
రష్యా సేనలు కాల్పులు ఆపి దేశం వీడటంతో పాటు భద్రతాపరమైన హామీలిస్తే పుతిన్ కోరుతున్నట్టు నాటో సభ్యత్వ డిమాండ్‌ను పూర్తిగా వదులుకునేందుకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పునరుద్ఘాటించారు. ‘‘నాటో విస్తరణకు రష్యా బద్ధ వ్యతిరేకి. మమ్మల్ని చేర్చుకునేందుకు పశ్చిమ దేశాలూ సుముఖంగా లేవు. రష్యా తక్షణం యుద్ధమాపి వెనుదిరగడం మాకు ముఖ్యం. కాబట్టి అందరికీ అంగీకారయోగ్యమైన రాజీ మార్గమిది’’ అన్నారు. తనతో ముఖాముఖి చర్చలకు రావాలని పుతిన్‌ను కోరారు.
నోబెల్ మెడల్ వేలం వేస్తా: మురతోవ్
ఉక్రెయిన్ శరణార్థులకు నిధులు సేకరించేందుకు తన నోబెల్ మెడల్‌ను వేలం వేస్తానని 2021 నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, రష్యా జర్నలిస్టు ద్మిత్రీ మురతోవ్ ప్రకటించారు.