MeToo
-
అలాంటి డైరెక్టర్‌తో అవకాశం.. వెంటనే తిరస్కరించా: బాలకృష్ణ హీరోయిన్
ఇటీవల మలయాళ ఇండస్ట్రీని హేమ కమిటీ నివేదిక కుదిపేసింది. మాలీవుడ్‌లో నటీమణులపై లైంగిక వేధింపులను ఈ నివేదిక బహిర్గతం చేసింది. దీంతో పలువురు మహిళా నటీమణులు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే గతంలోనూ లైంగిక వేధింపులపై మీటూ ఉద్యమం జరిగిన సంగతి తెలిసిందే. పలువురు హీరోయిన్స్ సైతం వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా సైతం మీటూ సమయంలో తీవ్రమైన ఆరోపణలు చేసింది. నానా పటేకర్ తనను లైంగికంగా వేధించారంటూ ఆరోపించింది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తనుశ్రీ మీటూ అంశంపై మరోసారి స్పందించింది. 2018లో తనకు ఓ పెద్ద నిర్మాత ప్రాజెక్ట్ ఆఫర్ చేశాడని తెలిపింది. అయితే ఆ మూవీ డైరెక్టర్ మీటూ నిందితుడు కావడంతో వెంటనే ఆఫర్‌ను తిరస్కరించినట్లు వెల్లడించింది. ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో రిజెక్ట్ చేసినట్లు తనుశ్రీ పేర్కొంది. గతేడాది కూడా కోల్‌కతాకు చెందిన ఓ దర్శకుడి నుంచి తనకు ఆఫర్ వచ్చిందని నటి తెలిపింది. అదే కారణంతో మళ్లీ తిరస్కరించానట్లు వివరించింది. లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి ఇమేజ్ను కాపాడుకునేందుకు ఆ దర్శకుడు తనను ఎంపిక చేశారని భావించినట్లు తనుశ్రీ పేర్కొంది.తనుశ్రీ మాట్లాడుతూ..'అతను నా దగ్గరకు ఎందుకు వచ్చాడు? తన సినిమాలో నేను నటిస్తే.. తన ఇమేజ్‌ని మార్చుకోవాలనుకున్నాడు. నేను ఆ సినిమా చేస్తే మీటూ నిందితుడికి సపోర్ట్ చేస్తున్నట్టే. అందుకే సున్నితంగా తిరస్కరించా. ఇందులో ఓ ఏజెన్సీ ప్రమేయం కూడా ఉంది. నేను సినిమాని వదిలేయాలనుకుంటున్నాను అని వారితోనే చెప్పా. ఈ విషయంపై తన అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి మా నాన్నను కూడా సంప్రదించా. ఒక నిందితుడితో సినిమా చేయడం నైతికంగా సరైనది కాదని నాన్న సలహా ఇచ్చాడని' తెలిపింది. కాగా.. బాలీవుడ్లో పలు చిత్రాలు చేసిన తనుశ్రీ దత్తా.. తెలుగులో బాలకృష్ణ సరసన వీరభద్ర సినిమాలో హీరోయిన్గా నటించింది. -
ఇండస్ట్రీలో ఇలా జరగడం దురదృష్టకరం: ఉప్పెన భామ
ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కన్నడ భామ కృతి శెట్టి. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్ సరసన మెప్పించింది. ఆ తర్వాత టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించింది. తాజాగా మలయాళ చిత్రం ఏఆర్ఎమ్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది భామ. టోవినో థామస్ హీరోగా నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కృతి శెట్టి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించింది. హేమ కమిటీ నివేదిక తర్వాత చోటు చేసుకున్న సంఘటనలపై కృతి శెట్టి మాట్లాడింది. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితులు చాలా దురదృష్టకరమని హీరోయిన్ పేర్కొంది. అయితే వీటి వల్ల ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఒక అవగాహన వస్తుందని కృతి శెట్టి అన్నారు. దీని వల్ల భవిష్యత్తులో సానుకూల మార్పులు వస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించింది.(ఇది చదవండి: ఏఆర్ఎమ్ నాకో పెద్ద సవాల్: కృతీ శెట్టి)కృతి శెట్టి మాట్లాడుతూ..'ఇలాంటి విషయాలు కచ్చితంగా ఎక్కువ స్థాయిలో మన జీవితాలపై ప్రభావం చూపుతాయి. ప్రతి ఒక్కరూ మా పరిశ్రమ మాత్రమే చెడ్డదని నమ్మించేందుకు ప్రయత్నిస్తారు. కానీ నేను మాత్రం చాలా సెన్సిటివ్ పర్సన్. మహిళలపై వేధింపులు లాంటి విషయాలను తలచుకుంటే నిజంగానే ఆందోళనకు గురవుతా. ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధాలు లేకుండా కేవలం నటిగా మాత్రమే ఉండాలని కోరుకుంటా. కానీ ఎవరైనా కొత్తగా నటనలో అడుగుపెట్టాలనుకునే వారు మాత్రం నిర్ణయాన్ని ఒకసారి ప్రశ్నించుకోవాలని సలహా ఇస్తా' అని అన్నారు. -
'మా దగ్గర ఆ పరిస్థితి లేదు'.. హీరో కామెంట్స్‌పై మండిపడ్డ సింగర్!
హేమ కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీనే కాదు.. కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆ విషయం తనకేం తెలియదంటూ కామెంట్స్ చేశారు. తాజాగా కోలీవుడ్ నటుడు జీవా సైతం కోలీవుడ్‌లో హేమ కమిటీ నివేదికపై స్పందించారు. నేను కూడా దాని గురించి విన్నా.. అయితే తమిళ సినీ ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితులు మాత్రం లేవన్నారు. గతంలో మీటూ పార్ట్-1 చూశామని.. ఇప్పుడు పార్ట్-2 వచ్చిందని అన్నారు. వారిపేర్లను బయటికి చెప్పడం తప్పు.. కానీ సినిమాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కలిగి ఉండాలని తెలిపారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన జీవా.. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.తమిళంలో ఆ పరిస్థితి లేదు..జీవా మాట్లాడుతూ..' నేను ఒక మంచి ఈవెంట్ కోసం ఇక్కడకు వచ్చా. కాబట్టి మంచి విషయాలు అడగండి. చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. తేనవట్టు అనే సినిమా షూటింగ్ ముగించుకునివస్తున్నా. చాలా సినీ పరిశ్రమలలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. మీ పని వార్తలను సేకరించడం. మా పని మంచి వాతావరణాన్ని కాపాడుకోవడం. నటులుగా మేము చాలా మంది వ్యక్తుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తాం. మలయాళంలో లాగా కోలీవుడ్‌లో జరగడం లేదు. ఈ విషయం గతంలోనూ చెప్పాను.. ఇప్పుడు కూడా చెబుతున్నా' అని అన్నారు. ఈ సందర్భంగా అయితే అక్కడే ఉన్న ఓ జర్నలిస్ట్‌తో కాసేపు వాగ్వాదం తలెత్తింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. రంగం సినిమాతో జీవా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చిన్మయి రిప్లై.. కోలీవుడ్‌లో అలాంటి పరిస్థితులు లేవని జీవా చెప్పడంపై సింగర్ చిన్మయి శ్రీపాద రియాక్ట్ అయింది. తమిళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు లేవని ఎలా చెబుతారంటూ ప్రశ్నించింది. ఇలా ఎలా మాట్లాడుతారో తనకు అర్థం కావడం లేదన్నారు. గతంలో చాలాసార్లు చిన్మయి ఇండస్ట్రీలో జరుగుతన్న వేధింపులపై మాట్లాడారు. మహిళలపై ఎక్కడా అఘాయిత్యాలు జరిగినా సరే చిన్మయి సోషల్ మీడియా వేదికగా పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. I really do not understand how they are saying sexual harassment does not exist in Tamil Industry.HOW?! https://t.co/sm9qReErs0— Chinmayi Sripaada (@Chinmayi) September 1, 2024 -
చిత్రపరిశ్రమలో వేధింపులు.. మీడియాపై సురేష్ గోపి ఆగ్రహం
మలయాళ చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై జస్టిస్ హేమ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇపుడు అక్కడ ప్రకంపనలు రేపుతుంది. అనేక బాధిత నటీమణులు ముందుకు వచ్చి పలువురు హీరోలు, దర్శకనిర్మాతలపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి, నటుడు సురేష్ గోపి మీడియాపై తీవ్ర ఆరోపణలు చేశారు.మలయాళం సినిమా ఇండస్ట్రీలో మీ టూ ఆరోపణలపై మంత్రి స్పందిస్తూ... కోర్టే సమాధానం ఇస్తుందన్నారు. చిత్ర పరిశ్రమలో ఆరోపణలు మీడియాకు ఆహారంగా మారిందని అన్నారు. ‘మీరు ఆ వార్తలతో డబ్బులు సంపాదించవచ్చుకానీ ఓ పెద్ద వ్యవస్థను నేలకూలుస్తున్నారు. మేకలు కొట్టుకునేలా చేసి, ఆ తర్వాత మీలాంటి వాళ్లు వాటి రక్తాన్ని తాగుతారు. ప్రజల మెదళ్లను మీడియా తప్పుదోవ పట్టిస్తోంది’ అని సురేశ్ గోపి మండిపడ్డారు.తాను ప్రైవేట్ పర్యటనలో ఉన్నానని, మలయాళం మూవీ ఆర్టిస్టుల సంఘానికి(అమ్మ) చెందిన ప్రశ్నలు కేవలం ఆ ఆఫీసును విజిట్ చేసినప్పుడు మాత్రమే అడగాలని ఆయన పేర్కొన్నారు. ఇది ఉండగా మలయాళ సినీ పరిశ్రమలో నటీమణులతో పాటు ఇతర మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్ హేమ కమిటీ ఏర్పాటయ్యింది. ఈ కమిషన్ కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఎప్పుడో నివేదిక సమర్పించగా.. తాజాగా ఇందులోని అంశాలు వెలుగుచూశాయి. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉన్నట్లు హేమ కమిషన్ తెలిపింది. -
MeToo Case: మళ్లీ తెరపైకి మీటూ కేసు.. మరో కొత్త ట్విస్ట్
కర్ణాటక: నటి శుత్రి హరిహరన్ మీటూ కేసు కొత్త మలుపు తిరిగింది. బీ రిపోర్ట్ ప్రశ్నిస్తూ శ్రుతికి కోర్టు నోటీసు జారీ చేసింది. బెంగళూరు 8వ ఎసిఎంఎం కోర్టు శ్రుతికి నోటీసు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలు సమర్పించాలని పోలీసులకు సూచించింది. 2018లో బహుభాష నటుడు అర్జున్‌పై నటి శుత్రి హరిహరన్ మీటూ ఆరోపణలు చేసింది. కేసుకు సంబంధించి అర్జున్‌పై ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని పోలీసులు కోర్టుకు బీ రిపోర్టు సమర్పించారు. దీంతో కోర్టు శ్రుతికి, పోలీసులకు నోటీసులు ఇచ్చారు. -
జంతర్ మంతర్ వద్ద బృందా కారత్కు చేదు అనుభవం
ఢిల్లీ: సీపీఐ(ఎం) నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్(75)కు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన వద్దకు గురువారం ఆమె చేరుకున్నారు. అయితే.. వేదిక ఎక్కి ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపించాలన్న ఆమె ప్రయత్నానికి రెజ్లర్లు అడ్డు తగిలారు. రాజకీయ ఎజెండాగా ఈ వ్యవహారాన్ని మార్చేయడం సరికాదంటూ మైకులోనే చెబుతూ ఆమెను వేదికపైకి ఎక్కకుండా అడ్డుకున్నారు. ఒలింపిక్స్ మెడలిస్ట్ అయిన బజరంగ్ పూనియా.. ఈ నిరసనలకు నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్టేజ్‌పైకి బృందా కారత్ ఎక్కేందుకు యత్నించగా.. తమ పోరాటాన్ని రాజకీయం చేయొద్దంటూ పూనియా ఆమెకు విజ్ఞప్తి చేశారు. దయచేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. అదే సమయంలో మరికొందరు రెజ్లర్లు.. కారత్ను ఉద్దేశిస్తూ ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేయడం గమనార్హం. కారత్‌తో పాటు మరికొందరు కమ్యూనిస్ట్ నేతలు ఆ సమయంలో వేదిక మీదకు వెళ్లకుండా నిలిచిపోయారు. ఆపై కాసేపటికే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. #WATCH | CPI(M) leader Brinda Karat asked to step down from the stage during wrestlers' protest against WFI at Jantar Mantar in Delhi. pic.twitter.com/sw8WMTdjsk — ANI (@ANI) January 19, 2023 రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ కైసర్‌గంజ్ ఎంపీ(ఉత్తర ప్రదేశ్) బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ నిరసనలు మొదలయ్యాయి. అవినీతి, మానసికంగా వేధింపులు, లైంగిక వేధింపుల పర్వం కొనసాగుతోందంటూ హస్తిన నడిబొడ్డున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కామన్ వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ వినేష్ ఫోగట్, మరో ఛాంపియన్ సాక్షి మాలిక్‌లు స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో.. వ్యవహారం మరింత ముదిరింది. బ్రిజ్ భూషణ్, కోచ్‌లు.. మహిళా రెజర్లను లైంగికంగా వేధించారంటూ ఆరోపించారు వాళ్లు. ఇక ఈ ఆరోపణలను తోసిపుచ్చిన బ్రిజ్ భూషణ్.. తాను పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధమంటూ ప్రకటించారు. ఆరోపణలు నిరూపిస్తే తల నరుక్కునేందుకు సిద్ధమంటూ ప్రకటించారు కూడా. జజరంగ్ పూనియా, సాక్షి మాలిక్‌లు వారం కిందట తనను కలిశారని, ఇద్దరూ ఎలాంటి సమస్యలు లేవని తనతో చెప్పారని, ఈ నిరసనల వెనుక తనను దించేసే కుట్ర జరుగుతోందని, ఓ బడా పారిశ్రామికవేత్త హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారాయన. మరోవైపు ఈ వ్యవహారంలో గురువారం కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. శాస్త్రి భవన్‌లోని కేంద్ర క్రీడా శాఖల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో చర్చించడానికి రెజ్లర్లు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని భజరంగ్ పూనియా సైతం ధృవీకరించారు. సమావేశం తర్వాత వివరాలను వెల్లడిస్తామని ఆయన అన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణ పూనియా రెజ్లర్ల నిరసనకు మద్దతు ప్రకటించారు. రెజ్లర్లకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆమె ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. I request PM Modi to make sure that our wrestlers get justice. I will continue to stand with our athletes: Dr Krishna Poonia, Congress MLA & former gold-medal-winning track & field athlete, at Jantar Mantar in Delhi pic.twitter.com/GEVTLJFT2Z — ANI (@ANI) January 19, 2023 -
స్టార్ హీరోపై నటి తీవ్ర ఆరోపణలు.. ‘నన్ను లైంగికంగా వేధించాడు’
ఓ స్టార్ హీరోపై నటి సంచలన వ్యాఖ్యలు చేసింది. భోజ్‌పూరి సూపర్ స్టార్ పవన్ సింగ్‌పై నటి యామిని సింగ్ తీవ్ర ఆరోపణలు చేసింది. పవన్ సింగ్ తనని లైంగికంగా వేధించాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా భోజ్‌పూరి నటి అయిన యామిని సింగ్ అక్కడ స్టార్ నటిగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో ఆమె పవన్ సింగ్ లేటెస్ట్ మూవీ బాస్‌లో నటించే చాన్స్ అందుకుంది. ఇటీవల సెట్‌పై వెళ్లిన ఈ సినిమాలో ఆమెకు సంబంధించిన పలు సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అయితే సడెన్‌గా ఆమెను ఈ సినిమా నుంచి తొలగించినట్లు ఇటివల వార్తలు వచ్చాయి. చదవండి: నా పిచ్చికి, బాధకు ఇదే మందు: సమంత ఆసక్తికర పోస్ట్ ఆమె తీరు నచ్చకే ఈ సినిమాలో నుంచి తొలగించారంటూ రకరకాలు పుకార్లు వినిపించాయి. తాజాగా తనపై వస్తున్న రూమార్స్‌పై యామిని సింగ్ స్పందించింది. ఇటీవల మీడియాతో ముచ్చటించిన ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. పవన్ సింగ్‌తో కలిసి పనిచేయడం తనకు ఇష్టం లేదని, అందుకే ఆ సినిమా నుంచి తప్పుకున్నానని చెప్పింది. ఆయన సినిమాల్లో లేడీ యాక్టర్స్‌కు సరైన పాత్రలు ఉండవని చెప్పింది. అదే విధంగా ‘పవన్ సింగ్ తన సినిమాలో నాకు అవకాశం ఇచ్చాడని ఇండస్ట్రీలోనే అందరు అనుకుంటున్నారు. చదవండి: కేజీయఫ్ ఓ చెత్త సినిమా: ‘కాంతార’ నటుడు సంచలన కామెంట్స్ కానీ అది నిజం కాదు. బాస్ సినిమాలో నాకు అవకాశం ఇచ్చింది డైరెక్టర్ అరవింద్ చౌబే. ఈ సినిమా నుంచి నన్ను ఎవరు తీసేయలేదు. నేనే తప్పుకున్నా. పవన్ చాలా మంచి నటుడు అని ఈ సినిమా ముందు వరకు అనుకున్నాను. కానీ అతడు అసలు స్వరూపం తర్వాత బయటపడింది. ఓ రోజు రాత్రి 9 గంటలకు నాకు ఫోన్ చేశాడు. ఆటోలో స్టూడియోకు రావాలని చెప్పాడు. అయితే రాత్రి అయ్యింది నేను రాలేనని చెప్పాను. దీంతో అతడు సినిమా చేయాలని ఉందా? లేదా? అని వార్నింగ్ ఇచ్చాడు. ఈ చిత్రంలో నువ్వు నటించాలంటే ఇప్పుడు రావాల్సిందే అంటూ బెదిరించాడు. ఇక నేను కాల్ కట్ చేసి సినిమా నుంచి తప్పుకున్నాను’ అంటూ యామిని చెప్పుకొచ్చింది. -
Actress Ashita: అందుకు ఒప్పుకోలేదు.. శాండిల్‌వుడ్‌కు దూరమయ్యా
బెంగళూరు: కన్నడ చిత్ర సీమను మీటూ వేధిస్తోందని నటి అశిత ఓ ఇంటర్వ్యూలో ఆరోపించింది. తాను శాండిల్‌వుడ్‌కు దూరం కావటానికి కారణాలను పేర్కొంది. కన్నడ చిత్రాలలో నటించాలంటే పెద్దలు చెప్పినట్లు నడుచుకోవాలి, అందుకు తాను సహకరించలేదు. సహకరించి ఉంటే నటించే అవకాశం వచ్చేది. దీంతో తాను శాండిల్ వుడ్‌కు దూరం అయ్యాయని ఆ చానల్లో పేర్కొంది. అయితే ఆమె ఎవరి పేరు ప్రస్తావించకుండా మీటూ ఆరోపణలు చేశారు. చదవండి: (Arohita: ఆమ్ ఆద్మీలో చేరిన సినీ నటి) -
మీటూపై అనుచిత వ్యాఖ్యలు, 'టార్గెట్ చేయాలనుకోలేదు, సారీ'
తనకు పది మంది మహిళలతో శారీరక సంబంధం ఉందని, అదే మీటూ అయితే దాన్ని కొనసాగిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు మలయాళ నటుడు వినాయకన్. ఒరుతె సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది. మీటూపై అడ్డగోలుగా మాట్లాడినందుకు జర్నలిస్టులు అతడిని ఏకిపారేశారు. ఈ పరిణామంతో వెనక్కు తగ్గిన వినాయకన్ సదర జర్నలిస్ట్‌కు క్షమాపణలు తెలియజేస్తూ ఫేస్బుక్లో నోట్ షేర్ చేశాడు. 'ఒరుతె ప్రమోషనల్ ఈవెంట్లో ఓ జర్నలిస్ట్ సిస్టర్ అవమానకరంగా భావించిన భాషను నేను ఉపయోగించాను. నేను ఆమెను ఏరకంగానూ టార్గెట్ చేయాలనుకోలేదు. ఆమెకు అసౌకర్యం కలిగించేలా మాట్లాడినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. మీ వినాయకన్' అని రాసుకొచ్చాడు. చదవండి: అదే ‘మీటూ’ అయితే, నేను దానిని కొనసాగిస్తాను -
ఆయన్ను తొలగించండి: పంజాబ్ సీఎంకు మీటూ సెగ
చండీగఢ్: అనూహ్య పరిణామాల మధ్య పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. రాష్ట్రానికి మొదటి దళిత సీఎంగా ఇంకా పూర్తి బాధ్యతలు చేపట్టకముందే ఛన్నీపై గతంలో చెలరేగిన మీటూ వివాదాల సెగ తాకింది. మీటూ ఆరోపణలొచ్చిన చన్నీని సీఎంగా ఎంపిక చేయడంపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవికి ఆయన అనర్హుడని, ఆయనను తొలగించాలని సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు. 2018 లో చన్నీపై వచ్చిన మీటూ ఆరోపణలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించిందని రేఖా శర్మ గుర్తు చేసుకున్నారు. దీనిపై ఆందోళన చేసినా చర్యలేవీ లేకపోగా, తాజాగా అలాంటి వ్యక్తిని సీఎంగా ఎంపిక చేయడం శోచనీయమన్నారు. ఒక మహిళ (సోనియా గాంధీ) నేతృత్వంలోని పార్టీలో ఈ పరిణామం తీవ్ర ద్రోహమన్నారు. ఈ చర్య మహిళల భద్రతకు ముప్పు అని రేశాఖర్మ వ్యాఖ్యానించారు. దీనిపై సమగ్రవిచారణ జరిపి, బాధిత మహిళ స్టేట్‌మెట్‌ను పరగణనలోకి తీసుకుని, చన్నీపై చర్యలు తీసుకోవాలని ఆమె సోనియాను కోరారు. పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్‌మధ్య మధ్య నెలరోజుల పాటు సాగిన సంక్షోభం నేపథ్యంలో కెప్టెన్ పదవినుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఇసుక మాఫియాపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరైన ఈ వేడుకకు మాజీ సీఎం అమరీందర్ సింగ్ గైర్హాజరు కావడం గమనార్హం. కాగా 2018లో తనకు చరణ్‌జీత్ అసభ్య మెసేజ్‌లు పంపారంటూ ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఆరోపణలు గుప్పించారు. అయితే తనపై ఆరోపణలు చేసిన అధికారిణికి క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం అక్కడితో ముగిసినట్టు అంతా భావించారు. Today, he has been made Punjab CM by a party that is headed by a woman. It is betrayal. He is a threat to women safety. An enquiry should be conducted against him. He is not worthy to be CM. I urge Sonia Gandhi to remove him from the CM post: NCW Chairperson Rekha Sharma (1/2) pic.twitter.com/56kjw4XG7F — ANI (@ANI) September 20, 2021 -
లైంగిక ఆరోపణలు: జైలు నుంచి నటుడి విడుదల.. బాధితుల ఆక్రోదన
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా అరవై మందికి పైగా బాధితులు ఆ సీనియర్ నటుడిపై లైంగిక ఆరోపణలు చేశారు. 2018లో నాటకీయ పరిణామాల మధ్య ఓ కేసులో ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడింది. మూడేళ్లు జైల్లోనూ మగ్గాడు. చివరికి జడ్జి అనూహ్య నిర్ణయంతో ఆయనకు ఊరట లభించింది. ఉన్నపళంగా నటుడు, హాలీవుడ్ నటుడు బిల్ కాస్బీ బుధవారం జైలు నుంచి విడుదల కావడం, తీర్పుపై బాధితుల అసహనంతో తీవ్ర చర్చకు దారితీసింది ఈ కేసు. హారిస్బర్గ్: హాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ బిల్ కాస్బీ(83)ని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది పెన్సిల్వేనియా అత్యున్నత న్యాయస్థానం. 2018లో లైంగిక నేరారోపణల కేసులో ఆయనకు మూడు నుంచి పదేళ్ల కారాగార శిక్ష పడింది. అయితే ఈ కేసులో శిక్ష విధించిన జడ్జి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించాడని, కాస్బీకి శిక్ష విధించబోనని ఒప్పందం కుదుర్చుకుని మరీ శిక్ష విధించడం సరికాదని పెన్సిల్వేనియా ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు లిఖిత పూర్వకంగా బాధితుల తరపున ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ కేసులో ఇంతకు ముందు జడ్జి, కాస్బీ నుంచి లైంగిక నేరారోపణలపై స్టేట్మెంట్ రికార్డు చేసి మరీ శిక్ష విధించబోనని బెంచ్ సాక్షిగా ప్రకటించాడు(నేరస్థులకు ఉన్న ఐదవ సవరణ హక్కు ప్రకారం). అయినప్పటికీ పదేళ్ల గరిష్ఠ జైలుశిక్ష విధించడాన్ని ఇప్పుడు తప్పు బట్టింది న్యాయస్థానం. అంతేకాదు తాజా పరిణామాలతో ఆయనకు వ్యతిరేకంగా బాధితులు అమెరికా సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి వీల్లేకుండా పోయింది. మరోవైపు ఈ తీర్పుపై బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము చేసిన న్యాయ పోరాటాన్ని.. అమెరికా చట్టంలోని లొసుగులు నీరుగారుస్తున్నాయని వాపోయారు. తదుపరి కార్యాచరణపై న్యాయ నిపుణులతో సంప్రదించి ముందుకు వెళ్తామని ప్రకటించారు. ఆండ్రియాతో మొదలు.. టెంపుల్ యూనివర్సిటీ బాస్కెట్ బాల్ టీంలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన ఆండ్రియా కాన్స్టాండ్.. తనకు మత్తు మందిచ్చి మరీ కోస్బీ అఘాయిత్యానికి పాల్పడ్డాడని 2005లో పోలీసులను ఆశ్రయించింది. ఏడాది తర్వాత మూడున్నర మిలియన్ల డాలర్ల పరిహారం చెల్లించి ఆమెతో కేసు క్లోజ్ కోసం డీల్ కుదుర్చుకున్నాడు కోస్బీ. అయితే 11 ఏళ్ల తర్వాత (12 ఏళ్లు గడిస్తే.. లైంగిక ఆరోపణలు చెల్లవు) మళ్లీ ఆమె తెర మీదకు వచ్చింది. ఈసారి మరో ఐదుగురు ఆమెతో కలిసి కేసు వేశారు. అదే టైంలో 60వ దశకం నుంచి ఆయనపై వినిపించిన ఆరోపణలనూ పరిగణనలోకి తీసుకుంది పెన్సిల్వేనియా లోకల్ కోర్టు. చివరికి విచారణ జరిపి 2018 సెప్టెంబర్‌లో కోస్బీకి శిక్ష విధించింది. అమెరికన్ డాడ్ స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన కోస్బీ.. సుమారు ఆరు దశాబ్దాలపాటు ఆడియొన్స్‌ను అలరించారు. 1984లో టెలికాస్ట్ అయిన ది కోస్బీ షో.. గొప్ప టీవీ షోగా గుర్తింపు దక్కించుకుంది. ఈ షో ద్వారా ఆయనకు ‘అమెరికాస్ డాడ్’ అనే ఐడెంటిటీ దక్కింది. ఆ తర్వాత సినిమాల ద్వారా ఫేమ్ దక్కించుకున్నాడీయన. అయితే కెరీర్ తొలినాళ్ల నుంచే పలు అఘాయిత్యాలకు పాల్పడినట్లు కోస్బీ ఆరోపణలు ఉన్నాయి. ఇక సంచలనం సృష్టించిన #metoo ఆరోపణల్లో మొట్టమొదట జైలు శిక్షకు గురైంది ప్రముఖుడు కూడా ఈయనే. చదవండి: అత్యాచార కేసులో బాధితురాలి అరెస్ట్!. గుండెపగిలి.. -
అత్యాచారం చేశాడు.. పిచ్చిదాన్నైపోయా!
లేడీ గాగా.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న సింగర్. హుషారుగా ఆడిపాడే ముప్ఫై ఐదేళ్ల ఈ అమెరికన్ సింగర్ ఒక డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలో.. తన గతానికి సంబంధించి కొన్ని చేదు విషయాల్ని బయటపెట్టి కంటతడి పెట్టుకుంది. పంతొమ్మిదేళ్ల వయసులో తనను ఒక ప్రొడ్యూసర్ బలవంతం చేశాడని, ఆ వయసుకే తాను గర్భవతి అయ్యాయని ఆమె ఆ డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలో పేర్కొంది. తన మ్యూజిక్ కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించి ఆ ప్రొడ్యూసర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. ఆ భయానక అనుభవాన్ని పంచుకుంటూ లేడీ గాగా ఏడ్చేసింది. అయితే గర్భవతి అయ్యానని తెలిశాక ఆ ప్రొడ్యూసర్ తనని వదిలేశాడని చెప్పింది. ఆ ఘటన తర్వాత తనను ఓ స్టూడియోలో బంధించారని, ఆ సమయంలో మానసికంగా ఎంతో కుంగిపోయానని లేడీ గాగా పేర్కొంది. తిరిగి మామూలు మనిషి కావడానికి రెండున్నరేళ్లు పట్టిందని ఆమె భావోద్వేగంతో మాట్లాడింది. ఆ చేదు అనుభవం నుంచి కోలుకోవడానికి తాను ఎంతో మధనపడ్డానని చెప్పిన లేడీ గాగా.. తన జీవితంలో వాటిని చీకటి రోజులుగా అభివర్ణించింది. అయితే ఆ ప్రొడ్యూసర్ పేరు చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు. మళ్లీ అతన్ని ఎదుర్కొవడం తనకు ఇష్టం లేదని ఆమె స్పష్టం చేసింది. యాపిట్ టీవీ ఫ్లస్ ఫ్లాట్ ఫామ్ వారి ‘ది మీ యూ కాంట్ సీ’ డాక్యుమెంటరీలో లేడీ గాగా ఈ సంచలన విషయాల్ని బయటపెట్టింది. శుక్రవారం ఆ డాక్యుమెంటరీ వీడియో రిలీజ్ అయ్యింది. కాగా, గాగా అసలు పేరు స్టెఫానీ గెర్మానొట్టా. -
‘మీటూ’కి కొత్త వెర్షన్!
