సాక్షి, హైదరాబాద్: కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో బండి సంజయ్‌పై కేసు నమోదైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
బండి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కూడా చేశాయి. ఆయన దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశాయి. మహిళలంటే గౌరవం లేకుండా మాట్లాడిన బండిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
కాగా.. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండిపై తెలంగాణ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. దీన్ని సుమోటాగా తీసుకుని నోటీసులు పంపింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ విచారణకు కవిత హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బండి సంజయ్ ఆమెపై విమర్శలు గుప్పిస్తూ నోరుజారారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడ్డారు.
చదవండి: కవితపై అనుచిత వ్యాఖ్యలు.. బండి సంజయ్‌కు మహిళా కమిషన్ నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment