politician
-
మనసారా మాట్లాడండయ్యా!
కవితాత్మక ప్రసంగాలతో మంత్రముగ్దుల్ని చేసే చాతుర్యం వాజ్‌పేయికి వెన్నతో పెట్టిన విద్య. తేలికైన పదాలతో బరువైన భావాలను వెల్లడించే మాటలకు ఆయన పెట్టింది పేరు. సాహితీ రంగంలోనూ అటల్ తనదైన ముద్ర వేశారు. హిందూ పురాణాల సారాన్ని నింపుకున్న ఆయన వాక్యాలకు పార్లమెంటులో పార్టీలకు అతీతంగా సభ్యులంతా సలామ్ కొట్టేవారు. ఆయన రాజకీయ ప్రసంగాలు కూడా సాహితీ సౌరభాలు వెదజల్లేవి. తాను అధికారంలో ఉండగా విపక్షాలు చేసే విమర్శలకు హుందాగా, చమత్కారంగా బదులిచ్చేవారు. ‘మనసారా మాట్లాడండయ్యా’ అంటూ తోటివారిని ప్రోత్సహించేవారు.చిరస్మరణీయ ప్రసంగం ప్రజాస్వామ్యంపై వాజ్‌పేయికి ఉన్న అపార నమ్మకం ఆయన దార్శనికతలో తొణికిసలాడేది. తన తొలి ప్రభుత్వం 13 రోజులకే కూలిన సందర్భంలో 1996 మే 27న ఆయన పార్లమెంట్లో చేసిన ప్రసంగం మరపురానిది! దాన్ని నాటి పార్లమెంట్ సభ్యులు, రాజకీయ నేతలు నేటికీ గుర్తు చేసుకుంటారు. ఎమర్జెన్సీ వేళ జైలు జీవితం గడుపుతూ రాసిన కవితలతో ‘ఖైదీ కవి కుండలీ’ అనే కవితా సంకలనం రచించారు. ‘అమరత్వం అగ్ని లాంటిది’, ‘నా 51 కవితలు’ వంటి పలు సంకలనాలు వెలువరించారు. ‘కవిత్వం రాసుకునేంత సమయాన్ని కూడా రాజకీయాలు మిగల్చలేదు. నా కవితా వర్షపుధార రాజకీయ ఎడారిలో ఇంకిపోయింది’ అని ఓసారి వాపోయారు. ధోతీ, కుర్తాలో నిండుగా కనిపించే అటల్ ఖాళీ సమయాల్లో కవితలు రాస్తూ సాహిత్యంతో దోస్తీ చేసేవారు. అవుంటేనే కవిత వాజ్‌పేయి సరదా మనిషి. ‘‘కవిత్వం రాయాలంటే అనువైన వాతావరణముండాలి. మనసు లగ్నం చేయగలగాలి. మనల్ని ఆవిష్కరించుకునే సమయం చిక్కాలి. ఈ రణగొణ ధ్వనుల మధ్య అవెలా సాధ్యం?’’ అన్నారోసారి. కొంతమేర సాహిత్య కృషి చేసినా పెద్దగా రాణించలేదంటూ తెగ బాధపడేవారట. ‘‘కవిత్వంలో నేను చేసింది సున్నా. అసలు రాజకీయాల గడప తొక్కక పోయుంటే హాయిగా కవితలు రాసుకుంటూ, కవి సమ్మేళనాల్లో పాల్గొంటూ ముషాయిరాల్లో మునిగి తేలుతూ గడిపేవాడిని’’ అంటూ తరచూ అంతర్మథనానికి లోనయ్యేవారు. -
ఫిరాయింపుల చట్టంలో లొసుగులు..
-
నటుడు విజయ్ ‘పొలిటికల్ పార్టీ’ జెండా ఆవిష్కరణ (ఫొటోలు)
-
USA: నాడు ఈ ముగ్గురు నేతలపైనా కాల్పులు
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవికి గాయమయ్యింది. గతంలోనూ అమెరికాకు చెందిన ముగ్గురు ప్రముఖ రాజకీయ నేతలపై వివిధ సమయాల్లో కాల్పులు జరిగాయి.జార్జ్ వాలెస్అలబామా గవర్నర్ జార్జ్ వాలెస్‌పై 1972, మే 15 కాల్పులు జరిగాయి. ఆర్థర్ బ్రెమెర్ అనే 21 ఏళ్ల కుర్రాడు నాటి అధ్యక్ష అభ్యర్థి, అలబామా గవర్నర్ జార్జ్ వాలెస్‌పై కాల్పులు జరిపాడు. మేరీల్యాండ్ షాపింగ్ సెంటర్లో జార్జ్ వాలెస్ ప్రచారం చేస్తుండగా, అతనిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో వాలెస్ ప్రాణాలతో బయటపడినప్పటికీ, జీవితాంతం పక్షవాతంతో బాధపడ్డారు.రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ1968, మార్చి 16న రాబర్ట్ కెన్నెడీ డెమోక్రటిక్ అమెరికా అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఆయన తన ఉత్సాహపూరిత ప్రచారంతో ప్రజలను అమితంగా ఆకట్టకున్నారు. దీంతో ఆయనపై అమెరికన్ ప్రజలకు నమ్మకం ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే 1968 జూన్ 5న కాలిఫోర్నియాలోని అంబాసిడర్ హోటల్లో రాబర్ట్ ఎఫ్ కెన్నెడీపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆయన మృతి చెందారు.రోనాల్డ్ రీగన్ 1981, మార్చి 30న నాటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌పై జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రీగన్ గాయపడ్డారు. వాషింగ్టన్ హిల్టన్‌లో బస చేసిన తర్వాత రీగన్ తన లిమోసిన్ ప్రాంతానికి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది. -
బ్రిటన్ రాజకీయాలు నేర్పుతున్న పాఠాలు
దాదాపు ఒక దశాబ్దకాలంగా మనం బలహీనమైన ఆర్థిక వ్యవస్థ, విశ్వసనీయత లేని రాజకీయ నాయకులు, నాణ్యమైనవి కాని మౌలిక సదుపాయాలు, క్రమంగా క్షీణిస్తున్న పాలనా ప్రతిష్ఠ... వంటివాటిని మాత్రమే బ్రిటన్ గురించి చూడడానికి అలవాటు పడుతూ వచ్చాము. అది మన తప్పు కాదు. కానీ ఇప్పుడు బ్రిటన్ను భిన్నంగా చూసే అవకాశం వచ్చింది. అలాగే ఇండియాలో మనం కూడా ఈసారి కొన్ని అమూల్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. యునైటెడ్ కింగ్డమ్ బహుశా ప్రపంచంలోనే అత్యంత బహుళ సాంస్కృతిక సమాజం. భారత సంతతికి చెందిన వ్యక్తి ఆ దేశానికి ప్రధానిగా పని చేశారు. ఇంకా అనేకమంది నల్లజాతీయులు లేదా ఆసియాకు చెందినవారు చాన్స్లర్లుగా, విదేశీ కార్యదర్శులుగా, హోమ్ శాఖ కార్యదర్శులుగా; స్కాట్లాండ్, వేల్స్, లండన్ల అధినేతలుగా ఉన్నారు. మిగతా ఏ దేశమూ ఇంతగా అపూర్వమైన స్థాయిలో వైవిధ్యాన్ని కలిగి ఉంటుందని నేను అనుకోను. గత సభలోని 10 శాతంతో పోల్చి చూస్తే ఇటీవల హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎంపికైన ఎంపీలలో 13 శాతం మంది నల్లజాతీయులు / ఆసియన్లు లేదా మైనారిటీ జాతుల మూలవాసులే. వీరిలో 29 మంది భారత సంతతి వారు కాగా, 15 మంది పాకిస్తాన్‌కు చెందినవారు. 12 మంది సిక్కులు. అయితే బ్రిటన్ జనాభాలో ఆసియన్లు 8 శాతం మాత్రమే కాగా, నల్లజాతీయులు 4 శాతం, భారత సంతతివారు 3.1 శాతం, పాక్‌కి చెందినవారు 2.7 శాతం మాత్రమే. హౌస్ ఆఫ్ కామన్స్‌తో పోల్చి చూసినప్పుడు.. భారతదేశ జనాభాలో దాదాపు 15 శాతంగా ఉన్న ముస్లింలు దామాషా ప్రకారం మన లోక్‌సభలో 74 మంది ఉండాలి. కానీ ఉన్నది 24 మందే. 2019లో వారి సంఖ్య 26. ఆ ముందు 2014లో 23. దేశంలోని 28 రాష్ట్రాల్లో మనకు ఒక్క ముస్లిం ముఖ్యమంత్రి కూడా లేరు. 15 రాష్ట్రాలలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేరు. 10 రాష్ట్రాలలో ఒక ముస్లిం ఉన్నారు కానీ, ఆ ఒక్కరూ ఉన్నది అల్పసంఖ్యాక వ్యవహారాలకు ఇన్ఛార్జిగా మాత్రమే!ఇంకా చెప్పాలంటే, అధికార బీజేపీ పార్టీకి లోక్‌సభలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేరు. 20 శాతం ముస్లింలు ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో ఆ పార్టీకి శాసన సభలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు. 2017లో కూడా అంతే. గుజరాత్లో బీజేపీ 1998 నుండి లోక్‌సభ ఎన్నికల్లో గానీ, విధాన సభ ఎన్నికల్లో కానీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. రాష్ట్రంలో 9 శాతం మంది ముస్లింలే అయినప్పటికీ ఒక పావు శతాబ్దం నుంచీ ఆ పార్టీ ముస్లిములతో ఉద్దేశపూర్వకమైన దూరాన్ని పాటిస్తోంది. మనం నేర్చుకోవలసిన చాలా భిన్నమైన రెండో పాఠం కూడా ఉంది. మీరు మీ పార్టీని ఎన్నడూ లేనంతగా ఘోర పరాజయం వైపు నడిపించినప్పుడు మీ స్పందన ఎలా ఉండాలన్నది. బ్రిటన్‌లో అయితే రిషీ సునాక్ రాజీనామా చేశారు. 12 గంటలు గడవక ముందే ఆయన అలా చేశారు. నిజానికి ఫలితాలింకా పూర్తిగా వెల్లడవక ముందే కన్జర్వేటర్లు తాము తిరిగి అధికారంలోకి రావాలంటే తామెలాంటి పార్టీగా ఉండాలన్న దానిపై బహిరంగంగా చర్చించటం ప్రారంభించారు. రానున్న వారాల్లో, నెలల్లో ఆ చర్చ మరింత తీవ్రతరం అవుతుంది. మొత్తం దేశం అందులో పాల్గొంటుంది. మీడియా ప్రశ్నిస్తుంది. రెచ్చగొడుతుంది. ఎంపీలు తగాదా పడతారు. వాదోపవాదాలు జరుగుతాయి. ఆశావహులు ముందుకు వస్తారు. వెనక్కు తగ్గుతారు. అనేకమంది వ్యక్తిగత ప్రతిష్ఠలు దెబ్బతింటాయి. పార్టీకి అది ఇబ్బందికరమైన పరిస్థితిగా పరిణమిస్తుంది. అయితే చివరికి ఒక కొత్త పార్టీ ఆవిర్భవిస్తుంది. ఇప్పుడొకసారి, 2014లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో కుప్పకూలి పోయాక ఏం జరిగిందో చూద్దాం. ఎవరూ రాజీనామా చేయలేదు. పార్టీ తన భవిష్యత్తు గురించి చర్చించలేదు. సోనియా గాంధీ మరో మూడు సంవత్సరాలు అధ్యక్షురాలిగా కొనసాగి, చివరికి తన కుమారుడికి మార్గం ఏర్పరిచారు. గాంధీల కుటుంబానికి వెలుపలి వ్యక్తిని అధ్యక్షుడిని చేసే ఎన్నిక 2022 వరకు జరగలేదు. అప్పుడు కూడా శశిథరూర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. పదేళ్ల తర్వాత ఈ రోజుకు కూడా ఆ పార్టీ గాంధీల గట్టి నియంత్రణలోనే ఉంది. మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడే కావచ్చు, కానీ రాహులే కీలకమైన వ్యక్తి. సోనియా గాంధీ వార్ధక్యంలో ఉన్నా, అస్వస్థతతో ఉంటున్నా, పార్లమెంటులో మాట్లాడేందుకు అనాసక్తతను కనబరుస్తున్నా కూడా సోనియానే పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. మూడో పాఠం కూడా ఉంది కానీ నేను దానిని క్లుప్తంగా మాత్రమే ప్రస్తావిస్తాను. సునాక్ రాజీనామా చేసేందుకు ప్రధాని అధికారిక వాహనంలో బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లారు. రాజీనామా అనంతరం ప్రైవేటు వాహనంలో ప్యాలెస్ పక్క ద్వారం నుండి బయటికి నిష్క్రమించారు. ఒక గంట తర్వాత కొత్తగా ఎన్నికైన ప్రధాని స్టార్మర్ ప్రతిపక్ష నాయకుడి కారులో అక్కడికి వచ్చారు. ప్రధాన మంత్రిగా తన నియామకం జరిగాక ప్రధాని అధికారిక వాహనం లిమజీన్ కారులో 10, డౌనింగ్ స్ట్రీట్‌కు వెళ్లారు. ఆయన అక్కడికి చేరుకునే సమయానికి సునాక్ కుటుంబానికి చెందిన వస్తువుల్ని ప్యాక్ చేసి, తరలించారు. 10 డౌనింగ్ స్ట్రీట్ కొత్త ప్రభుత్వాధినేతకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. ఇదంతా కూడా ఫలితాలు స్పష్టమైన కొద్ది గంటల్లోనే జరిగింది. వైభవోపేతమైన ప్రమాణ స్వీకారోత్సవం కోసం రాజ్యాంగ ప్రక్రియకు వాళ్లేమీ ఐదు రోజుల విరామం ఏమీ ఇవ్వలేదు. ఎన్నికలు ముగియటంతోనే పాలన ప్రారంభమై పోయింది. ప్రపంచంలోని కొత్త ప్రధానులందరూ వెంటనే పని మొదలు పెడతామని చెప్పినా, వాస్తవానికి బ్రిటన్ మాత్రమే ఆ పని చేయగలిగింది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
రాజకీయ చాతుర్యంలో.. ఆయనకు సాటి లేరు!
దేశ గమనాన్ని మలుపుతిప్పినవారు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు. నాటకీయ పరిణామాల మధ్య ప్రధాని పీఠాన్ని అధిష్టించి మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడపడం ఆయన పాలనాదక్షతకు ప్రతీక. అసలు ఆయన ప్రధాని కాకపోతే నేటి సరళీకరణ ఫలాలు మనకు కనిపించేవి కావేమో? దశ (అదృష్టం), దిశ (గమ్యం) రెండూ కొందరి జీవితాల్లో అనూహ్యంగా ట్విస్ట్ అవుతుంటాయి.దేశ రాజధానిలో మూడు దశాబ్దాల రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పి, వానప్రస్థం స్వీకరించాలనుకున్న సీనియర్ కాంగ్రెస్ నేత పాములపర్తి వెంకట నరసింహారావు విషయంలో ఇదే జరిగింది. 1991 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా డిల్లీ నుండి పెట్టే బేడాసర్దుకుని ఇంటిదారి పట్టేపనిలో ఉన్నారు. శ్రీ సిద్దేశ్వరి మఠం (తమిళనాడు)లో శేష జీవితం గడపటానికి వెళ్ళబోతున్నానని తన సన్నిహితులకు చెప్పారు.ఈ తరుణంలోనే 1991 మే 21 రాత్రి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మృత్యువాత పడటంతో, దేశ రాజకీయ పరిస్థితి ఒక్క ఉదుటున తారు మారయింది. ఇంకో విడత ఎన్నికలు జరగాల్సి ఉంది; పార్టీ అధ్యక్షుని హఠాన్మరణంతో అగాథంలో పడిన కాంగ్రెస్ నాయకులు మరుసటి రోజు మధ్యాహ్నం వర్కింగ్ కమిటీ మీటింగు ఏర్పాటు చేసి, అధ్యక్షుని స్థానంలో సీనియర్ నేత పీవీ నర్సింహారావును నియమించారు.కేవలం అరగంట పాటు జరిగిన ఆ సమావేశంలో వర్కింగ్ కమిటీ సభ్యులు, పార్టీ అధ్యక్షుని మరణ రీత్యా సంతాప తీర్మానం చేసి, తర్వాత తాత్కాలిక పార్టీ అధ్యక్షునిగా పీవీని నియమించారు. భర్తను కోల్పోయిన విషాదంలో, సోనియా గాంధీ పార్టీ కార్య కలాపాలకు దూరంగా ఉండాలనుకుంది. జూన్‌లో వెలువడిన 10వ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 232 సీట్లు సంపాదించి, అతి పెద్ద పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.గాంధీ కుటుంబీకులు రేసులో లేకపోవటంతో... అర్జున్ సింగ్, మాధవ్ రావ్ సింధియా, రాజేష్ పైలట్, శరద్ పవార్ లాంటి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత పదవికి బరిలోకి దిగినప్పటికీ ఎన్నికైన అత్యధిక ఎంపీలు, గాంధీ కుటుంబానికి విధేయత, అనుభవం ఉన్న పీవీ వైపే మొగ్గు చూపారు. ‘పార్లమెంటు పార్టీ నేత ప్రధాని పీఠానికి అర్హుడు కాబట్టి, ఈ పదవికి పార్టీ ఎంపీలు తమలోని నాయకుణ్ణి డెమాక్రటిక్ పద్ధతిలోనే ఎన్నుకోవాలని’ పాచిక విసిరారు శరద్ చంద్ర పవార్. రాజకీయ చదరంగం ఆటలో అప్పటికే ఆయన పేరొందిన ఆటగాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఆయన అనునాయిడూ, పూణె ఎంపీ అయిన సురేష్ కల్మాడి (ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ స్క్వాడ్రన్ లీడర్) మహారాష్ట్ర సదన్ నుండి, ఉత్తరాది కాంగ్రెస్ ఎంపీలను పవార్ లాబీ కోసం సమీకరణ చేస్తూ షాం–ఏ–దావతులు ఏర్పాటు చేశారు. ఇటు కేరళ హౌస్ నుండి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. కరుణాకరన్, పీవీ కోసం దక్షిణాది కాంగ్రెస్ ఎంపీలను ఏకతాటిపై తేవటానికి ప్రయత్నాలు జరిపారు. అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జూన్ 19 నాడు కాంగ్రెస్ నేతలతో కిక్కిరిసింది. 232 మంది నూతన ఎంపీలను పార్లమెంటరీ పార్టీ నాయకుణ్ణి ఎన్నుకోమని ఒకవేళ ఓటింగ్ నిర్వహిస్తే పవార్ 35 ఓట్లతో వెనుకంజలో ఉంటాడని తెలిసిపోయింది. వీరిని తన వైపు మరల్చుకోవటానికి ఆయనకు ఇట్టే సమయం పట్టదని గ్రహించిన పీవీ, పోటీకి దిగిన శరద్ పవార్‌ను ఆఖరి ప్రయత్నంగా, ఒక వైపు తీసుకెళ్లాడు.ఏకాంతంలో పవార్‌తో, ఈ మధ్యనే తన గుండెకు శస్త్ర చికిత్స జరిగిందనీ, వయోభారంతో రాజకీయ విధులు నిర్వర్తించటం ఎక్కువ కాలం సాధ్యపడక పోవచ్చని చెబుతూ... మరాఠీలో, ‘మీ హీ జబాబ్దారీ మాఝ్య ఖాంధ్యా వర్ కితీ దివస్ పేల్వూ (నేను ఈ భాధ్యత నా భుజాలపై వేసుకుని ఎన్ని రోజులని మోయగలను) అంటూ, ‘కొన్ని రోజులపాటు తనకు ప్రధానిగా అవకాశం ఇవ్వవలసిందిగా’ నవ్వుతూ కోరాడు పీవీ. పీవీ తాత్విక ధోరణితో మాట్లాడిన మాటలకు చలించి పోయారు పవార్ సాహెబ్.మరుసటి రోజు ఉదయం (జూన్ 20) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. హాజరైన ఎంపీలు అంతా హాలులోకి ప్రవేశించిన శరద్ పవార్ వైపే సస్పెన్స్‌తో చూస్తున్నారు. మీటింగు ఆరంభం కావటంతోనే పవార్, జేబులోనుండి తను రాసిన ఒక లెటర్ తీసి సభ్యుల ముందుంచారు. ‘పార్టీ నాయకత్వాన్ని నిర్ణయించడంలో సీపీపీని సమావేశ పరచాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్ అధ్యక్షులు (పీవీ) అంగీకరించడాన్ని నేను స్వాగతిస్తున్నాను. సీపీపీ సభ్యులందరూ శ్రీ పీవీ నరసింహారావుకు మద్దతు ఇవ్వాలనీ, ఈ విషయంలో ఏకగ్రీవ నిర్ణయానికి రావాలనీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని అందులో కోరారు.అంతే, మరునాడు (1991 జూన్ 21) రాష్ట్రపతి భవన్లో పీవీ నరసింహారావు తొమ్మిదవ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తను ప్రధాని అయ్యాక, శరద్ పవార్‌ను పార్టీ జాతీయ అధ్యక్షునిగా నియమిస్తానని రావు ప్రామిస్ చేసినట్టు అంటారు. కాని, ఏప్రిల్ 1992 ఏప్రిల్‌లో జరిగిన తిరుపతి కాంగ్రెస్ పార్టీ సదస్సులో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని తన అనుకూల సభ్యులతో పునర్వ్యవస్థీకరించి, అధ్యక్షునిగా పార్టీ పగ్గాలు సైతం నాటకీయంగా కైవసం చేసుకున్నారు అపర చాణక్యుడు పీవీ నరసింహారావు. (శరద్ పవార్ రాజకీయ ఆత్మకథ ‘లోక్ మాఝే సాంగతి’, రషీద్ కిద్వాయి రాసిన ‘24 అక్బర్ రోడ్’ ఆధారంగా) వ్యాసకర్త విశ్రాంత పీఎఫ్ కమిషనర్ 9819096949.సందర్భం: - జిల్లా గోవర్ధన్ -
ఈ ఆలయాల్లో దేవుళ్లుగా రాజకీయ నాయకులు..!
భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం. ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలకు పేరుగాంచింది. వేదభూమి, కర్మభూమిగా పేరుగాంచిన ఈ భారతావనిలో రాజకీయనేతలను దేవుళ్లుగా భావించి పూజించిన ప్రజలు కూడా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో తమ అభిమాన నేతకు గుడికట్టించి మరీ భక్తిగా కొలుచుకుంటున్నారు. కొందరూ అనుచరులు, కార్యకర్తల్లో వారి అభిమాన నాయకుడిపై విపరీతమైన అభిమానం ఇలా భక్తిగా మారి దేవాలయాలకు నిర్మించి కొలుచుకునే వరకు వెళ్లిపోయింది. ఆ ఆలయాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? అంతటి అభిమానాన్ని పొందిన నాయకులెవరూ తదతరాల గురించి సవివరంగా చూద్దామా..!సోనియా గాంధీ తెలంగాణలోని కరీంనగర్లో భారత జాతీయ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కోసం ఆమె మద్దతుదారులు దేవాలయం నిర్మించి మరీ దేవతగా కొలుచుకుంటున్నారు. వారి ప్రాంతానికి, దేశానికి చేసిన కృషి కారణంగా ఆమెను దేవతలాం చూస్తారు వాళ్లంతా. అంతేగాదు ఈ ఆలయంలో ఆమెకు పూజలు చేసి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు ప్రజలు. స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు ఆమె పట్ల కృతజ్ఞతతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆమె నాయకత్వంలో తమ ప్రాంతానికి గణనీయమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలు వచ్చాయని అక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం. నరేంద్ర మోదీ..ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి పెద్ద సంఖ్యలో అనుచరలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో ఆయన గౌరవార్థం దేవాలయాలను నిర్మించారు మోదీ అభిమానులు . ఉత్తరప్రదేశ్‌లో మోదీ విధానాలు, నాయకత్వం పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకునేలా ఒక మద్దతుదారుడు ఆయన కోసం గుడి కట్టాడు. ఆ ఆలయంలో మోదీ విగ్రహం ఉంటుంది. ఇక్కడ ప్రజలు మోదీ విగ్రహానికి పూజలు చేయడమే గాక ఆయన మార్గదర్శకత్వంలోనే పయనిస్తుంటారు కూడా. ఇక మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా మోదీకి మరో ఆలయం ఉంది. ఇక్కడ ఆయన ప్రధానిగా భాద్యతలు చేపట్టిన రోజుని ఘనంగా జరుపుకుంటారు. ఈ ఆలయాన్ని ఆయన నాయకత్వంలో జరిగిన అభివృద్ధికి ప్రతీకగా నిర్మించారు. ఆయనను పూజించటం తమ అదృష్టంగా భావిస్తామని, ఆయన తమకు స్ఫూర్తి అని అక్కడి ప్రజలు చెబుతున్నారు. మాయవతి..బహుజన్ సమాజ్‌వాద్ పార్టీ(బీఎస్పీ) అధినేత మాయవతికి బుందేల్‌ఖండ్, నాట్పురా గ్రామాల్లో ఆలయాలు ఉన్నాయి. ఆమె నాయకత్వంలో గణనీయమైన సామజిక మార్పు జరిగిందిని, అణగారిని వర్గాల కోసం ఎంగానో కృషి చేసినందుకుగానూ ఆమె మద్దతుదారులు, దళితలు ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో మాయవతి సంప్రదాయ దుస్తుల్లో ఉన్న విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఆమె పుట్టిన రోజులు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు ప్రజలు. అలాగే నాట్పురా గ్రామంలో మాయవతికి గుడి కట్టించారు. కుల వివకక్షకు వ్యతిరేకంగా సామాజిక సమానత్వం కోసం ఆమె చేసిన కృషికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారు అభిమానులు. అక్కడి ప్రజలకు ఆమెను పూజించడం వల్ల తమకు మానసిక ధైర్యం వస్తుందని, ఇది తమకు సామాజిక సవాళ్లను అధిగమించగల ఉపయోగపడుతుందని చెబుతున్నారు.మహాత్మా గాంధీజాతిపితా మహాత్మాగాంధీని భారతదేశం అంతటా గౌరవిస్తారు. కానీ ఒడిశాలోని సంబల్పూర్లో ఆయనకు ఆలయం నిర్మించి మరీ పూజలు చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఇక్కడ ప్రజలు ఆయనను పూజింటమే గాక, ఆయన చెప్పిన అహింస, సత్యం, స్వావలంబన వంటి వాటిని పాటిస్తారు కూడా. ఈ ప్రాంతం గాంధేయ తత్వాన్ని వ్యాప్తి చేసే కేంద్రంగా పనిచేస్తుంది. సందర్శకులు ఈ ఆలయంలో ఉన్న గాంధీని ఒక సాధువుగా చూస్తారు. ఆయన బోధనలు నేటికి అక్కడ వినిపిస్తుంటాయి. ఆ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది సమాజంలో శాంతి, సామరస్యాన్నిపెంపొందించే సామాజిక, విద్యా కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది.రాజీవ్ గాంధీ..ఆయన దేశాన్ని ఆధునికరించడానికి చేసిన కృషికి గుర్తుగా బిహార్‌లోని రాజీవ్ మద్దతుదారులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రజలు నివాళులు అర్పించడమే గాక ప్రగతిశీల భారతదేశం కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుని, ప్రేరణ పొందుతామని చెన్నారు. భారత్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెలీ కమ్యూనికేషన్స్ విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుంది. బిహార్‌లోని ప్రజలు ఈ ఆలయాన్ని దర్శించి వారి జ్ఞాపకాలను నెమరువేసుకోవడమే గాక రాజీవ్ సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటుంటారు. ఆయన నాయకత్వంలో తీసుకొచ్చిన విధానాలు గ్లోబల్ ఐటీ పవర్‌హౌస్‌గా మార్చడంలో సహాయపడ్డాయని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. ఎంజీఆర్ప్రముఖ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌కి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆయన జ్ఞాపకార్థం పలు ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలను చూస్తే.. ప్రజలతో ఆయనకు గల అవినాభావ సంబంధం తెలియజేస్తాయి. ముఖ్యంగా చెన్నైలోని ఆలయం మరింత పేరుగాంచింది. ఇక్కడ ఎంజీఆర్ జీవిత పరిణామక్రమానికి సంబంధించిన విషయాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. ఎంజీఆర్ స్ఫూర్తి.. తమకు మార్గనిర్దేశం చేసి కాపాడుతుందని ఆయన అనుచరుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయాల్లో ఆయన జయంతి, వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అంతేగాదు ప్రజలు తమ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఆయన ఆశీర్వాదాలు పొందాలని ఇక్కడకు తరుచుగా వస్తుంటారు కూడా.(చదవండి: ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?) -
ఎన్నికల పోరులో ఇదేం భాష?
ఈ సృష్టిలో మాట్లాడగలిగే మహ ద్భాగ్యం మనిషికే ఉంది. ఆ మాటను సవ్యంగా ఉపయోగిస్తే మాటే మంత్రమై గొప్ప గొప్ప పనులు నెరవేరుస్తుంది. లేదంటే ఆ మాటే కార్చిచ్చు అవుతుంది. నేటి ఎన్నికల సమరాంగణంలో భాషా ప్రయోగం ఎలా ఉంది? దాని పాత్ర ఏంటో చూద్దాం.భాష అంటే మనసులో ఉన్న భావాన్ని మాటల రూపంలో వ్యక్తం చేసే సాధనం. ప్రస్తుత ఎన్నికల వ్యవ హారం చూస్తుంటే అమ్మ భాషకు తూట్లు పొడుస్తున్నట్లుంది. ఎన్నికల్లో పోటీచేసే ప్రతీపార్టీ ప్రతినిధులూ ఓటరు వద్దకు వెళ్లి, ఓటు కోసం అభ్యర్థించడం సర్వసాధారణమైన అంశం. అభ్యర్థించడం అంటేనే ఒక విన్నపం. విన్నపం అంటేనే వినయంగా అడిగేది. కానీ పార్టీ ప్రచార సభల్లో నాయకులు తమ తమ విద్యాస్థాయులు, హోదాలు మరచి వ్యక్తిగత దూషణలకు పాల్పడటం శోచనీయం.నేటి ఎన్నికల ప్రచార సభల్లో కొన్ని రాజకీయ పార్టీల నాయకులు వారి అజెండా ఏమిటి? అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన అందిస్తారు? వారి భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి? అనే అంశాలను పూర్తిగా పక్కన పెట్టేసి, ఇతర పార్టీ నాయకులను దుయ్యబట్టడమే అజెండాగా కనిపిస్తోంది. ‘నీ తోలు తీస్తా, నీ పళ్లు రాలగొడతా, చెప్పుతో కొడతా, చిప్పకూడు తినిపిస్తా...’ వంటి అప్రజాస్వామిక భాషను వాడడం ఎంతవరకు సబబు? కొంతమంది నేతలు, వేరే నాయకులను దూషిస్తూ, కించపరుస్తూ, కొన్ని వర్గాల వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘నిన్ను పాతాళానికి తొక్కేస్తా’ అంటారొకరు. ఒక వ్యక్తిని అధికార పీఠం ఎక్కించాలా, దించాలా, పాతాళానికి తొక్కేయాలా అనేది నిర్ణయించేది వీళ్లు కాదు, కేవలం ఓటరు మాత్రమే. రాజకీయ నాయకులు ఒకరినొకరు పాతాళానికి తొక్కె య్యడం వల్ల ఓటరుకు ఒరిగేదేముంది? ఒకరు మరొక నాయకుడిని ‘నీ అంతు చూస్తా’ అంటాడు. ప్రజాస్వామ్య పాలనలో ఎవరి అంతుచూడాలన్నది ‘ఓటరన్న’కే సాధ్యం అనే గ్రహింపు కలిగి ఉండాలి. ప్రజా సమస్యలను తుంగలో తొక్కేసి, పర నింద, పరుష నింద వల్ల ఒరిగేదేమిటో వారికే ఎరుక!మరో నాయకుడు ‘ప్రతి అవ్వకు, ప్రతి తాతకు’అంటూ బంధుత్వాన్ని కలుపుతారు. ఈ మాటలు ఆ నాయ కుడికీ, ఓటరుకీ మధ్య ఒక మనోబంధాన్ని ఏర్పరుస్తాయి. తద్వారా ప్రజలకు ఆ నాయకుడిపై ఒక నమ్మకం, ఒక భరోసా కలిగిస్తాయి.పార్టీ అజెండా ప్రజలకు అర్థమయ్యే భాషలో, అర్థ మయ్యే విధంగా వివరించాలి. గతకాలంలో చేసిన వాగ్దా నాలు, వాటి నెరవేర్పు ఏమేరకు జరిగింది, వాటి మధ్య ఉన్న అంతరమెంత, ఆ అంతరాన్ని పూరించడానికి ఈ సారి అధికారంలోకొస్తే ఎలాంటి కార్యాచరణ చేస్తారు అనే అంశాలను విశదీకరించాలి. అంతే కాని, మన మాటలు మన వ్యక్తిత్వాన్ని దిగజార్చేవిగా, లేదా ఇతరులను దిగ జార్చేదిగా ఉండకూడదు. మన నైతికత మనకు సిబిల్ స్కోర్ లాంటిది. అది ఎంత ఎక్కువైతే అంత లాభిస్తుంది. అది ఎంత తక్కువైతే అంత పరోక్ష నష్టం వాటిల్లుతుంది. ఇటీవల కాలంలో ఒక పార్లమెంట్ సభ్యుడిపై, ఆయన ప్రత్యర్థులు అతనిని ‘హంతకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన తమ ప్రతివాదులను తిరిగి ఒక్క పరుషమైన మాట మాట్లాడక పోవడం చూపరులను ఆశ్చ ర్యానికి గురిచేస్తుంది. ఇది ఆయన సంస్కార స్థాయిని వ్యక్త పరుస్తుంది. ఇలాంటి వ్యక్తిత్వం కలిగినవారు రాజకీయాల్లో అరుదుగా కనిపిస్తారు. రాజకీయ నాయకులు వాడే అవాంఛనీయ భాష పార్టీల మధ్య కంటే, సామాన్య ప్రజల మధ్య చిచ్చు పెట్టేదిగా ఉంది. ఇలాంటి సందర్భాల్లో సామా న్యుడు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. అలాగే నాయకులు భాషను భ్రష్టు పట్టించకుండా ఉండాలి. అదే భాషా ప్రేమికుల ఆశ. మాతృ దేవోభవ, పితృ దేవో భవ అనే సంస్కృతిలో పుట్టి పెరిగిన మనం అలాంటి మాటలు మాట్లాడుతున్నామంటే మన సంస్కారం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.భాషను మనం సునిశితంగా పరిశీలించినట్లయితే, భాషలో పబ్లిక్ భాష, ప్రైవేట్ భాష, తక్కువ స్థాయి భాష, ఎక్కువ స్థాయి భాష, ప్రజాస్వామ్య భాష అనే రకాలు న్నాయి. ప్రజల్లో మాట్లాడేటప్పుడు ప్రజాస్వామిక భాష మాట్లాడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. భాష అనేది రెండు అంచులు గల కత్తి లాంటిది. మనం మంచిగా భాషను వాడితే సత్ఫలితాలనిస్తుంది. లేదంటే దుష్ఫలితాల నిస్తుంది. నాయకులు తమ నాయకత్వాన్ని వర్ధిల్ల చేసు కోవాలంటే, మంచి ‘భాషా శైలి’ ముఖ్యం అనే అంశాన్ని గ్రహించాలి.డా‘‘ యు. ఝాన్సీ వ్యాసకర్త తెలుగు అధ్యాపకురాలు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, నూజివీడు -
లోక్‌సభలో నారీ పవర్..
(మేకల కళ్యాణ్ చక్రవర్తి) : రాజకీయాల్లో రాణించడం.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయతీరాలకు చేరడం అంత సులువేమీ కాదు. భారత్‌లాంటి సాంప్రదాయ దేశాల్లో మహిళాలోకం రాజకీయంగా అభివృద్ధి చెందడం కొద్దిగా కష్టమే. అయినా ఉక్కు మహిళలుగా పేరొందిన మన దేశ నారీమణులు ప్రత్యక్ష ఎన్నికల్లో బ్రహా్మండంగా రాణిస్తున్నారు. సమకాలీన పరిస్థితులు, పురుషాధిపత్య రాజకీయాలను అధిగమిస్తూ అనేకస్థాయిల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గ్రామ సర్పంచ్ మొదలు దేశ ప్రధాని, రాష్ట్రపతి లాంటి మహోన్నత స్థానాల్లో కూడా కూర్చున్న ఘనత మన భారతీయ మహిళలది. మండల పరిషత్ అధ్యక్షురాలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా, ఆర్థికం లాంటి కీలకశాఖలు నిర్వహించిన ధీర వనితలుగా మన దేశ మహిళలకు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి భారతీయ మహిళల ప్రాతినిధ్యం పార్లమెంట్ దిగువసభ అయిన లోక్‌సభలో నానాటికీ పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో 4–5 శాతం ఉన్న మహిళల ప్రాతినిధ్యం ఇప్పుడు లోక్‌సభలో ఏకంగా 14 శాతం దాటింది. క్షేత్రస్థాయిలోనే కాదు జాతీయస్థాయిలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో నారీమణులు పురుషులను ఢీ కొడుతూ, రాజకీయ దిగ్గజాలను ప్రజాక్షేత్రంలో మట్టికరిపిస్తూ ప్రజల మన్ననలు పొంది దేశంలోనే అత్యున్నత చట్టసభలో అడుగుపెడుతున్నారు. మాటలే కాదు... చేతల మాస్కరీన్ యానీమాస్కరీన్...వాక్ స్వాతంత్య్రం, విద్యావికాసం, తిరుగుబాటు, మహిళా సాధికారతకు ప్రతీక ఈ పేరు. ప్రస్తుత కేరళ రాష్ట్రం, అప్పటి ట్రావెన్కోర్ సంస్థానంలో జన్మించిన ఈమె రాజకీయాల్లో మహిళాప్రాతినిధ్యానికి 20వ శతాబ్దం తొలినాళ్లలోనే బీజం వేసిన యోధురాలు. 1902 జూన్ 6న లాటిన్ కాజిnథలిక్ కుటుంబంలో జన్మించారు. ప్రభుత్వఉద్యోగి అయిన తండ్రి గాబ్రియెల్ పెంపకంలో తిరువనంతపురంలోని మహారాజాస్ కళాశాల నుంచి డబుల్ పీజీ (ఎకనామిక్స్, హిస్టరీ) చేశారు. ఆ తర్వాత న్యాయశాస్త్రం కూడా అభ్యసించారు. ఆ తర్వాత 1938లో ట్రావెన్కోర్ స్టేట్ కాంగ్రెస్‌లో చేరిన మాస్కరీన్ సంస్థానా«దీశులు, దివాన్లకు వ్యతిరేకంగా గళమెత్తారు. దివాన్‌గా పనిచేసిన రామస్వామి అయ్యర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జరిపిన పోరాటంలో ఆమె క్రియాశీలపాత్ర పోషించారు. ఇందుకు ప్రతిఫలంగా ఆమె పోలీసు దెబ్బలు తిన్నారు. ఆమె ఇంటిని కూలగొట్టి, ఇంట్లోని వస్తువులను దొంగిలించారు. ఆ తర్వాత 1939లో ఆమె ట్రావెన్కోర్ సంస్థానంలో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకు ప్రాతినిధ్యం వహించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న మాస్కరీన్కు 1946, ఫిబ్రవరి 21న మహాత్మాగాంధీ రాసిన లేఖ అప్పట్లో సంచలనమైంది. బాంబేలో ఆమె ఇచ్చిన ఉపన్యాసానికి స్పందిస్తూ ‘మీ నాలుక అదుపులో లేదు. బుద్ధికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు.’అని రాస్తూనే ట్రావెన్కోర్ ప్రభుత్వం నుంచి ఆమెను తొలగించాలని గాందీజీ ఆ లేఖలో కోరడం గమనార్హం. ఇక, ఆ తర్వాత 1946లో ఏర్పాటైన 299మంది సభ్యులతో కూడిన కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియాలో నియమితులయ్యారు. 1951లో మొదటి లోక్‌సభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాతి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ ఆరుగురి అదృష్టం ఏంటో? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనన తర్వాత ఇప్పటి వరకు రెండుసార్లు ఎంపీ ఎన్నికలు జరగ్గా 2014 ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత(టీఆర్ఎస్) నిజామాబాద్ నుంచి, 2019 ఎన్నికల్లో మాలోతు కవిత(టీఆర్ఎస్) మహబూబాబాద్ నుంచి గెలుపొందారు. ఇక, 2024 ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత మళ్లీ మహబూబాబాద్ నుంచి పోటీలో ఉండగా, బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే.అరుణ మహబూబ్‌నగర్ నుంచి బరిలో నిలిచారు. హాస్పిటల్ రంగానికి చెందిన కొంపెల్లి మాధవీలత (బీజేపీ) హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించింది. ఆదిలాబాద్ నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ, వరంగల్ నుంచి డాక్టర్ కడియం కావ్య, మల్కాజ్గిరి నుంచి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్రెడ్డిలను రంగంలోకి దింపింది. జాతీయస్థాయి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సై అంటున్న నారీమణులు ♦ 1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన 22 మంది మహిళలు ♦ 2009లో 50 దాటిన మహిళా ఎంపీల సంఖ్య... 2019లో అత్యధికంగా 78 మంది గెలుపు -
తెలంగాణ రాజకీయంలో తారల కనుమరుగు
‘‘తెరమీద బొమ్మలు పరిపాలన చేస్తాయి’’ అని అప్పుడెప్పుడో వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో చెప్పాడంటారు!. ఆ తర్వాత అది అక్షరం పొల్లుబోకుండా జరిగింది. దేశంలోని చాలా రాష్ట్రాలలో సినీతారలు రాజకీయాలు చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. వాళ్లలో ఉన్నత పదవులూ సైతం చేపట్టిన వాళ్లు కొందరు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలు అందుకు మినహాయింపేం కాదు. అయితే తెలంగాణలో ఇప్పుడు ఈ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. హైదరాబాద్ నడిబొడ్డున నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో జన సముద్రం మధ్య నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని (టీడీపీ) ప్రారంభించి.. దేశ రాజకీయాల్లోనే పెను ప్రభంజనం సృష్టించారు. ఆ తర్వాత ఆ స్థాయిలో సినీ తారలెవరూ ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాలోనూ రాజకీయంగా ప్రభావం చూపలేకపోవడం గమనార్హం. అంతెందుకు తెలంగాణ నుంచి పురుడు పోసుకున్న టీడీపీ.. చంద్రబాబు వైఖరి కారణంగా నేడు అదే రాష్ట్రంలో కనుమరుగైన స్థాయికి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత తెలంగాణలో సినీ తారల ప్రభావం తగ్గిపోతూ వస్తోంది. విజయశాంతి, బాబూ మోహన్ లాంటి ఒకరిద్దరు యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నా.. తెర ముందుకు వచ్చి వాళ్లు చేస్తున్న రాజకీయం అంతంత మాత్రమే అని చెప్పొచ్చు. ఇక బండ్ల గణేష్ లాంటి వాళ్లు పరోక్ష రాజకీయాలతో వార్తల్లో నిలుస్తున్నప్పటికీ వాళ్ల ప్రభావం కూడా అంతంత మాత్రమే ఉంటోంది. 2014లో 'బాబు మోహన్' ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం వర్గం నుంచి గెలిచినప్పటికీ.. 2018లో ఓటమిపాలయ్యారు. 2023 ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసి రేవంత్ రెడ్డి కేబినెట్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహ చేతిలో ఓడిపోయారు. 2018లో వైరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సినీ నటి రేష్మా రాథోడ్.. నోటా కంటే తక్కువ ఓట్లను పొంది ఓటమిపాలైంది. 2009లో వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో నటి 'జయసుధ' సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. అదే సమయంలో జయప్రద ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌పై ఎన్నికయ్యారు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీలో నటుడు నందమూరి బాలకృష్ణ, వైఎస్సార్సీపీలో ఆర్కే రోజా వంటి సినీతారలు మాత్రమే బరిలో ఉన్నారు. ముందుకు రారేం! ఒకప్పుడు తారలు ప్రచారం చేస్తే ఓట్లు రాలేవన్న నమ్మకం ఒకటి నడిచేది. కానీ, తెలంగాణలో ఇప్పుడు రాజకీయ నాయకుల కోసం ప్రచారం చేసే నటులు కూడా కరువైపోయారు. మొన్నటి అసెంబ్లీ, ఇప్పటి లోక్‌సభ ఎన్నికలకు సినీతారలంతా రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉన్నారు. అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం ఆ లోటును కాస్తో కూస్తో భర్తీ చేసే యత్నం మాత్రం చేస్తున్నారు. -
Kanimozhi Karunanidhi: రాజకీయ కవయిత్రి
కనిమొళి కరుణానిధి.. బహుముఖ ప్రతిభావంతురాలైన రాజకీయవేత్త, కవి, పాత్రికేయురా లు, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సభ్యురాలు. తూత్తుక్కుడి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. చురుకైన విద్యార్థి... కనిమొళి చిన్నప్పటి నుంచే చురుకైన విద్యార్థి. బాల్యంలో తండ్రితో పెద్దగా గడపలేకపోయినా.. ఆయనకు మాత్రం ప్రియమైన కూతురే. కనిమొళి పుట్టిన తరువాతే ముఖ్యమంత్రి పదవి దక్కడంతో అది ఆమె తెచి్చన అదృష్టమేనని కరుణానిధి భావించేవారు. తండ్రి తన దగ్గరలేని బాధను కనిమొళి కవిత్వంగా మలిచారు. అది చదివి ఆయన కదిలిపోయారు. అలా తండ్రీకూతుళ్లను సాహిత్యం మరింత దగ్గర చేసింది. కనిమొళి క్రియాశీల రాజకీయాలకు దూరంగా పెరిగారు. 2001లో జయలలిత హయాంలో కరుణానిధిని అరెస్టు చేసినప్పుడు తండ్రి పక్కన నిలబడి తొలిసారి ప్రముఖంగా బయటకు కనిపించారు. నాటినుంచీ ఆయన గళంగా మారిపోయారు. తండ్రి బహుముఖ ప్రజ్ఞకు కనిమొళి అప్రకటిత వారసురాలు. దానికి తోడు ఇంగ్లిష్ బాగా మాట్లాడతారు. దాంతో కరుణానిధి ఢిల్లీలో పెద్దలెవరినీ కలిసినా వెంట కనిమొళి ఉండేవారు. కనిమొళి ఢిల్లీ రాజకీయాల్లో, స్టాలిన్ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉండేలా కరుణానిధి ముందుచూపుతో వ్యవహరించారు. 1982లో జయలలిత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన వేదికపైనే 2008 జూన్‌లో కనిమొళితో డీఎంకే తొలి మహిళా సమ్మేళనం నిర్వహించారు. అలా ఆమెను అగ్రనాయకురాలిగా నిలబెట్టే ప్రయత్నాలు చేశారు. కనిమొళిని జయలలితకు కౌంటర్‌గా కరుణానిధి చూశారు. వారిద్దరికీ సారూప్యమూ ఉంది. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. జర్నలిస్టులుగా పనిచేశారు. రాజ్యసభ సభ్యులుగానే రాజకీయ జీవితం ప్రారంభించారు. రాజకీయాల్లో... కనిమొళి 2007లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. çఆరోగ్యం, కుటుంబ సంక్షేమ, విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి కమిటీ, హోమ్ వ్యవహారాల వంటి పలు కమిటీల్లో చురుగ్గా పనిచేసి ఆకట్టుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ జనరల్ అసెంబ్లీ సభ్యురాలిగా చేశారు. 2013లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2018లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. 2019లో తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. తూత్తుక్కుడి నుంచి బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్‌పై ఏకంగా 3,47,209 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సక్సెస్ఫుల్ జర్నలిస్టు.. కనిమొళి సక్సెస్ఫుల్ జర్నలిస్టు కూడా. ప్ర ముఖ ఆంగ్ల దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేశా రు. తమిళ వారపత్రిక ‘కుంగుమం’ సంపాదకురాలిగా వ్యవహరించారు. సింగపూర్‌కు చెందిన ‘తమిళ మురసు’ వార్తాపత్రికకూ ఫీచర్స్ ఎడిటర్‌గా సేవలందించారు. తమిళంలో కవిత్వం రాశారు. తమిళ కవిత్వాన్ని ఇంగ్లి‹Ùలోకి అనువదించారు. ఆమె రచనలు ఇంగ్లి‹Ù, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లోకి అనువాదమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: సిత్రాలు సూడరో..! (ఫోటోలు)
-
ఎన్నికల వేళ సోషల్ మీడియా షాక్.. మెటా కీలక నిర్ణయం!
ఎన్నికల వేళ రాజకీయ నేతలకు సోషల్ మీడియా దిగ్గజం మెటా ( Meta ) షాకిచ్చింది. పొలిటికల్ కంటెంట్‌ను తమ ఇన్స్టాగ్రామ్ ( Instagram ), థ్రెడ్స్ ప్లాట్‌ఫామ్‌లలో రెకమెండ్ చేయబోమని ప్రకటించింది. అంతేకాకుండా ఫేస్బుక్లో కూడా త్వరలో అవాంఛిత పొలిటికల్ కంటెంట్‌కి కళ్లెం వేస్తామంటోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ ప్లాట్‌ఫామ్‌లలో తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌ల వ్యాప్తిని అరికట్టడానికి ఫేస్బుక్ మాతృ సంస్థ ఇప్పటికే కృషి చేస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలతో రూపొందించిన చిత్రాలను గుర్తించడానికి ఇటీవల ప్రయత్నాలను విస్తరించింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ ప్లాట్‌ఫామ్‌లలో పొలిటికల్ కంటెంట్‌ను రెకమెండ్ చేయబోమని ప్రకటిచింది. అయితే రాజకీయ కంటెంట్‌ను ఇష్టపడేవారికి మాత్రం ఇటువంటి ఇబ్బంది ఉండదని మెటా తెలిపింది. అలాంటి కంటెంట్‌ను పోస్ట్ చేసే ఖాతాలను అనుసరించాలకుంటే తాము ఏ మాత్రం అడ్డు రాబోమని స్పష్టం చేసింది. ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతి కావాలని తాము కోరుకుంటున్నాని, అందుకే ఫాలో కాని అకౌంట్ల నుంచి రాజకీయ కంటెంట్‌ను ముందస్తుగా సిఫార్సు మాత్రం చేయబోమని చెప్పింది. ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ యాప్‌లలో రాజకీయ కంటెంట్ సిఫార్సులను చూడాలా వద్దా అన్నది పూర్తిగా యూజర్ల ఇష్టం. ఈ మేరకు ఎంపిక చేసుకోవడానికి అనుమతించే సెట్టింగ్‌లను మెటా తీసుకురాబోతోంది. ఇదే విధమైన నియంత్రణ రాబోయే రోజుల్లో ఫేస్బుక్లో అమలు కానుంది. "రాజకీయ కంటెంట్ కావాలా వద్దా అన్న ఎంపిక యూజర్లకు కల్పించడమే మా లక్ష్యం. అదే సమయంలో ప్రతి ఒక్కరి ఆసక్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది" అని ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి థ్రెడ్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. రాజకీయ నాయకుల సోషల్ మీడియా బలమైన వేదికగా ఉంది. తమ భావాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రధాన మీడియా కంటే సోషల్ మీడియానే అనువుగా మారింది. వీటిలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటివి ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇకపై ఆయా ప్లాట్‌ఫామ్‌లలో పొలిటికల్ కంటెంట్ అవాంఛితంగా అందిరికీ చేరదు. పొలిటికల్ అకౌంట్లు, పేజీలు ఫాలో అవుతున్నవారికి మాత్రమే ఆ కంటెంట్ చేరుతుంది. సార్వత్రిక ఎన్నికల వేళ మెటా తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ నాయకులకు గట్టి ఎదురుదెబ్బనే చెప్పాలి. -
మణిపుర్‌కు మతం రంగు!
మణిపుర్లో విధ్వంసం కన్నా మణిపుర్‌పై విధ్వంసక ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది! దేశంలో ఎక్కడేం జరిగినా దానికి మతాన్ని అంటుకట్టేలా తయారైన రాజకీయ వ్యవస్థ ఆఖరికి మణిపుర్‌లోని తెగల మధ్య ఘర్షణలను కూడా ‘మత కలహాలు’గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. మణిపుర్‌తో సంబంధం లేని రాష్ట్రాలకు సైతం ఆ ‘రాజకీయ మతోన్మాదం’ వ్యాపించింది! దురుద్దేశాలతో కొన్ని విదేశీ శక్తులు, పొద్దెరగని కొందరు దేశవాళీ కొత్త రాజకీయవాదులు స్వార్థ ప్రయోజనాల కోసం మణిపుర్ నిప్పుల కుంపటిని తమ ప్రసంగ వేదికలపైకి మోసుకెళుతున్నారు. అవి మత కలహాలు కావు... భూమి హక్కుల తగాదాలని తెలిసీ మణిపుర్‌కు మతం రంగును పులుముతున్నారు! నిరుడు ఈ సమయానికి మణిపుర్ ప్రశాంతంగా ఉంది. ఫిబ్రవరిలో ప్రశాంతం. మార్చి నెలలో కూడా ప్రశాంతం. ఏప్రిల్ వచ్చేసరికికొంచెం వేడెక్కింది. అయితే అది... ఏప్రిల్‌లో 16 సెల్సియస్ డిగ్రీలతో మొదలై, జూన్ నాటికి 35 డిగ్రీల వరకు చేరుకునే ఎండాకాలపు వేడిమి కాదు. నిరసన ప్రదర్శనల వేడి. దాడులు, దహనాల వేడి. నిజానికి అంతకు పదేళ్లు, ఆ ముందు పదేళ్ల నుంచి కూడా మణి పుర్ దాదాపుగా ప్రశాంతంగానే ఉంది. రాష్ట్రాన్నే రెండు ముక్కలు చేసేంతగా అక్కడేం జరగలేదు. గత మే నెల నుంచే హింసాకాండ మొదలైంది. మూకుమ్మడి దాడులు, గృహదహనాలు, ప్రార్థనాస్థలాల ధ్వంసం, మహిళల్ని నగ్నంగా ఊరేగించడం మణిపుర్‌ను అగ్నిగుండంలా మార్చేశాయి. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 180 మంది మరణించారు. దాదాపు 60 వేల మంది నిరాశ్రయులయ్యారు. డిసెంబరులో మణిపుర్ కాస్త ఊపిరి పీల్చుకున్నట్లుగా కనిపించినప్పటికీ కొత్త సంవత్సరంలో మళ్లీ ఒక్కసారిగా హింస చెలరేగింది. జాతుల మధ్య మొదలైన ఈ ఘర్షణలు విద్వేష జ్వాలలే అయ్యాయి. ఇంతకన్నా ఘోరం... అక్కడ జరుగుతున్న ఘటనలపై పాశ్చాత్య మీడియా చేస్తున్న దుష్ప్రచారం! వారితో పాటు అంతర్గతంగా మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు కూడా మణిపుర్‌కు మతంరంగు పులిమేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ‘‘1947లోపంజాబ్లో మతపరమైన ఉద్రిక్తతలతో జరిగిన నిర్మూలన కాండను మణిపుర్ ఘటనలు గుర్తు చేస్తున్నాయి’’ అనేంతగా ప్రచారం జరుగు తోంది. వారి వ్యతిరేకత ఎవరి మీదనైనా కావచ్చు. కానీ వాస్తవాలను హతమార్చడం ఎందుకు? పర్ణశాల వంటి మణిపుర్‌పై మతోన్మాద మరకల్ని అంటించడం దేనికి?భౌగోళికంగా మణిపుర్ ప్రత్యేకమైనది. రాష్ట్రంలో కేవలం పది శాతం మాత్రమే ఉన్న మైదాన భూభాగంలో రాష్ట్రంలోని దాదాపుతొంభై శాతం ప్రజలు నివసిస్తున్నారు. అందులో ఎక్కువ శాతం మైతేయిలు. రాష్ట్రంలో వారి జనాభా దాదాపు 53 శాతం. దీంతో సహజంగానే రాజకీయాల్లో వారిదే ప్రాబల్యం. 60 సీట్ల అసెంబ్లీలో 40 స్థానాలు వాళ్లవే.కొండ ప్రాంతాల్లోని గిరిజనులైన కుకీలు, నాగాలకు ఎస్టీ రిజర్వేషన్ ఉండటం, మైదాన ప్రాంత గిరిజనులైన మైతేయిలకు ఎస్టీ రిజర్వేషన్ లేకపోవడం... కాలక్రమంలో రెండు వర్గాల మధ్య సఖ్యత లోపించడానికీ, సంఘర్షణకూ కారణం అవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే వారి మధ్య సంబంధాలు మరింతగా క్షీణించడానికి మణిపుర్ హైకోర్టు గత ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పు కారణం అయింది. మణిపుర్‌ను రణపుర్గా మార్చేసింది. 2023 మార్చి 27న షెడ్యూల్డు తెగల జాబితాలోకి మైతేయి తెగలను చేర్చేందుకు కేంద్ర ఆదివాసీ శాఖకు సిఫారసు చేయాలని మణిపుర్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుపై కుకీలు, నాగాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మెజారిటీ వర్గంగా మైతేయిలదే రాజకీయంగా పైచేయిగా ఉందనీ, హిందువుల్లోని ఎస్సీ, ఓబీసీ హోదాలకున్న ప్రయోజనాలను వారు ఇప్పటికే అనుభవిస్తున్నారనీ, కాబట్టి వారికి ఎస్టీ హోదా ఇవ్వటం సరికాదనీ అభ్యంతరం చెబుతున్నారు. మైతేయిలకు రిజ ర్వేషన్లు దక్కితే వారు తమ అటవీ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటారనీ, తమ ఉద్యోగాల వాటా తగ్గిపోతుందనీ ఆందోళన చెందుతున్నారు. అయితే, మైతేయిల వాదన మైతేయిలకు ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని నాగా, కుకీ ఆదివాసీల్లోని ముప్పైకి పైగా తెగలకు ఎస్టీలుగా ప్రభుత్వ గుర్తింపు ఉంది. తమకు ఆ గుర్తింపు లేని కారణంగా దేశంలోని ఎవరైనా వచ్చి తాముంటున్న ఇంఫాల్ లోయ ప్రాంతంలో భూమి కొనొచ్చుగాని... తమకు మాత్రం పర్వత ప్రాంతాల్లో భూమి కొనుక్కోవటానికి వీలులేకుండా పోయిందన్నది మైతేయిల వాదన. అంతేకాదు 1949లో భారత్‌లో కలవటానికి ముందు మైతేయిలను ఆదివాసీ తెగగానే గుర్తించారని వారు గుర్తు చేస్తున్నారు. ఆ హోదాను పునరుద్ధరించాలని మాత్రమే తాము కోర్టుకు విన్నవించుకున్నాం అని మైతేయి సంఘం అంటోంది. కేవలం రిజర్వేషన్ల కోసమే కాకుండా... సంస్కృతిని, భాషను, భూమిని, తమ సంప్ర దాయాలను కాపాడుకోవటం కోసం ఎస్టీలుగా గుర్తింపును కోరు తున్నామని కోర్టులో వాదించింది. మణిపుర్ హైకోర్టు ఈ వాదనలతో ఏకీభవించింది. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆందో ళనకు పిలుపు ఇవ్వటం, అది హింసాత్మకంగా మారటంతో ఆందోళన మంటలు రాష్ట్రంలో రాజుకున్నాయి. రెండు వైపులా మరణాలు సంభ వించాయి. చర్చిలు, దేవాలయాలు ధ్వంసం అయ్యాయి. ఇవేమీ మత కలహాలు కావు. భూమి హక్కుల విషయమై మొదలై, నేటికీ కొనసాగుతున్న ఘర్షణలు. అయితే మణì పూర్లో జరుగుతున్నవి మత ఘర్షణలు అని, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని హిందువులు విధ్వంసానికి పాల్పడు తున్నారనే దుష్ప్రచారం సాగుతోంది. గమనించాల్సి వాస్తవం ఏమి టంటే మైతేయి తెగల్లో అధిక సంఖ్యాక హిందువులతో పాటు, ముస్లింలు, క్రిస్టియన్లు; కుకీ నాగాల్లోనూ అధిక సంఖ్యాక క్రిస్టియన్లతో పాటు హిందువులు, ముస్లింలు ఉన్నారన్నది! మణిపుర్ తెగల మధ్య ఘర్షణలు మతాల మధ్య చిచ్చుగా కొన్ని పాశ్చాత్య దేశాలకూ, మన దేశంలోనే కొన్ని రాజకీయ పార్టీల వారికీ మాత్రమే ఎందుకు కనిపిస్తోంది? ఎందుకంటే, ఎవరి స్వార్థ ప్రయో జనాలు వారివి. నిజానికి మత ఘర్షణలనేవి మణిపుర్ చరిత్రలోనే లేవు. ‘‘కుకీ, నాగా తెగలకు పరిపాలనలో స్థానం కల్పించిన చరిత్ర మైతేయిలది. మణిపురి ప్రజలకు మతోన్మాదం లేదు. 19వ శతాబ్దంలో రాచరిక పాలనలో హిందూమతం ఆధిపత్యం చలాయించిందన్నది నిజమే, కానీ అది ఎక్కువ కాలం కొనసాగలేదు. మరిక మతోన్మాదం ఎక్కడి నుంచి వచ్చింది?’’ అంటారు మణిపుర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రియోరంజన్ సింగ్. అయితే రెండు వేలకు పైగా చర్చిలను ధ్వంసం చేశారని కొన్ని రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఆ వివరాలను వారికి ఏ క్రైస్తవ దేశాలు అందించాయో వారే చెప్పాలి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే చూసినా 100 దేవాలయాలతో పాటు రెండు వేల మైతేయి ఇళ్లపై కూడా దాడులు జరిగాయి. మరి వీటిని ఏమంటారు? మత ఘర్షణలు అనేనా! మైతేయి వర్గం ప్రయోజనాల కోసం ఏర్పాటైన కోకోమి ప్రతినిధి కె. ఓథాబాయ మాట్లాడుతూ, ‘‘మణిపుర్‌లోని సమస్యలు మతపరమైనవి కావు’’ అని స్పష్టం చేశారు. ఆ మాటను కాంగ్రెస్ పార్టీ వాళ్లకు చెప్పేవారెవరు? ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు చెప్పేవారెవరు? ‘‘మణిపుర్లో మతం పేరుతో ఎప్పుడూ అల్లర్లు జరగలేదు. జరుగుతున్నదాన్ని డైవర్ట్ చేసి మతపరమైనహింసగా చూపించడం ఇదే మొదటిసారి’’ అని స్వయంగా మణిపుర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దేబబ్రత సింగ్ అన్నారు కదా! బాధ్యత గల రాజకీయ నాయకులు ఎవరూ మణిపుర్లో జరుగు తున్న మతపరమైన దాడులు అని అనలేదు. అలాంటి ప్రచారానికి తావు కూడా ఇవ్వరు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకు భిన్నంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మణిపుర్‌కు మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘మీరు క్రిస్టియన్ అయుండీ ఎందుకు మణిపుర్ క్రిస్టియ న్లను సమర్థించడం లేదు?’’ అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఆమె ఏ ఉద్దేశంతో ఇలా ఒక మతం వారిని రెచ్చగొట్టే ప్రసంగాలను ఇస్తున్నారో ప్రత్యేకించి చెప్పే పని లేదు. – మాధవ్ శింగరాజు, సీనియర్ జర్నలిస్ట్ -
ఎవరీమె? ఆమె స్పీచ్‌కి..పార్లమెంటే దద్దరిల్లింది!
పార్లమెంట్లో ఒక మహిళా రాజకీయవేత్త అందర్నీ ఆశ్చర్యపరిచేలా శక్తిమంతంగా తన గళం వినిపించింది. అదికూడా స్థానిక భాషల కోసం పార్లమెంట్లో చాలా ఉద్వేగభరితంగా మాట్లాడటం సంచలనంగా మారింది. చిన్న వయసులోనే పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికవ్వడమే గాక మాతృ భాషలో పార్లమెంటే దద్దరిల్లేలా మాట్లాడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరీమె? దేని గురించి అంతలా శివంగిలా మాట్లాడింది. ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటు చేసకుంది. ఆక్లాండ్, హామిల్టన్ మధ్య ఉన్న హంట్లీ అనే చిన్న పట్టణానికి చెందిన ఆమె పేరు హనా-రౌహితీ మైపి-క్లార్క్. కేవలం 21 ఏళ్ల వయసులోనే పార్లమెంట్‌కి ఎన్నికై రికార్డు సృష్టించింది. ఏకంగా 170 ఏళ్ల న్యూజిలాండ్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా ఎంపీగా నిలిచింది. గతేడాది అక్టోబర్‌లో పార్లమెంట్‌కి ఎన్నికయ్యారు. ఆమె న్యూజిలాండ్‌లోని మావోరి కమ్యూనిటీల హక్కుల కోసం పోరాడుతున్నారు. అంతేగాదు ఆ మావోరిల కమ్యునిటీ గార్డెన్‌ను కూడా మైపీ క్లార్క్ నడుపుతోంది ఏం మాట్లాడారంటే.. ఆ ఉద్వేగభరిత ప్రసంగంలో..తాను ఓటర్లకు "మీ కోసమే బతుకుతాను", "మీ గురించే చనిపోతానని" వాగ్దానం చేశాను. మా మావోరి తెగ తరతరాలుగా చాలా వెనుకబడి ఉంది. వారంతా తమ మాతృభాష నేర్చుకోవడం కోసం ఆర్రులు చాచి చూస్తోన్నారు. కనీసం తమ గుర్తింపుని కూడా చెప్పుకోలేని దీన స్థితిలో ఉంది. ఇప్పటికీ తాము వెనకబడిపోయే ఉన్నాం. అంతేగాదు నన్ను నేను ఎప్పటికీ రాజకీయ నాయకురాలి చూడనని. కేవలం మావోరి భాష సంరక్షకురాలిగా భావిస్తాను ఎందుకంటే రాబోయే తరాలకు ఈ స్వరాన్ని వినిపించాల్సిన అవసరం ఎంతైన ఉంది. నిజానికి ఈ పార్లమెంట్లో ప్రవేశించే ముందు కొన్ని సలహాలు ఇచ్చారు. వ్యక్తిగతంగా దేన్ని తీసుకోకూడదన్నారు. కానీ నేను ఈ ఛాంబర్లో చెప్పిన ప్రతిదాన్ని వ్యక్తిగతం తీసుకోకుండా ఉండలేను. జస్ట్ రెండు వారాల్లో ఈ ప్రభుత్వం నా ప్రపంచం(మావోరి) మొత్తంపై దాడి చేసింది. ఎంతలా అంటే ఆరోగ్యం, పర్యావరణం, నీరు, వెన్యువా, సహజవనరులు, మావోరి వార్డులు, వారి భాష, ఉనికి అన్నింటిని లాగేసుకుంది. ఈ దేశంలో మాకైనా, మీకైనా ఒక దేశ పౌరులుగా అన్ని హక్కులను సద్వినియోగించుకునే హక్కు ఉంది కదా! అంటూ తన మాతృ భాషలో పార్లమెంట్‌ని గడగడలాడించేలా మాట్లాడింది. దీంతో ఆమె ప్రసంగం వీడియో ఓ సంచలనంగా మారి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, ఆమె తాతా తైతిము మైపి కూడా మావోరి కార్యకర్తే. New Zealand natives' speech in parliament pic.twitter.com/OkmYNm58Ke — Enez Özen | Enezator (@Enezator) January 4, 2024 (చదవండి: మహిళా భద్రతలో టాప్.... చెన్నై!! హైదరాబాద్ స్థానం...??) -
మనసున్న మాస్ హీరో
తమిళ ప్రేక్షకులకు విజయ్‌కాంత్ ఓ ‘పురట్చి కలైజ్ఞర్’ (విప్లవ కళాకారుడు)... నల్ల ఎంజీఆర్... అభిమానులకు మంచి మాస్ హీరో... కెప్టెన్ ... ఇవే కాదు.. ధైర్యం, తెగువకు చిరునామా అనే పేరు కూడా ఉంది.. మంచి మానవతావాది కూడా. ఇలా ఎన్నో రకాల రూపాల్లో నటుడిగా, వ్యక్తిగా తమిళ ప్రజల మనసుల్లో ‘మనసున్న మాస్ హీరో’గా చెరగని ముద్ర వేసుకున్న విజయ్‌కాంత్ ఇక లేరు. విజయ్‌కాంత్ తమిళంలో తప్ప ఇతర భాషల్లో సినిమాలు చేయలేదు. కానీ ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ‘ఛాలెంజ్ రౌడీ, రౌడీలకు రౌడీ, పోలీస్ అధికారం, కెప్టెన్, కెప్టెన్ ప్రభాకరన్, మా బావ బంగారం, నేటి రాక్షసులు, సింధూరపువ్వు, అమ్మను చూడాలి, బొబ్బిలి రాయుడు, మరణ మృదంగం’.. ఇలా ఆయన నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో అను వాదమై, ఇక్కడి ప్రేక్షకులకు విజయ్‌కాంత్‌ని దగ్గర చేశాయి. తెలుగు హీరోలు పలువురు విజయ్‌కాంత్ తమిళ సినిమాలను తెలుగులో రీమేక్ చేసి బ్లాక్‌బస్టర్స్ కొట్టారు. చిరంజీవి కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఠాగూర్’ (2003) విజయ్‌కాంత్ హీరోగా వచ్చిన తమిళ సినిమా ‘రమణ’ (2002)కు రీమేక్. అలాగే విజయ్‌కాంత్ హీరోగా నటించిన ‘సట్టమ్ ఒరు ఇరుట్టరై’ (1981), ‘వెట్రి’ (1984), ‘అమ్మన్ కోయిల్ కిళక్కాలే’ (1986) సినిమాలు తెలుగులో ‘చట్టానికి కళ్ళు లేవు’ (1981) ‘దేవాంతకుడు’ (1984), ‘ఖైదీ నంబరు 786’ (1988)గా రీమేక్ కాగా, ఈ చిత్రాల్లో చిరంజీవి హీరోగా నటించారు. విజయ్‌కాంత్ ‘చిన్న గౌండర్’ (1992) తెలుగు రీమేక్ ‘చినరాయుడు’ (1992)లో వెంకటేశ్, ‘నానే రాజా నానే మంత్రి’ (1985) రీమేక్ ‘నేనే రాజు నేనే మంత్రి (1987)’, ‘ఎన్ పురుషన్దాన్ ఎనక్కు మట్టుమ్దాన్’ (1989) రీమేక్ ‘నా మొగుడు నాకే సొంతం’ (1989) చిత్రాల్లో మోహన్‌బాబు హీరోగా నటించారు. విజయ్‌కాంత్ ‘వానత్తై పోల’ (2000) సినిమాను తెలుగులో ‘మా అన్నయ్య’గా రీమేక్ చేసి హిట్ అందుకున్నారు రాజశేఖర్. కాగా కొందరు తెలుగు హీరోల సినిమాల తమిళ రీమేక్‌లో నటించి హిట్స్ అందుకున్నారు విజయ్‌కాంత్. బాలకృష్ణ హీరోగా నటించిన ‘భానుమతిగారి మొగుడు’ (1987) సినిమా తమిళ రీమేక్ ‘తెర్కత్తి కళ్లన్’ (1988)లో, ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘సింహాద్రి’ (2003) రీమేక్ ‘గజేంద్ర’ (2004)లో విజయ్‌కాంత్ హీరోగా నటించి, బ్లాక్‌బస్టర్స్ అందుకున్నారు. ఇలా ఆయన కెరీర్లో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. విజయ్‌కాంత్ అసలు పేరు నారాయణన్ విజయ్‌రాజ్ అళగర్సామి. కేఎన్ అళగర్సామి, ఆండాళ్ అళగర్సామి దంపతులకు 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారాయన. కాగా అళగర్సామి కుటుంబానికి తెలుగు మూలాలు ఉన్నాయి. పదో తరగతి వరకు చదివిన విజయ్‌రాజ్ తండ్రికి సహాయంగా రైస్ మిల్లు బాధ్యతలను చూసుకునేవాడు. అయితే చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో 1979లో చెన్నై చేరుకున్నాడు విజయ్‌రాజ్. సినీ అవకాశాల కోసం ప్రయత్నించిన ఆయనకు ఎంఏ రాజా దర్శకత్వం వహించిన ‘ఇనిక్కుమ్ ఇళమై’ (1979) చిత్రంలో ప్రతినాయకుడిగా తొలి అవకాశం వచ్చింది. ఆ చిత్ర దర్శక–నిర్మాత ఎంఏ కాజానే విజయ్‌రాజ్ పేరుని విజయ్‌కాంత్‌గా మార్చారు. ‘ఇనిక్కుమ్ ఇళమై’ తర్వాత ‘అగల్ విళక్కు, నీరోట్టం, చామంతి పూ’ తదితర చిత్రాల్లో ఆయన నటించినా ఆశించిన విజయాలు అందుకోలేకపోయారు. ఆ తర్వాత ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరత్తు ఇడి ముళక్కమ్’ (1980) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విజయ్‌కాంత్. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో నటించిన ద్వితీయ చిత్రం ‘చట్టం ఒరు ఇరుట్టరై’ (1981) సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు విజయ్‌కాంత్‌కు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. హీరోగా చాలా బిజీ అయిపోవడంతో రోజుకు మూడు షిఫ్టులుగా పని చేశారాయన. ఎంత బిజీ హీరో అంటే 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలవడం విశేషం. విజయ్‌కాంత్ సినిమాల్లో ఎక్కువగా సామాజిక నేపథ్యం ఉంటుంది. వీరోచితం, విప్లవ భావాలు, ప్రజలను ఉత్తేజపరచే అంశాలు ఉంటాయి. అలాగే ఆయన యాక్షన్ కు ప్రత్యేక అభిమానులున్నారు. ‘అమ్మన్ కోయిల్ కిళక్కాలే, వైదేహి కాత్తిరిందాళ్, చిన్న గౌండర్, వానతై ్త పోల’ వంటి పలు కుటుంబ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రాల్లోనూ తనదైన నటనతో అలరించారాయన. పోలీస్ పాత్రలకు వన్నె తెచ్చిన విజయ్‌కాంత్‌కు ‘కెప్టెన్ ప్రభాకరన్’ సంచలన హీరోగా పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తర్వాత ఫ్యాన్స్ ఆయన్ను ‘కెప్టెన్’ అని ప్రేమగా పిల వడం మొదలు పెట్టారు. కొందరు ఫ్యాన్స్ విప్లవ కళా కారుడు అంటూ గౌరవంతో పిలుచుకుంటారు. అయితే విజయ్‌కాంత్ సినీ కెరీర్ అంత సాఫీగా సాగలేదు. ఆదిలో ఎన్నో కష్టాలు, అవమానాలను ఎదుర్కొన్నారు. విజయ్‌కాంత్ నలుపు రంగులో ఉండటంతో మొదట్లో పలువురు ప్రముఖ నటీమణులు ఆయన సరసన నటించడానికి నిరాకరించారట. అయినా తనను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌కాంత్. అటు సందేశాత్మక చిత్రాలు, ఇటు వాణిజ్య సినిమాలు ఏకకాలంలో చేశారాయన. సినిమా ప్రారంభంలో కాకుండా విడుదల ముందు పారితోషికాన్ని అందుకుని నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఒకవేళ ఆ సినిమా నిర్మాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకునేవారు కాదట. ఎంజీఆర్ అభిమాని అయిన విజయ్‌కాంత్.. తన అభిమాన హీరోలాగా ప్రజల ఆకలి తీర్చేవారు. ఆయన కార్యాలయంలో నిత్యాన్నదానం చేస్తూ.. కరుప్పు (నలుపు) ఎంజీఆర్‌గా కొనియాడబడ్డారు విజయ్‌కాంత్. ఆర్కే సెల్వమణి దర్శకత్వం వహించిన ‘కెప్టెన్ ప్రభాకరన్ ’ విజయ్‌కాంత్‌కు నూరవ చిత్రం. ఆయన కెరీర్లో 150కిపైగా సినిమాల్లో నటిస్తే.. అందులో 20కిపైగా పోలీస్ ఆఫీసర్‌గా నటించిన సినిమాలే ఉండడం విశేషం. చివరగా తన కొడుకు షణ్ముగ పాండియన్ ను హీరోగా పరిచయం చేసిన ‘సహాబ్దం’ (1993) చిత్రంలో ముఖ్య పాత్రను పోషించారాయన. ‘విరుదగిరి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు విజయ్‌కాంత్. బావ ఎల్.కె. సుధీశ్‌తో కలిసి మూడు సినిమాలు నిర్మించారు విజయ్‌కాంత్. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం అధ్యక్షుడిగానూ విశేష సేవలందించారాయన. సినీ పరిశ్రమలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న విజయ్‌కాంత్ మృతికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కూడా ఆయనకు మృతి పట్ల విచారం వ్యక్తం చేశాయి. విజయ్కాంత్కుభార్య ప్రేమలత, కుమారులు విజయ ప్రభాకరన్, షణ్ముగ పాండియన్ ఉన్నారు. -
ఎన్నికల గ్యారంటీలు ‘జుమ్లా’లేనా?
దేశంలోని దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు తరచుగా చెప్పే మాట తమకు అధికారం ఇస్తే ప్రజలను సాధికారులుగా చేస్తాం అన్నది. అసలు సాధికారత (ఎంప వర్మెంట్) అంటే అర్థం ఏమిటి? దీనికి విస్తృతమైన అర్థాలు ఉన్నాయి. ముందుగా శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి లేదా అతని కుటుంబాన్ని బలోపేతం చేయడం, ఆ తర్వాత ఆ కుటుంబాన్ని సామాజికంగా బలోపేతం చేయడం అన్నది సాధికారతలో ఓ భాగం. కుటుంబాన్ని బలోపేతం చేయడ మనే ప్రక్రియ ఎలా జరుగుతుంది? ప్రతిరోజూ బలవర్ధకమైన ఆహారాన్ని వ్యక్తికి లేదా అతని కుటుంబానికి అందించాలి. వారు ఆరోగ్యంగా ఉండేటట్లు చూడాలి. అలా ఎంతకాలం చేయాలి? జీవితకాలంపాటు ఈ ప్రక్రియ కొనసాగాలి. కానీ, ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉండేది ఐదేళ్లపాటు మాత్రమే. ఐదేళ్లు ఉండే ప్రభుత్వం ఏ వ్యక్తినైనా, కుటుంబా న్నైనా, వర్గాన్నైనా జీవితకాలం పాటు పోషించలేదు కదా? అటువంటప్పుడు వారు సాధికారులు ఎలా అవుతారు?! ఆధునిక చైనా పితామహుడిగా చెప్పుకొనే డెంగ్ జియావో పింగ్ దీనినే ఓ ఉదాహరణ ద్వారా వివరించారు. ఆకలి గొన్న వ్యక్తికి రోజూ ఓ చేప చొప్పున ఇస్తూపోతే... అది ఇచ్చినంత కాలమే అతని ఆకలి తీరుతుంది. అదే అతనికి చేపలు పట్టే విద్య నేర్పించి, ఓ వలను ఇవ్వగలిగితే అతడు తన జీవితకాలం తన పొట్టను తానే పోషించుకొంటాడు. పైగా తన కుటుంబాన్ని సైతం ఆదుకోగలుగుతాడు. ప్రభు త్వాలు ప్రజలకు సంక్షేమం ఎలా ఇవ్వాలో సూక్ష్మంగా చెప్పాడు డెంగ్ ఈ ఉదాహరణ ద్వారా. ఇదే సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలో పెట్టడం ద్వారానే డెంగ్ తన పాలనలో చైనాను ప్రపంచంలో ఓ బలమైన ఆర్థిక శక్తిగా రూపొందించగలిగాడు. ప్రజల సమస్త వ్యక్తిగత, సామాజిక అవసరాలన్నింటినీ తామే తీర్చగలమన్న భ్రమల్ని వారిలో కల్పిస్తూ కొన్ని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకొంటున్నాయి. ఓట్ల కోసం హామీలు గుప్పించడం రాజకీయ పార్టీలకు రివాజుగా మారింది. అది ఇటీవలి కాలంలో మరింత వెర్రితలలు వేస్తోంది. వ్యవసాయరంగం మెరుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణ; విద్య, వైద్యం వంటివి సామాన్యులకు అందుబాటులోకి తేవడం, శాంతి భద్రత లను పటిష్టపర్చి పారిశ్రామిక పెట్టుబడుల్ని ఆకర్షించడం ద్వారా నిరుద్యోగాన్ని పారద్రోలడం వంటి చర్యలు ఏ ప్రభుత్వానికైనా ప్రాధాన్యం కావాలి. మహిళలు, బాలలు, వృద్ధులకు తగిన సామాజిక సంరక్షణ కల్పించడం ప్రభు త్వాల బాధ్యత. వీటిపైన దృష్టి పెట్టగలిగితే ప్రజలను సాధికారుల్ని చేసినట్లే. భారతదేశం నిద్రపోతున్న ఓ ఆర్థిక దిగ్గజం (స్లీపింగ్ జెయింట్) అని 70వ దశకంలోనే నాటి సింగపూర్ అధ్యక్షుడు ‘లీ కువాన్ యు’ అన్నారు. 1991లో పీవీ నర సింహారావు దేశ ప్రధాని అయిన తర్వాత గానీ దేశానికి పట్టిన స్తబ్ధత వదలలేదు. దశాబ్దాలపాటు పట్టి పీడించిన కొన్ని జాడ్యాలను వదిలించుకొని ఆర్థిక వ్యవస్థ వడి వడిగా అడుగులు వేస్తూ... పీవీ – డా‘‘ మన్మోహన్ సింగ్‌ల ద్వయం చూపిన సంస్కరణల బాటలో ముందుకు సాగిన ప్రస్థానానికి దాదాపు 3 దశాబ్దాల వయస్సు. ఈ కాలంలో దేశం చాలా రంగాలలో అభివృద్ధి చెందిన మాట నిజం. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నది అన్నది కూడా ఓ వాస్తవం. అయితే, ఈ ప్రస్థానం ఏ దిశగా సాగుతోంది? దేశంలోని సహజ వనరులన్నీ ప్రజలందరికీ సమానంగా చెందాలన్న రాజ్యాంగ లక్ష్యాలకు, రాజ్యాంగ నిర్మాత డా‘‘ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు భిన్నంగా దేశ సంపద కొంత మంది పారిశ్రామిక వేత్తలకు దఖలు పడింది. ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్‌కు చెందిన ఇద్దరు లేదా ముగ్గురు మొదటి వరుసలో ఉండగా, మరో 10 మంది రెండో వరుసలో కనిపిస్తారు. అదే సమయంలో... ప్రపంచ ఆకలి సూచీలో 180 దేశాల జాబితాలో ఇండియా 165 –170 స్థానాల మధ్య ఊగిసలాడుతోంది. మనకంటే పొరుగునున్న ఆసియా దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్ ఆకలి సూచీలో మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఆర్థిక దిగ్గజమైన భారత్‌కు ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా? ఈ 3 దశాబ్దాలలో దేశ సంపద బాగా పెరిగింది. దేశ స్థూల ఉత్పత్తి 40 లక్షల కోట్లు దాటింది. అదే సమయంలో దేశంలో ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోయినట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. దేశంలో పేదలు మరింత పేదలయ్యారు. సంపన్నులు పైపైకి ఎగబాకుతున్నారు. ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన సోషలిజం స్థానంలో చాలాకాలంగా ‘పాపులిజం’ వచ్చి చేరింది. ‘అన్ని వర్గాలకూ అన్నీ’ అన్నదే పాపులిజం మూల సూత్రం. ఓట్లు రాల్చే ఈ ‘ఇజం’ చుట్టూనే నేటి రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. ఈ పాపులిజం ఇటీవలి కాలంలో వెర్రితలలు వేయడమే నేటి విషాదం! దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు ‘జాకబ్ జుమా’ పాపులిస్ట్గా మారి దేశాన్ని అప్పుల ఊబిలో నెట్టివేశారు. ఆ దేశ జీడిపీలో అప్పుల నిష్పత్తి 50 శాతం దాటిన నేపథ్యంలో... సొంత పార్టీ వారే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి పదవి నుంచి దించి వేశారు. ‘జాకబ్ జుమా’ ఉదంతం ప్రపంచంలో అనేక దేశాలకు గుణపాఠం నేర్పింది. మొత్తం జీడీపీలో అప్పుల శాతం 24 శాతం మించరాదనీ, అదికూడా వృద్ధిరేటు 7 శాతం దాటినప్పుడే అది ఆమోదయోగ్యం కాగలదనీ ప్రముఖ ఆర్థికవేత్తలు నిగ్గు తేల్చారు. అయితే, భారత్‌లో కొన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి లెక్కల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అధికారం కోసం మొదట కర్ణాటకలో, ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలు, ఇతర హామీల విలువ కనీసం రెండు రాష్ట్రాల బడ్జెట్‌తో సమానం. ఇవి నెరవేర్చాలంటే ప్రజలపై అధికంగా పన్నులు వేయాలి, ఎఫ్.ఆర్.బి.ఎం.ను మించి అప్పులు తేవాలి. అవీ చాలక పోతే ప్రభుత్వ భూములు అమ్మాలి. ఇప్పటికే విలువైన ప్రభుత్వ భూములు చాలావరకు వేలంలో పోయాయి. భవి ష్యత్ అవసరాలకోసం తిరిగి భూములు కొనాల్సిన దుఃస్థితి ఇకపై రావొచ్చు. ఇక ఎటొచ్చీ, కొన్ని పథకాలను అమలు చేయకుండా మంగళం పాడొచ్చు. అలాగే ఎన్నికల ముందు ప్రకటించిన గ్యారంటీలను సైతం ఎత్తివేయవచ్చు. రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోకు ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడమే ఎడాపెడా హామీలు ప్రకటించడానికి కారణం అవుతోంది. మన దేశంలో రాజకీయ పార్టీల హామీల అంశంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకో వడానికి నిరాకరిస్తున్నాయి. అందువల్ల ఆకాశమే హద్దుగా కొన్ని రాజకీయ పార్టీలు హామీల సునామీ సృష్టిస్తున్నాయి. 2014లో బీజేపీ తన మేనిఫెస్టోలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అందిస్తామని చెప్పింది. విదేశాల్లో పోగుపడిన నల్ల ధనాన్ని వెనక్కి రప్పించి అందరి ఖాతాల్లో 15 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తామని బీజేపీ అగ్రనేతలు నమ్మకంగా చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ హామీల సంగతేమిటని కేంద్రమంతి ‘అమిత్ షా’ను నిలదీస్తే, అవన్నీ ‘ఎన్నికల జుమ్లా’ అని ఆయన ఒక్క మాటతో తేల్చేశారు. అంటే, ఎన్నికల సందర్భంలో ఎన్నో గాలి వాగ్దానాలు చేస్తుంటాం. వాటిని మీరు సీరియస్‌గా తీసుకొంటే ఎలా? అనే అర్థంలో కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. ప్రజలు ఈ ‘జుమ్లా’ మాటలు నమ్మడం లేదనే కారణంగానే ఇపుడు గ్యారెంటీలు ఇస్తున్నారు. సదరు గ్యారెంటీలు అమలు జరుగుతాయన్న గ్యారెంటీ కూడా లేదు. ఇదొక చేదు వాస్తవం. వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
ఓటేసిన రాజకీయ ప్రముఖులు - అధికారులు (ఫొటోలు)
-
పవన్ కంటే బర్రెలక్క నూరుపాళ్లు నయం!
ఒక సిద్ధాంతం లేదు.. కానీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానంటాడు.. ఆ సిద్ధాంతం ఏంటో మాత్రం చెప్పడు! ప్రశ్నించి తీరతానంటాడు.. తీరా సమయం వచ్చే సరికి సీన్లో లేకుండా పోతాడు నమ్మినవాళ్లను నట్టేట ముంచి.. పక్కనోడి జెండా మోయాలనడం బాగా అలవర్చుకున్నాడు ఎమ్మెల్యేగా నెగ్గకపోయినా.. సీఎం అవుతాడని అభిమానుల కలలు కంటుంటే.. వాటిని తుంచేస్తాడు కులం కులం లేదంటూనే.. కుల రాజకీయాలు చేయాలని తీవ్రంగా యత్నించి భంగపడుతుంటాడు సినిమానా? రాజకీయమా? ఎటూ తేల్చుకోని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంటాడు పవన్ ఇక పార్ట్ టైం పొలిటీషియనా? .. ఆ విషయం తన నోటితోనే చెప్పేశాడా? కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క.. తెలంగాణ ఎన్నికల సమయంలో తెగ ట్రెండ్ అవుతున్న పేరు. తెలంగాణలో ఉద్యోగ అవకాశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే.. తన అసహనాన్ని బర్రెలు కాస్తూ ప్రకటించిందామె. ఆపై సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా ఈ-సెలబ్రిటీగా మారిపోయింది. ఎవరూ ఊహించని రీతిలో నాగర్‌కర్నూల్ కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా నామినేషన్ వేసింది. ఆపై కొందరు నిరుద్యోగులు ఆమెకు అండగా కదిలి వచ్చారు. చందాలేసి మరీ బర్రెలక్క కోసం ప్రచారంలోకి దిగారు. దీంతో ఆమె వార్తల్లో నిలిచింది. ఆమెపై నాటకీయ పరిణామాల నడుమ ఆమె వర్గంపై జరిగిన దాడి.. మీడియా ముఖంగా ఆమె కన్నీటి పర్యంతం.. అటుపై అనూహ్యంగా లభిస్తున్న మద్దతు చర్చనీయాంశంగా మారాయి. యువత పోటీకి దిగితే.. ఇలాంటి పరిణామాలా? అంటూ ఆమె ప్రశ్నించడం తెలంగాణ సమాజంలో చాలామందిని కదిలించింది కూడా. మరి.. తొమ్మిదిన్నరేళ్లుగా ఓ పార్టీని నడుపుతూ.. అంతకు ముందు ఆరేళ్ల కిందటే మరో పార్టీ యువ విభాగానికి పని చేసిన రాజకీయ అనుభవం ఉండి పవన్ చేస్తోందేంటి?.. టీడీపీ తొత్తు పార్టీ ట్యాగ్‌తో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలచేత ‘అన్‌ఫిట్’ అనిపించుకున్న పవన్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా పోటీ చేసే ధైర్యం చేయలేదు. అందుకు పార్టీ విస్తరణ, ఉనికిపరమైన కారణాలు ఉండొచ్చు. కానీ, అప్పుడెప్పుడో తొందరపడి 32 సీట్లకు పోటీ అని ప్రకటించుకుని.. చివరాఖరికి బీజేపీ మద్దతుతో 8 సీట్లలో(నామమాత్రమేమో!) పోటీకి దింపుతున్నాడు. పోనీ ఆ అభ్యర్థుల గెలుపు కోసం అయినా తీవ్రంగా యత్నిస్తున్నాడా? అంటే.. ఇక్కడా సీరియస్లెస్ రాజకీయాలే!. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు పట్టుమని వారం రోజులు కూడా లేదు. ప్రచారంలోకి దిగిందే ఆలస్యంగా.. ఇప్పుడేమో టైం లేదంటూ నేరుగా ప్రకటన చేశాడు. మీరూ మీరే ఇక చూసుకోవాలని.. మద్దతు ఇవ్వాలని జనసేన శ్రేణులకు సలహా ఇచ్చాడు. అంటే.. ఓటమికి పవన్ ప్రిపేర్ అయిపోయినట్లేనా?. ధరణి విఫలం, పేపర్ లీక్స్.. ఇవి తెలంగాణ ప్రభుత్వంపై పవన్ చేసిన విమర్శలు. ఇవి పైపై విమర్శలే!. లోతుగా వెళ్లి విమర్శించే ధైర్యం చూపించలేదు. పైగా రాజకీయాల్లో తాను విమర్శలు చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయంటూ కబుర్లు చెబుతున్నాడు. తెలంగాణలో ఎక్కువ తిరగలేదంట. కేటీఆర్‌తో, రేవంత్‌తో స్నేహం ఉందంట.. రాజకీయాలు, స్నేహం వేరట. కానీ, మోదీ నాయకత్వంలో పని చేస్తాడట. తెలంగాణలో, దేశంలోనూ బీజేపీనే అధికారంలోకి రావాలంటున్నాడు. బీజేపీతో కలిసి మనస్ఫూర్తిగా పని చేయాలని.. ఆ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని జనసేన కేడర్‌కు పవన్ పిలుపు ఇస్తున్నాడు. నిన్న వరంగల్‌లో.. ఇవాళ కొత్తగూడెంలో.. పవన్ ఈ సూటి వ్యాఖ్యలే చేశాడు. మద్ధతు ఇవ్వాలి అంటున్నారు కానీ, కనీసం గెలిపించాలని అనే మాట కూడా పవన్ నోట రావడం లేదు. గద్దర్ ఆశయం గెలిపించాలంటూ ఓ భారీ డైలాగ్ కొట్టాడు. మరి గద్దర్ కూతురు కాంగ్రెస్ అభ్యర్థి అనే సంగతి పవన్ మరిచిపోయి ఉంటాడేమో. గత రెండు రోజులుగా ప్రచారంలోకి దిగి పవన్ చేస్తున్న ప్రసంగాలు చూస్తే.. రాజకీయాల్లో ఓనమాల దశలో ఉన్న బర్రెలక్కలాంటి వాళ్లు ఇంతకంటే పరిణితి ప్రదర్శిస్తున్నారనే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. చిన్నవయసులోనే పోటీ.. నామినేషన్ దగ్గరి నుంచి ప్రచారంలోనూ ఆమె కనబరుస్తున్న చిత్తశుద్ధికి, ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అటు ఏపీలోనేమో తెలుగు దేశం పార్టీకి మద్దతు.. పొత్తుగా జనసేనను తాకట్టు పెట్టాడు. రేపు ఎన్నికల సమయంలో చంద్రబాబు విసిరే ఐదు పది సీట్లను మహాప్రసాదం అనుకోడని గ్యారెంటీ ఏంటి?. అప్పుడు ప్రచారంలోనూ ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే చాలని అనకుండా ఉంటాడా?. అందులో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. కాబట్టి.. జనసైనిక్స్ ఫిక్స్ అయిపోండి. పవన్ సర్.. ఇక పార్ట్‌టైం పొలిటీషియనే!. :::సాక్షి డిజిటల్ పొలిటికల్ డెస్క్ -
పాలిటిక్స్ నుంచి వసుంధర రిటైర్మెంట్..! క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం
కోట: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ స్టేట్ మాజీ సీఎం వసుంధర రాజే కీలక ప్రకటన చేశారు. తాను ఎక్కడికి వెళ్లడం లేదని ఇప్పట్లో పాలిటిక్స్‌లో నుంచి తన రిటైర్మెంట్ లేదని క్లారిటీ ఇచ్చారు. జలావర్ జిల్లాలోని జల్రాపటాన్ నియోజకవర్గం నుంచి వసుంధర శనివారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. పాలిటిక్స్‌లో నుంచి తాను రిటైర్ అవనున్నట్లు వస్తున్న ఊహాగానాలకు ఈ సందర్భంగా ఆమె తెరదించారు.తానెక్కడికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. కాగా, శుక్రవారం జరిగిన ఒక ప్రచార బహిరంగ సభలో వసుంధర చేసిన వ్యాఖ్యలు ఆమె రిటైర్మెంట్పై ఊహాగానాలు రావడానికి కారణమయ్యాయి. తన కుమారుడు ఎంపీ దుశ్యంత్ సింగ్ మంచి లీడర్‌గా తయారయ్యాడని, ఇక రిటైర్ అవ్వాల్సిన టైమ్ వచ్చిందని వసుంధర ఆ మీటింగ్‌లో అన్నారు. -
పులిటీషియన్లు.. కొంగబావలు
అడవిలో పులి వేటకు బయలుదేరింది. కొంతకాలంగా ఆ అడవిలో దానిదే రాజ్యం. ఎంత కావాలంటే అంత ఆహారం. రోజుకో జంతువు విందు. అందుకే తాపీగా లేచి ఒళ్లు విరుచుకుని అడవి మీద పడింది. మాంచి ఆకలి మీద ఉందేమో కాసింత పెద్ద జంతువునే వేటాడేసి.. ఆరగించడం మొదలుపెట్టింది. పులికైనా పొలిటీషియన్ కైనా ఎంత తిన్నా ఆకలి అలాగే ఉంటుందని.. ఓ పెద్ద రైటర్ ఏనాడో చెప్పాడు. దొరికిన జంతువును ఆబగా తింటూండేసరికి దాని ఎముకగొంతులో ఇరుక్కుంది. దీంతో విలవిల్లాడిన పులి దాన్ని బయటకు తీయాలని అన్ని జంతువులను బతిమాలింది. కొని పులి అరాచకంపై కోపంతో.. మరికొన్ని భయంతో మావల్ల కాదనేశాయి. ఇంతలో ఓ కొంగ దాని కంటపడింది. కొంగ బావను ఎలాగైనా ఒప్పించాలని.. దానితో మాటలు కలిపి..తన బాధను చెప్పింది. ముందు కొంగ కూడా ససేమిరా అంది. అయితే పులి కొంగకు ఆశలు పెట్టింది. తాయిలాలు చూపింది. అచ్చం ఎలక్షన్ టైమ్‌లో మన నాయకులలాగా.. ‘ ఇల్లు ఇస్తాం, పొలం ఇస్తాం, పింఛన్ పెంచుతాం. గ్యాస్‌ధర తగ్గిస్తాం.. ఈసారి ఓటేసి గట్టెక్కించండి...’’... అలా కొంగ బావకు రకరకాల ఆశలు పెట్టింది. దానితో కొంగ ఐసైపోయింది. మన ఓటరు లాగా. ‘ ఆహా.. చిన్న సాయానికే బతుకు మారిపోతుందే..’ అనుకుంది. తన పొడుగాటి ముక్కు పులి నోట్లో తల పెట్టి ఎముక చులాగ్గా లాగి పారేసింది. పులి ఊపిరి పీల్చుకుని కొంగకు «థ్యాంక్స్ చెప్పి బయలుదేరింది. అలా వెళుతున్న పులికి దాని బాసలు గుర్తుచేసింది. తొందరగా పని కానివ్వు అన్నట్టుగా. తర్వాత రెండు మూడు నెలలు గడిచాయి. పులి జాడలేదు. ఇచ్చిన మాట జాడలేదు. ఎలాగోలా పులిని వెతికి పట్టుకుని ‘..నీ మాటేమైంది..’ అని కొంగ అడిగింది. ‘ .. చూద్దాం అదే పనిలో ఉన్నా..’ అని పులి అక్కడ నుంచి జారుకుంది. అలా నెలలు గడుస్తున్నాయి. ఉలకదు పలకదు. అచ్చం మన ప్రజాప్రతినిధిలా. ఓసారి పులి ఎదురైతే కొంగ గాట్టిగా నిలేసింది. ‘..ఎంతో మేలు చేస్తానన్నావ్ నీ పని అయిపోయాక తప్పించుకు పోతున్నావ్....’ అని. దానికి పులి చిద్విలాసంగా..‘‘ నేను నీకు మేలు ఎప్పుడో చేసేసాను.. నా నోట్లో నీ తల పెట్టినప్పుడు వదిలేశా.. అంతకన్నా మేలు ఏముంటుంది..’ అని తాపీగా నడుచుకుంటూ పోయింది. కొంగబావ అవాక్కయ్యింది. ఎన్ని ప్రలోభాలు.. ఎన్ని మాటలు.. ఎన్ని మోసాలు అని తిట్టుకుంది. అది మనిషి కాదు కనుక దానికిది కొత్త.. మనకైతే ప్రతి ఐదేళ్లకోసారి అనుభవానికి వస్తూనే ఉంటుంది. ఎలక్షన్ వచ్చింది...పులిటీషియన్లను ఇప్పుడు ఓటర్లే కాపాడాలి. ఎవరు మనవాళ్లు, ఎవరు విపక్షం, కొంగబావలాగా ఎవరిని మచ్చిక చేసుకోవాలి, ఏమివ్వాలి? ఎంత ఇవ్వాలి? ఏమిస్తామని ప్రలోభ పెట్టాలి..ఇలా ఎన్నో లెక్కలు.. .. ఇస్తే ఓటేసేవారెవరు? తీసుకుని మరీ వేరేవాళ్లకు వేసేదెవరన్న ఈ అంశంపైనే అమెరికాకు చెందిన మిషిగన్, కాలిఫోర్నియా యూనివర్సిటీల పొలిటికల్ స్టడీస్ ప్రొఫెసర్లు.. ఆగ్నేయాసియా దేశాల్లో విస్తృతమైన అధ్యయనం చేశారు. ఓట్ల కొనుగోళ్ల విషయంలో ఉన్న కొన్నిరకాల అభిప్రాయాలు తప్పు అని తేల్చారు. అభ్యర్థులు, ఓటర్ల మనోభావాలు ఎలా ఉంటాయన్నది విశ్లేషించారు. ఇది క్లైంటెలిజమ్! ఓటర్లను ప్రలోభపెట్టడానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు డబ్బులు, వివిధ రకాల వస్తువులు, బహుమతులు పంచడమే క్లైంటెలిజమ్. పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది సాధారణమే. దీనివల్ల అధికారం కొందరు రాజకీయ నేతలకే పరిమితమైపోతుంది. సిద్ధాంతపరమైన, సామాజిక ప్రయోజనకర అంశాలు పక్కనపడి.. వ్యక్తిగత ప్రయోజనాలే ప్రధానమైపోతాయి. దానితో అభివృద్ధి కుంటుపడుతుంది. తాయిలాలకు ఓట్లు రాలుతాయా? డబ్బులు, బహుమతులు తీసుకున్నవారంతా ఓటేస్తారా? ఏదైనా తీసుకున్నప్పుడు, మరొకటి తిరిగిచ్చి రుణం తీర్చుకోవాలన్న సంప్రదాయం వర్కౌట్ అవుతుందన్న దానిపైనే తాయిలాలు తయారయ్యాయి... దీనిపై చేసిన సర్వేలో .. ఓటర్లు డబ్బులు, బహుమతులను తీసుకున్నా కూడా తమకు ఓటేయరేమోనని లేక ఓటేయడానికే రారేమోనని చాలా మంది అభ్యర్థులు భావిస్తున్నట్టు పేర్కొంది. కొందరు ఓటర్లు కూడా డబ్బు తీసుకున్నాక వేరేవారికి ఓటేయడం పట్ల పెద్దగా ఇబ్బంది పడాల్సిందేమీ లేదని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇందుకోసమేనేమో.. డబ్బులు తీసుకున్న ఓటర్లతో ఒట్టు పెట్టించుకోవడం, గుళ్లకు తీసుకెళ్లి ప్రమాణాలు చేయించడం, కుల సంఘాలు, అసోసియేషన్లలో ప్రమాణాలు చేయించడం వంటివి మన నేతలు చేస్తుంటారు. ఓట్లు అమ్ముకోవడం తప్పా? ఓట్లు కొనడం, అమ్ముకోవడం తప్పు అనే ప్రచారం ఉన్నా.. ఆ భావన అటు నేతల్లో, ఇటు ఓటర్లలోనూ కనబడటం లేదని అధ్యయనం పేర్కొంది. గెలవడానికి ఎంతెంత ఇచ్చాం, ఏమేం పంచామనేది నేతలు బహిరంగంగానే చెప్తున్నారని.. ‘వాళ్లు ఇస్తున్నారు. మేం తీసుకుంటున్నాం..’ అని చెప్పడానికి ఓటర్లు కూడా పెద్దగా ఇబ్బంది పడటం లేదని వెల్లడించింది. అందుకే ఓటేయడా నికి డబ్బులు తీసుకోవద్దంటూ జరిగే ప్రచారానికి పెద్దగా ఫలితం ఉండటం లేదని స్పష్టం చేసింది. వ్యతిరేకులపై ప్రభావం అంతంతే.. తమపై వ్యతిరేకత ఉన్నవారికి డబ్బులు, బహుమతులు ఇచ్చినా తమకు అనుకూలంగా ఓటేయర న్న విషయం రాజకీయ నాయకులకు తెలుసని అద్యయనం పేర్కొంది. తమకు అనుకూలమైన వా రిని అలాగే కొనసాగించుకునేందుకు, త టస్థంగా ఉన్నవారిని తమవై పు తిప్పుకొనేందుకు మా త్ర మే డబ్బులు పంచుతారని తేల్చింది. తమ వెంట నిలిచిన కార్యకర్తలకు ఏదో ప్రయోజనం కల్పించామన్న భావన కోసం, తమను నాయకుడిగా గుర్తించేందుకు వారికి డబ్బు, బహుమతులు ఇస్తుంటారని వివరించింది. .. అనుచరులకు కాంట్రాక్టులు, పదవులు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడం, కొన్నిసార్లు నేరుగానే డబ్బు సాయం చేయడం వంటివీ ఇందుకే.. ఇక ఇప్పుడు రాజకీయంగా తటస్థంగా ఉండేవారు తక్కువే. కానీ ఆ కొద్దిశాతం ఓట్లతోనే గెలుపోటములు మారిపోయే పరిస్థితులు ఎక్కువ. ఇక్కడే ‘పంపకాల’ ప్రయోజనం మరింత ఎక్కువన్నమాట. ప్రలోభాలకు లొంగవద్దనే ప్రచారాలతో ప్రయోజనమెంత? డబ్బు తీసుకుని ఓటేయడాన్ని నిరుత్సాహ పరిచేందుకు ఎన్నికల కమిషన్, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తుంటాయి. ఇందులో ఓటేసేందుకు ఎలాంటి డబ్బు, బహుమతులు తీసుకోవద్దనేది ఒకటైతే.. డబ్బు తీసుకోండి, కానీ మీకు నచ్చినవారికే ఓటేయండి అన్నది రెండో రకం ప్రచారం. నిజానికి రెండో రకం ప్రచారం వల్ల ఓటర్లు డబ్బులు తీసుకున్నా.. తమకు నచ్చిన, సమర్థుడైన నేతకే ఓటేస్తారన్న అభిప్రాయం ఉంటుంది. కానీ ఇది తప్పు అని అధ్యయనం తేల్చింది. ఏమీ తీసుకోవద్దు, ఓటును అమ్ముకోవద్దన్న ప్రచారంతోనే కొంత ప్రయోజనం ఉంటోందని పేర్కొంది. ఏమీ తీసుకోనివారిలో ఎలాంటి బెరుకు ఉండదని, నచ్చినవారికి ఓటేస్తారని తెలిపింది. అయితే పంచే డబ్బు/బహుమతి విలువ ఎక్కువగా ఉన్నప్పుడు ఓటర్లు తీసుకోకుండా ఉండలేకపోతున్నారని స్పష్టం చేసింది. ఇక.. ‘డబ్బు తీసుకోండి. నచ్చినవారికే ఓటేయండి’ అన్న ప్రచారం.. ఓట్ల కొనుగోలు, ప్రలోభాలను మరింతగా పెంచుతోందని అధ్యయనం స్పష్టం చేసింది. దీనివల్ల ఓటర్లు డబ్బు/బహుమతులు తీసుకోవడంలో మొహమాటాన్ని పక్కన పెట్టేస్తున్నారని, ఓట్ల కొనుగోళ్లకు ప్రయత్నించే నేతలకు పని సులువు అవుతోందని పేర్కొంది. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లాక.. ‘డబ్బులు తీసుకున్నప్పుడు ఓటేయకపోతే ఎలా..?’ అన్న మీ మాంసతో డబ్బులిచ్చిన అభ్యర్థికే ఓటేస్తున్నారని తెలిపింది. -
పొలిటీషియన్ కాదు..పొలిటికల్ లీడరే ముఖ్యం
ప్రజాస్వామ్య వ్యవస్థకు కావాల్సింది పొలిటికల్ లీడర్స్ మాత్రమే.. పొలిటీషియన్లు కాదనేది \ సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) డైరెక్టర్ ప్రొఫెసర్ ఈ.రేవతి అభిప్రాయం. మహిళా మానవ వనరుల వినియోగంలో ఇప్పటికీ ప్రభుత్వాలు విఫలమవ్వడాన్ని అన్ని పార్టీలూ గుర్తించాలని ఆమె అంటున్నారు. రాష్ట్రావతరణ తర్వాత పల్లె జీవనంలో మార్పు వచ్చిందన్నారు. ఆర్థిక, సామాజిక స్థితిగతులపై నిరంతరం అధ్యయనం చేసే సెస్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న రేవతి ఎన్నికల వేళ విధానపరమైన అంశాలపై ‘సాక్షి’తో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆమె మాటల్లోనే.... దృక్కోణంలో మార్పు కావాలి పొలిటీషియన్ ఆలోచన ఎప్పుడూ కూడా తాత్కాలిక అవసరాల వైపే ఉంటుంది. అప్పటికప్పుడు ప్రజలను ప్రభావితం చేసే ధోరణిలో ఉంటుంది. ఆ దృక్కోణం దీర్ఘకాలిక ప్రయోజనాలివ్వదు. ఎన్నికల్లో గెలవడమే గీటురాయిగా సాధ్యం కాని హామీలు ఇవ్వడం పొలిటీషియన్ లక్షణం. కానీ పొలిటికల్ లీడర్ అలా కాదు. ఓ విజన్ ఉంటుంది. భావి తరాలకు మేలు చేసే ఆలోచనావిధానం ఉంటుంది. రాజకీయాల్లో ఒక్కోసారి వీరు విజయం సాధించకపోవచ్చు. కానీ ఆలస్యంగానైనా వీరి దూరదృష్టే ప్రజలను ఆకర్షిస్తుంది. ప్రజలకు హామీలిచ్చేప్పుడు నేతలు ఆలోచించాలి. కార్యాచరణలోకి తేగలమన్న విశ్వాసం ఉన్నప్పుడే హామీలివ్వాలి. అన్ని పార్టీలూ ఈ దిశగా విధాన నిర్ణయం తీసుకోవాలి. యువశక్తిలో ఉద్వేగమెందుకు? రాష్ట్రావతరణ తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందింది. మౌలిక వసతుల కల్పన పెద్ద ఎత్తున జరిగింది. విదేశీ పెట్టుబడులూ పెరిగాయి. పరిశ్రమలూ స్థాపించారు. కానీ ఉపాధి వేటలో యువశక్తిలో నైరాశ్యం కన్పిస్తోంది. నిజానికి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇక ఉద్యోగాలొస్తాయనేది కలే. ఇక్కడే కాదు, యావత్ ప్రపంచంలో ఇదే పరిస్థితి. ప్రైవేటు రంగమే ఉపాధి మార్గం. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కన్పిస్తున్నా, యువతలో ఉద్యోగాల్లేవన్న ఆందోళనకు కారణాలున్నాయి. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా యువతలో నైపుణ్యం పెంచకపోవడమే దీనికి ప్రధాన కారణం. నిజానికి ఉపాధి పొందుతున్న వారిలో మహిళలు 25 శాతమే ఉన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేసే పరిస్థితి కల్పించే దిశగా పాలకులు ఆలోచించాలి. యూత్ ఉద్యోగాలు సాధించే నైపుణ్యం ఉంటేనే రాష్ట్ర సంపద కూడా పెరుగుతుంది. దీన్ని గుర్తించడంలో పాలకులు వెనకపడ్డారనే చెప్పాలి. అమెరికా వెళ్తున్న మన వారు పర్మనెంట్ ఉద్యోగమే చేస్తున్నారా? చేసే ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. అయినా మూడు నెలల్లో మరో ఉద్యోగం చూసుకోవడం లేదా? ఇక్కడి యువతలోనూ ఆ స్థాయి నమ్మకం, నైపుణ్యం కల్పించే దీర్ఘకాలిక ప్రయోజనాల వైపు పాలకులు దృష్టి పెట్టాలి. వలసలు తగ్గాయి.. జీవనం మారింది ఒకప్పుడు తెలంగాణలో వలసలు ఎక్కువగా ఉండేవి. మహబూబ్‌నగర్ నుంచి అనేక రాష్ట్రాలకు వెళ్లేవారు. ఇప్పుడు హైదరాబాద్ ఉపాధి అవకాశాల హబ్‌గా మారింది. దీంతో అన్‌స్కిల్డ్ సెక్టార్ నుంచి వలసలు తగ్గాయి. రాష్ట్రంలో 86 శాతం సన్న,చిన్నకారు రైతులున్నారు. ఇప్పుడు వీరు వ్యవసాయం ఒక్కటే ఉపాధి అనుకోవ డం లేదు. కుటుంబంలో ఓ వ్యక్తి వ్యవ ాయం చేస్తే, ఇంకో వ్యక్తి ఇతర ఉద్యోగాన్ని ఆశ్రయిస్తున్నాడు. ఉన్నత విద్యావంతులు మాత్రం వ్యవసాయం జోలికి వెళ్లడం లేదు. ఐఐటీ చేస్తే వ్యవసాయం చెయ్యకూడదని ఉందా? ప్రపంచీకరణ మార్పులను ప్రజలకు అవగాహన కల్పించడంలో అన్ని పార్టీలూ కృషి చేయాలి. సిరిసిల్ల వంటి చేనేత కారి్మకులున్న ప్రాంతాల్లో తెలంగాణ వచ్చాక మార్పు కన్పిస్తోంది. పవర్‌లూమ్స్ ద్వారా ఆదాయం పెంచుకున్నారు. ఇలా అన్ని సెక్టార్‌లోనూ స్కిల్ అభివృద్ధి చేయాలి. అప్పుడు నిరుద్యోగ సమస్య, యువతలో ఆగ్రహాన్ని కట్టడి చేయవచ్చు. నాణ్యమైన విద్య అందుతుందా? విద్యాబోధనలోనే తేడాలున్నాయి. ఇవి అసమానతలకు కారణమవుతున్నాయి. ప్రభుత్వ విద్యా రంగాన్నే చూడండి. గురుకులాలు... మోడల్ స్కూల్స్... కేజీబీవీలు... ప్రభుత్వ స్కూళ్ళు... స్థానిక సంస్థల స్కూళ్ళు... ఒక్కో చోట ఒక్కో నాణ్యత ఉంటోంది. నాణ్యమైన విద్య అందరికీ అందించాలనే ధోరణి పాలకుల్లో ఉండాలి. ఈ దిశగా మేధోమథనం జరగాలి. విద్యా విధానాలపై శాశ్వత మార్పులను ఆశించి నిర్ణయాలు తీసుకోవాలి. సమాజాన్ని మేలుకొల్పే విద్యను నిర్లక్ష్యం చేస్తే భావితరం ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. నూతన మార్పు తెచ్చేది రాజకీయ పార్టీలే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే. -వనం దుర్గాప్రసాద్ -
గ్యాంగ్‌స్టర్, మాజీ ఎమ్మెల్యే అన్సారీకి షాక్, పదేళ్ల జైలు, భారీ జరిమానా
Mukhtar Ansari: యూపీకి చెందిన గ్యాంగ్‌స్టర్ టర్న్డ్ పొలిటీషియన్,మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ మరోసారి భారీ షాక్ తగిలింది. ముఖ్తార్ అన్సారీ హత్య, హత్యాయత్నం కేసుల్లో దోషిగా తేల్చిన ఘాజీపూర్ కోర్టు శుక్రవారం పదేళ్ల జైలుశిక్ష, భారీ జరిమానా విధించింది. 2009 గ్యాంగ్స్టర్స్ యాక్ట్ కేసులో అన్సారీని గురువారం ఘాజీపూర్ జిల్లా ప్రత్యేక న్యాయమూర్తి (ఎంపీ-ఎమ్మెల్యే) అరవింద్ మిశ్రా అన్సారీని దోషిగా ప్రకటించారు. బందా జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీ విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన కోర్టు శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. అన్సారీ అనుచరుడు, సోనూ యాదవ్‌ను కూడా దోషి తేల్చింది. సోనుకు 5 సంవత్సరాల జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా విధించింది. అయితే దీనిపై హైకోర్టులో అప్పీలు చేస్తామనీ, తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని ముఖ్తార్ అన్సారీ తరఫు న్యాయవాది లియాఖత్ తెలిపారు. 2009లో కపిల్ దేవ్ సింగ్ హత్యకు కుట్ర పన్నిన ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు మీర్ హసన్ అనే వ్యక్తిపై దాడికి సంబంధించిన మరో కేసు కూడా ఉంది. ఘాజీపూర్‌లోని కరంద పోలీస్ స్టేషన్లో ముఖ్తార్‌పై గ్యాంగ్‌స్టర్ కేసు నమోదైంది. అయితే 2011, 2023లో ఈ రెండు కేసుల్లో అన్సారీని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అన్సారీకి 1996లో విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) నాయకుడు నందకిషోర్ రుంగ్తా, 2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్‌ను హత్య చేసిన కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ముఖ్తార్ అన్సారీ మౌ సదర్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. #WATCH | Ghazipur additional district government counsel (criminal) Neeraj Srivastava says, "A case was registered against Mukhtar Ansari and his aide Sonu Yadav in 2010. In connection with that case, both the accused were pronounced guilty yesterday and today arguments on the… https://t.co/hVsOHFXn9a pic.twitter.com/fK2QZq71Ii — ANI UP/Uttarakhand (@ANINewsUP) October 27, 2023 -
ఫిట్టా.. ఫట్టా
ఎన్నికల్లో పోటీ చేయనున్న రాజకీయ నేత గెలవడం అంటే...తనకు ఓటేసిన లక్షల మంది ప్రజల ఆశల్ని మోయడం. అంతటి బరువు బాధ్యతల్ని మోసే నేత ఆరోగ్యంగా ఉండాలి..అంతకన్నా ముందు ఆ నేత ఆరోగ్యం గురించి ప్రజలకు తెలిసి ఉండాలి...అది వారి హక్కు అంటోంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ). ఏళ్లనాటి ఈ డిమాండ్ ఇంకా డిమాండ్‌గానే మిగిలి ఉన్న నేపథ్యంలో నేతల ఆరోగ్యంపై అవగాహన నిజంగా ప్రజల హక్కుగానే భావించాలా? అయితే ఎందుకు? 2015లో జరిగిన ఎన్నికల సందర్భంలో రాజకీయ నాయకులు తమ ఆర్థిక పరమైన ఆస్తులను ప్రకటించినట్లే తమ ఆరోగ్య స్థితిగతుల్ని కూడా ప్రకటించాలని ఐఎమ్ఎ ప్రతినిధులు పిలుపునిచ్చారు. రాబోయే ఐదేళ్లపాటు రాజకీయ ఒత్తిడిని తట్టుకుంటూ ప్రజాసేవ చేయగలరా లేదా అని తెలుసుకోవడం తమ అభ్యర్థుల ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం ఓటరు హక్కు ’’ అని అప్పటి ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెకె అగర్వాల్ స్పష్టం చేశారు. అది తప్పనిసరి చేయాలి.. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలనుకున్నప్పుడు, అభ్యర్థి ఫిట్నెస్ పరీక్ష చేయించుకోవాలి. వైద్య పరీక్షలో ముందుగా ఉన్న ఏదైనా తీవ్రమైన వ్యాధిని గుర్తిస్తే సదరు అభ్యర్థి ఉద్యోగానికి అనర్హులవుతారనేది మనకి తెలుసు. అలాగే క్రీడల్లో కూడా ఫిట్నెస్ పరీక్ష జరపకుండా ఆడటానికి అనుమతించరు. అలాంటప్పుడు పాలనకు బాధ్యత వహించే రాజకీయ నేతను ఎలా అనుమతిస్తారు? ప్రపంచంలోని అదిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో నేత ఆరోగ్యాన్ని తనిఖీ చేయకుండా ఎన్నికలలో పోరాడటానికి అనుమతివ్వడం సరైనదేనా? అనేవి కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలే. దీనిని దృష్టిలో ఉంచుకునే... ‘‘ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వైద్య పరీక్షలు చేయించుకుని తమ ఆరోగ్య వివరాలు వెల్లడించడం తప్పనిసరిగా మార్చి దీని కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’’ అని నొక్కి చెప్పారు అప్పటి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎ మార్తాండ పిళ్లై. యువతపై ప్రభావం... మన దేశంలో రాజకీయ నాయకులను సెలబ్రిటీలుగా పరిగణిస్తారని, వారి ఆహారపు అలవాట్లు జీవనశైలి యువ తరాన్ని ప్రభావితం చేస్తాయని ఐఎంఏ అంటోంది. నేతలు ఊబకాయంతో ఉండడం అలాగే పొగ తాగటం లేదా మద్యపానం వంటి దురలవాట్లు కలిగి ఉండడం... యువ తరానికి తప్పుడు సందేశం ఇస్తుందనేది తమ ఆందోళనగా పేర్కొంది. రాజకీయ నేత... అట్టడుగు స్థాయిలో పని చేయగలమని, శారీరకంగా చురుగ్గా ఉన్నామని, ఏ సమయంలోనైనా ఆకస్మిక విపత్తు సంభవించిన ప్రదేశాలకు రాగలమని, మైళ్ల దూరం నడిచి ప్రజలకు కావలసిన సేవలు అందించగలమనే నమ్మకం ప్రజలకు అందించాలి. ఐఎంఎ నాటి ప్రతిపాదనలోని ఔచిత్యాన్ని నేతలు ఇప్పటికైనా గుర్తించి...తప్పనిసరి నిబంధన రాకున్నా...ఆస్తుల వెల్లడి తరహాలోనే స్వచ్ఛందంగానైనా తమ ఆరోగ్య వివరాలు వెల్లడిస్తే... అది గొప్ప మార్పుకు దారి తీయవచ్చు. అనారోగ్యంతో మరణిస్తే... ఒక నేత తన అనారోగ్యాన్ని దాచిపెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత దురదృష్టవశాత్తూ మరణిస్తే... ఉపఎన్నిక అనివార్యమై. అది ప్రజాధనం వృధాకి కారణం అవుతుంది. నాయకులు అంటే ప్రజలకు సేవకులు అనేది అందరూ చెప్పే మాటే... అయితే ఒడిదుడుకులను ఎదుర్కొని తమకు 5ఏళ్ల పాటు సేవలు అందించే శారీరక మానసిక సామర్థ్యం నేతలకు ఉందో లేదో తెలుసుకోవడం ప్రజల హక్కు కూడా. –డా.బీఎన్‌రావు, రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షుడు ఆరోగ్యంగా ఉంటేనే కదా...చెప్పింది చేయగలరు.. ఏ మనిషైనా ఆరోగ్యం అత్యవసరం అనేది తెలిసిందే. నేతలు ఇచ్చిన హామీలు అమలు చేస్తారనే కదా ప్రజలు గెలిపిస్తారు. ఆరోగ్యం ఉంటేనే కదా నేతలు తాము ఇచ్చిన హామీలు అమలు చేయగలరు. కాబట్టి... నేతల ఆరోగ్య వివరాలు ప్రజల హక్కు అనేది నిర్వవాదం.. దీనిపై తాజాగా ఐఎంఎ ఎటువంటి ప్రకటనా చేయనప్పటికీ...గతంలో చేసిన ఈ డిమాండ్ ఎప్పటికీ సజీవమే అని నేను భావిస్తున్నా. –డా.గుత్తా సురేష్, జాతీయ ఉపాధ్యక్షులు, ఐఎంఏ. -
ప్రపంచంలో అతి పెద్ద నివాసం భారత్‌లోనే.. యజమాని ఈయనే..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసం భారత్‌లోనే ఉందన్న విషయం మీకు తెలుసా? గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా ప్రాంతంలో ఉంది. బరోడా గైక్వాడ్స్ యాజమాన్యంలో ఉన్న లక్ష్మీ విలాస్ ప్యాలెస్ (Laxmi Vilas Palace) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసం. ఇది ఇంగ్లండ్ రాజ కుటుంబీల నివాసమైన బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే చాలా రెట్లు పెద్దది. 500 ఎకరాల విస్తీర్ణం లక్ష్మీ విలాస్ ప్యాలెస్ బరోడా రాజ కుటుంబానికి చెందిన నివాసం. ఈ ప్యాలెస్ 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. 19వ శతాబ్దపు ఇండో-సార్సెనిక్ కాలంలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించారు. ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద ప్రైవేట్ నివాసాల్లో ఇదే అతి పెద్దది. ఇంగ్లండ్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దది. ఆకట్టుకునే కళాకృతులు గుజరాత్‌లోని ఈ రాజ యుగం నాటి ప్యాలెస్‌లో విస్తృతమైన ఇంటీరియర్ డిజైన్లు ఆకట్టుకుంటాయి. మొజాయిక్లు, షాన్డిలియర్లు, కళాకృతులు, ఆయుధాలు, కళాకృతులు ఆకర్షిస్తాయి. అప్పటి బరోడా మహారాజు ప్రముఖ కళాకారుడు రాజా రవి వర్మను ప్రత్యేకంగా నియమించి పెయింటింగ్‌లు వేయించారు. విశాలమైన పార్క్ లాంటి మైదానాలు ఇందులో ఉన్నాయి. ఇందులో గోల్ఫ్ కోర్స్ కూడా ఉండటం విశేషం. ఈయనే యజమాని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ యజమాని హెచ్ఆర్హెచ్ సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ ( HRH Samarjitsinh Gaekwad). రంజిత్‌సిన్హ్ ప్రతాప్‌సిన్హ్ గైక్వాడ్, శుభంగినీరాజేల ఏకైక కుమారుడు. 1967 ఏప్రిల్ 25న జన్మించిన ఈయన మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్. డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్లో చదువుకున్నారు. సమర్జిత్సిన్హ్ తన తండ్రి మరణం తర్వాత 2012లో మహారాజుగా పట్టాభిషక్తుడయ్యారు. ఈ వేడుక లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో 2012 జూన్ 22న అట్టహాసంగా జరిగింది. 2013లో తన మామ సంగ్రామ్‌సింగ్ గైక్వాడ్‌తో పాత వారసత్వ వివాదాన్ని పరిష్కరించుకుని లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌కు యజమాని అయ్యారు. రూ. 20,000 కోట్లకు పైగా ఆస్తి సంక్రమించింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లోని బనారస్‌లో 17 దేవాలయాలను నిర్వహించే దేవాలయాల ట్రస్టు సమర్జిత్సిన్హ్ ఆధీనంలో ఉంది. 2014లో బీజేపీలో చేరిన ఈయన 2017 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. సమర్జిత్సిన్హ్ వాంకనేర్ రాష్ట్ర రాజకుటుంబానికి చెందిన రాధికారాజేని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. -
'వ్యూహం' టీజర్ విడుదలపై అప్డేట్ ఇచ్చిన వర్మ
టాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా 'వ్యూహం', 'శపథం' అనే సినిమాలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా రాజకీయాల నేపథ్యంలోనే సినిమాలు తీస్తోన్న వర్మ ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి జీవితం ఆధారంగా ఈ సినిమాలు రూపొందిస్తున్నట్లు గతంలో ఆయన తెలిపారు. అయితే ముందుగా ‘వ్యూహం’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ‘వ్యూహం’ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ను ఆయన రివీల్ చేశారు. జూన్ 24న ఉదయం 11 గంటలకు టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు ట్వీటర్ ద్వారా ఆయన ప్రకటించారు. pic.twitter.com/p2ydsvMKxz — Ram Gopal Varma (@RGVzoomin) June 22, 2023 -
Ashneer Grover : ఎన్నాళ్లు ఇలా ప్రభుత్వాలకు ఊడిగం చేయాలి? :
విదేశాల్లో అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై కేంద్రం టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) ను వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కొత్త పన్ను విధానాన్ని, అందులోని లోపాల్ని భారత్ పే మాజీ సహ వ్యవస్థాపకులు అశ్నీర్ గ్రోవర్ విమర్శిస్తూ వస్తున్నారు. తాజాగా, మరో సారి ట్యాక్స్ పేయర్లు ప్రభుత్వాలకు ఊడిగం చేస్తున్నారంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పైగా పన్నులు చెల్లించడం ఓ శిక్షే’నని అన్నారు. ఈ మేరకు పన్ను చెల్లింపులపై పలు మార్లు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఎన్నాళ్లు ఇలా ఊడిగం చేయాలి కేంద్రం పన్నుల చెల్లింపు దారుల నుంచి 30 నుంచి 40 శాతం వరకు ట్యాక్స్ వసూలు చేస్తుందని, ప్రతిగా ఎలాంటి ప్రతిఫలం పొందలేకపోతున్నారని అశ్నీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్యాక్స్ పేయర్లు తమ సంపాదనలో కొంత బాగాన్ని దేశానికి ఇస్తున్నారు. కానీ వాళ్లు ఎలాంటి లబ్ధి పొందడం లేదు. రూ.10 మనం (ట్యాక్స్ పేయర్లను ఉద్దేశిస్తూ) సంపాదిస్తే అందులో రూ.4 ప్రభుత్వానికే ఇస్తున్నాం. దీంతో 12 నెలల సమయంలో 5 నెలలు ప్రభుత్వానికే పనిచేస్తున్నారు. అయినా ఇలా ట్యాక్స్ పేయర్లు వారీ జీవితంలో ప్రభుత్వాలకు ఎన్నాళ్లు ఇలా ఊడిగం చేయాలని ప్రశ్నించారు. కానీ పరిస్థితుల్ని బట్టి నడుచుకోవాల్సిందే తప్పదు’’ అని వ్యాఖ్యానించారు. ఉద్యోగులు ట్యాక్స్ ఎగవేతకు పాల్పడలేరు అంతేకాదు, వ్యాపారస్థులకు ట్యాక్స్ కట్టకుండా ఎలా తప్పించుకోవాలో తెలుసు. కానీ ఉద్యోగుల పరిస్థితి అలా కాదు. వేరే ప్రత్యామ్నాయం లేదు. శాలరీ నుంచే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. పైగా 18 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారు. అందుకే ట్యాక్స్ అనేది శిక్షతో సమానమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు అశ్నీర్ గ్రోవర్. నేనే రాజకీయ నాయకుడిని అయితే దేశంలో ఆదాయపు పన్ను రేటును తగ్గించేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరూ 10 నుంచి 15 శాతం ట్యాక్స్ కట్టేలా నిర్ధేశిస్తా. తద్వారా ఇప్పుడు ఎక్కువ పన్నులు కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే పన్ను తక్కువగా ఎగవేతకు ప్రయత్నించరు. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని అన్నారు. పార్టీలకు ఇచ్చే డొనేషన్లపై జీరో ట్యాక్సా గత నెలలో విదేశాల్లో క్రెడిట్ కార్డ్ వినియోగంపై 20 శాతం టీసీఎస్ వసూలు చేయడాన్నీ గ్రోవర్ తప్పుబట్టారు. విదేశాల్లో క్రెడిట్‌కార్డు వాడకంపై 20 శాతం పన్ను పార్టీలకు ఇచ్చే డొనేషన్లకు మాత్రం జీరో ట్యాక్స్ అంటూ ఎద్దేవా చేశారు. చదవండి👉 ‘విలాసాల రుచి మరిగి’..అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌కు మరో ఎదురు దెబ్బ! -
ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో పెళ్లి ఫిక్స్?
నితిన్ సరసన 'లై' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ మేఘా ఆకాష్. ఇటీవలే మాస్ మాహారాజా రవితేజ నటించిన రావణాసుర సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించింది. ఛల్ మోహన్ రంగ, పేట, రాజా రాజా చోర లాంటి తెలుగు సినిమాల్లో కనిపించినా అమ్మడికి మాత్రం భారీ విజయం తలుపుతట్టింది లేదు. తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదం.. అయినా గాయాలతోనే సెట్‌కు: షాహిద్ కపూర్) తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో మేఘా ఆకాష్ పెళ్లి ఫిక్సయినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అతను మేఘా ఆకాష్ కుటుంబానికి స్నేహితుడని తెలుస్తోంది. వీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని.. తర్వలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినున్నారని తెలుస్తోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటూనే.. ఇంకోపక్క తన తల్లితో కలిసి నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. గతేడాది ఒక సినిమాను ఒకే చేసి.. తాజాగా సెట్స్ మీదకు తీసుకెళ్లింది. అయితే ఇప్పటివరకు పెళ్లి వార్తలపై మేఘా ఆకాష్ స్పందించలేదు. (ఇదీ చదవండి: అఫీషియల్: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఇదే!) -
పొలిటీషియన్‌ను పెళ్లాడిన బుల్లితెర నటి.. దాదాపు పదేళ్ల తర్వాత!
ప్రేమకు వయసుతో సంబంధం లేదంటూ ఉంటారు. నిజమే మనసులు కలిస్తే చాలు. ఏ వయసులోనైనా పెళ్లి చేసుకోవచ్చేనేది ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. వయసుతో ఎలాంటి సంబంధం లేకుండానే పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ ఈ ట్రెండ్‌ను బాగా ఫాలో అవుతున్నట్లుంది. తాజాగా ఓ బుల్లితెర నటి తనకంటే 21 ఏళ్లు పెద్ద అయినా ఓ పొలిటీషియన్‌ను పెళ్లి చేసుకుంది. అయితే పదేళ్ల క్రితమే వివాహం చేసుకున్న నటి తాజాగా ఈ విషయాన్ని బయపెట్టింది. గతంలో కూడా దిలీప్ కుమార్, సైరా బాను జంట మధ్య వయస్సు అంతరం ఉన్నా వివాహబంధంతో ఒక్కటయ్యారు. (ఇది చదవండి: అవార్డులు కొల్లగొట్టిన ఆలియా భట్ మూవీ..!) కాగా.. బుల్లితెర నటి స్నేహల్ రాయ్ ఇష్క్ కా రంగ్ సఫేద్ సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత జన్మో కా బంధన్, విష్, పర్ఫెక్ట్ పతి, ఇచ్ఛప్యారీ నాగిన్ టీవీ షోలలో నటించింది. పెళ్లైన మహిళల అందాల పోటీలో పాల్గొన్న స్నేహల్ రాయ్ తన వివాహం గురించి చెప్పుకొచ్చింది. పొలిటీషియన్ మధ్వేంద్ర కుమార్ రాయ్‌తో వివాహం జరిగి 10 సంవత్సరాలు అవుతుందని తెలిపింది. తన భర్త తనకంటే 21 ఏళ్లు పెద్దవాడని వెల్లడించింది. అంతే కాకుండా తన భర్త కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని చెప్పుకొచ్చింది భామ. (ఇది చదవండి: అమ్మా, నాన్న చనిపోతే.. వారే అంతా పంచుకున్నారు: తేజ) తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమంలో మధ్వేంద్రను కలిశానని స్నేహల్ రాయ్ వివరించింది. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారి చివరికి పెళ్లి చేసుకున్నామని తెలిపింది. మేమిద్దరం మా మధ్య వయసు అంతరం గురించి ఎప్పుడు ఆలోచిందని పేర్కొంది. నా చిన్నతనంలో అమ్మ పడిన కష్టాలు దగ్గరుండి చూశానని.. నాన్నతో విడిపోయాక ఆహారం, డబ్బులేక కేవలం నీళ్లతోనే కడుపు నింపుకుని బతికామని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. View this post on Instagram A post shared by Snehal Rai (@snehalraiofficial) -
రిచెస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు.. ఏడీఆర్ నివేదికలో అసలు వాస్తవం
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో అత్యధిక ధనవంతుడు చంద్రబాబుగా ఏడీఆర్ నివేదికలో అసలు వాస్తవం బయటపడింది. దేశంలోనే మూడో ధనిక ఎమ్మెల్యేగా చంద్రబాబును ఏడీఆర్ నివేదిక పేర్కొంది. చంద్రబాబు రిచెస్ట్ అనే వాస్తవాన్ని ఎల్లో మీడియా దాచిపెట్టింది. దేశంలో ధనిక ఎమ్మెల్యేల జాబితాలో మొదటి స్థానం ఎన్ నాగరాజు, రెండో స్థానం డీకే శివ కుమార్ ఉండగా, రూ.668 కోట్లతో ఏపీలో మొదటి స్థానం, దేశంలో 3వ స్థానంలో చంద్రబాబు ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్ట్ వెల్లడించింది. చదవండి: చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ సెగ.. ఈడ్చిపడేయాలంటూ ఆదేశాలు -
ఐఫోన్లపై పెగాసస్ తరహా స్పైవేర్ ఎటాక్: సంచలన రిపోర్ట్
న్యూఢిల్లీ: భద్రతకు పెట్టింది పేరైన ఐఫోన్లు పెగాసస్ తరహా స్పైవేర్ ఎటాక్ గురయ్యాయట. ప్రముఖ రాజకీయవేత్తలు, జర్నలిస్టుల ఐఫోన్లను హ్యాకింగ్‌పై షాకింగ్ రిపోర్ట్ ఒకటి సంచలనం రేపుతోంది. జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కొంతమంది స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలకు చెందిన ఐఫోన్లు ఇజ్రాయెల్ ఆధారిత స్పైవేర్ మేకర్ పెగాసస్ తరహా స్పైవేర్ దాడికి గురైనట్టు మైక్రోసాఫ్ట్ అండ్ డిజిటల్ రైట్స్ గ్రూప్ సిటిజన్ ల్యాబ్ పరిశోధకులు వెల్లడించారు. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ విశ్లేషకులు క్వాడ్రీమ్ స్పైవేర్ ద్వారా హ్యాక్ చేసినట్టు గుర్తించింది. ప్రధానంగా యాపిల్ డివైస్‌లే లక్ష్యంగా ప్రత్యేకంగా ఐవోఎస్ వెర్షన్లు 14.4, 14.4.2 తోపాటు కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లపై మాల్వేర్ DEV-0196 దాడిచేసిందని తెలిపింది. ఉత్తర అమెరికా, మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, యూరప్ , మిడిల్ ఈస్ట్లలో కొత్త బాధితులను గుర్తించిన తర్వాత పెగాసస్ తరహా స్పైవేర్ దాడి భయం మళ్లీ తెరపైకి వచ్చింది. అలాగే బల్గేరియా, చెక్ రిపబ్లిక్, హంగేరి, ఘనా, ఇజ్రాయెల్, మెక్సికో, రొమేనియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ఉజ్బెకిస్తాన్‌లలో క్వాడ్రీమ్ సర్వర్లను గుర్తించినట్లు నివేదిక పేర్కొంది. (షాకింగ్! ప్రపంచంలోనే ఖరీదైన లిక్విడ్: చిన్న డ్రాప్ ధర పదివేలకు పైనే) 'ENDOFDAYS' అని పిలిచే జీరో-క్లిక్ దాడిచేసినట్టు టొరంటో విశ్వవిద్యాలయం సిటిజెన్ ల్యాబ్ ఒక ప్రకటనలో తెలిపింది. యూజర్లు ఏదైనా హానికరమైన, ఫిషింగ్ లింక్స్ పై క్లిక్ చేయకుండానే జరిగే దాడులను "జీరో-క్లిక్" అని పిలుస్తారు. ఈ స్పైవేర్ ఆపరేటర్ నుండి బాధితులకు అదృశ్య iCloud క్యాలెండర్ ఆహ్వానాలను ఉపయోగించినట్లు కనిపిస్తోందని పేర్కొంది. (Tecno Phantom V Fold వచ్చేసింది: అతి తక్కువ ధరలో, అదిరిపోయే పరిచయ ఆఫర్) కాగా పెగాసెస్ వివాదం నేపథ్యంలో యాపిల్ స్పైవేర్ డిటెక్టర్ టూల్ ‘ఇమేజింగ్’ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఐఫోన్లలో ‘పెగాసెస్ స్పైవేర్’ని కనిపెట్టవచ్చట.ఈ కొత్త టూల్ ఐఫోన్ బ్యాకప్, ఇతర ఫైల్స్‌ను చెక్ చేసి మాల్వేర్ ఏదైనా చొరబడిందా లేదా అని నిర్ధారిస్తుందంటూ అప్డేట్ చేసినసంగతి తెలిసిందే. -
పొలిటీషియన్తో పరిణీతి పెళ్లి? క్లారిటీ ఇచ్చిన ఆప్ నేత.. వీడియో వైరల్
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ప్రస్తుతం ఇండస్ట్రలో హాట్‌టాపిక్ నిలిచింది. కొంతకాలంగా తెరపై పెద్ద వినిపించిన ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఆప్ పార్టీకి చెందిన యంగ్ పొలిటిషియన్ రాఘవ చద్దాతో పరిణీతి ప్రేమలో మునిగితేలుతుందంటూ కోద్ది రోజులుగా నెట్టంట జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటివలె ఇద్దరు జంటగా డిన్నర్ డేట్‌కు వెళ్లి మీడియా కంట పడ్డారు. దాంతో వారి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: ఇటీవల భార్యకు ఆ హీరో విడాకులు.. ఇప్పుడు మీనాతో రెండో పెళ్లి! నటుడు సంచలన వ్యాఖ్యలు అప్పటి నుంచి వీరి ప్రేమ, పెళ్లి రూమర్స్ బి-టౌన్‌తో పాటు రాజకీయాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ పార్లమెంట్ సమావేశానికి హజరయ్యేందుకు వచ్చిన రాఘవ చద్దాకు మీడియా నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. పలు రాజకీయ అంశాలతో పాటు పరిణీతి చోప్రా గురించి విలేకర్లు ప్రశ్నించారు. ఇటీవల మీ ఇద్దరి ఫొటోలు వైరలయ్యాయి.. ఏంటీ సార్ ఏమైన శుభవార్త ఉందా? అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి రాఘవ చద్దా ముసిముసి నవ్వుతూ ‘రాజకీయ అంశాల గురించి అడగండి. కానీ.. పరిణితీ చోప్రా గురించి అడగోద్దు’ అంటూ సిగ్గుపడుతూ సమాధానం ఇచ్చాడు. చదవండి: నాటు నాటుకు ఆస్కార్ నా వల్లే వచ్చింది: అజయ్ దేవగన్ ఇక దీనిపై మీరు స్పందించాల్సిందే అని విలేకరి అడగ్గా.. ‘సమయం వచ్చినప్పుడు చెబుతాను’ అంటూ పార్లమెంటులోకి నడిచారు రాఘవ చద్దా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఇక త్వరలోనే రాఘవ చద్దా-పరిణితిలు పెళ్లి ప్రకటన రానుందా? అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల పరిణీతి పెళ్లి స్పందిస్తూ తన సహానటీనటులు, స్నేహితులంత పెళ్లి పీటలు ఎక్కారని, వారిని చూస్తుంటే తనకు కూడా వివాహం చేసుకోవాలని ఉందంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రస్తుతం తాను సింగిల్ అని, వరుడు కావాలంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. Hehe! @raghav_chadha 🤭 That smile. Aap mujhse rajneeti ke sawal kariye, Parineeti ke nahi kariye. Video zaroor dekhiye! pic.twitter.com/CJhsUNkhP3 — Mohak🇮🇳 (@mohak_kohli) March 24, 2023 -
ఆప్ నేతతో స్టార్ హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ పంజాబీ బ్యూటీ. 2011లో లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ అవార్డ్ దక్కింది. ఇప్పటికే పలు హిట్ చిత్రాలతో అభిమానులను అలరించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త తెగ వైరలవుతోంది. ప్రస్తుతం పరిణితీ డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా పరిణీతి ఆప్ పార్టీకి చెందిన పొలిటిషియన్‌తో డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ చద్దా అనే వ్యక్తితో కలిసి ముంబయిలో కెమెరాలకు చిక్కింది. నగరంలోని ఒక రెస్టారెంట్ నుంచి బయటకు వస్తుండగా ఈ జంట కెమెరాల కంటపడ్డారు. దీంతో డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. పరిణితీ, రాఘవకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా.. గతంలో పరిణితీ చోప్రాపై చాలా సార్లు డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. కాగా.. ప్రస్తుతం పరిణీతి తదుపరి చిత్రం చమ్కిలాలో కనిపించనుంది. ఈ చిత్రంలో పరిణీతితో దిల్జిత్ దోసాంజ్ నటిస్తున్నారు. పరిణీతి చివరిసారిగా అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, బోమన్ ఇరానీ, నీనా గుప్తా నటించిన ఉంఛాయి చిత్రంలో కనిపించింది. -
హామీలు నెరవేర్చకపోతే.. అక్కడ నాయకుల పని ఫినిష్! బంధించి..
ప్రజలు చేత ప్రత్యక్ష్యంగా ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారిగా ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. ఐతే ప్రతి నాయకుడు తనని గెలిపిస్తే ఇవి చేస్తాం, అవి చేస్తాం అంటూ ఎన్నెన్నో హామీలు ఇచ్చేస్తుంటారు. ఆ తర్వాత గెలిచాక అసలు వాటిని గుర్తుంచుకునే తీరికే లేనట్లు ప్రవర్తిస్తారు. మళ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు ప్రజలు గానీ, వారికిచ్చిన హామీలు గానీ వారికి గుర్తేరావు, ఔనా! ఐతే ఇక్కడ ఆ ఊరిలో మాత్రం అలా కుదరదట. నాయకులు హామీలు నెరవేర్చకపోతే ఇక అంతే సంగతులు. ప్రజలే అక్కడ వారిని బహిరంగంగా శిక్షిస్తారు. మళ్లీ ఇలాంటి పని చేయకుండా వారిలో మార్పు వచ్చేలా చేస్తారట. వివరాల్లోకెళ్తే..ఇటలీలో ఓ చిన్న పట్టణంలో ఈ వింత ఆచారం కొనసాగుతోంది. అక్కడ తాము ఎన్నుకున్న నాయకుడు తప్పుడుగా వ్యవహరించినా, తప్పుడు పనులు చేసినా ఇక అంతే సంగతులు. అలాగే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయినా.. వారిని బోనులో బంధించి నీటిలో ముంచేస్తారు. అలా అని వారిని చనిపోయేంత వరకు నీటిలో ముంచేయరు. తాము చేసిన తప్పు వారికి అవగతమయ్యేలా జస్ట్ ఒక్క సెకను మాత్రమే అలా బోనులో బంధించి నీటిలో ముంచుతారు. ఇది వారికి ఒక అవమానంలా అనిపించి ఎలాంటి తప్పులు దొర్లకుండా తమ విధులను సక్రమంగా నిర్వర్తించేలా చేయడమే తప్ప మరో ఉద్దేశ్యం ఏమి లేదని చెబుతున్నారు అక్కడి స్థానికులు. ఇది ఇటలీలోని టోంకాలో సాంప్రదాయకంగా జరుగుతుంది. ప్రతి ఏడాది జూన్ చివరిలో జరిగే విజిలియన్ వేడుకలో ఇది ఒక భాగం. అంతేగాదు ఈ శిక్షలను జూన్ 26కు ముందు, చివరి ఆదివారం విధిస్తారు. గతేడాది 2022 జూన్ 19న దీనిని నిర్వహించారు. 2023, జూన్ 25 ఈ కార్యక్రమం ఉంటుంది. (చదవండి: మంటల్లో చిక్కుకున్న బస్సు..అదే టైంలో కండక్టర్ నిద్రిస్తుండటంతో..) -
భర్తను చంపేందుకు ఆరుసార్లు యత్నం...మహిళకు 50 ఏళ్లు జైలు శిక్ష
మురికవాడలో పెరిగిన ఒక నిరుపేద మహిళను పెళ్లి చేసుకుని మంచి జీవితం ఇచ్చాడు. రాజకీయ నాయకురాలిగా ఎదిగేలా చేశాడు. అందుకు ప్రతిఫలంగా భర్తనే కడతేర్చేందుకు యత్నించి కటకటాల పాలయ్యింది. ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....బ్రెజిలియన్ మాజీ కాంగ్రెస్ మహిళ ఫ్లోర్డెలిస్ డాస్ శాంటోస్ మురకివాడల్లో పెరిగింది. ఆమెను 1994లో పాస్టర్ ఆండర్సన్ డో కార్మో కలుసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంట మురికివాడల్లోని డజన్ల కొద్ది పిల్లలను దత్తత తీసుకుని ఎంతో ఆదర్శంగా నిలిచారు. బ్రెజిల్‌లోని ఎవాంజెలికల్ క్రిస్టియన్ ఉద్యమంలో కూడా ఈ జంట మంచి పేరుగాంచారు. అంతేగాదు శాంటోస్ 2018లో కన్జర్వేటివ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరుఫున శాంటోస్ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యింది కూడా. ఐతే ఆర్ధిక వ్యవహారాల విషయాల్లో ఆమె భర్త డో కార్మో చాల కఠినంగా వ్యవహరిస్తుంటాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. అదీగాక ఆమె ఎప్పుడైతే రాజకీయవేత్తగా ఎదగడం ప్రారంభమైందో అప్పటి నుంచి శాంటోస్ తన భర్తను హతమార్చేందుకు యత్నించింది. ఇలా ఆమె అతన్ని సుమారు 6 సార్లు విషప్రయోగం చేసి హతమార్చేందుకు యత్నించింది. ఇక చివరికి తన బంధువు సాయంతో ఆయుధాన్ని కొనుగోలు చేసి మరీ 2019లో హతమార్చింది. దీన్ని సాయుధ దోపిడి హత్యగా చిత్రికరించేందుకు యత్నించింది. ఐతే ఆ సమయంలో ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకోవడం సాధ్యం కాలేదు. ఆమె ఇటీవల 2021 పార్లమెంటరీ ఎన్నికల్లో ఓడిపోయి పదవిని కోల్పోవడంతో పోలీసులు ఈ కేసును చేధించే మార్గం సుగమం అయ్యింది.తదనంతర విచారణలో ఆమె తన కుటంబ సభ్యులు, పిల్లల సాయంతో తన భర్తను హతమార్చినట్లు తేలింది. దీంతో బ్రెజిల్ కోర్టు ఆమెకు 50 ఏళ్లు జైలు శిక్షవిధించింది. ఆమెకు ఈ హత్యలో సహకరించి తన కుమార్తెకి 30 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ హత్యలో ఆమెకు ఆయుధం కొనుగోలు చేసి సాయం అందించిన బంధువుకి కూడా ఏడాది క్రితమే జైలు శిక్ష విధించింది. (చదవండి: చైనాలో టెస్లా కారు బీభత్సం.. రెప్పపాటులో ఎంత ఘోరం) -
ఆ వీడియోని చూసి...కన్నీళ్లు పెట్టుకున్న పాక్ నాయకుడు
పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ సెనెటర్ ఆజం ఖాన్ స్వాతి ఒక అభ్యంతరకర వీడియో గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆజం ఖాన్ గతనెలలో ట్విట్టర్లో జనరల్ కమర్ జావేద్ బజ్వాను విమర్శించడంతో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) ఆయన్ను అరెస్టు చేసింది. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల అయ్యారు. ఈ మేరకు ఆయన విలేకరులు సమావేశంలో ప్రసంగిస్తూ...తన భార్యకు గత రాత్రి ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి అభ్యంతరకర వీడియో వచ్చిందని చెప్పారు. ఐతే నా దేశంలో కూతుళ్లు, మనవరాళ్లు ఉన్నారు కాబట్టి ఆ వీడియో గురించి ఏమి ప్రస్తావించలేను అంటూ కన్నీరు పెట్టుకున్నారు. తాను తన భార్య క్వెట్టాను సందర్శించినప్పుడూ ఈ వీడియోని తీశారని, దీంతో తనను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారంటూ ఆవేదన చెందారు. అంతేగాదు తనను కస్టడీలో ఉంచి బట్టలు విప్పి ఎగతాళి చేస్తూ.. టార్చర్ చేసినట్లు తెలిపారు. ఐతే ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అది ఫేక్ వీడియో అని, ఫోటోషాప్తో సృష్టించిన నకిలీ వీడియో అని ప్రకటించింది. ఐతే సెనెటర్ ఈ విషయమై ఒత్తిడి చేస్తున్నారు కాటట్టి అధికారికంగా దరఖాస్తు దాఖలు చేస్తే విచారణ చేస్తామని ఫెడరల్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఈ మేరకు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ...ఆజం ఖాన్ స్వాతిని చిత్రహింసలకు గురిచేయడాన్ని ఖండించారు. అలాగే ఆయన భార్య అనుభవిస్తున్న అవమానకరమైన బాధ, ఆవేదనకు పాకిస్తాన్ తరుఫున తాను క్షమాపణలు చెబుతున్నాను అని అన్నారు. Shocking details of what happened last night to Azam Swati and his family being stated by @AzamKhanSwatiPk himself 1/2 pic.twitter.com/gdLpAW30qe — PTI (@PTIofficial) November 5, 2022 (చదవండి: వారెవ్వా.. సరికొత్త గిన్నిస్ రికార్డ్.. ‘కీహోల్’లోంచి ఏడు బాణాలు!) -
బెయిల్‌పై విడుదల: రాజకీయ నాయకుడికి అట్టహాసంగా ఘనస్వాగతం
నోయిడా: రాజకీయ నేత శ్రీకాంత్ త్యాగి మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించి జైలు పాలైన సంగతి తెలిసిందే. ఐతే ఆ నాయకుడు ప్రస్తుతం బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో అతని అనుచర వర్గాలు అతనికి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. పైగా శ్రీకాంత్ బాయ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు సదరు రాజకీయ నాయకుడు త్యాగి తన ప్రత్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ...తనపై చేసిన గ్యాంగ్‌స్టర్ వంటి ఆరోపణలు కల్పితమన్నారు. తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసే ప్రక్రియలో భాగంగా ఈ క్రుట్రలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వివాదంలోకి తన సోదరిని కూడా లాగి తమ మధ్య గొడవలు సృష్టించాలని చూశారన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో తనకు తన కుటుంబానికి అండగా నిలిచిని తమ కమ్యూనిటీ వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను రాజకీయాల్లోనే ఉంటానని, తాను చేయాల్సింది చాలా ఉందని చెప్పుకొచ్చాడు. తన తదుపరి నిర్ణయాల విషయమై మాట్లాడుతూ...తన మద్దతుదారులతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. త్యాగికి అలహాబాద్ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేయడంతో అతను గురువారం జైలు నుంచి విడుదలయ్యాడు. వాస్తవానికి త్యాగి గ్రాండ్ ఓమాక్స్ సొసైటీలో ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో వైరల్ కావడంతో అతన్ని అరెస్టు చేశారు. అతనిపై దోపిడీ నేరం, గ్యాంగ్‌స్టర్, మహిళలపై దాడి చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఐతే త్యాగి మాత్రం బీజేపీ రైతు విభాగం సభ్యుడినని చెబుతూ... పార్టీ అధినేత జేపీ నడ్డాతో దిగిన ఫోటోలను చూపిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం సీరియస్‌గా ఆ వ్యాఖ్యలను ఖండించడం గమనార్హం. (చదవండి: మూడేళ్లుగా మారువేషంలో.. బౌద్ధ సన్యాసి ముసుగులో భారత్‌లో గూఢచర్యం?) -
అర్చనా నాగ్ వెర్షన్ డర్టీ పిక్చర్ ఇది
భువనేశ్వర్: అర్చనా నాగ్.. ఒడిషాలో కలకలం రేపిన పేరు. వీవీఐపీలకు వలపు వల విసిరి ముగ్గులోకి దించి.. ఆపై బ్లాక్‌మెయిలింగ్‌తో కోట్లు దన్నుకున్న వగలాడి. ఓ నిర్మాత ఫిర్యాదుతో కదిలిన ఈ తేనెతుట్టు(హనీట్రాప్) ఒడిషాలో రాజకీయ ప్రముఖులకు మాత్రమే కాదు.. బెంగాల్‌కు చెందిన సెలబ్రిటీలకు సైతం వణుకు పుట్టిస్తోంది. కలహంది జిల్లా ఒకప్పుడు ఆకలి కేకలతో అల్లలాడిపోయిన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఓ పేద కుటుంబంలో పుట్టిన అర్చనా నాగ్.. కట్ చేస్తే కోట్లు విలువ చేసే బ్యాంక్ బ్యాలెన్స్‌తో, ఇంటి నిండా విదేశాల నుంచి వచ్చిన ఫర్నీచర్‌తో, లగ్జరీ కార్లతో, హైబ్రీడ్ కుక్కలు, ఓ తెల్ల గుర్రం పెంచుకుంటూ విలాసవంతమైన జీవితం గడపాలనుకుంది. అందుకు తగ్గట్లే 26 ఏళ్ల అర్చన పెద్ద పెద్ద స్కెచ్‌లే వేసింది. ప్రముఖులను హనీట్రాప్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి కోట్లు దండుకుంది. ► లంజిగర్‌లో ఓ పేద కుటుంబంలో పుట్టిన అర్చనా.. తల్లి వృత్తిరిత్యా కేసింగలో పెరిగింది. ఆపై 2015లో భువనేశ్వర్‌లో అడుగుపెట్టింది. తొలుత ఓ ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలో పని చేసి.. ఆపై ఓ బ్యూటీపార్లర్‌లో పనికి కుదిరింది. అక్కడే బాలాసోర్ జిల్లాకు చెందిన జగబంధు చంద్‌తో పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. అక్కడి నుంచి ఈ భార్యాభర్తల మోసాలు మొదలయ్యాయి. బ్యూటీపార్లర్‌లో పని చేసే టైంలోనే సెక్స్‌రాకెట్ నడిపినట్లు ఆమెపై ఆరోపణలు కూడా వచ్చాయి. ► జగబంధు ఓ కార్ల షోరూం తెరిచి.. బిల్డర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ఇతరులతో పరిచయం పెంచుకున్నాడు. వాళ్లతో ఆ భార్యాభర్తలు ఫొటోలు కూడా దిగారు. ఒక అర్చన వీవీఐపీలతో పరిచయం పెంచుకుని.. వాళ్లకు అమ్మాయిలను సప్లై చేయడం ప్రారంభించింది. ఆ సమయంలోనే వాళ్ల ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు తీసి.. డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించిందని పోలీసులు వెల్లడించారు. ► అర్చనా బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించిన పోలీసులు నోళ్లు వెళ్లబెట్టారు. 2018 నుంచి 2022 మధ్య.. కేవలం నాలుగేళ్లలో అర్చనా-జగబంధుల ఆసక్తి రూ.30 కోట్లకు చేరుకుందని చెప్తున్నారు. ఆమె ఏయే విలాసాలు కోరుకుందో.. అవన్నీ నెరవేర్చుకుందామె. అంటే.. ఆ భార్యభర్తల బ్లాక్‌మెయిలింగ్ ఏ రేంజ్లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. చివరకు ఓ నిర్మాతను మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతో.. ఆయన నాయపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 6న అర్చనా అరెస్ట్ కాగా.. అప్పటి నుంచి రోజుకో రోజుకో సంచలనం బయటపడుతూనే వస్తోంది. జగబంధు డ్రగ్స్ కార్యకలాపాలు సైతం వెలగపెట్టేవాడని తేలింది. ఇక ఈ వ్యవహారంలో ఆర్థిక దర్యాప్తు విభాగాలను సైతం దర్యాప్తు చేపట్టాలని ఒడిషా పోలీసులు కోరుతున్నారు. ► ఇక ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే అర్చనపై ఫిర్యాదుకు ముందుకు వచ్చారని, మరికొందరు బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలని భువనేశ్వర్ డీసీపీ ప్రతీక్ సింగ్ కోరుతున్నారు. మరోవైపు ఒడియా ఫిల్మ్ మేకర్ శ్రీధర్ మార్థా.. అర్చనా చేసిన డర్టీ పనుల ఆధారంగా ఓ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు కూడా. సెక్స్, డబ్బు, మోసంతో పాటు అర్చనా నాగ్ వ్యవహారంలో ఇప్పుడు రాజకీయమూ కీలకంగా మారింది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ వ్యవహారంలో అధికార బీజేడీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారని ఆరోపిస్తోంది. ఒకవేళ అదే గనుక బయటపడితే 22 ఏళ్ల నవీన్ పట్నాయక్ ప్రభుత్వం పతనం కాకతప్పదని అంటోంది. మరోవైపు బీజేపీ కూడా బీజేడీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అర్చనా వలలో ఉన్నట్లు ఆరోపిస్తోంది. బీజేడీ మాత్రం ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దంటూ బీజేపీ, కాంగ్రెస్‌లకు సూచిస్తోంది. సుమారు 25 మంది రాజకీయ ప్రముఖులు ఆమె ఉచ్చులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ప్రేమను కాదందనే రైలు కిందకు తోసేశాడు -
కెఎస్ఆర్ కామెంట్ : వీకెండ్ పొలిటీషియన్ పవన్
-
యుద్ధంపై విమర్శ... రష్యాన్ రాజకీయవేత్తపై వేటు..
మాస్కో: ఉక్రెయిన్ పై యుద్ధం చేయడం గురించి రష్యన్ రాజకీయవేత్త ఒకరు విమర్శించారు. ఇలా ఉక్రెయిన్ పై అమానుషంగా యుద్ధం చేసి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకోవడం తప్పు అంటూ పలు విమర్శలు చేశారు. అంతే సదరు రాజకీయవేత్త, మాజీ మేయర్ యెవ్జెనీ రోయిజ్ మాన్ పై రష్యాన్ అధికారులు సీరియస్ అవ్వడమే కాకుండా అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలాంటి చర్యలు రష్యా బలగాలను అప్రతిష్టపాలు చేసేలా చేయడమేనంటూ మండిపడ్డారు. అతను ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశాడని కూలంకషంగా రష్యా అధికారులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అతను రష్యాలో ప్రధాన ప్రతిపక్షం అభ్యర్థి, పైగా పలు మేయర్ పదువులను అలంకరించిన ప్రముఖ వ్యక్తి. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్ పై చేస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని ప్రత్యేక సైనిక చర్యగా అభివర్ణించుకుంటోంది. ఈ తరుణంలో ఎవరైన క్రెమ్లిన్‌ని తప్పుపట్టేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కన్నెరజేస్తోంది రష్యా. ఆయా వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా అరెస్టు చేయడం వంటి చర్యలు తీసుకుంటోంది. గతంలో ఒక యాంకర్ కూడా ఇలానే యుద్ధం వద్దంటూ ప్లకార్డులు పట్టుకున్నందుకు ఆమెను రష్యా భధ్రతా బలగాలు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఉక్రెయిన్ దళాలు కూడా ఈ దాడిని ప్రతిఘటించడమే కాకుండా రష్యా తన బలగాలను ఉపసంహరించుకునేలా పశ్చిమ దేశాలు రష్యా పై కఠిన ఆంక్షలు విధించాయి కూడా. ఆఖరికి ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తిని తోసిపుచ్చి తనదైన శైలిలో ఉక్రెయిన్ పట్ల దురుసుగా వ్యవహరిస్తోంది. (చదవండి: ఉక్రెయిన్‌ని విడిచిపెట్టి వచ్చేయండి!... హెచ్చరించిన యూఎస్) -
అన్నా.. మనల్ని పిలుస్తారే!.. బెంబేలెత్తుతున్న ఎమ్మెల్యేలు, మాజీలు
సాక్షి, హైదరాబాద్: క్యాసినో వ్యవహారంలో హవాలా వ్యవహారం ఇప్పుడు పలువురు రాజకీయ నేతలను, ప్రముఖులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చీకోటి ప్రవీణ్‌కుమార్‌తో సన్నిహితులుగా ఉన్నవారితోపాటు ఆయన కస్టమర్లుగా ఉన్నవారి మెడకు ఈడీ ఉచ్చు బిగిసేలా కనిపిస్తోంది. చీకోటి ప్రవీణ్ వాట్సాప్ ద్వారా సందేశాలు సాగించిన ఎమ్మెల్యేలు, మాజీఎమ్మెల్యేలు, మం్రతుల్లో ఇప్పటికే తీవ్ర చర్చ మొదలైనట్టు తెలుస్తోంది. క్యాసినో హవాలా దందాపై చీకోటి ప్రవీణ్‌తోపాటు మాధవరెడ్డి, సంపత్, గౌరీశంకర్ తదితర నిందితుల నివాసాల్లో సోదాలతోపాటు నాలుగు రోజులపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. అయితే ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చిన సంచలనాత్మకమైన వాట్సాప్ సందేశాలతో ఓ మంత్రితోపాటు పలువురు ఎమ్మెల్యేలకు సంబంధాలున్నాయని ఈడీ బలంగా విశ్వసిస్తోంది. దీనికి తగ్గట్టుగా సాగిన వాట్సాప్ చాట్లను రిట్రీవ్ చేసిన ఈడీ సంబంధిత ప్రముఖులకు శ్రీముఖాలు జారీచేయాలని భావిస్తోంది. ఈడీ నిజంగానే తమను పిలుస్తుందా? పిలిస్తే ఏంటన్న పరిస్థితిపై ఎమ్మెల్యేలు ఒకరికొకరు చర్చించుకుంటున్నట్టు అనుచరుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: (Telangana: డీజీపీ కుర్చీ ఎవరికి?.. రేసులో ఆ ముగ్గురు..!) క్యాసినో.. హవాలా.. ఏం చెప్పాలి ఈడీ పిలిస్తే ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశముందనే అంశాలపై లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లతో పలువురు ఎమ్మెల్యేలు చర్చిస్తున్నట్టు తెలిసింది. క్యాసినోకు ఎన్నిసార్లు వెళ్లారు, ప్రవీణ్‌కు అందించిన డిపాజిట్.. అందులో హవాలా వ్యవహారం ఏంటన్న అంశాలను నెమరేసుకుంటున్నట్టు తెలిసింది. డిపాజిట్‌కు పంపిన డబ్బుకు లెక్క చెప్పాల్సి వస్తే ఏం చేయాలన్న దానిపై సీఏలతో చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే కేవలం క్యాసినోకు వెళ్లినవారిలో పెద్దగా భయం లేకున్నా, క్యాసినో చాటున హవాలా వ్యవహారం సాగించిన వారిలోనే తీవ్ర అలజడి నెలకొన్నట్లు తెలుస్తోంది. హవాలా సాగించే అంత రేంజ్ ఉన్న నేతలు ఎవరన్నదానిపై ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. హవాలా ఆధారాలుంటే.. చీకోటి ప్రవీణ్ ఈడీకి ఏం చెప్పాడు, ఎవరెవరు ఎన్నిసార్లు వచ్చారు, డిపాజిట్ చేసిన మొత్తంలో క్యాసినోకు ఉపయోగించిందెంత, మిగిలిన హవాలా ఎంత అన్న అంశాలపై నేతలు ఆరా తీస్తున్నారు. ఒకవేళ హవాలా వ్యవహారంలో ఈడీకి పక్కగా ఆధారాలు దొరికితే పరిస్థితి ఏంటన్న దానిపైనా నేతలు ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. పైగా తమను విచారణకు రావాలని నోటీసులిస్తే రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం ఉంటుందన్న కలవరం కూడా నేతల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఈడీ దాడులపై రాజకీయంగా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అటు బీజేపీ నేతలు నిత్యం ఈడీ దాడులపై ప్రకటనలు చేస్తుండటం ప్రముఖనేతలకు నిద్ర పట్టకుండా చేస్తున్నట్టు తెలుస్తోంది. కొంతమంది నేతలు చీకోటిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే ఈడీ విచారణలో తెలిపిన అంశాలు ఏమాత్రం బయటకు పొక్కినా చీకోటి ప్రవీణ్‌కు చట్టప్రకారం కొత్త కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని ఆయన తరపు లాయర్లు స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో క్యాసినో జాబితాలో ఉన్నవారంతా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. -
అదే నా చివరి సినిమా: యంగ్ హీరో
Udhayanidhi Stalin Announces Maamannan Will Be His Last Film: తెలుగులో డబ్ అయిన 'ఓకే ఓకే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఉదయనిధి స్టాలిన్. తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి హిట్ సాధించాడు. ఇటీవల ఉదయనిధి స్టాలిన్ నటించిన తమిళ చిత్రం 'నెంజుకు నీధి'. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'ఆర్టికల్ 15'కు రీమేక్‌గా తెరెకెక్కిన ఈ సినిమా మే 20న విడుదల కానుంది. ఇది కాకుండా మారి సెల్వరాజ్ డైరెక్షన్లో 'మామన్నన్' అనే మూవీ చేస్తున్నాడు ఉదయనిధి స్టాలిన్. ఇందులో కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయం చెప్పాడు ఈ హీరో. ఉదయనిధి స్టాలిన్ నటించబోతున్న 'మామన్నన్' తన ఆఖరి సినిమా అని తెలిపాడు. ఇటు సినిమాలు అటు రాజకీయాలు బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతను చెప్పినట్లు సమాచారం. కాగా ఉదయనిధి స్టాలిన్ తండ్రి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడని తెలిసిన విషయమే. తండ్రిలానే తాను కూడా రాజకీయాల్లో సెటిల్ అవ్వాలని ఉదయనిధి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో జరిగిన గత ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. అప్పుడే సినిమాలకు దూరం అవుతాడని టాక్ వచ్చినా అలా జరగలేదు. True power and strong Will -justice will be served! Bringing the action-packed story of #NenjukuNeedhi on the big screens on 20th May 🔥 #6DaysToGo@ZeeStudios_ @BoneyKapoor @BayViewProjOffl #RomeoPictures @mynameisraahul @RedGiantMovies_ @Arunrajakamaraj @actortanya pic.twitter.com/coh9iLNy0m — Udhay (@Udhaystalin) May 14, 2022 -
సీసీజీ లేఖ రాజకీయ ప్రేరేపితం
న్యూఢిల్లీ: దేశంలో విద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల రాసిన బహిరంగ లేఖలో మాజీ సివిల్ సర్వీస్ అధికారులు చేసిన ఆరోపణలను మాజీ న్యాయమూర్తులు, ప్రభుత్వ మాజీ అధికారులు తీవ్రంగా ఖండించారు. వారి లేఖ రాజకీయ ప్రేరేపితమని, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి చేసిన ప్రయత్నమని మండిపడ్డారు. కానిస్టిట్యూషన్ కాండక్ట్ గ్రూప్(సీసీజీ) పేరిట 108 మంది మాజీ సివిల్ సర్వీసు అధికారులు రాసిన లేఖలో నిజాయతీ లేదని తేల్చిచెప్పారు. మోదీకి అండగా నిలుస్తున్న ప్రజల పట్ల వారి ఆక్రోశం ఇందులో వ్యక్తమవుతోందన్నారు. ఈ మేరకు ‘కన్సర్న్డ్ సిటిజెన్స్’ పేరిట 8 మంది మాజీ న్యాయమూర్తులు, 97 మంది మాజీ ఉన్నతాధికారులు, 92 మంది మాజీ సైనికాధికారులు ప్రధాని మోదీకి తాజాగా బహిరంగ లేఖ రాశారు. ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీసీజీ లేఖలోని ఆరోపణలను ఇందులో తిప్పికొట్టారు. సిక్కిం హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ప్రమోద్ కోహ్లీ, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు కన్వల్ సిబల్, శశాంక్, ‘రా’ మాజీ చీఫ్ సంజీవ్ త్రిపాఠి తదితరులు ఇందులో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో విద్వేష బీజాలు నాటే కుతంత్రలు సాగవని తేల్చిచెప్పారు. -
మాటలు జాగ్రత్త! తేడా వస్తే అంతే.. ఇలా వచ్చి అలా తలపై కోడిగుడ్డుతో...
