parineeti chopra
-
యానిమల్ రిజెక్ట్ చేసినందుకు బాధగా లేదు: పరిణితి చోప్రా
సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన 'యానిమల్' సినిమాలో హీరోయిన్గా మొదట పరిణితీ చోప్రాను అనుకున్నారు. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఈ అవకాశం రష్మిక మందన్నా చేతికి వెళ్లింది. అయితే ఈ మూవీ వద్దనడానికి గల కారణాన్ని పరిణితి తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది.అందుకే యానిమల్ రిజెక్ట్ చేశాపరిణితి చోప్రా మాట్లాడుతూ.. 'యానిమల్ సినిమాను మొదట ఒప్పుకున్నాను. అంతా ఫైనలైపోయింది అనుకుంటున్న సమయంలో నాకు అమర్ సింగ్ చమ్కీలా మూవీ ఆఫర్ వచ్చింది. రెండు సినిమాలు ఒకే సమయంలో తీస్తున్నారు. డేట్స్ కుదరట్లేదు. నాకెందుకో చమ్కీలా వదులుకోకూడదనిపించింది. అందుకే యానిమల్‌ను వదిలేసుకున్నాను. చమ్కీలా మూవీ ద్వారా నేను పొందిన ప్రేమ, గుర్తింపు, అభిమానం.. ఏదీ మర్చిపోలేను. ఇంతటి ఆనందిచ్చిన ఈ మూవీ కోసం యానిమల్‌ను వదిలేసుకున్నందుకు నేనేమీ బాధపడటం లేదు. సంతోషంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది.అమర్ సింగ్ చమ్కీలా సినిమా పోస్టర్సినిమాకాగా గొప్ప సంగీతకారుడు అమర్ సింగ్ చమ్కీలా జీవిత కథ ఆధారంగా అమర్ సింగ్ చమ్కీలా చిత్రం తెరకెక్కింది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించాడు. పరిణితి అతడి రెండో భార్య అమర్‌జోత్‌గా యాక్ట్ చేసింది. ఈ మూవీ ఏప్రిల్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.చదవండి: విడాకుల తర్వాత ఒకే స్టేజీపై కోలీవుడ్ జంట.. ఫ్యాన్స్ ఎమోషనల్ -
ఆయన మా ఇంటికి వస్తారనుకోలేదు.. సంతోషంలో హీరోయిన్ (ఫోటోలు)
-
మాల్దీవుస్‌లో పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్..!
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను ప్రేమ వివాహం చేసుకుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుగ గ్రాండ్‌గా జరిగింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ ఉన్న వీరిద్దరు చివరికీ ఏడడుగులు వేశారు.(ఇది చదవండి: పెళ్లై నెల కాలేదు.. భర్తతో కాకుండా మరొకరితో హనిమూన్ ఎంజాయ్)ఇటీవల తమ మొదటి వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు ఈ జంట. ఈ సందర్భంగా పరిణితీ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన భర్త రాఘవ్‌తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీరిద్దరూ మాల్దీవుస్‌లో తమ మొదటి పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by @parineetichopra -
ఆయన దుస్తులు లేకుండానే పక్కన వచ్చి కూర్చుంటాడు: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఒంటి మీద నూలు పోగు లేకుండా చేసిన ఫోటోషూట్ రెండేళ్ల క్రితం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఓ మ్యాగజైన్ కోసం ఆయన నగ్నంగా ఫోటోలు దిగి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. అదంతా ఆయన ఒక యాడ్ కోసం చేసుంటారులే అని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్వీర్ సింగ్ దుస్తులు గురించి బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.రణవీర్ సింగ్, పరిణీతి చోప్రా ఇద్దరూ మంచి స్నేహితులు. రణవీర్ సింగ్ హీరోగా నటించిన 'లేడీస్ వర్సెస్ రిక్కీ బాహ్ల్' అనే సినిమాతోనే పరిణీతి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి 'బ్యాండ్ బాజా బారాత్' సినిమాలో కూడా నటించారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రణ్వీర్ సింగ్ ఒంటి మీద దుస్తులు కూడా ఉంచుకోడని చెప్పి షాకిచ్చింది.అలాంటి సమయంలో కూడా దుస్తులు వేసుకోడు'రణవీర్‌తో నాకు మంచి స్నేహం ఉంది కాబట్టి అతను చేస్తున్న పనులకు నేను కూడా బాగా అలవాటు పడ్డాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిజైన్ దుస్తులతో వచ్చి ఈరోజు ఇదే లుక్ అంటాడు. ఈ క్రమంలో ఒక్కోసారి ప్యాంట్ వేసుకోకుండా వచ్చి పక్కనే కూర్చుంటాడు. అబ్బా.. ప్యాంట్ వేసుకోవచ్చు కదా అని ఎవరో ఒకరు చెప్తేనే ప్యాంట్ వేసుకుని వస్తాడు. నేను ఇతరుల మేకప్ వ్యాన్‌లోకి సాధరణంగానే వెళ్లిపోతాను. కానీ రణవీర్ ఉన్న వ్యాన్‌లోకి వెళ్లడానికి మాత్రం కాస్త ఆలోచించి అతని అనుమతి తీసుకుంటాను. దానికి కూడా కారణం ఉంది. తను నిద్రపోతూ ఉంటాడో లేదా వాష్‌రూమ్‌లో ఉంటాడో అని కాదు.. బట్టలు వేసుకున్నాడో లేదా అని తెలుసుకుని వెళ్తాను. ఒక్కొక్కసారి లోపలికి రావచ్చా అంటే రావచ్చు అంటాడు. కానీ, బట్టలు లేకుండా ఎదురుగానే నిలబడి ఉంటాడు. కానీ, అప్పుడు కూడా దుస్తులు వేసుకోడు. అలాగే సమాధానం ఇస్తాడు.' అని పరిణీతి సెట్లో అనుభవాలు పంచుకుంది.ఒకసారి రొమాంటిక్ సీన్ చేస్తుంటే..దుస్తులు లేకుండా చూస్తే రణవీర్ ఏమాత్రం ఫీల్ అవ్వడు.. కానీ, ఆ సమయంలో మనమే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అలా బట్టలు లేకుండా ఎందుకు తిరుగుతావని అడిగితే.. తనని అలా చూడడం వల్ల ఇతరుల జీవితాల్లో ఎలాంటి మార్పులు ఉండవు కదా.. అలాంటప్పుడు ఎందుకంత బాధ అని చెబుతాడు. ఒకసారి రొమాంటిక్ సీన్ కోసం రెడీ అవుతూ మేకప్ వేసుకుంటూ వెనక్కి తిరిగేసరికి ప్యాంట్ లేకుండానే రణవీర్ సెట్లో కనిపించాడు. ఇలాంటి సీన్లో నాకు ఇబ్బందిగా ఉందని స్క్రిప్ట్‌లో ఉన్నట్లు కనిపించాలని చెప్పడంతో వెంటనే ప్యాంట్ వేసుకుని వచ్చాడు. నేను ఆయన రూమ్‌లోకి వెళ్లిన ప్రతీసారి బట్టలు లేకుండానే కనిపించేవాడు. నా ముందే కాదు.. తను పబ్లిక్‌లోనే ప్యాంట్ తీసేయగలడు. ఇదంతా తనకు పెద్ద విషయం కాదు. అని పరిణీతి చెప్పింది. రణవీర్, పరిణీతి చోప్రాల మధ్య మంచి స్నేహం ఉంది. ఆ చనువుతోనే ఇవన్నీ చెబుతున్నట్లు ఆమె పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు తాను చేసినందుకు రణవీర్ పెద్దగా పట్టించుకోడని కూడా తెలిపింది. తాజాగా అమర్ సింగ్ చంకీలా సినిమాలో పరిణీతి మెప్పించిన విషయం తెలిసిందే. -
రాఘవ్ చద్దా కంటి అపరేషన్: విట్రెక్టమీ అంటే ఏమిటి? అంత ప్రమాదమా?
