పెన్షన్ సవరణ బిల్లును రద్దు చేయాలి
జగిత్యాలటౌన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ సవరణ బిల్లును రద్దు చేయాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో పాత పెన్షన్‌దారులకు హాని చేసే సవరణ బిల్లును రద్దు చేయాలనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. పెన్షనర్లను పాత, కొత్త పెన్షన్‌దారులుగా విభజించడం బిల్లు ముఖ్య ఉద్దేశమన్నారు. పెన్షన్ హక్కులు, లాభాలు ఎవరికీ వర్తించాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. పెన్షనర్ల కడుపు కొట్టే ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్‌కుమార్, నాయకులు పీసీ.హన్మంతరెడ్డి, గౌరిశెట్టి విశ్వనాథం తదితరులు ఉన్నారు.


