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఫైరింజన్‌కు ఆన్లైన్లో చలానా చెల్లించి శుభ్రం చేసినట్లు తెలిపారు. బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025 -
నేనూ వస్త బిడ్డా కేసీఆర్ సభకు..
9జగిత్యాలరూరల్: ‘కేసీఆర్‌ను చూడాలవ్వ.. నేనూ వస్తా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు.. నన్ను ఎలాగైనా తీసుకెళ్లండి..’ అంటూ జగిత్యాల రూరల్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన వృద్ధుడు చిన్నమల్లయ్య జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతను కోరారు. తాను కేసీఆర్‌ను చూస్తానని, తనను సభకు తీసుకెళ్లండని బతిమిలాడా రు. దీనికి వసంత మాట్లాడుతూ.. కేసీఆర్ సభకు తప్పకుండా తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. గ్రామగ్రామాన బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈనెల 27న గ్రామగ్రామాన పార్టీ జెండాలు ఆవిష్కరించాలని వసంత సూచించారు. జగిత్యాలరూరల్ మండలం లక్ష్మీపూర్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామ రక్ష అన్నారు. సింగిల్ విండో చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, ఆనందరావు, తుమ్మ గంగాధర్, మాజీ జెడ్పీటీసీ మహేశ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు సునీత, స్వప్న పాల్గొన్నారు. ఆంధ్రులు తెలంగాణకు వ్యవసాయం నేర్పారా..? తెలంగాణ రైతులకు ఆంధ్రప్రాంతం వారు వ్యవసాయం నేర్పించారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడటం యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానపర్చినట్టేనని వసంత అన్నారు. తెలంగాణ రైతులకు వెయ్యేళ్ల క్రితమే దక్కన్ ప్రాంతంలో వరి పండించిన చరిత్ర ఉందన్నారు. -
‘ఎస్ఆర్’ ప్రభంజనం
తిమ్మాపూర్: ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లాలోని ఎస్ఆర్ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ సెకండియర్‌లో ఎంపీసీలో 45 మంది 990 మార్కులకుపైగా సాధించారు. బైపీసీలో నలుగురు 990కిపైగా మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో 63 మంది 465 మార్కులకుపైగా సాధించారు. బైపీసీలో 435 మార్కులకుపైన సాధించి ముగ్గురు విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎంపీసీ సెకండియర్‌లో కాసర్ల భవాని, అబ్దుల్ రయాన్ 994 మార్కులు, సింధూజ 993 మార్కులు సాధించగా, 992 మార్కులు 16మంది సాధించారు. బైపీసీ ద్వితీయ సంవత్సరంలో బి.సహస్ర 993మార్కులు, కదిరి స్ఫూర్తి, కొత్తపల్లి జాహ్నవి 992మార్కులు, నాదే పూజిత 991మార్కులు సాధించారు. ఎంపీసీ ఫస్టియర్‌లో బండి ప్రతిష్ట, మండలోజి వైశాలిని 468 మార్కులు, ఏడుగురు 467 మార్కులు సాధించారు. బైపీసీ ఫస్టియర్‌లో హజామా హవీన్ 436 మార్కులు, దాడి శివాని, కీర్తన, వాసవి 435మార్కులు సాధించారు. వీరిని జోనల్ ఇన్చార్జి తిరుపతి, విద్యాసంస్థలు చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, డీజీఎం వాసుదేవరెడ్డి అభినందించారు. -
మగ్గిడి మోడల్ స్కూల్ విద్యార్థులు...
ధర్మపురి: ధర్మపురి మండలం మగ్గిడి మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబ ర్చారు. ఫస్టియర్‌లో 148మందికి 120 మంది పాసయ్యారు. సెకండియర్‌లో 119 మందికి 111 మంది ఉత్తీర్ణులయ్యారు. మైనార్టీ గురుకులంలో ఫస్టియర్‌లో 53 మందికి 47, సెకండియర్‌లో 45 మందికి 45 మంది ఉత్తీర్ణులయ్యారు. మగ్గిడి సోషల్ వెల్ఫేర్ కళా శాలలో ఫస్టియర్‌లో 18 మందికి 13, సెకండియర్‌లో 13 మందికి 13 మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులను మగ్గిడి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మ, అధ్యాపకులు అభినందించారు. నక్షత్ర -
బాలికలదే పైచేయి
● ఇంటర్ ఫస్టియర్‌లో 68శాతం పాసైన బాలికలు ● 39శాతంతో బాలుర ఉత్తీర్ణత ● సెకండియర్‌లో 54.9 శాతం బాలురు.. ● 78.58 శాతంతో బాలికలు అగ్రస్థానం ● జిల్లాకు ఫస్టియిర్‌లో 24.. సెకండియర్‌లో 18వ స్థానంజగిత్యాల: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా బాలికలే పైచేయి సాధించారు. సెకండియర్‌లో జిల్లా రాష్ట్రంలో 24వ స్థానంలో నిలువగా.. ఫస్టియర్ ఫలితాల్లో 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 73 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 13 మోడల్‌స్కూళ్లు, ఏడు కేజీబీవీ, ఐదు సోషల్ రెసిడెన్సీలు, ఐదు మైనార్టీ రెసిడెన్షియల్స్ 5, రెండు బీ సీ రెసిడెన్షియల్స్, ఐదు టీఎస్డబ్ల్యూఆర్సీజేసీ, 21 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రథమ సంవత్సరంలో.. జిల్లాలో మొదటి సంవత్సరం 2,554 మంది బాలురు పరీక్షలు రాయగా కేవలం 996 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇది 39శాతంగా నమోదైంది. బాలికలు 3,550 పరీక్ష రాయగా.. 2,443 మంది ఉత్తీర్ణతతో 68.82 శాతం సాధించారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలను 2,233 బాలురు రాయగా.. 1226 మంది ఉత్తీర్ణతతో 54.9 శాతం సాధించారు. బాలికలు 3,137 పరీక్ష రాసి 2,465 మంది పాసై 78.58 శాతం నమోదు చేశారు. ప్రథమ సంవత్సరం ఒకేషనల్‌లో బాలురు 570 మంది రాసి 178 మంది పాసయ్యారు. 399 బాలికలు పరీక్ష రాసి 273 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్‌లో 454 బాలురు పరీక్ష రాయగా 226 మంది పాసయ్యారు. 349 బాలికలు పరీక్షరాసి 303 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాలల్లోనే ఉత్తమ విద్య ప్రభుత్వ కళాశాలల్లోనే ఉత్తమ విద్య లభిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నా రు. ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి మార్కులు సాధించడంపై వారిని అభినందించారు. పేద విద్యార్థులు ప్రైవేటు కళాశాలలతో పోటీపడుతూ అత్యధిక మార్కులు సాధించడం అభినందనీయమన్నారు. సీఈసీ సెకండియర్‌లో మానుపాటి వర్ష 971, గ్రీష్మ 928, ఫస్టియర్ ఎంపీసీలో సానియామీర్జా 465, బైపీసీలో నజాలియ నస్ర 430 మార్కులు సాధించారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి నారాయణ, అధ్యాపకులు కొట్టాల తిరుపతిరెడ్డి, రాజయ్య, సునీత, శ్రీలత, శిల్ప, మాధవి పాల్గొన్నారు. మే 22 నుంచి సప్లిమెంటరీఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా గతేడాది కంటే మెరుగైన స్థానంలో నిలిచిందని ఇంటర్ నోడల్ అధికారి నారాయణ తెలిపారు. ఫస్టియర్‌లో 4.65శాతం, సెకండియర్‌లో 4.4శాతం ఉత్తీర్ణత పెరిగిందన్నారు. ఉత్తీర్ణులు కాని విద్యార్థుల కోసం మే 22నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఏదైనా సబ్జెక్ట్‌లో తక్కువ మార్కులు వచ్చినా.. రీకౌంటింగ్.. రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 30లోపు ఫీజు చెల్లించి ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. జవాబు ప్రతిని కూడా పొందవచ్చని సూచించారు. -
ఇంటర్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఆత్మహత్య
పాలకుర్తి(రామగుండం): ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘనశ్యాందాస్నగర్లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సాపల్ల ఎల్లయ్య– గంగమ్మ దంపతుల కూతురు శశిరేఖ(17) సిరిసిల్లలోని మోడల్ స్కూల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివింది. ఇటీవల పరీక్షలు రాసింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో కామర్స్ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యింది. శశిరేఖ తలి గంగమ్మ ఉదయమే పనికోసం పెద్దపల్లికి, తండ్రి ఎల్లయ్య క్వారీ పనికి వెళ్లాడు. శశిరేఖ ఒంటరిగా ఉన్నది. మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకుంది. తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చిచూసేసరికి విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె. ఇద్దరు కుమారులలో ఒకరు బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్నాడు. మరో కుమారుడికి ఇటీవలే నేవీలో ఉద్యోగం రాగా శిక్షణ నిమిత్తం కేరళలో ఉంటున్నాడు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై స్వామి తెలిపారు. బావిలో దూకి మహిళ ఆత్మహత్యబుగ్గారం: జీవితంపై విరక్తితో వ్యవసాయ బావిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుగ్గారం మండలం గంగాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల, పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కట్ట గంగమ్మ (61) కొంతకాలంగా క్షయ వ్యాధితో బాధపడుతోంది. జీవితంపై విరక్తి చెంది ఇంటికి సమీపంలోని ఓ వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కుమారుడు కట్ట తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపారు. గంగమ్మకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అత్యాచారయత్నం కేసులో రెండేళ్ల జైలు జగిత్యాలజోన్: మహిళపై అత్యాచారయత్నం కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జగిత్యాల మొదటి అదన పు జిల్లా జడ్జి సుగళి నారాయణ మంగళవారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాసారపు మల్లేశం కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళను భర్త వదిలివెళ్లిపోవడంతో పిల్లలతో కలిసి కిరాణం షాఫు పెట్టుకుని జీవిస్తోంది. 2019 మే9న రాత్రి భోజనం చేసి తన పిల్లలతో కలిసి నిద్రిస్తున్న సమయంలో సొంత చిన్న మామ అయిన బోద్దుల రాజేందర్ కిటికికి ఉన్న దోమ తెరను కత్తిరించుకుని అక్రమంగా మహిళ ఇంట్లోకి చొరబడి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. సదరు మహిళ అరవడంతో పక్కింటి వారు వచ్చేసరికి రాజేందర్ అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై సతీష్ కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు కె.నరేష్, బి.రాజునాయక్ సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టారు. పరిశీలించిన జడ్జి బొద్దుల రాజేందర్‌కు రెండేళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. -
‘పెద్దింటి’కి అరుదైన గౌరవం
సిరిసిల్లకల్చరల్: జిల్లాకు చెందిన ప్రముఖ కథారచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. ఆయన రాసిన జిగిరి, గోస, అనగనగా ఓ కోడిపెట్ట అనే కథలను వరంగల్‌లోని శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులకు సిలబస్‌గా ప్రవేశపెట్టారు. ఆయా కథలను బోధించే బాధ్యతను కూడా అప్పగించారు. స్వతహాగా ఉపాధ్యాయుడైన పెద్దింటి కళాశాల విద్యార్థులకు కథలను పాఠాలుగా బోధించారు. ఎనిమిది దశాబ్దాల చరిత్ర గల కళాశాలలో రచయితే అధ్యాపకుడై బోధించడం ఇదే తొలిసారి అని ప్రిన్సిపాల్ సానబోయిన సతీశ్ తెలిపారు. తన కథలపై తానే విస్తృతోపన్యాసం ఇవ్వడం మర్చిపోలేని అనుభవంగా పెద్దింటి అభివర్ణించారు. ఈ సందర్భంగా పెద్దింటిని మానేరు రచయితల సంఘం ప్రతినిధులు, కవులు, రచయితలు అభినందించారు. -
● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
కోరుట్ల: ఈనెల 27 వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సత సభకు భారీగా తరలిరావాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఈ మేరకు కోరుట్ల పట్టణంలో సోమవారం పలు కుల సంఘాలు, యువజన సంఘాల నాయకులను కలిసి ఆహ్వాన పత్రికలు అందించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించేందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని, అమలు సాధ్యంకాని హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రానికి మళ్లీ కేసీఆర్ అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
డిజిటల్ భవిష్యత్‌కు ఏఐ
గంభీరావుపేట(సిరిసిల్ల): డిజిటల్ భవిష్యత్ మొ త్తం ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పైనే ఆధారపడి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఫిజికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై నేషనల్ సెమినార్ కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పలు రీసెర్చ్ సంస్థల ప్రొఫెసర్లు పాల్గొని పవర్ ప్రెజెంటేషన్లు, ప్యానల్ డిస్కషన్, పోస్టర్ ప్రజెంటేషన్ ద్వారా ఏఐ గురించి వివరించారు. సెమినార్లో ఏం చెప్పారంటే.. డిజిటల్ భవిష్యత్‌కు కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) దోహదపడుతుందన్నారు. సాంకేతిక విప్లవాన్ని ముందుకు సాగించే క్రమంలో త్వరలోనే కృత్రిమ మేధ ప్రజలకు అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. సాంకేతికత, ఆవిష్కరణలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా సాధారణ పౌరుల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతూ వారి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. ఏఐ టెక్నాలజీని వినియోగించుకొని విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. పోటీ ప్రపంచానికి అనుగుణంగా స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకుంటూ విద్యార్థులు డిజిటల్ భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయలక్ష్మి, ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, రీసోర్స్ పర్సన్లు కల్యాణి, స్వాతి మాతూర్, హంట్ మెట్రిక్ సీఈవో అయూబ్ షేక్, సెమినార్ ఆర్గనైజింగ్ సెక్రటర డాక్టర్ శ్రావణ్‌కుమార్, పరిశోధకులు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. త్వరలో అందరికీ అందుబాటులోకి ‘కృత్రిమ మేధ’ గంభీరావుపేట డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నేషనల్ సెమినార్ హాజరైన రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఆకట్టుకున్న ప్రొఫెసర్ల పవర్ ప్రెజెంటేషన్లు -
విద్యార్థులే ‘సాగు’లో శాస్త్రవేత్తలు
● రావెప్కు కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలు ఎంపిక ● రైతులతోనే నాలుగు నెలల పాటు క్షేత్రస్థాయి పాఠాలు ● భౌగోళిక స్వరూపం, ప్రదర్శనల రూపకల్పనకరీంనగర్ అర్బన్: అవును.. విద్యార్థులే శాస్త్రవేత్తలుగా సలహాలు, సూచనలు అందించనున్నారు. అంతర్జాలం ద్వారా అందే సేవలను వివరించడంతో పాటు రైతుల జీవన ప్రమాణాలను రూపొందించనుండగా గ్రామ భౌగోళిక స్వరూపాన్ని డయాగ్రామ్ ద్వారా నివేదించనున్నారు. గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం (రావెప్)లో భాగంగా వ్యవసాయ విద్యార్థినులు నాలుగు నెలలపాటు గ్రామాల్లోనే బస చేయనున్నారు. కరీంనగర్ ఏరువాక ఆధ్వర్యంలో కార్యాచరణను రూపొందించగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎంపిక చేయగా ఇప్పటికే విద్యార్థులు రైతులతో మమేకమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ కళాశాలకు చెందిన మొత్తం 21మంది విద్యార్థులకు గానూ 4–5గురు విద్యార్థులతో బృందాలను ఏర్పాటు చేసి, మండలానికో గ్రామం ఎంపిక చేశారు. కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లి మండలం నాగుల మల్యాల, జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం పూడూరు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం తడగొండ గ్రామాల్లో క్షేత్రస్థాయి అనుభవాలను గడిస్తున్నారు. జూన్ వరకు కార్యక్రమాల నిర్వహణతో పాటు అనుభవాలను పొందనున్నారని కరీంనగర్ ఏరువాక సమన్వయకర్త డా.మదన్‌మోహన్‌రెడ్డి వివరించారు. యూట్యూబ్, టోల్‌ఫ్రీ సేవలపై ప్రచారం రైతులు ఆధునిక సాగు పద్ధతులను అనుసరించేలా అంతర్జాల వివరాలపై అవగాహన కల్పించనున్నారు. రైతు వేదికలో ఎప్పకటిప్పటి సమాచారాన్ని ప్రదర్శించనున్నారు. గ్రామీణ విశ్లేషణాత్మక తులనం(పీఆర్ఏ)లో భాగంగా సోషల్ మ్యాప్ వేసి గ్రామంలో ఉన్న భౌగోళిక వివరాలు, పోస్టాఫీస్, బ్యాంకులు, ఇతరత్రా వివరాలను రూపొందించనున్నారు. యూట్యూబ్ ఛానల్ ‘పీజేటీఎస్‌ఎయూ’లో అగ్రికల్చర్ యూనివర్సిటీ వీడియోలు ఉండనుండగా అథెంటిక్‌గా రూపొందించారు. ప్రధాన శాస్త్రవేత్తలు సూచనలు, సలహాలు చూసుకోవచ్చు. రైతుల విజయగాథలు ఉండనుండగా నిర్దిష్టమైన సమాచారం ఉంటుంది. వరి, పత్తి, మొక్కజొన్న, పెసలు, మినుములు, అపరాలు, తృణధాన్యాలపై వీడియోలు ఉండనున్నాయి. కిసాన్ సారథి టోల్‌ఫ్రీ నంబర్ 14426 లేదా 18001232175 ఫోన్ చేసి రైతులు తమ సమస్యలను వివరిస్తే పరిష్కారం చూపనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సేవలందనుండగా రైతులు ఫోన్ చేస్తే ఏ జిల్లా నుంచి చేస్తున్నారో ఆ జిల్లా ఏరువాక, కేవీకే శాస్త్రవేత్తలు లైన్లోకి రానున్నారు. ఇక వ్యవసాయ యూనివర్శిటీలు రూపొందించిన విత్తనాలను రైతుల క్షేత్రాల్లో ప్రాక్టికల్‌గా పరీక్షించనున్నారు. విత్తు నుంచి కోత వరకు సేవలు ఒక్కో విద్యార్థినికి ఒక్కో రైతును అటాచ్ చేయగా వివిధ రకాల విత్తనాలు వేసిన నుంచి పంట కోత వరకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. విత్తన ఎంపిక, విత్తన శుద్ధితో పాటు పంటలకు ఆశించే చీడపీడల నివారణ, దిగుబడులు ఎక్కువగా వచ్చేందుకు అనుసరించిన యజమాన్య పద్ధతులను శాస్త్రవేత్తల సూచనల క్రమంలో ఫీల్డ్‌లో అమలు చేయనున్నారు. ఎరువుల యాజమాన్యం, పురుగు మందుల వినియోగం పొదుపుగా జరిగేలా సూచనలు చేయనున్నారు. అలాగే ఏ గ్రామంలో సేవలందిస్తున్నారో ఆ గ్రామ నైసర్గిక స్వరూపంతో పాటు వనరులను వివరిస్తూ డయాగ్రామ్ రూపొందించనున్నారు. నాలుగు నెలల పాటు సేవలు మాది సిద్దిపేట. సిరిసిల్ల వ్యవసాయ కళాశాలలో అగ్రి కల్చర్ లాస్ట్ ఇయర్ చదువుతున్న. వ్యవసాయ విద్యార్థులకు తరగతి బోధనలతో పాటు ప్రాక్టీకల్ అవగాహన అవసరం. అందుకే నాలుగు నెలల పాటు పంట పొలాలు, రైతుల మధ్య తిరుగుతూ నివేదికలు, మ్యాప్‌లు రూపొందించాల్సి ఉంటుంది. – పి.స్పందన, ఆగ్రికల్చర్ విద్యార్థి, సిద్దిపేట -
చెరువులో మునిగి ఒకరి మృతి
● చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతు ముస్తాబాద్(సిరిసిల్ల): చేపలు పట్టేందుకు వెళ్లి.. వ్యక్తి చెరువులో గల్లంతవగా.. మరొకరు సురక్షితంగా బయటపడ్డ సంఘటన ముస్తాబాద్ మండలం కొండాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. కొండాపూర్‌కు చెందిన మహ్మద్ రషీద్(45), బాబా(30) గ్రామ శివారులోని పెద్ద చెరువులోకి చేపలు పట్టేందుకు ఆదివారం రాత్రి వెళ్లారు. ఇద్దరు వలతో చెరువులోకి దిగారు. రషీద్ చెరువులో మునిగిపోయాడు. రషీద్ కోసం బాబా ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో గ్రామంలోకి వెళ్లి విషయం తెలిపాడు. గ్రామస్తులు పెద్దచెరువులో రాత్రి ఎంత గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం సిరిసిల్ల నుంచి గజఈతగాళ్లను రప్పించారు. వారు రషీద్ మృతదేహాన్ని బయటకు తీసుకురావడంతో భార్య షెహనాజ్, కూతురు రేష్మ, కుమారుడు రఫీ, బంధువుల రోదనలు మిన్నంటాయి. రషీద్ ఆరు నెలల క్రితమే దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మూడేళ్ల క్రితం అదే చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి మహ్మద్ ఎక్రామ్ చనిపోయాడు. విద్యుత్షాకుతో రైతు..బుగ్గారం: పంటకు నీరు పెట్టడానికి వెళ్లి మోటార్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు వైరు తగిలి రైతు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుగ్గారం మండలం గోపులాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీధర్, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోవిందుల మల్లేశం(58) సోమవారం ఉదయం పెసరు, నువ్వుల పంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. స్టార్టర్ డబ్బా ఇనుపది కావడంతో సర్వీస్ వైరు మధ్యలో కొద్దిగా కట్ అయిన విషయం తెలియక మోటార్ స్టార్ట్ చేసేందుకు యత్నించాడు. డబ్బాకు అంటిన సర్వీస్ వైరుకు విద్యుత్ సరఫరా అయి రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మల్లేశం భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సీఎంఆర్ చెల్లించాలిజగిత్యాల: వానాకాలం సీజన్ 2024–25కు సంబంధించి సీఎంఆర్ రోజువారి లక్ష్యం ప్రకారం చెల్లించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బాయిల్డ్ రైస్‌మిల్లర్లతో సోమవారం సమీక్షించారు. మిల్లు కెపాసిటి ప్రకారం రోజువారి సీఎంఆర్ చెల్లింపులు చేయాలని ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నివేదిక సమర్పించాలన్నారు. ఎఫ్‌సీఐ అధికారులు సీఎంఆర్ గోదాముల్లో అవసరమైన స్థలం ఏర్పాటు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ లత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మామిడి మార్కెట్ ఆదాయం పెరిగేనా..?
● రూ.కోట్లలో సాగుతున్న వ్యాపారం ● మార్కెట్‌కు ఫీజు మాత్రం అంతంతే ● ఏటా రూ.70లక్షలు దాటని ఆదాయంజగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాలలోని చల్గల్ మామిడి మార్కెట్లో ఏటా కోట్లలో వ్యాపారం జరుగుతున్నా.. మార్కెట్ ఫీజు మాత్రం అంతంతమాత్రంగానే వస్తోంది. మార్కెట్ అధికారుల నిర్లక్ష్యంతో వ్యాపారులు ఇష్టారీతిన ఫీజు చెల్లిస్తుండటంతో సరైన ఆదాయం రావడం లేదు. మామిడి మార్కెట్ ఏర్పాటై 20 ఏళ్లు గడుస్తున్నప్పటికీ.. ఆదాయం ఏటా రూ.50లక్షల నుంచి రూ.60లక్షలలోపే ఉండటం అనుమానాలకు తావిస్తోంది. రూ.కోట్లలో మామిడి వ్యాపారం చల్గల్లో మామిడి మార్కెట్ 2005లో సుమారు 23 ఎకరాల స్థలంలో ఏర్పాటైంది. ఈ మార్కెట్లో ఏటా రూ.కోట్లలో వ్యాపారం సాగుతుంది. కాయలు కొనుగోలు చేసేందుకు 88 మంది కమీషన్ ఏజెంట్లు, 59 మంది అడ్తిదారులు ఉన్నారు. వీరంతా ప్రతి సీజన్లో రూ.200కోట్ల వరకు వ్యాపారం చేస్తుంటారు. సీజన్లో ఇక్కడి నుంచి మామిడిని పంజాబ్, హర్యానా, ఢిల్లీ, నాగ్‌పూర్ వంటి ప్రాంతాలకు రోజుకు కనీసం 5 నుంచి 10 లారీలు తరలిస్తుంటారు. పెద్దలారీలో 12 నుంచి 15 టన్నులు, చిన్న లారీలో 8 నుంచి 10 టన్నుల మామిడి ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది. ఐదారేళ్లుగా సగటున టన్ను మామిడికాయల రేటు రూ.30 వేల వరకు ఉంది. పెద్ద లారీలో వెళ్లే 15 టన్నుల మామిడికి టన్నుకు రూ.30వేల చొప్పున, రూ.4.50 లక్షలు అవుతుంది. మామిడికాయల కొనుగోలు విలువ ప్రకారం వ్యాపారులు ఒక శాతం మార్కెట్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. దీని ప్రకారం ఒక్కో లారీకి రూ.4500 మార్కెట్ ఫీజు చెల్లించాలి. మామిడికాయ రేటు పెరిగినప్పుడల్లా.. రేటు ప్రకారం మార్కెట్ ఫీజు వసూలు చేయాలి. వ్యాపారులు అధిక రేటు పెట్టి మామిడికాయలు కొనుగోలు చేసినప్పటికీ తక్కువ రేటుకు కొన్నామని చెప్పి ఆ మేరకు అధికారులు మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఫలితంగా మార్కెట్ ఫీజుకు గండి పడుతోంది. గతేడాది రూ.63.29లక్షలు మాత్రమే వసూలైంది. 2018లో రూ.71.89 లక్షలు, 2019లో రూ.64.01లక్షలు, 2020లో రూ.69.65 లక్షలు, 2021లో రూ.91.70 లక్షలు, 2022లో రూ.60.90 లక్షలు, 2023 రూ.43.28 లక్షల ఫీజు మాత్రమే వసూలైంది. ప్రారంభం నామమాత్రం దివంగత వైఎస్ హయాంలో అప్పటి మంత్రి జీ వన్ రెడ్డి పట్టుబట్టి మామిడి మార్కెట్‌ను జగి త్యాలకు తెచ్చారు. రూ.కోట్లు విలువైన వాలంతరీ సంస్థ స్థలాన్ని మార్కెట్‌కు కేటా యించారు. కేసీఆర్ ప్రభుత్వం ఎమ్మెల్యే సంజ య్‌కుమార్ ఒత్తిడితో మరో 10 ఎకరాలు కేటాయించింది. స్థలంతోపాటు దాదాపు రూ.6కోట్ల నుంచి రూ.7కోట్లతో వ్యాపారుల కోసం షెడ్లు నిర్మించారు. మార్కెట్ ప్రారంభ సమయంలో వ్యాపారులు, రైతులకు మార్కెట్‌ను పరిచయం చేసేందుకు లారీకి రూ.500 నుంచి రూ.వెయ్యి ప్పున నామమాత్రపు మార్కెట్ ఫీజు వసూలు చేసారు. అదే అదనుగా తీసుకున్న వ్యాపారులు మార్కెట్ ఫీజు చెల్లించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. నిర్వహణకూ సరిపోని పరిస్థితి మార్కెట్‌కు వచ్చే ఫీజు నిర్వహణకు సరిపోని పరిస్థితి ఏర్పడింది. కరెంట్ బిల్లులు కూడా మార్కెట్ నుంచే చెల్లించే పరిస్థితి నెలకొంది. విద్యుత్ స్తంభాలు జరపడం, తాగునీటి వసతి కల్పించడం, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం వంటి పనులు కొన్నేళ్లుగా చేస్తూనే ఉన్నారు. మార్కెట్‌ను పర్యవేక్షించే నలుగురైదుగురు సిబ్బంది జీతభత్యాలు కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. షెడ్ల నిర్మాణానికి మేడ్చల్, ములుగు, నర్సంపేట, కథలాపూర్, లక్సెట్టిపేట మార్కెట్ల నుంచి రూ.5.20 కోట్లు అప్పు తెచ్చారు. ఆ ఆప్పులకు వడ్డీ చెల్లించేందుకు మార్కెట్ ఫీజు సరిపోవడం లేదు. -
జర్నలిస్టుల పరిస్థితి దుర్భరం
వేములవాడ: రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి దుర్భరంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. వేములవాడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వస్తే జర్నలిస్టులను ఆదుకుంటామన్నారు. జర్నలిజం అనుభవం లేకున్నా యూట్యూబ్ చానళ్ల ముసుగులో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి గతంలో రూ.10 లక్షల మేరకు ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు చేశారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్ అధ్యక్షతన బండి సంజయ్‌ని సన్మానించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, నాయకులు ప్రతాప రామకృష్ణ, కుమ్మరి శంకర్, వికాస్‌రావు, ఐజేయూ జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్, కార్యదర్శి మహేశ్ పాల్గొన్నారు. ప్రసాద్ స్కీంలోకి రాజన్న గుడి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ప్రసాద్స్కీంలో చేర్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్‌టౌన్: దేశ చరిత్రలో అంబేడ్కర్ ఎదుర్కొ న్న అవమానాలు మరెవరూ ఎదుర్కోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. తన మేధాశక్తిని అణగారిన వర్గాల అ భ్యున్నతికి ధారపోసిన మహనీయుడు అని కొని యాడారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్లో నిర్వహించిన సెమినార్‌కు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేడ్కర్‌ను దళిత జాతికే పరిమి తం చేయాలని కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు. చరిత్ర అంటే డూప్లికేట్ గాంధీ కుటుంబానిదే అన్నట్లుగా విపరీతమైన ప్రచారం చేసుకుని ఆయన్ను తక్కువ చేసిందన్నారు. కాంగ్రెస్ తీరుతో విసుగుచెంది రాజీనామా చేసి బయటకొచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే కమ్యూనిస్టులతో కలిసిన రెండుసార్లు అంబేద్కర్‌ను ఓడించిందన్నారు. డూప్లికేట్ గాంధీ కుటుంబసభ్యులైన నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీలకు భారతరత్న ఇచ్చుకుందన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు కల్పించేందుకు కుట్రలు చేసిందన్నారు. అంబేద్కర్‌కు భారతరత్న వచ్చేలా చేసిన పార్టీ బీజేపీ అని అంబేడ్కర్ జయంతి రోజు రాష్ట్రీయ సమరసత దినంగా ప్రకటించి 120దేశాల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, మానేరు అనంతరెడ్డి, దేవేందర్ రావు, అడవి కుమార్, డాక్టర్ గంగాధర్, రాజేందర్‌రెడ్డి, సోమిడి వేణు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని విధాలా ఆదుకుంటాం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యలు -
ఇష్టారాజ్యంగా మార్కెట్ ఫీజు
మామిడి మార్కెట్లో ఇష్టారాజ్యంగా మార్కెట్ పీజు వసూలు చేస్తున్నారు. ఎంత కాయ కొంటున్నారు..? ఎంత వసూలు చేస్తున్నారు..? ఎవరికీ తెలియదు. మార్కెట్ ఫీజు బుక్కులు చివరకు వ్యాపారులకే ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఈ సారి అలా జరగకుండా చూడాలి. – బందెల మల్లయ్య, చల్గల్, రైతు పకడ్బందీగా వసూలు చేస్తాం గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా.. ఈసారి పకడ్బందీగా మార్కెట్ ఫీజు వసూలు చేస్తాం. మార్కెట్ కమిటీ పర్యవేక్షణలో ఉండేందుకే ఏ వ్యాపారికి కూడా మార్కెట్ బయట క్రయ విక్రయాలు చేసేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ప్రతిరోజూ వ్యాపారుల దుకాణాలు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తాం. – రాజశేఖర్, మార్కెట్ కార్యదర్శి, జగిత్యాల -
వరంగల్ సభకు చలో చలో..
మేడిపల్లి: ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు కోరారు. సోమవారం మండలకేంద్రంలో ముఖ్య నాయకులతో సమావేశమై సభ వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా గ్రామగ్రామాన బీఆర్ఎస్ జండా ఎగురవేయాలని, వరంగల్ సభకు తరలిరావాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు క్యాతం సత్తిరెడ్డి, చెన్నమనేని అజిత్‌రావు, ఉదిగిరి ఆదిరెడ్డి, మకిలీ దాసు, దేశవేని కృష్ణ, నాంచారి రాజేందర్ పాల్గొన్నారు. -
ఫసల్ బీమా అమలు చేస్తే రైతులకు పరిహారం అందేది
● నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇబ్రహీంపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తే రైతులకు పంట నష్ట పరిహారం అందేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో నష్టపోయిన పంటలను ఎంపీ సోమవారం పరిశీలించారు. పంట నష్టంపై సత్వరమే సర్వే నిర్వహించి ఎకరాకు రూ.50వేల చొప్పున అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు, మండల అధ్యక్షుడు బాయి లింగారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నరేందర్‌రెడ్డి, నాయకులు రఘు, సుకేందర్‌గౌడ్, వొడ్డెపల్లి శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నృసింహుని సన్నిధిలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామిని సోమవారం రాష్ట్ర రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయం తరఫున చైర్మన్ జక్కు రవీందర్ వారికి స్వామివారి శేషవస్త్రం, చిత్రపటం అందించారు. జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు పుల్లూరి సత్యనారాయణ, అర్చకులు నంబి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా జడ్జి పూజలు నృసింహస్వామిని మంచిర్యాల జడ్జి అర్పిత దర్శించుకున్నారు. ఈవో శ్రీనివాస్ ఆమెకు స్వాగతం పలికి స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. తేమశాతం వచ్చిన ధాన్యం కొనండిమెట్పల్లిరూరల్: తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్పల్లి మండలం మేడిపల్లి, సత్తక్కపల్లి గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కొనుగోళ్లలో జాప్యం చేయవద్దని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. రైతులు దళారులకు అమ్మి నష్టపోవద్దని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, ఏపీఎం విమోచన, ఏఈవో మనోజ్ఞ, మాజీ ఎంపీపీ సాయిరెడ్డి, నాయకులు ఆరెళ్ల రాజాగౌడ్, గంగాధర్, శ్రీధర్, లింగారెడ్డి, ఖుతుబొద్దీన్పాషా, తదితరులు పాల్గొన్నారు. భారీ వాహనాలు రాకుండా..ధర్మపురి: నృసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. భారీ వాహనాలతో భక్తులు, వ్యాపారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో నంది చౌరస్తా నుంచి నృసింహుని ఆలయం వరకు.. అక్కడి నుంచి బ్రాహ్మణ సంఘం వరకు భారీ వాహనాలు రాకుండా కట్టుదిట్టమైన ఐరన్ పైపులు అమర్చారు. వాటి వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీఐపీలు, వికలాంగులు, వృద్ధులకు వెసులుబాటు కల్పించారు. భక్తుల వాహనాలను బ్రాహ్మణసంఘం, నైట్ కాలేజీ వద్ద నున్న పార్కింగ్‌లో పెట్టుకోవాలని సూచించారు. స్థానికులకు షరతులు ఉండవని తెలిపారు. -
భూసమస్యల పరిష్కారానికే ‘భూ భారతి’
మెట్‌పల్లిరూరల్: రైతుల భూ సమస్యలన్నింటికీ భూభారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్పల్లి శివారులోని ఓ గార్డెన్లో భూభారతి చట్టంపై సోమవారం అవగాహన కల్పించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న సాదాబైనామా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. వీఆర్వో, వీఆర్ఏలు లేకపోవడంతో రైతుల భూ సమస్యలను గుర్తించేందుకు తహసీల్దార్లకు ఇబ్బందులు ఎదురయ్యాయని, నూతన చట్టంతో గ్రామస్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని వెల్లడించారు. ఏటా డిసెంబర్ 31న భూభారతి చట్టంలోని రికార్డులను ఆప్డేట్ చేస్తారన్నారు. అనంతరం విట్టంపేట, మెట్లాచిట్టాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మోహన్, డీఆర్డీవో పీడీ రఘువరన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్, ఆర్ఐలు కాంతయ్య, ఉమేశ్, నాయకులు, రైతులు పాల్గొన్నారు. భూములకు రక్షణ కల్పించేందుకే కొత్త చట్టం: విప్ అడ్లూరి గొల్లపల్లి: భూములకు రక్షణ కల్పించడానికే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూభారతి పోర్టల్‌ను రైతుల శ్రేయస్సే లక్ష్యంగా రూపొందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ● కలెక్టర్ సత్యప్రసాద్ -
యూజీడీపై ఆశలు
● రూ.400 కోట్ల అంచనాలతో డీపీఆర్ సిద్ధం ● నిధులు మంజూరుకు కేంద్రానికి ఎమ్మెల్యే వినతి ● పనులు పూర్తయితే పట్టణ ప్రజలకు ఎంతో మేలు జగిత్యాల: జిల్లా కేంద్రం.. లక్షకు పైగా జనాభా. 48 వార్డులు.. గ్రేడ్–1 మున్సిపాలిటీ కావడంతో జగిత్యాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) అత్యంత ఆవశ్యకంగా మారింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురికినీరంతా రోడ్లపైనే పారుతూ అస్తవ్యస్తంగా మారుతోంది. గత ప్రభుత్వ హయాంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి బీజం పడినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు రూ.400 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ను అధికారులు తయారుచేసి ప్రభుత్వానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపితే అనుమతి రాగానే పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌తో కలిసి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌ను కలిసి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. జగిత్యాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంతోపాటు, యూఐడీఎఫ్ పథకం కింద ఎస్టీపీ సీవరేజీ ప్లాంట్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు మంజూరైతే జిల్లా కేంద్రంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు కార్యరూపం దాల్చ నుంది. 2017లోనే బీజం.. జగిత్యాల జిల్లాగా మారిన అనంతరం జిల్లాకేంద్రంతోపాటు మెట్పల్లి, కోరుట్ల, మున్సిపాలిటీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. కొన్ని అనివార్య కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వం మారిన అనంతరం మళ్లీ యూజీడీ వ్యవస్థ ముందుకు వచ్చింది. గతంలో మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు యూజీడీ రూపకల్పనకు హైదరాబాద్‌కు చెందిన యూటర్న్ కన్సల్టెన్సీకి అప్పగించారు. ఇందుకు రూ.25లక్షలు కూడా కేటాయించారు. అయినప్పటికీ పనులు పూర్తి కాలేదు. ప్రస్తుతం మళ్లీ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం.. డీపీఆర్ రూ.400 కోట్లతో సిద్ధం చేయడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీనికి అధికారులు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే ఢిల్లీలోని కేంద్రమంత్రితో పాటు, కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌ను కలిసి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే, ఎంపీ అర్వింద్‌తో కలిసి కోరారు. జగిత్యాల వ్యూ యూజీడీతో మారనున్న రూపురేఖలు జిల్లా కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తి అస్తవ్యవస్తంగా మారింది. వర్షకాలం ఇళ్లలోకి నీరు చేరుతోంది. జిల్లాకేంద్రం కావడంతో చాలా గ్రామాలు ఇందులో విలీనమయ్యాయి. అయితే డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్మించలేదు. జగిత్యాల సుమారు 5 నుంచి 6 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. లక్షకు పైగా జనాభా ఉన్నా.. యూజీడీ లేకపోవడం గమనార్హం. ఒకవేళ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులోకి వస్తే సిటీ సుందరంగా రూపుదిద్దుకుంటుంది. యూజీడీ మంజూరుకు కృషి జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం చర్యలు తీసుకుంటున్నాం. రూ.400 కోట్ల అంచనాలతో డీపీఆర్ సిద్ధం చేశాం. రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే యూజీడీ నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటాం. – సంజయ్‌కుమార్, ఎమ్మెల్యే -
రాజ్యాంగంతోనే పౌరులకు హక్కులు
● మాజీమంత్రి జీవన్‌రెడ్డి ● బీర్పూర్లో జైబాపు, జైభీం, జైసంవిధాన్ సారంగాపూర్: అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంతోనే ప్రతిపౌరుడు హక్కులను స్వేచ్ఛగా పొందగలుగుతున్నాడని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం బీర్పూర్ మండలకేంద్రంలో జైబాపు, జైభీం, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగప్రతులతో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. దేశాన్ని ఏలుతున్న బీజేపీ రాజ్యాంగానికి విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తోందన్నారు. పదేళ్లలో బీర్పూర్లో ఒక్క ఇల్లు కూడా కట్టించలేనోడు ఇప్పుడు కాంగ్రెస్ ముసుగు వేసుకుని.. బీజేపీ బాటలో పయనిస్తూ గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని, సీసీ రోడ్లు, ఇతర పనులను తన అనుయాయులకే కట్టబెడుతున్నాడని, పదేళ్లపాటు పార్టీని కాపాడిన కార్యకర్తల పొట్టగొడుతున్నాడని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే రాజ్యాంగానికి లోబడి పనిచేస్తుందని, ముసుగులో వచ్చే వారిని ప్రజలు గమనించాలని కోరారు. రోళ్లవాగు ప్రాజెక్టుకు ఖరీఫ్ నాటికి మూడు గేట్లు బిగించే బాధ్యత తాను తీసుకుంటానని పేర్కొన్నారు. పరిశీలకులు సంగెనభట్ల దినేష్, మహంకాళి రాజన్న, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్, విండో చైర్మన్ పొల్సాని నవీన్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు చెర్పూరి సుభాష్, గుడిసె జితేందర్, కోండ్ర రాంచంద్రారెడ్డి హాజరయ్యారు. -
ఆయన రూటే సప‘రేటు’
● మెట్పల్లి మండల పరిషత్‌లో ఓ ఉద్యోగి ఇష్టారాజ్యం ● కార్యదర్శులకు తలనొప్పిగా ఆయన తీరు ● ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు ● పనుల విషయాల్లో ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ● ఆయన బాటలోనే మరో కార్యాలయం ఉద్యోగి ● మెట్పల్లి మండలంలోని ఓ గ్రామ కార్యదర్శి కొన్ని రోజుల క్రితం జీపీఎఫ్ లోన్ విషయంపై మండల పరిషత్ కార్యాలయంలోని ఓ ఉద్యోగి వద్దకు వెళ్లాడు. ఆ పనికి సంబంధించిన పత్రాలు నిబంధనల ప్రకారం ఉన్నప్పటికీ పెండింగ్‌లో పెట్టాడు. ఎంత బతిమిలాడిన పనిచేయకుండా నెలరోజులకు పైగా తిప్పించుకున్నాడు. చివరకు ఆ కార్యదర్శి తన పైఅధికారి దృష్టికి తీసుకెళ్లాడు. ఆ అధికారి చెప్పినప్పటికీ పనిచేయలేదు. కొద్దిరోజుల తర్వాత ‘కొంతమొత్తం’ ముట్టచెబితేనే పని చేసినట్లు తెలిసింది. ● మెట్పల్లి మండలంలోని మరో కార్యదర్శి వేతనానికి సంబంధించిన విషయంపై సదరు ఉద్యోగి వద్దకు వెళ్లాడు. పెండింగ్‌లో పెట్టి.. చాలారోజుల తర్వాత పనిపూర్తి చేశాడు. ఆ పనికి సంబంధించిన తర్వాతి ప్రక్రియ మరో కార్యాలయంలో జరగాల్సి ఉంది. ‘కొంతమొత్తం’ ముట్టజెప్పలేదనే కారణంతో మరో కార్యాలయంలో తనకు సన్నిహితంగా ఉండే ఉద్యోగితో ఆ పనిని పెండింగ్‌లో పెట్టించి ఇబ్బందులకు గురిచేయించినట్లు తెలిసింది. ఇలా వీరే కాదు సదరు అధికారి తీరుతో మరికొందరు కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మెట్‌పల్లిరూరల్: మెట్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఓ ఉద్యోగి ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. విధుల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా పంచాయతీ కార్యదర్శులను పలు పనుల విషయంలో ఇబ్బందులకు గురిచేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆయన తీరుపై విసుగు చెందిన పంచాయతీ కార్యదర్శులు సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల పైఅధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే తనపైనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారా..? అంటూ తన పైఅధికారిని సదరు ఉద్యోగి ప్రశ్నించడం గమనార్హం. ఎంతో ‘కొంత’ ముట్టచెబితేనే.. గ్రామ పంచాయతీలకు సంబంధించిన పనుల విషయంలో సదరు ఉద్యోగి వద్దకు వెళ్తున్న కార్యదర్శులు ఎంతో కొంత ముట్టచెబితేనే పనులు జరుగుతాయనేది ఇక్కడ బహిరంగ రహస్యంగా మారింది. ఉద్యోగుల వేతనాలు, సరెండర్ సెలవులు, ఇంక్రిమెంట్లు ,ఐటీ ఫైలింగ్, జీపీఎఫ్ లోన్, అప్పులకు సంబంధించిన పనులు, మిగతా సర్వీస్‌కు సంబంధించిన పనులకు ఎంతో కొంత ముట్టచెప్పాల్సిందే. లేకుంటే ఆ పనులను పెండింగ్‌లో పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేయడం పరిపాటిగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. సదరు ఉద్యోగి ప్రతి పనిని పెండింగ్ పెట్టడం, కాసులు ఇస్తేనే పని చేస్తుండడంతో బాధితులందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పూర్తిచేసి..అక్కడ పెండింగ్.. తన వద్దకు వచ్చిన కొన్ని పనులను తప్పని పరిస్థితుల్లో ఇక్కడ పూర్తి చేస్తున్న సదరు ఉద్యోగి.. ఆ పనికి సంబంధించి చివరి ప్రక్రియ మరో కార్యాలయంలో పూర్తి కావాల్సి ఉంటే అక్కడ తనకు సన్నిహితంగా ఉండే మరో ఉద్యోగితో పెండింగ్‌లో పెట్టించడం.. లేదా ఏదో కారణం చూపుతూ ఉద్దేశపూర్వకంగానే రిజెక్ట్ చేయిస్తున్నట్లు సమాచారం. ఇలా పనులు పూర్తికాకపోవడంతో ‘ఫలానా పని పూర్తికాలేదు సార్’ అని సదరు ఉద్యోగి వద్దకు వెళ్తే ‘నా వద్ద పని పూర్తయింది.. కానీ ఆ కార్యాలయంలో పెండింగ్ ఉంది..’ అని చెబుతున్నట్లు తెలిసింది. మరో కార్యాలయంలోని ఉద్యోగి వద్దకు వెళ్తే ఆయన మొదటగా ఏదో కారణాలు చెబుతూ, రోజుల తరబడి తిప్పించుకుంటూ.. ఆ తర్వాత ‘చేయి తడిపితేనే’ పనులు పూర్తి చేస్తున్నాడని కొందరు ‘సాక్షి’ దృష్టికి తీసుకువచ్చారు. షోకాజ్ నోటీస్ జారీ చేశారు పనుల విషయంలో సదరు ఉద్యోగి ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు కార్యదర్శులు ఫిర్యాదు చేశారు. ఉన్నతధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సదరు ఉద్యోగికి ఇప్పటికే షోకాజ్ నోటీస్ జారీ చేశారు. – మహేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో, మెట్పల్లి -
రజతోత్సవ సభకు చీమలదండులా కదలాలి
● మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మల్యాల: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఊరూరా ప్రజలు, కార్యకర్తలు చీమల దండై కదలిరావాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. మల్యాల మండలకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం సమావేశమయ్యారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయడంలేదని విమర్శించారు. 16నెలల కాంగ్రెస్ పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, అన్నివర్గాల ప్రజల్లో అసంతృప్తితో ఉన్నారని, ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రజతోత్సవ సభకు తరలివచ్చే ముందు గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొండపల్కల రాంమోహన్‌రావు, మాజీ ఎంపీపీ ఎడిపెల్లి అశోక్, శ్రీలత, మాజీ సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, ప్యాక్స్ చైర్మన్ బోయినపల్లి మధుసూదన్‌రావు, అయిల్నేని సాగర్‌రావు, జనగం శ్రీనివాస్ ఉన్నారు. -
తల్లీ బైలెల్లినాదో..
● అద్దకానికి తరలివెళ్లిన నీలగిరి పెద్దమ్మతల్లి ● ముత్యంపేట నుంచి శోభాయాత్ర ● మెట్‌పల్లికి చేరిన అమ్మవారు ● భారీగా తరలివచ్చిన భక్తులు ● ఆకట్టుకున్న పోతురాజుల విన్యాసంనీలగిరి పెద్దమ్మతల్లిని అద్దకానికి తరలిస్తున్న భక్తులుమల్లాపూర్: మల్లాపూర్ మండలం ముత్యంపేటలో నీలగిరి పెద్దమ్మతల్లి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐదేళ్లకోసారి అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని అద్దకం (కొత్తగా రంగులు వేయడం) కోసం ఆలయం నుంచి డప్పుచప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, అశేష భక్తజనం మధ్య శోభాయాత్రగా వేంపేట గ్రామం మీదుగా మెట్‌పల్లికి తరలించారు. అద్దకం పూర్తయిన తర్వాత మే ఒకటోతేదీన మళ్లీ శోభాయాత్రగా ముత్యంపేటకు తీసుకొచ్చి స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో తాత్కాలికంగా ప్రతిష్ఠించి మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. మే 4న ఆలయానికి తరలించనున్నారు. ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా మల్లాపూర్, మెట్పల్లి ఎస్సైలు రాజు, కిరణ్ బందోబస్తు నిర్వహించారు. కిసాన్కాంగ్రెస్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ వాకిటి సత్యంరెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ తక్కళ్ల నరేశ్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్, మాజీ సర్పంచ్ బొల్లపల్లి కృష్ణవేణి పాల్గొన్నారు. -
లేఔట్ నిబంధనలు బేఖాతరు
మెట్పల్లి(కోరుట్ల): పట్టణంలో వెంచర్ల ఏర్పాటులో రియల్ వ్యాపారులు నిబంధనలు పాటించడం లేదు. వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్న వ్యాపారులు.. వాటి విషయంలో ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా తుంగలో తొ క్కుతున్నారు. లేఅవుట్ అనుమతులు పొందకుండానే దర్జాగా ప్లాట్లు విక్రయిస్తూ పెద్ద ఎత్తున సొ మ్ము చేసుకుంటున్నారు. అక్రమ వెంచర్లకు అడ్డుకట్ట వేయాల్సిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అఽ దికారులు మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం పంచాయతీ నుంచి ము న్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన మెట్పల్లిలో ఇంతవరకు ఒక్కటి తప్ప మిగతావన్నీ అక్రమ వెంచర్లే కావడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. నిబంధనలు ఇవే.. ● వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు వినియోగించడానికి ముందుగా రెవెన్యూ అధికారులకు నాలా కింద దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలి. ● తర్వాత డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్ టౌన్, కంట్రీ ప్లానింగ్)కి దరఖాస్తు చేసుకోవాలి. ఈ శాఖ ఆమోదం పొందాలంటే ప్లాట్లుగా విభజిస్తున్న భూమిలో ప్రజాఅవసరాల నిమిత్తం పది శాతం స్థలాన్ని స్థానిక సంస్థలకు ఇవ్వాలి. ● అందులో ఏర్పాటు చేసే రహదారులు కనీసం 33 ఫీట్లు ఉండాలి. జరుగుతోందిలా.. ● పట్టణంలో హన్మాన్నగర్, సాయిరాంకాలనీ, టీచర్స్ కాలనీ, వెంకట్రావ్పేట, ఆరపేట, బీడీ కాలనీ, వేంపేట రోడ్, వెల్లుల్ల రోడ్, రాంనగర్ శివారులో ఉన్న వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేస్తున్న వ్యాపారులు నిబంధనలు పాటించడం లేదు. ● కేవలం నాలా కింద బదలాయింపునకే పరిమితమవుతున్నారు. ● స్థానికంగా భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. తద్వారా రియల్ వ్యాపారులు డీటీసీపీ అనుమతితో వెంచర్లు వేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ● అధికారుల ఉదాసీనత కూడా వీరికి దోహదం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ● లేఅవుట్ లేకుండానే భూములను ప్లాట్లుగా విభజించి బహిరంగంగానే విక్రయాలు జరుపుతున్నారు. ఆ భూముల్లో కేవలం 21, 24 ఫీట్లతో మాత్రమే రహదారులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ● ఈ సమస్య వల్ల ఇప్పటికే చాలా కాలనీల్లో రహదారులు ఇరుకుగా మారి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు మున్సిపాలిటీ ఆధీనంలో స్థలాలు లేకపోవడంతో కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీల్లో వసతులు కల్పించడం కష్టంగా మారింది. హద్దు రాళ్ల తొలగింపునకే పరిమితం ● అక్రమ వెంచర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు అలా చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ● ఎక్కడైనా వ్యవసాయ భూముల్లో ప్లాట్లను ఏర్పాటు చేస్తే అధికారులు అక్కడి వెళ్లి అందులోని హద్దురాళ్ల తొలగింపునకే పరిమితమవుతున్నారు. తర్వాత జరిగే లావాదేవీలను నిలువరించే ప్రయత్నాలు చేయడం లేదు. ● అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడడమే కాకుండా నిబంధల ప్రకారం రావాల్సిన పది శాతం స్థలాలను కోల్పోవాల్సి వస్తోంది. ప్రజలు కొనుగోలు చేయవద్దు లేఅవుట్ అనుమతులు లేని ప్లాట్లను ప్రజలు కొనుగోలు చేయవద్దు. అలాంటి వాటిని కొనుగోలు చేస్తే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇటీవల కొన్నిచోట్ల నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను ఏర్పాటు చేస్తే అడ్డుకున్నాం. ఇటీవల ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇచ్చింది. అలాంటి వాటిని మినహాయిస్తే మిగతా వాటిలో వెంచర్లు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటాం. – మోహన్, మున్సిపల్ కమిషనర్ వ్యవసాయ భూముల్లో యథేచ్ఛగా అక్రమ వెంచర్లు వేలాది ప్లాట్లు అక్రమంగా క్రయవిక్రయాలు రెండు దశాబ్దాల్లో కేవలం ఒక్కచోటనే డీటీసీపీ అనుమతి మున్సిపల్ ఆధీనంలో స్థలాలు లేక వసతుల కల్పనకు ఇబ్బందులు -
ధాన్యంలో కోత విధించొద్దు
● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పెగడపల్లి: ధాన్యంలో మిల్లర్లుగానీ, కొనుగోలు కేంద్రాల నిర్వహకులుగానీ కోత విధిస్తే క్షమించేది లేదని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హెచ్చరించారు. తూకంలో తేడా, ధాన్యంలో కోత ఉన్నట్లు ఫిర్యాదులు వస్తే నిర్వాహకులపై చర్యలుంటాయన్నారు. మండలంలోని ఆరవెల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ధాన్యం తూకం చేసిన వెంటనే రైతులకు ట్రక్‌షీట్ ఇవ్వాలని, మిల్లులో ధాన్యం దిగుమతి అయ్యే వరకు నిర్వాహకులే బాధ్యత వహించాలని సూచించారు. తూకం చేశాక రైతులకు ఎలాంటి సంబంధమూ ఉండకూడదన్నారు. రైతులు ఽనాణ్యతతో కూడిన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభారాణి, ఏఎంసీ వైస్ చైర్మెన్ సత్తిరెడ్డి, డైరెక్టర్లు, నాయకులు తిరుపతి, కాంతయ్య, శ్రీనివాస్, మురళి పాల్గొన్నారు. -
నేటి ప్రజావాణి రద్దు
జగిత్యాలటౌన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినతులు ఇవ్వడానికి ప్రజలెవరూ కలెక్టరేట్‌కు రావొద్దని కోరారు. జిల్లాలోని అన్ని మండలాల్లో భూభారతి అవగాహన సదస్సుల నిర్వహణలో అధికారులు బిజీగా ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వైభవంగా వేంకటేశ్వర స్వామి కల్యాణంఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీనివా సుడు, శ్రీదేవి, భూదేవి కల్యాణాన్ని ఆదివారం అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. అర్చకులు చక్రపాణిమాధవాచార్యులు, దివాకరాచార్యులు, మాజీ సర్పంచు దొంతుల శ్యామల తుక్కారం, మాజీ ఎంపీటీసీ పొనకంటి వెంకట్, నాయకులు మామిడి సురేశ్‌రెడ్డి, రాజన్న, గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బకాయి వేతనాలు విడుదల చేయండి జగిత్యాలటౌన్: పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలు విడుదల చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోమటి చంద్రశేఖర్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం పంచాయతీ కార్మికుల జిల్లా విస్తృతస్తాయి సమావేశం నిర్వహించారు. మే 20న నిర్వహించతలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కరపత్రాన్ని ఆవిష్కరించారు. శానిటేషన్, పంపుఆపరేటర్లు, బిల్‌కలెక్టర్, డ్రైవర్లు, కారోబార్లు, ఎలక్ట్రీషియన్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఏళ్ల తరబడి సేవలందిస్తున్నా.. ఉద్యోగ భద్రత కరువైందన్నారు. కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాదబీమా అమలు కావడం లేదన్నారు. కేంద్రప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తూ కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందన్నారు. కార్యక్రమంలో జీపీ కార్మిక యూనియన్ జిల్లా కార్యదర్శి పులి మల్లేశం, నా యకులు రాజన్న, రాజేందర్, సత్తయ్య, రాజు, దేవయ్య, జోగవ్వ తదితరులు పాల్గొన్నారు. పాలకవర్గాలు లేకనే సమస్యలుజగిత్యాలటౌన్: స్థానిక సంస్థలకు పాలకవర్గం లేకనే గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. వీధి దీపాలు, తాగునీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాజ్యాంగ ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేందుకు ఆదివారం జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో జైభీం, జైబాపు, జైసంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. గాంధీ ఆశయ సాధన కోసం జైభీం, జైబాపు, జైసంవిధాన్ కార్యక్రమాన్ని గడపగడపకూ తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు తాను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని గాంధీనగర్‌లో ఈనెల 22న నిర్వహించే జైబాపు, జైభీం, జైసంవిధాన్కు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర కార్యదర్శి బండ శంకర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, నాయకులు జీఆర్.దేశాయ్, మహ్మద్భారీ పాల్గొన్నారు. -
చిల్లర తిప్పలు తప్పేలా..
● ఆర్టీసీ బస్సు టికెట్ల జారీలో నగదురహిత సేవలు కథలాపూర్(వేములవాడ): ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల జారీలో చిల్లర డబ్బుల సమస్యలకు అడ్డుకట్ట పడింది. డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమల్లోకి తేవడంతో సేవలు మరింత సులువుగా మారాయి. ఇదివరకు ఉన్న సాధారణ టిమ్ యంత్రాల స్థానంలో కొత్తగా ఈ– టిమ్ (ఎలక్ట్రానిక్ టికెట్ ఇష్యూ మిషన్) యంత్రాలను ప్రవేశపెట్టారు. దీంతో సెల్ఫోన్లో ఫోన్ పే ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, లేకపోతే ఏటీఎం కార్డుతో స్వైప్ చేసి నగదురహిత బస్సు టికెట్ పొందవచ్చు. ప్రస్తుతం దూరప్రాంతాలకు వెళ్తున్న సూపర్ లగ్జరీ సర్వీసుల్లోనే కొన్ని నెలల క్రితం నగదురహిత డిజిటల్ సేవలను అమల్లోకి తెచ్చారు. కొద్దిరోజుల్లోనే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ– టిమ్ యంత్రాల వినియోగం మొదలవుతుందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం అధికారులకు, కండక్టర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నారు. అన్నిరకాల వ్యాపారాల్లో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. బ్యాంక్ ఖాతాల్లో డబ్బులుండి చేతిలో నగదు లేకున్నా సెల్‌ఫోన్ ఉంటే చాలు.. ఏదైనా కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. కొత్తగా ఆర్టీసీ సైతం తమ బస్సుల్లో డిజిటల్ చెల్లింపుల విధానం అమల్లోకి తెచ్చింది. మూడు డిపోలు.. 226 బస్సులు జిల్లాలో ఐదు మున్సిపాలిటీలుండగా 382 గ్రామాలున్నాయి. ప్రజలకు రవాణా సౌకర్యార్థం జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల ఆర్టీసీ డిపోలున్నాయి. వీటి పరిధిలో 226 బస్సులున్నాయి. ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చడంలో బస్సులు సేవలందిస్తున్నాయి. టికెట్ వెనుక రాసే పని లేకుండా.. బస్సుల్లో ఎక్కి టికెట్ తీసుకోగానే మొదట చిల్లర సమస్య ఎదురవుతోంది. చాలా మంది రూ.100, రూ. 200, రూ.500 నోట్లు ఇస్తుంటారు. చిల్లర ఇవ్వాలని కండక్టర్, లేవని ప్రయాణికులు అంటుంటారు. దీంతో టికెట్ వెనుక చెల్లించాల్సిన డబ్బులను కండక్టర్ రాసిస్తుంటారు. ప్రయాణికులు దిగే సమయంలో కండక్టర్ చెల్లిస్తుంటారు. ఒక్కోసారి మరిచిపోయి చిల్లర తీసుకోకుండానే ప్రయాణికులు దిగిపోయి నష్టపోతుంటారు. చిల్లర విషయంలో ఒక్కోసారి గొడవలు జరుగుతుంటాయి. ఈ– టిమ్ యంత్రాలతో ఇలాంటి చిల్లర సమస్యలు తలెత్తకుండా ఉంటుంది. అటు కండక్టర్, ఇటు ప్రయాణికులకు సేవలు సులువుగా అందుతాయి. సమయం ఆదా అవుతోంది. జిల్లాలోని డిపోల వారీగా బస్సులకు మిషన్ల అవసరాలు ఇలా.. బస్సుల సంఖ్యఈ– టిమ్లుడిపో (ప్రస్తుతం వినియోగిస్తున్నవి)కావాల్సినవిజగిత్యాల 110 20 100(సుమారు) మెట్పల్లి 54 06 60కోరుట్ల 62 50 20 -
వరంగల్ సభతో బీఆర్ఎస్ సత్తా చాటుదాం
కథలాపూర్: ఈనెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభతో పార్టీ సత్తాను చాటుదామని ఆ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి కావడం సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ సభకు ప్రతీ గ్రామం నుంచి కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో తరలిరావాలన్నారు. ప్రతీ గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు సభ కోసం సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మామిడిపల్లి రవి, కిరణ్‌రావు, గడ్డం భూమారెడ్డి, కేసరి సాయన్న, దొప్పల జలందర్, వంగ రవీందర్, శీలం మోహన్‌రెడ్డి, ఏజీబీ మహేందర్, తిరుజానీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ● బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ -
ధాన్యం త్వరితగతిన తరలించాలి
మల్యాల: తూకం వేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. మండలంలోని ముత్యంపేట, మల్యాల, రామన్నపేట, నూకపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం సందర్శించారు. రైతులు, కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని, జాప్యం లేకుండా లారీల్లో తరలించాలని సూచించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డీఆర్ఏ పీడీ రఘువరణ్, డిప్యూటీ తహసీల్దార్ నీతా, ఆర్ఐ తిరుపతి, రైతులు పాల్గొన్నారు. -
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ట్రినిటీ సత్తా
కరీంనగర్: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. ఎ.రఘుపతి జాతీయస్థాయిలో 138వ ర్యాంకు, ఎ.హేమంత్ 162, డి.సాయిచరణ్కుమార్ 313, ఎస్.పరమేశ్వరరెడ్డి 344, ఎ.ఫనీందర్ 409, ఆర్.సాయికిశోర్ 587, వి.అదీప్ 751, డి.మహేశ్ 974, ఆర్.మనోజ్ 1,262, బి.సిద్ధిక 1,551 ర్యాంకు సాధించారు. కేవలం కరీంనగర్ బ్రాంచ్ నుంచి 1,000 లోపు 8 ర్యాంకులు, పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 83 శాతం మంది ఉత్తమ ర్యాంకులతో జేఈఈ–అడ్వాన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. అడ్వాన్డ్స్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ బ్రాంచ్‌ల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
ఖమ్మంపల్లిలో వే బ్రిడ్జిపై కొరడా
ముత్తారం(మంథని): ఖమ్మంపల్లిలోని అసైన్డ్ భూమిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వే బ్రిడ్జిపై చర్యలు తీసుకోవాలనే స్థానికుల ఫిర్యాదుల మేరకు అధికారులు శనివారం స్పందించారు. ట్రాన్స్ఫార్మర్ నుంచి తీసుకున్న విద్యుత్ కనెక్షన్‌ను అధికారులు తొలిగించారు. వే బ్రిడ్జి నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని ట్రాన్సకో ఏఈ సంతోష్ రెడ్డి తెలిపారు. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సర్వేయర్ రాజశేఖర్ వే బ్రిడ్జిని పరిశీలించారు. అసైన్డ్భూమి అని, దీనిని లీజుకు ఇవ్వకూడదన్నారు. ఉన్నతాధికారులకు దీనిపై నివేదిస్తామని ఆర్ఐ శ్రీధర్ తెలిపారు. అనుమతిలేని వే బ్రిడ్జి నిర్వాహకులకు నోటీసులు జారీ చేశామని పంచాయతీ కార్యదర్శి బద్రు తెలిపారు. -
గుండెపోటుతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
ధర్మపురి: శుభకార్యం కోసం స్వగ్రామానికి వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గుండెపోటుతో మృతిచెందాడు. ఈ సంఘటన ధర్మపురిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ధర్మపురికి చెందిన దెహగం గిరీశ్ (40) కొన్నాళ్లు అమెరికా, పూణేలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. ప్రస్తుతం బెంగళూరులోని బోయింగ్ (విమానాలు తయారు చేసే కంపెనీ)లో భార్యతోపాటు పనిచేస్తున్నాడు. వీరికి కూతురు సంతానం. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో గురువారం భార్య, కూతురుతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. శు క్రవారం పొద్దంతా బంధువులందరితో ఆనందంగా గడిపాడు. రాత్రి సమయంలో సొంత అ న్నయ్య గణేశ్ ఇంటికి వెళ్లాడు. ఆయనతో మా ట్లాడుతుండగానే గుండెపోటుతో కుప్పకూలి పోయాడు. గణేశ్ వెంటనే ఆయనకు సీపీఆర్ చే సి వాహనంలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ప్రకటించారు. అప్పటిదాకా అందరితో కలిసిమెలి సి ఉండి అంతలోనే అనంతలోకాలకు చేరడంతో బంధువులు శోకసంద్రంలో మునిగి పోయారు. విప్ లక్ష్మణ్‌కుమార్, డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి తదితరులు గిరీశ్ మృతిపట్ల సానుభూతి తెలిపారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. చేపల వేటకు వెళ్లి బాలుడు..కొత్తపల్లి(కరీంనగర్): చేపల వే టకు వెళ్లి ఓ బాలుడు మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల వివరాలు.. కరీంనగర్‌లోని రేకుర్తి 18వ డివిజన్‌కు చెందిన మహ్మద్ అహిల్ అజ్మన్(11), మహ్మద్ అన్సర్, ఎండీ ఆర్మన్ శనివారం ఉదయం వెంకటేశ్వరకాలనీ శ్మశానవాటిక సమీపంలోని బావిలో చేపలు పట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మహ్మద్ అహిల్ అజ్మన్ ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడ్డాడు. ఆందోళనకు గురైన ఇరువురు కేకలు వేయడంతో పాటు స్థానికులకు తెలిపారు. అక్కడున్న బీఆర్ఎస్ నాయకుడు కృష్ణగౌడ్ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. బాలుడి కోసం బావిలో వెతగగా మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కలెక్టర్ కారుకు ఫైన్ గోదావరిఖని: కలెక్టర్ కారు వేగంగా వెళ్తోంది. హైవే వెంట నిర్ణీత స్పీడ్‌ను మించి ప్రయాణించడంతో పోలీసులు ఇటీవల ీస్పీడ్గన్ ద్వారా వేగాన్ని గుర్తించి నాలుగు ఫైన్లు వేశారు. ప్రధానంగా పెద్దపల్లి నుంచి కరీంనగర్‌వైపు వెళ్తుండగా, ముగ్ధుంపూర్వైవు వెళ్తుండగా మూడు ఫైన్లు విధించారు. అలాగే నుస్తులాపూర్ వద్ద హైస్పీడ్‌తో వెళ్తుండగా మరో ఫైన్ పడింది. టీఎస్ –220001 ఇన్నోవా వాహనంపై నాలుగు ఫైన్ల పేరిట రూ.4,140 ఫైన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ఓ మీటింగ్‌కు వచ్చిన కలెక్టర్ కారును స్థానికులు ఈ – చాలన్‌లో చెక్‌చేయగా ఇవి బయపడ్డాయి. సప్తగిరి ఆస్పత్రి గుర్తింపు రద్దుజమ్మికుంట(హుజూరాబాద్): పట్టణంలోని సప్తగిరి ఆస్పత్రిలో సీఎంఆర్ఎఫ్ నకిలీ బిల్లుల సృష్టించి డబ్బులు కాజేసిన వ్యవహారంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆస్పత్రి గుర్తింపును రద్దు చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.చందు తెలిపారు. శనివారం ఆస్పత్రిని పరిశీలించారు. ఆస్పత్రి నిర్వహణ చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా నకిలీ బిల్లుల వ్యవహారంపై 2023లో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. నకిలీ బిల్లులతో డబ్బులు కాజేసినట్లు విచారణలో తేలింది. -
గల్లంతయిన బాలుడు శవమై..
మల్లాపూర్: మండలకేంద్రం శివారులోని లింగన్న చెరువులో గల్లంతయిన బాలుడు పుట్ట రాజేశ్ (13) శవమై కనిపించాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలకేంద్రంలోని దుర్గమ్మకాలనీకి చెందిన పుట్ట పోశెట్టి, కవిత దంపతుల పెద్దకుమారుడు రాజేశ్ పశువులను మేపడానికి శుక్రవారం వెళ్లాడు. లింగన్న చెరువులో స్నానం చేసేందుకు దిగాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. ఎస్సై రాజు సిబ్బందితో ఘటనస్థలికి వెళ్లి గ్రామస్తులు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలించారు. ఈక్రమంలో శనివారం ఉదయం చెరువులో శవమై పైకి తేలాడు. రాజేశ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
స్వగ్రామానికి శ్రీనివాస్ మృతదేహం
ధర్మపురి: దుబయిలో పాకిస్థానీ యువకుడి చేతిలో ఈనెల 11 హత్యకు గురైన మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్ మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరింది. శ్రీనివాస్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కంటతడి పెట్టారు. అంత్యక్రియల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆయన కుటుంబానికి ఎన్ఆర్ఐ పాలసీ కింద రూ.5లక్షలతోపాటు కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించేలా చూస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి రూ.25లక్షలు ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, గ్రామస్థులు తదితరులున్నారు. -
విద్యుత్ మోటారు దొంగల అరెస్ట్
ఓదెల(పెద్దపల్లి): మద్యానికి బానిసై, బెట్టింగ్‌లకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో విద్యుత్ పంపుసెట్లు చోరీచేస్తున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో శనివారం పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ వివరాలు వెల్లడించారు. ఓదెల గ్రామానికి చెందిన సిరిగిరి ప్రసాద్, అంగిడి సాయికుమార్ కొంతకాలం క్రితం మద్యానికి బానిసయ్యారు. బెట్టింగ్‌లు పెడుతున్నారు. జల్సాలకు అలవాటుడపడ్డారు. చేతిలో డబ్బు లేకపోవడంతో కరెంట్ మోటార్లు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్, పొత్కపల్లి, సుల్తానాబాద్ పోలీస్స్టేషన్ల పరిధిలో వ్యవసాయబావుల వద్ద ఏర్పాటు చేసుకున్న కరెంట్ మోటర్లు, సర్వీసువైర్లను దొంగిలించారు. ఇందుకోసం ఆటోలో తిరుగుతున్నారు. ఈక్రమంలో పోలీసులు 13 కేసులు నమోదు చేశారు. నిఘా తీవ్రతరం చేశారు. దీంతో శనివారం ఎస్సై రమేశ్ వాహనాలను తనిఖీ చేస్తుండగా 39 కరెంట్ మోటార్లు, సర్వీసు వైర్లు, ఆటోట్రాలీ లభించగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాచాపూర్, కోనరావుపేట, రూపునారాయణపేట, కొలనూర్, శివపల్లి, మడిపల్లి గ్రామాల్లో వీటిని చోరీ చేసినట్లు నిందితులు తెలిపారు. ఇందుకు బాధ్యులైన సిరిగిరి ప్రసాద్, అంగిడి సాయికుమార్‌ను అరెస్టు చేసి, విద్యుత్ మోటార్లతో పాటు ఆటోట్రాలీ, సర్వీసు వైర్లు..మొత్తంగా రూ.10,67,500 విలువైన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పొత్కపల్లి ఎస్సై రమేశ్ పాల్గొన్నారు. కాగా, దొంగలను పట్టుకున్న ఎస్సై రమేశ్, ఏఎస్సై అశోక్, హెడ్‌కానిస్టేబుళ్లు కిషన్, ప్రవళిక, కానిస్టేబుళ్లు రాజేందర్, వెంకటేశ్, రవి, రాజు, శివశంకర్, శంకర్, రామకృష్ణ, అశోక్, సతీశ్, రజిత, దనలక్ష్మి, తేజస్వీనికి డీసీపీ, ఏసీపీ రివార్డులు అందజేశారు. 39 వ్యవసాయ పంపుసెట్లు, సర్వీసు వైర్లు స్వాధీనం పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ వెల్లడి -
గ్రావిటి కాలువలో దూకి వ్యక్తి ఆత్మహత్య
రామడుగు(చొప్పదండి): రామడుగు మండలం గోపాల్రావుపేట గ్రామానికి చెందిన పురాణం సాగర్ (30) రామడుగు సమీపాన గల గాయత్రి పంపుహౌజ్ నుంచి వెళ్లే గ్రావిటి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రాజు తెలిపిన వివరాలు.. సాగర్‌కు పురాణం పద్మతో 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. కాగా సాగర్ కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన సాగర్ రామడుగు సమీపాన ఉన్న గ్రావిటి కాలువలో బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దేశాయిపల్లిలో వృద్ధుడు.. బోయినపల్లి(చొప్పదండి): నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతు న్న మండలంలోని దేశాయిపల్లికి చెందిన వృద్ధుడు సంది దుర్గారెడ్డి(80) క్రిమిసంహారక మందు తాగగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఎస్సై పృథ్వీధర్ తెలిపిన వివరాలు. దుర్గారెడ్డి కొంతకాలంగా నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వా డినా తగ్గలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంట్లో పురుగుల మందు సేవించాడు. కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య సంది లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ కలహాలతో ఒకరు.. కోరుట్లరూరల్: కోరుట్ల పట్టణంలోని సాయిరాంపుర కాలనీకి చెందిన ఎలిగేటి శ్రీహరి (36) శనివారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన శ్రీహరి ఉపాధి నిమిత్తం కొన్నేళ్లు గల్ఫ్ వెళ్లి వచ్చాడు. సాయిరాంపురలో ఇట్లు కట్టుకుని భార్య లాస్య, కుమారుడు హర్ష, కూతురు నేహతో కలిసి ఉంటున్నాడు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం కూడా ఇద్దరూ గొడవ పడ్డారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లగా.. భార్య ఇంటి బయట పనులు చేసుకుంటోంది. ఇంతలో శ్రీహరి బెడ్రూంలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. భార్య వచ్చి చూసి పక్కింటివారిని పిలిచి చూడగా అప్పటికే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లాస్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
శ్రీచైతన్య విజయకేతనం
కరీంనగర్: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారు. ఎం.రోహిత్ 17, టి.కుందన్ 814, పి.ఈశ్వర్ ముఖేశ్ 1,275, ఎం.అంజలి 2,575, బి.అక్షర 2,992, ఎం.తరుణ్ 5,949, నందిని7,464 ర్యాంకు, 20 వేల లోపు 15 మంది ర్యాంకులు సాధించారు. పరీక్షకు హాజరైన వారిలో 40 శాతం మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు క్వాలీపై అయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ, సంస్థ స్థాపించిన నాటి నుంచి అన్ని పోటీ పరీక్షల్లో శ్రీచైతన్య విద్యార్థులు రాణిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి, డీన్ జగన్మోహన్రెడ్డి, ప్రిన్సిపాల్స్ మల్లారెడ్డి, రాధాకృష్ట, మోహన్‌రావు, ఏజీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపూర్: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఎస్ఆర్ కళాశాలల విద్యార్థులు ప్రతిభచాటారు. కళాశాలకు చెందిన 13 మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారని కళాశాలల జోనల్ ఇన్చార్జి తిరుపతి తెలిపారు. అలుగునూర్లోని ఎస్ఆర్ కళాశాల ఆవరణలో మాట్లాడారు. విద్యార్థులు వై.భరణిశంకర్ జాతీయస్థాయిలో 88వ ర్యాంకు, బి.సురేశ్ 98, ఎ.కార్తిక్ 584, లకావత్ మాధవ్చరన్ 707, లునావత్ రామ్‌చరణ్ 777, పత్తెం హృషికేశ్ 796వ ర్యాంకు సాధించగా, మరో ఏడుగురు 6 వేలలోపు ర్యాంకులు సాధించినట్లు వివరించారు. ఇంతటి విజయాన్ని అందించి, కళాశాలకు పేరు తీసుకొచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, కరీంనగర్ డీజీఎం వాసుదేవరెడ్డి, ప్రిన్సిపాల్స్ ప్రత్యేకంగా అభినందించారు. ఎస్ఆర్ ప్రభంజనం -
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
మల్లాపూర్: అకాల వర్షానికి పంటలు నష్టపోయిన బాధిత రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహరం ప్రకటించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం మల్లాపూర్ మండలం ముత్యంపేటలో, ఇబ్రహీంపట్నం మండలకేంద్రంతోపాటు వర్షకొండ, కోజన్కొ త్తూర్, ఎర్దండి గ్రామాల్లో పర్యటించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 30వేల ఎకరాల్లో మామిడికాయలు రాలి ప్రతి మామిడి రైతుకూ తీరని ఆవేదన మిగిల్చిందన్నారు. చేతికొచ్చే దశలో వరి, నువ్వు, సజ్జలు నేలవాలాయని ఆవేదన వ్యక్తంచేశారు. సర్వేలతోనే సరిపుచ్చడం కాకుండా రైతులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో మల్లాపూర్ మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్, ఇబ్రహీంపట్నంలో జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, తహసీల్దార్ ప్రసాద్, ఏడీఏ రమేష్, ఏవో రాజ్‌కుమార్, మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
‘మైకు’
మేల్కొలుపుతోంది..● గంట గంటకీ ఆధ్యాత్మిక సందేశం ● ఊరందరికీ ప్రామాణికం ● సమయం.. రోజు.. వారం.. నెల.. గంటకొట్టి చెబుతోంది ● బావుసాయిపేటలో బహుముఖ ప్రయోజనాలుతెల్లవారుజాము 5 గంటలు.. ఏమయ్యో మైకు మోగింది. లెవ్వు.. లేచి బర్రెపాలు పిండి, పాలకేంద్రంలో పోసిరాపో.. అంటూ భర్తను భార్య పురమాయిస్తుంటోంది. అగో తెల్లారుతోంది.. లేచి పొలం చుట్టూ తిరిగిరాపో అంటూ.. మరో ఇల్లాలు తన భర్తను అప్రమత్తం చేస్తుంటోంది.మైకు చెబుతోంది.. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట జనాన్ని మైకు మేల్కొలుపుతోంది. ఆ ఊరి మైకు చెప్పే.. సమయం.. రోజు, వారం, నెల ఆ గ్రామస్తులకు ప్రామాణికమయ్యాయి. ఆ ఊరి జనాభా నాలుగు వేలు. వ్యవసాయం ప్రధానవృత్తి. కోళ్లు, పాడిపరిశ్రమలు ఉన్నాయి. ఊరంతా ఆ మైక్ చెప్పే సమయాన్ని పాటిస్తూ తమ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నారు.సాయంత్రం 5 గంటలు.. మూలవాగు ఒడ్డున గల రవి పొలంలో ముదురుకలుపు తీసేందుకు పది మంది మహిళలు కై కిలి వచ్చారు. ఉదయం 10.30 గంటల నుంచి కలుపుతీత పని కొనసాగుతోంది. మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంటకు కూలీలు భోజనం చేశారు. మళ్లీ పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఊరిలోని మైకు గంటలు మోగాయి. భగద్గీత శ్లోకం వినిపించింది. ఈ రోజు ఆదివారం, ఏప్రిల్ నెల.. 2025.. ఇప్పుడు సమయం ఐదు గంటలు అంటూ.. మైకులో సందేశం వినిపించింది. అంతే అప్పటి వరకు పొలంలో ముదురుకలుపు తీసిన కూలీలు వెంటనే ఒడ్డుపైకి చేరారు. టైమైంది మేం పోతున్నామంటూ ఇంటిబాట పట్టారు. -
కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
● కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్కోరుట్ల రూరల్: ధా న్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండలంలోని అయిలాపూర్, ధర్మారం, కల్లూర్, సర్పరాజ్‌పూర్, మోహన్‌రావుపేట, వెంకటాపూర్, మాదా పూర్ గ్రామాల్లో ఐకేపీ, ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం నరహరి, ప్యాక్స్ చైర్మన్ ఆదిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ధాన్యంలో కోతలు పెట్టొద్దు ● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ జగిత్యాలఅగ్రికల్చర్: ధాన్యం తూకంలో కోతలు పెట్టకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. చల్గల్ మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మిల్లర్లు ఎలాంటి కోతలు పెట్టకుండా దిగుమతి చేసుకోవాలన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే తేవాలన్నారు. తాగునీటి వసతి వంటి సదుపాయాలు కల్పించాలన్నారు. డీసీఓ మనోజ్‌కుమార్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి, తహసీల్దార్ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ మహిపాల్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు, మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్, నాయకులు బాల ముకుందం, సురేందర్‌రావు, నారాయణ రెడ్డి పాల్గొన్నారు. -
తవ్వారు.. వదిలేశారు
జగిత్యాల: జిల్లా కేంద్రమైన జగిత్యాలలో సుమారు లక్షకుపైగా జనాభా ఉంటుంది. ప్రతి కాలనీల్లో సీసీరోడ్లు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ప్రత్యేక నిధులు మంజూరు చేయించారు. ప్రతి వార్డులో టెండర్లు పిలిచారు. కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేసిన తర్వాత రెండు నెలలు, అనంతరం తవ్వి వదిలేసి మరో రెండు నెలలకు పనులు కొనసాగిస్తున్నారు. దీంతో ప్రజలకు సంకటంగా మారింది. సీసీరోడ్డు నిర్మాణంలో రెండుమూడు రోజుల్లో పూర్తి చేయవచ్చు. కానీ అధికారులుగానీ, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. రోడ్డు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మొదట హడావుడి పనులు మొదలుపెడుతూ పొక్లెయిన్ సహాయంతో రోడ్డంతా తవ్వి దాంట్లో కొద్దిపాటి కంకర పోసి వదిలేస్తున్నారు. నెలల తరబడి ఆపుతున్నారు. దీంతో వాహనాలు వెళ్లాలన్నా, మహిళలు నడవాలన్నా, విద్యార్థులు స్కూల్‌కు వెళ్లాలన్నా ఆ రో డ్డులో ఇబ్బందికరంగా మారింది. నిబంధనల ప్రకా రం రోడ్డు మొదలుపెట్టిన తర్వాత వెనువెంటనే చేయాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ‘సారూ.. పనులు మొదలుపెట్టడం లేదు. ఇబ్బందులు అవుతున్నాయి. ఎటూ వె ళ్లలేని పరిస్థితి ఉంది..’ అని కాలనీ చెందిన ప్రజలు సంబంధిత ఏ ఈ, డీఈ, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇది కాంట్రాక్టర్‌కు కూడా అలుసుగా మారింది. పనులు అగ్రిమెంట్ అయిన తర్వాత 3 నుంచి ఆర్నెళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. రోడ్డు మొదలుపెట్టి వారాలు గడుస్తున్నా పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మొదలు పెట్టిన రో డ్లను పూర్తి చేసేలా చర్యలు తీ సుకోవాలని ఆయా కా లనీవాసులు కోరుతున్నారు. రోడ్డు వేయడంలో నిర్లక్ష్యం పట్టింపులేని అధికారులు ఇబ్బంది పడుతున్న ప్రజలునాణ్యత కరువే ఇది జిల్లా కేంద్రంలోని ఒకటో వార్డులో సీసీరోడ్డు నిర్మాణం కోసం దాదాపు రెండు నెలల క్రితం తవ్వారు. కాంట్రాక్టర్ మరిచిపోయాడు. దీంతో ఆ కాలనీలోని ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇళ్లలోకి వాహనాలు తీసుకెళ్దామన్నా.. ఆ రోడ్డు వెంట తాగునీరు తీసుకుని మహిళలు వెళ్లాలన్నా.. స్కూళ్లకు వెళ్లాలన్నా ఇబ్బందిగా మారింది. మున్సిపల్ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు చెబుతున్నారు. సీసీ రోడ్డు మొదలుపెట్టకముందు దానిపై పొక్లెయిన్‌తో లేయర్ తీసిన అనంతరం కంకర పోయాల్సి ఉంటుంది. కానీ కొంత మంది కాంట్రాక్టర్లు ఏకంగా చెత్తాచెదారం పోసి నింపుతున్నారు. కనీసం అధికారులు దీనిపై దృష్టి సారించడం లేదు. ఫిర్యాదు చేస్తే తప్ప పట్టించుకోవడం లేదు. కొన్ని కాలనీల్లో ఫిర్యాదు చేస్తే మళ్లీ దానిని తీసివేయడం, చిన్నపాటి కంకరపోస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సంబంధిత వర్క్ ఇన్స్పెక్టర్లు, అధికారులు నాణ్యతతో నిర్మించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
గ్రామగ్రామాన దండు కట్టాలి
సారంగాపూర్: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ప్రతి గ్రామం నుంచి దండుకట్టి బయల్దేరాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో సభకు జనం తరలింపుపై పర్యటించి సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 27న జరిగే రజతోత్సవ సభకు తరలిరావాలని కోరారు. ఈ సందర్భంగా మండలంలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన దివ్యాంగుడు రమేశ్ పింఛన్ సొమ్ము రూ.రెండు వేలు అందించి కేసీఆర్ సభకు ఖర్చు చేయాలని కోరారు. కార్యక్రమంలో సారంగాపూర్, బీర్పూర్ మండలాల పార్టీ అధ్యక్షులు తేలు రాజు, మాజీ సర్పంచ్‌లు భూక్య సంతోష్, బల్మూరి నారాయణరావు, వెంకటేష్, బుచ్చిమల్లయ్య, పార్టీ సీనియర్ నాయకులు సాంబరి గంగాధర్, ఎండబెట్ల ప్రసాద్, జలేందర్, వొడ్నాల జగన్, సాతల్ల రమేశ్ తదితరులు ఉన్నారు. రజతోత్సవ సభకు తరలిరావాలి జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత -
ఈత సరదా.. విషాదం కానీయొద్దు
జగిత్యాలక్రైం: వేసవిలో పిల్లలు, యువకులు ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాలువల వద్దకు వెళ్తున్నారని, చిన్న నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నందున తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు సరదాగా ఈతకు వెళ్తే.. నీటిలో మునిగి ప్రాణాలు పోయే అవకాశం ఉందని, ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను చెరువులు, కాలువలు, కుంటల వద్దకు ఒంటరిగా వెళ్లకుండా చూడాలన్నారు. పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. మామిడి చెట్లకు పెళ్లి కథలాపూర్: మండలంలోని గంభీర్పూర్లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెంచిన మామిడిచెట్లకు శనివారం పెళ్లి జరిపించారు. సంఘం తరఫున ఎనిమిది ఎకరాల్లో తోట పెంచుతున్నారు. చెట్లకు పెళ్లి చేస్తే కాయలు అధికంగా కాస్తాయనేది వారి నమ్మకం. దీంతో సంఘం సభ్యులు అల్లనేరేడు, మామిడి చెట్లకు అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య పెళ్లి జరిపించారు. కులసంఘం సభ్యులకు భోజనాలు పెట్టారు. రన్ ఫర్ జీసస్జగిత్యాలటౌన్: మానవాళి రక్షణకే ఏసుక్రీస్తు జన్మించారని జగిత్యాల బల్దియా మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి అన్నారు. ఈస్టర్ సందర్భంగా శనివారం క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రన్‌ఫర్ జీసస్ శాంతిర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అందరనీ సమానంగా, ప్రేమతో చూడాలని చెప్పిన కరుణామయుడు ఏసుక్రీస్తు అని అన్నారు. ఫాస్టర్ రెవా జీవరత్నం మాట్లాడుతూ మానవాళి పాప విమోచనకు క్రీస్తు తన ప్రాణాలను అర్పించిన రోజున గుడ్‌ఫ్రైడేగా.. సమాధి నుంచి లేచిన రోజును ఈస్టర్‌గా జరుపుకుంటామని తెలిపారు. ర్యాలీలో ఆలయ కమిటీ బాధ్యులు సునంద్రావు, సిల్వన్ బెన్నీ, జాన్‌వెస్లీ, విగ్నేష్, చర్చి పాస్టర్స్ ముద్దమల్ల ప్రభాకర్, క్రైస్తవులు పాల్గొన్నారు. పశువులకు గాలికుంటు నివారణ టీకాలుగొల్లపల్లి: పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించుకోవాలని పశు సంవర్ధక శాఖ అధికారి వేణుగోపాల్‌రావు అన్నారు. మండలంలోని రాఘవపట్నంలో పశువులకు టీకాలు వేశారు. మే 15 వరకు పశువులకు టీకాలు వేస్తామని, రైతులు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో రైతులు వెంగలదాసు మల్లేశం, కాసారపు అరవింద్‌గౌడ్, పశువైద్యాధికారి రవీందర్, లైవ్‌స్టాక్ అసిస్టెంట్ సంధ్య, సిబ్బంది నర్సయ్య, రవీందర్, శ్రీకాంత్, నిశాంత్, రమేశ్ పాల్గొన్నారు. హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్జగిత్యాల: జిల్లా నుంచి హజ్ యాత్రకు 39 మంది ఎంపికయ్యారని, వీరికి ఈనెల 24న మాతా శిశు సంక్షేమ కేంద్రంలో వ్యాక్సినేషన్ చేస్తామని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. శనివారం ముస్లిం మతపెద్దలతో సమావేశమయ్యారు. యాత్రికులకు వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రాలు, మెడికల్ సర్టిఫికెట్లు ఇస్తామని మైనార్టీ వెల్ఫేర్ అధికారి తస్లీంపాషా, షకీల్ సూచించారు. -
‘భూభారతి’తో భూ సమస్యలకు పరిష్కారం
వెల్గటూర్/మేడిపల్లి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంతో భూ సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం వెల్గటూర్ మండల కేంద్రంలోని రైతువేదిక, మేడిపల్లిలోని బీమన్నగుడి ప్రాంతంలో అవగాహన సదస్సు నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం ద్వారా సమస్యల పరిష్కారానికి అవకాశం ఉందన్నారు. సాదాబైనామాల రెగ్యులరైజేషన్‌కు అవకాశం ఉందన్నారు. సరిహద్దు వివాదాలు, తప్పుడు రిజిస్ట్రేషన్లు నివారణకు క్షేత్రస్థాయిలో అధికారులు పూర్తిగా విచారణ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు గ్రామకంఠం, ఆబాది భూములకు ప్రత్యేక పాస్‌బుక్‌లు ఇవ్వనున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ శేఖర్, ఏఎంసీ చైర్పర్సన్ గోపిక, వైస్ చైర్మన్ తిరుపతి, సహకార సంఘాల అధ్యక్షులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. రైతు భూములకు పూర్తి భరోసా.. రైతుల భూములకు భూభారతి చట్టం భరోసా క ల్పిస్తుందని కలెక్టర్ అన్నారు. జూన్ రెండో తేదీ నుంచి ఆన్లైన్లో పోర్టల్ అందుబాటులోకి వ స్తుందని తెలిపారు. ఏటా డిసెంబర్ 31న భూభా రతి చట్టంలోని నిబంధనల ప్రకారం రికార్డులను అప్డేట్ ఉంటుందన్నారు. పోర్టల్ లో నమోదైన రికార్డుల ఆధారంగానే బ్యాంకు రుణాలు ఇస్తారని తెలిపారు. పంట నష్టం వివరాలు నమోదు చేయాలి ఇబ్రహీంపట్నం: వడగళ్లవాన, ఈదురు గాలులతో పంటలు నష్టపోయిన రైతుల వివరాలను న మోదు చేయాలని కలెక్టర్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించారు. నష్టం వివరాలను వారంలోగా సిద్ధం చేసి పంపాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. జి ల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, తహసీల్దార్ ప్రసాద్, ఏడీఏ రమేశ్, ఏఓ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయాలి
జగిత్యాల: పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. శనివారం జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఐదేళ్లలోపు పిల్లల ందరికీ వ్యాధి నిరోధక టీకాలు వేయాలని, వివిధ కారణాలతో అందుబాటులోలేని పిల్లలు, గర్భిణులకు ఏప్రిల్, మే, జూన్ 21, 28 తేదీల్లో టీకాలు ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో మహిళా సంఘాలు, రిసోర్స్ పర్సన్లు, అంగన్వాడీ కార్యకర్తలు కలిసి పిల్లల డ్యూలిస్ట్ తయారు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, సమియోద్దీన్, శ్రీనివాస్, మదన్మోహన్, నరేశ్ పాల్గొన్నారు. ధాన్యం తూకం వేసేందుకు చర్యలు తీసుకోండిజగిత్యాలటౌన్: జిల్లాలోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వెంటనే తూకం వేసేలా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ సత్యప్రసాద్‌కు లేఖ రాశారు. జిల్లాలో 17శాతానికి తక్కువ తేమశాతం వస్తున్నా.. ధాన్యం తూకం వేయడం లేదన్నారు. ఈదురుగాలులు, అకాలవర్షాలు కురుస్తుండటంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసిన రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే తూకం వేయాలని కోరారు. -
క్షీరాభిషేకం, పుష్పాలంకరణ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం పూలతో అలంకరించారు. అర్చకులు శ్రీనివాసచార్యులు మంత్రోచ్ఛరణలతో లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు తరలివచ్చి స్వామివారలను దర్శించుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసమే తనిఖీలుజగిత్యాలక్రైం: శాంతిభద్రతల పరిరక్షణ కో సమే గురువారం అర్ధరాత్రి పోలీసులు తని ఖీలు చేపట్టడం జరిగిందని ఎస్పీ అశోక్‌కుమా ర్ అన్నారు. ఈసందర్భంగా శుక్రవారం ఎస్పీ మాట్లాడుతూ, జగిత్యాల పట్టణంలో రాత్రి స మయంలో నిఘా మరింత పటిష్టం చేస్తూ చర్యలు తీసుకోవడం ద్వారా చాలా వరకు నేరా లను నియంత్రించవచ్చన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్ చౌరస్తాల్లో నిషేధిత మత్తు పదార్థాలు, చట్ట విరుద్ధ వస్తువులను గుర్తించేందుకు శిక్షణ పొందిన నార్కోటిక్ డాగ్‌స్క్వాడ్స్, బాంబ్‌స్క్వాడ్ సిబ్బందితో విస్తృత తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి రాయికల్(జగిత్యాల): నిరుద్యోగ యువత ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కోరారు. శుక్రవారం రాయికల్ పట్టణంలోని చిన్నజీయర్‌స్వామి ట్రస్ట్ భవన్లో ప్రతి ఫౌండేషన్ సహకారంతో జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్, హౌస్వైరింగ్, టేలరింగ్‌లో శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతీ, యు వకులతో ముచ్చటించారు. ఆయన వెంట విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, ప్రతిమ ఫౌండేషన్ ఆ ర్గనైజర్ నాగిరెడ్డి రఘుపతి, కోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రజతోత్సవ సభ విజయవంతం చేయాలి రాయికల్(జగిత్యాల): ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత పిలుపునిచ్చారు. శుక్రవారం రాయికల్ పట్టణంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పోస్టర్ ఆవిష్కరించారు. పట్టణ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు ఎనగందుల ఉదయశ్రీ, మారంపల్లి రాణి, మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్, మహిళ అధ్యక్షురాలు స్పందన, నాయకులు శ్రీధర్‌రెడ్డి, మహేశ్‌గౌడ్ పాల్గొన్నారు. వృద్ధుల్లో మనోధైర్యం నింపేందుకే సదస్సులు జగిత్యాల: వృద్ధుల్లో మనోధైర్యం నింపేందుకే సదస్సులు నిర్వహించడం జరుగుతుందని సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ అన్నారు. శుక్రవారం అసోసియేషన్ కార్యాలయంలో వృద్ధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధులు ఆత్మహత్యలకు పాల్పడకుండా వారి పిల్లలు బాధ్యత వహించాలన్నారు. కొందరిని సొంత ఇంట్లోంచే గెంటివేయడం, వసతి గృహాలు, అనాథ శరణాలయాల్లో బలవంతంగా ఉంచుతున్నారని, తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. వారిని పట్టించుకోకపోతే కఠిన శిక్షలు సైతం ఉన్నాయన్నారు. వారి ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మానసిక వైద్యున్ని నియమించాలన్నారు. ప్రధాన కార్యదర్శి విశ్వనాథం, ప్రకాశ్‌రావు, అశోక్‌రావు పాల్గొన్నారు. -
ముందుకు.. వెనక్కి!
● కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వేలైన్ కోసం కదులుతున్న ఫైళ్లు ● సిరిసిల్లలో 751 ఎకరాల సేకరణకు రూ.400 కోట్లు వెచ్చింపు ● దాచారం నుంచి బోయినపల్లి వరకు భూమిని గుర్తించిన అధికారులు ● మరో 107 ఎకరాల కోసం రూ.69కోట్లు అవసరం ● మిడ్‌మానేరులో 37ఎకరాలకు బదులుగా కోనరావుపేటలో భూమి ● కరీంనగర్లోనూ 50 ఎకరాలు సేకరించిన అధికారులుకరీంనగర్లో 50 ఎకరాలకు రూట్ క్లియర్ కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వేట్రాక్ కోసం గంగాధర మండలం ఉప్పర మల్యాల రెవె న్యూ గ్రామం పరిధిలోని ఉప్పరమల్యాల, రంగారావుపల్లెలో 50.19 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఈ భూమిలో కొత్తపల్లి– వేములవాడ మధ్య ఐదు కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను అధికారులు నిర్మించనున్నారు. ఈ భూమితోపాటు ఇక్కడ ఉన్న 23 ఇళ్లను ప్రభుత్వం రైల్వేశాఖకు అప్పగించడంతో పనులు మొదలు కానున్నాయి. ఇంటికి రూ.15లక్షలు, ఎకరానికి రూ.20 లక్షల చొప్పున చెల్లిస్తున్నారు. గత సెప్టెంబరులో ఈ భూమిపై అభ్యంరాలపై నోటిఫికేషన్ వేసిన ప్రభుత్వం గ్రామసభలతో కొలిక్కి తీసుకొచ్చింది. వేములవాడ నుంచి వచ్చే ఈ ట్రాక్ గంగాధర సమీపంలోని కొత్తపల్లి స్టేషన్‌కు అనుసంధానం చేయడంతో మార్గం పూర్తవుతుంది.సాక్షిప్రతినిధి,కరీంనగర్: కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వేలైన్ భూసేకరణలో అధికారులు కాస్త వేగం పెంచినట్లు కనిపిస్తోంది. ఈ పనుల్లో నెలకొన్న జాప్యాన్ని చూస్తుంటే.. ఒకడుగు ముందుకుపడితే.. రెండడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది పరిస్థితి. ప్రస్తుతమైతే ఈ పనుల కోసం ఇటు సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో రెవెన్యూ అధికారులు దస్త్రాలను చకచకా ముందుకు కదుపుతున్నారు. ప్రస్తుతం సిరిసిల్ల జిల్లాలో పనులు కొనసాగుతున్నాయి. దాచారం నుంచి బోయినపల్లి వరకు దాదాపు 954 ఎకరాల భూమిని అధికారులు రైల్వేలైన్ కోసం గుర్తించగా ఇప్పటి వరకూ 751 ఎకరాలు సేకరించారు. భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసితులకు రూ.400 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించింది. రైల్వేలైన్ కోసం దాదాపు 107ఎకరాల భూమిని ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ భూమికి పరిహారంగా మరో రూ.69 కోట్ల వరకు నిర్వాసితులకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఈ నిధులు విడుదల కావాల్సి ఉంది. ఇవి వస్తే భూసేకరణ ప్రక్రియ మరింత వేగవంతమవుతుంది. మరోవైపు మిడ్‌మానేరు పరిధిలోని చింతల్మెట్, తాడూరు పరిధిలోని దాదాపు 37ఎకరాల అటవీభూమిని సేకరించారు. ఇందకోసం ప్రత్యామ్నాయంగా కోనరావుపేటలో మరో 40 ఎకరాల భూమిని అటవీ ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అప్పగించారు. సిరిసిల్ల వరకు పనులు నత్తనడకే మనోహరాబాద్– కొత్తపల్లి వరకు దాదాపు 151 కిలోమీటర్లకు రూ.1167 కోట్లతో 2016లో ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రస్తుతం 79కిలోమీటర్ల మేర ట్రాక్ పనులు పూర్తయి.. సిద్దిపేట వరకు రైలు సర్వీసు అందుబాటులోకి వచ్చింది. సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు జల, రోడ్ల మార్గాలు అధికంగా ఉన్న కారణంగా ఇక్కడ కల్వర్టులు, వంతెనలకు నిధుల విడుదల్లో జాప్యంతో పనులు ఆలస్యంగా నడుస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. 2023 మార్చిలోనే రైల్వే పనులు సిరిసిల్ల వరకు పూర్తికావాలి. సిద్దిపేట నుంచి కొత్తపల్లి వరకు ట్రాక్ పనులు పూర్తయేందుకు దాదాపు రూ.850 కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయని దక్షిణమధ్య రైల్వే అంచనా వేస్తోంది. ఈ లెక్కన చూస్తే.. కొత్తపల్లి వరకు ట్రాక్ పనులు పూర్తయ్యేందుకు మరో రెండేళ్లు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మార్గం పూర్తయితే రాజధానితోపాటు జగిత్యాల మీదుగా ముంబై, పెద్దపల్లి మీదుగా ఢిల్లీ, వరంగల్‌కు మార్గం సుగమం అవుతుంది. -
అకాల బీభత్సం
● దెబ్బతిన్న పంటలు ● విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, చెట్లు ● లేచిపోయిన రేకుల షెడ్లుIఇబ్రహీంపట్నం: కొజన్కొత్తుర్లో రోడ్డుపై విరిగిపడిన చెట్టు జగిత్యాల/ఇబ్రహీంపట్నం/కోరుట్లరూరల్/మేడిపల్లి/కథలాపూర్/మెట్‌పల్లిరూరల్: జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులు, రాళ్లతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ● ఇబ్రహీంపట్నం మండలంలో రోడ్లపై చెట్లు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. ఉడకబెట్టి ఆరబెట్టిన పసుపుపంటలు తడిసి ముద్దయ్యాయి. వరి, సజ్జ, నువ్వుల పంటలు నేలవాలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడికాయలు రాలిపోయాయి. ఎర్దండి ఒడ్డెర కాలనీలో తొమ్మిది ఇళ్ల రేకులు లేచిపోయి నిత్యవసర వస్తువులు తడిశాయి. ● కోరుట్ల మండలం నాగులపేట, సంగెం, యెఖీన్‌పూర్, యూసుఫ్‌నగర్, కల్లూర్ తదితర గ్రామాల్లో నువ్వుపంట పూర్తిగా నేల వాలింది. పొలల్లో వడ్లు రాలాయి. ● కథలాపూర్ మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలపై టార్ఫాలిన్ కవర్లు కొట్టుకుపోయాచి. భూషణరావుపేట శివారులో విద్యుత్ వైర్లపై తాటిచెట్టు పడటంతో స్తంభం నేలవాలింది. ఆయా గ్రామాల్లో రేకుల షెడ్లు కూలాయి. ● మెట్పల్లి మండలంలో పలు గ్రామాల్లో వరి, నువ్వులు, సజ్జ పంటలు నేలవాలాయి .కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. మామిడి కాయలు నేలవాలగా నష్టం వాటిల్లింది. వేంపేటలో నాలుగు, ఆత్మకూర్‌లో ఒక విద్యుత్ స్తంభం విరిగిపోయాయి. -
చరిత్రలో నిలిచిపోయేలా రజతోత్సవ సభ
● ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మల్లాపూర్(కోరుట్ల): వరంగల్‌లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలకు రజతోత్సవ సభ కరపత్రాలను అందించి పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమాల్లో ఐకేపీ ఏపీఎం దేవరాజ్, సీసీ స్రవంతి, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, నాయకులు కాటిపెల్లి ఆదిరెడ్డి, దేవ మల్లయ్య, ఏనుగు రాంరెడ్డి, ముద్దం శరత్‌గౌడ్, బండి లింగస్వామి, ద్యాగ గంగారెడ్డి, కోమ్ముల జీవన్‌రెడ్డి, డబ్బా రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్రాల వద్ద వసతులు కల్పించాలి ధాన్యం కొనుగోలు కేంద్రా ల వద్ద రైతులకు అన్ని వసతులు కల్పించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నా రు. శుక్రవారం మండలంలోని కుస్తాపూర్, రత్నాపూర్ గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించి ధా న్యం తేమశాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కేంద్రాల్లో ఏ గ్రేడ్ రకం ధా న్యం క్వింటాల్‌కు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 కనీస మద్దతు ధర అందిస్తారని తెలిపారు. -
మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయాలి
పెగడపల్లి(ధర్మపురి): వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలకవర్గం కృషి చేయాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. కమిటీ చైర్మన్‌గా రాములుగౌడ్, వైస్ చైర్మన్ సత్తిరెడ్డి, డైరెక్టర్లు అజ్మీర అంజన్ననాయక్, లింగంపల్లి మహేశ్, సంకిటి శ్రీకాంత్‌రెడ్డి, చాట్ల విజయభాస్కర్, తవుటు లావణ్య, దేశెట్టి లక్ష్మీరాజం, శ్రీరాం అంజయ్య, బాలుసాని శ్రీనివాస్, మన్నె గంగరాజం, ట్రేడర్ల నుంచి మ్యాకల మల్ల య్య, చెట్ల కిషన్, కర్ర భాస్కర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, ఏఎంసీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. రాజరాంపల్లి, నందగిరి, పెగడపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మార్కెట్ కార్యదర్శి వరలక్ష్మి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభారాణి, నాయకులు గజ్జల స్వామి, రాజేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల మహిళ అధ్యక్షులు విజయలక్ష్మి, సత్యప్రసన్న పాల్గొన్నారు. రైతులకు ఇబ్బందులు రానీయంవెల్గటూర్(ధర్మపురి): ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తామని విప్ లక్ష్మణ్‌కుమార్ హామీ ఇచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనాన్ని మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. సహకార సంఘాలు ఆర్థికంగా బలోపేతమై రైతులకు సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతీ ఒక్కరికీ మాఫీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గోపిక, సంఘం అధ్యక్షుడు రత్నాకర్, నాయకులు తిరుపతి, రాంరెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ -
విడతల వారీగా పని కల్పించడం సరికాదు
సారంగాపూర్(జగిత్యాల): సాంకేతిక కారణాలతో ఉపాధి కూలీలకు విడతల వారీగా పని కల్పించడం సరికాదని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అ న్నారు. శుక్రవారం మండలంలోని లక్ష్మీదేవిపల్లి అటవీప్రాంతంలో పనులు చేస్తున్న కూలీల వ ద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. లక్ష్మీదేవిపల్లిలో రోజూ 800 మంది పనికి వచ్చే అవకా శం ఉండగా కేవలం 300 మందికి మాత్రమే పని కల్పిస్తున్నారని, అవసరమైతే మేట్లను పెంచి వారికి బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నారు. దీనిపై డీఆర్డీవోతో ఫోన్లో మాట్లాడారు. ఈ వి షయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నా రు. కూలీలకు సమ్మర్ అలవెన్స్ రూ.350– రూ.400 వరకు చెల్లించాలని ఇది కూడా ఇవ్వడం లేదని, దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలతో పాటు నిర్మలాసీతారామన్‌కు లేఖ రాస్తానని తెలిపారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు విడ్డూరంగా మాట్లాడుతున్నాయని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1 లక్ష రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని గుర్తు చేశారు. ఆయన వెంట కొల్వాయి విండో చైర్మన్ పొల్సాని నవీన్‌రావు, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్, మండలాల అధ్యక్షులు కోండ్ర రాంచంద్రారెడ్డి, గుడిసె జితేందర్, సుభాష్, నాయకులు గంగారాం, భూమరావు, అఖిల్, అభిలాష్ ఉన్నారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి -
చెరువులో బాలుడి గల్లంతు
మల్లాపూర్(కోరుట్ల): చెరువులో స్నానాకి వెళ్లి ఓ బాలుడు గల్లంతయిన ఘటన మల్లాపూర్ మండల కేంద్రం శివారులోని లింగన్న చెరువు వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలోని దుర్గమ్మకాలనీకి చెందిన పుట్ట పోశేట్టి–కవిత దంపతులకు ఇద్దరు కుమారులు రాజేశ్(12), నరేశ్. రాజేశ్ మండలంలోని మొగిలిపేటలో బాబాయి వద్ద ఉంటూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాడు. ఇటీవలే మల్లాపూర్‌కు వచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. పశువుల కాపరి అయిన తండ్రి పోశేట్టికి చేదోడుగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం పశువులతో శివారు ప్రాంతానికి చేరుకున్న రాజేశ్ లింగన్న చెరువులో స్నానం చేసేందుకు వెళ్లాడు. చెరువులో నీళ్లు ఎక్కువగా ఉండడంతో రాజేశ్‌కు ఈతరాక నీటిలో గల్లంతయ్యాడు. పోలీసులు ఘటనస్థలికి వెళ్లి గ్రామస్తులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లతో అర్ధరాత్రి వరకు గాలింపు చేపట్టినా రాజేశ్ ఆచూకీ లభించలేదని ఎస్సై రాజు తెలిపారు. -
త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే
జగిత్యాలటౌన్/కథలాపూర్: జిల్లావ్యాప్తంగా శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. యేసుక్రీస్తును శిలువ వేసిన రోజును పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రఖ్యాత సీఎస్ చర్చితో పాటు ధరూర్ క్యాంపు యేబ్రోను, గోవింద్పల్లిలోని యేసురక్తం చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మిషన్ కాంపౌండ్‌లోని సీఎస్ఐ వెస్లీ చర్చిలో ఫాస్ట్రెస్ చైర్మన్ రెవా జీవరత్నం గుడ్ ఫ్రైడే సందేశం అందించారు. ఉమెన్స్ ఫెలోషిప్ సభ్యులు ప్రత్యేక గీతాలు ఆలపించారు. -
కారు బోల్తాపడి 9 మందికి గాయాలు
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామ శివారులో బైక్‌ను తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తాపడగా 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన మురళీకృష్ణ, దివ్య, బావిక, శ్రీకృష్ణ, మహరాజు, స్వీటి, బేబితో పాటు మరికొంత మంది వేములవాడలో కేశఖండనం కోసం వచ్చారు. శుక్రవారం ఉదయం కేశఖండన పూర్తికాగానే తమ కారులో కొండగట్టుకు వస్తుండగా చెప్యాల శివారులో అకస్మాత్తుగా ద్విచక్రవాహనం కారుకు అడ్డు రావడంతో తప్పించే ప్రయత్నంలో కారు అదుపుతప్పి రోడ్డు కిందకు వెళ్లి బోల్తాపడింది. కారులోని 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
వినూత్న ఆలోచన.. లాభార్జన
● పుచ్చకాయ సాగులో యువ రైతులు ● వరి, మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా పంట ● వాట్సప్‌లో షేర్ చేస్తూ.. నేరుగా విక్రయాలు జగిత్యాల అగ్రికల్చర్: సాధారణంగా యాసంగిలో చాలా మంది రైతులు వరి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తుంటారు. జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన యువరైతులు వినూత్నంగా ఆలోచన చేశారు. వరిసాగును వీలైనంత తగ్గించి, పుచ్చకాయ సాగుచేస్తూ.. పొందుతున్నారు. వచ్చిన పంటను కొందరు హోల్‌సేల్‌గా విక్రయిస్తుండగా, మరికొంతమంది నేరుగా వినియోగదారులకు అందిస్తూ.. లాభాలు పొందుతున్నారు. శివరాత్రి నుంచి పంట మార్కెట్‌కు పుచ్చకాయకు మహాశివరాత్రి నుంచి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. దీంతో నవంబర్ నుంచి విత్తనాలు నాటారు. ఫిబ్రవరి నుంచి పంట మార్కెట్‌కు వచ్చి, మే వరకు కొనసాగనుంది. కొందరు కిలోకు రూ.15వరకు హోల్‌సేల్‌గా విక్రయిస్తుండగా, మరికొందరు వినియోగదారులకు నేరుగా కిలో రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. సాధారణంగా ఎకరానికి 15–20 టన్నుల పంట రావాల్సి ఉండగా, ఈ సారి మారిన వాతావరణ పరిస్థితులతో, సస్యరక్షణ చర్యలు చేపట్టి ఎకరాకు 10–15 టన్నుల దిగుబడి తీశారు. హైదరాబాద్‌లోని మాల్స్‌తో ఒప్పందాలు జిల్లాకు చెందిన పలువురు రైతులు పంటను హైదరాబాద్‌లోని మాల్స్‌కు విక్రయించేలా ఒప్పందాలు చేసుకున్నారు. మిగిలిన కాయలను జిల్లాకేంద్రంలోని శ్రీరామ చౌరస్తా వద్ద, కోరుట్ల, మెట్పల్లిలో వినియోగదారులకు నేరుగా విక్రయిస్తున్నారు. ఎర్ర కలర్ పుచ్చకాయే కాకుండా పసుపు, గ్రీన్ రంగుల పుచ్చకాయలు సైతం విక్రయిస్తున్నారు. వాట్సప్‌లో సమాచారం.. సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన బండారి వెంకటేశ్, మల్లాపూర్ మండలం సిరిపూర్‌కు చెందిన పోగుల నరేశ్, ముత్యంపేటకు చెందిన మర్రిపల్లి శ్రీనివాస్, రాయికల్ మండలం అల్లూరుకు చెందిన మెక్కొండ రాంరెడ్డితో పాటు పలువురు యువకులు వినూత్నంగా ఆలోచన చేస్తూ పంటలు సాగు చేస్తుంటారు. ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు పోస్ట్ చేస్తున్నారు. సాగు వివరాలే కాకుండా, పంటను మార్కెటింగ్ చేసుకునే విధానాన్ని షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలో స్వల్పకాలంలో చేతికి వచ్చే పుచ్చకాయ పంట సాగు చేయాలని నిర్ణయించారు. ఓ పది ఎకరాల సాగుకు అవసరమైన మల్చింగ్ షీట్, నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు సైతం ఒకే కంపెనీవి కొనుగోలు చేశారు. -
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
● 48 గంటల్లో చోరీ కేసు ఛేదించిన పోలీసులు ● రెండు కేసుల్లో మూడున్నర తులాల బంగారం స్వాధీనం జమ్మికుంట: వృద్ధులకు పింఛన్ ఇప్పిస్తానని మెడలోని రెండు తులాల పుస్తెల తాడు ఎత్తుకెళ్లిన అంతర్ జిల్లా దొంగను జమ్మికుంట టౌన్ సీఐ వరంగంటి రవి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హుజూరాబాద్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్‌జి వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వడ్డెరకాలనీకి చెందిన అల్లెపు కృష్ణ అనే వ్యక్తి వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన అల్లెపురెడ్డి కమలమ్మ, కొమురరెడ్డి అనే వృద్ధ దంపతులకు జమ్మికుంట పట్టణంలో పింఛన్ ఇప్పిస్తానని, ఫొటో తీయాలని, మెడలో బంగారం ఉండొద్దంటూ రెండు తులాల బంగారు పుస్తెల తాడును మంగళవారం ఎత్తుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీఐ రవి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి 48 గంటల్లో చోరీ కేసు ఛేదించారు. వృద్ధుల రెండు తులాల బంగారం, హైదరాబాద్‌లో కృష్ణ చోరీ చేసిన మరో ఘటనలో తులంన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు. సీఐ రవి, హెడ్ కానిస్టేబుల్ మోహన్, సదయ్య, కానిస్టేబుల్ అబ్దుల్ ఖదీర్, శ్రీకాంత్‌ను ఏసీపీ అభినందించారు. పీడీ యాక్ట్.. కృష్ణ గతంలో పీడీ యాక్ట్ కింద 4 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినా.. చోరీలకు పాల్పడడం మానుకోలేదు. అంతర్ జిల్లా చోరీలకు పాల్పడుతున్న కృష్ణపై రాష్ట్రవ్యాప్తంగా 80 కేసులున్నాయి. జమ్మికుంటలో 3, హుజూరాబాద్‌లో 3, కరీంనగర్లో 10 కేసులున్నాయని ఏసీపీ తెలిపారు. -
చోరీ చేశారు.. అమ్మలేక దొరికారు
● ట్రాక్టర్ దొంగల అరెస్టుముస్తాబాద్(సిరిసిల్ల): జల్సాలకు అలవాటు పడి.. ఈజీ మనీ కోసం దొంగలుగా మారిన ముగ్గురు యువకులు చోరీ చేసిన ట్రాక్టర్, ఖాజ కుట్టుమిషన్లను ఎవరికి అమ్మాలో తెలియక చివరకు పోలీసులకు దొరికారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ శుభోదయ మండల సమాఖ్య కార్యాలయంలో ఉన్న ట్రాక్టర్ ఐషర్ ఇంజీన్, కాజా కుట్టు మిషన్లు గత ఫిబ్రవరి 17న అపహరణకు గురయ్యాయి. సమాఖ్య అధ్యక్షురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్సై గణేశ్ విచారణ చేపట్టారు. కాల్‌డాటా, అనుమానితుల కదలికలపై నిఘా పెట్టి ముస్తాబాద్‌కు చెందిన మహ్మద్ షాదుల్లా, దావిరెడ్డి నరేందర్‌రెడ్డి, మహ్మద్ సమీర్లు ట్రాక్టర్, కుట్టు మిషన్లను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వారిని అరెస్టు చేసి వారి నుంచి ట్రాక్టర్, కుట్టు మిషన్‌తోపాటు ఒక కారు, బైక్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. అయితే రెండు నెలల క్రితమే ట్రాక్టర్, మిషన్‌ను అపహరించిన నిందితులు వాటిని ఎవరికి అమ్మాలో తెలియక పొలాల మధ్య దాచిఉంచారన్నారు. రూ.7లక్షల విలువైన ట్రాక్టర్, కుట్టు కాజా మిషిన్‌ను స్వాధీనం చేసుకోవడంలో ఎస్సై గణేశ్, హెడ్‌కానిస్టేబుల్ బాలనర్సయ్య, కానిస్టేబుల్ ఖాసీంలను సీఐ అభినందించారు. -
సాగు వివరాలు తెలుసుకుంటూ
ఇప్పటి వరకు వరి సాగు చేశాను. మిత్రుల సూచనతో ఎకరంన్నరలో పుచ్చకాయ రెండు దఫాలుగా వేశాను. ఏ సమయంలో ఏం చేయాలనే విషయాలను మిత్రులు వాట్సప్‌గ్రూప్‌లో షేర్ చేస్తారు. దాని ప్రకారం అన్ని పనులు చేయడంతో పంట మంచి దిగుబడి వచ్చింది. – మర్రిపెల్లి శ్రీనివాస్, ముత్యంపేట, మల్లాపూర్ ధర బాగుంది గత రెండు, మూడేళ్లుగా పుచ్చకాయ సాగు చేస్తు న్నా. పంటను హోల్‌సేల్‌గా విక్రయి ంచకుండా నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నా. అందరం కలిసి విత్తనాలు కోనుగోలు చేస్తాం, ఎ క్కడ అమ్మాలనే దానిపై ఆలోచించి కంపెనీలతో ఒప్పందం చేసుకుంటాం. – మెక్కొండ రాంరెడ్డి, అలూరు, రాయికల్ -
సైక్లింగ్‌తో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం
మల్లాపూర్(కోరుట్ల): రోజూ సైక్లింగ్ చేయడంతో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వాల్గొట్ కిషన్ అన్నారు. శుక్రవారం సైకిల్‌పై నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి మల్లాపూర్ మండలం మొగిలిపేటకు చేరుకుని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సైక్లింగ్‌తో షుగర్, రక్తపోటు, ఊబకాయాన్ని నివారించవచ్చన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు తరిగిపోతున్న పెట్రోల్ నిల్వలను కాపాడుకోవచ్చన్నారు. ప్రజలందరూ నిత్యం సైక్లింగ్ చేయాలని సూచించారు. అనంతరం గ్రామంలోని గోల్కోండ రమేశ్, ఏలేటి ప్రీతంరెడ్డి, గంధం రఘు సైక్లింగ్ చేసేందుకు ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకున్నారు. జాతీయ పోటీలకు ఎంపికకరీంనగర్స్పోర్ట్స్: బీహార్‌లో నేటి నుంచి ఈ నెల 23వరకు జరగనున్న 47వ జాతీయస్థాయి జూనియర్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికై నట్లు హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వడ్లూరి రాజేందర్, జిట్టబోయిన శ్రీను తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో రాణించిన నాగరాజు(జగిత్యాల), కల్లేపల్లి చక్రధర్ (సిరిసిల్ల) ఎంపికై నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులను మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు, బొమ్మరవేని తిరుమల తిరుపతి, కలిగేటి శ్రీనివాస్, జెట్టిపెల్లి అశోక్, అనూప్‌రెడ్డి, శ్రీనివాస్, భాస్కర్ అభినందించారు. -
ఎండకు పక్షుల మృత్యువాత
కోనరావుపేట(వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని గ్రామాల్లో ఎండల తీవ్రతకు పక్షులు నేలరాలుతున్నాయి. నెమళ్లు, కాకులు, పిచ్చుకలతో పాటు ఇతర పక్షులు అస్వస్థతకు గురవుతున్నాయి. మర్తనపేట శివారులోని రైస్మిల్లువద్ద ఓ నెమలి ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురికాగా గమనించిన యువకులు రక్షించి అటవీ అధికారులకు అప్పగించారు. విండో చైర్మన్ రూ.7.23 లక్షలు దుర్వినియోగం● గతేడాది డిసెంబర్లో పలువురు డైరెక్టర్ల ఫిర్యాదు సారంగాపూర్(జగిత్యాల): మండలంలోని కోనాపూర్ సింగిల్‌విండోలో విండో చైర్మన్ గుర్నాథం మల్లారెడ్డి రూ.7,23,638 నిధులు దుర్వినియోగం చేసినట్లు జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్ వెల్లడించారు. చైర్మన్ అక్రమాలకు పాల్పడినట్లు జరిపిన విచారణ నివేదికను శుక్రవారం వెల్లడించారు. అక్రమాలపై విండో పరిధిలోని పలువురు డైరెక్టర్లు 2024 డిసెంబర్ 16న కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయికుమార్‌గౌడ్ విచారణ చేపట్టారు. 2021 నుంచి 2024 వరకు చైర్మన్ రూ.7,23,638 వివిధ రూపాల్లో దుర్వినియోగం చేసినట్లు నిర్ధారించడం జరిగిందని వివరించారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 21న ఉదయం 11 గంటలకు జిల్లా సహకార కార్యాలయంలో చైర్మన్ హాజరుకావాలని, లేకుంటే 18 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాజన్నను దర్శించుకున్న సినీ ప్రముఖులువేములవాడ: వేములవాడ రాజన్నను శుక్రవారం సినీ పరిశ్రమకు చెందిన సంపత్ నంది, దర్శకుడు అశోక్ తేజ, ప్రొడ్యూసర్ డి.మధు, వశిష్ట సింహ హీరోలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోడె మొక్కు చెల్లించుకున్నారు. స్వామి వారి దర్శనానంతరం వేదోక్త ఆశీర్వచనం గావించారు. -
అన్నదమ్ములే ఏటీఎం దొంగలు
● ఖాతాదారులు విత్‌డ్రా చేసిన సొమ్ము టార్గెట్ ● చాకచక్యంగా పట్టుకున్న పెద్దపల్లి పోలీసులుపెద్దపల్లిరూరల్: కస్టమర్లు డ్రా చేసుకునే సొమ్మును చాకచక్కగా చోరీ చేయడంలో నేర్పరులైన అన్నదమ్ములను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏసీపీ గజ్జి కృష్ణతో కలిసి డీసీపీ కరుణాకర్ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో రాజస్థాన్‌కు చెందిన ఆరుగురు సభ్యులు ముఠాగా ఏర్పడ్డారు. ఈనెల 15న పెద్దపల్లికి చేరుకుని కూనారం రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎంను తెరిచారు. డ్రా చేసుకునే సొమ్ము ఖాతాదారుల చేతికి చేరకుండా ఏటీఎంలో ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారాన్ని ముంబైలోని సెక్యూరిటీ విభాగం అధికారులు గుర్తించి ఇక్కడి బ్యాంకర్లను అప్రమత్తం చేశారు. ఏటీఎం చానల్ ఎగ్జిక్యూటివ్ రజనీకాంత్ పెద్దపల్లి చేరుకుని ఏటీఎం పరిశీలించగా, డబ్బు పోలేదని నిర్ధారించారు. సీసీ ఫుటేజీల ద్వారా నిందితుల చిత్రాలు సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై లక్ష్మణ్‌రావు కేసు నమోదు చేసి ఎటీఎంల వద్ద నిఘా పెంచారు. ఈ క్రమంలో స్థానిక శాంతినగర్‌లో నివాసం ఉండే సింగరేణి ఉద్యోగి పుట్ట శివకుమార్ ఏటీఎంలో రూ.500 డ్రా చేశారు. ఆ సొమ్ము బయటకు రాలేదు. ఆ తర్వాత రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా మల్కెర మండలం కరీడకు చెందిన అన్నదమ్ములు సిద్దిక్‌ఖాన్, ఆరీఫ్‌ఖాన్ ఏటీఎంలోకి వెళ్లి ఆ సొమ్ము తీసుకున్నారు. తర్వాత రైలులో సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్లేందుకు రైల్వేస్టేషన్ చేరుకున్నారు. అక్కడ తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నారు. పెర్టో ఏటీఎంలు టార్గెట్.. కస్టమర్ల సౌలభ్యం కోసం బ్యాంకర్లు పెర్టో కంపెనీకి చెందిన ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని టార్గెట్ చేసుకున్న అన్నదమ్ములు సిద్దిక్‌ఖాన్, ఆరీఫ్‌ఖాన్.. రాజస్థాన్‌కు చెందిన ఆరీఫ్ గుటారి, ఆశ్మహమ్మద్, సాహిల్, ఇమ్రాన్‌తో ముఠాగా ఏర్పడ్డారు. ఓ కారులో ఈనెల 5న బయలు దేరి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి తెలంగాణకు చేరుకున్నారు. మార్గమధ్యంలో ఉజ్జయిని, అకోలా, కండువా, తుల్జాపూర్లో చోరీలు చేశారు. చోరీల సందర్భంగా ఈ ముఠా సభ్యుల మధ్య ఈనెల 10న విభేదాలు తలెత్తాయి. దీంతో సిద్దిక్‌ఖాన్, ఆరీఫ్‌ఖాన్ కారుదిగి బస్సులో హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ పెర్టో ఏటీఎంలు కనిపించకపోవడంతో కాజీపేటకు చేరుకున్నారు. కాజీపేట, వరంగల్‌లో కూడా అవిలేవు. దీంతో ఈనెల 14న పెద్దపల్లికి చేరుకున్నారు. కూనారం రోడ్డులోని ఎస్బీఐలో పెర్టో ఏటీఎంను గుర్తించారు. ‘టి’ ఆకారం ఉన్న కీ తో ఓపెన్ చేసి.. ఏటీఎం పరిసరాల్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని టి ఆకారంలోని కీతో ఏటీఎం ముందు భాగాన్ని తెరిచి డబ్బు బయటకు వచ్చేమార్గంలో క్యాష్ డిస్పెన్సర్‌కు రేకు ముక్క అడ్డుగా ఉంచి ప్లాస్టర్ అతికించారు. ఆ తర్వాత ఏటీఎం డోర్‌ను యథాస్థానంలో ఉంచారు. మరుసటి రోజు వచ్చేసరికి డ్రాచేసిన రూ.500 మాత్రమే వారు అనుకున్న చోట ఏటీఎంలో ఆగిపోయింది. ఆ సొమ్మును తీసుకుని కాగజ్‌నగర్ వెళ్లేందుకు యత్నించి పోలీసుల చేతికి చిక్కారు. డీసీపీ మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి లాడ్జిలో బసచేస్తే వారి సమాచారాన్ని కచ్చితంగా పోలీసులకు అందించాలన్నారు. అంతర్రాష్ట్ర దొంగలను చాకచక్యంగా పట్టుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్పైలు లక్ష్మణ్‌రావు, మల్లేశం, సిబ్బంది రాజు, రఘు, రమేశ్, ప్రభాకర్, సతీశ్, అనిల్‌కుమార్‌ను డీసీపీ అభినందించారు. -
మద్యం మత్తులో ఆత్మహత్య
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ శాంతినగర్‌లో మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఎలక్ట్రీషియన్ బండ మోహన్(35) మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. గోదావరిఖని సంతోష్‌నగర్‌కు చెందిన బండ మోహన్ కొన్నిరోజులుగా శాంతినగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి మద్యం తాగివచ్చి భార్య మహేశ్వరితో గొడవపడ్డాడు. ఆ మత్తులో గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్యతోపాటు పిల్లలు శ్రీదీక్షిత్(12) శ్రీబృంద(11) ఉన్నారు. మృతుడి సోదరుడు బండ రవి ఫిర్యాదుతో ఎన్టీపీసీ ఎ స్సై ఉదయ్‌కిరణ్ కేసు నమోదు చేసుకొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): మెట్పల్లి మండలం సత్తక్కపల్లి–రాజేశ్వర్రావుపేట శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్‌కు చెందిన చిట్టాపురపు రాము(33) ద్విచక్రవాహనంపై కమ్మర్పల్లి వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఆర్డీసీ బస్సు రాము ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాము అక్కడికక్కడే మృతిచెందాడు. భవనంపై నుంచి పడి ఒకరు.. జగిత్యాలక్రైం: స్థానిక పోచమ్మవాడలో ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి కర్నాల అరుణ్ (40) మృతిచెందాడు. మెట్‌పల్లికి చెందిన అరుణ్ గురువారం పోచమ్మవాడలో ఉన్న తన అత్తగారింటికి వచ్చాడు. ఈనెల 23న అతని బావమరిది వివాహం ఉండగా గురువారం పోచమ్మ పండగ చేశారు. రాత్రి భోజనం చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి భవనంపై పడుకున్నారు. అర్ధరాత్రి భవనం దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడటంతో బలమైన గాయాలై మృతిచెందాడు. మృతుడి భార్య మనోజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కిరణ్ తెలిపారు. నేడు స్వగ్రామానికి వసలజీవి మృతదేహంధర్మపురి: దుబాయ్‌లో హత్యకు గురైన స్వర్గం శ్రీనివాస్ మృతదేహం కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కృషితో శనివారం గ్రామానికి తీసుకురానున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ తెలిపారు. మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి అక్కడ మోడర్న్ బేకరీలో పని చేస్తున్నాడు. ఈనెల 11న పాకిస్తానీ చేతిలో శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన మృత దేహాలు స్వదేశానికి రావడానికి నెలలు పడుతుందని, కానీ శ్రీనివాస్ మృత దేహాన్ని కేంద్ర మంత్రుల చొరవతో వారం రోజులకే శంశాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకువస్తారని భాస్కర్ తెలిపారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే పాఠశాలలు బలోపేతం
వెల్గటూర్: ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయని డీఈవో కే.రాము పేర్కొన్నారు. వెల్గటూర్ మండలం పాశి గామ ప్రాథమిక పాఠశాలలో గురువారం జరిగిన పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ సహకారానికి ప్రజల భాగస్వామ్యం తోడైతేనే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమై పురోగతి సాధిస్తాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంత ఘనంగా వార్షికోత్సవం నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అనంతరం బడిబాట కరపత్రాలను ఆవిష్కరించారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. పాఠశాల హెచ్ఎం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారి కొక్కుల రాజేశ్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంఈవో ప్రభాకర్, ఎంపీడీవో వెంకటేశ్వర్రావు, ఎంపీవో శ్రీనివాస్, ఎండపల్లి కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్, మహేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు. -
మద్దతు ధరకే ధాన్యం విక్రయించాలి
జగిత్యాలరూరల్: ప్రభుత్వం అందించే మద్ద తు ధరకే ధాన్యం విక్రయించాలని అదపు కలెక్టర్ లత సూచించారు. మండలంలోని పొలా స, గుల్లపేట గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు తేమశాతం ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తేవాలన్నారు. ధాన్యం విక్రయించిన తర్వాత ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్ బుక్, వ్యక్తిగత బ్యాంక్ ఖాతా జిరాక్స్‌లను నిర్వాహకులకు అందజేయాలన్నారు. డీఆర్డీఏ పీడీ రఘువరణ్, జగిత్యాల రూరల్ తహసీ ల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రమాదేవి, డిప్యూటీ తహసీల్దార్ కార్తీక్‌రెడ్డి, సివిల్ సప్లై డీటీ వరప్రసాద్, ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, ఏపీఎం గంగాధర్, సెక్రటరీలు రాఘవేంద్ర, నయిమోద్దీన్, సీసీ రవీందర్, సీసీలు రవీందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. దళారుల చేతిలో మోసపోవద్దు రాయికల్: రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, సద్విని యోగం చేసుకోవాలని జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్ పేర్కొన్నారు. రాయికల్ సహకార సంఘం ఆధ్వర్యంలో శివాజీనగర్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. కేంద్రాల్లో ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలి పారు. సింగిల్ విండో చైర్మన్ఏనుగు మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు బేతి మోహన్‌రెడ్డి, డైరెక్టర్లు కుర్మ రాము, నారాయణ, భూమరాజం, ఇన్చార్జి సీఈవో జగదీశ్, శంకర్ పాల్గొన్నారు. ‘దుబాయ్’ బాధిత వారసులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ● రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ జగిత్యాలరూరల్: దుబాయ్‌లో పాకిస్థాన్ వ్యక్తి చేతిలో హత్యకు గురైన వారి వారసులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర ఖని జాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్ ఇటీవల దుబాయ్‌లో పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో హత్యకు గురికాగా, గురువారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. హత్యకు గురైన తెలంగాణ యువకుల కుటుంబాలకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలని, మృతదేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు లేఖ రాశారన్నారు. ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ బీ ఎం.వినోద్‌కుమార్ బృందం మృతుల కుటుంబాలను పరామర్శించడం జరిగిందన్నారు. జూనియర్ కళాశాలల నుంచి దరఖాస్తుల ఆహ్వానంజగిత్యాల: 2025–26 సంవత్సరానికి రెప్యూటెడ్ (కార్పొరేట్) జూనియర్ కళాశాలల స్కీం కోసం జూనియర్ కళాశాలల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్‌కుమార్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు కల్పించేందుకు జిల్లాలోని జూని యర్ కళాశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల కళాశాలల యజమాన్యాలు ఐదేళ్లకు సంబంధించిన అకాడమిక్ ప్రొఫైల్‌తో పాటు ఈపాస్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈనెల 30 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ అన్నారు. ఎంపికై న కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కింద ప్రతి విద్యార్థికి రూ.35 వేలు, ప్యాకెట్ మనీ కింద రూ.3 వేలు ఏటా మంజూరవుతాయన్నారు. -
కోరుట్లలో నవోదయ!
● ఎంపీ అర్వింద్ చొరవ ● జిల్లా నేతల ఆశలు గల్లంతుకోరుట్ల: కోరుట్లలో జవహర్ నవోదయ స్కూల్ మంజూరుకు నవోదయ విద్యాసమితి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. స్కూల్ ఏర్పాటుకు పూర్తిస్థాయి సౌకర్యాలు కోరుట్లలో ఉన్నట్లు ఇటీవల అధికార యంత్రాంగం నవోదయ విద్యాసమితికి నివేదించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరు కాగా.. వాటిలో ఒకటి జగిత్యాల జిల్లాకు కేటాయించారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చొరవతో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కోరుట్ల శివారులోని సంగెం రోడ్డు వెంట ఉన్న జంబిగద్దె వద్ద ఏర్పాటుకు సన్నాహాలు పూర్తి అయినట్టు సమాచారం. ఏర్పాటుకు సర్వే పూర్తి కోరుట్ల శివారులోని జంబిగద్దెల సమీపంలో ఉన్న సుమారు 30ఎకరాల ప్రభుత్వ స్థఽలంలో నవోదయ స్కూల్ ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. దీన్ని ఆనుకొని జాతీయ రహదారి, కోరుట్ల ఏరియా ఆసుపత్రి అందుబాటులో ఉండటం వంటి అంశాలు అనుకూలంగా ఉన్నట్లుగా అధికారులు నవోదయ విద్యాసమితికి ప్రతిపాదనలు పంపించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించే అవకాశాలు లేనప్పటికీ.. ఒకవేళ విద్యార్థుల అడ్మిషన్లు మొదలైలే, వసతి కోసం కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్డులో ఉన్న సమగ్ర సంక్షేమ వసతి గృహం వాడుకోవాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. కోరుట్లలో నవోదయ స్కూల్ విషయంలో అధికారిక ప్రకటన రాకున్నా క్షేత్రస్థాయిలో అవసరమైన ఏర్పాట్లు దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. జిల్లా నేతల ఆశలు గల్లంతు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు మంజూరు చేసిన వెంటనే జిల్లాకు చెందిన ధర్మపురి, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల అధికార పార్టీ నేతలు ఎవరికి వారు తమ పరిధిలో నవోదయ స్కూల్ ఏర్పాటు చేయించాలని గట్టి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో సుమారు మూడు నెలల పాటు ప్రతిష్టాత్మకమైన నవోదయ విద్యాలయం ఎక్కడ ఏర్పాటు అవుతుందన్న విషయంలో ప్రతిష్టంబన నెలకొంది. నవోదయ విద్యా సమితి అధికారులు జగిత్యాల జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాలో జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల సెగ్మెంట్లలో నవోదయ ఏర్పాటుకు ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నయోనని సర్వేలు నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తన పుట్టిన ఊరు, ఇటీవల అసెంబ్లీకి పోటీ చేసిన కోరుట్ల సెగ్మెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు.ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కోరుట్లలో నవోదయ స్కూల్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు సమాచారం. ఫలితంగా కోరుట్లలో నవోదయ స్కూల్ ఏర్పాటులో ముందడుగు పడినట్లు తెలిసింది. -
ఆవేదన జీవితాంతం
ఆవేశం అదే క్షణం● చిన్నచిన్న కారణాలకే బలవన్మరణాలు ● ఒంటరవుతున్న పిల్లలు, తల్లిదండ్రులు ● ఉమ్మడి జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న ఆత్మహత్యలుసాక్షి ,పెద్దపల్లి ●: అనారోగ్యంతో కొందరు, కుటుంబ కలహాలతో మరికొందరు, అప్పుల బాధ, నిరుద్యోగం, పరీక్షల్లో ఫెయిల్, ప్రేమలో విఫలం, ఇష్టం లేని పెళ్లితో ఇంకొందరు.. వరకట్న వేధింపులు, అవమానం, ఆవేశం ఇలా కారణాలు ఎన్ని ఉన్నా మానసిక ఒత్తిడిలో బలహీనమైన క్షణంలో బలమైన నిర్ణయాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలతో ఆయా కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయి. మహిళలు ఆత్మహత్య చేసుకుంటే వారి పిల్లలు అనాథలవుతున్నారు. ప్రేమ, ఉద్యోగం, పరీక్షలు తదితర కారణాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. రోజూ ఇద్దరు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో సంవత్సరానికి 8లక్షల మందికి పైగా, అంటే ప్రతీ సెకనుకు ఒకరు ఆత్మబలిదానం చేసుకుంటున్నారు. ప్రపంచంలో జరిగే ప్రతి 4 ఆత్మహత్యల్లో ఒకటి ఇండియాలోనే నమోదవుతోంది. ఉమ్మడి జిల్లాలో గతేడాది 776 మంది సూసైడ్ చేసుకున్నారు. అంటే సగటున ప్రతీ రోజుకు ఇద్దరు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏదో కారణంతో తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. నివారిద్దాం ఇలా.. నిరాశ, నిస్పృహల్లో ఉన్నవారికి స్వాంతన కలిగించడం ద్వారా ఆత్మహత్యలను తగ్గించవచ్చు. ఆత్మహత్య ఆలోచన రావడమే తరువాయి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా వారిని మన వైపు మళ్లించవచ్చు. వారి బాధలను వినాలి, అర్థం చేసుకోవాలి. వారి సమస్యకు ఎలా పరిష్కారం దొరుకుతుందో వారితోనే చెప్పించాలి. ఇలాంటివారిని గుర్తించగానే ఒంటరిగా ఉంచకుండా నలుగురితో కలిసేలా కుటుంబసభ్యులంతా స్నేహంగా మెలగాలి. వారు సాధారణ జీవితం గడిపేంత వరకు వారిని గమనిస్తూ ఉండాలి. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మానసిక వైద్యులను కలిసి చికిత్స ఇప్పించాలి. గుర్తించడం ఇలా.. ఆత్మహత్య గురించి పదేపదే మాట్లాడుతుండటం, తనకు తాను హాని కలిగించుకునేందుకు ప్రయత్నించడం, తీవ్ర ఒత్తిడితో చికాకు పడుతుండటం, ఒంటరితనాన్ని ఇష్టపడటం, ప్రతీ విషయం గురించి ప్రతికూలంగా ఆలోచించడం, నిద్రపోకుండా ఉండటం, చేసే ప్రతి పనిపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం.. ఇలాంటి మార్పులు ఒక వ్యక్తిలో కనిపిస్తే, వారు ఆత్మహత్య గురించి ఆలోచనలు చేస్తుండొచ్చని భావించాలి. ● ‘ఏడాదిన్నర వయసు ఉన్న బిడ్డకు ఉరివేసి, అదే తాడుకు తల్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇటీవల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. తాను బక్కగా ఉన్నాననే బాధతో మనస్తాపం చెంది అఘాయిత్యానికి పాల్పడింది’. ● ‘ఈనెల 11న రామగుండం కార్పొరేషన్ 14వ డివిజన్ ఎల్కలపల్లి గేట్ గ్రామానికి చెందిన వివాహిత భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో ముగ్గురు పిల్లలు తల్లిలేని బిడ్డలయ్యారు’. ● ‘గత నెల 6న చొప్పదండి మండలానికి చెందిన ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని మనస్తాపం చెంది ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఓ కష్టం.. ఓ నష్టం.. ఆవేదన, ఆవేశం, ఆక్రోశం, మనిషిని తన ప్రాణం తాను తీసుకునేలా చేస్తోంది. దీంతో వారిపై ఆధారపడిన వారు ఒంటరవుతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. వారి కుటుంబాలను జీవితాంతం ఆవేదన మిగుల్చుతోంది. ...వీరంతా బతకాల్సిన వారే కౌన్సెలింగ్ తీసుకుంటే తప్పేంటి.. ఆత్మహత్య ఆలోచనలు వెంటాడుతున్న వారికి వీలైతే మానసిక వైద్యుడితో కౌన్సెలింగ్ ఇప్పించాలి. కానీ, మనదగ్గర మానసిక వైద్యం అంటే నామోషీ. మానసిక వైద్య చికిత్స అంటే.. అదేదో పిచ్చిపట్టినవాళ్లకు అందించే చికిత్స అనే భావన ప్రజల మెదళ్లలో నాటుకుపోవడం వల్లే ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఆత్మహత్యకు ముందు కొంతమంది ప్రదర్శించే నిర్దిష్ట లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారా చాలావరకు బలవన్మరణ కేసులను నివారించే అవకాశం ఉంటుందని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. -
బీజేపీవి కుల, మత రాజకీయాలు
రాయికల్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కుల, మత రాజకీయాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతోందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఆరోపించారు. రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో గురువారం జై బాపు జై భీమ్ జై సంవిదాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి రాజ్యాంగ ప్రతులతో పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోడీ కులమతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అంబేద్కర్ ఆలోచన విధానమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. పార్టీ కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దని, కష్టసుఖాల్లో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. గంగాధర్, మహేశ్, అత్తినేని గంగారెడ్డి, మాజీ సర్పంచ్ తంగెళ్ల రమేశ్, గోపి రాజిరెడ్డి, ఎంబారి రమేశ్, ఎంబారి వెంకటేశ్, ముజాద్, శ్రీను, రవి పాల్గొన్నారు.● మాజీ మంత్రి జీవన్‌రెడ్డి -
పైలెట్ ప్రాజెక్టుగా ‘ఇబ్రహీంపట్నం’
ఇబ్రహీంపట్నం: భూ భారతి చట్టం అమలుకు రాష్ట్రంలో నాలుగు మండలాలు ఎంపికయ్యాయని జూన్ 2 తర్వాత జిల్లాకు ఒకటి ఎంపిక చేస్తామని ఇందులో ఇబ్రహీంపట్నం మండలాన్ని ప్రదిపాదిస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో గురువారం భూ భారతి చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. మళ్లీ వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థ వచ్చే అవకాశం ఉన్నందున గ్రామస్థాయిలో భూ సమస్యల పరిష్కరం సులభతరం అవుతుందని తెలిపారు. రెవెన్యూ రికార్డులు అన్నీ ఇక నుంచి ప్రజల ముందు ఉంటాయని స్పష్టం చేశారు. 14 నెలలుగా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చేందుకు పకడ్బందీగా సర్వే చేసినట్లు వివరించారు. వీఆర్వో, వీఆర్ఏలు లేకపోవడంతో రైతుల భూ సమస్యలను గుర్తించేందుకు తహసీల్దార్లకు ఇబ్బందిగా ఉండేదన్నారు. భూ భారతి చట్టంతో గ్రామస్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని, తహసీల్దార్‌కు అప్పీల్ చేసుకోవచ్చునని, సమస్య పరిష్కారం కాకుంటే ఆర్డీవోకు అప్పీల్ చేసుకోవచ్చునని, అక్కడి నుంచి కలెక్టర్‌కు, కోర్టు వరకు వెళ్లవచ్చని తెలిపారు. సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంపీవో రామకృష్ణరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరిగం రాజు, ఆర్ఐలు రేవంత్‌రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు. భూ భారతితో సమస్యలు పరిష్కారం బుగ్గారం: భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని కలెక్టర్ సత్య ప్రసాద్ పేర్కొన్నారు. బుగ్గారంలో గురువారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భూ భారతితో మ్యూటేషన్లు 30రోజుల్లో ఆటోమేటిక్‌గానే అవుతాయన్నారు. నూతన చట్టంలో పొందుపరిచిన ముఖ్య విషయాలను కలెక్టర్ రైతులకు వివరించారు. ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ మాజిద్, ఎంపీడీవో అఫ్జల్‌మియా, ఏవో అక్షిత పాల్గొన్నారు. నేషనల్ హైవే భూసేకరణ వేగవంతం చేయాలి జగిత్యాల: నేషనల్ హైవే 63, 563 భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గురువారం నేషనల్ హైవే అధికా రులతో సమీక్ష నిర్వహించారు. ఆర్మూర్ నుంచి మంచిర్యాల గల ఎన్‌హెచ్–63, జగిత్యాల–వరంగల్ గల ఎన్‌హెచ్ 563 భూసేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. రహదారి నిర్మాణంలో భూములు పోయిన రైతులు, నివాసం ఉన్న వారు, నష్టపరిహారం కింద చెల్లించాల్సిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్–63 పీడీ అజయ్ మణికుమార్, ఎన్‌హెచ్–563 పీడీ దుర్గప్రసాద్, ఆర్డీవోలు జివాకర్‌రెడ్డి, శ్రీనివాస్, మధుసూదన్ పాల్గొన్నారు. భూ భారతికి మండలాన్ని ఎంపిక చేస్తాం కలెక్టర్ సత్యప్రసాద్ -
‘బీజేపీ బలోపేతానికి కృషి’
జగిత్యాలటౌన్: జిల్లాలో బీజేపీ బలోపేతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చా రు. జగిత్యాలలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మె ల్యే దన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రధాని మోడీ యకత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, సత్యనారాయణరావు, కొక్కు గంగాధర్, రఘు, కన్నం అంజయ్య, గడ్డల లక్ష్మి పాల్గొన్నారు. -
మెడికల్ హబ్‌గా జగిత్యాల
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ జగిత్యాల: జగిత్యాలను మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుకోవడం జరిగిందని, రాష్ట్రంలోనే అత్యధికంగా నియోజకవర్గానికి పల్లె దవాఖానాలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని లింగంపేటలో రూ.13 లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖానా, రూ.10 లక్షలతో పాఠశాలల్లో నిర్మించిన మరుగుదొడ్లను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకోవడంతో పాటు, నర్సింగ్ కళాశాల, క్రిటికల్ కేర్ యూనిట్లు అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాల జాప్యానికి గత ప్రభుత్వంలో నిధులు మంజూరు కాగా కాంట్రాక్టర్లు చేతులెత్తేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. జగిత్యాల పట్టణంలో 18 వేల కుటుంబాలకు ఉచిత కరెంట్, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, నూతన ఉద్యోగాలు, రుణమాఫీ, ఇలా అన్ని రంగాల్లో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. టీఆర్‌నగర్‌లో రూ.3 కోట్లతో బాలసదన్ టీఆర్‌నగర్‌లో రూ.3 కోట్లతో బాలసదన్ నిర్మాణం జరగగా అదనంగా రూ.75 లక్షల నిధులు కేటా యించనున్నట్లు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తెలి పారు. మున్సిపల్ అధికారులు వెటర్నరీ, హెల్త్ వివిధశాఖలతో సమీక్ష నిర్వహించారు. సీఆర్ఆర్ నిధులు రూ.30 కోట్ల టెండర్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్‌యార్డు నిర్వహణ, తడిపొడి చెత్త నిర్వహణపై ప్రజలను చైతన్య పర్చాలన్నారు. డీఎంహెచ్‌వో ప్రమోద్, కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, అడువాల జ్యోతి, గోలి శ్రీనివాస్, భారతి, చుక్క నవీన్ పాల్గొన్నారు. -
స్వశక్తి సంఘాలకు శిక్షణ
జగిత్యాలరూరల్: స్వశక్తి సంఘాల పుస్తకాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని ఐకేపీ ఏపీడీ చరణ్‌దాస్ అన్నారు. జగిత్యాల మండల ఐకేపీ కార్యాలయంలో స్వశక్తి సంఘాల ఆడిట్, సీఆర్పీలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. రాష్ట్ర గ్రామీణ, పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల నుంచి సంఘాల సంఖ్యను బట్టి నలుగురు నుంచి ఐదుగురు సీఆర్పీలను ఎంపిక చేసి వారికి ఐదురోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. రెండు రోజులు ఏదైనా గ్రామంలోని స్వశక్తి సంఘాల పుస్తకాల పరిశీలన, ఆర్థిక లావాదేవీలపై ఆడిట్ చేసి నివేదిక తయారు చేయిస్తామని వెల్లడించారు. ఫైనాన్స్ డీపీఎం విజయభారతి, ఐబీ డీపీఎం మానిక్‌రెడ్డి, మార్కెటింగ్ డీపీఎం మల్లేశం, ఏపీఎం గంగాధర్, జిల్లా డీఎంజీలు దేవయ్య, దాస్, సంతోష్, అకౌంటెంట్ పద్మ పాల్గొన్నారు. -
ఆరోగ్యం.. చల్లగా బేజారు!
● ప్రమాదకరంగా శీతలపానీయాలు ● నాణ్యతలేకుండా ఐస్ తయారీ ● వాటిని తాగితే గొంతునొప్పులు ● అనారోగ్య సమస్యల బారిన ప్రజలుజగిత్యాల: జిల్లాలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. మార్చి ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇళ్లనుంచి బయటకు వస్తున్న జనాలు శీతల పానీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఇక్కడే పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న చెరుకురసాల బండ్లు, పండ్లరసాల బండ్ల నిర్వాహకులు వినియోగిస్తున్న ఐస్‌లో ఆరోగ్యానికి హాని చేసే కారకాలు వెలుగుచూస్తున్నాయి. వాస్తవానికి చల్లదనం కోసం శీతలపానీయాలు, చెరుకురసాల్లో ఐస్ ముక్కలు వేసి ఇస్తుంటారు. అవి పరిశుభ్రంగా లేకపోతే అనారోగ్యానికి గురికావాల్సిందే. పైగా ఐస్‌లో రకరకాల రంగులు కలుపుతున్నారు. ఐస్‌లో రెండురకాలు జిల్లాలో ఐస్ తయారుచేసే ఫ్యాక్టరీలు సుమారు 10 వరకు ఉన్నాయి. జిల్లా కేంద్రంతోపాటు, కోరుట్ల, మెట్‌పల్లిలోనూ ఐస్ ఫ్యాక్టరీలున్నాయి. ఈ ఫ్యాక్టరీలు ఐస్ తయారీకి వినియోగించే నీరు శుభ్రంగా ఉండడం లేదని సమాచారం. బోర్లు, ఇతరత్రా ప్రాంతాల నుంచి తెచ్చిన నీటిని వినియోగిస్తున్నట్లు సమాచారం. ఆ నీటిని ఐస్‌లా మార్చి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఈ ఐస్ ముక్కలనే పొద్దటి నుంచి సాయంత్రం వరకు వినియోగిస్తున్నారు. వాస్తవానికి శుభ్రమైన నీటితో ఐస్ తయారు చేస్తే తొందరగా నీటిలా మారుతుంది. అపరిశుభ్ర నీటిని వినియోగిస్తే ముద్దలా ఉండి.. రాత్రి వరకూ అలాగే ఉంటుందని సమాచారం. అలాగే ఫ్యాక్టరీల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐస్ ఫ్యాక్టరీల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన మున్సిపల్, ఫుడ్‌సేఫ్టీ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు విధాలుగా తయారీ ● ఫ్యాక్టరీల్లో ఐస్‌ను రెండు విధాలుగా తయారుచేస్తుంటారు. ● ఒకటి పారిశ్రామిక అవసరాలకు వినియోగించేది ● మరొకటి మాంసం, చేపలు, పండ్లు, ఔషధాల నిల్వలు, ఆస్పత్రులు కోసం వినియోగిస్తుంటారు. ● ఐస్ తయారుచేసే సమయంలో ఏ నీటితోనైనా తయారుచేస్తుంటారు. ● ముఖ్యంగా పండ్లరసాల్లో వినియోగించే ఐస్‌ను శుభ్రమైన నీటితో, పరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేయాలి. ● అలాంటి ఐస్‌ను ఎవరూ కొనుగోలు చేయడం లేదు. బయట ప్రాంతంలో.. తక్కువ ధరకు దొరికే ఐస్‌ను కొనుగోలు చేసి శీతల పానియాల్లో వాడుతున్నారు. ● నాణ్యతలేని ఐస్ ముక్కలను వాడటం వల్ల గొంతునొప్పి, జ్వరం, ఆస్తమా వంటివ్యాధులు వస్తాయి. ● శీతలపానీయాలు సేవించేవారు ఐస్‌ముక్కలు వేసుకోకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ● నాణ్యత లేని ఐస్‌ను గుర్తించడం కష్టమే అయినప్పటికీ.. ఐస్ వేసుకోకపోవడమే చాలా మంచిది. నిబంధనలు హుష్‌కాకి ఐస్ ఫ్యాక్టరీల్లో అపరిశుభ్రమైన నీటిని వాడటంతోపాటు నీటి పరీక్షలను చేయాలి. కానీ.. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ అధికారులు పర్యవేక్షించాల్సి ఉన్నా కనీసం పట్టించుకోవడం లేదు. అపరిశుభ్రమైన నీటిని వాడటంతోపాటు ఐస్ తయారీకి ఉపయోగించే ఇనుపదిమ్మలు తుప్పుపట్టినా స్పందించేవారు లేరు. ఐస్ గడ్డల్లో వినియోగించే ఉప్పును కూడా నాణ్యతలేనిది వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. వైరస్, బ్యాక్టీరియలతో మలబద్దకం, టైపాయిడ్, డయేరియా తదితర వ్యాధులకు కారకాలవుతున్నాయి. కొందరు రుచి ఉండాలన్న ఉద్దేశంతో రసాయనాలు వాడుతుంటారు. ఇవి మూత్రపిండాల వ్యాధులకు దారితీస్తున్నట్లు సమాచారం. కండ్లు, దంతాలు కూడా దెబ్బతింటాయని వైద్యులు పేర్కొంటున్నారు. -
బీఆర్ఎస్ హయాంలోనే జగిత్యాల అభివృద్ధి
జగిత్యాల: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జగిత్యాల అభివృద్ధి చెందిందని, కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జిల్లాకేంద్రంగా ఏర్పాటు చేసి మెడికల్ కళాశాల, డబుల్బెడ్రూం ఇళ్లు కేటాయించారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశాన్ని జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేయగా.. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉచిత బస్ రవాణా తప్ప చేసిందేమీ లేదన్నారు. రైతుభరోసా ఇంకా రాలేదని, రుణమాఫీ కాలేదని, తులం బంగారం ఇవ్వడం లేదని తెలిపారు. ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారని, మళ్లీ పాత రోజులు వచ్చాయని పేర్కొన్నారు. రోళ్లవాగు ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయినా ఇప్పటికి గేట్లు కూడా బిగించలేకపోతున్నారని వివరించారు. 2018, 2023లో ఎమ్మెల్యేగా సంజయ్‌ని కష్టపడి గెలిపించుకుంటే ఇప్పుడాయన ఒకసారి సీఎంతో.. మరోసారి బీజేపీ ఎంపీ అర్వింద్‌తో ఫొటోల్లో కనిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. అభివృద్ధికి నిధులు తేవడంలో సంజయ్ విఫలమయ్యాడని, గ్రామగ్రామాన అతడిని నిలదీయాలన్నారు. బీఆర్ఎస్ పటిష్టతకు ప్రతి గ్రామంలో కమిటీలు వేయాలని, అందులో మైనార్టీలు, క్రిస్టియన్లు, ఎస్సీ, బీసీలు ఉండాలన్నారు. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ మా ట్లాడుతూ పార్టీలో కష్టపడిన ప్రతిఒక్కరికీ గుర్తింపు లభిస్తుందన్నారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, సీనియర్ నాయకులు ఓరుగంటి రమణారావు, రాజేశంగౌడ్, లోక బాపురెడ్డి, శీలం ప్రియాంక, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. ‘చలో వరంగల్’ పోస్టర్ ఆవిష్కరణ వరంగల్‌లో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ ర జతోత్సవ బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ ను కవిత ఆవిష్కరించారు. ఇది తెలంగాణ ప్రజల కు పండుగలాంటిదన్నారు. తెలంగాణ చౌక్ వద్ద వాల్‌రైటింగ్ చేశారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాల ని రాశారు. సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిన కాంగ్రెస్ ఆ పార్టీకి మోసం చేయడం మొదటి నుంచే అలవాటు పార్టీ రజోతోత్సవ సభకు భారీగా తరలిరండి ఎమ్మెల్యే సంజయ్ పార్టీ ఎందుకు మారాడో తెలియదు పార్టీ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత -
నీడ లేదు.. నీరూ లేదు..!
కూర్చునేందుకు కుర్చీ ఉండదు.. నిలబడదామంటే నీడ ఉండదు.. కనీసం తాగునీరు దొరకదు.. అత్యవసర పరిస్థితుల్లో మరుగుదొడ్లను వినియోగించుకుందామంటే ముక్కుపుటాలు అదిరే కంపు.. ఇవీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్లలో కనిపించే పరిస్థితులు. నియోజకవర్గ కేంద్రాల్లో బస్టాండ్లు ఉన్నా సౌకర్యాలు లేకపోగా.. మండల కేంద్రాల్లో కనీసం బస్టాండ్లు కూడా కరువయ్యాయి. మరికొన్ని ప్రధాన గ్రామాల్లో ప్రయాణప్రాంగణాలు లేక ప్రయాణికులు ఎండలోనే బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయడంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. వీరంతా ఎండలోనే నిల్చొని బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం.. అంటూ ప్రచారం చేసుకునే అధికారులు ప్రయాణ ప్రాంగణాలలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఉమ్మడి జిల్లాలో ప్రయాణ ప్రాంగణాలు లేక.. ఉన్నా సౌకర్యాలు కరువై ప్రయాణికులు పడుతున్న కష్టాలపై ‘సాక్షి’ ఫోకస్. – వివరాలు 8లో.. -
కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది రానీయొద్దు
ధర్మపురి: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇ బ్బందులు కల్గించవద్దని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండలంలోని రాయపట్నంలో బుధవారం కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యంలో కోతలు విధించొద్దన్నారు. గన్నీ సంచులు, హమాలీల కొరత లేకుండా చూడాలని అన్నారు. ఏఎంసీ చైర్మన్ చిలుముల లావణ్య, నాయకులు రాందేని మొగిలి, ఎంపీ.రఫీయో ద్దీన్, రెవెన్యూ అధికారులు తదితరులున్నారు. వెల్గటూర్‌లో.. వెల్గటూర్: కేంద్రాలను సద్వినియోగం చేసుకో వాలని విప్ న్నారు. ఎండపల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారులను న మ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ గోపిక, వైస్ చైర్మన్ తిరుపతి, సంఘ అధ్యక్షుడు రాంరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాంమల్లాపూర్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దామని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుదామని డీఈవో రాము అన్నారు. మండలంలోని వాల్గొండ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం రూపొందించిన బడిబాట కరపత్రాలను డీఈవో తన కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. విద్యార్థుల సంఖ్యను పెంచే ఉద్దేశంతో ఉపాధ్యాయులు కరపత్రాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. మల్లాపూర్ ఎంఈవో దా మెదర్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఎల్.రాజు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్‌ను నిలిపి వేయాలి కోరుట్ల: అడవుల్లోని కోట్లాది ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అందులోభాగంగానే ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ ముడిమడుగుల మ ల్లన్న అన్నారు. పట్టణంలోని సీ.ప్రభాకర్ స్మారక భవన్లో ఆదివాసీలపై దాడులకు వ్యతిరేకంగా ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆద్వర్యంలో ఈనెల 20న కరీంనగర్లో నిర్వహించే బహిరంగ సభ కరపత్రాన్ని బుధవారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 1990 నుంచి 2025 వరకు ఆది వాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టేందుకు అనే క రకాల ఆపరేషన్లు చేపట్టారని పేర్కొన్నారు. ఆదివాసీలపై ప్రభుత్వాలు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు, దళితులు, మేధావులు, హక్కుల కార్యకర్తలు అండగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల వేదిక కో–కన్వీనర్లు గుమ్మడి కొమురయ్య, రామిళ్ల బాపు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరుగుల రాజన్న, పొన్నం రాజమల్లయ్య, భూమేశ్వర్, చెన్నా విశ్వనాథం, రాజ భూమయ్య, తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు పిల్లలకు శ్రేష్టం జగిత్యాలరూరల్: తల్లిపాలు చిన్నారులకు ఎంతో శ్రేష్టమని ఐసీడీఎస్ సీడీపీవో మమత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం చల్గల్లోని అంగన్వాడీకేంద్రంలో బుధవారం పోషణపక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణులు, రెండేళ్లలోపు చిన్నారుల ఎత్తు, బరువు నమోదు చేయాలని సూచించారు. బాలింతలకు మొదటి వెయ్యి రోజుల ప్రాముఖ్యతను వివరించారు. పౌష్టికాహారం తీసుకుంటే పిల్ల లు బరువు, ఎత్తు వేగంగా పెరుగుతారన్నారు. గర్భిణులు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. 1098 (చైల్డ్‌లైన్ హెల్ప్‌లైన్), 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్), గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. సూపర్వైజర్ లావణ్య, సెక్రెటరీ శ్రీనివాస్, చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారి రజిత, మహిళాసాధికారత అధికారి స్వప్న, గౌతమి, డాక్టర్ చాందిని, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకుంటాం
ధర్మపురి: దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని రాష్ట్రప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. మండలంలోని దమ్మన్నపేటకు చెందిన శ్రీనివాస్ బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లి కంపెనీలో పని చేసుకుంటున్నాడు. ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడు శ్రీనివాస్‌ను కత్తితో నరికి చంపిన విషయం తెలిసిందే. విప్, మాజీమంత్రి జీవన్‌రెడ్డి బుధవారం మృతుడి తల్లి రాజవ్వ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. శ్రీనివాస్ హత్యకు గురికావడం బాధాకరమన్నారు. శ్రీనివాస్ కొడుకుకు అవుట్సోర్సింగ్ ఉద్యోగంతోపాటు ఇందిరమ్మ ఇల్లు, ఎన్నారై పాలసీ కింద రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేలా కృషి చేస్తామని అన్నారు. నాయకులు ఎస్.దినేష్, వేముల రాజు, చీపిరిశెట్టి రాజేశ్ ఉన్నారు. శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న విప్ అడ్లూరి, జీవన్‌రెడ్డి -
దరఖాస్తుల్లో యువ‘వికాసం’!
