Sakshi Special
-
అల.. ఏకశిలానగరిలో..
రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట రామాలయం టీటీడీలోకి విలీనమైంది. టీటీడీ ఏటా బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తోంది. ఈ ఏడు కూడా శనివారం నుంచి ఈ నెల 15 వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా నిర్వహించనున్నారు. తొలిరోజున అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. ఈనెల 11న రాములోరి కల్యాణం కన్నుల పండువగా చేయనున్నారు. ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈసందర్భంగాఒంటిమిట్ట రామయ్య క్షేత్రం ప్రత్యేక కళను సంతరించుకుంది. ఒంటిమిట్ట (రాజంపేట): ఒంటిమిట్టలోని కోదండరామాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. ఈ నెల 5వ తేదీ నుంచి 15 వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో విశేష పూజలు చేపట్టనున్నారు. రోజుకొక అలంకారంలో రామయ్య భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ప్రధాన విశేషం.. సీతారామలక్ష్మణులు కొలువుదీరిన ఏ ఆలయంలో అయినా హనుమ కూడా దర్శనమిస్తారు. అయితే ఒంటిమిట్ట గుడిలో సీతారామలక్ష్మణులు మాత్రమే ఏకశిలపై దర్శనమిస్తారు. ఆంజనేయుడి విగ్రహం లేదు. అయితే ఆలయ తూర్పు గాలిగోపురానికి తూర్పుగా రథశాల పక్కనే సంజీవరాయుడుగా వెలసిన ఆంజనేయస్వామి గుడి నిర్మించారు. త్రేతాయుగంలో సీతారామలక్ష్మణ నివాసం.. త్రేతాయుగంలో సీతారామలక్ష్మణులు ఈ ప్రాంతంలో కొంతకాలం నివసించారని పురాణ కథనం. అప్పుడు సీతమ్మకు దప్పిక అయింది..రాముడు బాణం సంధించి భూమిలోకి వదిలాడు. నీరుపైకి ఎగజిమ్మింది. సీతమ్మ దప్పిక తీరింది. లక్ష్మణుడు అన్న అనుజ్ఞతో తాను ఒక బాణం వదిలాడు. నీరుపైకి వచ్చింది. ఆ నీటిబుగ్గలనే నేడు రామతీర్థం..లక్ష్మణతీర్థం అని పిలుస్తున్నామనే కథ పురాణాల ద్వారా తెలుస్తోంది. ధర్మ సంస్థాపన కోసం ఒంటిమిట్ట గుడి.. రాముడిక్కడ కోదండం ధరించి ఉన్నాడు. కోదండం ధర్మరక్షణకు ప్రతీక. అలనాడు శ్రీరామచంద్రుడు అడవుల్లో తిరుగుతూ నార వస్త్రాలు ధరించినా కోదండాన్ని విడువలేదు. అది ధర్మరక్షణ కోసమే. బుక్కరాయులు తర్వాత సిద్దవటం మట్లిరాజులు ఆలయాన్ని అత్యంత వైభవోపేతంగా తీర్చిదిద్దారు. అనంతరాజు, తిరుమలరాయలు, తిరువెంగళనాథరాజు, కుమార అనంతరాజులు ఒంటిమిట్ట కోవెలను తీర్చిదిద్దారు. ఉన్నతమైన ప్రాకారకుడ్యాలు సమున్నతమైనగోపుర శిఖరాలు రంగమంటపాల్లో అద్భుత శిల్పవిన్యాసాలు కనిపిస్తాయి. ఏకశిలానగరానికి ఎలా చేరుకోవాలంటే.. చెన్నై–ముంబాయి రైలుమార్గంలోని ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లో దిగి ఒంటిమిట్ట(ఏకశిలానగరం)కు చేరుకోవచ్చు. కడప నుంచి రేణిగుంట తిరుపతికి వెళ్లే బస్సు మార్గంలో , కడప నుంచి 25కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట వస్తుంది. ఆలయ చరిత్ర.. విజయ నగర స్రామాజ్యంలో క్రీ.శ 1340లో ఉదయగిరి పాలకుడు కంపరాయలు ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించారు. ఆయన కొంతపరివారాన్ని వెంటబెట్టుకొని వచ్చాడు. ఈ అడవుల్లో ఇద్దరు బోయలు ఉండేవారు. వారే వంటడు, మిట్టడు. వీరు రాజుగారికి సేవలందించారు. ఈ సమయంలో సమీపంలో గుట్టమీద చిన్నపాటి గుడి ఉంది. జాంబవంతుడు నిలిపిన శిలలో సీతారామలక్ష్మణులని భావించి దండం పెట్టుకొంటున్నారని, అక్కడ గుడి కట్టి పుణ్యం కట్టుకోమన్నారు. సీతమ్మను వెతుకుతూ ఒకనాడు జాంబవంతుడు ఈ గుట్టమీద విశ్రమించాడని, ఆరాత్రి అక్కడే నిద్రించాడని ఉదయం తిరిగి వెళ్తూ ఆ శిలలో సీతారామలక్ష్మణులను భావించుకొని నమస్కరించుకొని వెళ్లాడట. వంటడు..మిట్టడు చెప్పిన మేరకు కంపరాయులు గుడి, చెరువు నిర్మించేందుకు అంగీకరించారు. ఆ బాధ్యత బోయలకే అప్పగించారు. కాగా.. ఒంటడు.. మిట్టడు.. ఆలయ నిర్మాణంలో భాగం అయ్యారు గనుకనే ఈ ఆలయానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందనే పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. ఏకశిలా నగరంగా.. ఒంటిమెట్ట మీద నిర్మించిన ఆలయం ఉన్న ప్రదేశం ఒంటిమిట్ట అయింది. ఒంటిమిట్ట గుడికి అనురూపంగానే ఏర్పడిన మరోపేరు ఏకశిల. ఒకేశిలలో సీతారామలక్ష్మణ విగ్రహాలు నిర్మితమై ఉన్నాయి. ఇది అరుదైన సంగతి. జాంబవంతుడు ముగ్గుర్ని ఒకే శిలలో భావించుకొన్నాడు. ఆ తర్వాత కాలంలో కంపరాయలు, బుక్కరాయలు అదే సంప్రదాయంతో ఏకశిలలో ముగ్గురు మూర్తులు ఉండేటట్లు నిర్మాణం చేయించారు. బహుశా ఒకే శిలలో ముమ్మూర్తులను నిలిపిన సంఘటన ఒంటిమిట్టలో మొదటిగా ఆవిష్కృతమైంది. అరుదుగా కొలవైన ఏకశిలావిగ్రహ ప్రాంతాన్ని ఏకశిల అని భక్తితో అన్నాడు పోతన. రాత్రిపూటే కల్యాణం.. ఒంటిమిట్ట స్వామివారి కల్యాణం రాత్రిపూట నిర్వహిస్తారు. చతుర్ధశినాటి రాత్రి వివాహమహోత్సవం, కళాపూర్ణుడైన చంద్రుడు సీతారామ కల్యాణాన్ని పరమానందంతో తిలకిస్తాడని పురాణకథ చెపుతోంది. కాగా రాత్రి కల్యాణం సంప్రదాయం ఇప్పటిదికాదు. అది ఒంటిమిట్ట ఆలయం ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇలాగే జరుగుతోంది. అన్ని రామాలయాలలో నవమిరోజున కల్యాణం నిర్వహిస్తారు. అది పగటిపూట. ఒక్క ఒంటిమిట్ట కోదండరామాలయంలోనే రాత్రి పూట రాములోరి కల్యాణం జరుగుతుంది. ఈ నెల11న రాత్రి 8–10 గంటలలోపు స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. రామయ్య సేవలో కవులుఒంటిమిట్ట కోదండరామాలయంలో వెలసిన రఘురాముడిని సేవిస్తూ కవులెందరో తరించారు. వారిలో అయ్యలరాజు తిప్పయ్య, బమ్మెర పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగొండూరు వెంకట కవి, వరకవి నల్లకాల్వ అయ్యప్ప, వాసుదాసు వావిలికొలను సుబ్బారావులు తమతమ స్థాయిలో కోదండరామునిపై సాహిత్యం, కీర్తనలు, రచనలుతోపాటు ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారు.ఆలయ నిర్మాణం ఇలా..విజయ నగర సామా్రజ్య చక్రవర్తి బుక్కరాయలు ఒంటిమిట్ట గుడిలో ఏకశిలా విగ్రహం నిలిపిన నాటికి గర్భాలయం, అంతరాళం, చిన్నగోపురం ఉండేవి. మొదటి దశ నిర్మాణమిది. మూడవ దశలో మహా మంటపం (రంగ మంటపం), మహా ప్రాకారం, తూర్పు, ఉత్తర , దక్షిణ గాలిగోపురాలు, మహా ప్రాకారం లోపల నైరుతి దిక్కున కళ్యాణ మంటపం, ఆగ్నేయ దిశలో పాకశాల, ప్రాకారంలోపల ఉత్తరం వైపు తూర్పున, పడమర ఎదుర్కోలు మంటపాలు, రామలింగదేవుని గుడి (1966)లో లింగాన్ని నిలిపారు. సంజీవరాయస్వామి, రథం, రథశాలను ఏర్పాటుచేశారు. అనంతరం అనంతరాజు గుడిని విస్తరించాడు. మహామంటపం, మహాప్రాకారం, గాలిగోపురాల నిర్మాణాలు చేపట్టారు. తెలుగురాష్ట్రాలలో ఒంటిమిట్ట గాలిగోపురాల తరహాలో మరెక్కడా కనిపించవు. ఈ ఆల యాన్ని దర్శించిన టావెర్నియర్ అనే యాత్రికుడు ఎత్తయిన గోపురాలు చూసి విస్మయం చెందాడు. రామయ్యకు బ్రహ్మోత్సవ శోభ ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలతో ఏకశిలానగం శోభాయమానంగా వెలుగొందనుంది. ఇప్పటికే కళ్యాణవేదిక ముస్తాబు, భక్తుల కోసం గ్యాలరీలు చకచకా ఏర్పాటుచేశారు. 60 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. వీవీవీఐపీ, వీఐపీ, సాధారణ భక్తులును దృష్టిలో ఉంచుకొని గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. దాశరథి కల్యాణానికి వచ్చే భక్తులకు తోపులాట వాతావరణం లేకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. రేపటి నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు దాదాపు పూరికావస్తున్నాయి. దాశరథి కోవెలలో నవమి ఏర్పాట్లు... ఒంటిమిట్టలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆరోజున ఆలయంలో పోతన జయంతి కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించనున్నది. కవిసమ్మేళనం నిర్వహిస్తారు. నవమి సందర్భంగా భక్తులు పెద్దఎత్తున రానున్నారు. -
వెండితెరకు మిస్టర్ భారత్
‘ఈ దేశం నీకేమిచ్చిందనేది కాదు... ఈ దేశానికి నువ్వేమిచ్చావ్ అనేది చూడాలి’ అన్నారు నెహ్రూ. ‘జై జవాన్ జై కిసాన్ ’ అన్నారు లాల్‌బహదూర్ శాస్త్రి. ఈ దేశానికి ప్రధానులైన వారు ప్రజలను దేశం వైపు చూసేలా చేయగలిగారు. ఈ స్ఫూర్తిని సినిమా రంగంలో మొదటగా అందుకున్న హీరో మనోజ్ కుమార్ (Manoj Kumar). సినిమాల్లో తన పాత్రకు ‘భారత్’ అని పేరు పెట్టుకుని అందరి చేత ‘మిస్టర్ భారత్’ అనిపించుకున్నాడు. శుక్రవారం మరణించిన ఈ దేశభక్త నటుడికి నివాళి1974.‘రోటీ కపడా ఔర్ మకాన్’ రిలీజైంది. జనం మొదటిరోజు మొదటి ఆటకు వెళ్లారు. ఫస్ట్సీన్... జేబులో డిగ్రీ పెట్టుకుని రోడ్ల మీద బేకార్‌గా తిరుగుతున్న హీరో ఒకచోట ఆగిపోయాడు. కారణం... పోలీస్ ఒకతనిపై తుపాకీ ఎక్కుపెట్టి ‘చెప్పు... ఎవరు నువ్వు’ అని అడుగుతున్నాడు. ‘నేనా... ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్‌ని’... ‘ఏం దొంగిలించుకుని వెళుతున్నావ్?’ ‘చూస్తావా...’ కోటు చాటున ఉన్న వస్తువు చూపించాడు. రొట్టె ముక్క.ఈ సీన్‌తోనే ఆనాటికి దేశంలో పేరుకొని పోయిన ఆకలిని, నిరుద్యోగాన్ని చూపించి ప్రేక్షకుల గుండెలను గట్టిగా చరుస్తాడు మనోజ్ కుమార్. ఆ తర్వాతి సీను కప్పుకోవడానికి గుడ్డలేని పేద స్త్రీలు... నిలువ నీడలేని నిరుపేద కూలివాళ్లు. దర్శకుడు తీసిన కథ తమ కష్టాల గురించే అని జనం అర్థం చేసుకున్నారు. సినిమా సూపర్ హిట్ అయ్యింది.‘సినిమా అనేది సందేశాలివ్వడానికి కాదు అని కొందరు అంటారు... అనుకుంటారు. కాని నేను తీసేది మాత్రం ఏదో ఒక సందేశం (Message) ఇవ్వడానికి. సమాజం నుంచి ఎంతో పొందాం... బదులుగా మంచి మాట చెప్పడానికి ఏమిటి కష్టం’ అంటాడు మనోజ్ కుమార్.బాధ చూసినవాడు బహుశా బాధ్యతగా ఉంటాడు. పదేళ్ల వయసులో ఉండగా దేశ విభజన చూశాడు మనోజ్ కుమార్. నేటి పాకిస్తాన్లో ఉన్నా అబ్తాబాద్ నుంచి అతడి కుటుంబం ఢిల్లీకి వచ్చేసింది. రెఫ్యూజీ క్యాంప్‌లో ఉంటూ చదువుకున్నాడు. ఆ కష్టాలను మర్చిపోవడానికి అప్పుడప్పుడు మేనమామ వచ్చి సినిమాకు తీసుకెళ్లేవాడు. పన్నెండేళ్ల మనోజ్ చూసిన మొదటి సినిమా ‘జుగ్ను’. ఇందులో దిలీప్ కుమార్ హీరో. సినిమా చివరలో చనిపోతాడు. తర్వాత మనోజ్ మరో సినిమా చూశాడు. ‘షహీద్’. ఇందులో కూడా దిలీప్ కుమార్ హీరో. సినిమాలో చనిపోతాడు. మనోజ్ చాలా విస్మయం చెంది ఇంటికొచ్చి తల్లిని అడిగాడు ‘అమ్మా.. ఒక మనిషి ఎన్నిసార్లు చనిపోతాడు?’. ‘ఒకసారే’. ‘మరి రెండుసార్లు చనిపోతే?’... ‘అలాంటి వాళ్లు దేవదూతలై ఉంటారు’ అంది. ‘అంటే సినిమా హీరోకు మరణం లేదన్నమాట. నేను హీరోను అవుతాను. దిలీప్ కుమార్లాంటి హీరో’ అనుకున్నాడు మనోజ్ కుమార్. అంతే కాదు దిలీప్ కుమార్ నటించిన ‘షబ్నమ్’ చూసి అందులో దిలీప్ పేరు ‘మనోజ్’ అని ఉంటే ‘నేను పెద్దయ్యి హీరో అయ్యాక ఆ పేరే పెట్టుకుంటాను’ అనుకున్నాడు. అనుకున్నట్టుగానే హీరో అయ్యాడు. అదే పేరుతో విఖ్యాతం అయ్యాడు. ఎంతగా అంటే అతని అసలు పేరు హరికిషన్ గిరి గోస్వామి (Harikrishna Giri Goswami) అని ఎవరికీ తెలియనంత!ఢిల్లీ నుంచి బాంబే వచ్చి సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు మనోజ్ కుమార్. వాళ్ల నాన్న కవి. ఇతనికి కూడా రాయడం వచ్చింది. కొన్నాళ్లు ఘోస్ట్ రైటర్‌గా పని చేశాడు. సినిమాల్లో ‘ఎక్స్ట్రా’గా కూడా కనిపించాడు. దిలీప్ కుమార్‌ను ఇమిటేట్ చేస్తూ ఇతను చేస్తున్న నటన ఖరీదైన దిలీప్ కుమార్‌ను బుక్ చేసుకోలేకపోయేవారిని ఆకర్షించింది. మెల్లగా అవకాశాలు వచ్చాయి. 1960లో వచ్చిన ‘కాంచ్ కీ గుడియా’తో తొలిసారి హీరోగా కనిపించాడు. సినిమా ఫ్లాప్ అయ్యింది. మరికొన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. అదే సమయంలో హీరో అవకాశాలు పొందడానికి డింకీలు కొడుతున్న ధర్మేంద్ర, శశి కపూర్లతో దోస్తీ కట్టి ఎక్కే స్టూడియో దిగే స్టూడియోగా ఉండేవాడు. ముగ్గురి జాతకం బాగుంది... ముగ్గురూ పెద్ద హీరోలయ్యారు. కాని మిగిలిన ఇద్దరి కంటే మనోజ్ ఎక్కువ నైపుణ్యాలు ప్రదర్శించాడు. నటుడు, రచయిత, ఎడిటర్, నిర్మాత, దర్శకుడు... అన్నింటికి మించి దేశభక్తి అనే అంశాన్ని సినిమాకు ఫార్ములాగా మార్చగలిగిన మేధావి అయ్యాడు.పెద్ద హీరోల రొమాంటిక్ సినిమాల హవా నడుస్తున్న రోజుల్లో డాన్స్ ఏ మాత్రం చేయలేని, లిమిటెడ్ బాడీ లాంగ్వేజ్ ఉన్న మనోజ్ కుమార్ సీరియస్ సబ్జెక్ట్స్ తనను గట్టెక్కిస్తాయని భావించాడు. భగత్సింగ్లాంటి కేరెక్టర్ తన ఇమేజ్ను పెంచుతుందని ఆ సినిమా చేయాలనుకున్నాడు. కాని భగత్ సింగ్‌కు సంబంధించి సినిమా తీసేంత సమాచారం ఆ రోజుల్లో లేదు. మనోజ్ కుమారే నాలుగేళ్లు తిరిగి సమాచారం సేకరించి కథ తయారు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. 1965లో వచ్చిన ‘షహీద్’... భగత్ సింగ్ మీద వచ్చిన తొలి భారతీయ సినిమా. పెద్ద హిట్ అయ్యింది. అంతేకాదు ‘నర్గిస్‌దత్ జాతీయ పురస్కారం’ గెలుచుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీకి వెళ్లినప్పుడు నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సినిమాను చూశారు. మరుసటిరోజు టీకి ఆహ్వానించి మనోజ్‌తో ‘నేను జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చాను కదా. నువ్వు ఆ నినాదం పై సినిమా తీయరాదూ’ అని అడిగారు. దేశ ప్రధాని కోరిన కోరిక మనోజ్‌ను సూటిగా తాకింది. ఒక నోట్‌బుక్, పెన్ను పట్టుకుని ఢిల్లీలో రైలెక్కి ముంబైలో దిగేలోపు ‘ఉప్కార్’ స్క్రిప్ట్ రాశాడు. దర్శకుడు కావాలనే కోరిక అప్పటి వరకూ మనోజ్‌కు లేదు. కాని ప్రధానిని ఇంప్రెస్ చేసేలా సినిమా తీయాలంటే తానే దర్శకుడిగా మారక తప్పదు అనుకున్నాడు. అంటే ఒక ప్రధాని వల్ల దర్శకుడైన ఏకైన వ్యక్తి మనోజ్. భారతదేశంలో రైతుకు ప్రాధాన్యం ఇవ్వాలని, సైనికులకు బాసటగా నిలవాలని మనోజ్ తీసిన ‘ఉప్కార్’ అతణ్ణి అంబరంలో కూచోబెట్టింది. అవార్డుల రాసి పోసింది. ‘మేరే దేశ్ కీ ధర్తీ’ పాట జనాన్ని ఊపేసింది. సినిమాలో పాత్రకు పెట్టిన పేరు భారత్ (Bharat) మనోజ్ కుమార్ నిక్‌నేమ్ అయ్యింది. ‘మిస్టర్ భారత్’.పాశ్చాత్య సంస్కృతి చెడ్డది కాకపోయినా దానిని చెడ్డగా ఇమిటేట్ చేస్తున్న వారిపై ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ తీశాడు మనోజ్. మన సంస్కృతి మనకు ముఖ్యం అని చాటాడు. ఇక దేశంలో నిరుద్యోగం, యువకుల్లో పేరుకుపోతున్న అనిశ్చితి పై ‘రోటీ కపడా ఔర్ మకాన్’ తీశాడు. నేటికీ ప్రభుత్వాలు ఈ మూడూ అందించడానికి ఆపసోపాలు పడుతూనే ఉన్నాయి. ఇక బ్రిటిష్ వారు ఆక్రమించుకున్న చిన్న సంస్థానాల నుంచి వారిపై సాయుధ పోరాటం చేసిన వారి కథతో తీసిన భారీ చిత్రం ‘క్రాంతి’ సూపర్‌డూపర్ హిట్ అయ్యి భాష తెలియని ప్రాంతాల్లో కూడా పెద్ద కలెక్షన్లు రాబట్టింది. కార్మికుల సమస్యలతో ‘షోర్’ తీశాడు. చిరుద్యోగుల తరఫున ‘క్లర్క్’ తీశాడు. ఆకాంక్షలో స్వచ్ఛత, ప్రయత్నంలో శ్రమ ఉంటే విజయం వరిస్తుందనడానికి మనోజ్ కుమార్ జీవితం ఒక ఉదాహరణ. ఏ హీరోని అయితే చూసి హీరో అయ్యాడో ఆ దిలీప్ కుమార్‌తో ‘ఆద్మీ’లో నటించగలిగాడు మనోజ్ కుమార్. అదే దిలీప్ కుమార్‌ను డైరెక్ట్ చేసి ‘క్రాంతి’గా సూపర్‌హిట్ సాధించగలిగాడు. తగిన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేక ముఖాన్ని చేతుల్లో దాచుకునే మేనరిజంతో ఫేమస్ అయిన మనోజ్‌ను అప్పుడప్పుడు కళాకారులు అదే మేనరిజంతో ఆటపట్టించడం కద్దు. షారూక్ ఖాన్ ‘ఓమ్ శాంతి ఓమ్’లో మనోజ్‌ను ఇమిటేట్ చేసి ఆయనకు కోపం తెప్పించాడు. పరువు నష్టం దావా వేసే వరకూ వ్యవహారం వెళ్లి తర్వాత సద్దుమణిగింది.చదవండి: అసహ్యించుకుంటూనే.. చివరికి నటినయ్యామనోజ్ కుమార్ నిజమైన దేశ ప్రేమికుడు. తన సినిమాల్లో అన్ని మతాల, వర్గాల వారి పాత్రలు సృష్టించి దేశమంటే మనుషులోయ్ అని చూపించినవాడు. నేటి హేట్ ఫిల్మ్స్ మధ్యలో మనోజ్ భావధార వెనుకబడ్డట్టు అనిపించిన అంతిమంగా గెలవబోయేది అదే. ఎందుకంటే విలువల వరుసలో మానవత్వం ముందు ఉండి తర్వాతే కదా మతం ఉండేది. సెల్యూట్ మిస్టర్ భారత్.హోమియోపతి డాక్టర్మనోజ్ కుమార్ మంచి హోమియోపతి డాక్టర్. అతనికి ఒకసారి చెంప మీద సర్పి వచ్చింది. అల్లోపతిలో ఎన్ని వైద్యాలు చేసినా పని చేయలేదు. నటుడికి ముఖాన సర్పి చాలా ప్రమాదం. ఆ సమయంలో మద్రాసులో షూటింగ్లో ఉండగా హోమియోపతిప్రాక్టీసు చేసే నటుడు అశోక్ కుమార్ (Ashok Kumar) ఒక డోస్ మందు వేశాడు. వారంలో సర్పి మాయమైంది. మనోజ్‌కు ఇది ఎంతగా ఆసక్తి రేపిందంటే అతడు హోమియోపతి డాక్టర్ల కంటే ఎక్కువగా హోమియోపతి (Homeopathy) చదివి ఆ వైద్యం ప్రాక్టీసు చేయడానికి సర్టిఫికెట్ పొందాడు. చాలామందికి హోమియోపతి వైద్యం చేశాడు.తెలుగు సినిమాల్లో మనోజ్ కుమార్మనోజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు తెలియకుండా తెలుగు సినిమాల్లో ఉన్నాడు. ఆయన తీసిన ‘ఉప్కార్’ తెలుగులో కృష్ణ హీరోగా ‘పాడిపంటలు’గా రీమేక్ అయ్యి హిట్ అయ్యింది. మరో సూపర్‌హిట్ ‘రోటీ కపడా ఔర్ మకాన్’ తెలుగులో శోభన్ బాబు హీరోగా ‘జీవన పోరాటం’ పేరుతో రీమేక్ అయ్యింది. హిందీలో అమితాబ్ వేసిన పాత్రను తెలుగులో రజనీకాంత్ చేశాడు. మనోజ్ కుమార్ నటించిన ‘ఓ కౌన్ థీ’ తెలుగులో జగ్గయ్య, జయలలిత కాంబినేషన్లో ‘ఆమె ఎవరు’గా వచ్చింది. ‘హిమాలయ్ కీ గోద్ మే’ శోభన్ బాబు హీరోగా ‘డాక్టర్ బాబు’గా వచ్చింది. ‘దస్ నంబరీ’ పెద్ద హిట్ కావడంతో ఎన్టీఆర్ (NTR) హీరోగా ‘కేడీ నంబర్ 1’ పేరుతో రీమేక్ చేశారు. చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘మగ మహారాజు’ సినిమాలో ఏడు రోజులు సైకిల్ తొక్కే సన్నివేశం ఒరిజినల్ మనోజ్ కుమార్ నటించిన ‘షోర్’లో ఉంది.మనోజ్ కుమార్ కన్నుమూతసుప్రసిద్ధ సినీనటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చాలాకాలంగా వెన్నునొప్పితోనూ, వయసు సంబంధమైన ఇతర రుగ్మతలతోనూ బాధపడుతున్న మనోజ్‌కుమార్ ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. కునాల్, విశాల్. వీరిలో కునాల్ హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. దేశభక్తి సినిమాలతో ఖ్యాతి పొందిన మనోజ్‌కుమార్‌ను 1992లో పద్మశ్రీ, 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు వరించాయి. షహీద్, ఉప్కార్, పూరబ్ ఔర్ పశ్చిమ్, క్రాంతి తదితర సూపర్‌హిట్ సినిమాలు మనోజ్ దర్శకత్వంలో రూపొందాయి. -
ప్రీ వెడ్డింగ్ షూట్.. ‘గిరిజన పల్లె’ ముస్తాబు..
ఆదివాసీ సంప్రదాయ దుస్తులు, కొమ్ముకోయ తలపాగ, వాయిద్యాలు.. ఇలా గిరిజన పల్లెను ప్రతిబింబించే థీమ్‌తో భద్రా చలంలోని గిరిజన మ్యూజియం ప్రాంగణంలో ఓ సెట్ రూపుదిద్దుకుంటోంది. హంగూ ఆర్భాటాలకు దూరంగా పూర్తిగా ఆదివాసీల జీవితాన్ని పరిచయం చేయబోతున్నారు. నిర్మాణ దశలో ఉండగానే ఈ పల్లెకు ఆదరణ వస్తున్న నేపథ్యంలో మరిన్ని సదుపాయాల కల్పనకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.గిరిజన సంస్కృతికి ప్రాచుర్యం కలి్పంచడమే ప్రధాన లక్ష్యం కావడంతో నామమాత్రపు రుసుముతోనే పర్యాటకులు, ఫొటో, ప్రీ వెడ్డింగ్ షూట్లకు వచ్చే వారికి ప్రవేశం కల్పించనున్నారు. భద్రాచలంలో సీతారాముల దర్శనానికి వచ్చే భక్తులకు గోదావరి తీర ప్రాంత గిరిజన సంప్రదాయాలను పరిచయం చేయాలనే ఆలోచనతోనే శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం వచ్చే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ మ్యూజియం, గిరిజన పల్లెను ప్రారంభించేలా ఐటీడీఏ పీఓ రాహుల్ నేతృత్వాన ఏర్పాట్లు ముమ్మరం చేశారు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంముక్కోటితో మొదలుజనవరిలో భద్రాచలంలో జరిగిన ముక్కోటి సందర్భంగా ‘ఏరు’పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా గడ్డి గుడిసెలు, మంచె, మట్టి ఇళ్ల నమూనాలను ఐటీడీఏ క్యాంపస్‌లో ఉన్న ట్రైబల్ మ్యూజియం ఆవరణలో నిర్మించారు. భద్రాచలం వచి్చన భక్తులను ఈ గడ్డి గుడిసెలు ఆకట్టుకున్నాయి. వీటి ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. దీంతో ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న గిరిజన మ్యూజియాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.ఆబాల గోపాలంగిరిజన మ్యూజియం ఆవరణలో పిల్లల కోసం ప్రత్యేకంగా బోటింగ్, ప్లే ఏరియా, యువకుల కోసం బాక్స్ క్రికెట్, శాండ్ వాలీబాల్, ఆర్చరీ గేమ్, ఓపెన్ జిమ్‌లు నిర్మించారు. ఆదివాసీ రుచుల నుంచి చైనీస్ వంటకాలతో కూడిన ఫుడ్ కోర్టు కూడా రెడీ చేశారు. మరోవైపు మ్యూజియాన్ని గిరిజనుల పండుగలు, వేటలో ఉపయోగించే ఆయుధాలు, ఇళ్లలో వినియోగించే పనిముట్లు, కళాకృతులు, వాయిద్యాల థీమ్‌లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వెరసి మూడు నెలల్లోనే గిరిజన మ్యూజియం ‘మినీ స్టూడియో’గా మారిపోయింది. ఓవైపు నిర్మాణ పనులు జరుగుతుండగానే.. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం కాబోయే వధూవరులు, బర్త్‌డే పారీ్టల కోసం గ్రూపులు గ్రూపులుగా స్థానికులు ఇక్కడికి రావడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే వెడ్డింగ్ షూట్ నిర్వహించుకునేలా మరిన్ని సదుపాయాలు జత చేయాలని నిర్ణయించారు. ఇక గిరిజన మ్యూజియం చూడాలనుకునే విద్యార్థుల కోసం స్కూలు మొత్తానికి కేవలం రూ.500 ఎంట్రీ ఫీజుగా నిర్ణయించారు. -
సెల్యూట్ పైలట్ సిద్ధార్థ్!
అంతా బాగున్నప్పుడు కాదు, ప్రమాదపుటంచున ఉన్నప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన వ్యక్తిత్వానికి కొలమానంగా నిలుస్తుంది. బుధవారం రాత్రి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కూలిపోయిన భారత వైమానిక దళ జాగ్వార్ ఫైటర్ జెట్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్ అలాంటి గొప్ప వ్యక్తిత్వమున్న వారి కోవకే వస్తారు. సాంకేతిక లోపాలతో విమానం కుప్పకూలనుందని అర్థమైంది. 28 ఏళ్ల యువకుడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. పైగా 10 రోజుల కిందే నిశ్చితార్థం కూడా అయింది. కో పైలట్‌తో కలిసి సురక్షితంగా ఎజెక్టయ్యే అవకాశముంది. అయినా సిద్ధార్థ్ తన ప్రాణాల కోసం పాకులాడలేదు. ప్రజల భద్రత గురించే ఆలోచించారు. విమానంజనావాసాల్లో పడకుండా జాగ్రత్తపడ్డారు. సురక్షితంగా మైదానంలో కూలిపోయేలా చూశారు. తద్వారా ఎంతోమంది పౌరుల మరణాలను నివారించారు. ఆ క్రమంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయినా తన సాటిలేని త్యాగంతో జాతి గుండెల్లో చిరంజీవిగా మిగిలిపోయారు. కో పైలట్ సురక్షితంగా ఎజెక్టయినా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. చివరి క్షణాల్లోనూ... బయల్దేరిన కాసేపటికే విమానంలో సాంకేతిక వైఫల్యం తలెత్తింది. విమానాన్ని నియంత్రించడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. ప్రమాదం తప్పదని స్పష్టమైంది. దాంతో పైలెట్లిద్దరూ ఎజెక్షన్ ప్రారంభించారు. అంతటి క్లిష్ట సమయంలోనూ ముందు కో పైలట్ సురక్షితంగా బయటపడేలా సిద్ధార్థ్ జాగ్రత్త తీసుకున్నారు. తర్వాత కూడా విమానాన్ని వెంటనే వదిలేయకుండా నివాస ప్రాంతాలకు దూరంగా తీసుకెళ్లారు. ఆ క్రమంలో ప్రాణాలనే పణంగా పెట్టారు. కుటుంబమంతా దేశ సేవలోనే.. ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ స్వస్థలం హరియాణాలోని రేవారీ. వారిది తరతరాలుగా సైనిక కుటుంబమే. ఆయన ముత్తాత బ్రిటిష్ హయాంలో బెంగాల్ ఇంజనీర్స్ విభాగంలో పనిచేశారు. తాత పారామిలటరీ దళాల్లో సేవలందించారు. తండ్రి కూడా వైమానిక దళంలో పనిచేశారు. సిద్ధార్థ్ 2016లో వైమానిక దళంలో చేరారు. రెండేళ్ల సర్వీసు తర్వాత ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా పదోన్నతి పొందారు. మార్చి 23నే నిశ్చితార్థం జరనిగింది. నవంబర్ 2న పెళ్లి జరగాల్సి ఉంది. మార్చి 31 దాకా కుటుంబీకులతో గడిపి ఇటీవలే విధుల్లో చేరారు. ఆయన మరణవార్తతో కుటుంబం, స్నేహితులే గాక పట్టణమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. విమానంలో ప్రయాణించాలని, దేశానికి సేవ చేయా లని సిద్ధార్థ్ ఎప్పుడూ కలలు కనేవాడని చెబుతూ తండ్రి సుజీత్ యాదవ్ కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘సిద్ధార్థ్ తెలివైన విద్యారి్థ. తనను చూసి ఎప్పుడూ గర్వపడేవాళ్లం. ప్రజల ప్రాణాలు కాపాడుతూ తన ప్రాణాలర్పించాడు. నా కొడుకును చూసి చాలా గర్వపడుతున్నా. మాకు ఒక్కగానొక్క కొడుకు తను’’అంటూ గుండెలవిసేలా రోదించారు. సిద్ధార్థ్ పారి్థవదేహం శుక్రవారం రేవారీకి చేరింది. పూర్వీకుల గ్రామం భలాకి మజ్రాలో పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లక్ష కోట్లు ఒక్కరోజే చెల్లించారు
సాక్షి, స్పెషల్ డెస్క్: స్మార్ట్ఫోన్ల వాడకంలో, డేటా వినియోగంలోనే కాదు.. డిజిటల్ చెల్లింపుల్లోనూ మనవాళ్లు తగ్గేదేలే అంటున్నారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారిత చెల్లింపుల్లో తాజాగా సరికొత్త రికార్డు ‘టచ్’ చేశారు. ఒక్కరోజే లక్ష కోట్లకు పైగా చెల్లింపులు జరిపారు.2025 మార్చి 1న దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ యాప్స్ ద్వారా రూ.1,01,627.92 కోట్ల విలువైన లావాదేవీలు నమోదు చేసి వాడకం మామూలుగా లేదనిపించారు. తొమ్మిదేళ్ల యూపీఐ చరిత్రలో ఈ స్థాయి లావాదేవీలు జరగడం ఇదే తొలిసారి. ఇక సంఖ్య పరంగా ఈ ఏడాది అత్యధికంగా మార్చి 13న గత రికార్డుకు చేరువగా 64.2 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఇప్పటివరకు 2024 అక్టోబర్ 31న అత్యధికంగా 64.4 కోట్ల లావాదేవీలు జరిగాయి. కొనసాగుతున్న రికార్డులు..యూపీఐ లావాదేవీల విలువ, సంఖ్య విషయంలో రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. అత్యధికంగా 2025 మార్చిలో రూ.24,77,221.59 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. లావాదేవీల సంఖ్య గత నెలలో 1,830 కోట్లకు చేరింది. విలువ, పరిమాణం పరంగా ఒక నెలలో ఇప్పటివరకు ఇవే అత్యధికం. సగటున రోజుకు లావాదేవీల విలువ రూ.79,910 కోట్లకు, లావాదేవీల సంఖ్య 59 కోట్లను తాకింది. ఇక దేశంలో 661 బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, పేమెంట్ యాప్స్ యూపీఐ సేవలను అందిస్తున్నాయి. మార్చి నెల విలువలో వ్యక్తుల నుంచి వ్యక్తులకు 73 శాతం, వ్యక్తుల నుంచి వర్తకులకు 27 శాతం లావాదేవీలు జరిగాయి. అలాగే సంఖ్యలో వ్యక్తుల నుంచి వర్తకులకు 63 శాతం, వ్యక్తుల మధ్య 37 శాతం నమోదయ్యాయి. -
ఏఐకి అంతా చెప్పేస్తున్నారా?
సాక్షి, స్పెషల్ డెస్క్: కొత్త వస్తువైనా, టెక్నాలజీ అయినా కంటపడితే దాని అంతుచూడందే కొందరికి నిద్ర పట్టదు. ప్రస్తుతం ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలోనూ చాలామంది పరిస్థితి ఇలాగే ఉంది. చాట్‌జీపీటీ, జెమినీ, గ్రోక్ వంటి ఏఐ టూల్స్‌తోనే ఎక్కువ సమయం గడుపుతున్నవాళ్లు చాలామందే ఉన్నారు. పనులు చక్కబెట్టుకోవటం కోసం, నాలెడ్జ్ కోసం వీటిని వాడుకోవటం మంచిదే. కానీ, విచక్షణ లేకుండా వీటిని మన వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని నిపుణులు సూచిస్తున్నారు.ఈ ఏఐ టూల్స్‌కు ఏ సమాచారం ఇవ్వచ్చో.. ఏది మన సమాచారంతోనే ఎల్ఎల్ఎం టైనింగ్ టీచర్ల బోధన, పాఠ్యపుస్తకంలోని పాఠాలు, గైడ్లు, నిజ జీవిత అనుభవాలన్నింటి సాయంతో ఎలాగైతే విద్యార్థులు నేర్చుకుంటారో.. లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లు (ఎల్ఎల్ఎం) కూడా అందుబాటులో ఉన్న సమాచారం, మనం వేసే ప్రశ్నల సాయంతో కొత్త విషయాలు నేర్చుకుంటాయి. దీన్నే ట్రైనింగ్ అని పిలుస్తుంటారు. చాట్‌జీపీటీ వంటివాటికి నిత్యవ్యవహారాల తాలూకు సమాచారం అందుబాటులో ఉంటే.. డాలీవంటి ఇమేజ్ జనరేటర్లకు వేల, లక్షల ఫొటోలు అందించి శిక్షణ ఇస్తుంటారు.ఈ శిక్షణ ఎంత ఎక్కువ ఉంటే, వచ్చే ఫలితాలు అంత కచ్చితంగా ఉంటాయి. అయితే, ఈ శిక్షణ సందర్భంగా వ్యక్తుల వ్యక్తిగత సమాచారం కూడా లభిస్తే దాన్ని కూడా అవి ఎక్కడో ఒకచోట వాడుకుంటాయి. కాబట్టి భవిష్యత్తులో మనకు ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే చాట్‌జీపీటీ, జెమినీ లాంటి ఎల్ఎల్ఎంలు ‘మీ సంభాషణల్లో సున్నితమైన సమాచారం లేకుండా చూసుకోండి’అని, ‘మీకు మాత్రమే తెలిసిన సమచారాన్ని పంచుకోవద్దు’అని చెబుతుంటాయి. 1, మీ ఇంటి అడ్రస్ లేదా ఫొన్ నంబర్, ఆధార్, ఓటర్ ఐడీ, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎల్ఎల్ఎంలతో అస్సలు పంచుకోవద్దు. 2023లో చాట్‌జీపీటీ కోడ్‌లో చిన్న పొరబాటు దొర్లింది. ఫలితంగా ఇతరులు అడుగుతున్న ప్రశ్నలు అందరికి కనిపించడం మొదలైంది. హ్యాకర్లు ఈ సమాచారం చూస్తే ఇక అంతే సంగతులు. 2, పాస్వర్డ్లు, లాగిన్ వివరాలను ఎల్ఎల్ఎంలతో పంచుకోవడం ఏమంత మంచిది కాదు. పడకూడని వారి చేతుల్లో పడితే ఈ సమాచారంతో మీ జేబులు ఖాళీ కావచ్చు. పాస్వర్డ్ మేనేజ్మెంట్ టూల్స్ మాదిరిగా ఎల్‌ఎల్‌ఎంలలో ఈ వివరాలు సంకేత భాషలో స్టోర్ కావు. మోడల్‌ను రివ్యూ చేసేవారికి అందుబాటులో ఉంటాయి. లేదా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎల్ఎల్ఎంలు పొరపాటుగానైనా ఈ సమాచారాన్ని పంచుకునే అవకాశం ఉంది. 3, ఎల్ఎల్ఎంలతో పంచుకోకూడని మరో అంశం వృత్తిపరమైన సమాచారం. దీనివల్ల మనం పనిచేసే సంస్థలకు నష్టం జరగవచ్చు. 4, వైద్యులు, లాయర్ల వద్ద ఏదీ దాచకూడదని చెబు తారు. కానీ, ఎల్ఎల్ఎంల వద్ద మాత్రం వైద్య సమాచారం అస్సలు పంచుకోకూడదు. ఎల్ఎల్ఎంలకు వైద్యపరమైన సమాచారాన్ని భద్రపరిచే చట్టాలు వర్తించకపోవచ్చు. ఫలితంగా మనం ఇచ్చే సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంటుంది. విరుగుడు మంత్రాలు ఎల్‌ఎల్‌ఎంలలో మన సంభాషణలు రికార్డు కాకుండా కొన్ని చిట్కాలున్నాయి.⇒ చాట్‌జీపీటీ 4.0లో సంభాషణలను టెంపరరీ మోడ్‌లో ఉంచుకోవచ్చు.⇒ డక్.ఏఐని వాడుకుంటే మన పేరు వివరాలు లేకుండా చేస్తుంది.⇒ మైక్రోసాఫ్ట్ కో–పైలట్, గూగుల్ జెమినీలోసంభాషణలను రికార్డు చేస్తారు కానీ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకుని దాన్ని గోప్యంగా ఉంచుకోవచ్చు.⇒ మన సంభాషణలను అప్పుడప్పుడూ డిలీట్ చేస్తుండటం ద్వారా సమాచార దుర్వినియోగాన్ని నివారించవచ్చు.⇒ చైనీస్ ఏఐ డీప్‌సీక్ మాత్రం మీ సంభాషణలన్నీ రికార్డు చేసి ట్రెయినింగ్ కోసం వాడుకుంటుంది. మార్పులు చేసుకునే, తప్పించుకునే అవకాశాల్లేవు. -
మనసు నిండుగా.. మురి'పాల' పండుగ
సృష్టిలో అమ్మ స్థానం అత్యున్నతం. అమ్మ గొప్పతనం వర్ణనాతీతం.. అమ్మ త్యాగం అనన్యసామాన్యం.. పురిటి నొప్పులను సైతం పంటి బిగువున భరిస్తూ బిడ్డకు జన్మనిస్తుంది. కంటికి రెప్పలా కాపాడుకునేందుకు ప్రాణం పెట్టేస్తుంది. అందుకే అమ్మను మించిన దైవం ఉండదు అంటారు. అయితే కొంతమంది తల్లులు అనివార్యకారణాలతో శిశువుకు ముర్రెపాలు అందించలేక తల్లడిల్లిపోతున్నారు. అలాంటి సమయంలో బిడ్డ ఆకలి తీర్చడమే కాకుండా రోగనిరోధకశక్తిని పెంచే తల్లిపాలను అందించేందుకు కొందరు అమ్మలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అమ్మతనానికి మరింత వన్నె తీసుకువస్తున్నారు. ఈ ప్రక్రియకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు.తిరుపతి తుడా : తల్లి పాలు అవసరం ఉన్న నవజాత శిశువులకు అవసరమైన పాలను మదర్ మిల్క్ బ్యాంకు అందిస్తుంది. అమ్మపాలు శిశువు ఎదుగుదలకు, సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో కీలకం, తల్లి పాల ప్రాధాన్యత తెలియకపోవడంతో కొందరు పిల్లలకు పాలిస్తే తమ శరీర ఆకృతి పాడైపోతుందని ఆవు, గేదె పాలను, మిల్క్ పౌడర్‌ను బాటిల్స్‌తో పట్టిస్తుంటారు. మరికొందరు బాలింతల విషయంలో శిశువుకు తగినంత పాలు లేకపోవడం, తల్లి అనారోగ్యం కారణంగా పాల వృద్ధి క్షీణిస్తుంది. ఇటువంటి వారికోసం మదర్ మిల్క్ కేంద్రం ఓ వరంగా పనిచేస్తోంది. 247లీటర్ల సేకరణ తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోని తల్లి పాల కేంద్రంలో ఏడాదిగా సుమారు 247లీటర్ల పాలను సేకరించి సుమారు 3,475మంది శిశువులకు అందించారు. ప్రతి నెల సుమారు 23 నుంచి 25 లీటర్ల పాలను డోనర్స్ నుంచి సేకరిస్తున్నారు. పాలు డొనేట్ చేసిన తల్లులకు సుమారు 6రకాల డ్రైఫ్రూట్స్ అందించి ప్రోత్సహిస్తున్నారు. మదర్ మిల్క్ కావలసిన వారు, డోనర్స్ 8919469744 నంబర్లో సంప్రదించవచ్చు. ఎలాంటి శిశువులకు అందిస్తారంటే... డెలివరీ అయిన వెంటనే తల్లి చనిపోయిన శిశువులకు, 2కేజీల కంటే బరువు తక్కువగా పుట్టిన పిల్లలకు, తల్లి ఆరోగ్యంగా ఉండి చనుపాల ద్వారం (నిప్పిల్స్) మూసుకుపోయిన పాలు రాని పరిస్థితి ఏర్పడిన శిశువులకు, తల్లిపాలు పడని బిడ్డలకు, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న బాలింతల పిల్లలకు పాలు అందిస్తున్నారు. ఒక్కో ఫీడింగ్‌కు 30ఎమ్ఎల్ చొప్పున రోజుకు 12సార్లు పాలు ఇస్తారు. ఇలా ఒకటి నుంచి 6నెలల వరకు శిశువుకు పాలు అందిస్తారు. సేకరణ ఇలా... స్వచ్ఛందంగా వచ్చే డోనర్స్ నుంచి తల్లి వయసు, డెలివరీ, ఆధార్‌కార్డుతో పూర్తి వివరాలను దరఖాస్తు రూపంలో నమోదు చేసుకుంటారు. అనంతరం తల్లి ఆరోగ్య సమాచారం సేకరించి అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తారు. తల్లి శరీరంపై టాటూస్ (పచ్చ»ొట్టులు) ఉన్నా, బ్రెస్ట్ సమీపంలో మచ్చలు, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బాలింతల నుంచి పాలు సేకరించరు. సంపూర్ణ ఆరోగ్యవంతులైన తల్లుల నుంచి మాత్రమే పాల సేకరణ చేస్తున్నారు. ప్రధానంగా హెచ్ఐవీ, హెచ్‌సీవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, వీడీఆర్ఎల్ పరీక్షలు ప్రతి తల్లికీ తప్పని సరిగా చేసి నెగటివ్ రిపోర్టు ఉంటేనే పాల డొనేషన్‌కు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలింతలు తమ బిడ్డకు సరిపోగా మిగులు పాలను మాత్రమే డొనేట్ చేయాల్సి ఉంటుంది.స్టోరేజ్ ఇలా...ఆరోగ్యవంతులైన తల్లుల నుంచి సుమారు 200ఎమ్ఎల్కు పైబడి ఒక సిట్టింగ్‌లో పాలు సేకరిస్తారు. ఇందులో 10ఎమ్ఎల్ శాంపిల్ పాలను పరీక్షల నిమిత్తం మైక్రోబయోలజీ విభాగానికి పంపుతారు. మిగిలిన పాలను మిక్స్ చేసి రిఫ్రిజిరేటర్లో భద్రపరుస్తారు. అనంతరం యూవీ రేస్‌లో ఉంచి పూలింగ్ ప్రక్రియ కొనసాగిస్తారు. సుమారు 3గంటల పాటు శుద్ధి చేసి 62.4 టెంపరేచర్లో వేడి చేస్తారు. అనంతరం సుమారు అరగంట పాటు కూలింగ్ ప్రాసెసర్‌లో ఉంచుతారు. సుమారు ఆరు నెలలపాటు పాలు సురక్షితంగా ఉండేందుకు మిల్క్ బ్యాంకు అధికారులు. సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. శిశు మరణాల నివారణకే.. శిశు మరణాలను తగ్గించాలనే సంకల్పంతోనే హ్యూమన్ మిల్క్ బ్యాంకుకు శ్రీకారం చుట్టాం. సుమారు రూ.35లక్షల వ్యయంతో ఏర్పాటు చేశాం. చాలా మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 3,475 మంది పసికందుల గొంతు తడిపాం. వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేశాం . – టి.దామోదరం,మిల్క్ బ్యాంక్ ప్రాజెక్ట్ చైర్మన్, తిరుపతి తల్లిపాలే తొలి వ్యాక్సిన్ నవజాత శిశువుకు తొలి వ్యాక్సిన్ తల్లి పాలే. గైనకాలజిస్టా్గ తల్లిపాల శ్రేష్టతపై స్పష్టమైన అవగాహన ఉంది. నేను ఇప్పటివరకు 34 లీటర్లకు పైగా పాలను మిల్క్ బ్యాంకుకు అందించా. బాలింతలు తమ మిగులు పాలను ఇచ్చేందుకు ముందుకు రావాలి. పసికందుల ప్రాణరక్షణకు సహకారం అందించాలి. – డాక్టర్ సోనా తేజస్వి, గైనకాలజిస్ట్ -
హలో అంటే చాలు.. పట్టేస్తారు!
సాక్షి, హైదరాబాద్: టార్గెట్ చేసిన వ్యక్తులకు కనిపించకుండా ఆన్లైన్లోనే అందినకాడికి దండుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. ఏళ్లుగా జరుగుతున్న సెక్స్టార్షన్ క్రైమ్‌కు తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను జోడిస్తున్నారు. ఫలితంగా తప్పు చేయకున్నా చేసినట్లు ఆడియోలు, వీడియోలు సృష్టిస్తూ.. బెదిరింపులకు దిగుతున్నారు. వాటిని సోషల్‌మీడియాలో పోస్టు చేస్తామంటూ బాధితులనుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ప్రస్తుతం ఈ తరహా సైబర్ నేరాలు ఉత్తరాదిలో ఎక్కువగా జరుగుతున్నాయని, అపరిచిత కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు, సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.ఈ నేరాలు ఒకప్పుడు ఇలా.. వాస్తవానికి సెక్స్టార్షన్ నేరం చాలాకాలంగా జరుగుతోంది. 2022–23లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదైనా.. ఆ తర్వాత కొంత వరకు తగ్గాయి. అందమైన యువతుల ఫొటోలను వాట్సాప్ డీపీలుగా పెట్టుకునే సైబర్ నేరగాళ్లు.. ఎంపిక చేసిన నంబర్లకు సందేశాలు పంపేవాళ్లు. వాటికి స్పందించిన యువకులు, పురుషులతో చాటింగ్ చేస్తూ సన్నిహితంగా మెలిగేవారు. ఆపై విషయాన్ని వీడియో కాల్స్ వరకు తీసుకువెళ్లే వాళ్లు. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా సదరు యువతే నగ్నంగా ఉండి కాల్ మాట్లాడుతున్నట్లు చేసేవారు. ఆ తర్వాత అసలు కథ మొదలుపెట్టే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసిన వ్యక్తి సైతం నగ్నంగా కాల్ చేసేలా ప్రేరేపించేవారు. ఆ కాల్‌ను రికార్డు చేసి, అతడికే షేర్ చేసి బెదిరించి, తాము అడిగినంత ఇవ్వకుంటే సోషల్‌మీడియాలో పోస్టు చేస్తామంటూ దండుకునేవారు. ఇప్పుడు ఏఐ వాడుతూ.. తాజాగా ‘ఈ–కేటుగాళ్లు’సైతం ఏఐని గణనీయంగా వినియోగిస్తున్నారు. ఎంపిక చేసుకున్న ఫోన్ నంబర్లకు వాయిస్, వీడియో కాల్స్ చేస్తున్నారు. ఆ వ్యక్తి వాటికి ఆన్సర్ చేస్తూ ‘హలో’, ‘ఎవరు’వంటి పదాలు వాడితే చాలు.. ఆ వాయిస్, వీడియోలను రికార్డు చేసుకుంటున్నారు. వీటిని ప్రత్యేక ఏఐ సాఫ్ట్‌వేర్స్‌లో పొందుపరిచి.. సదరు వ్యక్తి యువతితో అశ్లీలంగా, అసభ్యంగా సంభాషిస్తున్నట్లు, ఏకాంతంగా గడుపుతున్నట్లు ఆడియో, వీడియోలు సృష్టిస్తున్నారు. వీటిని టార్గెట్ చేసిన వ్యక్తికి పంపి బెదిరింపులకు దిగుతున్నారు. ఆ యువతితో ఫిర్యాదు చేయిస్తామని, సోషల్‌మీడియాలో పోస్టు చేస్తామని, కుటుంబీకులకు పంపిస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఆ ఆడియో, వీడియోలతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిసినప్పటికీ.. తీవ్ర ఆందోళన చెందే బాధితులు ప్రత్యామ్నాయాలు ఆలోచించట్లేదు. సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేసిన మొత్తం చెల్లించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అపరిచిత కాల్స్‌కు స్పందించొద్దు..ఇలాంటి నేరాల్లో బాధితులు తమ పరువు పోతుందనే ఉద్దేశంతో సైబర్ నేరగాళ్లు అడిగిన మొత్తం చెల్లించడానికే మొగ్గు చూపుతున్నారు. అయితే ఆ కేటుగాళ్లు ఒకసారి డబ్బు తీసుకుని వదిలిపెడతారనే గ్యారంటీ లేదు. అనేక ఉదంతాల్లో పదేపదే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. బాధితులు నగదు చెల్లించకుండా, ధైర్యం చేసి ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే ఫలితాలు ఉంటాయి. వీలున్నంత వరకు అపరిచిత నంబర్ల నుంచి వచ్చే ఫోన్, వీడియో కాల్స్‌కు స్పందించకపోవడం ఉత్తమం. – ఎన్.ఆర్.ప్రభాకర్‌రెడ్డి, సైబర్ క్రైమ్ నిపుణుడు -
బుల్లి పేస్ మేకర్
ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మమైన, బియ్యం గింజ కంటే కూడా బుల్లి పేస్ మేకర్‌ను అమెరికా పరిశోధకులు అభివృద్ధి పరిచారు. నార్త్వెస్ట్ర్న్ యూ నివర్సిటీకి చెందిన ఇంజనీర్లు గుండెను కృత్రిమంగా పనిచేయించే ఈ చిన్న పరికరాన్ని రూపొందించారు. ఉపయో గం తీరాక శరీరంలోనే కలిసిపోవడం దీని మరో ప్రత్యేకత. శరీరంపై గాటు పెట్టాల్సిన అవసరమేమీ లేకుండా ఇంజెక్షన్ ద్వారానే దీనిని లోపలికి పంపించేయొచ్చు. జర్నల్ నేచర్‌లో ఈ వివరాలు తాజాగా ప్రచురితమయ్యాయి. తాత్కాలిక అవసరాలు కలిగిన శిశువులకు ఇది ఎంతో ఉపయోగకరమని నిపుణులు అంటున్నారు. ‘మేం రూపకల్పన చేసిన ఈ డివైజ్ ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన పేస్ మేకర్‌గా భావిస్తున్నాం’అని నార్త్‌వెస్టర్న్ బయో ఎల్రక్టానిక్స్ నిపుణుడు, బృంద సారథి జాన్ ఎ.రోజెర్స్ చెప్పారు. ‘ముఖ్యంగా పీడియాట్రిక్ గుండె సర్జరీలకు సూక్ష్మంగా ఉండటం ఎంతో కీలకం. పేస్ మేకర్ ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది’అని ఆయన చెప్పారు. చిన్నారులను దృష్టిలో ఉంచుకునే ఈ డివైజ్‌ను రూపొందించామని నార్త్‌వెస్టర్న్ కార్డియాలజిస్ట్ ఇగోర్ ఎఫిమోవ్ చెప్పారు. ‘దాదాపు ఒక శాతం శిశువులు పుట్టుకతోనే గుండె సంబంధ లోపాలతో ఉంటున్నా రు. సర్జరీ తర్వాత వీరికి తాత్కాలిక పేస్ మేకర్ అవసరమవుతుంది. దాదాపు వారం పాటు వీరి గుండెలు సొంతంగా రిపేర్ చేసుకుంటాయి. ఆ కీలకమైన సమయంలో ఈ చిన్న పేస్ మేకర్ వారికి సహాయకారిగా ఉంటుంది. ఆ తర్వాత అది శరీరంలో కలిసిపోతుంది. దీనిని తొలగించడానికి మరో సర్జరీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు’అని ఎఫిమోవ్ వివరించారు. ఇదెలా పని చేస్తుందంటే..? ఛాతీపైన అమర్చే చాలా చిన్నగా ఉండే ఫ్లెక్సిబుల్, వైర్లెస్ ప్యాచ్‌లో ఈ పేస్ మేకర్ ఉంటుంది. గుండె స్పందనలు క్రమం తప్పినట్లు గుర్తించిన వెంటనే పేస్ మేకర్‌కు ఈ ప్యాచ్ సిగ్నల్ పంపించి, దానిని యాక్టివేట్ చేస్తుంది. ఇది ఇచ్చే సున్నితమైన స్పందనలు శరీరం, కండరాల ద్వారా అంది గుండె లయను క్రమబద్ధం చేస్తాయి. ఇందులోని అత్యంత సూక్ష్మమైన బ్యాటరీ శరీరంలోని ఫ్లూయిడ్లను ఉపయోగించుకుని విద్యుత్ శక్తిని తయారు చేస్తుంది. దీనికి సాధారణంగా ఉండే ఎలాంటి వైర్లు అవసరం లేదు. దీని వల్ల ఇది చాలా సురక్షితంగా ఉంటుంది. సులభంగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు తయారైన పేస్ మేకర్లు రేడియో సిగ్నళ్లపై ఆధారపడగా, ఈ కొత్త డివైజ్ కేవలం కాంతిని ఉపయోగించుకుని గుండె లయను నియంత్రించ గలుగుతుందని రోజెర్స్ చెప్పారు. జంతువులపైన, దాతల ద్వారా అందిన గుండెలపైన చేసిన ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చాయని చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రతీకారం తప్పదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తాజా టారిఫ్‌లపై ప్రపంచ దేశాలన్నీ మండిపడుతున్నాయి. ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెర తీశారంటూ దుయ్యబడుతున్నాయి. ప్రతీకారం తప్పదని ఆయా దేశాల అధినేతలు స్పష్టం చేశారు. వాణిజ్య యుద్ధాలు ఇరు పక్షాలను దెబ్బతీస్తాయని జర్మనీ హెచ్చరించింది. తమపై ట్రంప్ విధించిన 10 శాతం సుంకాన్ని ఎదుర్కోవడానికి లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రెజిల్ బుధవారం ఒక చట్టాన్ని ఆమోదించింది. దెబ్బకు దెబ్బ: ఈయూ యూరోపియన్ యూనియన్‌పై 20 శాతం సుంకాలను యూరప్ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. ఇది పూర్తిగా అన్యాయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘‘అమెరికా వస్తువులకు ఈయూ అతి పెద్ద మార్కెటని ట్రంప్ మర్చిపోయినట్టున్నారు. యూఎస్‌పై ప్రతీకార సుంకాలు విధిస్తాం’’అని హెచ్చరించాయి. ‘‘ఈయూ ఉక్కుపై అమెరికా సుంకాలకు ప్రతిస్పందనగా ప్రతీకార ప్యాకేజీని ఖరారు చేస్తున్నట్టు ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాండడెర్ లెయన్ ప్రకటించారు. చర్చలు విఫలమైతే తమ ప్రయోజనాలను, వ్యాపారాలను రక్షించుకోవడానికి మరిన్ని ప్రతీకార సుంకాలు తప్పవని స్పష్టం చేశారు. అయితే ఈ సుంకాల యుద్ధంతో అంతిమంగా నష్టపోయేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ...సమరమే: కెనడా ప్రపంచ వాణిజ్య వ్యవస్థనే అతలాకుతలం చేసే ట్రంప్ సుంకాలపై పోరాడతామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రతిజ్ఞ చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే కెనడాపై తాజా టారిఫ్‌ల ప్రభావం పరిమితమే. అయినా ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్స్‌పై అమెరికా సుంకాలు లక్షలాది కెనడియన్లను నేరుగా ప్రభావితం చేస్తాయని కార్నీ ఆక్షేపించారు. ఈ సుంకాలను ప్రతిదాడులతో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. మంచిది కాదు: బ్రిటన్ వాణిజ్య యుద్ధం ఎవరికీ మంచిది కాదని బ్రిటన్ ప్రధాని కియిర్ స్టార్మర్ వ్యాఖ్యానించారు. ‘‘అన్ని పరిస్థితులకూ మేం సిద్ధంగా ఉన్నాం. ప్రతిస్పందనగా మావైపు నుంచి ఏ చర్యలనూ తోసిపుచ్చలేం’’అని పార్లమెంటుకు చెప్పారు. విచారకరం: జపాన్ ఈ దిగుమతి సుంకాలు చాలా విచారకరమని జపాన్ వ్యాఖ్యానించింది. అవి ప్రపంచ వాణిజ్య సంస్థ, యూఎస్–జపాన్ ఒప్పందాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. అమెరికా తమపై విధించిన 36 శాతం సుంకంపై చర్చలు జరుపుతామని అయితే థాయిలాండ్ తెలిపింది. సుంకాల ప్రకటనకు ఒక రోజు ముందే.. అమెరికా దిగుమతులపై ఇజ్రాయెల్ అన్ని సుంకాలను రద్దు చేసినా.. ఫలితం లేకపోయింది. ఇజ్రాయెల్ వస్తువులపై ట్రంప్ 17 శాతం సుంకాలను విధించడంపై ఆ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భారీ మూల్యం తప్పదు: ఆ్రస్టేలియా ఆ్రస్టేలియా గొడ్డు మాంసంపై ట్రంప్ కఠిన ఆంక్షలు దారుణమని ప్రధాని ఆంటోనీ అల్బనీస్ విమర్శించారు. ఇందుకు అమెరికా ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అయితే, ‘‘మేం పరస్పర సుంకాలకు దిగబోం. అధిక ధరలకు, ఆర్థిక మందగమనానికి దారితీసే రేసులో చేరబోం’’అని స్పష్టం చేశారు. కంపెనీలను కాపాడుకుంటాం: స్పెయిన్ దేశీయ కంపెనీలను, పరిశ్రమలను, మొత్తంగా ఆర్థిక రంగాన్ని ఈ సుంకాల ప్రభావం బారినుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుని తీరతామని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ప్రకటించారు. స్వేచ్ఛా వాణిజ్య ప్రపంచమే తమ లక్ష్యమన్నారు. గొడవలొద్దు: స్వీడన్ వాణిజ్య అడ్డంకులను కోరుకోవడం లేదని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్ అన్నారు. ‘‘మాకు వాణిజ్య యుద్ధం వద్దు. అమెరికాతో కలిసి వాణిజ్యం, సహకార మార్గంలో పయనించాలని, తద్వారా ఇరు దేశాల ప్రజలు మెరుగైన జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాం’’అని చెప్పారు. హానికరమైన సుంకాలు: ఇటలీ ట్రంప్ సుంకాలను ఆయన మిత్రురాలు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఘాటుగా విమర్శించారు. ఈ సుంకాలు హానికరమని హెచ్చరించారు, ‘‘వాణిజ్య యుద్ధాన్ని నివారించాలి. అది తీవ్రతరం కాకముందే పరిష్కారం కోసం అమెరికా ప్రయతి్నంచాలి’’అని సూచించారు. ఆర్థిక సంక్షోభం: ఫ్రాన్స్ ట్రంప్ సుంకాలు అతి పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తాయని ఫ్రాన్స్ ఆందోళన వెలిబుచి్చంది. ఫ్రెంచ్ వైన్, స్పిరిట్స్ ఎగుమతులపై ఇవి గణనీయ ప్రభావం చూపుతాయని ప్రభుత్వ ప్రతినిధి సోఫీ ప్రైమాస్ వ్యాఖ్యానించారు. తక్షణం రద్దు చేయాలి: చైనా ఏకపక్ష టారిఫ్‌లను అమెరికా తక్షణం రద్దు చేయాలని చైనా డిమాండ్ చేసింది. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఇవి గొడ్డలి పెట్టని అభిప్రాయపడింది. అమెరికా ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ సరఫరా గొలు సులను కూడా దెబ్బతీస్తాయని హెచ్చరించింది. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికాకు సూచించింది.చర్చలే మార్గం: దక్షణ కొరియా ఈ సమస్యకు చర్చలే మార్గమని ద క్షణ కొరియా అభిప్రాయపడింది. ప్రపంచ వాణిజ్య యుద్ధం వాస్తవ రూపం దాల్చిందని తాత్కాలిక అధ్యక్షుడు హాన్ డక్ సూ అన్నారు. ఆర్థిక మంత్రి, ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష జరిపారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి శక్తి సామ ర్థ్యాలన్నింటినీ ధారపోద్దామని చెప్పారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
గాజాలో ఆకలి కేకలు: పిండీ లేదు.. తిండీ లేదు
రంజాన్ పండుగతో పాటే ప్రపంచవ్యాప్తంగా ముస్లింల ఉపవాస దీక్షలు ముగిసినా గాజాలో మాత్రం పాలస్తీనియన్లకు నిత్య ఉపవాసాలే కొనసాగుతున్నాయి. తినడానికి ఏమీ లేక ఖాళీ జనం డొక్కలెండుతున్నాయి. గాజాకు మానవతా సాయాన్ని, ఆహార సరఫరాను ఇజ్రాయెల్ పూర్తిగా అడ్డుకోవడంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఐరాసతో పాటు అంతర్జాతీయ సమాజం భారీ పరిమాణంలో పంపిన ఆహార నిల్వలన్నీ సరిహద్దుల వద్దే కుళ్లిపోతున్నాయి. గాజా ఏమో నిస్సహాయ స్థితిలో ఆకలితో యుద్ధం చేస్తోంది. రంజాన్ పండుగ సందర్భంగా కూడా కనీసం రొట్టెముక్కయినా దొరకని కుటుంబాలెన్నో...! ఇది చాలదన్నట్టు పిండి నిల్వలు కూడా పూర్తిగా నిండుకోవడంతో తాజాగా గాజాలో బేకరీలన్నీ మూతబడ్డాయి!!ఈద్. పవిత్ర రంజాన్ మాసానికి ముగింపు. సాధారణంగా అయితే గాజావాసులకూ వేడుకే. కుటుంబాలన్నీ కలిసి ఆనందంగా పండుగ జరుపుకొంటాయి. కానీ గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అక్కడ ఈద్ పాలస్తీనావాసుల ఆకలి కేకలు, ఇజ్రాయిల్ బాంబు దాడుల నడుమే ముగిసింది. యుద్ధం దెబ్బకు గాజా ఆహారోత్పత్తి సామర్థ్యం పూర్తిగా పడకేసింది. దాంతో తిండికి కూడా అంతర్జాతీయ సాయంపైనే ఆధారపడుతోంది. ఇజ్రాయెల్ మాత్రం తమ బందీల విడుదల కోసం హమాస్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా మార్చి నుంచే గాజాకు ఆహారం, మానవతా సాయం సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. దాంతో సహాయక ట్రక్కులు గాజాలో అడుగు పెట్టి మూడు వారాలు దాటింది. 18 నెలల క్రితం యుద్ధం మొదలైనప్పటి నుంచీ గాజాకు ఇంతకాలం పాటు ఎలాంటి ఆహార సరఫరాలూ అందకపోవడం ఇదే తొలిసారి. దాంతో ఇంధనం తదితరాల కొరత తారస్థాయికి చేరింది. అంతేకాదు, కనీసం పిండి నిల్వలు కూడా లేని పరిస్థితి! దాంతో బుధవారం గాజాలోని బేకరీలన్నీ మూతబడ్డాయి. స్థానిక బేకరీ యజమానుల సంఘం చీఫ్ అబ్దెల్ నాసర్ అల్–అజ్రామి ఈ మేరకు ప్రకటించారు. ‘‘గిడ్డంగుల్లో పిండి పూర్తిగా అయిపోయినట్టు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పీ) మాకు తెలిపింది. ఇజ్రాయిల్ రఫా క్రాసింగ్ తదితరాలను తెరిచి సహాయక సామగ్రి, మానవతా సాయాలను తిరిగి గాజాలోకి అనుమతించేదాకా బేకరీలు పనిచేయబోవు’’అని వెల్లడించారు. అబద్ధాలతో నిద్రపుచ్చుతూ... పాలస్తీనియన్ల ఆకలిని తీరుస్తున్న ప్రధాన వనరు రొట్టె మాత్రమే. చికెన్, మాంసం, కూరగాయలు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. అందుబాటులో ఉన్న ఇతర ఆహార పదార్థాలను రొట్టెను తింటూ రోజులు వెళ్లదీస్తున్నారు. ‘‘పరిస్థితి వివరించలేనంత దారుణంగా ఉంది. నా కుటుంబసభ్యులకు బ్రెడ్ కోసం ఉదయం 8 గంటల నుంచీ వెతుకుతున్నాను. డెయిర్ అల్–బలాహ్లోని అన్ని బేకరీల చుట్టూ తిరిగా. ఒక్కటి కూడా పనిచేయడం లేదు. పిండి లేదు. కట్టె లేదు. ఏమీ లేవు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవు. ఇంత దారుణం చూస్తామని ఎన్నడూ అనుకోలేదు’’అని ఇబ్రహీం అల్ కుర్ద్ అనే స్థానికుడు వాపోయాడు. ‘‘పిల్లలు రాత్రి భోజనం చేయకుండానే పడుకుంటున్నారు. ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టండి, ఉదయాన్నే పిండి తెచ్చుకుందామని వారికి అబద్ధాలు చెబుతూ నిద్రపుచ్చుతున్నాం’’అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. రఫా తదితర క్రాసింగ్లను తిరిగి తెరిచేలా ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలని ఆయన వేడుకుంటున్నాడు. చుక్కల్లో పిండి ధరలు... రొట్టెతో పాటు గాజావాసులకు వంట కోసం గ్యాస్‌ను కూడా బేకరీలే అందించేవి. అవి మూతబడటంతో తిండి వండుకోవడానికి కలపనే ఆశ్రయిస్తున్నారు. కానీ దానికీ తీవ్ర కొరతే ఉంది. కలపను బ్లాక్ మార్కెట్లో అడ్డగోలు ధరలకు అమ్ముతున్నారు. దాంతో అదీ జనానికి అందుబాటులో లేకుండా పోయింది. నూనె, ఈస్ట్ వంటి బేకింగ్ పదార్థాలు కూడా కొనలేని పరిస్థితి! బేకరీలు మూతబడటంతో పిండి ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. ఒక్క సంచీ ఏకంగా 400 షెకెల్స్ (115 డాలర్ల)కు అమ్ముతున్నారు. యుద్ధానికి ముందు 25 షెకెల్స్ ఉండేది. గత జనవరిలో స్వల్పకాలిక కాల్పుల విరమణ సందర్భంగా కూడా 35 షెకెల్స్కు దొరికేది. ‘‘ప్రజలు ఇప్పుడు యుద్ధ భయాన్ని, బాంబు దాడులను, వలస కష్టాలను, అన్నింటినీ మర్చిపోయారు. వారి ఆలోచనలన్నీ ఏ పూటకు ఆ పూట పిండి ఎలా దొరుకుతుందా అన్నదాని మీదే ఉన్నాయి’’అని ఉత్తర గాజాకు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అహ్మద్ డ్రెమ్లీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘యుద్ధం మొదలైనప్పుడు ప్రజలు ఆరోగ్యంగా, దేన్నయినా తట్టుకునే సామర్థ్యంతో ఉన్నారు. ఇప్పుడంతా మారిపోయింది. రొట్టెకు కూడా దిక్కు లేదు! దాంతో జనం ఏది దొరికినా తిని కడుపు నింపుకుంటున్నారు. కానీ కొద్ది రోజులుగా చాలామందికి తినేందుకు ఏమీ దొరకడం లేదు. బియ్యం కొనడానికి అప్పు చేస్తున్నారు. ఇంట్లో ఉన్నవన్నీ అమ్ముకుంటున్నారు. చాలామంది పాలస్తీనియన్లు రద్దీగా ఉన్న గుడారాల్లో బతుకీడుస్తున్నారు. కొందరైతే వీధుల్లోనే నిద్రపోతున్నారు. తిండి వండుకునే పరిస్థితులు కూడా లేవు’’అంటూ గాజాలోని దైన్యాన్ని ఆయన వివరించారు. దారుణ సంక్షోభం: ఐరాస ‘‘కాల్పుల విరమణ సమయంలో గాజాలోకి రోజుకు 500 నుంచి 600 ట్రక్కుల్లో సహాయక సామగ్రి వచ్చేది. ఇప్పుడన్నీ ఆగిపోయాయి. కాల్పుల విరమణ ముగిసి యుద్ధం తిరిగి మొదలైనప్పటినుంచీ ఘోరమైన మానవతా సంక్షోభం నెలకొంది. మార్చి 2 నుంచి గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా ఆపేసింది. ముఖ్యంగా బేకరీల మూతతో ఆహారం కోసం కేవలం వాటిపైనే ఆధారపడ్డ లక్షలాది మంది అల్లాడుతున్నారు. దిగ్బంధాన్ని తక్షణం ఎత్తేయకపోతే గాజాలో త్వరలోనే మరణమృదంగం తప్పదు’’అని ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారి హెచ్చరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వరమివ్వని ఉద్యానం
‘గ్రోత్ ఇంజిన్లు’గా చెప్పుకునే అరటి, చీనీ, టమాట, మిర్చి, మామిడి ఈ ఏడాది ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. లక్షలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంటలు కన్నీళ్లే మిగిల్చాయి. పంట పండితే ధరలు లేవు, ధరలుంటే పంటలు పండవు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. గతంలో ఎన్నడూ లేనంతగా అరటి, మిర్చి, టమాట రైతులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉద్యాన రైతులకు ఎక్కడా ఊరట లభించడం లేదు. అరటి రైతులైతే ఈ ఏడాది దారుణంగా దెబ్బతిన్నారు.పెట్టుబడులు పెరగడం, ధర తగ్గడంతో నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఒక దశలో రూ. 25 వేలు పలికిన టన్ను అరటి.. నేడు రూ.11 వేలు కూడా లేదు. రైతులేమో ఎకరాకు రూ. లక్షన్నర వరకూ పెట్టుబడి పెట్టారు. చాలా చోట్ల దిగుబడి బాగా వచ్చినా ధరల్లేక నిరాశే మిగులుతోంది. వాస్తవానికి జిల్లాలో పండే ‘గ్రాండ్ నైన్ అరటి’కి అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర లభిస్తున్నా ఎగుమతి సౌకర్యం లేకపోతోంది. మిరప, టమాట రైతుల కన్నీళ్లు మిరప, టమాట రైతులను కదిలిస్తే కన్నీటి గాథ బయటికొస్తోంది. మార్కెట్లో ప్రస్తుతం పచ్చి మిర్చి కేజీ రూ.20 లేదా రూ.30 కంటే ఎక్కువ లేదు. కేజీ కనీసం రూ.40 పలికితేనే రైతుకు గిట్టుబాటవుతుంది. రిటైల్ మార్కెట్లోనే రూ.20 ఉంటే రైతు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక టమాట రైతులకు అప్పులే మిగులుతున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా కిలో టమాట రూ.10 కంటే ఎక్కువ పలకడం లేదు. ఎరువులు, పురుగుమందు ఖర్చులు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. చీనీ రైతులకూ చేదు గుళికలే.. రాష్ట్రంలోనే అత్యధికంగా చీనీ దిగుబడి జిల్లాలో ఉంటుంది. చీనీ టన్ను ఇటీవల కాలంలో రూ.20 వేలు మించి పలకడం లేదు. 2021 కరోనా అనంతరం టన్ను లక్ష రూపాయలు అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది నేడు రూ.20 వేలు ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయొచ్చు. మరోవైపు.. మామిడి ప్రస్తుతానికి పూత, పిందె వస్తున్నా.. వచ్చే రోజుల్లో నిలబడగలదా అన్న భయం రైతుల్లో నెలకొంది.ప్రభుత్వమే ఆదుకోవాలి రెండు ఎకరాల్లో టమాట పంటను సాగు చేశా. సుమారు రూ. లక్ష పెట్టు బడి పెట్టా. «గిట్టుబాటు ధర లేకపోవటంతో పంటను తోటలోనే వదిలేశా. టమాట పంటకు మద్దతు ధర ప్రకటించి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.– బసవరాజు, దొడగట్ట, కళ్యాణదుర్గంమార్కెటింగ్ సౌకర్యం లేదు2 ఎకరాల్లో అరటి సాగు చేశా. ఎకరాకు రూ. లక్ష చొప్పున రెండు లక్షల వరకూ పెట్టుబడి పెట్టా. పంట ఉత్పత్తుల ఎగుమతులకు సరైన సౌకర్యం లేకపోవడంతో గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. – నాగరాజు, పెద్దజలాలపురం గ్రామం, శింగనమల, మండలం -
బిల్లుపై ఎవరి వాదనేమిటి?
వక్ఫ్. కొద్ది రోజులుగా దేశమంతటా చర్చనీయంగా మారిన అంశం. ఇస్లాం సంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ ఆస్తులన్నీ అల్లాకు చెందుతాయని భావిస్తారు. కనుక వాటి అమ్మకం, ఇతర ప్రయోజనాలకు వాడకం పూర్తిగా నిషిద్ధం. మసీదులు, మదర్సాలు, శ్మశానవాటికలు, అనాథాశ్రమాల నిర్మాణ నిర్వహణ తదితరాల నిమిత్తం ఉపయోగించాలి. భారత్‌లో వక్ఫ్ సంప్రదాయం 12వ శతాబ్ధంలో దిల్లీ సుల్తానుల హయాంలో మొదలైంది. స్వాతంత్య్రానంతరం 1954లో కేంద్ర వక్ఫ్ చట్టం వచ్చింది. దాని స్థానంలో 1995లో తెచ్చిన కొత్త చట్టం ద్వారా వక్ఫ్ బోర్డులకు మరిన్ని అధికారాలు దఖలు పడ్డాయి. వాటిని అపరిమితంగా పెంచుతూ యూపీఏ ప్రభుత్వం 2013లో మరిన్ని సవరణలు చేసింది. దేశవ్యాప్తంగా 8.7 లక్షలకు పైగా వక్ఫ్ ఆస్తులున్నాయి! వీటన్నింటికీ కలిపి 9.4 లక్షల ఎకరాలున్నాయి! ఆ లెక్కన వక్ఫ్ బోర్డులు దేశంలో మూడో అతి పెద్ద భూ యజమానులుగా అవతరించాయి. వాటి భూముల మొత్తం విలువ కనీసం రూ.1.2 లక్షల కోట్ల పై చిలుకేనని అంచనా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 వక్ఫ్ బోర్డులున్నాయి. వాటిలో అవినీతి తీవ్ర సమస్యేనని ముస్లిం సంఘాలు కూడా అంగీకరిస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశవ్యాప్తంగా 60 వేలకు పైగా వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. 13 వేలకు పైగా ఆస్తులు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. ఇక 4.35 లక్షల ఆస్తుల గురించి సమాచారమే లేదు! వక్ఫ్ భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని అన్యాక్రాంతం చేస్తోందని సచార్ కమిటీ ఆక్షేపించింది కూడా. అయితే తీవ్ర వాద వివాదాల నడుమ వక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. కేంద్ర వక్ఫ్ మండలి, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నది విపక్షాల ఆరోపణ. దీన్ని వక్ఫ్ భూములను ముస్లింల నుంచి లాక్కునేందుకు మోదీ సర్కారు కుట్రగా మజ్లిస్ వంటి పార్టీలు అభివర్ణిస్తున్నాయి. ఇందులోని పలు ప్రతిపాదనలు 14, 26, 26, 29 తదితర ఆర్టికల్స్‌కు పూర్తిగా విరుద్ధమని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వక్ఫ్ రగడపై ఇండియాటుడే న్యూస్ చానల్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ బుధవారం చర్చా కార్యక్రమం నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా, వ్యతిరేకంగా పలు పార్టీల నేతలు తదితరులు, నిపుణులు వాదనలు విన్పించారు. వక్ఫ్ ఆస్తులు అంతిమంగా పేద ముస్లింల అభ్యున్నతికి దోహదపడాలన్నదే తాజా బిల్లు ఉద్దేశమని ప్రభుత్వం చెబుతుండగా అందులోని ప్రతిపాదనలను అంశాలవారీగా విపక్షాలు దుయ్యబట్టాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
చాక్లెట్ పంట.. ధరలేక తంటా
సాక్షి, అమరావతి: చాక్లెట్ పంట అన్నదాతకు చేదును పంచుతోంది. కంపెనీలు సిండికేట్‌గా మారి కోకో గింజల ధరల్ని అమాతం తగ్గించేయడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. కష్టకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం కంపెనీలకు కొమ్ముకాస్తూ తమని పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో 1.12 లక్షల ఎకరాల్లో కోకో తోటలు ఉండగా.. ఎకరాకు 3–4 క్వింటాళ్ల చొప్పున ఏటా 12 వేల టన్నుల గింజల దిగుబడి వస్తోంది. ఇందులో 80 శాతం గింజల్ని క్యాడ్బరీ, మిగిలింది నెస్లే, క్యాంప్కో, లోటస్ (Lotus) తదితర కంపెనీలు సేకరిస్తున్నాయి. కోకో పంటకు నవంబర్ నుంచి జూన్ వరకు సీజన్. జూలై నుంచి అక్టోబర్ వరకు అన్ సీజన్. దిగుబడిలో రెండొంతులు సీజన్లోనూ, ఒక వంతు అన్ సీజన్లోనూ చేతికొస్తుంది. గతంలో సీజన్, అన్ సీజన్ అనే తేడా లేకుండా గింజలన్నింటినీ ఒకే రీతిలో అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా కంపెనీలు కొనుగోలు చేసేవి. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. గతేడాది కిలో గింజల ధర రూ.1,050 గతేడాది ఇదే సమయంలో కిలో కోకో గింజలకు రూ.1,050 ధర లభించింది. ఈ ఏడాది కంపెనీలు సిండికేట్‌గా మారి అనూహ్యంగా ధరలు తగ్గించేయడంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో కిలో గింజల ధర రూ.770కి పైగా పలుకుతుండగా, కంపెనీలు మాత్రం నాణ్యమైన (ప్రీమియం) గింజలకు సైతం రూ.400–450 మధ్య చెల్లిస్తున్నాయి. అన్‌సీజన్ గింజల్ని కొనేందుకు కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు కిలో రూ.200–250 మధ్య కొనుగోలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రస్తుతం కోతకు వచ్చిన సీజన్ పంటకు సైతం కంపెనీలు గిట్టుబాటు ధర చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. కోతకు సిద్ధంగా ఉన్న పంట కాకుండా రైతుల వద్ద దాదాపు 1,500 టన్నులకు పైగా కోకో గింజల నిల్వలున్నాయి. దిగుమతుల వల్లే.. ఈ ఏడాది చాక్లెట్ కంపెనీలు విదేశాల నుంచి కోకో గింజలు, పొడి, బటర్ దిగుమతి చేసుకోవడంతో ఇక్కడి రైతులు పండించిన పంటకు డిమాండ్ లేకుండాపోయింది. కోకో రైతుల్లో అత్యధికులు కౌలుదారులే. ఎకరాకు రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు కౌలు చెల్లిస్తుంటారు. తెగుళ్లు, చీడపీడలు, యాజమాన్య పనుల కోసం ఏటా రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడి పెడుతుంటారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక సతమతమవుతున్న రైతులు కంపెనీల మాయాజాలం వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. సీజన్, అన్‌సీజన్‌తో సంబంధం లేకుండా అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా కోకో గింజల్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా.. ప్రభుత్వం జోక్యం చేసుకుని కంపెనీల మాయాజాలాన్ని అడ్డుకోవాలని ఏపీ కోకో రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ధరల స్థిరీకరణ నిధి పథకాన్ని కోకో రైతులకూ వర్తింప చేయాలని కోరారు. కోకో రైతులను ఆదుకోకపోతే ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ప్రభుత్వం స్పందించడం లేదుఎకరాకు రూ.1.40 లక్షల చొప్పున చెల్లించేలా 60 ఎకరాలను కౌలుకు తీసుకుని కోకో సాగు చేస్తున్నా. ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడులు అవుతున్నాయి. అన్సీజన్కు సంబంధించి 7 టన్నుల గింజలు ఉండగా.. కిలో రూ.330 చొప్పున 2.50 టన్నులు అమ్మాను. మిగిలిన 4.50 టన్నులు అమ్ముదామంటే కొనేవారు లేదు. సీజన్‌కు సంబంధించి 7 టన్నుల గింజల్ని కిలో రూ.550 చొప్పున కొన్నారు. ఇంకా 4 టన్నులు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు కిలో రూ.450కు మించి కొనలేమని చెబుతున్నారు. మరో రెండు టన్నుల వరకు పంట రావాల్సి ఉంది. ఈ ఏడాది పెట్టుబడులు కూడా వచ్చేలా కనిపించడం లేదు. లీజుకు చెల్లించాల్సిన మొత్తం నష్టపోయినట్టే. పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఏమాత్రం స్పందించలేదు.రూ.45 లక్షలకు పైగా నష్టపోతున్నా ఈ రైతు పేరు అవర్ని అనిల్‌కుమార్. ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాయన్నపాలేనికి చెందిన ఈయన 150 ఎకరాలను కౌలుకు తీసుకుని.. ఎకరాకు రూ.1.40 లక్షల చొప్పున కౌలు చెల్లిస్తూ కోకో సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ.40 వేల చొప్పున పెట్టుబడి అవుతోంది. ఎకరాకు 3.50 క్వింటాళ్ల చొప్పున కోకో గింజల దిగుబడి వచ్చింది. అన్ సీజన్(వర్షాకాలం)లో తీసిన పంటను కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. బతిమాలుకుంటే కిలోకు రూ.200–250 మించి ధర ఇచ్చేది లేదంటున్నారు. చదవండి: భోజనం లేదు.. పుస్తకాల్లేవు!గతేడాది ఇదే సమయంలో సీజన్, అన్ సీజన్‌తో సంబంధం లేకుండా కిలో గింజలకు రూ.1,050 చొప్పున ధర దక్కింది. ఈ ఏడాది అమాంతం ధర తగ్గిపోవడంతో ఎకరాకు రూ.30 వేల చొప్పున మొత్తంగా తాను రూ.45 లక్షల మేర నష్టపోతున్నట్టు రైతు అనిల్‌కుమార్ ఘొల్లుమంటున్నారు. కోకో గింజల్ని కొనుగోలు చేసే కంపెనీలు సిండికేట్‌గా మారి ధరల్ని దారుణంగా తగ్గించేయడంతో కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. -
ఆటిజం.. అర్థం చేసుకుందాం
సుధ (పేరు మార్చాం) ఇద్దరు పిల్లల తల్లి. పిల్లలకు ఏడాదిన్నర వయసు నుంచి మారాం చేసినా, అన్నం తినకపోయినా సెల్ఫోన్లో వీడియోలు పెట్టి చూపించడం అలవాటు చేసింది. ఐదేళ్ల వయసుకు వచ్చినా ఇద్దరు పిల్లలకు మాటలు సరిగా రాలేదు. ఎవరు ఏం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితి లేదు. వైద్యులను సంప్రదిస్తే ఆటిజం అని చెప్పారు.రాజ్యలక్ష్మికి నెలలు నిండకుండానే ముగ్గురు పిల్లలు పుట్టారు. ఇద్దరు కుమారుల్లో ఒకరికి రెండేళ్లు వచ్చే వరకు నడక రాలేదు. వైద్యుల వద్దకు వెళ్లగా ఆటిజం ఉన్నట్టు తేల్చారు. రెండో బాబుకు సమస్య పాక్షికంగా ఉన్నట్టు చెప్పారు.ఇదో జబ్బు అని చెప్పలేం. బుద్ధి మాంద్యతా అంటే అదీ కాదు. మానసిక వైకల్యం అనీ అనలేం. ఏదో పెద్ద లోపంగా పరిగణించలేం. ప్రత్యేకంగా మందులంటూ ఏమీ లేవు. ఎందువల్ల దీని బారిన పడతారనే దానికి స్పష్టమైన కారణాలూ ఇప్పటివరకు తెలియవు. థెరపీలు, తల్లిదండ్రులకు అవసరమైన కౌన్సెలింగ్ మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం. అదే ఆటిజం (సాధారణ పిల్లల్లా లేకపోవడం). ఇది చిన్న పిల్లల్ని పీడించే ఓ రుగ్మత..ఓ సమస్య అని మాత్రమే చెప్పగలమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ ఆటిజంతో బాధ పడుతున్న కొందరిలో తెలివితేటలు (ఇంటెలిజెన్స్ కోషియంట్– ఐక్యూ) ఒకింత ఎక్కువగా ఉండటం గమనార్హం. కాగా ఇలాంటివారిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోపగించుకోవడం కానీ వేరుగా చూడడం కానీ చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లల్లో ఉండాల్సిన సహజ చురుకుదనం లేమి కారణంగా తల్లిదండ్రులను ఎంతో వేదనకు గురిచేసే ఆటిజంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం మీ కోసం..ఏంటీ ఆటిజం.. ?ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన రుగ్మత. అంటే న్యూరలాజికల్ డిజార్డర్‌గా భావించవచ్చు. అంతేగానీ ఓ జబ్బుగా పరిగణించడానికి వీల్లేదు. ఒకే రకమైన/నిర్దిష్ట లక్షణాలుండవు. ఏ ఇద్దరు పిల్లల్లోనూ ఒకేలా ఉండవు. లక్షణాల విస్తృతి చాలా ఎక్కువ. అందుకే దీనిని స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన రుగ్మత) లేదా ఆటిజమ్ స్పెక్ట్రమ్ అని చెబుతుంటారు. ఎలాంటి లక్షణాలుంటాయి?» చూడటానికి సాధారణ పిల్లల్లాగే కన్పిస్తుంటారు. కానీ.. » వయసుకు తగిన వికాసం లోపించిందా? అన్పించవచ్చు. » సాధారణ చిన్నారుల్లా ప్రతిస్పందించకపోవచ్చు. పేరు పెట్టి పిలుస్తున్నా పలుకకపోవచ్చు. » ఇతరులతో సమాచారం పంచుకోవడం (కమ్యూనికేషన్లో ఇబ్బంది), సంభాషిoచడంలో ఇబ్బంది పడుతుండొచ్చు. ఎదుటివారి కళ్లలో కళ్లు కలిపి చూస్తూ మాట్లాడలేరు. ఎంత పిలిచినా పలకకుండా వినికిడి లోపం ఏదైనా ఉందేమో అనిపించేలా ప్రవర్తిస్తారు. » దాదాపు 25 శాతం మంది చిన్నారులు మాటల్ని సరిగా పలుకలేరు. మాటలు రావడంలో ఆలస్యం అవుతుంది. » ఏదో లోకంలో ఉన్నట్టుగా ఉంటుండొచ్చు లేదా పలికిన మాటే పదే పదే పలుకుతూ ఉండవచ్చు. » యాస్పర్జస్ డిజార్డర్ ఉన్న పిల్లల్లో తెలివితేటలు ఒకింత ఎక్కువగా ఉండి, కొన్ని పనుల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. » కుదురుగా ఉండకుండా ఎప్పుడూ పరుగెడుతూ, గెంతుతూ ఉంటారు.» నీట్‌గా ఉండకపోవడం. చక్కగా డ్రస్ చేసుకోడానికి,సమయానికి హెయిర్ కట్ చేయించుకోడానికి నిరాకరించడం.» చేసిన పనులే పదే పదే చేస్తుండటం (రిపిటేటివ్ బిహేవియర్). కొత్త పనులపై ఆసక్తి చూపకపోవడం. ఎప్పుడూ తమకు ఇష్టమైన ఆట వస్తువునో మరొకటో పట్టుకుని ఉండటం. » గోడలపై ఉన్న సున్నం నాకడం లేదా తినడానికి యోగ్యం కాని పదార్థాలను తినడానికి యత్నించడం (పేపర్లు, షర్ట్ కాలర్ వంటి వాటిని నోట్లో పెట్టుకుని తినడానికి ప్రయత్నించడం లాంటి డిజార్డర్లు). » పిల్లలు సాధారణంగా చేసే గీతలు గీయడం, రాయడం, కత్తెర వంటి పనిముట్లను ఉపయోగించడం, నమలడం కూడా సరిగా చేయకపోవడం » సంతోషం, బాధ వంటి భావనలను త్వరగా అర్థం చేసుకోలేరు. వాటిని అర్థమయ్యేలా చెప్పలేరు. » తలను గోడకు లేదా నేలకేసి బాదుకోవడం, ఇతరులను బలంగా ఢీకొట్టడం,వస్తువులను విసిరేయడం వంటి దురుసు ప్రవర్తనలు కనబరచడం.రకరకాల థెరపీలతోనే చికిత్సచిన్నారుల వ్యక్తిగత లక్షణాలూ, భావోద్వేగ పరమైన అంశాలను బట్టి న్యూరో స్పెషలిస్టులు, సైకాలజిస్టులు, స్పీచ్ థెరపిస్టులు, బిహేవియరల్ థెరపిస్టులు ఇలా అనేక మంది స్పెషలిస్టుల సహాయంతో, సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ వంటి ప్రక్రియలతో సమీకృత చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలకు అవసరమైన విద్య అందించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సికింద్రాబాద్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్’(ఎన్ఐఈపీఐడీ) వంటి సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ చిన్నారుల కనీస స్వావలంబన కోసం పలు సామాజిక సంస్థలు, ఎన్జీవోలు కూడా పనిచేస్తున్నాయి. అటిజమ్ ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారుతోంది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు కావడం, పిల్లలతో గడిపే తీరిక లేకపోవడం, ఎక్కువగా స్క్రీన్కు అడిక్ట్ కావడం వంటివి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. చదవండి: టీకాలతో ఆటిజం వస్తుందా? అసలు చికిత్స ఉందా? -
ఓరుగల్లు సిగలో లోహవిహంగ నగ
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ మామునూరు విమానాశ్రయానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. సుమారు 44 ఏళ్ల క్రితం మూతపడిన ఈ విమానా శ్రయం నుంచి మళ్లీ విమానం ఎగిరేందుకు కార్యా చరణ సిద్ధమైంది. ఈ విమానాశ్రయం పునరుద్ధ రణతో హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే అతి పెద్ద నగరంగా పేరున్న వరంగల్ అభివృద్ధిలో మరింత ప్రగతి సాధించనుంది. కాకతీయ మెగా జౌళిపా ర్కు, ఐటీ పరిశ్రమలు ఏర్పడటం.. యునెస్కోతో రామప్ప అంతర్జాతీయ పర్యాటక కేంద్రం కావడం.. ఇలా ఒక్కొక్కటిగా వస్తున్న ప్రాజెక్టులు ఓరుగల్లు ప్రతిష్టను పెంచుతున్నాయి. సుమారు 44 ఏళ్ల తర్వాత తెలంగాణలో రెండో ప్రాంతీయ విమా నయాన కేంద్రంగా రూపుదిద్దుకోబోతుండగా.. భవిష్యత్ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. అర్ధ శతాబ్దం, ఆకాశయానం... 1930లో మామునూరు ప్రాంతంలో నిర్మించిన ఈ విమానాశ్రయం, నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆధ్వర్యంలో ప్రారంభం కాగా.. సోలాపూర్ వ్యాపార అభివృద్ధి, సిర్పూర్ కాగజ్‌నగర్ కాగిత పరిశ్రమ, వరంగల్ అజంజాహీ మిల్స్ అవసరాలకు సేవలు అందించేది. 1981 వరకు.. సుమారు అర్ధశతాబ్దం అనేక మంది ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు తమ పర్యటనలకు ఈ విమానాశ్రయాన్ని ఉపయోగించుకున్నారు. ఇండో–చైనా యుద్ధ సమయంలో ఢిల్లీ విమానాశ్రయాన్ని శత్రువులు లక్ష్యంగా చేసుకున్న సమయంలో కూడా, ఈ విమానాశ్రయం ప్రయాణికులకు సేవలు అందించింది. అయితే 1981లో వివిధ కారణాలతో ఈ విమానాశ్రయం మూత పడింది. మళ్లీ తెరిచేందుకు ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకపోగా.. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధ రణకు లైన్‌క్లియర్ అయ్యింది. ఇంతకాలం అడ్డంకిగా ఉన్న హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే జీఎంఆర్ గ్రూప్ నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (ఎన్ఓసీ) ఇవ్వడంతో మార్గం సుగమం అయ్యింది. పున రుద్ధరణకు విమానాశ్రయం డీపీఆర్‌ను సిద్ధం చేసే పనిలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిమగ్నమైంది. కొత్త ఎయిర్‌పోర్టులో ఇవీ..ఎయిర్‌బస్ ఎ–320, బోయింగ్ బీ–737 వంటి వైడ్–బాడీ విమానాలను ఉంచడానికి కొత్త రన్‌వే నిర్మించనున్నారు. విమానాశ్రయాన్ని సిగ్నల్ టవర్, భద్రతా వ్యవస్థలు, ఇతర కీలకమైన మౌలిక సదుపాయాలతో అప్‌గ్రేడ్ చేస్తారు. ఈ విమానాశ్రయం ప్రారంభంలో ముంబై, ఢిల్లీ, తిరుపతి, బెంగళూరు, విజయవాడ వంటి నగరాలకు దేశీయ మార్గాలను అందిస్తుంది. భవి ష్యత్తు ప్రణాళికల్లో భాగంగా ఈ విమానాశ్రయం చివరికి అంతర్జాతీయ ప్రయా ణికులు, కార్గో సేవలను అందిస్తుంది. కాగా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటం వల్ల ఇతర జాతీయ, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల కనెక్టివిటీ, తద్వారా ఆర్థిక వృద్ధికి అవకాశాలు మెండు. రద్దీగా ఉండే హైదరాబాద్ నగరంపై ఒత్తిడిని తగ్గించడానికి కూడా వరంగల్‌ను అభివృద్ధి చేయడం ఒక మార్గంగా ప్రభుత్వాలు భావి స్తున్నాయి. అంతేగాకుండా వరంగల్ చారిత్రక ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి, స్థిరమైన అభివృద్ధి సాధనకు ప్రభుత్వం వరంగల్‌ను సుందర నగరం (స్మార్ట్‌సిటీ), హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన (హృదయ్) వంటి పథకాల అమలు.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), కాకతీయ యూనివర్సిటీ (కేయూ), కాళోజీ హెల్త్ యూనివర్సిటీ (కేఎన్ఆర్)లున్న వరంగల్‌లో విద్య, వైద్యం, ఐటీ, పరిశ్రమల రంగాల అభివృద్ధికి ఎయిర్పోర్ట్ మరింత దోహదపడుతుంది.మున్ముందు ఎన్నో ప్రయోజనాలు.. వచ్చే 20 ఏళ్లలో మామునూరు విమానాశ్రయం తెలంగాణలో ఒక ముఖ్యమైన విమానయాన కేంద్రంగా మారడంతోపాటు.. వరంగల్, సమీప ప్రాంతాల్లో పెట్టుబడులను పెంచుతుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, మద్రాస్ మహానగరాల్లో ఉన్న కంపెనీలు తమ బ్రాంచీలను ఏర్పాటు చేసేందుకు ఉపయోగంగా ఉంటుంది. మహానగరాలతో పోల్చుకుంటే లివింగ్ కాస్ట్ ఇక్కడ తక్కువగా ఉండడం వల్ల ఐటీ ఉద్యోగులు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉంటాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్ వరంగల్ పట్టణం కంటే చిన్నది. అయినప్పటికి అక్కడ ఎయిర్‌పోర్టు ఉండడం వల్ల పట్టణానికి చుట్టూ స్పిన్నింగ్ మిల్లులు ఏర్పాటయ్యాయి. అదే విధంగా ముంబై, గుజరాత్, కోల్‌కతా, కోయంబత్తూరు లాంటి నగరాలకు చెందిన వస్త్ర పరిశ్రమలకు చెందిన వారు ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. వరంగల్ చారిత్రాత్మకంగా గుర్తింపు పొందడంతోపాటు రామప్ప, మేడారం, లక్నవరం, తాడ్వాయి అభయారణ్యం ఉన్నందున టూరిజం పెరుగుతుంది. దేశ విదేశాలకు చెందిన పర్యా టకులు ఇక్కడకు వచ్చి సందర్శించే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వేలాది మంది స్థానికులు విద్య, ఉద్యోగాల పరంగా అనేక దేశాల్లో ఉంటున్నారు. వారు తక్కువ సమయంలో వచ్చివెళ్లేందుకు ఎయిర్‌పోర్టు ఎంతో ఉప యోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా హోట ళ్లు, ఇతర సంస్థలు ఏర్పాటు కావడం వల్ల స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది.‡ వరంగల్ కాటన్, చిల్లీస్‌కు గుర్తింపు పొందినందున ఎయిర్‌పోర్టు ఉంటే ఫుడ్ ఆధారిత కంపెనీలు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి.మామునూరు ఎయిర్‌పోర్టుతో మహర్దశహైదరాబాద్ తర్వాత వరంగల్‌లో ఐటీ సెక్టార్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందుకు వస్తున్నందున పలు కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు ప్రారంభమైతే ఎంతో బిజీగా ఉండే ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీఈవోలు, ఇంటర్నేషనల్ సెక్టార్లకు చెందిన సీఈవోలు వచ్చి పోయేందుకు అనుకూలం. అందువల్ల ఇక్కడ కంపెనీలు పెట్టే అవకాశాలు ఉంటాయి. వరంగల్ కాటన్, చిల్లీస్‌కు గుర్తింపు పొందినందున ఎయిర్‌పోర్టు ఉంటే ఫుడ్ ఆధారిత కంపెనీలు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులు, గ్రానైట్ తదితర ఉత్పత్తులు అంతర్జాతీయంగా ఎగుమతులు అయ్యేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. – బొమ్మినేని రవీందర్‌రెడ్డి, అధ్యక్షుడు, వరంగల్ కామర్స్ ఆఫ్ ఇండస్ట్రీ, తెలంగాణ రాష్ట్ర కాటన్ వెల్ఫేర్ అసోసియేషన్మెడికల్ ఎమర్జెన్సీ, పరిశోధనలకు అవకాశం..వరంగల్‌లో ఎయిర్పోర్ట్ రాకతో విద్యార్థులకు ఏరోనాటి కల్ విభాగంలో నూతన ఆవిష్క రణ లకు, పరిశోధనలకు అనువై న అవకాశం లభిస్తుంది. వ్యాపా ర, వాణిజ్య, రియల్ ఎస్టేట్, టూరిజం రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రోపాలిటన్ నగరాలకు వెళ్లేందుకు ప్రయాణసమయాన్ని ఆదా చేసుకోవచ్చు. విపత్తు, ఆపద సమయాల్లో మెడికల్ ఎమర్జెన్సీని త్వరితగతిన అందించవచ్చు. – పి.రామ్‌లాల్, ప్రొఫెసర్, ఎన్ఐటీ, వరంగల్ఐటీ సంస్థలు ఎక్కువగా వస్తాయి..మామునూర్‌కు ఎయిర్ పోర్టు రావడం వల్ల ఐటీ సంస్థలు వరంగల్‌కు రావ డానికి అవకాశం ఉంది. దీంతో జిల్లాలోని నిరు ద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరగ నున్నాయి. గతంలోకన్నా ఎక్కువగా ఐటీ సంస్థలు రావడానికి అవకాశాలు పెరగ నున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా యువ కులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – దార ధనుంజయ్, ఐటీ ఉద్యోగి, మడికొండ, గ్రేటర్ వరంగల్నిట్ ‘దాసా’ విద్యార్థులకు ప్రయాణం ఈజీ..ఎన్ఐటీ వరంగల్‌లో విద్యనభ్యసిస్తున్న డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రోడ్ స్కీం (దాసా) విద్యార్థులు తమ గమ్యాన్ని చేరేందుకు మంచి అవకాశం. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లకుండా మామునూర్లో ప్రారంభమయ్యే విమానాశ్రయం నుంచి ప్రయాణ అవకాశం పొందవచ్చు. వరంగల్ నగరాన్ని ఆర్థికంగా ఉన్నతస్థాయిలోకి చేర్చేందుకు ఉపయోగపడుతుంది. యువత ఉపాధికల్పనకు తోడ్పడుతుంది. – మహ్మద్ శార్జిల్, ఎంబీఏ విద్యార్ధి, ఎన్ఐటీ, వరంగల్ -
Ghibli ఫొటోలు ట్రై చేస్తున్నారా?.. ఇది మీకోసమే!
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్.. ఇలా ఏ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా ఫీడ్ మొత్తం జిబ్లీ(Ghibli) ఫొటోలతో నిండిపోతోంది. సామాన్యులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు.. ఇలా అంతా కార్టూన్ తరహా ఫొటోలను పంచుకుంటూ మురిసిపోతున్నారు. ఎడాపెడా ఫొటోలు అప్లోడ్ చేస్తుండడంతో.. నెట్టింట ఈ నయా ట్రెండ్ ఊపేస్తోంది. అయితే అలా అప్లోడ్ చేసే ముందు ఇది ఎంతవరకు సురక్షితం అనే ఆలోచన మీలో ఎంతమంది చేస్తున్నారు?.. ఏఐ బేస్డ్ చాట్‌బాట్ యూజర్లను ఆకర్షించేందుకు ఆయా కంపెనీలు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే.. ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్‌జీపీటీలో (ChatGPT) జిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టింది. తమకు కావాల్సిన ఫొటోను ఎంచుకుని.. ఫలానా స్టైల్లో కావాలని కోరితే చాలూ.. ఆకర్షనీయమైన యానిమేషన్ తరహా ఫొటోలను సృష్టించుకోవచ్చు. ఈ ట్రెండ్ విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడంతో ఇతర ఏఐ ప్లాట్‌ఫామ్‌లు సైతం ఇవే సదుపాయాన్ని అందిస్తున్నాయి. అయితే ఆ వాడకం పరిధి దాటి శ్రుతిమించి పోతోంది. ఎంతవరకు సురక్షితం?ఏదైనా మనం ఉపయోగించినదాన్ని బట్టే ఉంటుంది. అది సాంకేతిక విషయంలో అయినా సరేనని నిఫుణులు తరచూ చెబుతుంటారు. అలాగే జిబ్లీ స్టైల్ ఏఐ ఇమేజ్ జనరేటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సృజనాత్మకత మరీ ఎక్కువైపోయినా.. భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. మరోవైపు వ్యక్తిగతమైన ఫొటోలను ఏఐ వ్యవస్థల్లోకి అడ్డగోలుగా అప్లోడ్ చేస్తే.. అవి ఫేషియల్ డాటాను సేకరించే ప్రమాదమూ లేకపోలేదని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఇలాగే కొన్ని కంపెనీలు వ్యక్తిగత డాటాను తమ అల్గారిథమ్‌లలో ఉపయోగించుకుంటున్న పరిస్థితులను నిపుణులు ఉదాహరిస్తున్నారు.అలాంటప్పుడు ఏం చేయాలంటే..వ్యక్తిగత ఫొటోలను అప్లోడ్ చేసేటప్పుడు.. ఆ జనరేటర్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రైవసీ పాలసీల విషయంలో నమ్మదగిందేనా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోండి. అందుకోసం సదరు జనరేటర్ గురించి నెట్లో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానికి యూజర్లు ఇచ్చే రివ్యూలను చదవాలి. అన్నికంటే ముఖ్యమైన విషయం.. సున్నితమైన అంశాల జోలికి పోకపోవడం. చిన్నపిల్లల ఫొటోలను ప్రయత్నించకపోవడమే మంచిది. మరీ ముఖ్యమంగా ప్రముఖుల ఫొటోలను ప్రయత్నించకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇది చట్టపరమైన చర్యలకు అవకాశం కూడా ఇచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ప్రస్తుతానికి.. ఛాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, ఎక్స్ గ్రోక్, డీప్‌ఏఐ, ప్లేగ్రౌండ్‌ఏఐలు.. పరిమితిలో ఉచితంగా,అలాగే పెయిడ్ వెర్షన్లలోనూ రకరకాల ఎఫెక్ట్‌లతో ఈ తరహా ఎఫెక్ట్‌లను యూజర్లకు అందిస్తున్నాయి. వీటితో పాటు జిబ్లీ ఏఐ కూడా స్టూడియో జిబ్లీస్టైల్ ఆర్ట్ వర్క్‌తో ఫొటోలను చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. నోట్: పర్సనల్ డాటా తస్కరణ.. సైబర్ నేరాలు పెరిగిపోతున్న రోజుల్లో ఏ టెక్నాలజీని అయినా.. అదీ సరదా కోణంలో అయినా ఆచితూచి.. అందునా పరిమితంగా వాడుకోవడం మంచిదనేది సైబర్ నిపుణుల సూచన. -
చేవ కలిగిన చేప!
సాక్షి, అమరావతి: చేపలు సాగు చేసే రైతులకు శుభవార్తే. వ్యాధులు సోకని హై గ్రోత్ చేపలు మార్కెట్లోకి రాబోతున్నాయి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ (సిఫా) అభివృద్ధి చేసిన ఈ చేప విత్తనాలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వ్యాధుల నియంత్రణకే ఖర్చెక్కువ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో 5.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా, దాంట్లో, 2.30 లక్షల ఎకరాల్లో చేపలు (Fishes) సాగవుతున్నాయి. మరోవైపు ఇన్‌ల్యాండ్ పబ్లిక్ వాటర్ బాడీస్‌లో కూడా చేపలు సాగవుతుంటాయి. ప్రధానంగా బొచ్చె (కట్ల), రాగండి (రోహు), మోసులు, రూప్ చంద్, ఫంగస్, పండుగప్ప, కొర్రమేను, తలాపియా వంటి వివిధ రకాల చేపలు సాగులో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా కట్ల, రోహూ రకాల చేపలే ఎక్కువగా సాగులో ఉన్నాయి. ఏటా 45 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అవుతుండగా, 70 నుంచి 80 శాతం ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకే ఎగుమతి అవుతుంటాయి.1980వ దశకంలో అభివృద్ధి చేసిన ఈ రకాలు దాదాపు 40 ఏళ్లుగా సాగులో ఉండడం, వీటిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడంతో పాటు ఏటా పెరుగుతున్న వ్యాధులు రైతులకు పెనుసవాల్‌గా మారాయి. పేను, రెడ్ డిసీజ్, గిల్ ఫ్లూక్స్, ఆర్గులస్ (ఫిష్లైస్) వంటి వివిధ రకాల వ్యాధుల నియంత్రణకు ఏటా లక్షలాది రూపాయలు ఖర్చుచేస్తున్నారు. లీజుతో కలిపి ఎకరాలో చేపలసాగుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంటే దాంట్లో రూ.30 వేల నుంచి రూ.40వేల వరకు ఈ వ్యాధుల నియంత్రణకే ఖర్చుచేయాల్సి వస్తుంది. పదేళ్ల కృషి ఫలితం వ్యాధులను సమర్ధవంతంగా ఎదుర్కొనే ప్రత్యామ్నాయ రకాల అభివృద్ధి కోసం దశాబ్ద కాలం పాటు సిఫా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. వ్యాధులు దరిచేరని ఐదో తరానికి చెందిన అమృత బొచ్చె, జయంతి రాగండి రకాలను అభివృద్ధి చేశారు. క్షేత్రస్థాయి పరీక్షల అనంతరం పలుచోట్ల ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయవంతం చేశారు. చేపల ఉత్పత్తిలో దేశంలోనే ఆగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఈ చేపల విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సీడ్ పునరుత్పత్తి కోసం బాపట్లకు చెందిన హేచరీతో అవగాహనా ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న బొచ్చె, రాగండి చేపలు 10–12 నెలలకు కిలో నుంచి కిలోన్నర పెరిగితే, అమృత బొచ్చె, జయంతి రాగండి చేపలు కేవలం 6–8 నెలల కాలంలోనే కిలోకి పైగా ఎదుగుతాయి. అదే ఏడాది పాటు సాగు చేస్తే 2–2.5 కేజీల పెరుగుదలతో 30–40 శాతం హై గ్రోత్ కలిగి ఉంటాయి. సంప్రదాయ చేపలకు ఎక్కువగా సోకే రెడ్ డిసీజ్, పేను వ్యాధులు వీటికి సోకవు. ఈ కారణంగా ఎకరాకు మందులకు ఉపయోగిస్తున్న వ్యయాలు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు ఆదా అవుతుంది. పైగా 6–8 నెలల్లోనే పట్టుబడికి రావడంతో సమయం కలిసొస్తుంది. అంటే సగటున రెండేళ్లకు మూడు పంటలు వేయొచ్చు. లేదంటే ఏడాది పాటు పెంచితే, వీటి గ్రోత్ కారణంగా 30–40 శాతం అదనంగా ఆదాయం వస్తుంది. ఇవి చూడడానికి గులాబీ రంగులో ఉంటాయి. పొడవు ఎక్కువగా, వెడల్పు తక్కువగా ఉంటాయి. బాణం ఆకారంలో నోరు కలిగి ఉంటుంది. సాధారణ బొచ్చె, రాగండి చేపల కంటే చాలా పెద్ద సైజులో ఉంటాయి. పాలీకల్చర్కు ఎంతో అనువైనవి.చదవండి: గడ్డి భూముల్లో హాయ్, హాయ్నాణ్యమైన సీడ్ అందించాలి.. నేను మూడు దశాబ్దాలుగా దాదాపు 150 ఎకరాల్లో చేపల సాగులో చేస్తున్నా. ప్రస్తుతం సాగులో ఉన్న కట్ల, రోహూ రకాలు దాదాపు 40 ఏళ్లపాటు సాగులో ఉండడం, పిల్లల ఉత్పత్తిలో ఇన్‌బ్రీడింగ్ వల్ల వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోయింది. ఏటా వీటికి సోకే వ్యాధుల నియంత్రణకు వాడే మందుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనితో పెట్టుబడి భారం పెరుగుతోంది. వీటికి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన అమృత కట్ల, జయంతి రోహూ రకాలను సాధ్యమైనంత త్వరగా అందించగలిగితే చేప రైతులు నిలదొక్కుకోగలుగుతారు. జెనెటికల్లీ ఇంప్రూవ్డ్ బ్రూడర్స్ ద్వారా నాణ్యమైన సీడ్ ఉత్పత్తికి సిఫా తోడ్పాటు అందించాలి. – పి.బోసురాజు, కార్యదర్శి ఏపీ ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ చేప రైతులకు నిజంగా వరం సిఫా అభివృద్ధి చేసిన అమృత కట్ల, జయంతి రోహు రకాలు చేపల రైతులకు నిజంగా వరం. ఇవి ఐదో తరానికి చెందిన రకాలు. జెనెటికల్లీ ఇంప్రూవ్డ్ రకాలు కావడంతో వ్యాధులు దరిచేరవు. ఆ మేరకు పెట్టుబడి ఆదా అవుతుంది. ఇప్పటికే బాపట్లలోని హేచరీలకు బ్రూడర్లు అందించాం. వచ్చే సీజన్ నుంచి ఈ చేప పిల్లలు పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి వస్తాయి. – డాక్టర్ రమేష్ రాథోడ్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ సిఫా -
ట్రంప్ మూడో ముచ్చట తీరేనా?
‘మూడోసారి కూడా అధ్యక్షుడు కావాలనుకుంటున్నా. నేనేమీ జోక్ చేయడం లేదు. సీరియస్‌గానే చెప్తున్నా. నన్ను మూడోసారి కూడా అధ్యక్షునిగా చూడాలని అమెరికన్లలో చాలామంది కోరుకుంటున్నారు’ – రెండోసారి అధ్యక్షుడై మూడు నెలలైనా నిండకముందే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. మూడో టర్ము గురించిన ఆకాంక్షలను వెలిబుచ్చడం ఆయనకు ఇది తొలిసారేమీ కాదు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం గత జనవరిలో కూడా, ‘ఒకట్రెండు సార్లు మాత్రమే కాదు, మూడు, ఇంకా చెప్పాలంటే నాలుగుసార్లు కూడా దేశానికి సేవ చేయడం నాకు అత్యంత గౌరవప్రదమైన విషయం’అని చెప్పుకొచ్చారు. రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టేందుకు అమెరికా రాజ్యాంగం అనుమతించదని తెలిసీ ట్రంప్ ఎందుకిలాంటి ప్రకటన చేశారన్నది ఆసక్తికరం. మనసుంటే మార్గముంటుందన్నట్టు, ‘మూడో’ముచ్చట తీర్చుకునేందుకు ట్రంప్‌కు అవకాశముందని అభిమానులు చెబుతున్నారు. అందుకే అంత బాహాటంగా ఆ ప్రకటన చేశారంటున్నారు. అదెంతవరకు సాధ్యమన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అంతేగాక ట్రంప్ యోచనకు అనుకూలంగా, వ్యతిరేకంగా కూడా పలు వాదనలు తెరపైకి వస్తున్నాయి. అవేమిటంటే...రాజ్యాంగాన్ని సవరించాలి అమెరికా రాజ్యాంగానికి చేసిన 22వ సవరణ ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టడానికి వీల్లేదు. అంతేకాదు. ఏ కారణాలతోనైనా రెండేళ్లు, అంతకంటే ఎక్కువకాలం అధ్యక్షునిగా చేసినా సరే, ఈ సవరణ ప్రకారం వారు మరొక్కసారి మాత్రమే తిరిగి ఎన్నిక కావచ్చు. ఈ లెక్కన ట్రంప్ కోరిక నెరవేరాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. కానీ అది అత్యంత కష్టసాధ్యం. ఎందుకంటే ఆ సవరణను కాంగ్రెస్ ఉభయ సభలూ మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించాలి. ఆ మీదట మూడొంతుల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదముద్ర వేయాలి. కానీ అధికార రిపబ్లికన్లకు కాంగ్రెస్‌లో అంతæ మెజారిటీ లేదు. పైగా 50 రాష్ట్రాల్లో 18 విపక్ష డెమొక్రాట్ల చేతుల్లోనే ఉన్నాయి.‘ఉపాధ్యక్ష’దారిలో... అధ్యక్ష పదవికి రెండుకంటే ఎక్కువసార్లు ‘ఎన్నిక’కావడాన్ని మాత్రమే 22వ సవరణ నిషేధిస్తోంది. వారసత్వంగా ఆ పదవిని పొందే విషయంపై మాత్రం అందులో ఎలాంటి ప్రస్తావనా లేదు. దీన్ని ట్రంప్ తనకు అనుకూలంగా వాడుకోనున్నట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు! ‘‘ఏ కారణంతోనైనా అధ్యక్షుడు రాజీనామా చేస్తే నిబంధనల ప్రకారం ఆ పదవి ఉపాధ్యక్షునికే దక్కుతుంది. కనుక 2028లో ట్రంప్ ఉపాధ్యక్ష బరిలో దిగుతారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారు. గెలిస్తే వెంటనే రాజీనామా చేస్తారు. తద్వారా ట్రంప్ ఆటోమేటిగ్గా మూడోసారి అధ్యక్షుడైపోతారు’’అంటున్నారు. ఈ ఆలోచన తన మనసులో ఉందని ట్రంప్ అంగీకరించారు కూడా. కానీ దీనిపై భిన్న వాదనలున్నాయి. ఇది అసాధ్యమని యూనివర్సిటీ ఆఫ్ నోర్టెడామ్లో ఎన్నికల నిబంధనల నిపుణుడైన ప్రొఫెసర్ డెరెక్ ముల్లర్ చెబుతున్నారు. ‘‘అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అర్హత లేని వ్యక్తి ఉపాధ్యక్ష పదవికి కూడా పోటీ పడేందుకు కూడా అనర్హుడేనని 12వ రాజ్యాంగ సవరణ స్పష్టం చేస్తోంది. 2028లో అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడు గనుక ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కూడా అనర్హుడే అవుతారు’’అని ఆయన స్పష్టం చేశారు. ఇవన్నీ కాకుండా ఒకవ్యక్తి మూడుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అనుమతిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలని రిపబ్లికన్ నేత ఆండీ ఓగ్లెస్ గత జనవరిలో ప్రతిపాదించారు. అంతగా అయితే ఆ మూడుసార్లు వరుసగా కాకుంటే చాలంటూ ఓ నిబంధన విధిస్తే సరిపోతుందని సూచించారు.9 మంది గెలవకుండానే అధ్యక్ష పీఠమెక్కారుఅమెరికా చరిత్రలో ఏకంగా 9 మంది ఉపాధ్యక్షులు ఎన్నికల పోరులో గెలవకుండానే అత్యున్నత పీఠమెక్కారు. అధ్యక్షుని మరణం, లేదా రాజీనామా వల్ల తాము అధ్యక్షులయ్యారు. వయసు అనుమతించేనా? మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు వయసు కూడా ట్రంప్‌కు అడ్డంకిగానే మారేలా కన్పి స్తోంది. ఆయనకిప్పటికే 78 ఏళ్లు. ఆ లెక్కన ఈ పదవీ కాలం ముగిసేసరికి 82 ఏళ్లకు చేరుకుంటారు. ఆ వయసులో తిరిగి ఎన్నికల బరిలో దిగాల్సి ఉంటుంది. అదెంత వరకు సాధ్యమన్నది కాలం గడిస్తే గానీ తేలదు.వద్దే వద్దు: డెమొక్రాట్లు ట్రంప్ మూడో టర్ము వ్యాఖ్యలను విపక్ష డెమొక్రాటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ‘‘ఇటువంటి ఆలోచనలతో ప్రజాస్వామ్యానికి ఆయన మరింతగా తూట్లు పొడుస్తున్నారు. రెండోసారి అధ్యక్షుడైతేనే ప్రపంచమంతటినీ ఇంతటి గందరగోళంలోకి నెట్టేస్తున్న ఆయన మూడోసారి గద్దెనెక్కేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ ప్రతినిధులకు రాజ్యాంగంపై ఏమాత్రం విశ్వాసమున్నా ట్రంప్ మతిలేని మూడో టర్ము ఆకాంక్షలను తక్షణం బాహాటంగా ఖండించాలి’’అని డిమాండ్ చేసింది. రిపబ్లికన్లలో కూడా కొందరు మూడో టర్ము సరైన యోచన కాదంటున్నారు. ఈ ఆలోచనకు తానసలే మద్దతివ్వబోనని ఓక్లహామీ సెనేటర్ మార్కవైన్ ములిన్ ఇటీవలే చెప్పారు.రూజ్వెల్ట్ నాలుగుసార్లు! రెండు కంటే ఎక్కువసార్లు అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన ఏకైక నేతగా ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ నిలిచిపోయారు. 32వ అధ్యక్షునిగా 1933లో తొలిసారి గద్దెనెక్కిన ఆయన 1945లో మరణించేదాకా పదవిలోనే కొనసాగారు! అత్యధిక కాలం పాటు అధ్యక్షునిగా కొనసాగిన రికార్డు కూడా ఆయనదే. అధ్యక్ష పదవిని రెండుసార్లకు మించి చేపట్టరాదన్న సంప్రదాయాన్ని అమెరికా మొదటినుంచీ పాటిస్తోంది. దీనికి బాటలు వేసింది తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టనే. ఆయన వరుసగా రెండుసార్లు గెలిచారు. మూడోసారీ అధ్యక్షుడు కావాలని దేశమంతా కోరినా సున్నితంగా నిరాకరించి తప్పుకున్నారు. అప్పటినుంచి అందరు అధ్యక్షులూ అనుసరిస్తూ వస్తున్న ఆ సంప్రదాయాన్ని రూజ్వెల్ట్ మాత్రం అతిక్రమించారు. రెండో ప్రపంచ యుద్ధాన్ని, హిట్లర్ సారథ్యంలో నాజీల దూకుడును బూచిగా చూపిస్తూ 1940, 1944 అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా మరో రెండుసార్లు పోటీ చేసి గెలిచారు. అయితే 1944లో నాలుగోసారి బరిలో దిగేనాటికే రూజ్వెల్ట్ ఆరోగ్యం క్షీణించింది. 1945లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే మరణించారు. అనంతరం రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టకుండా 1951లో 22వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచి్చంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
5 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగింది
అపారమైన మంచు నిల్వలకు గ్రీన్లాండ్ ఆలవాలం. ప్రపంచంలోని మొత్తం మంచినీటిలో 8 శాతం అక్కడే ఉందని అంచనా. అలాంటి గ్రీన్లాండ్లో మంచు శరవేగంగా కరిగిపోతోంది. ఎంతగా అంటే ఏటా సగటున 5,500 కోట్ల టన్నుల మేరకు! 1992లో మొదలైన ఈ ధోరణి ఏటా అంతకంతకూ పెరుగుతూనే వస్తోందట. ఆ లెక్కన గత 28 ఏళ్లలో అక్కడ ఏకంగా 5 లక్షల టన్నుల మంచు మాయమైపోయిందట! గ్రీన్‌లాండ్‌పై గ్లోబల్ వార్మింగ్ ప్రభావంపై చేపట్టిన అధ్యయనంలో సైంటిస్టులు ఈ మేరకు తేల్చారు. ఇది ఒక్క గ్రీన్‌లాండ్‌కే పరిమితం కాదని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) తెలిపింది. ‘‘మొత్తమ్మీద ధ్రువాల వద్ద మంచు కరుగుదల ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇది చాలా ఆందోళనకర పరిణామం’’అని ఆందోళన వెలిబుచి్చంది. అక్కడ మంచు ఈ స్థాయిలో కరిగిపోవడానికి నిర్దిష్ట కారణాలేమిటో తేల్చే పనిలో పడింది. అక్కడినుంచి ఆవిరవుతున్న నీరు ఎటు వెళ్తోందో తెలియడం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు అక్కడి నీటి ఆవిరిని డ్రోన్ల సాయంతో సేకరించి పరిశోధిస్తున్నారు. ఇందుకోసం భూ ఉపరితలం నుంచి 5,000 అడుగుల ఎత్తు దాకా వివిధ స్థాయిల్లో నీటి ఆవిరిని పలు దఫాలుగా సేకరించారు. ‘‘ఆవిరయ్యే నీటిలో ఎంతోకొంత తిరిగి మంచుగా మారి అక్కడే పడుతుంది. కానీ చాలావరకు మాత్రం గ్రీన్లాండ్ జలవ్యవస్థకు శాశ్వతంగా దూరంగా వెళ్లిపోతోంది. ఇదే ఆందోళన కలిగించే విషయం’’అని అధ్యయనానికి సారథ్యం వహించిన కెవిన్ రోజి్మయారెక్ వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈసారి ఎండలు ఎక్కువే!
న్యూఢిల్లీ: ఈసారి ఎండల భగభగ తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎండలు సాధారణానికి మించిన తీవ్రతతో ఉండొచ్చని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. మధ్య, పశ్చిమ, వాయవ్య భారతం మైదాన ప్రాంతాల్లో వడగాడ్పులు ఎక్కువ రోజులు కొనసాగే అవకాశముందని కూడా అంచనా వేసింది. తూర్పు, పశ్చిమ భారతం మినహా దేశంలోని మిగతా అన్ని ప్రాంతాల్లోనూ ఈసారి సాధారణ గరిష్ట స్థాయికి మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. తూర్పు, పశ్చిమ భారత్‌లో సాధారణ ఉష్ణోగ్రతలే కొనసాగుతాయంది. అత్యధిక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగతలు సైతం సాధారణ స్థాయికి మించి ఉండే అవకాశముందని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర సోమవారం వర్చువల్ మీడియా సమావేశంలో వివరించారు. ‘ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉత్తర, తూర్పు, మధ్య భారతదేశం, వాయవ్య భారతంలోని మైదాన ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు నుంచి నాలుగు రోజులు అధికంగానే వడగాడ్పులు వీచే అవకాశముంది. మామూలుగా, ఈ కాలంలో నాలుగు నుంచి ఏడు రోజులు మాత్రమే వడగాడ్పులు వీస్తుంటాయి’అని ఆయన తెలిపారు. వడగాడ్పుల తీవ్రత తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో రాజస్తాన్, గుజరాత్, హరియాణా, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు కర్ణాటక తమిళనాడుల్లోని ఉత్తర ప్రాంతాల్లో ఎక్కువగానే ఉంటుందని ఐఎండీ పేర్కొంది. -
గడ్డిభూముల్లో హాయ్.. హాయ్
సఫారీ.. ఈ మాట వింటే ఠక్కున గుర్తొచ్చేది దక్షిణాఫ్రికా. సవన్నాలుగా పిలిచే విశాలమైన పచ్చిక భూముల ప్రాంతం క్రూర మృగాలు, వన్యప్రాణుల ఆవాసం. కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాంతంలో విహరిస్తుంటే ఆ ఆనందమే వేరు. అందుకే ఆ దేశం పర్యాటకానికి ప్రాధాన్యమిస్తోంది. తద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలను సృష్టిస్తోంది. ఈ విషయంలో భారత్ సైతం ఇప్పుడిప్పుడే చొరవ కనబరుస్తోంది. గడ్డిభూములున్న ప్రాంతాలను గుర్తించి పర్యావరణ, పర్యాటకాన్ని ద్విగుణీ కృతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇంతకీ ఆ గడ్డిభూములు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? అక్కడి విశేషాలేంటి?మహారాష్ట్ర మొదటగా..పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పుణే(మహారాష్ట్ర) లోని అటవీ శాఖ షోలాపూర్‌లో గ్రాస్ ల్యాండ్ సఫారీ (గడ్డి భూముల్లో విహారయాత్ర)కి శ్రీకారం చుట్టింది. ఇక్కడి బోరామణి గ్రామ గడ్డి భూముల్లో తాజాగా ఈ ప్రక్రియను చేపట్టింది. ఈ భూములు కృష్ణ జింకలు, తోడేళ్ళు, బెంగాల్ నక్కలు, అడవి పందులు, రంగురంగుల సీతాకోకచిలుక జాతులకు ఆవాసాలు. ముఖ్యంగా అంతరించిపోతున్న అరుదైన బట్టమేక పక్షి (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్) ఉనికి ఇక్కడ కనిపిస్తుంది. వాటి సహజ ఆవాసాలను వాహనాల్లో సంచరిస్తూ వీక్షించే అవకాశాన్ని అటవీశాఖ కల్పిస్తోంది.రోజుకు రెండు సార్లు మాత్రమే..ఈ గ్రాస్‌ల్యాండ్ సఫారీ రెండు విడతల్లో ఉంటుంది. ఉదయం 6:30 నుంచి 10:30 వరకు, మధ్యాహ్నం 3:30 నుంచి 6:30 గంటల మధ్యలో విహరించేందుకు అనుమతిస్తున్నారు. వన్య ప్రాణులు, పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగించకుండా పరిమిత సంఖ్యలో వాహనాల్లో సంచరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సందర్శకులకు మెరుగైన అనుభవాన్ని పంచడానికి అటవీ శాఖ రాత్రి పూట బసలను అందుబాటులో ఉంచింది. ఈ గడ్డిభూముల్లో సందర్శకులు సొంత వాహనాల్లో, అద్దెవాహనాల్లో విహరిస్తూ ఆస్వాదించే సౌకర్యం కల్పించింది.కర్బన శోషకాలు.. గడ్డిభూములు కర్బన ఉద్గారాలతో పాటు ఉదజని (కార్బన్ డయాక్సైడ్)ని శోషించి వాతావరణాన్ని నియంత్రించడంలో గడ్డిభూములది కీలక పాత్ర. కృష్ణ జింకలు, జింకల్లాంటి శాకాహారులు, తోడేళ్లు, నక్కల్లాంటి మాంసాహారులు పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిలో ఎనలేని పాత్ర పోషిస్తాయి. గడ్డిభూముల సంరక్షణ విషయానికి వస్తే..అడవులతో పోల్చి చూస్తే తక్కువే అని చెప్పొచ్చు. పర్యావరణ స్థిరత్వాన్ని కాపాడటంలో ఇవి ఎంతో ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రాఫర్లు, పరిశోధకులకు స్వేచ్ఛగా గడ్డిభూముల్లో విహరించే వీలు కల్పించడం ద్వారా వీటి సంరక్షణపై అవగాహన తీసుకురావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. 2024 జనవరిలో ప్రారంభంగడ్డిభూముల్లో సఫారీకి 2024 జనవరిలో పుణే, షోలాపూర్ ప్రాంతాల్లో తొలిసారిగా శ్రీకారం చుట్టారు. ఇక్కడ అటవీ రేంజ్ లోని గడిఖేల్, శిర్షుపాల్, సబ్లెవాడీ, పర్వాడీ పరిధిలో విశాలమైన పచ్చిక బయళ్లలో సఫారీ ప్రారంభించారు. ఇది విజయవంతం కావడంతో గడ్డిభూములున్న ప్రాంతాల్లో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతున్నారు. దీంతో స్థానికులకు ప్రత్యక్ష,ంగా, పరోక్షంగా ఉపాధి దొరికింది. శిక్షణ పొందిన స్థానిక గైడ్లకు రూ. వేలల్లో ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. -
పొమ్మనకుండా పొగ.. సీనియర్లకు లోకేశ్ సెగ
టీడీపీలో సీనియర్ నేతలు ఒక్కొక్కరికీ వరుసగా తలుపులు మూసుకుపోతున్నాయి. మంత్రి లోకేశ్ అభీష్టం మేరకు.. తనకు బాగా సన్నిహితులైనవారిని కూడా సీఎం చంద్రబాబు దూరం పెట్టేస్తున్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం సీనియర్లకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్‌గజపతిరాజు, కంభంపాటి రామ్మోహనరావు వంటి వారిని ఇప్పటికే దాదాపు రిటైర్ చేశారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, మాగంటి బాబు వంటి పలువురు నేతలకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలుగా ఉన్నా కొందరి పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది. గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ప్రస్తుతం మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడుకు పారీ్టలో ఎటువంటి ప్రాధాన్యం లేకుండా ఉన్నారు. – సాక్షి, ప్రత్యేక ప్రతినిధిమిగిలిన సీనియర్లకూ అదే గతి..చంద్రబాబు సమకాలీకుడైన అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారనే సాకుతో ఆయనకు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. కేంద్ర మంత్రిగా, రాష్ట్రంలో పలుసార్లు మంత్రిగా పనిచేసిన అశోక్ అనుభవం, రాజకీయ నైపుణ్యాలను పట్టించుకోలేదు. దీంతో ఆయన ఇప్పుడు పారీ్టకి దూరంగా ఉంటున్నారు. అదితి కుమార్తె ఎమ్మెల్యేగా విజయనగరానికి పరిమితమయ్యారు.⇒ కంభంపాటి రామ్మోహనరావు ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడు. ఢిల్లీలో చంద్రబాబు తరఫున అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఇప్పుడు అవసరం లేకపోవడంతో కంభంపాటి ప్రాధాన్యత తగ్గిపోయింది. మరోసారి రాజ్యసభ సీటు ఇవ్వాలని ఆయన ప్రయత్నించినా పరిగణనలోకి తీసుకోలేదు.⇒ గోరంట్ల బుచ్చయ్యచౌదరి చిరకాల స్వప్నం మంత్రికావడం. కానీ, క్యాబినెట్లోకి తీసుకోలేదు. సొంత నియోజకవర్గంలో ఆయన చెప్పినవారికి పోస్టింగ్‌లూ ఇవ్వడం లేదు. ⇒ మాజీ హోం మంత్రి చినరాజప్పదీ ఇదే పరిస్థితి. ఉమ్మడి పశ్చిమలో ఒకప్పుడు చక్రం తిప్పిన మాగంటి బాబుకు అసలు సీటే ఇవ్వలేదు. ఇలా టీడీపీలో చాలామంది సీనియర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ⇒ పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న సీనియర్లకు లోకేశ్ జమానాలో తమకు అవకాశాలు వస్తాయా? అనే అనుమానాలు బలంగా మెదులుతున్నాయి. గత ఏడాది ఎన్నికల్లో బలమైన హామీలు పొందిన పిఠాపురం వర్మ వంటివారికీ నిరాశా నిస్పృహలు తప్పడం లేదు.యనమల.. సాగనంపారిలా..టీడీపీలో అత్యంత సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. స్పీకర్, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అయితే, ఆయన కుమార్తె, తుని ఎమ్మెల్యే యనమల దివ్య అవినీతి వ్యవహారాలపై లీకులిచి్చ.. తద్వారా యనమల రాజకీయ భవిష్యతుకు చంద్రబాబు తెరదించారనే తీవ్ర చర్చ పార్టీ ముఖ్యుల్లో జరుగుతోంది. 2 నెలల కిందట రాజ్యసభకు వెళ్లే చాన్స్‌ను, 2 వారాల కిందట ఎమ్మెల్సీగా కొనసాగించడానికి వచి్చన అవకాశాన్ని నిరాకరించి రామకృష్ణుడికి దారులను శాశ్వతంగా మూసేయడంలో చంద్రబాబు కృతకృత్యులయ్యారనేది పరిశీలకుల విశ్లేషణ.తన కూతురు దివ్య, అల్లుడు వెంకట గోపీనాథ్ అవినీతిని సాకుగా చూపి.. తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ వ్యూహాత్మకంగా పావులు కదిపారని యనమల తన అంతరంగీకుల వద్ద వాపోతున్నారని సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుకు ముందు దివ్య, గోపీనాథ్ అవినీతిపై ఎల్రక్టానిక్, సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో దుమారం రేగింది. దివ్య తొలిసారి ఎమ్మెల్యే అయినా అవినీతి, అక్రమాలలో స్మార్ట్‌గా దూసుకుపోతూ తన పేరు బయటకు పొక్కకుండా అనుభవజు్ఞరాలిగా సెట్ చేసుకుంటున్నారంటూ పరోక్షంగా రామకృష్ణుడిని తాకేలా తూర్పారపట్టారు. స్వపక్షీయులకు చెందిన మద్యం షాపులు, బెల్టు షాపులు, అనుమతుల్లేని బార్లు, పేకాట క్లబ్బుల నిర్వాహకుల ద్వారా నెలకు రూ.కోటి, మట్టి, గ్రావెల్ దందా ద్వారా రూ.రెండు కోట్లు వెనకేసుకుంటున్నారని, తుని సమీపంలో విమానాశ్రయం ప్రతిపాదనలో భాగంగా 700 ఎకరాలలో సుమారు 300 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్‌కు గాను ఇప్పటికే రూ.12 కోట్లు వెనకేసుకున్నారనేది పబ్లిక్ టాక్. రామకృష్ణుడు, దివ్య ఎక్కడా సీన్లో కనిపించకుండా వారి దగ్గరి బంధువు యనమల రాజేష్ ద్వారా అన్నీ నడిపిస్తున్నారని టాక్ నడుస్తోంది. హైదరాబాద్‌లో ఐఆర్ఎస్ అధికారైన దివ్య భర్త వెంకట గోపీనాథ్ ప్రతి శని, ఆదివారాలు తునిలో ఉంటూ అవినీతికి మార్గ నిర్దేశం చేస్తున్నారని చెబుతున్నారు. 2014–19 మధ్య డిప్యుటేషన్‌పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో పని చేసినప్పుడు నిధులు దారిమళ్లించడంతో పాటు అవినీతికి పాల్పడ్డారని అంటున్నారు. యనమలను పక్కన పెట్టేయడంలో బాబు, లోకేశ్ తప్పులేదని సమర్థించుకునేందుకు ఇప్పటికీ టీడీపీ అనుకూలురు, వారి సోషల్ మీడియాలో పై అంశాలతో కూడిన వీడియోలు హల్చల్ చేయిస్తుండటం గమనార్హం. యనమల కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా, మరో కుమార్తె భర్త పుట్టా మహే‹Ùయాదవ్ ఏలూరు ఎంపీగా, వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారని గుర్తుచేస్తూ.. పార్టీ ఏమైనా యనమల కుటుంబ ప్యాకేజీనా అనే కామెంట్లను టీడీపీ వారిచేతే గుప్పిస్తున్నారు. ఇక పార్టీ ఉన్నత స్థాయి ప్రణాళికల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయనే అనుమానాలు యనమల వర్గీయుల్లో బలంగా ఉన్నాయి. -
ట్రంప్ టారిఫ్‌ల టెన్షన్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార టారిఫ్‌ల అమలుకు డెడ్‌లైన్ అయిన ఏప్రిల్ 2 దగ్గరపడటంతో ఎగుమతి సంస్థల్లో గుబులు, గందరగోళం నెలకొంది. ఏయే రంగాలపై ఎంతెంత వేస్తారు, ఏయే రంగాలను వదిలేస్తారు అనే అంశాలపై అందరిలోనూ అయోమయం నెలకొంది. వాణిజ్య ఒప్పందాలపై సంప్రదింపులు జరిపే దేశాల జాబితాలో భారత్‌ని కూడా అమెరికా చేర్చడంతో ... టారిఫ్‌లపై బేరసారాలు చేసేందుకు అవకాశం దొరకవచ్చని, కొన్నాళ్లయినా సుంకాలు వాయిదా పడొచ్చేమోనని ఆశాభావం నెలకొంది. ఈ నేపథ్యంలో టారిఫ్‌లు, ఏయే రంగాలపై ప్రభావం పడొచ్చనే అంశాలను ఒకసారి చూస్తే.. – న్యూఢిల్లీఅమెరికా ప్రణాళిక ఏంటంటే..వివిధ దేశాలతో తమకున్న వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు వాటి నుంచి తమకు వచ్చే దిగుమతులపై అమెరికా సుంకాలను విధించడం / పెంచడం వంటి చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన ప్రతిపాదన ఇది. అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై ఇతర దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్నాయని, అవరోధాలు ఏర్పరుస్తున్నాయనేది ట్రంప్ ఆరోపణ. దీని వల్ల 1 లక్ష కోట్ల డాలర్ల మేర వాణిజ్య లోటు ఉంటోందని, దీనితో అమెరికన్ పరిశ్రమలు, వర్కర్లపైనా ప్రతికూల ప్రభావం పడుతోందనేది ఆయన వాదన.2021–22 నుంచి 2023–24 మధ్య కాలంలో భారత్‌కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశంగా ఉంది. భారత్ ఎగుమతుల్లో 18 శాతం, దిగుమతుల్లో 6.22 శాతం, అన్ని దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్యంలో 10.73 శాతం వాటా అమెరికాది ఉంది. 2023–24లో భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 119.71 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందులో భారత్ నుంచి 77.51 బిలియన్ డాలర్ల ఎగుమతులు, అమెరికా నుంచి 42.19 బిలియన్ డాలర్ల దిగుమతులు ఉన్నాయి. దీంతో వాణిజ్య మిగులు భారత్ పక్షాన సుమారు 35.31 బిలియన్ డాలర్లుగా నమోదైంది.భారత ఎగుమతులపై ప్రతీకార టారిఫ్‌లు ఏ స్థాయిలో ఉండొచ్చంటే..ప్రస్తుతానికి టారిఫ్‌లను ఏ విధంగా విధిస్తారనేది, అంటే ప్రోడక్టు స్థాయిలోనా, లేదా రంగాలవారీగానా, లేదా దేశ స్థాయిలోనా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..అమెరికా నుంచి దిగుమతులపై భారత్ విధించే సుంకాలు, నిజానికి ఆరోపిస్తున్న దానికంటే చాలా తక్కువ స్థాయిలోనే ఉంటున్నాయని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. అమెరికా గానీ సహేతుక వాణిజ్య విధానాన్ని అవలంబిస్తే, పెద్దగా అవాంతరాలు లేకుండా భారత పరిశ్రమలు ఎగుమతులను కొనసాగించవచ్చని, ఇరు దేశాల మధ్య మరింత సమతూకమైన, స్థిరమైన విధంగా వాణిజ్య బంధం బలోపేతం కావచ్చని పేర్కొన్నారు. నాలుగు స్థాయిల్లో టారిఫ్‌ల ప్రభావాలను జీటీఆర్ఐ అంచనా వేసింది.దేశ స్థాయిలో: భారత్ నుంచి అన్ని ఎగుమతులపై ఒకే రకంగా టారిఫ్‌లు విధించడం: ఒకవేళ ఈ విధానాన్ని అమలు చేస్తే మన ఎగుమతులపై అదనంగా 4.9 శాతం భారం పడుతుంది. ప్రస్తుతం అమెరికా ఉత్పత్తులపై మన దగ్గర టారిఫ్‌లు సగటున 7.7 శాతంగా ఉండగా, మన ఎగుమతులపై అక్కడ సగటున 2.8 శాతంగా ఉంటోంది. ఆ విధంగా రెండింటి మధ్య 4.9 శాతం వ్యత్యాసం ఉంది.వ్యవసాయం, పరిశ్రమల స్థాయిలో: ఈ విధానాన్ని అమలు చేస్తే వ్యవసాయోత్పత్తులపై అదనంగా 32.4 శాతం, పారిశ్రామికోత్పత్తులపై 3.3 శాతం భారం పడొచ్చు. ప్రస్తుతం అమెరికాకు భారత వ్యవసాయోత్పత్తులపై 5.3 శాతం సుంకాలు ఉండగా, అక్కడి నుంచి దిగుమతులపై అత్యధికంగా 37.7 శాతంగా (వ్యత్యాసం 32.4 శాతం) ఉంటోంది. మరోవైపు పారిశ్రామికోత్పత్తుల విషయానికొస్తే.. అమెరికా నుంచి దిగుమతులపై సగటున 5.9 శాతం, మన ఎగుమతులపై కేవలం 2.6 శాతం (వ్యత్యాసం 3.3 శాతం) ఉంటోంది.రంగాల స్థాయిలో: వివిధ రంగాల్లో ఇరు దేశాల ఉత్పత్తులపై టారిఫ్‌ల మధ్య వ్యత్యాసాలు వివిధ రకాలుగా ఉన్నాయి. రసాయనాలు..ఫార్మాలో 8.6 శాతం, ప్లాస్టిక్స్‌లో 5.6 శాతం, టెక్స్‌టైల్స్‌పై 1.4 శాతం, వజ్రాలు.. బంగారం మొదలైన వాటిపై 13.3 శాతం, ఇనుము..ఉక్కుపై 2.5 శాతం, మెషినరీ .. కంప్యూటర్స్‌పై 5.3 శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 7.2 శాతం, ఆటోమొబైల్స్ .. ఆటో విడిభాగాలపై 23.1 శాతం వ్యత్యాసం ఉంటోంది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే, సదరు రంగంపై ప్రభావం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. భారత్ ఎగుమతులు 30 కేటగిరీలుగా ఉంటున్నాయి. ఇందులో వ్యవసాయంలో ఆరు, పరిశ్రమల్లో 24 ఉన్నాయి.వ్యవసాయం⇒ అత్యధికంగా చేపలు, మాంసం, ప్రాసెస్డ్ సీఫుడ్‌పై ప్రభావం ఉంటుంది. దాదాపు 2.58 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులపై టారిఫ్‌ల వ్యత్యాసం 27.83 శాతం ఉంటోంది. ⇒1.03 బిలియన్ డాలర్లుగా ఉంటున్న ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర, కోకో ఎగుమతులపై ఏకంగా 24.99 శాతం మేర టారిఫ్‌లు పెరగొచ్చు. దీంతో అమెరికాలో భారతీయ స్నాక్స్ ఖరీదు మరింత పెరగొచ్చు. ⇒ చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలపై వ్యత్యాసం (1.91 బిలియన్ డాలర్ల విలువ) 5.72 శాతంగా ఉంటోంది. బియ్యం మొదలైన ఎగుమతులపై ప్రభావం పడొచ్చు.⇒ 181.49 మిలియన్ డాలర్ల విలువ చేసే డెయిరీ ఉత్పత్తులపై ఏకంగా 38.23 శాతం టారిఫ్ వ్యత్యాసం ఉంటోంది. దీంతో నెయ్యి, వెన్న, పాల పొడిలాంటివి రేట్లు పెరిగి, మన మార్కెట్ వాటా పడిపోవచ్చు.⇒ 199.75 మిలియన్ డాలర్ల విలువ చేసే వంటనూనెల ఎగుమతులపై 10.67 శాతం మేర టారిఫ్ పెరగవచ్చు.⇒ సుమారు 19.20 మిలియన్ డాలర్ల ఎగుమతులే అయినప్పటికీ ఆల్కహాల్, వైన్లపై అత్యధికంగా 122.10 శాతం సుంకాలు విధించవచ్చు.పారిశ్రామిక ఉత్పత్తులు⇒ 12.72 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటున్న ఫార్మా ఉత్పత్తులకు సంబంధించి టారిఫ్ వ్యత్యాసం 10.90 శాతం మేర ఉంటోంది. ఇది విధిస్తే, జనరిక్ ఔషధాలు, స్పెషాలిటీ డ్రగ్స్ రేట్లు పెరిగిపోతాయి.⇒ 14.39 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎలక్ట్రికల్, టెలికం, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులపై 7.24 శాతం టారిఫ్‌లు పడొచ్చు.⇒ మెషినరీ, బాయిలర్, టర్బైన్, కంప్యూటర్ ఎగుమతుల విలువ 7.10 బిలియన్ డాల ర్లుగా ఉంటోంది. వీటిపై 5.29 శాతం టారిఫ్‌ల పెంపు అవకాశాలతో భారత్ నుంచి ఇంజనీరింగ్ ఎగుమతులపై ప్రభావం ఉండొచ్చు.⇒ 5.71 బిలియన్ డాలర్ల విలువ చేసే రసాయనాల ఎగుమతులపై (ఫార్మాను మినహాయించి) 6.05 శాతం, 1.71 బిలియన్ డాలర్ల సెరామిక్, గ్లాస్, స్టోన్ ఉత్పత్తులపై 8.27 శాతం, 457.66 మిలియన్ డాలర్ల ఫుట్‌వేర్‌పై 15.56 శాతం ఉండొచ్చు. టెక్స్టైల్స్, ఫ్యాబ్రిక్స్, కార్పెట్లు మొదలైన వాటి ఎగుమతులు 2.76 బిలియన్ డాలర్లుగా ఉండగా వీటిపై సుమారు 6.59 శాతం; 1.06 బిలియన్ డాలర్లుగా ఉన్న రబ్బర్ ఉత్పత్తులపై (టైర్లు, బెల్టులు సహా) 7.76 శాతం; పేపర్ .. కలప ఉత్పత్తులపై (969.65 మిలియన్ డాలర్లు) 7.87 శాతం మేర టారిఫ్‌ల ప్రభావం ఉండొచ్చు.పెద్దగా ప్రభావం / అసలు ప్రభావమే ⇒ ఉండని రంగాలు3.33 బిలియన్ డాలర్ల విలువ చేసే ముడి ఖనిజాలు, పెట్రోలియం ఎగుమతులపై టారిఫ్‌లు మైనస్ స్థాయిలో (మైనస్ 4.36) ఉంటున్నాయి కాబట్టి, కొత్తగా విధించడానికేమీ ఉండకపోవచ్చు.⇒ అలాగే, 4.93 బిలియన్ డాలర్ల గార్మెంట్స్ ఎగుమతులపై, వ్యత్యాసం మైనస్ 4.62 శాతంగా ఉంది కాబట్టి టారిఫ్‌ల భారం ఉండకపోవచ్చు. -
వధువే వరుడై... వరుడే వధువై...
హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు మెడలో పెళ్లి కొడుకు తాళి కట్టడం సహజం. కానీ ఇక్కడ వధువే వరుడి మెడలో మూడు ముళ్లేస్తుంది. వధూవరులది ఒకే ఊరు. ఇరువురి మెడలో కరెన్సీ నోట్ల దండలు.. పెళ్లిపీటలపై కళ్లద్దాలు ధరిస్తూ దర్శనం. పెళ్లీడుకొచ్చిన అమ్మాయి, అబ్బాయిల మాటకు గౌరవమిచ్చే పెద్దలు. ఒకే ముహూర్తాన వందల సంఖ్యలో సామూహిక వివాహాలు.. దశాబ్దాలుగా ఎన్నికలెరుగని ఆ గ్రామం ఇంతకీ ఎక్కడుందంటే..? శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామం. సుమారు 12వేల జనాభా ఈ ఊరి సొంతం. స్వాతంత్య్రానికి పూర్వం నావల రేవుగా పిలిచేవారు. కాలక్రమేణా నువ్వలరేవుగా మారింది. రెవిన్యూ రికార్డుల్లో మాత్రం లక్ష్మీదేవిపేటగా కనిపించే ఆ గ్రామంలో అందరూ మత్స్యకారులే... చేపలవేట వీరి ప్రధాన జీవనాధారం. పెద్దవాళ్లు సముద్రంలో వేట సాగిస్తారు.చాటింపు వేసి.. వివరాలు సేకరించిఅంతగా ఉన్నత చదువులు లేకపోవడంతో ఈ ఊరి యువత ఉపాధి నిమిత్తం హైదరాబాద్, ముంబై, అండమాన్ ప్రాంతాలకు వలస వెళతారు. వీళ్లలో పెళ్లీడుకొచ్చిన యువకులను రెండేళ్లకోసారి గుర్తించి వారి జాబితాను సిద్ధం చేస్తారు. ఆ ఏడాదికి పెళ్లికి సిద్ధమయ్యేవారు ఎవరున్నారన్న సమాచారాన్ని ముందుగా చాటింపు వేయించి వారి వివరాలను సేకరిస్తారు. అలా ఎంపికైన వారందరికీ ఒకే ముహూర్తాన సామూహిక వివాహాలను జరిపిస్తారు.వధూవరులది ఒకే ఊరు గతంలో మూడేళ్లకోసారి ఈ పెళ్లిళ్లు చేసేవారు. కానీ ఇప్పుడు యువత సంఖ్య పెరగడంతో రెండేళ్లకోసారి ఈ తంతు జరిపిస్తున్నారు. వరుడికి కావాల్సిన వధువు కోసం ఎక్కడో అన్వేషించరు. ఉన్న ఊరిలోనే వరసకు వచ్చిన అమ్మాయితో నిశ్చయిస్తారు. సామూహిక వివాహ ప్రక్రియలో కులపెద్దలదే కీలక భూమిక. పెళ్లిళ్లన్నీ వారి పర్యవేక్షణలోనే జరుగుతాయి. ముహూర్తాలు నిశ్చయించిన వేళ పెళ్లీడుకొచ్చిన యువతీ యువకులను మరోసారి పెద్దలు పిలుస్తారు. వారి మనసులో ఎవరైనా ఉన్నారా... అని అడిగి తెలుసుకుంటారు. అలా ఇష్టపడినవారికి ఇచ్చి పెళ్లిచేయడంతో ఆ జంటల్లో ఆనందం రెట్టింపవుతుంది. నువ్వలరేవులో బైనపల్లి, బెహరా, మువ్వల అనే ఇంటి పేర్లున్న కుటుంబాలే అధికంగా ఉంటాయి. పెళ్లిళ్లన్నీ ఈ కుటుంబాల మధ్యే జరుగుతాయి.మూడు రోజుల పెళ్లి పండగసామూహిక వివాహ వేడుకను మూడురోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి రోజు పందిరిరాట వేస్తారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంంతో కేరింతలు కొడతారు. రెండోరోజు ప్రధాన ఘట్టం. అదే మాంగల్యధారణ. అయితే ఇక్కడ తాళికట్టేది వరుడు మాత్రమే కాదు. పెళ్లికూతురు సైతం వరుడి మెడలో తాళి కట్టడం విశేషం. మూడోరోజు వధువు పుట్టింటి నుంచి వరుడి ఇంటికి సారె వస్తుంది. ఈ సందర్భంగా పెళ్లి పందిరిలో ఆ సారెను అందరికీ చూపిస్తారు. గ్రామంలోని బంధావతి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాక పెళ్లి వేడుక ముగుస్తుంది. జిల్లాలో సాధారణంగా వరుడి ఇంటివద్ద పెళ్లి జరిపిస్తారు. కానీ నువ్వలరేవులో మాత్రం వధువు ఇల్లే పెళ్లి వేదిక కావడం విశేషం.ఊరంత కుటుంబం వధూవరులిద్దరిదీ ఒకే గ్రామం కావడంతో ఊరంతా ఒకరికొకరికి ఏదో బంధుత్వం ఉండటం ఇక్కడి వారి సొంతం. పెళ్లి విందుకు బంధువులందరినీ ఆహ్వానించరు. ఏ ఇంటి పెళ్లి విందుకు ఎవరు వెళ్లాలన్నది గ్రామ పెద్దలే నిర్ణయిస్తారు. అలా ఆహార పదార్థాలను వృథా చేయకుండా, అనవసర ఖర్చులను నియంత్రిస్తూ జాగ్రత్తపడతారు.వరకట్నానికి దూరం నువ్వలరేవులో వరకట్నం అనే మాట వినిపించదు. పెళ్లికయ్యే ఖర్చును వధూవరులిద్దరి కుటుంబాలు సమానంగా భరిస్తాయి. ఆడపిల్లను పుట్టినింటి నుంచి మెట్టినింటికి పంపడమే మహాభాగ్యంగా మగపెళ్లివారు భావిస్తారు. పెళ్లిపీటలపై ఆసీనులైన వధూవరులిద్దరూ నల్లకళ్లజోడు ధరిస్తారు. ఇద్దరి మెడలో కరెన్సీ నోట్ల దండలు వేస్తారు. ఈ సామూహిక వేడుకను తిలకించేందుకు పరిసరప్రాంతాల ప్రజలు తరలి వస్తారు. దీంతో మూడురోజుల పాటు నువ్వల రేవులో తిరునాళ్ల సందడి కనిపిస్తుంది. నువ్వలరేవులో సామూహిక వివాహాలే కాదు, శ్రీరామనవమి ఉత్సవాలను సైతం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.ముందు వరుడు.. ఆ తర్వాత వధువు పెళ్లిలో ముందుగా వరుడు వధువు మెడలో తాళికడతాడు. అనంతరం వధువు వరుని మెడలో తాళి కడుతుంది. దీన్నే స్థానికులు దురషం అని వ్యవహరిస్తారు. ఈ సాంప్రదాయం నువ్వలరేవు ప్రత్యేకం. ఇలా ఒకరికి ఒకరు తాళికట్టడంతో ఒకరికొకరు ఆజన్మాంతం రక్షగా ఉంటారన్నది ఇక్కడి వారి విశ్వాసం. అలాగే ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువనే భావన తమలో ఉండదని, అమ్మాౖయెనా, అబ్బాౖయెనా సమానంగానే భావిస్తామని గ్రామపెద్దలు చెబుతారు.– గుంట శ్రీనివాసరావు, సాక్షి, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం -
దత్తత పర్వంలో... దారుణ కోణం!
దత్తత మాటున దారుణాలు. కొరియా యుద్ధం తాలూకు విషాదంలో మరో చీకటి అధ్యాయం. దీనికి సంబంధించి తాజాగా బహిర్గతమైన విషయాలు విస్మయం కలిగిస్తున్నాయి. 1950ల్లో యుద్ధం కారణంగా దక్షిణ కొరియా పేదరికంలో కూరుకుపోయింది. జనం తమ సంతానాన్ని పోషించుకోలేని దుస్థితికి దిగజారడంతో వారిని ఆదుకునే సాకుతో ప్రభుత్వం తెచ్చిన పథకం అక్రమాలకు నెలవుగా, అంతులేని విషాదానికి చిరునామాగా మారింది. తొలుత ప్రశంసలు అందుకున్నా విదేశీ దత్తత పథకంలోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ఎన్నో అక్రమాలు జరిగాయని, లక్షలాది మంది చిన్నారులు సొంతవారికి దూరమై విదేశాల్లో కష్టాల పాలయ్యారని దీనిపై విచారణకు నియమించిన కమిషన్ కుండబద్దలు కొట్టింది. ‘‘ఇది పిల్లల భవిష్యత్తులో క్రూర చెలగాటం. దీనికి ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి’’ అని సిఫార్సు చేసింది. దత్తత పేరుతో దూర దేశాలకు తరలిపోయిన తమ చిన్నారుల కన్నీటి గాథలు దక్షిణ కొరియన్లను కంటతడి పెట్టిస్తున్నాయిప్పుడు...! విదేశాల్లో మొదలైన కష్టాలు దత్తత తీసుకున్న తల్లిదండ్రుల చెంత హాయిగా పెరిగిన పిల్లలు కొందరే. అత్యధికులు బానిసలుగా బతికారు. సరైన పోషణ, సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హింస, వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. దత్తత తండ్రుల చేతుల్లో అత్యాచారాలకు బలైన అమ్మాయిలు కోకొల్లలు. దత్తత సమయంలో తప్పుడు ఊళ్లు, పేర్లు, అన్నీ మార్చేసిన కారణంగా అసలు తమ కన్న తల్లిదండ్రులు ఎవరనేదీ పెద్దయ్యాక ఆ పిల్లలకు తెలీకుండా పోయింది. నార్వేలో జీవిస్తున్న 60 ఏళ్ల ఇంగర్ టోన్ ఉయిలాండ్ షిన్ కన్నీటిగాథ ఇలాంటిదే. ‘‘13 ఏళ్ల వయసులో నన్ను దత్తత తీసుకుని నార్వేకు తీసుకొచ్చారు. తిండి, వాతావరణం ఏదీ నాకు సరిపడలేదు. పెంపుడు తండ్రి లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. నాకన్నా పెంపుడు కుక్కనే బాగా చూసుకునేవాళ్లు. చేసిన నేరానికి శిక్ష అనుభవించకుండానే వాళ్లు చనిపోయారు. నేను మాత్రం ఇలా మిగిలిపోయా. చిన్ననాటి జ్ఞాపకాలు, అందమైన బాల్యం, సర్వం కోల్పోయా’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. అమెరికా, ఆ్రస్టేలియాతో పాటు యూరప్‌లోని ఎన్నో దేశాలకు దత్తు వెళ్లిన ఆయిలాండ్ వంటి చిన్నారుల కన్నీటిగాథలు కోకొల్లలని ‘ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్’ పేర్కొంది. మూడేళ్ల దర్యాప్తు తర్వాత బుధవారం సమగ్ర నివేదిక సమర్పించింది. అంతర్జాతీయ దత్తత చట్టాలు, చిన్నారుల పరిరక్షణపై ‘ది హేగ్ ఒడంబడిక’ను దక్షిణ కొరియా ప్రభుత్వం తుంగలో తొక్కిందని కమిషన్ చైర్పర్సన్ పార్క్‌సన్ యంగ్ మండిపడ్డారు.ఎందుకీ దుస్థితి? 1950వ దశకంలో కొరియా ద్వీపకల్పంలో మొదలైన యుద్ధమే ఈ దత్తత దారుణాలకు ప్రధాన కారణం. దేశ భూభాగంలో ఉత్తరభాగం డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (డీపీఆర్కే)గా, దక్షిణభాగం రిపబ్లిక్ ఆఫ్ కొరియాగా రెండు ముక్కలైంది. ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించినాసరే అమెరికాసహా 17 దేశాలు ద.కొరియాకు మద్దతు ప్రకటించాయి. చైనా, రష్యాలు ఉత్తరకొరియాకు అండగా నిలబడ్డాయి. చాన్నాళ్లు కొనసాగిన ఈ యుద్ధంలో ఒక్క దక్షిణకొరియాలోనే దాదాపు 2,00,000 మందికిపైగా మహిళలు తమ భర్తలను కోల్పోయి వితంతువులుగా మిగిలిపోయారు. మరో 1,00,000 మంది చిన్నారులు అనాథలయ్యారు. వితంతులు తమ పిల్లలను పెంచే స్తోమతలేక అనాథాశ్రమాల్లో చేర్పించారు. దీంతో దేశవ్యాప్తంగా అనాథాశ్రయాల్లో చిన్నారుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. యుద్ధంకారణంగా పేదరికం కోరల్లో చిక్కుకుపోయిన ద.కొరియా సర్కార్‌కు వీళ్ల పోషణ పెద్ద భారంగా తయారైంది. యుద్దంలో ద.కొరియాకు సాయంగా దేశంలో తిష్టవేసిన అమెరికా సైనికులు స్థానిక మహిళలతో సంబంధాలు పెట్టుకోవడంతో లక్షలాది మంది చిన్నారులు జని్మంచారు. ఇలాంటి వాళ్లకు సమాజంలో ఆదరణ కరువైంది. ఛీత్కారాలను ఎదుర్కొన్నారు. వితంతువుల పిల్లలు, అమెరికన్ల పిల్లలు, అనాథాశ్రయాల్లోని చిన్నారుల బాగోగులు చూసేందుకు ప్రభుత్వం విదేశీ దత్తత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీళ్లను దత్తత తీసుకునేందుకు పశ్చిమదేశాల్లోని జంటలు తెగ ఆసక్తి చూపించారు. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్‌లోని కొన్ని దేశాల నుంచి దత్తత డిమాండ్లు అధికమయ్యాయి. 1954లో ఈ ధోరణి ఊపందుకుంది. 1948 నుంచి 1960 వరకు సింగ్మాన్ రీ పాలనకాలంలో, తర్వాత పార్క్ చుంగ్ హీ హయాంలో 1961నుంచి 1979 కాలంలో ఈ పోకడ విపరీతంగా పెరిగిపోయింది.వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు దత్తత ప్రక్రియ పూర్తి లోపభూయిష్టమని, తమను అన్యాయంగా, అక్రమంగా విదేశాలకు తరలించారని చాలామంది చిన్నారులు పెద్దయ్యాక ఫిర్యాదులు చేశారు. వాటిపై కమిషన్ దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘దత్తత ప్రక్రియ తప్పులతడకగా సాగింది. పేర్లు మార్చేయడం, తల్లిదండ్రులున్నా అనాథ అని పేర్కొనడం వంటి ఎన్నో అక్రమాలు వెలుగు చూశాయి. విదేశీ జంటలకు అప్పగింతపై నెలవారీ పరిమితి ఉన్నా ఆ కోటాను ప్రభుత్వమే తుంగలో తొక్కింది. అలా ప్రైవేట్ ఏజెన్సీలు దశాబ్దాలుగా లక్షలాది మంది చిన్నారులను విదేశాలకు తరలించాయి. ఉచితంగా జరగాల్సిన దత్తత ప్రక్రియలో అడుగడుగునా భారీగా నగదు చేతులు మారింది’’ అని కమిషన్ పేర్కొంది. ఎట్టకేలకు 2023లో దత్తత ప్రక్రియలో కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చారు. ఇకపై ప్రైవేట్ ఏజెన్సీలకు బదులు విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో దత్తత కార్యక్రమం నడుస్తుందని ప్రకటించింది. కానీ కమిషన్ వెల్లడించిన కఠోర వాస్తవాలపై మాత్రం ప్రభుత్వం పెదవి విప్పలేదు. తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని తేలినా క్షమాపణ చెప్పలేదు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దారి తప్పిన పథకంపశ్చిమ దేశాల జంటలకు అనాథలను దత్తతనిచ్చే కార్యక్రమం మొదట్లో సవ్యంగా సాగినా రానురాను ఇది అక్రమాలకు నెలవుగా తయారైంది. దత్తత ప్రక్రియ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి చేతులు దులుపుకుంది. దీంతో ఈ ఏజెన్సీలు పశ్చిమదేశాల జంటల నుంచి అత్యధిక మొత్తాలను వసూలుచేసి వాళ్లకు నచ్చిన పిల్లలను విదేశాలకు తరలించడం మొదలెట్టాయి. ఇందుకోసం ఏజెన్సీలు ఎన్నో అక్రమ మార్గాలను ఎంచుకున్నాయి. అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు పిల్లల అసలు పేర్లను మార్చేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించేవారు. కుటుంబాలతో ఉంటున్న అందంగా, పుష్టిగా ఉన్న చిన్నారులు కొందరిని కిడ్నాప్ చేసి మరీ విదేశాలకు తరలించారు. కుటుంబాలకు చెందిన పిల్లలను అనాథలుగా ముద్రవేసి విదేశీ జంటలకు అప్పగించారు. ఇలా లక్షలాది మంది చిన్నారులను దేశం దాటించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆదిమ గెలాక్సీ చిక్కింది
అనంత విశ్వంలో మనకు అత్యంత సుదూరంలో ఉన్న ఒక నక్షత్ర మండలాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. దీన్ని అత్యంత ఆదిమ గెలాక్సీల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఎదుకంటే విశ్వావిర్భావానికి మూల కారణమని భావిస్తున్న బిగ్‌బ్యాంగ్ జరిగిన కేవలం 33 కోట్ల ఏళ్లకే అది పురుడు పోసుకుంది! విశ్వం వయసు 1,380 కోట్ల ఏళ్లని అంచనా. ఈ లెక్కన ఈ గెలాక్సీ ఎంత పురాతనమైనదో అర్థం చేసుకోవచ్చు. దీనికి జేడ్స్–జీఎస్–జెడ్13–1గా సైంటిస్టులు నామకరణం చేశారు. భూమి వయసు 450 కోట్ల సంవత్సరాలన్నది తెలిసిందే. అయితే, ‘‘జేడ్ గెలాక్సీ కేవలం 230 కాంతి సంవత్సరాల విస్తీర్ణంలోనే వ్యాపించింది. ఆ లెక్కన మన పాలపుంత కంటే ఇది వందలాది రెట్లు చిన్నదే’’ అని సైంటిస్టులు వివరించారు. కానీ దీని గుర్తింపుకు ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. చీకట్లను చీల్చుకుని...మనకు ఇప్పటిదాకా తెలిసిన అత్యంత పురాతన గెలాక్సీల్లో జేడ్స్ నాలుగోది. కానీ వాటన్నింట్లోకీ ఇది అత్యంత ప్రకాశవంతమైనది మాత్రం ఇదే. తద్వారా అయానీకరణ దశకు జేడ్స్ తొలి రుజువుగా నిలిచిందని ఈ అధ్యయనంలో పాల్గొన్న సైంటిస్టుల బృందం సంబరపడుతోంది. బిగ్బ్యాంగ్తో పురుడు పోసుకున్న విశ్వం క్షణాల వ్యవధిలోనే శరవేగంగా, అనంతంగా విస్తరించడం మొదలు పెట్టిందన్నది సైంటిస్టుల భావన. నవజాత దశను దాటి కాస్త చల్లబడ్డాక చాలాకాలం పాటు వైశ్విక అంధకార యుగం కొనసాగిందని చెబుతారు. ఆ దశలో విశ్వం మొత్తాన్నీ హైడ్రోజన్ వాయువు దట్టంగా కప్పేయడమే ఇందుకు కారణం. ‘‘దాంతో విశ్వమంతా కేవలం హైడ్రోజన్, హీలియం, కృష్ణరాశితో కూడిన ముద్దగా మిగిలిపోయింది. ఆ తర్వాత విశ్వపు తొలి తారలు, కృష్ణబిలాలు, గెలాక్సీలు పురుడుపోసుకున్నాయి. వాటినుంచి నుంచి అతి శక్తిమంతమైన పరారుణ కాంతి ఉద్గారాలు వెలువడ్డాయి. విశ్వాన్ని చిరకాలంగా కప్పి ఉంచిన తటస్థ హైడ్రోజన్ వాయు మండలాన్ని ఛేదించాయి. తొట్టతొలి వెలుగు కిరణాలుగా నిలిచిపోయాయి’’ అని పెన్హెగన్యూనివర్సిటీ కాస్మిక్ డాన్ సెంటర్‌కు చెందిన ఆస్ట్రో ఫిజిసిస్టు జోరిస్ విట్స్కాక్ వెల్లడించారు. తాజా అధ్యయనానికి ఆయనే సారథ్యం వహించారు. ‘‘అలా విశ్వం అయానీకరణ దశలో తొలిసారిగా వెలుగులు విరజిమ్మడం మొదలైంది. అందుకే దీన్ని విశ్వానికి పొద్దుపొడుపుగా చెబుతుంటారు. జేడ్స్ గెలాక్సీ సరిగ్గా ఆ పరివర్తన దశకు చెందినదని తేలింది’’ అని విట్స్కాక్ వివరించారు. ‘‘ఇప్పటిదాకా మనకు చిక్కిన ఇతర సుదూర గెలాక్సీలకు భిన్నంగా జేడ్స్ అత్యంత స్పష్టంగా కని్పస్తుండటం వెనక కారణం కూడా ఇదే. అందులో అత్యంత శక్తిమంతమైన పరారుణ రేడియేషన్ వంటిది ఉందనేందుకు ఇది నిదర్శనం. అయానీకరణం చెందిన హైడ్రోజన్ దాని చుట్టూ భారీగా పరుచుకుని ఉంది’’ అని చెప్పుకొచ్చారు. ఈ అధ్యయన వివరాలను జర్నల్ నేచర్‌లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గెలుపు ఎర వేస్తారు.. తర్వాత ఓడిస్తారు: వీసీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ‘బెట్టింగ్ యాప్స్ ప్రభావం ఎక్కువగా యువత పైనే ఉంటోంది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అనేకమంది వీటికి బలవుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఈ వ్యసనానికి బానిసలుగా మారుతున్నారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్‌లకు భిన్నంగా ఈ బెట్టింగ్ యాప్స్ యువతనే టార్గెట్‌గా చేసుకుని దోచుకుంటున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ఎలాగైనా ఎదుటివాళ్లు ఓడిపోయే విధంగానే డిజైన్ చేసి ఉంటాయి. ఒకటీ రెండుసార్లు డబ్బు వచ్చినా అది కేవలం దోచుకోవడానికి ఎర అనే విషయం తెలుసుకోవాలి..’ అని సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ పేరుతో సజ్జనార్ ప్రారంభించిన అవగాహన కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రాన్నీ కదిలించింది. తెలంగాణ సర్కారు వీటిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. గతంలో మల్టీ లెవల్ మార్కెటింగ్ దందాల పైనా ఇలానే పోరు కొనసాగించిన సజ్జనార్.. వాటికి సంబంధించి ప్రత్యేక చట్టం రావడానికి కారణమయ్యారు. తాజాగా బెట్టింగ్ యాప్స్‌పై యుద్ధం ప్రకటించిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అవగాహన పెంచేందుకే ‘సే నో టు బెట్టింగ్ యాప్స్’ యువత ప్రాణాలు తీసుకోవడం కదిలించింది. బెట్టింగ్ యాప్‌ల బారినపడ కుండా వారిని కాపాడటం కోసం, వారిలో అవగాహన కల్పించడానికి ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ ప్రారంభమైంది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది సెర్చ్ చేశారు. క్యాంపెయినింగ్ మొదలైన తర్వాత ‘ఎక్స్’ను 1.2 కోట్లు మంది, ఇన్‌స్ట్రాగామ్‌ను 85 లక్షలు మంది వీక్షించారు. ప్రస్తుతం అనేక మంది సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లతో పాటు ప్రముఖులు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీళ్లు ఆయా ప్రకటనలు చేసేప్పుడు తదనంతర పరిణామాలను ఊహించలేదు. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సైబర్ టెర్రరిజం కిందికే వస్తుంది. మన పోలీసులు ఆది నుంచీ ముందున్నారు సమాజంలో జరుగుతున్న వివిధ రకాలైన ఆర్థిక దోపిడీలను అడ్డుకోవడంలో మన పోలీసులు ఎప్పుడూ ముందుంటున్నారు. ఒకప్పుడు ఎంఎల్ఎం స్కామ్స్, ఆపై మైక్రో ఫైనాన్స్ దుర్వినియోగాలను పకడ్బందీగా కట్టడి చేశారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వంతు వచ్చింది. అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి కేవలం పాత్రధారులనే కాదు సూత్రధారులకూ చెక్ చెప్పే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చట్టాన్ని కూడా కఠినంగా అమలు చేయాలి. అన్నివర్గాల్లో అవగాహన కల్పించాలి. బెట్టింగ్ యాప్‌లను బ్యాన్ చేయడం, ప్రమోటర్లతో పాటు నిర్వాహకుల పైనా చర్యలు తీసుకోవడం అవసరం. ఈ బెట్టింగ్ ప్రకటనలను అనుమతించిన మీడియా ప్లాట్‌ఫామ్‌లూ బాధ్యత వహించేలా చేయాలి. లావాదేవీలను సులభతరం చేసే చెల్లింపు గేట్‌వేల లైసెన్స్‌లు రద్దు చేయాలి. అడ్డుకట్ట వేయకపోతే ఓ తరాన్ని ఫణంగా పెట్టాల్సిందే.. బెట్టింగ్ నెట్‌వర్క్‌లు విదేశాల నుండి పనిచేస్తుంటాయి. అందువల్ల వీరిని కనిపెట్టి, కట్టడి చేయడం కష్టసాధ్యమైన అంశం. అందువల్ల అంతా ముందుకు వచ్చి అందరిలోనూ అవగాహన కల్పించడం ద్వారా ఈ ఉచ్చు నుంచి యువతను తప్పించాలి. పోలీసులు సైతం ఎప్పటికప్పుడు బెట్టింగ్ దందాలపై అవరసమైన చర్యలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లు అనేక కుటుంబాలు కుప్పకూలడానికి కారణం అవుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ఆర్థిక ఉగ్రవాదంతో సమానం. ఇప్పటికైనా దీనికి అడ్డుకట్ట వేయకపోతే దానికి ఓ తరాన్ని ఫణంగా పెట్టాల్సి వస్తుంది. ఈ తరుణంలో అందరం కలిసి ముందుకు వెళితేనే మన సమాజాన్ని కబళిస్తున్న బెట్టింగ్ భూతానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టగలం. యువతరాన్ని రక్షించుకోగలం. తల్లిదండ్రుల అప్రమత్తతా కీలకం బెట్టింగ్ యాప్‌ల విషయంలో తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి. ఈ భూతాన్ని పూర్తిగా పారద్రోలాలంటే తల్లిదండ్రుల సహకారం అనివార్యం. ప్రతి ఒక్కరూ తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. సోషల్‌మీడియా వినియోగదారుల్లో 16–30 ఏళ్ల మధ్య వయసు్కలే ఈ యాప్‌ల టార్గెట్‌గా ఉంటున్నారు. ఇక తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న ఎందరో విద్యార్థులు తమ చదువుకు ఉద్దేశించిన డబ్బును బెట్టింగ్‌లో పోగొట్టుకుని విద్యకు దూరమైన ఉదంతాలు ఉన్నాయి. యువత అనేకమంది అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి ఇవి ఆత్మహత్యలు కాదు.. బెట్టింగ్ యాప్స్, వాటిని ప్రమోట్ చేసే వాళ్లు చేసిన హత్యలు. -
మన దగ్గరే 'బంగారు' కొండ
సాక్షి, స్పెషల్ డెస్క్: సుమారు 25,000 టన్నులు.. భారతీయుల వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలు ఇవి. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా.. బంగారం అంటే మన వాళ్లకు అమితపైన ప్రేమ ఉంది కాబట్టి ఆ మాత్రం ఉండొచ్చు అనే కదా మీ ఆలోచన. అసలు విషయం చెబితే నోరెళ్లబెట్టాల్సిందే. ప్రపంచంలో ఉన్న 10 ప్రధాన కేంద్ర బ్యాంకుల (ఆర్బీఐలాంటి సెంట్రల్ బ్యాంక్స్) వద్ద ఉన్న మొత్తం పసిడి నిల్వల కంటే మన భారతీయుల వద్ద ఉన్న బంగారమే ఎక్కువని హెచ్ఎస్బీసీ గ్లోబల్ తాజా నివేదికలో వెల్లడించింది. భారతీయుల కుటుంబాల్లో ఉన్న ‘బంగారు కొండ’ ఏపాటితో దీనిని బట్టి అర్థం అవుతుంది. తరతరాలుగా సంపదను సంరక్షించుకోవడం, భద్రత కోసం బంగారాన్ని ఒక ప్రాధాన్య ఆస్తిగా మనవారు ఆధారపడిన విధానాన్ని ఈ కొండ నొక్కి చెబుతోంది. భారతీయులు పసిడిని ఇలా విస్తారంగా కూడబెట్టుకోవడం దేశ ఆర్థిక, సాంస్కృతిక నిర్మాణంలో పుత్తడికి ఉన్న ప్రాముఖ్యతకు నిదర్శనం.ప్రత్యామ్నాయంగా పుత్తడి..యూఎస్ఏ, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, భారత్, జపాన్, తుర్కియే దేశాలు ఈ టాప్–10 జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల సెంట్రల్ బ్యాంకుల మొత్తం బంగారం నిల్వలను మించి భారతీయుల వద్ద పసిడి ఉందంటే.. పొదుపు, పెట్టుబడి వ్యూహం విషయంలో భారతీయుల్లో ఈ యెల్లో మెటల్ ఎంతటి కీలకపాత్ర పోషిస్తోందో అవగతం అవుతుంది. భారతీయ కుటుంబాలకు బంగారం ప్రాధాన్యత కలిగిన ఆస్తిగా ఉందనడంలో సందేహం లేదు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, కరెన్సీ విలువల హెచ్చుతగ్గులకు దీనిని ఒక విరుగుడుగా ప్రజలు భావిస్తున్నారు. వివాహాలు, పండగలు, మతపర వేడుకలు గోల్డ్ డిమాండ్‌ను గణనీయంగా పెంచుతున్నాయి. బ్యాంకుల్లో పొదుపు చేస్తే వచ్చే వడ్డీ కంటే బంగారం కొనుగోలు ద్వారా దీర్ఘకాలంలో అధిక ఆదాయం పొందవచ్చన్నది ప్రజల మాట. అందుకే అత్యధిక కుటుంబాల్లో బ్యాంకు డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా పుత్తడి అవతరించింది. సెంట్రల్ బ్యాంక్స్ సైతం..ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా, చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా భారత్ నిలిచింది. పుత్తడి దిగుమతులు సైతం భారత వాణిజ్య లోటు పెరగడానికి కారణం అవుతున్నాయి. అయితే కుటుంబ సంపద పరిరక్షణలో పసిడి ఇప్పటికీ ముఖ్యమైన భాగంగా ఉంది. భారతీయ కుటుంబాలు వ్యక్తిగతంగా బంగారాన్ని దాచుకోవడంలో ముందంజలో ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా ఇటీవలి కాలంలో పుత్తడి కొనుగోళ్లను పెంచాయి. ఆర్థిక అస్థిరతల నుంచి రక్షణ ఇచ్చే సాధనం బంగారమేనని ఇవి భావిస్తుండడమే ఇందుకు కారణం. ఈ ప్రపంచ ధోరణులకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన బంగారు నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది. 2024 డిసెంబర్ నాటికి ఆర్బీఐ వద్ద 876.18 టన్నుల నిల్వలు పోగయ్యాయి. తొలిస్థానంలో ఉన్న యూఎస్ఏ 8,133 టన్నులు, రెండోస్థానంలో ఉన్న జర్మనీ వద్ద 3,352 టన్నుల నిల్వలు ఉన్నాయి. -
రాబడిపై పన్ను సున్నా...
కొత్త బడ్జెట్లో ఆదాయపన్ను మినహాయింపు రాయితీలను గణనీయంగా పెంచడంతో మధ్యతరగతికి పెద్ద ఊరట లభించింది. వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్‌తో కలుపుకుని రూ.12.75 లక్షలు, ఇతరులకు రూ.12 లక్షల ఆదాయం ఉన్నా కానీ కొత్త విధానంలో రూపాయి పన్ను లేకుండా చేశారు ఆర్థిక మంత్రి. ఇప్పటికీ అధిక ఆదాయ పరిధిలో ఉండి, పన్ను ఆదా పెట్టుబడుల కోసం అన్వేషించే వారికి మెరుగైన మార్గం ఒకటి ఉంది. పన్ను ఆదా చేసే ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవడమే. వీటి నుంచి వచ్చే రాబడిపై ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఇందులో ఉండే ప్రయోజనాలు, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? తదితర వివరాలతో కూడిన కథనమే ఇది... బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు), చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులపై వచ్చే రాబడికి ఎలాంటి పన్ను ఆదా ప్రయోజనం లేదు. దీంతో రూ.12 లక్షలకు పైన ఆదాయం ఉన్న వారికి పన్ను ప్రయోజనం పరంగా ఇలాంటివి మెరుగైన సాధనాలు కాబోవు. ఎందుకంటే వీటిపై వచ్చే రాబడి పన్ను చెల్లింపుదారు వార్షిక ఆదాయానికి కలుస్తుంది. దాంతో చెల్లించాల్సిన పన్ను భారం పెరిగిపోతుంది. ఫలితంగా నికర ఆదాయం రూ.12.75 లక్షలకు మించిపోవచ్చు. దీనివల్ల పన్ను ఆదా రాయితీని కోల్పోవాల్సి వస్తుంది. కనుక అధిక ఆదాయం పరిధిలో ఉన్న వారికి అందుబాటులో ఉన్న మెరుగైన సాధనం ట్యాక్స్ ఫ్రీ బాండ్లే. ఎందుకంటే ఈ బాండ్లపై వచ్చే రాబడి ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలవదు. దీంతో ఈ మేరకు ప్రయోజనం పొందొచ్చు. ముఖ్యంగా రూ.12 లక్షల స్థాయిలో ఆదాయం కలిగిన వృద్ధులు (సీనియర్ సిటిజన్లు/60 ఏళ్లు నిండిన వారు) తమ రిటైర్మెంట్ నిధిలో కొంత మొత్తాన్ని ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయమే అవుతుంది. తద్వారా వారి పన్ను వర్తించే ఆదాయం రూ.12 లక్షలకు మించకుండా చూసుకోవచ్చు. పలు సంస్థల నుంచి బాండ్లు.. గతంలో పలు ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన ట్యాక్స్ ఫ్రీ బాండ్లు ప్రస్తుతం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో క్యాష్ విభాగంలో ట్రేడ్ అవుతున్నాయి. వీటిల్లో కొన్నింటిలో మెరుగైన లిక్విడిటీ (కొనుగోళ్లు, అమ్మకాల పరిమాణం)ని గమనించొచ్చు. ఇంకా 11 ఏళ్ల కాల వ్యవధితో బాండ్లు లభిస్తున్నాయి. ప్రస్తుతం వీటిల్లో పన్ను రహిత రాబడి రేట్లు 5.5–5.9 శాతం మధ్య ఉన్నాయి. పెట్టుబడికి రక్షణ, అదే సమయంలో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇవి మెరుగైన ఆప్షన్ అని విశ్లేషకులు చెబుతున్నారు. 2012 నుంచి 2016 మధ్య కాలంలో 14 ప్రభుత్వరంగ ఇన్ఫ్రా ఫైనాన్స్ కంపెనీలు (ఎన్హెచ్ఏఐ, ఐఆర్ఎఫ్సీ, పీఎఫ్సీ తదితర) సెక్యూర్డ్ (రక్షణతో కూడిన) ట్యాక్స్ ఫ్రీ బాండ్లను జారీ చేశాయి. వీటి కాల వ్యవధి 10, 15, 20 ఏళ్ల చొప్పున ఉంది. ఈ బాండ్లలో పెట్టుబడులపై రాబడి చెల్లింపులు ఏడాదికోసారి చేస్తారు. వీటికి అధిక భద్రతను సూచించే ‘ఏఏఏ’ రేటింగ్‌ను క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చాయి. గతంలో జారీ చేసిన అన్ని ట్యాక్స్ ఫ్రీ బాండ్ల సిరీస్‌లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ అయి ఉన్నాయి. ఇప్పటి వరకు 193 ఇష్యూలు రాగా, అందులో 57 బాండ్ల మెచ్యూరిటీ (కాలవ్యవధి) ముగిసిపోయింది. మిగిలిన ట్యాక్స్ ఫ్రీ బాండ్లు ప్రస్తుతం స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడ్ అవుతున్నాయి. వీటి మెచ్యూరిటీ సగటున 11 ఏళ్ల వరకు ఉంది. ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన ఈ బాండ్లలో రిస్క్ చాలా చాలా తక్కువ. ఒక విధంగా ఉండదనే చెప్పుకోవాలి. దీనికితోడు పన్ను ప్రయోజనం కూడా ఉండడం అదనపు ఆకర్షణ. తక్కువ ఆదాయం ఉన్న వారికి..? ఆదాయపన్ను పరిధిలో లేకుండా.. ఆదాయం తక్కువగా ఉన్న వారు ప్రత్యామ్నాయాలను పరిశీలించొచ్చు. ‘ఏఏఏ’ రేటెడ్ కార్పొరేట్ బాండ్లలో రిస్క్ కొంత తక్కువగా ఉంటుంది. వీటిల్లో ఈల్డ్స్ 7.4 శాతం మేర ఉన్నాయి. అలాగే, వృద్ధులకు బ్యాంక్ ఎఫ్డీలపై 8 శాతం వరకు వడ్డీ రేటు ప్రస్తుతం లభిస్తోంది. కానీ, కార్పొరేట్ బాండ్లు, బ్యాంక్ ఎఫ్డీలపై వచ్చే రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. మెచ్యూరిటీతో సంబంధం లేకుండా ఆయా పెట్టుబడులపై ఏటా వచ్చే రాబడిని ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అధిక ఆదాయపన్ను శ్లాబు రేటులో ఉన్న వారికి పన్ను చెల్లింపులు పోగా మిగులు నికర రాబడి 4.6–5.1 శాతం మించదు. అయితే, తక్కువ ఆదాయ శ్లాబుల్లో ఉన్న వారు, పన్ను వర్తించేంత ఆదాయం లేని వారికి.. కార్పొరేట్ బాండ్లు, బ్యాంక్ ఎఫ్డీలు తదితర సాధనాలను పరిశీలించొచ్చు. ఎందుకంటే వీటి నుంచి వచ్చే వడ్డీ రాబడి కలిసిన తర్వాత కూడా వారి ఆదాయం పన్ను పరిధిలోకి రాదు. ఎంపిక ఎలా..? ఈ బాండ్ల ఎంపిక అంత కష్టమైన విషయం కాదు. ముఖ్యంగా చూడాల్సింది లిక్విడిటీయే. అంటే ఆయా బాండ్లు రోజువారీగా ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్ అవ్వడంతోపాటు, తగినంత ట్రేడింగ్ వ్యాల్యూమ్ కూడా ఉండాలి. దీనివల్ల కొనుగోలు, విక్రయం సులభంగా మారుతుంది. ఆ తర్వాత చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం బాండ్ ఈల్డ్స్ టు మెచ్యూరిటీ (వైటీఎం). అంటే ఆయా బాండ్‌పై మిగిలి ఉన్న కాలానికి ఎంత రాబడి వస్తుందో ఇది తెలియజేస్తుంది. అధిక లిక్విడిటీ ఉన్న బాండ్‌ను మెరుగైన ధరపై కొనుగోలు చేసుకోవచ్చు. అదే లిక్విడిటీ తగినంత లేని చోట (అమ్మకాలకు ఎక్కువ మంది లేనప్పుడు) బాండ్ కొనుగోలు వ్యయం పెరిగిపోతుంది. దీనివల్ల ఈల్డ్ తగ్గిపోతుంది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ డేటా ప్రకారం ప్రస్తుతం స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడ్ అవుతున్న వాటిల్లో 20 బాండ్లలో మెరుగైన లిక్విడిటీ ఉంటోంది. ఉదాహరణకు ‘ఆర్ఈసీ బాండ్ ‘871ఆర్ఈసీ28’ను 2014లో 8.71 శాతం వార్షిక రేటుపై జారీ చేయగా.. గత నెలరోజులుగా రోజువారీ ట్రేడింగ్ వ్యాల్యూమ్ ఇందులో 1,534గా ఉంటోంది. ఈ బాండ్లో ఇటీవలి వైటీఎం 5.9 శాతంగా ఉంది. ఇది అనుకూల తరుణం.. ఆర్బీఐ ఇటీవలే రెపో రేటును పావు శాతం తగ్గించింది. రానున్న రోజుల్లో మరో 50 బేసిస్ పాయింట్ల వరకు (0.50 శాతం) రేట్లు తగ్గుతాయని విశ్లేషకుల అంచనాగా ఉంది. ఇప్పటికీ దీర్ఘకాల డెట్ సాధనాలపై రాబడులు మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కనుక డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే వారికి ప్రస్తుతం అనుకూల సమయం. పన్ను లేకపోవడం, పెట్టుబడులపై గరిష్ట పరిమితి లేకపోవడంతో ట్యాక్స్ ఫ్రీ బాండ్లు అధిక ఆదాయ వర్గాలకు మెరుగైన సాధనం అవుతుంది. పైగా ట్యాక్స్ ఫ్రీ బాండ్ల జారీ నిలిచిపోయింది. అంటే కొత్తగా బాండ్ల ఇష్యూలు రావడం లేదు. కనుక వీటిల్లో పెట్టుబడులు పెట్టుకోవాలంటే సెకండరీ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న వాటి నుంచే ఎంపిక చేసుకోవాలి. ఇన్వెస్టర్లు ఇక్కడి నుంచి ఎంత కాలానికి పెట్టుబడులు పెట్టుకోవాలని అనుకుంటున్నారో.. అంత కాలంలో మెచ్యూరిటీ తీరిపోయే ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. రిటర్నులు ఆకర్షణీయం సెకండరీ మార్కెట్లో ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో పెట్టుబడులు పెట్టే వారు మార్కెట్ రేటు కంటే ప్రధానంగా ఈల్డ్స్ టు మెచ్యూరిటీ (వైటీఎం)పైనే దృష్టి సారించాలి. ఇన్వెస్టర్ ఒక బాండ్‌ను కొనుగోలు చేసిన దగ్గర్నుంచి, అది మెచ్యూరిటీ అయ్యే వరకు ఏటా వచ్చే రాబడిని వైటీఎం సూచిస్తుంది. 15 ట్యాక్స్ ఫ్రీ బాండ్ల సిరీసీస్లలో ప్రస్తుతం వైటీఎం 5.5 శాతం నుంచి 5.9 శాతం మధ్య ఉంది. ఇవి గమనించాలి.. → 30 శాతం ఆదాయపన్ను పరిధిలో ఉన్న వారికి 6 శాతం పన్ను రహిత రాబడి నిజంగా ఎంతో మెరుగైనది. పన్ను ప్రయోజనం కూడా కలుపుకుంటే 8.5 శాతం రాబడి వచి్చనట్టు. → 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి సైతం 7.5 శాతం రాబడి వచి్చనట్టు అవుతుంది. → 10 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి దక్కే ప్రయోజనం తక్కువే. → కార్పొరేట్ బాండ్లతో పోల్చితే ట్యాక్స్ ఫ్రీ బాండ్లు అధిక రేటింగ్ కలిగినవి. ఈ బాండ్లను జారీ చేసేవి ప్రభుత్వరంగ సంస్థలే కనుక డిఫాల్ట్ దాదాపుగా ఉండదు. → ఇన్వెస్టర్ తనకు వీలైనంత ఇందులో పెట్టుబడి పెట్టుకోవచ్చు. గరిష్ట పరిమితి ఉండదు. → స్వల్పకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులకు వీటిని ఎంపిక చేసుకోవడం సరికాదు. → వీటిల్లో ఒక్కోసారి లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కనుక కాల వ్యవధి ముగిసేంత వరకు కొనసాగే వెసులుబాటు ఉన్న వారే వీటిని ఎంపిక చేసుకోవాలి. → కేవలం పన్ను ప్రయోజనం కోసమే వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం అనిపించుకోదు. రిస్క్ తీసుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇంతకంటే ఎక్కువ రాబడినే (పన్ను పోను) ఇస్తాయి. పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడుల వైవిధ్యం కోసం డెట్ విభాగం కింద ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవచ్చు. → అధిక లిక్విడిటీ, మెరుగైన వైటీఎం ఉన్న వాటికే పరిమితం కావాలి. –సాక్షి, బిజినెస్‌డెస్క్ -
రష్యా, ఫ్రాన్స్, జర్మనీ బెస్ట్
ఐదు దశాబ్దాలుగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికా, బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా వంటి దేశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఇటీవల యువత ధోరణి మారుతోంది. ఇప్పుడు వారి దృష్టి రష్యా, ఫ్రాన్స్, జర్మనీ అలాగే న్యూజిలాండ్ వంటి దేశాలకు మళ్లుతోంది. తమ చక్కటి భవిష్యత్ కోసం ఈ దేశాలను ఎంపిక చేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. వీసా విధానాలు, వ్యయాలు, ఉద్యోగ అవకాశాలు వంటివి ఇందుకు కారణం. భారతీయ విద్యార్థులు కొత్త విదేశీ విద్యా గమ్యస్థానాలను ఎందుకు ఎంచుకుంటున్నారు... ఈ దేశాలు అందించే ప్రయోజనాలు ఏమిటి అన్న విషయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్యూఎస్,యూకేల్లో కఠిన విధానాలుఅమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పుడు విద్యార్థుల ఆకర్షణ క్రమంగా కోల్పోతుండడానికి ఆయా దేశాలు అనుసరిస్తున్న కఠిన వీసా విధానాలు, అధిక ఫీజులు, విద్యను అభ్యసించిన తర్వాత ఉపాధి అవకాశాలు పరిమితం కావడం వంటి పలు అంశాలు కారణంగా ఉన్నాయి. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ రెండవ సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో విద్య, ఉపాధి అవకాశాలు పొందుదామనుకున్నవారి సంఖ్య గణనీయంగా పడిపోతున్న విషయం జగద్విదితమే. ఇక కెనడాకు విద్యార్థుల ఎన్రోల్మెంట్లు తగ్గడానికి దౌత్యపరమైన ఉద్రిక్తతలు ప్రధాన కారణం. ఇప్పటికీ అగ్ర దేశాలే.. కానీ.. అయితే రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, న్యూజిలాండ్ వంటి దేశాలు బలమైన ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతున్నాయి తప్ప కెనడా, అమెరికా, బ్రిటన్లను అవి అధిగమించేశాయని భావించడం సరికాదు. గత మూడు సంవత్సరాల్లో (2022–2024) భారీ సంఖ్యలో భారతీయ విద్యార్థులు విదేశాలలో చదివేందుకు ఎంపిక చేసుకున్న దేశాల జాబితాలో అగ్ర స్థానంలో కెనడా, అమెరికా, బ్రిటన్‌లున్నాయి. అయితే ఈ దేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో రష్యా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే వారి సంఖ్య పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ ఎందుకు?⇒ రష్యా: రష్యా విశ్వవిద్యాలయాలు పాశ్చాత్య దేశాలతో పోల్చితే తక్కువ ట్యూషన్ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ముఖ్యంగా వైద్య విద్య విషయంలో రష్యా తన ప్రత్యేకతను చాటుతోంది. అమెరికా, బ్రిటన్లలో పోల్చితే రష్యాలో ప్రవేశ ప్రక్రియ సైతం సరళంగా ఉంటోంది. అలాగే ప్రవేశ పరీక్షల సంఖ్య కూడా తక్కువ. ఇక ఆయా దేశాలతో పోల్చితే రష్యాలో జీవన వ్యయాలూ చాలా తక్కువగా ఉంటున్నాయి. ⇒ జర్మనీ: ఉచిత లేదా తక్కువ ఖర్చుతో విద్యావకాశాలు జర్మనీ ప్రత్యేకత. దీనితోపాటు జర్మనీ సమృద్ధిగా అభివృద్ధి చెందిన ఆరి్థక వ్యవస్థను కలిగి ఉంది. 4.92 ట్రిలియన్ డాలర్లతో దేశం ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత మూడో అతిపెద్ద ఆరి్థక వ్యవస్థగా ఉంది. అంతర్జాతీయ విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలను అందిస్తుంది. జర్మన్ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయంగా విద్యా ప్రమాణాలకు ప్రసిద్ధి. ⇒ ఫ్రాన్స్: అమెరికా, బ్రిటన్లతో పోల్చితే ఫ్రాన్స్ తక్కువ ఖర్చుతో విద్యను అందిస్తోంది. పెద్ద సంఖ్యలో ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఇంగ్లీషులో కూడా కోర్సులను అందిస్తున్నాయి. దీంతో భారతీయ విద్యార్థులకు అక్కడ చదవడం సులభమవుతోంది. పట్టభద్రులయ్యాక అంతర్జాతీయ విద్యార్థులు ఫ్రాన్స్‌లో ఉండి పనిచేసేందుకు అవకాశం ఉంది. ⇒న్యూజిలాండ్: ఈ దేశం భారత్ విద్యార్థులకు ప్రాచుర్యం పొందిన మరో దేశంగా మారింది. అనుకూలమైన వీసా నియమాలు, పనిచేయడానికి సులభమైన అవకాశాలు దీనికి ఒక కారణంకాగా, దేశంలోని విశ్వవిద్యాలయాలు మంచి విద్య, పరిశోధన అవకాశాలను అందిస్తున్నాయి. వీటన్నింటికీ మించి న్యూజిలాండ్ ప్రపంచంలోని అత్యంత సురక్షిత దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందడం గమనార్హం. ఆయా అంశాలు ఈ దేశాన్ని విద్యార్థులకు గమ్యస్థానంగా మారుస్తున్నాయి. ⇒ పోలాండ్, ఇటలీ, స్వీడన్ : పోలాండ్ తక్కువ వ్యయంతో విద్యా అవకాశాలు అందిస్తోంది. ఇటలీ విషయానికి వస్తే స్కాలర్షిప్లు ఇస్తూ ట్యూషన్ ఫీజుల వెసులుబాటును కల్పిస్తోంది. ఇక స్వీడన్లో ఇంగ్లీషులో బోధించే అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలూ లభిస్తున్నాయి. -
ప్రేమను పంచే శుభదినం ఈద్
ఈదుల్ ఫిత్ర్ లేక రంజాన్ పర్వదినం ప్రపంచంలోని ముస్లిం సమాజానికి అత్యంత పవిత్రమైన, ఆనందకరమైన వేడుక. అత్యంత ఉత్సాహంగా, ఆనందంగా వారు ఈవేడుకను జరుపుకుంటారు. ఈ పర్వదినాన్ని ‘ఈద్’ అని కూడా పిలుస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ను అనుసరించి రంజాన్ నెల ముగిసిన మరునాడు దీన్ని జరుపుకుంటారు.రంజాన్, ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదవ నెల. ఇది ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంలో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నెలలో ముస్లింలు ప్రత్యేకంగా ఉపవాసం (సియామ్) పాటిస్తారు, అంటే ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు భోజనం, పానీయాలు, ఇతర శరీర సంబంధిత అవసరాలన్నీ త్యజిస్తారు. ఉపవాసం ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఒక శుద్ధి ప్రక్రియగా భావించ బడుతుంది, ఇది స్వీయ నియంత్రణ, ప్రేమ, దయ, జాలి, క్షమ, సహనం, పరోపకారం, త్యాగం లాంటి అనేక సుగుణాలను పెంపొందించడానికి సహాయపడుతుంది. ఈ సందర్భంగా వారు వారి దైనందిన సేవాకార్యక్రమాలను మరింత విస్తరించుకొని, నైతికంగా, ఆధ్యాత్మికంగా తమ వ్యక్తిత్వాలను నిర్మించుకొని దేవుని కృపా కటాక్షాలు పొందడానికి ప్రయత్నిస్తారు. ఈదుల్ ఫిత్ర్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని, సమాజంలో పేదరికాన్ని తొలగించే ప్రయత్నం కూడా ఎంతోకొంత జరుగుతుంది. దాతృత్వం, సామాజిక సేవలకుప్రాధాన్యం ఇవ్వడం ఈ పండుగ ప్రధాన లక్ష్యం. ప్రతి ఒక్కరూ తమ తోటి సోదరులకు సహకరిస్తూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోడానికి ప్రయత్నిస్తారు. సదఖ, ఫిత్రా, జకాత్ ల ద్వారా అర్హులైన అవసరార్థులకు ఆర్థిక సహాయం అందిస్తారు.ఈదుల్ ఫిత్ర్ పర్వదినం సమస్త మానవాళి, సర్వ సృష్టిరాశి సుఖ సంతోషాలను కాంక్షించే రోజు. ఆనందం, శాంతి, సంతోషం, సమానత్వం, క్షమ, దయ, జాలి, పరోపకారం, సామాజిక బాధ్యతలను ప్రతిబింబించే ప్రత్యేకమైన రోజు. ఇది కేవలం ఒక ఆథ్యాత్మిక క్రతువు కాదు. సమాజంలో ప్రేమ, సహకారం, పరస్పర మైత్రి, బాధ్యత, ఆనందాలను పంచుకునే వేడుక. రంజాన్ నెల రోజుల శిక్షణ ద్వారానూ, ఈద్ పండుగ ద్వారానూ సమాజం ఆధ్యాత్మికతను, మానవతా విలువలను పునరుద్ధరించుకుంటుంది.పండగ తర్వాత కూడా...ఈద్ తో రోజాలకు వీడ్కోలు పలికినప్పటికీ, నెలరోజులపాటు అది ఇచ్చినటువంటి తర్ఫీదు అనంతర కాలంలోనూ తొణికిస లాడాలి. పవిత్ర రంజాన్ లో పొందిన దైవభీతి శిక్షణ, దయాగుణం, సహనం, సోదరభావం, పరస్పర సహకార, సామరస్య భావన, ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలు పంచుకునే గుణం, పరమత సహనం, సర్వ మానవ సమానత్వం లాంటి అనేక సదాచార సుగుణాలకు సంబంధించిన తర్ఫీదు ప్రభావం మిగతా పదకొండు నెలలకూ విస్తరించి, తద్వారా భావి జీవితమంతా మానవీయ విలువలే ప్రతిబింబించాలి. సమస్త మానవాళికీ సన్మార్గభాగ్యం ప్రాప్తమై, ఎలాంటి వివక్ష, అసమానతలులేని, దైవభీతి, మానవీయ విలువల పునాదులపై ఓ సుందర సమ సమాజం, సత్సమాజ నిర్మాణం జరగాలి. ఇహపర లోకాల్లో అందరూ సాఫల్యం పొందాలి. ఇదే రంజాన్ ధ్యేయం.ఈ రోజు ముస్లింలు ఉదయాన్నే నిద్రలేచి పరిశుభ్రతను పొందుతారు. ఈద్ నమాజ్ /ప్రార్థన ఆచరించి కుటుంబంతో, స్నేహితులతో కలిసి పండుగను జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ ఈ రోజున వారి వారిస్థోమత మేరకు కొత్త దుస్తులు ధరించి, పలు రకాల తీపి వంటకాలు ముఖ్యంగా సేమియా/షీర్ ఖుర్మా తీసుకుంటారు. ఈదుల్ ఫిత్ర్ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, సమాజంలో నైతిక, ఆధ్యాత్మిక, మానవీయ సుగుణాలను పునరుధ్ధరించే మహత్తరమైన రోజు. ఈ పండుగ రోజున ముస్లిం సమాజం జకాతుల్ ఫిత్ర్ అనే దానం కూడా ఇస్తారు. పేదసాదలను గుర్తించి వారికి ఫిత్రా దానాలు చెల్లించడం ద్వారా తమ దాతృత్వాన్ని చాటుకోవడం కాకుండా తమ బాధ్యతను నెరవేర్చామని భావిస్తారు.రంజాన్ నెల ముగియగానే, షవ్వాల్ నెల మొదటి రోజు ముస్లిం సోదరులు ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినం జరుపుకుంటారు. ‘ఫిత్ర్’ అంటే దానం, పవిత్రత లేదా శుద్ధి అని కూడా అంటారు. ఇది ఉపవాసం,ప్రార్థనల ధార్మిక విధిని పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దైవానికి కృతజ్ఞతలు తెలుపుకునే అపురూప సందర్భం.– మదీహా అర్జుమంద్ -
పెన్సిల్ విలేజ్ ఆఫ్ ఇండియా గురించి తెలుసా?
ఏపీ సెంట్రల్ డెస్క్: జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా ఓఖూ గ్రామం పెన్సిల్ విలేజ్ ఆఫ్ ఇండియాగా వినుతికెక్కింది. దేశం నుంచి పెన్సిల్ ఉత్పత్తికి కావాల్సిన 90 శాతం ముడి కలప ఇక్కడి నుంచే కంపెనీలకు ఎగుమతవుతోంది. పెన్సిళ్ల తయారీకి అవసరమైన కలపను ఒకప్పుడు చైనా, జర్మనీ నుంచి ఇక్కడివారు దిగుమతి చేసుకునేవారు. ఇప్పుడా అవసరం లేకుండా స్థానికంగా లభించే కలపను సమర్థవంతంగా నియోగించుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తమదైన ముద్ర వేసుకుంటున్నారు. మార్చి 30 జాతీయ పెన్సిల్ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం పాఠకుల కోసం.ప్రధాని ప్రస్థానంతో వెలుగులోకి.. దేశ ప్రధాని నరేంద్రమోదీ తన మనసులోని భావాలను ఆవిష్కరించే మన్ కీ బాత్ (mann ki baat) లో పెన్సిల్ విలేజ్ ఆఫ్ ఇండియాగా ఓఖూను అభివర్ణించారు. దీంతో ఈ గ్రామం వెలుగులోకి వచ్చింది. పుల్వామా జిల్లాలోని ఈ గ్రామం పెన్సిల్ తయారీకి ప్రధాన కేంద్రంగా గుర్తింపుపొందింది. దేశాన్ని విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో పుల్వామా కీలక భూమిక పోషిస్తోందని, విద్యార్థులు తమ హోంవర్క్ చేయడం, నోట్స్ రాసుకోవడంలో పెన్సిల్ (Pencil) వినియోగించినప్పుడల్లా పుల్వామా జిల్లా స్ఫురణకు వస్తుందని మన్ కీ బాత్ ప్రసంగంలో కితాబిచ్చారు. దిగుమతుల నుంచి ఎగుమతుల దాకా.. 1960 నుంచి ఇక్కడ పరిశ్రమల ప్రస్థానం ప్రారంభమైంది. మొదట్లో పెన్సిల్ తయారీకి దియోదార్ కలపను వినియోగించేవారు. 1992లో ఇక్కడి ప్రభుత్వం దియోదార్ వినియోగాన్ని నిషేధించడంతో చైనా, జర్మనీ దేశాల నుంచి కలపను దిగుమతి చేసుకునేవారు. అయితే ఇది వ్యయ ప్రయాసలతో కూడినది కావడంతో ప్రత్యామ్నాయానికి అన్వేషించారు. అలాంటి సమయంలో ఇక్కడ లోయల్లో లభించే పోప్లర్ కలప వీరికి వరంలా మారింది. ఆ కలపతో పెన్సిల్ పలకలను తయారుచేయడం మొదలెట్టారు. పోప్లర్ కలప పెన్సిల్ నాణ్యతను పెంచడంతో దిగుమతుల దశ నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి చేరింది. యూఏఈ, మెక్సికో, నేపాల్, పోలాండ్, ఫ్రాన్స్, భూటాన్, యూకే, బెల్జియం, మారిషస్, లెబనాన్, మాల్దీవులు, గ్రీక్, శ్రీలంక, బంగ్లాదేశ్ తోపాటు 85 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. నిరుద్యోగుల కల్పతరువు... ఓఖూ ఓఖూ... పుల్వామా జిల్లాకు చెందిన ఓ మారుమూల గ్రామం. ప్రపంచ స్థాయి మార్కెట్లో ఒకటిగా వెలుగొందుతోంది. గతంలో ముడి కలపను జమ్ము, చండీగఢ్‌లో ముక్కలుగా చేసి తెప్పించేవారు.స్థానిక ప్రభుత్వం వీరికి ఆధునికతను అందుబాటులోకి తీసుకురావడంతో పెన్సిల్ పలకలను ఇక్కడే తయారు చేస్తున్నారు. పెన్సిల్ రూపకల్పనకు అవసరమైన పలకలను ఎండబెడతారు. ఇవి బాగా ఆరాక ఒక్కో పెట్టెలో 800 పలకల లెక్కన ప్యాక్ చేస్తారు. నటరాజ్, అప్సర, హిందూస్థాన్ పెన్సిళ్ల తయారీ కర్మాగారాలకు ఇక్కడి నుంచే కలప వెళ్తోంది. ఏనాటికైనా కశ్మీర్ లోనే పూర్తిస్థాయి పెన్సిల్ ప్లాంట్ అందుబాటులోకి రావాలని, ప్రపంచ స్థాయిలో పెన్సిల్ ఉత్పత్తిలో దేశాన్ని అగ్రగామిగా నిలపాలన్నది ఓఖూ గ్రామస్తుల ఆకాంక్ష.చదవండి: వర్క్ షేరింగ్.. హ్యాపీనెస్ లోడింగ్ -
శరణార్థులకు, నిరాశ్రయులకు జారీ చేసే గ్రీన్ కార్డులకు ఫుల్స్టాప్!
గత జో బైడెన్ ప్రభుత్వం చూపించిన ఉదారవాద విధానాలను స ద్వినియోగం చేసుకుని ఇప్పటికే శరణార్థి/నిరాశ్రయుల హోదా సంపాదించిన విదేశీయులకు అందజేసే గ్రీన్‌కార్డుల జారీ ప్రక్రియ హఠాత్తుగా ఆగిపోయింది. తాత్కాలికంగా ఈ గ్రీన్‌కార్డుల జారీ ప్రక్రియను నిలిపేసినట్లు అమెరికా పౌరసత్వం, శరణార్థి సేవల విభాగం తాజాగా ధ్రువీకరించింది. దీంతో అక్రమ మార్గా ల్లో అమెరికాలోకి వచ్చి ఎలాగోలా శరణార్థి హో దా పొందిన వారికి ఇక కొత్త కష్టాలు మొదలయ్యే అవకాశముంది. శరణార్థి/నిరాశ్రయుల హోదా పొందటంతో ఏవైనా అవకతవకలు జరిగాయా లేదంటే వీళ్లంతా నిజంగానే సొంతదేశాల్లో హింస, పీడనకు గురయ్యారా? అనేది తేలాల్సి ఉంది. ఇందుకోసం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సంబంధిత పాత రికార్డులను తవ్వితీయనుందని తెలుస్తోంది. గ్రీన్‌కార్డు హోదా కోసం దరఖాస్తు చేసుకున్న వారి పూర్వాపరాలను సమీక్షించాకే వారికి గ్రీన్‌కార్డు కట్టబెట్టడంపై ముందుకెళ్లాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. దీంతో లక్షలాది మంది శరణార్థులు/నిరాశ్రయుల గ్రీన్‌కార్డు కలలపై ఒక్కసారిగా నీలినీడలు కమ్ముకున్నాయి. భారతీయుల్లో 466 శాతం ఎక్కువ రెండేళ్ల క్రితం అంటే 2023 ఏడాదిలో ఏకంగా 51,000 మందికిపైగా భారతీయులు అమెరికాకు చేరుకుని శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంతో పోలిస్తే ఒకేఏడాదిలో ఇంతమంది భారతీయులు శరణార్థులుగా అగ్రరాజ్యం చెంతకు చేరడం ఇదే తొలిసారి. 2018 ఏడాదిలో కేవలం 8,000 మంది భారతీయులు ఈ తరహా దరఖాస్తు చేసుకోగా 2023 ఏడాదికి వచ్చేసరికి ఏకంగా 466 శాతం అధికంగా 51,000 మంది అప్లై చేశారని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం విడుదలచేసిన గణాంకాల్లో వెల్లడైంది. అక్రమ మార్గాల్లో మెక్సికో, కెనడా సరిహద్దుల గుండా అమెరికా భూభాగంలోకి అడుగుపెడుతూ అమెరికా బోర్డర్ సెక్యూరిటీ పోలీసులకు చిక్కిన వేలాది మంది భారతీయులు శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకు అమెరికా ఇమిగ్రేషన్ సిస్టమ్ అనుమతిస్తోంది. శరణార్థి హోదా.. సుదీర్ఘ ప్రక్రియ బోర్డర్ వద్ద చిక్కిన వాళ్లకు వెంటనే శరణార్థి హోదా ఇవ్వరు. వాళ్లు చెప్పే వివరాలను అధికారులు నమోదుచేసుకుని దరఖాస్తు ప్రక్రియను మొదలుపెడతారు. వైద్య పరీక్షలతోపాటు ముఖాముఖి ఇంటర్వ్యూలు చేస్తారు. సంబంధిత శరణార్థి అధికారులు ఈ బాధ్యతలను నెరవేరుస్తారు. ఈ సందర్భంగా తాము స్వదేశాన్ని ఎందుకు వీడాల్సి వచ్చింది?. స్వదేశంలో తాము పడిన కష్టాలు, ఎదురైన సమస్యలు, సొంత సమాజంలో అణచివేతకు గురవడానికి కారణాలను వివరించాల్సి ఉంటుంది. వీళ్లు చెప్పే మాటలు, వివరాలను అధికారులు/ఇమిగ్రేషన్ న్యాయమూర్తులు నమ్మితే శరణార్థి హోదా వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. కార్యనిర్వాహక ఉత్తర్వుతో అడ్డుకున్న ట్రంప్ ఎలాగోలా శరణార్థి హోదా పొందిన వారికి అమెరికాలో తాత్కాలికంగా నివసించేందుకు అవకాశం చిక్కుతోంది. ఈ అవకాశం లేకుండా చేసేందుకు రెండోదఫా అధికారంలోకి వచ్చిన ట్రంప్ వెంటనే రెండు కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీచేశారు. శరణార్థులుగా వచ్చే వారిని లోపలికి రానివ్వడం ఆపేశారు. అరెస్టయి శరణార్థి శిబిరాల్లో ఉంటున్న వారు శరణార్థి హోదా దరఖాస్తు చేయకుండా నిలువరిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా–మెక్సికో సరిహద్దు వద్ద ఈ రెండు విధానాలను ట్రంప్ కఠినంగా అమలుచేస్తున్నారు. ఈ ఉత్తర్వులను ఇప్పటికే కొందరు కోర్టుల్లో సవాల్‌చేశారు. కొందరిని స్వదేశాలకు తిరిగి పంపడాన్ని ఇటీవల ఒక ఫెడరల్ జడ్జి తన ఉత్తర్వులతో అడ్డుకోవడం తెల్సిందే. హోదా సవరణపై ట్రంప్ సర్కార్ తీవ్ర అభ్యంతరం శరణార్థి హోదాతో చాన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్న వాళ్లు ఇక శాశ్వత స్థిర నివాసం కోసం గ్రీన్కార్డుకి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ దరఖాస్తుల పరిశీలనను ట్రంప్ సర్కార్ తాజాగా ఆపేసింది. హడావుడిగా వీళ్లకు గ్రీన్‌కార్డు ఇచ్చేయకుండా అసలు ఈ శరణార్థుల గతచరిత్ర స్వదేశంలో ఎలాంటిది?. భవిష్యత్తులో వీళ్లు అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారే ప్రమాదముందా?.. ఇలా పలు అంశాల తుది నిర్దారణకు సంబంధించి ‘స్క్రీనింగ్’విధానాలను అవలంబించాలని, అందుకోసమే అప్లికేషన్ల పరిశీలనను ఆపేశామని యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐసీ) అధికారులు స్పష్టంచేశారు. మెక్సికోలో గతంలో డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్న వ్యక్తులు/కుటుంబాలు అమెరికాలో శరణార్థులుగా ఉంటే అలాంటి వారి జాబితాను ఈ గ్రీన్‌కార్డు దరఖాస్తుల్లో వెతుకుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Ugadi 2025: విశ్వ శ్రేయస్సే విశ్వావసు...ఉగాది
మనిషికి భవిష్యత్తు తెలుసుకోవాలని ఎప్పుడూ ఉంటుంది. ఆ భవిష్యత్తులో మంచి జరగాలనే ఆకాంక్ష ఉంటుంది. కాని భవిష్యత్తు అనేది అనిశ్చితితో నిండి ఉంటుందన్న ఎరుక కూడా ఉంటుంది. అయితే ఒక ఆశ కావాలి కదా. ఆ ఆశను ఆధ్యాత్మిక రూపంలో గ్రహాలను ఊతంగా చేసుకుని సనాతనంగా వచ్చిన గ్రహ విజ్ఞానం ఆధారంగా నిలబెట్టేదే పంచాంగ దర్శనం. మంచిని వాగ్దానం చేస్తూ చెడును హెచ్చరిస్తూ సాగే పంచాంగంలో అనూహ్యమైనది ఏదీ కనిపించకపోయినా దానిని వినడం, చదవడం, పరికించడం ఆనవాయితీ. అయితే ఈసారి ‘సామాజిక పంచాంగం’ను వినిపించాలనుకుంది ‘సాక్షి’. ఆరు కీలక రంగాలు దేశంలో, స్థానికంగా ఎలా ఉంటాయో తెలియచేశారు పండితులు. అవధరించండి.ప్రకృతికి ప్రణామంమనం ఏ శుభలేఖల్లో అయినా స్వస్తిశ్రీ చాంద్రమానేన....అని చదువుతుంటాం. అంటే చాంద్రమానం ప్రకారం జరుపుకునే పండగల్లో ఉగాది పండగది ప్రథమస్థానం. ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ‘ఉగాది’ అన్న తెలుగు మాట ‘యుగాది‘ అన్న సంస్కృతపద వికృతి రూపం. బ్రహ్మ ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంభించిన రోజు. మొదటి ఋతువు వసంత ఋతువులో మొదటి మాసం ( చైత్ర మాసం)లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభవింపజేసాడని అర్థం. అందుకే మొదటి సంవత్సరానికి ‘ప్రభవ’ అని పేరు. చివరి అరవయ్యవ సంవత్సరం పేరు ‘క్షయ’ అంటే నాశనం అని అర్థం.ఉగాది సంప్రదాయాలుఉగాది రోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, ఉగాది పచ్చడి సేవనం, ధ్వజారోహణం, పంచాంగ శ్రవణం తదితర పంచకృత్యాలను నిర్వహించాలని వ్రతగ్రంథం పేర్కొంటోంది. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తాము పండించబోయే పంటకి ఏ కార్తెలో ఎంత వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి... వంటివన్నీ శ్రద్ధాభక్తులతో అడిగి తెలుసుకుంటారు.ఉగాది పూజఅన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పబడలేదు గనుక ఈరోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ తినక ముందే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు, అలాగే అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినడం వల్ల ఏడాదంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేలా చేస్తుందని వైద్యులు చెప్పేమాట. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు, అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది. ఎక్కడికీ కదలలేని చెట్లు కూడా తమ ఆకులను రాల్చేసుకుని చివుళ్లు తొడిగి పూత, పిందెలతో కళకళలాడే ఈ వసంతరుతువులో మనం కూడా మనలోని చెడు అలవాట్లను, నకారాత్మక ఆలోచనలను వదిలేసి, శుచి, శుభ్రత, సంయమనం, సమయపాలన, సమయోచిత కార్యాలను ఆచరించటమనే సద్గుణాలను అలవరచుకుందాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అర్థం ఏమిటి? నేడు మనం అడుగిడుతున్న కొత్త తెలుగు సంవత్సరానికి శ్రీవిశ్వావసు నామ సంవత్సరం అని పేరు. అంటే విశ్వ శ్రేయస్సు, విశ్వ సంపద అని అర్థం. ఇది అష్టవసువులలో ఒక వసువు పేరు. ఈ సంవత్సరం అందరికీ శ్రేయోదాయకంగా... సంపద్వంతంగా ఉంటుందని ఆశిద్దాం...కొత్తదనం... పచ్చదనంఉగాది అనగానే ఏదో తెలియని కొత్తదనం సుతిమెత్తగా మనసును తాకినట్టు అనిపిస్తుంది. పచ్చదనం మనసునిండా పరుచుకుంటుంది. మామిడిపళ్లు, మల్లెమొగ్గలు, తాటిముంజలు, పుచ్చకాయలు, కోయిల గానాలు మదిలో మెదులుతాయి. చిన్నప్పుడెప్పుడో చదువుకున్నట్టుగా చెట్లు చిగిర్చి పూలు పూసే వసంత రుతువు ఇది. మనసును ఉల్లాసపరిచే కాలం ఇది. అందుకే కవులు, కళాకారులు, సాహితీవేత్తలు ఉగాదిని, వసంత రుతువును విడిచిపెట్టలేదెప్పుడూ! ఉగాది కవి సమ్మేళనాలు, ఉగాది కథలు, కవితల పోటీలు, ఉగాది కార్టూన్లు కాగితం నిండా కళ్లు చేసుకుని తొంగి చూసే ప్రయత్నం చేస్తుంటాయి.ఆర్థికంగా ముందుకు...విశ్వావసు నామ సంవత్సరంలో మంత్రి చంద్రుడు అవడం చేత, రసాధిపతి శుక్రుడు అవడం చేత, నీరసాధిపతి బుధుడు అవడం చేత వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. భారతదేశం ఆర్థిక పరంగా ముందుకు సాగుతుంది. తెలుగురాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి. పశ్చిమ దేశాల్లో యుద్ధ భయం, యుద్ధ వాతావరణాలు ఉండి ఆర్థికపరంగా పశ్చిమ దేశాలకు అనిశ్చితి ఏర్పడుతుంది. మేఘాధిపతి రవి అవడం చేత పంటలకి క్రిమి కీటకాదుల వల్ల ముప్పు ఉంటుంది. రైతులకు కొంత ఆర్థిక నష్టం జరగవచ్చు. ధనవంతులు అధిక ధనవంతులు అవుతారు. పెద్ద వ్యాపారస్తులు లాభాలు బాగా ఆర్జిస్తారు. చిన్న వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆర్థికంగా భారతదేశానికి శుభ ఫలితాలనూ, తూర్పు ప్రాంతాలకు, తూర్పు దేశాలకు అనగా చైనా, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు అభివృద్ధిని సూచిస్తోంది.ఆరోగ్యం ఫరవాలేదు...శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో నవనాయకులలో ఐదుగురు పాపులు, నలుగురు శుభులు ఉండడం చేత రాజు రవి, మంత్రి చంద్రుడు అవటం వల్ల ప్రజలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉంటారు. కొన్ని గ్రహాల స్థితిగతులు అలజడులకు, విచిత్ర రోగాలకు, సర్వత్రా ఆందోళనలకు దారి తీస్తాయి. సంవత్సరారంభం నుంచి మే 6వ తేదీ వరకూ మీనరాశిలో నాలుగు గ్రహాలు ఒకే రాశిలో కూటమి కావడం వల్ల విశేష సూర్యతాపం, అకాల మరణాలు, యుద్ధ భయాలు, ధరల పెరుగుదల వంటి ఫలితాలు చూడాల్సిన పరిస్థితి. ఏప్రిల్ 1 నుంచి 13 రోజుల పాటు మీనరాశిలోనే పంచగ్రహ కూటమి ఏర్పడనుంది. దీనివల్ల దుర్భిక్ష పరిస్థితులు, కొన్ని దేశాలలో వ్యాధుల వ్యాప్తి, జననష్టం, ప్రకృతి బీభత్సాలు వంటివి నెలకొంటాయి. జూన్ ఒకటో తేదీ నుంచి జులై 28వ తేదీ వరకూ కుజరాహువుల పరస్పర వీక్షణాల వల్ల యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు, కొన్ని వ్యాధులు వ్యాపించే సూచనలు. ఉగాది నుండి సుమారు మూడు నెలల పాటు అపసవ్య రీతిన కాలసర్పదోష ప్రభావం కారణంగా వివిధ సమస్యలు, రోగాలతో ప్రజలు అవస్థ పడతారు. జాతీయ, అంతర్జాతీయ నేతలు కొందరిపై ఆరోపణలు, అరెస్టులు, ఆందోళనలు రేకెత్తవచ్చు. – చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్తఅనుబంధాలు జాగ్రత్తఈ ఏడాది పాలకుల మధ్య గాని కుటుంబ, వ్యక్తిగత అనుబంధాలుగానీ అంత బాగుంటాయని చెప్పలేం. అందువల్ల బంధుమిత్రుల ఇళ్లకు అతి ముఖ్యమైన పని మీద వెళ్లినా, ఎక్కువ సమయం ఉండకుండా తొందరగా పని చూసుకుని రావడం మంచిది. అనుబంధాలు, మానవ సంబంధాలు బాగుండాలంటే తరచు మాట్లాడుకుంటూ ఉండటం శ్రేయస్కరం. ఆర్థికంగా అంత బాగుండని బంధువుల మీద తెలిసీ తెలియక భారం వెయ్యకుండా వారికి మీ వల్ల చేతనైన సాయం చేయడం మంచిది. అనవసరమైన, చెయ్యలేని, చేతకాని వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చలేక మాటలు పడి మానసిక ప్రశాంతతను పోగొట్టుకునే బదులు చెయ్యగలదానిని మాత్రమే చెప్పడం, చెయ్యలేని వాటిని సున్నితంగా ముందే మా వల్ల కాదని చెప్పడం వల్ల స్నేహసంబంధాలు దెబ్బ తినకుండా ఉంటాయి. బంధువులు, మిత్రుల మధ్య అనుబంధాలు బాగుండాలంటే వారితో స్నేహ సంబంధాలు కొనసాగించడం మేలు. – డా. మైలవరపు శ్రీనివాసరావు, ఆధ్యాత్మిక వేత్తఆనందానికి లోటు లేదుఈ విశ్వావసు నామవత్సరంలో పేరులోనే విశ్వశాంతి గోచరిస్తోంది. క్రోధాలు, మోసాలు, ద్వేషాలు తొలగిపోయి ప్రజలంతా ఒక్కమాటగా ఉంటారు. రాజకీయ రంగంలోని వారికి అవకాశాలు రావడం వల్ల ఆనందంగా ఉంటారు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు వచ్చి ఆనందంలో తేలుతారు, సాహిత్య, సాంస్కృతిక పర్యాటక రంగాలలోని వారికి అనుకూలంగా ఉండటం వల్ల ఆనందం కలుగుతుంది. ప్రజలంతా చేయీ చేయీ కలుపుకొని మాటా మాటా కలుపుకొని మనసులలోని శంకలు మాపుకొని ఒక్కతాటి మీద నడుస్తూ ఆనందంగా ఉంటారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరం తక్కువ ఎక్కువలనూ పేదాగొ΄్పా తారతమ్యాలను విడనాడి, దేశంలోని అన్ని రంగాలలో సమన్వయం ఏర్పడి అందరూ కలసి కట్టుగా ప్రతి నిత్యం ఆనందంతో మునిగి తేలుతూ అంబరాలనంటేలా సంబరాలను జరుపుకుంటూ జీవిద్దాం. – తాడిగడప సోదరులు: తాడిగడప సుబ్బారావు, తాడిగడప బాల మురళి భద్రిరాజు,శ్రీ వాగ్దేవి జ్యోతిష విద్యాలయం,పెద్దాపురంఅభివృద్ధికరంగా ఉంటుందిశ్రీవిశ్వావసు నామ సంవత్సరంలో దేశ అభివృద్ధి ఆశాజనకంగా ఉంది. ఈ సంవత్సరం గ్రహాలలో అత్యధిక శాతం శుభులు ఉండడం వల్ల ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. సస్యవృద్ధి, పశుసంపదకు క్షేమం, ఆయురారోగ్యం కలుగుతుంది. రాజ్యాధిపతి అనుకూలుడుగా ఉండడంవల్ల దేశాధినేతలకు పాలకులకు శుభం చేకూరుతుంది. కొన్ని రాష్ట్రాలలో అతివృషి,్ట మరికొన్ని రాష్ట్రాలలో అనుకూల వృష్టి ఉండవచ్చు. నిత్యావసర వస్తువుల ధరలు నిలకడగా ఉంటాయి. రసవస్తువుల ధరలు కొంత హెచ్చి తగ్గుతాయి. నీరస వస్తువులు ధరలు తగ్గి స్వల్పంగా హెచ్చుతాయి. పరిపాలకులు సంయమనంతో ఉంటారు. చేతివృత్తుల వారికి ఈ సంవత్సరం చేతి నిండా పని దొరుకుతుంది. దేశ రక్షణ బాధ్యతను వహించే సైనికులకు ఈ సంవత్సరం పరీక్షా సమయం అయినప్పటికీ విజయం సాధిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమంపై దృష్టి సారిస్తారు. నీటిపారుదల, పారిశ్రామిక రంగాలపై పాలకులు ్రపాధాన్యతను చూపుతారు. యువకులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి– ఓరుగంటి నాగరాజశర్మ, పుష్పగిరి పీఠ మహాసంస్థాన సిద్ధాంతి, జ్యోతిష విద్వాంసులుఆధ్యాత్మికం మిశ్రమంశ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆధ్యాత్మికంగా, సామాజిక పరంగా శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి చేయూత, పండితులకు కొంత వరకు ఆర్థికసాయం అందే అవకాశం ఉంది. గురుడు వర్ష జగ లగ్నంలో కేంద్ర గతులవడం వల్ల ధార్మిక ఆరాధనల్లో విస్తృతి పెరుగుతుంది. ముఖ్య దేవాలయాల్లో కొన్ని సంస్కరణల వల్ల హైందవ జాతికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా మతపరమైన విషయాల్లో స్వీయ మత ఎరుక పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మం అభివృద్ధికరంగా ఉంటుంది. అయితే షష్ఠగ్రహ కూటమి వల్ల బంద్‌లు, అధిక ఉష్ణోగ్రతల వల్ల సమాజంలో కొంత భయం ఏర్పడి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అంతరాయం కలుగవచ్చు. అలాగే మత్తు మందులు మారక ద్రవ్యాల వల్ల చెడుమార్గం పట్టే వారికి సంఖ్య పెరిగి వారికి ఆధ్యాత్మిక కట్టడి అవసరం అవుతుంది సమాజంలో ఆధ్యాత్మిక చింతనకు ధనవంతుల ఆర్థికసాయం లభించగలదు. – చింతా గోపీశర్మ, సిద్ధాంతి – డి.వి.ఆర్. భాస్కర్ -
ప్రేమ.. పరువు.. ఆత్మహత్య.. హత్య!
ప్రేమ.. త్యాగం నేర్పుతుంది అంటారు. కానీ.. యువతీ, యువకుల మధ్య చిగురించిన ప్రేమ బలికోరుతోంది. సామాజిక సమీకరణాలు కుదరక కులాల కుంపటి రాజుకుంటోంది. గ్రామాల్లో ఈ పోకడ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాము కనీ, పెంచిన పిల్లలు తమకు దక్కకుండా పోతారన్న భయం, పరువు పోతుందన్న ఆందోళనలో తల్లిదండ్రులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. .. ఇవి హత్యల వరకు దారితీస్తున్నాయి. మరోపక్క తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించన్న భయంతో ప్రేమికులు ప్రాణత్యాగాలు చేసుకుంటున్నారు. దురదృష్టవశాత్తూ ఉమ్మడి జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండగా.. సామాజిక అంతరాలకు అద్ధం పడుతున్నా యి. వేర్వేరు కులాల యువతీ, యువకులు ప్రేమించుకుంటే వారిపై దాడులు సహజమే అయినా.. అది చంపుకునేదాకా వెళ్తుండడమే ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ఉత్తరాదికే పరిమితమైన ఈ పోకడ ఉమ్మడిజిల్లాకు పాకడం గమనార్హం.పంతాలతో కుటుంబాలు నాశనంసామాజిక కట్టుబాట్లను ఛేదించలేక, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల ప్రేమను అంగీకరించలేక పెద్దలు తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాలు ఆయా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. కుటుంబ పెద్ద జైలుకు వెళ్లడంతో ఆర్థికంగా చితికిపోతున్నా యి. వాస్తవానికి ఏ సమాజంలో ఏ పరువు కోసం హత్యలు చేస్తున్నారో.. తరువాత అదే సమాజం ఆయా కుటుంబాలకు అండగా నిలబడని విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో యుక్తవయసులో ప్రేమే సర్వస్వం అంటూ జీవితంలో స్థిరపడక ముందే ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ప్రాణాలు తీసుకుని, తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు.ఉమ్మడి జిల్లాలోని పలు ఘటనలు⇒ మార్చి 27న పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటకు చెందిన సాయికుమార్‌ను అదే గ్రామానికి చెందిన ముత్యం సద య్య తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని గొడ్డలితో నరికి చంపడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేవలం కులాలు వేరన్న కా రణమే సాయిని చంపేలా చేసింది.⇒ ఇల్లందకుంట యువకుడు, నిర్మల్ జిల్లాకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దల ఆమోదం ఉండదన్న ఆందోళనతో మార్చి 17న జమ్మికుంట పరిధిలోని రైల్వేస్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.⇒ మార్చి 6న చొప్పదండికి చెందిన ప్రేమికులు ఇంట్లోవారు తమ ప్రేమను అంగీకరించరన్న భయంతో కరీంనగర్లో స్నేహితుడి ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.⇒ 2024 ఏప్రిల్‌లో తాను అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయిందన్న బాధతో సిరిసిల్ల జిల్లాలో ఓ తండ్రి తన కుమార్తెకు పిండ ప్రదానం చేశాడు. తమ ఆశలను అడియాశలు చేసిన కూతురు మరణించిందని ఫ్లెక్సీ పెట్టించడం సంచలనంగా మారింది.⇒ 2023 నవంబరులో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన ప్రేమికులు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు.⇒ 2023 ఆగస్టులో కోరుట్ల పట్టణంలో తన ప్రియుడితో పరారయ్యే క్రమంలో ప్రియురాలు తన అక్కనే హత్య చేసి పరారవడం కలకలం రేపింది.⇒ 2021 ఆగస్టులో మంథనికి చెందిన ఓ ప్రేమజంటపై యువతి తండ్రి హేయంగా దాడి చేశాడు. ఈ దాడిలో ప్రేమికులు తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు. ⇒ 2017లో మంథనిలో మధుకర్ అనే దళిత యువకుడి అనుమానాస్పద మరణం కూడా పరువుహత్యగా ప్రాచుర్యం పొందింది. అనుమానాస్పద మరణం అని పోలీసులు, ప్రి యురాలి బంధువులే చంపారని మధుకర్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దళితసంఘాలు ధర్నా చేయడంతో మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. అప్పట్లో ఇది జాతీయస్థాయిలో చర్చానీయాంశంగా మారింది. ఈ కేసు ఇంకా తేలాల్సి ఉంది.⇒ 2016లో తిమ్మాపూర్‌లోని ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకునేందుకు పీటల మీద కూర్చున్న జంటపై యువతి బంధువులు దాడి చేశారు. పెళ్లికూతురు కళ్లముందే పెళ్లి కొడుకును విచక్షణా రహితంగా పొడిచి చంపడం కలకలం రేపింది.ఆలోచన తీరు మారాలి కులం అహంకారంతో జరిగే దారుణాలతో ప్రాణాలుపోతున్నాయి. టెక్నాలజీలో ముందున్న మనం ఆధునికంగా ఆలోచించలేక పోతున్నాం. ఉన్నత చదువులు చదువుకునే..యువత కూడా ప్రేమించుకోవడం.. కాదన్నారని ప్రాణాలు తీసుకోవడం తగదు. ఈ ఘటనలకు కేవలం ఆలోచన తీరే కారణం. తీరుమారితే విపరీత ధోరణులు మారుతాయి. – ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత,సోషియాలజీ విభాగం అధిపతి, శాతవాహన వర్సిటీకుల వివక్షపై అవగాహన కల్పించాలి సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నా కుల,మత భేదాలు గ్రామాల్లో అలాగే కొనసాగుతున్నాయి. కులాల మధ్య వైరుధ్యాలు పెరిగేలా ప్రభుత్వాలు కులాల ఆధారంగా ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజల మధ్య దూరాలను పెంచుతున్నాయి. పిల్లల ప్రేమ కన్నా పరువు, పట్టింపులే ఎక్కువ అనే భావన తొలిగేలా, కులవివక్షపై ప్రజలకు అవగాహన కలిగించేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.– కల్లెపల్లి ఆశోక్, కేవీపీఎస్ :::సాక్షిప్రతినిధి, కరీంనగర్ -
ఎఫ్ఎంసీజీ దిగ్గజాల షాపింగ్
ముంబై: ఇటీవల కొద్ది నెలలుగా ఎఫ్ఎంసీజీ రంగ దిగ్గజాలు షాపింగ్‌లో బిజీగా కనిపిస్తున్నాయి. ఇతర సంస్థల కొనుగోళ్లకు తెరతీస్తున్నాయి. ప్రధానంగా ఆధునికతరం డిజిటల్ బ్రాండ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న చిన్నతరహా కంపెనీలు లక్ష్యంగా షాపింగ్‌ను చేపడుతున్నాయి. జెన్‌జెడ్ వినియోగదారులకు చేరువ అవుతున్నాయి. డైరెక్ట్‌టు కన్జ్యూమర్ బ్రాండ్స్ సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వినియోగదారులను వేగంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే పరిమిత పంపిణీ వ్యవస్థ, నిధులలేమి కారణంగా పలు కంపెనీలు కార్యకలాపాలను విస్తరించలేకపోతున్నాయి. కొనుగోళ్ల బాటలో దీంతో ఎఫ్ఎంసీజీ కంపెనీలు హెచ్‌యూఎల్, గోద్రెజ్ ఆగ్రోవెట్, ఐటీసీ చిన్న సంస్థలను సొంతం చేసుకుంటున్నాయి. దీంతో చిన్నతరహా సంస్థలు తమ ప్రొడక్టులను విస్తారిత మార్కెట్లో పరిచయం చేసేందుకు వీలు కలుగుతోంది. ఇటీవల స్కిన్‌కేర్ బ్రాండ్ మినిమలిస్ట్‌ను హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) సొంతం చేసుకోగా.. గోద్రెజ్ ఆగ్రోవెట్.. క్రీమ్‌లైన్ డెయిరీను కొనుగోలు చేసింది. హెచ్‌యూఎల్ తెలంగాణలో పామాయిల్ క్షేత్రాన్ని కొనుగోలు చేసింది. తద్వారా సబ్బులు తదితర ప్రొడక్టుల తయారీలో పామాయిల్ అవసరాలను సర్దుబాటుచేసుకోనుంది. ఈ బాటలో తాజా గా ప్లాస్టిక్ రీసైక్లింగ్ సంస్థ.. లుక్రో ప్లాస్టిసైకిల్లో వాటా కొనుగోలు చేసింది. తద్వారా భవిష్యత్‌లో ఎఫ్ఎంసీజీ కంపెనీలకు తప్పనిసరికానున్న ప్లాస్టిక్ రీసైక్లింగ్ నిబంధనల అమలుకు హెచ్‌యూఎల్ దారి ఏర్పాటు చేసుకుంటున్నట్లు విశ్లేషకులు వివరించారు. మామాఎర్త్ లిస్టింగ్.. దశలవారీగా 100 శాతం వాటా కొనుగోలు చేస్తున్న డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ గూటికి.. ఫ్రోజెన్, రెడీటు ఈట్ ఆహార ప్రొడక్టుల కంపెనీ ప్రసుమ చేరనుంది. తొలుత 43.8 శాతం వాటాతో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి వాటాను ఐటీసీ సొంతం చేసుకోనుంది. ఇప్పటికే మరో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామీ.. పురుషుల సౌందర్య పోషక సంస్థ హీలియోస్ లైఫ్‌స్టైల్(ద మ్యాన్ కంపెనీ)ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇదేవిధంగా చింగ్స్ సీక్రెట్, స్మిత్ అండ్ జోన్స్ బ్రాండ్ల కంపెనీ క్యాపిటల్ ఫుడ్స్‌ను టాటా గ్రూప్ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ చేజిక్కించుకుంది. తద్వారా ఆర్గానిక్, హెల్త్ ఫుడ్ విభాగంలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. కాగా.. మామాఎర్త్ బ్రాండ్ ప్రొడక్టుల డీటూసీ కంపెనీ హోనసా కన్జ్యూమర్ డిజిటల్ మార్గంలో వినియోగదారులను ఆకట్టుకుంటున్నప్పటికీ ఆఫ్‌లైన్‌లో విస్తరించడంలో సవాళ్ల కారణంగా వృద్ధి పరిమితమవుతున్నట్లు విశ్లేషకులు వివరించారు. వెరసి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ కంటే ఎఫ్ఎంసీజీ దిగ్గజాల ద్వారా అధిక నిధులు, విస్తరణకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రీమియం ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ బ్రాండ్ ఇందులేఖను హెచ్‌యూఎల్ కొనుగోలు చేయడంతో పరిమితస్థాయి నుంచి బయటపడి భారీస్థాయిలో అమ్మకాలు సాధిస్తుండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ బాటలో మినిమలిస్ట్ ప్రొడక్టులు సైతం వేగవంత వృద్ధి సాధించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు కొంతకాలంగా ప్రత్యేక తరహా చిన్నకంపెనీలపై దృష్టి పెట్టాయి. డిజిటల్ బ్రాండ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న సంస్థల కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నాయి. తద్వారా జెన్‌జెడ్ వినియోగదారులకూ చేరువ అవుతున్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
డిజిటల్ చెల్లింపులు.. ‘ఖాతా’కు చిల్లులు!
డబ్బులు ఏట్లో పారేసినా లెక్క పెట్టి పారేయాలన్నది పెద్దల మాట. అంటే చేతితో డబ్బులు లెక్క పెట్టి పారేస్తూ ఉంటే దాని విలువ తెలుస్తుందని భావన. అలాగే మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయినీ ఏదైనా పుస్తకంలో రాసుకుంటే నెల చివరలో దేనికెంత ఖర్చు పెట్టాము.. ఎక్కడ అనవసరంగా ఖర్చు చేస్తున్నాము.. ఏ ఖర్చులు తగ్గించుకోవాలి.. ఎక్కడ మిగిలించాలనే విషయాలు తెలుస్తాయి. దీన్ని బట్టే ఫ్యామిలీ బడ్జెట్ రూపొందించుకోవచ్చు. కానీ ఇటీవల డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ కొనుగోళ్ల పుణ్యమా అని ఎంత డబ్బు వస్తున్నా ఇట్టే అయిపోతోంది. లెక్క పెట్టకుండా ఖర్చు చేయడం వల్లే ఈ సమస్య వస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.కర్నూలు(హాస్పిటల్): కర్నూలు జిల్లాలో ప్రస్తుతం అన్ని రకాల వ్యాపారాలు ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ ద్వారానే సాగుతున్నాయి. ఒకప్పుడు ఫోన్ పే, గూగుల్ పే లాంటివి ఉపయోగించాలంటే భయపడే జనం ఇప్పుడు అవలీలగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఎంతగా అంటే రూ.5 నుంచి వేల రూపాయల వరకు ఆన్లైన్లోనే చెల్లింపులు చేస్తున్నారు. ఏదైనా కొనుగోలు చేసినా, ఎవరికైనా డబ్బు పంపాలన్నా, అప్పు ఇవ్వాలన్నా, తీసుకున్న రుణం తీర్చాలన్నా, ఇతర ఎలాంటి లావాదేవీలైనా సరే డిజిటల్ పేమెంట్ తప్పనిసరి అవుతోంది.అయితే పెట్టే ఖర్చు మొత్తం బ్యాంకు ఖాతా ద్వారానే జరుగుతోంది. దీన్నిబట్టి ఎవరికి ఎంత డబ్బులు వస్తున్నా యి, ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంత ఏఏ ఖాతాలకు మళ్లిస్తున్నారు, ఎవరెవరికి చెల్లిస్తున్నారు, వీరికి ఎవరి నుంచి డబ్బులు వస్తున్నాయనే విషయాలన్నీ బ్యాంకుల వారికి తెలిసిపోతోంది. అది చిన్న మొత్తమైనా, పెద్ద మొత్తమైనా సరే అన్ని వివరాలు ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా మనకు తెలియకుండానే బ్యాంకులకు/ప్రభుత్వానికి చెప్పేస్తున్నాయన్న మాట. కోవిడ్ తర్వాత ఊపందుకున్న పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ రూపంలో పదేళ్ల క్రితం డెబిట్, క్రెడిట్‌కార్డులు, గిఫ్ట్‌కార్డులు వచ్చాయి. కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసి వాటిని వ్యాపార దుకాణాల్లో స్క్రాచ్ చేసి డబ్బులు చెల్లించేవారు. కొంత కాలం తర్వాత ఇవే కార్డుల ద్వారా ఆన్లైన్లోనే వస్తువులను కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. కోవిడ్ అనంతరం వ్యాపార లావాదేవీల్లో మరింత సరళతరం వచ్చింది. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా జనం డబ్బు చెల్లించడం, తీసుకోవడం ప్రారంభించారు. ఎంతగా అంటే రూ.5ల కొనుగోలుకు సైతం ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. మొదట్లో ఇలా డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడని వ్యాపారులు సైతం క్రమంగా అంగీకరించక తప్పని పరిస్థితి. చిల్లర కొరత కారణంగా కూడా డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయి.» కర్నూలు నగరంలోని ఎ.క్యాంపునకు చెందిన వెంకట్ ఓ ప్రైవేటు కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. ఆయన జీతం నెలకు రూ.60వేలు. వచ్చిన జీతంతో ఇంట్లోని నలుగురు కుటుంబసభ్యులతో హాయిగా జీవిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో నెలాఖరుకు అకౌంట్లో డబ్బులన్నీ అయిపోయినట్లు గమనిస్తున్నాడు. ఇంత డబ్బు ఏమైందని పరిశీలిస్తే అదంతా డిజిటల్ పేమెంట్స్ ద్వారా తానే ఖర్చు చేసినట్లు నిర్ధారించుకున్నాడు.» ఆదోనికి చెందిన నాగేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. చిరుద్యోగమే అయినా 20 ఏళ్లకు పైగా సీనియారిటీ ఉండటంతో జీతం రూ.లక్షకు పైగా వస్తోంది. మొదట్లో తాను ఖర్చుచేసిన ప్రతిదీ ఓ పుస్తకంలో రాసుకునే అలవాటు ఉండేది. అన్ని ఖర్చులు పోను నెలకు 30శాతం దాకా మిగిలేది. కానీ ఇటీవల డిజిటల్ అకౌంట్లో ఖర్చు పెడుతూ లెక్క రాసుకోవడం మానేశాడు. నెల తిరిగేసరికి బ్యాంకు ఖాతా ఖాళీ అవుతోంది. ఎందుకిలా అని ప్రశ్నించుకుంటే ఆన్లైన్లో తెలియకుండానే తానే ఖర్చు చేస్తున్నట్లు తెలుసుకున్నాడు.లెక్కలేకుండా ఖర్చు పెట్టేస్తున్నారు ఆన్లైన్ లావాదేవీల కారణంగా బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యేవరకు మనం ఎంత ఖర్చు పెట్టామో తెలియని పరిస్థితి. దీనికితోడు ఏ వస్తువును ఎంతకు కొనుగోలు చేస్తున్నారో కూడా తెలియకుండా, బేరమాడకుండా కొనేస్తున్నారు. సాధారణంగా మనం కిరాణా దుకాణానికి వెళ్తే సరుకులకు దేనికి ఎంత బిల్లు వేశాడో చూస్తాము. కానీ డిజిటల్ పేమెంట్స్ కారణంగా ఇవేమీ పట్టించుకోవడం లేదు. షాపువారు ఎంత చెబితే అంత చెల్లించి వచ్చేస్తున్నారు. దీనివల్ల డబ్బు విలువ చాలా మందికి తెలియకుండా పోతోంది. ముఖ్యంగా ఈ తరం యువతకు అస్సలు తెలియడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్యాంకుల్లోనూ పలుచబడిన జనం ఒకప్పుడు బ్యాంకులకు వెళ్తే అక్కడ పనిపూర్తి చేసుకుని తిరిగి రావడానికి గంట నుంచి రెండు గంటల సమయం పట్టేది. కోవిడ్ తర్వాత ఈ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. అప్పటి వరకు వివిధ రకాల పథకాల సొమ్ము అకౌంట్లో ప్రభుత్వం వేస్తే దానిని తీసుకోవడానికైనా బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్లేవారు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ కారణంగా డబ్బు ఎలా వస్తుందో, ఎలా పోతుందో కూడా తెలుసుకోలేకపోతున్నారు. దాదాపుగా అన్ని చోట్లా ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రుణాలను సైతం బ్యాంకు యాప్‌ల ద్వారానే నిమిషాల్లో తీసుకునే సౌలభ్యం వచ్చింది. కేవలం కరెంట్ బ్యాంకు ఖాతాలు ఉన్న కొద్ది మంది వ్యాపారులు మాత్రమే పెద్ద మొత్తంలో డబ్బులు వేయడానికి, డ్రా చేయడానికి మాత్రమే బ్యాంకులకు వెళ్తుండటం గమనార్హం. ఖాతాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి, అనుమానాలు తీర్చుకోవడానికి మాత్రమే బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. ఎంత ఖర్చు చేస్తున్నామో తెలియట్లేదు గతంలో డబ్బు చేతిలో ఉంటే చూసి ఖర్చు పెట్టేవారం. నగదు రూపంలో డబ్బులు ఉండటం వల్ల దేనికెంత ఖర్చు చేస్తున్నామో తెలిసేది. కానీ ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ కావడంతో ఎంత ఖర్చు చేస్తున్నామో అర్థంకాని పరిస్థితి. తెలియకుండానే నెలలో 20 నుంచి 30 శాతం ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం. – సాయిరామ్, ప్రభుత్వ ఉద్యోగి, కర్నూలు -
ఆ ‘క్లిక్కే’ వేరు!
సాక్షి, స్పెషల్ డెస్క్: మనతోని అట్లుంటది.. అవును ఆటైనా, పాటైనా.. ఆఖరుకు రిటైల్ అయినా రికార్డులు సృష్టించడంలో ఆ ‘క్లిక్కే’వేరు. ప్రపంచ ఆన్లైన్ రిటైల్ రంగంలో కస్టమర్ల సంఖ్య పరంగా అమెరికాను దాటి రెండవ అతిపెద్ద మార్కెట్‌గా భారత్ అవతరించింది. 28 కోట్ల మంది ఆన్లైన్ షాపర్స్‌తో రిటైల్ మార్కెట్‌ను మన దేశం షేక్ చేస్తోందని ఫ్లిప్‌కార్ట్ సహకారంతో బెయిన్ అండ్ కంపెనీ రూపొందించిన నివేదిక వెల్లడించింది. 92 కోట్ల మంది ఈ–రిటైల్ షాపర్స్‌తో చైనా తొలి స్థానంలో కొనసాగుతోంది. 27 కోట్ల ఆన్లైన్ షాపర్లతో అమెరికా మూడో స్థానంలో నిలిచింది. క్విక్ కామర్స్, ట్రెండ్–ఫస్ట్ కామర్స్, హైపర్–వాల్యూ కామర్స్ భారత్‌లో తదుపరి ఆన్లైన్ కొనుగోళ్ల వృద్ధి అధ్యాయాన్ని నిర్వచించనున్నాయి.ఐదు మించి ప్లాట్‌ఫామ్స్.. ఈ–రిటైల్ షాపర్స్‌లో జెన్–జీ తరం (1997–2012 మధ్య పుట్టినవారు) సంఖ్య దాదాపు 40% ఉంది. ప్రత్యేక షాపింగ్ అలవాట్లు వారి సొంతం. వారిలో సగం మంది ఏటా ఐదు, అంతకంటే ఎక్కువ ప్లాట్‌ఫామ్‌ల నుంచి కొనుగోళ్లు చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న ఫ్యాషన్ బ్రాండ్లపై ఇతర కస్టమర్లతో పోలిస్తే జెన్–జీ తరం మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తోంది. హైపర్ వాల్యూ కామర్స్ (అతితక్కువ ధరగల ఉత్పత్తులు) సామాన్యులను ఆకర్షిస్తోంది. ఈ–రిటైల్‌లో 2021లో 5% వాటా కలిగి ఉన్న ఈ విభాగం ఇప్పుడు 12% మించిపోయింది. కిరాణా, జీవనశైలి, సాధారణ వస్తువులు ఈ–రిటైల్ మార్కెట్లో 55% వాటా కలిగి ఉన్నాయి. ఇవి 2030 నాటికి మూడింట రెండు వంతులకు చేరనున్నాయి. తోడైన క్విక్ కామర్స్.. భారత్‌లో తలసరి జీడీపీ రూ. 2,99,950 కంటే ఎక్కువగా ఉన్న కేరళ, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, చండీగఢ్, తమిళనాడు ఇప్పటికే ఈ–రిటైల్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే 1.2 రెట్లు అధికంగా వ్యాప్తి చెందాయి. దేశంలోని ఈ–రిటైల్ రంగంలో ప్రధానంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో వంటి సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తూ గ్రామాల వరకు వ్యాపారాన్ని విస్తరించాయి. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ తదితర క్విక్ కామర్స్ కంపెనీలు మొత్తం ఈ–కామర్స్ జోరుకు సహాయపడుతున్నాయి.క్విక్ కామర్స్ యాక్టివ్ కస్టమర్ల సంఖ్య 2 కోట్లు దాటింది. స్వల్పకాలిక స్థూల ఆర్థిక ఎదురుగాలులు ఉన్నప్పటికీ భారత ఈ–రిటైల్ మార్కెట్లో దీర్ఘకాలిక అవకాశాలు బలంగా ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. ట్రెండ్–ఫస్ట్ ఫ్యాషన్ (సరసమైన ధరలకు ట్రెండీ కలెక్షన్) ఒక్కటే నాలుగు రెట్లు పెరిగి 2028 నాటికి సుమారు రూ. 68,560–85,700 కోట్లకు చేరుకోనుంది. ట్రెండ్–ఫస్ట్ ఫ్యాషన్ ఆదాయంలో సగానికిపైగా ఆన్లైన్ అమ్మకాల ద్వారానే రానుంది. పెద్ద నగరాలతో సమానంగా..⇒ ఈ–రిటైల్‌లో 2020 నుంచి ఇప్పటివరకు నమోదైన కొత్త కస్టమర్లలో దాదాపు 60% మంది తృతీయ శ్రేణి పట్టణాలు, చిన్న నగరాలకు చెందినవారే. అలాగే 2021 నుంచి ఈ–రిటైల్ ప్లాట్‌ఫామ్‌లలో చేరిన నూతన విక్రేతలలో 60% కంటే ఎక్కువ మంది ద్వితీయ శ్రేణి, చిన్న నగరాల నుంచి ఉన్నారు. మొత్తం ఆర్డర్స్‌లో తృతీయ, ఆ తర్వాతి స్థాయి పట్టణాల వాటా 45% పైగా ఉంది. ద్వితీయ శ్రేణి, చిన్న నగరాల్లో వినియోగదార్ల ఈ–రిటైల్ ఖర్చు మెట్రో, ప్రథమ శ్రేణి నగరాలతో సమానంగా ఉంది. అంతేగాక వివిధ వస్తు విభాగాలలో సగటు అమ్మకపు ధరలు సమానంగా లేదా కొంచెం తక్కువగా ఉన్నాయి.పదింటిలో ఒకటి ఈ–రిటైల్‌కు..ఈ–రిటైల్ (ఆన్లైన్ కొనుగోళ్లు) విపణి భారత్‌లో 2019– 2024 మధ్య ఏటా 20% వార్షిక వృద్ధి రేటు నమోదు చేసింది. 2024లో ఈ రంగంలో రూ. 5,14,200 కోట్ల వ్యాపా రం జరిగింది. ఏటా 18% వృద్ధితో 2030 నాటికి ఇది రూ. 14,56,900–16,28,300 కోట్లకు చేరుకుంటుందని అంచనా. స్థూల ఆర్థిక కారకాలు, వినియోగం క్షీణించిన కారణంగా దేశీయ ఈ–రిటైల్ వృద్ధి గతేడాదిలో 10–12 శాతానికి మందగించినప్పటికీ తాజాగా రికార్డు సృష్టించడం విశేషం. ఒకానొక దశలో ఈరంగం 20% పైగా వృద్ధి సాధించింది.2030 నాటికి దేశంలో తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) రూ. 2,99,950– 3,42,800లకు చేరనున్న నేపథ్యంలో కస్టమర్లు రిటైల్‌లో 10 డాలర్లు (రూ. 857) వెచి్చస్తే ఒకటి ఈ–రిటైల్ కోసం ఖర్చు చేస్తారట. అనవసర ఖర్చుల పెరుగుదల అందుకు ఆజ్యం పోయనుందని నివేదిక వివరించింది. -
కొత్త తరానికి చెబుదాం
తెలుగువారి తొలి పండగ వచ్చేస్తోంది. నూతనోత్సాహంతో ఉగాదిని ఆహ్వానించడానికి సిద్ధమవుతున్న వేళ... కొత్త తరానికి పండగల అర్థం తెలుస్తోందా? అంటే... ‘పెద్దవాళ్లు చెబితేనే తెలుస్తుంది’ అంటున్నారు ప్రముఖ రచయితలు రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్. ఉగాది ప్రత్యేకంగా ఇంకా ఈ ఇద్దరూ చెప్పిన విశేషాలు తెలుసుకుందాం.పండగలు జరుపుకోవడం ఎవరూ మానేయలేదు. పిండివంటలు చేసుకోవడానికైనా పండగలు చేసుకుంటున్నాం. పండగ పూట తల స్నానం చేసి, ఉగాది పచ్చడి తిన్న తర్వాతే మిగతా పనులు చేయాలని పిల్లలకు పెద్దలు చెప్పాలి. ఎప్పటికప్పుడు కొత్త తరానికి పాత తరంవాళ్లు చెబుతుండాలి. ఎందుకంటే పండగలన్నీ ముందు తరంవాళ్లు చేసుకుంటూ వచ్చారు కాబట్టి చెప్పడం వారి బాధ్యత. కొత్త తరాన్ని పాజిటివ్‌గా స్వాగతించాలి. వారూ వెల్‌కమింగ్‌గానే ఉంటారు. మన తానులో పెరిగిన ముక్కలు వేరేలా ఎలా ఉంటారు? కొత్త తరానికి పద్ధతులన్నీ కొత్తే. పోనీ ఇవాళ్టి పాత తరం అనుకున్నవారికి ఎవరు చెప్పారు? వారి ముందు తరంవారు చెబితేనే కదా వీరికి తెలిసింది. ఇది రిలే పందెంలాంటిది. ఒక తరానికి ఒక తరానికి సక్రమంగా విషయాలను అందజేయాల్సిన బాధ్యత ముందు తరానికి ఉంటుంది. యువతని నిందించడం సరికాదు: ప్రపంచాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. మంచి కోణంలో... దుర్గార్మపు కోణంలో... ఎప్పుడూ మొదటి కోణంలో చూస్తే మంచిది. అది కాదనుకుని యువత పెడదారి పట్టిందని, ఏదేదో జరిగిపోతోందని యువతరాన్ని నిందించడం సరికాదు. ఏదీ వక్రీకరించిన కోణంలో చూడొద్దు. ఫారిన్ కల్చర్ అంటున్నాం... విదేశాలు వెళ్లి చూస్తే ఇక్కడికన్నా ఎక్కువ అక్కడ పండగలు బాగా జరుపుకుంటున్నారు. అన్నమాచార్యుల కీర్తనలు కూడా పాడుతున్నారు. ఇక్కడితో పోల్చితే అమెరికా ఫాస్ట్ ఫార్వార్డ్ అనుకోవాలి కదా. కానీ అక్కడ మన సంప్రదాయాలు బతికే ఉన్నాయి. ఇక ఎప్ప టికీ ఇండియా రామని తెలిసిన కుటుంబాలు కూడా తమ పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు... మన సంప్రదాయాల గురించి చెబుతున్నారు. పిల్లలూ నేర్చుకుంటున్నారు. యువతరం బాధ్యతగా ఉంటోంది: సారవంతమైన నేల అది (యువతరాన్ని ఉద్దేశించి). బీజం వేయడం అనేది మన చేతుల్లో ఉంది. ముందు తరం బాధ్యతగా ఉండి, తర్వాతి తరానికి దగ్గరుండి అన్నీ నేర్పించి, అన్నీ ఆచరించేలా చేయాలి. వీళ్లు పాటిస్తూ వాళ్లు పాటించేలా చేయాలి. పొద్దున్నే వీళ్లు స్నానం చేయకుండా... పిల్లలను స్నానం చేసి, పూజలు చేయమంటే ఎందుకు చేస్తారు? నువ్వు చేయడంలేదు కదా? అంటారు. ఒకవేళ మాటల రూపంలో చెప్పకపోయినా... ముందు తరం ఆచారాలు పాటిస్తుంటే వీళ్లు చూసి, నేర్చుకుంటారు... అనుసరించడానికి ఇష్టపడతారు. బోధించే విధానం సక్రమంగా ఉండాలి. ఫైనల్‌గా చెప్పేదేంటంటే... మనం అనుకున్నంతగా యువతరం ఏమీ దిగజారిపోలేదు. చెప్పాలంటే మనకన్నా ఇంకా బాధ్యతగా ఉంటూ, పాతా కొత్తా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్నారు. ఈ కాలపు పిల్లలు ఇంటికీ, బయటికీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తెలిసినవాళ్లు. వాళ్లలో ఏదైనా లోపం ఉందీ అంటే... చెప్పేవాళ్లదే కానీ వాళ్లది కాదు. సో... ఏ పండగని ఎందుకు జరుపుకోవాలో విడమర్చి యువతరానికి చెప్పాల్సిన బాధ్యత ముందు తరానిదే. సంవత్సరాది ఎందుకు జరుపుకుంటున్నాం? ఉగాది పచ్చడి విశిష్టత వంటివి చెప్పి, పండగ అర్థం తెలియజేయాలి.పండగ‘రుచి’చూపాలి– అనంత శ్రీరామ్పండగలు జరుపుకునే తీరు మారింది. పెళ్లిళ్లల్లో ఎప్పుడైతే మనకు లేని రిసెప్షన్ అని మొదలుపెట్టామో అలానే పండగలు జరుపుకునే తీరులోనూ మార్పు వచ్చింది. ఉగాది గురించి చెప్పాలంటే... మా ఊరులో ఐదు రోజులు ఉగాది జాతర జరుగుతుంది. మాది వెస్ట్ గోదావరి, యలమంచిలి మండలం, దొడ్డిపట్ల గ్రామం. జాతర సందర్భంగా ఊరేగింపులు అవీ చేస్తుంటారు. ఇప్పుడూ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు జాతరలో భాగంగా మేజిక్ షోస్ అంటూ వెస్ట్రన్ కల్చర్ మిక్స్ అయిపోయింది. ఉగాది అంటే కవి సమ్మేళనాలు విరివిగా జరిగేవి. ఇప్పుడలా లేదు. ఎవరైనా విద్యావంతులు లేదా శాంతి సమాఖ్యలు వాళ్లు ఏదో టౌన్ హాలులో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసినా ఓ ఇరవై ముప్పైమంది ఉంటున్నారు... అంతే. ఉగాది ప్రత్యేకం అమ్మవారి జాతర: ఇక మా ఊరి ఉగాది గురించి చెప్పాలంటే... మాణిక్యాలమ్మ మా గ్రామ దేవత. ఉగాది సమయంలో మాకు ఆ అమ్మవారి జాతర ఉంటుంది. ఉగాది ప్రత్యేకం అంటే ఆ జాతరే. ఐదు రోజులు ఘనంగా చేస్తారు. ఐదో రోజు అయితే అమ్మవారిని బాగా అలంకరించి, ఊరేగించి, తెప్పోత్సవం చేస్తారు. నేను ప్రతి ఏడాది దాదాపు మిస్ కాకుండా వెళతాను. ఈసారి కుదరదు. ఆరు రుచులను సమానంగా ఆస్వాదించాలి: ఉగాది పచ్చడిలోని షడ్రుచుల గురించి చెప్పాలంటే... నేను ‘ఒక్కడున్నాడు’ సినిమాలో ‘ఇవ్వాళ నా పిలుపు... ఇవ్వాలి నీకు గెలుపు... సంవత్సరం వరకు ఓ లోకమా...’ అని పాట రాశాను. అది పల్లవి. పాట మొదటి చరణంలో రుచుల గురించి రాశాను. ‘కొంచెం తీపి... కొంచెం పులుపు పంచే ఆ ఉల్లాసమూ... కొంచెం ఉప్పు... కొంచెం కారం పెంచే ఆ ఆవేశమూ... చేదూ వగరూ చేసే మేలూ... సమానంగా ఆస్వాదించమని ఇవ్వాళ నా పిలుపు’ అని రాశాను. ఆరు విభిన్నమైన రుచులను సమానంగా ఆస్వాదిస్తేనే జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలమని చెప్పడమే ఆ పాట ఉద్దేశం. అంటే... జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నింటినీ సమానంగా స్వీకరించగలగాలి.ఆ బాధ్యత పెద్దవాళ్లదే: ఇక నేటి తరం గురించి చెప్పాలంటే... ఇప్పుడు కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలతో హాలోవెన్ అంటూ రకరకాల వేషాలు వేయిస్తున్నారు. వేలంటైన్స్ డే అనీ ఇంకా వేరే ఎక్కడెక్కడనుంచో తెచ్చిపెట్టుకున్న పండగలను జరుపుతున్నారు. అయితే పిల్లలకు మన పండగల గురించి చెప్పాలి. వేరే సంబరాలు ఎలా ఉన్నా కూడా మన పండగలకు ఎక్కువప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా పాత తరం ఆచరిస్తే కొత్త తరానికి అర్థం అవుతుంది. వాళ్లు మన సంస్కృతీ సంప్రదాయాలను ముందుకు తీసుకెళతారు. మా గ్రామంలో ఉగాది అంటే... ఇంట్లో పిల్లలకు వేప పూత, మామిడికాయలు, చెరుకు గడలు తెమ్మని టాస్కులు ఇచ్చేవారు. అవి తెచ్చే క్రమంలో మాకు పండగలు అర్థమయ్యేవి. అలా మా ముందు తరంవాళ్లు మాకు నేర్పించారు. కొత్త తరానికి మనం అలా నేర్పిస్తే వాళ్లు పాటిస్తారు. ముందు తరాలకు సంస్కృతీ సంప్రదాయాలను నేర్పించే బాధ్యత పెద్దవాళ్లదే.– డి.జి. భవాని -
పూలతో ఘుమఘుమలు
కంచేడి పూలు... అందంగా కనిపించే వీటిని గిరిజనులు లొట్టలేసుకుని మరీ తింటారు... వాటితో ఘుమఘుమలాడే కూరలు చేసుకుని ఇష్టంగా లాగించేస్తారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో లభించే వీటికి అల్లూరి జిల్లాలో మంచి డిమాండ్ ఉంది. ఏజెన్సీ వాసులే కాకుండా ఇప్పుడు మైదాన ప్రాంతవాసులు కూడా వీటిని తినేందుకు అలవాటు పడ్డారు.సాక్షి,పాడేరు: అడవుల్లోను, గ్రామాల సమీపంలోను కంచేడి చెట్లకు మార్చి, ఏప్రిల్ నెలల్లో పూలు పూస్తాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న వీటిని సర్వరోగ నివారిణిగా గిరిజనులు భావిస్తారు. ఈ పూలను ఈ సీజన్లో రోజువారీ కూరగా వండుకుని ఇంటిల్లాపాదీ తింటారు. మైదాన ప్రాంత ప్రజలు కూడా కంచేడి పూల కూర తినడానికి అలవాటుపడ్డారు. అల్లూరి జిల్లాలోని వారపుసంతల్లో ఈ పూల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. శ్రీరాముడు వనవాసం చేసే సమయంలో వీటిని ఉడకబెట్టి తిన్నాడన్న పురాణగాథ కూడా ప్రచారంలో ఉంది. ఈ విరులు.. ఆరోగ్య సిరులు ఈ పూల కూర మంచి రుచికరంగా ఉండడంతో పాటు, ఔషధగుణాలు కలిగిఉండడంతో గిరిజనులు ఇష్టంగా తింటారు. రక్తహీనత, కీళ్ల సమస్య, నొప్పులు, అజీర్ణం, కంటిచూపు మందగించడం వంటి రుగ్మతలు ఉన్న వారు ఈ కూరను తింటే మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మహిళల్లో పలు శారీరక రుగ్మతలను నయం చేస్తుందని గిరిజనుల నమ్మకం. వీటితో వేపుడు, ఇగురు కూరలను వండుకుని తింటున్నారు. కొంతమంది ఎండుచేప, ఎండు రొయ్యలను కూడా కలిపి ఇగురు కూరగా తయారు చేస్తారు. మరి కొంతమంది గిరిజనులు ఈపూలను బాగా ఎండబెట్టి వరిగెలు తయారు చేసుకుని, భద్రపరుచుకుని ఏడాది పొడవునా వండుకుని తింటారు. బుట్ట కంచేడిపూలు రూ.600 నుంచి రూ.800 ధరతో అమ్ముతున్నారు. సంతల్లో చిన్న పోగులుగా వేసి వాటాను రూ.50తో అమ్మకాలు విక్రయిస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ పూలు లభిస్తాయి. అనారోగ్య సమస్యలు దూరం కంచేడిపూలను వండుకుని తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఏడాదిలో రెండు నెలల మాత్రమే పూసే కంచేడి పూలను పూర్వం నుంచి తింటున్నాం. ఈకూర రుచికరంగా ఉండడంతో పాటు శరీరంలోని అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. కంచేడి పూలను మహిళలు అధికంగా తింటారు. – చిట్టిబాబు, ఆయుర్వేద వైద్యుడు,కుజ్జెలి గ్రామం, పాడేరు మండలం -
ముందే ప్లానేద్దాం.. సమ్మర్లో టూరేద్దాం!
సాక్షి, హైదరాబాద్: సమ్మర్ వెకేషన్‌కు ఇప్పటినుంచే మనవారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏటేటా పెరుగుతున్న పర్యాటకుల డిమాండ్‌కు తగ్గట్టుగానే...దేశవ్యాప్తంగా హోటళ్లు (హోటల్ రూమ్‌లు), ఇతర ప్రత్యామ్నాయ విడిదుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ వేసవిలో వివాహాలకు కూడా ముహూర్తాలు ఉండటంతో హోటళ్లకు కూడా డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. గత ఏడాదితో పోల్చితే ఇప్పటికే లగ్జరీ, మిడ్–స్కేల్, బడ్జెట్ సెగ్మెంట్లలో హోటల్ గదుల రేట్లు 10 నుంచి 12 శాతం పెరిగినట్టుగా ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ వర్గాలు చెబుతున్నాయి. తమతమ కుటుంబ బడ్జెట్, వేసవి విడిదులకు సంబంధించి ఖర్చు చేయగలిగే స్తోమతను బట్టి దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలు, విదేశాల్లోని ప్రముఖ సందర్శన ప్రదేశాలు, మరికొందరు వీసా ఫ్రీ దేశాల్లో వేసవి పర్యటనలకు సిద్ధమవుతున్నారు. కశ్మీర్, గోవా, హిమాచల్, కేరళలకు వెళ్లేందుకు క్రేజ్ దేశీయంగా చూస్తే.. కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, గోవా, రాజస్తాన్‌లతోపాటు ఈశాన్య రాష్ట్రాలు వేసవి సెలవులకు గమ్యస్థానాలుగా అగ్రభాగాన నిలుస్తున్నాయి. వీటితోపాటు హిల్‌స్టేషన్లుగా పేరుగాంచిన ముస్సోరి, మనాలి, రుషికేశ్ తదితర ప్రాంతాల్లోని హోటళ్ల గదులకు డిమాండ్ అత్యధికంగా ఉన్నట్టుగా వెల్లడైంది. కూర్గ్, మహబలేశ్వర్ వంటి టూరిస్ట్ డెస్టినేషన్లకు కూడా క్రమంగా పర్యాటకులు పెరుగుతున్నట్టుగా వివిధ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యేకంగా మహబలేశ్వర్‌లోని బీచ్‌కు ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నట్టుగా తెలుస్తోంది. ఉదయ్‌పూర్, జైపూర్లు కూడా ఈ విషయంలో ఏమాత్రం వెనుకబడి లేవు. రుషికేశ్, కాసోల్, హంపి, ముక్తేశ్వర్ వంటి పర్యాటక ప్రదేశాల్లో హాస్టళ్లకు డిమాండ్ పెరుగుతున్నట్టుగా జో వరల్డ్ సంస్థ వెల్లడించింది. టాప్ ఇంటర్నేషనల్ సమ్మర్ డెస్టినేషన్స్ ఇవే.. ఇంటర్నేషనల్ సమ్మర్ డెస్టినేషన్స్‌గా స్విట్జర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, హంగేరీ, ఆ్రస్టియా, చెక్ రిపబ్లిక్, ఇతర ఐరోపా దేశాలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. వీటితోపాటు దుబాయ్, ఈజిప్ట్, జపాన్, సింగపూర్, వియత్నాం, ఇండోనేసియాలకు ఏటా డిమాండ్ పెరుగుతోందని అట్లీస్ సంస్థ వెల్లడించింది. ఇక ఈ వేసవి సీజన్లో యూఏఈ, యూఎస్ఏలకు అత్యధికంగా బుక్సింగ్ జరిగినట్టు ఈ సంస్థ తెలిపింది. ఈ దేశాల్లో పర్యటించేందుకు ముందుగానే పర్యాటకులు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా ఆ సంస్థ అంచనా వేసింది. అంటార్కిటికాలో ఐస్‌బ్రేకర్ క్రూయిజ్‌లు, ఫిన్లాండ్లో నార్తర్న్ లైట్స్ అనుభవాలు, గాజు గోపుర ఇగ్లూలు, ఆర్కిటిక్ సూట్లు మరియు ఆర్కిటిక్ ట్రీహౌస్‌లలో బస వంటి ప్రీమియం అనుభవాలను కూడా ప్రయాణికులు కోరుకుంటున్నారు. సౌత్ ఆఫ్రికా వైన్‌యార్డ్‌లలో కన్వర్టిబుల్ కార్లు లేదా హార్లే–డేవిడ్‌సన్‌లతో సెల్ఫ్–డ్రైవ్ సాహసాలు కూడా ప్రజాదరణ పొందుతున్నాయి.తొలిసారి విదేశీ పర్యటనలకు వెళుతున్న వారిలో ఎక్కువగా కాంబోడియా, శ్రీలంక, అజర్‌బైజాన్‌లను ఇష్టపడుతున్నారు. ఈ దేశాల సందర్శనకు సులభంగా వీసా ప్రక్రియ ఉండటంతోపాటు ఆయా సమ్మర్ ట్రిప్‌లకు అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉండడమే అందుకు కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీసా అవసరం లేని ప్రాంతాలకు ఆదరణ... ఇక వీసా అవసరం లేని వివిధ పర్యాటక దేశాలు భారత టూరిస్ట్‌లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే వీసా ఫ్రీ దేశాలు అయిన నేపాల్, భూటాన్, థాయ్‌లాండ్, మాల్దీవులు, మారిషస్ వంటి వాటికి భారత్ టూరిస్టుల నుంచి భారీగా డిమాండ్ పెరిగినట్టు హాలిడే, టూరిజం నిర్వాహకులు చెబుతున్నారు. ఈ దేశాలు వీసా రహిత సులభ ప్రవేశ కారణంగా గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నాయి. ఎస్ఓటీసీ ట్రావెల్ హాలిడేస్, కార్పొరేట్ టూర్స్ విభాగం నివేదిక ప్రకారం.. వీసా రహిత గమ్యస్థానాలు ప్రయాణికులకు ఖర్చులను ఆదా చేసే అవకాశాన్ని అందిస్తున్నాయని, దీనిని వారు లగ్జరీ అనుభవాల కోసం ఉపయోగిస్తున్నారని పేర్కొంది. ఉదాహరణకు థాయ్‌లాండ్‌లో ముయే థాయ్ (కిక్‌బాక్సింగ్) నేర్చుకోవడం, లగ్జరీ రిసార్ట్‌లలో డిటాక్స్ కార్యక్రమాలు, మారిషస్‌లో స్నార్కెలింగ్ లేదా మాల్దీవ్స్‌లో మిషెలిన్–స్టార్ అండర్‌వాటర్ డైనింగ్ వంటివి ఉన్నాయి. అదే సమయంలో ఫినామినన్–ఆధారిత ప్రయాణం ఒక కీలక ధోరణిగా ఉద్భవించిందని ఈ నివేదిక తెలిపింది. -
వధువు కావలెను
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పెళ్లి కూతుళ్లకు కొరత ఏర్పడింది. అవును.. మీరు చదువుతున్నది నిజం. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అమ్మాయి దొరకడం లేదనే మాట వినిపిస్తోంది. ఆస్తిపాస్తులు, ఉద్యోగం ఉండి కూడా అమ్మాయిల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఆడపిల్లల జనాభా తగ్గడమేనన్నది వాస్తవం. సంప్రదాయ పెళ్లిళ్లన్నీ కులాల ప్రాతిపదికనే నడుస్తాయి. ప్రేమ వివాహాల దగ్గర మాత్రమే కుల ప్రస్తావన కనిపించదు. అయితే కొన్ని కులాల్లో ఆడపిల్లల కొరతతో చాలామంది పెళ్లి కాని ప్రసాద్‌లుగా మిగిలిపోతున్నారు. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ఏ కులం అమ్మాయి అయినా సరే అంటున్నారు. మరికొందరు పెళ్లి ఖర్చు భరిస్తామని, అవసరమైతే అమ్మాయి తరపు వారికి అయ్యే ఖర్చులు కూడా ఇస్తామని ముందుకొస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పెళ్లి సంబంధాల కోసం బంధువులు, తెలిసిన వారి చెవుల్లో వేస్తున్నారు. ఓ అమ్మాయిని వెతికి పెట్టండని మొర పెట్టుకుంటున్నారు. పురుషులకు దీటుగా ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. వివక్ష మాత్రం తగ్గడం లేదు. ఆడపిల్లను ఇప్పటికీ భారంగా భావిస్తున్న వారెందరో ఉన్నారు. కొందరైతే కడుపులో పెరుగుతున్నది ఆడో, మగో తెలుసుకుని.. ఆడపిల్ల అయితే కడుపులోనే తుంచేస్తున్నారు. రెండు మూడు దశాబ్దాలుగా లింగ నిష్పత్తిలో తేడా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలు, వారి తల్లిదండ్రులకు అమ్మాయిల కోసం వెతుకులాట తప్పడం లేదు. తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్–2024 నివేదికలో.. 2011 జనాభా ఆధారంగా రాష్ట్రంలో 2021 ప్రొజెక్టెడ్ పాపులేషన్ రికార్డులను పరిశీలిస్తే ఆడపిల్లల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నట్టు స్పష్టమవుతోంది. పదిహేనేళ్ల నుంచి 19 ఏళ్ల లోపు జనాభాలో.. మగవారి కన్నా ఆడవాళ్లు 96 వేల మేర తక్కువగా ఉన్నారు. అలాగే 20 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపు ఆడపిల్లలు లక్షా 6 వేల మంది తక్కువగా ఉన్నారు. పాతికేళ్ల నుంచి 29 ఏళ్ల లోపు వారు 78 వేల మంది ఆడపిల్లలు తక్కువగా ఉన్నట్టు నివేదిక స్పష్టం చేస్తోంది. పెళ్లి వయసు వచ్చిన మగవారి కన్నా.. ఆడపిల్లలు దాదాపు 2 లక్షల నుంచి 2.50 లక్షల మంది తక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. మ్యారేజ్ బ్యూరోలకు చేతినిండా పని... పెళ్లికూతుళ్ల కొరత మ్యారేజ్ బ్యూరోలకు చేతినిండా పని కల్పిస్తోంది. అబ్బాయి తరపువారు అమ్మాయిల కోసం బ్యూరోలను ఆశ్రయిస్తున్నారు. తెలిసిన వారికల్లా తమ కొడుక్కి ఓ మంచి సంబంధం చూడమంటూనే మరోవైపు బ్యూరోలకు బయోడేటా, ఫొటోలు ఇస్తున్నారు. బ్యూరోల నిర్వాహకులతో ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. గతంలో ఒకటి రెండు కులాల్లో వివాహ వేదికలు ఉండేవి. ఇప్పుడు అన్ని కులాల్లో వివాహ సంబంధాలు వెతికే బ్యూరోలు వెలిశాయంటే.. అమ్మాయిల కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంటర్నెట్లోనూ పెళ్లి సంబంధాలు.. వివాహ సంబంధాలకు మ్యారేజ్‌బ్యూరోలు ఇంటర్నెట్లో వెబ్సైట్లు తెరిచాయి. దీంతో అబ్బాయిలు తమకు ఎలాంటి అమ్మాయి కావాలో వారి అభిప్రాయాలు, చదువు, ఉద్యోగం, కుటుంబ నేపథ్యాలను వెబ్సైట్లలో ఉంచుతున్నారు. పలు వివాహ వేదికలు నిర్వహిస్తున్న వెబ్సైట్లలో వందలు, వేలల్లో పెళ్లి సంబంధాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో వివాహ పరిచయ వేదికలకు గిరాకీ పెరిగింది. వివిధ కులాలకు చెందిన పెళ్లి సంబంధాలను పరిచయ వేదికల ద్వారా వెతికే పని చేపట్టారు. ఈ వేదికలపై ఎన్నో పెళ్లి సంబంధాలు ఖాయం అవుతుండడంతో ఆదరణ పెరుగుతోంది. ఎదురు కట్నాననికి సిద్ధం వరకట్నం సమస్య అమ్మాయిల జనాభా తగ్గడానికి కారణమైన పరిస్థితుల్లో.. ఎదురు కట్నం ఇవ్వడానికి కూడా అబ్బాయిలు సిద్ధమవుతున్నారు. అమ్మాయి దొరికితే చాలు.. అంటూ అమ్మాయి తరపు వారికి ఎదురుకట్నం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. కొన్ని కులాల్లో ఎదురుకట్నం ఇచ్చే సంప్రదాయం మొదలైంది. కొందరు పెళ్లి ఖర్చు భరిస్తున్నారు. అమ్మాయిల కొరతతో ఎందరో అబ్బాయిలు.. పెళ్లికాని ప్రసాద్‌లుగా మిగులుతుండడం ఆందోళన కలిగించే అంశం. -
కారాగారంలో విజ్ఞాన కాంతులు
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారం శిక్షా కేంద్రంగానే కాకుండా.. విద్యా కేంద్రంగానూ రూపాంతరం చెందుతోంది. నేరాల చీకటిలో మగ్గుతున్న ఖైదీలకు విద్య ద్వారా కొత్త జీవితాన్ని వెలిగించే ప్రయత్నం జరుగుతోంది. కారాగారం (Jail) నాలుగు గోడల మధ్యనే ప్రాథమిక విద్య నుంచి పోస్ట్–గ్రాడ్యుయేషన్ వరకు చదువుకునే సౌకర్యం ఉండటం విశేషం. 2024–25 విద్యా సంవత్సరంలో 120 మంది ఖైదీలు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో 90 మంది ప్రాథమిక విద్యను పూర్తి చేస్తుండగా.. 19 మంది పదో తరగతి ఓపెన్ పరీక్షలు రాస్తున్నారు. 11 మంది ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షలను రాశారు. అంతేకాకుండా ఆసక్తి ఉన్న ఖైదీలు ఖాళీ సమయాల్లో చదువుకుంటూ డిగ్రీలు పొందుతున్నారు. కంప్యూటర్ విద్య, స్పోకెన్ ఇంగ్లిష్ (Spoken English) తరగతులు, వివిధ వృత్తుల్లో ఇక్కడ ఖైదీలు శిక్షణ పొందుతున్నారు. గతంలో ఇక్కడ శిక్ష అనుభవించిన ఒక ఖైదీ పీజీ పూర్తి చేసి బంగారు పతకం సాధించడం విశేషం. పని చేస్తూనే చదువుకునే వెసులుబాటు ఉండటంతో, శిక్ష పూర్తయిన అనంతరం విద్యావంతులుగా బయటకు వస్తున్న ఖైదీల సంఖ్య పెరుగుతోంది. అన్నీ జ్ఞానసాగర్లోనే.. జైలు లోపల ‘జ్ఞానసాగర్’ పేరుతో విద్యాలయం ఉంది. ఇక్కడ గ్రంథాలయం, తరగతి నిర్వహణ, విద్యా బోధన, పరీక్షల నిర్వహణ తదితర సౌకర్యాలు ఉన్నాయి. రిమాండ్‌లో ఉన్న ఖైదీలు, శిక్ష పడిన ఖైదీలు ఇక్కడ చదువుకుని పరీక్షలు రాయవచ్చు. చదువు లేని వారికి వయోజన విద్య ద్వారా అక్షరజ్ఞానం కలిగిస్తున్నారు. వారికి ప్రాథమిక స్థాయి నుంచి చదవడం, రాయడం నేర్పుతున్నారు. ఇందుకోసం జైళ్ల శాఖ ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయుడిని నియమించింది. ఈ ఉపాధ్యాయుడు ఖైదీల విద్యా సంబంధిత విషయాలన్నింటినీ చూసుకుంటారు. ఖైదీలు పరీక్షలకు దరఖాస్తు చేసినప్పటి నుంచి వారికి తరగతులు నిర్వహించడం, సందేహాలు తీర్చడం, పరీక్షలు నిర్వహించడం వరకు ఆయనే ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. తరగతులు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతాయి. ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. ఇక్కడ ప్రతి సంవత్సరం చదువుకున్న ఖైదీల సంఖ్య మారుతూ ఉంటుంది. కొత్త వారు రావడం, శిక్ష పూర్తయిన వారు వెళ్లిపోవడం వల్ల ఈ సంఖ్యలో మార్పు ఉంటుంది. గడిచిన ఐదేళ్లలో మొత్తం 55 మంది ఖైదీలు ఓపెన్ పదో తరగతిలో చేరారు. 20 మంది ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. డిగ్రీ స్థాయిలో బీఏ కోర్సును 29 మంది పూర్తి చేయగా, ఒకరు పీజీలో ఎంఏ పరీక్షలు రాశారు. 2020–21లో 80 మంది ప్రాథమిక విద్య, 26 మంది ఓపెన్ టెన్త్, 14 బీఏ చదువుకున్నారు. 2021–22లో 90 మంది ప్రాథమిక విద్య, 10 మంది ఓపెన్ టెన్త్, 9 మంది బీఏ విద్యనభ్యసించారు. 2022–23లో 82 మంది ప్రాథమిక విద్య, ఆరుగురు బీఏ, ఒకరు ఎంఏ చదివారు. 2023–24లో 80 మంది ప్రాథమిక విద్య, 9 మంది ఓపెన్ ఇంటర్మీడియట్ చదివారు. 2024–25 (ప్రస్తుతం)లో 90 మంది ప్రాథమిక విద్య కొనసాగిస్తుండగా, 19 మంది ఓపెన్ టెన్త్ పరీక్షలు రాస్తున్నారు. 11 మంది ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ఖైదీల్లో మార్పు కోసం.. ఖైదీల్లో పరివర్తనం సాధించడానికి చదువు ఉపయోగపడుతుంది. విచక్షణ కల్పించడానికే ఇక్కడ ఖైదీలను విద్యావంతులను చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రత్యేకంగా నియమించిన ఉపాధ్యాయుడు ద్వారా వారికి బోధన జరుగుతోంది. ఖైదీల చదువుకు అయ్యే ఖర్చు, పరీక్ష ఫీజులను జైలు సంక్షేమ నిధి నుంచే చెల్లిస్తున్నాం. చదువు మధ్యలో నిలిపివేసి జైలుకు వచ్చినవారు.. ఇక్కడ చదువు కొనసాగించుకోవచ్చు. – ఎన్.సాయిప్రవీణ్, జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ -
కన్నీటి దిగుబడి
రాయచోటి/రైల్వేకోడూరు అర్బన్: అన్నమయ్య జిల్లాలో దోస, కర్బూజ పంటలు పండించే రైతులకు ఫలితాలు.. ఈ ఏడాది కూడా ఆశాజనకంగా లేవు. నట్టేట ముంచి అప్పులపాలు చేస్తున్నాయి. ఫిబ్రవరి నెల ఆఖరులో, మార్చి మొదటి వారంలో దోస 22 రూపాయలు, కర్బూజ 18 రూపాయలు ధరలు పలకడంతో కొందరు రైతులు లాభపడ్డారు. దీంతో రైతులు కొండంత ఆశ పెట్టుకొన్నారు. కానీ అందరి దిగుబడి చేతికి వచ్చే సరికి.. దళారులు మోసాలతో ధరలను పాతాళానికి పడేశారు. జిల్లాలో భారీగా దోస, కర్బూజ పంటలు సాగు చేశారు. ముఖ్యంగా రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి ప్రాంతాలలో వందలాది మంది రైతులు వేశారు. తెగుళ్లు, దళారీల మోసాలు, గిట్టుబాటు ధరలు లేక భారీగా నష్టపోతున్నారు. ఓబులవారిపల్లిలో కోహినూర్ దోస వేసి ఎగుమతులు లేక రూ.లక్షల్లో నష్టపోయారు. ఎరువులు, పురుగు మందుల పిచికారీ కోసం.. దోస, కర్బూజ పంటల సాగు ప్రారంభ దశ నుంచే రైతులకు మందుల పిచికారీ, ఎరువులు పెనుభారంగా మారింది. విత్తన దశ నుంచి క్రిమి సంహారక మందులకు వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. దీనికి తోడు పూతకు పిందెలు వచ్చే సమయం నుంచి తెగుళ్ల నివారణకు మందుల పిచికారీ అధికంగా ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల పూత రావడానికి, పిందె నిలవడానికి, తెగుళ్లకు రెండు రోజులకు ఒక సారి అయినా మందులు పిచికారీ చేయాలి. కేవలం మందులకే రైతులు దుకాణాల్లో రూ.లక్షలు అప్పులు చేశారు.తూకాల్లో కోత రైతులు పంటకు ధరలు పడి పోయి కన్నీరు కారుస్తుంటే.. పలువురు దళారీలు ఇదే అదునుగా మరింతగా రేటు తగ్గిస్తున్నారు. ఇక్కడి దిగుబడిని ఇతర రాష్ట్రాలకు కూడా తరలిస్తుంటారు. ఇదే అదునుగా రైతులకు, వ్యాపారులకు మధ్య దళారులు చేరి అక్కడ ఒకరేటు, రైతులకు ఒకరేటు, లోడ్ తూకాలలో కోత, కమీషన్లు ఇలా రకరాలుగా మోసం చేస్తున్నారు. కరుణించని పాలకులు మార్కెట్ ధరలు లేక అప్పుల ఊబిలో కూరుకుపోయిన దోస రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గిట్టుబాటు ధరలు రావడం లేదని రైతు సంఘాల నేతలు గళమెత్తి అరుస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం.. కష్టాల కడలిలో ఉన్న కర్షకులను పరామర్శ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రాంతం ఎమ్మెల్యేలు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు కోరుతున్నారు. రైతులను ఆదుకోవాలి సంబేపల్లి మండలం రెడ్డివారిపల్లె పంచాయతీ సీఎం కొత్తపల్లిలో రైతు రామచంద్ర 4 ఎకరాలలో రూ.6 లక్షలు ఖర్చు చేసి సాగు చేశారు. దళారులు అడిగినంతకు కాయలు ఇవ్వలేదని వాటిని కొనుగోలు చేయలేదు. కాయలు తోటలోనే కుళ్లిపోవాల్సిన పరిస్థితి. పండించిన పంటను మార్కెట్‌కి తరలించలేక రైతు తోటలోనే కూలిపోయాడు. ఇలా వేల మంది రైతులు దోస, కర్బూజ తోటలను సాగు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కావున ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. – బాలకృష్ణారెడ్డి, రైతు సంఘం రీజనల్ కోఆర్డినేటర్, అన్నమయ్య జిల్లా ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పు రావాలి జిల్లాలో సాగవుతున్న పంటలో సగం ఒక పైగా రైతులు పండ్ల తోటలు వేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని మంచి ఆదాయాన్ని గడించవచ్చని దోస పంట సాగు చేశారు. రైతులు పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధరలు రావాలంటే ప్రజలు ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మంచిది. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు మంచి ఆరోగ్యం కోసం ఆహారంలో 200 గ్రాములు పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. జిల్లాలో పండించిన రైతుకు బాగుంటుంది. – రవిచంద్రబాబు, జిల్లా ఉద్యానవన అధికారి, అన్నమయ్య జిల్లా అనుకూలించని రేటుకష్టపడి పండించిన కర్బూజాకు మార్కెట్ ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కొంత మంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా దోస, పుచ్చకాయ పంటను సాగు చేశారు. మార్కెట్లో కేజీ దాదాపు రూ.15 నుంచి రూ.20 పలుకుతోంది. దళారులు కేజీ రూ.5 లేదా రూ.8 మాత్రమే చెల్లిస్తున్నారు.కానీ ఎకరాకు పెట్టుబడి 50 వేల నుంచి లక్ష రూపాయలకు పైగా అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. దీంతో పంటపై పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొలంలోనే కాయలను వదిలి వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వాపోతున్నారు. దళారీల సిండికేటుతో ఇక్కట్లు నా పేరు ఎద్దుల ప్రసాద్. మాది రైల్వేకోడూరు. పది ఎకరాలలో కర్బూజా పంటను సాగు చేశా. దళారుల సిండికేట్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలోని వ్యాపారులు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా కలిసి వాట్సాప్ గ్రూపులలో దోస, కర్బూజా ధరలను పంచుకుంటున్నారు. ఒక వ్యాపారి తోట దగ్గరికి వచ్చి కిలో 5 రూపాయలతో కొనుగోలు చేస్తామని చెప్పి వెళ్లిన విషయాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతు పేరుతోపాటు గ్రూపులలో షేర్ చేస్తున్నారు. దీంతో మిగిలిన వ్యాపారులు అదే ధరకు లేదా మరో రూపాయి అదనంగా ఇస్తామని మాత్రమే చెబుతున్నారు. పెట్టుబడి కూడా రాలేదు నా పేరు నిరంజన్‌రెడ్డి. మా ఊరు చిన్నమండెం మండలం రెడ్డివారిపల్లె. 20 ఎకరాల్లో దోస సాగు చేశా. పంట దిగుబడి వచ్చే వరకు 30 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఉద్యానవన అధికా రుల సూచనలతో పురుగు నివారణ మందులు పిచికారీ చేశాను. ఎకరాకు నాలు గైదు టన్ను లు వస్తుందని ఆనందపడ్డాను. ప్రకృతి కరుణించలేదు, తెగుళ్లు వీడలేదు. ఫలితంగా సగం తోట దెబ్బతిన్నది. వచ్చిన దిగుబడితోనైనా పెట్టుబడి వస్తుందని ఆశించాను. మార్కెట్‌కి వెళ్తే ధరలు లేక, పెట్టిన పెట్టుబడి రాక ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితులు వచ్చాయి. అప్పుల పాలైన అన్నదాత ఇదీ ఈ ఇద్దరి రైతుల ఆవేదనే కాదు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొంది. -
ఆహా షిదాల్.. అంతా.. ఫిదా!
ఈశాన్య రాష్ట్రాలు తయారు చేసే రుచుల్లో ఒకటి షిదాల్. ఎండుచేపలు, చేపల నిల్వ పచ్చళ్లకు పూర్తి భిన్నంగా.. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించేలా నోరూరించే వంటకమే షిదాల్. కేవలం ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా అందరినీ ఫిదా అనిపించేలా షిదాల్పై పరిశోధనలు, మార్కెటింగ్‌కు కేంద్ర మత్స్య పరిశోధన సంస్థ (సీఐఎఫ్టీ) శ్రీకారం చుట్టింది. ఆ దిశగా విస్తృత పరిశోధనలు చేస్తోంది. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం ఈశాన్య రాష్ట్రాల్లో నిరంతరం వర్షం కురుస్తూనే ఉంటుంది. ఎండలు చాలా తక్కువ. ఇక్కడ చేపలు, ఇతర ఆహార పదార్థాలు ఎండబెట్టాలంటే తగిన సూర్యరశ్మి లభ్యం కాదు. అందుకే ఈ రాష్ట్రాల ప్రజలు ఎండబెట్టడానికి ప్రత్యామ్నాయంగా పులియబెట్టడాన్ని (Fermentation) ఆచరిస్తున్నారు. పాల ఉత్పత్తులు, కూరగాయలు, చేపలు.. ఇలా పదార్థాల్ని భిన్నమైన పద్ధతుల్లో పులియబెడుతూ వాటిని ఆహారంలో వినియోగిస్తుంటారు. ఇందులో ప్రత్యేకమైంది షిదాల్. అంటే.. పులిసిన చేపలు. ఇప్పుడు ఈ పులిసే చేపల ఉత్పత్తులు ఈశాన్య రాష్ట్రాల్లో విరివిగా లభిస్తున్నాయి.షిదాల్ తయారీ ఇలా..అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, అసోం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లో చిన్న చిన్న మంచినీటి చేపలు దొరుకుతాయి. వీటిని కిణ్వ ప్రక్రియ ఆధారంగా నిల్వ చేస్తారు. భారీగా చేపలు లభ్యమైన సమయంలో వాటిని 4 నుంచి 5 రోజుల పాటు కిణ్వ ప్రక్రియలో ఆరబెడతారు. 10 నుంచి 40 కిలోల బరువును తట్టుకునే పరిమాణంలో లభించే ప్రత్యేకమైన మట్టికుండల్ని సిద్ధం చేస్తారు. ఈ కుండలకు వెజిటబుల్ ఆయిల్ లేదా చేప నూనెని లోపల, బయట పూసి ఆరబెడతారు. అలా మూడు నాలుగు పర్యాయాలు చేస్తారు. ఆ తర్వాత శుభ్రం చేసిన చేపల్ని ఆ కుండల్లో వేస్తారు. వాటిపై గతంలో తయారు చేసిన షిదాల్ నూనె, మంచినీరు వేసి ప్లాస్టిక్ కవర్‌తో పైన గట్టిగా గాలి చొరబడకుండా కట్టి మూతపెడతారు. తర్వాత మట్టితో మొత్తం కుండను కప్పేస్తారు.వీటిని ఎండ తగలని ప్రదేశంలో చల్లని ప్రాంతంలో 3 నుంచి 6 నెలలు నిల్వ ఉంచుతారు. ఈ విధానంలో లభించే చేపలనే షిదాల్ అంటారు. సాధారణంగా ఎండు చేపలు తయారీలో అవి పాడవ్వకుండా ఉప్పుని కలుపుతారు. కానీ షిదాల్ కిణ్వప్రక్రియలో ఉప్పు వాడరు. త్రిపురలో ఎక్కువగా దీన్ని తయారు చేస్తుంటారు.ఆ మూడు చేపలతో షిదాల్.. కుంటియస్, సెటిపిన్నా, గుడీసియా చేపల్ని షిదాల్కు వినియోగిస్తారు. ప్రస్తుతం వీటి ధర కిలోకు రూ. 800 నుంచి రూ. 1000 వరకూ పలుకుతోంది. రోజువారీ ఆహారంలో తీసుకుంటారు. నూనెలో మసాలాతో తాలింపు వేసి ఆహారంగా తీసుకుంటారు. షిదాల్తో లాభాలు » వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది» పొట్టలో మంచి సూక్ష్మ జీవుల సంఖ్య రెట్టింపు చేస్తుంది» పేగు, కాలేయ, జీర్ణాశయ వ్యాధులనుంచి రక్షణ ఇస్తుంది » హృద్రోగ, కొన్ని రకాల క్యాన్సర్లు, ఇన్ఫెక్షన్లకు అడ్డుకట్ట వేస్తుంది» మధుమేహం దరిచేరనీయదు లభించే పోషకాలు » ప్రొటీన్లు 30–35 శాతం » కొవ్వులు 15–18 శాతం » ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అమైనో ఆమ్లాలు పుష్కలం» సమృద్ధిగా కాల్షియం నాణ్యత, పోషకాలపై పరిశోధనలుషిదాల్ ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. దీన్ని దేశవ్యాప్తంగా అందించేందుకు కేంద్ర మత్స్య పరిశోధన సంస్థ (సీఐఎఫ్టీ) తరఫున పరిశోధనలు ప్రారంభించాం. కుంటియస్, సెటిపిన్నా, గుడీసియా చేపలు తక్కువగా లభిస్తున్నందున ఇతర చేపలతోనూ షిదాల్ తయారు చేయొచ్చా అనేదానిపై పరిశోధనలు చేపడుతున్నాం. పులియబెట్టేందుకు తోడువేసే స్టార్టర్ కల్చర్‌పైనా పరిశోధనలు ప్రారంభిస్తున్నాం. భారత ఆహార భద్రత–ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రమాణాలకు అనుగుణంగా.. ప్యాకింగ్ చేసి ఆన్లైన్ మార్కెటింగ్‌పైనా సీఐఎఫ్టీ దృష్టిసారిస్తోంది.– డా‘‘ బి. మధుసూదనరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీఐఎఫ్టీ -
గంగ రాళ్ల గలగల
కోరుట్ల: ఎక్కడైనా... ఎవరైనా గోదావరి తీరానికి వెళ్లడం సర్వసాధారణమే.. కానీ అక్కడి తీర గ్రామాల ప్రజల దృష్టి వేరేగా ఉంటుంది. ఇసుక తిన్నెల్లో దొరికే గంగరాళ్లను సేకరిస్తారు. పూజ గదుల్లో భద్రపరుస్తారు. ఇంట్లో అవి ఉంటే శుభప్రదమని విశ్వసిస్తారు. గోదావరి తీరానికి మొక్కులు, శుభకార్యాల కోసం వెళ్లిన ప్రతీ ఒక్కరు రంగురంగుల గంగరాళ్లపై దృష్టి పెడతారంటే అతిశయోక్తి కాదు. జగిత్యాల జిల్లాలో ఇబ్రహీంపట్నం నుంచి ధర్మపురి మండలం రాయపట్నం వరకు సుమారు 90 కిలోమీటర్ల గోదావరి పరివాహక ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో సుమారు 28 గ్రామాల వరకు ఉన్నాయి. ఈ గ్రామాల్లోనే కాదు.. చుట్టుపక్కల ఉన్న పట్టణ ప్రాంతాల్లోనూ గంగరాళ్ల సెంటిమెంట్ ఉంటుంది.శుభకార్యాలతో ముడిపడి..నీటితోనే మనిషి మనుగడ.. జలం జాడలున్న చోటే జనం అవాసాలు ఏర్పాటు చేసుకోవడం సాధారణం. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వచ్చే గోదావరి నది.. నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల వెంబడి ప్రవహిస్తుంది. ఈ ప్రాంతవాసులు గోదావరి గంగ అని పిలుచుకుంటారు. ప్రతీ శుభకార్యానికి గోదావరి నదికి వెళ్లి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడి వారి సంప్రదాయం. పుట్టువెంట్రుకలు, గర్భిణులకు గంగ తెప్పలు, పౌర్ణమి పుణ్యస్నానాలు, గంగ మొక్కులు చెల్లించుకోవడమే కాకుండా.. పితృదేవతలకు పిండాలు పెట్టడం, ఎవరైనా చనిపోతే.. ఆ వెంటనే గంగస్నానాలు చేయడం వంటి కార్యక్రమాలను గోదావరి తీరంలోనే చేస్తుంటారు. ఈ క్రమంలో గోదావరి (గంగ)తో ఇక్కడి ప్రాంతవాసుల జీవనశైలి, ఆచార వ్యవహారాలతో విడదీయరాని బంధం ఉంది. గంగరాళ్ల సెంటిమెంట్గంగ తీరంలో శుభకార్యాల కోసం బంధు మిత్రులతో కలిసి వెళ్లిన వారు పుణ్యస్నానాలు ముగించుకుని ఇక్కడి ఇసుకలో దొరికే రంగు రంగుల గంగరాళ్ల కోసం వెతకడం కనిపిస్తుంది. వీటిని పెద్దవాళ్లు శుభసూచకంగా భావిస్తే.. చిన్నపిల్లలు ఆట వస్తువులుగా.. గంగరాళ్లను సేకరిస్తారు. గంగ నీటి ప్రవాహంలో వందలాది కిలోమీటర్ల దూరం కొట్టుకువచ్చిన ఈ రాళ్లు.. విభిన్నమైన ఆకృతుల్లో, రంగుల్లో ఉంటాయి. దీంతో వీటిని ఇష్టంగా ఇంటికి తీసుకెళ్తారు. ఇలా తీసుకువచ్చిన గంగరాళ్లను వ్యాపారులు తమకు శుభాలు కలగాలని కౌంటర్ టేబుల్‌పై పేపర్‌వెయిట్‌గా ఉపయోగిస్తారు. చిన్నగా ఉండి లింగాకారంలో ఉండే రంగురాళ్లను శివునికి ప్రతీకగా పూజ గదుల్లో ఉంచుతారు. మరికొంతమంది గంగరాళ్లను దేవుడి గది ముందు ఉంచుతారు. ఇంట్లో శుభకార్యాలు జరిగినపుడు అదే రాయిపై కొబ్బరికాయలు కొట్టి దేవుళ్లకు అభిషేకం చేస్తుంటారు. మరికొంతమంది ఈ రంగురాళ్లను నీళ్లజాడీలో ఉంచి అలంకరణ కోసం వాడతారు. ఇలా ఈ ప్రాంత జనంలో గంగరాళ్ల సెంటిమెంట్ అనాదిగా కొనసాగుతోంది.బెల్లం రంగు రాళ్లు ఇష్టంగంగరాళ్లు అంటే నాకు చాలా ఇష్టం. వాటిలో బెల్లం రంగులో ఉండే రాళ్లు బాగుంటాయి. ఎప్పుడు గోదావరి తీరానికి వెళ్లినా అలాంటి రాళ్లను వెతికి తెచ్చుకుంటాను. ను న్నటి పెద్ద గంగరాయి దొరికితే.. దాన్ని పూజ గదిలో ఉంచుకుంటాం. ఇంట్లో శుభకార్యాలు, దేవునికి పూజలు చేసే సమయాల్లో కొబ్బరి కాయలు కొట్టడానికి వాడతాం. – కంటాల అనితదేవి, కోరుట్లవ్యాపారం బావుండాలని..వ్యాపారులు గంగరాళ్లను కౌంటర్ టేబుల్‌పై పెట్టుకుంటారు. దీన్ని ఒకవైపు పేపర్‌వెయిట్‌గా.. మరోవైపు వ్యాపారాల్లో లాభాలు తెచ్చే శుభసూచకంగా వినియోగి స్తారు. మా పిల్లలు గంగకు వెళ్లినప్పుడు ఆసక్తిగా ఇసుకలో రంగురాళ్లను వెతికి తెచ్చుకుని ఆటపాటల్లో వినియోగిస్తారు. – చిద్రాల వినోద్, వ్యాపారి, కోరుట్ల -
ఏఐ ఉందా జాబ్ ఇంద..
సాక్షి, స్పెషల్ డెస్క్: ‘ఒకప్పుడు ఐటీలో ఉద్యోగం చేయాలంటే ఆఫీసుకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనం లేదా కారు ఉంటే సరిపోయేది. ఇప్పుడలా కాదు. అభ్యర్థికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానం తప్పనిసరి..’ఇవి ఒక ప్రముఖ కంపెనీ హెచ్ఆర్ హెడ్ చేసిన వ్యాఖ్యలు. ఆయన మాటలు ప్రస్తుత జాబ్ మార్కెట్లో వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. సంప్రదాయ విద్యార్హతలకు మించి మార్కెట్‌కు తగ్గట్టుగా ఉద్యోగులూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటేనే విజయం సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏఐ రెడీ వర్క్‌ఫోర్స్ ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఒక్క భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు ఉంది. సాంకేతిక పురోగతి వైపు ప్రపంచ జాబ్ మార్కెట్ పయనిస్తోంది. కంపెనీల లేఆఫ్‌లకు కారణాల్లో ఒకటైన ఏఐ.. కొత్త ఉద్యోగ అవకాశాలకూ వేదిక అవుతోంది. భారత్‌లో 2027 నాటికి ఏఐలో 23 లక్షల ఉద్యోగావకాశాలు వెల్లువెత్తుతాయని బెయిన్ అండ్ కంపెనీ ఇటీవలి నివేదికలో వెల్లడించింది. నిపుణుల సంఖ్య మూడేళ్లలో 12 లక్షలకు చేరుకుంటుందని, కొరత 10 లక్షలకు పైమాటే అని వివరించింది. బడా కంపెనీల్లో లేఆఫ్స్..ఏఐ సృష్టిస్తున్న ప్రభంజనం ప్రభావం లేఆఫ్స్ రూపంలో కనిపిస్తోంది. కంపెనీల ఆదాయాల్లో వృద్ధి లేకపోవడం, ఉత్పాదకత పడిపోవడం, వ్యయాలు అధికం కావడం, లాభాల కోసం ఇన్వెస్టర్ల ఒత్తిడి.. ఉద్యోగుల తీసివేతలకు కారణమవుతున్నాయి. టెక్నాలజీ కంపెనీలకు అగ్రరాజ్యంగా చెప్పుకునే యూఎస్‌లో ఉద్యోగుల తీసివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. 2025లో ఇప్పటివరకు 89 టెక్ కంపెనీలు అంతర్జాతీయంగా సుమారు 23,400 మందిని ఇంటికి పంపించాయి. వీటిలో గూగుల్, మెటా, డిస్నీ, సిటీ గ్రూప్, హెచ్‌పీ, వాల్‌మార్ట్, ఫోర్డ్, స్టార్‌బక్స్ వంటి దిగ్గజాలు ఉన్నాయి. అమెజాన్ 18 వేల మందికి, ఐబీఎం 9 వేల మందికి, బోయింగ్ 10% మందికి ఉద్వాసన పలుకుతున్నాయని సమాచారం. సేల్స్‌ఫోర్స్ 30% మందిని ఇంటికి పంపనున్నట్టు తెలుస్తోంది. 2024లో 549 కంపెనీలు 1.52 లక్షల మందికి గుడ్‌బై చెబితే.. 2023లో ఏకంగా దాదాపు 1,200 కంపెనీలు 2.64 లక్షల మంది టెకీలను సాగనంపాయి. యూఎస్‌లో టెక్, సంబంధిత రంగాల్లో నిరుద్యోగిత రేటు 2022తో పోలిస్తే 2024లో 2.9 నుంచి 4.4 శాతానికి చేరుకుంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సర్వే ప్రకారం 41 శాతం అంతర్జాతీయ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వచ్చే ఐదేళ్లలో శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. భారత్‌లో అంత లేదు.. భారత్‌లో ఐటీ కంపెనీలు నిశ్శబ్దంగా లేఆఫ్‌లు చేపడుతున్నాయి. ఒక్క బెంగళూరులోనే ఏడాదిలో 50,000 మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయారని సమాచారం. అయితే తీసివేతలు ఆందోళన కలిగించే స్థాయిలో లేవన్నది నిపుణుల మాట. హైదరాబాద్‌లో మాత్రం కంపెనీలు గతంలో మాదిరి ఇబ్బడిముబ్బడిగా కాకుండా ఆచితూచి నియామకాలు చేపడుతున్నాయి. టీసీఎస్ 1,80,000 నియామ కాలకు శ్రీకారం చుట్టింది. ఇక మొత్తం లేఆఫ్‌లలో ఏఐ ప్రభావానికి గురైనవి 10% మాత్రమేనట. కరోనా కాలంలో కంన్జ్యూమర్ టెక్‌పై వ్యయాలు పెరగడంతో అందుకు తగ్గట్టుగా కంపెనీలు నియామకాలు చేపట్టాయి. నాటి రిక్రూట్మెంట్లో పరిమిత నైపుణ్యం గల వారు సైతం ఉన్నారు. వీరి వల్ల ఉత్పాదకతలో అసమతుల్యత ఏర్పడి కంపెనీలు క్లయింట్ల ఆగ్రహానికి లోనయ్యాయి. ఇటువంటి వారిపైనే ఇప్పుడు కత్తి వేలాడుతోంది. మరోవైపు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) భారత్‌కు వెల్లువెత్తుతున్నా యి. ఈ కేంద్రాల్లో రిక్రూట్మెంట్ కొనసాగుతోంది. ప్రతి ఉద్యోగి నిత్య విద్యార్థిగా ఉండాలి ప్రీమియం, క్వాలిటీ స్కిల్స్ ఉన్నవారికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఏఐ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ కొరత ఉంది. డిమాండ్‌కు తగ్గ నైపుణ్యం పెంచుకోవడమే ఇప్పుడున్న మార్గం. కంపెనీలపై ఆధారపడకుండా సొంతంగానైనా నైపుణ్యం అందిపుచ్చుకోవాలి. టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే. – వెంకారెడ్డి, హెచ్ఆర్ రంగ నిపుణులు క్యాంపస్‌లోనే కొట్టాలి.. విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనే జాబ్ కొట్టాలి. విఫలం అయితే కాస్త కష్టపడాల్సిందే. దొరికినా రూ.2.5 లక్షల లోపు వార్షిక ప్యాకేజీతోనే. నైపుణ్యం ఉన్నవారికి జీసీసీలు అధిక వేతనాలు ఆఫర్ చేస్తున్నా యి. నియామకాల్లో జీసీసీల హవా కొనసాగుతోంది. – నానబాల లావణ్య కుమార్, కో–ఫౌండర్, స్మార్ట్‌స్టెప్స్ -
వెల్లువలా ఫిర్యాదులు
సాక్షి నెట్వర్క్:⇒ పింఛన్ ఇప్పించాలంటూ వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల వేడుకోలు..!⇒ తమ భూములు కబ్జాకు గురయ్యాయంటూ కాళ్లరిగేలా తిరుగుతున్న గిరిజనులు..!⇒ రేషన్ కార్డులు, ఇళ్ల కోసం నెలల తరబడి ఆరాటంతో ఎదురు చూస్తున్న పేదలు..! ⇒ అడుగు ముందుకు పడని భూముల మ్యుటేషన్లు.. పాస్‌బుక్‌లు అందక రైతన్నల గగ్గోలు..! ⇒ స్థలాలు ఆక్రమణలకు గురై తీవ్ర ఆందోళనలో సామాన్యులు..! ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ అందక చదువులు మధ్యలో ఆగిపోయిన పిల్లలు..!ఇంతమంది ఇన్ని సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నా పరిష్కారం లభిస్తుందనే భరోసా ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఓ ప్రహసనంగా.. సమస్యల నిలయంగా మారింది! కలెక్టర్ నుంచి జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటున్న ఈ వేదిక ప్రజలకు ఏమాత్రం భరోసా కల్పించలేకపోతోంది. ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు తరలి వస్తున్న వారితోపాటు కార్యాలయాలను కుప్పలు తెప్పలుగా ముంచెత్తుతున్న అర్జీలే ఇందుకు సాక్ష్యం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కడ చూసినా సమస్యలతో సతమతమవుతూ నెలల తరబడి తిరుగుతున్నవారే కనిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిష్కార వేదికల వద్దకు వచ్చిన వారిని ‘సాక్షి’ ప్రతినిధుల బృందం పలుకరించగా ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపించాయి. గత ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం కల్పిస్తూ అడుగులు ముందుకు వేసిందని, గ్రామ స్థాయిలో ఇంటి వద్దకే పౌర సేవలను అందచేసిందని గుర్తు చేసుకున్నారు. ఏ కారణం చేతనైనా సరే.. అర్హుల్లో ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా లబ్ధి చేకూరేలా ఏటా రెండుసార్లు జాబితాను సిద్ధం చేసి సచివాలయాల్లో పారదర్శకంగా ప్రదర్శించి వలంటీర్ల ద్వారా ఇంటికే పథకాలను చేరవేసిందని చర్చించుకోవడం కనిపించింది.⇒ ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రామలింగం. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం మాచాపురానికి చెందిన ఆయన కుమారుడు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 32లో 89 సెంట్లను రామచంద్రుడు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. ఇందులో 44 సెంట్ల భూమిని ఈశ్వరయ్య అనే వ్యక్తికి విక్రయించాడు. మిగిలిన 45 సెంట్ల భూమికి పాస్‌బుక్ కోసం వెళితే మూడు సార్లు సర్వే కోసం చలానా కట్టించుకున్నారు. సర్వేయర్ ఒక్కసారి కూడా వచ్చి సర్వే చేయలేదు. కోర్టు పరిధిలో భూమి ఉందంటూ దాట వేస్తున్నారు. దీంతో బాధితుడు నాలుగైదుసార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.⇒ ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నమ్మలు తన కుమారుడిని పాలిటెక్నిక్ చదివిస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో కాలేజీ యాజమాన్యం వారిపై ఒత్తిడి తెస్తోంది. దీంతో అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం చౌడువాడ నుంచి దివ్యాంగుడైన తండ్రి సాయంతో కలెక్టరేట్‌కు వచ్చింది. కాలేజీకి ఫీజు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందించింది. నిరుపేదనైన తాను ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చే ఫీజుల డబ్బులతోనే కుమారుడిని చదివిస్తున్నానని, ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెడుతోందని చిన్నమ్మలు వాపోయింది.⇒ చిత్రంలో కనిపిస్తున్న గిరిజనులు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుణదతీలేసు పంచాయతీ పరిధిలోని లాబేసు గ్రామం వాసులు. వీరంతా నిరుపేదలు. గ్రామానికి చెందిన18 మంది గిరిజన రైతులు సర్వే నంబర్ 16, 11లోని కొంత ప్రభుత్వ భూమిలో తుప్పలు తొలగించి 1995 నుంచి పంటలు పండిస్తున్నారు. సాగు హక్కు పట్టాలు మంజూరు చేయాలంటూ తొమ్మిది నెలలుగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు.నేను చచ్చిన తరువాత పింఛన్ ఇస్తారా? పెన్షన్ కోసం కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. కలెక్టరేట్‌కు వస్తే సచివాలయానికి వెళ్లమంటారు. అక్కడికి వెళితే మళ్లీ ఇక్కడికే పొమ్మంటారు. అసలు పెన్షన్ ఇస్తారా? ఇవ్వరా? ఇవ్వబోమంటే మా పని ఏదో చేసుకొని బతుకుతాం. పేదలను ఇలా తిప్పుకోవడం మంచిది కాదు. నేను చచ్చిన తరువాత పెన్షన్ ఇస్తామంటే ఏం లాభం? గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల మంజూరు చాలా చక్కగా ఉండేది. – మద్దయ్య, బి.తాండ్రపాడు, కర్నూలు మండలం, కర్నూలు జిల్లాఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు బండిపై బాదంపాలు విక్రయిస్తూ జీవిస్తున్నా. ఒంటరి మహిళను. ఈ ఏడాది జనవరి 22వ తేదీన చిలకలూరిపేటలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కారు ఢీకొనడంతో కాలు, చేయి విరిగాయి. ఆపరేషన్‌కు రూ.లక్ష ఖర్చు అయింది. ఇప్పటికీ నడవలేకపోతున్నా. నిందితుడిని గుర్తించి, పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. ప్రమాదానికి కారకుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. –షేక్ సైదాబీ, కావూరు లింగంగుంట్ల, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లాముళ్ల పొదల్లో మృతదేహాలను మోసుకుంటూ..మా గ్రామం నుంచి నంద్యాల వెళ్లే రహదారిలో మాంటిస్సోరి స్కూల్ వెనుక భాగంలో 70 సెంట్ల హిందూ శ్మశాన వాటిక స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అక్కడకు వెళ్లాలంటే రహదారి లేదు. పొలం గట్లపై, ముళ్ల పొదల్లో భయంభయంగా మృతదేహాలను మోసుకుంటూ తీసుకెళ్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొనే నాథుడే లేరు. – చాపిరేవుల గ్రామస్తులు, నంద్యాల జిల్లా -
పడిపోతే.. ఫట్
మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. ముఖ్యంగా శరీర నిర్మాణానికి ఆధారంగా నిలిచే ఎముకలు చాలా త్వరగా పటుత్వాన్ని కోల్పోతున్నాయి. చిన్నగా కాలు తడబడి కింద పడితే చాలు.. ఫట్‌మంటూ విరిగిపోతున్నాయి. ఇక ద్విచక్ర వాహనాల పైనుంచి పడితే మల్టిపుల్ ఫ్రాక్చర్లు అవడం అనేది సర్వసాధారంగా మారిపోతోంది. చిన్నారుల నుంచి మూడు పదుల వయస్సు కూడా నిండని యువతలో సైతం ఎముకలు పటుత్వం తగ్గుతోంది.ఎముకలు గుల్లబారడం, బలహీనపడటం, తేలికగా విరిగిపోయే స్థితిని వైద్య పరిభాషలో (ఆస్టియోపొరోసిస్) అంటారు. పౌష్టికాహార లోపం, వయోభారం, కాల్షియం, డి–విటమిన్ లోపం దీనికి ప్రధాన కారణాలని ఆర్థోపెడిక్ సర్జన్లు (ఎముకల శస్త్రచికిత్స నిపుణులు) చెబుతున్నారు. వీటికి తోడు హార్మోన్ల అసమతుల్యత, వారసత్వ (జెనిటిక్) ప్రభావం, మద్యపానం, ధూమపానం, శారీరక వ్యాయామం లేకపోవడం కూడా ఎముకల ఆరోగ్యంపై ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, కాకినాడయువతలో సైతం.. ఒకప్పుడు ఆరు పదుల వయస్సు మీద పడినా చాలా మందిలో ఎముకలు బలహీన పడటమనే సమస్య ఉండేది కాదు. మారిన జీవన విధానంతో ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఆహార విధానంలో వస్తున్న మార్పులు ఎముకల పటుత్వాన్ని దెబ్బ తీస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్లనే ఈ సమస్య ఇప్పుడు అన్ని వయస్సుల వారిలోనూ కనిపిస్తోందని అంటున్నారు. యువతలో ఈ సమస్య ఉంటే జువైనల్ ఆస్టియోపొరోసిస్ అని వైద్య పరిభాషలో పిలుస్తారు.ఆహారంలో పోషకాల లోపం ఉండటం, రోడ్డు పక్కన ఆహారం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, హార్మోన్లు అవసరమైన స్థాయిలో ఉత్పత్తి కాకపోవడం, స్టెరాయిడ్ల వంటి మందులు అధికంగా వినియోగించడం, రుమటాయిడ్ ఆర్ర్థరైటిస్, లూపస్ వంటి వ్యాధుల బారిన పడిన యువతీయువకులు ఎముకల పటుత్వం కోల్పోతున్నారని వైద్యులు నిర్ధారించారు. కాల్షియం లోపంతో పుట్టడం వలన కూడా ఎముకలు గుల్లబారుతుండటం ఇటీవల ఎక్కువైందని ఇటీవల కాకినాడ జీజీహెచ్ ఆర్థోపెడిక్ విభాగ వైద్యుల పరిశీలనలో తేలింది. మహిళల్లో సైతం.. యువత తరువాత ఈ సమస్య మహిళల్లో తీవ్రంగా కనిపిస్తోందని వైద్యులు నిర్ధారించారు. ప్రతి ఐదుగురు మహిళల్లో కనీసం ఇద్దరు ఆస్టియోపొరోసిస్‌తో బాధ పడుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన మహిళల్లో రుతుచక్రం ఆగిపోయే (మెనోపాజ్) దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతూంటుంది. దీనివలన ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. అదే పురుషుల్లో అయితే 60 సంవత్సరాలు దాటిన వారిలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. మహిళల్లోనే ఎక్కువగా ఎముకలు గుల్లబారడానికి హార్మోన్ల లోపం, శారీరక నిర్మాణం, జీవనశైలి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు.పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎముకలు సన్నగా, సున్నితంగా ఉండటం కూడా మరో కారణమని అంటున్నారు. గర్భిణుల్లో ఉండే కొద్దిపాటి కాల్షియాన్ని గర్భంలో ఉండే బిడ్డకు కూడా అందుతుంటుంది. దీనివల్ల కూడా వారిలో ఎముకల పటుత్వం తగ్గుతుంది. అలాగే, పిల్లలకు పాలిచ్చే సమయంలో పోషకాహారం లేకపోవడంతో శరీరంలో కాల్షియం నిల్వలు తగ్గిపోయి, ఎముకలు గుల్లబారుతుంటాయి. పాలిసిస్టిక్ ఓవరీ డిజార్డర్ (పీసీఓడీ), థైరాయిడ్, గర్భాశయ తొలగింపు (హిస్టరెక్టమీ) వంటి వాటి వలన హార్మోన్లలో విపరీతమైన అసమతుల్యత ఏర్పడి, మహిళల్లో ఎముకలు గుల్లబారుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.అప్రమత్తతే ఆయుధంచిన్నచిన్న గాయాలైనప్పుడు తక్కువ ఒత్తిడితో కూడా ఎముకలు విరిగిపోతుంటాయి. నడుము, వెన్నెముక, కాళ్లలో దీర్ఘకాలిక నొప్పులు, వెన్నెముక దెబ్బతినడం, ఎముకలు కుచించికుపోయి ఎత్తు, పొడవు తగ్గడం, నడుము, మోకాళ్లు, భుజాల జాయింట్లలో నొప్పి, నిస్సత్తువ వంటి లక్షణాలున్న వారు వైద్యుల సూచనల మేరకు తప్పనిసరిగా తగిన పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా బోన్ మినరల్ డెన్సిటీ (బీఎండీ), ఎముకల క్షీణతను గుర్తించే ఎక్స్‌రే, ఎంఆర్ఐ స్కాన్, కాల్షియం, విటమిన్–డి స్థాయి అంచనా వేసేందుకు రక్త, మూత్ర పరీక్షల వంటివి తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు.50 ఏళ్ల వయస్సు దాటిన మహిళలు, 65 ఏళ్లు పైబడిన పురుషులు ఆరు నెలలకోసారి వైద్యులను సంప్రదించి, ఈ పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా ఆస్టియోపొరాసిస్ ఉన్నా, నీడ పట్టున, ఏసీలలో ఎక్కువ సమయం గడిపే ఉద్యోగులు, ఇతర వర్గాలు, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్న వారు, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపంతో వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు కచ్చితంగా తగిన పరీక్షలు చేయించుకుకోవాలి.నిర్లక్ష్యం చేయకండి ఎముకల బలహీనత ఉందనే అనుమానం ఎవరికైనా ఉంటే తక్షణం కాకినాడ జీజీహెచ్‌కు రావాలి. బీఎండీ పరీక్షలు జీజీహెచ్‌లో ఉచితంగా చేస్తున్నాం. మందులు ఉచితంగా అందిస్తున్నాం. బీఎండీ పరీక్షల కోసం ప్రత్యేక క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాం. ఆస్టియోపొరాసిస్ చిన్న సమస్య అని నిర్లక్ష్యం చేయకండి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల జీవిత కాలాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. కాల్షియం, విటమిన్–డి ఉన్న పోషకాహారం తీసుకోవాలి. అధిక ప్రొటీన్ ఉండే ఆహారంతో పాటు సూర్యరశ్మిలో గడపడం, తగినంత నిద్ర మేలు చేస్తాయి. వయస్సును బట్టి కనీసం ఏడు గంటల నిద్ర ఉండాలి. వయస్సుతో సంబంధం లేకుండా వ్యాయామాలు కచ్చితంగా చేయాలి. – డాక్టర్ ఎం,పాండురంగ విఠల్, ఆర్థోపెడిక్ విభాగాధిపతి, జీజీహెచ్, కాకినాడప్రతి నెలా 3 వేల మంది పైనే.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (జీజీహెచ్) ఎంతో ప్రధానమైనది. ఇక్కడకు కోనసీమ, రాజమహేంద్రవరం ప్రాంతాల నుంచే కాకుండా పొరుగున ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం అనేక మంది చికిత్స కోసం వçస్తుంటారు. కేవలం ఈ ఒక్క ఆసుపత్రికే ప్రతి నెలా 3 వేల మందికి పైగానే రోగులు ఎముకల సంబంధిత సమస్యలతో వస్తున్నారు. ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కూడా కలిపితే ఈ సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. దీనినిబట్టి సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. -
‘స్టార్’ లయన్
‘అనగనగా ఓ పెద్ద అడవి. ఆ అడవికి రాజు సింహం’.. ఎన్నో తరాలుగా పిల్లలకు చెప్పే కథే ఇది! ఇక్కడ కూడా అడవిలో రారాజుగా వెలుగొందిన ఓ మృగరాజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎన్నో యుద్ధాలు చేసి రాజ్యాన్ని, బలగాన్ని విస్తరించి, తన రాజ్యాన్ని 14 ఏళ్ల పాటు ఆఫ్రికా ఖండంలోనే ఓ పెద్ద అడవిని ఏక ఛత్రాధిపత్యంతో ఏలింది ఈ సింహం. కుడి కంటిపై గాటుతో భయంకరంగా కనిపించే ఈ సింహం 2021 జూన్ 11న వృద్ధాప్యంతో ప్రాణాలు విడిచింది. ఈ గాటు వల్లనే దానికి ‘స్కార్ ఫేస్ లయన్’గా పేరుపొందింది. ఐదేళ్ల క్రితం ఓ సింహం గడ్డిలో పొర్లాడుతూ భయంకరమైన గర్జన చేస్తూ చనిపోయిన వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అది ఎక్కడ జరిగిందో అని చాలా మంది ఆరా తీయగా.. కెన్యాలోని మసాయి మారా నేషనల్ పార్కులోదిగా తేల్చారు. అప్పుడే ఈ లయన్ కింగ్ ప్రత్యేకత తెలిసింది. అడవుల్లో సింహాలు గరిష్టంగా 12 ఏళ్లు బతికితే.. ఇది మాత్రం 14 సంవత్సరాలు జీవించింది. ఇదేం పెద్ద గొప్పకాకున్నా..బతికినంత కాలం రారాజుగానే ఉండి, సహజ మరణం పొందడమే విశేషం. ఈ లయన్ కింగ్ జీవితం, పోరాటాలు, సాహసాలపై కెన్యా ప్రభుత్వం పలు సందర్భాల్లో వీడియోలు తీసి, ఓ డాక్యుమెంటరీగా రూపొందించింది. అందులోని కొన్ని భాగాలు ఇప్పుడు మనదాకా వచ్చాయి. ఈ ‘స్టార్ లయన్ కింగ్’ ప్రత్యేకత ఏంటంటే.. – సాక్షి, అమరావతిపుట్టింది - 2007మరణం - 2021 జూన్ 11 వేట - 130 మగ సింహాల మరణం 400 హైనాలు ఒక హిప్పోపోటమస్లెక్కలేనన్ని అలిగేటర్స్ (మొసళ్లు)సొంత కుటుంబం - 120 సింహాలుజీవించిన కాలం - 14 సంవత్సరాలుఆఫ్రికాలోనే అత్యంత సెలబ్రిటీ లయన్గాగుర్తింపుమరో సింహానికి అవకాశం ఇవ్వకుండా..ఆఫ్రికా ఖండంలో అతి పెద్ద నేషనల్ పార్కుల్లో ఒకటి కెన్యాలోని మసాయి మారా నేషనల్ పార్కు. 400 చదరపు కిలోమీటర్లు విస్తరించిన ఈ అరణ్యంలో 2007లో పుట్టిందీ సింహం. మూడేళ్లకే అరివీర భయంకరిగా మారింది. అడవుల్లో సహజంగా మగ సింహాల మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది. ఈ పోరులో గెలిచిన సింహం శత్రు గుంపులోని ఆడ సింహాలను, ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకుంటుంది. ఇంత పెద్ద అడవిలో ఈ లయన్ మరో మగ సింహానికి అలాంటి అవకాశమే ఇవ్వలేదు. ప్రతి యుద్ధంలో గెలిచింది. ఆడ సింహాలన్నింటినీ సొంతం చేసుకుంది. 14 ఏళ్ల జీవిత కాలంలో 130 మగ సింహాలను హతమార్చింది. 400కు పైగా హైనాలను హతమార్చింది. ఖడ్గమృగాలు, బలీయమైన మొసళ్లను చంపేసింది. సాధారణంగా సింహాలు హిప్పో (నీటి ఏనుగు)ల జోలికి పోవు. కానీ ఈ స్కార్ ఫేస్ లయన్ ఓ మగ హిప్పోతో ఒంటరిగా పోరాడి గెలిచింది. ఇవి అధికారికంగా అటవీ సంరక్షకులు గుర్తించిన సంఖ్య మాత్రమే.120 సింహాల గుంపునకు నాయకత్వంకంటిపై గాటుతో కనిపించే ఈ మృగరాజు జీవితాంతం సవాళ్లతో పోరాడింది. స్థానిక సింహాలనే కాదు.. వేటగాళ్ల దాడులను సైతం దీటుగా ఎదుర్కొంది.ఎదురే లేని రారాజుగా నిలిచిందని అటవీ పరిరక్షకులు చెబుతుంటారు. పోరాటాల్లో తగిలిన తీవ్రమైన గాయాల నుంచి త్వరగా కోలుకోవడంతో పాటు ప్రతికూల పరిస్థితుల్లోనూ గర్వంగా నిలబడింది. అడవిలో ఓర్పుకు చిహ్నంగా మారింది. సాధారణంగా సింహాల గుంపులో 5 నుంచి 20 వరకు ఉంటాయి. కానీ ఈ మృగరాజు మాత్రం 120 సింహాలతో కూడిన పెద్ద గుంపుతో తిరిగేది. అందుకే మసాయి మారాలోని ఇతర జీవులకు ఈ కింగ్ అంటే హడల్. ‘స్కార్ ఫేస్ లయన్’గా మారింది ఇలా..2012లో ఓ గుంపులోని ఆల్ఫా లయన్‌తో జరిగిన పోరాటంలో కుడి కంటికి, దాని పైభాగంలో లోతైన గాయమైంది. అదే పెద్ద గాటుగా మారిపోయింది. దాంతో దానికి‘స్కార్ ఫేస్ లయన్’గా సందర్శకులు పేరు పెట్టారు. ఈ సింహం 2021 జూన్ 11న వృద్ధాప్యంతో మరణించింది. మసాయి మారా రిజర్వ్ ఫారెస్ట్ సందర్శనకు వచ్చే వారికి ఈ స్కార్ ఫేస్ లయన్ డాక్యుమెంటరీని చూపిస్తారంటే దాని ప్రత్యేకతను అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఈ మృగరాజు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
మీ స్కోర్ ఎంత..?
ముంబైకి చెందిన అజయ్ వర్మ (31) తన పర్సనల్ లోన్‌ను పూర్తిగా తీర్చేసి నాలుగు నెలలు గడిచిపోయింది. ఇటీవలే క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించగా.. ఆ రుణం ముగిసిపోయిన విషయం తన రుణ చరిత్రలోకి చేరలేదన్న విషయం అర్థమైంది. క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకోండంటూ ‘పైసాబజార్’ నుంచి వచ్చిన సందేశం చూసి, హైదరాబాద్‌కు చెందిన అఖిలేశ్ (45) లింక్‌పై క్లిక్ చేశాడు. మొబైల్ నంబర్, ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత క్రెడిట్ రిపోర్ట్ తెరుచుకుంది. అందులో తాను తీసుకోని రుణాల సమాచారం ఉండడాన్ని చూసి ఆందోళన చెందాడు. ఆర్జించే ప్రతి వ్యక్తి క్రెడిట్ రిపోర్ట్‌ను తరచుగా ఎందుకు తనిఖీ చేసుకోవాలి? అన్న దానికి ఇవి నిదర్శనాలుగా నిలుస్తాయి. మనలో కొందరు ఏటా ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. అనారోగ్యాలు ఏవైనా ఉంటే ఆరంభంలోనే గుర్తించి నయం చేసుకునేందుకు ఈ పరీక్షలు వీలు కల్పిస్తాయి. అదే మాదిరి క్రెడిట్ రిపోర్ట్‌ను ఏడాదికోసారి అయినా తనిఖీ చేసుకోవడం ద్వారా అందులో తప్పులు, పొరపాట్లు, మోసపూరిత లావాదేవీలకు చోటు లేకుండా చూసుకోవచ్చు. మెరుగైన క్రెడిట్ స్కోర్‌తో రుణ పరపతిని గణనీయంగా పెంచుకోవచ్చు. గతంలో ఎంతో ముఖ్యమైన అవసరం ఉంటేనే అరువు తీసుకునేవారు. కానీ, నేడు మెరుగైన జీవనం కోసం, కోరికలు తీర్చుకోవడానికి, సొంతింటి కల సాకారానికి ఇలా ఒకటేమిటి.. అన్ని అవసరాలకు రుణాలను ఆశ్రయించే సంస్కృతి విస్తరిస్తోంది. 2024 ఫిబ్రవరి నాటికి మన దేశంలో 10 కోట్ల మందికి పైగా క్రెడిట్ కార్డులున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇల్లు, కారు, ఇంట్లో ఖరీదైన ఎల్రక్టానిక్ పరికరాలను ఈఎంఐలపై తీసుకోవడానికి ఎంతమాత్రం సంకోచించడం లేదు. ప్రతి రుణానికి గీటురాయి మెరుగైన క్రెడిట్ స్కోరే. తీరా రుణం అవసరమైన పరిస్థితుల్లో క్రెడిట్ రిపోర్ట్‌లో లోపాలు అడ్డంకిగా మారొచ్చు. అందుకే క్రెడిట్ రిపోర్ట్‌ను అప్పుడప్పుడూ పరిశీలించుకోవడం అవసరం. ‘గతంలో రుణం తీసుకుని, అన్ని ఈఎంఐలను సకాలంలో చెల్లించేశాను. కనుక, భవిష్యత్తులో సులభంగా రుణం లభిస్తుంది’ అని అనుకోవడానికి లేదు. మీకున్న క్రెడిట్ స్కోర్? మీ అర్హతలను నిర్ణయిస్తుంది. క్రెడిట్ రిపోర్ట్.. వ్యక్తులు, వ్యాపార సంస్థల పేరిట (పాన్ ఆధారంగా) అన్ని రుణాలు, వాటి చెల్లింపుల వివరాలతో కూడిన సెంట్రల్ డేటాను నిర్వహించేవే క్రెడిట్ బ్యూరోలు. బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు ప్రతీ రుణానికి సంబంధించి చెల్లింపుల వివరాలను ఎప్పటికప్పుడు క్రెడిట్ బ్యూరోలకు తెలియజేస్తుంటాయి. ట్రాన్స్‌యూనియన్ సిబిల్, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్, క్రిఫ్ హైమార్క్ సంస్థలు ప్రస్తుతం ఈ సేవలను ఆందిస్తున్నాయి. రుణం కోరుతూ చేసే విచారణలు, రుణానికి చేసే దరఖాస్తులు, రుణాల జారీ, వాటికి చెల్లింపులు, ఈఎంఐలను సకాలంలో చెల్లించలేకపోవడం, రుణ చెల్లింపులను ఎగవేయడం ఇలా ప్రతీ సమాచారం క్రెడిట్ బ్యూరో రికార్డుల్లో నమోదవుతుంటుంది. ఇప్పటి వరకు ఒక వ్యక్తి లేదా సంస్థ ఎన్ని రుణాలు తీసుకున్నారు, వాటిని పూర్తిగా చెల్లించారా? లేదా? అన్న సంపూర్ణ సమాచారం ఉంటుంది. ప్రతి రుణ ఖాతాకు సంబంధించి తాజా సమాచారాన్ని 15 రోజులకు ఒకసారి (గతంలో నెలకోసారి) క్రెడిట్ బ్యూరోలకు అందించాలని ఆర్థిక సంస్థలు, బ్యాంక్‌లను ఇటీవలే ఆర్బీఐ ఆదేశించడం గమనార్హం. ఇలా అన్ని మార్గాల ద్వారా వచ్చే సమాచారం ఆధారంగానే ప్రతి వ్యక్తి/సంస్థ పేరిట క్రెడిట్ రిపోర్ట్‌ను క్రెడిట్ బ్యూరోలు రూపొందిస్తుంటాయి. ఈ సమాచారం ఆధారంగానే స్కోర్‌ను కేటాయిస్తుంటాయి. వివిధ రకాల రుణ సాధనాలను వినియోగించుకోవడం.. వాయిదాలను సకాలంలో చెల్లిస్తూ ఆర్థిక క్రమశిక్షణ చూపించే వారికి బలమైన స్కోర్ లభిస్తుంది. రుణం మంజూరు చేస్తే ఎంత రిస్క్ ఉంటుందన్న విషయాన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు క్రెడిట్ రిపోర్ట్, స్కోర్ ఆధారంగా సులభంగా అంచనాకు వస్తాయి. కేవలం రుణదాతలే క్రెడిట్ స్కోర్/రిపోర్ట్‌కు పరిమితం కావడం లేదు. బీమా కంపెనీలు పాలసీల జారీకి ముందు సంబంధిత దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోర్‌ను ఇటీవలి కాలంలో పరిశీలిస్తున్నాయి. కంపెనీలు ఉద్యోగ నియామకాల సమయంలోనూ అభ్యర్థుల క్రెడిట్ స్కోర్‌ను గమనిస్తున్నాయి. తద్వారా వారు ఆర్థిక విషయాల్లో ఎంత క్రమశిక్షణగా ఉంటున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నాయి. క్రెడిట్ రిపోర్ట్‌లో ఒక్కోసారి తప్పులు, పొరపాట్లకు అవకాశం లేకపోలేదు. ప్రతి ఒక్కరూ తమ క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించుకోవడం ద్వారానే వీటి గురించి తెలుస్తుంది. లేదంటే రుణ దరఖాస్తు తిరస్కారానికి గురైనప్పుడే వాటి గురించి తెలుస్తుంటుంది.ఏమి చూడాలి..? క్రెడిట్ స్కోర్‌ను సరిగ్గా అర్థం చేసుకోవడం, మెరుగైన స్కోర్ కొనసాగేలా చూసుకోవడం ఎంతో ముఖ్యమని సిబిల్ మాజీ ఎండీ, అథేనా క్రెడ్ఎక్స్పర్ట్ వ్యవస్థాపకుడు సతీష్ మెహతా పేర్కొన్నారు. నాలుగు క్రెడిట్ బ్యూరోల నుంచి ఏడాదికోసారి ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్‌ను పొందొచ్చు. అంటే ప్రతి బ్యూరో నుంచి ఒకటి పొందే అవకాశం ఉంటుంది. ప్రతి మూడు నెలలకు ఒక బ్యూరో నుంచి రిపోర్ట్‌ను ఉచితంగా పొందడం ద్వారా అందులో సమాచారం సరిగ్గా ఉందా? లేదా అన్నది నిర్ధారించుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఏదైనా రుణం తీసుకోవాలని అనుకుంటుంటే, దానికంటే ముందుగానే క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించుకుని, అందులోని సమాచారం అంతా సవ్యంగా ఉందో లేదో అన్నది ధ్రువీకరించుకోవాలి. లేదంటే రుణ అర్హతపై ప్రభావం పడుతుంది. కనీసం ఏడాదిలో ఒకసారి పరిశీలించుకోవడం ద్వారా తప్పులు సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. → గతంలో ఎప్పుడో వాడి పడేసిన క్రెడిట్ కార్డ్‌పై రూ.100 బకాయి ఉన్నా సరే అది ఏళ్లపాటు క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. → రుణం పూర్తిగా చెల్లించినప్పటికీ.. సంబంధిత రుణ ఖాతాను ‘ఓపెన్’ అని (ఇంకా తీరిపోలేదు) చూపించొచ్చు. బాకీ మొత్తాన్ని తప్పుగా చూపించొచ్చు. తాము తీసుకోని రుణాలు తీసుకున్నట్టుగా క్రెడిట్ రిపోర్ట్‌లోకి చేరొచ్చు. → మోసపూరిత రుణ ఖాతాలు సైతం ఒకరి రుణ చరిత్రను దెబ్బతీసే ప్రమాదం ఉంది. అంటే ఒకరి పాన్‌పై వేరొకరు/సంస్థలు మోసపూరితంగా రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం వంటివి చోటు చేసుకోవచ్చు. → రుణ ఖాతా వర్గీకరణను చూడాలి. అన్ని రుణ ఖాతాలకూ ‘స్టాండర్డ్’అనే ఉండాలి. ‘ఓవర్ డ్యూ’, ‘ఎస్ఎంఏ’ అన్న ట్యాగ్లు ఉండకూడదు. → ఒక్కోసారి ఒకే రుణం రెండు రుణ ఖాతాలుగా క్రెడిట్ రిపోర్ట్‌లో నమోదు కావచ్చు. → క్రెడిట్ రిపోర్ట్‌లో ప్రతి లోపం మోసం కాకపోవచ్చు. రుణ గ్రహీత సకాలంలోనే చెల్లించినప్పటికీ, బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ జాప్యం అయినట్టు పొరపాటుగా క్రెడిట్ బ్యూరోలకు సమాచారం ఇవ్వొచ్చు. అలాంటి అవాస్తవ, తప్పులు/లోపాలు/మోసాలకు సంబంధించిన సమాచారాన్ని తొలగించుకునే హక్కు రుణ గ్రహీతలకు ఉంటుంది. → వ్యక్తిగత రుణాన్ని వ్యాపార రుణంగా పేర్కొనే అవకాశం లేకపోలేదు. మెరుగైన స్కోర్‌తో లాభాలు.. → చక్కని ఆర్థిక క్రమశిక్షణ, సకాలంలో రుణ చెల్లింపులతో క్రెడిట్ స్కోర్‌ను మెరుగ్గా కాపాడుకోవచ్చు. దీనివల్ల రుణాలను ఇతరులతో పోల్చితే తక్కువ రేటుకే సొంతం చేసుకోవచ్చు. వ్యాపార సంస్థల విషయంలోనూ ఇంతే. రుణ షరతుల్లో వెసులుబాటు లభిస్తుంది. → ఒకేసారి ఒకటికి మించిన రుణాలు తీసుకోవడం క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అలాగే, తరచూ రుణాల కోసం చేసే విచారణలు సైతం క్రెడిట్ స్కోర్‌ను తగ్గించేస్తాయి. → రుణ బకాయిలను జాప్యం లేకుండా నిర్ణీత కాలవ్యవధిలో తీర్చేయాలి. ఒక్క రుణ వాయిదా చెల్లింపులోనూ ఆలస్యం లేకుండా చూసుకోవాలి. చెల్లించడం కష్టమని భావిస్తే రుణ కాల వ్యవధిని పెంచుకుని, ఈఎంఐ తగ్గించుకోవాలి. → ఒకేసారి ఒకటికి మించి ఒకే తరహా రుణాలు తీసుకోకూడదు. ఒకటికి మించిన పర్సనల్ లోన్లు, వాహన రుణాలు స్కోర్‌ను తగ్గించేస్తాయి. దీనికి బదులు క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్, హౌసింగ్ లోన్ ఇలా రుణాలు మిశ్రమంగా ఉంటే స్కోర్‌కు నష్టం చేయదు. → క్రెడిట్ కార్డుపై క్రెడిట్ లిమిట్లో వినియోగం (యుటిలైజేషన్ రేషియో) 30–40 శాతం మించకుండా చూసుకోవాలి.తప్పులు సరిచేసుకోవడం ఎలా? → రుణాలకు సంబంధించి ఏవైనా తప్పులను గుర్తించినట్టయితే, క్రెడిట్ బ్యూరో దృష్టికి తీసుకెళ్లాలి. ఆన్లైన్లో దరఖాస్తు దాఖలు చేయొచ్చు. తమ క్లెయిమ్‌కు ఆధారాలను కూడా జత చేయాలి. → రుణాలను సరిగ్గానే చెల్లించినప్పటికీ తప్పులు చోటుచేసుకుంటే బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ దృష్టికి తీసుకెళ్లాలి. క్రెడిట్ బ్యూరోలోని సమాచారం అప్డేట్కు బ్యాంక్, ఎన్బీఎఫ్సీ సహకరిస్తాయి. → అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఆర్బీఐ అంబుడ్స్‌మన్ వద్ద ఫిర్యాదు దాఖలు చేయాలి. → క్రెడిట్ రిపోర్ట్‌లో మీ పేరు, చిరునామా, డేట్ ఆఫ్ బర్త్, గుర్తింపు వివరాల్లో పొరపాట్లు ఉంటే అదే విషయాన్ని సంబంధిత క్రెడిట్ బ్యూరో దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అనంత దూరంలోని... ఆ గెలాక్సీలో ఆక్సిజన్!
అనంతమైన విశ్వంలో మన భూమిపై తప్ప ఇంకెక్కడా ప్రాణవాయువు(ఆక్సిజన్) ఉండకపోవచ్చని శాస్త్రజు్ఞలు ఇప్పటిదాకా భావించేవారు. కానీ మనకు అత్యంత సుదూరంలో ఉన్న ఒక నక్షత్ర మండలం (గెలాక్సీ)లో ఆక్సిజన్ ఆనవాళ్లను గుర్తించారు. అంతేగాక భారీ లోహాల జాడను సైతం కనిపెట్టారు. ఈ గెలాక్సీ భూమి నుంచి ఏకంగా 1,340 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది! విశ్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ఇది ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్‌బ్యాంగ్ 1,380 కోట్ల ఏళ్ల క్రితం సంభవించిందన్న వాదనలు ఇప్పటికే ఉన్నాయి. ఈ నక్షత్ర మండలానికి జేడ్స్–జీఎస్–జెడ్14–0 అని నామకరణం చేశారు. నిజానికి దీన్ని 2024 జనవరిలోనే ప్రాథమికంగా గుర్తించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ గెలాక్సీ ఉనికిని వెలుగులోకి తెచ్చింది. కాకపోతే దానిపై ప్రాణవాయువు ఉన్నట్లు కనిపెట్టడం కీలక పరిణామమని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ ఆక్సిజన్ ఏ రూపంలో, ఎంత పరిమాణంలో ఉందన్నది తేల్చడానికి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. పరిమాణంలో అత్యంత భారీగా ఉన్న ఈ నక్షత్ర మండలం కాంతివంతమైనది కూడా. మన భూగోళమున్న గెలాక్సీకి సమీపంలో ఇప్పటిదాకా మరో 700 గెలాక్సీలను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రోజుకు 10 గ్రాములు చాలు!
సాక్షి, స్పెషల్ డెస్క్: అమ్మ చేతి గోరు ముద్దను నెయ్యి కమ్మదనం లేకుండా ఊహించలేం. నేతి రుచి తగలకపోతే భోజనమైనా, అల్పాహారమైనా, పిండి వంటలైనా సంతృప్తికరం, సంపూర్ణమూ కావంటే అతిశయోక్తి కాదు. వివిధ రకాల పచ్చళ్లు, పొడులకు కాస్త నెయ్యి జోడించి తింటే ఆ మజాయే వేరు. 3 వేల ఏళ్ల క్రితం నుంచే నెయ్యి వాడకం ఉందని చరిత్ర చెబుతోంది. అయితే నెయ్యి వినియోగంపై భిన్నాభిప్రాయాలున్నాయి.మంచిదని కొందరంటుంటే, మితిమీరి వాడితే రక్తనాళాల్లో అవరోధాలేర్పడతాయని కొందరంటున్నారు. ఇంతకీ నిపుణులేమంటున్నారు? భారతీయులు సగటున రోజుకు 10 గ్రాముల వరకు నెయ్యి/వెన్న తీసుకోవచ్చని హైదరాబాద్‌లోని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అనుబంధ సంస్థ జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)లో లిపిడ్ కెమిస్ట్రీ డివిజన్ సైంటిస్ట్ (జి)గా ఉన్న డాక్టర్ అహ్మద్ ఇబ్రహీం (Dr. Ahmed Ibrahim) తెలిపారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే..ఔషధ విలువలపై పరిశోధనలు జరగలేదు.. నెయ్యిలో ఎక్కువ వరకు కొవ్వు పదార్థాలే ఉంటాయి. విటమిన్ ఎ, ఇ, కె కూడా కొంతవరకు ఉంటాయి కానీ, అవి పరిగణనలోకి తీసుకోదగినంత ఎక్కువగా ఉండవు. అందుకని ఈ విటమిన్లను పొందటం కోసం నెయ్యిని వనరుగా చూడకూడదు. ఆవు నెయ్యిలో గేదె నెయ్యి కంటే తక్కువ శాతం కొవ్వు ఉంటుంది.మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అనే ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థం ఆవు నెయ్యిలో కొంచెం ఎక్కువగా ఉంటుంది.. అంతే తేడా. నెయ్యిలో ఔషధ విలువల గురించి ఎన్ఐఎన్లో పరిశోధనలేమీ చెయ్యలేదు. అలాగే వేసవిలో ఎంత నెయ్యి తీసుకోవాలి? అనే విషయంపై కూడా పరిశోధనలేమీ జరగలేదు. అయితే నెయ్యిని నిర్దేశిత మోతాదుకు మించకుండా తీసుకోవాలి. నెయ్యిలో పోషకాలు (100 గ్రాములకు) ⇒ శక్తి – 870 కిలోకేలరీలు ⇒ పిండి పదార్థం– 0 గ్రా. ⇒ కొవ్వు – 99.5 గ్రా. ⇒ శాచ్యురేటెడ్ ఫ్యాట్ – 61.9 గ్రా. ⇒ మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్ – 28.7 గ్రా. ⇒ పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ – 3.69 గ్రా. ⇒ మాంసకృత్తులు – 0.3 గ్రా. ⇒ కొలెస్ట్రాల్ – 256 మిల్లీ గ్రాములు ⇒ కాల్షియం – 4 మిల్లీ గ్రాములు వేర్వేరు వంట నూనెలు మంచిది ఒకరు సగటున రోజుకు సుమారు 2,000 కిలో కేలరీల ఆహారం తీసుకోవాలి. అందులో 30% కేలరీల మేరకు కొవ్వు పదార్థాలు ఉండాలి. అందులో ‘ఇన్విజిబుల్ ఫ్యాట్’సగం, ‘విజిబుల్ ఫ్యాట్’సగం ఉండాలి. మనం రోజూ తినే అనేక ఆహార పదార్థాల్లో అంతర్లీనంగా కలిసి ఉండే కొవ్వు పదార్థాలనే ‘ఇన్విజిబుల్ ఫ్యాట్’అంటున్నాం. 2,000 కిలో కేలరీల ఆహారం తీసుకునే వ్యక్తి రోజుకు సుమారు 30 గ్రాముల ‘విజిబుల్ ఫ్యాట్’అంటే.. వంట నూనెలు, నెయ్యి/వెన్న వంటివి తీసుకోవచ్చు.వీటిలో మూడింట ఒక వంతు మాత్రమే నెయ్యి/వెన్న ఉండాలి. వంట నూనెలు ఒకే రకం కాకుండా అనేక రకాలను తీసుకోవటం చాలా మంచిది. ఒక్కో నూనెలో ఒక్కో రకం ఫ్యాటీ యాసిడ్ పాళ్లు అధికంగా ఉంటాయి. అందుకే అనేక రకాల నూనెలను రోజుకు 20 గ్రాముల వరకు తీసుకోవచ్చు. 10 గ్రాములకు మించకుండా నెయ్యి / వెన్న వంటి శాచ్యురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉన్న పదార్థాలను తీసుకోవచ్చు. అయితే, 30 గ్రాముల వరకు నూనెలు తీసుకునే వారు కూడా నెయ్యి తప్పకుండా తీసుకోవాలనేమీ లేదు. మొత్తం కలిపి కొవ్వు పదార్థాలు రోజుకు 30 గ్రాములకు మించకుండా తీసుకోవాలి. దీన్ని ఎన్ఐఎన్ విడుదల చేసిన ‘భారతీయులకు ఆహార సంబంధ మార్గదర్శక సూత్రాలు’లోనూ పొందుపరిచాం.పిల్లలు ఇలా తీసుకోవాలి పిల్లలు వారి వయసు, బరువు ఆధారంగా ఎన్ని కేలరీలను రోజువారీ ఆహారం తీసుకోవాలో ఎన్ఐఎన్ నిర్దేశించింది.⇒10–12 ఏళ్ల మగ పిల్లలు రోజుకు 2,200 కేలరీల ఆహారం తినాలి. వీరు 24 గ్రాముల నూనెలు, 12 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు. ⇒ 10–12 ఏళ్ల ఆడ పిల్లలు రోజుకు 2,000 కేలరీల ఆహారం తినాలి. 22 గ్రాముల నూనెలు, 11 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు. ⇒ 13–15 ఏళ్ల మగ పిల్లలు రోజుకు 2,800 కేలరీల ఆహారం తినాలి. వీరు 30 గ్రాముల నూనెలు, 15 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు. ⇒ 13–15 ఏళ్ల ఆడ పిల్లలు రోజుకు 2,400 కేలరీల ఆహారం తినాలి. 27 గ్రాముల నూనెలు, 13 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు. ⇒ 16–18 ఏళ్ల మగ పిల్లలు రోజుకు 3,300 కేలరీల ఆహారం తినాలి. వీరు 37 గ్రాముల నూనెలు, 18 గ్రాముల నెయ్యి/వెన్న వాడొచ్చు. ⇒ 16–18 ఏళ్ల ఆడ పిల్లలు రోజుకు 2,500 కేలరీల ఆహారం తినాలి. వీరు 28 గ్రాముల నూనెలు, 13 గ్రాముల నెయ్యి వాడొచ్చు.వ్యాయామం చేసే వారికి నెయ్యితో మేలు! నెయ్యి మన శరీరంలో ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. మెదడును శక్తిమంతం చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుంది. వాతాన్ని, పైత్యాన్ని, కఫాన్ని సమస్థితిలో ఉంచుతుంది. చర్మానికి కాంతినిస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. నేతిలోని బుటిరేట్ జఠరాగ్నిని ప్రజ్వలింపజేస్తుంది. విష దోషాల్ని, పేగుల్లో పుళ్లు, వాపుల్ని, గడ్డల్ని నివారిస్తుంది. నెయ్యి తినే అలవాటున్న వారిలో పేగు కేన్సర్ తక్కువ. భారతీయ గోసంతతి విదేశీ గోసంతతి కన్నా భిన్నమైనది. మన ఆవుల వెన్నలో అపకారక ఎల్డీఎల్ కొవ్వు కన్నా ఉపకారక హెచ్‌డీఎల్ కొవ్వు ఎక్కువగా ఉంటుంది. బాగా వ్యాయామం చేసే వారికి నెయ్యి మేలే చేస్తుంది. – డా. జీవీ పూర్ణచందు ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు -
ఇళ్లకు వెళ్లి మరీ సేవలు చేశాం
క్యాన్సర్‌తో పోరాడుతూ చివరిదశలో ఉన్నవారికి స్వస్థత చేకూర్చుతుంది హైదరాబాద్‌లోని స్పర్శ్ హాస్పిస్. కోవిడ్ టైమ్‌లో క్యాన్సర్ పేషంట్లకు సేవలు అందించడానికి, బయటి నుంచి వచ్చిన పేషంట్లను అడ్మిట్ చేసుకోవడానికి, భయాందోళనలో ఉన్న వారికి ధైర్యం చెప్పడానికి ఒక బృందంగా తామంతా ఎలా సిద్ధమయ్యారో హాస్సిస్ అడ్మినిస్ట్రేటర్ శారద లింగరాజు వివరించారు.‘‘ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే ఒకరికొకరు ఉన్నామా, మన వరకే బతుకుతున్నామా.. అనే నిజాలు వెలుగులోకి వచ్చేది. మేం అందించేది ఎమర్జెన్సీ కేర్ కాదు. చనిపోయేదశలో ఉన్నవారికి ఉపశమనాన్ని ఇవ్వడం. కోవిడ్ సమయంలో అప్పటికే అంతటా భయాందోళనలు. ఎవరి వల్ల ఎవరికి కోవిడ్ వస్తుందో చెప్పలేం. ఎవరికి ఎవరు సాయంగా ఉంటారో తెలియదు. అలాంటప్పుడు రిస్క్ ఎందుకని, మేం ‘చేయలేం’ అని చెప్పవచ్చు. చేయూతనివ్వలేమని వదిలేయచ్చు. హాస్పిస్ తలుపులు మూసేయచ్చు. కానీ, మానవతా ధర్మంగా చూస్తే వారిని అలా వదిలేయడం సరికాదు అనిపించింది. అందుకే, క్యాన్సర్‌తో పోరాటం చేస్తూ కొన ఊపిరితో ఉన్నవారిని తీసుకువస్తే వారికి ‘లేదు’ అనకుండా కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ మాకు చేతనైన సేవలు అందించాం.నేరుగా వారి ఇళ్లకే..క్యాన్సర్ పేషంట్స్‌కి వారి స్టేజీలను బట్టి పెయిన్ ఉంటుంది. సరైన మందులు అందక వారు బాధపడిన సందర్భాలు ఎన్నో. వారు మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు ఆ మందులను వారి ఇళ్లకే వెళ్లి అందజేశాం. వారికి కావల్సిన స్వస్థతను ఇంటికే వెళ్లి అందించాం. ఈ సేవలో పాలిచ్చే తల్లులైన నర్సులూ పాల్గొన్నారు. ఆయాలు పేషంట్స్‌కు దగ్గరగా ఉండి, సేవలు అందించారు. పేషంట్స్ చనిపోతే అప్పటికప్పుడు బాడీ తీసేయమని చెప్పినవారున్నారు. కనీసం వారి పిల్లలు వచ్చేంత టైమ్ ఇవ్వమన్నా కుదరదనేవారు. వాళ్లు కోవిడ్‌తో కాదు క్యాన్సర్‌తో చనిపోయారు అని కన్విన్స్ చేయడానికి టైమ్ పట్టేది.వీడియోలలో దహన సంస్కారాలు.. ఒక బెంగాలియన్ క్యాన్సర్ చివరి దశలో చనిపోయాడు. మృతదేహాన్ని హాస్పిస్ నుంచి వారి స్వస్థలానికి తీసుకువెళ్లాలి. కోవిడ్ కాకుండా క్యాన్సర్‌తో చనిపోయాడనే లెటర్‌తో పాటు అంబులెన్స్‌ను సిద్ధం చేయించి పంపాం. వాళ్లు కూడా ఏమీ ఆలోచించకుండా అప్పటికప్పుడు వెళ్లి దహనసంస్కారాలు చేయించి వచ్చారు. మా దగ్గర సేవ పొందుతున్న వారు చనిపోతే కనీసం చివరి చూపు చూడటానికి కూడా వారి పిల్లలు రాలేని పరిస్థితి. అందువల్ల దహన సంస్కారాలు చేసే సమయంలోనూ, ఆ తర్వాత వారికి వీడియోలు చూపించేవాళ్లం. పసుపు, కుంకుమలు, చెట్లకు ఉన్న కాసిన్ని పూలు పెట్టి సాగనంపేవాళ్లం. వారి ఏడుపులు, మేం సమాధాన పరచడం.. ఆ బాధ.. ఆ సందర్భంలో ఎలా తట్టుకున్నామో.. ఇప్పుడు తలుచుకుంటే అదంతా ఒక యజ్ఞంలా చేశామనిపిస్తోంది.ప్రతి వారిలోనూ మంచితనాన్నే చూశాం..ఒక తల్లి చనిపోయే చివరి దశ. ఆమె కొడుకు తల్లిని చూడటానికి జార్ఖండ్ నుంచి వచ్చాడు. గచ్చిబౌలిలో ఉండేవాడు. రెండు మూడుసార్లు బైక్ మీద వచ్చాడు. కొడుకును చూడాలని ఆ తల్లి ప్రాణం కొట్టుకులాడేది. కొడుకు చూసి వెళ్లిన పది నిమిషాల్లో ఆమె చనిపోయింది. నిజంగా జబ్బు ముదిరిపోయి చివరిదశలో ఉంటే ఆ కష్టాన్ని ఒకలా చూస్తాం. కానీ, కోవిడ్ భయంతో చుట్టూ ఉన్న మానవసంబంధాల కష్టం అప్పుడే చూశాం. తమ వారిని చూసుకోవడానికే కాదు, బాడీని తమ స్వస్థలాలకు చేర్చుకోవడానికి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. డబ్బు కాదు బంధాలే ముఖ్యం అనిపించాయి ఆ రోజులు. చివరి రోజుల్లో ఉన్న క్యాన్సర్ పేషంట్లకు కోవిడ్ టైమ్‌లో ఏ దారీ లేదనే పరిస్థితుల్లో కూడా ‘మేం ఉన్నాం’ అనే ధైర్యాన్ని ఇచ్చాం. ప్రతి వాళ్లలో మంచితనాన్ని చూశాం’ అని గడిచిన కాలపు జ్ఞాపకాలలోని మానవతను కళ్లకు కట్టారు.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
వందల ఏళ్ల రక్షణ స్థావరం.. రామగిరి కోట!
అభివృద్ధికి అవకాశం ఉన్న పర్యాటక ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా.. తెలంగాణలో తొలిసారిగా రోప్‌వే పర్యాటకానికి అవకాశం కల్పించింది. భువనగిరి జిల్లా యాదగిరి గుట్టపై 2 కిలోమీటర్ల రోప్‌వేను తొలిసారిగా ఏర్పాటు చేస్తుండగా.. రాష్ట్రంలో మరో నాలుగు ప్రతిపాదిత రోప్‌వేలలో పెద్దపల్లి జిల్లా రామగిరి కోటకు చోటు కల్పించారు. – మంథనిప్రాచీన శిల్పకళా సంపదకు చిరునామా.. రామగిరి ఖిలా జిల్లాలోని రామగిరి ఖిలాను జాతీయస్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్‌ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. ఇక్కడి ప్రాచీన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించింది. రామగిరి ఖిలా (Ramagiri fort) క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలో రామగిరి కోటగా రూ పుదిద్దుకుంది. ఈ కోట శత్రుదుర్భేద్యమైన రక్షణ స్థావరంగా వందల ఏళ్లపాటు వివిధ వంశాల రాజులకు ఆశ్రయమిచ్చింది. ఎంతో ఎత్తున్న దుర్గం, అనేక రాతి కట్టడాలు, బురుజులు, ఫీనాలతో విరాజిల్లుతోంది. దుర్గం అంతర్భాగంలో సాలుకోట, సింహాల కోట, జంగేకోట, ప్రతాపరుద్రుల కోట, అశ్వాల, కొలువుశాల, మొఘల్శాల, చెరసాల, గజశాల, భజనశాల, సభాస్థలితో పాటు రహస్య స్థలాలు, రహస్య మార్గాలు, సొరంగాలు, తీపులు, ఫిరంగి గుండ్లు ఇక్కడ దర్శనమిస్తాయి.తెలంగాణలోని దుర్గాల్లో ఈ దుర్గం పటిష్టంగా ఉండి.. వజ్రకూటంగా ప్రసిద్ధి చెందింది. సీతమ్మ కొలను గుంటపై పసుపు, ఎరుపు రంగు నీరు దర్శనమివ్వడం విశేషం. పిల్లల ఫిరంగి నుంచి దూరితే సంతానప్రాప్తి లభిస్తుందని పర్యాటకుల విశ్వాసం. రామగిరి ఖిలాపై సుందర దృశ్యాలు, ప్రాకారాలు.. సందర్శకులను ఆకర్షిస్తాయి. శ్రీరాముని మూల విగ్రహాలున్న స్థలంలో కొండ చరియకింద వెయ్యిమంది తలదాచుకోవచ్చు.రామగిరి కోటలో ఇరువైపులా 9 ఫిరంగులు, 40 తోపులు ఉన్నాయి. శ్రీరాముడు వనవాసకాలంలో రామగిరికోటపై తపస్సు చేసి గుహలో శివలింగాన్ని ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి కొండపై నుంచి వచ్చే నీటిధార.. బిలం నుంచి లోయలోకి ప్రవహిస్తోంది. ఈ ద్వా రం వద్ద సీతాదేవి స్నానమాచరించినట్లు భక్తుల నమ్మకం. కొండపై సీతారాముల విగ్రహాలతో పాటు నంది విగ్ర హం ఉంది. నీటిధార నేరుగా శివలింగం, నంది విగ్రహాలపై పడటం విశేషం. రామగిరి కొండ పైనుంచి వర్షాకాలం జలపాతాలు కనువిందు చేస్తాయి. రోప్‌వే (Rope Way) ద్వారా పర్యాటకుల్ని గుట్టపైకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు చేశారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే.. రామగిరి ఖిలాకు పర్యాటకుల సందడి పెరగనుంది.లోయలాంటి సరస్సు ఎల్‌మడుగు గోదావరి నది మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన అతి పెద్ద లోయలాంటి సరస్సే ఎల్‌మడుగు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల మధ్య మంథని మండలం ఖాన్సాయిపేట – శివ్వారం అటవీ ప్రాంతంలోని ఎల్‌మడుగు రెండు గుట్టల నడుమ ప్రవహిస్తోంది. ఈ సరస్సు చుట్టూ ఆనుకున్న దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తయిన కొండలు, గుట్టలు.. రెండు కొండల మధ్యనుంచి ప్రవహించే గోదావరి నది.. ఆ సరస్సులో సందడి చేసే పక్షుల కిలకిలారావాలు, నీటిలో ఎగిరే చేపల విన్యాసాలు కనువిందు చేస్తాయి. చిన్న చిన్న చేపపిల్లలు గుంపుగా కదులుతున్న దృశ్యం.. కళ్లెదుటే ఆక్వేరియం ఉన్నట్టు అనిపిస్తుంది. సుమారు రెండు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉండే ఈ సరస్సులో.. ఈ సుందర దృశ్యాలను కచ్చితంగా చూడాల్సిందే అనడం అతిశయోక్తి లేదు.ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఎల్‌మడుగును ఇకో పార్కుగా అభివృద్ధి చేసేందుకు రూ.2 కోట్లు కేటాయించారు. ఇప్పటికే మంథని (Manthani) మండలం ఖానాపూర్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గోదావరి వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కాళేశ్వరంలో పర్యాటక అభివృద్ధికి రూ.115 కోట్లు, మంథనిలోని గోదావరి నది తీరంలో గౌతమేశ్వర ఘాట్ అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఇటీవల మంథనిలో పర్యటించగా, పర్యాటక శాఖ కమిషనర్ న్యాలకొండ ప్రకాశ్‌రెడ్డి సైతం రామగిరిని సందర్శించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్.. మంత్రి శ్రీధర్‌బాబు సతీమణి కాగా, పర్యాటక శాఖ కమిషనర్ ఈ ప్రాంతానికి సంబంధించిన ఐపీఎస్ అధికారి కావడం.. మంథనికి కలిసివస్తుందన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది.చదవండి: ఇక్కడ చదివిన వారెవరూ ఖాళీగా ఉండరు! -
ఇక్కడ చదివిన వారెవరూ ఖాళీగా ఉండరు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక డెయిరీ కళాశాల కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉంది. నాలుగున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నతోద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. ఇక్కడ చదువు పూర్తవకముందే ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అనేక ఉద్యోగావకాశాలు దక్కుతాయి. రాష్ట్రంలో ప్రముఖ డెయిరీ సంస్థ అయిన జెర్సీ డెయిరీ డైరెక్టర్లంతా ఈ కళాశాల విద్యార్థులు కావడం విశేషం. రాష్ట్రంలోని వివిధ డెయిరీ సంస్థల్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్న వారంతా ఇక్కడ చదువుకున్నవారే.కామారెడ్డి పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో 1978లో బీఎస్సీ డెయిరీ కోర్సును ప్రారంభించారు. ఇంటర్ చదివిన వారికి.. నేరుగా సాధారణ డిగ్రీ కోర్సుల్లా డెయిరీ కోర్సులో ప్రవేశం కల్పించేవారు. తరువాతి కాలంలో బీటెక్ డెయిరీ కోర్సుగా మార్పుచెంది.. ఎంసెట్ ద్వారా సీట్ల కేటాయింపు మొదలైంది. డెయిరీ కోర్సు ఎంచుకున్న వారికి.. ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయించేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కొనసాగిన డెయిరీ కోర్సును 2007 సెప్టెంబర్ 1న శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోకి మార్చారు. తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఏర్పాటయ్యాక పీవీ నర్సింహారావు పశువైద్య విశ్వ విద్యాలయం పరిధిలోకి తీసుకువచ్చారు.దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (YS Rajasekhara Reddy) హయాంలో.. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలకు సంబంధించిన 60 ఎకరాల భూమిని డెయిరీ కళాశాలకు కేటాయించారు. కాలేజీ భవనం, హాస్టళ్ల నిర్మాణాలకు రూ.11 కోట్లు మంజూరు చేసిన అప్పటి సీఎం వైఎస్సార్.. భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. కాలేజీ భవనంతో పాటు బాలికలు, బాలుర హాస్టళ్లు, ఆడిటోరియం, ల్యాబ్‌లకు భవనాలు నిర్మించారు. పీజీ కోర్సులకు అవసరమైన మేర సౌకర్యాలు కూడా ఉన్నాయి. అప్పటి నుంచి అదే భవనంలో కళాశాల కొనసాగుతోంది. ప్రాక్టికల్స్‌లో భాగంగా విద్యార్థులు పాల పదార్థాలు తయారు చేసి.. డెయిరీ పార్లర్‌ను కూడా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు కోవా, దూద్‌పేడా, రసగుల్లా, గులాబ్‌జామ్ (Gulab Jamun) వంటివి తయారు చేసి విక్రయిస్తారు. వెయ్యి మందికి పైగా చదువు..కళాశాల స్థాపించినప్పటి నుంచి.. ఇప్పటి వరకు 900 పైచిలుకు డెయిరీ కోర్సులు చదివారు. వారిలో చాలామంది దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ డెయిరీ రంగంలో ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇక్కడ చదివిన వారిలో కొందరు విద్యార్థులు సొంతంగా డెయిరీ ఉత్పత్తుల సంస్థలను స్థాపించారు కూడా. మరెందరో వివిధ డెయిరీ సంస్థల్లో పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లోనూ చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా విజయ డెయిరీ, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, సూపర్వైజర్లు వంటి ఉద్యోగ అవకాశాలు కూడా పొందే వీలుంది. రాష్ట్ర స్థాయిలో ఉపకార వేతనాలు, జాతీయ స్థాయిలో మెరిట్ స్కాలర్షిప్లు అందిస్తారు. పీజీ కోర్సులు వస్తే మరింత ప్రయోజనం కళాశాలలో పీజీ కోర్సులు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు మేలు జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడా డెయిరీ కళాశాలలు లేవు. ఏకైక కామారెడ్డి కళాశాలలో పీజీ కోర్సులు లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది. కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు వెళ్లి పీజీ కోర్సులు చదవాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యనభ్యసించాలంటే ఖర్చుతో కూడుకున్నది కావడంతో.. చాలా మంది బీటెక్‌తోనే చదువును ఆపేస్తున్నారు. ఇక్కడే పీజీ కోర్సులు ప్రారంభిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుందని విద్యార్థులు అంటున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.మంచి భవిష్యత్తు ఉన్న కోర్సు బీటెక్ డెయిరీ కోర్సు చదివిన వారెవరూ ఖాళీగా ఉండే పరిస్థితి లేదు. అందరికీ అనేక అవకాశాలు దొరుకుతున్నాయి. మా కళాశాలలో చదివినవారు ప్రపంచవ్యాప్తంగా డెయిరీ సంస్థల్లో ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు. మన రాష్ట్రంలోని అన్ని డెయిరీల్లోనూ మనవారే కీలక పాత్ర పోషిస్తున్నారు. కొందరు సొంతంగా డెయిరీ సంస్థలు నెలకొల్పారు. ఏటా 40 మందికి ప్రవేశం పొందడానికి అవకాశం ఉంది. ఎంపీసీ చదివిన విద్యార్థులకు ఎంసెట్ ద్వారా డెయిరీ కోర్సులో 35 మందికి సీట్లు దక్కుతాయి. ఐదు సీట్లను రైతు విభాగాల కోటా ద్వారా భర్తీ చేస్తాం. – డాక్టర్ ఉమాపతి, కళాశాల డీన్ -
వైఎస్ ఇచ్చిన వరం.. మా బతుకు బంగారం
నూజివీడు: ట్రిపుల్ ఐటీ.. ఈ పేరు చెబితేనే వాటి వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు అందరి మదిలో మెదులుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పిల్లలకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను ప్రభుత్వమే అందించి వారి కుటుంబాల్లో మార్పు తీసుకురావాలనే సత్సంకల్పంతో 2008లో వైఎస్ ఈ ట్రిపుల్ ఐటీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అనాటి ఉమ్మడి కృష్ణాజిల్లా.. ప్రస్తుత ఏలూరు జిల్లా నూజివీడులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటైంది. అప్పట్లో ఇక్కడ చదువుకున్న మొదటి బ్యాచ్ (2008–14) విద్యార్థుల సమ్మేళనం శనివారం స్థానిక ట్రిపుల్ ఐటీ ఆడిటోరియంలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యాచ్ విద్యార్థులు ఉన్నతస్థాయిలో స్థిరపడ్డారు. 400 మంది విద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి ట్రిపుల్ ఐటీలను స్థాపించి ఉండకపోతే తమ భవిష్యత్తు సాదాసీదాగానే ఉండేదని, తమ జీవితాలు ప్రస్తుతం ట్రిపుల్ ఐటీకి పూర్వం, ట్రిపుల్ ఐటీ తరువాత అన్నట్లుగా చెప్పుకోవచ్చని వారు తెలిపారు. ట్రిపుల్ ఐటీలవల్లే తాము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని వారంతా ముక్తకంఠంతో చెప్పారు. పలువురు విద్యార్థుల భావాలు వారి మాటల్లోనే.. ఏడాదికి రూ.35 లక్షల వేతనం వస్తోంది 2008లో ట్రిపుల్ ఐటీలో చేరి ఈసీఈ బ్రాంచితో ఇంజనీరింగ్ పూర్తిచేశా. మా నాన్న సన్నకారు రైతు, రైతు కూలీ. చదువు పూర్తవగానే సెమీ కండక్టర్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరా. ప్రస్తుతం ఏఆర్ఎం సెమీ కండక్టర్స్ కంపెనీలో జాబ్‌చేస్తున్నా. ఏడాదికి రూ.35 లక్షల వేతనం వస్తోంది. ట్రిపుల్ ఐటీవల్లే ఈ స్థాయిలో ఉన్నా. – నుగ్గు ఆదినారాయణ, గొల్లపల్లి, పొదిలి మండలం, ప్రకాశం జిల్లా అమెరికన్ కంపెనీలో లీడ్ ప్రొడక్ట్ మేనేజర్‌గా.. అమెరికన్ కంపెనీలో లీడ్ ప్రొడక్ట్ మేనేజర్‌గా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా. ఏడాదికి రూ.36 లక్షల వేతనం వస్తోంది. ఈసీఈ చదివాక ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చింది. ఈ స్థాయిలో ఉండటానికి కారణం కేవలం ట్రిపుల్ ఐటీనే. వీటిని స్థాపించకపోయి ఉంటే సాదాసీదా చదువులు చదివేవాడిని. ఇలాంటి విద్యా సంస్థ నెలకొల్పిన వైఎస్ రాజశేఖరరెడ్డికి సెల్యూట్. – పక్కి కార్తీక్, గజపతినగరం, విజయనగరం జిల్లా ఏడాదికి రూ.50 లక్షల వేతనం వస్తోంది.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్థాపించిన ట్రిపుల్ ఐటీలో చదువుకోవడంవల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నా. ప్రస్తుతం ఇన్ఫర్మేటికల్ సంస్థలో ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేస్తున్నా. ఏడాదికి రూ.50 లక్షల వేతనం వస్తోంది. మా నాన్న రైతు కూలీగా పనిచేస్తూ నన్ను చదివించారు. ట్రిపుల్ ఐటీ లేకపోతే నేను మా ఊరిలోనే ఉండేవాడినేమో. – పప్పల సురేష్, గోరింట, పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో మేనేజర్‌గా.. నా సొంతూరు విశాఖపట్నంలోని గాజువాక. నూజివీడు ట్రిపుల్ ఐటీలో మొదటి బ్యాచ్‌లో నేను కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. ఆ తరువాత విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో మేనేజర్‌గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నా. మా నాన్న లారీ డ్రైవర్‌గా పనిచేసేవారు. ట్రిపుల్ ఐటీ అనేది లేకపోతే మేం లేం. ట్రిపుల్ ఐటీ అనేది మా జీవితంలో భాగమైంది. – భీశెట్టి గోపి, మేనేజర్, విశాఖ రిఫైనరీ, విశాఖపట్నం ఏడాదికి రూ.36 లక్షల వేతనం ట్రిపుల్ ఐటీ లేకపోతే చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవాడిని. ఈసీఈ చదివి ప్రస్తుతం ఒడెస్సా సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా చేస్తున్నా. వేతనం ఏడాదికి రూ.36 లక్షలు వస్తోంది. మా నాన్న ప్రైవేటు టీచర్‌గా పనిచేసేవారు. ఇంజనీరింగ్ చేసిన తరువాత ఐఐఎం ఇండోర్‌లో ఎంబీఏ చదివి ఆ తరువాత ఉద్యోగంలో చేరా. – నంబూరు మధుబాబు, చల్లవానిపేట, జలుమూరు మండలం, శ్రీకాకుళం జిల్లా ఇస్రోలో సైంటిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నా..ప్రస్తుతం నేను తిరువనంతపురంలో ఇస్రోకు చెందిన విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్లో సైంటిస్ట్–ఈ కేడర్‌లో పనిచేస్తున్నా. ట్రిపుల్ ఐటీలో ఈసీఈ పూర్తిచేసి రగ్పూర్ ఐఐటీలో ఎంటెక్ పూర్తిచేశా. ఆ తరువాత ఇస్రోలో చేరా. ఆరేళ్లపాటు ట్రిపుల్ ఐటీలో మా భవిష్యత్తుకు బంగారు బాట వేశారు. – కారుమూరి వంశీ, దేవరపల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా స్టార్టప్ ప్రారంభించా.. మా నాన్న సన్నకారు రైతు. వ్యవసాయ కూలి పనులకూ వెళ్లేవాడు. ట్రిపుల్ ఐటీ మొదటి బ్యాచ్‌లో చేరి మెకానికల్ ఇంజనీరింగ్ చేశా. ఆ తరువాత ఐఐఎం లక్నోలో ఎంబీఏ చేశా. తర్వాత ఏడాదికి రూ.45 లక్షల వేతనంతో సాఫ్ట్వేర్ జాబ్ చేశా. ప్రస్తుతం స్టార్టప్ ప్రారంభించా. వైఎస్ రాజశేఖరరెడ్డి, రాజిరెడ్డి ఇద్దరూ మా జీవితాల్లో వెలుగులు నింపారు. ట్రిపుల్ ఐటీలు లేకపోతే మా కుటుంబ ఆరి్థక పరిస్థితికి పాలిటెక్నిక్ గాని, డిగ్రీ గాని మాత్రమే చదివేవాడిని. – పరిటాల శివాజీ, కారంపూడి, గుంటూరు జిల్లా రియాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా.. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. ట్రిపుల్ ఐటీ లేకపోతే స్థానికంగా ఏదోక కాలేజీలో డిగ్రీ చదివి ఉండేవాడిని. ప్రస్తుతం టెక్నాలజీ కన్సల్టింగ్ కంపెనీలో సౌదీలోని రియాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఏడాదికి రూ.72 లక్షల వేతనంతో పనిచేస్తున్నాను. ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరికీ వైఎస్ రాజశేఖరరెడ్డి దేవుడు. మా అందరికీ లైఫ్ ఇచ్చారు. – సంజయ్‌ఖాన్, ఖాజీపురం, మధిర మండలం, ఖమ్మం జిల్లా సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్‌గా చేస్తున్నా.. ఈసీఈ బ్రాంచిలో ఇంజనీరింగ్ పూర్తిచేసి ప్రస్తుతం అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కంపెనీలో రూ.30 లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్‌గా చేస్తున్నా. ఇక్కడ ఆరేళ్ల పాటు చదవడం ఒక రకంగా స్వర్ణయుగం. ట్రిపుల్ ఐటీలో చదవడం వరం. ఇలాంటి విద్యాసంస్థను ఏర్పాటుచేయడం గొప్ప విషయం. – పసుపురెడ్డి వివేక్, హరిపురం, మందస మండలం, శ్రీకాకుళం జిల్లా ట్రిపుల్ ఐటీ మా జీవితాన్నే మార్చేసింది.. మా నాన్న మోటార్ మెకానిక్. ట్రిపుల్ ఐటీలో సీఎస్ఈ చదివా. ఆ తరువాత కాకినాడ జేఎన్టీయూలో ఎంటెక్ పూర్తిచేశా. కొంతకాలం టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశా. ఆ తరువాత 2018 నుంచి గుంటూరులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సీఎస్ఈ లెక్చరర్‌గా పనిచేస్తున్నా. ట్రిపుల్ ఐటీ మా జీవితాన్నే మార్చేసింది. – గజ్జా ప్రణయని, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా -
ఒక్క మందు.. ఊబకాయం, షుగర్ ఔట్!
భారత్‌లో ఏటేటా ఊబకాయుల శాతం పెరిగిపోతోంది. తద్వారా మధుమేహం బారినపడుతున్నవారూ ఎక్కువగానే ఉంటున్నారు. దేశంలో సుమారు 10 కోట్ల మంది వరకు మధుమేహ బాధితులు ఉన్నట్టు అంచనా. అదే సమయంలో జనాభాలో 6.5 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. వీరిలో సగం మందికిపైగా ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదని పలు అధ్యయనాలు తేల్చాయి కూడా. సరైన ఔషధాలు అందుబాటులో లేకపోవడం, అవగాహన లేమి వంటివి కారణమవుతున్నాయి.ఇలాంటి నేపథ్యంలో మన దేశంలోకి ‘మవుంజారో (టైర్జెపటైడ్)’ పేరిట స్థూలకాయాన్ని, మధుమేహాన్ని నియంత్రించే ఔషధం అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఎలీ లిల్లీ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో గుర్తింపు పొందిన ఈ ఔషధాన్ని తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఊబకాయంతోపాటు మధుమేహాన్నీ ఏకకాలంలో నియంత్రించగల ఈ ఔషధం అనేక మంది బాధితులకు ఆశారేఖ కాగలదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. – సాక్షి స్పెషల్ డెస్క్ఎలా పని చేస్తుంది?వారానికి ఒక ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే.. అటు బరువు తగ్గడంతోపాటు ఇటు మధుమేహాన్ని అదుపులో ఉంచే ఔషధాల్లో మొట్టమొదటిది ‘మవుంజారో’. ఇది ‘గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులినోట్రాపిక్ పాలీపెప్టైడ్ (జీఐపీ)’, ‘గ్లూకగాన్ లైక్ పెప్టైడ్–1 (జీఎల్పీ–1)’ హార్మోన్ రెసెప్టార్లను ప్రేరేపించడం ద్వారా బరువునూ, చక్కెర మోతాదులను నియంత్రిస్తుంది’’ అని ఎలీ లిల్లీ కంపెనీ చెబుతోంది. ప్రస్తుతానికి ఈ మందు విషయంలో భారత్‌లో ఏ స్థానిక కంపెనీతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకోలేదని తెలిపింది.క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 72 వారాల పాటు.. ఎంపిక చేసిన వ్యక్తులకు తగిన ఆహారం, వ్యాయామాలతోపాటు ఈ ‘మవుంజారో’ ఔషధాన్ని ఇచ్చి పరిశీలించామని వెల్లడించింది. ఈ మందు 15 ఎంజీ మోతాదులో ఇచ్చినవారు 21.8 కిలోలు బరువు తగ్గారని.. 5 ఎంజీ మోతాదు ఇచ్చినవారు 15.4 కిలోల బరువు తగ్గారని తెలిపింది.‘‘భారతీయుల్లో స్థూలకాయం, టైప్–2 డయాబెటిస్తో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువే. వారందరికీ ప్రయోజనం కలిగేలా భారతీయ ప్రభుత్వ వర్గాలతో, ఇక్కడి కంపెనీల సహకారంతో ఈ మందుపై అవగాహన కలిగించేందుకు మేం ప్రయత్నిస్తాం’’ అని ఎలీ లిల్లీ ఇండియా ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ విన్సెలోవ్ టక్కర్ పేర్కొన్నారు.నెలకు రూ.17,500 వరకు ఖర్చుతో..‘మవుంజారో’ ఔషధాన్ని ఇంజెక్షన్ రూపంలో వారానికి ఒక మోతాదు తీసుకోవాల్సి ఉంటుంది. మన దేశంలో ఔషధాలు, కాస్మెటిక్స్ నియంత్రణ సంస్థ అయిన ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ)’ ఆమోదంతో దీని ధరను 2.5 ఎంజీకి రూ.3,500గా, 5 ఎంజీ రూ.4,375 గా నిర్ణయించారు. అంటే ఒక నెలకు రూ.14,000 నుంచి రూ.17,500 వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. వ్యక్తుల బరువు, ఆరోగ్య స్థితి, ఇతర అంశాల ఆధారంగా ఎంత మోతాదులో ఇవ్వాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు.అందుకు అనుగుణంగా నెలవారీ ఖర్చులో హెచ్చుతగ్గులు ఉంటాయి. నిజానికి ఈ ఔషధాన్ని మనదేశంలో తక్కువ ధరకే తెచ్చారు. యూఎస్ఏలో దీనికి నెలకు 1,000 – 1,200 డాలర్లు ఖర్చవుతుంది. అంటే మన కరెన్సీలో రూ.86,000 నుంచి రూ.లక్ష అన్నమాట. భారత దేశ పరిస్థితులకు అనుగుణంగా బాధితులపై పెద్దగా భారం పడకుండా, విలువకు తగిన ప్రయోజనం చేకూరేలా ధరను నిర్ణయించామని ఎలీ లిల్లీ కంపెనీ చెబుతోంది.మరికొన్ని మందులున్నా..బరువు తగ్గించే కొన్ని రకాల మందులు ఇప్పటికే భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నోవో నార్డిక్స్ కంపెనీకి చెందిన ‘రైబెల్సస్’ ఔషధం మూడేళ్ల కింద అంటే.. 2022 జనవరి నుంచే ఇక్కడ వినియోగంలో ఉంది. ఇది ఇప్పటికే యాంటీ–ఒబేసిటీ మందుల మార్కెట్లో 65 శాతాన్ని చేజిక్కించుకుంది.డ్యూలాగ్లూటైడ్, ఆర్లిస్టాట్, లిరాగ్లూటైడ్ వంటి బ్రాండ్లు కూడా వినియోగంలో ఉన్నాయి. మరోవైపు ఇదే తరహాకు చెందిన ‘సెమాగ్లూటైడ్’ ఔషధం పేటెంట్ కాలవ్యవధి వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. అప్పుడు దాని జనరిక్ మందును తయారు చేసేందుకు ప్రముఖ భారతీయ ఔషధ కంపెనీలు సంసిద్ధంగా ఉన్నాయి. అది తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.వందల కోట్ల మార్కెట్..ఫార్మాట్రాక్ వంటి మార్కెట్ రీసెర్చ్ సంస్థల అంచనా ప్రకారం.. భారత్‌లో యాంటీ ఒబేసిటీ మందులకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ తరహా మందుల మార్కెట్ 2020లో రూ.137 కోట్లుగా ఉండగా.. 2024 నవంబర్ నాటికి రూ.535 కోట్లకు చేరింది. ఇది మరింతగా పెరుగుతోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.టైప్–1 డయాబెటిస్ వారికి ఉపయోగపడదుమవుంజారో వారానికి ఒకసారి ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సిన మందు. స్థూలకాయంతోపాటు టైప్–2 డయాబెటిస్ ఉన్నవారు వాడాల్సిన ఔషధం. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 కంటే ఎక్కువగా ఉండి, డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగపడుతుంది. కిడ్నీ, గాల్ బ్లాడర్, సివియర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు ఉన్నవారు వాడకపోవడమే మంచిది.టైప్–1 డయాబెటిస్‌కు పనిచేయదు. కొంతమంది సెలెక్టెడ్ పాపులేషన్‌కు మాత్రమే ఉపకరించే ఔషధం. వైద్యుల పర్యవేక్షణలో, వారి సూచనల మేరకు మాత్రమే దీనిని వాడాలి. – డాక్టర్ శివరాజు, సీనియర్ ఫిజీషియన్మంచిదే కానీ.. ఇదే మ్యాజిక్ డ్రగ్ కాదు..భారత్‌లో మధుమేహం, స్థూలకాయం సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మవుంజారో మందు ఆశాజనకంగా కనిపిస్తోంది. షుగర్‌ను తగ్గించడంలోనే కాదు బరువు నియంత్రించడంలో కూడా మంచి ఫలితాలను చూపుతోంది. అయితే ఇదొక్కటే ‘మ్యాజిక్ పిల్’ అని పరిగణించడం తప్పుడు భావన. దీర్ఘకాలికంగా ఈ మందు ఎలా పనిచేస్తుందో ఇంకా పూర్తి సమాచారం లేదు.దీనికి తోడు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉండొచ్చు. అందుకే ఈ మందును ఎవరైనా వాడాలనుకుంటే.. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వినియోగించాలి. జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం వంటివి కూడా ఈ మందుతోపాటు తప్పనిసరిగా కొనసాగాలి. అప్పుడే మంచి ఫలితాలు కనిపిస్తాయి. – డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలి..మవుంజారో మందును కేవలం డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. బరువు తగ్గడానికి ఇవ్వాల్సిన మోతాదు, డయాబెటిస్ నియంత్రణకు ఇచ్చే మోతాదు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే వాడాల్సిన మందు అన్నది గుర్తుంచుకోవాలి. బరువు తగ్గించే మందులతోపాటు డయాబెటిస్‌ను నియంత్రించే ఈ తరహా మందులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఈ ‘మవుంజారో’ ఔషధం ప్రపంచవ్యాప్తంగా కాస్తంత గుర్తింపు పొందింది.స్థూలకాయం, అధిక బరువు కారణంగా మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల అరుగుదలతోపాటు డయాబెటిస్, హైపర్‌టెన్షన్, స్లీప్ ఆప్నియా వంటి 200 రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఉన్న మందులకు తోడు మరో రెప్యూటెడ్ బ్రాండ్ కావడంతో ఎలీ లిల్లీ వాళ్ల ఔషధం మరో ప్రత్యామ్నాయం అవుతుంది. – డాక్టర్ గురవారెడ్డి, సీనియర్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ఈ ఔషధం చాలావరకు సురక్షితమే.. కానీ..: – డాక్టర్ అమర్ వెన్నపూస, సీనియర్ బేరియాట్రిక్ సర్జన్మవుంజారోను ఇప్పుడు అధికారికంగా భారత్‌లో ప్రవేశపెట్టారుగానీ ఇప్పటికే విదేశాల నుంచి తెప్పించుకుని వాడినవాళ్లు ఉన్నారు. ఇందులో బరువు తగ్గడమనేది జీఐపీ, జీఎల్పీ–1 హార్మోన్ల ఆధారంగా జరుగుతుంటుంది. బేరియాట్రిక్ సర్జరీలో దాదాపు 200కుపైగా బరువును నియంత్రించే హార్మోన్లలో మార్పులు వస్తాయి. అందులో ముఖ్యమైనవి జీఎల్పీ–1, జీఐపీ. సాధారణంగా ఇన్సులిన్ ఆధారితంగా చక్కెరను నియంత్రించినప్పుడు బరువు పెరగడం జరుగుతుంది.కానీ ఈ ఔషధంతో ఇటు చక్కెరను అదుపులో ఉంచడం, అటు బరువును తగ్గించడం ఈ రెండూ జరుగుతాయి. ఇది చాలావరకు సురక్షితమైనదే. కొందరిలో మాత్రం.. వికారం, వాంతులు, నీళ్ల విరేచనాలు, ఆకలి తగ్గడం, మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలతోపాటు అరుదుగా కళ్లు మసకబారడం, కిడ్నీ సమస్యలు, గాల్ బ్లాడర్ సమస్యలు, పాంక్రియాటైటిస్, థైరాయిడ్ కేన్సర్, సివియర్ అలర్జిక్ రియాక్షన్ వంటివీ రావచ్చు. కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణలో సరైన మోతాదులో వాడాలి. నిజానికి బరువు తగ్గదలచిన కొందరు తమ జీవనశైలి మార్పులతో, ఆహార నియంత్రణతో బరువు తగ్గుతారు.ప్రాణాంతకమైన మార్బిడ్ ఒబేసిటీ ఉన్నవారికి బేరియాట్రిక్ చికిత్స తప్పదు. కానీ కొందరిలో అటు మార్బిడ్ ఒబేసిటీ కాకుండా, ఇటు జీవనశైలి మార్పులతో బరువు తగ్గకుండా ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారికి ఈ ఔషధం మంచిదే. ఇక బేరియాట్రిక్ చికిత్స తర్వాత కూడా బరువు పెరుగుతున్నప్పుడు ఈ మెడిసిన్ వాడవచ్చు. బరువు తగ్గడం, చక్కెర నియంత్రణ రెండూ జరుగుతాయి కదా అంటూ ఎవరు పడితే వారు వాడటం సరికాదు.లైఫ్‌స్టైల్ మార్పులతో బరువు తగ్గడమనేది ఎప్పటికైనా మంచిది. జీవనశైలి మార్పులతో ఫలితాలు కనిపించనప్పుడు దీన్ని ఒక ఉత్ప్రేరకంగా (కిక్ స్టార్లా) వాడవచ్చు. తగ్గిన బరువును అలాగే కొనసాగించడానికి జీవనశైలి మార్పులను అనుసరించడమే ఆరోగ్యకరం. -
సమృద్ధిగా పశు సంపద
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పశు సంపద సమృద్ధిగా ఉందని సామాజిక, ఆర్థిక సర్వే 2024–25లో ప్రభుత్వం వెల్లడించింది. 2012 నుంచి రాష్ట్రంలో పశు సంపద 22 శాతం పెరిగిందని తెలిపింది. సర్వే ప్రకారం రాష్ట్రంలో 3.26 కోట్ల పశువులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా దేశంలోని మొత్తం గొర్రెల్లో 25 శాతం తెలంగాణలోనే ఉన్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉండడానికి వ్యవసాయంతోపాటు దాని అనుబంధ రంగాలైన పాల ఉత్పత్తి, కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకం వల్ల వస్తున్న ఆదాయమే కారణమని సర్వే స్పష్టం చేసింది. వ్యవసాయ అనుబంధ రంగాలపై సర్వేలోని కీలక విషయాలు» రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పాలలో 62 శాతం వ్యవసాయ భూమి లేని రైతుల నుంచే వస్తున్నాయి. » 70 శాతం రైతులు పశు సంపదను కలిగి ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 3.26 కోట్ల పశువులు ఉన్నాయి. » 2012 నుంచి పశు సంపద 22 శాతం పెరిగింది. » ఈ రంగంలో 2023–24 ఆర్థిక సంవత్సరం తుది సవరించిన అంచనాల ప్రకారం ‘జోడించిన రాష్ట్ర స్థూల విలువ’(జీఎస్వీఏ) రూ.96,908 కోట్లు ఉంటే.. 2024–25 ముందస్తు అంచనాల ప్రకారం రూ.1,02,835 కోట్లకు పెరిగింది. » 2024–25లో చేపల ఉత్పత్తి లక్ష్యం 4,81,421 టన్నులు కాగా.. ఈ ఏడాది జనవరి నాటికి 3,69,489 టన్నులు ఉత్పత్తి అయ్యింది. మంచినీటి రోయ్యల ఉత్పత్తి లక్ష్యం 18,366 టన్నులు కాగా.. జనవరి నాటికి 11,845 టన్నులు వచ్చింది. – చేపల పెంపకంలో కృషికిగాను రాష్ట్రానికి కేంద్రం ‘బెస్ట్ పెర్ఫార్మింగ్ ఇన్‌ల్యాండ్ స్టేట్ ఇన్ ఫిషరీస్ సెక్టార్’అవార్డు ప్రకటించింది. -
భారంగా బంగారం లీజింగ్
సాక్షి, బిజినెస్ డెస్క్: జ్యుయలర్లకు బంగారం లీజింగ్ రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. జనవరి నుంచి బంగారం ధర 14 శాతం పైగా పెరిగింది.దీంతో సంఘటిత రిటైల్ జ్యుయలరీ సంస్థలైన టైటాన్, సెంకోగోల్డ్, కల్యాణ్ జ్యుయలర్స్, పీఎన్ గాడ్గిల్ తదితర వాటి మార్జిన్లపై ప్రభావం పడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ టారిఫ్‌లతో బంగారం లీజింగ్ రేట్లు మరింత పెరుగుతాయని జ్యుయలర్లు అంచనా వేస్తున్నారు.‘‘వాణిజ్య, టారిఫ్ యుద్ధాలతో బంగారం లీజింగ్ రేట్లు రెట్టింపయ్యాయి. ఇది మార్జిన్లపై ఒత్తిళ్లను పెంచుతోంది. ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం’’అని పీఎన్జీ జ్యుయలర్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కిరణ్ ఫిరోదియా తెలిపారు. జ్యుయలరీ సంస్థలు అరువుగా తీసుకునే బంగారంపై వసూలు చేసే రేట్లను గోల్డ్ లీజింగ్ రేట్లుగా చెబుతారు. జ్యుయలర్లు తమకు కావాల్సిన బంగారాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడానికి బదులు బ్యాంక్‌లు, బులియన్ ట్రేడర్ల నుంచి పరిమిత కాలానికి అరువు కింద తెచ్చుకుంటాయి. స్థానిక బ్యాంక్‌లు విదేశీ బ్యాంకుల నుంచి బంగారాన్ని సమకూర్చుకుని.. జ్యుయలరీ వర్తకులకు అరువుగా ఇస్తుంటాయి. కొంత వేచి చూశాకే నిర్ణయం తాము మార్చి త్రైమాసికం ముగిసే వరకు వేచి చూసే ధోరణి అనుసరించనున్నట్టు, ఆ తర్వాత దీనిపై ఒక నిర్ణయానికి వస్తామని దేశంలోనే అతిపెద్ద ఆభరణాల రిటైల్ చైన్ టైటాన్ వెల్లడించింది. ‘‘బంగారం లీజింగ్ రేట్లు ఇంకా పెరుగుతాయని సంకేతాలు తెలియజేస్తున్నాయి. సరఫరా ఎలా ఉందన్న దాన్ని అర్థం చేసుకునేందుకు ఒకటి రెండు నెలలు పడుతుంది. అప్పుడే ధరల తీరు తెలుస్తుంది’’అని టైటాన్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) విజయ్ గోవిందరాజన్ తెలిపారు. రేట్ల పెంపు తప్పదా..?బాడుగ బంగారంపై రేట్లు పెరిగిన నేపథ్యంలో తమ మార్జిన్లను కాపాడుకోవాలంటే జ్యుయలర్లు ఆభరణాల రేట్లను పెంచొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు డిమాండ్ లేని సీజన్ కావడంతో రేట్ల పెంపు విషయంలో జ్యుయలర్లు సౌకర్యంగా లేని పరిస్థితి నెలకొన్నట్టు చెబుతున్నారు. డిసెంబర్ త్రైమాసికంలో పండుగలు, వివాహాల కారణంగా కొనుగోళ్లు జోరుగా సాగాయి. మార్చి త్రైమాసికంలో వినియోగం పెరగడానికి ఎలాంటి అనుకూలతలు లేని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.గోల్డ్ లీజింగ్ రేట్లు పెరగడం తమకు ఆందోళన కలిగిస్తున్నట్టు సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ సువాంకర్ సేన్ ఇన్వెస్టర్ కాల్ సందర్భంగా ప్రకటించడం గమనార్హం. లీజింగ్ రేట్లు పెరగడం వల్ల తమకు రుణ వ్యయాలు 0.5 శాతం మేర పెరగనున్నట్టు చెప్పారు. తద్వారా ఫిబ్రవరి, మార్చి నెలల్లో 7–8 కోట్ల మేర తమపై ప్రభావం ఉంటుందని చెప్పారు. ఎంసీఎక్స్‌లో బంగారం రేట్లు జనవరి నుంచి 14 శాతానికి పైగా పెరగడం గమనార్హం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు ఆర్థిక అనిశ్చితులు బంగారం రేట్ల పెరుగుదలకు కారణమవుతున్నట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. -
అప్పుల ఊబిలో అన్నదాత.. ఆవు వచ్చి రక్షించింది..
సాక్షి ప్రతినిధి, వరంగల్/వేలేరు: కుమ్మరిగూడెం.. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో కేవలం 300 జనాభా, 72 ఇళ్లున్న ఓ కుగ్రామం.. ఇక్కడి అన్నదాతలు ఒకప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి విలవిల్లాడారు. ఇప్పుడదే గ్రామం అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యిని స్థానికంగా విక్రయించడంతోపాటు అమెరికా, యూకే, జర్మనీ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. కేవలం ఏడేళ్ల వ్యవధిలోనే అప్పుల ఊబి నుంచి బయటపడి ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసింది. జర్మన్ మహిళ దాతృత్వంతో.. సత్యసాయి బాబా భక్తురాలు, దాతృత్వశీలి అయిన మోనికా రేటరింగ్(జర్మనీ) భారత్‌లో పర్యటిస్తూ.. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతలను, ఆపన్నులను ఆదుకుంటున్నారు. ఈ క్రమంలో 2018లో హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పాలేకర్ సాగు విధానంపై శిక్షణ పొందిన కుమ్మరిగూడెంవాసి మారుపాక కోటి, మహర్షి గోశాల నిర్వాహకుడు సర్జన రమేష్ ద్వారా కుమ్మరిగూడెం సహా చుట్టుపక్కల గ్రామాల్లో స్వయంగా పర్యటించారు.అన్నదాతల ఇబ్బందులను ఆమె గుర్తించారు. వారిని ఎలాగైనా ఆదుకోవాలనుకున్న మోనికా రేటరింగ్.. గ్రామస్తులను పాడిపరిశ్రమ వైపు ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన 30 మంది రైతులను గుజరాత్ తీసుకెళ్లి రూ. 50 వేల చొప్పున 30 గిర్ జాతి ఆవులను కొనిచ్చారు. అలాగే నెయ్యి తీసే యంత్రాన్ని కూడా రైతులకు అందించారు.మోనికా రేటరింగ్ అందించిన ఆర్థిక చేయూతతో కుమ్మరి గూడెం రైతులు క్రమంగా నిలదొక్కుకున్నారు. ముఖ్యంగా స్వచ్ఛమైన గిర్ జాతి ఆవు పాలతో గ్రామస్తులు నెలకు సుమారు 50కిలోల మేర తయారు చేస్తున్న నెయ్యికి భారీ డిమాండ్ ఏర్పడింది. సాధారణంగా కిలో ఆవు నెయ్యి తయారీకి 20 లీటర్ల పాలు అవసర మవుతుంది. కుమ్మరి గూడెం రైతులు మాత్రం కిలో నెయ్యి (Ghee) తయారీకి 30 నుంచి 35 లీటర్ల పాలను ఉపయో గిస్తున్నారు. స్వచ్ఛతకు మారుపేరుగా మారడంతో కిలో రూ.4 వేలకు పైగా వెచ్చించి మరీ కొంటున్నారు. ఆదిలాబాద్, విజయవాడ, విశాఖపట్నం వాసులు కూడా ఫోన్ చేసి ఆర్డర్లు ఇస్తున్నారు. అమెరికాలోని డాలస్, యూకేలోని లండన్, జర్మనీలో ఉంటున్న వారు సైతం ఫోన్ చేసి నెయ్యి ఆర్డర్ చేస్తున్నారు. వారికి స్పీడ్ పోస్ట్, కార్గో సర్వీస్‌ల ద్వారా నెయ్యిని పంపిస్తున్నారు. హనుమ కొండ, వరంగల్, హైదరాబాద్‌లలోని ఆయుర్వేద వైద్యులు సైతం ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నారు.ఇంటి ఖర్చులకు ఉపయోగపడుతోంది..నాకున్న ఎకరంతోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. అలాగే పశుపోషణ చేస్తున్నాను. ప్రస్తుతం ఒక గిర్ ఆవు పాలు ఇస్తోంది. ప్రతి నెలా పాలబిల్లు రూ. 7–8 వేలు వస్తోంది. దీంతో మా కుటుంబ నెలవారీ ఖర్చులు, ఇతర అవసరాలకు ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుంది. – మారుపాక రవి, కుమ్మరిగూడెం గ్రామస్తుడుప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలి..మేము గ్రామంలోనే నెయ్యి తయారు చేసి దేశవిదేశాలకు సరఫరా చేస్తున్నాం. ఇక్కడ తయారు చేసిన నెయ్యికి చాలా డిమాండ్ ఉంది. మాకు ప్రభుత్వం సహకారం అందించి రుణాలు మంజూరు చేస్తే చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. – మారుపాక రాజు, పాలకేంద్రం నిర్వాహకుడు, కుమ్మరిగూడెంసంతృప్తిగా ఉంది.. కుమ్మరిగూడెం (Kummarigudem) ఏడేళ్లలో సాధించిన ప్రగతిని చూసి ఎంతో ఆనందిస్తున్నా. ఇప్పుడు ఈ గ్రామంలో పర్యటిస్తుంటే ఇంగ్లిష్ మాట్లాడే యువకులు నా వెంట నడుస్తూ విజయగాథలు వివరిస్తుంటే నా మనసు గర్వంతో ఉప్పొంగుతోంది. గ్రామస్తులు ఫోన్ చేసి వారి ఆవులను చూసేందుకు రావాలని, జీవితంలో ఎంతో బాగుపడ్డామని చెబుతుండటం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. – మోనికా రేటరింగ్ -
పోషకాల పండు..లాభాలు మెండు 'అవకాడో'
చింతపల్లి: గిరిజన ప్రాంతానికి మేలైన, అనువైన రకాలను గుర్తించడానికి అల్లూరి జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయోగాలు చేస్తుంటారు. ఏజెన్సీలో లాభదాయకమైన పంటలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో గతంలో యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, లిచీ వంటి మొక్కలను ప్రభుత్వం సరాఫరా చేసింది. చింతపల్లి మండలంలో గిరిజన రైతులు వాటిని పండించి మంచి ఫలితాలను పొందుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి అవకాడో వచ్చి చేరింది. నిజానికి రెండు దశాబ్దాల క్రితమే కేంద్ర కాఫీ బోర్డు అధికారులు కాఫీ మొక్కలకు నీడ కోసమని అవకాడో మొక్కలను మండలంలో గొందిపాకలు పంచాయతీలోని పలు గ్రామాల్లో పంపిణీ చేశారు. ఈ మొక్కలపై రైతులకు అవగాహన లేకపోయినా కాఫీ చెట్లకు నీడనిస్తాయనే ఉద్దేశంతో పెంపకం సాగించారు. ఈ మొక్కలు పెరిగి క్రమేపీ పండ్ల దశకు చేరుకున్నాయి. అయితే ఈ అవకాడో పండ్లకు మార్కెట్లో విలువ తెలియక వాటిని రైతులు వృథాగా వదిలేశారు. కొన్నేళ్ల క్రితం ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గ్రామానికి వచ్చి ఈ అవకాడో పండ్లను చూసి దాని విశిష్టత, ఆ పండ్లకు మార్కెట్లో ఉన్న విలువను రైతులకు వివరించారు. దాంతో రైతులు నాటి నుంచి మార్కెట్లో ఈ అవకాడో పండ్ల అమ్మకాన్ని ప్రారంభించారు. దాంతో వ్యాపారస్తులు సైతం గ్రామాలకు వచ్చి రైతుల నుంచి ఈ పండ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో ఆరు దేశ, విదేశీ రకాలను దిగు మతి చేసుకొని ఎకరం విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. ప్రత్యేక శ్రద్ధతో గిరి రైతుల సాగు చింతపల్లి మండలంలో గొందిపాకలు, చిక్కుడుబట్టి, చినబరడý, పెదబరడ మొదలైన గ్రామాల్లో రైతులకు ఐటీడీఏ గతంలో వివిధ రకాల పండ్ల మొక్కలతోపాటు అవకాడో మొక్కలను పంపిణీ చేసింది. రైతులు ఈ మొక్కలను తమ పొలాల్లో వేసి పెంచుతున్నారు. ప్రస్తుతం అవి పెరిగి పెద్దవై దిగుబడులను ఇస్తున్నాయి. ఈ అవకాడో పండ్లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఔషధ గుణాలు, పోషకాలు అధికం అవకాడో పండు ఇతర పండ్ల మాదిరిగా కాకుండా అత్యధిక పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు, పోషకాల నిపుణులు గుర్తించారు. ప్రధానంగా ఈ పండు క్యాన్సర్ కారకాలను నిరోధించడంతోపాటు కంటి చూపు, మధుమేహం, స్థూలకాయం తగ్గుదలకు, సంతానోత్పత్తికి, జీవక్రియ మెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు.» కాఫీ చెట్లకు నీడనిచ్చేందుకు తీసుకొచ్చిన విదేశీ మొక్క» పోషకవిలువలున్నఫలాలనూఇస్తోంది.. » చింతపల్లిఉద్యాన పరిశోధన స్థానంలో 6 దేశీ, విదేశీ రకాలపై పరిశోధనలు చింతపల్లిలో కొత్త రకాలపై పరిశోధనలు అవకాడో పండ్లకు దేశీయంగానే కాకుండా విదేశాల్లోను మంచి గిరాకీ ఉంది. దీనిని గుర్తించి చింతపల్లి ఉద్యానవన పరిశోధన స్థానంలో గత ఏడాది టకేడి–1, హోస్ మొక్కల సాగు చేపట్టగా ఈ ఏడాది కొత్తగా పింకిర్టన్, ప్యూర్డ్, రీడ్ వంటి కొత్త రకాలను ఇక్కడికి తీసుకువచ్చి పరిశోధనలు జరుపుతున్నాం. గిరిజన రైతాంగం పండించి ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్న అవకాడోకు శాస్త్రీయ నామం లేదు. దాంతో పంటకు మంచి గిట్టుబాటు ధర లభించడంలేదు.ప్రస్తుతం మా క్షేత్రంలో గత ఏడాది మూడు వెరైటీలు, ఈ ఏడాది 3 రకాలపై పరిశోధనలు జరుపుతున్నాం. ఈ కొత్త రకాలను శాస్త్రీయ నామంతో మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చు. దీంతో మంచి ధర వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ, మిరియాలు పంటల వలే ఈ అవకాడో పంటను విస్తరించడానికి మేలైన రకాల కోసం ప్రయోగాలు చేపడుతున్నాం. – శెట్టి బిందు, ప్రధాన శాస్త్రవేత్త,ఉద్యాన పరిశోధన స్థానం, చింతపల్లివిదేశీ పంటలకు అల్లూరి జిల్లా ఆలవాలంగా మారింది. ఇప్పటికే ఏజెన్సీ పాంతంలో స్ట్రాబెర్రీ, లిచీ, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలు మంచి ఫలితాలను ఇస్తుండగా తాజాగా ఈ కోవలోకి అవకాడో వచ్చి చేరింది. కాఫీ చెట్లకు నీడ కోసం పెంచుతున్న ఈ చెట్లు పోషక విలువలతో ఉన్న పళ్లను కూడాఇస్తున్నాయి. -
పెద్దపులికి పెనుముప్పు
నడకలో రాజసం.. ఒళ్లంతా పౌరుషం.. పరుగులో మెరుపు వేగం.. పెద్దపులికే సొంతం. అది ఒక్కసారి గాండ్రిస్తే అడవి అంతా దద్దరిల్లిపోవాల్సిందే. ఏ జంతువైనా తోక ముడుచుకోవాల్సిందే. టన్నుల కొద్దీ ఠీవీని తనలో ఇముడ్చుకున్న పెద్దపులి మనుగడ ప్రమాదపు అంచులకు చేరడం జంతు, పర్యావరణ ప్రేమికులతో పాటు ప్రభుత్వ యంత్రాంగాలనూ ఆందోళనకు గురిచేస్తోంది. పులి గాండ్రింపు సురక్షితం కావాలన్న ఆకాంక్ష బలంగా వినిపిస్తోంది. సాక్షి, అమరావతి: దేశంలో పెద్దపులికి పెనుముప్పు వచ్చి పడింది. ఐదేళ్లలో పులుల వేట అమాంతం పెరిగింది. పులులను వేటాడి వాటి ఎముకలు, చర్మాలను విదేశాలకు భారీగా అక్రమ రవాణా చేస్తున్నారు. అందుకోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో ప్రత్యేకంగా కొన్ని ముఠాలు వ్యవస్థీకృతమై మరీ స్మగ్లింగ్ దందాను సాగిస్తున్నాయి.పులి ఎముకలకు చైనా, తైవాన్, జపాన్లలో పెద్దఎత్తున డిమాండ్ ఉండటంతో ఈ ముఠాలు చెలరేగిపోతున్నాయి. ప్రధానంగా 2024లో దేశంలో పులుల వేట, స్మగ్లింగ్ జోరందుకోవడం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర ప్రభుత్వ విభాగం ‘వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) తాజా నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో బలైన 100 పులులు కొన్నేళ్లుగా చేపడుతున్న చర్యలతో దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని సంతోషించేలోగానే.. పులుల వేట కూడా అమాంతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలో ఉన్న పెద్ద పులుల సంఖ్యలో 70 శాతం భారత్‌లోనే ఉన్నాయి. దేశంలో 58 టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లలో 2022 నాటికి 3,682 పెద్ద పులులు ఉన్నాయి. 2006లో కేవలం 1,411 పెద్ద పులులు మాత్రమే ఉండగా.. 2023 నాటికి వాటి సంఖ్య 3,682కు పెరగడం విశేషం.కాగా 17 ఏళ్లలో క్రమంగా దేశంలో పులుల సంఖ్య పెరగ్గా.. గత ఐదేళ్లలో పులుల వేట కూడా పెరగడం ప్రతికూలంగా పరిణమిస్తోంది. గత ఐదేళ్లలో స్మగ్లింగ్ ముఠాలు దేశంలో 100 పులులను వేటాడాయి. వాటి ఎముకలు, చర్మం, ఇతర భాగాలను అక్రమంగా రవాణా చేశాయి. 2021–23లోనే 33 పులులను హతమార్చగా... 2024లోనే 42 పులులను వేటాడారు. ఐదేళ్లలో అత్యధికంగా మహారాష్ట్రలో 41 పులులను హతమార్చారు. ఆ రాష్ట్రంలో 2024 డిసెంబర్ 30 నుంచి 2025 జనవరి 22 నాటికి.. అంటే కేవలం 24 రోజుల్లోనే 12 పులులను వేటాడటం దేశంలో స్మగ్లింగ్ ముఠాల బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. స్మగ్లింగ్‌లో రెండో స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ఐదేళ్లలో 10 పులులు వేటగాళ్ల దెబ్బకు బలయ్యాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మూడేసి, తమిళనాడులో రెండు పులులు హతమవగా... కేరళ, ఉత్తరాఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్లో మిగిలిన పులులను వేటాడారు. మందుల తయారీ ముడిసరుకుగా పులి ఎముకలు చైనా, తైవాన్, జపాన్ తదితర దేశాల్లో పులుల ఎముకలకు భారీ డిమాండ్ ఉండటంతో వాటి వేట పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో పులి శరీర భాగాలను వాణిజ్యపరమైన డిమాండ్ ఏమీ లేదు. పులి చర్మాలను స్టేటస్ సింబల్‌గా కొందరు బడా బాబులు తమ బంగ్లాలలో ప్రదర్శిస్తుంటారు. కానీ.. చైనా, తైవాన్, జపాన్ దేశాల్లో పులి శరీర భాగాలకు వాణిజ్యపరమైన డిమాండ్ భారీగా ఉంది. ప్రధానంగా పులి ఎముకలకు ఆ దేశాల్లో అత్యధిక డిమాండ్ ఉంది. చైనా, తైవాన్లలో ఔషధాల తయారీకి పులి ఎముకలను వినియోగిస్తున్నారు. పులి ఎముకలను పొడి చేసి వాటిని ప్రత్యేకమైన కొన్ని ఔషధాల తయారీకి వాడుతున్నారు. ఇక జపాన్‌లో పులి ఎముకలను బాగా ఉడికించి ఆ రసాన్ని ఖరీదైన మద్యం తయారీకి వాడుతున్నారు. ఆ దేశాల్లో పులులు లేవు. దాంతో ఆ దేశాల్లోని ఔషధ కంపెనీలు భారత్ నుంచి అక్రమంగా పులి ఎముకలను కొనుగోలు చేస్తున్నాయి. అందుకోసం ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ముఠాలు పులులను వేటాడి వాటి శరీర భాగాలను ఆ ఏజెంట్లకు విక్రయిస్తున్నాయి. ఏజెంట్లు ఈశాన్య రాష్ట్రాల్లోని షిల్లాంగ్– సిల్చార్–ఐజ్వాల్–చంఫాయి గుండా దేశ సరిహద్దులు దాటించి మయన్మార్ మీదుగా చైనా, తైవాన్, జపాన్ తదితర దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. స్మగ్లింగ్ అడ్డుకట్టకు సిట్ ఏర్పాటు దేశంలో పులుల వేట, స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఇది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. ఇప్పటికే కొందర్ని అరెస్ట్ చేసింది. పులులను వేటాడే ముఠాల భరతం పట్టేందుకు కార్యాచరణను వేగవంతం చేసింది. -
మూస ధోరణికి భిన్నంగా..
ఒక జాతి సంస్కృతి తెలుసుకోవాలంటే.. ఆ జాతి ఏర్పాటు చేసుకున్న రంగస్థలమేంటో తెలుసుకుంటే సరిపోతుందంటారు సామాజికవేత్తలు. తెలుగు జాతి సంస్కృతి, సంప్రదాయాలు, సమకాలీన సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో చూపడంలో రంగస్థలం అత్యంత ప్రధానమైంది. నలభయ్యేళ్లుగా ప్రవాహంలా సాగిపోతున్న నాటక రంగానికి తమవంతు బాధ్యతగా దశాదిశ చూపే ప్రయత్నం చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు (Thorrur) ప్రాంత కళాకారులు.తొర్రూరు ప్రాంతానికి చెందిన చైతన్య కళా సమాఖ్య ప్రతినిధులు 1985 నుంచి నాటక రంగానికి జీవం పోస్తున్నారు. నాటక ప్రదర్శనల్లో.. తెలుగు రాష్ట్రాల్లోనే చైతన్య కళా సమాఖ్య మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 200 పైచిలుకు నాటక ప్రదర్శనలకు అవకాశమిచ్చిన కళా సమాఖ్య.. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ గుర్తింపు పొందుతోంది. ఆదర్శం.. చైతన్య కళా సమాఖ్య నాటక సేవ మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 1985లో మన్నూరు ఉమ బృందం చైతన్య కళా సమాఖ్యను స్థాపించింది. అప్పటినుంచి సమాఖ్య 40 ఏళ్లుగా కళా రంగానికి తన వంతు సేవ చేస్తోంది. ఏటా మార్చిలో వారం రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ జాతీయ తెలుగు ఆహ్వాన నాటికల పోటీల్లో.. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక నాటక సంఘాలు ప్రదర్శనలిచ్చాయి. హైదరాబాద్, కరీంనగర్, గుంటూరు కళాకారులు నాటకాలను ప్రదర్శించారు. ఈ కళా సమితి వేదికపై ప్రదర్శనలు ఇచ్చి పలువురు గుర్తింపు పొందారు. మూస ధోరణికి భిన్నంగా.. 1980 వరకు గ్రామాల్లో, పట్టణాల్లో పండుగల సందర్భాల్లో నాటకాలను ప్రదర్శిస్తుండేవారు. వాటికి విపరీతమైన ఆదరణ ఉండేది. ఒకప్పుడు వెలుగొందిన ఈ కళ.. నేడు సినిమా, టీవీల ప్రభావంతో మసకబారుతోంది. ప్రస్తుతం నాటక ప్రదర్శనలకు పెద్దలు మినహా నేటితరం యువత రావడం లేదు. ఇలాగే కొనసాగితే తెలుగు నాటకం (Telugu Natakam) మసకబారే ప్రమాదముందని భావించిన తొర్రూరు చైతన్య కళా సమాఖ్య కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ఉత్తమ నాటకాలను ఎంచుకుని ప్రదర్శనలకు ఆహ్వానిస్తోంది. పోటీకి వచ్చిన నాటికల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి నగదు బహుమతులు అందజేస్తోంది. ఉత్తమ నటులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది.చదవండి: దేవాలయాల్లో రావి, వేప చెట్లు ఎందుకు ఉంటాయి?నాటక వారసత్వాన్ని కొనసాగించాలని.. ప్రస్తుతం టీవీ, సినిమాలు చూస్తే.. వాటిలో ఎలాంటి సందేశం ఉండటం లేదు. కానీ నాటకాలను తిలకించినప్పుడు.. అందులోని పాత్రలు, సారాంశం నిజ జీవితానికి అద్దం పట్టేలా ఉంటాయి. నాటకాల వారసత్వాన్ని నేటి తరానికి అందించే లక్ష్యంతో చైతన్య కళా సమాఖ్య ఏటా పోటీలు నిర్వహిస్తోంది. కళా సమాఖ్య ద్వారా తొర్రూరులో మా వంతుగా కళా రంగాభివృద్ధికి కృషి చేస్తున్నాం. – మన్నూరు ఉమ, అధ్యక్షుడు, చైతన్య కళా సమాఖ్య, తొర్రూరునాటకానికి జవసత్వాలు నింపాలి ప్రాచీన కళలు అంతరించి పోకుండా ఐక్యంగా కృషి చేయాలి. నాటక పోటీల ద్వారా ఈ రంగానికి జవసత్వాలు నిండాలన్నదే మా ఆకాంక్ష. ఇటీవల తొర్రూరులో నిర్వహించిన జాతీయ స్థాయి తెలుగు ఆహ్వానిత నాటక పోటీలకు ఎన్నడూ లేనంత ఆదరణ లభించింది. ప్రేక్షకులు నాటకాలు వీక్షించేందుకు గంటల తరబడి కుర్చీలకే అతుక్కుపోయారు. రానున్న రోజుల్లోనూ నాటక ప్రదర్శనలు కొనసాగిస్తాం. – సుంకరనేని పినాకపాణి, ప్రధాన కార్యదర్శి, చైతన్య కళా సమాఖ్య -
డాక్టర్ నుంచి డేటా సైన్స్ వైపు
సాక్షి, ఎడ్యుకేషన్: ‘ఎంబీబీఎస్ పూర్తయ్యాక నచ్చిన స్పెషలైజేషన్‌లో పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చదవడం. ఆ వృత్తిలో కొనసాగడం.. సాధారణంగా.. ఎంబీబీఎస్ విద్యార్థుల ప్రణాళిక ఇదే. కానీ.. మారుతున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా హెల్త్‌కేర్ సెక్టార్లో కీలకంగా నిలుస్తుందని.. ఇందులో నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. ఎంబీబీఎస్, ఏఐ నైపుణ్యాల కలయికతో మరింత ఉన్నతంగా ఎదగొచ్చని భావించా.అందుకే ఎంబీబీఎస్ తర్వాత బీఎస్ డేటా సైన్స్‌లో చేరాను. ఏఐలో ఎంటెక్ చేయడం, హెల్త్‌కేర్‌లో ఏఐపై రీసెర్చ్ చేయడమే లక్ష్యం..’అంటున్నారు.. గేట్–2025లో డేటా సైన్స్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్లో 96.33 మార్కులతో.. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన..ఏపీలోని నెల్లూరు జిల్లా ఆమంచర్లకు చెందిన సాదినేని నిఖిల్ చౌదరి. పదో తరగతి నుంచి తాజాగా గేట్ ర్యాంకు వరకు అన్నిటా ముందు నిలిచిన నిఖిల్ చౌదరి.. ప్రస్తుతం ఎక్స్‌పర్ట్‌డాక్స్ అనే హెల్త్‌కేర్ ఏఐ సంస్థలో ఇన్ఫర్మాటిక్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక.. 2017లో ఎయిమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, నీట్–యూజీ రెండింటికీ హాజరయ్యా. ఎయిమ్స్ ఎంట్రన్స్‌లో 22వ ర్యాంకు, నీట్–యూజీలో 57వ ర్యాంకు వచ్చాయి. ఎయిమ్స్ వైపు మొగ్గుచూపి ఢిల్లీలో ఎంబీబీఎస్‌లో చేరా. చదువు పూర్తయ్యాక 2023లో ఆరు నెలల పాటు ఎయిమ్స్‌లోనే తాత్కాలిక ప్రాతిపదికన డాక్టర్‌గా విధులు నిర్వర్తించా.అప్పుడే బీఎస్ డేటా సైన్స్ ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే.. డేటా సైన్స్.. హెల్త్‌కేర్ సెక్టార్లో దాని ప్రాధాన్యంపై అవగాహన ఏర్పడింది. ఆ కోర్సు చదవాలని భావించా. ఐఐటీ– చెన్నైలో ఆన్లైన్ విధానంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) ఇన్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుని అందులో చేరా. 2021 నుంచి 2024 వరకు ఆన్లైన్లో ఈ కోర్సు చదివి సరిఫికెట్ సొంతం చేసుకున్నా. ఇప్పుడు ఇదే అర్హతతో గేట్లో డేటా సైన్స్ / ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్‌కు హాజరయ్యా. హెల్త్‌కేర్ రంగంలో కీలకంగా ఏఐ ప్రస్తుతం హెల్త్‌కేర్ రంగంలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో కీలకంగా నిలుస్తోంది. ఎంఆర్ఐ, కోడింగ్, మెడికల్ ఇమేజెస్ వంటి వాటిని కచ్చితత్వంతో విశ్లేషించడానికి ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ దోహదం చేస్తుంది. అంతేకాకుండా మెడికల్ కోడింగ్, బిల్లింగ్ వంటి ఇతర హెల్త్‌కేర్ సంబంధ వ్యవహారాల్లో కూడా ఏఐ టూల్స్ విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి.ఏఐలో ఎంటెక్.. తర్వాత రీసెర్చ్ గేట్లో వచ్చిన ర్యాంకుతో ఐఐటీలో ఎంటెక్ ఏఐ స్పెషలైజేషన్‌లో చేరతా. ఆ తర్వాత ఈ రంగానికే చెందిన సంస్థల్లో ఉద్యోగంలో చేరాలని భావిస్తున్నా. భవిష్యత్తులో అవకాశం ఉంటే స్టార్టప్ నెలకొల్పడంపై దృష్టి సారిస్తా. కానీ హెల్త్‌కేర్ ఏఐలో రీసెర్చ్ చేయడమే నా మొదటి ప్రాధాన్యం.గేట్ అంటే భయపడక్కర్లేదు.. నేను ఉద్యోగం చేస్తూనే.. సిలబస్‌ను ఆసాంతం నిశితంగా పరిశీలించి బీటెక్ అకడమిక్స్‌పై పట్టు సాధిస్తే గేట్లో విజయం సులభమే. నేను బీఎస్ డేటా సైన్స్‌లో చదివిన అంశాలను సిలబస్‌తో బేరీజు వేసుకుంటూ చదివా. ప్రాక్టీస్ టెస్టులు, మోడల్ టెస్టులకు హాజరయ్యా. ప్రస్తుతం ఎక్స్‌పర్ట్‌డాక్స్ అనే సంస్థలో ఇన్ఫర్మాటిక్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నా.ఒకవైపు ఉద్యోగం చేస్తూనే గేట్‌కు ప్రిపరేషన్ సాగించా. ప్రతీరోజు 3 నుంచి 4 గంటలు.. సెలవు రోజుల్లో ఏడెనిమిది గంటలు కేటాయించా. కొన్ని ఆన్లైన్ క్లాస్‌లకు కూడా హాజరయ్యా. ఇందులో ముఖ్యమైన అంశం టైమ్ మేనేజ్మెంట్. పరీక్ష రోజు మనకు అందుబాటులో ఉండే సమయాన్ని గుర్తుంచుకుని.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ దశ నుంచే ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది.నిఖిల్ అన్నింటిలోనూ టాపరే..⇒ పదో తరగతి: 9.8 జీపీఏ⇒ ఇంటర్మిడియెట్: 986 మార్కులు ⇒ ఎయిమ్స్ ఎంట్రన్స్ – 2017, ర్యాంకు: 22 ⇒ నీట్ – 2017 ర్యాంకు: 57 ⇒ 2017–2023: ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ ⇒ 2024: బీఎస్ డేటా సైన్స్ (ఐఐటీ – చెన్నై) 9.95 జీపీఏ ⇒ గేట్–2025లో డేటా సైన్స్, ఏఐ పేపర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ -
ఒక్క గ్రాముతో.. 27 ఏళ్లు బతికేయొచ్చు
కడుపు నిండా భోజనం చేస్తే.. ఓ పూట పనికి సరిపడా శక్తి వచ్చేస్తుంది. మహా అయితే మరికొన్ని గంటలు గడిపేయొచ్చు. ఆ తర్వాత మళ్లీ ఏదో ఒకటి తినాల్సిందే. శక్తిని సమకూర్చుకోవాల్సిందే. అరటి పండు తింటే ఇంత, అన్నం తింటే ఇంత అంటూ మన శరీరానికి అందే కేలరీల శక్తిని గురించి లెక్కలేసుకుంటూ ఉంటాం కూడా. కానీ కేవలం ఒక్క గ్రాము.. అంటే అరచేతిలో పట్టేంత పదార్థంతో.. 27 ఏళ్లు బతికేసేంత శక్తి వస్తే!? భలే చిత్రమైన అంశం కదా.. ఇది జస్ట్ కేవలం థియరీ మాత్రమే, నిజంగా చేయగలిగితే మనుషులమంతా ‘ఐరన్ మ్యాన్’ అయిపోవచ్చన్న మాటే!ఏం చేసినా, చేయకున్నా శక్తి ఖర్చు..మనం ఏ పనిచేసినా, ఏమీ చేయకుండా నిద్రపోయినా కూడా మన శరీరంలో శక్తి ఖర్చవుతూనే ఉంటుంది. గుండె కొట్టుకోవడం, రక్త సరఫరా, శ్వాస తీసుకోవడం, మెదడు, కాలేయం, కిడ్నీలు ఇలా దాదాపు అన్ని అవయవాలు దాదాపుగా నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఇందుకోసం శక్తి ఖర్చవుతూనే ఉంటుంది. ఇక మనం ఏ పనిచేసినా కండరాల్లో శక్తి వినియోగం అవుతుంది. మనం తినే ఆహారం నుంచే ఈ శక్తి శరీరానికి సమకూరుతూ ఉంటుంది.ఉదాహరణకు ఒక అరటి పండు నుంచి 90 కేలరీల శక్తి వస్తుంది. గుడ్డు నుంచి 155 కేలరీలు, వంద గ్రాముల అన్నం నుంచి 130 కేలరీలు, 100 గ్రాముల చికెన్ నుంచి 239 కేలరీల శక్తి అందుతుంది.ఆ ఒక్క గ్రాము.. ఆహారం కాదు!ఒక్క గ్రాముతో 27 ఏళ్లు బతికేయొచ్చని చెప్పినది ఆహారం గురించి కాదు.. అంత శక్తిని ఉత్పత్తి చేయగల యురేనియం నుంచి! అణువిద్యుత్ ఉత్పత్తి, అణ్వాయుధాల తయారీ కోసం యురేని యం వాడటం తెలిసిందే. శాస్త్రవేత్తలు తేల్చిన లెక్కల ప్రకారం... ఒక్క గ్రాము యురేనియం నుంచి సుమారు 1,96,05,985 కేలరీలు.. ఈజీగా చెప్పాలంటే సుమారు 2 కోట్ల కేలరీల శక్తి వస్తుంది. అంటే.. ఏకంగా 27 ఏళ్లపాటు శరీరానికి అవసరమైన శక్తి అంతా అందుతుందన్న మాట.ఐరన్ మ్యాన్ ‘ఆర్క్ రియాక్టర్’ తరహాలో..అయితే యురేనియం నుంచి శక్తి వస్తుందికదా అని నేరుగా తినేయడం అస్సలు సాధ్యం కాదు. అత్యంత ప్రమాదం కూడా. కేవలం 50 మిల్లీగ్రాముల యురేనియం శరీరంలోకి వెళ్లినా... ప్రాణాలు పోయినట్టే. మరి శరీరానికి శక్తి ఎలా? దీనిపైనే శాస్త్రవేత్తలు భిన్నమైన ప్రతిపాదన చేస్తు న్నారు. చిన్న పరిమాణంలో ఉండే అణు రియాక్టర్‌ను రూపొందించి, శరీరంలో అమర్చడం ద్వారా శక్తి పొందవచ్చట. ఉదాహరణకు.. ‘ఐరన్ మ్యాన్’ సినిమాలో హీరో క్యారెక్టర్. తన గుండె ఉండే భాగంలో చిన్న పాటి ‘ఆర్క్ రియాక్టర్’ను అమర్చుకుంటాడు. దాని నుంచి వచ్చే శక్తితోనే ఐరన్‌మ్యాన్ పోరాటాలు, విన్యాసాలు చేస్తుంటాడు.అయినా.. ‘ఆహారం’ తప్పనిసరిగా తినాల్సిందే!ఒకవేళ నిజంగానే ‘ఆర్క్ రియాక్టర్’ వంటిది వచ్చినా.. మనం ఆహారం తీసుకోవడం మాత్రం తప్పదని నిపుణులు తేల్చి చెప్తున్నారు. మన శరీరం కేవలం కేల రీల శక్తితో మాత్రమే పనిచేయదు. ప్రతి అవయ వం పనితీరుకు, ప్రతి జీవక్రియకు కొన్ని ప్రత్యేక మైన రసాయన సమ్మేళనాలు.. విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు వంటివి అవసరం. వాటికోసమైనా మనం సమతుల పోషకాహారం తీసుకోక తప్పదు మరి.ఇక మిగిలింది.. యురేనియంతో ‘ఐరన్‌మ్యాన్’ ఎప్పుడు అవుదామా అని ఎదురుచూడటమే!– సాక్షి సెంట్రల్ డెస్క్ -
అడవులు 24.69%
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు 24.69 శాతం ఉన్నాయని సామాజిక, ఆర్థిక సర్వే 2024–25లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో అడవులు 23.59 శాతం ఉండగా, రాష్ట్రంలో అంతకంటే అధికంగానే ఉన్నట్లు పేర్కొంది. అడవుల సగటు విస్తీర్ణంలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 2,939 కి పైగా వృక్ష, మొక్క జాతులున్నాయి. 365 పక్షి జాతులు, 131 ఇతర జంతువులు, మృగాల జాతులున్నాయని సర్వేలోతెలిపారు. రాష్ట్రంలో మొత్తం అడవులు 27,688 చ.కి.మీ మేర విస్తరించి ఉన్నాయి. మొత్తం 12 రక్షిత ప్రాంతాల్లో 9 వైల్డ్‌లైఫ్ శాంక్చురీలు, మూడు జాతీయ పార్కులు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం వనమహోత్సవం, ప్రాజెక్ట్ టైగర్, అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అమ్రాబాద్ పులుల అభయారణ్యం (ఏటీఆర్)ను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రకటించింది. -
చిన్న బ్రాండ్స్‌కు యువత జై
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కొనుగోళ్లలో సాధారణంగా పెద్ద బ్రాండ్స్‌నే ఎక్కువగా ఎంచుకునే వినియోగదారుల ధోరణి క్రమంగా మారుతోంది. కొత్త తరం కన్జూమర్లు, ముఖ్యంగా మిలీనియల్స్, జెన్ జెడ్ వర్గాలు.. పేరొందిన పెద్ద కంపెనీల కన్నా కొన్నాళ్ల క్రితమే మార్కెట్లోకి వచ్చిన చిన్న బ్రాండ్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ నీల్సన్ఐక్యూ తాజా అధ్యయనం ప్రకారం 2019–2024 మధ్య కాలంలో పరిశ్రమ వార్షిక వృద్ధి రేటు కేవలం 8 శాతంగానే ఉండగా, వర్ధమాన ఎల్రక్టానిక్స్ గృహోపకరణాల బ్రాండ్లు మాత్రం ఏకంగా 13% వృద్ధి రేటు నమోదు చేశాయి.5 శాతం కన్నా తక్కువ మార్కెట్ వాటా గల సంస్థలను వర్ధమాన బ్రాండ్లుగా పరిగణనలోకి తీసుకున్నారు. 1981–96 మధ్య పుట్టిన వారిని మిలీనియల్స్‌గా, 1997–2012 మధ్య జన్మించిన వారిని జెనరేషన్ జెడ్‌గా వ్యవహరిస్తారు. చిన్న గృహోపకరణాల విభాగంలో వర్ధమాన బ్రాండ్ల మార్కెట్ వాటా గత అయిదేళ్లలో 55% నుంచి 59%కి పెరిగింది. టీవీల్లో 23% నుంచి 26%కి చేరింది. ఇక ఈ–కామర్స్‌లో కొత్త బ్రాండ్లు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతున్నాయి. అటు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డేటా ప్రకారం గత అయిదేళ్లలో ఆరు టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ వార్షిక వృద్ధి 1.2 శాతానికి నెమ్మదించగా, చిన్న బ్రాండ్లు మాత్రం 2.65% వృద్ధి చెందాయి. తీవ్రమైన పోటీ.. బ్రాండ్లు చిన్నవే అయినప్పటికే అవి అనుసరిస్తున్న వ్యూహాలే వ్యాపార వృద్ధికి ఊతమిస్తున్నాయి. ప్రధానంగా వినూత్నత, తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తుండటంలాంటి అంశాలు వాటికి ప్లస్ పాయింటుగా ఉంటోంది. ఇక ఈ–కామర్స్ విషయానికొస్తే.. కొనుగోళ్లు సులభతరంగా ఉండటం కూడా కలిసి వస్తోంది. ప్రీమియం ఫీచర్లను మరింత అందుబాటులోకి తేవడం ద్వారా వివిధ కేటగిరీల్లో వర్ధమాన బ్రాండ్లు తీవ్రమైన పోటీకి తెరతీశాయని నీల్సన్ఐక్యూ ఇండియా పేర్కొంది. టీవీలు, ఎయిర్ కండీషనర్లు, వేరబుల్స్ విభాగాల్లో దాదాపు 45–50 బ్రాండ్స్ పోటీపడుతున్నాయి.సాధారణంగా ఎల్రక్టానిక్స్ కేటగిరీలో 3–4 పెద్ద బ్రాండ్స్ మాత్రమే మార్కెట్‌పై ఆధిపత్యం చలాయిస్తుంటాయి. ఉదాహరణకు రిఫ్రిజిరేటర్లు.. వాషింగ్ మెషీన్లు వంటి కేటగిరీల్లో ఎల్జీ, శాంసంగ్, వర్ల్‌పూల్, గోద్రెజ్ మొదలైనవి అగ్రస్థానంలో ఉండగా .. ఏసీల్లో వోల్టాస్, డైకిన్, ఎల్జీ లాంటి సంస్థలు టాప్ బ్రాండ్లుగా ఉంటున్నాయి. ప్రస్తుతం ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) విభాగంలోని ధోరణులే ఎల్రక్టానిక్స్‌లోనూ కనిపిస్తున్నాయని నీల్సన్ఐక్యూ వివరించింది.డిసెంబర్ క్వార్టర్లో దిగ్గజ సంస్థల కన్నా దాదాపు రెట్టింపు స్థాయిలో చిన్న, మధ్య తరహా సంస్థల అమ్మకాలు 13–14% స్థాయిలో పెరిగినట్లు పేర్కొంది. ఎల్రక్టానిక్స్ సెగ్మెంట్లో ప్రీమియం ఉత్పత్తుల విభాగం వేగవంతంగా వృద్ధి చెందుతోందని నీల్సన్ఐక్యూ డేటా సూచిస్తోంది. ఇక 2024 సెప్టెంబర్–డిసెంబర్ మధ్య కాలంలో ఈ–కామర్స్ మాధ్యమాన్ని తీసుకుంటే మొత్తం మార్కెట్ 6 శాతమే పెరగ్గా ఈ–కామర్స్ అమ్మకాలు ఏకంగా 19–20 శాతం వృద్ధి చెందాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్స్మార్ట్ ఫోన్స్‌లో జోరు..ఇక, స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో వర్ధమాన బ్రాండ్లు మరింత జోరుగా దూసుకెళ్తున్నాయని ఐడీసీ ఇండియా వెల్లడించింది. ఈ సంస్థ డేటా ప్రకారం 2022లో టాప్ అయిదు బ్రాండ్ల మార్కెట్ వాటా 76 శాతంగా ఉండగా 2024లో 65 శాతానికి తగ్గింది. అలాగే, 2023తో పోలిస్తే స్మార్ట్‌వాచ్, వేరబుల్స్ విభాగాల్లోనూ చిన్న బ్రాండ్లు గణనీయంగా వృద్ధి చెందాయి.తక్కువ రేటులో ఎక్కువ ఫీచర్ల కోసం వినియోగదారుల నుంచి డిమాండ్ నెలకొనడం ఈ బ్రాండ్లకు ఉపయోగపడుతోంది. మోటరోలా వంటి వర్ధమాన బ్రాండ్ల అమ్మకాలు 136% ఎగి యగా, ఐక్యూ 51%, పోకో సేల్స్ 19%పెరిగాయి. శాంసంగ్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 2023తో పోలిస్తే 2024లో 19.4% క్షీణించాయి. రియల్‌మి 8.5%పడిపోగా, షావోమీ అమ్మకాలు 0.2 శాతమే పెరిగాయి. 34% వృద్ధితో బడా బ్రాండ్లలో యాపిల్ మాత్రమే ఇందుకు మినహాయింపు. -
‘యువిక’.. భావి శాస్త్రవేత్తలకు వేదిక
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): అంతరిక్ష పరిశోధనలపై మక్కువ ఉన్న విద్యార్థులను ప్రొత్సాహించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వారిని ప్రత్యేకంగా తమ ప్రాంగణాలకు ఆహ్వానించి నూతన ఆవిష్కరణలపై ఉత్సాహాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా యువిక (యుంగ్ సైంటిస్ట్)–2025 పేరిట ఉపగ్రహ ప్రయోగాలను తెలుసుకునేందుకు, శాస్త్రవేత్తలతో మాట్లాడేందుకు తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. ఈ విధమైన అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఇస్రో పిలుపునిస్తుంది. అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల ఇస్రో 100 ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు దీటుగా భారత్ పలు పరిశోధనలు చేపడుతోంది. ఈ విజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజెప్పేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇస్రో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. యువిక లక్ష్యాలు ఇవీ.. » భారత అంతరిక్ష పరిశోధనలను విద్యార్థులకు పరిచయం చేయడం» విద్యార్థులను స్పేస్ టెక్నాలజీ వైపు ప్రోత్సహించడం» అంతరిక్ష పరిశోధకులుగా వారిని సిద్ధం చేయడంఎవరు అర్హులంటే...ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థులు, ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఇస్రో ప్రాధాన్యతనిస్తోంది. ఎనిమిదో తరగతిలో సాధించిన మార్కుల్లో 50 శాతం, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాల్గొంటే వాటి ఆధారంగా 2–10%, ఆన్లైన్ క్విజ్ పోటీల్లో చూపించిన ప్రతిభకు 10% వెయిటేజీ ఇవ్వనుంది. ఎన్సీసీ, స్కౌట్, గైడ్స్ విభాగాల్లో ఉంటే 5%, పల్లె ప్రాంతాలకు చెందిన వారికి 15% ప్రాధాన్యం ఇవ్వనుంది. పరీక్ష ఎక్కడంటే...ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 7 కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట (ఏపీ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్ (మేఘాలయ). దరఖాస్తు ఇలా చేసుకోవాలి..నాలుగు దశల్లో విద్యార్థులు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. మొదటగా ఈ–మెయిల్ ఐడీతో వివరాలు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్లైన్ క్విజ్‌లో పాల్గొనాలి. క్విజ్ పూర్తి చేసిన 60 నిమిషాల తరువాత ‘యువికా’ పోర్టల్‌లో ఆన్లైన్ దరఖాస్తుతో పూర్తి వివరాలు నమోదు చేసి సమర్పించాలి. మూడేళ్లలో వివిధ అంశాల్లో విద్యార్థి సాధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఏవైనా ఉంటే, వాటి జెరాక్స్ కాపీలపై విద్యార్థి సంతకం చేసి అప్లోడ్ చేయాలి. దరఖాస్తులు సమర్పించేందుకు మార్చి 23 వరకు అవకాశముంది. ఎంపిక జాబితాను 2 విడతల్లో ప్రకటించి అర్హత సాధించిన వారికి సమాచారం అందిస్తారు. యువికా శిక్షణకు ఎంపికైన వారికి శిక్షణకు హాజరయ్యేందుకు రవాణా చార్జీలు, బస, భోజన వసతితో పాటుగా అన్ని సౌకర్యాలను ఇస్రో కల్పిస్తుంది.కార్యక్రమం షెడ్యూల్ ఇలా..వచ్చిన దరఖాస్తులను ఏప్రిల్ 7నాటికి వడపోసి ఎంపికైన విద్యార్థుల జాబితాలను ఇస్రో విడుదల చేస్తుంది. మే నెల 18 నుంచి విద్యార్థులను ఆహ్వానిస్తుంది. 19 నుంచి 30వ తేదీ వరకూ యువికా–25 కార్యక్రమం చేపడుతోంది. మే 31న ముగింపు కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తుంది. ఎంపికైన విద్యార్థులను మే లో 14 రోజులు ఇస్రోకు చెందిన స్పెస్ సెంటర్లకు తీసుకువెళ్తుంది. అక్కడి వింతలు, విశేషాలు, సప్తగహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తుంది. వారు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి వారికి విజ్ఞానాన్ని అందిస్తారు.విద్యార్థులకు మంచి అవకాశం విద్యార్థులకు ఇస్రో వంటి సంస్థను సందర్శించటం, ఆయా పరిశోధనలపై అవగాహన పెంచుకోవటానికి ఇది మంచి అవకాశం. భావి శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ఇస్రో చేపడుతోన్న యువికా కార్యక్రమాన్ని అర్హతగల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. సంబంధిత పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు పిల్లలకు సహకరించాలి. జిల్లా పరిధిలో డీవీఈవోలు, ఎంఈవోలు ఈ విషయంపై వారి పరిధిలో యంత్రాంగాన్ని చైతన్యపర్చాలి. పెద్ద సంఖ్యలో విద్యార్థులతో దరఖాస్తు చేయించాలి. – యువీ సుబ్బారావు, డీఈవో, ఎన్టీఆర్ జిల్లాఅవగాహన కల్పిస్తున్నాం యువికాలో పాల్గొనేందుకు, దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నాం. గతంలో నిర్వహించిన అనేక సైన్స్ ఎగ్జిబిషన్లు, పోటీ పరీక్షల్లో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు సత్తాచాటి జాతీయ స్థాయిలో వారి ప్రదర్శనలతో అబ్బురపర్చారు. ఇదేస్ఫూర్తితో పెద్ద సంఖ్యలో అర్హత గత విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం. – డాక్టర్ మైనం హుస్సేన్, జిల్లా సైన్స్ అధికారి -
వైద్య, ఆరోగ్య శాఖ కొంచెం మెరుగు
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖకు 2025–26 సంవత్సరానికి బడ్జెట్లో రూ.12,393 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ రూ.11,468 కోట్లతో పోలిస్తే రూ.825 కోట్లు అధికం. ఈ కేటాయింపుల్లో నిర్వహణ పద్దు కింద రూ. 5,666.86 కోట్లు కేటాయించగా, అభివృద్ధి కోసం రూ. 6,070 కోట్లు కేటాయించారు. ఇందులో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు కలిపి రూ. 680.63 కోట్లు కేటాయించగా. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ (డీఎంఈ)కు రూ. 3,011 కోట్లు కేటాయించారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాధిపతికి రూ. 554.24 కోట్లు కేటాయించారు. ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ కమిషనర్ పరిధిలోని కార్యక్రమాలకు రూ. 1686.80కోట్లు కేటాయించడం గమనార్హం. ఇవి కాకుండా ఆయుష్ కోసం రూ.133.52 కోట్లు, డ్రగ్స్ కంట్రోల్ విభాగాధిపతికి రూ.2.10 కోట్లు కేటాయించారు. ఆరోగ్యశ్రీ చెల్లింపులకు ఎలా?రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి ప్రభుత్వం బడ్జెట్లో రూ. 1,143 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచడంతోపాటు వైద్యం ఖర్చుల స్లాట్లను కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా ఆసుపత్రులతోపాటు కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా రోగులకు చికిత్సలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1200 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. తమకు బకాయిలు చెల్లించాలని రెండు నెలల క్రితం నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె కూడా చేశాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్లో కేవలం రూ.1,143 కోట్లను కేటాయించడాన్ని ఆరోగ్య శ్రీ చెల్లింపులకు కొంత ఇబ్బంది కలిగించే విషయంగా ప్రైవేటు ఆసుపత్రులు చెపుతున్నాయి. ఇందులో నిర్వహణ ఖర్చులు పోను మిగిలే రూ. 695.79 కోట్లు మాత్రమే ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌కు చేరే అవకాశం ఉంది. -
నీటిపారుదల శాఖకు రూ.23,372 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2025–26 బడ్జెట్లో నీటిపారుదల శాఖకు రూ.23,372.7 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రగతి పద్దు కింద రూ.11,786.77 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.11,543.87 కోట్లు చూపించింది. చార్జ్డ్ మొత్తం కింద రూ.42.06 కోట్లు కేటాయించింది. అయితే ఈ కేటాయింపుల్లో సింహభాగం రుణాల తిరిగి చెల్లింపులకే పోనున్నాయి. ప్రాధాన్య ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేస్తామన్న ప్రభుత్వ హామీకి తగ్గట్లుగా నిధుల కేటాయింపులు జరగలేదు. 2024–25 బడ్జెట్లో నీటిపారుదల శాఖకు రూ.22,301 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్లో రూ.1,071 కోట్లు పెంచారు. ఈ శాఖకు 2022–23లో రూ.19,349.24 కోట్లు, 2023–24లో రూ.29,766 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. రుణమే పెనుభారం కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డితో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి తీసుకున్న భారీ రుణాలు తిరిగి చెల్లించడానికి సాగునీటి శాఖ బడ్జెట్ కేటాయింపుల్లోని సింహభాగం నిధులు వెళ్లనున్నాయి. రుణాల తిరిగి చెల్లింపులకు రూ.9,877.01 కోట్లు అవసరమని బడ్జెట్లో ప్రభుత్వం తెలిపింది. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల రుణాల తిరిగి చెల్లింపులకు రూ.2,962.47 కోట్లు, కాళేశ్వరం కార్పొరేషన్ రుణాల తిరిగి చెల్లింపులకు రూ.6,914.54 కోట్లు కేటాయించారు. ఇక తెలంగాణ జలవనరుల సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీడబ్ల్యూఆర్ఐడీసీఎల్)కు రుణం కింద రూ.2,962.47 కోట్లు ప్రతిపాదించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణకు నిధులు రూ.385.38 కోట్లకు తగ్గాయి. ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.7,120 కోట్లు.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి మూలధన పెట్టుబడుల కింద బడ్జెట్లో రూ.12,652 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.7120.27 కోట్లు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుల పూర్తితో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 6,55,895 ఎకరాలు, 2025–26లో 9,42,778 ఎకరాలను సాగులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా 2025–26 నాటికి మొత్తం 15,98,673 ఎకరాల ఆయకట్టు సాగులోకి రావాల్సి ఉంది. అయితే, నిధులు అరకొరగానే కేటాయించటంతో గడువులోగా ఆయా ప్రాజెక్టులను పూర్తిచేయటం అనుమానంగా మారింది. ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టులో భాగంగా వచ్చే నెలలో తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్లో మాత్రం ఈ ప్రాజెక్టుకు నిధులను రూ.248.99 కోట్ల నుంచి రూ.32.22 కోట్లకు తగ్గించడం గమనార్హం. -
సంతృప్తే సదానందం
బ్రహ్మాండమైన హాస్యనటుడు బ్రహ్మానందం. కానీ తనని మించిన హాస్య నటులు చాలామంది ఉన్నారని ఆయన అంటున్నారు. ఎలా అంటే..? ‘చుట్టూ ఉన్నవాళ్లని చూస్తూ... ఆనందపరుస్తూ... నవ్విస్తూ ఉండగలిగితే నీ అంతటి హాస్య నటుడు ఇంకొకడు లేడు’ అన్నారు బ్రహ్మానందం. సంతృప్తే సంతోషం అనే ఈ సదానందం ‘వరల్డ్ హ్యాసీనెస్ డే’ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్న విశేషాలు.→ ఆనందానికి మీరిచ్చే నిర్వచనం? ఆనందం అనేది ఓ అనుభూతి... ఓ భావోద్వేగం. నవ్వు కూడా ఓ అనుభూతి. కేవలం శబ్దం కాదు. ఇక ఆనందం ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది. నువ్వు చేసే పని ద్వారా నువ్వు ΄పొందే అనుభూతే ఆనందం. మన మనసుకి ఏదైతే ఆనందాన్నిస్తుందో అదే ఆనందానికి నిర్వచనం.→ ఒక మనిషి నవ్వుతూ ఉన్నాడంటే ఆనందంగా ఉన్నట్టేనా? ఉన్నట్టు కాదు. నవ్వు నిస్సహాయతలోనూ వస్తుంది. అలానే ఏడుస్తున్నాడంటే విపరీతమైన బాధలోనూ ఉన్నట్టు కాదు. మనం ఒక ట్రాజెడీ నాటకం చూస్తున్నప్పుడు ఏడుస్తుంటాం. కానీ అది మన వ్యక్తిగత బాధ కాదు. మనం చూస్తున్న దాని ద్వారా ΄పొందిన అనుభూతి. ‘వియ్ కెన్ గెట్ హ్యాపీనెస్ ఫ్రమ్ ట్రాజెడీనెస్ ఆల్సో’. ఇక మనిషి భావాలను బట్టి అతను బయటకు కనిపించేది... అతని లోపల జరిగేది ఒకటే అనుకోలేం.→ చిన్నప్పుడు మీరు ఆర్థికపరమైన, ఇంకా ఎన్నో ఒడిదొడుకులు చూశారు. సో... మీకు పరిపూర్ణమైన ఆనందం పరిచయమైనది ఎప్పుడు? నే¯ð ప్పుడూ ఆనందం ఇలా ఉంటుంది... దుఃఖం ఇలా ఉంటుందీ అనుకోలేదు. రెండింటినీ వేరువేరుగా చూడలేదు... తెలియదు కూడా. ఆర్థిక సమస్యలుంటే దుఃఖం, అవి లేకుంటే ఆనందం అనుకోలేదు. ఒక మహర్షిలా తలకిందులుగా తపస్సు చేసి, నేర్చుకున్నటువంటి జ్ఞానం కాదిది. స్వతహాగానే ఏర్పడింది. ఈ పూట భోజనం ఉండదే అని బాధపడిపోలేదు. బట్టలు సరిగ్గా లేవా... ఓకే అనుకునేవాణ్ణి. అమ్మ పెట్టిందే బాగుందనుకోవడం.... నాన్న ఇచ్చినవే బాగున్నాయనుకోవడం. ఆనందాన్ని, దుఃఖాన్ని విభజించడం రాకపోవడం నాకు అలవాటుగా మారిపోయింది. ప్రస్తుతానికి అన్నీ ఉన్నాయి. బావుంది. అలాగని బ్రహ్మానందపడిపోలేదు. అప్పటి ఆ దుఃఖం తెలియకపోవడంవల్లే ఇప్పటి ఈ ఆనందం కూడా మనసుకి ఎక్కలేదు అనుకుంటుంటా. అయినా ప్రతిదీ లోతుగా విశ్లేషించి చూడక్కర్లేదు. సౌకర్యం ఇచ్చేది ఆనందం అంటా. అలాగే అసౌకర్యం ఆనందం ఇవ్వనిది కాదు కానీ విషాదం అని మాత్రం అనను.→ స్థితప్రజ్ఞతతో ఉండటం అనేది మీకు చిన్నప్పుడే అలవాటైందనుకోవచ్చా? ఏమో... ఏది ఏమైనా జీవితం నేర్పినపాఠాలు కొన్ని ఉంటాయి. పేదరికమంటే నాకు విపరీతమైన ఇష్టం. అందుకే నేను పేదవాళ్లకి సహాయం చేసినా బయటకు చెప్పను... కానీ చేస్తూనే ఉంటా. ఇక పేదరికం అనేది మన దగ్గర ఏది లేదో దాన్ని సంపాదించడానికి కృషి చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. నీ దగ్గర తిండి, డబ్బు, గౌరవం లేకపోతే వాటిని ఎలా సంపాదించుకోవాలా అని ఆలోచిస్తావు. అలా నీకు లేనిదాన్ని ΄పొందడానికి దారి చూపించే ఓ మంచి మార్గం పేదరికం. అందులో నుంచి ఎలా బయటకు రావాలనే తపన ఉండాలి తప్ప మనకు లేదు... వాడికి ఉంది అని పోల్చి చూసుకోవడాలు ఉండకూడదు. ఈ లేదూ... ఉంది అనే ఆలోచనల్లో కన్నీళ్లు తప్ప ఏమీ మిగలవు.→ పేరుకు తగ్గట్టు మీరు బ్రహ్మానందాన్ని పంచుతున్నారు... ‘నాకీ పేరు ఎందుకు పెట్టాలనిపించింది’ అని మీ తల్లిదండ్రులను ఎప్పుడైరా అడిగారా?ఇలా మన గురించి ఒకరు అనుకుంటే హ్యాపీగా ఉంటుందేమో. నేనెప్పుడూ వాళ్లని అడగలేదు. అడుగుదామనే స్థాయికి చేరుకునే సరికి వాళ్లు పెద్దవాళ్లై పోయారు. మేం ఎనిమిది మంది సంతానం. నేను ఏడోవాడిని. ఏదో పేరు పెట్టారు... అనుకున్నానంతే. ఇప్పుడీ స్థితికి వచ్చాక నా తల్లిదండ్రులు పెట్టిన పేరుకి జస్టిఫికేషన్ జరిగిందని అనుకుంటుంటాను.→ స్ట్రెస్‌లో ఉన్నప్పుడు కొందరు మీ కామెడీ సీన్లు చూసి, రిలీఫ్ అవుతుంటారు. మరి... మీ స్ట్రెస్ బస్టర్? నేనెప్పుడూ ఆనందంగా ఉంటాను. నా ఫిలాసఫీ చె΄్పాను కదా. బాధ, ఆనందం వేరు వేరు అనుకోను. కెరటం ఎగిసినప్పుడు విజయం అని, కిందపడినప్పుడు అపజయం అనీ అనుకుంటాం. కానీ అవి రెండూ ఒకటే. అలాగే ఆనందం, బాధ కూడా. గతంలో ఇదే ప్రశ్న అడిగి ఉండుంటే, మంచి భోజనం తింటే ఆనందం అనేవాణ్ణేమో. కానీ ఇప్పుడు ఈ 70 ఏళ్ల వయసులో తినే ఓపిక, తిన్నా అరిగించుకునే ఓపిక రెండూ లేవు. ‘ఏంటోనండీ ఓ ముద్ద తినలేకపోతున్నాం’ అనుకోవాలి. దీన్ని మళ్లీ బాధ అంటున్నాం. ఇది కూడా బాధ కాదు. ఆనందం, బాధ... ఈ రెండూ మన ఆలోచనా విధానం మీదే ఆధారపడి ఉంటాయి.→ మీ లైఫ్‌లో డల్ మూమెంట్స్ ఉంటాయా? సూర్యుడే డల్ అయిపోతాడు సాయంత్రానికి. మనమెంత? ఇదంతా ఓ నిరంతర ప్రక్రియ. అయితే కోరి డల్‌నెస్ తెచ్చుకోవడం వేరు... రావడం వేరు. సాగుతున్నప్పుడు డల్‌నెస్ అదే వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు నాకు నాలుగు గంటలకల్లా కాఫీ ఇవ్వాలనుకోండి... ఓ రెండు నిమిషాలు లేట్ అయిందంటే... ఏంటో ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నారని డల్ అయిపోవచ్చు... ఏముందీ కాస్త లేట్ అయిందని కూల్‌గానూ ఉండొచ్చు. సో... డల్‌నెస్ అనేది సాగనప్పుడు రాదు. జీవితం అనేది మన చేతిలో స్టీరింగ్ లాంటిది. ఎటు తిప్పుతున్నామనేది మన చేతుల్లోనే ఉంటుంది.→ ఇప్పుడు యువత చిన్న చిన్న విషయాలకే విపరీతంగా బాధపడిపోతున్న ధోరణి కనబడుతోంది... వాళ్లకి ఏం చెబుతారు? ఇప్పుడు యువత ఆనందంగా లేరని చెప్పలేం. అయితే ఇప్పుడు యూత్‌లో ఎక్కువమంది కష్టపడకుండా ఎలాగైనా డబ్బులు సంపాదించుకోవాలనే దాని మీద దృష్టి పెడుతున్నట్లున్నారు. అలా కాకుండా కష్టపడి పని చేసి, సక్సెస్ సాధించాలి. వేరే ఇతర మార్గాల వైపు... అంటే సులువైన మార్గాల్లో వెళ్లి సంపాదించుకుంటే, కష్టపడి సాధించేదాంట్లో దొరికే తృప్తి దొరకదు. ఇలాంటివన్నీ సాధ్యమైనంత వరకూ చెప్పే ప్రయత్నం చేయాలి. మన హిందూ ధర్మం గొప్పదనం ఏంటంటే... ఎదుటివారిని బాధించకుండా ఉండటం. ఎవరి అభిప్రాయం వారిది అని గౌరవించడం. → ప్రస్తుతం దాదాపు అందరి జీవితం ఒత్తిడి అయిపోయిన ఫీలింగ్...ఒత్తిడి లేకుండా ఎప్పుడుంది? పూర్వం కూడా ఒత్తిడి జీవితమే. ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితం అంటున్నాం. మరి... జనాభా పెరిగిపోయారు కదా. సమస్యలు పెరిగాయి. భక్తి పెరిగింది. అన్ని రకాలుగా పెరుగుదలలు ఉన్నప్పుడు ఒత్తిడి కూడా వస్తుంది. అలాగే ఒత్తిడి సహజంగా రావడం... లేదా మనం తెచ్చుకుంటే రావడం... రెండు రకాలుగానూ వస్తుంది.ప్రస్తుతం నెగటివిటీ వైపే చాలామంది ఆకర్షితులవుతున్నారు... ఈ పరిస్థితి గురించి?ప్రస్తుతం ఏ మనిషికైనా రెండే పద్ధతులు పని చేస్తాయి. నచ్చింది తీసుకోవడం.... నచ్చనిది పట్టించుకోకపోవడం.పాజిటివ్‌గా ఉండాలంటే నెగటివ్వైపు వెళ్లకుండా ఉండటమే. పోనీ వెళ్లడంలోనే ఆనందం ఉందీ అనుకుంటే... అది వారి ఆలోచనా విధానం. ఎక్కడైనా ఫలానాది జరిగింది అంటూ ఓ నెగటివ్ హెడ్లైన్ చదివితే... ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలం. తీరా అసలు విషయంలో ఏమీ ఉండదు. సో... నెగటివిటీకి ఎట్రాక్ట్ అవుతున్నారు. అందుకే పెరిగిపోతోంది. ఈ పెరుగుదలకు కూడా కారణం మనమే. అందుకే పాజిటివిటీని పెంచడానికి ప్రయత్నించడం మంచిది.– డి.జి. భవానిఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్ -
Trump: న్యాయవ్యవస్థను బేఖాతరు చేయబోతున్నారా?
అమెరికా న్యాయవ్యవస్థ కంటే తమకు అసాధారణ అధికారాలు దఖలుపడ్డాయనే భావన డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో గూడుకట్టుకుపోయిందనే వార్త ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశమైంది. సోమవారం యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జేమ్స్ ఇ.బోస్బర్గ్ ఇచ్చిన ఆదేశాలను ట్రంప్ సర్కార్ పూచికపుల్లలాగా తీసిపక్కన పడేయడమే ఇందుకు ప్రధాన కారణం. వలసదారులను వెనిజులాకు చెందిన నేరాల గ్యాంగ్ సభ్యులుగా ఆరోపిస్తూ దేశ బహిష్కరణ (deportation) చేయడం సబబుకాదని జడ్జి బోస్బర్గ్ ఆగ్రహం వ్యక్తంచేయడం తెల్సిందే. ఎల్ సాల్వెడార్‌కు వలసదారులను విమానాల్లో తరలించడం తక్షణం ఆపేయాలని కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని జడ్జి ఆదేశించారు. అయితే ఆ సమయానికే రెండు విమానాలు బయల్దేరాయని, గాల్లో ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారు. అయితే విమానాలను వెంటనే వెనక్కి తిప్పాలని జడ్జి ఆదేశించారు. అయినాసరే ప్రభుత్వ న్యాయవాదులు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించడం వెనుక ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యధోరణి దాగుందని తెలుస్తోంది. పైగా దేశ అధ్యక్షుడి నిర్ణయాన్ని కేవలం ఒక జిల్లా జడ్జి ప్రశ్నించేంత సాహసం చేస్తారా? అన్న దురహంకారం అధికారయంత్రాంగంలో ఎక్కువైందని వార్తలొచ్చాయి.తానే సర్వశక్తివంతుడినంటున్న ట్రంప్ యుద్ధకాలంలో ప్రయోగించాల్సిన కఠిన చట్టాలు, నిబంధనలను శాంతికాలంలో ఉపయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందని పలువురు న్యాయనిపుణులు వాదిస్తున్నారు. అక్రమ వలసదారులను తరిమేసేందుకు ఏకంగా 18వ శతాబ్దంనాటి విదేశీ శత్రుచట్టాన్ని హఠాత్తుగా అమలుచేయాల్సిన పనేముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే తాను మాత్రమే అమెరికాను కాపాడగలనన్న విశ్వాసంతో రెండో దఫా భారీ మెజారిటీతో తనను ప్రజలు గెలిపించారన్న అతివిశ్వాసం ట్రంప్‌లో పెరిగిందని, అందుకే సర్వశక్తివంతుడినన్న ధీమాతో అసాధారణ నిర్ణయాలు తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి. సొంత పార్టీలో తన వ్యతిరేకవర్గాన్ని పూర్తిగా అణిచేసి, విపక్ష డెమొక్రాట్ల చేతిలో ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వరంగంలోని ఏ విభాగం లేకుండా చేసి ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని ఏలాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇదే ధోరణి ఆయన పాలనాయంత్రాంగంలోని సీనియర్ సభ్యుల్లోనూ కనిపిస్తోంది.సోమవారం సీఎన్ఎన్ ‘కేసీ హంట్’ కార్యక్రమంలో శ్వేతసౌధం (White House) సీనియర్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ సైతం ట్రంప్‌లాగా మాట్లాడారు. ‘‘అమెరికాలోకి విదేశీయుల చొరబాట్లను అడ్డుకునే, వారిని తరిమేసే సర్వాధికారం అధ్యక్షుడికే ఉంటుంది. ఈ అంశాన్ని సమీక్షించే హక్కు కోర్టులకు లేదు. అందులోనూ ఒక జిల్లా జడ్జికి అస్సలు లేదు’’అని ఆయన అన్నారు. ట్రంప్ సైతం జడ్జి బోస్బర్గ్ను తిడుతూ ‘ట్రూత్‌సోషల్’ ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘ఆ జడ్జిని అభిశంసించాల్సిందే. ఆయన పెద్ద సమస్యగా తయారయ్యారు. నిరసకారుడిగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. గత ఏ డాది ఎన్నికల్లో మొత్తం 7 స్వింగ్ రాష్ట్రాల్లో పాపులర్ ఓటు సాధించి నా నాయకత్వం, నా నిర్ణయం ఎంత సరైనవో నిరూపించుకున్నా. అధ్యక్షుడిగా నేను తీసుకున్న నిర్ణయాల చట్టబద్ధతను సమీక్షించే అధికారం జడ్జి కంటే నాకే ఉందని తాజా ఎన్నికలు నిరూపించాయి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు జిల్లా జడ్జిని తిడుతూ అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగా ఒక పోస్ట్పెట్టడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ మంగళవారం స్పందించారు. ‘‘గత రెండు శతాబ్దాల చరిత్రను గమనిస్తే కోర్టుల నిర్ణయాన్ని విబేధించేందుకు కార్యనిర్వాహణ వ్యవస్థ ‘అభిశంసన’ అనే విధానాన్ని ప్రయోగించడం ఎంతమాత్రం సబబు కాదు’’ అని వ్యాఖ్యానించారు. చదవండి: పుతిన్.. ఎవరి మాటా వినని సీతయ్య! జడ్జీలపై కన్నెర్ర పాలక రిపబ్లికన్లు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పే జడ్జీలను సాగనంపాలని చూస్తున్నారు. బూస్బర్గ్కు వ్యతిరేకంగా అభిశంసన తెస్తే బాగుంటుందని ఇప్పటికే ఇద్దరు దిగువసభ రిపబ్లికన్ సభ్యులు వ్యాఖ్యానించారు. ట్రంప్‌కు సంబంధించన కేసులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన జడ్జీలు అమీర్ అలీ, పౌల్ ఈగల్ మేయర్లను అభిశంసించాలని దిగువసభలో గతంలో వ్యాఖ్యానించారు. 2019 జూలైలో అధ్యక్షుడిగా ట్రంప్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘అధ్యక్షుడిగా నాకేం కావాలన్నా నచ్చినట్లు చేసుకునే హక్కు రాజ్యాంగంలోని రెండో ఆర్టికల్ నాకు ప్రసాదించింది’’అని వ్యాఖ్యానించడం తెల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నడి సముద్రంలో 95 రోజులు
పది రోజుల చేపల వేటకని ఆయన బయలుదేరాడు. తుఫాను దారిని మళ్లించింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన పసిఫిక్ మహాసముద్రంలో కొట్టుకుపోయాడు. ఎటు చూసినా నీళ్లు. నెల.. రెండు నెలలు.. మూడు నెలలు.. సముద్రంలోనే జీవితం. సరైన ఆహారం లేదు. మంచి నీరు కూడా లేదు. అయినా బతకాలన్న ఆశ అతడిని ఒడ్డున చేర్చింది. 95 రోజుల తరువాత గస్తీ బృందానికి దొరికాడు. సినిమా స్టోరీని తలపిస్తున్న ఈ కథ.. పెరూవియన్ మాక్సిమో నాపా కాస్ట్రో నిజ జీవితం. పెరూవియన్ తీరంలోని మార్కోనా పట్టణానికి చెందిన మాక్సిమో డిసెంబర్ 7న ఫిషింగ్ కోసం బయలుదేరాడు. రెండు వారాల ట్రిప్. అందుకు తగ్గట్టుగానే ఆహారాన్ని కూడా పఆయక్ చేసుకున్నాడు. పది రోజుల తరువాత వచి్చన తుఫాను అతని పడవను దారి మళ్లించింది. పసిఫిక్ మహాసముద్రంలో కొట్టుకుపోయాడు. అతని కుటుంబం, పెరూ సముద్ర గస్తీ దళాలు వెదకడం మొదలెట్టాయి. మరోవైపు నట్ట నడి సముద్రంలో తప్పిపోయిన మాక్సిమోకు ఎటు చూసినా నీళ్లు. కుటుంబంపైనే ధ్యాస. తన తల్లి గురించి, నెలల వయసున్న మనవరాలి గురించిన ఆలోచనలే.అవే ఆయన జీవితంపై ఆశ.. ఎలాగైనా బతికి ఒడ్డుకు చేరాలన్న స్ఫూర్తిని ఇచ్చాయి. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని తాగాడు. బతకడం కోసం కీటకాలు, పక్షులు, తాబేలును తిన్నాడు. ఎవరో ఒకరు కనిపెట్టేవరకూ తాను బతికుండాలన్న ఆశ అతని ప్రాణాలను నిటబెట్టింది. నాపా కాస్ట్రో కుటుంబం, మత్స్యకారుల బృందాలు మూడు నెలలుగా గాలిస్తూనే ఉన్నాయి. మూడు నెలలైనా ఆచూకీ దొరకలేదు. అయినా అటు కుటుంబం ఆశలు వదులు కోలేదు. ‘‘నాన్న నీవు రాకపోవడం మాకు అంతులేని బాధ. ఈ పరిస్థితిని ఎదుర్కొంటామని మేము ఎప్పుడూ అనుకోలేదు. మిమ్మల్ని కనుగొంటామనే ఆశ ఉంది’అని అతని కుమార్తె మార్చి 3న ఫేస్బుక్లో రాసింది. సరిగ్గా ఇది జరిగిన 8 రోజులకు మార్చి 11న ఈక్వడార్ గస్తీ బృందం ఫిషింగ్ బోటులో ఆయనను కనుగొన్నది తీరానికి 1,094 కి.మీ దూరంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మాక్సిమోను రక్షించింది. వెంటనే ఈక్వెడార్, పెరూ సరిహద్దుకు సమీపంలోని పైటాలోని న్యూస్ట్రా సెనోరా డి లాస్ మెర్సిడెస్ ఆసుపత్రికి తరలించింది. గత 15 రోజులుగా ఏమీ తినకుండా ఉండటంతో తీవ్ర డీహడ్రేషన్కు గురయ్యారని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం మాక్సిమో సోదరుడికి అప్పగించారు. తన తండ్రి ప్రాణాలను కాపాడిన కుమార్తె ఇనెస్ నాపా టొర్రెస్ కృతజ్ఞతలు తెలిపింది. ‘ఈక్వెడార్ సోదరులారా>, నా తండ్రి గాటన్ను రక్షించినందుకు ధన్యవాదాలు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు’అని ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అరబ్బుల ఇంటికి.. మన అరటి!
పులివెందులూరల్: వైఎస్సార్ జిల్లా పులివెందుల అరటి కాసులు కురిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో మంచి డిమాండ్ ఉన్న ఈ అరటి ఇటీవల కాలంలో గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతూ నాణ్యత విషయంలో తగ్గేదే లేదంటోంది. ఈ ప్రాంతంలో సాగయ్యే అరటికి బయట మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపారులు నేరుగా తోటల వద్దకు వస్తున్నారు.ఢిల్లీ మార్కెట్‌కు అనుకూలంగా ఉన్న తోటలను ఎంచుకుని అరటికాయలను కొనుగోలు చేస్తున్నారు. రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి ధరలు నిర్ణయించి కొనుగోలు చేయడం ద్వారా దళారుల బెడద లేకుండా పోయిందని రైతన్నలూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో 10 నుంచి 15వేల ఎకరాల్లో ... పులివెందుల ననియోజకవర్గ వ్యాప్తంగా 15వేల ఎకరాల్లో అరటి సాగు ఉంటే ఇందులో 10వేల ఎకరాల్లో గెలలు మొదటి కోతకు రానున్నాయి. నియోజకవర్గంలోని పులివెందుల, లింగాల, వేముల, వేంపల్లె మండలాల్లో అధికంగానూ, తొండూరు, సింహాద్రిపురం మండలాల్లో తక్కువగా అరటి సాగు అవుతోంది. ఒకసారి సాగు చేస్తే మూడు పంటలు తీయవచ్చన్న ఉద్దేశంతో రైతులు అరటిని ఎంచుకుంటున్నారు. ఎక్కువగా మే, జూన్, జూలై నెల్లో సాగుచేస్తారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కోతకు వచ్చేలా సాగు చేయడం ద్వారా ధరలు ఉంటాయని రైతులు అంటున్నారు. ఎకరాకు రూ.60వేలు పైనే పెట్టుబడులు అరటి సాగులో పెట్టుబడులు కూడా అధికం అవుతున్నాయి. ఎకరా సాగు చేయాలంటే రూ.60వేల నుంచి రూ.70వేల వరకు పెట్టుబడులు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. అరటి నాటిన మొదలు గెలలు కోతకు వచ్చే వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాగుచేసిన 11 నెలలకు గెలలు కోతకు వస్తాయి. సాగులో పెట్టుబడులు అవుతున్నప్పటికీ ఆదాయం ఉంటుందనే రైతులు అరటిని సాగుచేస్తున్నారు. డ్రిప్పు ద్వారా నీటి తడులతో పాటు ఎరువులు అందించడం ద్వారా నాణ్యమైన అరటి ఉత్పత్తులు అందుతున్నాయి. సాగులో ఎకరాకు 10 నుంచి 15 టన్నుల వరకు దిగుబడులు వస్తున్నాయి. ఒక్కో గెల 10 నుంచి 12 చీప్‌లు వేస్తుందని రైతులు అంటున్నారు. వారం రోజుల పాటు అరటి కాయల నిల్వ ... పులివెందుల నుంచి అరటిని ఢిల్లీకి తరలించాలంటే వారంరోజులు పడుతుంది. పక్వానికి వచ్చిన గెలలను కొట్టి చీపులను వేరుచేస్తారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా వారంపాటు నిల్వ ఉండడంతో ఢిల్లీకి చెందిన వ్యాపారులు పులివెందుల అరటి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కోసారి అరటి గెలలను లారీకి లోడ్ చేసి ఢిల్లీకి తరలిస్తారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లేసరికి అరటి గెలలు దెబ్బతినవని, కాయలు నాణ్యతగా ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. అరటికాయలను శుద్ధిచేసి ప్యాకింగ్ ... పులివెందుల నుంచి అరటి కాయలను ఢిల్లీకి తరలించాలంటే శుద్ధి చేసి ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో తోటల వద్దకు కూలీలు వెళ్లి అరటి గెలలు తీసుకువచ్చి చీపులను వేరుచేస్తారు. వీటిని బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీటిలో శుద్ధి చేస్తారు.అలా శుద్ధిచేసిన చీపులను అట్టపెట్టెలో కవరు వేసి అందులో అరటి కాయలను ఉంచి ప్యాకింగ్ చేస్తారు. ఒక్కో అట్టపెట్టెలో 15కిలోల చొప్పున అరటికాయలను ప్యాక్ చేస్తారు. తోటల వద్దనే తూకాలు వేసి అట్టపెట్టెలను సీజ్ చేస్తారు. అరటికాయలతో ఉన్న అరటి పెట్టెలను లోడ్ చేసి ఢిల్లీ మార్కెట్‌కు తరలిస్తారు. గల్ఫ్ దేశాలకు పులివెందుల అరటిపులివెందుల ప్రాంతంలో పండిన అరటికి ఢిల్లీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎక్కువగా ఈ సీజన్లోనే ఇక్కడ అరటి కాయలను తరలిస్తారు. నెలకు 10నుంచి 15వేల టన్నుల మేర కాయలు ఢిల్లీ మార్కెట్‌తో పాటు గల్ఫ్ దేశాలు అరబ్, ఇరాక్, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్తాయి. ఇక్కడ పండించిన అరటి నాణ్యతగా ఉండడం, వారం రోజుల పాటు నిల్వ ఉండడం వల్ల ఢిల్లీ మార్కెట్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లో డిమాండ్ ఉంటుంది. – రామమల్లేశ్వరరెడ్డి, అరటి రైతు -
బట్టమేక.. కష్టాల కేక
పొడవైన తెల్లటి మెడ.. దాని చుట్టూ తెలుపు–నలుపు ఈకల హారం.. బంగారు/గోధుమ వర్ణపు వీపు.. తలపై నల్లని టోపీతో ఇట్టే ఆకర్షించే రూపం బట్టమేక పక్షుల సొంతం. విమానం మాదిరిగా నేలపై పరుగులు తీసి గాల్లోకి లేచి.. స్థిమితంగా.. లయబద్ధంగా విశాలమైన రెక్కలు కదిలిస్తూ గగన విహారం చేయడం వీటి ప్రత్యేకత.సాక్షి, అమరావతి: అరుదైన బట్టమేక పక్షులు (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్) మన దేశంలో అంతరించిపోయే స్థితికి చేరాయి. కొన్నేళ్లుగా చాలాచోట్ల వీటి జాడ కనిపించడం లేదు. 2008లో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 300 బట్టమేక పక్షులు ఉండగా.. ప్రస్తుతం వాటిసంఖ్య దేశవ్యాప్తంగా 150కి పడిపోయినట్టు తేలింది. వాటిలోనూ ఎక్కువ పక్షులు రాజస్థాన్‌లోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 20కిపైగా బట్టమేక పక్షి జాతులు ఉండగా.. మన దేశంలో 4 జాతులున్నాయి. వాటిలో మన రాష్ట్రంలో కనిపించేవి ఇంకా అరుదైన జాతి పక్షులు.మీటరు పొడవు.. 15 కిలోలకు పైగా బరువుబట్టమేక పక్షుల్లో అత్యంత బలిష్టమైనవి మన ప్రాంతంలోనే ఉండేవి. ఈ పక్షి మీటరు పొడవు, 15 నుండి 20 కిలోల బరువు, పొడవాటి మెడ కలిగి ఉంటుంది. వీటిసంతతి చాలా అరుదుగా వృద్ధి చెందుతూ కేవలం ఏడాదికి ఒక గుడ్డు మాత్రమే పెట్టి దట్టమైన పొదల్లో 27 రోజులపాటు పొదుగుతుంది. దీని జీవిత చక్రం సుమారు 12 ఏళ్లు. ఒక్కో ఆడ పక్షి జీవిత కాలంలో కేవలం ఐదారు గుడ్లు మాత్రమే పెడతాయి. ఏవి దొరికినా తిని కడుపు నింపుకోవడం వీటి ప్రత్యేకత. ధాన్యం గింజలు, పంటల కోత తర్వాత మిగిలిన మోళ్లు, వేళ్లు, పొలాల్లోని మిడతలు, పురుగులు, జెర్రులు, బల్లులు, తొండలు వంటివి వీటి ఆహారం. ఎగిరే పక్షుల్లో రెండవ అతి భారీ పక్షులుగా గుర్తింపు పొందినా.. నివాసానికి అనుకూల వాతావరణం లేక అంతరించిపోతున్నాయి.సంరక్షణ చర్యలున్నా.. ప్రయోజనం సున్నామన దేశంలో కనిపించే అత్యంత అరుదైన బట్టమేక పక్షి జాతుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం కలగడం లేదు. వీటికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాల్లోనూ వాటి జాడ అరుదుగా మాత్రమే కనిపిస్తోంది. గత ఏడాది కర్ణాటకలోని బళ్లారి సమీపాన సిరిగుప్పలో రెండు, మహారాష్ట్ర లోని బీదర్‌లో ఒకటి కనిపించినట్టు అటవీ శాఖ నిర్ధారించింది. ఆ తర్వాత వీటి జాడ ఎక్కడా కానరాలేదు. మన రాష్ట్రంలోనూ వీటి కోసం నంద్యాల జిల్లా నందికొట్కూరు సమీపంలోని రోళ్లపాడులో 600 హెక్టార్లలో బట్టమేక పక్షుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా అక్కడ కూడా ఈ పక్షులు కనిపించడంలేదు. వేటగాళ్ల ఉచ్చులకు బలైపోవడం, ఆవాసాలు తగ్గిపోవడం, ఎగిరే సమయంలో గాలి మరలు, విద్యుత్ లైన్లకు తగిలి మృత్యువాత పడటం, వాహనాల రణగొణ ధ్వనులే ఇవి అంతరించిపోవడానికి ప్రధాన కారణాలని వన్యప్రాణుల నిపుణులు చెబుతున్నారు.గడ్డి భూములు తగ్గిపోవడంతో..|పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో గడ్డి భూముల పాత్ర కీలకం. బట్టమేకల పక్షుల ఉనికి పర్యావరణానికి మేలు చేసే గడ్డి భూములపైనే ఆధారపడి ఉంది. విశాలమైన గడ్డి మైదానాలే వాటి ఆవాసాలు. అందుకే బట్ట మేక పక్షులను గడ్డి భూముల జీవనాడిగా చెబుతారు. ఈ భూములు పశువులకు మేత అందించడంతోపాటు పశువులపై ఆధారపడి జీవించే జాతుల మనుగడకు ప్రధానమైనవి. వాతావరణంలో ప్రాణవాయువును పెంచేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. తద్వారా పర్యావరణం, జీవ వైవిధ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తాయి. ఆయా ప్రాంతాల్లో నీటి ప్రవాహానాన్ని గడ్డి భూములు క్రమబద్ధీకరిస్తాయి. అలాంటి గడ్డి భూములు తగ్గిపోతుండడం బట్టమేక పక్షులు అంతరించిపోతుండటానికి ప్రధాన కారణమైంది. మన దేశంలో 2005 నుంచి 35 శాతం మేర గడ్డి భూములు తగ్గిపోయినట్టు అంచనా. వ్యవసాయ విస్తరణ, పశువుల మేత ఎక్కువవడం, భూముల నిర్వహణ సరిగా లేకపోవడంతో జీవ వైవిధ్యం కోల్పోయి గడ్డి భూములు క్షీణిస్తున్నాయి. గతంలోని గడ్డి భూములు ప్రస్తుతం బంజరు భూములుగా మారిపోయాయి. ఫలితంగా ఆవాసాలు లేక బట్టమేక పక్షులు అంతరించిపోతున్నాయి.కృత్రిమ గర్భధారణపైనే ఆశలుబట్టమేక పక్షుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ పక్షులను మళ్లీ పునరుద్ధరించే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటికోసం సురక్షితమైన గడ్డి మైదానాలను సృష్టించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచిస్తోంది. కృత్రిమ గర్భధారణ ద్వారా బట్టమేక పక్షి పిల్లలను పుట్టించి.. గడ్డి భూముల్లో వదలాలని నిపుణులు సూచిస్తున్నారు. రెండేళ్ల క్రితం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని జాతీయ పరిరక్షణ పెంపక కేంద్రం (నేషనల్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్) కృత్రిమ గర్భధారణ ద్వారా బట్టమేక పక్షుల్ని పునరుద్ధరించింది. వాటిని గడ్డి మైదానాల్లో వదిలి సంరక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఎంతమేరకు సఫలీకృతం అవుతాయో వేచి చూడాలి. -
షుగర్స్ పునఃప్రారంభంలో ని‘జామ్’!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్స్ పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసినప్పటికీ.. మళ్లీ సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ కొంత ప్రక్రియ పూర్తి చేసింది. ప్రైవేటు యాజమాన్యం పరిధిలోని ఈ ఫ్యాక్టరీకి చెందిన రూ.400 కోట్ల బ్యాంకుల బకాయిలకు సంబంధించి, వన్‌టైం సెటిల్మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.190 కోట్లు చెల్లించింది. 2025 డిసెంబర్ నాటికి ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రకటించినప్పటికీ.. అది మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆలస్యంగానైనా.. పబ్లిక్ సెక్టార్‌లోనా, ప్రైవేటు సెక్టార్‌లోనా, సహకార విధానంలో ప్రారంభిస్తారా? అనే అంశంపై కూడా స్పష్టత లేకుండా పోయింది. మరోవైపు క్షేత్రస్థాయిలో సన్నద్ధత విషయంలో ఇప్పటికీ గందరగోళమే నడుస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది క్రషింగ్ సీజన్ (అక్టోబర్ నుంచి డిసెంబర్) నాటికి సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. ప్రభుత్వం నుంచి సైతం స్పష్టమైన ప్రకటన రావడం లేదు. బోధన్ ఫ్యాక్టరీని మరో చోటికి తరలించి.. కొత్త యంత్రాలతో నడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. రైతులతో విడతల వారీగా కమిటీ చర్చలు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీలో సభ్యుడైన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ రైతులతో విడతలవారీగా ముఖాముఖి చర్చలు జరిపింది. చెరుకు సాగును ప్రోత్సహించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, షుగర్ కేన్ బోర్డు రాష్ట్ర స్థాయి అధికారులు పాల్గొన్నారు. మరోవైపు ప్రస్తుతం ఫ్యాక్టరీ స్థితిగతులు, యంత్రాల పరిస్థితిని నిపుణుల బృందం పరిశీలిస్తోంది. తరువాత వారి నివేదిక మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. నిపుణుల బృందం నివేదిక ప్రభుత్వం వద్దకు వెళ్లి దని ప్రచారం జరుగుతోంది. నివేదికలో ఏముందో బయటకు రాలేదు. మరోవైపు చెరుకు సాగుపై రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం విధానపరంగా ఫ్యాక్టరీ పునఃప్రారంభం విషయమై స్పష్టత ఇవ్వలేదు. రైతులు గణనీయమైన స్థాయిలో చెరుకు పంటను పండించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తేనే.. షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పునఃప్రారంభానికి అడుగులు మరింతగా పడాలంటే చెరుకు సాగు విస్తీర్ణమే ప్రధానం కానుంది. బోధన్ (ఉమ్మడి నిజామాబాద్), మంబోజిపల్లి (ఉమ్మడి మెదక్), ముత్యంపేట (ఉమ్మడి కరీంనగర్) జిల్లాల్లో నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీలున్నాయి. 2002లో ప్రైవేటుకు విక్రయించిన చంద్రబాబు ప్రభుత్వం.. నిజాం షుగర్స్ యూనిట్లను 2002లో డెల్టా పేపర్ మిల్స్ అనే ప్రైవేటు సంస్థకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విక్రయించింది. 2014లో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ నిజాం షుగర్స్‌ను ప్రభుత్వపరం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా 2015 డిసెంబర్ 23న ఫ్యాక్టరీ మూడు యూనిట్లకు లేఆఫ్ ప్రకటించారు. 2005–06లో చెరుకు దిగుబడి 35 వేల టన్నులున్నప్పటికీ నడిపిన ఈ కర్మాగారాలను.. 2015లో దిగుబడి లక్ష టన్నులకు పెరిగినా మూసేయడం గమనార్హం. దీంతో రైతులు వరి పంట వైపు మళ్లారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలున్న బోధన్, ముత్యంపేట, మంబోజిపల్లి ప్రాంతాల్లో రైతులు గణనీయమైన విస్తీర్ణంలో చెరుకు పంట పండించేందుకు ముందుకు వస్తేనే.. ప్రభుత్వం ఫ్యాక్టరీల పునఃప్రారంభం విషయంలో మరింత వేగంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు చెరుకు సాగు చేయడంపై ఆసక్తి నెలకొంది. -
సంపద వెలికితీద్దాం పదండి..!
ఎప్పుడో పది, ఇరవై ఏళ్ల క్రితం బ్యాంకులో డిపాజిట్ చేసి మర్చిపోయారా..? తల్లిదండ్రులు లేదా పూర్వికుల పేరిట స్టాక్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మరుగున పడి ఉన్నాయా?.. ఏమో ఎవరు చూసొచ్చారు. ఓసారి విచారిస్తేనే కదా తెలిసేది..! రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు క్లెయిమ్ లేకుండా, నిష్ప్రయోజనంగా ఉండిపోయినట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో సుమారు రూ.78,200 కోట్లు బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి.ఫిజికల్ షేర్ల రూపంలో ఉన్న మొత్తం సుమారు రూ.3.8 లక్షల కోట్లు. రూ.36 వేల కోట్లు మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఉంటే, క్లెయిమ్ చేయని డివిడెండ్లు రూ.5 వేల కోట్ల పైమాటే. ఉలుకూ, పలుకూ లేకుండా ఉండిపోయిన ఈ పెట్టుబడులకు అసలు యజమానులు ఎవరు, నిజమైన వారసులు ఎవరు?.. ఏమో అందులో మన వాటా కూడా ఉందేమో..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం... – సాక్షి, బిజినెస్ డెస్క్ కుటుంబ యజమాని తాను చేసిన పెట్టుబడుల వివరాలను జీవిత భాగస్వామితో పంచుకునే అలవాటు గతంలో అతి కొద్ద మందిలోనే ఉండేది. స్టాక్ మార్కెట్ ఆరంభంలో ఇన్వెస్ట్ చేసి, కాలం చేసిన వారి పేరిట పెట్టుబడుల వివరాలు కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు కూడా. ఇంట్లో ఆధారాలుంటే తప్పించి ఆయా పెట్టుబడుల గురించి తెలిసే అవకాశం లేదు. అవేవో పత్రాలనుకుని, పక్కన పడేసిన వారు కూడా ఉండొచ్చు.లేదా భౌతిక రూపంలోని షేర్ సర్టీఫికెట్లు కనిపించకుండా పోవచ్చు. ఎక్కడో పెట్టి మర్చిపోవచ్చు. ఏళ్లకేళ్లకు క్లెయిమ్ లేకుండా ఉండిపోయిన పెట్టుబడులు ‘ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ’ (ఐఈపీఎఫ్ఏ/పెట్టుబడిదారుల అక్షరాస్యత, సంరక్షణ నిధి)కు బదిలీ అయిపోతాయి. ఐఈపీఎఫ్ఏ కిందకు ఇలా చేరిపోయిన లిస్టెడ్ కంపెనీల షేర్ల విలువ ఎంతన్నది అధికారిక సమాచారం లేదు. సెబీ నమోదిత ‘ఫీ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎల్ఎల్పీ’ అంచనా ప్రకారం.. ఈ మొత్తం 2024 మార్చి నాటికి సుమారు రూ.77,033 కోట్లుగా ఉంటుంది. ఐఈపీఎఫ్ఏ కిందికి..లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి వాటాదారులు వరుసగా ఏడు సంవత్సరాలు, అంతకుమించి డివిడెండ్ క్లెయిమ్ చేయకపోతే కంపెనీల చట్టంలోని సెక్షన్ 124 కింద ఆయా వాటాలను ఐఈపీఎఫ్ఏ కిందకు కంపెనీలు బదిలీ చేయాలి. గతంలో డివిడెండ్లు ఎన్‌క్యాష్ (నగదుగా మార్చుకోవడం) కాకపోవడం, చిరునామాలో మార్పులతో అవి కంపెనీకి తిరిగి వచ్చేవి. నేటి రోజుల్లో డీమ్యాట్ ఖాతాతో అనుసంధానమై ఉన్న బ్యాంక్ ఖాతా ఇనాపరేటివ్ (కార్యకలాపాల్లేని స్థితి)గా మారిన సందర్భాల్లో వాటాదారులకు డివిడెండ్ చేరదు. ఇలా పదేళ్ల పాటు కొనసాగితే, ఆయా వాటాలు ఐఈపీఎఫ్ఏ కిందకు వెళ్లిపోతాయి. గుర్తించడం ఎలా..? కార్పొరేట్ వ్యవహారాల శాఖ కింద ఐఈపీఎఫ్ఏ పనిచేస్తుంటుంది. అన్ క్లెయిమ్డ్ షేర్ల వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు వీలుగా gov. in/ login పోర్టల్‌లో డేటాబేస్ అందుబాటులో ఉంది. ఇన్వెస్టర్లు తమ మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం లాగిన్ అయి, పాన్ నంబర్ ఆధారంగా తమ పేరు, తమ తల్లిదండ్రులు, వారి పూర్వికులలో ఎవరి పాన్ నంబర్ లేదా పేరుమీద షేర్లు ఐఈపీఎఫ్ఏ కింద ఉన్నాయేమో పరిశీలించుకోవచ్చు.ఒకవేళ ఐఈపీఎఫ్ఏకు ఇంకా బదిలీ కాకుండా, కంపెనీ వద్దే ఉండిపోయిన అన్క్లెయిమ్డ్ షేర్లు, డివిడెండ్ల వివరాలు కూడా పోర్టల్‌లో లభిస్తాయి. ఫోలియో నంబర్‌తోనూ చెక్ చేసుకోవచ్చు. దీనికంటే ముందు ఒకసారి ఇల్లంతా వెతికి ఒకవేళ భౌతిక పత్రాలుంటే, వాటిని డీమ్యాట్ చేయించుకోవడం సులభమైన పని. ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ సంస్థలు ఇన్వెస్టర్లకు పాన్ నంబర్ ఆధారంగా కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ (సీఏఎస్)ను నెలవారీగా పంపిస్తుంటాయి.ఇన్వెస్టర్ ఈమెయిల్స్‌ను పరిశీలించడం ద్వారా వారి పేరిట పెట్టుబడులను తెలుసుకోవచ్చు. తమ తల్లిదండ్రులు లేదా సమీప బంధువు ఇటీవలి కాలంలో మరణించినట్టయితే, వారి పేరిట పెట్టుబడులను తెలుసుకునేందుకు మరో మార్గం ఉంది. వారి ఆదాయపన్ను రిటర్నులను పరిశీలిస్తే వివరాలు తెలియొచ్చు. ఎన్ఎస్డీఎల్ లేదా సీడీఎస్ఎల్కు లేఖ రాస్తూ, తమ వారి పేరిట ఉన్న పెట్టుబడుల సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. తాము వారికి చట్టబద్ధమైన వారసులమన్న రుజువును లేఖకు జత చేయాలి. రికవరీ ఎలా..? ఐఈపీఎఫ్ఏ నుంచి షేర్లు, డివిడెండ్‌ను రికవరీ చేసుకోవడానికి కొంత శ్రమించక తప్పదు. ‘షేర్ సమాధాన్’ వంటి కొన్ని సంస్థలు ఫీజు తీసుకుని ఇందుకు సంబంధించి సేవలు అందిస్తున్నాయి. ఐఈపీఎఫ్ఏ వద్ద క్లెయిమ్ దాఖలు చేసి, షేర్లు, డివిడెండ్లను వెనక్కి తెప్పించుకోవడానికి చాలా సమయం పడుతుందని షేర్ సమాధాన్ చెబుతోంది.ప్రస్తుతం క్లెయిమ్ ఆమోదం/తిరస్కారానికి ఆరు నెలల నుంచి మూడేళ్ల సమయం తీసుకుంటున్నట్టు షేర్ సమాధాన్ డైరెక్టర్ శ్రేయ్ ఘోషల్ తెలిపారు. కొన్ని కంపెనీలు, ఆర్టీఏలు ఈ విషయంలో మెరుగ్గా స్పందిస్తుంటే.. కొన్నింటి విషయంలో ఒకటికి రెండు సార్లు సంప్రదింపులు నిర్వహించాల్సి వస్తున్నట్టు చెప్పారు. ఏదైనా కంపెనీలో వాటాలున్నట్టు గుర్తించి, అవి ఇంకా ఐఈపీఎఫ్ఏ కిందకు బదిలీ కాకపోతే.. కంపెనీ ఆర్టీఏను సంప్రదించాలి. నిర్దేశిత డాక్యుమెంట్లను సమర్పించి, వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. డీమ్యాట్ చేసుకోవాలి..? 2019 ఏప్రిల్ నుంచి షేర్ల క్రయ, విక్రయాలకు అవి డీమ్యాట్ రూపంలో ఉండడాన్ని సెబీ తప్పనిసరి చేసింది. వాటాదారులు మరణించిన కేసుల్లో వారి వారసుల పేరిట బదిలీకి మాత్రం మినహాయింపు ఉంది. ఇప్పటికీ పత్రాల రూపంలో షేర్లు కలిగి ఉంటే, ఆయా కంపెనీల ఆర్టీఏలను సంప్రదించి డీమెటీరియలైజేషన్ (డీమ్యాట్) చేయించుకోవాలి. షేర్ హోల్డర్ పేరు, ఫోలియో నంబర్ వివరాలతో ఆర్టీఏను సంప్రదిస్తే.. ఏయే పత్రాలు సమర్పించాలన్నది తెలియజేస్తారు.నిబంధనల మేరకు దరఖాస్తును పూర్తి చేసి, కేవైసీ, ఇతర పత్రాలను జోడించి ఆర్టీఏకి పంపించాలి. దరఖాస్తును ఆమోదిస్తే, ధ్రువీకరణ లేఖను ఆర్టీఏ జారీ చేస్తుంది. అప్పుడు దీన్ని డీమ్యాట్ ఖాతా కలిగిన డిపాజిటరీ పార్టీసిపెంట్ (సీడీఎస్ఎల్/ఎన్ఎస్డీఎల్)కు సమర్పించిన అనంతరం షేర్లు జమ అవుతాయి. ఈ విషయంలో కొందరు బ్రోకర్లు, కన్సల్టెన్సీ సంస్థలు సేవలు అందిస్తున్నాయి. వాటి సాయం తీసుకునే ముందు ఆయా సంస్థల వాస్తవికతను నిర్ధారించుకోవడం అవసరం. బ్యాంక్ డిపాజిట్లు.. బ్యాంక్ ఖాతాలో రెండేళ్లకు పైగా ఎలాంటి లావాదేవీ లేకపోతే అది ఇనాపరేటివ్‌గా మారిపోతుంది. ఖాతాదారు మరణించిన సందర్భంలో ఇలా జరగొచ్చు. అటువంటప్పుడు మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు నామినీ తన కేవైసీ డాక్యుమెంట్లను బ్యాంక్ శాఖలో సమర్పించాలి. ఖాతాను మూసేసి, అందులోని బ్యాలన్స్‌ను నామినీకి బదిలీ చేస్తారు. ఒకవేళ నామినీ లేకపోయినప్పటికీ, ఇనాపరేటివ్ ఖాతాలో బ్యాలన్స్ రూ.25 వేల లోపు ఉంటే బ్యాంక్ స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చు.అంతకుమించి బ్యాలన్స్ ఉంటే చట్టబద్ధమైన వారసులు (జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలు, సోదరులు/సోదరీమణులు) కోర్టుకు వెళ్లి సక్సెషన్ సర్టీఫికెట్ తెచ్చుకోవాలి. క్లెయిమ్ కోసం ఒకరికి మించి ముందుకు వస్తే, అప్పుడు ఇండెమ్నిటీ సర్టి ఫికెట్‌ను సైతం బ్యాంక్ కోరొచ్చు. డిపాజిట్ అయినా, ఖాతాలో బ్యాలన్స్ అయినా 10 ఏళ్లపాటు క్లెయిమ్ లేకుండా ఉండిపోతే, ఆ మొత్తాన్ని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను తమ పోర్టల్‌లో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ గతంలో బ్యాంక్‌లను ఆదేశించింది. కనుక పేరు, పుట్టిన తేదీ, పాన్ తదితర వివరాలతో తమ పేరు, తమ వారి పేరిట డిపాజిట్లు ఉన్నాయేమో బ్యాంక్ పోర్టల్‌కు వెళ్లి పరిశీలించుకోవచ్చు. లేదంటే బ్యాంక్ శాఖకు వెళ్లి విచారణ చేయాలి. అన్క్లెయిమ్డ్ షేర్లు డీమ్యాట్ రూపంలో ఉంటే..?⇒ అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా వాటిని తమ పేరిట బదిలీ చేయించుకోవచ్చు.⇒డీపీ వద్ద దరఖాస్తు దాఖలు చేయాలి. షేర్లు పత్రాల రూపంలో ఉంటే? ⇒ విడిగా ప్రతి కంపెనీ ఆర్టీఏ వద్ద డీమెటీరియలైజేషన్కు దరఖాస్తు చేసుకోవాలి.⇒ అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి. అవన్నీ కచ్చితమైనవని నిర్ధారించుకున్న తర్వాత, అప్పుడు డీమ్యాట్ ఖాతాకు బదిలీ అవుతాయి. .ఐఈపీఎఫ్ఏకు బదిలీ అయిపోతే..? ⇒ వాటాలున్న ప్రతి కంపెనీ ఆర్టీఏ నుంచి ఎంటైటిల్మెంట్ లెటర్‌ను పొందాలి. ⇒ ఐఈపీఎఫ్–5 ఈ–ఫారమ్‌ను ఐఈపీఎఫ్ఏ వద్ద దాఖలు చేయాలి. ⇒ కంపెనీ ఆమోదం తర్వాత క్లెయిమ్‌ను ఐఈపీఎఫ్ఏ ఆమోదిస్తుంది. దాంతో షేర్లు అసలైన యజమానులు లేదా వారసులకు బదిలీ అవుతాయి. ⇒ సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (ఎస్ఆర్ఎన్) జారీ అవుతుంది. దీని ఆధారంగా ఆయా కంపెనీల ఆర్టీఏ వద్ద 7–10 రోజుల్లోగా డాక్యుమెంట్లను సమర్పించాలి.ఫండ్స్ పెట్టుబడుల సంగతి..? బ్యాంక్ డిపాజిట్లకు, బీమా పాలసీలకు మెచ్యూరిటీ ఉంటుంది. కానీ ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు అలాంటిదేమీ ఉండదు. అయినప్పటికీ పదేళ్లకు పైగా ఒక ఫోలియోపై ఎలాంటి లావాదేవీలు లేకుండా, కేవైసీ అప్డేట్ చేయకపోతే వాటిని అన్క్లెయిమ్డ్గా పరిగణించొచ్చు. డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్‌కు సంబంధించి డివిడెండ్లు క్లెయిమ్ కాకపోయి ఉండొచ్చు.చిరునామా, కాంటాక్ట్ వివరాలు మారిపోయి, ఇన్వెస్టర్ మరణించిన సందర్భాలు, బ్యాంక్ ఖాతా ఇనాపరేటివ్‌గా మారిపోయిన కేసుల్లోనూ ఇది చోటు చేసుకోవచ్చు. ఇలాంటి పెట్టుబడులను ఐఈపీఎఫ్ఏ కిందకు బదిలీ చేసినట్టయితే, షేర్ల మాదిరే నిర్దేశిత ప్రక్రియలను అనుసరించి వాటిని సొంతం చేసుకోవచ్చు. ఫండ్స్ పెట్టబడుల వివరాలను గుర్తించేందుకు క్యామ్స్, కే–ఫిన్‌టెక్ సాయం తీసుకోవచ్చు.యాక్టివ్‌గా లేని ఫండ్స్ పెట్టుబడులను తెలుసుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ‘మిత్రా’ పేరుతో (ఎంఎఫ్ పెట్టుబడుల గుర్తింపు, రికవరీ) ఒక ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ త్వరలో అందుబాటులోకి రానుంది. అప్పుడు, తమ పేరు, తమ వారి పేరిట ఉన్న ఫండ్స్ పెట్టుబడి వివరాలను సులభంగా గుర్తించొచ్చు.ఇలా చేస్తే సమస్యలకు దూరం..⇒ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు సంబంధించి (ట్రేడింగ్ ఖాతాకు అనుసంధానంగా ఉన్న) బ్యాంక్ ఖాతాను యాక్టివ్‌గా ఉంచుకోవాలి. ⇒ పెట్టుబడుల వివరాలను జీవిత భాగస్వామితో పంచుకోవాలి. లేదంటే ఒక డైరీలో అన్ని పెట్టుబడులు, ఆర్థిక వివరాలను నమోదు చేసి, ఇంట్లో భద్రపరచాలి. ⇒ ప్రతి పెట్టుబడికి నామినీని నమోదు చేయాలి. ⇒ వీలునామా లేదా ఎస్టేట్ ప్లానింగ్ చేసుకోవాలి. దీనివల్ల భవిష్యత్తులో వారసులకు క్లెయిమ్ సమస్యలు ఎదురుకావు. ⇒ చిరునామా, ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతా ఇలా కేవైసీకి సంబంధించి ముఖ్యమైన వివరాల్లో మార్పులు జరిగితే వెంటనే బ్యాంక్‌లు, మ్యూచువల్ ఫండ్స్, డీపీలు, బీమా కంపెనీల వద్ద అప్డేట్ చేసుకోవాలి. బీమా ప్రయోజనాలూ అంతే..ఎల్ఐసీ సహా కొన్ని బీమా సంస్థల పరిధిలో మెచ్యూరిటీ (గడువు) ముగిసినా, ఎలాంటి క్లెయిమ్ చేయని పాలసీలు చాలానే ఉన్నాయి. ఒక పాలసీదారు పేరిట క్లెయిమ్ చేయని మొత్తం రూ.1,000కి మించి ఉంటే, ఆ వివరాలను తమ వెబ్సైట్లలో బీమా సంస్థలు ప్రదర్శించాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. పాలసీదారు పేరు, పాలసీ నంబర్, పాన్, పుట్టిన తేదీ వివరాలతో వీటి గురించి తెలుసుకోవచ్చు. క్లెయిమ్ బ్యాంక్ డిపాజిట్ల మాదిరే ఉంటుంది. -
ప్యాలెస్‌లో ప్రయాణం రాజస్థాన్ విహారం
ప్యాలెస్ ఆన్ వీల్స్‌లో వారం రోజుల ప్రయాణం. ఇది ప్రయాణం మాత్రమే కాదు... ఒక అనుభూతి. రాజస్థాన్ కోటలను చూడాలి... థార్ ఎడారిలో విహరించాలి. రాజపుత్రులు మెచ్చిన జానపద కళల ప్రదర్శనలను ఆస్వాదించాలి.ఇవన్నీ మామూలుగా కాదు... సకల మర్యాదలతో రాజసంగా ఉండాలి.పర్యటన ఆద్యంతం కాలు కింద పెట్టకుండా సౌకర్యంగా ఉండాలి. రాజస్థాన్ టూరిజం... సామాన్యులకు రాజలాంఛనాలను అందిస్తోంది. ఇందుకోసం ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’ పేరుతో ఒక రైలునే సిద్ధం చేసింది. ఇది టూర్ మాత్రమే కాదు... ఇది ఒక లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్.ఇంకెందుకాలస్యం... ట్రైన్ నంబర్ 123456... ప్లాట్ మీదకు వస్తోంది... లగేజ్‌తో సిద్ధంగా ఉండండి.రాజస్థాన్ పర్యాటకం రాజసంగా ఉంటుంది. సాధారణ ప్యాకేజ్‌లు క్లస్టర్లుగా కొన్ని ప్రదేశాలనే కవర్ చేస్తుంటాయి. పింక్‌సిటీ, బ్లూ సిటీ, గోల్డెన్ సిటీ, లేక్ సిటీలన్నింటినీ కవర్ చేయాలంటే ప్యాలెస్ ఆన్ వీల్స్ సౌకర్యంగా ఉంటుంది. 7 రాత్రులు 8 రోజుల ప్యాకేజ్‌లో రైలు న్యూఢిల్లీ సఫ్దర్ గంజ్ స్టేషన్లో మొదటి రోజు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరుతుంది. 8 రోజు ఉదయం ఏడున్నరకు అదే స్టేషన్లో దించుతుంది.ఢిల్లీ నుంచి మొదలై ఢిల్లీకి చేరడంతో పూర్తయ్యే ఈ ప్యాకేజ్‌లో జయ్‌పూర్, సవాయ్ మాధోపూర్, చిత్తోర్ఘర్, ఉదయ్‌పూర్, జై సల్మీర్, జో«ద్‌పూర్, భరత్పూర్, ఆగ్రాలు కవర్ అవుతాయి. ఈ పర్యాటక రైలు 1982, జనవరి 26 నుంచి నడుస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలో టూరిజమ్ ప్రమోషన్ కోసం ఇండియన్ రైల్వేస్– రాజస్థాన్ టూరిజమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ టూర్ విదేశీయులే ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు మనవాళ్లు కూడా పెద్ద సంఖ్యలో పర్యటిస్తున్నారు.తొలిరోజు: ఢిల్లీ టూ జయ్పూర్పర్యాటకులకు రాజపుత్రుల సంప్రదాయ రాచమర్యాదలందిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు రైల్వే స్టేషన్‌కి చేరగానే రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకుతారు. పూలమాల వేసి, బొట్టు పెట్టి, గంధం రాస్తారు. షెహనాయ్ రాగం, కచ్చీఘోదీ నాట్యం, ఏనుగు అంబారీల మధ్య రిఫ్రెష్ డ్రింక్ (సాఫ్ట్ డ్రింకులు, బార్) తో వెల్కమ్ చెబుతారు. పర్యాటకులు ఎవరికి కేటాయించిన గదిలోకి వాళ్లు వెళ్లిన తర్వాత ఆరున్నరకు రైలు ఢిల్లీ స్టేషన్ నుంచి పింక్‌సిటీ జయ్‌పూర్‌కు బయలుదేరుతుంది. రాత్రి ఎనిమిది గంటలకు రైల్లో విందు భోజనం ఇస్తారు.రెండవ రోజు: జయ్‌పూర్ టూ సవాయ్ మాధోపూర్అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు ట్రైన్ జయ్‌పూర్‌కి చేరుతుంది. పర్యాటకులు నిద్రలేచి రిఫ్రెష్ అయిన తర్వాత ఏడు గంటలకు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. ఎనిమిది గంటలకు రైలు దిగి (లగేజ్ రైల్లోనే ఉంటుంది) సైట్ సీయింగ్ కోసం ఏర్పాటు చేసిన వాహనాల్లోకి మారాలి. నగరంలో ఆల్బర్ట్ హాల్, హవామహల్, సిటీ ప్యాలెస్, జంతర్‌మంతర్ (ఖగోళ పరిశోధనాలయం)ని చూడడం. మధ్యాహ్నం లోహగర్ ఫోర్ట్‌లోని రిసార్ట్‌కు తీసుకెళ్తారు. లంచ్ అక్కడే. ఆ తర్వాత సూర్యాస్తమయంలోపు అమేర్ ఫోర్ట్ విజిట్, షాపింగ్ పూర్తి చేసుకుని ఆరు గంటలకు ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలెక్కాలి. ఏడు గంటల తర్వాత రాజస్థాన్ సంప్రదాయ వంటకాలతో డిన్నర్. ప్రయాణం సవాయ్ మాధోపూర్‌కు సాగుతుంది.మూడవ రోజు: మాధోపూర్ టూ చిత్తోర్ఘర్తెల్లవారు జామున ఐదు గంటల లోపు సవాయ్ మాధోపూర్ చేరుతుంది. రిఫ్రెష్ అయి ఆరు గంటలకు రైలు దిగి రణతంబోర్ నేషనల్ పార్క్, రణతంబోర్ ఫోర్ట్ విజిట్‌కి వెళ్లాలి. నేషనల్ పార్క్ పర్యటన పూర్తి చేసుకుని పదింటికి ట్రైన్ ఎక్కాలి. అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. రైలు చిత్తోర్ఘర్ వైపు సాగిపోతుంది. లంచ్ రైల్లోనే. సాయంత్రం నాలుగు గంటలకు చిత్తోర్ఘర్ చేరుతుంది. రైలు దిగి సైట్ సీయింగ్‌కి వెళ్లాలి. ఆరు గంటలకు కోట లోపల టీ తాగి, లైట్ అండ్ సౌండ్ షో ను ఆస్వాదించి ఏడున్నరకు రైలెక్కాలి. ఎనిమిది గంటలకు రైల్లోనే డిన్నర్.నాలుగవ రోజు: చిత్తోర్ఘర్ టూ జై సల్మీర్ వయా ఉదయ్పూర్రెండు గంటలకు చిత్తోర్ఘర్ నుంచి బయలుదేరుతుంది. ఉదయం ఏడున్నరకు బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసుకున్న తర్వాత ఎనిమిదిన్నరకు లేక్‌సిటీ ఉదయ్‌పూర్ చేరుతుంది. రైలు దిగి తొమ్మిదింటికి వాహనంలోకి మారి సైట్‌సీయింగ్, షాపింగ్ చేసుకోవాలి. మధ్యాహ్నం ఒకటిన్నరకు బోట్ రైడ్, ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం. మూడు గంటలకు తిరిగి ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలెక్కాలి. నాలుగు గంటలకు జై సల్మీర్‌కు ప్రయాణం. రాత్రి భోజనం రైల్లోనే ఎనిమిది గంటలకు.ఐదవ రోజు: జై సల్మీర్ టూ జోద్పూర్రైలు ఉదయం తొమ్మిదిన్నరకు జై సల్మీర్కి చేరుతుంది. రైలు దిగి గడిసిసార్ సరస్సు. జై సల్మీర్ కోట, నగరంలోని హవేలీలు చూసుకుని షాపింగ్ చేసుకుని తిరిగి రైలెక్కాలి. భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత నాలుగు గంటలకు రైలు దిగి ఎడారిలో విహారం, క్యామెల్ రైడ్ ఆస్వాదించాలి. రాజస్థాన్ సంప్రదాయ జానపద నృత్యాలు, సంగీత కార్యక్రమాల వినోదం, రాత్రి భోజనం కూడా అక్కడే చేసుకుని రాత్రి పది గంటలకు రైలెక్కాలి. పన్నెండు గంటలలోపు రైలు జై సల్మీర్ నుంచి బ్లూ సిటీ జో«ద్‌పూర్‌కు బయలుదేరుతుంది.ఆరవ రోజు: జో«ద్‌పూర్ టూ భరత్పూర్రైలు ఉదయం ఏడు గంటలకు జో«ద్‌పూర్‌కు చేరుతుంది. ఏడున్నరకు బ్రేక్‌ఫాస్ట్ చేసి ఎనిమిదిన్నరకు సైట్ సీయింగ్ కోసం రైలు దిగాలి. మెహరాన్‌ఘర్ ఫోర్ట్, జస్వంత్ థాడా, ఉమైద్ భవన్ ప్యాలెస్ మ్యూజియం చూసుకున్న తర్వాత షాపింగ్. ఒకటిన్నరకు బాల్ సమంద్ లేక్ ప్యాలెస్‌లో రాజలాంఛనాలతో విందు భోజనం చేసిన తర్వాత ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలెక్కాలి. నాలుగన్నరకు రైలు జో«ద్‌పూర్ నుంచి భరత్‌పూర్‌కు బయలుదేరుతుంది. రాత్రి భోజనం రైల్లోనే.ఏడవ రోజు: భరత్పూర్ టూ ఆగ్రారైలు ఉదయం ఆరు గంటలకు భరత్‌పూర్‌కి చేరుతుంది. వెంటనే సైట్ సీయింగ్‌కి బయలుదేరాలి. ఘనా బర్డ్ సాంక్చురీ విజిట్ తర్వాత ఎనిమిది గంటలకు మహల్ ఖాజ్ ప్యాలెస్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసి రైలెక్కాలి. పది గంటలకు రైలు ఆగ్రాకు బయలుదేరుతుంది. పదకొండు గంటలకు ఆగ్రా రెడ్ ఫోర్ట్ చూసుకుని ఫైవ్ స్టార్ హోటల్లో లంచ్ తర్వాత మూడు గంటలకు తాజ్‌మహల్ వీక్షణం. ఐదున్నర నుంచి షాపింగ్, ఏడున్నరకు రైలెక్కి డిన్నర్ తర్వాత ఎనిమిది ముప్పావుకి ఢిల్లీకి బయలుదేరాలి.ఎనిమిదవ రోజు: ఆగ్రా టూ ఢిల్లీఉదయానికి రైలు ఢిల్లీకి చేరుతుంది. బ్రేక్‌ఫాస్ట్ చేసి, లగేజ్ సర్దుకుని ఏడున్నరకు దిగి ప్యాలెస్ ఆన్ వీల్స్‌కి వీడ్కోలు పలకాలి.తరగతుల వారీగా ట్రైన్ టికెట్ వివరాలు:⇒ ప్రెసిడెన్షియల్ సూట్లో క్యాబిన్‌కి... 2,67,509 రూపాయలు⇒ సూపర్ డీలక్స్‌లో క్యాబిన్‌కి... 2,18,207 రూపాయలు⇒ డీలక్స్ క్యాబిన్ సింగిల్ ఆక్యుపెన్సీ... 1,10,224 రూపాయలు⇒ డీలక్స్ క్యాబిన్ డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి... 71,712 రూపాయలు⇒ ఐదేళ్ల లోపు పిల్లలకు ఉచితం. పన్నెండేళ్ల లోపు పిల్లలకు సగం చార్జ్.⇒ ఒక క్యాబిన్లో ఇద్దరికి అనుమతి. పిల్లలను పేరెంట్స్తోపాటు అదే క్యాబిన్లో అనుమతిస్తారు.ప్యాలెస్ ఆన్ వీల్స్ మరిన్ని వివరాల కోసం...Email : palaceonwheels.rtdc@rajasthan.gov.in Website: Palaceonwheels.rajasthan.gov.inపులి కనిపించిందా!ఈ టూర్లో రాజస్థాన్ సంప్రదాయ సంగీతం, స్థానిక ఘూమర్, కల్బేలియా జానపద నృత్యాలను ఆస్వాదిస్తూ సాగే కామెల్ సఫారీ, డెజర్ట్ సఫారీలు, క్యాంప్‌ఫైర్ వెలుగులో ఇసుక తిన్నెల మీద రాత్రి భోజనాలను ఆస్వాదించవచ్చు. భరత్‌పూర్‌లోని కెలాడియా నేషనల్ పార్క్‌కి సైబీరియా నుంచి వచ్చిన కొంగలను చూడవచ్చు. ఈ పక్షులు ఏటా సైబీరియా నుంచి ఏడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి నవంబర్‌లో ఇక్కడికి వలస వస్తాయి.మార్చి వరకు ఇక్కడ ఉండి ఏప్రిల్ నుంచి తిరుగు ప్రయాణం మొదలు పెడతాయి. ఈ కొంగలతోపాటు వందల రకాల పక్షులుంటాయి. రణతంబోర్ నేషనల్ పార్క్‌కు వెళ్లి జీప్ సఫారీ లేదా ఎలిఫెంట్ సఫారీ చేస్తూ పులి కనిపిస్తుందేమోనని రెప్పవేయకుండా కళ్లు విప్పార్చి బైనాక్యులర్‌లో చూసి చూసి... దూరంగా ఎక్కడో పులి అలికిడి కనిపించగానే భయంతో కూడిన థ్రిల్‌తో బిగుసుకు పోవచ్చు.ఏడు హెరిటేజ్ సైట్లను చూడవచ్చుప్యాలెస్ ఆన్ వీల్స్ ప్యాకేజ్‌లో యునెస్కో గుర్తించిన ఏడు వరల్డ్ హెరిటేజ్ సైట్లు కవర్ అవుతాయి. అవేంటంటే... జయ్‌పూర్‌లోని జంతర్ మంతర్, రణతంబోర్లో రణతంబోర్ కోట, చిత్తోర్‌ఘర్‌లో చిత్తోర్ఘర్ కోట, జై సల్మీర్‌లో జై సల్మీర్ కోటతోపాటు థార్ ఎడారి, భరత్పూర్ కెలాడియో నేషనల్ పార్క్, ఆగ్రాలో తాజ్ మహల్. ఇవన్నీ యునెస్కో గుర్తింపు పొందిన హెరిటేజ్ సైట్లు. ఈ గౌరవంతోపాటు తాజ్‌మహల్‌కి ప్రపంచంలోని ఏడు వింతల జాబితాలో కూడా స్థానం ఉంది. -
RRR వరకు హెచ్ఎండీఏ విస్తరణతో డీటీసీపీకి బ్రేక్
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా, సమగ్రమైన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించకుండానే ఆగమేఘాల మీద హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)ను ట్రిపుల్ ఆర్ వరకు విస్తరిస్తూ తెచ్చిన జీఓ.. రియల్ ఎస్టేట్ (Real Estate) రంగాన్ని కుదేలు చేసేలా మారింది. నిర్మాణ రంగం కూడా మరింత బలహీన పడే పరిస్థితి నెలకొంది. ఇంచుమించు ఏడాదిన్నరగా చతికిల పడ్డ ‘రియల్ భూమ్’ను ఇది మరింత భూస్థాపితం చేసేలా మారిందని నిర్మాణరంగ నిపుణులు భావిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఆవిర్భవించినప్పటి నుంచి రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల నుంచే ప్రభుత్వ ఖజానాకు అత్యధిక ఆదాయం లభించింది. నగరం చుట్టుపక్కల ఉన్న భూములు బంగారం కంటే ప్రియంగా మారాయి. అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. హెచ్ఎండీఏ (HMDA) భూములకు సైతం భారీ డిమాండ్ వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు (Outer ring road) పరిధిలో ఎక్కడ హెచ్ఎండీఏ భూములను అమ్మకానికి పెట్టినా రూ.వందల కోట్ల ఆదాయం లభించింది. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలతో రియల్ రంగం వెనుకంజ వేసింది. ఈ క్రమంలో హెచ్ఎండీఏ విస్తరణతో తిరిగి కొంత రియల్ భూమ్ రావచ్చని మొదట్లో భావించారు. కానీ.. ఏ విధమైన ప్రణాళికలు, విధి విధానాలు లేకుండానే ఆకస్మికంగా జీఓ తేవడంతో అనుమతులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్‌ప్లానింగ్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) నుంచి లభించే అనుమతులకు తాజాగా బ్రేక్ పడింది. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది.అనుమతులు ఇచ్చేదెవరు? ఇప్పటికే డీటీసీపీ పరిధిలో భూములు కొనుగోలు చేసి లేఅవుట్ అనుమతుల కోసం ఎదురుచూస్తున్న రియల్టర్లకు ఎలాంటి సమాధానం లభించడం లేదు. ప్రస్తుతం లే అవుట్ అనుమతుల అంశం తమ పరిధిలో లేదంటూ డీటీసీపీ (DTCP) అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణదారులు రెండు, మూడు రోజులుగా హెచ్ఎండీఏకు తరలివస్తున్నారు. కానీ.. హెచ్ఎండీఏలో సైతం చుక్కెదురే కావడం గమనార్హం. ట్రిపుల్ ఆర్ వరకు తమ పరిధి పెరిగినప్పటికీ ఇంకా ఎలాంటి విధివిధానాలు రాలేదని చెబుతున్నారు.మరోవైపు కొత్త మాస్టర్‌ప్లాన్ వస్తే తాము అనుమతులు ఇవ్వలేమంటున్నారు. దీంతో రియల్టర్లు, వ్యాపార వర్గాలు, ఆర్కిటెక్టర్లు తదితర వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. ‘అనుమతుల కోసం కొంత కాలం ఆగాల్సిందేనంటున్నారు. కానీ.. ఎంతకాలం అనే దానిపై స్పష్టత లేకుండాపోయింది. పైగా మాస్టర్ ప్లాన్ లేకుండా అనుమతులను ఇవ్వడం కూడా సాధ్యం కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇది నష్టదాయకంగా మారింది’ అని కందుకూరు ప్రాంతానికి చెందిన రియల్టర్ ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు బ్యాంకుల నుంచి, ఇతరత్రా రుణాలు తీసుకుని భూములు కొనుగోలు చేసిన వ్యాపారుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.మాస్టర్‌ప్లాన్‌కు మరో ఏడాది.. మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని మూడు భాగాలుగా చేసి సమగ్రమైన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించేందుకు ప్రభుత్వం ఏడాది క్రితం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఔటర్‌రింగ్ రోడ్డు వరకు కోర్ అర్బన్‌గా, ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్‌గా, రీజినల్ రింగ్ రోడ్డు నుంచి మిగతా తెలంగాణ అంతా రూరల్‌గా పరిగణిస్తూ రీజినల్ రింగ్ రోడ్డు వరకు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమగ్రమైన మాస్టర్‌ప్లాన్– 2050ని రూపొందించాల్సి ఉంది. కానీ.. ఈ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.చదవండి: ఎల్ఆర్ఎస్తో తిప్పలు.. దరఖాస్తుదారులకు చుక్కలు మాస్టర్‌ప్లాన్ (Mastar Plan) రూపకల్పన కోసం ఆసక్తి గల అంతర్జాతీయ సంస్థల నుంచి రిక్వెస్ట్ ప్రపోజల్స్‌ను ఆహ్వానించేందుకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు చెప్పారు. ఎంపిక చేసిన సంస్థ పూర్తిగా అధ్యయనం చేసి సమగ్రమైన మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేసేందుకు కనీసం ఏడాది సమయం పట్టవచ్చని అంచనా. మాస్టర్ ప్లాన్ సిద్ధమైతే తప్ప హెచ్ఎండీఏ నుంచి అనుమతులు లభించవు. అంటే అప్పటి వరకు ట్రిపుల్ ఆర్ వరకు అన్ని రకాల నిర్మాణాలు, లే అవుట్లు, వెంచర్లు నిలిచిపోవాల్సిందేనా అనే సందేహం నెలకొంది. ఈ పరిణామం రియల్ ఎస్టేట్ భవిష్యత్‌ను మరోసారి ప్రశ్నార్థకంగా మార్చిందని ఆ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.పరిస్థితి అగమ్యగోచరం.. హైదరాబాద్ విస్తరణ పట్ల ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ.. అసలు మాస్టర్‌ప్లాన్ లేకుండానే విస్తరణ జీఓ ఇవ్వడం వల్ల స్పష్టత లేకుండా పోయింది. రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ రంగానికే కాదు హైదరాబాద్ అభివృద్ధికి కూడా ఇది నష్టమే. – సత్యనారాయణ చిట్టి, రియల్ ఎస్టేట్ నిపుణులు -
ఈ బస్సుకు డ్రైవర్ లేడు!
బార్సిలోనా: స్పెయిన్‌లోని బార్సిలోనా నగర వీధుల్లో ఒక కొత్త బస్సు సందడిచేస్తోంది. అందులో ఎక్కే ప్రయాణికుల నుంచి ఒక వారంరోజులపాటు ఎలాంటి రుసుము వసూలుచేయట్లేరు. ఈ బస్సుకు ప్రత్యేకత ఉంది. అదేంటంటే బస్సుకు డ్రైవర్ అంటూ ఎవరూ ఉండరు. ఈ డ్రైవర్‌లెస్ విద్యుత్ బస్సు ఇప్పుడు బార్సిలోనా సిటీ వీధుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డ్రైవర్లేకున్నా ధైర్యంచేసి బస్సులో దూరిపోయే ప్రయాణికులూ ఎక్కువైపోయారు. గంటకు 40కిలోమీటర్ల వేగంతో ఈ బస్సు దూసుకుపోతుంది. ఒక్కసారి చార్జ్‌చేస్తే 120 కిలోమీటర్లదాకా ప్రయాణించవచ్చు. చుట్టూతా 10 అత్యాధునిక కెమెరాలు, సెన్సార్లతో పనిచేసే ఎనిమిది లిడార్లను అమర్చారు. అతి చిన్న రూట్ సుదూరాలకు ప్రయాణించకుండా తొలి దఫాలో ఈ మినీ బస్సును కేవలం 2.2 కిలోమీటర్ల వృత్తాకార పరిధిలోనే తిప్పుతున్నారు. ప్రయాణంలో ఇది మొత్తం నాలుగు చోట్ల మాత్రమే ఆగుతుంది. స్వయంచాలిత వాహనాల తయారీలో ప్రత్యేకత సాధించిన వీరైడ్ అనే సంస్థతో ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజ సంస్థ రెనాల్ట్ చేతులు కలిపి ఈ అధునాతన బస్సును రూపొందించింది. తొలిసారిగా ఈ బస్సు నమూనాను గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఇప్పుడు బస్సు బార్సిలోనా నగర వీధుల్లో సేవలందిస్తోంది.ఇలాంటి ప్రయోగ ప్రాజెక్టులను ఫ్రాన్స్‌లోని వాలెన్స్ సిటీ, జ్యురిచ్ ఎయిర్‌పోర్ట్‌లోనూ ప్రారంభించారు. ‘‘సాధారణ ఇంజన్‌తో నడిచే బస్సును ఎక్కి బోర్ కొట్టింది. అందుకే ఈ రోజు డ్రైవర్‌లెస్ బస్సెక్కా’’అని 18 ఏళ్ల పావూ కగాట్ చెప్పారు. ‘‘శాన్ఫ్రాన్సిస్కో మొదలు టోక్యో దాకా ఇప్పటికే పలు నగరాల్లో డ్రైవర్‌లెస్ బస్సును పరీక్షించినా యూరప్‌లో మాత్రం వీటి సందడి ఇంకా మొదలుకాలేదు. అందుకే ఈ పంథాను ఇక్కడ మేం మొదలెట్టాం’’అని రేనాల్ట్ అటానమస్ మొబిలిటీ ప్రాజెక్ట్స్ హెడ్ ప్యాట్రిక్ వర్గిలాస్ చెప్పారు.బస్సు సిగ్నళ్ల వద్ద ఆగుతూ, పాదచారులు రోడ్డు దాటేటప్పుడు ఆగి వెళ్తూ ట్రాఫిక్ నిబంధనలనూ చక్కగా అనుసరిస్తోంది. ఇప్పటిదాకా ఎలాంటి రోడ్డు ప్రమాదాలకు ఇది కారణం కాలేదని బార్సిలోనా సిటీ అధికారులు చెప్పారు. ఇప్పుడీ బస్సులో ఎక్కిన వాళ్లు లోపల కూర్చొని, బయట నిలబడి సెల్ఫీలు దిగుతూ తెగ షేర్లు చేసుకుంటున్నారు. దీంతో బుల్లి బస్సుకు భలే గిరాకీ ఉందే అని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానాలు చేశారు. -
అప్పు... ఆర్థిక భద్రతకు ముప్పు!
ఇప్పుడు ఆర్థికవేత్తల చర్చల్లో కీలకాంశం.. భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ), దానితో పోల్చితే భారత్ రుణ నిష్పత్తి. ఒక కుటుంబానికి తీర్చగలిగిన స్థాయిలోనే అప్పు ఎలా ఉండాలో.. ఒక దేశానికి తన ఆర్థిక వ్యవస్థ స్థాయికి తగినట్లుగానే రుణం ఉండాలి. ఒక కుటుంబం ఆదాయం– అప్పు ఎలా బేరీజు వేసుకోవాలో దేశం కూడా తన జీడీపీని, అందులో రుణ నిష్పత్తిని తూకం వేసుకోవాలి. ఒక దేశం ఆర్థిక ‘ఆరోగ్యానికి’ చక్కటి సూచిక జీడీపీ–రుణ నిష్పత్తి.విస్తృత స్థాయిలో ఆమోదం పొందిన ఈ సూచీని అదుపులో పెడతామని కేంద్రం ఇస్తున్న హామీ ఇప్పుడు ఆర్థిక వర్గాలకు ఊరటనిస్తోంది. అయితే ఇది అంత తేలిక్కాదని వాస్తవ పరిస్థితులు అద్దం పడుతున్నాయి. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వ అప్పు (సెంట్రల్ గవర్నమెంట్ డెట్) కొంత అదుపులో ఉన్నా.. రాష్ట్రాలను కూడా కలుపుకుంటే (జనరల్ గవర్నమెంట్ డెట్) ఆందోళన కలిగిస్తున్న విషయం ఇక్కడ గమనార్హం. ఆయా అంశాలపై చర్చించిందే ఈ కథనం. – సాక్షి, బిజినెస్ డెస్క్కేం ద్రానికి రుణ–జీడీపీ నిష్పత్తి 2024–25 ఆర్థిక సంవత్సరంలో 57.1 శాతం. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే రానున్న 2025–26లో 56.1 శాతానికి తగ్గించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించుకుంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య ఉన్న నికర వ్యత్యాసం– ద్రవ్యలోటును తగ్గించుకోవడం... ఆర్థికాభివృద్ధి ద్వారా జీడీపీలో రుణ నిష్పత్తిని గణనీయంగా తగ్గించుకోవాలన్న సంకల్పాన్ని బడ్జెట్ ఉద్ఘాటించింది. తద్వారా ఈ నిష్పత్తిని 2031 మార్చి 31 నాటికి ఒక శాతం అటుఇటుగా 50 శాతానికి చేర్చాలని ప్రణాళికలను వెల్లడించింది.అంటే జీడీపీలో రుణ నిష్పత్తిని 2031 నాటికి ఏడాదికి ఒక శాతం చొప్పున తగ్గించుకుంటూ వెళ్లాలన్నది కేంద్రం లక్ష్యం. ఇందుకు రెండు ప్రధానదారులు ఒకటి ద్రవ్యలోటు కట్టడికాగా, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మరొకటి. 2024–25లో ద్రవ్యలోటు 4.9 శాతం ఉండాలని బడ్జెట్ నిర్ధేశించుకున్నప్పటికీ, ఇది సవరించిన అంచనాల ప్రకారం మరింత మెరుగ్గా 4.8 శాతానికి తగ్గించుకోగలిగింది.రానున్న ఆర్థిక సంవత్సరంలో (2025–26) ఈ రేటును 4.4 శాతానికి తగ్గించుకోవాలని కూడా తాజా బడ్జెట్ నిర్దేశించుకుంది. లక్ష్యాలకు అనుగుణంగా నడుస్తూ, జీడీపీ– రుణ నిష్పత్తిని లక్ష్యాల మేరకు తగ్గించుకుంటామని కేంద్రం స్పష్టం చేస్తోంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇది బాండ్ మార్కెట్, ప్రభుత్వం చెల్లించాల్సిన రుణ వడ్డీరేట్లు స్థిరత్వానికి తద్వారా దేశ ఎకానమీ పురోగతికి దోహదపడే అంశమనడంలో సందేహాలే అక్కర్లేదు. ⇒ తొమ్మిదేళ్లలో రూ.93.26 లక్షల కోట్ల ⇒ నుంచి రూ.200.16 లక్షల కోట్లులోక్సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి ప్రకటన ప్రకారం ఫిబ్రవరి 10వ తేదీన 2018–19లో కేంద్ర ప్రభుత్వ రుణం 93.26 లక్షల కోట్లు. నిర్దిష్ట ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే ఇది 49.3 శాతమే. మహమ్మారి కోవిడ్ ప్రభావిత ఆర్థిక సంవత్సరం 2020–21లో రుణ భారం ఏకంగా 121.86 లక్షల కోట్లకు ఎగసింది. జీడీపీలో ఇది 61.4 శాతానికి చేరింది. కరోనా పరిస్థితుల్లో దేశ ఎకానమీ తీవ్రంగా దెబ్బతినడం దీనికి నేపథ్యం. అయితే అటు తర్వాత ఆర్థిక సంవత్సరాలు చూస్తే, (2021–22 నుంచి ఇటీవల బడ్జెట్ 2025–26) జీడీపీలో రుణ నిష్పత్తులు వరుసగా తీవ్ర స్థాయిల్లో (వరుసగా 58.8 శాతం, 57.9 శాతం, 58.1 శాతం, 7.1%, 56.1 శాతం)నే కొనసాగాయి తప్ప, తిరిగి 2018–19 నాటి స్థితికి (49.3 %) చేరుతుందన్న ఆశలు మాత్రం కల్పించలేదు.రూపాయిల్లో చూస్తే, గడచిన తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో రుణ పరిమాణం 93.26 లక్షల కోట్ల నుంచి రెట్టింపుకన్నా అధికంగా 200.16 లక్షల కోట్లకు చేరింది. అయితే తిరిగి వచ్చే ఆరేళ్లలో జీడీపీలో ఒక శాతం అటుఇటుగా 50 శాతానికి రుణ నిష్పత్తిని తీసుకువెళతామని తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం ఎకానమీ పరంగా కొంత ఊరటనిచ్చే అంశం.లక్ష్య సాధన తేలిక్కాదుబడ్జెట్లో నిర్దేశించుకున్నట్లు 2031 నాటికి జీడీపీలో రుణ నిష్పత్తిని నిజంగానే తిరిగి 50 శాతానికి చేర్చడం సాధ్యమేనా అన్నది ఇక్కడ బిలియన్ డాలర్ల ప్రశ్న. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలు భారత్ ఎకానమీకి ప్రస్తుతం తీవ్ర ప్రతికూలంగా ఉన్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్–హమాస్ సమస్యలతో తీవ్ర అనిశి్చతిలో ఉన్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ట్రంప్ తాజా పాలనా కాలంలో మరింత క్షీణించాయి.టారిఫ్‌ల యుద్ధం కూడా దాదాపు ప్రారంభమైంది. ఒకపక్క అమెరికా టారిఫ్‌ల యు ద్ధం, మరోపక్క చైనాకి విదేశీ ఫోర్ట్‌ఫోలియో పెట్టుబడులు తరలిపోవడం వంటి అంశాలు భారత్ ఎకానమీపై తీవ్ర ఇప్పుడు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి లక్ష కోట్ల ఎఫ్ఐఐ పెట్టుబడులు భారత్ నుంచి వెనక్కు మ ళ్లాయి. వీటిలో అధిక భాగం చైనా ఆకర్షించడం గమనార్హం. బలహీనమైన ప్రపంచ డిమాండ్. ఉ త్పాదక రంగంపై ఒత్తిళ్లు, డాలర్ మారకంలో రూ పాయి మారకపు విలువలో తీవ్ర అనిశి్చతి, భారత్ ఎకానమీకి తీవ్ర సవాళ్లను విసురుతున్నాయి.అ యితే పటిష్ట దేశీయ డిమాండ్, ప్రైవేటు వినియో గం, ద్రవ్యలోటు వంటి అంశాల్లో క్రమశిక్షణ, పటిష్ట విదేశీ మారకద్రవ్యాలు, సేవల రంగంలో మిగులు, చక్కటి రెమిటెన్సుల (ఎన్ఆర్ఐలు దేశానికి పంపే విదేశీ డబ్బు) వృద్ధి భారత్ ఎకానమీకి మూలస్తంభాలని, ఈ దన్నుతో ఎకానమీ పురోగతి సాధ్యమేనని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దేశ పౌరునిగా అంతా మంచే జరగాలని మనమూ కోరుకుందాం. రుణ భారం ఎక్కువైతే...⇒ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, విద్య వంటి ముఖ్యమైన రంగాలకు కేటాయింపుల కంటే వడ్డీ చెల్లింపులపై ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ⇒ భవిష్యత్ తరాలకు ప్రయోజనం చేకూర్చే పెట్టుబడుల నుండి ప్రభుత్వం దూరంగా జరిగి.. వడ్డీ వ్యయాలకు అధిక మొత్తాన్ని కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ⇒ తీసుకున్న రుణం ఎక్కడికి వెళుతోందన్న అంశమూ కీలకం. ఇది వృద్ధికి దోహదపడే దీర్ఘకాలిక ప్రాజెక్టుల వ్యయాల్లో భాగం కావాలి. అసమానత, పేదరికం, నిరుద్యోగం సమస్యల పరిష్కారానికి దోహదపడే వ్యయాలు ఎకానమీ పురోగతికి బాటలు వేస్తాయి. విదేశీ రుణ భారం.. ఊరట అయితే 2018–19 ఆర్థిక సంవత్సరం జీడీపీలో 2.5 శాతంగా ఉన్న భారత్ ప్రభుత్వ రుణ భారం (రూ.4.74 లక్షల కోట్లు), 2025–26కు సంబంధించి ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లోనూ 2.5 శాతంగా (రూ.8.92 లక్షల కోట్లు) యథాతథంగా కొనసాగడం కొంత ఊరటనిచ్చే అంశం. విదేశీ రుణ భారాలను స్థిరంగా ఉంచాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పాన్ని ఇది సూచిస్తోంది. రాష్ట్రాలనూ కలుపుకుంటే.. కలవరమే!భారతదేశ ఆర్థిక వ్యవస్థపై అప్పుల భారం ఇప్పటికే తీవ్రంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ అప్పుతో పాటు రాష్ట్రాల రుణ భారం కలుపుకొని చూస్తే, పరిస్థితి మరింత ఆందోళన కలిగించేలా మారుతోంది. దీనిని ‘జనరల్ గవర్నమెంట్ డెట్’ (జీజీడీ) అని వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది జీడీపీలో 80 శాతానికి పైగా స్థిరంగా కొనసాగుతుండటం ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ వర్గాలు 2030–31 నాటికి ఈ నిష్పత్తిని 70 శాతం లోపుకు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతున్నా, ఇది అంత తేలికైన విషయం కాదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు (వ్యయాలు – ఆదాయాల మధ్య వ్యత్యాసం) జీడీపీలో 5 శాతానికి దిగువన కొనసాగుతుందనే అంచనా ఉంది. అయితే రాష్ట్రాల అప్పును కలుపుకుంటే ఈ నిష్పత్తి 7 శాతం పైగా పెరిగే అవకాశం ఉంది, ఇది ఆర్థిక స్థిరత్వానికి హానికరమైన అంశం. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సహా పలు ఆర్థిక సంస్థలు భారత సాధారణ ప్రభుత్వ అప్పు జీడీపీకి 100 శాతానికి మించిపోవచ్చని ఇప్పటికే హెచ్చరించాయి.ఈ పరిణామాలు భారత సావరిన్ రేటింగ్‌లపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. మూడీస్, ఎస్అండ్పీ, ఫిచ్ వంటి అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు భారత్‌కు ఇస్తున్న సావరిన్ రేటింగ్.. ‘జంక్’ స్థాయి కన్నా కేవలం ఒక అంచె ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇది విదేశీ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపి, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటును దెబ్బతీస్తోంది. అమెరికాకు 123 శాతం ఉంటే.. భారత్‌కు 56 శాతం.. భయమెందుకు! జీడీపీలో అమెరికాసహా కొన్ని అగ్ర దేశాల రుణ నిష్పత్తులు 100 శాతం దాటిపోతే భారత్‌ది 56 శాతమేగా భయమెందుకు? అన్న సందేహాలు కొందరికి కలగవచ్చు. ఇక్కడ ఒక్కటే సమాధానం. కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి ఎంత డబ్బు అయినా అప్పు తీసుకోవచ్చు. అది ఆ వ్యక్తి తేలిగ్గా తీర్చేయగలడు.ధనికుడు అప్పు అడగడంతోనే ఇచ్చేవాడూ వెనకాముందూ చూడకుండా ఇచ్చేస్తాడు. మరి పేదవాడు అప్పుచేస్తే అది ఎంత ఎక్కువుంటే.. అతనికి అంత కష్టం. ఇదీ అంతే. అమెరికా, జపాన్ వంటివి అగ్ర దేశాలు. వాటి ఎకానమీలు స్వల్పకాలంలో ఆటుపోట్లకు గురైనా.. అవి అత్యంత శక్తివంతమైనవి. అయితే ఆయా దేశాల అప్పులనూ అంత తేలిగ్గా తీసిపారేయవద్దని, ఇది అవి మునగడంతోపాటు, ప్రపంచ దేశాలనూ ముంచే వ్యవహారమనీ.. విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ముందుచూపు అవసరం భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే రాజకీయ పార్టీలు పొదుపు విధానాలను అలవర్చుకోవడంతో పాటు, అప్పులను సమర్థంగా నిర్వహించాలి. వృద్ధిని పెంచే సంస్కరణలను ప్రోత్సహించడంతో పాటు, ప్రభుత్వ వ్యయాలను సద్వినియోగం అయ్యేల చూడ్డం అత్యవసరం. ఇకపై ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు దేశ ఆర్థిక భద్రతను నిర్దేశించనున్నాయి! -
ఔరా.. వైరా..
తడారిన భూములకు ఊపిరి పోస్తోంది. ఎండిన గొంతుల దాహార్తి తీరుస్తోంది. అన్నదాతలకు ఆసరాగా నిలుస్తోంది.. లక్షలాది బతుకులకు అన్నం పెడుతోంది. పర్యాటక కేంద్రంగా కూడా వరి్ధల్లుతున్న ఆ జలాశయం వయసు వందేళ్లు.. ఖమ్మం జిల్లాలో అతి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టుగా పేరొందిన వైరా జలాశయంపై కథనమిది. వైరా: రాష్ట్రంలోని మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఒకటైన వైరా జలాశయం.. సుమారు 25 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. కల్పతరువుగా నిలుస్తున్న ఈ జలాశయాన్ని స్వాతంత్య్రానికి ముందు నైజాం నవాబు నిర్మించారు. వృథా నీటిని అరికట్టేలా.. తొలినాళ్లలో ఇల్లెందు, కారేపల్లి, కామేపల్లి అటవీ ప్రాంతం నుంచి ప్రవహించే నిమ్మవాగు, ఏన్కూరు మండలం నుంచి ప్రవహించే గండివాగు, గిన్నెలవాగు, పెద్దవాగుల నుంచి వచ్చే మరో ఏరు.. వైరా సమీపాన కలిసి అతిపెద్ద ప్రవాహంగా తయారై వృ«థాగా పోయేది. ఈ పరిస్థితుల్లో ప్రవాహానికి అడ్డుకట్ట నిర్మించి వేలాది ఎకరాల బీడు భూములకు సాగునీరు అందించాలని.. నాటి పాలకుడైన నైజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ ఆలోచన చేశారు. దీంతో సాయిద్ జాదా నవాబ్ అలావత్జంగ్ బçహదూర్ 1923వ సంవత్సరంలో శంకుస్థాపన చేయగా అప్పటి నిజాం ప్రభుత్వ కార్యదర్శి నీటిపారుదల శాఖ ఇంజనీర్ అయిన నవాబ్ అలీ, నవాబ్ జంగ్ బçహదూర్ పర్యవేక్షణలో సుమారు రూ.36 లక్షలతో ఏడేళ్లలో నిర్మాణం పూర్తి చేశారు. డంగు సున్నం, రాయితో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించగా.. 274 చదరపు మైళ్ల భూమి ముంపునకు గురైంది. అలాగే, 130 చదరపు మైళ్ల భూమిని రైతుల నుంచి సేకరించి.. అప్పట్లోనే సుమారు రూ.3 లక్షలకు పైగా నష్టపరిహారం చెల్లించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 18.3 అడుగులుగా ఉన్నప్పుడు మొత్తం 60 వేల క్యూసెక్కుల నీరు నిల్వ ఉంటుంది. ప్రాజెక్టు ఆనకట్ట ఎత్తు 88 అడుగులు కాగా, పొడవు 5,800 అడుగులుగా ఉంది. ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు 19 మైళ్ల దూరం ప్రవహిస్తూ.. 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాయి. కుడి కాల్వ 15 మైళ్ల దూరం ప్రవహించి 29 ఉపకాల్వల ద్వారా 16 వేల ఎకరాలు, ఎడమ కాల్వ ఐదు మైళ్ల దూరం ప్రవహిస్తూ 22 ఉప కాల్వల ద్వారా తొమ్మిది వేల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చిoది. 1930లో కేవలం 12 వేల ఎకరాల భూములను సాగులోకి తెచ్చేలా డిజైన్ చేసినా ప్రస్తుతం రెండింతలుగా సాగవుతుండడం విశేషం. దాహార్తి తీరుస్తూ.. ఖమ్మం జిల్లాలోని వైరా, బోనకల్, మధిర, ఎర్రుపాలెం, కల్లూరు, వేంసూరు, కొణిజర్ల, చింతకాని, ఏన్కూరు, పెనుబల్లి తదితర 11 మండలాల్లోని 420 గ్రామాల ప్రజలకు ఈ ప్రాజెక్టు ద్వారానే తాగునీరు అందుతోంది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఈ రిజర్వాయర్ నుంచి ఫ్లోరైడ్ రహిత తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వైఎస్సార్ కృషితో మహర్దశ.. జలయజ్ఞంలో భాగంగా అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక కృషి వల్ల ఈ జలాశయం రూపురేఖలు మారాయి. తొలిసారిగా ఈ ప్రాజెక్టు ఆధునికీకరణకు అప్పట్లో రూ.51 కోట్లు మంజూరు చేయగా మహర్దశ పట్టింది. జలాశయం ఆధునికీకరణలో భాగంగా కుడి, ఎడమ కాల్వల్లో పూడిక తీత, సిమెంట్‌తో లైనింగ్ చేయించి కాల్వలు పటిష్టం చేశారు. దీంతో ఈ ప్రాంత రైతుల చిరకాల స్వప్నం ఫలించింది. పర్యాటకంగానూ అభివృద్ధి రిజర్వాయర్ కట్టపై పచ్చిక బయళ్లు.. అందమైన పూల తోటలు.. చుట్టూ నీరు.. కొండపై నుంచి చూస్తే రమణీయమైన ప్రకృతి దృశ్యాలు ఇక్కడ మైమరిపింపజేస్తాయి. ఈ సుందర దృశ్యాలను చూస్తూ.. అందమైన సాయంత్రాలు గడిపేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. సూర్యోదయం లేదా సాయంసంధ్య వేళల్లో ఇక్కడి దృశ్యాలను తిలకించేందుకు రెండు కళ్లు సరిపోవనే చెప్పాలి. ఈమేరకు పర్యాటక అభివృద్ధిలో భాగంగా పిల్లల పార్క్ నిర్మించి.. పూలతోటలు అభివృద్ధి చేయడమే కాక ప్రత్యేక టైటింగ్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం 2006లో పర్యాటక శాఖ రూ.70 లక్షలు వెచ్చిoచింది. ఇక్కడ పలు టీవీ సీరియళ్ల షూటింగ్ కూడా జరగడం విశేషం. మత్స్యకారులకు జీవనోపాధి వైరా రిజర్వాయర్‌పై కొణిజర్ల, వైరా, తల్లాడ మండలాలకు చెందిన సుమారు 500 మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయడానికి.. ముందు నుంచే మత్స్యకారులు చేపలు, రొయ్య పిల్లలు వేసి ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వేటతో జీవనం సాగిస్తుంటారు. -
బాల్యంపై బులీయింగ్ పడగ
‘ఐ వాంట్ టు డై’.. ఐదో తరగతి చదివే ఒక బాలిక తన రెండు నోట్‌బుక్స్‌లో రాసుకున్న వాక్యం ఇది. హైదరాబాద్‌లోని అల్వాల్ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఆ బాలిక బాగా పేరొందిన పాఠశాలలో చదువుతోంది. నోట్‌బుక్స్‌లో రామకోటి రాసినట్లుగా ‘ఐ వాంట్ టు డై’అంటూ రాసి పేజీలు నింపేసింది. వాటిని చూసి తల్లిదండ్రులుహడలిపోయి, మానసిక వైద్యులను సంప్రదించారు.కొంతకాలంగా ఆ బాలిక తీవ్ర కుంగుబాటుకు లోనైనట్లు వైద్యులు గుర్తించారు. తల్లిదండ్రులు సకాలంలో స్పందించకపోతే పాప ఆత్మహత్యకు పాల్పడి ఉండేదని తెలిపారు. ఆ బాలిక మాత్రమే కాదు.. చాలామంది స్కూల్ పిల్లలు తరగతి గదిలో తోటి విద్యార్థుల వేధింపుల కారణంగా కుంగుబాటుకు గురవుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కొంతమంది విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి ఒకరిద్దరు పిల్లలను టార్గెట్ చేసి అనేక రకాలుగా వేధిస్తున్నారు. వారిలోని శారీరక లోపాలను ఎత్తిచూపుతూ ఏడిపిస్తారు. మానసిక వైద్య పరిభాషలో ‘బులీయింగ్’గా పిలిచే ఈ విష సంస్కృతి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కాలేజీల్లో ర్యాగింగ్ తరహాలో స్కూళ్లలో బులీయింగ్ భూతంపిల్లలను వెంటాడుతోందని నిపుణులు చెబుతున్నారు. యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ విష సంస్కృతి 1.3 శాతం ఉంటే, హైదరాబాద్ తదితర మెట్రో నగరాల్లో 35 నుంచి 37 శాతం వరకు ఉన్నట్లు చెబుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ఏమిటీ బులీయింగ్?ఐ వాంట్ టు డై అని రాసిన బాలిక తోటి విద్యార్థుల కంటే కాస్త లావుగా ఉంటుంది. దాంతో తరగతి గదిలో సహ విద్యార్థులు మొదట్లో ఆటపట్టించేవారు. క్రమంగా అంతా ఒక్కటై ఆమెను ఏకాకిని చేసి ఏడిపించడం మొదలుపెట్టారు. ఈ బులీయింగ్ అంతటితో ఆగలేదు. బాలిక చుట్టూ చేరి జడలు పట్టుకొని లాగుతూ ‘పిగ్టేల్’అంటూ ఏడిపించేవారు. ఈ వేధింపులపై క్లాస్ టీచర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పైగా ఆ బాలికనే తిట్టింది. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ ఫిర్యాదును పట్టించుకోలేదు.దీంతో ఆ బాలిక డిప్రెషన్లోకి వెళ్లింది. పైకి చూడ్డానికి ఇది సాధారణంగా ఏడిపించడం (బులీయింగ్)గానే కనిపిస్తుంది. కానీ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని స్కూళ్లలో కొందరు టీచర్లే బులీయింగ్‌కు ఆజ్యం పోస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పిల్లల రంగు, రూపు, ఆకృతి, నడక వంటి శారీరక అంశాలను లక్ష్యంగా చేసుకొని ‘బాడీషెమింగ్’కు పాల్పడుతున్నారు. ఏడేళ్ల చిన్నారుల నుంచి 18 ఏళ్ల టీన్స్ వరకు బులీయింగ్ బారిన పడుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.ఆధిపత్య పెంపకంతరగతిలో ఉన్న పిల్లలంతా ఒకేవిధమైన బులీయింగ్ స్వభావాన్ని కలిగి ఉండరు. వారిలో ఒక్కరో, ఇద్దరో కలిసి మిగతా వాళ్లందరినీ ఒక గ్రూపుగా సంఘటితం చేస్తారు. టార్గెట్ చేసిన బాలిక లేదా బాలుడిని ఏకాకిని చేస్తారు. మిగతా పిల్లలు తమ ప్రమేయం లేకుండానే ఆ జట్టులో చేరి ఏడిపిస్తుంటారు. తరగతిలో తాము ఏం చేసినా చెల్లుబాటవుతుందనే ఆ ఒకరిద్దరు పిల్లల ప్రవర్తన మిగతా పిల్లలను ప్రభావితం చేస్తుంది.తోటివారికంటే తామే గొప్పవాళ్లమనే భావన పిల్లల్లో కలగడానికి వారి తల్లిదండ్రుల ఆధిపత్య పెంపకమే (అథారిటేరియన్ పేరెంటింగ్) కారణమని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విష సంస్కృతి గురించి ఉపాధ్యాయులు, స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోవడం లేదు. బులీయింగ్ను అరికట్టాల్సిన టీచర్లే బాధితులను మరింత ఏకాకులను చేస్తున్నారు.స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఆ రోజు ఎలా గడిచిందనే విషయాన్ని తల్లిదండ్రులు కచి్చతంగా ఆరా తీయాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా బులీయింగ్‌కు గురయ్యే పిల్లలు సరిగ్గా తినకపోవడం, మాట్లాడకుండా ఉండిపోవడం, ఇంట్లోనూ ఒంటరిగా గడపడం వంటి లక్షణాలతో బాధపడుతారు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. కలిసికట్టుగా ఎదుర్కోవాలి పిల్లల పెంపకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహపూర్వకంగా ఉండాలి. కానీ కొందరు అందుకు భిన్నంగా డామినేటింగ్ కల్చర్‌లో పిల్లలను పెంచుతారు. దీంతో సహజంగానే ఆ పిల్లలకు అదే సంస్కృతి అలవడుతుంది. తాము అలా ఏడిపించడం వల్ల తోటి విద్యార్థి మనస్సును గాయపరుస్తున్నామనే భావన ఆ పిల్లల్లో ఏ మాత్రం కనిపించదు. ఒక సర్వే ప్రకారం తరగతి గదిలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఏదో ఒక విధమైన బులీయింగ్‌కు గురవుతున్నారు. తల్లిదండ్రులు, టీచర్లు, స్కూల్ యాజమాన్యం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమస్య ఇది. బులీయింగ్ లక్షణాలు ఏ రూపంలో కనిపించినా అరికట్టాలి. లేకపోతే పిల్లల భావి జీవితాన్ని ఇది కబళిస్తుంది. – డాక్టర్ సంహిత, మానసిక వైద్యనిపుణులు, సికింద్రాబాద్. -
అమృత కవచం!
(సాక్షి స్పెషల్ డెస్క్): రక్షణశాఖలో ఆహార శాస్త్రవేత్తగా 34 ఏళ్లు పనిచేసి రిటైరైన డాక్టర్ ఎ.రామకృష్ణ ఉద్యాన పంటలు సాగుచేసే రైతులు, వ్యాపారులతోపాటు వినియోగదారులకు మేలు కలిగించే అద్భుత ఆవిష్కరణను వెలువరించారు. భారతీయ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)కు అనుబంధంగా కర్ణాటకలోని మైసూర్లో ఉన్న రక్షణ ఆహార పరిశోధన ప్రయోగశాల (డీఎఫ్ఆర్ఎల్)లోని ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ ప్యాకేజింగ్ విభాగంలో ఆయన సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేసి రిటైర్ అయ్యారు. మూడేళ్లుగా సొంతంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో పండ్లు, కూరగాయలు, పూలు ఎక్కువకాలం దెబ్బతినకుండా ఉండేలా, పూర్తిగా ప్రజలకు ఉపయోగపడేందుకు దోహదపడేలా వినూత్న ప్యాకేజింగ్‌తో ‘కృషి కవచ్’కవర్లను అభివృద్ధి చేశారు.పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో..పోలియాక్టిక్ యాసిడ్, చెరుకు పిప్పి వంటి స్థానికంగా చవకగా లభించే సేంద్రియ పదార్థాలను ఉపయోగించి కృషి కవచ్ కవర్లను రూపొందించినట్టు రామకృష్ణ వెల్లడించారు. ‘‘కూరగాయలు, పండ్లు, పూలను కృషి కవచ్ కవర్లలో ఉంచితే చాలు. రిఫ్రిజిరేషన్ అవసరం లేదు. సాధారణ గది వాతావరణంలో ఉంచినా.. నెల రోజుల వరకు బాగుంటాయి.వడలిపోవు. కుళ్లిపోవు. అర కిలో నుంచి వంద కిలోల వరకు అవసరం మేరకు కృషి కవర్లను తయారు చేసుకోవచ్చు. రైతులు తమ ఉత్పత్తులను కోసిన రోజే ఏదో ఒక ధరకు అమ్ముకోకుండా నిల్వ చేసుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. రైతుల ఆదాయం పెరుగుతుంది. టోకు, చిల్లర వ్యాపారులతోపాటు విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారులకు కూడా కృషి కవచ్ కవర్లు ఉపయోగపడతాయి’’అని తెలిపారు. దీనిపై త్వరలో పేటెంట్ కోసం దరఖాస్తు చేస్తున్నట్టు చెప్పారు.ఐఐహెచ్‌ఆర్‌తో త్వరలో ఒప్పందం.. ఐఐహెచ్ఆర్, యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్‌లోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్రంలో ‘కృషి కవచ్’టెక్నాలజీని పరీక్షించి చూశారని రామకృష్ణ తెలిపారు. ఈ టెక్నాలజీని ప్రజలకు అందించే క్రమంలో ఐఐహెచ్‌ఆర్‌తో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ టెక్నాలజీని ఐఐహెచ్ఆర్ అందిస్తుందని వెల్లడించారు.ఇది అనవసరపు నష్టం.. రైతులు ఆరుగాలం కష్టించి పండిస్తున్న పండ్లు, కూరగాయలను తోటలో కోసినప్పటి నుంచి మన నోటికి చేరేసరికే సగటున 25–30% వరకు పాడైపోతున్నాయి. సరైన రవాణా, నిల్వ సదుపాయాలు లేకపోవడమే దీనికి కారణం. దీనివల్ల అనవసరంగా జరుగుతున్న నష్టం ఏటా రూ.1,52,790 కోట్లు అని అంచనా.ఇది అమృతం లాంటి పరిష్కారం.. కూరగాయలు, పండ్లు, పూలను సాధారణ వాతావరణంలోనే 30 రోజులపాటు చెక్కు చెదరకుండా నిల్వ ఉంచే అద్భుత ఆవిష్కరణ అందుబాటులోకి వచ్చింది. మైసూరుకు చెందిన ఓ విశ్రాంత శాస్త్రవేత్త ఈమేరకు ప్రత్యేకమైన కవర్లను రూపొందించారు. పర్యావరణహిత పదార్థాలతో ఈ ‘మోడిఫైడ్ ఎటా్మస్ఫియర్ ప్యాకేజింగ్ (మాప్)’ కవర్ల తయారీ సాంకేతికతను ఆవిష్కరించటం విశేషం. బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ (ఐఐహెచ్ఆర్) ద్వారా ఈ సాంకేతికత త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.వృథా అవుతున్న పండ్లు, కూరగాయలు: 25 30%ఈ నష్టం విలువ సుమారు: రూ.1,52,790 కోట్లు⇒ మన దేశంలో ఏటా 1,132 లక్షల టన్నుల పండ్లు, 2,146 లక్షల టన్నుల కూరగాయలు, 36 లక్షల టన్నుల పూలు ఉత్పత్తి అవుతున్నాయి. ⇒ కూరగాయల్లో.. బంగాళదుంపలు 30–40%, టమాటాలు 5–47%, ఉల్లిపాయలు 25–40%, వెల్లుల్లి 8–22%, క్యాబేజీ, కాలీఫ్లవర్ 7–25%, మిరపకాయలు 4–35%, క్యారట్ 5–9% శీతల సదుపాయాల్లేక పాడైపోతున్నాయి. ⇒ పండ్లలో.. ద్రాక్ష 27%, అరటి 20–28%, బత్తాయి, నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు 20–95%, యాపిల్స్ 14%, అవకాడోలు 43% దెబ్బతింటున్నాయి.‘కృషి కవచ్’ పనిచేసేదిలా.. ‘‘సాధారణంగా పండ్లు, కూరగాయలను చెట్ల నుంచి కోసిన తర్వాత ఆక్సిడేటివ్ మెటబాలిజం ద్వారా వాటిలో మార్పులు జరుగుతాయి. సేంద్రియ పదార్థాలు విచ్చిన్నమవుతూ ఉంటాయి. శీతల ప్రదేశంలో ఉంచకపోతే ఈ ప్రక్రియ వేగంగా సాగి.. అవి వడలి, కుళ్లి పాడైపోతాయి. ‘కృషి కవచ్’కవర్లలోకి ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, ఇౖథెలిన్ వంటి వాయువులు కొంతమేర ఇటూ ఇటూ పారాడేందుకు వీలుంటుంది. ఇందులో నీటి ఆవిరి ఏర్పడదు.దీనితో ఆహార ఉత్పత్తులు సెకండరీ ప్యాకేజింగ్ అవసరం లేకుండానే 30 రోజుల వరకు తాజాగా ఉంటాయి. సూక్ష్మజీవులు, ఫంగస్‌లు కూడా ఆశించవు. ఈ కవర్లను తిరిగి వాడొచ్చు, కంపోస్టు చేయవచ్చు. 25–30శాతంగా ఉన్న ఉద్యాన ఉత్పత్తుల వృథాను అరికట్టడం ద్వారా గణనీయమైన ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రయోజనాలు చేకూరుతాయి.కృషి కవచ్ కవర్ల ద్వారా ఆహార వృథాను అరికట్టడంతోపాటు వ్యాల్యూ యాడెడ్ చర్యల ద్వారా దేశ జీడీపీని 3శాతం మేరకు పెంచుకోవచ్చు. – డాక్టర్ ఎ.రామకృష్ణ, విశ్రాంత శాస్త్రవేత్త, ‘కృషి కవచ్’ ఆవిష్కర్త, మైసూరు -
ఆ గంటే.. కీలకమంట
శ్రీకాకుళం క్రైమ్ : గోల్డెన్ అవర్.. ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలు సంభవించేటప్పుడు మాత్రమే ఈ పదం వినుంటారు. ప్రమాదాలు సంభవించిన గంటలోపే క్షతగాత్రులను ఆస్పత్రికి చేర్చడం దీని ఉద్దేశం. ఇదే తరహాలో సైబర్ మోసాలకు గురయ్యే బాధితులు సైతం నేరం జరిగిన గంటలోగా ఫిర్యా దు చేయగలిగితే.. మన ఖాతాలో పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రాబట్టుకునే వీలుంటుంది. బాధితులు చేయాల్సిందల్లా గోల్డెన్ అవర్‌లో సైబర్‌సెల్‌కు ఫిర్యాదు చేయడమే. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇచ్చిన నివేదిక ప్రకారం జిల్లాలో ఇప్పటివరకు ఐదువేలలోపు సైబర్ నేరాలకు సంబంధించి ఫిర్యాదులు వెళ్లాయి. తాము మోసానికి గురవుతున్న నిమిషాల్లోనే ఎన్సీఆర్బీకి, 1930 సైబర్ సెల్ నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు ఇవ్వడం వలన సుమారు రూ. 4.09 కోట్ల వరకు సేవ్ అయినట్లు ఈ నివేదికలు చెబుతున్నాయి. జిల్లాలో తొలిసారిగా ఐదు సైబర్ కేసులకు సంబంధించి రూ. 10.13 లక్షలు బాధితులకు అందించిన ట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఇటీవల వెల్లడించారు. ఫిర్యాదు చేయాలిలా.. » మనం మోసపోయిన క్షణానే1930 నంబర్‌కు కాల్ చేయాలి. » లేదంటే https://cybercrime.gov.in/ అనే పోర్టల్‌ను క్లిక్ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లి ఫైల్ ఎ కంప్లైంట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని నియమాలు షరతులు చూపిస్తుంది. వాటిని చదివి యాక్సెప్ట్ చేసి రిపోర్ట్ అదర్ సైబర్ క్రైమ్ బటన్‌పై క్లిక్ చేయాలి. » తర్వాత సిటిజన్ లాగిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పేరు, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ వివరాలు ఎంటర్ చేస్తే రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. » ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్‌ను బాక్స్‌లో ఫిల్ చేసి సబి్మట్ బటన్ నొక్కాలి. తర్వాత పేజీలోకి తీసుకెళ్తుంది. అసలు ప్రక్రియ మొదలయ్యేది ఇక్కడే. » ఈ పేజీలో ఒక ఫారం కనిపిస్తుంది.. దానిలో మనకు జరిగిన సైబర్ మోసం గురించి రాయాలి. కాకపోతే నాలుగు సెక్షన్లుగా విభజించి ఉంటుంది. సాధారణ సమాచారం (విక్టిమ్ ఇన్ఫర్మేషన్), సైబర్ నేరానికి సంబంధించి సమాచారం (సైబర్ క్రైమ్ ఇన్ఫర్మేషన్), ప్రివ్యూ అనే సెక్షన్లు ఉంటాయి. » ప్రతి సెక్షన్లో అడిగిన వివరాలను సమర్పిస్తూ.. ప్రక్రియను పూర్తిచేయాలి. మూడు సెక్షన్లు పూర్తయ్యాక ప్రివ్యూను వెరిఫై చేయాలి. అన్ని వివ రాలు సరిగా ఉన్నాయమని భావిస్తే సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత ఘటన ఎలా జరిగిందనేది వివరాలు నమోదుచేయాలి. నేరానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు (అకౌంట్ ట్రాన్సాక్షన్ తదితర) ఫైల్స్ వంటి ఆధారాలు, సాక్ష్యాలు అందులో పొందుపర్చాలి. వివరాలు సేవ్ చేసి నేరగాళ్ల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే ఫిల్ చేయాలి. » అంతా వెరిఫై చేసుకున్నాక సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. కంప్లైంట్ ఐడీతో పాటు ఇతర వివరాలతో కూడిన ఈ–మెయిల్ వస్తుంది. తర్వాత అధికారులు దర్యాప్తు ప్రారంభిస్తారు. » ఫిర్యాదు చేయడం ఆలస్యమైతే దుండగుడు డబ్బును వేర్వేరు ఖాతాల్లో మళ్లించేస్తాడు. లేదంటే క్రిప్టో కరెన్సీగా మార్చుకునే ప్రమాదముంది. క్షణాల్లో ఫిర్యాదు చేయండి.. సైబర్ మోసానికి గురయ్యేవారు వెంటనే గుర్తించాలి. క్షణాల్లో ఫిర్యాదు చేస్తే మన డబ్బులు వెనక్కి వచ్చే అవకాశాలెక్కువ. లేదంటే ఎక్కడ ఉంటారో.. వారి ఖాతాలు ఏ రాష్ట్రానికి చెందినవి.. ఇవన్నీ కనుక్కోవడం పెద్ద ప్రాసెస్. 1930కు గానీ, ఎన్సీఆర్బీకి గానీ ఫిర్యాదు చే సి బ్యాంకు వాళ్లను, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలి. – కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ -
అందని దారం.. వ్రస్తోత్పత్తి ఆగం
సిరిసిల్ల: సిరిసిల్ల వ్రస్తోత్పత్తిదారులు, చేనేత, జౌళిశాఖ అధికారుల మధ్య సమన్వయం లోపం.. వ్రస్తోత్పత్తికి శాపంగా మారింది. ప్రభుత్వం ఇచ్చే వ్రస్తోత్పత్తి ఆర్డర్లకు నూలు (దారం) సరఫరా చేస్తామని ముందుగా అధికారులు ప్రకటించి వేములవాడలో నూలు డిపో ఏర్పాటు చేశారు. కానీ, సిరిసిల్లలో వ్రస్తోత్పత్తికి అవసరమైన నూలును సకాలంలో అందించడంలో విఫలమయ్యారు. ఫలితంగా ఈనెల 15 నాటికి అందించాల్సిన ఆర్వీఎం(రాజీవ్ విద్యా మిషన్), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు సంబంధించిన స్కూల్ యూనిఫామ్స్ వ్రస్తాల ఉత్పత్తిలో జాప్యం జరుగుతోంది. సిరిసిల్లలోని పాతికవేల మరమగ్గాల (పవర్‌లూమ్స్)పై షూటింగ్, షర్టింగ్, ఓనీ వ్రస్తాలు ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. దానికి అవసరమైన నూలు అందించలేదు. దీంతో గడువులోగా వ్రస్తాల తయారీ కష్టంగా మారింది. ప్రభుత్వ లక్ష్యానికి గండి స్కూళ్లు తెరిచే నాటికి (జూన్ మొదటి వారంలో) అన్ని ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల్లోని పిల్లలకు రెండు జతల యూనిఫామ్స్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు డిసెంబర్లో సిరిసిల్ల నేతన్నలకు కోటి ఐదు లక్షల మీటర్ల వ్రస్తాల ఆర్డర్లు ఇచ్చారు. ఈ బట్ట ఉత్పత్తికి అవసరమైన నూలును డిపో ద్వారా అందించేందుకు టెండర్లు పిలిచారు. ఈ మొత్తం ప్రాసెస్ పూర్తయి.. సిరిసిల్లలోని నేతన్నలకు వేములవాడలోని నూలు డిపో ద్వారా నూలు సరఫరా అయ్యే సరికి ఫిబ్రవరి అయింది. వచ్చిన నూలుకు ఆసాములు పది శాతం మేరకు డీడీలు చెల్లించి, నూలు తీసుకుని వచ్చి భీములుగా పోసి సాంచాలపైకి ఎక్కించారు. ప్రస్తుతం పది లక్షల మీటర్ల వస్త్రాలు సిద్ధంగా ఉండగా.. భీములపై మరో పది లక్షల మీటర్ల వస్త్రం రెడీ అవుతోంది. మొత్తంగా 20 లక్షల మీటర్లు మరో వారంలోగా సిద్ధమైనా.. ఈ నెలాఖరులోగా 50 శాతం వ్రస్తోత్పత్తి లక్ష్యం అసాధ్యమే. ఈ లెక్కన వ్రస్తాల సేకరణ పూర్తయి, యూనిఫామ్స్ కుట్టి, బడి తెరిచే నాటికి రెండు జతల డ్రెస్సులు అందించాలనే లక్ష్యం సాధించడం కష్టంగానే ఉంది.సమస్య ఏంటంటే..!ప్రభుత్వం టెస్కో ద్వారా సిరిసిల్లలోని మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీ (మ్యాక్స్)లకు వ్రస్తోత్పత్తి ఆర్డర్లు ఇవ్వడం, ఇక్కడ మాస్టర్ వీవర్స్ (యజమానులు) నూలును కొనుగోలు చేసి ఆసాముల (పవర్‌లూమ్స్ యజమానులు)కు ఇవ్వడం, వారు సాంచాలు నడుపుతూ, కార్మికులతో పని చేయిస్తూ.. బట్ట నేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ, ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన నూలు డిపో ద్వారా నాణ్యమైన నూలు సరఫరా చేస్తామని ప్రకటించిన అధికారులు సకాలంలో అందించలేదు. ఇప్పుడు ప్రైవేటుగా కొనుగోలు చేసి స్కూల్ యూనిఫామ్స్ బట్టను నేయాలని యజమానులను జౌళిశాఖ అధికారులు కోరుతున్నారు. ఆలస్యంగా నూలు ఆర్డర్లు ఇవ్వడంతో వ్రస్తోత్పత్తికి విఘాతం కలుగుతోంది. ఇటీవల చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ సిరిసిల్ల కలెక్టరేట్లో వ్రస్తోత్పత్తిదారులతో సమావేశం నిర్వహించి ఈనెల 15లోగా 50 శాతం బట్ట ఇవ్వాలని కోరారు. కానీ ఆ మేరకు సిరిసిల్లలో వ్రస్తాల నిల్వలు లేవు.మహిళాశక్తి చీరల ఊసేది?సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 8న ఇందిరా మహిళా శక్తి పేరిట స్వశక్తి సంఘాల్లోని మహిళలకు ఏటా రెండు చీరలు ఇస్తామని సీఎం ప్రకటించారు. మొదటి విడతగా 2.12 కోట్ల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. దీని విలువ రూ.71.75 కోట్లు ఉంటుంది. కానీ, దానికి సంబంధించిన నూలును ఇప్పటి వరకు సరఫరా చేయలేదు. రెండో విడతగా మరో 2.12 కోట్ల మీటర్ల వ్రస్తోత్పత్తి ఆర్డర్లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నా.. మొదటి విడతకే మోక్షం లేక వ్రస్తోత్పత్తిదారులు రెండో విడత ఆర్డర్లు తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు నూలు డిపోలో వార్పు (భీముల నిలువు పోగుల), వెప్ట్ (అడ్డం కోముల పోగుల) నూలు అందుబాటులో ఉండటం లేదు. వార్పు, వెప్ట్ రెండు ఉంటేనే బట్టను మగ్గంపై నేసే అవకాశం ఉంది. ఒకటి ఉండి ఒకటి లేక వస్త్రోత్పత్తికి ప్రతిబంధకంగా మారింది. స్కూల్ యూనిఫామ్స్ వస్త్రాల తయారీ సాగుతుండగా, ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి మరింత ఆలస్యం కానుంది.ఆలస్యమైనా లక్ష్యం సాధిస్తాంకొంత ఆలస్యమైనా వ్రస్తోత్పత్తిలో లక్ష్యం సాధిస్తాం. ఈ మేరకు సిరిసిల్లలోని వ్రస్తోత్పత్తిదారులను ప్రోత్సహిస్తున్నాం. కొత్తగా నూలు డిపో ఏర్పాటు చేసి నూలు సరఫరా చేస్తున్నాం. ప్రైవేటుగా కూడా నూలు కొనుగోలు చేసుకోవచ్చని చెప్పాం. డిపో ద్వారా అందరికీ నూలు ఇవ్వడం సాధ్యం కాదు. ప్రభుత్వ వ్రస్తోత్పత్తి లక్ష్యాన్ని సాధించేలా చర్యలు తీసుకుంటాం. – వులిశె అశోక్‌రావు, టెస్కో జీఎం, హైదరాబాద్ -
కౌన్సెలింగ్.. గైడెన్సే కీలకం
సాక్షి, ఎడ్యుకేషన్: ప్రస్తుత విద్యా వ్యవస్థ కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి సమస్యను పరిష్కరించాలంటే... వారికి పాఠశాల స్థాయిలోనే కెరీర్ గైడెన్స్, వారి నైపుణ్యాలపై కౌన్సెలింగ్ ఇవ్వడం వంటి చర్యలు తీసుకోవాలని ఐసీ3 (ఇంటర్నేషనల్ కాలేజ్ అండ్ కెరీర్ కౌన్సెలింగ్) మూవ్మెంట్ వ్యవస్థాపకులు, ప్రముఖ కెరీర్ కౌన్సిలర్, టెడెక్స్ స్పీకర్ గణేశ్ కోహ్లి చెప్పారు. పోటీ వాతావరణం, పరీక్షల్లో మార్కులనే ప్రతిభకు కొలమానంగా భావించడం, ఇతరులతో పోల్చుకోవడం వంటి పలు కారణాలతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారన్నారు.దీంతో వారి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని, ఈ కారణంగానే ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలకు పాఠశాల స్థాయి నుంచే పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. ‘కౌన్సెలింగ్ ఇన్ ఎవ్రీ స్కూల్’అనే ఉద్దేశంతో ఐసీ3 మూవ్‌మెంట్‌కు రూపకల్పన చేసి, దాదాపు 90 దేశాల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్, కెరీర్ గైడెన్స్ నిర్వహిస్తున్న గణేశ్ కోహ్లి.. విద్యార్థుల మానసిక ఒత్తిడి అందుకు కారణాలు, పరిష్కార మార్గాలపై పలు సూచనలు ఇచ్చారు.మానసిక ఒత్తిడికి ఎన్నో కారణాలువిద్యార్థుల్లో నెలకొంటున్న మానసిక ఒత్తిడి సమస్యలు చివరికి వారు ఆత్మహత్యలకు పాల్పడే స్థాయికి చేరుకుంటున్నాయి. 2012లో 6,654గా ఉన్న విద్యార్థుల ఆత్మహత్యలు, 2022 నాటికి 13,044కు చేరాయి. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కావడానికి అకడమిక్స్‌తో పాటు మరెన్నో అంశాలు కారకాలుగా నిలుస్తున్నాయి. ఆర్థిక అస్థిరత, వ్యక్తిగత ఆహార్యం, సహచరులు– బంధువుల ఒత్తిడి, వైఫల్యం అంటే విపరీతమైన భయం వంటివి వీటిలో ముఖ్యమైనవిగా చెప్పొచ్చు.సంపూర్ణ వికాసం కల్పించడం కంటే అత్యున్నత గ్రేడ్లకే విలువనిచ్చే విద్యావ్యవస్థ ఇందుకు మరో ముఖ్యమైన కారణం. మరోవైపు చిన్నతనం నుంచే పిల్లలను వారి సహచరులతో పోల్చడం వల్ల తమ సామర్థ్యంపై అపనమ్మకం ఏర్పడి దీర్ఘకాలిక ఒత్తిడికి గురవుతున్నారు. దీన్ని గుర్తించకపోవడం వల్ల ఎన్నో ప్రతికూల పరిణామాలు చూడాల్సి వస్తోంది.విదేశాల్లో ఇప్పటికే నివారణ చర్యలుఇతర దేశాల్లోనూ విద్యార్థుల మానసిక ఆరోగ్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే పలు దేశాలు ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఫిన్లాండ్, కెనడా, నెదర్లాండ్స్ తదితర పాశ్చాత్య దేశాల్లో పరీక్షల్లో మార్కుల కంటే సామర్థ్య ఆధారిత అభ్యసనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కౌన్సెలింగ్, మెంటార్íÙప్, ప్రయోగాలతో కూడిన అభ్యసనం వంటి మార్గాల ద్వారా కెరీర్‌పై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.కానీ మన దేశంలో అకడమిక్‌గా పొందిన ఘనతనే విజయంగా గుర్తిస్తున్నారు. సక్సెస్ అంటే మార్కులే అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, మానసిక సమస్యల విషయంలో కౌన్సెలింగ్ కార్యక్రమాలు ఎంతో సత్ఫలితాలనిస్తాయి. పలు దేశాల్లో ఇది నిరూపితమైంది. మన దేశంలోనూ కౌన్సెలింగ్ సమ్మిళిత సాధనాలను అందుబాటులోకి తెస్తే మానసిక దృఢత్వాన్ని సొంతం చేసుకుని సవాళ్లను స్వీకరించే స్థాయికి విద్యార్థులు ఎదుగుతారు. సవాళ్లను ఎదుర్కొనేలా సంసిద్ధుల్ని చేయాలి నేటి విద్యా వ్యవస్థను పరిశీలిస్తే పాఠశాలలు విద్యార్థులకు కేవలం అకడమిక్ అభ్యసన కేంద్రాలుగానే ఉంటున్నాయి. వాటిని విద్యార్థుల భావోద్వేగాలను, సామాజిక, మానసిక సమస్యలను తీర్చే ప్రాంగణాలుగా రూపొందించాల్సిన ఆవశ్యకత నెలకొంది. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు తరగతి గదిలో, బాహ్య ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా సంసిద్ధులను చేసేందుకు చర్యలు తీసుకోవాలి.పిల్లల మాట తల్లిదండ్రులు వినాలి విద్యార్థుల మానసిక ఒత్తిడి విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలు తమ సమస్యలను, ఆలోచనలను తమతో పంచుకునే వాతావరణాన్ని కల్పించాలి. దీనికి భిన్నంగా పిల్లల మాటలను తీసిపారేసేలా ప్రవర్తిస్తే వారు మరింత న్యూనతకు గురవుతారు. సక్సెస్ అంటే ఒక ప్రతిష్టాత్మక కాలేజీలో చేరడం మాత్రమే కాదని పిల్లల బలాలు, ఆకాంక్షలను నెరవేర్చుకునేలా వ్యవహరించడం అని గుర్తించాలి.పరీక్ష విధానంపై పునరాలోచన చేయాలి దేశంలోని పరీక్షల విధానంపైనా పునరాలోచన చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది. కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్‌నే పరీక్షించే విధంగా ఉండడంతో విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. దీంతో విద్యార్థులు కూడా ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన భావనలను, నిజ జీవిత పరిస్థితుల్లో వాటిని అన్వయించే నైపుణ్యాలను పొందడంపై దృష్టి పెట్టకుండా..మార్కుల కోసం బట్టీ పట్టి చదువుతున్నారు. పర్యవసానంగా వాస్తవ పరిస్థితుల్లో ఆయా పాఠ్యాంశాల ప్రాధాన్యత ఏంటో తెలియట్లేదు. సామర్థ్య ఆధారిత మూల్యాంకనం దిశగా అడుగులు వేయాలని జాతీయ విద్యా విధానం సూచించిన సంగతి తెలిసిందే.పాఠశాలల పాత్ర కీలకంప్రస్తుత పరిస్థితుల్లో మార్పు తేవాలంటే పాఠశాలలు ముందు నిలవాలి. మానసిక పరిపక్వత, భావోద్వేగ స్థిరత్వం వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వాలి. అదే విధంగా విద్యార్థులు ఆత్మవిశాసం పెపొందించుకోవడానికి కెరీర్ కౌన్సెలింగ్ తోడ్పడుతుంది. నిర్దిష్టమైన కెరీర్ గైడెన్స్ పొందిన విద్యార్థులు వారి భవిష్యత్తు గురించి ఎంతో ఆత్మ విశ్వాసంతో ఉంటారని.. ఆనిశి్చతి, ఆందోళనలను తగ్గించుకుంటారని పలు పరిశోధనల్లో తేలింది.ఏం చేయాలి..⇒ పిల్లల్లోని ఒత్తిడి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించేలా టీచర్లకు శిక్షణనివ్వాలి. ⇒ విద్యార్థులు భావోద్వేగాలను నియత్రించుకోవడం, స్వీయ అవగాహన పెంపొందించుకోవడంపై బోధించాలి. ⇒ మాధ్యమిక పాఠశాల స్థాయి నుంచే కెరీర్ కౌన్సెలింగ్‌ను కరిక్యులంలో భాగం చేయాలి. ⇒ విద్యార్థులు సహచరులతో మానసిక సమస్యల గురించి చర్చించుకునే పరిస్థితిని, ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొనే వాతావరణాన్ని కల్పించాలి. -
అలా.. ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత మారుమూల ప్రాంతమైన సిర్గాపూర్ మండలంలోని ఉజ్జంపాడ్ గ్రామం మాది. ప్రభుత్వ ఉద్యోగాల పట్ల మా ప్రాంతంలో అవగాహన అంతంతే. నీళ్లు, నిధులు, నియామకాల అంశంపై సాగిన తెలంగాణ (Telangana) ఉద్యమంతో మాకు ప్రభుత్వ ఉద్యోగాలపై కొంత అవగాహన వచ్చింది.. కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు (Govt Jobs) సాధించొచ్చనే నమ్మకంతో ప్రిపరేషన్ మొదలుపెట్టి ఆరు ఉద్యోగాలు సాధించాను. పక్కా ప్రణాళికతో చదివితే ఉన్నత ఉద్యోగాలను సాధించొచ్చు’ అని అంటున్నారు ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో మూడో ర్యాంక్ (Third Rank) సాధించిన బీర్‌దార్ మనోహర్‌రావు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...కుటుంబ నేపథ్యం.. విద్యాభ్యాసం మాది వ్యవసాయ కుటుంబం. నాన్న పండరినాథ్ కీర్తనకారుడు. పండరిపూర్ విఠలేశ్వరుని కీర్తనలు, ప్రవచనాలు బోధిస్తారు. మా ఉజ్జంపహాడ్ గ్రామం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉటుంది. నా భార్య మనీష గృహిణి. కూతురు మనస్విని 3వ తరగతి, కొడుకు మహేశ్వర్ ఒకటో తరగతి చదువుతున్నారు. కుటుంబమంతా ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్నారు. నేను నిత్యం హనుమాన్‌చాలీసా చదువుతాను. ప్రస్తుతం మెదక్ జిల్లా కుల్చారం మండలం అంసాన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. ఎకనామిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ పూర్తి చేశాను. ఒక దాని తర్వాత మరోటి ఇప్పటివరకు నాకు గవర్నమెంట్ కొలువులు ఆరు వచ్చాయి. గురుకుల పాఠశాలలకు సంబంధించి పీజీటీలో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు టీజీటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు (State First Rank) వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్‌లో రెండో ర్యాంకు, 2016 గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగంలో చేరా. కరోనా సమయంలో అనారోగ్య సమస్యలతో ఆ ఉద్యోగం మానేశా. తిరిగి స్కూల్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరా. జూనియర్ లెక్చరర్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, తాజా గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్ర స్థాయి 3వ ర్యాంకు వచ్చింది. బుధవారం రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నియమక పత్రం అందుకున్నా. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరాను.డిప్యూటీ కలెక్టర్ కావాలని ఉంది రాష్ట్ర ప్రభుత్వ నియామకాల్లో అత్యున్నతమైనది గ్రూప్–1. డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం సాధించడమే నా ముందున్న లక్ష్యం. గ్రూప్–1 పరీక్షలు కూడా రాశాను. 430 మార్కులు వచ్చాయి. త్వరలోనే ఈ ఫలితాలు వెలువడితే గ్రూప్–1 ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలున్నాయి. చదవండి: గ్రూప్– 2 టాపర్ హరవర్ధన్రెడ్డిసిలబస్లో లేని అంశాలు చదివితే ఫలితముండదు నోటిఫికేషన్ వచ్చాకే ప్రిపేర్ అవుతానంటే కష్టం. సంబంధిత సబ్జెక్టు మరిచిపోకుండా కనీసం రెండు గంటలైనా చదవాలి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ముఖ్యంగా నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. సిలబస్‌పై పూర్తి అవగాహన ఉండాలి. సిలబస్‌లో లేని అంశాలు చదివితే ఫలితం ఉండదు. పాత ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రశ్నలు ఎలా వస్తున్నాయనే దానిపై అవగాహన పెంపొందించుకోవాలి. సమయం వృథా చేసుకోవద్దు. ముఖ్యంగా సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే అంత సమయం కలిసొస్తుంది. కనీసం 8 గంటలు చదవాలి. -
గాయాన్ని గంటల్లో మాన్పే మాయా చర్మం
అది చర్మం కాని చర్మం. అయితే అలాంటిలాంటి చర్మం కాదు. గాయాలను శరవేగంగా నయం చేసే చర్మం! ఎంతటి గాయాన్నయినా నాలుగే గంటల్లో 90 శాతం దాకా మాన్పుతుంది. 24 గంటల్లో పూర్తిగా నయం చేసేస్తుంది. వినడానికి ఏదో సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా కథలా అన్పిస్తున్నా అక్షరాలా నిజమిది. ఈ మాయా చర్మం అందుబాటులోకి వస్తే వైద్యచికిత్స కొత్తపుంతలు తొక్కడం ఖాయమని చెబుతున్నారు. అచ్చం చర్మాన్ని తలపించే కొత్త రకం హైడ్రోజెల్‌ను రూపొందించడంలో సైంటిస్టులు విజయవంతమయ్యారు. చర్మానికి ఉండే స్వీయచికిత్స సామర్థ్యాన్ని ఇది ఎన్నో రెట్లు పెంచుతుందట. ఫిన్లండ్‌లోని ఆల్టో యూనివర్సిటీ, జర్మనీలోని బైరైట్ వర్సిటీలకు చెందిన పరిశోధకులు దీన్ని రూపొందించారు. నిజానికి ఇటువంటి విప్లవాత్మక ఆవిష్కరణ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతూనే వస్తున్నాయి. కానీ అవేవీ ఇప్పటిదాకా అంతగా విజయవంతం కాలేదు. చర్మం తాలూకు విలక్షణతే అందుకు కారణం. సాగే లక్షణం, దీర్ఘకాలిక మన్నిక, తీవ్ర ప్రతికూల పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం వంటి ఎన్నో ప్రత్యేకతలు చర్మం సొంతం. వీటన్నింటినీ మించి గాయాలను తనకు తాను నయం చేసుకునే సాటిలేని సామర్థ్యం చర్మానికి ఉంది. ఇన్ని లక్షణాలతో కూడిన కృత్రిమ చర్మం రూపకల్పన ఇన్నేళ్లుగా సైంటిస్టులకు సవాలుగానే నిలిచింది. తాజాగా రూపొందించిన హైడ్రోజెల్ మాత్రం పూర్తిగా చర్మం లక్షణాలను కలిగి ఉంటుంది. కాలిన, తెగిన గాయాలపై ఈ జెల్‌ను అమరిస్తే వాటిని చిటికెలో నయం చేస్తుంది. తర్వాత దాన్ని తొలగించవచ్చు. లేదంటే క్రమంగా అదే కరిగిపోతుంది. ఇలా సాధించారు... అతి పలుచనైన నానోషీట్తో రూపొందించిన పాలిమర్ సాయంతో కృత్రిమ చర్మం రూపకల్పన సాధ్యపడింది. మోనోమర్ పొడిని నీటితో కూడిన నానోషీట్లతో చాకచక్యంగా కలపడం ద్వారా అధ్యయన బృందంలోని శాస్త్రవేత్త చెన్ లియాంగ్ దీన్ని సాధించారు. తర్వాత ఈ మిశ్రమాన్ని యూవీ రేడియేషన్‌కు గురిచేయడంతో అందులోని అణువుల మధ్య ఆశించిన స్థాయిలో బంధం సాధ్యపడింది. ఫలితంగా చక్కని సాగే గుణమున్న చర్మంలాంటి హైడ్రోజెల్ రూపొందించింది. ‘‘అత్యంత హెచ్చు సామర్థ్యంతో కూడిన వ్యవస్థీకృత నిర్మాణం దీని సొంతం. హైడ్రోజెల్‌కు ఇది గట్టిదనం ఇవ్వడమే గాక గాయాల వంటివాటిని తనంత తానుగా నయం చేసుకోగల సామర్థ్యాన్ని కూడా కట్టబెట్టింది’’ అని అధ్యయన బృందం పేర్కొంది. ‘‘జీవకణాలు చూసేందుకు గట్టిగా ఉన్నా స్వీయచికిత్స సామర్థ్యంతో కూడి ఉంటాయి. సింథటిక్ హైడ్రోజెల్లో ఈ లక్షణాలను చొప్పించడం ఇప్పటిదాకా సవాలుగానే నిలిచింది. దాన్నిప్పుడు అధిగమించాం’’ అని వివరించింది. కృత్రిమ చర్మ పరిజ్ఞానంలో ఇది మైలురాయిగా నిలుస్తుందని పేర్కొంది. ‘‘కాలిన, దీర్ఘకాలిక గాయాలను సత్వరం నయం చేయడం ఇకపై మరింత సులువు కానుంది. అంతేగాక వైద్య చికిత్సలోనే గాక ప్రోస్తటిక్స్, సాఫ్ట్ రోబోటిక్స్ తదితర రంగాల్లో కూడా ఇది ఉపయుక్తం కానుంది’’ అని వివరించింది. మిల్లీమీటర్ మందంలోని జెల్లో దాదాపు 10 వేల నానోïÙట్లుంటాయి. ఫలితంగా దానికి గట్టిదనంతో పాటు సాగే గుణం కూడా ఉంటుంది. ఈ మిరాకిల్ జెల్ ప్రస్తుతానికి ప్రయోగ దశలోనే ఉంది. వైద్యపరంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మరో ఐదేళ్లకు పైగా పట్టవచ్చు. అధ్యయన వివరాలు ప్రతిష్టాత్మక జర్నల్ నేచర్ మెటీరియల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. ఏమిటీ హైడ్రోజెల్ సింపుల్‌గా చెప్పాలంటే ఇది జెల్ వంటి మృదువుగా ఉండే పదార్థం. దీన్ని పాలిమర్ తదితర మెటీరియల్స్‌తో తయారు చేస్తారు. వెంట్రుకల చికిత్స మొదలుకుని ఆహారోత్పత్తుల దాకా దాదాపు అన్నింట్లోనూ వీటిని విస్తృతంగా వాడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మీ స్మార్ట్ వాచ్ మీకు నిజమే చెబుతోందా?
సాక్షి, సెంట్రల్ డెస్క్ : ఓ రోజున అమర్ అనే యువకుడు నాకు అత్యవసరంగా ఫోన్ చేశాడు. ఆ సమయంలో తను జిమ్‌లో ఉన్నాడు. తన స్మార్ట్ వాచ్ గుండె కొట్టుకునే రేటు నిమిషానికి 38 మాత్రమే చూపిస్తోందని చెప్పాడు. నిజానికి 60–100 మధ్యలో ఉండాలి.కానీ ఓసారి వాచ్ తీసి..మళ్లీ వేసుకునే సరికి అది100 చూపించింది. అదిఆ వాచ్ కచ్చితత్వంలో ఉన్న ఎర్రర్. కానీ ఆ సమయంలో నిజంగానే తనకు హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమోఅన్నంతగా తను టెన్షన్ పడ్డాడు..స్మార్ట్ వాచ్‌లు.. ఇప్పుడు చాలామంది వీటిపైనే ఆధారపడుతున్నారు. తామెంత నడిచాం.. ఎంత సేపు పరిగెత్తాం.. ఎంత సేపు స్విమ్ చేశాం.. పడుకున్నాం.. ఎన్ని కాలరీలు బర్న్ చేశాం.. ఇవన్నీ ఉదయాన్నే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ.. స్టేటస్లు పెడుతున్నవాళ్లూ ఎక్కువయ్యారు. ఇదంతా నాణానికి ఓవైపు.. మరోవైపు చూస్తే.. నిజానికి ఇదో వ్యసనంలా మారుతోందా? స్మార్ట్ వాచ్‌లపై మనంఅతిగా ఆధారపడుతున్నామా? అసలు మన స్మార్ట్ వాచ్ నిజమే చెబుతోందా? హార్ట్ రేట్ స్మార్ట్ వాచ్‌కు సంబంధించి ముఖ్యంగా వైద్యపరమైన అంశాల్లో గుడ్డిగా నమ్మడం మంచిది కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘యువకులు వీటిపై అతిగా ఆధారపడుతున్నారు. హార్ట్ రేట్ బాగా పెరిగిందనో.. లేదా బాగా తగ్గిందనో భయంతో మా వద్దకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది’అని పుణేకు చెందిన కార్డియాలజిస్ట్ అభిజిత్ వైద్య తెలిపారు. నిజానికి స్మార్ట్ వాచ్‌లు పల్స్ రేట్‌ను మాత్రమే చూపిస్తాయని.. జనానికి ఈ రెండింటి మధ్య తేడా పెద్దగా తెలియదన్నారు. ‘ప్రతీ సారి గుండె కొట్టుకునేటప్పుడు రక్తప్రసరణలో వచ్చిన మార్పులను పరిశీలించడం ద్వారా గుండె కొట్టుకునే రేటును గణించడానికి స్మార్ట్ వాచ్‌లు ఫొటోప్లెథిస్మోగ్రఫీ(పీపీజీ)ని వాడతాయి. గుండె కొట్టుకునే రేటును కచి్చతంగా గణించడానికి ఎలక్ట్రోకార్డియోగ్రామ్(ఈసీజీ) బెస్ట్. పీపీజీ కూడా కొంత మొత్తంలో పనిచేస్తుంది గానీ.. ఈసీజీతో పోలిస్తే.. అది కచ్చితంగా లెక్కించలేదు’అని చెప్పారు. చాలా చిన్నచిన్న మార్పులు పల్స్ రేట్‌ను ప్రభావితం చేస్తుంటాయని.. దీనివల్ల స్మార్ట్ వాచ్ హార్ట్ రేట్‌ను కచ్చితంగా చూపించలేదని చెప్పారు. ‘నేను చాలాసార్లు ఇలాంటివారికి కౌన్సెలింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అదే పనిగా హార్ట్ రేట్, బీపీని స్మార్ట్ వాచ్‌లో చెక్ చేసుకోవడం కూడా ఒక రకమైన మానసిక సమస్యే’ అని తెలిపారు. 2022లో ఫ్రాన్స్, కెనడా, నెదర్లాండ్స్‌కు చెందిన పరిశోధకులు ఒక పాపులర్ స్మార్ట్ వాచ్‌లోని ఈసీజీ సదుపాయాన్ని పరీక్షించి చూడగా.. ఫాల్స్ పాజిటివ్‌లు(తప్పుడు ఫలితం) ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ‘నిజంగానే గుండెకు సంబంధించి సమస్య ఉండి.. మీ ఖరీదైన స్మార్ట్ వాచ్ ఈసీజీలో అంతా నార్మల్ అని చూపిస్తే.. అప్పుడు ఆ రోగి వైద్యుడు వద్దకు వెళ్లడు. అది ప్రమాదకరం. హృదయ ధమనుల్లో ఏదైనా పూడికల్లాంటివి ఉంటే ఈసీజీలో తెలుస్తుంది. స్మార్ట్ ఫోన్ అలాంటి వాటిని పట్టుకోదు’ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, కొన్ని నాణ్యమైన స్మార్ట్ వాచ్‌లు గుండె కొట్టుకోవడంలో తేడాలను(అరిర్థియా) సరిగానే గుర్తిస్తున్నాయని చెప్పారు. స్లీప్ ట్రాకర్స్లీప్ ట్రాకర్ల విషయానికొస్తే.. మన నిద్ర ఆధారంగా అవి 0–100 వరకూ మార్కులిస్తుంటాయి. ఎక్కువ వస్తే.. మనం మంచిగా నిద్రపోయినట్లు అన్నమాట. ‘స్మార్ట్ వాచ్‌లు సెన్సర్లను ఉపయోగిస్తాయి. ఆక్సిలరోమీటర్, గైరోస్కోప్, హార్ట్ రేట్ మానిటర్ ఇలా.. అవి నిద్రలోని వివిధ దశలను గుర్తించలేవు. నిజమైన నిద్రను స్లీప్ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్తో లెక్కించవచ్చు. అంతేకాదు.. స్మార్ట్ వాచ్‌లు మన కదలికలను బట్టి.. నిద్రను గణిస్తాయి. ఒకవేళ మీరు పడుకోకున్నా.. కదలకుండా ఉంటే.. అది నిద్ర కింద లెక్క తీసుకుంటుంది’అని డయాబెటాలజీ అండ్ స్లీప్ మెడిసన్ కన్సల్టెంట్ డాక్టర్ స్మిత వివరించారు. సరైన స్లీప్ స్కోర్ రాలేదని టెన్షన్ పడే వాళ్ల సంఖ్య కూడా ఈ మధ్య పెరిగిందని చెప్పారు. ఖర్చు చేసే కేలరీలు కేలరీల ఖర్చు అంచనాల్లోనూ ఇదే పరిస్థితి. స్టాన్‌ఫోర్ట్ వర్సిటీ చేసిన పరిశోధనలో కేలరీలు ఎంత ఖర్చయ్యాయి అన్న విషయాన్ని స్మార్ట్ వాచ్‌లు సరిగా గణించలేకపోయినట్లు తేలింది. ‘ఇద్దరు 60 కేజీల బరువున్న వాళ్లను తీసుకుంటే.. ఒకరిలో 15 శాతం బాడీ ఫ్యాట్, రెండో వారిలో 45 శాతం బాడీ ఫ్యాట్ ఉంది అనుకుందాం. నిజానికి కేలరీల ఖర్చు అన్నది ఇద్దరిలో వేరువేరుగా జరుగుతుంది. స్మార్ట్ వాచ్‌లో మనం బరువు మాత్రమే నమోదు చేస్తాం కాబట్టి.. ఇద్దరికీ ఒకేలా కేలరీలు ఖర్చయినట్లు చెబుతుంది. కానీ శరీరతత్వం బట్టి.. కేలరీల ఖర్చు వేర్వేరుగా ఉంటుంది’అని న్యూట్రిషనిస్ట్ రాధిక తెలిపారు. స్టెప్ కౌంట్గతంలో 111 దేశాలకు చెందిన 7 లక్షలకు పైగా జనాన్ని శాంపిల్‌గా తీసుకుని అమెరికా, ఆ్రస్టేలియా పరిశోధకులు అధ్యయనం చేశారు. దీని ప్రకారం.. స్టెప్ కౌంట్ అనేది.. వాచీ స్థాయిని బట్టి 15–66 శాతం తేడా వస్తోందని తేలింది. అయితే, ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందింపజేసుకోవడానికి స్మార్ట్ వాచ్‌లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని.. అదే సమయంలో ఆరోగ్యపరమైన అంశాల్లో వీటిపైనే అతిగా ఆధారపడటం మంచిది కాదని.. పైగా.. ఇది అనవసరమైన ఆందోళనకు తెర తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే..మీ స్మార్ట్ వాచ్ ఏం చెబుతోందోదాన్ని కాదు.. మీ శరీరం మీకుఏం చెబుతుందో దాన్ని వినండి..అని వైద్యులు సూచిస్తున్నారు. -
హైదరాబాద్‌కు దగ్గరలో అద్భుతమైన కోట
భువనగిరి: హైదరాబాద్ నగరానికి 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరి పట్టణంలోని భువనగిరి ఖిల్లా అనేక పోరాటాలకు, చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తూ చెక్కు చెదరని నిర్మాణంగా ఉంది. సముద్ర మట్టానికి 610 మీటర్ల ఎత్తులో ఏకశిలా రాతిగుట్టపై నాటి రాజులు కోట నిర్మించారు. కోట కింది భాగంలో గుర్రాల కోసం కొట్టాలు, ధాన్యాన్ని నిల్వ చేయడానికి ధాన్యాగారాలు, సైనికుల కోసం సైనిక గారాలున్నాయి. రాజ భవనాల కింద శిలాగర్భంలో అనేక రహస్య మార్గాలున్నాయని స్థానికులు చెబుతుంటారు. చాళుక్యుల శిల్పరీతిని ప్రతిబింబించే రాజప్రసాదాలు, కాకతీయ శైలిలో అనేక శిలాకృతులను చెక్కారు.త్రిభువనమల్ల విక్రమాదిత్య పేరుతో.. కాకతీయుల కాలంలో భువనగిరి కోట (Bhuvanagiri Fort) ప్రముఖంగా ప్రసిద్ధి చెందింది. పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన ఆరవ త్రిభువనమల్ల విక్రమాదిత్య ఖిల్లాపై కోట నిర్మించారు. అతని పేరుమీదుగా దీనికి త్రిభవనగిరి (Tribhavanagiri) అనే పేరు వచ్చింది. ఈ పేరు క్రమంగా భువనగిరిగా మార్పు చెందింది. అలాగే త్రిభువనమల్లుకి స్థానికులైన గొల్ల దంపతులు ఈ కొండను చూపించారని అరణ్యంలో తీగలతో కప్పబడి ఉన్న ఈ కొండ కోట నిర్మాణానికి అనుకూలంగా ఉందని భావించి దర్గం నిర్మించారు. దీంతో స్థానికులైన బోనయ్య గిరమ్మ దంపతుల పేరుగానే ఈ పట్టణానికి భువనగిరిగా పేరు వచ్చిందని మరో కథనం కూడా ఉంది.ఈ కోట పరిసర ప్రాంతాల్లో మధ్యరాతియుగం, నవీన శిలాయుగం, మధ్య పాతరాతియుగం నాటికి చెందిన బాణాలు, రాతి గొడ్డళ్లు, కత్తులు, సమాధుల ఆనవాళ్లు లభ్యమయ్యాయి. భువనగిరి కోట కొంతకాలం కుతబ్షాహీల పరిపాలనతో కూడా ఉంది. 1687లో మొఘలులు (Mughal Empire) గోల్కొండను ఆక్రమించినప్పుడు ఈ కోట కొంత కాలం మొఘలుల పాలనలోకి వెళ్లింది. అనంతరం కల్లు గీత కుటుంబంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న (Sardar Sarvayi Papanna) 1708లో ఓరుగల్లును గెలుచుకొని తర్వాత భువనగిరి కోటను జయించి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఖిల్లాపై చెక్కుచెదరని నిర్మాణాలు భువనగిరి కోట మొదటి ద్వారాన్ని ఉక్కు ద్వారం అని పిలుస్తారు. నిజాం రాజు తన సొంత ఖర్చుతో ఈ ద్వారాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఇది గోల్కొండ కోటలోని బాలాహిస్సార్ మొదటి ద్వారం ఫతే దర్వాజాను పోలి ఉంటుంది. ఎత్తైన గోడలు, విశాలమైన గదులు, ఇస్లాం సంస్కృతి నిర్మాణ శైలిలో కనిపిస్తాయి. అండాకారపు ఏకశిలాపర్వతం గల కొండ దక్షిణం నుంచి చూస్తే తాబేలుగా, పడమర నుంచి చూస్తే పడుకున్న ఏనుగులాగా కనిపిస్తుంది.ఏనుగుల మోట వాగులు, బైరవకొలను, సప్త కన్యలు అనే పేరుతో నీటి కొలనులు ఉన్నాయి. దిగుడు మెట్ల బావులు, వంట గదులు, అశ్వ శాలలు, ఎనిమిది దిక్కుల్లో ఫిరంగులున్నాయి. ఖిల్లాపైన మూడు అత్యవసర ద్వారాలున్నాయి. ఇందులో రెండు మూసుకుపోగా ఒకటి మాత్రం నామమాత్రంగా ఉంది. శిలాశాసనాలు, దేవాలయాలకు చెందిన శిథిలాలు కూడా ఉన్నాయి. కొండ మధ్య భాగంలో మండపంతో పాటు ఖిల్లా చుట్టూ రక్షణ గోడలలో మూడు అంచెలలో ఎలాంటి మట్టి లేకుండా పూర్తిగా రాతితోనే నిర్మించారు. సందర్శకుల సందడి.. భువనగిరి ఖిల్లాను సందర్శించేందుకు నిత్యం ఎంతో మంది వస్తుంటారు. ఇందులో ప్రధానంగా జూన్ నుంచి ఫిబ్రవరి వరకు ఖిల్లాలో సందర్శకులతో సందడి కనిపిస్తుంది. భువనగిరి ఖిల్లాను అ మెరికా, రష్యా, ఫ్రాన్స్, స్వీడన్, స్విట్జర్లాండ్, ఆ్రస్టేలియా, బ్రిటన్, దేశాలకు చెందిన వారితో పాటు దేశంలోనే అన్ని రాష్టాలకు చెందిన వారు కూడా సందర్శిస్తుంటారు. చారిత్రక చరిత్ర కలిగిన ఖిల్లాపై ఎన్నో బాలీవుడ్ సినిమాలకు సంబంధించి సన్నివేశాలు చిత్రీకరించారు. ఖిల్లా అభివృద్ధికి చర్యలు భువనగిరి ఖిల్లా అభివృద్ధికి 2024లో కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ కింద రూ.118 కోట్లు కేటాయించింది. ఇటీవల మళ్లీ అధికారంలోకి వచ్చిన కేంద్రం ప్రభుత్వం తిరిగి ఖిల్లా అభివృద్ధికి మొదటి విడత కింద రూ.58 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో ఖిల్లాపై రోప్ వేతో పాటు కింది భాగంగా బీటీ రోడ్డు, ఖిల్లాపై విశ్రాంతి ప్రదేశాలు, పార్కులు, ఆట సామగ్రి, కింది భాగంలో పార్కింగ్ కోసం ప్రదేశాలు ఏర్పాటు చేయడం, విద్యుత్ కాంతులు వెదజల్లేలా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడం వంటి వాటిని ప్రణాళిక కింద తీసుకున్నారు. ఈ అభివృద్ధి పనులను చేసేందుకు ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. ప్రస్తుతం ఈ పనులకు సంబంధించి చేపట్టేందుకు టెండర్లు దశలో ఉన్నాయి.చదవండి: అద్భుతం కోరుట్ల మెట్లబావి.. రాతి స్తంభాల కింద సొరంగం -
నా ఐస్‌క్రీమ్ తినేసింది అమ్మను అరెస్ట్ చేయండి
జీవితంలో కొన్ని పనులు చేయకూడదంటారు. అందులో కొత్తది ఒకటి వచ్చి చేరింది. అదేంటంటే చిన్నారుల చేతుల్లోని ఐస్‌క్రీమ్‌ను పొరపాటున కూడా దొంగలించకూడదు. దొంగలిస్తే పోలీసులు ఖచ్చితంగా వస్తారు. భారత్‌లో వస్తారో లేదో తెలీదుగానీ అమెరికాలో మాత్రం ఖచ్చితంగా వస్తారు. అరెస్ట్చేస్తారో లేదో తెలీదుగానీ వారు అవాక్కవడం మాత్రం ఖాయం. ఇటు చిన్నారి తల్లి, అటు పోలీసులు సైతం కొద్దిసేపు నవ్వుకున్న సరదా ఉదంతం అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలోని మౌంట్ ప్లీసాంట్ పట్టణంలో గత మంగళవారం జరిగింది. అటు దొంగతనం.. ఇటు 911కు ఫోన్ ఇష్టంగా తింటున్న ఐస్‌క్రీమ్‌ను కన్న తల్లి గభాలున లాక్కుని తినేసే సరికి నాలుగేళ్ల బుడతడికి పట్టరాని కోపం వచ్చింది. ఏడ్వడం మానేసి తల్లికి ఎలాగైనా గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా, న్యాయం కోసం ఫోన్లైన్లో పోలీసుల తలుపు తట్టాడు. 911 నంబర్‌కు ఫోన్‌చేసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పాడు.నాలుగేళ్ల పిల్లాడు చెబుతున్న దాంట్లో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఇద్దరు మహిళా పోలీసులు రంగంలోకి దిగారు. అంతకుముందు పిల్లాడు, పోలీసుల మధ్య కొద్దిసేపు ఫోన్ సంభాషణ జరిగింది. ఇప్పుడా ఆడియో సంభాషణ రికార్డ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చిన్నారి వాదన విన్న వారంతా తెగ నవ్వుకున్నారు.అమ్మను తీసుకెళ్లండి911 డిస్పాచ్ విభాగంలో ఉన్న పోలీసు ఒకరు ఈ పిల్లాడి ఫోన్‌కాల్‌కు స్పందించారు. సమస్య ఏంటని ప్రశ్నించారు. ‘‘మా అమ్మ చెడ్డదైపోయింది’’అని చెప్పాడు. సరేగానీ అసలేమైందని అధికారి అడగ్గా.. ‘‘వెంటనే వచ్చి మా అమ్మను బంధించండి’’అని సమాధానమిచ్చాడు. లాక్కుని ఐస్‌క్రీమ్ తింటున్న తల్లి.. పిల్లాడు పోలీసులకు ఫోన్‌చేయడం చూసి అవాక్కైంది. వెంటనే తేరుకుని పిల్లాడి నుంచి ఫోన్ లాక్కుని ‘‘ఫోన్ చేయాల్సిన పెద్ద విషయం ఏమీ లేదండి. మా అబ్బాయి వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే. వీడి ఐస్‌క్రీమ్ తిన్నాను. అందుకే మీకు ఫోన్‌చేసి ఉంటాడు’’అని చెప్పింది. వీళ్లు ఓవైపు మాట్లాడుతుంటే పిల్లాడు మాత్రం తన వాదనను కొనసాగించాడు.ఐస్‌క్రీమ్ లాక్కుని అమ్మ పెద్ద తప్పు చేసిందని పిల్లాడు అరవడం ఆ ఫోన్‌కాల్‌లో రికార్డయింది. విషయం అర్థమై నవ్వుకున్న పోలీసులు 911 నిబంధనల ప్రకారం పిల్లాడి ఇంటికెళ్లారు. పోలీసుల రాక గమనించి పిల్లాడు మళ్లీ వాళ్లకు నేరుగా ఫిర్యాదుచేశాడు. అమ్మను అరెస్ట్‌చేసి జైలుకు తీసుకెళ్లాలని డిమాండ్చేశాడు. ‘‘సరే. మీ అమ్మను నిజంగానే జైళ్లో వేస్తాం. నీకు సంతోషమేగా?’’అని పోలీసులు అడగ్గా.. ‘‘వద్దు వద్దు. నాకు కొత్త ఐస్‌క్రీమ్ ఇస్తే సరిపోతుంది’’అని అసలు విషయం చివరకు చెప్పాడు. దీంతో పిల్లాడి ఐస్ గోల అక్కడితో ఆగింది. అయితే రెండు రోజుల తర్వాత పోలీసులు మళ్లీ ఆ పిల్లాడి ఇంటికొచ్చారు. మళ్లీ ఎందుకొచ్చారబ్బా అని సందేహంగా చూస్తున్న పిల్లాడి చేతిలో పోలీసులు పెద్ద ఐస్‌క్రీమ్‌ను పెట్టారు. దాంతో చిన్నారి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఈ ఐస్‌క్రీమ్ వృత్తాంతాన్ని పోలీసులు మీడియాకు వెల్లడించడంతో ఈ విషయం అందరికీ తెల్సింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బంగారు అవకాశం.. హద్దు ఆకాశం
ఎన్నాళ్లుగానో మదిలో మెదులుతున్న రూపం కళ్ల ముందు కదలాడే క్షణాలవి.. ఎన్నో కలలు, మరెన్నో ఆశల ప్రతిరూపాలుగా వాహనాలు మెరుపులా దూసుకెళ్లే అపురూప ఘడియలవి. గోకార్టింగ్ అంటే కేవలం వాహనాల పోటీ కాదు. ఎంతో ఇష్టపడి తయారు చేసుకున్న మోడల్, కష్టపడి తయారు చేసుకున్న ఇంజిన్, వాహనంలో ప్రతి విభాగంపై సొంత ముద్ర.. ఇలా ప్రతి అంశంలోనూ విద్యార్థులు తమను తాము చూసుకుంటారు. పోటీలో బండి పరుగులు పెడుతుంటే చూసి మురిసిపోతారు. ఓ కొత్త వాహనానికి పురుడు పోసే దశను గుండెతో ఆస్వాదిస్తారు. టెక్కలి: శ్రీకాకుళం జిల్లాలో జరిగిన జాతీయ స్థాయి గోకార్టింగ్ పోటీలు ఇంజినీరింగ్ విద్యార్థుల మనసు దోచుకున్నాయి. ఆటోమొబైల్ రంగంలో ఎదగాలనుకునే విద్యార్థులకు ఈ పోటీలు ఒకరకంగా తొలి పరీక్ష లాంటివి. ఈ పోటీలు నిర్వహించడం, అందులో పాల్గొనడం, వాహనాలు తయారు చేయడం ఆషామాషీ విషయం కాదు. చాలారకాల దశలు దాటాకే బండిని ట్రాక్ మీదకు ఎక్కించాలి. గోకార్టింగ్ పోటీలు ఎందుకు నిర్వహిస్తారు..? ఆటోమొబైల్ రంగంపై ఆసక్తి కలిగిన ఇంజినీరింగ్ విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉండే సృజనకు పరీక్ష పెట్టేందుకే ఈ గోకార్టింగ్ పోటీలు నిర్వహిస్తారు. ఇందులో రెండు రకాల వాహనాలు తయారు చేస్తారు. వాటిలో సీవీ(ఇంజిన్‌తో తయారుచేసినవి) ఈవీ(ఎలక్ట్రికల్ వాహనాలు) ఉంటాయి. వాహనాల తయా రీతో పాటు బిజినెస్ ఆలోచనలు సైతం పంచుకునే విధంగా ఈ గోకార్టింగ్ పోటీలు నిర్వహిస్తారు. అర్హతలు ఉండాల్సిందే.. గోకార్టింగ్ పోటీల్లో పాల్గొనాలంటే కళాశాల స్థాయి లో ‘మోటార్ స్పోర్ట్ కార్పొరేషన్’ తయారు చేసిన రూల్ బుక్ ఆధారంగా గ్రాఫికల్‌గా డిజైన్ చేస్తూ వాహనాన్ని తయారుచేయాలి. ఆ తర్వాత పోటీల్లో పాల్గొనేందుకు ఆయా కళాశాలలు నిర్వహించే ఆన్లైన్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాలి. పోటీల్లో పాల్గొనే ముందు కూడా డిజైనింగ్ చెక్, ఇన్నోవేషన్ చెకింగ్‌లో భాగంగా కొత్తగా ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత ఆలోచనలకు ప్రాముఖ్యతనిస్తారు. అలాగే బ్రేక్ టెస్ట్, లోడ్ టెస్ట్, స్పీడ్ టెస్ట్, స్టీరింగ్ టెస్ట్ తో పాటు ఇండ్యూరేషన్ టెస్ట్కూడా చేస్తారు. చివరగా బిజినెస్ రౌండ్లోనూ నెగ్గితేనే అర్హత సాధించినట్టు. ఒక్కో వాహనానికి 20 నుంచి 30 మంది టీమ్ సభ్యులు ఉంటారు. వారిలో కెపె్టన్, రైడర్, కో రైడర్ ఉంటారు. వాహనం తయారీ » గోకార్టింగ్ వాహనం తయారీకి సుమారు రూ. 70వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. »ఇందులో సీవీ వాహనాలను పూర్తిగా ఇంజిన్‌తో తయారు చేస్తారు. ఇంజిన్, మోటారు, వీల్స్, స్టీరింగ్, ఇతర పార్టులు ఉంటాయి. »ఈవీ వాహనాలను బ్యాటరీ ఆధారంగా తయారుచేస్తారు. దీనికి బ్యాటరీ, వీల్స్, స్టీరింగ్, మోటారు ఇతర పార్టులు ఉంటాయి. ఒక్కో వాహనం సుమారు 80 నుంచి 100 కిలోల వరకు బరువు ఉంటుంది. అఫిడవిట్ కచ్చితం.. గోకార్టింగ్ పోటీల్లో రైడర్ల పాత్ర కీలకం. కానీ రైడర్‌గా మారాలంటే విద్యార్థి తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది నుంచి అఫిడవిట్‌ను సమర్పించాల్సిందే. గోకార్టింగ్ తో వచ్చే అవకాశాలు గోకార్టింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశం రావడమే విద్యార్థుల విజయానికి తొలిమెట్టు లాంటిది. వాటి లో ప్రముఖ కోర్ కంపెనీల్లో ఉద్యోగవకాశాలు, ఆటోమొబైల్ రంగంలో సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్న వారికి ప్రాథమిక ప్లాట్‌ఫామ్‌గా గోకార్టింగ్ ఉపయోగపడుతుంది. ప్రమాదమైనా ఇష్టమే.. గోకార్టింగ్ లో రైడింగ్ ప్రమాదకరమైనప్పటికీ ఎంతో ఆసక్తిగా ఉండడం వలన రైడర్‌గా మారాను. 60 ఓల్ట్స్ బ్యాటరీ సామర్థ్యంతో వాహనం తయారుచేశాం. మా కళాశాల ప్రిన్సిపాల్ కె.వీ.ఎన్.సునీత, ఫ్యాకల్టీ లు రూపత్, గోపీకృష్ణ సహకారంతో గోకార్టింగ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నాం. అందరి సహకారంతో ఈవీ వెహికల్ రైడ్‌లో మొదటి స్థానంలో నిలిచాం. – జననీ నాగరాజన్, రైడర్, బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల, హైదరాబాద్. రెండు సార్లు రైడర్‌గా మొదటి స్థానం మా కళాశాల సీనియర్స్ ఇన్స్పిరేషన్తో గోకార్టింగ్ రైడర్ గా పోటీల్లో పాల్గొంటున్నాను. 150 సీసీ పల్సర్ ఇంజిన్‌తో వాహనం తయారుచేశాం. రైడర్‌గా రెండు సార్లు మొదటి స్థానంలో నిలిచాం. మాది మధ్య తరగతి కుటుంబం. మా నాన్న ఆటోడ్రైవర్, అమ్మ గృహిణి. భవిష్యత్‌లో మంచి కోర్ కంపెనీలో ఉద్యోగం సాధించడమే లక్ష్యం. – వి.సునీల్, రైడర్, రఘు ఇంజినీరింగ్ కళాశాల, విశాఖపట్టణం -
అద్భుతమైన ఇంజనీరింగ్ శైలి..
కోరుట్ల: పెద్ద పెద్ద రాతి స్తంభాలు.. వాటిపై శిలాఫలకాలతో శ్లాబ్ వంటి నిర్మాణాలు. అక్కడక్కడ చిన్నచిన్న విశ్రాంతి గదులు. దుస్తులు మార్చుకునేందుకు అనువైన నిర్మాణాలు. మూడు అంతస్తుల నిర్మాణం. భూమిపై కనిపించేది కేవలం ఒక అంతస్తు మాత్రమే.. మిగిలిన రెండు అంతస్తుల నిర్మాణం భూగర్భంలోకి వెళ్లిపోయింది. క్రీ.శ. 957–1184 మధ్య కాలం నాటి శిల్పుల ఇంజనీరింగ్ శైలికి నిదర్శనంగా నిలిచిన అద్భుతమైన నిర్మాణం జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. జైన చాళుక్యుల కాలంలో.. క్రీ.శ. 1042–1068 వరకు వేములవాడ రాజధానిగా పరిపాలన సాగించిన జైన చాళుక్యుల కాలంలో ఈ మెట్ల బావి నిర్మించినట్లు సమాచారం. 7–10వ శతాబ్ది వరకు పరిపాలన సాగించిన కల్యాణి చాళు క్యులు, రాష్ట్రకూటుల హయాంలోనూ ఈ మెట్ల బావి (Stepwell) ఆ కాలం నాటి రాజవంశీయుల స్నానాలకు, విశ్రాంతి తీసుకోవడానికి, ఈత నేర్చుకోవడానికి వినియోగించారని చెబుతారు. ఈ మెట్ల బావిలోని రాతి స్తంభాలపై చెక్కిన తీరు అమోఘం. రాతి స్తంభాల కింది భాగంలో భూగర్భమార్గంలో రాజకోటను చేరుకోవడానికి సొరంగం వంటి మెట్ల నిర్మా ణం ఉన్నట్లుగా ప్రచారంలో ఉంది. రాజవంశీయుల కాలంలో నిషిద్ధ ప్రాంతంగా ఉన్న ఈ మెట్ల బావి ప్రస్తుతం కోరుట్ల (Korutla) మున్సిపల్ అధీనంలో ఉంది. ఎక్స్‌లెన్స్ సర్టిఫికెట్ కోరుట్లలోని మెట్ల బావిలో స్నానాలకు వచ్చే రాజవంశీయులకు దుస్తులు మార్చుకోవడానికి అనువుగా మెట్లబావి రెండవ అంతస్తులో చిన్నచిన్న గదులుండటం గమనార్హం. వీటితో పాటు విశ్రాంతి తీసుకోవడానికి మెట్ల బావి చుట్టూ రాతి స్తంభాల మీద నిలబెట్టిన శిలాఫలకాలతో పెద్ద వసారా ఉంది. మెట్ల బావి (stair well) చుట్టూ దీపాలు వెలిగించడానికి అవసరమైన చిన్నపాటి గూళ్లు ఉన్నాయి. మెట్లబావిపై భాగంలో ఉన్న మెట్లకు వెంబడి ఎడమ వైపు ఉన్న ఓ రాతిపై శిలాశాసనం (Epigraphy) ఉంది. ఈ శిలాశాసనం సంపూర్ణంగా చదవడానికి వీలు కానట్లుగా సమాచారం. ఈ మధ్య కాలంలో దెబ్బతిన్న కోరుట్ల మెట్లబావిని మున్సిపల్ ఆధ్వర్యంలో బాగు చేయించి కొత్త సొబగులద్దారు. దీంతో ఈ మెట్లబావికి ఇండి గ్లోబల్ నెట్వర్క్ నుంచి 2022–23 సంవత్సరంలో ఎక్స్‌లెన్స్ సర్టిఫికెట్ దక్కింది. చదవండి: వెండితెరపై మానుకోట -
స్వర్గం భూమ్మీదకు వచ్చిందా?.. అందాల లోకం.. వారెవ్వా వనాటు
స్వర్గం ఎలా ఉంటుందో ఎవడికి తెలుసు?. ఎవరో వర్ణిస్తే కానీ ఊహించుకోవడం తప్పించి!. ఒకవేళ అది భూమ్మీద గనుక ఉంటే.. అది అచ్చం ‘వనాటు’(Vanuatu)లాగే ఉంటుందని లలిత్ మోదీ అంటున్నారు. ఐపీఎల్ సృష్టికర్త కారణంగా ఇప్పుడు ఈ దేశం పేరు తెగ వినిపించేస్తుండగా.. దాని గురించి వెతికే వాళ్ల సంఖ్యా ఒక్కసారిగా పెరిగిపోయింది.ఆర్థిక నేరగాడికి అభియోగాలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ 2010లో దేశం విడిచి లండన్ పారిపోయారు. అయితే ఆయన్ని వెనక్కి రప్పించే ప్రయత్నాలు భారత్ ముమ్మరంగా చేయగా.. ఆయన తెలివిగా వనాటు పౌరసత్వం పొందారు. అయితే ఈ విషయం తెలియడంతో ఆ దేశం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఇది ఇక్కడితోనే ఆగలేదు. లలిత్ మోదీ పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు వనాటు ప్రధాని జోథం నపాట్ స్వయంగా ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడిన కాసేపటికే.. ఎక్స్ వేదికగా లలిత్ ఓ పోస్ట్ చేశారు.‘‘వనాటు ఒక అందమైన దేశం, స్వర్గంలా ఉంది. మీ పర్యటనల జాబితాలో దీన్ని చేర్చాల్సిందే’’ అని సందేశం ఉంచారు. దీంతో నెటిజన్స్ ఆయన కామెంట్ సెక్షన్లో సరదా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వనాటు అందాల గురించి ఆరా తీస్తున్నారు.వనాటు.. ఎక్కడుంది?ఉత్తర ఆస్ట్రేలియాకు 1,750 కిలోమీటర్ల దూరంలో దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఉంది ఈ ద్వీప దేశం. మొత్తం 83 చిన్న చిన్న ద్వీపాల సముదాయంగా వై(Y) ఆకారంలో ఉంటుందీ దేశం. ఇందులో 65 ద్వీపాల్లో మాత్రమే ప్రజలు జీవిస్తున్నారు. ఎఫేట్ ఐల్యాండ్‌లో ఉండే పోర్టువిల్లా నగరం ఆ దేశ రాజధాని. పశ్చిమంగా ఫిజీ దేశం, ఇతర దిక్కుల్లో సాలామాన్ ద్వీపాలు, న్యూ కాలేడోనియా ఉన్నాయి. ఒకప్పుడు బ్రిటిష్ఫ్రెంచ్ సంయుక్త పాలనలో ఇది బానిస దేశంగా ఉండేది. 1980 జులై 30న వనాటు స్వాతంత్రం పొందింది. కరెన్సీ వనాటు వాటు. ప్రస్తుత జనాభా దాదాపు మూడున్నర లక్షలు. ‘‘దేవుడితో మేం నిలబడతాం’’ అనేది ఆ దేశపు నినాదం.అగ్నిపర్వతాలు.. భూకంపాల నేలఈ ద్వీప దేశంలో అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని క్రియాశీలకంగా కూడా ఉన్నాయి. సంవత్సరంలో సుదీర్ఘంగా వేసవి వాతావరణంతో పొడిగా ఉంటుంది అక్కడ. అయితే నవంబర్-ఏప్రిల్ మధ్య వర్షాలు, తుపాన్లు సంభవిస్తుంటాయి. ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉండడం మూలంగా భూ కంపాలు షరామాములుగా మారాయి. అయితే కిందటి ఏడాది డిసెంబర్లో 7.3 తీవ్రతతో వచ్చిన భూకంపం ఆ దేశానికి తీవ్ర నష్టం కలిగించింది. ఈ భూకంపంలో 14 మంది చనిపోగా.. 265 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందాల లోకం.. వనాటులో ఉన్న వృక్ష, జంతు సంపద అత్యంత అరుదైంది. ఈ భూమ్మీద ఎక్కడా కనిపించని జీవ జాతులు ఉన్నాయక్కడ. ఎటు చూసినా.. దట్టమైన అడవులు, జలపాతాలు, అందమైన సముద్రం.. నిర్మానుష్యమైన తీరాలు, కొన్ని ద్వీపాల్లో లాగున్లూ.. ఓ ప్రత్యేక అనుభూతిని పంచుతాయి. సహజ సౌందర్యం, జీవ వైవిధ్యం.. వనాటును ప్రపంచ పర్యాటక జాబితాలో ‘ప్యారడైజ్ ఆఫ్ ది ఎర్త్’గా నిలబెట్టాయి.టూరిజం కోసమే..టూరిజం, వ్యవసాయం ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ వనరులు. అలాగే జనాభాలో గ్రామీణ జనాభా ఎక్కువ. 80 శాతం వ్యవసాయమే చేస్తుంటారు. కావా పంట ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంది. పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయం ఆ దేశ జీడీపీలో 65 శాతంగా ఉంది. పర్యాటకం మీద ఆధారపడిన ప్రజలు కావడంతో.. పర్యాటకులను మర్యాదలతో ముంచెత్తారు. అలాగే.. సంప్రదాయాలకు అక్కడి ప్రజలు పెద్ద పీట వేస్తుంటారు. పెంటెకాస్ట్ ఐల్యాండ్‌లో స్థానికులు ల్యాండ్ డైవింగ్ క్రీడ నిర్వస్తుంటారు. బొంగులలాంటి నిర్మాణలను ఎత్తుగా పేర్చి.. చెట్ల తీగలతో సాయంతో బంగీ జంప్లా కిందకు దూకుతారు. ఎవరి తల భూమికి మొదట తాకితే వాళ్లు విజేతలు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు చేసే ఈ ప్రయత్నాల్లో.. పాపం ఒక్కోసారి ప్రాణాలు పొగొట్టుకుంటారు కూడా. పన్నులు లేవు, కానీ..వనాటులో ఎలాంటి పన్నులు విధించరు. ఈ కారణంగా అంతర్జాతీయ నియంత్రణ సంస్థలు ఈ దేశంపై ప్రత్యేక దృష్టి సారించాయి. అదే టైంలో.. వనాటు ఆర్థిక నేరాలకు అడ్డా కూడా. మనీలాండరింగ్‌కు సంబంధించిన చట్టాలు కూడా అక్కడ బలహీనంగా ఉండడమే ప్రధాన కారణం. ఆర్థిక నేరాలతో పాటు డ్రగ్స్.. ఆయుధాల అక్రమ రవాణాలకు ఇది అడ్డాగా మారింది. ఈ కారణంగానే పైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ దేశాన్ని గ్రే లిస్ట్‌లో చేర్చింది. అలాగే.. 2017లో వెలుగు చూసిన ప్యారడైజ్ పేపర్స్ లీక్.. అక్కడి అక్రమ సంపద వ్యవహారాలను బయటపెట్టింది. ఇక.. 2001 ఏప్రిల్‌లో అప్పటి ప్రధాని బరాక్ సోప్ ఫోర్జరీ కేసులో చిక్కుకున్నారు. భారత్‌కు చెందిన వ్యాపారవేత్త అమరేంద్ర నాథ్ ఘోష్‌కు వందల కోట్ల విలువ చేసే పైనాన్షియల్ గ్యారెంటీలను అనధికారికంగా కట్టబెట్టారని బరాక్‌పై అభియోగాలు వచ్చాయి. ఈ కారణంతో ఆయన అదే ఏడాది తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.. ప్రపంచం దృష్టిలో ఏర్పడిన ఈ మచ్చని.. కఠిన చట్టాల ద్వారా తొలగించుకునే పనిలో ఉంది ఈ సుందర ద్వీప దేశం. -
కెనడా తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీ
టొరంటో: కెనడా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా గతంలో సేవలందించిన బ్యాంకింగ్ రంగ ప్రముఖుడు మార్క్ కార్నీను కెనడా ప్రధానమంత్రి పీఠం వరించింది. ప్రస్తుత ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తానని జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో పాలక లిబిరల్ పార్టీ నూతన సారథి కోసం ఎన్నికలు నిర్వహించగా కార్నీ ఘన విజయం సాధించారు. దాంతో తదుపరి ప్రధానమంత్రిగా 59 ఏళ్ల కార్నీ త్వరలో బాధ్యతల స్వీకరించనున్నారు. ట్రంప్ సారథ్యంలోని అమెరికాతో కెనడా వాణిజ్యయుద్ధానికి దిగిన వేళ కెనడా ప్రధాని పగ్గాలు కార్నీ చేపడుతుండటం గమనార్హం. ఆదివారం లిబరల్ పార్టీ సారథ్యం కోసం జరిగిన ఓటింగ్‌లో కార్నీ 1,31,674 ఓట్లు సాధించారు. మొత్తం ఓట్లలో ఏకంగా 85.9 శాతం ఓట్లు కార్నీ కొల్లగొట్టడం విశేషం. గతంలో మహిళా ఉపప్రధానిగా సేవలందించిన క్రిస్టినా ఫ్రీలాండ్ రెండోస్థానంలో సరిపెట్టుకున్నారు. ఈమెకు కేవలం 11,134 ఓట్లు పడ్డాయి. అంటే మొత్తం ఓట్లలో కేవలం 8 శాతం ఓట్లు ఈమెకు దక్కాయి. గవర్నమెంట్ హౌస్ లీడర్ కరీనా గౌల్డ్(4,785 ఓట్లు) మూడో స్థానంతో, వ్యాపా ర అనుభవం ఉన్న నేత ఫ్రాంక్ బేలిస్(4,038) నాలుగో స్థానంతో సరిపెట్టు కున్నారు. మొత్తం 1,51,000 మందికిపైగా పార్టీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.పదవీ స్వీకారం ఎప్పుడు ?పార్టీ ఎన్నికల్లో గెలిచినా వెంటనే కార్నీ ప్రధాని పీఠంపై కూర్చోవడం కుదరదు. ట్రూడో ప్రధానిగా రాజీనామా చేసి గవర్నర్ జనరల్‌కు సమర్పించాలి. కెనడా ఒకప్పుడు బ్రిటన్ వలసరాజ్యం కావడంతో ప్రస్తుత బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్–3 సమ్మతితో గవర్నర్ జనరల్.. కార్నీతో నూతన ప్రధానిగా ప్రమాణంచేయిస్తారు. అయితే అక్టోబర్ 20వ తేదీలోపు కెనడాలో సాధారణ ఎన్నికలు చేపట్టాల్సిఉంది. అందుకే కార్నీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించగానే ఎన్నికలకు పిలుపిచ్చే వీలుంది.ట్రంప్‌ను నిలువరిద్దాంపార్టీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాక వందలాది మంది మద్దతుదారులనుద్దేశించి కార్నీ ప్రసంగించారు. అమెరికా దిగు మతి టారిఫ్‌ల పెంపు అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ ఇకపై ఏమాత్రం నమ్మలేని దేశం(అమెరికా) మనకు గడ్డు పరిస్థితు లను తీసుకొచ్చింది. అయినాసరే మనం ఈ పరిస్థితిని దీటుగా ఎదుర్కోగలం. అమెరికా దిగుమతి టారిఫ్‌లకు దీటుగా మనం కూడా టారిఫ్‌లు విధిస్తాం. మమ్మల్ని అమెరికా గౌరవించేదాకా ఇవి కొనసాగుతాయి. అమెరికన్లు మా సహ జవనరులు, భూములు, నీళ్లు, ఏకంగా మా దేశాన్నే కోరుకుంటున్నారు. ఏ రూపంలోనూ కెనడా ఎప్పటికీ అమెరికాలో భాగం కాబోదు. ట్రంప్ గెలవకుండా నిలువరిద్దాం’’ అని వందలాది మంది మద్దతుదారులను ద్దేశించి కార్నీ ప్రసంగించారు.బ్యాంకర్ పొలిటీషియన్కెనడా, బ్రిటన్‌లోని సెంట్రల్ బ్యాంక్‌లకు సారథ్యం వహించి అపార బ్యాంకింగ్ అనుభవం గడించిన మార్క్ కార్నీ ఇప్పుడు కెనడా ప్రధానిగా కొత్త పాత్ర పోషించనున్నారు. బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్ హోదాలో 2008లో ఆర్థిక సంక్షోభం నుంచి కెనడాను గట్టెక్కేలాచేసి శెభాష్ అనిపించుకున్నారు. వలసలు, అధికమైన ఆహార, ఇళ్ల ధరలతో ప్రస్తుతం కెనడా సతమవుతున్న వేళ ట్రంప్ టారిఫ్ యుద్ధానికి తెరలేప డంతో కార్నీ తన బ్యాంకింగ్ అనుభవాన్ని పరిపాలనా దక్షతగా మార్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.హార్వర్డ్‌లో ఉన్నత విద్య: 1965 మార్చి 16వ తేదీన వాయవ్య కెనడాలోని ఫోర్ట్‌స్మిత్ పట్టణంలో కార్నీ జన్మించారు. తర్వాత ఆల్బెర్టా రాష్ట్రంలోని ఎడ్మోంటెన్‌లో పెరిగారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 1988లో ఉన్నతవిద్య పూర్తిచేశారు. ఈయనకు ఐస్ హాకీ అంటే చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో ఐస్హాకీ బాగా ఆడేవారు. తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ సాధించారు. బ్రిటన్‌కు చెందిన ఆర్థికవేత్త డయానా ఫాక్స్‌ను పెళ్లాడారు. వీళ్లకు నలుగురు కుమార్తెలు. కెనడా పౌరసత్వంతోపాటు ఈయనకు ఐరిష్, బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు గవర్నర్‌గా పనిచేసినకాలంలో తొలిసారిగా బ్రిటన్ పాస్‌పోర్ట్ సంపాదించారు. గోల్డ్‌మ్యాన్ శాక్స్‌లో దశాబ్దానికిపైగా పనిచేశారు. లండన్, టోక్యో, న్యూయార్క్, టొరంటోలో పనిచేశారు. తర్వాత 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడాలో డిప్యూటీ గవర్నర్‌గా పనిచేశారు.3 శతాబ్దాల్లో తొలిసారిగా: 2013 నుంచి ఏడేళ్లపాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్‌గా సేవలందించారు. 1694లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను స్థాపించగా గత 300 సంవత్సరాల్లో ఆ బ్యాంక్‌కు గవర్నర్‌గా ఎన్నికైన తొలి బ్రిటీషేతర వ్యక్తిగా 2013లో కార్నీ చరిత్ర సృష్టించారు. బ్రెగ్జిట్ వేళ బ్రిటన్ ఆర్థికసంక్షోభంలో కూరుకుపోకుండా బ్యాంకర్‌గా కార్నీ సమర్థవంత పాత్ర పోషించారు. 2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను వీడాక ఐక్యరాజ్యసమితిలో వాతావరణ మార్పులు, ఆర్థిక అంశాలపై ప్రత్యేక దౌత్యవేత్తగా సేవలందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
47 ఏళ్ల క్రితం ఆఖరి ఉరి
ప్రణయ్ హత్య కేసులో తీర్పు వెలువడింది. ఏ2గా సుభాష్ శర్మను కోర్టు దోషిగా నిర్ధారిస్తూ మరణశిక్ష విధించింది. అయితే శిక్ష అమలు కావడానికి మూడు అంకాలు దాటాల్సి ఉంటుంది. ఇక్కడ తెరపైకి వచ్చే అంశం ఏమిటంటే.. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ జైలులోనూ గ్యాలోస్ (ఉరికంబం ఉండే ప్రాంతం సాంకేతిక నామం) లేదు. తలారులుగా పిలిచే హ్యాంగ్ మన్ పోస్టులు అసలే లేవు.రాష్ట్రపతి వరకు అప్పీల్‌కు చాన్స్..ప్రస్తుతం ట్రయల్ కోర్టు సుభాష్ శర్మకు మరణశిక్ష విధించింది. అతను ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేసే అస్కారం ఉంది. అంతేకాదు ట్రయల్ కోర్టు కూడా ఈ శిక్ష విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తుంది. ఈ క్రమంలో ‘రిఫర్డ్ ట్రయల్’గా పిలిచే విధానంలో హైకోర్టు విచారణ చేయవచ్చు. మరణశిక్షను హైకోర్టు సమర్థిస్తే.. సుప్రీంకోర్టులో అప్పీల్ చేయవచ్చు. అక్కడా చుక్కెదురైతే క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయవచ్చు. రాష్ట్రపతి తిరస్కరిస్తే.. దోషులకు విధించిన మరణశిక్ష పూర్తిగా ఖరారైనట్లే. దీంతో శిక్ష విధించినన్యాయస్థానానికి సంబంధించిన రాష్ట్రంలో.. మరణశిక్షను అమలు చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 47 ఏళ్ల క్రితం..ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఆఖరి ఉరిశిక్షను 47 ఏళ్ల క్రితం ముషీరాబాద్ సెంట్రల్ జైలులో అమలు చేశారు. 1978లో భారత వైమానిక దళంలో పనిచేసిన ఎయిర్‌మన్ రామవతార్ యాదవ్‌పై హత్య కేసు నిరూపితమై, మరణశిక్ష ఖరారు కావడంతో ఉరి తీశారు. అప్పట్లో ముషీరాబాద్ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్‌గా ఉన్న సుబ్బారెడ్డి పర్యవేక్షణలో శిక్షను అమలైంది. తర్వాతి కాలంలో ముషీరాబాద్ సెంట్రల్ జైలును చర్లపల్లి ప్రాంతానికి మార్చారు.ఇక్కడ జైలు నిర్మిస్తున్నప్పుడు గ్యాలోస్ (ఉరికంబం) కోసం ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసినా ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉరికంబం ఉన్న జైలు ఒక్క రాజమండ్రి సెంట్రల్ జైలు మాత్రమే. ఇక తెలంగాణ జైళ్ల శాఖలో హ్యాంగ్‌మన్‌గా పిలిచే తలారీ పోస్టులు లేవు. చాలా ఏళ్లుగా ఉరిశిక్ష అమలు లేకపోవడంతో కొందరు హెడ్–వార్డెర్లకే ఈ అంశంలో ప్రాథమిక శిక్షణ ఇస్తున్నారు.రాజమండ్రి జైల్లో 49 ఏళ్ల క్రితం...రాజమండ్రి సెంట్రల్ జైలులో చివరిసారిగా 1976 ఫిబ్రవరిలో ఉరిశిక్షను అమలు చేశారు. ఓ హత్య కేసులో దోషిగా తేలిన అనంతపురం జిల్లాకు చెందిన నంబి కిష్టప్పను ఉరి తీశారు. తర్వాత కొందరు ఖైదీలను ఉరిశిక్ష అమలు కోసం ఈ జైలుకు తరలించినా అమలు కాలేదు. 1875 నుంచీ గ్యాలోస్ ఉండి, ఇప్పటికీ కొనసాగుతున్న కేంద్ర కారాగారం రాజమండ్రి సెంట్రల్ జైల్ మాత్రమే.స్వాతంత్య్రం అనంతరం దేశవ్యాప్తంగా వివిధ కారాగారాల్లో దాదాపు 100 మందిని ఉరితీశారు. అందులో అత్యధికంగా 42 శిక్షలను రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే అమలు చేశారు. ఉరి అమలుకు ముందు సదరు ఖైదీని ఆఖరి కోరిక ఏమిటని అడగటం ఆనవాయితీ. కిష్టప్ప తన ఆఖరి కోరికగా లడ్డూ తింటానని కోరగా.. జైలు అధికారులు అతడికి లడ్డూలు అందించారు. రాజమండ్రి జైలు తలారీ ధర్మరాజు ఆ ఉరి తీశారు.అదో ప్రత్యేకమైన గ్యాలోస్..రాజమండ్రి సెంట్రల్ జైల్లోని గ్యాలోస్ 1980 వరకు ప్రధాన ద్వారం పక్కనే బహిరంగ ప్రదేశంలో ఉండేది. ఉరిశిక్ష అమలు తర్వాత మృతదేహాన్ని ఉరికంబం కింద ఉండే ప్రత్యేక చాంబర్లో దింపుతారు. అక్కడి నుంచి నేరుగా ట్రే ద్వారా సంబంధీకులకు అప్పగించాలని, మృతదేహాన్ని జైలుగదుల మీదుగా బయటికి తీసుకురావద్దనే ఉద్దేశంతో అలా ఏర్పాటు చేశారు. 1980 తర్వాత గ్యాలోస్‌ను అడ్మినిస్ట్రేటివ్ భవనం పరిసరాల్లోకి మార్చారు.2013లో ఈ గ్యాలోస్ ఉన్న ప్రాంతంలోనే రూ.7.5 కోట్లతో కొత్తగా పరిపాలనా భవనాన్ని నిర్మించారు. అయితే గ్యాలోస్‌ను అక్కడి నుంచి మార్చడం ఇష్టం లేక భవనం కింద భూగర్భంలో ఏర్పాటు చేశారు. ఈ తరహా గ్యాలోస్ కలిగిన కారాగారం దేశంలో మరోటి లేదు. అంతేకాదు నిర్మాణాలు ఎన్ని మారినా ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి ఇనుప ఉరికంబాన్నే వినియోగిస్తున్నారు. తరచూ దీనికి నూనె రాస్తూ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
ఎవరికి వారే.. వేసవి వ్యూహాలు
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)ను కేంద్ర బలగాలు చేపట్టాయి. ఈక్రమంలోనే బస్తర్ అడవుల్లో నెత్తురు ఏరులై పారింది. ఎదురుకాల్పుల్లో 300 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. అయితే ప్రభుత్వ దళాల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు మావోయిస్టులు (Maoists) ఎదురుదాడులకు సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంవేసవి వ్యూహం..వేసవి (Summer) సమీపించడంతో ఆకులు రాలిపోయి అడవులు వెలవెలబోతాయి. దీంతో ప్రతి వేసవిని మావోయిస్టులు గడ్డుకాలంగానే పరిగణిస్తారు. అడవిలో చాటు తగ్గిపోవడంతో పాటు నీటి వనరుల లభ్యత పరిమితంగా ఉంటుంది. దీంతో అడవుల్లోకి పోలీసులు, భద్రతా దళాలు చొచ్చుకురాకుండా ‘ట్యాక్టిక్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్’ పేరుతో ముందుగానే ఎదురుదాడులకు దిగే వ్యూహాన్ని ఆ పార్టీ అమలు చేస్తోంది. కానీ పెరిగిన నిర్బంధం వల్ల ప్రస్తుతం బస్తర్ అడవుల్లో మావోయిస్టులు, వారి సానుభూతిపరులకు మధ్య సంబంధాలు గతంలో పోలిస్తే తగ్గిపోయాయి. సానుభూతిపరుల నుంచి అవసరమైన మేర సాయం అందే పరిస్థితి లేదు. ఈ లోటును పూడ్చుకునేందుకు తమ సాయుధ బలగాలనే ఏకం చేసి వ్యూహాత్మక దాడులు చేయాలనే ప్లాన్‌లో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం.ఏకమవుతున్న దళాలు.. బస్తర్ అడవులు కేంద్రంగా కేంద్ర కమిటీతో పాటు వివిధ రాష్ట్రాలు, ఏరియా కమిటీలు పనిచేస్తున్నాయి. ఈ కమిటీలకు రక్షణగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన సాయుధులు రక్షణ కల్పిస్తున్నారు. దీనికి తోడు ప్రతి కమిటీకి సాయుధ దళాలు ఉంటాయి. వేసవి ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వ భద్రతా బలగాలను ఎదుర్కోవాలంటే దళాలు వేర్వేరుగా కాకుండా కలిసికట్టుగా దాడులు చేయాలనే వ్యూహానికి మావోలు పదును పెడుతున్నట్టు సమాచారం. ఈ మేరకు దండకారణ్యం, అబూజ్మడ్ అడవుల్లో తమకు పట్టున్న ప్రాంతానికి వివిధ దళాలు చేరుకున్నట్టు తెలుస్తోంది.సురక్షితంగా ఎంట్రీ–ఎగ్జిట్.. ఒకప్పుడు రెడ్ కారిడార్ అంటే నేపాల్ నుంచి దక్షిణ భారతదేశం వరకు ఉండేది. ప్రస్తుతం బస్తర్ అడవులు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ చాలా ప్రాంతం భద్రతా దళాల అధీనంలోకి వెళ్లింది. అయినప్పటికీ దక్షిణ బస్తర్, ఏవోబీ, ఛత్తీస్‌గఢ్ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఇప్పటికీ మావోల గుప్పిట్లోనే ఉన్నాయి. దీంతో తమకు పట్టు ఉన్న ప్రాంతానికి చేరుకుంటున్న దళాలు... ఆయా ప్రాంతాల నుంచి ఎంట్రీ, ఎగ్జిట్, రిట్రీవ్ రూట్లు సేఫ్‌గా ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. తమ స్థావరాల సమీపంలోకి భద్రతా దళాలు వస్తే భీకరంగా ఎదురుదాడి చేయాలని మావోయిస్టులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. జవాన్ల జోరు తగ్గిందా? ఈ ఏడాది ఆరంభంలో జనవరి 16, 21, ఫిబ్రవరి 9న భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనల్లో 80 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి సైతం ప్రాణాలు కోల్పోయారు. కానీ గడిచిన నెలరోజులుగా భారీ ఎన్కౌంటర్లు ఎక్కడా జరగలేదు. నక్సలైట్ల వేసవి వ్యూహాలను పసిగట్టడం వల్లనే గడిచిన నెల రోజులుగా గాలింపు చర్యలను భద్రతా దళాలు ఆచితూచి చేపడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దూకుడుగా అడవుల్లోకి వెళ్లి మావోయిస్టుల వలలో చిక్కితే భారీగా ప్రాణనష్టం జరగడంతో పాటు జవాన్ల ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్లే కూంబింగ్‌కు సమాంతరంగా బేస్ క్యాంపులను సుస్థిరం చేయడం, కొత్తగా అధీనంలోకి వచ్చిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై భద్రతా దళాలు ఫోకస్ చేస్తున్నాయి. కవ్వింపు చర్యలు తీవ్ర నిర్బంధం కొనసాగుతున్నప్పటికీ మార్చి 6న దంతేవాడ జిల్లా కేంద్రానికి 40 కి.మీ. దూరంలో బస్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించారు. విప్లవ ద్రోహులుగా పేర్కొంటూ అక్కడ కొన్ని కుటుంబాలను ఊరు వదిలి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. గాలింపు చర్యల్లో భద్రతా దళాల దూకుడు తగ్గడంతో వారిని రెచ్చగొట్టి అడవుల్లోకి రప్పించేందుకే మావోయిస్టులు ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మావోయిస్టుల ప్రింటింగ్ సామగ్రి స్వాధీనందుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా చింతల్నార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోమ్గూడ క్యాంపు బలగాలు ఆదివారం మావోయిస్టుల ప్రింటింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. గోమ్గూడ క్యాంపు నుంచి డీఆర్జీ, కోబ్రా, 241 బెటాలియన్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గోమ్గూడ క్యాంపు పరిధిలోని జాలేర్గూడ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు స్పైక్(పదునైన కడ్డీలు)లను ఏర్పాటు చేశారు. వాటిని తొలగించుకుంటూ గాలిస్తుండగా.. మావోయిస్టులకు చెందిన ప్రింటింగ్ స్థావరం బయటపడింది. అక్కడ మావోయిస్టులు దాచిపెట్టిన ప్రింటర్లు, ఇన్వర్టర్ యంత్రాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మావోయిస్టులకు లొంగుబాటే శరణ్యమా? -
షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల వరకు..
మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా అనగానే మొదట గుర్తుకువచ్చేది క్రీడలు.. అంతేనా.. విద్య, ఉద్యమాలు, పోరాటాల్లో.. పాటల రచయితలు, సంగీత దర్శకులు, ఫొటోగ్రాఫర్లు, కళాకారులుగా.. ఇలా ఎందరో సత్తా చాటుతున్నారు. మిర్చి, పసుపు, పత్తి పంటల్లో రాణిస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ, పోలీస్, జవాన్, నేవీ తదితర అనేక రంగాల్లో వెలుగుతున్నారు. మానుకోట (Manukota) ముద్దుబిడ్డలుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. జిల్లా నుంచి సినీరంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్న కళాకారులు కోకొల్లలు. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ.. పాటలు పాడుతూ ఎదుగుతున్నారు. చిన్న సినిమాలకు తొలుత సంగీతం అందించి ప్రస్తుతం పెద్దపెద్ద హీరోల సినిమాలకు పనిచేస్తున్నారు. వీడియో, కెమెరామెన్, సినిమా ఫొటోగ్రఫీ, అసోసియేట్ డైరెక్టర్ వరకు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. దాశరథి నుంచి.. మానుకోట జిల్లా నుంచి మొదట సినిమారంగంలో చిన్నగూడూరుకు చెందిన దాశరథి కృష్ణమాచార్యులు ప్రవేశించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’అని తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ అందించిన కవి ఆయన. తెలుగు సినిమాలకు గేయ రచయితగా రాణించారు. ‘కన్నె వయసు’సినిమాలో ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో..’ పాట రాశారు. తోట రాముడు సినిమాలో ‘ఓ బంగరు రంగుల చిలకా పలకవే..’అనే పాట కూడా రాశారు. మానుకోట జిల్లా (Manukota District) కేంద్రం గుమ్ముడూరుకు చెందిన గోడిశాల జయరాజు సినీగేయ రచయిత, కవి. ప్రకృతిపై కథలు, గేయాలు రాశారు. అవి తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ సహా అనేక భాషల్లోకి అనువాదమై విస్తృత ప్రాచుర్యం పొందాయి. జయరాజు మొదట ‘అడవిలో అన్న’ సినిమాలో ‘వందనాలమ్మ’ పాట రాశారు. ‘దండోరా’ సినిమాలో ‘కొండల్లో కోయిల పాటలు పాడాలి’ అనే పాట రాశారు. కేసముద్రం మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన జె.కె.భారవి (సుదర్శన భట్టాచార్య) తెలుగు సినీ రచయితగా, దర్శకుడు, పాటల రచయితగా పేరొందారు. కన్నడ సినీరంగంలోనూ పేరు తెచ్చుకున్నారు. అన్నమయ్య, లవ్‌స్టోరీ, శ్రీమంజునాథ, శ్రీరామదాసు, పాండురంగడు, శక్తి, ఓం నమో వేంకటేశాయ, చిటికెల పందిరి, జగద్గురు ఆదిశంకర తదితర సినిమాల్లో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పని చేశారు. ఆత్రేయ ప్రియశిష్య పురస్కారం అందుకున్నారు. మానుకోట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన సంగీత దర్శకుడు చక్రధర్ రచయితగా, గాయకుడిగా, నటుడిగా రాణించారు. మొదట ‘పండు వెన్నెల’ అనే మ్యూజిక్ ఆల్బమ్ చేశారు. చిరునవ్వుతో, ఇడియట్, శివమణి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, దేశముదురు, నేనింతే, చక్రం, ఆంధ్రావాలా, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తదితర 85 చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసి నంది అవార్డు అందుకున్నారు. బయ్యారం మండల గౌరారం గ్రామానికి చెందిన బొబ్బిలి సురేశ్ (Bobbili Suresh) సినీరంగంలో రాణిస్తున్నారు. నీదీ నాదీ ఒకే కథ, జార్జ్‌రెడ్డి, తోలుబొమ్మలాట, తిప్పర మీసం, గువ్వా గోరింక, విరాటపర్వం, చిల్బ్రో, టెన్త్‌క్లాస్ డైరీస్, మళ్లీ పెళ్లి తదితర సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. చదవండి: రాజమౌళి- మహేశ్ సినిమా.. ఒక్క లీక్ ఎంతపని చేసింది జిల్లా కేంద్రానికి చెందిన కందుకూరి అనిల్‌కుమార్ మొదట ప్రైవేట్ ఆల్బమ్ పాటలకు నృత్య దర్శకునిగా పని చేశారు. తరువాత పీపుల్స్‌వార్, పోలీస్ వెంకటరామయ్య, దండకారణ్యం సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన గిద్దె రాంనర్సయ్య.. తెలంగాణ ఉద్యమంలో పలు గీతాలు ఆలపించారు. ఉద్యమంలో ఎంతో మందిని తన పాటలతో ఉత్తేజ పరిచారు.కంబాలపల్లి గ్రామానికి చెందిన గుర్రాల ఉదయ్ (Gurrala Uday) జేఎన్టీయూలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఫొటోగ్రఫీ కోర్సు పూర్తి చేశారు. మొదట షార్ట్ ఫిలిమ్స్ తీశారు. ‘స్వేచ్ఛ’సినిమాతో సినీరంగంలోకి డైరెక్టర్‌గా అడుగుపెట్టారు. ఉత్తమ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు. జంగిలిగొండ గ్రామానికి చెందిన రాజమౌళి (Rajamouli) బుల్లితెర షోల్లో నటించారు. భోళాశంకర్, ధమాక, బంగారు బుల్లోడు, అనుభవించు రాజా, చోర్ బజార్, సిల్లి ఫెలోస్ తదితర సినిమాల్లోనూ నటించారు.తెలంగాణ యాసపై సినిమాలు చేస్తా నాకు మొదట సినిమాల్లో అవకాశం కల్పించింది ఆర్.నారాయణమూర్తి. ప్రకృతితో.. నాకూ ఉన్న అనుబంధాన్ని నా పాటల్లో వివరించా. భవిష్యత్‌లో సినిమాల్లో రచనలు చేసే అవకాశం వస్తే వదులుకోను. నా ప్రతిభను మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా గుర్తించి అవార్డు అందజేశారు. తెలంగాణ యాస, భాషపై మరిన్ని సినిమాలు చేస్తాను. – గొడిశాల జయరాజ్, సినీ రచయిత ‘స్వేచ్ఛ’షార్ట్ ఫిలింతో ప్రవేశం మొదట ‘స్వేచ్ఛ’షార్ట్ ఫిలింతో సినిమా రంగంలోకి అడుగు పెట్టాను. చిన్న చిన్న సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాను. నేను రూపొందించిన ‘మేల్’సినిమా.. బెస్ట్ ఫిలిం స్క్రీన్‌ప్లే న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డుకు నామినేట్ అయింది. – గుర్రాల ఉదయ్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ ఆస్కార్ అవార్డు లక్ష్యం సినీరంగంలో మొదటి సినిమాతోనే నాకు మంచి గుర్తింపు వచ్చింది. భవిష్యత్‌లో పెద్ద పెద్ద హీరోలకు మంచి సంగీతం అందించి గుర్తింపు తెచ్చుకుని ఆస్కార్ అవార్డు అందుకోవాలన్నది నా కోరిక. ఇప్పటి వరకు నాకు చేయూతనిచ్చిన దర్శకులు, నిర్మాతలకు రుణపడి ఉంటా. – సురేష్ బొబ్బిలి, సంగీత దర్శకుడు కొత్తవారికి అవకాశమిస్తా టీవీ షోలు, సినీరంగంలో ఎంతో కష్టపడ్డాను. సినీ ప్రేక్షకులు, జిల్లా ప్రజల ఆశీస్సులతో ఇంతటి వాడినయ్యాను. నటనలో నైపుణ్యం ఉన్న వారికి కచ్చితంగా అవకాశం కల్పిస్తాను. పేద ప్రజలకు నా వంతుగా సేవ చేస్తున్నాను. – రాజమౌళి, జబర్దస్త్ నటుడు -
గర్భిణులు పారాసిటమాల్ వాడితే... పిల్లల్లో ఏడీహెచ్‌డీ!
కొందరు పిల్లలు చదువుతో పాటు ఆటపాటలు, అల్లరిలోనూ చురుగ్గా ఉంటారు. మరికొందరు మరీ అతి చురుకుదనం చూపిస్తారు. ఏదైనా ఇట్టే చేయగలమనే ధీమా వాళ్లలలో తొణికిసలాడుతుంది. అలా శక్తికి మించిన పనులు చేసి సమస్యలు కొని తెచ్చుకుంటుంటారు. అలాంటి ఈ పిల్లలు దేనిపైనా ఎక్కువ సేపు దృష్టి పెట్టలేరు. ఆలోచన కంటే ఆవేశంతోనే పనులు చేస్తుంటారు. పర్యావసానాలను కూడా పట్టించుకోరు. ఇలాంటి వాళ్లు అటెన్షన్ డిఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్టర్ (ఏడీహెచ్‌డీ)తో బాధపడుతున్నట్టు! పారాసిటమాల్గా పిలిచే అసిటమినోఫిన్ను గర్భిణులు అతిగా వాడితే పిల్లల్లో ముప్పు మూడింతలు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. తలనొప్పికి, జ్వరానికి పారాసిటమాల్ వాడటం మన దగ్గర పరిపాటి. ఇది జ్వరంతో పాటు ఓ మాదిరి ఒంటి నొప్పులను కూడా తగ్గిస్తుంది. కానీ నొప్పి గర్భంతో ఉన్నప్పుడు ఈ మాత్రను అతిగా వాడితే పుట్టబోయే పిల్లల మెదడు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్టు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. గర్భంతో ఉన్న 307 మంది నల్లజాతి మహిళల్లో పారాసిటమాల్ వాడినప్పుడు ఒంట్లో రక్తప్రవాహ రేట్లు, రక్తంలో ఈ ఔషధ పాళ్లను గమనించారు. వాటిని అతిగా వాడిన వారికి పుట్టిన చిన్నారుల్లో మిగతా పిల్లలతో పోలిస్తే ఏడీహెచ్‌డీ ముప్పు మూడు రెట్లు అధికమని తేలింది. అమ్మాయిలైతే పదేళ్ల లోపు ఏడీహెచ్‌డీ బారిన పడే ముప్పు ఏకంగా ఆరు రెట్లు ఎక్కువని అధ్యయనకారులు తెలిపారు. కనుక తప్పని పరిస్థితుల్లో మాత్రమే పారాసిటమాల్ వాడాలని సూచించారు. అధ్యయన వివరాలు ‘నేచర్ మెంటల్ హెల్త్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. దశాబ్దాలుగా వాడకం ‘‘అసిటమినోఫిన్ను దశాబ్దాలుగా వాడుతున్నారు. గర్భిణుల్లో పిండం తాలూకు మెదడు, నాడీవ్యవస్థ ఎదుగుదలపై అసిటమినోఫిన్ ప్రభావంపై ఇంతవరకు ఎలాంటి పరిశోధనలూ జరగలేదు. తాజా పరిశోధన నేపథ్యంలో గర్భిణుల పారాసిటమాల్ వాడకంపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని్రస్టేషన్ (ఎఫ్‌డీఏ) విభాగం పునఃసమీక్ష జరపాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై అమెరికా ప్రభుత్వం ఆలోచించాలి’’ అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో పిల్లల వైద్య నిపుణురాలు షీలా సత్యనారాయణ చెప్పారు. అయితే, ‘‘ప్రస్తుత పరిశోధన ఫలితాలతో బెంబేలెత్తాల్సిన పని కూడా లేదు. దీనిపై మరింత విస్తృత అధ్యయనం జరగాల్సి ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గర్భిణులకు పారాసిటమల్‌ను తప్పనిసరైతేనే, అదీ తక్కువ డోసులోనే వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. తాజా అధ్యయనం నేపథ్యంలో ఎఫ్‌డీఏతో పాటు యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఒబ్్రస్టిటీíÙయన్స్, గైనకాలజిస్ట్స్, ది సొసైటీ ఆఫ్ ఓబ్స్ట్రిటీíÙయన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ ఆఫ్ కెనడా, ది సొసైటీ ఆఫ్ మెటర్నల్ –ఫీటల్ తదితరాలు పునరాలోచనలో పడే వీలుంది. అయితే గర్భిణులు అసిటమినోఫిన్ వాడితే పిల్లలకు ఏడీహెచ్‌డీ వస్తుందని నిరూపణ కాలేదని ఎఫ్‌డీఏ అధికారులు 2015లో తేల్చడం గమనార్హం. – వాషింగ్టన్ -
ఉడ్తా కేరళ!
అందమైన అడవులు, కొండలు, లోయలతో దేవుడు తీరిగ్గా తీర్చిదిద్దినట్టుగా ఉండే కేరళ మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోతోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్ భూతం కబళిస్తోంది. చివరికి స్కూలు విద్యార్థులు కూడా డ్రగ్స్‌కు బానిసలవుతున్న పరిస్థితి! మాదకద్రవ్యాల వాడకంలో పంజాబ్‌ను కూడా దాటేసి దేశంలో తొలి స్థానంలో నిలిచింది. కేరళలోని కడక్కవూర్‌లో ఓ మహిళ డ్రగ్స్ మత్తులో టీనేజీ వయసున్న కన్న కొడుకుపైనే లైంగిక దాడులకు పాల్పడింది. దాంతో సహించలేక మరో కొడుకు ఆమెను చంపేశాడు! సంచలనం రేపిన ఈ ఘటన రాష్ట్రంలో సింథటిక్ డ్రగ్స్ విజృంభణకు ఉదాహరణ మాత్రమే.కేరళలో ఏ మూలన చూసినా డ్రగ్స్ ఘాటు గుప్పున కొడుతోందని నార్కోటిక్ గణాంకాలు చెబుతున్నాయి. 2024లో రాష్ట్రవ్యాప్తంగా నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం,1985 కింద ఏకంగా 24,517 కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ అతి వాడకానికి మారుపేరుగా మారిన పంజాబ్‌లో నమోదైంది 9,734 కేసులే! ‘‘సింథటిక్ డ్రగ్స్ రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా కఠిన చట్టాలు చేయాల్సిన సమయమొచి్చంది. స్కూళ్ల ప్రాంగణాల్లోనూ డ్రగ్స్ బయటపడుతున్నాయి’’ అని కేరళ హైకోర్టు జస్టిస్ వీజీ అరుణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి.330 శాతం అధికం 2021 నుంచి చూస్తే మూడేళ్లలో కేరళలో డ్రగ్స్ కేసులు 330 శాతం పెరిగాయి. నమోదవని ఘటనలు మరెన్నో రెట్లు ఉంటాయని చెబుతున్నారు. రాష్ట్రంలో తరచూ భారీ పరిమాణంలో మత్తుపదార్థాలను పోలీసులు స్వా«దీనం చేసుకుంటున్నారు. గతంలో స్థానికంగా దొరికే గంజాయి సేవించేవారు. ఇప్పుడు సింథటిక్ డ్రగ్స్ వైపు మళ్లుతున్నారని స్వయంగా హైకోర్టు న్యాయమూర్తే వాపోయారు. దీనిపై అసెంబ్లీలో రెండుసార్లు చర్చించడమే గాక సమస్య పార్లమెంటులోనూ ప్రస్తావనకు వచ్చింది. ఎన్నెన్ని విషాదాలో...! డ్రగ్స్‌కు బానిసలైన వారి కుటుంబాల్లో ఆనందం ఆవిరవుతోంది. యువత, ముఖ్యంగా మైనర్లు మత్తులో తూగుతున్నారు..→ కాలికట్ జిల్లాలో మత్తుకు బానిసైన పాతికేళ్ల ఆశిఖ్ తన తల్లినే నరికి చంపాడు. పైగా ‘నాకు జన్మనిచి్చనందుకు శిక్షించా’ అంటూ డ్రగ్స్ మత్తు లో చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మా రింది.→ త్రిసూర్‌లో మరో పాతికేళ్ల వ్యక్తి తల్లి నాలుక కోసేశాడు. జనవరి 1న త్రిసూర్‌లోనే 14, 16 ఏళ్ల టీనేజర్లు బహిరంగంగా డ్రగ్స్ తీసుకుంటూ హల్చల్ చేశారు. వారించిన 30 ఏళ్ల వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు.→ తమ అబ్బాయి డ్రగ్స్ వ్యసనాన్ని వదిలించలేకపోతున్నామంటూ పథినంతిట్ట జిల్లాలో ఒక వృద్ధ జంట ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ కంటతడి పెట్టించింది.→ డ్రగ్స్ మానేయమన్న అక్క ముఖాన్ని బ్లేడుతో చెక్కేశాడో తమ్ముడు. మరో ప్రబుద్ధుడు మందలించిన తండ్రిపైనే దాడికి దిగాడు. ఇంకొకడు డ్రగ్స్ కొనేందుకు డబ్బివ్వలేదని తల్లినే చితకబాదాడు.→ డ్రగ్స్ తీసుకుంటూ టీచర్లకు పట్టుబడి, విషయం ఇంట్లో చెప్పొద్దని వాళ్లనే బెదిరిస్తున్న విద్యార్థులకు కొదవే లేదు. డార్క్‌వెబ్, క్రిప్టోకరెన్సీలో లావాదేవీలు డ్రగ్స్‌ను ముఠాలు పోలీసులకు చిక్కకుండా అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాయి. డార్క్‌వెబ్, క్రిప్టోకరెన్సీ, వాట్సాప్ గ్రూప్‌ల్లో లావాదేవీలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేరళలో డ్రగ్ సరఫరా చేసే హాట్స్పాట్లు ఏకంగా 1,300కు పైగా ఉన్నట్లు చెబుతున్నారు. కొకైన్, హషి‹Ù, బ్రౌన్ షుగర్, హెరాయిన్ వాడకం ఎక్కువగానే ఉన్నా మిథేలిన్ డైఆక్సీ మిథాఫెటమైన్ (ఎండీఎంఏ) వీటన్నింటినీ మించిపోయింది. దీని వాడకం ఏడాదిలోనే ఏకంగా 65 శాతం పెరిగింది. ఎండీఎంఏ, మెథ్ వేరియంట్ డ్రగ్స్ బెంగళూరు, చెన్నై నుంచి కేరళలోకి వస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. 590 కిలోమీటర్ల సముద్రతీరం కూడా డ్రగ్స్ సరఫరాకు రాచమార్గంగా మారింది. జర్మనీ, ఫ్రాన్స్, థాయిలాండ్ దేశాల నుంచి డార్క్‌వెబ్ ద్వారా క్రిప్టో కరెన్సీని విక్రయించి బదులుగా కొరియర్ల ద్వారా డ్రగ్స్ తెప్పిస్తున్నారు.నాలుగేళ్లలో 93,599 అరెస్టులు! కేరళలో 2023లో ఏకంగా 30,697, 2024లో 24,517 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. గత నాలుగేళ్లలో 87,101 కేసులు నమోదయ్యాయి. వీటిలో 93,599 మందిని అరెస్టు చేశారు. అంతకుముందు నాలుగేళ్లలో 37,228 కేసులు నమోదవగా 41,378 మందిని అరెస్టు చేసినట్టు సీఎం విజయన్ అసెంబ్లీలో చెప్పారు. గత జనవరిలో 2,000 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి.క్యాండీలు, ఐస్క్రీంల రూపంలో... సింథటిక్ డ్రగ్స్ వాడేవారిలో సమాజంలోని అన్నివర్గాల వారూ ఉన్నారు. విద్యార్థుల నుంచి వైద్యుల దాకా వాటికి బానిసలవుతున్నారు. ఎవరూ గుర్తు పట్టకుండా చాక్లెట్ల నుంచి ఐస్క్రీంల దాకా నానారకాలుగా వీటిని విక్రయిస్తున్నారు. పైగా వీటికి విద్యాసంస్థలే అడ్డాలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దాంతో తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. తమ పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారేమో తేల్చుకోవడానికి టెస్ట్ కిట్లు కొనుగోలు చేస్తున్నారు. దాంతో వాటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.సూపర్‌బైక్‌లపై డెలివరీ... స్మార్ట్ ఫోన్లో, వాట్సాప్ గ్రూప్‌లోనూ మెసేజ్ చేస్తే పావుగంటలోపే సూపర్ బైక్‌లపై వచ్చి మరీ డ్రగ్స్ డెలివరీ చేసే స్థాయికి కేరళ ఎదిగిందని అసెంబ్లీలో విపక్ష నేత ఇటీవలే ఎద్దేవా చేశారు. పెడ్లర్లు డ్రగ్స్ సరఫరాకు తప్పుడు/నకిలీ నంబర్ ప్లేట్లున్న సూపర్‌బైక్‌లను వాడుతున్నారు. పోలీసులకు చిక్కకుండా వాటిపై మెరుపు వేగంతో దూసుకెళ్తున్నారు. తోటి పెడ్లర్ల పోటీని తట్టుకునేందుకు, వేగంగా సరకు డెలివరీకి రాత్రిళ్లు ఈ బైక్‌లను వాడుతున్నట్టు ఎక్సయిజ్, పోలీసు విభాగాలు చెబుతున్నాయి. డ్రగ్స్ ముఠాలు 18–24 ఏళ్ల వారినే డెలీవరీకి ఎంచుకుంటున్నారు. ఒక ప్యాకెట్‌కు రూ.1,000, రోజంతా డెలీవరీ చేస్తే రూ.4,000 ఇస్తున్నారు. ఫ్యామిలీ అని భ్రమింపజేసేలా బైక్ వెనక మహిళను కూర్చోబెట్టుకుంటున్నారు. టీనేజర్లనే డ్రగ్స్ పెడ్లర్లుగా ఈ ముఠాలు వాడుకుంటున్నాయి. పోకిరీలతో పరిచయాలు కాకుండా తల్లిదండ్రులే తమ పిల్లలపై కన్నేసి ఉంచాలి– రిటైర్డ్ ఎస్పీ కేజీ సిమాన్ కేరళలో పదేళ్ల విద్యార్థులు కూడా గ్యాంగ్ ఫైట్లకు దిగుతున్నారు. కనీసం 10 నుంచి 15 క్రిమినల్ కేసులున్న విద్యార్థి నాయకులను ఆదర్శంగా తీసుకుంటున్నారు– కేరళ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‘‘అత్యధిక అక్షరాస్యతా రేటు, ఉన్నత విద్యార్హతలున్నా ఉపాధి లేక కేరళలో యువత నైరాశ్యంతో డ్రగ్స్ బారిన పడుతోంది’’ – ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) ఆసియా–పసిఫిక్ రీజియన్ మాజీ సలహాదారు జి.ప్రమోద్‌కుమార్– సాక్షి, నేషనల్ డెస్క్ -
మావోలకు లొంగుబాటే శరణ్యమా?
సాక్షి, హైదరాబాద్: భద్రతా బలగాల భారీ వేట.. వృద్ధాప్యానికి చేరిన మావోయిస్టు (Maoist) అగ్ర నాయకులు.. తరుముకొస్తున్న ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్... వెరసి అన్నల్లో అంతర్మథనం మొదలైందనే చర్చ జరుగుతోంది. దశాబ్దాల ఉద్యమ చరిత్ర కలిగిన మావోయిస్టులకు గత మూడేళ్లుగా కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒక్కో ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో పూర్తి పట్టున్న ప్రాంతాలు సైతం సాయుధ పోలీసు బలగాల చేతిలోకి వెళ్లిపోతున్నాయి. దీంతో కొందరు మావోయిస్టులు లొంగుబాట పట్టారు. గత నెలన్నరరోజుల్లో తెలంగాణ (Telangana) పోలీసుల ఎదుట కొందరు కీలక నాయకులు లొంగిపోయిన విషయం తెలిసిందే.ఇటీవల మావోయిస్టు పార్టీ డీవీసీఎం పుల్సం పద్మ అలియాస్ ఊరే అలియాస్ గంగక్క ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. ఈమె దివంగత మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ భార్య. పద్మ 27 ఏళ్ల తన అజ్ఞాత జీవితాన్ని విడిచి 52 ఏళ్ల వయసులో జనజీవన స్రవంతిలో కలిశారు. అలాగే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొసా ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్ వంజెం కేషా అలియాస్ జిన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఎదుట లొంగిపోయింది. లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలకు కొందరు ఆకర్షితులవుతున్నారు.మరోవైపు మావోయిస్టు పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం, ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో కేషా లొంగిపోయిందని...ఆమె లొంగుబాటు సందర్భంగా అంబర్ కిశోర్ ఝా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు కేషాతోపాటు ఇటీవల కొందరు మావోయిస్టుల లొంగుబాట్ల వెనుకున్న పరిస్థితికి అద్దం పడుతున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇలా పలు కీలక స్థానాల్లో పనిచేసిన మావోయిస్టు సీనియర్ నాయకులు వరుస లొంగుబాట్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణలో గతేడాది 41 మంది సరెండర్ 2024లో తెలంగాణ పోలీసుల ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఒకరు స్పెషల్ జోనల్ కమిటీ, ఒకరు స్టేట్ కమిటీ సభ్యుడు, 16 మంది ఏరియా కమిటీ సభ్యులు, మిగిలినవారు పలు కేడర్లకు చెందినవారు. 85 మంది మావోయిస్టులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. నాయకుల వయో‘భారం’మావోయిస్టు పార్టీకి గుండెకాయ వంటి సెంట్రల్ కమిటీ సభ్యుల్లో దాదాపు అంతా ఐదు పదుల వయసు దాటినవారే ఉన్నారు. మావోయిస్టులను ముందుండి నడిపించాల్సిన అగ్రనాయకత్వం వయోభారంతోపాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. పైగా తెలంగాణ రాష్ట్ర కమిటీలోనూ స్థానికులకంటే ఇతర రాష్ట్రాలవారే ఎక్కువగా ఉన్నారు. వీరిలోనూ కీలక నేతలు కూడా వయసులో పెద్దవారే. వీరంతా ప్రస్తుతం సాయుధ పోలీసు బలగాల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనను సమర్థంగా ఎదుర్కోలేని పరిస్థితి. ఇలా ప్రతి అంశంలోనూ మావోయిస్టులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో కిందిస్థాయి నాయకత్వానికి భరోసా ఇచ్చి నడిపించేవారు లేకుండాపోయారు. మరికొన్ని ప్రధాన లొంగుబాట్లు ఇలా...ఈ ఏడాది ఫిబ్రవరి 12న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ ఎదుట ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ ఏడాది జనవరి 18న చర్ల పోలీస్‌స్టేషన్‌లో కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ ఎదుట ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ ఏడాది జనవరి 11న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్‌ఖేర్ ఎదుట ఒక మావోయిస్టు లొంగిపోయాడు. ఈ ఏడాది జనవరి 2న మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ భార్య విమల చంద్ర సీదం అలియాస్ తారక్క గడ్చిరోలిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు అలువ స్వర్ణ 2024 డిసెంబర్ 25న ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. అక్టోబర్ 2, 2024లో పెదబయలు ఏరియా కమిటీకి చెందిన 17 మంది మావోయిస్టులు పాడేరు జిల్లా ఎస్పీ అమిత్‌బర్దర్ ఎదుట లొంగిపోయారు. డిసెంబర్ 10 2023న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాల్లో 20 మంది మావోయిస్టులు స్థానిక ఎస్పీ ఎదుట లొంగిపోయారు. జనవరి 1, 2022న సుక్మా జిల్లా పోలీసుల ఎదుట 44 మంది లొంగిపోయారు. జనవరి 28, 2022న విశాఖపట్నం పోలీసుల ఎదుట 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు. -
Sakshi Excellence Awards 2025: సినీ ప్రతిభకు క్లాప్స్
తెలుగు ప్రజల ప్రాథమిక వినోదం సినిమా. ప్రతి శుక్రవారం కొత్త రిలీజుకై ఎదురు చూసే ప్రేక్షకులు తమ ఇష్టాఇష్టాలతో జాతకాలు మారుస్తుంటారు. వీరిని మెప్పించేందుకు హీరో, హీరోయిన్లు, నిర్మాత–దర్శకులు అనుక్షణం కొత్త ఆలోచనలు చేస్తుంటారు. 2023 ఎన్నో ఘనవిజయాలను చూసింది. అలాగే 2024లోనూ తెలుగు సినిమా ఘన విజయాలు చూసింది... ఘనతలు సాధించింది. చంద్రమోహన్ వంటి గొప్ప నటుణ్ణి కోల్పోయింది. అందుకే చంద్రమోహన్‌కు నివాళి అర్పిస్తూ ఈ వేడుకను నిర్వహించింది ‘సాక్షి’. వేయి చిత్రాల్లో నటించిన గొప్ప నటి రమాప్రభకు ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ బహూకరించడం తనను తాను గౌరవించుకోవడంగా భావిస్తోంది ‘సాక్షి’. మాతో పాటు మీరూ క్లాప్స్ కొడుతూ వేడుకలోకి రండి.‘సాక్షి’ టీమ్‌కి ధన్యవాదాలు. యాక్చువల్లీ... ఇది నాకు సర్ప్రైజ్. ఈ అవార్డుని అసలు ఊహించలేదు. నేను కాలేజీలో లెక్చరర్‌గా చేస్తూ... జాబ్ వదిలేసి సినిమాల్లోకి వద్దామనుకున్నప్పుడు ... నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన నా గురువు రామ్మోహన్రావుగారికి ఈ అవార్డు అంకితం ఇస్తున్నాను. థ్యాంక్యూ... సార్. మీ లవ్ అండ్ సపోర్ట్‌కి. – 2024 ‘తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న సందర్భంగా దర్శకుడు సుకుమార్∙అవార్డు అందుకుంటున్న సుకుమార్ మా హీరో బన్నీ (అల్లు అర్జున్), నిర్మాతలు నవీన్, రవిగార్లు, దేవిశ్రీ ప్రసాద్‌లతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ఎంతో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. ‘పుష్ప 2’ థ్యాంక్స్ మీట్లో నేను కొందరికి థ్యాంక్స్ చెప్పలేకపోయాను. సెట్స్‌లో నాతోపాటు ఏకధాటిగా పని చేసిన పాండు, ఆర్ట్ అసిస్టెంట్ మధు, నాతోపాటు ఐదేళ్లు వేరే సినిమా చేయకుండా పని చేసిన కూలీ గ్యాంగ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. సహ నిర్మాతలు ప్రవీణ్, సతీష్గార్లు, ప్రశాంతిగారికి థ్యాంక్స్. – ‘పుష్ప 2’కి పాపులర్ డైరెక్టర్ అవార్డు అందుకున్న సందర్భంగా సుకుమార్నా సినిమా ప్రయాణం చాలా పెద్దది. నేను ఇండస్ట్రీకి వచ్చి 63 సంవత్సరాలు అయింది. ఈ పెద్ద ప్రయాణంలో ఐదు తరాలతో కలిసి నటించాను. అలాంటి నాకు ఈ జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చినందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి, భారతీగారికి ధన్యవాదాలు. సరైన సమయంలో... సరైన వయసులో నాకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ భారతమ్మా. – నటి రమాప్రభ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ సందర్భంగా దివంగత చంద్రమోహన్‌గారికి నివాళి అర్పిస్తూ, మా కుటుంబాన్ని ఆహ్వానించినందుకు ‘సాక్షి’ మీడియా గ్రూప్‌కి కృతజ్ఞతలు. నేను, మా పెద్దమ్మాయి మీనా మోహన్, మా చిన్నమ్మాయి డాక్టర్ మాధవి హైదరాబాద్‌లో లేకపోవడం వల్ల వ్యక్తిగతంగా ఈ వేడుకకి హాజరు కాలేకపోయాం. మా తరఫున మా మేనల్లుడు శివలెంక కృష్ణప్రసాద్ ఈ వేడుకలో పాల్గొని, మా అందరి తరఫున కృతజ్ఞతలు చెబుతారు. – జలంధర, చంద్రమోహన్ సతీమణిచంద్రమోహన్గారి రెండో అక్క కొడుకుని నేను. 1978లో ‘సీతామాలక్ష్మి’ సినిమా సమయంలో ఆయన వద్దకు నేను ఉద్యోగం కోసం వెళ్లాను. అప్పుడు ఆయన నా వ్యక్తిగత విషయాలు చూసుకో అన్నారు. అలా మావయ్య వద్ద చేరాను. ‘నిర్మాత కావొద్దు... టెక్నీషియన్‌గా అయినా పర్వాలేదు’ అని కూడా ఆయన అన్నారు. కానీ, నేను మాత్రం నిర్మాతగా నా తొలి సినిమానే మావయ్య, రాజేంద్రప్రసాద్‌లతో ‘చిన్నోడు పెద్దోడు’ తీశా. ఆ తర్వాత బాలకృష్ణగారితో ‘ఆదిత్య 369’తో పాటు నాలుగు సినిమాలు చేశాను. ఈ మధ్య కాలంలో ‘యశోద’ మూవీ తీశాను. చంద్రమోహన్‌గారు 1965లో ఇండస్ట్రీకి రాగా 1966లో మొదటి మూవీ చేశారు. మన తెలుగు వాళ్లే కాకుండా మిగతా భాషల్లో కూడా ఆయనకి అప్రిషియేషన్ ఉండేది. శివాజీ గణేశన్, ఎంజీఆర్గార్లతో పాటు అందరూ ఆయన్ని అభినందించేవారు. 1977–78 నుంచి ఆయన పూర్తి స్థాయిలో హీరోగా మారి దాదాపు 160 సినిమాలు చేశారు. దాదాపు 54 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఎన్నో పాత్రలు వేశారు. మావయ్యగారి ‘సుఖ దుఃఖాలు’ మూవీ చూసి, మహానటుడు ఎస్వీ రంగారావుగారు మావయ్యతో ‘బాంధవ్యాలు’ అనే సినిమా నిర్మించారు. చంద్రమోహన్గారిలాంటి మంచి నటుడికి, మంచి వ్యక్తికి మేనల్లుడు కావడం నా అదృష్టం. మావయ్య నటనని, చిత్రసీమకు ఆయన చేసిన సేవలను పురస్కరించుకుని గుర్తింపు ఇచ్చినందుకు ‘సాక్షి’ మేనేజ్మెంట్కి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు. – నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‘పుష్ప 2’ చిత్రానికి ఇది తొలి అవార్డు. ‘సాక్షి’ అవార్డుతోప్రారంభం అయింది. ఇక్కడి నుంచి ఇంకా చాలా అవార్డులు రావాలని, వస్తాయని నమ్ముతున్నాను. పదేళ్ల క్రితం ‘శ్రీమంతుడు’ చిత్రానికి ఇదే వేదికపై ఇదే ‘సాక్షి’ అవార్డుని భారతీగారు తన గోల్డెన్ హ్యాండ్స్‌తో ఇచ్చారు. అప్పటి నుంచి మా ప్రయాణం సినిమా సినిమాకి పెరుగుతూ వస్తోంది. ‘సాక్షి’ మొదటి అవార్డుతో మొదలైన మా ప్రయాణంలో ఇప్పటికి మా మైత్రీ మూవీ మేకర్స్‌కి దాదాపు 50 నుంచి 100 అవార్డులు వివిధ సంస్థల నుంచి వచ్చాయి. అందులో జాతీయ అవార్డు కూడా ఉండటం గొప్పగా భావించే అంశం. థ్యాంక్యూ వెరీ మచ్ టు ‘సాక్షి’. ‘పుష్ప 2’ని బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపిక చేసిన జ్యూరీకి కృతజ్ఞతలు. మా హీరో అల్లు అర్జున్‌కి బెస్ట్ యాక్టర్‌గా ‘సాక్షి’ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. అల్లు అర్జున్‌గారు ఇక్కడ ఉండి ఉంటే తప్పకుండా వచ్చి అవార్డు తీసుకునేవారు. ఆయన తర్వాతి సినిమా ట్రాన్స్ఫర్మేషన్ కోసం సిద్ధం అవుతుండటం వల్ల రాలేకపోయారు. – నిర్మాత యలమంచిలి రవిశంకర్‘లక్కీ భాస్కర్’లో నా నటనని గుర్తించి ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉంది. ఇది నాకు తొలి అవార్డు కావడంతో ఎక్స్ట్రా స్పెషల్. మా నిర్మాతలు చినబాబు, నాగవంశీగార్లకు, సుమతి వంటి మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ వెంకీ అట్లూరిగారికి థ్యాంక్స్. ఈ అవార్డు నా జీవితంలో ఓ భాగం. – హీరోయిన్ మీనాక్షీ చౌదరి నాకు ఇది తొలి అవార్డు. ‘క’ సినిమాని నిర్మించిన చింతా గోపాలకృష్ణా రెడ్డిగారికి, నాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శకులు సుజీత్, సందీప్‌లకు ధన్యవాదాలు. ‘క’కి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ థ్యాంక్స్. పీపుల్స్ ఛాయిస్ అవార్డు రావడం ఆనందంగా ఉంది. నన్ను ఆదరించి, సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. నన్ను గుర్తించి అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు. – హీరో కిరణ్ అబ్బవరంమా ‘హను–మాన్’ సినిమానిప్రోత్సహించిన ఆడియన్స్‌కు, ఎఫర్ట్స్ పెట్టిన దర్శకుడు ప్రశాంత్, మమ్మల్ని నమ్మిన నిర్మాత నిరంజన్ రెడ్డిగారికి థ్యాంక్స్. ఇలా అవార్డ్స్‌తో ప్రతిభనుప్రోత్సహిస్తున్నందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి థ్యాంక్స్. సుకుమార్‌గారి చేతుల మీదగా అవార్డు అందుకోవడం హ్యాపీ. నేపాల్, చైనా–టిబెట్ బోర్డర్ లొకేషన్స్‌లో మా సినిమా షూటింగ్ జరిపినప్పుడు అక్కడి వారు... ఇది ఏ సినిమా అంటే.. తెలుగు సినిమా అన్నాం. వెంటనే వాళ్లు ‘హో పుష్ప’ అన్నారు. మేం ‘పుష్ప’ టీమ్ కాదు కానీ ‘పుష్ప’ సినిమా తీసిన ల్యాండ్ నుంచి వచ్చాం అని చె΄్పాం. – హీరో తేజ సజ్జా‘క’ సినిమాకు మాకు అవకాశం ఇచ్చిన నిర్మాత గోపాలకృష్ణా రెడ్డిగారు, మమ్మల్ని నమ్మిన కిరణ్ అబ్బవరంగారికి థ్యాంక్స్. ‘సాక్షి’కి చాలా థ్యాంక్స్. ఇది మా ఫస్ట్ అవార్డు. మాకెంతో ప్రత్యేకం. కంటెంట్‌ను నమ్మి సినిమా తీద్దామనుకున్నాం. స్ట్రాంగ్ కంటెంట్ చెబుదామనుకున్నాం... కంటెంట్‌ను నమ్మి చేసినందుకు మమ్మల్ని ఇక్కడివరకు తీసుకొచ్చిన తెలుగు ఆడియన్స్‌కు ధన్యవాదాలు. ఈ అవార్డును వారికి అంకితం ఇద్దామనుకుంటున్నాం. – దర్శకులు సుజిత్ అండ్ సందీప్ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ఇచ్చిన ‘సాక్షి’కి థ్యాంక్స్. మా అమ్మానాన్నలకు, యూ ట్యూబ్ ద్వారా ఎంతో నేర్పించిన షార్ట్ ఫిల్మ్ మేకర్స్‌కి, ఎలా సినిమా తీయాలో నేర్పించిన ప్రతి దర్శకుడికి ధన్యవాదాలు. ప్రతి డెబ్యూ డైరెక్టర్ పడే కష్టాలన్నీ పడ్డాను. రైట్ స్క్రిప్ట్‌కి, రైట్ ప్రొడ్యూసర్ అవసరం అంటారు. నిహారిక కొణిదెల, ఫణి ఎడపాకగార్ల ద్వారా ఆ అవకాశం దక్కింది. ‘ఇది చిన్న సినిమా (‘కమిటీ కుర్రోళ్లు) కాదు.. ఎంత బడ్జెట్ కావాలో అంత పెడతాం’ అన్నారు. అందుకే ఈ అవార్డు నిహారిక, ఫణిగార్లకు అంకితం. – దర్శకుడు యదు వంశీ‘నాకు ఫస్ట్ క్లాస్‌లో సాంస్కృతిక విభాగంలో బహుమతి ఇచ్చారు. నాకు ఊహ తెలిశాక అది ఫస్ట్ అవార్డు కావడంతో ఇప్పటికీ గుర్తు. ఇప్పుడు నా సినిమా (‘డ్రింకర్ సాయి’)కి హీరోగా ‘సాక్షి’ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. ‘సాక్షి’కి థ్యాంక్స్. ఈ అవార్డు జీవితాంతం గుర్తుండిపోతుంది. 2025లో నా తొలి హ్యాపియెస్ట్ మూమెంట్ ఇది. – హీరో ధర్మఇలాంటి అవార్డులు ఇచ్చినప్పుడు సరికొత్త కథలు రావడానికిప్రోత్సాహకంగా ఉంటుంది. దర్శకుడిగా నాకిది (‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’) తొలి సినిమా అయినప్పటికీ చాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్‌కి థ్యాంక్స్. – డైరెక్టర్ దుష్యంత్ఈ అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి థ్యాంక్స్. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ని ఆదరించిన ప్రేక్షకులకూ మరోసారి ధన్యవాదాలు. – నిర్మాత ధీరజ్ మొగిలినేనిమా సినిమాకి అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి, భారతీ మేడమ్‌కి ధన్యవాదాలు. – హీరో సుహాస్వ] ూ దర్శక–నిర్మాతలకు, గీతా ఆర్ట్స్‌కి, ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ని సపోర్ట్ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్ – హీరోయిన్ ఎన్. శివాని‘హాయ్ నాన్న’ విడుదలై చాలా రోజులు గడిచిపోయాయి. కానీ, ఆ సినిమా గెలుచుకుంటున్న ప్రేమ, అవార్డులు, రివార్డులు... ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. మరోసారి ఈ మూవీని సెలబ్రేట్ చేస్తున్నందుకు ‘సాక్షి’కి, జ్యూరీ మెంబర్లకు కృతజ్ఞతలు. మా సినిమాని వివిధ విభాగాల్లో ఎంపిక చేసినందుకు, అలాగే నన్ను బెస్ట్ యాక్టర్‌గా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. నేను వేరే దేశంలో ఉండటం వల్ల అవార్డు ఫంక్షన్‌కి రాలేకపోయాను. – హీరో నాని‘హాయ్ నాన్న’ విడుదలై ఏడాదికి పైగా అయినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులు అదే అభిమానం చూపిస్తుండటం అపురూపమైనది. బెస్ట్ యాక్ట్రస్‌గా ఈ అవార్డు ఇచ్చినందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు. నేను ఫంక్షన్‌కి రానందుకు క్షమించాలి. నాని, శౌర్యువ్, బేబి కియారా, నిర్మాతలు, సంగీత దర్శకుడు... ఇలా వీరందరూ లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు. – హీరోయిన్ మృణాల్ ఠాకూర్‘హాయ్ నాన్న’కి ఈ అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి, భారతీగారికి ధన్యవాదాలు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నాం. ఫిల్మ్‌ఫేర్, ఐఫా, సైమా అవార్డులొచ్చాయి. వీటన్నిటికన్నా ఒక తెలుగు అవార్డు (సాక్షి ఎక్సలెన్స్) అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుని నా నిర్మాతలకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకు అంకితం ఇస్తున్నా... ప్రత్యేకించి నానీగారికి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని నమ్మి ఇలాంటి ఒక సున్నితమైన కథ, అందులోనూ ‘దసరా’ లాంటి సినిమా తర్వాత ఆయన ‘హాయ్ నాన్న’ని ఒప్పుకుని చేసినందుకు రుణపడి ఉంటాను. – డైరెక్టర్ శౌర్యువ్మా సినిమాకి అవార్డు ఇచ్చిన సాక్షి యాజమాన్యానికి, జ్యూరీ మెంబర్లకు థ్యాంక్స్. ‘బలగం’ అనేది పీపుల్స్ ఛాయిస్ మూవీ. ఈ సినిమా క్రెడిట్ వేణుకి దక్కుతుంది. – నిర్మాత హన్షితా రెడ్డి‘బలగం’ చిత్రానికి పీపుల్స్ ఛాయిస్ విభాగంలో అవార్డు అందించిన ‘సాక్షి’వారికి థ్యాంక్స్. వైఎస్ రాజశేఖర రెడ్డిగారు మా నాన్నకి చాలా క్లోజ్. మా ఆటోమొబైల్ బిజినెస్‌లో ఓ షాప్ ఓపెనింగ్‌ని రాజశేఖర రెడ్డిగారి చేతుల మీదుగా చేయించాలని మా నాన్న మూడు నెలలు వేచి ఉండి, ఆయన చేతుల మీదుగానేప్రారంభింపజేశారు. ఇప్పుడు మేం నిర్మించిన ‘బలగం’కి వాళ్ల సంస్థ (సాక్షి) నుంచి మాకు అవార్డు రావడం, అది కూడా మా ఫస్ట్ మూవీ కావడం హ్యాపీగా ఉంది. – నిర్మాత హర్షిత్ రెడ్డి‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ టెన్త్ ఎడిషన్‌లో అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు మాకో మధురమైన అనుభూతి. ‘బేబీ’ సక్సెస్‌కు కారణమైన నా స్నేహితుడు సాయి రాజేశ్‌కు మరోసారి కృతజ్ఞతలు. – నిర్మాత ఎస్కేఎన్ ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డు తీసుకోవడం, పైగా బెస్ట్ క్రిటికల్లీ ఎక్లై్లమ్డ్ ఫిల్మ్‌కు తీసుకోవడం అనేది ఇంకా సంతోషం. – దర్శకుడు సాయి రాజేశ్2023 నా లైఫ్‌లో స్పెషల్ ఇయర్. మా ‘బేబీ’ ద్వారా మాకు చాలా లవ్, ఎంకరేజ్మెంట్ దొరికింది. ‘బేబీ’ సినిమా నా లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘బెస్ట్ డెబ్యూ యాక్ట్రస్’ అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి ధన్యవాదాలు. ఈ అవార్డు తీసుకోవడం చాలా ఎంకరేజింగ్‌గా, మోటివేటివింగ్గా ఉంది. – హీరోయిన్ వైష్ణవీ చైతన్య ‘బలగం’ వంటి ఒక మించి కథని నమ్మి నాకు అన్ని రకాలుగా సహకారం అందించి, నన్ను ముందుకు నడిపించిన ‘దిల్’ రాజు, హన్షిత, హర్షిత్, శిరీష్గార్లకు ధన్యవాదాలు. జీవితాంతం వీళ్లందరికీ రుణపడి ఉంటాను. జీవితాంతం గుర్తుంచుకునే మరపురాని అనుభూతిని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్... అలాగే వారికి జన్మజన్మలు రుణపడి ఉంటాను. మా ‘బలగం’ విజయం కానీ, ఏ అవార్డు అయినా కానీ మా యూనిట్ అందరికీ దక్కుతుంది. – దర్శకుడు వేణు యెల్దండినన్ను నమ్మిన నిర్మాత నాగవంశీగారికి ఈ అవార్డు (బెస్ట్ డెబ్యూ డైరెక్టర్)ని అంకితం ఇస్తున్నాను. అలాగే మా ‘మ్యాడ్’ ముగ్గురు హీరోలకి, నిర్మాత చినబాబుగారికి, ఎడిటర్ నవీన్ నూలిగార్లకు థ్యాంక్స్. ‘మ్యాడ్ 2’ కూడా రాబోతోంది. టీజర్ కూడా విడుదలైంది. ఈ చిత్రం కూడా తొలి భాగం అంత క్రేజీగా ఉంటుంది. దయచేసి అందరూ చూడండి. ఇది నా మొదటి అవార్డు.. చాలా ప్రత్యేకం. ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు. – డైరెక్టర్ కల్యాణ్ శంకర్ -
స్మగ్లింగ్.. కోడి గుడ్డేం కాదు!
కెనడా, మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమంగా తరలిస్తూ సరిహద్దుల్లో భారీగా పట్టుబడుతున్న ఉత్పత్తుల సంఖ్య కొద్ది నెలలుగా భారీగా పెరిగిపోయింది. అయితే అవేమిటో తెలుసా? ఎప్పట్లా ఫెంటానిలో, ఇతరేతర డ్రగ్సో కాదు. పౌల్ట్రీ ఉత్పత్తులు! ఆశ్చర్యంగా ఉన్నా నిజమిది. పైగా వాటిలోనూ సింహ భాగం గుడ్లే కావడం విశేషం!! నానాకష్టాలూ పడి డ్రగ్స్‌ను దేశం దాటించేకంటే స్మగ్లింగ్ నెట్వర్కులకు ఇదే మాంచి లాభసాటి బేరంగా కన్పిస్తోందట. అమెరికాను అతలాకుతలం చేస్తున్న గుడ్ల కొరత తీవ్రతకు ఈ ఉదంతం అద్దం పడుతోంది. కెనడా, మెక్సికోల నుంచి అమెరికాలోకి ఫెంటానిల్ తదితర డ్రగ్స్ విచ్చలవిడిగా స్మగ్లింగ్ అవుతుండటం పరిపాటి. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇది డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ప్రచారాస్త్రంగా మారింది కూడా. కెనడాపై టారిఫ్‌ల యుద్ధానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా కూడా ఫెంటానిల్ నిలిచింది. కానీ కొద్ది నెలలుగా కెనడా నుంచి గుడ్లు తదితర పౌల్ట్రీ ఉత్పత్తుల స్మగ్లింగ్ డ్రగ్స్‌ను కూడా మించిపోయిందంటూ అమెరికా అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. గుడ్లే అమెరికన్లకు ప్రధానమైన బ్రేక్‌ఫాస్ట్. ఉదయాన్నే ఆమ్లెట్లుగానో, మరో రూపంలో గుడ్లు తిన్నాకే వారికి రోజు మొదలవుతుంది. వారి బ్రేక్‌ఫాస్ట్ అవసరాలు కాస్తా బ్లాక్మార్కెటర్లకు కాసుల పంటగా మారుతుండటం విశేషం!డ్రగ్స్ కంటే 10 రెట్లు! 2024 అక్టోబర్‌తో పోలిస్తే ప్రస్తుతం కెనడా నుంచి డెట్రాయిట్ గుండా అమెరికాలోకి అక్రమంగా గుడ్లు తరలిస్తున్న వారి సంఖ్య 36 శాతం పెరిగినట్టు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ గణాంకాలు చెబుతున్నాయి. ఇక మెక్సికో సరిహద్దులకు అతి సమీపంలో ఉండే శాన్‌డీగో వద్ద ఈ ఉదంతాలు ఏకంగా 158 శాతం పెరిగిపోవడం విశేషం. 2024 అక్టోబర్ నుంచి అమెరికా సరిహద్దులను దాటించే ప్రయత్నంలో పౌల్ట్రీ ఉత్పత్తులు పట్టుబడ్డ ఉదంతాలు 3,768కి పైగా నమోదయ్యాయి. ఇదే సమయంలో ఫెంటానిల్ పట్టుబడ్డ ఉదంతాలు కేవలం 352 మాత్రమే కావడం విశేషం. పెరుగుతున్న ఫ్లూ రిస్క్! బర్డ్ ఫ్లూ దెబ్బకు కొన్నేళ్లుగా ఉత్తర అమెరికా ఖండమంతా అతలాకుతలమవుతోంది. కెనడాలో దీని తీవ్రత తక్కువగా ఉన్నా అమెరికా బాగా ప్రభావితమైంది. అక్కడ రెండు మూడేళ్లుగా కోట్లాది కోళ్లను హతమార్చాల్సి వచ్చింది. ఇది క్రమంగా దేశవ్యాప్తంగా తీవ్ర గుడ్ల కొరతకు దారితీసింది. దాంతో గుడ్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. డజనుకు 5 డాలర్ల మార్కును దాటేసి ఆల్‌టైం రికార్డు సృష్టించాయి. షికాగో, శాన్ఫ్రాన్సిస్కో వంటి పలు ప్రధాన నగరాల్లోనైతే డజను గుడ్లు ఏకంగా 9 నుంచి 10 డాలర్ల దాకా పలుకుతున్న పరిస్థితి! గుడ్ల సంక్షోభం చేయి దాటిపోయిందని స్వయానా అధ్యక్షుడు ట్రంపే అంగీకరించారు! ఈ ఏడాది చివరకల్లా గుడ్ల ధరలు కనీసం మరో 50 శాతం దాకా పెరగవచ్చని అంచనా. దాంతో కొద్ది నెలలుగా స్మగ్లర్ల కన్ను గుడ్లపై పడింది. కెనడా నుంచి అమెరికాలోకి వాటి అక్రమ రవాణా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. అయితే దీనివల్ల బర్డ్ ఫ్లూతో పాటు ఇతరత్రా రోగాల రిస్కు పెరిగిపోతోందని అమెరికా ఆందోళన చెందుతోంది. కోళ్లు, గుడ్ల స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు కెనడా, మెక్సికో సరిహద్దుల వద్ద నిఘాను మరింత కఠినతరం చేయాలంటూ ట్రంప్ సర్కారు తాజాగా ఆదేశాలు జారీచేసింది!అమెరికాలో అద్దెకు కోళ్లు గుడ్ల సంక్షోభం పుణ్యమా అని అమెరికాలో ఇప్పుడు కోడి పెట్టలను అద్దెకిచ్చే సరికొత్త వ్యాపారం పుట్టుకొచి్చంది. అది ఇప్పుడక్కడ యమా జోరుగా సాగుతుండటం విశేషం. డజను గుడ్లకు 5 నుంచి 10 డాలర్ల దాకా పెట్టాల్సి రావడం అమెరికన్లను కలవరపరుస్తోంది. దీనికి బదులు ఇంటి పెరళ్లలో కోడిపెట్టలను సాకేందుకు వాళ్లు మొగ్గుచూపుతున్నారు. దాంతో దేశవ్యాప్తంగా కోడిపెట్టలకు చెప్పలేనంత డిమాండ్ ఏర్పడింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు రెంట్ ద చికెన్ వంటి పేర్లతో ఏకంగా కంపెనీలే పుట్టుకొచ్చాయి. ఆర్నెల్ల ప్రాతిపదికన కోడిపెట్టలను అద్దెకిస్తున్నాయి. కనీస అద్దె ప్యాకేజీలు 300 డాలర్ల నుంచి మొదలవుతున్నాయి. ఇందులో భాగంగా రెండు పెట్టలతో పాటు వాటికి ఆర్నెల్ల పాటు కావాల్సిన దాణాను కూడా కంపెనీలే ఇస్తాయి. కోళ్ల గూడు కూడా సమకూరుస్తాయి. ఆరోగ్యకరమైన పెట్ట వారానికి ఐదారు దాకా గుడ్లు పెడుతుంది. ఆ లెక్కన రెండు కోళ్లు ఆర్నెల్లకు కనీసం 250 గుడ్లు పెడతాయన్నమాట. వాటిని మార్కెట్లో కొనాలంటే ప్రస్తుత రేట్లను బట్టి కనీసం 80 నుంచి 160 డాలర్లకు పైనే పెట్టాల్సి ఉంటుంది. కోళ్లను సాకడం ద్వారా ఏ రోజుకు ఆ రోజు తాజా గుడ్లు దొరుకుతుండటం అమెరికన్లను బాగా ఆకర్షిస్తోంది. అంతేగాక గుడ్లను పొదిగించి కోళ్ల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్నారు. కాంట్రాక్టు ముగిశాక అవి వారికే సొంతమవుతున్నాయి. వాటిని అద్దెకిస్తూ సైడ్ వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొదవ లేదు. దొరికితే జరిమానాలుఅమెరికాలోకి గుడ్లు, ఇతర ప్రాసెస్ చేయని పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణా చట్టవిరుద్ధం. ఫ్లూ తదితర ఆందోళనలే ఇందుకు కారణం. వీటిని దేశంలోకి తరలించే ప్రయత్నంలో పట్టుబడితే 300 డాలర్ల దాకా జరిమానా విధిస్తారు. ‘‘ఇరు దేశాలకూ కొన్నేళ్లుగా నిద్ర లేకుండా చేస్తున్న ఫెంటానిల్ వంటి డ్రగ్స్ కంటే కూడా కెనడా నుంచి అమెరికాలోకి గుడ్ల అక్రమ రవాణాయే పెరిగిపోతోందంటే ఆశ్చర్యంగానే ఉంది. కానీ కళ్లెదుట కన్పిస్తున్న వాస్తవమిది’’ అన్నారు కెనడా చాంబర్ ఆఫ్ కామర్స్ పాలసీ చీఫ్ మాథ్యూ హోమ్స్. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Sakshi Excellence Awards 2025: సామాజిక స్ఫూర్తికి సెల్యూట్
సమాజం ఆర్థిక సూత్రాల పై ఆధారపడి నడుస్తున్నట్టు కనిపించినా దానికి హృదయం, స్పందన ఇచ్చేది మాత్రం సామాజిక, సాంస్కృతిక అంశాలే. ‘ఇలా మారాలి’ అని సామాజిక సేనానులు బోధ చేస్తే, ‘ఇలా వికాసం పొందాలి’ అని సాంస్కృతిక సారథులు దారి చూపుతారు. సామాజిక చైతన్యం, సాంస్కృతిక వికాసం లేని సమాజంలో సంపద కేవలం పటాటోపం మాత్రమే. అందుకే అర్థవంతమైన సమాజం కోసం గత పది సంవత్సరాలుగా సాక్షి మీడియా గ్రూప్ ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ నిర్వహిస్తోంది. సామాజిక రంగంలో, కళారంగంలో విశిష్ట రీతిలో పని చేస్తున్న వారికి అవార్డ్స్ ఇచ్చి గౌరవిస్తోంది. ఈ పరంపరలో 2023కు గాను ఫిబ్రవరి 28 శుక్రవారం హైదరాబాద్‌లో ఘనమైన వేడుక నిర్వహించింది. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో వై.ఎస్.భారతి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్లు, ఎడిటర్, విశిష్ట అతిథులు పాల్గొన్న వేడుక అవార్డు గ్రహీతలకు జీవితకాల అనుభూతిగా మారింది.సమాజంలో ఉన్నటువంటి అనేక మంది సేవకు గుర్తింపు రావడం అంటే సామాన్య విషయం కాదు. వారు ఆయా రంగాల్లో చేసిన సేవను గౌరవించడానికి ఈ అవార్డులు ఇస్తున్నారు. సమాజానికి సేవ చేసిన వారికి ఇలాంటి గౌరవం ఇవ్వడం అభినందనీయం. సాక్షి గ్రూప్‌నకు, ముఖ్యంగా భారతీరెడ్డి గారికి అభినందనలు.– బండారు దత్తాత్రేయ, హరియాణ గవర్నర్సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో భాగస్వామి కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవార్డుల కార్యక్రమంతో నాకు 10 ఏళ్ల అనుబంధం ఉంది. జ్యూరీలో నన్ను భాగస్వామిని చేసినందుకు కృతజ్ఞతలు. అసామాన్య ప్రతిభ చూపే వారిలో ఉత్తములను ఎంపిక చేయడం కత్తిమీద సాములాంటిది. ఇందుకోసం సాక్షి టీమ్ ఎంతో కష్టపడ్డారు. ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై రీసెర్చ్ చేసి పెద్ద నోట్స్ సిద్ధం చేశారు. మేం ఎలా ముందుకు సాగాలో తెలియజెప్పేందుకు వారు పడిన కష్టం ఎంతో గొప్పది. ఎలాంటి పక్షపాతం లేకుండా అవార్డులకు ఎంపిక చేసే విధానం సాక్షిలో నాకు కనిపించిన గొప్పదనం. అవార్డులు తీసుకున్న వారందరికీ నా అభినందనలు.– శాంతా సిన్హా, జ్యూరీ చైర్పర్సన్మట్టిని పట్టుకున్నా బంగారమే అవుతుందని నిరూపించాడు కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన మావురం మల్లికార్జున్‌రెడ్డి. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసిన తరువాత వ్యవసాయం మీదున్న ఆసక్తితో తన 12 ఎకరాల భూమికి తోడు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సేంద్రియ వ్యవసాయం ప్రారంభించారు. వరి, అల్లం, మిర్చి సాగు చేస్తూ మరోవైపు దేశీ ఆవులు, కోళ్లు పెంచుతూ సమీకృత వ్యవసాయానికిప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఆయనను ‘ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.మావురం మల్లికార్జున్ రెడ్డి, సేంద్రియ వ్యవసాయంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్‌గా పని చేస్తున్న హర్షవర్ధన్ ఒక డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే తన ప్రజా వైద్యశాలలో కేవలం ఒక్క రూపాయి ఫీజుతో కార్పోరేట్ హాస్పిటల్ స్థాయి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఏజెన్సీప్రాంత నిరుపేదలకు ఆయనొక ఆపద్బాంధవుడు. అవసరమైనవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సర్జరీలు చేస్తుంటారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న డాక్టర్ హర్షవర్థ్దన్ ను ‘ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.హర్షవర్థన్, ఆరోగ్య సంరక్షణచెక్కుచెదరని సంకల్పం ఉంటే సాధ్యం కానిదేమీ లేదు అని నిరూపించారు నెల్లూరుకు చెందిన సుహాస్. ఫార్మసీలో పీహెచ్డీ చేసి 3 లక్షల రూపాయల పెట్టుబడితో చిన్న ఐస్‌క్రీమ్ స్టోర్ప్రారంభించిన సుహాస్ ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో 120కి పైగా స్టోర్లకు విస్తరించారు. 14 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించారు. ఆర్గానిక్ ఐస్‌క్రీమ్ తయారు చేస్తూ ఆదరణ పొందారు. సుహాస్ బి షెట్టిని ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్మాల్ అండ్ మీడియం అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.సుహాస్ బి శెట్టి, చిన్న/మధ్య తరహా వాణిజ్యంవీధి బాలలను చేరదీసి ఆశ్రయం కల్పించి తగిన పౌష్టికాహారం అందించి బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలనే సమున్నత ఆశయంతో పని చేస్తోంది రెయిన్ బో హోమ్స్ప్రోగ్రాం సంస్థ్థ. దేశవ్యాప్తంగా పది నగరాల్లో ఇప్పటివరకు 14,996 మంది వీధి బాలలు, 5,557 మంది చిన్నారులు, యువతీ, యువకులకు ఆశ్రయం కల్పించింది. రెయిన్ బో హోమ్స్ ప్రోగ్రామ్ సంస్థను ‘ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.కె. అనురాధ, విద్యారంగంమట్టిని పట్టుకున్నా బంగారమే అవుతుందని నిరూపించాడు కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన మావురం మల్లికార్జున్‌రెడ్డి. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసిన తరువాత వ్యవసాయం మీదున్న ఆసక్తితో తన 12 ఎకరాల భూమికి తోడు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సేంద్రియ వ్యవసాయంప్రారంభించారు. వరి, అల్లం, మిర్చి సాగు చేస్తూ మరోవైపు దేశీ ఆవులు, కోళ్లు పెంచుతూ సమీకృత వ్యవసాయానికి ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఆయనను ‘ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.మావురం మల్లికార్జున్ రెడ్డి, సేంద్రియ వ్యవసాయంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్‌గా పని చేస్తున్న హర్షవర్ధన్ ఒక డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే తన ప్రజా వైద్యశాలలో కేవలం ఒక్క రూపాయి ఫీజుతో కార్పోరేట్ హాస్పిటల్ స్థాయి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఏజెన్సీప్రాంత నిరుపేదలకు ఆయనొక ఆపద్బాంధవుడు. అవసరమైనవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సర్జరీలు చేస్తుంటారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న డాక్టర్ హర్షవర్థ్దన్ ను ‘ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.హర్షవర్థన్, ఆరోగ్య సంరక్షణచెక్కుచెదరని సంకల్పం ఉంటే సాధ్యం కానిదేమీ లేదు అని నిరూపించారు నెల్లూరుకు చెందిన సుహాస్. ఫార్మసీలో పీహెచ్డీ చేసి 3 లక్షల రూపాయల పెట్టుబడితో చిన్న ఐస్‌క్రీమ్ స్టోర్ప్రారంభించిన సుహాస్ ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో 120కి పైగా స్టోర్లకు విస్తరించారు. 14 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించారు. ఆర్గానిక్ ఐస్‌క్రీమ్ తయారు చేస్తూ ఆదరణ పొందారు. సుహాస్ బి షెట్టిని ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్మాల్ అండ్ మీడియం అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.సుహాస్ బి శెట్టి, చిన్న/మధ్య తరహా వాణిజ్యంచదరంగంలో ఎత్తుకు పై ఎత్తు వేసి...ప్రత్యర్థిని చిత్తు చేయాలి.. అలాంటి టాలెంట్ పుష్కలంగా ఉన్న అర్జున్ చెస్‌లో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నారు. హన్మకొండకు చెందిన అర్జున్ గుజరాత్లో జరిగిన జాతీయ చాంపియన్ షిప్లో అండర్ 13 విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకుని తన విజయయాత్రనుప్రారంభించారు. 2015 ఏషియన్ యూత్ చాంపియన్ షిప్లో రజతం గెలిచి తొలి అంతర్జాతీయ పతకం సొంతం చేసుకున్నారు. 2018లో 14 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి తెలంగాణ నుంచి జీఎం హోదా పొందిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. అర్జున్ ను ‘యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్–స్పోర్ట్స్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.అర్జున్ ఎరిగైసి, క్రీడలుఅడవులు అంతరించి పర్యావరణ సంక్షోభం ఏర్పడుతున్న ఈ కాలంలో అడవినే సృష్టించడానికి ముందుకు వచ్చిన వ్యక్తి దుశర్ల సత్యనారాయణ. సూర్యాపేట జిల్లా రాఘవపురంలో 70 ఎకరాల వ్యవసాయ భూమిని అడవిగా మార్చేశారాయన. ఆయన కృషి ఫలితంగా లక్షల చెట్లు ఊపిరి తీసుకుంటూ ఉండగా వాటితో పాటు నెమళ్లు, జింకలు, నక్కలు, అడవి పందులు... నీడ పొందుతున్నాయి. పక్షులు, జంతువుల కోసం ఆ అడవిలోనే ఏడు చెరువులు తవ్వించిన సత్యనారాయణను ‘ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.దుశర్ల సత్యనారాయణ, పర్యావరణంభద్రాచలంకు చెందిన గొంగడి త్రిష క్రికెట్లో కొత్త తారగా అవతరించింది. ఎనిమిదేళ్ల వయసులో జిల్లాస్థాయి అండర్ 16 జట్టుకు ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ద సీరిస్’ గా నిలిచింది. పన్నెండేళ్ల వయసులో హైదరాబాద్ మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైన త్రిష బీసీసీఐ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు’ను గెలుచుకుంది. ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్న ఈ లెగ్ స్పిన్నర్ ఐసీసీ అండర్–19 మహిళల టి 20 వరల్డ్ కప్–2025లో సెంచరీ చేసి రికార్డులు బ్రేక్ చేసింది. గొంగడి త్రిషను ‘యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్– స్పోర్ట్స్ అవార్డు’తో సత్కరించింది సాక్షి.త్రిష, క్రీడలుఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన మద్దెబోయిన మానస పుట్టుకతోనే అంధురాలు. ఇరుగు పొరుగువారి మాటలకు మానసగాని ఆమె తల్లిదండ్రులుగాని కొంచెం కూడా వెరవలేదు. డిగ్రీ వరకు చదివిన మానస తానెవరికీ తక్కువ కాదు అని పోటీ పరీక్షలపై దృష్టి సారించారు.ఇంటి వద్దనే సొంతంగా ప్రిపరేషన్ మొదలు పెట్టి గ్రూప్–4 ఉద్యోగానికి ఎంపికై తన కలను నెరవేర్చుకున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన మానసను ‘ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎడ్యుకేషన్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.మద్దెబోయిన మానస, విద్యారంగంవరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తికి పుట్టుకతో జన్యుపరమైన బలహీనత ఉంది. అయినా స్కూల్లో తోటి విద్యార్థులతో సమానంగా ఆటల్లో పాల్గొనేది. ఆమె ప్రతిభను గుర్తించిన కోచ్ రమేశ్ పారా అథ్లెట్‌గా ట్రెయినింగ్ ఇచ్చారు. ఇక ఆ తరువాత మొదలైంది పతకాల వేట. 2024లో జపాన్ లో జరిగిన పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్ షిప్లో 400 మీటర్ల టి20 విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకోవడమే కాకుండా ప్రపంచ రికార్డును నెలకొల్పారు దీప్తి. దీప్తి జీవాంజిని స్పోర్ట్స్ కేటగిరిలో ‘యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.జీవాంజి దీప్తి, క్రీడలుపెద్ది శంకర్ గౌడ్ ‘రెడీ టు సర్వ్ ఫౌండేషన్’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి 2011లో వనస్థలిపురంలో ఒక ఓల్డేజ్ హోమ్ప్రారంభించారు. ఏ ఆసరా లేని వృద్ధులకు ఆశ్రయం కల్పించి ఉచిత భోజన, వైద్య సేవలు అందచేస్తోంది ఈ సంస్థ. ప్రముఖ హాస్పిటల్స్ యాజమాన్యాలను ఒప్పించి అక్కడి వైద్యుల చేత వృద్ధులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన మెడిసిన్స్ ఉచితంగా ఇస్తున్నారు. పెద్ది శంకర్ గౌడ్‌ను ‘యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ సోషల్ సర్వీస్’ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.పెద్ది శంకర్, సామాజిక సేవమద్దినేని ఉమామహేష్.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతున్న ఇరవయ్యేళ్ల షూటర్. స్వస్థలం విజయవాడ. బెంగుళూరులో జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో గోల్డు మెడల్ సాధించాడు. 2022లో జర్మనీలో జరిగిన ISSF జూనియర్ వరల్డ్ కప్‌లో, 2024లొ ఢిల్లీలో జరిగిన FISU వాల్డ్ యూనివర్సిటీ ఛాంపియన్ షిప్ మెన్స్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకాలు సాధించాడు. ఉమా మహేష్‌ను ‘స్పోర్ట్స్ కేటగిరిలో యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి.మద్దినేని ఉమా మహేష్, క్రీడలుఇస్రో మాజీ శాస్త్రవేత్తలైన పవన్ కుమార్ చందన, నాగభరత్ కలిసి 2018లో స్కైరూట్ ఏరోస్పేస్నుప్రారంభించారు. ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల స్టార్టప్ కంపెనీ. అంతరిక్షాన్ని అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో విక్రమ్–సిరీస్ ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేస్తోంది స్కైరూట్. ఈ కంపెనీలో 350కు పైగా ప్రతిభావంతమైన అంతరిక్ష నిపుణులు పని చేస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలను సరళతరం చేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీని ‘ఎక్సలెన్స్ ఇన్ స్టార్టప్ అవార్డు’తో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్.పవన్ చందన, నాగ భరత్, స్టార్టప్తలసీమియా... చిన్నారుల పాలిట శాపమైన ఈ వ్యాధికి వైద్యం చేయించలేక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులకు అండగా నిలిచారు పొద్దుటూరి అనిత. ఖమ్మంలో ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తూనే తలసీమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం సంకల్ప పేరిట ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ తలసేమియా గురించి... రక్త దానం ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తున్నారు. పొద్దుటూరి అనితను ‘ఎక్సలెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.అనితప్రొద్దుటూరి, సామాజిక సేవచంద్రకాంత్ సాగర్ పుట్టుకతోనే 90 శాతం శారీరక లోపంతో జన్మించారు. అయినా ఏనాడూ కుమిలిపోలేదు. వీల్‌చైర్ నుంచే 2019లో ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో పరిశ్రమ ఏర్పాటు చేసి పర్యావరణహిత సంచులు, సర్జికల్ మాస్కులు, పెన్నులు, పెన్సిళ్లు తయారు చేస్తూ పది మంది దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం వారి టర్నోవర్ 25 లక్షలు. చంద్రకాంత్ సాగర్ని ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ కేటగిరీ’లో స్పెషల్ జ్యూరీ రికగ్నేషన్ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.చంద్రకాంత్ సాగర్, చిన్న/మధ్య తరహా వాణిజ్యండొక్కరి రాజేశ్ గుండె ధైర్యం, త్యాగం దేశాన్నే కాదు తెలుగు వారిని కూడా గర్వపడేలా చేసింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామానికి చెందిన డొక్కరి రాజేశ్ 2018లో ఆర్మీలో చేరి తండ్రి కలను నిజం చేశారు. మూడేళ్లలోనే నాయక్ స్థాయికి ఎదిగారు. సెలవుపై స్వగ్రామానికి వచ్చినప్పుడల్లా పేద విద్యార్థుల చదువు కోసం ఖర్చుపెట్టేవారు. 2024 జూలై 15న జమ్ము కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులను ఎదుర్కొంటూ వీరమరణం పొందారు. వీర జవాన్ డొక్కరి రాజేశ్‌కు సాక్షి ఎక్సలెన్స్ – పొస్తమస్ అవార్డును ఆయన కుటుంబ సభ్యులకు అందించింది సాక్షి మీడియా గ్రూప్.డొక్కరి రాజేష్ తల్లిదండ్రులు, అమర సైనికుడు→పురస్కార గ్రహీత చంద్రకాంత్‌తో భారతీరెడ్డి ∙‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతినిధులతో ముఖ్య అతిథి బండారు దత్తాత్రేయడొక్కరి రాజేష్ తల్లిదండ్రులకు పురస్కారం అందిస్తూ... -
అలలపై కలల విహారం
అలలపై తేలియాడుతూ ప్రయాణం.. గమ్యం చేరే వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఆటలు, పాటలు, విందులు, వినోదాల్లాంటి బోలెడన్ని సరదాలు.. కళ్లు చెదిరే ఇంటీరియర్లతో అందమైన గదులు.. ప్రయాణ బడలిక తెలియనివ్వని పాన్పులు.. ఒకవేళ అలసటకు గురైతే స్పా, మసాజ్ లాంటి సర్వీసులు.. ఉన్న చోటే బోలెడంత షాపింగ్ చేసుకొనే అవకాశం.. ఇంకా ఈత కొలనులు.. జిమ్‌లు.. ఇలా ఒకటేమిటి ఇంద్రభవనం లాంటి సకల విలాసాలతో కూడిన నౌకల్లో విహారయాత్రలంటే ఎవరికి ఇష్టం ఉండదు.అందుకే దేశంలో లగ్జరీ క్రూజ్ టూరిజం సరికొత్త ట్రెండ్‌గా మారింది. పర్యాటకులను ఆనంద‘సాగరం’లో ముంచెత్తే అనుభూతులు పంచుతోంది. ఇంకేం.. జీవితాంతం గుర్తుండిపోయే సముద్రమంత లోతైన జ్ఞాపకాలు కావాలనుకుంటే ‘సీ’కేషన్కు సిద్ధమైపోండి. గెట్ సెట్ క్రూజ్!! దేశంలో క్రూజ్ పర్యాటకం క్రమంగా పుంజుకుంటోంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్, ప్రైవేటు పార్టీలు, కంపెనీల గెట్ టు గెదర్ వంటి కార్యక్రమాలకు కూడా క్రూజ్‌లు వేదికలుగా మారుతున్నాయి. ప్రస్తుతం దేశంలో క్రూజ్ ప్రయాణికుల సంఖ్య 4.5 లక్షలు దాటింది. కార్డీలియా క్రూజెస్ అనే స్వదేశీ సంస్థ 2021 సెపె్టంబర్లో సుమారు 2 వేల మంది ప్రయాణికుల సామర్థ్యంగల ‘ఎంప్రెస్’నౌక ద్వారా భారత్‌లో తొలిసారిగా లగ్జరీ క్రూజ్ పర్యాటకానికి తెరతీసింది.బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాల్లో క్రూజ్ యాత్రలు నిర్వహిస్తోంది. పశ్చిమ తీరంలో ముంబై హోమ్ పోర్టుగా సెపె్టంబర్–జూన్ మధ్య గోవా, కొచ్చి, లక్షదీవులకు... జూన్–సెప్టెంబర్ మధ్య తూర్పు తీరంలో చెన్నై హోమ్ పోర్ట్‌గా క్రూజ్ ట్రిప్పులు తిప్పుతోంది. 2023 జూన్‌లో భారత్ నుంచి శ్రీలంకకు జర్నీతో విదేశీ క్రూజ్ సర్విసులను ప్రారంభించిన ఘనతను కూడా కార్డీలియా సొంతం చేసుకుంది.ఇప్పుడు ఏటా చెన్నై–శ్రీలంక మధ్య జూన్–సెపె్టంబర్ నెలల్లో కార్డీలియా ’ఎంప్రెస్‘విహారయాత్రలను నిర్వహిస్తోంది. గమ్యస్థానాల్లో వాటర్ అడ్వెంచర్లు, జంగిల్ సఫారీలు, ఆన్‌షోర్ సిటీ టూర్, అవుట్డోర్ పర్యటనలను కూడా అందిస్తోంది. దేశీయ గమ్యస్థానాలకు పర్యాటకుల ఆక్యుపెన్సీ 85 శాతం మేర ఉంటోందని.. వేసవి సెలవుల్లో టికెట్లు పూర్తిగా బుక్ అయిపోతున్నాయని కంపెనీ సీఈఓ జుర్గెన్ బైలోమ్ చెబుతున్నారు. కొత్త రూట్లు, గమ్యస్థానాలకు విస్తరణ నేపథ్యంలో భారతీయ క్రూజ్ ట్రాఫిక్ 25–30 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్రం దన్ను.. దేశంలో సముద్ర క్రూజ్ పర్యాటకులను 2029 నాటికి ఏటా 10 లక్షల మంది స్థాయికి చేర్చడంతోపాటు ఈ రంగంలో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఐదేళ్ల భారత్ క్రూజ్ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా 10 సముద్ర క్రూజ్ టెర్మినల్స్, 100 రివర్ క్రూజ్ టెర్మినల్స్ నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం.ప్రపంచస్థాయి మౌలిక వసతులతోపాటు పర్యాటక ప్రదేశాలను మరింతగా అభివృద్ధి చేయనున్నారు. బడ్జెట్లో కూడా క్రూజ్ పరిశ్రమ వృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడం విశేషం. గంగ, బ్రహ్మపుత్ర నదుల్లో ఇప్పటికే రివర్ క్రూజ్ సర్విసులు ప్రారంభమయ్యాయి. కృష్ణా, గోదావరి, నర్మద, కావేరి నదుల్లోనూ ఈ సర్విసులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రివర్ క్రూజ్ పర్యాటకులను 2029 నాటికి ఏటా 15 లక్షలకు పెంచాలనేది మిషన్ లక్ష్యం.వైజాగ్ హాట్ డెస్టినేషన్... జూలైలో మళ్లీ క్రూజ్ రెడీ2022లో తొలిసారి కార్డీలియా క్రూజెస్ ‘ఎంప్రెస్’నౌక విశాఖ–చెన్నై మధ్య సముద్ర విహారంతో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచింది. గతేడాది ‘ద వరల్డ్’అనే విదేశీ లగ్జరీ క్రూజ్ షిప్ గ్లోబల్ టూరిస్టులను విశాఖకు తీసుకొచ్చింది. ఇక్కడ సకల సౌకర్యాలతో నిర్మించిన అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్‌లో లంగరేసింది. ఈ ఏడాది మళ్లీ జూలైలో కార్డీలియా ఎంప్రెస్ నౌక వైజాగ్–పుదుచ్చేరి–చెన్నై మధ్య ట్రిప్పులకు రెడీ అవుతోంది.సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో విశాఖ పోర్టులో నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ నుంచి నౌకల రాకపోకలు మొదలవడంతో క్రూజ్ పర్యటకానికి కూడా వైజాగ్ హాట్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది. షిప్ ఆకారంలో నిర్మించిన ఈ టెర్మినల్‌లోని బెర్త్‌లో 2,500 మంది సామర్థ్యంతో కూడిన భారీ క్రూయిజ్లను లంగరేయొచ్చు. త్వరలో ఇక్కడి నుంచి సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక తదితర దేశాలకు క్రూజ్ సర్వీసులు ప్రారంభించేందుకు పలు క్రూజ్ కంపెనీలతో సంప్రదింపులు జరుగుతున్నాయి.విదేశీ క్రూజ్‌ల క్యూఇటలీకి చెందిన కోస్టా క్రూజెస్ తొలిసారిగా 2023లో భారత్ పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి క్రూజ్ అనుభూతితోపాటు ఇటాలియన్ ఆతిథ్యాన్ని రుచి చూపించింది. ముంబై, కొచ్చి, గోవాతోపాటు లక్షదీవుల మధ్య మొత్తం 23 ట్రిప్పులు నిర్వహించింది. మొత్తం 14 అంతస్తులు (డెక్‌లు), 3,780 మంది ప్రయాణికుల సామర్థ్యంతో కోస్టా సెరీనా క్రూజ్ భారత సముద్ర జలాల్లో విహరించిన అతిపెద్ద నౌకగా రికార్డుకెక్కింది.ఆసియా పసిఫిక్ కార్యకలాపాల కోసం భారత్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకోవడంపై దృష్టి పెడుతున్నామని కోస్టా క్రూజెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాబర్టో అల్బెర్టీ వెల్లడించారు. క్రూజ్ టూరిజానికి ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని క్రూజ్ కంపెనీలు భారత్‌కు క్యూ కట్టనున్నాయి. వచ్చే ఏడాది నుంచి ‘రిసార్ట్ వరల్డ్ వన్’క్రూజ్ లైనర్ మన దేశంలో సెయిలింగ్‌కు సై అంటోంది. రాయల్ కరీబియన్, డిస్నీ తదితర దిగ్గజ క్రూజ్ లైనర్లు కూడా భారత మార్కెట్లోకి అడుగుపెట్టే ప్రణాళికల్లో ఉన్నాయి.ఇక అలలపై ఆగ్నేయాసియా చుట్టేయొచ్చు! భారత క్రూజ్ పరిశ్రమ ఇక అంతర్జాతీయంగానూ సత్తా చాటనుంది. కార్డీలియా తొలిసారిగా భారత్ నుంచి ఆగ్నేయాసియాలోని ప్రముఖ పర్యాటక దేశాలకు జూలైలో క్రూజ్ జర్నీ ప్రారంభిస్తోంది. ఇందుకోసం 2,500 మంది సామర్థ్యంగల రెండు కొత్త క్రూజ్లను కొననుంది. చెన్నై నుంచి మొదలయ్యే ఈ 10 రోజుల ట్రిప్‌లో థాయ్‌లాండ్ (ఫుకేట్), మలేసియా (కౌలాలంపూర్, లంకావీ)ల మీదుగా సింగపూర్ చేరుకోవచ్చు.అలాగే సింగపూర్ నుంచి మొదలై అవే డెస్టినేషన్లను కవర్ చేస్తూ చెన్నై చేరేలా టూర్లను ప్లాన్ చేశారు. ఇప్పటికే కార్డీలియా వెబ్సైట్ (www.cordeliacruises) తోపాటు ప్రముఖ ట్రావెల్ పోర్టల్స్‌లో బుకింగ్స్ మొదలయ్యాయి. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను చుట్టేయడంతోపాటు గమ్యస్థానాల్లో సిటీ టూర్స్, ఆన్‌షోర్ పర్యటనలతో ఒకే ట్రిప్‌లో మూడు దేశాలను కవర్ చేసే అవకాశం ఉంటుంది.ప్యాకేజీలు ఇలా... కార్డీలియా ‘ఎంప్రెస్షిప్లో మధ్యతరగతి కుటుంబం సైతం లగ్జరీ క్రూజ్ జర్నీ చేసేవిధంగా రకరకాల రూమ్‌లు, ఆఫర్లు, గ్రూప్ ప్యాకేజీలు ఉన్నాయి. ఉదాహరణకు చెన్నై–విశాఖ మధ్య ఇద్దరు పెద్దవాళ్లకు రెండు రాత్రులు, 3 పగళ్ల ప్యాకేజీ ధరలు (పన్నులన్నీ కలిపి) చూస్తే...అన్లిమిటెడ్ ఫుడ్, ఎంటర్టైన్మెంట్తో మూడు రోజులపాటు ఫైవ్ స్టార్ లగ్జరీ సముద్ర ప్రయాణ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. జర్నీ రూట్, ఎంత మంది, ఎన్ని రోజులు (3, 5 నైట్స్ ప్యాకేజీలు) అనేదాన్ని బట్టి రేట్లు మారతాయి. 12 ఏళ్ల లోపు పిల్లలకు షరతులకు లోబడి ఉచిత ప్రయాణ (పన్నులు కాకుండా) ఆఫర్ ఉంది. ధర ఎక్కువైనా మరింత లగ్జరీ, సౌకర్యాలు కోరుకునేవారికి సూట్, చైర్మన్ సూట్ కూడా ఉన్నాయి.విదేశీ టూర్ల విషయానికొస్తే... చెన్నై నుంచి శ్రీలంకకు (హంబన్‌టోట, ట్రింకోమలీ, జాఫ్నా), తిరిగి చెన్నై (5 నైట్స్, 6 డేస్ రౌండ్ ట్రిప్) జర్నికి ఇద్దరు పెద్దవాళ్లకు చార్జీ దాదాపు రూ. లక్ష పడుతుంది. అలాగే చెన్నై నుంచి సింగపూర్ (ఫుకెట్, లంకావీ, కౌలాలంపూర్ మీదుగా వన్‌వే ట్రిప్ – 10 నైట్స్, 11 డేస్) ట్రిప్‌కి చార్జీ రూ.2,21,745 అవుతుంది. పన్నులతో కలిపి, ఇంటీరియర్ స్టేట్‌రూమ్ ప్యాకేజీలు ఇవి.క్రూజ్ లెక్కలు ఇలా.. 3 కోట్లు: ప్రపంచవ్యాప్తంగా ఏటా క్రూజ్ జర్నీ చేస్తున్న పర్యాటకుల సంఖ్య (సుమారుగా) 30 బిలియన్ డాలర్లు: క్రూజ్ జర్నీ మార్కెట్ విలువ45 బిలియన్ డాలర్లు: 2029 నాటికి క్రూజ్ జర్నీ మార్కెట్ విలువ అంచనా4.5 లక్షలు: దేశంలో ప్రస్తుతం క్రూజ్ ప్రయాణికుల సంఖ్య5.3 లక్షలు: ఇప్పటిదాకా కార్డీలియా ఎంప్రెస్‌లో విహరించిన పర్యాటకులు -
టారిఫ్ వార్.. ఎవరికి లాభం?
అన్నట్టుగానే భారత్‌పైనా సుంకాల మోతకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెర తీశారు. ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకాలు తప్పవని పునరుద్ఘాటించారు. దీని ప్రభావం మనపై ఏ మేరకు ఉండనుందంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే అమెరికా మనకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. అందుకే అగ్ర రాజ్యంతో టారిఫ్‌ల రగడకు తెర దించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటికే అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన ద్వైపాక్షిక వర్తక ఒప్పందం (బీటీఏ)పై చర్చలు జరుపుతున్నారు. ఈలోగా పలు అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లను వీలైనంతగా తగ్గిస్తూ భారత్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ తదితర ఉత్పత్తులపైనా టారిఫ్ కోతలు ప్రకటించే అవకాశం కన్పిస్తోంది. ఏ మేరకు సుంకాలు? సుంకమంటే ఒక దేశం మరో దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పన్ను. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు సగటున 4 నుంచి 5 శాతం మించడం లేదు. భారత్ మాత్రం అమెరికా ఉత్పత్తులపై సగటున 18 శాతం పై చిలుకు దిగుమతి సుంకాలు విధిస్తోంది. లగ్జరీ కార్లు, కెమికల్స్, ఎల్రక్టానిక్స్‌పై 125 శాతం, మద్యం మీదైతే ఏకంగా 150 శాతం దాకా వసూలు చేస్తోంది! ఈ తేడాలను సరిచేయకుంటే ఏప్రిల్ 2 నుంచి తామూ అంతే మొత్తం బాదుతామని ట్రంప్ బెదిరిస్తున్నారు. అమెరికాపై ప్రధానంగా ఆధారపడ్డ భారత ఎగుమతిదారులపై ఇది గట్టి ప్రభావమే చూపనుంది. ముఖ్యంగా మన ఇనుము, ఉక్కు, జౌళి ఎగుమతులపై ప్రభావం తీవ్రంగా ఉండనుంది. దిద్దుబాటు చర్యలేవీ తీసుకోని పక్షంలో 25 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులపై ప్రభావం పడవచ్చని అంచనా. అయితే మన జీడీపీలో అమెరికా ఎగుమతుల వాటా కేవలం 2.2 శాతమే. కనుక భారత్ మరీ అంతగా బెంబేలెత్తిపోవాల్సిన పని లేదన్నది ఆర్థికవేత్తల మాట. ‘‘భారత్ వంటి అతిపెద్ద మార్కెట్‌ను అమెరికా విస్మరించలేదు. అక్కడి ఈ కామర్స్ కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక సేవలు, టెక్నాలజీ సంస్థలకు భారత మార్కెట్ అంటే భారీ ఆసక్తి. సోషల్ నెట్వర్కింగ్ కంపెనీలకూ భారత్ ప్రధానమే’’ అని వారంటున్నారు. అమెరికాతో భారత్ వాణిజ్యమెంత? అమెరికాకు అతి పెద్ద ఎగుమతిదారుల్లో భారత్ ఒకటి. 2024లో ఆ దేశానికి 87.4 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అమెరికా నుంచి 41.8 బిలియన్ డాలర్ల దిగుమతులు మాత్రమే చేసుకుంది. ఈ వాణిజ్య లోటునూ ట్రంప్ ప్రశి్నస్తున్నారు. దీన్ని పూడ్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. మనకు మేలే! ట్రంప్ తెర తీసిన టారిఫ్ వార్ అంతిమంగా భారత్‌కే లబ్ధి చేకూరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా, కెనడా, మెక్సికో తదితర దేశాలపై అమెరికా ఇప్పటికే సుంకాలను పెంచడం తెలిసిందే. బదులుగా అమెరికాపై ప్రతీకార సుంకాలు తప్పవని ఆ దేశాలు కూడా స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి అమెరికాకు ఎగుమతులు బాగా తగ్గేలా కని్పస్తున్నాయి. ఇది భారత్‌కు సానుకూలంగా మారుతుందని, మనం మరిన్ని ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ట్రంప్ తొలి హయాంలో కూడా చైనాపై సుంకాలు పెంచడంతో భారత్ బాగా లాభపడింది. ఈసారి కూడా అమెరికాకు మన మిర్చి, జౌళి తదితర ఉత్పత్తుల ఎగుమతులు బాగా పెరిగే అవకాశముంది. ఇప్పటికే చర్యలు అమెరికాపై విధిస్తున్న సుంకాల తగ్గింపుకు భారత్ ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది... → ఇటీవలి బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ దిగుమతులపై ప్రకటించిన 15–16 శాతం సుంకాల నుంచి అమెరికాను మినహాయించాలని కేంద్రం భావిస్తోంది.→ వైద్య పరికరాలు, లగ్జరీ మోటార్ సైకిళ్ల వంటి పలు అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లను తగ్గించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.→ వాణిజ్య లోటును తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా నుంచి రక్షణ, చమురు తదితర ఉత్పత్తుల దిగుమతులను ఇతోధికంగా పెంచేందుకు ట్రంప్–మోదీ భేటీలో అంగీకారం కూడా కుదిరింది. → ఏఐజీ వంటి అమెరికా బీమా దిగ్గజాలకు లబ్ధి చేకూర్చేలా ఆ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100 శాతానికి పెంచుతూ తాజా బడ్జెట్లో కేంద్రం నిర్ణయం తీసుకుంది.→ భారత ఔషధాలపై అమెరికా ఎలాంటి సుంకాలూ వసూలు చేయడం లేదు. కనుక అమెరికా ఔషధ దిగుమతులపై భారత్ విధిస్తున్న 10 శాతం సుంకాన్ని కూడా ఎత్తేయాలని ఫార్మా సంస్థలు సూచిస్తున్నాయి. → అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న పలు వ్యవసాయోత్పత్తులపై ఏకంగా 42 నుంచి 120 శాతం దాకా సుంకాలున్నాయి. వీటిని కూడా బాగా తగ్గించే అవకాశముంది. త్వరలో ఒప్పందం: భారత్ న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుని తాజా ప్రకటనపై భారత్ ఆచితూచి స్పందించింది. అగ్ర రాజ్యంతో వాణిజ్య బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడమే తమ లక్ష్యమని పేర్కొంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) ద్వారా టారిఫ్, టారిఫేతర అడ్డంకులను తగ్గించుకునేందుకు కృషి చేస్తున్నట్టు వివరించింది. దీన్ని ఇరు దేశాలకూ ఆమోదనీయ రీతిలో పరిష్కరించుకుంటామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైస్వాల్ శుక్రవారం ఒక ప్రకటనలో విశ్వాసం వెలిబుచ్చారు.సుంకాల తగ్గింపుకు భారత్ ఒప్పుకుంది: ట్రంప్ అమెరికాపై సుంకాలను భారీగా తగ్గించేందుకు భారత్ అంగీకరించినట్టు ట్రంప్ వెల్లడించారు. శుక్రవారం ఉదయం వైట్‌హౌస్ ఓవల్ కార్యాలయంలో ఈ మేరకు ప్రకటించారు. అమెరికాపై ఇన్నాళ్లుగా భారత్ విధిస్తున్న హెచ్చు సుంకాలను తాను బయట పెట్టడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మాయమయ్యాడు.. మామూలు మనిషి
ఒకప్పడు ఎటు చూసినా బంధాలు..అను బంధాలు..ఆత్మీయతలు.. అనురాగాలు.. విలసిల్లేవి.. ప్రపంచీకరణ పుణ్యమాని.. మనిషిలో స్వార్థం పెరిగి మాన సంబంధాలు కనుమరుగవుతున్నాయి. తన జీవితం తనదే, పొరుగువారితో పనేముందన్న రీతి లో మానవుడు సాగుతున్నాడు. యాంత్రిక జీవనం గడుపుతున్నాడు.. మచ్చుకైనా మానవత్వం కనిపించకపోవడంతో మామూలు మనిషి మాయమైపోయాడనక తప్పదు. నేటి మానవ సంబంధాలపై ప్రత్యేక కథనం. పలమనేరు: మానవ సంబంధాలను మంటగలిపి కేవలం తమ స్వార్థం చూసుకుంటున్న మనుషులు సమాజంలో ఎక్కువైపోయారు. గమ్యం తెలియని జీవన పయనమెటో తెలియని గందరగోళం నెలకొంది. సమాజంలో మంట కలుస్తున్న మానవత్వాన్ని మేలు కొల్పాల్సిన అవరసం ఎంతైనా ఉంది. గత ఏడాదిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అందరూ ఉండి అనాథల్లా మారి కనీసం అంత్యక్రియలకు నోచుకోని పదిమందికి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు దహనసంస్కారాలు చేశారంటే సమాజంలో ఎలాంటి మావనీయ సంబంధాలున్నాయే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మానవ సంబంధాలెలా ఉన్నాయంటే? పలమనేరు మండలంలోని మొరం పంచాయతీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి తన కుటుంబంతో బెంగళూరులో కాపురముంటున్నారు. అనారోగ్యంతో అతని తల్లి మృతి చెందింది. దీంతో ఆ ఇంటి యజమాని మానవత్వం లేకుండా తన ఇంట్లో శవాన్ని పెట్టకుండా అడ్డుకున్నాడు. దీంతో విధిలేక వారు స్వగ్రామానికి తీసుకొచ్చారు. బయట చనిపోయినవారు గ్రామంలోకి రాకూదనే సంప్రదాయంతో శవాన్ని ఊరిబయటే పెట్టి ఆపై అంత్యక్రియలను నిర్వహించారు. పలమనేరు సమీపంలోని సాయినగర్‌లో ఓ ఉద్యోగి సొంత ఇంటిని నిర్మించుకుని పదేళ్లుగా కాపురముంటున్నాడు. ఆయన ఇప్పటివరకు ఇరుగుపొరుగు వారితో మాట్లాడలేదు. ఎరింటికీ వెళ్లలేదు. ఆ వీధిలో ఎవరికైనా కష్టమొచ్చినా సాయం చేయలేదు. పొద్దున ఆఫీసుకెళ్లడం పొద్దుపోయాక ఇంటికి రావడం తప్ప అతనికి ఎవరితోనూ సంబంధం లేని జీవితం గడుపుతున్నారు. మారిన బతుకులు ఒకటో తరగతి నుంచి కార్పొరేట్ స్కూల్ ఆపై కాలేజీ, మళ్లీ కుటుంబానికి దూరంగా పిల్లల చదువులు. ఆపై ఉద్యోగం రాగానే వారి జీవితం వారిది. ఇక ఇళ్లల్లోని పెద్దలను పిల్లలే వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. దీంతో కుటుంబ విలువలు తెలియని పిల్లలు ఎవరికివారేఅన్న భావనతో తమ బతుకులకు అంకితమైపోతున్నారు. స్మార్ట్ఫోన్ల పుణ్యమాని మానవ సంబంధాల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. గతంలో ఓ గ్రామంలో వంద కుటుంబాలుంటే కనీసం 20 కుటుంబాలన్నా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఊరికి రెండు, మూడు కుటుంబాలు సైతం కలిసి ఉండడం లేదు. సచ్చినా బాధపడే వారెవరు? సొంత కుటుంబసభ్యులు ఎవరైనా మృతి చెందితే కనీసం కొన్నేళ్లపాటు బాధపడే రోజులు గతంలో కనిపించేవి. కానీ ఇప్పుడు సొంత కుటుంబసభ్యులు చనిపోయినా కేవలం రెండు మూడు రోజులే బాధ, ఆపై అసలు పట్టించుకోరు. మాయమవుతున్న మానవసంబంధాలు ఎవరు ఏమైతే నాకేంటి నా కుటుంబం బాగుంటే చాలనే స్వార్థం ఎక్కువైంది. ఆఖరికి తన సొంత అమ్మా నాన్న, అక్కా చెల్లి, అన్నదమ్ములను సైతం పట్టించుకోవడం లేదు. గతంలో గ్రామంలో ఎవరి ఇంట్లోనైనా శుభ, అశుభకార్యాలు జరిగితే పనులు చేసేందుకు ఇంటికోమనిషి వెళ్లేవారు. ఇప్పుడు పెళ్లికి సైతం రావడంలేదు. దీంతో శుభ, అశుభ కార్యక్రమాలకు ఈవెంట్ మేనేజర్లే దిక్కుగా మారారు. నాటి పలకరింపులు కరువు గతంలో ఇంటికి ఎవరైనా బంధువులొస్తే గంటల తరబడి పలకరింలుండేవి. ఆపై బంధువులకు విందుభోజనం చేసిపెట్టేవాళ్లం. ఇప్పుడు ఎవరైనా బంధువులు ఇంటికోస్తే నిమిషం పలకరింపు, బిజీగా ఉన్నాం ఇంకోసారి వస్తాంలేనంటూ పదినిమిషాల్లో వెళ్లడం కనిపిస్తోంది. మన ఇంట్లోని వారు సైతం బంధువులతో మాట్లాడకుండా స్మార్ట్ఫోన్లకు అతక్కుపోయి ఉంటున్నారు . – లక్ష్మీపతినాయుడు, బురిశెట్టిపల్లి, బైరెడ్డిపల్లి మండలం కష్టమొస్తే పలకరించేవాళ్లుండాలయ్యా! గతంలో ఎవరికైనా కష్టం వస్తే ఇంటిపక్కనున్నవారో స్నేహితులో మంచి సలహా చెప్పి సమస్యకు పరిష్కారం చూపేవారు. ఇప్పుడు ఆత్మీయ పలకరింపులు లేవు. ఎవరు చూసినా వారి పనుల్లో బిజీబీజీ. రోడ్డుపై ప్రమాదం జరిగినా మనకెందుకులే, కేసవుతుందని వెళ్లిపోయే సమాజమిది. అమ్మా,నాన్న, బిడ్డలకంటే ఎక్కువగా సోషల్‌మీడియాతో గడుపుతున్నారు. – పుష్పరాజ్, రిటైర్డ్ టీచర్, పలమనేరు -
నల్లమల.. వన్యప్రాణుల ఖిల్లా
ప్రకృతి అందాలకు నల్లమల అటవీ ప్రాంతం ఆలవాలమైంది. ఎటు చూసినా ఆకాశాన్నంటే చెట్లు, బెబ్బులి గర్జనలు, నెమళ్ల నాట్యాలు, అరుదైన పక్షుల కిలకిలా రావాలు, అటు నుంచి ఇటు పరిగెత్తే జింకలు, సెలయేళ్లు, పర్యాటక ప్రదేశాలకు నల్లమల అటవీ ప్రాంతం నెలవుగా మారింది. ప్రతి ఏడాది మార్చి 3న ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ప్రజలకు వణ్యప్రాణుల సంరక్షణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు.మార్కాపురం:నల్లమల అటవీ ప్రాంతం ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల పరిధిలో సుమారు 6.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ అటవీ ప్రాంతంలో 87కు పైగా రాయల్ బెంగాల్ టైగర్లు, సుమారు 400 కు పైగా చిరుతలు తిరుగుతున్నాయి. వీటితోపాటు వందల సంఖ్యలో దుప్పులు, జింకలు, నీల్గాయ్లు, ఎలుగుబంట్లు ఉన్నాయి.వీటితోపాటు ఆకాశంలో 4 నుంచి 5 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ క్షణాల్లో భూమిమీద తిరిగే వన్యప్రాణులను తినే అరుదైన క్రస్టడ్ హక్ ఈగల్ (నల్లపాముల గద్ద), షార్టు టోడోస్ స్నేక్ఈగల్, హనీబజర్, క్రస్టడ్ సర్పెంట్ ఈగల్‌లు సంచరిస్తున్నాయి. ఇక రష్యా నుంచి 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి నల్లమలకు వచ్చే మాన్టెగ్యూష్ హారియర్, పాలిడ్ హ్యారియర్ తదితర పక్షులకు కూడా నల్లమల ప్రాంతం నివాసంగా మారింది. మార్కాపురానికి చుట్టుపక్కల నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పెద్దదోర్నాల, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, పెద్దారవీడు, అర్ధవీడు, గిద్దలూరు తదితర మండలాల్లో అటవీ సమీప గ్రామాలున్నాయి. పెద్దదోర్నాల మండలంలోని నల్లగుంట్ల, వై చర్లోపల్లి, తుమ్మలబైలు, శ్రీశైల శిఖరం, బొమ్మలాపురం, ఘాట్‌రోడ్డు, అర్ధవీడు మండలంలోని వెలగలపాయ, మాగుటూరు తాండ, గన్నెపల్లి, లక్ష్మీపురం, దొనకొండ, మార్కాపురం మండలం గొట్టిపడియ, పెద్దారవీడు మండలం గుండంచర్ల తదితర గ్రామాల సమీపాల్లోకి వన్యప్రాణులు తరచుగా వస్తుంటాయి. ముఖ్యంగా పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, నెమళ్లు సంచరిస్తున్నాయి. అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు అన్నీరకాల చర్యలు తీసుకుంటున్నారు. పెద్దపులులు, చిరుతలకు అడవిలోనే నీటి సమస్య లేకుండా సోలార్ సాసర్పిట్లు ఏర్పాటుచేసి అధికారులు నీటి సమస్య తీర్చారు. నల్లమల పరిధి పెరిగిపోతోంది. గతంలో ఏపీలోని ప్రకాశం, గుంటూరు, కర్నూల్, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ తదితర జిల్లాలతో అనుసంధానంగా ఉండగా ఇప్పుడు శేషాచలం అడవులను కలుపుతూ ఎన్ఎస్టీఆర్ (నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు), శేషాచలం అడవులను కలిపి టైగర్ కారిడార్ ఏర్పాటైంది. నల్లమల అడవిలోని పెద్దపులులు కడప మీదుగా వనిపెంట, ఒంటిమిట్ట తదితర ప్రాంతాల్లో ఉన్న శేషచలం అడవుల్లో కూడా సంచరిస్తున్నాయి. దీంతో నల్లమల పరిధి 8 వేల చదరపు కిలోమీటర్ల నుంచి 16 వేల చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 1000 మంది సిబ్బందిని, 85 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. పులుల సంరక్షణకు తీసుకునే చర్యల వలన పులుల సంఖ్య పెరగడం విశేషం. ఆకట్టుకుంటున్న జంగిల్ సఫారీ..దోర్నాల నుంచి శ్రీశైలం మధ్య అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జంగిల్ సఫారీని చూడొచ్చు. అటవీశాఖాధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో నల్లమల అటవీ ప్రాంతంలో సుమారు 25 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. జింకలు, నెమళ్లు, పలురకాల పక్షిజాతులు కనిపిస్తాయి. ఇందులో పులికుంట వద్ద వ్యూ పాయింట్ వద్ద కాసేపు వాహనాన్ని ఆపుతారు. పెద్దపులులు, చిరుతలు ఇక్కడికి తరచుగా వచ్చి నీళ్లు తాగుతాయి. ఇక కొండ చిలువలు, పెద్ద పెద్ద చెట్లకు చుట్టుకుని కనిపిస్తాయి. జంగిల్ సఫారీ అద్భుతంనల్లమల అటవీ ప్రాంతంలో దోర్నాల నుంచి శ్రీశైలం మధ్యలో అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ చాలా అద్భుతం. విజ్ఞానంతోపాటు వినోదాన్ని కూడా అందిస్తుంది. ప్రతి ఒక్కరూ సెలవు రోజుల్లో పిల్లలను తీసుకుని జంగిల్ సఫారీకి వెళితే అన్నీ రకాల వన్యప్రాణులను మనం చూడవచ్చు. – జీఎల్ రమేష్ బాబు, టీచర్ మార్కాపురం -
గుడ్లు తేలేస్తున్న అమెరికా
కనీవినీ ఎరగని కొరత. ఆకాశాన్నంటిన ధరలు. అంతంత పెట్టయినా కొందామంటే వాటిపైనా ఆంక్షలు. మొత్తమ్మీద అగ్ర రాజ్యం అక్షరాలా ‘గుడ్లు’ తేలేస్తోంది. తీవ్ర గుడ్ల కొరతతో అమెరికా కొద్ది నెలలుగా సతమతమవుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ సమస్య మరింత తీవ్రతరమవుతోందే తప్ప తెరిపిన పడే సూచనలే కన్పించడం లేదు...! దాంతో అమెరికన్లలో అత్యధికులకు ఉదయం పూట అల్పాహారమైన గుడ్లు ఒక్కసారిగా విలాస వస్తువుగా మారిపోయిన దుస్థితి! ఎందుకీ సమస్య? అమెరికాలో కొద్ది నెలల క్రితం మొదలైన గుడ్ల కొరత నానాటికీ పెరిగిపోతోంది. బర్డ్‌ఫ్లూగా పిలిచే హెచ్5ఎన్1 తీవ్రతే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. తొలుత కెనడాలో తలెత్తిన ఈ మహమ్మారి 2022లో అమెరికాలో ప్రవేశించింది. చూస్తుండగానే 50 రాష్ట్రాలకు విస్తరించింది. దీని వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ మూడేళ్లలో ఏకంగా 16 కోట్ల గుడ్లు పెట్టే కోళ్లను చంపేయాల్సి వచ్చింది. 2024లోనే 3 కోట్ల కోళ్లను చంపేశారు. వీటిలో 1.7 కోట్ల కోళ్లను కేవలం గత నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే అంతమొందించారు. అలా 2025 జనవరి నాటికి అమెరికాలో గుడ్లు పెట్టే కోళ్ల సంఖ్య 30 కోట్లకు పరిమితమైంది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇది ఏకంగా 11 శాతం తగ్గుదల! అలా మొదలైన గుడ్ల కొరత కొద్ది నెలలుగా తీవ్ర రూపు దాలి్చంది. కొద్ది రోజులుగా డజను గుడ్లు్ల ఏకంగా 5 డాలర్లకు చేరినట్టు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. అంటే 435 రూపాయలు. ఒక్క గుడ్డు రూ.36 అన్నమాట. ఇది అమెరికా చరిత్రలోనే ఆల్‌టైం గరిష్టం! అంతేకాదు, షికాగో, న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో వంటి పలు పెద్ద నగరాల్లోనైతే డజను గుడ్ల ధర ఏకంగా 8 నుంచి 10 డాలర్ల దాకా ఎగబాకింది!! దాంతో గుడ్ల కొనుగోలుపై పరిమితి విధిస్తూ రెండు నెలల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని పలు సూపర్మార్కెట్లు ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. కొన్నిచోట్ల అయితే ఒక్కో కస్టమర్‌కు గరిష్టంగా 2 గుడ్లే అమ్ముతున్నాయి! డెన్సీస్, వాఫుల్ హౌస్ వంటి రెస్టారెంట్ చెయిన్లు ఒక్కో గుడ్డుపై 50 సెంట్ల సర్‌చార్జీ కూడా వడ్డిస్తున్నాయి!ధరలు మరింత పైపైకే? సమీప భవిష్యత్తులో కూడా గుడ్ల ధరలు తగ్గే పరిస్థితి కన్పించకపోవడం అమెరికన్లను మరింత కలవరపెడుతోంది. కోళ్ల కొరతను అధిగమించడానికే కనీసం మరికొద్ది నెలలు పట్టవచ్చని చెబుతున్నారు. అప్పటిదాకా పరిస్థితి ఇంతేనని సమాచారం. గత జనవరిలోనే గుడ్ల ధరలు ఏకంగా 15 శాతం ఎగబాకాయి. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే సగానికి సగం పెరిగిపోయాయి. ఇది ఇక్కడితో ఆగదని, ఈ ఏడాది గుడ్ల ధరలు కనీసం 40 శాతానికి పైగా పెరగవచ్చని అమెరికా వ్యవసాయ శాఖ అంచనా వేసింది! ట్రంప్ సర్కారు కూడా పరోక్షంగా అదే చెప్పింది. ‘‘ఏడాదిన్నరలోగా డజను గుడ్ల ధర ఎప్పట్లా 2 డాలర్ల లోపుకు దిగొచ్చేలా చర్యలు తీసుకుంటాం’’ అని వ్యవసాయ మంత్రి బ్రూక్ రోలిన్స్ చెప్పుకొచ్చారు! దాంతో గుడ్ల కొరతను అధిగమించేందుకు తుర్కియే వైపు చూస్తోంది. గతంలో కెనడా, నెదర్లాండ్స్, బ్రిటన్, చైనా నుంచీ అమెరికా గుడ్లను దిగుమతి చేసుకున్నా కొన్నేళ్లుగా ఒక్క తుర్కియేకే పరిమితమైంది. ఆ దేశం నుంచి ఈ ఏడాది కనీసం 42 కోట్ల గుడ్లను దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది. అయినా పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదని పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. ఫ్లూ సమస్య ఇలాగే కొనసాగితే దాని తాలూకు లోటును, ఉత్పత్తి నష్టాలను భర్తీ చేసుకోవడానికే ఈ దిగుమతులు చాలవని చెబుతున్నారు.ఇవీ లెక్కలు..→ అమెరికాలో ఏటా సగటున 9,000 కోట్లకు పైగా గుడ్లు ఉత్పత్తవుతాయి. → ఫ్లూ కారణంగా మూడేళ్లలో 14 కోట్ల కోళ్లను చంపేయాల్సి వచ్చింది. → 2021లో 1.6 డాలర్లున్న డజను గుడ్ల ధర ఇప్పుడు 5 డాలర్లను దాటేసింది. → 2024లో తుర్కియే నుంచి 7 కోట్ల గుడ్లు దిగుమతి చేసుకున్నారు. → ఈసారి ఏకంగా 42 కోట్ల గుడ్లు దిగుమతి చేసుకోనున్నారు. ఇది దేశ చరిత్రలోనే అత్యధికం! → అయినా డిమాండ్‌ను తట్టుకోవడానికి ఇది ఏమాత్రమూ చాలదంటున్నారు.ట్రంప్ బిలియన్ డాలర్ ప్లాన్ గుడ్ల కొరతను అధిగమించి వాటి ధరలను నేలకు దించేందుకు బిలియన్ డాలర్ల ప్రణాళికను అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదిస్తున్నారు. అందులో ఏమున్నాయంటే... → బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు. → బర్డ్‌ఫ్లూ చికిత్స, వ్యాక్సిన్ల అభివృద్ధి తదితరాలకు 10 కోట్ల డాలర్లు → పౌల్ట్రీఫారాల యజమానులకు ఆర్థిక సాయానికి 40 కోట్ల డాలర్లు → దిగమతుల ద్వారా ప్రస్తుత డిమాండ్‌ను తట్టుకుని కొరతను అధిగమించడంబైడెన్ సర్కారు ఏం చేసింది? ఫ్లూపై పోరుకు బైడెన్ ప్రభుత్వం మూడేళ్లలో 150 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఫ్లూ బారిన పడ్డ కోళ్లను అంతమొందిస్తూ వచ్చింది. ఈ వైరస్ మనుషులకు పాకకుండా చూసేందుకు 60 కోట్ల డాలర్లు కేటాయించింది. వ్యాక్సిన్ల వృద్ధి తదితరాలపై దృష్టి పెట్టింది. ఎంత చేసినా గుడ్ల కొరత నానాటికీ పెరుగుతూనే వచ్చింది. బైడెన్ ప్రభుత్వ అర్థంలేని చర్యల వల్లే సమస్య విషమించిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆయన చర్యలతో పరిస్థితి ఎంతో కొంత అదుపులోకి రాగలదని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు ఆశాభావంతో ఉండటం విశేషం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆలివ్ రిడ్లే..బతకాలిలే..
సాగర గర్భంలో తల్లులు, ఎక్కడో దూరంగా తీరంలో పిల్లలు.. ఆ తల్లీపిల్లలు కలుసుకోవడానికి సవాలక్ష ఆటంకాలు. ప్రకృతి వైపరీత్యాలు, జంతువుల దాడులు, ఆకతాయిల వికృత చేష్టలు అన్నీ తట్టుకుని నిలబడితేనే ఆ పిల్లలు కడలి గర్భంలోకి వెళ్లగలవు. లేదంటే అండంలో ఉన్నప్పుడే ఆయుష్షు తీరిపోతుంది. ఇలాంటి ఆపత్కాలంలో ఉన్న ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లల ఆయుష్షుకు అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు అండగా నిలబడుతున్నారు. తీరంలో గుడ్లను సంరక్షించి అవి పొదిగి పిల్లలు బయటకు వచ్చే వరకు జాగ్రత్తగా చూసి.. బుల్లి బుల్లి తాబేలు పిల్లలు ఆనందంగా సముద్రంలోకి వెళ్లడాన్ని మురిపెంగా చూస్తున్నారు. సోంపేట: సముద్రంలో లక్షలాది జీవులు నివాసం ఉంటాయి. అందులో సముద్రానికి మేలు చేసే జాతుల్లో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఒక జాతి. ఆ రకం తాబేళ్లు గుడ్లు పెట్టుకునేందుకు మన తీరాలను అనువుగా ఎంచుకున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత సముద్ర తీరానికి వచ్చి తీరంలో గొయ్యి తవ్వి గుడ్లు పెడతాయి.అనంతరం వాటిని కప్పేసి సముద్రంలోకి వెళ్లిపోతాయి. తీరంలో గుడ్లు పెట్టడానికి అనువైన స్థలం చూసుకుని గుడ్లు పెడుతుంటాయి. అలా వచ్చినప్పుడు బోట్లు తగిలి కొన్ని తాబేళ్లు చనిపోతుంటాయి. ప్రస్తుతం ఆలివ్‌రిడ్లే తాబేళ్లు అంతరించి పోయే ప్రమాదంలో ఉండడంతో అటవీశాఖ పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో తాబేళ్ల సంరక్షణకు నడుం బిగించింది. 50 నుంచి 150 గుడ్లు సాధారణంగా ఈ జాతి తాబేళ్లు 50 నుంచి 150 వరకు గుడ్లు పెడుతుంటాయి. అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల లోపు తీరానికి చేరుకుని ఇసుకలో గోతులు తవ్వి వాటిలో గుడ్లు పెట్టి, తిరిగి వాటిపై ఇసుక కప్పి తల్లి తాబేళ్లు సముద్రంలోకి వెళ్లిపోతాయి. ప్రత్యేక జీవులు ఆలివ్ రిడ్లే తాబేళ్లు చాలా ప్రత్యేకమైనవి. వీటికి స్థిర నివాసం ఉండదు. రెండు అడుగుల పొడవు, సుమారు 150 కిలోలు పైన బరువు ఉండే తాబేళ్లు ఆహార అన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం సుమారు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. డిసెంబర్ నుంచి మార్చి రెండో వారం వరకు ఎక్కువగా గుడ్లు పెడుతుంటాయి. గుడ్లకు సంరక్షణ.. తీరంలో తాబేళ్లు గుడ్లు పెట్టి వెళ్లిపోయాక శ్రీకాకుళం జిల్లాలో అటవీ శాఖ అధికారులు, ట్రీ ఫౌండేషన్ సౌజన్యంతో గుడ్లను సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో మొత్తం మూడు డివిజన్ల పరిధిలో 16 సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇచ్ఛాపురం నియోజక వర్గంలో 7 కేంద్రాలు ఏర్పాటు చేశారు. నియోజక వర్గంలోని సోంపేట మండలం బట్టిగళ్లూరు, బారువ పేట, ఇస్కలపాలేం, కవిటి మండలం కళింగపట్నం, బట్టివాని పాలేం, సీహెచ్ కపాçసుకుద్ది, ఇచ్ఛాపురం మండలం డొంకూరులో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత సంవత్సరం జిల్లాలో 1,59,403 గుడ్లు సేకరించి 1,44,981 పిల్లలుగా తయారు చేసి సముద్రంలోకి విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది గత ఏడాది కంటే ఎక్కువ పిల్లలను తయారు చేసి సముద్రంలోకి విడిచి పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ డివిజన్ల పరిధిలో 452 నెట్లు ఏర్పాటు చేసి 53,400 గుడ్లు సేకరించారు. సుమారు 40 రోజుల పాటు రక్షణ వలయంలో ఉంచి గుడ్లు పిల్లలుగా మారిన తర్వాత వాటిని సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెడతారు. మత్స్యకారులు సహకరించాలి తాబేలు గుడ్లను సంరక్షించడానికి అటవీ శాఖా ధికారులు, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులకు మత్స్యకారులు సహకరించాలి. అంతరించే స్థితి లో ఉన్న ఆలివ్‌రిడ్లే తాబేళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. గుడ్లను సంరక్షించే బాధ్యత అటవీ శాఖ తీసుకుంటుంది. గత ఏడాది సుమారు లక్షా యాభై వేల పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టాం. ఈ ఏడాది అంతకన్నా ఎక్కువ పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. – నాగరాజు, జిల్లా అటవీ శాఖాధికారి గుడ్లను సంరక్షించడం ఆనందం గత కొన్నేళ్లుగా అటవీ శాఖాధికారుల సౌజన్యంతో ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల గుడ్లు సేకరించి, వాటిని పిల్లలుగా తయారు చేసి సముద్రంలోకి విడిచి పెట్టడం ఆనందంగా ఉంది. జిల్లాలో మత్స్యకారులు సహాయ సహకారాలు అందించడంతో ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. – కె.సోమేశ్వరరావు, ట్రీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ -
ఏనుగు మళ్లీ జూలు విదిలిస్తుందా?
వూలీ మమోత్.. భారీ ఆకారంతో, సింహం జూలును తలపించేలా తొండం నుంచి తోకదాకా దట్టమైన రోమాలతో భీకరంగా ఉండే ఏనుగు అది. అలాంటి ఏనుగును పునః సృష్టించేందుకు.. ఒక ‘ఎలుకంత’ ముందడుగు పడింది.తల నుంచి తోకదాకా నిండా దట్టమైన రోమాలతో కూడిన ఎలుక జీవం పోసుకుంది. అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ ‘కొలోస్సల్ బయోసైన్సెస్’ శాస్త్రవేత్తలు చేసిన ఈ చిత్రమైన పరిశోధన ఏమిటో తెలుసుకుందామా... –సాక్షి, సెంట్రల్డెస్క్ధ్రువ ప్రాంత మంచులో దొరికిన ఆనవాళ్లతో..భూమ్మీద తిరుగాడి, కాలక్రమేణా అంతరించిపోయిన అరుదైన జీవులను పునః సృష్టి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ‘కొలోస్సల్ బయోసైన్సెస్’ శాస్త్రవేత్తలు వూలీ మమోత్ ఏనుగులకు తిరిగి ప్రాణం పోసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర ధ్రువ ప్రాంతపు మంచులో దొరికిన వూలీ మమోత్ అవశేషాల్లోని జన్యువులను, ప్రస్తుతమున్న సాధారణ ఆసియన్ ఏనుగుల జన్యువులను పోల్చి చూశారు. మమోత్‌లలో దట్టమైన వెంట్రుకలకు కారణమైన జన్యువులను గుర్తించారు. దీనికి సంబంధించి తొలుత ఎలుకలపై ప్రయోగాలు చేపట్టారు. ‘‘అంతరించిపోయిన ఒకనాటి జీవులను పునః సృష్టించగలం అనేందుకు ఈ ఎలుకలు సజీవ సాక్ష్యం. భవిష్యత్తులో ఈ టెక్నాలజీతో వూలీ మమోత్‌లను పుట్టించి, ప్రకృతిలోకి వదిలిపెట్టగలం..’’అని కొలోస్సల్ సంస్థ చీఫ్ సైన్స్ ఆఫీసర్ బెత్ షాపిరో పేర్కొన్నారు.1 ధ్రువ ప్రాంతపు మంచులో దొరికిన వూలీ మమోత్ అవశేషాల నుంచి జన్యువులను సేకరించారు.2 ఇప్పుడున్న ఆసియా ఏనుగుల జన్యువులతో, వూలీ మమోత్ జన్యువులను పోల్చి తేడాలను గుర్తించారు.3 ఎలుక పిండ కణాలను తీసుకుని.. వాటిలో పైచర్మం, వెంట్రుకలు, వాటి పొడవు, మందం తదితర లక్షణాలను నియంత్రించే ఎనిమిది జన్యువుల్లో.. మమోత్‌ల జన్యువుల తరహాలో మార్పులు చేశారు.4 ఈ జన్యుమార్పిడి చేసిన పిండ కణాలను కొన్ని సాధారణ ఎలుకల గర్భంలో ప్రవేశపెట్టారు.5 నిండా దట్టమైన రోమాలతో, అతి శీతల వాతావరణాన్ని కూడా తట్టుకోగలిగిన ‘ఊలు ఎలుకలు’ జన్మించాయి. -
ఈ ‘సర్వీసెస్’ మీ కోసమే...
సాక్షి, హైదరాబాద్: నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారిపై అత్యాచారం జరిగింది.. పోలీసులు కేసు నమోదు చేశారు.. న్యాయస్థానంలో విచారణ సాగుతోంది.. తీర్పు వచ్చే వరకు ఆమె భవిష్యత్ ఏంటి? కోర్టుటంటే ఏంటో తెలియని ఆ పేదలు ఎలా అక్కడికి వెళ్లగలరు? మానసికంగా కుంగిపోయిన ఆ చిన్నారికి ఎవరు ధైర్యం చెబుతారు? కౌన్సెలింగ్ ఎవరు ఇప్పిస్తారు?.. ఇలాంటి ప్రశ్నలకు జవాబే తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ (టీఎస్ఎల్ఎస్ఏ). ఒకటి కాదు.. రెండు కాదు.. జువెనైల్ జస్టిస్, డ్రగ్స్, మానవ అక్రమ రవాణా, కార్మిక చట్టాలు, సైబర్ నేరాలు, ప్రజల ప్రాథమిక హక్కులు, ప్రభుత్వ పథకాలు.. ఇలా అనేక సేవలను న్యాయ సేవాధికార సంస్థ అందిస్తోంది. అయితే, ఈ సేవలు మారుమూల పల్లెలకు సరిగా చేరడం లేదన్న భావనతో సంస్థ కొత్త ఆలోచన చేసింది ఆయా అంశాలతో లీగల్ సర్వీసెస్ అథారిటీ, రాష్ట్ర ఫిల్మ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డి.సాయిప్రసాద్ దర్శకత్వంలో ఈ 10 లఘు చిత్రాలు రూపొందించింది. వీటిని రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. న్యాయ సేవాధికార సంస్థ అందించే సేవలు, న్యాయ సాయం సమాజంలోని అట్టడుగు వర్గాలకు చేరాలన్నదే లక్ష్యం. వీరందించే ఆర్థిక సాయం కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు. లఘు చిత్రాల ద్వారా ప్రజల్లో సంస్థ అందించే సేవలు, న్యాయ సాయం గురించి అవగాహన పెరుగుతోంది. నిజ జీవితంలో జరిగిన అంశాల ఆధారంగా రూపొందించిన ఈ లఘు చిత్రాలను చూస్తే.. తమ సమస్య ఏంటి? ఎవరిని, ఎలా ఆశ్రయించాలి? ఎలా సాయం పొందాలి? అనేది తెలిసిపోతుంది. ఆ చిత్రాలేంటి.. సాయం ఎలా చేస్తారో తెలుసుకుందాం...తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఫోన్: 040 – 23446723E-mail : telenganaslsa@gmail.comవిడుదల... కొత్తగా ఓ భార్యభర్తలు ఓ ఇంటిలో దిగారు. ఎప్పుడూ భార్య బయటికి వచ్చేది కాదు. భర్త ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు రోజూ ఇంటికి తాళం వేసుకుని వెళ్లేవాడు. చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం రాకుండా ప్రవర్తించేవాడు. కానీ, ఇంటి పక్కనే ఉండే ఓ మహిళకు అతని ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో న్యాయ సేవాధికార సంస్థ పారా లీగల్ వలంటీర్‌ను సమాచారం ఇచ్చింది. వారు పోలీసుల సహకారంతో తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. భార్యను చైన్‌తో కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఉండటాన్ని చూసి వారు షాకయ్యారు. వెంటనే వారు ఆ భార్యకు విముక్తి ప్రసాదించి సఖి కేంద్రంలో చేర్పించారు. వైద్య చికిత్స అందించడంతోపాటు జీవనోభృతి కల్పించారు. ఆ భర్తను అరెస్టు చేసి, శిక్ష పడేలా చర్యలు తీసుకున్నారు. ఆమె ఆనందంగా జీవించేలా ఏర్పాట్లు చేశారు. అంకురం.. పారా లీగల్ వలంటీర్ ఓ హోటల్లో చిన్నారి పని చేయడం చూసి యజమానిని హెచ్చరించాడు. పనిలో తీసేసిన ఆ చిన్నారిని వ్యభిచార గృహానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న వలంటీర్ పోలీసుల సహకారంతో ముఠా గుట్టు రట్టు చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కటకటాల్లోకి పంపించారు. ఆ చిన్నారితోపాటు చాలామంది చిన్నారులకు జీవితాన్నిచ్చారు. వారంతా చదువుకునేలా న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేసింది. సీత కథ.. గిరిజన గ్రామం. చదువుకోవాలని ఎంతో ఆశపడిన బాలికకు 16 ఏళ్లకే తల్లిదండ్రులు వివాహం చేశారు. కాపురం అంటే ఏంటో తెలియని వయసులో అత్త మామలు, భర్త పెట్టే వేధింపులు భరించలేక ఇంట్లోంచి పారిపోయి నగరానికి వచ్చింది. పని ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి ఆమె వద్ద ఉన్న నగలు, డబ్బులు తీసుకుని ఉడాయించాడు.అయితే కట్టుబాట్లు అంటూ తిరిగి ఆ బాలికను గ్రామంలోకి అనుమతించలేదు. విషయం న్యాయసేవాధికార సంస్థకు తెలిసింది. తొలుత సఖి కేంద్రానికి తరలించి.. చదువుకునేందుకు చర్యలు చేపట్టింది. తర్వాత ఊరి పెద్దలతో మాట్లాడి బాలికను అనుమతించేలా చేశారు. బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ప్రేరణ... పాఠశాలకు వెళ్లి అందరిలా చదువుకోవాలని ఉన్నా.. ఇళ్లలో పనిచేసేది ఓ బాలిక. పనికి వెళితేనే పైసలు వస్తయని, చదువుకుంటే డబ్బులేం రావని తల్లి చెబుతుండేది. పని చేసే చోట ఓ వృద్ధుడు చదివిస్తానని మాయమాటలు చెబుతూ గర్భవతిని చేశా డు. ఎవరికైనా విషయం చెబితే పుస్తకాలు కొనివ్వనని బెదిరించాడు. ఎలా అయినా చదువుకోవాలని తపన పడిన చిన్నారి అతని బాధలన్నీ భరించింది. బాలిక గర్భిణి అని తెలుసుకున్న తల్లిదండ్రులు అల్లాడిపోయారు. న్యాయసేవాధికార సంస్థను సంప్రదించారు. అబార్షన్ చేసే అవకాశం కూడా లేకపోవడంతో బాలిక, పసికందు సంరక్షణ చర్యలు తీసుకున్నారు. పోక్సో చట్టం కింద జైలుకు పంపి నా... నిందితుడు కేసు విచారణలో ఉండగానే మృతి చెందాడు. ఆ బాలిక భవిష్యత్ అంధకారం కాకుండా న్యాయ సేవాధికార సంస్థ ఆర్థిక సాయం చేసింది. వల... ఓ యువతి.. తల్లి ప్రోత్సాహంతో రీల్స్, షార్ట్స్ అంటూ వీడియోలు పోస్టు చేసేది. ఆమె ఉత్సాహం, వ్యూస్ చూసిన సైబర్ నేరగాళ్లు ఆమె ఐడీని హ్యాండిల్ చేస్తామని చెప్పారు. మురిసిపోయిన ఆమె తన వ్యక్తిగత వివరాలన్నీ తెలియజేసింది. వాళ్లు ఏమీ చెబితే అది చేయడం ప్రారంభించింది. ఎంత డబ్బు అడిగినా ఇస్తారని తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు.. ఓ రోజు ఫేస్ మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియో, ఫొటోలను ఆమెకు పంపించారు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారు. తండ్రికి విషయం చెప్పడంతో న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించారు. తొలుత 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. న్యాయ సాయం అందించి, ఫేక్ ఏజెన్సీ వాళ్లను పట్టకునేలా సంస్థ చర్యలు చేపట్టింది. ముందడుగు... కాలేజీకి వెళ్లే ఓ విద్యార్థి మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు. డ్రగ్స్ తీసుకుంటే బాగా చదువుకోవచ్చని స్నేహితులు చెప్పిన మాటలు నమ్మి ఊబిలో కూరుకుపోయాడు. చదువు సంగతి అటుంచితే.. ఆరోగ్యం పూర్తి దెబ్బతినే వరకు తెచ్చుకున్నాడు. ఓ రోజు పోలీసుల వలకు ముఠా చిక్కింది. పెడ్లర్లకు కోర్టు కఠిన శిక్ష విధించింది. న్యాయ సేవాధికార సంస్థ విద్యార్థులను డీఅడిక్షన్ సెంటర్‌కు పంపింది. ఇప్పుడు వారు డ్రగ్స్‌కు దూరంగా సాధారణ జీవనం సాగిస్తున్నారు. సంకల్పం... తోపుడు బండ్లపై, గంపల్లో వ్యాపారం చేసుకునే వారి వద్ద బేరమాడి తక్కువ రేటుకు కొంటాం. రోజువారీ వడ్దీకి తెచ్చి ఎండనక, వాననక.. కష్టపడి వందో.. రెండు వందలో ఇంటికి తీసుళ్తే తప్ప పూట గడవదు. ఇలా ఓ మహిళ డబ్బు తీసుకుని ఓ రోజు డబ్బు చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారి ఆ వ్యాపారాన్ని నాశనం చేశాడు. న్యాయసేవాధికార సంస్థను సంప్రదించడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు. మెప్మా ద్వారా రుణం ఇప్పించారు. స్టాల్ పెట్టించి సొంత వ్యాపారం పెట్టుకునే భరోసా కల్పించారు. ఇలా పథకాలతో నెలనెలా వేలల్లో సంపాదిస్తున్న వారెందరో ఉన్నారు.. సంరక్షణ...ఏకాంతంగా ఆడుకుంటున్న ఓ మగ, ఆడబిడ్డపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కాస్త ఊహ తెలిసిన బాధిత చిన్నారి ఇచ్చిన సమాచారం మేరకు అతన్ని అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కటకటాల్లోకి పంపారు. చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించిన న్యాయ సేవాధికార సంస్థ కౌన్సెలింగ్ కూడా ఇప్పించింది. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నేరుగా జడ్జి ఆ చిన్నారులతో మాట్లాడారు. ఏం జరిగిందో ఆ చిన్నారులు భయపడుతూనే వివరించారు. దుర్మార్గుడిని కూడా గుర్తించడంతో రెండు కేసుల్లో కఠిన శిక్షలు పడ్డాయి. న్యాయ సేవాధికార సంస్థ నుంచి బాధితులకు పరిహారం అందించారు. అందరిలా వారు జీవించేందుకు ఏర్పాట్లు చేశారు. అంకురం.. పారా లీగల్ వలంటీర్ ఓ హోటల్లో చిన్నారి పని చేయడం చూసి యజమానిని హెచ్చరించాడు. పనిలో తీసేసిన ఆ చిన్నారిని వ్యభిచార గృహానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న వలంటీర్ పోలీసుల సహకారంతో ముఠా గుట్టు రట్టు చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కటకటాల్లోకి పంపించారు. ఆ చిన్నారితోపాటు చాలామంది చిన్నారులకు జీవితాన్నిచ్చారు. వారంతా చదువుకునేలా న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేసింది. గెలుపు.. మొబైల్‌కు వచ్చిన లింక్‌ను చదివిన మహిళ పార్ట్ టైమ్ జాబ్‌కు ఓకే కొట్టింది. వెయ్యి, రెండు వేల వరకు బాగానే వేసిన సైబర్ నేరగాళ్లు ఆదాయపు పన్ను అంటూ తొలుత లక్ష, తర్వాత మరో లక్ష చెల్లించాలన్నారు. వారి ఊబిలో ఇరుక్కుపోయిన మహిళ అడిగినప్పుడల్లా డబ్బు ట్రాన్స్ఫర్ చేసింది. ఆ నగదు తన అకౌంట్లోనే చూపిస్తుండటంతో అనుమానం రాలేదు. ఇలా వివాహం కోసం దాచిన రూ.50 లక్షలు బదిలీ చేసింది. ఆ తర్వాత కానీ మోసపోయానని ఆమె తెలుసుకోలేదు. ఆత్మహత్యకు యత్నించిన ఆ మహిళను తండ్రి కాపాడి సైబర్ పోలీసులను ఆశ్రయించారు. సరైన సమయంలో పోలీసులను సంప్రదించడంతో వారు ఆ డబ్బును రికవరీ చేయగలిగారు. గతంలో 2 శాతమే ఉన్న ఈ రికవరీ రేటు ప్రస్తుతం 20 శాతానికి పెరిగింది. వెంటనే సంప్రదిస్తే ఫలితం వచ్చే అవకాశమెక్కువ. జోజో పాపాయి... పురిటిలోనే తల్లిని కోల్పోయిన చిన్నారికి పాల కోసం రోజు కిలోమీటర్ల దూరం వెళ్లేవారు తాత. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా గేదెను కొనుక్కొనేందుకు ఆర్థికంగా సహకరించలేదు. న్యాయ సేవాధికార సంస్థకు విషయం తెలియడంతో ఆ తాతను అధికారుల వద్దకు తీసుకెళ్లారు. గిరిజన సంక్షేమ శాఖ సహాయ గిరిజన అభివృద్ధి అధికారి సహకారంతో ఆవును అందించారు. పసికందు ఆకలి తీర్చడానికి చర్యలు చేపట్టారు. టీకాలు, ఇతర పోషకాహారం కూడా ఇంటికే అందించే ఏర్పాటు చేశారు. తస్మాత్ జాగ్రత్త.. ఉదయం లేచింది మొదలు ఫోన్‌తోనే గడిపేవారు ఎందరో. కొందరు ఆర్థిక అవసరాల కోసం లోన్ యాప్‌లను సంప్రదిస్తున్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదని చెబుతూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు వడ్డీ వసూలు చేస్తున్నారు. లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడే ‘ఓకే’ కొట్టడంతో మన ఫోన్లో ఉన్న డేటా అంతా వారికి చేరుతుంది. మన ఫొటోలు, వీడియోలు కూడా.. తీసుకున్న లోన్ మొత్తం కట్టినా వేధింపులు ఆగలేదు. ఓ వ్యక్తి అక్క వివాహం కోసం లోన్ తీసుకున్నాడు. సైబర్ నేరగాళ్లు అక్క ఫోటోలను మార్ఫింగ్ చేసి పంపారు. దీంతో అతడు న్యాయసేవాధికార సంస్థను సంప్రదించగా.. సైబర్ పోలీసులు అతని ఫోన్‌ను వాచ్ చేసి నేరగాళ్లను అరెస్టు చేశారు. బంధ విముక్తులను చేసి...ఇదే నాగర్‌కర్నూల్‌లో రూ.15 వేల అప్పు కట్టలేదని గిరిజన భార్యాభర్తలను నిర్భందించి, పనిలో పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. విషయం తెలుసుకున్న జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కార్మికులకు అందిస్తున్న పథకం కింద ఇద్దరికీ రూ.30 వేల చొప్పున 2024, డిసెంబర్లో అందించింది. వారిని బంధవిముక్తులను చేసింది.నాంది... ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇంటికే భోజనం, సరుకులు తెచ్చే యాప్‌లు ఎన్నో ఉన్నాయి. మరి వాటిలో పని చేస్తున్న కార్మికుల పరిస్థితి ఏంటి? వారిని పనిలోంచి తీసేయడం, శ్రమ దోపిడీ జరిగితే ఎక్కడికి వెళ్లాలి.. ఎవరిని సంప్రదించాలి? కార్మిక చట్టం ప్రకారం యాప్ ఆధారిత కార్మికుల పరిస్థితిని సమర్థవంతంగా మెరుగుపర్చడానికి చట్టపరమైన చర్యల ప్రత్యేక బ్లూప్రింట్ అవసరమని న్యాయ సేవాధికార సంస్థ ప్రతిపాదించింది. అసంఘటితరంగ కార్మికుల హక్కుల రక్షణకు అండగా నిలుస్తోంది. మానసిక వేదనకు పరిష్కారం బాధితులకు న్యాయం చేయడం కోసం చివరి వరకు ప్రయత్నించాలన్నది సుప్రీంకోర్టు పిలుపు. లీగల్ సర్వీసెస్ అథారిటీ (Telangana State Legal Services Authority) సేవలు దేశవ్యాప్తం కావాలని ఆకాంక్ష. అట్టడుగు వర్గాలకు న్యాయ సేవలు అందాలి. కులం, మతం లేదా ఆర్థిక స్తోమత లేని కారణంగా న్యాయం పొందలేకపోవడం సరికాదు. రూపాయి ఖర్చు లేకుండా లీగల్ సర్వీసెస్ అథారిటీ సేవలు అందిస్తుంది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయితోపాటు గ్రామాల్లో వలంటీర్లు అందుబాటులో ఉంటారు.న్యాయసాయమే కాదు.. పథకాల వర్తింపుపైనా సమాచారం ఇస్తారు. అంతేకాదు.. ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలన్నా న్యాయ సాయం చేస్తారు. ఎలాంటి నేరం జరిగినా బాధితులను ఆర్థికంగా, మానసికంగా అండగా ఉంటారు. ఎలాంటి నేరం జరిగితే.. ఎలా సాయం పొందవచ్చు అని ప్రజలు తెలుసుకునేందుకే రియల్ స్టోరీల ఆధారంగా లఘు చిత్రాలను రూపొందించాం. గతంలో రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శిగా పనిచేసిన (ప్రస్తుత ఎఫ్ఏసీ రిజిస్ట్రార్ జనరల్) ఎస్.గోవర్ధన్‌రెడ్డి ఈ చిత్రాల రూపకల్పనలో కీలక పాత్ర వహించారు. మార్ఫింగ్ వీడియోలు, అత్యాచారాల్లాంటి ఘటనల్లో ఆర్థిక సాయం అందించొచ్చు.. నేరగాళ్లకు శిక్ష పడొచ్చు.. కానీ, బాధితుల మానసిక వేదనను అర్థం చేసుకునేవారు ఉండరు. అలాంటి సమస్యలను పరిష్కరించడంలో అథారిటీ కీలక పాత్ర పోషిస్తోంది. చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు ప్రభుత్వం మరింత ముందుకొచ్చి చర్యలు చేపట్టాలి. – డి.సాయిప్రసాద్, లఘు చిత్రాల దర్శకుడు బాధితుల సంక్షేమానికి చర్యలు న్యాయసేవాధికార సంస్థ అంటే.. న్యాయ సేవలు ఒకటే కాదు. సంక్షేమ ఫలాలు బాధితులకు అందేలా చర్యలు తీసుకున్నాం. నేరం జరిగినప్పుడు బాధితుల వేదనను గుర్తించి నష్ట పరిహారం అందిస్తున్నాం. ప్రభుత్వం ద్వారా వారికి లబ్ధి చేకూరుస్తున్నాం. కేసు విచారణకు న్యాయ సాయంతోపాటు తీర్పు వచ్చే వరకు అండగా నిలుస్తున్నాం. రాష్ట్రస్థాయిలో టీఎస్ఎల్ఎస్ఏను, జిల్లాల్లో డీఎల్ఎస్ఏను, మండలాల్లో మండల లీగల్ సర్వీసెస్ కమిటీని సంప్రదించి సాయం పొందవచ్చు. బాధితులు ఈ కేంద్రాలకు వెళ్లి న్యాయపరమైన సలహాలు కోరవచ్చు. ప్రతీచోట పారా లీగల్ వలంటీర్లు, న్యాయవాదులుంటారు. రాలేని పరిస్థితి ఉంటే నేరుగా మేమే వారి దగ్గరికి వెళ్లి సాయం అందిస్తున్నాం. బాధితులే కాదు.. వారు సాయం అర్థించే పరిస్థితిలో లేకుంటే, వారి తరఫున ఎవరు సమాచారం ఇచ్చినా చేయూత అందించేందుకు కృషి చేస్తాం. మీకు వచ్చిన భాషలో దరఖాస్తుతో వలంటీర్లను లేదా అధికారులను ఆశ్రయించవచ్చు. న్యాయ సాయం తప్ప ఇతర సేవలను వినియోగించుకునే వారు చాలా తక్కువ. ఎక్కడ, ఎలా వాటిని పొందాలో చాలామందికి తెలియదు. సంస్థ సేవలు అట్టడుగు ప్రజానీకానికి, మారుమూల గ్రామాలకు చేరాల్సిన అవసరం ఉంది. అవసరం ఉన్న వారిలో ఎక్కువ మంది ఆ సేవలు పొందగలిగినప్పుడే నిజమైన సార్థకత చేకూరుతుంది. – సీహెచ్. పంచాక్షరి, సభ్య కార్యదర్శి, టీఎస్ఎల్ఎస్ఏ -
ట్రంప్ ఎత్తుకు అరబ్ దేశాల పైఎత్తు
కైరో: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వా«దీనం ప్రతిపాదనకు అరబ్ దేశాలు చెక్ పెట్టాయి. ‘మిడిల్ ఈస్ట్ రివేరా’విజన్‌కు భిన్నంగా గాజా పునర్నిర్మాణ ప్రణాళికను విడుదల చేశాయి. 53 బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రతిపాదనను అరబ్నాయకులు ఆమోదించా రు. యుద్ధానంతర ప్రణాళికను ఈజిప్టు ప్రతిపాదించింది, దీని ప్రకారం పాలస్తీనా అథారిటీ (పీఏ) పరిపాలన కింద గాజా పునర్నిర్మాణం జరుగుతుంది. గాజాను అమెరికా అ«దీన ప్రాంతంగా మార్చేందుకు ట్రంప్ చేసిన ప్రణాళికకు ఇది కౌంటర్. ట్రంప్ గాజా స్వా«దీన ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి మద్దతు తెలిపిన మరుసటి రోజే కైరోలో అరబ్ లీగ్ సదస్సు జరిగింది. ముగింపు సమావేశంలో ఈ గాజా పునర్నిర్మా ణం కోసం ‘సమగ్ర అరబ్ ప్రణాళిక’ను ఆయా దేశా ల నేతలు ప్రకటించారు. అంతేకాదు ఈ ప్రణాళికకు అంతర్జాతీయ మద్దతుకు పిలుపునిచ్చారు. భూభాగ పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చడానికి ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రాజెక్టు కోసం అన్ని దేశాలు, ఆర్థిక సంస్థల నుంచి సహకారాన్ని స్వీకరిస్తామని పేర్కొన్నారు. 112 పేజీల డాక్యుమెంట్ పాలస్తీనియన్ల తరలింపు, గాజాను అమెరికా పునర్నిర్మించాలన్న ట్రంప్ ఆకాంక్షకు ప్రత్యామ్నాయంగా ఈజిప్టు, జోర్డాన్, గల్ఫ్ అరబ్ దేశాలు దాదాపు నెల రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నాయి. గాజా నుంచి పాలస్తీనియన్లను సామూహికంగా తరలించడాన్ని అరబ్ దేశాలు తిరస్కరించాయి. తామే ఆ బాధ్యతలు తీసుకున్నాయి. ‘గాజా పునర్నిర్మాణ ప్రణాళిక’పేరుతో 112 పేజీల డాక్యుమెంట్‌ను రూపొందించాయి. గాజాను తిరిగి ఎలా అభివృద్ధి చేయనున్నారనే మ్యాప్‌లు, ఇల్లు, ఉద్యానవనాలు, కమ్యూనిటీ సెంటర్లకు సంబంధించిన ఏఐ జనరేటెడ్ చిత్రాలతో తయారు చేశారు. అలాగే వాణిజ్య నౌకాశ్రయం, టెక్నాలజీ హబ్, బీచ్ హోటళ్లు, విమానాశ్రయం కూడా ఉన్నాయి. స్వాగతించిన హమాస్..శిఖరాగ్ర సమావేశం ప్రణాళికను, సహాయక చర్యలు, పునర్నిర్మాణం, పాలనను పర్యవేక్షించడానికి తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు హమాస్ తెలిపింది. అంతేకాదు.. కమిటీలో తమ అభ్యర్థులను ఉంచబోమని ప్రకటించింది. అయితే పీఏ పర్యవేక్షణలో పనిచేసే కమిటీ విధులు, సభ్యులు, ఎజెండాకు తన సమ్మతిని తెలియజేయాల్సి ఉంటుంది. కమిటీలో ఉండబోయే వ్యక్తుల పేర్లను నిర్ణయించినట్లు ఈజిప్టు విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలాటీ మంగళవారం రాత్రి తెలిపారు. పీఏకు నాయకత్వం వహిస్తున్న పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ మాట్లాడుతూ ఈజిప్టు ఆలోచనను తాను స్వాగతిస్తున్నానని, పాలస్తీనా నివాసితులను తరలించని ఇలాంటి ప్రణాళికకు మద్దతు ఇవ్వాలని ఆయన ట్రంప్‌ను కోరారు. పరిస్థితులు అనుకూలిస్తే అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎన్నికల ప్రణాళికను సైతం హమాస్ స్వాగతించింది. తిరస్కరించిన అమెరికా.. అరబ్ నాయకులు ఆమోదించిన గాజా పునర్నిర్మాణ ప్రణాళికను ట్రంప్ ప్రభుత్వం తిరస్కరించింది, ఈ భూభాగంలోని పాలస్తీనా నివాసితులను పునరావాసం కల్పిచి, అమెరికా యాజమాన్యంలోని ‘రివేరా’గా మార్చే తన పాత విజన్‌కే అమెరికా అధ్యక్షుడు కట్టుబడి ఉన్నారని తెలిపింది. గాజా ప్రస్తుతం నివాసయోగ్యంగా లేదని, శిథిలాలు, పేలని ఆయుధాలతో కప్పబడిన భూభాగంలో నివాసితులు జీవించలేరని జాతీయ భద్రతా మండలి ప్రతినిధి బ్రియాన్ హ్యూస్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సును తీసుకురావడానికి మరిన్ని చర్చల కోసం తాము ఎదురు చూస్తున్నామన్నారు. తోసిపుచ్చిన ఇజ్రాయెల్.. ఈజిప్టు ప్రణాళికను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. కాలం చెల్లిన దృక్పథాలతో ఉందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రక టనలో విమర్శించింది. పీఏఐ ఆధారపడటా న్ని తిరస్కరించింది. ప్రణాళిక హమాస్‌కు అధికారాలిచ్చేదిగా ఉందని ఆరోపించింది. హమా స్ సైనిక, పాలనా సామర్థ్యాలను నాశనం చే యడమే తమ లక్ష్యమని, ముందు హమాస్ సై నిక ఉపసంహరణకు అంగీకరించేలా చేయాల ని డిమాండ్ చేసింది. అది తప్ప మరేదీ తమకు ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది. -
సోలో ట్రిప్‌కే అతివల ఆసక్తి
సాక్షి, అమరావతి: పర్యాటకుల అభిరుచి కొత్త పుంతలు తొక్కుతోంది. వర్తమాన జీవితంలో సంతోషానికే ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ క్రమంలోనే 2025 సంవత్సరం మహిళల సోలో ప్రయాణాలకు కేరాఫ్‌గా మారనుంది. దీనికితోడు వెల్నెస్ రిట్రీట్లు, పాప్ సంస్కృతి ప్రేరేపిత టూర్లపై ఆసక్తి కనిపిస్తోంది. వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ఈ ఏడాది అత్యంత ముఖ్యమైన ట్రెండ్లలో ‘సోలోగా మహిళా ప్రయాణం’ ఒకటిగా నిలుస్తోంది. 2024లో సోలో వీసాలకు దరఖాస్తు చేసిన మహిళలు 30 శాతం ఉంటే.. ఈ ఏడాది 37 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తోంది. సుమారు 25–40 ఏళ్ల మధ్య మహిళలు సోలో ట్రిప్‌లను ఉద్యమంగా చేపట్టబోతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. బాలి, థాయ్‌లాండ్, జపాన్ వంటి గమ్యస్థానాలలో సాహస యాత్రల ద్వారా తమ అన్వేషణను చేపట్టాలని భావిస్తున్నట్టు తేలింది.పర్యాటక శక్తి కేంద్రంగా ఆసియాప్రపంచ ప్రయాణ రంగంలో ఆసియా ఆధిపత్యం కొనసాగుతోంది. థాయ్‌లాండ్, జపాన్, వియత్నాంతో పాటు ఇండోనేషియా 2025లో అత్యంత పర్యాటక రద్దీని ఎదుర్కోనుంది. వీసా రహిత విధానాలు, వివిధ ఎక్స్‌పోలు లక్షలాది మంది సందర్శకులను ఆకర్షించనుంది. సింగపూర్‌కు చెందిన డిస్నీ క్రూయిజ్‌కు 27 శాతానికిపైగా డిమాండ్ పెరగనుంది. నోరూరించ రుచుల కోసంప్రయాణ ప్రణాళికలో ఆహారం ప్రధాన భాగంగా మారుతోంది. 2025లో వంటకాల పర్యాటకం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇటలీ ట్రఫుల్ ఫెస్టివల్, థాయ్‌లాండ్ సాంగ్‌క్రాన్ ఫుడ్ ఫెస్టివల్ వంటి ఐకానిక్ ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి. అదే సమయంలో స్లోవేనియా, లావోస్, ఫారో దీవులు వంటి ఆఫ్‌బీట్ గమ్యస్థానాలు సాహస యాత్రల అనుభవాలను మహిళలు కోరుకుంటున్నారు.ఆరోగ్యకర ప్రయాణంప్రయాణికులు తమ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలి, తైవాన్ వంటి ప్రశాంతమైన గమ్యస్థానాలలో యోగా, ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువ ప్రాంతాలను చుట్టిరావడం కంటే ఒకే ప్రాంతంలో అనుభూతులను పూర్తిగా ఆస్వాదించేలా ‘స్లో ట్రావెలింగ్’ భావనను అలవర్చుకుంటున్నారు. మరోవైపు పాప్ సంస్కృతి ప్రయాణాన్ని ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా ఇష్టపడుతున్నారు. అభిమానులు తమకు ఇష్టమైన సినిమాలు, ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాల నుంచి ప్రేరణ పొంది టూర్లను ప్లాన్ చేసుకుంటున్నారు. -
కన్నా.. కన్నవాళ్లంరా..
చిత్రంలో కనిపిస్తున్నామె పేరు రామేశ్వరమ్మ(65). ఈమెది మాడ్గుల మండల కేంద్రం. భర్త బ్రహ్మచారి 23 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఐదుగురు కుమార్తెలు. ఒక కుమారుడు. ఆమెకు ఏకైక ఆధారం భర్త సంపాదించిన ఇల్లు ఒక్కటే. ఎవరికీ తెలియకుండా కుమారుడు ఇంటిని తన పేరున రాయించుకున్నాడు.ఆ తర్వాత తల్లి సహా ఇద్దరు చెల్లెళ్లను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్డాడు. దీంతో న్యాయం చేయాలని కోరుతూ రామేశ్వరమ్మ ఏడాది క్రితం ఇబ్రహీంపట్నం ఆర్డీఓను ఆశ్రయించింది. ఇప్పటికీ న్యాయం దక్కలేదు. తలదాచుకునేందుకు ఇల్లు లేకపోవడంతో వీధుల్లో బతుకీడుస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: జీవిత చరమాంకంలో అండగా నిలబడాల్సిన కన్నబిడ్డలు.. ఆ తల్లిదండ్రుల పాలిట కర్కోటకులుగా ప్రవర్తిస్తున్నారు. పెన్షన్ డబ్బులు ఇవ్వాలంటూ కొందరు.. ఉన్న ఇళ్లు, భూములు, ఇతర ఆస్తులు రాసి ఇవ్వాలంటూ మరికొందరు వేధిస్తున్నారు. ఇంకొందరు ప్రత్యక్ష దాడులకు పాల్పడటంతోపాటు బలవంతంగా ఇంటి నుంచి బయటకు గెంటేస్తున్నారు.విధిలేని పరిస్థితుల్లో కొంతమంది జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖను ఆశ్రయించి, న్యాయం పొందుతుండగా, మరికొంత మంది ఆత్మాభిమానం చంపుకొని జీవించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే 2023–24లో 1,105 ఫిర్యాదులు అందగా, వాటిలో 979 కేసులు పరిష్కారమయ్యాయి.ఈ ఏడాది జనవరి 25 వరకు 107 ఫిర్యాదులు అందగా, 69 పరిష్కారం అయ్యాయి. నిజానికి ప్రొటెక్షన్ ఆఫ్ పేరెంట్స్ అండ్ మెయింటెనెన్స్ 2007 యాక్ట్ ప్రకారం ఫిర్యాదు చేసిన 90 రోజుల్లోనే తుది తీర్పు ఇవ్వాల్సి ఉన్నా.. మెజారిటీ కేసుల్లో రెండు మూడేళ్లైనా విచారణ పూర్తి కావడం లేదు. కఠినచర్యలు తప్పవు వనస్థలిపురం సచివాలయనగర్‌కు చెందిన వృద్ధురాలు కె.రత్నమణి ఇటీవల జిల్లా వయోజన వృద్ధుల సంక్షేమశాఖను ఆశ్రయించింది. కొడుకు అమృతరాజ్, కోడలు పద్మ తన ఆస్తులను లాగేసుకుని ఆ తర్వాత తన సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరిపి, తుది ఉత్తర్వులు కూడా జారీ చేశారు.ఇలా ఇప్పటికే ఎనిమిది కేసుల్లో తీర్పులు ఇచ్చాం. వృద్ధులు/తల్లిదండ్రులపై ప్రత్యక్ష దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయిస్తాం. బాధితులకు పూర్తి రక్షణ కల్పిస్తాం. ఆర్డీఓతో విచారణ జరిపించి..వారిచ్చే నివేదిక ఆధారంగా తుది ఆదేశాలు జారీ చేస్తున్నాం. ఇప్పటికే మెజారిటీ కేసులను పరిష్కరించాం. – సంధ్యారాణి, రంగారెడ్డి జిల్లా వయోవృద్ధుల సంక్షేమ విభాగం అధికారిసత్వర న్యాయం చేయాలి విచారణ పేరుతో ఏళ్ల తరబడి కేసును సాగదీస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రులను చాలా మంది పిల్లలు భారంగా భావిస్తున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయాలి. వృద్ధులపై దాడులకు పాల్పడే కొడుకులు, కోడళ్లపై కఠినచర్యలు తీసుకోవాలి. అప్పుడే సమాజంలో వృద్ధులకు రక్షణ పెరుగుతుంది. – మధుసూదన్‌రావు, అధ్యక్షుడు, తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్తల్లిదండ్రుల మైండ్‌సెట్ మారాలి పిల్లలకు స్వేచ్ఛ ఇస్తే ఎక్కడ పాడవుతారో అనే భయం తల్లిదండ్రుల్లో ఉంది. తన తర్వాత తన ఆస్తి తన పిల్లలకే చెందుతుందని చెబుతుంటారు. సొంతకాళ్లపై నిలబడకుండా చేస్తున్నారు. దీంతో వారు తమ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి చివరకు తనకే వస్తుందనే భావనలో ఉండిపోతున్నారు.బలవంతంగా ఆస్తులన్నీ తమ పేరుపై రాయించుకొని చివరకు వారిని ఇంటి నుంచి గెంటివేస్తున్నారు. నిజానికి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులపై పిల్లలకు హక్కులుండవు. తాత నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులపైనే పిల్లలకు హక్కులు ఉంటాయి. విదేశీయుల మాదిరిగా ఇండియన్ పేరెంట్ మైండ్‌సెట్ కూడా మారాలి. అప్పుడే ఆస్తి వివాదాలు, గొడవలు తగ్గుతాయి – విశేష్, సైకాలజిస్ట్ -
లక్షల మంది చిన్నారుల ప్రాణదాత అస్తమయం
కారణజన్ములు అత్యంత అరుదుగా పుడతారని ప్రపంచవ్యాప్తంగా విశ్వసిస్తారు. ఆ విశ్వాసాన్ని నిజంచేస్తూ లక్షలాది మంది పసిపాపల ప్రాణాలను నిలబెట్టిన జేమ్స్ క్రిస్టఫర్ హారిసన్ తుదిశ్వాస విడిచారు. రక్తంలోని ప్లాస్మాను 1,173 సార్లు దానంచేసి అందులోని అరుదైన యాంటీ–డి యాంటీబాడీతో దాదాపు పాతిక లక్షల మంది చిన్నారులను కాపాడిన ప్రాణదాతగా ఘన కీర్తులందుకున్న హారిసన్(88) గత నెల 17వ తేదీన ఆ్రస్టేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో తుదిశ్వాస విడిచిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సింగ్ హోమ్‌లో నిద్రలోని ఆయన శాశ్వత నిద్రలోకి జారుకున్నారని వైద్యులు తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన హారిసన్‌ను అందరూ ‘మ్యాన్ విత్ ది గోల్డెన్ ఆర్మ్’అని గొప్పగా పిలుస్తారు. ఏమిటీ ప్రత్యేకత? మానవ రక్తంలో పాజిటివ్, నెగిటివ్ అని రెండు రకాల వర్గీకరణలు ఉన్నాయి. దీనిని రీసస్(ఆర్‌హెచ్)ఫ్యాక్టర్ అని కూడా అంటారు. ఆర్‌హెచ్ నెగిటివ్ రక్తమున్న మహిళ, ఆర్‌హెచ్ పాజిటివ్ ఉన్న వ్యక్తి కారణంగా గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డకు ఆర్‌హెచ్ పాజిటివ్ ఉండే ఛాన్సుంది. దీంతో కొన్ని సార్లు ప్రాణాంతకమైన సమస్య తలెత్తుతుంది. తల్లి ఎర్ర రక్తకణాలు పుట్టబోయే బిడ్డ రక్తకణాలపై దాడిచేసి కొత్త వ్యాధిని సృష్టిస్తాయి. దీనినే హీమోలైటిక్ డిసీజ్ ఆఫ్ ది న్యూబార్న్(హెచ్డీఎన్)గా పిలుస్తారు. అంటే పుట్టబోయే/పుట్టిన బిడ్డలో ఎర్రరక్త కణాలు అత్యంత వేగంగా క్షీణించిపోతాయి.దీంతో బిడ్డకు రక్తహీనత సమస్య రావడం, గుండె వైఫల్యం చెందడంతోపాటు ప్రాణాలు పోయే అవకాశాలు చాలా అధికం. హెచ్డీఎన్ సమస్యతో ఆ్రస్టేలియాలో ప్రతి ఏటా వేలాది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయితే జేమ్స్ హారిసన్లోని రక్తంలో అరుదైన యాంటీ–డీ యాంటీబాడీని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈయన రక్తం ప్లాస్మా నుంచి సేకరించిన యాంటీబాడీతో ఔషధాన్ని తయారుచేసి దానిని ఆర్‌హెచ్‌డీ సమస్య ఉన్న గర్భిణులకు ఇచ్చారు.దీంతో పిండస్థ దశలోని చిన్నారుల ప్రాణాలు నిలబడ్డాయి. ఇలా 1967వ సంవత్సరం నుంచి ఎప్పటికప్పుడు హారిసన్ తన ప్లాస్మాను దానం చేస్తూనే ఉన్నారు. ఆస్ట్రేలియాలో 81 ఏళ్లు దాటిన వాళ్లు ప్లాస్మా దానం చేయకూడదనే నిబంధన ఉంది. దాంతో ఆయన తన 82వ ఏట ప్లాస్మా దానాన్ని ఆపేశారు. అప్పటికే ఆయన 1,173 సార్లు ప్లాస్మాను దానంచేశారు. దాని సాయంతో ఒక్క ఆస్ట్రేలియాలోనే దాదాపు 24 లక్షల మంది పసిపాపలను కాపాడటం విశేషం. ఆరు దశాబ్దాలపాటు దానం 1936 డిసెంబర్ 27న హారిసన్ జన్మించారు. 14వ ఏట అంటే 1951 ఏడాదిలో హారిసన్‌కు ఛాతిలో పెద్ద శస్త్రచికిత్స జరిగింది. అప్పుడు పెద్దమొత్తంలో రక్తం అవసరమైంది. ఇతరుల రక్తదానంతో బతికానన్న కృతజ్ఞతాభావం ఆయనలో ఆనాడే నాటుకుపోయింది. బ్రతికినంతకాలం రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నారు. నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన తర్వాతే రక్తదానం ఇవ్వడం మొదలెట్టారు. ఇలా దాదాపు 60 ఏళ్లపాటు ప్లాస్మాను దానంచేశారు.ప్రతి రెండు వారాలకోసారి ప్లాస్మా దానమిచ్చారు. అత్యధిక సార్లు ప్లాస్మా దానం చేసిన వ్యక్తిగా 2005లో ఆయన ప్రపంచ రికార్డ్ సృష్టించారు. 2018 మే11వ తేదీన చివరిసారిగా ప్లాస్మా దానంచేశారు. న్యూ సౌత్ వేల్స్(ఎన్ఎస్డబ్ల్యూ) జాతీయ యాంటీ–డీ కార్యక్రమంలో వ్యవస్థాపక సభ్యునిగా హారిసన్ ఉన్నారు. ఇన్నేళ్లలో ఎన్ఎస్డబ్ల్యూ తయారుచేసిన యాంటీ–డీ ప్రతి బ్యాచ్‌లో ఒక్క డోస్ అయినా హారిసన్ది ఉండటం విశేషం.లక్షల ప్రాణాలు కాపాడి రికార్డ్ సృష్టించారని గతంలో మీడియా ఆయన వద్ద ప్రస్తావించగా నవ్వి ఊరుకున్నారు. ‘‘రికార్డ్ సృష్టించడం అంటూ ఏదైనా జరిగిందంటే అది కేవలం ఆ దాతృత్వ సంస్థ చేసిన విరాళాల వల్లే. ఇందులో నా పాత్ర ఏమీ లేదు’’అని నిగర్విలా మాట్లాడారు. నేనూ బతికా: కూతురు హారిసన్ మరణంపై ఆయన కూతురు ట్రేసీ మెలోషి ప్ మాట్లాడారు. ‘‘మా నాన్న ఇన్నిసార్లు దానం చేసి కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆయన అందించిన యాంటీ–డీ డోస్‌తో ఎంతో మంది బ్రతికారు. అందులో నేను కూడా ఉన్నా’’అని ట్రేసీ అన్నారు. ఈ డోస్ పొందిన వారిలో హారిసన్ మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉండటం విశేషం. 14 ఏళ్ల వయసులో ఆపరేషన్ వేళ తీవ్రస్థాయిలో రక్తం ఎక్కించుకోవడం వల్లే హారిసన్ ఈ అరుదైన లక్షణాన్ని సంతరించుకున్నారని కొందరి వాదన. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ సముద్ర ప్రవాహం... నెమ్మదిస్తోంది!
పర్యావరణ మార్పుల తాలూకు విపరిణామాలు ఊహాతీత వేగంతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ధ్రువాల వద్ద మంచు ఎన్నడూ లేనంత వేగంతో కరిగిపోతుండటం కొన్నేళ్లుగా మనమంతా చూస్తున్న భయానక పరిణామమే. ఇది మరో పెను ప్రమాదానికి కూడా దారి తీస్తోందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. అంటార్కిటికాలో అత్యంత బలమైన సముద్ర ప్రవాహ గతి కొన్నేళ్లుగా క్రమంగా నెమ్మదిస్తూ వస్తోందని వెల్లడించింది. అంటార్కిటికా వద్ద భారీ మంచు ప్రమాదకర వేగంతో కరుగుతుండటమే ఇందుకు కారణమని వివరించింది. ప్రపంచ వాతావరణాన్ని క్రమబదీ్ధకరించడంలో ఈ ప్రవాహానిదే అతి కీలకపాత్ర. అంతేగాక మహాసముద్రాల ప్రవాహాల గతి కూడా చాలావరకు ఈ ప్రవాహ గతిమీదే ఆధారపడి ఉంటుంది. ‘‘లక్షలాది ఏళ్లుగా సమతుల్యంగా కొనసాగుతూ వస్తున్న అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రవాహం కూడా పర్యావరణ మార్పుల దెబ్బకు గాడి తప్పుతుండటం అత్యంత ఆందోళనకరం. ఇదిలాగే కొనసాగితే మానవాళి ఊహాతీతమైన పర్యావరణ విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని అధ్యయనం హెచ్చరించింది. ఏసీసీ... పెట్టనికోట! ప్రపంచ పర్యావరణ సమతుల్యతకు అంటార్కిటికా అత్యంత కీలకమైనది. అంటార్కిటిక్ సర్కంపొలార్ కరెంట్ (ఏసీసీ)గా పిలిచే అక్కడి మహాసముద్ర ప్రవాహం ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తుంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత బలమైన సముద్ర ప్రవాహం! పశ్చిమం నుంచి తూర్పుగా అంటార్కిటికా మహాసముద్రం పొడవునా సాగే ఈ ప్రవాహం ప్రపంచ వాతావరణాన్ని, ఇతర సముద్ర ప్రవాహాల గతిని నిత్యం నియంత్రిస్తూ ఉంటుంది. అంతేగాక ప్రధానంగా వేటాడే తత్వముండే ఇతర ప్రాంతాల్లోని సముద్ర జీవరాశులు అంటార్కిటికా జలాల్లోకి ప్రవేశించకుండా ప్రాకృతిక అడ్డుగోడలా కూడా ఏసీసీ నిలుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మానవాళి మనుగడకు ఇది పెట్టనికోట వంటిది. గ్లోబల్ వార్మింగ్ తదితరాల దెబ్బకు అంటార్కిటికాలోని అపారమైన మంచు కొన్నేళ్లుగా శరవేగంగా కరుగుతోంది. దాంతో అపార స్వచ్ఛ జలరాశి నిరంతరం సముద్రంలోకి పోటెత్తుతోంది. దాని దెబ్బకు అంటార్కిటికా మహాసముద్రంలో లవణీయత, నీటి సాంద్రత మార్పుచేర్పులకు లోనవుతున్నాయి. ఇదంతా అంతిమంగా ఏసీసీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాని ప్రవాహ గతి నానాటికీ నెమ్మదిస్తూ వస్తోంది.ఇలా చేశారుఏసీసీ ప్రవాహ గతిలో మార్పు లపై ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్కు చెందిన పరిశోధకుల బృందం పరిశోధన చేసింది. అధ్యయనంలో భాగంగా పలు అంశాలపై సైంటిస్టులు లోతుగా దృష్టి పెట్టారు. ఆ్రస్టేలియాలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ జీఏడీఐ సాయంతో సముద్ర ప్రవాహాల్లో మార్పులు తదితరాలను కచి్చతంగా లెక్కగట్టారు. హెచ్చు రెజల్యూషన్‌తో కూడిన సముద్ర, యాక్సెస్–ఓఎం2–01 క్లైమేట్ మోడల్ సేవలను కూడా ఇందుకు వాడుకున్నారు. మహాసముద్ర ప్రవాహాలపై మంచు, స్వచ్ఛ జలరాశి ప్రభావం, తద్వారా వేడిని మోసుకుపోయే సామర్థ్యంలో హెచ్చుతగ్గులు తదితరాలను నిశితంగా పరిశీలించారు. అంతిమంగా ఇవన్నీ ఉష్ణోగ్రత, లవణీయత, పవనాల గతి తదితరాల్లో ఎలాంటి మార్పులకు కారణమవుతాయో గమనించారు. మంచు కరిగి సముద్రంలోకి చేరే అపార జలరాశి ఏసీసీ ప్రవాహాన్ని వేగవంతం చేస్తుందన్న గత పరిశోధనల ఫలితాలు సరికావని స్పష్టం చేశారు. అందుకు పూర్తి విరుద్ధంగా ఏసీసీ ప్రవాహ గతి బాగా నెమ్మదిస్తోందని తేల్చారు. తాజా పరిశోధన ఫలితాలను ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్‌లో ప్రచురించారు. పెను విపత్తులే...! ఏసీసీ ఒకరకంగా ప్రపంచ వాతావరణ సమతుల్యతకు ఇంజిన్ వంటిదని అధ్యయన బృంద సభ్యుడైన అసోసియేట్ ప్రొఫెసర్ భిషగ్దత్త గయేన్ వివరించారు. ‘‘మహాసముద్రాలన్నింటికీ కన్వేయర్ బెల్ట్ మాదిరిగా ఏసీసీ పని చేస్తుంది. వేడిమి, కార్బన్ డయాక్సైడ్తో పాటు సముద్రంలోని జీవరాశుల మనుగడకు అత్యంత కీలకమైన పలు పోషకాలు తదితరాలు పసిఫిక్, అట్లాంటిక్, హిందూ తదితర మహాసముద్రాల మధ్య సజావుగా పంపిణీ అయ్యేలా చూస్తుంది. అది గనక పడకేసిందంటే జరిగే విపరిణామాలు అన్నీ ఇన్నీ కావు’’ అని ఆయన స్పష్టం చేశారు. అవేమిటంటే... → ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు → పలు ప్రాంతాల్లో అత్యంత వేడిమి, ఆ వెనకే అతి శీతల పరిస్థితులు → సముద్ర జలాల్లో లవణీయత పరిమాణం నానాటికీ తగ్గిపోవచ్చు → ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ ప్రక్రియ మరింత వేగం పుంజుకోవచ్చు → ఇతర ప్రాంతాల సముద్ర జలాలకే పరిమితమైన నాచు, కలుపు మొక్కలు, మొలస్కా వంటి జీవులు అంటార్కిటికాలోకి ప్రవేశించవచ్చు. అదే జరిగితే అక్కడి జీవావరణ వ్యవస్థ దెబ్బ తింటుంది. ఇవి అంతిమంగా పెంగి్వన్ల వంటి స్థానిక జీవరాశుల ఆహార వనరులకు కూడా ఎసరు పెట్టవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కంపెనీల బాండ్ బాజా!
ఎఫ్ఐఐల అమ్మకాలు ఆగటం లేదు. మార్కెట్లు పడిపోతున్నాయి. దీంతో చాలా కంపెనీల షేర్లు ఏడాది కనిష్టానికి వచ్చేశాయి. మిగిలిన పెట్టుబడి సాధనాల్లో... బంగారం పెరుగుతున్నా... ధరల్లో ఊగిసలాట తప్పదు. రియల్ ఎస్టేట్ అంతంత మాత్రంగానే ఉంది. బ్యాంకు డిపాజిట్లు సురక్షితమే కానీ... వడ్డీ రేట్లు తక్కువ. మరి వీటికన్నా ఎక్కువ వచ్చే ప్రభుత్వ బాండ్లు బెటరా? లేకపోతే అంతకన్నా కాస్త ఎక్కువ గిట్టుబాటయ్యే ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల బాండ్లు బెటరా? రాబోయే వారం పది రోజుల్లో పలు ప్రభుత్వ కంపెనీలు సైతం బాండ్లు జారీ చేయటానికి ముందుకొస్తున్న నేపథ్యంలో... వాటి లాభనష్టాలు, రిసు్కల గురించి తెలుసుకుందాం...వడ్డీ రేట్లు పెంచుతూ లిక్విడిటీని రిజర్వు బ్యాంకు కట్టడి చేస్తోంది. దీంతో అప్పుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా పలు కంపెనీలు బాండ్ల జారీకి వస్తున్నాయి. ఈ తాకిడి ఎంతలా అంటే... ఈ ఒక్కవారంలోనే కంపెనీలు రూ.30 వేల కోట్ల విలువైన బాండ్లు జారీ చేస్తున్నాయి. వీటిలో ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఇరెడా) 7.40 శాతం వడ్డీతో 11 ఏళ్ల కాలానికి రూ.820 కోట్లు సమీకరించగా... నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) ఏడేళ్ల కాలానికి 7.35 శాతం వడ్డీ రేటుతో రూ.4,800 కోట్లు సమీకరించింది. ఇక ఆర్ఈసీ 7.99 శాతం వడ్డీతో నిరవధిక బాండ్లను జారీ చేసింది. రూ.2,000 కోట్లు సమీకరించాలనుకున్నా రూ.1,995 కోట్లే చేయగలిగింది. ఇక రాబోయే రోజుల్లో నాబార్డ్ పదేళ్ల కాలానికి రూ.7,000 కోట్లు, సిడ్బి నాలుగేళ్ల కాలానికి రూ.6,000 కోట్లు, పీఎఫ్సీ నాలుగేళ్లకు రూ.4 వేల కోట్లు సమీకరించనున్నాయి. జనవరిలో ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన, భౌగోళిక అనిశి్చతుల నేపథ్యంలో బాండ్ మార్కెట్ భయపడింది. వడ్డీ రేట్లు పెరిగాయి. ఆర్బీఐ సైతం వడ్డీ రేట్లు పెంచి లిక్విడిటీని కట్టడి చేసింది. దీంతో ప్రభుత్వ బాండ్లపై ఈల్డ్‌లు (రాబడి) 0.5 శాతం వరకూ పెరిగాయి. దీంతో కార్పొరేట్లు మరింత ఎక్కువ వడ్డీని ఆఫర్ చేయాల్సి వచి్చంది. ప్రస్తుతం ప్రభుత్వ బాండ్ల ఈల్డ్ 7.1 శాతం నుంచి 7.3 శాతం మధ్య ఉండగా... ప్రైవేటు కంపెనీలు అంతకన్నా ఎక్కువ కూపన్ రేటును ఆఫర్ చేయాల్సి వస్తోంది. నిరవధిక బాండ్లు అంటే..సాధారణంగా పెర్పెట్యువల్ బాండ్లుగా పిలిచే ఈ బాండ్లకు నిర్ణీత కాలమంటూ ఏదీ ఉండదు. ఒక కంపెనీ ఈ రకమైన బాండ్లను జారీ చేస్తే... కాలపరిమితి ఉండదు కనుక ఏడాదికోసారి చొప్పున నిరవధికంగా వడ్డీని చెల్లిస్తూ పోతాయి. ఒకవేళ వాటిని బైబ్యాక్ చెయ్యాలని భావిస్తే అప్పుడు ప్రకటన ఇచి్చ... తమ బాండ్ల ప్రిన్సిపల్ మొత్తాన్ని చెల్లించి వెనక్కి తీసుకుంటాయి. అప్పటిదాకా వడ్డీ మాత్రం చెల్లిస్తుంటాయి. ప్రిన్సిపల్ మొత్తాన్ని తిరిగి పొందటానికి కాలపరిమితి ఉండదు కనుక వీటికి వడ్డీ రేటు కూడా ఎక్కువే ఉంటుంది. గమనించాల్సింది ఏంటంటే...బాండ్లలో ఇన్వెస్ట్ చేసేవారు గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే... ఆ బాండ్లకు బాగా రేటింగ్ ఉండి, చురుగ్గా ట్రేడయితేనే సెకండరీ బాండ్ మార్కెట్లో వెంటనే విక్రయించగలం. రేటింగ్ తక్కువగా ఉన్న బాండ్లయినా, నిరవధిక బాండ్లయినా విక్రయించటం అంత ఈజీ కాదు. పైపెచ్చు విక్రయించేటపుడు వాటి ధర అప్పటి వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. మీరు కొన్నపుడు వడ్డీరేట్లు తక్కువ ఉండి ఆ తరవాత పెరిగాయనుకోండి. మీ బాండ్ల ధర కూడా తగ్గుతుంది. అదే రివర్స్‌లో మీరు కొన్నాక వడ్డీ రేట్లు తగ్గితే.. మీ బాండ్లకు ఎక్కువ వడ్డీ వస్తుంది కనక వాటికి గిరాకీ ఉంటుంది. ఈ అంశాలు దృష్టిలో పెట్టుకుంటే బాండ్లలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు.ప్రభుత్వ సావరిన్ బాండ్లు→ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తాయి కనుక చాలా తక్కువ రిస్కు ఉంటుంది. → సురక్షితం కనుక... తక్కుక వడ్డీని ఆఫర్ చేస్తాయి. కానీ బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే వడ్డీ కాస్తంత ఎక్కువ ఉంటుంది. → డిపాజిట్ల మాదిరి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాన్సిల్ చేసుకోలేరు. కానీ బాండ్ మార్కెట్లో ట్రేడవుతాయి కనుక అప్పటి ధరకు విక్రయించుకోవచ్చు. → ఏడాదికోసారి వడ్డీ మన ఖాతాలో ఠంచనుగా పడుతుంది. ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీల బాండ్లు→ కంపెనీలు తమ సొంత పూచీకత్తుపై జారీ చేస్తాయి. వాటి పనితీరుపై ఆధారపడి ఉంటాయి కనుక రిస్కు కాస్తంత ఎక్కువ. → రిస్కు ఎక్కువ కనుక ప్రభుత్వ బాండ్ల కన్నా వడ్డీ కాస్త ఎక్కువే. → వీటిని కూడా ప్రభుత్వ బాండ్ల మాదిరి ఎప్పుడు కావాలంటే అప్పుడు బాండ్ మార్కెట్లో విక్రయించుకునే అవకాశం ఉంటుంది. → వీటి రేటింగ్‌ను బట్టి వడ్డీ ఉంటుంది. ట్రిపుల్ ఏ బాండ్లకు కాస్త తక్కువగా... రేటింగ్ తగ్గుతున్న కొద్దీ వడ్డీ పెరిగేలా ఉంటాయి. → కాకపోతే తక్కు రేటింగ్ ఉన్న బాండ్లకు రిస్కు కూడా ఎక్కువని గమనించాలి. – సాక్షి, బిజినెస్ ప్రతినిధి -
ఈజీగా ఇంటర్నేషనల్ జర్నీ
విమానం మిస్సవుతుందనే భయం లేదు. నిశ్చింతగా బయలుదేరవచ్చు. గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. ఎలాంటి నిరీక్షణ లేకుండా ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ – ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీఐ–టీటీపీ) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సత్ఫలితాలిస్తోంది.ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా విదేశాలకు క్రమం తప్పకుండా ప్రయాణించేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతోంది. సాధారణ ఇమిగ్రేషన్ క్యూలైన్లకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఫాస్ట్‌ట్రాక్ ఇమిగ్రేషన్ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ప్రవేశ, నిష్క్రమణ ఈ–గేట్లను ఏర్పాటు చేశారు. – సాక్షి, హైదరాబాద్నమ్మకమైన ప్రయాణికుల కోసమే..హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ సుమారు 70 వేల మందికి పైగా డొమెస్టిక్ (దేశీయ), ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ) ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో 10 వేల మందికి పైగా విదేశాలకు వెళ్లి వచ్చేవారు ఉన్నారు. వీరిలో తరచూ ప్రయాణించేవారికి ఈ ఫాస్ట్‌ట్రాక్ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంది. టూరిస్టులు, రెండుమూడేళ్లకోసారి విదేశీ ప్రయాణం చేసేవాళ్లు ఈ సేవలను వినియోగించుకోలేరని, తరచూ రాకపోకలు సాగించే నమ్మకమైన ప్రయాణికుల కోసమే దీనిని అందుబాటులోకి తెచ్చామని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు.‘ఇది భారతీయ పాస్ట్‌పోర్ట్‌లు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డులు కలిగిన వాళ్ల కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక వ్యవస్థ. ఇమిగ్రేషన్ చెక్ కోసం క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియను ముగించి రాకపోకలు సాగించవచ్చు’అని ఆయన చెప్పారు.ఇప్పటివరకు 500 మందికి పైగా ఎఫ్టీఐ–టీటీపీలో వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. రోజూ 10 – 15 మంది వరకు ఈ సేవలను వినియోగించుకుంటున్నారని, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వీరికోసం ప్రత్యేకంగా 8 గేట్లను వినియోగిస్తున్నామని తెలిపారు.దరఖాస్తు ఇలా..ఫాస్ట్‌ట్రాక్ ఇమిగ్రేషన్ వ్యవస్థను ఉపయోగించుకోవాలంటే www.ftittp.mha.gov.in వెబ్సైట్లో ప్రయాణికులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి. పాస్‌పోర్ట్ కనీసం 6 నెలల చెల్లుబాటును కలిగి ఉండాలి. దరఖాస్తు సమయంలోనే పాస్‌పోర్ట్‌ను అప్లోడ్ చేసి, ఇతర అన్ని వివరాలు నమోదు చేయాలి. భద్రతాపరమైన తనిఖీల అనంతరం ఎఫ్టీఐ–టీటీపీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ సమాచారాన్ని ఇమిగ్రేషన్ బ్యూరో పరిశీలించి ఆమోదిస్తే, ఆ సమాచారం ప్రయాణికుల మొబైల్ ఫోన్‌కు ఎస్సెమ్మెస్ రూపంలో వస్తుంది. ఈ మెయిల్‌కు కూడా సందేశం వస్తుంది. వేలిముద్రలు, ఫొటో వంటి బయోమెట్రిక్ వివరాలను నమోదు చేసేందుకు ఎయిర్‌పోర్టులోని ప్రత్యేక కౌంటర్లలో సంప్రదించవలసి ఉంటుందని అధికారులు తెలిపారు.సేవలు ఇలా.. ⇒ ఫాస్ట్‌ట్రాక్ ఇమిగ్రేషన్ సదుపాయం కలిగిన ప్రయాణికులు వీసా తనిఖీ పూర్తయిన తరువాత బోర్డింగ్ పాస్ కోసం రిజిస్టర్డ్ ప్యాసింజర్ చెక్–ఇన్ కౌంటర్లో సంప్రదించాలి. ⇒ బోర్డింగ్ పాస్ తీసుకున్న తరువాత ఇమిగ్రేషన్ కోసం వీరికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ–గేట్ల వద్దకు వెళ్లాలి. ⇒ మొదటి గేట్ వద్ద పాస్‌పోర్ట్, బోర్డింగ్ పాస్ స్కానింగ్ పూర్తవుతుంది. దీంతో రెండో ఈ–గేట్‌కు అనుమతి లభిస్తుంది. ⇒ రెండో ఈ–గేట్ వద్ద ప్రయాణికుడి ముఖాన్ని స్కాన్ చేస్తారు. ధ్రువీకరణ అనంతరం ఇమిగ్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రయోజనాలు ఇవీ.. ⇒ సాధారణ ఇమిగ్రేషన్ ప్రక్రియలో వివిధ దేశాలకు వెళ్లే ప్రయాణికులంతా ఒకే క్యూలైన్లో వెళ్లవలసి ఉంటుంది. అందువల్ల ఎక్కువ సమయం పడుతుంది. ఒక్కోసారి అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటే గంటకు పైగా పడిగాపులు తప్పవు.⇒ అంతర్జాతీయ ప్రయాణికులు విమానం బయలుదేరడానికి 3 గంటల ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. ఆ తరువాత సంబంధిత ఎయిర్‌లైన్స్‌లో క్యూలో వేచి ఉండి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. అదే సమయంలో లగేజ్ చెక్ –ఇన్ ఉంటుంది. ఆ తరువాత వరుసగా భద్రతా తనిఖీలు, ఇమిగ్రేషన్ లైన్లలోకి వెళ్లాలి. ఈ ప్రక్రియ పూర్తవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎఫ్టీఐ టీటీపీ వ్యవస్థలో ముందే వివరాలు నమోదు చేసుకోవడం వల్ల సాధారణ భద్రతా తనిఖీల అనంతరం నేరుగా ఈ–గేట్ ద్వారా ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని వెళ్లవచ్చు. డిజియాత్ర మొబైల్ యాప్ ఉన్న ప్రయాణికులు బోర్డింగ్పాస్ను ఆన్లైన్లోనే పొందవచ్చు. -
భారీ లెక్కలు.. ఫీజు బేరాలు!
గత మూడేళ్ల కాలంలో ప్రవేశ పెట్టిన పలు కొత్త కోర్సులు, మౌలిక సదుపాయాల కల్పన కారణంగా ఖర్చు బాగా పెరిగిపోయిందని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు చెబుతున్నాయి. వార్షిక ఫీజులను ఈ ఏడాది భారీగా పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ మండలి (టీజీఎఫ్ఆర్సీ) ముందు ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించాయి. మరోవైపు ప్రభుత్వ పెద్దలతోనూ ఫీజుల పెంపు విషయమై యాజమాన్యాలు లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది.ఖర్చులు పరిశీలించే ఆడిటింగ్ వ్యవస్థతో దొడ్డిదారిన సంప్రదింపులు జరుపుతున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రైవేటు కాలేజీలు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది కన్వీనర్ కోటా ఫీజులు దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ఉన్నత విద్యా మండలి వర్గాలు చెబుతున్నాయి. అప్పుడు మేనేజ్మెంట్ కోటా సీట్ల ఫీజులు కూడా పెరుగుతాయని అంటున్నారు. – సాక్షి, హైదరాబాద్ప్రతిపాదనలు పరిశీలిస్తున్న ఎఫ్ఆర్సీ బీటెక్, బీఫార్మసీ, అగ్రికల్చర్ కాలేజీల ఫీజులను ఎఫ్ఆర్సీ ప్రతీ మూడేళ్ళకోసారి సమీక్షిస్తుంది. 2022లో కొత్త ఫీజులను నిర్ణయించారు. ప్రస్తుతం ఇవే అమల్లో ఉన్నాయి. 2022–23లో నిర్ణయించిన ఫీజులు అప్పట్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఆఖరి సంవత్సరం వరకూ వర్తిస్తాయి. కాగా 2025–26కు కొత్త ఫీజులను ఖరారు చేసేందుకు గాను ఆడిట్ నివేదికలు ఇవ్వాలని గత ఏడాది ఆగస్టులోనే ఎఫ్ఆర్సీ యాజమాన్యాలను ఆదేశించింది. దీంతో 157 కాలేజీలు కొత్త ఫీజులతో మండలికి ప్రతిపాదనలు సమర్పించాయి.గత మూడేళ్లలో కొత్తగా వచ్చిన కోర్సుల కోసం, మౌలిక వసతులు, బోధన సిబ్బంది కోసం భారీగా ఖర్చు చేశామని జమా ఖర్చుల్లో పేర్కొన్నాయి. ఈ ప్రతిపాదనలను మండలి నేతృత్వంలోని ఆడిట్ బృందాలు పరిశీలిస్తాయి. ఆ తర్వాత యాజమాన్యాలతో మండలి చర్చలు జరిపి ఫీజులను నిర్ణయిస్తుంది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత కొత్త ఫీజులు అమలులోకి వస్తాయి. 2025–26, 2026–27, 2027–28 వరకూ కొత్త ఫీజులు అమల్లో ఉంటాయి. కొత్త విద్యా సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో ఎఫ్ఆర్సీ ఈ ప్రక్రియను వేగవంతం చేసింది.వంద శాతం పెంచాల్సిందేఈసారి ఫీజులు భారీగా పెంచాల్సిందేనని ప్రైవేటు కాలేజీలు పట్టుబడుతున్నాయి. 157 కాలేజీలకు గాను 60 కాలేజీల్లో ప్రస్తుతం రూ. 1.40 లక్షలకు పైనే ఫీజు ఉంది. వీటిని ఈసారి రెట్టింపు చేయాలని కోరుతున్నాయి. 33 కాలేజీల్లో రూ.75 నుంచి రూ.1.15 లక్షల వరకూ ఫీజులున్నాయి. ఈ కాలేజీలు రూ.1.10 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకూ పెంచాలని ప్రతిపాదించాయి. రూ.50 వేల లోపు ఉన్న మిగతా కాలేజీలు కనీస ఫీజు రూ.75 వేలు చేయాలని పట్టుబడుతున్నాయి.మూడేళ్ళ క్రితం కొన్ని కాలేజీల ఫీజులు భారీగా పెరిగాయి. వసతులు, బోధన సిబ్బంది పరిశీలన అనంతరం కొన్నింటికి తగ్గించారు. ఎంజీఐటీ ఫీజు రూ.1.08 లక్షల నుంచి రూ.1.60 లక్షలకు పెరిగింది. నారాయణమ్మ ఫీజు రూ.1.22 లక్షల నుంచి రూ. లక్షకు తగ్గించారు. సీబీఐటీ ఫీజును తొలుత రూ.1.34 లక్షల నుంచి రూ.1.73 లక్షలకు పెంచారు. తర్వాత ఆడిట్ నివేదిక ప్రకారం సవరించి రూ.1.15 లక్షలకు తగ్గించారు. కాలేజీ కోర్టును ఆశ్రయించడంతో అనంతరం రూ.1.65 లక్షలుగా ఖరారు చేశారు. కొన్ని కాలేజీల ఫీజులు అసలు పెంచలేదు. ఇవి ఈసారి ఫీజుల పెంపు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. కొత్త కోర్సులు వచ్చాయి..ఖర్చు పెరిగిందిరాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల్లో లక్షకు పైగా ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, ఇందులో 61 వేల సీట్లు సీఎస్ఈ, ఇతర కొత్త కంప్యూటర్ కోర్సులవే ఉన్నాయి. కాగా కొత్త కోర్సుల కోసం భారీగా ఖర్చు చేశామని కాలేజీలు అంటున్నాయి. లైబ్రరీ, లేబొరేటరీ, ఇతర మౌలిక వసతుల నేపథ్యంలో ఈ మూడేళ్ళలో 80 శాతం వ్యయం పెరిగిందని చెబుతున్నాయి. ఏఐ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల ఫ్యాకల్టీకి అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నట్టు జమా ఖర్చుల్లో పేర్కొన్నాయి.తీవ్ర వ్యతిరేకతప్రైవేటు కాలేజీల ప్రతిపాదనలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రైవేటు అధ్యాపక సంఘాలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మౌలిక వసతులు ఈ మూడేళ్లలో ఎక్కడా పెరగలేదని, చాలా కాలేజీల్లో సరిపడా ఫ్యాకల్టీ లేదని అంటున్నాయి. ఆడిట్ వ్యవస్థతో పాటు ప్రభుత్వం అన్నీ సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఫీజులపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి.వేతనాలే ఇవ్వడం లేదు చాలా కాలేజీలు ఉద్యోగులకు సరిగా వేతనాలు ఇవ్వడం లేదు. ఒక్కసారి బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. కొత్త కోర్సులు వచ్చినా, సీట్లు పెరిగినా, నైపుణ్యం ఉన్న సిబ్బందిని నియమించలేదు. కాలేజీల్లో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయో అధికారులు పరిశీలించాలి. తప్పుడు నివేదికలు ఇచ్చిన కాలేజీలపై చర్యలు తీసుకోవాలి. – అయినేని సంతోష్‌కుమార్ (ప్రైవేటు సాంకేతిక కాలేజీల అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు)తప్పుడు లెక్కలు ఆమోదించొద్దు ప్రైవేటు కాలేజీలు తప్పుడు ప్రతిపాదనలతో ఫీజుల పెంపునకు ప్రయత్నిస్తున్నాయి. వీటిని గుడ్డిగా ఆమోదించవద్దు. దీనివల్ల పేద విద్యార్థికి చదువు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఎఫ్ఆర్సీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. – టి.నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) -
డ్రోన్ లేడీ!
ఆసక్తి ఉంటే అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగవచ్చని... ప్రత్యేక గుర్తింపు పొందవచ్చని నిరూపించారు వైఎస్సార్ జిల్లా కమలాపురం మున్సిపాలిటీలోని కె.అప్పాయపల్లె గడ్డ వీధికి చెందిన నామాల జ్యోత్స్న. పొదుపు సంఘంలో క్రియాశీలకంగా ఉన్న ఆమె డ్రోన్ పైలట్‌గా ఎదిగారు. తొమ్మిది మండలాల్లోని పొలాలకు డ్రోన్ ద్వారా పురుగుమందులు పిచికారి చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. స్థానికంగా డ్రోన్ మహిళగా గుర్తింపు పొందారు. –కమలాపురంరూ.3లక్షల వరకు వచ్చాయినేను కలలో కూడా డ్రోన్ పైలట్ అవుతానని అనుకోలేదు. ఇప్పటి వరకు కమలాపురం, చెన్నూరు, వల్లూరు, సీకే దిన్నె, కడప, వేముల, సిద్ధవటం, మైదుకూరు, ఖాజీపేట మండలాల్లో డ్రోన్ ద్వారా పురుగుమందులు పిచికారి చేశాను. ఎకరాకు రూ.400 తీసుకుంటున్నా. తొమ్మిది మండలాల్లో 58 రోజుల్లో దాదాపు 700 ఎకరాల్లో పురుగుమందులు పిచికారి చేశా. రూ.3లక్షల వరకు ఆదాయం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. – నామాల జ్యోత్స్న, కె.అప్పాయపల్లె, కమలాపురం, వైఎస్సార్ జిల్లాపొదుపు సంఘం నుంచి ఢిల్లీ వరకుదేశవ్యాప్తంగా 100 జిల్లాల్లోని పంట పొలాల్లో డ్రోన్ల ద్వారా పురుగుమందులు పిచికారి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో వైఎస్సార్ జిల్లా ఒకటి. వైఎస్సార్ జిల్లా నుంచి కమలాపురానికి చెందిన జ్యోత్స్నను డ్రోన్ పైలట్‌గా ఎంపిక చేశారు. ఆమె కమలాపురంలోని ‘నికితా’ పొదుపు సంఘం లీడర్‌గా ఉన్నారు. గ్రూప్ లీడర్‌గా బాగా పనిచేస్తున్న జ్యోత్స్నను డీఆర్డీఏ అధికారులు గుర్తించి కరోనా కాలంలో క్రిషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ద్వారా కమలాపురంలో మినీ నర్సరీని ఏర్పాటు చేయించారు. ఆమె బంతి, నిమ్మ, గుమ్మడి, వంగ, మిర్చి, వరి నారు పెంచి రైతులకు విక్రయిస్తున్నారు.ప్రకృతి వ్యవసాయం ద్వారా తన పొలంలో పంటలు పండించి ఆదాయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మహిళలను డ్రోన్ పైలట్లుగా తయారు చేసేందుకు ప్రవేశ పెట్టిన ‘లక్పతి దీదీ’ పథకానికి కూడా జ్యోత్స్నను అధికారులు ఎంపిక చేశారు. ఆమె 2023 డిసెంబర్ 11 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో శిక్షణ పొందారు. లక్పతి దీదీ పథకాన్ని 2024 మార్చిలో ప్రధాని మోదీ ప్రారంభించారు. గుంటూరులో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఆమెకు సర్టిఫికెట్‌తోపాటు డ్రోన్ అందజేశారు. మార్చి 27న అధికారికంగా ఆమె ఇంటికి డ్రోన్ వచ్చింది. ఇప్పటి వరకు ఆమె 58 రోజులపాటు డ్రోన్ ఉపయోగించి పురుగుమందులు పిచికారి చేసి రూ.3లక్షల వరకు ఆదాయం పొందారు.స్వాతంత్య్ర దిన వేడుకలకు హాజరు..ఢిల్లీలో 2024 ఆగస్టు 15న జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకలను తిలకించేందుకు డ్రోన్ పైలట్లకు కేంద్రం ప్రత్యేక ఆహ్వానం పంపింది. వైఎస్సార్ జిల్లా నుంచి జ్యోత్స్న వెళ్లి స్వాతంత్య్ర దిన వేడుకలను తిలకించారు. ఇది తన జీవితంలో మరపురాని ఘట్టమని ఆమె తెలిపారు. కడపలో 2024, జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో డీఆర్డీఏ తరఫున ఆమె డ్రోన్ ఎగురవేసి రూ.25వేలు నగదు బహుమతి పొందారు. -
గగనాన్ని జయించినా..
సూళ్లూరుపేట: భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ ప్రయోగాల్లో ఇస్రో బాలారిష్టాలను దాటలేకపోతోంది. ఇప్పటికే 7 ఉపగ్రహాలను ప్రయోగించినా అనుకోని సాంకేతిక అవాంతరాలతో సత్ఫలితాలను సాధించలేకపోతోంది. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం) వ్యవస్థలో ఇంకా తప్పటడుగులు పడుతూనే ఉన్నాయి. ఈ ఏడు ఉపగ్రహాల సిరీస్‌లో ఐఆర్ఎన్ఎస్ఎస్–1 ఉపగ్రహం సాంకేతిక లోపంతో పని చేయడం లేదు.దీనిస్థానంలో 2017 ఆగస్ట్ 31న ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ పేరుతో చేసిన ప్రయోగం విఫలమైంది. మళ్లీ ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహాన్ని ప్రయోగించి ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఏ స్థానంలో ప్రవేశపెట్టినప్పటికీ సొంత నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి రాలేదు. ఇదిలావుండగానే ఈ నావిగేషన్ వ్యవస్థలో సెకండ్ జనరేషన్ శాటిలైట్ వ్యవస్థ పేరుతో నావిక్–01 ఉపగ్రహాన్ని 2023లో ప్రయోగించారు. ఈ ఏడాది జనవరి 31న నావిక్–02 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. నావిగేషన్ ఉపగ్రహాల శ్రేణిలో కొన్నింటికి కాలపరిమితి ముగియనుండటంతో వాటి స్థానంలో నావిక్ ఉపగ్రహాలను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నావిక్–02 ఉపగ్రహం జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ నుంచి జియో ఆర్బిట్‌లోకి ఇంకా చేరలేదు. ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అపోజి ఇంధనాన్ని మండించేందుకు ఆక్సిడైజర్ వాల్‌్వలు తెరుచుకోకపోవడం వల్ల కక్ష్య దూరాన్ని పెంచలేకపోతున్నారు. ఈ ఉపగ్రహం కూడా విఫలమైనట్టుగానే ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో భారతదేశానికి సొంత నావిగేషన్ వ్యవస్థ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.7 ఉపగ్రహాల అవసరాన్ని గుర్తించి..భారతదేశానికి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నావిగేషన్ సిస్టం తయారు చేసుకోవడానికి ఏడు ఉపగ్రహాల అవసరాన్ని 2006లో ఇస్రో గుర్తించింది. దీనికి రూ.3,425 కోట్ల వ్యయం అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనికి కేంద్రం ఆమోద ముద్ర వేసి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థలో మొత్తం ఏడు ఉపగ్రహాలకు రూ.1,000 కోట్లు, రాకెట్లకు రూ.1,125 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ ఉపగ్రహ వ్యవస్థకు ప్రత్యేకంగా బెంగళూరు సమీపంలోని బైలాలు అనే ప్రాంతంలో రూ.1,300 కోట్లతో గ్రౌండ్ స్టేషన్ నిర్మాణం కూడా చేశారు.సొంత నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి 2006లోనే ప్రణాళికలు సిద్ధం చేసుకుని 2013 జూన్ 1న ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఏ) ఉపగ్రహ ప్రయోగంతో శ్రీకారం చుట్టారు. 2014 ఏప్రిల్ 4న ఐఆర్ఎన్ఎస్ఎస్–1బీ, అక్టోబర్ 16న ఐఆర్ఎన్ఎస్ఎస్–1సీ, 2015 మార్చి 28న ఐఆర్ఎన్ఎస్ఎస్–1డీ, 2016 జనవరి 20న ఐఆర్ఎన్ఎస్–1ఈ, మార్చి 10న ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఎఫ్, ఏప్రిల్ 28న ఐఆర్ఎన్ఎస్ఎస్–1జీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.ఇందులో 1ఏ ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దీని స్థానంలో 2017 ఆగస్ట్ 31న ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అది విఫలమైంది. తిరిగి 2018 ఏప్రిల్ 12న ఐఆర్ఎన్ఎస్ఎస్–1ఐ ఉపగ్రహాన్ని 1ఏ ఉపగ్రహం స్థానంలో రీప్లేస్ చేశారు. ఇందులో కొన్ని ఉపగ్రహాలకు కాల పరిమితి కూడా ముగియనుండటంతో నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి సెకండ్ జనరేషన్ పేరుతో నావిక్–01 సిరీస్‌లో ఐదు ప్రయోగాలకు శ్రీకారం చుట్టగా.. వీటిలో రెండు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇందులో ఒకటి ఉపగ్రహం కక్ష్యలోకి వెళ్లినప్పటికీ దాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల దూరంలోని జియో ఆర్బిట్‌లోకి పంపే ప్రక్రియ సాంకేతిక లోపంతో ఆగిపోయింది. చిన్నచిన్న అవాంతరాలతో తప్పని ఇబ్బందులునావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలోని 7 ఉపగ్రహాల్లో 3 ఉపగ్రహాలు భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని భూస్థిర కక్ష్యలో 34 డిగ్రీలు, 83 డిగ్రీలు, 130.5 డిగ్రీ తూర్పు రేఖాంశాల వద్ద కక్ష్యలో ఉండి పనిచేస్తాయి. మిగతా నాలుగు ఉపగ్రహాలు భూమధ్య రేఖలను ఖండించే భూస్థిర కక్ష్యలోనే 55 డిగ్రీలు, 115 డిగ్రీల తూర్పు భూమధ్య రేఖాతలానికి 31 డిగ్రీల వాలుతో ఉండే కక్ష్యలో 12 ఏళ్లపాటు సేవలందిస్తాయి.భూస్థిర కక్ష్యలో వివిధ స్థానాల్లో ఉండి పనిచేయడం ప్రారంభించి స్వదేశీ దిక్సూచి వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో లోపాలు తలెత్తడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు దిక్కులు తెలియజేయడం, ఆపద సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం, వాహన చోదకులకు దిశానిర్దేశం, ఇంటర్నెట్తో అనుసంధానం, భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు కూడా ఈ ఉపగ్రహ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చేందుకు నావిగేషన్ సిరీస్ ఉపగ్రహాలను ప్రయోగిస్తూనే ఉన్నప్పటికీ చిన్న చిన్న అవాంతరాల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే భారతదేశం అంచునుంచి సుమారు 1,500 కిలోమీటర్ల పరిధి వరకు ఈ సేవలు విస్తరించి పనిచేస్తుంది. -
దేశీ మద్యం గుబాళింపులు
ప్రపంచంలో విస్కీని అత్యధికంగా వాడేది భారత్‌లోనే. విశ్వవ్యాప్తంగా తయారయ్యే వీస్కీలో దాదాపు సగం మన దేశంలోనే ఖర్చయిపోతోంది. విస్కీ, రమ్, జిన్, ఓడ్కా, బ్రాండీ... ఇలా అన్ని రకాలూ కలిపి భారత్‌లో మద్యం మార్కెట్ విలువ ఏకంగా రూ.4.59 లక్షల కోట్లకు చేరింది. మరో మూడేళ్లలో రూ.5.59 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. ఇంతటి భారీ మార్కెట్లో దేశవాళీ మద్యం కూడా తన హవా కొనసాగిస్తోంది. విదేశీ మూలాలున్న విస్కీ, బ్రాండీ, ఓడ్కా లాంటి వాటితో పోలిస్తే స్థానిక రకాలను ప్రేమించే మద్యం ప్రియులు ఎక్కువైపోయారు. వారి అభిరుచికి తగ్గట్లు స్థానిక రకాలకూ స్థానం కల్పించడం బార్లలో ఇప్పుడు పెద్ద ట్రెండ్‌గా మారింది. ఈ ధోరణి నానాటికీ పెరుగుతోందనేందుకు పెరిగిన దేశవాళీ సరకు అమ్మకాలే నిదర్శనం.టోంగ్బా.. జుడియా సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లలో టోంగ్బా అనే స్థానిక మద్యం మద్యపాన ప్రియులకు మహా ఇష్టం. అస్సాంలో జుడియా, మణిపూర్‌లో సేక్మాయ్ యూ... ఇలా స్థానిక రుచులకు జనం నానాటికీ ఫిదా అవుతున్నారు. ఇక గోవాలో ఫెనీ చాలా ఫేమస్. ఈ స్థానిక మద్యాన్ని పులియబెట్టిన జీడిపప్పుల నుంచి తయారుచేస్తారు. గోవాలో ఏ మూలన చూసినా, ఏ బార్లో చూసినా విదేశీ మద్యంతో పాటు ఫెనీ కూడా అమ్ముతారు. పలు రాష్ట్రాల నుంచి వచి్చన పర్యాటకులతోపాటు విదేశీ సందర్శకులు కూడా దీన్ని టేస్ట్ చేయకుండా వదిలిపెట్టరు. అందుకే ఇప్పుడక్కడ దీని విక్రయాలు గతంలో పోలిస్తే బాగా పెరిగాయి. ‘‘పోర్చుగీస్ మూలాలున్న ఫెనీకి స్థానిక రుచిని కలపడంతో గోవా సంస్కృతిలో భాగంగా మారింది’’ అని మిస్టర్ బార్ట్రెండర్గా ఇన్‌స్టాలో ఫేమస్ అయిన కాక్టేల్ నిపుణుడు నితిన్ తివారీ చెప్పారు. దేశవ్యాప్తంగా మారిన టేస్ట్శతాబ్దాల చరిత్ర ఉన్న స్థానిక మద్యం రకాలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతోంది. దాంతో అవి బార్లలోనూ అందుబాటులోకి వస్తున్నట్టు తులీహో సీఈఓ, 30బెస్ట్బార్స్ ఇండియా, ఇండియా బార్టెండర్ వీక్ సహ వ్యవస్థాపకుడు విక్రమ్ ఆచంట చెప్పారు. ఈ ట్రెండ్ గతేడాది నుంచి మొదలైందని నెట్‌ఫ్లిక్స్ మిడ్నైడ్ ఆసియా కన్సల్టెంట్, ప్రముఖ కాక్టేల్ నిపుణుడు అమీ ష్రాఫ్ వెల్లడించారు. ‘‘స్థానిక మద్యానికి జై కొట్టడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో యువత చేస్తున్న ప్రచారమే. హిమాచల్‌లో ధాన్యం, గింజలను ఉడకబెట్టి తయారుచేసే రైస్ వైన్ వంటి స్థానిక రకాలకు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది’’ అని పీసీఓ, ఢిల్లీ జనరల్ మేనేజర్ వికాస్ కుమార్ చెప్పారు. ‘‘ఇదేదో గాలివాటం మార్పు కాదు. పక్కాగా వ్యవస్థీకృతంగా జరుగుతోంది. దేశవాళీ మద్యానికి గుర్తింపు తేవాలని ఇక్కడి కంపెనీలు నడుం బిగించాయి’’ అని డియాజియో ఇండియా చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ విక్రమ్ దామోదరన్ అన్నారు. విలాస వస్తువుగా..‘‘ఇండియా అగావే, ఫెనీ, మహువా వంటి స్థానిక మద్యం ఆయా ప్రాంతాల్లో మాత్రమే లభిస్తోంది. ఆ రకం కావాలంటే అక్కడికి వెళ్లాల్సిందే. అయినా సరే, రానుపోను ఖర్చులు, బస, ఇతరత్రా ఖర్చులను కూడా లెక్కచేయకుండా ప్రత్యేకంగా అక్కడిదాకా వెళ్లి మద్యం సేవించి రావడం ట్రెండ్‌గా మారింది. దీంతో స్థానికేతరులకు స్థానిక మద్యం కూడా విలాస వస్తువుగా మారుతోంది’’ అని మాయా పిస్టోలా అగావెపురా మద్యం సంస్థ మహిళా సీఈఓ కింబర్లీ పెరీరా చెప్పారు. ‘మహువా రకం మద్యం బ్రిటన్‌కు భారత్ వలసరాజ్యంగా మారకముందు చాలా ఫేమస్. తర్వాత మరుగున పడింది. ఇప్పుడు కొందరు దాంట్లో పలు రుచులు తెస్తున్నారు. వాటిని కాక్టేల్ నిపుణులు మరింత మెరుగుపరుస్తున్నారు. సిక్స్ బ్రదర్స్ మహువా పేరుతో దేశంలోనే తొలిసారిగా లగ్జరీ మహువా మద్యం తెస్తున్నాం’’ అని సౌత్ సీస్ డిస్టిలరీస్ డైరెక్టర్ రూపీ చినోయ్ చెప్పారు. అయితే, ‘‘స్థానిక మద్యం మొత్తానికీ వర్తించే సింగిల్ బ్రాండ్ అంటూ ఇప్పటికైతే ఏమీ లేదు. ఈ సమస్య పరిష్కారమైతే లైసెన్సింగ్ సమస్యలు తీరతాయి. అప్పుడు దేశవాళీ మద్యం అమ్మకాలు, నాణ్యత పెరుగుతాయి’’ అని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫండ్స్‌లో ‘సిప్’ చేస్తున్నారా..?
‘‘స్మాల్, మిడ్‌క్యాప్‌లో సిప్‌లను ఇక నిలిపేయాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నా. ఎందుకంటే వాటి వేల్యుయేషన్లు చాలా అధిక స్థాయిలో ఉన్నాయి’’ మ్యూచువల్ ఫండ్స్‌లో దశాబ్దాల అనుభవం ఉన్న వెటరన్ ఫండ్ మేనేజర్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సీఈవో ఎస్.నరేన్ తాజాగా చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు ఇవి. దీంతో స్మాల్, మిడ్‌క్యాప్ విభాగంలో మరింత అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది. నరేన్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారితీశాయి. సిప్పై సందేహాలు ఏర్పడ్డాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి నెలవారీ రూ.26 వేల కోట్లకు పైనే పెట్టుబడులు వస్తున్నాయి. దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలకు కావాల్సినంత సమకూర్చుకునేందుకు సిప్ మెరుగైన సాధనమన్న నిపుణుల సూచనలు, ఫండ్స్ పరిశ్రమ ప్రచారంతో ఇన్వెస్టర్లలో దీనిపై ఆకర్షణ పెరిగిపోయింది. వేతన జీవులతోపాటు హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్ (హెచ్ఎన్ఐలు/ధనవంతులు) సైతం సిప్‌కు జై కొడుతున్నారు. అన్ని కాలాలకూ అనువైన సాధనంగా సిప్‌ను భావిస్తుంటే, దీనిపై నరేన్ వ్యాఖ్యలు అయోమయానికి దారితీశాయి. ఈ తరుణంలో అసలు సిప్ దీర్ఘకాల లక్ష్యాల సాధనకు ఏ మేరకు ఉపకరిస్తుంది? ఇందులో ప్రతికూలతలు ఉన్నాయా? తదితర అంశాలపై నిపుణులు ఏమంటున్నారో తెలిపే కథనమిది... సిప్ అంటే..? నిర్ణిత మొత్తం, నిర్ణిత రోజులకు ఒకసారి చొప్పున ఎంపిక చేసుకున్న పథకంలో ఇన్వెస్ట్ చేయడానికి వీలు కల్పించేదే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్). రోజు/వారం/పక్షం/నెల/మూడు నెలలకోసారి సిప్ చేసుకోవడానికి ఫండ్స్ అనుమతిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల వద్ద 10.26 కోట్ల సిప్ ఖాతాలుంటే.. వీటి పరిధిలో జనవరి చివరికి మొత్తం రూ.13.12 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. మొత్తం ఈక్విటీ ఫండ్స్ నిర్వహణ ఆస్తుల్లో సిప్‌కు సంబంధించే 40 శాతానికి పైగా ఉన్నాయి. పొదుపు–మదుపులో క్రమశిక్షణ సిప్‌తో నిర్బంధ పొదుపు, మదుపు సాధ్యపడుతుంది. ఇన్వెస్టర్ ప్రమేయం లేకుండా ప్రతి నెలా నిర్ణిత తేదీన నిర్ణీత మొత్తం పెట్టుబడిగా మారిపోతుంది. సిప్ కాకుండా.. ఇన్వెస్టర్ వీలు చూసుకుని ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే ఎక్కువ సందర్భాల్లో సాధ్యపడకపోవచ్చు. దీర్ఘకాల లక్ష్యాల సాధనకు కావాల్సింది క్రమశిక్షణ. అది సిప్ ద్వారా సాధ్యపడుతుంది.దీర్ఘకాలంలో సంపద సృష్టి 10 ఏళ్లలో కారు కొనుగోలు. 15–20 ఏళ్లలో పిల్లల ఉన్నత విద్య, 25 ఏళ్లకు పిల్లల వివాహాలు, అప్పటికి సొంతిల్లు.. ఇలా ముఖ్యమైన లక్ష్యాలను ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులతో సాకారం చేసుకోవచ్చు. ఇలా ప్రతి లక్ష్యానికి నిర్ణీత కాలం అంటూ ఉంది. అన్నేళ్లలో అంత సమకూర్చుకునేందుకు ప్రతి నెలా, ప్రతి ఏటా ఎంత చొప్పున ఇన్వెస్ట్ చేయాలన్నది నిపుణుల సాయంతో తెలుసుకోవాలి. వారు చెప్పిన విధంగా.. మార్కెట్ అస్థిరతలను పట్టించుకోకుండా నియమబద్ధంగా సిప్ పెట్టుబడి చేసుకుంటూ వెళ్లిపోవడమే. దీనివల్ల కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. కాలాతీతం.. ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడు ఎటు వైపు చలిస్తాయో ఇదమిత్థంగా ఎవరూ చెప్పలేరు. ఈ స్థాయి నుంచి ఇంకా పెరుగుతాయని, ఫలానా స్థాయి నుంచి కరెక్షన్కు వెళతాయని.. దిద్దుబాటులో ఫలానా స్థాయిల నుంచి మద్దతు తీసుకుని తిరిగి ర్యాలీ చేస్తాయని.. గమనాన్ని ఎవరూ కచి్చతంగా అంచనా వేయలేరు. మార్కెట్లు సహేతుక స్థాయిలో దిద్దుబాటుకు గురైనప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అక్కడి నుంచి దీర్ఘకాలంలో పెట్టుబడిపై అద్భుత రాబడులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, దిద్దుబాటు సమయంలో ఎప్పుడు, ఏ స్థాయిల వద్ద ఇన్వెస్ట్ చేయాలనేది సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లకు అర్థం కాని విషయం. లమ్సమ్ (ఏకమొత్తం) ఇన్వెస్ట్ చేస్తుంటే, ఒకవేళ మార్కెట్లు గరిష్టాల్లో ఆ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ఎందుకంటే అక్కడి నుంచి మార్కెట్లు పతనాన్ని చూస్తే.. రాబడి చూడడానికి చాలా కాలం పట్టొచ్చు. విసిగిపోయిన ఇన్వెస్టర్ నష్టానికి తన పెట్టుబడిని వెనక్కి తీసుకునే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారమే సిప్. మార్కెట్ ర్యాలీ చేస్తోందా? లేక పతనం అవుతోందా? అన్నదానితో సంబంధం లేదు. ఒక పథకంలో ప్రతి నెలా 1వ తేదీన రూ.5,000 ఇన్వెస్ట్ చేయాలని సిప్ దరఖాస్తు సమరి్పస్తే.. కచి్చతంగా ప్రతి నెలా అదే తేదీన బ్యాంక్ ఖాతా నుంచి ఆ మొత్తం డెబిట్ అయి పెట్టుబడి కింద మారుతుంది. దీనివల్ల కొనుగోలు వ్యయం సగటుగా మారుతుంది. ఉదాహరణకు ఎఫ్ అనే పథకంలో రూ.2,000 సిప్ చేస్తున్నారు. ఆ ఫండ్ యూనిట్ ఎన్ఏవీ 2025 జనవరి 1న రూ.40గా ఉంది. దీంతో 50 యూనిట్లు వస్తాయి. ఫిబ్రవరి 1కి కరెక్షన్ వల్ల అదే ఫండ్ ఎన్ఏవీ 34కు తగ్గింది. దీంతో 58.82 యూనిట్లు వస్తాయి. జనవరి నెల సిప్‌తో పోలి్చతే ఫిబ్రవరిలో దిద్దుబాటు వల్ల 8.82 యూనిట్లు అదనంగా వచ్చాయి. మార్చి1న ఫండ్ యూనిట్ ఎన్ఏవీ ఇంకా తగ్గి రూ.32కు దిగొస్తే.. అప్పుడు 62.5 యూనిట్లు వస్తాయి. ఈక్విటీ విలువల్లో మార్పులకు అనుగుణంగా ఫండ్ ఎన్ఏవీ మారుతుంటుంది. దీనికి అనుగుణంగా సిప్ కొనుగోలు సగటు ధర తగ్గుతుంది. దీనివల్ల 10–15–20 ఏళ్లు అంతకుమించిన కాలాల్లో మంచి రాబడులకు అవకాశం ఉంటుందని గత చరిత్ర చెబుతోంది.స్వల్ప మొత్తం... చాలా పథకాల్లో ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే కనీసం రూ.5,000 అవసరం, కొన్ని పథకాలకు ఇది రూ.1,000గా ఉంది. అదే సిప్ రూపంలో అయితే రూ.500 స్వల్ప మొత్తంతో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఇటీవలే రూ.250 సిప్‌ను (జన్నివే‹Ù) ప్రారంభించింది. రోజువారీ/వారం వారీ అయితే రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.కేవలం ఈక్విటీలకేనా..? సిప్ ప్రయోజనం ఎక్కువగా ఈక్విటీ పెట్టుబడులపైనే లభిస్తుంది. డెట్ పెట్టుబడులపై రాబడి వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు ఈక్విటీలంత చంచలంగా ఉండవు. నిర్ణిత సైకిల్ ప్రకారం రేట్లు చలిస్తుంటాయి. డెట్ ఫండ్స్‌లోనూ సిప్ చేసుకోవచ్చు. దీనివల్ల ఈక్విటీల మాదిరి అస్థిరతలను అధిగమించి, రాబడులు పెంచుకునే ప్రత్యేక ప్రయోజనం ఉండదు. డెట్, ఈక్విటీ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్‌లో సిప్‌తో మెరుగైన ప్రతిఫలం పొందొచ్చు. సౌలభ్యం.. సిప్ కోసం సమ్మతి తెలిపామంటే.. కచి్చతంగా పెట్టుబడి పెట్టి తీరాలనేమీ లేదు. వీలు కానప్పుడు, లేదా పథకం పనితీరు ఆశించిన విధంగా లేనప్పుడు ఆ సిప్‌ను నిలిపివేసే స్వేచ్ఛ, వెసులుబాటు ఇన్వెస్టర్లకు ఎప్పుడూ ఉంటుంది. మార్కెట్‌తో ముడిపడి.. ప్రతి నెలా రూ.1,000 చొప్పున గత ఐదేళ్లలో రూ.60 వేలు ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ఏటా 15 శాతం కాంపౌండెడ్ రాబడి వస్తే ఐదేళ్లకు ఆ మొత్తం రూ.90 వేలకు చేరుతుంది. సరిగ్గా ఆ సమయంలో మార్కెట్ 25 శాతం పడిపోయిందనుకుంటే.. రూ.90 వేల పెట్టుబడి కాస్తా.. రూ.67,500కు తగ్గుతుంది. నికర రాబడి రూ.7,500కు తగ్గిపోతుంది. దీంతో వచ్చే వార్షిక కాంపౌండెడ్ రాబడి 4.5 శాతమే. డెట్ సెక్యూరిటీల కంటే తక్కువ. చారిత్రక డేటాను పరిశీలిస్తే లార్జ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లోనూ పలు సందర్భాల్లో ఐదేళ్ల సిప్ రాబడులు 5 శాతం కాంపౌండెడ్గానే (సీఏజీఆర్) ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతికూల రాబడులు వచి్చన సందర్భాలూ ఉన్నాయి. అదే మిడ్, స్మాల్‌క్యాప్ పెట్టుబడులపై ఈ ప్రభావం ఇంకా అధికంగా ఉంటుంది.అనుకూలం/అననుకూలం→ 10 ఏళ్లు అంతకుమించిన కాలానికి, అవసరమైతే 20 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగించే వెసులుబాటు ఉన్న వారికే సిప్ అనుకూలం. → అధిక రిస్క్ తీసుకునే వారే మిడ్, స్మాల్ క్యాప్‌లో సిప్ చేసుకోవాలి. → సిప్‌తో సగటు కొనుగోలు ధర తగ్గుతుందన్నది సాధారణంగా చెప్పే భాష్యం. కానీ, ఈక్విటీలు కొంత కాలం పాటు భారీ దిద్దుబాటు అన్నదే లేకుండా అదే పనిగా ర్యాలీ చేస్తూ వెళ్లి.. అక్కడి నుంచి భారీ పతనంతో కొన్నేళ్లపాటు బేర్ గుప్పిట కొనసాగితే రాబడులు కళ్లజూసేందుకు కొన్నేళ్లపాటు వేచి చూడాల్సి రావచ్చు. → సిప్ మొదలు పెట్టిన తర్వాత మార్కెట్లు కుదేలైతే.. పెట్టుబడి విలువ క్షీణతను ఎంత వరకు భరించగలరు? అని ప్రశి్నంచుకోవాలి. 50–60 శాతం పడిపోయినా ఓపిక వహించే వారికే అనుకూలం. → ‘ఈక్విటీ పెట్టుబడులు సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్’ అన్న హెచ్చరికను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మార్కెట్ల పనితీరు మెరుగ్గా ఉంటేనే సిప్పై మెరుగైన రాబడి వస్తుంది. అంతేకానీ సిప్పై లాభానికి గ్యారంటీ లేదు.అధిక రాబడులు ఎలా ఒడిసిపట్టాలి..? సిప్ చేస్తూనే.. మార్కెట్ పతనాల్లో పెట్టుబడిని రెట్టింపు చేయాలి. ఉదాహరణకు ప్రతి నెలా రూ.5,000 సిప్ చేస్తుంటే.. మార్కెట్ దిద్దుబాటు సమయంలో రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. దిద్దుబాటు ముగిసి, బుల్ ర్యాలీ మొదలైన తర్వాత అదనపు సిప్‌ను నిలిపివేసుకోవచ్చు. 10 ఏళ్లకు మించిన సిప్ పెట్టుబడులపై రాబడిని స్వల్ప స్థాయి కరెక్షన్లు తుడిచి పెట్టేయలేవు. అదే 15–20 ఏళ్లు, అంతకుమించిన దీర్ఘకాలంలో రాబడులు మరింత దృఢంగా ఉంటాయి. ఒకవేళ పెట్టుబడిని ఉపసంహరించుకునే సమయంలో మార్కెట్ కరెక్షన్లోకి వెళితే, తిరిగి కోలుకునే వరకు లక్ష్యాన్ని వాయిదా వేసుకోవడమే మార్గం. ఇలాంటి పరిస్థితిని నివారించాలంటే.. ఆర్థిక లక్ష్యానికి రెండేళ్ల ముందు నుంచే క్రమంగా సిప్ పెట్టుబడులను విక్రయిస్తూ డెట్‌లోకి పెట్టుబడులు మళ్లించాలి. చివరి మూడేళ్ల పాటు ఈక్విటీ పథకంలో కాకుండా డెట్ ఫండ్‌లో సిప్ చేసుకోవాలి. ప్రత్యామ్నాయాలు.. పెట్టుబడులు అన్నింటినీ ఈక్విటీలకు కేటాయించుకోకూడదు. ఈక్విటీ, డెట్, బంగారం, రీట్, ఇని్వట్లతో కూడిన పోర్ట్‌ఫోలియో ఉండాలి. ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్‌లో వేర్వేరుగా పెట్టుబడి పెట్టుకోవాలి. ఆర్థిక ప్రతికూల పరిస్థితుల్లో పెట్టుబడుల ఉపసంహరణ అవసరమైతే ఈక్విటీ పెట్టుబడులను కదపకుండా.. డెట్, గోల్డ్ తదితర ఫండ్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. సిప్ ఎప్పుడు స్టాప్ చేయాలి? → ఒక పథకం గతంలో మెరుగైన రాబడి ఇచి్చందని అందులో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. భవిష్యత్తులోనూ అదే స్థాయి రాబడిని ఆ పథకం నుంచి ఆశిస్తుంటారు. ఒక పథకం 3, 5, 10 ఏళ్లలో సగటున మెరుగైన ప్రతిఫలం ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆయా కాలాలను మరింత లోతుగా విశ్లేషిస్తే మధ్యలో ఒక్కో ఏడాది తక్కువ, ప్రతికూల రాబడులు ఇచి్చన సందర్భాలూ ఉంటాయి. సిప్ మొదలు పెట్టిన తొలి ఏడాదే రాబడిని ఆశించడం అన్ని వేళలా అనుకూలం కాదు. కనీసం రెండు మూడేళ్లకు గానీ పథకం అసలు పనితీరు విశ్లేషణకు అందదు. అందుకే ఒక పథకం ఎంపిక చేసుకునే ముందు.. ఆ విభాగంలోని ఇతర పథకాలతో పోల్చి చూసినప్పుడు రాబడి మెరుగ్గా ఉందా? కనీసం సమానంగా అయినా ఉందా అన్నది నిర్ధారించుకోవాలి. → ఒక ఫండ్ మేనేజర్ పనితీరు నచ్చి పథకంలో సిప్ చేయడం మొదలు పెట్టారు. తర్వాతి కాలంలో ఆ మేనేజర్ మరో సంస్థకు మారిపోయారు. అప్పుడు కొత్తగా వచ్చిన ఫండ్ మేనేజర్ చరిత్రను ట్రాక్ చేయాలి. → పై రెండు ఉదాహరణల్లోనూ పథకం పనితీరు ఆశించిన విధంగా లేకపోతే సిప్ నిలిపివేయొచ్చు. ప్రతికూల రాబడులు ఇటీవలి మార్కెట్ పతనంతో 26 స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఏడాది కాల సిప్ పెట్టుబడులపై రాబడి ప్రతికూలంగా మారింది. అంటే నికర నష్టంలోకి వెళ్లింది. క్వాంట్ స్మాల్‌క్యాప్ ఫండ్‌లో సిప్ పెట్టుబడిపై ఎక్స్ఐఆర్ఆర్ (రాబడి) మైనస్ 22.45 శాతంగా మారింది. మహీంద్రా మాన్యులైఫ్ స్మాల్‌క్యాప్ ఫండ్‌లో మైనస్ 21.84 శాతంగా మారింది. ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ ఎక్స్ఐఆర్ఆర్ మైనస్ 18.25 శాతంగా ఉంది. ఇవే పథకాలు రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల సిప్‌లపై డబుల్ డిజిట్ రాబడులు అందించడం గమనార్హం. దశాబ్దాల పాటు కుదేలైతే..? జపాన్ ‘నికాయ్ 225’ ఇండెక్స్ 1989 డిసెంబర్లో చూసిన 38,271 గరిష్ట స్థాయి నుంచి 2009 ఫిబ్రవరిలో 7,416 కనిష్ట స్థాయికి పతనమైంది. నెమ్మదిగా కోలుకుంటూ 35 ఏళ్ల తర్వాత.. 2024 మార్చిలో తిరిగి 1989 నాటి గరిష్ట స్థాయిని అధిగమించింది. రియల్ ఎస్టేట్ బబుల్ బద్దలు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 1989 డిసెంబర్ నాటి ముందు వరకు సిప్ లేదా లమ్సమ్ రూపంలో జపాన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుని, దీర్ఘకాలం పాటు వేచి చూసే అవకాశం లేని వారు.. ఆ తర్వాత నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఉండిపోయారు. స్టాక్ మార్కెట్ ర్యాలీ ఆర్థిక వృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. జపాన్ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలం పాటు స్తబ్దుగా కొనసాగడం వల్లే ఇన్నేళ్లపాటు అక్కడి మార్కెట్ ర్యాలీ చేయలేదు. ప్రస్తుతం చైనాలోనూ ఇలాంటి వాతావరణమే నడుస్తోంది. అలాంటి పరిస్థితులు భారత్ మాదిరి వర్ధమాన దేశాలకు అరుదు. నరేన్ ఏం చెబుతున్నారు? అర్థం, పర్థం లేని అధిక విలువలకు చేరిన అస్సెట్ క్లాస్‌లో (అది స్మాల్ లేదా మిడ్ లేదా మరొకటి అయినా) ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఆ సిప్‌లపై రాబడి రాదన్నది నరేన్ విశ్లేషణగా ఉంది. ఇందుకు 2006 నుంచి 2013 మధ్య కాలాన్ని ప్రస్తావించారు. ఆ కాలంలో స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో సిప్ చేసిన వారికి ఎలాంటి రాబడులు రాలేదని చెప్పారు. కనీసం 20 ఏళ్లపాటు తమ పెట్టుబడులను కొనసాగించే వారికే స్మాల్, మిడ్‌క్యాప్ పెట్టుబడులకు మంచి వేదికలు అవుతాయన్నారు. అంతకాలం పాటు ఆగలేని వారికి మల్టిక్యాప్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ లేదా మల్టీ అస్సెట్ ఫండ్స్ అనుకూలమని చెప్పారు. నరేన్ అభిప్రాయాలతో ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా విభేధించారు. ‘‘2006 గరిష్టాల నుంచి 2013 కనిష్టాల మధ్య రాబడులను చూస్తే అంత మంచిగా కనిపించవు. కానీ, మార్కెట్లో అలాంటివి సాధారణమే. మార్కెట్లో సంపద సృష్టి జరగాలంటే కనీసం 10 ఏళ్లు అంతకుమించిన కాలానికి సిప్ ద్వారా పెట్టుబడి పెట్టుకోవడం అవసరం’’ అని రాధికా గుప్తా సూచించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
వన్యప్రాణులతో హాయ్.. హాయ్
ఠీవిగా నడిచే సింహం...మెడ సాగదీసే జిరాఫీ,.. ఘీంకరించే ఏనుగులు...గాల్లో బెలూన్లను అందుకునే డాల్ఫీన్స్... ఇలా వివిధ రకాల జంతువులను వాటి సహజ ఆవాసాలను పోలి ఉండే వాతావరణంలో దగ్గరగా వీక్షిస్తూ ఉల్లాసంగా గడిపేలా ఇండోనేసియా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇవేకాక... చిన్నారులను సైతం ఆకట్టుకునేలా సెంట్రల్జావా, సోలో సఫారీ డినోరైడ్, సవన్నాజిప్లైన్, గోకార్ట్ వంటివి ఏర్పాటు చేసింది.సాక్షి, అమరావతి: వన్యప్రాణి పర్యాటకంపై ఇండోనేసియా దృష్టి సారించింది. ప్రకృతి ఒడిలోకి పర్యాటకులను ఆహ్వానిస్తోంది. ఆసియాలో... ఆఫ్రికాను పోలిన సఫారీ అనుభవాన్ని అందిస్తోంది. వీసా నిబంధనలను సైతం సరళతరం చేసింది. 2025 నాటికి కోటిన్నర మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించాలనేది లక్ష్యం. ఈక్రమంలో భారతీయ మార్కెట్‌పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. దీంతో ఇప్పుడు భారత్‌తో సహా 97 దేశాలకు చెందిన ప్రయాణికులు ఆన్లైన్లో వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకపై ఈ–వీసా ఆన్ అరైవల్స్‌లో ఇండోనేసియా చుట్టిరావచ్చు. వాస్తవానికి ఇండోనేసియా ఇన్»ౌండ్ వేగంగా విస్తరిస్తోంది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులతో గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్–2024 డేటా ప్రకారం ఇండోనేసియాను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య 7.10 లక్షలకు చేరుకుంది. ఇది గతేడాదికంటే 17.20 శాతం పెరుగుదలను నమోదు చేయడం విశేషం. కుటుంబంతో సహా విహార, సాహస యాత్రలు, బీచ్ అందాలు, సాంస్కృతిక పర్యటనల సమ్మేళనంతో ఇండోనేసియా భారతీయ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. ఈ క్రమంలోనే ‘తమన్ సఫారీ’ ఒక ప్రధాన వన్యప్రాణుల గమ్యస్థానంగా మారింది. కంగారూలూ కనిపిస్తాయితమన్ సఫారీ ప్రిజెన్లో ప్రయాణికులకు ఆ్రస్టేలియా వన్యప్రాణులను పరిచయం చేస్తుంది. కంగారూలు, వొంబాట్స్, ఈములతో పాటు త్వరలో కోలాస్ వంటి జంతువులు సందర్శించవచ్చు. ఇక్కడ చిన్నచిన్న ఏటీవీ వాహనాల్లో సాహస యాత్రలు కూడా చేయవచ్చు. సెంట్రల్ జావా, సోలో సఫారీ డినోరైడ్, సవన్నా జిప్‌లైన్, గోకార్ట్ వంటివి చిన్నారులకు మంచి అనుభవాలను అందిస్తున్నాయి. సింహాలను చూస్తూ భోజనం చేయవచ్చు. తమన్ సఫారీ బాలిలో కొమోడో డ్రాగన్లు, ఒరంగుటాన్లు (కోతిజాతి), స్టార్లింగ్ పక్షుల అందాలను వీక్షించొచ్చు. ప్రిడేటర్ ఫీడింగ్ సెషన్లు, జీప్ సఫారీలు వంటి సాహస యాత్రలు ఉంటాయి. నీటి కింద భోజనం చేస్తూ వరుణ షో, అగుంగ్షోల ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సంస్కృతి ప్రదర్శనలు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. జకార్తా అక్వేరియం సఫారీలో మెరై్మడ్ షోలు, అక్వాట్రెక్కింగ్, అండర్ వాటర్ ఫాంటసీ డైనింగ్లు ఉంటాయి. వీటితో సఫారీల్లో విభిన్న ఆహార ప్రాధాన్యతలను అందిస్తున్నాయి. సందర్శకులకు మొక్కల ఆధారిత వంటకాలనూ అందిస్తున్నాయి.ఆకట్టుకుంటున్న బహుళ సఫారీ పార్కులు వివిధ దేశాల్లో ఉన్న జూ మాదిరిగా కాకుండా ఆఫ్రికా తరహాలో జంతువుల మధ్య వాహనాల్లో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించేలా ‘తమన్ సఫారీ’ సాహస యాత్రను తలపిస్తోంది. ఇక్కడ జంతువులను వాటి సహజ ఆవాసాలను పోలి ఉండే వాతావరణంలో వీక్షించవచ్చు. పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ఇండోనేసియా... ప్రధాన విమానాశ్రయాలు, పర్యాటక కేంద్రాలకు సమీపంలోనే సఫారీలను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఇండోనేసియాలో బహుళ సఫారీ పార్కుల యాత్రలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో తమన్ సఫారీ బోగోర్ (పశ్చిమ జావా), తమన్సఫారీ ప్రిజెన్ (తూర్పు జావా), తమన్ సఫారీ బాలి, సోలో సఫారీ (సెంట్రల్ జావా), జకార్తా అక్వేరియం సఫారీ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. నైట్ సఫారీ..24 గంటలూ సాహసం! ఇండోనేసియా సఫారీల్లో ప్రతిదానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో తమన్ సఫారీ బోగోర్ 24 గంటల పాటు వన్యప్రాణుల మధ్య సాహసయాత్రలను నిర్వహిస్తోంది. అందుకే అత్యధిక సందర్శకులు దీనికే క్యూ కడుతున్నారు. ప్రయాణించే వాహనంలో భోజన సదుపాయాలు సైతం కల్పిస్తుండటంతో రోజంతా చుట్టిరావచ్చు. సింహాలు, జిరాఫీలు, ఏనుగులతో పాటు వివిధ దేశాల జంతువులను చూడొచ్చు. దీనికి తోడు డాల్ఫీన్లతో ఈతకొట్టడం, పెంగ్విన్లకు ఆహారం అందించడం వంటి అనుభవాలు పొందవచ్చు. ముఖ్యంగా పర్యాటకులు రాత్రిపూట కూడా వన్యప్రాణులను చూసేలా నైట్ సఫారీ ఉంది. అక్కడే రిసార్టుల్లో బస చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. -
వీసా గోల్డెన్ చాన్సేనా?
