
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా డేటింగ్ రూమర్స్‌తో కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ఆమె ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరు జంటగా పలుమార్లు కెమెరాకు చిక్కారు. కానీ తమ ప్రేమ విషయంపై మాత్రం ఇద్దరూ ఇంతవరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే త్వరలోనే వీరు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయినట్లు తెలుస్తుంది.
చదవండి: శ్రీజను టార్గెట్ చేస్తూ వీడియో షేర్ చేసిన కల్యాణ్‌దేవ్
సంబంధింత వర్గాల సమాచారం ప్రకారం ఈనెల 13న రాఘవ్ చద్దాతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం ఢిల్లీలో జరగనుందట. ఇరు కుటుంసబభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు,సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు అత్యంత సన్నిహితులైన 150మంది అతిథులకు ఇప్పటికే ఆహ్వానాలు అందినట్లు సమాచారం.
ఇక ఎంగేజ్‌మెంట్ కోసం వీరిద్దరూ ముంబై నుంచి మంగళవారం ఉదయాన్నే ఢిల్లీకి బయలుదేరారు. నిశ్చితార్థం అనంతరం ఈ ప్రేమజంట తమ రిలేషన్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. చదవండి: ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన హీరోయిన్ కృతిసనన్.. కామెంట్స్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment