స్టాక్‌హోమ్: ‘మీ టూ’ ప్రకంపనల నేపథ్యంలో ఈ ఏడాది నోబెల్ సాహితీ పురస్కారాన్ని స్వీడిష్ అకాడెమీ వాయిదావేసింది. అకాడెమీ సభ్యురాలి భర్తపై లైంగిక ఆరోపణలతోపాటు వివిధ వివాదాలూ దీనికి కారణం. అకాడెమీలోని శాశ్వత సభ్యురాలు, కవయిత్రి కటరినా ఫ్రోస్టెన్సన్, తన భర్త ఫ్రెంచి జాతీయుడైన జీన్ క్లౌడ్ అర్నాల్ట్‌తో కలిసి ఓ సాహితీ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థకు స్వీడిష్ అకాడెమీ భారీగా నిధులను అందజేస్తోంది. అయితే, ‘మీ టూ’ ప్రచారోద్యమంలో భాగంగా పలువురు మహిళలు జీన్ క్లౌడ్ అర్నాల్ట్ తమపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆరోపించారు. దీంతోపాటు అకాడెమీ ఆస్తులను ఆర్నాల్ట్ దుర్వినియోగం చేశాడనీ, సాహితీ పురస్కారంపై లీకులిచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వివాదం నేపథ్యంలో 18 మంది శాశ్వత సభ్యులుండే స్వీడిష్ అకాడెమీలో లుకలుకలు మొదలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment