
పరిణీతి చోప్రా
‘ఏంటా హెయిర్ స్టయిల్.. పిశాచిలా, భూతంలా కన్పిస్తున్నావ్.. అసలెవరైనా జుట్టుకు ఎరుపు రంగు వేసుకుంటారా’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాను విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. అయితే పరిణీతి మాత్రం... ‘ ఎరుపు రంగు అని ఎవరు చెప్పారు. అది బర్గండి’ అంటూ కూల్ ట్వీట్‌తో తనను ట్రోల్ చేసిన వాళ్లకు టిట్ ఫర్ టాట్ ఇచ్చారు.
అసలు విషయమేమిటంటే...
ప్రస్తుతం ‘నమస్తే ఇంగ్లండ్’ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న పరిణీతి... తన తదుపరి సినిమా ‘జబరియా జోడి’ కోసం కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేయాలనుకున్నారట. ఆ సినిమా నిర్మాత రుచికా కపూర్ సలహా మేరకు.. బర్గండి కలర్‌తో డై చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి పరిణీతి హెయిర్ స్టైల్‌ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఈ విషయంపై స్పందించిన పరిణీతి.. ‘ఇదివరకు ఎప్పుడు ప్రయత్నించని పని చేయాలనుకున్నాను. రుచికా సలహా మేరకు ఇలా ట్రెండీగా తయారయ్యాను. కానీ ఇష్టమైన హెయిర్ స్టైల్ మెయింటేన్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఈరోజు నాకు ఆ ఓపిక వచ్చేసిందంటూ’ వ్యాఖ్యానించారు. కాగా ఇలా విచిత్రమైన స్టైల్స్‌తో పరిణీతి నెటిజన్ల చేతికి చిక్కడం ఇదేమి కొత్త కాదు.
BURGUNDY! 🐙🍇🧞♀️ pic.twitter.com/7RioMQlsfF
— Parineeti Chopra (@ParineetiChopra) August 31, 2018
Comments
Please login to add a commentAdd a comment