
● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
కోరుట్ల: ఈనెల 27 వరంగల్‌లో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సత సభకు భారీగా తరలిరావాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఈ మేరకు కోరుట్ల పట్టణంలో సోమవారం పలు కుల సంఘాలు, యువజన సంఘాల నాయకులను కలిసి ఆహ్వాన పత్రికలు అందించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించేందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని, అమలు సాధ్యంకాని హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రానికి మళ్లీ కేసీఆర్ అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.