
అంబేడ్కర్ కృషితోనే అన్ని వర్గాల అభ్యున్నతి
● మాజీమంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాలరూరల్: అంబేడ్కర్ కృషితోనే అన్ని వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతోందని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాలఅర్బన్ మండలం ధరూర్‌లో జైబాపు, జై బీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ధరూర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ రహదారిపై అంబేడ్కర్, మహాత్మగాంధీ చిత్రపటాలు, రాజ్యాంగ ప్రతులతో ర్యాలీ నిర్వహించారు. కులమతాల పేరుతో చిచ్చుపెడుతున్న బీజేపీకి యువతే తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అభివృద్ధి ముసుగులో కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేను నిలదీయాలని పిలుపునిచ్చారు. పదేళ్ల నుంచి ఎందుకు అభివృద్ధి చేయలేదో నిలదీయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శీలం సురేందర్, శివకుమార్, శీలం మల్లేశం, నర్సయ్య, బండ శంకర్, గాజంగి నందయ్య, గోపి రాజిరెడ్డి, కండ్లపల్లి దుర్గయ్య, జున్ను రాజయ్య, కోండ్ర జగన్, చాంద్‌పాషా, గంగాధర్, మహేశ్, రాధాకిషన్‌రావు, నరేశ్, రాజిరెడ్డి, స్వామిరెడ్డి, గుండ మధు, సింగరావు, మొగిలి, ముకేశ్ పాల్గొన్నారు.