Aam Aadmi Party
-
సార్! నేను కాంగ్రెస్ వాడిని కాను! 'ఆప్' నేతను టోపీ సేమ్ టూ సేమ్ అంతే!
-
ఎన్నికల షెడ్యూల్ రాకుండానే ఢిల్లీలో ఆప్ దూకుడు
-
అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ రెండో జాబితా.. సిసోడియా స్థానం మార్పు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనునన్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు కొనసాగిస్తోంది. ఎన్నికల షెడ్యూల్, తేదీలు ప్రకటించకముందే.. ప్రజాక్షేత్ర సమరానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆప్ తమ అభ్యర్థులను ప్రకటిస్తోంది. ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసిన ఆప్.. తాజాగా సోమవారం 20 అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను ప్రకటించింది.ఈ జాబితా ప్రకారం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జంగ్‌పురా నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం సిసోడియా తూర్పు ఢిల్లీలోని పట్పర్గంజ్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆయన్ను జంగ్‌పురాకు మార్చారు. పట్పర్గంజ్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన సివిల్ సర్వీసెస్ ఉపాధ్యాయుడు అవధ్ ఓజాను ఆప్ బరిలోకి దించుతోంది. 2013లో ఢిల్లీ అసెంబ్లీ మాజీ స్పీకర్ మణీందర్ సింగ్ ధీర్ గెలిచినప్పటి నుంచి జంగ్‌పురా సీటు ఆప్‌లో ఉంది. అనంతరం మణీందర్ సింగ్ బీజేపీలోకి వెళ్లడంతో 2015, 2020 ఎన్నికలలో ఆప్ ప్రవీణ్ కుమార్‌ను పోటీకి నిలిపింది. ఆయనే రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించారు. అయితే ఈసారి జంగ్‌పురా నుంచి ఆప్ సిసోడియాను ఎంపిక చేసింది. ప్రస్తుత జంగ్‌పురా ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌కు జనక్‌పురి సీటు కల్పించింది.కాగా సిసోడియా 2013లో పట్పర్గంజ్ నుంచి తన ప్రత్యర్ధి బీజేపీ అభ్యర్థి నకుల్ భరద్వాజ్‌పై విజయం సాధించి తొలిసారి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 2015 ఎన్నికలలో బిజెపికి చెందిన వినోద్ కుమార్ బిన్నీపై, గత 2020 ఎన్నికలలో రవీందర్ సింగ్ నేగిపై విజయం సాధించారు.ఇదిలా ఉండగా గత నెలలో విడుదల చేసిన తొలి జాబితాలో 11 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. నేటిజాబితాలో 20 అభ్యర్థులను వెల్లడించింది. ఇక 39 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. -
ఢిల్లీ బహుత్ దూర్ హై!
ఢిల్లీ బాద్షా ఎవరు? కేంద్ర సర్కార్ బడానేతలు మోదీ–షా ద్వయానికి అతిపెద్ద రాజకీయ సవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక. దశాబ్దంగా దేశ ఎన్నికల రాజకీయాలను దాదాపు శాసిస్తున్న బీజేపీ నాయకత్వానికి మింగుడు పడని గరళ గుళిక ‘ఢిల్లీ’! పదేళ్లలో, వరుసగా 2014, 2019, 2024 మూడు ఎన్నికల్లో ఏడుకు ఏడు లోక్‌సభ స్థానాలు అలవోకగా గెలుస్తూ వస్తున్న బీజేపీ... ఢిల్లీ రాష్ట్రాధికార పీఠాన్ని ఎడబాసి పాతికేళ్లు! దేశ రాజధానిలో పునర్వైభవం కోసం రెండున్నర దశాబ్దాలుగా అది చేయని యత్నం, వేయని ఎత్తు లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ఆధిపత్యానికి కొంత గండిపడ్డా.... హరియాణా, మహారాష్ట్ర ప్రభుత్వాలను తిరిగి నిలబెట్టుకున్న ఆత్మవిశ్వాసంతో పార్టీ నాయకత్వం ఢిల్లీ అసెంబ్లీ పోరుకు సిద్ధమౌతోంది.భూమ్మీద రెండో అతిపెద్ద జనాభా (3.4 కోట్లు) నగరం మన రాజధాని ఢిల్లీ. 3.7 కోట్ల జనాభా కలిగిన టోక్యో (జపాన్) తర్వాత మనదే ఎక్కువ జనాభా నగరం. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా చూస్తూ ఓటేసే తెలివిపరుల బరి ఇది. అదే, ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీకి చిక్కులు తెచ్చిపెడ్తోంది. ఏకులా వచ్చి మేకులా, స్థానిక రాజకీయ శక్తిగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్థిరపడిపోవడం బీజేపీకి మింగుడుపడట్లేదు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్, పదకొండేళ్లుగా ఢిల్లీని ఏలుతున్న ఆప్‌లకు ఒక లోక్‌సభ సీటు కూడా దక్కనీకుండా బీజేపీ, దశాబ్దకాలంగా సున్నాకే పరిమితం చేసింది. కానీ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ని వరసగా మూడు పర్యాయాలు కాంగ్రెస్, మరో మూడుమార్లు ఆప్ గెలవటంతో 26 ఏళ్లుగా బీజేపీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతోంది. రాజకీయ ఆటుపోట్ల నడుమ కూడా, 70లో 11 స్థానాలకు ఆప్ అప్పుడే అభ్యర్థులను ప్రకటించి బరిలో దూకింది. ఫిబ్రవరిలో ఢిల్లీ కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. మోదీ నాయకత్వంలోని బీజేపీని ఎదుర్కునేందుకు ఆప్ అస్త్రశస్త్రాలు సన్నద్దం చేసుకుంటోంది. ఎన్నికలవేళ ఓటర్లను ఆకట్టుకునే ‘ఉచితాల మీద (‘రేవడీ పే’) చర్చ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయంలో బీజేపీది రెండు నాల్కల ధోరణి అని విమర్శించే ఆప్, మహారాష్ట్ర హామీల ఉదాహరణలతో వారిని ఎండగట్టాలని ఎత్తుగడ. మరో పక్క కాంగ్రెస్ ‘ఢిల్లీ న్యాయయాత్ర’ ప్రారంభించింది. ఆప్ పాలన బాగోలేదనే విమర్శతో...‘ఢిల్లీ ఇక సహించదు’ అనే నినాదాన్ని ప్రచారం చేస్తోంది.పొత్తుతో ‘ఆప్’కి మేలా, కీడా?ఢిల్లీలో 70 సీట్లకు ఒంటరిగానే పోటీచేస్తామని అటు కాంగ్రెస్, ఇటు ‘ఆప్’ ప్రకటించాయి. ఇక రాబోయేది మూడు ముక్కలాటే! సహజంగానే ‘ఇండియా’ కూటమి మిత్రులుగా ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీచేస్తాయనుకుంటారు. లోక్‌సభ ఎన్నికల్లో అలాగే చేశాయి. కానీ, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా బరిలోకి దిగాయి. 2013 నుంచి ఢిల్లీ రాజకీయాల్లో సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. షీలా దీక్షిత్ సీఎంగా మూడు పర్యాయాలు ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పతనం 2013 నుంచే మొదలైంది. ఆ ఎన్నికల్లో 24.7 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్‌కు 2015లో 9.7%, 2020లో 4.3% ఓట్లే దక్కాయి. 2013లోనే 29.7% ఓట్లతో ఆధిక్యత ప్రారంభించిన ఆప్, 2015లో 54.5% ఓట్లు సాధిస్తే, 2020లో 53.8% ఓట్లు దక్కించుకుంది. మూడు మార్లూ గెలిచింది. పదేళ్లుగా పాలకపక్షం ‘ఆప్’ మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉందనీ, దాన్ని సొమ్ము చేసుకుంటూ తాను పూర్వవైభవం సాధించాలనీ కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే ఆలోచన బీజేపీది. కాంగ్రెస్ – బీజేపీ మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే... అది ‘ఆప్’కే లాభం! కాంగ్రెస్‌తో కలిసి ఆప్ పోటీ చేస్తే, లాభం ఉంటుందనే గ్యారెంటీ లేకపోగా ప్రభుత్వ వ్యతిరేక ఓటులో కాంగ్రెస్ అంటే గిట్టని వారి ఓటు... బీజేపీకి అనుకూలంగా కేంద్రీకృతమయ్యే ఆస్కారాన్ని శంకిస్తున్నారు. మూడు పార్టీల వ్యూహకర్తలు ఎలా ఆలోచిస్తారో చూడాలి. 2013లో 70 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ 8 స్థానాల్లో నెగ్గితే, 69 పోటీ చేసిన ఆప్ 28 సీట్లు. 66 పోటీ చేసిన బీజేపీ 31 సీట్లు గెలిచాయి. 2015లో ఫలితాల సునామీ సృష్టించిన ఆప్ 70 చోట్ల పోటీ చేసి 67 గెలిచి, ప్రత్యర్థుల్ని ‘చీపురు’ పెట్టి ఊడ్చింది. 69 చోట్ల పోటీ చేసిన బీజేపీకి 3 సీట్లు లభిస్తే, మొత్తం 70 స్థానాలకూ పోటీ చేసిన కాంగ్రెస్ ఒకచోట కూడా గెలువలేకపోయింది. 2020 లోనూ సుమారు అటువంటి పరిస్థితే! కాంగ్రెస్ (0), బీజేపీ (8) లపై మళ్లీ ఆప్ (62) ఏకపక్ష ఆధిక్యత సాధించింది.ఓటరు పరిణతి వేరుపార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్ని ఢిల్లీ ఓటర్లెప్పుడూ వేర్వేరు వేదికలుగానే చూస్తారు. జాతీయాంశాల పరంగా లోక్‌సభ ఎన్నికల్లో తీర్పిస్తే, దైనందినాంశాలు, పౌర సదుపాయాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలను, వాటి పనితీరును కొలుస్తుంటారు. అక్కడే ‘ఆప్’ క్లిక్ అయింది. తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం, రవాణా వంటి అంశాల్లో శ్రద్ధ వహిస్తూ, ఢిల్లీ ఓటర్లతో తన నిబద్ధత చాటుకుంది. అర్బన్ ఓటర్లను ఆకట్టుకోగలిగింది. సర్కారు బడుల్ని మెరుగుపరచడం, మొహల్లా ఆస్పత్రుల్ని బాగుచేయడం, ఉచితంగా 400 లీటర్ల వరకు తాగునీరు, 200 యూనిట్ల వరకు విద్యుత్తు, మహిళలకు బస్సులో ప్రయాణ సదుపాయం వంటివి కల్పించడం సంక్షేమపరంగా పెద్ద ముందడుగు. పన్ను చెల్లింపుదారలకు న్యాయం చేసే సర్కారు జవాబుదారీతనం, అవినీతి రహిత పాలననూ ఆప్ ప్రచారం చేసుకుంది. కానీ, ఢిల్లీ మద్యం పాలసీ కేసు వల్ల ఆప్ ప్రభుత్వం అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిందంటూ ప్రత్యర్థులు ప్రచారం చేసే ఆస్కారం వచ్చింది. దీన్ని బీజేపీ ఎలా వాడుకుంటుందో చూడాలి. ఆ కేసులో, ముఖ్యమంత్రి హోదాలో అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఉపముఖ్య మంత్రి మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ తదితర ఆప్ ముఖ్యులు అరెస్టయ్యారు. కేజ్రీవాల్ సీఎం పదవికే రాజీనామా చేశారు. అది కేవలం బీజేపీ కక్ష సాధింపేనని తిప్పికొట్టిన ఆప్ నాయకత్వం, నిర్దోషులుగానే నేతలు బయటపడతారని చెబుతోంది. ‘పాక్షిక రాష్ట్ర హోదా కల్గిన ఢిల్లీపై, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ద్వారా దొడ్డిదారి అధికారం చలాయిస్తూ, ఆప్ ప్రతిష్ఠ్ మసకబారేలా బీజేపీ నాయకత్వం కుయుక్తులు పన్నుతోందని ఆప్ విమర్శిస్తోంది.నాడి పట్టడంలో బీజేపీ విఫలంఎక్కువ నగర, తక్కువ గ్రామీణ జనాభాతో ఉండే ఢిల్లీ ఒకప్పుడు బీజేపీకి ఓటు బ్యాంకు. కానీ, 1998 తర్వాత సీన్ మారింది. ప్రస్తుత సమీకరణాల్లో ఢిల్లీ వాసుల నాడి పట్టలేకపోతోంది. పాతతరం – కొత్తతరం, సంపన్నులు–పేదలు, స్థానికులు–వలసజీవులు... ఇలా వైవిధ్యంగా ఉన్న సమూహాల్లో బీజేపీకి ఆధిపత్యం దొరకటం లేదు. ఒకప్పుడు తిరుగులేని పట్టున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎమ్సీడీ) ఎన్నికల్లోనూ బీజేపీకి క్రమంగా పట్టు జారుతోంది. 98 శాతం ఢిల్లీ అర్బన్ జనాభా 75 శాతం విస్తీర్ణంలో నివాసముంటుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 7 పార్లమెంటు స్థానాలూ గెలిచిన బీజేపీకి, 52 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యత దక్కింది. ఆప్ (10), కాంగ్రెస్ (8) కు నాలుగోవంతు సీట్లలోనే ఆధిక్యత వచ్చింది. కలిసి పోటీ చేసిన ఆప్ (24.17%), కాంగ్రెస్ (18.19%)ల ఉమ్మడి ఓటు వాటా (42.36%) కన్నా బీజేపీ వాటా (54.35%) ఎక్కువ! 2008 నుంచీ బీజేపీ గెలవని అసెంబ్లీ స్థానాలు 23 ఉంటే, కాంగ్రెస్ గెలవని స్థానాలు 25 ఉన్నాయి. 2013 నుంచి ఆప్ గెలవని స్థానం ఒకటే! 2013, 2015, 2020 అన్ని ఎన్నికల్లోనూ వారు గెలుస్తూ వస్తున్న స్థానాలు 26 ఉన్నాయి.ఆప్ ఓ నాలుగు లోక్‌సభ స్థానాలు పంజాబ్‌లోనైనా గెలిచింది తప్ప ఢిల్లీలో ఖాతాయే తెరవలేదు. ఢిల్లీ మహానగరంలో సామాజిక వర్గాల సమీకరణం కూడా ఈ వైవిధ్య ఫలితాలకు కారణమే! ఢిల్లీ 70 అసెంబ్లీ సీట్లలో... బిహార్, యూపీ రాష్ట్రాల వలసదారుల ఆధిపత్యమున్నవి 17 స్థానాలయితే, అంతే సంఖ్య స్థానాల్లో పంజాబీలు (14 శాతం జనాభా) నిర్ణాయకశక్తిగా ఉంటారు. స్థానికంగా పట్టు కలిగిన గుజ్జర్లు, జాట్లవి ఓ 10 స్థానాలు. ఢిల్లీ మొత్తంలో 12% జనాభా కలిగిన ముస్లింలు 30% మించిన ఓటర్లతో, నిర్ణాయకంగా ఉన్నవి 6 నియోజకవర్గాలు. అన్ని వర్గాలు మిళితమై నిర్దిష్టంగా ఎవరికీ ఆధిక్యత లేని నియోజకవర్గాలు 20 వరకుంటాయి. ఇన్ని వైవిధ్యాల మధ్యనున్న దేశ రాజధాని అసెంబ్లీ పీఠం గురించి ఎన్ని ఎత్తుగడలేసినా... బీజేపీకి, ఇంకా ఢిల్లీ బహుదూరమే (అభీ ఢిల్లీ బహుత్ దూర్ హై)!దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
ఒక కేసులో బెయిల్.. గంటల వ్యవధిలో మరో కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
ఢిల్లీ : ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే దోపిడీ కేసులో షరతులతో కూడిన బెయిల్ పొందారు. అలా బెయిల్ వచ్చిందో లేదో .. ఇలా మరో కేసులో అరెస్ట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ బుధవారం దోపిడీ కేసులో బెయిల్ పొందిన కొన్ని గంటల తర్వాత, వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కేసులో అరెస్టయ్యారు.ఆదివారం ఢిల్లీ ఉత్తమ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బల్యాన్‌ను మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) నిబంధనల ప్రకారం అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.PTI SHORTS | AAP MLA Naresh Balyan arrested in an organised crime case under MCOCA; granted bail in a separate extortion caseWATCH: https://t.co/enOt0Wf9Lo Subscribe to PTI's YouTube channel for in-depth reports, exclusive interviews, and special visual stories that take you…— Press Trust of India (@PTI_News) December 4, 2024 అయితే, ఈ అరెస్ట్‌కు ముందే గత శనివారం దోపిడీ కేసులో మూడు రోజుల కస్టడీ గడువు ముగిసిన అనంతరం, అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. దోపిడీ కేసులో రూ.50 వేలు ఫైన్ విధిస్తూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ మరుసటి రోజు ఆదివారం బల్యాన్‌ను దక్షిణ ఢిల్లీలోని ఆర్కే పురం క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి విచారణ కోసం వచ్చిన బల్యాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఎమ్మెల్యేకు బెయిల్,అరెస్ట్‌పై బీజేపీ, ఆప్ నేతలు విమర్శల దాడికి దిగారు. నేరాలకు పాల్పడుతున్న తన పార్టీ ఎమ్మెల్యేపై అరవింద్ కేజ్రీవాల్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. అయితే, బీజేపీ విమర్శల్ని ఆప్ ఖండించింది. బల్యాన్ అరెస్ట్ అక్రమమని, బీజేపీ అబద్ధపు ప్రచారం చేసి తమ పార్టీ నేతలపై కేసులు పెట్టిస్తుందని ఆప్ నేతలు మండిపడుతున్నారు. -
కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఆప్.. కేజ్రీవాల్ కీలక ప్రకటన
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలపై జాతీయ పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటక చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము ఎలాంటి పొత్తులు లేకుండానే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఆప్ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చారు.మాజీ సీఎం కేజ్రీవాల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎన్నికల కోసం ఎవరితోనూ పొత్తు ఉండదు. ఇండియా కూటమితో పొత్తుకు మేము సిద్ధంగా లేమంటూ కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో ఢిల్లీలో శాంతిభద్రతల అంశంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు నేను చేసిన తప్పు ఏంటి..? ఢిల్లీ శాంతిభద్రతల విషయంలో కేంద్రమంత్రి అమిత్ షా చర్యలు తీసుకుంటారని ఆశించాను. కానీ, దానికి బదులు పాదయాత్రలో నాపైనే దాడి జరిగింది. మేము ప్రజా సమస్యలను లేవనెత్తాము. మీకు వీలైతే.. గ్యాంగ్స్టర్లను అరెస్టు చేయించండి. అంతే కానీ, మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.#WATCH | AAP national convener Arvind Kejriwal says, "There will be no alliance in Delhi (for assembly elections)." pic.twitter.com/KlPKL9sWrY— ANI (@ANI) December 1, 2024అయితే, కేజ్రీవాల్‌పై దాడి చేసింది బీజేపీ కార్యకర్తే అంటూ ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్లాన్ ప్రకారమే కేజ్రీవాల్‌పై దాడి జరిగిందని వారు మండిపడుతున్నారు. కాగా, ఆప్ ఆరోపణలను బీజేపీ నేతలు కౌంటరిచ్చారు. ఈ ఘటనపై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ స్పందిస్తూ.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని చెప్పుకొచ్చారు. ప్రజలు సింపథీ కోసమే ఇలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.ఇక.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ ప్రకటనతో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా పంజాబ్‌లో కాంగ్రెస్‌తో పొత్తుకు ఆప్ నిరాకరించిన సంగతి తెలిసిందే. 13 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. మరోవైపు.. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో తాము కూడా పొత్తు లేకుండానే పోటీ చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో, ఇండియా కూటమి నేతలు, బీజేపీ మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. -
Arvind Kejriwal: ఢిల్లీలో టెన్షన్.. కేజ్రీవాల్‌పై దాడికి యత్నం.!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి ప్రయత్నం జరిగింది. వెంటనే అప్రమత్తమైన ఆప్ నాయకులు.. దాడికి పాల్పడిన యువకుడిని అడ్డుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది.వివరాల ప్రకారం.. మాజీ సీఎం కేజ్రీవాల్ కైలాశ్ ప్రాంతంలో శనివారం పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనూహ్యంగా పాదయాత్రలోకి ఓ యువకుడు చొరబడి.. కేజ్రీవాల్‌పై దాడికి యత్నించాడు. తన చేతిలో ఉన్న ఏదో ద్రావణాన్ని కేజ్రీవాల్‌పై చల్లే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఆప్ నాయకులు, కార్యకర్తలు.. సదురు యువకుడిని పట్టుకున్నారు. అనంతరం, అతడిని చితకబాదారు. ఈ ఘటనతో అక్కడి ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.🚨 Security breach: Man throws liquid at former CM Arvind Kejriwal, detained by police 🚨 pic.twitter.com/92nVej1YUJ— Rahul kushwaha (@myy_Rahul) November 30, 2024 అయితే, కేజజ్రీవాల్పై దాడి చేసింది బీజేపీ కార్యకర్తే అని ముఖ్యమంత్రి అతిశి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో దాడికి పాల్పడిన వ్యక్తికి సంబంధించిన ఫొటోను ఆమె.. తన ట్విట్టర్లో షేర్ చేశారు. మోదీతో సహా అతను ఆ ఫొటోలో ఉండటం గమనార్హం.आज दिन दहाड़े भाजपा के कार्यकर्ता ने @ArvindKejriwal जी पर हमला किया। दिल्ली का चुनाव तीसरी बार हारने की बौखलाहट भाजपा में दिख रही है।भाजपा वालों: दिल्ली के लोग ऐसी घटिया हरकतों का बदला लेंगे। पिछली बार 8 सीटें आयीं थी, इस बार दिल्ली वाले भाजपा को ज़ीरो सीट देंगे pic.twitter.com/LgJGN1aQ0T— Atishi (@AtishiAAP) November 30, 2024ఇదిలా ఉండగా, అంతకుముందు కేజ్రీవాల్.. ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీని గ్యాంగ్స్టర్లు నడిపిస్తున్నారని ఆరోపించారు. నగరంలో నిత్యం కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఘాటు విమర్శలు చేశారు. ఢిల్లీని కొన్ని ముఠాలు నడిపిస్తున్నట్లు తనకు అనిపిస్తోందని సంచలన కామెంట్స్ చేశారు. దీంతో, మరోసారి కేంద్రం, ఆప్ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం మొదలైంది. అనంతరం, ఆప్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. -
కేజ్రీవాల్ సంచలనం.. ఢిల్లీ ఎన్నికలకు ఆప్ తొలి జాబితా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడే సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఎన్నికల కోసం 11 మంది అభ్యర్థులతో తొలి జాబితా గురువారం విడుదల చేసింది. మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.ఛత్తర్పూర్ నుంచి బ్రహ్మ సింగ్ తన్వార్, కిరాడి నుంచి అనిల్ ఝా, విశ్వాస్ నగర్ నుంచి దీపక్ సింగ్లా, రోహతాన్ నగర్ నుంచి సరితా సింగ్, లక్ష్మీ నగర్ నుంచి బీబీ త్యాగి, బదార్పూర్ నుంచి రామ్ సింగ్, సీలమ్పూర్ నుంచి జుబీర్ చౌధురి, సీమాపురి నుంచి వీర్ సింగ్ ధిగాన్, ఘోండా నుంచి గౌరవ్ శర్మ, కర్వాల్ నగర్ నుంచి మనోజ్ త్యాగి, మాటియాలాలో సోమేశ్ షౌకీన్ పేర్లను కేజ్రీవాల్ ఖరారు చేశారు.ఈ జాబితాలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఇటీవల ఆప్‌లో చేరిన ఆరుగురు నేతలు ప్రముఖంగా ఉన్నారు. బీజేపీ మాజీ నేతలు బ్రహ్మ్‌సింగ్ తన్వర్, అనిల్ ఝా, బీబీ త్యాగితో పాటు కాంగ్రెస్ మాజీ నాయకులు చౌదరి జుబేర్ అహ్మద్, వీర్ ధింగన్, సుమేష్ షోకీన్‌లను అభ్యర్థులుగా ఆప్ ప్రకటించింది. అయితే ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆప్ టికెట్ నిరాకరించింది. -
బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గహ్లోత్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గహ్లోత్.. నేడు (సోమవారం) బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, జే పాండా, దుష్యంత్ గౌతమ్, హర్ష్ మల్హోత్రా, పలువురు బీజేపీ నేతల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.ఆప్ ప్రాథమిక సభ్యత్వంతోపాటు ఢిల్లీ రవాణాశాఖ మంత్రి పదవికి కూడా గహ్లోత్ ఆదివారం రాజీనామా చేసిన సంగతి విదితమే. అయితే ఇది జరిగిన మరుసటి రోజే సోమవారం మధ్యాహ్నం ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం కైలాష్ మాట్లాడుతూ.. ఆప్‌కు రాజీనామా, బీజేపీలో చేరిక నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకోలేదని స్పష్టం చేశారు. ఒత్తిడితోనే తాను వైదొలిగినట్లు ఆప్ చేసిన వాదనను ఆయన తోసిపుచ్చారు. పార్టీ ప్రధాన విలువలు, నైతికతలకు దూరమైందని ఆరోపించారు..‘నేను ఎలాంటి ఒత్తిళ్ల వల్ల బీజేపీలో చేరలేదు. ఆప్ దాని సిద్ధాంతాలపై రాజీ పడింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. సామాన్య ప్రజలకు సేవ చేయడానికి ఆప్‌లో చేరాను, కానీ ఇప్పుడు పార్టీ దాని అసలు లక్ష్యం డిస్కనెక్ట్ అయ్యింది, ఆప్ నాయకులు 'ఆమ్' (కామన్) నుంిచి 'ఖాస్' (ఎలైట్) గా మారుతున్నారు.కేంద్రంతో పోరాడటంపైనే ఆప్ ప్రభుత్వం దృష్టి సారించింది., అలాంటి వైఖరి ఢిల్లీలో నిజమైన పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. కేంద్రంలో కలిసి పని చేస్తేనే నిజమైన అభివృద్ధి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అందుకే ఈ రోజు బీజేపీలో చేరాను. ’ అని ఢిల్లీ మాజీ మంత్రి తెలిపారు.కాగా నజాఫ్‌గఢ్ ఎమ్మెల్యే అయిన గహ్లోత్ ఒకప్పుడు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అత్యంత సన్నిహితుడు. అయితే ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయలేని వాగ్దానాలు చేస్తోందని.. కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి పంపిన రాజీనామా లేఖలో ఆయన ఆరోపించారు. ఇటీవల పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇవన్నీ తన రాజీనామాకు కారణాలుగా పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలని నిబద్దతతో ఏర్పడిన పార్టీ తన ఆశయాలను నిలబెట్టుకోలేకపోయిందని మండిపడ్డారు.ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన కీలక వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యిందని ఆరోపించారు , యుమనా నదిని స్వచ్ఛమైన జలాలుగా మారుస్తామని వాగ్దానం చేసి ఆ పని చేయలేకపోయిందని, బహుశా గతంలో ఎన్నడూ చూడనంత కాలుష్యంలో యుమనా నది కూరుకుపోయందని విమర్శించారు. కేజ్రీవాల్ కొత్త అధికారిక బంగ్లా 'శీష్ మహల్' చుట్టూ వివాదం ముసురుకోవడాన్ని కూడా ఆయన విమర్శించారు. -
ఆప్ పార్టీకి, మంత్రి పదవికి కైలాష్ గెహ్లాట్ రాజీనామా
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీపై పలు విమర్శలు చేస్తూ, ఒక ప్రకటిన విడుదల చేశారు.కైలాష్ ఆ పకటనలో పార్టీలో పలు వింత వివాదాల ఉన్నాయని, అవి అందరినీ పలు సందేహాలకు గురిచేస్తున్నాయన్నారు. ఢిల్లీ ప్రభుత్వం కేంద్రంపై పోరాటానికి ఎక్కువ సమయం కేటాయిస్తే ఢిల్లీకి నిజమైన పురోగతి ఉండదని ఇప్పుడు స్పష్టమైందన్నారు. ఆప్ నుండి విడిపోవడం తప్ప తనకు వేరే మార్గం లేదని, అందుకే తాను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని తెలిపారు.కేంద్రంతో పోరాడడం వల్ల సమయం వృధా అని కైలాష్ అభిప్రాయపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం రాజకీయ ఎజెండా కోసమే పోరాడుతోందని, కేజ్రీవాల్ తన కోసం విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని, తాము చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయామన్నారు. యమునా నదిని శుభ్రం చేయలేకపోయామని, అది నేడు అత్యంత కలుషితంగా మారిందన్నారు. ఢిల్లీలో ని సామాన్యులు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. Delhi Minister and AAP leader Kailash Gahlot resigned from primary membership of Aam Aadmi Party; writes to party national convenor Arvind Kejriwal.The letter reads, "There are many embarrassing and awkward controversies like the 'Sheeshmahal', which are now making everyone… https://t.co/NVhTjXl1c2 pic.twitter.com/wVU7dSesBa— ANI (@ANI) November 17, 2024ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కైలాష్ గెహ్లాట్‌ను ఈడీ విచారించింది. మద్యం కుంభకోణంలో నిందితుడైన విజయ్ నాయర్ మంత్రి కైలాష్ గెహ్లాట్ అధికారిక నివాసంలో నివసించినట్లు ఈడీ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. కాగా కైలాష్ గెహ్లాట్ రాజీనామా తర్వాత బీజేపీ నేత కపిల్ మిశ్రా ఒక ప్రకటన చేశారు. మంత్రి కైలాష్ గెహ్లాట్ రాజీనామా లేఖతో పలు విషయాలు స్పష్టమయ్యాయన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో, ప్రభుత్వంలో కొనసాగడం అసాధ్యమైందని గెహ్లాట్ తన రాజీనామా లేఖలో స్పష్టంగా రాశారన్నారు. కైలాష్ గెహ్లాట్ తీసుకున్న ఈ చర్య స్వాగతించదగినదని కపిల్ మిశ్రా అన్నారు. -
ఢిల్లీ మేయర్ పీఠం ఆప్‌దే.. స్వల్ప తేడాతో బీజేపీపై విజయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడంతో ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్ మహేశ్ కుమార్ ఖించి కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి కిషన్‌లాల్‌పై స్వల్ప ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. కరోల్‌బాగ్‌లోని దేవ్‌నగర్ కౌన్సిలర్‌గా ఉన్న మహేశ్ ఖించికి 133 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 130 ఓట్లు వచ్చాయి. కేవలం మూడు ఓట్ల తేడాతో ఆప్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.కాగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక గురువారం ఉత్కంఠగా సాగింది. కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు సభ్యలు వాకౌట్ చేయడంతో ఆప్-బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. మొత్తంగా 265 ఓట్లు పోలవ్వగా.. రెండు ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. బీజేపీకి 120 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉండగా.. మరో 10 ఓట్లు సాధించగలిగింది. దీంతో ఆప్ నుంచి కొందరు కార్పొరేటర్లు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ బీజేకి చెందిన కిషన్‌లాల్‌పై ఆప్ కౌన్సిలర్ మహేష్ ఖించి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తా, బీజేపీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఓటు వేశారు. అయితే ఖించి కేవలం 5 నెలల మాత్రమే మేయర్ పీఠంపై కొనసాగనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఆప్, బీజేపీ మధ్య పోరుతో పదే పదే వాయిదా పడటమే ఇందుకు కారణం. -
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. సీనియర్ నాయకుడు రాజీనామా
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. హస్తం పార్టీ సీనియర్ నాయకుడు చౌదరీ మతీన్ అహ్మాద్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అనంతరం, ఆయన అధికార ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. వచ్చే ఏడాదిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో సీనియర్ నేత పార్టీని వీడటంతో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది.కాంగ్రెస్ సీనియర్ నేత మతీన్ అహ్మద్ ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆప్‌లో ఆయన చేరికను పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీలోకి అహ్మాద్‌ను స్వాగతిస్తూ.. మతీన్ సాహబ్ సరైన పార్టీలో చేరారు. అహ్మద్ ఢిల్లీ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి. పార్టీలో చేరిన అహ్మాద్‌కు సరైన గౌవరం, స్థానం ఉంటుంది అంటూ కామెంట్స్ చేశారు.ఢిల్లీలోని సీలంపూర్ నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా 1993 నుండి 2013 వరకు అహ్మాద్ ఎన్నికయ్యారు. ఇక, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో సీలంపూర్ అసెంబ్లీ స్థానాన్ని ఆప్ గెలుచుకుంది. ఇదిలా ఉండగా.. అహ్మద్ కుమారుడు చౌదరి జుబేర్ అహ్మద్.. అతని భార్య, కాంగ్రెస్ కౌన్సిలర్ షగుఫ్తా చౌదరి అక్టోబర్‌లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్‌లో చేరారు. కాగా, ఢిల్లీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీలంపూర్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా చౌదరి జుబేర్ అహ్మద్ బరి నిలుస్తారనే చర్చ నడుస్తోంది. Senior Congress leader, 5-time MLA Chaudhary Mateen Ahmed joined AAP today in the presence of AAP National Convenor Arvind Kejriwal.(Pics: AAP) pic.twitter.com/e5k7Sxpvg0— ANI (@ANI) November 10, 2024 दिल्ली के पूर्व मुख्यमंत्री एवं @AamAadmiParty के राष्ट्रीय संयोजक श्री @ArvindKejriwal स्वयं चौधरी मतीन अहमद के घर पहुंचे और उन्हें पार्टी में औपचारिक रूप से शामिल कराया। pic.twitter.com/ci6zX6Kgs2— Chaudhary Mateen Ahmed (@MateenAhmedINC) November 10, 2024 -
రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా తీర్చిదిద్దుతా: ఆప్ ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: నటి, బీజేపీ ఎంపీ హేమా మాలినిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నగరంలోని రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా(చెంపలు )అందంగా, మృదువుగా చేస్తానని ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మంగళవారం సందర్శించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు.ఆప్ ఎమ్మెల్యే వ్యాఖ్యాలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ స్పందిస్తూ.. ఆయన్ను మహిళా ద్వేషిగా అభివర్ణించారు. తమ పార్టీ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీని కోరారు. ఇలాంటి వారిని సమాజం నుంచి తరిమికొట్టాలని అన్నారు.‘దేశంలోని వివిధ ప్రాంతాలలో నేతలు, ముఖ్యంగా ఇండియా కూటమికి చెందిన నాయకులు స్త్రీలపై ద్వేషం కనబరుస్తున్నారు. మహిళలపై లింగవివక్ష వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. దాదాపు 40 సంవత్సరాల క్రితం లాలూ ప్రసాద్ యాదవ్ అదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యక్తులు తమను తామునేతలుగా భావిస్తారు. కానీ ప్రజలు ఎన్నికల సమయంలో అలాంటి వ్యక్తులకు తగిన గుణపాఠం చెప్పాలి. వీరిని సమాజంలో అంగీకరించకూడదు.’ అని పేర్కొన్నారు.అటు ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్ కూడా ఆప్ ఎమ్మెల్యే వ్యాఖ్యాలపై ధ్వజమెత్తారు. పదేళ్ల నుంచి ఆయన నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. ’నరేష్ బల్యాన్ చేసిన మహిళా వ్యతిరేక ప్రకటనను ఖండిస్తే సరిపోదు. గత పదేళ్లుగా ఉత్తమ్ నగర్ రోడ్లు ఆధ్వానంగా ఉన్నాయి. ప్రజలు వీటినే వినియోగిస్తున్నారు. ఇన్నేళ్లు ఆయన నిద్రపోతున్నారా; రోడ్లను హేమమాలిని చెంపలలాగా తీర్చిదిద్దుతాం" అంటున్నారు. మహిళలను వస్తువులుగా భావించే ఇలాంటి చౌకబారు ఆలోచనకు సమాజంలో స్థానం లేదు. మహిళా వ్యతిరేక ఆలోచనలు కలిగిన ఈ వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాల అరవింద్ కేజ్రీవాల్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు,.दिल्ली के उत्तम नगर से विधायक नरेश बाल्यान का कहना है कि “सड़कें हेमा मालिनी के गालों जैसी बना देंगे”! इस महिला विरोधी बात की जितनी निंदा करें वो कम है। ये आदमी पूरे दस साल सोता रहा है जिसके चलते उत्तम नगर की सड़कें टूटी फूटी पड़ी हैं! आज भी काम न करके, सिर्फ़ अपनी घटिया सोच का… pic.twitter.com/ObXRdrbj3e— Swati Maliwal (@SwatiJaiHind) November 4, 2024 -
ఢిల్లీలో హీట్ పాలిటిక్స్.. సీఎం ఇంటి వద్ద ఆప్ ఎంపీ వినూత్న నిరసన
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి నివాసం వద్ద ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న నిరసన చేపట్టారు. ఓ వాటర్ బాటిల్లో కలుషిత నీటిని తీసుకువచ్చి సీఎం ఇంటి ఎదుట పారబోసి ఆప్ సర్కార్‌పై మండిపడ్డారు. దీంతో, ఆమ్ ఆద్మీ పార్టీలో కొత్త చర్చ మొదలైంది.ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ తాజాగా సీఎం అతిషి నివాసం వద్ద వినూత్న నిరసన తెలిపారు. ఓ వాటర్ బాటిల్లో కలుషిత నీటిని తీసుకువచ్చి సీఎం ఇంటి ఎదుట పారబోశారు. అనంతరం స్వాతి మాలివాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు సాగర్పూర్, ద్వారక ప్రజలు నాకు ఫోన్ చేసారు. దీంతో, నేను అక్కడికి వెళ్లాను. ఆ ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను ఒక ఇంటికి వెళ్లి అక్కడ నల్లానీరు సరఫరాను గమనించాను. ఆ నల్లా నీటిని బాటిల్లో నింపాను.నల్లాల్లో సరఫరా అవుతున్న నీరు నల్లగా, కలుషితంగా ఉంది. అదే నీటిని ఇప్పుడు నేను సీఎం అతిషి ఇంటి వద్దకు తెచ్చాను. ఇలాంటి నీటిని ఎవరైనా తాగుతారా?.. వాడుకుంటారా?. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదల కష్టాలు మాత్రం తీరడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇదే నా హెచ్చరిక. రానున్న 15 రోజుల్లో ఢిల్లీలో ప్రతీ ఇంటికి మంచి నీరు అందాలి. లేని పక్షంలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇవే నీటిని ట్యాంకర్లో నింపి సీఎం నివాసం వద్ద పారబోస్తాం. ఇప్పుడు కేవలం ఒక్క బాటిల్ నీటిని మాత్రమే వేస్తున్నాను. ఇది కేవలం శాంపిల్ మాత్రమే.#WATCH | AAP MP Swati Maliwal arrives at Delhi CM Atishi's residence with a bottle filled with polluted water and throws it outside the CM's residence. She is claiming that this water is being supplied to the people of Delhi pic.twitter.com/ERJpqowuZX— ANI (@ANI) November 2, 2024ఇలాంటి నీటిని ఎవరైనా తాగుతారా? తాగితే వారు ప్రాణాలతో ఉంటారా?. ఢిల్లీలో ఛత్ పూజ వస్తోంది. ఈరోజు గోవర్ధన్ పూజ జరిగింది. నిన్న దీపావళి. పండుగ వేళ ఇలాంటి నీటితో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి అతిషి వద్దే నీటి పారుదల శాఖ కూడా ఉంది. నీటి సమస్యపై ఆమె ప్రతీరోజు మీటింగ్ పెట్టి ఈ సమస్యను పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు. ఇక, ఆప్ ఎంపీ నిరసన రాజకీయంగా బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. #WATCH | Delhi | AAP Rajya Sabha MP Swati Maliwal says, "The people of Sagarpur, Dwarka had called me and the situation there is very bad... I went to a house and black water was being supplied there. I filled that black water in a bottle and I brought that water here, at the… https://t.co/FN3JgtYUXn pic.twitter.com/2twrYzVlO8— ANI (@ANI) November 2, 2024 -
పార్టీ చీఫ్ పదవిపై పంజాబ్ సీఎం కీలక వ్యాఖ్యలు
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పార్టీ చీఫ్ పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ రాష్ట్ర విభాగానికి పూర్తికాల అధ్యక్షుడిని నియమించటంపై ఆప్ పార్టీ నాయకత్వంతో చర్చిస్తామని అన్నారు. ఆయన చబ్బేవాల్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను రాష్ట్ర చీఫ్ పదవి నుంచి వైదొలగాలనే కోరికను బయటపెట్టారు.‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు పెద్ద బాధ్యతలు ఉన్నాయి. ఇప్పటికే నాకు 13-14 శాఖలు ఉన్నాయి. బాధ్యతలు విభజించబడేలా పూర్తి సమయం రాష్ట్ర యూనిట్ చీఫ్‌ను నియమించడానికి పార్టీ న్యాయకత్వంతో మాట్లాడతా’’ అని అన్నారు. భగవంత్ మాన్ 2017లో సంగ్రూర్ ఎంపీగా ఉన్నప్పుడు ఆప్ పంజాబ్ యూనిట్ చీఫ్‌గా నియమితులయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాన్ పంజాబ్‌లో పార్టీకి నాయకత్వం వహించారు. అంతేకాకుండా.. 2022లో 117 మంది సభ్యుల పంజాబ్ అసెంబ్లీలో 92 స్థానాలను గెలుచుకుని ఆప్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే.. 2023 జూన్ ఆప్ పంజాబ్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుధ్ రామ్‌ను నియమించింది. మరోవైపు.. గిద్దర్బాహా, డేరా బాబా నానక్, చబ్బేవాల్, బర్నాలా నాలుగు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెలువడుతాయి. ఈ స్థానాల ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నిక కావటంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.చదవండి: సీజేఐ ఇంట్లో గణపతి పూజకు మోదీ హాజరు.. చంద్రచూడ్ రియాక్షన్ -
కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర: ఆప్
న్యూఢిల్లీ: తమ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపించింది. జరగరానిదేదైనా ఆయనకు జరిగితే బీజేపీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురిలో ప్రచార పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్‌పై శుక్రవారం బీజేపీ గూండాలు దాడికి దిగారని పేర్కొంది. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ శనివారం మీడియాతో మాట్లాడారు. ‘దాడి ఘటనపై పోలీసుల వైఖరిని బట్టి చూస్తే దీని వెనుక కేజ్రీవాల్‌ను చంపేందుకు పెద్ద కుట్రే ఉందని స్పష్టమవుతోంది. ఆయనకు బీజేపీ శత్రువుగా మారింది’అని పేర్కొన్నారు. ఆయనకు హాని తలపెట్టాలనుకుంటే ప్రజలు ఊరుకోరన్నారు. ఇటువంటి వాటికి కేజ్రీవాల్ వెనుకడుగు వేయర న్నారు. వికాస్పురిలో ముందుగా ప్రకటించిన విధంగానే కేజ్రీవాల్ పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌పై మొదటిగా దాడి చేసింది బీజేపీ ఢిల్లీ యువ మోర్చా ఉపాధ్యక్షుడు కాగా, రెండో వ్యక్తి ఢిల్లీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి అని ఆప్కే చెందిన ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. దాడి అనంతరం వీరిద్దరూ అక్కడ డ్యాన్స్ చేశారన్నారు. ఘటనపై చట్ట పరంగా ముందుకెళ్లే విషయమై నిపుణుల సలహాలను తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. అటువంటిదేమీ జరగలేదంది. -
ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు భారీ ఊరట.. రెండేళ్లకు బెయిల్
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆప్ సీనియర్ నేత సత్యేందర్ జైన్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మాజీ మంత్రి అయిన సత్యేందర్ జైన్‌కు రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కాగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద నమోదైన కేసులో ఆయన దాదాపు 18 నెల జైలులో ఉన్నారు.బెయిల్ మంజూరు సందర్భంగా.. హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పీఎంఎల్ఏ వంటి కఠినమైన కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. విచారణలో జాప్యాన్ని ఎత్తిచూపుతూ.. సత్యేందర్ జైన్ సుధీర్ఘ కాలం నిర్బంధంలో ఉన్నారని పేర్కొంది. ఈమేరకు ఆప్ నేత మనీష్ సిసోడియా కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. సత్వర విచారణ అనేది ప్రాథమిక హక్కుగా తెలిపింది. ట్రయల్ ప్రారంభించడానికి ఇంకా చాలా సమయం పడుతుందన్న న్యాయస్థానం వీలైనంత త్వరగా కేసును ముగించాలని దర్యాప్తు సంస్థకు సూచించింది.కాగా జైన్‌ను రెండేళ్ల కిత్రం మే 2022లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. అయితే ఆరోగ్య కారణాలతో వైద్య కారణాలతో 2023 మేలో సుప్రీంకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఈ ఏడాది మార్చిలో సాధారణ బెయిల్ కోసం ఆయన చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో జైన్ ఢిల్లీలోని తీహార్ జైలుకు తిరిగి వచ్చారు.ఇటీవల కాలంలో వివిధ కేసుల్లో బెయిల్ పొందిన మూడో ఆప్ నేత సత్యేందర్ జైన్. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గత నెలలో బెయిల్ మంజూరు అయిన సంగతి తెలిసిందే. ఇక ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఆగస్టులో బెయిల్ లభించింది. -
జమ్ముకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఆప్ మద్దతు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా.. నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రకటించింది. నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొంటూ ఒక లేఖను లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పించింది. కాగా మ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తొలిసారిగా గెలుపొందింది. దోడా నియోజకవర్గం నుంచి ఆప్ తరుపున పోటీ చేసిన మెహ్రాజ్ మాలిక్- బీజేపీ అభ్యర్థిపై గజయ్ సింగ్ రాణాపై 4,538 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కన్నా రెండు సీట్లు ఎక్కువగా గెలుచుకుంది. ఎన్సీ 42 చోట్ల, కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయ దుందుభి మోగించాయి. బీజేపీ 29 సీట్లను సొంతం చేసుకుంది. పీడీపీ మూడు స్థానాలకు పరిమితమైంది. 10 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. -
సీఎం సామాన్లనే బయటపడేశారు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అధికార నివాసం వేదికగా ఆప్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాల మధ్య మరోసారి అధికార ఆధిపత్యపోరు కనిపించింది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన ఆప్ నాయకు రాలు అతిశికి ఇంకా అధికారిక బంగ్లా కేటాయించకపోవడం ఈ వివాదానికి ఆజ్యంపోసింది. దీంతో సీఎం హోదాలో గతంలో అరవింద్ కేజ్రీవాల్‌కు కేటాయించిన ఢిల్లీలోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డు, నంబర్ 6 అధికారిక బంగ్లాలోకి అతిశి మారారు. దీంతో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తన అధికారాన్ని ఉపయోగించి అతిశికి సంబంధించిన సామగ్రిని బయట పడేశా రని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ బుధవారం ఢిల్లీలో మీడి యా సమావేశంలో మాట్లాడారు. ‘‘ సీఎం అతిశికి అధికారిక బంగ్లాను కేటాయించలేదు. అందుకే ఇ న్నాళ్లూ సీఎంగా ఉన్నపుడు వినియోగించి, కేజ్రీవాల్ ఖాళీ చేసిన అధికారిక బంగ్లాలోకే అతిశి మారారు. దీనిని జీర్ణించుకోలేని బీజేపీ ప్రభుత్వం ఎలాగైనా ఆ బంగ్లాను బీజేపీ అగ్రనేతకు కేటాయించాలని కుట్ర పన్నింది. లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను అడ్డుపెట్టుకుని అతిశికి చెందిన సామగ్రిని బయట పడేశారు. అంతకుముందు అదే బంగ్లాలోని క్యాంప్ ఆఫీస్‌లో అతిశి ఒక సమావేశం కూనిర్వహించారు. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో మూడుసార్లు ఓడిపోయిన బీజేపీ ఇలా చవకబారు బంగ్లా రాజకీయాలు చేస్తోంది’’ అని సంజయ్ వివరించారు.బంగ్లాకు సీలు వేయాల్సిందే: బీజేపీవివాదంపై బీజేపీ దీటుగా స్పందించింది. ఢిల్లీ శాసనసభలో విపక్షనేత, బీజేపీ నాయకుడు విజేందర్ గుప్తా మీడియాతో మాట్లాడారు. ‘‘ గత ఏడాది కేజ్రీవాల్ మంత్రివర్గంలోకి అతిశి చేరినప్పుడే కేబినెట్ మంత్రి హోదాలో ఆమెకు మథుర రోడ్డులోని ఏబీ–17 బంగ్లాను ప్రజాపనుల విభాగం(పీడబ్ల్యూడీ) గతంలోనే కేటాయించింది. ఆ బంగ్లా ఉండగా ఈ బంగ్లాతో సీఎంకు పనేంటి?. కేజ్రీవాల్ వెళ్లిపోయినా సీఎం బంగ్లా తాళాలు పీడబ్ల్యూడీకి అప్పజెప్పలేదు. ఇప్పుడు అతిశి అక్రమంగా ప్రవేశించిన ఈ బంగ్లాకు సీలు వేయాల్సిందే’’ అని గుప్తా డిమాండ్‌చేశారు.అక్రమంగా తరలించారు: సీఎం కార్యాలయం‘‘దేశ చరిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. బీజేపీ ఆదేశాలను శిరసావహిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా.. అతిశి వస్తువులను బయట పడేయించారు. బీజేపీ బడా నేతకు ఈ బంగ్లాను కేటాయించాలను ఎల్జీ ఉవ్విళ్లూరుతున్నారు. ఢిల్లీ రాష్ట్రంలో 27 ఏళ్లుగా అధికారాన్ని అందుకోలేని బీజేపీ ఇప్పుడు సీఎం బంగ్లాను ఆక్రమించాలని చూస్తోంది’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.అది అధికారిక బంగ్లా కాదు: ఎల్జీ వర్గాలుసీఎంఓ ప్రకటన తర్వాత ఎల్జీ కార్యాలయం వర్గాలు స్పందించాయి. ‘‘ సీఎం హోదాలో అతిశికి ఆ బంగ్లాను కేటాయించలేదు. అనుమతి లేకుండా అతిశి ఆమె సామగ్రిని బంగ్లాలోకి తరలించారు. తర్వాత ఆమెనే వాటిని బయటకు తరలించారు. ప్రస్తుతా నికి ఆ బంగ్లా పీడబ్ల్యూడీ అధీనంలోనే ఉంటుంది. గతంలో సమకూర్చిన వస్తువులను సరిచూసు కున్నాకే కేటాయిస్తారు’’ అని ఎల్జీ ఆఫీస్ వర్గాలు తెలిపాయి. -
కాంగ్రెస్ అతివిశ్వాసం.. ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: ఆప్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బొర్లా పడిన కాంగ్రెస్‌కు ఎటు తోచని పరిస్థితి నెలకొంది. రాష్టంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాతో వ్యవహరించిన హస్తానికి ఫలితాలు కోలుకోలేని దెబ్బ కొట్టింది. అంచనాలన్నీ తలకిందలు కావడంతో.. అనూహ్య ఫలితాలతో ఆ పార్టీలో అంతర్మథనం మొదలైంది. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ వైఖరిపై మిత్రపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తన భాగస్వామ్య పక్షాలను హస్తం పార్టీ పట్టించుకోలేదని మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అతివిశ్వాసం మితిమీరిందని విమర్శిస్తున్నాయి.తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంకా కక్కర్ మాట్లాడుతూ.. తన భాగస్వామ్య పక్షాలను హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని మండిపడ్డారు. వారికి అతివిశ్వాసం మితిమీరిపోయిందని, ఆ కారణంగానే ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు.లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఎక్కువ సీట్లు ఇచ్చినప్పటికీ హర్యానాలో ఆప్, సమాజ్ వాదీ పార్టీకి కాంగ్రెస్ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. అతివిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్, అహంకార బీజేపీపై పోటీ చేసే సామర్థ్యం తమ పార్టీకి ఉందని అన్నారు.ఢిల్లీలో పదేళ్లుగా ఒక్క అసెంబ్లీ సీటు గెలవని కాంగ్రెస్‌కు ఇటీవల లోక్‌సభలో మూడు సీట్లు ఇచ్చామని.. అయినప్పటికీ హరియాణా ఎన్నికల్లో మిత్రపక్షాలకు తోడుగా నిలవలేదని ఆప్ విమర్శించింది. హరియాణా ఎన్నికల్లో పొత్తుకోసం ఇండియా కూటమి చేసిన ప్రయత్నాలన్నింటినీ కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపడింది.కాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో వెళ్లాలని ముందుగా కాంగ్రెస్, ఆప్ భావించాయి. కానీ సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్-ఆప్‌ల మధ్య జరిగిన చర్చలు విఫలమవ్వడంతో రెండు పార్టీలు స్వతంత్రంగా పోటీ చేసి ఓటమి చవిచూశాయి. మెజార్టీ మార్కుకు కాంగ్రెస్ దూరం కాగా.. ఆప్ అసలు ఖాతా తెరవలేదు. దాంతో హ్యాట్రిక్ విజయాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. -
హరియాణాలో ఆప్ గుండుసున్నా
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి రెండు రకాల అనుభవాలు ఎదురయ్యాయి. జమ్మూకశ్మీర్‌లో తొలిసారి ఖాతా తెరవగా, హరియాణాలో మాత్రం చతికిలపడింది. జమ్మూకశ్మీర్‌లో ముస్లిం మెజార్టీ కలిగిన దోడా నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి గజయ్సింగ్ రాణాపై 4,538 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) సభ్యుడైన మెహ్రాజ్ మాలిక్‌కు 32,228 ఓట్లు, గజయ్సింగ్కు 18,690 ఓట్లు లభించాయి. దోడాలో నేషనల్ కాన్ఫరెన్స్, డీపీఏ పీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామమాత్రంగా ఓట్లు సాధించారు. మెహ్రాజ్ మాలిక్ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. 2020లో డీడీసీ సభ్యుడిగా గెలిచారు. లెఫ్టినెంట్ గవర్నర్ పాలనపై పదునైన విమర్శలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్శించారు. తన విజయం ప్రజలకే దక్కుతుందని మాలిక్ అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా3 కోసం తన పోరాటం సాగిస్తానని చెప్పారు. ఆయన ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నిరాశ చెందకుండా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి గెలుపు సొంతం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ‘ఆప్’ 7 స్థానాల్లో పోటీ చేసింది. కేవలం ఒక స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. హరియాణాలో 1.79 శాతం ఓట్లే హరియాణా అసెంబ్లీలో పాగా వేయాలని ఎన్నికల్లో గట్టిగా తలపడిన ఆమ్ ఆద్మీ పార్టీకి నిరాశే మిగింది. ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఆ పార్టీకి కేవలం 1.79 శాతం ఓట్లు లభించాయి. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో హరియాణా ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీకి శరాఘాతంగా మారింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సొంత రాష్ట్రమైన హరియాణాలో ఆప్ 89 స్థానాల్లో పోటీ చేసింది. చివరకు రిక్తహస్తమే ఎదురయ్యింది. 2014లో ఆ పార్టీ ఏర్పాటయ్యింది. హరియాణాలో ఇప్పటిదాకా అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, లోక్‌సభ ఎన్నికల్లో గానీ కనీసం ప్రభావం చూపలేకపోయింది. ఏ ఒక్క ఎన్నికల్లోనూ గెలుపు దక్కలేదు. రాష్ట్రంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 46 సీట్లలో పోటీ చేయగా, ఎక్కడా కూడా ‘నోటా’ కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడం ఆప్‌ను దెబ్బతీసినట్లు పరిశీలకులు చెబుతున్నారు. హరియాణాకు రెండు వైపులా ఉన్న పంజాబ్, ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.అతివిశ్వాసం వల్లే ఓటమి: కేజ్రీవాల్న్యూఢిల్లీ: హరియాణాలో అతి విశ్వాసం వల్లే ఓడిపోయామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో ఓ సమావేశంలో మాట్లాడారు. అతి విశ్వాసం ఉన్నవారికి హరియాణా ఎన్నికల ఫలితాలు ఒక గుణపాఠం అని పేర్కొన్నారు. ఏ ఒక్క ఎన్నికనూ తేలిగ్గా తీసుకోవద్దని, ప్రతి సీటూ ముఖ్యమేనని, గెలుపు కోసం కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. హరియాణాలో ఇతర పార్టీలతో తాము పొత్తు పెట్టుకొని ఉంటే భిన్నమైన ఫలితాలు వచ్చేవని రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు సుశీల్ గుప్తా చెప్పారు. -
కశ్మీరంలో కూటమి
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఆర్టీకల్ 370 రద్దయ్యి, కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మూడు పార్టీ లతో కూడిన విపక్ష ‘ఇండియా’ కూటమికే పట్టంగట్టారు. శాసనసభలో మొత్తం 90 స్థానాలకు గాను ఆ కూటమి 49 స్థానాలు సొంతం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించింది. ఇండియా కూటమిలోని నేషనల్ కాన్ఫరెన్స్ 42 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ ఆరు, సీపీఎం ఒక స్థానం దక్కించుకున్నాయి. మూడు పార్టీ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.జమ్మూకశ్మీర్‌లో మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ బలం పెరిగింది. ఆ పార్టీ ఓట్లశాతం 2014లో 20.77 ఉండగా, ఇప్పుడు 23.43 శాతానికి చేరుకుంది. మరో ప్రాంతీయ పార్టీ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) ఈ ఎన్నికల్లో కేవలం 3 సీట్లకే పరిమితమైంది. ఆ పార్టీ ఓట్ల శాతం 22.67 నుంచి 8.87కు పడిపోయింది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ మెరుగైన ఫలితాలే సాధించింది. సొంతంగా 29 సీట్లలో జెండా ఎగురవేసింది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి 25 స్థానాలు దక్కగా, ఈసారి మరో నాలుగు స్థానాలు పెరగడం గమనార్హం. అంతేకాకుండా ఓట్ల శాతం 23 శాతం నుంచి 25.64 శాతానికి పెరిగింది. కానీ, జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రైనా ఓటమి పాలయ్యారు. మహిళలు ముగ్గురే తమ కూటమికి అధికారం దక్కినప్పటికీ కాంగ్రెస్‌కు మాత్రం ఈ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి. పదేళ్ల క్రితం ఆ పార్టీ 12 సీట్లు గెలుచుకోగా, ప్రస్తుతం కేవలం ఆరు సీట్లు దక్కాయి. కశ్మీర్ లోయలో ఐదు స్థానాలు, జమ్మూ ప్రాంతంలో కేవలం ఒక స్థానం లభించింది. ఓట్ల శాతం కూడా 18 నుంచి 12 శాతానికి తగ్గిపోయింది. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య విజయం సాధించింది. ఒక స్థానంలో పాగా వేసింది. జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్(జేపీసీ)కు ఒక స్థానం లభించింది. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 90 మంది నూతన ఎమ్మెల్యేల్లో మహిళలు ముగ్గురే ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి సకీనా మసూద్, షమీమా ఫిర్దోస్, బీజేపీ నుంచి షగున్ పరిహర్ గెలిచారు. జమ్మూకశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. -
‘పెద్ద గుణపాఠం’.. హర్యానా ఎన్నికల్లో ఆప్ ఓటమిపై కేజ్రీవాల్
హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. హర్యానాలో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తుండగా.. జమ్మూ కశ్మీర్లో ఇండియా కూటమి హవా కొనసాగిస్తోంది. రెండు రాష్ట్రాల్లో ఒంటరిగా బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్ తమ పరిధిని విస్తరించుకోవాలని చూసినా.. ఆశాభంగం తప్పలేదు. హర్యానాలో ఒక్కస్థానంలోనూ ఆప్ ఖాతా తెరవకపోగా.. జమ్ముకశ్మీర్‌లో ఓచోట బోణీ కొట్టింది. దోడా అసెంబ్లీ నియోజకవర్గంలో 'ఆప్' అభ్యర్థి మేహరాజ్ మాలిక్ గెలుపొందారు. తన సమీప బీజేపీ ప్రత్యర్థి గజయ్ సింగ్ రాణాపై ఆయన 4,770 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మాలిక్ గెలుపుతో పంజాబ్, గుజరాత్ తర్వాత మరో రాష్ట్రంలో 'ఆప్' ఖాతా తెరిచినట్టు అయింది.హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ ఘోర పరాజయంపై పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. 89 స్థానాల్లో ఒంటరిగా పోటి చేసిన ఆ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోవడంపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆప్ మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హర్యానా ఎన్నికలు అతిపెద్ద పాఠాన్ని నేర్పాయని పేర్కొన్నారు. ఎప్పుడూ అతి విశ్వాసంతో ఉండకూడదనే విషయాన్నిఈ ఫలితాలు మనకు నేర్పించాయని అన్నారు. ‘హర్యానాలో ఫలితాలను గమనిస్తే.. ఎన్నికల్లో అతి విశ్వాసం ఉండకూడదనేది మనకు నేర్పిన గుణపాఠం. ఎన్నికలు సమీపిస్తే వాటిని తేలిగ్గా తీసుకోకూడదు. ప్రతి స్థానం, ప్రతి ఎన్నిక కఠినమైనదే. గెలుపు కోసం తీవ్రంగా కష్టపడి పనిచేయాలి. అంతర్గత పోరు ఉండకూడదు.’ అంటూ కేజ్రీవాల్ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. కాగా ఇదే కేజ్రీవాల్ హర్యానా ఎన్నికల్లో ప్రచారం చేస్తూ.. ఆప్ మద్దతు లేకుండా రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని అన్నారు.ఇక హర్యానాలో ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ తన హవా కొనసాగిస్తోంది. అకార వ్యతిరేకత ఉన్నప్పటికీ వరుసగా మూడోసారి అధికారిన్ని దక్కించుకునే దిశగా సాగుతోంది. మొత్తం 90 స్థానాలకు గానూ 50 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుంది. -
హర్యానాలో ఆప్ ఓటమికి 10 కారణాలు
న్యూఢిల్లీ: హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు మంగళవారం వెలువడుతున్నాయి. హర్యానాలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు నిరాశే ఎదురయ్యేలా ఉంది. హర్యానాలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఆశలు అడియాలసలయ్యాయి. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో ఆప్ అభ్యర్థులు ఒక్క సీటులో కూడా ముందంజలో లేరు. హర్యానాలో ఆప్ ఓటమికి 10 ప్రధాన కారణాలివే..కాంగ్రెస్‌తో పొత్తు లేదు సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరలేదు. దీంతో బీజేపీ లబ్ధి పొందింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి.ఐదు సీట్లకు పరిమితమై.. ఆప్ మొదట 10 సీట్లు అడిగింది. కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేకపోవడంతో ఆప్ తన డిమాండ్‌ను ఐదుకి తగ్గించింది. అయితే కాంగ్రెస్ మూడు సీట్లు ఇచ్చింది. ఆప్ అందుకు అంగీకరించలేదు.ఆప్- కాంగ్రెస్ మధ్య పోరు హర్యానా కాంగ్రెస్ నేతలలో ముఖ్యంగా భూపేంద్ర సింగ్ హుడా ఆప్ సహకారాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆప్ సాయముంటే కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతుందని ఆయన వ్యాఖ్యానించారు.పేలవమైన పార్టీ పనితీరు హర్యానాలో ఆప్ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహాన్ని చూపలేదు. గత ఎన్నికల్లోనూ ఆప్‌కు విజయం దక్కలేదు. ఓట్ల శాతం కూడా చాలా తక్కువగా నమోదయ్యింది.బీజేపీకి అనుకూల గాలి హర్యానాలో బీజేపీకి అనుకూలమైన గాలి వీచింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న సీట్లు కాంగ్రెస్‌కు ఆప్‌కు ఆఫర్ చేసింది. ఇక్కడ పోటీని ఎదుర్కోవడం ఆప్‌కు కష్టమయ్యింది.అట్టడుగు నుంచి మద్దతు శూన్యంహర్యానాలో ఆప్‌కు అట్టడుగు స్థాయి నుంచి మద్దతు దక్కలేదు. బీజేపీ, కాంగ్రెస్‌లతో పోలిస్తే అంత బలపడని కారణంగా విజయం సాధించలేకపోయింది. స్థానిక నాయకత్వ లోపం కూడా ఏర్పడింది.చీలిన బీజేపీ వ్యతిరేక ఓట్లు హర్యానాలో పలు పార్టీలు విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. దీంతో బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ప్రజల ఓట్లు చీలిపోయి, ఆప్ విజయావకాశాలు మరింత తగ్గాయి.ఆకట్టుకోవడంలో విఫలం ఆప్ నేతలకు సంబంధించిన వివాదాల కారణంగా పార్టీ ప్రతిష్ట దెబ్బతింది. హర్యానా ప్రజల హృదయాలను ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది.వ్యూహాత్మక అంచనా లోపం హర్యానాలో ఆప్ తన బలాన్ని అంచనా వేయడంలో తప్పుగా లెక్కలు వేసుకుంది. ఇది వైఫల్యానికి దారితీసింది.సమయం కేటాయించని నేతలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆప్ నేతలు తమ పూర్తి సమయం కేటాయించలేదు. చివరి క్షణం వరకూ ఆప్‌కు కాంగ్రెస్‌తో పొత్తు కుదరలేదు. దీంతో అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం, వ్యూహాలు రచించడం ఆప్‌కి భారంగా మారింది. ఇది కూడా చదవండి: కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్న సీఎం -
నాదీ భరతుడి వ్యథే!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఆతిశి బాధ్యతలు స్వీకరించారు. మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పై తనకున్న ప్రభు భక్తిని చాటుకున్నారు. ఇన్నాళ్లూ ఆయన కూర్చున్న ఎర్ర రంగు కుర్చీని ఖాళీగానే ఉంచి, ఆ పక్కనే మరో తెల్ల రంగు కుర్చీలో కూర్చుని సాదాసీదాగా సోమవారం సచివాల యంలో ఆమె ఢిల్లీ 8వ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆతిశి మీడియాతో మాట్లాడారు.ఈ కుర్చీ కేజ్రీవాల్దిరామాయణంలో శ్రీరాముడి సోదరుడు భరతుడి మాదిరిగానే తాను వ్యథ చెందుతున్నానని ఆతిశి అన్నారు. ‘ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. ఆనాడు భరతుడి వ్యథలాగే.. నేడు నా మనసు వ్యథ చెందుతోంది. శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసానికి వెళ్లినప్పుడు భరతుడు అయోధ్య రాజ్య పాలన బాధ్యతలు తీసుకోవాల్సివచ్చింది. శ్రీరాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి ఆయన రాజ్యపాలన చేశారు. అదే తీరుగా వచ్చే నాలుగు నెలలు ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తాను. తండ్రికిచ్చిన మాట కోసం శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం చేశారు. అందుకే మనం ఆయనను మర్యాద పురుషోత్తముడిగా పిలుచుకుంటాం. శ్రీరాముడి జీవితం మర్యాద, నైతికతకు నిదర్శనం. అదే విధంగా కేజ్రీవాల్ కూడా మర్యాద, నైతికతకు నిదర్శనంగా నిలిచారు. గత రెండేళ్లుగా కేజ్రీవాల్‌పై బురదజల్లేందుకు బీజేపీ ఏ అవకాశాన్నీ వదిలి పెట్టలేదు. అయితే, నిజాతీపరుడినని నిరూపించుకునే వరకూ సీఎం పీఠంలో కూర్చోనని ఆయన పదవికి రాజీమా చేశారు. కానీ, ఈ కుర్చీ (తన పక్కనే ఖాళీగా ఉన్న కుర్చీని చూపెడుతూ) కేజ్రీవా ల్ది. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు తమ ఆశీర్వాదంతో కేజ్రీవాల్‌ను సీఎం పీఠంపై కూర్చో బెడతారనే నమ్మకం నాకుంది’’ అని ఆతిశి అన్నారు. సీఎం పదవికే అవమానంకేజ్రీవాల్ వాడిని కుర్చీలో కూర్చోరాదంటూ సీఎం ఆతిశి తీసుకున్న నిర్ణయంపై బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా మండిపడ్డాయి. ‘ఆతిశి చేసిన పని ఆదర్శం ఎంతమాత్రమూ కాదు. ఆమె సీఎం పదవిని అవమా నించడమే కాదు, ఢిల్లీ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు’’ అని ఆ పార్టీ ప్రతినిధులు ధ్వజమెత్తారు.