
తాగునీటి సమస్య పరిష్కరించాలి
రాయికల్: రాయికల్ పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని అదనపు కలెక్టర్ బీఎస్.లత సూచించారు. రాయికల్ బల్దియాలో తాగునీటి సమస్య, ఎల్‌ఆర్‌ఎస్‌పై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లత మాట్లాడుతూ.. బల్దియాలో ఎక్కడెక్కడ తాగునీటి సమస్యలున్నాయో గుర్తించి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బల్దియాలో ఎల్‌ఆర్‌ఎస్ వసూళ్లు వందశాతం చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ ఖయ్యూం, కమిషనర్ మనోహర్‌గౌడ్, ఎంపీడీవో చిరంజీవి, పంచాయతీరాజ్ ఏఈ ప్రసాద్ ఉన్నారు.
సేవాభావంతోనే భగవంతుడి అనుగ్రహం
సారంగాపూర్: సేవాభావంతోనే భగవంతుడి అనుగ్రహం పొందగలుగుతామని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. మంచిర్యాల, ఆది లాబాద్ జిల్లాల నుంచి కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్న అంజన్న దీక్షాపరులకు శుక్రవా రం సారంగాపూర్‌లో స్థానికులతో కలిసి పండ్లు, మజ్జిగ, మంచినీరు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని పలు కుటుంబాలను పరా మర్శించారు. సూర కోటేశ్వర్‌రెడ్డి, కొండ్ర రాంచంద్రారెడ్డి, ఆసాది హరీశ్, చేకుట శేఖర్, ఉరుమల్ల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలతో గ్రామాల అభివృద్ధి
రాయికల్: కేంద్ర ప్రభుత్వ పథకాలతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి పేర్కొన్నా రు. గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రామాజీపేట గ్రామాన్ని సందర్శించారు. కార్యకర్తలతో పార్టీ జెండా ఆవిష్కరించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా శ్రమదానం చేపట్టారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెడుతున్న పథకాలతో గ్రామాలు అభివృద్ధి చెందాయని, సన్నబియ్యం కేంద్రప్రభుత్వ పథకమేనని వివరించారు. మాజీ ఎంపీటీసీ ఆకుల మహేశ్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి రాజశేఖర్, సింగిల్ విండో చైర్మన్ ముత్యంరెడ్డి, ఉపాధ్యక్షుడు కోల శంకర్, సాయి, నరేందర్, రాజు, శ్రీను, భూమేశ్, నాగరాజు పాల్గొన్నారు.
ఏప్రిల్ 19న శాటిలైట్ టెక్నాలజీ డే
జగిత్యాల: విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలు పెంపొందించేందుకు అంతరిక్ష విజ్ఞానంలో ఆసక్తి, అవగాహన కల్పించేందుకు భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యబట్ట ప్రయోగింపబడి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 19న శాటిలైట్ టెక్నాలజీ డే నిర్వహిస్తున్నట్లు డీఈవో రాము తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆన్‌లైన్‌లో ఈ సెమినార్ నిర్వహించడం జరుగుతుందని, 17వ తేదీలోపు ఉపాధ్యాయులు, విద్యార్థులు WWW. ARYABHATA. INDIA. SPACEWEEK. ORG వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అన్ని పాఠశాలల హెచ్‌ఎంలు విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. మరిన్ని వివరాలకు రాజశేఖర్ 94402 12333 సంప్రదించాలన్నారు.
వక్ఫ్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి
కోరుట్ల: వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ముస్లింలు డిమాండ్ చేశారు.శుక్రవారం ప్రార్థనల అనంతరం పట్టణంలోని అన్ని మసీదుల వద్ద ముస్లింలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన చేపట్టారు. కార్యక్రమంలో ముస్లిం సంఘాల నాయకులు, యువకులు, పాల్గొన్నారు.

తాగునీటి సమస్య పరిష్కరించాలి

తాగునీటి సమస్య పరిష్కరించాలి