nobel medal
-
ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ఆపితే అందుకు మేం సిద్ధం
రష్యా సేనలు కాల్పులు ఆపి దేశం వీడటంతో పాటు భద్రతాపరమైన హామీలిస్తే పుతిన్ కోరుతున్నట్టు నాటో సభ్యత్వ డిమాండ్‌ను పూర్తిగా వదులుకునేందుకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పునరుద్ఘాటించారు. ‘‘నాటో విస్తరణకు రష్యా బద్ధ వ్యతిరేకి. మమ్మల్ని చేర్చుకునేందుకు పశ్చిమ దేశాలూ సుముఖంగా లేవు. రష్యా తక్షణం యుద్ధమాపి వెనుదిరగడం మాకు ముఖ్యం. కాబట్టి అందరికీ అంగీకారయోగ్యమైన రాజీ మార్గమిది’’ అన్నారు. తనతో ముఖాముఖి చర్చలకు రావాలని పుతిన్‌ను కోరారు. నోబెల్ మెడల్ వేలం వేస్తా: మురతోవ్ ఉక్రెయిన్ శరణార్థులకు నిధులు సేకరించేందుకు తన నోబెల్ మెడల్‌ను వేలం వేస్తానని 2021 నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, రష్యా జర్నలిస్టు ద్మిత్రీ మురతోవ్ ప్రకటించారు. చదవండి: (Ukraine Russia War: రసాయన దాడి ఖాయం: బైడెన్) -
ఈ ఏడాది నోబెల్ ‘సాహిత్యం’ ఉండదు!
స్టాక్‌హోమ్: ‘మీ టూ’ ప్రకంపనల నేపథ్యంలో ఈ ఏడాది నోబెల్ సాహితీ పురస్కారాన్ని స్వీడిష్ అకాడెమీ వాయిదావేసింది. అకాడెమీ సభ్యురాలి భర్తపై లైంగిక ఆరోపణలతోపాటు వివిధ వివాదాలూ దీనికి కారణం. అకాడెమీలోని శాశ్వత సభ్యురాలు, కవయిత్రి కటరినా ఫ్రోస్టెన్సన్, తన భర్త ఫ్రెంచి జాతీయుడైన జీన్ క్లౌడ్ అర్నాల్ట్‌తో కలిసి ఓ సాహితీ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థకు స్వీడిష్ అకాడెమీ భారీగా నిధులను అందజేస్తోంది. అయితే, ‘మీ టూ’ ప్రచారోద్యమంలో భాగంగా పలువురు మహిళలు జీన్ క్లౌడ్ అర్నాల్ట్ తమపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆరోపించారు. దీంతోపాటు అకాడెమీ ఆస్తులను ఆర్నాల్ట్ దుర్వినియోగం చేశాడనీ, సాహితీ పురస్కారంపై లీకులిచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వివాదం నేపథ్యంలో 18 మంది శాశ్వత సభ్యులుండే స్వీడిష్ అకాడెమీలో లుకలుకలు మొదలయ్యాయి. -
ఠాగూర్ నోబెల్ మెడల్ చోరీ కేసులో కొత్త మలుపు
కోల్ కతా: ప్రఖ్యాత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ కు 1913లో వచ్చిన నోబెల్ బహుమతిని విశ్వభారతి మ్యూజియం నుంచి దొంగిలించిన గ్రూపుకు సాయం చేసిన వ్యక్తిని సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. బెంగాల్ జానపద గీతాలు(బాల్) సింగర్ ప్రదీప్ బౌరీ నిందితులకు సహకరించాడని పేర్కొన్నారు. బౌరీ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాడానికి గుజరాత్ కు తరలించనున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. బౌరీ బిర్బూమ్ జిల్లాలోని అతని స్వగ్రామం రుప్పుర్ లో అరెస్టు చేసి విచారణకు తరలించినట్లు చెప్పారు. గత రెండు వారాలుగా బౌరీని ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు.. రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ మెడల్ దొంగతనంతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. 1998 నుంచి 2003 వరకూ రుప్పూర్ గ్రామ సర్పంచ్ గా పనిచేసిన బౌరీ.. నోబెల్ మెడల్ ను దొంగతనం చేసేందుకు నిందితులకు సాయం చేయడమే కాకుండా రాష్ట్రం నుంచి పారిపోయేందుకు కూడా సహకరించినట్లు తెలిసింది. ఓ బంగ్లాదేశీ జాతీయుడు, ఇద్దరు యూరోపియన్ జాతీయులు ఈ దొంగతనంలో పాల్గొన్నట్లు బౌరీ అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. 2004లో మ్యూజియం నుంచి దొంగతనానికి గురైన మెడల్ ను తిరిగి తీసుకువచ్చే బాధ్యత ప్రభుత్వానిదని చెప్పడంతో కేసులో విచారణ వేగవంతమైంది.