
రాజకీయ నాయకుల ప్రధాన విధి.. ప్రజలకు సేవ చేయడం. ఆ బాధ్యత సక్రమంగా నిర్వహించాలంటే.. వాళ్లూ ఆరోగ్యంగా ఉండాల్సిందే. అప్పుడే పరిపూర్ణంగా.. విరామం ఎరగకుండా తమ కర్తవ్యాలను నిర్వర్తించగలుగుతారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం(World Health Day) సందర్భంగా.. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ముఖ్య కారణాలు.. ఇంతకీ వీళ్ల ఆరోగ్యం దేశానికి ఎలా మహాభాగ్యమో ఓసారి పరిశీలిద్దాం..
బిజీ షెడ్యూల్: నాయకులు రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి శ్రమిస్తుంటారు. అలాగని.. ఆరోగ్యంగా ఉంటేనే వారు దీర్ఘకాలం సేవ చేయగలుగుతారు.
నిరంతర ప్రయాణాలు: స్థల మార్పులు, వేళకి తగినపుడు ఆహారం పొందకపోవడం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. సరైన జీవనశైలి పాటించడం(టైం టు టైం తినడం లాంటివి..) ద్వారా దీన్ని నివారించగలుగుతారు.
ఇమ్యూనిటీ బూస్ట్: రాజకీయ నేతలు ఎడతెరిపిలేని పర్యటనల్లో పాల్గొంటారని చెప్పుకున్నాం కదా. ఈ క్రమంలో రకరకాల వ్యాధుల బారిన పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి మంచి ఆహారం.. ఆరోగ్యపు అలవాట్లు పాటిస్తే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
మానసిక ఒత్తిడి: ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక నిర్ణయాలు తీసుకోవడం అంటే.. తీవ్ర ఒత్తిడికి గురైనట్లే. ధ్యానం, యోగా ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ప్రధాన ఆరోగ్య సమస్యలు
గుండె సంబంధిత వ్యాధులు: అధిక ఒత్తిడి కారణంగా గుండెపోటు సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి.
మధుమేహం : భోజన అలవాట్ల వల్ల మధుమేహం రిస్క్ పెరుగుతుంది.
హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు): చురుకైన రాజకీయ జీవితం వల్ల అధిక రక్తపోటుకి గురవుతారు.
నిద్రలేమి: నిత్యం మీటింగులు, ప్రణాళికలు కారణంగా తగిన నిద్ర పొందలేక సమస్యలు ఉత్పన్నమవుతాయి.
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు..
ఆహార నియంత్రణ : అధిక పిండి పదార్థాలు, కొవ్వు తగ్గించి.. శరీరానికి అవసరమైన పోషకాలు తీసుకోవడం.
నియమిత వ్యాయామం : రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం, యోగా చేయడం.
ఆరోగ్య పరీక్షలు: ప్రతి ఆరునెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్ష చేయించుకోవడం.
నిద్ర-విశ్రాంతి: రోజుకు 7-8 గంటల నిద్ర పోవడం.. వీలు చిక్కినప్పుడు విశ్రాంతి తీసుకోవడం. మరీ వీలైతే కుటుంబ సభ్యులతో సమయం గడపడం.
ఒత్తిడి నిర్వహణ : ధ్యానం, యోగా, స్మార్ట్ డిజిటల్ డిటాక్స్(స్మార్ట్ ఫోన్లకు కొంతకాలం దూరంగా ఉండడం) వల్ల ఒత్తిడి తగ్గుతాయి.
నేతలు తమ ఆరోగ్యం కాపాడుకోవడం.. వాళ్ల సామాజిక బాధ్యత. ఆరోగ్యమున్న నాయకులే సమర్థవంతంగా దేశానికి సేవ చేయగలరు. అదే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే.. అది ప్రభుత్వ విధానాల మీద ప్రతికూల ప్రభావం చూపించగలదు. ఆరోగ్యం మంచిగా ఉంటేనే ప్రజలకు శ్రద్ధగా సేవ చేయగలరు. ఆరోగ్యమే నిజమైన సంపద.. ఈ సందేశాన్ని ఈ World Health Day 2025 సందర్భంగా ప్రతీ నాయకుడు గుర్తించాలి!.