breaking news
Jagitial District News
-
ఇక సంగ్రామమే..
జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం జెడ్పీ చైర్మన్ కరీంనగర్ 03 00 06 06 15 బీసీ(జనరల్) సిరిసిల్ల 03 01 05 03 12 ఎస్సీ(జనరల్) జగిత్యాల 04 01 09 06 20 మహిళ(జనరల్) పెద్దపల్లి 06 03 00 04 13 మహిళ(జనరల్)సాక్షిప్రతినిధి, కరీంనగర్: సా్థనిక ఎన్నికలకు నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీతోపాటు గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. తొలుత రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. తదుపరి మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 9నుంచి నవంబర్ 11వరకు ఎన్నికల పక్రియ కొనసాగనుంది. 33 రోజుల పాటు కోడ్ అమల్లో ఉండనుంది. పల్లెల్లో రాజకీయ సందడి జోరందుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గెలుపే లక్ష్యంగా గ్రామాల వారీగా బలమైన అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభించగా, ఆశావహులు ఒక్కచాన్స్ ఇవ్వండంటూ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గతంకు భిన్నంగా... ఎప్పుడైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చే శాక, పంచాయతీ ఎన్నికలు నిర్వహించేవారు. ఈసారి రెండు ఎన్నికలను కలిపి నిర్వహిస్తుండటంతో పోటీ చేసి ఓడిపోతే ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆశావహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 646 ఎంపీటీసీ, 60 ఎంపీపీ, 60 జెడ్పీటీసీలకు, 1,226 సర్పంచ్ స్థానాలకు, 5,968 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం సీట్ల ల్లో 50శాతం తగ్గకుండా మహిళలకు కేటాయించారు. ముగ్గురు పిల్లలుంటే అనర్హులే.. కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు 1994లో పంచాయతీరాజ్ చట్టంలో ఈ నిబంధన తీసుకొచ్చారు. దీని ప్రకారం ముగ్గురు పిల్ల లుంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. తాజాగా ప్రభుత్వం ఈ నిబంధన ఎత్తివేయాలని ఆలోచించినా పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 21(3)ని సవరించలేదు. దీంతో ముగ్గురు పిల్లలు నిబంధన యథాతథంగా ఉండనుంది. కోర్టులో ఉండడంతో.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రామచంద్రపల్లి, కుర్మపల్లి గ్రామాల విషయం కోర్టు పరిధిలో ఉండగా రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టలేదు. మరోవైపు జిల్లా రిజర్వేషన్ల ప్రక్రియ వివరాలు వెల్లడించేందుకు జిల్లా పంచాయతీ అధికారి, డీపీఆర్వో సుముఖత చూపలేదు.జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం కరీంనగర్ 39 00 73 58 170 సిరిసిల్ల 25 07 56 35 123 జగిత్యాల 26 07 52 41 126 పెద్దపల్లి 25 03 59 50 137జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం సిరిసిల్ల 53 30 101 76 260 జగిత్యాల 68 31 153 133 385 పెద్దపల్లి 54 06 110 93 263 కరీంనగర్ – – – – –జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం కరీంనగర్ 03 00 06 06 15 సిరిసిల్ల 03 01 05 03 12 జగిత్యాల 04 01 08 07 20 పెద్దపల్లి 05 03 00 05 13 -
స్థానిక పోరుకు ఏర్పాట్లు
● రెండు దశల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ● రెండు దశల్లో సర్పంచ్ ఎన్నికలుజగిత్యాల: జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడంతో కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత వివరాలు ప్రకటించారు. 9న నోటిఫికేషన్ విడుదలవుతుందని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు 23, 27 తేదీల్లో రెండు దశల్లో నిర్వహించనుండగా.. కౌంటింగ్ నవంబర్11న ఉంటుందన్నారు. సర్పంచ్ ఎన్నికలు 10 మండలాలు ఫేస్–2లో.. మరో 10 మండలాలు ఫేస్–3లో జరుగుతాయని తెలిపారు. ఎస్పీ అశోక్‌కుమార్, అదనపు కలెక్టర్ రాజాగౌడ్ పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రాలు ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో.. జగిత్యాల, జగిత్యాలరూరల్, కొడిమ్యాల, మలా ల, ధర్మపురి, బుగ్గారం కండ్లపల్లి మోడల్స్కూల్లో.. రాయికల్, సారంగాపూర్, బీర్పూర్ ఇబ్రహీంపట్నం మోడల్స్కూల్లో.. మల్లాపూర్, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం కల్లూరు మోడల్స్కూల్లో... కోరుట్ల, బీమారం, మేడిపల్లి గొల్లపల్లి మోడల్స్కూల్లో... గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూర్, ఎండపల్లి రెండు దశల్లో సర్పంచ్ ఎన్నికలు అక్టోబర్ 21 నుంచి నవంబర్ 4 వరకు మండలాలు : మేడిపల్లి, బీమారం, కథలాపూర్, కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, సారంగాపూర్, బీర్పూర్, రాయికల్ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 8 వరకు మండలాలు : ధర్మపురి, బుగ్గారం, మల్యాల, కొడిమ్యాల, ఎండపల్లి, వెల్గటూర్, జగిత్యాలరూరల్, జగిత్యాల, గొల్లపల్లి, పెగడపల్లి మొదటి విడత పోలింగ్ 10 నుంచి 108 ఎంపీటీసీలు పోలింగ్ కేంద్రాలు 554మండలాలు: బీర్పూర్, రాయికల్, సారంగాపూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పల్లి, బీమారం, కథలాపూర్, కోరుట్ల, మేడిపల్లి రెండో విడత పోలింగ్ 10 నుంచి 108 ఎంపీటీసీలు పోలింగ్ కేంద్రాలు 569మండలాలు: బుగ్గారం, ధర్మపురి, ఎండపల్లి, జగిత్యాల, జగిత్యాలరూరల్, కొడిమ్యాల, మల్యాల, పెగడపల్లి, వెల్గటూర్, గొల్లపల్లిగ్రామపంచాయతీలు 385వార్డులు 3,536పోలింగ్ కేంద్రాలు 3,536పోలింగ్ లొకేషన్స్ 477క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 244సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు 1361మండలాలు 20జెడ్పీటీసీ స్థానాలు 20ఎంపీటీసీ స్థానాలు 216ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాలు 1123పోలింగ్ లొకేషన్స్ 416ఓటర్లు 6,07,263పురుషులు 2,89,266మహిళలు 3,17,988ఇతరులు 9జెడ్పీటీసీ రిటర్నింగ్ ఆఫీసర్లు 20+ (4 రిజర్వ్) ఎంపీటీసీ రిటర్నింగ్ ఆఫీసర్లు 70+ (14 రిజర్వ్) జోనల్ ఆఫీసర్లు 70+ (14 రిజర్వ్) -
బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు
జగిత్యాలక్రై ం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. గ్రీవెన్స్‌లో భాగంగా వివిధ ప్రాంతాల 12 మంది దరఖాస్తులు సమర్పించారు. వారితో ఎస్పీ నేరుగా మాట్లాడారు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీకి 3.50 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లోజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వస్తుండటంతో 39 గేట్లను ఎత్తి 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 3.50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. 3.59 లక్షల క్యూసెక్కుల నీటిని వివిధ మార్గాల ద్వారా విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువకు నాలుగు వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4000, సరస్వతి కెనాల్‌కు 400, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. మాజీ ఎంపీపీ రాజేంద్రప్రసాద్ సస్పెండ్ జగిత్యాల: జగిత్యాల రూరల్ మండల మాజీ ఎంపీపీ రాజేంద్రప్రసాద్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. వచ్చే జెడ్పీటీసీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని కోరగా.. తనను ఎవరు రమ్మన్నారంటూ అవమానించి బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. 23 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని, కుట్రతో ఇలా చేశారని, కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీ చించినందుకు తనపై కక్షగట్టారని తెలిపారు. సేవకులకు వేతనాలు పెంపుధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో ఏళ్ల తరబడి వివిధ రకాల సేవలందిస్తున్న తాత్కాలిక సేవకులకు (బోయలు) వేతనాలు పెంచుతూ సోమవారం జీవో జారీ అయింది. ఆలయంలో పనిచేసే 12 మంది తాత్కాలిక సేవకులకు ప్రస్తుతం రూ.14వేల వేతనం వస్తుండగా.. దానిని రూ.17,500 వరకు పెంచుతున్నట్లు జీవో జారీ అయ్యింది. జీవో పత్రాలను మంత్రి అడ్లూరి చేతులమీదుగా పంపిణీ చేశారు. -
విశ్వవిపణిలోకి సింగరేణి
గోదావరిఖని: దసరా పండగకు ముందే ప్రభుత్వం సింగరేణికి శుభవార్త చెప్పింది. ఫ్యూచర్ సిటీలో పదెకరాలు కేటాయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభలో ప్రకటించడంతో ప్రపంచస్థాయి వ్యాపార విస్తరణకు మార్గం సుగమమైనట్లయ్యింది. అయితే, ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తిచేస్తేనే స్థలం అప్పగిస్తామని సీఎం కండిషన్ పెట్టారు. ప్రపంచస్థాయి సంస్థలతో పోటీపడే అవకాశం సింగరేణికి కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మహారత్న కంపెనీలకు దీటుగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సింగరే ణి వరుస లాభాలతో మహారత్న కంపెనీలకు ధీటు గా ముందుకు సాగుతోంది. సుమారు 41వేల మంది పర్మినెంట్, మరో 30వేల మంది కాంట్రాక్టు కార్మికులతో ఏటా 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. దీంతోపాటు సోలార్, థర్మల్ విద్యుత్ రంగాల్లోనూ దూసుకెళ్తోంది. రాబోయే రోజుల్లో వ్యాపారాలను మరింతగా విస్తరించేందుకు యోచిస్తోంది. ఇప్పటికే గోల్డ్, మెటల్ మైన్స్ పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిఉంది. క్లిటికల్ మినరల్ పరిశోధనలోనూ ముందుకెళ్తోంది. రామ గుండం రీజియన్‌లోని మేడిపల్లి ఓసీపీలో హైడ్రోపవర్ ఉత్పత్తికి కూడా ప్రయోగ్మాకంగా సిద్ధమైంది. ఇతర రాష్ట్రాలకూ విస్తరణ.. సింగరేణి తెలంగాణతోపాటు పలురాష్ట్రాల్లో వ్యాపార విస్తరణ కొనసాగిస్తోంది. గోల్డ్, కాపర్ అన్వేషణ కోసం కర్నాటక రాష్ట్రంలోని దేవదుర్గలో పరిశోధనకు లైసెన్స్ పొందింది. ఒడిశా నైనీబ్లాక్‌లో భారీ ప్రాజెక్టు ప్రారంభించి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. పదెకరాల్లో కార్పొరేట్ కార్యాలయం.. సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో ఉంది. కార్పొరేట్ కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. వ్యాపార విస్తరణకు అనుగుణంగా కార్యాలయాన్ని కూడా విస్తరించేందుకు ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం స్థలం కేటాయించినట్లు తెలుస్తోంది. సుమారు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారు. ఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్ కనెక్టివి కల్పించారు. నెట్‌జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీ, వాణిజ్య, వసతి, పారిశ్రామిక, వినోదం ప్రాంతాలు అనుసంధానంగా ఫ్యూచర్ సిటీ ఉంటుంది. అందులో పదెకరాలు కేటాయించడం సింగరేణికి శుభసూచకమని నిపుణులు పేర్కొంటున్నారు. -
‘సానుభూతి’కి నో చాన్స్!
సిరిసిల్ల: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. గతానికి భిన్నంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆశావహులు ఒక్కసారిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గతానికి భిన్నంగా.. గతంలో ముందుగా ఒక్క నోటిఫికేషన్ జారీ అయ్యేది. అయితే ఎంపీటీసీ ఎన్నికలు, లేదా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఏదో ఒక్కటి ముందు జరిగేవి. ఇలా జరగడం మూలంగా ముందుగా వచ్చిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఆ ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించి, దరి దాపుల్లోకి వచ్చి ఓడిపోయినవారు.. మరోసారి వెంటనే వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం ఉండేది. కానీ ఈ సారి శ్రీసానుభూతిశ్రీ చాన్స్ లేకుండానే నేరుగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ వెంటనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫలితంగా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు శ్రీసానుభూతిశ్రీని మూటగట్టుకునే చాన్స్ లేకుండా పోయింది. రెండు ఎన్నికల్లో పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రెండింటికీ పోటీ చేస్తే.. నెగెటివ్ ఫలితాలు వస్తాయని కొందరు భావిస్తున్నారు. మొదటి ఎన్నికల్లో ఓడి.. రెండో ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఈ సారి లేవు. గతంలో చాలా మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి ఓడిపోయి, మళ్లీ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచారు. ముందుగా ఎంపీటీసీగా ఓడిపోయి, తర్వాత సర్పంచ్‌గా గెలిచిన ఘటనలు ఉన్నాయి. ఈ సారి ఆ అవకాశం లేకుండా పోయింది. ఏది ఏమైనా ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. పార్టీ నేతలకు తలపోట్లు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ పరంగా జరుగుతుండగా.. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పార్టీ రహితంగా సాగుతాయి. ఈ నేపథ్యంలో ఒకేసారి అటు ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను ఆయా పార్టీ నేతలు ఎంపిక చేయాల్సి వస్తుంది. రెండు వేర్వేరుగా నోటిఫికేషన్లు వస్తే.. ఆయా పార్టీలకు కొంత సమయం దొరికి అభ్యర్థుల ఎంపిక సులభంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఏకకాలంలో ఎన్నికలు రావడంతో ఒక్క ఊరిలో ఎంపీటీసీ అభ్యర్థిని, సర్పంచ్ అభ్యర్థిని, మండల స్థాయిలో జెడ్పీటీసీ అభ్యర్థిని, మళ్లీ గ్రామస్థాయిలో వార్డు సభ్యులను ప్యానల్‌గా నిలపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అన్ని పార్టీలకు ఈ జమిలి నోటిఫికేషన్ తలనొప్పిగా మారింది. రెండు విడతల్లో ఎంపీటీసీ, మూడు విడతల్లో సర్పంచ్ రెండు విడతల్లో ఎంపీటీసీ, మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబరు 11న నామినేషన్లు వేసేందుకు చివరి రోజు కాగా, అక్టోబరు 23న ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత ఎన్నికలకు అక్టోబరు 15న నామినేషన్లకు చివరి రోజు. 27న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు నవంబరు 11న వెలువడుతాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాల కోసం పక్షం రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది. అదే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు అక్టోబరు 31, నవంబరు 4, 8వ తేదీల్లో మూడు విడతల్లో పూర్తి కానున్నాయి. ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రమే ఫలితాలు వెలువడుతాయి. మొత్తంగా ఒకేసారి స్థానిక సంస్థల ఎన్నికలు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను జారీ చేస్తూ ఎన్నికల కోడ్‌ను అమలులోకి తెచ్చింది. ‘స్థానిక’ంలో ఒకే దఫా అన్ని ఎన్నికలు ఓడి, గెలిచేందుకు అవకాశమే లేదు వరుసగా ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు -
అస్వస్థతకు గురైన ఉపాధ్యాయుడు మృతి
పెగడపల్లి: మండలంలోని నామాపూర్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) ఐలయ్య (38) చికిత్స పొదుతూ మృతి చెందాడు. ఈనెల 25న మల్యాలలో జరిగిన ఎన్నికల శిక్షణలో పాల్గొన్న ఆయన అక్కడే అస్వస్థతకు గురయ్యాడు. అతడిని చికిత్స నిమిత్తం జగిత్యాలలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఐలయ్యకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఐలయ్య మృతిపై తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బోనగిరి దేవయ్య, బోయినపల్లి ప్రసాద్‌రావు సానుభూతి తెలిపారు. ఐలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. పోతారంలో వివాహిత అదృశ్యంమల్యాల: మండలంలోని పోతారానికి చెందిన దాసరి లత అదృశ్యమైనట్లు ఆమె భర్త రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు. రవీందర్ ఈనెల 25న మర్రిపల్లిలో ఉన్న తన కూతురు ఇంటికి కొడుకుతో కలిసి వెళ్లాడు. కొద్దిసేపటికే ఆయన భార్య లత ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో రవీందర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంథనిరూరల్: పట్టణంలోని ఓ ఫెర్టిలైజర్ షాప్‌నుంచి అక్రమంగా తరలిస్తున్న యూరియాను అడవిసోమన్‌పల్లి చెక్‌పోస్ట్ వద్ద అధికారులు పట్టుకున్నారు. యూరియా అక్రమ రవాణాను నియంత్రించేందుకు అడవిసోమన్‌పల్లి వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. అయితే, సోమవారం ఓ మినీ వాహనంలో సుమారు 50 యూరియా బస్తాలు తరలిస్తుండగా సిబ్బంది తనిఖీ చేశారు. వాహనాన్ని అదుపులోకి తీసుకుని మంథనికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సదరు యజమానికి జరిమానా విధించారు. ఇందిరమ్మ చీరలు ఎక్కడ?● ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ● బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కిన అనంతరం ప్రజలను విస్మరిస్తోందని, ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని, రూ.800 బతుకమ్మ చీరలు ఎక్కడిచ్చారని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు ప్రశ్నించారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు తండ్రిలాంటి కేసీఆర్‌ను తిట్టడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రూ.4 వేల పెన్షన్, రైతులకు బోనస్ వంటి ఎన్నో హామీలిచ్చి ఒక్కటీ సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో ప్రజలు బుద్ది చెప్పాలని కోరారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఎక్కడ అని ప్రశ్నించారు. మాజీ కౌన్సిలర్ దేవేందర్‌నాయక్, ప్రధాన కార్యదర్శి ఆనందరావు, ఉపాధ్యక్షుడు వొల్లం మల్లేశం, నాయకులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు మెట్పల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్‌కు స్థానిక ఎన్నికల్లో భంగపాటు తప్పదని విద్యాసాగర్‌రావు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. నాలుగు మండలాల నాయకులు పాల్గొన్నారు. వారికి పలు సూచనలు చేశారు. ఐక్యంగా పని చేస్తే అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని పేర్కొన్నారు. -
ఎకై ్సజ్ ఎస్సై నుంచి ఎంపీడీవో వరకు..
చిగురుమామిడి: కొండాపూర్ గ్రామానికి చెందిన బింగి సాయికీర్తన ఎంపీడీవో ఉద్యోగం సాధించారు. సీఎం రేవంత్‌రెడ్డి నుంచి నియామకపుపత్రం అందుకున్నారు. హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమె.. గ్రూపు– 2 ద్వారా ఎకై ్సజ్ ఎస్సైగా ఉద్యోగం సాధించారు. అంతటితో ఆగకుండా గ్రూప్–1 పరీక్ష రాసి ఎంపీడీవోగా ఎంపికయ్యారు. నిజామాబాద్‌లో బీడీఎస్ పూర్తిచేసి.. ఏడాదిపాట ప్రాక్టీస్ చేసినా సంతృప్తి చెందలేదలేదు. ఏడాదిపాటు ఆన్లైన్లో శిక్షణ తీసుకుని పరీక్ష రాసి.. ఎంపీడీవో ఉద్యోగం సాధించారు. సాయికీర్తన తల్లిదండ్రులు సరోజన– సంపత్‌కు సాయికీర్తనకు ఒక తమ్ముడు ఉన్నాడు. -
పక్షవాత బాధిత కుటుంబానికి రూ.1.23 లక్షలు
ధర్మపురి: ఒక వైపు పేదరికం.. మరోవైపు పక్షవా తం రావడంతో ఓ నిరుపేద ఇంటికే పరిమితమయ్యాడు. ఆ బాధితుడిని ఆదుకునేందుకు ఫేస్బుక్ మిత్రులు రూ.1.23 లక్షలు సాయం అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ధర్మపురికి చెందిన సంకు రాజశేఖర్ బీడీ కంపెనీలో కార్మికుడిగా పనిచేసేవాడు. చిన్న అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రెండేళ్ల క్రితం అప్పు చేసి కూతు రు వివాహం చేశాడు. ఏడు నెలల క్రితం పక్షవాతం బారిన పడడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఇంటి అద్దె, కుటుంబ ఖర్చులు భారంగా మారడంతో వైద్యానికి దూరమయ్యాడు. ఆయన దీనస్థితిని తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకు డు రేణికుంట రమేశ్ ఈనెల 4న ఫేస్బుక్లో పోస్టు చేశారు. బాధితుడికి సాయం అందించాలని కోరారు. స్పందించిన ఎన్నారైల మిత్రులు రాజశేఖర్ భార్య భూలక్ష్మి బ్యాంకు ఖాతాకు రూ.1.23 లక్షలు విరాళాలుగా పంపించారు. ప్రస్తుత వైద్యం, ఇతర ఖర్చుల కోసం రూ.23వేలను స్థానిక ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ దిలీప్ చేతుల మీదుగా ఆమెకు అందించారు. మిగిలిన డబ్బులను భూలక్ష్మి బ్యాంకు ఖాతాలో జమ చేశామని రమేశ్ తెలిపారు. -
దుబాయ్‌లో బతుకమ్మ సంబరాలు
రాయికల్: దుబాయ్‌లో ఈటీసీఏ ఆధ్వర్యంలో అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్ బతుకమ్మ సంబరాలు నిర్వహించింది. యూఏఈలోని వివిధ ప్రాంతాలకు చెందిన 5 వేల మంది ప్రవాసీలు వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు పీచర్ల కిరణ్‌కుమార్, అధ్యక్షుడు చీటి జగదీశ్వర్‌రావు, జనరల్ సెక్రటరీ కోట్ల రాణి, ఉపాధ్యక్షుడు అలిగేటి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరి శేఖర్‌గౌడ్, కోశాధికారి తిరుమల్ పాల్గొన్నారు. దుర్గమ్మకు బోనమెత్తిన భవానీలుధర్మపురి: దుర్గా నవరాత్రోత్సవాల సందర్భంగా భవానీలు ధర్మపురిలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. సోమవారం సాయంత్రం దుర్గమ్మ బోనాలతో శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం నుంచి నందీకూడలి మీదుగా శోభాయాత్రగా వెళ్లారు. ఉదయం రుద్రాభిషేకం, సరస్వతీపూజలు చేశారు. -
అబుదాబిలో పూలపండుగ
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): అబుదిబిలోని తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. ఇండియా అండ్ సోషల్ కల్చర్ వేదికగా తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యలో ఉత్సవాలు నిర్వహించారు. యుఏఈలోని భారత రాయబార కార్యాలయం నుంచి ఫస్ట్ సెక్రటరీ కమ్యూనిటీ వెల్ఫేర్ కో ఆర్డినేషన్ జార్జీజార్జ్ ముఖ్య అథితిగా హాజరయ్యారు. ప్రతినిధులు జయచంద్రన్ నాయర్, షాజీ వీకే, సర్వోత్తమ్ శెట్టి, విజయ్ మానె, దివాకర్ ప్రసాద్, వినాయక్ అవాటె తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ కవి, గాయకుడు కోకిల నాగరాజు, యువగాయని సోని యాదర్ల బతుకమ్మ ఆటాపాటలతో ఉర్రూతలూగించారు. ఉత్సవ నిర్వాహకులు రాజా శ్రీనివాస్‌రావు, గంగారెడ్డి, వంశీ, సందీప్, గోపాల్, సతీశ్, పావని, అర్చన, దీప్తి, పద్మజ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
చెత్త కుప్పల్లో ఫోర్టిఫైడ్ రైస్
వెల్గటూర్: ప్రజలకు బలవర్ధకమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పంపిణీ చేసిన ఫోర్టిఫైడ్ రైస్‌ను గుర్తు తెలియని వ్యక్తులు మండలకేంద్రంలోని పెద్దవాగు పక్కన చెత్త కుప్పల్లో పడేసి వెళ్లిన ఘటన చర్చనీయాంశమైంది. సుమారు 50కి పైగా ఫోర్టిఫైడ్ రైస్ సంచులను పడేసి వెళ్లారు. ప్రభుత్వం సరఫరా చేసే రేషన్‌లో ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఐరన్, పోలిక్ యాసిడ్, విటమిన్ బీ–12 పుష్కలంగా ఉంటాయి. ఇందుకోసం మిల్లర్లకు ఫోర్టిఫైడ్ రైస్‌ను ప్రభుత్వమే అందిస్తుంది. బియ్యాన్ని మూడు నెలలవరకు మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయమై తహసీల్దార్ శేఖర్‌ను వివరణ కోరగా.. గడువు ముగిసిన బియ్యాన్ని ఎవరో మిల్లర్లు ఇక్కడ పడేసి ఉంటారని తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించామని, బియ్యం బహిరంగ ప్రదేశంలో పడేయడం ద్వారా పశువులు, ఇతర జీవులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని, జేసీబీతో గుంత తవ్వి అందులో పూడ్చి పెట్టామని తెలిపారు. -
వేధించినందుకే యువకుడి హత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో ఈనెల 27న ఎదురుగట్ల సతీశ్ (28) హత్యకు గురైన విషయం తెల్సిందే. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని సతీశ్ వేధించినందుకే యువతి బంధువులు హత్య చేసినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. రూరల్ సీఐ కార్యాలయంలో నిందితుల వివరాలు వెల్లడించారు. రేచపల్లికి సతీశ్ 20రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ యువతితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమెను తన ప్రేమికురాలని, ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోవద్దంటూ పోస్ట్ చేశాడు. దీంతో ఆగ్రహించిన ఆమె కుటుంబ సభ్యులు ఈనెల 27న రాత్రి 7.30 గంటల సమయంలో ఇంట్లో ఉన్న సతీశ్‌ను బయటకు తీసుకొచ్చి కారంపొడి చల్లి కర్రలతో తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితులను అదే గ్రామానికి చెందిన నాంతారి వినాజీ, నాంతారి శాంత, జలగా గుర్తించామని, సోమవారం 10 గంటల ప్రాంతంలో రేచపల్లిలో వారిని పట్టుకుని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఓ మైనర్ పరారీలో ఉన్నాడని వివరించారు. నిందితుల నుంచి రక్తపు మరకల దుస్తులు, హత్యకు ఉపయోగించిన కర్రలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన రూరల్ సీఐ సుధాకర్, సారంగాపూర్ ఎస్సై గీతను అభినందించారు. పరారీలో మైనర్ డీఎస్పీ రఘుచందర్ వెల్లడి -
సరస్వతీమాతగా అమ్మవారు
గరత్మంతుని వాహనంపై లక్ష్మీనృసింహుడుమల్యాల: దేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా సోమవారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సరస్వతీ అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు జితేంద్ర స్వామి, రామచంద్ర ప్రసాద్ ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ధర్మపురి: శరన్నవరాత్రోత్సోవాల సందర్భంగా సోమవారం సాయంత్రం యోగ, ఉగ్ర శ్రీలక్ష్మీనృసింహస్వాములను గరత్మంతుని వాహనంపై ఊరేగించారు. దారి పొడవునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. మహాగౌరిగా అమ్మవారుధర్మపురి: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారు సోమవారం మహాగౌరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో 8వ రోజు చండీపారాయణం, దేవి భాగవత పారాయణం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆలయ ఈవో శ్రీనివాస్, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ జక్కు రవీందర్ తదితరులు హాజరయ్యారు. -
ఒక్కేసి పువ్వేసి చందమామ..
జగిత్యాలటౌన్/జగిత్యాలరూరల్/కోరుట్ల/సారంగాపూర్/ పెగడపల్లి/మల్యాల:ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్కజాములాయే చందమామ.. అంటూ మహిళలు బతుకమ్మ ఆడిపాడారు. ఉదయమే లేచి రంగురంగుల పూలతో బతుకమ్మ పేర్చి సాయంత్రం కూడళ్లలో ఆడుకున్నారు. అనంతరం ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. జిల్లాకేంద్రంలోని ధరూర్ క్యాంపు రామాలయం, మోతె చెరువు, చింతకుంట చెరువు, కండ్లపల్లి చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. పోయిరా గౌరమ్మా.. మళ్లీ రావమ్మా.. అంటూ వీడ్కోలు పలికారు. -
‘టెట్’ టెన్షన్
జగిత్యాల: ప్రభుత్వ ఉపాధ్యాయులకు టీచర్ ఎల్జిబిలిటి టెస్ట్ (టెట్) టెన్షన్ పట్టుకుంది. 2010కు ముందు ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులు టెట్ రాసి అర్హత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో వారిలో అలజడి మొదలైంది. దీనికి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు కోరుతున్నారు. ఐదేళ్లకు పైబడి సర్వీస్, ఇన్ సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్ ఉత్తీర్ణులు కాని పక్షంలో ఉద్యోగం వదులుకోవాల్సిందేనన్న భయాందోళన మొదలైంది. ఉపాధ్యాయులుగా కొనసాగడానికి, పదోన్నతులకు కూడా టెట్ తప్పనిసరి అని చెప్పడంతో రెండేళ్లలో ఉత్తీర్ణత సాధించకుంటే ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. ఉద్యోగ విరమణకు ఐదేళ్ల సమయం ఉన్న టీచర్లకు మినహాయింపు ఇచ్చినప్పటికీ వారికి పదోన్నతి రావాలంటే టెట్ రాయాల్సి ఉంటుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం టెట్ తప్పనిసరి చేశారు. 2008 నుంచి డీఎస్సీ రాయాలంటే టెట్ అర్హత తప్పనిసరి ఉంది. అంతకుపూర్వమే ఎంపికై న ఉపాధ్యాయులకు కూడా టెట్ అర్హత ఉండాల్సిందేనని నిబంధనలు రావడంతో ఉపాధ్యాయులు తర్జనభర్జన పడుతున్నారు. చాలా మంది ఉపాధ్యాయులు జిల్లాలో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో సుమారు నాలుగు వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో సుమారు రెండు వేలకు పైగా ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించాల్సిన వారున్నారు. సీనియర్ ఉపాధ్యాయులు, చాలాకాలం నుంచి పాఠశాలలో బోధన చేస్తున్న వారు ఆరోగ్య సమస్యలు, ఇంటి బాధ్యతల వంటి కారణాలతో ఈ పరీక్షలకు హాజరుకావడం ఇబ్బందేనని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పునరాలోచించాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు కోరుతున్నారు. టెట్ అర్హతపై సడలింపులు, లేదా ప్రత్యామ్నాయ పరిష్కారం చూపాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఎప్పుడో చదివిన ఉపాధ్యాయులు2008 డీఎస్సీ నుంచి టెట్ తప్పనిసరి చేశారు. అప్పుడు చాలా మంది ఉపాధ్యాయులు టెట్‌లో అర్హత సాధించి ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. కానీ.. ఎప్పుడో ఉపాధ్యాయులుగా చేరిన వారికి ఇప్పుడు టెట్ రాయాలంటే ఇబ్బందికరంగానే ఉంటుంది. టెట్‌లో అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. ఒక్కో సబ్జెక్ట్‌కు ఒక ఉపాధ్యాయుడు ఉంటారు. ఉదాహరణకు మ్యాథ్స్ ఉపాధ్యాయుడు టెట్ రాయాలంటే అతనికి అన్ని సబ్జెక్ట్లపై అవగాహన ఉండాలి. టెట్‌లో అర్హత సాధించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. -
ఏటా రూ.250 పెంచాలి
ఏటా వరి పంటకు ఉన్న ధరలకు అదనంగా కనీసం రూ.250వరకు పెంచితేనే రైతులకు న్యాయం జరుగుతుంది. ఏటా రూ.50, రూ.100 పెంచుకుంటే వెళ్తుంటూ రైతులకు పెద్దగా లాభం చేకూరదు. కొంతమొత్తం పెరిగిందో.. లేదో కూలీల ఖర్చు రెట్టింపవుతోంది. – నక్కల తిరుపతి రెడ్డి, తొంబరావుపేట రైతులు పెట్టిన పెట్టుబడికి రెండింతల ఆదాయం రావాలి. అప్పుడే రైతులు నిలదొక్కుకునే అవకాశం ఉంది. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు ధరలు పెరగడం లేదు. రైతులు పెడుతున్న ఖర్చుకు అనుగుణంగా ధరలు పెంచితేనే వ్యవసాయం చేసే పరిస్థితి ఉంది. – ఎల్లాల జలపతిరెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు -
‘సద్దుల’ సందడి
సద్దుల బతుకమ్మ సందర్భంగా ఆదివారం మార్కెట్లో సందడి నెలకొంది. గుమ్మడి, తంగేడు, గునుగు, బంతి, కలువ పూలు, పండ్లు, రంగుల కొనుగోలులో మహిళలు బిజీబిజీ అయ్యారు. అలాగే బతుకమ్మల నిమజ్జనం కోసం జగిత్యాల బల్దియా యంత్రాంగం 18 చోట్ల ఘాట్లు ఏర్పాటు చేసింది. రామాలయం, బసవేశ్వర కూడలి, పొన్నాల గార్డెన్స్, లింగంపేట చెరువు, ధర్మసముద్రం, వీక్లీబజార్ స్కూల్ సమీపంలో, చిలుకవాడ, గొల్లపల్లి రోడ్, కండ్లపల్లి చెరువు, శంకులపల్లి చౌరస్తా, ముప్పారపు చెరువు వద్ద రెండు ఘాట్ల చొప్పున ఏర్పాట్లు చేశారు. ఘాట్ల వద్ద లైటింగ్ తదితర సదుపాయాలు కల్పించారు. – జగిత్యాలటౌన్ -
దంత వైద్యుడి పోస్టు ఖాళీ
రాయికల్: రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రికి దంతవైద్యుడి పోస్టు మంజూరైంది. ఇక్కడ పనిచేసిన వైద్యురాలిని జిల్లా కేంద్రానికి డిప్యూటేషన్‌పై పంపించారు. దీంతో స్థానిక ఆస్పత్రిలో దంతవైద్యం అందకుండాపోతోంది. ఫలితంగా పట్టణంతోపాటు మండలంలోని 32 గ్రామాల బాధితులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన ప్రవీణ్‌చంద్ర మోర్తాడ్‌కు బదిలీ అయ్యారు. ఆ స్థానంలో కోరుట్లకు చెందిన లావణ్య రెగ్యులర్ పోస్టుపై వచ్చారు. ఆస్పత్రిలో దంత వైద్యానికి సంబంధించిన పరికరాలన్నీ ఉన్నాయి. అయితే లావణ్యను డిప్యూటేషన్‌పై జిల్లా కేంద్రానికి బదిలీ చేశారు. అప్పటినుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో దంత సమస్యలతో బాధపడుతున్నవారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మాజీమంత్రి జీవన్‌రెడ్డి స్పందించి రాయికల్ ఆస్పత్రికి దంత వైద్య పోస్టు భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
మినహాయింపు ఇవ్వాలి
సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితుల్లో టెట్ రాయాలంటే ఇబ్బందే. ప్రమోషన్లకు దగ్గరగా చాలామంది ఉపాధ్యాయులున్నారు. ఇప్పుడు రాయాలంటే కష్టగా ఉంటుంది. మినహాయింపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. – మచ్చ శంకర్, ఉపాధ్యాయుడు ప్రభుత్వం చొరవ చూపాలి ఉపాధ్యాయుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. టెట్ వల్ల చాలామంది ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయులందరూ టెట్ రా యాలంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. – అమర్నాథ్రెడ్డి, పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి -
అల్లీపూర్ మండలం ఏర్పాటు సీఎం దృష్టికి
రాయికల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫాం ఇచ్చే అవకాశం వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 69శాతం సీట్లు కేటాయిస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని కిష్టంపేట నుంచి చల్గల్, అల్లీపూర్ నుంచి శ్రీరాంనగర్, చెర్లకొండాపూర్ నుంచి మైతాపూర్, ఇటిక్యాల మోడల్‌స్కూల్ వరకు, చింతలూరు నుంచి బషీర్పల్లె వరకు రూ.6.30కోట్లతో బీటీ రోడ్డు పనులకు ఆదివారం భూమిపూజ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి నియోకవర్గ అభివృదికి నిరంతరం కృషిచేస్తానన్నారు. బీఫాం ఇచ్చే అవకాశం వస్తే ఆయా సామాజికవర్గాలకు 69 శాతం సీట్లు కేటాయిస్తానన్నారు. అల్లీపూర్‌ను మండలం చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. సింగిల్‌విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, డీటీ రాజరెడ్డి, ఎంపీడీవో చిరంజీవి, డీఈ మిలింద్, ఏఈ ప్రసాద్, నాయకులు మోర హన్మాండ్లు, గన్నె రాజరెడ్డి, అచ్యుత్‌రావు, కోల శ్రీనివాస్, పడిగెల రవీందర్‌రెడ్డి, కాటిపెల్లి గంగారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేణు, ఆదిరెడ్డి, దేవుని రవి పాల్గొన్నారు ఆలయాల అభివృద్దికి కృషి జగిత్యాలరూరల్: ఆలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. పొలాసలోని పౌలేస్తేశ్వర స్వామి ఆలయంలో ధర్మకర్తల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ధర్మకర్తల్లో ముగ్గురు పొలాస వాసులు ఉన్నారని తెలిపారు. దామోదర్ రావు, పాలెపు రాజేంద్రప్రసాద్, ధర్మకర్తలు భూమన్న, సత్యనారాయణ, కొండాల్‌రావు, రాజయ్య, వినిత, డాక్టర్ నాగరాజు పాల్గొన్నారు. -
రైతులకు స్వల్ప ఊరట
జగిత్యాలఅగ్రికల్చర్: వివిధ పంటలకు కేంద్రప్రభుత్వం మద్దతు ధరను స్వల్పంగా పెంచింది. ఏటా మాదిరిగానే 22 రకాల పంటలకు ధరలు ప్రకటించింది. ఈ ధరలు ప్రస్తుత వానాకాలం సీజన్ నుంచే రైతులకు అందించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపుతో జిల్లాలో అత్యధికంగా సాగు చేసే వరి, మొక్కజొన్న రైతులకు లబ్ధి చేకూరనుంది. రూ.2,389కి చేరిన క్వింటాల్ ధాన్యం మొన్నటివరకు వరి ధాన్యం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,320గా ఉంది. ప్రస్తుతం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.69 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన ఇకనుంచి రైతుకు రూ.2,389 అందనుంది. అలాగే కామన్ రకం రూ.2,300 నుంచి రూ.2,369కి పెరిగింది. జిల్లాలో వానాకాలం సీజన్లో 3.10 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఈసారి పురుగులు, తెగుళ్ల బెడద పెద్దగా లేకపోవడంతో సగటున ఎకరాకు 23 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుందని అంచనా. ఈ మేరకు 71.30 లక్షల క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. మొన్నటివరకు ఉన్న ధర రూ.2,320 ప్రకారం రైతులకు రూ.1,654కోట్లు వస్తే.. పెరిగిన ధర రూ.2,389 ప్రకారం రూ.1,703 కోట్లు రానున్నాయి. రైతులకు అదనంగా రూ.49 కోట్లు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. మొక్కజొన్నకు రూ.175 పెంపు మొక్కజొన్న పంట ఇప్పుడిప్పుడే చేతికొస్తోంది. క్కజొన్నను జిల్లాలో దాదాపు 35 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఎకరాకు సగటున కనీసం 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన 8.75లక్షల క్వింటాళ్లు దిగుబడి రానుంది. మొన్నటివరకు క్వింటాల్‌కు రూ.2,225 ఉండగా.. ప్రస్తుతం రూ.175 పెంచి రూ.2400గా నిర్ణయించారు. ఓపెన్ మార్కెట్లో మొక్కజొన్నకు డిమాండ్ ఉండటంతో క్వింటాల్‌కు రూ.2600 నుంచి రూ.మూడువేల వరకు పలుకుతోంది. ఓపెన్మార్కెట్లో ధర లేనప్పుడు ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి.. మద్దతు ధర చెల్లించడం ద్వారా రైతులకు లాభం జరిగే అవకాశం ఉంది. గతంలో జిల్లా మొక్కజొన్న రైతులకు రూ.194.68 కోట్ల వరకు రాగా.. ఈ ఏడాది పెరిగిన ధరలతో రూ.210.00 కోట్లు రానుంది. మొత్తంగా రైతులకు రూ.15.32కోట్ల లబ్ధి చేకూరనుంది. గుడ్డిలో మెల్లగా.. పెరుగుతున్న పెట్టుబడుల నేపథ్యంలో మద్దతు ధర పెంపు కొంతమేర ఊరట నిచ్చినా.. సాగు ఖర్చులకు అనుగుణంగా ధరలు పెరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడికి అనుగుణంగా మద్దతు ధరలు ప్రకటించాల్సి ఉండగా.. కేంద్రం నామమాత్రంగా పెంచుతోందనే విమర్శలు ఉన్నాయి. మద్దతు ధరలను నిర్ణయించే కేంద్ర వ్యవసాయ ధరల నిర్ణాయక కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి.. రైతుల నుంచి సాగు ఖర్చుల వివరాలు తీసుకుంటే కొంత మేలు జరిగేది. గతంలో ఉన్న ధరలకే కొంత కలిపి ఇస్తుండటంతో సాగు ఖర్చులు, రైతులకు వచ్చే ఆదాయానికి పొంతన లేకుండా పోతోంది. ఇవేవీ పట్టించుకోకుండా ధరల నిర్ణాయక కమిషన్ సిద్ధం చేసిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా అమలు చేయడంతో రైతులకు అంతంతమాత్రంగానే లాభం చేకూరుతోంది. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సాగు ఖర్చుకు రెట్టింపు ఆదాయం రావాల్సి ఉండగా.. కనీసం సాగు ఖర్చులు కూడా రావడం లేదు. -
కోయలేక పోతున్నం
మొక్కజొన్న పంట కోతకు వచ్చింది. వర్షాలతో కోయలేక పోతున్నాం. కర్రలు కుళ్లిపోయి పసుపు పంటపై పడుతున్నాయి. ఈసారి రామచిలుకలు, కోతులు సగం నష్టపర్చాయి. వర్షాలు మరింత నష్టపరుస్తున్నాయి. సాగు కష్టంగా మారింది. – కోల నారాయణ, చల్గల్ ఆరబెట్టలేకపోతున్నం మొక్కజొన్నను అతికష్టం మీద కోసినప్పటికీ వర్షాలతో ఆరబెట్టలేకపోతున్నాం. కంకులపై ఉండే బూరును కూడా తీయలేకపోతున్నాం. కంకులను కుప్పగా పోయడంతో గింజలు బాగా నాని మొలకలు వస్తున్నాయి. రైతుల పరిస్థితి ఘోరంగా తయారైంది. – క్యాతం శ్యామల, సింగరావుపేట, రాయికల్ మండలం -
సాంకేతికతతో ఉపాధి అవకాశాలు మెరుగు
జగిత్యాల: సాంకేతికతతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ప్రభుత్వం యువతకు గ్లోబల్‌స్థాయి నైపుణ్యాలు అందించడమే లక్ష్యమని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను ఎమ్మెల్యే సంజయ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టాటా టెక్నాలజీ లిమిటెడ్ భాగస్వామ్యంతో సుమారు రూ.45 కోట్ల విలువైన ఆధునిక యంత్ర పరికరాలు విద్యార్థుల శిక్షణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. టెక్నాలజీ అవసరం కాబట్టి ఆధునికత సాంకేతిక విద్య అవసరమని, అందుకే ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి జిల్లాలో ఇలాంటి కేంద్రాన్ని ఏర్పా టు చేస్తామన్నారు. యువత ఈ కోర్సుల్లో చేరి ఉపాధి అవకాశాలు పొందాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో యువత ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారని, మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్‌ను కోరగానే ఏటీసీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 125 మంది విద్యార్థులకు ఇందులో శిక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్.లత, ప్రిన్సిపల్ రవీందర్, తహసీల్దార్ వరందన్ పాల్గొన్నారు. బుగ్గారం అభివృద్ధికి కట్టుబడి ఉంటా.. బుగ్గారం: బుగ్గారం మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉంటానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దుర్గమాతాకు అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. గౌడ కులస్తులకు కాటమయ్య కిట్లను అందించారు. మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందన్నారు. -
పేదల సొంతింటి కల తీరుతోంది
జగిత్యాలరూరల్: పేదల సొంతింటి కల సాకా రం అవుతోందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం కండ్లపల్లి లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. నియోజకవర్గానికి 3 వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, కండ్లపల్లిని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిందని తెలిపారు. ఇళ్లు నిర్మించుకున్న లబ్ధి దారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తోందని తెలిపారు. అదనపు కలెక్టర్ లత, హౌసింగ్ పీడీ ప్రసాద్, తహసీల్దార్ వరందన్, డీఈ భాస్కర్, సీఐ సుధాకర్, కార్యదర్శి మహేశ్ పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. పొలాసలో రూ.20 లక్షల నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ.21లక్షల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టే పనులకు భూమిపూజ చే శారు. డీఈ మిలింద్, తహసీల్దార్ వరందన్, మా జీ సర్పంచులు,ఏఎంసీ మాజీ చైర్మన్లు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘ అభివృద్ధికి కృషి రాయికల్: పట్టణంలోని విశ్వబ్రాహ్మణ సేవ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. సంఘం అధ్యక్షుడిగా మానాల వెంకటి ఎన్నికకాగా.. అభినందించారు. సంఘం అభివృద్ధికి కృషి చేయాలని వెంకటి ఎమ్మెల్యేను కోరగా సానుకూలంగా స్పందించారు. మహేందర్‌బాబు, అజయ్ ఉన్నారు. పల్లె దవాఖానాలతో మేలుసారంగాపూర్: పల్లె దవాఖానాలతో ఇంటిముందుకు వైద్యం చేరిందని ఎమ్మెల్యే అన్నారు. బీర్పూర్ మండలం తాళ్లధర్మారంలో రూ.20లక్షలతో నిర్మించిన పల్లెదవాఖానా ప్రారంభించారు. 14 మందికి రూ.3.58 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. -
ముంచుతున్న ముసురు
జగిత్యాలఅగ్రికల్చర్: మొక్కజొన్న పంట కోతకు వచ్చింది. 15 రోజులుగా ప్రతిరోజూ వర్షం కురుస్తుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో మొక్కజొన్న చేనుల్లో నీరు నిలిచిపోయింది. ఆ నీటిని తొలగించేందుకే నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉంది. పంటను కోయలా..? వద్దా అని రైతులు అయోమయంలో పడుతున్నారు. మరికొందరు రైతులు పంటను కోసినప్పటికీ ఆరబెట్టేందుకు నానా తిప్పలు పడుతున్నారు. తడిసిముద్ద జిల్లాలో రెండో ప్రధాన పంటగా మొక్కజొన్నను సుమారు 35వేల ఎకరాల్లో సాగు చేస్తారు. ఆ పంట కోతకు రావడం.. ప్రతిరోజు వర్షం కురవడంతో కో త ఇబ్బందిగా మారింది. కోసిన చొప్ప తడిసి కుళ్లి పోయే పరిస్థితి నెలకొంది. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పల్లి వంటి ప్రాంతాల్లో సాగు చేసిన మొక్కజొన్నను కోసి ఆరబెట్టారు. వర్షానికి తడిసిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. సో యాబీన్, పెసర, కంది వంటి పంటలైతే దిగుబడి వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో రైతులు దున్ని కొత్తగా పంట వేసే పరిస్థితి నెలకొంది. అంతరపంటగా పసుపు పసుపులో అంతరపంటగా మొక్కజొన్న సాగు చేస్తారు. వర్షాలకు నీరు నిలవడంతో తేమ ఆరిపోయేవరకూ మొక్కజొన్నను కోయలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే జరిగితే మొక్కజొన్న పసుపుపై పడిపోయి పంట దెబ్బతినే అవకాశం ఉంది. కోసిన కంకులను కుప్పపోస్తే.. వర్షానికి నాని మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మొత్తంగా కోతల వేళ వర్షాలు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. డిమాండ్ ఉన్నా.. దిగుబడి అంతంతే.. మొక్కజొన్నకు పౌల్ట్రీ పరిశ్రమ నుంచి డిమాండ్ ఉంది. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2400 ఉండగా.. ఓపెన్ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.2800 నుంచి రూ.3000 వరకు ఉంది. ఈ ఏడాది తొలిదశ కత్తెర పురుగు దెబ్బతీసింది. గింజ దశలో కోతులు, రామచిలుకలు, అడవి పందులు దెబ్బతీశాయి. ఫలితంగా ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి ఆశిస్తే 15 నుంచి 20 క్వింటాళ్లు వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. -
కొండా లక్ష్మణ్‌ను తెలంగాణ జాతిపితగా గుర్తించాలి
జగిత్యాలటౌన్: రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి మరువలేనిదని, పదవా..? ప్రాంతమా..? అంటే ప్రాంతమే ముఖ్యమన్న తొలితరం ఉద్యమకారుడైన లక్ష్మణ్‌ను జాతిపితగా గుర్తించాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ 109వ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రలోని బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దశాబ్దాల పోరాటానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన బాపూజీ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. నాయకులు కల్లెపెల్లి దుర్గయ్య, ఎలి గేటి నర్సయ్య, ఒల్లాల గంగాధర్ పాల్గొన్నారు. -
స్థానిక సందడి షురూ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. గత కొన్ని నెలలుగా గ్రామాల వారీగా ఎదురుచూస్తున్న ఆశావహుల ఉత్కంఠకు తెరపడింది. కలిసొచ్చినా రిజర్వేషన్‌తో పలువురు సంబరాలు జరుపుకోగా, మరికొందరు నిరాశలో మునిగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేయగా, దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం స్థానిక ఎన్నికల కసరత్తును పూర్తి చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా, బీసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన ఆధారంగా డెడికేటెడ్ కమిటీ సిఫార్సులను అనుగుణంగా 42శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీంతో గతంలో కన్నా అన్ని స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిథ్యం పెరిగింది. ఎన్నికల పక్రియలో భాగంగా శనివారం తొలుత ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్స్‌కు రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో ఖరారు చేయగా, మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఆయా కలెక్టరేట్లలో వివిధ రాజకీయపక్షాల సమక్షంలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు లాటరీ పక్రియ ద్వారా నిర్ణయించారు. పూర్తిస్థాయిలో రిజర్వేషన్లు కేటాయింపులు పూర్తాకాగానే జిల్లాలవారీగా రిజర్వేషన్ల గెజిట్‌ను ఆయా జిల్లా కలెక్టర్లు విడుదల చేయనున్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో రిజర్వేషన్లు ఖరారు చేస్తుండటంతో తమ గ్రామంలో, తమ మండలంలో ఎంపీపీ ఏవరికి కేటాయించరో తెలుసుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. తమకు రిజర్వేషన్ అనూకూలించని వారు తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దించాలనే దిశగా పావులు కదుపుతున్నారు. త్వరలో స్థానిక ఎన్నికల నగారా మోగనుండటంతో పల్లెల్లో రాజకీయం వెడేక్కింది. రెండు మహిళలకు... ఎస్సీ, బీసీలకు ఒక్కోటి పెద్దపల్లి, జగిత్యాల జెడ్పీ చైర్మన్ స్థానాలను జనరల్ మహిళలకు కేటాయించగా, కరీంనగర్ జెడ్పీస్థానం బీసీ జనరల్‌కు, సిరిసిల్ల జెడ్పీ పీఠంను ఎస్సీ జనరల్‌కు కేటాయిస్తూ శనివారం రాత్రి పంచాయితీరాజ్‌శాఖ అధికారికంగా గెజిట్ విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని నాలుగు జెడ్పీ చైర్మన్లలో రెండు మహిళలకు, ఎస్సీ, బీసీలకు ఒక్కోటి కేటాయించినట్లయింది. మొదలైన ఆశావహుల సందడి.. జెడ్పీటీసీ, ఎంపీపీ, గ్రామపంచాయతీల ఎన్నికలకు కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఆశావహుల్లో హడావుడి మొదలైంది. ముసాయిదా రిజర్వేషన్ల జాబితాను శనివారం జిల్లాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల ఎదుట ప్రదర్శించారు. ఈ క్రమంలో కలెక్టరేట్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆశావహులు క్యూకట్టారు. లాటరీ పక్రియలో పాల్గొన్న నేతలతో ఆశావాహులు ఫోన్లో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈసారి ఎన్నికల్లో బీసీలకు అధికంగా సీట్లు కేటాయించడంతో ఉత్సాహం నెలకొంది. స్థానిక పోరు మరింత వేడెక్కింది. ఎన్నికలు జరిగేనా.. సామాజిక న్యాయం కలిగించేలా ప్రభుత్వం బీసీవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లను అమలుచేస్తూ జీవోను విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణకు ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వెలువడవచ్చన్న అంచనాలు నెలకొన్న క్రమంలో బీసీ రిజర్వేషన్ల పెంపుకు వ్యతిరేకంగా పలువురు హైకోర్డుకు వెళ్లిన నేపథ్యంతో జీవో అమలుపై సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు ఎన్నికలు నిర్వహిస్తారా, లేక మరోసారి ఎన్నికలు వాయిదా పడే అవకాశాలుంటాయా అనేదాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జనరల్ కరీంనగర్ 6 3 0 6 పెద్దపల్లి 6 3 0 4 జగిత్యాల 9 4 1 6 సిరిసిల్ల 0 0 0 0జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జనరల్ కరీంనగర్ 6 3 0 6 పెద్దపల్లి 5 3 0 5 జగిత్యాల 8 4 1 7 సిరిసిల్ల 0 0 0 0సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్లకు రిజర్వేషన్లు ఖరారుసిరిసిల్ల: ఎస్సీ జనరల్కరీనగర్: బీసీ జనరల్ జగిత్యాల: జనరల్ మహిళపెద్దపల్లి: జనరల్ మహిళ -
ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్
జగిత్యాలటౌన్: ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో లక్ష్మణ్ జయంతిలో పాల్గొన్నారు. చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొండా లక్ష్మణ్ పేరిట ప్రతిభా పురస్కారాలు అందిస్తోందన్నారు. బీసీ సంక్షేమ అధికారి సునీత, డీఎంహెచ్‌వో ప్రమోద్, మెప్మా పీడీ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ జగిత్యాలటౌన్: ఆడబిడ్డల ఆత్మగౌరవం, సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని కలెక్టర్ సత్యప్రసాద్ అ న్నారు. సీ్త్ర, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శని వారం కలెక్టరేట్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు సమష్టిగా బతుక మ్మ ఆడటం ద్వారా ఐక్యత బలపడుతుందన్నా రు. పూలను పూజించి ప్రకృతిని ప్రేమించే ఏకై క పండుగ బతుకమ్మ అన్నారు. అదనపు కలెక్టర్లు ల త, జిల్లా సంక్షేమ అధికారి నరేశ్, ఈడీఎం మమ త, మహిళా అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు. -
జగిత్యాల డిప్యూటీ కలెక్టర్‌గా అనంతపల్లివాసి
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లికి చెందిన కన్నం కళాప్రపూర్ణజ్యోతి–రమేశ్‌ల కూతురు కన్నం హరిణి గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. కరీంనగర్‌లోని నివసించే రమేశ్, కళాప్రపూర్ణజ్యోతి దంపతులు ఉపాధ్యాయులు. వీరిరి రెండో కూతురు హరిణి రాష్ట్రస్థాయిలో 55వ ర్యాంకు సాధించారు. ఎస్సీ కేటగిరీలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా జగిత్యాల జిల్లాకు నియమితులయ్యారు. ఉపాధ్యాయ దంపతుల మరో కూతురు అఖిల మెడిసిన్ తృతీయ సంవత్సరం చదువుతుంది. అబ్బాయి బాలాజీ బీబీఏ చదువుతున్నారు. -
డెంగీ లక్షణాలతో బాలుడి మృతి
కోనరావుపేట(వేములవాడ): మండల కేంద్రానికి చెందిన పాక శ్రేయాన్ష్ డెండీ లక్షణాలతో శనివారం మృతిచెందాడు. మండల కేంద్రానికి చెందిన పాక మహేశ్–జల దంపతుల కుమారుడు శ్రేయాన్ష్(4)కు వారం రోజుల క్రితం జ్వరం రాగా సిరిసిల్ల లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాలుగు రోజులు అడ్మిషన్ ఉంచుకున్న వైద్యుడు ఇంటికి పంపగా మళ్లీ జ్వరం వచ్చింది. మరో రోజు ఉంచుకుని కరీంనగర్‌కు పంపించాడు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి హైదరాబాద్‌కు పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. గుర్తుతెలియని వ్యక్తి మృతికరీంనగర్క్రైం: కరీంనగర్ బస్టాండులో ఉన్న గుర్తు తెలియని వృద్ధుడిని ప్రభత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. ఈ నెల 25న బస్టాండ్‌లోని 19వ నంబర్ ఫ్లాట్‌ఫారం వద్ద ఓ వ్యక్తి కిందపడి ఉన్నాడు. గమనించిన ఆర్టీసీ సిబ్బంది 108 ద్వారా ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను అదే రోజు మృతిచెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తుపడితే వన్‌టౌన్ పోలీసులను సంప్రదించాలని సూచించారు. చొప్పదండి: పట్టణంలోని మర్లవాడ శివారులో చొప్పదండి, ధర్మారం హైవేపై జరిగిన రోడ్డు ప్ర మాదంలో పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన పెద్దెళ్లి అంజయ్య (42) మృతి చెందాడు. పోలీసు కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి అంజయ్య రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌తో ఓ వ్యక్తి ఢీకొట్టాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమారులుండగా, భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇంటర్ ఎస్జీఎఫ్లో గందరగోళం
కరీంనగర్‌స్పోర్ట్స్: స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఏటా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అండర్–14, 17, 19 విభాగాల్లో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. సుమారు 60కి పైగా క్రీడాంశాల్లో పోటీలుంటాయి. అండర్–19 కళాశాలలస్థాయి పోటీల నిర్వహణకు జిల్లా ఇంటర్ విద్యాశాఖ ఎస్జీఎఫ్ కళాశాల కార్యదర్శిని నియమించడం ఆనవాయితీ. కానీ మూడేళ్లకాలంలో ఇంటర్ విద్యాశాఖ విచిత్ర ధోరణిలో అవలంబిస్తోంది. కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లను కాదని పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లకు అండర్–19 బాధ్యతలు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. 2025–26 విద్యాసంవత్సరంలో గడిచిన నెల వ్యవధిలో ఇంటర్ విద్యాశాఖ అధికారి గంగాధర్ అండర్–19లో ఇద్దరు కార్యదర్శులను అనూప్‌రెడ్డి(కొడిమ్యాల మోడల్ స్కూల్ పీడీ), మధు జాన్సన్ (ఆర్ట్స్ కళాశాల పీడీ)లను నియమించి, తరువాత తొలగించారు. తాజాగా పాఠశాలల అండర్–14,17 కార్యదర్శి వేణుగోపాల్‌కు అండర్–19 బాధ్యతలు అప్పగించారు. 2023– 24లో ఇలా.. ఇంటర్ విద్యాశాఖ తొలిసారిగా 2023–24 ఏడాదికి అండర్–19 ఎస్జీఎఫ్ కార్యదర్శిగా అప్పటి పాఠశాల ల ఎస్జీఎఫ్ కార్యదర్శిని నియమించింది. పలు కారణాలతో అండర్–14,17 బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో ఇంటర్ విద్యాశాఖ అధికారి సైతం అ ండర్–19 బాధ్యతలనుంచి తప్పించారు. 2025– 26 విద్యాసంవత్సరానికి గాను అండర్ 14,17 కార్యదర్శికి అండర్–19 బాధ్యతలు అప్పగించారు. మాకివ్వండని మొరపెట్టుకున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ కళాశాలలో ఒకరు, గురుకుల కళాశాలల్లో 10మందికిపైగా పీడీలుగా పని చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న సీనీయర్ పీడీని కార్యదర్శిగా నియమించాలి. ఒక్కరే ఉండడంతో అతనికే బాధ్యతలిచ్చారు. 2025–26 విద్యాసంవత్సరానికి గానూ క్రీడాపోటీల నిర్వహణకు ఔట్ సోర్సింగ్ పీడీగా పనిచేస్తున్న అనూప్రెడ్డిని ఇంటర్ విద్యాధికారి నియమించారు. దీంతో గురుకుల కళాశాలలో పనిచేస్తున్న రెగ్యులర్ పీడీలు అండర్–19 బాధ్యతలను తమకివ్వాలని డీఐఈవో గంగాధర్‌కు వినతిపత్రం ఇచ్చారు. దీంతో అనూప్‌రెడ్డి స్థానంలో మధుజాన్సన్ను నియమించారు. మధుజాన్సన్కు పక్కనపెట్టి వేణుగోపాల్‌ను నియమించారు. సంగారెడ్డి, జనగాంతో పాటు పలుజిల్లాల్లో అండర్–19 ఎస్జీఎఫ్ కార్యదర్శులుగా గురుకుల కళాశాల పీడీలు కొనసాగుతుండగా కరీంనగర్లో గురుకుల కళాశాలల పీడీలను పక్కన పెట్టడంపై పలువురు క్రీడారంగ బాధ్యులు ఆందోళనకు గురైయ్యారు. ఉమ్మడి జిల్లాలోని తమను కాదని పాఠశాల కార్యదర్శికి క్రీడాపోటీల నిర్వహణను అప్పగించడంలో అంతర్యమేంటోనని పలువురు పీడీలు అనుకుంటున్నారు. దీనివల్ల అండర్–19 క్రీడల్లో కళాశాలల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చక్రం తిప్పుతున్న కార్యాలయ సిబ్బంది? కళాశాల పీడీని కాదని పాఠశాల పీడీలకు అండర్–19 బాధ్యతలు అప్పజెప్పడంలో ఇంటర్ విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి చక్రం తిప్పుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2023–24, 2025–26 విద్యా సంవత్సరాల్లో పాఠశాల కార్యదర్శికి, ఔట్సోర్సింగ్ పీడీకి కార్యదర్శిగా నియమించడంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరు కార్యదర్శులను మార్చిన వైనం కొత్తగా పాఠశాలల కార్యదర్శికి అండర్– 19 బాధ్యతలు పక్క జిల్లాల్లో ఒక రూల్... కరీంనగర్లో మరో రూల్ ఎస్జీఎఫ్ క్రీడల్లో ఇంటర్ విద్యార్థులు నష్టపోతారంటున్న పీడీలు -
సీసీఎల్ డైరెక్టర్ సింగరేణి వారసుడు
గోదావరిఖని: సింగరేణి సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన అధికారి తనయుడు అనూప్ అంజూరా సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ టెక్నికల్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూలో అనూప్ అంజూరాను సీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్‌గా ప్రత్యేక కమిటీ రికమండ్ చేసింది. సింగరేణి ఆర్జీ–2 ఏరియాలోని జీడీకే–9వగనిలో ఏజెంట్‌గా, కొత్తగూడెం ఏరియా జీఎంగా పనిచేసి రిటైర్ అయిన సీఎల్ అంజూర ఈప్రాంత వాసులకు సుపరిచితులు. ఆయన తనయుడు అనూప్అంజూరా గోదావరిఖనిలోని యైటింక్లయిన్‌కాలనీ సింగరేణి పాఠశాల, గోదావరిఖని సెయింట్ క్లెయిర్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. -
ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ
వేములవాడ: ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ అని.. ప్రకృతి క్షేమంగా ఉంటేనే ప్రజలు క్షేమంగా ఉంటారని.. ప్రకృతి క్షేమంగా ఉంటేనే ఆడబిడ్డలు క్షేమంగా ఉంటారని.. ఆడబిడ్డలు క్షేమంగా ఉంటేనే బతుకమ్మ క్షేమంగా ఉంటుందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్పర్సన్ విమలక్క పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలకు మాజీ సర్పంచ్ నరాల సత్తమ్మపోచెట్టి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మూలవాగులోని బతుకమ్మ తెప్ప వద్దకు చేరుకుని నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. ప్రకృతి క్షేమంగా ఉంటే... ఆడబిడ్డలు క్షేమంగా ఉంటారు ఆడబిడ్డలు క్షేమంగా ఉంటే... బతుకమ్మ క్షేమంగా ఉంటుంది అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్పర్సన్ విమలక్క వేములవాడలో బతుకమ్మ వేడుకలకు హాజరు -
రేబిస్.. ప్రాణాంతకం
● కుక్కకాటుపై నిర్లక్ష్యం వద్దు ● అవగాహన, అప్రమత్తత అవసరం ● ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా టీకాలు ● నేడు రేబిస్ నివారణ దినోత్సవం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ బయ్యారానికి చెందిన ముత్తు బోయిన సందీప్(25) తండ్రిని నెలన్నర క్రితం పెంపుడు కుక్క కరిచింది. ఆయనకు చికిత్స చేయించాడు. దూరంగా వదిలేసేందుకు ఓ సంచిలో పెట్టుకుని వెళ్తుండగా కుక్క కాలిగోటితో గీరింది. వైద్యం చేయించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో నరాల బలహీనతతోపాటు రేబిస్ లక్షణాలు కనిపించాయి. కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా సందీప్‌ను పరీక్షించిన వైద్యులు.. రేబిస్ సోకినట్లు నిర్ధారించారు. చికిత్స చేస్తుండగానే ఈనెల 23న సందీప్ మృతి చెందాడు. సకాలంలో వైద్యం తీసుకుంటే యువకుడు బతికేవాడని డాక్టర్లు తెలిపారు. కోల్‌సిటీ(రామగుండం): విశ్వాసం ప్రదర్శించడంలో కుక్కకు మించిన ప్రాణి మరోటిలేదంటారు. అందుకే కొందరు వాటిని ఇంటికి రక్షణగా, మరికొందరు తోడుగా ఉంటుందని పెంచుకుంటున్నారు. వీటితోపాటు వీధికుక్కలు పల్లెలు, పట్టణాలు, నగరాల్లో సంచరిస్తూ దొరికిన ఆహారం తింటూ బతుకుతున్నాయి. కొన్నిసార్లు తమకు ప్రమాదం తెస్తున్నారని భావించి మనుషులను కరుస్తుంటాయి. ఈ కాటుతో రేబిస్ సోకి ఒక్కోసారి ప్రాణాపాయం తెస్తోంది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రేబిస్ నివారణకు ఉపయోగించే, ఉచితంగా లభించే ఏఆర్వీ టీకాలు ఉన్నా కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. నాటు వైద్యం వైపు మొగ్గుచూపుతూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. లూయీస్ ప్యాక్చర్ అనే ప్రముఖ శాస్త్రవేత్త రేబీస్ నివారణకు వ్యాక్సిన్ కనుగొన్నారు. ప్రజలకు రేబిస్‌పై అవగాహన కల్పించడానికి, లూయీస్ ప్యాక్చర్ జ్ఞాపకార్థం ఏటా సెప్టెంబర్ 28న వరల్డ్ రేబిస్ డేగా నిర్వహిస్తున్నారు. కుక్కలతో భద్రం.. రేబిస్‌తో బాధపడే కుక్కలు పుండ్లు, గాయం ఉన్నచోట నాకినా, కొరికినా మనుషులకు వ్యాధి సోకుతుంది. రేబిస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదకరమైన వ్యాధి. ముఖ్యంగా కుక్కలు, కోతులు, పెంపుడు జంతువులు మనుషులను కరవడం, గీకడం ద్వారా రేబిస్ వ్యాపిస్తుంది. కరిచిన నాలుగైదు రోజుల తర్వాత వ్యాధి బహిర్గతమవుతుంది. అయితే కుక్క ఎక్కడ కరిచింది? ఎంతో లోతు గాయమైంది. వైరస్ శరీరంలోకి ఎంతమేరకు ప్రవేశించిందనే దానిపై వ్యాధి తీవ్రత ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వైరస్ కండరాల్లోంచి నరాల ద్వారా మెదడులోకి వెళ్తుంది. కణాల సముదాయంలోకి, ఎముకలు, గ్రంథుల్లోకి వెళ్లి లాలాజలంలో ప్రవేశిస్తుంది. స్కిన్ బయాప్సీ, లాలాజలం ద్వారా వైరస్‌ను నిర్ధారిస్తారు. లక్షణాలు ఇలా ఉంటాయి.. తలనొప్పి, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి, సాధారణ జ్వరం ఉంటాయి. దీంతోపాటు కుక్క కరిచిన ప్రాంతంలో నొప్పి పెరుగుతుంది. ఈ లక్షణాల తర్వాత వైరస్ మెదడును తీవ్రమైన ఉద్వేగాలకు లోనయ్యేలా చేస్తుంది. దీంతో గాలికి భయపడతారు. నీళ్లను చూసినా వణికిపోతారు. గొంతులోని కండరాలు బిగుసుకుపోతాయి. ఈ పరిస్థితుల్లో ఉన్న పేషెంట్‌ను వెంటనే ఆస్పత్రిలో చేర్చాలి. క్షణాలను బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు. జాగ్రత్తలు తప్పనిసరి కుక్కకాటుకు గురైన వారు తప్పనిసరిగా వెంటనే యాంటీ రేబిస్ వ్యాక్సిన్(ఏఆర్వీ) వేయించుకోవాలి. వీరికి మొదటి, మూడు, ఏడో, 14వ, 28వ రోజుల్లో వ్యాక్సిన్ వేస్తారు. వైరస్ శరీరంలోకి ప్రవేశించి మొదడు వరకు చేరకుండా అడ్డుకోవడానికి అవసరమైన వారికి పీఈపీ టీకాలను కూడా వేస్తారు. కుక్కే కాదు.. పంది, పందికొక్కులు, కోతులు, గాడిదలు, గుర్రాలు, గబ్బిలాలు, ఎలుకలు, పిల్లులు వంటివి కరిచినా ఏఆర్వీ వ్యాక్సిన్ వేయించుకోవాలి. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని శుభ్రంగా కడిగి, సకాంలో చికిత్స తీసుకోవాలి. -
అదుపుతప్పిన ఆర్టీసీ బస్సులు
మంథనిరూరల్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శనివారం రెండు ఆర్టీసీ బస్సులు అదుపుతప్పాయి. ఒక ఘటనలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మరోఘటనలో ఆరు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వివరాలు.. మంథని మండలం వెంకటాపూర్ ఎక్స్‌రోడ్డు సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. మంథని మండలం ఆరెంద గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్నక్రమంలో వెంకటాపూర్ సమీపంలోని రహదారిపై ఏర్పడిన గుంతలో పడగా పట్టీలు విరిగి అదుపుతప్పింది. దీంతో పక్కకు దూసుకుపోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిందని ప్రయాణికులు తెలిపారు. బస్సులో 36మంది ప్రయాణికులు ఉండగా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను మరో బస్సులో మంథనికి తరలించారు. కాట్నపల్లిలో గొర్రెల మందపై దూసుకెళ్లిన బస్సు సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): కాట్నపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై శనివారం ఆర్టీసీ బస్సు గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరు గొర్రెలు మృత్యువాతపడ్డాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కాట్నపల్లి గ్రామానికి చెందిన రాజయ్య రోడ్డు పక్క నుంచి గొర్రెలను తీసుకెళ్తున్నాడు. ఈక్రమంలో కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. దీంతో ఆరు గొర్రెలు మృత్యువాత పడగా, మరోరెండు గాయాలపాలయ్యాయి. మృతిచెందిన వాటి విలువ సుమారు రూ.1లక్ష వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు. వెంకటాపూర్‌లో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బస్సు సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు కాట్నపల్లిలో గొర్రెల మందపై దూసుకెళ్లిన వైనం ఆరు గొర్రెలు మృత్యువాత.. గాయపడిన మరోరెండు -
నక్సలైట్‌గా మారేందుకు అవకాశం ఇవ్వండి
సిరిసిల్లక్రైం: అధికారుల తీరుతో పదేళ్లుగా తనకు అన్యాయం జరుగుతోందని, తనలాంటి బాధితులకు న్యాయం చేసేలా నక్సలైట్‌గా మారేందుకు తనకు అవకాశం ఇవ్వాలని మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్వాసితుడు చల్లా బాలరాజు కోరారు. ఈమేరకు శనివారం రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బీ గీతేకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బాధితుడు బాలరాజు మాట్లాడుతూ రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో నిర్మించిన మిడ్‌మానేరు ప్రాజెక్టులో స్థలం కోల్పోయానని తెలిపాడు. అధికారులు తనకు పదేళ్లుగా నష్టపరిహారం చెల్లించకుండా దరఖాస్తులు, పరిశీలన అంటూ కాలయాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతోపాటు మిగతా వారికి నష్టపరిహారం, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు. తమకు న్యాయం చేయాలని ఇప్పటికే కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేసినా.. ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పటి వరకు కలెక్టర్‌గా పనిచేసిన సందీప్‌కుమార్ ఝా నిర్వాసితుల సమస్యలపై అవహేళన చేస్తూ ఇబ్బందులకు గురిచేశారన్నారు. కలెక్టర్, ఉన్నతస్థాయి అధికారులపై కేసు నమోదు తమ పరిధిలో లేదని ఎస్పీ తెలిపినట్లు చెప్పారు. జిల్లాకు కొత్తగా రానున్న కలెక్టర్ రెవెన్యూ విభాగంలోని చట్టపరిధిలో చర్యలు తీసుకుంటారని ఎస్పీ సూచించారని తెలిపారు. ఎస్పీని కలిసిన వారిలో ఇనుకొండ లక్ష్మి, మంజుల, తిరుపతి, ఉపేందర్ ఉన్నారు. అన్యాయం చేసిన అధికారులపై కేసు నమోదు చేయండి మిడ్‌మానేరు బాధితుడు చెల్లా బాలరాజు సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బి గీతేకు వినతి -
సద్వినియోగం చేసుకోవాలి
నూతన సాంకేతిక విద్యాబోధన, ప్రాక్టికల్స్‌కు ఏటీసీ ప్రత్యేకత. ఇది జిల్లాలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.45 కోట్లు ఖర్చుచేసింది. యువత సద్వినియోగం చేసుకుంటే మంచి ఉపాధి లభిస్తుంది. – ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కోర్సుల్లో చేరండి యువత ఆరు కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి. వీటిద్వారా విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుంది. కొన్నికోర్సుల్లో 40 సీట్లు ఉండగా, మరికొన్నింట్లో 24, 20 సీట్ల చొప్పున ఉన్నాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – రవీందర్, ప్రిన్సిపాల్, నూకపల్లి ఏటీసీ -
ఐలమ్మకు నివాళి
జగిత్యాల రూరల్: నివాళి అర్పిస్తున్న ఎస్బీ డీఎస్పీ వెంకటరమణ జగిత్యాల టౌన్: ఐలమ్మ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న అధికారులు జగిత్యాల టౌన్: నివాళి అర్పిస్తున్న మంత్రి అడ్లూరి, జీవన్రెడ్డివీరనారి చాకలి ఐలమ్మ జయంతి శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, రజక సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల చింతకుంట చెరువు మినీ ట్యాంక్‌బండ్ వద్దగల ఐలమ్మ విగ్రహానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈతరం ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని వారు సూచించారు. ఐలమ్మ అడుగుజాడల్లో నడవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బండ శంకర్, రజక సంఘం ప్రతినిధులు గుండారపు రవీందర్, సట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత నివాళి అర్పించారు. ఆమె పోరాటాన్ని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి సునీత, డీపీవో మదన్మోహన్, మెప్మా పీడీ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్బీ డీఎస్పీ వెంకటరమణ నివాళి అర్పించారు. వీరనారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో శశికళ, ఆర్ఐలు కిరణ్‌కుమార్, వేణు, సైదులు, డీపీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. – జగిత్యాలటౌన్/జగిత్యాల క్రైం -
స్థానిక పోరుకు సై
జగిత్యాలరూరల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం దశలవారీగా కార్యాచరణ పూర్తి చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం బీసీ ఓటర్ల గుర్తింపు కూడా శుక్రవారం పూర్తి చేసింది. జిల్లాలో పోలింగ్ విధులు నిర్వహించే పీవో, ఏపీవోలకు కూడా శిక్షణ ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే 385 పంచాయతీల్లో 3,536 వార్డుల్లో విభజన పూర్తి చేసి నివేదిక అందజేశారు. జిల్లావ్యాప్తంగా 3,536 వార్డుల ఎన్నికల కోసం 3,536 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 216 ఎంపీటీసీ, 20 జెడ్పీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికల కోసం 1,123 పోలింగ్ బూత్‌లను కూడా ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల కమిషన్‌కు అప్పగించింది. ఇప్పటికే జి ల్లాస్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు కూడా రిజర్వేషన్లు పూర్తి చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే.. రిజర్వేషన్లను జిల్లాస్థాయిలో అధికారులు ప్రకటిస్తారు. ఆ వార్డులో ఓటర్లు 35 మందే.. బీర్పూర్ మండలం చిన్నకొల్వాయి పంచాయతీలో వార్డుకు 35 మంది ఓటర్లుండగా.. అతి పెద్ద వార్డుగా మల్యాల పంచాయతీలో ప్రతీ వార్డుకు 640 మంది ఓటర్లున్నారు. ఎంపీటీసీ అతి పెద్ద స్థానం బుగ్గారంలో 4,855 మంది ఓటర్లుండగా.. అతి చిన్న స్థానం జగిత్యాల అర్బన్ మండలం ధరూర్–2 ఎంపీటీసీ స్థానం 1,293 మంది ఓటర్లున్నారు. 385 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా.. 3,536 వార్డులను గుర్తించి ఒక్కో వార్డుకు ఒక్కో పోలింగ్ బూత్‌ను ఎంపిక చేశారు. 50 శాతం రిజర్వేషన్ గతంలో మాదిరిగానే జిల్లాలో జరగనున్న పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగనుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ కోటాలకు కూడా మహిళల రిజర్వేషన్లు అమలు కానున్నాయి. రిజర్వేషన్లపై ఉత్కంఠ జిల్లావ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఓటర్ల జాబితా, వార్డుల విభజన, పోలింగ్ స్టేషన్ల ఎంపిక, బీసీ ఓటర్ల గుర్తింపు పూర్తి కావడంతో ఆయా పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లాస్థాయిలో రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగానే జిల్లాలో రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. గ్రామాల్లో ఇప్పటినుంచే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేడి రాజుకుంది. ఆయా గ్రామాల్లో రిజర్వేషన్లపై పార్టీల నాయకులు తర్జనభర్జన పడుతున్నారు. రిజర్వేషన్ అనుకున్న ప్రకారం ఏ వ్యక్తిని రంగంలోకి దింపాలనే ఆలోచనలో పడ్డారు. -
విద్యార్థులకు వరం ఏటీసీ
జగిత్యాల: యువతకు వృత్తి విద్యలో నైపుణ్యం కలిగించి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం టాటా టెక్నాలజీ లిమిటెడ్ సహకారం తీసుకుంటోంది. ఇప్పటికే ఉన్న ఐటీఐలను ఆధునికీకరించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ)గా తీర్చిదిద్దిన సర్కార్.. 2025–26 విద్యా సంవత్సరం నుంచి సాంకేతిక విద్యను బలోపేతం చేసే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేస్తోంది. జగిత్యాల జిల్లా నూకపల్లి సమీపంలో ఏటీసీని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ శనివారం ప్రారంభించనున్నారు. ఇందులో విద్యార్థులకు సాంకేతిక నైపుణ్య విద్య అందిస్తారు. ఇందులో చేరేవారికి ఆరు కోర్సులు అందుబాటులో ఉంచారు. అందుబాటులోని కోర్సులివే.. ఏటీసీలో ఆరు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రతీకోర్సులో 40 సీట్లు ఉంటాయి. ఇందులో మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్(40), ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ (40), బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరీఫైర్(24), అడ్వాన్స్డ్ సీఎన్సీ మిషనింగ్ టెక్నిషియన్(24), ఎలక్ట్రికల్ వెహికిల్ మె కా నిక్ (24), ఆర్టిసన్ యాజింగ్ అడ్వాన్స్డ్ టూల్(20 సీట్లు) కోర్సులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆధునిక వసతులు.. నూకపల్లి సమీపంలో ఏటీసీలో సుమారు రూ.4 కోట్ల వ్యయంతో ఆధునిక వసతులతో కూడిన భవనాన్ని ఇప్పటికే నిర్మించారు. ఇందులో విద్యార్థులకు అవసరమైన ప్రయోగశాలలు, ట్రైనింగ్‌కు సంబంధించిన ఇనిస్టిట్యూట్స్, మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ. 45 కోట్ల వ్యయం చేసినట్లు అధికారులు తెలిపారు. ఉజ్వల భవిష్యత్.. ఏటీసీల్లో చేరే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత హైటెక్ యుగంలో టెక్నాలజీ ద్వారానే ఎక్కువగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఇప్పటికే ఐటీఐ ఉండగా, ఇందులో పలుకోర్సుల్లో చేరి అనేకమంది యువత ఉద్యోగ అవకాశాలు దక్కించుకున్నారు. ఇందులో ముఖ్యంగా మేషన్, ఎలక్ట్రికల్, ప్లంబర్ తదితర కోర్సుల్లో శిక్షణ పొందారు. కొందరు విదేశాల్లో సైతం పనులు చేస్తున్నారు. ఏటీసీలో సైతం ఈ ఆరు కోర్సులు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు నచ్చిన కోర్సులో శిక్షణ పొందితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. నేడు ప్రారంభించనున్న మంత్రి నూకపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ఏటీసీని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ శనివారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
సీఎం ఫొటో ఎక్కడ?
ప్రభుత్వం మారింది.. ముఖ్యమంత్రి మా రారు. కానీ.. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటోలు మాత్రం మారడంలేదు. జిల్లాలోని అధికారుల నిర్లక్ష్యం వెరిసి సీఎం చిత్రపటాలు కనిపించకూండా పోతున్నాయి. జగిత్యాల రూరల్ మండలంలోని హన్మాజీపేట, పొరండ్ల, బాలపల్లి, తిమ్మాపూర్, నర్సింగాపూర్, వంజరిపల్లి, గొల్లపల్లె, చెర్లపల్లె గ్రామపంచాయతీల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో అమర్చలేదు. జగిత్యాల మండల పరిషత్ ఎంపీడీవో విజయలక్ష్మి ఆఫీస్‌లో ఇదే పరిస్థితి. మోతె, హస్నాబాద్, అంబారిపేట, ధరూర్ పంచాయతీ ఆఫీస్‌ల్లో చిత్రపటం పెట్టలేదు. ఈ విషయమై డీపీవో మదన్మోహన్ను వివరణ కోరగా అన్ని కార్యాలయాల్లో సీఎం ఫొటో ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. – జగిత్యాలరూరల్ -
సహకార సంఘం చైర్మన్, డైరెక్టర్ల కొనసాగింపు
కథలాపూర్: భూషణరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ లోక బాపురెడ్డితోపాటు 9 మంది డైరెక్టర్లను యధావిధిగా పదవుల్లో కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. సహకార సంఘాల పాలకవర్గం గడువు గత నెలలో ముగియడంతో కొన్ని సంఘాలకు పర్సన్ ఇన్చార్జీలను నియమించారు. మరికొన్ని పాలకవర్గాలను యధావిధిగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అన్నింటికి ఒకేసారి ఎన్నికలు జరగగా.. కొన్నింటిపై వివక్ష చూపించడంపై నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. భూషణరావుపేట సహకార సంఘం చైర్మన్ లోక బాపురెడ్డి, వైస్ చైర్పర్సన్ మిట్టపెల్లి లక్ష్మి, ఏడుగురు డైరెక్టర్లు యధావిధిగా పదవుల్లో కొనసాగుతారన్నారు. -
సజావుగా ఎన్నికల ప్రక్రియ
మెట్పల్లి రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మెట్పల్లి మండలం వెల్లుల శివారులోని ఓ గార్డెన్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శుక్రవారం శిక్షణ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా... సిద్ధంగా ఉండాలన్నారు. అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ప్రతీ ఒక్కరు నిబంధనలు పాటించాలన్నారు. సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు. చెక్‌లిస్ట్ ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ ఎంపీడీవోలు మహేశ్వర్‌రెడ్డి, సలీం, శశికుమార్, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి మల్యాల: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి ఆదేశించారు. మల్యాల మండల కేంద్రంలో శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణ చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో స్వాతి, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఏఈఈలు, డీఈఈలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకం కథలాపూర్: ఇంటర్ విద్యార్థుల అభివృద్ధిలో లెక్చరర్లతోపాటు తల్లిదండ్రుల పాత్ర కీలకమని జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి నారాయణ అన్నారు. శుక్రవారం కథలాపూర్ ప్రభుత్వ జూని యర్ కళాశాలలో లెక్చరర్లు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ప్రతీ ప్రభు త్వ జూనియర్ కళాశాలలో సీసీ కెమెరాలు ఏర్పా టు చేశామన్నారు. ఇక్కడి సీసీ కెమెరాలు హైదరాబాద్‌లోని ఇంటర్ విద్యాశాఖ కార్యాలయానికి అనుసంధానంగా ఉంటాయని అన్నా రు. విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వీలుందన్నారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ అచ్యుత్రాజ్, లెక్చరర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
పరికరాలు.. పాత సామాన్లకే?
కోరుట్ల: జగిత్యాల జిల్లాలో తీపి సిరులు పండించి రైతులను మురిపించిన ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలో మూసివేత ఫలితంగా యంత్ర పరికరాలు పనికిరాని తుప్పుగా మారిపోయాయి. శుక్రవారం ముత్యంపేట ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మళ్లీ తెరవాలంటే కొత్త టెక్నాలజీతో కూడిన మిషన్లు వినియోగించాలని తేటతెల్లమైంది. ఈ సారి జపాన్ టెక్నాలజీ మిషనరీ వాడే అవకాశముంది. పదేళ్లుగా మూసివేత ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీకి 2015లో లేఆఫ్ ప్రకటించి మూసివేశారు. ఆ తర్వాతకాలంలో ఫ్యాక్టరీలోని కీలకమైన యంత్ర పరికరాలను పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఫ్యాక్టరీ మూసివేసిన నాటి నుంచి శుక్రవారం పునరుద్ధరణ కమిటి వచ్చి పరిశీలించే వరకు మిషనరీలో చేరుకున్న బూజు, చెత్త చెదారం, నీరు నిలిచిన ఫలితంగా యంత్ర పరికరాలు తప్పుపట్టిపోయాయి. చెరుకు క్రషింగ్‌లో కీలకమైన మిల్లింగ్ సెక్షన్ పరికరాలు, బాయిలర్లు, పవర్‌హౌస్, బాయిలింగ్ హౌస్, మొలాసిస్ యూనిట్, షుగర్ డ్రాపింగ్ పరికరాలు, క్రషింగ్ యంత్రాల విడిభాగాలు ఎక్కడిక్కడే తుప్పు పట్టాయి. ఇవీ కనీసం కదిలే పరిస్థితుల్లో లేకపోవడం గమనార్హం. ఫ్యాక్టరీ లోపలి భాగంలో ఉన్న యంత్ర పరికరాల్లో దాదాపు 90శాతం పనిచేయలేని స్థితిలో ఉన్న వైనాన్ని పునరుద్ధరణ కమిటీకి చెందిన పరిశ్రమల విభాగం ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ పరికరాలను అన్నింటిని తొలగించి కొత్త చెరకు క్రషింగ్ టెక్నాలజీకి పరికరాలను బిగించే అవసరం తప్పనిసరని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. -
సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు చేయాలి
● మున్సిపల్ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ జగిత్యాల: తెలంగాణ ప్రజల సంస్కృతికి ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ అని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలకు ఇబ్బందులు కలుగకుండా అన్నిఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన మున్సిపల్ అధికారులతో మాట్లాడారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే చెరువులు, కుంటల ప్రవేశాల వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మహిళలు బతుకమ్మ ఆడే ప్రతీచోట లైట్స్ బిగించాలని అన్నారు. గుంతలు ఉంటే మట్టితో చదును చేయించాలని సూచించారు. చెరువుల వద్ద గజఈత గాళ్లను అందుబాటులో ఉంచాలని, రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. బతుకమ్మ ముగింపు వేడుకలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరవుతారని తెలిపారు. సద్దుల బతుకమ్మ వేడుకలు వివేకానంద మైదానంలో నిర్వహించేలా చూడాలని పేర్కొన్నారు. మున్సిపల్కమిషనర్ స్పందన, ఏవో శ్రీనివాస్, టీఎంసీ రజిత పాల్గొన్నారు. జనం కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారుమల్లాపూర్: రాష్ట్రవ్యాప్తంగా జనం కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం మల్లాపూర్ మండలం వేంపల్లిలో హెల్త్ సబ్‌సెంటర్ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ హయాంలో అమలైన పథకాల్లో కోత పెడుతూ ప్రజలు, రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనలో విఫలమైందన్నారు. ఫలితంగా జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన అందిస్తేనే తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శ గ్రామాలుగా నిలిచి అవార్డులు అందుకున్నాయని గుర్తుచేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. వచ్చేస్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైద్యాధికారి వాహిని, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ కదుర్క నర్సయ్య, మాజీ వైస్ చైర్మన్ ముద్దం శరత్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ బిట్ల నరేశ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తాం
మల్లాపూర్: మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, డిసెంబర్‌లోపు పునరుద్ధరణ పనులు ప్రా రంభించబోతున్నట్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ని ముత్యంపేట శివారులో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి, పునరుద్ధరణ కమిటీ సభ్యుడు జీవన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, అధికారులతో కలిసి బుధవారం సందర్శించారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పార్టీ, సీఎం రే వంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మూడు ఫ్యాక్టరీల్లో మొదటగా ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణ యం తీసుకుందన్నారు. ఫ్యాక్టరీ పరిధిలో 1500 ఎకరాల సాగుతో లక్ష మెట్రిక్ టన్నుల చెరుకు ఉత్పత్తి అవుతుందని, లాభసాటిగా ఉండాలంటే సుమారు 10వేల ఎకరాల వరకు చెరుకు పంటను సాగు చేయాలని, 3.50లక్షల మెట్రిక్ టన్ను ల వరకు ఉత్పిత్తి చేయాల్సిన బాధ్యత రైతులపైనే ఉందన్నారు. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్, వ్యవసాయశాఖ ప్రిన్సిపా ల్ కార్యదర్శి రఘునందన్‌రావు, షుగర్‌కెన్ కమిషనర్ నర్సిరెడ్డి, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్, ఆర్డీవో శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు. -
కోచింగ్ ఇస్తూనే ఉద్యోగం సాధించి
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మెన్నేని అనూష గ్రూప్–1లో రాష్ట్రస్థాయిలో 62వ ర్యాంక్‌తో జిల్లా పంచాయతీ ఽఅధికారిగా ఎంపికయ్యారు. ముస్తాబాద్‌కు చెందిన మెన్నేని జగన్మోహన్రావు కుమారుడు సంతోష్‌రావు సతీమణి అయిన అనూష బీటెక్ చదివి ఉస్మానియాలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. న్యాయవిద్యలో రెండు బంగారు పతకాలు సాధించిన అనూష.. డీపీవోగా ఎంపిక కావడంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో భర్త సంతోష్‌రావుతో కలిసి కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులను పోటీపరీక్షలకు సిద్ధం చేస్తున్న అనూష డీపీవోగా ఎంపికయ్యారు. అనూష -
ఎన్టీపీసీ యువకుడు.. గ్రూప్–1 విజేత
జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం ప్రాంతానికి చెందిన ముద్దసాని శ్రీరాంరెడ్డి గ్రూప్–1లో 144వ ర్యాంక్‌తో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌గా ఎంపికయ్యారు. స్థానిక కృష్ణానగర్‌కు చెందిన ముద్దసాని శ్రీనివాసరెడ్డి–ఊర్మిల దంపతుల కుమారుడు ముద్దసాని శ్రీరాంరెడ్డి స్థానిక ఓ ప్రైవేట్ స్కూల్లో పాఠశాల విద్య, ఫిట్జీలో ఇంటర్ చదివారు. తాను పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి యూపీఎస్సీకి సిద్ధమవుతున్నారు. రెండోసారి యూపీఎస్ఈ మెయిన్స్ వరకు వెళ్లారు. ఈక్రమంలో గ్రూప్–1 ఫలితాలు వెలువడడంతో ఉద్యోగం సాధించారు. శ్రీరాంరెడ్డి -
కనిపించని ‘మార్పు’
● తూతూమంత్రంగా వంద రోజుల ప్రణాళిక ● పకడ్బందీగా అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం ● సమస్యలు పరిష్కారం కాక ప్రజలకు తప్పని ఇబ్బందులు మెట్పల్లి: మున్సిపాలిటీలను పరిశుభ్రమైన, ఆరో గ్యవంతమైన వాటిగా తీర్చిదిద్దడమే కాకుండా ఎ లాంటి విపత్తులనైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగించడం కోసం ప్రభుత్వం ఇటీవల వంద రోజు ల ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేసింది. ఇందులోభాగంగా ప్రతి రోజు ‘ఒక చర్య.. ఒక మార్పు’ అనే నినాదంతో దీనికి శ్రీకారం చుట్టింది. ఎంతో మంచి ఉద్దేశంతో రూపొందించిన ఈ కార్యక్రమాన్ని మెట్పల్లి పట్టణంలో అధికారులు తూతూమంత్రంగా నిర్వహించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిని పకడ్బందీగా అమలు చేసి ఉంటే పలు సమస్యలు పరిష్కారానికి నోచుకునేవి. కానీ అధికారులు అలా చేయకపోవడం వల్ల ఎటువంటి ‘మార్పు’ లేకుండా పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రణాళికలో 50 అంశాలు.. ● మున్సిపాలిటీల్లో వంద రోజుల ప్రణాళికను జూన్ 2న ప్రారంభించి, ఈనెల 10న ముగించింది. ● ఇందులో సుమారు 50 అంశాలను పొందుపర్చింది. వీటిని పకడ్బందీగా అమలు చేయడం కోసం మున్సిపల్ సిబ్బందే కాకుండా వివిధ వర్గాలను భాగస్వాములుగా చేయాలని సూచించింది. ● ప్రధానంగా ప్రజావసరాలైనా డ్రైనేజీలు, నాలాల్లో పూడిక తొలగించడం..అంతర్గత రహదారులకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తీసివేయడం, బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేయడం, రోడ్లపై గుంతలను పూడ్చడం, పబ్లిక్ టాయిలెట్ల సమస్యలు పరిష్కరించడం, దోమల నియంత్రణ చర్యలు చేపట్టడం, మంచినీటి వనరులను శుద్ది చేయడం వంటివి ఉన్నాయి. చిత్తశుద్ధి చూపని అధికారులు ● వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఏయే పనులు చేపట్టాలన్నది ఉన్నతాధికారులు నిర్దేశించారు. ● మెట్పల్లి పట్టణంలో అధికారులు వీటిని సక్రమంగా అమలు చేసే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించారనే విమర్శలున్నాయి. దీనివల్ల ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● చాలా కాలనీల్లో రోడ్లపై గుంతలను పూడ్చకుండా, డ్రైనేజీల్లో వ్యర్థాలను తొలగించకుండా అలాగే వదిలేశారు. ఖాళీ ప్రదేశాల్లో, రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించలేదు. ● వీటితో పాటు పలుచోట్ల మూతబడ్డ పబ్లిక్ టాయిలెట్లను పునరుద్ధరించలేదు. ● ఇలా అనేక సమస్యలపై దృష్టి సారించకుండా నామమాత్రంగా చేపట్టి.. ముగించారు. ● స్థానికంగా సమస్యలు ఎక్కువగా ఉన్న శివారు కాలనీలకు చాలాకాలంగా అధికారులు రావడం లేదని ఆయా కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు. ● ప్రస్తుతం కౌన్సిలర్లు లేకపోవడం..మరోవైపు అధికారులు రాకపోవడంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆయా కాలనీలవాసులు నానా అవస్థలు పడుతున్నారు. ● వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంతోనైనా తమ కాలనీల్లో సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన వారికి అధికారుల తీరుతో నిరాశే మిగలడం గమనార్హం. పూర్తిగా వ్యర్థాలతో నిండిపోయి కనిపిస్తున్న ఈ డ్రైనేజీ మెట్పల్లి బల్దియాలోని 12 వార్డులోనిది. పట్టణంలో పారిశుధ్యంపై మున్సిపల్ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారో ఈ దృశ్యం నిదర్శనంగా నిలుస్తోంది. కొన్ని నెలలుగా వ్యర్థాలు డ్రైనేజీలో పూడుకపోయినప్పటికీ వాటిని తొలగించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇలా ఈ ఒక్క చోటే కాదు.. చాలా వీధుల్లో డ్రైనేజీల పరిస్థితి ఇలాగే ఉంది. ఇటీవల ప్రభుత్వం వంద రోజుల ప్రణాళిక కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఇలాంటి వాటిని గుర్తించి శుభ్రం చేయాలి. అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. -
ఘొల్లుమన్న గోపాల్‌రావుపల్లె
సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): గోపాల్‌రావుపల్లె.. పచ్చటి పొలాలు, ఎతైన గుట్టలు.. మధ్యమానేరు బ్యాక్ వాటర్.. పాడిపంటలతో కళకళలాడే ఊరు. ఆ ఊరిలో ఉన్నత కుటుంబంలో పుట్టిన నూనూగుమీసాల యువకుడు.. నాలుగున్నర దశాబ్దాల క్రితం పీడిత ప్రజల విముక్తి కోసం ఉద్యమబాట పట్టాడు. ఈ తరం వారికి అతనెవరో తెలియదు. కానీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబూజ్‌మఢ్ అడవుల్లో సోమవారం ఎన్కౌంటర్లో మరణించిన కొస అలియాస్ కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ సాధు ఉన్నట్లు తెలియడంతో ఒక్కసారిగా గోపాల్‌రావుపల్లె వార్తల్లోకెక్కింది. కొస పార్థీవదేహం గురువారం ఉదయం 10.20 గంటలకు ఆ పల్లెకు చేరగానే ఆ ఊరంతా కన్నీటిసంద్రమైంది. నాలుగున్నర దశాబ్దాలుగా కంటికి, ఇంటికి దూరమైన మావోయిస్టు అగ్రనేత కొస ప్రస్థానం అంత్యక్రియలతో ముగిసింది. ● ఎరుపెక్కిన ఊరు కడారి సత్యనారాయణరెడ్డి కుటుంబ సభ్యులు ముద్దుగా పిలుచుకునే సత్యం పార్థీవదేహం రావడంతో అప్పటికే ఊరు చేరిన ప్రజాసంఘాల ప్రతినిధులు, పౌరహక్కుల నేతలు, కళాకారులు, మాజీ మావోయిస్టు నేతలు ఎర్రజెండాలు కప్పి నివాళి అర్పించారు. కొస చిత్రపటంతో కూడిన ప్లెక్సీలను ప్రదర్శించారు. సత్యనారాయణరెడ్డి మృతదేహం గ్రామానికి చేరగానే ప్రజాకళాకారులు పాటలతో కొసను తలచుకుంటూ ఉద్యమ గీతాలు ఆలపించారు. పిడికిళ్లు బిగించి నివాళులు అర్పిస్తూ, జోహార్లు చెబుతూ హోరెత్తించారు. మధ్యాహ్నం అంతిమయాత్ర ప్రారంభం కాగానే ఓ వైపు వర్షం మరోవైపు రోడ్డుపై బురద ఉన్నా.. జనం లెక్క చేయకుండా అంతిమయాత్రలో పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు, కళాకారుల ఉద్యమ గీతాలు, ఆవేశపూరిత ప్రసంగాలతో అంతిమయాత్ర సాగింది. ● తరలివచ్చిన అభిమానులు సత్యనారాయణరెడ్డి అంతిమయాత్రకు ప్రజాసంఘాల ప్రతినిధులు గాదె ఇన్నయ్య, ఉద్యోగ సంఘాల ప్రతినిధి దేవిప్రసాద్, పౌరహక్కుల సంఘం నాయకులు నక్క నారాయణరావు, మాదన కుమారస్వామి, దళిత లిబరేషన్ ఫ్రంట్ వ్యవస్థాపకులు మార్వాడి సుదర్శన్, అమరవీరుల బంధుమిత్రుల కమిటీ ప్రతినిధి పద్మకుమారి, ప్రజాసంఘాల ప్రతినిధులు శాంతి, యాదవ్వ, లక్ష్మి, భవాని, మాజీ మావోయిస్టులు జ్యోతి, అమర్, గాజర్ల అశోక్, సిదన్న, దళిత సంఘాల ప్రతినిధులు రాగుల రాములు, రంజిత్, కవులు జూకంటి జగన్నాథం, గాయకులు నాగరాజు, శ్రీకాంత్, అభిమానులు, జిల్లాలోని పలు గ్రామాల ప్రతినిధులు తరలి రావడంతో గోపాల్‌రావుపల్లె జనసంద్రమైంది. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతుందని, మోదీ, అమిత్‌షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు నాయకులు పాడెమోశారు. వర్షంలోనూ కన్నీటి వీడ్కోలు పలికారు. ● కొస భార్య కూడా ఎన్కౌంటర్లో బలి సత్యనారాయణరెడ్డి ఇల్లు విడిచి ఉద్యమంలో చేరినప్పుడు అతనికి పెళ్లికాలేదు. నిజానికి పెళ్లి చేసుకుంటే.. విప్లవ ఉద్యమంలో పని చేయడం ఇబ్బందిగా ఉంటుందని భావించి ముందే పిల్లలు కాకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న కమిట్మెంట్ ఉద్యమకారుడు. గర్చిరోలి జిల్లా కార్యదర్శిగా ఉండగా ఆదివాసీ మహిళ అయిన చడిమేక్ రుక్మిణి అలియాస్ రాధను పెళ్లి చేసుకున్నాడు. ఉద్యమ సహచరిగా ఉన్న ఆమె బస్తర్ జిల్లా మావోయిస్టు కార్యదర్శి హోదాలో ఏడాది క్రితం ఎన్కౌంటర్లో మరణించింది. కొస కుటుంబ సభ్యులకు మాత్రం అతనికి ఇంకా పెళ్లి కాలేదని తెలిసినా, ఉద్యమంలో రాధను పెళ్లి చేసుకున్నట్లు మాజీ మావోయిస్టులు వెల్లడించారు.కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొస(ఫైల్) కొస భార్య రాధా అలియాస్ రుక్మిణి(ఫైల్) శోకసంద్రమైన ఊరు 45 ఏళ్లకు విగతజీవిగా ఇల్లు చేరిన కడారి సత్యనారాయణరెడ్డి మావోయిస్టు కొసకు కన్నీటి వీడ్కోలు తరలివచ్చిన ప్రజలు, పౌరహక్కుల నేతలు, బాల్యమిత్రులు -
మొదటి ప్రయత్నంలోనే సక్సెస్
కోరుట్ల: కష్టపడితే ఫలితం వస్తుందనేందుకు కోరుట్లకు చెందిన దురిశెట్టి విజయ్‌కుమార్ నిదర్శనం. పట్టణానికి చెందిన విజయ్ 177వ ర్యాంక్‌తో జైళ్లశాఖ డీఎస్పీగా ఎంపికయ్యారు. దురిశెట్టి సత్యనారాయణ–జమునారాణి దంపతులకు కూతురు, కుమారుడు. సత్యనారాయణ కోరుట్లలో జ్యూవెల్లరీ షాప్ నిర్వహిస్తుండగా... జమునారాణి గృహిణి. విజయ్‌కుమార్ పదోతరగతి వరకు కోరుట్ల, ఇంటర్ హైదరాబాద్, ఢిల్లీలోని ఎన్ఐటీలో బీటెక్(ఈసీఈ) పూర్తి చేశారు. గతేడాది గ్రూప్–4 పరీక్ష రాసి జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికై మెట్పల్లి ఆర్డీవో ఆఫీస్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రూప్–1 ఫలితాల్లో 177వ ర్యాంక్ సాధించి..జైళ్లశాఖ డీఎస్పీగా ఎంపికయ్యారు. దురిశెట్టి విజయ్‌కుమార్ -
తల్లిదండ్రుల సహకారం
ఫెర్టిలైజర్‌సిటీ: రామగుండం కార్పొరేషన్ 22వ డివిజన్ ఎల్కలపల్లిగేట్కు చెందిన సామల శంకరయ్య–సూరమ్మ దంపతుల పెద్దకుమారుడు సామల సతీశ్‌కుమార్ 154వ ర్యాంక్‌తో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌గా ఉద్యోగం సాధించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సతీశ్‌కుమార్ పాఠశాల విద్యను గోదావరిఖనిలో, ఇంటర్ హన్మకొండ, బీటెక్ అనంతపురంలోని జేఎన్టీయూలో పూర్తి చేశారు. బీటెక్ పూర్తయ్యాక యూపీఎస్సీ కోసం పదేళ్ల పాటు ప్రిపేర్ అయ్యారు. ఈక్రమంలోనే సీఆర్పీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్, సెంట్రల్ ఇంటెలిజెన్సీబ్యూరోలో ఉద్యోగం సాధించారు. ఖాళీ సమయంలో హైదరాబాద్‌లోని పలు ఇనిస్టిట్యూట్లలో విద్యార్థులకు యూపీఎస్సీ, పోటీ పరీక్షలపై శిక్షణ ఇచ్చేవారు. గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతో రాత్రింబవళ్లు కష్టపడి ప్రిపేర్ అయి అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌గా కొలువు కొట్టారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌గా ఎంపికైన సతీశ్‌కుమార్ -
కుటుంబ అండదండలతో..
గోదావరిఖని/గోదావరిఖనిటౌన్: గోదావరిఖనికి చెందిన సింగరేణిలో ఓసీపీ ఈపీ ఆపరేటర్ తుంగపిండి ఆనంద్ కొడుకు తుంగపిండి శివశంకర్‌ప్రసాద్ 448 ర్యాంక్‌తో అసిస్టెంట్ ట్రెజరరీ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. ప్రాథమిక విద్య సింగరేణిప్రాంతంలోనే పూర్తి చేసిన శివశంకర్‌ప్రసాద్ ఇంటర్ కరీంనగర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత రెండేళ్ల పాటు గ్రూప్స్, సివిల్స్ కోసం ప్రయత్నించారు. ఇంతలోనే గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతో ప్రణాళికాబద్ధంగా చదివి ఉద్యోగం సాధించారు. శివశంకర్‌ప్రసాద్ మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుల అండదండలతోనే ఈ విజయం సాధించానని, గ్రూప్–1 ఉద్యోగం చేస్తూనే సివిల్స్ రాసి ఐఏఎస్ కావడమే తన జీవిత లక్ష్యమన్నారు. తన ఎదుగుదలలో అమ్మానాన్నల పాత్ర అమోఘమని, వారికి రుణపడి ఉంటానన్నారు. కుటుంబ సభ్యులతో శివశంకర్వరప్రసాద్ -
రైతులకు అండగా ప్రభుత్వం
జగిత్యాలరూరల్: రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తిలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని గురువారం ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, ఈజీఎస్ నిధులు జగిత్యాలకు మంజూరయ్యాయని తెలిపారు. యూరియా కొరతతకు అనేక కారణాలున్నాయని, కేంద్రాన్ని విమర్శించి రాజకీయం చేయడం అవసరం లేదన్నారు. పంచాయతీరాజ్ ఈఈ లక్ష్మణ్‌రావు, ఎంపీడీవో రమాదేవి, డీఈ మిలింద్, ఎంపీవో రవిబాబు, ఎంఈవో గంగాధర్ పాల్గొన్నారు. అంతకుముందు పొలాసలోని పౌలస్తేశ్వరస్వామి ఆలయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి సత్కరించారు. యాదవ యువజన సంఘం భవనానికి నిధులు మంజూరు చేయాలని అఖిల భారత యాదవ మహాసంఘం సభ్యులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. -
ఏకపక్ష కాల్పులు సరికాదు
నేను, సత్యనారాయణరెడ్డి పెద్దపల్లిలో ఐటీఐ చేశాం. ఇద్దరం క్లాస్మెంట్లమే. ఎంతో చురుకై న విద్యార్థి. నేను ఉద్యోగంలో చేరి స్థిరపడ్డాను. ఆయన ఉద్యమంలో చేరారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధమని చెబుతున్నా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏకపక్ష కాల్పులకు దిగుతుంది. మావోయిస్టులను అంతం చేయడం కాదు.. నిరుద్యోగాన్ని, పేదరికాన్ని అంతం చేయాలి. – దేవీప్రసాద్, కొస క్లాస్మెంట్ మాది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగళపల్లె. నేను మావోయిస్టు పార్టీలో 20 ఏళ్లు పని చేశాను. కొస దాదాతో కలిసి చాలా కాలం పని చేశాను. ఎంతో కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ప్రజాఉద్యమాలపై పాఠాలు చెప్పేవారు. వనరుల దోపిడీ, పీడిత ప్రజల మౌలిక వసతులు, బహుళజాతి కంపెనీల ఎత్తుగడలను వివరించేవారు. పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తూ దేశమంతటా తిరిగేవారు. ఆయన పార్టీకి ఓ లెజెండ్. – నేరెళ్ల జ్యోతి, మాజీ మావోయిస్టు, శివంగాళపల్లె మాది పెద్దపల్లి పక్కన ఓ పల్లె. మా అన్న లచ్చిరెడ్డి అలియాస్ సూరన్న తొలితరం దళనేత. సూరన్నతో కలిసి సత్యనారాయణరెడ్డి ప్రజా ఉద్యమాల్లోకి వెళ్లాడు. నిజానికి 1980లో తొలిసారి ఆదివాసీ ప్రాంతాల్లో సాయుధపోరాటాన్ని నడిపించిన మొదటి వ్యక్తి కొస. దండకారణ్యంలో ఆదివాసీ సమస్యలపై పోరాటం చేస్తూ, అక్కడి ప్రజలను ఏకం చేశారు. ఆయన స్ఫూర్తితోనే మావోయిస్టు పార్టీ దండకారణ్యంలో నాలుగున్నర దశాబ్దాలుగా మనుగడ సాధించింది. – కంది చొక్కారెడ్డి, పెద్దపల్లి -
వ్యవసాయ కుటుంబం నుంచి ఆర్డీవోగా..
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని బస్టాండ్ ప్రాంతానికి చెందిన పొందుగుల భూషిత్రెడ్డి గ్రూప్–1 ఫలితాల్లో ఆర్టీవోగా ఎంపికయ్యాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన భాస్కర్‌రెడ్డి–విజయలక్ష్మి దంపతుల కుమారుడు భూషిత్రెడ్డి. గ్రూప్–1లో 343వ ర్యాంక్‌తో ఆర్డీవోగా ఉద్యోగం సాధించారు. భూషిత్రెడ్డి పాఠశాల విద్యాభ్యాసం పెద్దపల్లి, హైదరాబాద్‌లో ఇంటర్, వరంగల్ ఎన్ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ప్రస్తుతం బెంగళూరులో ఇన్‌కంటాక్సు ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులతో భూషిత్రెడ్డి -
● రోజంతా వర్షం.. ● రోడ్లన్నీ బురదమయం ● అస్తవ్యస్తంగా పారిశుధ్యం
జగిత్యాల: జిల్లా కేంద్రంలో ఉదయం నుంచే వర్షం కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఉద్యోగులు, మహిళలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పండుగకావడంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు జిల్లాకేంద్రానికి వస్తుంటారు. రోడ్లన్నీ బురదమయంగా మారడంతో నానా ఇబ్బందులకు గురయ్యారు. సద్దుల బతుకమ్మ సమీపించినా.. మున్సిపల్ అధికారులు ఎక్కడా మొరం పోయించలేదు. కనీసం మహిళలు ఆడుకోవడానికీ ఇబ్బందిగా మారింది. రోడ్లు బాగా లేక.. బురదమయం కావడంతో వాహనదారులు, ప్రజలు నడవడానికే అవస్థలు పడ్డారు. సద్దుల పండుగ సందర్భంగా రోడ్ల మరమ్మతు, ఘాట్ల వద్ద ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.20 లక్షలు కేటాయించినా.. ఇప్పటివరకు పనులు ముందుకుసాగడం లేదు. అస్తవ్యస్తంగా పారిశుధ్యం జిల్లా కేంద్రంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. డ్రైనేజీలోని పూడికతీత తీయకపోవడం.. తీసినా రోడ్లపైనే ఉంచడం.. వర్షానికి అంతా రోడ్డుపైకి కొట్టుకొచ్చి దుర్వాసన వెదజల్లుతోంది. కొన్ని చోట్ల డ్రైనేజీల్లో ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్ల నిండి మురికినీరు బయటకు వెళ్లడంలేదు. వర్షానికి డ్రైనేజీలన్నీ నిండి రోడ్లపైనే మురికినీరు ప్రవహిస్తోంది. మున్సిపల్ అధికారులు స్పందించి పారిశుధ్యం మెరుగుపర్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ చిత్రంలో కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని విద్యానగర్ ప్రధాన రోడ్డు. వర్షం కురవడంతో పూర్తిగా బురదమయమైంది. ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డు నుంచి ముప్పారపు ట్యాంక్‌కు వెళ్తుంటారు. బతుకమ్మ పండుగకు కనీసం మొరం పోయకపోవడంతో పూర్తిగా బురదమయంగా మారింది. అధికారులు స్పందించి బతుకమ్మ ఆడుకునే మహిళల కోసం మొరం పోయాలని మహిళలు కోరుతున్నారు. -
ఘనంగా బతుకమ్మ సంబరాలు
జగిత్యాలరూరల్/జగిత్యాలటౌన్/జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాకేంద్రంలో గురువారం బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. బస్టాండ్‌లో ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు ఆడిపాడా రు. డిపో మేనేజర్ కల్పన, సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం, ఎస్‌ఏవో తిరుపతయ్య, డీఈలు గంగారాం, మధుసూదన్ పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అశోక్‌కుమార్ కోలాటం ఆడారు. పూలను పూజించే సంప్రదాయం ఇక్కడే ఉందన్నారు. డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, ఏవో శశికళ, ఆర్ఐ కిరణ్‌కుమార్, వేణు, సైదులు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీకి 3.05 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 3.05 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. దీంతో ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరి లోకి వదులుతున్నారు.శాకంబరిగా అమ్మవారుధర్మపురి: దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారు గురువారం శాకంబరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కాత్యాయనిగా అమ్మవారి దర్శనంమల్యాల: కొండగట్టు అంజన్న ఆలయంలో అమ్మవారు కాత్యాయినిగా దర్శనమిచ్చారు. స్థానాచార్యులు కపీందర్, ఉపప్రధాన అర్చకులు చిరంజీవస్వామి, అర్చకులు అఖిల్ కృష్ణ అమ్మవారిని అలంకరించి, పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు.ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లుమల్లాపూర్ : ముత్యంపేటలోని చక్కెర కర్మాగారం వద్ద పరిశ్రమలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చేపట్టనున్న ప్రజాభిప్రాయ సేకరణ కు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి, మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, డీఎస్పీ రాములు పరిశీలించారు. షుగర్ ఫ్యాక్టరీలను పునఃప్రారంభించే క్రమంలో రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు అధికారుల బృందం రానుందని, పార్టీలకు అతీతంగా రైతులు పెద్ద సంఖ్యలో రైతులు హాజరుకావాలని సూచించారు. వారి వెంట కిసాన్కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలాల జలపతిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పూండ్ర శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పలత, వైస్ చైర్మన్ ఇట్టెడి నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
సాదాబైనామాలపై స్పెషల్‌డ్రైవ్
● నిష్పక్షపాతంగా విచారణ ● ఒకే గ్రామంలో 15 మంది జీపీవోలు ● రాయికల్ మండలంలో ప్రయోగంరాయికల్: సాదాబైనామాల పరిష్కారానికి రాయికల్ తహసీల్దార్ నాగార్జున వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. మండలంలోని ఓ గ్రామాన్ని ఎంచుకుని.. ఆ గ్రామంలో వచ్చిన దరఖాస్తులను విచారణ చేపట్టేందుకు ఏకంగా 15 మంది జీపీవోలను నియమించారు. మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. భూభారతి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అల్లీపూర్లో 441 దరఖాస్తులు వచ్చాయి. అలాగే ఆలూరులో 42, భూపతిపూర్‌లో 248, బోర్నపల్లిలో 80, చింతలూరులో 54, దావన్పల్లిలో 56, ధర్మాజీపేటలో 76, ఇటిక్యాలలో 956, కట్కాపూర్‌లో 120, కిష్టంపేటలో 65, కుమ్మరిపల్లిలో 94, మైతాపూర్లో 136, మూటపల్లిలో 284, ఒడ్డెలింగాపూర్‌లో 113, రాయికల్ 513, రామాజీపేటలో 102, తాట్లవాయిలో 169, ఉప్పుమడుగులో 27, వస్తాపూర్లో 50, వీరాపూర్‌లో 44 చొప్పున మొత్తంగా 3,670 దరఖాస్తులు వచ్చాయి. ఒకే గ్రామంలో 15 మంది జీపీవోలతో.. 2014 జూన్ 2కు ముందు తెల్లకాగితం ద్వారా భూముల కొనుగోలు, అమ్మకాలు చేసుకుని.. 20202 అక్టోబర్ 12 నుంచి 2020 నవంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ఏయే గ్రామాల్లో ఎంతమంది సాదాబైనామాలకు దరఖాస్తు చేసుకున్నారో సంబంధిత జీపీవోల నుంచి సమాచారం సేకరించారు. వీటిని నిష్పక్షపాతంగా పరిష్కరించే దిశగా తహసీల్దార్ నాగార్జున ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రతిరోజు ఒక రెవెన్యూ గ్రామాన్ని ఎంపిక చేసుకుని.. ఆ గ్రామంలో ముందస్తుగా సమాచారం అందించి.. ప్రజలముందే సాదాబైనామాలపై రెవెన్యూ అధికారులతోపాటు, 15 మంది జీపీవోలతో పరిష్కరించేలా చూస్తున్నారు. ఆయా గ్రామాల్లో తేదీలు ప్రకటించి ఆ మేరకు సాదాబైనామాల సమస్యకు చెక్ పెట్టేందుకు ముందుకు కదులుతున్నారు. దరఖాస్తుదారులకు ఇబ్బందులు కలగకుండా ఆ గ్రామానికే రెవెన్యూ అధికారులు, జీపీవోలు వెళ్లి పరిష్కరించడం అభినందనీయమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్టీసీలో ప్రయాణించండి.. బహుమతి గెలుచుకోండి
జగిత్యాలటౌన్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి లక్కీడ్రాలో బహుమతి గెలుచుకోవాలని జగిత్యాల డిపో మేనేజర్ కల్పన ప్రయాణీకులను కోరారు. దసరా నవరాత్రులను పురస్కరించుకుని ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిందని, ఈనెల 27నుంచి అక్టోబర్ 6వరకు సెమీ డీలక్స్, డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారు లక్కీడ్రాకు అర్హులని తెలిపారు. ప్రయాణికులు తమ బస్ టికెట్ వెనుక పేరు చిరునామా, ఫోన్ నంబర్ వివరాలు రాసి బస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన డ్రా బాక్స్‌లో వేయాలని సూచించారు. అక్టోబర్ 8న కరీంనగర్ రీజనల్ ఆఫీసులో లక్కీడ్రా ఉంటుందని పేర్కొన్నారు. రీజియన్ నుంచి ముగ్గురు విజేతలను ఎంపిక చేసి మీడియా ద్వారా తెలియజేస్తామని వివరించారు. మొదటి బహుమతి రూ.25వేలు, రెండో బహుమతి రూ.15వేలు, మూడో బహుమతి రూ.10వేలు చెక్కు రూపంలో అందిస్తామని తెలిపారు. -
సూర్యప్రభ వాహనంపై శ్రీలక్ష్మీనృసింహుడు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి వారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అయితే దేవుడిపై వర్షం కురిస్తే అరిష్టమని, ఈ విష యం తెలిసినా ఆలయ అధికారులు కవర్లు కప్పుకొని ఊరేగించారని పలువురు భక్తులు అనడం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం వర్షం కురవడంతో సేవను నిలిపిశారు. గురువారం సేవను కొనసాగించడంపై విమర్శలు వాచ్చాయి. దీనిపై ఆలయ చైర్మన్ జక్కు రవీందర్‌ను వివరణ కోరగా.. ఊరేగింపు సమయంలో వర్షం రాలేదని, ముందు జాగ్రత్త చర్యగా కవర్లు కప్పుకొని స్వామివారి శోభాయాత్ర చేశామని పేర్కొన్నారు. హంస వాహనంపై స్వామివారుకోరుట్లటౌన్: పట్టణంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీఅష్టలక్ష్మీ ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు కనులపండువగా నిర్వహించారు. హింస వాహనంపై స్వామివారు, గజ వాహనంపై శ్రీవారు దర్శనమిచ్చారు. మహిళలు మంగళహారతులతో పూజలు చేశారు. ఆలయాల చైర్మన్లు ఎతిరాజం నర్సయ్య, బూరుగు రామస్వామిగౌడ్, కార్యనిర్వహణాధికారి విక్రమ్, సహాయాధికారి పి.నర్సయ్య, పూజారులు బీర్నది నరసింహాచారి, ఇందుర్తి మధుసూదనచారి పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి కృషి
ధర్మపురి: గ్రామాల్లో వసతులు కల్పించి.. అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండలంలోని రాయపట్నం, దోనూర్లో రూ.45 లక్షలతో చేపట్టనున్న పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఇచ్చిన హామీ మేరకు ప్రతి గ్రామంలో వంద శాతం అభివృద్ధి చేస్తామన్నారు. రాయపట్నంలో రూ.12లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణం, రూ.5లక్షలతో అంబేడ్కర్ భవనం పనులు, రూ.1.5 లక్షలతో ఎలక్ట్రికల్ లైట్లకు శంకుస్థాప న చేశారు. దోనూర్లో రూ.15 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ.10లక్షలతో నిర్మించే సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఏఎంసీ చైర్పర్సన్ చిలుముల లావణ్య, నాయకులు ఎస్.దినేష్, కుంట సుధాకర్ తదితరులున్నారు. -
మహిళలు ఆరోగ్యంగా ఉండాలి
● డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ మల్యాల: మహిళలు ఆరోగ్యంగా ఉండాలని, అప్పుడే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని డీఎంహెచ్‌వో ప్రమోద్ కుమార్ అన్నారు. స్వస్త్‌నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం మండల వైద్యురాలు మౌనిక ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు, పురుషులు సుమారు 300మందికిపైగా పరీక్షలు చేశారు. గ్రామీణ మహిళలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. సకాలంలో వ్యాధులను గుర్తించి చికిత్స అందిస్తే క్యాన్సర్ వంటి వ్యాధిని కూడా నియంత్రించవచ్చని అన్నారు. వైద్యులు శ్రీనివాస్, జైపాల్ రెడ్డి, మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫార్మసిస్ట్.. తెరవెనుక వైద్యుడు
కోల్‌సిటీ(రామగుండం): వ్యాధిని గుర్తించి, నివారణకు తగిన మందు సూచించేది డాక్టరు.. మందుల ఎంపిక, మోతాదు, వినియోగించే విధానం తదితర మొత్తం ప్రక్రియపై దిశ, నిర్దేశం చేసేది ఫార్మసిస్ట్.. ఇలా వైద్యులపాత్ర కూడా పోషించేది ఫార్మసిస్టే. పేషెంట్ ఆరోగ్య పరిరక్షణలో వీరే కీలకపాత్ర. ఆరోగ్య సంరక్షణలో వీరు అందిస్తున్న అమూల్య సేవలు, సహకారాన్ని గౌరవించేందుకు ఏటా సెప్టెంబర్ 25న ప్రపంచ ఫార్మాసిస్ట్‌ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈఏడాది ‘థింక్ హెల్త్.. థింక్ ఫార్మసిస్ట్’ నినాదం ఎంచుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఐదు వేల మంది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 4వేల వరకు రిటైల్ మెడికల్ షాపులు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా లో 1,500 నుంచి 1,600 వరకు, పెద్దపల్లిలో 700, జగిత్యాలలో 950, రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 650 వరకు మెడికల్ షాపులు ఉన్నాయి. వీటితోపాటు హోల్‌సేల్ దుకాణాలు మరో 200 దాకా ఉన్నాయి. వీటిలో సుమారు 5వేల నుంచి 6వేల మంది వరకు ఫార్మసిస్ట్‌లు సేవలు అందిస్తున్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో తనిఖీలు, కేసులు.. ఉమ్మడి జిల్లాలో డ్రగ్ ఇన్స్‌స్పెక్టర్లు(ఫార్మసీ కోర్సు పూర్తిచేసినవారు) మెడికల్‌షాపుల లైసెన్స్, రెన్యూవల్స్ జారీచేయడంతోపాటు మెడికల్ షాపుల్లో తనిఖీలు, మందుల నాణ్యత పరిశీలిస్తున్నారు. అనుమానం వచ్చిన మందులను ల్యాబొరేటరికి పరిశీలనకు పంపిస్తున్నారు. నాణ్యతలో లోపం ఉంటే సంబంధిత విక్రయదారు, తయారీదారుపై చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. వైద్యుల తర్వాత ఫార్మసిస్ట్దే కీలకపాత్ర.. పేషెంట్లకు వైద్యం అందిచండంలో వైద్యుల తర్వాత ఫార్మసిస్టులే కీలకం. వ్యాధి త్వరగా నయం కావడానికి, మందులను ఎంత మోతాదులో వేసుకోవాలో చెబుతారు. ప్రయోజనాలు, దుష్ప్రభావాల గురించి సైతం వివరిస్తూ అత్యంత కీలకపాత్ర పోషిస్తారు. కొందరు ఫార్మసిస్ట్‌లు మందుల తయారీ కోసం ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో పనిచేస్తుండగా, ఔషధ పరిశోధన, అభివృద్ధి, భద్రతా పరీక్షలకు మరికొందరు సహకరిస్తున్నారు. ఔషధాల్లోని లోపాలను తగ్గించేందుకూ కృషి చేస్తున్నారు. ● వైద్యుల పాత్ర పోషించేది వారే.. ● నేడు ప్రపంచ ఫార్మసిస్ట్ డే -
ప్రతీనెల తనిఖీలు చేస్తున్నాం
ప్రతీనెల 30కిపైగా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలు అతిక్రమించి ఔషధాలు విక్రయించే మెడికల్ షాపులపై కేసులు నమోదు చేస్తున్నాం. ఫార్మసిస్ట్‌ల పర్యవేక్షణలోనే మందుల క్రయ, విక్రయాలు సాగాలి. ఫార్మసీ చదివిన వారు సొంతంగానే వ్యాపారం చేయాలి. ఇతరులు వ్యాపారం చేయడానికి వారి సర్టిఫికెట్లు ఇవ్వకూడదు. పేషెంట్లు మందులు వాడడంలో ఫార్మసిస్ట్‌లు అవగాహన, చైతన్యం కలిగించాలి. కాలం చెల్లించిన మందులపై ఫార్మసిస్ట్‌లు పేషెంట్లకు దిశానిర్దేశం చేయాలి. – పిట్ట శ్రావణ్, డ్రగ్ ఇన్స్పెక్టర్ -
కాసులిస్తే రైట్‌రైట్
కోరుట్ల: అనుకున్న రీతిలో కాసులు చేతికి అందితే చాలు ఇసుక అక్రమ రవాణాదారులకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. కాదంటే కేసులు.. భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఇదీ కోరుట్ల రెవెన్యూ సిబ్బందిలో కొంతమంది తీరు. మామూళ్ల వసూళ్ల కోసం కొందరు ఏకంగా ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నా.. ఉన్నతాధికారుల దృష్టికి రాకపోవడం మరింత విడ్డూరం. కిందిస్థాయి అధికార యంత్రాంగంపై కరువైన పర్యవేక్షణకు ఇది నిదర్శనంగా కనిపిస్తోంది. అక్రమార్కులపై ఔదార్యం.. అడ్డగోలుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. ఒక్కోసారి పగలు..రాత్రి తేడా లేకుండా రెవెన్యూ సిబ్బంది ఇసుక రవాణాను అడ్డుకుని జరిమానా వేస్తున్నారు. మూడు నెలల వ్యవధిలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు 120 ట్రాక్టర్లను పట్టుకున్నారు. అయితే కొంతమంది రెవెన్యూ సిబ్బంది కాసులు వసూలు చేస్తూ అక్రమార్కులపై ఎక్కడా లేని ఔదార్యం చూపుతున్నారు. రాత్రి వేళ పట్టుబడిన ఇసుక లారీలు, ట్రాక్టర్ల యజమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ వదిలేస్తున్నారు. ప్రైవేటు ఏజెంట్లు.. రెవెన్యూకు రెండు కళ్లుగా పనిచేయాల్సిన ఇద్దరు అధికారులు తమ కింద ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వసూళ్ల దందా సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్నెళ్ల క్రితం ఓ వ్యక్తిని దళారీగా పెట్టుకుని ఇసుక ట్రాక్టర్లను ఆపి డబ్బులు డిమాండ్ చేయించిన వీడియో వైరల్ అయింది. నేరుగా డబ్బులు తీసుకుంటే ఏసీబీకి ఎక్కడ చిక్కుతామోనన్న భయంతో నేర్పుగా తాము నియమించుకున్న ఏజెంట్ల ఫోన్ పేకు డబ్బులు పంపాలని సూచిస్తున్నారు. 20 రోజుల క్రితం ఓ అధికారి అర్ధరాత్రి వేళ కోరుట్ల పరిఽధిలో ఇసుక లారీలను పట్టుకున్నారు. తమ ప్రైవేటు ఏజెంట్ ఫోన్‌కు ఫోన్‌పే చేయించి తరువాత ఇసుక లారీలను వదిలేసిన తీరు పరిస్థితికి అద్దం పడుతోంది. కోరుట్ల, కథలాపూర్ పరిసరాల్లో పెద్ద ఎత్తున సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన అఽధికారులు ఈ రీతిలో వ్యవహరించడం అక్రమార్కులకు అడ్డుఅదుపూ లేకుండా పోయింది. ఓ రెవెన్యూ ఏజంట్‌కు ఫోన్‌పే చేసిన రసీదులు చర్యలు తీసుకుంటాం రెవెన్యూ సిబ్బంది ప్రైవేటు వ్యక్తులతో కలిసి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయం మా దృష్టికి రాలేదు. ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ఈ విషయంలో ఫిర్యాదులు వస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. – కృష్ణ చైతన్య, తహసీల్దార్, కోరుట్ల -
‘కడారి’ కడచూపునకే నిరీక్షణ
సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): మావోయిస్టు అగ్రనేత కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొస(70) ఎన్కౌంటర్లో మరణించగా కడసారి చూపుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో సోమవారం ఎన్కౌంటర్లో మరణించిన తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లెకు చెందిన సత్యనారాయణరెడ్డి మృతదేహాన్ని తెచ్చేందుకు ఆయన సోదరుడు కరుణాకర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు మంగళవారం తరలివెళ్లారు. నారాయణపూర్‌లో శవపంచనామా, పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీస్ అధికారులు జాప్యం చేయడంతో బుధవారం రాత్రి వరకు మృతదేహాన్ని అప్పగించలేదు. కనీసం తమ్ముడి శవాన్ని కళ్లతో చూసుకుంటానని కరుణాకర్‌రెడ్డి పోలిసులను ప్రాధేయపడినా వారు కనికరించలేదు. కాసేపట్లో శవాన్ని అప్పగిస్తామంటూ రోజంతా కాలయాపన చేశారు. చివరి 45 ఏళ్లుగా ఇంటికి, కంటికి దూరమైన తమ్ముడిని చూసేందుకు కరుణాకర్‌రెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు. మృతదేహాన్ని అప్పగిస్తామంటూ బుధవారం రాత్రి వరకు హామీలా పరంపరను పోలీసులు కొనసాగించారు. నింగినేలా ఏకమై.. నారాయణపూర్‌లో మంగళవారం రాత్రి నుంచి నింగినేలా ఏకమైనట్లు వర్షం కురుస్తూనే ఉంది. నారాయణపూర్ జిల్లా ఆస్పత్రి మార్చురీ వద్ద వరదనీరు, బురదతో కలిసి శవాన్ని తరలించేందుకు ప్రతికూలంగా ఉంది. జోరువానతో రోడ్లు బురదమయమై రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కడారి సత్యనారాయణరెడ్డి శవంతో గురువారం ఉదయం గోపాల్‌రావుపల్లెకు చేరే అవకాశం ఉంది. శవం అప్పగింతపై ఆరా.. మావోయిస్టు అగ్రనేత కొస మృతదేహం అప్పగింతపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆసక్తి నెలకొంది. ఆయన చదువుకున్న పెద్దపల్లి, ఉద్యమం బాటపట్టిన బసంత్నగర్తోపాటు సిరిసిల్ల జిల్లాకు చెందిన పలువురు ఆరా తీశారు. వివిధ పార్టీల నాయకులు కొసను కడసారి చూసేందుకు స్వగ్రామం గోపాల్‌రావుపల్లెకు వస్తామంటూ మృతదేహం అప్పగింతపై వివరాలు సేకరించారు. సత్యనారాయణరెడ్డి మృతదేహంతో ఊరు చేరేందుకు కుటుంబ సభ్యులు పడిగాపులు కాసారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): చిన్నతనంలోనే విప్లవబాట పట్టి.. స్వగ్రామమైన గోపాల్రావుపల్లెను విడిచి వెళ్లిన కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొస అలియాస్ సాదు ఉద్యమంలోనే అసువులుబాసారు. 45 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన సత్యనారాయణరెడ్డి మళ్లీ చివరిమజిలీ కోసం స్వగ్రామానికి అమరుడై వస్తున్నాడు. స్వగ్రామంలోనే గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో గోపాల్రావుపల్లెలోని సత్యనారాయణరెడ్డి ఇంటిని గ్రామస్తులు శుభ్రం చేశారు. ఇంటి చుట్టూ ఏపుగా పెరిగిన మొక్కలను తొలగించారు. నారాయణపూర్‌లో కుటుంబ సభ్యుల పడిగాపులు నేడు గోపాలరావుపల్లెకు చేరనున్న మృతదేహం -
‘స్థానిక’ రిజర్వేషన్లు బహిర్గతం చేయాలి
సారంగాపూర్: ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసిందని, రిజర్వేషన్ల కేటాయింపు చేపట్టిన నేపథ్యంలో అధికారులు గ్రామాలవారీగా రిజర్వేషన్లను ప్రకటించాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి కోరారు. మండలకేంద్రంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. 2024 కుల గణన ఆధారంగా 42శాతం బీసీలకు కేటాయించే స్థానాలను ప్రకటించాలన్నారు. 2011 ఎస్సీ, ఎస్టీ జనాభా ఆధారంగా వారి స్థానాలను కూడా విడుదల చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో కార్యకర్తలే సుప్రీం అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, సన్నబియ్యం పంపిణీ, సన్నాలకు రూ.500 బోనస్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని తెలిపారు. కాంగ్రెస్ మండల నాయకులు రాంచంద్రారెడ్డి, రాజన్న, పూర్ణచందర్‌రెడ్డి, మహేశ్, గంగాధర్, గోపి, గంగారాం, ఆదర్శ్, లక్ష్మారెడ్డి, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
టీజీఎన్పీడీసీఎల్ యాప్‌తో మరిన్ని సేవలు
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించడంలో భాగంగా టీజీఎన్పీడీసీఎల్ యాప్‌ను సంస్థ రూపొందించింది. వినియోగదారులకు సేవలు విస్తరించడమే లక్ష్యంగా విద్యుత్ సంస్థ ముందుకు సాగుతోంది. ఇంటి వద్ద నుంచే విద్యుత్ సేవలు పొందేలా ఈ యాప్‌ను విద్యుత్ సంస్థ అందుబా టులోకి తెచ్చింది. అత్యుత్తమ సాంకేతికతను జోడిస్తూ వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా 20 ఫీచర్లతో తయారు చేసిన ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు వినియోగించొచ్చు. ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని విద్యుత్ సేవలు పొందొచ్చు. 20 ఫీచర్లతో.. విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకోకుండా విద్యుత్‌కు సంబంధించిన ప్రతీ అంశాన్ని యాప్‌లో రూపొందించారు. వినియోగదారులు ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకుంటూ విద్యుత్ సేవలు పొందొచ్చు. రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్, కన్స్యూమర్ గ్రీవెన్సెస్, సెల్ఫ్ రీడింగ్, పే బిల్స్, బిల్ హిస్టరీ, ఆన్లైన్ పేమెంట్ హిస్టరీ, కొత్త కనెక్షన్ తీసుకునేందుకు కావాల్సి న వివరాలు, లింక్ ఆధార్ అండ్ ఫోన్ నంబర్, డొమెస్టిక్ బిల్, కొత్త కనెక్షన్ ఎలా తీసుకోవాలి? పేరు, లోడ్ మార్పు గురించి, పవర్ కంజప్టెడ్ గైడ్‌లైన్స్, టారిఫ్ డిటేయిల్స్, ఎనర్జీ సేవింగ్ టిప్స్, సేఫ్టీ టిప్స్, ఫీడ్ బ్యాక్, మై ఎకౌంట్, వినియోగదారుల బిల్లు సమాచారం, వినియోగదారుల పరిధిలోని అధికారి వివరాలు, కాంటాక్ట్ అజ్ వంటి ఫీచర్లు పొందుపర్చారు. వినియోగదారులకు ఉపయోగపడేలా యాప్‌ను రూపొందించింది. విద్యుత్ కనెక్షన్ పొందడం నుంచి బిల్లింగ్, పేమెంట్ వివరాలతోపాటు అంతరాయాల సమస్యను సంబంధిత అధికారికి తెలియజేయొచ్చు. కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా ఇంటి వద్ద నుంచే యాప్ ద్వారా సేవలను పొందొచ్చు. 24/7 టోల్‌ఫ్రీ నంబర్లు పని చేస్తాయి. 18004250028, 1912 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి విద్యుత్ సంబంధిత సమస్యలు పరిష్కరించుకోవచ్చు. – మేక రమేశ్‌బాబు, ఎస్ఈ, కరీంనగర్ 20 ఫీచర్లతో ఆండ్రాయిడ్ వెర్షన్లో యాప్ -
పందెం కోళ్ల పెంపకంపై శిక్షణ
మంథనిరూరల్: మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఎస్సీ మహిళలకు పందెం కోళ్ల పెంపకం, నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. షెడ్యూల్డ్ కులాలు, సబ్ ప్లాన్‌లో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేవికే శాస్త్రవేత్తలు మహిళలకు పలు సూచనలు చేశారు. దేశీకోళ్ల కాన్న అత్యధిక వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయని, వేగంగా పరుగెత్తడం, శత్రువులను ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలు అధికంగా ఉండడం వీటి లక్షణమన్నారు. ఆరునెలల్లోనే రెండు కేజీల నుంచి మూడు కేజీల వరకు బరువు పెరుగుతాయని తెలిపారు. ఆడకోళ్లు 120 నుంచి 140 గుడ్లు పెడతాయని వివరించారు. అనంతరం ఒక్కొక్కరికి పది కోడిపిల్లలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వై.వెంకన్న, కిరణ్, బండారి నరేశ్, నాయకులు పేరవేన లింగయ్య, మంథని సత్యం, ప్రభాకర్‌రెడ్డి, బొడ్డు శ్రీనివాస్, ఆర్ల నారాయణ, సదానందం తదితరులు పాల్గొన్నారు. -
పోగొట్టుకున్న బంగారం అప్పగింత
హుజూరాబాద్: దారిలో దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు ఓ దంపతులు. వారిని హుజూరాబాద్ సీఐ సత్కరించారు. సీఐ వివరాల ప్రకారం.. మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన రెడ్డబోయిన రమేశ్ మూడ్రోజుల క్రితం భీమదేవరపల్లి మండలం కొప్పురు నుంచి తన కుటుంబానికి చెందిన 13తులాల బంగారంతో బైక్‌పై హుజూరాబాద్ వస్తున్నాడు. మార్గమధ్యలో ఇప్పలనర్సింగాపూర్ శివారులో బైక్నుంచి బ్యాగ్ జారి కిందపడిపోయింది. బంగారం పోగొట్టుకున్న రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పలనర్సింగాపూర్ గ్రామానికి చెందిన సమ్మయ్య–నఫీజా దంపతులకు బ్యాగు దొరికింది. వారు పోలీసులకు అప్పగించారు. సీఐ కరుణాకర్ దంపతులను అభినందించి, రమేశ్‌కు బంగారం ఉన్న బ్యాగును అప్పగించారు. ఆస్పత్రులే లక్ష్యంగా..● ద్విచక్ర వాహనాలు చోరీ ● ముగ్గురిని పట్టుకున్న పోలీసులు ● 13 బైక్‌లు స్వాధీనం కరీంనగర్‌రూరల్: ఆస్పత్రుల వద్ద పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలు దొంగతనం చేస్తున్న ముగ్గురిని బుధవారం కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కరీంనగర్‌రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ద్విచక్రవాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురు మైనర్లను పట్టుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేయగా 13 ద్విచక్రవాహనాలు దొంగిలించామని, కొన్నింటిని విక్రయించి, మరికొన్ని దాచిపెట్టినట్లు తెలిపారు. చల్మెడ ఆనందరావు ఆస్పత్రి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, అపోలో ఆస్పత్రి వద్ద వాహనాలు దొంగిలించినట్లు అంగీకరించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుచగా రిమాండ్ చేశారు. దొంగలను పట్టుకున్న సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సైలు లక్ష్మారెడ్డి, నరేశ్‌ను సీపీ గౌస్ ఆలం, రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ అభినందించారు. మానకొండూర్: మండలంలోని శంషాబాద్ గ్రామంలోని ఓ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి మత్తుపదార్థాలు లభ్యమయ్యాయని గ్రామస్తులు తెలిపారు. హైదరాబాద్ నుంచి మత్తు పదార్థాలను తీసుకువచ్చి ఇంట్లో దాచగా విషయం తెలుసుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారని వివరించారు. -
ఎస్సారెస్పీకి భారీగా ఇన్‌ఫ్లో
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 2.54 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో 40 గేట్లు ఎత్తి 3,85,160 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.మంటపాల వద్ద సౌకర్యాలు కల్పించాలని..జగిత్యాలటౌన్: దుర్గామాత మంటపాల వద్ద సౌకర్యాలు కల్పించాలని భవానీ దీక్షాస్వాములు డిమాండ్ చేశారు. టీఆర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన దుర్గామాత మంటపం వద్ద మొరం, లైటింగ్ ఏర్పాటు చేయాలని పలుమార్లు బల్ది యా అధికారులను కోరినా స్పందించడం లేద ని బుధవారం జగిత్యాల బల్దియా ఎదుట బై టాయించారు. దుర్గామాత మంటపంతో పా టు పాత బతుకమ్మ ఘాట్ వద్ద లైటింగ్ ఏర్పా టు చేయాలని కోరారు. కమిషనర్ స్పందన స్పందించి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. కోటగిరి మోహ న్, గజేందర్, భవానీలు పాల్గొన్నారు.చెరుకు రైతుల కల నెరవేరబోతోందిమల్లాపూర్ : షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, త్వరలోనే చెరుకు రైతుల కల నెరవేరబోతోందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణలో భాగంగా రూ.200కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. పరిశ్రమలు, వ్యవసాయశాఖ అధికారుల బృందాన్ని ఈ 26న షుగర్ ఫ్యాక్టరీ వద్దకు పంపి రైతుల అభిప్రాయం సేకరించనుందని పేర్కొన్నారు. ఫ్యాక్టరీ తెరవాలంటే కనీసం 10వేల ఎకరాల్లో చెరుకు సాగు అవసరమని, తాము సాగు చేస్తామని రైతులు తెలపాలని కోరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పలత, వైస్ చైర్మన్ ఇట్టెడి నారాయణరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పూండ్ర శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నల్ల బాపురెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ నల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.రాష్ట్రస్థాయి పోటీలకు చల్గల్ విద్యార్థినిజగిత్యాలరూరల్: చల్గల్ జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన విద్యార్థిని శిరిణ్ మిత్ర రాష్ట్రస్థాయి కబడ్డీ సబ్ జూనియర్ పోటీలకు ఎంపికై నట్లు పీడీ వెంకటలక్ష్మీ తెలిపారు. ఈనెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్‌లో జరిగే కబడ్డీ పోటీల్లో శిరిణ్మిత్ర పాల్గొంటుందని పేర్కొన్నారు. శిరిణ్ను బుధవారం హెచ్ఎం లతాదేవి, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ నీరటి సుకన్య, ఉపాధ్యాయులు అభినందించారు.పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంమల్యాల: పిల్లలు, గర్భిణులకు పోషకాహారం అందించి, ఆరోగ్య తెలంగాణలో భాగస్వామ్యం కావాలని శిశు సంక్షేమశాఖ జిల్లా అధి కారి బి.నరేశ్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో బుధవారం స్వస్త్‌నారీ శక్తి అభియాన్‌లో భాగంగా అంగన్వాడీ టీచర్లు పోషకాల స్టాళ్లను ప్రదర్శించారు. రంగులతో ముగ్గులు వేశారు. పోషకాలతో తయా రు చేసిన పిండి వంటలు, మిల్లెట్స్, స్టాళ్లను నరేశ్ పరిశీలించారు. బేటీ పడావో.. బేటీ బచావోపై అవగాహన కల్పించారు. సీడీపీఓ వీరలక్ష్మీ, డాక్టర్ జైపాల్ రెడ్డి, ఏసీడీపీఓ అరవింద, సూపర్వైజర్లు పవిత్ర, శారద, సిబ్బంది స్వప్న, గౌతమి పాల్గొన్నారు. -
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
కథలాపూర్: విద్యుత్ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ట్రాన్స్‌కో ఎస్ఈ సుదర్శనం తెలిపారు. మండలంలోని గంభీర్పూర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఇంటర్ లింకింగ్ సిస్టంను బుధవారం ప్రారంభించారు. గంభీర్పూర్, భీమారం మండలం గోవిందారంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల మధ్య కొత్తగా విద్యుత్ స్తంభాలు, వైర్లను ఏర్పాటు చేశామన్నారు. సరఫరాలో సమస్యలు వస్తే ఒక సబ్‌స్టేషన్ నుంచి మరో సబ్‌స్టేషన్‌కు విద్యుత్‌ను సరఫ రా చేయవచ్చని కొత్తగా లైన్లు ఏర్పాటు చేశామన్నారు. వినియోగదారులు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో డీఈలు మధుసూదన్, గోపాలకృష్ణ, ఏడీఈలు రఘుపతి, రాజబ్రహ్మచారి, ఏఈ భూమేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు. -
పండుగలకు పటిష్ట భద్రత
జగిత్యాలక్రైం: దుర్గా శరన్నవరాత్రోత్సవాలు, బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు కల్పించాలని, అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఇవ్వొద్దని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని పట్టణ, ట్రాఫిక్ పోలీస్స్టేషన్లను తనిఖీ చేశారు. రికార్డులు, కేసు డైరీలు, రిజిస్టర్లను పరిశీలించారు. పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఆదేశించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. డయల్ 100 కాల్‌రాగానే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోకార్ నిరంతరం గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. పండుగల సందర్భంగా శాంతిభద్రతల సమస్య రానివ్వొద్దని సూచించారు. సీఐ కరుణాకర్, ఎస్సైలు సుప్రియ, కుమారస్వామి, మల్లేశ్, రవికిరణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
సమన్వయంలో పోలీసుల పాత్ర అభినందనీయం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతిజగిత్యాలజోన్: కక్షిదారుల మధ్య సయోధ్య కుది ర్చి.. లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం కావడంలో పోలీసుల పాత్ర అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి అన్నారు. లోక్ అదాలత్‌లో అత్యధిక కేసుల పరిష్కారంలో కీలకపాత్ర పోషించిన పోలీసులను బుధవారం జిల్లా కోర్టులో అభినందించి, సర్టిఫికెట్లు అందించారు. పెండింగ్ కేసుల పరిష్కారం ద్వారా కోర్టులపై భారం తగ్గుతుందన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. పోలీసు విధుల్లో భాగంగా కేసుల పరిష్కారానికి ప్రయత్నించామన్నారు. మొదటి అదనపు జడ్జి సుగళి నారాయణ మాట్లాడుతూ ఇటీవలి లోక్ అదాలత్‌లో మూడు వేలకుపైగా కేసులు పరిష్కరించామన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ కక్షిదారుల మధ్య సమన్వయం కుదర్చడంలో ఎస్పీ నుంచి కోర్టు కానిస్టేబుల్ వరకు చొరవ చూపారని తెలిపారు. మొదటి అదనపు జుడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి పాల్గొన్నారు. 22 మంది కోర్టు కానిస్టేబుళ్లకు సన్మానం లోక్‌అదాలత్‌లో విశేష కృషి చేసిన ఎస్పీ అశోక్, వివిధ పోలీస్స్టేషన్లకు చెందిన 22 మంది కోర్టు కానిస్టేబుళ్లు, నలుగురు పోలీసు అధికారులను ప్రధాన న్యాయమూర్తి సన్మానించారు. 91 కేసులు పరిష్కరించిన సీఐ కరుణాకర్, 57 కేసులు పరిష్కరించిన కోరుట్ల ఎస్సై చిరంజీవి, 56 కేసులు పరిష్కరించిన రాయికల్ ఎస్సై సుధీర్‌రావు, గొల్లపల్లి సీఐ శ్రీనివాస్, ఎస్సై శ్రీకాంత్‌ను అభినందించారు. -
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
ఇబ్రహీంపట్నం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో 21 మంది లబ్ధిదారులకు రూ.5.10లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయామన్నారు. సోయిలేకుండా ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థంకావడం లేదన్నారు. మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, మాజీ కో–ఆప్షన్ ఏలేటి చిన్నారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎలాల దశరథ్‌రెడ్డి, నాయకులు జాజాల జగన్రావు, సున్నం స త్యం, నేమూరి నరేష్, తదితరులు పాల్గొన్నారు. -
తండాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం
పెగడపల్లి: తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ప్రతి తండాలో గిరిజన భవనం నిర్మాణానికి నిధులు కేటాయిస్తామన్నారు. మండలంలోని కీచులాటపల్లి నుంచి మల్లాపూర్ వరకు రూ.8 కోట్లు, ఏడుమోటలపల్లి తండా నుంచి పెగడపల్లి వరకు రూ.2 కోట్లతో నిర్మిస్తున్న రహదారులను బుధవారం పరిశీలించారు. కాంట్రాక్టర్లు ఇష్టారీతిన నష్టపరుస్తున్నారని ఇరువైపులా సమానంగా భూమి తీసుకో వడం లేదని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల్లో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను వివరించారు. పరిష్కారానికి ప్రతిపాదనలు పంపాలని ఎస్ఈ సుదర్శన్‌కు మంత్రి సూచించారు. అంతకుముందు అమ్మవారలను దర్శించుకున్నారు. అనంతరం 78 మందికి ప్రమాద బీమా పరిహారం చెక్కులు అందించారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములుగౌడ్, వైస్ చైర్మన్ సత్తిరెడ్డి, డీసీవో మనోజ్‌కుమార్, గొల్లపల్లి ఏడీఈ వరుణ్‌కుమార్ పాల్గొన్నారు. -
‘బోనస్’ ఇంకా రాలే..
జగిత్యాలఅగ్రికల్చర్: యాసంగిలో రైతుల నుంచి సన్నరకం ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం.. రైతులకు ఇప్పటివరకు బోనస్ చెల్లించలేదు. గత యాసంగిలో క్వింటాల్‌కు కేంద్రం రూ.2,320 చెల్లించింది. ఈ మొత్తానికి అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నెలలు గడుస్తున్నా.. బోనస్ రాకపోవడంతో అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. సివిల్ సప్లై అధికారులు, కలెక్టరేట్లోని ప్రజావాణిలో మొరపెట్టుకుంటూనే ఉన్నారు. నెలలు గడుస్తుండడంతో అసలు బోనస్ ఇస్తుందా..? లేదా..? అని ఆందోళన చెందుతున్నారు. 47,880 క్వింటాళ్లు సేకరణ గత యాసంగిలో ఐకేపీ, సింగిల్ విండో కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లావ్యాప్తంగా రైతుల నుంచి 47,880 క్వింటాళ్ల సన్నాలు కొనుగోలు చేశారు. తప్ప, తాలు పేరిట క్వింటాల్‌కు కిలో నుంచి రెండు కిలోలు కట్ చేశారు. కొన్న ధాన్యాన్ని మిల్లులకు పంపించారు. వాటికి సంబంధించి రూ.500 బోనస్ చొప్పున రైతులకు రూ.2.39 కోట్లు రావాల్సి ఉంది. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే బోనస్ జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆచరణలో సాధ్యం కాలేదు. 2024 నవంబర్ 16 న తొలిసారి బోనస్ విడుదల చేసిన ప్రభుత్వం.. తర్వాతి సీజన్ నుంచి ఇవ్వడమే లేదు. దీంతో రైతులు బోనస్ కోసం ప్రతి సీజన్లోనూ ఎదురుచూస్తున్నారు. కొందరు రైతులైతే ప్రతిరోజూ బ్యాంకుకు వెళ్లి చెక్ చేసుకుంటున్నారు. యాసంగి సీజన్లో కొనుగోళ్లు ముగిసి నాలుగు నెలలు గడుస్తున్నా.. బోనస్ విడుదల చేయకపోవడంతో ప్రభుత్వంపై అన్నదాతలు గుర్రుగా ఉన్నారు. బోనస్ డబ్బుల వివరాలు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ధాన్యం కొనుగోలు వివరాలను సివిల్ సప్లై శాఖ ఈ–కుబేర్ యాప్‌కు పంపిస్తే ప్రభుత్వం నుంచి శాఖ ఖాతాలో నిధులు జమ చేయాల్సి ఉంది. కానీ.. ప్రభుత్వం నుంచే డబ్బులు రావడంలేదు. బోనస్ రాని రైతులు ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. త్వరలో ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
60 క్వింటాళ్ల బోనస్ రాలే..
నేను 60 క్వింటాళ్ల సన్న ధాన్యాన్ని గడిచిన యాసంగిలో అమ్మిన. బోనస్ రూపంలో రూ.30వేలు రావాల్సి ఉంది. రెండు రోజుల్లోనే క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నాలుగు నెలలైనా ఇవ్వడంలేదు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన. – ఏలేటి మహేశ్ రెడ్డి, కొత్తదాంరాజ్ పల్లి, మల్లాపూర్ మండలం 90క్వింటాళ్లు అమ్మిన నేను 90 క్వింటాళ్ల సన్న ధాన్యం అమ్మిన. రూ.500 చొప్పున నాకు రూ.45వేల బోనస్ రావాలి. ఇప్పటివరకు రాలేదు. సన్న ధాన్యం సాగు చేయాలంటేనే భయమేసే పరిస్థితి నెలకొంది. ఫోన్‌కు ఏ మేసేజ్ వచ్చినా బోనస్ అనుకుంటున్నాం. ఊరిలో చాలామందికి రావాల్సి ఉంది. – మిట్టపెల్లి గంగారెడ్డి, కొత్త దాంరాజ్పల్లి, మల్లాపూర్ మండలం -
టీఎన్జీవోల భూమి ఎక్కడ?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: వారంతా విశ్రాంత ఉద్యోగులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం వీరికి ఇంటిస్థలం కేటాయించింది. దాన్ని కబ్జాదారులు మాయం చేయగా.. మూడు దశాబ్దాల పోరాటం తరువాత మరో చోట 20ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించిన అధికారులు నేటికీ ప్రొసీడింగ్స్ ఇవ్వడం లేదు. దీంతో ఎనిమిదేళ్లుగా ముదిమి వయసులో ఇంటిస్థలానికి అనుమతులు ఇవ్వాలంటూ కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒకటి, కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు దశాబ్దాలుగా కబ్జాకు గురైన తమ స్థలానికి ప్రత్యామ్నాయం చూపాలంటూ ఈ సీనియర్ సిటీజన్లు చేస్తున్న పోరాటం నేటికీ ఆగడం లేదు. నగర శివారుల్లో టీఎన్జీవోలకు కేటాయించిన స్థలం కబ్జా అయినప్పటికీ.. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో 40ఏళ్లుగా తీరని అన్యాయమే మిగిలిందని ఆవేదన చెందుతున్నారు. అసలేం జరిగింది? 1980లో ఉమ్మడి జిల్లాలోని 930మంది టీఎన్జీవోలు కలిసి ఇంటి స్థలాల కోసం హౌసింగ్ సొసైటీగా ఏర్పడ్డారు. తమకు ఇంటిస్థలాలు కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. స్పందించిన అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ వీరికి మూడు చోట్ల ఇంటి స్థలాలు కేటాయించారు. తొలుత కరీంనగర్ కమాన్‌రోడ్‌లోని పాతచెరువు సమీపంలో సర్వే నంబరు 415లో 18 ఎకరాలు, ఎర్రగుంట సమీపంలో సర్వే నంబరు 918లో 14 ఎకరాలు కేటాయించారు. ఈ రెండు స్థలాలను టీఎన్జీవోలకు ప్రభుత్వం స్వాఽ దీనం చేసింది. ఈ స్థలాల్లో 304 మంది టీఎన్జీవోలు ఇండ్లు నిర్మించుకున్నారు. మూడోచోటుగా బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 96లో 20ఎకరాల భూమిని కేటాయించారు. ఈ భూమి తమది అంటూ స్థానిక నేతలు అభ్యంతరం తెలిపారు. ఆ భూమిని కబ్జా చేశారు. దీన్ని స్వాధీ నం చేసుకునేందుకు టీఎన్జీవోలు 2017 వరకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తిమ్మాపూర్‌లో చూసినప్పటికీ బొమ్మకల్‌లో కబ్జా అయిన 20 ఎకరాల విలువైన స్థలం గురించి ఇటు టీఎన్జీవో పెద్దలు, అటు కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా రూ.కోట్లాది విలువైన స్థలం కబ్జాదారుల వశమైంది. దీంతో అప్పటి నుంచి ప్రయత్నించగా.. ఎట్టకేలకు ప్రత్యామ్నాయ భూమిని చూపిస్తే కేటాయిస్తామన్నారు. దాదాపు మూడుదశాబ్దాలపాటు అన్వేషించిన టీఎన్జీవోలు చివరికి 2017లో తిమ్మాపూర్ మండలంలోని యాదవులపల్లి సర్వే 502, 522లలో దాదాపు 21 ఎకరాల ప్రభుత్వ ఖాళీ స్థలం ఉందని గుర్తించి అధికారులకు విన్నవించారు. నివేదికను రెవెన్యూ అధికారులు కలెక్టర్ కార్యాలయానికి పంపినా.. ఇంతవరకూ ఎలాంటి ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు. ఎనిమిదేళ్లుగా కాళ్లు అరిగేలా తిరుగుతున్నా నేటికీ న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి స్థలాలు రాకుండా మిగిలిన 626 మందిలో దాదాపు 100 మంది మరణించార ని, 200 మందికిపైగా అనారోగ్యంతో మంచా న పడ్డారని, దాదాపు 40 ఏళ్లుగా సాగుతున్న పోరాటాన్ని ఇకనైనా గుర్తించి న్యాయం చేయాలని సీఎం, కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఆశావహుల్లో టెన్షన్!
జగిత్యాల: స్థానిక సంస్థల ఎన్నికల సందడి ఊపందుకుంది. పంచాయతీల పాలకవర్గం ముగిసి నెలలు గడుస్తుండడం.. ఈనెల 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం.. సమయం దగ్గర పడడంతో అధికారులు ఆ దిశగా ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు సమాచారం. ఆ వివరాలన్నింటినీ ప్రభుత్వానికి కూడా పంపించినట్లు తెలిసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కానుండటంతో విధివిధానాలను బట్టి రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతటా అదే చర్చ.. స్థానిక రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేయడంతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఎక్కడ నలు గురు కలిసినా రిజర్వేషన్లపైనే చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా గతంలో ఉన్న రిజర్వేషన్లు, స్థానాలు కచ్చితంగా మారుతాయని ఉన్నతాధికారుల నుంచి సమాచారం వస్తుండడంతో ఏ స్థానం ఎవరికి దక్కుతుందోనన్న ఆందోళన ఆశావహుల్లో నెలకొంది. కొందరు ఏకంగా జిల్లా అధికారులకు ఫోన్ చేసి ఏ రిజర్వేషన్ వస్తుందంటూ ఆరా తీస్తున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రిజర్వేషన్లపై జోరుగా ప్రచారం ఊపందుకుంది. లోగుట్టుగా ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి పంపించడంతో ఆశావహుల్లో రిజర్వేషన్లపై తీవ్రమైన ఉత్కంఠ కన్పిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయిస్తున్న నేపథ్యంలో వారికి స్థానాలు అత్యధికంగా పెరిగే అవకాశాలున్నాయి. ఎవరికి ఏ స్థానాలో..? ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు చాలా ఆలస్యం కావడంతో ఆశావహుల్లో నిరాశ వ్యక్తమైంది. రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో తాజాగా టెన్షన్ మొదలైంది. గతంలో ఉన్న రిజర్వేషన్లు మారనుండటంతో ఏవి వస్తాయో..? స్థానం దక్కుతుందో..? లేదోనన్న టెన్షన్ మొదలైంది. ఇటీవల కులగణన సర్వే లెక్కల ఆధారంగా 42 శాతం బీసీలకు కేటాయించనున్న నేపథ్యంలో బీసీలకు ఎక్కువగా స్థానాలు లభించే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచులు, వార్డు సభ్యులకు రిజర్వేషన్లు కేటాయించారు. జిల్లాలో 22 గ్రామపంచాయతీల్లో పూర్తిగా ఎస్టీలు ఉండటంతో వారికే ఆ స్థానాలు దక్కనున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు బయటకు చెప్పవద్దని, గోప్యంగా ఉంచాలని హెచ్చరికలు రావడంతో అధికారులు కూడా బయటకు ఏమీ చెప్పకుండానే లోలోపల తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. సమాచార సేకరణలో బిజీబిజీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తున్నారని ప్రచారం కావడంతో సమాచార సేకరణలో నాయకులు బిజీ అయ్యారు. ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ వర్తిస్తుంది..? ఈ సారి అవకాశం వస్తుందా..? లేదా..? ఏదైనా వేరే అవకాశం చూసుకోవాలా..? అనే దానిపై ప్రతి ఒక్కరు ఫోన్లు చేసుకుంటున్నారు. రిజర్వేషన్లపైనా ఆరా తీస్తున్నారు. ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ఒక ముందడుగు వేయడం.. రిజర్వేషన్ల ప్రక్రియ సైతం పూర్తి చేయడంతో ఆశావహుల్లో సందడి నెలకొంది. -
దుర్గామాతకు తెప్పోత్సవం
రాయికల్: మండలంలోని కుమ్మరిపల్లిలో నేతాజీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గమాతకు బుధవారం అర్చకులు రామగోపాలాచార్యుల ఆధ్వర్యంలో తెప్పోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. మూల విరాట్్కు ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం చెరువులో తెప్పోత్సవం చేపట్టారు. మహిళలు మంగళహారతులతో శోభాయాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమంలో యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. మంగళహారతులతో మహిళలు అమ్మవారి తెప్పోత్సవంలో అర్చకులు -
అభివృద్ధి కోసమే సీఎం వెంట
రాయికల్: జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంతో కలిసి నడుస్తానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. రాయికల్‌లో బుధవారం ఇందిర మహిలాశక్తి క్యాంటీన్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని, రూ.కోట్ల బకాయిలు విడుదల చేయించానని గుర్తుచేశారు. తనను గెలిపించిన ప్రజలు, అభివృద్ధి కోసం సీఎంతో కలిసి పనిచేస్తానన్నారు. రాజకీయంలో ఉన్నన్ని రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. మహిళలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్యాంటీన్లలో స్టీల్ పాత్రలు వినియోగించాలన్నారు. రాయికల్‌కు మంజూరైన రూ.15 కోట్లతో సీసీరోడ్లు, ఆలయాలు, ఇతరత్రా వసతులు కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, కమిషనర్ మనోహర్‌గౌడ్, మెప్మా ఏవో శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, వైస్ చైర్మన్ రమాదేవి, డీఎంసీ సునీత, టీఎంసీ శరణ్య పాల్గొన్నారు. -
కుటుంబం గడవడం కష్టంగా ఉంది
జీతాలు రాకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. కూటికి లేకనే చాలీచాలని జీతం ఇస్తున్నా.. నెట్టుకొస్తున్నాం. మూడు నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎట్ల బతుకుడు..? – చంద్రయ్య మల్టీపర్పస్ వర్కర్ అప్పు చేయాల్సి వస్తంది పండుగ పూట పైసలు లేక ఇబ్బంది పడుతున్నాం. కనీసం పండుగకై నా జీతాలు చెల్లిస్తే సంతోషంగా జరుపుకొనే అవకాశం ఉంటుంది. ప్రతినెలా ఇదే తంతు కొనసాగుతుండడంతో అప్పు చేస్తున్నాం. – అవునూటి రవి, ఎలక్ట్రీషియన్, బతికపల్లి నిధులు రావాల్సి ఉంది పంచాయతీ సిబ్బంది వేతనాలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. పంచాయతీల ఖాతాల్లో నిధులు లేక వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. సిబ్బంది వేతన విషయం ప్రభుత్వ దృష్టిలో ఉంది. – మదన్మోహన్, డీపీవో -
ఆర్నెళ్లలో చేతికందుతుంది
ఆయిల్ పాం తోటల్లో పరా గసంపర్కం పూర్తయిన ఆ రు నెలల తర్వాత పంట చే తికందుతుంది. ఆఫ్రికన్ పు రుగులు పూతను పిందె.. కాయగా మార్చడంలో కీల క పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ఆయిల్ పాం గెల టన్నుకు రూ.19,107గా ఉంది. ప్రతినెలా ఆదాయం పొందవచ్చు. – శ్యాంప్రసాద్, జగిత్యాల ఉద్యానశాఖాఽధికారి జిల్లాలో మూడేళ్లు దాటిన అన్ని ఆయిల్ పాం తోటల్లో ఆఫ్రికన్ పురుగులు వదులుతాం. దీనివల్ల పరపరాగ సంపర్కం జరిగి పూతంతా పిందెగా.. తర్వాత కాయగా మారుతుంది. రైతులకు దిగుబడి పెరిగి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పురుగులను ప్రత్యేకంగా జిల్లాకు తెప్పించాం. – విజయ్‌భరత్, లోహియా కంపెనీ ప్రతినిధి -
వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మృతదేహం
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం మోతె శివారు నవదుర్గ ఆలయ సమీపంలో ఓ వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. సుమారు 35 నుంచి 40 ఏళ్ల వ్యక్తిగా అనుమనిస్తున్నామని, కుడిచేతిపై ఎస్.హన్మంతరావు అని రాసి ఉందని, గోధుమరంగు నిండుచొక్కా, నెవీబ్లూ కలర్ ప్యాంట్ ఉందని, గుర్తించిన వారు రూరల్ ఎస్సై సదాకర్‌ను సంప్రదించాలని కోరారు. కట్నం వేధింపులు.. భర్తకు జైలుకరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్‌కు చెందిన కూర నిర్మలను కులంపేరుతో దూషించడంతోపాటు కట్నం కోసం వేధించడంతో భర్త అంజిరెడ్డికి మంగళవారం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించినట్లు కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. నగునూరుకు చెందిన నిర్మలను వివాహం చేసుకున్న అంజిరెడ్డి రూ.5లక్షల కట్నం తీసుకురావాలని వేధించడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ చేసిన కోర్టు అంజిరెడ్డికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ.1000 జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు. ● వివరాలు వెల్లడించిన ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి వేములవాడ: భూమి కోసమే సిరిగిరి రమేశ్ హత్యకు గురైనట్లు ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి అన్నారు. మంగళవారం వివరాలు వెల్లడించారు. చందుర్తిలోని భూమిని ఎస్సీ కార్పొరేషన్ లోన్‌పై పెట్రోల్ బంక్ కోసం చిర్రం రవి, సిరిగిరి రమేశ్‌కు రిజిస్ట్రేషన్ చేశారని, అయితే పెట్రోల్ బంక్ ఇవ్వకుండా, తిరిగి భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా సదరు భూమి తనదేనంటూ రమేశ్ అమ్మకానికి ప్రయత్నాలు మొదలు పెట్టడంతో విషయం తెలుసుకున్న రవి ఆ భూమి తనకు దక్కాలంటే రమేశ్‌ను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు ఎద్దండి వెంకటేశ్, అలా వంశీకి సుపారీ ఇచ్చాడు. పథకం ప్రకారం ఈనెల 19న రాత్రి 8 గంటలకు పెద్దూరు సబ్‌స్టేషన్ సమీపంలో కారు ఆపి, కారులో నిద్రిస్తున్న రమేశ్‌ను వంశీ, చిర్రం రవి కదలకుండా గట్టిగా పట్టుకోగా, వెంకటేశ్ కత్తితో రమేశ్ గొంతు, ఛాతిపై పొడిచి హత్య చేశాడు. అనంతరం కారుతోపాటు మృతదేహాన్ని వేములవాడ నందికమాన్ సమీపంలోని రమేశ్‌కు చెందిన నందీశ్వర టౌన్షిప్ వెంచర్లో వదిలి పారిపోయారు. ఈక్రమంలో వేములవాడ శివారులోని సాయిరక్షా దాబా సమీపంలో ఎద్దండి వెంకటేశ్, అలా వంశీని పట్టుకుని, వారి నుంచి కారు, మొబైల్‌ఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తిని సీజ్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ వివరించారు. చిర్రం రవి పరారీలో ఉన్నాడని తెలిపారు. మహిళలపై బండరాళ్లు విసిరిన వ్యక్తిపై కేసుకొత్తపల్లి: చింతకుంట శాంతినగర్‌లో ఈనెల 21న బతుకమ్మ ఆడుతున్న మహిళలపై బండరాళ్లతో దాడిచేసిన వ్యక్తిని రిమాండ్ చేశామని సీఐ కోటేశ్వర్ తెలిపారు. ప్రైమరీస్కూల్ ప్రాంతానికి చెందిన షేక్సజ్జు బండరాళ్లతో అక్కడే బతుకమ్మ ఆడుతున్న కాసారపు లక్ష్మి, మధు రెడ్డి, ఎల్లమ్మ, మొగిలి అకిరానంద్పై దాడిచేయగా గాయాలయ్యాయి. కాసారపు లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, షేక్సజ్జును మంగళవారం అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ● రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గితే ● 14.945 కిలోల గంజాయి దహనం సిరిసిల్లక్రైం: రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా వివిధ పోలీసుస్టేషన్లలో నమోదైన 45 కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 14.945 కిలోల గంజాయిని చట్ట ప్రకారం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తూ దహనం చేసినట్లు ఎస్పీ మహేశ్ బీ గితే తెలిపారు. మనకొండూరులోని బయోలాజికల్ ల్యాబ్‌లో గంజాయిని దహనం చేసినట్లు వివరించారు. గంజాయి రవాణా చేసినా, అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి రవాణాపై నిరంతరం నిఘా పెడుతూ నార్కోటిక్ జాగిలాలతో విస్తృత తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, డీసీఆర్బీ సీఐ నాగేశ్వరరావు, ఆర్ఎస్సై రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ డ్యాన్స్ మాస్టర్ మృతి
రామడుగు: మండలంలోని గోపాల్రావుపేట గ్రామానికి చెందిన డ్యాన్స్ మాస్టర్ దాసరి శేఖర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు... ఓ ప్రైవేటు పాఠశాలలో డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేస్తున్న శేఖర్ మూడు రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే పురుగుమందు తాగాడని, బంధువులు కరీంనగర్‌లోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడని, శేఖర్‌కు భార్య ఉందని, మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. -
ఆయిల్ పాం తోటల్లో ‘ఆఫ్రికన్’ పురుగులు
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల జిల్లాలో మూడేళ్ల క్రితం ఆయిల్ పాం సాగుకు రైతులు ముందుకొచ్చారు. ప్రస్తుతం ఆ తోటలు కాపుకొస్తున్నాయి. ఆయిల్ పాం సాగుపై రైతులకు పెదగా అవగాహన లేకపోవడంతో ఉద్యానశాఖ, కంపెనీ అధికారులు సమావేశాలు నిర్వహిస్తూ.. క్షేత్రస్థాయిలో పర్యటించి వివరించారు. రైతులు అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించి తోటలు సాగు చేస్తున్నారు. అయితే పూతను పిందెగా మార్చి.. దిగుబడి పెంచేందుకు మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి, ధర్మపురి మండలాల్లో సాగవుతున్న ఆయిల్ పాం తోటల్లో పరాగ సంపర్కం కోసం ఉద్యానశాఖ, లోహియా ఆయిల్ పాం కంపెనీ అధికారులు ఆఫ్రికన్ పురుగులను వదిలుతున్నారు. పూతకొస్తున్న తోటలు జిల్లాలో 2022–23లో సుమారు మూడు వేల ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేశారు. ఆ తోటలు పూతకు వస్తున్నాయి. పూత పిందెగా మారి, ఆపై కాయగా మారాల్సి ఉంటుంది. అప్పుడే ఆయిల్ పాం గెలలను కోసి ప్రాసెసింగ్‌కు పంపించాల్సి ఉంటుంది. తోటల్లో రసాయన ఎరువులు.. పురుగు మందుల వాడకం పెరగడంతో పరాగ సంపర్కం కోసం సహజ సిద్ధంగా వచ్చే పురుగులు రావడం లేదు. దీంతో పూత దశలో ఉన్న తోటల్లో ఆఫ్రికన్ పురుగులను వదులుతున్నారు. ఎలాడోబియస్ కామెరునికాస్ అనే ఆఫ్రికన్ పురుగు ఆయిల్ పాం తోటల్లో పరపరాగ సంపర్కం జరపడంలో కీలకపాత్ర పోషిస్తుంది. చెట్టు పూతకు వస్తే.. ఆ గెలకు ఆడ, మగపుష్పాలు పూస్తాయి. ఆఫ్రికన్ పురుగులు మగ పుష్పాల పరాగ రేణువులను ఆడ పుష్పాలకు చేరవేస్తాయి. తద్వారా ఫలదీకరణం జరిగి కాయలు ఏర్పడతాయి. పరాగ సంపర్కం జరగడం ద్వారా ప్రతి చెట్టుకూ పిందెలు ఎక్కువగా తయారై, దిగుబడి బాగా పెరుగుతుంది. ఆఫ్రికన్ పురుగుల ప్రాధాన్యత ఏంటంటే..? ఆఫ్రికన్ పురుగులు 4 మిల్లీమీటర్ల పొడవుంటాయి. నల్లటి రంగులో ఉండి పరాగ సంపర్కం కలిగిస్తాయి. తొలుత ఈ పురుగులను 1980 ప్రాంతంలో మలేసియాలో ఆయిల్ పాం దిగుబడి పెంచేందుకు దిగుమతి చేసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ కూడా ఆయిల్ పాం సాగు పెరగడంతో దిగుబడి కోసం ఆఫ్రికన్ పురుగులను తీసుకొస్తున్నారు. చెట్టుకు ఉండే మగ పుష్పాల సువాసనకు ఆఫ్రికన్ పురుగులు ఆకర్షించబడతాయి. పురుగులు వాలినప్పుడు పుప్పోడి రేణువులు వాటి శరీరానికి అంటుకుంటాయి. తర్వాత పురుగులు ఆడ పుష్పాలపై వాలినప్పుడు వాటి శరీరానికి అంటుకున్న పుప్పోడి రేణువులు పడి పరాగ సంపర్కం జరుగుతుంది. ఈ పురుగుల ద్వారా అనుకున్న స్థాయిలో పరాగ సంపర్కం జరిగితే ఆయిల్ పాం తోటల్లో గెలలు ఎక్కువగా ఏర్పడటంతోపాటు నూనె దిగుబడి పెరుగుతుంది. ఈ పురుగులు ఆయిల్ పాం తోటలకుగానీ.. మనుషులకు గాని హానికరమైనవి కావు. ఉద్యానశాఖ ద్వారా తోటల్లోకి.. దిగుబడి పెంచాలనేది లక్ష్యం -
‘కడారి’.. ఉద్యమమే ఊపిరి
సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోస అలియాస్ సాధు ఉద్యమమే ఊపిరిగా జీవితాన్ని ప్రజలకోసమే పణంగా పెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లెకు చెందిన కడారి కిష్టారెడ్డి–అన్నమ్మ చిన్న కొడుకు సత్యనారాయణరెడ్డి. 1980లో ఉద్యోగాన్ని వదిలి ఉద్యమబాటలో సాగిన ఆయన ఇంటివైపు కన్నెత్తి చూడకుండా నాలుగున్నర దశాబ్దాలపాటు మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతగా ఉన్నారు. గోపాల్‌రావుపల్లె నుంచి ఛత్తీస్‌ఘడ్ వరకు.. సత్యనారాయణరెడ్డి తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో ఆయన పనిచేసిన ఎల్లారెడ్డిపేటలోనే చదువు సాగింది. ఆటలు, చదువులో చురుకుగా ఉండేవాడు. పెద్దపల్లి జిల్లాలో చదువు పూర్తి కావడంతో ఉద్యోగం సాధించిన సత్యనారాయణరెడ్డి అక్కడ జరిగిన కార్మిక సంఘాల గొడవల్లో జైలుపాలు కావడంతో వామపక్ష ఉద్యమాలవైపు వెళ్లాల్సి వచ్చింది. మహారాష్ట్రలోని సిరోంచా, గడ్చిరోలీ ప్రాంతాల్లో ఆర్గనైజర్‌గా అప్పటి పీపుల్స్‌వార్ దళనాయకుడిగా, జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. దేశవ్యాప్తంగా మావోయిస్టు పొలిట్ బ్యూరోలో 26 మంది సభ్యులు ఉండగా వారిలో ఒకరిగా కోస ఉన్నారు. పెళ్లి చేసుకోకుండా వ్యక్తిగత జీవితాన్ని సైతం ప్రజలకోసం త్యాగం చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతారు. అనారోగ్యంతో ఉన్నా కూడా అడవిబాట విడవకుండా దండకారణ్యంలో ప్రజాయుద్ధాన్ని కొనసాగించారు. ఛత్తీస్‌గఢ్ బయల్దేరిన కుటుంబ సభ్యులు నారాయణపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన సత్యనారాయణరెడ్డి మృతదేహం కోసం అతడి సోదరుడు కరుణాకర్‌రెడ్డి, సమీప బంధువులు మంగళవారం ఛత్తీస్‌గఢ్‌కు బయలుదేరారు. పోస్టుమార్టం అనంతరం కోస మృతదేహాన్ని స్వగ్రామం గోపాల్‌రావుపల్లెకు తీసుకువచ్చే అవకాశం ఉంది. పోరుబాటలో అసువులు బాసిన సత్యనారాయణరెడ్డి గోపాల్‌రావుపల్లె నుంచి ఛత్తీస్‌గఢ్ వరకు 45 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి(కోస)కి ఎల్లారెడ్డిపేట మండలంతో విడదీయరాని అనుబంధం ఉంది. సత్యనారాయణరెడ్డి తండ్రి కడారి కిష్టారెడ్డి గణిత ఉపాధ్యాయుడిగా మండల కేంద్రంలోని పెద్దబడిలో 1976 వరకు పనిచేశారు. ఆ సమయంలో చిన్నవయసులో ఉన్న సత్యనారాయణరెడ్డి ఇక్కడే చదువుకున్నారు. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు పెద్దబడిలో చదువుకున్నారు. నారాయణపూర్‌లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో సత్యనారాయణరెడ్డి చనిపోయాడన్న వార్త ఎల్లారెడ్డిపేటలో కలకలం రేపింది. ఆ సమయంలో పెద్దబడిలో చదువుకున్న విద్యార్థులు కోసతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. వారిని కదిలించగా.. విద్యార్థి వయసు నుంచే సోషలిస్ట్ భావాలు ఉండేవని, సమాజంలోని అన్యాయాలపై ప్రశ్నించేవారని గుర్తుచేసుకున్నారు. ఎప్పుడూ సమసమాజం, పేదల బతుకులపై మాట్లాడేవారని తెలిపారు. తమతో చదువుకున్న విద్యార్థి కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగి, ఎన్కౌంటర్లో చనిపోవడంపై వారు భావోద్వేగానికి గురయ్యారు. -
ఖాళీ స్థలాలు..మురికి నిలయాలు
కోరుట్ల: ప్రతీరోజు మోస్తరుగా కురుస్తున్న వర్షానికి కోరుట్ల పట్టణంలోని ఖాళీస్థలాల్లో మురికినీరు నిలిచి ప్రమాదకరంగా మారింది. నీట కుంటలు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. ఖాళీ స్థలాల్లో నిలిచిన నీటిని తొలగించడంతో ఆయా స్థలాల యజమానులు, మున్సిపల్ అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో జనం ఇబ్బందుల పాలవుతున్నారు. లెక్కలేనన్ని ఖాళీ స్థలాలు పట్టణంలో 33 వార్డులు ఉన్నాయి. శివారు ప్రాంతాల్లోని వార్డులతోపాటు పట్టణ నడిబొడ్డున ఉన్న వార్డుల్లోనూ చాలాచోట్ల ఖాళీ స్థలాలు ఉన్నాయి. 33 వార్డుల్లో కలిపి 390వరకు ఖాళీ స్థలాలు ఉన్నట్లు అంచనా. ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటం సమస్యగా మారింది. ఆయా ఖాళీ స్థలాల్లో వర్షాలకు మురికి నీరు నిండిపోతోంది. ఆ నీటిలో దోమలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ వర్షం కురుస్తుండడం.. నీరు మురికిగా ఉండడంతో డెంగీకారక దోమలకు ఆలవాలంగా మారుతోంది. ఫలితంగా అన్ని వార్డుల్లో డెంగీ, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. శివారు ప్రాంతాలైన హాజీపురా, ఆనంద్‌నగర్, బిలాల్పురా, రాంనగర్, అంబేద్కర్ నగర్, అయిలాపూర్ రోడ్ ఏరియాల్లో జ్వర పీడితులు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఆయా ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో నిలిచిన నీటి ఫలితంగానే విష జ్వరాలు, సీజనల్ సంబంధిత వ్యాధులు విజృంభిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నివారణ చర్యలు శూన్యం ఖాళీ స్థలాల్లో దోమలు వృద్ధికాకుండా గతంలో ఆయిల్ బాల్స్, గంబూసియా చేపలను వదిలేవారు. చేపలు, ఆయిల్ బాల్స్ నీటిలో పెరిగే దోమల లార్వాను దెబ్బతీసేవి. కానీ.. ఈ సారి కనీసం ఆయిల్ బాల్స్ కూడా వేయడం లేదు. గంబూసియా చేపల జాడే లేదు. దోమల నివారణకు ఫాగింగ్ మిషన్లు వాడుతున్న దాఖలాలు లేవు. ఫలితంగా జనాలు జ్వరాలు పాలవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు జ్వరాలతో వస్తున్న వారి సంఖ్య పెరిగిపోవడం గమనార్హం. మున్సిపల్ అధికారులు దోమల నివారణకు చర్యలు చేపట్టి సీజనల్ వ్యాధులను ఆరికట్టాల్సిన అవసరముంది. -
వేతనాల కోసం ఎదురుచూపు
పెగడపల్లి: గ్రామ పంచాయతీల్లో వివిధ కేటగిరిలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు అందక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న తమకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో అప్పు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా పండుగ సమీపిస్తున్నా వేతనాలు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. పండుగపూట పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించిందంటున్నారు. గ్రామాల్లో వీధులు, మురికి కాల్వలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం, మంచినీటి సరఫరా చేయడం వీరి విధి. జిల్లాలోని 20 మండలాల పరిధిలోని 385 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో రూ.9,500 వేతనంపై 1487 మంది పనిచేస్తున్నారు. వీరిలో కారోబార్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, పంపు ఆపరేటర్లు, వాటర్సప్లై, పారిశుధ్య కార్మికులున్నారు. వీరికి ప్రతినెలా ఒకటిన జీతభత్యాలు చెల్లించాల్సి ఉంది. వచ్చిన వేతనంతో కుటుంబపోషణ, ఇతర అవనసరాలు తీర్చుకునే వారు. అయితే ప్రభుత్వం రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. సర్కారు స్పందించి వేతనాలు అందించాలని పంచాయతీ సిబ్బంది వేడుకుంటున్నారు. -
యాదాద్రి జిల్లాలో గొర్రెల చోరీ
శంకరపట్నం: యాదాద్రి భువనగిరి జిల్లాలో చోరీకి గురైన గొర్రెలను మంగళవారం వేకువజామున మొలంగూరులో పోలీసులు పట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పదిరోజుల క్రితం 10 గొర్రెలు చోరీకి గురయ్యాయి. అక్కడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణలో భాగంగా చోరీకి గురైన గొర్రెలు శంకరపట్నం మండలం మొలంగూర్ శివారులోని మైదానం ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడి పోలీసులు, స్థానిక పోలీసుల సాయంతో ట్రాలీఆటోలో గొర్రెలను తీసుకెళ్లారు. గొర్రెల దొంగలు మండలానికి చెందిన వ్యక్తులుగా ప్రచారం జరుగుతోంది. మొలంగూర్‌లో పట్టివేత -
పట్టపగలే చోరీ
ఇల్లందకుంట: ఇంటి యజమాని ఆరుబయట ఉండగానే గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన మంగళవారం మండలంలోని మల్యాల గ్రామ పంచాయతీ పరిధి గాంధీనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గూడెపు మల్లమ్మ ఇంటి ఆరుబయట పడుకొని ఉండగా పక్కన ఉన్న రూం కిటికీలు తెరిచి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి చూసింది. బీరువా తలుపులు తెరిచి ఉన్నాయని, అందులోని రూ.2.5 లక్షలు దొంగిలించారని మల్లమ్మ ఫిర్యాదు చేసిందని, సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టామని సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై క్రాంతికుమార్ వివరించారు. -
జగిత్యాల
30.0/22.07గరిష్టం/కనిష్టంఐరావతంపై నృసింహుడుధర్మపురి: దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీలక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తులను ఐరావతంపై ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొనసాగుతాయి. అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీమల్యాల: కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. దర్శనం టికెట్ల విక్రయాలు, లడ్డూ, ప్రసాదం ద్వారా ఆలయానికి రూ.2.75 లక్షల ఆదా యం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. బుధవారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025 -
తూటాల దిశ మారిందా?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: తుపాకీ నుంచి తూటా బయటికి వచ్చిన తరువాత.. టార్గెట్ వైపునకు దూసుకుపోతుంది. టార్గెట్‌ను తాకిన తరువాత దాని వేగం ఆగదు. కానీ, దిశ మార్చుకుని అదే వేగంతో మరింత ముందుకు దూసుకుపోతుంది. ఎలగందుల ఫైరింగ్ రేంజ్ సమీపంలో ఉన్న బోనాలపల్లె వైపునకు దూసుకుపోతున్న పోలీసు తూటాల విషయంలో సరిగ్గా ఇదే జరిగిందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. తూటా ప్రయాణంలో ఉండగా.. దిశ మార్చుకోవడం సహజంగా జరిగేదే అని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే బోనాలపల్లెలోని వృద్ధురాలు అమృతమ్మకు తగిలిన తూటా, అంతకుముందు అక్కడి ఇళ్ల పైకప్పుల నుంచి లోనకు దూసుకువచ్చిన బుల్లెట్లు కూడా ఇదే విధంగా వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బోనాలపల్లెలో అమృతమ్మను తాకింది ఎస్ఎల్ఆర్ నుంచి వచ్చినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బుల్లెట్ రికేషే బుల్లెట్‌ను తుపాకీ నుంచి పేల్చిన తరువాత లక్ష్యం వైపు దూసుకుపోతుంది. టార్గెట్ మనిషి లేదా జంతువు ఇంకేదైనా మెత్తని ఉపరితలం అయితే.. దాన్ని చీల్చుకుంటూ వెళ్తుంది. లక్ష్యానికి కలిగే నష్టం బుల్లెట్ ప్రయాణించిన దూరం మీద ఆధారపడి ఉంటుంది. నునుపు లేదా గరుకు ఉపరితలలాను సమీపం నుంచి బుల్లెట్ తాకినపుడు అది తాకిన కోణం ఆధారంగా దిశ తప్పకుండా మార్చుకుని మరో దిశకు దూసుకుపోతుంది. దీన్నే సాంకేతిక భాషలో శ్రీబుల్లెట్ రికేషేశ్రీ అని పిలుస్తారు. ఉదాహరణకు తుపాకీ నుంచి వెలువడిన ఒక బుల్లెట్ 15 నుంచి 45 డిగ్రీల కోణంలో ఉపరితలాన్ని తాకినప్పుడు అది తన దిశను మార్చుకునేందుకు అధిక అవకాశాలు ఉన్నాయని సినీయర్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో 70 నుంచి 90 డిగ్రీల కోణంలో గరుకు ఉపరితలాన్ని బుల్లెట్ తాకినప్పుడు అది తిరిగి వచ్చి కాల్చిన వ్యక్తి శరీరంలోకే దూసుకు వెళ్లే ప్రమాదముందని స్పష్టంచేస్తున్నారు. బోనాలపల్లెలలో ఏం జరుగుతోంది? బోనాలపల్లె వైపునకు బుల్లెట్లు దూసుకువస్తున్న విధానంపై స్థానిక పోలీసులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. శిక్షణలో ఉన్న పోలీసులకు ఉన్నతాధికారులు పాయింట్22, 303, సెల్ఫ్ లోడెడ్ రైఫిల్ (ఎస్ఎల్ఆర్), ఏకే–47, పిస్టల్, కార్బన్ తదితర అన్ని రకాల తుపాకులతో సాధన చేయిస్తారు. ఏ తుపాకీ నుంచి వెలువడిన బుల్లెట్ అయినా సగటున గంటకు 43,00 కిమీలకుపైగా వేగంతో ప్రయాణిస్తుంది. ఎలగందుల ఫైరింగ్రేంజ్లో టార్గెట్ బోర్డులను తాకి వెనక ఉన్న కొండ రాళ్లను తాకుతున్నాయి. కాల్చిన తూటాల్లో చాలామట్టుకు అక్కడే ఆగిపోతాయి. కొన్ని తూటాలు రాళ్ల ఉపరితలం అంచును తాకి దిశను మార్చుకుని బోనాలపల్లె వైపుకు దూసుకొస్తున్నాయి. గతంలోనూ ఇలా తూటాలు దూసుకువచ్చాయి. కానీ, ఆ సమయంలో మైనింగ్ లేకపోవడంతో గుట్టు ఎత్తు అధికంగా ఉండేది. దీంతో అక్కడే ఆగిపోయేవి. ఈ మధ్య ఎత్తు తగ్గడంతో బోనాలపల్లె వరకు బుల్లెట్లు ప్రయాణిస్తున్నాయి. ఇలా దిశ మార్చుకున్న తూటాలు కూడా ప్రాణాంతకమే అని పలువురు పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ నుంచి బాలిస్టిక్ ఎక్స్పర్ట్స్ టీం వచ్చి అధ్యయనం చేసిన అనంతరం మరిన్ని విషయాలు తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
సూర్య ప్రభ వాహనంపై శ్రీనివాసుడు
కోరుట్ల: పట్టణంలోని అతి పురాతన శ్రీవేంకటేశ్వర ఆలయం, అష్టలక్ష్మీ సహిత శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయాల్లో దసరా శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేంకటేశ్వర ఆలయంలో సూర్యప్రభ వాహనంపై.. అష్టలక్ష్మీ ఆలయంలో హనుమత్‌వాహనంపై స్వామివారలు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్పత్తుల మేళాకు మహిళలుజగిత్యాలజోన్: హైదరాబాద్‌లోని శిల్పారామంలో జరుగుతున్న జాతీయస్థాయి మహిళాసంఘాల ఉత్పత్తుల మేళాకు మంగళవారం జిల్లా నుంచి మహిళాసంఘాల ప్రతినిధులు తరలివెళ్లారు. వారి బస్సును డీఆర్డీఏ పీడీ రఘువరణ్ ప్రారంభించారు. అక్కడికెళ్లిన మహిళలు ఆయా రాష్ట్రాల మహిళలు తయారుచేసిన ఉత్పత్తులు, అమ్మకాలు, మార్కెటింగ్, తీసుకున్న రుణం, శిక్షణ ప్రమాణాలపై అడిగి తెలుసుకున్నారు. సెర్ప్ అధికారులు ఉత్పత్తుల ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ సౌకర్యంపై అవగాహన కల్పించారు. ఏపీడీ సునీత, డీపీఎం రమేశ్, జిల్లా ఏపీఎం వి.గంగాధర్, సీసీ సత్యనారాయణ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సరోజన, కార్యదర్శి ఆమని పాల్గొన్నారు. -
‘డిజిటల్ అరెస్ట్’.. సైబర్ మోసం
జగిత్యాలక్రైం: డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ మోసమని, దానిని ఎవరూ నమ్మవద్దని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు తాము పోలీస్ అధికారులమని, సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇతర ప్రభుత్వ విభాగాల సిబ్బంది అంటూ నటిస్తూ.. కేసు ఉందని భయపెట్టడం, వీడియో కాల్లో అరెస్ట్ చేస్తున్నామని చూపించ డం, డబ్బులు బదిలీ చేస్తే తప్పించుకోవడం డిజి టల్ అరెస్ట్ అని తెలిపారు. ఇలాంటి నేరాలపై ప్ర జలు అవగాహన పెంచుకోవాలన్నారు. మోసపో తే వెంటనే 1930కు కాల్ చేయాలని, తద్వారా డ బ్బు రికవరీ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఆలస్యం చేస్తే నష్టపోతారని హెచ్చరించారు. డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రజలకు సూచనలు -
టీబీ వ్యాధిగ్రస్తులకు చేయూతనిద్దాం
కోరుట్లటౌన్: టీబీ వ్యాధిగ్రస్తులకు చేయూత ఇవ్వాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. కోరుట్ల ఏరియా ఆసుపత్రిలో స్వస్త్ నారి శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధిగ్రస్తులకు మంగళవారం పౌష్టికాహారం పంపిణీ చేశారు. దాతలు, ప్రజాప్రతినిధులు, సామాజిక సేవా సంస్థలు ముందుకొచ్చి క్షయ రోగులను ఆదుకోవాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ మాట్లాడుతూ క్షయ రోగులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఆకుల శ్రీనివాస్, ఐఎంఏ డాక్టర్లు వై.అనూప్‌రావు, రేగొండ రాజేశ్, వినోద్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఎస్సారెస్పీకి కొనసాగుతున్న ఇన్ఫ్లోజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో 40 గేట్లు ఎత్తి, 2,84,866 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 2.22 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. వరద కాలువకు 6,735 క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 5,500, ఎస్కేప్ గేట్ల ద్వారా 2,500, సరస్వతి కెనాల్‌కు 400, లక్ష్మి కెనాల్‌కు 200, అలీసాగర్ ఎత్తి పోతల పథకానికి 180, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ‘ఒకే దేశం ఒకే పన్ను’ అమలు చేయాలిజగిత్యాలటౌన్: జీఎస్టీ తెచ్చిన మోదీ ప్రభుత్వం తన తప్పును గ్రహించి సరళీకృతం చేయడాన్ని ఆహ్వానిస్తున్నామని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. పన్ను మినహాయింపు ఇచ్చామంటే ఇప్పటివరకు పన్నుల భారం మోపామని కేంద్రం ఒప్పుకున్నట్లేనన్నారు. ప్రజాభిప్రాయం మేరకు ప్రధాని మోదీ పెట్రోల్, డీజిల్‌పై ఒకేదేశం ఒకే పన్ను విధానం అమలు చేయాలని, 18 శాతం జీఎస్టీ పరిధిలోకి తేవాలన్నారు. జీఎస్టీ పన్నుల సరళీకరణతో కలిగే లబ్ధిని వినియోగదారులకు చేరేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. నాయకులు బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, పుప్పాల అశోక్, జున్ను రాజేందర్, రఘువీర్‌గౌడ్, గుండ మధు పాల్గొన్నారు. అంతరాయం రాకుండా అదనపు బ్రేకర్లు ఇబ్రహీంపట్నం/మల్లాపూర్: నాణ్యమైన విద్యుత్ సరఫరాలో అంతరాయం రాకుండా అదనపు బ్రేకర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శన్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్, వేములకుర్తి, మల్లాపూర్ సబ్‌స్టేషన్‌లో బ్రేకర్లు, ఇంటర్ లింకింగ్‌ను ప్రారంభించారు. రూ.20 లక్షలతో రెండు బ్రేకర్లను ఏర్పాటు చేశామన్నారు. అన్ని సబ్స్టేషన్లకు రెండో ప్రత్యామ్నాయ లైన్లు వేస్తున్నామని, 70 శాతం పూర్తయ్యాయని తెలిపారు. రైతులు కెపాసిటర్లు బిగించుకోవాలన్నారు. మెట్పల్లి డివిజన్ డీఈ మధుసూదన్, ఎమ్మార్టీ డీఈ రవీందర్ పాల్గొన్నారు. అనంత దీపోత్సవంధర్మపురి: దసరా నవరాత్రోత్సవాల సందర్భంగా శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి అనంత దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగనంలో ఓం, స్వస్థిక్, మహాలింగేశ్వర ఆకారాలతో విద్యుత్ ద్వీపాలను అలంకరించారు. -
గాయత్రీదేవిగా అమ్మవారు
బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారుధర్మపురి: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారు మంగళవారం పసుపురంగు వస్త్రంలో బ్రహ్మచారిణి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని న్యూ టీటీడీ కల్యాణ మండపంలో నవదుర్గా సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో దుర్గాదేవి నవరాత్రోత్సవాల సందడి నెలకొంది. మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అమ్మవారు గాయత్రిదేవి రూపంలో దర్శనం ఇచ్చారు. లంబాడిపల్లిలో శ్రీపద్మసహిత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారిని గాయత్రిదేవిగా అలంకరించారు. -
రిజర్వేషన్లపై ఫోకస్..!
జగిత్యాల: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ కావడంతో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునివ్వగా.. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతోంది. రిజర్వేషన్ల ఖరారుపై మార్గదర్శకాలు విడుదల కావడంతో కలెక్టర్ సత్యప్రసాద్ దాని ప్రకారం ముందుకెళ్తున్నారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా ఎంపీడీవోలు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు కలెక్టరేట్లో రిజర్వేషన్లపై కసరత్తు చేశారు. కలెక్టర్ పూర్తిస్థాయిలో వాటిని పరిశీలించి ఖరారు చేసినట్లు తెలిసింది. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ల కోటా కేటాయించనుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొంది. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్ అమలు చేయనుండటంతో దీనిపైనే జిల్లాలో చర్చ కొనసాగుతోంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఎలా ఇస్తారు..?అనే చర్చే ప్రతినోటా వినిపిస్తోంది. ఉన్నతాధికారుల నుంచి రిజర్వేషన్ స్థానాలు కేటాయించాలని ఆదేశాలు రావడంతో కలెక్టర్ లు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. సామాజిక, ఆర్థిక, కులగణనలో ఉన్న బీసీ జనాభా వివరాలు, ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలు లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు చేపట్టనున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్ కేటగిరీలు ఈసారి ఉండవు. మళ్లీ నూతన రిజర్వేషన్లు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఆశావహుల్లో దడ రిజర్వేషన్ల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం వేడెక్కింది. గతంలో ఉన్న రిజర్వేషన్ ఉండదని తెలుస్తుండటంతో ఆశావహుల్లో దడపుడుతోంది. ఇప్పటికే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతోపాటు, మున్సిపల్ పాలకవర్గం సమయం ముగిసి రెండేళ్లు సమీపిస్తోంది. ఎన్నికలు ఎప్పుడెప్పుడా నిర్వహిస్తారా..? అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్లపై అధికారులు కసరత్తు చేస్తుండటంతో వారిలో సందడి మొదలైంది. జిల్లాలో 6,07,222 మంది ఓటర్లు ఉన్నారు. 385 గ్రామాల్లో 3,536 వార్డులున్నాయి. 20 జెడ్పీటీసీలు, 216 ఎంపీటీసీ స్థానాలున్నాయి. గతంలో 18 జెడ్పీటీసీలకే ఎన్నికలు జరగగా.. ఈసారి కొత్తగా భీమారం, ఎండపల్లి స్థానాలు పెరిగాయి. అలాగే ఎంపీటీసీ స్థానాలు కూడా రెండు పెరిగాయి. ఇవి కాక ఐదు మున్సిపాలిటీల్లోనూ ఎన్నికలు నిర్వహించనున్నారు. ‘స్థానికం’పై కసరత్తురిజర్వేషన్ల ఖరారు కలెక్టర్లకే.. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచుల రిజర్వేషన్ల ఖరా రు చేసే బాధ్యత కలెక్టర్లకే ఇచ్చినట్లు తెలిసింది. సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్ స్థానిక ఆర్డీవో, వార్డు స భ్యుల రిజర్వేషన్లు మండల ఎంపీడీవోలు చూ స్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీట్లు కేటాయించిన తర్వాతే మిగితా సీట్లు జనరల్‌కు కేటాయిస్తున్నట్లు తెలిసింది. మొత్తం ఓటర్లు 6,07,222 పురుషులు 2,89,249మహిళలు 3,17,964ఇతరులు 9పంచాయతీలు 385 వార్డులు 3,536 జెడ్పీటీసీ స్థానాలు 20 ఎంపీటీసీ స్థానాలు 216 -
షుగర్ ఫ్యాక్టరీపై చిగురిస్తున్న ఆశలు
మల్లాపూర్: మండలంలోని ముత్యంపేటలోగల నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ దిశగా అడుగులు పడుతున్నాయి. మూతపడిన కర్మాగారాన్ని ఈనెల 26న పరిశ్రమలు, వ్యవసాయశాఖల ఉన్నతాధికారుల బృందం సందర్శించనుంది. బృందం సభ్యులు రైతులతో సమావేశమై అభిప్రాయాలు సేకరించనున్నారు. ఈ మేరకు మంగళవారం పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్‌కుమార్, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్‌రావు, షుగర్‌కెన్ డైరెక్టర్ సీహెచ్.నర్సిరెడ్డి కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మూతపడి పదేళ్లు.. నష్టాలతో నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీకి స్వరాష్ట్రం వచ్చాక ఎన్డీఎస్ఎల్ యజమాన్యం లే ఆఫ్ ప్రకటించింది. దీంతో ఫ్యాక్టరీ 2015 డిసెంబర్ 23న మూసివేశారు. అప్పటికే నష్టాలతో నడుస్తున్న ఫ్యాక్టరీని రైతుల భాగస్వామ్యంతో పునరుద్ధరిస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించినా.. కొన్ని కారణాలతో ముందడుగు పడలేదు. దీంతో ఈ ప్రాంత రైతులు పదేళ్లుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు. ఫ్యాక్టరీల పునరుద్ధరణ.. చెరుకు పంట విస్తీర్ణాన్ని పెంచడం.. టన్ను చెరుకుకు రూ.4వేల మద్దతుధర కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే గతేడాది ఫిబ్రవరిలో పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో పునరుద్ధరణ కమిటీ బృందాన్ని నియమించింది. ఆ బృందం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి రైతుల అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించింది. తెరుచుకునేనా..? షుగర్ ఫ్యాక్టరీని పరిశ్రమలు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల బృందం సందర్శిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంత చెరుకు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈనెల 26న ఫ్యాక్టరీకి పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిప్రాయం చెప్పేందుకు చెరుకు రైతులు సిద్ధమవుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లింపు, చెరుకు క్రషింగ్ బకాయిల చెల్లింపు, హార్వెస్టింగ్ తదితర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, కర్మాగారాన్ని ప్రభుత్వ ఆధీనంలో నడిపించినా.. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించినా.. భవిష్యత్తులో ఫ్యాక్టరీని తరలించడంగానీ.. మూసివేయడంగానీ చేయొద్దని డిమాండ్ చేయనున్నారు. 26న ఏర్పాట్లు చేయండి.. జగిత్యాలఅగ్రికల్చర్: ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని చెరుకు రైతులతో ఈనెల 26న వ్యవసా య, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు సమావేశం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, ఎస్పీకి ఆదేశాలు అందాయి. ఈ మేరకు స్పెషల్ చీ ఫ్ సెక్రటరిలు సంజయ్‌కుమార్, రఘునందన్‌రావు కలెక్టర్, ఎస్పీతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రైతులు సమన్వయంతో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ యాదగిరి, వ్యవసాయాధికారి భాస్కర్, మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, డీఎస్పీ రాములు, అసిస్టెంట్ చెరుకు కమిషనర్ వెంకటరవి పాల్గొన్నారు. -
మహిళా ఆరోగ్యంతోనే మంచి కుటుంబం
కోరుట్లరూరల్/కోరుట్ల: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే శక్తివంతమైన కుటుంబం తయారవుతుందని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. స్వస్త్నారి స్వశక్తి పరివార్ అభియాన్‌లో భాగంగా అయిలాపూర్ పీహెచ్సీలో వైద్య శిబిరాన్ని డీఎంహెచ్‌వో ప్రమోద్‌తో కలిసి ప్రారంభించారు. పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. సీఎంది బజారుభాష.. మల్లాపూర్: సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ, బహిరంగసభల్లో బజారుభాష మాట్లాడుతూ రాష్ట్రం పరువు తీస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడదామన్నారు. పదేళ్లుగా లేని యూరియా కష్టాలు కాంగ్రెస్ పాలనలో ఎందుకొచ్చాయని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్దిచెప్పాలని కోరారు. అనంతరం దుర్గాదేవి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. సీఎంఆర్ఎఫ్తో పేదలకు మేలు మెట్పల్లి: సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. మండలంలోని 52మందికి రూ.13.98లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో అందించారు. -
శాతవాహన స్నాతకోత్సవానికి రండి
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవానికి సిద్ధమైంది. గవర్నర్, శాతవాహన చాన్స్‌లర్ జిష్ణుదేవ్‌వర్మ నవంబర్ 7న స్నాతకోత్సవం నిర్వహణకు అనుమతినిచ్చినట్లు వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఉమేశ్‌కుమార్ తెలిపారు. ఈమేరకు ఆయన సోమవారం గవర్నర్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ బీజేరావు హాజరుకానున్నట్లు తెలిపారు. స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులకు బంగారు పతకాలు, పీహెచ్డీ పరిశోధకులకు డాక్టరేట్ పట్టాలు అందజేస్తామన్నారు. 2019 ఆగస్టులో తొలిస్నాతకోత్సవం జరిగిందని, ఇప్పుడు ద్వితీయ స్నాతకోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. -
జాతీయ రహదారికి భూసేకరణ పూర్తి చేయాలి
జగిత్యాల: జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారికి భూసేకరణ పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్ సత్యప్రసాద్‌ను ఆదేశించారు. కలెక్టర్‌తో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. భూసేకరణ దాదాపు పూర్తి కావొచ్చిందని, కొన్నిచోట్ల ఉన్న ఇబ్బందులను పరిష్కరిస్తున్నామని తెలిపారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ లత, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నాంజగిత్యాలక్రైం: బాధితుల సమస్యలను పరిష్కరిస్తున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 8 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారితో నేరుగా మాట్లాడిన ఎస్పీ తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఎస్సారెస్పీ 40 గేట్ల ఎత్తివేతజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వస్తుండటంతో 40 గేట్లు ఎత్తి 2,38,720 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 1.80 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. టెండర్లు ఆహ్వానంజగిత్యాల: జిల్లాలోని 123 జెడ్పీ, ప్రాథమికోన్నత, మోడల్‌స్కూల్, కేజీబీవీల్లో కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ మరమ్మతు చేసేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాము తెలిపారు. ఆసక్తి గల వారు కంప్యూటర్ హార్డ్‌వేర్, సేల్స్ అండ్ సర్వీసెస్ నుంచి సీల్డ్ టెండర్లను ఈనెల 25న సాయంత్రం 5 గంటలలోపు డీఈవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు విద్యాశాఖ కార్యాలయం కో–ఆర్డినేటర్ 95150 60246 సంప్రదించాలని కోరారు. విద్యార్థి చదువు ప్రగతికి వెలుగుకొడిమ్యాల: విద్యార్థులు బాగా చదువుకుంటే అన్నిరంగాల్లో రాణించగలుగుతారని ఇంటర్మీ డియట్ జిల్లా అధికారి బి.నారాయణ అన్నా రు. మండలకేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలను సోమవారం తనిఖీ చేశారు. ఆధుని క మార్పులకు అనుగుణంగా అధ్యాపకులు బోధన పద్ధతులు మెరుగుపరుచుకోవాలన్నా రు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాల కు రావాలని, క్రమశిక్షణ, పట్టుదలతో చదవా లని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ వేణు, అధ్యాపకులు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. సహస్ర లింగాల ఆలయంలో పూజలు జగిత్యాలరూరల్: దుర్గ శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా జగిత్యాల రూరల్ మండలం పొ లాసలోని సహస్ర లింగాల దేవాలయంలో భక్తులు పూజలు చేశారు. అన్నపూజలో పాల్గొన్నారు. ఆలయ వ్యవస్థాపకులు నలమాసు గంగాధర్ పాల్గొన్నారు. ఆలయానికి సింహ వాహనం అందజేతఇబ్రహీంపట్నం: మండలంలోని వేములకుర్తి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహోత్సవాలకు దేవాలయ కమిటీ మాజీ అధ్యక్షుడు పట్నం నర్సయ్య కుమారుడు పట్నం నరేశ్ అనూజ దంపతులు సోమవారం సింహవాహానాన్ని అందచేశారు.కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాసచార్యులు, మలేపు రమేష్, కరం ఇంద్రయ్య పాల్గొన్నారు. -
బతుకమ్మ ఏర్పాట్లేవి..?
జగిత్యాల: బతుకమ్మ వేడుకలు ప్రారంభమైనా జిల్లా కేంద్రంలో మాత్రం నిమజ్జనం ఏర్పాట్లు చేయలేదు. మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాల్సి ఉండగా అధికారులు పట్టించుకోవడంలేదు. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ ఆడి మహిళలు నిమజ్జనం చేస్తుంటారు. ఏర్పాట్లు లేకపోవడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. సద్దుల బతుకమ్మ వరకు పనులు పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. జిల్లాకేంద్రంలో సుమారు 18 ఘాట్ల వరకు ఉన్నాయి. రామాలయం, బసవేశ్వరస్వామి, పొన్నాల గార్డెన్, లింగంపేట చెరువు, ధర్మసముద్రం, వీక్లీబజార్ స్కూల్సమీపం, చిలుకవాడ, గొల్లపల్లిరోడ్, కండ్లపల్లి చెరువు, శంకులపల్లి చౌరస్తా, ముప్పారపు చెరువులో రెండు ఘాట్ల చొప్పున మొత్తం 18ఘాట్లు ఉన్నా.. ఇప్పటివరకు ఎక్కడా శుభ్రత చర్యలు చేపట్టలేదు. రూ.20 లక్షల కేటాయింపు బతుకమ్మ సంబరాల కోసం ఇప్పటికే రూ.20 లక్షలు కేటాయించినట్లు తెలిసింది. ఇందులో ఘాట్ల వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేయడంతోపాటు, లైటింగ్, కొన్నిచోట్ల మహిళల కోసం సౌండ్ సిస్టం ఏర్పాటు చేస్తుంటారు. అలాగే బతుకమ్మ ఆడుకునేందుకు సాండ్ (దుబ్బ) పోస్తుంటారు. వీటన్నింటి కోసం రూ.20 లక్షలు టెండర్ వేశారు. కానీ వేడుకలు ప్రారంభం కాకముందే చేస్తే బాగుండేదని మహిళలు పేర్కొంటున్నారు. -
కొలువుదీరిన అమ్మవారు
జగిత్యాలటౌన్/రాయికల్/ధర్మపురి/మల్యాల/సారంగాపూర్/కోరుట్ల: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు మంటపాల్లో కొలువుదీరారు. జిల్లాకేంద్రంలో కొందరు మండపాల నిర్వాహకులు అమ్మవారి విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. టవర్‌సర్కిల్ వద్ద అమ్మవారి శోభాయాత్ర సందర్భంగా నిత్య జనగణమన ప్రారంభం కావడంతో భక్తులు జాతీయ గీతాలాపనలో పాల్గొని సెల్యూట్ చేశారు. ధర్మపురిలో మొదటి రోజు అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిచ్చారు. కొండగట్టు అమ్మవారి ఆలయంలో మూలవిరాట్టుకు పంచామృతాభిషేకం నిర్వహించారు. రాయికల్‌లో యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవారికి ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. బాలత్రిపుర సుందరిదేవీగా అలంకరించారు. బీర్పూర్ మండలం తుంగూర్‌లో అమ్మవారిని శోభాయాత్రగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. -
గ్రామాల అభివృద్ధికి కృషి
ధర్మపురి: గ్రామాల్లో అన్ని రకాల వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండలంలోని నాగారంలో రూ.54 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను సోమవారం మంత్రి ప్రారంభించారు. మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల కరెంట్ అందిస్తున్నామని, రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ చేశామన్నారు. కుల సంఘాలు సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ చిలుముల లావణ్య, నాయకులు ఎస్.దినేష్, గడ్డం భాస్కర్‌రెడ్డి తదితరులున్నారు. -
చక్కెర ఫ్యాక్టరీపై ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం
మెట్పల్లి: చెరుకు రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. ఫ్యాక్టరీ ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ప్రైవేట్ యాజమాన్యం తీసుకున్న అప్పులకు వన్‌టైం సెటిల్మెంట్ కింద ప్రభుత్వం వాటికి రూ.172కోట్లు చెల్లించిందన్నారు. గతంలో ఫ్యాక్టరీ నడిచే సమయంలో 20వేల ఎకరాల్లో పంట సాగు చేశారని, తిరిగి దానిని పునఃప్రారంభించాలంటే కనీసం 10వేల ఎకరాల్లో సాగు చేయాల్సిన అవసరముందన్నారు. ఈ విషయంలో రైతుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈనెల 26న ముత్యంపేటలో పరిశ్రమలు, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులు పర్యటించే అవకాశముందన్నారు. ఈ సీజన్లో మొక్కజొన్నతోపాటు సన్నరకం ధాన్యాన్ని రైతులు భారీగా సాగు చేశారని, ప్రభుత్వం జాప్యం చేయకుండా వచ్చే నెలలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ధర్మపురి ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు జువ్వాడి కృష్ణారావు, నాయకులు అల్లూరి మహేందర్‌రెడ్డి, ఎలాల జలపతిరెడ్డి, కొంతం రాజు, తిప్పిరెడ్డి అంజిరెడ్డి తదితరులున్నారు. -
సోమవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
జగిత్యాలటౌన్/ధర్మపురి/రాయికల్/కోరుట్లటౌన్: ఎంగిలిపూలతో బతుకమ్మ వేడుక ప్రారంభమైంది. తంగేడు, గునుగు, గుమ్మడి, బంతి, చేమంతి వంటి తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా పేర్చిన ఆడపడుచులు ఆడిపాడారు. జిల్లాకేంద్రంలోని ప్రధాన కూడళ్లు, కాలనీల్లో మహిళలు బతుకమ్మ ఆడారు. ధర్మపురి బల్దియా కార్యాలయం ఆవరణలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వేడుకను ప్రారంభించారు. కమిషనర్ శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. పూల వేడుక ప్రారంభం -
ఆరుతడి అంతంతే..
జగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్లో రైతులు సాగు చేసిన పంటల లెక్క తేలింది. వ్యవసాయాధికారులు గ్రామాల వారీగా సేకరించిన లెక్కల ప్రకారం వరిని అత్యధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ఆరుతడి పంటలను అంతంతమాత్రంగానే సాగు చేశారు. జిల్లాలో పుష్కలమైన సాగునీటి వనరులకు తోడు పొలం దున్నేందుకు ట్రాక్టర్లు, హార్వేస్టర్లు, నాట్లు వేసేందుకు బీహార్ కూలీలు, పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రావడం.. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2389కు చేరడంతో రైతులు వరి పంట వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణంగా మారాయి. 3.15 లక్షల ఎకరాల్లో వరి సాగు రైతులు వానాకాలం సీజన్లో వరి పంట వైపే మొగ్గు చూపారు. జిల్లాలో గతేడాది వానాకాలం సీజన్లో 3.10లక్షల ఎకరాల్లో సాగు కాగా.. ఈ వానాకాలం సీజన్లో మరో 5వేల ఎకరాలకు పెరిగి, 3.15 లక్షల ఎకరాలకు చేరుకుంది. ఆయా మండలాల్లో మిగతా ఆరుతడి, ఉద్యానపంటలను అంతంతమాత్రంగానే సాగు చేశారు. మిగతా పంటలతో పోల్చితే వరికి ప్రభుత్వ మద్దతు ధర ఉండటం.. గ్రామాల్లోనే కొనుగోలు చేసే వెసులుబాటు ఉండటం, సాగు నీరు పుష్కలంగా ఉంది. ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని మూసివేయడంతో చెరుకు రైతులు కూడా వరి వైపే దృష్టి సారించారు. ఈ సారి యూరియా కొరత కారణంగా సకాలంలో పంటకు వేయకపోవడంతో దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుతడి పంటలు అంతంతే.. పప్పుదినుసులు, నూనెగింజలు, వాణిజ్య పంటలను దాదాపు 62 వేల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. మొక్కజొన్న 32,463ఎకరాలు, పత్తి 16,393, సోయాబీన్ 809, కంది 976, పెసర 265, మినుము 21, చెరుకు 702, అనుములు 240, పసుపు 10,144, కూరగాయలు 373, మిర్చి 365, అలసంద 8 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వేరుశెనగ, నువ్వు, పొద్దుతిరుగుడు వంటి నూనె పంటలను పూర్తిగా తగ్గించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో పంటలన్నీ నీళ్లలో మునిగాయి. భూమిలో తేమ ఎక్కువగా ఉండటంతో మొక్కలు గిడసబారి ఎండిపోయాయి. మొక్కజొన్నను పీచు దశ నుంచి కంకి దశ వరకు ఓ వైపు అడవిపందులు, మరోవైపు కోతులు, రామచిలుకలు ధ్వంసం చేయడంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆరుతడి పంటలు మార్కెట్‌కు వచ్చే వరకు ఏ రేటు ఉంటుందో తెలియని పరిస్థితి ఉండడం.. ఆరుతడి పంటల సాగు అధిక శ్రమతో కూడుకున్నది కావడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. -
హద్దు మీరుతున్న ఆర్ఎంపీ వైద్యం
కొడిమ్యాల: జిల్లాలో ఆర్ఎంపీల వైద్యం హద్దు మీరుతోంది. ప్రథమ చికిత్స చేయాల్సిన ఆర్ఎంపీలు ప్రొఫెషనల్ వైద్యుల మాదిరిగా చికిత్స ఇస్తున్నారు. మెడిసిన్ చదివిన వారు ఇస్తున్న మందు గోళీల కంటే కొందరు ఆర్ఎంపీలు ఇస్తున్న యాంటీబయోటిక్సే ఎక్కువ. వీరిపై ప్రజలకు ఉన్న గుడ్డి నమ్మకమే కొన్నిసార్లు రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. జ్వరం వచ్చినా.. అనారోగ్యం పాలైనా రెండు ఇంజక్షన్లు వేసి.. అవసరం లేకున్నా సైలెన్లతోపాటు యాంటీబయోటిక్స్ అంటగట్టి అందినకాడికి లాగుతున్నారు. కేవలం ప్రథమ చికిత్సకు మాత్రమే పరిమితం కావాల్సిన ఆర్ఎంపీలు నర్సింగ్ హోం తరహాలో బెడ్లు వేసి మరి ట్రీట్మెంట్ చేస్తున్నారు. విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ వినియోగం గతంలో వైద్యాధికారులు ప్రాథమిక చికిత్స కేంద్రాలలో తనిఖీలు చేసి పరిమితికి మించి అధిక డోస్ ఇస్తున్న కొన్ని కేంద్రాలను గుర్తించి నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా మారని కొందరు ఆర్ఎంపీలు యాంటీబయోటిక్స్‌తో పాటు స్టెరాయిడ్స్ వంటి వాటిని రోగులకు ఇస్తున్నారు. స్పెషలైజేషన్ చేసి అన్ని అర్హతలు ఉన్న డాక్టర్లు మాత్రమే రాయాల్సిన మందులను గ్రామాల్లో ఆర్ఎంపీలు రెఫర్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు ఆర్ఎంపీలు అర్హత లేకున్న ప్రిస్క్రిప్షన్ రాయడంతోపాటు ప్రథమ చికిత్సకు వచ్చే రోగులకు ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఆర్ఎంపీల వద్దకు వచ్చిన వారి ఆరోగ్య స్థితిపై పూర్తి అవగాహన లేకుండా ఇస్తున్న మందులు భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలకు కారణం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు ఆర్ఎంపీలు పీఎంపీలు క్లినిక్‌కు అనుబంధంగా మెడికల్ షాపులు, పాథాలజీ లాబ్స్ నిర్వహిస్తూ.. రోగ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తున్నారంటే అతిశయోక్తికాదు. ప్రైవేట్ ఆస్పత్రులతో కమీషన్ దందాలు కొందరు ఆర్ఎంపీలు హైదరాబాద్, కరీంనగర్ వంటి నగరాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులకు ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్స్, పాథాలజీ ల్యాబ్స్‌తో కుమ్మక్కయి ప్రజల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రథమ చికిత్స కోసం వచ్చిన వారికి లేని రోగాన్ని అంటగట్టి తాము ఏజెంట్‌గా పనిచేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారు. సదరు ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు రోగం చిన్నదే అయినా ఆ భయాన్ని పెద్దగా చూపి రూ.లక్షల్లో గుంజుతున్నారు. ఏజెంట్లకు ఒక్కో పేషెంట్‌ను రెఫెర్ చేస్తే రోగాన్ని బట్టి 40శాం నుంచి 50శాతం కమీషన్ ఇస్తున్నాయి. అర్హతకు మించి వైద్యం చేస్తున్న ఇలాంటి ఆర్ఎంపీలు, పీఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రాథమిక చికిత్స కేంద్రాలు అని మాత్రమే బోర్డు ఏర్పాటు చేసుకోవాలి. ప్రాథమిక చికిత్స మాత్రమే అందించాలి. యాంటీబయోటిక్స్ ఇవ్వడం.. ప్రిస్క్రిప్షన్ రాయడం, పరిమితికి మించి వైద్యం చేస్తే చర్యలు తీసుకుంటాం. ఆర్ఎంపీలు బెడ్స్ వేసి చికిత్స అందించొద్దు. అలాంటివి మా దృష్టికి వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. – ప్రమోద్‌కుమార్, డీఎంహెచ్‌వో -
బీఆర్ఎస్ హయాంలో చేసిందేమిటి..?
ధర్మపురి: పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రజలకిచ్చి న హామీలపై ఆత్మ విమర్శ చేసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడా రు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చి రెండేళ్లు కాలేదని, ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేశామని, బీఆర్ఎస్ ఓర్వలేక ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేమిటో చెప్పాలన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో ధర్మపురి ఆలయానికి రూ.500 కోట్లు ఇస్తానని కేసీఆర్ ప్రకటించి మాట తప్పారని గుర్తుచేశారు. నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందిస్తామన్నది నిజం కాదా..? అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ధర్మపురిలో డిగ్రీ కళాశాల, పాల్టెక్నిక్, బస్‌డిపో, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెస్తానన్నారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, నాయకులు ఎస్.దినేష్, వేముల రాజు ఉన్నారు. -
పండుగకు ఊరెళ్తున్నారా..!
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో పిల్లలకు సెలవులు వచ్చాయి. పట్టణాల్లో ఉంటున్న వారంతా పిల్లాపాపలతో సొంతిళ్లకు బయల్దేరుతున్నారు. అయితే ఇళ్లకు తాళం వేసి వెళ్లేవారు విలువైన వస్తువులు ఉంచొద్దని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. ఆదివారం ‘సాక్షి’కి పలు విషయాలు వెల్లడించారు. ఇంకా ఆయన మాటల్లోనే..జగిత్యాలక్రైం: సెలవులు రావడంతో చాలామంది ఇళ్లకు తాళాలు వేసి విహారయాత్రలు, స్వస్థలాలకు వెళ్తున్నారు. అలాంటివారు ఇంట్లో విలువైన వస్తువులు ఉంచొద్దు. వెంట తీసుకెళ్లాలి.. లేదా బంధువుల వద్ద భద్రపర్చుకోవాలి. లేదా బ్యాంకు లాకర్లలో పెట్టుకోవాలి. ఇంటి ఇరుగుపొరుగు వారికి తప్పనిసరిగా సమాచారం అందించాలి. స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందిస్తే ఆ ప్రాంతంలో గస్తీ పెంచుతాం. ఇప్పటికే పోలీస్‌శాఖ తరఫున రాత్రివేళల్లో నిఘా పెంచాం. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. నేరాలు నియంత్రణకు తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. పండుగ సీజన్ కావడంతో వివిధ వస్తువులను అమ్మకం పేరిట ఇళ్ల వెంబడి తిరిగే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. చాలామంది మాటలతో మభ్యపెట్టి చోరీలకు పాల్పడే అవకాశం ఉంది. చైన్‌స్నాచర్లు వృద్ధులను టార్గెట్‌ను చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధులు బంగారు ఆభరణాలు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్‌లు వేసుకుని మాటల్లో దింపుతున్నట్లు అనిపిస్తే అప్రమత్తం కావాలి. మాస్క్‌లు వేసుకున్న వారు అనుమానితులైతే స్థానికులు వెంటనే వారిని ఆపి వివరాలు అడగాలి. సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దు కొంతమంది అపరిచితులు సోషల్ మీడియాలో పెట్టే వదంతులు నమ్మవద్దు. ఎవరైనా రెచ్చగొట్టేలా.. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే పోస్టులు పెడితే పోలీసులకు సమాచారం అందించాలి. సోషల్ మీడియాపై కూడా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలు శాంతియుతంగా పండుగలు జరుపుకునేలా పోలీసు శాఖ కృషి చేస్తుంది. రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరందసరా, బతుకమ్మ, దుర్గా నవరాత్రోత్సవాల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేశాం. గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక పోలీసు బలగాలు బృందాలుగా ఏర్పడి బందోబస్తు పెంచుతున్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా స్థానికులు వెంటనే 100 డయల్‌కు కాల్చేస్తే స్థానిక పోలీసులు అప్రమత్తమై వెంటనే సంఘటన స్థలానికి చేరుకుంటారు. -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థి ఎంపిక
కథలాపూర్: మండలంలోని భూషణరావుపేటకు చెందిన బానోత్ సిద్దూ అనే విద్యార్థి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు పీడీ రవీందర్ తెలిపారు. బానోత్ సిద్దూ కథలాపూర్ మోడల్స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఇటీవలే జగిత్యాలలో జరిగిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో సిద్దు ప్రతిభ చాటారన్నారు. నిజామాబాద్‌లో ఈనెల 25 నుంచి జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో సిద్దు మన జిల్లా తరఫున పాల్గొంటాడని పేర్కొన్నారు. విద్యార్థిని ప్రిన్సిపాల్ అనిత, ఉపాధ్యాయులు అభినందించారు. -
వరి పంటే లాభముంది
మొక్కజొన్న, కంది, పెసర వంటి వాటితో పోల్చితే వరి పంటే లాభంగా ఉంది. ట్రాక్టర్‌తో దున్నించి, నాటు వేసి, రోజు నీళ్లు చూసుకుంటే సరిపోతుంది. హార్వేస్టర్తో కోయించి, కొనుగోలు కేంద్రంలో పోస్తే అమ్ముకోవచ్చు. నేను మూడెకరాల్లో వరి సాగు చేశాను. – బందెల మల్లయ్య, చల్గల్ సాగునీరు పుష్కలం నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో వరి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 3.15 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. వరి పంటను తగ్గించి ఇతర పంటల వైపు రైతుల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ రైతులు వరి వైపే మొగ్గు చూపుతున్నారు. – వడ్డెపల్లి భాస్కర్, డీఏవో -
ఖైదీలకు ఉపాధి అవకాశాలు
● కరీంనగర్ జైలు బంకు సేవలు భేష్ ● జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా కరీంనగర్‌క్రైం: జైళ్లలో ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, కరీంనగర్లో ఖైదీలు తయారు చేసిన అగర్బత్తీలు రాష్ట్రవ్యాప్తంగా విక్రయం అవుతున్నాయని జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్యామిశ్రా అన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జైలుకు ఓ ట్రక్కు, అగర్బత్తీల తయారీ మిషన్, జిరాక్స్ మిషన్, కంప్యూటర్లు బహూకరించారు. వాటిని శనివారం జైళ్లశాఖ డీజీ సౌమ్య ఐజీ సంప త్, కరీంనగర్ జైలు సూపరింటెండెంట్ విజయ్‌దేని, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చీఫ్ మేనేజర్ స్వామినాథన్‌తో కలిపి ఆవిష్కరించారు. అనంత రం మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ ఆధ్వర్యంలో జైళ్లశాఖకు పెద్దఎత్తున సహాయం అందించారని తెలిపారు. కరీంనగర్ పెట్రోల్ బంక్ సేవల్లో ప్రథమస్థానంలో కొనసాగుతోందన్నారు. కరీంనగర్ జైలులో తయారు అవుతున్న అగర్బత్తీలు రాష్ట్రస్థాయిలో పెరుగాంచాయన్నారు. కరీంనగర్ జైలులో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి ఖైదీలకు డిజిటల్ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తామన్నారు. అనంతరం జైలులో ఖైదీల యోగక్షేమాలు, సదుపాయాలను పరిశీలించారు. జైలర్లు పి.శ్రీనివాస్, బి.రమేశ్, ఎ.శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ జైలర్లు ఎల్.రమేశ్, అజయ్‌చారి పాల్గొన్నారు. -
రెచ్చిపోతున్న చైన్‌స్నాచర్లు
● జల్సాల కోసం దొంగతనాల బాట ● భయాందోళన చెందుతున్న ప్రజలుజగిత్యాలక్రైం: ఒంటరిగా తిరుగుతున్న మహిళలే టార్గెట్‌గా చైన్‌స్నాచర్లు రెచ్చిపోతున్నారు. మెడలో నుంచి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్తున్నారు. ద్విచక్రవాహనాలపై వస్తున్న నిందితులు ముఖాలకు మాస్క్‌లు ధరించి వాహనాలపై... ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలోంచి బంగారాన్ని లాక్కెళ్తున్నారు. కాపు కాసి మరీ జనసంచారం లేనిచోట వారిని వెంబడిస్తున్నారు. వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా చూసుకుని ప్రధాన రహదారులతోపాటు చిన్నచిన్న గల్లీల్లో చోరీలకు పాల్ప డుతున్నారు. పొరండ్లకు చెందిన గొల్లపల్లి వెంకవ్వ మెడలో నుంచి బంగారాన్ని లాక్కెళ్లిన ఇద్దరు నిందితులను సీసీ పుటేజీ ఆధారంగా గుర్తించారు. వారి చిత్రాలను ఆంధ్రప్రదేశ్‌తోపాటు, వివిధ రాష్ట్రాలకు స్థానికల పోలీసులు పంపించారు. జల్సాల కోసమే చోరీలు.. చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న వారంతా 18 నుంచి 25 ఏళ్లలోపే వారేనని తెలుస్తోంది. గతంలో పట్టుబడిన వారు కూడా అదే వయస్సు గల వారు కావడం గమనార్హం. వీరంతా జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతూ.. వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నారు. -
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
జగిత్యాల:విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రా ణించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను ప్రారంభించారు. గెలుపోటములు సహజమని, ఓడిన వారు విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. యువజన క్రీడల అభివృద్ధి అధికారి రవికుమార్, అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, డీఆర్డీవో రఘువరన్ పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి జిల్లా కేంద్రంలోని 5, 11 వార్డుల్లోని ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఉచితంగా ఇసుక అందిస్తున్నామని, రవాణా, కూలీల ఖర్చులు భరించుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందన, వార్డు ఆపీసర్లు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన జిల్లా కలెక్టర్ జిల్లాకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి రేణుక యారను కలెక్టర్, ఎస్పీ అశోక్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆర్డీవో మధుసూదన్ ఉన్నారు. భవిత సెంటర్లను పూర్తి చేయాలి అంగన్వాడీ, భవిత సెంటర్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. భవన నిర్మాణాలపై కలెక్టరేట్లో సమీక్షించారు. అధికారులు అంగన్వాడీ, భవిత సెంటర్, పంచాయతీ, పాఠశాలలో కిచెన్ షెడ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. దసరా సెలవుల్లోపు పనులన్నీ పూర్తి కావాలన్నారు. జాతీయ రహదారిపై రైతుల అభ్యంతరాలు జాతీయ రహదారి 563 విస్తరణకు రైతుల నుంచి అభ్యంతరాలు రావడంతో కలెక్టర్ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరుఫున న్యాయవాదులు వివరించారు. జాతీయ రహదారి విస్తరణలో కొడిమ్యాల మండలం గౌరాపూర్‌కు చెందిన రైతుల భూములు పోతున్నాయని, రైతులు అభ్యంతరం చెబుతున్నారని అన్నారు. రైతులు సమర్పించిన ఆధారాలు, అభ్యంతరాలపై భూసేకరణ అర్బిట్రేషన్ అప్పిల్ హియరింగ్ నిర్వహించారు. -
బయో వ్యర్థాలపై నిర్లక్ష్యం వద్దు
మెట్పల్లి: బయో వ్యర్థాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మెట్పల్లి బల్దియా కమిషనర్ మోహన్ అన్నారు. బయో వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్న వైనంపై గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన మున్సిపల్ అధికారులు శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఆర్ఎంపీలతో సమావేశమయ్యారు. వారికి పలు సూచనలు చేశారు. వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తే ప్రజలు, మూగజీవాల ఆరోగ్యం దెబ్బతినే అవకాశముందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థకు అందించాలన్నారు. ఆర్ఐ అక్షయ్ ఉన్నారు. పింఛన్ పెంచాలని గ్రామపంచాయతీల ముట్టడిజగిత్యాలరూరల్: మేనిఫెస్టోలో ప్రకటించినట్టు దివ్యాంగులకు రూ.6 వేలు, చేయూత రూ.4 వేలు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం మాదిగ ఆధ్వర్యంలో పొరండ్ల, బాలపల్లి పంచాయతీ కార్యాలయాలను ముట్టడించారు. పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రం సమర్పించారు. అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. 22 నెలలు గడుస్తున్నా నెరవేర్చడం లేదన్నారు. పెన్షన్లు పెంచకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలిపారు. మెడపట్ల చంద్రశేఖర్, తోట రాజేశ్, మెడపట్ల రమేశ్, శిరీష, సుశీల, లక్ష్మీ పాల్గొన్నారు. -
హైకోర్టు జడ్జికి ఘనస్వాగతం
జగిత్యాలక్రైం:జిల్లా కోర్టులో నిర్వహించిన సమావేశానికి హైకోర్టు న్యాయమూర్తి రేణుక యారను రాగా.. ఆమెకు ఘన స్వాగతం లభించింది. పోలీసు గౌరవ వందనం స్వీకరించి జ్యుడిషియల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆమెను సన్మానించారు. జిల్లా జడ్జి రత్న పద్మావతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి మారుతి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతజగిత్యాలరూరల్: పర్యావరణ పరిరక్షణ అంద రి బాధ్యత అని జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ జెడ్పీ పాఠశాలలో ఏక్‌పేడ్ అప్నే మా కే నామ్‌పే కార్యక్రమంలో భాగంగా శనివారం మొక్కలు నాటారు. పర్యావరణ అసమతుల్య తతో మానవాళికి ముప్పు ఉందన్నారు. ఇందు కు విరివిగా మొక్కలు నాటి సంరక్షించుకోవా లన్నారు. ఎంపీవో రవిబాబు, హెచ్ఎం స్వరూపరాణి, ఉపాధ్యాయులు రమేశ్ పాల్గొన్నారు. డీలర్లు నిబంధనలు పాటించాలిమెట్పల్లి రూరల్/కోరుట్లరూరల్: ఫర్టిలైజర్ షాపుల డీలర్లు వ్యవసాయ శాఖ నిబంధనల మేరకు ఎరువులు విక్రయించాలని డీఏవో భాస్కర్ అన్నారు. మెట్పల్లి, వెల్లుల్ల, బండలింగాపూర్, కోరుట్ల మండలంలోని మాదాపూర్‌లోని ఫర్టిలైజర్ షాపులు, ఎరువుల గోదామును శనివారం తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ–పాస్ ద్వారానే ఎరువుల విక్రయించాలని సూచించారు. యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. మెట్పల్లి ఇన్చార్జి ఏవో లావణ్య, కోరుట్ల మండల ఏవో నాగమణి, సీఈఓ మహేందర్, ఏఈఓలు రాఘవేంద్ర, మమత ఉన్నారు. రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ పోటీలకు మోడల్‌స్కూల్ విద్యార్థులుజగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి మోడల్స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న పేరాల కృష్ణిక రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ పోటీలకు ఎంపికై నట్లు పీడీ వినిత్, అజీమ్ తెలి పారు. అండర్–14 బాలికల విభాగంలో చెస్ లో కృష్ణిక అత్యంత ప్రతిభ కనబర్చింది. కృష్ణికను పాఠశాల ప్రిన్సిపాల్ సరితాదేవి, వైస్ ప్రిన్సిపల్ నగేశ్, ఉపాధ్యాయులు అభినందించారు. చెస్, తైక్వాండో పోటీలకు తక్కళ్లపల్లి విద్యార్థులు మల్యాల: మల్యాల మండలం తక్కళ్లపల్లి జెడ్పీ పాఠశాల విద్యార్థులు ఎ.విష్ణువర్ధన్, ఎం.లతిక జిల్లాస్థాయి చెస్ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తైక్వాండో పోటీల్లో ఎం.లాత్విక రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. విద్యార్థులను హెచ్ఎం జి.శాంతిరాజు, పీడీ అంకం శేఖర్, ఉపాధ్యాయులు అభినందించారు. తాటిపల్లి బాలికల గురుకులం విద్యార్థులు జిల్లాస్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచినట్లు పీఈటీ మధులిక తెలిపారు. -
సైబర్‌క్రైం ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి
జగిత్యాలక్రైం: సైబర్‌క్రైం ఫిర్యాదులపై తక్షణం స్పందించి విచారణ వేగవంతం చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సైబర్‌నేరాల దర్యాప్తు, కేసుల పురోగతిపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సైబర్‌నేరాలు వేగంగా పెరుగుతున్నాయని, ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించి బాధితుల డబ్బులు ఫ్రీజ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్స్టేషన్ల పరిధిలో సైబర్‌క్రైం కేసులను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని సీఐలకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉండాలన్నారు. బ్యాంకింగ్, ఆన్లైన్ షాపింగ్ మోసాలు, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ అకౌంట్ హ్యాకింగ్, లాటరీ మోసాలు, ఉద్యోగాల పేరుతో డబ్బులు దోచుకోవడం వంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వీటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు, సోషల్ మీడియా ద్వారా విస్త్తృత ప్రచారం చేపట్టాలన్నారు. సమావేశంలో సైబర్‌క్రైం డీఎస్పీ వెంకటరమణ, సీఐలు అనిల్‌కుమార్, సురేశ్, రామ్నరసింహారెడ్డి, సుధాకర్, కరుణాకర్, రవి, సైబర్ ఎస్సై కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. హోంగార్డ్స్ సంక్షేమానికి ప్రత్యేక చర్యలుజిల్లాలో పని చేస్తున్న హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఉలెన్ జాకెట్స్, రెయిన్ కోట్స్‌ను శుక్రవారం హోంగార్డులకు అందజేశారు. వర్షాకాలం, చలికాలంలో హోంగార్డ్స్ ఇబ్బందిపడకుండా సక్రమంగా విధులు నిర్వర్తించేందుకు ఉలెన్ జాకెట్స్, రెయిన్ కోట్స్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్ఐ సైదులు, సిబ్బంది పాల్గొన్నారు. -
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
రాయికల్(జగిత్యాల): రాయికల్ పట్టణాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలో రూ.కోటితో చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటుకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు ఆహ్లాదకరంగా గడిపేందుకు పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాయికల్‌లోని ప్రతి వార్డులో రూ.15 కోట్ల నిధులతో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, కమిషనర్ మనోహర్, ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ నాగార్జున, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, మాజీ వైస్ చైర్మన్ రమాదేవి, నాయకులు పడిగెల రవీందర్‌రెడ్డి, కోల శ్రీనివాస్ పాల్గొన్నారు. జగిత్యాలక్రైం: జిల్లాలోని ప్రతీ బ్యాంకు ఏటీఎంల వద్ద పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటించాలని జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ అన్నారు. పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఏటీఏంల వద్ద సెక్యూరిటీ గార్డు, సీసీ కెమెరాలు, అలారమ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద అనుకోని ఘటన జరిగితే సిబ్బంది ఎలా ప్రతిస్పందించాలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. పట్టణ సీఐ కరుణాకర్, ఎస్సై కుమారస్వామి పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి
జగిత్యాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 10,775 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 7,261 మార్క్ చేయగా, 2,569 బేస్మెంట్స్థాయి, 428 గోడల నిర్మాణం, 165 స్లాబ్ దశకు చేరుకున్నాయని వివరించారు. ఇళ్లు మంజూరై పనులు ప్రారంభించకుంటే ఇతరులకు కేటాయించాలని ఆదేశించారు. జగిత్యాలలో ఇసుక బజార్ ఏర్పాటు చేయడం జరిగిందని, లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక లభిస్తుందన్నారు. ఆరోగ్యం స్వచ్ఛత అందరి బాధ్యత ఆరోగ్యం స్వచ్ఛత మనందరి బాధ్యత అని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమ పక్షోత్సవాల పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో చెత్తనిల్వ ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేయాలని, పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్, శ్రీనివాస్, డీఆర్డీఏ పీడీ రఘువరణ్ పాల్గొన్నారు. -
● ఇంకెన్నాళ్లు ఈ వేధింపులు? ● మహిళా ఉద్యోగులకు రక్షణ ఏది.. ● కమిటీలు నామమాత్రమేనా?
జగిత్యాల: మహిళా ఉద్యోగులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు తీసుకుంటున్నా వేధింపులు ఆగడం లేదు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను తోటి ఉద్యోగులు వేధిస్తే వెంటనే ఫిర్యాదు చేసేందుకు ప్రతీశాఖలో మహిళా కమిటీలను ఏర్పాటు చేశారు. వేధింపులకు గురైనవారు కమిటీకి ఫిర్యాదు చేస్తే వారు పూర్తిస్థాయిలో విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కానీ, జిల్లాలో వేధింపుల ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో అధికారుల ఒత్తిళ్ల మధ్య నలిగిపోతూ.. ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్న వారు ఉందరో ఉన్నారు. ● లోలోనే కుమిలిపోతూ.. ప్రతీశాఖలో కమిటీతో పాటు, జిల్లాస్థాయిలో సైతం కమిటీ ఉంటుంది. జిల్లస్థాయి కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. బాధితులు ఈ కమిటీలకు ఫిర్యాదు చేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు, సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో మహిళలు వేధింపులకు గురైనా చెప్పుకోలేకపోతున్నారు. ఉన్నతాధికారులకు చెబితే ఏమైనా సమస్యలు ఎదురవుతాయేమోనని లోలోపలే మదనపడుతున్నారు. కమిటీలు అంతర్గతంగా ఉంచినా ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు. ప్రతీ శాఖలో లైంగిక వేధింపుల ఘటనలు జరుగుతున్నా ధైర్యంగా ఫిర్యాదు చేయడం లేదు. ● ధైర్యంగా ఫిర్యాదు చేసేలా.. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి కమిటీలను బలోపేతం చేయడంతో పాటు, బాధితులు స్వేచ్ఛగా ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించాలి. అలాగే ఫిర్యాదు వచ్చిన వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. కొన్ని ఘటనల్లో నాన్చుడు ధోరణి వల్ల ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదన్న భావన మహిళ ఉద్యోగుల్లో కన్పిస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి వేధింపులు అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అంసరం ఎంతైనా ఉంది. మహిళలు వేధింపులకు గురైనప్పుడు ధైర్యంగా కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మహిళలు నిర్భయంగా విధులు నిర్వర్తించాలి. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. – సత్యప్రసాద్, కలెక్టర్ -
జాడలేని అప్రోచ్ రోడ్డు
అస్తవ్యస్తంగా మారిన రోడ్డు కోరుట్ల: రైల్వే స్టేషన్లో పనులు మొదలుపెట్టడానికి ముందే అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేయడంపై శ్రద్ధ చూపాల్సిన రైల్వే అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికులకు నరకం చూపుతోంది. కేవలం ప్రయాణికులకే కాదు..కల్లూర్ రోడ్ నుంచి అయిలాపూర్ మీదుగా మల్లాపూర్ మండలానికి లింకు కలిపే ఈ రోడ్డు సరిగా లేక జనం నానా అవస్థలు పడుతున్నారు. సుమారు 8 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా..ఈ ప్రాంత నాయకులు ఎవరు పట్టించుకోకపోవడం విచారకరం. అప్రోచ్‌రోడ్డు లేకుండానే.. ఈ ఏడాది జనవరిలో కోరుట్ల రైల్వే స్టేషన్లో వ్యాగన్ల లోడింగ్, అన్లోడింగ్ కోసం అదనపు రైల్వే ట్రాక్‌తో పాటు బల్లాస్ట్ లోడింగ్ పాయింట్(కంకర, ఇనుము, ఇసుక, వంటి సరుకుల నిల్వ–సరాఫరా కేంద్రం) ఏర్పాటుకు సంబంధించి రూ.17 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించక ముందే కాంట్రాక్టర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లడానికి అప్రోచ్ రోడ్డు నిర్మించాల్సి ఉండగా ఆ పని జరగలేదు. అప్రోచ్ రోడ్డు పనులు జరగకుండానే కాంట్రాక్టర్ కంకర నిల్వ కేంద్రం పనులు మొదలెట్టారు. ఈ క్రమంలో గతంలో ఉన్న మట్టి రోడ్డు సైతం దెబ్బతింది. దీంతో పాటు రైల్వే స్టేషన్‌కు వెళ్లడానికి తరుచూ రోడ్లను మార్చుతుండటంతో మరింత సమస్యగా మారింది. ఈ రోడ్డు సైతం మట్టితో వేయడంతో బురద మయంగా మారిపోయింది. కంకర లోడింగ్ పాయింట్ కోసం పోసిన కంకర రోడ్డుపైకి చేరడంతో వాహనాల రాకపోకలకు మరింత అవస్థలు ఎదురవుతున్నాయి. బిజీగా రైల్వేస్టేషన్.. జిల్లాలోని లింగంపల్లి, కోరుట్ల, మెట్పల్లి రైల్వే స్టేషన్లలో అత్యధికంగా కోరుట్ల నుంచి ముంబాయి, హైదరాబాద్‌కు రాకపోకలు ఉంటాయి. ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రాత్రి వేళ రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సి ఉండటం, అక్కడికి వెళ్లే అప్రోచ్ రోడ్డు సవ్యంగా లేక రైల్వే స్టేషన్ దారి తప్పిపోతున్నారు. ప్రస్తుతం రాకపోకల కోసం ఉన్న రోడ్డు ఎక్కడికక్కడే కాగిపోవడం..మరో రోడ్డులో వెళ్లాల్సి రావడం..మళ్లీ ఆ తోవలోనూ రోడ్డు అర్ధంతరంగా ఆగిపోవడం ఫలితంగా రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు. కొంత మంది రోడ్డు సరిగా లేక ప్రమాదాల పాలైన సందర్భాలు ఉన్నాయి. తొమ్మిదేళ్ల క్రితం కోరుట్ల రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు ఏలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు..సరికదా స్టేషన్‌కు వెళ్లే మట్టి రోడ్డు దెబ్బతిందని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలు తీసుకొని ఇబ్బందులు తొలగించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. -
జగిత్యాల
33.0/25.0Iగరిష్టం/కనిష్టంఎములాడ.. హిట్ పాట వేములవాడ రాజన్న సాక్షిగా షూటింగ్ చేసుకున్న ఎన్నో జానపద గీతాలు యూట్యూబ్‌లో దుమ్ము దులుపుతున్నాయి. మిలియన్లలో వ్యూస్‌తో దూసుకెళ్తున్నాయి.వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల చిరుజుల్లులు కురిసే అవకాశం ఉంది. అదనపు కలెక్టర్‌కు సన్మానంరాయికల్: అదనపు కలెక్టర్ రాజాగౌడ్‌ను శుక్రవారం రాయికల్ ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ నాగార్జున, పంచాయతీరాజ్ ఏఈ ప్రసాద్ తదితరులు సన్మానించారు. IIలోu శనివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025 -
ఎస్సారెస్పీకి 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 2.16 లక్షల కూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు 12 గేట్ల ఎత్తి 35,293 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే వరద కాల్వకు 6,735 క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 4 వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేలు, సరస్వతి కాల్వకు 400, లక్ష్మి కెనాల్‌కు 200, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మెట్పల్లి(కోరుట్ల): వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆరు నెలలకు పైగా ఏజెన్సీ నిర్వాహకులు తమకు వేతనాలు చెల్లించడం లేదన్నారు. దీంతో తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధులు సక్రమంగా నిర్వహిస్తున్న తమకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం సరికాదన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని బకాయిలు పూర్తిగా చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ధర్మపురి: నాటిన మొక్కలను సంరక్షించాలని జిల్లా పంచాయతీ అధికారి మదన్మోహన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నాటుదాం ఒక మొక్క అమ్మ పేరుమీద’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మగ్గిడి పాఠశాలలో శుక్రవారం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతీ విద్యార్థి తమ అమ్మ పేరుమీద ఒక మొక్క నాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఎంపీడీవో రవీందర్, ఏపీవో సృజన్, ఏఈఈ వివేకానంద, ప్రత్యేకాధికారి ఎంఈవో సీతామహాలక్ష్మి తదితరులున్నారు. మెట్పల్లి(కోరుట్ల): పట్టణంలో బయో వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్న వైనంపై ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనానికి హై దరాబాద్‌లోని మున్సి పల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మోహన్‌ను ఆదేశించారు. దీంతో ఆయన ..స్థానికంగా ఉన్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు ఇవ్వాలని శానిటేషన్ విభాగం ఇన్చార్జి అక్షయ్‌కు సూచించారు. ఈ మేరకు శుక్రవారం పలు ఆసుపత్రులకు నోటీసులు అందజేశారు. ఆసుప్రతుల్లోని బయో వ్యర్థాలను ఎక్కడికి తరలిస్తున్నారో ఆ సమాచారం లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. అలాగే ఆర్ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసి, వారి నుంచి కూడా బయోవ్యర్థాల సమాచారం తీసుకోవాలని నిర్ణయించామని అక్షయ్ తెలిపారు. మల్లాపూర్(కోరుట్ల): ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులు ప్రమాణాలు పాటించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డీఈవో రాము అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్తదాంరాజ్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. రోజూ విద్యార్థులు భోజనం తినే ముందు ఉపాధ్యాయులు విధిగా పర్యవేక్షించాలన్నారు. ఆయన వెంట ఎంఈవో దామోదర్‌రెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు. -
కొలిక్కిరాని ‘మెట్పల్లి క్లబ్’
మెట్పల్లి(కోరుట్ల): పట్టణంలోని మెట్పల్లి క్లబ్ సొసైటీకి చెందిన స్థల విక్రయ వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. నిబంధనలకు విరుద్ధంగా స్థలాన్ని విక్రయించారని సొసైటీలోని మృతిచెందిన సభ్యుల కుటుంబీకులు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు ద్వారా జిల్లా కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ విచారణకు ఆదేశించగా, పోలీసులు సొసైటీ ముఖ్యులపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యలతో ఆందోళన చెందుతున్న కొనుగోలు దారులు.. శుక్రవారం సొసైటీ ముఖ్యల వద్దకు వెళ్లి వివాదంపై నిలదీసినట్లు తెలిసింది. తమకు స్థలం అప్పగించాలని లేకుంటే తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని పట్టుబట్టినట్లు సమాచారం. ● వివాదం ఇలా మొదలు.. ● మెట్పల్లి క్లబ్ సొసైటీకి స్థానిక రాంనగర్లో 1,864 గజాల స్థలం ఉంది. దీనిని గత జూలైలో ఓపెన్ టెండర్ ద్వారా సుమారు రూ.4కోట్ల్లకు ఇద్దరి వ్యక్తులకు విక్రయించారు. ● అయితే ఈ విక్రయానికి సంబంధించిన సమాచారాన్ని తమకు తెలపకపోవడమే కాకుండా వచ్చిన సొమ్ములో సమాన వాటా ఇవ్వలేదని మృతిచెందిన సభ్యుల కుటుంబీకులు ఆరోపించారు. ● ఈ విషయాన్ని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావుకు తెలిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ● దీంతో జువ్వాడి విక్రయ వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకపోగా..ఆయన విచారణ జరిపి నివేదిక అందజేయాలని జిల్లా సహాకార అధికారి మనోజ్‌కుమార్‌ను ఆదేశించారు. ● బాధితులు ఫిర్యాదు మేరకు పలువురు సొసైటీ ముఖ్యులపై కేసు నమోదయింది. ● నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తింపు ● కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన డీసీవో మనోజ్‌కుమార్ పలు కోణాల్లో విచారణ జరిపి, సొసైటీ ముఖ్యులు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ● ప్రధానంగా మృతిచెందిన సభ్యుల కుటుంబీకులకు సభ్యత్వం ఇవ్వకపోవడం, సొసైటీ తరహా వ్యవహారాలతో నిమిత్తం లేని వ్యక్తులకు విక్రయించడం వంటివి చేసినట్లు గుర్తించి సంబంధిత నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. ● దీనిని పరిశీలించిన కలెక్టర్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలిసింది. ● కొనుగోలుదారుల ఆందోళన ● రెండునెలలకు పైగా ఈ వివాదం కొనసాగుతుండడంతో కోట్లాది రూపాయలు చెల్లించిన కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ● వివాదం పరిష్కారం కోసం సొసైటీ ముఖ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇది ఇప్పట్లో సమసిపోయే అవకాశం లేకపోవడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. ● మొత్తానికి ఈ వివాదం రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్నది చర్చనీయాంశమైంది. -
‘ఇందిరమ్మ ఇళ్ల’ను వేగవంతం చేయాలి
ఇబ్రహీంపట్నం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగం పెంచాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మండలంలోని యామపూర్లో ఇందిరమ్మ ఇళ్లు, పాఠశాలలో కిచెన్ షెడ్, తిమ్మాపూర్ తండాలో గ్రామ పంచాయతీ భవనం, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని అధికారులకు సూచించారు. పాత పోలీస్‌స్టేషన్ వద్ద నిర్మిస్తున్న పంచాయతీ భవనాన్ని పరిశీలించి మూడు నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు తెలిపారు. ఆర్డీవో శ్రీనివాస్, పీఆర్‌ఈఈ లక్ష్మణ్‌రావు, డీఈ రమణారెడ్డి, ఏఈ అభినవ్, హౌసింగ్ ఈఈ వాసం ప్రసాద్, తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో మహ్మద్ సలీం, ఎంపీవో రామకృష్ణరాజు పాల్గొన్నారు. కలెక్టర్‌కు స్వాగతం పలికిన చిన్నారులు యామపూర్ ప్రాథమిక పాఠశాల చిన్నారులు కలెక్టర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఏం చదువుతున్నారు..? మధ్యాహ్న భోజనం పెడుతున్నారా..? కోడిగుడ్డు ఇస్తున్నారా..? అన్నం రుచికరంగా ఉందా..? అని అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులు.. జగిత్యాల: తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులేనని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో దివ్యాంగులు, వయోవృద్ధుల కమిటీలతో సమావేశమయ్యారు. తల్లిదండ్రులను విస్మరించే కొడుకులు, కోడళ్లు, వారసులకు సీనియర్ సిటిజన్స్ కమిటీ ప్రతినిధులు కౌన్సెలింగ్ ఇస్తూ వారిలో చైతన్యం కల్పించాలన్నారు. ఫిర్యాదులు ఇచ్చే వృద్ధులకు సత్వర న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వ వృద్ధాశ్రమాన్ని సంక్రాంతికి ప్రారంభిస్తామన్నారు. దివ్యాంగులకు బస్సు, రైల్వే పాసుల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బీఎస్.లత, రాజాగౌడ్, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్‌రెడ్డి, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటరమణ, జిల్లా సంక్షేమ అధికారి నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పంపిణీకి సిద్ధంగా బతుకమ్మ చీరలు
జగిత్యాలరూరల్: బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం స్వశక్తి మహిళలకు బతుకమ్మ చీరలు అందించేందుకు సిద్ధమైంది. ఒక్కో మహిళకు రెండు చీరల చొప్పున అందించనున్నారు. జిల్లాలో 20,886 సంఘాల్లో 2,39,950 మంది మహిళలు ఉన్నారు. ఆరున్నర మీటర్ల చీరలను 1,84,673 మందికి.. 9 మీటర్ల చీరలను 55,277 మందికి అందించనున్నారు. మహిళలకు బతుకమ్మ కానుకగా.. గతంలో మాదిరిగానే బతుకమ్మ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చీరలు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ధర్మపురి నియోజకవర్గానికి ఎస్సీ హాస్టల్ ధర్మపురిలో.. జగిత్యాల నియోజకవర్గానికి నూకపల్లి న్యాక్ సెంటర్లో.. వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, కథలాపూర్ మండలాలకు కోరుట్ల సీ్త్రశక్తి భవన్లో.. కోరుట్ల నియోజకవర్గానికి కోరుట్ల మెప్మా కార్యాలయంలో చీరలను సిద్ధంగా ఉంచారు. -
మూతపడిన మహిళా క్యాంటీన్
జగిత్యాల: మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మహిళా క్యాంటీన్ మూతపడింది. రెండో అంతస్తులో మహిళా క్యాంటీన్ కోసం ఒక గది, హాల్ కేటాయించారు. ఉద్యోగులు, వచ్చిపోయే ప్రజలకు టీ, కాఫీతోపాటు భోజనం పెట్టేవారు. మహిళా సంఘాల సభ్యులు నెలకొకరు మారడం.. నిర్వహణ లేకపోవడంతో మూతపడింది. విశాలమైన గది, హాల్, వంటగది, స్టోర్ రూం ఉన్నా.. వ్యాపారం బాగానే జరిగినా.. అధికారుల నిర్లక్ష్యమో.. మహిళా సంఘాలు పట్టించుకోకపోవడమోగానీ అది మూతపడింది. ఈ విషయమై డీ ఆర్డీఏ పీడీ రఘువరణ్‌ను వివరణ కోరగా.. కొన్ని కారణాలతో తీయడం లేదని, త్వరలో తెరిచేలా చూస్తామని వెల్లడించారు. -
మహిళలు వినియోగించుకోవాలి
మహిళలకు ఇది ప్రత్యేక కార్యక్రమం. 13 రోజులపాటు శిబిరాలు నిర్వహిస్తాం. ప్రతి మహిళకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తాం. శిబిరాలను సద్విని యోగం చేసుకోవాలి. ఏదైనా వ్యాధి ఉంటే వెంటనే చికిత్స అందేలా చర్యలు తీసుకోవచ్చు.– శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌వో మహిళలందరికీ వైద్యం జిల్లాలోని ప్రతి మహిళకూ పరీక్షలు చేస్తాం. స్వస్థ్నారీస్వశక్తి పరివార్ అభియాన్కింద కార్యక్రమం చేపట్టాం. 13 రోజులపాటు శిబిరాల్లో అందరూ పాల్గొనాలి. ఇది ఎలాంటి ఖర్చు లేకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకునే మంచి అవకాశం. – ప్రమోద్‌కుమార్, డీఎంహెచ్‌వో -
రేపు జిల్లాకు హైకోర్టు జడ్జి రాక
జగిత్యాలజోన్: హైకోర్టు న్యాయమూర్తి రేణుక యా ర శనివారం జిల్లాకు రానున్నారు. కోర్టులో జరిగే జ్యు డిషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రేణుక ప్రస్తుతం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని అన్ని కో ర్టుల జ్యుడిషియల్ ఆఫీసర్స్ పాల్గొననున్నారు. పరిశుభ్రతలో భాగస్వామ్యం కండిమెట్పల్లి: పరిసరాల పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ అన్నారు. పట్టణంలో స్వచ్ఛోత్సవ్–స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతపై గురువారం అవగాహన కల్పించారు. ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు తడి, పొడి చెత్త వేర్వేరుగా వేయాలని, మురికి కాలువలు, రహదారులపై వేయొద్దని సూచించారు. చుట్టు పక్కన గ్రామాల నుంచి వచ్చే వారు పబ్లిక్ టాయిలెట్స్‌ను వినియోగించుకోవాలన్నారు. ఆశ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అల్లీపూర్ విద్యార్థిరాయికల్: మండలంలోని అల్లీపూర్ జెడ్పీ పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థి సీహెచ్.మనోజ్ కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పీడీ కృష్ణప్రసాద్ తెలిపారు. ఈనెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటాడని పేర్కొన్నారు. మనోజ్‌ను ప్రిన్సిపల్ పొరండ్ల కిరణ్ అభినందించారు. ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు ప్రారంభంజగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలోని పొన్నాల గార్డెన్స్‌లో 69వ ఎస్జీఎఫ్ అండర్–19 క్రీడాపోటీలు గురువారం ప్రారంభయ్యాయి. డీఐఈవో నారాయణ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. నిఖత్జరీన్, సిరాజ్, దీప్తి వంటి క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని కోరారు. దాదాపు 260మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పీడీలు, కోచ్‌లు సరిత, రాజశేఖర్, శ్రీనివాస్, రాజేందర్, సంతోష్, శ్రీకాంత్ పాల్గొన్నారు. నాణ్యతలేకనే దుంపేట చెరువుకు గండి కథలాపూర్: అధికారుల నిర్లక్ష్యం, నాణ్యతలేని పనులతోనే మండలంలోని దుంపేట చెరువుకు గండి పడిందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, మండల అధ్యక్షుడు మల్యాల మారుతి అన్నారు. గండిపడిన చెరువు వద్ద గురువారం నిరసన తెలిపారు. చెరువుకు ఇప్పటికి మూడుసార్లు గండిపడి రైతులు, మత్స్యకారులకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గండితో 80 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిన ట్లు దుంపేట, దూలూర్ రైతులు తెలిపారు. బీజేపీ నాయకులు దండిక లింగం, కథలాపూర్ మహేశ్, గడ్డం జీవన్‌రెడ్డి, నరెడ్ల రవీందర్‌రెడ్డి, కాసోజి ప్రతాప్ పాల్గొన్నారు. చెరువును తహసీల్దార్ వినోద్, నీటిపారుదలశాఖ డీఈ ప్రశాంత్, ఏఈ నవీన్, రాజు పరిశీలించారు. మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలిజగిత్యాల: మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీఈవో రాము అన్నారు. జిల్లా కేంద్రంలోని టీచర్స్ భవన్లో మాట్లాడారు. అక్రమ రవాణా నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం అయినప్పుడే సమూలంగా నిర్మూలించవచ్చన్నారు. ప్రజల స్వచ్ఛంద సంస్థ విద్యా పరిశోదన శిక్షణ మండలి ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ప్రాజెక్ట్ మేనేజర్ చంద్రయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు. -
సీబీఐ ఇక బిజీబిజీ!
హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు– నాగమణి జంటహత్య కేసు విచారణకు గురువారం సీబీఐ రంగప్రవేశం చేసింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఫోన్‌ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకు అప్పగిస్తే ఉమ్మడి జిల్లాలోనే మూడు కేసుల విచారణ కొనసాగనుంది. ఈ మూడు కేసులతో ఉమ్మడి జిల్లాకు లింక్ ఉండటంతో రాజకీయం హీటెక్కుతోంది. –సాక్షిప్రతినిధి, కరీంనగర్ఫోన్ట్యాపింగ్ కేసుతో లింకులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని పార్టీలకు చెందిన ముఖ్యనేతలుండగా వారి కదలికలను పసిగట్టేందకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్‌ట్యాపింగ్ చేసినట్లు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా కేంద్రసహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, కరీంనగర్ గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు తమ ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణ ఎదుర్కొంటున్న డీఎస్పీ ప్రణీత్‌రావును 2024 మార్చిలో సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్నారు. ఫోన్‌ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి అప్పగిస్తే రాష్ట్రంలో సంచలం సృష్టించిన ఈ మూడు కేసులు ఉమ్మడి జిల్లాతో ఉన్న లింకులు బయటపడనున్నాయి.జంట హత్యల కేసు2021 ఫిబ్రవరి 17న హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతులు రామగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కల్వచర్ల సమీపంలో హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఏడుగురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం సీబీఐ పునర్విచారణతో వామన్‌రావు తండ్రి ఆరోపిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత ప్రమేయంపై ఏం తేల్చస్తుందోనని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల్లో జోరుగా చర్చ నడుస్తోంది.‘కాళేశ్వరం’పైమంథని నియోజకవర్గం పరిధిలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ వైఫల్యానికి ప్రణాళిక, డిజైన్, నాణ్యత లోపాలు, నిర్మాణం కారణమని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టాలని అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ప్రభుత్వం లేఖ రాసింది. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా విచారణ చేపట్టొద్దని హైకోర్టు బ్రేకులు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ చేపడుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే సీబీఐ అధికారులు విచారణ చేపట్టే అవకాశాలున్నాయి.కేంద్ర దర్యాప్తు సంస్థల పర్యటనల పరంపర● ఉమ్మడి జిల్లాలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఇదేం కొత్త కాదు. గత ప్రభుత్వ హయాంలోనూ పలుమార్లు ఉమ్మడి కరీంనగర్ కేంద్రంగా అనేక కేసుల్లో విచారణ చేపట్టాయి. కొన్ని దాడులతో సరిపెట్టగా.. మరికొన్నిట్లో నోటీసుల వరకు వెళ్లాయి. ఇంకొన్నిట్లో విచారణ నేటికీ సాగుతోంది.● ఈ ఏడాది మార్చిలో మయన్మార్ కేంద్రంగా సైబర్ కేఫ్‌ల వద్ద బంధీలుగా మారిన భారతీయులను కేంద్రం విడిపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు, బాధితులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. ఈ కేసుపై ఎన్ఐఏ, సీబీఐ, ఇమిగ్రేషన్ సంస్థలు సంయుక్తంగా విచారణ చేపడుతున్నాయి.● 2022 సెప్టెంబరులో పీఎఫ్ఐ సానుభూతిపరులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. దేశ్యాప్తంగా పీఎఫ్ఐ సానుభూతిపరులను ఏకకాలంలో బెంబేలెత్తించింది. కరీంనగర్లోనూ ఇద్దరిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.● సీబీఐ ఆఫీసర్ అంటూ ఓ వ్యక్తి పలువురు వీఐపీలను మోసం చేసిన కేసులో అతని గురించి సమాచారం ఇవ్వాలంటూ 2022 డిసెంబరులో అప్పటి మంత్రి గంగుల కమలాకర్‌కు సీబీఐ అధికారులు నోటీసులు జారీచేశారు. ఈ ఘటన తరువాత ఉమ్మడి జిల్లాలో సీబీఐ అడుగుపెట్టడం ఇదే తొలిసారి.● లిక్కర్‌స్కాంలో విచారణలో భాగంగా కరీంనగర్ చెందిన అనేక మంది ప్రముఖుల ఇళ్లపై హైదరాబాద్‌లో 2022 సెప్టెంబరులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. వీరి స్వస్థలమైన కరీంనగర్ నుంచి కూడా రహస్యంగా పలు ఫైళ్లు, ఇతర సమాచారం సేకరించింది.● 2022 నవంబరులో గ్రానైట్ మైనింగ్‌లో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వానికి భారీగా పన్ను ఎగవేశారని ఈడీ, ఇన్‌కం ట్యాక్స్ (ఐటీ) పలువురు వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించాయి. -
మహిళలకు ఆరోగ్య పరీక్షలు
జగిత్యాల: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కు టుంబం బాగుంటుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ని ర్ణయించింది. ఇందుకోసం స్వస్థ్నారీస్వశక్త్ పరి వార్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్యక్రమాన్ని ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించగా.. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. వచ్చేనెల రెండోతేదీ వరకు ప్రతి మహిళకు ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని 24 ఆస్పత్రుల్లో 69 మంది స్పెషలిస్ట్‌లతో రోజుకు ఐదు క్యాంపుల చొప్పున మొత్తం 65 శిబిరాలు నిర్వహించి మహిళలకు చికిత్స అందించనున్నారు. మహిళా వైద్యులను నియమించి అవసరమైన రక్త, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీ నింగ్, రక్తహీనత, క్షయవ్యాధి, సికెల్‌సెల్ ఎని మియా వంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఎన్టీ, డెంటల్, సైకియాట్రిస్ట్, జనరల్ మెడిసిన్, చిన్నపిల్లలకూ వైద్యసేవలు అందించనున్నారు. మహిళలకు మేలు వైద్య శిబిరాల్లో మహిళలకు వివిధ వైద్య పరీక్షలతోపాటు గర్భిణులు, బాలింతలకు చికిత్స అందించి పోషకాహారంపై వివరించనున్నారు. జిల్లాలో మూడు లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. ఒక్కోరోజు ఒక్కో ఆస్పత్రిలో శిబిరం ఉండేలా రూపొందించారు. ప్రత్యేక వైద్యులు, ఆశావర్కర్లు, వైద్య సిబ్బంది చికిత్స అందించనున్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. ప్రతిఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలి మహిళలందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. స్వస్థ్ నారి స్వశక్తి పరివార్ శిబిరాన్ని ఖిలాగడ్డలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించారు. ఉప్పు, చక్కెర వాడకాన్ని తగ్గించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ మాట్లాడుతూ శిబిరాలను వినియోగించుకోవాలన్నారు. ఈఎన్టీ వైద్యులు శ్వేత, సంతోష్, ఆర్బీఎస్కే వైద్యులు సురేందర్ పాల్గొన్నారు. టెక్నికల్ కోర్సుతో విద్యార్థులకు భవిష్యత్టెక్నికల్ కోర్సులతో విద్యార్థులకు భవిష్యత్ ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. స్థానిక ఐటీఐ కళాశాలలో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. యువత టెక్నికల్ కోర్సులు నేర్చుకుని నిలదొక్కుకోవాలన్నారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది జగిత్యాలరూరల్: ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై న జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి మోడల్‌స్కూల్ టీచర్ చిలుకూరి శివకృష్ణను సన్మానించారు. -
తల్లిని పట్టించుకోని కొడుకులకు కౌన్సిలింగ్
హుజూరాబాద్‌రూరల్: కొడుకులు పట్టించుకోవడం లేదంటూ మండలంలోని కనుకులగిద్దె గ్రామానికి చెందిన ములుగు రాజమ్మ ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆర్డీవో రమేశ్‌బాబు గ్రామంలో విచారణ చేపట్టారు. ఒక్కొక్కరూ నెలకు రూ.మూడువేల చొప్పున తల్లి పోషణ నిమిత్తం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు సరిగా అమలవుతున్నాయో లేదా అని తెలుసుకోవడానికి కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలోని బృందం బుధవారం విచారణ చేపట్టింది. విచారణలో రాజమ్మను కుమారులు పట్టించుకోవడం లేదని తేలింది. ఆమె ముగ్గురు కొడుకులకు కౌన్సిలింగ్ ఇచ్చి రాజమ్మను పట్టించుకోకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విచారణలో సోషల్ కౌన్సిలర్ పద్మావతి, డీవీసీ కౌన్సిలర్ ఆరె శేఖర్, ఎస్ఆర్వో రఫీ, హెడ్ కానిస్టేబుల్ మధు, మల్లయ్య, మర్రి శ్రీనివాస్ తదితరులున్నారు. -
ప్రోత్సాహం ఇవ్వాలి
పట్టుకుచ్చుల పూల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి. బంతిపూల సాగుకు అందించినట్లు మాకూ సహకారం అందించాలి. – పెసరు లచ్చయ్య, రైతు, పెద్దాపూర్ బతుకమ్మ తయారీలో పట్టుకుచ్చులు అగ్రస్థానంలో ఉంటాయి. ఈ పూలు బతుకమ్మ పండుగకే వన్నె తెస్తాయి. మేము వీటినే ఉపయోగిస్తాం. – కె.రమాదేవి, కోనరావుపేట బంతి, చామంతి, లిల్లీ, గైలార్డియాపూల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. తక్కువ పెట్టుబడి, శ్రమలేని బంతిపూలు సాగుచేయాలి. – మహేశ్, హార్టికల్చర్ ఆఫీసర్ -
బతుకమ్మకు పట్టుకుచ్చుల అందం
జూలపల్లి(పెద్దపల్లి): బతుకమ్మకు అందం తెచ్చే పట్టుకుచ్చులు(కాక్స్‌కాంబ్) పూల సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతూ వస్తోంది. ఆడపడచులు సంబురంగా ఆడుకునే బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మను పేర్చేందుకు పట్టుకుచ్చులు వినియోగిస్తారు. వీటిని పెద్దాపూర్, తెలుకుంట, నాగులపల్లె, జూలపల్లి, చీమలపేట తదితర గ్రామాల్లో రైతులు విరివిగా సాగు చేస్తున్నారు. మూడు నెలలకే పంట కోతకు వస్తుంది. పెట్టుబడి తక్కువ, శ్రమతో కూడుకున్నది. అయినా, డిమాండ్ అధికంగా ఉండడంతో అన్నదాతలు వీటి సాగుకు మొగ్గుచూపుతున్నారు. బతుకమ్మ పండుగకు మూడు నెల ముందే నారుపోస్తారు. సస్యరక్షణ చర్యలతో నాణ్యమైన పూలు పండిస్తున్నారు. గతంలో రెండు, మూడు ఎకరాలకే పరిమితమైన పట్టుకుచ్చుల సాగు.. ఇప్పుడు సుమారు 15 ఎకరాలకు పైగా పెరిగిందని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటే సాగు విస్తీర్ణం మరింత పెంచుతామని రైతులు చెబుతున్నారు. పల్లెల నుంచి పట్టణాలకు.. వివిధ పల్లెల్లో పండిస్తున్న పట్టుకుచ్చుల పూలను రైతులు పట్టణాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా మంచిర్యాల, గోదావరిఖని, కరీనంగర్, హైదరాబాద్, సిద్దిపేట తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. పెద్దాపూర్‌లో పెరిగిన సాగు విస్తీర్ణం రైతులకు ప్రోత్సాహం ఇవ్వాలని వినతి -
బైక్ అదుపు తప్పి మామ, కోడలు దుర్మరణం
మాక్లూర్/నందిపేట్ (ఆర్మూర్): బైక్ అదుపు తప్పిన ఘటనలో మామ, కోడలు మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దుర్గానగర్ శివారులో బుధవారం వేకువజామున చోటు చేసుకుంది. నందిపేట మండలం తల్వేదకు చెందిన చింటుకు ఇబ్రహీంపట్నం మండలం కొజన్‌కొత్తూర్‌కు చెందిన పూజ (25)తో పది నెలల క్రితమే వివాహమైంది. బీటెక్ చదివిన పూజ పెళ్లికి ముందు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేది. పెళ్లి సమయంలో ఉద్యోగం మానేసిన ఆమె.. మళ్లీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఇంటర్వ్యూ కోసమని హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. బైక్‌పై తమను నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్ద వదిలేసి రావాలని చింటు తండ్రి నారాయణ (58)ను కోరాడు. ముగ్గురూ కలిసి బైక్‌పై బయల్దేరారు. చింటు డ్రైవింగ్ చేస్తున్నారు. దుర్గానగర్ శివారులో బైక్ అదుపు తప్పి కిందపడిపోయారు. నారాయణ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తీవ్రంగా గాయపడిన పూజ, చింటును ఆంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పూజ మృతి చెందింది. మామ, కోడలు మృతితో తల్వేదలో విషాదం అలుముకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. నారాయణ (ఫైల్) పూజ (ఫైల్) స్వల్పగాయాలతో బయటపడిన మృతురాలి భర్త పైళ్లెన 10 నెలలకే విషాదం మృతురాలిది ఇబ్రహీంపట్నం మండలం కొజన్‌కొత్తూర్ -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని లెక్చరర్కాలనీలో నివాసం ఉండే దిడ్డి శ్రీదేవి(53) అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. మనస్తాపంతో భర్త దిడ్డి సుధాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. టౌన్ సీఐ రామకృష్ణ కథనం ప్రకారం.. దిడ్డి శ్రీదేవి – దిడ్డి సుధాకర్‌కు కొన్నేళ్లక్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు ఆదర్స్, కూతురు సింధూ ఉన్నారు. ఇద్దరికీ వివాహాలయ్యాయి. కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, ‘మీ అక్క చనిపోయి ఉంద’ని సుధాకర్ ఫోన్‌ద్వారా ఆమె సోదరుడు పోరండ్ల శ్రావణ్‌కు ఫోన్‌ద్వారా సమాచారం అందించాడు. ఆ వెంటనే కుటుంబసభ్యులతో కలిసి అక్కడకు చేరుకున్న శ్రావణ్.. సోఫాలో పడుకొని మృతి చెందిన తన అక్కను చూసి రోదించాడు. తన కూతురుకు అనారోగ్యం లేదని, బాధపడేంత ఇతర కారణాలు కూడా ఏమీలేవని, ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలి తల్లి తిరుపతమ్మ వాపోయింది. మృతిపై విచారణ జరిపి న్యాయం చేయాలని పోలీసుకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదుచేశారు.భర్త సుధాకర్ ఆత్మహత్యాయత్నం..శ్రీదేవి చనిపోవడంతో మనస్తాపం చెందిన సుధాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తన భార్య శ్రీదేవి సోపాలో పడుకుని గుండెపోటుతో మృతి చెందిందని, ఆమె మృతిని తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించానని సుధాకర్ వెల్లడించాడు. మరోవైపు.. తన తల్లి మృతి చెందిందనే సమాచారంతో అమెరికాలో ఉంటున్న కుమారుడు ఆదర్స్ వెంటనే ఇండియా బయలుదేరినట్లు బంధువులు తెలిపారు. -
బైండోవర్ ఉల్లంఘించిన ఏడుగురికి జైలు
మంథని: ముత్తారం మండలం ఖమ్మంపల్లి, పోతారం, మైదంబండ, అడవిశ్రీరాంపూర్, కేశనపల్లి, పారుపల్లి గ్రామాల్లో గుడుంబా విక్రయిస్తూ బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన ఏడుగురిని బుధవారం తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి ఎదుట బైండోవర్ చేసినట్లు ఆబ్కారీ ఇన్స్పెక్టర్ రాజేశ్‌కుమార్ తెలిపారు. దీంతో వారికి ఏడాది జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించారన్నారు. ఈమేరకు నిందితులను రిమాండ్ నిమిత్తం కరీంనగర్‌కు తరలించినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ సాయికుమార్, సిబ్బంది శ్రీనివాస్, మహేందర్, నిరంజన్, వసంత, రవి పాల్గొన్నారు. మూడిళ్లలో చోరీజగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని అయ్యప్ప ఆలయ సమీపంలోని హరిహర కాలనీలో బుధవారం వేకువజామున తాళం వేసి ఉన్న మూడిళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇళ్ల తాళాలు పగులగొట్టి తులంన్నర బంగారం ఎత్తుకెళ్లారు. ఉదయం పక్కింటి వారు లేచేసరికి డోర్లు తెరిచి ఉండటంతో ఇంటి యజమానులకు సమాచారం అందించారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించగా పట్టణ సీఐ కరుణాకర్ సంఘటన స్థలానికి చేరుకుని హరిహర కాలనీలో సీసీపుటేజీలను పరిశీలించారు. ముగ్గురు దొంగలు ముసుగులు వేసుకుని వెళ్లినట్లు రికార్డు అయింది. సీఐ మాట్లాడుతూ.. ఇళ్లలో విలు వైన వస్తువులు ఉంచవద్దని, బ్యాంక్ ల్యాకర్లలోగానీ భద్రపర్చుకోవాలన్నారు. ప్రతి కాలనీల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. -
డిజిటల్ క్రాప్ సర్వే షురూ
● గతానికి భిన్నంగా వెసులుబాటు ● అక్టోబర్ 20 గడువు కరీంనగర్ అర్బన్: డిజిటల్ క్రాప్ సర్వేశ్రీ క్రమంగా పట్టాలెక్కుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం సర్వే చేపడుతున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో కొంత ఆలస్యంగా మొదలవగా సర్వే పురోగతిని వ్యవసాయ శాఖ డైరెక్టర్ సమీక్షిస్తున్నారు. వచ్చే అక్టోబరు 20నాటికి పూర్తి చేయాల్సి ఉండగా గతేడాది సర్వే నిర్వహణకు ఏఈవోలు చేతులెత్తేయగా ఈ ఏడాది ఆ సమస్య తలెత్తకుండా, సజావుగా సాగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. 17 అంశాలతో వివరాల నమోదు మార్కెటింగ్, ఎరువులు, విత్తనాలు, దిగుమతులు, ఎగుమతులు, ప్రాసెసింగ్ వంటి అవసరాల ప్రణాళికను రూపొందించేందుకు ప్రతి రైతు వివరాలను ఆన్లైన్లో పొందుపరచనున్నారు. 17 పేజీల మార్గదర్శకాలతో ప్రభుత్వం ఆదేశించింది. పచ్చిరొట్ట, అపరాలు, సీడ్ ప్రొడక్షన్ వివరాలు, అంతర పంట వివరాలు, సేంద్రియ వ్యవసాయం చేసే వారి వివరాలు, ప్రతి పంట వాటి రకాలు, నీటి వసతి, ఉద్యాన పంటలైతే వయసు, చెట్ల సంఖ్య నమోదు చేయనున్నారు. గత నెల వరకు 2,10,234 పాసుపుస్తకాలకు డిజిటల్ సైన్ కాగా ప్రతి సర్వే నంబర్ వారీగా పంటల వివరాలను నమోదు చేస్తున్నారు. వివరాల నమోదు అనంతరం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచిన అనంతరం రైతుల ఫోన్ నంబర్లకు ఎస్సెమ్మెస్ రానుంది. పురుషులకు 2 వేలు.. మహిళలకు 18,00 లక్ష్యం సీజన్లో ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి తమ క్లస్టర్ పరిధిలోని రైతులను ప్రత్యక్షంగా కలిసి వాస్తవంగా సాగులో ఉన్న క్షేత్రాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేయాలి. మహిళా ఏఈఓలు కనీసం 1,800 ఎకరాల్లో, పురుష ఏఈఓలు కనీసం 2వేల ఎకరాల్లో డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన వాటికి సాధారణ క్రాప్ బుకింగ్ పద్ధతిలో చేస్తారు. ప్రతి పంటను ఫొటో తీసి అప్లోడ్ చేయటం తప్పనిసరి. నమోదు మొత్తాన్ని ఒకే మొబైల్ యాప్ ద్వారా పూర్తి చేస్తారు. సర్వేలో వరి రకాల వివరాలు పేర్కొనటం తప్పనిసరి. ధాన్యం సేకరణ కోసం ఇది ఉపయోగపడుతుంది. సర్వే ఎందుకంటే దేశంలో ఏ పంట దిగుబడి ఎంత వస్తుందనే అంచనా సులువు. అలాగే దిగుబడులకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధరల నిర్ణయం ఉండనుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కచ్చితత్వంతో నష్ట నిర్ధారణ ఉంటుంది. అలాగే చీడపీడల ఉనికి, తగిన విధంగా రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలు సంసిద్ధతకు వినియోగించనున్నారు. వ్యవసాయ పురోగతి అంచనాకు ఈ సర్వే దోహదపడుతుంది. రైతుకు సంక్షిప్త సందేశం క్రాప్ బుకింగ్ 90శాతం పూర్తి కాగానే రైతులకు సంక్షిప్త సమాచారం ద్వారా వివరాలు పంపిస్తారు. రైతు వివరాలు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రదర్శించాలి. నమోదులో తప్పులు దొర్లితే సరిచేయమంటూ రైతు దరఖాస్తు ఇవ్వాలి. ఏఈవో మూడు రోజుల్లో సరి చేసి తుది జాబితా ప్రదర్శించనున్నారు. జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే ముమ్మరంగా సాగుతోందని, తప్పుగా నమోదైన వివరాలు సరిచేసేందుకు అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు. జిల్లాలో మొత్తం రైతులు : 2,10,234 మొత్తం క్లస్టర్లు : 77 రెవెన్యూ గ్రామాలు : 205 భూ విస్తీర్ణం : 3,33,450 ఎకరాలు -
మోదీ పాలనలో అగ్రగామిగా దేశం
పెగడపల్లి: ప్రధాని మోదీ పాలనలో దేశం అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జెండా విష్కరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కేంద్ర పథకాలను ఇంటింటికీ వివరించాలన్నారు. అనంతరం కాటం నర్సింహరెడ్డి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. పార్టీ మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ధర్మపురి ఇన్చార్జి అంజయ్య, జిల్లా అధికార ప్రతినిధి సత్యం, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అనసూర్య, మహేశ్, హరీశ్, రవీందర్‌రెడ్డి, కొమురెల్లి తదితరులు పాల్గొన్నారు. -
మహాలక్ష్మీ పథకం ద్వారా..
జగిత్యాల: ప్రజాపాలనలో పేదలకు భరోసా లభి స్తోందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నా రు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమ ని, సన్నవడ్లకు బోనస్, విద్యార్థులకు మెరుగైన వి ద్య అందిస్తున్నామని తెలిపారు. భూభారతి చట్టం ద్వారా రైతులకు వెసులుబాటు కలుగుతుందన్నా రు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో మాట్లాడారు. 1948లో తెలంగాణ నిజాంచెర నుంచి విముక్తి పొంది దేశంలో విలీనమైన రోజు సెప్టెంబర్ 17 అన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇంటి స్థలం ఉండి.. దరఖాస్తు చేసుకున్న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న 10,775 మందికి ఇళ్లు ఇవ్వగా 7,245 ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని, లబ్ధిదారులకు దశలవారీగా రూ.29.19 కోట్లు చెల్లించామని వివరించారు. భూభారతి ద్వారా రెవెన్యూ సదస్సులు నిర్వహించి 25,672 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించామని, సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయన్నారు. 2024–25 యాసంగి సీజన్లో 428 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 4,63,308 టన్నుల దొడ్డురకాన్ని 86,979 మంది రైతుల నుంచి కొని రూ.1,075 కోట్లు ఖాతాల్లో జమ చేశామన్నారు. 30,626 టన్నుల సన్నరకం ధాన్యాన్ని 940 మంది రైతుల నుంచి కొని రూ.11కోట్లతోపాటు, క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 38,619 మందికి రేషన్‌కార్డులు మంజూరు చేశామని, 75,052 మంది కుటుంబ సభ్యుల పేర్లు కొత్తగా చేర్చామని వివరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024 నుంచి విద్యార్థులకు 200 శాతం డైట్ చార్జీలు 40 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచామన్నారు. 1,67,154 జాబ్‌కార్డులు జారీ చేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 11.12 లక్షల పనిదినాలు కల్పించి 32.19 లక్షల ఉపాధి కూలీలకు పనులు కల్పించామన్నారు. మహిళలకు రుణాలు మహిళలందరినీ కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇందిరా మహిళాశక్తి ద్వారా 461 వ్యక్తిగత యూ నిట్లకు రూ.10.21కోట్లు మంజూరు చేశామన్నారు. 53 గ్రూపులకు రూ.9.14 కోట్లు కేటాయించామన్నా రు. 330 స్వశక్తి సంఘాలకు ఈ ఏడాది రూ.45.54 కోట్లు బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరు చేశామన్నారు. ముందుగా ఆయన పోలీసుల గౌరవ వంద నం స్వీకరించారు. ఆయనకు కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ స్వాగతం పలికారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మాజీమంత్రి జీవన్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు బీఎస్.లత, రాజాగౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సరస్వతిదేవిని దర్శించుకున్న నిరంజన్ అనంతరం నిరంజన్ నూకపల్లిలోని సరస్వతి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టరేటోవిశ్వకర్మ జయంతి జగిత్యాలటౌన్: శిల్ప కల,వాస్తు శిల్పి మూలపురుషుడు విశ్వకర్మ అని నిరంజన్ అన్నారు. కలెక్టరేట్లో విశ్వకర్మ జయంతి వేడుకలో పాల్గొన్నారు. ఆధునిక సమాజంలో ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు విశ్వకర్మను ఆదర్శంగా తీసుకో వాలన్నారు. అదనపు కలెక్టర్ రాజా గౌడ్, బీసీ సంక్షేమ అధికారి సునీత, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాగేందర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రైతులకు భరోసావానాకాలం సీజన్లో రైతులకు రైతుభరోసా అందించామని, 2,25,406 మంది రైతులకు రూ.243.32 కోట్లు జమచేశామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. నాలుగు విడతల్లో 80,515 మంది రైతులకు రూ.721.74 కోట్ల మాఫీ చేశామన్నారు. రైతుబీమా ద్వారా రూ.248.80 కోట్లు అందించి ఆర్థిక చేయూత కల్పించామని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 19,661 మందికి రూ.46.21 కోట్ల విలువ చేసే శస్త్రచికిత్స చేయించామన్నారు. మహాలక్ష్మీ పథకాన్ని ఇప్పటి వరకు 5.41 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నారని, వారికి రూ.279.93 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. రూ.500కే సిలిండర్ సరఫరా చేస్తున్నామని, రూ.23.73 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించిందన్నారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకున్నవారికి జీరో బిల్లు ఇస్తున్నామని, 2,07,474 సర్వీసులకు రూ.125.62కోట్లు ప్రభుత్వం చెల్లించిందన్నారు. -
బహిరంగ ప్రదేశాల్లో బయోవ్యర్థాలు
మెట్పల్లి: పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు, ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌ల నుంచి వెలువడే బయో వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. నిబంధనల ప్రకారం వీటిని ప్రభుత్వం గుర్తించిన బయో వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థలకు అప్పగించాల్సి ఉంటుంది. కానీ చాలామంది నిర్మానుష్య ప్రదేశాల్లో పడేసి చేతులు దులుపుకుంటున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇవి నిబంధనలు.. జరుగుతోందిలా.. పొంచి ఉన్న ముప్పు.. -
హైదరాబాద్ రాష్ట్రం విలీనంలో నెహ్రూ, పటేల్ పాత్ర
● మాజీమంత్రి జీవన్‌రెడ్డి జగిత్యాలటౌన్: హైదరాబాద్ రాష్ట్రం దేశంలో విలీనం కావడం వెనుక నెహ్రూ, సర్దార్ వల్ల భాయ్ పటేల్ పాత్ర పోషించారని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఇందిరాభవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. భారత సైన్యాన్ని హైదరాబాద్ కు తరలించి రాచరిక పాలన నుంచి విముక్తి కల్పించారని పేర్కొన్నా రు. సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడం మంచి నిర్ణయమన్నారు. నాయకులు బండ శంకర్, గాజుల రాజేందర్, రాంచంద్రారెడ్డి పాల్గొనారు. సీపీఐ ఆధ్వర్యంలో..జగిత్యాలటౌన్: సీపీఐ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విజయాలు నేటి పరిస్థితిపై సదస్సు నిర్వహించారు. సాయుధ పోరాట అమరులకు నివాళి అర్పించారు. ఎర్రజెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. తుల రాజేందర్, వెంకటస్వామి, భూమేశ్వర్, సుతారి రాములు, మునుగూరి హన్మంతు, కొక్కుల శాంత, లక్ష్మి పాల్గొన్నారు. -
ప్రజాపోరుతోనే తెలంగాణకు విముక్తి
జగిత్యాలటౌన్: సబ్బండ వర్గాల పోరాటంతోనే నిజాం నిరంకుశత్వం నుంచి తెలంగాణకు విముక్తి లభించిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు లెల్లెల బాలకృష్ణ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శ్రీవీర తెలంగాణ విప్లవ పోరాటం – నేటి వక్రీకరణలుశ్రీ అంశంపై సదస్సు నిర్వహించారు. రైతాంగ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది కమ్యునిస్టులు, వేలాది మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ఆ పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ స్థానం ఏమిటని ప్రశ్నించారు. ఏ మాత్రం సంబంధం లేని పార్టీలు విమోచన, విలీనం, విద్రోహం అంటూ చరిత్రకు వక్రభాష్యాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోమటి చంద్రశేఖర్, ఎంఏ.చౌదరి, మల్యాల సురేష్, లకావత్ మహిపాల్, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
జాతి సమైక్యతతో ముందుకు సాగాలి
జగిత్యాలక్రైం: జాతి సమైక్యతతో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని ఎస్పీ అశోక్‌కుమార్ అ న్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు ప్రధాన కార్యాలయంలో జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంతో మంది సమరయోధుల పోరాటంతో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీ ఐలు ఆరీఫ్‌అలీఖాన్, అనిల్‌కుమార్, రాంనర్సింహారెడ్డి, సుధాకర్, కరుణాకర్, ఆర్ఐలు కిరణ్‌కుమార్‌రెడ్డి, సైదులు, వేణు, ఎస్సైలు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాపాలన కాదు.. రాచరిక పాలనజగిత్యాల: రాష్ట్రంలో ప్రజాపాలన కాదు.. రాచరిక పాలన నడుస్తోందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత అన్నారు. బుధవారం జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవి ష్కరించారు. తెలంగాణ ప్రజల పోరాట స్ఫూ ర్తికి రైతాంగ సాయుధ పోరాటం ఉదాహరణ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో సుపరిపాలన అందిస్తే.. రేవంత్‌రెడ్డి ప్రజావ్యతిరేక పాలన అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆనంద్‌రావు, గంగాధర్, మల్లేశ్, వొల్లం మల్లేశం, దే వేందర్నాయక్, వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. ముగిసిన విశ్వకర్మ భగవానుడి బ్రహ్మోత్సవాలుధర్మపురి: పట్టణంలోని గోదావరి ఒడునున్న విశ్మకర్మ భగవానుడి బ్రహ్మోత్సవాలు బుధవారంతో ముగిశాయి. విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో శ్రీమద్విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఐదు రోజులపాటు నిర్వహించారు. జయంతి వేడుకల సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరై స్వామివార్లను దర్శించుకున్నారు. సాయంత్రం స్వామివారి సేవా పల్లకిని పట్టణ పురవీధుల మీదుగా ఊరేగించారు. తాగునీటి కోసం గ్రామస్తుల ధర్నారాయికల్: పదిహేను రోజులుగా తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం మండలంలోని వీరాపూర్ గ్రామస్తులు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పైప్‌లైన్ లీక్ కావడంతో నల్లా నీరు రావడం లేదని, పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి చెప్పినా పట్టించుకోవడం లేదని, ఉన్న బోరు కూడా వినియోగంలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు అందిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మనుషుల అక్రమ రవాణా నిర్మూలన అందరి బాధ్యత జగిత్యాల: మనుషుల అక్రమ రవాణా నిర్మూలన అందరి బాధ్యత అని ప్రజ్వల ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చంద్రయ్య అన్నారు. బుధవారం టీచర్స్ భవన్లో విద్య పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరికీ చట్టాల గురించి వివరించాలని, పోక్సో, ఐటీపీఏ, బీఎన్ఎస్ చట్టాలపై విద్యార్థులకు వివరించాలన్నారు. కార్యక్రమంలో కో–ఆర్డినేటర్ సత్యనారాయణ, చంద్రయ్య, సరిత, రాజేశ్, మహేశ్, ఆనందరెడ్డి పాల్గొన్నారు. -
బెడ్లు లేక రోగులు విలవిల
ధర్మపురి: వివిధ సమస్యలతో బాధపడుతు ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్న రోగులకు సరిపడా బెడ్లు లేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రి గతంలో 30పడకలుగా ఉండేది. వైద్య విధాన పరిషత్‌లోకి మారడంతో 50 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. కానీ.. ఇది పేరుకు మాత్రమే. కేవలం పది బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విషజ్వరాలతో చాలామంది బాధపడుతున్నారు. బుధవారం 184 మంది ఓపీ వచ్చారు. వీరిలో వివిధ వ్యాధులో బాధపడుతున్నవారిని ఆస్పత్రిలో చేర్చుకున్నారు. అయితే ఒక్కో బెడుపై ఇద్దరు చొప్పున ఉంచి వైద్య సేవలందించారు. రోగి వెంట వచ్చి సహాయకులు ఆస్పత్రిలో స్థలం లేక బయట ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆస్పత్రిని సందర్శించి రోగులకు సరిపడా వసతులు కల్పించాలని వైద్యాఽధికారులకు సూచించారు. అయినప్పటికీ అదనపు వసతులు కల్పించలేదనే విమర్శలు ఉన్నాయి. మండలంలోని వివిధ గ్రామాల నుంచి జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రికి వస్తే.. బెడ్లు లేకుండాపోయాయని రోగులు ఆవేదనం వ్యక్తం చేశారు. ఈ విషయమై వైద్యాధికారి రవిని వివరణ కోరగా ప్రస్తుతం ఆస్పత్రి పైఅంతస్తు పనులు పూర్తికాకపోవడంతో బెడ్లు ఉపయోగించడం లేదన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఎనిమిది బెడ్లు జనరల్ వార్డులో, మూడు ఎమర్జెన్సీ, 15 పోస్ట్ ఆపరేటర్ వార్డులో, 10 ఐసీయూలో ఉన్నాయని, పరిస్థితులను బట్టి వినియోగించుకుంటున్నామని తెలిపారు.