Actor Vinayakan Controversial comments On MeToo: మలయాళ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ వినాయకన్ మీ టూపై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. తను 10 మంది మహిళలతో శారీరక సంబంధం కలిగి ఉన్నానంటూ అతడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దూమారం రేపుతున్నాయి. వినాయకన్ తాజా చిత్రం ఒరుతె ప్రమోషన్ కార్యక్రమంలో మీ టూపై వినాయకన్‌కు ప్రశ్న ఎదురవగా అతడు స్పందించిన తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు మలయాళ పరిశ్రమకు చెందిన నటీనటులు సైతం వినాయకన్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఒరుతె ప్రమోషన్ కార్యక్రమంలో వినాయకన్‌తో పాటు మూవీ టీం పాల్గొంది.
చదవండి: అప్పుడే ఓటీటీకి ఆర్‌ఆర్‌ఆర్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఈ సందర్భంగా మీ టూ ఉద్యమంపై ఆయన అభిప్రాయం అడగ్గా.. మీటూ అంటే తనకు తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘మీ టూ ఉద్యమం అంటే ఏమిటో నాకు తెలియదు. ఒక మహిళను నాతో శృంగారం చేస్తావా? అని అడగడం మీ టూ అయితే. నేను దానిని అలాగే కొనసాగిస్తాను’ అంటూ వినాయకన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అంతేగాక ఇది కేవలం మహిళలకు సంబంధించిన విషయమేనా? అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’ అంటూ వినాయకన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైయ్యాయి. అదే మీటూ అయితే తన జీవితంలో ఇప్పటి వరకు 10 మంది మహిళలతో శారీరక సంబంధం కలిగి ఉన్నానని, వారందరిని నాతో గడుపుతారా? అని అడిగానని చెప్పాడు.
చదవండి: జానీ మాస్టర్‌కి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో
ఇదే మీ టూ అయితే ఇకముందు కూడా తాను అలాగే చేస్తానంటూ వ్యాఖ్యానించాడు. ఇక అతడి తీరుపై నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. మీ టూపై సరైన అవగాహన లేకుండా ఉన్నాడంటూ వినాయకన్‌పై పలువురు విరుచుకుపడుతున్నారు. కాగా వినాయకన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. 2019లో మృదులదేవి అనే దళిత మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు, లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్టయి అతడు జైలుకు వెళ్లాడు. ఇప్పుడు మరోసారి మీ టూపై ఈ తరహా వ్యాఖ్యలు చేసి మరోసారి వివాదంలో నిలిచాడు. మరోవైపు బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపేసిన ‘మీ టూ ఉద్యమం’పై ప్రముఖ నటుడైన వినాయకన్ ఈ విధంగా స్పందించడంపై సినీ సెలెబ్రెటీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment