బీజేపీవి కుల, మత రాజకీయాలు
రాయికల్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కుల, మత రాజకీయాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతోందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఆరోపించారు. రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో గురువారం జై బాపు జై భీమ్ జై సంవిదాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి రాజ్యాంగ ప్రతులతో పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోడీ కులమతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అంబేద్కర్ ఆలోచన విధానమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. పార్టీ కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దని, కష్టసుఖాల్లో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. గంగాధర్, మహేశ్, అత్తినేని గంగారెడ్డి, మాజీ సర్పంచ్ తంగెళ్ల రమేశ్, గోపి రాజిరెడ్డి, ఎంబారి రమేశ్, ఎంబారి వెంకటేశ్, ముజాద్, శ్రీను, రవి పాల్గొన్నారు.
● మాజీ మంత్రి జీవన్‌రెడ్డి


