![Russia Says Destroyed US Made Radar Station Near Ukrainian Town Of Zolote - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/9/Zelensky.jpg.webp?itok=-B1hZa_j)
it would consider NATO transport carrying weapons in Ukraine: ఉక్రెయిన్‌లోని జోలోట్ పట్టణం సమీపంలో అమెరికా నిర్మించిన రాడార్ స్టేషన్‌ను ధ్వంసం చేసినట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్‌లో ఆయుధాలను మోసుకెళ్లే నాటో రవాణాను నాశనం చేసేందుకు ఉద్దేశించిన లక్ష్యంలో భాగంగా ఆ స్టేషన్‌ని ధ్వంసం చేసినట్లు రష్యా మంత్రిత్వశాఖ పేర్కొంది. అంతేకాదు రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ సాధించిన విజయానికి గుర్తుగా రష్యా బలగాలు ఈ ఘటనకు పాల్పడినట్లు స్పష్టం చేసింది. పైగా మే 9 రష్యా విక్టరీ డే పురస్కరించుకుని మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైనిక బలగాలకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు వ్లాదిమిర్ పుతిన్ తన బలగాలను ఉద్దేశించి ..."మీరు మాతృభూమి కోసం, భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. పైగా మీరు రెండవ ప్రపంచ యుద్ధం నుంచి నేర్చుకున్న పాఠాలను ఎప్పటికీ మర్చిపోరు. అయినా ఈ గడ్డ పై ఉరితీసేవారికి, వేధించేవారికి, నాజీలకు చోటు ఉండదు." అని అన్నారు. మరోవైపు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్ స్కీ కూడా రష్యా విక్టరీ డే సంర్భంగా ఓ వీడియోను విడుదల చేస్తూ... ఉక్రెయిన్‌కు రెండు విక్టరీ డేస్‌లు ఉంటాయని చెప్పడం కొసమెరుపు.
పైగా జెలన్ స్కీ కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో తమ పూర్వీకులు చేసిన వాటిని ఎప్పటికీ మరచిపోం అని వ్యాఖ్యానించడం విశేషం. అంతేకాదు ఇక్కడ 8 మిలియన్లకు పైగా ఉక్రేనియన్లు మరణించడమే కాకుండా ప్రతి ఐదవ ఉక్రేనియన్ ఇంటికి తిరిగి రాలేదన్నారు. ఈ మేరకు ఈ యుద్ధం దాదాపు 50 మిలియన్ల మంది ప్రాణాలను బలిగొందని జెలెన్ స్కీ అన్నారు. అదీ గాక ఉక్రెయిన్ పై రష్యా నిరవధిక దాడుల జరిపి నేటికి 75వ రోజుకు చేరుకుంది. ఐతే రష్యా ప్రధాన సంధానకర్త వ్లాదిమిర్ మెడిన్‌స్కీ ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు ఆగలేదని కాకపోతే మెక్కుబడిగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.
(చదవండి: అంచనాలను తలకిందులు చేస్తూ.. ఉక్రెయిన్‌లోని ‘మాతృభూమి’ రక్షణ కోసమే పోరాటం: పుతిన్)
Comments
Please login to add a commentAdd a comment