‘నేను కూడా’ (మీటూ) అంటూ లైంగిక వేధింపుల బాధితులు ధైర్యంగా బయటికొచ్చి చెప్పుకోవడం ఒక ఉద్యమంలా నాలుగేళ్ల క్రితమే మొదలైంది. ఎప్పుడో జరిగినదానికి ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని నిందితులు ఆక్రోశించినా.. ‘ఎప్పుడు జరిగితేనేం.. జరిగిందా లేదా?’ అని కోర్టులు కూడా బాధిత మహిళలకు అండగా ఉండటంతో పదీ పదిహేనేళ్ల క్రితం తమపై జరిగిన లైంగిక వేధింపులపైన కూడా ఇప్పుడు మహిళలు పోరాడగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక చైనా మహిళ తన బాస్‌తో మరో పదేళ్ల తర్వాత కాకుండా.. అక్కడికక్కడే, అప్పటికప్పుడే తేల్చేసుకోవడంతో ‘మీటూ’కి ఒక కొత్త ఉద్యమరూపం వచ్చినట్లయింది. పని చేసే చోట మహిళలపై వేధింపులు చైనాలో అయినా ఒకటే, ఇండియాలో అయినా ఒకటే. కనుక ఇది చైనా స్టోరీ అని పక్కన పడేసేందుకు లేదు. అక్కడి హైలాంగ్జియాన్ ప్రావిన్స్ లో ‘పేదరిక నిర్మూలన ప్రభుత్వ కార్యాలయం’ ఒకటి ఉంది. ఆ కార్యాలయ అధికారి వాంగ్. ఆయనే తన సిబ్బంది అందరికీ బాస్. ఝౌ అనే యువతి కూడా అక్కడ పని చేస్తోంది. ఝౌ అనేది ఆమె ఇంటి పేరు. వారిద్దరి అసలు పేర్లను బయట పెట్టవద్దని ప్రభుత్వం అక్కడి వార్తా సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. జరిగిందేమిటో ఇప్పటికే పది లక్షల మందికి పైగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో చూశారు కనుక వారి పేర్లతో పట్టింపు ఎవరికి ఉంటుంది! మొత్తానికి విషయం ఏమిటంటే బాస్ తన కింది మహిళా ఉద్యోగినిని లైంగికంగా వేధించాడు. దాంతో అతడిని ప్రభుత్వం ఉద్యోగంలోంచి తొలగించింది. ఆ మధ్యలో ఏం జరిగిందన్నది మొత్తం 14 నిముషాల వీడియోగా ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రభుత్వం మాత్రం వాంగ్ని ‘లైఫ్ డిసిప్లిన్ కారణాల వల్ల’ తీసేస్తున్నట్లు ప్రకటించింది కానీ విషయం అది కాదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఒక మహిళను వేధించిన కారణంగా ఒక అధికారిని తీసివేయవలసి వచ్చింది అని బహిరంగం గా ఒప్పుకోవడం చైనా ప్రభుత్వానికి పరువు తక్కువ. అందుకే డిసిప్లిన్ అనే మాటతో సరిపెట్టేసింది. ∙∙ వాంగ్ మొదట ఝౌ కు టెక్స్ట్ మెసేజ్ పంపడంతో ఇదంతా ఆరంభమైంది. అది అభ్యంతరకరమైన మెసేజ్. ఝౌ కూడా మెసేజ్‌తోనే అతనిని ఖండించవచ్చు. కానీ అలా చేస్తే మెసేజ్‌లతో సాగదీస్తాడని భయపడి, నేరుగా వెళ్లి చెప్పింది.. ‘బాస్, నాకు ఇలాంటివి నచ్చవు’ అని. అలా చెప్పి, ఇలా తన సీట్లోకి వచ్చేసరికి మళ్లొక మెసేజ్! బాస్ తన క్యాబిన్లో తను ఉండేవాడు, అక్కడి నుంచి మెసేజ్‌ల రూపంలో ఈమె ఫోన్లోకి వచ్చేసేవాడు. కొన్నాళ్లుగా ఇలా జరుగుతోంది. చివరికి విసుగెత్తిపోయిన ఝౌ.. నేరుగా అతడి క్యాబిన్లోకి వెళ్లింది. మామూలుగా వెళ్లలేదు. చేత్తో తుడుపు కర్రను తీసుకెళ్లింది. ‘‘నీకెంత చెప్పినా బుద్ధి లేదురా వెధవా..’అని ఆ కర్రతో ముఖం మీద, భుజం మీద బాది బాది వదిలింది. అతడేం మాట్లాడలేదు. కుర్చీలోంచి కదల్లేదు. ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. ఝౌ అతడి టేబుల్ మీద ఉన్న సామగ్రినంతా విసిరిపారేసింది. అతడిపై ముఖంపై నీళ్లు కొట్టింది. తుడుచుకుంటున్నాడు, మళ్లీ ఆమెనే చూస్తున్నాడు. పద్నాలుగు నిముషాలు పాటు ఝౌ అతడిని తిడుతూనే, కొడుతూనే ఉంది. ఆ మనిషి చలించలేదు. మధ్య మధ్య ఝౌ, అతడు తనకు ఎలాంటి మెసేజ్‌లు పంపుతున్నాడో ఎవరికో ఫోన్ చేసి చెబుతోంది. ఆఫీస్ స్టాఫ్ ఎవరూ బాస్‌కి సపోర్ట్‌గా ఆమెను అడ్డుకోలేదు. ఒకరెవరో వీడియో షూట్ చేస్తూ ఉన్నారు. వీడియో పూర్తయ్యేసరికి అతడి పనీ అయిపోయింది. నిరుత్తరుడై, నిమిత్తమాత్రుడై అలా కూర్చుండిపోయాడు. ‘సారీ’ అనలేదు, ‘నేననలా చెయ్యలేదు’ అనీ అనలేదు. పైగా ‘అదంతా జోక్’ అని తుడిచేసుకున్నాడు. కానీ ప్రభుత్వం అతడిని సీరియస్‌గా తీసుకుని సీట్లోంచి తొలగించింది. తుడిచే కర్రతో బాస్‌ను కొడుతున్న ఝౌ (వీడియో క్లిప్స్) -
మీ టూ వల్ల తప్పించుకున్నాను!
‘మీ టూ’ అంటూ నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఎప్పట నుంచి అయితే బయటకు చెబుతున్నారో అప్పటి నుంచి ఓ మంచి మార్పు వచ్చిందనే చెప్పాలి. అందుకు ఓ ఉదాహరణ సాయి పల్లవి చెప్పిన ఒక విషయం. ఇటీవల ఓ సందర్భంలో ‘మీ టూ’ ఉద్యమం గురించి సాయి పల్లవి మాట్లాడుతూ– ‘‘కథలో భాగంగా హీరోతో పెదవి ముద్దు సన్నివేశంలో నటించాలని ఒక దర్శకుడు అడిగారు. అలాంటి సన్నివేశాలు చేయడం నాకు అసౌకర్యంగా ఉంటుందన్నాను. ఇంతలో, హీరో కలగజేసుకొని ‘మీరు బలవంతపెడితే ‘మీ టూ’ ఉద్యమంలో ఇరుక్కునే ప్రమాదం ఉంద’ని దర్శకుడితో అన్నారు. దాంతో లిప్ లాక్ సీన్‌ని ఆ దర్శకుడు విరమించుకున్నారు. ‘మీ టూ’ వల్ల నేను ఆ సీన్ నుంచి తప్పించుకున్నాను’’ అని పేర్కొన్నారు. అయితే అది ఏ సినిమా? హీరో ఎవరు? లిప్ లాక్ చేయమన్న దర్శకుడు ఎవరు? అనే విషయాలను మాత్రం సాయి పల్లవి బయటపెట్టలేదు. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్యకి జోడీగా సాయి పల్లవి నటించిన ‘లవ్‌స్టోరీ’లో ముద్దు సీన్ ఉంది. ట్రైన్ లో చైతూతో ట్రావెల్ చేస్తున్న సీన్లో సాయి పల్లవి, చైతూకి ముద్దుపెడతారు. అయితే ఇది లిప్ లాక్ కాదు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. రానాతో ‘విరాటపర్వం’ సినిమాలో నటిస్తున్నారామె. మరోవైపు వెబ్ సిరీసుల్లోనూ నటిస్తున్నారు. -
ఇక్కడితో ఆగిపోవడం లేదు
యూఎస్‌లో యాష్లీ జూడ్. ఇండియాలో తనుశ్రీ దత్తా. ఈజిప్టులో నదీన్ అష్రాఫ్! ముగ్గురూ ‘మీటూ’ ఫైటర్స్. ముగ్గుర్లో చిన్న.. నదీన్. పద్దెనిమిదేళ్లకే ఉద్యమజ్వాల. ఇరవై రెండేళ్లకిప్పుడు.. మీటూ మహోజ్వల స్ఫూర్తి. ఇక్కడితో.. ఆగిపోవడం లేదంటోంది. మహిళల్ని సమైక్యం చేస్తానంటోంది. నాలుగేళ్ల క్రితం నదీన్ అష్రాఫ్ వయసు పద్దెనిమిదేళ్లు. అప్పటికి ఏడేళ్ల క్రితం ఆమె వయసు పదకొండేళ్లు. ఈ రెండు వయసులలో ఒకటి ఆమెను ఇప్పటికీ పీడకలలా వెంటాడుతున్నది. ఇంకోటి.. అలాంటి పీడకల ఏ అమ్మాయిని వెంటాడుతున్నా ఆ అమ్మాయి వైపు నిలిచి తనే ఆ పీడకల వెంటబడి తరిమికొట్టేందుకు నదీన్‌ను ఒక శక్తిగా మలచినది. మరి తన పీడకల మాట ఏమిటి?! ఆ పిశాచి దొరకలేదు. ఆ పిశాచి ముఖం గుర్తు లేదు. నదీన్కు పదకొండేళ్ల వయసులో వెనుక నుంచి వచ్చి ఆమె వెనుక భాగాన్ని అరిచేత్తో కొట్టి మాయమైపోయాడు. ఏం జరిగిందీ ఆ చిన్నారికి అర్థం కాలేదు. తననెందుకు తెలియనివారొకరు తాకడం?! అంతవరకే ఆలోచన. నదీన్ పెద్దదవుతోంది. ఇలాంటి పిశాచాలు ఉంటాయని అర్థయ్యే వయసుకు వచ్చింది. చిన్నతనంలో తనకు జరిగిందీ ‘అలాంటిదే’ అని రోషంతో ఉడికిపోయింది. ఏ అమ్మాయికి అలా జరిగిందని విన్నా తనకు జరిగిందే ఆమె గుర్తుకు వస్తోంది. అతడెవరో తెలియదు కనుక తనేం చేయలేదు. ఇప్పుడైతే ఒకటి కచ్చితంగా చేయగలదు. లైంగిక వికృతాలకు, లైంగిక హింసకు, దౌర్జన్యానికి, దాడికి పాల్పడిన వారిని వేటాడి కలుగుల్లోకి లాగి బాధితులకు న్యాయం జరిపించడం! ఆమెకు ఈ ఆలోచన కలిగించింది ‘మీటూ’ మూవ్మెంట్. నాలుగేళ్ల క్రితం 2017లో అమెరికాలో మొదలైన ఆ ఉద్యమజ్వాల పద్దెనిమిదేళ్ల నదీన్ కు మీటూ బాధితుల తరఫున నిలిచి పోరాడేలా స్ఫూర్తిచ్చింది. అమెరికాలో ఎలాగైతే హాలీవుడ్ నటి యాష్లీ జూడ్ ‘మీటూ’కు ఊపిరులు ఊదిందో ఈజిప్టులో అలా నదీన్ మీటూ ఒత్తిని వెలిగించింది. అందుకే 2020లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వందమంది శక్తిమంతమైన మహిళల బి.బి.సి. జాబితాలో నదీన్ ఒకరయ్యారు. ఆ గుర్తింపు కూడా నదీన్కు మీటూ ఉద్యమకారిణిగా లభించినదే. ∙∙ యూఎస్‌లో మీటూ మొదలయ్యే సమయానికి నదీన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘అసాల్ట్ పోలీస్’ అనే పేజ్ని నడుపుతూ ఉంది. హాలీవుడ్లో హార్వీ వైన్స్టీన్లా ఈజిప్టులో అహ్మద్ బస్సమ్ జికీ అనే వ్యక్తి అనేక మంది మహిళల్ని లైంగికంగా వేధించిన కేసుల్లో ప్రధాన నిందితుడు. యాభై మందికి పైగా మహిళలు అతడి వల్ల తాము పడిన లైంగిక హింసను ‘అసాల్ట్ పోలీస్’లో షేర్ చేసుకున్నారు. ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా నదీన్ అనుకోకుండా ప్రారంభించింది. ఆమె అంతకుముందు ఫేస్బుక్లో చురుగ్గా ఉండేది. నదీన్ ఓ రోజు రాత్రి పొద్దుపోయాక అహ్మద్ బస్సమ్ జికీ లైంగిక అకృత్యాలపై ఒక పోస్ట్ చదువుతుంటే అకస్మాత్తుగా అది అదృశ్యం పోయింది. అతడి ఘోరాలపై అప్పటికే రగిలిపోతున్న నదీన్ అప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ప్రారంభించి, అతడి గురించి ఆరా తీసింది. కొద్ది గంటల్లోనే కనీసం యాభై మంది బాధితులు అతడు తమనెలా మోసం చేసిందీ, లైంగికంగా ఎలా హింసించిందీ నదీన్తో పంచుకున్నారు. అలా ఈజిప్టులో మీటూకు నదీన్ ఇన్స్టాగ్రామ్ నుంచి తొలి అడుగు పడింది. అదే సమయంలో ఈజిప్టు ప్రభుత్వం మీటూకు ఊతం ఇచ్చేలా లైంగిక నేరాల నిరోధక చట్టాన్ని అమల్లోకి తేవడంతో యూఎస్‌లో వైన్‌స్టీన్ అరెస్ట్ అయినట్లే ఈజిప్టులో అహ్మద్ కూడా అరెస్ట్ అయ్యాడు. మీటూ ఉద్యమకారిణిగా నదీన్ గుర్తింపు పొందారు. నదీన్ ఉండేది ఈజిప్టు రాజధాని కైరోలో. ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆమె తల్లి పౌష్టికాహార వైద్య నిపుణురాలు. తండ్రికి సొంత సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. కూతురి మీటూ ఉద్యమ సారథ్యానికి ఇద్దరూ చోదకశక్తుల్లా పనిచేస్తున్నారు. నిజంగా ఇది గొప్ప సంగతి. అందుకే.. ‘‘లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కీలకమైన ఉద్యమ పాత్రను పోషిస్తూ సమాజంలో మార్పు తెచ్చేందుకు నదీన్ కృషి చేస్తోంది’ అని బి.బి.సి. ఇచ్చిన ప్రశంసకు నదీన్ తల్లిదండ్రులూ పాత్రులే. ‘‘నేనిక్కడితో ఆగిపోవడం లేదు’’ అని మంగళవారం ‘ఈజిప్షియన్ స్ట్రీట్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు నదీన్ అష్రాఫ్. లైంగిక హింసకు, వేధింపులకు గురవుతున్న మహిళలకు మద్దతుగా నిలబడి, వారికి న్యాయపరమైన సహకారం కూడా ఉచితంగా అందే ఏర్పాటు చేస్తున్న నదీన్ ఆన్లైన్ వేదికగా మహిళలందరినీ బాధితుల తరఫున సమైక్య పరిచే ప్రణాళిక ను సిద్ధం చేసుకుంటున్నారు. తనుశ్రీ దత్తా, యాష్లీ జూడ్ -
రీ ఎంట్రీకి రెడీ అయిన తనుశ్రీ దత్తా..!
తనుశ్రీ దత్తా సినిమాల ద్వారా కంటే కూడా మీటూ ఉద్యమంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. భారతదేశంలో మీటూ ఉద్యమానికి ఆధ్యురాలు ఆమె. సినిమాలకు దూరమయిన ఆమె అమెరికా వెళ్లారు. ఇండియా వచ్చిన సమయంలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో సహా నటుడు నానాపటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. ఆ తర్వత తనుశ్రీ దత్తా స్ఫూర్తితో ఎందరో తమకు ఎదురైన భయానక పరిస్థితుల గురించి వెల్లడించారు. ఇక దేశంలో మీటూ ఉద్యమం ఉధృతంగా మారిన సమయంలో ఆమె అమెరికా వెళ్లిపోయారు. తాజాగా ఆమెకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త తెలిసింది. త్వరలోనే తనుశ్రీ దత్తా సినిమాల్లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు తనుశ్రీదత్తా. సినిమాల కోసం అమెరికన్ గవర్నమెంటు ఉద్యోగం వదులుకున్నానని.. 15 కిలోల బరువు కూడా తగ్గానని తెలిపారు. యూఎస్ డిఫెన్స్‌లో ఉద్యోగం వదులుకున్నాను ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో. ‘గత కొద్ది రోజులుగా నేను అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్నానే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అవన్ని అవాస్తవాలు. ట్రైనింగ్ తీసుకున్న మాట వాస్తవమే కానీ ఉద్యోగంలో చేరలేదు. వాస్తవానికి అమెరికా డిఫెన్స్ రంగంలో నాకు మంచి ఉద్యోగం లభించింది. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన జాబ్. కరోనా ముగిసిన తర్వాత ఉద్యోగంలో చేరాలి. ఆ తర్వాత నేను మూడేళ్ల పాటు అమెరికా నుంచి ఎక్కడి వెళ్లడానికి వీల్లేదు. మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికాలో జాతీయ రక్షణ సంబంధిత ఉద్యోగాలు సాధారణంగా చాలా ఎక్కువ భద్రతా క్లియరెన్స్, అనుమతులను కలిగి ఉంటాయి. అందుకే ఉద్యోగాన్ని వదులుకున్నాను. ఆర్టిస్ట్‌గా నా కెరీర్‌ని తిరిగి ప్రారంభించాలనుకుంటున్నాను. ఇండస్ట్రీలోని కొందరు చెడ్డవారి వల్ల నేను నా పనిని మధ్యలో వదిలేయాల్సి వచ్చింది. కానీ బాలీవుడ్లో నాకు మంచి పేరు ఉంది. దాంతో ఇండస్ట్రీలో తిరిగి నా కెరీర్‌ని ప్రారంభించాలని భావించాను. అందుకే ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నాను. మంచి చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో నటించాలని అనుకుంటున్నాను’ అని తెలిపారు తనుశ్రీ దత్తా. (చదవండి: మీటూ ఉద్యమానికి మహిళలే బాధ్యులు) View this post on Instagram Some old news doing the rounds that I'm doing an IT job in LA. I was infact training for in IT and had a fantastic IT job opportunity in the defence sector of the US Government. It was a very prestigious job opportunity as I have always had the discipline, integrity and determination of an army person so to work in this field in whatever capacity would have been an honour. But I didn't take it as I wanted to explore my artistic career again. The defence job based out of Nevada would eventually after the Pandemic would need me to shift out of LA/ NY and I would not be permitted to leave the US for 3 years. I would also have to sign a job contract for 3 years coz such national defence related US jobs usually have very high security clearance and permissions so they cannot have people in and out of employment. Since I'm an artist at heart who just happened to lose my way away from my craft due to some very very bad human beings and the trouble they caused me, i decided to not be hasty in changing my profession and re-consider what options I have in Bollywood. I have a lot of goodwill in Bollywood and Mumbai so I came back to India and will stay here for sometime and will work on some interesting projects. I have been getting some offers from Bollywood in terms of movies and web series and the Industry seems far more interested in casting me rather than my arch- enemies.( they only announce projects but none of their projects ever see the light of day & will not).At present I'm in touch with 3 big South film managers who are pitching me for Big budget south Projects as well as 12 Casting offices in Mumbai. There are powerfull Industry bigwigs who are giving me silent support in the background as they know the truth and are my wellwishers.There are also big production houses I'm talking to for projects in lead roles. The pandemic has just made shooting dates uncertain so I'm unable to make a concrete announcement. I recently shot a commercial advertisement in the beauty space and announced that I'm back to work. I'm looking good, getting back my sass as I've lost 15 kgs and there is a strong buzz amongst industry folks of my imminent return to acting! #🤞🤞 A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) on Nov 7, 2020 at 10:52pm PST సౌత్‌లో మూడు పెద్ద సంస్థల్లో అవకాశం ఇక ముంబై తిరిగి వచ్చిన తర్వాత తాను సౌత్‌కు చెందిన మూడు పెద్ద నిర్మాణ సంస్థల ప్రాజెక్టుల్లో అవకాశం దక్కించుకున్నట్లు తనుశ్రీ దత్తా తెలిపారు. ప్రస్తుతం ఈ మూడు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయన్నారు. ఇవే కాకుండా మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రల కోసం బాలీవుడ్‌లోని 12 క్యాస్టింగ్ ఆఫీస్‌లు తనను సంప్రదించాయన్నారు. ఇప్పటికే తాను అంగీకరించిన కొన్ని సినిమాలు ప్రారంభం కావాల్సి ఉండగా... కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ వాయిదా పడిందన్నారు. తన గురించి తెలిసిన కొందరు పెద్దలు రహస్యంగా తనకు సాయం చేస్తున్నారని వెల్లడించారు. అంతేకాక ఇటీవలే తాను ఓ ప్రచార చిత్రంలో నటించిన విషయాన్ని ఈ సందర్భంగా తనుశ్రీ దత్తా ప్రస్తావించారు. ఇక సినిమాల కోసం తాను ఏకంగా 15 కిలోల బరువు తగ్గినట్లు తెలిపారు. స్లిమ్ లుక్‌లో తాను ఇంతకుముందు నటించిన చిత్రాల్లో మాదిరిగా అందంగా కనిపించానన్నారు. ఇక తెలుగులో తనుశ్రీ దత్తా బాలకృష్ణకు జోడిగా వీరభద్ర చిత్రంలో నటించారు. -
నటిపై ఆరోపణలు; రూ. కోటి పరువు నష్టం దావా
ముంబై : బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు మోపిన నటి పాయల్ ఘోష్‌పై రూ.కోటి పది లక్షల పరువు నష్టం దావా వేశారు రిచా చద్ధా. 2013లో అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించారని పాయల్ ఆరోపించిన విషయం తెలిసిందే. తాను ఫోన్ చేస్తే చాలు ముగ్గురు హీరోయిన్లు రిచా చద్దా, మహీ గిల్, హ్యుమా ఖురేషీలు తన వద్దకు వస్తారంటూ కశ్యప్ ఆ సమయంలో చెప్పినట్లు’ పాయల్ పేర్కొన్నారు. అయితే తాను ఎటువంటి ప్రలోభాలకూ లొంగలేదని ఆమె వెల్లడించారు. చదవండి: లైంగిక ఆరోపణలు.. విచారణకు హాజరైన దర్శకుడు ఈ ఆరోపణలపై మరోనటి రిచా చద్దా స్పందించి పాయల్‌కు లీగల్ నోటీసులు పంపించారు. పాయల్ చేసిన వ్యాఖ్యలు తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయని బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. నష్ట పరిహారంగా ఒక కోటి 10 లక్షల రూపాయలను డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన జస్టిస్ ఎకే మీనన్ ఏకసభ్య ధర్మాసనం పాయల్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఉపసంహరించుకుంటే సరిపోతుందా అని రిచా తరపు న్యాయవాదిని అడిగారు. చదవండి: దర్శకుడిపై అత్యాచారం కేసు దీనిపై స్పందించిన పాయల్.. కేవలం తను అనురాగ్ మాట్లాడిన వ్యాఖ్యలను మాత్రమే చెప్పినట్లు పేర్కొన్నారు. దీనిని తప్పుడు ఆరోపణగా పేర్కొంటూ.. ఈ కేసుతో తనకు ఏ సంబంధం లేదని తెలిపారు. అసలు తన పేరు తీసినందుకు అనురాగ్ కశ్యప్‌ను రిచా ప్రశ్నించాలని పేర్కొన్నారు. అనంతరం కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. మరో వైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనురాగ్ కశ్యప్‌కు బాలీవుడ్ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. ఆయన మాజీ భార్యలు కల్కి కొచ్లిన్, ఆర్తి బజాజ్‌లు సైతం కశ్యప్‌కు బాసటగా నిలిచారు కాగా తనపై లేనిపోని ఆరోపణలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. -
రూపా దత్తా తప్పులో కాలేశారా?
సాక్షి, ముంబై: మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి మీటూ ఉద్యమం తరువాత తాజాగా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. హీరోయిన్ పాయల్ ఘోష్ ఆరోపణల అనంతరం బెంగాలీ నటి రూపా దత్తా కూడా ఇదే ఆరోపణలతో ముందుకు వచ్చారు. అయితే ఇక్కడే తీవ్ర గందరగోళం ఏర్పడింది. అనురాగ్ కశ్యప్ లైంగికంగా వేధించాడంటూ దీనికి సంబంధించిన అనురాగ్ సఫర్ పేరుతో ఉన్న ఫేస్ బుక్ చాట్ స్క్రీన్ షాట్స్ షేర్ చేయడంతో పెద్ద దుమారమే రేగుతోంది. మరోవైపు కశ్యప్‌కు స్త్రీల పట్ల ఏ మాత్రం గౌరవం లేదంటూ పాయల్ ఘోష్ ఆరోపణలను గట్టిగా సమర్ధించారు రూపా. అంతేకాదు ఆయన డ్రగ్స్ కూడా తీసుకుంటారని, కఠినంగాశిక్షించాలని కోరారు. ఎన్సీబీ తనిఖీలు చేపట్టాలని ట్వీట్ చేశారు. తాజా పరిణామంపై రూపా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. (వాళ్లిద్దరికీ అతడితో సంబంధం: నటి స్పందన) అనురాగ్ కశ్యప్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించిన రూపా దత్తా ... అనురాగ్ సఫర్ 2014 నాటి ఛాటింగ్ షేర్ చేయడం సరికొత్త వివాదాన్ని రేపింది. ఐర్లాండ్ కు చెందిన అనురాగ్ సఫర్ 2010, సెప్టెంబరు చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది. తాను దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను కాదని తనకూ అనురాగ్ కశ్యప్ కు సంబంధం లేదనే ఆ సమాచారాన్ని ట్వీట్ చేశాడు. అనురాగ్ సఫర్కి గతంతో అనురాగ్ కశ్యప్ పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ ఉండేదని, పలు మీడియా సంస్థలు కూడా అతడిని కశ్యప్ గా భావించడంతో ఈ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. కాగా పాయల్ ఘోష్ ఫిర్యాదు ఆధారంగా మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆరు సంవత్సరాల క్రితం జరిగిన ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని పోలీసు అధికారి తెలిపారు. అయితే మీరు గొప్ప స్త్రీవాది అంటూ తాప్సీ పన్ను కశ్యప్‌కు కితాబివ్వడం విశేషం. ఈ ఆరోపణలు రుజువైతే కశ్యప్‌తో అన్ని సంబంధాలను తెంచుకుంటానని తాప్సీ ప్రకటించారు. మీటూ ఉద్యమానికి చెడ్డపేరు తేవద్దంటూ నటి స్వర భాస్కర్ కూడా రూపాను తప్పుబట్టారు. అలాగే సైయమీ ఖేర్, రాం గోపాల్ వర్మ, అనుభవ్ సిన్హా తోపాటు, అనురాగ్ కశ్యప్ మాజీ భార్య కూడా కశ్యప్‌కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలను అనురాగ్ ఇప్పటికే ఖండించారు. अनुराग कश्यप ख़ुद बोल रहा है मैं अनुराग कश्यप नहीं हूँ चैटिंग में।वाह ! पायेल घोष के साथ अश्लील हरकते करने के बाद भी बोल रहा है मैंने कुछ नहीं किया।गुनहगार गुनह करके स्वीकार नहीं करता ये स्वाभाविक है।अरेस्ट के बाद उसका भी तरीक़ा है गुनह कुबूलने की।चिन्ता ना करे सच सामने आएगा। — Rupa Dutta (@iamrupadutta) September 22, 2020 Pl Excuse me friends!!! I am not film director or producer Anurag Kashyap. I am another Anurag. Please do not bug me considering him. — Anurag Safar (@anurag_safar07) September 15, 2010 अनुराग कश्यप के नज़रों में किसी भी औरत का कोई इज्ज़त नहीं है।जो मुझे उसे जानने के बाद पता चला।इसीलिए पायेल घोष का इल्ज़ाम बिलकुल सही है।अनुराग कश्यप को कठोर से कठोर सज़ा मिलनी चाहिए।और यह ड्रग भी लेता है।अपने आर्टिस्ट को भी सप्लाई करता है NCB जांच करे कृपा।#arrestanuragkashyab pic.twitter.com/ckK5ZfUDOW — Rupa Dutta (@iamrupadutta) September 19, 2020 -
సాయం చేయండి: మోదీకి పాయల్ ట్వీట్
ముంబై: ‘ఇప్పుడు మహిళల కోసం నిలబడాల్సిన సమయం, ప్లీజ్ వారి వాదన వినండి’ అంటూ నటి పాయల్ ఘోష్ ప్రజలను కోరారు. అంతేగాక దర్శక-నిర్మాత అనురాగ్ కశ్యప్‌పై వల్ల తనకు ప్రమాదం ఉందని, సాయం చేయాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆమె తాజాగా ట్విట్ చేశారు. అనురాగ్ తనను బలవంతం చేయబోయాడని అతడిపై చర్యలు తీసుకోవాలంటూ పాయల్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ట్వీట్ చేశారు. ‘‘అనురాగ్ నన్ను లైంగికంగా ఇబ్బందికి గురిచేశాడు. దయతో అతడిపై చర్య తీసుకోండి. ఈ సృజనాత్మక వ్యక్తి వెనుక రాక్షసుడు ఉన్నాడు. అది ప్రజలంతా గ్రహించాలి. దయ చేసి నాకు సాయం చేయండి’’ అంటూ ఆమె ట్విటర్ వేదికగా మోదీకి విజ్ఞప్తి చేశారు. అయితే అనురాగ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన అనంతరం చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు, నటీనటులు పాయల్‌వి అసత్య ఆరోపణలని, అలాంటి వాడు కాదంటూ ఆయనకు మద్దతునిస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: కశ్యప్‌పై పాయల్ లైంగిక దాడి ఆరోపణలు) ఈ నేపథ్యంలో పాయల్ ఘోష్ సోమవారం ఓ ట్వీట్ చేస్తూ.. ‘ప్రజలు ప్రతి విషయంలో మహిళలనే నిందిస్తూ మాతృస్వామ్యాన్ని అణగదొక్కుతున్నారు. ఇది మహిళల కోసం నిలబడే సమయం. వారి గొంతు వినండి. మహిళలు అణచివేతకు గురయ్యే కాలం పోయింది. ఇప్పుడు 2020లో ఉన్నాం అంటూ #metoo హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు. పాయల్ తనపై చేసిన ఆరోపణలను అనురాగ్ ఖండించారు. ఇవి నిరాధారమైన ఆరోపణలని, ఇవి పూర్తిగా తప్పుడు వ్యాఖలుగా అనురాగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. అందరూ పాయల్‌కు వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తుంటే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు. అనురాగ్‌ను అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. (చదవండి: నేనెప్పుడూ అలా ప్రవర్తించలేదు: అనురాగ్) People blame women for everything and post smash the patriarchy. It's time to stand with the women. Let them be heard. A voice suppressed is a generation of women oppressed. It's 2020. Come on, India! #MeToo — Payal Ghosh (@iampayalghosh) September 21, 2020 -
నా పేరెందుకు వాడారు?: నటి
ముంబై: బాలీవుడ్ ప్రముఖ దర్శక-నిర్మాత అనురాగ్ కశ్యప్‌పై లైంగిక ఆరోపణలలో తన పేరును వాడటాన్ని నటి రిచా చద్దా తీవ్రంగా ఖండించారు. ఈ వివాదంలో తన పేరు వాడిన మూడవ వ్యక్తిపై త్వరలోనే చట్టపరమైన తీసుకుంటున్నట్లు ఆమె తరపు న్యాయవాది సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై నటి పాయల్ ఘోష్ శనివారం లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రిచా చద్దాతో పాటు మరో ఇద్దరు నటుల పేర్లను కూడా పాయల్ వాడారు. తన పేరు అవమానకర రీతిలో వాడారంటూ రిచా ఆగ్రహం వ్యక్త చేశారు. వారిపై న్యాయపరమైన పోరాటానికి తాను సిద్దంగా ఉన్నట్లు రిచా ప్రకటించారు. (చదవండి: అనురాగ్ నన్ను ఇబ్బందిపెట్టాడు) ‘అనురాగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో మూడవ వ్యక్తి అనవసరంగా నా క్లైయింట్ రిచా చద్దా పేరు తీసుకువచ్చారు. ఆమె అన్యాయానికి గురైన మహిళలకు న్యాయంగా జరగాలని కోరుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరును అవమానకర రీతిలో వాడారు’ అని చద్దా తరపు ఆయన అన్నారు. ‘‘నిరాధారమైన ఆరోపణల వివాదాల్లో మూడవ వ్యక్తి తనను తీసుకురావడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా ఇతర మహిళలను అనవసరంగా వివాదంలో లేవనెత్తి సమాజంలో వారి ఆత్మగౌరవాన్ని కించపరిచారు. ఓ మహిళ తన స్వేచ్చా పోరాటంలో మరో మహిళ వ్యక్తిత్వాన్ని దేబ్బతీసే హక్కు లేదు. దీనిని తీవ్రంగా ఖండించడమే కాకుండ న్యాయ పోరాటానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తాం’’ అని పేర్కొన్నారు. (చదవండి: మీ టూ: అనురాగ్‌కు మాజీ భార్య మద్దతు) View this post on Instagram 💪🏼 A post shared by Richa Chadha (@therichachadha) on Sep 20, 2020 at 3:42pm PDT సినిమా చాన్స్‌లు కావాలంటే ప్రతి నటి తనతో చాలా సన్నిహితంగా ఉంటుందని దర్శకుడు అనురాగ్ తనతో చెబుతూ లైంగిక దుష్పవర్తనకు పాల్పడినట్లు నటి పాయల్ ఓ ఇంటర్యూలో ఆరోపించింది. దీనికి తాను అనురాగ్‌తో ‘మీరు రిచా చద్దాకు అవకాశం ఇచ్చారు. మహీ గిల్, హుమా ఖురేషిలకు సినిమా ఛాన్స్‌లు ఇచ్చారు. వారు చాలా నార్మల్‌గా కనిపించే అమ్మాయిలే అయినప్పటికీ మీరు వారికి మీ సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అసలు దర్శకులేవరు అలాంటి అమ్మాయిలకు అవకాశం ఇవ్వరూ కానీ మీరు గొప్ప పని చేశారు అని చెప్పి మానసికంగా నేను దీనికి సిద్దంగా లేను’ అని కశ్యప్‌తో చెప్పానన్నారు. అనురాగ్ కశ్యప్ 2012లో తన క్రైమ్ డ్రామా ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’లో రిచా చద్దా.. నాగ్మా ఖటూన్ పాత్రలో నటించారు. హుమా ఖురేషి కూడా అదే ప్రాజెక్ట్ ఓ పాత్రలో కనిపిచారు. 2009లో కశ్యప్ దర్శకత్వం వహించిన ‘దేవ్ డి’లో మహీ గిల్ నటించారు. (చదవండి: నేనెప్పుడూ అలా ప్రవర్తించలేదు: అనురాగ్) -
హీరోయిన్ మెటీరియల్ కాదన్నారు
అందం, అభినయంతో సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాజేశ్. కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ పలు హిట్లను తన ఖాతాలో వేసుకొని అటు టాలీవుడ్ ఇటు కోలివుడ్లో ఫుల్ బిజీ నటిగా మారారు. విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస లవర్’ చిత్ర ఫలితం ఎలా ఉన్నా సువర్ణ పాత్రలో ఐశ్యర్య నటను అందరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం నాని చిత్రంలో నటిస్తున్న ఈ తెలుగమ్మాయి కెరీర్ ఆరంభంలో తను ఎదుర్కొన్న అవమానాలను వెల్లడించారు. ‘నా కెరీర్ ఆరంభంలో నేను కూడా లైంగిక వేధింపులతో పాటు వర్ణ వివక్షను కూడా ఎదుర్కొన్నాను. నా రంగు నలుపు అని చాలా మంది అవహేళన చేశారు. నేను హీరోయిన్ మెటీరియల్ కాదని ఓ స్టార్ డైరెక్టర్ కించ పరచే విధంగా మాట్లాడాడు. కమెడియన్ పక్కన తప్ప హీరో పక్కన నేను సెట్ అవ్వనని కూడా ఆయన అన్నారు. అయితే ఈ అవమానాలేవి నన్ను ఆపలేదు. నేనుబోల్డ్గా ఉంటాను. ఆ లక్షణమే నన్ను నిలబెట్టిందనుకుంటాను. సమస్యల్ని స్వీకరించడం నాకు తెలుసు. ఎవరూ నన్ను నమ్మనప్పుడు నన్ను నేను నమ్మాను. అందుకే.. బాధల్ని ఓర్చుకున్నాను’ అంటూ ఐశ్వర్య రాజేశ్ వ్యాఖ్యానించారు. ఇక ఐశ్వర్య రాజేశ్ సినిమా బ్యాక్‌గ్రౌండ్ నుంచే వచ్చిన విషయం తెలిసిందే. ఆమె తండ్రి రాజేశ్ అప్పట్లో పలు చిత్రాల్లో నటుడిగా కనిపించారు. అంతేకాకుండా ప్రముఖ నటి శ్రీలక్ష్మి మేనకోడలే ఐశ్వర్య రాజేశ్ అన్న విషయం కొంతమందికే తెలుసు. ఇక సినిమా బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన నటికి కూడా లైంగింక వేదింపులు, వర్ణ వివక్ష తప్పకపోవడం గమనార్హం అని పలువురు వాపోతున్నారు. చదవండి: త్రివిక్రమ్ డైరెక్షన్.. వెంకీ, నాని హీరోలు! యూట్యూబ్ ట్రెండింగ్‌లో ‘నో పెళ్లి’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1081263436.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కాపాడమని లాయర్ దగ్గరకు వెళ్తే..
బాలీవుడ్లో మీటూ ఉద్యమానికి తెరలేపిన నటి తనుశ్రీ దత్తా. చిత్ర పరిశ్రమలో ఈ ఉద్యమం పెను దుమారాన్నే సృష్టించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఈ ముద్దగుమ్మ చేసిన ఆరోపణలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి. అయితే తను శ్రీ ఆరోపణలను ఖండిస్తూ నానా పటేకర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. లైంగిక వేధింపుల కేసులో తనుశ్రీ తన తరుఫున వాదించేందుకు నితిన్ సత్పుటే అనే ఓ లాయర్‌ను నియమించుకుంది. (మా అక్కలా.. నాకెప్పుడూ జరుగలేదు’) సదరు లాయర్ నితిన్ సత్పుటే కూడా కామాంధుడేనట. ఇటీవల లాయర్ నితిన్‌పై ఓ మహిళా లాయర్ కేసు నమోదు చేసింది. ఓ భూవివాదానికి సంబంధించిన కేసులో కాంప్రమైజ్ చేసేందుకు నితిన్.. ప్రత్యర్థి మహిళా లాయర్‌తో కలిసి మాట్లాడాడట. ఆ సమయంలో తన పట్ల నితిన్ అసభ్యంగా ప్రవర్తించాడని మహిళా న్యాయవ్యాది కేసు పెట్టింది. తననేదో రక్షిస్తాడని ఓ లాయర్‌ను పెట్టుకుంటే ఆయన కూడా కామాంధుడేనని కేసు పడింది. దీంతో తనుశ్రీ దిక్కుతోచని స్థితిలో నిలిచింది. (ఇన్స్పిరేషన్ #తనూటూ..!) -
వేశ్య అని వేధించేవారు: బాలీవుడ్ నటి
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు, వివాదాలపై ఏ మాత్రం జంకకుండా తన అభిప్రాయాలను వెల్లబుచ్చడంలో బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ ఎప్పుడూ ముందుంటారు. ఫ్రాన్స్‌కు చెందిన కల్కి బాలీవుడ్లో మంచి నటిగా గుర్తింపుపొందారు అంతేకాకుండా ఏ విషయంలోనైనా నిక్కశ్చిగా, ముక్కుసూటిగా మాట్లాడతారు. అయితే తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని అవమాన సంఘటనలు తాజాగా అభిమానులతో పంచుకున్నారు. తొలి చిత్రం ‘దేవ్ డి’తర్వాత ఎన్నో అవమానాలతో పాటు పరోక్షంగా లైంగిక వేధింపులను ఎదుర్కొన్న విషయాన్ని బయటపెట్టారు. ఈ చిత్రంలో వేశ్య పాత్ర పోషించడంతో తనను రష్యన్ వేశ్య అని వేధించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: బిడ్డ సరే... మరి నీ భర్త ఎక్కడ?) ‘దేవ్ డి చిత్రం విడుదలైన తర్వాత ఓ ఆంగ్ల పత్రికలో ఇలాంటి రష్యన్ వేశ్యలను బాలీవుడ్‌కు ఎందుకు తీసుకొస్తారో తెలియదు అని పరోక్షంగా నా గురించి ఓ వార్త రాశారు. ఇది చదివాక నేను చాలా బాధపడ్డాను. అయితే నేను రష్యా నుంచి రాలేదు కదా అనుకున్నా. ఇక 2013లో కల్కి.. రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణే కలిసి ‘యే జవానీ హై దివానీ’ వంటి సూపర్ హిట్ సినిమాలో నటించినా నాకు సరైన అవకాశాలు రాలేదు. దీంతో కొంత కాలం ఖాళీగా ఉన్నాను. ఈ క్రమంలో ఓ సినిమా నిర్మాత సినిమా అవకాశం ఇస్తానని చెప్పి పరోక్షంగా లైంగికంగా వేధించాడు. ఈ లైంగిక వేధింపులు, అవమానాలు కేవలం బాలీవుడ్లోనే కాదు హాలీవుడ్లో కూడా ఉంటాయి. ఒక సారి హాలీవుడ్లో నటించడానికి వెళితే ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి నువ్వు రష్యన్ వేశ్య అని అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఓ మహిళ నా దగ్గరకు వచ్చి నీ ముఖ్యంపై ముడతలు కనిపించడంలేదు, ఎక్కువగా నవ్వకు, జట్టు పైకి కట్టుకో అంటూ బెదిరించింది. ఇలా అన్ని చోట్లా అవమానాలు, వేధింపులు భరించాను. అంతేకాకుండా నేను పెళ్లికి ముందే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో అందరూ ఆ బిడ్డకు తండ్రెవరు అంటూ సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పెళ్లికి ముందే పిల్లల్ని కనడం అంటే ఇప్పటికీ సమాజం ఓ తప్పుగా భావిస్తుంది. నా ఇంట్లోవారికి నా పక్కింటి వారికి నేనుంటున్న కాలనీ మొత్తానికి నాకు పెళ్లి కాలేదని తెలుసు. కానీ వాళ్లెప్పుడూ నన్ను వేలెత్తి ప్రశ్నించింది లేదు. ఇక నేను తల్లిని కాబోతుండటంతో నన్ను సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు ఈ ఆలోచనా విధానం మారాలి’అని కల్కి పేర్కొన్నారు. రీసెంట్గా ఈ భామ సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన నెట్‌ఫ్లిక్స్ ‘సేక్రెడ్ గేమ్స్’ లో కనిపించిన విషయం తెలిసిందే. -
వాళ్లను చూస్తుంటే భయమేస్తోంది: చిన్మయి
సాక్షి, చెన్నై: సీనియర్ సినీ పాటల రచయిత వైరముత్తుపై సంచలన గాయనీ, డబ్బింగ్ కళాకారిణి చిన్మయి మరోసారి ఫైర్ అయ్యారు. అంతేకాకుండా ప్రముఖనటుడు, మక్కళ్ నీదిమయ్యం పార్టీ అద్యక్షుడు కమలహాసన్పై కూడా ఆమె పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. చిన్మయి గతంలో కూడా వైరముత్తుపై మీటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఆరోపణలు సినీ పరిశ్రమలో పెద్ద సంచలనాలనే సృష్టించాయి. ఫలితంగా తనూ నష్టపోయారు. దీంతో సయయం వచ్చినప్పుడల్లా చిన్మయి వైరముత్తును టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా కమల్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయంలో దివంగత దర్శకుడు కే.బాలచందర్ శిలావిగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్‌తో పాటు వైరముత్తు పాల్గొన్నారు. దీంతో గాయనీ చిన్మయి వైరముత్తుపై మరోసారి విరుచుకుపడ్డారు. ‘అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆయన జీవితం నశించిపోతుంది. ఇక బయట ప్రపంచంలో తలెత్తుకుని తిరగలేరు. ఇలాంటి వారిని కార్యక్రమాలకు అతిధులుగా ఎలా ఆహ్వానిస్తారు?అని ఆరోపించారు. మీటూ ఆరోపణలను ఎదుర్కొంటున్న వైరముత్తు ఈ ఏడాది పలు కార్యక్రమాల్లో, రాజకీయ కార్యక్రమాల్లోనూ అతిధిగా పాల్గొన్నారు. ఆయనకు జరిగిన నష్టం ఏమీలేదు అయితే బాధింపుకు గురైన నేను మాత్రం నిషేధానికి గురైయ్యాను. ఇదే సినీరంగంలో పెద్దల ద్వారా నాకు లభించిన న్యాయం. అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్నవారు బహిరంగ వేదికలపై తమ ఇమేజ్ను ఎలా కాపాడుకోవాలన్నది బాగానే తెలుసుకున్నారు. అలాంటి వారిలో కొందరు రాజకీయనాయకులూ ఉన్నారు. వారిని చూస్తుంటే భయం కలుగుతోంది’ అని చిన్మయి చేసిన ట్వీట్ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాఫిక్‌గా మారింది. -
సెక్స్ వేధింపులపై ఇదో ‘ఫేస్బుక్’ ఉద్యమం
సాక్షి, న్యూఢిల్లీ : ‘మీటూ’ ఉద్యమంలాగా బ్రిటన్‌లో మరో ఉద్యమం మొదలయింది. అయితే ఇది ‘ఫేస్బుక్’ వేదికగా కొనసాగుతోంది. తమకు మాజీ జీవిత భాగస్వాముల నుంచి ఎదురైన చేదు అనుభవాలను మహిళలు వరుస క్రమంలో ఇందులో వివరిస్తున్నారు. వీటిలో ఎక్కువగా లైంగిక వేధింపులే ఉంటున్నాయి. మాజీ జీవిత భాగస్వాములైన పురుష పుంగవులు తమను ఎలా లైంగికంగా, మానసికంగా లోబర్చుకున్నారో, వేధించారో, రేప్‌లు చేశారో, తమను మోసం చేసి పరాయి స్త్రీలతో ఎలా కులికారో, తిరిగారో వివరిస్తూ ‘ప్రిక్ అడ్వైజర్’ ఫేస్బుక్ గ్రూప్‌లో పోస్ట్‌ల మీద పోస్ట్‌లు పెడుతున్నారు. మాజీ భాగస్వాముల పేర్లను, ఫొటోలను కూడా షేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ గ్రూపులో లక్ష మంది బ్రిటన్ మహిళలు చేరిపోయారు. ‘క్లేర్స్ లా విషయంలో బ్రిటన్ అధికారులు చూపిస్తున్న అలసత్వం వల్లనే ఈ ఉద్యమం పుట్టుకొచ్చిందని ‘ప్రిక్ అడ్వైజర్ గ్రూప్’లోని ఒక అడ్వైజరయిన సమంతా రైట్ మీడియాకు వివరించారు. ‘క్లేర్స్ లా’ అనే చట్టం అప్పటి బ్రిటన్ హోం మంత్రి థెరిసా మే చొరవ మేరకు 2014, మార్చి నెల నుంచి అమల్లోకి వచ్చింది. ఇంతకుముందు పెళ్లి చేసుకుని భార్యకు విడాకులు ఇచ్చిన మగవాళ్ల గృహ హింసకు సంబంధించిన నేర చరిత్రను తెలుసుకోవాలంటే వారిని పెళ్లి చేసుకోబోతున్న మహిళలను ఈ చట్టం కింద సమాచారాన్ని కోరవచ్చు. ఈ మేరకు పోలీసులిచ్చే సమాచారాన్ని చూసి తాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్న భర్తల విషయంలో ఓ నిర్ణయానికి రావచ్చు. బ్రిటన్‌లో ఏటా 13 లక్షల మంది మహిళలు భర్తల చేతుల్లో లైంగిక వేధింపులు, గృహ హింసకు గురై విడిపోతుంటే వారిలో 18 శాతం మంది బాధితులే పోలీసు అధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు. కేసులు పెడుతున్నారు. వారి భర్తలకు సంబంధించిన నేర చరిత్ర మాత్రమే పోలీసుల వద్ద నిక్షిప్తమై ఉంటోంది. మిగతా వారి గురించి తెలియడం లేదు. అందుకనే ఈ ‘ప్రిక్ అడ్వైజర్’ గ్రూప్ పేజీ పుట్టుకొచ్చింది. ఈ గ్రూపులో చేరిన మహిళలంతా మాజీ భర్తల నుంచి ఎదురైన అనుభవాలను వారి భార్యల పోస్టింగ్‌ల ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు. వాటిలో తాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్న పురుష పుంగవులు ఎవరైనా ఉంటే వారి జాతకాలు చేతికి చిక్కినట్లే. ఈ ఫేస్బుక్ గ్రూప్‌పై మాజీ భర్తలు మాత్రం లబోదిబోమని గొడవ చేస్తున్నారు. ఈ పేరిట అమాయకులైన మగవారి జీవితాలను బలిచేసే ప్రమాదం ఉందని, పోస్టింగ్‌ల ఆధారంగా మాజీ భర్తలపై పోలీసులు ఇప్పుడు కేసులు పెట్టి వేధించే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుంటే....కలిసి కాపురం చేస్తున్నప్పుడు కాల్చుకుతిన్న భార్యలు భవిష్యత్తులో తాము మరో పెళ్లి చేసుకోకుండా ఇలా జీవితాలను నాశనంచేస్తున్నారని ఇంకొందరు వినిపిస్తుంటే, బతికితిమిరా దేవుడా ! అనుకుంటూ విడాకులు తీసుకుంటే ఈర్శాసూయలతోని, మానసిక రుగ్మలతోని మాజీ భార్యలు ఇలాగా కూడా వేధిస్తారా?....అంటూ గగ్గోలు పెడుతున్నవారూ లేకపోలేదు. అయితే ఏదీ తాము శ్రుతిమించనీయమని, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ‘ఫేస్బుక్’ యాజమాన్య వర్గాలు తెలియజేస్తున్నాయి.