France Presidential Candidate Sparked Raging Controversy: రాజకీయ నాయకులు లేదా ప్రముఖ సెలబ్రెటీలు ఏవైనా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడూ ప్రజలు వాటిని ఖండించడం, నిరసనలు వ్యక్తం చేయడం మాములే. అంతేగానీ కోడిగుడ్లు, టమాటాతో దాడి వంటివి జరగవు. ఎప్పుడో ఏదైనా అనుహ్య పరిణామాల్లో తప్ప ఇలాంటి ఘటనలు ఎదురవ్వవు. కానీ అలాంటి పరాభవం ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఒక రాజకీయ నాయకుడికి జరిగింది. పైగా ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన ఎదురైంది. వివరాల్లోకెళ్తే...ఫ్రాన్స్‌కు చెందిన ఫార్ రైట్ ప్రెసిడెంట్ అభ్యర్థి ఎరిక్ జెమ్మూర్ ఎన్నికల ప్రచార నిమిత్తం మోయిసాక్ నగరానికి కారులో వస్తున్నాడు. ఇంతలో జెమ్ముర్ చేరుకోవాల్సిన నగరం రావడంతో కారు దిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి కోడి గుడ్డుతో దాడి చేసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నిజానికి రాజకీయ పరిజ్ఞానం లేని జెమ్మూరు గత నవంబర్‌లో ఎన్నికల్లో అధ్యక్షుడి పదవికీ పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. అందులో భాగంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు దివ్యాంగ పిల్లలు సాధారణ ప్రభుత్వ పాఠశాలలకు బదులుగా ప్రత్యేక పాఠశాలలకు వెళ్లాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఉపాధ్యాయుల బృందాన్ని ఉద్దేశించి ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. పైగా దివ్యాంగ పిల్లలు ఇతర పిల్లలచే ఇబ్బందులకు గురవుతారని, అందులోనూ పేద విద్యార్థులు మరింత ఇబ్బందులు ఎదుర్కుంటారు కాబట్టి వారికి ప్రత్యేక పాఠశాలలు ఉండాలని అన్నారు. జెమ్మూర్ వ్యాఖ్యలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రజలు కూడా ఆయనపై కోపంగా ఉన్నారు. అయితే తాజాగా ఒక వ్యక్తి ఆయన చేసిన వ్యాఖ్యలకు కోపంతో జెమ్మూర్ ప్రయాణిస్తున్న కారుని వెంబడించి మరీ వచ్చి కోడి గుడ్లతో దాడి చేశాడు. దీంతో అక్కడ ఉన్నవారందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో ఆ దాడి చేసిన వ్యక్తికి ఉన్న కొడుకు దివ్వాంగుడని తెలిసింది. ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. ▶️Éric Zemmour a été visé par un œuf qu'un homme lui a claqué sur la tête à son arrivée à Moissac, où le candidat d'extrême droite battait campagne samedi matin pour la présidentielle pic.twitter.com/oChOUxVBcU — LN24 (@LesNews24) March 12, 2022 (చదవండి: అత్యంత వృద్ధ జంట...వాళ్లుకు ఇది ఎన్నో వివాహ వార్షికోత్సవమో తెలుసా!) -
మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం
సాక్షి, అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే గౌతమ్ రెడ్డి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారన్నారు. మంత్రిగా చాలా చురుగ్గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. నిన్నటి వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారన్నారు. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఓ మంచి స్నేహితుడ్ని, అన్నను కోల్పోయా: మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ దిగ్బాంత్రి వ్యక్తం చేశారు. ఓ మంచి స్నేహితుడు, అన్నను కోల్పోయానన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై సంతాపం వ్యక్తం చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఏపీ ఐటి రంగంలో అభివృద్ధి చేసిన మేకపాటి గౌతంరెడ్డి మరణం బాధాకరమని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు.. అభివృద్ధి చెందుతున్న ఏపీకి తీరని లోటు అవంతి పేర్కొన్నారు. సహచర మంత్రిగా స్నేహితునిగా ఆయన మరణం ఊహించుకోలేక పోతున్నామన్నారు. రాష్ట్ర ఐ.టి.శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నూజివీడు ఎమ్మెల్యే మేకాప్రతాప్ ప్రతాప్ అప్పారావు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ. ఆయన అకాలమరణం పార్టీకి తీరని లోటు. ఒక సమర్థవంతమైన నాయకుడిని కోల్పోయాం. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై సంతాపం వ్యక్తం చేసిన మంత్రి పేర్నినాని. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఆయన మరణం చాలా బాధాకరమన్నారు. ఏపీలో పెట్టుబడుల కోసం పరిశ్రమలు, ఐటీ మంత్రిగా ఎంతో కృషి చేస్తున్నారన్నారు. నిన్నటి వరకు కూడా రాష్ర్టంలో పెట్టుబడుల కోసం దుబాయ్‌లో పర్యటించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇక లేరు అనే వార్త కలచి వేసిందన్నారు. చాలా బాధాకరం: తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చాలా బాధాకరమన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ►మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణ వార్త కలచివేసిందని మంత్రి తానేటి వనిత అన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని పార్థిస్తున్నాన్నారు. ►గౌతమ్‌రెడ్డి మృతి పట్ల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి కోసం గౌతమ్‌రెడ్డి నిరంతరం శ్రమించారన్నారు. ►గౌతమ్‌రెడ్డి మృతి పట్ల మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యుడిలా గౌతమ్‌రెడ్డి ఉండేవారన్నారు. గౌతమ్‌రెడ్డి మరణం పార్టీ, ప్రజలకు తీరని లోటన్నారు. ►మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్భాంతి వ్యక్తం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రాజకీయాల నుంచి ''ఆ ముసలోళ్లను ఎలిమినేట్ చేయండి సార్''..!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. 70 ఏళ్ల వయస్సు పైబడిన వారిని రాజకీయ పదవులకు పోటీ చేయకుండా నిషేధించాలని పిలుపునిచ్చారు. ట్వీట్లో చట్టసభ సభ్యులు ఎవరనేది ప్రస్తావించనప్పటికీ, ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్, మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్, ఇద్దరూ 70 ఏళ్లు పైబడిన వారు. కొద్ది రోజుల క్రితం ఎలన్ సెటైర్లు వేసిన సెనేటర్ సాండర్స్ వయస్సు 80 సంవత్సరాలు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఎలన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. Let’s set an age limit after which you can’t run for political office, perhaps a number just below 70 … — Elon Musk (@elonmusk) December 2, 2021 ఎలన్ మస్క్ అమెరికా నేతల్ని పరోక్షంగా కర్ర కాల్చి వాత పెడుతున్నారు. నవంబర్ 13న వాషింగ్టన్లో కొంతమంది డెమోక్రాట్లు ఎలన్ మస్క్, జెఫ్ బేజోస్, మార్క్ జుకర్‌బర్గ్ లాంటి బిలియనీర్లపై పన్నులు పెంచాలని ఒత్తిడి చేశారు. బిలియనీర్లు స్టాక్స్ ధర పెరిగినప్పుడు వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. అదే సమయంలో అమెరికా సెనేట్ బడ్జెట్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న సాండర్స్ అమెరికాలోని 0.1 శాతం ఉన్న అత్యంత ధనవంతులు కుటుంబాలపై వార్షిక పన్నును ప్రతిపాదించారు. ‘‘అత్యంత ధనవంతులు వారి వంతు పన్నులను సక్రమంగా చెల్లించాల్సిందిగా మనం డిమాండ్ చేయాలి’’ అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌పై ఎలన్ తనదైన స్టైల్లో సాండర్స్ పై సెటైర్లు వేశారు. ‘‘ సాండర్స్ నువ్వు బతికున్నావనే విషయాన్ని నేను మర్చిపోతుంటాను..ఇప్పుడేమంటావ్.. నేను మరింత స్టాక్ అమ్ముకోవాలని నువ్వు కోరుకుంటున్నావా.. చెప్పు’’ అంటూ ఎలన్ మస్క్ విరుచుకుపడ్డాడు. అయితే తాజాగా ఎలన్ చేసిన 'ఎలిమినేట్' వ్యాఖ్యలకు కారణం సెనెటర్లు బిలియనీన్లు పన్నులు కట్టాలని సెనెటర్లు చేసిన డిమాండ్లేనని తెలుస్తోంది. బిలియనీన్లు పన్నులు చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఎలన్..టెస్లాలోని తన శాతం షేర్లను అమ్మకానికి పెడుతున్నట్లు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ దెబ్బకు టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో లక్షకోట్లుకు పైగా నష్టం వాటిల్లింది. ఆ నష్టాన్ని తట్టుకోలేకనే ఈ బిలియనీర్ 70ఏళ్లకు పై బడిన వారిని రాజకీయాల్లో పదవులకు పోటీ చేసేందుకు అనర్హులుగా గుర్తించాలని ట్వీట్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్యం అమెరికాలో చర్చాంశనీయం కాగా..ఆ వ్యాఖ్యల ప్రభావం ఎలన్పై భారీగా ఉండొచ్చనేది విశ్లేషకులు చెబుతున్నమాట. చదవండి: లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1 -
అతని కథ సినిమాకు ఏమాత్రం తీసిపోదు!
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బెంగళూరువాసి శ్రీకృష్ణ అలియాస్ శ్రీకి పేరు చెబితే రాజకీయనేతలు, ప్రముఖ వ్యక్తులు హడలిపోతారు. శ్రీకి నుంచి రాజకీయ నేతలు, వారి సుపుత్రులు భారీగా బిట్కాయిన్ల డబ్బును స్వీకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పెద్ద రాజకీయ కలకలం ఏర్పడింది. ఇతని కథ సినిమాకు ఏమాత్రం తీసిపోదంటారు. జయనగర నివాసి గోపాల్ రమేశ్ కుమారుడైన శ్రీకి అంతర్జాతీయ స్థాయి హ్యాకర్‌గా గుర్తింపు పొందాడు. తన ఆధారాలు చిక్కకుండా హ్యాక్ చేయడం ఇతని ప్రత్యేకత. ఇందుకోసం ఎప్పడూ సొంత ల్యాప్‌టాప్, కంప్యూటర్, మొబైల్‌ఫోన్‌ను వాడింది లేదు. 4వ తరగతి నుంచి షురూ.. నాలుగో తరగతి చదువుతుండగానే మొబైల్‌ఫోన్‌ను హ్యాక్ చేసే నైపుణ్యం పొందిన శ్రీకి హైస్కూల్లో చేరేటప్పటికి ప్రముఖ హ్యాకర్‌గా గుర్తింపుపొందాడు. 17 ఏళ్లు వయసులోనే ఇళ్లు వదిలిపెట్టి ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌కు పారిపోగా పోలీసులు కనిపెట్టి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఎప్పుడూ స్కూల్‌కి గైర్హాజరయ్యే ఇతడు తోటి విద్యార్థులు, పాఠశాల కంప్యూటర్లను హ్యాక్ చేసి ఔరా అనిపించేవాడు. వీవీ పురం ప్రైవేటు కాలేజీలో పీయూసీ కంప్యూటర్ సైన్సు చదువుతుండగా ప్రపంచస్థాయి హ్యాకర్లతో పరిచయమైంది. పీయూసీ తరువాత ఉన్నత విద్య కోసం నెదర్లాండ్‌కు వెళ్లడంతో అందులో నిష్ణాతునిగా మారాడు. అక్కడి హ్యాకర్లతో గొడవలు వచ్చి తిరిగి బెంగళూరుకు చేరుకున్నాడు. పెద్దవాళ్లతో స్నేహం.. తెలివితేటలను ఉపయోగించి నగరంలో ప్రముఖ వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు, సీనియర్ పోలీస్ అధికారులు, వారి పిల్లలతో స్నేహం పెంచుకున్నాడు. యుబీ సిటీలో ఎమ్మెల్యే హ్యారిస్ కుమారుడు నలపాడ్, విద్వత్ అనే యువకునిపై దాడిచేసిన సమయంలో శ్రీకి కూడా ఉన్నాడు. దాంతో కొన్నాళ్లు పరారయ్యాడు. డబ్బు కొల్లగొట్టి విలాసాలు.. బెంగళూరులో మకాం వేసి ప్రభుత్వ వెబ్సైట్లు, టెండర్లను హ్యాక్ చేసేవాడు. తద్వారా కోట్లాది రూపాయలను కొల్లగొట్టి స్టార్ హోటళ్లు, క్రూయిజ్ ఓడల్లో, విమానాల్లో విలాసంగా గడపడం ఇతని నైజం. అయితే గత జనవరిలో సీసీబీ పోలీసులు శ్రీకిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడంతో కష్టాలు మొదలయ్యాయి. అప్పుడే క్రిప్టో కరెన్సీ దందా వెలుగుచూసింది. ఇతని అకౌంట్లలో ఉన్న సుమారు రూ.9 కోట్ల విలువచేసే బిట్కాయిన్ల సీజ్ చేశారు. కొన్నినెలల పాటు జైల్లో ఉండి ఇటీవలే విడుదలయ్యాడు. -
పోలీసులపై ఫిర్యాదుల విచారణకు స్థాయీ సంఘం
న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ నాయకులకు, పోలీసు అధికారులకు మధ్య ఉండే సన్నిహిత సంబంధాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీల అండ చూసుకొని బ్యూరోక్రాట్లు ,ముఖ్యంగా పోలీసు అధికారులు ఎలా ప్రవర్తిస్తారో తనకు తెలుసునన్నారు. పోలీసుల అకృత్యాలపై అందిన ఫిర్యాదులను విచారించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సస్పెండైన పోలీసు అధికారి గుర్జీందర్ పాల్ సింగ్ తనపై దేశద్రోహం, అవినీతి, బలవంతపు వసూళ్లకు సంబంధించి నమోదైన క్రిమినల్ కేసుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం విచారించింది. నేతల అండతో చెలరేగే పోలీసు అధికారుల్ని న్యాయవ్యవస్థ కాపాడలేదని సీజేఐ వ్యాఖ్యానించారు. పోలీసు అధికారుల దౌర్జన్యాలపై దాఖలైన పిటిషన్ల విచారణకు స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన ఉందని చెప్పారు. -
పోలీస్– పొలిటీషియన్ దోస్తీ.. నయా ట్రెండ్!
న్యూఢిల్లీ: అధికారంలో ఉన్న రాజకీయనేతలతో పోలీసు అధికారులు దోస్తీ చేయడం దేశంలో కొత్త ట్రెండ్‌గా మారిందని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగిన అధికారులపై వచ్చే క్రిమినల్ కేసుల నుంచి తామెందుకు రక్షించాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ ప్రశ్నించింది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన గుర్జీందర్ పాల్ సింగ్ ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. అనంతరం పోలీసు అకాడమీ డైరెక్టర్ (అదనపు డీజీపీ హోదా)గా నియమితులయ్యారు. ప్రభుత్వం మారిన అనంతరం అవినీతి నిరోధక శాఖ, ఆర్థిక నేరాల విభాగం సోదాలు జరిపి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ కేసుల కారణంగా గుర్జీందర్ పాల్ సస్పెండయ్యారు. వివిధ వర్గాల మధ్య విభేదాలు కలిగేలా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాని రాజద్రోహం కేసు కూడా నమోదయింది. రాజద్రోహం కేసును కొట్టివేయాలంటూ తొలుత ఆయన హైకోర్టును ఆశ్రయించగా అనుకూలంగా ఉత్తర్వులు రాలేదు. దాంతో సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు సింగ్‌పై తీవ్ర చర్యలను కొన్నాళ్లు ఆపాలని, సింగ్ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని గతంలో ఆదేశించింది. తాజాగా ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు సింగ్ న్యాయ వాదిని ఉద్దేశించి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పదవిలో ఉన్నవారితో అతి సాన్నిహిత్యం వల్ల ఇలాగే జరుగుతుందని, ఏదో ఒకరోజు వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుందని చురకలంటించింది. ఇలాంటివారిని ఎందుకు రక్షించాలని, తను జైలుకు వెళ్లాల్సిందని బెంచ్ తీవ్రవ్యాఖ్యలు చేసింది. సింగ్ కింది కోర్టులో లొంగిపోయి, తర్వాత బెయిల్‌కు యత్నించాలంది. సింగ్ లాంటి సిన్సియర్ అధికారులను కోర్టు రక్షించాలని న్యాయవాది కోరారు. సింగ్‌పై ఆరోపణలకు రుజువులున్నాయని రాష్ట్రప్రభుత్వ న్యాయవాది తెలిపారు. -
ఆయన మంత్రి కాదు.. సీడీల బాబా.. అనేక మంది రాసలీలల..
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న మంత్రి మురుగేశ్ నిరాణి వద్ద ఐదు వందల సీడీలు ఉన్నట్లు సామాజిక కార్యకర్త ఆలం పాషా ఆరోపించారు. ఆయన మంగళవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. మురుగేశ్ నిరాణి వద్ద ఐదు వందల సీడీలున్నాయి. అందులో ఎవరివైనా ఉండవచ్చన్నారు. మురుగేశ్‌ను సీడీ బాబా అని వర్ణిస్తూ అనేక మంది రాసలీల సీడీలు ఆయన వద్ద ఉన్నాయన్నారు. నకిలీ పేర్లతో ఆయన బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నారని అన్నారు. -
Karnataka: రోహిణి సింధూరి బదిలీ వెనుక రాజకీయ నాయకుల కుట్ర..
సాక్షి, మైసూరు(కర్ణాటక): మైసూరు నగరంలో గత 25 ఏళ్ల నుంచి అనేక భూ ఆక్రమణలు జరిగాయి. ఈ క్రమంలో.. భూముల అక్రమాలను వెలికితీసి వాటిపై ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిచే విచారణ చేయించాలని వాటాల్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వాటాల్ నాగరాజు కోరారు. ఆదివారం ఆయన ఈ మేరకు మైసూరులో ధర్నా చేశారు. జిల్లా కలెక్టర్‌గా రోహిణిని పునర్నియమించాలన్నారు. రాష్ట్రంలో అటవీ భూములు, చెరువులు, ఇలా అనేక భూములను పలుకుబడి ఉన్న వారు కబ్జాలు చేసుకున్నారని, మైసూరులోనే ఇదే జరిగిందని, ఈ అక్రమాలన్నీ బయటకు రావాలంటే రోహిణితో దర్యాప్తు చేయించాలని అన్నారు. కొందరు రాజకీయ నాయకులు కుట్ర పన్ని ఆమెను బదిలీ చేయించారని ఆరోపించారు. చదవండి: ఐఏఎస్ రోహిణి సింధూరికి ఎమ్మెల్యే సవాల్! -
పంచాయతీ ఎన్నికలు.. పన్నీర్ పంచిన నాయకులు
లక్నో: ఎన్నికలనగానే రాజకీయ నాయకులు మద్యం, డబ్బు పంపిణీ చేసి ప్రజలను తమ బుట్టలో వేసుకోవడానికి తెగ ప్రయత్నింస్తుంటారు. అయితే, యూపీలోని అమ్రోహాలో నాయకులు కాస్త వేరైటిగా ఆలోచించారు. వీరు అక్కడ జరగబోయే పంచాయతీ ఎన్నికలలో పన్నీర్‌ను పంచి వార్తల్లో నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. చాకోరి గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థి సోదరుడు గజేంద్ర సింగ్ తన సోదరుడికి మద్దతు తెలపాలని కోరుతూ కాటేజ్ జున్ను(పన్నీర్) పంచి పెట్టాడు. విషయం తెలియగానే పోలీసులు ఆ ప్రదేశంపై దాడిచేసి, అక్కడున్న 30 కేజీల పన్నీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ప్రజలను ప్రభావితం చేయటానికి ప్రయత్నించాడని గజేంద్ర సింగ్ పై కేసును కూడా నమోదు చేశారు. ఈ పన్నీర్‌ను అక్కడి ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కాగా, యూపీలో ఏప్రిల్ 15 నుంచి 29ల మధ్య నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న విషయం విదితమే . అయితే, ఈ విధంగా ఓటర్లను ప్రభావితం చేయడానికి గతంలో ఒక నాయకుడు 100 కేజీల రసగుల్లాలను పంచిపెట్టి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. -
అందాల తార జయప్రద గురించి ఈ విషయాలు తెలుసా..?
ఆమె ఆరేసుకుంటే ప్రేక్షకుడు మనసు పారేసుకున్నాడు. ఈమెతోనే రజనీకాంత్ ‘ఇంక ఊరేల.. సొంత ఇల్లేల ఓ చెల్లెలా’ అన్నది. కమలహాసన్ కళ మద్యపు మురుక్కాలవలో పారుతుంటే ఈమె కదూ దానిని ‘సాగర సంగమం’ చేయించింది. ‘భారతీయ వెండితెర మీద అంత అందమైన ముఖం మరొకటి లేదు’ అని సత్యజిత్ రే పొగిడిన ఏకైక తెలుగు అందం జయప్రదది. ఆమె రాజకీయ ప్రస్థానం ఒకదారి. ఆమె నటనదే ప్రేక్షకుల గుండెదారి. జయప్రద... జయసుధ.. శ్రీదేవి తెలుగు సినీ జగత్తును ఏలిన ఈ ముగ్గురు హీరోయిన్లు ఒకటి రెండు సంవత్సరాల తేడాతో స్టార్లు అయ్యారు. తెలుగు మాట, తెలుగు ఆట, తెలుగు సౌందర్యం తెర మీద చూపారు. శ్రీదేవి గ్లామర్‌లో బెస్ట్. జయసుధ యాక్టింగ్‌లో బెస్ట్. జయప్రద ఇటు గ్లామర్, అటు యాక్టింగ్ రెంటిలోనూ బెస్ట్ అనిపించుకున్నారు. రాజమండ్రికి చెందిన లలిత రాణి ‘భూమి కోసం’ (1974)లో మొదటిసారి తెర మీద రెండు మూడు నిమిషాల సేపు కనిపించారు. ఒక పాట మధ్యలో ఒక వితంతువు తనను చెరబట్టే కామందును హతమారుస్తుంది. ఆ వితంతువు జయప్రద. మొట్టమొదటి వేషం అలాంటిది ఎవరూ వేయరు. కాని జయప్రద చేశారు. ఆ సినిమాలోనే పేరు మార్చుకుని అప్పట్లో ‘జయ’ ట్రెండ్ నడుస్తున్నందున జయప్రదగా మారారు. ఆమె పెదవి మీద పుట్టుమచ్చ ఉంటుంది. వెండితెర మీద ఒక అందమైన పుట్టుమచ్చగా ఆమె ప్రేక్షకులకు నచ్చింది. తరం మారుతున్నప్పుడు కొత్త తరం వస్తుంది. వాణిశ్రీ, లక్ష్మి, మంజుల, లత... వీరు సీనియర్లు అవుతున్న కొద్దీ కొత్తవాళ్లు కావాల్సి వచ్చారు. జయప్రద ఆ సమయంలోనే మద్రాసులో అడుగుపెట్టారు. ఏకంగా కె.బాలచందర్ దృష్టిలో పడ్డారు. ఆమె తమిళంలో తీసిన ‘అవల్ ఒరు తోడర్ కథై’లో సుజాత చేసిన పాత్రను జయప్రదకు ఆఫర్ చేశారాయన. సుజాతకు అప్పటికి తెలుగు రాదు. అచ్చతెలుగు అమ్మాయి ఉంటేనే బాగుంటుందని బాలచందర్ ఆలోచన. అందుకు జయప్రద సరైనది అని ఆయన భావించారు. ఒక మధ్యతరగతి గంపెడు సంసారాన్ని తన భుజాల మీద మోసే, తన కలలను చిదిమేసుకుని కుటుంబం కోసం బతికే ఒక సగటు ఆడపిల్ల కథ అది. దాని బరువు ఎక్కువ. జయప్రదది ఆ సమయానికి చిన్న వయసు. కాని ఆమె ఆ పాత్రను అర్థం చేసుకొని పోషించడంతో... ఒక్క కేరెక్టర్లోనే ప్రేమ, కోపం, ఆర్తి, అసహనం చూపడంతో జయప్రద స్టార్ అయ్యారు. ఆ సినిమాయే తెలుగులో రజనీకాంత్‌కు కూడా తొలి సినిమా. ఆ సినిమాలో ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి పాట’... ఏసుదాస్‌కు, జయప్రదకు, రజనీకాంత్‌కు నేటికీ మిగిలిపోయింది. కె.బాలచందర్ దర్శకత్వంలో ఆమె ‘47 రోజులు’, ‘అందమైన అనుభవం’ చేశారు. కేన్సర్ పేషెంట్‌గా చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు? జయప్రద తప్ప. ‘అడవి రాముడు’తో కె.రాఘవేంద్రరావు జయప్రదను కమర్షియల్ హీరోయిన్ను చేశారు. అప్పటికే జయప్రద కుటుంబం ఎన్.టి.ఆర్కు పరిచయం ఉంది. కొన్నాళ్ల క్రితం సెలవుల్లో వచ్చి ఆయన దగ్గర కూచుని కబుర్లు చెప్పిన స్కూల్ గర్ల్ ఇప్పుడు ఆయన పక్కనే హీరోయిన్ అయ్యింది. వేటూరి రాయగా కె.వి.మహదేవన్ స్వరపర్చగా బాలూ, సుశీల పాడిన ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ పాట జయప్రదను సకల ప్రేక్షకులకు పరిచయం చేసేసింది. జయప్రద అంటే ఒక సుందరమైన సౌందర్యవంతమైన రూపం. ప్రేక్షకులు అలానే కోరుకున్నారు. ఆమె నేటికీ అలానే ఉన్నారు. ఇప్పుడు ఆమె ఒక తెలుగు సినిమా లో నటిస్తున్నారు. మరోసారి జయప్రద జయప్రదంగా మన ముందుకు రావాలని కోరుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
లోకేష్‌ను జెడ్పీటీసీగా నిలబెట్టి గెలిపించుకోగలరా?
తాడేపల్లి: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల విధులు నిర్వహించారని ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు వారిని శ్రీకాంత్ రెడ్డి అభినందించారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ పార్టీ కేంద్ర కార్యలయంలో విలేకరుల సమావేశంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాగా, టీడీపీ ఈ ఎన్నికలను రాజకీయంగా వాడుకొవాలని చూశారని విమర్షించారు. వీరికి పోటీలో నిలబెట్టడానికి అభ్యర్థులు దొరక్క వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడికి దిగారన్నారు. చాలా స్థానాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఏకగ్రీవం కావడం పట్ల టీడీపీ కావాలనే రాద్ధాంతం చేసిందని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఏ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందో మున్సిపల్ ఫలితాలు చూస్తే తెలిపిపోతుందన్నారు. అయితే , చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రజలను దూశించారని, అందుకే వారు ఓట్లరూపంలో బాబుకు సరైన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. లోకేష్‌ను కనీసం జెడ్పీటీసీగా అయినా నిలబెట్టి గెలిపించుకోగలరా అని సవాల్ విసిరారు. ఇప్పటి వరకు దాదాపు 86కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో ప్రజల ఖాతాల్లో చేరాయని తెలిపారు. సంక్షేమం, అభివృద్ది జగన్మోహన్ రెడ్డికి రెండు కళ్ళని అన్నారు. అయితే, చంద్రబాబుకి మాత్రం దోచుకోవడం, దాచుకోవం మాత్రమే తెలుసన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలోని ప్రతి హమీని జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారన్నారు. కాగా, ఉల్లి ధరలు పెరిగితే సబ్సీడి కింద అందించారని తెలిపారు. కాగా, 75 మున్సిపాలీటిలలో టీడీపీ ఒక్క స్థానం కూడా గెలవలేదని, 12కార్పోరేషన్లలో డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. చంద్రబాబు, లోకేష్ తమ భాషను మార్చుకొవాలన్నారు. కాగా, ఏపీ ఎన్నికల కమీషనర్ ఒక రాజ్యంగ బద్ధ పదవిలోఉండి రాజకీయా పార్టీలతో హోటళ్ళలో రహస్యంగా కలవడం దేనికి సంకేతమని అన్నారు. ఇప్పటికైన చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు. చంద్రబాబుకు చిత్త శుధ్ది ఉంటే కోర్తులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోకుండా విచారణను ఎదుర్కొవాలని డిమాండ్ చేశారు. కాగా, చంద్రబాబు హయాంలో నీరు చెట్టు పేరుతో వేలకోట్లు దోచేశారని, చెత్తతో సంపద సృష్ఠి అన్నారు.. ఎక్కడ సృష్టించారో తెలపాలన్నారు. ప్రజలకు టీడీపీ పార్టీ పట్ల పూర్తిగా నమ్మకం పోయిందని శ్రీకాంత్‌రెడ్డి విమర్షించారు. -
టీడీపీలో ‘చిచ్చు’ బుడ్డి
అధికారంలో ఉన్నన్నాళ్లూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఆధిపత్యం కోసమే గొడవపడిన టీడీపీ నేతలు.. ప్రతిపక్షంలోనూ అదే బాటలో పయనిస్తున్నారు. అనంతపురంలో పట్టుకోసం అటు వైకుంఠం, ఇటు జేసీ పాకులాడుతుండగా కేడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది. విందు రాజకీయాలతో జేసీ పవన్ ఆ పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తుండగా.. వైకుంఠం తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. సాక్షి , అనంతపురం: ప్రతిపక్ష టీడీపీలో వర్గపోరు దీపావళి తారజువ్వలా ఎగసిపడుతోంది. జేసీ, వైకుంఠం వర్గాలు అమీతుమీకి సిద్ధమయ్యాయి. నేతలిద్దరూ కేడర్‌తో మంతనాలు జరుపుతూ ఎగదోస్తుండగా.. వర్గపోరు వంకాయ బాంబులా ఏ క్షణమైనా పేలేందుకు సిద్ధమైంది. దీపావళికి పచ్చపార్టీలో రేగిన ‘చిచ్చు’ బుడ్డి ఎవరి కొంప ముంచుతుందోననే చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. ( చదవండి: మున్సిపల్ కార్పొరేషన్ ఖజానా పై కన్నేసిన టీడీపీ నేతలు ) ఆది నుంచీ విభేదాలే... జేసీ కుటుంబం టీడీపీలో చేరడం కూడా వైకుంఠానికి ఇష్టం లేదు. అయినప్పటికీ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో నోరుమెదపలేకపోయారు. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా జేసీ కుటుంబానికి ఎదురు నిలుస్తున్నారు. ఒకే పార్టీలో ఉన్నా.. కేడర్‌ను రెండుగా చీల్చి రాజకీయం నడుపుతున్నారు. రెండు వర్గాల మధ్య విభేదాలు ప్రారంభం నుంచీ ఉన్నా.. ప్రధానంగా అనంతపురం నగరంలోని రోడ్డు వెడల్పు విషయంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. జేసీ దివాకర్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి పార్టీ వీడతారనే దాకా ప్రచారం సాగింది. అంతిమంగా రోడ్డు వెడల్పు కోసం ఉత్తర్వులు కూడా జారీ చేయించుకున్నారు. కానీ అంతకుమించి ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. దీని వెనుక ప్రభాకర్ చౌదరి మంత్రాంగం నడిపారనే ప్రచారం ఉంది. రోడ్డు వెడల్పు పనులు జరగకుండా వ్యాపారులను ఎగదోసి అడ్డుకున్నారనే ప్రచారం కూడా సాగింది. రాంనగర్ బ్రిడ్జి విషయంలోనూ మనస్పర్థలు.. నగరంలోని రాంనగర్ బ్రిడ్జి వెడల్పు కుదించే విషయంలో కూడా జేసీ, వైకుంఠం మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ బ్రిడ్జిని కూడా ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా అప్పట్లో ఎంపీ హోదాలో జేసీ ప్రారంభించారు. ఎన్నికల సమయంలోనూ ఇరువురి మధ్య సఖ్యత లేకుండా పోయింది. ఇప్పుడు ఇరువురూ ఓడిపోయిన తర్వాత.. ఒక కేసు విషయంలో జేసీ దివాకర్‌రెడ్డి అరెస్టయి నగరంలోని ఓ పోలీసు స్టేషన్లో ఉండగా.. అటువైపు కన్నెత్తి చూడవద్దని తన అనుచరులనే కాకుండా పార్టీ నేతలను కూడా వైకుంఠం కట్టడి చేశారని సమాచారం. అంతేకాకుండా నిరసనల ఊసే లేకుండా చేయగలిగారనే చర్చ కొనసాగుతోంది. తద్వారా జేసీకి నగరంలో కనీస పట్టు లేదనే భావన వచ్చేలా చేయగలిగారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ప్రభాకర్‌చౌదరిని దెబ్బకొట్టేందుకు జేసీ పవన్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నేరుగా భేటీలు.. విందులు! వైకుంఠంతో వర్గపోరు నడుస్తున్న నేపథ్యంలో జేసీ కుటుంబం నగరంలో పాగా వేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రభాకర్ చౌదరికి దగ్గరగా ఉన్న నేతలతో జేసీ పవన్ గత 15 రోజులుగా 2–3 సార్లు భేటీ అయ్యారు. అంతేకాకుండా విందు సమావేశాలు కూడా నిర్వహించారు. టౌన్ బ్యాంకు మాజీ అధ్యక్షుడు జేఎల్ మురళితో పాటు కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రాయల్ మురళి, టీడీపీ బీసీ సెల్ నగర అధ్యక్షుడు మధుసూదన్ గౌడ్, టీడీపీ జిల్లా కార్యదర్శి సద్దల చెన్నప్ప, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు డేరంగులు వెంకటాద్రి, కో–ఆప్షన్ మెంబర్ కృష్ణమకుమార్, మాజీ కార్పొరేటర్లు రంగమ్మ, ఉమామహేశ్వరనాయుడు, విద్యాసాగర్, టీఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి మణికంఠబాబు, వాణిజ్యవిభాగం ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతి తదితరులతో జేసీ పవన్ మంతనాలు సాగించారు. గత 15 రోజులుగా 2–3 సార్లు సమావేశం కావడంతో పాటు విందు కూడా ఏర్పాటు చేశారు. తద్వారా నగరంలో ప్రభాకర్ చౌదరిని ఏకాకిని చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆ పార్టీ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తమ వర్గానికే ప్రాధాన్యత దక్కుతుందని జేసీ అనుచరులు వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా టీడీపీ పరిస్థితి దీపావళి వేళ మూడు వంకాయ బాంబులు, ఆరు లక్ష్మీ బాంబుల్లా తయారైంది. అయితే, చివరకు ఏ వర్గం బాణసంచా ఢాం అని పేలుతుందో.. ఎవరి మతాబు తుస్సుమంటుందో తేలాల్సి ఉంది. జేసీ పవన్ అంతరంగం ఎమ్మెల్యే వర్గాన్నంతా మనవైపు తిప్పుకోవాలి. నగరంలో పట్టుసాధించాలి. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ కార్పొరేటర్ సీట్లు మనవాళ్లకే ఎక్కువగా ఇప్పించుకుని పైచేయి సాధించాలి. వైకుంఠం ప్రణాళిక జేసీని ఏకాకిని చేయాలి. నగరంలో వర్గమంటూ లేకుండా చూడాలి. కార్పొరేటర్ సీట్ల ఎంపికలోనూ మనమే సత్తా చాటాలి. జేసీ వైపు వెళ్లిన వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలి. -
ప్రజాప్రతినిధులపై భారీగా క్రిమినల్ కేసులు
న్యూఢిల్లీ: ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులపై గత రెండేళ్లుగా క్రిమినల్ కేసులు భారీగా పెరిగాయని ఒక నివేదిక తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి సిట్టింగ్, మాజీ ప్రజా ప్రతినిధులపై 4,442 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండగా ప్రస్తుతం 4,859కు చేరుకున్నట్లు వివరించింది. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విచారణ రెండేళ్లుగా వేగవంతమైనప్పటికీ పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని న్యాయవాదులు విజయ్ హన్సారియా, స్నేహ కలిట సోమవారం సుప్రీంకోర్టు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ‘హైకోర్టులు సూక్ష్మస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి, ఇలాంటి కేసులను సత్వరమే పరిష్కరించాలి. ఇందుకోసం ప్రతి జిల్లాలోనూ సెషన్స్, మెజిస్టీరియల్ స్థాయి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కొన్ని హైకోర్టులు కోరుతున్నాయి. ప్రతి కోర్టుకు నోడల్ ప్రాసిక్యూషన్ అధికారి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయా హైకోర్టులు లేఖలు కూడా రాశాయి. సాక్షులకు రక్షణ, భద్రత కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్ల కల్పనలో నిధుల కొరత సమస్యగా మారిందని హైకోర్టులు చెప్పాయి’ అని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటికే పనిచేస్తున్న బెంగళూరు, అలహాబాద్ ప్రత్యేక కోర్టుల్లో విచారణ కేసుల సంఖ్య ఎక్కువగా ఉందనీ, ఇలాంటి చోట్ల అదనంగా కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
ఎన్నికల్లో పోటీ చేస్తాను: మాజీ డీజీపీ
పట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా వార్తల్లో నిలిచిన బిహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్వచ్ఛంద పదవి విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల్లో చేరతారంటూ వార్తలు వచ్చాయి. సమాజసేవ చేయడం కోసమే పదవి విరమణ చేశానంటూ ఈ వార్తలని ఖండించారు. అయితే నిన్నటి వరకు తాను రాజకీయాల్లో చేరనన్న గుప్తేశ్వర్ పాండే.. రాత్రికి రాత్రే తన మనసు మార్చుకున్నారు. ఇవాళ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ ప్రవేశంపై ఆయన స్పష్టత ఇచ్చారు. తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని తేల్చిచెప్పారు పాండే. క్రిమినల్స్ పార్లమెంట్లో అడుగుపెడుతున్నారు. అలాంటప్పుడు తానేందుకు రాజకీయాల్లో రావొద్దు అని ప్రశ్నించారు పాండే. రాజకీయాల్లోకి రావడం ఏమైనా అనైతిక చర్యనా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. (చదవండి: రాబిన్ హుడ్ అవతారమెత్తిన డీజీపీ) బిహార్‌లో తాను ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా తప్పకుండా గెలుస్తాను అని పాండే ధీమా వ్యక్తం చేశారు. అంతేకాక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలిచి తీరతానని చెప్పారు. ఒక వేళ తాను రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేస్తే సింహాంలా అడుగుపెడుతానని, దొంగలా కాదని గుప్తేశ్వర్ పాండే పేర్కొన్నారు. -
రియాకు అర్హత లేదు.. డీజీపీ రాజీనామా
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిని విమర్శించినందుకు గాను రియా చక్రవర్తిపై మండి పడటమే కాక.. ఆమెకు ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన డీజీపీ గుప్తేశ్వర్ పాండే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే రాజకీయాల్లో చేరడానికి పాండే రాజీనామా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వచ్చే నెలలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాండే స్వచ్ఛంద పదవీ విరమణ చేయడంతో ఎన్నికల్లో పోటీ చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1987 బిహార్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి గుప్తేశ్వర్ పాండే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక పాండే రాజీనామా అభ్యర్థనకు సంబంధించి నోటిఫికేషన్ హోంశాఖ జారీ చేసింది. ఇక నిన్నటితో ఆయన వర్కింగ్ డేస్ పూర్తయ్యాయి.(చదవండి: ‘రియాకు ఆ అర్హత లేదు.. అందుకే’) ఇక డీజీపీ రాజకీయాల్లో చేరతారంటూ వస్తోన్న వార్తలపై పాండే స్పందించారు. ‘నేను ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరలేదు.. దీని గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాకు సమాజ సేవ చేయాలని ఉంది. అందుకుగాను రాజకీయాల్లోనే చేరాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. ఇక పాండే గతంలో కూడా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రాజకీయాల్లో చేరి.. బీజేపీ టికెట్ పొందాలని ఆశించారు. కానీ అవకాశం లభించలేదు. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన 9 నెలల తర్వాత తిరగి తనను విధుల్లోకి తీసుకోవాల్సిందిగా బిహార్ ప్రభుత్వాన్ని కోరారు. అతని అభ్యర్థన మేరకు నితీష్ కుమార్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు పాండేని విధుల్లోకి తీసుకున్నారు. -
హనీట్రాప్: ఎమ్మెల్యేలు, మాజీల రహస్య వీడియోలు
ఎమ్మెల్యేలు, బడా నాయకులతో పరిచయాలు పెంచుకుని రహస్య వీడియోలు తీసి బెదిరిస్తున్న ఘరానా హనీ ట్రాప్ ముఠా చరిత్రను తవ్వుతున్న కొద్దీ సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం సీసీబీ పోలీసుల అదుపులో ఉన్న ముఠా కీలక సభ్యుల సెల్ఫోన్లు, కంప్యూటర్లు తదితరాల్లో నాయకుల శృంగార వీడియోలు అనేకం బయటపడినట్లు సమాచారం. కొందరు అధికారులు కూడా వలపు ముఠాకు చిక్కడం గమనార్హం. బనశంకరి: రాష్ట్రంలో పదిమందికి పైగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హనీ ట్రాప్‌లో చిక్కుకున్న కేసు రోజురోజుకు మలుపు తిరుగుతోంది. గత ఆగస్టు నుంచి జరుగుతున్న హనీట్రాప్ దందాలో సీరియల్ నటి బృందానికి మాజీమంత్రులు, శాసనసభ్యుల రాజకీయ ప్రత్యర్థులకు లక్షలాది రూపాయలు అందించి సహకారం అందించినట్లు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసుల విచారణలో వెలుగుచూసింది. హనీట్రాప్ వెలుగులోకి వచ్చిన అనంతరం పలువురు ప్రజాప్రతినిదులు, ప్రముఖులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కేసు లేకుండా పరిష్కరించుకోవడానికి పోలీస్‌శాఖను ఆశ్రయిస్తున్నారు. ట్రాప్ చేసేవారిలా కీలక నిందితుడు రాఘవేంద్ర, అతని ప్రియురాలు తదితరుల నుంచి సీసీబీ పోలీసులు స్వాదీనం చేసుకున్న ఎల్రక్టానిక్స్ పరికరాల్లో పదిమందికి పైగా ప్రజాప్రతినిధులు, మాజీమంత్రుల వీడియోలు లభ్యమయ్యాయి. ఇంకా అనేకమంది హనీట్రాప్ ఇరుక్కుని డబ్బులు ముట్టజెప్పినట్లు సమాచారం. హనీట్రాప్‌లో ఎమ్మెల్యేలు, అధికారులను బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన మహిళలు రాత్రి 10 గంటల అనంతరం మొబైల్‌ఫోన్‌కు ఫోన్ చేసి అర్ధరాత్రి వరకు సంభాషించడం, ఎమ్మెల్యేలు మద్యం మత్తులో ఉండటాన్ని ధ్రువీకరించుకుని మహిళలు రంగంలోకి దిగేవారు. హనీట్రాప్ వలలో పడిన ఎమ్మెల్యేలు, యువతులను ఎమ్మెల్యేలు తరచుగా పిలిపించుకునేవారు. ఈ నీచకృత్యాలను పెట్టుబడిగా పెట్టుకున్న వంచకముఠా వీడియోలు తీసి భారీనగదును ఇవ్వాలని నాయకులను ఒత్తిడి చేసేవారు. రాఘవేంద్ర వద్ద ఏడుకు పైగా మొబైల్స్, 15 సిమ్‌కార్డులను స్వాదీనం చేసుకుని వాటిని విశ్లేషిస్తున్నారు. పరారీలో ముఠా సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన హనీట్రాప్ ముఠా తమ బృందంలోని ప్రముఖులు అరెస్ట్ కావడంతో కొందరు పరారీలో ఉన్నారు. వీరి అరెస్ట్‌చేయడానికి ప్రత్యేక పోలీస్‌బృందం తీవ్రంగా గాలిస్తున్నట్లు సీసీబీ పోలీస్ వర్గాలు తెలిపాయి. నిందితులు వీడియో రికార్డింగ్, మొబైల్ కాల్స్ వివరాలు, సంబాషణలను నాశనం చేశారు. వాటి డిజిటల్ సాక్ష్యాల కోసం విచారణ అధికారులు ప్రయత్నిస్తున్నారు. గదగ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే హనీట్రాప్ ముఠాలో చిక్కుకోగా రహస్యంగా చిత్రీకరించడానికి రూ.10 లక్షలు ఇవ్వాలని సీరియల్ నటి ఆ ఎమ్మెల్యే రాజకీయ ప్రత్యర్థిని అడిగారు. చివరకు రూ.1 లక్ష చెల్లించారు. ఏదో వంకతో పరిచయం పెంచుకుని నియోజకవర్గంలో గ్రామీణ అభివృద్ధికి సంబంధించి క్యాంప్ నిర్వహించాలని, వారం రోజుల పాటు ఉండటానికి వ్యవస్థ కల్పించాలని అని గదగ్ జిల్లా ఎమ్మెల్యే వద్ద హనీట్రాప్ ముఠా సభ్యులు విన్నవించారు. ప్రారంభంలో మహిళ పట్ల అసక్తి చూపని ఎమ్మెల్యే అనంతరం మహిళ ట్రాప్‌లో పడ్డారు. ఎమ్మెల్యే రాసలీలను సీరియల్ నటి రహస్యంగా చిత్రీకరించి తన అనుచరులకు అందజేశారు. ఆ సీడీని ఎమ్మెల్యేకు చూపించి రూ.50 కోట్లకు డిమాండ్ పెట్టారు. అంత డబ్బు తన వద్దలేదనడంతో కనీసం రూ.10 కోట్లు ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలిసింది. ఉడుపి జిల్లా, ఉత్తర కన్నడ జిల్లా ఎమ్మెల్యేల వీడియోలు కూడా బయటపడ్డాయి. రహస్య కెమెరా కలిగిన హ్యాండ్‌బ్యాగ్‌ల సాయంతో రికార్డింగ్ చేసేవారని తెలిసింది. సమాచారం ఇవ్వండి: పోలీసులు హనీట్రాప్ వలలో పడిన వ్యక్తులు ఎవరైనా తమకు సమాచారం అందించి విచారణకు సహకరించాలని పోలీస్‌శాఖ కోరింది. ఫిర్యాదుదారుల సమాచారం రహస్యంగా ఉంచి విచారణ చేపడతామని చెబుతున్నారు. హనీట్రాప్ కేసులో చిక్కుకుని కంగారుపడిన అనేకమంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం కోర్టును ఆశ్రయించారు. వీడీయోలు, సమాచారం ప్రసారం కాకుండా అడ్డుకోవాలని కొందరు కోర్టులో పిల్ వేశారు. -
సెక్స్ రాకెట్: వీడియోలు తీసి.. బ్లాక్మెయిల్ చేసి
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుతం సెక్స్ రాకెట్ కుంభకోణం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై విచారణ నిమిత్తం ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి సంజీవ్ షమీ అధ్యక్షతన సిట్‌ని ఏర్పాటు చేసింది. ఈ కుంభకోణంలో 12మంది బ్యూరోక్రాట్లు, 8మంది రాజకీయ నాయకులు ఉన్నట్లు సిట్ వెల్లడించింది. వీరిలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర గవర్నర్ కూడా ఉండటం సంచలనంగా మారింది. ఈ మొత్తం కుంభకోణానికి సూత్రదారి అయిన శ్వేతా జైన్‌ను ప్రస్తుతం సిట్ విచారిస్తుంది. ఈ విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ హనీట్రాప్‌లోకి కాలేజీ విద్యార్థినులను ఎలా భాగం చేస్తున్నారు.. ఆనక వారితో చేయించే అకృత్యాలు, తద్వారా తాము పొందే లాభాల గురించి శ్వేతా జైన్ సిట్ ముందు వెల్లడించింది. ఆ వివరాలు.. శ్వేతా జైన్ భర్త స్వాప్నిల్ జైన్ ఓ ఎన్జీవోను ప్రారంభించాడు. ముందుగా ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మధ్య తరగతి కుటుంబాలను ఎంచుకుంటుంది. ఆ ఇళ్లలో ఉన్న చదువుకునే, యుక్త వయసు అమ్మాయిలకు జాబ్ ఇప్పిస్తాను, చదువుకునేందుకు సాయం చేస్తామంటూ మాయమాటలు చెప్తుంది. ఆడంబర జీవితం, డబ్బు రుచి చూపి.. అందుకు ఆ కుటుంబం ఒప్పుకుంటే.. ఆ తర్వాత శ్వేతా జైన్ రంగంలోకి దిగుతుంది. నెమ్మదిగా సదరు యువతులకు ఆడంబరమైన జీవితాన్ని రుచి చూపిస్తుంది. భారీ మొత్తంలో డబ్బు ఇచ్చి.. తాను చెప్పినట్లు చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశపెడుతుంది. ఆ తర్వాత వారిని నెమ్మదిగా తన సెక్స్ రాకెట్ కోసం వాడుకుంటుంది. అలా కాలేజీకి వెళ్లే యువతులను రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు ఎర వేస్తుంది. ఆ అధికారులు, నాయకుల కోరిక మేరకు సదరు యువతులను వారి వెంట టూర్లకు, ఫైవ్‌స్టార్ హోటళ్లకు పంపేది. అనంతరం వారు శృంగారంలో పాల్గొంటుండగా చాటుగా వీడియో తీసేది. ఆ తర్వాత ఈ వీడియోలను చూపించి సదరు అధికారులను, నాయకులను బ్లాక్మెయిల్ చేసి భారీ కాంట్రాక్టులు, ఎన్జీవోకు అధిక మొత్తంలో విరాళాల రూపంలో డబ్బు సంపాదించేది. ఒక్కసారి శ్వేతా జైన్ చేతిలో పడిన యువతులు ఈ ఉచ్చు నుంచి బయటకు రావడం కష్టం. శ్వేత చేస్తున్న అక్రమాల గురించి పోలీసులకు గానీ, మీడియాకు గానీ చెప్పాలని చూస్తే.. వారి వీడియోలను ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తానని బెదిరించేది. దాంతో యువతులు కూడా కామ్‌గా ఉండేవారు. ఇలా సాగుతున్న శ్వేతా జైన్ అక్రమాలకు ఓ ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదు అడ్డుకట్ట వేసింది. తీగ లాగడంతో డొంక అంతా కదిలింది. గొప్ప కాలేజీలో సీటు ఇప్పిస్తానని.. ఈ క్రమంలో మౌనిక అనే భాదితురాలు మాట్లాడుతూ.. ‘ఇంటర్ పూర్తయ్యాక నేను ఉన్నత విద్య అభ్యసించాలని ఆశించాను. కానీ నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ఈ క్రమంలో శ్వేతా జైన్ భర్త నా తండ్రిని కలిసి.. తన ఎన్జీవో ద్వారా నేను చదువుకోడానికి సాయం చేస్తానని చెప్పాడు. మంచి పేరున్న కాలేజీలో సీటు ఇప్పిస్తానని.. నన్ను భోపాల్ పంపిచాల్సిందిగా కోరాడు. మా నాన్న అంగీకరించడంతో నన్ను భోపాల్ తీసుకెళ్లారు. అక్కడ నన్ను ఓ పాష్ హోటల్లో ఉంచారు. తిరగడానికి బీఎండబ్ల్యూ కార్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత నెమ్మదిగా వారి ప్లాన్‌ను నాకు వివరించారు. ఎంతో డబ్బు వస్తుందని.. ఫలితంగా నా కుటుంబ ఆర్థిక అవసరాలు అన్ని తీరతాయని నన్ను ప్రలోభాలకు గురి చేశారు. పైగా నన్ను మంచి కాలేజీలో చేర్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత శ్వేతా జైన్ నన్ను సెక్రటేరియట్ వద్దకు తీసుకెళ్లి పెద్ద పెద్ద అధికారులను నాకు పరిచయం చేసింది. వారి ద్వారా నాకు మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని నమ్మించింది. అలా నన్ను దీనిలో ఇరికించింది’ అంటూ మౌనిక వాపోయింది. చదవండి: సెక్స్ రాకెట్; మాజీ సీఎం సహా ప్రముఖుల పేర్లు! రూ. 3కోట్లు ఇవ్వాల్సిందిగా బెదిరింపు... ‘ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు 30న శ్వేతా, ఆమె సహాయకులు ఆర్తి దయాల్, రూప నన్ను ఓ పాష్ హోటల్‌కు తీసుకెళ్లారు. మరుసటి రోజు సాయంత్రం వారు నన్ను ప్రభుత్వ ఇంజనీర్ హర్భజన్ సింగ్ దగ్గరకు పంపించారు. హోటల్ గదిలో మేం శృంగారంలో పాల్గొంటుండగా ఆర్తి దయాల్ వీడియో తీశాడు. తర్వాత దాన్ని హర్భజన్‌కు చూపించి తనకు రూ. 3కోట్లు ఇవ్వాల్సిందిగా శ్వేత బ్లాక్మెయిల్ చేసింది. కానీ ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ విషయం గురించి మా తల్లిదండ్రులతో చెప్తే.. వీడియోను ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తానని శ్వేత నన్ను బెదిరించింది. దాంతో నేను మౌనంగా ఉన్నాను. శ్వేత దగ్గర నాలాంటి కాలేజీ యువతులు ఓ రెండు డజన్ల మంది ఉండగా.. కాల్ గర్ల్స్ 40 మంది దాకా ఉంటార’ని మౌనిక సిట్ ముందు వెల్లడించింది. కాగా ఈ సెక్స్ రాకెట్లో మాజీ మంత్రులు, బ్యూరోక్రాట్ల ప్రమేయంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి కేకే మిశ్రా మాట్లాడుతూ.. భోపాల్, ఇండోర్ వంటి ప్రముఖ పట్టణాల్లో సెక్స్ రాకెట్ చాలా సంవత్సరాలుగా సాగుతోందని, బ్లాక్ మెయిల్‌కు గురైన రాజకీయ నాయకులలో 80 శాతం మంది బీజేపీకి చెందినవారేనని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉన్నట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
నేతలకు పట్టని ‘నేచర్’ సమస్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘50 లక్షల జనాభా కలిగిన మెట్రోపాలిటన్ నగరం చెన్నై తాగునీరు కోసం తల్లడిల్లుతోంది. బిహార్‌లో వీచిన వడగాడ్పులకు ఇప్పటివరకు 150 మంది మరణించారు. దక్షిణాఫ్రికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐ గుప్తా ఇంట్లో ఇటీవల జరిగిన పెళ్ళిలో 4000 కిలోల చెత్త మహాకూడింది’ గత కొన్ని వారాల్లో చోటుచేసుకున్న ఈ పరిణామాలన్నీ పర్యావరణ సమస్యకు సంబంధించినవే. రానున్న రోజుల్లో దేశం ఎంతటి పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందో ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. అయినా ఇంతటి తీవ్రమైన అంశం ఎందుకు రాజకీయ నాయకులకు పట్టదో అర్థం కాదు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పాకిస్థాన్ నుంచి పన్నుల వరకు పలు అంశాలు ప్రస్థావనకు వచ్చినప్పటికీ పర్యావరణ సమస్య మాత్రం పెద్దగా రాలేదు. ఏ ఎన్నికల సందర్భంగా కూడా ఈ సమస్యలు ప్రస్తావనకు రావు. క్యాన్సర్, టీబీ, ఎయిడ్స్, డయాబిటీస్ లాంటి రోగాలన్నింటి వల్ల చనిపోతున్న వారి కంటే వాయు కాలుష్యం వల్ల ఎక్కువ మంది మరణిస్తున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2020కల్లా దేశంలోని 21 నగరాల్లో భూగర్భ జలాలు ఇంకిపోతాయని ‘నీతి ఆయోగ్’ సంస్థ అంచనాలు. 2030 సంవత్సరం నాటికి దేశంలోని 40 శాతం నగరాలు మంచినీటికి కటకట లాడుతాయని అంచనాలు తెలియజేస్తున్నాయి. రానున్న ముప్పు నుంచి బయటపడాలంటే ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. తాత్కాలిక ప్రయోజనాలు, అవసరాల మీద రాజకీయ నాయకులకు అంతటి దూరదష్టి ఉండడం కష్టమే. -
పార్లమెంటులో ఫస్టు క్లాసు లీడర్స్
కొన్ని అద్భుతాలు అంతే. హడావుడి లేకుండా, హంగామా చేయకుండాచరిత్రలో చెరగని ముద్ర వేస్తాయి. తాజాగా దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలసమరాంగణంలో రెండు అద్భుతాలు జరిగాయి. గిరిజన తెగకు చెందిన ఇద్దరుయువతులు సరికొత్త చరిత్ర లిఖించారు. దేశం యావత్తు తమవైపుచూసేలా చేశారు. ఒకరు చంద్రాణి ముర్ము. ఇంకొకరు గొడ్డేటి మాధవి. కియోంజహర్‌లోని తికర్‌గుమురా గ్రామానికి చెందిన చంద్రాణి ముర్ము.. బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ లేదా ఒడిశాలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం దొరక్కపోతే ప్రైవేటు కంపెనీలో మెకానికల్ ఇంజనీర్ ఉద్యోగం సంపాదించాలనుకున్నారు. అయితే ఊహించని విధంగా ఆమె జీవితం మలుపు తిరిగింది. జాబ్ వస్తే చాలనుకున్న ఆమె పాతికేళ్ల ప్రాయంలోనే ఏకంగా లోక్‌సభ ఎంపీగా ఎన్నికై అందరి దృష్టినీ ఆకర్షించారు. ‘‘ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల్లో నామినేషన్ వేయాల్సివచ్చింది. రాజకీయాల్లోకి వస్తానని, ఎంపీ అవుతానని కలలో కూడా అనుకోలేదు’’ అని చంద్రాణి ఉద్వేగంగా చెప్పారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కియోంజహర్ నియోజకవర్గం(ఎస్టీ) నుంచి బిజూ జనతాదళ్ (బీజేడీ) తరపున పోటీ చేసిన చంద్రాణి బీజేపీ నాయకుడు అనంత నాయక్‌ను 66,203 ఓట్ల ఆధిక్యంతో ఓడించి ఔరా అనిపించారు. 25 ఏళ్ల 11 నెలల 8 రోజుల ప్రాయంలో (ఎన్నికలు ఫలితాలు వెలువడిన మే 23 నాటికి) ఎంపీగా ఎన్నికై సరికొత్త రికార్డు లిఖించారు. జూన్ 16న 26వ పడిలోకి అడుగు పెట్టడానికి ముందే లోక్‌సభ ఎంపీగా ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటివరకు ఈ రికార్డు హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా మనవడు దుష్యంత్ చౌహన్ పేరిట ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 26 ఏళ్ల 13 రోజుల వయస్సులో హిస్సార్ నియోజకవర్గం నుంచి ఎన్నికై అతిపిన్న వయస్కుడిగా దుష్యంత్ ఘనత సాధించారు. తాజా విజయంతో ఈ రికార్డును చంద్రాణి అధిగమించారు. సీఎం ఎంపిక చేసిన అమ్మాయి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని భావించిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండి, ప్రజా జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నవారి గురించి వెతుకుతుండగా చంద్రాణి ఆయన దృష్టిలో పడ్డారు. మరో ఆలోచన లేకుండా ఆమెను అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటికి ఆమె ఇంజినీరింగ్ పూర్తి చేసి కేవలం రెండేళ్లు మాత్రమే అయింది. 1993, జూన్ 16న జన్మించిన చంద్రాణి.. కియోంజహర్‌లోని ఎన్ఎస్ పోలీస్ హైస్కూల్లో పాఠశాల విద్య, భువనేశ్వర్‌లోని నాయుడు క్లాసెస్ విద్యా సంస్థ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. శిక్షా ’ఓ’ అనుసాధన్ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా సాధించారు. చంద్రాణి తండ్రి సంజీవ్ ముర్ము ప్రభుత్వ ఉద్యోగి కాగా, తల్లి ఊర్వశి సోరేన్ గృహిణి.ఎన్నికల సమరాంగణంలోకి అడుగుపెట్టిన వెంటనే చంద్రాణికి వ్యతిరేకంగా ప్రత్యర్థుల విష ప్రచారం మొదలైంది. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అపఖ్యాతి పాల్జేసేందుకు కుట్రలు చేయడంతో ఒక దశలో ఆమె చాలా బాధపడ్డారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా విజయం సాధించడంతో చివరకు న్యాయం గెలిచిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.గొడ్డేటి మాధవి.. తెలుగు గడ్డపై తిరుగులేని విజయం సాధించి సమకాలిన రాజకీయ చరిత్రలో కొత్త పేజీని లిఖించారు. తెలుగు రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా గిరి పుత్రిక మాధవి ఖ్యాతి దక్కించుకున్నారు. నేర్చుకుని నిరూపించుకుంటా... ‘‘ఇక రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నాను. వయసుతో సంబంధం లేకుండా పార్లమెంట్ నా గళం బలంగా విన్పిపించడానికి ప్రయత్నిస్తాను. సీనియర్ల నుంచి పాఠాలు నేర్చుకుని లోక్‌సభ సభ్యురాలిగా నన్ను నేను నిరూపించుకుంటాను. నామినేషన్ వేయడానికి కొద్ది రోజుల ముందే నన్ను ఎంపిక చేయడంతో నియోజకవర్గం మొత్తం తిరగలేకపోయాను. నిజం చెప్పాలంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల నాకు పూర్తి అవగాహన లేదు. ప్రజలకు ఎక్కువ సమయం కేటాయించి నా నియోజకవర్గం గురించి తెలుసుకోవడమే ఇప్పుడు నా ముందున్న కర్తవ్యం.’’ – చంద్రాణి, ఒడిశా ఎంపీ మురిసిన తెలుగు గడ్డ గొడ్డేటి మాధవి.. తెలుగు గడ్డపై తిరుగులేని విజయం సాధించి సమకాలిన రాజకీయ చరిత్రలో కొత్త పేజీని లిఖించారు. తెలుగు రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా గిరి పుత్రిక మాధవి ఖ్యాతి దక్కించుకున్నారు. అరకు పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగి రాజకీయ ఉద్ధండుడైన వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌ను 2.25 లక్షల భారీ మెజార్టీతో మట్టికరిపించారు. పోరాటాలే అనుభవాలుగా.. తండ్రి ఆశయాల కోసం రాజకీయాల వైపు అడుగులు వేసి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ప్రత్యర్థి అనుభవమంత వయసు లేకపోయినా 26 ఏళ్ల ప్రాయంలోనే ఎంపీగా ఎన్నికై తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం శరభన్నపాలెం మాధవి స్వగ్రామం. తల్లి చెల్లయమ్మ ఎస్జీటీగా పనిచేస్తూ కొయ్యూరు మండలంలోనే నివాసం ఉంటున్నారు. మాధవి తండ్రి గొడ్డేటి దేముడు కమ్యూనిస్టు నాయకుడు, చింతపల్లి మాజీ ఎమ్మెల్యే. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినా ఆస్తులు కూడబెట్టుకోని నిజాయితీపరుడు. 1992, జూన్ 18న మాధవి జన్మించారు. ఆమెకు ఇద్దరు సోదరులు. బీఎస్సీ బీపీడీ అయ్యాక ఆమె గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పీడీగా పనిచేశారు. 2018 అక్టోబర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేశారు. మలుపు తిప్పిన ఘటన మాధవి తాటిపర్తి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైతే పాడేరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎంత ప్రాధేయపడినా ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యులు ఆ చిన్నారికి వైద్యం అందించలేదు. ఐటీడీఏకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. పదవిలో ఉంటే తప్ప సమస్యలు పరిష్కారం కావని అర్థం కావడంతో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. మాధవి పోరాట పటిమను గుర్తించిన వైఎస్ జగన్ ఆమెకు అరకు లోక్‌సభ టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ రికార్డు విజయం సాధించారు. - పోడూరి నాగ శ్రీనివాసరావు సాక్షి వెబ్ డెస్క్ -
రాజకీయాల్లోకి వస్తా : ప్రముఖ హాస్యనటుడు
సాక్షి, చెన్నై : నేనూ రాజకీయాల్లోకి వస్తానని నటుడు వివేక్ అన్నారు. హాస్యనటుడిగా పేరుగాంచిన ఈయన సోమవారం కోడైకెనాల్‌లోని ఒక ప్రైవేట్ కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమంలో అమెరికాకు చెందిన మిత్రుడితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు మంచి నీళ్లు లేని రాష్ట్రంగా మారుతోందనే భయాన్ని వ్యక్తం చేశారు. కాలువలు, చెరువులను శుద్ధి చేసే కార్యక్రమాలను యువత చేపట్టాలని పిలుపునిచ్చారు. వర్షాన్ని కురిపించే శక్తి చెట్లకు ఉందన్నారు. కాబట్టి విద్యార్థులు మొక్కలు నాటే ప్రయత్నం చేయాలన్నారు. ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్లే విద్యార్థులు ప్రతి ఏడాది ఒక మొక్క చోప్పున నాటినా పర్యావరణాన్ని కాపాడగలుతారన్నారు. తాను అబ్దుల్‌కలాం సూచన మేరకు రాష్ట్రంలో కోటి మొక్కలను నాటే పథకాన్ని చేపట్టానని తెలిపారు. అందులో ఇప్పటికి 30 లక్షల 23 వేల మొక్కలను నాటానని చెప్పారు. అదే విధంగా రానున్న వర్షాకాలంలో పర్యాటకులు పర్యావరణాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. కాగా నటుడు, మక్కళ్‌నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి అడుగుతున్నారని, అది ఆయన వ్యక్తిగతం అని అన్నారు. అదే విధంగా నటుడు రజనీకాంత్ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని అన్నారు. తనకు రాజకీయాల గురించి తెలియదని, ప్రస్తుతానికి తనకలాంటి ఆలోచన లేదనిచెప్పారు. అయితే త్వరలో తాను రాజకీయాల్లోకి వచ్చినా ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదని నటుడు వివేక్ పేర్కొన్నారు. -
నేనే నేను
ఉపేంద్రని తెర మీద చూసినమొదటిసారి నుంచి ఇప్పటిదాకా ఇదే లొల్లి!వెయ్యి ఇజమ్‌లలో ఈయనది ‘నేనిజమ్’.కథ ఎలా ఉన్నా స్క్రీన్‌ప్లే మాత్రంఎప్పుడూ ఇలాగే నేస్తాడు.ఎవరు ఏమన్నా నేవర్ మైండ్.నేను ఉంటే పెయిన్ ఉంటుంది...గెయిన్ ఉంటుంది అంటాడు.ఆ సినిమాలో ఉన్న నేనేరాజకీయాల్లో ఉన్న ఈ నేను అంటాడు. కొన్ని రోజులుగా మీ పార్టీ ‘యుపీపీ’ (ఉత్తమ ప్రజాకీయ పార్టీ) తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపారు. ప్రచారం ఎలా సాగింది? ఉపేంద్ర: ఆర్గానిక్‌గా ప్రచారం చేశాం. అంటే సహజసిద్ధంగా. ప్రచారం అంటే ర్యాలీ, రోడ్ షోలా కాకుండా కేవలం మీడియా, సోషల్ మీడియా ద్వారా ఓటర్స్‌ను అప్రోచ్ అయ్యాం. విచారమే (వివరణ) ప్రచారం అవ్వాలనుకున్నాను. అన్ని జిల్లాల ప్రజలను కలిశాను. వెళ్లిన ప్రతిచోటా ఓ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశాం. అక్కడ ఎవరెవరు మా ప్రజాకీయను సపోర్ట్ చేయాలనుకున్నారో వాళ్లే వచ్చి మాతో కలసి ప్రచారం చేశారు. మీ అభ్యర్థులను ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేశారని విన్నాం.. అవును. మూడు స్టేజీల్లో ఇంటర్వ్యూలను నిర్వహించాం. ఫస్ట్ క్వొశ్చన్ రౌండ్, ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామ్. వాటిలో ఎంపికైన వాళ్లతో ఫైనల్ ఇంటర్వ్యూ నిర్వహించాం. మా గైడ్ లైన్స్ అన్నింటినీ వాళ్లు అంగీకరిస్తేనే తీసుకున్నాం. జీతం కోసం మాత్రమే పని చేయాలి. సేవ చేస్తాను, లీడర్ అవుతానని రాకూడదని స్పష్టంగా చెప్పేశాను. ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రభుత్వం జీతం ఇస్తుంది. నువ్వు (రాజకీయాల్లో ఉన్నవాళ్లు) కేవలం జీతం తీసుకుంటున్న ఉద్యోగివి మాత్రమే. కార్పొరేట్ ఎంప్లాయ్‌లానే పదవుల్లో ఉన్నవాళ్లు కూడా తామేం చేస్తున్నారనే రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ సరిగ్గా ఇవ్వకపోయినా, వాళ్ల పనితో ప్రజలు సంతృప్తిగా లేకపోయినా వాళ్లు రాజీనామా చేసి వెళ్లిపోవాలి. ఇదీ మా పార్టీ నిబంధన. కొత్తవాళ్లకు, అంతగా పాపులార్టీ లేనివాళ్లకు కూడా టికెట్ ఇచ్చారు. వాళ్లు గెలుస్తారనుకుంటున్నారా? మన రాజ్యాంగం ఏం చెప్పింది? ఎవ్వరైనా అభ్యర్థిగా నిలబడొచ్చు. గెలవడానికి కోట్లు ఖర్చు పెట్టి 2, 3 లక్షల జీతం కోసం ఎవరైనా పనిచేస్తారా? అంత ఖర్చు పెట్టి ఓట్లు కొని, రాజకీయాన్ని బిజినెస్ చేసేశారు. 100, 200 కోట్లు ఖర్చు పెడతాను. దానికి డబుల్ సంపాదిస్తాను అన్నట్టు ఉంటారు. పార్టీ ఫండ్స్ కూడా అలానే ఉంటాయి. వాళ్లనుంచి అవినీతి లేని రాజకీయం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? బేసిక్ ప్రాబ్లమ్ ఈ స్ట్రక్చర్, మనీ. నా ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’ ద్వారా అవన్నీ పక్కన పెడదాం అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ ఎక్కువగా లేకపోయినా ఎవ్వరైనా వచ్చి రాజకీయాల్లో నిలబడ వచ్చని మన రాజ్యాంగం చెప్పింది. మనకు కావాల్సింది ఓ రిపోర్టర్లా పని చేయాలి. కానీ మన మైండ్‌ని ఎలా సెట్ చేశారంటే... ఇక్కడికి వచ్చేవాళ్లు పెద్ద మనిషి అయ్యుండాలి, అనుభవం కలిగి ఉండాలని. రాజకీయాల్లోకి రావడం ద్వారా మీరు ప్రజలకు చెప్పాలనుకున్నదేంటి? నేను గెలవడం, నా అభ్యర్థి గెలవడం కాదు. మీరు (ప్రజలు) గెలవాలి. సర్వెంట్స్‌ను తీసుకోండి మీరు. లీడర్స్ వద్దు మీకు. పెద్ద మనిషిని గెలిపిస్తే వాళ్ల ఇంటికి మీరు వెళ్లాలి. చిన్నవాళ్లను గెలిపిస్తే వాళ్లు మీ ఇంటికి వచ్చి, సమస్యలు తెలుసుకుంటారు. ప్రజాప్రభుత్వం అంటే ప్రజలే రాజులు. ఇప్పుడు రాష్ట్రం మన ఇల్లు అనుకుంటే.. మన ఇంటి పనుల కోసం వర్కర్స్‌ని పెట్టుకుంటాం. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, సెక్యూరిటీ.. వీళ్లతో ఎలా పనులు చేయించుకుంటామో రాజకీయాల్లో ఉన్నవాళ్లతో కూడా అలానే పనులు చేయించుకోవాలి. కానీ మనం ఓట్లు వేసి గెలిపించి, మనం ట్రాఫిక్‌లో ఉండిపోయి వాళ్లను జీరో ట్రాఫిక్‌లో పంపిస్తాం. దీన్ని మించిన ట్రాజెడీ ఉందా? బ్రిటీష్ వాళ్లు పరిపాలించినప్పుడు మనపైన కూర్చున్నారు. వాళ్లు వెళ్లి, ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు వీళ్లు కూడా పైన కూర్చుంటా అంటే? ఇంకా మనం రోడ్డులోనే ఉన్నాం. యూత్‌కి రాజకీయాలంటే అసహ్యంగా ఉంది. అందుకే వాళ్లకు ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేశాను. డబ్బు ఖర్చు పెట్టకపోతేనే సరైన పాలన జరుగుతుంది. డబ్బులు పెట్టుబడిగా పెడితే నేనూ ఆ డబ్బు వెనక్కి తెచ్చుకునే మార్గం ఆలోచిస్తాను. అందుకే మా పార్టీలో ఎవర్నీ ఖర్చు పెట్టొద్దన్నాను. నేనూ మినిమమ్ ఖర్చే పెట్టా. పోలింగ్ అయిపోయింది. మీ పార్టీ రిజల్ట్ గురించి ఎలాంటి ఫీడ్‌బ్యాక్ వచ్చింది? బాగా సపోర్ట్ చేశారు. అయితే గెలుపోటముల గురించి ఆలోచించలేదు. ఓడిపోతే తలెత్తుకొని జీవిస్తాను. గెలిస్తే తల దించుకొని పనిచేస్తానని డిసైడ్ అయి రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాలంటే గెలుపోటములు కానే కాదు. పాల్గొనడం.. అంతే. నేను కర్మణ్యే వాదికారస్తే...ని ఫాలో అవుతాను. మీ పార్టీలో వాళ్లకి డ్రెస్ కోడ్ పెట్టాలన్నది ఎవరి ఆలోచన? మదర్ థెరిస్సాగారు ఏదీ ఆశించకుండా సేవ చేశారు. కానీ డబ్బులు తీసుకొని వీళ్లు చేసింది సేవ ఎలా అవుతుంది? హాస్యాస్పదంగా ఉంటుంది. నాయకులు ‘లీడర్స్’ అంటే వాళ్ల ఇంటి నుంచి డబ్బులు తెచ్చి ఫ్లై ఓవర్, రోడ్స్ కట్టలేదు. జనం డబ్బు అది. నో సర్వీస్.. నో లీడర్స్. అక్కడున్నది ఓన్లీ వర్కర్స్ మాత్రమే. అందుకే ఖాకీ పెట్టాం. మీరు ప్రచారానికి ఖాకీ డ్రెస్‌లోనే వెళ్లారా? లేదు. నేను ఎంపీగా పోటీ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి నేను రాజా (నవ్వుతూ). ఎమ్మెల్యేగా గెలిచాక వర్కర్ని అవుతాను. పాలిటిక్స్‌ను మారుద్దాం అనుకున్నవాళ్లల్లో చాలామందిని పాలిటిక్స్ మార్చేస్తుందని, పొల్యూట్ చేస్తుందని అంటుంటారు. మీరు అలా పొల్యూట్ అయిపోతారన్నది కొందరి ఊహ? ఇక్కడ ఒక మాట చెప్పనా.. ‘ఏ ఫర్ అంటే యాపిల్’ అని మనల్ని ట్రైన్ చేశారు. అలా కాకుండా ఏ ఫర్ ఏంటి? అని మీ అంతట మీరు ఆలోచించండి చెప్పండి అంటే అమెరికా అనో అంటార్కిటికా అనో చెప్పేవాళ్లు. ఇప్పుడు 20 పర్సంట్, 80 పర్సంట్ సైకాలజీ గురించి వివరిస్తాను. మన దగ్గర 20 శాతం మందిమి మాత్రమే మాట్లాడతాం. మిగిలిన 80 శాతం మందికి వాయిస్ లేదు. ఆ 20 శాతం మంది రాజకీయాలంటే ఇలా ఉంటాయి, ఇక్కడికి రాకూడదు అని 72 ఏళ్లుగా చెప్పినదే చెప్పీ చెప్పీ ఓ అభిప్రాయాన్ని రుద్దేశారు. రాజకీయాలు డబ్బులు ఉండేవాళ్లవి అని మన బ్రెయిన్‌కు ఫీడ్ చేశారు. పొల్యూట్ అయిపోతారనే భావనను కూడా బలపరిచారు. నేను ఓ కొత్త ప్రయత్నం చేయడానికి వచ్చాను. నిజాయితీగా మాట్లాడుతున్నాను. ఏమవుతుందో చూద్దాం. సినిమాల్లోంచి వచ్చిన వారిలో తెలుగు నాట ఎన్టీఆర్, తమిళంలో ఎంజీఆర్, జయలలిత సీఎంలుగా రూల్ చేశారు. భవిష్యత్తులో మీరు కన్నడ రాష్ట్రాన్ని రూల్ చేస్తారని అనుకుంటున్నారా? లేదు. నేను ఇక్కడ రూల్ చేయడానికి రాలేదు. మీరు (ప్రజలు) రూల్ చేయండి అని చెప్పడానికి వస్తున్నాను. నేను చేసేది రాజకీయం కాదు, ప్రజాకీయం. మీరు (ప్రజలు) కూడా ఇన్వాల్వ్ అవ్వండి. ఒక్కరోజు ప్రజాస్వామ్యం మనకు వద్దు. స్విట్జర్లాండ్‌లో జనాల అభిప్రాయాలు తీసుకుంటారు. అక్కడ అన్నీ పారదర్శకంగా జరుగుతాయి. రాజకీయ నాయకులు కూడా జీతానికి పని చేస్తున్న వర్కర్లా చేస్తారు. ఇక్కడ కూడా నాతో సహా ఒక వర్కర్లా మారిపోవాలి. వర్క్ చేయాలి. అన్నీ పారదర్శకంగా జరగాలి. ఓటర్స్ కూడా ఇందులో భాగం అవ్వాలి. నేను చేయబోయేది రెగ్యులర్ పాలిటిక్స్ కాదు. అసలెందుకు పాలిటిక్స్‌లోకి రావాలనుకున్నారు? జనాలకు మంచి చేయాలని కాదు. నేనో సిటిజన్ని. బాధ్యత గల పౌరుడిగా నా సొసైటీని బాగు చేయాలని వస్తున్నాను. అది పొలిటికల్ పార్టీ పెట్టకుండా కుదరదా? పవర్ కావాలా? ఇది ఒక మైండ్‌సెట్. ఇందాక ‘ఏ ఫర్ యాపిల్’ కథ చెప్పాను కదా. ఇది కూడా అలాంటిదే. మనం ఎలా ఆలోచించాలో నిర్ధేశించేశారు. అలాగే పాలిటిక్స్ అనేది సోషల్ వర్క్ కాదని డిసైడ్ చేసేశారు. మరి రాజకీయాలంటే ఏంటి? వ్యాపారమా? ఇది సమాజ సేవ కాదా? నేను సోషల్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. సోషల్ వర్క్ అంటే ఏదో ఊళ్లో బస్టాండ్ కట్టించుకో, నీళ్ల ట్యాంక్ కట్టించుకో అంటున్నారు లేదా ఊరినే అడాప్ట్ చేసుకో అంటున్నారు. అసలు రాజకీయం అంటేనే సోషల్ వర్క్ కదా. మనం అందరం ట్యాక్స్ కడుతున్నాం. మీరు ట్యాక్స్ రూపంలో ఖర్చు చేసిన డబ్బుని మళ్లీ మీకు ఎలా ఉపయోగపడేలా చేయాలనేది మెయిన్ ఎజెండ్ అవ్వాలి. నా లక్ష్యం అదే. దీనివల్ల యంగ్‌స్టర్స్ వస్తారు. విద్యావేత్తలు, అట్టే చదువుకోనివాళ్లు.. ఇలా అందరూ సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి వస్తే అందరం కలసి అద్భుతాలు సృష్టించవచ్చు. సినిమా, పాలిటిక్స్ రెండు పడవల ప్రయాణమా? ఇది ఇంకో మైండ్‌సెట్. మీరు వస్తే పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావాలి, అప్పుడప్పుడు వచ్చి పోతే కష్టం అని అంటుంటారు. నేను బతకడానికి సినిమాలు చేయాలి. దాంతోపాటు రాజకీయాలకు ఓ టైమ్ కేటాయిస్తాను. సినిమాలు చేసుకుంటూ, ఇక్కడ ఏదైనా పని ఉందంటే వచ్చి పూర్తి చేస్తాను. ప్రజాకీయాల్లో నాకు పని కలిపిస్తే నేను పూర్తి స్థాయిలో రావొచ్చు. కానీ ఇంకా నాకు ఓట్ వేయలేదు. నేను పవర్లోకి రాలేదు. అప్పుడే సినిమాలు మానేస్తా అనకూడదు. నా ఇండస్ట్రీలో నేను కింగ్ అయ్యుండొచ్చు. రూలింగ్‌లోకి వచ్చాక వర్కర్ని. కానీ ప్రస్తుతం మాత్రం గెలిచే వరకూ వర్కర్లా ఉండి గెలిచాక నాయకుడు అయిపోతున్నాడు. ఓట్ వేసిన తర్వాత వర్కర్ అనే ‘మైండ్‌సైట్’ పోకూడదు. ఓకే.. ‘ఐ లవ్ యూ’ అనే టైటిల్‌తో.. ‘నన్నే ప్రేమించు’ అనే ట్యాగ్‌లైన్‌తో త్వరలో స్క్రీన్ మీదకు రానున్నారు... మీ కాలేజ్ రోజుల్లో ఎవరితో అయినా ‘నన్నే ప్రేమించు’ అని చెప్పారా? (పెద్దగా నవ్వుతూ). ప్రేమను చెప్పడానికే భయపడేవాణ్ణి. ఇక ప్రేమించు అని చెబితే ఎక్కడ అపార్థం చేసుకుంటుందో, స్నేహం ఎక్కడ కట్ అవుతుందో అని భయపడేవాణ్ణి. సినిమాల్లో ప్రేమ సన్నివేశాల్లో సునాయాసంగా నటించేస్తాను. రియల్ లవ్‌లో మన లోపల చాలా భయం ఉంటుంది. ఒకవేళ లవ్ ఎక్స్‌ప్రెస్ చేశాక తను మాట్లాడకపోతే? దూరం పెడితే? డిజప్పాయింట్ అయిపోతాను. యంగ్ ఏజ్‌లో ఒక అట్రాక్షన్ ఉంటుంది. అందులో దురుద్దేశాలేమీ ఉండవు. ఆ ప్రేమలో నిజాయతీ ఉంటుంది. కానీ చెప్పేంత ధైర్యం ఉండేది కాదు. అందుకే చెప్పకుండా నేను కవితలు రాసేవాణ్ణి. మీది లవ్ మ్యారేజే కదా.. ప్రియాంకాగారితో చెప్పడానికి ఎలా ధైర్యం వచ్చింది? ఇక తను లేకపోతే మన జీవితం లేదు అనేంతగా ప్రేమించేశాను. ఆ ప్రేమే నాకు ధైర్యం ఇచ్చింది. అయినప్పటికీ ‘ప్రేమిస్తున్నాను’ అని ప్రియాంక దగ్గర చెప్పడానికి ఏడాదిన్నర సమయం తీసుకున్నాను. చెప్పాలా వద్దా? అనుకుంటూ చివరికి చెప్పేశా. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100’ లాంటి ఇప్పటి బోల్డ్ సినిమాలను 20 ఏళ్ల క్రితమే మీరు తీశారు. ఆ టైమ్‌లో వివాదాలు కూడా ఎదుర్కొన్నారు? మంచి విషయమే చెప్పాంగా! ఎందుకు వివాదం అవుతోంది? అనుకునేవాణ్ణి. అర్థం అయ్యేది కాదు. సమాజానికి చెప్పాల్సిన విషయం చెబితే ఇలా రివర్స్‌గా తీసుకుంటున్నారేంటి? అనే ఫీలింగ్ కలిగేది. సినిమాల్లో నన్ను నేనే తిట్టుకుంటూ మంచి విషయాలు చెప్పేవాణ్ణి. అయితే ఓ 20 ఏళ్ల తర్వాత చెప్పాల్సిన విషయాలను ముందుగానే చెప్పేసరికి షాకయ్యారు. విడిగా నన్ను చూసినవాళ్లూ షాకయ్యారు. నాతో మాట్లాడాక ‘మీరు మీ సినిమాల్లో పాత్రల్లానే ఉంటారేమో? అనుకున్నాం. మరీ ఇంత సాఫ్ట్‌గా ఉన్నారేంటి?’ అని ఆశ్చర్యపోయేవాళ్లు. ‘లేదండీ.. సినిమాల్లో చూపించేవి జస్ట్ నా ఆలోచనలు మాత్రమే’ అనేవాణ్ణి. అప్పట్లో మీరు ‘ఏ’ సినిమాలోనే ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి డిస్కస్ చేశారు. ఆ ఇష్యూ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. అలాంటివి ఏమైనా సంఘటనలు విని లేదా చూసి ఆ సినిమా తీశారా? ‘మీటూ’ అనేది ఇప్పుడు మొదలైంది కాదు కదా. స్త్రీలను వేధించడం అనేది రాజుల కాలం నుంచీ ఉన్నదే. ‘రేప్’ అన్న పదం ఈనాటిది కాదు. ఎప్పుడో ఉంది. ఎక్కడ పురుషుడు ఉంటాడో అక్కడ స్త్రీకి వేధింపులు తప్పవు. నేను అంటున్నది తప్పుడు మనస్తత్వం ఉన్న పురుషుల గురించి. సినిమా ఇండస్ట్రీ ప్రభావంతో మాత్రమే ‘ఏ’ తీయలేదు. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్నవాటిని కూడా దృష్టిలో పెట్టుకునే ‘ఏ’ కథ రాశాను. దర్శకుడిగా నా ఆలోచనలను స్క్రీన్ మీద చూపించాను. మంచి విషయం ఏంటంటే ఇప్పుడు అందరూ ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి ఓపెన్ అవుతున్నారు. ఇప్పుడొస్తున్న కొన్ని సినిమాల్లో విచ్చలవిడితనం పెరిగినట్లనిపిస్తోంది. మీ అభిప్రాయం? గుట్టుగా ఉండటం అనేది ఇప్పుడు దాదాపు లేదు. కుతూహలం ఉంటేనే అక్కడ ఏదో ఉందన్న ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్‌లో ఏదైనా చూడొచ్చు. చూసిన తర్వాత ఇంతేనా అని వదిలేస్తాం. ఏదైనా మోతాదు మించితే ప్రమాదమే. సైన్స్ అనేది మనల్ని సత్య యుగంలోకి తీసుకుపోతోంది. ఇప్పుడు నా భార్యతో నేను ముంబైలో ఉండి హైదరాబాద్‌లో ఉన్నానని చెప్పడానికి కుదరదు. వీడియోకాల్ చేస్తుంది. ఎక్కడున్నావు చెప్పు అని? ఫ్యూచర్లో అబద్ధం చెప్పలేం. మన రోజుల్లో స్కూల్ బంక్ కొడితే ఓకే. ఇప్పుడు స్కూల్ నుంచి మెసేజ్ వస్తుంది. టెక్నాలజీ మనల్ని నిజం వైపు తీసుకువెళ్తుంది. అయితే అదే టెక్నాలజీ మనుషులను దూరం చేస్తోంది కదా? కాదన్నది నా అభిప్రాయం. ఫ్యూచర్ జనరేషన్ వాళ్లు దూరంగా ఉన్నా ఫేస్ టైమ్‌లో లైవ్‌లో మాట్లాడుకుంటారు. దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు మనకు కారు లేదు. ఇప్పుడు చూడండి అందరూ కారులో తిరుగుతున్నారు అనుకుంటే కుదరదు. హల్లో... సాంకేతికాభివృద్ధిని నువ్వు యాక్సెప్ట్ చేయాలి అంటాను. ఇంతకు ముందు ఫ్యామిలీని మిస్ అయ్యేవాళ్లం. ఇప్పుడు ఎక్కడున్నా వీడియోకాల్ చేస్తే చాలు.. భార్యాపిల్లలు హాయిగా మాట్లాడతారు. అప్పట్లో అవుట్డోర్ అంటే.. ఇంటిని మిస్సయినట్లే. ఇప్పుడు వీడియో కాల్ వల్ల మిస్ అయిన ఫీలింగ్ ఉండదు. సో.. టెక్నాలజీ మనుషులను దగ్గర చేస్తోందంటాను. కమ్యూనికేషన్ బాగా పెరిగినప్పటికీ, ఇద్దరు వ్యక్తులు ఒకేచోట ఉన్నా ఎవరి ఫోన్లతో వాళ్లు బిజీగా ఉండటం వల్ల నేరుగా మాట్లాడుకోవడం తగ్గింది కదా? మీరు మొబైల్ లేకుండా ఒక్కరోజుని ఊహించుకోండి. పిచ్చి లేచిపోతుంది. అట్లీస్ట్ ఏదో ఓ దాంట్లో మునిగిపోతారు. భార్య–భర్త, అత్తా–కోడలు ఏదో పనిలో బిజీగా ఉంటారు. గొడవల్లోకి వెళ్లరు కదా (నవ్వుతూ). ఏది జరిగినా మంచి కోసమే. మన ఐడియాలజీని మన కిడ్స్ మీద రుద్దుతూ ఉంటాం. అది తప్పు ఇది తప్పు అని. నిజమేంటంటే వాళ్ల నుంచి మనం చాలా నేర్చుకోవాలి. అలాగే పిల్లలకు కష్టం నేర్పాలి. ఒక ఇల్లు కొనుక్కుని సెటిల్ అయిపో, లేదంటే మరోలా సెటిల్ అయిపో అని చెబుతుంటాం. నేను చాలా కష్టపడి బైక్ కొనుక్కున్నాను. ఆ బైక్ నడిపే కిక్ ఎలా ఉంటుంది? కానీ ఆ హ్యాపీనెస్‌ని మనం కష్టం తెలియకుండానే మనం మన పిల్లలకు ఇచ్చేస్తాం. ఆ హ్యాపీనెస్ సులువుగా లభిస్తుంటే కష్టపడకుండా కొత్త కొత్త అలవాట్లు అలవాటు చేసుకునే అవకాశం ఉంది. రేపు వాళ్లు కూడా నేనింత కష్టపడి ఇది సొంతం చేసుకున్నాను అని ఫీల్ అవ్వాలి. కానీ మీ పిల్లలు హైఫై లైఫే లీడ్ చేస్తుంటారు కదా? కొన్నిసార్లు మనం అనుకున్నది కుదరకపోవచ్చు. అవును.. వాళ్లు కంఫర్ట్బుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ వాళ్లకు ప్రైవసీ అనేది ఉండదు కదా. బయటకు ఎక్కువగా రాలేరు. అవన్నీ వాళ్లు మిస్ అవుతారు. కొన్ని విషయాలను యాక్సెప్ట్ చేయాలి. ఫైనల్లీ... ఒకప్పుడు మీరు బాగా డబ్బులు సంపాదించాలని వచ్చుంటారు. ఇప్పుడు డబ్బు, ఫేమ్ ట్రాష్ అనిపించిన సందర్భాలేమైనా ఉన్నాయా? నేను డబ్బు సంపాదించాలని రాలేదు. డబ్బులు సంపాదించాలనుకుంటే డబ్బులు సంపాదించలేం. నేను బతకాలని వచ్చాను. నాకు ఎవరైనా భోజనం పెడితే అదే నా హ్యాపీనెస్. జీరో నుంచి స్టార్ట్ చేస్తే లైఫ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఎవరైనా అపాయింట్మెంట్ ఇస్తే సంతోషం. నేను రాసింది వింటే ఇంకో రేంజ్ హ్యాపీనెస్. అదే నేను రాసింది తీసుకుంటే మహానందం. డబ్బు కూడా ఇస్తే అయ్యో... ఇంక చెప్పలేను. ఆనందం.. ఆనందం.. జీరోలో ఉంటే ఎన్ని కిక్కులో చూడండి. అదే మా నాన్న బాగా ధనవంతుడు అయితే... నేను రాసిందానికి ఐదొందలే ఇస్తారా? ఏంట్రా నా వేల్యూ తెలుసా నీకు? అనుకుంటాను. నటుడు అర్జున్ తనను వేధించాడంటూ కథానాయిక శ్రుతీ హరిహరన్ ఆరోపించారు. ఈ ఇద్దరితో మీకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఏమనిపించింది? నాకు ఇద్దరి గురించి బాగా తెలుసు. శ్రుతి ఆరోపణలు విన్నప్పుడు మైండ్ బ్లాంక్ అయింది. అర్జున్ అలా చేస్తాడని ఊహించలేను. శ్రుతి అన్నా నాకు నమ్మకమే. ఇలాంటి పరిస్థితిలో మనకేమీ అర్థం కాదు. నేను అలానే అయ్యాను. ఆ ఇష్యూ మీద చాలా గొడవ జరిగింది. చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఎవరూ మాట్లాడటం లేదు. ఒకప్పుడు బతుకు తెరవు కోసం ‘పేపర్ కవర్స్’ తయారు చేసేవారు. ఇప్పుడు కోటీశ్వరుడు. డబ్బు, పేరు ఉన్నాయి. ఇంకా ఏదైనా అచీవ్ చేయాలని ఉందా? నేను అచీవ్ చేయాల్సింది ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. నేను ఇక్కడ వరకూ వచ్చింది ‘ప్రజాకీయ పార్టీ’ పెట్టి, రాజకీయాల్లోకి రావడానికే అనుకుంటున్నాను. ఇంత ఎత్తుకి ఎదగడానికి ‘జీరో’ నుంచి మొదలయ్యాను. ఇప్పుడు పాలిటిక్స్‌లో జీరో నుంచి మొదలవుతున్నాను. ‘క్యాష్‌లెస్’ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నా. జీరో నుంచి మొదలుపెడితే ప్యూర్‌గా ఉంటుంది. డి.జి. భవాని -
ఓటు హక్కుపై చైతన్యం పెంచండి
సాక్షి, న్యూఢిల్లీ: ఓటింగ్ శాతం పెరిగితే అది దేశానికి శుభసూచకం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలంతా ఓటుహక్కు వినియోగించుకునేలా అవగాహన పెంచాలని పలు రంగాల ప్రముఖులకు పిలుపునిచ్చారు. రాజకీయ, సినీ, క్రీడా, సామాజిక, వినోద రంగాల ప్రముఖులను ట్యాగ్ చేస్తూ ప్రధాని బుధవారం వరస ట్వీట్లతో పాటు ప్రత్యేక బ్లాగ్ రాశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, వ్యాపార దిగ్గజం రతన్ టాటా, బెంగాల్ సీఎం మమత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటులు నాగార్జున, మోహన్‌లాల్ తదితరుల పేర్లు ప్రస్తావించారు. తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు, ఏపీ సీఎం చంద్రబాబు, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, దీపికా పదుకొణె తదితరులను ట్యాగ్ చేశారు. మీడియా రంగ ప్రముఖులు వినీత్ జైన్, సంజయ్ గుప్తా, అరుణ్ పూరీలతో పాటు సంస్థలు పీటీఐ, ఏఎన్‌ఐలను జతచేస్తూ ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకమన్నారు. ఓటేయకుంటే ఆ నొప్పి తెలియాలి ‘అధిక ఓటింగ్ శాతంతో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. అది దేశానికి శుభసూచకం కూడా. పటిష్ట ప్రజాస్వామ్యంతోనే దేశం అభివృద్ధి చెందుతుంది. గత కొన్నేళ్లుగా ఓటింగ్ శాతం పెరుగుతోంది. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఈ లోక్‌సభ ఎన్నికల్లో కూడా అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఓటు విలువను తెలియజేస్తూ ప్రజల్లో అవగాహన పెంచాలని రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాల ప్రముఖులను కోరుతున్నా. దేశ ప్రగతి పథంలో భాగస్వామి అయ్యేందుకు పౌరుడి ఇష్టాన్ని ఓటు సూచిస్తుంది. పోలింగ్ బూతులకు వచ్చి ఓటుహక్కు వినియోగించుకోని వారికి ఆ బాధ తెలియాలి. భవిష్యత్తులో మీరు కోరుకోని, అవాంఛనీయ పరిస్థితి రావాలని అనుకుంటున్నారా? మీరు ఆ రోజు ఓటేయనందుకే ఈ పరిస్థితి తలెత్తిందని చింతిస్తారా?’ అని మోదీ బ్లాగ్‌లో ప్రశ్నించారు. -
‘ఈ పదేళ్లు జైలులో గడిపినట్లుంది’
శ్రీనగర్ : ఐఏఎస్ అధికారిగా ఉన్న ఈ పదేళ్లు నాకు జైలులో గడిపినట్లనిపించింది అంటున్నారు మాజీ ఐఏఎస్ అధికారి షా ఫజల్. 2009లో సివిల్ సర్వీస్ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించిన తొలి కశ్మీరీగా చరిత్ర సృష్టించిన ఫజల్.. గత నెలలో తన పదవికి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగానికి రాజీనామ చేసిన తరువాత తొలిసారి ఓ పబ్లిక్ మీటింగ్‌కు హాజరయ్యారు ఫజల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విదేశాలకు వెళ్తే నా కుటుంబంతో కలిసి చాల సౌకర్యవంతమైన జీవితం గడిపే అవకాశం ఉన్నప్పటికి కూడా.. నేను అలా చేయలేదు. నా ప్రజల కోసం ఇక్కడే ఉండాలనుకున్నాను. ప్రజలకు, అధికారులకు మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చాలనుకున్నాను. ఐఏఎస్‌ను ఎంచుకున్నాను’ అని తెలిపారు. అంతేకాక ‘ఈ పదేళ్లలో నా ప్రజలకు ఎన్నో సేవలు చేశాను. దాంతో పాటు సర్వీసు కాలంలో ఎన్నో అన్యాయాలను, అమానుషాలను కూడా చూశాను. వీటన్నింటి గురించి విన్నప్పడు నేను చాలా నిస్సహాయుడినని భావించేవాడిని. నిజం చెప్తున్న.. ఈ పదేళ్లు జైలులో ఉన్నట్లు అనిపించింది. కానీ ఇప్పుడు ఉద్యోగాన్ని వదిలేశాను. ఇక మీదట ఊరూరా తిరుగుతు ప్రజల సమస్యల గురించి పోరాటం చేస్తాన’ని తెలిపాడు. అంతేకాక కశ్మీర్ ప్రజల గురించి మాట్లాడ్డానికి.. వారి సమస్యల గురించి పోరాటం చేయడానికి తాను రాజకీయాల్లోకి వస్తున్నాని ప్రకటించాడు. అవినీతి రహిత రాజకీయాల కోసం తాను పాటుపడతానని.. అందుకే ఏ పార్టీలో చేరబోనని.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపాడు షా ఫజల్. -
ప్రభాస్ పెళ్లి అప్పుడే
‘‘నటుడిగా 50 ఏళ్లు ప్రయాణం చేశాను. ఇంకా ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటాను. ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలు చేశాను. ఇప్పుడు కూడా అలాంటి పాత్రలే పోషించాలనుకుంటున్నాను. అలాగే రాజకీయాల్లో కూడా పార్టీ ఎలా కోరుకుంటే అలా ప్రయాణం చేస్తాను’’ అని నటులు కృష్ణంరాజు అన్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా కృష్ణంరాజు సినిమా, రాజకీయాలకు సంబంధించిన పలు విశేషాలను ఇలా పంచుకున్నారు.. ► బర్త్‌డే ఫంక్షన్స్ అంటూ ప్రత్యేకంగా ఏం లేవు. ఫ్యాన్స్ వస్తారు. ఫ్రెండ్స్ విష్ చేస్తారు. మామూలుగానే ఉంటుంది. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సౌత్, నార్త్‌కు సంబంధించిన సెలబ్రిటీస్ అందర్నీ పిలిచి ఓ ఫంక్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఈ ఫంక్షన్ ఎప్పుడో చేయాలనుకున్నా కుదర్లేదు. మాతో ప్రయాణం కొనసాగిస్తున్న అభిమానులనూ సన్మానించాలనుకుంటున్నాను. త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తా. ► ఆ మధ్య కర్ణాటక ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేశాను. ఆంధ్రా ఎన్నికలు ఇంకా హీట్ ఎక్కలేదు. పార్టీ అడిగితే ప్రచారం చేస్తాను. సంక్రాంతికి మా ఊరు వెళ్లి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం. పార్టీ పనిమీద ఢిల్లీ వెళ్లి వచ్చాను. ఊరెళ్లడం కుదర్లేదు. ► నటుడిగా మంచి పాత్రలు ఎంపిక చేసుకోవాలి అనుకుంటున్నాను. అలా వచ్చి వెళ్లిపోయే పాత్రలు చేయాలని లేదు. మన పాత్ర కథకు, సినిమాకు కీలకంగా ఉండాలి. అందుకే పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉంటున్నాను. ఓ 2 సినిమాలు డిస్కషన్లో ఉన్నాయి. త్వరలోనే ప్రకటిస్తాను. ► ‘మహానటి’ సినిమా చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. డైరెక్టర్ నాగీ, కెమెరామేన్ డ్యానీ అద్భుతంగా చేశారు. కీర్తీ సురేశ్‌కి అయితే ఫుల్ మార్క్స్. సావిత్రి జీవితంలో ఎత్తుపల్లాలను చూపించారు కాబట్టి బావుంది. యస్వీఆర్గారి బయోపిక్ చూడాలనుంది. ఆ పాత్రని ప్రకాశ్‌రాజ్ చేయగలడేమో అని అనుకుంటున్నాను. ► గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ మీద ప్రభాస్‌తో ఓ లవ్‌స్టోరీ చిత్రం నిర్మిస్తున్నాం. ఆ సినిమా ఓ షెడ్యూల్ పూర్తి అయింది. అందులో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. కథలు కుదిరితే కచ్చితంగా గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌పై నిర్మాణం కొనసాగిస్తాం. ► మన బిడ్డను ఐదేళ్ల వరకూ దేవుడిలా చూడాలి.. ఐదు నుంచి పద్దెనిమిదేళ్ల వరకూ సేవకుడిలా చూడాలి.. ఆ తర్వాత స్నేహితుడిలా చూడాలని మా నాన్నగారు నాకు చెబుతుండేవారు. నాకు, ప్రభాస్‌కి మధ్య అనుబంధం బావుంటుంది. ► యాక్టర్‌గా 50 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను.. ఇండస్ట్రీలో పెద్దగా మార్పులేం రాలేదు. అలానే కష్టపడుతున్నారు. అప్పటి హీరోస్ అందరం బాగానే ఉండేవాళ్లం. ఇప్పుడు యంగ్ హీరోస్ కూడా బావుంటున్నారు. మహేశ్, ఎన్టీఆర్, చరణ్ వీళ్లందర్నీ చూస్తూనే ఉన్నాం కదా. మా వాడు (ప్రభాస్) కూడా అందరితో బావుంటాడు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? అని అందరూ నన్ను అడుగుతూనే ఉన్నారు. ‘సాహో’ సినిమా తర్వాత కచ్చితంగా ఉంటుంది. ► ‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమా ఖ్యాతి జాతీయంగా కాదు అంతర్జాతీయంగా పెరిగింది. అందరూ మన సినిమాలవైపు చూస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ► ‘సాహో’ సినిమా చాలా భారీ లెవల్లో తీస్తున్నారు. మొన్నామధ్య దుబాయ్ వెళ్లి ఫైట్ సీన్స్ తీశారు. సినిమా చాలా బాగా వస్తోందట. ► కన్నడలో అంబరీష్ చనిపోవడం నాకు బాధ కలిగించింది. ఆరోగ్యం బాలేనప్పుడు కూడా చాలాసార్లు కలిశాను. వాణ్ని కన్నడలో రెబల్ స్టార్ అంటారు. నా పిక్చర్స్ కొన్ని రీమేక్ కూడా చేశాడు. ‘గురువుగారు’ అని పిలుస్తుంటాడు నన్ను. -
కలుషిత రాజకీయాలు ప్రమాదకరం
హైదరాబాద్: నేటితరం రాజకీయ నాయకుల ప్రసంగాలు, విమర్శలు, వ్యవహార శైలితో రాజకీయాలు కలుషితమైపోయాయని, ఇది దేశానికి ప్రమాదకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి గొప్ప నైతిక విలువలు ఉన్న వ్యక్తి అని, ఒకరికి గౌరవం ఇచ్చి మాట్లాడటంలో ఆయనకు ఆయనే సాటి అని కొని యాడారు. కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వర్‌రావు ఫౌండేషన్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి సంతాప సభను ఆదివారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా నారాయణతో పాటు సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, సీఆర్ ఫౌండేషన్ కార్యదర్శి చెన్న కేశవరావు, సభ్యురాలు డాక్టర్ రజనీ, సీపీఐ శేరిలింగంపల్లి కార్యదర్శి కె.శ్రీశైలంగౌడ్‌తో పాటు పలువురు శివరామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ చట్ట సభకు ఎన్నికైన తొలితరం ప్రజా ప్రతినిధుల్లో ఒకరైన శివరామిరెడ్డి నిస్వార్థ సేవలం దించి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. తాను మరణించే వరకు సీఆర్ ఫౌండేషన్‌కు, వృద్ధాశ్రమంలో ఉంటూ సేవలందించారన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కె.రామకృష్ణ మాట్లాడుతూ శివరామిరెడ్డి రైతాంగ సమస్యలపై పోరాడారని గుర్తు చేశారు. నేటితరం నాయకులందరికీ ఆదర్శ ప్రాయులని, ఉన్నత భావాలున్న గొప్ప వ్యక్తిని కోల్పోవడం తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించి పార్టీ ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసుకోవడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. తెలంగాణ రా>ష్ట్ర సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ శివరామిరెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ఆశయాల సాధనకు ఉద్య మాలు నిర్మించాల్సి ఉందన్నారు. సంతాప సభలో శివరామిరెడ్డి కుటుంబ సభ్యులు, సీఆర్ ఫౌండేషన్, వృద్ధాశ్రమం సహచరులు పాల్గొన్నారు. -
‘అందుకే దూరంగా ఉండాలనుకున్నాను’
అనుకోకుండా వచ్చిన స్టార్డమ్ నన్ను అణచివేసినట్లు అనిపించింది. అందుకే కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండాలనుకున్నాను అన్నారు విలక్షణ నటుడు అరవింద్ స్వామి. ‘రోజా’, ‘బాంబే’ వంటి చిత్రాల ద్వారా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారారు అరవింద్ స్వామి. ఆ తర్వాత సినిమాలకు దూరమైన అరవింద స్వామి మణిరత్నం ‘కడలి’ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు. ఇండియా టూడే ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన అరవింద్ తన రీల్, రియల్ లైఫ్ ప్రయణాల గురించి ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. ‘అనుకోకుండా నటున్ని అయ్యాను. కానీ స్టార్‌డమ్‌ని కోరుకోలేదు. అదే వచ్చింది. నేను హీరోగా కంటే నటుడిగా గుర్తింపబడాలని కోరుకున్నాను. కాలేజీలో ఉన్నప్పుడు డబ్బు కోసం మోడలింగ్ చేసేవాడిని.. ఆ తరువాత ప్రకటనలు. అప్పుడు నన్ను చూసిన మణిరత్నం నాకు దళపతి సినిమాలో అవకాశం ఇచ్చారు’ అంటూ చెప్పుకొచ్చారు. కొనసాగిస్తూ.. ‘ఆ తరువాత వచ్చిన ‘రోజా’, ‘బాంబే’ సినిమాలు నాకు స్టార్డమ్ తీసుకొచ్చాయి. దీనివల్ల నా మీద ఒత్తిడి పెరిగింది.. నా ప్రైవసీని కూడా కోల్పోయాను. ఈ స్టార్డమ్ నన్ను అణచివేస్తున్నట్లు అనిపించింది. ఇదంతా నాకు కొత్తగా, చాలా ఇబ్బందిగా తోచింది. రోజా తర్వాత అమెరికా వెళ్లి మాస్టర్స్ చేయాలనుకున్నాను. అమెరికా వెళ్లాను. ఆ తర్వాత బిజినేస్ ప్రారంభించాను. 2005లో దాన్ని వదిలేశాను. అప్పటికే నేను సింగిల్ పేరెంట్‌ని. నా పిల్లల కోసం సమయం కేటాయించాల్సి వచ్చింది. సరిగా అదే సమయంలో నాకు యాక్సిడెంట్ కూడా అయ్యింది. ఇన్నీ జరిగాయి.. కానీ మళ్లీ ఎప్పుడు సినిమాల్లోకి తిరిగి రావాలని అనుకోలేద’ని తెలిపారు. ఆ సమయంలో మణిరత్నం మళ్లీ నన్ను ‘కడలి’ సినిమాకోసం పిలిపించారన్నారు. రాజకీయాల్లోకి వచ్చే అంశం గురించి మాట్లాడుతూ.. ‘నేను నటున్ని. నటించడం మాత్రమే నా పని. మరేందుకు నా నుంచి రాజకీయాలను ఆశిస్తున్నారు. నటుడిగా ఏదైనా అంశాన్ని వెలుగులోకి తేగలను.. కానీ దానికి పరిష్కారం చూపలేను కదా’ అన్నారు. మీటూ గురించి అడగ్గా.. ఈ విషయం గురించి నాకు పూర్తిగా తెలియదు. కాబట్టి దీని గురించి మాట్లాడలేను అంటూ సమాధానమిచ్చారు. -
సర్కారా! గాడెవడురో?!
‘నిగ్గదీసి అడుగు..’ అంటూ ప్రశ్నల కొడవళ్లను మన ముందు పెట్టిన సినిమా. ‘అగ్గితో కడుగు ఈ సమాజ జీవనచిత్రాన్ని’ అని ఎలుగెత్తిన సినిమా. ఇద్దరు అగ్రదర్శకులు కథ అందించిన సినిమాలో కొన్ని దృశ్యాలు ఇవి. ఈ సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... రౌడీనాయకుడు మరియు రాజకీయనాయకుడు గురునారాయణను ఎయిర్‌పోర్ట్‌లో విలేకర్లు చుట్టుముట్టారు.ఆయన ముఖం కందగడ్డలా ఉంది. ఈ ముఖాన్ని చూసి ప్రశ్న అడగనక్కర్లేదు. అయినా సరే అడిగారు...‘‘మీరు ఢిల్లీ వెళ్లిన పని ఏమైంది సార్?’’సూటిగా సమాధానం చెప్పకుండా ‘‘ఐయామ్ వెరీ హ్యాపీ’’ అంటూ వేగంగా కారు వైపు దౌడు తీశాడు గురునారాయణ.దారిలో అభిమాని ఒకడు దండ పట్టుకొని దగ్గరకు వస్తూ ‘‘అన్నా... ఒక్క నిమిషం’’ అన్నాడు.‘‘ఏ టైమ్‌లో దండేయాలో కూడా తెల్వదు. ధమాక్ లేనోడు’’ అని అభిమాని వైపు కొరకొరా చూస్తూ కారెక్కాడు గురునారాయణ.‘‘అన్నా...పోయేటప్పుడు అందరూ సపోర్ట్ చేస్తానన్నరు. గిట్లైందేంది?’’ అడిగాడు నర్సింగ్.‘‘అందరూ పాలిటిక్స్ నేర్చిండ్రురా’’ పండ్లు నూరాడు గురునారాయణ.ఇంట్లో...‘‘అదేన్నా... ప్రొహిబిషన్ గడబిడలో సారా దుకాణాలు తీసేస్తరట. అందుకే రాజాసింగ్ పరేశాన్ల ఉన్నడు’’ అన్నాడు నర్సింగ్.‘‘సారా మీద బతికే సర్కారోళ్లు భయపడాలెగాని దందా మీద బతికే మనకేమైతదిరా’’ అని రాజాసింగ్‌కు ధైర్యం చెప్పాడు గురునారాయణ.‘‘లేదన్నా, సీరియస్‌గానే ఉన్నదట’’ భయపడుతూనే ఉన్నాడు రాజాసింగ్. ‘‘ఛల్ తీ. ఒక్కటి పోతే ఇంకొక్కటి ఉంటది. గుడుంబ లేదా’’ అని మళ్లీ ధైర్యం చెప్పాడు గురునారాయణ. అప్పుడే లాయర్‌సాబ్ ఇంట్లోకి వచ్చాడు.‘‘లాయర్సాబ్కి కుర్చేయండి’’ అని మార్యాద చేస్తూనే ‘‘గా ఢిల్లీ ముచ్చట అగడొద్దు’’ అని చెప్పకనే చెప్పాడు గురునారాయణ. ఢిల్లీ టాపిక్‌ను దారి మళ్లించడానికి ‘‘గావళ్లు ఏమైన్రూ?’’ అని ఆరా తీశాడు.‘‘ఎవళు సార్?’’ అడిగాడు నర్సింగ్.‘‘గదేరా, కొట్లాడొచ్చిన్రు చూడు. వాళ్లను పిలువు’’ గురునారాయణ.వాళ్లు వచ్చి గురునారాయణ ముందు నిల్చున్నారు.‘‘ఈళ్లు గౌలిగూడ బార్ల దూరి వాళ్ల మందుతాగి వాళ్లనే కొట్టిండ్రు. బయట కనబడితే పోలీసులు ఎక్కడ బొక్కలో నూకుతరోనని ఫికరైతాండ్రు. మీదికెళ్లి వాడి బర్త్‌డే నంట. గదో సెంటిమెంట్ బెట్టిండు. జర ఏమైనా చెయ్’’ అని లాయర్సాబ్తో చెబుతూ కుర్రాళ్ల వైపు తిరిగి...‘‘జరిగింది జరిగినట్లు చెప్పుండ్రి. లేకపోతే బర్త్‌డే కేకు కాదు జైల్లో చిప్పకూడు తినాల్సొస్తది’’ అరిచాడు గురునారాయణ. గురునారాయణ మినిస్టర్ అయిన తరువాత.... ఒకరోజు‘‘ప్రెసొల్లా! లేలేలే... ఆ దుక్నం మనకొద్దు బై. ఆళ్లు అడ్డమైన కొచ్చెన్లెస్తరు మనకు చెప్పనీకి రాదు. నాకు సిగై్గతది. పొమ్మను పో’’ టీవీలో మైకేల్‌జాక్సన్ డ్యాన్స్ ప్రోగ్రాం చూస్తూ అన్నాడు గురునారాయణ.‘‘భలేవారే! ప్రెస్వద్దా...మీరు గొప్పోడు అని నేను, నేను గొప్పాడు అని మీరు అనుకుంటే సరిపోద్దా? ప్రపంచానికి తెలియాలి. పబ్లిసిటీ ఇంపార్టెంట్. లేకపోతే ఎక్కడి మైకేల్ జాక్సన్, ఎక్కడి మనం... చూడట్లా!’’ అని నక్క బుర్రతో సలహా ఇచ్చాడు లాయర్‌సాబ్.‘‘ఏక్‌ధమ్ సమజైంది బై. మంచిగచెప్పినవ్’’ అని లాయర్సాబ్కు థ్యాంక్యూ చెబుతూ ‘‘గా పోరిని రమ్మను’’ అని నర్సింగ్‌తో అన్నాడు గురునారాయణ.రిపోర్టర్ అనిత లోపటికి వచ్చింది.గురునారాయణ కండ్లలో కనిపించని భయం. ‘‘థియేటర్లలో జరిగిన హత్యల విషయంలో మీ కామెంట్ ఏమిటి?’’ అడిగింది అనిత.‘‘గదైతే నేను ఖండిస్తున్నాను. అంతే’’ అన్నాడు గురునారాయణ గంభీరంగా.‘‘అంటే?’’ అర్థం కానట్లు చూసింది రిపోర్టర్.‘‘ఖండిస్తున్నాను కదా. అంతే’’ అని మరోసారి అన్నాడు గురునారాయణ.‘‘అది అర్థమైంది కాని, మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారని...’’ అడిగింది రిపోర్టర్.‘‘ఏం యాక్షన్ తీసుకుంటం. పోలీసోళ్లకు జెప్పినం. నువ్వే గదరా డీయస్పీతో ఫోన్లో మాట్లాడినవ్. గాడేం జెయ్యలే. సూడుమళ్లా’’ నర్సింగ్ వైపు తిరిగి అన్నాడు గురునారాయణ.‘‘ఇలాంటి ముఠా తగాదాల వల్ల ఎంతోమంది అమాయకులు వాళ్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దానికి సంబంధించిన మినిస్టర్ మీరై ఉండి కూడా మీరేం చేస్తున్నారని...’’ సూటిగా వాడిగా అడిగింది రిపోర్టర్ అనిత.‘‘మళ్లా ఏంజేస్తున్నారంటవ్...చెప్పిన కదా... ఖండిస్తున్నాను’’ మరోసారి బలంగా ఖండించాడు గురునారాయణ.‘‘మళ్లీ ఖండిస్తున్నానంటున్నారు. అసలు ఏ విషయాన్ని ఖండిస్తున్నారో తెలుసా మీకు?’’ అసహనంగా అడిగింది అనిత,‘‘ఏందమ్మో ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నవ్’’ అని గయ్యిన లేచాడు నర్సింగ్.‘‘ష్ష్ష్’’ అన్నాడు లాయర్‌సాబ్. ఆయన ‘ష్ష్ష్’ని గౌరవిస్తున్నట్లుగా అందరూ సైలెంటైపోయారు.ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మరో ప్రశ్న అడిగింది రిపోర్టర్...‘‘సర్కార్‌ని విడిపించడంలో మీ చేయి కూడా ఉందని ఒక రూమర్ ఉంది. దాని గురించి మీ కామెంట్ ఏమిటి?’’‘‘సర్కారా? గాడెవడ్రో’’ అని నాటకీయంగా ఆశ్చర్యపోయాడు గురునారాయణ.ఇలా అన్న కొద్దిసేపటికే ఆ సర్కార్ గురునారాయణ ఇంట్లోకి పరుగెత్తుకు వచ్చాడు. ప్రత్యర్థి గ్యాంగ్ అతడివెంటబడుతుంది.సర్కార్‌ని చూసి అక్కడున్నవాళ్లు అదిరిపోయారు.‘‘అన్నా. పక్కకు పోదం. రూమ్‌లోకి పా’’ అని సర్కార్‌ని పక్క గదిలోకి తీసుకెళ్లాడు నర్సింగ్.‘‘అతనే సర్కార్ కదూ’’ అడిగింది అనిత.అబద్ధాలు బాగా నమిలి జీర్ణించుకున్న గురునారాయణ నీళ్లు నమలలేదు.ఈలోపే సర్కార్‌ని పట్టుకోవడానికి పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ ఇంట్లోకి దూసుకొచ్చాడు.అతడిని చూసి...‘‘ఏంద్వయ్యా గిట్ల జొర్రబడితివి.ఈడ నీకేం పని?’’ అరిచాడు గురునారాయణ.‘‘సర్కార్‌ని అరెస్ట్ చేయడానికి వచ్చాను’’ దృఢంగా అన్నాడు ఇన్స్పెక్టర్.‘‘గాన్ని అరెస్ట్ చేస్తావా? నీ తాన వారంటు ఉందా? నేను పాలిట్రిక్స్ మంత్రిని.ఖబడ్దార్’’ అని హెచ్చరించాడు గురునారాయణ.‘‘సర్కార్ ఎవరో తెలియదు అన్నారు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు?’’ అడిగింది రిపోర్టర్.‘‘ఆ...గాడు నా నియోజకవర్గం ఓటరు. జర్రంత డేంజర్ల పడి ఉంటడు. హెల్పింగ్ కోసం ఇంట్ల దూరిండు. దీనికి పెద్ద పంచాయితీ జేస్తున్నారే...ఆ...’’ అని గట్టిగా అరిచాడు గురునారాయణ. -
సునాయిక
సకల సుగుణ నాయిక సుష్మాస్వరాజ్! వాగ్ధాటి, సుపరిపాలన, సత్వర ప్రతిస్పందన, సంస్కృతి, సంప్రదాయం, మానవత కలగలిసిన రాజనీతిజ్ఞురాలు.. సుగుణాలకే వన్నెతెచ్చిన నాయిక.. సునాయిక..సుష్మాస్వరాజ్. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం. ప్రత్యర్థి పార్టీలు కూడా గౌరవించే వ్యక్తిత్వం. దేశ రాజధానికి... ముఖ్యమంత్రి అయిన తొలి మహిళ. మూడు సార్లు ఎమ్మెల్యే... ఏడుసార్లు ఎంపీ. ‘బెస్ట్ లవ్డ్ పొలిటీషియన్’.. వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రశంస. ‘బెస్ట్ అవుట్‌స్టాండింగ్ పార్లమెంటేరియన్’.. మన దేశం. కొత్త తరం పొలిటీషియన్లకు రోల్‌మోడల్. అన్నీ కలిస్తే.. సుష్మా స్వరాజ్. ఓ రోజున సుష్మా స్వరాజ్ ట్విట్టర్ అకౌంట్‌కి ‘మేడమ్ ప్లీజ్ హెల్ప్’ అంటూ ఒక ట్వీట్ వచ్చింది. అది దోహా ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన తన సోదరుడిని రక్షించమని కోరుతూ ప్రన్షు సింఘాల్ అనే వ్యక్తి చేసిన ట్వీట్. మూడవ రోజునే ‘నా సోదరుడు అంకిత్ క్షేమంగా విడుదలయ్యాడు. కృతజ్ఞతలు’ అంటూ మరో ట్వీట్ చేశాడు ప్రన్షు సింఘాల్. అంతకంటే ముందు... బెర్లిన్‌లో పాస్‌పోర్టు, డబ్బు ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను పోగొట్టుకున్న అగర్త అనే అమ్మాయి నుంచి సుష్మకు ఒక ట్వీట్ వచ్చింది. ఆ మరుసటి రోజే ‘ఈ రోజు ఇండియన్ ఎంబసీకి వెళ్లి పాస్‌పోర్టుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక అనుమతి తీసుకున్నాను. కృతజ్ఞతలు’ అంటూ ఎంబసీ ఉద్యోగుల పేర్లతో సహా మరో ట్వీట్ చేసింది అగర్త. మరికొన్నాళ్లకు.. దేవ్ తంబోలి అనే వ్యక్తి నుంచి ఓ ట్వీట్.. ‘మా చెల్లెలు ఉద్యోగం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి వెళ్లింది. ఆమెను ఓ గదిలో బంధించారు. రక్షించండి’ అంటూ తన ఫోన్ నంబరు కూడా ఇచ్చాడతడు. కొన్ని గంటల్లోనే దేవ్ ట్విట్టర్ అకౌంట్‌కి ‘యుఎఈ అంబాసిడర్‌ని సహాయం అడిగాను. ఆయన మీతో మాట్లాడతారు, వివరాలు చెప్పండి’ అని భారత విదేశాంగ మంత్రి నుంచి రిప్లయ్ ట్వీట్ వచ్చింది. ఆ రోజు సాయంత్రానికే ‘దుబాయ్ పోలీసుల సహాయంలో మీ చెల్లెల్ని రక్షించాం. ఇప్పుడామెను దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీ షెల్టర్‌కు చేర్చడమైంది’ అని దేవ్‌కి ట్వీట్ చేశారు భారత విదేశాంగ మంత్రి. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకే కాదు, మనదేశంలో చిక్కుకుపోయిన విదేశీయులకూ అంతే వేగంగా సుష్మ నుంచి సేవలు అందుతున్నాయి. సుజాన్నె లుగానో అనే డచ్ మహిళ తన సోదరి సబినె హార్మెస్ భారత పర్యటనలో రిషికేశ్‌లో తప్పి పోయిందని ట్వీట్ చేసింది. సోదరిని గుర్తుపట్టడానికి ఆనవాళ్లను కూడా వివరించింది సుజాన్నె. ఆ ట్వీట్‌కు బదులుగా ‘మా అధికారులు సబినె హార్మెస్ను కనుగొన్నారు. ప్రస్తుతం ఆమె స్వతంత్ర ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటోంది. డెహ్రాడూన్‌లోని పాస్‌పోర్టు అధికారి ఆమెను స్వయంగా కలిశారు’ అని ఒక ట్వీట్. మరి కొన్ని గంటలకు ‘ఆమె కాళ్లకు గాయాలయ్యాయి. ఆమె మానసికంగా కూడా స్థిమితంగా లేదు. నిర్మల్ జాలీ గ్రాంట్ హాస్పిటల్’లో చేర్చి చికిత్స చేస్తున్నారు’ అని మరో ట్వీట్ చేశారు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్. ఇవి మాత్రమే కాదు.. ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయుల వీడియో చూసి మనోవేగంతో స్పందించారు సుష్మ. ఆపదలో ఉన్న వారిని విడిపించారు, మరణించిన వారిని వారి బంధువులకు అప్పగించారామె. ఇవన్నీ భారతీయులుగా మన ఛాతీ ఉప్పొంగే సేవలైతే... సోనూ అనే చిన్నారిని రక్షించడంలో ఆమెలో అమ్మతనం దేశం హృదయాన్ని తాకింది. సోనూ నాలుగేళ్ల కుర్రాడు. ఢిల్లీలో ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా 2010లో ఇద్దరు మహిళలు ఆ చిన్నారిని అపహరించుకుని వెళ్లారు. సుష్మ దృష్టికి వచ్చిన తర్వాత సోనూ కోసం శోధించి 2016లో బంగ్లాదేశ్‌లోని షెల్టర్ హోమ్‌లో ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆ ప్రభుత్వంతో సంప్రదించి సోనూను ఇండియాకు రప్పించి అతడి తల్లిదండ్రులకు అప్పగించినప్పటి దృశ్యం దేశ ప్రజల గుండెల్ని కదలించింది ఆ స్థానంలో మగవాళ్లు ఉంటే ఆ సందర్భం కర్తవ్య నిర్వహణలో భాగంగానే ఉండేది. మీడియా కోసం ఫొటోకి పోజిచ్చి, పిల్లాడిని అమ్మానాన్నలకు అప్పగించేవాళ్లు్ల. సుష్మాస్వరాజ్ మంత్రిగా మాత్రమే కాదు, ఓ తల్లిలా కూడా స్పందించారు. సోనూను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. తన బిడ్డే తప్పిపోయి తిరిగి దగ్గరకు చేరితే తల్లిపేగు కన్నీరు పెట్టుకున్నట్లు స్పందించారామె. ఇలా ఆమెలో దేశాన్ని తల్లిలా భావించే లక్షణం కూడా ఆమెతోపాటే పెరిగింది. పాలకులు ప్రజలను బిడ్డల్లా పాలించాలనే తత్వాన్ని ఆమెకు పొలిటికల్ సైన్స్ నేర్పించింది. హరియాణా అమ్మాయి సుష్మాస్వరాజ్ పూర్వికులు లాహోర్ (పాకిస్థాన్)లోని ధరంపురా నుంచి హరియాణాకు వచ్చారు. తండ్రి హర్దేవ్ శర్మ ఆర్ఎస్ఎస్లో క్రియాశీలక సభ్యుడు. అంబాలా కంటోన్మెంట్లో స్థిరపడ్డారాయన. సుష్మ బాల్యం, కాలేజ్ చదువు అంతా అంబాలాలోనే. వరుసగా మూడేళ్లు బెస్ట్ ఎన్సీసీ క్యాడెట్ అవార్డు నుంచి బెస్ట్ హిందీ స్పీకింగ్ అవార్డు, బెస్ట్ స్టూడెంట్ అవార్డు, సంగీతం, సాహిత్యం, లలిత కళలు, నాటకాలు, వక్తృత్వం... అన్నింటిలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది. పంజాబ్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చదివే రోజుల్లో విద్యార్థి పరిషద్‌లో చురుగ్గా పాల్గొంటున్నప్పుడు ఆమె ఊహించి ఉండరు.. దేశంలో ఇంతటి క్రియాశీలకమైన రాజకీయవేత్తగా మారతానని. లా కోర్సు పూర్తయిన తర్వాత అందరిలాగానే న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. జార్జి ఫెర్నాండెజ్ లీగల్ డిఫెన్స్ టీమ్‌లో చేరడం... ఆమె జీవితాన్ని మలుపు తిప్పి, ఇప్పుడు మనం చూస్తున్న గమ్యానికి చేర్చింది. సుష్మ... స్వరాజ్ 1975, జూలై 13. అప్పటి వరకు ఆమె కేవలం సుష్మ, ఆ రోజు నుంచి సుష్మా స్వరాజ్. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తూ.. ఫెర్నాండెజ్, జయప్రకాశ్ నారాయణ్లతోపాటు సుష్మ ఉద్యమించిన సమయంలోనే ఫెర్నాండెజ్ టీమ్‌లో చేరి, పరిచయం అయిన న్యాయవాది కౌశల్ స్వరాజ్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. తర్వాత రెండేళ్లకు హరియాణా శాసనసభకు ఎన్నికలు వచ్చాయి. జనతాపార్టీకి చురుకైన అభ్యర్థులు కావాల్సి వచ్చింది. పార్టీ నాయకులకు సుష్మాస్వరాజ్ కనిపించారు. పాతికేళ్లకే ఆమె శాసన సభకు పోటీ చేయడం, గెలవడం, దేవీలాల్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణం చేయడం జరిగిపోయాయి. మరో రెండేళ్లకే పార్టీ రాష్ట్ర బాధ్యతలు స్వీకరించారు. విప్లవాత్మక నిర్ణయాలు సుష్మాస్వరాజ్ దేశంలో అనేక రాజకీయ అనిశ్చితులకు ప్రత్యక్ష సాక్షి. ఎమర్జెన్సీ నుంచి సంకీర్ణ యుగం వరకు, పదమూడు రోజుల ప్రభుత్వం వంటి ఒడిదుడుకులను కూడా చూశారు. సమాచార ప్రసార మంత్రిగా పార్లమెంట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆరు ఎయిమ్స్‌ల స్థాపన ఆమె చొరవే. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ల తనిఖీ వంటి సాహసోపేతమైన అడుగులు కూడా వేశారు. అప్పట్లో ఉల్లిపాయలు కేజీ ఐదు నుంచి యాభై రూపాయలను చేరడం భారత దేశం ఊహించని పరిణామం. ఆ ఫలితాన్ని ఆమె ఢిల్లీ ఎన్నికలలో మోయాల్సి వచ్చింది. భారతీయత– విదేశీయత సుష్మాస్వరాజ్ రాజకీయ జీవితం ఇందిరా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా మొదలవడం అనుకోకుండా జరిగిపోయింది. భారత విదేశాంగ శాఖను నిర్వహించిన మహిళల్లో ఇందిరాగాంధీ తర్వాత సుష్మ పేరు చేరడం కూడా యాదృచ్చికమే. అయితే 1999లో గాంధీ కుటుంబంతో బరిలో దిగడం మాత్రం అప్పటి రాజకీయ అవసరం. సోనియా గాంధీ కర్నాటకలోని బళ్లారి లోక్‌సభ స్థానానికి కూడా పోటీ చేశారు. అప్పుడు అద్వానీ, వాజ్‌పేయి వంటి పార్టీ పెద్దలు సుష్మాస్వరాజ్ వైపు మొగ్గుచూపారు. భారతీయతకు– విదేశీయతకు మధ్య పోటీగా రూపుదిద్దుకున్న ఆ ఎన్నికల్లో చివరి నిమిషంలో బరిలో దిగిన సుష్మాస్వరాజ్... ప్రచారంలో కన్నడ భాషలో మాట్లాడి కన్నడిగులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. మూడున్నర లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. కొద్ది తేడాతో విజయానికి దూరంగా ఉండిపోయినప్పటికీ ఆ ఎలక్షన్ సుష్మ పొలిటికల్ చరిష్మా గ్రాఫ్‌ను పెంచింది. నిత్య విద్యార్థి సుష్మా స్వరాజ్ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. టెక్నాలజీతోపాటు అప్డేట్ అవుతుంటారు. ట్విటర్‌ను పరిపాలనకు ఆమె ఉపయోగించినంత విరివిగా మరెవరూ వాడి ఉండరు. ఏ క్షణమైనా ప్రపంచానికి ఒక ట్వీట్ దూరంలోనే ఉంటారు. సుష్మాస్వరాజ్... స్మార్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎలాగన్నది చేతిలో స్మార్ట్‌ఫోన్‌తో చేసి చూపిస్తున్నారు. అదే వేదికగా ప్రజాభిమానాన్ని కూడా చూరగొంటున్నారు. ఆమెకు కిడ్నీ సమస్య వచ్చినప్పుడు వెల్లువెత్తిన అభిమానం రాజకీయ పార్టీల హద్దులను చెరిపేసింది. తమ కిడ్నీ ఇస్తామంటూ అభిమానుల నుంచి ట్వీట్లు వచ్చాయి. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆమె సంపాదించుకున్న స్థిరాస్తి అది. నాయకులు రెండు రకాలు. తమకు మార్గదర్శనం చేసిన వారి అడుగుజాడల్లో నడిచేవాళ్లు, తర్వాతి తరం కోసం తమ పాదముద్రలతో పథనిర్మాణం చేయగలిగిన వాళ్లు. సుష్మా స్వరాజ్‌ది రెండో కోవ. ప్రధాని అవుతారా?! సుష్మా స్వరాజ్ గత వారం... తన ఆరోగ్య రీత్యా రాబోయే 2019 ఎన్నికల్లో పోటీ చేయలేనని యథాలాపంగా అన్నట్లు అన్నారు. ఆ మాట ప్రజల దృష్టిని ఆకర్షించింది. రాజకీయాల నుంచి రిటైర్ అవుతారా? అన్ని పార్టీల్లోనూ సందేహం. ‘ఎన్నికల్లో పోటీ చేయకపోతే రాజకీయాల నుంచి రిటైర్ అయినట్లేనా? రాజ్యసభ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యి ప్రధానమంత్రి కావచ్చు కదా, ఇందిరాగాంధీలాగా’ అని సీనియర్ జర్నలిస్టు బర్ఖాదత్ ఆశాజనకమైన సందేహాన్ని వ్యక్తం చేశారు. అదే నిజం కావాలని కోరుకునే వాళ్లు దేశంలో చాలామంది ఉన్నారు. తొలి మహిళ రికార్డులు ► ఢిల్లీ ముఖ్యమంత్రి ► భారత పార్లమెంట్లో ప్రతిపక్ష నేత ► జాతీయ పార్టీకి అధికార ప్రతినిధి ► అవుట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డు ► హరియాణా క్యాబినెట్ మంత్రి ► హరియాణా జనతాపార్టీ అధ్యక్షురాలు బర్ఖాదత్, సీనియర్ జర్నలిస్టు కూతురు బాన్సూరి కౌశల్‌తో సోనూను తల్లిదండ్రులకు అప్పగిస్తూ.. భర్త స్వరాజ్ కౌశల్‌తో (పెళ్లి ఫొటో) సుష్మలాగ అభినయిస్తున్న చిన్నారి (ఫ్యాన్సీ డ్రస్ పోటీ) – వాకా మంజులారెడ్డి -
ఎక్కడి నాయకులు అక్కడే..
సిరిసిల్ల: ముందస్తు ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగియగానే సీఎం కేసీఆర్ సిరిసిల్లలో మంగళవారం సభ నిర్వహించడం టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. సిరిసిల్ల టీఆర్ఎస్ అభ్యర్థిగా కేటీఆర్ సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేయగా మంగళవారం నిర్వహించిన సీఎం సభకు మాత్రం భారీ జనసమీకరణ చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి జనాలను సమీకరించారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల అభ్యర్థులు కేటీఆర్, రమేశ్‌బాబు సీఎం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీఆర్ఎస్ శ్రేణులతో సభ సక్సెస్ చేయాలని స్పష్టం గా చెప్పి ఆ మేరకు జనాన్ని సమీకరించి విజయవంతమయ్యా రు. టీఆర్ఎస్కు ఇదే పెద్దసభ కావడంతో ఇకక్షేత్రస్థాయి ప్రచా రంలో పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యాయి. ఎక్కడి నాయకులు అక్కడే.. ఏ ఊరు నాయకులు ఆ ఊరిలోనే క్షేత్రస్థాయిలో ప్రచారాలు ని ర్వహించాలని మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ వెళ్లి టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వివరించాలన్నారు. గడపగడపకూ గులాబీజెండా చేరాలని, ప్రతీ ఓటరుకు గులాబీ పార్టీ చేసిన ప్రయోజనాలను వివరించాలని కేటీఆర్ ఉద్బోధించారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, ఏఎంసీ, సింగిల్‌విండో చైర్మన్లు, సింగిల్‌విండో, ఏఎంసీల డైరెక్టర్లు, సెస్ డైరెక్టర్లు, టీఆర్ఎస్ శ్రేణులు పల్లెబాటపట్టాయి. ఈ పక్షం రోజులు పనిచేయాలని గులాబీబాస్ పార్టీ శ్రేణులకు సూచించారు. దీంతో పటిష్టమైన ప్రణాళికతో గెలుపుకోసం టీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. సభలో సీఎం ఉత్సాహం.. సిరిసిల్ల సభలో సీఎం కేసీఆర్ ఉత్సాహంగా స్థానిక నేతలతో ముచ్చటిస్తూ నమస్కరిస్తూ ముందుకు సాగారు. సభకు భారీగా జనం రావడంతో ఆ పార్టీ శ్రేణులు సభా విశేషాలను బుధవారం చర్చించుకోవడం కనిపించింది. సీఎం కేసీఆర్ జిల్లా నాయకులను పేరుపెట్టి పిలుస్తూ పలకరించడాన్ని టీఆర్ఎస్ నాయకులు ఉటంకించారు. మొత్తంగా సిరిసిల్లలో సీఎం సభ సక్సెస్ కావడంతో రెట్టింపు ఉత్సాహంతో గులాబీ శ్రేణులు ప్రచార పర్వంలో బీజీ అయ్యారు. -
నిజమైన నాయకుడు...
సాక్షి, భద్రాచలం : ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు తరతరాలకు సరిపడేంత వెనుకేసుకునే ప్రస్తుత రాజకీయాల్లో.. సంపాదనకు దూరంగా, విలువలే పరమావధిగా రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి. మూడుసార్లు భద్రాచలం నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధించారు. శాసనసభలో ప్రజాసమస్యలపై విశేషంగా గళమెత్తారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిజాయితీగా పనిచేస్తున్న కుంజా బొజ్జి..వృద్ధాప్యంలోనూ ప్రస్తుత ఎన్నికల్లో జొరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆ హ్యాట్రిక్ ఎమ్యెల్యే ఇప్పటికీ సాధరణ జీవితాన్ని గడుపుతున్నారు. గ్రామంలో జన్మించి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో వీఆర్‌పురం మండలం రామవరం పంచాయితీలోని అడవి వెంకన్న గూడెంలో కుంజా బొజ్జి జన్మించారు. నిరుపేద కుటుంబంలో 8వ సంతానంగా జన్మించిన ఆయన కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో పెద్దగా చదువుకోలేదు. 1948లో లాలమ్మను వివాహం చేసుకున్న ఆయనకు ఆరుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. ఓటమి విజయానికి నాందిగా భావించి.. 1970లో వీఆర్‌పురం మండలంలోని రామవరం పంచాయితీ సర్పంచ్‌గా పోటీ చేసిన ఒకే ఒక్క ఓటుతో ఓడిపోయారు. 1981లో వీఆర్‌పురం సమితి అధ్యక్షుడిగా సీపీఎం నుంచి పోటిచేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. కానీ ప్రతీ ఓటమిని ఓ గుణపాఠంగా తీసుకొని ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే వారు. నక్సలైట్ల చేతిలో దెబ్బలు తిని.. మొదటి నుంచి కమ్యూనిస్లు పార్టీలో చురుకుగా పాల్గొన్న ఆయన 1985లో జీడిగుప్పలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సీపీఎం నేతలు బత్తుల భీష్మారావు, బండారు చందర్రావులతో కలసి వెళ్లారు, వీరు వస్తున్న సమాచారం అందుకున్న మావోయిస్టులు చుట్టుముట్టి బత్తుల భీష్మారావు, చందర్రావులను కాల్చి చంపారు. బొజ్జిని మాత్రం కొట్టి వదిలివేశారు. పార్టీ గెలుపు కోసం.. సీపీఎం పార్టీలో ఏ కార్యక్రమం జరిగినా 92ఏళ్ల ముదిమి వయుస్సులో కూడా యువకుడిలా చురుకుగా పాల్గొనడం పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం. ప్రస్తుతం భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా డాక్టర్ మిడియం బాబూరావు బరిలో ఉన్నారు. ఆయన గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా పార్టీ గెలవాలనే ఆకాంక్షతో ప్రచారంలో పాల్గొంటున్నారు. కుంజా బొజ్జిని ఆదర్శంగా పార్టీ కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. హ్యాట్రిక్ వీరుడు భద్రాచలం నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా 1985లో మొదటిసారిగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం 1989,94ల్లో కూడా సీపీఎం నుంచి గెలుపొందారు. 1984లో ఎమ్మెల్యేగా ఆయనకు వచ్చే జీతం రూ.2వేలు. అందులో రూ.వెయ్యి రాష్ట్ర పార్టీకి ,రూ.200 జిల్లా ఫండ్‌గా ఇచ్చి మిగిలిన రూ.800లతో కుటుంబాన్ని సాకేవారు. ఆనాడు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం సొంత ఇంటి నిర్మాణం కోసం స్థలం కేటాయించగా పార్టీ నిర్ణయం మేరకు ఆ స్థలాన్ని కూడా నిరాకరించిన నిజాయితి పరుడు కుంజా బొజ్జి. రాజకీయాలు మారాలి పేదలకోసం పనిచేసే రాజకీయ నాయకులు కావాలి. కానీ ఈ రోజుల్లో అలాంటి వారు చాలా తక్కువగా కనిస్తున్నారు. ఒక్క సారి గెలిస్తే ఎంత సంపాదిద్దామా అనే ధోరణితోనే ఉంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తరాలు మారినా మనం చేసిన సేవలు జనం గుర్తించుకోవాలి .రాజకీయాల్లో విలువలను పాటించాలి. లేకుంటే బతికున్నా చచ్చినట్టే, తన శేష జీవితం కూడా పార్టీ కోసమని ,ప్రజల కోసమే వెచ్చిస్తా అంటున్నారు మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి. మెజారిటీలోనూ ఆయనదే రికార్డు భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన వారిలోకెల్లా అత్యధిక మెజారిటీ ఓట్లతో విజయం సాధించిన ఘనత కూడా కుంజా బొజ్జికే దక్కుతుంది. 1985,89,94 సంవత్సరాల్లో వరుసగా మూడు సార్లు సీపీఎం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే 1994లో 39,265 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటి వరకు 1955 నుంచి 2014 ఎన్నికల వరకూ గెలిచిన అభ్యర్థుల్లో మరెవ్వరికీ ఈ స్థాయిలో మెజారిటీ రాలేదు. -
వేషాలు వేస్తామమ్మా..వేషాలు వేస్తాం
సాక్షి ,ఖమ్మం: ఎన్నికల వేడి మొదలైంది...రాజకీయనాయకులు కొత్త కొత్త ..వింత వేషాలను వేస్తున్నారు. అందులో కొన్ని.. తిలకం దిద్ది..హారతి పట్టి ఖమ్మంరూరల్: పాలేరు టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వెంకటగిరి, గుర్రాలపాడులో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.ఆయనకు కోట నారాయణపురంలో మహిళలు తిలకందిద్ది, హారతిపట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ..ఇంకా విన్నవించారు. చేపలు అమ్ముతా.. చక్కబెడతా మణుగూరురూరల్: ప్రజల్లో కలిసిపోయి వారిలో ఒకరిగా ఉంటానని, అండగా నిలుస్తానని చెబుతూ..మణుగూరు టీఆర్ఎస్ అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం ప్రచారంలో భాగంగా ఇదిగో ఇలా చేపలు విక్రయించారు. మత్సా్యలను చేతుల్లోకి తీసుకుని..తరాజుల్లో జోకుతూ అమ్మారు. ఎమ్మెల్యేగా మళ్లీ గెలిపిస్తే..జనం పక్షాన నిలుస్తానని, ఈసారి తిరిగి ఆశీర్వదించి ఆదరించాలని కోరుతూ ఓట్లు అభ్యర్థించారు. గడ్డం గీస్తా..వృద్ధిచేస్తా వైరా: టీఆర్ఎస్ వైరా అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్ మంగళవారం వైరా పట్టణ వీధుల్లో ప్రచారం చేశారు. ఈక్రమంలో ఓ మంగలి దుకాణంలో ఒకరికి చక్కగా గడ్డం గీశారు. ఎమ్మెల్యే అంటే..అందనంత దూరంలో ఉండనని, మీతోనే, మీ వెన్నంటే ఉంటానంటూ ప్రజలకు భరోసానిస్తూ, ఒక్కసారి తిరిగి గెలిపించాలని కోరారు. మధ్యలో నిలిచిన అన్ని రకాల పనులను విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. వాహనం..అంతా కాషాయం సత్తుపల్లిటౌన్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రచారంలో భాగంగా సత్తుపల్లికి చెందిన భూక్య శ్యాంసుందర్‌నాయక్ తన పల్సర్ ద్విచక్ర వాహనాన్ని ఇలా పూర్తిగా కాషాయ భరితంగా మలుచుకున్నారు. బండిపై కూడా బీజేపీ అని రాయించుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈసారి బీజేపీ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావును గెలిపించాలని ఓట్లు అభ్యర్థించాడు. -
‘మీ టూ’తో పురుషుల్లో మార్పు!
లైంగిక వేధింపులపై ఉద్యమంలా ప్రారంభమైన ‘మీటూ’.. స్త్రీల పట్ల పురుష వైఖరిలో మార్పుకి కారణమైందా? పురుషులు జాగ్రత్త పడేలా చేసిందా? అంటే దేశంలోని పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రతి ఇద్దరిలో ఒకరు అవునని చెప్పగా.. తాము తోటి మహిళా ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని ప్రతి ముగ్గురిలో ఒకరు అంగీకరించారు. విధులు నిర్వహించిన ప్రాంతాల్లో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను సినీ, మీడియా రంగ ప్రముఖులు పలువురు ఇటీవల ‘మీటూ’ ఆన్లైన్ ఉద్యమం ద్వారా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే పురుషుల ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చిందా? అని ‘యు గవ్ ఇండియా’ అనే సంస్థ ఈ నెల 16 నుంచి 22 వరకు ఓ సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలకు చెందిన వెయ్యి మంది స్త్రీ, పురుషుల నుంచి 21 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టింది. వీరిలో పురుషులు 51 శాతం కాగా, మహిళలు 49 శాతం మంది. సర్వేలో తేలిన ప్రధానాంశాలు.. ► ‘మీటూ’ ఉద్యమం ప్రభావంతో ప్రతి ఇద్దరు పురుషుల్లో ఒకరు తాము స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నామన్నారు. మీటూ భయంతో సహోద్యోగులైన స్త్రీలతో వ్యవహరించేటప్పుడు కేవలం పనికి సంబంధించిన విషయాలకు మాత్రమే పరిమితమవుతున్నామంటూ ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరు అంగీకరించారు. అదేవిధంగా పురుషుల్లో మూడోవంతు మంది కార్యాలయాల్లో తమ టీంలోకి మహిళలను తీసుకునే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నామని చెప్పారు. అయితే ‘మీటూ’ ఉద్యమానికి కొంత మంది సానుకూలంగా ఉన్నప్పటికీ స్త్రీల ఉద్యోగ జీవితాల్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా తలెత్తుతున్నట్టు సర్వే తేల్చింది. ► పట్టణాల్లో నివసించేవారిలో 76 శాతం మంది లైంగిక వేధింపులను తీవ్రమైన సమస్యగా భావిస్తున్నారు. మహిళల్లో అత్యధికంగా 87 శాతం మంది లైంగిక వేధింపులు తీవ్రంగా ఉన్నాయని తెలపగా, పురుషుల్లో 66 శాతం మంది మాత్రమే ఈ సమస్య తీవ్రంగా ఉందన్నారు. యువతరం (18–39 ఏళ్ల వారు) లైంగిక వేధింపులను తీవ్రమైందిగా భావిస్తుండగా 40 ఏళ్ల వయస్సు వారు మాత్రం అంత తీవ్రమైన సమస్యగా అనుకోవడం లేదు. యువతరంలో 83 శాతం మంది ‘మీటూ’ని సీరియస్‌గా భావిస్తుండగా, 40 ఏళ్ల వారిలో 63 శాతం మంది ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. ► సర్వేలో ఎక్కువ మంది తమ అంగీకారం లేకుండా తాకడం, అసభ్య చిత్రాలూ, మెసేజ్‌లూ పంపించడం లైంగిక వేధింపుగానే భావిస్తామన్నారు. ► బాలీవుడ్లో లైంగిక వేధింపులు ఎక్కువ. ఆ తరువాతి స్థానం రాజకీయాలదే. ► దాదాపు 43 శాతం మంది తమకు లైంగిక వేధింపుల బాధితులెవరో తెలుసునని పేర్కొనగా, 36 శాతం మంది నిందితులెవరో తెలుసుని చెప్పారు. -
ఔత్సాహిక నేతల కోసం ట్రైనింగ్ సెంటర్
లక్నో: డాక్టర్లు, ఇంజనీర్లు వంటి వృత్తి నిపుణులుగా మారేందుకు ప్రత్యేకంగా కళాశాలలు ఉన్నాయి. అదే తరహాలో రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకునేందుకు ఓ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రాజకీయ శిక్షణా కేంద్రం కోసం రూ.198 కోట్ల నిధులను యూపీ ప్రభుత్వం కేటాయించింది. దాదాపు 16 ఎకరాల్లో ఇక్కడి ఘజియాబాద్ జిల్లా కేంద్రంలో దీని నిర్మాణం జరగనుంది. ఈ శిక్షణా కేంద్రంలో రాజకీయాల్లోకి రావాలనుకునే వ్యక్తులతో పాటు చట్టసభల ప్రతినిధులు చేరవచ్చని యూపీ పట్టణాభివృద్ధి మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా తెలిపారు. ఇక్కడి విద్యార్థులకు వేర్వేరు దేశాధినేతలు, నిపుణులు, రాయబారులు, రాజకీయ ప్రముఖులతో తరగతులు నిర్వహిస్తామన్నారు. ఢిల్లీ పర్యటనకు వచ్చే ప్రజలు సందర్శించేందుకు వీలుగా దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో ఉన్న ఘజియాబాద్‌లో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ శిక్షణా కేంద్రాన్ని యూపీ పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహిస్తుందనీ, దీనికి గుర్తింపు కోసం పలు జాతీయ విశ్వవిద్యాలయాలతో చర్చిస్తున్నామని సురేశ్ కుమార్ పేర్కొన్నారు. పాఠ్యాంశాల రూపకల్పనకు ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశామనీ, మరో రెండేళ్లలో ఈ శిక్షణా కేంద్రం పూర్తిస్థాయిలో పనిచేస్తుందని చెప్పారు. -
ప్రజలకో న్యాయం.. నేతలకో న్యాయమా?
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల్లో నేర చరిత కలిగిన రాజకీయ నాయకులు పోటీ చేయకుండా నిరోధించే అధికారం తమకు లేదని, ఈ విషయంలో తాము పార్లమెంట్ పాత్రను నిర్వహించలేమని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసిన విషయం తెల్సిందే. హత్యలు, కిడ్నాప్‌లు, రేప్‌లు లాంటి కీలక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తుండడం పట్ల ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. నేర చరితులను ప్రజలు ఎన్నుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కేంద్రానికి, ఎన్నికల కమిషన్‌కు కొన్ని సూచనలు చేసింది. తాము ఎదుర్కొంటున్న ప్రతి కేసు వివరాలను అభ్యర్థులు తమ అఫిడవిట్లో విధిగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు కోర్టు సూచించింది. అలాగే రాజకీయ పార్టీలు పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేర చరితుల వివరాలను వెబ్సైట్లలో పొందుపర్చాలని సూచించింది. అలాగే నేర చరితులు ఎన్నికల్లో పోటీ చేయడాకుండా పార్లమెంట్లో చట్టం తీసుకరావాలని కూడా కోర్టు సూచించింది. ఇంతవరకు సుప్రీం కోర్టు సూచనలు బాగానే ఉన్నాయిగానీ వీటిని అమలు చేసేది ఎవరు? ఏ పార్టీ అధికారంలో ఉన్న ఈ దిశగా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే ప్రతి పార్టీ తరఫున ఎన్నికల్లో నేర చరితులే పోటీలు పడుతున్నారు. కేసుల్లో శిక్ష పడిన రాజకీయ నాయకులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నివారించేందుకు 1951–ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని 8వ సెక్షన్ అడ్డుపడుతోంది. పెండింగ్ కేసులున్న వారిని నిరోధించలేక పోతోంది. దాంతో వివిధ రాజకీయ పార్టీల తరఫున నేర చరితులు పోటీ చేస్తూనే ఉన్నారు. 2004లో పార్లమెంట్ ఎన్నికల్లో 124 మంది, 2009లో 162 మంది, 2014లో 184 మంది పోటీ చేశారు. కేసులు నమోదయిన వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం తీసుకొచ్చినట్లయితే రాజకీయ నాయకులను పోటీ చేయకుండా అడ్డుకునేందుకు ఎవరైన అనవసరమైన కేసులు పెట్టవచ్చన్నది రాజకీయ పార్టీల భావం. అన్ని కేసుల్లో కాకుండా హత్య, కిడ్నాప్, రేప్ లాంటి కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని పోటీ చేయకుండా నివారించవచ్చు. కానీ శిక్ష పడనంత వరకు ప్రతి ఒక్కరు నిర్దోషులేనని ఎన్నికల కమిషన్ ఎప్పటి నుంచో వాదిస్తోంది. ఈ లెక్కన దేశంలో నేడు వివిధ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న 2.7 లక్షల మంది అండర్ ట్రయల్స్ కూడా నిర్దోషులే. వారంతా అన్యాయంగా జైల్లో మగ్గుతున్నారు. వారందరికి వ్యక్తిగత ఇష్టత. స్వేచ్ఛా కదలికలు, వత్తి స్వేచ్ఛ, ప్రతిష్టకు సంబంధించిన ప్రాథమిక హక్కులు లేకుండా చట్ట ప్రకారమే హరిస్తున్నారు. అదే రాజకీయ నాయకులకేమో పోటీచేసే హక్కు ఉందంటున్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ నేతల చట్టపరమైన హక్కుకు రక్షణ కల్పించడం ఎంత అన్యాయం? రాజకీయ నాయకులు కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారించడం ఒక్కటే ఇందుకు సరైన పరిష్కారం అని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీం కోర్టుకు సూచించారు. అయితే ఈ విషయాన్ని పరిగణలోకి కోర్టు తీసుకోక పోవడం ఆశ్చర్యం. కేసుల త్వరితగతి పరిష్కారం కోసం ప్రత్యేక సీబీఐ కోర్టులు, ప్రత్యేక వినియోగదారుల కోర్టులు, రేప్ కేసులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నప్పుడు నేతల కేసుల విచారణకు ఎందుకు ప్రత్యేక లేదా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయకూడదు? ఎన్నికల పిటిషన్లను హైకోర్టులు ఆరు నెలల్లోగా పరిష్కరించాలనే మార్గదర్శకాలు ఇప్పటికే ఉన్నాయి. శాసన సభ్యులపై నమోదయ్యే కేసులను ఏడాదిలోగా విచారించి తీర్పు చెప్పాలని, అలా కుదరనప్పుడు అందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు వివరణ ఇవ్వాలని పబార్గినేట్ కోర్టులకు 2014లో సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు పూర్తిగా సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. మరి నేరచరితులు అడ్డుకునేందుకు దొరికిన అవకాశాన్ని సుప్రీం కోర్టు ఇప్పుడు ఎందుకు వదులుకుందో అర్థం కాదు. కొన్ని విషయాల్లో తన పరిధి దాటి క్రియాశీలతను ప్రదర్శించే సుప్రీం కోర్టు ఆ క్రియాశీలతను రాజకీయ ప్రక్షాళనలో చూపకపోవడం అధర్మమే! -
కీర్తి
మేడమ్ మాయావతి గారు ఈ మధ్య అద్భుత మైన భవనాన్ని నిర్మించుకున్నారు. ఆ భవనం ముఖద్వారం దగ్గరే ఒకటి కాదు తన విగ్రహాలు నాలుగింటిని మన అశోక చక్రంలో సింహాల్లాగా నాలుగు దిక్కులూ చూస్తున్నట్టు నిర్మించుకున్నారు. విగ్రహాల ద్వారా శాశ్వత కీర్తిని సంపాదించుకోవచ్చని నమ్మిన నాయకురాలు మాయావతి. దీనిలో ఒక సుఖం ఉంది. ఎవరి ఇంటిలో వారు తమ విగ్రహాలు పెట్టుకోవడం ఎవరి దురదను వారే గోక్కోవడం లాంటిది. ఆమె పదవిలో ఉన్న రోజుల్లో లక్నోలో ఏనుగుల విగ్రహాలతోపాటు తన విగ్రహం, తమ నాయకుడు కాన్షీరాంగారి విగ్రహంతో పెద్ద పార్కుని నిర్మించారు. కీర్తి ఎంత ప్రయత్నించినా వదలని దురద. గోకినకొద్దీ రెచ్చిపోతుంది.ఇది చాలా సంవత్సరాల కింద పత్రికలో వచ్చిన వార్త. ఒక మహానగరంలో వరసగా హత్యలు జరుగుతున్నాయట. పోలీసులకు ఎంత ప్రయత్నించినా కారణం దొరకడం లేదు. ఒక హత్యకీ మరొక దానికీ పొంతన లేదు. సాధార ణంగా నేరస్థుడికి ఒక ‘ఒడుపు’ ఉంటుంది. అది పోలీసులకు పట్టి ఇస్తుంది. ఈ వరస హత్యలలో అలాంటి పొంతన దొరకడం లేదు. పోలీసులు ఇరకాటంలో పడ్డారు. ప్రజలు భయభ్రాంతులవు తున్నారు. ఎట్టకేలకు హంతకుడు దొరికాడు. ‘‘ఏమయ్యా, ఎందుకీ హత్యలు చేస్తున్నావు?’’ అని పోలీసులు నిలదీశారు. హంతకుడు తృప్తిగా సెలవిచ్చాడు. ‘‘బాబూ! నాకు చదువూ సంధ్యా లేదు. ఏ ప్రత్యేకతా లేదు. అడ్డమయినవాళ్లూ రక రకాల కారణాలకి ‘కీర్తి’ని ఆర్జిస్తున్నారు. నాకు ఇలా ఆర్జించాలనిపించింది. నాకు చేతనయిన పని చేశాను. నా ఫోటో జాగ్రత్తగా వేయించండి. పేరులో స్పెల్లింగు తప్పు రాకుండా చూడండి’’ అన్నాడట. కీర్తి ప్రయత్నించినా వదులుకోలేని వ్యసనం. తలవంచిన కొద్దీ పీకకి చుట్టుకుంటుంది.చాలా సంవత్సరాల కిందట మద్రాసు మౌంట్ రోడ్డులో బుహారీ సెంటర్లో చాలా అంద మైన కరుణానిధిగారి విగ్రహం ఉండేది. డీఎంకే పాలనలో ఆయన భక్తులు, అనుచరులు, నాయ కుని విగ్రహం నెలకొల్పారు. ఏఐఏడీఎంకే పార్టీవారికీ, నాయకులకీ ఆ విగ్రహం కంటగిం పుగా ఉండేది. బతికున్న నాయకుల విగ్రహాలు నెలకొల్పడం న్యాయమా? అని మీమాంస లేవదీ శారు. కరుణానిధి తర్వాత ముఖ్యమంత్రి అయిన ఎంజీ రామచంద్రన్ మరణించాక జరిగిన అల్ల ర్లలో కొందరు దుండగులు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. కీర్తి అందమయిన గాజు కుప్పె లాంటిది. చెయ్యి జారినా, చెయ్యి ‘జార్చినా’ విరిగి ముక్క లవుతుంది. అలనాడు విజయవాడ ఏలూరు కాలువ పక్కన నీలం సంజీవరెడ్డిగారి విగ్రహం ఉండేది. విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలంటూ నడిచిన ఉద్యమంలో ఆందోళనకారులు ఈ విగ్ర హాన్ని పగలగొట్టి కాలవలోకి విసిరేశారు. కీర్తి కొందరి ప్రతిష్టకి దగ్గర తోవ. కాలం ఆ తోవకి పెద్ద గండి.1930 ప్రాంతాలలో రాఫేల్ ట్రూజిల్లో అనే ఈజిప్టు పాలకుడు ఉండేవాడట. ఆయన గొప్ప తనం ఏమిటంటే ఆయన ఎన్నికకి దేశంలో ఉన్న జనాభా కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయట! (ఆయన ఉపయోగించిన ఓటింగు మెషీన్లు ఏమిటో మన ప్రతిపక్షాలు వాకబు చెయ్యాలి!) ఆయన కీర్తికి దగ్గర తోవ కనిపెట్టి కేవలం రెండు వేల విగ్రహాలను మాత్రమే ప్రతిష్టింపచేశారట. 1961 మే 30న ఆయన హత్యకు గురి అయ్యే వరకూ ఆ విగ్రహాలు వర్ధిల్లాయట. తర్వాత? పెట్టుబడితో సంపాదించిన కీర్తి అకాలంలో పూసిన గడ్డిపువ్వులాంటిది. దాని పుట్టుక, చావు ఎవరి మనస్సులోనూ నిలవదు. మన ఊళ్లలో చూస్తూంటాం. రోడ్డు పక్కన బస్సు షెల్టర్లుంటాయి. వాటి మీద పెద్ద అక్షరా లతో, ‘‘అప్పడం తాతయ్యల స్మారకార్థం, వారి కుటుంబ సభ్యులు–మావుళ్లయ్య, మనవాళ్లమ్మ, ధనశ్రీ, చింటూ, ధమ్ము, టుమ్మీ’’ అని. కొన్నాళ్లు బాగానే వారి కీర్తి వ్యాపిస్తుంది. ఒక వర్షాకాలం రోజున బలిసిన ఎద్దు సగం తడిసిన ఆ షెల్టరుకి వీపుని రుద్దుతుంది. అప్పటికే నీరసించిన ఆ షెల్టరు కూలి బోర్డు మీద సగం అక్షరాలు మిగు లుతాయి. కీర్తికి జంతుదోషం పడుతుంది. విగ్రహాల ద్వారా కీర్తిని ఎల్లకాలం నిలుపు కోవాలన్న యావ అతి ప్రాథమికమయిన ఆలో చన. నిజమైన కీర్తి మానవాళికి జరిగిన ఉపకారం, మానవ మేధస్సుని ప్రభావితం చేసిన గొప్ప సాంస్కృతిక కృషి, హృదయాల్ని రసప్లావితం చేయగల అమరగానం, మౌలిక సాధన–ఇలాంటి అపురూప వైభవాలకు ప్రతీకగా సమాజం విగ్ర హాల రూపంలో నిక్షిప్తం చేసుకుంటుంది. విగ్రహం ఒక మహాత్ముని ఉపకారానికి కృతజ్ఞత. జాతి సమర్పించే నివాళి. మహాత్ములు కీర్తి వెంటపడరు. కీర్తి మహాత్ముల్ని ఆశ్రయించుకు నిలుస్తుంది. కీర్తికి విగ్రహం పెట్టుబడి కాదు. విగ్రహం సంకేతం. కీర్తికి విగ్రహం గమ్యం కాదు. కృషికి విగ్రహం చిరునామా. గొల్లపూడి మారుతీరావు -
తల్లయిన నటి.. ఆరు నెలల తర్వాత వెల్లడి!
మాజీ మిస్ ఇండియా, మోడల్, నటి, రాజకీయ నాయకురాలు, వ్యాపారవేత్త, క్రీడాకారిణి, పైలట్‌గా.. విభిన్న రంగాల్లో తనదైన ముద్ర వేసిన గుల్ పనాగ్ ప్రస్తుతం తల్లిగా కొత్త బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదేంటి ఆమె ఎప్పుడు తల్లయ్యారు అనుకుంటున్నారా.. ఆరు నెలల క్రితమేనటండీ. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చాననే శుభవార్తను ఆమే స్వయంగా తెలియజేశారు. అయితే ఇన్నాళ్లుగా ఆ విషయం ఎలా దాయగలిగారని ప్రశ్నించగా.. ‘రిషి(గుల్ పనాగ్ భర్త), నేను ప్రతీ విషయంలో ప్రైవసీని కోరుకుంటాం. తల్లిదండ్రులుగా మారటం అనేది ఒక గొప్ప అనుభూతి. సెలబ్రిటీలు అయినంత మాత్రాన ప్రతీ విషయాన్ని పబ్లిక్‌గా చెప్పాల్సిన పనిలేదు. మా కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు మాత్రమే నిహాల్ గురించి తెలుసంటూ’ సమాధానమిచ్చారు. కుమారుడి పేరు గురించి ప్రస్తావిస్తూ.. ‘నిహాల్ అంటే ఆనందం, విజయం అని అర్థం. వాడి రాకతో ఆ రెండు మా జీవితాల్లోకి వచ్చేశాయి. అందుకే మా గారాల పట్టికి ఆ పేరు పెట్టామని’ చెప్పుకొచ్చారు. నిహాల్ రాకతో సినిమాలకు కాస్త విరామం ఇచ్చానని, ప్రస్తుతం వాడి అల్లరితోనే సమయం గడుస్తోందని.. త్వరలోనే కెరీర్‌పై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. వయసు మీద పడుతోంది కాబట్టి పెళ్లి చేసుకోవాలి, త్వరగా పిల్లల్ని కనేయాలనే నిబంధనలు పెట్టుకునే బాపతు తాను కాదని చెప్పుకొచ్చారీ ఈ 39 ఏళ్ల బ్యూటీ. -
తగని ప్రశ్న తగిన జవాబు
ప్రశ్న: మీ పూర్వపు భర్త ఇమ్రాన్‌ఖాన్ లైంగిక అవలక్షణాలపై మీరు పుస్తకం రాశారు. కానీ అదేమీ పాకిస్తాన్ ఓటర్లపై ప్రభావం చూపినట్లు లేదు. ఆయనిప్పుడు పాక్ ప్రధాని కాబోతున్నారు. మీరు ఆశించినట్లు జరగనందుకు నిరాశకు లోనయ్యారా? రెహమ్ ఖాన్ : నా పుస్తకం అతడి గెలుపును అడ్డుకుంటుందన్న భ్రమ నాకు లేదు. ఇప్పుడైనా అది అతడి గెలుపు కాదు. మిలటరీ డైరెక్షన్లో అతడిదొక పాత్ర. అంతే. యూత్‌కి అతడు ఒక రాంగ్ రోల్ మోడల్. అతడి ప్లేబాయ్ ఇమేజ్ అతడిని ఓడించకపోవడానికి కారణం.. సమాజంలో పురుషుడంటే ఉన్న ఎక్కువ భావనే, స్త్రీ అంటే ఉన్న తక్కువ భావన తప్ప ఇంకొటి కాదు.