
తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే
జగిత్యాలటౌన్: తల్లిదండ్రుల సంరక్షణ వారి పిల్లలదేనని, బాధ్యతలను విస్మరిస్తే జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తామని జగిత్యాల ఆర్డీవో పులి మధుసూదన్ అన్నారు. శనివారం తన కా ర్యాలయంలో వయోవృద్ధుల చట్టం కింద దాఖలయిన అర్జీలను పరిశీలించారు. వృద్ధుల వారసులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పెగడపల్లి మండలం నామాపూర్‌కు చెందిన నల్ల రాజిరెడ్డి, గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందిన ఈర్తి రాయమల్లు, మల్లన్నపేటకు చెందిన గుండేటి రాజేశ్వరి, జిల్లాకేంద్రంలోని వాణినగర్‌కు చెందిన పల్లికొండ లక్ష్మి ఫిర్యాదులపై ఆర్డీ వో వి చారణ చేపట్టారు. తల్లిదండ్రుల సంక్షేమాన్ని వి స్మరిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. నోటీసులు ఇచ్చినా స్పందించకుంటే జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ ఏఓ తఫజుల్ హుస్సేన్, సీనియర్ సిటిజెన్స్ జిల్లా కమిటీ అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్, ప్రతినిధులు గౌరిశెట్టి విశ్వనాథం, నక్క ఇందయ్య, చట్టం సెక్షన్ అసిస్టెంట్ పద్మజ, ఎఫ్‌ఆర్‌ఓ కొండయ్య పాల్గొన్నారు.
● జగిత్యాల ఆర్డీవో పులి మధుసూదన్