Weapons
-
పన్నుకు పన్ను ట్రంప్ ప్రతిపాదనలపై మెక్సికో!
మెక్సికో: మెక్సికో నుంచి దిగుమతులపై 25 శాతం పన్ను విధిస్తామన్న అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికకు ఆ దేశం తీవ్రంగా స్పందించింది. అదే జరిగితే మెక్సికో కూడా సుంకాలతో బదులిస్తుందని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ హెచ్చరించారు. అమెరికా సరిహద్దుల వెంబడి మాదకద్రవ్యాలు, వలసదారుల ప్రవాహాన్ని ఆపకపోతే మెక్సికో వస్తువులపై 25% దిగుమతి సుంకాలు తప్పవని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను క్లాడియా తీవ్రంగా దుయ్యబట్టారు. అమెరికా నుంచి అక్రమంగా ప్రవాహంలా వచ్చిపడుతున్న ఆయుధాలతో మెక్సికో బాధపడుతోందన్నారు. ఇక మాదకద్రవ్యాలు అమెరికా సొంత సమస్యేనన్నారు. వలస సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. సమస్యలపై చర్చలకు సిద్ధమన్నారు. వలసదారుల కారవాన్లు ఇకపై సరిహద్దుకు చేరవని స్పష్టం చేశారు. ఆయుధాలపై పెట్టే ఖర్చును వలస సమస్యను పరిష్కారానికి వెచ్చిస్తే మంచిదని అమెరికాకు హితవు పలికారు. యుద్ధానికి ఖర్చు చేసే మొత్తంలో కొంత శాంతి, అభివృద్ధిపై కేటాయిస్తే సమస్యను సులువుగా పరిష్కరించవచ్చన్నారు. అమెరికా, మెక్సికో పలు అంశాల్లో పరస్పరం ఆధారపడతాయి. భారీ పన్నులు ఇరు దేశాల్లో ద్రవ్యోల్బణానికి, నిరుద్యోగానికి కారణమవుతాయి. ఇరు దేశాల మధ్య అవగాహన, శాంతి సాధనకు చర్చలే మార్గం’’అన్నారు. అవి త్వరలోనే జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
రష్యా ఆయుధాగారాలపై ఉక్రెయిన్ భీకర దాడి
కీవ్: రష్యాకు చెందిన కీలక ఆయుధాగారాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. మిసై్పళ్లు, ఇతర ఆయుధాలను ధ్వంసం చేసింది. సరిహద్దు నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని ఆయుధ గిడ్డంగులపై ఉక్రెయిన్ మంగళవారం రాత్రి వందకు పైగా డ్రోన్లను ప్రయోగించి వాటిని నేలమట్టం చేసింది. భారీ పేలుళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. టోరోపెట్స్‌లో ఉన్న రష్యా ఆయుధ గిడ్డంగులను ధ్వంసం చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. మాస్కోకు 380 కిలోమీటర్ల దూరంలో టోరోపెట్స్ ఉంది. ఉక్రెయిన్ సెక్యూరిటీ సరీ్వసెస్, ఉక్రెయిన్ ఇంటలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ కలిపి సంయుక్తంగా ఈ భీకర దాడిని చేపట్టాయి. స్వదేశీ తయారీ కొమికేజ్ డ్రోన్లను ఉక్రెయిన్ ఈ దాడికి వాడింది. ఇస్కాండర్, టోచ్కా–యు మిసై్పళ్లు, గ్లైడ్ బాంబులు, ఇతర మందుగుండు సామాగ్రి ఈ గిడ్డంగుల్లో ఉందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉత్తరకొరియా సరఫరా చేసిన కేఎన్–23 స్వల్పశ్రేణి బాలిస్టిక్ మిసై్పళ్లు కూడా ఇందులో ఉన్నాయని చెప్పారు. భూకంపం వచి్చనంతటి తీవ్రతతో పేలుళ్లు జరిగాయని, పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించారని రష్యా వార్తా సంస్థలు తెలిపాయి. టోరోపెట్స్‌లో 11 వేల జనాభా ఉంది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడులతో మిసై్పళ్లు పేలిపోయి 6 కిలోమీటర్ల ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. -
ఆ రెండు స్కూళ్లలో వాళ్లని కాల్చి చంపేస్తా!
ఫ్లోరిడా: రెండు స్కూళ్లలో కాల్పులు జరిపి, చంపాల్సిన ‘కిల్ లిస్ట్‌ను తయారు చేసుకున్నాడు. అందుకు రకరకాల రైఫిళ్లు, పిస్టళ్లతోపాటు, కత్తులను సైతం సిద్ధం చేసుకున్నాడు. కిల్ లిస్ట్‌తోపాటు ఆయుధ సామగ్రి ఫొటోలను ఆన్లైన్లో తన క్లాస్మేట్లకు గొప్పగా చూపించుకున్నాడు. అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన 11 ఏళ్ల బాలుడి ఘన కార్యమిది. .! అసలే స్కూళ్లలో కాల్పుల ఘటనలతో జనం గగ్గోలు పెడుతున్న సమయం. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. దీంతో, వారు ‘కార్లో కింగ్స్టన్’ డొరెల్లి’ కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్లారు. అతడు పోగేసిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ‘క్రీక్ సైడ్ మిడిల్ స్కూల్లో చదువుకుంటున్న కార్లో అనే బాలుడు క్రీక్ సైడ్, సిల్వర్ శాండ్ మిడిల్ స్కూళ్లలో వాళ్లను కాల్చి చంపేందుకు పథకం వేశాడు. పేర్లు, లక్ష్యాలతో జాబితాను సైతం సిద్ధం చేసుకున్నాడు. వీటిని ఆన్లైన్లో పెట్టాడు. ఇదేమని అడిగితే ఒట్టి జోక్ మాత్రమే అంటున్నాడు’ అని ఒలూసియా కౌంటీ షరీఫ్ మైక్ చిట్వూడ్ తెలిపారు. అధికారులు బాలుడికి సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్తున్న వీడియోను ఆయన ‘థ్రెడ్’లో షేర్ చేశారు. అతడిపై శిక్షార్హమైన నేరం కింద కేసు నమోదు చేశామన్నారు. ‘ఉత్తుత్తిగా లేదా నిజంగానే బెదిరింపులకు గురిచేసే పిల్లల ఫొటోలతో వివరాలను బహిర్గతం చేస్తాం. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి’అని తల్లిదండ్రులను హెచ్చరించారు. -
IMA study: ఆత్మరక్షణకు ఆయుధాలు
దేశంలో మూడింట ఒక వంతు వైద్యులు రాత్రి షిఫ్టుల్లో అభద్రతతో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే. దాంతో కొందరైతే ఆత్మరక్షణ కోసం ఆయుధాలను తీసుకెళ్లడం తప్పదన్న భావనకు కూడా వచ్చారట. ఐఎంఏ అధ్యయనం ఈ మేరకు వెల్లడించింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య దేశమంతటా ఆందోళనకు దారితీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాత్రి షిఫ్టుల్లో వైద్యుల భద్రతను అంచనా వేయడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆన్లైన్ సర్వే చేపట్టింది. 3,885 వైద్యుల వ్యక్తిగత ప్రతిస్పందనలతో నిర్వహించిన ఈ సర్వే దేశంలోనే అతి పెద్ద అధ్యయనమని ఐఎంఏ పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 85 శాతం మంది 35 ఏళ్లలోపు వారు. 61 శాతం ఇంటర్న్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలున్నారు. కేరళ స్టేట్ ఐఎంఏ రీసెర్చ్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్, ఆయన బృందం రూపొందించిన ఈ సర్వే ఫలితాలను ఐఎంఏ కేరళ మెడికల్ జర్నల్ అక్టోబర్ సంచికలో ప్రచురించనున్నారు. ఈ ఆన్లైన్ సర్వేను గూగుల్ ఫామ్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులకు పంపారు. 24 గంటల్లో 3,885 స్పందనలు వచ్చాయని డాక్టర్ జయదేవన్ తెలిపారు. ‘‘వీరిలో చాలామంది దేశవ్యాప్తంగా వైద్యులు, ముఖ్యంగా మహిళలు రాత్రి షిఫ్టుల్లో అరక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో భద్రతా సిబ్బంది, పరికరాలను మెరుగుపరచాల్సిన అవసరముంది’’ అని అధ్యయనం పేర్కొంది.అధ్యయన నివేదిక...కొన్ని ఎంబీబీఎస్ కోర్సుల్లో లింగ నిష్పత్తికి అనుగుణంగా మహిళలు 63 శాతం ఉన్నారు. తమకు భద్రత లేదని భావించే వారి నిష్పత్తి మహిళల్లో ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది. 20–30 ఏళ్ల వయస్సున్న వైద్యులు అతి తక్కువ భద్రతా భావాన్ని కలిగి ఉన్నారు. వీరంతా ఎక్కువగా ఇంటర్న్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు. నైట్ షిఫ్టుల్లో 45 శాతం మందికి డ్యూటీ రూమ్ కూడా అందుబాటులో లేదు. రద్దీ, ప్రైవసీ లేకపోవడం, డ్యూటీ గదులకు తాళాలు లేకపోవడమే గాక అవి సరిపోవడం లేదు. దాంతో వైద్యులు ప్రత్యామ్నాయ విశ్రాంతి ప్రాంతాలను వెదుక్కోవాల్సి వస్తోంది. అందుబాటులో ఉన్న డ్యూటీ గదుల్లో మూడింట ఒక వంతు అటాచ్డ్ బాత్రూములు లేవు. దాంతో ఆ అవసరాలకు వైద్యులు అర్ధరాత్రి వేళల్లో బయటికి వెళ్లాల్సి వస్తోంది. సగానికి పైగా (53 శాతం) ప్రాంతాల్లో డ్యూటీ రూము వార్డు/ క్యాజు వాలిటీకి దూరంగా ఉంది. ప్రధానంగా జూ నియర్ డాక్టర్లు ఇలాంటి హింసను అనుభ విస్తున్నారు. పాలన లేదా విధాన రూప కల్పనలో వీరికి ప్రమే యం ఉండటం లేదు.వైద్యుల సూచనలు...→ శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచాలి.→ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.→ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ (సీపీఏ) అమలు చేయాలి.→ అలారం వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.→ తాళాలతో కూడిన సురక్షిత డ్యూటీ గదుల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి.→ సురక్షితమైన, పరిశుభ్రమైన డ్యూటీ రూములు ఏర్పాటు చేయాలి.– ఆహారం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల్లో మెరుగుదల అవసరం.→ ఆస్పత్రుల్లో తగినంత వైద్య సిబ్బందిని నియమించాలి.→ వార్డులు ఇతర ప్రాంతాల్లో రద్దీ లేకుండా ఏర్పాట్లు చేయాలి.అదనపు సూచనలుమద్యం సేవించిన లేదా మాదకద్రవ్యాల మత్తులో ఉన్న వ్యక్తుల నుంచి క్యాజువాలిటీలో పని చేస్తున్న వైద్యులు మౌఖిక, శారీరక బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. అత్యవసర గదుల్లో మహిళా వైద్యులకు అనవసరంగా తాకడం, అనుచిత ప్రవర్తన వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. పరిమిత సిబ్బంది, తక్కువ భద్రత ఉన్న చిన్న ఆసుపత్రుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భద్రతా సమస్యలు తలెత్తినప్పుడు నిర్వాహకుల నుంచి ఉదాసీనత వ్యక్తమవుతోందని చాలా మంది వైద్యులు తెలిపారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
జమ్మూలో 40 మందికి పైగా పాక్ ఉగ్ర మూకలు.. ఏరివేతలో భద్రతా బలగాలు
భారత్‌లో పాక్ ఉగ్ర మూకల వేట కొనసాగుతోంది. జమ్మూ ప్రాంతంలో సుమారు 40 నుంచి 50 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు కేంద్ర నిఘూ వర్గాలు గుర్తించాయి. దీంతో భద్రతా బలగాలు ఉగ్ర మూకల్ని ఏరిపారేసేందుకు కూంబింగ్ ప్రారంభించాయి..పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. జమ్మూ ప్రాంతంలోకి చొరబడిన ఉగ్రవాదులు అత్యున్నత శిక్షణ పొందారు. వారి వద్ద అమెరికా తయారు చేసిన ఎం4 కార్బైన్ రైఫిల్స్‌తో పాటు అత్యంత ఆధునిక, అధునాతన ఆయుధాలు ఉన్నట్లు సమాచారం. బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లోకి సైతం చొచ్చుకుపోయే సామర్థ్యం ఉన్న బుల్లెట్లను ఉన్నాయని తేలింది. జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదులు యాక్టీవ్‌గా ఉన్నారు. ముఖ్యంగా పర్వతాలు, అడవుల కేంద్రంగా ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. వారి ఏరివేత కోసం ఆర్మీ దళాలు కార్డన్, సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. -
కశ్మీర్ ఉగ్రవాదుల చేతికి అమెరికా తుపాకులు
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ నుంచి 2021లో నిష్క్రమించిన సందర్భంగా అమెరికా సేనలు అక్కడే వదిలేసిన అత్యాధునిక తుపాకులు పాకిస్తాన్ మీదుగా జమ్మూకశ్మీర్ ఉగ్రవాదుల చేతికందాయని నిపుణులు చెబుతున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి ఘటనల్లో వీటిని విరివిరిగా వాడటంపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేశారు. వీటిల్లో ముఖ్యంగా ఎం4 కార్బైన్ అసాల్ట్ రైఫిల్ ప్రధానమైంది. అత్యంత తేలిగ్గా ఉంటూ, మేగజీన్‌ను సులువుగా మారుస్తూ సునాయాసంగా షూట్‌చేసే వెలుసుబాటు ఈ రైఫిల్‌లో ఉంది. దాదాపు 600 మీటర్ల దూరంలోని లక్ష్యాలనూ గురిచూసి కొట్టొచ్చు. నిమిషానికి 700–970 బుల్లెట్ల వర్షం కురిపించే సత్తా ఈ రైఫిల్ సొంతం. ఇంతటి వినాశకర రైఫిళ్లు కశ్మీర్ ముష్కరమూకల చేతికి రావడంతో దూరం నుంచే మెరుపు దాడులు చేస్తూ సునాయాసంగా తప్పించుకుంటున్నారని రక్షణ రంగ నిపుణుడు లెఫ్టినెంట్ జనరల్ సంజయ్ కులకర్ణి అసహనం వ్యక్తంచేశారు. 2017 నవంబర్‌లో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ బంధువు రషీద్‌ను సైన్యం మట్టుబెట్టినపుడు అక్కడ తొలిసారిగా ఎం4 రైఫిల్‌ను సైన్యం స్వాధీనంచేసుకుంది. 2018లో, 2022లో ఇలా పలు సందర్భాల్లో ఉగ్రవాదుల ఎన్కౌంటర్ ఘటనాస్థలిలో ఈ రైఫిళ్లను భారత ఆర్మీ గుర్తించింది. జూలై 8వ తేదీన కథువాలో ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడిలోనూ ఇవే రైఫిళ్లను వాడారని తెలుస్తోంది. -
తాలిబన్ల ఆయుధాలపై పాక్ వణుకు!
పాకిస్తాన్లో ఆశ్రయం పొందిన తాలిబన్లు ఇప్పుడు తమ ఆయుధాలతో తమకు నీడ కల్పించిన దేశాన్నే వణికిస్తున్నారు. తాలిబన్ల దగ్గరున్న ప్రాణాంతక, ప్రమాదరక ఆయుధాలను చూసి బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకోవాలంటూ ఐక్యరాజ్య సమితి(యూఎన్ఓ)ని వేడుకుంటోంది.పాకిస్తాన్ తమకు రెండో ఇల్లు అని చెప్పుకునే తాలిబన్లు పాక్‌లో వ్యాపార, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకున్నారు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ పరస్పరం సరిహద్దులు పంచుకుంటున్న దేశాలని, మతపరంగా కూడా తాము ఒకే గూటి పక్షులమని తాలిబన్ నేతలు గతంలో ప్రకటించారు. అయితే అదే తాలిబన్ ఇప్పుడు పాకిస్తాన్‌పై వేలాడుతున్న కత్తిలా ప్రమాదకరంగా తయారయ్యింది.తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) వంటి తీవ్రవాద గ్రూపులను నిరాయుధులను చేసేందుకు ‘కాంక్రీట్ క్యాంపెయిన్’ ప్రారంభించాలని పాక్ తాజగా యూఎన్ఓను కోరింది. ఐక్యరాజ్య సమితి సమీక్షా సమావేశంలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ మాట్లాడుతూ ఉగ్రవాద గ్రూపులు ఆధునిక ఆయుధాలను సేకరించడం, వినియోగించడంపై పాకిస్తాన్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నదని తెలిపారు. ఆ గ్రూపుల దగ్గరున్న అన్ని ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సంఘటిత ప్రచారం అవసరమని పేర్కొన్నారు. అలాగే ఈ ఉగ్రవాద గ్రూపులు అధునాతన ఆయుధాలను ఎలా సేకరించాయనే దానిపై విచారణ చేపట్టాలని కూడా కోరారు.నిషేధిత ఉగ్రవాద సంస్థ టీటీపీ పాకిస్తాన్ అంతటా షరియా పాలనను నెలకొల్పాలని భావిస్తోంది. ‘డాన్’ వార్తా కథనం ప్రకారం ఉగ్రవాద గ్రూపులు సాగిస్తున్న ఆయుధాల స్మగ్లింగ్, వినియోగంపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఐక్యరాజ్యసమితితో పాటు గ్లోబల్ ఆర్గనైజేషన్‌లోని సభ్య దేశాలపై ఉందని పాక్ రాయబారి వ్యాఖ్యానించారు. ఈ ఆయుధాలను ఉగ్రవాదులు, నేరస్తులు స్వయంగా తయారు చేయరని, వాటిని చట్టవిరుద్ధమైన ఆయుధ మార్కెట్ల నుండి లేదా ఏదైనా దేశాన్ని అస్థిరపరచాలనుకునే సంస్థల నుండి సేకరిస్తారని పాక్ రాయబారి ఐక్యరాజ్య సమితికి వివరించారు. -
ఇజ్రాయెల్‌కు అమెరికా హెచ్చరిక.. ‘ఆయుధాల సరాఫరా నిలిపివేస్తాం’
న్యూయార్క్: గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న సమయంలో అమెరికా షాక్ ఇచ్చింది. రఫాలో దాడులకు దిగితే.. ఇజ్రాయెల్‌కు అయుధాలు సరాఫరా చేయబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం వార్నింగ్ ఇచ్చారు.‘‘ఇజ్రాయెల్ గాజాలోని రఫా నగరంలోకి అడుగు పెడితే.. ఆయుధాలు సరాఫరా నిలిపివేస్తాం. మధ్య ప్రాచ్యం నుంచి జరిగే దాడులను ఎదుర్కొవడానికి ఇజ్రాయెల్‌కు ఆయుధాలు సరాఫరా చేస్తాం. కానీ, రఫా నగరంపై దాడిచేస్తే.. ఆయుధాలు సరాఫరా నిలిపివేస్తాం’’ అని బైడెన్ హెచ్చరించారు. ఇజ్రాయెల్‌కు పంపిన 2వేల పౌండ్ల బాంబుల సరాఫరాపై బైడెన్ స్పందిస్తూ.. అమెరికా సరాఫరా చేసే బాంబుల కారణంగానే గాజాలో పాలస్తీనా ప్రజలు మృతి చెందుతున్నారని తెలిపారు.రఫా నగరంలో ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోవటం కోసం అగ్రరాజ్యం అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పది లక్షల జనాభా ఉన్న రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్ ఇంకా రఫా నగరంపై పూర్తిస్థాయిలో దాడులకు దిగలేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరాఫరా చేయటంపై మరోసారి సమీక్ష జరుపుతామని అమెరికాకు చెందిన ఒక ఉన్నతాధికారి వెల్లడించారు.‘తమ ఆయుధాలతో ఇజ్రాయెల్ గాజాలో పౌరులపై దాడులతో ప్రాణాలు తీస్తోందని అమెరికా ఏడు నెలల తర్వాత గుర్తించింది. ఇప్పటివరకు 34, 789 మంది పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందారు’ అని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. -
న్యూక్లియర్ డ్రిల్స్‌కు ఆదేశించిన పుతిన్
ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న తరుణంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు సమీపంలో రష్యన్ మిలటరీ, నేవి ఆధ్వర్యంలో అణ్వాయుధాల డ్రిల్స్ నిర్వహించాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించినట్లు ఆ దేశ రక్షణ శాఖ సోమవారం ప్రకటించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అణుయుద్ధానికి సంబంధించి పుతిన్ పలుసార్లు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.న్యూక్లియర్ డ్రిల్స్ చేస్తున్న సమయంలో నాన్ స్ట్రాటజిక్ న్యూక్లియర్ ఆయుధాలను ఉపయోగించటంపై శిక్షణ తీసుకోనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. నాన్ స్ట్రాటిజిక్ న్యూక్లియర్ ఆయుధాలను టెక్నికల్ వెపన్స్ అంటారు. యుద్ధ క్షేత్రాల్లో ఉపయోగించే మిసైల్స్ గుండా వీటిని ప్రయోగిస్తారు.కొన్ని పశ్చాత్య దేశాల నుంచి తమ దేశానికి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని సమీప భవిష్యత్తులో న్యూక్లియర్ డ్రిల్స్ చేపడతామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. అక్రమిత ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక బలగాలతో పాటు.. వైమానిక, నౌకా దళాలు న్యూక్లియర్ డ్రిల్స్ పాల్గొంటాయని పేర్కొంది. అమెరికాతో గతంలో చేసుకున్న ‘న్యూ స్టార్ట్ ఒప్పందం’నుంచి తాత్కాలికంగా తప్పుకొంటున్నామని గతేడాది రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. -
మరిన్ని శాటిలైట్లు, అణ్వస్త్రాలు: కిమ్
సియోల్(దక్షిణ కొరియా): కొరియా ద్వీపకల్పంలో అమెరికా, దక్షిణాకొరియా యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయని ఉత్తరకొరియా నియంత కిమ్ జాన్ మండిపడ్డారు. బదులుగా తామూ ఆయుధ సంపత్తిని పెంచుకుంటామని ప్రకటించారు. కొత్త ఏడాదిలో అదనంగా మూడు నిఘా ఉపగ్రహాల ప్రయోగాలు చేపడతామని ప్రకటించారు. అలాగే మరిన్ని అణ్వస్త్రాలనూ తయారు చేస్తామన్నారు. ఉత్తర కొరియా అధికారిక కేసీఎన్ఏ వార్తాసంస్థ ఈ మేరకు వెల్లడించింది. ట్రంప్ హయాంలో అమెరికాతో చర్చలు విఫలమయ్యాక అగ్రరాజ్యం నుంచి ఆక్రమణ, దాడి ముప్పు పొంచి ఉందన్న అనుమానంతో కిమ్ ఆయుధ సంపత్తి విస్తరణకు తెర తీశారు. ‘‘అమెరికా, దక్షిణకొరియా కవి్వంపు చర్యలు కొరియా ద్వీపకల్పాన్ని అణుయుద్ధం అంచుకు తీసుకెళ్లాయి. వాటి మెరుపుదాడులను తట్టుకుని నిలబడాలంటే మా సాయుధ, శక్తి సామర్థ్యాలను మరింత పటిష్టం చేసుకోవడం అత్యవసరం’’ అన్నారు. -
పాక్‌కు చైనా అందిస్తున్న ఆయుధ సహకారమెంత?
