'సల్మాన్ తో నటించడం లేదు' | I am not doing 'Sultan', says Parineeti Chopra | Sakshi
Sakshi News home page

'సల్మాన్ తో నటించడం లేదు'

Published Sun, Dec 6 2015 7:52 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'సల్మాన్ తో నటించడం లేదు' - Sakshi

'సల్మాన్ తో నటించడం లేదు'

ముంబై: తనపై వచ్చిన పుకార్లను బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా కొట్టిపారేసింది. అలీ అబ్బాస్ జాఫార్ దర్శకత్వంలో యశ్రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న చిత్రం 'సుల్తాన్'లో సల్మాన్ఖాన్కు జోడీగా పరిణీతి జతకట్టినట్లు వదంతులు వినిపించాయి. అయితే, తాను ఆ మూవీలో నటించడంలేదని ఆదివారం తన ట్విట్టర్ లో పరిణీతి పోస్ట్ చేసి వదంతులకు ఫుల్స్టాప్ పెట్టేసింది. తన నెక్స్ట్ మూవీ వివరాలను త్వరలో వెల్లడిస్తానంటోంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ.  

 'లేడీ వర్సెస్ రికీ బహల్’  తో 2011లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పరిణీతీ చోప్రా ‘ఇష్క్‌జాదే’ , ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’,  ‘హసీతో ఫసీ’  మొదలైన సినిమాలలో హీరోయిన్‌గా తన ప్రతిభ చాటుకున్నారు. ఈ అమ్మడు చివరగా గతేడాది విడుదలైన 'కిల్ దిల్'లో తెరపై కనిపించింది. కండల వీరుడు సల్మాన్ 'సుల్తాన్' మూవీలో మల్లయోధుడిగా కనిపించనున్నాడు. ఇప్పటివరకూ ఈ మూవీకి హీరోయిన్ను ఎంపిక చేయలేదని తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement