Controversial comments
-
రోహిత్‌పై బాడీషేమింగ్ కామెంట్స్.. కోహ్లీని వదలని షామా!
న్యూఢిల్లీ: స్టార్ బ్యాటర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై బాడీ షేమింగ్ పోస్టుతో వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్ నేత షామా మహమ్మద్.. ఎట్టకేలకు స్పందించారు. రోహిత్ అభిమానులు, టీమిండియా మాజీలు, బీజేపీ, ఆఖరికి సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.‘‘ఓ ఆటగాడు ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలన్నది నా అభిప్రాయం. అందుకే రోహిత్ శర్మ విషయంలో పరిశీలనపూర్వకంగానే నేను మాట్లాడా. అతను కాస్త ఓవర్‌వెయిట్ అనిపించాడు. అందుకే అలా ట్వీట్ చేశా. అందులో బాడీ షేమింగ్ ఏం లేదు. నేనేం తప్పు చేయలేదు’’ అని అన్నారామె. ఈ క్రమంలో.. గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ల పేర్లను ప్రస్తావించిన షామా.. వాళ్లతో రోహిత్‌ను బాడీని పోల్చారు.#WATCH | On her comment on Indian Cricket team captain Rohit Sharma, Congress leader Shama Mohammed says, "It was a generic tweet about the fitness of a sportsperson. It was not body-shaming. I always believed a sportsperson should be fit, and I felt he was a bit overweight, so I… pic.twitter.com/OBiLk84Mjh— ANI (@ANI) March 3, 2025ఇది ప్రజాస్వామ్యం.. అందులో తప్పేం ఉంది. నాకు మాట్లాడే హక్కు ఉంది అని అన్నారామె. అలాగే.. ఈ సందర్భంగా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై షామా ప్రశంసలు గుప్పించారు. గతంలో పాక్‌పై ఓటమి తర్వాత మహమ్మద్ షమీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో షమీకి కోహ్లీ అండగా నిలిచాడు. అందుకు కోహ్లీని కూడా విమర్శించారు. తోటి ఆటగాళ్లకు అండగా ఉంటూ జట్టును ముందు ఉండి నడిపించడం, పరుగులు చేయడం, ప్రత్యర్థి జట్టు ప్రదర్శన గురించి తెలిసి ఉండడం.. ఇవన్నీ మంచి సారథికి ఉండే లక్షణాలు. ఇవన్నీకోహ్లీకి ఉన్నాయి. ప్రత్యర్థులు బాగా ఆడినా మెచ్చుకునేందుకు కోహ్లీ వెనకాడడు’’ అని షామా అన్నారు. అయితే ఇదే షామా గతంలో కోహ్లీపై చేసిన ఓ పోస్ట్ అంటూ ఒక స్క్రీన్ షాట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.2018లో కెప్టెన్‌గా ఉన్న సమయంలో కోహ్లీ ఓ ఫ్యాన్ పెట్టిన పోస్టుకు తీవ్రంగా స్పందించాడు. ‘‘నాకు భారతీయుల కంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రీడాకారుల క్రికెట్ బాగుంటుంది. ఇక కోహ్లీని అయితే జనాలు అనసవరంగా ఆకాశానికి ఎత్తేస్తుంటారు’’ అని ఓ ఫ్యాన్ చేసిన పోస్టును కోహ్లీ స్వయంగా చదివి వినిపించాడు.‘‘నువ్వు ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. భారత్‌లో ఉంటూ ఇతర దేశాలపై అభిమానం చూపించడం ఏమిటి. నీకు నేను నచ్చకపోవడంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, ఇతర దేశాల వారు నచ్చినప్పుడు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం’’ అని కోహ్లీ అన్నాడు.అయితే.. కోహ్లీ పోస్టుపై అప్పట్లో షామా చాలా ఘాటుగా స్పందించారు. ‘‘బ్రిటిషర్లు కనిపెట్టిన ఆటను కోహ్లీ ఆడుతుంటాడు. విదేశీ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ కోట్లు సంపాదిస్తుంటాడు. పెళ్లి కూడా ఇటలీలో చేసుకున్నాడు. హెర్షెల్ గిబ్స్ తన ఫేవరెట్ క్రికెటర్ అని కూడా చెబుతాడు. కెర్బర్ తన ఫేవరెట్ టెన్నిస్ ప్లేయర్ అని అంటాడు. కానీ ఇతర దేశాల క్రీడాకారులను అభిమానించే వారు మాత్రం దేశాన్ని విడిచిపెట్టి పోవాలని అంటాడు’’ అని షామా మండిపడ్డారు. రోహిత్‌పై ఆమె చేసిన కామెంట్లు దుమారం రేపడం, కోహ్లీని పొగడడం నేపథ్యంలో ఈ పోస్ట్ మళ్లీ తెరపైకి వచ్చింది.షామా ఏమన్నారంటే..ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ‘‘క్రీడాకారుడిగా రోహిత్ శర్మ ఫిట్‌గా లేడు. అతడు బరువు తగ్గాలి. అంతేకాదు.. గత కెప్టెన్లతో పోలిస్తే అత్యంత ఆకట్టుకోని సారథి ఇతడే’’ అని షామా రాసుకొచ్చారు. ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారడంతో దీనిపై తీవ్ర వివాదం రాజుకుంది. -
సినిమా అర్థమైంది.. బాబు వంకర మాటలకు బిత్తరపోయిన టీడీపీ నేతలు
-
నైతిక విలువల్ని పాటించండి
న్యూఢిల్లీ: యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా వివాదాస్పద అశ్లీల వ్యాఖ్యలు, సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర జోక్‌లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో ఓవర్ ది టాప్(ఓటీటీ)ప్లాట్‌ఫామ్‌లు నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు స్వీయ నియంత్రణ సంస్థలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఐటీ నిబంధనలు,2021లోని ‘కోడ్ ఆఫ్ ఎథిక్స్’ను పాటించాలని గురువారం కేంద్ర ప్రభుత్వం ఒక అడ్వైజరీని జారీచేసింది. నైతిక నియమాల ఉల్లంఘన జరిగితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన స్వీయనియంత్రణ సంస్థలు తగు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ వంటి ఆన్లైన్ క్యూరేటెడ్ కంటెంట్, సోషల్ మీడియాలో అసభ్యకర, శృంగారభరిత, బూతు సమాచారం విస్తృతంగా ప్రసారంలోకి వస్తోందని పలువురు పార్లమెంట్ సభ్యులు, కొన్ని సంస్థల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అడ్వైజరీ జారీచేసింది. -
రష్మిక వ్యాఖ్యలపై కన్నడ వాసుల ఆగ్రహం..
-
తొక్కిసలాట పెద్ద విషయమేమీ కాదు: హేమామాలిని
న్యూఢిల్లీ: సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమా మాలిని మహా కుంభమేళా దుర్ఘటనపై చేసిన వ్యాఖ్యలు.. వివాదాస్పదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొక్కిసలాటలో అంత మంది చనిపోవడం పెద్ద విషయమేమీ కాదని అన్నారామె. మహా కుంభమేళాలో ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం తొక్కిసలాటలో 30 మంది మరణించగా.. 60 మంది గాయపడ్డారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. మరణాల సంఖ్యను యూపీ సర్కార్ దాస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో.. ఈ అంశం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలనూ కుదిపేస్తోంది. అయితే ఈ విమర్శలపై హేమా మాలిని స్పందించారు. #WATCH | Delhi: BJP MP Hema Malini says "...We went to Kumbh, we had a very nice bath. It is right that an incident took place, but it was not a very big incident. I don't know how big it was. It is being exaggerated...It was very well-managed, and everything was done very… pic.twitter.com/qIuEZ045Um— ANI (@ANI) February 4, 2025‘‘మేమూ పుణ్య స్నానం కోసం అక్కడికి వెళ్లాం. జరిగిందేదో జరిగింది. అయినా అదేం అంత పెద్ద ఘటనేం కాదు. కేవలం ప్రతిపక్షాలు ప్రదర్శిస్తున్న అతిశయోక్తి మాత్రమే. కుంభ మేళా నిర్వహణలో యోగి ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది. అంతా సజావుగానే జరుగుతోంది. అయితే అంత మంది వస్తుండడంతో.. నిర్వాహణ కాస్త కష్టతరమే. కాబట్టి తొక్కిసలాట పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు అని అన్నారామె. అయితే ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ తారీఖ్ అన్వర్ కౌంటర్ ఇచ్చారు. ఆమె నటి, పైగా అధికారంలో ఉన్నారు. అందుకే ఆమెకు వీఐపీ ట్రీట్మెంట్ దక్కి ఉంటుంది. తొక్కిసలాటకు దారి తీసే భయంకరమైన రద్దీ ఎలా ఉంటుందో బహుశా ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు అని అన్నారామె. ఒకవేళ అది(తొక్కిసలాట ఘటన) పెద్ద విషయం కాదని ఆమె అంటే.. అది నిజంగా దురదృష్టకరం. అది బాధిత కుటుంబాలను అవమానించడమే అని అన్నారాయన#WATCH | On BJP MP Hema Malini's statement on the Maha Kumbh Stampede, Congress MP Tariq Anwar says, "Hema Malini can never know what it was really like. When she visited, she was given VIP treatment. Things at Maha Kumbh went downhill because the police and administration were… pic.twitter.com/SnsQGfnIkA— ANI (@ANI) February 4, 2025ఇదిలా ఉంటే.. గత వారం పుణ్య స్నానానికి వెళ్లిన హేమా మాలిని.. గొప్ప అనుభూతిని పొందినట్లు ఆ టైంలో వ్యాఖ్యానించారు. ఆ టైంలో ఆమె వీవీఐపీ టట్రీట్మెంట్ గురించి చర్చ నడిచింది. మరోవైపు మహాకుంభమేళాలో సామాన్యులను పట్టించుకోవడం లేదని, కేవలం వీవీఐపీలకు మాత్రమే ఏర్పాట్లు ఉంటున్నాయనే ఆరోపణలు మొదటి నుంచి వినవస్తున్నాయి. -
జగన్‌ను కమ్మవాళ్లు అడ్డుకోవాలి
సాక్షి, అమరావతి : ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో సారి సీఎం కాకుండా కమ్మవాళ్లు అడ్డుకోవాలి. అందుకోసం అహర్నిశలు కష్టపడాలి. అందుకు ఏం చేయాల్సి వచ్చినా సరే ముందు జాగ్రత్త చర్యగా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’.. అని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ‘వాడూ.. వీడూ’ అంటూ తూలనాడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ‘వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి రాకుండా ఏం చేసేందుకైనా కమ్మవాళ్లు సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్నా’.. అని ఆయన బాహాటంగా ప్రకటించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈనెల మొదటి వారంలో నిర్వహించిన కమ్మ సామాజికవర్గ సమావేశంలో ఏబీవీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ రిటైర్డ్ పోలీసు అధికారి ఇలా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించడంపట్ల పోలీసు వర్గాలతోపాటు సామాజికవేత్తలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడీయన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అత్యంత వివాదాస్పదంగా సాగిన ఈ ప్రసంగంలో ఏబీవీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండండి..‘నెవ్వర్ ఎగైన్.. నెవ్వర్ ఎగైన్.. ఇటువంటి వాడు అటువంటి అధికారాన్ని మళ్లా పొందకుండా అహర్నిశలు కష్టపడాల్సిన బాధ్యత మనందరం (కమ్మవాళ్లు) తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ ఆ బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించాలి. దీనికోసం ఏం చేయాల్సి వచ్చినా సరే ముందు జాగ్రత్తచర్యలు చేపట్టాలని మీ అందరికీ (కమ్మవాళ్లకు) పిలుపునిస్తున్నా’.ఏబీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి..ఇదిలా ఉంటే.. దాడులా.. దౌర్జన్యాలా.. హత్యలు చేయాలా.. అసలాయన ఉద్దేశం ఏమిటని పౌర సమాజం ప్రశ్నిస్తోంది. ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంతలా బరితెగించి సమాజంలో విద్వేషాలు, అల్లర్లను ప్రోత్సహించడం విభ్రాంతి కలిగిస్తోందని సామాజికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు ప్రసంగం వీడియో చూసి ఎవరైనా ప్రభావితమై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే పరిణామాలు ఎలా ఉంటాయోనని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు ఏబీ వెంకటేశ్వరరావు సమ్మతించకపోతే పోలీసులు ఆయనపై కేసు నమోదుచేసి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే ఏబీ వెంకటేశ్వరరావు విద్వేషపూరిత వ్యాఖ్యల వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని భావించాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. -
ఆమెతోనా మాకు నీతులు చెప్పించేది
సాక్షి ప్రతినిధి, అనంతపురం/అనంతపురం టవర్ క్లాక్ : టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సి పల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా.. ఆయన సినీ నటి, బీజేపీ నేత మాధవీలతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె పెద్ద వ్యభి చారి అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తులతోనా తమకు నీతులు చెప్పించేది అంటూ ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.న్యూ ఇయర్ వేడుకలకు వెళ్లొద్దన్నందుకు..నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ‘మహిళలకు మాత్రమే’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్థరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని, జేసీ పార్కులో వేడుకలకు వెళ్లొద్దని సూచించారు. దీంతో జేసీ ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఆయనతో పాటు టీడీపీకే చెందిన మున్సిపల్ కౌన్సిలర్ మల్లికార్జున కూడా పరుష పదజాలంతో మాట్లాడారు. మాధవీలతకు సంబంధించిన చిత్రాలను చూపిస్తూ అశ్లీలంగా నటించిందంటూ వ్యాఖ్యానించారు.మీరు థర్డ్ జెండర్ కంటే అధ్వానం..జేసీ ప్రభాకర్‌రెడ్డి బీజేపీని, దాని అనుబంధ సంస్థలనూ వదల్లేదు. ‘మాధవీలత బతుకుదెరువు కోసం ఏదో పాట్లు పడుతోంది, పడనివ్వండి. ఆమె మాకు నీతులు చెప్పకూ డదు. భజరంగదళ్, ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్.. ఇలాంటి వాళ్లా నన్ను బెదిరించేది? వాళ్లకంటే థర్డ్‌జెండర్ (ట్రాన్స్‌జెండర్)లు మేలు’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ వాళ్లు నా వెంట్రుక కూడా పీక్కోలేరు.. సిగ్గులేని నా కొ...కల్లారా అంటూ ఫైర్ అయ్యారు. తన బస్సును కాల్చిన తర్వాత ఆ వేడికి కరెంటు వైర్లు పడ్డాయని.. కానీ, షార్ట్ సర్క్యూట్ అని రాసుకున్నారని, అలాగే రాసుకోండని జేసీ అన్నారు. తన వర్గం మహిళలతో మాధవీలత పైనే తాడిపత్రి పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయించారు.జేసీకి మతిపోయిందేమో..ఇక జేసీ ప్రభాకర్‌రెడ్డికి వయసు రీత్యా మతి ఏమైనా పోయిందేమోనని, ఒకసారి చూపించుకోవాలని బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు సూచించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డి బీజేపీ మహిళా నేతలపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కూటమిలో ఉండి కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, ఇది సరైంది కాదని హితవు పలికారు.కేసులకు భయపడను : మాధవీలతజేసీ పరుష వ్యాఖ్యల నేపథ్యంలో సినీనటి మాధవీలత కూడా సోషల్‌మీడియాలో ఘాటుగానే స్పందించారు. మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడటం తప్పయితే తనపై వెయ్యి కేసులు పెట్టినా భయపడబోనన్నారు. తెరమీద కనిపించే వాళ్లందరూ వ్యభిచారులేనని అనడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. ఇలాగైతే తాడిపత్రి నుంచి తెర మీదకు ఎవరూ రాకూడదన్నట్లు ఉందన్నారు. తండ్రి అలా మాట్లాడినా యువ ఎమ్మెల్యేగా ఉన్న అస్మిత్‌రెడ్డి ఖండించలేని స్థితిలో ఉన్నారన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రేమించే సైకోలెవరికీ తాను భయపడబోనన్నారు. తనను కిడ్నాప్ చేయాలనుకున్నా, మర్డర్ చేయాలనుకున్నా తాను బెదిరేది లేదన్నారు. ఈ వయసులో ఇలా మాట్లాడ్డానికి ఆయన సిగ్గుపడాలని, ఈ భాషను భరిస్తున్న ఆయన భార్యాపిల్లలకు ధన్యవాదాలన్నారు. -
మంత్రికి, ఆయన తండ్రికి రుణపడి ఉంటా
రామచంద్రపురం: స్థానిక సీఐ కడియాల అశోక్‌కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామచంద్రపురం పట్టణంలోని టౌను హాలులో గురువారం జరిగిన శెట్టిబలిజ సామాజికవర్గ వనసమారాధనకు ఆయన పోలీసు యూనిఫాంతో వెళ్లడమే కాకుండా.. ‘‘నేను ఇక్కడకు (రామచంద్రపురం సీఐగా) రావడానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు, ఆయన తండ్రి సత్యానికి నేను, నా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటాం’’ అని బహిరంగంగా చెప్పారు. అంతేకాకుండా ‘‘భవిష్యత్ అంతా మనదే. ఎందుకంటే పోలీసు శాఖతో పాటుగా ఇతర శాఖల్లోనూ మనవారున్నారు’’ అని అన్నారు. ఆయన మాట్లాడిన వీడియో వైరల్ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై నియోజకవర్గానికి చెందిన కొంత మంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు సీఐ అశోక్‌ను వీఆర్‌కు పంపిస్తూ చర్య తీసుకున్నారు. కోనసీమ జిల్లాలో ప్రస్తుతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ విషయమై కలెక్టర్‌కు నివేదిక కూడా సమరి్పంచారు. ఆది నుంచీ వివాదాస్పదమే.. సీఐ అశోక్ కుమార్ వ్యవహార శైలి ఆది నుంచీ వివాదాస్పదంగానే ఉంది. గత ఆగస్ట్ 7న ఆయన రామచంద్రపురం సీఐగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచీ అధికార పార్టీకి చెందిన వారిలో ఒక వర్గానికి పూర్తిగా కొమ్ము కాస్తున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు. గతంలో జగనన్న కాలనీల్లో టీడీపీకి చెందిన కొంత మంది ఇసుకను బహిరంగంగానే దొంగిలించుకుపోగా, వారి పక్షాన ఉంటూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అనంతరం రామచంద్రపురం మండలం తాళ్లపొలం గ్రామంలో జరిగిన ఒక సివిల్ వివాదంలో తలదూర్చి, టీడీపీ వారికి వత్తాసు పలికి, సివిల్ కేసును మరింత వివాదంగా మార్చారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అంతే కాకుండా ప్రతి విషయంలోనూ టీడీపీకి చెందిన ఒక రౌడీషిటర్కు మంత్రి సహాయ సహకారాలతో కొమ్ముకాస్తూ, ఆయన చేసిన ఘనకార్యాలకు వత్తాసు పలికారంటూ నియోజకవర్గ వాసులతో పాటు శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన కొంత మంది కూడా వ్యతిరేకించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. గతంలో రామచంద్రపురం ఎస్సైగా సీఐ అశోక్ కుమార్ బంధువైన పాటి వాసు బాధ్యతలు స్వీకరించారు. తరువాత రామచంద్రపురం సీఐగా అశోక్ ఇక్కడకు వచ్చారు. అనంతరం వారం రోజుల్లోనే ఎస్సై వాసు కూడా వీఆర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆ సందర్భంలో స్థానికంగా ఉన్న రా్ర‹Ù్టర మంత్రి వాసంశెట్టి సుభాష్ తిరిగి వాసును ఉంచే ప్రయత్నం చేయలేదంటూ అదే పారీ్టకి చెందిన వారు అలక వహించినట్లు అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి. తాజాగా సీఐ అశోక్‌ను కూడా వీఆర్ నుంచి తప్పించడంలో మంత్రి చేతులెత్తేశారని సమాచారం. ఏరి కోరి తెచ్చుకున్న సీఐ ఇలా వివాదాల్లో ఇరుక్కోవడం మంత్రికి తలనొప్పిగా మారినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. -
నావల్లనే ప్రాబ్లమ్ అయితుంది అంటే వెళ్లిపోతా: జేసీ
అనంతపురం, సాక్షి: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాల్ని తాను ఇష్టమొచ్చినట్లు తిడతానని, పడాల్సిందేనంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ‘చదువులెందుకంటూ?’ విడ్డూరమైన వ్యాఖ్యలు చేశారాయన.‘‘తాడిపత్రిలో ఆలయాలకు వెళ్లే భక్తులకు క్రమశిక్షణ లేదు. జనాలను దారిలో పెట్టేందుకు ఖచ్చితంగా తిడతా.. పడాల్సిందే. మీరు మారతారా? లేదంటే నన్ను ఊర్లోంచి తరిమేయండి. నావల్లనే సమస్య అంటే నేను వెళ్లిపోతా. ఉంటే మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా’’ అని అన్నారాయన. చెత్త వేసే వారి ఇళ్లకు కరెంట్ కట్ చేస్తా.. తాగునీటి సరఫరా నిలిపివేయిస్తా అని హెచ్చరించారు. అలాగే..బీటెక్ చదివిన ఓ అమ్మాయిని దీపాలు అమ్ముతుంటే.. సంతోషపడ్డానని, వేరే దగ్గర ఆమెతో స్టాల్ పెట్టిస్తే.. మళ్లీ పాత చోటుకే వచ్చి అమ్ముతోందని మండిపడ్డారాయన. ఈ మాత్రం దానికి చదువుకుని దేనికి? అంటూ ప్రశ్నించారు. పిల్లలకు చదువులు కాకుండా క్రమశిక్షణ నేర్పించాలని తల్లిదండ్రులకు జేసీ సూచించారు.‘‘పిల్లలకు డిసిప్లిన్ నేర్పియండి. చదువుకాదు. లేకుంటే పాడైపోతారు. అమెజాన్, రెడ్‌బస్ ఓనర్లు.. ఎలాన్ మస్క్.. వీళ్లంతా చదువులేనోళ్లే!!. ఇప్పుడంతా కొత్త షావుకారులే వస్తున్నారు. సదువులేనోళ్లు బ్రహ్మాండమైన ఇళ్లు కడుతున్నారు. వాళ్లంతా బుర్రున్నోళ్లు. ఇంజనీరింగ్ కంటే మున్సిపల్లో ఊడ్చే పర్మినెంట్ ఉద్యోగికి మంచి జీతం వస్తోంది’’ అని జేసీ అన్నారు. తాడిపత్రి ప్రజలకు ఉంది రెండే ఆప్షన్లు. మీరైనా మారాలి లేదంటే నన్ను ఊర్లోంచి తరిమేయండని అన్నారాయన. -
మహిళా పోలీసుల్ని అంగీకరించే పరిస్థితి లేదు
సాక్షి, అమరావతి: పోలీస్ శాఖలోకి మహిళలు రావడానికి వారి కుటుంబాలు అంగీకరించడం లేదని హోం మంత్రి వంగలపూడి అనిత గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అనిత సమాధానమిస్తూ.. గత ప్రభుత్వంలో మహిళా సంరక్షణ కార్యదర్శులతో పోలీస్ డ్రెస్ కూడా వేయించాలని చూశారన్నారు. దానిపై కొందరు న్యాయస్థానాల్ని ఆశ్రయించారని చెప్పారు. వారిని ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీస్ శాఖలో కొనసాగిస్తారా, మహిళా, శిశు సంక్షేమ శాఖలో కొసాగిస్తారా అనేది ప్రభుత్వం చెప్పాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. ఈ అంశంపై ప్రభుత్వానికే అవగాహన లేకపోవడం వల్ల వారంతా మానసిక క్షోభకు గురవుతున్నారని చెప్పారు.విశాఖ మెట్రో ఎప్పుడుచింతలపూడి ఎత్తిపోతల సాగునీటి పథకం పనులు 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. త్వరగా పూర్తిచేయండని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారని ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, వెలగపూడి రామకృష్ణ, గణబాబు, విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో ఎర్రకాలువ వరద వల్ల రైతులకు ఏటా నష్టం వాటిల్లుతోందని.. మరమ్మతులకు కనీసం రూ.50 కోట్లు కేటాయించమని అడిగితే ఇవ్వలేదని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఎంటీఎస్ టీచర్లకు రిటైర్మెంట్ ప్రయోజనాలు వర్తించవుమినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ప్రాతిపదికన గత ప్రభుత్వం 3,939 టీచర్ పోస్టులను భర్తీ చేసిందని విద్యా శాఖ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. మిగిలిన 600 పోస్టుల భర్తీకి చర్చిస్తామన్నారు. ఎంటీఎస్ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవన్నారు. వచ్చే రెండేళ్లలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని పూర్తి చేస్తామని బుచ్చయ్య చౌదరి ప్రశ్నకు సమాధానంగా మంత్రి లోకేశ్ తెలిపారు. గత ప్రభుత్వంలో హజ్ యాత్రికుల ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇచ్చేవారని.. అదేవిధంగా ఈ ప్రభుత్వంలోనూ ఇవ్వాలని ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అహ్మర్ కోరారు.‘సాక్షి’పై అక్కసుఅసెంబ్లీ వేదికగా మరోసారి సాక్షి పత్రికపై జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నోరుపారేసుకున్నారు. వైఎస్సార్సీపీ కరపత్రిక, అవినీతి పత్రిక అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సిగరెట్ ప్యాకెట్ మీద పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని రాస్తున్నట్టు.. సాక్షి పత్రిక చదవడం ఆరోగ్యానికి హానికరం అని మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. -
రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా తీర్చిదిద్దుతా: ఆప్ ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: నటి, బీజేపీ ఎంపీ హేమా మాలినిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నగరంలోని రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా(చెంపలు )అందంగా, మృదువుగా చేస్తానని ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మంగళవారం సందర్శించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు.ఆప్ ఎమ్మెల్యే వ్యాఖ్యాలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ స్పందిస్తూ.. ఆయన్ను మహిళా ద్వేషిగా అభివర్ణించారు. తమ పార్టీ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీని కోరారు. ఇలాంటి వారిని సమాజం నుంచి తరిమికొట్టాలని అన్నారు.‘దేశంలోని వివిధ ప్రాంతాలలో నేతలు, ముఖ్యంగా ఇండియా కూటమికి చెందిన నాయకులు స్త్రీలపై ద్వేషం కనబరుస్తున్నారు. మహిళలపై లింగవివక్ష వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. దాదాపు 40 సంవత్సరాల క్రితం లాలూ ప్రసాద్ యాదవ్ అదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యక్తులు తమను తామునేతలుగా భావిస్తారు. కానీ ప్రజలు ఎన్నికల సమయంలో అలాంటి వ్యక్తులకు తగిన గుణపాఠం చెప్పాలి. వీరిని సమాజంలో అంగీకరించకూడదు.’ అని పేర్కొన్నారు.అటు ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్ కూడా ఆప్ ఎమ్మెల్యే వ్యాఖ్యాలపై ధ్వజమెత్తారు. పదేళ్ల నుంచి ఆయన నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. ’నరేష్ బల్యాన్ చేసిన మహిళా వ్యతిరేక ప్రకటనను ఖండిస్తే సరిపోదు. గత పదేళ్లుగా ఉత్తమ్ నగర్ రోడ్లు ఆధ్వానంగా ఉన్నాయి. ప్రజలు వీటినే వినియోగిస్తున్నారు. ఇన్నేళ్లు ఆయన నిద్రపోతున్నారా; రోడ్లను హేమమాలిని చెంపలలాగా తీర్చిదిద్దుతాం" అంటున్నారు. మహిళలను వస్తువులుగా భావించే ఇలాంటి చౌకబారు ఆలోచనకు సమాజంలో స్థానం లేదు. మహిళా వ్యతిరేక ఆలోచనలు కలిగిన ఈ వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాల అరవింద్ కేజ్రీవాల్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు,.दिल्ली के उत्तम नगर से विधायक नरेश बाल्यान का कहना है कि “सड़कें हेमा मालिनी के गालों जैसी बना देंगे”! इस महिला विरोधी बात की जितनी निंदा करें वो कम है। ये आदमी पूरे दस साल सोता रहा है जिसके चलते उत्तम नगर की सड़कें टूटी फूटी पड़ी हैं! आज भी काम न करके, सिर्फ़ अपनी घटिया सोच का… pic.twitter.com/ObXRdrbj3e— Swati Maliwal (@SwatiJaiHind) November 4, 2024 -
సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు: ఉదయనిధి
చెన్నై: సనాతన ధర్మంపై తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగీ వంటిదని, దాన్ని నిర్మూలించాలని గతంలో ఆయన పిలుపునిచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలకుగానూ స్థాలిన్కు వ్యతిరేకంగా హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో తాజాగా యన చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పందించారు.సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తన పిలుపుపై క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశారు. మహిళలపై జరిగిన అణచివేత పద్దతులను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చుకున్నారు. సనాతన ధర్మంపై తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఆ విషయంలో ఎవరికీ క్షమాపణ చెప్పేది లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలపై న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ. పెరియార్, మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి వంటి ద్రావిడ నాయకుల అభిప్రాయాలను తాను ప్రతిధ్వనించానని అన్నారు.‘మహిళలను చదువుకోవడానికి అనుమతించ లేదు వారు తమ ఇళ్లను వదిలి వెళ్ళలేకపోయారు. ఒకవేళ భర్త చనిపోతే వారు కూడా చనిపోవాలి. వీటన్నింటికీ వ్యతిరేకంగా తంతై పెరియార్ మాట్లాడారు. పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ చెప్పిన దానినే నేను చెప్పాను’ అని ఉదయనిధి పేర్కొన్నారు. -
ఇంకా సద్దుమణగలేదు!
సాక్షి, హైదరాబాద్: సినీ హీరో అక్కినేని నాగార్జున కుటుంబంతోపాటు సినీనటి సమంతపై తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వివాదం ఇంకా సద్దుమణగలేదు. మంత్రి వ్యాఖ్యలను తప్పుపడుతూ చలనచిత్ర ప్రముఖులు గురువారం తీవ్రస్థాయిలో స్పందించారు. అక్కినేని కుటుంబంతోపాటు నటి సమంతకు బాసటగా నిలిచారు. ఈ మేరకు కొండా సురేఖపై సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. తెలుగు సినీ పరిశ్రమతోపాటు ఇతర భాష నటీనటులు కూడా స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి, హీరోలు వెంకటేష్, మహేష్‌బాబు, ప్రభాస్, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ, నరేష్, నాని, విజయ్ దేవరకొండతో పాటు సీనియర్ నటి విజయశాంతి, హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్, దర్శకులు రాజమౌళి, హరీశ్ శంకర్, తమిళ నటి కుష్బూ తదితరులు కూడా మంత్రి సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ ‘ఎక్స్’, ఇన్‌స్ట్రాగామ్‌లలో పోస్టులు పెట్టారు. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సైతం మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. సినీ పరిశ్రమకు చెందిన సభ్యుల వ్యక్తిగత జీవితాలతో ముడిపడి ఉన్న సున్నిత అంశాలపై ఎవరు మాట్లాడినా తగిన చర్యలకు ఉపక్రమిస్తామని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు.. అసోసియేషన్ తరపున కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ అధికారికంగా సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత నష్టం జరగకుండా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. దీంతో సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ‘ఎక్స్’ లో పోస్టు చేశారు. నాగార్జున పరువునష్టం దావా..మంత్రి సురేఖపై సినీనటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ సభ్యుల పరువుకు మంత్రి భంగం కలిగించారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు కొండా సురేఖపై పలువురు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. ‘మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే ఉంది. ఇంకా శుద్ధి ఎందుకు.. లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు?’ అని ప్రశ్నించారు. మంత్రి సురేఖ వ్యాఖ్యల దుమారం రేగుతున్నా... సీఎం రేవంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. -
ఎందుకీ సుద్దపూస కబుర్లు.. ఆ విషయం మర్చిపోయావా రేవంత్!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య వివాదాస్పదంగా ఉంది. ఆయన కొంతమంది జర్నలిస్టులను ఉన్మాదులుగా పోల్చడం బాగోలేదు. రాజకీయ పార్టీలు ప్రారంభించుకున్న పత్రికలలో పనిచేస్తున్నకొందరు పాత్రికేయులు ఉన్మాదంగా మారి ప్రెస్ మీట్లలో లేదా జరుగుతున్న కార్యక్రమాలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన పత్రికలలో పనిచేసే వారు మంత్రుల కార్యాలయాలు, మరికొన్ని చోట్లకు వెళ్లి కూర్చోవడంతో పాటు కొన్ని విషయాలలో అనవసర రాద్దాంతం చేస్తున్నారని సృష్టిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బహుశా కొందరు పాత్రికేయులు అడిగే ప్రశ్నలు, ఇచ్చే కథనాలు ఆయనకు నచ్చకపోవచ్చు. లేదా కొన్ని పత్రికలపట్ల ఆయనకు వ్యతిరేకత ఉండవచ్చు. అంతమాత్రాన వారిని ఉన్మాదులతో ఎలా పోల్చారో అర్ధం కాదు.రాజకీయ నేతల భాష గురించి పక్కనబెట్టి, పాత్రికేయుల భాష గురించి హితవు చెప్పిన రేవంత్ ఇలా మాట్లాడడం సమంజసమేనా అన్నది చూడాలి. అలా అని మీడియా అంతా వృత్తి ప్రమాణాలు పాటిస్తోందని చెప్పడం లేదు. ఏ రంగంలో అయినా అన్ని రకాలవారు ఉంటారు. అలాగే జర్నలిజంలో కూడా ఉండవచ్చు. రాజకీయ పార్టీలు పత్రికలు స్థాపించడం గురించి రేవంత్ ప్రస్తావించారు. గతంలో వామపక్షాలు పత్రికలు పెట్టుకున్న విషయాన్ని చెప్పి వాటిలో పనిచేసే జర్నలిస్టులను గౌరవంగానే మాట్లాడారు. బహుశా ఒక వామపక్షం తమకు మిత్రపక్షంగా ఉన్నందున ఆయన జాగ్రత్తపడి ఉండవచ్చు. పైగా ఒక సిపిఐ నేతకు పదవి కూడా ఇచ్చారు.మిగిలిన మీడియా సంస్థలలో ఏవి రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్నవో ఆయన వివరించలేదు కాని, ప్రధానంగా ఆయన ఆగ్రహం అంతా బీఆర్ఎస్కు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక గురించి అయి ఉండాలి. అలాగే బీఆర్ఎస్కు కాస్త అనుకూలంగా ఉన్న యూట్యూబ్ చానళ్ల గురించి అయి ఉండాలి.బీజేపీ మీద కంటే ఆయన దృష్టి అధికంగా బీఆర్ఎస్ మీదే ఉన్న నేపథ్యంలో ఈ ప్రస్తావన వచ్చి ఉండాలి. రాజకీయ నాయకులకు సహజంగానే తమపై నెగిటివ్ వార్తలు రాసే పత్రికలన్నా, సంబంధిత జర్నలిస్టులన్నా కాస్త కోపమే ఉంటుంది. విశేషం ఏమిటంటే కాంగ్రెస్‌కు ఎప్పుడూ మీడియానే లేదనట్లుగా ఆయన మాట్లాడడం. నిజానికి ఇప్పుడు తెలంగాణలో ఉన్న అధిక మీడియా ఆయనకు మద్దతు ఇస్తున్నట్లే లెక్క. వెలుగు దినపత్రిక యజమాని ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారుడు కాంగ్రెస్ ఎంపీ ఆయన సోదరుడు కూడా ఎమ్మెల్యేనే. ఆ యజమాని కుటుంబం తొలుత కాంగ్రెస్ తదుపరి బీఆర్ఎస్, ఆ పిమ్మట బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంది. వారు ఎటు ఉంటే దానికి అనుగుణంగా మీడియాలో కొంతవరకు వార్తలు ఇచ్చే మాట నిజమే.అలాగే ఇతర పార్టీలకు కొంత వ్యతిరేకం అనిపించే స్టోరీలు ఇస్తుండవచ్చు. అంతమాత్రాన అది ఉన్మాదం అయిపోతుందా?. ఏ మీడియా అయినా వాస్తవాలు రాయాలని చెప్పాలి. ఒకవేళ పనికట్టుకుని అసత్యాలు రాస్తే ఖండనలు ఇస్తారు. మరీ తీవ్రమైన స్థాయిలో కల్పిత గాధలు రాస్తే వాటిపై చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలు పత్రికలు పెట్టుకోవడం కొత్త కాదు. కొందరు మీడియా యజమానులు కొన్ని పార్టీలకు కొమ్ముకాయడం, ఆ పార్టీల ద్వారా ప్రయోజనాలు పొందడం, వారు ఆశించిన పని జరగకపోతే బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు.ఇదీ చదవండి: మరకే మంచిదంటున్న చంద్రబాబు!వారిలో ఒకరిద్దరితో ఈయనకు సత్సంబంధాలే ఉన్నాయని అంటారు. అందరూ అలా చేస్తున్నారని కాదు. మీడియా రంగంలో ఒకప్పుడు కొంతైనా నిష్పక్షపాతంగా ఉండాలన్న అభిప్రాయం ఉండేది. కాని రానురాను, అవి తమకు నచ్చిన పార్టీలను భుజాన వేసుకుంటుండంతో రాజకీయ పార్టీలు, లేదా నేతలు సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకోవలసి వస్తోంది. వామపక్షాలైన సిపిఐ, సిపిఎం లకు ఎప్పటి నుంచో పత్రికలు ఉన్నాయి.కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించింది. తెలుగులో కూడా కాంగ్రెస్ పక్షాన మొదటి నుంచి కొన్ని పత్రికలు ఉండేవి. కాంగ్రెస్ మాజీ ఎంపీ కెఎల్ ఎన్ ప్రసాద్ ఆంధ్రజ్యోతి పత్రికను స్థాపించారు. మరో కాంగ్రెస్ మాజీ ఎంపీ టి.చంద్రశేఖరరెడ్డి డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి పత్రికలను నిర్వహించారు. ఆయన కుమారుడు కాంగ్రెస్ మాజీ ఎంపీ వెంకట్రామిరెడ్డి క్రానికల్ పత్రికకు సారధ్యం వహిస్తున్నారు. ఉదయం పత్రికను స్థాపించిన దాసరి నారాయణరావు తదుపరి కాంగ్రెస్ ఎంపీ అయి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. "వార్త పత్రిక యజమాని గిరీష్ సంఘీ కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యులు అయ్యారు. ఈనాడు దినపత్రికను జలగం వెంగళరావు సహకారంతో ఆరంభించారు. ఆ తర్వాత కాలంలో ఆయన తనది కాంగ్రెస్ వ్యతిరేక పత్రిక అని చెప్పడం విశేషం. తొలుత తెలుగుదేశానికి మద్దతు ఇచ్చిన ఆయన ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో విభేదాలు వచ్చాక చంద్రబాబును భుజాన వేసుకున్నారు.దీనితో పాటు మరో పత్రిక ఆంధ్రజ్యోతి కూడా కొత్త యాజమాన్యంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా చంద్రబాబు అనుకూల పత్రికగా మారింది. ఈ రెండు పత్రికల ఎజెండాను అర్థం చేసుకున్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తమకు కూడా పత్రిక ఉండాలని భావించి తన కుమారుడు జగన్‌తో సాక్షి పత్రిక, టివిలను ఆరంభించారు. వైఎస్ మరణం తర్వాత వైఎస్ బొమ్మను సాక్షి పత్రిక, టివిలలో ప్రముఖంగా వేసుకుని నడుపుతున్నారు. కాని ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం తెలుగు దేశం జెండా గుర్తు వేసుకోకుండా లేదా చంద్రబాబు మద్దతు దారులమని ప్రకటించకుండా పూర్తి స్థాయిలో ఆయనకు సపోర్టు ఇస్తున్నాయి. అదే సమయంలో చంద్రబాబు వ్యతిరేకులపై ప్రత్యేకించి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ పై నీచమైన స్థాయిలో పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తుంటాయి.చంద్రబాబుకు భజన చేసుకుంటే పర్వాలేదు కాని వాస్తవాలతో నిమిత్తం లేకుండా ఉన్మాదంగా వైఎస్సార్సీపీపై అధికారంలో ఉన్నప్పుడే కాక ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ కూడా అదే ధోరణిలో వెళుతున్నాయి. చిత్రం ఏమిటంటే ఈ రెండు మీడియాలు మరికొన్ని ఎల్లో మీడియా సంస్థలు తెలంగాణలో కాంగ్రెస్‌కు, ఏపీలో టీడీపీ జనసేన, బీజేపీ కూటమిని భుజాన వేసుకుని ప్రచారం చేస్తుంటాయి. ఈ మీడియాల యజమానులతో రేవంత్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ఒక మీడియా అధిపతి వద్దకు స్వయంగా రేవంత్ వెళ్లి వినయంగా వ్యవహరించిన ఘట్టం విమర్శలకు గురి అయ్యింది. ఈ మధ్యలో కొత్తగా వచ్చిన ఒక టివి, చానల్ రేవంత్ అనుచరుడిది అని చెబుతారు. నిజానికి రేవంత్ పైకి వచ్చింది మీడియా సహకారంతో అన్న విషయం అందరికి తెలిసిందే.ఇప్పుడు ఆయన మీడియాకు సుద్దులు చెప్పే దశకు చేరుకున్నారు .ఆలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక యూ ట్యూబ్ చానల్ లు నిర్వహించడం ...అప్పట్లో కేసిఆర్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా కధనాలు నడపించడంతో పోలీసులు దాడులు చేసి కేసులు పెట్టారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పై రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు .ప్రధాన మీడియా అయినా, యూ ట్యూబ్ చానల్ లు అయినా తమ పరిధులలో ఉండాలని చెప్పడంలో ఏలాంటి సందేహం అవసరం లేదు.కాని చంద్రబాబు ,రేవంత్ రెడ్డి వంటి నేతలు తాము అధికారంలో ఉంటే మీడియా ఒక రకంగాను, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా ఉండాలని కోరుకోవడంతోనే సమస్యలు వస్తాయి.గత కేసిఆర్ ప్రభుత్వం సచివాలయంలో జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టిన మాట నిజమే. అందువల్ల ఆయనకు అప్రతిష్ట వచ్చింది. ఇప్పుడు రేవంత్ అలాంటి అంక్షలు లేవని అనడం ఆహ్వనించదగ్గదే. కాని కొంత మంది జర్నలిస్టులపై ఉన్మాద ముద్ర వేయడం కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఆ ఉన్మాద పత్రికల యజమానులతో ఆయన స్నేహ సంబంధాలు నడుపుతున్న విషయం మర్చిపోవద్దు.:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నా కూతురు అల్లుడిని నదిలో పడేయండి: మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ(అజిత్‌పవార్) సీనియర్ నేత ధర్మారావు బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన కూతురు భాగ్యశ్రీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరుతుందంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. శనివారం అహేరి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లతో మాట్లాడుతూ.. నమ్మక ద్రోహానికి పాల్పడితే తన కూతురు భాగ్యశ్రీ, అల్లుడు రితురాజ్ హల్గేకర్‌లను ప్రాణహిత నదిలో పడేయాలని వ్యాఖ్యానించారు.అయితే మంత్రి ఈ వ్యాఖ్యలు ‘జన్సన్మాన్ యాత్ర’ సందర్భంగా ఎన్సీపీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సమక్షంలోనే చేయడం గమనార్హం. ‘పార్టీని విడిచివెళ్లే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మా కుటుంబంలోని కొందరు వేరే పార్టీలో చేరాలనుకుంటున్నారు. 40 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు ఎన్నో ఫిరాయింపులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు శరద్ పవార్‌కు చెందిన నాయకులు నా కుటుంబాన్ని విభజించి నా కుమార్తెను నాపై పోటీకి దింపాలని చూస్తున్నారు. నా అల్లుడు, కూతురిని నమ్మవద్దు. వాళ్లు నన్ను విడిచిపెట్టారు. అలాంటి వారిని సమీపంలోని ప్రాణహిత నదిలో తోసేయాలి, వారు నా కుమార్తెను తమ వైపుకు తిప్పుకొని సొంత తండ్రికి వ్యతిరేకంగా ఆమెను తయారు చేస్తున్నారు. తండ్రికి కూతురు కాలేకపోయిన అమ్మాయి మీకు ఏం అవుతుంది? దాని గురించి మీరు ఆలోచించాలి. ఆమె నీకు ఏం న్యాయం చేస్తుంది? వారిని నమ్మవద్దు. రాజకీయాల్లో నేను కుమార్తె, సోదరుడు సోదరిలా చూడను. ’అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్న ధర్మారావు ఆత్రమ్.. త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అహేరి నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగాలని చూస్తున్నారు. -
మేకప్ లేకుంటే కంగనాను గుర్తుపట్టరు: మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
మండీ: హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై ఆ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగత్ సింగ్ నేగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర శాసనసభలో చర్చ సందర్భంగా జగత్ సింగ్ కంగన అంశాన్ని ప్రస్తావించారు. ‘జూన్ చివర్లో ముంచెత్తిన వర్షాలు, వరదలతో మన రాష్ట్రం అతలాకుతలమైంది. నేతలంతా వరద ప్రభావితకాలంలోనే పర్యటించి బాధితులను ఓదార్చారు. కంగన ప్రాతినిధ్యం వహిస్తున్న మండీ నియోజకవర్గం సైతం వర్గం, వరద బారిన పడింది.కానీ కంగన పరద సమయంలో పర్యటించలేదు. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టి అంతా సర్దుకున్నాక తీరిగ్గా కంగన పర్యటించారు. వర్షాల కాలంలో ఆమె బయటకు రాదు. ఎందుకంటే వర్షం కారణంగా ఆమె వేసుకున్న మేకప్ పోతుంది. మేకప్ లేకుంటే కంగనను ఎవరూ గుర్తుపట్టలేరు. ఎదురుగా ఉన్నది కంగననా? లేక ఆమె తల్లినా? అనేది కూడా ఎవరూ పోల్చుకోలేరు" అని అన్నారు. దీంతో బీజేపీ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.People have lost everything, in the vastness of that loss I feel immense pain and grief. pic.twitter.com/Mfh1Gg3YUq— Kangana Ranaut (@KanganaTeam) August 6, 2024కాగా ఇటీవేల హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వరదలు అతలాకుతలం చేశాయి. ఈ వర్షాల వల్ల దాదాపు 153 మంది మరణించారు. సుమారు రూ.1271 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీంతో, వరద ప్రభావిత ప్రాంతాన్ని ఆగష్టు 7న కంగన సందర్శించి.. బాధితులను పరామర్శించారు. ఆ ఫొటోలను కంగనా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ ఫొటోలపై జగత్ సింగ్ నేగి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
స్మితా సబర్వాల్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి,హైదరాబాద్ : ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. స్మితా సబర్వాల్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. పూజా ఖేద్కర్ వ్యవహారం నేపథ్యంలో.. దివ్యాంగులపై ఆ మధ్య ఆమె చేసిన ఎక్స్ పోస్టులు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్‌లను తొలగించాలని, దివ్యాంగులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఆ పిటిషన్లకు విచారణ అర్హత లేదని తేలుస్తూ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు ఊరట లభించినట్లైంది.గతంలో స్మిత సబర్వాల్ ఏం మాట్లాడారు?ఈ ఏడాది జులై నెలలో మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ ఉదంతం, యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనామాపై స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా స్పందించారు.ఈ చర్చ మరింత విస్తృతమవుతున్న నేపథ్యంలో.. దివ్యాంగులను గౌరవిస్తూనే.. విమానయాన సంస్థ దివ్యాంగులను పైలట్‌గా నియమిస్తుందా? వైకల్యం కలిగిన సర్జన్‌ను మీరు నమ్మకంతో విశ్వసిస్తారా? ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌వోఎస్‌లు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినవి. ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాల్సి ఉంటుంది. ఈ పనులకు శారీరక దృఢత్వం అవసరం. ఇలాంటి అత్యున్నత సర్వీసులో అసలు ఈ కోటా ఎందుకవసరం? నేను కేవలం అడుగుతున్నా అని పేర్కొన్నారు.సబర్వాల్ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపాయి. దివ్యాంగులను అవమానించేలా, వారి శక్తిసామర్థ్యాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు స్మితా సబర్వాల్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా, ఆ పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. -
బొలిశెట్టి నోటి దురుసు.. మళ్లీ అల్లు అర్జున్‌పై కామెంట్స్
పశ్చిమగోదావరి, సాక్షి: తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి తన నోటి దురుసు ప్రదర్శించారు. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ అనుచిత వ్యాఖ్యలు చేసి.. ఆయన అభిమానుల ఆగ్రహానికి గురైన ఈ జనసేన ఎమ్మెల్యే.. మళ్లీ అదే పని చేశారు.‘‘అల్లు అర్జున్ మళ్లీ మాట్లాడితే కౌంటర్ ఇస్తా. నాకు, నా పార్టీతో అల్లు అర్జున్‌కు ఎలాంటి శత్రుత్వం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్‌పై ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. మొన్న ఆయన మాట్లాడితే మాట్లాడాను. మళ్లీ మాట్లాడితే మళ్లీ కౌంటర్ ఇస్తాను’’ అని బొలిశెట్టి మళ్లీ బన్నీ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడారు. అంతకు ముందు.. అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నట్టు నాకు తెలియదు. మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచిలు, షామియానా కంపెనీలులాగా పెట్టుకుంటే మేం చెప్పలేం. తనకు ఫ్యాన్స్ ఉన్నారని అల్లు అర్జున్ ఊహించుకుంటున్నారేమో! ఆయన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా మాట్లాడాలి. అలా కాదని.. నేను పెద్ద పుడింగిని, నా కిష్టమైతేనే వస్తా అంటే.. ఎవడికి కావాలి? మానేయ్ వెళ్లిపో.. ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి?.అల్లు అర్జున్ ఏమైనా పుడింగా.. ఆయనకు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే.. అని ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపాయి. బన్నీ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలను బొలిశెట్టి ఎదుర్కొంటున్నారు. -
Yogi Adityanath: విడిపోతే ఊచకోతే
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆగ్రాలో దుర్గాదాస్ రాథోడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ‘విడిపోతే ఊచకోత కోస్తారు’ అంటూ హిందువులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘బంగ్లాదేశ్‌లో ఏమవుతోందో చూస్తున్నారుగా! ఆ తప్పిదాలను భారత్‌లో పునరావృతం చేయొద్దు. విడిపోయామంటే ఇక అంతే సంగతులు. మనల్ని ఊచకోత కోస్తారు. కలిసుంటేనే సురక్షితంగా ఉండగలం. అభివృద్ధి చెందగలం’’ అన్నారు. అనంతరం ఈ వ్యాఖ్యలను ఎక్స్‌లో కూడా యోగి పోస్ట్ చేశారు. వీటిపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ముస్లిం విద్వేషంతో యూపీని విడదీస్తున్నదే యోగి అని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ‘‘మైనారిటీల ఇళ్లపైకి ఆయన ఇప్పటికే బుల్డోజర్లు నడుపుతున్నారు. ఇప్పుడిలా మరో అడుగు ముందుకేసి విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు. యూపీని మతపరంగా మరింతగా విడదీయజూస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. సీఎం పదవి చేజారేలా ఉండటంతో అభద్రతా భావంతోనే ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రధాని కావాలని యోగికి ఎంత కోరికగా ఉన్నా మరీ ఇప్పట్నుంచే ఇలా విదేశీ వ్యవహారాల్లో వేలు పెట్టొద్దంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. -
‘బాబుతో మాట్లాడతా.. పేకాట ఆడిస్తా..’!
సాక్షి, అనంతపురం: అనంతపురం ఆఫీసర్స్ క్లబ్లో పేకాట ఆడిస్తానంటూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పేకాట ఆడకపోవడం వల్ల కరోనా సమయం లో 22 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్లబ్బుల్లో పేకాట ఆడేందుకు కృషి చేస్తానంటూ ఎమ్మెల్యే ప్రసాద్ సెలవించారు.ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రజలు మండిపడుతున్నారు. అభివృద్ది మరిచి.. పేకాట కోసం సీఎంను కలుస్తారా? అంటూ విమర్శిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.పోలీసుల సమక్షంలోనే తన్నుకున్న టీడీపీ నేతలుఉరవకొండ: స్థానిక పోలీస్టు స్టేషన్ ఎదుటనే టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. పరస్పర దాడులతో రెచ్చిపోయారు. వివరాలు.... ఉరవకొండ మండలం నింబగల్లు వద్ద ఉన్న సమ్మర్ స్టొరేజీ ట్యాంక్ పరిశీలనకు సోమవారం ఉదయం మంత్రి పయ్యావుల కేశవ్ వెళ్లారు. అనంతరం కొనకొండ్లకు వెళుతున్న మంత్రి కాన్వాయ్ వెంట వాహనాల్లో టీడీపీ నేతలూ అనుసరించారు. ఉరవకొండలోని పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వెళుతున్న వై.రాంపురం గ్రామ టీడీపీ నేత సంజీవరాయుడు వాహనాన్ని వెనుకనే ఉన్న అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత వాహనం ఢీకొంది.ఆ సమయంలో వాహనాలను ఆపి ఇరువర్గాల నాయకులు వాదులాటకు దిగారు. వారి అనుచరుల మధ్య తోపులాట జరిగింది. అదే సమయంలో లత్తవరం గ్రామ మాజీ సర్పంచ్ గోవిందు కలుగజేసుకుని నడి రోడ్డు మీద తోపులాటకు దిగిన టీడీపీ నాయకులను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో సంజీవరాయుడు వర్గం గోవిందుపై తిరగబడింది. వెంటనే గోవిందు అనుచరులు వారితో కలబడ్డారు. పరస్పర దాడులతో ఆ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పి ఇరువర్గాలను అక్కడి నుంచి సాగనంపారు. -
బుద్ధి వైకల్యం ప్రమాదకరం.. స్మితా సబర్వాల్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: అంగవైకల్యం కంటే బుద్ధి వైకల్యం చాలా ప్రమాదకరమని అంటున్నారు తెలంగాణ మంత్రి సీతక్క. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ దివ్యాంగుల కోటా కామెంట్లపై నెలకొన్న వివాదంపై మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా సీతక్క తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘అంగవైకల్యం కంటే బుద్ధి వైకల్యం ప్రమాదకరం. అంతా అవగాహన ఉందని మాట్లాడే వాళ్లు.. ఇతరుల అభిప్రాయలు గుర్తించకపోవడం కరెక్ట్ కాదు. అది వాళ్ల మానసిక వైకల్యం. ఐపీఎస్‌కు ఫిజికల్ ఫిట్నెస్ అవసరం. పోలీసులకు కలెక్టర్లకు తేడా తెలియదా?.... ఒక అధికారిగా ఉండి ఆమె అలా మాట్లాడడం తప్పు. ఆమె అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆమె వ్యాఖ్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా’’.. అని మంత్రి సీతక్క అన్నారు.సాక్షితో స్మితా సబర్వాల్ఇదిలా ఉంటే.. తన ఎక్స్ పోస్ట్ వివాదం కావడంతో ఆమె నిన్న దానికి వివరణ ఇచ్చారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని, తాను తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని అన్నారామె. ఆపై వివాదం మరింత ముదిరింది. ఆమెపై ఇటు తెలంగాణలో, అటు ఏపీలోనూ పీఎస్‌లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. తాజాగా ఆమె సాక్షి టీవీ తో ఫోన్ లైన్లోనూ మాట్లాడారు. ‘‘నేను ఎవరినో కించపరచడానికో లేదంటే కాంట్రవర్సీ కోసమో ఆ వ్యాఖ్యలు చెయ్యలేదు. యూపీఎస్సీలో సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం నుంచి సీనియర్, ఫీల్డ్ వర్క్ చేసిన అధికారుల అభిప్రాయం తీసుకుంటుంది. రిజర్వేషన్ల అంశంలో నేను నా అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేశాను.. అని అంటున్నారామె. -
పచ్చ బిళ్ల వేసుకుని వెళ్లండి: అచ్చెన్నాయుడు
గంగ చంద్రముఖిగా మారేందుకు ఎక్కువ సమయమేమీ పట్టలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రెండు వారాల్లోపే టీడీపీ నేతలు తమ అసలు రంగును బయటపెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు దీనికి నిదర్శనంశ్రీకాకుళం, సాక్షి: ‘‘టీడీపీ కార్యకర్తల్లారా.. పసుపు బిళ్ల పెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లండి. మీకు అక్కడి అధికార యంత్రాంగం సకల రాచమర్యాదలు చేస్తుంది. అలా చేయకుంటే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు..’’ అంటూ ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.‘‘.. ఏ ఆఫీస్ అయినా సరే. పసుపు బిళ్ళతో వచ్చే టీడీపీ కార్యకర్తలకు పనులు చేయాల్సిందే. తమ కార్యాలయంలో అడుగు పెట్టిన టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు మర్యాదగా చూసుకోవాలి. మీకు కుర్చీ వేసి, టీ ఇచ్చి పనిచేస్తారు. అలా వారికి నేను ఆదేశాలను జారీ చేస్తా. మాట వినని ఉద్యోగులు ఎవరైనా ఉంటే వారిని నేను దారిలోకి తెస్తా. ఒకరో ఇద్దరో ఆ మాట జవ దాటితే ఏమవుతుందో ప్రత్యేకంగా నేను ఆ అధికారులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినా టీడీపీ కార్యకర్తల పనులు వేగంగా జరిగేలా నేనే సమావేశం పెట్టి ఆ అధికారుల్ని ఆదేశిస్తా’’ అని టీడీపీ కార్యకర్తలకు అచ్చెన్న భరోసా ఇచ్చారు. అంతేకాదు.. మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టవద్దు అంటూ కార్యకర్తలను ఉద్దేశించి రెచ్చగొట్టేలా అచ్చెన్నాయుడు మాట్లాడారు. సోమవారం సాయంత్రం శ్రీకాకుళం పట్టణ కేంద్రంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించగా.. ఆ భేటీలోనే అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. AP Animal Husbandry and Fisheries Minister Atchannaidu’s open warning to officials and brazen abuse of power. Honorary Minister tells govt officials to salute TDP workers and give them royal treatment in govt offices. #Atchannaidu #TDP #AP #AndhraPradesh pic.twitter.com/NSPY9FGFfQ— Sakshi Post (@SakshiPost) June 18, 2024 VIDEO CREDITS: Sakshi Post -
మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభు త్వంలో మంత్రిగా ఉన్న చౌదరి ఫవాద్ హుస్సేన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భారత్‌లో విద్వే షం, ఉగ్రవాద శక్తులను శాంతి సామరస్యా లు ఓడించాలని ఆకాంక్షించారు. దీనికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దీటైన సమాధానమిచ్చారు. ‘చౌదరి సాహిబ్, నేను, మా దేశ ప్రజలకు సమస్యల్ని పరిష్కరించుకునే సమర్థత ఉంది. మీ ట్వీట్ అవసరం లేదు. పాకిస్తాన్లో ప్రస్తుతం పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. మీ దేశం సంగతి చూసుకోండి. ఎన్నికలు భారత్ అంతర్గత వ్యవహారం. ఉగ్రవాదానికి అతిపెద్ద స్పాన్సర్‌గా ఉన్న పాకిస్తాన్ మా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించబోం’అని హెచ్చరించారు. ఆ తర్వాత కేజ్రీవాల్ అభిప్రాయాలపై చౌదరి ఫవాద్ హుస్సేన్ స్పందించారు. ‘ఉగ్రవాదానికి సరిహద్దులతో సంబంధంలేదు. పాక్‌లో ప్రస్తుతం పరిస్థితులు బాగానే ఉన్నాయి. మెరుగైన సమాజం కావాలనే ఎవరైనా కోరుకుంటారు’అని పేర్కొన్నారు. ఈ పరిణామంపై బీజేపీ స్పందించింది. ‘ఆప్ నేత అవినీతి రాజకీయాలకు పాక్ నుంచి కూడా వంతపాడుతున్నారు. ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారీ పాక్ నుంచి స్పందిస్తుంటారు. దేశ శత్రువులతో కేజ్రీవాల్ అంటకాగుతున్నారనడానికి ఇదే రుజువు’ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ పేర్కొన్నారు. -
నేను గెలుస్తానో లేదో..
సాక్షి,విశాఖపట్నం/పాలకొండ/వీరఘట్టం: విశాఖ ఎన్నికల సభలో జనసేన అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యువతను రెచ్చగొట్టేలా ప్రసంగించారు. యువత గుండెల్లో నిప్పంటించడానికే రాజకీయాల్లోకి వచ్చానని.. తనకు తిక్కరేగితే ముఖ్యమంత్రి అమ్మమొగుడు కూడా గుర్తుకు రాడంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదోనని.. పదవి వస్తుందో రాదోనని కూడా అనుమానం వ్యక్తంచేశారు. తాను నటుడిని కాకపోతే సాయుధ పోరాటంలోకి వెళ్లేవాడినన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గురువారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. అంతా అవగాహన చేసుకున్నాకే రాజకీయాల్లోకి వచ్చానని.. రాజకీయ నాయకుడికి ఓటమి తెలియాలని, అందుకే తాను గత ఎన్నికల్లో గాజువాక, భీమవరాల్లో ఓడిపోయినా బాధపడలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను యువత ఎందుకు స్ఫూర్తిగా తీసుకుంటున్నారని, ఆయనలో ఏముందని ప్రశ్నించారు. విశాఖపట్నంలో వైఎస్సార్సీపీ గూండాలను మోకాళ్లపై కొట్టి జగదాంబ జంక్షన్లో కూర్చోబెడతానని, తొక్కేస్తానని నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఒకపక్క ఆవేశంతోను, మరోవైపు నిర్వేదంతో ప్రసంగించిన పవన్ చెప్పిన అంశాలనే పదేపదే ప్రస్తావించి సభికులకు బోరు తెప్పించారు. పవన్ వచ్చిన కాసేపటికే జనం తిరుగు ముఖంపట్టారు. ఇక కూటమి అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అమలుచేస్తామని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో పవన్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపెద్ద పోస్టర్లు వేసుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. -
బాలకృష్ణ చిన్నల్లుడి వ్యాఖ్యలపై దుమారం
సాక్షి, విశాఖపట్నం: ‘ప్రభుత్వం అతి పెద్ద గూండా! అది వైఎస్సార్ సీపీ అయినా.. టీడీపీ ప్రభుత్వమైనా అంతే..’ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. విశాఖ లోక్‌సభకు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న శ్రీభరత్. ఈయన నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు, నారా లోకేష్ తోడల్లుడు కూడా. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే.. ‘ప్రభుత్వంతో పని చేయడం తనకు అస్సలు ఇష్టం ఉండదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ పోట్లాడలేరు. చేసిన పనులకు బిల్లు పెండింగులో ఉంటే కోర్టు కెళ్తే వస్తుందనుకుంటున్నారా? రాదు.. వెయ్యి కండిషన్లు పెడతారు. ఏదో లోపం వెతుక్కుంటూ పోతారు. అందుకే ప్రభుత్వాలపై నాకు నమ్మకం కుదరదు’ అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో డబ్బు ఖర్చు పెట్టే వారి దగ్గరకే ఎక్కువ మంది జనం చేరతారన్నారు.‘ఎక్కువ మంది మన గురించి మాట్లాడాలన్నా.. వారికి చేరువకావాలన్నా డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టాలి. కార్యకర్తలు రాజకీయ నాయకుడి దగ్గరకు విద్య, వైద్య, ఆరోగ్య అవసరాల కోసం వస్తుంటారు. పార్టీ కార్యక్రమాలు చేస్తున్నామని, గుడులు కడుతున్నాం విరాళాలివ్వండి అంటూ వస్తారు. నేను మనీ పాలిటిక్స్‌ను నమ్మను’ అని పేర్కొన్నారు. అందుకే తాను ఎంపీగా పోటీ చేయాలని ఎంచుకున్నట్లు చెప్పారు. ఎంపీ అయితే డబ్బుల విషయంలో నేరుగా జోక్యం(డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్) ఉండదన్నారు. ఎంపీ అభ్యర్థయితే డబ్బు ఖర్చు పెట్టనక్కర్లేదని, తన లోక్‌సభ పరిధిలో పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల అభ్యర్థులే అవన్నీ భరిస్తారని కుండబద్దలు కొట్టారు.ఇప్పటికే శ్రీభరత్ ఎన్నికల ఖర్చుల విషయంలో క్యాడర్‌కు చుక్కలు చూపిస్తున్నారని టీడీపీ శ్రేణులు లబోదిబోమంటున్నారు. ఎన్నికల ఖర్చు విషయంలో ఆయన పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులపైనే భారాన్ని మోపారన్న విషయం తేటతెల్లమవుతోందని టీడీపీ నాయకులే చెబుతున్నారు. కోట్లకు అధిపతి అయిన శ్రీభరత్‌ను ఎంపీగా గెలిపించే బాధ్యతను తమపైకి నెట్టేయడమేమిటని అసెంబ్లీ అభ్యర్థులు కిందామీదా పడుతున్నారు. మొత్తం మీద శ్రీభరత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అటు టీడీపీలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అవుతున్నాయి. -
అమరజీవికి అవమానం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ తండ్రి జగన్నాథం ఇటీవల యాదవులను నోటికొచ్చినట్లు తిట్టారు. వారిని కించపరిచేలా మాట్లాడటమే కాకుండా ఫోన్ సంభాషణలో బెదిరించారు.ఇప్పుడు గొండు శంకర్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాతీపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములను అవమానపరిచేలా మాట్లాడారు. శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్‌కు ఆ పేరు తీసేసి అంధవరపు తవిటయ్య పేరు పెడతామని, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడికి ప్రపోజల్ పెట్టామని బహిరంగ ప్రకటన చేశారు. తండ్రీకొడుకులిద్దరు చేసిన కామెంట్స్ ఇప్పుడు హా ట్ టాపిక్ అయ్యాయి.ఇప్పటివరకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకులు నగర అభివృద్ధికి పాటు పడ్డారు. ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే జిల్లా కేంద్రం అభివృద్ధిలో కీలక భూ మిక వహించారు. రిమ్స్ ఆస్పత్రి, ప్రధాన వంతెనలు, రోడ్లు, కలెక్టరేట్, స్టేడియం, పార్కులు, మా ర్కెట్, శాలిహుండం, అరసవల్లి దేవాలయం అభివృద్ధి, శ్రీకూర్మం దేవాలయం అభివృద్ధి, కళింగపట్నం బీచ్ అభివృద్ధి, డంపింగ్ యార్డ్, తాగునీరు సరఫరా... ఇలా ఎన్నో అభివృద్ధి పనులతో శ్రీకాకుళం నగరంతో పాటు నియోజకవర్గ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు.జిల్లాలోనైతే వంశధార ప్రాజెక్టు, ఆఫ్‌షోర్ ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్, మడ్డువలస రి జర్వాయర్, అంబేడ్కర్ యూనివర్సిటీ, మూలపేట పోర్టు, ఉద్దానం కిడ్నీ ఆస్పపత్రి, ఉద్దానం మంచినీ టి ప్రాజెక్టు తదితర అభివృద్ధి పనుల్లో భాగస్వా మ్యం అయ్యారు. ఆయనే కాదు గుండ అప్పలసూర్యనారాయణ, గుండ లక్ష్మీదేవి, అంతకుముందు పనిచేసిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా శ్రీకాకుళం అభివృద్ధికి కృషి చేసి, చరిత్రలో నిలిచిపోయారు. కానీ ఎన్నడూ ఇలా ప్రముఖుల పేర్లు తీసేస్తామని వివాదాస్పదంగా వ్యవహరించలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న గొండు శంకర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తండ్రి ఒక కులాన్ని దూషించగా, గొండు శంకర్ ఏకంగా వైశ్యుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టేలా, రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములను అవమానపరిచేలా వ్యాఖ్య లు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నగరంలో కీలక వ్యక్తుల పేరుతో కొత్తగా ఏవైనా ఏర్పాటు చేసి వాటికి పేరు పెట్టడమో, లేదంటే వారిని గౌరవించేందుకు, స్మరించేందుకు విగ్రహాలు ఏర్పాటు చేయడమో చేయాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అలాంటి గౌరవం ఎంతో మంది ప్రముఖులకు లభించింది. బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహాలను నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. అంధవరపు వరం మరణించాక ఆయన విగ్రహాన్ని ప్రధాన జంక్షన్లో ఏర్పాటు చేశారు. వీరితో పాటు మరికొంత ప్రముఖుల విగ్రహాలను నగరంలో ఆవిష్కరించారు. అంతేగానీ అప్పటికే ఉన్న వాటికి ప్రముఖుల పేర్లు తీసేయడం చేయలేదు. గొండు శంకర్ సమాజానికి ఏం సంకేతాలు ఇద్దామనుకుంటున్నారో గానీ రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి, ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరుతో ఉన్న శ్రీకాకుళం మున్సిపల్ మార్కెట్‌కు ఆయన పేరు తీసేసి అంధవరపు తవిటయ్య పేరు పెడతామనడం వివాదాస్పదమైంది. ఆయన పేరు ను ఏదైనా కొత్తగా ఏర్పాటు చేసిన దానికి పెడతామ ని చెప్పాలే తప్ప రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాముల పేరును తీసేస్తామనడం, దానికో సం ఎంపీ రామ్మోహన్నాయుడికి ప్రతిపాదన పెట్టా మనడం వైశ్య వర్గాన్నే ఆశ్చర్యపరిచింది. వైశ్యుల ముద్దు బిడ్డగానే కాదు రాష్ట్రమంతా గొప్పగా భావించే పొట్టి శ్రీరాములు పేరు తీయాలన్న ఆలోచన రావడమే దారుణమని, ఇలాంటి వికృత చర్యలతో ఏం చేద్దామనుకుంటున్నారని వైశ్య వర్గాలే కాదు ప్రతి ఒక్కరూ తప్పు పడుతున్నారు. -
టీడీపీ నేత జేసీ పవన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
Kolkata: ‘దీదీ’పై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
కలకత్తా: పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతాబెనర్జీపై బీజేపీ నేత దిలీప్‌ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ కూతురునని చెప్పుకుంటున్న మమతాబెనర్జీ తన తండ్రి ఎవరో ముందు డిసైడ్ చేసుకోవాలన్నారు. దిలీప్‌ఘోష్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘మమత గోవా వెళ్లి గోవా బిడ్డనంటుంది. త్రిపుర వెళ్లి త్రిపుర బిడ్డనంటుంది. అసలు తన తండ్రి ఎవరో ముందు మమత ముందు నిర్ణయించుకోవాలి’ అని ఘోష్ వ్యాఖ్యానించారు.ఘోష్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. గతంలో దుర్గా మాతపై, ఇప్పుడు మమతా బెనర్జీపై ఘోష్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు నైతికంగా ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. కాగా, 2021లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ వాడిన ‘బెంగాల్ వాంట్స్ టు గో విత్ డాటర్’ నినాదం బాగా పాపులర్ అయింది. ఆ ఎన్నికల్లో తృణమూల్ ఘన విజయం సాధించింది. ఇదీ చదవండి.. అందుకే వరుణ్‌గాంధీని బీజేపీ పక్కకు పెట్టింది -
ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాకు ఊరట
చెన్నై: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాతోపాటు మరో డీఎంకే నేత చట్టసభ సభ్యులుగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. అయితే, డీఎంకే నాయకులు వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. సనాతన ధర్మాన్ని హెచ్ఐవీ, మలేరియా, డెంగ్యూతో పోల్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా మాట్లాడడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమేనని తేలి్చచెప్పింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ సమాజంలో విభజన తెచ్చేలా వ్యవహరించడం ఏమిటని అసహనం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. -
ఉదయనిధి స్టాలిన్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, సాక్షి: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల కేసుకు సంబంధించిన ఆయన వేసిన ఓ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపింది కోర్టు. ఆ సమయంలో ఆయన తీరును తీవ్రంగా తప్పు బట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. పరిణామాలు ఎలా ఉంటాయో తెలిసి కూడా అలా మాట్లాడడం ఏంటని? ప్రశ్నించింది. తమిళనాడు సహా దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో తన వ్యాఖ్యలపై నమోదైన కేసులన్నింటిని(ఎఫ్ఐఆర్)లను ఒకే చోట విచారించేందుకు అనుమతించాలంటూ ఉదయనిధి స్టాలిన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే.. స్టాలిన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన బెంచ్.. ఉదయనిధి స్టాలిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రాజ్యాంగం మీకు అందించిన ఆర్టికల్ 19(1)(a)ను(వాక్ స్వాతంత్ర్యం-భావ వ్యక్తీకరణ) మీరే అగౌరవపర్చుకున్నారు. అలాగే.. ఆర్టికల్ 25(మత స్వేచ్ఛా హక్కు)ను కూడా మీరే ఉల్లంఘించుకున్నారు. ఇప్పుడు.. మీ హక్కును రక్షించాలంటూ మీరే ఆర్టికల్ 32( తమ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు రాజ్యాంగపరమైన పరిష్కారాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడం) ప్రకారం కోర్టును ఆశ్రయిస్తారు. మీరు చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి పరిణామాలు ఉంటాయో మీకు తెలియందా?.. మీరు సామాన్యులేం కాదు కదా. మీరు ఒక మంత్రి. జరగబోయే పరిణామాలన్నీ కూడా మీకు తెలిసే ఉంటుంది’’ అని మందలించింది ధర్మాసనం. ఎఫ్ఐఆర్లను ఒకే చోట విచారించే అంశంపై ఆయా రాష్ట్రాల హైకోర్టులనే ఆశ్రయించాలని ఉదయనిధి స్టాలిన్ తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వికి బెంచ్ సూచించింది. అయితే.. సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ‘‘ఇప్పటికే ఆయా హైకోర్టులను ఆశ్రయించామని.. గతంలో ‘‘అమిష్ దేవగన్, అర్నాబ్ గోస్వామి, నుపూర్ శర్మ, మొహమ్మద్ జుబెర్’’ కేసుల్లో నిందితులకు న్యాయస్థానాలు ఊరట ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. దీంతో.. ఉదయనిధి స్టాలిన్ పిటిషన్‌ను పరిశీలిస్తామని చెబుతూ.. తదుపరి విచారణను మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఏమన్నారంటే.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కిందటి ఏడాది సెప్టెంబర్‌లో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సనాతన ధర్మాన్ని మలేరియా.. డెంగీలతో పోల్చిన జూనియర్ స్టాలిన్, దానిని నిర్మూలించాల్సిన అవసరం ఉందంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని.. క్షమాపణలు చెప్పాలంటూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. మరోవైపు రాజకీయంగా బీజేపీ.. ఇండియా కూటమిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే.. తనపై విమర్శలకు ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యల్ని మరోలా అర్థం చేసుకున్నారని.. సమాజంలో దుష్టశక్తులెన్నో పెరిగిపోవడానికి సనాతన ధర్మం ఒక కారణం అవుతోందనే తాను అన్నానని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ విమర్శలను ఎదుర్కొనేందుకు.. న్యాయపరమైన పోరాటానికి తాను సిద్ధం అంటూ ప్రకటించారాయన. -
నాకు ఓటేయకుంటే తిండి మానండి
ముంబై: తల్లిదండ్రులు తనకు ఓటేయకుంటే రెండు రోజులపాటు అన్నం మానేయాలంటూ మహారాష్ట్రలో అధికార శివసేన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సంతోష్ బంగార్ చిన్నారులకు చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల సంబంధ కార్యక్రమాల్లో చిన్నారులను ఉపయోగించుకోరాదంటూ ఎన్నికల కమిషన్ ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేయడం తెలిసిందే. బంగార్ ఇటీవల ఓ జిల్లా పరిషత్ పాఠశాలలో పదేళ్లలోపు చిన్నారులతో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరేమీ తినకుండా ఉంటే ఏమైందని అమ్మానాన్న అడుగుతారు. బంగార్కే ఓటేయండి. అప్పుడే తింటాం అని చెప్పండి’’ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే ఓటేయాలని తల్లిదండ్రులకు చెబుతామంటూ పిల్లలతో వల్లె వేయించారాయన. దీనిపై విపక్షాలన్నీ మండిపడ్డాయి. -
జస్టిస్ రాకేష్‌పై ‘సుప్రీం’ సీరియస్!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న సమయంలో జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ దొనడి రమేష్ తమ తీర్పులో అటు అత్యున్నత న్యాయస్థానం ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పక్షపాతంతో చేసిన ఆ అభ్యంతరకర, వివాదాస్పద వ్యాఖ్యలను ఆ తీర్పు నుంచి సుప్రీంకోర్టు తాజాగా తొలగించింది. ఇలాంటి అసంబద్ధ, పక్షపాత వ్యాఖ్యలతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. ఈమేరకు ఆ వ్యాఖ్యలను తీర్పు నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం.త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఏం జరిగిందంటే...? మిషన్ బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై 2020 డిసెంబర్లో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ రమేష్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ జరిగినప్పుడల్లా జస్టిస్ రాకేశ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అభ్యంతరకర, ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందా..? రాష్ట్రంలో ఆర్థిక అత్యాయక పరిస్థితి ఉందా? అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాజ్యాల విచారణను గమనించిన ప్రతి న్యాయవాది జస్టిస్ రాకేష్ కుమార్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నట్లు అర్థం చేసుకున్నారు. ఈ ధోరణిని ఎన్నోసార్లు భరిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు మీరు విచారిస్తే న్యాయం జరిగే అవకాశం లేదని, అందువల్ల ఈ వ్యాజ్యాల విచారణ నుంచి తప్పుకోవాలంటూ (రెక్యూజ్) జస్టిస్ రాకేష్ కుమార్‌ను కోరింది. ఆ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. దీంతో జస్టిస్ రాకేష్ కుమార్ తీరు ప్రజలందరికీ తెలిసింది. ప్రభుత్వం న్యాయబద్ధంగా చేసిన అభ్యర్థనతో జస్టిస్ రాకేష్ కుమార్ అహం దెబ్బ తిన్నది. తనను విచారణ నుంచి తప్పుకోమనడం ధిక్కారపూర్వక చర్యే అవుతుందని జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ రమేష్‌ల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ధర్మాసనం తరఫున జస్టిస్ రాకేష్ కుమారే తీర్పు రాశారు. విచారణ నుంచి తప్పుకోవాలన్న ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. కొలీజియంపై తీవ్ర వ్యాఖ్యలు సర్వ సాధారణంగా ప్రభుత్వం చేసిన అభ్యర్థన పట్ల అభ్యంతరం ఉంటే ఏ న్యాయమూర్తి అయినా ఉత్తర్వులు జారీ చేసి అంతటితో ఆగిపోతారు. జస్టిస్ రాకేష్ కుమార్ మాత్రం అలా ఆగలేదు. ఆ తీర్పు ద్వారా తన అసలు నైజాన్ని బయటపెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపైనే కాకుండా అప్పటి ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేసినందుకు సుప్రీంకోర్టు కొలీజియంపై సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏకంగా 55 పేజీల తీర్పు వెలువరుస్తూ మిషన్ బిల్డ్‌పై దాఖలైన వ్యాజ్యాలతో సంబంధం లేని అంశాలను ప్రస్తావించారు. ఏ పిటిషనర్ ప్రస్తావించని అంశాలతోపాటు తమ ముందున్న కేసుతో సంబంధం లేని వివరాలను, వెబ్సైట్లలో ఉన్న వాటిని సైతం తీర్పులో పొందుపరిచారు. ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌పై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బనాయించిన కేసుల గురించి తన తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించారు. జగన్మోహన్రెడ్డి గురించి తనకు తెలియదని, తరువాత చాలా ఆసక్తికర విషయాలు తెలుసుకున్నానంటూ ఓ న్యాయమూర్తి చేయకూడని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా గూగుల్‌లో ఖైదీ నెంబర్ 6093 అని టైప్ చేస్తే చాలా సమాచారం వస్తుందంటూ వ్యాఖ్యానించారు. తన పదవీ విరమణకు ఒక్క రోజు ముందు జస్టిస్ రాకేష్ కుమార్ ఈ వివాదాస్పద తీర్పును వెలువరించారు. ఆ మరుసటి రోజు ఆయన పదవీ విరమణ చేసి ఇంటికి వెళుతుండగా టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ మద్దతుదారులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఆయనను పసుపు పూలతో ముంచెత్తారు. ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసి స్వామిభక్తిని చాటుకున్నారు. ‘సుప్రీం’ విస్మయం.. ఈ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం జస్టిస్ రాకేష్ కుమార్ తీర్పుపై తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఆ తీర్పు తమను ఆందోళనకు గురి చేస్తోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. నిమిషం ఆలస్యం చేయకుండా జస్టిస్ రాకేష్ కుమార్ తీర్పు అమలుపై స్టే విధిస్తూ 2021 ఫిబ్రవరి 10న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అనంతరం ఈ వ్యాజ్యంపై జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా మరోసారి విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. జస్టిస్ రాకేష్ కుమార్ కేసుతో సంబంధం లేని అంశాలను ప్రస్తావించారని నివేదించారు. పలు అంశాలపై అవసరం లేని వ్యాఖ్యలు చేశారన్నారు. సుప్రీంకోర్టు కొలీజీయంపై కూడా విమర్శలు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల పాలనపరంగా పలు ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియంను విమర్శిస్తూ జస్టిస్ రాకేష్ కుమార్ తన తీర్పులో చేసిన వ్యాఖ్యలను తొలగించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ జస్టిస్ రాకేష్ కుమార్ వ్యాఖ్యలన్నింటినీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత వివాదాస్పదుడు పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ న్యాయమూర్తిగా మారిన జస్టిస్ రాకేష్ కుమార్ న్యాయవ్యవస్థలో అత్యంత వివాదాస్పదుడిగా పేరుపొందారు. బిహార్ మహాదళిత్ వికాస్ మిషన్ ఫండ్ నిధుల విషయంలో ఐఏఎస్ అధికారి రామయ్య ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆయన తోసిపుచ్చారు. అయితే కింది కోర్టు రామయ్యకు బెయిల్ ఇవ్వడాన్ని జస్టిస్ రాకేష్ కుమార్ తప్పుబడుతూ సుమోటోగా విచారణ జరిపారు. తాను బెయిల్ నిరాకరించిన వ్యక్తికి కింది కోర్టు బెయిల్ ఎలా ఇస్తుందని ప్రశ్నిస్తూ దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సివిల్ కోర్టులో అవినీతి జరుగుతోందంటూ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. పాట్నా హైకోర్టులో అవినీతి బహిరంగ రహస్యమంటూ ఓ తీర్పే రాశారు. అవినీతి విషయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్నారు. జస్టిస్ రాకేష్ కుమార్ తీరును పాట్నా హైకోర్టు న్యాయమూర్తులందరూ సీరియస్‌గా తీసుకున్నారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షాహీ నేతృత్వంలో 11 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ప్రత్యేకంగా సమావేశమై జస్టిస్ రాకేష్ కుమార్ తీర్పును రద్దు చేసింది. జస్టిస్ రాకేష్ కుమార్ తీరుపై ఆ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆయనను కేసుల విచారణ బాధ్యత నుంచి తప్పించారు. అటు తరువాత సుప్రీంకోర్టు జస్టిస్ రాకేష్‌ను 2019లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేసింది. రాజ్యాంగ విచ్ఛిన్నమంటూ రభస ఏపీ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించాక కొద్ది రోజులు మౌనం పాటించిన జస్టిస్ రాకేష్ కుమార్ ఆ తరువాత నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. చిన్న చిన్న కేసుల్లో కూడా ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ హెబియస్ కార్పస్‌పై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛినం జరిగిందంటూ విచారణ చేపట్టారు. పలు సందర్భాల్లో డీజీపీని ఆక్షేపించారు. రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై తీర్పు రాసే అవకాశం కనిపించకపోవడంతో ముఖ్యమంత్రి జగన్‌ను లక్ష్యంగా చేసుకునేందుకు మిషన్ బిల్డ్ కేసును ఎంచుకున్నారు. బహుమానంగా ఎన్సీఎల్ఏటీ పదవి.. పదవీ విరమణ అనంతరం జస్టిస్ రాకేష్ కుమార్‌కు జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) జుడీషియల్ సభ్యుడిగా అవకాశం దక్కింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకే ఎన్సీఎల్ఏటీ పదవి దక్కిందన్నది న్యాయవ్యవస్థలో అందరికీ తెలిసిన విషయమే. ఎన్సీఎల్టీలో కూడా ఆయన వివాదాస్పదంగా వ్యవహరించారు. ఏకంగా సుప్రీంకోర్టు ఆదేశాలనే ఉల్లంఘించారు. తనకు కావాల్సిన విషయం విచారణ చేపట్టారు. ఫినోలెక్స్ కేబుల్ వార్షిక సర్వసభ్య సమావేశం ఫలితాల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారు. దీంతో సుప్రీంకోర్టు ఆయనపై కన్నెర్ర చేసి కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాకేష్ కుమార్ తీరు వల్ల ఎన్సీఎల్ఏటీ కుళ్లిపోయిందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో జస్టిస్ రాకేష్ కుమార్ బాగోతం దేశమంతా తెలిసిపోవడంతో గత్యంతరం లేక ఎన్సీఎల్ఏటీ జుడీషియల్ సభ్యుడి పదవికి రాజీనామా చేశారు. -
కొలికపూడి, టీవీ5 సాంబశివరావులను విచారించిన సీఐడీ
సాక్షి, అమరావతి: సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తలనరికి తెస్తే రూ.కోటి ఇస్తామన్న వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు, టీవీ 5 న్యూస్ యాంకర్ సాంబశివరావులను సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో సోమవారం ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దాదాపు 5.30 గంటలపాటు వారిద్దరిని కలిపి, విడివిడిగానూ విచారించారు. టీవీ 5 చానల్ నిర్వహించిన డిబేట్ ద్వారా తన హత్యకు ప్రేరేపించేందుకు ఉద్దేశపూర్వకంగానే కొలికపూడి శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యలు చేశారని రామ్‌గోపాల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అందుకు బాధ్యులుగా ఆయన పేర్కొన్న కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు, టీవీ 5 చానల్ ఎండీ, చీఫ్ ఎడిటర్ బి.ఆర్.నాయుడు, న్యూస్ యాంకర్ సాంబశివరావు, ఫిరోజ్, టీవీ 5 మేనేజింగ్ ఎడిటర్లపై పలు సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 3న కొలికపూడి శ్రీనివాసరావును సీఐడీ అధికారులు మొదటి దఫా విచారించారు. కాగా ఆరోజు న్యూస్ యాంకర్ సాంబశివరావు విచారణకు హాజరుకాలేదు. దాంతో వారిద్దరిని సోమవారం సీఐడీ అధికారులు విచారించారు. ఆర్జీవీని హత్య చేసేలా ఎందుకు వ్యాఖ్యానించారు? ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారా? ఆ వ్యాఖ్యలతో ప్రేరేపితమై ఎవరైనా అవాంఛనీయ ఘటనకు పాల్పడితే పరిణామాలు ఎలా ఉంటాయో అవగాహన ఉందా.. సమాజంలో విద్వేషాలు రేకెత్తించకూడదన్న అవగాహన లేదా..? అంటూ వారిద్దరిపై సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ సీఐడీ అధికారుల ప్రశ్నలకు కొలికపూడి శ్రీనివాసరావు, సాంబశివరావు సూటిగా సమాధానం చెప్పలేదని సమాచారం. వారిద్దరి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న సీఐడీ అధికారులు ఈ నెల 12న మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. అందుకు వారిద్దరూ సమ్మతించారు. -
Lakshadweep vs Maldives: ముదిరిన లక్షద్వీప్–మాల్దీవుల వివాదం
న్యూఢిల్లీ: ‘లక్షద్వీప్–మాల్దీవుల’ వివాదం ముదురుతోంది. మన పర్యాటక రంగంపై మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలతో మొదలైన ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ పిలుపుకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఆ దేశ దౌత్యవేత్త అలీ నజీర్ మొహమ్మద్‌తో భారత హైకమిషనర్ మును ముహావర్ సోమవారం సమావేశమయ్యారు. భారత్ పట్ల, ప్రధాని మోదీ పట్ల మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలను ఎండగట్టారు. వారిని మాల్దీవులు ఇప్పటికే సస్పెండ్ చేయడం తెలిసిందే. అయినా దీనిపై భారతీయ సమాజంలో ఆగ్రహావేశాలు తగ్గలేదు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, శ్రద్దా కపూర్, వెంకటేశ్ ప్రసాద్, వీరేందర్ సెహా్వగ్ తదితర సెలెబ్రిటీలు కూడా ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’కు జై కొట్టారు. మాల్దీవుల పర్యటన మానేసి లక్షద్వీప్, అండమాన్ వంటి భారతీయ రమణీయ కేంద్రాలకు వెళ్లాలంటూ ఫొటోలను షేర్చేశారు. మాల్దీవులతో వాణిజ్య కార్యకలాపాలు తగ్గించుకోవాలని కన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ పిలుపునిచి్చంది. 3,400 శాతం పెరిగిన సెర్చింగ్! లక్షద్వీప్‌లో మోదీ పర్యటన తర్వాత ఆన్లైన్ వేదికల్లో భారత దీవుల కోసం వెతికే వారి సంఖ్య ఏకంగా 3,400 శాతం పెరిగిందని మేక్మైట్రిప్ సంస్థ పేర్కొంది. మాల్దీవులకు పర్యాటకుల్లో భారతీయుల సంఖ్యే అత్యధికమని ఆ దేశ పర్యాటక శాఖ గణాంకాల్లో వెల్లడైంది. గతేడాది 2.09 లక్షల మంది భారతీయులు అక్కడికెళ్లారు. 2022లో 2.4 లక్షలు, 2021లో 2.11 లక్షల మంది పర్యటించారు. అంతేకాదు, కోవిడ్ కాలంలోనూ 63,000 మంది అక్కడ పర్యటించారు! ట్రెండింగ్‌లో లక్షద్వీప్ మాల్దీవులకు బదులు భారతీయ పర్యటక కేంద్రాలకే వెళ్దామన్న సెలబ్రిటీలు పిలుపుతో లక్షద్వీప్ కోసం ఆన్లైన్లో సెర్చింగ్ అనూహ్యంగా పెరిగింది. ‘లక్షద్వీప్’ పదంతో ప్రపంచవ్యాప్తంగా సెర్చింగ్ చేస్తున్న వారి సంఖ్య గత రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత ఎక్కువ స్థాయికి చేరుకుందని ‘గూగుల్ ట్రెండ్స్’ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఈజ్‌మైట్రిప్ సంస్థ భారత్‌కు మద్దతుగా మాల్దీవులకు విమానాల బుకింగ్స్‌ను రద్దుచేసింది. ‘‘మాల్దీవులు/సీషెల్స్ మాదిరే లక్షద్వీప్‌లోని బీచ్‌లు, పరిసరాలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడే పర్యటించండి’’ అని సంస్థ సీఈవో నిషాంత్ పిట్టి చెప్పారు. -
తేజస్వీ యాదవ్‌పై ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం
పాట్నా: సీఎం నితీష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సమర్ధించడాన్ని ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తప్పుబట్టారు. తేజస్వీ యాదవ్ పాఠశాలకు ఎప్పుడూ వెళ్లలేదని, కనీసం తొమ్మిదో తరగతి కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. సెక్స్ ఎడ్యూకేషన్ పట్ల తేజస్వీ యాదవ్‌కు ఎలాంటి అవగాహన లేదని దుయ్యబట్టారు. తేజస్వీ యాదవ్ ఏ పాఠశాలకు వెళ్లారో బయటకు వెళ్లడించాలని ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు. ఎక్కడ నుంచి సెక్స్ ఎడ్యుకేషన్‌ను నేర్చుకున్నారో? బహిర్గతం చేయాలని కోరారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడినంత అసభ్యకరమైన భాషలో పాఠశాలల్లో లైంగిక విద్య బోధించరని చెప్పారు. సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యలపై తేజస్వీ స్పందించిన తీరు ఆయనకు జ్ఞానం లేనివాడనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. స్త్రీలు చదువుకుంటే.. భర్తలను కంట్రోల్లో పెట్టి జనాభాను తగ్గిస్తారని జనాభా నియంత్రణపై మాట్లాడిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళలు విద్యావంతులైతే కలయిక వేళ భర్తలను అదుపులో పెడతారని, తద్వారా జనాభా తగ్గుతుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతులు అవుతున్నందువల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు తగ్గిందని, త్వరలోనే 2కు చేరుతుందని నితీశ్ అసెంబ్లీలో అన్నారు. ఆ సమయంలో అసెంబ్లీలోనే ఉన్న తేజస్వీ యాదవ్.. నితీష్ వ్యాఖ్యలను సెక్స్ ఎడ్యుకేషన్‌గా పేర్కొంటూ.. పాఠశాలల్లో కూడా చర్చిస్తారని అన్నారు. అయితే.. బీజేపీ, మహిళా సంఘాల ఆందోళనలతో నితీష్ కుమార్ తన వ్యాఖ్యలపై ఎట్టకేలకు క్షమాపణలు కోరారు. ఇదీ చదవండి: సీఎం రేసుపై సచిన్ పైలెట్ కీలక వ్యాఖ్యలు -
నోరుజారిన సీఎం నితీష్.. జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు
బిహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నోరుజారారు. జనాభా నియంత్రణపై రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ నితీష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ఎందుకు పడిపోయిందో వివరిస్తూ ముఖ్యమంత్రి అసభ్యకరమైన, కించపరిచే పదజాలాన్ని ఉపయోగించారు. నితీష్ మాట్లాడుతూ.. ‘గతంలో 4.3 శాతం సంతానోత్పత్తి రేటు ఇప్పుడు 2.9 శాతానికి పడిపోయింది. సెక్స్ ఎడ్యుకేషన్ (లైంగిక విద్య) గురించి ఈ తరం అమ్మాయిలకు అవగాహన పెరిగింది. ఏ టైంలో ఏం చేయాలో వారి బాగా తెలుసు. అందుకే జనాభా తగ్గుతోంది’ అని వ్యాఖ్యానించారు. సీఎం వ్యాఖ్యలపై అసెంబ్లీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు షాక్‌కు గురయ్యారు. జనాభా నియంత్రణపై ఆయన చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయంటూ మహిళా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీష్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. సీఎం నితీష్‌ను అత్యంత నీచమైన వ్యక్తిగా పేర్కొంటూ విమర్శలు గుప్పించింది. ‘దేశ రాజకీయాల్లో నితీష్ అంత అసభ్యకరమైన నాయకుడిని చూడలేదు. అతని మనసుంతా చెత్త ఆలోచనలతో నిండిపోయి ఉంది. సీఎం డబుల్ మీనింగ్ వ్యాఖ్యాలను నిషేధించాలి’ ట్విటర్ వేదికగా డిమాండ్ చేసింది. సీఎం వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో జేడీయూ మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీలు మాత్రం సీఎం వ్యాఖ్యలను సమర్ధించుకున్నాయి. పాఠశాలల్లో బోధించే సెక్స్ ఎడ్యుకేషన్ విద్య గురించి నితీష్ మాట్లాడుతున్నారని, ఆ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు సైన్స్, జీవశాస్త్రంలో దీన్ని నేర్చుకుంటారని అన్నారు. చదవండి: Bihar Caste Reservation: రిజర్వేషన్లపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. -
‘అంబేద్కర్ చెప్పినదానికంటే నేనేం ఎక్కువ మాట్లాడలేదు’
చెన్నై: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు ఎప్పటికీ కట్టుబడి ఉంటానని తమిళనాడు నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు. ఈ వ్యవహారంలో తమిళనాడు పోలీసులు వ్యవహరించిన తీరుపై మద్రాస్ హైకోర్టు మండిపడింది. ఉదయనిధితో పాటు పీకే శేఖర్ బాబుపై చర్యలు తీసుకోవడంలో పోలీస్ శాఖ తాత్సారం చేసిందంటూ న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పనిలో పనిగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను కోర్టు తప్పుబట్టింది. అయితే.. కోర్టులో ఇవాళ జరిగిన పరిణామాలపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. తాను న్యాయపరంగా ఈ అంశాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నానంటూ ప్రకటించారు. అంతేగానీ సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి మాత్రం తీసుకోబోనని స్పష్టం చేశారు. ‘‘నేనేం తప్పుగా మాట్లాడలేదు. మాట్లాడింది సరైందే కాబట్టి న్యాయపరంగా ఈ అంశాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. గతంలో నేను ఇచ్చిన ప్రకటనలో ఏమాత్రం మార్పు లేదు. నేను నమ్మే సిద్ధాంతాన్నే బయటకు చెప్పా. అలాగని రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ చెప్పినదానికంటే ఎక్కువ మాట్లాడలేదు. పెరియార్, తిరుమవలవన్‌లు ఏం చెప్పారో.. అంతకంటే కూడా నేను ఎక్కువ మాట్లాడలేదు. నేను ఎమ్మెల్యే అయినా, మంత్రిని అయినా, యువ విభాగపు నేతను అయినా.. రేపు పదవుల్లో లేకపోయినా ఫర్వాలేదు. కానీ, మనిషిగా ఉండడమే నాకు ముఖ్యం. నీట్ అంశం ఆరేళ్లనాటిది. కానీ, సనాతన ధర్మం వందల ఏళ్లనాటి అంశం. కాబట్టి, సనాతన ధర్మాన్ని ఎప్పటికీ మేం వ్యతిరేకిస్తూనే ఉంటాం అని స్టాలిన్ పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోలుస్తూ దానిని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. అది సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకమని నాటి ప్రసంగంలో పేర్కొన్నారాయన. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. డీఎంకేపై బీజేపీ అయితే తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇవాళ్టి కోర్టులో.. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల విషయంలో తమిళనాడు పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని.. చర్యలు తీసుకోలేని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. ఆపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘అధికారంలో ఉన్న ఓ వ్యక్తి మతాలు, కులాలు, సిద్ధాంతాల పేరిట అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం సరికాదు. బదులుగా అవినీతి, అంటరానితనం సామాజిక రుత్మతలనో లేదంటే ఆరోగ్యాన్ని పాడు చేసే మాదకద్రవ్యాలు, మత్తుపానీయాలనో నిర్మూలించాలని ప్రకటన చేయడం సరైందని ఈ న్యాయస్థానం అభిప్రాయపడుతుంది. విభజన ఆలోచనలను ప్రోత్సహించడానికి లేదంటే ఏదైనా భావజాలాన్ని రద్దు చేయడానికి ఏ వ్యక్తికి హక్కు ఉండదు. ఉదయనిధిపై చర్యలు తీసుకోకపోవడంలో పోలీస్ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది’’ అని అని జస్టిస్ జీ జయచంద్రన్ వ్యాఖ్యానించారు. -
రాహుల్ గాంధీపై బీజేపీ వివాదాస్పద ఫొటో.. రావణుడితో పోల్చి..
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎన్నికల హడావుడి ఇప్పటి నుంచే మొదలైంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. లంకాధిపతి రావణుడి అవతారంలో ఉన్న ఒక ఫొటోను బీజేపీ ట్విట్టర్లో షేర్ చేయడంతో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. రావణుడి అవతారంలో రాహుల్ గాంధీ ఫొటోను బీజేపీ ట్విట్టర్లో షేర్ చేసింది. ఇక, రాహుల్ ఫొటోకు మరింత వివాదాస్పదంగా టైటిల్‌ను పెట్టింది. దుర్మార్గుడు, ధర్మ వ్యతిరేకి, రాముడికి వ్యతిరేకి అంటూ కింద క్యాప్షన్ రాసుకొచ్చింది. భారత దేశాన్ని నాశనం చేయడమే రాహుల్ గాంధీ లక్ష్యం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ కామెంట్స్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రొడక్షన్, జార్జ్ సోరోస్ దర్శకత్వం వహించారని ఆ పోస్టర్లో పేర్కొంది. ఈ వివాదాస్పద ఫొటోపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. The new age Ravan is here. He is Evil. Anti Dharma. Anti Ram. His aim is to destroy Bharat. pic.twitter.com/AwDKxJpDHB — BJP (@BJP4India) October 5, 2023 ఈ ఫొటోపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ.. రాహుల్ గాంధీని రావణుడిగా చిత్రీకరిస్తూ గ్రాఫిక్ ఫోటోలు విడుదల చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మాజీ అధ్యక్షుడిపై హింసను ప్రేరేపించడం, రెచ్చగొట్టడం కోసమే ఈ పోస్ట్ చేశారని మండిపడ్డారు. దేశాన్ని విభజించాలని చూసిన కొన్ని శక్తులు.. రాహుల్ గాంధీ తండ్రి, అమ్మమ్మలను హత్య చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక అబద్ధాల కోరు అని ఆరోపించారు. తన పార్టీని ఇలాంటి అసహ్యకరమైన పోస్టులు చేయాలని కోరడం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని.. ఇలాంటివి చాలా ప్రమాదకరమైనవని మండిపడ్డారు. ఇలాంటి వాటికి కాంగ్రెస్ పార్టీ బెదిరిపోదని గట్టి సమాధానం ఇచ్చారు. What is the real intent of an atrocious graphic portraying @RahulGandhi as Ravan by the BJP’s official handle? It is clearly intended to incite and provoke violence against a Congress MP and a former President of the party, whose father and grandmother were assassinated by forces… — Jairam Ramesh (@Jairam_Ramesh) October 5, 2023 ఇదిలా ఉండగా.. జార్జ్ సోరోస్ ఒక హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త. అతను దేశాన్ని అస్థిరపరిచేందుకు భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడని ఆరోపణలున్నాయి. అతను అనేక భారతదేశ వ్యతిరేక ప్రచారాలను నడుపుతున్నాడని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటనలో హంగేరియన్-అమెరికన్ వ్యాపారి నిధులు సమకూర్చుకున్న వ్యక్తులను కలిశారని బీజేపీ ఆరోపించింది. జార్జ్ సోరోస్‌తో అనుబంధం ఉన్న సునీతా విశ్వనాథ్‌ను రాహుల్ అమెరికా పర్యటనలో కలిశారా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని కాంగ్రెస్‌ను బీజేపీ కోరింది. यह कार्टून 1945 में अग्रणी पत्रिका में छपा था, जिसका सम्पादक नाथूराम गोडसे था। तीर चलाने वालों में एक सावरकर है। गांधी और कांग्रेस हमेशा से इनके निशाने पर रहे हैं, लेकिन न तब डरे थे, न आज डरे हैं और न ही आगे डरने वाले हैं। https://t.co/fyfiX2JtBz pic.twitter.com/HkuyYTrWke — Jairam Ramesh (@Jairam_Ramesh) October 5, 2023 ఇది కూడా చదవండి: సిసోడియా అరెస్ట్‌పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం.. సాక్ష్యం ఎక్కడ? -
మొత్తానికి ఆయన చెప్పినట్టే జరిగిందిగా.. కపిల్ సిబాల్
జైపూర్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ.. బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన మతపరమైన వ్యాఖ్యలను స్వయంగా బీజేపీ నేతలే ఖండించగా పార్టీ అధిష్టానం మాత్రం ఆయనకు జైపూర్‌లోని టోంక్ జిల్లా ఎన్నికల ప్రచార నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. దీనిపై మరోసారి డానిష్ అలీ స్పందిస్తూ ఇది ఆయన చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలకు దక్కిన బహుమతి అయి ఉంటుందని అన్నారు. ప్రమోషన్.. పార్లమెంట్లో రమేష్ బిధురీ చేసిన వ్యాఖ్యలకు ఆయనపై సీరియస్ యాక్షన్ తీసుకుంటుందన్న అధిష్టానం ఆయనకు టోంక్ జిల్లా ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గుర్జార్ సామాజిక వర్గానికి చెందిన ఆయన టోంక్ జిల్లాలోని నాలుగు స్థానాల్లో పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ నాలుగు స్థానాల్లో ఒక చోట ఆ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ పోటీ చేయనుండటంతో ఇక్కడ పోటీ ఎలా ఉండబోతోందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే బాధ్యతలు స్వీకరించిన రమేష్ బిధూరీ బుధవారం ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి నేతృత్వంలో జరిగిన సమావేశంలో కూడా పాల్గొన్నారు. राजस्थान प्रदेश भाजपा कार्यालय जयपुर में ज़िला टोंक की समन्वय बैठक में प्रदेश अध्यक्ष श्री @cpjoshiBJP जी द्वारा संगठनात्मक कार्यों व चुनाव की तैयारियों के साथ सेवा सप्ताह के कार्यक्रमों सहित आगामी कार्यकर्ताओं के प्रवास योजनाओं की जानकारी लेते हुए। pic.twitter.com/wK63ctXR6X — Ramesh Bidhuri (@rameshbidhuri) September 27, 2023 అక్కడ ఆయనైతేనే కరెక్టని.. సమావేశాలు ముగిశాక డానిష్ అలీ మాట్లాడుతూ ఈ ప్రత్యేక సమావేశాల్లో ఎంపీలను మతపరంగా దూషించడానికే నిర్వహించారని బీజేపీ పార్టీ ఆయన చేసిన వ్యాఖ్యలకు శిక్షిస్తుందో లేక ప్రమోషన్ ఇస్తుందో చూద్దామని ఆరోజే వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు ఆయన చెప్పిందే నిజం కావడంతో రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ తీవ్రస్థాయిలో స్పందించారు. కపిల్ సిబాల్ మాట్లాడుతూ.. బీజేపీ ఎప్పుడూ విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసేవారికి రివార్డులు ఇస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే రమేష్ బిధూరిని టోంక్ జిల్లా ఇంఛార్జిగా నియమించిందన్నారు. ఆ జిల్లాలో 30 శాతం ముస్లింలే ఉన్నారు కాబట్టే రమేష్ బిధూరీకి ఆ బాధ్యతలు అప్పగించిందన్నారు. నేనేమీ అనలేదు.. అంతకుముందు డానిష్ అలీ ప్రధాని కులాన్ని దూషించిన కారణంగానే రమేష్ బిధూరీ అలా మాట్లాడాల్సి వచ్చిందంటూ బీజేపీ నేతలు విమర్శించగా అందులో డానిష్ అలీ ఎక్కడా ప్రధాని కుల ప్రస్తావన చేయలేదని.. ప్రజాస్వామ్య దేవాలయంలోకి ఒక తీవ్రవాదిని ఎలా అనుమతించారని మాత్రం ప్రశ్నించిన సంభాషణలు మాత్రమే ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. Despite the abuses and extreme provocation, I didn’t utter a single word that could harm the sanctity of the temple of democracy. Even I didn’t repeat what Mr @rameshbidhuri said about me and my community. Inspite of it @BJP4India is trying it’s best to create a false narrative. pic.twitter.com/yApQ6w1vJR — Kunwar Danish Ali (@KDanishAli) September 26, 2023 ఇది కూడా చదవండి: ‘అందుకే బాబుకు కోర్టులు బెయిల్ ఇవ్వడం లేదు’ -
‘జాహ్నవిని ఉద్దేశించి నవ్వలేదు’
సియాటెల్‌లో రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని జాహ్నవి (Jaahnavi Kandula) మృతి చెందడంపై అక్కడి పోలీసు అధికారి ఒకరు చులకనగా మాట్లాడడం.. తెలిసిందే. ఆ అధికారి తీరుపై ఎన్నారైలు నిరసనలు వ్యక్తం చేస్తుండగా.. కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ సైతం అమెరికాను డిమాండ్ చేస్తోంది. అయితే, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ వ్యాఖ్యలు జాహ్నవిని కించపరిచే ఉద్దేశంతో చేసినవి కావంటూ అధికారి డేనియల్ ఆర్డరర్ పేరిట ఓ లేఖ బయటకు వచ్చింది. ఏపీ కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) ఈ ఏడాది జనవరి 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా.. పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందింది. అయితే.. సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ మైక్ సోలన్‌కు ప్రమాదం గురించి సమాచారం అందిస్తూ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ అడెరెర్.. చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయ్యింది. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి Just a regular person.. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉంది. కేవలం ఓ చెక్ ఇస్తే సరిపోతుందని.. 26 ఏళ్ల వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది’ అని నవ్వుతూ మాట్లాడాడు. ఈ క్లిప్ బయటకు రావడంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. అటు భారత్ కూడా దీనిపై అసహనం వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారి డేనియల్‌పై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులకు డేనియల్ అడెరెర్ రాసిన లేఖను సియాటెల్ పోలీసు అధికారుల గిల్డ్ విడుదల చేసింది. న్యాయవాదులను ఉద్దేశిస్తూనే ఆ వ్యాఖ్యలు చేశాను. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు న్యాయస్థానంలో వాదనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వాను అంతే.. అని డేనియల్ లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు. ‘‘జనవరి 23న పెట్రోలింగ్ వాహనం వల్ల ప్రమాదం జరిగిందని తెలిసి సాయం చేసేందుకు నేను వెళ్లాను. తిరిగి ఇంటికి వస్తుండగా తోటి అధికారికి ఫోన్ చేసి ఘటన గురించి చెప్పాను. అప్పటికి నా విధులు పూర్తయ్యాయి. అయితే బాడీక్యామ్ కెమెరా ఆన్‌లో ఉన్న విషయం నాకు తెలియదు. నేను జరిపిన వ్యక్తిగత సంభాషణ అందులో రికార్డ్ అయ్యింది. అయితే, ఇలాంటి కేసుల్లో కేవలం న్యాయవాదులు జరిపే వాదనల గురించే నేను మాట్లాడాను. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనిషి ప్రాణం విలువ గురించి ఇరు పక్షాల లాయర్లు ఎలా వాదిస్తారో, బేరసారాలు ఎలా సాగిస్తారో గతంలో చాలా సార్లు చూశాను. అవి ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వుకున్నాను’’ అని డేనియల్ తన లేఖలో వివరించారు. అంతేగానీ.. బాధితురాలిని అవమానించేలా తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. పూర్తి వివరాలు తెలియకపోతే.. ఇలాంటి భయానక ఊహాగానాలే వైరల్ అవుతాయని అన్నారు. దీనిపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని, ఉన్నతాధికారులు ఏ శిక్ష విధించినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని తెలిపారు. ఈ వివాదంపై సియాటెల్ పోలీసు అధికారుల గిల్డ్, డేనియల్ అడెరెర్‌కు మద్దతుగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘వైరల్ అయిన దృశ్యాలు బాడీక్యామ్ వీడియో రికార్డ్ చేసినవి. అయితే, ఆ సంభాషణల్లో ఒకవైపు మాత్రమే బయటికొచ్చింది. అందులో ఇంకా చాలా వివరాలున్నాయి. అవి ప్రజలకు తెలియవు. పూర్తి వివరాలు తెలియకపోవడంతో అక్కడ అసలేం జరిగిందో చెప్పడంలో మీడియా విఫలమైంది’’ అంటూ డేనియల్‌కు మద్దతుగా గిల్డ్ వ్యాఖ్యానించింది. మరోవైపు డేనియల్ అడెరెర్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని అమెరికాలో ఆన్లైన్ పిటిషన్లు మొదలయ్యాయి. -
సనాతన ధర్మం శాశ్వతం: సీఎం యోగి
లక్నో: సనాతన ధర్మంపై రాజకీయ రగడ కొనసాగుతున్న వేళ.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. సనాతన ధర్మం శాశ్వతమైందని.. దానిని నిర్మూలించే దమ్ము ఎవరికీ లేదని పేర్కొన్నారు. లక్నో పోలీస్ లైన్స్‌లో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో ఆయన ప్రసంగిస్తూ.. ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావనను తీసుకురాకుండా పదునైన విమర్శలు గుప్పించారాయన. ‘‘మన సనాతన సంస్కృతిని చూపిస్తూ మన వారసత్వాన్ని అవమానించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రావణుడి దురహంకారం.. సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టలేకపోయింది. కంసుడి సవాల్‌తో సనాతన ధర్మం ఇంచు కూడా కదల్లేదు. బాబర్, ఔరంగజేబుల్లాంటి వాళ్ల దురాగతాలకు సనాతన ధర్మం చెక్కుచెదరలేదు. అలాంటిది.. రాజకీయ పరాన్నజీవులు పిలుపు ఇచ్చినంత మాత్రాన సనాతన ధర్మం తుడిచిపెట్టుకుపోతుందా? అంటూ సీఎం యోగి పేర్కొన్నారు. ఇలాంటి రాజకీయ పరాన్నజీవులు.. ఇలాంటి ప్రకటనలు చేస్తున్నందుకు సిగ్గుపడాలి. సూర్యుడి మీద ఉమ్మేస్తే.. సూర్యుడికేం కాదు. ఆ ఉమ్ము ఉమ్మినవాళ్ల ముఖం మీదే పడుతుంది అంటూ ఉదయనిధికి పరోక్ష చురకలంటించారు. ‘‘దేశం సరైన పురోగతిలో వెళ్తుండడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రపంచ స్థాయిలో ప్రతిష్టాత్మక స్థానంలో నిలవడాన్ని తట్టకోలేకపోతున్నారు. అమృత్ కాల్లో.. భారతదేశం వేగంగా ప్రగతి సాధిస్తోంది. ప్రతిరోజూ కొత్త విజయాలు సాధిస్తోంది. దేశ పురోగతికి అడ్డుపడే క్రమంలోనే.. కొంతమంది మన సనాతన ధర్మంపై వేళ్లు చూపుతున్నారు’’ అంటూ సనాతన ధర్మంపై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నవాళ్లపై యోగి మండిపడ్డారు. -
సనాతన ధర్మం వ్యాఖ్యలపై ధీటుగా స్పందించండి.. ప్రధాని మోదీ ఆదేశం
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలు పెనురాజకీయ దుమారాన్నే సృష్టించాయి. ఇప్పటివరకు ఈ అంశంపై మౌనంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జరిగిన మంత్రుల సమావేశంలో స్పందించారు. ఈ వ్యాఖ్యలపై సరైన విధంగా స్పందించాలని ఆదేశించారు. ఇది హైలైట్ చెయ్యండి.. బుధవారం జరిగిన క్యాబినెట్ మంత్రుల సమావేశంలో ప్రధాని రెండు అంశాలపై వారికి స్పష్టతనిచ్చారు. మొదటిది సనాతన ధర్మంపై డీఎంకే నేత చేసిన వ్యాఖ్యలపై కఠినంగా స్పందించమన్నారు. రెండవది 'ఇండియా' 'భారత్' అంశంపై మాట్లాడవద్దని మంత్రులకు ప్రధాని మోదీ సలహా ఇచ్చారు. కేవలం పార్టీ అధికార ప్రతినిధులు మాత్రమే ఈ అంశంపై స్పందిస్తారని మిగతావారంతా సనాతన ధర్మాన్ని కించపరచిన వ్యాఖ్యలకు దీటుగా సమాధానమివ్వాలని కోరారు. కుర్రనేత తగ్గేదెలే.. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకపక్క బీజేపీ నేతలంతా ఈ వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండిస్తుంటే.. మరోపక్క డీఎంకే యువనేత మాత్రం తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని మళ్ళీ మళ్ళీ ఇదే మాట అంటానని తెగేసి చెబుతున్నారు. కేంద్రం కులవివక్షను పెంచి పోషిస్తోందని, నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఉదయనిధి స్టాలిన్ పైన ఆ వ్యాఖ్యలను సమర్ధించినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే పైన కూడా యూపీలోని రామ్‌పూర్‌లో కేసు నమోదైంది. ఇది కూడా చదవండి: రామ్‌నాథ్ కోవింద్ కమిటీ మొదటి సమావేశంలో కీలకాంశాలు -
బీఆర్ఎస్కు ఓటేసే వారికే దళితబంధు, ప్రభుత్వ పథకాలు
చిన్నగూడూరు: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారికి, తమకు ఓటు వేసే వారికే దళితబంధు, ఇత ర ప్రభుత్వ పథకాలు ఇస్తామని తెలిపారు. శనివారం ఆయన జిల్లాలోని చిన్నగూడూరు మండల కేంద్రంతోపాటు విస్సంపల్లి, తుమ్మల చెరువు తండా, చేపూరి తండాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి స్సంపల్లిలో దళితబంధు రాలేదని స్థానిక దళితులు ఎమ్మెల్యేను అడిగేందుకు వచ్చారు. అయితే బీఆర్ ఎస్ నాయకులు అడ్డుపడటంతో ఇరువురికి వా గ్వాదం జరిగింది. అనంతరం జరిగిన సభలో రెడ్యానాయక్ మాట్లాడుతూ నియోజకవర్గానికి 100 దళి తబంధు యూనిట్లు వస్తే అందులో 80 విస్సంపల్లి గ్రామానికి మంజూరు చేశామన్నారు. ‘గతంలో ఈ గ్రామం నుంచి ఓట్లు పడలేదు. ఎవరు ఓటు వేస్తారో, వేయరో మాకు తెలుసు. మా పార్టీలో పని చేసే వారికే, మాకు ఓటు వేసే వారికి మాత్రమే దళితబంధు, ప్రభుత్వ పథకాలు ఇస్తాం’అని అనడంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. -
నాగర్ కర్నూల్ పీఎస్ లో రేవంత్ పై కేసు నమోదు
-
చిరంజీవి ఎందుకు ఉలిక్కిపడ్డారు? అదన్న మాట అసలు సంగతి!
మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఎందుకో ఉలిక్కి పడినట్లు ఉంది. ఆయనలో సడన్‌గా భయం ఏర్పడడానికి కారణాలు ఉండవచ్చు. చిరంజీవి అంటే ఒక నీతిమంతుడని, నిజాయితీపరుడని, ప్రజాసేవాభిలాషి అని అంతా అనుకుంటారు. అభిమానులతై ఆయన మాటకు ప్రాణం ఇస్తారు. రాజకీయాలలో సఫలం కాకపోయినా, ప్రజాభిమానానికి కొదవలేని సినీ రంగ ప్రముఖుడిగా వెలుగొందుతున్నారు. ఒక రకంగా సినీ పరిశ్రమను శాసిస్తున్న ఆయన ఎందుకు సినీ పరిశ్రమను పిచ్చుకతో పోల్చారు? రెమ్యునరేషన్ గురించి ఎవరూ అడగవద్దని ఎందుకు అంటున్నారు? ఎందుకు ఆకస్మికంగా గుర్తుకు వచ్చాయి? ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, ఇతర ప్రజా సమస్యలు ఆయనకు ఎందుకు ఆకస్మికంగా గుర్తుకు వచ్చాయి? ఇది తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతు ఇవ్వడం కోసమా? లేక రెమ్యునరేషన్ వ్యవహారం దేశ వ్యాప్త చర్చ అయితే అది అందరికి చుట్టుకుని సినీ పరిశ్రమలో నల్లధనంపై ఫోకస్ పెరుగుతుందన్న సంశయమా? చిరంజీవి హీరోగా నటించిన అనేక సినిమాలలో నిజాయితీ గురించి, అధికార యంత్రాంగంలో ఉండే అవినీతికి వ్యతిరేకంగా చేసే కార్యక్రమాల గురించి బోలెడెన్ని సన్నివేశాలు ఉంటాయి. ఆయన యాక్ట్ చేసిన ఠాగూర్ సినిమా మొత్తం అవినీతికి వ్యతిరేకంగా ఉంటుంది. ఆ సినిమాలను చూసి ఎందరో స్పూర్తి పొంది ఉండవచ్చు. ముందుగా ఎవరికి చెప్పి ఉండాలి? ఠాగూర్ సినిమాలో పాడే శ్రీశ్రీ గీతాలతో చిరంజీవిలో ఒక విప్లవకారుడిని చూసుకుని ఉంటారు. కాని ఇప్పుడు అదే చిరంజీవి తమకు సినీ నిర్మాతలు ఇచ్చే పరిహారం అంటే రెమ్యునరేషన్‌తో ప్రభుత్వాలకు పని ఏమిటని అమాయకంగా ప్రశ్నించారు. నిజంగానే చిరంజీవి ఈ రెమ్యునరేషన్ వివాదాలు ఉండకూడదనుకుంటే ముందుగా ఆయన ఎవరికి చెప్పి ఉండాలి? తన సోదరుడు, జనసేన పార్టీని నడుపుతున్న పవన్ కళ్యాణ్‌కు కదా! ఆయనే ఎవరూ అడగకపోయినా తాను రోజుకు రెండుకోట్లు సంపాదిస్తానని పదే, పదే ఎందుకు చెబుతూ వచ్చారు? అదేదో త్యాగం చేసి రాజకీయాలలోకి వచ్చినట్లు పోజు పెడుతుంటారు కదా! పవన్ కళ్యాణ్ ఏడాదికి కనీసం వంద రోజులు షూటింగ్లలో ఉంటారని అనుకుంటే 200 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కాని ఆయన ఆదాయ పన్ను శాఖకు సమర్పించే రిటర్న్‌లో పది కోట్ల రూపాయలు కూడా చూపించడం లేదని ఆయన ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా కొందరు ఆడిటర్లు విశ్లేషించారు. సినిమా రంగంతో పాటు రాజకీయాలోను వెలుగు వెలగాలని ఆశిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలో నిజాయితీ గురించి కథలు చెబుతున్నప్పుడు ప్రత్యర్ధులు ఆయన ఆదాయం గురించి, ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ గురించి ప్రశ్నించకుండా ఉంటారా?. చిరంజీవి కంగారు పడ్డారా? పార్లమెంటులో ఒక బిల్లుపై చర్చ సందర్భంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక హిందీ హిరో గురించి చెబుతూ రెమ్యునరేషన్ 250 కోట్ల పైన ఉంటుందని అన్నారట. దానికి ఏమైనా చిరంజీవి కంగారు పడ్డారా?. అదే విధంగా నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తన సోదరుడు పవన్ కళ్యాణ్ ఆదాయంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినట్లు జరుగుతున్న ప్రచారం గురించి భయపడుతున్నారనుకోవాలి. కేంద్రం నిజంగానే సీరియస్‌గా తీసుకుంటే అందరి ఆదాయాలు బయటకు వచ్చి వందల కోట్ల రూపాయల పన్ను కట్టవలసి వస్తుందని చిరంజీవి ఆందోళన చెందుతున్నారా? చెప్పేటందుకే నీతులని అంటారు. అది రాజకీయాలకే కాదు.. సినిమాలకు వర్తిస్తుందని చిరంజీవి మాటలు రుజువు చేస్తున్నాయి. తమ వెనుక బోలెడు మచ్చలు పెట్టుకుని.. కేవలం సినీ రంగం వారు సినిమాలకు పరిమితం అయితే వారి జోలికి ఎవరూ వెళ్లరు. తమ వెనుక బోలెడు మచ్చలు పెట్టుకుని రాజకీయాలలోకి వచ్చి ఆయా పార్టీల వారిని విమర్శిస్తే వారు ఊరుకుంటారా? వీరి వెనుక ఉండే బొక్కలను వెదకకుండా ఉంటారా?. ఒకాయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా, కొందరితో అక్రమ సంబంధాలు నెరిపినట్లు ఆరోపణలు ఎదుర్కుంటూ, బయట రాజకీయాలలోకి వచ్చి మహిళల ఉద్దారకుడిగా పిక్చర్ ఇవ్వాలనుకుంటే ఎదుటివారు చూస్తూ ఊరుకుంటారా?. కాంగ్రెస్‌లో ఎందుకు విలీనం చేశారు? అంబటి రాంబాబుపై తనకు అవకాశం ఉంది కదా అని సినిమాలో ఆయన పాత్రను సృష్టించి అవమానించడం ఎందుకు?. అప్పుడు ఎక్కడ కొట్టాలో రాంబాబుకు తెలియదా? దెబ్బకు దెయ్యం వదిలిందిన్నట్లు సినిమా పరిశ్రమ మొత్తం తమ నల్లధనం విషయాలు బయటకు పొక్కి ఎక్కడ అల్లరి అవుతామో అన్న భయంతో మాట్లాడుతున్నారు. చిరంజీవి కూడా అందుకు మినహాయింపు కాదని అర్ధం అవుతుంది. ఆయన సినిమాల ఆధారంగానే రాజకీయాలలోకి వచ్చారు కదా? సినిమావాళ్ల జోలికి రాజకీయ నేతలు ఎందుకు వస్తున్నారంటూప్రశ్నించేవారు. అదే సూత్రం సినిమా వారికి వర్తిస్తుంది కదా?. సినిమా వారు తమ గ్లామర్‌ను పెట్టుబడిగా పెట్టి రాజకీయాలోకి ఎందుకు వస్తున్నట్లు?నిజంగా ప్రజాసేవే పరమావధి అనుకుంటే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఓటమి తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో ఎందుకు విలీనం చేశారు? కేంద్ర మంత్రి పదవి ఎందుకు తీసుకున్నారు? కేంద్ర మంత్రి పదవి ఎందుకు తీసుకున్నారు?. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు ఆయన చేసిన మేలు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఎవరినో మోయడానికి రాజకీయాలలో ఎందుకు కొనసాగుతున్నారు?. ఆదాయపన్ను శాఖ అప్పుడప్పుడు సినిమా నిర్మాతలు, డైరెక్టర్లు, నటులపై దాడులు చేసి పెద్ద ఎత్తున బ్లాక్ మనీని పట్టుకుని టాక్స్ కట్టించుకుంటుంది. దాని నుంచి తప్పించుకోవడానికి కొందరు యాక్టర్లు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో జతకడుతుంటారన్న భావన ఉంది. వీటన్నిటి గురించి ఎవరూ మాట్లాడరాదని చిరంజీవి అనుకోవడమే పెద్ద తప్పు. సడన్‌గా ఎందుకిలా? ప్రజా జీవితంలో ఎవరైనా పారదర్శకంగా ఉండాలి. కేవలం సినిమాలలో పాత్రలకే పరిమితం అయి, ఆ తర్వాత తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే అది అభిమానులను మోసం చేసినట్లు కూడా అవుతుంది. చిరంజీవి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించి అనవసరంగా వివాదంలో ఇరుక్కున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హడావుడిగా రాష్ట్రాన్ని విభజించాలన్న తాపత్రయంలో ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టలేదన్నది విమర్శ. అప్పుడు ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఇప్పటికీ ఆయన కాంగ్రెస్‌ను వీడినట్లు ఎక్కడా చెప్పలేదు. కాకపోతే రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు చెబుతూ వస్తూ, సడన్ గా రాజకీయాలు మాట్లాడడమే సమస్య అయింది. ఆ సంగతి చిరంజీవికి తెలియదా? పోనీ ఈయన ఒక నటుడిగా, సామాజిక బాధ్యతతో ప్రత్యేక హోదాపై ఒక సినిమా తీసి ఉండవచ్చు. ఏపీలో పేదల సంక్షేమం జరుగుతోందో లేదో ఒకసారి ఆయన ఏదైనా ప్రాంతానికి వెళ్లి జనంతో మాట్లాడితే తెలుస్తుంది కదా! ఉపాధి, అవకాశాల మీద అంత ఆసక్తి ఉంటే చిరంజీవి విశాఖ లేదా ఇతర ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో సినీ పరిశ్రమ అభివృద్దికి ఎందుకు కృషి చేయడం లేదు?. తెలంగాణ రాజధానిగా ఉన్నహైదరాబాద్లో ఉంటూ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడితే సరిపోతుందా?. ముఖ్యమంత్రి జగన్ తాను అధికారంలోకి రాగానే లక్షన్నర మందికి ఓకేసారి ఉద్యోగాలు కల్పించిన సంగతి హైదరాబాద్‌లో ఉన్న చిరంజీవికి తెలియకపోవచ్చు. పిచ్చుకలతో పోల్చడం ఏంటి? సినీ పరిశ్రమవారిని ఆయన పిచ్చుకలతో పోల్చడం ఆశ్చర్యంగానే ఉంది. తాము బలశాలులమని ఊగిపోతుండేవారికి ఈ సంగతి చెప్పడం మంచిది. ఈ విషయాలు పక్కన బెడితే చిరంజీవి జనసేనకు మద్దతుగా ప్రచారం చేయవచ్చంటూ ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. తమ్ముడికి మద్దతుగా ఏమైనా ప్రకటన చేస్తే చేస్తారేమో కాని, ఆయన స్వయంగా ప్రచారానికి దిగే ధైర్యం చేయకపోవచ్చు. తమ్ముడి తీరు ఆయనకు కూడా అంత నచ్చదని కొందరు చెబుతారు. అది నిజమో కాదో తెలియదు కాని, ఇంతకాలం జనసేనకు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వలేదు. ఈ ఎన్నికలలో కూడా అదే విధానం అవలంభించవచ్చు. చిరంజీవికిగాని, ఇతర సినిమా ప్రముఖులకు కాని తమ నల్లధనం లావాదేవీలు బయటకు వస్తాయేమోనన్న భయం తప్ప వేరొకటి కాకపోవచ్చు. ఇప్పటికైనా సినీనటుల అభిమానులు వాస్తవాలు గుర్తించి, అతికి పోకుండా ఉంటే మంచిదని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
నేను మూర్ఖుడిని.. ఎవర్నీ వదలను: నారా లోకేశ్
సాక్షి, నరసరావుపేట: ‘నేను మూర్ఖుడిని.. తగ్గేదే లేదు. అందరి పేర్లూ ఎర్ర బుక్‌లో రాసుకుంటున్నా. ఎవర్నీ వదలను.. టీడీపీ అధికారంలోకి రాగానే వారందరికీ వడ్డీతో సహా చెల్లిస్తా’ అంటూ వినుకొండలో జరిగిన బహిరంగసభలో టీడీపీ నేత నారా లోకేశ్ హెచ్చరించారు. యువగళం పాదయాత్ర బుధవారం పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం, పట్టణంలో సాగింది. కొంతమంది అధికారులు అధికారపార్టీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే వారిని జైలుకు పంపిస్తానని చెప్పారు. 2019–24 మధ్య ఎన్ని ఎక్కువ కేసులు నమోదైతే.. అధికారంలోకి వచ్చాక అంత పెద్ద నామినేటెడ్ పదవి ఇస్తానని టీడీపీ కార్యకర్తలకు లోకేశ్ సూచించారు. చదవండి: మేం చెప్పిందే చట్టం!.. అధికారులను బెదిరించిన ‘నారాయణ’ -
మరోసారి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, నర్సీపట్నం: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై తన నోటి దురుసును ప్రదర్శించారు. ‘‘6 నెలల్లో చంద్రబాబు సీఎం అవుతున్నారు.. పోలీసులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి.. లేదా లిస్ట్ రాసుకుని ఒక్కొక్కరి సంగతి చెప్తా’’ అంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా పలు సందర్భాల్లో అయ్యన్న పోలీసులపై నోరు పారేసుకున్నారు. గుంటూరులో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయాడు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులు తమ చంకే నాకాలంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 'త్వరలో టీడీపీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చాక నాకు లా అండ్ ఆర్డర్ మంత్రి పదవి ఇవ్వాలి. షూట్ అండ్ సైట్ అధికారాలు అప్పగించాలి. అప్పుడు ఈ పోలీసుల సంగతి చెబుతా' అంటూ అయ్యన్న పాత్రుడు భయబ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యానించారు. చదవండి: పాయకరావుపేటలో అనిత ఎలా గెలుస్తారో చూస్తాం.. -
అవన్నీ రైతు ఆత్మహత్యలు కావు..
వరంగల్ క్రైం: పంట నష్టం, అప్పుల బాధ తదితర కారణాలతో గ్రామాల్లో జరిగే రైతుల ఆత్మహత్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గురువారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నకిలీ విత్తన ముఠాల వివరాలు వెల్లడించిన సీపీ.. అనంతరం పలువురు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో రైతు ఆత్మహత్యలపై మాట్లాడుతూ ‘గ్రామాల్లో జరుగుతున్నవన్నీ రైతు ఆత్మహత్యలు కాదు.. గుండెపోటు, అనారోగ్యంతో చనిపోయినా రైతు ఆత్మహత్యలుగా నమోదయ్యేవి. గతంలో రైతు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం రూ.లక్ష పరిహారం ఇచ్చేది. అందుకే రైతు ఆత్మహత్యగా నమోదు చేసేవాళ్లం. ఎలా చనిపోయినా రైతు ఆత్మహత్యగానే నమోదు చేయడంతో సంఖ్య ఎక్కువగా ఉంది..’అని అన్నారు. ఈ వ్యాఖ్యలు మీడియాలో రావడంతో సీపీ వివరణ ఇచ్చారు. 6 నెలలుగా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు: రైతు ఆత్మహత్యలపై ఎలాంటి వివాదం లేదని సీపీ వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించడం ద్వారా ఆరు నెలల కాలంగా ఏ ఒక్క రైతు కూడా ఆర్థిక, పంటనష్టం కారణంతో ఆత్మహత్యకు పాల్పడలేదని, ఈ కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎక్కడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యన్నతి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగానే రైతుబీమా పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ పథకం ద్వారా రైతు ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారన్నారు. కానీ రైతులు, పోలీసులకు ఈ పథకంపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఇతర కారణాలతో రైతులు మరణిస్తే 2004లో అప్పటి ప్రభుత్వం జారీచేసిన 421 జీఓ నిబంధనల ప్రకారమే ఆర్థిక సాయం కోసం రైతు ఆత్మహత్యలుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు. అయితే ప్రస్తుతం రైతులు ఏ విధంగా మరణించినా బాధిత కుటుంబాలకు రైతుబీమా ద్వారా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నారని తెలిపారు. -
అదే జరిగితే CSK గెలిచేదే కాదు..!
-
దళితులపై లోకేష్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాల ఆందోళన
-
1,000 మందిని లైంగికంగా వేధించానా? నేనేమైనా 'శిలాజిత్' రోటీలు తింటున్నానా?
న్యూఢిల్లీ: రెజ్లర్ల నుంచి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను మొదట 100 మందిని లైంగికంగా వేధించినట్లు ప్రచారం చేశారని, ఇప్పుడేమో ఎకంగా 1,000 మందిని వేధించానని అంటున్నారని వ్యాఖ్యానించారు. ఇంత మందిని అలా చేయడానికి తానేమైనా శిలాజిత్‌తో తయారు చేసిన రోటీలు తింటున్నానా? అని నోరుజారారు. దీంతో బ్రిజ్ భూషణ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడవచ్చా? అని అతనిపై ఆరోపణలు చేస్తున్న మహిళా రెజ్లర్ సత్యవార్ట్ కదియాన్ మండిపడ్డారు. బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఏడగురు మహిళా రెజ్లర్లు ఢిల్లీలో నిరసనకు దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అతనిపై కేసు నమోదు చేసి, పదవి నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు మొదట బ్రిజ్‌పై కేసు నమోదు చేయేలదు. కానీ చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు అతనిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అయితే రాజకీయ దురుద్దేశంతోనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బ్రిజ్ భూషణ్ పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లు నిరసన చేస్తే తాను రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. కాగా.. మహిళ రెజ్లర్లకు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు మద్దతు తెలిపారు. వారి ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. నలుపు రంగులో ఉండే శిలాజిత్ పౌడర్‌ను ఉపయోగిస్తే సామర్థ్యం పెరుగుతుందని అంటారు. ఇవీ క్యాప్సుల్స్ రూపంలో కూడా లభిస్తాయి. ఇది తింటే పురుషుల శక్తి సామర్థ్యాలు రెట్టింపు అవుతాయంటారు. చదవండి: రాజద్రోహం చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటులో బిల్లు..! -
బైడెన్ ఐదేళ్లలో చనిపోతారు.. రిప్లబికన్ అధ్యక్ష అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు..
వాషింగ్టన్: వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున నిక్కీ హేలీ బరిలో ఉన్నారు. అయితే ఫాక్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బెడైన్‌కు ఓటేస్తే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రెసిడెంట్ అవుతారని, ఎందుకంటే ఆయన ఐదేళ్లకు మించి బతకరని హేలీ అన్నారు. జో బైడెన్ ప్రస్తుత వయసు 80 ఏళ్లు దాటింది. హేలీ వయసు 51 ఏళ్లే. అందుకే ఎన్నికల ప్రచారంలో వయసునే ప్రధాన అస్త్రంగా మలుచుకుని ముందుకెళ్లాలని హేలీ భావిస్తున్నారు. వృద్ధులను ఎన్నుకునే ముందు ఆలోచించాలని అమెరికన్లను కోరుతున్నారు. సరిగ్గా ఆరోగ్యంగా లేని వారు అగ్రరాజ్యాన్ని ముందుకెలా నడిపిస్తారని ప్రశ్నిస్తున్నారు. 75 దాటి ఎన్నికల్లో పోటీ చేసేవారికి మానసిక సామర్థ్య పరీక్షలు నిర్వహించాలనే కొత్త డిమాండ్‌ను ఆమె తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం 80 ఏళ్లు దాటిన బైడెన్.. మరో ఐదేళ్లు ఆరోగ్యంగా ప్రాణాలతో ఉంటారని తనకు నమ్మకం లేదని హేలీ అన్నారు. మరోవైపు తాను మరోసారి డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష బరిలో ఉంటున్నట్లు బైడెన్ మంగళవారమే అధికారికంగా ప్రకటించారు. తాను పూర్తి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నానని స్పష్టం చేశారు. శ్వేతసౌధం కూడా బైడెన్ కోటు ధరించి జాగింగ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. తీరిక లేకుండా ఆయన చేస్తున్న వివిధ పర్యటనల షెడ్యూల్‌ను కూడా వెల్లడించింది. దీంతో బైడెన్ తనకు ఎలాంటి ఆరోగ్య, మానసిక సమస్యలు లేవని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా రిపబ్లికన్లను ఓడించి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. చదవండి: గ్రీన్‌కార్డులపై ‘కంట్రీ లిమిట్’ తొలగించండి -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతు పురాణం.. ముక్కున వేలేసుకున్న కార్యకర్తలు
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: మాజీ మంత్రి, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ నోరు జారారు. ప్రతిపక్షాలను పరుష పదజాలంతో దూషించారు. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చిలక్కొయలపాడులో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రెడ్యానాయక్ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్కు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని.. ఇతర ల.. కొడుకులకు లేదని రెడ్యానాయక్ నోరు పారేసుకున్నారు. రేవంత్ రెడ్డిని బోసి.. కే అంటూ సంబోధించారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న సీనియర్ నాయకుడు రెడ్యానాయక్ ఇలాంటి మాటలు మాట్లాడటంతో సభకు వచ్చిన వారు ముక్కున వేలేసుకున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నాయకుడు ఇలాగా మాట్లాడేది అనే గుసగుసలు వినిపించాయి. చదవండి: ‘పాత నంబర్ ఎందుకు మార్చారు?.. చైనాకు కాల్స్ ఎందుకు వెళ్లాయి?’ -
అప్పుడప్పుడు అలా జరుగుతుంది.. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ సహాయనిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అప్పుడప్పుడు వైద్యం వికటించడం సహజమని, డాక్టర్లే కాకుండా సిబ్బంది వల్ల కూడా తప్పు జరగొచ్చంటూ వ్యాఖ్యానించారు. స్వయంగా డాక్టర్ అయిన సంజయ్ కుమార్ కు కంటి వైద్యంలో మంచి పేరుంది. డాక్టర్లు, చికిత్స గురించి సంపూర్ణ అవగాహన ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. ఒకటి రెండు సంఘటనల వల్ల ప్రభుత్వాసుపత్రుల పట్ల అభిప్రాయాన్ని చెడుగా మార్చుకోవద్దని కోరారు. "మహిళ కడుపులో గుడ్డ ఉంచి కుట్లు వేశారన్నది రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఘటన.. కానీ ఇపుడు పేపర్లలో వస్తోందన్నారు. కింది స్థాయిలో ఒకరు చేసిన పొరపాటుకు మొత్తం వ్యవస్థను నిందించవద్దు. డాక్టర్లు, నర్సుల సమిష్ఠి బాధ్యతతో ఆపరేషన్లు జరుగుతాయని, ప్రభుత్వాసుపత్రులపై నమ్మకంతో రండి, మాతా శిశు ఆస్పత్రులలో ఉచితంగా వైద్యం చేయించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. కాగా, జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటన గత వారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొడిమ్యాల మండలం నమిలికొండకు చెందిన నవ్యశ్రీ అనే మహిళకు పదహారు నెలల క్రితం.. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అయింది. అయితే ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు కడుపులోనే క్లాత్ వదిలేయడం కలకలం రేపింది. ఏడాది తర్వాత నవ్యశ్రీకి తీవ్ర కడుపు నొప్పి రావడంతో వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకుంది. స్కానింగ్‌లో కడుపులో బట్ట ఉన్నట్టు గుర్తించగా.. వెంటనే ఆసుపత్రిలో సర్జరీ చేసి బట్ట తొలగించారు. ఈ మొత్తం విషయాన్ని లేఖలో పేర్కొంటూ నవ్యశ్రీ కుటుంబీకులు జగిత్యాల DMHOకు ఫిర్యాదు చేశారు. చదవండి: నిప్పులకొలిమి.. ఎండకు వెళ్తే మండిపోతారు! డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక -
ఉన్నమాట అంటే ఉలిక్కిపడుతున్నారు.. ఏపీ మంత్రులపై హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: కొందరు ఏపీ మంత్రులు ఎగిరెగిరిపడుతున్నారని.. ఉన్నమాట అంటే.. వారు ఉలిక్కిపడుతున్నారని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి చెందిన మేస్త్రీలు ఇటీవల తనను కలిసినప్పుడు తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ తమ బిడ్డలేనని చెప్పానన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇక్కడే ఉండాలని వారికి సూచించానన్నారు. ‘ఆనాడు ఏపీకి ప్రత్యేక హోదా కోసం మీ నాయకత్వం పోరాడతాం అన్నది. ఈరోజు ఎందుకు మౌనం వహిస్తున్నారు? విశాఖ ఉక్కు కోసం ఎందుకు పోరాడటం లేదు? పోలవరం పనులు ఎందుకు పూర్తికావడం లేదన్నాను. ఇందులో ఏమైనా తప్పుందా?. నేను ప్రజల పక్షాన మాట్లాడా. ఏపీ ప్రజలు, మంత్రుల గురించి తప్పుగా మాట్లాడలేదు’ అని హరీశ్‌రావు అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, వివిధ సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కేసీఆర్ పాలన ఉందన్నారు. కుర్రోకుర్రు.. కేసీఆర్ పీఎం.. హరీశ్‌రావు సీఎం అత్మీయ సమ్మేళనంలో సిద్దిపేట అర్బన్ మండలం నాంచారిపల్లికి చెందిన చిన్నారి మైత్రి సభావేదికపై కుర్రో కుర్రు అంటూ మంత్రి హరీశ్‌రావుకు సోది చెప్పింది. హరీశ్‌రావుకు నరదృష్టి బాగా ఉందని పేర్కొంది. నరంలేని నాలుక 40 మాటలు అంటుందని.. అవన్నీ పట్టించుకోవద్దని సూచించింది. తన నోరు సత్యమే పలుకుతుందని.. తన మాట తప్పదంటూ దేశానికి కేసీఆర్ పీఎం కావాలనుకుంటే హరీశ్‌రావు రాష్ట్రానికి సీఎం కావాలని ఆ చిన్నారి సోది చెప్పింది. చదవండి: తెలంగాణలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ నేతలను ఆరా తీసిన రాహుల్ -
‘చంద్రబాబు, లోకేశ్‌ను తరిమికొడతాం’
తాడికొండ: దళితులంటే చిన్నచూపుతో మాట్లాడుతున్న చంద్రబాబు, లోకేశ్‌ను రాష్టం నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బహుజన పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఆదివారం 931వ రోజుకు చేరాయి. పలువురు నాయకులు మాట్లాడుతూ.. పాదయాత్ర చేస్తున్న లోకేశ్ ప్రజా సమస్యలపై మాట్లాడకుండా దళితులను కించపరిచేలా మాట్లాడడం సిగ్గుచేటని, దళిత బహుజనులు తమకు ఓట్లేయడం లేదనే అక్కసుతో చంద్రబాబు, లోకేశ్ అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో చంద్రబాబు దళితుడిగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా... అంటే, ఇప్పుడు లోకేశ్ దళితుల గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాదయాత్రలో లోకేశ్‌కు ప్రతి గ్రామంలో ముందు ఎదురయ్యేది జగనన్న కాలనీలేనని, వాటిని చూసిన ప్రతిసారి వెన్నులో వణుకు మొదలై దళితులు, బహుజనులు తమను ఎక్కడ విస్మరిస్తారో అనే భయం పట్టుకుని అసహనంతో మాట్లాడుతున్నాడన్నారు. నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, పులి దాసు, న్యాయవాది పెరికే వరప్రసాద్, ఈపూరి ఆదాం పాల్గొన్నారు. -
కర్నూలు: లోకేష్ పాదయాత్రకు నిరసన సెగ
సాక్షి, కర్నూలు: నారా లోకేష్ పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. దళితులు ఏం పీకారంటూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దళిత సంఘాలు ఆయనను అడ్డుకున్నాయి. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో లోకేష్ ఏం చేయాలో తెలియక తెల్లమొహం వేసుకున్నాడు. కాగా.. దళితులపై నారా లోకేశ్ నోరుపారేసుకున్న విషయం తెలిసిందే. అసభ్య పదజాలంతో ఆ వర్గాన్ని దూషించారు. ‘యువగళం’ పేరుతో చేస్తున్న పాదయాత్రలో లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చనీయాంశమవుతున్నాయి. పాదయాత్రలో భాగంగా గురువారం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గానికి లోకేశ్ చేరుకున్నారు. జక్కసానిపల్లిలో ఎస్సీలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగానే దళితులు పీకిందేమీ లేదని అనుచిత వ్యాఖ్యలు చేశారు. చదవండి: Nara Lokesh : దళితులు పీకిందేమీ లేదు -
ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ శోభాయాత్రలో గాడ్సే ఫోటో ప్రదర్శించారని మండిపడ్డారు. దేశంలో తొలి టెర్రరిస్టు నాథురామ్ గాడ్సేనేనని.. ఆయన ఫోటోలు ప్రదర్శిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తాము లాడెన్, హజరీ ఫోటోలు ప్రదర్శిస్తే ఊరుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఇటీవల హైదరాబాద్‌లో శ్రీరామనవమి రోజున గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించిన శోభాయాత్రలో మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే ఫొటో దర్శనం ఇవ్వడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ స్పందిస్తూ...హనుమాన్ శోభయాత్రలో గాడ్సే ఫొటోలు ప్రదర్శించడం ఏంటని ప్రశ్నించారు. చదవండి: వీడిన సస్పెన్స్.. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇంచార్జీగా మర్రి రాజశేఖర్ రెడ్డి -
అమ్మాయిల దుస్తులపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఇండోర్: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నేత వివాదంలో చిక్కుకున్నారు. అసభ్యకరమైన బట్టలు(డర్టీ క్లాత్స్) ధరించే అమ్మాయిలు రామాయణంలో శూర్పణఖ మాదిరి కనిపిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గామారింది. మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో మహవీర్ జయంతి సందర్భంగా జైన సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన దుస్తులు వేసుకోని అమ్మాయిలను ఆయన తప్పుపట్టారు. రాత్రిపూట బయటకు వెళ్లినప్పుడు మద్యం మత్తులో డాన్స్ చేస్తున్న యువతీ యువకులు కనిపిస్తుంటారని.. దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను.. వారిని చూస్తుంటే గట్టిగా చెప్పుతో కొట్టాలన్నంత కోపం వస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మహిళలను మనం దేవతలా ఆరాధిస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అసభ్యకరంగా దుస్తులు ధరించిన కొంతమంది ఆడవాళ్లను చూస్తుంటే శూర్పణఖలా కనిపిస్తారు. దేవుడు మీకు మంచి శరీరాన్ని ఇచ్చాడు. మంచి దుస్తులు వేసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకు మంచి బుద్దులు నేర్పాలి’ అని సూచించారు. అయితే విజయ్‌వర్గియా వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. మహిళల పట్ల ద్వేషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వ్యాఖ్యలతో పురుషాధిక్యత, పితృస్వామ్య భావజాలన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శిస్తున్నారు. రాజకీయ నేతలు ఇలా మాట్లాడటం సరికాదని.. బీజేపీ నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా కైలాష్ విజయవర్గియా ఇంలాటి వ్యాఖ్యలు చేయడం తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయన వివాదంలో ఇరుకున్నారు. చదవండి: కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకి తృటిలో తప్పిన ప్రమాదం.. BJP Leader @KailashOnline says girls dress badly & look like ‘Shurpanakha’. This is a reprehensible & demeaning insult to every woman of this country Where is @smritiirani now? Does she condone this disgusting statement? Or does she only find her voice to attack @RahulGandhi! pic.twitter.com/hzoxrnZpl1 — Dr. Shama Mohamed (@drshamamohd) April 8, 2023 -
'బ్రిటిష్-పాకిస్తానీ మగవాళ్లు ఇంగ్లీష్ అమ్మాయిలను దారుణంగా..'
లండన్: బ్రిటన్ హోంమంత్రి సుయెల్లా బ్రవర్మన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బ్రిటిష్-పాకిస్తానీ పురుషులే దేశంలో తీవ్ర నేరాల్లో భాగం అవుతున్నారని ఆమె ఆరోపించారు. ఇంగ్లీష్ మహిళలను వేధించడం, వారిపై అత్యాచారాలకు పాల్పడటం సహా డ్రగ్స్, హాని తలపెట్టే పనుల్లో పాక్ సంతతికి చెందిన బ్రిటన్ పురుషులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం చేస్తున్నారు. ముఖ్యంగా మైనర్లు, ఇంగ్లీష్ యువతులను లక్ష్యంగా చేసుకుని వీరు వికృత చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. 'మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే.. సంరక్షణ కేంద్రాలు, జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటున్న బలహీనమైన తెల్ల ఇంగ్లీష్ అమ్మాయిలు, పిల్లలను బ్రిటిష్-పాకిస్తానీ పురుషుల ముఠాల వేధిస్తున్నాయి. వారిని వెంబడించి అత్యాచారం చేయడం, మత్తుపదార్థాలు ఇవ్వడం, హాని చేయడం వంటి క్రూర చర్యలకు పాల్పడుతున్నాయి. నిందితుల్లో సంరక్షణ కేంద్రాల్లో పని చేసేవారు ఉంటున్నారు. మరికొందరికి పెద్ద నెట్వర్క్ ఉంది. చాలా మంది నేరస్థులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అధికారులు ఈ నేరస్థులకు భయం కల్గించేలా చేసి బాధితులకు న్యాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనో లేక భయంతోనో, జాత్యహంకారం, మతోన్మాదం అనుకుంటారనో అధికారులు వీరిని గుడ్డిగా వదిలేస్తున్నారు.' అని బ్రవర్న్ అన్నారు. Home Secretary @SuellaBraverman says 'vulnerable white girls are being targeted by British Pakistani grooming gangs', and people have been 'turning a blind eye out of political correctness'.#Ridge https://t.co/ZoMhCmTrtv 📺 Sky 501, Virgin 602, Freeview 233 and YouTube pic.twitter.com/vO2KSs6vEX — Sophy Ridge on Sunday & The Take (@RidgeOnSunday) April 2, 2023 'కొన్ని జాతి సమూహాల ప్రాబల్యం గురించి చాలా కాలంగా అనేక నివేదికలు ఉన్నాయి. బ్రిటిష్ పాకిస్తానీ పురుషులు బ్రిటిష్ విలువలకు పూర్తిగా విరుద్ధమైన సాంస్కృతిక విలువలను కలిగి ఉంటారు. వారు స్త్రీలను అవమానిస్తారు. కాలం చెల్లిన సంప్రదాయాలు పాటిస్తారు. కొన్నిసార్లు వారి ప్రవర్తన హేయంగా ఉంటుంది' అని హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పిల్లలు, యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నీచమైన నేరస్థుల ముఠాల పనిపట్టేందుకు కొత్తటాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. చదవండి: చైనాను రెచ్చగొట్టిన తైవాన్.. సరిహద్దులో ఉద్రిక్తత -
ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, నెల్లూరుజిల్లా: ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లంచాలు తీసుకుంటూ ఉద్యోగులు కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్నామని, తమపై సోమిరెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ఆ.. నా కొడుకులకు జీతాలివ్వడానికా పన్నులు వసూలు చేసేది? కాగా, ఉద్యోగులపై గతంలో చంద్రబాబు, తోకపత్రిక ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎంప్లాయీస్ గుర్తుచేసుకుంటున్నారు. వారి మధ్య సంభాషణలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దాన్ని ఒకసారి చూస్తే.. చంద్రబాబు-రాధాకృష్ణ సమావేశమై వివిధ అంశాలపై చర్చించుకున్నారు. తమకు కల్పించాల్సిన ప్రయోజనాల గురించిన ఉద్యోగుల డిమాండ్ ప్రస్తావనకు రాగానే రాధాకృష్ణ బూతు పురాణం లంకించుకున్నారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అవమానించేలా, కించపరుస్తూ మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి చిద్విలాసంగా ఆస్వాదిస్తూ ఉండిపోయారు. పైగా రాధాకృష్ణ చెప్పినవన్నీ నిజాలేనని కితాబిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులపై తనకున్న కక్షను పరోక్షంగా చాటుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను ‘ఆ .. నా కొడుకులు’ అని రాధాకృష్ణ దుర్భాషలాడినా.. అలా అనడం తప్పని చంద్రబాబు అనకపోవడం గమనార్హం. అధికారం లేకపోతే మనమేమీ చేయలేమని, అధికారం కోసం కొన్ని హామీలు ఇవ్వాలని సీఎం చెప్పుకొచ్చారు. మొదట్లో కొంత ఉదారంగా ఉంటే తర్వాత ఏదో ఒకటి చేయొచ్చని అన్నారు. రుణమాఫీ హామీ కూడా అధికారం కోసమే ఇచ్చామంటూ మనసులో మాట చెప్పేశారు. చదవండి: మేము తలుపులు తెరిస్తే టీడీపీలో మిగిలేది వారిద్దరే: బాలినేని -
మళ్లీ రిపీట్.. మరో సారి నోరు జారిన ఎమ్మెల్యే భాస్కర్ రావు!
సాక్షి, నల్గొండ: వేములపల్లి మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్ నేతలకు ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. నాలుగు చీరలిచ్చే కాంగ్రెస్ నాయకుడికి ఓట్లు వేయాలా.. అలా అయితే మేం వేసిన రోడ్లపై నడవకండంటూ భాస్కర్ రావు వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారేన్ని రేపుతున్నాయి. కాగా గతంలోనూ అడవిదేవులపల్లి మండలంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసిన ఈ ఎమ్మెల్యే విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. -
Modi Surname: రాహుల్ గాంధీకి కోర్టులో ఎదురుదెబ్బ.. రెండేళ్లు జైలు శిక్ష
సూరత్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి పరువు నష్టం కేసులో న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చింది. రెండేళ్లు జైలు శిక్ష విధించింది. గురువారం ఈమేరకు తీర్పునిచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కర్ణాటక కోలార్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు రాహుల్. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. దేశంలో దొంగల ఇంటి పేరు మోదీ అనే ఎందుకు ఉంది? అని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై అప్పుడే తీవ్ర దుమారం చెలరేగింది. తమ కమ్యూనిటీని అవమానించేలా రాహుల్ మాట్లాడారని గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ రాహుల్‌పై కోర్టులో పరువునష్టం దావా వేశారు. విచారణ అనంతరం రాహుల్‌ను దోషిగా తేల్చింది న్యాయస్థానం. అయితే ఈ తీర్పును రాహుల్ హైకోర్టులో సవాల్ చేసే అవకాశముంది. -
నరేష్‌తో పెళ్లి.. పవిత్ర లోకేష్‌పై మాజీ భర్త సుచేంద్ర సంచలన ఆరోపణలు!
సినీ నటుడు నరేష్-పవిత్రా లోకేష్‌లు పెళ్లిబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. కొంతకాలంగా సీక్రెట్ రిలేషన్లో ఉన్న వీరిద్దరు మార్చి 10న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినట్లు నరేష్ ప్రకటించాడు. మీ ఆశీర్వదాలు కావాలంటూ పెళ్లి వీడియో షేర్ చేశాడు. ఇక అప్పటి నుంచి వీరి పెళ్లి వ్వవహరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. నిజంగా పెళ్లి చేసుకున్నారా? లేక మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ వీడియో షేర్ చేశారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా నరేశ్‌కు ఇది నాలుగవ పెళ్లి కాగా.. పవిత్రకు మూడో పెళ్లి అనే విషయం తెలిసిందే. చదవండి: హీరోగా కొడుకు లుక్ షేర్ చేస్తూ మురిసిపోయిన యాంకర్ సుమ అయితే వీరి పెళ్లి వీడియో బయటకు వచ్చిన అనంతరం పవిత్ర మొదటి భర్త, కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్ ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రీసెంట్గా ఆయన కన్నడ మీడియాతో ముచ్చటించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పవిత్ర-నరేష్ పెళ్లిపై సుచేంద్రకు ప్రశ్న ఎదురవగా మాజీ భార్యపై ఆయన తీవ్ర ఆరోపణలు చేసినట్లు కన్నడ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తాజా బజ్ ప్రకారం సుచేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ప్లాన్ ప్రకారమే పవిత్ర నరేష్‌కు దగ్గరైందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడట. అంతేకాదు ‘పవిత్ర లగ్జరీ లైఫ్ కోసం ఆమె ఏమైనా చేస్తుంది. ఆస్తి కోసమే నరేష్‌తో లవ్ ట్రాక్ నడిపింది. డబ్బు కోసం ఆమె ఎంతకైన దిగజారుతుంది. చదవండి: నా పిచ్చిని భరించే ఏకైక వ్యక్తివి నువ్వు: లాస్య ఎమోషనల్ పోస్ట్ కేవలం డబ్బు పిచ్చితోనే గతంలో ఇద్దరికి విడాకులు ఇచ్చింది. పవిత్ర పచ్చి అవకాశవాది. ఆ విషయం నరేష్ ఇంకా అర్థం కావట్లేదు. నరేష్‌కు దగ్గరై విజయ నిర్మల గారు సంపాదించిన రూ. 1500 కోట్ల ఆస్తిని కొట్టేయాలనేదే ఆమె ప్లాన్. ఈ విషయం నరేష్‌కు కూడా త్వరలోనే అర్థం అవుతుంది’ అంటూ పవిత్రపై సుచేంద్ర ప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశాడు. దీంతో ఆయన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఆయన వ్యాఖ్యలతో మరోసారి నరేష్-పవిత్ర ప్రేమ, పెళ్లి వార్తల్లోకెక్కింది. కాగా గతంలో కూడా సుచేంద్ర ప్రసాద్ పవిత్రపై ఇలాంటి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పవిత్ర లోకేష్ మంచిది కాదని, ఆమెకు కాపురాలు కూల్చే బుద్ధి ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. -
నాగార్జున యూనివర్సిటీలో ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు
మరోసారి తన తీరుతో వార్తలో నిలిచాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. బుధవారం(మార్చి 15న) గుంటూరు ఆచార్య నాగార్జున వర్సిటీలో జరిగిన అకాడమిక్ ఎగ్జిబిషన్ 2023 ఈ వెంట్‌కు వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. నచ్చింది తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అంటూ విద్యార్థులకు ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో ఆయన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. చదవండి: క్రేజీ బజ్: రిషబ్ శెట్టి-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ? అదే విధంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. ‘నేను చనిపోయాక స్వర్గానికి వెళ్తే అక్కడ ఏం లేకపోతే ఎలా.. అందుకే ఆ చాన్స్ తీసుకోకుండ ఇక్కడే అన్ని అనుభవించేస్తా’ అన్నాడు. ఒకవేళ స్వర్గంలో రంభ, ఊర్వశీలు ఉండకపోవచ్చు.. అందుకే ఇక్కడే ఎంజాయ్ చేయాలంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. ఇక తాను చనిపోయిన తర్వాత ప్రపంచమంత మరో క్షణంలో అంతమైన తాను లెక్కయనన్నాడు. ఎందుకంటే తాను కేవలం తన కోసమే బ్రతుకుతానన్నాడు. మీ భవిష్యత్తు ఏంటీ? మీరు ఎంత బాగా చదువుతున్నారనేది తాను కేర్ కూడా చేయనన్నాడు. చదవండి: రాము పరీక్షల్లో ఏం చేశాడంటే.. ఆర్జీవీ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు రంభ, ఊర్వశీ, మేనకలతో తిరిగినప్పుడే తనకు మోక్షం కలుగుతుందంటూ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అలాగే వైరస్ వచ్చి తాను తప్ప మగజాతి అంతా పోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో వర్మ కామెంట్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఇక వర్మ వ్యాఖ్యలకు అక్కడ ఉన్న మహిళా లెక్చరర్లు షాక్ అయ్యారు. అయితే ఆర్జీవీ మాట్లాడుతుంటే స్టూడెంట్స్ అంతా గట్టి గట్టిగా అరుస్తూ రెచ్చిపోయారు. -
కవితపై అనుచిత వ్యాఖ్యలు.. బండి సంజయ్‌పై కేసు నమోదు..
సాక్షి, హైదరాబాద్: కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో బండి సంజయ్‌పై కేసు నమోదైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. బండి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కూడా చేశాయి. ఆయన దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశాయి. మహిళలంటే గౌరవం లేకుండా మాట్లాడిన బండిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా.. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండిపై తెలంగాణ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. దీన్ని సుమోటాగా తీసుకుని నోటీసులు పంపింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ విచారణకు కవిత హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బండి సంజయ్ ఆమెపై విమర్శలు గుప్పిస్తూ నోరుజారారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడ్డారు. చదవండి: కవితపై అనుచిత వ్యాఖ్యలు.. బండి సంజయ్‌కు మహిళా కమిషన్ నోటీసులు -
బండి సంజయ్‌కు మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. కవితపై బండి వ్యాఖ్యల్ని సుమోటాగా తీసుకుంది. దీనిపై విచారణకు ఆదేశించింది. బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని తెలిపింది. లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత.. ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కవితపై విమర్శలు చేశారు. చట్టం ముందు అందరూ ఒక్కరే అని అన్నారు. ఇదే సమయంలో కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. సంజయ్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యి ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళనలు చేశారుు. బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ దిష్టి బొమ్మ దహనం చేశారు. చదవండి: బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసమే ఢిల్లీ లిక్కర్ స్కాంపై చర్చ -
నేను నోరు విప్పితే.. మీరు ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పనా?: తమ్మారెడ్డి
ఆర్ఆర్ఆర్ మూవీ వివాదంపై ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆస్కార్ బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్ మూవీపై ఇటీవల ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఆస్కార్ అవార్డు కోసం ట్రిపుల్ ఆర్ టీం రూ. 80 కోట్లు ఖర్చు చేసిందంటూ షాకింగ్ కామెంట్స్. దీంతో ఆయనపై సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. చదవండి: దిల్ రాజు కొడుకుని చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. ఇక తనపై వస్తున్న నెగిటివిటీ చూసి తమ్మారెడ్డి నేరుగా స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఏ తప్పు చేయలేదని, క్షమాపణలు చెప్పనన్నారు. తాను చిన్న సినిమాలపై మూడు గంటలు మాట్లాడితే కేవలం ఓ క్లిప్పింగ్ ఆధారంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజమౌళిని చూసి ఈర్ష్యతో అలా అన్నానని కొందరు అంటున్నారని, ఆయన తనకు సమకాలీకుడు కాదంటూ కౌంటర్ ఇచ్చారు. రెండ్రోజుల కింద ‘ఆర్ఆర్ఆర్’ను ప్రశంసిస్తూ మాట్లాడానని.. దాని గురించి ఎవరూ పట్టించుకోలేదే? అని ప్రశ్నించారు. ‘నేను ఇండస్ట్రీకి వివరణ ఇచ్చుకోవాలి అనుకున్నా. కానీ ఇప్పుడు ఆ అవసరం నాకు లేదు. కానీ పెద్దవాళ్లు అందరు మాట్లాడాకా నేను దానికి సమాధానం కూడా చెప్పనక్కర్లేదు. అసలు వీడికేం లెక్కలు తెలుసంటున్నారు కొందరు. నాకు లెక్కలు తెలియనక్కర్లేదు. అయితే చాలా మంది అకౌంట్స్ నాకు తెలుసు. ఎవరెవరు ఏ అవార్డులు, పదవుల కోసం ఎవరెవరిని అడుక్కున్నారో, ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో అన్నీ నాకు తెలుసు. నేనెప్పుడూ వీటి గురించి మాట్లాడను. నేను మాట్లాడితే ఇండస్ట్రీ పరువు పోతుంది. ఇండస్ట్రీ నా తల్లి. ఇండస్ట్రీని గౌరవిస్తా. అందుకే ఈరోజుకీ సంయమనంగానే మాట్లాడుతున్నా’ అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. చదవండి: ఆర్ఆర్ఆర్పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిర్మాతపై నెటిజన్ల ఆగ్రహం ‘కొందరు నన్ను అసభ్యంగా, నీచంగా తిడుతున్నారు. నాకు నీతిగా బతకడం, నిజం చెప్పడం తెలుసు. ఎక్కడైన నేను నిజాలు మాట్లాడగలను. మీరు ధైర్యంగా నిజం చెప్పగలరా? నన్ను ఇంతగా తిడుతూ విమర్శిస్తున్నా మీకు నన్ను అనే హక్కు ఉందా? గతంలో రాజమౌళిని అభినందిస్తూ మాట్లాడాను అది చూడలేదా? ఇప్పుడు ఎవరో ఏదో క్లిప్ పెట్టేసరికి మీకు తెలిసిందా? మూడు గంటల చిన్న సినిమా గురించి మాట్లాడాను. మీరు ఓ చిన్న సినిమా కోసం టైం కెటాయించగలరా? ఎప్పుడు ఎవరో ఒకరి కాళ్లు పట్టుకోవాలని, ఎంతసేపు వాళ్లకు వీళ్లకు మర్దన చేయాలా? అని చూసే మీరా నా గురించి మాట్లాడేది. నన్ను అనే హక్కు మీకుందా? ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే తిరిగి మొహం మీదే పడుతుంది’ అంటూ తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు. -
ఆర్ఆర్ఆర్పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిర్మాతపై నెటిజన్ల ఆగ్రహం
టాలీవుడ్ సంచలనం ఆర్ఆర్ఆర్ మూవీపై సీనియర్ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండిస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు కోసం ఆర్ఆర్ఆర్ టీం రూ. 80 కోట్లు ఖర్చు చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పలువురు టాలీవుడ్ సినీ దిగ్గజాలు, సినీ ప్రియులు అభ్యంతరం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: జేమ్స్ కెమెరూన్ డబ్బు తీసుకొని పొగుడుతున్నారా? లెక్కలున్నాయా?: కె. రాఘవేంద్రరావు సూటి ప్రశ్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్పందిస్తూ తమ్మారెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. మిత్రుడు భరద్వాజ్‌కి.. తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచవేదికలపై మొదటిసారి వస్తున్న పేరు చూసి గర్వపడాలి కానీ, రూ.80 కోట్ల ఖర్చు అని చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ లాంటి వారు డబ్బు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా? అంటూ ట్వీట్ చేశారు. ఇక దర్శకేంద్రుడి మద్దతుగా నెటిజన్లు, ఆరఆర్ఆర్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ తమ్మారెడ్డి భరద్వాజ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘శత్రువులు ఎక్కడో ఉండరు మన పక్కనే తిరుగుతారు. 80 కోట్ల రూపాయలు ఉంటే పది సినిమాలు తీస్తారు సరే.. అందులో ఒకటైన ఆస్కార్‌కు వెళుతుందనే గ్యారంటీ ఇస్తారా? భరద్వాజ గారు’ అంటూ ఓ నెటిజన్ ఆయనకు కౌంటర్ ఇచ్చాడు. అలాగే మరో నెటిజన్ స్పందిస్తూ ‘విచిత్రమైన మనిషి, విచిత్రమైన కామెంట్స్’ అసహనం వ్యక్తి చేశాడు. చదవండి: ఆస్కార్ కోసం 'ఆర్ఆర్ఆర్' ఫ్లైట్ ఖర్చులతో పది సినిమాలు తీయొచ్చు : తమ్మారెడ్డి కాగా రీసెంట్గా రవింద్ర భారతీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘రూ.200 కోట్లు పెట్టి బాహుబలి తీశారు. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ బడ్జెట్. ఆ తర్వాత రూ.600 కోట్లు ఖర్చు పెట్టి ఆర్ఆర్ఆర్ మూవీ తీశారు. ఇప్పుడు వచ్చే ఆస్కార్ కోసం రూ.80 కోట్లు పెట్టారు. ఆ డబ్బులు నాకు ఇస్తే 8 సినిమాలు తీసి వాళ్ల మొఖాన కొడతాను’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. Satruvulu ekkada undaru andi mana pakkane tirugutuntaru. 80crores unte 10 cinemalu teesukovachu correct ye. aah 10 cinemalu lo okatyna oscar vastundi aney gaurantee isthara bharadwaj garu. — Challapalli Anurag 🇮🇳 (@anurough) March 9, 2023 పాపం భరద్వాజులు గారు చల్లగా Attention తీసుకుని జారుకుందాం అనుకున్నారు కానీ తెలుగు జాతిని గర్వపడేలా చేసిన @RRRMovie & @ssrajamouli గారి మీద రాయి వేసి జారుకుందాం అని చుస్తే, తెలుగు వారు తెలుగు ప్రముఖుల గమ్ముగా వుంటారని భావించి నట్లు ఉన్నారు. — CMA Monesh (@Cmamonesh) March 9, 2023 -
డామిట్, మాట జారిపోయింది.! తప్పయిపోయింది సారీ! ఆ ఎమ్మెల్యే పరేషాన్
ఎప్పుడూ మంత్రి కాలేదు. కాని మంత్రి కంటే ఎక్కువగానే అధికారాలు అనుభవించారు. ప్రత్యేక రాష్ట్రం రాగానే రాజకీయ గురువుకు సున్నం పెట్టాడు. గెలిపించిన పార్టీకి పంగనామాలు పెట్టి అధికార పార్టీలో చేరిపోయాడు. మూడోసారి పోటీ చేయడానికి రెడీ అవుతున్న ఆ నేత ఇటీవల పదే పదే జనానికి సారీ చెబుతున్నాడు. అనవసరపు చిక్కులు కొని తెచ్చుకుంటున్నాడు. సీనియర్ ఎమ్మెల్యేకు సారీ చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఇంతకీ ఆ నేత ఎవరు? కాంగ్రెస్‌కు చేయిచ్చి.. ఆ వెంటనే కారెక్కి.! ఎంతటి నాయకులైనా నోరు జారితే తిరిగి వెనక్కు తీసుకోలేరు. ఒక ఎమ్మెల్యే స్థాయి నేత పబ్లిక్‌లో ఇష్టారీతిన కామెంట్స్ చేస్తే అటు ఆయనకు.. ఇటు పార్టీకి కూడా నష్టం తప్పదు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావుకు ఇప్పుడదే జరిగింది. గతంలో రెండు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డికి షాడోగా వ్యవహరించిన వ్యక్తి. ఆయన అండదండలతో.. 2014లో రాజకీయాల్లోకి వచ్చీరాగానే.. మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ టికెట్ పొందారు. ఎమ్మెల్యే కాగానే గురువును వదిలేసి గులాబీ పార్టీలో చేరిపోయారు భాస్కరరావు. 2018లో బీఆర్ఎస్ నుంచి టికెట్ తెచ్చుకుని మరోసారి పోటీ చేసి గెలిచారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఈ మధ్య ఎమ్మెల్యే భాస్కరరావు చేస్తున్న వ్యాఖ్యలు ఆయనతో పాటు గులాబీ పార్టీని కూడా ఇబ్బందులకు గురిచేసేలా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రోడ్లతో రాజకీయమా? ఆ మధ్య అడవిదేవులపల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో..సీసీ రోడ్ల ప్రారంభోత్సం సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు రాజకీయంగా దుమారం రేపాయి. మేము వేయించిన రోడ్లపై నడవద్దు, మేము ఇచ్చే సంక్షేమ పథకాలు తీసుకోవద్దని.. తాను తలుచుకుంటే ఐదు నిమిషాల్లో డ్యాన్సులు చేయిస్తానంటూ ప్రతిపక్షాలే లక్ష్యంగా ఆయన మాట్లాడిన మాటలు ఆయనకు..పార్టీకీ డ్యామేజ్ చేసేవిగా మారాయి. జరిగిన నష్టం గమనించిన ఆయన తన వ్యాఖ్యలకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ ఘటన మరిచిపోకముందే మరో కార్యక్రమంలోనూ ఇదేరకంగా నోటి దురుసును ప్రదర్శించారాయన. మిర్యాలగూడలో జరిగిన దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమం సందర్బంగా ఎంపీపీ సరళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రెండు కులాల పేర్లను ప్రస్తావిస్తూ... ఆ వర్గాలు చేసే పనులు కూడా నేనే చేయాలా అంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు. ఈ వీడియోలు బయటకు రావడం, వైరల్ కావడంతో మరోసారి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు నోటి దురుసు గురించి చర్చ మొదలైంది. బీసీ సంఘాలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొందరైతే ఎమ్మెల్యేకు ఫోన్లు చేసి నిరసన వ్యక్తం చేశారట. రెండు రోజులపాటు ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో.. ఎవరికి క్షమాపణలు చెప్పాల్సి వస్తుందోనన్న ఆందోళన ఆయనలో కన్పించిందని అనుచరులే చెప్పారు. సారీ.. ఆ ఒక్కటి పట్టించుకోవద్దు దీంతో పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన భాస్కరరావు క్షమాపణలు చెప్తూ వీడియో విడుదల చేశారు. తాను కావాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే ఎమ్మెల్యే.. కొంతకాలంగా పదే పదే నోరు జారడానికి ఆయనలో పెరుగుతున్న టెన్షన్ కారణం కావచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా? రాదా? అన్న అనుమానం ఒకటైతే.. సీపీఎంతో పొత్తు కుదిరితే మిర్యాలగూడ కేటాయించాల్సి వస్తే తన రాజకీయ భవిష్యత్తు ఏమౌతుందోనని భాస్కరరావు ఆందోళన చెందుతున్నారట. దీంతో పాటు ఈసారి తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని కూడా ఆయన అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో సీటు సీపీఎంకు కేటాయిస్తే.. ఇటు తన రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారడంతో పాటు కొడుకు రాజకీయ అరంగేట్రం కూడా ఆలస్యం అవుతుందన్న ఆందోళనే ఆయన నోరు జారుడుకు కారణంగా విశ్లేషిస్తున్నారు. పైగా తరచుగా వివాదాల్లో చిక్కుకోవడంతో పార్టీలో ఆయన వ్యతిరేక వర్గం నేతలు సంబరాలు చేసుకుంటున్నారట. ఓ నేత అయితే ఏకంగా తన అనుచరులకు పార్టీ ఇచ్చారని మిర్యాలగూడలో ప్రచారం సాగింది. ఒకనాడు జానారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పిన నల్లమోతు భాస్కరరావు ఇప్పుడు ప్రతీ దానికి.. ఫోన్ చేసిన ప్రతీ వ్యక్తికి క్షమాపణలు చెప్పాల్సి రావడం అంటే.. ఆయన స్వయంకృతాపరాధమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే నోటి దురుసుతనానికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారని ప్రత్యర్థులు పండుగ చేసుకుంటున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
ఆ విషయంలో క్షమించండి.. కానీ నా మాటలను వెనక్కి తీసుకోను: వెంకటేశ్ మహా
‘కేరాఫ్ కంచెరపాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా కేజీయఫ్ చిత్రంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. సినిమా పేరు చెప్పకుండా స్టోరీ చెబుతూ సెటైర్లు వేశాడు. దీంతో అతడిపై కామెంట్స్‌పై కేజీయఫ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు క్షమాపణలు చెప్పాలంటూ కన్నడ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వెంకటేశ్ మహాకు వ్యతిరేకంగా పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారు. ఇక తనపై వస్తున్న తీవ్ర నెగిటివిటీ, ట్రోల్స్‌కి వెంకటేశ్ మహా స్పందించాడు. తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ తాజాగా ఓ వీడియో షేర్ చేశాడు. చదవండి: కళ్లు చెదిరేలా కమెడియన్ రఘు లగ్జరీ ఇల్లు.. చూశారా? క్షమాపణలకు బదులుగా తన కామెంట్స్‌ని సమర్థించుకోవడం గమనార్హం. తన అభిప్రాయం సరైనదే అని అయితే తాను వాడిన భాష కరెక్ట్ కాదన్నాడు. ఇంతకీ వెంకటేశ్ మహా ఈ వీడియో ఏం చెప్పాడంటే.. ‘‘కొంతమందిని ఉద్దేశించే నా అభిప్రాయం చెప్పాను. నాలాగే చాలామంది ఆ సినిమా నచ్చలేదు. నా అభిప్రాయం నచ్చినవాళ్లు ‘మీరు చెప్పింది కరెక్ట్ సార్’ అంటూ నాకు మెసెజ్‌లు పెట్టారు. కాబట్టి వారందరి తరపున నా వాయిస్ వినిపించాను. అయితే ఈ క్రమంలో నేను వాడిన పద భాష కరెక్ట్ కాదు. దానికి నా క్షమాపణలు. కానీ, నేను సినిమాలోని కల్పిత పాత్రను మాత్రమే విమర్శించాను. రియల్ పర్సన్ కాదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ట్రెండింగ్‌లో అల్లు అర్జున్-స్నేహల ఫొటో! స్పెషల్ ఏంటంటే.. అనంతరం మాట్లాడుతూ.. ‘తాను దూషించింది కేవలం ఓ కల్పిత పాత్ర మాత్రమే. కానీ రియల్ పర్సన్ అయినా నన్ను దూషించడం ఎంతవరకు కెరెక్ట్. నాపై తప్పుడు ఇమేజ్ క్రియేట్ చేస్తూ అసభ్యంగా దూషిస్తున్నారు. ఇదేం నాకు కొత్త కాదు. చాలా సార్లు ఇలాంటివి ఎదుర్కొన్నాను. అయితే మీరంత అన్ని రకాల సినిమాలను ఆదరిస్తారని, ఒకేలా చూస్తారని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్ మరోసారి వైరల్‌గా మారాయి. కాగా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేశ్ మహా ప్రముఖ దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, నందిని రెడ్డి, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయలతో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన వారి సమక్షంలోనే ఈ మూవీ వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనికి వారంత నవ్వడం యశ్ ఫ్యాన్స్‌ని ఆగ్రహానికి గురి చేసింది. దీంతో నందిని రెడ్డిని కొందరు ప్రశ్నించగా ఆమె ట్విటర్ వేదికగా క్షమాపణలు కోరారు. pic.twitter.com/SzJ5mt07ml — Venkatesh Maha (@mahaisnotanoun) March 6, 2023 -
ప్రకాశ్ రాజ్ కామెంట్స్‌పై ఘాటుగా స్పందించిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్
విలక్షణ నటడు ప్రకాశ్ రాజ్ ది కశ్మీర్ ఫైల్స్ మూవీ, ఆ మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నహోత్రిపై చేసిన సంచలన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఇటీవ కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్ రాజ్ ది కశ్మీర్ ఫైల్స్ మూవీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘కశ్మీర్ ఫైల్స్ ఓ చెత్త సినిమా అని, ఆ సినిమాపై ఇంటర్నేషనల జ్యూరీ ఉమ్మివేసిందంటూ వివాదాస్పదంగా స్పందించాడు. దీంతో ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. దీంతో తాజాగా ఆయన కామెంట్స్ కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ స్పందించాడు. చదవండి: బాలుని చూడటానికి వెళ్లలేదు.. నన్ను రావద్దన్నారు: పి సుశీల ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్‌ను అంధకార్ రాజ్ అంటూ ప్రస్తావించాడు ఆయన. ఈ మేరకు వివేక్ అగ్ని హోత్రి ప్రకాశ్ రాజ్ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ కౌంటర్ ఇచ్చాడు. ఆయన ట్వీట్ చేస్తూ.. “జనాలు ఆదరించిన కశ్మీర్ ఫైల్స్ మూవీ అర్బన్ నక్సల్స్‌కు నిద్రలేకుండా చేసింది. అలాంటిది వీక్షకులను మొరిగే కుక్కలు.. అని పిలుస్తూ సినిమా రిలీజైన ఏడాది తర్వాత కూడా ఇబ్బంది పెడుతున్నారు. మిస్టర్ ‘అంధకార్ రాజ’.. భాస్కర్ ఎప్పటికీ మీదే అయినప్పుడు నేనెలా పొందుతాను” అంటూ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. చదవండి: హీరో అవుదామని ఆశగా మద్రాస్ వెళితే హేళనగా మాట్లాడారు..మానసిక క్షోభకు గురయ్యా: మెగాస్టార్ ప్రస్తుతం వివేక్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఈవెంట్లో ప్రకాశ్ రాజ్ మాట్టాడుతూ.. పఠాన్ మూవీ ప్రశంసిస్తూ.. కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని విమర్శించిన సంగతి తెలిసిందే. ది కశ్మీర్ ఫైల్స్ అనేది ఓ చెత్త సినిమా. దాన్ని సినిమా ఎవరు నిర్మించారో తెలిసిందే. అంతర్జాతీయ జ్యూరీనే వారిపై ఉమ్మివేసింది. అయినా కూడా సిగ్గులేకుండా దర్శకుడు ఆస్కార్ ఎందుకు రాదు? అని అడిగారు. ఆ సినిమాకు కనీసం భాస్కర్ అవార్డ్ కూడా రాదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. A small, people’s film #TheKashmirFiles has given sleepless nights to #UrbanNaxals so much that one of their Pidi is troubled even after one year, calling its viewer’s barking dogs. And Mr. Andhkaar Raj, how can I get Bhaskar, she/he is all yours. Forever. pic.twitter.com/BbUMadCN8F — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) February 9, 2023 -
ఇంగితంలేని మాటలు.. అయ్యన్నా.. ఇక ఆపన్నా! టీడీపీ నేతల హితవు
తాగి వాగే అయ్యన్న మాటలు సొంత పార్టీ నేతలకు కూడా రుచించడం లేదా..? అయ్యన్న రోజూ చేసే వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారా..? అయ్యన్న ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు చేరుతోందా? ఇంతకీ టీడీపీలో అయ్యన్న పాత్ర ఎలా ఉంది?. కొంతకాలం నుంచి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యవహరిస్తున్న తీరుపై తెలుగుదేశం పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నోరు ఉంది కదా అని ఏది బడితే అది వాగడం వల్ల పార్టీకి నష్టం జరుతుందని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రిని, మహిళలను, ఉద్యోగులను, పోలీసులను పట్టుకొని ఏది బడితే అది మాట్లాడటం వల్ల పార్టీకి డామేజ్ తప్పదని హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నేత కనీస ఇంగిత జ్ఞానం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటంపై టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.. సోషల్ మీడియా వేదికగా అయ్యన్న తీరును కొందరు టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. సొంత ప్రయోజనాల కోసం, పార్టీ ఎజెండాను పక్కనపెట్టి సొంత ఎజెండాతో వ్యవహరించే నాయకులు పార్టీకి మేలు చేస్తున్నారో కీడు చేస్తున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని టీడీపీ నేత బండారు అప్పలనాయుడు ట్విట్టర్ వేదికగా అయ్యన్నను ప్రశ్నించారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వారు సహనం కోల్పోయి మాట్లాడడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. సీఎంను విమర్శించడం ద్వారా అయ్యన్న తన ఉనికిని చాటుకోవాలని ఇష్టానుసారంగా మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారని టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు. సీఎంపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే తన కుమారుడికి పార్టీ అధినేత అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తారనే ఆశతోనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల పోలీసులపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. షూట్ ఎట్ సైట్ ద్వారా పోలీసులను కాల్చి పారేస్తానంటు బహిరంగ వేదిక పైనుంచి మాట్లాడారు. హోం మంత్రి పదవితో పాటు లా అండ్ ఆర్డర్ పదవి కట్టబెడితే పోలీసుల సంగతి తేలుస్తానంటూ.. వారి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించారు. అయ్యన్న వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించింది. అయ్యన్న వ్యాఖ్యలపై న్యాయపరంగా కూడా ముందుకు వెళ్లేందుకు వెనకాడబోమని స్పష్టం చేసింది. ఉద్యోగుల మనోభావాలు కించిపరిచే విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని సూచించింది. గతంలో కూడా ఒక మహిళా అధికారిని పట్టుకొని బట్టలూడదీసి కొడతానంటూ దుర్భాషలాడి విమర్శల పాలయ్యారు.. చదవండి: ఆ సందర్భాల్లో చంద్రబాబు ఇంగ్లీష్ స్పీచ్ విసుగు తెప్పించేదా? గ్రాఫిక్స్ చరిత్రలు సైకిల్ పార్టీవే నర్సీపట్నం మెడికల్ కాలేజ్ నిర్మాణమంతా గ్రాఫిక్స్ అంటూ అయ్యన్న చేసిన విమర్శలపై అనకాపల్లి జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. గ్రాఫిక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబునాయుడని స్థానిక ప్రజలు అయ్యన్నకు గుర్తు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మాట ఇస్తే కట్టుబడి ఉంటారని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, అయ్యన్నపాత్రుడుతో సహా టిడిపి నేతలు వస్తే నర్సీపట్నం మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో దగ్గరుండి చూపిస్తామని సవాల్ చేస్తున్నారు. ఇప్పటికైనా అయ్యన్న నోటికి తాళం వేయకపోతే రానున్న రోజుల్లో టీడీపీ పరిస్థితి మరింతగా దిగజారడం ఖాయమంటునన్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఐదుగురు భర్తలకు ఒకే భార్య.. టీఎంసీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దుమారం..
