
ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మీద లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కాబోయే మున్నా భాయ్ 3 సినిమా మీద ఈ ఎఫెక్ట్ పడినట్లు సమాచారం. హిరానీ మీద వచ్చిన లైంగిక వేదింపుల ఆరోపణల గురించి ఓ క్లారిటీ వచ్చే వరకూ ఈ సినిమా పనులను ప్రారంభించకూడదంటూ ఫోక్స్ సంస్థ ఆదేశించినట్లు సమాచారం. హిరానీ మీద వచ్చిన ఆరోపణలు నిజమని తెలితే ఇక మున్నా భాయ్ 3ని తెరకెక్కించడం జరగదనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదే కాక సోనమ్ కపూర్, అనిల్ కపూ్‌లు ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ ప్రమోషన్ కార్యక్రమాల్లోంచి హిరాణీ పేరును తొలగిస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వీవీసీ పేర్కొంది. అంతేకాక ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు వీసీసీ వర్గాలు తెలిపాయి.‘సంజు’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో హిరానీ తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఈ విషయాన్ని హిరానీ ఫిల్మ్ మేకింగ్ పార్ట్‌నర్ విదూ వినోద్ చోప్రా, ఆయన భార్య అనుపమా చోప్రా, రచయిత అభిజిత్ జోషీకు మెయిల్ చేశానని సదరు మహిళ తెలిపారు. అయితే ఈ ఆరోపణలు అసత్యమని, తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే ప్రయత్నమే అని కొట్టిపారేశారు హిరానీ.
Comments
Please login to add a commentAdd a comment