Parineeti Chopra-Raghav Chadha to marry in October, had roka already: Report - Sakshi
Sakshi News home page

Parineeti Chopra : సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌.. ఎంపీతో స్టార్‌ హీరోయిన్‌ పెళ్లి ఫిక్స్‌

Published Fri, Apr 21 2023 3:29 PM | Last Updated on Fri, Apr 21 2023 3:45 PM

Parineeti Chopra Raghav Chadha To Marry In October As Per Reports - Sakshi

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాలు డేటింగ్‌లో ఉన్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటివరకు ఈ జంట స్పందించకపోయినా కలిసి జంటగా పలుమార్లు మీడియాకు చిక్కారు.

ఇక ఇటీవలె వీరి ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీనికి బలం చేకూరిస్తూ రీసెంట్‌గా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన పరిణీతి చోప్రా చేతికి ఉంగరంతో కనిపించింది. దీంతో ఈ జంట ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నట్లు బీటౌన్‌లో టాక్‌ నడుస్తోంది.

ఇక పరిణీతి-రాఘువ్‌ చద్దాలు పెళ్లికి అంతా సిద్దమయినట్లు తెలుస్తుంది. అక్టోబర్‌ నెలలో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement