MeToo Movement
-
అలాంటి డైరెక్టర్‌తో అవకాశం.. వెంటనే తిరస్కరించా: బాలకృష్ణ హీరోయిన్
ఇటీవల మలయాళ ఇండస్ట్రీని హేమ కమిటీ నివేదిక కుదిపేసింది. మాలీవుడ్‌లో నటీమణులపై లైంగిక వేధింపులను ఈ నివేదిక బహిర్గతం చేసింది. దీంతో పలువురు మహిళా నటీమణులు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే గతంలోనూ లైంగిక వేధింపులపై మీటూ ఉద్యమం జరిగిన సంగతి తెలిసిందే. పలువురు హీరోయిన్స్ సైతం వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా సైతం మీటూ సమయంలో తీవ్రమైన ఆరోపణలు చేసింది. నానా పటేకర్ తనను లైంగికంగా వేధించారంటూ ఆరోపించింది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తనుశ్రీ మీటూ అంశంపై మరోసారి స్పందించింది. 2018లో తనకు ఓ పెద్ద నిర్మాత ప్రాజెక్ట్ ఆఫర్ చేశాడని తెలిపింది. అయితే ఆ మూవీ డైరెక్టర్ మీటూ నిందితుడు కావడంతో వెంటనే ఆఫర్‌ను తిరస్కరించినట్లు వెల్లడించింది. ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో రిజెక్ట్ చేసినట్లు తనుశ్రీ పేర్కొంది. గతేడాది కూడా కోల్‌కతాకు చెందిన ఓ దర్శకుడి నుంచి తనకు ఆఫర్ వచ్చిందని నటి తెలిపింది. అదే కారణంతో మళ్లీ తిరస్కరించానట్లు వివరించింది. లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి ఇమేజ్ను కాపాడుకునేందుకు ఆ దర్శకుడు తనను ఎంపిక చేశారని భావించినట్లు తనుశ్రీ పేర్కొంది.తనుశ్రీ మాట్లాడుతూ..'అతను నా దగ్గరకు ఎందుకు వచ్చాడు? తన సినిమాలో నేను నటిస్తే.. తన ఇమేజ్‌ని మార్చుకోవాలనుకున్నాడు. నేను ఆ సినిమా చేస్తే మీటూ నిందితుడికి సపోర్ట్ చేస్తున్నట్టే. అందుకే సున్నితంగా తిరస్కరించా. ఇందులో ఓ ఏజెన్సీ ప్రమేయం కూడా ఉంది. నేను సినిమాని వదిలేయాలనుకుంటున్నాను అని వారితోనే చెప్పా. ఈ విషయంపై తన అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి మా నాన్నను కూడా సంప్రదించా. ఒక నిందితుడితో సినిమా చేయడం నైతికంగా సరైనది కాదని నాన్న సలహా ఇచ్చాడని' తెలిపింది. కాగా.. బాలీవుడ్లో పలు చిత్రాలు చేసిన తనుశ్రీ దత్తా.. తెలుగులో బాలకృష్ణ సరసన వీరభద్ర సినిమాలో హీరోయిన్గా నటించింది. -
మీరు నా కెరీర్ రైలు దిగనందుకు కృతజ్ఞతలు
ఫ్రాన్స్ నగరంలోని కాన్స్‌లో 77వ కాన్స్ చలన చిత్రోత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఈ ఏడాది కాన్స్ జ్యూరీ ప్రెసిడెంట్‌గా నటి–దర్శకురాలు గ్రెటా గెర్విగ్ వ్యవహ రిస్తున్నారు. ఆమె నేతృత్వంలో జ్యూరీ ఈ సంవత్సరం పోటీ పడుతున్న 22 చిత్రాల నుండి విజేతను ఎంపిక చేస్తుంది. వేడుక చివరి రోజు విజేతకు అవార్డు ప్రదానం చేస్తారు. ఇక వేడుకలు ్రపారంభం అయ్యే ముందు విలేకరులతో ‘మీ టూ’ మూమెంట్ గురించి, సమాజంలో సానుకూల మార్పు తెచ్చే శక్తి బలమైన కథలకు ఉంటుందని గ్రెటా గెర్విగ్ పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి 25 వరకూ జరిగే ఈ ఫెస్టివల్లో తొలి రోజు ్రపారంభ చిత్రంగా క్వెంటిన్ డ్యూపియక్స్ దర్శకత్వంలో రూ΄పొందిన ‘ది సెకండ్ యాక్ట్’ ప్రదర్శితమైంది. అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘పామ్ డి ఓర్’ పురస్కారాన్ని నటి మెరిల్ స్ట్రీప్‌కి ప్రదానం చేశారు. సినీ రంగానికి మెరిల్ చేసిన సేవలకు గాను ఆమెను ఈ పురస్కారంతో గౌరవించారు. 1989లో కాన్స్ ఉత్సవాల్లో పాల్గొన్నారు మెరిల్. ‘ఈవిల్ ఏంజెల్స్’లో కనబర్చిన నటనకుగాను ఆ ఏడాది ఆమె ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 40 ఏళ్ల వయసు అప్పుడు ఆ అవార్డు అందుకున్న మెరిల్ ఇప్పుడు 74 ఏళ్ల వయసులో ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు. దాదాపు 35 ఏళ్లకు మళ్లీ కాన్స్‌లో పాల్గొనడం, ప్రతిష్టాత్మక పామ్ డి ఓర్ పురస్కారం అందుకోవడం, అవార్డు అందుకుంటున్న సమయంలో వీక్షకులు ఓ 2 నిమిషాల పాటు నిలబడి చప్పట్లతో అభినందించడంతో మెరిల్ స్ట్రీప్ ఒకింత ఉద్వేగానికి గురై, ఈ విధంగా స్పందించారు. ‘‘గతంలో నేను కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొన్నప్పుడు నా వయసు 40. అప్పటికి ముగ్గురు పిల్లల తల్లిని. నా కెరీర్ ముగిసిపోయిందనుకున్నాను. కానీ ఈ రాత్రి (కాన్స్ వేదికను ఉద్దేశించి) నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మేడమ్ ప్రెసిడెంట్ (గ్రెటా గెర్విగ్‌ని ఉద్దేశించి... 2019లో గ్రెటా దర్శకత్వం వహించిన ‘లిటిల్ ఉమెన్’ చిత్రంలో నటించారు మెరిల్)తో సహా నేను పని చేసిన ఎంతోమంది ప్రతిభావంతులైన కళాకారులు. ఇక్కడ నా సినిమాల క్లిప్పింగ్స్‌ని చూస్తుంటే నా కెరీర్‌ని బుల్లెట్ ట్రైన్ కిటికీలోంచి చూస్తున్నట్లుగా ఉంది. ఆ కిటికీలోంచి నా యవ్వనం మధ్యవయసుకి ఎగరడం నుంచి ఇదిగో ఇప్పుడు ఈ వేదిక వరకూ రావడం.. అంతా కనిపిస్తోంది. ఈ ప్రయాణంలో ఎన్నో ప్రదేశాలు... ఎన్నో ముఖాలు గుర్తొస్తున్నాయి. అన్నింటికీ మించి ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తున్న మీకు (ప్రేక్షకులు) చాలా కృతజ్ఞతలు. నా ముఖం పట్ల మీరు విముఖత చూపనందుకు నా కెరీర్ ట్రైన్‌ని మీరు దిగనందుకు ధన్యవాదాలు’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు మెరిల్ స్ట్రీప్. మెరిసిన దేశీ తారలు ఈ వేడుకల్లో పలువురు దేశ, విదేశీ తారలు ΄పొడవాటి గౌనుల్లో ఎర్ర తివాచీపై క్యూట్‌గా క్యాట్‌వాక్ చేసి ఆకట్టుకున్నారు. బాలీవుడ్ తారలు దీప్తీ సద్వానీ, ఊర్వశీ రౌతేలా తదితరులు పాల్గొన్నారు. టీవీ సిరీస్ ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ ఫేమ్, పలు హిందీ చిత్రాల్లో నటించిన దీప్తీ సద్వానీ రెడ్ కార్పెట్ పై మెరిశారు. ్రపారంభ వేడుకలో పాల్గొన్న ఈ బ్యూటీ మొత్తం మూడు రోజుల పాటు ఈ చిత్రోత్సవాల్లో పాల్గొననున్నారు. కాన్స్ ఉత్సవాల్లో ΄పొడవాటి గౌను ధరించిన తొలి తారగా రికార్డ్ సాధించారు దీప్తి. ‘‘ఈ రెడ్ కార్పెట్‌పై నడవడం గౌరవంగా భావిస్తున్నాను. అది కూడా రికార్డు బద్దలు కొట్టే ΄పొడవాటి ట్రైల్ ఉన్న గౌను ధరించడం హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు దీప్తీ సద్వాని. ఇక గత ఏడాది కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొన్న బాలీవుడ్ తార ఊర్వశీ రౌతేలా ఈసారీ హాజరయ్యారు. పింక్ కలర్ ఫ్రాక్‌లో ఆకట్టుకున్నారామె. కాగా 2018లో ఈ వేడుకల్లో పాల్గొన్న దీపికా పదుకోన్ పింక్ రంగు గౌను ధరించారు. ఇప్పుడు ఊర్వశీ ధరించిన గౌనుని అప్పటి దీపికా గౌనుతో పోల్చుతున్నారు. ఇలా తారల తళుకులు, పురస్కారగ్రహీత భావోద్వేగాలతో కాన్స్ చిత్రోత్సవాలు ఆకట్టుకునేలా సాగుతున్నాయి. -
రెజ్లర్ల మీటూ ఉద్యమం..చర్చలు విఫలం!.. ఉత్కంఠ
న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌పై మీటూ ఆరోపణల దరిమిలా.. ఆయన్ని గద్దె దించడమే ధ్యేయంగా రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. గురువారం సాయంత్రం ఫెడరేషన్ అధికారులతో, ప్రభుత్వ ప్రతినిధులతో క్రీడామంత్రిత్వ శాఖ కార్యాయలంలో చర్చలు జరిగినప్పటికీ.. అవి విఫలం అయినట్లు స్పష్టమవుతోంది. చర్చలు సంతృప్తికరంగా సాగలేదని, స్పష్టమైన హామీలు లభించలేదని, అలాగే.. ఫెడరేషన్ చీఫ్‌ను తొలగించడంపైనా ప్రభుత్వం తరపున ఎలాంటి హామీ రాలేదని రెజ్లర్లు మీడియాకు వెల్లడించారు. మా దగ్గర ఐదుగురి నుంచి ఆరుగురు అమ్మాయిలు ఇప్పటికిప్పుడు సాక్ష్యం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అతను(బ్రిజ్ భూషణ్) జైలుకు వెళ్లాల్సిందే. మా డిమాండ్లు నెరవేరేంత వరకు రెజ్లింగ్ బరిలోకి దిగేది లేదు. ఒకవేళ ప్రభుత్వం గనుక స్పందించకుంటే.. పోలీసుల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుందని రెజర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్‌లు, ఈ నిరసనలకు నేతృత్వం వహించిన బజరంగ్ పూనియాలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. చర్చలు విఫలమైన నేపథ్యంలో రాత్రి పది గంటల సంమయంలో నేరుగా క్రీడాశాఖ మంత్రి అనురాగ్ థాకూర్‌తో రెజ్లర్లు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. Allegations levelled by wrestlers are serious in nature. Taking swift action, Govt of India sent a notice to WFI and sought a reply within 72 hours. I will try to meet the wrestlers after I reach Delhi. We will talk & listen to them: Union Sports Min Anurag Thakur, in Chandigarh pic.twitter.com/mNmdPyIiVR — ANI (@ANI) January 19, 2023 ఇక జంతర్ మంతర్ వద్ద గురువారం నాడు(రెండోరోజు) కొనసాగిన ధర్నాలో 200 మంది రెజ్లర్లు పాల్గొన్నారు. ప్రధాని మోదీపై ఉన్న నమ్మకంతోనే తాము న్యాయపరమైన చర్యలకు దిగట్లేదని వాళ్లు ప్రకటించారు. అయితే.. బీజేపీ ఎంపీ, ఒలింపియన్ అయిన బబితా ఫోగట్ దౌత్యంతో ప్రభుత్వంతో చర్చలకు ముందుకు వచ్చారు రెజ్లర్లు. మరోవైపు కేంద్ర క్రీడా శాఖ బుధవారం ఈ ఆరోపణలపై 72 గంటల్లో స్పందించాలని డబ్ల్యూఎఫ్ఐకి అల్టిమేటం జారీ చేసింది కూడా. ఇదిలా ఉంటే.. బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(66) .. తొలి నాళ్లలో రెజ్లరు కూడా. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన.. నిజమని తేలితే ఆత్మహత్య చేసుకుంటానంటూ అంటున్నారు. వినేశ్ ఫోగట్(28) ఆరోపణలతో ఈ వ్యవహారంపై తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తనకు ఆ పరిస్థితి ఎదురు కాకున్నా.. నేషనల్ క్యాంప్‌లో ఉన్న సుమారు 20 మందికి అలాంటి వేధింపులు ఎదురు అవుతున్నాయని, కోచ్‌లతో పాటు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ కూడా ఈ వేధింపుల పర్వంలో భాగం అయ్యారంటూ ఫోగట్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. వాళ్ల కుటుంబ నేపథ్యాల దృష్ట్యా భయంతో ముందుకు రావడం లేదని, అందుకే తాను పోరాటానికి ముందుకు వచ్చి న్యాయం కోరుతున్నానని వెల్లడించారామె. ఆమెకు మద్దతుగా పలువురు రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసనకు తోడయ్యారు. మరోవైపు ఢిల్లీ మహిళా కమిషన్ ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను కోరింది. అదే సమయంలో క్రీడా మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. నేషనల్ సైక్లింగ్ టీం కోచ్‌ను లైంగిక ఆరోపణలతో తొలగించి నెలలు గడవకముందే.. రెజ్లింగ్‌లో ఇలాంటి ఆరోపణలు రావడంతో క్రీడా రంగం దిగ్భ్రాంతికి లోనవుతోంది. హాలీవుడ్ నుంచి మొదలైన మీటూ ఉద్యమం.. ఆ తర్వాత ప్రపంచమంతా విస్తరించింది. భారత్‌లో 2018లో కొందరు నటీమణులు.. తాము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామంటూ మీడియా ముందుకు వచ్చారు. దీంతో అప్పటి నుంచి మన దేశంలోనూ తరచూ మీటూ ఘటనలు తెరపైకి వస్తున్నాయి. -
సాజిద్ ఖాన్ ప్రైవేట్ బాగోతంపై నటి సంచలన ఆరోపణలు
ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాపులారిటీతో పాటు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న బిగ్‌బాస్ హిందీలో 15 సీజన్లు పూర్తి చేసుకొని తాజాగా 16వ సీజన్లోకి అడుగుపెట్టింది. అయితే ఇందులో డైరెక్టర్ సాజిద్ ఖాన్‌ను కంటెస్టెంట్‌గా తీసుకోవడంపై తీవ్ర విమర్శలు రేకేత్తుతున్నాయి. మీటూలో భాగంగా పలువురు మహిళలు ఆయనపై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తిని బిగ్గెస్ట్ రియాలిటీ షోకు తీసుకురావడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా నటి షెర్లీన్ చోప్రా ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది. ఓసారి సాజిద్ తన ప్రైవేట్ పార్టుని చూపించి దానికి 10వరకు ఎంత రేటింగ్ ఇస్తావని నాతో చీప్‌గా ప్రవర్తించాడు. ఇప్పుడు నేను బిగ్‌బాస్‌లోకి వెళ్లి అతడికి రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నా. అలాగే సల్మాన్ ఖాన్ ఈ విషయంలో జోక్యం చేసుకొని సాజిద్‌ని తప్పించాల్సిందేనంటూ కోరింది. మరోవైపు మందనా కరిమి, సోనా మహపాత్ర, ఉర్ఫీ జావేద్, నేహా భాసిన్ సహా పలువురు ఆర్టిస్టులు సాజిద్ ఖాన్‌ను వెంటనే హౌస్ నుంచి బయటకు వెళ్లగొట్టాలని సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. He had flashed his private part at me & asked me to rate it on a scale of 0 to 10. I’d like to enter into the house of Big Boss & give him the rating! Let 🇮🇳 watch how a survivor deals with her molester! Pls take a stand! @BeingSalmanKhan Read more at: https://t.co/j8kPljB1s6 — Sherlyn Chopra (शर्लिन चोपड़ा)🇮🇳 (@SherlynChopra) October 10, 2022 -
Actress Ashita: అందుకు ఒప్పుకోలేదు.. శాండిల్‌వుడ్‌కు దూరమయ్యా
బెంగళూరు: కన్నడ చిత్ర సీమను మీటూ వేధిస్తోందని నటి అశిత ఓ ఇంటర్వ్యూలో ఆరోపించింది. తాను శాండిల్‌వుడ్‌కు దూరం కావటానికి కారణాలను పేర్కొంది. కన్నడ చిత్రాలలో నటించాలంటే పెద్దలు చెప్పినట్లు నడుచుకోవాలి, అందుకు తాను సహకరించలేదు. సహకరించి ఉంటే నటించే అవకాశం వచ్చేది. దీంతో తాను శాండిల్ వుడ్‌కు దూరం అయ్యాయని ఆ చానల్లో పేర్కొంది. అయితే ఆమె ఎవరి పేరు ప్రస్తావించకుండా మీటూ ఆరోపణలు చేశారు. చదవండి: (Arohita: ఆమ్ ఆద్మీలో చేరిన సినీ నటి) -
మీ టూ నిందితులు వేధిస్తున్నారు: తనుశ్రీ దత్త షాకింగ్ పోస్ట్
బాలీవుడ్ నటి, హీరోయిన్ దనుశ్రీ దత్త పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆమె పేరు వినగానే ముందుగా గుర్తోచ్చేది ‘మీ టూ’ ఉద్యమం. 2018లో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన మీటూ ఉద్యామానికి తెరలేపింది ఆమె. ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనని శారీరంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఆమె తర్వాతా వెంటనే పలువురు నటీమణులు కూడా బయటకు వచ్చి తమకు ఎదురైన చేదు అనుభావాలను పంచుకున్నారు. దీంతో మీ టూ దేశ్యవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా మరోసారి ఆమె మీ టూపై స్పందించింది. రీసెంట్గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రీఫ్ నోట్ షేర్ చేసింది. చదవండి: విషాదం.. క్యాన్సర్‌తో టీవీ నటి మృతి ఈ సందర్భంగా ఆమె.. లైంగిక వేధింపులపై మాట్లాడినందకు ఇప్పటికీ తనని వేధిస్తున్నారని ఆరోపించింది. ‘మీటూ నిందితులు నాకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. నా కెరీర్రను నాశనం చేయాలని వారు కంకణం కట్టుకున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చిత్ర పరిశ్రమను వదిలి వెళ్లిపోను. మళ్లీ నటిగా కొత్త జీవితం ప్రారంభిస్తాను’ అని పేర్కొంది. అలాగే బాలీవుడ్‌పై మహారాష్ట్ర పాత ప్రభుత్వం ప్రభావం ఎలా ఉందో ఈ సందర్భంగా వివరించింది. ‘బాలీవుడ్ మాఫియా, మహారాష్ట్రలోని పాత పొలిటికల్ సర్క్యూట్ (ఇప్పటికీ ప్రభావం ఉంది) దుర్మార్గపు జాతీయ-వ్యతిరేక క్రిమినల్ ఎలిమెంట్స్ కలిసి సాధారణంగా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఇలా పనిచేస్తాయి. వీటన్నింటి వెనుక నేను బయటపెట్టిన #metoo నేరస్థులు, NGO వారే ఉన్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. చదవండి: మరోసారి తల్లికాబోతున్న ఐశ్వర్య?.. వీడియో వైరల్ ఎందుకంటే వారి తప్పు లేనప్పుడు ఇంకా నన్ను ఎందుకు టార్గెట్ చేసి వేధిస్తారు?? అంతేకాదు చాలా మంది నన్ను బాలీవుడ్లో లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నాకు తెలుసు. నన్ను టార్గెట్ చేసి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడినందుకు చిన్నపిల్లలు, అమ్మాయిలను వేధించి చంపగలిగే ప్రదేశం ఇది ఏమిటి?? ఇక్కడ విషయాలు నిజంగా చేయి దాటిపోతున్నాయి. నాలాంటి సాధారణ వ్యక్తులు జీవించలేని పరిస్థితులు ఉన్నాయి. దాని బాధితులుగా ఈరోజు నేను.. రేపు నువ్వు కూడా కావచ్చు’ అంటూ ఆమె రాసుకొచ్చింది. అయితే ఇన్ని సమస్యలు, ఎంతమంది తనని ఇబ్బంది పెట్టాలని చూసిని తాను మాత్రం భయపడనని, ఆత్మహత్య లాంటివి చేసుకోను అంటూ హామి ఇచ్చింది. వీటన్నింటి ఎదురు నిలబడేందుకు నా ఆత్మ స్థైర్యాన్ని పెంచుకుంటానని, అందుకోసం ఆధ్యాత్మిక సాధనను మరింత బలోపేతం చేసుకుంటున్నట్లు ఆమె చెప్పింది. View this post on Instagram A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) -
'మీటూ' తెలియదు.. కానీ 10 మంది మహిళలతో పడక పంచుకున్నా: నటుడు
Actor Vinayakan Controversial comments On MeToo: మలయాళ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ వినాయకన్ మీ టూపై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. తను 10 మంది మహిళలతో శారీరక సంబంధం కలిగి ఉన్నానంటూ అతడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దూమారం రేపుతున్నాయి. వినాయకన్ తాజా చిత్రం ఒరుతె ప్రమోషన్ కార్యక్రమంలో మీ టూపై వినాయకన్కు ప్రశ్న ఎదురవగా అతడు స్పందించిన తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు మలయాళ పరిశ్రమకు చెందిన నటీనటులు సైతం వినాయకన్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఒరుతె ప్రమోషన్ కార్యక్రమంలో వినాయకన్‌తో పాటు మూవీ టీం పాల్గొంది. చదవండి: అప్పుడే ఓటీటీకి ఆర్ఆర్ఆర్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ఈ సందర్భంగా మీ టూ ఉద్యమంపై ఆయన అభిప్రాయం అడగ్గా.. మీటూ అంటే తనకు తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘మీ టూ ఉద్యమం అంటే ఏమిటో నాకు తెలియదు. ఒక మహిళను నాతో శృంగారం చేస్తావా? అని అడగడం మీ టూ అయితే. నేను దానిని అలాగే కొనసాగిస్తాను’ అంటూ వినాయకన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేగాక ఇది కేవలం మహిళలకు సంబంధించిన విషయమేనా? అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’ అంటూ వినాయకన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైయ్యాయి. అదే మీటూ అయితే తన జీవితంలో ఇప్పటి వరకు 10 మంది మహిళలతో శారీరక సంబంధం కలిగి ఉన్నానని, వారందరిని నాతో గడుపుతారా? అని అడిగానని చెప్పాడు. చదవండి: జానీ మాస్టర్‌కి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో ఇదే మీ టూ అయితే ఇకముందు కూడా తాను అలాగే చేస్తానంటూ వ్యాఖ్యానించాడు. ఇక అతడి తీరుపై నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. మీ టూపై సరైన అవగాహన లేకుండా ఉన్నాడంటూ వినాయకన్‌పై పలువురు విరుచుకుపడుతున్నారు. కాగా వినాయకన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. 2019లో మృదులదేవి అనే దళిత మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు, లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్టయి అతడు జైలుకు వెళ్లాడు. ఇప్పుడు మరోసారి మీ టూపై ఈ తరహా వ్యాఖ్యలు చేసి మరోసారి వివాదంలో నిలిచాడు. మరోవైపు బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపేసిన ‘మీ టూ ఉద్యమం’పై ప్రముఖ నటుడైన వినాయకన్ ఈ విధంగా స్పందించడంపై సినీ సెలెబ్రెటీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
లైంగిక ఆరోపణలు: జైలు నుంచి నటుడి విడుదల.. బాధితుల ఆక్రోదన
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా అరవై మందికి పైగా బాధితులు ఆ సీనియర్ నటుడిపై లైంగిక ఆరోపణలు చేశారు. 2018లో నాటకీయ పరిణామాల మధ్య ఓ కేసులో ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడింది. మూడేళ్లు జైల్లోనూ మగ్గాడు. చివరికి జడ్జి అనూహ్య నిర్ణయంతో ఆయనకు ఊరట లభించింది. ఉన్నపళంగా నటుడు, హాలీవుడ్ నటుడు బిల్ కాస్బీ బుధవారం జైలు నుంచి విడుదల కావడం, తీర్పుపై బాధితుల అసహనంతో తీవ్ర చర్చకు దారితీసింది ఈ కేసు. హారిస్బర్గ్: హాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ బిల్ కాస్బీ(83)ని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది పెన్సిల్వేనియా అత్యున్నత న్యాయస్థానం. 2018లో లైంగిక నేరారోపణల కేసులో ఆయనకు మూడు నుంచి పదేళ్ల కారాగార శిక్ష పడింది. అయితే ఈ కేసులో శిక్ష విధించిన జడ్జి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించాడని, కాస్బీకి శిక్ష విధించబోనని ఒప్పందం కుదుర్చుకుని మరీ శిక్ష విధించడం సరికాదని పెన్సిల్వేనియా ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు లిఖిత పూర్వకంగా బాధితుల తరపున ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ కేసులో ఇంతకు ముందు జడ్జి, కాస్బీ నుంచి లైంగిక నేరారోపణలపై స్టేట్మెంట్ రికార్డు చేసి మరీ శిక్ష విధించబోనని బెంచ్ సాక్షిగా ప్రకటించాడు(నేరస్థులకు ఉన్న ఐదవ సవరణ హక్కు ప్రకారం). అయినప్పటికీ పదేళ్ల గరిష్ఠ జైలుశిక్ష విధించడాన్ని ఇప్పుడు తప్పు బట్టింది న్యాయస్థానం. అంతేకాదు తాజా పరిణామాలతో ఆయనకు వ్యతిరేకంగా బాధితులు అమెరికా సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి వీల్లేకుండా పోయింది. మరోవైపు ఈ తీర్పుపై బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము చేసిన న్యాయ పోరాటాన్ని.. అమెరికా చట్టంలోని లొసుగులు నీరుగారుస్తున్నాయని వాపోయారు. తదుపరి కార్యాచరణపై న్యాయ నిపుణులతో సంప్రదించి ముందుకు వెళ్తామని ప్రకటించారు. ఆండ్రియాతో మొదలు.. టెంపుల్ యూనివర్సిటీ బాస్కెట్ బాల్ టీంలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన ఆండ్రియా కాన్స్టాండ్.. తనకు మత్తు మందిచ్చి మరీ కోస్బీ అఘాయిత్యానికి పాల్పడ్డాడని 2005లో పోలీసులను ఆశ్రయించింది. ఏడాది తర్వాత మూడున్నర మిలియన్ల డాలర్ల పరిహారం చెల్లించి ఆమెతో కేసు క్లోజ్ కోసం డీల్ కుదుర్చుకున్నాడు కోస్బీ. అయితే 11 ఏళ్ల తర్వాత (12 ఏళ్లు గడిస్తే.. లైంగిక ఆరోపణలు చెల్లవు) మళ్లీ ఆమె తెర మీదకు వచ్చింది. ఈసారి మరో ఐదుగురు ఆమెతో కలిసి కేసు వేశారు. అదే టైంలో 60వ దశకం నుంచి ఆయనపై వినిపించిన ఆరోపణలనూ పరిగణనలోకి తీసుకుంది పెన్సిల్వేనియా లోకల్ కోర్టు. చివరికి విచారణ జరిపి 2018 సెప్టెంబర్‌లో కోస్బీకి శిక్ష విధించింది. అమెరికన్ డాడ్ స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన కోస్బీ.. సుమారు ఆరు దశాబ్దాలపాటు ఆడియొన్స్‌ను అలరించారు. 1984లో టెలికాస్ట్ అయిన ది కోస్బీ షో.. గొప్ప టీవీ షోగా గుర్తింపు దక్కించుకుంది. ఈ షో ద్వారా ఆయనకు ‘అమెరికాస్ డాడ్’ అనే ఐడెంటిటీ దక్కింది. ఆ తర్వాత సినిమాల ద్వారా ఫేమ్ దక్కించుకున్నాడీయన. అయితే కెరీర్ తొలినాళ్ల నుంచే పలు అఘాయిత్యాలకు పాల్పడినట్లు కోస్బీ ఆరోపణలు ఉన్నాయి. ఇక సంచలనం సృష్టించిన #metoo ఆరోపణల్లో మొట్టమొదట జైలు శిక్షకు గురైంది ప్రముఖుడు కూడా ఈయనే. చదవండి: అత్యాచార కేసులో బాధితురాలి అరెస్ట్!. గుండెపగిలి.. -
సన్నిహిత సన్నివేశాల రూపశిల్పి
తాము చేస్తున్నది నటన అని నటీనటులకు తెలుసు. దర్శకుడు చెప్పింది చేయాలని కూడా తెలుసు. అయితే ఆ చెప్పింది తమ కంఫర్ట్ లెవల్లో చేయాలని అనుకుంటే అందుకు ఒక ఎక్స్పర్ట్ కావాలి. ప్రేమ సన్నివేశాలు, శోభనం సన్నివేశాలు, సన్నిహిత సన్నివేశాలు ఇప్పుడు కథల్లో పెరిగాయి. చిత్రీకరణలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ‘డాన్స్ కొరియోగ్రాఫర్లు’ ఉన్నట్టుగానే ‘ఇంటిమసీ కొరియోగ్రాఫర్లు’ ఎందుకు లేరు అనుకున్నారు ఆస్థా ఖన్నా. భారతదేశపు తొలి ‘ఇంటిమసి కో ఆర్డినేటర్’గా ఇప్పుడు ఆమె ఒక కొత్త ఉపాధి మార్గాన్ని చూపుతున్నారు. ‘మీ టూ’ ఉద్యమం వచ్చే వరకూ ప్రపంచ సినిమా మేకింగ్ ఒకలా ఉండేది. ‘మీ టూ’ వచ్చాక మారిపోయింది. సన్నిహిత సన్నివేశాలలో నటించేటప్పుడు ఆ నటక ఏదైనా తప్పు సంకేతం ఇస్తే అపార్థాలు జరిగి సమస్య ఉత్పన్నం కావచ్చునని ముఖ్యంగా మగ నటులు భావించడం మొదలెట్టారు. మరో వైపు ఓటిటి ప్లాట్‌ఫామ్స్ వల్ల, మారిన సినిమా ధోరణుల వల్ల ‘సన్నిహిత’ సన్నివేశాలు విపరీతం గా పెరిగాయి. సన్నిహితమైన కంటెంట్తోటే కొన్ని వెబ్ సిరీస్ జరుగుతున్నాయి. ప్రేక్షకులు భిన్న అభిరుచులతో ఉంటారు. వీరిని ఆకర్షించడానికి రకరకాల కథలు తప్పవు. అయితే ఇలాంటి కథల్లో ఏ చిక్కులూ రాకుండా ఉండేందుకు, నటీనటులు ఇబ్బంది లేకుండా నటించేందుకు సెట్లో ఉండి తగిన విధంగా సూచనలు ఇస్తూ బాధ్యత తీసుకునే కొత్త సినిమా క్రాఫ్ట్వారు ఇప్పుడిప్పుడే మొదలయ్యారు. వీరిని ‘ఇంటిమసీ కోఆర్డినేటర్లు’ లేదా ‘ఇంటిమసీ కొరియోగ్రాఫర్లు’ అంటున్నారు. బాలీవుడ్లో ఒక మహిళ మొట్టమొదటిసారి సర్టిఫైడ్ ఇంటిమసి కోఆర్డినేటర్ అయ్యింది. ఆమె పేరు ఆస్థా ఖన్నా. ముంబైలోని ‘ఇంటిమసీ ప్రొఫెషనల్ అసోసియేషన్’ ద్వారా శిక్షణ, సర్టిఫికెట్ పొందిమరీ ఈమె ఈ రంగంలోకి వచ్చారు. నిజంగా ఇదొక విశేషమైన వార్త. సగటు సమాజ భావజాలంలో ఒక స్త్రీ ఇలాంటి ఉపాధి ఎంచుకోవడం విశేషమే. ఎవరీ ఆస్థా చద్దా ఆస్థా చద్దా లండన్‌లో చదువుకుంది. భారతదేశం తిరిగి వచ్చి బాలీవుడ్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసింది. ఆ మధ్య హిట్ అయిన ‘అంధా ధున్’కు పని చేసింది. భారతదేశంలో తయారయిన ‘మస్త్ రామ్’ అనే వెబ్ సిరీస్‌కు ‘ఇంటిమసీ కోఆర్డినేటర్’గా ఆస్ట్రేలియాకు చెందిన అమండా కటింగ్ వచ్చి పని చేసింది. ఆ సంగతి ఆస్థా చద్దా తెలుసుకుంది. అదీ గాక తాను పని చేసిన సినిమాలలో సన్నిహిత సన్నివేశాల చిత్రీకరణ సమయం లో నటీనటులు, దర్శకుడు ఏదో ఒక ‘తక్షణ ఆలోచన’తో పని చేస్తున్నట్టుగా ఆమెకు అనిపించింది. నిజానికి సన్నిహిత సన్నివేశాలు అప్పటికప్పుడు ఆలోచించి చేసేవి కావు. వాటికి ప్రత్యేక సూచనలు, జాగ్రత్తలు అవసరం. ఆ ఖాళీ భారతీయ సినిమారంగంలో ఉందని ఆస్థా అర్థం చేసుకుంది. వెంటనే తాను శిక్షణ పొంది ఇంటిమసి కోఆర్డినేటర్‌గా ఉపాధి ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్‌లో తయారవుతున్న మూడు నాలుగు వెబ్ సిరీస్‌కు పని చేసింది ఆస్థా. వీరేం చేయాలి? హీరో హీరోయిన్లుగాని, కేరెక్టర్ ఆర్టిస్టులు కాని వివిధ సందర్భాలకు తగినట్టుగా సన్నిహితంగా నటించాలి. అయితే ఇద్దరూ భిన్న నేపథ్యాల నుంచి వచ్చి ఉంటారు. ఎంత అది నటన అయినా దానికి ఇబ్బంది పడే వీలు ఎక్కువ. కొందరు అదుపు తప్పి వ్యవహరించవచ్చు కూడా. వీటన్నింటిని ‘ఇంటిమసి కోఆర్డినేటర్లు’ పర్యవేక్షిస్తారు. దుస్తులు, కెమెరా యాంగిల్స్, నటీనటుల మూవ్మెంట్స్ వీరే గైడ్ చేస్తారు. ‘నటీనటులకు తగ్గట్టు అవసరమైతే డూప్స్‌ను వాడటం, వారి శరీరాలు దగ్గరగా ఉన్నా ఇద్దరి మధ్య కొన్ని అడ్డంకులు ఉంచడం, ఎంతవరకు సీన్‌కు అవసరమో అంతవరకూ నటించేలా చూడటం మా పని’ అంటుంది ఆస్థా ఖన్నా. ఏ సన్నివేశాలలో ఏ నటీనటులైతే నటించాలో వారితో ముందు వర్క్‌షాప్ నిర్వహించడం కూడా ఆస్థా పని. ‘దానివల్ల నటీనటులు తీయవలసిన సీన్‌కు ప్రిపేర్ అవుతారు. చిత్రీకరణ సమయంలో ఇబ్బంది పడకుండా ఉంటారు’ అంటుందామె. పిల్లల రక్షణ కూడా ఇంటిమసీ కోఆర్డినేటర్లు షూటింగ్లో పాల్గొనే పిల్లలతో తోటి నటుల ‘స్పర్శ’ను కూడా గమనిస్తారు. తండ్రి పాత్రలు వేసేవారు కుమార్తెగా లేక కుమారుడిగా నటించే పిల్లలతో నటించేటప్పుడు ఆ పిల్లలు ఎంత కంఫర్ట్‌గా ఉన్నారు, ఆ టచ్‌లో ఏదైనా దురుద్దేశం ఉందా ఇవన్నీ కూడా ఇంటిమసీ కోఆర్డినేటర్లు గమనించి పిల్లలకు సూచనలు ఇస్తారు. ‘వాళ్లు ఇబ్బంది పడే సన్నివేశానికి నో చెప్పడం మేము నేర్పిస్తాం’ అంటుంది ఆస్థా ఖన్నా. శరీరాలు ఇబ్బంది పడే సన్నివేశాలంటే కేవలం అత్యాచార సన్నివేశాలే కాదు... బైక్ మీద హీరోను కరుచుకుని కూచోవాల్సిన సమయంలో కూడా ఆ నటికి ఇబ్బంది ఉండొచ్చు. లేదా నటుడికి ఇబ్బంది ఉండొచ్చు. ఆ సమయంలో ఇంటిమసి కోఆర్డినేటర్లు తగిన జాగ్రత్తలు చెప్పి షూట్ చేయిస్తారు. గతంలో ఫలానా సన్నివేశంలో నటించడానికి ఇబ్బంది పడి షూటింగ్ మానేసిన తారలు ఉన్నారు. ఇప్పుడు కోఆర్డినేటర్లుగా స్త్రీలు ముందుకు రావడం వల్ల తమ ఇబ్బందులు వారితో షేర్ చేసుకునే వీలుంది. వీరు డైరెక్టర్‌తో చెప్పి షూటింగ్ సజావుగా అందరి ఆమోదంతో జరిగే విధంగా చూసే వీలు ఉంది. చూడబోతే మున్ముందు ఆస్థా ఖన్నా వంటి ప్రొఫెషనల్స్ అవసరం మరింత ఎక్కువగా ఉండొచ్చు. ఉపాధిని కనిపెట్టడమే కాదు దానిని గౌరవప్రదంగా నిర్వహించడం కూడా ఈ తరం తెలుసుకుంటోంది. దానిని మనం స్వాగతించాలి. – సాక్షి ఫ్యామిలీ -
బాల్యం నుంచి వేధింపులు, మీ స్ఫూర్తితో ధైర్యం చేశా: నెటిజన్
చిన్మయి శ్రీపాద.. గాయనీగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా పరిశ్రమలో దూసుకుపోతున్న ఆమె ఒక్కప్పుడు పెద్దగా ఎవరికీ తెలియదు. తన గాత్రంతో ఎందరినో ఆకట్టుకున్న ఆమె.. చిన్మయి పేరుతో మాత్రమే సుపరిచితురాలు. తెరవెనుకే ప్రేక్షకులను అలరించిన ఆమె ఒక్కసారిగా మీటూ ఉద్యమంతో తెరపైకి వచ్చి పాపులర్ అయ్యింది. అంతకుముందు వరకు పాడటం కోసమే సవరించిన ఆమె గొంతు.. ఒక్కసారిగా గళాన్ని విప్పింది. బయట సమాజంలో ఆడవారు ఎదుర్కొంటున్న వివక్షను మీ టూ ఉద్యమం ద్వారా ఆమె ప్రశ్నించడం ప్రారంభించింది. అలా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న చిన్మయి ఎంతోమంది మహిళలకు, బాలికలకు, యువతులకు ఆదర్శంగా నిలిచింది. తమ పట్ల జరుగుతున్న అఘాయిత్యాలపై నోరు మెదిపేందుకు భయపడుతున్న వారు సైతం ఆమె స్ఫూర్తితో బయటకు వచ్చి తమ బాధను చెప్పుకుంటున్నారు. తాజాగా ఓ యువతి తనకు జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులతో చెప్పుకున్నానని, అంతేగాక తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ కామంధుడికి తగిన శిక్ష పడేలా చేశానంటూ ఆమె చిన్మయికి లేఖ రాసింది. అంతేగాక ఇది మీ వల్లే ఇంత ధైర్యం చేశానని కూడా చెప్పింది. ఈ లేఖ సదరు యువతి.. ‘మీరు నిజంగా మాకు స్ఫూర్తి మేడం. నేను నా బాల్యం నుంచి లైంగిక వేధింపులకు గురయ్యాను. మా కజిన్‌నే నాపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయం మా అమ్మనాన్నలకు చెప్పేందుకు భయపడేదాన్ని. కానీ ఓ రోజు ధైర్యం చేసి నిజం చెప్పాను. అయితే వారు ఈ విషయం బయట ఎక్కడ మాట్లాడొద్దని నన్ను హెచ్చరించారు. వారి నుంచి ఆ మాటలు విని నిరాశ పడ్డాను. కానీ మీలాంటి వ్యక్తులు అలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుండటంతో నాలాంటి వారిలో ధైర్యం వచ్చింది. మగవారు తప్పు చేసినా కూడా మనం ఎందుకు సైలెంట్‌గా ఉండాలనే ఆలోచన మొదలైంది. అందుకే ఇంట్లో ఎదురించలేకపోయిన బయట ఓ ఆకతాయి చేసిన పనికి పోలీసులకు ఫిర్యాదు చేశాను. పబ్లిక్ స్థలంలోనే అతడు నన్ను తాకడంతో తిరిగి ఎదిరించాను. అతడిపై ఫిర్యాదు కూడా చేశాను. వాడికి సరైన శిక్ష పడేలా చేశాను. మా లాంటి వారి గొంతుకలా నిలుస్తున్నందుకు మీకు ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చిన లేఖను చిన్మయి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
ఇది మహిళా నాయకత్వ సంవత్సరం
ఓ ఏడాది వచ్చినట్టు మరో ఏడాది మార్చి 8 ఉండదు. నూట పది సంవత్సరాల మార్చి ఎనిమిది శ్రామిక మహిళల సంఘర్షణల మైలురాళ్లు నాటుకుంటూ వస్తున్నది. గతేడాది పౌరసత్వం మా హక్కంటూ గడగడ వణికించే చలిలో రోడ్డుపై నిరవధిక శాంతియుత సత్యాగ్రహానికి కూర్చున్న వేలాదిమంది మహిళల పట్టుదల నివ్వెరపరిచింది. అబద్ధపు ప్రచారాలనీ, విద్వేషపు దాడుల్నీ, అనేక కుట్రల్నీ తట్టుకుంటూ దాదాపు మూడునెలలు దేశవ్యాప్తంగా వందల బైఠాయింపులు జరిగాయి. అవన్నీ దాదాపుగా మహిళల చొరవతో, మహిళల నిర్వహణతో నడచినవే. దేశ చరిత్రలో మొదటిసారి పురుషులు సహకార భూమికలో దర్శనమిచ్చారు. ఇప్పుడు నాలుగో నెలలోకి చేరిన రైతుల సత్య సంగ్రామానికి పునాది షాహీన్‌బాగ్. ధరల నిరంతర పెరుగుదల, కోల్పోయిన ఉపాధి, మూతబడిన సూక్ష్మ, చిన్న, మధ్య గృహ పరిశ్రమలు, పెరిగిపోతున్న నిరుద్యోగం, ఇంటాబయటా పెరిగిపోతున్న హింస... వీటితో విసిగి అధికార నిచ్చెనలో అట్టడుగున ఉండే మహిళలు ‘ఇక చాలు’ అంటున్నారు. వ్యవసాయ ఆర్డినెన్స్‌లు వచ్చిన నాటి నుండి మహిళా రైతులు, కూలీలు వాటిని అర్థం చేసుకున్నారు. ‘మా పొలాల్లో మేమే కూలీలుగా మారే కార్పొరేటు, కాంట్రాక్టు వ్యవసాయ విధానం’ వద్దన్నారు. ఊరూరు, ఇల్లిల్లూ తిరిగారు. ఈ చట్టాల గురించి వివరించారు. ఊరేగింపులు చేశారు. టోల్‌ప్లాజాల వద్ద ధర్నాలు చేశారు. ఢిల్లీకి చేరారు. ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. భయపడలేదు. నిరంతరాయంగా సాగుతున్న ఢిల్లీ సరిహద్దుల ముట్టడిలో వారు వేదిక నిర్వాహకులు, స్త్రీల ప్రత్యేక కార్యక్రమాల రూపకర్తలు, తీర్మానాల రచయిత్రులు, యాంకర్లు, ఎకౌంటెంట్లు, వంటలక్కలు, పది చేతుల్తో పనులు చక్కబెట్టే ఉద్యమకారులు. లంగరు (సామూహిక వంటశాల)లో ఎక్కువ భాగం పనులన్నీ పురుషులే చేయటం గమనార్హం. ఎక్కడ అవసరం అయితే అక్కడికి ట్రాలీల నిండా వండిన ఆహారంతో ట్రాక్టరు స్వయంగా నడుపుకుంటూ పోయే 80 ఏళ్ల నవనీత్ సింగ్ చాలా మామూలుగా చెబుతుంది, ‘నా భర్త పోయాక నేనే 50 ఏళ్లుగా వ్యవసాయం చేసి కుటుంబాన్ని ఒక దారికి తెచ్చాను. ఈ చట్టాలతో నా కుటుంబ ఆధారమే నేలమట్టం అవుతుంది. ఎంతకాలం అయినా పట్టని చట్టాలు వాపస్ తీసుకోవాల్సిందే’ అని. అసంఖ్యాకమైన స్త్రీల మాదిరి గానే ‘బతకడం కోసం ఏది అవసరం అయితే అది చెయ్యాలి’ అనేది ఆమె జీవన సూత్రం. మనుగడ ప్రశ్నార్థకం అయ్యింది కాబట్టే ఈరోజు స్త్రీలు ఉద్యమాల అనుచరులుగా, సహచరులుగా ఉండే పాత్రనుదాటి రూపకర్తలుగా, సమన్వయకారులుగా నిలబడుతున్నారు. వంటపని, ఇంటిపని, పిల్లల పెంపకం, వృద్ధుల సేవలు, బయట ఉపాధి వ్యవహారం... బహుళ ముఖ్యమైన పనులు ఒకేసారి చక్కబెట్టే వారి సామర్థ్యం ఉద్యమాల్లో భిన్న పాత్రలు అలవోకగా పోషించడానికి అనుభవాన్నిచ్చింది కనుకనే వంతులవారీ సరిహద్దుల ముట్టడిలో వుంటూ, ఊరేగింపులు, ధర్నాలు స్థానికంగా నిర్వహిస్తూ... వ్యవసాయ పనులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉద్యమాల కోసం వెళ్లిన సహచరుల చేలను కూడా పండిస్తున్నారు. భారీ మద్దతు ఒకప్పుడు ఖాప్ పంచాయతీల్లో స్త్రీలకు ప్రవేశం లేదు. అక్కడ స్త్రీలకు ప్రతికూల నిర్ణయాలే ఎక్కువ. ఇవాళ కిసాన్ పంచాయతీల్లో మేలిముసుగులు తొలగించి రాజపుత్రులు, జాట్ స్త్రీలే కాకుండా దళిత మహిళలు సైతం వేదికలెక్కి ఉపన్యాసాలిస్తున్నారు. తీర్మానాలు చేస్తున్నారు. శతాబ్దాలుగా కరడుగట్టిన ఆధిపత్య వ్యవస్థల్ని ఈ ఉద్యమం బీటలు వారుస్తున్నది. విచిత్రంగా ప్రపంచ వేదిక నుండి ఈ ఉద్యమానికి భారీ మద్దతు లభించింది కూడా ప్రధానంగా ప్రాచుర్యంగల స్త్రీల నుంచే. ఒక రియానా, ఒక గ్రేటా థన్‌బర్గ్ అధికార పీఠం కింద భూకంపం పుట్టించారు. విశ్వవిద్యాలయాల ఉద్యమం నుండి నేటి రైతు ఉద్యమం దాకా యువతులపై, స్త్రీలపై ప్రభుత్వ దాడులు అరెస్టులు సర్వసాధారణం అయ్యాయి. కార్మిక కర్షక సమన్వయానికి ప్రతీకగా నిలిచిన నవదీప్కౌర్తో పాటు హిందీ సినీ మహిళా తారలు కూడా ప్రభుత్వ కక్ష సాధింపులకు ఎరవుతున్నారు. రైతులకు మద్దతు ఇవ్వడమే వారి పాపం. కరోనా కాలంలో అంతులేకుండా పెరిగిపోయిన గృహ హింస, ఇంటి చాకిరీకి తోడు మానసిక, శారీరక, లైంగిక హింస... పడిపోయిన ఆదాయాలు, గందరగోళం అయిన విద్యా సామాజిక జీవనం, అన్నింటినీ తట్టుకుని కుటుంబాలను సాధారణ స్థితికి చేర్చడానికి స్త్రీలు తాపత్రయపడ్డారు. గత సంవత్సరం వారి అస్తిత్వమే ఒక పోరాటంగా మారింది. అయినా స్త్రీలు ఓడిపోవడానికి నిరాకరించారు. డెన్మార్క్, ఇథియోపియా, ఫిన్లాండ్, జర్మనీ, ఐస్లాండ్, న్యూజిలాండ్, స్లోవాకియాతోపాటు 20 దేశాలకు అధినేతలుగా ఉన్న మహిళలు కోవిడ్‌కు సత్వరంగా స్పందించారు. సమర్థవంతంగా నివారించారు. కనుకనే ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం, ఈ ఏడాది మార్చి 8ని ‘నాయకత్వంలో స్త్రీలు– కోవిడ్ 19 ప్రపంచంలో సమానత్వ సాధన కోసం’ అనే నినాదంతో జరుపుకోవాలని పిలుపిచ్చింది. ‘మీటూ’ ప్రియారమణికి, పర్యావరణ కార్యకర్త దిశా రవికి న్యాయస్థానాలిచ్చిన తీర్పులు స్త్రీలు తమపై జరిగే హింసపై మాట్లాడటానికి, భూమిపై తమ హక్కును ప్రకటించడానికి భరోసా కల్పించాయి. బాధితులయిన పసిబిడ్డల్ని అక్కున చేర్చుకోవాల్సిన చట్ట చౌకీదారు నేరస్తులకు సానుభూతి చూపింది. కానీ, మెలకువలో ఉన్న మహిళా ఉద్యమం ఎటువంటి ‘పెడ’ ధోరణుల్ని సహించనని నిర్ద్వంద్వంగా స్పందించింది. ఈ ఏడాది ఉద్యమకాలం, ఈ మార్చి 8 మహిళా నాయకత్వ విజయం. రైతులు, కార్మికులు, విద్యార్థినులు, మేధావులు అందరూ ఉద్యమకారులుగా బరిలో నిలిచిన సందర్భం. భయాన్ని కోల్పోయేంతగా భయపెడితే మీకు వణుకుపుట్టిస్తాం అని నిర్బంధాలకూ, విద్వేషాలకూ మహిళలు ఐక్యంగా తెగేసి చెప్పిన ఏడాదికి జేజేలు. – దేవి, సాంస్కృతిక కార్యకర్త -
మీటూ కేసు : రామాయణం ప్రస్తావన
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ వేసిన పరువు నష్టం దావా కేసు నుంచి జర్నలిస్టు ప్రియారమణికి విముక్తి లభించింది. 2018లో మీటూ ఉద్యమం నేపథ్యంలో ఎంజే అక్బర్ తనని లైంగికంగా వేధించారంటూ ప్రియారమణి చేసిన ఆరోపణలపై అక్బర్ కోర్టుకెక్కారు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. అయితే ప్రియారమణికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ ఎంజే అక్బర్ వేసిన దావాను ఢిల్లీ కోర్టు బుధవారం కొట్టేసింది. లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళలకి దశాబ్దాల తర్వాత కూడా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ వేదికలోనైనా తనకు జరిగింది వెల్లడించే హక్కు ఉందని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాంజే స్పష్టం చేశారు. తీర్పుని వెలువరించే సమయంలో న్యాయమూర్తి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘంలో హోదా ఉన్న వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడలేదని చెప్పలేమని అన్నారు. ‘‘లైంగిక వేధింపులపై తమ గళం విప్పిన మహిళల్ని శిక్షించలేము. ఒక వ్యక్తి పరువు తీశారని ఫిర్యాదులు వచ్చినా మహిళల్ని శిక్షించడానికి వీల్లేదు. మహిళల మర్యాదని పణంగా పెట్టి సంఘంలో మరో వ్యక్తి పరువుని కాపాడలేము’’ అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ‘‘లైంగిక వేధింపులతో మహిళల ఆత్మగౌరవం, మర్యాదకి భంగం వాటిల్లుతుంది. తనపై జరిగిన నేరంతో ఆమె తీవ్రమైన మానసిక సమస్యలనెదుర్కొంటుంది. నాలుగు గోడల మధ్య జరిగిన ఘటనలపై ఒక్కోసారి ఆమె పెదవి విప్పలేకపోవచ్చు. ఒక్కో సారి ఆమెకి అన్యాయం జరిగిందని కూడా బాధితురాలికి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే లైంగిక వేధింపులకు గురైన మహిళలు దశాబ్డాల తర్వాత కూడా బయట ప్రపంచానికి వెల్లడించవచ్చు’’ అని మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు.‘‘లైంగిక వేధింపులతో బాధితురాలు ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటుందో సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి కూడా మిగిలిన వారిలాగే మన సమాజంలో కలిసిపోతారు. అతనికీ కుటుంబం, బంధువులు, స్నేహితులు ఉంటారు. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలోనే ఉంటారు. ఈ విషయాన్ని అందరూ గ్రహించుకోవాలి’’ అని మేజిస్ట్రేట్ రవీంద్రకుమార్ వ్యాఖ్యానించారు. మహిళల్ని గౌరవించాలంటూ రామాయణ, మహాభారతం వంటి పవిత్ర గ్రంథాలు రాసిన నేలపై వారి పట్ల జరుగుతున్న అకృత్యాలు సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు. మహిళలు ఇక మాట్లాడాలి ఢిల్లీ కోర్టు వెలువరించిన తీర్పు పట్ల ప్రియారమణి హర్షం వ్యక్తం చేశారు. తన గెలుపు మరెందరో మహిళల్ని పెదవి విప్పేలా ప్రోత్సహిస్తుందని ప్రియారమణి వ్యాఖ్యనించారు. ‘‘నేను చేస్తున్న పోరాటం నా ఒక్కదాని కోసం కాదు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలందరి తరఫున పోరాడుతున్నాను. కేవలం మాట్లాడానని నన్ను ఈ కేసులోకి లాగారు. ఒక బాధితురాలినైన నన్ను ముద్దాయిగా బోనులో నిలబెట్టారు. సమాజంలో పలుకుబడి ఉందని, శక్తిమంతులమని బావించే మగవాళ్లు బాధిత మహిళల్ని కోర్టుకీడ్చడానికి ఇకపై ముందు వెనుక ఆలోచిస్తారు’’ అని ప్రియారమణి అన్నారు. ఈ కేసులో తాను విజయం సాధించేలా శ్రమించిన తన లాయర్లకి ప్రియారమణి ధన్యవాదాలు తెలిపారు. -
మీటూ : కేంద్రమాజీ మంత్రికి షాక్
సాక్షి, న్యూఢిల్లీ : చిత్ర పరిశ్రమలోనే కాక దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన మీటూ ఉద్యమం కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. కేంద్రమాజీ మంత్రి ఎంజే అక్బర్ తనపై లైంగిక వేదింపులకు పాల్పడ్డారంటూ జర్నలిస్ట్ ప్రియా రమణి చేసిన అరోపణలు అప్పట్లో సంచలనం రేకిత్తించిన విషయం తెలిసిందే. తనపై ప్రియా తప్పుడు ఆరోపణలు చేశారని, తన పరువుకు భంగంకలిగే విధంగా వ్యాఖ్యలు చేశారని ఎంజే అక్బర్ కోర్టును ఆశ్రయించారు. ప్రియా రమణిపై ఢిల్లీ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం బుధవారం కీలక తీర్పునిచ్చింది. బాధితురాలిపై ఎంజే అక్బర్ దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు ఎప్పుడైనా బయటకు చెప్పుకోవచ్చని స్పష్టం చేసింది. ఎంజే అక్బర్ వాదనలతో ఏకీభవించని న్యాయస్థానం.. ఆమె వ్యాఖ్యలతో పిటిషనర్‌కు పరువు నష్టం జరిగిందని భావించేమని పేర్కొంది. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. దీంతో ప్రియా రమణికి న్యాయస్థానంలో ఊరట లభించింది. గత ఏడాది అక్టోబర్‌లో 20 ఏళ్ల క్రితం అక్బర్ తమని లైంగికంగా వేధించారని ఆయన మాజీ సహచర ఉద్యోగులు ప్రియా రమణి, ప్రేరణాసింగ్ బింద్రా, పేరు తెలియని మరో మహిళా జర్నలిస్టు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే వీటిని అవాస్తవమని కొట్టి పారేసిన అక్బర్ జర్నలిస్టు ప్రియా రమణిపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఆమె తప్పుడు ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం కేసు నమోదు చేశారు. దీనిని తాజాగా ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. కాగా ఎంజే అక్బర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలు ప్రధానంగా రాజకీయ రంగంలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ప్రియా రమణి మొదలు పలువురు మహిళలు అక్బర్‌పై తీవ్రమైన ఆరోపణలతో మీటూ అంటూ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చారు. -
‘రియా కోసం అతడి గుండె రక్తమోడుతోంది’
ముంబై: బాలీవుడ్ ప్రముఖ సింగర్ విశాల్ దద్లానీపై గాయని సోనా మహాపాత్ర విమర్శలు గుప్పించారు. కాలానికి, మనుషులకు తగ్గట్లుగా ఆయన మనసు మారిపోతూ ఉంటుందని వంగ్యాస్త్రాలు సంధించారు. కాగా నటి తనూ శ్రీ దత్తా నానా పటేకర్‌పై చేసిన లైంగిక ఆరోపణ నేపథ్యంలో బాలీవుడ్లో మీటూ ఉద్యమం ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోనా సహా పలువురు ఆమె మద్దతుగా నిలబడ్డారు. మీటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇక ప్రముఖ సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ జడ్జి, సంగీత దర్శకుడు అను మాలిక్ తమను లైంగికంగా వేధించాడంటూ పలువురు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో అనూ మాలిక్‌కు వ్యతిరేకంగా సోనా బలంగా తన గొంతు వినిపించారు. బాధితుల పక్షాన నిలబడ్డారు. అయితే అనూ మాలిక్‌తో అదే వేదికను పంచుకున్న సింగర్ విశాల్ దద్లానీ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్టైన విషయం విదితమే. అనేక పరిణామాల అనంతరం వీరిద్దరికి బెయిలు లభించగా జైలు నుంచి విడుదలయ్యారు. ఇక ఈ విషయం గురించి గురువారం ట్విటర్లో ప్రస్తావించిన విశాల్.. ప్రముఖ జర్నలిస్టు అర్నబ్ గోస్వామిని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అక్కాతమ్ముళ్ల అందమైన భవిష్యత్తును నాశనం చేశారంటూ మండిపడ్డాడు. తన రాజకీయ గురువులను ప్రసన్నం చేసుకునేందుకే ఇలా చేశాడంటూ ఆరోపించాడు.(చదవండి: ‘బెల్ట్ తీసి కొట్టేవాడు.. వేళ్లు విరిచేవాడు’) ఈ విషయంపై స్పందించిన ఓ నెటిజన్.. గురువుల మెప్పు పొందేందుకు మీటూ ఉద్యమం గురించి నోరు తెరవని నువ్వు ఇప్పుడిలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. అనుమాలిక్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడని మీకు డబ్బు గురించి ఆలోచనే తప్ప ఇంకేమీ పట్టదంటూ ఘాటుగా విమర్శిస్తూ సోనా మహాపాత్రను ట్యాగ్ చేశారు. ఇందుకు బదులుగా.. ‘‘ మన అవసరాన్ని, సౌలభ్యాన్ని బట్టి ఏది సరైంది, ఏది కాదు అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. రియా చక్రవర్తి కోసం దద్లానీ గుండె రక్తమోడుతోంది. కానీ ఇండియన్ ఐడల్‌లో ఆయన సహచరుడు అనూ మాలిక్ గురించి ఎంతో మంది మహిళలు ఆరోపణలు చేసినప్పుడు మాత్రం ఎలాంటి న్యాయన్యాయాలు గుర్తుకురాలేదు’’ అంటూ విమర్శించారు. “What is right is often forgotten by what is convenience.” Dadlani’s heart bleeds for Rhea Chakraborty & 🤟🏾🙏🏾.None of this justice bent came into play for Vishal when endless women called out his #IndianIdol colleague Anu Malik. @IndiaMeToo .#WontBeForgotten #India #WillRemember https://t.co/tHwsaXKdhC — Sona Mohapatra (@sonamohapatra) December 10, 2020 -
ఇక్కడితో ఆగిపోవడం లేదు
యూఎస్‌లో యాష్లీ జూడ్. ఇండియాలో తనుశ్రీ దత్తా. ఈజిప్టులో నదీన్ అష్రాఫ్! ముగ్గురూ ‘మీటూ’ ఫైటర్స్. ముగ్గుర్లో చిన్న.. నదీన్. పద్దెనిమిదేళ్లకే ఉద్యమజ్వాల. ఇరవై రెండేళ్లకిప్పుడు.. మీటూ మహోజ్వల స్ఫూర్తి. ఇక్కడితో.. ఆగిపోవడం లేదంటోంది. మహిళల్ని సమైక్యం చేస్తానంటోంది. నాలుగేళ్ల క్రితం నదీన్ అష్రాఫ్ వయసు పద్దెనిమిదేళ్లు. అప్పటికి ఏడేళ్ల క్రితం ఆమె వయసు పదకొండేళ్లు. ఈ రెండు వయసులలో ఒకటి ఆమెను ఇప్పటికీ పీడకలలా వెంటాడుతున్నది. ఇంకోటి.. అలాంటి పీడకల ఏ అమ్మాయిని వెంటాడుతున్నా ఆ అమ్మాయి వైపు నిలిచి తనే ఆ పీడకల వెంటబడి తరిమికొట్టేందుకు నదీన్‌ను ఒక శక్తిగా మలచినది. మరి తన పీడకల మాట ఏమిటి?! ఆ పిశాచి దొరకలేదు. ఆ పిశాచి ముఖం గుర్తు లేదు. నదీన్కు పదకొండేళ్ల వయసులో వెనుక నుంచి వచ్చి ఆమె వెనుక భాగాన్ని అరిచేత్తో కొట్టి మాయమైపోయాడు. ఏం జరిగిందీ ఆ చిన్నారికి అర్థం కాలేదు. తననెందుకు తెలియనివారొకరు తాకడం?! అంతవరకే ఆలోచన. నదీన్ పెద్దదవుతోంది. ఇలాంటి పిశాచాలు ఉంటాయని అర్థయ్యే వయసుకు వచ్చింది. చిన్నతనంలో తనకు జరిగిందీ ‘అలాంటిదే’ అని రోషంతో ఉడికిపోయింది. ఏ అమ్మాయికి అలా జరిగిందని విన్నా తనకు జరిగిందే ఆమె గుర్తుకు వస్తోంది. అతడెవరో తెలియదు కనుక తనేం చేయలేదు. ఇప్పుడైతే ఒకటి కచ్చితంగా చేయగలదు. లైంగిక వికృతాలకు, లైంగిక హింసకు, దౌర్జన్యానికి, దాడికి పాల్పడిన వారిని వేటాడి కలుగుల్లోకి లాగి బాధితులకు న్యాయం జరిపించడం! ఆమెకు ఈ ఆలోచన కలిగించింది ‘మీటూ’ మూవ్మెంట్. నాలుగేళ్ల క్రితం 2017లో అమెరికాలో మొదలైన ఆ ఉద్యమజ్వాల పద్దెనిమిదేళ్ల నదీన్ కు మీటూ బాధితుల తరఫున నిలిచి పోరాడేలా స్ఫూర్తిచ్చింది. అమెరికాలో ఎలాగైతే హాలీవుడ్ నటి యాష్లీ జూడ్ ‘మీటూ’కు ఊపిరులు ఊదిందో ఈజిప్టులో అలా నదీన్ మీటూ ఒత్తిని వెలిగించింది. అందుకే 2020లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వందమంది శక్తిమంతమైన మహిళల బి.బి.సి. జాబితాలో నదీన్ ఒకరయ్యారు. ఆ గుర్తింపు కూడా నదీన్కు మీటూ ఉద్యమకారిణిగా లభించినదే. ∙∙ యూఎస్‌లో మీటూ మొదలయ్యే సమయానికి నదీన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘అసాల్ట్ పోలీస్’ అనే పేజ్ని నడుపుతూ ఉంది. హాలీవుడ్లో హార్వీ వైన్స్టీన్లా ఈజిప్టులో అహ్మద్ బస్సమ్ జికీ అనే వ్యక్తి అనేక మంది మహిళల్ని లైంగికంగా వేధించిన కేసుల్లో ప్రధాన నిందితుడు. యాభై మందికి పైగా మహిళలు అతడి వల్ల తాము పడిన లైంగిక హింసను ‘అసాల్ట్ పోలీస్’లో షేర్ చేసుకున్నారు. ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా నదీన్ అనుకోకుండా ప్రారంభించింది. ఆమె అంతకుముందు ఫేస్బుక్లో చురుగ్గా ఉండేది. నదీన్ ఓ రోజు రాత్రి పొద్దుపోయాక అహ్మద్ బస్సమ్ జికీ లైంగిక అకృత్యాలపై ఒక పోస్ట్ చదువుతుంటే అకస్మాత్తుగా అది అదృశ్యం పోయింది. అతడి ఘోరాలపై అప్పటికే రగిలిపోతున్న నదీన్ అప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ప్రారంభించి, అతడి గురించి ఆరా తీసింది. కొద్ది గంటల్లోనే కనీసం యాభై మంది బాధితులు అతడు తమనెలా మోసం చేసిందీ, లైంగికంగా ఎలా హింసించిందీ నదీన్తో పంచుకున్నారు. అలా ఈజిప్టులో మీటూకు నదీన్ ఇన్స్టాగ్రామ్ నుంచి తొలి అడుగు పడింది. అదే సమయంలో ఈజిప్టు ప్రభుత్వం మీటూకు ఊతం ఇచ్చేలా లైంగిక నేరాల నిరోధక చట్టాన్ని అమల్లోకి తేవడంతో యూఎస్‌లో వైన్‌స్టీన్ అరెస్ట్ అయినట్లే ఈజిప్టులో అహ్మద్ కూడా అరెస్ట్ అయ్యాడు. మీటూ ఉద్యమకారిణిగా నదీన్ గుర్తింపు పొందారు. నదీన్ ఉండేది ఈజిప్టు రాజధాని కైరోలో. ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆమె తల్లి పౌష్టికాహార వైద్య నిపుణురాలు. తండ్రికి సొంత సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. కూతురి మీటూ ఉద్యమ సారథ్యానికి ఇద్దరూ చోదకశక్తుల్లా పనిచేస్తున్నారు. నిజంగా ఇది గొప్ప సంగతి. అందుకే.. ‘‘లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కీలకమైన ఉద్యమ పాత్రను పోషిస్తూ సమాజంలో మార్పు తెచ్చేందుకు నదీన్ కృషి చేస్తోంది’ అని బి.బి.సి. ఇచ్చిన ప్రశంసకు నదీన్ తల్లిదండ్రులూ పాత్రులే. ‘‘నేనిక్కడితో ఆగిపోవడం లేదు’’ అని మంగళవారం ‘ఈజిప్షియన్ స్ట్రీట్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు నదీన్ అష్రాఫ్. లైంగిక హింసకు, వేధింపులకు గురవుతున్న మహిళలకు మద్దతుగా నిలబడి, వారికి న్యాయపరమైన సహకారం కూడా ఉచితంగా అందే ఏర్పాటు చేస్తున్న నదీన్ ఆన్లైన్ వేదికగా మహిళలందరినీ బాధితుల తరఫున సమైక్య పరిచే ప్రణాళిక ను సిద్ధం చేసుకుంటున్నారు. తనుశ్రీ దత్తా, యాష్లీ జూడ్ -
రీ ఎంట్రీకి రెడీ అయిన తనుశ్రీ దత్తా..!
తనుశ్రీ దత్తా సినిమాల ద్వారా కంటే కూడా మీటూ ఉద్యమంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. భారతదేశంలో మీటూ ఉద్యమానికి ఆధ్యురాలు ఆమె. సినిమాలకు దూరమయిన ఆమె అమెరికా వెళ్లారు. ఇండియా వచ్చిన సమయంలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో సహా నటుడు నానాపటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. ఆ తర్వత తనుశ్రీ దత్తా స్ఫూర్తితో ఎందరో తమకు ఎదురైన భయానక పరిస్థితుల గురించి వెల్లడించారు. ఇక దేశంలో మీటూ ఉద్యమం ఉధృతంగా మారిన సమయంలో ఆమె అమెరికా వెళ్లిపోయారు. తాజాగా ఆమెకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త తెలిసింది. త్వరలోనే తనుశ్రీ దత్తా సినిమాల్లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు తనుశ్రీదత్తా. సినిమాల కోసం అమెరికన్ గవర్నమెంటు ఉద్యోగం వదులుకున్నానని.. 15 కిలోల బరువు కూడా తగ్గానని తెలిపారు. యూఎస్ డిఫెన్స్‌లో ఉద్యోగం వదులుకున్నాను ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో. ‘గత కొద్ది రోజులుగా నేను అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్నానే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అవన్ని అవాస్తవాలు. ట్రైనింగ్ తీసుకున్న మాట వాస్తవమే కానీ ఉద్యోగంలో చేరలేదు. వాస్తవానికి అమెరికా డిఫెన్స్ రంగంలో నాకు మంచి ఉద్యోగం లభించింది. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన జాబ్. కరోనా ముగిసిన తర్వాత ఉద్యోగంలో చేరాలి. ఆ తర్వాత నేను మూడేళ్ల పాటు అమెరికా నుంచి ఎక్కడి వెళ్లడానికి వీల్లేదు. మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికాలో జాతీయ రక్షణ సంబంధిత ఉద్యోగాలు సాధారణంగా చాలా ఎక్కువ భద్రతా క్లియరెన్స్, అనుమతులను కలిగి ఉంటాయి. అందుకే ఉద్యోగాన్ని వదులుకున్నాను. ఆర్టిస్ట్‌గా నా కెరీర్‌ని తిరిగి ప్రారంభించాలనుకుంటున్నాను. ఇండస్ట్రీలోని కొందరు చెడ్డవారి వల్ల నేను నా పనిని మధ్యలో వదిలేయాల్సి వచ్చింది. కానీ బాలీవుడ్లో నాకు మంచి పేరు ఉంది. దాంతో ఇండస్ట్రీలో తిరిగి నా కెరీర్‌ని ప్రారంభించాలని భావించాను. అందుకే ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నాను. మంచి చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో నటించాలని అనుకుంటున్నాను’ అని తెలిపారు తనుశ్రీ దత్తా. (చదవండి: మీటూ ఉద్యమానికి మహిళలే బాధ్యులు) View this post on Instagram Some old news doing the rounds that I'm doing an IT job in LA. I was infact training for in IT and had a fantastic IT job opportunity in the defence sector of the US Government. It was a very prestigious job opportunity as I have always had the discipline, integrity and determination of an army person so to work in this field in whatever capacity would have been an honour. But I didn't take it as I wanted to explore my artistic career again. The defence job based out of Nevada would eventually after the Pandemic would need me to shift out of LA/ NY and I would not be permitted to leave the US for 3 years. I would also have to sign a job contract for 3 years coz such national defence related US jobs usually have very high security clearance and permissions so they cannot have people in and out of employment. Since I'm an artist at heart who just happened to lose my way away from my craft due to some very very bad human beings and the trouble they caused me, i decided to not be hasty in changing my profession and re-consider what options I have in Bollywood. I have a lot of goodwill in Bollywood and Mumbai so I came back to India and will stay here for sometime and will work on some interesting projects. I have been getting some offers from Bollywood in terms of movies and web series and the Industry seems far more interested in casting me rather than my arch- enemies.( they only announce projects but none of their projects ever see the light of day & will not).At present I'm in touch with 3 big South film managers who are pitching me for Big budget south Projects as well as 12 Casting offices in Mumbai. There are powerfull Industry bigwigs who are giving me silent support in the background as they know the truth and are my wellwishers.There are also big production houses I'm talking to for projects in lead roles. The pandemic has just made shooting dates uncertain so I'm unable to make a concrete announcement. I recently shot a commercial advertisement in the beauty space and announced that I'm back to work. I'm looking good, getting back my sass as I've lost 15 kgs and there is a strong buzz amongst industry folks of my imminent return to acting! #🤞🤞 A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) on Nov 7, 2020 at 10:52pm PST సౌత్‌లో మూడు పెద్ద సంస్థల్లో అవకాశం ఇక ముంబై తిరిగి వచ్చిన తర్వాత తాను సౌత్‌కు చెందిన మూడు పెద్ద నిర్మాణ సంస్థల ప్రాజెక్టుల్లో అవకాశం దక్కించుకున్నట్లు తనుశ్రీ దత్తా తెలిపారు. ప్రస్తుతం ఈ మూడు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయన్నారు. ఇవే కాకుండా మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రల కోసం బాలీవుడ్‌లోని 12 క్యాస్టింగ్ ఆఫీస్‌లు తనను సంప్రదించాయన్నారు. ఇప్పటికే తాను అంగీకరించిన కొన్ని సినిమాలు ప్రారంభం కావాల్సి ఉండగా... కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ వాయిదా పడిందన్నారు. తన గురించి తెలిసిన కొందరు పెద్దలు రహస్యంగా తనకు సాయం చేస్తున్నారని వెల్లడించారు. అంతేకాక ఇటీవలే తాను ఓ ప్రచార చిత్రంలో నటించిన విషయాన్ని ఈ సందర్భంగా తనుశ్రీ దత్తా ప్రస్తావించారు. ఇక సినిమాల కోసం తాను ఏకంగా 15 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. స్లిమ్ లుక్‌లో తాను ఇంతకుముందు నటించిన చిత్రాల్లో మాదిరిగా అందంగా కనిపించానన్నారు. ఇక తెలుగులో తనుశ్రీ దత్తా బాలకృష్ణకు జోడిగా వీరభద్ర చిత్రంలో నటించారు. -
మీటూ ఉద్యమానికి మహిళలే బాధ్యులు
ముంబై: సూపర్ హీరో ‘శక్తిమాన్’ ముఖేష్ ఖన్నా సహానటులపై, సామాజిక విషయాలపై తరచూ వ్యంగ్య వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఆయన మీ టూ ఉద్యమంపై అనుచిత వ్యాఖ్యలు చేసి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన వ్యాఖ్యలను నెటిజన్లు, మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆయన మీ టూ ఉద్యమంపై మాట్లాడుతూ.. మీటూ ఉద్యమానికి మహిళలే బాధ్యులు అని వ్యాఖ్యానించారు. ‘మహిళలు ఇంటి పనికి బాగా సరిపోతారు. అయితే మీ టూ ఉద్యమం మొదలైంది వారి వల్లే. ఎందుకంటే ఇంటి పని చేసుకోవడం మహిళ బాధ్యత. కానీ వారు అది చేయకుండా బయటకు వచ్చి పురుషులకు పోటీ పడటం(పురుషులతో భుజం-భజం కొట్టుకోవడం) ప్రారంభించారు. అందువల్లే మీ టూ ఉద్యమం మొదలైంది. దీనికి బాధ్యత వహించాల్సింది కూడా మహిళలలే’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ముఖేష్ కన్నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: దానికంటే చెత్త షో మరొకటి ఉండదు: ముఖేష్ కన్నా) Actor turned right wing rabble rouser Mukesh Khanna says women going out to work and thinking of being equal to men is cause of #metoo pic.twitter.com/1sZ37GudTy — Hindutva Watch (@Hindutva__watch) October 30, 2020 ‘గతంలో మీరు చేసిన పాత్రలకు అందరూ మిమ్మల్ని గౌరవిస్తున్నారు. అలాంటి మీ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం నిరాశపరిచింది’, ‘ఈ వ్యక్తే మనం బాల్యంలో ఆదర్శంగా తీసుకున్న సూపర్ హీరో. చూడండి ఆయన ఆలోచనలు, మాటలు ఎలా ఉన్నాయో’, ‘మహిళలు పని చేయడానికి బయటకు వస్తే పురుషులు లైంగిక వేధింపులకు అర్హులు.. కానీ మహిళలు వారి భద్రత కోసం ఇంట్లోనే ఉండాలా?. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కోంచమైన సిగ్గండాలి ముఖేష్ కన్నా’ అంటూ నెటిజన్లు మండిపడుతూ ఆయనపై ధ్వజమెత్తుతున్నారు. అయితే హీరోయిన్ సోనాక్షి సిన్హాకేబీసీలో రామాయణంపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడంపై ఆమెను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక నిర్మాత ఎక్తాకపూర్, ప్రముఖ కామెడీ కపిల్ శర్మ షోలను కూడా కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. అయితే బీఆర్ చొప్రా నిర్మించిన మహాభారతంతో భీష్మ పితామహా పాత్రలో నటించి అందరి మన్నలు పొందారు. అంతేగాక సూపర్ హీరో శక్తిమాన్‌లో లీడ్‌రోల్ చేసి చిన్నారులను ఆకట్టుకున్నారు. (చదవండి: ‘సోనాక్షిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు’) -
ఈ చెత్తలోకి నన్ను లాగొద్దు: నటి ఫైర్
ముంబై: నటి పాయల్ ఘోష్ ఆరోపణలతో బాలీవుడ్లో మీటూ ఉద్యమం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కంగనా రనౌత్ వంటి నటీమణులు పాయల్‌కు మద్దతు ప్రకటించగా, తాప్సీ, అనురాగ్ మాజీ భార్యలు నటి కల్కి కొచ్లిన్, ఎడిటర్ ఆర్తీ బజాజ్ సహా పలువరు సెలబ్రిటీలు అతడి అండగా నిలబడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా నటి హూమా ఖురేషి సైతం ఈ జాబితాలో చేరారు. అనురాగ్ తనతో ఎన్నడూ తప్పుగా ప్రవర్తించలేదని, అనవసరంగా తన పేరును వివాదంలోకి లాగవద్దంటూ పాయల్‌పై మండిపడ్డారు. మీటూ ఉద్యమానికి ఉన్న పవిత్రతను నాశనం చేయవద్దని హితవు పలికారు. ఈ మేరకు ట్విటర్లో ఓ లేఖ షేర్ చేశారు.(చదవండి: అంతా అబద్ధం: అనురాగ్ కశ్యప్) ‘‘అనురాగ్ నేను 2012-13 సంవత్సరంలో కలిసి పనిచేశాం. తను నాకు ప్రియమైన స్నేహితుడు. ఎంతో ప్రతిభావంతుడైన దర్శకుడు. నాకు తెలిసినంత వరకు తను నాతో గానీ, ఇతరులతో గానీ ఇంతవరకు ఎప్పుడూ చెడుగా ప్రవర్తించలేదు. అయితే ఆయనపై ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్లు అధికారులకు, పోలీసులకు, న్యాయ వ్యవస్థకు ఫిర్యాదు చేయాలి. ఈ విషయంపై నేను స్పందించకూడదు అనుకున్నా. ఎందుకంటే సోషల్ మీడియా యుద్ధాలు, మీడియా విచారణలపై నాకు నమ్మకం లేదు. అయితే నా పేరును ఇందులోకి లాగడం ఆగ్రహాన్ని తెప్పించింది. ఎన్నో ఏళ్లుగా కఠిన శ్రమకోర్చి తనకంటూ ప్రత్యేక గుర్తిం పు తెచ్చుకున్న మహిళలు ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. నా ఫైనల్ రెస్పాన్స్ ఇది. ఈ విషయంలో ఇకపై నన్ను ఎవరూ సంప్రదించవద్దు’’ అని హూమా ఖురేషి మీడియాకు విజ్ఞప్తి చేశారు.(చదవండి:మేము బెస్ట్‌ఫ్రెండ్స్; నాకు చెప్పాల్సిన అవసరం లేదు! కాగా అనురాగ్ తెరకెక్కించిన గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ సినిమాతో హూమా బాలీవుడ్ తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల షేర్ చేసిన వీడియోలో పాయల్ సంచలన ఆరోపణలు చేశారు. అనురాగ్ తనను లైంగికంగా వేధించాడని, రిచా చద్దా, హూమా ఖురేషి వంటి వాళ్లు అతడు ఫోన్ చేసినప్పుడల్లా వెళ్లి సంబంధం కొనసాగిస్తారంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయంపై ఫైర్ అయిన రిచా చద్దా పాయల్‌పై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించగా, హూమా ఖురేషి ఈ మేరకు స్పందించారు. pic.twitter.com/g0FGKyFxGi — Huma S Qureshi (@humasqureshi) September 22, 2020 -
మీ నాన్న ఉంటే సిగ్గుపడేవాడు; నోరు మూసుకోండి!
ముంబై: ‘‘మా నాన్న గురించి తమకు తెలుసు అని చెప్పుకొనే వారి పట్ల నేటితో గౌరవం పోయింది. అయితే ఒక్కటి మాత్రం నిజం నా కంటే మా నాన్న అన్ని విషయాల్లో బెటరే. మీ ద్వేషం కారణంగా నాకు ఈరోజు లిబరేషన్ అంటే ఏమిటో అర్థమైంది. అయినా మీరేం చేయలేరు. అయితే ఓ వ్యక్తి గురించి వెంటనే జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. అన్నట్లు మీ నాన్న కూడా నిన్ను చూసి సిగ్గుపడుతారు. కాబట్టి నోరు మూసుకో. నేను, బాబా బెస్ట్‌ఫ్రెండ్స్. మా నాన్న ఏం చేసేవారో చెప్పడానికి అస్సలు ప్రయత్నించకండి. ఆయన నమ్మకాల గురించి తెలియకుండా మాట్లాడవద్దు’’ అంటూ బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ ట్రోల్స్‌పై మండిపడ్డాడు. తన తండ్రి గురించి తనకు చెప్పాల్సిన అవసరం లేదని చురకలు అంటించాడు. దర్శక- నిర్మాత అనురాగ్ కశ్యప్‌కు మద్దతుగా నిలిచినందుకు తనను విమర్శించిన వాళ్లకు ఈ విధంగా సమాధానమిచ్చాడు. (చదవండి: ఇది మహిళల కోసం నిలబడే సమయం: పాయల్ ) కాగా నటి పాయల్ ఘోష్ అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండగా, ఆయన మాజీ భార్యలు ఆర్తీ బజాజ్, కల్కి కొచ్లిన్ సహా తాప్సీ వంటి సినీ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. పాయల్ చేసిన ఆరోపణల్లో నిజం లేదంటూ అనురాగ్‌కు అండగా నిలబడుతున్నారు. ఈ క్రమంలో బాబిల్ ఖాన్ సైతం ఇదే బాటలో నడిచాడు. అంతేగాక ఎంతో గొప్పదైన మీటూ ఉద్యమాన్ని దుర్వినియోగం చేయడం వల్ల, నిజమైన బాధితులకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ఓ వ్యక్తిపై నిందలు వేయడం సులువేనని, అయితే నిజాన్ని నిరూపించడం కష్టమని చెప్పుకొచ్చాడు. (చదవండి: మీ టూ: అనురాగ్‌కు మాజీ భార్య మద్దతు ) అంతేగాక మీటూ అంటూ కొంతమంది చేసే నిరాధార ఆరోపణల వల్ల లైంగిక వేధింపుల బాధితులపై నమ్మకం పోయే అవకాశం ఉందని, అలాంటి వాళ్లు ఎప్పటికీ చీకట్లోనే మగ్గిపోవాల్సిన దుస్థితి కలుగుతుందంటూ.. ‘‘చిన్ అప్ అనురాగ్ సర్’’అని ఇన్‌స్టాలో ఓ పోస్టు షేర్ చేశాడు. ఇక ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘మీరన్నట్లు ఒకరిపై అభాండాలు వేయడం తేలికే కావొచ్చు. ఇన్ని విషయాలు తెలిసిన వాళ్లు, ఎదుటి వ్యక్తి చెప్పేది కచ్చితంగా అబద్ధమేననే స్టాంఢ్ తీసుకోవడం ఎంత వరకు కరెక్ట్. ఒకవేళ ఆ అమ్మాయి చెప్పేది నిజమే అయితే అప్పుడు ఏం చేస్తారు. మీ నాన్న ఉంటే నిజంగా సిగ్గుపడేవారు. ఆయనలా బతికేందుకు ప్రయత్నించు’’అంటూ బాబిల్‌ను విమర్శించారు. దీంతో తన జడ్జిమెంట్‌పై తనకు నమ్మకం ఉందని, ఒకవేళ ఇది తప్పని తేలితే అందుకు బాధ్యత వహిస్తానని బాబిల్ చెప్పుకొచ్చాడు. కాగా ఇర్పాన్ ఖాన్- సుతాపా సికిందర్ దంపతులకు బాబిల్ ఖాన్. ఆర్యన్ అనే ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram Chin up, Anurag sir. I know you all are gonna hate me for this but I’ve got to stand up when something feels wrong. A lot of people in the comments are asking ‘What if the girl is right?’ I am trusting my judgement, I will take responsibility for my words if I’m wrong. A post shared by Babil (@babil.i.k) on Sep 21, 2020 at 4:37am PDT -
లైంగిక ఆరోపణలు : మేయర్ బలవన్మరణం
సియోల్ : దక్షిణ కొరియా తదుపరి అధ్యక్ష పదవికి పోటీపడతారని భావిస్తున్న సియోల్ మేయర్ ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటూ బలవన్మరణానికి పాల్పడ్డారు. సియోల్ మేయర్ పార్క్ వాన్‌సూన్ మృతదేహాన్ని నగరానికి సమీపంలోని పర్వత ప్రాంతంపై కనుగొన్నారు. మీటూ ఆరోపణలతో వివిధ రంగాల ప్రముఖులపై బాధిత మహిళలు ఆరోపణలు గుప్పిస్తున్న క్రమంలో పార్క్ వాన్‌సూన్ విషాదాంతం చోటుచేసుకుంది. ఆయన అధికార నివాసంలో లభించిన సూసైడ్ నోట్లో ఈ ప్రపంచాన్ని వీడుతున్నందుకు అందరూ తనను క్షమించాలని రాసుకున్నారు. తన దహన సంస్కారాలు నిర్వహించి అస్తికలను తన తల్లితండ్రుల సమాధుల వద్ద చల్లాలని ఆయన కోరారు. తన కుటుంబాన్ని బాధపెట్టినందుకు కుటుంబ సభ్యులు తనను మన్నించాలని పార్క్ వాన్‌సూన్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావించకుండా బై ఎవిరివన్ అంటూ లేఖను ముగించారు. దశాబ్ధ కాలంగా సియోల్ మేయర్‌గా కొనసాగుతున్న పార్క్ దక్షిణ కొరియా రాజకీయాల్లో, పాలక డెమొక్రటిక్ పార్టీలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. గతంలో తన కార్యదర్శిగా పనిచేసిన మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మరుసటి రోజే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా 2015లో పార్క్ వద్ద కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఆయన తనను లైంగిక వేధింపులకు గురిచేశారని పనివేళల్లో అభ్యంతరకరంగా ప్రవర్తించేవారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఆయన అండర్వేర్ ధరించి ఉన్న సెల్ఫీలను తనకు పంపి మెసెంజర్ యాప్‌లో అసభ్యకర కామెంట్లు చేసేవారని ఫిర్యాదు చేశారు. పార్క్ చర్యలతో తనకు విపరీతంగా భయం వేసేదని, సియోల్నగర ప్రజలు, నగర ప్రయోజనాల కోసం వాటిని భరించానని ఆమె పేర్కొన్నారు. మహిళ ఫిర్యాదును ధ్రువీకరించిన పోలీసులు వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. మరోవైపు పార్క్ మరణించడంతో ఆయనకు వ్యతిరేకంగా మహిళ చేసిన ఫిర్యాదులపై విచారణ సైతం ముగిసిపోనుంది. చదవండి : హీరోయిన్ మెటీరియల్ కాదన్నారు -
క్యాస్టింగ్ కౌచ్: రాజీకొస్తే ఇంతకంటే ఎక్కువ ఇస్తా!
ఏడాది క్రితం ఇండియాలో మొదలైన మీటూ ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ ఎంతో మంది మహిళలు ఇంకా ఇలాంటి అమానుషాన్నిఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా తాను ఎదుర్కొన్న ఓ చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు బాలీవుట్ నటి మాన్వీ గాగ్రీ. ధూమ్ మచావో ధూమ్ టెలివిజన్ షోతో కెరీర్ ప్రారంభించిన మాన్వీ.. ట్రిప్లింగ్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వంటి వెబ్ సిరీస్‌లో నటించారు. హిందీ సినిమాలతోపాటు సీరియల్స్‌లోనూ నటించారు. ఇటీవల ఓ వెబ్ సిరీస్‌లో పనిచేయానికి నిర్మాత నుంచి ఆఫర్ వచ్చిందని, ఆ సమయంలో నిర్మాత తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని వెల్లడించారు. అతని నుంచి లైంగిక వేధింపులు ఎదర్కొన్నానని పేర్కొన్నారు. ఇక గతంలోనూ మాన్వీ తను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పిన విషయం తెలిసిందే. ఓ ఆడిషన్‌కు వెళ్లినప్పుడు అత్యాచార సన్నివేశంలో నటించమని అడిగారని, దాంతో బయపడి అక్కడి నుంచి పరుగులు తీశానని ఆమె తెలిపారు. (ఈ మేలు మర్చిపోము: ట్రంప్ ) ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఏడాది క్రితం ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. వెబ్ సిరీస్ చేస్తున్నామని, అందులో నన్ను నటించాలని కోరారు. అలాగే నీ బడ్జెట్ ఎంత అని నన్ను అడిగారు. దానికి నేను.. ఇప్పుడే బడ్జెట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. ముందు మీరు కథ చెప్పండి. నాకు నచ్చితే అన్నింటి గురించి చర్చిద్దామన్నాను. అయినప్పటికీ నా మాటలు పట్టించుకోకుండా.. లేదు మీకు మేము ఇంత బడ్జెట్‌ను ఇవ్వాలనుకుంటున్నామని చెప్పాడు. అయితే అది చాలా తక్కువ అని చెప్పడంతో అతను వెంటనే దాన్ని మూడు రేట్లు పెంచాడు. అంతేకాకుండా నువ్వు కావాలనుకుంటే ఇంతకంటే ఎక్కువ ఇస్తా.. కానీ రాజీపడాలని కోరాడు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (ఇక్కడైతే బతికిపోయేవాడు) ‘ఆ మాటలు విని షాక్ అయ్యాను. కాంప్రమైజ్ అనే మాట దాదాపు 7, 8 సంవత్సరాల తర్వాత విన్నాను. కోపంతో వెంటనే అతని తిట్టడం ప్రారంభించాను. ఫోన్ కట్ చేయి.. నీకు ఎంత ధైర్యం.. నీ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదించాను’ అని మాన్వీ చెప్పుకొచ్చారు. కాగా ఓ వైపు మీటు పేరుతో ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్నా.. ఇంకా ఇలాంటివి ఎలా జరుగుతున్నాయో ఆశ్యర్యంగా ఉందని ఆమె పేర్కొన్నారు. (వేషం ఉంది.. టాప్ తీసెయ్ అన్నాడు -
ఇక్కడైతే బతికిపోయేవాడు
హాలీవుడ్ మూవీ మొఘల్, నిర్మాణ దిగ్గజం హార్వీ వెయిన్‌స్టీన్‌కి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. లైంగిక వేధింపులు, అత్యాచారం చేసిన నేరానికి జైలు పాలయ్యారు హార్వీ. పలువురు నటీమణులను ఇబ్బంది పెట్టిన కారణంగా ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలకు గురయ్యారు. ఆ తర్వాతే ‘మీటూ ఉద్యమం’ ఊపందుకుంది. ఇటీవల జరిగిన కేసు విచారణలో హార్వీకు 23 ఏళ్లు కారాగార శిక్ష విధిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. కోర్టు నిర్ణయంపై పలువురు హాలీవుడ్ హీరోయిన్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హార్వీ వయసు 67 ఏళ్లు. ఇదిలా ఉంటే... ఇండియన్ ఇండస్ట్రీలో ‘మీటూ’ ఉద్యమం బాగా ఊపందుకోవడానికి కారణం బాలీవుడ్లో నటి తనుశ్రీ దత్తా, సౌత్‌లో సింగర్ చిన్మయి. ప్రముఖ రచయిత వైరముత్తుపై ఆరోపణలు చేశారు చిన్మయి. ఇప్పుడు హార్వీకి శిక్ష పడిన విషయాన్ని ఉద్దేశించి ‘‘ఇండియాలో పుట్టి ఉండాల్సింది అని హార్వీ అనుకునే వాడేమో. ముఖ్యంగా తమిళ నాడులో. ఇక్కడ ఉండి ఉంటే పార్టీలు చేసుకునేవాడు. తనకి పొలిటికల్ పార్టీలు సపోర్ట్ చేసుండేవి’’ అని ఇక్కడైతే హార్వీ బతికిపోయేవాడనే అర్థం వచ్చేట్లు చిన్మయి ట్వీట్ చేశారు. -
జైలుకి హార్వీ వెయిన్‌స్టీన్
తమపై లెంగిక వేధింపులు జరిపాడు అంటూ హాలీవుడ్ బడా నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌పై ఆరోపణలు చేశారు పలువురు హాలీవుడ్ నటీమణులు. దాంతో ‘మీటూ’ ఉద్యమం ఊపందుకుంది. తాజాగా హార్వీ వెయిన్‌స్టీన్‌పై వచ్చిన ఆరోపణలు నిజమే అంటూ జ్యూరీ తేల్చింది. పన్నెండు మంది (ఏడుగురు మగవాళ్లు, ఐదుగురు ఆడవాళ్లు) సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ జ్యూరీ ఐదురోజులపాటు సమీక్షించి వెయిన్‌స్టీన్‌పై వచ్చిన ఆరోపణలోని నిజానిజాలు తేల్చారు. ఈ కేసులో వెయిన్‌స్టీన్‌కి ఐదేళ్ల నుంచి 25 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందట. మార్చి 11న వెయిన్‌స్టీన్ జైల్‌కి వెళ్లనున్నారు. అయితే ఆయన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ‘‘వెయిన్‌స్టీన్ గురించి బయటకు వచ్చి మాట్లాడిన వాళ్లకి, ఇన్ని రోజులు ఆ బాధను అనుభవించిన వాళ్లందరికీ ధన్యవాదాలు. మీ ధైర్యం ప్రపంచంలో ఎందరో మహిళలకు పబ్లిక్ సర్వీస్లాంటిది. మరోసారి అందరికీ థ్యాంక్స్’’ అన్నారు నటి ఆఫ్లే జూడ్. వెయిన్‌స్టీన్ గురించి తొలిసారి బాహాటంగా ఆరోపణ చేశారామె. ఆ తర్వాత మిగతావాళ్లు బయటికొచ్చారు. -
రాధారవిపై చిన్మయి ఫైర్..
చెన్నై, పెరంబూరు: నటుడు రాధారవి కుట్ర పన్ని ఎన్నికల్లో గెలిచారని గాయని, డబ్బింగ్ కళాకారిని చిన్మయి విమర్శించారు. డబ్బింగ్ యూనియన్ భవన ని ర్మాణంలో అవక తవకలు జరిగాయని, లక్షల్లో డబ్బును తినేశారని, నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈమె కోలీవుడ్‌లో ఫైర్‌బ్రాండ్‌గా ముద్రవేసుకున్నారనే చెప్పాలి. ప్రముఖ సినీ గీత రచయిత వైరముత్తు, సీనియర్ నటుడు రాధారవి వంటి వారిపై మీటూ ఆరోపణలు చేసి కలకలం సృష్టించారు. వారిని క్షమించేది లేదంటూ అవకాశం కలిగినప్పుడల్లా ఫైర్ అవుతూనే ఉన్నారు. ఆ మధ్య వైరముత్తుకు గౌరవ డాక్టరేట్ బిరుదును ప్రకటించగా దాన్ని తీవ్రంగా ఖండించారు. కాగా నటుడు రాధారవికి చిన్మయికి మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. సౌత్ ఇండియన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న రాధారవి ఆ యూనియన్ నుంచి చిన్మయిని తొలగించారు. ఆమె వార్శిక చందాను చెల్లించని కారణంగానే సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు యూనియన్ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. అయితే తనపై కక్షతోనే రాధారవి తన సభ్యత్వాన్ని రద్దు చేశారని ఆరోపించిన చిన్మయి దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి విజయం సాధించింది. అయినప్పుటికీ ఆమె సభ్యత్వాన్ని ఆమోదించేది లేదంటూ యూనియన్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బుధవారం డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాధారవి అధ్యక్ష పదవికి పోటీ చేయగా ఆయనకు వ్యతిరేకంగా చిన్నయి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆమె నామినేషన్‌ను తిరష్కరించిన ఎన్నికల అధికారి నటుడు రాధారవిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. దీనిపై చిన్మయి ఫైర్ అయ్యారు. ఈమె మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఎన్నికలయినా ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరగాలన్నారు. అలాంటిది తన నామినేషన్‌ను ఎందుకు తిరష్కరించార న్నది వెల్లడించకుండా రాధారవి విజయం సాధించారని ప్రకటించడంలో అతి పెద్ద కుట్ర ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇక్కడ ఓడింది తాను మాత్ర మే అయితే మాట్లాడేదాన్ని కాదని అన్నారు. పలు ఏళ్లుగా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్‌లో సభ్యులు గా ఉన్న వందలాది మంది పారితోషకాలు నుంచి తీసుకున్న 10 శాతం డబ్బుతో యూనియన్ను నిర్వహిస్తున్నారని, ఆ డబ్బుతోనే యూనియన్‌కు భ వనాన్ని కట్టబడిందని చెప్పారు. అయితే రూ. 47.5 లక్షలతో స్థలాన్ని, భవనాన్ని కట్టించి కోట్ల రూపాయలకు పైగా డబ్బింగ్ కళాకారుల డబ్బును స్వాహా చేశారని ఆరోపించారు. ఆ అవినీతిని బయటకు తీయడానికే తాము పోరాడుతున్నామని అన్నారు. అయితే ఎదిరించి మాట్లాడితే హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని, ఫోన్లో దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. అయినప్పటికీ యూనియన్‌లో రాధారవికి వ్యతిరేకంగా 45 శాతం ఓట్లు పోలయ్యాయని చెప్పారు. ఇప్పుడు తానూ వారికి వ్యతిరేకంగా మారడంతో ఓటమి ఖాయం కావడంతో దొడ్డి దారిలో రాధారవి గెలిచినట్లు ఆరోపించారు. ఈ ఎన్నికలను వ్యతిరేకిస్తూ తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చిన్మయి తెలిపారు. -
చిన్మయి నామినేషన్ తిరస్కరణ
పెరంబూరు: దక్షిణ భారత సినీ, టీవీ డబ్బింగ్ కళాకారుల యూనియన్ ఎన్నికలు వివాదానికి తెరలేపాయి. ఈ యూనియన్ ఎన్నికలు బుధవారం చెన్నైలో జరిగాయి. కాగా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి సీనియర్ నటుడు రాధారవి పోటీ చేయగా ఆయనకు వ్యతిరేకంగా గాయని, డబ్బింగ్ కళాకారిణి చిన్మయి పోటీ చేశారు. వీరిద్దరి మద్య చాలా కాలంగా వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. రాధారవిపై చిన్మయి మీటూ ఆరోపణలు గుప్పించారు. దీంతో చందా చెల్లించలేదన్న ఆరోపణలతో ఆమెను యూనియన్ నుంచి తప్పించారు. అయితే ఆమె కోర్టును ఆశ్రయించారు. కోర్టు చిన్మయిని తొలగించడం చట్ట ప్రకారం విరుద్ధం అని తీర్పు నిచ్చింది. అలా చిన్మయి యూనియన్‌లో తన సభ్యత్వాన్ని నిలుపుకున్నారు. కాగా బుధవారం జరిగిన యూనియన్ ఎన్నికల్లో రాధారవికి వ్యతిరేకంగా పోటీ చేసిన చిన్మయి నామినేషన్‌ను ఎన్నికల విదానానికి విరుద్ధంగా ఉందని చెప్పి ఎన్నికల అధికారి తిరష్కరించారు. దీంతో పోటీదారుడైన రాధారవిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.అయితే చిన్మయి నామినేషన్ తిరష్కరణ గురించి ఇప్పటికే చర్చ జరుగుతోంది. దీంతో డబ్బింగ్ యూనియన్ ఎన్నికలు వివాదానికి దారి తీశాయి. కాగా ఈ వ్యవహారంపై స్పందించిన చిన్మయి తన నామినేషన్ తిరష్కరణపైనా, రాధారవి ఏకగ్రీవ ఎంపికపైనా కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. దీని గురించి ఆమె గురువారం మీడియా ముందుకు రానున్నారు. -
చిన్మయి వర్సెస్ రాధా రవి
‘మీటూ’ ఉద్యమం మన దేశంలోనూ ఊపందుకున్నప్పుడు సౌత్ ఇండస్ట్రీల్లో ఎక్కువగా వినిపించిన పేరు చిన్మయి. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చిన్మయి పాపులర్. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్లకు గొంతుగా ఉండే చిన్మయి, ఈ ఉద్యమంలో ఎందరో బాధితులకు గొంతుగా నిలిచారు. ధైర్యంగా నిలబడ్డారు. ‘మీటూ’ ఉద్యమంలో ఆమె ఎదుర్కొన్న లైంగిక వేధింపులను నిర్భయంగా బయటకు చెప్పడమే కాకుండా దాని వెనుక ఉన్నది ప్రముఖ గేయ రచయిత వైరముత్తు అని ఆయన పేరుని బయటపెట్టారు. తమిళ పరిశ్రమలో అది సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తన ట్వీటర్ వేదికగా వైరముత్తు, నటుడు, నిర్మాత రాధారవిపై ఆరోపణలు చేసిన స్త్రీల వివరాలను గోప్యంగా ఉంచి వాళ్ల చేదు సంఘటనలు షేర్ చేస్తూ ఉన్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే చిన్మయి డబ్బింగ్ యూనియన్ సభ్యత్వం రద్దయింది. సభ్యత్వం కొనసాగించకపోవడానికి వార్షికరుసుము చెల్లించకపోవడమే కారణం అని, అందుకే సభ్యత్వాన్ని రద్దు చేశామని యూనియన్ పేర్కొంది. అప్పుడు డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ పదవిలో రాధారవి ఉన్నారు. సభ్యత్వం రద్దు విషయమై చిన్మయి కోర్టుని ఆశ్రయించగా, కోర్టు చిన్మయి వాదనకు అనువుగా ఇంటర్న్ ఆర్డర్ (ఈ కేసు పరిశీలనలో ఉన్నంత కాలం ఆమె డబ్బింగ్ యూనియన్ సభ్యురాలిగానే పరిగణించాలి) మంజూరు చేసింది. ఆ తర్వాత తమిళంలో చిన్మయి డబ్బింగ్ కెరీర్ మందకొడిగా సాగుతోంది. తాజాగా ఈ నెల డబ్బింగ్ యూనియన్ ఎన్నికలు జరగనున్నాయనే ప్రకటన విడుదలైంది. మరోసారి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడానికి రెడీ అయ్యారు రాధారవి. ఆయనకు ప్రత్యర్థిగా, రామరాజ్యం పార్టీ తరపున ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేశారు చిన్మయి. విశేషం ఏంటంటే సభ్యత్వం రద్దు చేసినప్పుడే డబ్బింగ్ యూనియన్ ఓటర్ల జాబితాలో నుంచి చిన్మయి పేరును తొలగించారు. ‘సభ్యులు కానివారు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారు?’ అని ఒక వర్గం వారు చిన్మయిని విమర్శించారు. ‘‘కోర్టు మంజూరు చేసిన ఆర్డర్లో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు నాకుంది’’ అని పేర్కొన్నారు చిన్మయి. ప్రస్తుతం చిన్మయి నామినేషన్ పత్రాలు పరిశీలనలో ఉన్నాయి. ఫిబ్రవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. మరి ఎలాంటి నాటకీయత చోటు చేసుకుంటుంది? చిన్మయి వర్సెస్ రాధారవి.. గెలుపు ఎవరిది? అని తమిళ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
ఇన్‌స్ట్రాగామ్‌లో నటికి అసభ్య ఎస్ఎంఎస్లు
సినిమా: నిన్నటి వరకు మీటూ వేధింపులంటూ నార్త్, సౌత్ అని తేడా లేకుండా చిత్ర పరిశ్రమలో వాతావరణం వేడెక్కింది. అది కాస్త చల్లారిందనుకుంటున్న సమయంలో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో నటీమణులకు వేధింపుల బెడద తలెత్తుతోంది. నిజానికి ఈ తరహా వేధింపులు చాలా కాలం నుంచే తలెత్తుతున్నాయి. అయితే కోలీవుడ్‌లో ప్రముఖ కథానాయికలకు ఇలాంటివి అరుదే. తాజాగా నటి నందిత శ్వేత అసభ్య ఎస్ఎంఎస్ బెడదను ఎదుర్కొంంటోంది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. తమిళంలో అట్టకత్తి చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన నందితాశ్వేత ఇక్కడ ఇదర్కు దానే, ఆశైపడ్డాయ్ బాలకుమారా తదితర చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. అంతే కాదు తెలుగు, కన్నడం భాషల్లోనూ నటిస్తూ దక్షిణాది హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. కాగా ఈ చిన్నది చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో తన చిత్రాల వివరాలను, విశేషాలను పంచుకుంటుంది. అలా నందితాశ్వేతను ఇన్‌స్ట్రాగామ్‌లో చాలా మంది అభిమానులు ఫాలో అవుతున్నారు. అలా ఫాలో అయిన వారిలో వాంజి సెలియన్ అనే యువకుడు అసభ్య ఎస్ఎంఎస్లతో వేధింపులకు గురి చేస్తున్నాడట. దీని గురించి నందితాశ్వేత స్పందిస్తూ.. ఆ వ్యక్తి అసభ్య ఎస్ఎంఎస్లతో తనను వేధింపులకు గురి చేస్తున్నాడని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొంది. ఇలాంటి వారికి కుటుంబం అంటూ ఉండదా? ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి అని వాపోయింది. అయితే ఈ వ్యవహారంలో పోలీస్‌లకు ఫిర్యాదు చేసే ఆలోచన తనకు లేదని చెప్పికొచ్చింది. ఈ వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసి మరింత రచ్చ చేయడం నందితాశ్వేతకు ఇష్టం లేనట్టుంది. సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వ్యవహారం ఇంతటితో సద్దుమణిగితే ఫర్వాలేదు. లేకుంటే పోలీసుల వరకూ వెళ్లే అవకాశం ఉంటుంది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో తానా చిత్రంలోనూ.. తెలుగులో అక్షర, ఐపీసీ 376 చిత్రాల్లోనూ నటిస్తోంది. వీటితో పాటు కన్నడంలో మైనేమ్ ఈజ్ కిరాతక అనే చిత్రంలోనూ నటిస్తోంది. -
వేషం ఉంది.. టాప్ తీసెయ్ అన్నాడు
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్త్రీలు పని చేసే వాతావరణంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా పోరాటం ఆగదు అంటున్నారు టెలివిజన్ స్టార్ మల్హర్ రాథోడ్. ఢిల్లీకి చెందిన ఈ నటి కొన్ని చేదు అనుభవాల తర్వాత ముంబై నుంచి తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. ‘శక్తిని పుంజుకుంటాను... తిరిగి పోరాడతాను’ అంటున్నారామె. ‘హోస్టేజెస్’ (2019) వెబ్ సిరీస్‌లోనూ, ‘తేరే లియే బ్రో’ (2017) టీవీ సిరీస్‌లోనూ నటించిన మల్హర్ రాథోడ్ బాలీవుడ్లో ఒక నటిగా, మోడల్‌గా ఎదుర్కొనాల్సిన సవాళ్లన్నీ ఎదుర్కొన్నారు. స్త్రీలకు ఆత్మరక్షణ తెలిసి ఉండాలని చెప్పే ఈ నటి ప్రస్తుతం కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్నారు. ‘స్త్రీలు పోరాటం చేయాలి. అందుకు సన్నద్ధం కూడా అయి ఉండాలి’ అని ఆమె అంటారు. మల్హార్ రాథోడ్ అందరు వర్థమాననటులకు మల్లే తానూ బాలీవుడ్లో కష్టాలు పడ్డారు. ‘నటించాలనే నా కోరికను నా కుటుంబం కాదనలేదు. కాని ముంబైలో నాకు ఎదురయ్యే సవాళ్లు వాళ్ల నుంచి దాచాలంటే కష్టంగా ఉండేది’ అని ఆమె అంది. ‘ఒక నిర్మాత.. అతని వయసు 65 సంవత్సరాలు ఉంటాయి. సినిమాలో వేషం ఉందని ఆఫీసుకు పిలిపించాడు. నీకు వేషం ఉంది... ఒకసారి ఆ టాప్ తీసెయ్ అన్నాడు. నేను షాక్ అయ్యాను. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు. మెల్లగా అక్కడి నుంచి వచ్చేశాను. దీని నుంచి బయటపడటానికి చాలా రోజులు పట్టింది’ అని ఆమె ముంబైలో ఇటీవల ఏ.ఎఫ్.పి వార్తా సంస్థకు తెలియచేసింది. ‘బాలీవుడ్లో ఎవరైనా పని లేకపోవడం అనే కష్టాన్ని అనుభవిస్తారు. నెలల తరబడి పని దొరకదు. ఆడవాళ్లకు సెక్సువల్ హరాస్మెంట్స్ అదనం. అదృష్టవశాత్తు మీటు ఉద్యమం రావడం వల్ల కొంత చైతన్యం వచ్చింది. హాలీవుడ్లో బాలీవుడ్లో కొందరి బండారం బట్టబయలైంది. ఆ ఉద్యమం రాకపోయి ఉంటే జరిగేది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో ఇలాంటి విషయాల పట్ల బహిరంగంగా బయట మాట్లాడరు. కాని తప్పక మాట్లాడాలని నేను అంటాను’ అందామె. కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్న మల్హర్ రాథోడ్ ‘మా కుటుంబానికి వ్యాపారాలు ఉన్నాయి. వాళ్లు నన్ను తమ వ్యాపారాలు చూసుకుంటే చాలని అనుకుంటున్నారు. బాలీవుడ్లో స్ట్రగుల్ అవుతూ ఉండటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కాని మన కలలు నెరవేర్చుకోవడానికి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. నేను కొంత కాలం కోసం ఢిల్లీ వచ్చేశాను. మానసికంగా, శారీరకంగా మరింత దృఢమయ్యి తిరిగి ముంబై వెళతాను. అనుకున్నది సాధిస్తాను’ అందామె. మల్హార్ రాథోడ్ పాములు తిరిగే దారిలో కర్ర పట్టుకొని నడవాల్సిన అవసరాన్ని చెబుతున్నారు. పాములుంటాయని ఆ దారిలోనే వెళ్లడం మానేస్తే మణులు మన చేత చిక్కవు అని కూడా ఆ మాటలకు అర్థం. పోరాటం కొనసాగించే వారే విజయానికి చేరువవుతారు. లక్ష్యం చేరుకుంటారు. -
యావద్దేశానికీ... ఒక ‘దిశ’
ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన పురుషులను చీల్చి చెండాడిన ‘మీటూ’ ఉద్యమం ఈ ఏడాది మహి ళలకు కొత్త శక్తినిచ్చింది. ఈ చైతన్యమే మహిళా ఉద్యమంలో 2019ని మైలురాయిగా నిలిపింది. అక్రమాలపై, అత్యాచారాలపై నిర్భ యంగా గళమెత్తేలా చేసింది. మరోవంక ఇన్ని జరిగినా మృగాళ్లు మాత్రం చెలరేగిపోతూనే వచ్చారు. యావద్దేశానికీ... ఒక ‘దిశ’ నవంబర్ 27, 2019న తెలంగాణలోని శంషాబాద్ టోల్‌ప్లాజా దగ్గర వెటర్నరీ వైద్యురాలిని నలుగురు యువకులు దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన యావద్దేశాన్నీ అట్టుడికించింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ దుర్మార్గులను తక్షణం ఉరితీయాలంటూ ప్రాంతాలకతీతంగా యావ ద్దేశం ఒక్కటైంది. ఆ తరువాత ఈ దారుణానికి పాల్పడిన నలుగురు యువకులను పోలీసులు ఎదురు కాల్పుల్లో కాల్చి చంపడం వేగంగా జరిగిపోయింది. యువతుల్లో, మహిళల్లో చైతన్యాన్ని నింపే అనేక కార్యక్రమాలకు ఈ ఘటన దారితీసింది. ‘దిశ’పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని కూడా తెచ్చింది. అత్యాచార బాధితురాలిని కాల్చేశారు ఉత్తరప్రదేశ్‌లోని ‘ఉన్నావ్’లో తనపై అత్యాచా రానికి పాల్పడిన వారిని శిక్షించాలంటూ కోర్టుకెళ్లిన ఓ మహిళ... వారి దౌర్జన్యానికి బలైపోయింది. ఐదుగురు నిందితుల్లో బెయిల్‌పై వచ్చిన ఇద్దరి తోపాటు మరో ముగ్గురు బాధితురాలిని సజీవ దహనం చేసే యత్నం చేశారు. అగ్ని కీలల్లో దగ్ధమ వుతూనే ఆసరా కోసం చుట్టుపక్కల జనాన్ని ప్రా«థేయపడిన బాధితురాలు... చివరకు పోలీసు లకు స్వయంగా ఫోన్ చేసి సాయం కోరడం అందర్నీ కలచి వేసింది. ఈ కేసులో నిందితుడు శుభం త్రివేదీ ఆమెను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి, తన సోదరుడితో కలసి ఆమెపై 2018లో అత్యాచారానికి పాల్పడ్డాడు. బా«ధితు రాలు తన మరణ వాంగ్మూలంలో ఇదే చెప్పింది. చివరికామె ఆసుపత్రిలో కన్నుమూసింది. -
సెలవులు వస్తాయనీ అమ్మాయిలకు సైట్ కొట్టవచ్చని..
చెన్నై, పెరంబూరు: గాయనీ, డబ్బింగ్ కళాకారిణి చిన్మయి మరోసారి వార్తల్లోకొచ్చారు. ఈమె మీటూ వ్యవహారంలో ప్రముఖ గీతరచయిత వైరముత్తు, సీనియర్ నటుడు రాధారవి వంటి వారిపై తీవ్ర విమర్శలు చేసి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. కాగా తాజాగా మరో సీనియర్ నటుడు వైజీ.మహేంద్రన్‌పై ఫైర్ అయ్యారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లుపై భిన్న స్వరాలు వినిపిస్తున్న విషయం, ప్రతి ప్రతి పక్ష పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు వైజీ.మహేంద్రన్ ఆదివారం చెన్నైలోని ఒక కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన యువత గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోరాట కార్యక్రమాల్లో విద్యార్ధులు కళాశాలలకు సెలవులు వస్తాయనీ, ఆందోళన కార్యక్రమంలో అరెస్ట్ అయ్యి వ్యానులో కూర్చుని అమ్మాయిలకు సైట్ కొట్టవచ్చని పాల్గొంటున్నారనీ వ్యాఖ్యానించారు. ఈయన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. పలువురు విమర్శలు చేస్తున్నారు. కాగా వైజీ.మహేంద్రన్ వ్యాఖ్యలపై గాయనీ చిన్మయి స్పందిస్తూ ఫైర్ అయ్యారు. ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ వైజీ.మహేంద్రన్ లాంటి వ్యక్తుల వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవాలసిన అవసరం లేదని అన్నారు. వారు అంతేననీ, మారరనీ చిన్మయి పేర్కొన్నారు. -
నిలిచి గెలిచారు
ఇండియాలో ‘మీటూ’ ఉద్యమం మొదలై ఏడాది అయింది. ఈ ఏడాది కాలంలో.. బయటికి వచ్చి పోరాడిన సెలబ్రిటీ బాధిత మహిళలకు దక్కింది ఏమీ లేకపోగా పోగొట్టుకున్నదే ఎక్కువ అనే భావన ‘మీటూ’ ను సమర్థించేవాళ్లలో సైతం నెలకొని ఉంది. మన దగ్గర రీతుపర్ణ చటర్జీ, సోనా మహాపాత్ర, వినితా నందా, చిన్మయి శ్రీపాద.. ప్రధానంగా ఫైట్ చేసిన మీటూ మహిళలు. ఏడాది క్రితం వరకు ప్రొఫెషన్ పరంగా వీళ్లెంత సౌఖ్యంగా ఉన్నారో.. ఇప్పుడంత అసౌకర్యంగా, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఈ నలుగురిలో ఒక్కరు కూడా ఆ మాటను ఒప్పుకోవడం లేదు. ‘‘పర్సనల్‌గా మేమెంతో నష్టపోయి ఉండొచ్చు. కానీ ఒక పర్సన్‌గా మీటూ మమ్మల్ని నిలబెట్టింది’’ అంటున్నారు. ప్రఖ్యాత జర్నలిస్టు రీతుపర్ణా చటర్జీ తనకొక ఉద్యోగం కావాలని ఇటీవల తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టారు! అదింకా అలాగే ఉంది. అంటే ఆమె ఇంకా నిరుద్యోగిగానే ఉన్నారు. ఒక జాతీయ పత్రికకు పదిహేనేళ్లు ఎడిటర్‌గా పనిచేసిన సీనియర్ పాత్రికేయురాలు ఉద్యోగాల వేటలో ఉండటం ఏమిటి?! ఇదే ప్రశ్న రీతు కూడా తనకు తను వేసుకున్నారు. అసలిలా ట్విట్టర్లో పెట్టడం కాన్ఫిడెన్స్ లోపించడం అవదా అని తన మనసుతో తను ఇరవై నాలుగు గంటలపాటు చర్చ కూడా పెట్టుకున్నారు. అయినా తప్పలేదు. నిజంగానే ఆమెకు ఇప్పుడొక ఉద్యోగం అవసరం. ‘మీటూ’ ఉద్యమంలో గత ఏడాదిగా చురుగ్గా ఉంటున్నారు రీతు. అందుకు దక్కిన ‘ప్రతిఫలమే’.. ఉద్యోగం కోసం తనకై తాను ఒక ప్రకటనను ఇచ్చుకోవలసిన పరిస్థితి తలెత్తడం! ఆమె రెజ్యుమె గొప్పదిగా ఉండొచ్చు. కానీ ఆమె ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా, ఆ రెజ్యుమె కంటే ముందు ఆమె మీటూ చరిత్ర కంపెనీల యాజమాన్యాలకు చేరుతోంది. ‘ఓ.. ఆవిడా!! వీరనారి. ఆవిడకు ఉద్యోగం ఎందుకు?’’ అనే వెక్కిరింపు వారి నుంచి వస్తోంది. మీటూ బాధితులకు రీతు దగ్గరుండి మరీ సహాయాలు చేశారు. పోలిస్ కంప్లయింట్ ఎలా రాయాలో తెలియకపోతే తనే రాసి ఇచ్చారు. కొన్ని కేసులలో తనే స్వయంగా జాతీయ మహిళా కమిషన్‌ను కూడా సంప్రదించారు. ఇవన్నీ ఊరికే పోలేదు. ఉద్యోగాలిచ్చేవాళ్లు గుర్తుపెట్టుకున్నారు! బాధిత మహిళలంతా ఏకం కావడమే ఒక ఉద్యమం. ఒకే అంశం మీద ఏకం అవడం ఉద్యమం కన్నా పెద్ద విషయం. విప్లవం అనొచ్చు దీనిని. ఇవాళ ప్రతి ఖండంలో, ప్రతి దేశంలో ‘మీటూ’ మహిళలు ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. ‘‘బయటికొచ్చి చెప్పుకున్నావుగా! ఏ ఒరిగింది నీకు’’ అనే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. తప్పుడు పని చేసిన వ్యక్తిని బయటపెట్టాను. అది విజయం సాధించడం కాదా?! నా తరఫున ఎవరూ లేకున్నా.. నాలాంటి బాధితుల తరఫున నేను ఉంటాను. జర్నలిస్టుగా ఎంత సంతృప్తిగా జీవించానో.. జర్నలిజానికి దూరమైనప్పటికీ మీటూ కార్యకర్తగా అంతే సంతృప్తిగా, గౌరవంగా జీవిస్తున్నాను. – రీతుపర్ణా చటర్జీ గత ఏడాది అక్టోబర్‌లో ఒక చిన్న ట్వీట్.. దేశంలో ‘మీటూ’ను రాజేసింది. గాయని సోనా మహాపాత్ర చేసిన ట్వీట్ అది. సహ గాయకుడు అను మాలిక్ తన భర్త రామ్ సంపత్ ఎదుటే తనను లైంగికంగా కించపరుస్తూ మాట్లాడాడని సోనా ఆ ట్వీట్లో ఆవేదన వ్యక్తం చేశారు. అను మాలిక్ ‘ఇండియన్ ఐడల్’ జడ్జి కూడా. వేళకాని వేళలలో సోనాకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడేవారట ఆయన. కైలాష్ ఖేర్ కూడా తనతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఇంకో ట్వీట్లో సోనా బహిర్గతం చేశారు.అలా ఆమె ‘మీటూ’ ఉద్యమ ప్రయాణం మొదలైంది. ఆర్థికంగా ఆమె చితికిపోడానికి కూడా ఆ ట్వీటే నాంది పలికింది. ఏడాదిగా సోనాకు అవకాశాల్లేవు! ప్రొఫెషన్లో ఒక్కక్కొరుగా ఆమెకు దూరం అవుతున్నారు. భర్త, కుటుంబ సభ్యులు.. వీరు మాత్రమేకు ఆమె అండగా ఉన్నారు. నాకు జరిగిన దానిని ఒక ఉద్యమ నాయికగా నేను బయట పెట్టలేదు. ఒక బాధితురాలిగా మాత్రమే చెప్పుకున్నాను. ఒకసారి మనం నోరు విప్పామా.. మిగతా బాధితులకూ ధైర్యం వస్తుంది. ‘‘అక్కా మాక్కూడా ఇలా జరిగింది’’ అని చెప్పుకున్నవారు ఉన్నారు. నేటికీ నాతో చెప్పుకోడానికి వస్తున్నవారూ ఉన్నారు. బాధితులందరి పేర్లు, ఫోన్ నంబర్లతో ఒక నెట్వర్క్ ఏర్పాటు అయింది.ఎవరైనా బెదిరించినా, చట్టం ప్రకారం చేయవలసిన సహాయాన్ని చేయడానికి అధికారులు నిరాకరించినా.. వెంటనే ఆ సంగతి మా అందరికీ తెలుస్తుంది. దానిపై ఉద్యమిస్తాం. సమాజంలో మార్పు తెచ్చే ప్రయత్నంలో మనం కొంత కోల్పోవలసి వస్తుంది. అది ఉద్యోగం అయినా, ఉపాధి అయినా. అప్పుడే మరింత ఆత్మ స్థయిర్యంతో ముందుకు సాగాలి. – సోనా మహాపాత్ర మీటూ ఉద్యమంలో బయటకు వచ్చిన మరో గళం వినీతా నందా. ఆమె బాలీవుడ్ సినిమా రచయిత, నిర్మాత. అలోక్ నాథ్ అనే బాలీవుడ్ నటుడు తనను 19 ఏళ్ల కిందట రేప్ చేశాడని అతడి మీద పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. అలోక్‌నాథ్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పటికీ ముంబయి సెషన్స్ కోర్ట్ అతడికి ఈ ఏడాది జనవరిలో యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. అలోక్‌కు బెయిల్ ఇవ్వడాన్ని న్యాయస్థానం సమర్థించుకుంటూ ‘‘వినీత తన స్వప్రయోజనాలను ఆశించి, నేరం జరిగిన వెంటనే కంప్లయింట్ చేయలేదు’’ అని పేర్కొంది. ఇలాంటి పరిస్థితులు ఉన్న సమాజంలో పోరాడడం అంటే సమయాన్ని వృథా చేసుకోవడమేననే అభిప్రాయానికి వచ్చింది వినితా నందా. ఈ పోరాటంలో సాధించింది ఏమీ కనిపించకపోగా చేతిలో ఉన్న రెండు వెబ్ సిరీస్ ప్రాజెక్టులు వెనక్కి పోయాయి. నేను మౌనంగా ఉంటే అంతా సవ్యంగా సాగిపోయేది. అయితే మన జీవితంలో మన ప్రమేయం లేకుండా అపసవ్యత ఏర్పడినప్పుడు దాని గురించి మాట్లాడకుండా ఉండలేం. మాట్లాడి సాధించేది కూడా ఏమీ లేకపోవచ్చు. కోర్టు తీర్పు మనకు వ్యతిరేకంగా రావచ్చు. మన విలువలు అవహేళనకు గురి కావచ్చు. కానీ ‘మనం నిలబడ్డాం.. నిలదీశాం’ అనే ఆలోచన మనపై మన గౌరవాన్ని పెంచుతుంది. మనల్ని మరికొందరు అనుసరించేలా చేస్తుంది. న్యాయం దక్కటం, దక్కకపోవటం అనే వాటిని మనం ఫలితాలుగా చూడకూడదు. పరిణామాలుగా పరిగణించాలి. సమాజం పూర్తిగా మారినప్పుడే అది ఫలితం అవుతుంది. ఆ ఫలితానికి పరిణామం ఒక మెట్టు మాత్రమే. – వినీతా నందా దక్షిణాదిలో మరో మీటూ బాధితురాలు చిన్మయి శ్రీపాద. ఆమె మంచి గాయని. ఆమె 2018 అక్టోబర్ నెలలో తన స్టోరీని ట్వీట్ చేసింది. అందులో ఆమెను లైంగికంగా వేధించిన వైరముత్తు తెరమీదకొచ్చాడు. వైరముత్తు తమిళంలో ప్రఖ్యాత పాటల రచయిత. పద్మశ్రీ, పద్మభూషణ్, సాహిత్య అకాడమీ అవార్డులు... మొత్తం ఏడు జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నాడు. అతడిని తమిళ జాతి గర్వకారణంగా గుర్తిస్తోంది ఆ రాష్ట్రం. అతడి మీద లైంగిక ఆరోపణలు రావడంతో రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడింది. చిన్మయి తనకు జరిగిన అన్యాయం గురించి మాత్రమే మాట్లాడి ఊరుకోలేదు. ‘మాకూ ఇలాగే జరిగింది’ అంటూ ముందుకొచ్చిన మహిళల గళం కూడా తానే అయింది. ఇలా మీటూలో ఎంతమంది మహిళలు గొంతు విప్పినప్పటికీ తమిళ సమాజం వైరముత్తును తప్పుపట్టడానికి ఇష్టపడలేదు. అతడిలోని గురివిందను చూడడానికి ఇష్టపడ లేదు. పైగా వైరముత్తు అభిమానులు చిన్మయిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. చిన్మయి మాత్రం తన పోరాటాన్ని ఆపలేదు. సోషల్ మీడియా వేదికగా కొనసాగిస్తోంది. నాకిప్పుడు కోపం లేదు. అసహనం లేదు. అసంతృప్తి లేదు. రకరకాల మనస్తత్వాల వాళ్ల మధ్య ఉన్నప్పుడు మన ఆవేదనకు ఒక్కొక్కరు ఒక్కో అర్థం చెబుతారు. మనం ఎవరి మీదనైతే ఫిర్యాదు చేశామో వారిని అభిమానించే వారు మన ఆవేదనకు చెప్పే నిర్వచనం మనసుకు బాధ కలిగించేలా ఉంటుంది. అయితే ఆ దశను నేను ఎప్పుడో దాటిపోయాను. మీటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లావని కొందరు ప్రశంసిస్తుంటారు. ఉద్యమమైనా, సంఘర్షణ అయినా ముందుకు వెళ్లేటప్పుడు అంతే వేగంతో మనల్ని వెనక్కు నెట్టే శక్తులు ఉంటాయి. వాటికి తట్టుకుని నిలబడటమే ముందుకు వెళ్లడం అంటాను. – – చిన్మయి శ్రీపాద -
మీటు అన్నాక సినిమాలు రాలేదు
యశవంతపుర: తనపై జరిగిన లైంగిక వేధింపులపై మీ టూ ద్వారా బహిరంగం చేసినందుకు గర్వంగా ఉందని నటి శ్రుతి హరిహరన్ చెప్పారు. ఆదివారం బెంగళూరులో జరిగిన ఒక చర్చాగోష్టిలో ఆమె మాట్లాడారు. మీ టు అనడంలో సిగ్గుపడవలసిన పని లేదు. న్యాయపరంగా నా పోరాటం కొనసాగుతోంది. మీ టూ గురించి మాట్లాడినప్పటి నుంచి నాకు సినిమా అవకాశాలు తగ్గాయి. అప్పటి నుంచిఒక్క సినిమా అవకాశం రాలేదు. దీనిపై చింతించబోను. ఏడాది నుంచి భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నా. ఈ సారి జాతీయ చలనచిత్ర అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది. ఇలాగైనా మళ్లీ నటించే చాన్స్ వస్తుందని ఆశిస్తున్నా. మీటూ వంటి విషయాలకు ఎలాంటి సాక్ష్యాలుండవు. కేసును దైర్యంగా ఎదుర్కోవాలి. నాకు జరిగిన అనుభవం మీకు కూడా జరక్కుండా ఉండాలంటే చూస్తూ కూర్చోకండి అని చెప్పారు. -
అతడు క్రూర జంతువు.. నీచుడు: నేహా
దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రకంపనలు సృష్టించిన ‘మీటూ ఉద్యమం’ మరోసారి తెరపైకి వచ్చింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అను మాలిక్... పాటల కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా రావడమే ఇందుకు కారణం. పని ప్రదేశాల్లో మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాల గురించి బట్టబయలు చేస్తూ హాలీవుడ్లో మొదలైన మీటూ ఉద్యమం.. భారత్‌లోనూ క్రమంగా వ్యాపించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా.. విలక్షణ నటుడు నానా పటేకర్‌పై చేసిన లైంగిక ఆరోపణలతో ఉధృతమైన ఈ ఉద్యమం సినిమా, క్రీడలు, జర్నలిజం ఇలా ప్రతీ రంగంలో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్న ఎంతో మంది మృగాళ్ల నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. ఇందులో భాగంగా ప్రముఖ గాయనీమణులు శ్వేతా పండిట్, సోనా మహాపాత్ర అను మాలిక్ తమ పట్ల ప్రవర్తించిన తీరును ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ నేపథ్యంలో తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అను మాలిక్‌ను ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం నుంచి నిర్వాహకులు తొలగించారు. అయితే సెప్టెంబరులో మళ్లీ అతడిని న్యాయ నిర్ణేతగా తీసుకురావడం పట్ల ప్రముఖ గాయని నేహా బాసిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్పీ రేట్ల కోసం అతడిని మళ్లీ తీసుకువచ్చామంటూ నిర్వాహకులు తనతో చెప్పారని.. ఇది సరికాదంటూ మరోసారి గళమెత్తిన సోనాకు ఆమె అండగా నిలిచారు. ‘నేను నీతో ఏకీభవిస్తున్నాను. లింగవివక్ష కలిగిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. అందులో అను మాలిక్ ఒక దిగజారుడు వ్యక్తి. 21 ఏళ్ల వయస్సులో నేను కూడా అతడి అసహజ చర్యల నుంచి తప్పించుకుని పారిపోయాను. ఓ రోజు స్టూడియోకు వెళ్లిన సమయంలో సోఫా మీద పడుకుని ఎదురుగా నన్ను కూర్చోమంటూ నా కళ్ల గురించి వర్ణించడం మొదలుపెట్టాడు. అయితే నేను మాత్రం వెంటనే విషయాన్ని పసిగట్టి కింద అమ్మ ఎదురుచూస్తోంది అని అబద్ధం చెప్పి అతడి నుంచి తప్పించుకున్నాను. ఆ తర్వాత కూడా అతడు నాకు మెసేజ్‌లు, కాల్స్ చేసి విసిగించేవాడు. కానీ నేను మాత్రం వాటికి స్పందించకుండా మిన్నకుండిపోయాను. అతడు ఒక క్రూర జంతువు’ అని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా నేహా చేసిన వ్యాఖ్యలకు పలువురు నెటిజన్లు మద్దతు పలుకుతున్నారు. అను మాలిక్‌ను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాగా జాగ్ ఘూమియా వంటి హిట్‌సాంగ్స్‌తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నేహా.. తెలుగులోనూ అటు నువ్వే ఇటు నువ్వే(కరెంట్), నిహారికా నిహారికా(ఊసరవెళ్లి), స్వింగ్ జరా(జై లవ కుశ) తదితర పాటలు పాడి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. I agee with you. We do live in a very sexist world. Anu Malik is a predetor, i too have run away from his strange moves when i was 21. I didn't let myself get into a sticky situation beyond him lying on a sofa in front of me talking about my eyes in a studio. I fleed lying https://t.co/tQgStLrYyT — Neha Bhasin (@nehabhasin4u) October 30, 2019 -
మీటూ మార్పు తెచ్చింది
‘‘మీటూ’ ఉద్యమం జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఒక నటిగా, స్త్రీగా నా అభిప్రాయమేంటంటే.. ఈ ఉద్యమాన్ని తేలికగా తీసుకోకూడదు. ‘మీటూ’ వల్ల చిత్ర పరిశ్రమలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమైనది కూడా. బయటకు వచ్చి ఈ విషయాలను చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. బాధితులందరి ధైర్యాన్ని అభినందిస్తున్నాను’’ అని ‘మీటూ’ మూమెంట్ గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు పూజా హెగ్డే. ప్రస్తుతం ‘హౌస్‌ఫుల్ 4’ ప్రమోషన్లో ఫుల్ బిజీగా ఉన్నారు పూజా. అక్షయ్‌కుమార్, సన్నీ డియోల్, పూజా హెగ్డే, రానా, కృతీ సనన్, కృతీ కర్భందా ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ఇది. ముందుగా ఈ చిత్రానికి సాజిద్ ఖాన్ దర్శకుడు. దాదాపు 70 శాతం సినిమాని కూడా పూర్తి చేశారు. అయితే ‘హౌస్‌ఫుల్ 4’ చిత్రీకరణలో ఉండగానే, ఆయన మీద ‘మీటూ’ ఆరోపణలు రావడంతో దర్శకుడిగా తప్పించారు. ఆ విషయం గురించి పూజా మాట్లాడుతూ – ‘‘సినిమా జరుగుతున్న సమయంలో దర్శకుడిని తప్పించడమంటే సినిమాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ నిర్మాణ సంస్థ ఆ ఇబ్బంది ఏం తెలియనివ్వలేదు. ఈ చిత్ర కథా రచయిత ఫర్హాద్ సమ్‌జీను దర్శకుడిగా నియమించింది’’ అని పేర్కొన్నారు. -
మీటూ ఫిర్యాదులతో అవకాశాలు కట్
సినిమా: మీటూతో అవకాశాలు బంద్ అని నటి తమన్నా పేర్కొంది. మీటూ అనేది ముందుగా హాలీవుడ్లో మొదలై, ఆ తరువాత మన దేశంలో వ్యాపించింది. అదీ బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించి ఆపై దక్షిణాదిలో కలకలానికి దారి తీసింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో మీటూ చాలా ఎఫెక్ట్ చూపించిందనే చెప్పాలి. ఇక్కడ సినీ ప్రముఖులను బయటకు ఈడ్చిందని చెప్పవచ్చు. ప్రఖ్యాత గీత రచయిత వైరముత్తుపై ప్రముఖ యువ గాయని, డబ్బింగ్ కళాకారిణి చిన్మయి చేసిన మీటూ ఆరోపణలు పెద్ద దుమారాన్నేలేపాయి. ఇక నటుడు, దర్శకుడు, నృత్యదర్శకుడు రాఘవ లారెన్స్, దర్శకుడు సుశీగణేశ్, సీనియర్ నటుడు రాధారవి వంటి వారికి మీటూ ఆరోపణలు వదలలేదు. సంచలన నటి వరలక్ష్మీశరత్‌కుమార్ లాంటి వారు కూడా మీటూ సమస్యలను ఎదుర్కొన్నట్లు బహిరంగంగానే వెల్లడించారు. అయితే ఈ వ్యవహారం సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో నటి తమన్నా మూలంగా మరోసారి చర్చకు వచ్చింది. ఇటీవల వరుస సక్సెస్‌లతో జోరు మీదున్న తమన్నా ఒక ఆంగ్ల పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో మీటూ ప్రస్తావన వచ్చింది. దీనికి ఈ మిల్కీబ్యూటీ బదులిస్తూ సహజసిద్ధంగా పని చేసుకుంటూ పోయే తనకు ఇంత వరకూ మీటూ సమస్య ఎదురవలేదని చెప్పింది. తాను ఎలా ప్రవర్తించాలో తనకు తెలుసు అని అంది. లైంగికపరమైన ఒత్తిడి రాకపోవడం తన అదృష్టం కూడా కావచ్చునని పేర్కొంది. అయితే అత్యాచార ఒత్తిళ్లు ఎదుర్కొన్న మహిళలు వాటి గురించి ధైర్యంగా మాట్లాడడం మంచిదేనంది. అయితే అలాంటి వారికి అవకాశాలు రాకపోవడం బాధగా ఉందని పేర్కొంది. ఏదైనా ఒక విషయం మిమ్మల్ని బాధిస్తోందని భావిస్తే దాన్ని ఎదిరించిపోరాడాలని అంది. అలా తాను కూర్చుని చింతించే అమ్మాయిని కాదని చెప్పింది. తాను ఇంతకాలం నటిగా నిలబడడానికి కారణం తాను అనుకున్నది చేయగలగడమేనని చెప్పింది. పలు శక్తివంతమైన, ఆత్మస్థైర్యంతో సాధిస్తున్న మహిళలు ఇప్పుడు ఉన్నారని తమన్నా అంది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో విశాల్‌తో నటించిన యాక్షన్ చిత్రం వచ్చే నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. -
ఆ హీరో నా స్కర్ట్ లో చేయి పెట్టాడు
మీటు’ ఉద్యమం వెలుగులోకొచ్చాక ఇండస్ట్రీలో చాలా మంది తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడి, ఈ సంస్కృతిని నివారించే ప్రయత్నం చేస్తున్నారు. హాలీవుడ్లో మొదలైన ఈ ఉద్యమం ఇండియన్ ఇండస్ట్రీ వరకూ విస్తరించింది. ఈ ఉద్యమం వచ్చాక వేదింపులు తగ్గినప్పటీకి ఇంకా బరితెగించి ప్రవర్తిస్తూనే ఉన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి కొంతవరకు బాగానే ఉందని అంటున్నారు బ్రిటిష్ నటి నవోమి హారీస్. తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న భయంకర పరిస్థితి గురించి నవోమి ఇప్పుడు బయట పెట్టింది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు సినీ కెరీర్ ప్రారంభించాను. పలు చోట్ల ఆడిషన్స్‌కు వెళ్లాను. ఒక రోజు ఓ స్టార్ హీరో సినిమా కోసం ఆడిషన్స్‌కు వెళ్లాను. అక్కడ కాస్టింగ్ డైరెక్టర్, సినిమా దర్శకుడు, ఆ స్టార్ హీరో ఉన్నాడు. ఆడిషన్స్ కోసం నన్ను పిలిచి అసభ్యంగా ప్రవర్తించారు. ఆ హీరో నా స్కర్ట్ లోకి చేయి పెట్టి అసభ్యకరంగా టచ్ చేశాడు. అప్పుడు నేను భయంతో వణికి పోయాను. అతను అలా చేస్తుంటే అక్కడే ఉన్న దర్శకుడు, ప్రొడక్ష్లన్ వారు ఏమి అనలేదు. అలాగే చూస్తూ ఉండిపోపయారు. ఆ సంఘటన నేను జీవితంలో మర్చి పోలేను. అప్పుడు నా కెరీర్ ప్రారంభ స్టేజ్ లో ఉంది కనుక చెప్పదల్చుకోలేదు. ఇప్పుడు ఆయన పేరును బయట పెట్టాలని నేను అనుకోవడం లేదు. దీన్ని మరింత పెద్ద వివాదంగా మార్చే ఉద్దేశ్యం లేదు.. కేంబ్రిడ్జి వంటి ప్రపంచ ప్రసిద్ది యూనివర్శిటీలో ఉన్నత చదువు చదివిన నేను ఆ హీరో అలా చేయడంతో తట్టుకోలేక పోయాను. నటన అంటేనే ఆసక్తి పోయింది. కానీ మళ్లీ ప్రయత్నాలు చేసి అవకాశాలు దక్కించుకున్నాను’ నవోమీ చెప్పుకొచ్చింది. ఇలాంటి విషయాలు బయటపెట్టరని పురుషులు అనుకుంటారని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని నవోమి అభిప్రాయపడ్డారు. -
‘ఎంతో కోల్పోవాల్సి వస్తుందని తెలుసు’
న్యూఢిల్లీ : పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల గురించి ప్రతీ మహిళ ధైర్యంగా ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉందని ప్రముఖ పాత్రికేయురాలు ప్రియా రమణి అన్నారు. తమను వేధించిన వారికి ఎదురు తిరిగి యుద్ధం చేసినపుడే ఇలాంటి అకృత్యాలు పునరావృతం కాకుండా ఉంటాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పలు రంగాల్లో ప్రకంపనలు రేపిన మీటూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ జర్నలిస్టు, మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌పై ప్రియా రమణి గతేడాది సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. జాబ్ ఇంటర్వ్యూలో భాగంగా తనను హోటల్ గదికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు. వికృత చేష్టలతో అక్బర్ తనను మానసికంగా హింసించాడని తెలిపారు. ఈ క్రమంలో ఎంతోమంది మహిళా జర్నలిస్టులు ప్రియను స్పూర్తిగా తీసుకుని అక్బర్ కారణంగా తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి బహిర్గతం చేశారు. దీంతో అక్బర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించింది. చదవండి: #మీటూ : అక్బర్ అత్యాచార పర్వం..వైరల్ స్టోరీ ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ప్రియా రమణి తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఎంజే అక్బర్ ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఇందులో భాగంగా ప్రియా రమణి సోమవారం ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్బర్ తరఫు న్యాయవాది సంధించిన ప్రశ్నలకు బదులుగా...ఎంజే అక్బర్‌పై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. ‘ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే నేను నిజాలు మాట్లాడాను. మీటూ ఉద్యమంలో భాగంగా నేను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకోవడం ద్వారా.. పని ప్రదేశాల్లో తమకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి ప్రతీ మహిళా ధైర్యంగా ముందుకు వస్తారనే ఆశతో నిజాలు మాత్రమే చెప్పాను. ఈ కేసు వల్ల వ్యక్తిగతంగా నేనెంతగానో కోల్పోవాల్సి వస్తుందని నాకు తెలుసు. నిశ్శబ్ధంగా ఉంటే ఇలాంటి కేసుల నుంచి తప్పించుకోవచ్చు. అయితే అది సరైంది కాదు. నన్ను టార్గెట్ చేయడం ద్వారా ‘అక్బర్ బాధితుల’ నోరు మూయించాలనేదే వారి ఉద్దేశం’ అని ప్రియా రమణి న్యాయమూర్తికి విన్నవించారు. -
9 మంది మహిళలతో సింగర్ బాగోతం
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఒపెరా’ ప్రపంచంలో కూడా ‘మీటూ’ ఉద్యమం ప్రారంభమైంది. వాషింగ్టన్ ఒపెరా, లాస్ ఏంజెలిస్ ఒపెరాలను నిర్వహిస్తూ గాయకుడిగా, కంపోజర్‌గా ఏకంగా 14 గ్రామీ అవార్డులు అందుకున్న సుప్రసిద్ధుడు ప్లాసిడో డొమింగో (78)పై తొమ్మిది మంది మహిళలు ఆరోపణలు చేశారు. గడచిన మూడు దశాబ్దాల కాలంలో తమపై డొమింగో లైంగిక నేరాలకు పాల్పడినట్లు వారు వెల్లడించారు. ఈ మహిళలు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందని డొమింగో ఒపెరాతో అనుబంధం ఉన్న 40 మంది మహిళలు చెప్పారు. ఉపాధి పేరిట బలవంతంగా తమను లొంగదీసుకున్నారని తొమ్మిది మంది మహిళలు తెలిపారు. నిరాకరించిన వారిని చేదు అనుభవాలు ఎదురయ్యాయని వారిలో ఏడుగురు మహిళలు చెప్పారు. అలా లైంగిక వేధింపులకు గురైన మహిళల్లో గాయకులు, డ్యాన్సర్లు, సంగీతవేత్తలు, వాయిస్ టీచర్లు, ఇతర స్టేజి కళాకారులు ఉన్నారు. అయితే వీరిలో ఒక్కరు మాత్రమే తన పేరును వెల్లడిస్తూ బయటకు వచ్చారు. మిగతా ఎనిమిది మంది పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడలేదు. రిటైర్డ్ గాయకురాలు పట్రీసియా వూల్ఫ్ మాత్రమే పేరు వెల్లడించారు. డ్రెసింగ్ రూముల్లోకి, హోటల్ రూముల్లోకి వచ్చి బలవంతంగా ముద్దులు పెట్టుకునే వాడని తొమ్మిది మంది కాకుండా మరో ముగ్గురు మహిళలు ఆరోపించారు. 1990 దశకంలో ఆయనతో పాడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాక వరుసగా తనను ఇష్టం లేకున్నా విహార యాత్రకు తీసుకెళ్లే వాడని ఓ గాయకురాలు తెలిపారు. ఈ తాజా ఆరోపణలు తనను ఎంతో బాధిస్తున్నాయని, తాను ఇంత వరకు ఎవరిని లైంగికంగా వేధించలేదని, అందరు ఇష్టపూర్వకంగానే తనతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని ప్లాసిడో డొమింగో చెబుతున్నారు. డొమింగోకు ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. తన కళను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తారని చెబుతారు. నాలుగువేల ప్రదర్శనల్లో 150 పాత్రలకు పాటలు పాడిన ఒపెరా రికార్డును కూడా ఆయన సొంతం చేసుకున్నారు. -
‘ఆ సినిమాల్లో ఎప్పటికీ నటించను’
ముంబై : తనకు ఎదురైన చేదు అనుభవాల కారణంగానే బాలీవుడ్‌ను వీడినట్లు హీరోయిన్ నీరూ బజ్వా పేర్కొన్నారు. 1998లో దేవానంద్ హీరోగా తెరకెక్కిన ‘మై సోలా బరాస్ కీ’ సినిమాతో ఆమె తెరంగేట్రం చేశారు. గత కొంతకాలంగా హిందీ చిత్రసీమకు దూరమైన ఆమె ప్రస్తుతం.. పంజాబీ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. హీరో దిల్జిత్ దోసన్‌కు జంటగా నీరూ నటించిన ‘షాదా’ సినిమా శుక్రవారం విడుదలయ్యింది. ఈ సందర్భంగా నీరూ మాట్లాడుతూ కెరీర్ తొలినాళ్ల నాటి అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ‘బాలీవుడ్లో నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నా. కానీ అక్కడ నిలదొక్కుకోవాలంటే హీరోయిన్లు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయని కొంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు నాతో ద్వంద్వార్థాలతో మాట్లాడారు. ఒక్కసారిగా భయంతో వణికిపోయా. వారి మాటలే అంత నీచంగా ఉంటే ప్రవర్తన ఇంకెంత దారుణంగా ఉంటుందో ముందే ఊహించగలిగాను. అలా అని అందరూ ఒకేలా ఉంటారని చెప్పను. దురదృష్టవశాత్తూ నాకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అందుకే బాలీవుడ్లో నటించకూడదని నిర్ణయించుకున్నాను. నా నుంచి ఏమీ ఆశించకుండా కేవలం ప్రతిభ ఆధారంగా పంజాబీ సినిమాలో నాకు అవకాశాలు ఇస్తున్నారు. నటిగా నిరూపించుకోవడానికి ఇది చాలు. ఇకపై బాలీవుడ్ వంక చూసేది లేదు’ అని తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. కాగా పాన్-ఇండియా మూవీగా తెరకెక్కిన షాదా పంజాబీతో పాటు పలు భాషల్లో విడుదలైంది. ఇక ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా పలువురు నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి గళం విప్పిన సంగతి తెలిసిందే. -
ఈ ఇడియట్‌ను చూడండి : సమంత
దక్షిణాదిన మీటూ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన సింగర్ చిన్మయి శ్రీపాదకు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. లైంగిక వేధింపుల బాధితులకు మద్దతుగా నిలిచినందుకు.. ఇండస్ట్రీ ‘పెద్ద మనుషుల’ కారణంగా ఆమె కెరీర్ ప్రమాదంలో పడింది. డబ్బింగ్ చెప్పేందుకు అవకాశం లేకుండా ఆమె గొంతుక వినిపించకుండా కొంతమంద్రి కుట్ర పన్నారు. అయితే తాజాగా సమంత లీడ్ రోల్లో నటిస్తున్న ఓ బేబీ సినిమా ద్వారా తమిళ డబ్బింగ్ చెప్పే అవకాశం చిన్మయికి లభించింది. ఈ విషయాన్ని ట్విటర్లో పంచుకున్న చిన్మయి..‘ సమంతకు తమిళ్లో డబ్బింగ్ చెప్పాను. నిజానికి నందినిరెడ్డి, సమంత వల్లే ఇదంతా సాధ్యమైంది’ అని ఓ బేబి టీజర్‌ను జతచేశారు. ఈ క్రమంలో ఎంతో మంది చిన్మయికి మద్దతునిస్తుండగా.. మరికొంత మాత్రం.. ‘ఫెమినిస్టులు అందరూ ఒకే దగ్గర ఉన్నారుగా.. ఈ సినిమా ప్లాపవడం ఖాయం’ అంటూ నెగిటివ్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తన పాత్రకు గొంతుతో జీవం పోసే చిన్మయికి సమంత అండగా నిలబడ్డారు. ‘ థ్యాంక్యూ... ప్రపంచం ఓ మూర్ఖున్ని కలిసింది. ఓ మూర్ఖుడు ప్రపంచంలోకి వచ్చాడు’ అంటూ సమంత ట్వీట్ చేశారు. దీంతో.. ‘కౌంటర్ అదిరింది సామ్. ఆడవాళ్లకు మరింత శక్తి రావాలి. ఓ బేబీ సినిమా కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా తొలి సినిమాతో ‘ఏ మాయ చేశావే’తోనే సమంత స్టార్‌గా మారడానికి ప్రధాన కారణం.. నటనతో పాటు ఆ సినిమాలో వినిపించిన గొంతేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గమ్మత్తైన ఆ గొంతు చిన్మయిది. తొలి సినిమా నుంచి సమంతకు చిన్మయి తన గొంతు అరువు ఇస్తూనే ఉన్నారు. ఇక వారిద్దరు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. Aaaaaaand. I DUBBED IN TAMIL for Samantha. Frankly it is only because of @nandureddy4u and @Samanthaprabhu2 that this was possible. Here’s to women who make life better for other women. https://t.co/KO3dcpHobv https://t.co/0OtisVB1de — Chinmayi Sripaada (@Chinmayi) June 17, 2019 -
మీ టూ : నానా పటేకర్‌కు క్లీన్ చిట్
ముంబై : లైంగిక వేధింపుల ఆరోపణలపై అలోక్ నాధ్, వికాస్ బల్లు క్లీన్ చిట్ అందుకున్న క్రమంలో తాజాగా మీటూ ఆరోపణలపై బాలీవుడ్ నటుడు నానా పటేకర్కూ క్లీన్ చిట్ లభించింది. నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ లభించనందున కేసును మూసివేసినట్టు సమాచారం. కాగా నానా పటేకర్‌కు క్లీన్ చిట్ లభించిందని గతంలోనూ వార్తలు వెలువడగా ఆయనపై ఆరోపణలు గుప్పించిన తనుశ్రీ దత్తా వాటిని వదంతులుగా తోసిపుచ్చారు. నానా పటేకర్ పీఆర్ బృందం ఈ వదంతులను వ్యాపింపచేస్తున్నారని తనుశ్రీ ప్రతినిధి, అడ్వకేట్ నితిన్ సత్పుటే ఆరోపించారు. కాగా నానా పటేకర్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, నిర్మాత సమి సిద్ధిఖీ, దర్శకుడు రాకేష్ సావంత్‌లు తనపై, తనతో పాటు కారులో ఉన్న కుటుంబ సభ్యులపై దాడిచేశారని తాము ఫిర్యాదు చేయగా పోలీసులు నానా పటేకర్‌కు ఎలా క్లీన్ చిట్ ఇస్తారని ఇటీవల తనుశ్రీ ప్రశ్నించారు. కాగా, 2008లో హార్న్ ఓకే ప్లీస్ సెట్లో నటుడు నానా పటేకర్ తనతో ఇంటిమేట్ సీన్లో నటించాలని కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో కలిసి ఒత్తిడి చేశారని, అందుకు నిరాకరించడంతో తనతో పాటు తన కారులో ఉన్న కుటుంబ సభ్యులపై వారు దాడికి తెగబడ్డారని తనుశ్రీ దత్తా ఆరోపించారు. -
రాజీ పడాలన్నాడు
‘మీటూ’ అంటూ ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ సంఘటనలను హీరోయిన్లు బయటకు చెబుతూనే ఉన్నారు. తాజాగా మరో హీరోయిన్ తన చేదు అనుభవాలను పంచుకున్నారు. తమిళంలో ‘వరుత్తపడాద వాలిబర్ సంఘం, తిరుట్టుపయలే 2, మిస్టర్ లోకల్’ వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించారు హీరోయిన్ షాలు షాము. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేస్తూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు – ‘‘నేనూ క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాను. కానీ దాని గురించి కంప్లయింట్ చేయదలచుకోలేదు. అలాంటి పరిస్థితుల నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే మనం ఆరోపించిన వారు తమ తప్పును అంగీకరిస్తారా? చాన్సే లేదు. ‘నాతో కాంప్రమైజ్ అయితే నీకు విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇప్పిస్తా’ అని ఓ దర్శకుడు ప్రపోజల్ పెట్టాడు’’ అని పేర్కొన్నారు షాలు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు? మీ ఊహలకే వదిలేస్తున్నాం. -
అసభ్య మెసేజ్; చిన్మయి అల్టిమేట్ రిప్లై!
జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినప్పటి నుంచి గాయని చిన్మయి శ్రీపాద విపరీతంగా ట్రోలింగ్‌కు గురువుతూనే ఉన్నారు. పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలతో ట్రోల్ చేయడం ఆకతాయిలకు పరిపాటిగా మారింది. ఇందులో భాగంగా.. ఓ ప్రబుద్ధుడు.. ‘దీనికి ఒక పరిష్కారం ఉంది. నువ్వు వైరముత్తును పెళ్లి చేసుకో. గత కొన్ని రోజులుగా నువ్వు ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నావో అర్థం కావడం లేదు. స్టుపిడ్ నీకేం పనిలేదా. ఎప్పుడూ ఆయన(వైరముత్తు) గురించే మాట్లాడతావు. నువ్వు బీజేపీ వ్యక్తివని మాకు తెలుసు’ అంటూ ద్వేషపూరిత కామెంట్ చేస్తూ మగ అహంకారం ప్రదర్శించాడు. ఇక తాజాగా మరో మగానుభావుడు ఏకంగా ఓ అడుగు ముందుకు వేసి తన పశు ప్రవృత్తిని బయటపెట్టుకున్నాడు. ‘మీ నగ్నచిత్రాలు పంపండి’ అంటూ వెకిలి కామెంట్లతో నీచంగా ప్రవర్తించాడు. అయితే మీటూ ఉద్యమంలో భాగంగా ‘పెద్ద మనుషులు’, ఇండస్ట్రీ ‘ప్రముఖులనే’ సునాయాసంగా ఎదుర్కొంటున్న చిన్మయి.. ఓ సగటు యువకుడు చేసిన ఈ అసభ్యకర కామెంట్‌ను చాలా తేలికగా తీసుకున్నారు. ‘ఇవిగో ఇవే నా ఫేవరెట్ న్యూడ్స్’ అంటూ లిప్‌స్టిక్ ఫొటోలను అతడికి పంపించి చెంప చెళ్లుమనిపించేలా.. చాలా తెలివిగా, హుందాగా సమాధానమిచ్చారు. అయితే అంతటితో అతడిని వదిలేయక.. స్త్రీ పట్ల నీచ భావం కలిగి ఉన్న సదరు యువకుడిని..‘ఎంటర్టైన్మెంట్ కోసం’ అంటూ నెటిజన్లకు పరిచయం చేశారు. దీంతో.. ‘చాలా తెలివైన సమాధానం మేడమ్.. అటువంటి పశువులకు కనీసం మీ ఉద్దేశం అర్థం అయి ఉండదేమో.. బ్యూటీ విత్ బ్రెయిన్.. హ్యాట్సాఫ్’ అంటూ చిన్మయిపై ప్రశంసలు కురిపిస్తూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. కాగా హ్యూమన్ స్కిన్ టోన్స్‌కు మ్యాచ్ అయ్యే కలర్లో ఉండే లిప్‌స్టిక్‌లను న్యూడ్ లిప్స్టిక్స్గా వ్యవహరిస్తారు. దాదాపు ఇందులో 20 నుంచి 30 వరకు షేడ్లు ఉంటాయి. కాగా ఇండియాలో బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమాన్ని గాయని చిన్మయి దక్షిణాదిన ముందుండి నడిపిస్తున్న సంగతి తెలిసిందే.18 ఏళ్ల వయసులో... ప్రముఖ గేయ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించారంటూ ఆమె పలు సంచలన విషయాలు బయటపెట్టారు. చిన్మయి స్ఫూర్తితో మరికొంత మంది కూడా వైరముత్తు వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ సినీ ఇండస్ట్రీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా... పలువురు ‘ప్రముఖులు’ చిన్మయిపై కక్ష సాధింపు చర్యలకు దిగి ఆమె కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. In the meanwhile.. for some entertainment pic.twitter.com/JwarkEaKDz — Chinmayi Sripaada (@Chinmayi) May 20, 2019 -
నటుడిపై మండిపడ్డ లాయర్
ముంబై: హీరోయిన్ తనుశ్రీ దత్తాను వేధించిన కేసులో విలక్షణ నటుడు నానాపటేకర్‌కు పోలీసులు క్లీన్చిట్ ఇవ్వలేదని ఆమె తరపు న్యాయవాది నితిన్ సత్పాతే తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నానాపటేకర్‌కు పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారన్నది కేవలం వదంతి మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ కేసు నుంచి బటయపడేందుకు, తప్పుడు పుకార్లు ప్రచారం చేసి మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసును తప్పుదోవ పట్టించేందుకు నానాపటేకర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని పోలీసులు ఇప్పటివరకు నమోదు చేయలేదన్నారు. సాక్షులు ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, పోలీస్ స్టేషన్‌కు వచ్చి వాంగ్మూలం ఇవ్వడానికి భయపడుతున్నారని చెప్పారు. ‘పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు ఇంకా కోర్టుకు వెళ్లలేదు. పోలీస్ స్టేషన్లో మాకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన సాక్షులకు నార్కో ఎనాలిసిస్, లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కోరామ’ని నితిన్ చెప్పారు. ‘హారన్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్లో నానాపటేకర్ తనను వేధించాడని 2018, సెప్టెంబర్‌లో తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. తనుశ్రీ కేసు దేశంలో ‘మీటూ’ ఉద్యమానికి ఉత్ప్రేరంగా పనిచేసింది. తాము కూడా లైంగిక వేధింపులకు గురయ్యామని ఎంతో మంది మహిళలు నిర్భయంగా గళం విప్పారు. -
‘మా అక్కలా.. నాకెప్పుడూ జరుగలేదు’
పదేళ్ల క్రితం తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బాలీవుడ్ నటి తనుశ్రీ గళం విప్పిన నాటి నుంచి భారత్‌లో మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. పెద్ద మనుషుల ముసుగులో చలామణీ అవుతున్న వివిధ రంగాలకు చెందిన ‘మగానుభావుల’ నిజ స్వరూపాన్ని ఈ ఉద్యమం బట్టబయలు చేసింది. కాగా పదేళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ తనూశ్రీ ఆరోపించింది. అంతేకాకుండా నానాపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయం గురించి తనుశ్రీ చెల్లెలు ఇషితా దత్తా మాట్లాడుతూ.. తన అక్కను చూసి గర్వంగా ఫీలవుతున్నట్లు పేర్కొంది. టీవీ నటిగా బిజీగా ఉన్న ఇషితా.. ఏక్తా కపూర్ నిర్మించిన బేపనా ప్యార్ సీరియల్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చేదు అనుభవం ఎదురైనప్పటికీ తన అక్క ఇండస్ట్రీకి వెళ్లొద్దంటూ నిరాశ పరచలేదని తనుశ్రీ వ్యక్తిత్వం గురించి చెప్పుకొచ్చింది. ‘ వేధింపుల గురించి ధైర్యంగా గళం విప్పిన మా అక్కకు ధన్యవాదాలు. తన కారణంగా ఎంతో మంది మహిళలు మానసిక వేదన నుంచి విముక్తి పొందారు. నిజానికి ఆరోజు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆనాడు పోలీసులు సరైన సమయానికి రాకపోయి ఉంటే మా అక్క పరిస్థితి ఎలా ఉండేదో. అప్పుడే తను ఫిర్యాదు చేసింది. కానీ ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ ఇటీవలి కాలంలో ఇండస్ట్రీలో కూడా మార్పు వచ్చింది. మహిళలతో పాటుగా ఎంతో మంది నటులు మా అక్కకు అండగా నిలిచారు. వారందరికి కృతఙ్ఞతలు. ప్రస్తుతం ఇదొక సీరియస్ ఇష్యూగా మారింది. ఈ సమిష్టి ఉద్యమం వల్ల పనిచేసే చోట మహిళలకు వేధింపులు కాస్త తగ్గినా మనం ధన్యులమవుతాం. వేధింపుల గురించి చెబితే మానసిక భారం తప్ప పోయేదేమీ లేదని అందరూ గుర్తించారు. నిజానికి తనకు అలా జరిగినా మా అక్క నన్నెప్పుడూ నిరుత్సాహ పరచలేదు. ఇండస్ట్రీలో అందరూ చెడ్డవాళ్లే ఉండరు కదా అని ధైర్యం చెప్పింది. అయితే తను అన్నట్టుగానే అదృష్టవశాత్తు నాకు మా అక్కలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదు. కానీ నా స్నేహితుల్లో చాలా మందికి ఇలా జరిగింది. వాటి కారణంగా వారి జీవితాల్లో తీవ్ర అలజడి చెలరేగింది’ అని పేర్కొంది. కాగా 2012లో చాణక్యుడు అనే తెలుగు సినిమా ద్వారా ఇషితా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. -
‘ఆ దర్శకుడు తప్పుగా మాట్లాడాడు’
ముంబై : మీటూ ఉద్యమంలో భాగంగా మూవీ సెట్స్‌పై ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న బాలీవుడ్ నటీమణులు తమ అనుభవాలను ధైర్యంగా వెల్లడిస్తున్న క్రమంలో తాజాగా మరో నటి తనకు ఎదురైన అసౌకర్య పరిస్థితిని బహిర్గతం చేశారు. 2016లో లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా సెట్లో జరిగిన ఘటనను నటి అహనా కుమ్రా ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ఈ సినిమా సెట్లో ఓ శృంగార సన్నివేశం తెరకెక్కిస్తుండగా దర్శక, నిర్మాత ప్రకాష్ ఝా సెట్లోకి వచ్చి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు తనకు చాలా అసౌకర్యంగా అనిపించాయని తెలిపారు. దీంతో తాను దర్శకులు అలంక్రిత శ్రీవాస్తవ వద్దకు వెళ్లి ఆయన తనకు దర్శకుడు కాదని, సెట్లో ఎందుకు ఉన్నారని అడిగానని చెప్పారు. ఆయన నుంచి తాను అలాంటి వ్యాఖ్యలు ఎందుకు వినాలని, ఆయన కేవలం నిర్మాతేనని అలంక్రితకు చెప్పినట్టు వెల్లడించారు. ఇక తాను చెప్పిన వెంటనే నిర్మాత ప్రకాష్ ఝాను సెట్ నుంచి వెళ్లాల్సిందిగా అలంక్రిత కోరగా, అప్పుడాయన వెళ్లిపోయాడని తెలిపారు. ఆయన సెట్లో ఉంటే తమకు ఇబ్బందికరమని అర్ధం చేసుకున్నాడని చెప్పుకొచ్చారు. కాగా, అలంక్రిత శ్రీవాస్తవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2016లో విడుదలైంది. -
సరైన శిక్ష ఏదీ?
బహుభాషా నటీమణుల్లో నటి పూర్ణ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాతృభాష మలయాళం అయినా తమిళం, తెలుగు భాషల్లోనూ నటిగా ఈ బ్యూటీకి మంచి పేరు ఉంది. మునిమాండి విలంగియల్ 3ఆమ్ ఆండు చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్గా రంగప్రవేశం చేసిన పూర్ణ ఆ తరువాత కందకోట్టం, ఆడుపులి, సవరకత్తి, కొడివీరన్ చిత్రాల్లో నటించారు. అయితే ఇటీవల తన బాణీని మార్చుకున్నారు. కథానాయకిగానే నటిస్తానని పట్టుపట్టకుండా నటనకు అవకాశం ఉన్న ఎలాంటి పాత్రనైనా నటించడానికి సిద్ధం అంటున్నారు. మంచి డాన్సర్ అయిన పూర్ణ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ జరిగింది, జరుగుతోంది, జరగనుంది అంతా ముందే రాసిపెట్టి ఉంటుందనే వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చారు. నిజం చెప్పాలంటే తాను సినిమాల్లోకి వస్తానని, కథానాయకినవుతానని ఊహించలేదన్నారు. ఎవరి సపోర్టు లేకుండా ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా, స్త్రీ ఒంటరిగా బయట ప్రపంచంలో సేఫ్‌గా తిరిగే పరిస్థితి లేదని పేర్కొంది. తన గురించే చెప్పాలంటే షూటింగ్కుగానీ, వేరే కార్యక్రమానికికానీ తనను ఒంటరిగా పంపడానికి తన తల్లి భయపడుతుందని చెప్పారు. తనతో అమ్మ గానీ, అక్క గానీ వస్తుంటారని తెలిపారు. ఎందుకంటే ఇప్పుడు మహిళలకు జరుగుతున్న సంఘటనలను చూసి వారు భయపడుతుంటారు. తాను డాన్స్ క్లాస్‌కు వెళ్లినా ఎవరో ఒకరు తనకు తోడుగా వస్తారన్నారు. ఇప్పుడు సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూస్తుంటే ఎవరిని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహిళల విషయంలో తప్పు చేసిన వారికి సరైన శిక్ష పడితే తప్పు జరగదని.. అప్పుడే అత్యాచారాలు తగ్గుతాయని అన్నారు. స్త్రీలు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా బయట తిరగగలుగుతారని చెప్పారు. తప్పు చేస్తే విదేశాల్లో కఠిన శిక్షలు ఉంటాయని, ఇక్కడ అలాంటి పరిస్థితి లేదని నటి పూర్ణ పేర్కొన్నారు. -
చిన్మయి ఆందోళనకు అనుమతి నిరాకరణ
పెరంబూరు: గాయని చిన్మయి ఆందోళన కార్యక్రమానికి చెన్నై పోలీస్ కార్యాలయం అనుమతి ఇవ్వలేదు. వివరాల్లోకి వెళ్లితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన్ గొగొయిపై ఆయన కార్యాలయ పనిమనిషి లైంగిక ఆరోపణలు చేసిన విషయం, దీనిపై పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీలో కొందరు మహిళామండలి నిర్వాహకులు న్యాయమూర్తికి వ్యతిరేకంగా న్యాయస్థానం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైలో లైంగిక వేధింపులపై(మీటూ) గళం విప్పిన తొలి మహిళగా పేరు తెచ్చుకున్న గాయని చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణను ఎదుర్కొన్న న్యాయమూర్తి రంజన్ గొగొయి కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించలేదు. ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఇతర మహిళామండలి కార్యకర్తలతో కలిసి ఆదివారం స్థానిక వళ్లువర్ కోట్టం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టింది. అందుకు పోలీస్కమీషనర్ కార్యాలయంలో అనుమతి కోరుతూ వినతి పత్రాన్ని అందించింది. దీనిపై పోలీస్‌కమిషనర్ కార్యాలయం ఆమెకు అనుమతిని నిరాకరించారు. సుప్రీంకోర్టే కొట్టివేసిన కేసు విషయంలో ఆందోళన చేయడం న్యాయస్థానాన్ని అవమానించడం అవుతుందని, చిన్మయికి అనుమతిని ఇవ్యలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. -
పోరాటానికి అనుమతించండి
తమిళనాడు, పెరంబూరు: సుప్రీం కోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా పోరాటానికి అనుమతినివ్వాల్సిందిగా గాయని చిన్మయి బుధవారం చెన్నైలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఒక లేఖను అందించారు. కోలీవుడ్‌లో మీటూ పోరాటానికి ఆధ్యం పోసింది గాయని చిన్మయినేనని చెప్పాలి. ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసి కోలీవుడ్‌లో కలకలం సృష్టించిన చిన్మయి ఆ తరువాత సీనియర్ నటుడు రాధారవిపైనా ఆరోపణలు చేసి మీటూపై పోరాటం చేస్తోంది. ఈ కలకలం కాస్త సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో తాజాగా ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం అవుతోంది. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన్‌గగోయ్‌పై ఆయన కార్యాలయం పనిమనిషి లైంగిక వేధింపుల కేసును పెట్టిన సంగతి, దానిపై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే న్యాయమూర్తి రంజన్‌గగోయ్‌పై లైంగిక వేధింపుల కేసును ధర్మాసనం కొట్టివేసింది. దీంతో పలు మహిళామండలి కార్యకర్తలు సుప్రీంకోర్టు ముందు ధర్నాకు దిగారు. పోలీసులు వారిపై లాఠీలు ఝలిపించి 144 సెక్షన్ అమలు పరిచారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిచిన గాయని చిన్మయి, ఇతర మహిళా సంఘాల నిర్వాహకులు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా చెన్నైలో పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో పోరాటానికి అనుమతినివ్వాల్సిందిగా మహిళా మండలి తరఫున గాయని చిన్మయి బుధవారం చెన్నైలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. మరి చిన్మయి వినతిపత్రంపై పోలిస్ కమిషనర్ కార్యాలయం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
‘మహిళల నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు’
ఇండస్ట్రీలో మహిళల నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఈ ఆలోచన ధోరణి మారాలి అంటున్నారు నటి సమీరా రెడ్డి. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి గురించి మాట్లాడారు సమీరా రెడ్డి. ‘అవకాశాలను ఎరగా చూపి మహిళల్ని వాడుకోవాలనుకుంటారు. అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంటారు. మహిళ అంటే కేవలం ఓ గ్లామర్ వస్తువుగా మాత్రమే చూస్తారు. నేను కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాను’ అన్నారు సమీరా. అంతేకాక ‘పరిశ్రమలో పురుషులను, స్త్రీలను సమానంగా చూడరు. పారితోషికం విషయంలో మాత్రమే కాదు గౌరవం విషయంలో కూడా ఈ అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయి. మహిళల విషయంలో పరిశ్రమ ఆలోచన పూర్తిగా మారాలి. ఈ మార్పు ఎంత త్వరగా వస్తే అంత మేలు జరుగుతుంది. మీటూ లాంటి ఉద్యమాల వల్ల ఇప్పుడిప్పుడే ఆ మార్పు ప్రారంభమయ్యింది. అయితే ఇంకా బుల్లి బుల్లి అడుగులే పడుతున్నాయి. కాస్త త్వరగా మార్పు వస్తే మంచిద’న్నారు సమీరా. 2014 వరకు సమీరారెడ్డి దక్షిణాది సినిమా పరిశ్రమలో రాణించింది. ఆ తర్వాత పారిశ్రామిక వేత్త అక్షయ్ వార్దేను వివాహం చేసుకోవడంతో యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పారు. 2015 నుంచి కేవలం ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమయ్యారు. తాజాగా రెండో బిడ్డకు జన్మనిచ్చేందుకు రెడీ అయ్యారు. -
‘క్రూరంగా పశువులా ప్రవర్తించాడు.. అందుకే’
హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్బుక్ పేజీలో ఓ యువతి రాసుకొచ్చిన పోస్టును ఎంతోమంది ప్రశంసిస్తూ ఉంటే..మరికొంత మంది మాత్రం ఎప్పటిలాగానే ఇప్పుడెందుకు.. అప్పుడేం చేశావు... నీకు నచ్చలేదు.. బాధ కలిగింది కాబట్టే ఇప్పుడు అతడి గురించి బయటపెట్టావా అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈ నెగటివ్ కామెంట్స్ చదువుతుంటే విషయమేంటో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. అవును మీరు ఊహించింది కరెక్టే. గతంలో తాను ఎదుర్కొన్న లైంగిక హింస, వేధింపుల గురించి శ్రుతీ చౌదరి అనే అమ్మాయి నిర్భయంగా అందరితో పంచుకుంది. అంతేకాదు తన #మీటూస్టోరీ ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుందని ధైర్యంగా ‘అతడి’ ముసుగును తొలగించింది. తనలా ఎవరూ మోసపోకూడదని.. అతడి బారి నుంచి కనీసం ఒక్కరిని కాపాడినా సరే తను విజయం సాధించినట్లేనని పేర్కొంది. ఆ పోస్టు సారాంశం ఇలా.. ‘అందరిలాగానే కలలు సాకారం చేసుకునేందుకు... చిన్న పట్టణం నుంచి ముంబై మహానగరానికి వచ్చాను. కానీ ఇక్కడికొచ్చాకే ఎన్నెన్నో సత్యాలు నాకు బోధపడ్డాయి. ఓరోజు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు ఓ వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో నా రాతలు చూసి తన దగ్గర రైటర్‌గా పనిచేయాలంటూ కోరాడు. సరే అన్నాను. కలిసి పనిచేస్తున్న క్రమంలో మా మధ్య స్నేహం చాలా బలపడింది. ఆత్మీయుడిగా భావించి నాకున్న అభద్రతా భావం గురించి, ఇతర సమస్యల గురించి అతడితో పంచుకోవడం ప్రారంభించాను. తరుచుగా కలుసుకునేవాళ్లం(అన్ని విధాలుగా). అయితే మా స్కాట్లాంట్ ట్రిప్ వరకు అంతా బాగానే జరిగింది. ఆరోజు రాత్రి మేము ఔటింగ్‌కు వెళ్లాల్సింది. కానీ అకస్మాత్తుగా వద్దన్నాడు. అయితే నేను అందుకు సిద్ధంగా లేనని చెప్పాను. కాసేపటి తర్వాత తన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. నాతో కఠినంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మాట్లాడటం మానేశాడు. దాంతో గిల్టీగా ఫీలయ్యాను. తన కోరిక కాదన్నందుకు బాధపడతాడేమోనని సరేనన్నాను. కానీ తను మాత్రం అలా అనుకోలేదు. చాలా కఠినంగా, పశువులా ప్రవర్తించాడు. ఆరోగ్యం గురించి శ్రద్ధ ఉండాలి కదా అన్నా వినలేదు. శారీరక హింసకు గురిచేశాడు. అలా చాలాసార్లు ఎంతగానో హింసించాడు. కొన్ని రోజుల తర్వాత తనతో ‘బంధం’ తెంచుకోవాలని అనుకున్నాను. తను కూడా సరేనన్నాడు. సహచర ఉద్యోగుల్లా మాత్రమే ఉన్నాము. కానీ ఓ రోజు నాకు వచ్చిన మెసేజ్ చూసి షాకయ్యాను. అతడు కేవలం నాతోనే కాదు చాలా మంది అమ్మాయిలతో ఇలాగే ప్రవర్తించాడు అని తెలిసి ఎంతో వేదనకు గురయ్యాను. అతడి నిజస్వరూపం గురించి బయటపెట్టాలని భావించాను. నాలా ఎంతమంది అమ్మాయిలు ఈ లైంగిక హింసను ప్రేమలో భాగం అనుకుని పొరబడ్డారో తెలిసి, నా మూర్ఖత్వం గురించి తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాను. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో నా మీటూస్టోరీని బహిర్గతం చేశాను. ఆ తర్వాత కొన్ని గంటల పాటు ఫోన్ స్విచ్చాఫ్ చేసి.. మళ్లీ ఆన్ చేయగానే నా పోస్టు వైరల్‌గా మారడం చూసి ఆశ్చర్యపోయాను. పదుల కొద్ది సంఖ్యలో అమ్మాయిలు అతడిని నమ్మిన తీరు, ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి తెలుసుకుని షాకయ్యాను. నేను అనుకున్న దానికన్నా కూడా అతడెంతో క్రూరుడు. మూర్ఖుడు. నేను ధైర్యంగా అతడి గురించి బయటపెట్టడం చూసి చాలా మంది కూడా పోరాడటానికి సిద్ధమయ్యారు. అందుకు ఫలితంగా అతడికి శిక్ష వేయించడంలో సఫలీకృతులమయ్యాం. ఈ రోజు నేను షేర్ చేసిన నా స్టోరీ ఎంతోమంది యువతులకు ఆదర్శంగా నిలుస్తుందనుకుంటున్నాను. నాలా ఎంతో మంది భ్రమలో ఉండి మోసపోయి ఉంటారు. మీరెవ్వరూ ఒంటరివారు కాదు. ధైర్యంగా ముందుకురావాలి. ఇప్పుడెందుకంటే... హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజీలో ‘ట్రిగ్గర్ వార్నింగ్’ పేరిట రాసుకొచ్చిన శ్రుతి చౌదరి మీటూస్టోరీ 24 గంటల్లోపే వేల కొద్దీ లైకులు, షేర్లతో దూసుకుపోయింది. ‘ హ్యాట్సాఫ్!!! మీలా ధైర్యంగా ముందుకు రాకపోవడం వల్ల ఎంతో మంది మహిళలకు అన్యాయం జరుగుతోంది. ఇలా చెప్పడం ద్వారా మీరు కనీసం ఒక్కరినైనా అతడి నుంచి రక్షించిన వారవుతారు. అలాకాకుండా నాకెందుకులే అనుకుని ఉంటే మరెంతో మంది అతడి బారిన పడేవారు. మీరు చాలా ధైర్యవంతురాలు’ అంటూ వందల సంఖ్యలో పురుషులు, మహిళలు శ్రుతికి మద్దుతగా నిలుస్తూ, ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ వివాహిత మాత్రం.. ‘ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న నా భర్త నిజస్వరూపం గురించి బయటపెట్టాలని అనుకున్నాను. కానీ ధైర్యం చేయలేకపోయా. అది నిజంగా ఎంతపెద్ద తప్పో ఇప్పుడే అర్థమైంది. ఏం చేయాలో, ఎలా చేయాలో నాకు ఇప్పుడు అర్థమైంది. ధన్యవాదాలు’ అని తన బాధను వ్యక్తపరిచారు. ‘ జెంటిల్‌మేన్ ఎప్పుడూ సమ్మతం లేకుండా ఏ మహిళను కనీసం తాకరు. నిజంగా జెంటిల్‌మేన్ అయితే భార్య అయినా గర్ల్‌ఫ్రెండ్ అయినా సరే వారి నిర్ణయాన్ని తప్పక గౌరవిస్తాడు’ అంటూ దేవ్ పత్ అనే ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు హ్యూమన్స్ బాంబేతో పాటు నెటిజన్లు కూడా పాజిటివ్‌గా రియాక్టవ్వడం విశేషం. ఇది నాణేనికి ఒకవైపు. ఇప్పుడెందుకో.. మీ తప్పేం లేదా? ఎవరైనా ఒక అమ్మాయి తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పగానే ఎదురయ్యే మొదటి, అతి సాధారణ ప్రశ్న. ఇప్పుడెందుకు ? అప్పుడేం చేశావు? అవును శ్రుతి చౌదరి చెప్పినట్టుగా ఎంతోమంది భ్రమలో పడి మోసానికి గురవుతున్నారు. తీరా ఆ విషయం గుర్తించే సరికి సమయం మించిపోవడంతో.. ఇలాంటి నెగటివిటీకి, సోకాల్డ్ పరువుకు భయపడి నోరు విప్పి నిజాలు చెప్పడం లేదు. చెబితే అప్పుడు అనుభవించిన శారీరక హింసకంటే కూడా... తనకు ఎదురవ్వబోయే మానసిక హింసను భరించడమెలాగో తెలియని భయం. ఎందుకంటే లైంగిక హింసకు గురైంది ఒక మహిళ అయితే, అత్యాచారానికి గురైంది ఓ ఆడపిల్ల అయితే సమాజం ఎప్పుడూ ఆమెను బాధితురాలిగా గుర్తించే కంటే.. ఏదో తప్పు చేసిన వ్యక్తులుగా చిత్రీకరించి ఆమెను మరింతగా కుంగదీసేందుకే ప్రయత్నిస్తోందనే భయం. కానీ శ్రుతి ఇలాంటివి చిన్న చిన్న విషయాలంటూ తేలికగా తీసుకుంది. అందరూ ఆమెలాగే ముందుకు వస్తే.. పశ్చాత్తాపం కంటే కూడా భయంతోనైనా అతడి లాంటి మేకతోలు వన్నె పులులు కాస్తైనా మారతాయనేది ఆమె ఉద్దేశం. ఒక్క శ్రుతిదే కాదు... భారత్‌లో మీటూ ఉద్యమాన్ని మొదలు పెట్టిన బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా, దక్షిణాదిన ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న చిన్మయి శ్రీపాద వంటి వారి ఉద్దేశం కూడా ఇదేననేది మెజారిటీ వర్గాల అభిప్రాయం. వాళ్లే కదా జెంటిల్మెన్.. శ్రుతి పోస్టు ద్వారా చర్చనీయాంశంగా మారిన మరో అంశం వైవాహిక అత్యాచారం(మ్యారిటల్ రేప్). వివాహం అనగానే భార్య ఎల్లవేళలా సిద్ధంగా ఉండి.. భర్తతో శారీరక సంబంధాలకు సమ్మతి తెలుపుతుందని అర్థం కాదు. భార్య సమ్మతితోనే భర్త ఈ సంబంధాన్ని కొనసాగించాల్సి ఉంటుంది’ అని ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, సీ హరిశంకర్‌తో కూడిన ధర్మాసనం గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. భాగస్వామి లైంగిక హింస విషయంలో బలవంతపెట్టడం, భయపెట్టడం వంటి చర్యలను మాత్రమే నేరంగా పరిగణించాలని, అలాంటివి లేనప్పుడు దీనిని నేరంగా పరిగణించలేమని మారిటల్ రేప్ అంశాన్ని వ్యతిరేకిస్తున్న పురుషుల సంక్షేమ ట్రస్ట్ అనే ఎన్జీవో సంస్థ వాదించగా.. ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు. లైంగిక దాడి కోసం బలవంతపెట్టారా? గాయాలయ్యాయా అని చూడాల్సి అవసరం ఇప్పుడు లేదని, రేప్ నిర్వచనం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని ధర్మాసనం పేర్కొంది. ‘రేప్ కోసం బలవంతపెట్టడమనేది కచ్చితమైన షరతు ఏమీ కాదు. భార్యను ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి.. శృంగారంలో పాల్గొంటేనే గృహావసరాలు, పిల్లల ఖర్చుల కోసం డబ్బులు ఇస్తానని భర్త ఒత్తిడి చేయవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో భార్య అందుకు ఒప్పుకున్నా.. ఆ తర్వాత ఆమె భర్తకు వ్యతిరేకంగా రేప్ కేసు పెట్టవచ్చు. అది జరిగే అవకాశముంది’ అని ధర్మాసనం పేర్కొంది. గృహహింస నిరోధక చట్టం, వివాహిత మహిళల వేధింపుల నిరోధక చట్టం, వేరుగా ఉంటున్న భార్యతో బలవంతపు శృంగారం నిరోధించే చట్టాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని, ఈ నేపథ్యంలో భార్యతో శృంగారం నేరం కాబోదని పేర్కొంటున్న సెక్షన్ 375ను మార్చాల్సిన అవసరం ఏముందని మారిటల్ రేప్‌ను వ్యతిరేకిస్తున్న ఓ పిటిషనర్ వాదించగా.. ఇన్ని చట్టాల్లో పరిధిలో ఉన్నప్పుడు సెక్షన్ 375లో మాత్రం ఎందుకు మినహాయింపు ఇవ్వాలని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించిన తీరును పలువురు ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు.. . మహిళల సమ్మతి లేకుండా వారి భర్తలు శృంగారం జరిపే క్రమంలో భౌతిక దాడులు, బెదిరింపులు ఉన్నపుడు మాత్రమే అత్యాచారంగా పరిగణిస్తే సరిపోదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అభిప్రాయాన్ని.... రేప్ నిర్వచనం పూర్తిగా మారిపోయిందన్న విషయాన్ని గౌరవించాలంటున్నారు. మహిళల అంగీకారం లేకుండా వారి శరీరంపై జరిగే ప్రతీ చర్యను అత్యాచారంగానే పరిగణించాల్సిన ఆవశ్యతను ప్రతీ ఒక్కరు గుర్తించాలంటున్నారు. న్యాయం జరుగుతుంది కదా!! ‘మీటూ లాంటి ఉద్యమాల వల్ల చాలా మంది బాధితులు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెడుతున్నారు. అయితే ఆ సమయంలో వారు అనుభవించిన బాధ కంటే కూడా... అప్పుడు ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్పు.. అసలు ఇదంతా నిజమేనా... ఒకవేళ నిజమే అయితే సాక్ష్యాలు చూపించు అనే ఈ మాటల వల్లే ఎక్కువ బాధను అనుభవిస్తున్నారు. ఇక్కడ విచారించదగ్గ మరో విషయం ఏంటంటే చాలా మంది యూరోప్ మహిళలు తమపై జరిగిన అత్యాచారాల గురించి నోరు మెదిపే ధైర్యం చేయలేకపోవడం. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చినపుడే న్యాయం జరుగుతుంది కదా’ - గతంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, యూరోప్ మహిళా హక్కుల నేత అన్నా బ్లస్ చేసిన వ్యాఖ్యలు -
‘ఇప్పుడు కుంగిపోయే ప్రసక్తే లేదు’
‘ఆ చేదు అనుభవాల నుంచి నేను నుంచి పూర్తిగా బయటపడ్డాను. అతడికే జీవితం కాస్త మారి ఉంటుంది. మనచుట్టూ ఎంతోమంది నేరగాళ్లు, మోసగాళ్లు ఉంటారు. లైంగిక వేధింపులపై గళం విప్పినప్పుడు ఎంతో మంది నా క్యారెక్టర్‌ను ఇష్టం వచ్చినట్లుగా జడ్జ్ చేశారు. అవమానాలకు గురిచేశారు. అప్పుడు కాస్త బాధ పడ్డాను. కానీ ఇప్పుడు అలా కుంగిపోయే ప్రసక్తే లేదు. నాకు ఎదురైన వేధింపుల గురించి బయటపెట్టడం ద్వారా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. అయితే అందరూ నాలాగా ఉండాలని ఆశించకూడదు కదా’ అని బాలీవుడ్ నటి ప్రియాంక బోస్ తన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ తనను లైంగికంగా వేధించారంటూ ప్రియాంక బోస్ మీటూ స్టోరిని బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రియాంక బోస్ ప్రస్తుతం.. ప్రకాశ్ ఝా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పరీక్షతో పాటు మేఘా రామస్వామి ద ఆడ్స్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష గురించి మాట్లాడుతూ.. ‘ ఓ రిక్షావాలా కుటుంబం కథ ఇది. కొడుకును ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనుకునే తల్లిదండ్రులు పడే వేదనే పరీక్ష. ఇటువంటి సినిమాలో నటించడం ద్వారా నటిగా ఓ మెట్టు ఎక్కినట్టు భావిస్తున్నా అని ప్రియాంక చెప్పుకొచ్చారు. లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకున్నాయని ప్రశ్నించగా ఆమె పైవిధంగా స్పందించారు. ఇక సాజిద్ ఖాన్‌పై నటి సలోని చోప్రాతో పాటు ప్రియాంక బోస్, మందనా కరిమి, రేచల్ వైట్ వంటి పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ అతడిపై ఏడాది పాటు నిషేధం విధించింది. -
ఆడెవడు!
‘నర్సిమన్నా.. ఆడెవడు!’ అంటాడు ‘అంతఃపురం’ సినిమాలో జగపతిబాబు. ఇప్పుడు అదే ధిక్కారం పా.రంజిత్ మాటల్లో చిన్మయి అభిమానులకు వినిపిస్తోంది. మీటూ బాధితుల తరఫున రంజిత్ మామూలు మనిషితో డీకొనలేదు. కె.రాజన్‌తో పెట్టుకున్నాడు. రాజన్ తమిళ్ ఇండస్ట్రీలో నర్సిమన్న! ఆ నర్సిమన్నకు తనలోని ట్వంటీ ఫిఫ్త్ ఫ్రేమ్‌ను చూపించాడు రంజిత్. మాధవ్ శింగరాజు సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్లతో ఎవరూ పెట్టుకోరు. పెద్ద నిర్మాత, పెద్ద దర్శకుడు, పెద్ద హీరో.. ఇంకా ఏవో ఉంటాయి ట్వంటీఫోర్ ఫ్రేమ్స్ అని.. ఆ ఫ్రేముల్లోని పెద్దవాళ్లు ఒక మాట చెబితే చాలు.. ఎంత టాలెంట్ ఉన్నవాళ్లకైనా రూకలు చెల్లాల్సిందే. లాగి అవతల పడేయిస్తారు. మరెలా ఇండస్ట్రీ నడవడం! పెద్దవాళ్లు తలచుకుంటే టాలెంట్‌కి కొదవేముంటుంది.. ఎవరో ఒకర్ని తెచ్చేసుకుని టాలెంట్‌కి అప్పటికప్పుడు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. అందుకే ఆర్టిస్టులెవరూ ఈ పెద్దవాళ్లను ప్రజ్వలన వరకు పోనివ్వరు. సినిమా ఇండస్త్రీ అనే కాదు.. ఎక్కడైనా డబ్బు ఖర్చు చేసేవాళ్లదే పై మాట. ఆ మాట వినకపోతే మనకొచ్చే రెమ్యూనరేషన్ ప్లేట్ ఇడ్లీ సాంబార్ అయినా, పదకొండు వేల నూట పదహార్లయినా, కొన్ని లక్షల కాంట్రాక్ట్ అయినా ఆ రోజుతో ఆఖరు. ఆ నష్టం కొంచెమే. ఆ తర్వాత ఇక ఎవరూ పిలిచి కెరీర్‌ని ఇవ్వరు. అది పెద్ద నష్టం. అంతా ఏకమై పగపడతారు. ఆర్టిస్టులకైతే ఫిల్మ్గతులు ఉండవు. కె.రాజన్ ఇప్పుడు తమిళ్లో పెద్ద ప్రొడ్యూజర్. పలుకుబడి ఉన్న సీనియర్ నిర్మాత. ప్రస్తుతం ‘పర’ అని తమిళంలో ఒక సినిమా తీస్తున్నారు. గతవారం ఆ సినిమా ఆడియో ఫంక్షన్లో అకస్మాత్తుగా ఆయన చిన్మయి ప్రస్తావన తెచ్చారు. ‘పర’లో చిన్మయి పాడింది లేదు. డబ్బింగ్ చెప్పిందీ లేదు. కనీసం ఆమె ఆ ఫంక్షన్లో కూడా లేరు. ‘పర’ ఒకటే కాదు.. కమింగ్ అప్ సినిమాల్లో కూడా ఆమె పాటలు, మాటలు లేవు. నిరుడు వైరముత్తుపై ‘మీటూ’ ఆరోపణలు చేసినప్పటి నుంచీ ఆమె గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. అందుకు చిన్మయేం చింతించలేదు. ఇండస్ట్రీ మొత్తం కక్ష కట్టినా భర్త సపోర్ట్ ఆమెను నిలిపింది. కె.రాజన్ సీనియర్ నిర్మాత అయినట్లే, వైరముత్తు సీనియర్ గీత రచయిత. ‘‘కన్నదాసన్, వలీల తర్వాత.. అంతటి విద్వత్తు గల వైరముత్తు మీదే ఆరోపణలు చేస్తావా. ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం ఆయన నిన్ను ఏదో చేశారని, ఇప్పుడు నువ్వు చీప్ పబ్లిసిటీ కోసం ఆయన్నేదో చేయబోతావా? నిన్ను సర్వనాశనం చేస్తా చూడు. నాకు తెలిసిన వాళ్లు యాభై మంది ఉన్నారు. వాళ్లకు ఒక్కమాట చెప్పానంటే నీ అంతు చూస్తారు. నువ్వు వైరముత్తు మనశ్శాంతిని ధ్వంసం చేస్తే నా మనుషులు నిన్ను అధోగతి పట్టిస్తారు’’ అని చిన్మయి పేరెత్తకుండా చిన్మయిపై విరుచుకుపడ్డారు రాజన్. రాజన్ మాట్లాడుతున్నప్పుడు వేదికపై ఆయన వెనకే ఎల్లో శారీ, గ్రీన్ కలర్ జాకెట్లో ఉన్న యాంకర్.. రాజన్ అంటే ఉన్న భయభక్తుల వల్ల కావచ్చు.. చేతులు కట్టుకుని, తలదించుకుని గౌరవ మనస్కురాలై నిలబడి ఉన్నారు. చెప్పలేం. నిరసనకు అదొక జెశ్చర్ అయినా కావచ్చు. పెద్దాయన కదా మరి! రాజన్ మాటలపై ఇంకో మాట ఉండదు. శాసనం. తర్వాతి వక్త పా.రంజిత్. ఫంక్షన్‌కి అతడు చీఫ్‌గెస్ట్ కూడా. యువ దర్శకుడు. రజనీతో ‘కబాలి’, ‘కాలా’ తీసింది అతడే. వేదిక మీదకి వచ్చి మైక్ అందుకున్నాడు. చిన్మయికి రాజన్ ఇచ్చిన వార్నింగ్ ఎక్కడైతే ఆగిందో.. సరిగ్గా అక్కడి నుంచి రంజిత్ ప్రసంగం మొదలైంది! ఇది ఎవరూ ఊహించనిది. వణికిపోయారు. కూర్చున్న కొమ్మపై గొడ్డలి లేపాడేమిటీ కుర్రాడు అనుకున్నారు. రాజన్ పేరెత్తకుండా, చిన్మయి మాటెత్తకుండా మాట్లాడాడు రంజిత్. ‘‘ఏళ్లుగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఇండస్ట్రీ ఇది. ఈ వాస్తవాన్ని తిరస్కరించలేం. అంతే కాదు.. వాస్తవమని అంగీకరించాలి కూడా. మహిళా ఆర్టిస్టులు ఫిర్యాదు చేసినప్పుడు ఆరోపణగా తీసుకోకూడదు. విచారణ జరిపించాలి. ఫిర్యాదు చేసిన మహిళనే నేరస్థురాలిగా చూడ్డాన్ని నేను ఖండిస్తున్నాను’’ అన్నాడు! సభలో సౌండ్ లేదు. ఎవరూ చప్పట్లు కొట్టలేదు. ఆ పసుపురంగు చీరలో ఉన్న అమ్మాయి ముఖంలో మాత్రం కృతజ్ఞతలాంటి చిరునవ్వు ఒకటి మెరిసి మాయమైంది. మీటూ ఉద్యమం మన దగ్గర ఏడాదిగా నడుస్తోంది. బాలీవుడ్లో తనుశ్రీ దత్తా, తమిళంలో చిన్మయి.. ఈ ఇద్దరూ ధైర్యంగా బయటికి వచ్చారు. నిందలు, అవమానాలు పడ్డారు. చిన్మయి అయితే అవకాశాలు కోల్పోయారు. తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు చిన్మయి ఒంటరి ఆర్టిస్ట్. అయినా గట్టిగా నిలబడ్డారు. రాజన్ బెదిరింపులకూ భయపడలేదు. ‘సిదైక ఆల్ ఎల్లమ్ వెచ్చుర్కారమే. బయప్పోదుమా?’ అని ట్విట్ చేశారు. మనుషుల్ని పెట్టించుకున్నారట! భయపడాలా?! అని. ఆ తర్వాత చిన్మయి భర్త పా.రంజిత్‌కి సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలిపారు.. ప్రతిచోటా ఇలాంటి గౌరవనీయులు ఒక్కరైనా ఉండాలి అని. ఇప్పుడిక రంజిత్‌కి ఉంటుంది. తన మాటకే మాట వేసినందుకు రాజన్.. రంజిత్‌కి సినిమాలు ఇవ్వకుండా, సినిమాలు రాకుండా చెయ్యవచ్చు. అయితే రంజిత్ ఇవేమీ ఆలోచించలేదు. తన మనసులో ఉన్నది మాట్లాడాడు. అసలీ మాటను ఈసరికే తమిళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దపెద్ద వాళ్లు మాట్లాడి ఉండవలసింది. కానీ మౌనం తప్ప మాట లేదు! ఇప్పుడు పా.రంజిత్ మాట్లాడాడు. హీరోలను డైరెక్ట్ చేసినవాడు రంజిత్. ఇప్పుడు అతడే హీరోగా నిలబడ్డాడు. రియల్ హీరోగా! చిన్మయిని సపోర్ట్ చెయ్యడం అతడి హీరోయిజం కాదు. చిన్మయిని, చిన్మయిలాంటి వాళ్లను కించపరుస్తున్న పెద్దవాళ్లందర్నీ ఒక్కమాటతో ఖండించాడు. ‘వేధింపులు నిజమే అని అంగీకరించాలి’ అనే ఒక్కమాటతో ఇండస్ట్రీ పెద్దలకు ఎదురు నిలిచాడు. ఇలాంటి ఒక హీరో.. ధైర్యంగా బయటికి వచ్చిన ప్రతి అమ్మాయి పక్కనా సపోర్ట్‌గా ఉండాలి. నాన్న, అన్న, భర్త, స్నేహితుడు, సన్నిహితుడు.. ఎవరైనా ఒక హీరో! స్టంట్స్, ఫైట్స్ చెయ్యక్కర్లేదు.. ఆమె మీదకు వచ్చేపడే మాటల ఈటెల్ని తిప్పికొట్టే హీరో! బూమరాంగ్ అయిన ఆ ఈటెలు ఒక్కో మసుగునూ తొలగిస్తుంటే అమ్మాయిలకెంత ధైర్యం, ధీమా. - మాధవ్ శింగరాజు -
ఆ గాయని పని పట్టడానికి సిద్ధం చేశానన్నారు..
తమిళనాడు, పెరంబూరు: ఆ మధ్య మీటూ సినీ పరిశ్రమలో పెద్ద కలకలాన్నే సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కోలీవుడ్‌లో మీటూ సంచలనం సృష్టించిన గాయని చిన్మయి అనే చెప్పాలి. ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై ఆమె మీటూ ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలను వైరముత్తు ఖండించారు. అయితే ఈ విషయంలో తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమని చిన్మయి ప్రకటించారు. అదే విధంగా సీనియర్ నటుడు రాధారవిపైనా చిన్మయి ఈ ఆరోపణలే చేశారు. వీరి మధ్య మాటల యుద్ధం ఘాటుగానే సాగింది. కాగా ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో నటుడు, నిర్మాత కే.రాజన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో తెరలేపారు. ఆయన ఇటీవల జరిగిన ఒక చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై ఒక గాయని ప్రఖ్యాత గీతరచయితపై మీటూ ఆరోపణలు చేసిందన్నారు. ఆయన ఎంతో కష్టపడి సంపాధించుకున్న పేరును, గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం చేసిందన్నారు. ఇంతటితో ఆపకుండా ఆమె ఇదే విధంగా దుష్ప్రచారం చేసుకుంటూ పోతే, తాను ఆ గాయని పని పట్టడానికి కొందరిని సిద్ధం చేశానన్నారు. దీనికి ట్విట్టర్లో బదులిచ్చిన గాయని చిన్మయి చాలా సింపుల్‌గా ఆయన మాటలకు తానిప్పుడు భయపడిపోవాలా? అని పేర్కొన్నారు. దీంతో మీటూ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చి రచ్చ చేసే అవకాశం ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
‘వైరముత్తును పెళ్లి చేసుకో; ఐడియా బాగుంది’
పెద్ద మనుషుల ముసుగులో చలామణీ అవుతున్న వివిధ రంగాలకు చెందిన ‘మగానుభావుల’ నిజ స్వరూపాన్ని.. ‘మీటూ’ ఉద్యమం ద్వారా పలువురు బాధితులు బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని గాయని చిన్మయి దక్షిణాదిన ముందుండి నడిపిస్తున్నారు. 18 ఏళ్ల వయసులో... ప్రముఖ గేయ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించారంటూ ఆమె పలు సంచలన విషయాలు బయటపెట్టారు. చిన్మయి స్ఫూర్తితో మరికొంత మంది కూడా వైరముత్తు వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ సినీ ఇండస్ట్రీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా... పలువురు ‘ప్రముఖులు’ చిన్మయిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. అంతేకాదు పబ్లిసిటీ కోసమే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలతో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా... ‘ దీనికి ఒక పరిష్కారం ఉంది. నువ్వు వైరముత్తును పెళ్లి చేసుకో. గత కొన్ని రోజులుగా నువ్వు ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నావో అర్థం కావడం లేదు. స్టుపిడ్ నీకేం పనిలేదా. ఎప్పుడూ ఆయన(వైరముత్తు) గురించే మాట్లాడతావు. నువ్వు బీజేపీ వ్యక్తివని మాకు తెలుసు’ అంటూ ద్వేషపూరిత కామెంట్ చేశాడు. ఇందుకు స్పందించిన చిన్మయి... ‘ మీ ఐడియా చాలా బాగుంది. కానీ నాకు నచ్చలేదు’ అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా తనకు అండగా నిలుస్తూ భర్త రాహుల్ రవీంద్రన్ గతంలో రాసిన లేఖను ట్వీట్ చేశారు. ‘ పనికిలేని వాళ్లంతా నా టైమ్‌లైన్‌లో చెత్త రాస్తున్నారు. నా భార్య కారణంగా మీకేదో ఇబ్బంది కలుగుతోందని అర్థమవుతోంది. ఎందుకంటే తనో ప్రత్యేకమైన వ్యక్తి. మాట్లాడే ధైర్యం కలది. మగ అహంకారం చూపి తనను భయపెట్టాలని చూస్తున్నారు. ప్రపంచం మారుతోందన్న విషయాన్ని మీరు అంగీకరించరు. సమానత్వం వచ్చేదాకా తనలాంటి గొంతులు మరింతగా హోరు పెంచుతాయి. ప్రేమించే, జాగ్రత్తగా చూసుకునే, నిస్వార్థంగా ఇతరుల కోసం జీవించే మహిళను నేను భార్యగా పొందాను. మీరు కూడా మీ వ్యక్తిత్వానికి తగిన భార్యను వెతుక్కోండి. ఆమె లాంటి వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ వాళ్లు మీలాంటి సంకుచిత వ్యక్తులను ఎంచుకుంటారా అనేదే కాస్త సందేహంగా ఉంది’ అంటూ రాహుల్ రవీంద్రన్ తన భార్య ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న వారికి దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ‘నా భర్త స్ట్రాంగెస్ట్’ అని చిన్మయి ఈ లేఖను మరోసారి ట్విటర్లో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో చిన్మయిపై విషం చిమ్మిన నెటిజన్ వ్యాఖ్యలపై పలువురు స్పందించారు. ‘బాధితులకు ఎంత మంచి సలహా ఇచ్చావురా నాయనా. అలాంటి వాళ్లు మనింట్లో ఉన్నా కూడా ఇలాగే చెప్పాలి. ఎంతైనా నువ్వు గ్రేట్’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. What an idea. Sorry not interested. https://t.co/DsURMwT9b6 — Chinmayi Sripaada (@Chinmayi) April 15, 2019 ❤️❤️❤️❤️❤️💪🏻💪🏻💪🏻💪🏻 My husband strongest. https://t.co/EEAJzSHopn — Chinmayi Sripaada (@Chinmayi) October 17, 2018 -
సోలోగానే వెళ్తానంటోన్న టాప్ డైరెక్టర్
తనుశ్రీ దత్తా ప్రారంభించిన ‘మీటూ’ ఉద్యమం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమా, జర్నలిజం వంటి పలు రంగాలకు చెందిన ప్రముఖుల మీద లైంగిక వేధింపులు ఆరోపణలు రావడంతో దేశం అట్టుడికి పోయింది. ఇలా ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ కూడా ఉన్నారు. ‘సంజు’ సినిమా సమయంలో రాజ్‌కుమార్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ ఏడాది అనీల్ కపూర్ - సోనమ్ కపూర్లు ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఏక్ లడ్కీ కో దేఖా థో హైసా’ లగా చిత్రం నుంచి కూడా రాజ్‌కుమార్ పేరును తొలగించారు. ఇన్నాళ్లు వినోద్ చోప్రోతో కలిసి తన ప్రొడక్షన్ హౌస్‌లో ఎన్నో హిట్ సినిమాలు తీసిన రాజ్‌కుమార్ హిరాణీ తొలిసారి ఒంటరిగా ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నట్లు సమాచారం. ‘ప్రస్తుతానికి స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ఈ సారి రాజ్‌కుమార్ ఒక్కరే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే కొంతమంది నటీనటులతో సినిమా గురించి మాట్లాడారు. వారంతా ఈ చిత్రంలో పని చేసేందుకు రెడీగా ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రటకన వెలువడనుంద’ని రాజ్‌కుమార్ సన్నిహితుడొకరు మీడియాకు తెలిపారు. గతంలో రాజ్‌కుమార్ సంజు, పీకే సినిమాలకు వినోద్ చోప్రాతో కలిసి నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే రాజ్‌కుమార్ మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సంజయ్ దత్, రణ్‌బీర్ కపూర్, సోనమ్ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు మద్దతుగా నిలిచారు. -
ఆ ఆరోపణలను నమ్మను
‘‘దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీతో కలసి చాలా సినిమాలు చేశాను. చాలా కాలంగా అతను నాకు పరిచయం. అతని మీద వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలను నేను అస్సలు నమ్మను’’ అన్నారు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా ‘మున్నాభాయ్’ సిరీస్, ‘పీకే, సంజు’ చిత్రాల దర్శకుడు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన ఓ మహిళ చేసిన ఆరోపణలను సంజయ్ దత్ కొట్టి పారేశారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘రాజు మీద ఆరోపణలు నమ్మశక్యంగా లేవు. ఆరోపణలు కాకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవచ్చుగా?’’ అన్నారు. ‘‘మున్నాభాయ్ సిరీస్‌లో కొత్త చిత్రం కచ్చితంగా ఉంటుందని రాజు ఆల్రెడీ చెప్పాడు. కానీ అది ఎప్పుడు ఉంటుందో నాక్కూడా సరిగ్గా తెలియదు’’ అని కూడా సంజయ్ దత్ చెప్పారు. -
‘మీకు ఓ భార్య, కూతురు ఉన్నారు కదా’
మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ పరిశ్రమలో పెద్దలుగా చెలామణి అవుతోన్న వారి మీద లైంగిక వేదింపుల ఆరోపణలు రావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి పనిచేయకూడదని ఇండస్ట్రీలో నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇలా బహిష్కరించిన వారిలో అలోక్ నాథ్ కూడా ఉన్నారు. అయితే తాజాగా ఈయన అజయ్ దేవగణ్ ‘దే దే ప్యార్ దే’ చిత్రంలో నటించారు. ఈ రోజు చిత్ర ట్రైలర్ విడుదల సందర్భంగా ఈ విషయం తెలిసింది. దీని గురించి అజయ్ దేవగణ్‌ని ప్రశ్నించగా.. ‘ఈ విషయం గురించి మాట్లాడ్డానికి ఇది సరైన వేదిక కాదు. కానీ అతని మీద ఆరోపణలు వచ్చే నాటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది’ అని తెలిపారు. అయితే అజయ్ సమాధానంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అజయ్ మీకు ఓ భార్య, కూతురు ఉన్నారు కదా. అలాంటప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని మీ చిత్రంలో ఎలా ఉంచుతారు. ఇలాంటి వ్యక్తికి మద్దతిస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. అలోక్ నాథ్ సన్నివేశాలు తొలగించాలి.. లేదా వేరే వ్యక్తితో ఆ పాత్రలో నటింపజేయాలి.. లేదంటే ఈ సినిమాను థియేటర్లో కాదు కదా కనీసం టీవీలో కూడా చూడమంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గతంలో ఆమిర్ ఖాన్‌తో పాటు మరికొందరు బాలీవుడ్ నటులు మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి నటించేది లేదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. @IndiaMeToo I'm not gonna watch #DeDePyaarDe until Alok Nath gets kicked from the movie...not even on tv. If @ajaydevgn is a responsible actor, he should be the one to do it. Sadly this industry does only show off abt respecting women. Fake people !! — Dr.Nitin Rathod (@SRKnitin_rathod) April 2, 2019 -
నాతో తప్పుగా ప్రవర్తించలేదు
‘మీటూ’ ఉద్యమం సమయంలో బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. తమ పట్ల సాజిద్ అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ పలువురు కథానాయికలు ఆరోపించిన విషయం తెలిసిందే. దాంతో ‘హౌస్‌ఫుల్ 4’ చిత్ర దర్శకత్వ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారాయన. సాజిద్ ఖాన్ తనతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని, అతనితో పని చేయడం కంఫర్ట్‌బుల్‌గానే అనిపించిందని పేర్కొన్నారు తమన్నా. సాజిద్ ఖాన్ దర్శకత్వంలో ‘హిమ్మత్వాలా, హమ్‌షకల్స్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించారు తమన్నా. సాజిద్ ఖాన్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను తమన్నా పంచుకుంటూ – ‘‘నేనెలాంటి సినిమా చేయబోతున్నా, ఆ సినిమా స్క్రిప్ట్ ఏంటి? అన్నదే నాకు ముఖ్యం. నేను, సాజిద్ ఖాన్ కలసి చేసిన రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. తనెప్పుడూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు. తనతో పని చేయడం కంఫర్ట్‌బుల్‌గా ఫీల్ అవుతాను’’ అని పేర్కొన్నారామె. ఇటీవల విద్యాబాలన్ ‘మళ్లీ సాజిద్‌తో కలసి సినిమా చేయబోనని పేర్కొన్నారు’ కదా అని అడగ్గా –‘‘అందరి అనుభవాలు ఒకలా ఉండవు. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. ఒకవేళ విద్యకు బ్యాడ్ఎక్స్పీరియన్స్ ఎదురై ఉంటే ఆమె అలా రియాక్ట్ అయ్యుండొచ్చు’’ అని చెప్పారు తమన్నా. -
డబ్బింగ్ చెప్పనిస్తారా?
‘మీటూ’ ఉద్యమంలో డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ చిన్మయి శ్రీపాద కీలకపాత్ర పోషించారు. ప్రముఖ తమిళ కవి వైరముత్తుపై ఆరోపణలు చేయడమే కాకుండా, అజ్ఞాతంగా ఉంటూ ఆయనపై ఆరోపణలు చేసినవారి ట్వీట్స్‌ను తన ట్వీటర్లో పోస్ట్ చేశారామె. అది మాత్రమే కాదు.. నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రాధారవిపై కూడా చిన్మయి ఆరోపణలు చేశారు. దాంతో గత ఏడాది నవంబర్‌లో ఎటువంటి ముందస్తు సమాచారం అందించకుండానే డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ సభ్యత్వ ఫీజు చెల్లించలేదనే కారణం చూపి చిన్మయిని యూనియన్ నుంచి పక్కనపెట్టారు. ఈ విషయంలో న్యాయం కోసం చిన్మయి మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు. తాజాగా హై కోర్టు టెంపరరీ స్టే ఇస్తూ, ఈ విషయం మీద మార్చి 25లోగా వివరణ ఇవ్వాలని రాధారవిని ఆదేశించింది. ‘‘ఇది కేవలం కొన్ని రోజుల స్టే మాత్రమే. రాధారవి, అతని అనుచరులు ఎలా స్పందిస్తారో, అప్పుడు కేసు ఎలా ముందుకు నడుస్తుందో చూడాలి. ఇది వరకు యూనియన్ నుంచి తప్పించబడ్డ వాళ్ల అనుభవాలు వింటే ఇది కొన్నేళ్లపాటు సాగే పోరాటం అని అర్థం అవుతోంది’’ అని పేర్కొన్నారు చిన్మయి. ఇలా కేసు ఏళ్ల తరబడి సాగితే చిన్మయి గొంతు తమిళంలో మళ్లీ ఎప్పుడు వినిపించాలి? అసలు చిన్మయికి మళ్లీ డబ్బింగ్ చెప్పుకునే అవకాశం ఇస్తారా? కాలమే చెప్పాలి. -
చిన్మయి నిషేధంపై స్టే
మీటూ ట్వీట్లతో కోలీవుడ్‌లో సంచలనం సృష్టించిన గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాదకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆమె పై తమిళనాడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోషియేషన్ విధించిన నిషేధంపై హైకోర్టు స్టే ఇచ్చింది. గత ఏడాది మీటూ ఆరోపణల నేపథ్యంలో తమిళ డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధా రవిపై చిన్మయి తీవ్ర ఆరోపణలు చేశారు. రాధరవి చాలా సందర్భాల్లో మహిళపై దుర్భాషలాడారని ఆరోపించారు. దీంతో కొద్ది రోజుల్లోనే చిన్మయిపై తమిళనాడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోషియేషన్ నిషేధం విధించింది. ఈ ఘటనపై చిన్మయి కోర్టును ఆశ్రయించారు. కోర్టు నిషేధంపై స్టే విధించటం పట్ల హర్షం వ్యక్తం చేసిన చిన్మయి ‘కోర్టు నా మీద విధించిన నిషేధంపై స్టే ఇచ్చింది. కానీ ఇంకా చేయాల్సిన పోరాటం చాలా ఉంది. న్యాయం జరుగుతుందన్న నమ్మకముంది’ అంటూ ట్వీట్ చేశారు. I have been awarded an interim stay order by the Honble Court regarding my ban from the Tamilnadu Dubbing Union. It is a long legal battle ahead. Hope justice will prevail. Thank you. — Chinmayi Sripaada (@Chinmayi) 15 March 2019 -
చిన్మయి ఫిర్యాదు.. స్పందించిన మేనకా గాంధీ
బాలీవుడ్లో తను శ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమాన్ని సౌత్‌లో ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ముందుండి నడిపించారు. చిన్మయి కూడా స్వయంగా లైంగిక వేధింపుల బాధితురాలే. మీటూ ఉద్యమంలో భాగంగా 18 ఏళ్ల వయసులో వైరముత్తు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని షాకింగ్ విషయాలను బయటపెట్టి సంచలనం సృష్టించారు చిన్మయి. ఆ తరువాత మరి కొందరు వైరముత్తుపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఇండస్ట్రీ వైరముత్తుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ చిన్మయిని మాత్రం కోలీవుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి తప్పించారు. అప్పటి నుంచి వైరముత్తుకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు చిన్మయి. తాజాగా ఈ విషయం గురించి ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రి మేనకా గాంధీకి ఫిర్యాదు చేశారు చిన్మయి. ‘మేడమ్.. వైరముత్తు నన్ను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసి నాలుగు నెలలు అవుతోంది. ఈ విషయంలో నాకు న్యాయం జరగకపోగా.. నన్ను తమిళనాడు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తప్పించారు. ప్రస్తుతం నేను కేసు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను. మీరే నాకేదన్నా దారి చూపండి’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ, మేనకా గాంధీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు చిన్మయి. ఈ ట్వీట్‌పై మేనకా గాంధీ స్పందించారు. ‘మీ కేసును ఎన్సీడబ్ల్యూ (జాతీయ మహిళా కమిషన్) దృష్టికి తీసుకెళ్లాను. మీ వివరాలను నాకు పంపించండి’ అని రిట్వీట్ చేశారు మేనకా గాంధీ. (తమిళంలో చిన్మయి గొంతు వినిపించదు) I have taken up your case with @NCWIndia. Kindly DM your contact details. @Chinmayi @sharmarekha https://t.co/louSvb4Ge6 — Maneka Gandhi (@Manekagandhibjp) February 27, 2019 -
‘మీటూ’పై సినిమా.. జడ్జీ పాత్రలో అలోక్
బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాల్లో, బుల్లి తెర మీద సంస్కారవంతమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అలోక్ నాథ్‌పై కూడాఆరోపణలు వచ్చాయి. రచయిత, నిర్మాత వింటా నందా అలోక్ నాథ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం.. ఆ తరువాత అలోక్ కోర్టులో ఫిర్యాదు చేయడం వంటివి తెలిసిందే. అయితే ఈ వివాదం ఓ కొలిక్కి రాకముందే అలోక్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ప్రచారం అవుతోంది. అదేంటంటే మీటూ ఉద్యమం నేపథ్యంలో బాలీవుడ్లో తెరకెక్కిన మైనేభీ చిత్రంలో అలోక్ నాథ్ జడ్జీ పాత్రలో నటించారు. ఈ విషయం గురించి అలోక్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం నా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ‘మైనే భీ’ అనే సినిమా చిత్రీకరణ కొన్ని రోజుల ముందే పూర్తైంది. ఇందులో నేను జడ్జి పాత్రలో నటించాను. మీకేమన్నా సమస్య ఉందా? నేను ఈ సినిమా చేస్తున్నానని మీరు బాధపడుతున్నట్లున్నారు. పేద నిర్మాతలకు ఈ సినిమాలోని నా పాత్ర అండగా నిలుస్తుంది. విడుదల కానివ్వండి’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు అలోక్. నిసార్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సోనాలి రౌత్, షావర్ అలీ, ఇమ్రాన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. (చదవండి : వింటా నందాకు కోర్టులో ఎదురుదెబ్బ) -
మీటూపై షార్ట్ ఫిల్మ్
ఇండియాలో ‘మీటూ’ ఉద్యమం ఊపందుకోవడానికి తనుశ్రీ దత్తా ముఖ్య కారణం. నానా పటేకర్ లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేశారామె. తనుశ్రీ దత్తా ధైర్యం మరెందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆ తర్వాత చాలామంది నటీమణులు సినిమా పరిశ్రమలో తమకు ఎదురైన చేదు అనుభవాలను బయట పెట్టారు. తాజాగా లైంగిక వేధింపులపై ఓ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట తనుశ్రీ. మార్చి 8న మహిళా దినోత్సవం. ఆ రోజు ఈ వీడియో రిలీజ్ ప్లాన్ చేశారట. వాస్తవిక సంఘటనలకు కాల్పనికత జోడించి ఈ షార్ట్‌ఫిల్మ్ కథను తయారు చేశారట. ఈ షార్ట్ ఫిల్మ్‌లో నటించడమే కాకుండా రైటింగ్ సైడ్ కూడా పాలుపంచుకున్నారట తనుశ్రీ దత్తా. -
#మీటూ : ప్రియా రమణికి బెయిల్
న్యూఢిల్లీ : బాలీవుడ్లో తను శ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సినిమాల్లో, రాజకీయాల్లో పెద్ద మనుషులుగా చెలామణి అవుతోన్న వారి ముసుగులు తొలగించింది. ఎంజే అక్బర్ ఏకంగా మంత్రి పదవికి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన మీద ఆరోపణలు చేసిన జర్నలిస్ట్ ప్రియా రమణి మీద అక్బర్ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రియా రమణికి బెయిల్ మంజూరు చేస్తూ పటియాలా హౌస్ కోర్టు తీర్పునిచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా ప్రియా రమణి న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘ఇక ఇప్పుడు నా వంతు.. నా కథను ప్రపంచానికి వినిపించే సమయం వచ్చింది. నిజమే నా ఆయుధం’ అని పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో 20 ఏళ్ల క్రితం అక్బర్ తమని లైంగికంగా వేధించారని ఆయన మాజీ సహచర ఉద్యోగులు ప్రియా రమణి, ప్రేరణాసింగ్ బింద్రా, పేరు తెలియని మరో మహిళా జర్నలిస్టు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే వీటిని అవాస్తవమని కొట్టి పారేసిన అక్బర్ జర్నలిస్టు ప్రియా రమణిపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఆమె తప్పుడు ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం కేసు నమోదు చేశారు. (#మీటూ : అక్బర్ అత్యాచార పర్వం..వైరల్ స్టోరీ) -
శత్రుఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు
-
‘ప్రతీ వ్యక్తి పతనం వెనుక కూడా ఓ మహిళ ఉంటుంది’
సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ నటుడు, బీజేపీ నాయకుడు శత్రుఘ్న సిన్హా. సొంత పార్టీ నాయకుల మీదే వివాదాస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడే ఈ సీనియర్ స్టార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబైలో ఓ బుక్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న శత్రుఘ్న సిన్హా మీటూ ఉద్యమం పై స్పందించారు. ‘మీటూ ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను ఈ వ్యాఖ్యలు చేయడానికి ఏ మాత్రం సంశయించటం లేదు. విజయవంతమైన ప్రతీ వ్యక్తి పడిపోవటం వెనుక కూడా ఓ మహిళ ఉంటుంది. మీటూ వివాదంలో నా పేరు వినిపించకపోవటం అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు. -
మీటూపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు!
తమిళనాడు, పెరంబూరు: మీటూపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని గాయని, డబ్బింగ్ కళాశారిని చిన్మయి ఆరోపించారు. సోమవారం నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈమె తాము మోదీ పేరును ప్రస్తావించడానికి పోలీసు అధికారులు అనుమతించలేదన్నారు. లలిత మోదీ గురించి పాడతామన్నా అంగీకరించలేదని తెలిపారు. అలాంటిది మీటూ వ్యవహారం గురించి చట్టంలో మార్పులు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి, ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి బదులు రాలేదన్నారు. దీంతో చట్టం నిరుపయోగంగా ఉన్న స్థితిలో మనం ఉన్నట్టు భావించాల్సి వస్తోందని చిన్మయి అన్నారు. తనను డబ్బింగ్ కళాకారుల యూనియన్ నుంచి తొలగించిన వ్యవహారంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని చిన్మయి పేర్కొన్నారు. -
∙మీటూ; ద వే ఫార్వార్డ్ చనిపోతే తప్ప నమ్మరా?
హైదరాబాద్, బేగంపేటలో ఉంది ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌కు వేదిక ఆ స్కూలే. ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్. ఇది తొమ్మిదో ఎడిషన్. నిన్న మొదలైన ఈ మూడు రోజుల పండుగ రేపటితో ముగుస్తుంది. ఈ ఏడాది ఫెస్టివల్‌కి అతిథి చైనా దేశం. గాంధీజీ 150వ జయంతి ఏడాది కావడంతో గుజరాత్ సాహిత్యం సాహిత్యం, గాంధీజీ ప్రధానాంశాలుగా రూపొందిందీ ప్రోగ్రామ్. సాహిత్య సభలో సిరాచుక్క సాక్షిగా ‘మీటూ’ సామాజికాంశం ప్రధానమైన చర్చనీయాంశమైంది. అనేక ఆవేదనలకు సంగ్రహరూపంగా ‘మీటూ; ద వే ఫార్వార్డ్’ ప్యానల్ డిస్కషన్ జరిగింది. ఇందులో చిన్మయి శ్రీపాద, సంధ్య మెనన్, సుతప పాల్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది వసుధా నాగరాజ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఎవరికి చెప్పుకోవాలి ‘బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ ద కంట్రీ’ అంటూ ప్రశంసపూర్వకంగా ఆహ్వానించారు వసుధ. ‘‘సమాజం అధికార సమీకరణల మీద నడుస్తోందని, అది విద్యార్థిని– టీచర్ నుంచి అధికారి – ఉద్యోగిని వరకు అన్ని చోట్లా విస్తృతంగా రాజ్యమేలుతోందని నిరసించారామె. ‘మీటూ’ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ ‘నా దేహాన్ని పణంగా పెట్టడం ఎందుకు’ అంటూ శ్రీరెడ్డి గళం విప్పినప్పుడు తెలిసింది సినిమా ఇండస్ట్రీకి విశాఖ గైడ్‌లైన్స్ గురించి తెలియదని. ధైర్యంగా బయటకు వచ్చిన తనుశ్రీదత్తా నుంచి ఎవరు కూడా కంప్లయింట్ ఫైల్ చేసే అవకాశమే లేని విధంగా నడుస్తోంది మన వ్యవస్థ. పని ప్రదేశంలో సెక్సువల్ హెరాస్మెంట్ ప్రివెన్షన్ సెల్ ఉండాలనే నిబంధన అమలు చేయించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి’’ అన్నారు వసుధ. ‘‘మగవారికి ప్రతికూలమైన అంశాల మీద కనీస చర్చ లేకుండా వీలయినంత త్వరగా తుడిచేయడానికే చూస్తుంది సమాజం. బేటీ బచావో, బేటీ పడావో అనే నినాదం మంచి ఫలితాలనివ్వాలంటే మహిళలకు ఉద్యోగం చేసే చోట సురక్షితమైన వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం కల్పించే వరకు ప్రభుత్వాలు పర్యవేక్షిస్తూనే ఉండాలి’’ అని రచయిత సంధ్యా మెనన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అసత్యపు ఆరోపణలు అంటూ గొంతుచించుకోవడం మీద తన అధ్యయనాన్ని వివరిస్తూ ‘‘నేపాల్ నుంచి కేరళ వరకు రకరకాల మహిళలను కలిశాను. వారి అనుభవాలను తెలుసుకున్నాను. నా ఫోన్‌కు 250 మెసేజ్‌లు వచ్చాయి. వాటిలో మూడు మాత్రమే పెద్దగా ప్రాధాన్యం లేనివి. మిగిలినవన్నీ ఏ మాత్రం సందేహం లేకుండా వేధింపు అని అంగీకరించాల్సినవే. ఆ మూడింటిని కూడా అసత్యపు ఆరోపణలు అనడానికి వీల్లేదు. చిన్నపాటి అపార్థాల కారణంగా లేవనెత్తిన ఆరోపణలవి.మీటూ ఉద్యమంలో స్పందించే గొంతుకలు ఉన్నాయి. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించుకోవాలి’’ అన్నారు సుతప పాల్. గళం విప్పినందుకు.. సమంత, భూమిక, కాజల్, త్రిష, పూజా హెగ్డే, సోనాక్షి సిన్హా, నయనతార, లావణ్య త్రిపాఠి... వంటి అనేక మంది హీరోయిన్ల ద్వారా మనకు స్వర పరిచితురాలు చిన్మయి శ్రీపాద. సింగర్‌గా సింగిల్ కార్డుతో పాటలు పాడిన అమ్మాయి. నంది, ఫిలింఫేర్, స్టేట్ అవార్డు వంటి లెక్కలేనన్ని అవార్డులందుకున్న అమ్మాయి. బ్లూ ఎలిఫెంట్ కంపెనీ సీఈవోగా విజయవంతంగా నడుస్తున్న కెరీర్ ఆమెది. తమిళనాడు నుంచి ఫార్చ్యూన్ గ్లోబల్ ఉమెన్స్ మెంటరింగ్ పార్ట్నర్ షిప్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన తొలి మహిళ. ఒకప్పుడు గడియారంతో పాటు పరుగులు తీస్తూ... రోజుకు ఐదారు పాటలు పాడిన అమ్మాయి. ఇప్పుడు రోజుకు ఒక పాటకు మించడం లేదు. దీనంతటికీ కారణం తమిళ కవి, పాటల రచయిత వైరముత్తు అకృత్యాలను బయటపెట్టడమే. ‘మీటూ’ అంటూ బయటకొచ్చిన బాధితులకు ఆలంబనగా నిలిచినందుకు ఆమె చెల్లిస్తున్న మూల్యం ఇది. ‘‘సక్సెస్‌లో ఉన్నావు కెరీర్‌ని కోల్పోవద్దు... అని చెప్పింది మా అమ్మ. కెరీర్ కంటే స్త్రీగా ఆత్మగౌరవం ముఖ్యం కదా అమ్మా అన్నాను. వైరముత్తు మీద నోరు తెరిచిన క్షణం నుంచి ఈ క్షణం వరకు వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. వైరముత్తు వేసుకున్న జెంటిల్మన్ ముసుగును తొలగిస్తూ వందల మంది బయటకు వచ్చారు. అప్పటివరకు నా కులం ప్రస్తావన రాలేదు, వాళ్ల అఘాయిత్యాలను బయటపెట్టినప్పటి నుంచి కుల సమీకరణలు మొదలయ్యాయి. అవి రాజకీయ సమీకరణలకు దారితీశాయి. వాటంతటగా అవి దారి తీయలేదు. అలా తీయించారు. ‘పబ్లిసిటీ కోసం సమాజంలో పేరున్న వాళ్ల మీద ఇలాంటి ఆరోపణలు చేయడం మామూలే’ అన్నాడా పెద్దమనిషి. పదిహేడేళ్లపాటు నిర్మించుకున్న కెరీర్ నాది. నేనందుకున్న అవార్డులకు లెక్కేలేదు. అలాంటి నేను పబ్లిసిటీ కోసం అర్థరహితమైన ఆరోపణలు చేయడం నాకవసరమా? పద్మశ్రీలు, పద్మభూషణ్‌లు అందుకున్న వ్యక్తి (వైరముత్తు) అనాల్సిన మాటలు కావవి. సోషల్ మీడియాలో నా మీద ట్రోలింగ్ ఎక్కువైంది. ప్రాణ హాని ఉంటుందని, ఒక్కదానినే ప్రయాణం చేయవద్దని స్నేహితులు, బంధువులు జాగ్రత్తలు చెబుతున్నారు. ఏరోజు ఏదైనా జరగవచ్చనేటంతగా భయానక వాతావరణం ఏర్పడి ఉంది. ఇది కూడా పవర్ ఉన్న వాళ్లు వ్యూహాత్మకంగా సృష్టించినదే.ఇలాంటి విషయాల్లో భారతీయ సమాజం మారాలి. పితృస్వామ్య భావజాలంతోపాటు స్త్రీ అంటే తేలిక భావం, ఏదైనా అనవచ్చు అనే ఆధిక్య భావన కరడు గట్టుకుని ఉంది. మహిళను నమ్మరు, ఆమె మాటను విశ్వసించరు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ఏమిటంటే... వివాదాన్ని ఎదుర్కొంటున్న మహిళ తాను చెప్పదలచుకున్న విషయాన్ని రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నప్పుడే ఆమె మాటను విశ్వసిస్తారు. బతికి ఉండి చేసే పోరాటానికి మద్దతు ఇవ్వడానికి పురుష సమాజానికి మనసు రాదు. ఈ పోకడ మారనంత వరకు ఈ పోరాటాలు తప్పవు’’ అన్నారు గాయని చిన్మయి శ్రీపాద. – వాకా మంజులారెడ్డిఫొటోలు: అనిల్ కుమార్ మహిళ తాను చెప్పదలుచుకున్న విషయాన్ని రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నప్పుడే ఆమె మాటను విశ్వసిస్తారు. బతికి ఉండి చేసే పోరాటానికి మద్దతు ఇవ్వడానికి పురుష సమాజానికి మనసు రాదు. మంచి పరిణామం కోసమే ‘‘నా మీద ఏ క్షణాన అయినా దాడి జరగవచ్చు. దాడి జరుగుతుందని వెనక్కి పోవడం ఉండదు. ఇప్పటి వరకు జరిగిన దాని పట్ల నాకు ఎటువంటి విచారమూ లేదు. జరగాల్సినదే జరిగింది. జరగాల్సిన మంచి పరిణామానికి వేసిన అడుగు ఇది. ఒక మంచి జరగాలంటే కొంత ఘర్షణ తప్పదు. అలాంటి ఘర్షణే ఇది. లక్ష్యాన్ని చేరే వరకు ప్రయాణం కొనసాగుతుంది. – చిన్మయి శ్రీపాద, గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ -
మీటూ ఆరోపణలపై నమ్మకం లేదు : హీరోయిన్
అచ్చం ఎంబదు మడమయడా చిత్రంతో కోలీవుడ్, టాలీవుడ్ (తెలుగులో సాహసమే శ్వాసగా)లో ఒకే సారి పరిచయమైంది మంజిమా . ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించినా మంజిమామోహన్ కెరీర్ మాత్రం వేగం పుంజుకోలేదనే చెప్పాలి. హిందీ చిత్రం క్వీన్ మలయాళ రీమేక్‌లో కంగనారావత్ పాత్రలో నటించింది. జామ్జామ్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఈ చిత్ర విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జామ్ జామ్ పాటు మరో మలయాళ చిత్రంలోనూ నటిస్తోంది. ఇక తమిళంలో ప్రస్తుతం ఈ బ్యూటీ గౌతమ్‌కార్తీక్‌తో జత కట్టిన దేవాట్టం చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. తాజాగా జీవా, అరుళ్‌నిధి కలిసి నటిస్తున్న చిత్రంలో నాయకిగా నటించబోతోంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న మీటూ గురించి ప్రస్తావన తీసుకురాగా, మీటూ కారణంగా చిత్ర పరిశ్రమలో ఏదో మార్పు వచ్చిందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు మంజిమామోహన్ బదులిస్తూ దాని గురించి తనకు తెలియదంది. అలాంటి అనుభవం తనకు ఎదురు కాలేదని పేర్కొంది. మీటూ వ్యవహారంలో కొందరి అనుభవాలు నమ్మదగ్గవిగానూ, మరి కొందరి ఆరోపణలు నమ్మశక్యంగానివిగానూ ఉన్నాయని చెప్పింది. చెప్పాలంటే మీటూ ఆరోపణలపై నమ్మకం లేదని పేర్కొంది. తాను షూటింగ్‌కు వచ్చానా, పేకప్ అయ్యిందా, ఇంటికి వెళ్లానా అన్నట్టుగా తన దిన చర్య ఉంటుందని మంజిమామోహన్ అంది. అయినా ఎదిగే దశలో ఉన్న ఈ అమ్మడు ఇంత కంటే ఏం చెబుతుంది. -
మున్నా భాయ్ 3కి కష్టాలు..?
ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మీద లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కాబోయే మున్నా భాయ్ 3 సినిమా మీద ఈ ఎఫెక్ట్ పడినట్లు సమాచారం. హిరానీ మీద వచ్చిన లైంగిక వేదింపుల ఆరోపణల గురించి ఓ క్లారిటీ వచ్చే వరకూ ఈ సినిమా పనులను ప్రారంభించకూడదంటూ ఫోక్స్ సంస్థ ఆదేశించినట్లు సమాచారం. హిరానీ మీద వచ్చిన ఆరోపణలు నిజమని తెలితే ఇక మున్నా భాయ్ 3ని తెరకెక్కించడం జరగదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కాక సోనమ్ కపూర్, అనిల్ కపూ్లు ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ ప్రమోషన్ కార్యక్రమాల్లోంచి హిరాణీ పేరును తొలగిస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వీవీసీ పేర్కొంది. అంతేకాక ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు వీసీసీ వర్గాలు తెలిపాయి.‘సంజు’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో హిరానీ తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని హిరానీ ఫిల్మ్ మేకింగ్ పార్ట్నర్ విదూ వినోద్ చోప్రా, ఆయన భార్య అనుపమా చోప్రా, రచయిత అభిజిత్ జోషీకు మెయిల్ చేశానని సదరు మహిళ తెలిపారు. అయితే ఈ ఆరోపణలు అసత్యమని, తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే ప్రయత్నమే అని కొట్టిపారేశారు హిరానీ. -
టాప్ డైరెక్టర్‌పై లైంగిక ఆరోపణలు.. షాక్‌లో బాలీవుడ్!
‘మీటూ’ ఉద్యమంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో చాలామంది లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నారు. తాజాగా ‘3 ఇడియట్స్, సంజు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అగ్రదర్శకుడు రాజ్ కుమార్ హిరానీపై ‘సంజు’ సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేసిన ఓ మహిళ ఆరోపించారు. ‘‘సంజు’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో హిరానీ నన్ను లైంగికంగా వేధించారు. ఆయన్ని ఓ తండ్రిలా భావించాను. మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు. ఆ పరిస్థితుల్లో ఉద్యోగం పోతే మళ్లీ ఉద్యోగం సంపాదించడం కష్టం అవుతుందని సైలెంట్‌గా ఉండిపోయాను’’ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని హిరానీ ఫిల్మ్ మేకింగ్ పార్ట్నర్ విదూ వినోద్ చోప్రా, ఆయన భార్య అనుపమా చోప్రా, రచయిత అభిజిత్ జోషీకు మెయిల్ చేశారామె. అయితే ఈ ఆరోపణలు అసత్యమని, తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే ప్రయత్నమే అని కొట్టిపారేశారు హిరానీ. టాప్ డైరెక్టర్‌పై ఇలాంటి ఆరోపణ రావడం బాలీవుడ్‌కి పెద్ద షాకే. -
వింటా నందాకు కోర్టులో ఎదురుదెబ్బ
సినిమాల్లో, టీవీ షోలలో సంస్కారవంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు అలోక్‌నాథ్.. తనపై అత్యాచారం చేశాడంటూ ‘మీటూ ఉద్యమం’లో భాగంగా రచయిత, నిర్మాత వింటానందా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలోక్ ఈ ఆరోపణలను ఖండిచడమే కాకా వింటానందాపై పరువు నష్టం దావా కూడా వేశారు. అయితే, వింటా ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అలోక్‌పై కేసు నమోదు చేశారు. కేసును విచారించిన ముంబై సెషన్స్ కోర్టు అలోక్‌కి శనివారం ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది. (ప్రముఖ నటుడిపై రేప్ కేస్ నమోదు) కోర్టు ఏమన్నదంటే.. తనపై అఘాయిత్యం జరిగినప్పుడు స్వీయప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వింటానందా నాడు నోరు మెదపలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అలోక్‌ను ఈ కేసులో తప్పుగా ఇరికించారనే వాదనలను కొట్టిపారేయలేమని చెప్పింది. 19 ఏళ్లక్రితం తనపై అత్యాచారం జరిగిందనీ, అప్పడు అలోక్ పెద్ద నటుడు అయినందున భయపడి నోరుమెదపలేదనే నందా ఆరోపణల్లో పస లేదని కోర్టు తేల్చింది. ‘ఆమె చెప్పిన కథ నమ్మశక్యంగా లేదు. అలోక్‌ను నిందితుడిగా పేర్కొనడానికి వింటా దగ్గర సరైన ఆధారాలు లేవనిపిస్తోంది. సంఘటన వివరాలన్నీ చెప్తున్న బాధితురాలు దాడి జరిగిన తేదీ లేదా సంవత్సరం మాత్రం చెప్పడం లేదు. అత్యాచారం జరిగింది తన ఇంట్లోనే అని నందా చెప్తోంది. అటువంటప్పుడు ఘటనకు సంబంధించిన ఆధారాలు నాశనమయ్యే వీలేలేదు’ అని కోర్టు అభిప్రాయపడింది. నందా ఇంటివైపు అలోక్ వెళ్లొద్దనీ, ఈ కేసుతో సంబంధమున్న వారిని బెదిరించడం, లంచాలు ఇవ్వడం వంటివి చేయొద్దని కోర్టు ఆంక్షలు విధించింది. -
మీటూ భయాన్ని సృష్టించింది
సినిమా ఇండస్ట్రీలో ‘మీటూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంపై కొందరు నటీనటులు తమ అభిప్రాయాలను వివిధ సందర్భాల్లో పంచుకున్నారు. తాజాగా మీటూ ఉద్యమం గురించి మలయాళగ దర్శకుడు లాల్ జోస్ మాట్లాడుతూ– ‘‘సినిమా షూటింగ్ సమయంలో నా తోటి వారితో కొన్నిసార్లు కోపంగా, మరికొన్నిసార్లు స్నేహపూర్వకంగా ఉంటాను. పురుషులు, మహిళలనే బేధం లేకుండా అందరితో ఒకేలా మాట్లాడతాను. అయితే నేను ఆగ్రహం వ్యక్తపరిచినప్పుడు ఎవరు ఎలా తీసుకుంటారో నేను ఊహించలేను. అందుకే ‘మీటూ’ వచ్చాక నా టీమ్‌లోకి మహిళలను తీసుకోవడానికి భయంగా ఉంది. దాదాపు 20 ఏళ్ల క్రితం సెట్లో నా ప్రవర్తన బాగోలేదని ఓ పాపులర్ లేడీ ఫొటోగ్రాఫర్ నాపై ఆరోపించారు. అయితే అది నిజం కాదు. ఇప్పుడు మీటూ ఉద్యమం ఒక భయాన్ని క్రియేట్ చేసిందని నా అభిప్రాయం. కానీ ఈ భయం మంచికా? లేక చెడుకా? అనేది చెప్పలేం’’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా పేర్కొన్నారు. -
ఈ ఉద్యమాలతో ఏం సాధిస్తారు?
‘‘నేను స్త్రీవాదినే. కాకపోతే ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ‘మీటూ’ ఉద్యమమంతా రబ్బిష్ (చెత్త) ’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటి షావుకారు జానకి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇలా పేర్కొన్నారామె. ఓ తమిళ చానెల్ ఇంటర్వ్యూలో ‘మీటూ’ గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘కొన్ని రోజులుగా టీవీల్లో, పేపర్స్‌లో ‘మీటూ’ గురించే వార్తలు వస్తున్నాయి. ఎప్పుడో ఇలాంటి ఓ పనికి అంగీకరించి ప్రస్తుతం ప్రమోషన్ కోసం దానిని వాడుకుంటున్నారు. ఇలాంటి పనుల వల్ల మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పరువు పోవడం తప్ప ఏం లేదు. ఇలాంటి ఉద్యమాలతో ఏం సాధిస్తారు? చీప్ పబ్లిసిటీ కోసం ఎప్పుడో జరిగినవాటి గురించి, లేదా జరగని వాటి గురించిన ఆరోపణలు చేస్తున్నారు వీళ్లంతా’’ అని పేర్కొన్నారు షావుకారు జానకి. -
‘ఇప్పటివరకు ఇంత చెత్త మాటలు నేను వినలేదు’
‘నా అంతరాత్మ క్షోభిస్తోంది. ఇప్పటివరకు ఇంత చెత్త మాటలు నేను వినలేదు. బాధితులే మారాలి గానీ, కారకులకు ఈ విషయంతో ఎటువంటి సంబంధం ఉండదని చెప్పాలనుకుంటున్నారా ఏంటి రాణీ గారు!’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మీరు చెప్పిందే సరైంది అనుకుంటే...నాలుగు నెలల పాపాయి తనపై అకత్యానికి పాల్పడే వ్యక్తిని ఎలా అడ్డుకోగలదు అని ఆమెను విమర్శిస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే... ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చలో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, అనుష్క శర్మ , అలియా భట్, రాణి ముఖర్జీలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తోన్న ‘మీటూ’ ఉద్యమం గురించి వారి వారి అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో దీపికా, అనుష్కలు మాట్లాడుతూ ఇంటి తర్వాత మహిళలకు అత్యంత సురక్షితంగా భావించాల్సిన ప్రదేశం పని ప్రదేశమే కాబట్టి వారికి అక్కడ రక్షణ ఉండాలని పేర్కొన్నారు. కాగా వీరి వ్యాఖ్యలకు స్పందించిన రాణీ ముఖర్జీ..‘ మహిళలు స్వతహాగా బలవంతులుగా ఉండాలి. వేధింపులు ఎదురైనపుడు, అకృత్యాలు జరిగినపుడు వాటిని అడ్డుకునే ధైర్యవంతులై ఉండాలి. అందుకోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. అప్పుడే పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో... ‘ఒక పెద్ద ప్రొడక్షన్ హౌజ్ కలిగి ఉన్న మహిళ ఇలా మాట్లాడటం సిగ్గుచేటు. అమ్మాయిలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని చెప్పారు.. ఇందుకు బదులు ప్రతీ తల్లి తన కొడుకును సత్ప్రవర్తనతో పెంచాలని మీకు అనిపించడం లేదా... మీరు జోక్ చేయట్లేదు కదా! పసికందులు ఎన్ని విద్యలు నేర్చుకున్నా మీరు చెప్పినట్లు జరిగే అవకాశమే లేదు’ అని రాణీని విమర్శిస్తున్నారు. ఇక.. రాణీముఖర్జీ బాలీవుడ్ బడా నిర్మాత ఆదిత్య చోప్రా భార్య అన్న సంగతి తెలిసిందే. I'm cringing my soul out! Rani's take on #Metoo is the worst thing I have ever heard, she's basically saying that the victims should change but not the other way around. Annoying as fuck that she didn't let Anu & Deepika talk... #RaniMukerji pic.twitter.com/du5ieVYhW1 — ♡ (@bollypardesi) December 30, 2018 #RaniMukerji was never relevant enough to be cancelled but seeing what she had to say abt #Metoo movement is truly appalling. The woman who has the biggest production house behind her rich entitled ass saying women should behave themselves? You've got to be kidding me!!! pic.twitter.com/RSN6jC5QNX — ً (@srkkajol_) December 29, 2018 -
‘మీ టూ’ కంటే ముందే.. మనీషా
అవును.. వారి ‘అరుపు’లో నిజాయితీ ఉంది.. ఎమోషన్ ఉంది.. ఒక బృందం కష్టంతో పాటు చిత్తశుద్ధి ఉంది. అందుకే ఆ తెలుగు వీడియో అంతర్జాతీయ వేదికపై కేక పుట్టించింది. చూసిన వారందరినీ కంట తడి పెట్టించింది. శాన్ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ అవార్డుని దక్కించుకుంది. ‘అరుపు’ వీడియో టీమ్‌ని పలకరించినప్పుడు తమ వీడియో ప్రారంభం నుంచి అవార్డు వరకు జర్నీ విశేషాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘అరుపు’ అలా మొదలైంది..రోల్‌రైడా ‘ఆసిఫా’ ఘటన నన్ను షాక్‌కు గురిచేసింది. ఆడ శిశువనే కారణంతో ఆరునెలల బిడ్డని తల్లిదండ్రులే కర్చిఫ్ నోట్లో కుక్కి చంపేశారని ఫ్రెండ్ చెబితే కలవరపడ్డాను. వెంటనే పాట రాశాను. తర్వాత ఇలాంటి ప్రాజెక్ట్ ఉంటే చెప్పమన్న ప్రొడ్యూసర్స్‌కి సాంగ్ పంపించాం. వారికి నచ్చింది. డైరెక్టర్ హరికాంత్ని వారికి కలిపించాను. లిరిక్స్ రికార్డ్ చేసి, నా వరకు వీడియో రికార్డ్ చేసి నేను బిగ్‌బాస్‌లోకి వెళ్లిపోయాను. అంతే, తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కాన్సెప్టే డిఫరెంట్‌గా చేశారు.. నిజరూపానికి ప్రతిబింబాన్ని అద్దంలో చూస్తాం. అలా మనకు కళ్లకు కనిపించేది వాస్తవం కాదు. అసలు నిజం ఏంటో తెలుసుకోవాలి. కంటికి చాలా మాములుగా కనిపించే ఎన్నో విషయాల వెనుక ఎన్నో భయంకర విషాదాలు ఉండవచ్చు. అందుకే ఈ కాన్సెప్ట్‌ని ఇలా రెడీ చేశాం. కమరాన్ చాలా కష్టపడ్డాడు. మనీషా బాగా పాడింది. తర్వాత మేం షూట్ కోసం అడిగాం. ఆమె ఒప్పుకుంది. కానీ ఆమెకు షూట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నామో అర్థం కాలేదు. వీడియో పూర్తయ్యాక మెచ్చుకుంది. ప్రాజెక్ట్ విలువ రూ.27 లక్షలు.పోస్ట్ ప్రొడక్షన్‌కి, వీఎఫెక్ట్కి ఎక్కువ సమయం పట్టింది. తర్వాత ఏం జరిగింది..కమరాన్, మ్యూజిక్ కంపోజర్ సీరియస్ ఇష్యూస్‌ని తీసుకుని ర్యాప్ వీడియోలు చేయాలని ముందు నుంచే ఉంది. కానీ స్టార్టింగ్‌లోనే ఇలాంటి పాట చేసి ఉంటే మమ్మల్ని ఎవరూ గుర్తించేవారు కాదు. ఇప్పుడు మాకు ఒక లిజనర్షిప్ ఉంది. అది రైడా ఫీలై రాసేసరికి ఇక ఆలస్యం చేయకుండా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. రైడా డెమో ట్రాక్ పాడించి పెట్టాం. తర్వాత తను బిగ్‌బాస్‌కి వెళ్లిపోయాడు. దాని మీదే రైడా షూట్ కూడా జరిగింది. మనీషా యూఎస్ నుంచి రావడానికి 20 రోజుల టైం ఉండే. అప్పుడు ఈ ఎఫెక్ట్స్ చేసి పెట్టాను. ఆమె ఇంగ్లిష్‌లో పాడుతుంది, డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చు. సినిమాకి మ్యూజిక్ స్క్రిప్ట్ పరంగా చేయాలి. ఇండిపెండెంట్ మ్యూజిక్‌కి ఉన్న పవర్ ఏంటంటే,ఆర్టిస్ట్‌కి నచ్చింది చేసే స్వేచ్ఛ ఉంటుంది.. నిజాయితీగా చేస్తారు. దాంతో వినే వారు కనెక్ట్ అవుతారు. అందుకే చేస్తున్నప్పుడు జనాల్లోకి వెళుతుందా లేదా అనే డౌట్ రాదు. ఈ వీడియోకి చాలా హ్యూజ్ రెస్పాన్ వచ్చింది. ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారు. పతంగ్ తర్వాత మళ్లీ అంత రెస్పాన్స్ ఇంది. ప్రొడ్యూసర్లు కూడా ఒక్క ప్రశ్న వేయకుండా సపోర్ట్ చేశారు. ‘మీ టూ’ కంటే ముందే.. మనీషా ఇది రోల్‌రైడా ఐడియా. అమ్మాయిలపై లైంగిక హింస, వేదింపులు అనేక అంశాలు చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మన దగ్గర ‘మీ టూ’ కంటే ముందే ఈ వీడియో విడుదలైంది. ‘మీ టూ’ వంటి మూమెంట్ వల్ల మార్పు వెంటనే వస్తుందని చెప్పలేం. కానీ అందరూ దీని గురించి మాట్లాడతారు.. ఆలోచిస్తారు. అవగాహన పెరుగుతుంది. మార్పుకి మార్గం ఏర్పడుతుందని భావిస్తాను. మీ గురించి... వీడియో గురించి.. ‘నేను లోకల్, మహానుభావుడు, సవ్యసాచి, ఈ నగరానికి ఏమైంది’ చిత్రాల్లో పాడాను. మాషప్స్ చేస్తుంటాను. అది చూసి రోల్, కమరాన్ ఏదైనా ప్లాన్ చేద్దామన్నారు. నేను పాడిన లిరిక్స్, కోరస్ కృష్ణకాంత్ రాశారు. మిగతాది రోల్‌రైడా రాశారు. ఈ పాటను యూఎస్ నుంచి వచ్చి పాడాను. తర్వాత వీడియోలో కూడా ఉంటే బాగుంటందన్నారు. గంటలో షూటింగ్ అయిపోయింది. చాలా మంచి రివ్యూస్, ఫీడ్‌బ్యాక్ వచ్చాయి. కొంతమంది ఈ వీడియో చూసి మాకు ఏడుపొచ్చింది అని మెసేజ్ చేశారు. అంతకంటే గొప్ప రివ్యూ ఏం ఉంటుంది? ఈ ప్రాజెక్ట్ చేయడానికి కారణమిదీ..సునీల్ గడ్డమేడి,వీడియో ప్రొడ్యూసర్ నేను ఓ ఈవెంట్లో రైడాను కలిసినప్పుడు తెలుగులో ఎక్కువగా మ్యూజిక్ వీడియోలు వేడుకలు, పండుగలు, సంబురాల మీదనే ఉన్నాయి. అలా కాకుండా వెస్ట్రన్ మ్యూజిక్‌లో సీరియస్ ఇష్యూస్‌ని.. ముఖ్యంగా స్త్రీల సమస్యలను చూపవచ్చు కదా అని సూచించా. అయితే, అలాంటివి చేయాలని తనకున్నా ప్రొడ్యూసర్లు ముందుకు రారని రైడా అన్నారు. స్త్రీ సాధికారతపై వీడియో ప్లాన్ చేస్తే చెప్పమన్నాం. తను ఈ రికార్డింగ్ పంపితే విన్నా.. బాగా నచ్చింది. వెంటనే ప్రాజెక్టుకు ఓకే చెప్పాం. ముప్పైవేల డాలర్లు ఖర్చవుతుందన్నారు. శ్రీని శ్రీగద నా ఫ్రెండ్. ఈ ప్రాజెక్ట్‌కి ఎక్కువ బడ్జెట్ అవసరం కావడంతో తనని అడిగాను. వెంటనే ఏ వివరాలు అడగకుండా ఆయన ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. మూడు నెలల్లో పూర్తి చేశాం. ఎక్కువ ప్రమోషన్ చేయకుండానే వీడియో పాపులర్ అయింది. ఇకపై కూడా అర్థవంతమైన ప్రొడక్షన్స్ చేస్తాం. పరిచయం లేనివారు కూడా వివరాలు తెలుసుకొని ఫొన్ చేసి చక్కటి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఒక్కటే బాధ, యాదృచ్ఛికంగా ‘మీ టూ’ సమయంలో ఈ వీడియో విడుదలైంది. అయినా ఫెమినిస్టులు, సెలబ్రిటీలు ఈ వీడియో గురించి మాట్లాడ్డం గానీ, ట్వీట్ కానీ చేయలేదు. అదే కొంచెం వెలితి. అంతర్జాతీయ పురస్కారం.. ‘అరుపు’ మ్యూజిక్ వీడియోలో రోల్‌రైడా, మనీషా పాడడంతో పాటు నటించారు. హరికాంత్ గుణమగరి దర్శకత్వం వహించిన ఈ వీడియోకి మ్యూజిక్ స్కోర్ అందించింది కమరాన్. ఈ వీడియోని యూ–ట్యూబ్‌లో 50 లక్షల మందికి పైగా వీక్షించారు. శాన్ఫ్రాన్సిస్కో న్యూ కాన్సెప్ట్ ఫిలిం ఫెస్టివల్ యూఎస్ఏ అవార్డు దక్కించుకుంది. భారత్ నుంచిఎంపికైన ఏకైక చిత్రం ‘అరుపు’ మాత్రమే. ప్రొడ్యూసర్స్ సునీల్ గడ్డమేడి, శ్రీని శ్రీగదని ఈ ఫెస్టివల్‌కి ఆహ్వానించారు. ఈ వీడియో ‘ది బెస్ట్’గా అవార్డు అందుకుంటుందని ఎప్పుడూ ఊహించలేదంటోంది ఈ వీడియో బృందం. -
మగవారూ వేధింపులకు గురవుతున్నారు: నటి
పెరంబూరు: మహిళలే కాదు, పురుషులూ లైంగిక వేధింపులకు గురవుతున్నారని నటి గౌతమి పేర్కొన్నారు. కేన్సర్ బారి నుంచి బయటపడిన అతి కొద్ది మందిలో ఈమె ఒకరు. కోవిల్ పట్టిలో ఆదివారం జరిగిన కేన్సర్‌పై అవగాహన, యోగా శిక్షణ శిబిరం కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నటి గౌతమి మాట్లాడుతూ కేన్సర్ వ్యాధి కారణంగా తనకు పలు సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. వైద్య చికిత్స పొందిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయ్యిందన్నారు. శరీరం పూర్తిగా కట్టుబాటులోకి రావడానికి యోగా బాగా పని చేసిందని చెప్పారు. కేన్సర్ సోకిన విషయాన్ని బయట పెట్టకపోవడం, ఆ వ్యాధిని నిర్లక్ష్యం చేయడం వంటివి శ్రేయస్కరం కాదన్నారు. అలా చేస్తే ప్రాణానికే కాకుండా, కుటుంబానికే హాని జరుగుతుందని పేర్కొన్నారు. ఇకపోతే ప్రస్తుతం సినిమా పరిశ్రమలోనే కాదు ఇతర రంగాల్లోనూ లైంగిక వేధింపులు కలకలం సృష్టిస్తున్నాయన్నారు. లైంగిక వేధింపులు మహిళలకే కాకుండా, మగవారు, పిల్లలు, పెద్దలు అంటూ అందరూ పలు విధాలుగా ఎదుర్కొంటున్నారన్నారు. ఇలాంటి విషయాల్లో రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అదే విధంగా ఇటీవల నిర్మాతల మండలి వ్యవహారం రచ్చరచ్చగా మారిందని, అయితే ఆ సమస్యను వారే పరిష్కరించుకుంటారని నటి గౌతమి అన్నారు. -
అవగాహన లేకుండా మాట్లాడను
ఈ ఏడాది ‘మీటూ’ ఉద్యమం ఇండియన్ ఇండస్ట్రీలను ఊపేసింది. మమ్మల్ని వేధించారంటూ చాలామంది నటీమణులు కొందరి స్టార్స్‌పై ఆరోపణలు చేశారు. ఈ ఉద్యమాన్ని చాలా మంది సపోర్ట్ చేయగా కొందరు వ్యతిరేకించారు కూడా. ‘మీటూ’ ఉద్యమాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? అని నటుడు అరవింద స్వామిని అడగ్గా – ‘మీటూ’ ఉద్యమాన్ని స్వాగతిస్తాను. కానీ సపోర్ట్ చేస్తానా? లేదా విమర్శిస్తానా అనే స్టాండ్ తీసుకోలేను’’ అని పేర్కొన్నారాయన. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘ఎవరైనా ఎవరి మీదైనా ఆరోపణలు చేశారంటే ఆ మాటలు విని ఆరోపించినవారిని సపోర్ట్ చేసి, నిందకు గురైనవారిని విమర్శించను. ఎందుకంటే ఆ ఆరోపణల గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటాను. ఆ విషయం మీద ఎంతో కొంత అవగాహన ఉంటే తప్ప నేను మాట్లాడలేను. ఆధారాలు లేనప్పుడు ఎటు వైపు మాట్లాడినా అది తప్పు. అలా కామెంట్ చేస్తే ఆ అభిప్రాయం ఆ ఒక్కరిదే అవుతుంది. అలాగే ఒక గుంపుగా చేరి ఆరోపించేవాళ్లను సమర్థించను కూడా’’ అని పేర్కొన్నారు అరవింద స్వామి. -
అడ్జస్ట్ అయితేనే చాన్స్ ఇస్తామన్నారు!
‘‘ఇండస్ట్రీలో అడ్జస్ట్మెంట్ (క్యాస్టింగ్ కౌచ్) అనే దానికి ఒప్పుకోనందువల్లే దాదాపు ఎనిమిది నెలలు పనిని కోల్పోయాను’’ అంటూ ‘మీటూ’ ఉద్యమం గురించి మాట్లాడుతూ అదితీరావ్ హైదరీ తనకెదరైన అనుభవాన్ని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఓ సదస్సులో ‘మీటూ’ గురించి అదితీరావ్ హైదరీ మాట్లాడుతూ – ‘‘నేను కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో అమాయకంగా ఉండేదాన్ని. నా ఫ్యామిలీ నన్ను చాలా జాగ్రత్తగా పెంచారు. ఇండస్ట్రీలో ఇలాంటి విషయాలు జరుగుతాయని నమ్మేదాన్ని కాదు. నిజాయితీగా చెప్పాలంటే నాకన్ని చేదు అనుభవాలు కూడా ఇక్కడ ఎదురవ్వలేదు. ఒక్క సంఘటన జరిగింది. అది నాకు అంతగా హాని చేయలేదు కానీ కొంచెం డిస్ట్రబ్ చేసింది. ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించి.. అడ్జస్ట్ అయితేనే చాన్స్ ఇస్తాం అని చాయిస్ ఇచ్చారు. దాని గురించి నేను పెద్దగా ఆలోచించకుండానే చాలా సింపుల్‌గా ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాను. అలా ఓ ఎనిమిది నెలలు పని కోల్పోయాను. దాంతో అప్సెట్ అయ్యాను. ఇక కొత్త సినిమాలేవి చేయలేనా? అనే ఆలోచనల్లో పడిపోయాను. నా టీమ్, నా మేనేజర్ అంతా కలసి నెగటీవ్ ఆలోచనల నుంచి నన్ను బయటకు తీసుకువచ్చారు. అలాగే లైంగిక వేధింపులకు గురైనవారిని కచ్చితంగా ఏదోటి మాట్లాడాలని ఒత్తిడికి గురి చేయకూడదు. వాళ్లు మాట్లడటానికి సిద్ధంగా ఉన్నారనుకున్నప్పుడే మాట్లాడమనాలి. ఎవరైనా తమ అనుభవాన్ని బయటకు చెప్పకపోతే నోరు నొక్కేసారు, అమ్ముడుపోయారు అని కొందరు ప్రచారం చేస్తారు. మాట్లాడకపోతే ‘మీటూ’ ఉద్యమాన్ని మీరు వదిలేసినట్టే.. మాట్లాడండి అని కొందరు కండీషన్స్లు పెడుతుంటారు. అది తప్పు. ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, అది కరెక్ట్ అని అనిపించినప్పుడు చేయడమే నిజమైన సాధికారత అని నేను భావిస్తాను’’ అని పేర్కొన్నారు.