కోల్‌కతా: నోటి దురుసుతో తరచూ వార్తల్లో నిలిచే టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల అనుచితంగా మాట్లాడారు. భారత సంస్కృతిలో ఒక భార్యను ఐదుగురు పురుషులు పంచుకోవచ్చని వ్యాఖ్యానించారు. మహాభారతంలో ద్రౌపదిని పరోక్షంగా ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలుపై కేంద్ర విద్యా శాఖ బృందం సమీక్ష నిర్వహించింది. ఇందులో అవకతవకలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఐదుగురు వంట సిబ్బందికి కేటాయించిన నిధులను ప్రభుత్వం ఏడుగురికి సమానంగా ఇస్తోందని కనిపెట్టారు. దీనిపై వ్యంగ్యంగా స్పందించిన మదన్ మిత్రా.. భారత సంస్కృతిలో ఐదుగురు కలిసి ఒకే భార్యను పంచుకుంటారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వం మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తుందో తెలిపేందుకు మదన్ వ్యాఖ్యలే నిదర్శనం అని కమలం పార్టీ ఎమ్మెల్యే, నటి అగ్నిమిత్ర పాల్ ధ్వజమెత్తారు. టీఎంసీ నాయకులు అందుకే అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఫైర్ అయ్యారు. సొంత టీఎంసీ పార్టీ కూడా మదన్ మిత్రా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సూచించారు. మిత్రా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. భారత ఇతిహాసాల గురించి తప్పుగా మాట్లాడటం ఆమోదయోగ్యం కాదన్నారు. చదవండి: వారి ఆకాంక్షలను బడ్జెట్ నెరవేర్చింది.. విపక్షాల స్పందన ఇదే! -
అక్కినేని వివాదం: మరోసారి బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లెజెండరి నటులు దివంగత నాగేశ్వరరావును ఉద్దేశించిన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యాలు తీవ్ర దూమారం లేపాయి. దీంతో బాలయ్య క్షమాపణలు చెప్పాలటూ అక్కినేని అభిమానులంతా డిమాండ్ చేశారు. దీంతో ఎట్టకేలకు తన వ్యాఖ్యాలపై స్పందించిన బాలయ్య వివరణ ఇస్తూనే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చదవండి: ఎన్టీఆర్ వర్థంతి నాడు నాగ్ అలా.. ఏఎన్ఆర్ వర్ధంతి నాడు బాలయ్య ఇలా.. ‘నాగేశ్వరరావు గారు నాకు ఎప్పుటికి బాబాయే. ఆయన అంటే నాకు చాలా గౌరవం.ఆయన కూడా నన్ను తన పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేవారు. నన్ను అప్యాయంగా పలకరించేవారు. ఎందుకంటే అక్కడ లేని(అక్కినేని కుటుంబంలో) అప్యాయత ఇక్కడ ఉంది కాబట్టి. గుర్తు పెట్టుకోండి’ అని బాలయ్య వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి బాలయ్య కామెంట్స్ వైరల్‌గా మారాయి. కాగా వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్లో బాలయ్య చేసిన ‘అక్కినేని-తొక్కినేని’ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ టైమ్‌లో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో చెబుతూ.. ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం’ అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: కఠిన సమయంలో నాకు చేరువై, నాలో స్ఫూర్తి నింపావు..: సమంత -
అక్కినేనిపై బాలయ్య వ్యాఖ్యలు.. మంత్రి రోజా రియాక్షన్ ఇదే
సాక్షి, తిరుపతి: అక్కినేనిపై బాలకృష్ణ వ్యాఖ్యలను మంత్రి ఆర్కే రోజా ఖండించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘ఏఎన్ఆర్పై బాలకృష్ణ వ్యాఖ్యలు సరికాదు. చాలా తప్పు. చాలా సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందో బాలకృష్ణ ఆలోచించాలి’’ అని మంత్రి రోజా అన్నారు. కాగా, నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదంలో నిలిచారు. ఆయన లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి సక్సెస్ మీట్లో సినీ దిగ్గజాలను కించపరుస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. సినీ దిగ్గజం, నట సామ్రాట్ దివంగత అక్కినేని నాగేశ్వరరావుపై బాలయ్య అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆయనపై మండిపడుతున్నారు. చదవండి: బాలయ్య అనుచిత వ్యాఖ్యలు, ట్రెండింగ్‌లో ‘మెంటల్ బాలకృష్ణ’ హ్యాష్ ట్యాగ్! -
బాలయ్య అనుచిత వ్యాఖ్యలు, ట్రెండింగ్‌లో ‘మెంటల్ బాలకృష్ణ’ హ్యాష్ ట్యాగ్!
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదంలో నిలిచారు. ఆయన లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి మూవీ సక్సెస్ మీట్ సినీ దిగ్గజాలను కించపరుస్తూ చేసిన ఆయన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. సినీ దిగ్గజం, నట సామ్రాట్ దివంగత అక్కినేని నాగేశ్వరరావుపై బాలయ్య అనుచిత వ్యాఖ్యలు చేసిని సంగతి తెలిసిందే. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆయనపై మండిపడుతున్నారు. ఇటవల జరిగిన వీర సింహారెడ్డి మూవీ సక్సెస్ మీట్లో బాలయ్య మాట్లాడుతూ ‘అక్కినేని.. తొక్కినేని’ అని వ్యాఖ్యానించడం సరికాదని, ఇందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని అక్కినేని అభిమాన సంఘాలు, కాపునాడు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య చేసిన కామెంట్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్న ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయనను టార్గెట్ చేస్తున్నారు. ఈ మేరకు మెంటల్ బాలయ్య అని పేర్కొంటూ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్న అక్కినేని ఫ్యాన్స్. మెంటల్ హ్యాష్‌ట్యాగ్ ‘‘అక్కినేని నాగేశ్వరరావుపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా వివిధ ప్రాంతాల నుంచి అక్కినేని అభిమానులు స్పందించారు. దీంతో ‘మెంటల్ బాలకృష్ణ, ముద్దుల మామయ్య కాదు.. మెంటల్ మామయ్య’ అనే హ్యాష్‌ట్యాగ్స్ ట్విటర్ వేదికగా ట్రెండింగ్‌లోకి వచ్చాయి. అలాగే వివిధ సందర్భాల్లో బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర ప్రవర్తనలకు సంబంధించిన వీడియోలను అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ‘ఈ మెంటల్‌కి సర్టిఫికెట్ రెన్యూవల్ చేయలేదా?.. మళ్ళీ పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు.. ఎస్వీ రంగారావుగారు, అక్కినేని నాగేశ్వర రావుగారి గురించి మాట్లాడే స్థాయి నీకు ఉందా అసలు?’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ‘‘బహిరంగ సభల్లో మాట్లాడకుండా బాలకృష్ణపై నిషేధం విధించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వివిధ కారణాల వల్ల ఆయన నాలుకకు అడ్డూ అదుపు ఉండటం లేదు’ అంటూ ఓ ఫ్యాన్ ట్వీట్ చేశారు. ఇటు ఎస్వీ రంగారావు అభిమానులు కూడా బాలకృష్ణ వైఖరిని తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. Ma mental balakrishna ni kutha pagal degai la Unaru 🤣 Andhukai mata matladai mundhu alochinchi matladali... Adhi yavar ina sare.... #MentalBalaKrishna pic.twitter.com/rvD6oVOlEV — AK Badri (@AKBadri6848) January 25, 2023 సినిమాల్లో డైలాగ్స్ ఏముంది బొచ్చడు చెప్పుకోవచ్చు కానీ బైట అలా ఉండదు #VeeraSimhaReddy#MentalBalaKrishna pic.twitter.com/sf31KY3Y2e — Mahesh (@Norito_DON) January 23, 2023 చివరి రోజుల్లో ఎన్టీఆర్‌కు పట్టెడన్నం కూడా పెట్టని నందమూరి వారసులు రామారావుగారి చివరి రోజుల్లో ఆయనకు పట్టెడన్నం కూడా నందమూరి వారసులు పెట్టలేదన్న విషయం నందమూరి బాలకృష్ణగారు గ్రహించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డిగారు ఉన్న సమయంలో బాలకృష్ణగారి ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు ఏ విధంగా ఆ కేసు నుంచి బాలకృష్ణగారు బయటపడ్డారనే నిజం ఆయనకే (బాలకృష్ణ) తెలియాలి. ఈ కేసు విషయాలను బాలకృష్ణగారు బయటపెడితే మేం కూడా స్వాగతిస్తాం. ఇకనైనా బాలకృష్ణగారు సీనియర్ నటులను గౌరవించడాన్ని నేర్చుకోవాలి. అక్కినేని నాగేశ్వరరావుగారిపై ఇకపై ఏ నటుడైనా విమర్శలు చేస్తే అభిమానులు కూడా ప్రతి విమర్శలు చేస్తారు’’ అంటూ కడప జిల్లా నాగార్జున యువశక్తి అధ్యక్షుడు ఓ వీడియో షేర్ చేశారు. ఇంకా ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అక్కినేని నాగేశ్వరరావుగారికి ఎన్నో అవార్డులు రాకుండా చేసింది ఎవరో అందరికీ తెలుసు. సినీ ఇండస్ట్రీ హైదరాబాద్‌కు రావడానికి ముఖ్య కారకులు నాగేశ్వరరావుగారు. అలాంటి నటుడిపై బాలకృష్ణ విమర్శలు చేయడం దారుణం. సొంతంగా స్పందించిన డబ్బుతో అక్కినేని నాగేశ్వరరావుగారు అన్నపూర్ణ స్టూడియోను నిర్మించాలనుకుంటే ఆ స్థలాన్ని కూడా నందమూరి రామారావుగారు కబ్జా చేయాలని చూస్తే, కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. అయినప్పటికీ తన చివరి రోజుల్లో కూడా రామారావుగారు అక్కినేని నాగేశ్వరరావుగారిని బ్రదర్ అంటూ పిలిచారు. తన తండ్రి వయసుగల అక్కినేని నాగేశ్వరరావుగారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇకనైనా మానుకోవాలి’’ అన్నారు. ‘‘బాలకృష్ణ గారు వాళ్ల నాన్నగారి ముందు వీళ్లంతా ఎవరూ అక్కినేని, తొక్కినేని అంటూ అసభ్యకర పదజాలంతో మాట్లాడటం అహంకారపూరిత అవలక్షణంగా భావించాల్సి వస్తోంది’’ అంటూ అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. సర్వేశ్వరరావు ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీ కళాకారులను మదరాసులోనే అంతం అవకుండా మొట్టమొదట హైదరాబాద్‌కు తీసుకువచ్చి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో సేవలు చేసేలా చేసి, తన నటనతో, సేవాభావంతో ఎంతోమందికి, ఆర్టిస్ట్‌లకు అవకాశాలు కల్పిస్తూ ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్న స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణగారి అహంకారపు మాటలను ఖండిస్తున్నాం. మీ (బాలకృష్ణని ఉద్దేశించి) నాన్నకు అన్యాయం చేసి అధికారం లాక్కుంటే, మీ నాన్న మాటల్లో ఆ నీచుడిని చంపి నా దగ్గరికి రా బాలయ్య అంటూ ఆ రోజు మీ నాన్న నీకు చెప్తే ఈ రోజుకీ ఒక కొడుకుగా నెరవేర్చలేని నీ హీరోయిజం ఏ మాత్రానికి అని మేం ప్రశ్నించవచ్చు. కానీ మా అక్కినేని ఫ్యాన్స్‌కు ఆ సంస్కారం ఉంది. ఇక మీద మీ అహంకార కుల మత్తు మాటలు కట్టిపెట్టి అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ వారు చేసే విభిన్న కార్యక్రమాలకు మీరు చాలా బాధపడాల్సి వస్తుందని అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ హెచ్చరిస్తూ ఉంది’’ అని ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. పవన్ స్పందించాలి ఎప్పుడూ ఇండస్ట్రీకి ఏదో మేలు చేసే వ్యక్తిలా మాట్లాడే పవన్ కల్యాణ్ ఇప్పుడు ‘అక్కినేని నాగేశ్వరరావుగారి’పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని ఓ అక్కినేని ఫ్యాన్ ట్వీట్ చేశారు. ఇక పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ ఓ సందర్భంలో పేర్కొన్నారు. కానీ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సెకండ్ సీజన్‌లోని ఓ ఎపిసోడ్‌కు పవన్ గెస్ట్‌గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇటీవలే క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అంటూ ఇటీవల బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో తన పొరపాటును మన్నించాల్సిందిగా కోరుతూ బాలకృష్ణ ఓ లేఖను విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
బాలకృష్ణకు కాపునాడు అల్టిమేటం
సాక్షి, విజయవాడ: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ దిగ్గజాలను ఉద్దేశించి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై కాపునాడు తాజాగా ఆయనకు అల్టిమేటం జారీ చేసింది. బాలకృష్ణ వ్యాఖ్యలు కాపుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని, ఈ నెల 25వ తేదీలోపు క్షమాపణ చెప్పాలని బాలయ్యను డిమాండ్ చేశాయి. ఒకవేళ బాలకృష్ణ గనుక క్షమాపణలు చెప్పని తరుణంలో.. రంగా విగ్రహాల వద్ద మౌన ప్రదర్శన పాటించి నిరసన తెలపాలని కాపు సోదరులకు కాపునాడు పిలుపు ఇచ్చింది. నిర్ణీత సమయంలోపు బాలకృష్ణ కాపు సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పాలి. గతంలో దేవీబ్రహ్మణులపై వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న బాలయ్య.. సంతకం లేని లేఖ రిలీజ్ చేసి క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడు అలాకాకుండా ప్రెస్‌మీట్ పెట్టి మరీ కాపు సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పాలని కాపునాడు డిమాండ్ చేస్తోంది. అలా జరగని పక్షంలో.. టీడీపీ నుంచి బాలకృష్ణను పదేళ్ల పాటు బహిష్కరించాలి. ఇవేవీ జరగకుంటే నారా లోకేష్ చేపట్టబోయే యువ గళం పాదయాత్రను అడ్డుకుంటామని కాపునాడు హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావును ఉద్దేశిస్తూ నందమూరి బాలకృష్ణ ‘‘ఆ రంగా రావు.. ఈ రంగా రావు’’ అని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కాపునాడు తీవ్రంగా పరిగణించింది. గతంలో కూడా.. కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ బాలయ్య తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రాజకీయాలలో చిరంజీవి విఫలమయ్యారని వ్యాఖ్యానించిన క్రమంలో.. రాజకీయాలలో విజయం తమకే సాధ్యమని.. ‘‘మా బ్లడ్డు వేరు మా బ్రీడు వేరు’’ అంటూ చేసిన కామెంట్లు కూడా కాపుల మనోభావాలని తీవ్రంగా దెబ్బతీశాయి. అటుపై జనసేన పార్టీ లో తిరిగే వారందరూ అలగాజనం అనీ సంకరజాతి జనం అని అంటూ చేసిన వ్యాఖ్యలైతే ఏకంగా గుండెల్లో గునపాలు దింపాయని కాపు సామాజిక వర్గం పేర్కొంది. -
'బీజేపీలోకి వస్తారా? లేక బుల్డోజర్లు తీసుకురమ్మంటారా?'
భోపాల్: మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలంతా బీజేపీలోకి రావాలని, లేదంటే బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయని ఆయన బహిరంగంగా బెదిరించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 'మీరందరు బీజేపీలో చేరండి. నెమ్మదిగా అధికార పార్టీలోకి రండి. మధ్యప్రదేశ్‌లో 2023లో కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయి.' అని బీజేపీ మంత్రి అన్నారు. రాఘోగఢ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈమేరకు మాట్లాడారు. राघोगढ़ में कांग्रेसियों से बोले पंचायत मंत्री महेंद्र सिंह सिसोदिया "भाजपा में आ जाओ नहीं तो 2023 के बाद बुलडोजर तैयार है" मंत्री जी,आपका बुल डोजर अंग्रेजों से बड़ा नहीं है,हम उनसे लड़े हैं.@OfficeOfKNath pic.twitter.com/t0ZvVtd8Oh — KK Mishra (@KKMishraINC) January 19, 2023 బీజేపీ మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆయన మతిస్తిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నారో తెలియక ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడింది. బీజేపీకి ప్రజలే తగిన రీతిలో బుద్ది చెబుతారని పేర్కొంది. ఎలాంటి భాష ఉపయోగించాలో మంత్రి నేర్చుకోవాలని హితవు పలికింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ సంస్కృతి విపరీతంగా పెరిగింది. నేరస్థులు, నిందితుల ఇళ్లు, ఆస్తులను ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేస్తోంది. మధ్యప్రదేశ్‌లో కూడా ఈ తరహా ఘటనలు ఎక్కువయ్యాయి. సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ వీటిని బహిరంగంగా సమర్థిస్తున్నారు. చదవండి: సచిన్ పైలట్‌ను కరోనాతో పోల్చిన రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ -
టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
-
తమిళనాడు Vs తమిళగం దుమారం..వివరణ ఇచ్చిన గవర్నర్
తమిళనాడు రాష్ట్రం పేరు విషయంలో గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలు పెద దుమారం రేపాయి. ఏకంగా తమిళనాడు వర్సెస్ తమిళగం అనే తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు తెరదించుతూ గవర్నర్ రవి వివరణ ఇచ్చారు. తాను తమిళనాడుకి వ్యతిరేకిని కానని తాను పేరు మార్చాలని సూచించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం అని నొక్కి చెప్పారు. తన మాటలను అర్థం చేసుకోకుండా కొందరూ అలా కావాలనే వక్రీకరించారన్నారు. తమిళ ప్రజలు, కాశీకి మధ్య గల చారిత్రక సాంస్కృతిక అనుసంధానం గురించి మాట్లాడుతూ..'తమిళగం' అనే పదాన్న ప్రస్తావించానని చెప్పారు. వాస్తవానికి ఆ రోజుల్లో తమిళనాడు లేదన్నారు. అందుకనే చారిత్రక సాంస్కృతిక సందర్భంలో 'తమిళగం' అనే పదాన్ని సముచితమైనదిగా చెప్పేందుకు యత్నించానన్నారు. అంతేగాదు గవర్నర్ తనపై వస్తున్న వ్యతిరేక వాదనలకు ముంగింపు పలికేలా వివరణ ఇస్తూ.." 'తమిళనాడు' అంటే 'తమిళుల దేశం' అని, 'తమిళగం' అంటే 'తమిళుల ఇల్లు' అని అర్థం. 'నాడు' అనే పదానికి అర్థం 'భూమి'. భారతదేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతాన్ని వర్ణించడానికి ఈ పదాన్ని వాడాలని చాలమంది భావిస్తున్నారు. తమిళనాడు భారతదేశంలో అంతర్భాగం కాదనే కథనాన్ని పురికొల్పే వారికి ఈ వాదన సరితూగవచ్చు. దేశం మొత్తానికి వర్తించేది తమిళనాడు కాదని, అలవాటుగా మారింది. నిజం గెలవాలంటే తమిళగం సరైన పదం. విదేశీయలు పాలన కాలంగా మన సంస్కృతి నాశనమై ఇలా ఈ పదం వచ్చిందని వివరణ ఇచ్చారు. కాగా పొంగల్ వేడుకలకు రాజ్‌భవన్ ఆహ్వానంలో తమిళ వెర్షన్లో గవర్నర్‌ని తమిళగ ఆజునర్ లేదా తమిళగం గవర్నర్ అని ప్రస్తావించడం, దానికి తోడు ఆయన కూడా తమిళనాడు పేరు గురించి మాట్లాడటం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాను గవర్నర్ రవి ముందుకు తెచ్చారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. అంతేకాదు రవికి వ్యతిరేకంగా అసెంబ్లీలో క్విట్ తమిళనాడు, గెట్ ఔట్ రవి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కూడా. (చదవండి: పెద్దనాన్న ఇంటికి ఉదయ నిధి స్టాలిన్.. ఆనందంతో ఆహ్వానించిన కాంతి అళగిరి) -
Tamil Nadu: అంబేద్కర్ పేరు పలకని గవర్నర్.. డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీకి గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంతో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అసెంబ్లీ ప్రసంగ పాఠాన్ని గవర్నర్ మార్చి ప్రసంగించారు. ప్రసంగంలో బీఆర్ అంబేద్కర్, పెరియార్, సీఎన్ అన్నాదురై, కరుణానిధి వంటి ప్రముఖుల పేర్లను దాటవేస్తూ కొత్త వ్యాఖ్యలను జోడించారు. ప్రసంగ పాఠంలో మార్పులను గుర్తించిన సీఎం స్టాలిన్.. దీనిపై అభ్యంతరం తెలియజేయగానే గవర్నర్ సభ నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ వివాదం ఆరోజు నుంచి రగులుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతున్న గవర్నర్ ప్రవర్తనపై తమిళనాడుతో సహా దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో డీఎంకే కార్యకర్త వాజీ కృష్ణమూర్తి గవర్నర్ ఆర్ఎన్ రవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. గవర్నర్ అంబేద్కర్ పేరు చెప్పలేకపోతే అతను కశ్మీర్ వెళ్లాలని, అక్కడికి ఉగ్రవాదులను పంపుతామని, వారు ఆయన్ను కాల్చి చంపుతారని బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ‘భారత దేశానికి రాజ్యాంగాన్ని అందించిన పితామహుడు అంబేద్కర్ పేరును ఈ వ్యక్తి ఉచ్చరించడానికి నిరాకరిస్తే, ఆయనను చెప్పుతో కొట్టే హక్కు నాకు ఉందా లేదా?. అసలు గవర్నర్ రాజ్యాంగం పేరుతో ప్రమాణం చేయలేదా? దాన్ని రాసింది అంబేద్కర్ కాదా.. రాజ్యాంగం మీదనే ప్రమణం చేస్తే ప్రసంగంలోని అంబేద్కర్ పేరును ఎందుకు చదవలేదు. అంబేద్కర్ పేరు చెప్పకపోతే కాశ్మీర్‌కు వెళ్లిపో.. మేమే ఓ ఉగ్రవాదిని పంపిస్తాం.. వారు మిమ్మల్ని తుపాకీతో కాల్చిచంపగలరు’ అని డీఎంకే కార్యకర్త శివాజీ కృష్ణమూర్తి అన్నారు. చదవండి: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కార్యాలయంపై సీబీఐ దాడులు.. If he (TN Gov RN Ravi) refuses to utter the name of Ambedkar in his Assembly speech, don't I have the right to assault him? If you (Gov) don't read out the speech given by Govt, go to Kashmir&we'll send terrorists so that they'll gun you down: DMK's Shivaji Krishnamoorthy (12.01) pic.twitter.com/OvcuauylVw — ANI (@ANI) January 13, 2023 మరోవైపు డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. గవర్నర్‌పై బెదిరింపు వ్యాఖ్యలపై రాజ్ భవన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎంకేకు ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని గవర్నర్ డిప్యూటీ సెక్రటరీ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌పై శివాజీ కృష్ణమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అవుతోందని చెన్నై సీపీకి రాసిన లేఖలో రాజ్ భవన్ పేర్కొంది. ఈ వీడియోలో శివాజీ కృష్ణమూర్తి గవర్నర్‌పై దుర్భాషలాడటంతో పాటు, పరువు నష్టం కలిగించే విధంగా భయపెట్టే పదజాలాన్ని ఉపయోగించారని లేఖలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా శివాజీ కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ ఫిర్యాదును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ విభాగానికి పంపారు. -
సరస్వతీదేవిపై అనుచిత వ్యాఖ్యలు
బాసర (ముథోల్): బాసరలోని జ్ఞాన సరస్వతీదేవిపై భారతీయ నాస్తిక సంఘం రాష్ట్ర శాఖకు చెందిన రేంజర్ల రాజేశ్ అనే గాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంగళవారం బాసరవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. స్థానిక రైల్వేస్టేషన్ చౌరస్తాలో బైఠాయించి రాజేశ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అమ్మవారిని వ్యంగ్య పదాలతో దూషించిన రాజేశ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాసర ఆలయ అర్చకులు, సిబ్బంది, ఆలయ తాత్కాలిక లేబర్ సొసైటీ సిబ్బంది సైతం అమ్మవారి ఆలయ ప్రధాన గోపురం ఎదుట ధర్నా చేశారు. గ్రామస్తులతో కలసి ర్యాలీగా వెళ్లి.. పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. రాజేశ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేశ్‌పై ఐపీíసీ 153, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. కాగా, సరస్వతీదేవిని దూషించిన హిందూ ద్రోహి రేంజర్ల రాజేశ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని వీహెచ్‌పీ రాష్ట్ర శాఖ ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. నరేశ్‌ను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు కాళేశ్వరం: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇప్పటికే వికారాబాద్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న హనుమకొండ జిల్లాకు చెందిన బైరి నరేశ్‌ను మహారాష్ట్ర పోలీసులు ఇదే తరహా కేసులో అరెస్టు చేశారు. అతన్ని గడ్చిరోలి జిల్లా సిరొంచ కోర్టులో మంగళవారం హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గతేడాది డిసెంబర్ 24, 25 తేదీల్లో సిరొంచలో నిర్వహించిన కార్యక్రమంలో హిందూ దేవతలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై సిరొంచ, అహేరి తాలూకాల్లో అతనిపై కేసు నమోదైంది. హిందూ దేవుళ్లను తిడితే వీపులు పగలకొట్టండి ఎంపీ సోయం బాపూరావ్ బోథ్: హిందూ దేవుళ్లను తిట్టినా.. కించపరిచినా వారి వీపులు పగలకొట్టాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని దేవుల్‌నాయక్ తండాలో మంగళవారం నిర్వహించిన జగదాంబదేవి జాతరలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
భైరి నరేష్‌కు మద్దతుగా పోస్టులు.. అగ్నితేజ్ అరెస్ట్
సాక్షి, హన్మకొండ: అయ్యప్ప స్వామి, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఓయూ విద్యార్థి భైరి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, నరేష్ సోదరుడు అగ్నితేజ్.. నరేష్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ సోషల్ మీడియాలో మరో పోస్టు చేశాడు. దీంతో, మరోసారి దుమారం చోటుచేసుకుంది. కాగా, ఈ పోస్టు అనంతరం అగ్నితేజ్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం రాములపల్లికి చెందిన నరేష్ కుటుంబసభ్యుడు అగ్నితేజ్‌ను అరెస్ట్ చేసి మెజీస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నట్లు సీఐ సంజీవ్ తెలిపారు. ఈ సందర్బంగా ఎవరైనా రెచ్చగొట్టే విధంగా.. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మరొకరి మనోభావాలు దెబ్బతీసేలా ఎవరు వ్యవహరించకూడదని కోరారు. మరోవైపు.. సోషల్ మీడియాలో అగ్నితేజ్ పోస్ట్ కారణంగా అతడి స్వగ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో, అప్రమత్తమైన పోలీసులు అగ్నితేజ్ పేరెంట్స్‌ను అదుపులోకి తీసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇక, అగ్నితేజ్ పై 153-A, 295-A, 298, 505(2) సెక్షన్ కింద కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
భైరి నరేష్‌కు సపోర్ట్‌గా పోస్టులు.. రంగంలోకి పోలీసులు
సాక్షి, హైదరాబాద్/హన్మకొండ: అయ్యప్ప స్వామి, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఓయూ విద్యార్థి భైరి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భైరి నరేష్‌పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని ప్రకటించారు కూడా. ఈ తరుణంలో శనివారం మరో పరిణామం చోటు చేసుకుంది. భైరి నరేష్‌ను కోర్టులో హాజరు పర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. భైరి నరేష్‌ను, హనుమంత్లను పరిగి సబ్ జైలుకు తరలించారు పోలీసులు. ఈ సమాచారం అందుకున్న అయ్యప్ప స్వాములు జైలు ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు భైరి నరేష్ సమీప బంధువు మరో వివాదాస్పద చర్యకు దిగాడు. భైరి నరేష్ వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశాడు అగ్నితేజ్. దీంతో మరో దుమారం చెలరేగింది. అగ్నితేజ్ పోస్టుపై అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో రంగంలోకి దిగిన పోలీసులు.. అగ్నితేజ్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని అగ్నితేజ్ గురించి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే తమ కొడుకుతో తమకు మాటలు లేవని, తాము దేవుళ్లను పూజిస్తామని అగ్నితేజ్ తల్లి స్టేట్మెంట్ ఇచ్చింది. మరోవైపు భైరి నరేష్ తల్లిదండ్రులు, భార్య సుజాత ఇద్దరు పిల్లలు భయంతో ఇల్లు విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. -
నిజామాబాద్: అయ్యప్ప స్వాముల ధర్నాలో ఉద్రిక్తత
-
కొడంగల్: భైరి నరేష్‌పై కేసు నమోదు
సాక్షి, వికారాబాద్: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌పై శుక్రవారం కేసు నమోదు అయ్యింది. నరేష్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కొడంగల్ పోలీసులు. రెండు రోజుల కిందట ఓ సభలో హిందూ దేవుళ్లను, అయ్యప్ప స్వామిపై వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప మాలధారులు నిరసనలు, రాస్తారోకో చేపట్టారు. ఈ క్రమంలో కోస్గిలో వీడియోలు తీస్తూ అనుమానాదాస్పదంగా వ్యవహరించిన బాలరాజు అనే వ్యక్తిపై అయ్యప్ప మాలధారులు దాడి చేశారు కూడా. అయితే.. ఫిర్యాదుల నేపథ్యంలో భైరి నరేష్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. 295/ఏ, 298, 153ఏ, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. పరారీలో ఉన్న నరేష్ కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే.. అతన్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారం నడుస్తోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించమని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి స్పష్టం చేశారు. మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు. శాంతికి విఘాతం కలిగించేవాళ్లను సమావేశాలకు పిలవొద్దని ఎస్పీ స్పష్టం చేశారు. -
Bairi Naresh: అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. పరిగెత్తించి కొట్టిన స్వాములు
సాక్షి, నారాయణపేట: హిందూ దేవుళ్లు, అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ భైరి నరేష్‌పై అయ్యప్ప మాలధారులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. శుక్రవారం కోస్గి మండల కేంద్రంలో భైరి నరేష్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు, రాస్తారోకో చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. బాలరాజు అనే వ్యక్తిని పరిగెత్తిస్తూ మాలధారులు చితకబాదినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొనగా.. పోలీసులు కలుగుజేసుకుని అతన్ని అక్కడి నుంచి తరలించారు. ఆపై చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. వీడియోలు తీస్తూ అనుమానాదాస్పదంగా కనిపించడం, నిలదీస్తే పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతోనే అతనిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఇక రెండు రోజుల కిందట కొడంగల్‌లో ఓ సభలో హిందూ దేవుళ్లు, అయ్యప్ప స్వామిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు భైరి నరేష్. ఈ వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయంటూ హిందూ సమాజం భగ్గుమంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు భైరి నరేష్ యూట్యూబ్ ఛానల్‌ను పూర్తిగా నిషేధించాలనే డిమాండ్ వినిపిస్తోంది. వీడియోలన్నింటిని యూట్యూబ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంత వాతావరణాన్ని భైరి నరేష్ భగ్నం కలిగిస్తున్నాడని, కులాల, మతాల మధ్య ద్వేషం రగిలిస్తున్నాడని, ఉద్దేశపూర్వకంగా హిందూ మతాన్ని, హిందూ దేవతలను అవమాన పరుస్తున్నాడని విమర్శిస్తున్నారు. హిందూ దేవతలను అశ్లీల అసభ్య పదాలతో వర్ణించడంతో యావత్ హిందూజాతి చాలా అవమానం, బాధకు గురవుతుందని నిరసనకారుల్లో పలువురు విమర్శిస్తున్నారు. భైరి నరేష్ పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని, వెంటనే అరెస్ట్ చేయాలని జడ్చర్ల పట్టణంలోని నేతాజీ కూడలిలో అయ్యప్ప స్వాముల ధర్నా చేపట్టారు. మరోవైపు నల్లగొండ జిల్లా నకిరేకల్ లో ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు అయ్యప్ప స్వామి భక్తులు. నకిరేకల్ అయ్యప్ప స్వామి భక్త మండలి అద్యర్యం లో రాస్తా రోకో ధర్నా చేపట్టారు. మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన నరేష్ పై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వాళ్లు. -
‘ఇండియాలో పరిస్థితులు బాగాలేవు’.. ఆర్జేడీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) సీనియర్ నాయకుడు, బిహార్ మాజీ మంత్రి అబ్దుల్ బారీ సిద్దిఖీ తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. భారత్‌లో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని, విదేశాల్లోనే స్థిరపడాలని తన పిల్లలకు చెప్పానంటూ వారం క్రితం ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘నా కుమారుడు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. కుమార్తె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువు పూర్తిచేసింది. అక్కడే ఉద్యోగాలు వెతుక్కోవాలని, సాధ్యమైతే అక్కడే స్థిరపడి, పౌరసత్వం కూడా సంపాదించుకోవాలని చెప్పాను. ఎందుకంటే భారత్‌లో పరిస్థితులు బాగాలేవు. వారు ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుంటారో లేదో తెలియదు. ఒక తండ్రి తన పిల్లలకు ఇలాంటి మాటలు చెప్పాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోండి’’ అని సిద్దిఖీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ బిహార్ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ ఖండించారు. సిద్దిఖీ లాంటి వ్యక్తులు జాతి వ్యతిరేక అజెండాను మోస్తున్నారని మండిపడ్డారు. దేశం పట్ల, రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని సిద్దిఖీ కుటుంబంతో సహా పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలన్నారు. ఈ దేశం ఎవరి జాగీరూ కాదంటూ దీనిపై సిద్దిఖీ ఆగ్రహం వెలిబుచ్చారు. -
తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు..
సాక్షి, కొత్తగూడెం: తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ కొత్తగూడెంలో జరిగిన క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో డీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలో ఆధునికతకు మూలం క్రైస్తవులు. దేశ అభివృద్ధిలో నాటి క్రైస్తవ పాత్ర కీలకం. ఏసుక్రీస్తు దయవల్లే భారత్‌లో కరోనా తగ్గింది. భారత దేశ మనుగడ క్రైస్తవ మహత్యం అంటూ కామెంట్స్ చేశారు. -
భారత ప్రధానమంత్రి కసాయి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో నోటి దురుసు ప్రదర్శించారు. ఐరాస భేటీ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్‌కు ఒక విషయం చెప్పదల్చుకున్నా. లాడెన్ చచ్చిపోయాడు గానీ గుజరాత్ ప్రజల ప్రాణాలను బలి తీసుకున్న కసాయి బతికే ఉన్నాడు. ఆయనే భారత ప్రధాని. ఆయన్ను అమెరికాలో అడుగుపెట్టకుండా అక్కడి ప్రభుత్వం నిషేధించింది. ఆయన ఆరెస్సెస్ ప్రధాని. ఆరెస్సెస్ విదేశాంగ మంత్రి. అసలు ఆర్ఎస్ఎస్ హిట్లర్ నుంచి స్ఫూర్తి పొందింది!’’ అన్నారు. బిలావల్ తొలుత ఐరాస భేటీలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. వేలాది మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్ర సంస్థ అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌కు, భారత పార్లమెంట్‌పై దాడి చేసిన ముష్కరులకు ఆశ్రయమిచ్చిన పాక్‌కు నీతి బోధలు చేసే అధికారం లేదంటూ విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా బదులిచ్చారు. ఈ విమర్శలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మోదీపై బిలావల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవి అనాగరికంగా, పాక్ స్థాయిని మరింత దిగజార్చేలా ఉన్నాయంటూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తీవ్రంగా ఖండించారు. 1971లో ఏం జరిగిందో బిలావల్ మర్చిపోయినట్లున్నారని భారత్ చేతిలో పాక్ ఓటమిని ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. -
ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు.. 24 గంటల్లోపే అరెస్ట్
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర మంత్రి రాజా పటేరియా అరెస్ట్ అయ్యారు. ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మధ్యప్రదేశ్ హోం శాఖ స్పందించింది. పటేరియా మీద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పన్నాలోని పవాయ్ పోలీస్ స్టేషన్లో సోమవారం మధ్యాహ్నాం కేసు రిజిస్టర్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం పన్నా జిల్లాలోని పవాయ్ పట్టణంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడినట్లుగా చెబుతున్న వీడియో ఒకటి సోమవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ‘ఇక త్వరలో మోదీ ఎన్నికల తంతుకు మంగళం పాడుతారేమో. భాష, కులం, మతం ప్రాతిపదికన జనాలను విడగొడతారు. రాజ్యాంగ నియమాలను కాలరాస్తూ దళితులు, గిరిజనులు, మైనారిటీల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేస్తున్నారు. ఇకనైనా రాజ్యాంగ పరిరక్షణ జరగాలంటే మోదీని చంపేందుకు సిద్ధంకండి. చంపడమంటే ఓడించడమే’ అని పటేరియా చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. సోమవారం ఆ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా.. పటేరియాపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని ఆదేశించారు. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు, దళితులు, మైనారిటీల మధ్య విద్వేషాలు పెంచేలా వ్యాఖ్యలు చేశారంటూ పలు సెక్షన్ల కింద పవాయ్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదుచేశారు. మరోవైపు ఈ వ్యాఖ్యలను సీఎం శివరాజ్ సింగ్ సైతం తీవ్రంగా ఖండించారు. Congress leader & former minister Raja Pateria incites people to kill PM Modi - earlier too Cong leaders spoke about death of PM Modi (Sheikh Hussain) But now a death threat! After “Aukat dikha denge” “Raavan” this is Rahul Gandhi’s Pyaar ki Rajniti? Will they act on him? No! pic.twitter.com/wH6LSi63g2 — Shehzad Jai Hind (@Shehzad_Ind) December 12, 2022 ఇక ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించబోమని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ విభాగం సైతం ఖండించింది. అయితే.. ‘ నా ఉద్దేశం బీజేపీని, మోదీని ఓడించాలని. చంపాలని కాదు. నా వ్యాఖ్యలను వక్రీకరించారు’ అని తర్వాత పటేరియా వివరణ ఇచ్చారు. అయినప్పటికీ కేసు నమోదు కావడంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. -
రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీని లేకుండా చేయాలి: కాంగ్రెస్ నేత
భోపాల్: కాంగ్రెస్ నేత రాజా పటేరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ మద్దతుదారులతో ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాజ్యాంగాన్ని కాపాడాలంటే ప్రధాని నరేంద్ర మోదీని లేకుండా చేయాలని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ మహాత్మా గాంధీకి చెందిన పార్టీ కాదని, ఇటలీ ముస్సోలిని పార్టీ అని తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆ పార్టీ ఆయన సిద్ధాంతాలనే పాటిస్తోందని మధ్యప్రదేశ్ కమలం పార్టీ నేత నరోత్తమ్ మిశ్రా ధ్వజమెత్తారు. అయితే తన వ్యాఖ్యలపై రాజా పటేరియా వివరణ ఇచ్చారు. మోదీని లేకుండా చేయాలనేది తన ఉద్దేశం కాదని, ఎన్నికల్లో ఓడించాలనేదే తన మాటల్లోని అంతరార్థం అని చెప్పుకొచ్చారు. వీడియో తీసిన వ్యక్తి ఎవరో తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని పేర్కొన్నారు. మోదీని లేకుండా చేయడమంటే, అధికారం నుంచి గద్దె దించడమేనని వివరించారు. మధ్యప్రదేశ్ మాజీ మంత్రి అయిన రాజా పటేరియా సోమవారం తన మద్దతుదారులతో మాట్లాడుతూ మోదీపై ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొద్ది గంటలకే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో ఆయన వివరణ ఇచ్చారు. यह है @INCIndia का असली चेहरा पूर्व मंत्री व कांग्रेस नेता श्री राजा पटेरिया मोदी जी की हत्या का बयान देकर समाज को विभाजित कर भड़काऊ भाषण दे रहे है @BJP4India @BJP4MP @vdsharmabjp @HitanandSharma @LokendraParasar pic.twitter.com/XfJ0EApASx — Rajpal Singh Sisodiya (@rpssisodiya) December 12, 2022 చదవండి: రొటీన్‌కు భిన్నంగా ఆలోచించండి.. ఇంకెన్నాళ్లు ఇలా? -
మహిళల దుస్తులపై అనుచిత వ్యాఖ్యలు.. రామ్‌దేవ్ బాబా క్షమాపణలు
మహిళలు దుస్తులు ధరించకపోయినా అందంగా ఉంటారని యోగా గురు రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు కూడా పంపింది. దీంతో రామ్‌దేవ్ బాబా తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఈమేరకు లేఖ విడుదల చేశారు. మహారాష్ట్ర థానెలో శుక్రవారం నిర్వహించిన యోగా సైన్స్ క్యాంప్ కార్యక్రమంలో మాట్లాడుతూ నోరు జారారు రామ్‌దేవ్ బాబా. మహిళలు చీరకట్టులోనైనా, సల్వార్ సూట్లోనైనా అందంగా కన్పిస్తారని, తన దృష్టిలో వాళ్లు దుస్తులు లేకపోయినా బాగుంటారని అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. దీనిపై మహిళా నేతలు సహా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర మహిళా కమిషన్ కూడా నోటీసులు జారీ చేసింది. వివాదం మరింత ముదురుతుందని భావించి రామ్‌దేవ్ బాబా క్షమాపణలు చెప్పారు. రామ్‌దేవ్ బాబా మహిళల దుస్తుల గురించి మాట్లాడినప్పుడు ఆయన పక్కనే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత, సీఎం ఎక్నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే కూడా ఉన్నారు. దీంతో ఇది రాజకీయంగానూ వివాదాస్పదమైంది. రామ్‌దేవ్ అసలు మనస్తత్వం ఏంటో భయటపడిందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఆయన మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనంటూ మండిపడింది. దుస్తుల ప్రస్తావన ఎందుకు? యోగా క్యాంప్‌లో పాల్గొనేందుకు వచ్చిన మహిళలు సల్వార్ సూట్లు ధరించారు. యోగా అనంతరం వెంటనే సమావేశం నిర్వహించడంతో వారు చీర కట్టుకునేందుకు సమయం కూడా లేకపోయింది. దీంతో వారంతా సల్వార్ సూట్‌లోనే మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే దీనిపై మాట్లాడుతూ రామ్‌దేవ్ నోరుజారారు. "Women look good even without clothes."#Ramdev's sexist comment sitting besides #AmruthaFadanavis. pic.twitter.com/FwPMH8yY1w — Sanghamitra Bandyopadhyay (@AITCSanghamitra) November 26, 2022 చదవండి: భారత్‌లో ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి.. -
శివాజీ వ్యాఖ్యల దుమారం: గవర్నర్‌కు సపోర్ట్‌గా..
ముంబై: మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీపై వ్యాఖ్యలతో వివాదంలోకి దిగారు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ. ఛత్రపతి శివాజీ పాత ఐకాన్ అంటూ బహిరంగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మహా సర్కార్‌ను సైతం ఇరకాటంలో పడేశాయి. శివాజీని అగౌరవపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ తరుణంలో మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి.. గవర్నర్‌కు మద్దతుగా చేసిన వ్యాఖ్యలు ఆ అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. ఫడ్నవిస్ భార్య అమృత.. గవర్నర్ కోష్యారీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ‘‘వ్యక్తిగతంగా గవర్నర్‌గారు నాకు తెలుసు. మరాఠా సంస్కృతి మీద ఆయనకు ఎంతో గౌరవం ఉంది. ఆయన ఇక్కడికి వచ్చాకే మరాఠీ నేర్చుకున్నారు. మరాఠీలను ఆయన ఎంత ఇష్టపడతారో.. దగ్గరుండి మరీ చూశా. ఆయన ఏదో అన్నారని కాదు. కానీ, మనస్ఫూర్తిగా ఆయన మరాఠాను గౌరవించే మనిషే అంటూ ఆమె విలేఖరులతో చెప్పారు. ఒకవైపు శివాజీ వ్యాఖ్యల ఆధారంగా గవర్నర్‌పై మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. గవర్నర్ రీకాల్ కోసం ప్రయత్నించాలని మహా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. ఈ తరుణంలో.. అమృతా ఫడ్నవిస్ వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు బీజేపీని, బీజేపీ-షిండే శివసేన కూటమి సర్కార్‌ను మరింత ఇరకాటంలో పడేశాయి. ప్రతిపక్షాలు అమృత కామెంట్ల ఆధారంగా బీజేపీపై విరుచుకుపడుతున్నారు. మరోవైపు ఉద్దవ్ థాక్రే.. కేంద్రం అమెజాన్ పార్శిల్లో కోష్యారీని పంపించిందంటూ ఎద్దేవా చేశారు. కోష్యారీని తప్పించకపోతే.. అన్ని పార్టీలను పోగుజేసి వ్యతిరేక నిరసనలు కొనసాగిస్తామని థాక్రే హెచ్చరించారు. కేంద్రాన్ని ఉద్దేశిస్తూ.. ‘‘మీరు పంపిన శాంపిల్‌ను మీరే తీసుకెళ్లండి. ఒకవేళ ఆయన్ని ఓల్డేజ్ హోంకి పంపించాల్సి వస్తే ఆ పని చేయండి. అంతేకానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఆయన్ని ఉంచకండి అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు థాక్రే. మరోవైపు గవర్నర్ వ్యాఖ్యలపై నిరసన కోసం.. థాక్రే శివసేన వర్గపు నేత సంజయ్ రౌత్.. కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్‌ను కలిసి చర్చించారు. ఇదిలా ఉండగా.. శివాజీపై వ్యాఖ్యల నేపథ్యంలో గవర్నర్ కోష్యారీని కేంద్రం ఢిల్లీకి పిలిపించుకున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: శివాజీపై గవర్నర్ వ్యాఖ్యలు.. గడ్కరీ ఏమన్నారంటే.. -
రెచ్చిపోయిన చింతమనేని.. పబ్లిక్‌లోనే బూతులు తిడుతూ..
సాక్షి, పినకమామిడి: టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. ఏలూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని.. మహిళలు, చిన్నారులు ఉన్నారన్న ఇంగితజ్ఞానం మరిచిపోయి బూతులు మాట్లాడారు. అయితే, ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని పినకమామిడిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో చింతమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పబ్లిక్ మీటింగ్‌లో బూతుపురాణం అందుకున్నారు. అట్రాసిటీ కేసు పెట్టిన దళితుడిపై మరోసారి అశ్లీల వ్యాఖ్యలు చేశారు. దీంతో చింతమనేని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సభలో **** నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ రెచ్చిపోయి బూతులు మాట్లాడారు. కులాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై కూడా తప్పుడు ప్రచారం చేశాడు. మరోవైపు.. వివాదస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయిన చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు.. సోషల్‌మీడియాలో వైరల్
నటి సాయి పల్లవి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దక్షిణాదిలో ముఖ్యంగా టాలీవుడ్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న నటి సాయిపల్లవి. డాక్టర్ విద్యను చదివిన ఈమె నటిగా అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైంది. ప్రేమమ్ చిత్ర విజయంతో ఆమె పేరు దక్షిణాది చిత్ర పరిశ్రమంతా వ్యాపించింది. అలా ప్రస్తుతం దక్షిణాదిలో కథానాయకిగా ఉన్నత స్థాయికి చేరుకుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ అమ్మడు మొదట్లో టీవీ ఛానల్లో డాన్స్ పోటీల్లో పాల్గొనడం ద్వారా సినీ అవకాశాలను దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఈమె అలాంటి డాన్స్ పోటీలనే విమర్శిస్తోంది. అలాంటి పోటీల పైన తనకు నమ్మకం లేదని పేర్కొంది. తమిళంలో విజయ్ టీవీల్లో ప్రసారం అయిన ఉంగళిల్ యార్ అడుత్త ప్రభుదేవా (మీలో ఎవరు తదుపరి ప్రభుదేవా) అనే డాన్స్ పోటీల కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవి ఆ పోటీల్లో ద్వితీయ బహుమతికే పరిమితం అయ్యింది. అదే ఆమెను బాధ పెట్టినట్టుంది. ప్రథమ బహుమతి గెలుచుకోవడానికి కారణం ధన బలం అంటూ తన అక్కసును వెళ్లగక్కింది. దీని గురించి ఇటీవల ఆమె ఒక భేటీలో పేర్కొంటూ డాన్స్ పోటీల్లో ప్రతిభకు ఎప్పుడు గౌరవం లేదని పేర్కొంది. సాధారణంగా టీవీ ఛానళ్లలో డబ్బుకే అత్యంత ప్రాధాన్యత ఇస్తారని చెప్పింది. లేకపోతే ప్రముఖుల వారసులకు అలాంటి మర్యాద ఇస్తారని, అందుకే తనకు డాన్స్ పోటీలు అంటే నమ్మకం లేదని అలాంటివంటే అసహ్యం అంటూ ఆరోపణ చేసింది. కాగా ఈ నటి ఆ మధ్య ప్రభుదేవా నృత్య దర్శకత్వంలో ధనుష్‌తో కలిసి మారి –2 చిత్రంలో రౌడీ బేబీ అనే పాటలో నటించింది. ఆ పాటలో ఆమె ధనుష్‌తో కలిసి చేసిన డాన్స్‌కు దేశ వ్యాప్తంగా పేరు వచ్చిందన్నది గమనార్హం. -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
-
Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై షాహినాయత్ గంజ్‌లోని ఆయన ఇంట్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజాసింగ్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో రాజాసింగ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి చర్లపల్లి జైలుకు తరలించే అవకాశం ఉంది. అరెస్టుకు ముందు ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వీడియో విడుదల చేశారు. తాను తుపాకీ గుళ్లకు, ఉరిశిక్షకు భయపడేవాడిని కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. తనను నగర బహిష్కరణ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజాసింగ్ ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. ఫిబ్రవరి, ఏప్రిల్‌లో నమోదైన కేసులకు సంబంధించి మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్ పోలీసులు ఈ రోజు ఉదయమే రాజాసింగ్‌కు 41(A) సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. మంగళ్‌హట్ పీఎస్‌లో 68/2022 క్రైమ్ నంబర్ కేసులో 505(2), 171, రెడ్‌విత్ 171 సెక్షన్లు , షాహినాయత్‌గంజ్ పీఎస్‌లో క్రైమ్ 71/2022లో 153(ఏ). 295 (ఏ), 504, 505(2) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని మంగళ్‌హాట్ పోలీసులు కోరారు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ -
ఏ మతాన్నీ కించపరచలేదు: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: తాను చేసిన వీడియోలో ఏ మతాన్నీ కించపర్చలేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. అయితే కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి తాను మాట్లా డలేనని తెలిపారు. తనపై నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు. బీజేపీ జాతీయ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై సమాధానం ఇస్తానని చెప్పారు. తాను ఇచ్చే వివరణతో పార్టీ సంతృప్తి చెందు తుందని, బీజేపీ తనను వదులుకోబోదని భావిస్తున్నానని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. కాగా స్వామి పరిపూర్ణా నంద బుధవారం రాజాసింగ్ నివాసానికి వెళ్లి కలిశారు. రాజాసింగ్‌ను పరామర్శించి, అరెస్టుకు దారితీసిన పరిణామాలు, అరెస్ట్, అనంతరం విడుదల, కేసుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. -
Telangana: రాష్ట్రాన్ని తగలబెట్టి శ్మశానాలు ఏలుతారా?
సాక్షి, హైదరాబాద్: ‘ఎవడో జోకర్ ఏదో మాట్లాడాడు. ఆ జోకర్‌కు ఈ సన్నాసులు పోలీసుల కాపలా పెట్టి అనుమతినిచ్చారు. ఆ జోకర్ మాట్లాడిన దానిపై రాజాసింగ్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడతారు. ఇంతకూ ఈ రాష్ట్రాన్ని ఏం చేయదల్చుకున్నారు? తెలంగాణను తగలబెట్టి శ్మశానాలను ఏలాలని బీజేపీ అనుకుంటోందా? కేసీఆర్ ఏం చేయదల్చుకున్నారు? ఇంతటి విద్వేషాలను రెచ్చగొట్టి ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకోవడం భావ్యమా?’ అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ నేతలు మల్లురవి, చిన్నారెడ్డి, అనిల్, శంకర్ నాయక్, ప్రీతం, రోహిణ్రెడ్డిలతో కలిసి ఆయన మీడియా భేటీలో మాట్లాడారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీలో మద్యం కుంభకోణం జరిగింది. ఆ పార్టీకి పంజాబ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆర్థిక సాయం అందించింది. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి సీఎం కేజ్రీవాల్‌ను కేసీఆర్ కలిశారు. ఇద్దరూ కలిసి పంజాబ్ కూడా వెళ్లారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సందర్భాల్లో ఆయా పార్టీలకు ఆర్థిక తోడ్పాటునందించి తనకు అవసరమైనప్పుడు మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు’ అని అన్నారు. ఈ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కుటుంబస భ్యుల ఇళ్లపై సీబీఐ, ఈడీ ఎందుకు దాడులు చేయలేదని ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీ ఐటీ దాడులు చేసి వ్యాపార సంస్థలను బెంబేలెత్తిస్తోందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మునుగోడు ఎన్ని కలు రాగానే సుమధుర, వాసవి, ఫీనిక్స్ సంస్థలపై దాడులు మొదలయ్యాయన్నారు. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాదని, బీజేపీ ఎలక్షన్ డిపార్ట్మెంట్ అని అన్నారు. ప్రియాంక మార్గదర్శనం మునుగోడు అభ్యర్థిని నెలాఖరు వరకు ప్రకటిస్తామని, ఒకట్రెండు రోజులు అటూ ఇటు అవుతుందని రేవంత్ చెప్పారు. ఇంకా ఏ పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించలేదని, ఇలాంటి పరిస్థితుల్లో తమకు కూడా ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలు ఉంటాయన్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై ప్రియాంకాగాంధీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని వెల్లడించారు. -
Raja Singh: చేటు తెచ్చిన మాటలు!.. 2018లో ఒకే ఒక్కడు..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వైఖరి.. రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. తాజాగా ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఓ వర్గంపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడం, తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ ఆ వర్గం వారు తరచూ నగర పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది. బక్రీద్ సందర్భంగానూ ఆయన ప్రత్యేకంగా యువకులతో గోరక్షక దళాలు ఏర్పాటు చేసి నగరానికి ఆనుకొని ఉన్న టోల్గేట్లు, నగరంలోకి ప్రవేశించే అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులపై గస్తీ ఏర్పాటు చేస్తారని.. ఓ వర్గం వారిపై దాడులకు పాల్పడతారన్న అపవాదు ఆయనపై ఉంది. ఈ విషయంలోనూ ఆయనపై దేశవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. నగరంలో సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీకి రాజాసింగ్ తీరుతో కొన్నిసార్లు మేలు జరగ్గా.. మరికొన్ని సందర్భాల్లో నష్టం వాటిల్లినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2018లో ఒకే ఒక్కడు.. రాజాసింగ్ రెండుసార్లు గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో అంబర్పేట్ బరిలో నిలిచిన ప్రస్తుత కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ముషీరాబాద్ బరిలో నిలిచిన ప్రస్తుత పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌లు టీఆర్ఎస్ వేవ్ కారణంగా ఓడిపోయినా.. రాజాసింగ్ గెలిచి సత్తా చాటారు. చదవండి: ‘రాజీ’ ఎరుగని బీజేపీ ఎమ్మెల్యే.. ఏడికైతే ఆడికైతది.. తగ్గేదెలే! -
బీజేపీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెండ్
-
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన బీజేపీ హైకమాండ్.. పది రోజుల్లోగా..
సాక్షి, హైదరాబాద్: మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. నుపూర్ శర్మ ఎపిసోడ్‌తో రాజాసింగ్‌పై తక్షణం చర్యలు చేపట్టింది పార్టీ హైకమాండ్. దీంతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రాజాసింగ్ విడుదల చేసిన వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ హైకమాండ్ .. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వడానికి బీజేపీ పది రోజులు గడువిచ్చింది. సెప్టెంబర్ 2లోగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేను ఆదేశించింది. కాగా మహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే విడుదల చేసిన వీడియోపై మజ్లిస్ నేతలు, మైనార్టీలు.. అర్ధరాత్రి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ముందు, పట్టణంలోని ఇతర ప్రాంతాలలో బైఠాయించి నిరసనలకు దిగారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ పలు పీఎస్‌లలో ఫిర్యాదులు చేశారు.దీంతో యూట్యూబ్ నుంచి రాజాసింగ్ వీడియోను పోలీసులు తొలగించారు. కొనసాగుతున్న కేసుల పరంపర బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రాజాసింగ్‌పై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఆరు చోట్ల, హైదరాబాద్‌లో నాలుగు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మంగళ్‌హాట్, బహదూర్‌పురా, బాలానగర్, డబీర్‌పూర, సంగారెడ్డి నిజామాబాద్‌లో రాజాసింగ్‌పై కేసులు ఫైల్ చేశారు. ఓ వర్గం వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందిన నేపథ్యంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చదవండి: మునుగోడు కోసం తెలంగాణను తగలబెడతారా?: అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ -
పార్ట్-2 కూడా ఉంది.. చావడానికైనా రెడీ: రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పాతబస్తీలో హై టెన్షన్ క్రియేట్ చేశాయి. మహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా రాజాసింగ్.. యూ ట్యూబ్‌లో వీడియోను విడుదల చేయడం మజ్లిస్ నేతలను ఆగ్రహానికి గురి చేసింది. ఈ క్రమంలో రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ మజ్లిస్ నేతలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. మరోవైపు.. రాజాసింగ్ వీడియోపై ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాజాసింగ్.. ముస్లింల మనోభావాలు కించపరిచారంటూ మజ్లిస్ నేతలు ఆందోళనలకు దిగారు. మంగళవారం ఉదయం ఎంఐఎం ఎమ్మెల్యే బలాల.. సీపీ కార్యాలయానికి వెళ్లారు. రాజాసింగ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక, ఆందోళనలు పెరుగుతున్న క్రమంలో పోలీసులు.. యూ ట్యూబ్‌ను రాజాసింగ్ వీడియో తొలగించాలని కోరారు. పోలీసుల అభ్యర్థన మేరకు యూ ట్యూబ్ వివాదాస్పద వీడియోను తొలగించింది. ఇదంతా జరుగుతున్న క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. మునావర్‌కు కౌంటర్ వీడియోలు చేస్తానని ముందే చేప్పాను. కౌంటర్ వీడియోను యూట్యూబ్‌లో తొలగించారు. రెండో భాగం వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను. యాక్షన్‌కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుంది. నాపై ఎలాంటి చర్యలకు దిగినా నేను సిద్ధం. ధర్మం కోసం నేను చావడానికైనా రెడీగా ఉన్నాను. ఇది కూడా చదవండి: మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పాతబస్తీలో హైటెన్షన్ -
బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
జైపూర్: రాజస్తాన్ బీజేపీ నాయకుడు జ్ఞానదేవ్ ఆహోజా చేసిన వ్యాఖ్యలు పెను వివాస్పదంగా మారడమే గాక మత విద్వేషాలకు తెరలేపింది. ఈ మేరకు ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో పోలీసులు ఆయన పై కేసు నమోదు చేశారు కూడా. ఇంతకీ ఆయన ఏమన్నారంటే...ఇప్పటివరకు తాము ఐదుగురిని హత్య చేశామని, గోహత్య చేసే వారిని చంపండి అంటూ.. నినాదాలు చేశారు. ఆ హత్యలు లాలావాండి లేదా బెహ్రూర్‌లో కావచ్చు అంటూ రక్బర్ ఖాన్, పెహ్లూ ఖాన్ హత్యలు గురించి ప్రస్తవించారు. అంతేకాదు వాటిలో ఒక హత్యను 2017లో మరోకటి 2018లో చేశామని బహిరంగంగా చెప్పారు. అవన్నీ కూడా బీజేపీ అధికారంలో ఉన్నప్పుడూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామ్‌గఢ్‌లో జరిగిందని చెప్పడం విశేషం. తమ కార్యకర్తలకు చంపడానికి స్వేచ్ఛ ఇచ్చానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వారు హత్య చేసిన వెంటనే బెయిల్ పొందడమే గాక నిర్దోషులుగా విడుదలవుతారని చాలా ధీమాగా చెబుతున్నారు. కానీ రాజస్తాన్‌లోని అల్వార్ నియోజకవర్గం బీజేపీ చీఫ్ సంజయ్ సింగ్ మాత్రం అవన్నీ అతని వ్యక్తిగత అభిప్రాయాలని పేర్కొన్నారు. తమ పార్టీ ఎప్పుడూ అలాంటి ఆలోచనలు చేయదంటూ... మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలన్నింటిని తీవ్రంగా ఖండిచారు. వాస్తవానికి పెహ్లూ ఖాన్, రక్బర్ ఖాన్ ఇద్దరు హర్యానకు చెందిన పాల వ్యాపారులు. ఐతే పెహ్లు ఖాన్ బెహ్రూర్‌లో 2017 ఏప్రిల్‌లో హత్యకు గురవ్వగా రక్బర్ ఖాన్ జులై 2018లో లాలావండి గ్రామంలో హత్యకు గురయ్యారు. పోలీసులు కూడా ఈ రెండు మతపరంగా జరిగిన హత్యలుగానే గుర్తించారు. మరోవైపు రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా బీజేపీ మతపరమైన ఉగ్రవాదానికి, మతోన్మాదానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి.. బీజేపీ రంగు బట్టబయలైంది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కుపెట్టారు. (చదవండి: లిక్కర్ కుంభకోణంలో అసలు సూత్రధారి కేజ్రీవాల్: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ధ్వజం) -
బాయ్‌ఫ్రెండ్‌ని మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తున్నారు!
న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీకి గుడ్ బై చెప్పి ఆర్జేడితో జత కట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై నితీష్ పై కైలాష్ విజయ వర్గీయ పెద్ద ఎత్తున్న విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ మేరకు కైలాష్ విజయవర్గీయ మాట్లాడుతూ..."తాను కొన్నాళ్లు విదేశాల్లో ఉన్నానని అక్కడ మహిళలు చాలా ఈజీగా బాయ్ప్రెండ్ని మార్చేస్తుంటారని, అచ్చం అలాగే నితీష్ కుమార్ కూడా పార్టీలు మార్చేస్తుంటాడు. ఎప్పుడూ ఎవరి చేయి పట్టుకుంటాడో, ఎవరి చేయి వదిలేస్తాడో ఎవరికి తెలియదు." అని మండిపడ్డారు. ఐతే కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సూర్జేవాలా.. బీజేపీ కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ చేసిన సంచలన వ్యాఖ్యల వీడియోని ట్విట్టర్లో షేర్ చేస్తూ...ఆయనకు మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో చెప్పకనే చెప్పారు అంటూ విమర్శించారు. भाजपा के राष्ट्रीय महासचिव द्वारा नारी सम्मान का नया नमूना 👇 pic.twitter.com/DEGr5ojM5r — Randeep Singh Surjewala (@rssurjewala) August 18, 2022 (చదవండి: బీజేపీ నాయకులకు సరైన సమయంలో బదులిస్తా) -
ఉద్యోగాల కోసం లంచం.. మంచం: ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వారి అర్హత బట్టి కాకుండా లంచం, మంచం ఆధారంగా నియామకంగా జరుగుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే యువకులు లంచం ఇవ్వాలి, యువతులు మంచం ఎక్కాల్సి వస్తుందని ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఖర్గే కలబురిగిలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాలను అమ్మకాలకు పెట్టారని, విధానసౌధ వ్యాపారసౌధగా మారిందని ఆరోపించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తక్షణమే ఆయన మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుంటే వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వారిని అవమానించడమేనని అన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర స్థాయిలోనూ, కేంద్ర స్థాయిలోనూ ఇలాంటివి జరిగాయని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై పలు వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: Munugode Politics: మాణిక్యం ఠాగూర్ ఔట్.. ప్రియాంక ఇన్..? -
బీజేపీ రావణుడిని పూజించాలి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడిని కాదు, రావణుడిని పూజించండి అని అధికార భారతీయ జనతా పార్టీ నాయకులకు సూచించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. రాముడి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉండేవారని గుర్తుచేశారు. రావణాసురుడి పాలనలో అష్టకష్టాలు ఎదుర్కొన్నారని చెప్పారు. ఇప్పుడు మన దేశంలో జనం అలాంటి కష్టాలే అనుభవిస్తున్నారని తెలిపారు. అందుకే బీజేపీ నాయకులు రాముడి స్థానంలో రావణుడిని ఆరాధిస్తే మంచిదని అన్నారు. ‘రామా’ అనే ఒకే ఒక్క ఆయుధంతో ప్రజల దృష్టిని బీజేపీ మళ్లిస్తోందని అధిర్ రంజన్ ఆక్షేపించారు. -
తెలంగాణ సీఎం ఆరోపణలు అర్థరహితం: నీతి ఆయోగ్
సాక్షి, న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తూ.. సంచలన ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. నీతి ఆయోగ్ ఒక పనికి మాలిందని, నీతి ఆయోగ్ సమావేశాలు భజన బృందంగా మారిందంటూ తీవ్ర ఆరోపణలే చేశారాయన. ఈ క్రమంలో కేసీఆర్ ఆరోపణలు చేసిన కాసేపటికే నీతి ఆయోగ్ తీవ్రంగా స్పందించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఆరోపణలు అర్థరహితం. సమాఖ్య స్ఫూర్తి బలోపేతం కోసమే ఈ సంస్థ ఏర్పాటు. గడిచిన ఏడాదిలోనే సీఎంలతో ముప్ఫై సమావేశాలు నిర్వహించాం. నీతిఆయోగ్ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో గతేడాది జనవరి 21న రాష్ట్రాభివృద్ధి అంశాలపై తెలంగాణ సీఎంతో భేటీ అయ్యాం. పలుమార్లు సమావేశం కోసం ప్రతిపాదించినా.. తెలంగాణ సీఎం స్పందించలేదు. రేపటి సమావేశానికి ఆయన హాజరుకావొద్దన్న నిర్ణయం దురదృష్టకరం. రాష్ట్రాలకు ఎజెండా తయారీలో నీతి ఆయోగ్ సహకరించడం లేదన్న ఆరోపణలు సరికాదు. కేంద్రం రాష్ట్రాలకు ఆర్థికంగా అన్ని రకాలుగా సహకరిస్తుంది. 2015-16లో రూ. 2 లక్షల 3 వేల 740 కోట్లు.. 2022-23 ఏడాదికి రూ.4 లక్షల 42 వేల 781 కోట్లకు చేరింది. జల్‌జీవన్ మిషన్ కింద తెలంగాణకు రూ.3,982 కోట్లు కేటాయింపు జరిగింది. కానీ, తెలంగాణ కేవలం రూ.200 కోట్లు మాత్రమే వినియోగించుకుంది. పీఎంకేఎస్‌వై-ఏబీపీ స్కీం కింద రూ.1,195 కోట్లు విడుదల అయ్యాయి అని గణాంకాలతో సహా సీఎం కేసీఆర్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ అనేది దేశంలోని అత్యున్నత రాజకీయ నాయకత్వం ఉండే వేదిక. రాష్ట్ర స్థాయిలలో కీలకమైన అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై చర్చించి, జాతీయ అభివృద్ధికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే వేదిక. బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని తయారు చేయాలనే ఉద్దేశ్యంతో స్పూర్తితో నీతి ఆయోగ్ ఒక సంస్థగా ఏర్పాటు చేయబడింది. రాష్ట్రాలతో సన్నిహితంగా పని చేసేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టాం అని ప్రకటించుకుంది.. ఇదీ చదవండి: నీతి ఆయోగ్ తెలంగాణను మెచ్చుకుంది కూడా-సీఎం కేసీఆర్ -
ఇంకానయం! దేశానికి దిక్కనలేదు!!
ఇంకానయం! దేశానికి దిక్కనలేదు!! -
గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన సీఎం ఏక్నాథ్ షిండే
ముంబై: మహారాష్ట్రలోని గుజరాత్, రాజస్థాన్ ప్రజలను ఉద్ధేశిస్తూ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వ్యాఖ్యలు రాజకీయపరంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. గవర్నర్‌పై మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సహా ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గవర్నర్ మాటలు మరాఠీలను అవమానపరచేలా, హిందువులను విభజించేలా ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందించారు. కోశ్యారీ వ్యాఖ్యలు వ్యక్తిగతమని, ఆయన మాటలతో ఏకీభవించమని షిండే స్పష్టం చేశారు. ‘కోశ్యారీ వ్యాఖ్యలతో ఏకీభవించం. అది అతని వ్యక్తిగత అభిప్రాయం. అతను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. ఇతరులను అవమానపరిచేలా మాట్లాడకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ముంబైవాసులను మేము ఎప్పుడూ మర్చిపోము. ముంబై అభివృద్ధి కోసం మరాఠీ ప్రజలు ఎంతో కృషి చేశారు. ముంబై ఎంతో ప్రాముఖ్యత కలిగిన ముఖ్యమైన నగరం. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది ప్రజలు ముంబైని సొంత ఇంటిగా భావిస్తున్నప్పటికీ మరాఠీ ప్రజలు తమ గుర్తింపు, గౌరవాన్ని కాపాడుకున్నారు. వారిని అవమానించకూడదు’ అని అన్నారు. చదవండి: హిందువులను విభజించాలని చూస్తున్నారు: ఉద్ధవ్ థాక్రే ఇదిలా ఉండగా శుక్రవారం మహారాష్ట్ర గవర్నర్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను పంపిస్తే ముఖ్యంగా పుణె, ముంబై వంటి ప్రాంతాల్లో డబ్బే ఉండదనిని వ్యాఖ్యానించారు. దేశానికి ముంబై ఆర్థిక రాజధానిగా కొనసాగలేదని అన్నారు. ఇక గవర్నర్ వ్యాఖ్యలపై శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే సైతం స్పందిస్తూ.. మరాఠీ బిడ్డలను అవమానించేలా భగత్ సింగ్ కోశ్యారి మాట్లాడారని మండిపడ్డారు. ఆయనను ఇంటికి పంపుతారో లేక జైలుకు పంపుతారో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలన్నారు. -
దుప్పటి కప్పుకున్నా అశ్లీలంగానే కనిపిస్తుంది : శ్రావణ భార్గవి
Okapari Okapari Sravana Bhargavi: టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి పేరు కొంతకాలంగా నెట్టింట హల్చల్ చేస్తుంది. తాజాగా ఆమె రిలీజ్ చేసిన ఓ పాటపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేసిందంటూ అన్నమయ్య వంశస్తులు మండిపడుతున్నారు. వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి వివిధ భంగిమల్లో కనిపిస్తూ, కాళ్లు ఊపుతూ పాటను చిత్రీకరించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా తనపై వస్తోన్న విమర్శలపై సింగర్ శ్రావణ భార్గవి స్పందించింది. తాను పాడిన పాటలో ఎలాంటి తప్పులేదని, మీరు చూసే చూపులోనే తప్పుందని ఘాటుగా బదులిచ్చింది. 'ఆ వీడియోలో అశ్లీలత ఎక్కడ కనిపించింది? నేను ఆ పాటను ఎంత భక్తితో పాడానో నాకు తెలుసు. ఈ పాటలో మీకు తెలుగుదనం తప్పా ఇంకేదైనా కనిపిస్తే అది మీ చూపులో లోపం. నా ప్రాబ్లం కాదు.మీరు చూసే చూపులో లోపం ఉంటే దుప్పటి కప్పుకుని కూర్చున్నా అశ్లీలంగా కనిపిస్తుంది. నేనేం లిరిక్స్ మార్చి పాడలేదు. నా అంతరాత్మకి తెలుసు నేను తప్పుచేయలేదని. నిజంగా ఈ పాట తప్పు అంటే.. దేవుడే ఆ పాటని తీయించేస్తాడు. మగ గాయకులు ఆల్బమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఎలాంటి వివాదాలు ఉండవు. కానీ అదే ఆడవాళ్లు రిలీజ్ చేసినప్పుడే ఇలాంటి వివాదాలు సృష్టిస్తారు' అంటూ శ్రావణ భార్గవి కౌంటర్ ఇచ్చింది. -
పళనిస్వామికి కొత్త తలనొప్పి.. కలకలం రేపిన రహస్య సంభాషణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: మొన్నటి వరకు పన్నీర్‌సెల్వంతో పోరాడిన ఎడపాడి పళనిస్వామికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. పార్టీ నుంచి పొన్నయ్యన్‌ను బహిష్కరించాలని మాజీ మంత్రులు కొందరు అప్పుడే నిరసన గళం విప్పారు. కన్యాకుమారి జిల్లాకు చెందిన పార్టీ ప్రముఖుడొకరు పొన్నయన్‌తో రహస్య సంభాషణ చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆడియో, ఆయనను బహిష్కరించాలనే డిమాండ్ ఎడపాడిని ఇరుకునపెట్టింది. చదవండి: మరో కొత్త వివాదం.. అన్నాడీఎంకే ఖజానాపై ‘వారిద్దరి’ కన్ను ఆడియోలోని వివరాలు.. మాజీ మంత్రి కేపీ మునుస్వామి డీఎంకే మంత్రి దురైమురుగన్ సిఫార్సుతో క్వారీల కాంట్రాక్టు పొంది నెలకు రూ.2 కోట్లు సంపాదిస్తున్నట్లు, అలాగే మాజీ మంత్రి తంగమణి సైతం తన అక్రమాస్తులను ఏసీబీ దాడుల నుంచి కాపాడుకునేందుకు సీఎం స్టాలిన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్నారని, మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం గురించి విమర్శలు చేసినట్లు, ఎంజీఆర్, జయలలితల గురించి అమర్యాదగా మాట్లాడినట్లు ఆ సంభాషణల్లో ఉన్నాయి. అంతేగాక తంగమణి, వేలుమణి దొంగలు, డబ్బు, కాంట్రాక్టులు ఇచ్చి 42 మంది ఎమ్మెల్యేలను గుప్పిట్లో పెట్టుకున్నారని, వాస్తవానికి ఎడపాడికి కేవలం 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతు పలుకుతున్నారని కూడా మాట్లాడారు. ఈ కారణంగా పొన్నయ్యన్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని ఎడపాడిపై మాజీ మంత్రులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆడియో సంభాషణలను పొన్నయ్యన్ ఖండించారు. సాంకేతిక పరిజ్ఞానంతో తన గొంతుకను ప్రచారంలోకి తెచ్చారని ఆరోపించారు. మాజీ మంత్రులపై తాను తప్పుగా మాట్లాడలేదని పేర్కొన్నారు. అయితే, మొత్తం ఈ ఆడియోల వివాదం కోర్టుకెక్కగా గురువారం విచారణ జరగనుంది. పన్నీర్, శశికళపై నిఘా పార్టీ పగ్గాలు చేజారిపోవడంతో పన్నీర్‌సెల్వం, శశికళ ఏకంకావాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు అన్నాడీఎంకే నేతలు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ రహస్యంగా కలుసుకుని మంతనాలు సాగిస్తున్నారనే సమాచారం అందడంతో నిఘాపెట్టి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎడపాడిపై జరుపుతున్న న్యాయపోరాటంలో నెగ్గకుంటే మరో మార్గంలో రాజకీయంగా దెబ్బకొట్టేందుకు పన్నీర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా పన్నీర్‌ను తమవైపు తిప్పుకోవాలని కొందరు, జయ అన్న కుమార్తె, కుమారులైన దీప, దీపక్ పన్నీర్‌సెల్వంను ఇంటికి విందుకు ఆహా్వనించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ విందుకు శశికళను కూడా ఆహ్వానిస్తాం, కలిసి కొత్త పార్టీ స్థాపించి ఎడపాడి ఎత్తుగడలను చిత్తుచేయవచ్చని పన్నీర్‌కు గాలం వేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రచారాన్ని ఓపీఎస్ వర్గీయులు నిర్ధారించడం లేదు. 17న ఎమ్మెల్యేలతో ఎడపాడి సమావేశం పారీ్టలో ఇంతటి గందరగోళ పరిస్థితులు కొనసాగుతుండగా ఈనెల 17వ తేదీన ఎమ్మెల్యేలతో ఎడపాడి పళనిస్వామి సమావేశం నిర్వహిస్తున్నారు. 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్, పన్నీర్ బహిష్కరణతో ప్రధాన ప్రతిపక్ష ఉపనేత పదవి భర్తీపై ఆనాటి సమావేశంలో చర్చించనున్నారు. అత్యవసర విచారణకు నో అన్నాడీఎంకే కార్యాలయానికి వేసిన సీలును తొలగించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను అత్యవసర కేసుగా విచారించాలని ఎడపాడి పళనిస్వామి, ఓ పన్నీర్‌సెల్వం తరపున చేసిన అభ్యర్థనను మద్రాసు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్లు బుధవారం విచారణకు రాగా, ఎడపాడి తరపున పిటిషన్ వేసింది ఎమ్మెల్యే కావడం వల్ల ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి సాధారణ కేసుగా జాబితాలో చేరుస్తామని తెలిపారు. ఇక పన్నీర్‌సెల్వం తరపున దాఖలైన పిటిషన్‌పై కూడా ఆదే విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు. -
పిస్తోళ్లు, గునపాలు సిద్ధం చేసుకోండి.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యాపారస్తులు తమ దుకాణాల్లో తుపాకులు, గునపాలు, రాళ్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గొడవలు జరిగినప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తే.. వారు వచ్చే లోపే దుకాణాలు తగలబడిపోతున్నాయని పేర్కొన్నారు. వారు మాత్రం ఎంతసేపు పనిచేస్తారని వ్యాఖ్యానించారు. విక్రమ్ సైనీ ముజఫర్‌పుర్ జిల్లా ఖాతౌలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జాన్సఠ్లోని వాజిద్పుర్ గ్రామంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సంజీవ్ బాలియన్తో పాటు ఈయన కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రసంగిస్తూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. 'ఒకట్రెండు రాళ్ల డబ్బాలు, 4-5 గునపాలు, రెండు పిస్తోళ్లు మీ దుకాణాల్లో ఉంచుకోండి ' అని అన్నారు. ఆపేందుకు ప్రయత్నించినా విక్రమ్ సైనీ మాట్లాడే సమయంలో స్టేజీపై ఉన్న మరో నేత ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. 'ఈరోజు నన్ను మాట్లాడనివ్వండి. నేను మాట్లాడేది, పేపర్లు, టీవీల్లో రావాలి. నన్ను ఐదేళ్ల పాటు ఎవ్వరూ పదవి నుంచి తప్పించలేరు. ఆ తర్వాత నాకు ఏ ఆశా లేదు' అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తన ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో అది వైరల్‌గా మారి దుమారం రేపింది. నూపుర్ శర్మకు మద్దతు తెలిపిన వ్యక్తిని ఉదయ్‌పూర్‌లో హత్య చేసిన విషయాన్ని కూడా విక్రమ్ ప్రస్తావించారు. ఆమెకు అనుకున్నది మాట్లాడే హక్కు ఉందని పేర్కొన్నారు. చదవండి: Idris Ali: శ్రీలంకలో జరిగిందే ఇక్కడా రిపీట్ అవుతుంది.. మోదీ కూడా గొటబాయలా.. -
నూపుర్ శర్మ అరెస్టు పిటిషన్.. అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరణ
సాక్షి, న్యూఢిల్లీ: నూపుర్ శర్మను అరెస్టు చేయాలని దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ ఇందార బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన విశ్రాంత ధర్మాసనం.. ఈ పిటిషన్‌ను మొదట రిజిస్ట్రార్ ముందుకు తీసుకెళ్లాలని సూచించింది. అయితే ఇప్పటికే ఈ పిటిషన్ రిజిస్ట్రార్ ముందు ఉందని, జులై 11న దీనిపై విచారణ జరిగే అవకాశం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది అత్యున్నత ధర్మాసనానికి తెలిపారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి భాజపా నుంచి సస్పెండ్ అయిన నూపుర్ శర్మ వల్ల దేశ, విదేశాల్లో అనిశ్చితి, అశాంతి నెలకొందని పిటిషన్ పేర్కొంది. ఆమె వల్ల దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. ఈ వ్యవహారంపై స్వతంత్ర, విశ్వసనీయ, నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని న్యాయస్థానాన్ని కోరింది. ఆమెపై ఫిర్యాదులు నమోదైనా.. పోలీసులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకెళ్లాడు. నూపుర్ శర్మను తక్షణమే అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించాలని అభ్యర్థించాడు. చదవండి: సల్మాన్ ఖాన్ లాయర్‌కు బెదిరింపు లేఖ.. వదిలిపెట్టేది లేదంటూ.. -
Agnipath Scheme: ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: అగ్నిపథ్ మంటల్లో రాజకీయ నాయకులు చలికాచుకుంటున్న తీరుగా వ్యవహారం తయారైంది. పథకంలోని లోపాలేంటి, చేపట్టాల్సిన చర్యలేంటి? అనే సంగతి మరచి రాజకీయ నాయకులు పరస్పర విమర్శలతో రెచ్చిపోతున్నారు. స్థాయి మరచి దూషణలకు దిగుతుండటంతో విషయం పక్కదారి పట్టేలా ఉంది! తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్ ప్రధాని నరేంద్రమోదీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. హిట్లర్ మాదిరిగా మొండిగా ముందుకెళ్తే.. ఆయనకు పట్టిన గతే పడుతుందని సుబోధ్ సోమవారం ఓ సభలో వ్యాఖ్యానించారు. చదవండి👉 తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత.. ఇక మోదీపై అనుచిత వ్యాఖ్యలపట్ల జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్‌దాస్ స్పందించారు. నోటి దురుసుగా మాట్లాడటం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని దుయ్యబట్టారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో సోనియాగాంధీ కూడా ఇలాగే నోరుపారేసుకున్నారని, ఆయనను అవమానించిన కాంగ్రెస్ ఏపాటి లాభపడ్డదో గుర్తుంచుకోవాలని అన్నారు. కాంగ్రెస్ విపరీత వ్యాఖ్యలపట్ల కన్నెర్ర జేసిన గుజరాత్ ప్రజలు మరోసారి మోదీకి అఖండ మెజారిటీ కట్టబెట్టారని రఘుబర్‌దాస్ చెప్పుకొచ్చారు. మోదీపై అభిమానంతోనే జనం ఆయనను ప్రధానిగా వరుసగా గెలిపిస్తున్నారని, కాంగ్రెస్ నీచ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. విర్రవీగి మాట్లాడితే కాంగ్రెస్ ఎప్పటికీ ప్రతిపక్షానికి పరిమితమవుతుందని మరికొందరు బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. కాగా, తాత్కాలిక ప్రాతిపదికన రక్షణ రంగంలో నియామకాలకు కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. చదవండి👉 ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా 24న దేశ్యవాప్త నిరసన -
సాయి పల్లవి వివరణపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Prakash Raj Support Sai Pallavi About Controversial Comments: రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'విరాట పర్వం'. ఈ మూవీ విడుదలకు ముందు నుంచి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో 'కశ్మీర్ ఫైల్స్ మూవీలోని హింస, గోరక్షక దళాలు, మానవత్వం' గురించి మాట్లాడింది. ఈ వ్యాఖ్యలపై ఓ వర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన వ్యాఖ్యలపై శనివారం (జూన్ 18) స్పష్టతనిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో తన దృష్టిలో హింస అనేది ముమ్మాటికి తప్పేనని, తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. సాయి పల్లవి ఇచ్చిన వివరణపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఆమెకు మద్దతుగా నిలుస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో 'మానవత్వమే అన్నింటికంటే ముందు. కాబట్టి సాయి పల్లవి.. మేము నీతోనే ఉన్నాం.' అని రాసుకొచ్చారు ప్రకాశ్ రాజ్. కాగా నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన 'విరాట పర్వం' చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. చదవండి: 'విరాట పర్వం'పై సరళ అన్నయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ Humanity first … we are with you @Sai_Pallavi92 https://t.co/6Zip4FJPv3 — Prakash Raj (@prakashraaj) June 19, 2022 -
మతోన్మాదం.. భారత్ పరువును మంటగలుపుతోంది: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల వివాదం పట్ల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఇది సిగ్గుపడాల్సినంతటి మతోన్మాదం అని ట్విటర్లో పేర్కొన్నారు. 'ఉద్దేశపూర్వకంగానే విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారు... కానీ, భారతదేశం బయటి దేశాల్లో బలహీనపడుతోంది. ఇలాంటి సిగ్గుమాలిన మతోన్మాదం మనలను ఏకాకులను చేయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారత్ పరువును కూడా మంటగలుపుతోంది' అని బీజేపీని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ విమర్శించారు. Divided internally, India becomes weak externally. BJP’s shameful bigotry has not only isolated us, but also damaged India’s standing globally. — Rahul Gandhi (@RahulGandhi) June 6, 2022 ఈ వివాదంపై.. పలు ప్రతిపక్షాలు బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్, బీఎస్పీ నేత మాయావతి సహా పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. PM @narendramodi Ji, Why should India as a country apologise to international community for the hate speeches of BJP bigots? It is BJP that should apologise; not India as a Nation Your party should first apologise to Indians at home for spewing & spreading hatred day in day out — KTR (@KTRTRS) June 6, 2022 1. देश में सभी धर्मों का सम्मान जरूरी। किसी भी धर्म के लिए आपत्तिजनक भाषा का इस्तेमाल उचित नहीं। इस मामले में बीजेपी को भी अपने लोगों पर सख्ती से शिकंजा कसना चाहिए। केवल उनको सस्पेंड व निकालने से काम नहीं चलेगा बल्कि उनको सख्त कानूनों के तहत् जेल भेजना चाहिए। 1/2 — Mayawati (@Mayawati) June 6, 2022 -
హిందీ భాషపై కమల్‌హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళ భాష వర్ధిల్లాలి.. అని నటుడు కమల్ హాసన్ పిలుపునిచ్చారు. ఈయన కథానాయకుడిగా నటిస్తూ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం విక్రమ్. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఇందులో సూర్య అతిథి పాత్రలో కనిపించడం విశేషం. మాస్టర్ చిత్రం ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విక్రమ్ చిత్ర ట్రైలర్, ఆడియో లాంచ్ కార్యక్రమాన్నిచెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్ మాట్లాడుతూ.. హిందీని వ్యతిరేకించనని, అలాగని తన మాతృభాష తమిళానికి అడ్డుపడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాని పేర్కొన్నారు. 'చిన్నతనంలో శివాజీ గణేషన్ ఇంటికి ఎక్కువగా వెళుతుండే వాడిని. అలా తనకు తొలి గురువు ఆయన అయితే రెండవ గురువు గీత రచయిత వాలి. వారి వల్లే నేనిక్కడ ఇలా మాట్లాడగలుగుతున్నాను. తమిళం వర్థిల్లాలి అని చెప్పడం నా బాధ్యత. దీనికి ఎవరూ అడ్డు వచ్చినా ఎదుర్కొంటా. ఇప్పుడు భాష గురించి చర్చ జరుగుతోంది..మాతృభాషను మరవకండి. హిందీకి వ్యతిరేకినని చెప్పను. అన్ని భాషలూ ఒకటే. అందరూ కలిస్తేనే ఇండియా' అంటూ చెప్పుకొచ్చారు. -
విశ్వక్ సేన్ అసలు హీరోనే కాదు: ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్
Danam Nagender Fires On Vishwak Sen: యంగ్ హీరో విశ్వక్సేన్- ప్రముఖ టీవీ యాంకర్‌కు మధ్య జరిగిన మాటల యుద్దంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరగుతుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వక్ సేన్, ఆయన టీం చేసిన ప్రాంక్ వీడియో విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఓ టీవీ ఛానెల్లో జరిగిన డిబెట్లో విశ్వక్ సేన్, సదరు యాంకర్ దేవీ నాగవల్లి మధ్య వాడివాడి చర్చ జరిగింది. స్టూడియో నుంచి 'గెట్ అవుట్' అంటూ యాంకర్ గట్టిగా అరవడం, దానికి విశ్వక్ సేన్ అభ్యంతరకర ఎఫ్.. పదంతో దూషించడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇక దీనిపై మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: విశ్వక్సేన్పై మంత్రికి ఫిర్యాదు చేసిన ప్రముఖ యాంకర్ ‘చానళ్లు విశ్వక్ సేన్ హీరోగా గుర్తిస్తున్నారో లేదో మాకు తెలియదు. కానీ, మేం మాత్రం అతడిని హీరోగా గుర్తించడం లేదు. లైవ్‌లో ఇలాంటి అసభ్యకర పదాలు వాడటం కరెక్ట్ కాదు. దేవి నాగవళ్లికి యాంకర్‌గానే కాదు, బయట సమాజంలో కూడా మంచి పేరు ఉంది. అలాంటి యాంకర్‌ను పట్టుకుని అతడు అలా అనడం సహించరానిది. మీడియాలో మాట్లాడాల్సిన సమయంలో అనేక ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వాటికి జవాబు చెప్పే సత్తా ఉన్నప్పుడు మాత్రమే మీడియా ముందుకు రావాలి. లేకపోతే సైలెంట్‌గా ఉండాలి. స్టూడియోలో విశ్వక్ సేన్ మాట్లాడిన మాటల మీద పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలి’ అన్నారు. లేకపోతే మహిళా సంఘాలతో కేసు పెట్టిస్తామని, అతను ఆ మాట అనగానే అదే వేదికపై యాంకర్ చెప్పుతో కొట్టేది ఉండే అని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్ ‘విశ్వక్ సేన్ బయట కనపడితే మా మహిళలు చెప్పులు తీసుకుని కొడతారు. విశ్వక్ సేన్ లాంటి వ్యక్తికి బుద్ది చెప్పాల్సిందే. ఇంకోసారి మరెవరు ఇలాంటి పదాలు వాడకుండా చేయాలి. విశ్వక్ సేన్ లాంటి వాళ్లను సినిమాల్లోకి తీసుకోవద్దని దర్శక నిర్మాతలను కోరుతున్నాను’ అని దానం నాగేందర్ పేర్కొన్నారు. అయినప్పటికీ తమ మహిళ సంఘాలు ఆయనను కొట్టడానికి రెడీగా ఉన్నారని దానం హీరోపై ఫైర్ అయ్యారు. అనంతరం రోడ్లపై ఇలాంటి వ్యవహరాలు చేయడం. కిరోసిన్ డబ్బాను పట్టుకుని సినిమా ప్రమోషన్స్ చేసుకోవడానికి ఆయన ఏమైన పెద్ద హీరో అనుకుంటున్నాడా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే యాంకర్ దేవి నాగవళ్లి ఫిర్యాదుతో విశ్వక్ సేన్‌పై ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పిన సంగతి తెలిసిందే. -
హిందువులు నలుగురిని కని... ఇద్దర్ని ఆరెస్సెస్‌కు దత్తతివ్వండి
కాన్పూర్/లక్నో/సిమ్లా: భారత్ హిందూ దేశంగా మారాలంటే ప్రతి హిందూ దంపతులు నలుగురేసి పిల్లల్ని కనాలని సాధ్వి రితంబర కోరారు. వారిలో ఇద్దరిని దేశం కోసం కేటాయించాలన్నారు. కరడుగట్టిన హిందుత్వవాదిగా పేరున్న ఆమె శనివారం నిరాలానగర్‌లో రామ్ మహోత్సవ్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందూ దంపతులు నలుగురిని కని వారిలో ఇద్దరిని ఆర్ఎస్ఎస్కు దత్తతకివ్వాలి. వీహెచ్‌పీ కార్యకర్తలుగా తయారు చేసి దేశానికి అంకితం చేయాలి’’ అన్నారు. ‘‘జనాభా అసమతుల్యత భవిష్యత్తులో దేశానికి మంచిది కాదు. ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకొస్తే ఈ సమస్య ఉండదు’’ అని చెప్పారు. అయోధ్య రామ మందిర ఉద్యమంతో సంబంధమున్న రితంబర వీహెచ్‌పీ మహిళా విభాగం దుర్గావాహిని వ్యవస్థాపకురాలు. నర్సింగానంద్.. మళ్లీ అదే మాట భారత్ ముస్లిం దేశంగా మారకూడదంటే హిందువులు ఎక్కువ మంది సంతానాన్ని కనాలని యతి నర్సింగానంద్, అఖిలభారత సంత్ పరిషత్ హిమాచల్‌ప్రదేశ్ ఇన్చార్జి యతి సత్యదేవానంద్ సరస్వతి పిలుపునిచ్చారు. సోమవారం హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లా ముబారక్‌పూర్‌లో ‘ధర్మసంసద్’లో వారు మాట్లాడారు. ‘‘ముస్లింలు పథకం ప్రకారం ఎక్కువ మందిని కంటూ తమ జనాభాను పెంచుకుంటున్నారు. భారత్ ముస్లిం దేశంగా మారకుండా చూసేందుకు ఎక్కువ సంతానాన్ని కనాలని హిందూ దంపతులకు పిలుపునిస్తున్నాం’ అని సరస్వతి అన్నారు. ఇవి అభ్యంతరకర వ్యాఖ్యలంటూ జిల్లా పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. యతి నర్సింగానంద్ ఇటీవల మథురలోనూ ఇవే వ్యాఖ్యలు చేశారు. గతేడాది హరిద్వార్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన బెయిల్‌పై ఉన్నారు. -
అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలపై నేడు కోర్టు తీర్పు
-
'మీటూ' తెలియదు.. కానీ 10 మంది మహిళలతో పడక పంచుకున్నా: నటుడు
Actor Vinayakan Controversial comments On MeToo: మలయాళ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ వినాయకన్ మీ టూపై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. తను 10 మంది మహిళలతో శారీరక సంబంధం కలిగి ఉన్నానంటూ అతడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దూమారం రేపుతున్నాయి. వినాయకన్ తాజా చిత్రం ఒరుతె ప్రమోషన్ కార్యక్రమంలో మీ టూపై వినాయకన్కు ప్రశ్న ఎదురవగా అతడు స్పందించిన తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు మలయాళ పరిశ్రమకు చెందిన నటీనటులు సైతం వినాయకన్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఒరుతె ప్రమోషన్ కార్యక్రమంలో వినాయకన్‌తో పాటు మూవీ టీం పాల్గొంది. చదవండి: అప్పుడే ఓటీటీకి ఆర్ఆర్ఆర్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ఈ సందర్భంగా మీ టూ ఉద్యమంపై ఆయన అభిప్రాయం అడగ్గా.. మీటూ అంటే తనకు తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘మీ టూ ఉద్యమం అంటే ఏమిటో నాకు తెలియదు. ఒక మహిళను నాతో శృంగారం చేస్తావా? అని అడగడం మీ టూ అయితే. నేను దానిని అలాగే కొనసాగిస్తాను’ అంటూ వినాయకన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేగాక ఇది కేవలం మహిళలకు సంబంధించిన విషయమేనా? అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’ అంటూ వినాయకన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైయ్యాయి. అదే మీటూ అయితే తన జీవితంలో ఇప్పటి వరకు 10 మంది మహిళలతో శారీరక సంబంధం కలిగి ఉన్నానని, వారందరిని నాతో గడుపుతారా? అని అడిగానని చెప్పాడు. చదవండి: జానీ మాస్టర్‌కి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో ఇదే మీ టూ అయితే ఇకముందు కూడా తాను అలాగే చేస్తానంటూ వ్యాఖ్యానించాడు. ఇక అతడి తీరుపై నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. మీ టూపై సరైన అవగాహన లేకుండా ఉన్నాడంటూ వినాయకన్‌పై పలువురు విరుచుకుపడుతున్నారు. కాగా వినాయకన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. 2019లో మృదులదేవి అనే దళిత మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు, లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్టయి అతడు జైలుకు వెళ్లాడు. ఇప్పుడు మరోసారి మీ టూపై ఈ తరహా వ్యాఖ్యలు చేసి మరోసారి వివాదంలో నిలిచాడు. మరోవైపు బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపేసిన ‘మీ టూ ఉద్యమం’పై ప్రముఖ నటుడైన వినాయకన్ ఈ విధంగా స్పందించడంపై సినీ సెలెబ్రెటీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
స్టార్ హీరోలపై సంచలన కామెంట్స్ చేసిన హీరోయిన్
Kriti Sanon Sensational Comments on Star Heroes: అందం, అభినయంతో తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ కృతి సనన్. ‘1నేనొక్కడినే’ చిత్రం ద్వారా టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృతి ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా అక్షయ్‌కుమార్‌తో కలిసి ఆ అమ్మడు నటించిన బచ్చన్ పాండే మూవీ ఈనెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న కృతి తాజాగా స్టార్ హీరోల గురించి సంచలన కామెంట్స్ చేసింది. హీరోలకు సమానంగా హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యత ఉండటం లేదని పేర్కొంది. సినిమాల్లో హీరోయిన్‌కి 60శాతం ఇంపార్టెన్స్ ఉండి, హీరో పాత్రకి 40 శాతమే ఇంపార్టెన్స్ ఉంటే.. అందులో పేరున్న హీరోలెవరూ నటించడానికి ఆసక్తి చూపించరు. ఈ కారణంగానే గతంలో నేను నటించిన చిత్రాల్లో పలువురు స్టార్స్ నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ ధోరణి మారాలిని కోరుకుంటున్నా అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం కృతి చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ఇక ఆత్రంగి రే చిత్రంలో పాత్ర చిన్నదైనా అక్షయ్ కుమార్ నటించడానికి ఒప్పుకున్నాడని, ఇది చాలా మంచి విషయమని చెప్పుకొచ్చింది. -
తృణమూల్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బెంగాల్లో వివాదాన్ని రేకెత్తిస్తోంది. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ బెంగాల్‌లోని ఓ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి బిహార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలోని బుక్ ఫెయిర్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సభలో టీఎంసీ ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి ప్రసంగిస్తూ.. ‘మీలో బెంగాలీ రక్తం ప్రవహిస్తే, ఖుదీరామ్, నేతాజీ(సుభాష్ చంద్రబోస్)ల రక్తం ప్రవహిస్తే.. మాతృభాషను, మాతృభూమిని ప్రేమిస్తే.. ఒక బీహార్ వ్యక్తి వంద వ్యాధులతో సమానం’ అని గట్టిగా అరవాలని వ్యాఖ్యానించారు. బెంగాలీలకు వ్యాధులు వద్దని, బెంగాల్‌ను వ్యాధి రహితంగా మార్చాలని పేర్కొన్నారు. తృణమూల్ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రంగా తప్పుపట్టారు. ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి మాట్లాడిన వీడియో తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ముందు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ యూపీ, బిహారిలు లేని పశ్చిమ బెంగాల్‌గా మార్చాలని అన్నారు. ఎమ్మెల్యే మనోరంజన్ బయాపరి మొదటిసారిగా 2021 బెంగాల్ ఎన్నికల్లో హుగ్లీ నుంచి గెలిచారు. First his leader @MamataOfficial labels Biharis & UPites as "Bohiragotos" & now this clarion call to make Bengal free of Biharis.@BJP4Bihar @BJP4India @renu_bjp @SanjayJaisw @girirajsinghbjp @BJP4Jharkhand@YashwantSinha @PavanK_Varma — Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) March 14, 2022 -
అచ్చెన్నా.. నీకెందుకంత నోటి దురద
సాక్షి, శ్రీకాకుళం: ‘అచ్చెన్నకు ఎందుకంత నోటి దురద.. అంత తల బిరుసు ఎందుకు.. టిక్కెట్ ఇస్తాడో.. పోతాడో తర్వాత సంగతి. మనిషిని మనిషిగా గుర్తించాలి. నాయకులంటే అంత చులకనా. చెక్కులిస్తే తీసుకుంటారా? ఆస్తి రాసిస్తే వాడుకుని వదిలేస్తారా? పబ్లిక్ మీటింగ్‌లో ఆ వాగుడేంటి? టీడీపీలో జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న చర్చి ఇది. ‘మా సామాజిక వర్గ నాయకుడుంటే అంత చిన్న చూపా? వాడు, వీడు అంటూ సంబోధనేంటి? అచ్చెన్నాయుడికి ఎందుకంత అహంకారం? మా సామాజికవర్గంపై నీ పెత్తనమేంటి? నోరు అదుపులో పెట్టుకోకుండా చేస్తున్న అజమాయిషీ ఏంటి? మా సామాజికవర్గ నేతను నోటికొచ్చినట్టు మాట్లాడటమేంటి? మమ్మల్ని అవమానపరచడం, తొక్కేయడం ఆయనకు అలవాటైపోయింది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా అచ్చెన్నకు బుద్ధి చెబుతాం.. ’ఏకవచనంతో అవమానకర మాటలకు గురైన మామిడి గోవిందరావు సామాజిక వర్గంలో పెల్లుబుకుతున్న ఆవేదనిది. పార్టీ లేదు.. ––– లేదు అన్నారంటే అది పార్టీ వ్యవహారం. కానీ, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నాయకుడ్ని, పార్టీకి, నియోజకవర్గంలో కేడర్‌కి చేతనైనంత సాయం చేస్తున్న నేతను పట్టుకుని పబ్లిక్ మీటింగ్‌లో అనుచితంగా మాట్లాడటాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మునిగిపోతున్న పార్టీని కాస్త నోరున్న వ్యక్తికి ఇస్తే బాగుంటుందనే అంతా అనుకున్నాం. అచ్చెన్నాయుడు పర్వాలేదని భావించాం. కానీ ఇప్పుడాయన పార్టీని పాతాళంలోకి తొక్కేసేలా మాట్లాడుతున్నారని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. పార్టీ పగ్గాలు అప్పగించిన చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్‌నే.. ‘వాడే మంచిగా ఉంటే పార్టీకి ఈ గతి ఎందుకు పడుతుంది.. చట్నీ వెయ్’ అని తిరుపతిలో అన్నప్పుడే అచ్చెన్నాయుడు నైజమేంటో తెలిసిపోయింది. లోకేష్‌నే గుర్తించని వాడు.. జిల్లాలో పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులపై నోటికొచ్చినట్టు వాగడం పెద్ద విషయమేమి కాదని కూడా టీడీపీలో చర్చించుకుంటున్నారు. ‘ఆడొచ్చి చంద్రబాబునాయుడికి ఏదో చెక్కిచ్చాడు, చెక్కు కాదు కదా ఆయన ఆస్తి మొత్తం రాసిచ్చినా సరే పార్టీ అతన్ని వాడుకుంటది, వాడుకొని వదిలేస్తది..’ అని అంటే...ఒక నాయకుడికి ఎంత బాధగా ఉంటుంది.. నాయకుడికి గాని, ఒక కార్యకర్తకు గాని, పార్టీ వాడుకొని వదిలేస్తుందా, ఆస్తి మొత్తం రాసిచ్చేయమన్నా కూడా పార్టీ అతన్ని పట్టించుకోదు అన్న మాట ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనాల్సిన మాటేనా. కింద స్థాయి కేడర్ అన్నా, నియోజకవర్గంలో పనిచేసే నాయకులన్నా అచ్చెన్నకు చులకనని టీడీపీ నేతలు అంతర్మథనం చెందుతున్నారు. టిక్కెట్ ఇస్తారో..పోతారో తర్వాత సంగతి.. ముందు నాయకుల్ని గౌరవించుకోవడం నేర్చుకోవాలని అచ్చెన్నకు ఘాటుగానే సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు రిప్లై ఇస్తున్నాయి. మొత్తానికి మామిడి గోవిందరావునుద్దేశించి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జిల్లాలో హాట్‌టాపిక్ కావడమే కాకుండా టీడీపీలోనూ, ఓ సామాజిక వర్గంలోనూ రచ్చకు దారితీశాయి. ఆ పార్టీ నాయకులకు నా సానుభూతి.. ‘చెక్కులేంటి.. ఆస్తి రాసి ఇచ్చినా లాక్కుందాం. వాడిని అలాగే వాడుకొని వదిలేద్దాం’ అంటూ నియోజకవర్గ స్థాయి నేతనే అన్నాడంటే టీడీపీలో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇది టీడీపీ పాత సిద్ధాంతమే అయినా అచ్చెన్న కొత్తగా చెప్పాడు. ఇక ఆ పార్టీలో ఉన్న నాయకులకు నా సానుభూతి. – ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి -
'ఫార్ములావన్‌ను యువతులు ఎగబడి చూస్తున్నారు.. ఆటపై ఇష్టంతో కాదు'
ఫార్ములావన్ ఫాలో అయ్యేవారికి క్రిస్టియన్ హార్నర్.. పరిచయం అక్కర్లేని పేరు. 2005 నుంచి రేసింగ్‌లో ఉన్న క్రిస్టియన్ హార్నర్ ఖాతాలో తొమ్మిది వరల్డ్ టైటిల్స్ ఉన్నాయి. అందులో నాలుగు వరల్డ్ కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్స్.. మిగతా ఐదు వరల్డ్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్స్ ఉన్నాయి. ప్రస్తుతం బ్రిటిష్ టీమ్ రెడ్‌బుల్ ఫార్ములావన్ ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో క్రిస్టియన్ హార్నర్ ఫార్ములావన్ ఫాలో అవుతున్న యువతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఫార్ములా వన్ చూసేందుకు అమ్మాయిలు ఎగబడుతున్నారని.. అయితే అది ఆటపై ఇష్టంతో కాదని.. అందమైన ఫార్ములా వన్ డ్రైవర్లను చూసేందుకే వస్తున్నారంటూ పేర్కొన్నాడు. క్రిస్టియన్ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. టాక్స్పోర్ట్స్కు చెందిన న్యూజ్ ప్రెజంటేటర్ లారా వుడ్స్‌కు క్రిస్టియన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. '' ఫార్ములావన్ ఇప్పుడు ఉత్సాహంగా ఉన్న యువకులను ప్రోత్సహిస్తుంది. యంగ్ జనరేషన్‌పై ఫోకస్ పెట్టింది. కానీ ఫార్ములావన్ ఫాలో అవుతున్న యువతులు మాత్రం డ్రైవర్లపై ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడొస్తున్న యంగ్ డ్రైవర్లు మంచి లుక్‌తో కనిపిస్తున్నారు. కేవలం వారిని చూసేందుకు పార్ములా వన్‌కు ఎగబడుతున్నారు.. ఆటపై ఇష్టంతో మాత్రం కాదు'' అంటూ పేర్కొన్నాడు. క్రిస్టియన్ సమాధానం విన్న లారా వుడ్స్ అతనికి ధీటుగా కౌంటర్ ఇచ్చింది. ''ఫార్ములా వన్ను యువతులు ఎక్కువగా చూస్తున్నారని మీరన్న మాట నిజమే.. కానీ డ్రైవర్లపై మోజుతో మాత్రం కాదు.. ఆటను చూసి యువతులు కూడా గొప్ప రేసర్లుగా మారాలని అనుకుంటున్నారు.'' అంటూ పేర్కొంది. కాగా క్రిస్టియన్ వ్యాఖ్యలపై అన్ని వైపలు నుంచి విమర్శలు రావడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణ కోరాడు. చదవండి: 423 రోజుల తర్వాత గ్రౌండ్లోకి.. గతం ఒక చీకటి జ్ఞాపకం డబ్బు లేదు.. విరిగిన బ్యాట్‌కు టేప్ వేసి ఆడేవాడిని.. “A lot of young girls watch F1 because all these great-looking young drivers” says Horner. #F1 Listening to the Christian Horner’s opinion : pic.twitter.com/MfpeifwvsV — 𝐑𝐀𝐘 | 𝐒𝐭𝐢𝐥𝐥 𝐈 𝐑𝐢𝐬𝐞 💜 (@RayyLH44) February 22, 2022 Dear Christian Horner, On behalf of the women that watch and love f1 I wanna say something: WE. WATCH. F1. BECAUSE. WE. LIKE. THE. SPORT. WE. DON'T. WATCH. F1. BECAUSE. WE. THINK. THAT. THE. DRIVERS. ARE. HOT. Stop saying such bullshit. Thank you. Yours sincerely Lara — lara || Charles Leclerc wdc year || essereFerrari (@scuderialara) February 22, 2022 christian horner is genuinely a cunt pic.twitter.com/MNAtxeVI3R — cess ⁺✧. 。 (@pogkazuha) February 21, 2022 -
సీఎం కేసీఆర్‌పై భరత్ వాఘ్మారే వివాదాస్పద వ్యాఖ్యలు
పంజగుట్ట: రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుక కోసిన వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ వాఘ్మారే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కి ధైర్యం ఉంటే తన పదవికి రాజీనామా చేసి రాజ్యాంగం మారుస్తాననే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లాలని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆ సంఘం జాతీయ ప్రధానకార్యదర్శి ఎమ్.విజయ్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.నానులు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఈ ఏడేళ్లలో ఒక్కసారి కూడా జయంతి, వర్థంతుల సందర్భంగా ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయలేదని, ఆయనకు అంబేద్కర్ అంటే గౌరవమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: మోదీ.. తెలంగాణ ద్రోహి) పరిస్థితులకు అనుగుణంగా సవరణ చేసుకోవచ్చని రాజ్యాంగంలోనే ఉందని, ఇప్పటివరకు 130 సార్లు సవరించారని, అలాంటిది ఏకంగా రాజ్యాంగాన్నే మారుస్తామనడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. వెంటనే అంబేడ్కర్ విగ్రహంవద్ద కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో తలారి గోపాల్, షర్మిల జాదవ్, వినోద్‌కుమార్, సురేందర్, లింగన్న పాల్గొన్నారు. (చదవండి: మాదకద్రవ్యాల వ్యవహారాన్ని ఆటకట్టించేలా ‘హెచ్–న్యూ’) -
‘బీజేపీ ఎంపీలది శిఖండి పాత్ర’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించేవిధంగా బీజేపీ ఎంపీలు శిఖండి పాత్ర పోషిస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రప్రగతిని అడ్డుకునేందుకు కొన్నిశక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో సోమవారం పార్టీ నేతలు ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, లింగంపల్లి కిషన్‌రావు, రూప్‌సింగ్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుబంధు ద్వారా ఇప్పటివరకు రైతుల బ్యాంకుఖాతాల్లో రూ.50 వేలకోట్లు వేసిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా మారిందని, రైతుసంక్షేమం గురించి అనేక రాష్ట్రాలు తెలంగాణను చూసి నేర్చుకుంటున్నాయని పేర్కొన్నారు. ఒమిక్రాన్ నిబంధనలకు లోబడే రైతుబంధు సంబురాలు చేసుకోవాలని తాము రైతులకు పిలుపునివ్వడం కొందరు కుహనా రాజకీయ నాయకులకు ఇబ్బందిగా మారిందని పల్లా విమర్శించారు. రైతుబంధుతో రైతులు సోమరిపోతులు అవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడాన్ని పల్లా ఖండిస్తూ, ఆయన రైతులను కించపరిచేలా మాట్లాడారని ఆరోపించారు. రైతుబీమా పథకం కింద రాష్టంలో ఇప్పటివరకు 70,714 మంది రైతు కుటుంబాలకు బీమా పరిహారం ఇచ్చామని చెప్పారు. ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల కొనుగోలు కేంద్రాల ద్వారా 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. రాష్ట్రంలో లేని ఆత్మహత్యలను ఉన్నట్లుగా చిత్రీకరించేందుకు రైతు స్వరాజ్యవేదిక అనే సంస్థ ప్రయత్నిస్తోందని, అది ఆంధ్రా నాయకులు పెట్టుకున్న వ్యాపార సంస్థ అని పల్లా ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానిస్తే సహించేది లేదని హెచ్చరించారు. -
‘రూ.15 లక్షల దాకా అవినీతి.. నో ప్రాబ్లమ్!’
అధికారులు, నేతల మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు.. అది చర్చనీయాంశంగా మారడం సహజం. కానీ, అందుకు విరుద్ధంగా ఓ రాజకీయ నాయకుడు అవినీతిని ప్రొత్సహించేలా మాట్లాడడమే ఇక్కడ విశేషం. దీంతో ఆయన్ని తిట్టిపోస్తున్నారు. మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా.. తాజాగా రేవాలో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో అవినీతి గురించి షాకింగ్ కామెంట్లు చేశాడు. ఎవరైనా వ్యక్తిగతంగా 15 లక్షల రూపాయల దాకా అవినీతికి పాల్పడడం సరైందేనంటూ వ్యాఖ్యానించాడాయన. చాలామంది నా దగ్గరికొచ్చి మా సర్పంచ్ అవినీతికి పాల్పడుతున్నారంటూ చెప్తుంటారు. అప్పుడు నేను ఆ సర్పంచ్ చేసిన అవినీతి 15 లక్షలలోపు ఉంటే నా దగ్గరికి రాకండయ్యా అని అంటాను. ...When people accuse sarpanch of corruption, I jokingly tell them that if corruption is up to Rs 15 lakhs don't come to me...come only if it's (corruption) beyond Rs 15 lakhs: BJP MP Janaradan Mishra in Rewa, Madhya Pradesh (27.12) pic.twitter.com/ImobGWecBH — ANI (@ANI) December 28, 2021 ఎందుకంటే ఆ సర్పంచ్ ఎన్నికల కోసం రూ.7 లక్షలు ఖర్చు చేసి ఉంటారు. మరో 7 లక్షలు వచ్చే ఎన్నికల కోసం కేటాయిస్తారు. మరో లక్ష అదనం. ఆ లెక్కలే అంత. అంతకు మించి అవినీతికి పాల్పడితే అది వేరే పరిస్థితి అంటూ మిశ్రా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్లకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పంచాయితీ ఎలక్షన్ ర్యాలీలోనే ఆయన ఈ కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది. చదవండి: కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ.. సోనియాకు చేదు అనుభవం -
ఎమ్మెల్యే ‘అత్యాచార’ కామెంట్లు.. తీవ్ర దుమారం
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో చర్చ సందర్భంగా కర్ణాటక ఎమ్మెల్యే, అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ తప్పని పరిస్థితుల్లో రేప్ అనివార్యమైనపుడు దానిని ఆస్వాదించాల్సిందే’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో క్షమాపణ చెబుతున్నట్లు ఆయన తర్వాత ప్రకటించారు. రమేశ్ వ్యాఖ్యలపై బీజేపీ, జాతీయ మహిళా కమిషన్, కొందరు కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రమేశ్ వ్యాఖ్యలపై రాహుల్, ప్రియాంక స్పందించాలని బీజేపీ డిమాండ్ చేసింది. అసెంబ్లీలో గురువారం వరదలపై చర్చ సందర్భంగా రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సభా గౌరవాన్ని దెబ్బతీయాలనేది తన ఉద్దేశం కాదని రమేశ్ తర్వాత చెప్పారు. ఈ విషయమై ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పా రు. స్పీకర్‌కు క్షమాపణ చెప్పారు. ఇకపై జాగ్రత్తగా మాట్లాడతానని ఆయన తర్వాత ట్వీట్‌చేశారు. అంతకుముందు అంజలీ నింబాల్కర్ సహా కొందరు కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు రమేశ్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ విషయాన్ని శుక్రవారం లోక్‌సభలో లేవనెత్తారు. ఆయన వ్యాఖ్యలను పలువురు బీజేపీ నేతలు ఖండించారు. అత్యాచారాన్ని ఆనందించాలన్న రమేశ్ మొత్తం భారతీయ మహిళలకు క్షమాపణ చెప్పాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు. ఒకపక్క దేశమంతా ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలికపై రేప్ ఘటనపై విచారం వ్యక్తం చేస్తుంటే, ఈయన మాత్రం అత్యాచారాన్ని ఆనందించాలంటున్నాడని పీఏఆర్ఐ(పీపుల్ అగనెస్ట్ రేప్ ఇన్ ఇండియా) కార్యకర్త యోగితా భయానా దుయ్యబట్టారు. ఏంజరిగింది? అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం పంటల బీమాపై చర్చ సందర్భంగా అందరికి మాట్లాడేందుకు స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి అవకాశం ఇవ్వడంపై రమేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదమయ్యాయి. సభలో అందరూ ఒకేసారి మాట్లాడడం ప్రారంభిస్తే ఏమి చేయాలని స్పీకర్ అసహనం వ్యక్తంచేయగా, ‘ఒక సామెత ఉంది. అత్యాచారం తప్పదనుకుంటే దానిని ఆనందించాల్సిందే. ప్రస్తుతం మీరు ఈ స్థితిలోనే ఉన్నారు’ అని రమేశ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అనంతరం ఆయన క్షమాపణలు చెబుతూ, గురువారం సభలో మాట్లాడాల్సిన సభ్యుల సంఖ్య ఇంకా మిగిలేఉండటడంతో స్పీకర్‌కు సమయం గుర్తుచేస్తూ తాను ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చారు. ఒక ఇంగ్లిస్ సామెతను ప్రస్తావించానని, వేరే ఉద్దేశం ఏమీలేదని స్పష్టంచేశారు. 'There is a saying, When rape is inevitable, lie down and enjoy it': You would not believe an ex-Speaker & Congress MLA says this inside the #KarnatakaAssembly and Speaker laughs it off ... No one objects and it is business as usual @ndtv @ndtvindia #OutrageousRapeComment pic.twitter.com/n8oJ8itVDY — Uma Sudhir (@umasudhir) December 16, 2021 -
ఈర్ష్య, కడుపు మంటతో బాబు రగిలిపోతున్నారు: మంత్రి పేర్ని నాని ధ్వజం
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈర్ష్య, కడుపుమంటతో రగిలిపోతూ ఇష్టానుసారం మాట్లాడు తున్నారని సమాచారశాఖ మంత్రి పేర్ని నాని మండిప డ్డారు. తన కుమారుడి వయసు ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గాలిలో కలిసిపోతాడంటూ మాట్లాడటం దారుణమన్నారు. మంత్రి నాని శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహ రించాల్సిన చంద్రబాబు శృతిమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా ఆయన భార్యను అవమానించామంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వరద ప్రభా విత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను చూసి చంద్రబాబుకు మతిపోయిందన్నారు. బాధితులను ఓదార్చడం మానేసి తమపై అనవసర విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో వరదలు వచ్చినప్పుడు చంద్ర బాబు నదిలో ఈదుకుంటూ వెళ్లారా అని నిలదీశారు. మోకాలి లోతు కూడా లేని నీళ్లలో పడవపై లైఫ్ జాకెట్ వేసుకుని చంద్రబాబు చేసిన డ్రామాలను చూసి ప్రజ లు నవ్వుకుంటున్నారన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు హెలికాప్టర్లో కూర్చుకుని గిన్నెలు గిన్నెలు టిఫిన్లు తింటూ ఏరియల్ సర్వే చేశారని ఎద్దేవా చేశారు. తమ ముఖ్యమంత్రి ప్రచారం కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇకనైనా టీడీపీకి పుట్టగతులు కూడా లేకుండా చేయొద్దని ఆ పార్టీ నేతలు చంద్రబాబుకు హితవు చెప్పాలన్నారు. గోదావరి పుష్కరాల్లో పబ్లిసిటీ పిచ్చితో 31 మంది మరణానికి కారణమై మానవ తప్పిదం చేశారని మండిపడ్డారు. ఆన్లైన్ సినిమా టికెట్ల విషయంలో జీవో నంబర్ 35లో నిర్దేశించిన ధరలను పునఃసమీక్షించాలని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, పలువురు నటులు, ప్రొడ్యూసర్లు ప్రభుత్వాన్ని కోరారన్నారు. త్వరలోనే ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. -
సీఎం గాల్లోనే వస్తాడు.. గాల్లోనే పోతాడు..!
సాక్షి, తిరుపతి: ‘ముఖ్య మంత్రి గాల్లోనే వస్తాడు.. గాల్లోనే పోతాడు.. గిరగిరా తిరుగుతున్నాడు. ఎక్కడో ఓ చోట శాశ్వతంగా ఫినిష్ అవుతాడు. మనతో పెట్టుకు న్నోడు కాలగర్భంలో కలిసిపోయాడు. కడుపు కాలుతోంది.. మండుతోంది’ అని చిత్తూరు జిల్లా పర్యటనలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాపానాయుడుపేట, తిరు చానూరు, రాయలచెరువు, తిరుపతిలో బుధవారం చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. టీడీపీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. హుదుద్ తుఫాను సందర్భంగా తాను విశాఖలోనే ఉండి వారంలో అన్నీ చక్కదిద్దానని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే మాత్రమే నిర్వహించారని విమర్శించారు. చంద్రగిరి– శ్రీకాళహస్తి మధ్య స్వర్ణముఖి నదిపై బ్రిడ్జి లు, చెక్ డ్యామ్‌లు కట్టించానన్నారు. వాటిని కాపా డలేక వదిలేయడం వల్లే కొట్టుకుపోయాయని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీని వాయిదా వేసి వరద ప్రాంతాల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు. -
48 గంటల్లో హైకోర్టు నుంచి స్టే తెప్పించగలను
సాక్షి, తిరుపతి: ‘చట్టం, న్యాయం మనవైపు ఉన్నాయి. 48 గంటల్లో హైకోర్టు నుంచి వ్యక్తిగతంగా స్టేలు తెప్పించగలను. నాపై 11 కేసులు పెట్టారు. 307 కేసు పెట్టినా ఏం పీక్కోలేకపోయారు..’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వ్యాఖ్యానించారు. కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం లోకేశ్ తీవ్రమైన, అసభ్యకరమైన పదజాలంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టేలా ప్రచారం సాగించారు. లక్ష్మీపురంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ప్రచారం చేస్తుంటే వారి వైపు చేయి చూపిస్తూ సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కడున్న పోలీసులవైపు చూస్తూ.. తన చొక్కా కాలర్ ఎగరేస్తూ మాట్లాడారు. చిత్తూరు ఎస్పీని, కుప్పం డీఎస్పీని హైకోర్టు ‘దా.. దా.. అంటూ రమ్మంది..’ అని ఎద్దేవా చేశారు. రేపు సీఐ, కానిస్టేబుళ్లను కూడా కోర్టు ‘దా.. దా.. అంటుందేమో’ అని పోలీసులను చులకన చేస్తూ మాట్లాడారు. ‘కరెంటు ఇవ్వలేని నా కొడుకులు కుప్పంలో ఓట్లెలా అడుగుతారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే డిస్మిస్ చేస్తాం రాష్ట్రంలో పోలీసులు రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్కో ఎస్పీపై ఐదారు ప్రైవేట్ ఫిర్యాదులున్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే వీరందరినీ డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. పోలీసులు వైఎస్సార్ సీపీ కండువా కప్పుకుని పనిచేస్తే మంచిదన్నారు. తన తండ్రి సీఎంగా ఉన్నన్ని రోజులు అమరావతిలో తన నివాసానికి ఎవరొచ్చినా గేట్లు తెరిచామని, అదే తాడేపల్లిలోని కొంపకు ఎంతమంది వెళ్లారంటూ స్థానికులను ప్రశ్నించారు. తన తండ్రి వయసున్న మంత్రి పెద్దిరెడ్డిని ‘వాడు, వీడు’ అంటూ సంబోధించారు. -
మరోసారి కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు, వీడియో వైరల్
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలకు చిరునామాగా నిలిచిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరో సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలమైన 1947 నాటి దేశ స్వాతంత్య్రాన్ని ఆమె ‘భిక్ష’గా అభివర్ణించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో సర్కార్ కొలువుతీరిన 2014 ఏడాదిలోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం సిద్ధించినట్లు భావించాలని ఆమె వ్యాఖ్యానించారు. ఒక ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో కంగన మాట్లాడిన వీడియోను పిలిభిత్ ఎంపీ, బీజేపీ నేత వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు.‘ 1947లో దేశం స్వాతంత్య్రం పొందలేదు. అది కేవలం ఒక భిక్ష. మనందరికి 2014లోనే అసలైన స్వాతంత్య్రం వచ్చింది. ఆనాడు భిక్షగా పొందిన దానిని మనం స్వాతంత్య్రంగా ఎలా భావిస్తాం?. దేశాన్ని కాంగ్రెస్‌కు వదిలేసి బ్రిటిషర్లు వెళ్లిపోయారు. బ్రిటిషర్ల పాలనకు మరో కొనసాగింపు రూపమే కాంగ్రెస్’ అని ఆ వీడియోలో ఉంది. ‘1857లోనే మనం తొలిసారిగా స్వాతంత్య్రం కోసం ఐక్యంగా పోరాడాం. కానీ ఆ ఉద్యమాన్ని బ్రిటిషర్లు అణిచివేశారు. దాదాపు శతాబ్దం తర్వాత బ్రిటిషర్లు ‘స్వాతంత్య్రం’ అనే దానిని గాంధీజీ భిక్ష పాత్రలో వేశారు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేశారు. వెల్లువలా విమర్శలు కంగన వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్, ఆప్, శివసేన ఇలా పార్టీలకతీతంగా విమర్శలు వెల్లువెత్తాయి. దేశద్రోహం సెక్షన్ల కింద కంగనపై కేసు నమోదుచేయాలని ఆప్ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ప్రీతి శర్మ మీనన్ ముంబై పోలీసులకు ఫిర్యాదుచేశారు. దేశప్రజలందరికీ కంగన బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ అన్నారు. ‘ గాంధీజీ, భగత్‌సింగ్, నేతాజీ లాంటి త్యాగధనులను అవమానించిన కంగన నుంచి పద్మశ్రీని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదంటే కేంద్రం ఇలాంటి మరెంతో మందిని ప్రోత్సహిస్తోందని భావించాల్సిందే’ అని ఆయన అన్నారు. ‘కంగన మాటలను దేశద్రోహంగా భావించాలా? లేక పిచ్చిపట్టి మాట్లాడుతోంది అనుకోవాలా?. ఇలాంటి సిగ్గుమాలిన వ్యాఖ్యలను మనం కేవలం ఖండించి వదిలేస్తే సరిపోదు’ అని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఆగ్రహంగా మాట్లాడారు. कभी महात्मा गांधी जी के त्याग और तपस्या का अपमान, कभी उनके हत्यारे का सम्मान, और अब शहीद मंगल पाण्डेय से लेकर रानी लक्ष्मीबाई, भगत सिंह, चंद्रशेखर आज़ाद, नेताजी सुभाष चंद्र बोस और लाखों स्वतंत्रता सेनानियों की कुर्बानियों का तिरस्कार। इस सोच को मैं पागलपन कहूँ या फिर देशद्रोह? pic.twitter.com/Gxb3xXMi2Z — Varun Gandhi (@varungandhi80) November 11, 2021 How Dare she insult Our Martyrs like this .. What a SHAMEFUL COMMENT ‼️ Just PATHETIC ‼️‼️ pic.twitter.com/sF59i7Or2e — Aarti (@aartic02) November 10, 2021 .@AamAadmiParty member @PreetiSMenon filed a complaint with the @MumbaiPolice against actor #KanganaRanaut for her recent remarks on India's freedom struggle on a news channel. pic.twitter.com/ZiYgs1sd5x — Silverscreen.in (@silverscreenin) November 11, 2021 -
‘మోదీ నిరక్ష్యరాస్యుడు’... ‘అయితే రాహుల్ డ్రగ్స్ అమ్ముతాడు’
సాక్షి, బెంగుళూరు: ‘రాహుల్ గాంధీ డ్రగ్స్‌కు బానిస, ఆయనో డ్రగ్స్ పెడ్లర్ కూడా’ అంటూ కర్ణాటక బీజేపీ ప్రెసిడెంట్ నలిన్ కుమార్ కతీల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌పై మీడియాలో వచ్చిన కథనాలనే ఉటంకిస్తున్నానని ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీని నడిపే సామర్థ్యం లేదని నలిన్‌కుమార్ మంగళవారం నాటి ఓ మీడియా సమావేశంలో విమర్శలు చేశారు. ప్రధాని మోదీ నిరక్షరాస్యుడని కర్ణాటక కాంగ్రెస్ యూనిట్ ట్వీట్లు చేసిన నేపథ్యంలో నలిన్ కుమార్ కౌంటర్ అటాక్‌గా రాహుల్‌పై ఎదురుదాడి చేసినట్టు తెలుస్తోంది. అయితే, మోదీపై తమ పార్టీ చేసిన ట్వీట్లను తొలగించామని కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ వివరణ ఇచ్చారు. రాహుల్‌పై నలిన్ కుమార్ అసభ్య పదజాలాన్ని వాడారని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఏ వర్గం వారైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా మసలుకోవాలని, ఇష్టారీతిన వ్యవహరించి అభాసుపాలు కావొద్దని సూచించారు. (చదవండి: బాహుబలి గోల్డ్ మోమోస్.. ధర తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే) I have always believed that civil and parliamentary language is a non-negotiable pre-requisite for political discourse. An uncivil tweet made by a novice social media manager through the Karnataka Congress official Twitter handle is regretted and stands withdrawn. — DK Shivakumar (@DKShivakumar) October 18, 2021 Yesterday I said I believe we should be civil and respectful in politics, even to our opponents. I hope the BJP agrees with me, and will apologise for their state president’s abusive and unparliamentary remarks against Shri Rahul Gandhi.@RahulGandhi — DK Shivakumar (@DKShivakumar) October 19, 2021 ఆజ్యం పోసిన ట్వీట్ అక్టోబర్ 30న జరగనున్న సిందగి, హంగల్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈక్రమంలో కర్ణాటక కాంగ్రెస్ ట్విటర్ హ్యాండిల్ నుంచి వెలువడిన ట్వీట్ అగ్నికి ఆజ్యం పోసింది. ఆ ట్వీట్లో ప్రధాని మోదీకి చదువు రాదని కన్నడలో పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ ఎన్నో పాఠశాలలు నిర్మించింది... మోదీ అక్కడ చదువుకోలేదు. వయోజనులకు కూడా విద్యా కార్యక్రమాలు పెట్టింది... అక్కడా ఆయన చదువుకోలేదు. దేశాన్ని పాలిస్తున్నవారు ప్రజలను సోమరులను చేశారు. కనీసం బిచ్చమెత్తుకుందామంటే అది కూడా లేకుండా నిషేదించారు’ అని ట్వీట్లో రాసుకొచ్చారు. (చదవండి: ఉత్తరాన వర్షాలు.. కేరళలో వరద) -
'పార్టీ కార్యకర్తలు తాలిబన్లు, నక్సలైట్లుగా ఉద్యమించాలి'
సాక్షి, ఖమ్మం: వైరా ఎమ్మెల్యే మరోసారి నోరుజారారు. కొనిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలోని శ్రీసిటీలో ఆదివారం ఎమ్మెల్యే రాములు నాయక్ అధ్యక్షతన వైరా నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆవేశంగా మాట్లాడిన ఆయన పార్టీ కార్యకర్తలు తాలిబన్లు, నక్సలైట్లుగా ఉద్యమించాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. దీంతో ఆయన మాట్లాడిన మాటలు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరుగుతున్న వరుస మీటింగ్‌లలో ఎమ్మెల్యే అదుపుతప్పి మాట్లాడుతూ వివాదాస్పదంగా నిలుస్తున్నారు. చదవండి: (పెళ్లయిన నెలకే.. భార్య గొంతు కోసి దారుణహత్య) -
స్టార్ కిడ్స్ ముఖాలు రెండోసారి చూడగలమా : నటి
Nia Sharma Slams Star Kids: ప్రముఖ బుల్లితెర నటి నియా శర్మ తనపై చేస్తున్న బాడీ షేమింగ్ కామెంట్స్‌పై స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యలో మాట్లాడిన ఆమె స్టార్ కిడ్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. 'చాలామంది నేను అందంగా లేనని, నా పర్సనాలిటీ బాగోదని, అందుకే సినిమాల్లో అవకాశాలు రావట్లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా మాట్లాడే వాళ్లు ఒక్కసారి బాలీవుడ్ స్టార్ కిడ్స్ ముఖాలు చూస్తే అర్థమవుతుంది. వాళ్ల పేరేంట్స్ పేర్లు పక్కన లేకపోతే రెండోసారి వాళ్ల ముఖాలు ఎవరూ చూడలేరు. స్టార్ స్టేటస్ ఉంది కాబట్టి వాళ్లు సినిమాలు చూస్తున్నాం తప్పా వాళ్లకంత సీన్ లేదు. నిజం చెప్పాలంటే నేను స్టార్ కిడ్స్ కంటే వంద శాతం బెటర్' అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. ఇక మణికర్ణిక సినిమా ఎక్స్పీరియన్స్ గురించి అడగ్గా.. దాని గురించి మాట్లాడటం తెలివి తక్కువ పనే అవుతుందని, అంతేకాకుండా తన టైం కూడా వేస్ట్ అని పేర్కొంది. ఇక హిందీ సీరియల్స్‌తో పాపులర్ అయిన నియా శర్మ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. చదవండి : ఓటీటీలో ‘రాజ రాజ చోర.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. గ్రాండ్‌గా సుకుమార్ భార్య బర్త్‌డే సెలబ్రేషన్స్ -
సిద్ధూపై ఆప్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ వ్యవసాయ చట్టాల అంశంలో శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీలపై ట్విట్టర్ వేదికగా చెలరేగిపోయారు. శిరోమణి అకాలీదళ్ చేస్తున్న నిరసన ప్రదర్శనలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆప్ కూడా రైతులపై మొసలి కన్నీరు కారుస్తోందని విరుచుకు పడ్డారు. దీంతో ఆప్ సిద్ధూపై ఎదురుదాడికి దిగింది. సిద్ధూ రాజకీయాల్లో రాఖీసావంత్ అంటూ ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘పంజాబ్ రాజకీయాల్లో రాఖీ సావంత్ అయిన సిద్ధూని కాంగ్రెస్ హైకమాండ్ మందలించింది. సీఎం అమరీందర్‌ను నిరంతరం దూషిస్తున్న సిద్ధూకి కళ్లెం వేసింది. అందుకే మార్పు కోసం ఆయన కేజ్రివాల్‌ని అంటున్నారు. రేపటి వరకు వేచి చూడండి. సిద్దూ మళ్లీ కెప్టెన్‌పై విరుచు కుపడతారు’’ అని రాఘవ్ ట్వీట్ చేశారు. (చదవండి: Cadbury: 1990లలో తీసిన క్యాడ్బరీ యాడ్ గుర్తుందా? అది ఇప్పుడు రివర్స్‌గా..) -
ఈ రాజకీయమేంటి అబ్బాజాన్?
కొన్ని మాటలు అంతే... కత్తి కన్నా పదును. కాలకూట విషం కన్నా ప్రమాదం. అందుకే కావచ్చు ఉత్తరప్రదేశ్ (యూపీ) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘అబ్బా జాన్’ అంటూ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. కన్న తండ్రిని ముస్లిమ్‌లు ప్రేమగా పిలుచుకొనే ‘అబ్బాజాన్’ అనే ఉర్దూ సంబోధనతో మైనారిటీలను ఆయన అన్యాపదేశంగా ప్రస్తావించారు. మునుపటి ఏలుబడిలో మెజారిటీల ఉచిత రేషన్‌ను కూడా ‘అబ్బా జాన్’ అనేవాళ్ళే తినేశారంటూ యోగి ఆదివారం ఓ కార్యక్రమంలో అన్నారు. గత పాలనలో రేషనంతా నేపాల్, బంగ్లాదేశ్‌లకు తరలిపోయిందంటూ, పరోక్షంగా మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆయన తండ్రి ములాయమ్లపై నోరు చేసుకున్నారు. ఇక, మంగళవారం అలీగఢ్‌లో ప్రధానమంత్రి మోదీ ఏకపక్షంగా యోగీది ‘ఉత్తమ పాలన’ అని సమర్థించారు. మునుపటి మాఫియారాజ్యం యూపీలో ఇప్పుడు లేదంటూ ప్రతిపక్షాలపై తూటాలు పేల్చారు. ఈ తాజా సభలు, వ్యాఖ్యలతో వచ్చే మార్చిలో రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి బీజేపీ ముందే సమరశంఖం పూరించింది. మరోపక్క ‘ద్వేషాన్ని పెంచిపోషించేవారు యోగి ఎలా అవుతార’న్న రాహుల్ తదితరుల ప్రతిస్పందనలతో రాజకీయం వేడెక్కుతోంది. గత సర్కారు మైనారిటీలను బుజ్జగించే రాజకీయాలు చేసిందనీ, తాము అలాంటివి చేయడం లేదన్నది బీజేపీ మాట. కానీ, ఇప్పుడీ అసంబద్ధమైన ‘అబ్బా జాన్’ ప్రస్తావనతో ఆ పార్టీ ఏ వర్గంపై విషం కక్కి, మరే వర్గాన్ని దగ్గరకు తీసుకొని, ఓటు బ్యాంకుగా ఏకీకృతం చేయాలనుకుంటోందో అర్థం చేసుకోవచ్చు. యోగి హయాంలో యూపీలో విషాదకరమైన హాథ్రస్ అత్యాచార ఘటన జరిగి మంగళవారానికి సరిగ్గా ఏడాది. తొలి వార్షికోత్సవం నాడే ప్రధాని మోదీ రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రశంసల వర్షం కురిపించడాన్ని చూసి, విమర్శకులు నోరు నొక్కుకుంటున్నారు. అయితే, అఖిలేశ్ సారథ్యంలోని గడచిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) పాలనలో కన్నా ఇప్పటి యోగి ప్రభుత్వంలో హత్యలు, అత్యాచారాలు తగ్గాయన్నది జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో లెక్క. ఒకప్పుడు రాష్ట్రంలో మాఫియా రాజ్యం నెలకొంటే, ఇప్పుడు నేరగాళ్ళకు జైలు భయం పట్టుకుందని బీజేపీ నేతలు అంటున్నదీ అందుకే. అలాగని యోగి పాలనలో అంతా అద్భుతమే అనుకుంటే పొరపాటే. రైతు సమస్యలు, నిరుద్యోగం, కరోనాలో కుప్పకూలిన ఆరోగ్యవ్యవస్థ లాంటి వైఫల్యాలూ అనేకం. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో భాగమైన మిత్రపక్షాలు సైతం యోగి ‘అబ్బా జాన్’ వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నాయి. మిత్రపక్షమైన జేడీయూ జాతీయ అధ్యక్షుడే ఆ వ్యాఖ్యల్ని ఖండించారు. బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉన్న యోగి మరో అయిదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇలాంటి మతప్రమేయ వ్యాఖ్యలు చేయడం ఒక రకంగా ఎన్నికల వ్యూహమే. మతప్రాతిపదికన ఓటర్లను చీల్చి, మెజారిటీ వర్గాన్ని మచ్చిక చేసుకొని ఒక తాటి మీదకు తేవాలనే యుద్ధతంత్రమని ఓ వాదన. ‘సబ్ కా సాథ్... సబ్ కా వికాస్... సబ్ కా విశ్వాస్’ మాటల్లోనే తప్ప, మనుషులందరినీ కలుపుకొని పోవడంలో లేదనే విమర్శకు అది తావిస్తోంది. అయోధ్య, రామమందిరం, అలహాబాద్‌ను ప్రయాగరాజ్‌గా, ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా, మొఘల్ సరాయ్ జంక్షన్‌ను పండిట్ దీనదయాళ్ జంక్షన్‌గా పేర్ల మార్చిన బీజేపీ ముస్లిమ్ మరాఠా గవర్నర్ పేరు మీద వచ్చిన అలీగఢ్‌ను సైతం హరిగఢ్‌గా మార్చాలనే వాదనకూ ఊకొడుతుండడం విచిత్రం. నిజానికి, 403 అసెంబ్లీ సీట్లు, 80 లోక్‌సభా స్థానాలే కాదు... ఇప్పటికే 23 కోట్ల జనాభా ఉన్న యూపీలో సమస్యలు చాలా ఉన్నాయి. కరోనా వేళ రాజకీయ నేతలు కేవలం ఓట్లు, సీట్ల మీదే కాక, ఆ సమస్యల పరిష్కారం మీదా దృష్టి పెడితే ప్రజలకు మేలు జరుగుతుంది. మరోపక్క యోగి తప్పులను ఎండగట్టేందుకు కాంగ్రెస్, ఎస్పీ, ఆప్, మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లు దేనికది వ్యూహరచన చేస్తున్నాయి. ఆ మధ్య దాకా అమ్మ సోనియా నిలబడే రాయ్‌బరేలీలో, అన్నయ్య రాహుల్ పోటీపడే అమేథీలో ప్రచారానికే పరిమితమైన ప్రియాంకా గాంధీని ఈసారి యూపీ ప్రచారక్షేత్రంలో ముందు నిలబెడుతోంది కాంగ్రెస్. ఇప్పటి అసెంబ్లీలో 7 సీట్లకే పరిమితమైన ఆ పార్టీ అవసరమైతే సీఎం అభ్యర్థి ఎవరో ప్రియాంకే చెబుతారనీ అంటోంది. బీఎస్పీ రూటు మార్చి, వేదమంత్రాలు, శంఖనాదాలతో బ్రాహ్మణుల్ని మచ్చిక చేసుకోవడంపై దృష్టి పెట్టింది. బీజేపీ అయోధ్యతో పాటు అలీగఢ్‌లో జాట్ వర్గపు పూర్వకాల మహారాజు పేరిట విశ్వ విద్యాలయ ఏర్పాటు లాంటి వ్యూహాలతో జాట్లనూ, ఇతరులనూ తన వైపు తిప్పుకొనేపనిలో ఉంది. ముజఫర్ నగర్ మతఘర్షణలతో 2014 జాతీయ ఎన్నికలలో, ‘ఎస్పీ ప్రభుత్వం ముస్లిమ్ అను కూలమ’నే వాదనతో 2017 అసెంబ్లీ ఎన్నికలలో, మెజారిటీలదే ఇష్టారాజ్యమనే అంతర్లీన వైఖరితో కూడిన జాతీయవాదంతో 2019 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ పైచేయి సాధించినట్టు ఓ విశ్లేషణ. ఇక, రానున్న 2022 ఎన్నికల్లో హిందూ ఓట్ల ఏకీకరణపై ఆ పార్టీ నమ్మకం పెట్టుకుంది. అయితే, ఈ కుల, మత ఓటుబ్యాంకు రాజకీయాలతో ఎన్నికల పోరు సాగించాలనుకోవడం సామాజిక సామరస్యానికే ప్రమాదం. బీజేపీ మిత్రపక్షాలే గుర్తుచేస్తునట్టు ఈ దేశం అన్ని మతాలదీ, కులాలదీ. ఆ సమైక్యతను దెబ్బతీసే మాటలు, చేతలు ఎవరివైనా తప్పే. రాజకీయ నేతల మాటలు పొదుపుగా ఉండాలి. చేతలు అదుపులో ఉండాలి. దేనిపై నియంత్రణ లేకపోయినా చిక్కే. కానీ దేశానికి గుండె లాంటి యూపీ ఎన్నికలయ్యేలోగా ఇలాంటి మాటలు, చేష్టలు ఇంకెన్ని చూడాల్సొస్తుందో అబ్బాజాన్! -
అందుకు ఒప్పుకుంటేనే అవకాశాలు.. నటి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: ఇక్కడి ఇండస్ట్రీలో మగవాడి ఆశలకు లొంగితేనే.. అవకాశాలు దరి చేరుతాయని, అందుకే ఇతర రాష్ట్రాల వారు విజయాలు సాధిస్తున్నారని నటి మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నటి, మోడల్, బిగ్ బాస్ ఫేం మీరా మిథున్ వ్యాఖ్యలు రచ్చకెక్కుతున్న విషయం తెలిసిందే. గతవారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటుగా ఏడు సెక్షన్లతో కేసులు ఆమె మీద నమోదు అయ్యాయి. ఈ పరిస్థితుల్లో గురువారం ఆమె విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారడమే కాదు, మరో వివాదాన్ని రేపింది. ఇతర రాష్ట్రాలకు చెందిన నటీమనుల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండించే వారు ఎక్కువే అయ్యారు. ముందుగా ఆ వీడియోలో ప్రధాని నరేంద్రమోదీ, సీఎం ఎంకే స్టాలిన్లకు విజ్ఞప్తి చేస్తూ, తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. తమిళనాడు బిడ్డగా, ఓ సామాజిక వర్గానికి చెందిన మహిళ నైన తాను అనేక ఇబ్బందుల్ని ఇక్కడ ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏది చేసినా, ఏమి చెప్పినా వివాదం చేస్తున్నారని పేర్కొన్నారు. తనను వేధించిన ఆ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి స్పష్టంగా వ్యాఖ్యలు చేస్తే, దానిని ఓ సామాజిక వర్గాన్ని కించ పరిచినట్లుగా చిత్రీకరించారని వివరించారు. తనకు వ్యతిరేకంగా సాగుతున్న పరిణామాల్ని అడ్డుకోవాలని, ఇందుకు ముగింపు పలికేందుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇక, పోలీసుల్ని ఉద్దేశించి మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యతిరేకంగా, తన మీద అతి నీచాతి నీచంగా, అసభ్య పదజాలాలతో సామా జిక మాధ్యమాల వేదికగా విమర్శలు, ఆరోపణలు, చర్చలు సాగుతున్నాయని, వీటన్నింటి మీద ఎందు కు దృష్టి పెట్టలేదని ప్రశ్నించారు. తాను చేసిన వ్యాఖ్యలను బూతద్దంలో పెట్టి వివాదంగా మార్చిన వారికి వత్తాసు పలుకుతూ కేసులు పెట్టారని మండిపడ్డారు. మహిళనైన తన మీద సామాజిక మాధ్యమాల వేదికగా సాగుతున్న దాడి విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తనను అరెస్టు చేయలేరంటూ పోలీసులకు సవాల్ చేయడం గమనార్హం. -
సురేశ్ రైనా వివాదాస్పద వ్యాఖ్యలు; ఉతికారేస్తున్న నెటిజన్లు
చెన్నై: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)కు రైనా కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం మ్యాచ్ సందర్భంగా కామెంట్రీ ఇస్తూ అక్కడి సంస్కృతిపై మాట్లాడుతూ నోరు జారాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్కేతోనే ఉన్న రైనాను తన సహచర కామెంటేటర్ చెన్నై సంస్కృతి గురించి అడిగాడు. దీనిపై రైనా స్పందింస్తూ.. '' నేను కూడా బ్రాహ్మిణ్‌ను అనుకుంటున్నా. 2004 నుంచి చెన్నై జట్టుకు ఆడుతున్నా. అనిరుద్ధ శ్రీకాంత్, బద్రినాథ్, బాలాజీలతో కలిసి ఆడాను. ఇక్కడి సంస్కృతి అంటే నాకు చాలా ఇష్టం. ఇక నా జట్టు సహచరులు అంటే చెప్పలేనంత అభిమానం. సీఎస్కే జట్టులో మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది.. అది ఎంతలా అంటే మాకు చాలా స్వేచ్చ దొరుకుతుంది. సీఎస్కే జట్టులో భాగం కావడం సంతోషంగా ఉంది '' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రైనా చేసిన కామెంట్స్ దుమారాన్ని లేపాయి. చెన్నై అంటే కేవలం బ్రాహ్మిణ్లే ఉంటారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. '' రైనా ఇలాంటి కామెంట్స్ చేసినందుకు సిగ్గుపడాలి. ఇన్నేళ్లుగా చెన్నైకి ఆడుతున్నావు.. నువ్వు నిజమైన చెన్నై సంస్కృతిని చూసినట్లు లేవు'' అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం రైనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఇక గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉన్న రైనా ఈ సీజన్‌కు మాత్రం సీఎస్కే తరపున ఆడాడు. ఈ సీజన్లో సీఎస్కే తరపున 7 మ్యాచ్‌లాడి 123 పరుగులు చేశాడు. గతేడాది ఫేలవ ప్రదర్శన కనబరిచిన సీఎస్కే ఈసారి మాత్రం దుమ్మురేపింది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక సురేశ్ రైనా 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. What the heck @ImRaina sir.. you shouldn’t use that word ….. https://t.co/v8AD1Cp0fT pic.twitter.com/TltPoMbYec — udayyyyyy 👨🏻💻👨🏻💼👨🏻🍳🏋️ (@uday0035) July 19, 2021 So watched the video, I once liked Raina very much and now im sad how ignorant or he has been hiding all these days. Lost it! No more respect — vijay renganathan (@MarineRenga) July 20, 2021 -
‘ఆరు నెలల్లో చెప్పుచేతల్లోకి మీడియా!’.. తీవ్ర దుమారం
తమిళనాడు బీజేపీ పార్టీ కొత్త అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అన్నామలై చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఆరు నెలల్లోగా మీడియా మొత్తం పార్టీ చెప్పుచేతల్లోకి వచ్చేస్తోందని ఈ యువ నేత చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీస్తోంది. చెన్నై: ‘‘మీడియాను నియంత్రిస్తాం. రాబోయే ఆరు నెలల్లో పూర్తిగా మన చెప్పుచేతుల్లోకి తెచ్చుకోబోతున్నాం. కాబట్టి, ఎవరూ బాధపడకండి. నిరాధారమైన వార్తలు ఎల్లకాలం మనల్ని ఇబ్బంది పెట్టలేవు. మన పార్టీ మాజీ అధ్యక్షుడు.. సమాచార ప్రసార శాఖ మంత్రి అయ్యాడు. అన్ని మీడియా హౌజ్‌లు ఇక ఆయన కిందే ఉంటాయి. తప్పులు ఎల్లకాలం జరగవు. వాటితో ఎల్లకాలం మీరు రాజకీయాలు చేయలేరు’ అంటూ అన్నామలై మాట్లాడిన వీడియో ఒకటి సర్క్యూలేట్ అయ్యింది. అన్నామలైని పార్టీ ఛీప్‌గా నియమించాక.. కొయంబత్తూరు నుంచి చెన్నైకి పార్టీ కేడర్‌తో చేరుకున్నాడు. కరోనా టైంలో ఈ టూర్ అధికారులకు పెద్ద తలనొప్పి అయ్యింది. దీంతో మీడియా హౌజ్‌లు ఈ యువ నేత పర్యటన మీద విమర్శనాత్మక కథనాలు ప్రసారం చేశాయి. అయితే తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని.. రాబోయే ఆరు నెలల్లో మీడియా మన చేతికి వస్తుందని ఆ బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడాడు అన్నామలై. తమిళనాడు బీజేపీ ఛీఫ్‌గా పని చేసిన ఎల్ మురుగన్.. ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణలో సమాచార ప్రసార మంత్రిగా(మినిస్టర్ ఆఫ్ స్టేట్-డిప్యూటీ హోదా)గా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యాన్ని ఊటంకిస్తూ వ్యాఖ్యలు చేశాడు అన్నామలై. @BJP4TamilNadu new president @annamalai_k on taking control of the media in the state. During his first tour to reach chennai #Annamalai says his predecessor @Murugan_MoS was given the I and B portfolio only to take control of the media @TheWeekLive pic.twitter.com/VFL7rpaTpZ — Lakshmi Subramanian (@lakhinathan) July 15, 2021 ఇక ఈ కామెంట్లను తమిళనాడు ఐటీ శాఖ మంత్రి మనో త్యాగరాజన్ ఖండించాడు. అన్నామలైవి పరిణితి లేని వ్యాఖ్యలని మండిపడ్డాడు. మీడియా ఏ ఒక్క పార్టీ సొత్తో కాదని, ఆయన అలా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని మంత్రి పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రాజకీయ విమర్శలు రావడంతో.. అన్నామలై స్పందించాడు. తాను ‘ఫేక్ న్యూస్ కట్టడి’, రాబోతున్న ఐటీ యాక్ట్ గురించి ఉద్దేశించి అలా మాట్లాడనని.. మీడియాను పార్టీ నియంత్రిస్తుందన్న కోణంలో తాను మాట్లాడలేదని అన్నామలై స్పష్టం చేశాడు. ట్విటర్ ట్రెండ్‌లో యువరక్తం తమిళనాడు కరూరు జిల్లా వ్యవసాయ కుటుంబానికి చెందిన అన్నామలై.. మెకానికల్ ఇంజినీరింగ్, లక్నో ఐఐఎంలో ఎంబీఏ చదివాడు. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన కర్ణాటకలో ఆయన విధులు నిర్వహించినప్పుడు ‘సింగం’గా పేరుండేది. 2018-19 టైంలో కీలక బాధ్యతలు చేపట్టాడు కూడా. అయితే అనూహ్యంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. బీజేపీలో చేరాడు. మొన్నటి తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు కూడా. అయితే యువ రక్తం కావడం, జనాల్లో క్రేజ్ ఉండడంతో 37 ఏళ్లకే బీజేపీ అతన్ని పార్టీ ఛీఫ్‌గా నియమించింది. ఈయనకి ఉన్న క్రేజ్ ఎట్లాంటిదంటే.. ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో ‘తమిళనాడు కోసం అన్నామలై’ #Annamali4TN హ్యాష్‌ట్యాగ్ ట్విటర్ టాప్‌లో కొనసాగుతోంది. -
‘లక్షద్వీప్’ కేసులో కేరళ హైకోర్టుకు ఆయేషా
కొచ్చి: లక్షద్వీప్‌లో కోవిడ్ విజృంభణకు లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ కారణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వివాదంలో అరెస్ట్ నుంచి బయటపడేందుకు ఫిల్మ్ మేకర్ అయేషా సుల్తానా సోమవారం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. కవరట్టికి తిరిగి వెళ్తే తనను అరెస్ట్‌చేస్తారని, ముందస్తు బెయిల్ కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ‘ ఒకప్పుడు కరోనా పాజటివ్ కేసులులేని లక్షద్వీప్‌లో ప్రఫుల్ పటేల్ వచ్చాక కోవిడ్ పరిస్థితులు దారుణంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం సంధించిన జీవాయుధం ఆయన’ అంటూ ఇటీవల ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఆయేషా వ్యాఖ్యానించారు. ఆయేషా కేంద్రప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశారంటూ లక్షద్వీప్ బీజేపీ చీఫ్ అబ్దుల్ ఖాదర్ ఆమెపై పోలీసు ఫిర్యాదుచేశారు. దీంతో పదో తేదీన దేశద్రోహం ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది. ప్రఫుల్‌కు ‘బ్లాక్ డే’ స్వాగతం లక్షద్వీప్‌లో సంస్కరణల పేరిట అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ అమల్లోకి తెచ్చిన విధానాలపై అక్కడి ప్రజల నుంచి వ్యక్తమవుతోన్న నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. సోమవారం ప్రఫుల్ లక్షద్వీప్‌కు విచ్చేసిన నేపథ్యంలో నిరసనలు ప్రస్ఫుటంగా కనిపించాయి. చాలా చోట్ల జనం నల్లటి మాస్కులు ధరించి, వారి ఇళ్లపై నల్ల జెండాలను ఎగరేశారు. ప్రఫుల్ వ్యతిరేక నినాదాలిచ్చారు. -
లాక్డౌన్ ఉంది ఎలా బతకాలి?.. 'ఆకలితో చస్తే.. చావు'
సాక్షి, బెంగళూరు : ఒకవైపు కోవిడ్ మహమ్మారి, మరోవైపు లాక్డౌన్, ఇటువంటి సమయంలో రేషన్ బియ్యాన్ని తగ్గిస్తే మేమెలా బతకాలి, ఆకలితో చావాలా? అని ప్రశ్నించిన వ్యక్తికి కర్ణాటక పౌర సరఫరా మంత్రి ఉమేశ్ కత్తి వివాదాస్పద సమాధానమిచ్చారు. ఆకలితో చస్తే.. చావు అని మంత్రి చెప్పడంతో అందరూ కంగుతిన్నారు. గదగ జిల్లా కుర్తకోటి గ్రామ రైతు సంఘం కార్యకర్త ఈశ్వర్.. మంత్రికి ఫోన్ చేసి రేషన్ బియ్యం తగ్గించడాన్ని ప్రశ్నించారు. మంత్రి మాట్లాడుతూ ఉత్తర కర్ణాటకలో బియ్యంతో పాటు జొన్నలు ఇస్తున్నాం, వచ్చే నెల నుంచి బియ్యం పెంచుతాం అన్నారు. బియ్యం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయి, లాక్డౌన్ ఉంది, అప్పటి వరకు ఉపవాసంతో చచ్చేదా? అంటూ ఈశ్వర్ ప్రశ్నించారు. అందుకు కర్ణాటక పౌర సరఫరా మంత్రి ఉమేశ్ కత్తి చావడమే మంచిదని వ్యాఖ్యానిస్తూ తనకు తిరిగి ఫోన్ చేయవద్దంటూ హెచ్చరించారు. ఈ ఆడియో బుధవారం వైరల్ కావడంతో మంత్రి వివరణ ఇచ్చారు. ఫోన్ చేసిన వ్యక్తి మరణించాలా అని అడిగితే సరే అని చెప్పాను. వద్దు అని చెప్పేటంత పెద్ద మనస్సు నాకు లేదు అన్నారు. మంత్రి మాటలపై పలు వర్గాల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో చివరకు క్షమాణ కోరారు. ఎవరూ మరణించాలని తాను కోరుకోబోనని, అందరికీ మంచి జరగాలనే కోరుకుంటానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. చదవండి: (ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం.. 150 జిల్లాల్లో లాక్డౌన్?) -
కేంద్రం తీరుపై గుస్సా
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో 9 రోజులపాటు జరిగిన బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ముగిశాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చతోపాటు వార్షిక బడ్జెట్, పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లులు, ప్రశ్నోత్తరాలు తదితర సందర్భాల్లో తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించేందుకు అధికారపక్షం ప్రాధాన్యతనిచ్చింది. మరో వైపు ఇటీవలి కాలంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తోందనే అంశానికి గణాంకాలు జోడిస్తూ సభ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. కేంద్రం నుంచి రూ. 28 వేల కోట్ల బకాయిలు రాలేదని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, మిషన్ భగీరథకు ఆర్థిక సాయం వంటి విషయాలను మంత్రులు, అధికారపక్ష సభ్యులు ప్రసంగాల్లో ప్రస్తావించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి, గంగుల కేంద్రం తీరును దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పనిచేస్తుంటే బీజేపీ నేతలు ఆటంకాలు సృష్టిస్తున్నారని, బీజేపీకి స్వరాష్ట్ర భక్తి లేదని మంత్రి హరీశ్‌రావు బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణను కేంద్రం చిన్నచూపు చూస్తోందని, ఆత్మనిర్భర్ ప్యాకేజీలో రూ. 20 లక్షల కోట్లు ఎక్కడని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నిబంధనల మేరకు అప్పులు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న విషయాన్ని సీఎం కేసీఆర్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రస్తావించారు. నల్ల బ్యాడ్జీలతో కాంగ్రెస్ నిరసన.. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సంద ర్భంగా జరిగిన చర్చతోపాటు బడ్జెట్, పద్దులపై చర్చలో తమకు సమయం కేటాయించట్లేదని కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీఎం అందుబాటులో ఉండటం లేదంటూ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి రికార్డుల నుంచి తొలగించగా కాంగ్రెస్ వాకౌట్ చేసింది. తమకు సభలో తగిన సమయం ఇవ్వట్లేదంటూ భట్టి విక్రమార్క స్పీకర్‌కు లేఖ రాయడంతోపాటు ఆ పార్టీ సభ్యులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు వచ్చారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన దుబ్బాక బీజేపీ శాసనసభ్యుడు ఎం.రఘునందన్ రావు పలు అంశాలపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న దుబ్బాక నియోజకవర్గ సమస్యలతోపాటు వివిధ అంశాలను ప్రస్తావించారు. పీఆర్సీ సహా కీలక ప్రకటనలు శాసనసభ సమావేశాల వేదికగా సీఎం కేసీఆర్, మంత్రులు పలు అంశాలకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. ఈ నెల 22న ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్, 61 ఏళ్ల ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంపుపై సీఎం ప్రకటన చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితుల్లో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. వీటితోపాటు మాజీ ఎమ్మెల్యేలకు, జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శులకు వేతనాల పెంపు, ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల పెంపు హమీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ హామీ వంటి కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కరోనా పరిస్థితుల్లో భౌతికదూరం పాటించడం, పాస్‌ల జారీలో ఆంక్షలు అమలు చేయగా వివిధ అంశాలకు సంబంధించి పలు సంఘాలు అసెంబ్లీ ముట్టిడికి ప్రయత్నించాయి. కరోనా పరిస్థితుల్లో శాసనమండలి కేవలం 5 రోజులు సమావేశమవగా సీఎం కేసీఆర్ పెద్దల సభకు హాజరు కాలేదు. -
మహిళలపై అవాక్కులు!
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారంటే సాధారణ పౌరులు బెంబేలెత్తే పరిస్థితులొచ్చాయి. ఎన్నికల ప్రచారసభల్లో, మీడియా సమావేశాల్లో, ర్యాలీల్లో, సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నాయకులు ఎలాంటి దుర్భాషలతో విరుచుకుపడతారో, ఏం వినవలసివస్తుందోనన్న భయాందోళనలు కలుగుతున్నాయి. మహిళలనూ, అట్టడుగు కులాలవారినీ కించపరుస్తూ మాట్లాడే నేతల పరువు ఎటూ పోతుంది. కానీ సామాజిక మాధ్యమాల్లో ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతూ దేశ పరువుప్రతిష్టలు సైతం దెబ్బతింటున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆ మాదిరే వున్నాయి. తన కాలికి అయిన గాయాన్ని ప్రదర్శించదల్చుకుంటే ఆమె చీరెకు బదులు బెర్ముడా షార్ట్‌లు ధరించాలని ఆయనగారు సలహా ఇచ్చారు. ఈ నెల 10న నందిగ్రామ్ జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో ఆమె కాలికి గాయమైంది. రెండు రోజులు ఆసుపత్రిలో వుండి వచ్చారు. అప్పటినుంచీ ఆమె గాయానికి కట్టుతోనే చక్రాల కుర్చీలో కూర్చుని ప్రచారసభల్లో పాల్గొంటున్నారు. కారు డోరు తీసుకుని వుండగా కొందరు దుండ గులు దాడి చేయటానికి ప్రయత్నిస్తున్న సమయంలో కాలు ఇరుక్కుని గాయమైందని ఆమె వివరణ నిచ్చారు. ఇదంతా సానుభూతి పొందటానికి ఆడుతున్న డ్రామా అని బీజేపీ కొట్టిపారేసింది. గాయమైందంటే కనీసం సానుభూతి ప్రకటించటానికి కూడా సిద్ధపడలేదన్న విమర్శలొచ్చాయిగానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి వాతావరణాన్ని ఆశించలేం. అది లేకపోగా హద్దు మీరి వస్త్రధార ణపై సలహా ఇచ్చేవరకూ పోయిందంటే ఎన్నికల ప్రచార సరళి రాను రాను ఎలా దిగజారుతున్నదో అర్థం చేసుకోవచ్చు.మమతా బెనర్జీ ప్రస్తుతం దేశంలో ఏకైక మహిళా ముఖ్యమంత్రి. ప్రత్యర్థులపై నిప్పులు చెరగటం ఆమె నైజం. అలా మాట్లాడటం కొందరికి నచ్చకపోవచ్చు. కానీ విమర్శ ఆ అంశానికి పరిమితం కావాలి తప్ప కించపరిచేలా మాట్లాడటం సరికాదు. దిలీప్ ఘోష్ వ్యాఖ్య అసభ్యకరంగా వున్నదని విమర్శలొస్తే ఆయన మరింత హీన స్థాయిలో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆమె బెంగాల్ సంస్కృతిని ప్రతిబింబించేలా వ్యవహరించాలట. చీరె ధరించిన మహిళ కాళ్లు చూపటం సభ్యత కాదట. తన మాటల్లో వివాదమేమీ లేదని, వాటిపై వివరణనివ్వాల్సిన అవసరం లేదని దిలీప్ ఘోష్ అభిప్రాయం. ఆయన అయిదేళ్లక్రితం కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి వివాదా స్పదుడయ్యారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థినులనుద్దేశించి ‘వారు మగపిల్లల సాహచర్యం కోసం దొరికే ఏ అవకాశాన్ని వదులుకోని సిగ్గుమాలిన వార’ంటూ వ్యాఖ్యానించారు. 2019 ఆగస్టులో ‘నేను చంపటం మొదలెట్టానంటే తృణమూల్ కార్యకర్తల కుటుంబాలు తుడిచిపెట్టుకుపోతాయ’ న్నారు. వాస్తవానికి ఇలాంటి ధోరణి ఏ ఒక్క పార్టీకో, నాయకుడికో పరిమితమైంది కాదు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ నేత ఆజంఖాన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి జయప్రదనుద్దేశించి 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు దారుణమైన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత గోపాల్ షెట్టి తన ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి ఊర్మిళా మంటోద్కర్ విషయంలో ఇదే మాదిరి మాట్లాడారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపైనా ఆ ఎన్నికల్లో మహారాష్ట్ర పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ నేత జయదీప్ కవాడే ఇలాగే వ్యాఖ్యానించారు. ఆమె నుదుటన ధరించే సిందూరం పెద్దగా వుండటాన్ని ప్రస్తావిస్తూ ‘భర్తల్ని మార్చినప్పుడల్లా ఆ సిందూరం పరిమాణం పెరుగుతుంటుంద’న్నారు. చిత్రమేమంటే పురుషులు మాత్రమే కాదు... మహిళా నేతలు సైతం తోటి మహిళలపట్ల ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుంటారు. గతంతో పోలిస్తే ఇప్పుడు మెరుగుపడి వుండొచ్చుగానీ... పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మహిళలు భిన్న రంగాల్లో చొరవగా ముందుకు రావటం మన దేశంలో ఇప్పటికీ తక్కువే. అన్నిచోట్లా గూడుకట్టుకున్న పితృస్వామిక భావజాలమే ఇందుకు కారణం. సైన్యంలో పనిచేసే మహిళలకు శాశ్వత కమిషన్ హోదా ఇవ్వాలన్న పిటిషన్‌పై తీర్పునిస్తూ, మన సమాజంలోని అన్ని రకాల నిర్మాణాలూ పురుషుల కోసం పురుషులే ఏర్పాటుచేసుకున్నవని సుప్రీం కోర్టు గురువారం వ్యాఖ్యానించింది. మహిళల వస్త్ర ధారణ ఎలావుండాలో, వారెలా మెలగాలో, ఎలా మాట్లాడాలో చెప్పేవారంతా ఇలాంటి పితృస్వామిక భావజాల ప్రభావంతోనే మాట్లాడుతున్నారు. అందుకోసం సంస్కృతిని అడ్డం పెట్టుకుంటున్నారు. రాజకీయ రంగంలోవున్నవారిని సమాజం గమనిస్తుంటుంది గనుక వారి ప్రవర్తన, భాష ఇతరులకు ఆదర్శప్రాయంగా వుండాలి. దేశ రాజకీయాల్లో మహిళలు కూడా ఇప్పుడిప్పుడే చురుగ్గా వుంటున్నారు. రాష్ట్రపతి, విదేశాంగమంత్రి, రక్షణమంత్రి వంటి పదవులు చేపట్టి తాము పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపించారు. ప్రస్తుత కేంద్ర ఆర్థికమంత్రి కూడా మహిళే. కానీ కొందరు రాజకీయ నాయకులు చవకబారు వ్యాఖ్యలు చేసి తమను తాము దిగజార్చుకోవటమే కాదు... సమాజానికి కూడా తప్పుడు సంకేతాలు పంపుతున్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గురువారం ఒక సదస్సులో ప్రసంగిస్తూ ప్రజలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, వారు ఏం తినాలో, వ్యక్తులుగా వారేం చేయాలో చెప్పే ధోరణి రాజకీయ నాయకులకు తగదన్నారు. దిలీప్ ఘోష్ అయినా, మరొ కరైనా ఈ విషయాన్ని గుర్తెరగాలి. జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవాలి. -
వివాదాస్పద తీర్పులు: ప్రమోషన్‌కు ఎసరు
న్యూఢిల్లీ: బాలికలపై లైంగికదాడి కేసులో వివాదాస్పద తీర్పులు ఇచ్చి దేశవ్యాప్తంగా సంచలనం రేపారు బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేదివాలా. ఆ తీర్పులే ఆమె పదోన్నతికి ఎసరు పెట్టాయి. ఆమెకు పదోన్నతి కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పుష్ప మరో ఏడాదిపాటు అదనపు న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఈ మేరకు అదనపు న్యాయమూర్తిగానే కొనసాగిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ పుష్ప బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. సాధారణంగా అదనపు న్యాయమూర్తి పదవీకాలం రెండేళ్లు. ఈ లెక్కన జస్టిస్ పుష్ప అదనపు న్యాయమూర్తి పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. ఈ పదవీకాలం ముగిసిన తర్వాత శాశ్వత న్యాయమూర్తిగా ఆమెకు పదోన్నతి కల్పించాలి. కానీ పదోన్నతి కల్పించకుండా కేంద్ర న్యాయశాఖ ఆమెకు షాకిచ్చింది. జస్టిస్ పుష్పకు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించకుండా.. మరో ఏడాది కాలం పాటు ఆమె అదనపు న్యాయమూర్తిగానే కొనసాగుతారని కేంద్రం తెలిపింది. దీనికి గల కారణాలు ఆమె గతనెలలో ఇచ్చిన తీర్పులేనని బహిరంగ రహాస్యం. ఆమె వివాదాస్పద తీర్పులు ఇవ్వడంతోనే సుప్రీంకోర్టు వెనుకడుగు వేసిందని తెలుస్తోంది. ఆమె గతనెలలో ఇచ్చిన వివాదాస్పద తీర్పులు ఇవే.. ‘నేరుగా బాలిక శరీరాన్ని తాకనప్పుడు ఆ కేసు పోక్సో కిందకు రాదు’ అని జస్టిస్ పుష్ప తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. ‘బాలిక చేతిని పట్టుకుని, అతను ప్యాంట్ జిప్ తెరిచినంత మాత్రాన పోక్సో చట్టం కింద దాన్ని లైంగిక దాడిగా పరిగణించలేం’ మరో కేసులో జస్టిస్ పుష్ప తెలిపారు. ఈ రెండు తీర్పులను గత నెలలో జస్టిస్ పుష్ప ఇచ్చారు. గతంలో జస్టిస్ పుష్ప బ్యాంకులు, బీమా కంపెనీలకు న్యాయవాదిగా పని చేసేవారు. దీంతో పాటు కొన్ని కళాశాలల్లో అధ్యాపకురాలిగా కొనసాగుతున్నారు. 2007లో జిల్లా జడ్జిగా ఆమె నియమితులు కాగా ఫిబ్రవరి 13, 2019లో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పదోన్నతి వచ్చి ఉంటే శాశ్వత న్యాయమూర్తిగా ఆమె నియమితులయ్యే వారు.