పంజాబ్‌కు చెందిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అత్యవసర కంటి శస్త్రచికిత్సకోసం లండన్‌లో ఉన్నారు. రెటీనాకు రంధ్రం కారణంగా విట్రెక్టమీ సర్జరీకోసం లండన్‌కు వెళ్లినట్టు ఢిల్లీ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. అసలు విట్రెక్టమీ అంటే ఏమిటి? కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందా? ఆ వివరాలు ఒకసారి చూద్దాం.రాఘవ్ చద్దాం రెటీనాలో రంధ్ర కారణంగా కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అందుకే అత్యవసరంగా ఆయనకు ఆపరేషన్ చేశారు. ఇది ప్రమాదకరమే అయినప్పటికీ, శస్త్రచికిత్స బాగానే జరిగిందని ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలుస్తోంది. బయటికి వెళ్లకుండా, ఎండతగలకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్యులుఘసూచించారనీ, పరీక్షలు, చెకప్ కోసం వారానికి రెండుసార్లు వైద్యుడిని సందర్శించాల్సిఉంటుందనీ ఈ నేపథ్యంలో డాక్టర్లు అనుమతి ఇచ్చినప్పుడే అతను ఇండియా వచ్చే అవకాశం ఉందని బంధువుల సమాచారం.విట్రెక్టమీ అంటే ఏమిటి?జాన్ హాప్కిన్స్ మెడిసిన్ ప్రకారం, కంటి లోపల రెటీనా వెనుక ఏర్పడిన జెల్ లాంటి పదార్థాన్ని (విట్రస్ జెల్)ని బయటకు తీసివేసేందుకు నిర్వహించే సర్జరీనే విట్రెక్టమీ అంటారు. రెటీనా వెనుక పేరుకున్న పదార్థాన్ని తొలగించి, సెలైన్ ద్రావణంతోగానీ, గ్యాస్ బబుల్‌తో గానీ ఆ ప్రదేశాన్ని భర్తీ చేస్తారు.మధుమేహం కారణంగావచ్చే డయాబెటిక్ రెటినోపతి, రెటీనా డిటాచ్మెంట్, విట్రస్ హెమరేజ్ లేదా తీవ్రమైన కంటి గాయాలు, కంటి ఇన్ఫెక్షన్లు, కంటిశుక్లం శస్త్రచికిత్స తర్వాత సమస్యలు, ఇతర కంటి సమస్యల కారణంగా విట్రెక్టమీ అవసరం కావచ్చు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేసినా, చికిత్స చేయకుండా వదిలివేసినా, అంధత్వానికి దారితీయవచ్చు.కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా కాంతిని సంగ్రహించి, మెదడుకు దృశ్య సంకేతాలను ప్రసారం చేస్తుంది. క్లియర్ విట్రస్ జెల్ కాంతిని రెటీనాకు చేరవేస్తుంది. తద్వారా మనకు దృశ్యాలు కనిపిస్తాయి. అయితే అక్కడ రక్తం గడ్డకట్టడం, గడ్డలు లాంటివి ఈ కాంతిని అడ్డు పడతాయి. ఫలితంగా దృష్టి లోపం ఏర్పడుతుంది. రెటీనాకు ప్రాప్యతను మెరుగుపరచడానికి దానిపై ఒత్తిడిని తగ్గించడానికి విట్రెక్టోమీ చేస్తారు.తద్వారా కంటిచూపు మెరుగవుతుంది. కొన్నిసందర్భాల్లో, కోల్పోయిన దృష్టిని పునరుద్ధరించడంలో సహాయ పడుతుంది.విట్రెక్టమీ: ప్రమాదమా?విట్రెక్టమీ అనేది డయాబెటిక్ ఐ డిసీజ్ (డయాబెటిక్ రెటినోపతి), రెటీనా డిటాచ్మెంట్లు, మాక్యులర్ హోల్స్, మాక్యులర్ పుకర్, విట్రస్ హెమరేజ్‌తో సహా కొన్ని వ్యాధి పరిస్థితులలో కంటి కేంద్ర కుహరం నుండి విట్రస్ను తొలగించే శస్త్రచికిత్సా ప్రక్రియ. ప్రత్యేకంగా రూపొందించిన సాధనాలు, సాంకేతికతలను ఉపయోగించి రెటీనా సర్జన్ చేస్తారు. లోకల్ అనస్థీషియాలో నిర్వహించే డే కేర్ ప్రక్రియ. సాధారణంగా, విట్రెక్టోమీకి సుమారు రెండు గంటలు పడుతుంది, కొన్నిసార్లు,క్లిష్టమైన కేసులకు ఎక్కువ సమయం పడుతుంది. విట్రెక్టమీని ప్రస్తుతం ఆధునిక పద్దతుల్లో 23 గేజ్ ట్రోకార్- కాన్యులా సిస్టమ్ (మైక్రోఇన్సిషన్ సర్జరీ) ద్వారా కుట్లు లేకుండా, వేగంగా చేస్తున్నారు.విట్రెక్టోమీ సాధారణంగా సురక్షితమైనది.కంటిచూపును కాపాడటం కోసం చేసే సర్జరీ. కానీ ఇతర ఆపరేషన్ల మాదిరిగానే రోగి వయస్సు, ఆరోగ్యం , కంటి సమస్య తీవ్రతను బట్టి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ఇన్ఫెక్షన్ రావచ్చుఅధిక రక్తస్రావం అయ్యే ప్రమాదంకంటి లోపల ఒత్తిడి పెరగుతుంది.శస్త్రచికిత్స కారణంగా కొత్త రెటీనా డిటాచ్మెంట్ సమస్యకంటి లెన్స్ దెబ్బతినడంకంటిశుక్లం ఏర్పడే అవకాశంశస్త్రచికిత్స అనంతర కంటి కదలికలో ఇబ్బందులువక్రీభవన లోపంలో మార్పులు (అద్దాలు, లెన్స్ అవసరం)ఈ శస్త్రచికిత్స అసలు సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోవచ్చు కూడా. దీనికి మరో శస్త్రచికిత్స అవసరం కావచ్చు. కాగా హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ చద్దా గత ఏడాది సెప్టెంబర్‌లో ఉదయపూర్‌లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం పరిణీతి తన లేటెస్ట్ మూవీ అమర్ సింగ్ చమ్కిలా ప్రమోషన్లో బిజీగా ఉంది. -
బ్లాక్ అండ్ వైట్ చీరలో పరిణితి హోయలు..ధర ఎంతంటే?
బాలీవుడ్ నటి పరిణితి చోప్రా తన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నటి. ఆమె నటనకు గాను ఫిల్మ్‌ఫేర్, నేషనల్ ఫిల్మ్ ఫేర్ వంటి అవార్డు అందుకుంది. 2013లో ఫోర్బ్స్ ఇండియాలో చోటు దక్కించుకుంది. ఇటీవలే ఆమ్ఆద్మీ పార్టీ సభ్యుడు రాఘవ్ చద్దాని పెళ్లి చేసుకుని వివాహం బంధంలో అడుగుపెట్టింది. అయినప్పటికీ కెరీర్ పరంగా దూసుకుపోతుంది పరిణితి. తన మూవీ చమ్కిలా మూవీ ప్రమోషన్లో భాగంగా పరిణితి బ్లాక్ అండ్ వైట్ చీరలో గ్లామరస్ లుక్‌లో సందడి చేసింది. ఎంబ్రాయిడరీతో కూడిన బ్లాక్ అండ్ వైట్ చీరలో సౌందర్యం అంతా ఆమెలోనే దాగుందా అన్నంత ఆకర్షణగా ఉంది. ఆ ఎంబ్రాయిడరీ చీరకు తగ్గట్టు హై నెక్బ్లౌజ్ జత చేయడం ఆమెకు మరింత అందాన్నితెచ్చి పెట్టింది . పూలా ఎంబ్రాయిడరీ వర్క్‌తో కూడిన బ్లాక్ అండ్ వైట్ ఆరు గజాల చీర ఆమె అందాన్ని రెట్టింపు చేసేలా మరింత అందంగా ఉంది పరిణితి. చాలా సింపుల్‌గా జస్ట్ చెవులకు మాత్రమే డైమెండ్లతో కూడిన చెవిపోగులు పెట్టుకుంది. లైట్ మేకప్‌తో కళ్లను హైలెట్ చేసేలా స్మోకీ ఐషాడో వేసుకుంది. హెయిర్‌ని ప్రీగా వదిలేసింది. ఇక ఇక్కడ పరిణితీ ధరించి చీర ప్రముఖ శ్రియా ఖన్నా బ్రాండ్‌కి చెందింది. ఈ బ్రాండ్ చీరలన్ని సంప్రదాయం ఉట్టిపడేలా చక్కటి ఎంబ్రాయిడర్‌తో హుందాగా ఉంటాయి. వాటి ధర రూ. 30 వేలు దాక పలుతుంది. View this post on Instagram A post shared by @parineetichopra (చదవండి: గ్లామరస్ క్వీన్ దీపిక బ్యూటీ సీక్రెట్ ఇదే..!) -
హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ.. వైరలవుతోన్న పోస్ట్!
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ప్రస్తుతం చమ్కీలా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దిల్జీత్ దోసాంజ్‌కు జంటగా నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమర్ సింగ్ బయోపిక్‌గా తెరకెక్కించిన ఈ సినిమాతో అభిమానులను పలకరించనుంది. అయితే ఈ ముద్దుగుమ్మ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆప్ లీడర్ రాఘవ్ చద్ధాతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. (ఇది చదవండి: ప్రియుడితో పెళ్లి.. స్టార్ హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ..!) అయితే ఇటీవల పరిణీతి చోప్రా ప్రెగ్నెన్సీతో ఉందంటూ రూమర్స్ వినిపించాయి. ఎయిర్‌పోర్ట్‌లో వైట్ కలర్ అవుట్‌ఫిట్‌లో కనిపించడంతో నెటిజన్స్ అలాంటి కామెంట్స్ చేశారు. తేలికైన దుస్తుల్లో ఎయిర్‌పోర్ట్‌కు రాగా ప్రెగ్నెన్సీ టాపిక్ కాస్తా వైరలైంది. తాజాగా ఈ వార్తలపై నటి పరిణీతి స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ప్రెగ్నెన్సీతోనే ఉన్నట్లేనా? అంటూ రాసుకొచ్చింది. అందులో తాను ధరించే మూడు రకాల డ్రెస్సులను ప్రస్తావిస్తూ ఫన్నీ ఎమోజీని జత చేసింది. అంటే తాను వేసుకునే డ్రెస్సును చూసి మీరు అలా అనుకుంటే కామెడీగా ఉందంటూ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. -
ప్రియుడితో పెళ్లి.. స్టార్ హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ..!
బాలీవుడ్ భామ, హీరోయిన్ పరిణీతి చోప్రా గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఆప్ లీడర్ రాఘవ్ చద్ధాను ఆమె పెళ్లాడింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె అమర్ సింగ్ చమ్కీలా అనే చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన కనిపించనుంది. ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో వైట్ కలర్ అవుట్‌ఫిట్‌లో కనిపించింది. తేలికైన దుస్తుల్లో పరిణీతి కనిపించడంతో అభిమానులు ప్రెగ్నెన్సీతో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పెద్దఎత్తున సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న అమర్ సింగ్ బయోపిక్ చమ్కీలా ఏప్రిల్ 12న విడుదల కానుంది. కాగా.. గతేడాది మే నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. సెప్టెంబర్‌లో మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. అయితే ఈ విషయంపై పరిణీతి చోప్రా ఇంత వరకు స్పందించలేదు. ప్రెగ్నెన్సీ అంటూ వస్తోన్న రూమర్స్‌పై స్పందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) Parineeti Chopra's fashion perfection ♥️😍#ParineetiChopra #Fashion #Celebrity #ViralVideo #Trending #BollyTadka24 pic.twitter.com/XUQcZhXAY1 — Bolly Tadka24 (@bollytadka24) March 6, 2024 -
సింగర్ అవతారమెత్తిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా సినీ ప్రియులకు సుపరిచితమైన పేరే. గతేడాది తన ప్రియుడు, ఆప్ ఎంపీ రాఘవచద్దాను పెళ్లాడింది. పరిణీతి చివరిసారిగా అక్షయ్ కుమార్ నటించిన మిషన్ రాణిగంజ్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న ముద్దుగుమ్మ సినిమాల్లో పెద్దగా నటించడం లేదు. అయితే తాజాగా బాలీవుడ్ భామ అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమాల్లో హీరోయిన్గా అలరించిన పరిణీతి ప్రస్తుతం సింగర్‌గా మారిపోయింది. తన జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలైందంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్టూడియోలో పాట పాడుతున్న వీడియోను అభిమానులతో పంచుకుంది. పరిణీతి తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నాకు సంగీతం ఎప్పటికీ సంతోషకరమైన ప్రదేశం. నా జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నా. ఒకేసారి రెండు కెరీర్లు చేసుకునే అవకాశం కల్పించిన ఈ ప్రయాణం ఎంతో సరదాగా ఉంది. అందుకే ఇక్కడ నాకు తెలియని వాటిని నేర్చుకోవడం, నాలో భయాలన్నింటినీ తొలగించుకుని.. నా తొలి గానం ప్రారంభించా. దీనికోసం నేను ఉత్తమ సంస్థతో చేతులు కలిపా. ఈ ఏడాది మొత్తం మీ కోసం కొన్ని అద్భుతాలు సృష్టించబోతున్నా. మీరు కూడా దీని కోసం నాలాగే ఎంతో ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నాను' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఈ వీడియోలో పరిణీతి పాడిన ఈ పాట'మాన కే హమ్ యార్ నహీ' అనే పాట ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఆమె నటించిన 2017 రొమాంటిక్ మూవీ 'మేరీ ప్యారీ బిందు' చిత్రంలోనిది. అయితే పరిణీతి ఇంతకుముందే మనోజ్ ముంతషిర్ రాసిన దేశభక్తి పాట 'తేరి మిట్టి' మహిళా వర్షన్‌ను అలపించింది. ఈ సాంగ్ అక్షయ్ కుమార్, పరిణీతి నటించిన 2019 యుద్ధ చిత్రం 'కేసరి'లో ప్రదర్శించారు. అంతే కాకుండా 35 ఏళ్ల బాలీవుడ్ భామ తన డిస్కోగ్రఫీలో 'మత్లాబి యారియన్' ట్రాక్‌ను కూడా కలిగి ఉంది. ఈ పాట మిస్టరీ థ్రిల్లర్ 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్' అనే చిత్రంలోనిది. ఇందులో పరిణీతి, అవినాష్ తివారీ, అదితి రావ్ హైదరీ నటించారు. కాగా.. గతేడాది సెప్టెంబర్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లాడిన పరిణీతి.. తన పెళ్లి పాట 'ఓ పియా' కూడా పాడింది. కాగా.. ప్రస్తుతం ఆమె 'అమర్ సింగ్ చమ్కిలా' అనే చిత్రంలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by @parineetichopra -
తలకిందుల భంగిమలో అనసూయ.. పెళ్లి జ్ఞాపకాల్లో స్టార్ హీరోయిన్
తలకిందులుగా యాంకర్ అనసూయ పోజులు చీరలో క్యూట్‌నెస్‌తో చంపేస్తున్న ఈషా రెబ్బా సెల్ఫీ మోడ్‌లో బంగార్రాజు భామ దక్షా నగర్కార్ ఆకు పచ్చని చీరలో మత్తెక్కిస్తున్న పూజాహెగ్డే పెళ్లి జ్ఞాపకాల్లో హీరోయిన్ పరిణీతి చోప్రా పింక్ డ్రస్‌లో మెరిసిపోతున్న మెగా డాటర్ నిహారిక జిమ్ వర్కౌట్ లో బిజీబిజీగా బిగ్‌బాస్ బ్యూటీ దివి బికినీలో హీరోయిన్ పూనమ్ బజ్వా పరువాల విందు View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by @parineetichopra View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) -
Birthday Special: ట్రెండీ లుక్స్‌లో పరిణీతి చోప్రా.. బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
Parineeti Chopra: ట్రెండింగ్‌లో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా రేర్ ఫోటోలు
-
Parineeti Chopra: పెళ్లయ్యాక తొలిసారి ర్యాంప్‌వాక్ చేసిన పరిణీతి చోప్రా (ఫొటోలు)
-
పెళ్లై నెల కాలేదు..
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గత కొద్దిరోజులుగా ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంది. ఆప్ యువ నాయకుడు రాఘవ్ చద్ధాతో ఆమె వివాహం గత నెలలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగవైభవంగా జరిగిన విషయం తెలిసిందే. సినిమాల కన్నా.. ఇతర విషయాలతోనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా ఆమె మారింది. దీంతో ఆమె నటించిన చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోయినా స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తుంది.(ఇదీ చదవండి: శ్రీలీల ఎవరి అమ్మాయో తెలిస్తే అంటూ షాకిచ్చిన అనిల్ రావిపూడి)ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ పార్టీలు,రెస్టారెంట్లు అంటూ ఎంజాయ్ చేశారు. అలా పలుమార్లు కెమెరాల కంట కనిపిస్తూ ట్రెండ్ అయ్యారు. ఇలా వారిద్దరూ వైరల్ అయ్యాక కొద్దిరోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే పరిణితి చోప్రా పెళ్లి తర్వాత తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రాఘవ్ చద్దాతో పెళ్లి తర్వాత పరిణితి చోప్రా హానీమూన్ ప్లాన్‌ను గ్రాండ్ చేసుకుంటుందని అంతా అనుకున్నారు.కానీ ఎవరూ ఊహించిని విధంగా భర్త లేకుండానే మాల్దీవుల వెకేషన్‌కు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. కానీ ఆమె ఈ వెకేషన్‌కు తన మరదలతో వెళ్లినట్లు ఆమె ఇలా చెప్పుకొచ్చింది. 'నేను హానిమూన్‌కు వెళ్లలేదు. ఈ ఫోటోను నా మరదలు తీసింది. ఇది గర్ల్స్ ట్రిప్' అంటూ బికినీలో ఉన్న ఒక ఫోటో షేర్ చేసింది. దీంతో మరదలితో హనిమూన్ ఏంటి..? కొత్తగా పెళ్లైన వారు జంటగా వెళ్తే ఆ మధుర క్షణాలు చెప్పలేనివి అంటూనే పెళ్లై నెల కాలేదు.. భర్తతో కాకుండా మరొకరితో హనిమూన్ ఎంజాయ్ చేస్తున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by @parineetichopra -
ఆస్కార్ రేసులో...
ఆస్కార్ రేసులో హిందీ చిత్రం ‘మిషన్ రాణిగంజ్’ను ప్రవేశపెట్టారు. టినూ సురేష్ దేశాయ్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, పరిణీతీ చోప్రా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిషన్ రాణిగంజ్’. ఈ నెల 6న విడుదలైన ఈ సినిమా వసూళ్ల పరంగా చెప్పుకోదగ్గ విధంగా లేనప్పటికీ మేకింగ్ పరంగా మెప్పించింది. పశ్చిమ బెంగాల్‌లోని ఓ బొగ్గు గనిలో వరదలు సంభవించినప్పుడు జస్వంత్ సింగ్ గిల్ అనే ఇంజనీర్ 65 మంది కార్మికులను ఏ విధంగా రక్షించాడు? అన్నదే ఈ చిత్రకథ. జస్వంత్ సింగ్ గిల్‌గా అక్షయ్ కుమార్ నటించారు. ఇక 96వ ఆస్కార్ అవార్డ్స్ పోటీకి జనరల్ కేటగిరీలో ఇండిపెండెంట్‌గా ఆస్కార్ నామినేషన్ కోసం ఈ చిత్రం యూనిట్ దరఖాస్తు చేసిందని బాలీవుడ్ టాక్. ఇదే తరహాలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కూడా ఆస్కార్ రేసులో నిలిచి, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు గెలుచుకుంది. మరి.. ‘మిషన్ రాణిగంజ్’కు ఆస్కార్ నామినేషన్ దక్కుతుందా? నామినేషన్ దక్కించుకుంటే.. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్‌ని తీసుకువచ్చినట్లే ఈసారి ఈ సినిమా తెస్తుందా? అనేది 2024 మార్చిలో తెలిసిపోతుంది. మార్చి 10న ఆస్కార్ అవార్డుల ప్రదానం జరగనుంది. మరోవైపు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ కోసం మలయాళ చిత్రం ‘2018’ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. -
భర్త కంటే 120 రెట్లు ఎక్కువ: పరిణీతి షాకింగ్ నెట్‌వర్త్, లగ్జరీ కార్లు
Pari-Raghav Chadha Networth బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ వేడుక, ఫోటోలు ఇంటర్నెట్లో లేటెస్ట్ బజ్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది మేలో నిశ్చితార్థం చేసుకున్న లవ్బర్డ్స పరి- రాఘవ్ చద్దా లీలా ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి ముచ్చటగా సాగింది. అలాగే పెళ్లి దుస్తుల్లో సరికొత్త లుక్లోఈ జంట మెరిసిపోయారు. ఈక్రమంలో వారి ఆస్తి ఎంత అనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రాఘవ్ కంటే పరిణీతి నెట్‌వర్త్ 120 రెట్లు ఎక్కువ అని టాక్. 2011లో విడుదలైన లేడీస్ వర్సెస్- రికీ బాహ్ల్ సినిమాతో తెరంగేట్రం చేసిన అనేక సినిమాల్లో నటించింది. బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఆమె ఒకరు. సినిమాలతో బ్రాండ్ ఎండార్స్మెంట్లు ద్వారా కోట్ల రూపాయలను సంపాదిస్తుంది. దీంతో పరిణీతి చోప్రా నికర విలువ సుమారు 74 కోట్లుగా అంచనా. పరిణీతి ఆడి డ్రైవ్ చేస్తే, భర్త రాఘవ్ స్విఫ్ట్ డిజైర్‌ను నడుపుతాడు అంటూ సోషల్ మీడియాలోకమెంట్లు వినిపిస్తున్నాయి. (Today Gold and Silver: బంగారం నేలచూపులు, షాకిస్తున్న వెండి) పలు మీడియా నివేదికల ప్రకారం ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్ అయిన క్లెన్స్టాలో మైనారిటీ వాటా, హైదరాబాద్‌కు చెందిన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ తృతీయలో పెట్టుబడులు ఉన్నాయి. ముంబైలోని బాంద్రాలో ఒక అద్భుతమైన అపార్ట్మెంట్ పరిణీతి సొంతం. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో కూడిన ఇంటి ఇంటీరియర్స్ తో అద్భుతంగా కనిపించే ఈ ఇల్లు ధర సుమారు రూ. 22 కోట్లు (బ్యాంకు లాకర్లో రూ.18 లక్షలు చెదల పాలు: లాకర్ కొత్త నిబంధనలు తెలుసా?) లగ్జరీ కార్లు పరిణీతికి కూడా ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. రూ. 99.56 లక్షలు జాగ్వార్ XJL,దాదాపు రూ 1.30 కోట్ల లువైన రేంజ్ రోవర్ వోగ్ లగ్జరీ కార్లు పరిణీతి సొంతం. ఇంకా 43.19 లక్షల విలువైన ఆడి క్యూ4, రూ. 69.27 లక్షలు Q7, ఆడి ఏ-6 లాంటివి కూడా ఆమె గ్యారేజ్‌లో ఉన్నాయి. ఆమె ధరించే దుస్తులు, బ్యాగ్‌లు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటాయి. బ్రాండెడ్ బ్యాగ్స్, షూ ఫ్యాన్ 2.05 లక్షల ఖరీదుచేసే లూయిస్ విట్టన్ న్యూ వేవ్ మల్టీ-పోచెట్ బ్యాగ్‌తో కనిపించింది .అలాగే ఒక ఈవెంట్లో ఆమె ధరించిన ఫిగర్-హగ్గింగ్ ఫెండీ దుస్తుల ధర సుమారు 1.64 లక్షలు. అంతేకాదు పరిణీమి షూ ఫ్యాన్ కూడా. జిమ్మీ చూ నుండి బాలెన్సియాగా వరకు అన్ని హై-ఎండ్ బ్రాండ్లంటే మోజు. నటిగానే కాకుండా ఒక అద్భుతమైన గాయని కూడా. ప్లేబ్యాక్ సింగర్‌గా ఐకానిక్ సాంగ్ బతెరి మిట్టి మహిళా వెర్షన్‌తో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఆయుష్మాన్ ఖురానా సరసన 2017లో వచ్చిన రొమాంటిక్ డ్రామా మేరీ ప్యారీ బిందులో గాయనిగా విశ్వరూపాన్ని చూపించింది ఇషాక్జాదే (2012), శుద్ధ్ దేశీ రొమాన్స్ (2013), హసీ తో ఫేసీ (2014), డిషూమ్ (2016), గోల్మాల్ ఎగైన్ (2017) బ్లాక్‌బస్టర్ హిట్మూవీల్లో నటించిన పరిణీతి మిషన్ రాణిగంజ్‌లో అక్షయ్ కుమార్‌తో కలిసి పరిణీతి చోప్రా కనిపించనుంది.ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ‘చమ్కిలా’లో దిల్జిత్ దోసాంజ్‌తో కలిసి చమ్కిలా లో యాక్ట్ చేసింది. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన పరిణీతి పరిణీతి చోప్రా 1988న అక్టోబర్ 22న న హర్యానాలోని అంబాలాలో జన్మించింది. పరిణీతి చోప్రా ధనిక కుటుంబం నుంచి వచ్చింది. తండ్రి, పవన్ చోప్రా, వ్యాపారవేత్త, అంబాలా కంటోన్మెంట్లో భారతీయ సైన్యానికి డీలర్ కూడా తల్లి రీనా చోప్రా. అంబాలాలోని జీసస్ మేరీ కాన్వెంట్లో, UKలోని మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ నుండి బిజినెస్, ఎకనామిక్స్ ఫైనాన్స్‌లో ట్రిపుల్ హానర్స్ డిప్లొమా పొందింది. అలాగే మ్యూజిక్‌లో బి.ఎ. హానర్స్ చేసింది. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు 43.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. యష్ రాజ్ ఫిల్మ్ ప్రొడక్షన్స్‌కు PRగా తన వృత్తిని ప్రారంభించింది. రాఘవ్ చద్దా నికర విలువ రాఘవ్ చద్దా పార్లమెంటులో అతి పిన్న వయస్కుడిగా పాపులర్అయిన ఈ ఆప్ ఎంపి.యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ వంటి ప్రసిద్ధ సంస్థల్లో విద్యనభ్యసించాడు. నికర విలువ రూ. 50 లక్షలుగా తెలుస్తోంది. పరిణీతి లగ్జరీ కార్లతోపోలిస్తే రాఘవ్ చద్దా వద్ద ఉన్నది స్విఫ్ట్ డిజైర్ కారు. -
పెళ్లిలో ఆలియా భట్‌ను ఫాలో అయిన పరిణీతి చోప్రా, ఫోటోలు వైరల్
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లీలా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను పరిణీతి సోషల్ మీడియా వేదికగా పంచుకోగా కాసేపటికే ఫోటోలు వైరల్‌గా మారాయి. 'మేము మొదటి సారి బ్రేక్‌ఫాస్ట్ కోసం కలిసి కూర్చున్నప్పుడే మా హృదయాలు కలిశాయి. ఈరోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాను. ఎట్టకేలకు అందరి ఆశీర్వాదంతో మేము ఒక్కటయ్యాం. మేము ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేము' అంటూ తన సంతోషాన్ని పంచుకుంది. దీంతో పరిణీతి-రాఘవ్‌ల దంపతులకు సెలబ్రిటీలు సహా నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరి జోడి చూడచక్కగా ఉందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెళ్లి వేడుకలో పరిణీతి చోప్రా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహెంగాలో మెరిసిపోగా, పవన్ సచ్‌దేవా డిజైన్ చేసిన డిజైనర్ అవుట్‌ఫిట్‌లో రాఘవ్ చద్దా కనిపించారు. ఈ ఇద్దరూ పేస్టల్ కలర్ దుస్తుల్లో అందంగా కనిపించారు. ఈమధ్య కాలంలో పేస్టల్ కలర్స్, న్యూడ్ మేకప్ ట్రెండ్ బాగా వినిపిస్తోంది. ఆలియా భట్ నుంచి ఇప్పుడు పరిణీతి చోప్రా వరకు.. సింపుల్‌గా, పేస్టల్ కలర్స్‌లో నేచురల్‌గా కనిపించేందుకే సెలబ్రిటీలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు పెళ్లంటే రెడ్, ఎల్లో, గ్రీన్ వంటి సాంప్రదాయ కలర్స్ దుస్తుల్లోనే వధూవరులు కనిపించేవారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు హెవీ లెహంగాలు, భారీ నగలు, హెవీ మేకప్ వరకు.. అంతా భారీగా ఉండాలని కోరుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హెవీ అండ్ కాస్ట్లీ దగ్గర్నుంచి ఇప్పుడు సింపుల్ అండ్ క్లాసిక్ అనే ట్రెండ్ నడుస్తోంది. దీనికి తగ్గట్లే న్యూడ్ మేకప్ విత్ పేస్టల్ కలర్స్ అంటూ మరో అద్భుతమైన ట్రెండ్ సెట్ చేశారు మన బాలీవుడ్ ముద్దుగుమ్మలు. ఇక మరో విశేషం ఏమిటంటే.. పరిణీతి చోప్రా ఆలియా భట్‌ను ఫాలో అయ్యిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆలియా కూడా తన పెళ్లికి క్రీం పేస్టల్ కలర్ అవుట్‌ఫిట్‌లో అందంగా ముస్తాబైంది. అంతేకాకుండా మెహందీ ఫంక్షన్లోనూ చాలా సింపుల్ మెహందీలో దర్శనమిచ్చింది. ఇప్పుడు పరిణీతి కూడా అచ్చంగా ఆలియాలానే క్రీం కలర్ పేస్టల్ లెహంగా, చాలా సింపుల్ మెహందీలో కనిపించింది. దీంతో వీరిద్దరి లుక్‌ని పోలుస్తూ పలు ఫోటోలు ఇంటర్నెట్లో దర్శనమిస్తున్నాయి. -
పరిణీతి- రాఘవ్ పెళ్లి.. అందుకోసం 2500 గంటలు పట్టిందా??
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పరిణయమాడింది. ఈ వివాహానికి సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా పెద్దఎత్తున హాజరయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ జంట వెడ్డింగ్ దుస్తుల్లో దిగిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. ఇవీ అభిమానులు సైతం నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇది చదవండి: నాకెలాంటి సంబంధం లేదు.. పైశాచిక ఆనందం కోసమే: టాలీవుడ్ హీరోయిన్) పరిణీతి లెహంగాపై చర్చ ఇదిలా ఉంటే పెళ్లిలో పరిణీతి చోప్రా ధరించిన డ్రెస్‌పైనే నెట్టింట చర్చ మొదలైంది. వధువుగా హీరోయిన్ ధరించిన లెహంగా డిజైన్ ప్రత్యేకంగా కనిపించడంతో అందరి దృష్టి దానిమీదే పడింది. అయితే వీరి పెళ్లికి దుస్తులను ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా సిద్ధం చేశారు. వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన డ్రెస్సుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పరిణీతి ధరించిన లెహంగా ప్రత్యేకతలను ఆయన వివరించారు. పరిణీతి కోసం లెహంగా రూపొందించడానికి దాదాపు 2,500 గంటల సమయం పట్టిందని మనీష్ మల్హోత్రా తెలిపారు. ఇది పూర్తిగా హ్యాండ్ ఎంబ్రాయిడరీతో చేసినట్లు వెల్లడించారు. ఈ అందమైన లెహంగాను పాతకాలపు బంగారు దారంతో రూపొందించామన్నారు. అతిథులను మంత్రముగ్దులను సున్నితమైన మెష్, దుపట్టా, ముత్యాలు, ప్రతి ఒక్కటి ఫెయిర్‌తో అలంకరించామని డిజైనర్ మనీశ్ పేర్కొన్నారు. అంతే కాకుండా పరిణీతి డ్రెస్‌పై రాఘవ్ పేరు ముద్రించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by @parineetichopra -
Parineeti Chopra-Raghav Chadha Wedding: పరిణీతి చోప్రా,రాఘవ్ చద్దా పెళ్లి ఫొటోలు
-
పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా పెళ్లి ఫోటో వైరల్
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆదివారం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. మూడు రోజుల పాటు వేడుకలు జరుపుకున్న ఈ జంట.. ముచ్చటగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లీలా ప్యాలెస్‌లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. మూడు రోజులుగా జరిగిన వీరి పెళ్లి వేడుక అత్యంత వైభవంగా కొనసాగింది. (ఇదీ చదవండి: 'విశ్వగానగంధర్వుడు' బాలసుబ్రహ్మణ్యం తొలి గురువు ఎవరు..?) ఈ పెళ్లి ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే వివాహం అనంతరం పరిణీతి-రాఘవ్ జంటగా దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో పరిణీతి పింక్ చీరలో భర్త రాఘవ్ చద్దాతో కలిసి పోజులిచ్చారు. పరిణీతి నుదుటిపై సిందూరం ఉంది. దీంతో ఈ ఫోటోలను వారిద్దరి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలో వారి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలను కూడా షేర్ చేయనున్నారు. ఈ వేడుకకి ఇరు కుటుంబాలతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దిల్లీ, పంజాబ్‌ల ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్లతోపాటు సినీ, క్రీడా ప్రముఖులు కొత్త జంట రాగ్నీతీ (రాఘవ్, పరిణీతి)లను ఆశీర్వదించారు. కాగా.. సెప్టెంబర్ 30న చండీగఢ్‌లో వివాహ రిసెప్షన్‌ను నిర్వహించనుంది. ఆ తర్వాత ఢిల్లీలో మరో రిసెప్షన్ జరగనుంది. -
మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ప్రేమజంట.. హాజరైన ప్రముఖులు!
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అధికారికంగా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. మూడు రోజుల పాటు వేడుకలు జరుపుకున్న ఈ జంట.. ముచ్చటగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లీలా ప్యాలెస్‌లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. మూడు రోజులుగా జరుగుతున్న వీరి పెళ్లి వేడుక అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ పెళ్లి ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. త్వరలోనే అధికారికంగా పెళ్లి ఫోటోలను రిలీజ్ చేయనున్నారు. (ఇది చదవండి: చెల్లి పెళ్లికి హాజరుకాని ప్రియాంక చోప్రా.. అదే ముఖ్యమా!!) పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహానికి పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. మనీష్ మల్హోత్రా, సానియా మీర్జా, హర్భజన్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆదిత్య ఠాక్రే, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఉన్నారు. అయితే ఈ పెళ్లికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మాత్రం హాజరు కాలేదు. ఈ వేడుకకు ఆమె తల్లి, డాక్టర్ మధు చోప్రా హాజరయ్యారు. కాగా.. ప్రియాంక ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిణీతికి శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా.. సెప్టెంబర్ 30న చండీగఢ్‌లో వివాహ రిసెప్షన్‌ను నిర్వహించనుంది. ఆ తర్వాత ఢిల్లీలో మరో రిసెప్షన్ జరగనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
చెల్లి పెళ్లికి హాజరుకాని ప్రియాంక చోప్రా.. అదే ముఖ్యమా!!
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా గురించి పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరోయిన్గా ఎదిగిన భామ.. ఆ తర్వాత హాలీవుడ్‌కు మారింది. అమెరికాకు చెందిన నిక్ జోనాస్ ప్రేమవివాహాం చేసుకుంది. ఈ జంటకు సరోగసీ ద్వారా ఓ బిడ్డ కూడా జన్మించింది. అయితే ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ పరిణీతి చోప్రా వివాహాబంధంలోకి అడుగుపెడుతోన్న సంగతి తెలిసిందే. ఆప్ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్దాను ఆమె పెళ్లి చేసుకుంటోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుక జరుగుతోంది. ఇదంతా బాగానే ఉన్నా.. చెల్లి పెళ్లికి అక్క ప్రియాంక చోప్రా హాజరు కాకపోవడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. బంధువులు, సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరవుతున్న ప్రియాంత చోప్రా రాకపోవడం ఏంటా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఈ జంటకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపింది. మొదట ఈ వివాహానికి ప్రియాంక వస్తుందని అందరూ భావించారు. కానీ ఆమె పెళ్లి హాజరవ్వకుండా అభిమానులకు షాకిచ్చింది. సంగీత కచేరీకి హాజరు పరిణీతి చోప్రా పెళ్లికి రాని ప్రియాంక కాలిఫోర్నియాలోని బర్కిలీలో జరిగిన బంగ్లాదేశ్-అమెరికన్ ఆర్టిస్ట్ జై వోల్ఫ్ సంగీత కచేరీకి హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఆమె తన భర్త నిక్ జోనాస్ సోదరుడు ఫ్రాంక్లిన్ జోనాస్‌తో కలిసి జై వోల్ఫ్ కచేరీలో పాల్గొంది. అయినా చెల్లి పెళ్లికి రాకపోవడమేంటని ప్రియాంక తీరుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by Bushra Khan 🇧🇩 (@b.khanfident) -
పరిణీతి-రాఘవ్ చద్దా వెడ్డింగ్: ఒక్క నైట్‌కి హోటల్ సూట్ ఖర్చు ఎంతంటే?
