ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న స్టార్ హీరోయిన్! | Parineeti Chopra and Raghav Chadha already engaged Video Goes Viral | Sakshi
Sakshi News home page

Parineeti Chopra: పరిణీతి చోప్రా ఎంగేజ్‌మెంట్‌.. సోషల్ మీడియాలో వైరల్

Published Sun, Apr 16 2023 6:15 PM | Last Updated on Sun, Apr 16 2023 6:21 PM

Parineeti Chopra and Raghav Chadha already engaged Video Goes Viral - Sakshi

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ నేత రాఘవ్ చద్దా డేటింగ్‌లో ఉన్నట్లు బీ టౌన్‌లో గాసిప్స్ గుప్పుమన్న సంగతి తెలిసిందే. వాటన్నింటినీ నిజం చేస్తూ ఈ జంట చాలాసార్లు ముంబయి, దిల్లీ విమానాశ్రయాల్లో కెమెరాలకు చిక్కింది. దీంతో ఈ జంటపై డేటింగ్ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చాయి. అయితే వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై ఆప్ ఎంపీ సంజీవ్ ఆరోరా విషెస్‌ కూడా చెప్పారు. అయితే త్వరలోనే ఈ జంట ఎంగేజ్‌మెంట్‌ చేసుకోనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. వారి వద్ద నుంచి అధికారిక ప్రకటన వస్తుందని భావించినా అలాంటిదేం జరగలేదు. 

అయితే తాజాగా ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో పరిణీతి చోప్రా కనిపించింది. ఆ వీడియోలో పరిణీతి చోప్రా చేతికి ఉంగరం కనిపించింది. దీంతో ఈ జంట ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నట్లు బీటౌన్‌లో టాక్‌ నడుస్తోంది. ఆమె వేలికి ఉంగరం కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేశారు. కాగా.. పరిణీతి, రాఘవ్‌ల కుటుంబాలకు కూడా కొన్నేళ్లుగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement