అలాంటి డైరెక్టర్‌తో అవకాశం.. వెంటనే తిరస్కరించా: బాలకృష్ణ హీరోయిన్ | Actress Tanushree Dutta says refusing to work with MeToo accused | Sakshi
Sakshi News home page

Tanushree Dutta: అలాంటి వారితో సినిమా చేస్తే ప్రోత్సహించినట్టే: తనుశ్రీ దత్తా

Published Tue, Oct 1 2024 4:51 PM | Last Updated on Tue, Oct 1 2024 5:10 PM

Actress Tanushree Dutta says refusing to work with MeToo accused

ఇటీవల మలయాళ ఇండస్ట్రీని హేమ కమిటీ నివేదిక కుదిపేసింది. మాలీవుడ్‌లో నటీమణులపై లైంగిక వేధింపులను ఈ నివేదిక బహిర్గతం చేసింది. దీంతో పలువురు మహిళా నటీమణులు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే గతంలోనూ లైంగిక వేధింపులపై మీటూ ఉద్యమం జరిగిన సంగతి తెలిసిందే. పలువురు హీరోయిన్స్‌ సైతం వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా సైతం మీటూ సమయంలో తీవ్రమైన ఆరోపణలు చేసింది. నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించారంటూ ఆరోపించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తనుశ్రీ మీటూ అంశంపై మరోసారి స్పందించింది.  2018లో తనకు ఓ పెద్ద నిర్మాత ప్రాజెక్ట్ ఆఫర్ చేశాడని తెలిపింది. అయితే ఆ మూవీ డైరెక్టర్‌ మీటూ నిందితుడు కావడంతో వెంటనే ఆఫర్‌ను తిరస్కరించినట్లు వెల్లడించింది. ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో రిజెక్ట్ చేసినట్లు తనుశ్రీ పేర్కొంది. గతేడాది కూడా కోల్‌కతాకు చెందిన ఓ దర్శకుడి నుంచి తనకు ఆఫర్ వచ్చిందని నటి తెలిపింది. అదే కారణంతో మళ్లీ తిరస్కరించానట్లు వివరించింది. లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి ఇమేజ్‌ను కాపాడుకునేందుకు ఆ దర్శకుడు తనను ఎంపిక చేశారని భావించినట్లు తనుశ్రీ పేర్కొంది.

తనుశ్రీ మాట్లాడుతూ..'అతను నా దగ్గరకు ఎందుకు వచ్చాడు? తన సినిమాలో నేను నటిస్తే.. తన ఇమేజ్‌ని మార్చుకోవాలనుకున్నాడు. నేను ఆ సినిమా చేస్తే మీటూ నిందితుడికి సపోర్ట్ చేస్తున్నట్టే. అందుకే సున్నితంగా తిరస్కరించా. ఇందులో ఓ ఏజెన్సీ ప్రమేయం కూడా ఉంది. నేను సినిమాని వదిలేయాలనుకుంటున్నాను అని వారితోనే చెప్పా. ఈ విషయంపై తన అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి మా నాన్నను కూడా సంప్రదించా. ఒక నిందితుడితో సినిమా చేయడం నైతికంగా సరైనది కాదని నాన్న సలహా ఇచ్చాడని' తెలిపింది. కాగా.. బాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసిన తనుశ్రీ దత్తా.. తెలుగులో బాలకృష్ణ సరసన వీరభద్ర సినిమాలో హీరోయిన్‌గా నటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement