AAP Leader Raghav Chadha Response On Dating Rumours With Parineeti Chopra - Sakshi
Sakshi News home page

Parineeti Chopra: పరిణీతితో ప్రేమ, పెళ్లి? తొలిసారి స్పందించిన ఆప్‌ నేత

Published Sat, Mar 25 2023 2:46 PM | Last Updated on Sat, Mar 25 2023 3:24 PM

Raghav Chadha Response On Dating Rumours With Parineeti Chopra - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా ప్రస్తుతం ఇండస్ట్రలో హాట్‌టాపిక్‌ నిలిచింది. కొంతకాలంగా తెరపై పెద్ద వినిపించిన ఆమె పేరు సోషల్‌ మీడియాలో మారుమోగుతోంది.  ఆప్‌ పార్టీకి చెందిన యంగ్‌ పొలిటిషియన్‌ రాఘవ చద్దాతో పరిణీతి ప్రేమలో మునిగితేలుతుందంటూ కోద్ది రోజులుగా నెట్టంట జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటివలె ఇద్దరు జంటగా డిన్నర్‌ డేట్‌కు వెళ్లి మీడియా కంట పడ్డారు. దాంతో వారి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చదవండి: ఇటీవల భార్యకు ఆ హీరో విడాకులు.. ఇప్పుడు మీనాతో రెండో పెళ్లి! నటుడు సంచలన వ్యాఖ్యలు

అప్పటి నుంచి వీరి ప్రేమ, పెళ్లి రూమర్స్‌ బి-టౌన్‌తో పాటు రాజకీయాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ పార్లమెంట్‌ సమావేశానికి హజరయ్యేందుకు వచ్చిన రాఘవ చద్దాకు మీడియా నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. పలు రాజకీయ అంశాలతో పాటు పరిణీతి చోప్రా గురించి విలేకర్లు ప్రశ్నించారు. ఇటీవల మీ ఇద్దరి ఫొటోలు వైరలయ్యాయి.. ఏంటీ సార్‌ ఏమైన శుభవార్త ఉందా? అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి రాఘవ చద్దా ముసిముసి నవ్వుతూ ‘రాజకీయ అంశాల గురించి అడగండి. కానీ.. పరిణితీ చోప్రా గురించి అడగోద్దు’ అంటూ సిగ్గుపడుతూ సమాధానం ఇచ్చాడు.

చదవండి: నాటు నాటుకు ఆస్కార్‌ నా వల్లే వచ్చింది: అజయ్‌ దేవగన్‌

ఇక దీనిపై మీరు స్పందించాల్సిందే అని విలేకరి అడగ్గా.. ‘సమయం వచ్చినప్పుడు చెబుతాను’ అంటూ పార్లమెంటులోకి నడిచారు రాఘవ చద్దా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియా వైరల్‌గా మారింది. ఇక త్వరలోనే రాఘవ చద్దా-పరిణితిలు పెళ్లి ప్రకటన రానుందా? అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల పరిణీతి పెళ్లి స్పందిస్తూ తన సహానటీనటులు, స్నేహితులంత పెళ్లి పీటలు ఎక్కారని, వారిని చూస్తుంటే తనకు కూడా వివాహం చేసుకోవాలని ఉందంటూ కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రస్తుతం తాను సింగిల్‌ అని, వరుడు కావాలంటూ ఓపెన్‌ కామెంట్స్‌ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement