న్యూఢిల్లీ: నటి, బీజేపీ ఎంపీ హేమా మాలినిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నగరంలోని రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా(చెంపలు )అందంగా, మృదువుగా చేస్తానని ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మంగళవారం సందర్శించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు.
ఆప్ ఎమ్మెల్యే వ్యాఖ్యాలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ స్పందిస్తూ.. ఆయన్ను మహిళా ద్వేషిగా అభివర్ణించారు. తమ పార్టీ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీని కోరారు. ఇలాంటి వారిని సమాజం నుంచి తరిమికొట్టాలని అన్నారు.
‘దేశంలోని వివిధ ప్రాంతాలలో నేతలు, ముఖ్యంగా ఇండియా కూటమికి చెందిన నాయకులు స్త్రీలపై ద్వేషం కనబరుస్తున్నారు. మహిళలపై లింగవివక్ష వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. దాదాపు 40 సంవత్సరాల క్రితం లాలూ ప్రసాద్ యాదవ్ అదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యక్తులు తమను తామునేతలుగా భావిస్తారు. కానీ ప్రజలు ఎన్నికల సమయంలో అలాంటి వ్యక్తులకు తగిన గుణపాఠం చెప్పాలి. వీరిని సమాజంలో అంగీకరించకూడదు.’ అని పేర్కొన్నారు.
అటు ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ కూడా ఆప్ ఎమ్మెల్యే వ్యాఖ్యాలపై ధ్వజమెత్తారు. పదేళ్ల నుంచి ఆయన నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. ’నరేష్ బల్యాన్ చేసిన మహిళా వ్యతిరేక ప్రకటనను ఖండిస్తే సరిపోదు. గత పదేళ్లుగా ఉత్తమ్ నగర్ రోడ్లు ఆధ్వానంగా ఉన్నాయి. ప్రజలు వీటినే వినియోగిస్తున్నారు. ఇన్నేళ్లు ఆయన నిద్రపోతున్నారా; రోడ్లను హేమమాలిని చెంపలలాగా తీర్చిదిద్దుతాం" అంటున్నారు. మహిళలను వస్తువులుగా భావించే ఇలాంటి చౌకబారు ఆలోచనకు సమాజంలో స్థానం లేదు. మహిళా వ్యతిరేక ఆలోచనలు కలిగిన ఈ వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాల అరవింద్ కేజ్రీవాల్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు,.
दिल्ली के उत्तम नगर से विधायक नरेश बाल्यान का कहना है कि “सड़कें हेमा मालिनी के गालों जैसी बना देंगे”! इस महिला विरोधी बात की जितनी निंदा करें वो कम है।
ये आदमी पूरे दस साल सोता रहा है जिसके चलते उत्तम नगर की सड़कें टूटी फूटी पड़ी हैं! आज भी काम न करके, सिर्फ़ अपनी घटिया सोच का… pic.twitter.com/ObXRdrbj3e— Swati Maliwal (@SwatiJaiHind) November 4, 2024
Comments
Please login to add a commentAdd a comment