చైనా, పాకిస్తాన్ నౌకాదళాలు తొలిసారి సంయుక్త నావికా విన్యాసాన్ని నిర్వహించబోతున్నాయి. ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఈ కసరత్తుపై పాక్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాగా పాకిస్తాన్ తన మిత్రదేశం చైనాను హాంగౌర్ క్లాస్ జలాంతర్గామి కావాలని కోరింది. ఈ రెండు దేశాలు దీనిని నిర్మించే ప్రయత్నంలో ఉన్నాయి. పాకిస్తాన్ తన ఆయుధ అవసరాలను తీర్చుకునేందుకు చైనాపైననే అధికంగా ఆధారపడుతోంది. యునైటెడ్ స్టేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్- 2023 నివేదిక ప్రకారం 80వ దశకంలో ఆఫ్ఘన్ జిహాద్‌ను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ అమెరికా నుండి పెద్ద మొత్తంలో ఆయుధాలను కొనుగోలు చేసేది. అయితే 2005 నుండి 2015 వరకు పాకిస్తాన్.. చైనా నుండి అత్యధిక ఆయుధాలను కొనుగోలు చేసిందని ఆ నివేదిక వెల్లడించింది. గత 15 ఏళ్లలో పాకిస్తాన్‌కు చైనా 8,469 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అందించింది. అంతకుముందు గత 50 ఏళ్లలో, చైనా.. పాకిస్తాన్‌కు 8794 మిలియన్ డాలర్ల (ఒక మిటియన్ అంటే రూ. 10 లక్షలు) విలువైన ఆయుధాలను అందించింది. ఇంతేకాకుండా పాకిస్తాన్ సైన్యం అమెరికా, రష్యా నుండి కూడా గరిష్ట సంఖ్యలో ఆయుధాలను కొనుగోలు చేస్తుంటుంది. 2015 నుండి పాకిస్తాన్ ఆయుధ అవసరాలలో 75 శాతం చైనా తీరుస్తుంది. 2021లో పాకిస్తాన్.. చైనా నుండి హై-టు-మీడియం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎయిర్ మిసైల్‌ను కొనుగోలు చేసింది. పాకిస్తాన్ ఆర్మీలో చైనా ఫిరంగి, రాకెట్ లాంచర్లను ఉపయోగిస్తున్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్‌తో కలసి నావికా విన్యాసాలు చేపట్టనున్న సందర్భంగా చైనా తన ఆరు నౌకలను అరేబియా సముద్రంలో దించనుంది. ఈ నౌకల్లో గైడెడ్ మిస్సైల్ జిబో, గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ జింగ్జౌ, లిని ఉన్నాయి. ఇది కాకుండా రెండు షిప్‌బోర్న్ హెలికాప్టర్లలో నావికాదళ సిబ్బంది విన్యానాల్లో పాల్గొననున్నారు. అలాగే చైనా టైప్-093 సాంగ్ కేటగిరీకి చెందిన డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్‌ను కూడా మోహరించినుంది. పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ తెలిపిన వివరాల ప్రకారం సీ గార్డియన్- 2023 నావికా విన్యాసాల ఉద్దేశ్యం ఇరు దేశాల నౌకాదళాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నెలకొల్పడం. ఇది కూడా చదవండి: కొత్త రూపంలో కోవిడ్-19.. భారత్‌కూ తప్పని ముప్పు? -
అల్-షిఫా ఆస్పత్రి ఎమ్ఆర్ఐ సెంటర్లో హమాస్ ఆయుధాలు!
గాజా: అల్ షిఫా ఆస్పత్రిని హమాస్ ఉగ్రవాదులు తమ స్థావరంగా మార్చుకున్నారని గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే అందుకు తగిన ఆధారాలను కూడా బయటపెట్టింది. తాజాగా అల్-షిఫా ఆస్పత్రిలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సేనలు హమాస్ దాచిన ఆయుధాలను బయటపెట్టారు. ఆస్పత్రి ఎమ్ఆర్ఐ స్కానింగ్ సెంటర్లో హమాస్ కమాండ్ కేంద్రాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి జోనాథన్ కాన్రికస్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేశారు. Watch as LTC (res.) Jonathan Conricus exposes the countless Hamas weapons IDF troops have uncovered in the Shifa Hospital's MRI building: pic.twitter.com/5qssP8z1XQ — Israel Defense Forces (@IDF) November 15, 2023 ఎమ్ఆర్ఐ స్కానింగ్ కేంద్రంలో హమాస్ ఆయుధాలకు సంబంధించిన బ్యాగులు బయటపడ్డాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి జోనాథన్ కాన్రికస్ స్వయంగా వెల్లడించారు. ఆ బ్యాగుల్లో ఏకే-47 వంటి భారీ స్థాయి తుపాకులు, మందుగుండు సామగ్రి కనిపించాయని ఆయన వీడియోలో చూపించారు. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఆస్పత్రులను హమాస్ ఉగ్రవాద కేంద్రంగా మార్చిందని ఆయన ఆరోపించారు. అల్-షిఫా ఆస్పత్రిని హమాస్ స్థావరంగా మార్చుకుందని ఇజ్రాయెల్ సేనలు ఆరోపిస్తున్నాయి. ఆస్పత్రి అంతర్భాగంలో సొరంగాలు ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రవాదుల ఇళ్ల నుంచి ఆస్పత్రికి నేరుగా సొరంగ మార్గాలను కనుగొన్నామని సైన్యం వెల్లడించింది. అల్-షిఫా ఆస్పత్రి పరిసరాల్లో కొద్ది రోజుల పాటు హమాస్-ఇజ్రాయెల్ సేనలకు మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఆస్పత్రికి కొద్ది రోజులుగా నీరు, ఆహారం, ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో చిన్నారులతో సహా వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇదీ చదవండి: జిన్‌పింగ్ ఓ నియంత.. బైడెన్ నోట మళ్లీ అదే మాట! -
హమాస్‌కు ఆయుధాలు ఎక్కడివి? కీలకపాత్రధారులెవరు?
ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వివాదానికి ఏళ్ల చరిత్ర ఉంది. పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న హమాస్‌ను ప్రపంచంలోని అనేక దేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. అలాగే మానవతా ధృక్ఫథంతో పాలస్తీనాకు సహాయం అందిస్తున్న యూరప్‌లోని పలు దేశాలు ఇకపై తమ సహాయాన్ని కొనసాగించాలా వద్దా అనే డైలమాలో పడ్డాయి. అటువంటి పరిస్థితిలో హమాస్‌కు ఆర్థిక సహాయంతో పాటు ఆయుధాలు ఎక్కడ నుండి లభిస్తున్నయనే ప్రశ్న అందరి మదిలో తలెత్తుతుంది. హమాస్‌కు మద్దతు అందించేందుకు ఇరాన్, సిరియాల నుంచి పలు రహస్య మార్గాలు ఉన్నాయి. 2005లో గాజా నుండి ఇజ్రాయెల్ వైదొలిగిన తర్వాత, సిరియా, ఇరాన్‌లను అనుసంధానిస్తూ మార్గాన్ని ఏర్పరుచుకునేందుకు హమాస్‌కు అవకాశం లభించింది. 2007లో ఇజ్రాయెల్ సూడాన్ ద్వారా హమాస్‌కు అందుతున్న ఆయుధ రవాణాను అడ్డుకుంది. అయితే దీని ప్రభావం అంతగా కనిపించలేదు. కార్పొరేషన్ ఫర్ వరల్డ్ వైడ్ బ్రాడ్‌కాస్టింగ్ తెలిపిన వివరాల ప్రకారం సుడాన్‌కు వెళ్లే మార్గంలో ఫజర్-5 రాకెట్లను మోసుకెళ్తున్న ఓడను అడ్డుకోవడం బ్లాక్ మార్కెట్ ఉనికిని తెలియజేస్తుంది. హమాస్ వివిధ ఆయుధాలను సముద్ర మార్గం ద్వారా అందుకుంటుంది. ఇజ్రాయెల్ నావికాదళం కన్నుగప్పి ఇవన్నీ కొనసాగుతున్నాయంటారు. అలాగే హమాస్.. ఇరాన్, సిరియా మీదుగా ఈజిప్ట్-గాజా సరిహద్దులో ఒక రహస్య సొరంగాన్ని నిర్మించింది. దీని ద్వారా ఆయుధ రవాణా జరుగుతుందని సమాచారం. హమాస్ ఇరాన్, సిరియాలతో సన్నిహితంగా ఉంటూనే ఫజ్ర్-3, ఫజ్ర్-5, ఎమ్302 తదితర రాకెట్లను విదేశాల నుండి కొనుగోలు చేసింది. 2014 గాజా యుద్ధంలో హమాస్ ఇజ్రాయెల్‌పై 4500 రాకెట్లను ప్రయోగించింది. హమాస్‌కు ఆయుధాలు అందించడంలో స్మగ్లర్లు, ఓడల సిండికేట్లు, ఫైనాన్స్ ఆపరేటర్లు మొదలైనవారు కీలక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇది కూడా చదవండి: బంకర్లు అంటే ఏమిటి? యుద్ధ ప్రాంతాల్లో ఎందుకు అవసరం? -
వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నాయకుల హత్యాయత్నం
ద్వారకాతిరుమల: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని గొల్లగూడెంలో ఆదివారం రాత్రి వినాయకచవితి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్న పలువురు వైఎస్సార్సీపీ నేతలపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కర్రలు, ఇతర ఆయుధాలతో దాడిచేసి హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో ఐదుగురు వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల కథనం ప్రకారం.. వినాయకచవితి ఉత్సవాల నిర్వహణ కోసం స్థానిక రామాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలు గంటా వెంకటసుబ్రహ్మణ్యం, బొంతు రమేష్, ఈలప్రోలు ధర్మరాజు, కొత్తపల్లి గురువిష్ణు, కొత్తపల్లి హేమంత్ షామియానా పందిరి ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమయంలో పాతకక్షల నేపథ్యంలో టీడీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రసాద్, నాయకులు కొమ్మిన సత్యనారాయణ, చిలకా సతీష్, బొంతు వెంకటేశ్వరరావు, కొత్తపల్లి హరికృష్ణ, గంజి సతీష్, గంజి సురేష్, బొంతు మణీంద్రరావు, బొంతు నరసింహరావు, కవి భార్గవ, కొత్తపల్లి దుర్గారావు తదితరులు వారిపై ఒక్కసారాగా దాడిచేశారు. కర్రలు, ఆయుధాలతో తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో ఘంటా వెంకటసుబ్రహ్మణ్యం, బొంతు రమేష్, ఈలప్రోలు ధర్మరాజు తలలకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావమైంది. కొత్తపల్లి గురువిష్ణుకు చెయ్యి విరగ్గా, కొత్తపల్లి హేమంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారు అక్కడ చికిత్స పొందుతున్నారు. రాజకీయకక్షల నేపథ్యంలో తమను హత్యచేసేందుకు ప్రయత్నించారని బాధితులు పేర్కొన్నారు. ఈ దాడిపై దర్యాప్తు చేస్తున్నట్లు ద్వారకాతిరుమల ఎస్ఐ టి.సుధీర్ తెలిపారు. -
పాక్ ఆ బంకర్లలో ఏమి దాస్తోంది? అమెరికా రిపోర్టులో హడలెత్తించే వివరాలు?
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు కుప్పకూలింది. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోలు ధర లీటరు రూ.300కి చేరింది. ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ మాత్రం అణ్వాయుధాలపై మోజు పెంచుకుంటూపోతోంది. అణ్వాయుధాల తయారీలో పూర్తి స్వింగ్‌లో ఉంది. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్ఏఎస్) తాజా నివేదిక ప్రకారం పాకిస్తాన్ దగ్గర ప్రస్తుతం దాదాపు 170 అణ్వాయుధాలు ఉన్నాయి. అమెరికా ఏం కనుగొంది? పాకిస్తాన్ అణ్వాయుధాలను గుర్తించడానికి అమెరికన్ శాస్త్రవేత్తలు ఓపెన్ సోర్స్ మెటీరియల్స్‌ను అంటే ఇప్పటికే పబ్లిక్‌గా ఉన్న మెటీరియల్స్‌ను ఉపయోగించారు. ఉదాహరణకు.. వర్గీకరించిన పత్రాలు, రక్షణ బడ్జెట్ కేటాయింపు, సైనిక కవాతు, సైనిక అధికారుల ప్రకటనలు. ఇదేకాకుండా పాక్ మిలటరీ గార్రిసన్, ఎయిర్ ఫోర్స్ బేస్‌కు సంబంధించిన తాజా ఉపగ్రహ చిత్రాలను కూడా విశ్లేషించారు. వివిధ సైనిక దళాలు, వైమానిక దళ స్థావరాలకు సంబంధించిన తాజా ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన తరువాత పాకిస్తాన్ అణ్వాయుధాల కోసం కొత్త లాంచర్ సౌకర్యాలను నిర్మించినట్లు అమెరికా కనుగొంది. 5 నుంచి 10 అణ్వాయుధాలు.. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ నివేదికలోని వివరాల ప్రకారం పాకిస్తాన్ ఒకవైపు అణ్వాయుధాల సంఖ్యను పెంచుకుంటూనే మరోవైపు కొత్త ఆయుధాల కోసం ముడిసరుకును కూడా వేగంగా సేకరిస్తోంది. పాకిస్తాన్ ప్రతి సంవత్సరం 14-27 ఆయుధాలకు సరిపడా ముడిసరుకును సేకరిస్తోంది. కనీసంగా 5 నుండి 10 న్యూక్లియర్ వార్హెడ్లను ఉత్పత్తి చేస్తోందని నివేదిక అంచనా వేసింది. అణ్వాయుధాలను ఎక్కడ దాస్తోంది? నివేదికలోని వివరాల ప్రకారం పాకిస్తాన్ తన అణ్వాయుధాలను నిల్వ చేసేందుకు కనీసం 5 సైనిక, వైమానిక స్థావరాలను వినియోగిస్తోంది. ఇందులో అక్రో, గుజ్రాన్వాలా, ఖుజ్దార్, పనో అకిల్ మరియు సర్గోధా గారిసన్ ఉన్నాయి. కాగా పాకిస్తాన్ 4 కొత్త ప్లూటోనియం ఉత్పత్తి రియాక్టర్ల కోసం కూడా పని చేస్తోంది. అలాగే యురేనియం రియాక్టర్ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటోంది. ఇందుకోసం కొత్త మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటోంది. ఇది పాక్ అణు సామర్థ్యాన్ని మరింతగా పెంచుతోంది. 2025 నాటికి పాకిస్తాన్ అణ్వాయుధాల సంఖ్య 200కి చేరుకుంటుందని అంచనా. పెరిగిపోతున్న పాక్ రహస్య కార్యకలాపాలు ఈ నివేదికలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బంకర్ ప్రస్తావన కూడా ఉంది. పాకిస్తాన్ తన అణ్వాయుధాలకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. అయితే ఇస్లామాబాద్‌కు సమీపంలోని వా కంటోన్మెంట్ పరిధిలోగల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఇందులో కీలక పాత్ర ఉందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా శాస్త్రవేత్తలు ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరుగుతున్న కార్యకలాపాలను చాలా కాలంగా గమనిస్తున్నారు. 2020 నాటికే 60 నుండి 80 అణ్వాయుధాలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లోపల 6 ఇగ్లూ ఆకారపు బంకర్లు ఉన్నాయి. వీటిని చాలా నీట్‌గా కవర్ చేశారు. ఈ బంకర్ల చుట్టూ ఎల్లప్పుడూ బహుళస్థాయి భద్రత ఉంటుంది. ఈ బంకర్లలో అణ్వాయుధాలను దాచి ఉంచినట్లు అమెరికా అనుమానిస్తోంది. 2020 నాటికే పాకిస్తాన్ వద్ద 60 నుండి 80 అణ్వాయుధాలు ఉండవచ్చని అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గతంలోనే అంచనా వేసింది. ఇప్పుడు ఈ తాజా నివేదిక అమెరికన్ ఏజెన్సీలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇది కూడా చదవండి: లాహోర్ భారత్‌లో భాగం.. అయినా పాకిస్తాన్‌కు ఎందుకు అప్పగించారు? -
అమెరికాకు వ్యతిరేకంగా చేతులు కలిపిన రష్యా, ఉత్తర కొరియా
కరడుగట్టిన నియంతగా పేరుగాంచిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యేక రైలులో మిత్రదేశం రష్యా చేరుకున్నారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో కిమ్ భేటీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నేడో రేపో చర్చలు జరగనున్నాయి. అగ్రరాజ్యం అమెరికాపై ఉన్న ఉమ్మడి శత్రుత్వం వల్ల రష్యా–ఉత్తర కొరియా సన్నిహితంగా మారాయని చెప్పొచ్చు. రెండు దేశాలూ అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. రష్యా, ఉత్తర కొరియాలను దుష్ట దేశాలుగా అమెరికా అభివర్ణిస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా పట్ల కొంత ఉదారంగానే వ్యవహరించారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం కిమ్ పట్ల కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిమ్–పుతిన్ తాజా సమావేశంపై ప్రపంచమంతటా ఆసక్తి నెలకొంది. ఈ భేటీ వల్ల ప్రపంచ భౌగోళిక–రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఆయుధమే కీలకం.. పుతిన్–కిమ్ భేటీతో ఎవరికి ఎంత లాభం? అనేదానిపై చర్చ మొదలైంది. కిమ్ రాజ్యంలో భారీస్థాయిలో ఆయుధ పరిశ్రమ వర్థిల్లుతోంది. ఆయుధాల ఉత్పత్తి సామర్థ్యం అధికంగా ఉంది. మరోవైపు ఉక్రెయిన్‌పై సుదీర్ఘ కాలంగా యుద్ధం కొనసాగిస్తున్న రష్యా వద్ద ఆయుధ నిల్వలు నిండుకున్నాయి. పైగా ఉక్రెయిన్ నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అమెరికా సహా పశ్చిమ దేశాలు ఇస్తున్న ఆయుధాలతో ఉక్రెయిన్ సైన్యం రష్యాపై విరుచుకుపడుతోంది. రష్యాకు ఇతర దేశాల నుంచి ఇప్పటికిప్పుడు ఆయుధాలు అందే పరిస్థితి లేదు. అందుకే ఉత్తర కొరియా నుంచి ఆయుధాల సేకరణపై పుతిన్ దృష్టి పెట్టారు. ఉత్తర కొరియా నుంచి రష్యాకు ఆయుధాల ఎగుమతిపై ఇరుదేశాల నడుమ ఇప్పటికే ఫలవంతమైన చర్చలు జరిగినట్లు అమెరికా అనుమానిస్తోంది. తుది ఒప్పందం కోసమే కిమ్ రష్యాకు వెళ్లినట్లు చెబుతోంది. అయితే, దీనిపై రష్యా ఇప్పటిదాకా అధికారికంగా స్పందించలేదు. ఆయుధాల కొనుగోలును నిర్ధారించలేదు. కానీ, రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని రష్యా, ఉత్తర కొరియా తీర్మానించుకున్నాయని చెప్పడానికి ఎన్నో దృష్టాంతాలు కనిపిస్తున్నాయి. రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు ఈ ఏడాది జూలైలో ఉత్తర కొరియాలో పర్యటించారు. అక్కడ ఆయుధాల ప్రదర్శనను తిలకించారు. ఆయుధాల ఫ్యాక్టరీలను సైతం సందర్శించినట్లు వార్తలొచ్చాయి. ఉత్తర కొరియాతో కలిసి ఉమ్మడిగా సైనిక విన్యాసాలు చేపడతామని సెర్గీ ప్రకటించారు. అప్పట్లో సెర్గీకి కిమ్ జోంగ్ ఉన్ ‘టూర్ గైడ్’గా పనిచేశారు. దగ్గరుండి తమ ఆయుధాలను చూపించారు. సంతకాన్ని రద్దు చేసుకుంటే! ఉత్తరకొరియా నుంచి ఆయుధాలు చేతికి అందిన తర్వాత ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందని పుతిన్ సంకేతాలిస్తున్నారు. అమెరికా కనుసన్నల్లో నడస్తున్న ప్రపంచ క్రమం(వరల్డ్ ఆర్డర్) మారుతుందని అంటున్నారు. తమ లక్ష్య సాధనకు ఉత్తర కొరియాతో సైనిక సహకారం సైతం కుదుర్చుకోవాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, అణ్వస్త్ర ప్రయోగాలు కొనసాగిస్తున్న ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇటీవల ఆంక్షలు విధించింది. ఉత్తర కొరియాతో ఎవరూ ఆయుధ వ్యాపారం చేయరాదని ఆదేశించింది. ఈ తీర్మానంపై రష్యా కూడా సంతకం చేసింది. తమ సంతకాన్ని రద్దు చేసుకొనే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు తాజాగా తేల్చిచెప్పాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన రష్యా వెనక్కి తగ్గితే ఉత్తర కొరియాపై ఆంక్షలు బలహీనమవుతాయి. అప్పు డు ఉత్తర కొరియా నుంచి యథేచ్ఛ గా ఆయు ధాలు కొనుగోలు చేసుకో వచ్చు. ప్రతిఫలం అదేనా? రష్యా సంగతి సరే మరి ఉత్తరకొరియాకు దక్కే ప్రయోజనమేంటి?రష్యాకు ఆయుధాలు ఇచ్చి, తిరిగి పొందే ప్రతిఫలం ఏమై ఉంటుంది? కిమ్ రాజ్యంలో ప్రస్తుతం తీవ్ర ఆహార కొరత వేధిస్తోంది. పౌష్టికాహారం అనేది కలలో మాటగా మారింది. అందుకే మానవతా సాయం పేరిట రష్యా నుంచి భారీగా ఆహార ధాన్యాలను తీసుకోవాలని కిమ్ ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. అలాగే సైన్యానికి ఉపయోగ పడే శాటిలైట్లు, అణ్వస్త్ర సహిత జలాంతర్గాములు తయారు చేసే అత్యాధునిక టెక్నాలజీ ఉత్తర కొరియా వద్ద లేదు. ఇలాంటి సాంకేతికతలో రష్యా ముందంజలో ఉంది. ఆయుధాలకు ప్రతిఫలంగా ఈ టెక్నాలజీని రష్యా నుంచి సొంతం చేసుకోవాలని కిమ్ ప్రభుత్వం నిర్ణయానికొచి్చనట్లు సమాచారం. అందుకు పుతిన్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థూలంగా చెప్పాలంటే పుతిన్ తనకు అవసరమైన ఆయుధాలను ఉత్తర కొరియా నుంచి తీసుకుంటారు. బదులుగా ఆహార ధాన్యాలు, ఆధునిక టెక్నాలజీని కిమ్‌కు అందజేస్తారు. ఇద్దరికీ లాభమేనన్నమాట! ఇక ఒప్పందాలపై సంతకాలు చేయడమే మిగిలి ఉంది. -
జనశక్తి నేతలు రాజన్న, అమర్ విడుదల
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జనశక్తి నేతలు కూర రాజన్న, అమర్‌తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల విచారణ అనంతరం విడుదల చేశారు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గాజువాక సమీపంలోని ఓ బత్తాయి తోటలో ఆల్ ఇండియా కిసాన్ సంయుక్త మోర్చా రెండు రోజుల సమావేశం నిర్వహిస్తుండగా గురువారం మధ్యాహ్నం అందించిన సమాచారం మేరకు పోలీసులు రెక్కీ నిర్వహించి అరెస్ట్ చేశారు. సుమారు 3గంటల పాటు ఆ తోటలోనే విచారించారు. అనంతరం జిల్లా పోలీసు అధికారుల సూచన మేరకు జిల్లా కేంద్రంలోని డీటీఎస్కు తరలించారు. శుక్రవారం జిల్లా పోలీసు అధికారుల ముందు ప్రవేశపెట్టారు. అరెస్ట్ అయిన వారిలో కూర రాజన్న, అమర్‌తో పాటు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు రైతు నాయకులు ఉన్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా జరగబోయే రైతు ఉద్యమాల గురించి చర్చించేందుకు రెండు రోజులపాటు ఇక్కడ సమావేశాలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న తరువాత వీరి వద్ద ఉన్న బ్యాగులను క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించగా ఎలాంటి ఆయుధాలు లభించలేదని తెలిసింది. అమర్‌కు సంబంధించిన బ్యాగులో ఒక లేఖ లభ్యమైనట్లు సమాచారం. సమావేశాలు ఎందుకు పెట్టుకున్నారు.. భవిష్యత్తులో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయబోతున్నారా.. రాబోయే ఎన్నికల సందర్భంగా ఏదైనా కుట్ర పన్నారా అనే అంశాలపై విచారించినట్లు తెలిసింది. శుక్రవారం సాయంత్రం వారిని పోలీసులు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అన్యాయంగా అరెస్టు చేశారు: రాజన్న, అమర్ దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు సమావేశం పెట్టుకుంటే పోలీసులు తమను అన్యాయంగా అరెస్ట్ చేశారని జనశక్తి నేతలు కూర రాజన్న, అమర్ ఆరోపించారు. పోలీసుల వేధింపులు ఇటీవల ఎక్కువయ్యాయని విమర్శించారు. శుక్రవారం వారు తమను కలిసిన విలేకరులతో మాట్లాడారు. వరంగల్ జిల్లాలో ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళ్తే అక్కడ పోలీసులు ఇబ్బందులు పెట్టారని, ఖమ్మంలో జిల్లాలో కూడా పోలీసులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. తమ సంఘం నిషే«ధితం కాదని, అలాంటప్పుడు తమను ఎందుకు ఇబ్బందులు గురిచేస్తున్నారో పోలీసులకే తెలియాలన్నారు. -
మణిపూర్‌లో ఆయుధాల లూటీ
ఇంఫాల్: మణిపూర్‌లో తెగల పోరు, ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి పోలీసు ఆయుధాగారంపై దుండగులు దాడి జరిపి ఆయుధాలను లూటీ చేశారు. ఎకే 47, ఘాతక్ వంటి అత్యాధునిక రైఫిల్స్, వివిధ రకాల తుపాకుల్లోని 19 వేలకు పైగా బుల్లెట్లు అపహరించారు. బిష్ణుపూర్ జిల్లా నారన్‌సైనా ప్రాంతంలో రెండవ ఇండియా రిజర్వ్ బెటాలియన్‌లో ఈ లూటీ జరిగింది. ‘‘బెటాలియన్ కేంద్రంపై దాడులకు దిగిన అల్లరి మూకలు అత్యాధునిక ఆయుధాలను లూటీ చేశారు. ఏకే, ఘాతక్ రైఫిళ్లు, 195 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, అయిదు ఎంపీ–5 గన్స్, 16 9ఎంఎం పిస్టల్స్, 25 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, 21 కార్బైన్స్, 124 హ్యాండ్ గ్రేనేడ్స్‌ను దొంగిలించారు’’ అని అధికారులు తెలిపారు. మరోవైపు మే 3వ తేదీన జరిగిన ఘర్షణల్లో మరణించిన వారి సామూహిక ఖననానికి ఆదివాసీలు చేస్తున్న ప్రయత్నాలు ఉద్రిక్తతలకి దారి తీస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్న మరికొందరు ప్రదర్శనగా ఆ ప్రాంతానికి వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 25 మందికిపైగా గాయపడ్డారు. దీంతో, అంతిమ సంస్కార కార్యక్రమాలను కేంద్రం వినతి మేరకు వారం పాటు వాయిదా వేసుకున్నారు. -
ఆగమవుతున్న ఫ్రాన్స్.. అదుపులోకి రాని పరిస్థితులు, వివాదంలో అధ్యక్షుడు
పారిస్: యూరప్ దేశం ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. నగరాలు, పట్టణాల్లో వాహన, గృహ దహనాలు, దుకాణాల లూటీలు, ఆస్తుల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఏకంగా 45,000 మంది పోలీసులను రంగంలోకి దించినప్పటికీ పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. రేవు నగరం మార్సిలీలో ఆందోళనకారులు ఓ ఆయుధ దుకాణాన్ని లూటీ చేసి, ఆయుధాలు ఎత్తుకెళ్లారు. యువతీయువకులు బయటకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండేలా వారి తల్లిదండ్రులు చూడాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నాలుగో రోజు శనివారం సైతం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. శనివారం ఒక్కరోజే 1,311 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటిదాకా 2,400 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,500 దాకా దహనాలు, లూటీల ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పారు. నిరసనకారుల దాడుల్లో వందలాది మంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. అయితే, ఎంతమంది నిరసనకారులు గాయపడ్డారన్నది ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. మంగళవారం రాజధాని పారిస్ శివారులోని నాంటెర్రేలో పోలీసు కాల్పుల్లో నేహల్ అనే 17 ఏళ్ల యువకుడు మరణించడం దేశవ్యాప్తంగా తీవ్ర అశాంతికి దారితీసిన సంగతి తెలిసిందే. నేహల్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు, మిత్రులు శనివారం నిర్వహించారు. మతాచారం ప్రకారం తొలుత మసీదులో ప్రార్థనలు చేసి, నాంటెర్రే అనంతరం శ్మశాన వాటికలో ఖననం చేశారు. సంగీత కచేరీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్స్‌లో ఘర్షణలను నివారించడంలో దారుణంగా విఫలమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. దేశమంతటా ఒకవైపు ఆందోళనలు, హింసాకాండ కొనసాగుతుండగా, మరోవైపు ఆయన పారిస్‌లో ఓ సంగీత కచేరీలో తన భార్యతో కలిసి పాల్గొన్నారు. సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా గడిపారు. భార్యతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ సంగీత కచేరీ బుధవారం జరిగినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మేక్రాన్ నిర్వాకంపై