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనూహ్య స్పందన ● వరుస సెలవులు, సర్వర్ సమస్యలతో దరఖాస్తులకు ఇబ్బందులు ● చాల మందికి ఇంకా అందని కులం, ఆదాయం, రేషన్ కార్డులు ● గడువు పెంచాలని దరఖాస్తుదారుల వినతులుసాక్షిప్రతినిధి, కరీంనగర్: యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువవికాస పథకానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చింది. దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర సమస్యలు ఎదురైన దరఖాస్తులు వెల్లువెత్తాయి. సర్వర్ లోపాలతో పాటు సాంకేతిక సమస్యలతో దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగడంతో వేల మంది పథకం కోసం దరఖాస్తు చేసుకోకముందే గడువు ముగియటంతో నిరాశచెందుతున్నారు. ప్రభుత్వం మెరుగైన రాయితీతో రూ.4 లక్షల వరకు విలువైన యూ నిట్లు మంజూరు చేయనుండటంతో యువత ఈ పథకానికి భారీగా దరఖాస్తు చేసుకోవాడానికి ఆసక్తి చూపారు. గడువు ముగిసేనాటికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,31,075 మందికి ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. సర్వర్ సమస్యలతో కేంద్రాల వద్ద బారులు రాజీవ్ యువ వికాసం దరఖాస్తు చేయడానికి రూపొందించినటువంటి ఓబీఎంఎంఎస్ పోర్టల్‌లో సర్వర్ సమస్యలు నెలకొన్నాయి. దీంతో మీ సేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాసారు. కొన్నిసార్లు అప్లికేషన్ చివరిదశకు వెళ్లిన సమయంలో సర్వర్ మొరాయించగా, దరఖాస్తు సమర్పించిన తర్వాత అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ కాకపోవడంలాంటి సమస్యలు ఎదురయ్యాయి. ఒకవేళ మళ్లీ దరఖాస్తు చేస్తే అల్రెడీ అప్లైడ్ అని రావడం, దరఖాస్తు సమయంలో తరచూ సర్వర్ ఎర్రర్ మెసేజ్ రావడమనేది పరిపాటిగా మారింది. దీంతో ఒక్కో దరఖాస్తు చేయడానికి కనీసం అరగంటకు పైగా ఎదురుచూడాల్సి వచ్చింది. సెలవులతో అర్జీలు పెండింగ్‌లో రేషన్‌కార్డు లేకుంటే ఆదాయ ధ్రువీకరణ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఆ సర్టిఫికేట్స్ కోసం మీసేవ కేంద్రాలకు పరుగులు తీశారు. ఐతే రాజీవ్ యువవికాసం పథకం దరఖాస్తులు స్వీకరించినప్పటి నుంచి వరుస సెలువులు సైతం దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురిచేశాయి. రంజాన్, ఉగాది, జగ్జీవన్‌రామ్ జయంతి, తాజాగా రెండో శనివారం, ఆదివారం, సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆఫీసులు పనిచేయలేదు. దీంతో ఆదాయం, కుల సర్టిఫికేట్స్ పెండింగ్ దరఖాస్తులు ఎలా పరిష్కారమవుతాయని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు మీసేవ కేంద్రాల ద్వారా రెవెన్యూ కార్యాలయాలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లక్షల్లో క్యాస్ట్, ఇన్‌కం ధ్రువీకరణ పత్రాలకు అర్జీలు వచ్చాయి. వీటిలో వేలల్లోనే దరఖాస్తులను మాత్రమే అధికారులు ఆమోదించారు. దీంతో ధ్రువీకరణ పత్రాలు అందని చాలామంది చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరు ఏండ్ల తరువాత 6 ఏళ్ల తరువాత నిరుద్యోగుల కోసం స్వయం ఉపాధి పథకాన్ని అమలు చేస్తుండటంతో యువత దీనిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ మార్చి 15వ తేదీన ప్రారంభించినప్పటికీ అప్పటికీ రుణాల పరిమితి, కేటగిరీలు, రాయితీ నిధులకు సంబంధించి స్పష్టత రాలేదు. మార్చి 25న ఈ పథకం విధివిధానాలపై సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఆ తరువాత ఈబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ చేపట్టింది. గడవు పెంచుతూ 14 వరకు సమయం ఇచ్చింది. తాజాగా మరోసారి గడువు పెంపుపై ఆశలు పెట్టుకున్నారు.పెద్దపల్లి: 47,470జగిత్యాల: 31,128రాజన్నసిరిసిల్ల: 23,477కరీంనగర్: 29,000కుల ధ్రువీకరణ పత్రం లేక దరఖాస్తు తిరస్కరణ కుల ధ్రువీకరణ పత్రం కోసం వారం రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నా. తహసీల్దార్ కార్యాలయంలో సైట్ ఓపెన్ కావడం లేదని వారు దానిని అప్లోడ్ చేయలేదు. దీంతో నాకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ రాలేదు. దీంతో నేను దరఖాస్తు చేసుకోలేకపోయాను. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసే నంబరు వేసినప్పటికీ యువ వికాస్ పథకంలో తీసుకోవడం లేదు. దీంతో ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేకుండా పోయింది. –ఏదుల కిరణ్‌కుమార్, జగిత్యాల -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు
మెట్‌పల్లిరూరల్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చే యొద్దని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్పల్లి మండలం ఆత్మనగర్, ఆత్మకూర్ గ్రామాల్లోని కొ నుగోలు కేంద్రాలను బుధవారం పరిశీలించారు. తప్ప, తాలు లేకుండా తేమ శాతం వచ్చిన ధా న్యాన్ని వెంటవెంటనే కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు తరలించాలని సూచించారు. కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, డీఆర్డీవో పీడీ రఘువరణ్, డీసీవో మనోజ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఏవో దీపిక, ఏపీఎం విమోచన, ఆర్ఐ ఉమేశ్, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు. ● కలెక్టర్ సత్యప్రసాద్ -
బెదిరింపులు.. మోసం.. వారికి కొత్త కాదు: కవిత
సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు.. మోసం కొత్త కాదని.. తెలంగాణ ఇస్తానని చెప్పి 2004లో మోసం చేసిన కాంగ్రెస్... ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేస్తోందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. జగిత్యాలలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ, ఉచిత బస్సు అంటూ. మహిళల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తోంది. ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇచ్చి బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్ల సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు.కళ్యాణలక్ష్మీ పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఒక బస్సు ఇచ్చి.. బంగారాన్ని తుస్సుమనిపించారు. రుణ మాఫీ, రైతు భరోసా 50 శాతం మందికి ఇంకా రానేలేదు. గ్రామగ్రామాన కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలి. బీజేపీ మోసపూరిత విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పసుపు బోర్డును తూతూమంత్రంగా ఏర్పాటు చేశారే కానీ.. చట్టబద్ధత కల్పించలేదు. దాంతో పసుపు బోర్డుకు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పసుపు ధరలు పడిపోతే బోర్డు నుంచి డబ్బులు ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. మరి పసుపు ధరలు పడిపోతే బోర్డు నుంచి రైతులకు డబ్బులు ఇచ్చారా?’’ అంటూ కవిత ప్రశ్నించారు.రెండు కోట్ల ఉద్యోగాలు, బోర్డుకు చట్టబద్ధత, మనిషికి 15 లక్షలు ఏమయ్యాయని అడిగితే ఎంపీ అర్వింద్ పిచ్చి మాటలు మాట్లాడుతారు. అంతకు మించి ప్రజలకు పనికి వచ్చే మాటలు మాట్లాడిన దాఖలాలు లేవు. రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు.. అయినా కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు 8 రూపాయలు కూడా ఇవ్వలేదు. 8+8 = పెద్ద గుండు సున్నా. తెలంగాణాను కాపాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, గులాబీ జెండానే. రజతోత్సవం గుజాబీ పండుగ మాత్రమే కాదు.. ఇది తెలంగాణ పండుగ. తెలంగాణా ప్రజలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్’’ అని కవిత చెప్పుకొచ్చారు.‘‘బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఎంపీ అర్వింద్ కలిసిమెలసి ఢిల్లీతో తిరుగుతున్న వార్తను టీవీల్లో చూశాను. సంజయ్ బీజేపీలో చేరారా లేదా కాంగ్రెస్‌లో చేరారా అన్న అనుమానం వచ్చింది. సంజయ్ ఒకసారి సీఎం రేవంత్ రెడ్డితో... మరొకసారి బీజేపీ వాళ్లతో కనిపిస్తారు. ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో తెలియక ప్రజల్లో అయోమయం నెలకొంది. జగిత్యాలకు నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యే సంజయ్ విఫలం. ఎమ్మెల్యే సంజయ్‌ని గ్రామ గ్రామానా నిలదీయాలి’’ అని కవిత పేర్కొన్నారు. -
స్వచ్ఛమైన నీరు అందుతుంది
కేంద్ర ప్రభుత్వం నిధులతో అమృత్ 2.0 పూర్తిచేస్తే రాయికల్ పట్టణ ప్రజలంతా స్వచ్ఛమైన నీరు తాగే అవకాశం ఉంది. అధికారులు నిర్లక్ష్యంతో పనుల్లో జాప్యం ఎదురవడంతో నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. – సామల్ల సతీశ్, బీజేపీ నాయకులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం రాయికల్ బల్దియాలో అమృత్ 2.0పై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇటీవల స్థల పరిశీలన చేశాం. ల్యాండ్ అక్వేషన్ అనుమతి రాగానే పనులు చేపడతాం. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిస్తాం. – మనోహర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ -
నేడు జగిత్యాలకు ఎమ్మెల్సీ కవిత రాక
జగిత్యాల: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం జిల్లాకు రానున్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ రజోతోత్సవ సభ సన్నాహక సమావేశంలో పాల్గొంటారని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత తెలిపారు. ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశానికి నాయకులకు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. సహకార వ్యవస్థను బలోపేతం చేస్తాంజగిత్యాలఅగ్రికల్చర్: సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని చాలా సహకార సంఘాలు రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొన్నారు. సహకార వ్యవస్థ బలోపేతం జరిగితే మరిన్ని సౌకర్యాలు రైతులకు అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో సంఘ సలహాదారు అశోక్‌కుమార్, సంఘ అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షుడు గర్వందుల చిన్న గంగయ్య, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. అగ్నిప్రమాదాలపై అవగాహన పెరగాలిజగిత్యాలక్రైం: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెరగాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణకాంత్ అన్నారు. అగ్ని మాపక వారోత్సవాల సందర్భంగా మంగళవారం కొత్తబస్టాండ్ చౌరస్తాలో అగ్నిప్రమాదా లు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పట్టణాల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు తక్షణ మే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాలన్నారు. స్థానికంగా ఉన్న వారు అగ్నిప్రమాదాన్ని నివారించేందుకు కృషి చే యాలన్నారు. అనంతరం అగ్నిమాపక శాఖ అఽ దికారులు విన్యాసాలు చేపట్టారు. కార్యక్రమంలో ఎల్ఎఫ్ రవీందర్, జి.మధు పాల్గొన్నారు. సూరమ్మ రిజర్వాయర్ కట్ట పనులు ప్రారంభంకథలాపూర్: మండలం కలిగోట శివారులోగల సూరమ్మ రిజర్వాయర్ కట్ట పనులు మంగళవారం ప్రారంభించారు. ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా ఈ రిజర్వాయర్‌ను నింపాలన్నది లక్ష్యం. ఇటీవలే మత్తడి నిర్మాణం పూర్తి చేశారు. నెలరోజుల్లో కట్ట నిర్మాణం, తూము నిర్మాణం పూర్తి చేయిస్తామని అధికారులు అంటున్నారు. వానకాలం సీజన్ వరకు రిజర్వాయర్ అందుబాటులోకి రానుందని మండల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అగ్నివీర్ దరఖాస్తు గడువు పొడిగింపుజగిత్యాలటౌన్: ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ దరఖాస్తు గడువును ఈనెల 25వరకు పొడిగించినట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి బింగి సత్తమ్మ తెలిపారు. ఇండియన్ ఆర్మీలో కేటగిరీల వారీగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్ కం స్టోర్‌కీపర్, అగ్నివీర్ ట్రేడ్‌మెన్‌కు సంబంధించిన దరఖాస్తు గడువును ఈనెల 25 వరకు పొడించారని, అర్హులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
జగిత్యాలరూరల్: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి మోసపోవద్దని డీఆర్డీఏ పీడీ రఘువరణ్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం నర్సింగపూర్, వెల్దుర్తి, వంజరిపల్లి, జాబితాపూర్, ధర్మారం గ్రామాల్లో మంగళవారం ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే గన్నీ బ్యాగులను కేంద్రాలకు తరలించామని వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి, ఏపీఎం గంగాధర్, సీసీ మరియ, నాయకులు మహేశ్, మల్లారెడ్డి, శంకర్‌రెడ్డి, మల్లేశంగౌడ్, నరేశ్, ప్రవీణ్‌గౌడ్, ప్రకాశ్, మమత పాల్గొన్నారు. -
6
40.0/28.0ఎల్ఆర్ఎస్లో తప్పులను సరిదిద్దుకునే అవకాశంచెరువులు.. రూ .18.90 కోట్లు7గరిష్టం/కనిష్టంవాతావరణం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. ఎండవేడిమిగా ఉంటుంది. సాయంత్రం వేడిగాలులు కొనసాగుతాయి. 8లోu ● చెరువుల సుందరీకరణకు నిధులు మంజూరు ● టెండర్లకు ముందుకు రాని కాంట్రాక్టర్లు ● పనులు కొనసాగితే కొత్త అందాలు● నిషేధిత భూములతోనే సమస్య ● ఎల్ఆర్ఎస్ చెల్లించుకోవాలి ● ఈనెల 30 వరకు గడువుజగిత్యాల: ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజ్డ్ స్కీం)కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2020లో దరఖాస్తులు చేసుకున్న ఇంటి స్థలాల యజమానులు ఈనెల 30 వరకు క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచింది. ఆలోపు చెల్లిస్తే 25 శాతం రాయితీ వర్తిస్తుంది. ప్లాట్ల క్రమబద్ధీకరణపై చాలా మందికి అనేక సందేహాలున్నాయి. ఎల్ఆర్ఎస్ ఎవరికి వర్తిస్తుంది..? ఫీజులు ఎవరికి చెల్లించాలి..? ఎవరిని సంప్రదించాలి..? అనే అనేక అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్కు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జగిత్యాల టౌన్ ప్లానింగ్ అధికారి, ఇన్చార్జి డీటీసీపీవో శ్రీనివాస్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. -
‘భూభారతి’పై ప్రచారం కల్పించాలి
జగిత్యాల: భూభారతి చట్టంపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం భూభారతిపై అధికారులతో సమావేశమయ్యారు. భూభారతి చట్టంపై తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, గెజిట్ రూల్స్‌ను రెవెన్యూ శాఖలో ప్రతి అధికారి తెలుసుకోవాలన్నారు. చట్టంలో రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉందన్నారు. ఇకపై రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసే సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరిగా అవసరం అవుతుందన్నారు. ప్రతిరోజు కనీసం రెండు అవగాహన కార్యక్రమాలు జరగాలని, రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఈ చట్టం ముందుగా పైలెట్ ప్రాజెక్ట్ కింద నాలుగు మండలాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారని, వాటిని పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో భూ భారతి చట్టం అమలుకు అధికారులు సంసిద్ధం కావాలని, ప్రజల భూ సమస్యల పరిష్కారానికి పటిష్ఠ కార్యచరణ రూపొందించాలన్నారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ భూముల పెన్సింగ్, మార్కింగ్ వెంటనే పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. తాగునీటి ఇబ్బందులున్న చోట యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లు సొంత స్థలంలో దరఖాస్తు చేసుకున్న వారికి మండల స్పెషల్ ఆఫీసర్లుగా కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, పథకం కింద అర్హులను ఎంపిక చేయాలన్నారు. త్వరలోనే నిధులు విడుదలయ్యేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్‌రెడ్డి, శ్రీనివాస్, మదన్మోహన్ పాల్గొన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
రూ.15వేలు పలికిన పసుపు
మెట్పల్లి: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పసుపు క్వింటాల్‌కు రూ.15వేలు పలికింది. ఈ సీజన్లో జనవరి 31నుంచి యార్డులో కొనుగోళ్లు మొదలవ్వగా ఇప్పటివరకు వ్యాపారులు 45,386 క్వింటాళ్ల పసుపు కొనుగోలు చేశారు. ఇందులో కాడిరకం 26,807, గోళరకం 14,995, చూర రకం 3,584 క్వింటాళ్లు ఉన్నాయి. ప్రారంభంలో క్వింటాల్‌కు రూ.12వేలు చెల్లించి కొనుగోలు చేశారు. ఆ తర్వాత పెరుగుతూ వచ్చిన ధర.. ప్రస్తుతం రూ.15వేలకు చేరింది. ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్‌కు చెందిన రైతు దేవారెడ్డి ఈ ధర పొందాడు. నిబంధనలకు విరుద్ధంగా ఇటుకబట్టీలుమెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలంలో ఇటుకబట్టీల దందా జోరుగా సాగుతోంది. రహదారుల పక్కనే నిబంధనలకు విరుద్ధంగా బట్టీలు ఏర్పాటు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదు. బట్టీల ఏర్పాటుకు ముందుగా స్థానిక గ్రామ పంచాయతీ, ఇండస్ట్రీయల్, మైనింగ్, ఇతర శాఖల అనుమతి తప్పనిసరి. కానీ వ్యాపారులు అవేమీ పట్టించుకోకుండా దందాను కొనసాగిస్తుండడం గమనార్హం. కొండ్రికర్ల, మెట్లచిట్టాపూర్, రంగారావుపేట గ్రామ శివారులో అనుమతి లేకుండా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. ఇందులో కొందరు వ్యాపారులు లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోకపోగా.. మరికొందరు ట్యాక్స్ చెల్లించడంలేదు. మిగతా అనుమతులు కూడా సరిగ్గా లేవు. ఓ గ్రామ శివారులో ఇటుక బట్టీ నిర్వహిస్తున్న వ్యాపారికి స్థానిక పంచాయతీ కార్యదర్శి లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలని, ట్యాక్స్ చెల్లించాలని సూచించగా ‘మీ పైఅధికారితో మాట్లాడుకుంటా అంటూ’ సదరు బదులిచ్చినట్లు తెలిసింది. సదరు వ్యాపారికి గతంలో నోటీస్ జారీ చేసినప్పటికీ ఆయన ఇప్పటికీ లెక్క చేయకపోవడం గమనార్హం. అధికారులు ఇటుక బట్టీల విషయంలో ‘మాములుగా’ వ్యవహరించడంతోనే ఇటుక బట్టీలు అడ్డూఅదుపు లేకుండా నడుస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. -
కీబోర్డులో జగిత్యాల వాసికి గిన్నీస్ రికార్డు
జగిత్యాల: నాన్‌స్టాప్‌గా కీబోర్డు వాయించి జగిత్యాలకు చెందిన విద్యార్థి ప్రతీక్ మక్క గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించాడు. జగిత్యాలకు చెందిన మక్క ప్రవీణ్, సుచరిత దంపతుల కుమారుడు ప్రతీక్ చిన్నప్పటి నుంచే కీబోర్డుపై ఇష్టం పెంచుకుని పట్టు సాధించాడు. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ హలెల్ మ్యూజిక్ స్కూల్ మేనేజ్మెంట్కు బోర్డు ఈవెంట్లో గిన్నీస్ రికార్డుకు 8 దేశాల నుంచి ఎంట్రీలను ఆహ్వానించింది. 1046 మంది పేర్లు నమోదు కాగా.. ఏడాది పాటు ఆన్లైన్లో కీబోర్డు శిక్షణ ఇచ్చింది. 2024 డిసెంబర్ 1న 1046 మందితో గంటపాటు ఆన్లైన్లో నాన్‌స్టాప్ కీబోర్డు ప్లే ఈవెంట్‌ను హలెల్ మ్యూజిక్ స్కూల్ నిర్వహించింది. అనంతరం గిన్నీస్లో రికార్డు కోసం పంపించగా వీరు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రోగ్రాంలో గిన్నీస్ సంస్థ ప్రతినిధి ప్రతీక్‌కు సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా జగిత్యాల వాసులు హర్షం వ్యక్తం చేశారు. -
దుబాయ్‌లో తెలంగాణవాసుల హత్య
సోన్/నిర్మల్/ధర్మపురి/ఆర్మూర్ టౌన్: పొట్టకూటి కోసం దుబాయ్ వలస వెళ్లిన ఇద్దరు తెలంగాణ వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. వీరు దుబాయ్‌లోని అల్‌క్యూజ్ ప్రాంతంలో మోడర్న్ బేకరీలో పనిచేస్తున్నారు. వీరితోపాటు అక్కడే పనిచేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి వీరిని కత్తితో విచక్షణారహితంగా నరికి చంపారు. మతవిద్వేషంతోనే వారిని చంపినట్లు అక్కడ ఉంటున్న తెలంగాణవాసులు చెప్పారు. బేకరీలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తానీ దాడిలో నిర్మల్ జిల్లాకు చెందిన ఆష్టపు ప్రేమ్‌సాగర్ (40), జగిత్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్ మరణించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన దేగాం సాగర్‌కు గాయాలయ్యాయి. సాగర్‌ను సహోద్యోగులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి ఘటనకు సంబంధించిన సమాచారాన్ని బయటకు చేరవేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని యాజమాన్యం హెచ్చరించినట్లు వారి బంధువులు చెప్పారు. చిన్న బిడ్డను చూడకుండానే..నిర్మల్ జిల్లా సోన్ మండలానికి చెందిన ప్రేమ్‌సాగర్ (40) ఇరవై ఏళ్లుగా గల్ఫ్‌లో పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం దుబాయ్‌లోని మోడర్న్ బేకరీలో యంత్రం ఆపరేట్ చేసే పనిలో చేరాడు. ప్రేమ్‌సాగర్‌కు తల్లి లక్ష్మి, భార్య ప్రమీల (35), కూతుళ్లు విజ్ఞశ్రీ (9), సహస్ర(2) ఉన్నారు. పదిరోజుల క్రితమే ప్రేమ్‌సాగర్ నాన్నమ్మ ముత్తమ్మ (90) చనిపోయారు. ఆమె పెద్దకర్మ చేసిన శుక్రవారం రోజే ప్రేమ్‌సాగర్ హత్యకు గురయ్యాడు. ప్రేమ్‌సాగర్ మృతి వార్తను ఆయన కుటుంబసభ్యులకు చెప్పలేదు. ప్రేమ్‌సాగర్ తన చిన్నకూతురు సహస్ర తల్లి కడుపులో ఉన్నప్పుడే దుబాయ్ వెళ్లాడు. తను పుట్టినప్పటి నుంచి గ్రామానికి రాలేదు. బిడ్డను చూడకుండానే ఆయన తనువు చాలించడం స్థానికులను కలచివేస్తోంది. కాగా, దుబాయ్‌లో మరణించిన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్ (42)కు భార్య మంజుల, ఇద్దరు కుమారులు, తల్లి ఉన్నారు. శ్రీనివాస్ మృతి విషయం ఆయన తల్లి రాజవ్వకు ఇంకా చెప్పలేదు. ప్రేమ్‌సాగర్ కుటుంబానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అండగా నిలిచారు. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకురా>వడంతోపాటు నిందితులపై కఠినచర్యలు తీసుకునేలా చూడాలని విదేశాంగ శాఖను కోరారు.విదేశాంగ శాఖ మంత్రికి కిషన్‌రెడ్డి లేఖసాక్షి, న్యూఢిల్లీ: ఇద్దరు తెలంగాణ వ్యక్తులను ఓ పాకిస్తానీ హత్య చేసిన ఘటనపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. ఈ విషయంలో చొరవతీసుకుని వీలైనంత త్వరగా మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన విదేశాంగ మంత్రి జైశంకర్ ఆదేశాలకు అనుగుణంగా దుబాయ్ లోని భారత కాన్సులేట్ అధికారులు.. బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు వివరాలను తెలుసుకున్నారు. ఉద్దేశపూర్వక హత్యకేసుగా నమోదు చేశామని పోలీసులు వారికి చెప్పారు. కాగా, ఇద్దరు తెలంగాణ కార్మికులు మరణించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. భారత కాన్సులేట్ ద్వారా దుబాయ్ పోలీసులు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఆయన ప్రేమ్ సాగర్ సోదరుడు అష్టపు సందీప్‌తోనూ మాట్లాడారు. -
ఆ ఊరిలో ఏకంగా 45 హనుమాన్ దేవాలయాలు!
ఊరిలో ఒకటి.. రెండు హనుమాన్ దేవాలయాలు ఉండటం మామూలే. ఒకటి రెండు కాదు.. ఏకంగా 45 హనుమాన్ దేవాలయాలు.. అక్కడితో ఆగకుండా వీధుల్లో అక్కడక్కడ గుడి నిర్మాణాలు జరగని అంజన్న విగ్రహాలు పది వరకు కొలువుదీరి ఉన్నాయి. ఈ వింత జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో మనకు కనిపిస్తుంది. గ్రామంలో ఏ మూలకు వెళ్లిన ఓ అంజన్న దేవాలయం దర్శనమిస్తుంది. అక్కడ నిత్యపూజలు, భక్తజన కోలాహలం ఉంటుంది. ఎందుకిలా ఇంత పెద్ద మొత్తంలో అంజన్న దేవాలయాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఓ సారి ఆ ఊరి చరిత్రలోకి తొంగిచూడాల్సిందే. ఎటూ చూసినా అంజన్న గుళ్లు..వెల్లుల్ల గ్రామ చావడి వద్ద పెద్ద మర్రిచెట్టును ఆనుకుని మూడు దిక్కులా ఎటు చూసినా అంజన్న దేవాలయాలు కనిపిస్తాయి. అక్కడి నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల్లోకి వెళ్తే.. సందుకు ఓ అంజన్న గుడి కనిపిస్తుంది. ఈ గుళ్లు చిన్నవి.. పెద్దవి కావచ్చు. కానీ ఆయా గుళ్లలో హనుమంతునికి నిత్యపూజలు జరుగుతూనే ఉంటాయి. ఇలా వీధుల్లో ఉన్న అంజన్న దేవాలయాలు లెక్కిస్తే ఏతావాతా 45 వరకు ఉన్నాయి. దేవాలయాలే కాకుండా చెరువు కట్ట వద్ద రెండు హనుమాన్ విగ్రహాలు, గ్రామంలోని నాలుగైదు వీధుల్లో హనుమాన్ విగ్రహాలున్నాయి. వీటికి గుళ్ల నిర్మాణం జరగకున్నా భక్తులు ప్రతీ శనివారం పూజలు చేయడం ఆనవాయితీ.ఈ సారి కొండగట్టు హనుమాన్ (Kondagattu Hanuman) జయంతి సందర్భంగా దాదాపు అన్ని హనుమాన్ దేవాలయాలను కాషాయరంగుల్లో అందంగా తీర్చిదిద్దారు. ప్రతీ దేవాలయంలో అంజన్న దీక్షాపరులు దీక్షల కోసం ప్రత్యేక నిలయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఊరి జనాభా సుమారు 2,200 వరకు ఉండగా ఈ సారి హనుమాన్ దీక్షలు తీసుకున్న యువ భక్తుల సంఖ్య ఎంత తక్కువ అనుకున్నా 300 దాకా ఉంటుందని గ్రామానికి చెందిన శ్రీనివాస్ చెప్పడం గమనార్హం. ఇక్కడ ఉన్న అంజన్న గుళ్లకు అభయాంజనేయ, భక్తాంజనేయ, వీరాంజనేయ.. ఇలా వెల్లుల్లలో అంజన్న గుడులు ఉన్న కారణంగా అంజన్న దీక్షా సమయంలో 41 రోజుల పాటు వెల్లుల్ల గ్రామం కాషాయ రంగు పులుముకుని హనుమాన్ భక్తుల సందడి, అంజన్న భజనలతో సందడిగా ఉంటుంది. ఎందుకీ ప్రత్యేకత?జైన చాళుక్యుల పాలనా కాలంలో వెల్లుల్ల గ్రామం (Vellulla Village)లో సుమారు 200 వరకు బ్రాహ్మణ కుటుంబాలు నివాసముండేవి. ఈ బ్రాహ్మణ కుటుంబాల్లో చాలా మంది అంజన్నను ఆరాధ్య దైవంగా భావించేవారు. వీరు తమ ఆరాధ్య దైవానికి నిత్యపూజలు అందించేందుకు వంశాల వారీగా ఎవరికి వారు తమ ఇళ్ల పక్కనే ఉన్న ఖాళీ స్థలాల్లో వీలైన రీతిలో పెద్ద, చిన్న ఆంజనేయ గుళ్లు నిర్మించుకున్నారు. గ్రామంలోని గుట్ట గండి సమీపంలో మర్రిచెట్టు వద్ద ఉన్న ఆంజనేయ ఆలయం ఆ కాలంలో ఈ ప్రాంతంలో ఉన్న దొంగల బారి నుంచి తమను అంజన్న కాపాడతాడనే నమ్మకంతోనే నిర్మించినట్లు గ్రామస్తులు చెబుతారు.ఇలా వంశానికి ఒక్కటి చొప్పున అంజనేయ ఆలయాలు (Anjaneya Temples) నిర్మించడం గ్రామంలో ప్రతీ వీధిలో అంజన్న గుళ్లు కనిపించడానికి ప్రధాన కారణం. కాలక్రమేణా బ్రాహ్మణ కుటుంబాలు ఇక్కడి నుంచి వలస వెళ్లినప్పటికీ గ్రామస్తులు మాత్రం ఆ గుళ్లను తమ ఇంటి అంజన్నగా మార్చుకుని నిత్య పూజలు నిర్వహించడం ఆచారంగా మార్చుకున్నారు. దీనికి తోడు పురాతన కాలంలో నిర్మించిన అంజన్న దేవాలయాలతో పాటు కొత్తగా ఇంటి దగ్గర అంజన్న గుడి ఉంటే శుభప్రదమన్న నమ్మకంతో కొంత మంది తమ తమ ఇళ్ల వద్ద అంజన్న గుళ్లు నిర్మించడంతో పాత, కొత్త అంజన్న దేవాలయాలన్నీ కలిసి వెల్లుల్ల గ్రామాన్ని ‘అంజన్న ఆలయాల ఖిల్లా’గా మార్చాయి. బ్రాహ్మణులు ఏర్పాటు చేసినవే జైనుల కాలంలో వెల్లుల్ల గ్రామంలో సుమారు 200 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవని చెబుతారు. ఆ కుటుంబాలు ఎవరికి వారు అంజన్న గుడులు నిర్మించి నిత్యపూజలు చేసేవారని పెద్దలు చెప్తారు. బ్రాహ్మణులు ఇక్కడి నుంచి వెళ్లిపోయినా అవే గుళ్లు ఇప్పటికీ ప్రజలకు ఆరాధ్యదైవాలుగా మారి పూజలు అందుకుంటున్నాయి. – మార మురళి, వెల్లుల్లఅంజన్న అంటే నమ్మకం మా ఊరిలో అన్ని కుటుంబాలకు ఆరాధ్యదైవం అంజన్న. అంజన్న గుళ్లు నిర్మించుకున్న అన్ని కుటుంబాల నుంచి ఏటా యువకులు అంజన్న దీక్షలు చేపడతారు. అంజన్న దీక్షా కాలంలో మా ఊరు కాషాయమయంగా మారుతుంది. అంజన్న భక్తులను భజనలతో ఊరు మార్మోగుతుంది. – మహేశ్, వెల్లుల్ల, అంజన్న భక్తుడుఆ కాలంలో నిర్మించినవే 1920–30 దశాబ్దిలో వెల్లుల్ల గ్రామంలో ఉన్న 200 బ్రాహ్మణ కుటుంబాలు ఎవరి వంశానికి వారు నిర్మించుకున్న ఆంజన్న గుడులే ఇప్పుడు వెల్లుల్లలో మనకు కనిపిస్తున్నాయి. కాల క్రమేణా బ్రాహ్మణులు ఇక్కడి నుంచి వెళ్లిపోయినా అంజన్నపై నమ్మకంతో గ్రామస్తులు ఆ గుడులను మళ్లీ అభివృద్ధి చేసి పూజలు చేస్తున్నారు. అంతే కాక గ్రామంలో కొత్త ఆలయాలు నిర్మించి తమ భక్తిని చాటుకుంటున్నారు. ఇదే వెల్లుల్లకు ప్రత్యేకతను ఇచ్చింది. – నంబి కిషన్ శర్మ, పూజారి వెల్లుల్ల -
ఏమీ తెలియని వయసులోనే..
కోరుట్ల: ‘అప్పటికి నాది ఏమి తెలియని వయసు.. ఆ సమయంలోనే మావోయిస్టుల్లో కలిశాను. నా భర్త పసుల రాంరెడ్డితో కలిసి కొన్నాళ్లు పనిచేశాను. తరువాత కొంత కాలానికి ఒక్కదానినే బస్తర్ డివిజన్లో మావోయిస్టు అజ్ఞాతదళాలతో కలిసి పనిచేసిన. నాలుగైదు సార్లు కాల్పుల నుంచి తప్పించుకున్న. ఉత్తర బస్తర్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. ఈ ఏడాది జనవరిలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ పోలీసులకు లొంగిపోయాను. సుమారు 45ఏళ్ల తరువాత మా వాళ్లు నన్ను ఆదరిస్తారని అనుకోలేదు. నా కూతురు భవానీ, కోరుట్ల, కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన బంధువులు అంతా నన్ను అక్కున చేర్చుకున్నారు. భర్త రాంరెడ్డి చనిపోయి పాతికేళ్లు గడుస్తున్నా.. బంధువులంతా నా వెంట నిలిచారు’.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు ఇటీవల లొంగిపోయి.. సుమారు 45 ఏళ్ల తరువాత ఇంటికి తిరిగొచ్చిన మావోయిస్టు వసంత అలియాస్ గంబాలు. రెండు రోజుల క్రితం ఇంటికి..రెండురోజుల క్రితం ఛత్తీస్‌గఢ్ పోలీసులు వసంతను తన కూతురు భవానీకి అప్పగించి ఇంటికి పంపించిన క్రమంలో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వసంత బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆమెను ఆప్యాయతతో పలకరించి అక్కున చేర్చుకుని కంటతడి పెట్టారు. వసంత కూతురు భవానీ మాట్లాడుతూ తనకు తల్లి లేదని అనుకున్నానని, కానీ బతికే ఉందని తెలిసి ఎంతో సంతోషపడ్డానని చెప్పారు. ఎంత కష్టమైన సరే తన తల్లిని తన వద్దకు తెచ్చుకుని ఆప్యాయంగా చూసుకోవాలని నిర్ణయించుకుని తన పెద్ద నాన్న కుమారుడు పసుల కృష్ణప్రసాద్, అంబేడ్కర్ సంఘాల నాయకులు వుయ్యాల నర్సయ్య సాయంతో ఛత్తీస్‌గఢ్ వెళ్లానని అక్కడి పోలీసులు పూర్తిగా సహకరించారని పేర్కొన్నారు. పార్టీలోనే చనిపోయిందనుకున్నాం: బంధువులులొంగిపోయిన మావోయిస్టు పసుల వసంత సోదరి పెద్ద గంబాలు మాట్లాడుతూ.. తమ చెల్లి ఎప్పుడో పార్టీలోనే చనిపోయిందని అనుకున్నామని, ఇప్పటికి తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మావోయిస్టు పార్టీలో నిర్వహించిన కార్యకలాపాల గురించి పసుల వసంత ఏమీ వెల్లడించలేదు. తనకు పెద్దగా ఏమీ గుర్తులేదని చెప్పడం గమనార్హం. పసుల వసంత అనారోగ్యంతో ఉండటంతోపాటు తెలుగు సరిగా రాకపోవడం.. ఛత్తీస్‌గఢ్ వాసులు గోండు భాష ఎక్కువగా మాట్లాడటంతో వివరాల వెల్లడి ఇబ్బందికరంగా మారింది. వసంతకు వచ్చే రివార్డు డబ్బులు త్వరలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కూతురు భవానీ విజ్ఞప్తి చేశారు. -
కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి
● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరైన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కోరుట్ల మున్సిపల్ పరిదిలోని యెఖీన్‌పూర్ గ్రామ శివారులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి పోస పోవద్దని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, సింగిల్ విండో చైర్మన్లు సింగిరెడ్డి నర్సారెడ్డి, ఆదిరెడ్డి, నాయకులు పేర్ల సత్యం, సీఈవో బాబా, నాయకులు, రైతులు పాల్గొన్నారు. రైతులు మద్దతు ధర పొందాలి మల్లాపూర్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డ్‌లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి తేమ శాతాన్ని పరిశీలించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో సహకార అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పలత, వైస్ చైర్మన్ ఇట్టెడి నారాయణరెడ్డి, కార్యదర్శి శ్రీధర్, ఫ్యాక్స్ చైర్మన్ వేంపేట నర్సారెడ్డి, సీఈవో భూమేష్, నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
వైభవంగా భీమేశ్వరస్వామి రథోత్సవం
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం పొరండ్లలోని శ్రీభీమేశ్వరస్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామివారికి రథోత్సవ నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి శోభాయాత్ర చేపట్టారు. అక్కడ పూజలు చేసి ఆలయానికి తీసుకువచ్చారు. అలాగే హన్మాజీపేటలోని ఆదిపెద్దమ్మతల్లి రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. విద్యాహక్కు చట్టం అమలు చేయాలిజగిత్యాలటౌన్: విద్యాహక్కు చట్టం– 2009 ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించాలని, ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందించాలని మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. పౌరులందరికీ కులం, మతానికి అతీతంగా విద్యాబోధన అందాలనే సంకల్పంతో అంబేడ్కర్ ప్రాథమిక హక్కుల జాబితాలో విద్యను చేర్చారని పేర్కొన్నారు. విప్ అంటే మంత్రితో సమానమని, విద్య ఆవశ్యకతను సీఎం దృష్టికి తీసుకెళ్లి అమలయ్యేలా చూడాలని కోరారు. వేదికపై ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు బండ శంకర్ తదితరులు ఉన్నారు. -
ఏం తప్పు చేశారని ఇంటిపై దాడి చేశారు..?
● నిందితులపై చర్యలు తీసుకోవాలి ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబుగొల్లపల్లి: కాంగ్రెస్ నాయకులు గూండాళ్ల ప్రవర్తించి బీజేపీ నాయకులతోపాటు వారి ఇళ్లపై దాడులకు పాల్పడ్డారని, వారు ఏం తప్పు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు ప్రశ్నించారు. గొల్లపల్లి మండలకేంద్రానికి చెందిన బీజేపీ మండల అధ్యక్షులు కట్ట మహేశ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు సంగెం కల్యాణ్‌పై కాంగ్రెస్ నాయకులు ఆదివారం రాత్రి దాడులకు పాల్పడిన విషయం తెల్సిందే. ఈ మేరకు యాదగిరి బాబు ధ్వంసమైన బీజేపీ నాయకుడి ఇంటిని సోమవారం పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారబలంతో ఏదైనా సాధ్యమనే అహంకారంతో దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. తమ నాయకుల ఎదుగుదలను చూసి ఓర్వలేని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిశాంత్‌రెడ్డి తన అనుచరులతో దాడి చేశాడని, ఇలాంటి వాటిని ప్రజలు క్షమించబోరని పేర్కొన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. దాడి విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇప్పటికే బండి సంజయ్ పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారని తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరణామాలు ఉంటాయన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులకు శిక్ష పడేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదాల నివారణ అందరి బాధ్యత
జగిత్యాలరూరల్: అగ్ని ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని జగి త్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయంలో సంజ య్, ఎస్పీ కార్యాలయంలో అశోక్‌కుమార్ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ సివిల్ డిఫెన్స్ వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. గృహ నిర్మాణాలు, స్కూళ్లు, వ్యాపార సముదాయాలు అగ్నిప్రమాదా నివారణ చర్యలు చేటప్టిన తర్వాతే అనుమతులు ఇవ్వాలన్నారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో జిల్లా అగ్నిమాపక శా ఖ అధికారి కృష్ణకాంత్, ఫైర్ సిబ్బంది రవీందర్, మధు, నాయకులు కోలగాని సత్యం, శరత్‌రావు, ప్రభాత్సింగ్, ఠాకూర్, పవన్, మహేశ్, వెంకటేశ్, శ్రీరాం, భిక్షపతి పాల్గొన్నారు. -
బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్
జగిత్యాలటౌన్:బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి అంబడ్కర్ అని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌తోపాటు జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆర్డీవో పులి మధుసూదన్, బల్దియా మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి, కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇందిరాభవన్‌లో విప్ అడ్లూరి, జీవన్‌రెడ్డి అంబేడ్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, లెల్లెల బాలకృష్ణ పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నాయకులు ముసిపట్ల లక్ష్మీనారాయణ పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్, భారత్ సురక్షా సమితి రాష్ట్ర కార్యదర్శి ఏసీఎస్.రాజు, టీఎన్జీవో భవన్లో జిల్లా అధ్యక్షుడు మిర్యాల నాగేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
సిబ్బంది కొరత తీర్చాలి
బొమ్మెన గ్రామంలోని సబ్‌స్టేషన్‌లో సిబ్బంది లేక జేఎల్‌ఎంలతో తాత్కాలికంగా నెట్టుకొస్తున్నారు. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల వద్ద, గ్రామంలో వైర్ల సమస్య వస్తే సబ్‌స్టేషన్ నుంచి జేఎల్ఎంలు పరుగెత్తుకుంటూ వస్తున్నారు. కరెంట్ సమస్యలు వస్తే అత్యవసరంగా పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రతీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సరిపడేలా సిబ్బందిని నియమించాలి. – అల్లూరి బాపురెడ్డి, రైతు, బొమ్మెన ఉన్నతాధికారులకు నివేదించాం విద్యుత్ సబ్స్టేషన్లలో ఆర్టిజియన్ల కొరత విషయమై ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. ఆర్టిజియన్ల కొరత ఉంటే ఆయా గ్రామాల జేఎల్ఎంలు సబ్స్టేషన్లలో విధులు నిర్వర్తించాల్సిందే. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జేఎల్ఎంలకు సబ్స్టేషన్లలో విధులు కేటాయిస్తున్నాం. విద్యుత్ సమస్యలుంటే ప్రజలు చెప్పగానే పరిష్కారానికి కృషి చేస్తున్నాం. – రఘుపతి, ట్రాన్స్‌కో ఏడీఈ, కోరుట్ల రూరల్ -
సబ్స్టేషన్లలో ఆపరేటర్ల కొరత
● ట్రాన్స్‌కో సిబ్బందిపై అదనపు భారం ● గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారంలో జాప్యంకథలాపూర్(వేములవాడ): రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతుంటే.. అందుకు తగ్గట్లుగా ట్రాన్స్‌కో అధికారులు సిబ్బంది నియామకంపై దృష్టిసారించడంలేదనే ఆరోపణలున్నాయి. ఉన్న సిబ్బందితో నెట్టుకురావడంతో విద్యుత్ సమస్యలు వస్తే పరిష్కారంలో జాప్యం జరుగుతోందని ప్రజలు పేర్కొంటున్నారు. ఇందుకు నిదర్శనం కథలాపూర్ మండలంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్(ఆర్టిజియన్)ల కొరత. ఆర్టిజియన్ల కొరతతో గ్రామాల్లో పనిచేసే ట్రాన్స్‌కో జేఎల్‌ఎంలతో నెట్టుకొస్తున్నారు. పూర్తిస్థాయి ఆర్టిజియన్లు ఉంటే జేఎల్‌ఎంలపై అదనపు భారం పడదని, విద్యుత్ సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే వీలుంటుందని ప్రజలు భావిస్తున్నారు. కథలాపూర్ పరిధిలో ఏడు సబ్స్టేషన్లు కథలాపూర్ మండలంలో 19 గ్రామాలుండగా.. కథలాపూర్, భూషణరావుపేట, బొమ్మెన, చింతకుంట, తాండ్య్రాల, గంభీర్పూర్, అంబారిపేట గ్రామాల్లో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు ఉన్నాయి. వీటి ద్వారా ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఏడు సబ్స్టేషన్లలో కథలాపూర్ సబ్‌స్టేషన్‌ను ట్రాన్స్‌కో సిబ్బంది నిర్వహిస్తున్నారు. ఒక్కో సబ్‌స్టేషన్ ఆపరేటింగ్ కోసం ముగ్గురు చొప్పున ఆరు సబ్స్టేషన్లకు 18 మంది ఆర్టిజియన్లు అవసరం. కానీ, 9 మందితో నెట్టుకొస్తున్నారు. బొమ్మెన సబ్‌స్టేషన్‌లో ఆర్టిజియన్లు లేకపోవడంతో ట్రాన్స్‌కో సిబ్బంది షిఫ్టులవారీగా నిర్వహిస్తున్నారు. ఒక్కో సబ్‌స్టేషన్‌లో ఒకరోజుకు మూడు షిఫ్ట్‌ల్లో ఒక ఆర్టిజియన్ 8 గంటలు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. సమస్యల పరిష్కారంలో జాప్యం విద్యుత్ సబ్స్టేషన్లను ఆపరేటింగ్ చేసే ఆర్టిజియన్ల కొరత కారణంగా ట్రాన్స్‌కో జేఎల్ఎంలు సబ్స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు వస్తే సంబంధిత జేఎల్ఎం నిమిషాల్లో అక్కడకు చేరుకొని పరిష్కరించాల్సి ఉంటుంది. కాగా, జేఎల్ఎంలు సబ్స్టేషన్లలో ఉంటే గ్రామాల్లో విద్యుత్ వైర్లు తెగడం, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజ్ పోతే మరమ్మతులో జాప్యం జరుగుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. పొద్దంతా విద్యుత్ సమస్య వస్తే ఏమోగానీ రాత్రివేళ అయితే వినియోగదారులు ఇబ్బందిపడే అవకాశముంది. ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు దృష్టిసారించి విద్యుత్ సబ్స్టేషన్లలో సరిపడా ఆర్టిజియన్లను నియమించి, ట్రాన్స్‌కో జేఎల్‌ఎంలను వారికి కేటాయించిన గ్రామాల్లో యథావిధిగా విధులు నిర్వర్తించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
చివరి గింజ వరకు కొంటాం
కథలాపూర్/మేడిపల్లి: అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కథలాపూర్ మండలం బొమ్మెనలో ఉపాధి నిధులు రూ.20 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఆదివారం భూమిపూజ చేశారు. ఏఎంసీ చైర్మన్ పూండ్ర నారాయణరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం మేడిపల్లి, భీమారం మండలాల్లోని వల్లంపల్లి, మన్నెగూడెం, ఈదులలింగంపేటలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రూ.1.89కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మాదం వినోద్, వైస్ చైర్మన్ మిట్టపల్లి రాజరెడ్డి, అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్ రెడ్డి, రమేశ్‌రెడ్డి,నాగరాజు, నరేష్, కొమురయ్య, వెంకటేశం ఉన్నారు. -
రైతు పొలంలో జిల్లా జడ్జి నీలిమ
సారంగాపూర్: మండలంలోని పెంబట్లకు చెందిన బండారి వెంకటేష్ సాగు చేస్తున్న పుచ్చకాయల తోటను ఆదివారం జిల్లా జడ్జి నీలిమ కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. వెంకటేష్ ఏటా భిన్నమైన పంటలను సాగు చేసి విక్రయిస్తుంటాడు. గతేడాదిగా లోపలి భాగం ఎరుపు, పసుపురంగులో ఉన్న కర్బూజలను పండించి జిల్లాకేంద్రంలోని శ్రీరామ చౌరస్తాలో అమ్ముతున్నాడు. ఆ పంట వివరాలు తెలుసుకునేందుకు జడ్జి పెంబట్లకు చేరుకున్నారు. తోటలో కలియతిరిగి పంట పండించే విధానాన్ని తెలుసుకున్నారు. రైతు దంపతులైన వెంకటేష్, విజయను జడ్జి అభినందించారు. అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలిజగిత్యాల:అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14న జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం, అంబేడ్కర్ చౌరస్తా వద్ద నిర్వహించే వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొనాలని సూచించారు. లండన్‌లో ‘చలో వరంగల్’ పోస్టర్ ఆవిష్కరణరాయికల్: ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించిన శ్రీచలో వరంగల్శ్రీ పోస్టర్‌ను ఆదివారం ఏన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్ టవర్ బ్రిడ్జి వద్ద ఆవిష్కరించారు. బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి మట్లాడుతూ రజతోత్సవ సభకు ప్రజలంతా భారీ సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేయాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలంతా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని, రానున్న రోజు ల్లో లండన్‌లో కూడా రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సత్యమూర్తి చిలుముల, కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు, అడ్వైజరీ వైస్ చైర్మన్ గణేష్ కుప్పాల, సభ్యులు పవన్ కళ్యాణ్, అజయ్ రావు గండ్ర పాల్గొన్నారు. పీసీసీ చీఫ్‌ను కలిసిన ఎమ్మెల్యేజగిత్యాల: పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌ను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆదివారం హైదరాబాద్‌లో కలిశారు. ఇటీవల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మధ్య వివాదం ముదురుతున్న విషయం తెల్సిందే. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్.. కాంగ్రెస్‌లో చేరగా అప్పటినుంచి కాంగ్రెస్ నాయకులు విబేధిస్తూ వస్తున్నారు. ఇటీవల ప్రెస్మీట్లలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పీసీసీ అధ్యక్షుడితో స్థానిక నేతలతో కలవడం చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి నిధుల కోసమా..? లేక ఇద్దరి మధ్య వివాదా నికి తెరపడేలా చర్చించారా..? తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యే వెంట జగిత్యాల బల్దియా మాజీ చైర్మన్లు గిరి నాగభూషణం, అడువాల జ్యోతి, నాయకులు వెళ్లారు. అయితే వీరిలో కొందరు మొన్నటివరకు జీవన్‌రెడ్డి వెంట ఉన్నవారు వెళ్లడం చర్చకు దారితీస్తోంది. అకాలం.. తడిసిన ధాన్యంరాయికల్: మండలంలోని ఆలూరు, వీరాపూర్, రాజనగర్ గ్రామంలో ఆదివారం అకాల వర్షంతో కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతు సంఘం నాయకులు మెక్కొండ రాంరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పోస్టర్ ఆవిష్కరిస్తున్న నవీన్‌రెడ్డి -
ప్రశాంతంగా ముగిసిన చిన్న జయంతి
సోమవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025● అంజన్న స్వాములతో కిక్కిరిసిన కొండ ● మార్మోగిన జైశ్రీరామ్.. జై హనుమాన్ నామస్మరణసుమారు 2 లక్షల మంది రాక హనుమాన్ జయంతి వేడుకలు కొండగట్టు అంజన్న క్షేత్రంలో ఘనంగా జరిగాయి. దాదాపు 2 లక్షలకు పైగా భక్తులు, దీక్షాపరులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారుల అంచనా. మూడు రోజుల పాటు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి తరలివచ్చిన దీక్షాపరులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షించారు. జగిత్యాల: రామ నామస్మరణతో కొండగట్టు అంజన్న క్షేత్రం మార్మోగింది. మూడురోజుల నుంచి నిర్వహిస్తున్న హనుమాన్ చిన్న జయంతి వేడుకలు ఆదివారంతో ముగిశాయి. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ అర్ధరాత్రులు అక్కడే ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. దీక్షాపరులు స్వామివారిని దర్శించుకుని ఇరుముడులు సమర్పించి మాల విరమణ చేశారు. న్యూస్‌రీల్ -
పెన్షన్ సవరణ బిల్లును రద్దు చేయాలి
జగిత్యాలటౌన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ సవరణ బిల్లును రద్దు చేయాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో పాత పెన్షన్‌దారులకు హాని చేసే సవరణ బిల్లును రద్దు చేయాలనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. పెన్షనర్లను పాత, కొత్త పెన్షన్దారులుగా విభజించడం బిల్లు ముఖ్య ఉద్దేశమన్నారు. పెన్షన్ హక్కులు, లాభాలు ఎవరికీ వర్తించాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. పెన్షనర్ల కడుపు కొట్టే ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్‌కుమార్, నాయకులు పీసీ.హన్మంతరెడ్డి, గౌరిశెట్టి విశ్వనాథం తదితరులు ఉన్నారు. -
గుట్టపై గంగమ్మ
● ఒకప్పటి నేరెళ్ల .. నేటి రైతుల జీవనేల ● ప్రకృతికి అనుగుణంగా పంటల సాగు ● వీరునితండా గిరి జనుల ఆదర్శ సాగుసిరిసిల్ల: ఎత్తయిన గుట్టలు.. కాకులు దూరని కారడవి.. మధ్యలో ఉంటుంది వీరునితండా. ఏంటి ఈ తండా ప్రత్యేకత అనుకుంటే.. అంతకుమించి విజయగాథ ఉంది. వీరుని తండా రైతులు ఒక్క బోరు కూడా వేయించకుండానే వ్యవసాయం చేస్తున్నారు. 196 ఎకరాల్లో 36 బావుల ఆధారంగా పంటలు పండిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలకొద్ది ఫీట్ల లోతులో బోర్లు వేయిస్తూ అప్పులపాలవుతున్న రైతులను చూశాం. కానీ వీరునితండా రైతులు ప్రకృతి ఇచ్చిన కానుకను అందిపుచ్చుకొని వ్యవసాయబావులు.. వర్షాధారంగా పంటలు పండిస్తున్నారు. వీరునితండా రైతుల విజయగాథ ఒక్కసారి పరిశీలిద్దాం.. 8లోu -
రోళ్లవాగును పూర్తిచేయండి
సారంగాపూర్: బీర్పూర్ శివారులోని రోళ్లవాగు ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అధికారులకు సూచించారు. మండలకేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించినా వ్యయం రూ.60కోట్ల నుంచి రూ.131కోట్లకు చేరిందని, అయినా అటవీశాఖ అనుమతులు పొందలేదని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చొరవతో అన్ని అనుమతులు పొంది రూ.153 కోట్లతో పాలన అనుమతులు వచ్చాయని తెలిపారు. ఆ నిధులతో మూడు గేట్లను వెంటనే బిగించాలని కోరారు. సమావేశంలో సింగిల్‌విండో చైర్మన్ పొల్సాని నవీన్‌రావు, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్ పాల్గొన్నారు. -
డ్రంకెన్ డ్రైవ్‌పై కొరడా
● పట్టుబడితే జైలు, జరిమానా ● జిల్లాలో గతేడాది 7,058 మందిపై.. ● జనవరి నుంచి ఇప్పటి వరకు 2,227 మందిపై కేసులు నమోదు జగిత్యాలక్రైం: జిల్లా వ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. నిత్యం వాహనాల తనిఖీతో పాటు డ్రంకెన్‌డ్రైవ్ చేపట్టి మద్యం తాగిన వారిపై కేసులు నమోదు చేస్తూ ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నారు. 2021లో జిల్లా వ్యాప్తంగా 4,270, 2022లో 8,619 (వీరిలో 11 మందిపై 304 సెక్షన్ కింద కేసులు), 2023లో 5,831, 2024లో 7,058 కేసులు, ఈఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 2,227 కేసులు నమోదు చేశారు. జిల్లాలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు శాఖ విస్తృత తనిఖీలు చేపడుతుంది. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి సమాచారం ట్యాబ్‌ల్లో వెంటనే అప్లోడ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. కొత్త మిషన్లతో.. ● జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసు అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ● దీంతో ఇటీవల డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త బ్రీతింగ్ ఎనలైజర్లు పంపిణీ చేయగా మూడురోజుల క్రితం అన్ని పోలీస్స్టేషన్లకు ఎస్పీ అశోక్‌కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ● జిల్లా వ్యాప్తంగా చాలా మంది డ్రంకెన్ డ్రైవ్ చే స్తూ రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతుండటంతో వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ● వారు నడిపే వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోవడంతో పాటు వారికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవ డం, మద్యం తాగి వాహనం నడిపినట్లు నిర్ధారణ కావడంతో ప్రమాదంలో మరణించిన చాలా కుటుంబాలకు పరిహారం అందడం లేదు. ● దీంతో పాటు మద్యం తాగి వాహనాలు నడిపిన వారు ప్రమాదాలు ఎక్కువగా చేస్తుండటంతో ప్రమాదాల నివారణ కోసం పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. పట్టుపడిన చోటే కేసు జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ డ్రంకెన్ డ్రైవ్ చేస్తున్నప్పుడు పట్టుబడిన వెంటనే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా పట్టుబడిన చోటనే బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా పరీక్షలు చేసి మద్యం తాగినట్లు తేలగానే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో చాలా మంది వాహనదారులు మద్యం తాగి వాహనం నడిపేందుకు జంకుతున్నారు. నిబంధనలు కఠినం డ్రంకెన్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. మద్యం తాగి వాహనాలు నడిపితే ఎంతటి వారైనా చర్యలు తప్పవు. డ్రంకెన్ డ్రైవ్‌పై శిక్షలు కూడా కఠినతరంగా ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే పోలీసు శాఖ కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మద్యం తాగి ఎవరు కూడా వాహనాలు నడపరాదు. ఇటీవల ప్రతి పోలీస్‌స్టేషన్‌కు బ్రీతింగ్ ఎనలైజర్ మిషన్లు అందజేశాం. – అశోక్‌కుమార్, ఎస్పీ -
‘రాజీవ్ యువ వికాసానికి’ ఆన్లైన్ అవస్థలు
జగిత్యాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగ యువత కోసం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకుందామనుకున్న నిరుద్యోగుల ఆశలు అడిసయాలవుతున్నాయి. ఈనెల 14 చివరి తేదీ అని ప్రకటించగా.. వరుసగా సెలవులు వచ్చాయి. కుల ధ్రువీకరణ, ఆదాయం సర్టిఫికెట్తో దరఖాస్తు చేసుకోవాల్సి రావడంతో యువత తహసీల్దార్ కార్యాలయాల వద్దకు పరుగులు తీస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పట్టింపులేని ధోరణితో కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ కావడం లేదు. మరోవైపు సైట్ ఓపెన్ కావడం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు సెంటర్ల వద్ద యువత పడిగాపులు కాస్తున్నారు. శని, ఆది, సోమవారం సెలవులు రావడంతో తహసీల్దార్ కార్యాలయాలు మూసివేసి ఉన్నాయి. అప్పుడప్పుడు సైట్ ఓపెన్ అవుతున్నా కులం, ఆదాయ సర్టిఫికెట్స్ లేకపోవడం యువతకు ఇబ్బందిగా మారింది. ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు చేస్తే మేలు సెలవుదినాలు కావడంతో మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో నిరుద్యోగుల దరఖాస్తుదారులను స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తే బాగుండేది. కానీ జిల్లాలో తహసీల్దార్ కార్యాలయాలన్నీ మూసి ఉండటంతో ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది. కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి సెలవుల్లో సైతం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని యువత కోరుతున్నారు. అంతా గందరగోళం జగిత్యాలలో 48 వార్డులు ఉండగా.. సైట్లో కేవలం 38 వార్డులే చూపిస్తున్నాయి. ఆన్లైన్లో యువత దరఖాస్తు చేసుకునేందుకు మీసేవ కేంద్రానికి వెళ్తే కొన్ని వార్డులే కనిపిస్తుండడంతో ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. 10 వార్డులు సైట్లో కన్పించకపోవడంతో 10 వార్డులకు సంబంధించిన నిరుద్యోగ యువత ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపాలిటీలో విలీనమైన లింగంపేట, మోతె, టీఆర్‌నగర్ గ్రామాలు కూడా కన్పించడం లేదు. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని వార్డుల జాబితాను వెబ్సైట్లో పొందుపర్చేలా చూడాలని కోరుతున్నారు. గడువు పొడిగించేనా..? ఒక వైపు రాజీవ్ యువ వికాస్ పథకం సైట్ ఓపెన్ కాకపోవడం, మరోవైపు అత్యధిక మంది దరఖాస్తులు చేసుకోవడంతో తహసీల్దార్ కార్యాలయాల్లో సైతం కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సైతం పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఈ మూడు రోజులు సెలవులు రావడంతో వారు సైతం కార్యాలయాలు తెరవడం లేదు. ప్రభుత్వం గడువు పెంచడంతో పాటు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సైట్లు రూపొందిస్తే తప్ప చాలామంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోతుంది. కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి సమస్యను పరిష్కరించేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. తహసీల్దార్, మీసేవ చుట్టూ నిరుద్యోగ అభ్యర్థులు సర్వర్‌డౌన్‌తో ఓపెన్‌కాని సైట్ ఈనెల 14తో ముగియనున్న గడువుఆదాయ సర్టిఫికెట్ లేకున్నా.. రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోండి రాయికల్: రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఆదాయం సర్టిఫికెట్ లేకున్నా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆదాయం సర్టిఫికెట్ కోసం యువత తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్న విషయం తెల్సిందే. మండలాల్లో వందల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో తహసీల్దార్ కార్యాలయంలో సర్వర్ బిజీ వచ్చి ఆదాయ సర్టిఫికెట్ పత్రాలు జారీ చేయడంలో తీవ్ర జాప్యం ఎదురవుతోంది. దీంతో నిరుద్యోగుల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం తెల్లరేషన్‌కార్డు ఉన్నవారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తుల సమయంలో రేషన్‌కార్డు ఉన్న వారు కార్డు నంబరు పొందుపరిస్తే సరిపోతుంది. లేని వారు మాత్రం తప్పనిసరిగా ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. రేషన్‌కార్డు, ఆదాయ ధ్రువీకరణపత్రం ఈ రెండింట్లో ఏదైనా ఒకదాంతో దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కిశోర్ ‘సాక్షి’కి తెలిపారు. 14 వరకే గడువు రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకున్న గ్రామీణ ప్రాంతాల వారు సంబంధిత మండల పరిషత్ కార్యాలయంలో.. మున్సిపల్ ప్రజలు స్థానిక మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఈనెల 14లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
ప్రజల కోరిక మేరకే జగ్జీవన్‌రాం విగ్రహ ఏర్పాటు
జగిత్యాలటౌన్: జిల్లా ప్రజల కోరిక మేరకే జిల్లాకేంద్రంలోని మంచినీళ్ల బావి చౌరస్తాలో బాబు జగ్జీవన్‌రాం విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి శనివారం స్థల పరిశీలన చేశారు. సామాజిక న్యాయం కోసం బాబు జగ్జీవన్‌రాం చేసిన పోరాటం ముందుతరాలకు ప్రేరణగా ఉంటుందన్నారు. జగ్జీవన్‌రాం సేవలు చిరస్మరణీయంగా ఉండేలా విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజాప్రతినిధులు, కులసంఘాల నాయకులు పాల్గొన్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు కృషి చేద్దాంజగిత్యాల: గర్భాశయ క్యాన్సర్ నివారణకు కృషి చేద్దామని, సర్వైకల్ క్యాన్సర్ ముక్త్భారత్ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఐఎంఏ అధ్యక్షుడు హేమంత్ అన్నారు. శనివారం ఐఎంఏ హాల్లో గైనకాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్‌తో రోజురోజుకూ మరణాలు పెరిగిపోతున్నాయని, ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. గైనకాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు పద్మిని మాట్లాడుతూ 9 నుంచి 45ఏళ్ల వారు వ్యాక్సిన్ తీ సుకోవచ్చన్నారు. అనంతరం 20 మంది మహిళలకు వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, కోట గిరి సుధీర్‌కుమార్, వినీల, నాగరత్న, సాయిసుధ పాల్గొన్నారు. అంజన్న కృపతో ప్రజలకు మేలు చేకూరాలిమల్లాపూర్: అంజనేయస్వామి కృపతో ప్రజ లకు మేలు చేకూరాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఖాదీ బోర్డు చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. మండలంలోని రాఘవపేటలో శనివారం నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో సతీసమేతంగా పాల్గొన్నారు. ఆలయాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మెట్పల్లి మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, నాయకులు నత్తి నర్సయ్య, బైరి రవికుమార్, గురిజేల లక్ష్మీనారాయణ, హనుమాన్ దీక్షదారులు తదితరులు పాల్గొన్నారు. -
‘రోళ్లవాగు’ నిర్మాణానికి పాలన అనుమతులు
● తాజాగా రూ.16.19 కోట్లు విడుదల ● గేట్ల బిగింపునకు రూ.కోటి.. ● అడవుల అభివృద్ధికి రూ.8కోట్లు ● జీఎస్టీకి రూ.6 కోట్లు.. మిగిలినది కంకర పర్మిట్లకుసారంగాపూర్: బీర్పూర్ శివారులోని రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం రూ.153 కోట్ల తుది అంచనాలకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. 2015–16లో రూ.62 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు ఆధునీకరరణకు ఇప్పటి వరకు పెరిగిన అంచనాలతో రూ.136 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు నిర్మాణం 90 శాతం పూర్తయినా ప్రాజెక్టుకు మూడు గేట్లు బిగించాల్సి ఉంది. నిధుల కొరతతో పనులు నిలిచిపోయి ఏడాది కావస్తోంది. ఇప్పటి వరకు పనులకు రూ.136.81 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం మరో రూ. 16.19 కోట్లు (మొత్తం రూ.153 కోట్లు) ఖర్చు చేయడానికి పరిపాలన అనుమతులు రావడంతో ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. రూ.16.19 కోట్ల వ్యయం ఇలా ఖర్చు చేయనున్నారు పెరిగిన రూ.16.19 కోట్లలో రూ.8 కోట్లు అడవుల అభివృద్ధికి కేటాయించారు. రూ. కోటి మూడు గేట్లు ఏర్పాటుకు, రూ.2 కోట్లు కంకర పర్మిట్ ఫీజ్ కింద చెల్లించనున్నారు. మిగిలిన మొత్తం రూ.6 కోట్లు జీఎస్టీ చెల్లింపులకు వెచ్చిస్తామని డీఈ చక్రూనాయక్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి అయితే 15 వేల ఎకరాలకు సాగునీరు రోళ్లవాగు ప్రాజెక్టు పూర్తి అయితే బీర్పూర్, ధర్మపురి మండలాల్లోని 15 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. గేట్లు ఏర్పాటు చేయకపోవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి డి–53, 12 ఎల్ కాలువ ద్వారా వచ్చిన నీరు వచ్చినట్లు బయటకు వెళ్లిపోతున్నాయి. కాంట్రాక్టర్ మాత్రం అటవీశాఖ అనుమతులు పూర్తిగా వచ్చిన తరువాతే పనులు చేపడతానని పేర్కొన్నట్లు సమాచారం. -
కొనుగోలు కేంద్రం ప్రారంభం
కథలాపూర్: రైతు సంక్షేమమే ధ్యేయమని ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం మండలకేంద్రంలో సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించా రు. మహిళా సంఘాలకు 50 శాతం కేంద్రాలు కే టాయించామన్నారు. సన్న బియ్యం పంపిణీపై బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్లెక్సీలు కట్టి తామే సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం దారుణ మన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు పంపిణీ చేయడం లేదో సమాధానం చె ప్పాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూ ండ్ర నారాయణరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షు డు కాయితి నాగరాజు, డైరెక్టర్లు రమేశ్‌నాయక్, వాకిటి రాజారెడ్డి, విజయ్, ఏపీఎం న రహరి, సీసీలు అంజయ్య, విజయనిర్మల పాల్గొన్నారు. -
సనాతన ధర్మం శాశ్వతమైనది
జగిత్యాలటౌన్: సనాతన ధర్మం శాశ్వతమైనదని బీజేపీ సీనియర్ నాయకులు రవీందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపు శ్రీకోదండరామాలయ సమీపంలో 41 అడుగుల సనాతన ధర్మధ్వజాన్ని వేదపండితులు నంబివేణుగోపాలాచార్య కౌశిక, బ్రహ్మశ్రీ తిగుళ్ల విశుశర్మ వేద మంత్రోచ్ఛరణ మధ్య శనివారం ఆవిష్కరించారు. దేశంలో ఉంటూ కొందరు దేవుడి ఉనికిపై, భారతీయ విలువలపై దాడులు చేసేందుకు యత్నించడం దురదృష్టకరమన్నారు. ద్వజస్తంభ ఏర్పాటులో సహకరించిన మ్యాన మహేష్, చిప్పరి రాజును అభినందించారు. బీజేపీ సీనియర్ నాయకులు ఏసీఎస్ రాజు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వ సంత, మ్యాన మహేష్, వొద్దినేని శ్రీలత, సీపె ల్లి రవీందర్, లింగంపేట శ్రీను, గుర్రం రా ము, వేముల సంతోష్, చొప్పరి రాజు, బ్ర హ్మాండభేరి నరేష్, గాజోజు సంతోష్, గడ్డల లక్ష్మి, బిట్టు, బుర్ర ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
మనువాడిన మామిడి చెట్లు
సారంగాపూర్: సాగు చేస్తున్న మామిడితోటలో కాపుకొచ్చిన చెట్లకు రైతు దంపతులు పెళ్లి చేశారు. వ్యవసాయంతో తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన ఓగుల అనిల, అజయ్ దంపతులు ఎనిమిది ఎకరాల్లో మామిడి తోట సాగు చేస్తున్నారు.నాలుగేళ్ల తరువాత మొదటి కాత (పంట) వచ్చింది, దీంతో కాత కాసిన రెండు చెట్లకు పెళ్లి చేయాలని నిశ్చయించి బంధువులను సైతం ఆహ్వానించారు. బీర్పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ అర్చకుడు వొద్దిపర్తి మధుకుమారాచార్యులు ఆధ్వర్యంలో మామిడి చెట్లకు నూతన వస్త్రాలు ధరింపజేసి, జీలకర్ర, బెల్లం ఉంచి మాంగళ్యధారణ గావించారు. కార్యక్రమానికి గ్రామంలోని పలువురు రైతులు హాజరుకాగా.. మామిడితోటలో సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. ఆడెపు రమ్య, మహేశ్, సత్తెన్న, మమత దంపతులు పెళ్లి పెద్దలుగా హాజరయ్యారు. -
ధర్మపురిలో జయంతి ఏర్పాట్లు
ధర్మపురి: హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా ధర్మపురిలో ఏర్పాట్లు చేశారు. శనివారం నాటి హనుమాన్ జయంతికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. గోదావరిలో స్నానాలు ఆచరించి, ఆలయాల్లో స్వామివా ర్లను దర్శించుకుంటారు. ఈ మేరకు గోదావరి ఒడ్డున చలువ పందిళ్లు, తాగునీటి వసతులు కల్పించారు. సత్యావతి, బ్రహ్మ గుండాల వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దేవస్థానం వద్ద ప్రత్యేక చలివేంద్రాలు, చలువ పందిళ్లు వేశారు. టెండర్లకు ఆహ్వానం ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి దేవస్థానంలో ని ర్వహించే వివిధ రకాల టెండర్లకు ఆన్లైన్, ఆఫ్ లైన్ల ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఈవో శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటిలో తలనీలాల సేకరణకు ఈనెల 16న బహిరంగ వేలం, సీల్డు కొటేషన్ టెండర్, ఇప్రోక్యూర్మెంట్ టెండర్ ఉంటుందన్నారు. సెక్యూరిటీ గార్డుల నియమకానికి ఈనెల 21న ఇప్రోక్యూర్మెంట్ టెండర్ నిర్వహిస్తామని తెలిపారు. -
ముగ్గు పోశారు.. పునాదితో ఆపారు
● ముందుకు సాగని ఇందిరమ్మ ఇండ్లు ● మోడల్ ఇళ్లకే పరిమితమైన నిర్మాణాలు ● జిల్లాలో 1,420 నిర్మాణాల లక్ష్యం ● ఇప్పటి వరకు బేస్మెంట్ పూర్తయినవి 49జగిత్యాల: నిరుపేదల సొంతింటి కల సాకారం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకంలో ఆలస్యం జరుగుతోంది. కొన్నిచోట్ల ముగ్గు పోయగా.. మరికొన్ని చోట్ల పునాదులకే పరిమితం అయ్యింది. ఇంటిస్థలం ఉన్న నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలో మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో 1,420 ఇళ్ల నిర్మాణాలకు మంజూరు వచ్చింది. జనవరి 26న అధికారులు మంజూరు పత్రాన్ని లబ్ధిదారులకు అందజేశారు. దాదాపు రెండు నెలలు కావస్తున్నా కొన్ని చోట్ల ముగ్గు పోశారే తప్ప పనులు ముందుకు సాగడం లేదు. జిల్లావ్యాప్తంగా 49 ఇళ్లకు మాత్రమే బేస్మెంట్ పూర్తయింది. దీంతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాలు కేవలం మోడల్‌కే పరిమితమయ్యాయి. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ ధర్మపురి మున్సిపాలిటీలతో పాటు మండలాల్లోని పలు గ్రామాల్లో అర్హులైన వారికి ప్రొసిడింగ్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ 270 ఇళ్లకే ముగ్గు పోశారు. కొన్ని చోట్ల పునాదులు తవ్వినప్పటికీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. 49 ఇళ్ల బేస్మెంట్ పూర్తి చేశారు. ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టాలన్న ఉద్దేశం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకో వడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఇళ్ల నిర్మాణాల్లో అనేక అక్రమాలు జరిగాయన్న ఉద్దేశంతో ఈసారి ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించారు. సర్వే సమయంలో చూపించిన స్థలంలోనే ఇళ్లు నిర్మించుకునేలా జియో పెన్సింగ్ విధానాన్ని అమలు చేశారు. సర్వే అప్పుడు చూపిన స్థలంలోనే లబ్ధిదారు ఇల్లు నిర్మించుకోవాలి. కానీ ఆ నిబంధనలు ప్రభుత్వం సడలించింది. లబ్ధిదారు తనకు నచ్చిన చోట ఇంటి నిర్మాణానికి అవకాశం కల్పించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.జిల్లాలో నియోజకవర్గాలవారీగా మంజూరైన ఇండ్లునియోజకవర్గం మంజూరైనవి బేస్మెంట్ పూర్తయినవి ధర్మపురి 598 20 జగిత్యాల 321 19 కోరుట్ల 130 04 వేములవాడ 227 01 చొప్పదండి 144 05 -
కాషాయ‘కొండ’
● భక్తజన సంద్రమైన కొండగట్టు ● వైభవంగా ప్రారంభమైన అంజన్న చిన్నజయంతి వేడుకలు ● జై శ్రీరాం.. జై హనుమాన్ నామస్మరణలతో మార్మోగిన ఆలయం ● భారీగా తరలివచ్చిన దీక్షాపరులు.. ● పర్యవేక్షించిన కలెక్టర్ సత్య ప్రసాద్, ఈవో, అధికారులు ● నేడూ కొనసాగనున్న దీక్షా విరమణజగిత్యాల: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు కాషాయమయమైంది. జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో అంజన్న సన్నిధి మార్మోగింది. ఆలయంలో హనుమాన్ చిన్నజయంతి వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. జయంతి సందర్భంగా సాయంత్రం నుంచి దీక్షాపరులు వేలాదిగా కొండకు తరలివచ్చారు. సుమారు 30 వేల మంది మాల విరమణ చేయగా.. అర్ధరాత్రి వరకు సంఖ్య భారీగా పెరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, ఇతర జిల్లాల నుంచి వేలాదిగా తరలించారు. అర్ధరాత్రి తరువాత లక్షన్నరకు పైగా భక్తుల రాకతో కొండ కిక్కిరిసిపోయింది. కోనేరులో స్నానమాచరించిన భక్తులు, క్యూలైన్ ద్వారా వెళ్లి ఇరుముడి సమర్పించి, మాల విరమణ చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. మరో రెండు రోజుల పాట రద్దీ కొనసాగనుంది. జయంతి సందర్భంగా కలెక్టర్ కలెక్టర్ సత్యప్రసాద్ ఏర్పాట్లను పరిశీలించారు. మెడికల్క్యాంప్లో మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండాలని సిబ్బందికి సూచించారు. కోనేరును ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఎస్పీ రఘుచందర్, పంచాయతీ అధికారి మదన్మోహన్ పాల్గొన్నారు. -
రమణీయం.. రామయ్య రథోత్సవం
పెగడపల్లి: మండలంలోని నంచర్ల శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా చివరి ఘట్టమైన స్వామివారి రథోత్సవం కనుల పండువగా సాగింది. ఐదురోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఉత్సవ మూర్తులను రథంపైకి తెచ్చి ఆలయం చుట్టూ సప్తహవాలతో జైశ్రీరాం..జై శ్రీరాం నినాదాలతో రథోత్సవం నిర్వహించారు.వ రామనామ భక్తుల నినాదాలు, నృత్యాలతో ఆలయ ఆవరణ మార్మోగింది. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కొత్త జైపాల్‌రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి వెంకన్న, మంత్రి హరిగోపాల్, పెగడపల్లి ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములుగౌడ్ పాల్గొన్నారు. -
తాగునీటి సమస్య పరిష్కరించాలి
రాయికల్: రాయికల్ పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని అదనపు కలెక్టర్ బీఎస్.లత సూచించారు. రాయికల్ బల్దియాలో తాగునీటి సమస్య, ఎల్ఆర్ఎస్పై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లత మాట్లాడుతూ.. బల్దియాలో ఎక్కడెక్కడ తాగునీటి సమస్యలున్నాయో గుర్తించి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బల్దియాలో ఎల్ఆర్ఎస్ వసూళ్లు వందశాతం చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ ఖయ్యూం, కమిషనర్ మనోహర్‌గౌడ్, ఎంపీడీవో చిరంజీవి, పంచాయతీరాజ్ ఏఈ ప్రసాద్ ఉన్నారు. సేవాభావంతోనే భగవంతుడి అనుగ్రహంసారంగాపూర్: సేవాభావంతోనే భగవంతుడి అనుగ్రహం పొందగలుగుతామని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. మంచిర్యాల, ఆది లాబాద్ జిల్లాల నుంచి కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్న అంజన్న దీక్షాపరులకు శుక్రవా రం సారంగాపూర్‌లో స్థానికులతో కలిసి పండ్లు, మజ్జిగ, మంచినీరు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని పలు కుటుంబాలను పరా మర్శించారు. సూర కోటేశ్వర్‌రెడ్డి, కొండ్ర రాంచంద్రారెడ్డి, ఆసాది హరీశ్, చేకుట శేఖర్, ఉరుమల్ల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో గ్రామాల అభివృద్ధి రాయికల్: కేంద్ర ప్రభుత్వ పథకాలతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి పేర్కొన్నా రు. గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రామాజీపేట గ్రామాన్ని సందర్శించారు. కార్యకర్తలతో పార్టీ జెండా ఆవిష్కరించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా శ్రమదానం చేపట్టారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెడుతున్న పథకాలతో గ్రామాలు అభివృద్ధి చెందాయని, సన్నబియ్యం కేంద్రప్రభుత్వ పథకమేనని వివరించారు. మాజీ ఎంపీటీసీ ఆకుల మహేశ్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి రాజశేఖర్, సింగిల్ విండో చైర్మన్ ముత్యంరెడ్డి, ఉపాధ్యక్షుడు కోల శంకర్, సాయి, నరేందర్, రాజు, శ్రీను, భూమేశ్, నాగరాజు పాల్గొన్నారు. ఏప్రిల్ 19న శాటిలైట్ టెక్నాలజీ డేజగిత్యాల: విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలు పెంపొందించేందుకు అంతరిక్ష విజ్ఞానంలో ఆసక్తి, అవగాహన కల్పించేందుకు భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యబట్ట ప్రయోగింపబడి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 19న శాటిలైట్ టెక్నాలజీ డే నిర్వహిస్తున్నట్లు డీఈవో రాము తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆన్లైన్లో ఈ సెమినార్ నిర్వహించడం జరుగుతుందని, 17వ తేదీలోపు ఉపాధ్యాయులు, విద్యార్థులు WWW. ARYABHATA. INDIA. SPACEWEEK. ORG వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అన్ని పాఠశాలల హెచ్ఎంలు విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. మరిన్ని వివరాలకు రాజశేఖర్ 94402 12333 సంప్రదించాలన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలికోరుట్ల: వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ముస్లింలు డిమాండ్ చేశారు.శుక్రవారం ప్రార్థనల అనంతరం పట్టణంలోని అన్ని మసీదుల వద్ద ముస్లింలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన చేపట్టారు. కార్యక్రమంలో ముస్లిం సంఘాల నాయకులు, యువకులు, పాల్గొన్నారు. -
చదువు ప్రాముఖ్యతను చాటిన పూలే
జగిత్యాలటౌన్: చదువుతోనే జీవితంలో మార్పు సాధ్యమని భావించి, విద్యా ప్రాముఖ్యతను చాటిచెప్పిన మహనీయుడు జ్యోతిరావుపూలే అని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతి వేడుకల్లో కలెక్టర్ బి.సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బీఎస్.లత, కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్.రమణ పాల్గొన్నారు. జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. గతంలో వర్ణ, వర్గ, కుల వ్యవస్థ కారణంగా దళితులు, బడుగు బలహీన వర్గాలపై తీవ్ర వివక్ష ఉండేదన్నారు. మహిళలను సమానంగా చూడటం అనే ఆలోచన కూడా లేని రోజుల్లో మహిళా విద్యను ప్రోత్సహించిన మహానీయుడు పూలే అని కొనియాడారు. ఎల్.రమణ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నిదానంగా స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు. మెరుగైన విద్యాబోధనకు పటిష్ట చర్యలు చేపట్టడమే పూలేకు అసలైన నివాళి అని పేర్కొన్నారు. జిల్లా బీసీ అబివృద్ధిశాఖ అధికారి జి.సునీత, బీసీ సంక్షేమ సంఘం నాయకులు హరి అశోక్‌కుమార్, ముసిపట్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.● కలెక్టర్ సత్యప్రసాద్ -
ఫిలిప్పీన్స్‌కు జగిత్యాల రా రైస్
● ఇప్పటికే ఫిలిప్పీన్స్ తరలిన 1,000 టన్నుల బియ్యంజగిత్యాలరూరల్: రాష్ట్ర ప్రభుత్వం రైస్‌మిల్లర్ల వద్ద ఉన్న రా రైస్ బియ్యాన్ని ఫిలిప్పీన్స్ దేశానికి పంపిస్తోంది. గతంలోనే ఫిలిప్పీన్స్ అధికారుల బృందం తెలంగాణ రాష్ట్రానికి వచ్చి రైస్‌మిల్లుల్లో ఉన్న రా రైస్‌ను పరిశీలించి వెళ్లారు. బియ్యం నాణ్యత ప్రమాణాలు బాగుండడంతో ఇప్పటికే 12,500 మెట్రిక్ ట న్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఇటీవలే మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫిలిప్పీన్స్ పంపించా రు. ఫిలిఫిన్స్ చేరిన బియ్యాన్ని అక్కడి అధికారుల బృందం పరిశీలించి, తెలంగాణ రాష్ట్రంలోని రా రైస్ బియ్యం మరో 83వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలని కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అయా జిల్లాల నుంచి రా రైస్ బియ్యాన్ని సేకరించాలని పౌరసరఫరాలశాఖ అధికారులకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. జగిత్యాల జిల్లా నుంచి 5,800 మెట్రిక్‌టన్నుల బియ్యం ఫిలిప్పీన్స్ తరలించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. బియ్యాన్ని త్వరలో సేకరించి లారీల ద్వారా కాకినాడ పోర్టుకు చేర్చనున్నారు. అక్కడి నుంచి షిఫ్‌ల ద్వారా ఫిలిప్పీన్స్ దేశానికి తరలించనున్నారు. గతంలో జగిత్యాల జిల్లా నుంచి 1000 మెట్రిక్ టన్నుల రారైస్‌ను కేఎల్ గ్రూ పు సంస్థ ఇప్పటికే ఫిలిప్పీన్స్ దేశానికి పంపించింది. దీంతో జిల్లాలో మిల్లర్ల ఉన్న రా రైస్‌ను పూర్తిస్థాయిలో సేకరించి ఫిలిప్పీన్స్‌కు రవాణా చేయనున్నారు. -
ఆడ బిడ్డలకు అండగా ప్రభుత్వం
వెల్గటూర్: పేదింటి ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం, కల్యాణ లక్ష్మి పథకం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఎండపల్లి తహశీల్దార్ కార్యాలయంలో 24 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కల్యాణలక్ష్మి లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని, అక్కడికక్కడే సంతకాలు పెట్టి పంపిస్తున్నామని, గత పాలకుల మాదిరిగా ఇబ్బందులకు గురిచేయడం లేదని తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్‌కార్డు ఉన్న పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయడం కాదుకదా కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేసి చరిత్ర సృష్టించిందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ గోపిక, తహసీల్దార్ రవికాంత్, నాయకులు గోపాల్‌రెడ్డి, తిరుపతి, రమేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి భూమిపూజ వెల్గటూరు మండలంలోని మొక్కట్రావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించనున్న హనుమాన్ ఆలయానికి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ శుక్రవారం భూమిపూజ చేశారు. ఎండపల్లి మండలం పాతగూడూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు పొనుగోటి శ్రీని వాసరావు, మద్దుల గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ -
ఖాకీ.. కలవరం
● విధి నిర్వహణలో ఆటంకాలు ● ఇసుక ట్రాక్టర్ల ఓనర్ల ఇష్టారాజ్యం ● అడ్డుకునేందుకు వెళ్తే దాడులు ● ఆపై.. రాజకీయ ఒత్తిళ్లు ● చర్యలు తీసుకోలేకపోతున్న తీరుకోరుట్ల: ● 15 రోజుల క్రితం కోరుట్ల మండలం నాగులపేటలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకున్న కానిస్టేబుల్‌తో ఓ వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. ఇది తోపులాట వరకూ వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ● 10 రోజుల క్రితం మల్లాపూర్ మండలం మొగిలిపేట–నడికుడ గ్రామాల మధ్య భూ సరి హద్దు వివాదంలో సివిల్ డ్రెస్సులో ఉన్న ఓ కానిస్టేబుల్‌పైకి ఓ వ్యక్తి తిరగబడ్డాడు. పోలీసులు సంఘటనపై విచారణ జరిపి సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ● మెట్పల్లి మండలం వేంపేట సమీపంలో ఐదు రోజుల క్రితం అక్రమంగా ఇసుక తీసుకెళ్తున్న ట్రాక్టర్‌ను ఓ ఏఎస్సై, కానిస్టేబుల్ ఆపారు. ట్రాక్టర్ ఆపినందుకు ఓ వ్యక్తి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగి నానా హంగామా చేశాడు. పోలీస్స్టేషన్లోనూ అదే తీరుతో వ్యహరించాడు. రాజకీయ ఒత్తిళ్లతో తర్జన భర్జన పడిన పోలీసులు చివరికి అతనిపై కేసు నమోదు చేశారు. ఇలా వారం వ్యవధిలో పోలీసులపై తిరగబడిన ఘటనలు చోటు చేసుకోవడంతో విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై కిందిస్థాయి పోలీసు సిబ్బంది కలవరపడుతున్నారు. పోలీసు విధుల నిర్వహణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు అనేక సమస్యల మధ్య చట్టపరిధిలో పనిచేసే పోలీసు సిబ్బంది నైతిక స్థైర్యం దెబ్బతీస్తుందన్న ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో తిప్పలే.. క్షేత్రస్థాయిలో పనిచేసే పోలీసు సిబ్బంది ఎక్కువగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ నిక్కచ్చిగా అమలు అవసరమే అయినప్పటికీ.. పోలీసులు కనీసం లాఠీలు లేకుండా విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది. సామూహికంగా జరిగే గొడవలు, ఉత్సవాలు, ఊరేగింపు వంటి సందర్భాలతోపాటు అక్రమ మార్గాల్లో ఇసుక, మొరం సరాఫరా చేస్తున్న వారు గంజాయి తీసుకుని గలాటాలు సృష్టించే వాళ్లు ఇలా కొంత మంది అసాంఘిక శక్తులు ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ పోలీసు సిబ్బంది ఏం చేయరన్న ధీమాతో కొన్నిచోట్ల తమ ఇష్టం ఇచ్చినట్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. రాత్రి..పగలు తేడా లేకుండా పనుల్లో నిమగ్నం కావాల్సిన పోలీసు సిబ్బంది ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మానసిక స్థైర్యం కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆయా పోలీసు ఉన్నతాధికారులు నిక్కచ్చిగా వ్యవహరించి పోలీసులపై తిరగబడుతున్న వారి విషయంలో కఠినంగా ఉండాల్సిన అవసరముంది. రాజకీయ ఒత్తిళ్లు తప్పట్లేదు కొంతమంది రాజకీయ నాయకుల అండ ఉందన్న ధీమాతో పోలీసులతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మల్లాపూర్ మండలంలోని సరిహద్దు వివాదంతోపాటు మెట్పల్లి మండలం వేంపేట, నాగులపేట అక్రమ ఇసుక రవాణా సందర్భంలో దురుసుగా వ్యవహరించిన వారి తరఫున కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సిబ్బందిపై తిరగబడిన వ్యక్తులపై చర్యలకు తర్జనభర్జన పడినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పైస్థాయి అధికారుల పోస్టింగ్‌ల కోసం పైరవీలు తప్పనిసరి అన్న విషయం బహిరంగ రహస్యం. ఈ క్రమంలో పోలీసు సిబ్బందికి సమస్యలు ఎదురైనప్పుడు అధికారులు కఠినంగా వ్యవహరించలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒత్తిళ్లను పక్కనపెట్టి కింది స్థాయి సిబ్బందిలో మానసిక స్థైర్యం నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫలితంగా శాంతిభద్రతల పరిరక్షణలో క్షేత్రస్థాయి సిబ్బంది చక్కగా పనిచేయడంతో ప్రజలకు మేలు జరుగుతుందన్న వాదనలు ఉన్నాయి. -
కాంగ్రెస్ కుటుంబమైతే.. ఇన్నాళ్లు ఎక్కడున్నారు..?
● రాజ్యాంగ పరిరక్షణపై మాట్లాడితే సంజయ్‌కి ఉలుకెందుకు.. ● రాహుల్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా.. ● మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జగిత్యాలటౌన్: రాహుల్‌గాంధీ ఆలోచన విధానమైన జైభీం, జైబాపు, జైసంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ నైతిక విలువలపై తాను మాట్లాడితే ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు ఉలికి పాటెందుకని మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. తనది కాంగ్రెస్ కుటుంబమంటున్న సంజ య్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడున్నాడని, అభివృద్ధి కోసమైతే ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల నియంతృత్వ పాలనకు ఎదురొడ్డి పోరాడిన అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు దక్కాల్సిన గౌరవం పరాయి వాళ్లకు దక్కుతుండడం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా సంజయ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించి రౌడీషీట్లు నమోదు చేయించిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేదన్నా రు. పార్టీ మారని కాంగ్రెస్ సర్పంచులను సస్పెండ్ చేయించిన చరిత్ర సంజయ్దన్నారు. బీఆర్ఎస్ నాయకుల వేధింపులతో హబ్సీపూర్ గ్రామానికి చెందిన శివనాగ చైతన్య ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. తాను పార్టీ మారినప్పుడు ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయాన్ని సంజయ్ తెలుసుకోవాలన్నారు. బండ శంకర్, గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, గాజంగి నందయ్య, చందా రాధాకిషన్, జగదీశ్వర్, రఘువీర్‌గౌడ్, గుండ మధు, ముకేష్‌ఖన్నా పాల్గొన్నారు. -
నీటికొరత రాకుండా చర్యలు
బుగ్గారం (ధర్మపురి): ధర్మపురి పట్టణంలో తాగునీటికి కొరత రాకుండా చర్యలు చేపడుతున్నట్లు ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో గురువారం రెండు నీటి ట్యాంకర్లను ప్రారంభించారు. పట్టణానికి నీటి సరఫరాకు సహాయం చేస్తానని తెలిపారు. అనంతరం అక్కపల్లి రాజేశ్వరస్వామి ఆలయ సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో పర్యటించారు. అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించారు. అమృత్ పథకంలో భాగంగా చేపడుతున్న పైప్‌లైన్ పనులను ప్రారంభించారు. నాయకులు సంగనభట్ల దినేష్, వేముల రాజు, వొజ్జల లక్ష్మణ్, ప్రసాద్, జక్కు రవీందర్, సీపతి సత్యనారాయణ, కస్తూరి శ్రీనివాస్, చిలుముల లక్ష్మణ్, సుముఖ్ పాల్గొన్నారు. రోళ్లవాగు ముంపు అటవీప్రాంతం పరిశీలనసారంగాపూర్: బీర్పూర్ శివారులోని రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణంలో అటవీశాఖ కోల్పోతున్న భూములు, అటవీప్రాంతాన్ని గురువారం అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ సి.సరవనన్ (నిర్మల్) పరిశీలించారు. అటవీశాఖకు జరుగుతున్న నష్టంపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.136.81 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణంలో అటవీశాఖకు చెందిన 816 ఎకరాల భూమి ముంపునకు గురవుతోందని, ఇందులో 53వేల చెట్లకు నష్టం వాటిల్లుతోందని అటవీశాఖ ఇచ్చిన నివేదికను ఆయన పరిశీలించారు. ముంపు భూములకు బదులు ప్రభుత్వం గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూర్ మండలాల్లో కేటాయించిన భూములను పరిశీలించారు. ఆయన వెంట డీఎఫ్‌వో రవిప్రసాద్, డిఈ చక్రూనాయక్, అధికారులు ఉన్నారు. అరగంటలోపే రిజిస్ట్రేషన్జగిత్యాలటౌన్: స్లాట్ బుక్ చేసుకున్న అరగంటలోపే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నామని జగిత్యాల సబ్ రిజిస్ట్రార్ సుజాత అన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా గురువారం జగిత్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నూతన విధానంలో టైంస్లాట్ బుక్ చేసుకున్న కొనుగోలుదారుకు అరగంట లోపే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి డాక్యుమెంట్‌ను అందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీఐజీ (స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్) రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు. నేడు డయల్ యువర్ డీఎంజగిత్యాలటౌన్: ప్రయాణికుల సమస్యల పరిష్కారం, మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ జగిత్యాల డిపో మేనేజర్ కల్పన తెలిపారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు 99592 25925నంబర్‌కు ఫోన్ చేసి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. మహిళలు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలిజగిత్యాలరూరల్: మహిళలు అరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని, సరైన పౌష్టికాహారం తీసుకోవాలని మార్కెటింగ్ డీపీఎం మల్లేషం, ఫైనాన్స్ డీపీఎం విజయభారతి అన్నారు. జగిత్యాలలోని ఐకేపీ కార్యాలయంలో వీఓఏలతో సమావేశమయ్యారు. పోషక పక్షం–పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. గర్భిణులు ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం పోషకాహారం తీసుకోవాలన్నారు. యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస వసతులు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం గంగాధర్, సీసీలు మరియా, రవీందర్, శ్రీనివాస్, మండల సమాఖ్య అధ్యక్షురాలు మారు సత్తవ్వ, కోశాధికారి శ్రీలత, మాజీ కార్యదర్శి భారతి పాల్గొన్నారు. -
దళారులకు అమ్మి నష్టపోవద్దు
మెట్‌పల్లిరూరల్: రైతులు తమ పంటలను దళారులకు అమ్మి నష్టపోవద్దని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్పల్లి మండలం రామలచ్చక్కపేట, ఆత్మనగర్, ఆత్మకూర్, మెట్లచిట్టాపూర్‌లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, తహసీల్దార్ శ్రీనివాస్, ఏవో దీపిక, ఏపీఎం విమోచన, మెట్లచిట్టాపూర్ పీఏసీఎస్ చైర్మన్ నవీన్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
దారులన్నీ కొండగట్టుకే..
● కాషాయమయమైన అంజన్న సన్నిధి ● నేటి నుంచి చిన్న జయంతి ఉత్సవాలు ● తరలిరానున్న రెండు లక్షల మంది భక్తులు ● ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీ ● అడుగడుగునా సీసీ కెమెరాల ఏర్పాటుజగిత్యాల: జై శ్రీరాం.. జై హనుమాన్ అంటూ తమ ఇష్టదైవమైన కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం అంజన్న చిన్న జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో గల శ్రీఆంజనేయస్వామి ఆలయం ముస్తాబైంది. మూడురోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అడుగడుగునా సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు, మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం లైటింగ్స్ సిద్ధం చేశారు. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు వేశారు. కల్యాణకట్ట వద్ద నాయీబ్రాహ్మణులను అధిక సంఖ్యలో నియమించారు. జయంతి సందర్భంగా ఇప్పటికే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీక్షాపరులు మాలవిరమణ చేసి అంజన్నకు ముడుపు కట్టనున్నారు. రెండు లక్షల మంది అంచనా.. అంజన్న సన్నిధైన కొండమీదకు కాలినడకన, వాహనాల్లో అనేక ప్రాంతాల నుంచి సుమారు రెండు లక్షల మంది రానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం వరకు భక్తులందరూ కొండగట్టుకు చేరుకుని అంజన్న సన్నిధిలో అర్ధరాత్రి వరకు సేదతీరి క్యూలైన్లలో నిలబడి మాల విరమణ చేయనున్నారు. జై హనుమాన్, జై శ్రీరాం అంటూ కొండ ప్రాంగణమంతా మారుమోగనుంది. పార్కింగ్‌కు ఏర్పాట్లు ● జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ● ఇప్పటికే ఎస్పీ అశోక్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ● జేఎన్టీయూ దాటాక, ఘాటో రోడ్ వెంట తాగునీటికి చలివేంద్రాలు, మల విసర్జనకు తాత్కలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ● బొజ్జ పోతన్న సమీపంలో వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలం.. అనారోగ్య సమస్యలు తలెత్తితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. ● అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఫైరింజిన్, చోరీలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ● కొండ దిగువ నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, దారి వెంట భక్తులకు ఆటోల ద్వారా నీరు అందించనున్నారు. ● భక్తులు స్నానం ఆచరించే పరిసరాలల్లో నిత్యం శానిటేషన్ చేపట్టనున్నారు. భక్తుల దర్శనం ఇలా.. ఘాట్‌రోడ్ మీదుగా వాహనాలపై.. మెట్లదారిలో కాలినడకన గుట్టపైకి చేరుకోవాలి. నాచుపల్లి జేఎన్టీయూ వైపు నుంచి వచ్చే భక్తుల కోసం బొజ్జ పోతన్న సమీపంలో పార్కింగ్ స్థలం సిద్ధం చేశారు. ఇక్కడ వాహనాలను పార్కింగ్ చేసి కాలి నడకన కొండమీదకు చేరుకోవాలి. కొండపైకి చేరుకున్నాక ముందుగా పాత కోనేరు ఎదురుగా ఉన్న మెట్లదారి వెంట వెళ్లి అక్కడి కల్యాణకట్టలో క్యూలైన్ పద్ధతిలో మాల విరమణ చేసుకోవాలి. నూతన కోనేరు పక్కనున్న చలువ పందిళ్ల దిగువ, శ్రీరామ కోటి స్తూపం వెనకాల షెడ్డులో తలనీలాలు సమర్పించాలి. నూతన కోనేరులో పుణ్యస్నానాలచరించాలి. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన క్యూలైన్ ద్వారా వెళ్లి స్వామి వారిని దర్శించుకోవాలి. ఆలయం వెనక వైపు నుంచి తిరుగు పయనం కావాలి. -
నూకలు వస్తున్నయి
మా కుటుంబానికి ఈనెల 18 కిలోల సన్నబియ్యం ఇచ్చిండ్రు. అందులో రెండు కిలోల నూకలు వచ్చినయి. మిగతా బియ్యం మంచిగనే ఉన్నయ్. ఇవే మాకు ఆధారం. ప్రతీనెల సన్నబియ్యం ఇస్తే మాకు ఎంతో ఆసరాగా ఉంటుంది. – సత్తమ్మ, యైటింక్లయిన్‌కాలనీ సన్నబియ్యం బాగున్నాయి వారం కిందట రేషన్ బియ్యం తెచ్చుకున్న. కొద్దిగా నూకలు వచ్చినయి. అయినా, మంచిగానే ఉన్నయి. సన్నబియ్యం వండుకుని తిన్నం. మాలాంటి పేదలకు సన్నబియ్యం ఇవ్వడం మంచిదే. పథకాన్ని ఇలాగే కొనసాగించాలి. – బిట్ల వజ్రవ్వ, ముస్తాబాద్, సిరిసిల్ల -
ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
బుగ్గారం(ధర్మపురి): ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం తనిఖీ చేశారు. వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్, ఓపీ సేవలు, ఐపీ సేవలు, ఫార్మసీ, వివిధ రికార్డులు పరిశీలించారు. రూ.రెండు కోట్లతో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను పరిశీలించారు. 70 శాతం పనులు పూర్తయ్యాయని, రెండు నెలల్లో మిగిలిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆవరణలో పిచ్చిమొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. ఆరోగ్య మహిళా కేంద్రంలో మహిళలకు వైద్యపరీక్షలపై అడిగి తెలుసుకున్నారు. థైరాయిడ్, క్యాన్సర్, ఆస్తమా వంటి పరీక్షలను ఎంతమందికి చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ కృష్ణచైతన్య, డీసీహెచ్ఎస్ రామకృష్ణ, హెల్త్ సూపరింటెండెంట్ రవి ఉన్నారు.