గోల్డ్ కార్డ్ వీసా.. ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసిన టాపిక్ ఇది. అత్యంత గౌరవంగా భావించే అమెరికా పౌరసత్వం (US Citizenship) కోసం ట్రంప్ సర్కార్ తెచ్చిన ఈ కొత్త విధానం ఎంత మందిని ఆకట్టుకుంటుంది? అమెరికన్ కంపెనీలు ఈ పథకాన్ని ఉపయోగించి భారతీయులు సహా విదేశీ విద్యార్థులను, ప్రతిభావంతులను నియమించుకోవచ్చని ట్రంప్ అన్నారు. ట్రంప్ కేవలం పౌరసత్వ కలను అమ్ముకోవడం ద్వారా లాభం పొందాలని కోరుకోవడం లేదు. అమెరికన్ కంపెనీలు మంచి నిపుణులను నియమించుకోవడానికి వీలవుతుందని అంటున్నారు. వ్యాపారం పరంగా ఈ ఆఫర్ అమెరికన్ కంపెనీలకు ఆకర్షణీయమేనా? భారతీయులకు ప్రయోజనం చేకూరుస్తుందా? ఒక కోటి గోల్డ్ కార్డులు అమ్మడం ద్వారా అమెరికా (America) అప్పులు తొలగిపోతాయని ట్రంప్ పేర్కొంటున్నారు. కానీ రూ.43.7 కోట్ల విలువైన వీసాను కొనగలిగే అతి ధనవంతులు అమెరికా వెలుపల ఎంతమంది ఉన్నారనేదే ఇక్కడ ప్రశ్న. మరోవైపు పౌరసత్వం సరే.. పన్ను నిబంధనలపై అనిశ్చితి కారణంగా గోల్డ్‌కార్డు (Gold Card)ను తీసుకునేవారు తక్కువగా ఉంటారని నిపుణులు అంటున్నారు. – సాక్షి, బిజినెస్ బ్యూరోట్రంప్ లక్ష్యం అంత సులభమేమీ కాదు..ఒక కోటి గోల్డ్ కార్డుల అమ్మకాలు అమెరికా రుణభారాన్ని తుడిచిపెట్టగలవని ట్రంప్ అంటున్నారు. కానీ ఏకంగా రూ.43.7 కోట్లు వెచ్చించగల స్తోమత ఉన్న ధనవంతులు అమెరికా వెలుపల ఎంత మంది ఉన్నారు? క్రెడిట్ స్విస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా 5–10 మిలియన్ డాలర్ల సంపద పరిధిలోని ధనికుల సంఖ్య 51 లక్షలు. ఇందులో 10 మిలియన్ డాలర్లకుపైగా ఉన్నవారు 28లక్షల మంది. ఇలాంటప్పుడు ఒక కోటి మంది గోల్డ్‌కార్డ్ కొనుగోలుదారులను పొందడం సాధ్యమయ్యేదేనా? అన్న సందేహాలు వస్తున్నాయి. రష్యా, చైనా, ఆగ్నేయాసియా నుంచి ధనవంతులు డబ్బు సంచులతో అమెరికాకు వస్తారని ట్రంప్ ఆశిస్తున్నారేమోగానీ.. విదేశీ బిలియనీర్లు గోల్డ్ కార్డ్‌ను తీసుకుంటారా? అని ఇమిగ్రేషన్ నిపుణులే పేర్కొంటున్నారు. గోల్డ్కార్డ్పై తలెత్తుతున్న ప్రశ్నలెన్నో.. » ఈ కార్యక్రమం ద్వారా అమెరికన్ పౌరసత్వాన్ని అమ్మకానికి పెట్టడం, యోగ్యత కంటే డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివాటిని ప్రతిభావంతులైన నిపుణుల ఖర్చుతో ధనవంతుల అవసరాలను తీర్చడంగా చూడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. » గోల్డ్ కార్డుల వల్ల బలమైన నియంత్రణ, తనిఖీలు లేనప్పుడు పెట్టుబడి అంశంతో కూడిన ఇమిగ్రేషన్ కార్యక్రమాలు మనీలాండరింగ్‌కు, విదేశాల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇది రష్యన్ సామ్రాజ్యవాదులకు అమెరికా తలుపులు తెరుస్తుందా అని అడిగినప్పుడు ట్రంప్ ఉదాసీనంగా సమాధానమిచ్చారు. ‘అవును. నాకు కొందరు రష్యన్ సామ్రాజ్యవాదులు తెలుసు. వారు చాలా మంచి వ్యక్తులు’అని పేర్కొన్నారు. » ఉద్యోగాలను సృష్టించే సంస్థలలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా గోల్డ్ కార్డ్ వస్తే.. చాలా మంది ధనవంతులు యూఎస్ ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి తోడ్పాటు ఏమీ ఇవ్వకుండా నివాసం ఉండవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. » కెనడాలో ఇలాంటి కార్యక్రమాన్ని తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించారు. కానీ అది విపరీతంగా దుర్వినియోగం కావడంతో రద్దు చేశారు. ముందున్న సవాళ్లు రెండు.. ప్రతినిధుల సభ కాంగ్రెస్‌లో.. వలస విధానంలో ఏదైనా ముఖ్య మార్పును అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్ ఆమోదించాలి. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ కి ఉభయ సభలలో మెజారిటీ ఉంది. కానీ అమెరికన్ పౌరసత్వాన్ని అమ్ముకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అందరు రిపబ్లికన్లు సమర్థించకపోవచ్చు. డెమొక్రాట్లు ఈ ప్రతిపాదనను దాదాపుగా వ్యతిరేకిస్తారు. కోర్టులలో..అమెరికాలో చాలా చట్టపరమైన సవాళ్లు వీసా కార్యక్రమాల నిర్వహణ నుంచే ఉత్పన్నమవుతాయి. ట్రంప్ గోల్డ్ కార్డ్ ఎలాంటి చట్టపర సవాళ్లను ఎదుర్కొంటుందో ఊహించడం కష్టమేనని నిపుణులు అంటున్నారు. భారతీయులు–గోల్డ్ కార్డ్..కాన్సులర్ ప్రాసెసింగ్ ఉపయోగించి 2022–23లో ఈబీ–5 కార్యక్రమం ద్వారా 631 మంది భారతీయులు మాత్రమే యూఎస్ గ్రీన్‌కార్డులను పొందారు. ఈ పథకానికి రూ.9.17 కోట్లు పెట్టుబడి మాత్రమే అవసరం. అలాంటిది రూ.43.7 కోట్లపైన చెల్లించి గ్రీన్‌కార్డ్ కొనాలనే ఆలోచన చాలా మంది భారతీయులకు ఆకర్షణీయంగా కనిపించే అవకాశం లేదని యూఎస్ న్యాయవాది, అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ సభ్యురాలు రవనీత్ కౌర్ బ్రార్ అభిప్రాయపడ్డారు. గోల్డ్ కార్డ్ వీసా అంటే? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ను ఈ వారమే ఆవిష్కరించారు. ఇది విదేశీ పెట్టుబడిదారులకు అమెరికా పౌరసత్వం పొందేందుకు రాచమార్గం. అమెరికా గ్రీన్కార్డ్కు ఖరీదైన ప్రత్యామ్నాయం కూడా. గోల్డ్ కార్డ్ కోరుకునేవారు యూఎస్ ప్రభుత్వానికి 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.43.7 కోట్లు) చెల్లించాలి. ఈ వీసా విధివిధానాలు రెండు వారాల్లో వెలువడనున్నాయి. గోల్డ్ కార్డ్ హోల్డర్లు అమెరికా వెలుపల సంపాదించిన ఆదాయంపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. దేశీయంగా (యూఎస్‌లో) ఆర్జించే ఆదాయాలపై పూర్తి పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. గోల్డ్‌కార్డుల విక్రయం ద్వారా పెద్ద పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగ సృష్టికర్తలు అమెరికాకు సమకూరుతారని ట్రంప్ అన్నారు. అప్పుల భారం తగ్గించుకునేందుకు.. గోల్డ్ కార్డ్ విధానం అమెరికా రుణాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మేం కోటి కార్డులు అమ్మితే 50 ట్రిలియన్ డాలర్లు (రూ.43,70,00,000 కోట్లు) సమకూరుతుంది. మాకు 35 ట్రిలియన్ డాలర్ల (రూ.30,59,00,000 కోట్లు) అప్పు ఉంది’’అని ఆయన పేర్కొన్నారు. అసాధారణ ప్రతిభ ఉన్న దరఖాస్తుదారులను స్పాన్సర్ చేయడం కోసం కంపెనీలను అనుమతించే నిబంధనలను గోల్డ్ కార్డ్‌లో చేర్చవచ్చని ట్రంప్ చెప్పారు. యాపిల్ వంటి సంస్థలు తాము నియమించుకోవాలనుకునే అగ్రశ్రేణి ప్రతిభావంతులకు గోల్డ్ కార్డులను స్పాన్సర్ చేయవచ్చన్నారు. ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఇదే.. ప్రస్తుత ఈబీ–5 వీసా స్థానంలో గోల్డ్ కార్డ్ రానుంది. యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ నిర్వహించే ఈబీ–5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్‌ను 1990లో అమెరికా ప్రజాప్రతినిధుల సభ అయిన కాంగ్రెస్ రూపొందించింది. విదేశీ పెట్టుబడిదారుల ద్వారా అమెరికాలో ఉద్యోగ సృష్టి, మూలధన పెట్టుబడి ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు దానిని అమలు చేస్తున్నారు. ఈబీ–5 వీసా కోసం 10,50,000 డాలర్ల (రూ.9.17 కోట్లు) పెట్టుబడి అవసరం. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో అయితే 8,00,000 డాలర్లు (రూ.6.99 కోట్లు) పెట్టుబడి పెట్టినా సరిపోతుంది. దీనికితోడు కనీసం 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలి. దీనిద్వారా సాధారణంగా 3–5 ఏళ్లలో గ్రీన్‌కార్డ్ అందుకోవచ్చు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న 2019లో ఈ పరిమితిని 9,00,000 డాలర్లకు (రూ.7.8 కోట్లకు) పెంచాలన్న ప్రయత్నం జరిగింది. కానీ ఫెడరల్ కోర్టు అడ్డుకుంది. అమెరికా ఏటా 10,000 ఈబీ–5 వీసాలను జారీ చేస్తోంది. ప్రతి దేశానికి గరిష్టంగా 7% వీసాలు ఇస్తారు. ఈబీ–5 వీసా కావాల్సినవారు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అదే కొత్త గోల్డ్ కార్డ్ అయితే ఒకసారి కొనుక్కుంటే చాలు. పెట్టుబడి, ఉద్యోగ కల్పన భారం ఉండదు. దశాబ్దంలో 3,800 మంది.. హెచ్–1బీ, ఈబీ–2, లేదా ఈబీ–3 వీసాలపై యూఎస్‌లో ఉన్న భారతీయ వలసదారులు గోల్డ్ కార్డ్ వీసా కోసం దరఖాస్తు చేసుకుని అక్కడి పౌరసత్వాన్ని అందుకోవచ్చు. వర్క్ వీసాలు, ముఖ్యంగా హెచ్–1బీ వీసాల కోసం భారత్ నుంచి అత్యధిక డిమాండ్ ఉంది. గోల్డ్ కార్డ్ వీసా హోల్డర్ల రాక వల్ల.. ఇతర వీసా హోల్డర్లు గ్రీన్‌కార్డుల కోసం వేచిఉండాల్సి వస్తుందనే ఆందోళన ఉంది. అమెరికాలో గ్రీన్‌కార్డ్ (శాశ్వత చట్టపర నివాస అనుమతి) కోసం వేచి ఉండే సమయం భారతీయులకు చాలా ఎక్కువ. కొన్నిసార్లు దశాబ్దాల సమయం పడుతోంది. అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులకు ఓ–1 వీసా మెరుగైన ప్రత్యామ్నాయమని.. దానిద్వారా సులభంగా ఈబీ–1 గ్రీన్కార్డ్లోకి మారవచ్చని ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. ఇది ఇతర ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ విభాగాల్లా కాకుండా తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక వ్యాపార సంస్థల యజమానులు, కీలక స్థానాల్లో ఉన్న ఉద్యోగులు ఎల్–1 వీసాను పరిగణించవచ్చు. ఈబీ–5 వీసా కోసం చూస్తున్నవారు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో.. దానిని రద్దు చేయడానికి ముందే త్వరపడాలనే ఆత్రుత కనిపిస్తోంది. అయితే ఈబీ–5 వీసా రద్దు చేయాలంటే అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం అవసరమని ఇమిగ్రేషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత దశాబ్దంలో దాదాపు 3,800 మంది భారతీయులు ఈబీ–5 వీసాతో అమెరికా వెళ్లారని అంచనా. 100కుపైగా దేశాల్లో సంపన్నులకు గోల్డెన్ వీసాలు ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా దేశాలు సంపన్నులకు గోల్డెన్ వీసాలు ఇస్తున్నాయి. యూరప్, ఇతర ప్రాంతాల్లోని చాలా దేశాలు పెట్టుబడి కార్యక్రమాల ద్వారా పౌరసత్వాన్ని ఆఫర్ చేస్తున్నాయి. తమ దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే వారికి మాల్టా పౌరసత్వాన్ని అందిస్తోంది. ఆ విధానం ఉత్తమమైనదని హ్యాన్లీ సిటిజన్‌షిప్ ప్రోగ్రామ్ ఇండెక్స్ పేర్కొనడం గమనార్హం. మాల్టా పౌరసత్వం పొందాలంటే కనీసం €6,00,000 యూరోల (రూ.5.45 కోట్లు) పెట్టుబడితోపాటు అక్కడ కనీసం 36 నెలల పాటు నివాసం ఉండాలి. లేదా 12 నెలలు అక్కడ నివసించిన తర్వాత €7,50,000 యూరోలు (రూ.6.82 కోట్లు) ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. హ్యాన్లీ ఇండెక్స్ టాప్–10 జాబితాలో ఆ్రస్టియా, గ్రెనాడా, యాంటీగ్వా అండ్ బాబూడా, నౌరూ, సెయింట్ కిట్స్ ఉన్నాయి. తమ లాభాలను పెంచుకోవాలని చూస్తున్న అంతర్జాతీయ వ్యాపారులకు ఇవి ఆకర్షణీయ పన్ను స్వర్గధామాలు (ట్యాక్స్ హెవెన్స్) కూడా. ఇక హ్యాన్లీ గ్లోబల్ రెసిడెన్స్ ప్రోగ్రామ్ ఇండెక్స్ జాబితాలో గ్రీస్ అగ్రస్థానంలో ఉంది. తరువాతి స్థానాన్ని స్విట్జర్లాండ్ కైవసం చేసుకుంది. సంపన్న భారతీయులకు ఇష్టమైన గమ్యస్థానంగా నిలిచిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కనీసం 5,45,000 డాలర్ల (రూ.4.76 కోట్లు) పెట్టుబడితో గోల్డెన్ వీసా రెసిడెన్స్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తోంది. -
అంతర్జాతీయ ఆవాసం!
అవును. ఈ బుల్లి ఇల్లు నిజంగానే రెండు దేశాల పరిధిలో విస్తరించింది! ఈ గమ్మత్తైన ఇల్లు ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లోని లోంగ్వా గ్రామంలో ఉంది. ఇది కాస్త భారత్‌లో, మిగతా భాగం మయన్మార్ పరిధిలో ఉంటుంది! భారత్, మయన్మార్ సరిహద్దు సరిగ్గా ఈ గ్రామం నడుమగా పోవడమే దీనికి కారణం. ప్రధాన ద్వారానికి ఆ పక్క సగంపై నాగాలాండ్ (భారత్), ఈ పక్క సగంపై సగాయింగ్ (మయన్మార్) అని రాసి ఉంటుంది కూడా. ఇంటి బయట ఠీవిగా నుంచున్నది దాని యజమాని టోనెయ్ ప్వాంగ్. అన్నట్టూ, ఆయన స్థానిక కోన్యాక్ నాగా గిరిజన తెగ నాయకుడు కూడా. ఆరకంగా చూస్తే ఆయన నివాసం లోంగ్వా గ్రామం మొత్తానికీ రాజప్రాసాదం వంటిదన్నమాట. ఈ ఇంటికి 100 ఏళ్ల పై చిలుకు చరిత్ర ఉంది. అంతర్జాతీయ సరిహద్దు మాత్రం 1971లో పుట్టుకొచ్చింది. ప్వాంగ్ ఇంటిని రెండు దేశాలకూ చెందేలా విడదీసింది. ‘‘అంతర్జాతీయ సరిహద్దు 50 ఏళ్ల కింద పుట్టుకొచ్చింది. మా ఇల్లు అంతకు 50 ఏళ్ల ముందునుంచే ఉంది. సరిహద్దు భూభాగాన్ని విభజిస్తుందేమో గానీ ఇది మా పూరీ్వకుల ఆవాసం. ఇందులో ఉండేందుకు మాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురవడం లేదు’’ అంటారు ప్వాంగ్. ఈ ఊళ్లోని వాళ్లంతా భారతీయులే. అందరికీ ఓటు హక్కు కూడా ఉంది. అయినా వారికి మయన్మార్ నుంచి పలు సంక్షేమ పథకాలు అందుతుండటం విశేషం! ఈ ఊళ్లో రెండు దేశాల సైన్యాలూ గస్తీ కాస్తుంటాయి. అంతేకాదు. ఈ ప్రాంతంలో భారత్, మయన్మార్ ప్రజలు వీసా తదితరాలేవీ అవసరం లేదు. -
124 ఏళ్లలో కెల్లా అత్యంత వేడి ఫిబ్రవరి
ఈసారి ఎండలు అప్పుడే దంచికొడుతున్నాయి. ఎండాకాలం ఇంకా మొదలైనా కాకుండానే ఠారెత్తిస్తున్నాయి. ఆ క్రమంలో గత 124 ఏళ్లలో అత్యంత వేడిమి ఫిబ్రవరిగా గత మాసం కొత్త రికార్డు సృష్టించింది. గత నెలలో సగటున 22 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 1901 తర్వాత ఫిబ్రవరిలో ఈ స్థాయి సగటు నమోదవడం ఇదే తొలిసారి. అంతేకాదు, చరిత్రలోనే తొలిసారిగా ఈ ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 15 డిగ్రీల పై చిలుకు నమోదై సరికొత్త రికార్డు నెలకొల్పాయి. అంతేగాక సగటు గరిష్ట ఉష్ణోగ్రత విషయంలో 2023 ఫిబ్రవరి నెలకొల్పిన రికార్డును కూడా గత నెల దాదాపుగా అధిగమించినంత పని చేసింది! దీనిపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ మార్పుల తాలూకు విపరిణామాలకు ఈ ఉష్ణ ధోరణులు తాజా నిదర్శనమని వారు చెబుతున్నారు. 20 ఏళ్లు వరుసగా చరిత్రలోనే అత్యంత వేడిమి దశాబ్దాలుగా రికా ర్డులు సృష్టించిన వైనాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అకస్మాత్తుగా వరుణుడు కరుణిస్తే తప్ప వచ్చే మూడు నెలలు ప్రచండమైన ఎండలు తప్పవని సైంటిస్టులు జోస్యం చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వారెవ్వా... వాస్తు శిల్పి!
మనం ఒక పురాతన దేవాలయానికి వెళతాం. ఆ దేవాలయం అద్భుత నిర్మాణం గురించి చర్చించుకుంటాం. ఆధునిక ప్రపంచంలో ఒక నగరానికి వెళతాం. అక్కడి ఆకర్షణీయమైన భవనాల గురించి మాట్లాడుకుంటాం. మన ఆఫీసులో ఏర్పాటు చేసిన వసతుల గురించి గర్వంగా చెప్పుకుంటాం. అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ... ఈ ఆకర్షణీయమైన నిర్మాణ రూపకల్పలో కీలక వ్యక్తి.. అప్పటి వాస్తు శిల్పి... ఇప్పటి ఆర్కిటెక్ట్. ఆధునిక సమాజంలో ఆర్కిటెక్ట్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.చాలా బిజీ ప్లేస్‌లో ఉన్న ఒక చిన్న స్థలంలో సైతం అద్భుత, ఆకర్షణీయమైన వాణిజ్య నిర్మాణ రూపకల్పన వారి ప్రత్యేకం. తక్కువ చోటైనా... అన్ని సదుపాయాలతో చక్కటి ఇంటి నిర్మాణానికి డిజైన్ వేయడం వారి ప్రతిభ. మన కలలను నిజం చేయగల సామర్థ్యం వారి సొంతం. ఇవే అంశాలు వారిని ఇప్పుడు ప్రత్యేక స్థానంలో నిలబెడుతున్నాయి. జాబ్ మార్కెట్ డిమాండ్ విషయంలో ఇంజనీర్లను కాదని వారిని అగ్ర స్థానాన నిలబెడుతోంది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ఆర్కిటెక్ట్లు ఇప్పుడు దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న నిపుణులుగా మారారు. ప్రపంచంలో నంబర్ వన్ జాబ్ సైట్, గ్లోబల్ జాబ్ మ్యాచింగ్, హైరింగ్ ప్లాట్‌ఫామ్– ఇండీడ్ఙ్ ‘బెస్డ్ జాబ్స్ ఫర్ 2025 ఇన్ ఇండియా’ పేరుతో విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని చెబుతోంది. పలు రంగాలను పరిశీలిస్తే, ఉపాధి అవకాశాల పెరుగుదల రేటు ఆర్కిటెక్ట్ విభాగంలో ఏకంగా 81 శాతంగా ఉందంటే ప్రస్తుత సమాజంలో వారి ప్రాధాన్యత అర్థం అవుతుంది.నివేదిక ప్రకారం వారి సగటు వార్షిక వేతనం రూ.14,95,353. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిపుణులకు ఉన్న డిమాండ్‌తో పోల్చితే భారత్ కార్పొరేట్ రంగంలో ఆర్కిటెక్ట్‌ల డిమాండ్ అధికంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవసరాల్లో వచ్చిన మార్పులకు ఇది ప్రతిబింబం. ప్రత్యేకత ఎందుకు?ఆర్కిటెక్ట్ లను ఇంజనీర్లతో పోల్చి కొందరు వారిని తక్కువగా అర్థం చేసుకుంటారు. కానీ వాస్తవానికి ఇంజనీర్లతోపాటు ఆర్కిటెక్ట్‌లు కూడా ఒక భవనాన్ని రూపుదిద్దడానికి ఎంతో అవసరం. అందమైన, బలమైన, సుస్థిరమైన భవనాల రూపకల్పనలో ఇంజనీర్‌తో పాటు ఆర్కిటెక్ట్ పాత్ర కూడా ఎంతో కీలకం. ఆర్కిటెక్టŠస్ భవనాన్ని కేవలం నిర్మాణం కోణంలోనే కాకుండా, దానిని అందంగా, వినియోగదారులకు అనువుగా డిజైన్ చేస్తారు. వారు ఫంక్షనాలిటీ అలాగే ఎస్తెటిక్ని సమతుల్యం చేస్తారు. ఇంజనీర్ పటిష్ట నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తే, ఆర్కిటెక్ట్ అందమైన, వినియోగదారులకు అనువైన ప్రదేశాలను సృష్టిస్తారు. కస్టమర్ అవసరాలు, ఆర్థిక పరిమితులు, పర్యావరణ అంశాలు, నగర విస్తరణ– ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేస్తారు. ఆర్కిటెక్టŠస్ కొత్త, విభిన్నమైన డిజైన్ ఆలోచనలను ప్రతిపాదిస్తారు. ఇంజనీర్లు వాటిని సాధ్యమయ్యేలా చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఆర్కిటెక్టŠస్ సృజనాత్మకతను జోడించి వినూత్నమైన భవనాలు రూపొందిస్తారు. ఇంజనీర్లు వాటిని ప్రాక్టికల్‌గా మార్చుతారు. ఆధునికతతో అగ్రస్థానంఉద్యోగ నియామకాలు, జీతం పోకడలు, వృద్ధి అవకాశాలు, వేగవంతమైన పట్టణీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్థిర, ఆకర్షణీయ మైన నిర్మా ణాలు, ప్రాధాన్యతలు ఇలా ఎన్నో అంశాలు ఆర్కిటెక్ట్‌ను జాబ్ మార్కెట్ డిమాండ్‌లో అగ్రభాగాన నిలబెట్టింది. మెట్రోల విస్తరణ, స్మార్ట్ నగరాల రూపకల్పన, పర్యావరణ సానుకూలతలు అలాగే పర్యావరణానికి అనుకూలమైన ఇంధన సమర్థ వినియోగ కార్యాలయాల నిర్మాణాలు వంటి ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత్ కార్పొరేట్ కార్యాలయ స్థలాలలో పెట్టుబడి పెడతాయి, ఆర్కిటెక్ట్‌లు ఈ పరివర్తనకు కేంద్రంగా ఉండడం గమనార్హం.కీలక పాత్రకస్టమర్ అవసరాలను అర్థం చేసుకుని, వారి అభిరుచులకు అనుగుణంగా డిజైన్ చేయడం వీరి ప్రత్యే కత. నియమాలు, భద్రతా ప్రమాణాలు పాటించడం, ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ల అనుమతుల కోసం సమర్పించాల్సిన ప్లాన్లు సిద్ధం చేయడం, సంపదను, వనరులను సమర్థవంతంగా వినియోగించడం, భవనం నిర్మాణాన్ని, తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్లానింగ్ చేయడం, ప్రా జెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేయడానికి అన్ని విభాగాలతో సమన్వయం, ఆధునిక సమాజంలో గ్రీన్ బిల్డింగ్స్, ఎనర్జీ–ఎఫిషియెంట్ డిజైన్ల రూపకల్పన.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆధు నిక నిర్మాణ రంగంలో వారి పాత్ర అపారం. డిమాండ్ ఎక్కడ?» వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం» అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్, ఆఫీస్ బిల్డింగ్లు» రోడ్లు, బ్రిడ్జీలు, గవర్నమెంట్ భవనాల వంటి ప్రభుత్వ ప్రాజెక్టులు » మల్టీనేషనల్ కంపెనీల క్యాంపస్ డిజైన్లు» మ్యూజియం, హోటల్స్, ఎయిర్పోర్ట్, స్టేడియం, దేవాలయాల వంటి ప్రత్యేక భవనాల డిజైన్ఇంజనీర్లు భవనానికి ప్రాణం పోసే గుండె లాంటి వారు అయితే, ఆర్కిటెక్ట్ ఆ భవనానికి జీవం పోసే ఆత్మ. ఆర్కిటెక్ట్ లేకపోతే భవనాలు కేవలం ‘నిర్మాణాలు’గానే ఉంటాయి. అందమైన, ఆకర్షణీయమైన వినియోగదారులకు అనుకూలమైన, చిరస్థాయిగా నిలిచే నిర్మాణాలను రూపొందించేది ఆర్కిటెక్ట్‌లే!ఆర్కిటెక్ట్ కావాలంటే?భారతదేశంలో ఆర్కిటెక్ట్‌గా పనిచేయాలంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీ.ఆర్క్) అనే 5 సంవత్సరాల కోర్సు పూర్తి చేయాలి. దీనికి నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా) లేదా జేఈఈ పేపర్ 2 ద్వారా అర్హత పొందాలి. -
ఊరు, ఇల్లు వదిలి.. అక్కడ అందరిదీ ఇదే పరిస్థితి!
ఈ చిత్రంలోని దంపతులు కీలుకత్తుల యాదయ్య, మంగమ్మ.. నర్సిరెడ్డిగూడెంలో వ్యవసాయం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. శివన్నగూడ రిజర్వాయర్ కట్ట నిర్మాణంతో నర్సిరెడ్డిగూడెం గ్రామానికి రాకపోకలు నిలిచిపోనున్నాయి. అధికారులు బలవంతంగా ఊరిని ఖాళీ చేయిస్తుండటంతో ఉన్న ఊరిని.. ఇన్నాళ్లూ తలదాచుకున్న ఇంటిని ఖాళీ చేసి, శివన్నగూడలో అద్దెకు తీసుకున్న ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పుడీ ఊళ్లో చాలామందిది ఇదే పరిస్థితి.సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పుట్టి పెరిగిన ఊరు కన్నతల్లిలాంటిది అంటారు. ఏ కారణం చేతనైనా ఉన్న ఊరిని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తే.. ఆ బాధ వర్ణనాతీతం. అందునా బలవంతంగా ఊరి నుంచి పంపించే పరిస్థితి వస్తే కలిగే వేదన చెప్పనలవికాదు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులు ఇప్పుడదే బాధను అనుభవిస్తున్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మర్రిగూడ మండలంలో శివన్నగూడ రిజర్వాయర్ (Shivannaguda Reservoir) నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్ కట్ట నిర్మాణంతో నర్సిరెడ్డిగూడెం గ్రామానికి వచ్చే రోడ్డు పూర్తిగా పోతోంది. కట్ట నిర్మాణం పూర్తయితే గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలో అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్నారు. అయితే, పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించకుండానే ఉన్న ఊరి నుంచి తమను తరిమేస్తున్నారని నర్సిరెడ్డిగూడెం (Narsi Reddy Gudem) వాసులు ఆరోపిస్తున్నారు. వీరికి అధికారికంగా ఇళ్ల స్థలాలను కూడా అప్పగించలేదు. చాలామంది గ్రామస్తులు వేరేచోట ఇళ్లు కట్టుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఎక్కడికి వెళ్లాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పరిహారం శివన్నగూడ ప్రాజెక్టు పనులకు మాజీ సీఎం కేసీఆర్ (KCR) 2015, జూన్ 12వ తేదీన శంకుస్థాపన చేశారు. 14.5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించాలని అనుకున్నా పలు కారణాలతో 11.5 టీఎంసీలకు కుదించారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం 3,465 ఎకరాల భూసేకరణ చేపట్టారు. అందులో పట్టా భూములు 2,900 ఎకరాలు ఉండగా, మిగతావి ప్రభుత్వ భూములు. పట్టా భూములకు మొదట్లో ఎకరానికి రూ.4.15 లక్షలు, ఆ తరువాత ఎకరానికి రూ.5.15 లక్షల చొప్పున చెల్లించారు. చదవండి: ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో 'మరో సొరంగం'! ప్రస్తుతం ఎకరానికి రూ.8 లక్షలకు పైగా చెల్లిస్తున్నారు. ఈ రిజర్వాయర్ కింద నర్సిరెడ్డిగూడెం, చర్లగూడెం, వెంకేపల్లి, వెంకేపల్లి తండాలు ముంపునకు గురవుతున్నాయి. రాంరెడ్డిపల్లి, శివన్నగూడ, ఖుదాబాక్షపల్లి గ్రామాల రైతుల భూములు కూడా సేకరించారు. అయితే, భూములకు పరిహారం ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ఇవ్వడంపై గ్రామస్తులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. అందరికీ పెంచిన పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇళ్ల స్థలాలు ఈ నాలుగు ముంపు గ్రామాల్లోని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.7.61 లక్షలు ఇచ్చారు. అయితే, సర్వే సమయంలో అందుబాటులో లేని కొంతమందికి అదీ అందలేదు. వీరికి చింతపల్లి మండల కేంద్రంలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నర్సిరెడ్డిగూడెంలోని 289 కుటుంబాలకుగాను 257 కుటుంబాలకే ఇచ్చారు. ఇంకా 32 కుటుంబాలకు అధికారికంగా ప్లాట్లను కేటాయిస్తూ పత్రాలు అందజేయలేదు. ఇప్పుడు కట్ట నిర్మాణం పేరుతో గ్రామాన్ని ఖాళీ చేయిస్తుండటంతో చేసేదేం లేక ఆ కుటుంబాలు వేరే ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు మారిపోతున్నారు. నా కుమారుడికి ప్లాట్ ఇస్తలేరు నాకు ఇద్దరు కొడుకులు, ఒక కుమారుడికి ప్లాట్ ఇస్తామని హామీ ఇవ్వకపోవటంతో నర్సిరెడ్డిగూడెంలో మా ఇంటి దగ్గరే ఉంటున్నా. అధికారులు వెళ్లమంటున్నారు. నా కొడుక్కి ఇంటి స్థలం ఇస్తామని చెప్పే వరకు వెళ్లను. మాకు ఆరు ఎకరాల భూమి ఉండగా, ఒక్కో ఎకరానికి రూ.5.15 లక్షలే ఇచ్చారు. – కీలుకత్తుల సోమమ్మపట్టాలు ఇవ్వలేదు ఊరి నుంచి పంపిస్తే శివన్నగూడలో ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నాం. చింతపల్లి మండలంలో ఇండ్లను కేటాయించారు.. కానీ ఇంటి పట్టాలు ఇవ్వలేదు. ఈలోగానే ఊరు ఖాళీ చేయాలని చెప్పి పంపించేశారు. ఇంటి స్థలాలకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. – బల్లెం పద్మమ్మ కిరాయి ఇంట్లో ఉంటున్నాం మా ఊరి జ్ఞాపకాలను మరువలేకపోతున్నాం. ఇప్పుడు సొంత ఇల్లు లేకుండా పోయింది. శివన్నగూడలో ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నాను. కిరాయి చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. ఉన్న ఆరెకరాలు ప్రాజెక్టులో పోయింది. మొదటగా ఎకరానికి రూ.4.15 లక్షలు, తరువాత రూ.5.15 లక్షల చొప్పున మాత్రమే ఇచ్చారు. – సుంకరి జంగయ్య -
ఆ‘పాత’ నావ
ఇదేమిటో తెలుసా? అలనాటి భారతీయ నౌకా పాటవానికి నిదర్శనం. వేల ఏళ్ల క్రితమే సముద్రాలపై రాజ్యం చేసిన వైనానికి తిరుగులేని గుర్తు. ఐదో శతాబ్దం దాకా సముద్రాలపై భారతీయులకు ఆధిపత్యం కట్టబెట్టిన విశాలమైన నావలివి. ఇనుము వాడకుండా కేవలం కలప దుంగలు, చెక్క, తాళ్లు తదితరాలతో వీటిని తయారు చేసేవారు. అయినా ఇవి అత్యంత ప్రతికూల వాతావరణాలను కూడా తట్టుకుంటూ సదూర సముద్రయానాలకు ఎంతో అనువుగా ఉండేవి. ఈ భారతీయ నావలకు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా యమ గిరాకీ ఉండేదట. ఇంతటి చరిత్ర ఉన్న పురాతన భారతీయ నావకు వాయుసేన, కేంద్ర సాంస్కృతిక శాఖ ఇప్పుడిలా ప్రాణం పోశాయి. వారి ఆలోచనలకు రూపమిస్తూ గోవాకు చెందిన నౌకా నిర్మాణ సంస్థ హోడీ ఇన్నొవేషన్స్ అచ్చం అలనాటి విధానంలోనే దీన్ని రూపొందించింది. బాబు శంకరన్ సారథ్యంలో కేరళకు చెందిన నిపుణులైన పనివాళ్లు అహోరాత్రాలు శ్రమించి దీన్ని పూర్తి చేశారు. అప్పట్లో మాదిరిగానే ఈ నావను ముందుగా రెండు అర్ధ భాగాలుగా నిర్మించారు. తర్వాత కొబ్బరి నార నుంచి అల్లిన తాళ్ల సాయంతో ఒడుపుగా ఒక్కటిగా బిగించారు. సముద్ర జలాల్లో తడిసి పాడవకుండా నావ అడుగు, పక్క భాగాలకు అప్పటి పద్ధతుల్లోనే సార్డిన్ ఆయిల్ తదితరాలతో పూత పూశారు. మన్నిక కోసం టేకు, పనస వంటి చెక్కలు మాత్రమే వాడారు. ఈ తరహా భారతీయ నావల హవా క్రీస్తుశకం ఐదో శతాబ్ది దాకా ప్రపంచమంతటా నిరి్నరోధంగా సాగింది. ఆ ఘన వారసత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో ఇదో ముందడుగని నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆ‘పాత’నావకు ఇంకా పేరు పెట్టాల్సి ఉంది. ఇది బుధవారం ఘనంగా జలప్రవేశం చేసింది. ఈ ఏడాది చివర్లో 15 మంది నేవీ అధికారులతో ప్రాచీన సముద్ర మార్గాల్లో ఈ నావ మస్కట్, ఇండొనేసియాలకు తొలి ప్రయాణం ప్రారంభించనుంది. దీన్ని నడిపే విధానం తదితరాలపై వారు ముందస్తు శిక్షణ కూడా పొందనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇండియాలో క్యాన్సర్ విస్ఫోటం
దేశంలో క్యాన్సర్ తీవ్రత ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆందోళన వ్యక్తంచేసింది. ప్రతి ఐదుగురు క్యాన్సర్ బాధితుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నట్లు వెల్లడించింది. పురుషులతో పోలిస్తే మహిళలే అధికంగా క్యాన్సర్ బారినపడుతున్నట్లు తెలియజేసింది. భవిష్యత్తులో క్యాన్సర్ కేసుల సంఖ్య భారీగా పెరగనుందని హెచ్చరించింది. ఈ మేరకు ఐసీఎంఆర్ తాజాగా విడుదల చేసిన నివేదికను లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించారు. గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ–2022 అంచనాల ఆధారంగా గణాంకాలు రూపొందించారు. ఇందుకోసం 36 రకాల క్యాన్సర్లు, నాలుగు రకాల వయసు గ్రూప్‌లను పరిగణనలోకి తీసుకున్నారు. → ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల్లో ఇండియా మూడోస్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి. → క్యాన్సర్ సంబంధిత మరణాల్లో చైనాది మొదటిస్థానం కాగా ఇండియాది రెండోస్థానం. → ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ బాధితుల్లో మహిళలే అధికంగా ఉంటున్నారు. → పురుషులు, మహిళల్లో లంగ్ క్యాన్సర్ వల్ల అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. → భారత్‌లో అధిక జనాభా కారణంగా మొత్తం క్యాన్సర్ రేటు తక్కువగా కనిపిస్తోంది. → యువతీ యువకుల కంటే వృద్ధులకు క్యాన్సర్ ముప్పు అధికంగా పొంచి ఉంది. → ప్రస్తుతం దేశంలో యువ జనాభా అధికంగా ఉంది. రానున్న రోజుల్లో వృద్ధుల జనాభా పెరిగిపోనుంది. తద్వారా క్యాన్సర్ రేటు సైతం పెరగనుంది. → మధ్య వయసు్కలు, వృద్ధులతో పోలిస్తే చిన్నారులు, యువతకు క్యాన్సర్ ముప్పు అంతగా లేదు. → మహిళల్లో క్యాన్సర్ సంబంధిత మరణాలు ప్రతిఏటా 1.2 శాతం నుంచి 4.4 శాతం పెరుగుతున్నాయి. పురుషుల్లో ఇది 1.2 శాతం నుంచి 2.4 శాతంగా ఉంది. → 2022 నుంచి 2050 వరకు క్యాన్సర్ సంబంధిత మరణాల రేటు 64.7 శాతం నుంచి 109.6 శాతానికి పెరిగే అవకాశం కనిపిస్తోంది. → దేశంలో 2012 నుంచి 2022 వరకు క్యాన్సర్ కేసులు 36 శాతం పెరిగాయి. 2012లో 10.1 లక్షల కేసులు నమోదు కాగా, 2022లో 13.8 లక్షల కేసులు నమోదయ్యాయి. → అదే సమయంలో క్యాన్సర్ సంబంధిత మరణాలు 30.3 శాతం పెరిగాయి. 2021లో 6.8 లక్షల మంది, 2022లో 8.9 లక్షల మంది క్యాన్సర్ వల్ల మృతిచెందారు. → క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారిలో ఏకంగా 70% మంది మధ్య వయస్కులు, వృద్ధులే ఉంటున్నారు. → క్యాన్సర్ నియంత్రణపై ప్రభుత్వాలు తక్షణమే దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. క్యాన్సర్ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతుండడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడుతోందని పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సింహపురి ఆభరణాలు భళా..
స్వర్ణాభరణాల తయారీలో దక్షిణాది రాష్ట్రాల్లో సింహపురి రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇక్కడ లభించే వినూత్న డిజైన్లకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. స్థానికంగా స్థిరపడిన మార్వాడీలు, జైన్లు.. ఇక్కడి వారు అందించే ముడిసరుకుతో ఆభరణాలను తయారు చేస్తూ స్వర్ణకారులు, ముస్లింలు ఉపాధి పొందేవారు. అయితే కాలక్రమేణా వీరి స్థానాన్ని బెంగాలీలు ఆక్రమిస్తున్నారు. ఫలితంగా ఎన్నో ఏళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకున్న తయారీదారులు ప్రస్తుతం జీవనోపాధి కోల్పోయి నానా అగచాట్లు పడుతున్నారు. నెల్లూరు (పొగతోట): స్వర్ణాభరణాల తయారీకి కేరాఫ్‌గా నెల్లూరు నిలుస్తోంది. దక్షిణాదిలో కోయంబత్తూరు తర్వాతి స్థానం నెల్లూరుదే కావడం విశేషం. చెన్నై సైతం మూడో స్థానంలో ఉందంటే ఇక్కడ రూపొందించే ఆభరణాలకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి 50 ఏళ్ల నుంచే జిల్లాలో నిష్ణాతులు పాతుకుపోయారు. పెద్ద, చిన్న, అతి సూక్ష్మ ఆభరణాల తయారీలో ఇక్కడి స్వర్ణకారులు ప్రావీణ్యం సాధించారు. అర గ్రాము, గ్రాముతో చిన్న కమ్మలు, నెక్లెస్‌లు, స్టోన్ ఐటెమ్స్‌ను రూపొందించడంలో చేయి తిరగడంతో వీటిని సింగపూర్, మధ్య ప్రాచ్య దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జిల్లాలో నెలకు రూ.500 కోట్లకుపైగా వ్యాపారం జరుగుతోందని అంచనా. జిల్లాలో ఇలా.. ఆభరణాలను తయారు చేసే స్వర్ణకారులు జిల్లాలో సుమారు 15 వేల మందికిపైగా ఉన్నారు. చిన్న, పెద్ద బంగారు షాపులు నగరంలో వెయ్యికిపైగా ఉన్నాయి. స్వర్ణాభరణాలను తయారు చేయడంలో ప్రారంభంలో స్థానిక స్వర్ణకారులు, అనంతరం ముస్లింలు, ప్రస్తుతం బెంగాలీలు ముందంజలో ఉన్నారు. చేతితో తయారుచేసే బంగారు ఆభరణాలను ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు. అదే ముంబై, కోయంబత్తూర్ తదితర ప్రాంతాల్లో మెషీన్ కటింగ్‌తో తయారు చేస్తున్నారు. నగరంలోని ఆచారివీధి, చిన్నబజార్, కొరటాల వీధి, గిడ్డంగివీధి, కాకర్ల వీధి, కుక్కల గుంట, మండపాల వీధిలో వేలాది మంది స్వర్ణకారులు జీవనోపాధి పొందుతున్నారు. అధిక శాతం షాపులనూ ఆయా ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా మార్పులు స్వర్ణకారులకు ముడి సరుకును మార్వాడీలు, జైన్లు, స్థానికులు అందజేస్తారు. స్వర్ణకారులుండే రోజుల్లో వంద గ్రాముల బంగారానికి 8 గ్రాముల తరుగు, కూలిని అందించేవారు. ఇలా వంద గ్రాముల బంగారాన్ని ఇస్తే 92 గ్రాములతో ఆభరణాలను తయారుచేసేవారు. ఫలితంగా స్వర్ణకారులకు 8 గ్రాముల బంగారం, కూలి లభించేది. అనంతరం తయారీలో ముస్లింలు ప్రవేశించారు. ఆ సమయంలో కూలిని ఎత్తేసి తరుగును మాత్రమే ఇచ్చేవారు. గోల్డ్ మాఫియా ఆగడాలు జిల్లాలో గోల్డ్ మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. బడా నేతల సహకారంతో ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకుండానే రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో తయారు చేస్తున్న రాళ్లు, ఫ్యాన్సీ ఐటమ్స్ నగలకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక డిమాండ్ ఉండటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన బడా వ్యాపారులు దొడ్డిదారిన తీసుకొచ్చి తయారీ అనంతరం అదే మార్గంలో అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు, పోలీసులకు ప్రతి నెలా ముడుపులు అందుతుండటంతో నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. పెండింగ్‌లో ఎఫ్ఐఆర్లు బంగారు ఆభరణాలను తయారు చేసేందుకు వచ్చిన బెంగాలీల్లో అధిక శాతం మంది పూర్తి వివరాల్లేకుండానే ఉంటున్నారు. బంగారు ఆభరణాల చోరీలకు సంబ«ంధించిన ఎఫ్ఐఆర్లు సంతపేట పోలీస్‌స్టేషన్‌లో అధిక శాతం పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు వీటిని తయారు చేసే దుకాణంలో సీసీ ఫుటేజ్‌లు అందుబాటులో ఉన్నా, అపహరించిన వారిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. జిల్లాలో నైపుణ్యమున్న స్వర్ణకారులు కార్మికులుగానే మిగిలిపోతున్నారు. వీరి జీవితాల్లో వెలుగులు రావడంలేదు. బెంగాల్ నుంచి తయారీదారులను ఆహ్వా నించి సూక్ష్మ బంగారు ఆభరణాలను రూపొందించడాన్ని ప్రారంభించారు. సూక్ష్మ, పలచటి ఆభరణాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపడంతో అధిక శాతం మంది రావడం ప్రారంభించారు. తయారీలో ప్రస్తుతం వీరే కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరికి ప్రస్తుతం తరుగుగా ఐదు గ్రాములను ఇస్తున్నారు. వీరి రంగప్రవేశంతో స్వర్ణకారులు, ముస్లింలు ఉపాధి కోల్పోయారు. ఫలితంగా ఆటోలు తోలుకుంటూ, కూరగాయలు, పండ్ల వ్యాపారాలు, బడ్డీ కొట్లు నడుపుకొని జీవనం సాగిస్తున్నారు.సందట్లో సడేమియాగా మధ్యవర్తులుబంగారు ఆభరణాల తయారీలో మధ్యవర్తులుగా చిన్నబజార్, పెద్దబజార్ తదితర ప్రాంతాలకు చెందిన కీలక వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నారు. మధ్యవర్తులు సూచించిన వ్యక్తులకే బంగారాన్ని ఆభరణాల తయారీ నిమిత్తం ఇస్తారు. తయారీదారులకొచ్చే తరుగులో కొంత భాగాన్ని వీరు తీసుకుంటున్నారు. మరోవైపు కొన్ని చోట్ల కీలకంగా ఉండే వ్యక్తులకు బంగారు ముడి సరుకును ఇస్తున్నారు. వీరు బెంగాలీలతో బంగారు ఆభరణాలను తయారు చేయించి తిరిగి అందజేస్తున్నారు. -
కొంచెం అతి ఖర్చుకు 100 కోట్ల మంది దూరం
ఆసియాలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లో వినియోగదారుల వర్గం పెరగడం లేదు. సంపన్నుల సంపద మాత్రమే పెరుగుతోంది. ఏకంగా 100 కోట్ల మంది వద్ద వస్తువులు, సేవల మీద వెచ్చించేందుకు డబ్బు లేదు! బ్లూమ్ వెంచర్స్ సంస్థ నివేదిక ఈ మేరకు వెల్లడించింది. 143 కోట్ల జనాభాలో అత్యవసరం కాని వస్తువులు, సేవలపై, అంటే ఓ మాదిరి విలాసాలపై ఖర్చు చేసే ప్రజల సంఖ్య చాలా తక్కువని తెలిపింది. వెంచర్ క్యాపిటల్ నివేదిక ప్రకారం దేశంలో 13 నుంచి 14 కోట్ల మందే ‘వినియోగ వర్గం’గా ఉన్నారు. కనీసావసరాలకు మించి కొనుగోలు చేయగల సామర్థ్యం వీరికే ఉంది. ఈ వినియోగదారుల వ్యయంపైనే దేశ జీడీపీ ఎక్కువగా ఆధారపడి ఉందని నివేదిక పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల సౌలభ్యంతో ఎక్కువ వెచ్చిస్తున్నా చాలావరకు అది అత్యవసర సేవల కోసమే ఉంటోందని తెలిపింది. కొత్త స్టార్టప్‌ల సేవలకు వారు డబ్బు వినియోగించడం లేదని తెలిపింది. భారత్‌లో వినియోగదారుల మార్కెట్ విస్తృతంగా విస్తరించడం లేదని, సంపన్నుల సంఖ్య పెరగడం లేదని, ఉన్నవారే మరింత సంపన్నుల వుతున్నా రని ఈ సర్వే మరోసారి తేల్చిందని నిపుణులంటున్నారు. ఈ మార్పు వ్యాపార ధోరణులను ప్రభావితం చేస్తోందని చెబుతున్నారు.మధ్యతరగతిపై రోకటిపోటు1990లో జాతీయాదాయంలో 34 శాతంగా ఉన్న భారతీయ సంపన్నుల వాటా ఇప్పుడు ఏకంగా 57.7 శాతానికి పెరిగింది. దిగువ సగం జనాభా వాటా 22.2 శాతం నుంచి 15 శాతానికి పడిపోయింది. ఆర్థిక పొదుపు కూడా క్షీణిస్తోంది. మెజారిటీ భారతీయుల రుణాలు పెరుగుతున్నాయి. ఆర్థికంగా ఎదుగుతున్న వినియోగదారులు కొనుగోళ్ల కోసం దాదాపుగా రుణాలపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో అరక్షిత రుణాల నిబంధనలను ఆర్బీఐ కఠినతరం చేయడం వారిని బాగా ప్రభావితం చేస్తోంది. వినియోగదారుల డిమాండ్‌కు ప్రధాన చోదకశక్తిగా ఉన్న మధ్యతరగతి కుంచించుకుపోతోంది. దేశంలో పన్ను చెల్లించే మధ్య తరగతిలో సగం మందికి దశాబ్దం కాలంగా వేతనాల్లో పెరుగుదల లేదు. పైపెచ్చు ద్రవ్యోల్బణంతో పోలిస్తే వారి ఆదాయాలు సగానికి పడిపోయాయి. ఈ ఆర్థిక మాంద్యం మధ్యతరగతి పొదుపును దాదాపుగా నాశనం చేసేసింది. భారతీయ కుటుంబాల నికర ఆర్థిక పొదుపు 50 ఏళ్ల కనిష్టానికి చేరిందని ఆర్బీఐ పదేపదే చెబుతోంది. దాంతో మధ్యతరగతి గృహ వ్యయాలతో ముడిపడ్డ ఉత్పత్తులు, సేవలకు మున్ముందు గడ్డుకాలమేనని నివేదిక సూచిస్తోంది.ఏఐ దెబ్బ...సాంకేతికత, యాంత్రీకరణ దెబ్బకు వైట్ కాలర్ ఉద్యోగాలు శరవేగంగా మాయమవుతున్నట్టు మార్సెలస్ నివేదిక హెచ్చరిస్తోంది. క్లరికల్, సెక్రటేరియల్ పోస్టులను క్రమంగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థలు భర్తీ చేస్తున్నాయి. దాంతో తయారీ రంగంలో పర్యవేక్షక ఉద్యోగాలూ తగ్గుతున్నాయి. ఏఐ తాలూకు ఈ దుష్ప్రభావం గురించి ఆర్థిక సర్వే–2025 కూడా పేర్కొంది. ఏఐ వల్ల ఉత్పాదకత పెరుగుతున్నా కార్మికులపై ఆధారపడే మన ఆర్థిక వ్యవస్థను ఇది దెబ్బ తీస్తుందని హెచ్చరించింది. వృద్ధిని కూడా ఇది దెబ్బ తీస్తుందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు, విద్యా సంస్థల మధ్య సహకారం, సమగ్ర విధానం అవసరమని నివేదిక పేర్కొంది. ఉద్యోగాలపై ఏఐ ప్రభావం విషయంలో అలసత్వం చూపితే భారత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
దారి చూపే చుక్కాని
‘ఆడపిల్లలకు పెద్ద చదువులు ఎందుకు?’ అనుకునే కాలం. ‘ఆడపిల్లలకు సైన్స్ కష్టం’ అనుకునే కాలం. ఎన్నో అనుమానాలు, అవమానాలు, అడ్డంకులను అధిగమించి ఆ తరం మహిళలు సైన్స్‌లో సత్తా చాటారు. ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోషియన్’ ను స్థాపించారు. గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకున్న ఈ సంస్థ ఈ తరం మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.‘కొందరు మహిళలు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. మేము మాత్రం అలా ఎప్పుడూ భయపడలేదు. మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడ్డాం’ అంటుంది 91 సంవత్సరాల డా.సుధా పాధ్యే. ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’ వ్యవస్థాపకులలో ఆమె ఒకరు. ల్యాబ్‌లో 76 ఏళ్ల డాక్టర్ భక్తవర్ మహాజన్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’కు దేశవ్యాప్తంగా పదకొండు శాఖలు ఉన్నాయి. రెండు వేలమంది సభ్యులు ఉన్నారు. ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే రకరకాల కార్యక్రమాల్లో పిల్లలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొంటారు.ఇంటిపనికి, వృత్తిపనికి మధ్య సమన్వయం చేసుకోలేని ఎంతోమంది మహిళలకు, కొత్తగా వృత్తిలోకి వచ్చిన మహిళలకు ఆర్గనైజేషన్‌కు సంబంధించి డే కేర్ అండ్ హెల్త్ కేర్ సెంటర్, చిల్డ్రన్స్ నర్సరీ, 160 పడక ల విమెన్స్ హాస్టల్ అండగా ఉంటుంది.‘ఈ సంస్థ మాకు రెండో ఇల్లు’ అంటుంది అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు డా.రీటా ముఖోపాధ్యాయ.ముప్ఫై తొమ్మిది ఏళ్ల డా. సెరెజో శివ్‌కర్ నుంచి 81 ఏళ్ల డా.సునీత మహాజన్ వరకు శాస్త్రవేత్తల మధ్య ఎంతో వయసు తేడా ఉండవచ్చు. అయితే సైన్స్ అద్భుతాల పట్ల ఉన్న ఆసక్తి, గౌరవం సభ్యులందరినీ ఒకేతాటిపై తీసుకువచ్చింది.‘కొద్దిమంది మా సంస్థ విలువను గుర్తించడానికి ఇష్టపడక పోవచ్చు. ఆడవాళ్లు కాలక్షేప కబుర్లు చెప్పుకునే కార్యాలయం అని వెక్కిరించవచ్చు. అయితే అలాంటి వారు మా సంస్థ కార్యక్రమాలను దగ్గరి నుంచి చూపినప్పుడు వారిలో తప్పకుండా మార్పు వస్తుంది’ అంటుంది డా. రీటా ముఖోపాధ్యాయ.‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్ ఏం సాధించింది?’ అనే ఏకైక ప్రశ్నకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన జవాబులు ఉన్నాయి.సైన్స్ అంటే భయపడే అమ్మాయిలలో ఆ భయాన్ని పోగొట్టి సైన్స్‌ను ఇష్టమైన సబ్జెక్ట్ చేయడం నుంచి కుటుంబ బాధ్యతల భారం వల్ల ఉద్యోగం వదులుకోవాలనుకున్న వారికి అండగా నిలబడి పరిష్కార మార్గం చూపడం వరకు ఈ సంస్థ ఎన్నో చేసింది ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’ అనేది ఎన్నో తరాల మహిళా శాస్త్రవేత్తల అనుభవ జ్ఞానసముద్రం. ఈ తరానికి దారి చూపే చుక్కాని.ఎన్నో అనుభవాలు, మరెన్నో జ్ఞాపకాలుఅసోసియేషన్ బిల్డింగ్‌లోకి అడుగు పెడితే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఎందరో మహిళా శాస్త్రవేత్తలు, ఎన్నో అనుభవాలు, విలువైన జ్ఞాపకాలకు ఈ భవనం చిరునామా. ఇక్కడికి వస్తే కాలం వెనక్కి వెళ్లవచ్చు. ముందున్న కాలాన్ని చూడవచ్చు. స్థూలంగా చె΄్పాలంటే ‘ఇండియన్ విమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్’ సైన్స్ పట్ల ఈ తరంలో ఆసక్తిని, అనురక్తిని రేకెత్తించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.– డా. సెరెజో శివ్‌కర్, శాస్త్రవేత్త -
TN Vs Centre: భాషా యుద్ధం.. ఇది ఈనాటిదేం కాదు!
జాతీయ విద్యా విధానం(National Education Policy 2020) అమలు విషయంలో.. తమిళనాడు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం వ్యవహారం మరింత ముదురుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాజాగా సంచలన ఆరోపణలు చేయగా.. బీజేపీ అంతే ధీటుగా బదులిచ్చింది. బలవంతంగా హిందీ భాషను రుద్ది.. స్థానిక భాషలను కనుమరుగయ్యే స్థాయికి చేర్చారంటూ ఆరోపిస్తున్నారాయన. సోదరీసోదరీమణుల్లారా.. గత 100 సంవత్సరాల్లో ఎన్ని భాషలను హిందీ మింగేసిందో తెలుసా? భోజ్‌పురి, మైథిలీ, అవాదీ, బ్రజ్, బుంధేలీ, ఖుమావోని, మఘాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్‌ఘడీ, అంగిక, సంతాలి, హో, ఖారియా, ఖోర్థా, కుర్మాలీ, ముండారీ, కురుఖ్.. ఇలా పాతికకుపైగా నాశనం చేసింది. ఇంకోన్ని భాషలు తమ మనుగడ కోసం పోరాడుతున్నాయి. ఏకపక్షంగా హిందీని రాష్ట్రాలపై రుద్దేయాలన్న నిర్ణయం.. పురాతన భాషలను తుడిచి పెట్టేస్తోంది. ఉత్తర ప్రదేశ్, బీహార్లు హిందీకి గుండెకాయలు అని చెబుతుంటారు. కానీ, ఆ రాష్ట్రాల్లో అసలైన భాషలు అంతరించే స్థితికి చేరుకున్నాయి అని స్టాలిన్ పోస్ట్ చేశారు. హిందీ అమలు విషయంలో తమిళ రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలు అర్థంలేనివని.. కేవలం 2026 ఎన్నికల్లో లాభం కోసమే పాకులాడుతున్నాయని కేంద్రం డీఎంకే ప్రభుత్వంపై మండిపడుతోంది. అయితే స్టాలిన్ ఈ విమర్శలను కూడా తిప్పికొట్టారు. తమిళనాడుకు మాత్రం ఆ నిర్ణయం(NEP) ఏవైపు దారి తీస్తుందో తెలుసని, అందుకే అమలు చేయబోమంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన.My dear sisters and brothers from other states,Ever wondered how many Indian languages Hindi has swallowed? Bhojpuri, Maithili, Awadhi, Braj, Bundeli, Garhwali, Kumaoni, Magahi, Marwari, Malvi, Chhattisgarhi, Santhali, Angika, Ho, Kharia, Khortha, Kurmali, Kurukh, Mundari and… pic.twitter.com/VhkWtCDHV9— M.K.Stalin (@mkstalin) February 27, 2025ఇదిలా ఉంటే.. స్టాలిన్ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఆయన(Stalin) వాదన అసంబద్ధంగా(Silly)గా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తొలుత జాతీయ విద్యావిధానం అమలు చేస్తామని తమిళనాడు కూడా అంగీకరించిందని, ఆపై రాజకీయ లబ్ధి కోసమే యూటర్న్ తీసుకుందని మండిపడ్డారాయన. ఇక.. ఎన్ఈపీ అమలుకు సన్నద్ధంగా లేకపోవడం వల్లే తమిళనాడుకు వచ్చే రూ. 2,400 కోట్ల ఫండ్‌ను కేంద్రం ఆపేసిందన్న ఆరోపణలనూ మంత్రి ధర్మేంద్ర తోసిపుచ్చారు. ఎన్ఈపీ ప్రకారం రాష్ట్రాలు తమకు నచ్చిన భాషలను అమలు చేసే అవకాశం ఉందని, కానీ తమిళనాడు ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.హిందీ భాష అమలు విషయంలో కేంద్రం గనుక తమ రాష్ట్రంపై బ్లాక్‌మెయిల్‌కు పాల్పడితే.. మరో భాషా యద్ధానికి(Language War) సిద్ధమంటూ సీఎం స్టాలిన్, ఆయన తనయుడు.. డిప్యూటీ సీఎం ఉదయ్‌నిధి స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాడు ఏం జరిగిందో ఓసారి పరిశీలిస్తే..అప్పటి నుంచే అనుమానాలుభారత రాజ్యాంగం ప్రకారం 15 ఏళ్లపాటు హిందీతో పాటు ఇంగ్లీష్‌ను అధికారిక ఉత్తర్వుల కోసం వినియోగించాలని కానిస్టిట్యూట్ అసెంబ్లీ నిర్ణయించింది. దీని ప్రకారం.. జనవరి 26, 1950 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అయితే 1965లో ఆ గడువు పూర్తి కావడంతో.. హిందీయేతర రాష్ట్రాలు ఆందోళన బాట పట్టాయి. బలవంతంగా తమ రాష్ట్రాల్లో హిందీ భాషను అమలు చేస్తారేమో అని ఉద్యమాలు మొదలుపెట్టాయి. తమిళ సంప్రదాయాలతో పాటు భాషప్రతిపాదికన మద్రాస్ గడ్డపై ద్రవిడ ఉద్యమం జరిగింది. అలాంటి చోట హిందీ భాష ప్రవేశపెట్టడంపై దశాబ్దాల నుంచే వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. 1965లో తమిళనాడులో డీఎంకే ఆధ్వర్యంలో భారీ హిందీ భాష అమలు వ్యతిరేక ఉద్యమం జరగ్గా.. అది హింసాత్మక మలుపు తీసుకుంది. హిందీ భాష అమలును వ్యతిరేకిస్తూ.. ఎంతో మంది బలిదానం చేసుకున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్‌ను తమిళనాడులో అధికార పీఠం నుంచి దించేయడానికి ఓ కారణమైంది. తమిళనాడులో రెండు భాషలే..సీఎన్ అన్నాదురై నేతృత్వంలోని తొలి డీఎంకే ప్రభుత్వం.. 1968లో తమిళనాడు కోసం ఓ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టింది. అందులో ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం తమిళం, ఆంగ్లం మాత్రమే బోధించాలని ఉంది. అయితే అదే సమయంలో ఇందిరా గాంధీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం కొఠారి కమిషన్(1964-66) నివేదిక ఆధారంగా తొలిసారి జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టింది. సమాన విద్యావకాశాలను ప్రొత్సహించడంతో పాటు జాతీయ సమైక్యతను ప్రతిబింబించేలా మూడు భాషల ఫార్ములాను ప్రవేశపెట్టాలని సదరు కమిషన్ సూచించింది. దీని ప్రకారం.. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషలను సూచించింది. అయితే ఆ టైంలోనూ హిందీ తప్పనిసరి కాదని కేంద్రం చెప్పినా.. ఆ విద్యావిధానాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించింది.👉1968లో ఇందిరా గాంధీ హయాంలో మొదటి జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టబడింది. 14 ఏళ్లలోపు వారికి తప్పనిసరి విద్య, శాస్త్ర విజ్ఞాన రంగాలపై అవగాహన ద్వారా ఆర్థిక అభివృద్ధి, సమాన విద్యావకాశాలు, టీచర్లకు శిక్షణ.. ఇతర అంశాలతో కొఠారి కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పాలసీని అమల్లోకి తెచ్చింది. ఇందులో మూడు భాషల విధానం తీసుకొచ్చింది కేంద్రం. 👉ఇక.. 1986లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న టైంలో మరోసారి ఎన్ఈపీ తెరపైకి వచ్చింది. ఈసారి మూడు భాషల అంశం లేకుండా.. కేవలం విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడంతో పాటు అన్ని వయసుల వారికి విద్యను అందించడం మీదనే ఫోకస్ చేసింది.👉ముచ్చటగా మూడోసారి.. పీవీ నరసింహారావు హయాంలో ప్రవేశపెట్టారు. అయితే.. 1986 ఎన్ఈపీకే కొన్ని మార్పులుచేర్పులు చేశారు. సమకాలీన సవాళ్లను ప్రస్తావిస్తూ.. విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంపై ఆయన దృష్టిసారించారు.ఇక.. దేశ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తెచ్చే ఉద్దేశంతో.. 2020, జులై 29వ తేదీన జాతీయ విద్యా విధానాన్ని ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా 1986 జాతీయ విద్యా విధానాన్ని(ఇప్పుడు అమల్లో ఉన్నదే) సమూలంగా మార్చేసింది. జులై 29, 2020లో అప్పటి కేబినెట్ నూతన విద్యా విధానానికి ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం 10+2గా ఉన్న బేసిక్ అకడమిక్ వ్యవస్థను.. 5+3+3+4గా మార్పు చేయడంతో పాటు పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ ఎన్ఈపీ ప్రకారం.. మూడు లాంగ్వేజ్ ఫార్ములా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో హిందీ కూడా ఉంది. కానీ.. ఇది బలవంతపు నిర్ణయం కాదని కేంద్రం మొదటి నుంచి చెబుతోంది. రాష్ట్రాలు, రీజియన్లు, విద్యార్థులు తమకు నచ్చి భాషలను ఎంచుకునే వీలు ఉంటుందని చెబుతూ వస్తోంది. అయితే ఇది తమ మాతృభాషకు దొడ్డిదారిన ముప్పు కలిగించే ప్రయత్నమేనని తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ విధానం అమలు చేయబోమని చెబుతోంది. ఇక 2026లో ఈ విద్యావిధానం అమల్లోకి రానుంది. -
40 ఏళ్ల తరువాత తల్లిని చేరిన కూతురు
ఐదు రోజుల పసికూనగా వెళ్లిపోయిన కూతురు 40 ఏళ్ల తరువాత తల్లి ముందు నిలబడితే.. ఆ ఆనందానికి అవధులు ఉండవు కదా! ఈ అంతులేని సంతోషానికి ఇటీవల వేదికయ్యింది చిలీలోని శాన్ ఆంటోనియో. వివరాల్లోకి వెళ్తే.. 40 ఏళ్లకిందట.. శాన్ అంటోనియాకు చెందిన 24 ఏళ్ల ఎడిటా బిజామాకు అప్పటికే ఇద్దరమ్మాయిలు. మూడో సారి కుమార్తె పుట్టింది. పిల్లల్లో పేదరికాన్ని తగ్గించడానికి అప్పటి అగస్టో పినోచెట్ నాయకత్వంలోని సైనిక నియంతృత్వ ప్రభుత్వం అంతర్జాతీయ దత్తతలే మార్గమని భావించింది. అట్లా దాదాపు 20వేల మంది పిల్లలను బలవంతపు దత్తత ఇచ్చింది. బిడ్డ కడుపులో ఉండగా.. బిజామా సైతం దత్తతకు అంగీకరించింది. కానీ.. పాప పుట్టిన తరువాత పంపించడానికామె ఒప్పుకోలేదు. ‘ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, స్థిరత్వం లేదు. పిల్లలను ఎలా పెంచుతావ్’అంటూ ప్రశ్నించిన ప్రభుత్వాధికారులు ఆమె ఐదు రోజుల కూతురిని తీసుకెళ్లిపోయారు. బిజామా కుటుంబంలోని చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు. కానీ పేగు తెంచుకు పుట్టింది కదా.. బిజామా బిడ్డకోసం రోదిస్తూనే ఉంది. వెదకడానికి కనీసం పేరు తెలియదు. మార్గం కూడా లేదు. మరోవైపు.. ఆమె కూతురు అడామరీ గార్సియా ఫ్లోరిడాలో పెరిగింది. ఇప్పుడు ప్యూర్టో రికోలో నివసిస్తోంది. తనను దత్తత తీసుకున్నారని చిన్నతనం నుంచే తెలుసు. కానీ కన్న తల్లిదండ్రులను కలుసుకోవడమెలాగో తెలియదు. అలాంటి సమయంలో ఆమె ఫ్రెండ్ ఒకరు.. శిశువుగా దత్తతకు వచ్చి.. చిలీలోని తన సొంత కుటుంబాన్ని కలుసుకున్న టెక్సాస్ అగ్నిమాపక అధికారి టేలర్ గ్రాఫ్ గురించి చెప్పారు. అలాంటివారికోసం సాయం చేసేందుకు ఆయన ఏర్పాటు చేసిన ‘కనెక్టింగ్ రూట్స్’స్వచ్ఛంద సంస్థ గురించి వివరించారు. వెంటనే ఆ సంస్థను కలిసింది గార్సియా. కుటుంబం గురించి తెలుసుకోవడానికి గార్సియా తపన చూసి.. ఆమెను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు సైతం ప్రోత్సాహమందించారు. సోదరి బర్త్ సరి్టఫికెట్ ద్వారా కుటుంబ వివరాలు తెలిసాయి. అయినా.. డీఎన్ఏ పరీక్షతో బిజామానే గార్సియా కన్నతల్లని కనెక్టింగ్ రూట్స్ నిర్ధారించింది. వెంటనే మొదటిసారి జూమ్ ద్వారా మాట్లాడుకున్నారు. గార్సియాది ప్యూర్టో రికన్ స్పానిష్, మయామీ యాస. కానీ తల్లి, అక్కలది విలక్షణమైన చిలీ యాస. మొదటిసారి సంభాషణ కష్టమే అయ్యింది. ఒకరినొకరు చూసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. గతవారం కుటుంబం చెంతకు చేరుకుంది గార్సియా. 41 ఏళ్ల గార్సియాకు తల్లికి, ఇద్దరు అక్కలకు దగ్గరకు పోలికలున్నాయి. అంతేకాదు.. పెద్దక్కకు ఇష్టమున్నట్టే ఆమెకూ కుక్కలంటే చాలా ఇష్టం. ఇప్పుడు గార్సియా చిలీయాస, వంటకాలు, సంగీతం అన్నింటినీ నేర్చుకుంటోంది. అక్కలతో ఎక్కువకాలం గడపాలని నిర్ణయించుకుంది. కనెక్టింగ్ రూట్స్ ఈ ఏడాది చిలీకి తీసుకువచి్చన ఐదుగురు దత్తతదారుల్లో గార్సియా ఒకరు. ఇది ఆ ఎన్జీవో చేసిన నాలుగవ పునరేకీకరణ. ఎన్జీవో చర్యలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. 40 ఏళ్ల కిందట దత్తతకు పోవడంతో ఇప్పుడు తల్లులు పెద్దవారవుతున్నారు. కొందరు చనిపోయారు. అందుకే ఆలస్యం కాకముందే సాధ్యమైనన్ని ఎక్కువ కుటుంబాలను తిరిగి కలపాలని లక్ష్యంగా పెట్టుకుంది కనెక్టింగ్ రూట్స్. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బిడ్డ చదువెలా ఉంది సారూ!
సాక్షి, అమరావతి: దేశంలో పిల్లల విద్య, భవిష్యత్తుపై తల్లిదండ్రుల శ్రద్ధ నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రజలు చదువు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ బిడ్డలు బడికి వెళ్లారా.. ఎలా చదువతున్నారు.. ఇంటి వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను టీచర్లను అడిగి తెలుసుకొంటున్నారు. అంతే కాదు.. వారూ అక్షర జ్ఞానం పెంచుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం రోజువారీ పనుల మీదే దృష్టి పెట్టే తల్లిదండ్రులు పిల్లల చదువుపై అంతగా శ్రద్ధ పెట్టే వారు కాదు. బడుల్లో తల్లిదండ్రుల సమావేశాలు పెట్టినా పెద్దగా హాజరయ్యేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. 46.6 శాతం తల్లులు స్కూళ్లకు వెళ్లి పిల్లల చదువుపై ఆరా తీస్తున్నారు. వారు కూడా పనులు చేసుకుంటూనే పిల్లలతో సమానంగా చదువుకుంటున్నారు. ‘వార్షిక స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (అసర్)– 2024’ సర్వే నివేదిక ఈ విషయాలు వెల్లడించింది. గ్రామీణ భారత్‌లో పాఠశాలకు వెళ్లే వయసు గల పిల్లలు (5 నుంచి 16 ఏళ్లు) ఉన్న తల్లులు విద్యా రంగంపై మంచి అవగాహనతో ఉన్నారని ఆ నివేదిక తెలిపింది. 2016లో జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో 29.4 శాతం మంది తల్లులు మాత్రమే ఇలా బడిబాట పడితే.. 2024 నాటికి ఆ సంఖ్య 46.6 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. తల్లుల్లో 10వ తరగతి మించి చదువుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్టు పేర్కొంది. ఎనిమిదేళ్ల క్రితం గ్రామాల్లో పదో తరగతి చదువుకున్న తల్లులు 9.2 శాతం ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 19.5 శాతం పెరిగిందని తెలిపింది. పదో తరగతి దాటి చదివిన తండ్రుల శాతం పెరుగుదల 2016లో 17.4 శాతం ఉండగా 2024లో 25 శాతానికి చేరువైంది. పదో తరగతి దాటి చదివిన తల్లులు, తండ్రుల శాతం మధ్య అంతరమూ గత ఎనిమిదేళ్లలో తగ్గిందని, 2016లో తల్లులకంటే తండ్రులు 8 శాతం ఎక్కువుంటే, 2024 నాటికి సుమారు 5 శాతానికి తగ్గినట్టు నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో సైతం 23 శాతం మంది బడుల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతుండడంతో పాటు పిల్లలతో సమానంగా విద్యనభ్యసిస్తున్నట్టు ప్రకటించింది. జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో ప్రగతి పదో తరగతికి మించి విద్యావంతులైన తల్లులు గతంలో జాతీయ సగటుకంటే ఎక్కువగా కేరళలోనే అధికంగా ఉండేవారని, ఇప్పుడు ఈ జాబితాలో హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కూడా చేరినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో 2016లో పదో తరగతికి మించి చదివిన తల్లులు 10.4 శాతం ఉండగా 2024లో 22.8 శాతానికి పెరిగినట్లు తెలిపింది. తల్లులు విద్యావంతులు కావడంతో చదువు అవసరాన్ని గుర్తించారని నివేదిక వివరించింది. పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న ఆలోచన పెరగడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రోత్సాహక కార్యక్రమాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొంది. గతంలో ఈ ప్రగతి కేరళలో మాత్రమే కనిపించేదని, ఇప్పుడు దేశంలో పలు రాష్ట్రాల్లో చదువుకునే తల్లులు పెరుగుతున్నట్టు వెల్లడించింది. సర్వే ఇలా.. అసర్ సర్వే కోసం ప్రథమ్ సంస్థ దేశంలోని 605 జిల్లాల్లో 17,997 గ్రామాల్లో 3,52,028 గృహాలను సందర్శించింది. 15,728 పాఠశాలల్లోని వివిధ తరగతుల్లో 6,49,491 మంది పిల్లల చదువులు, వారి తల్లిదండ్రుల పర్యవేక్షణను పరిశీలించింది. చదువులో పిల్లల రాణింపు, విషయ పరిజ్ఞానంతో పాటు తల్లిదండ్రులు విద్యా ప్రగతని అంచనావేసి నివేదిక రూపొందించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంస్థ 390 గ్రామాల్లో 7,721 నివాసాలను సర్వే చేసి, 3 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు గల 12,697 మంది పిల్లలను పరీక్షించింది. -
శివరాత్రి వేళ ముక్కంటి వైభవం
రాష్ట్రంలోని శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం వేకువజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నదులు, పుష్కరిణిలలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు భోళాశంకరుడిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఆదిదేవునికి అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. అనేకచోట్ల రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు.లింగోద్భవ కాలం అనంతరం పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవాలు నేత్రపర్వంగా సాగాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, పంచారామ క్షేత్రాలతోపాటు కోటప్పకొండ త్రికూటేశ్వరస్వామి ఆలయం భక్తులతో సందడిగా మారాయి. ‘ఓం నమశ్శివాయ’ అంటూ భక్తులు కైలాసనాథుడికి తమ కోరికలను విన్నవించుకున్నారు. – సాక్షి నెట్వర్క్శ్రీశైలానికి వెల్లువెత్తిన భక్తజనం శ్రీశైలంలో ఆదిదేవుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి వెల్లువలా తరలివచ్చిన భక్తులతో శ్రీగిరి క్షేత్రం జనసంద్రమైంది. మల్లన్న, భ్రామరీలకు దేవస్థానం విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. లింగోద్భవ సమయంలో మల్లన్నకు పాగాలంకరణ జరిపారు. పండితులు, ప్రధాన అర్చకులు జ్యోతిర్లింగ మల్లికార్జునుడికి లింగోద్భవకాల మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకానికి శ్రీకారం చుట్టారు. శంభో శివ శంబో ఓం నమశ్శివాయ అంటూ భక్తుల శివనామస్మరణ నలుమూలల నుంచి ధ్వనించింది. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన చేనేత కార్మికుడు ఫృధ్వి సుబ్బారావు స్వామివారి గర్భాలయ విమాన గోపురాన్ని, ముఖమండపంపై ఉన్న 14 నందులను కలుపుతూ పాగాలంకరణ చేశారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు శివపార్వతులకు పట్టువ్రస్తాలు, బంగారు ఆభరణాలు, పరిమళపూలతో అలంకరించారు. వేదమంత్రాల నడుమ ఆది దంపతులు ఒక్కటైన కల్యాణ ఘడియల్లో క్షేత్రమంతటా శివనామ స్మరణలు హోరెత్తాయి. ప్రభల ఉత్సవం కనుల పండువగా సాగింది.కోటప్పకొండపై కోలాహలం ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండపై వెలసిన త్రికోటేశ్వర స్వామి క్షేత్రం భక్తజనంతో నిండిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున స్వామి దర్శనం కోసం తరలివచ్చారు. వేకువజామున 3 గంటలకు తీర్థబిందెతో స్వామికి అభిషేకాలు నిర్వహించారు. త్రికూటాద్రి పర్వతంపై కొలువై ఉన్న మహానందీశ్వరునికి పంచామృతాభిషేకాలు జరిపారు. ప్రభల ఉత్సవం కోలాహలంగా జరిగింది. 20 భారీ విద్యుత్ ప్రభలతోపాటు చిన్న చిన్న ప్రభలు ప్రభల నిధికి చేరాయి. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.సుజాత, జస్టిస్ కె.సురేష్ రెడ్డి, జస్టిస్ కృష్ణమోహన్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్రమంత్రి టీజీ భరత్, ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవింద్‌బాబు, యరపతినేని శ్రీనివాసరావు, బి.రామాంజనేయులు, కొలికిపూడి శ్రీనివాసరావు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. పంచారామాలకు పోటెత్తిన భక్తులుఉమ్మడి గుంటూరు జిల్లా అమరావతి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, పాలకొల్లు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోట, ద్రాక్షారామంలోని పంచారామ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. అమరావతిలోని అమరారామంలో ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు పవిత్ర కృష్ణా నదిలో స్నాన మాచరించి అమరేశ్వరాలయంలో దీపాలు వెలిగించి ఏకాదశ రుద్రాభిషేకాలను, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. అమరేశ్వరుడిని హైకోర్టు న్యాయమూర్తులు జ్యోతిర్మయి, సుమతి, రవినాథ్ తివారి, రిటైర్డ్ న్యాయమూర్తి శ్యాంప్రసాద్, ప్రభుత్వ సలహాదారు అర్పీ ఠాకూర్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, జగన్మోహనరావు, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ దర్శించుకున్నారు. భీమవరం గునుపూడిలోని ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆలయం (సోమారామం)లో విశేష అభిషేకాలు, పూజలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు చేశారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు క్షేత్రాన్ని దర్శించుకున్నారు. పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో విశేష అభిషేకాలు, మహన్యాసపూర్వక అభిషేకాలు నిర్వహించారు. రాత్రి 8.35 గంటలకు జగజ్జ్యోతి వెలిగించారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో స్వామివారికి మల్లన్న పాగా అలంకరించారు. అనంతరం లక్షపత్రి పూజ నిర్వహించారు.ద్రాక్షారామం, సామర్లకోట సమీపంలోని భీమారామం క్షేత్రాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని పట్టిసీమ శివక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానమాచరించి భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి గోదావరిలో మైల తెప్పలు వదిలారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మురమళ్లలో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి, కోటిపల్లి రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వరస్వామి, పిఠాపురం నియోజకవర్గంలోని పాదగయ, రాజమహేంద్రవరంలోని ఉమా మార్కండేయేశ్వరస్వామి, కోటి లింగేశ్వర స్వామి తదితర ఆలయాల్లో లింగోద్భవ అభిషేకాలకు భక్తులు పోటెత్తారు. కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం, గోదావరి ఘాట్లలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు జరిపారు.శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తజనంతిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఇంద్ర విమానం, చప్పర, నంది, సింహ వాహనాలపై మాడ వీధుల్లో విహరించారు. భక్తులు కర్పూర హారతులు పట్టారు. రాత్రి శివయ్య జాగరణకు వేలాది మంది భక్తులు శ్రీకాళహస్తికి చేరుకున్నారు. అర్ధరాత్రి దాటాక లింగోద్భవ దర్శనం ప్రారంభమైంది. హీరో మంచు విష్ణు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, చిత్రబృందం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. తిరుమలలోనూ శివరాత్రి సందడి తిరుమలలోని గోగర్భం సమీపంలో వెలసిన రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి అభిషేకం నిర్వహించారు. క్షేత్రపాలకుడి శిల వద్ద పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరి నీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నైవేద్యం సమరి్పంచారు.యనమలకుదురులో సందడిగా ప్రబోత్సవం కృష్ణా జిల్లా యనమలకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తుల సందడితో శివగిరి పై ఉత్సవ శోభ ఏర్పడింది. భక్తులు బుధవారం మహాశివరాత్రి పర్వదినంతో వేకువజామునే కొండ పై వేంచేసి ఉన్న స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామంలో ప్ర¿ోత్సవం ఆకట్టుకుంది. సాయంత్రం 6 గంటలకు రాతిచక్రాల రథం పై ఏర్పాటు చేసిన దేవుడి ప్రభ కొండ చుట్టూ ఊరేగించారు. గ్రామంలో దాదాపు 50 ప్రభలు రంగురంగు కాగితాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. మండపం సెంటర్లో 70 అడుగుల ప్రభ ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్రభలు రాత్రి పొద్దుపోయే వరకు ప్రదర్శించారు. -
అందమైన బంధానికి అపురూపం
కోటి ఆశలతో, వేల ఊసులతో ఒక్కటయ్యే అనుబంధం. నమ్మకమనే ఆస్తిని ఇద్దరి భుజస్కంధాలపై మోయాలనే మాటకు అసలైన అర్థం పెళ్లి. అంతటి ముఖ్యమైన ఘట్టంలోని మధుర క్షణాలు, జ్ఞాపకాలను పదిలంగా దాచుకునేందుకు నేటితరం ఆసక్తి చూపుతోంది. ఓ వైపు కల్యాణ మండపం, విందు.. మరోవైపు అందంగా.. ఆధునికంగా చిత్రాలు, వీడియోల చిత్రీకరణకు ఎంత ఖర్చయినా వెనకాడటం లేదు. ఇందుకోసం కొత్తగా ‘ప్రీ వెడ్డింగ్ షూట్’కు యువత ఆసక్తి చూపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పెళ్లి చేసుకుంటున్న జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్ (Pre Wedding Shoot) వైపు మొగ్గు చూపుతున్నారు. అందమైన ఊహలు, దివ్యమైన ఆలోచనలకు రూపాన్నిచ్చేలా.. చక్కటి రూపం కల్పిస్తుండడంతో ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వధూవరుల ఇళ్లకు పరిమితమవ్వకుండా.. పచ్చదనంతో నిండిన అందమైన ప్రాంతాలకు వెళ్తున్నారు. – తొర్రూరువెడ్డింగ్ షూట్ కొత్తపుంతలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్ (Warangal), కాజీపేట, నర్సంపేట, మహబూబాబాద్, భూపాలపల్లి తదితర పట్టణాల్లో ఫొటో, వీడియోగ్రఫీ కొత్త పుంతలు తొక్కుతోంది. ‘ప్రీ వెడ్డింగ్ షూట్’కు ప్రత్యేక చిత్రాలను తీయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీడియో, ఫొటోగ్రాఫర్లతో ఒప్పందం కుదుర్చుకునే ముందు.. గతంలో వారు తీసిన వీడియోలను చూశాకే బుక్ చేసుకుంటున్నారు. గతంలో కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వ్యాపార, వాణిజ్య, రాజకీయ నాయకుల పిల్లలు మాత్రమే వీటికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రస్తుతం అందరిలో ఆసక్తి పెరగడంతో ఆయా ప్రాంతాల్లో కొత్త విధానానికి మొగ్గు చూపుతున్నారు. అందమైన కావ్యంలా..అందమైన ప్రదేశంలో ఫొటో.. వీడియో షూట్లకు నవ వధూవరులు ఆసక్తి చూపుతున్నారు. వివాహానికి ముందే వధూవరులు తమ హావభావాలు, సంభాషణలు, సాన్నిహిత్యాన్ని చిత్రీకరించుకుంటున్నారు. భిన్న కోణాల్లో చూసుకుని మురిసిపోయేందుకు.. రేపటి తరానికి చూపించేందుకు ఎంత వ్యయమైనా వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. ‘ప్రీ వెడ్డింగ్ షూట్’ ద్వారా ఆధునిక కెమెరాలతో ఓ సినిమా పాటలా చిత్రీకరిస్తున్నారు.అత్యాధునిక కెమెరాలతో చిత్రీకరణ..ప్రీ వెడ్డింగ్ షూట్‌ను చిత్రీకరించేందుకు హైడెన్సిటీ (హెచ్డీ) టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు డీఎస్ఎల్ఆర్, డ్రోన్, 5డీ, మార్క్ 3, మార్క్ 4, సోని, 1 డీఎక్స్, 1 డీఎక్స్ మార్క్ తదితర కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఒక షూట్ చేయడానికి కనీసం నలుగురు కెమెరామన్లు పని చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు. ఒక్కొక్క కెమెరాకు ఒక్కొక్క లెన్స్‌లను ఉపయోగించి వధూవరులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మూడు నుంచి 4 నిమిషాల నిడివిగల పాటకు సుమారు 2 నుంచి 3 రోజుల పాటు పని చేస్తారు. ఒక పాటకు ఒక్కోసారి ప్రదేశాలను కూడా మార్చాల్సి ఉంటుంది. ప్రదేశం మారిన సమయంలో దుస్తులను మార్చుకోవడం, మేకప్ వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వడంతో సమయం ఎక్కువ పడుతుంది.ఎడిటింగ్ కీలకం..వధూవరులపై సన్నివేశాల చిత్రీకరణ కెమెరామెన్ల ఆలోచన, సృజనాత్మకతను బట్టి ఉంటుంది. ఒక్కోసారి వధూవరుల ఆలోచనలకూ ప్రాధాన్యమిస్తారు. చిత్రీకరణకు 2 నుంచి 3 రోజుల సమయం పట్టినా దాన్ని పాట రూపంలో తీసుకొచ్చేందుకు ఎంతో శ్రమించాల్సి ఉంటోంది. ఎడిటింగ్‌కు కనీసం 10 రోజుల సమయం పడుతుంది. ఈ మేరకు సీన్‌కట్, ఈడీఎస్, ప్రీమియర్, ఆప్టర్ ఎఫెక్ట్స్ వంటి సాఫ్ట్వేర్లు ఉపయోగిస్తారు.వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ..ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రకృతి రమణీయ ప్రదేశాల్లో షూటింగ్ జరుపుతున్నారు. లక్నవరం చెరువు, రామప్ప లేక్, పాకాల చెరువు, కాకతీయ మ్యూజికల్ గార్డెన్, గోవిందరాజుల గుట్ట, ఏటూరునాగారం అభయారణ్యం, పాకాల అభయారణ్యం, వేయిస్తంభాల గుడి, కాకతీయ రాక్ గార్డెన్, భద్రకాళి టెంపుల్ తదితర ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహిస్తున్నారు.లక్షలు ఖర్చయినా లక్షణంగా..గతంలో పెళ్లికి ఫొటోలు, వీడియో తీయించుకోవాలంటే తెలిసిన ఫొటోగ్రాఫర్లకు చెప్పుకునేవాళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం ప్రీ వెడ్డింగ్ షూట్ కాకుండా ఆల్బమ్‌లు, వీడియోలు అన్ని కలిపి ప్యాకేజీగా తీసుకుంటున్నారు. దీనికి రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు పలు రకాల ప్యాకేజీలున్నాయి. ఇందులో ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కూడా ఉంటాయి. వివాహానికి కొద్ది రోజుల ముందు, వివాహమైన తర్వాత రెండు రోజుల పాటు ప్రత్యేకంగా షూటింగ్ చేసి వీడియోలను చిత్రీకరిస్తున్నారు.వాట్సాప్, ఫేస్బుక్లో షేరింగ్..గతంలో వివాహాలంటే చాలా రోజుల ముందు నుంచే హడావుడి మొదలయ్యేది. బంధువులు, స్నేహితులకు శుభలేఖల పంపిణీ చేయడం పెద్ద ప్రహసనంగా మారిపోయేది. కానీ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ పుణ్యమా.. అని ఆ శ్రమ లేకుండా పోయింది. ప్రీ షూట్ చేశాక పెళ్లికి ముందు తమ సమీప బంధువులు, స్నేహితులకు అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో పంపుకొంటున్నారు. ఈ డిజిటల్ ఆహ్వానాన్నే పెళ్లి కార్డుగా ఉపయోగిస్తున్నారు.పెరిగిన ఉపాధి..ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు పెళ్లిళ్ల సీజన్లో మాత్రమే పని ఉండేది. ప్రస్తుతం ట్రెండ్ నడుస్తుండటంతో వారికి గిరాకీ పెరిగింది. ప్రీ వెడ్డింగ్ షూట్ల వల్ల పెళ్లికి ముందు, తర్వాత కూడా చేతినిండా పని దొరుకుతుంది. సమర్థవంతులైన ఫొటోగ్రాఫర్లు బృందాలుగా ఏర్పడి వేడుకలను నిర్వహిస్తున్నారు. యువతరం ఆసక్తి పెరగడంతో నాణ్యతతో కూడిన అత్యాధునిక కెమెరాలను ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వినియోగిస్తున్నారు. ఉపాధి పొందుతున్నారు. -
పాపం పాలపిట్ట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దసరా పండుగ పూర్తయ్యేది రంగురంగుల పాలపిట్టను దర్శించిన తర్వాతే. అందుకే అది రాష్ట్ర పక్షిగా కూడా అయ్యింది. అయితే, ఎంతో పవిత్రంగా భావించే పాలపిట్ట (Palapitta) ఈ మధ్య కనిపించటమే లేదు. దేశంలోని అంతరించిపోతున్న పక్షుల జాబితాలో పాలపిట్ట కూడా చేరిపోయింది. ‘రైతు నేస్తం’గా పిలిచే పాలపిట్ట పూర్తిగా అంతరించిపోకుండా కాపాడేందుకు తాజాగా ప్రభుత్వం నడుం బిగించింది.ప్రమాదం అంచున..ఆకర్షణీయమైన ప్రత్యేక రంగులతో ఇట్టే ఆకట్టుకునే రంగురంగుల పక్షి పాలపిట్ట. దీనిని ఇండియన్ రోలర్ (Indian roller), బ్లూ జే అని కూడా పిలుస్తారు. రెక్కలు విచ్చుకున్నప్పుడు ముదురు, లేత నీలం రంగు డామినేట్ చేస్తూ... తెలుపు, గోధుమ, నలుపు రంగులతో ఈ పక్షి ప్రత్యేకంగా కనిపిస్తుంది. మామూలు సమయంలో 30–34 సెం.మీ (12–13 అంగుళాలు), రెక్కలు విచ్చుకున్నప్పుడు 65–74 సెం.మీ (26–29 అంగుళాలు) పొడవు, 166–176 గ్రాముల బరువుతో చూడముచ్చటగా ఉంటుంది. ఏడాది క్రితం విడుదలైన ‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ రిపోర్ట్’లో సంఖ్య తగ్గిపోతున్న పక్షి జాతుల్లో వీటిని కూడా చేర్చారు. అంతకుముందు ఏడాదితో పోల్చితే వీటి సంఖ్య 30 శాతం తగ్గినట్లు వెల్లడైంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) నివేదికలో రెడ్ లిస్ట్ రీఅసెస్మెంట్ కోసం పాలపిట్టను సిఫార్సు చేశారు. తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, ఒడిశా, బిహార్ (Bihar) రాష్ట్రాల్లో కూడా పాలపిట్టను రాష్ట్ర పక్షిగా గుర్తించారు. పాలపిట్ట పరిరక్షణకు ప్రణాళికపాలపిట్టల సంఖ్య తగ్గిపోవటానికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం, మొబైల్ టవర్ల ద్వారా వస్తున్న రేడియేషన్ (Radiation) అని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. దసరా, ఉగాది పండుగల సమయంలో కొందరు వీటిని బంధించి పట్టణాల్లో ప్రదర్శించి డబ్బులు వసూలు చేస్తుండడం కూడా వాటికి ప్రాణసంకటంగా మారుతోంది. ప్రమాదాన్ని గుర్తించిన ప్రభుత్వం పాలపిట్టను రక్షించేందుకు చర్యలకు ఉపక్రమించింది. చదవండి: హైదరాబాద్ జూ పార్కు ఎంట్రీ టికెట్ ధరల పెంపుతాజాగా జరిగిన రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు సమావేశంలో పాలపిట్ట సంరక్షణకు ప్రణాళిక సిద్ధం చేయాలని అటవీ శాఖా మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. అటవీచట్టం షెడ్యూల్–4లో పాలపిట్ట ఉండడంతో దానిని బంధించడం, హింసించడం వంటివి చేస్తే నాన్‌బెయిలబుల్ కేసులతో పాటు మూడేళ్ల జైలుశిక్ష, రూ.25 వేల వరకు జరిమానా విధించే వీలుంది. దీంతో పాలపిట్ట సంరక్షణకు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.రైతు నేస్తంపాలపిట్టలు రైతు నేస్తాలు. ఇవి వలస పక్షులు కావు. భారత్, ఇరాక్, థాయ్‌లాండ్‌లో అధికంగా కనిపిస్తాయి. చిన్న కప్పలు, మిడతలు, కీచురాళ్లు వంటి వాటిని వేటాడి తింటుంటాయి. వీటి జీవితకాలం 17–20 ఏళ్లు. చెట్ల తొర్రల్లో గూళ్లు పెట్టి మూడు నుంచి ఐదు గుడ్ల వరకు పెడతాయి. వీటి ప్రత్యుత్పత్తి కాలం వాటి ఆవాస ప్రాంతాలను బట్టి ఫిబ్రవరి–జూన్ నెలల మధ్యలో ఉంటుంది. ఈ పక్షులు పంట పొలాలు, తోటలు, ఉద్యా నవనాల్లో తెగుళ్లను ఆహారంగా తీసుకుంటాయి. పంటలను నష్టపరిచే కీటకాలు, సరీసృపాలు, ఉభయ చరాలను వేటాడి తింటూ రైతులకు పరోక్షంగా సహకారం అందిస్తాయి. అందుకే వీటిని రైతునేస్తాలు అని పిలుస్తారు.పంటల సాగు తగ్గటంవల్లే..కొంతకాలంగా పాలపిట్టలు అంతగా కనబడడం లేదు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ రియల్ ఎస్టేట్ విస్త రణ, నగరాలు, పట్టణాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం నిలిచిపోవడంతో వాటి ఆవాస ప్రాంతాలకు ఇబ్బందులు తలెత్తాయి. పంటల రక్షణకు పురుగుమందులు అధికంగా వినియోగించటం కూడా ఈ పక్షుల సంఖ్య తగ్గటానికి కారణం. – హరికృష్ణ ఆడెపు, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ అధ్యక్షుడు.పూర్తిగా అంతరించకపోవచ్చు..పాలపిట్టలు మను షులు, జనావాసా లకు దూరంగా ఉండేందుకు ఇష్టపడతాయి. అందువల్ల వాటి కచ్చితమైన సంఖ్యను తెలుసుకో వడం కష్టమే. పాలపిట్ట జాతి పూర్తిగా అంతరించిపోతుందని భావించడానికి లేదు. – డా. సాయిలు గైని, బయో డైవర్సిటీ నిపుణుడు. -
చిన్నవయసులోనే గుండెపోటు.. ఎందుకొస్తుందో తెలుసా?
దేశంలో ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఈ తరహాలో గుండెపోటు, స్ట్రోక్, గుండె, ధమనుల వ్యాధులు వృద్ధులలో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు పాతికేళ్లలోపువారిలోనూ గుండపోటు కేసులు వెలుగు చూస్తున్నాయి. దీనికి కారణమేమిటి? వైద్యులు ఏమంటున్నారు?పురుషుల్లోనే అధికంఇండియన్ హార్ట్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం గత కొన్నేళ్లుగా 50 ఏళ్లలోపు వయసుగల వారిలో గుండెపోటు ముప్పు 50 శాతం, 40 ఏళ్లలోపు వారిలో 25 శాతం మేరకు పెరిగింది. అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో.. మహిళల్లో గుండెపోటు కేసులు చాలా తక్కువని తెలిపింది. పురుషులు ఎక్కువగా గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ధూమపానం, మద్యపానం అనేవి యువతలో హృదయ సంబంధ వ్యాధులకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ వ్యసనాల కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా ఇది కరోనరీ హార్ట్ డిసీజ్‌కు దారితీస్తుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది రక్త నాళాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా గుండెపోటు ముప్పు పెరుగుతుంది.కారణాలివే..👇👉ఆహారపు అలవాట్లుఈ రోజుల్లో ప్రతి రంగంలోనూ పని ఒత్తిడి మరింతగా పెరిగింది. దీంతో యువత తమ ఆహారపు అలవాట్లు, దినచర్యపై తగిన శ్రద్ధ చూపడం లేదు. ఇది పలు రకాల గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తోంది. జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల యువత ఆరోగ్యం దెబ్బతింటోంది. దీని కారణంగా శరీరంలోని కేలరీల పరిమాణం పెరుగుతుంది. ఇది గుండెపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.👉అధిక పని ఒత్తిడిమానసిక ఒత్తిడి కూడా గుండెపోటుకు కారణంగా నిలుస్తోంది. పని భారం అనేది నేరుగా రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా యువకులు, మధ్య వయస్కులు రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. నిద్రలేమితో బాధపడేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఎనిమిది గంటల కన్నా తక్కువ సమయం నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.👉మధుమేహం యువతలో గుండె జబ్బులకు మధుమేహం (డయాబెటిస్) కూడా ఒక ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో డయాబెటిస్ రోగులు అత్యధికంగా ఉన్నారు. 2019లో భారతదేశంలో 7.7 కోట్ల మంది డయాబెటిక్ బాధితులు ఉన్నారని పలు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2045 నాటికి డయాబెటిస్ రోగుల సంఖ్య 13 కోట్లకు పైగా పెరుగుతుందనే అంచనాలున్నాయి.జిమ్, డ్యాన్స్ సమయంలోనే ఎందుకంటే..అధికంగా శారీరక శ్రమ చేయడం వలన గుండె ధమనులలో అథెరోస్క్లెరోటిక్ ప్లేక్ చీలిపోయే ప్రమాదం మరింతగా పెరుగుతుంది ఇది గుండెపోటుకు దారితీస్తుంది. కఠినమైన వ్యాయామాలు చేస్తున్న సందర్భంలో ఛాతీపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అలాగే గుండెపోటు ముప్పు కూడా మరింతగా పెరుగుతుంది. అందుకే నిపుణుల సలహా మేరకు, వారి పర్యవేక్షణలో మాత్రమే వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా నృత్యం చేసే సమయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. నృత్యం చేసే సమయంలో హృదయ స్పందన పెరుగుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఊబకాయం కలిగివారు, అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు ఎక్కువ స్టెప్స్ కలిగిన నృత్యం చేస్తున్నప్పుడు వారు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. అకస్మాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.ఈ లక్షణాలు కనిపిస్తే.. జాగ్రత్తపడండిఛాతీ, వీపు, గొంతు, దవడ లేదా రెండు భుజాలలో తరచూ నొప్పిగా అనిపిస్తుంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. అలాగే ఉన్నట్టుండి చెమటలు పడుతున్నా, ఊపిరి ఆడటం కష్టంగా అనిపించినా, రెండు అడుగులు కూడా వేయలేనంత నీరసంగా అనిపించినా వెంటనే వైద్య నిపుణులను కలుసుకోవాలి. ఇదేవిధంగా ఛాతీలో, ఉదరంలో గ్యాస్ ఏర్పడినా, విపరీతమైన అలసట లేదా తల తిరుగుతున్నట్లు ఉన్నా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఛాతీ నొప్పి, విశ్రాంతి లేకపోవడం, శ్వాస సమస్యలు లేదా వేగంగా శ్వాస తీసుకోవడం మొదలైనవి గుండెపోటు సంబంధిత లక్షణాలు కావచ్చని గుర్తించాలని, ఇటువంటి సందర్భాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు.గుండెలో సమస్యలు👉హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిగుండె కండరాలు గట్టిపడే జన్యుపరమైన రుగ్మత. దీని వలన గుండె రక్తాన్ని సమర్ధవంతంగా పంప్ చేయలేకపోతుంది.👉డైలేటెడ్ కార్డియోమయోపతి దీనిలో ఎడమ జఠరిక పెద్దదిగా, బలహీనంగా మారుతుంది. ఇది గుండెకు రక్తాన్ని సమర్థవంతంగా ప్రసరింపజేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.👉అరిథ్మోజెనిక్ రైట్ వెంట్రిక్యులర్ డిస్ప్లాసియా దీనిలో కొవ్వు లేదా పీచు కణజాలం గుండె కండరాలకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇది రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. ప్రాణాంతక అరిథ్మియా ముప్పును మరింతగా పెంచుతుంది.ముందుగా చేసే పరీక్షలివే..👉ఎకోకార్డియోగ్రఫీ (ఎకో) గుండె పనితీరునంతటినీ అంచనా వేయడానికి చేసే గుండె సంబంధిత అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ ఇది.👉స్ట్రెస్/ట్రెడ్మిల్ పరీక్ష శారీరక శ్రమ చేసే సమయంలో గుండె ఎలా స్పందిస్తుందో ఈ పరీక్ష అంచనా వేస్తుంది. గుండె సంబంధిత సమస్యలను గుర్తిస్తుంది.👉జెనెటిక్ పరీక్ష ఆకస్మిక గుండెపోటు, వారసత్వంగా వచ్చిన గుండె సంబంధిత సమస్యలు, కుటుంబ చరిత్రను పరిశీలిస్తారు.👉హోల్టర్ పర్యవేక్షణ హోల్టర్ మానిటర్ అనేది హృదయ స్పందనను రికార్డ్ చేస్తుంది. ఇది గుండె సంబంధిత అసాధారణ సంకేతాలను తనిఖీ చేస్తుంది. బాధితులకు అవసరమైనప్పుడు వైద్యులు 24 గంటల హోల్టర్ పర్యవేక్షణను సూచిస్తుంటారు.వెంటనే ఏం చేయాలంటే..అకస్మాత్తుగా గుండె ఆగిపోయినప్పుడు సీపీఆర్ అనేది ప్రాణాలను కాపాడుతుంది. సీపీఆర్ చేయడం ద్వారా మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని ప్రవహింపజేస్తుంది. కణజాల మరణాన్ని కొంతసేపటి వరకూ నివారిస్తుంది. సీపీఆర్ అందని పక్షంలో ఐదు నిమిషాల్లో మెదడు దెబ్బతినే అవకాశం ఉంది. ఎనిమిది నిమిషాల తర్వాత మరణం దాదాపు ఖాయమని వైద్యులు చెబుతున్నారు.అత్యవసర సేవలకు కాల్ఎవరైనా అకస్మాత్తుగా కుప్పకూలిపోతే పక్కనే ఉన్నవారు ఆ వ్యక్తిని కదిలిస్తూ ‘బాగున్నారా?’ అని గట్టిగా అడగాలి. వెంటనే అత్యవసర సేవలకు కాల్ చేయాలి. బాధితులు శ్వాస తీసుకుంటున్నాడా లేదా అనేది గుర్తించాలి. బాధితుడు శ్వాస తీసుకోకవడం లేదని గుర్తిస్తే అతని ఛాతీ మధ్యలో గట్టిగా వేగంగా అదమండి. నిమిషానికి 100 నుండి 120 సార్లు ఇలా చేయాలి. సీపీఆర్‌లో శిక్షణ పొందినవారు 30 కంప్రెషన్ల తర్వాత రెస్క్యూ శ్వాసలను అందించగలుగుతారు. శిక్షణ పొందనివారు ఛాతీ కంప్రెషన్లను కొనసాగించాలి. అదేవిధంగా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి.ఇది కూడా చదవండి: Mahakumbh: చివరి పుణ్యస్నానాలకు పోటెత్తిన జనం.. తాజా ఫొటోలు -
భవిష్యత్ భయాలు
ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పిల్లల ఫీజులు, తల్లిదండ్రుల వైద్య ఖర్చులు ఏటా తడిసి మోపెడవుతున్నాయి. నిత్యావసరాల ధరలు సరేసరి.. కానీ, ఆ స్థాయిలో ఆదాయాలు పెరగటంలేదు. వచ్చే సంపాదనలోనే ఎంతో కొంత భవిష్యత్ కోసం పొదుపు చేస్తున్నా.. అవి ఏమూలకూ సరిపో వటంలేదు.. ఇదీ నేడు సగం మంది భారతీయుల ఆవేదన. ముఖ్యంగా 35 – 54 ఏళ్ల మధ్య వయసున్న భారతీయులు భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పొదుపు, ఖర్చులపై యూ గౌ, ఎడిల్వీస్ లైఫ్ ఇన్సూరెన్స్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. – సాక్షి, హైదరాబాద్అధ్యయనంలోని కీలకాంశాలు..» దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని 4,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వారిలో 94 శాతం మంది భవిష్యత్ కోసం సవివరమైన ఆర్థిక ప్రణాళిక లేదా ఒక మోస్తరు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.» సర్వేలో పాల్గొన్నవారిలో సగానికిపైగా తాము చేస్తునపొదుపు భవిష్యత్ అవసరాలకు సరిపోదని ఆందోళన వ్యక్తంచేశారు.» పక్కా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకున్నా చివరకు అది పూర్తిస్థాయిలో అక్కరకు రావడం లేదని తెలిపారు.» వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, వయసు పెరుగుతున్న పిల్లల ఆర్థిక అవసరాలను తీర్చడంలో నిమగ్నమైన 35–54 ఏళ్ల లోపువారిలో 60 శాతం మంది తమ పొదపు భవిష్యత్ అవసరాలకు సరిపోదని అంగీకరించారు.» వివిధ రూపాల్లో ఎదురయ్యే అత్యవసరాలను ఎదుర్కొనే విషయంలో పొదుపు సొమ్ము సరిపోక అప్పులు చేయాల్సి వస్తోందని ఎక్కువ మంది చెప్పారు.» అనారోగ్య సమస్యలు, విద్య, ఇంటికి మరమ్మతులు వంటివాటికి అన్నిరకాల రుణాలను వినియోగించుకుంటుండటంతో దీర్ఘకాలిక ఆకాంక్షలు నెరవేర్చుకునే విషయంలో ఇబ్బందులు తప్పడం లేదని తెలిపారు.» భవిష్యత్ అవసరాలకు పనికి వస్తుందనే ఆశతో పలు మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్నా.. అది అవసరానికి చేతికి రావటంలేదని కొంతమంది పేర్కొన్నారు. » భవిష్యత్‌లో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేమని సర్వేలో పాల్గొన్న 35 – 54 ఏళ్ల మధ్య వయస్కుల్లో సగంమందికి పైగా అభిప్రాయపడ్డారు. భవిష్యత్ ఆర్థిక అవసరాలను తీర్చేందుకు జీవిత బీమా వంటి మార్గాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.రెండు రకాల సవాళ్లురెండు తరాలవారిని (తల్లి దండ్రులు, పిల్లలు) ఆదుకోవాల్సిన బాధ్యతల మధ్య ‘సాండ్విచ్ జనరేషన్’ (35 – 54 ఏళ్ల మధ్యవారు) నలిగిపోయే పరిస్థితి ఎదురవుతోంది. పెద్దలకు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినపుడు తగిన విధంగా ఖర్చు చేయడం, పెరుగుతున్న పిల్లలకు నాణ్యమైన విద్యను అందించటం వీరికి సవాల్‌గా మారుతోంది. –సుమిత్ రాయ్, ఎండీ–సీఈవో, ఎడిల్వీస్ లైఫ్ ఇన్సూరెన్స్. -
ఉద్యోగానికి ‘ఇంటర్న్’ బాట
సాక్షి, ఎడ్యుకేషన్: దేశంలోని యువతకు ఉద్యోగ సాధన కోసం అవసరమయ్యే క్షేత్రస్థాయి నైపుణ్యాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అమల్లోకి తెచ్చిన ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ (పీఎంఐఎస్)కు ఆదరణ లభిస్తోంది. పదో తరగతి, ఇంటర్మిడియెట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ వంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఆన్ జాబ్ ట్రైనింగ్ అవకాశం కల్పించడంతోపాటు నెలకు రూ.5 వేలు చొప్పున స్టైపెండ్ కూడా అందించడం ఈ పథకం ప్రత్యేకత. ఏడాది పాటు ఉండే ఈ ఇంటర్న్‌షిప్‌ను పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లోనూ పూర్తి చేసే అవకాశం ఉండటం గమనార్హం. దీనివల్ల తగిన నైపుణ్యాలు సమకూరి, మంచి ఉద్యోగంలో స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది.28,141 మందికి శిక్షణ కేంద్రం గతేడాది బడ్జెట్లో ఆమోదం లభించి, అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిన పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ తొలి దశలో 28,141 మందికి ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభించాయి. ఈ స్కీమ్ కింద దేశంలో ఏటా 1.25 లక్షల మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా భాగస్వామ్య సంస్థల నుంచి 1.27 లక్షల ఆఫర్లు వచ్చాయి. వాటి కోసం 6.21 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 82,077 మందిని కంపెనీలు ఎంపిక చేసుకుని ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేశాయి. అయితే 28,141 మంది మాత్రమే ఆఫర్లను తీసుకుని ఆయా సంస్థల్లో శిక్షణకు హాజరయ్యారు.24 రంగాల సంస్థల్లో అవకాశాలుపీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌లో భాగంగా 24 రంగాలకు చెందిన సంస్థలు అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్‌ను అందిస్తున్నాయి. బీఎఫ్ఎస్ఐ, హాస్పిటాలిటీ, ఆటోమోటివ్, ఎఫ్ఎంసీజీ, మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలతోపాటు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి బ్యాంకింగ్ రంగ సంస్థలు, పలు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉండటం గమనార్హం.ట్రెయినీలకు స్టైఫండ్ కూడా.. పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ కింద ఎంపికై వివిధ సంస్థల్లో చేరినవారికి కేంద్ర ప్రభుత్వం స్టైఫండ్ ఇస్తుంది. తొలి దశలో 28,141 మంది ఇంటర్న్ ట్రైనీల బ్యాంకు ఖాతాల్లో వన్ టైమ్ గ్రాంట్ కింద రూ.4.38 కోట్లు, 2024 డిసెంబర్ వరకు రూ.1.3 కోట్ల స్టైఫండ్‌ను జమ చేసినట్లు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రకటించింది.పీఎంఐఎస్‌కు అర్హతలివీ.. పీఎం ఇంటర్న్‌షిప్ పథకం కోసం దరఖాస్తు చేసుకునేవారు 21 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసులో ఉండాలి. వారి కుటుంబ వార్షికాదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలి. ఎలాంటి ఉద్యోగం లేని యువతకు వారి విద్యార్హతలకు తగినట్టుగా ఏడాది పాటు ఆన్ జాబ్ ఆన్ ట్రైనింగ్/ఇంటర్న్‌షిప్ కల్పిస్తారు. ఐదేళ్ల వ్యవధిలో కోటి మంది యువతకు దేశంలోని టాప్–500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైనవారికి నెలకు రూ.5 వేలు స్టైపెండ్ ఇస్తారు. ఇందులో రూ.4.5 వేలను కేంద్ర ప్రభుత్వం, మరో రూ.500ను ఆయా సంస్థలు సీఎస్ఆర్ కింద భరిస్తాయి.విస్తృతం చేయాలి.. పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌ను టాప్–500 సంస్థలకేకాకుండా ఇతర సంస్థలకు కూడా విస్తరింపజేయాలి. దీనివల్ల ఔ త్సాహికులు తమ సమీప ప్రాంతాల్లోని సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం మెరుగవుతుంది. సుదూర ప్రాంతాల్లోని సంస్థల్లో ఇంటర్న్ ట్రైనీగా అవకాశం లభించినా.. నివాస ఖర్చులు, ఇతర కోణాల్లో ఆసక్తి చూపని పరిస్థితి ఉంది. మరోవైపు విద్యార్థులు కూడా వ్యక్తిగత హద్దులు ఏర్పరచుకుని మెలగడం కూడా సరికాదని, అవకాశమున్న చోటికి వెళ్లాలని గుర్తించాలి. – టి.మురళీధరన్, టీఎంఐ నెట్వర్క్ చైర్మన్ఏపీలో 4,973, తెలంగాణలో 7,913 మందికి చాన్స్జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న ఈ స్కీమ్‌లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 4,973 మందికి, తెలంగాణలో 7,913 మందికి ఇంటర్న్‌షిప్ ఆఫర్లు వచ్చాయి. మొత్తంగా తమిళనాడుకు చెందినవారికి అత్యధికంగా 14,585 మందికి ఇంటర్న్‌షిప్ ఆఫర్ లభించింది. మహరాష్ట్ర (13,664 ఆఫర్లు), గుజరాత్ (11,690 ఆఫర్లు), కర్ణాటక (10,022 ఆఫర్లు), ఉత్తరప్రదేశ్ (9,027) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 1,27,508 ఆఫర్లు అందుబాటులో ఉన్నట్టు పేర్కొన్న కంపెనీలు.. 82,077 మందిని ఇంటర్న్‌షిప్ కోసం ఎంపిక చేశాయి.రెండో దశకు దరఖాస్తులు షురూ..⇒ పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ రెండో దశ దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలైంది. ఇందులో 1,26,557 అవకాశాలు అందుబాటులో ఉంచారు. వీటిలో ఆంధ్రపదేశ్‌కు 4,715; తెలంగాణకు 5,357 కేటాయించారు. అభ్యర్థులు https://pminternship.mca.gov.in/login/ వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. తమ అర్హతలు, ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకోవాలి.⇒ఈ స్కీమ్‌లో అర్హతల వారీగా అవకాశాల సంఖ్యను సైతం పేర్కొన్నారు. డిగ్రీ పూర్తిచేసిన వారికి 36,901, టెన్త్ చదివిన వారికి 24,696, ఐటీఐ ఉత్తీర్ణులకు 23,269, డిప్లొమా ఉత్తీర్ణులకు 18,589; ఇంటర్మిడియెట్ / 12వ తరగతి ఉత్తీర్ణులకు 15,412 అవకాశాలను అందుబాటులో పెట్టారు. రెండో దశలో అభ్యర్థులకు ఇవి అందుబాటులో ఉంటాయి. -
విద్యుత్ వాహనాల జోరు
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. 2021లో మొత్తం వాహనాల రిజిస్ట్రేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్లు కేవలం 2 శాతం కన్నా తక్కువగానే ఉండగా.. 2024లో 7 శాతానికి పైగా నమోదైందని ఆర్బీఐ విడుదల చేసిన బులెటిన్ వెల్లడించింది. 2024లో మొత్తం వాహనాల రిజిస్ట్రేషన్లలో త్రిపురలో అత్యధికంగా 8.5 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు ఉండగా..ఢిల్లీలో 8.2 శాతం, గోవాలో 7.1 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 2.3 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్టు ఆ బులెటిన్ పేర్కొంది. కేంద్రం ఇన్నోవేషన్ వెహికల్ ప్రోత్సాహం పథకాన్ని గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించడంతో పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెరుగుతోందని బులెటిన్ తెలిపింది. 2024లో అత్యధికంగా కర్ణాటకలో 5,765, మహారాష్ట్రలో 3,728, ఉత్తరప్రదేశ్‌లో 1,989 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటైనట్టు పేర్కొంది. –సాక్షి, అమరావతి -
అపురూపాల మంత్రపురి
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని (Manthani) ప్రాచీన పట్టణం. సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఆ గ్రామంలో ప్రజల ఆహారపు అలవాట్లు, వినియోగించే వస్తువులు.. ఇలా అన్నీ భిన్నంగానే ఉంటాయి. ఉన్నతోద్యోగాలు, ఉపాధి కోసం.. మంత్రపురి (Mantrapuri) వాసులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడిపోయారు. సమాజంలో మార్పులకు ఇక్కడి ప్రజలు కూడా అలవాటు పడిపోతున్నారు. కానీ మంథనిలోని సీతారామ సేవా సదన్ స్వచ్ఛంద సేవా సంస్థ.. ఈ గ్రామస్తులు తరతరాలుగా వినియోగించిన విలువైన పురాతన వస్తు సామగ్రిని భవిష్యత్తరాలకు అందించేందుకు కృషి చేస్తోంది. అందుకోసం మంత్రపురిలోని పురాతన ఇళ్లు, వాటిలోని వస్తుసామగ్రి, వంటలు, వ్యవసాయ.. తదితర అవసరాలకు ఉపయోగించే పురాతన వస్తువులను సేకరించి ప్రదర్శించేందుకు మంత్రపురి దర్శన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో పురాతన వంటసామగ్రి, ధాన్యం నిల్వచేసే గాదెలు, కొలతలు, ప్రమాణాల పరికరాలు, వ్యవసాయ పరికరాలు, ఎండ, వేడి, చలిని తట్టుకునేలా సొనార్చి (మిద్దె), పాలతం.. తదితర సుమారు ఐదు వందల రకాల వస్తువులను ప్రదర్శనగా ఉంచారు. ఇందు కోసం ఓ ఇంటిని ప్రత్యేకంగా నిర్మించారు. ప్రజల సందర్శనార్థం రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ప్రదర్శన శాలను తెరిచి ఉంచుతున్నారు. వివిధ దేశాల్లో స్థిరపడి స్వస్థలానికి వచ్చిన ప్రవాసులు.. ఈ పురాతన వస్తువులను దర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. మంథనితోపాటు చుట్టు పక్కల ప్రాంతాల విద్యార్థులకు ఇందులో అవకాశం కల్పిస్తున్నారు. పురాతన వస్తుసామగ్రి సేకరణకు దాదాపు మూడేళ్లకు పైగా సమయం పట్టిందని, మరో 50 ఏళ్లు ఇవి ఉండేలా ఇంటిని నిర్మించామని సేవా సదన్ (Seva Sadan) వ్యవస్థాపకుడు గట్టు నారాయణ గురూజీ, అధ్యక్షుడు కర్నే హరిబాబు తెలిపారు.ఎన్టీపీసీ, సింగరేణిలో ప్రదర్శన మంత్రపురి దర్శన్‌లోని తాళపత్ర గ్రంథాలతోపాటు ఇతర పురాతన వస్తువులను ఎన్టీపీసీ, సింగరేణి సంస్థ ఉన్నతాధికారులు తీసుకెళ్లి తమ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. ఇలా పలుమార్లు పలు సంస్థలు.. ఇతర ప్రాంతాల వారు వచ్చి ఈ పురాతన వస్తువులను తీసుకెళ్లి తమ కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ తీసుకొచ్చి మంత్రపురి దర్శన్ నిర్వాహకులకు అప్పగిస్తున్నారు.చదవండి: మల్లన్నగుట్టే.. చిన్న శ్రీశైలంనేటితరం కోసం.. భారతీయ ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రకృతిలో లభించే అనేక వస్తువులు కనుమరుగవుతున్నాయి. ఈక్రమంలో నాటి కుటీర, గ్రామీణ వ్యవస్థ, వస్తువులను నేటితరానికి చూపించాలనే ఆకాంక్షతోనే గట్టు నారాయణ గురూజీ ఈ అవకాశం కల్పించారు. విద్యార్థులు, యువత అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. -
మల్లన్నగుట్టే.. చిన్న శ్రీశైలం
రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిధానపల్లి (Nidhanapalle) గ్రామ శివారులోని మల్లన్నగుట్ట (mallanna gutta) చిన్న శ్రీశైలంగా పేరొందింది. గుట్టపై ఉన్న ప్రధాన దేవాలయంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి కొలువై ఉన్నాడు. క్షేత్రం ఎగువభాగంలోని గుహాంతరాళమున మహామునుల తపో స్థలములు, స్వామివారి పుట్టులింగములు ఉండటం మల్లన్నగుట్ట ప్రత్యేకత. మునుల తపస్సు చేత ప్రసిద్ధి చెందిన గుట్టపై కొలువై ఉన్న మల్లికార్జునస్వామి భక్తుల కొంగుబంగారమై కోరిన కోర్కెలు తీరుస్తాడని ప్రజల నమ్మకం. ప్రతీ సంవత్సరం మాఘమాసం బహుళ త్రయోదశి నుంచి పాల్గుణమాసం విదియ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను కనుల పండువగా నిర్వహిస్తారు. గుట్టపై నిద్రిస్తే రోగాలు మాయం మల్లన్నగుట్టపై సువిశాలమైన మైదానం ఉంది. హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. పరిసర గ్రామాల ప్రజలు వివిధ పర్వదినములలో స్వామివారి దర్శనం కోసం పరితపిస్తుంటారు. నూతన కార్యక్రమాలను గుట్టపై గల దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రారంభిస్తారు. ఎంతటి క్లిష్టమైన ఆపదల నుంచైనా భగవంతుడు తమను రక్షిస్తాడని భక్తుల ప్రగాఢమైన నమ్మకం. గుట్టపై నిద్రచేస్తే ఆయురారోగ్యములు, భోగ భాగ్యాలు పొందుతామని ప్రజలు విశ్వసిస్తారు. కోనేరు నీటితో సకల శుభాలు గుట్టపైకి వెళ్లేమార్గంలో సహజ సిద్ధమైన కోనేరు ఉంది. కోనేటిలో ఏడాది పొడవునా నీరు ఉంటుంది. కోనేటి నీటిని ప్రజలు పరమ పవిత్రంగా భావిస్తారు. కోనేటిలోని నీటిని తీసుకెళ్లి పంటలపై చల్లితే చీడపీడలు తొలగి పంటలు సమృద్ధిగా పండుతాయని, పశువులపై చల్లితే పుష్కలంగా పాలు ఇస్తాయని, రోగాలు మాయమవుతాయని ప్రజల విశ్వాసం. మెరుగైన రోడ్డు సౌకర్యం నిధానపల్లి మల్లన్నగుట్ట(చిన్న శ్రీశైలం) చిట్యాల– భువనగిరి రోడ్డుకు సమీపంలో ఉంటుంది. గుట్టపైకి వాహనాలు వెళ్లడానికి ఘాట్‌రోడ్డు ఉంది. వాహనాల పార్కింగ్‌కు విశాలమైన మైదానం ఉంది. గత ఏడాది మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన సొంత డబ్బులతో ప్రధాన దేవాలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేయడానికి బండరాళ్లను తొలగింపజేశారు. (Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?) ఈ ఏడాది జరిగే బ్రహ్మోత్సవాల వివరాలు ఈనెల 26న గణపతి పూజ, స్వస్తివాచనము, అంకురార్పణ, బ్రహ్మకలశ స్థాపనలు, ధ్వజారోహణం, ఉత్సవాల విగ్రహాలు గుట్టపైకి వేం చేయుట 27న స్వామివారి ఆర్జిత సేవలు, ప్రభోత్సవం, షావలు, రాత్రి కల్యాణ మహోత్సవం 28న రుద్ర చండీహవనం, అన్న ప్రసాద వితరణ, వీరభద్రేశ్వరస్వామి పూజ, ఖడ్గాలు, ప్రభల ఊరేగింపు, భద్రకాళి అమ్మవారి పూజ తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవం 29న గెలుపు, మహదాశీర్వచనములు ఉంటాయి.చదవండి: కనువిందు.. ఇందూరు చిందు అత్యంత మహిమాన్వితుడు మల్లన్నగుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి పట్ల పరిసర ప్రాంత ప్రజలకు అపారమైన నమ్మకం. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారు అత్యంత మహిమాన్వితుడు. బాధల నుంచి విముక్తి కలిగించే దైవమని భక్తుల నమ్మకం. ఏటా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. –బేతోజు సత్యనారాయణశాస్త్రి, ప్రధానార్చకుడు చదవండి: Mahashivratri 2025: శివరాత్రికి ఉపవాసం, ఇంట్రస్టింగ్ టిప్స్