France Presidential Candidate Sparked Raging Controversy: రాజకీయ నాయకులు లేదా ప్రముఖ సెలబ్రెటీలు ఏవైనా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడూ ప్రజలు వాటిని ఖండించడం, నిరసనలు వ్యక్తం చేయడం మాములే. అంతేగానీ కోడిగుడ్లు, టమాటాతో దాడి వంటివి జరగవు. ఎప్పుడో ఏదైనా అనుహ్య పరిణామాల్లో తప్ప ఇలాంటి ఘటనలు ఎదురవ్వవు. కానీ అలాంటి పరాభవం ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఒక రాజకీయ నాయకుడికి జరిగింది. పైగా ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన ఎదురైంది.
వివరాల్లోకెళ్తే...ఫ్రాన్స్‌కు చెందిన ఫార్ రైట్ ప్రెసిడెంట్ అభ్యర్థి ఎరిక్ జెమ్మూర్ ఎన్నికల ప్రచార నిమిత్తం మోయిసాక్ నగరానికి కారులో వస్తున్నాడు. ఇంతలో జెమ్ముర్ చేరుకోవాల్సిన నగరం రావడంతో కారు దిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి కోడి గుడ్డుతో దాడి చేసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
నిజానికి రాజకీయ పరిజ్ఞానం లేని జెమ్మూరు గత నవంబర్‌లో ఎన్నికల్లో అధ్యక్షుడి పదవికీ పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. అందులో భాగంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు దివ్యాంగ పిల్లలు సాధారణ ప్రభుత్వ పాఠశాలలకు బదులుగా ప్రత్యేక పాఠశాలలకు వెళ్లాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఉపాధ్యాయుల బృందాన్ని ఉద్దేశించి ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
పైగా దివ్యాంగ పిల్లలు ఇతర పిల్లలచే ఇబ్బందులకు గురవుతారని, అందులోనూ పేద విద్యార్థులు మరింత ఇబ్బందులు ఎదుర్కుంటారు కాబట్టి వారికి ప్రత్యేక పాఠశాలలు ఉండాలని అన్నారు. జెమ్మూర్ వ్యాఖ్యలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రజలు కూడా ఆయనపై కోపంగా ఉన్నారు.
అయితే తాజాగా ఒక వ్యక్తి ఆయన చేసిన వ్యాఖ్యలకు కోపంతో జెమ్మూర్ ప్రయాణిస్తున్న కారుని వెంబడించి మరీ వచ్చి కోడి గుడ్లతో దాడి చేశాడు. దీంతో అక్కడ ఉన్నవారందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో ఆ దాడి చేసిన వ్యక్తికి ఉన్న కొడుకు దివ్వాంగుడని తెలిసింది. ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది.
▶️Éric Zemmour a été visé par un œuf qu'un homme lui a claqué sur la tête à son arrivée à Moissac, où le candidat d'extrême droite battait campagne samedi matin pour la présidentielle pic.twitter.com/oChOUxVBcU
— LN24 (@LesNews24) March 12, 2022
(చదవండి: అత్యంత వృద్ధ జంట...వాళ్లుకు ఇది ఎన్నో వివాహ వార్షికోత్సవమో తెలుసా!)
Comments
Please login to add a commentAdd a comment