Parineeti Chopra-Raghav Chadha Weddingబాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా (Parineeti Chopra) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) పెళ్లి సందడి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే వీరి వెడ్డింగ్‌లో కీలకమైన మెహీందీ, హల్దీ వేడుకు ఫోటోలు నెట్లో సందడి చేస్తున్నాయి. ఈ జంట సెప్టెంబర్ 24న రాజస్థాన్ ఉదయ్‌పూర్ (Udaipur)లోని లీలా ప్యాలెస్ (Leela Palace) వేదికగా వివాహానికి సన్నాహాలు జోరందుకున్నాయి. ఇప్పటికే వధూవరులతోపాటు బంధుమిత్ర సపరివారం ఉదయ్‌పూర్‌లో ల్యాండ్ అయ్యారు. ముఖ్యంగా బఈ వివాహ వేడుక నిమిత్తం ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ ఉదయ్‌పూర్ చేరుకున్నారు. రాఘవ్ , పరిణీతి వారి జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగు పెట్టబోతున్నారంటూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇవాళ రేపు(శని, ఆది) వివాహ వేడుకలు జరుగాయని వెల్లడించారు. ఈసందర్బంగా ఉదయ్‌పూర్ మరోసారి వార్తల్లో నిలిచింది.ఈ సిటీలోని లీలా ప్యాలెస్, తాజ్ లేక్ ప్యాలెస్ లాంటి కొన్ని విలాసవంతమైన లగ్జరీ సూట్లను లాక్ చేసుకున్నారు. వీరి పెళ్లికి బుక్ చేసిన హోటల్లోని అత్యంత ఖరీదైన మహారాజా సూట్ అద్దెఎంత అనేది ఆసక్తికరంగా మారింది. హోటల్ సూట్ ఒక రాత్రికి రూ. 10 లక్షలు వసూలు చేస్తుందట. 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ హోటల్ ట్రావెల్ ప్లస్ లీజర్ వరల్డ్ సర్వే అవార్డ్స్ – 2023లో ర్యాంక్ .అంతేకాదు లీలా ప్యాలెస్ ప్రపంచంలోని అత్యుత్తమ 100 మరియు భారతదేశానికి ఇష్టమైన 5 హోటళ్లలో కూడా స్థానాన్ని కూడా సంపాదించింది. శిల్పకళా సౌందర్యానికి పాపులర్ అయిన లీలా ప్యాలెస్ హోటల్అతిథులకు రుచికరమైన వంటల్ని వడ్డించనున్నారు. VIDEO | “Raghav and Parineeti are set to step into a new chapter of their lives for which I want to extend my heartiest congratulations to them,” says AAP leader Sanjay Singh as he arrives in Udaipur to attend Raghav Chadha and Parineeti Chopra’s wedding. pic.twitter.com/vRn0MGcRmH — Press Trust of India (@PTI_News) September 23, 2023 డిజైనర్ దుస్తుల్లో పరిణీతి, రాఘవ్ చద్దా జంట , అతిథులకు నో- ఫోన్ రాఘవ్ మామ, ఫ్యాషన్ డిజైనర్ పవన్ సచ్‌దేవా, వరుడి కోసం అన్ని వివాహ దుస్తులను డిజైన్ చేసినట్టు వెల్లడించారు. ఇక పెళ్లి కూతురు పరిణీతి మనీష్ మల్హోత్రా సమిష్టిని ధరించనుంది. బేసిక్ సాలిడ్ పాస్టెల్ కలర్ లెహంగా, స్టేట్మెంట్ జ్యువెలరీ స్పెషల్ లుక్‌లో ఎట్రాక్షన్‌గా కనిపించనుందని టాక్. అంతేకాదు ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు హాజరయ్యే అతిథులు గోప్యతను పాటించాల్సి ఉంది. అందుకే నో-ఫోన్ విధానాన్ని పాటించాలని వారికి సూచించినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. -
సంప్రదాయ నగలంటే ఇష్టం: పరిణితి చోప్రా
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లో నూతనంగా ఏర్పాటు చేసిన త్రితియా జ్యువెల్స్‌ను శనివారం బాలీవుడ్ నటి పరిణితి చోప్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు ట్రెడిషినల్ నగలు అంటే ఎంతో ఇష్టమని వాటిని ధరించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటానని తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు కాంతి దత్, ప్రీతమ్ జుల్కర్ తదితరులు పాల్గొన్నారు. -
నిన్ను చాలా మిస్ అవుతున్నా.. హీరోయిన్ పోస్ట్ వైరల్!
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. ప్రియాంక చోప్రా సోదరిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట మే నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వీరి పెళ్లి వేడుక జరగనుంది. అయితే ఇప్పటికే పెళ్లి డేట్ ఫిక్స్ కాగా.. తాజాగా పరిణీతి చోప్రా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: మెగాస్టార్ ప్రశంసలే మాకు బిగ్ సక్సెస్: దర్శకుడు కామెంట్స్!) 2013లో ఆమె నటించిన చిత్రం శుద్ధ్ దేశీ రొమాన్స్. ఈ చిత్రంలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించారు. ఈ చిత్రం విడుదలై ఇప్పటికీ పదేళ్లు పూర్తయిన సందర్భంగా పరిణీతి చోప్రా ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాను తలుచుకుంటూ ఇన్‌స్టాలో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. పరిణీతి తన ఇన్‌స్టాలో రాస్తూ.. అవును నిజమే.. కాలం ఎగురుతుంది! దశాబ్దం గడిచినా ఆ సినిమా జ్ఞాపకాలు ఇంకా కొత్తగానే ఉన్నాయి. అది నవ్వులతో నిండిన ఓ మధురమైన ప్రయాణం. అలాంటి దిగ్గజ నటులతో ఈ సినిమా చేయడం జీవితంలో గొప్ప అనుభవం. రిషి సార్ మిమ్మల్ని మిస్ అవుతున్నాం. సుశాంత్ సింగ్ నిన్ను ఇంకా చాలా ఎక్కువగా మిస్ అవుతున్నా. మీరు నాకు ఇష్టమైన నటుల్లో ఒకరు.' అంటూ పోస్ట్ చేశారు. 2013లో విడుదలైన శుద్ధ్ దేశీ రొమాన్స్ చిత్రంలో పరిణీతి చోప్రా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లతో పాటు వాణి కపూర్, భువన్ అరోరా, రాజేష్ శర్మ నటించారు. (ఇది చదవండి: 17 ఏళ్లకే పాన్ ఇండియా మూవీ.. ఆ స్టార్ కిడ్ ఎవరో తెలుసా?) View this post on Instagram A post shared by @parineetichopra