ప్రజలు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. అధ్యక్షుడు చేయాల్సిన పని ఇదేనా? అని మండిపడుతున్నారు. As protesters burn French cities, Macron lights up at Elton John concert in Paris The President of France in these shots is in a great mood, he enjoys music with his wife and dances a little. pic.twitter.com/v1CSKI7WB8 — Spriter Team (@SpriterTeam) June 30, 2023 సోషల్ మీడియానే కారణం: మేక్రాన్ ఫ్రాన్స్‌లో అలజడికి సోషల్ మీడియానే కారణమని అధ్యక్షుడు మేక్రాన్ ఆక్షేపించారు. హింసను ప్రేరేపించడానికి కొందరు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారని, వారిని కచి్చతంగా అరెస్టు చేస్తామని చెప్పారు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే ఉద్దేశపూర్వక సమాచారాన్ని సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాలన్నారు. ఈ విషయంలో ఆయా సంస్థలతో ప్రభుత్వం కలిసి పని చేస్తుందన్నారు. యువత బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని స్పష్టం చేశారు. సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలని అధికారులను మేక్రాన్ ఆదేశించారు. ఇదిలా ఉండగా, మేక్రాన్ సోమవారం నుంచి జర్మనీలో పర్యటించాల్సి ఉంది. స్వదేశంలోని పరిణామాల దృష్ట్యా ఈ పర్యటనను వాయిదా వేసుకున్నారు. అంతమాత్రానికే కాల్చి చంపుతారా? నేహల్ మృతి పట్ల అతడి తల్లి, అల్జీరియా మూలాలున్న మౌనియా స్పందించారు. తన బిడ్డను కాల్చి చంపిన పోలీసు అధికారిపై మాత్రమే తనకు ఆగ్రహం కలుగుతోందని, ఇతరులపై కాదని చెప్పారు. ఏ నేరమూ చేయని పిల్లల ప్రాణాలను బలిగొనే హక్కు పోలీసులకు ఎక్కడిదని ప్రశ్నించారు. తన కుమారుడు నేహల్ చూడడానికి అరబ్ దేశస్తుడిలా కనిపిస్తాడని, అంతమాత్రానికే కాల్చి చంపుతారా? అని నిలదీశారు. -
ఆ దేశాలకు ఆయుధాలు అమ్మబోం: చైనా
బీజింగ్: ఏడాదికి పైగా యుద్ధంలో తలమునకలైన రష్యా, ఉక్రెయిన్లలో ఎవరికీ ఆయుధాలు విక్రయించబోమని చైనా ప్రకటించింది. చైనా మిత్ర దేశమైన రష్యా యుద్ధం కారణంగా సాయుధ సంపత్తిని భారీగా కోల్పోవడం తెలిసిందే. దాంతో రష్యాకు చైనా భారీగా ఆయుధాలు సరఫరా చేయవచ్చని పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి. అలాంటి ఉద్దేశమేమీ తమకు లేదని చైనా విదేశాంగ మంత్రి క్విన్ కాంగ్ శుక్రవారం ప్రకటన చేశారు. పౌర, సైనిక వాడకం రెండింటికీ పనికొచ్చే వస్తువులను రష్యాకు ఎగుమతి చేయడంపైనా నియంత్రణ విధిస్తామన్నారు. యుద్ధంలో తమది తటస్థ పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. కాకపోతే యుద్ధం మొదలైనప్పటి నుంచీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా రష్యాకు చైనా మద్దతుగానే నిలుస్తూ వస్తోంది. పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో చైనా దన్ను రష్యాకు ఎంతగానో ఆసరా అయింది. అదే క్రమంలో రష్యాకు ఆయుధాలు కూడా సమకూర్చేందుకు చైనా సన్నద్ధమవుతున్నట్టు తమకు నిఘా సమాచారముందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇటీవల పేర్కొనడం తెలిసిందే. చదవండి: పదేళ్లలో మరో మహమ్మారి!.. ఆ నివేదికలో భయంకర విషయాలు -
అన్నంత పని చేస్తున్న కిమ్! 'ఆయుధాలను పెంచాలని పిలుపు'
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి బెదిరింపులకు తెగబడ్డాడు. ఈ మేరకు కిమ్ మరిన్ని అణ్వాయుధాల ఉత్పత్తిని పెంచాలని, శక్తిమంతమైన ఆయుధాలను తయారు చేయాలని పిలుపునిచ్చాడు. గతంలో ఆయన మరిన్నీ ఆయుధాలు పెంచుతానంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడూ దాన్నే నిజం చేస్తూ.. కిమ్ ఇలా అణ్వాయుధా సంస్థ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే తన అణ్వాయుధాలను ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించడాని రెడీగా ఉండాలని చెప్పారు. మరింత ముందుచూపుతో అణు ఆయుధాలను తయారు చేసేలా అణు పదార్థాల ఉత్పత్తిని పెంచాలాని ఆదేశించారు. మనం ఆయుధాలను దోషరహితంగా ముందుచూపుతో సిద్ధం చేస్తే.. శత్రువు మనకు భయపడతాడని అన్నారు. తద్వారా దేశ సార్వభౌమాధికారాన్ని, వ్యవస్థను, ప్రజలను రెచ్చగొట్టే సాహసం చేయలేడని చెప్పారు. గతేడాదే ఉత్తరకొరియా తిరుగులేని శక్తిగా ప్రకటించుకుంది. ప్రస్తుతం మరిన్ని అణ్వాయుధాల ఉత్పత్తికి పిలుపునిచ్చి తన మాటను నిజం చేసుకుంది. అమెరికా, దక్షిణ కొరియా మంగళవారమే ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించాలని షెడ్యూల్ ఖరారు చేసుకున్న నేపథ్యంలోనే ఉత్తర కొరియా నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. కాగా, ఇటీవలే ఉత్తరకొరియా తన అణ్వాయుధాలను వైవిధ్యపరిచేలా సరికొత్తగా నీటి అడుగున అణుదాడి చేసే డ్రోన్ సంబంధిత పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఇది సముద్రంలో సునామీ సృష్టించి తీర ప్రాంతాలను తుడిచిపెట్టేలా చేయడం లేదా నౌక స్థావరాలను ముంచేయడం వంటి విధ్వంసాలను సృష్టిస్తుంది. (చదవండి: ఇదొక జబ్బులా ఉంది! స్కూల్ ఘటనపై జోబైడెన్ ఫైర్) -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. సాయానికి నాటో దేశాల కీచులాట? కారణాలేంటి?
దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి ఉక్రెయిన్ యుద్ధం విషయంలో నాటో దేశాల మధ్య మనస్పర్థలు తలెత్తుతున్నాయా? ఉక్రెయిన్ మరో అఫ్గానిస్తాన్‌గా మారుతుందేమోననే అనుమానాలు నాటో కూటమిలో కలుగుతున్నాయా? ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న సంప్రదాయక యుద్ధం ముదిరి నాటో దేశాలు కూడా ప్రభావితమై భీకర యుద్ధంగా మారుతుందా? ఉక్రెయిన్ పద్మవ్యహంలో పీకల దాకా చిక్కుకుపోయామనే సందేహం నాటో దేశాల అధినేతల్లో మొదలవుతోందా? ఇటీవల జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి. రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు సరఫరా చేసే విషయంలో నాటో కూటమిలో చెలరేగిన పొరపొ చ్చాలను గమనిస్తే కూటమి మధ్య స్నేహ సంబంధాలు సజావుగా సాగడం లేదని అర్థం అవుతోంది. ఉక్రెయిన్‌కు సాయం అందించడంలో తామంతా ఒక్కతాటిపై ఉన్నట్లు పైకి చెబుతున్నా నాటో దేశాధినేతల మధ్య అనేక అంశాలపై విభేదాలు ఉన్నట్లు బయటపడింది. ఒత్తిడికి తలొగ్గిన అగ్రరాజ్యం... నాటో కూటమిలో విభేదాలు తలెత్తే పరిస్థితులను గమనించి అమెరికా తలొగ్గక తప్పలేదు. ఉక్రెయిన్ బెటాలియన్‌కు సరిపడా 31 అబ్రహం ట్యాంకులను పంపడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ అయిష్టంగానే అంగీకరించారు. ఆ వెంటనే జర్మనీ సహా ఇతర యూరప్ దేశాలన్నీ తమ వద్ద ఉన్న లెపర్డ్–2 ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపుతున్నట్లు ప్రకటించాయి. నాటో కూటమిలో చీలికలు తప్పవని ఎదురుచూసిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు నిరాశే ఎదురయ్యింది. ఇప్పుడు జరుగుతోంది రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కాదని... అమెరికా తెరవెనుక ఉండి నిర్వహిస్తున్న యుద్ధమని అమెరికాలోని రష్యా దౌత్యవేత్త అనతోలి టానోల్ వ్యాఖ్యానించారు. లెపర్డ్–2 యుద్ధవిమానాల కోసం ఉక్రెయిన్ పట్టు సుదీర్ఘ చర్చలు, మంతనాల తర్వాత ఉక్రెయిన్‌కు ట్యాంకులు సరఫరా చేయడానికి నాటో కూటమి అంగీకరించిందో లేదో ఇప్పుడు తమకు యుద్ధవిమానాలు కూడా కావాలని ఉక్రెయిన్ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. భూతలంపై ఉన్న తమ సైనిక బలగాల రక్షణకు గగనతలంలో యుద్ధవిమానాల అవసరం ఉందని ఉక్రెయిన్ అధినేతలు నాటోను కోరుతున్నారు. నాలుగో తరానికి చెందిన ఎఫ్16, యూరోఫైటర్స్, టోర్నడో, ఫ్రెంచ్ రఫేల్ యుద్ధవిమానాల అవసరాన్ని ఉక్రెయిన్ అధినేతలు బహిరంగంగానే చెబుతున్నారు. రష్యా దగ్గర నాలుగోతరం యుద్ధవిమానాలు 772 ఉంటే తమ దగ్గర సోవియెట్ యూనియన్ నాటి పాతబడిన 69 విమానాలే ఉన్నాయని... వాటితో రష్యాను నిలువరించడం కష్టమని ఉక్రెయిన్ రక్షణ శాఖ సలహాదారు యూరి సక్ చెబుతున్నారు. ట్యాంకుల పంపిణీపై అంగీకారానికి రావాడానికి తల బొప్పికట్టి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న నాటో దేశాలు ఈ కొత్త డిమాండ్‌తో బిత్తరపోయాయి. ఎఫ్16 విమానాలను ఉక్రెయిన్‌కు కేటాయిస్తున్నారా అని ఓ విలేఖరి అడిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ‘నో’అని ఒకమాటలో కొట్టిపారేశారు. ఇది అర్థంపర్థంలేని డిమాండ్ అని జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్ స్పష్టం చేశారు. అయితే ఈ యుద్ధవిమానాల కోసం ఉక్రెయిన్ చేసిన వినతిపట్ల కొన్ని నాటో దేశాలు సానుకూలంగా స్పందించాయి. ఎఫ్16 యుద్ధవిమానాల కోసం ఉక్రెయిన్ అధికారికంగా కోరితే సానుకూలంగా పరిశీలిస్తామని నెదర్లాండ్ విదేశాంగ మంత్రి హొప్కి హోక్స్ట్రా అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్ కూడా తమ దేశ యుద్ధవిమానాలను ఉక్రెయిన్‌కు పంపడానికి సిద్ధమన్నారు. లిథువేనియా అధ్యక్షుడు గిటినస్ న్యూసెథా కూడా సానుకూలంగా స్పందించారు. అయితే యుద్ధ విమానాల అంశం నాటో కూటమిలో మరోసారి విభేదాలకు దారితీయవచ్చని దౌత్యవేత్తలు అనుమానిస్తున్నారు. అసలు భయం ఇదీ.. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు అండగా నిలిచిన నాటో కూటమిలో ఆయా దేశాలు అందిస్తున్న సాయంపై అంతర్మథనం జరుగుతోంది. ఏడాదిపాటు రష్యా లాంటి అతిశక్తివంతమైన దేశాన్ని నిలువరించగలిగిన ఉక్రెయిన్... ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో మరింత దూకుడుగా వెళ్లి యుద్ధాన్ని రష్యా భూభాగంలోకి తీసుకువెళుతుందేమోనన్న అనుమానాలు కూటమి దేశాల్లో మొదలయ్యాయి. రష్యా ఆక్రమించుకున్న క్రిమియా వంటి భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఉక్రెయిన్ ఉవ్విళ్లూరుతున్న విషయం ఆ దేశ నాయకుల ప్రకటనల్లో అర్థమవుతోంది. నాటో అందిస్తున్న ఆయుధ సంపత్తితో ఉక్రెయిన్ కనుక ఇలాంటి దుస్సాహసం చేస్తే అది యుద్ధం విస్తృతరూపం దాల్చడానికి దారితీస్తుందని అమెరికా, జర్మనీ వంటి దేశాలు భయపడుతున్నాయి. తామిచ్చే సాయం రష్యా దురాక్రమణలను అడ్డుకోవడానికి ఉక్రెయిన్ ఉపయోగించుకోవాలని, ఇది శ్రుతి మించితే యుద్ధం తమ సరిహద్దుల వరకూ వచ్చే ప్రమాదం ఉందని నాటో దేశాలు ముఖ్యంగా రష్యా సరిహద్దుగా ఉన్న యూరప్ దేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌కు అందిస్తున్న సాయంపై ఆయా దేశాల ప్రజల్లో కొంత అసహనానికి దారి తీస్తుందని సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ కనుక తమ భూభాగాలను టార్గెట్ చేయడానికి ఉపయోగపడే యుద్ధవిమానాలు, క్షిపణి ప్రయోగ యంత్రాల వంటివి అందిస్తే నాటో హద్దు మీరుతున్నట్లుగా భావించాల్సి వస్తుందని పుతిన్ సహా రష్యా నేతలు హెచ్చరిస్తున్నారు. తమ పట్టణాలపై దాడి చేసే ఆయుధ సంపత్తిని నాటో గనక ఉక్రెయిన్‌కు అందిస్తే తీవ్ర రూపంలో ప్రతిఘటిస్తామని... దీనివల్ల యుద్ధం స్వరూపం మారే ప్రమాదం ఉందని రష్యా దౌత్యాధికారి గౌవ్రిలోవ్ హెచ్చరించారు. ట్యాంకులపై గొడవ ఉక్రెయిన్ కోరిన యుద్ధ ట్యాంకులు అందించడంపై వారాల తరబడి సాగిన మంతనాలు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చి నాటో దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఉక్రెయిన్‌కు సమీపాన ఉన్న యూరప్ దేశాలు ట్యాంకులు సరఫరా చేయాలని అమెరికా కోరుకుంది. అక్కడి భూ ఉపరితల పరిస్థితులకు ఐరోపా ట్యాంకులు సరితూగుతాయి కాబట్టి అయా దేశాలే ట్యాంకులు పంపిణీ చేయాలని అమెరికా వాదించింది. కానీ యూరప్‌లోని నాటో దేశాలు ముఖ్యంగా జర్మనీ అందుకు అంగీకరించలేదు. నాటో కూటమి సభ్యుల మధ్య అధికారికంగా జరిగిన అనేక సమావేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయాయి. అమెరికా ముందుగా ట్యాంకులు పంపేందుకు ఒప్పుకుంటేనే తాము కూడా సిద్ధమవుతామని జర్మనీ తేగేసి చెప్పింది. అమెరికా తన దగ్గరున్న అధునాతన అబ్రహం ట్యాంకులను ఉక్రెయిన్‌కు అందజేయడానికి అంగీకరిస్తేనే తాము లెపర్డ్–2 ట్యాంకులు ఇవ్వడానికి ఒప్పుకుంటామని జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్ పట్టుబట్టారు. అమెరికా భాగస్వామ్యం లేకుండా తాము ట్యాంకులు పంపితే రష్యా తన ఆగ్రహాన్ని తమపై గురిపెడుతుందన్న భయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెరవెనుక చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. యూరప్‌లోని నాటో దేశాలు స్పెయిన్, పోలాండ్, ఫిన్లాండ్, నార్వే తమ వద్ద ఉన్న లెపర్డ్–2 ట్యాంకులను పంపడానికి సిద్ధంగా ఉన్నా జర్మనీ అనుమతి లేకుండా వాటిని ఇతర దేశాలకు పంపకూడదన్న ఒప్పందాన్ని అనుసరించి ముందడుగు వేయలేని పరిస్థితి. అబ్రహం ట్యాంకులు అత్యాధునికమైనవని, వాటిని ఉపయోగించడం కష్టసాధ్యమని, వాటి తయారీకి అనేక నెలలు పడుతుందని, రిపేర్లు చేయడం ఉక్రెయిన్‌కు సాధ్యం కాదని అమెరికా అధినేతలు బహిరంగంగా వాదిస్తూ వచ్చారు. పెంటగాన్ అధికారి కాలిన్ హెబ్ కాల్, అమెరికా జాతీయ భద్రతా దళ ప్రతినిధి జాన్ కిర్బి ఈ వాదనలు ముందుకు తెచ్చారు. అయినా కూడా జర్మనీ ససేమిరా అంది. -
Ukraine-Russia war: మాకు మరిన్ని ఆయుధాలు కావాలి
బ్రస్సెల్స్: రష్యాను ఎదుర్కొనేందుకు తమకు మరింత సైనిక సాయం కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొమిదిర్ జెలెన్స్కీ కోరారు. ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) కలిసి యూరప్ బద్దవ్యతిరేకి అయిన రష్యాతో తలపడుతున్నాయని చెప్పారు. గురువారం ఆయన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లోని ఈయూ పార్లమెంట్‌నుద్దేశించి ప్రసంగించారు. ‘మనం కలిసి ఉన్నంత కాలం, మన యూరప్‌ను కాపాడుకున్నంత కాలం, మన యూరప్ జీవన విధానాన్ని పరిరక్షించుకున్నంత కాలం యూరప్ యూరప్‌గానే నిలిచి ఉంటుంది’అని జెలెన్స్కీ చెప్పారు. యూరప్ జీవన విధానాన్ని నాశనం చేయాలని రష్యా కోరుకుంటోంది. కానీ, మనం అలా జరగనివ్వరాదు’అని చెప్పారు. అంతకుముందు ఈయూ ప్రతినిధులు ఆయనకు పార్లమెంట్ భవనంలోకి ఘనంగా స్వాగతం పలికారు. ప్రసంగం పూర్తయిన అనంతరం, ప్రొటోకాల్ ప్రకారం ఉక్రెయిన్ జాతీయ గీతం, యూరోపియన్ గీతం వినిపించారు. ఆ సమయంలో జెలెన్స్కీ ఈయూ జెండాను చేబూనారు. అనంతరం యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు రొబెర్టా మెట్సోలా మాట్లాడుతూ.. లాంగ్ రేంజ్ క్షిపణి వ్యవస్థలను, యుద్ధవిమానాలను సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్‌కు అందించే విషయం పరిశీలించాలని సభ్య దేశాలను కోరారు. ఉక్రెయిన్‌కు రష్యాతో ఉన్న ముప్పునకు తగ్గట్లే చర్యలుండాలని సూచించారు. ఇది ఉక్రెయిన్ అస్తిత్వానికి సంబంధించిన విషయమన్నారు. ఈనెల 24వ తేదీతో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించి ఏడాదవుతోంది. ఈ సందర్భంగా దాడులను మరో విడత తీవ్రతరం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అదనపు సైనిక సాయం కోసం జెలెన్స్కీ మిత్ర దేశాల్లో పర్యటనలు చేస్తున్నారు. అంతకుముందు ఫ్రాన్సు పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు మేక్రాన్ ఆయన్ను లీజియన్ ఆఫ్ హానర్‌తో సన్మానించారు. బ్రస్సెల్స్‌లో ఈయూకు చెందిన 27 దేశాల నేతలతో జెలెన్స్కీ సమావేశమయ్యారు. -
రూ.520కే గన్ డెలివరీ!
సాక్షి, హైదరాబాద్: కంటికి కనిపించకుండా కేవలం ఫోన్ ద్వారానే కథ నడుపుతూ అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో తయారైన నాటు, నీటు తుపాకులను తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ఫేస్‌బుక్‌లోని మార్కెట్ ప్లేస్ కేంద్రంగా ప్రచారం చేసి మోసాలకు పాల్పడుతున్నారు. తుపాకీకి డబ్బు ఇప్పుడు చెల్లించాల్సిన పనిలేదని, కేవలం రూ.520 అడ్వాన్స్‌గా చెల్లిస్తే డెలివరీ చేస్తామని, ఆ తర్వాత మిగిలిన డబ్బులు చెల్లించాలని నమ్మబలుకుతున్నారు. ఇందులో బాధితులు కోల్పోతున్నది చిన్న మొత్తాలే కావడంతో ఎవరూ పోలీసుల వరకు వెళ్లి ఫిర్యాదులు చేయడం లేదు. దీన్నే అదనుగా భావిస్తున్న అనేక ముఠాలు ఈ తరహా నేరాలకు పాల్పడి అనునిత్యం రూ.లక్షల్లో కొల్లగొడుతున్నాయి. తుపాకుల ప్రచారంపై ఫేస్బుక్ పేజీలో పెట్టిన పోస్ట్. (ఇన్సెట్లో) వాట్సాప్ డీపీలో ఉన్న ఫొటో వీడియో రూపంలో ప్రకటన.. ఫేస్బుక్లో ఆల్ ఇండియా డెలివరీ పేరుతో ఓ పేజ్ ఏర్పాటు చేసిన సైబర్ నేరగాళ్లు అందులో తుపాకులు, తపంచాలు, కత్తులకు సంబంధించిన వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఈ పేజ్ పైనే 86384 67582 అనే మొబైల్ నంబర్ కూడా ఉంటోంది. దేశవ్యాప్తంగా ఎక్కడికైనా డెలివరీ చేస్తామంటూ ఓ లింకును పెడుతున్నారు. ఈ ప్రకటనకు ఆకర్షితులైన వాళ్లు ఈ లింక్ క్లిక్ చేస్తే.. అది నేరుగా వాట్సాప్‌కు వెళ్తోంది. ఫేస్బుక్ పేజ్ పైన ఉన్న నంబర్‌తోనే పని చేసే ఈ వాట్సాప్ ఖాతాకు డిస్ప్లే పిక్చర్ (డీపీ)గా ఆయుధాలను పక్కన పెట్టుకుని పడుకున్న యువకుడి ఫొటో ఉంటోంది. ఫేస్బుక్ ద్వారా ఈ వాట్సాప్ ఓపెన్ కావడంతోనే తెరిచిన వ్యక్తి ఆ ఆయుధాల వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నట్లు సందేశం సైతం పోస్టు అవుతోంది. రకరకాల ఫొటోలు షేర్ చేసి.. ఆ వెంటనే స్పందిస్తున్న సైబర్ నేరగాళ్లు వివిధ రకాల తుపాకులకు సంబంధించిన 20–30 ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఎదుటి వారిని పూర్తిగా నమ్మించడానికి ఈ ఫొటోలు కూడా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసినట్లు ఉండకుండా జాగ్రత్తపడుతున్నారు. చేత్తో పట్టుకుని, వాహనాలపై ఉంచి, వస్త్రాల్లో భద్రంగా కట్టి ఉంచిన తుపాకుల ఫొటోలనే షేర్ చేస్తున్నారు. వీటిని చూసిన వాళ్లు అవతలి వారి దగ్గరే అవి ఉన్నట్లు భావిస్తున్నారు. ఇవతలి వ్యక్తి వాటి ఖరీదు చెప్పమంటూ ఆరా తీస్తే... తొలుత ఓ తుపాకీ ఎంచుకుని దాన్ని తనకు రిటర్న్ షేర్ చేయమంటూ సైబర్ నేరగాడు సూచిస్తున్నాడు. అలా చేసిన తరువాత ఆ తుపాకీ ధరను రూ.3 వేల నుంచి రూ.5 వేల మధ్య చెప్పి, ఎక్కడకు కావాలంటే అక్కడకు తెచ్చి ఇస్తామంటున్నాడు. పరీక్షించడం కోసమూ చెల్లింపులు.. తమ వద్ద ఏ తుపాకీ ఖరీదు చేసినా దాంతో పాటు పది తూటాలు ఉచితంగా ఇస్తామంటూ నమ్మిస్తున్నారు. ఆయుధానికి పూర్తి మొత్తం ముందుగా చెల్లించాల్సిన పనిలేదని, అడ్వాన్స్‌గా కేవలం రూ.520 చెల్లిస్తే డెలివరీ చేస్తామని, ఆ తర్వాత మిగిలిన డబ్బులు చెల్లించాలని నమ్మబలుకుతున్నారు. తుపాకులపై ఆసక్తి ఉన్న వాళ్లు, తక్కువ ధరకు వస్తోందని భావించిన వారిలో కొందరు ఇది నిజమా? కాదా? అనేది తెలుసుకోవడానికి చెల్లింపులు చేస్తున్నారు. ఈ అడ్వాన్స్‌ను 89509 45896 నంబర్‌కు వాట్సాప్ చేయాలంటూ సైబర్ నేరగాళ్లు సూచిస్తున్నారు. ఆ మొత్తం పంపే వరకు సందేశాలు పంపుతూనే ఉంటున్నారు. ఒకసారి తన ఖాతాలో ఆ డబ్బు పడిన తర్వాత బాధితుల నంబర్లను బ్లాక్ చేయడం, వేరే నంబర్ నుంచి కాల్ చేసినా ఎత్తకపోవడం వంటివి చేస్తున్నారు. తాము కోల్పోయింది చిన్న మొత్తమే అనే భావనతో బాధితులూ ఫిర్యాదులు చేయట్లేదు. దీంతో సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఇది మోసం కాకపోయినా నేరమే.. ఇలాంటి మోసాల్లో ఒక బాధితుడు కోల్పోయేది తక్కువే అయినా... వారి సంఖ్య ఎక్కువగా ఉంటుండటంతో నేరగాళ్లకు చేరేది రూ.లక్షల్లోనే ఉంటుంది. ఈ తరహా నేరాల్లో నేరగాళ్లు వినియోగిస్తున్న ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు బోగస్ వివరాలతో లింకై ఉంటాయి. అందువల్ల వాటి ఆధారంగా సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కష్టసాధ్యం. అయితే బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే మాత్రం ఆ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయించడం ద్వారా వారిని కొంతవరకు కట్టడి చేయొచ్చు. ఇలాంటి మోసపూరిత ప్రకటనల ఉచ్చులో ఎవరూ పడకూడదు. ఇది మోసం కాకుండా నిజంగా ఆయుధాలు డెలివరీ అయినా అదీ నేరమే అవుతుంది. లైసెన్సు లేకుండా ఎవరూ ఎలాంటి ఆ«యుధాలూ కలిగి ఉండరాదు. – డి.ప్రభాకర్ నాయుడు, సైబర్ క్రైమ్ నిపుణుడు -
రష్యా భరతం పట్టాలంటే సరికొత్త ఆయుధాలు కావాలి.. త్వరగా ఇవ్వండి
కీవ్: ఉక్రెయిన్ తూర్పు డొనెస్క్ ప్రాంతంలో రష్యా తరచూ దాడులు చేస్తోందని అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. తాము అత్యంత కఠిన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. రష్యాను దీటుగా ఎదుర్కోవాలంటే తమకు సరికొత్త ఆయుధాలు కావాలని, ప్రపంచ దేశాలు వేగంగా వాటిని తమకు అందించాలని కోరారు. ఈమేరకు ఆయన ఆదివారం వీడియో సందేశం విడుదల చేశారు. డొనెస్క్‌లోని బాఖ్ముత్, వుహ్లెడార్తో పాటు ఇతర చోట్ల రష్యా తరచూ భీకర దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ సేనలను దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. రష్యా ఈ యుద్ధాన్ని ఇంకా సాగదీయాలని చూస్తోందని, అందుకే సమయాన్ని ఆయుధంగా మార్చుకుని శత్రు దేశాన్ని చావుదెబ్బతీయాలని జెలెన్స్కీ చెప్పారు. అత్యంత వేగంగా తమకు అధునాతన ఆయుధాలు సమకూర్చాలన్నారు. డొనెస్క్‌లోని బ్లాహొదాట్నే ప్రాంతంపై రష్యా దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు ఉక్రెయిన్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ఆదివారం ఉదయమే వెల్లడించారు. రష్యా మాత్రం ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్నట్లు ప్రకటించింది. అమెరికా, జర్మనీ వంటి దేశాలు ఇతర దేశాల సహకారంతో ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం అందిస్తున్నాయి. అయితే అమెరికా తయారు చేసిన ఏటీఎసీఎంస్ క్షిపణులను తమకు ఇవ్వాలని జెలెన్స్కీ కోరుతున్నారు. 300 కీలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉండటం దీని ప్రత్యేకత. అయితే ఈ క్షిపణులను ఉక్రెయిన్ను ఇచ్చేందుకు అమెరికా నిరాకరిస్తోంది. చదవండి: బర్త్‌డే పార్టీలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి.. -
భారత్ జలాల్లోకి పాక్ ఫిషింగ్ బోట్..అప్రమత్తమైన అధికారులు
భారత్ జలాల్లోకి ప్రవేశించిన పాక్ ఫిషింగ్ బోట్‌ను అధికారులు అడ్డుకున్నారు. ఈ మేరకు ఆయుధాలు, పదిమంది సిబ్బందితో వెళ్తున్న పాకిస్తాన్ ఫిషింగ్ బోట్ అల్ సోహెలీని అడ్డుకున్నట్లు భారత్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. అంతేగాదు ఆ పాకిస్తానీ బోట్‌ను అడ్డగించే ఆపరేషన్‌ను గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ లేదా ఏటీఎస్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించినట్లు భారత్ కోస్ట్ గార్డ్ ట్విట్టర్లో తెలిపింది. ఆ బోటులో సుమారు 300 కోట్ల ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తోపాటు దాదాపు 40 కిలోల మాదకద్రవ్యాలను దాచినట్లు అధికారులు గుర్తించారు. తదుపరి విచారణ కోసం బోటును ఓఖాకు తీసుకువస్తున్నట్లు కోస్ట్‌గార్డు పేర్కొంది. (చదవండి: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. కశ్మీర్లో 15 కిలోల ఐఈడీ స్వాధీనం) -
ఇంట్లో పదునైన కత్తులు పెట్టుకోండి: బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పార్లమెంటరీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్.. హిందూ కార్యకర్తల హత్యల గురించి మాట్లాడుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. హిందువులకు తమపై దాడి చేసిన వారిపై స్పందించే హక్కు ఉందని, అది వారి గౌరవానికి సంబంధించినదని అన్నారు. అలాగే తమను తాము రక్షించుకునే హక్కు ప్రతిఒక్కరికీ ఉన్నందున ఇంట్లో పదునైనా కత్తులు పెట్టుకోవాంటూ పిలుపునిచ్చారు. లవ్ పేరుతో కొందరు జిహాద్ చేస్తున్నారని అందులో ప్రేమ మాత్రం ఉండదని అన్నారు. ఈ మేరకు ప్రగ్యా ఆదివారం జరిగిన సౌత్ రీజియన్ వార్షిక సదస్సులో మాట్లాడుతూ... దేవుడు సృష్టించిన ఈ లోకంలో అణిచివేతదారులను, పాపాత్ములను అంతం చేయాలని లేదంటే ప్రేమకు నిజమైన నిర్వచనం ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో తమపై దాడి చేసిన వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పండి. అంతేగాదు లవ్ జిహాద్ పేరుతో బలవుతున్న అమ్మాయిలను రక్షించండి. బాలికలకు సరైన విలువలు నేర్పండి. శివమొగ్గకు చెందిన హర్షతో సహా హిందువుల కార్యకర్తల హత్యల గురించి ప్రస్తావిస్తూ... స్వీయ రక్షణ కోసం ఇంట్లోని కత్తులనైనా పదును పెట్టుకోవాలన్నారు. ఇంట్లో ఆయుధాలైనా ఉంచుకోండి లేదా కూరగాయాల కోసం ఉపయోగించే పదునైన కత్తులైనా రెడీగా ఉంచుకోండి అని చెప్పారు. ఎప్పుడూ ఎలాంటి పరిస్థిత వస్తుందో తెలియదు కాబట్టి దాడి చేసినప్పుడు వారికి తగిన రీతిలో రిప్లై ఇవ్వడం మన హక్కు అని చెప్పారు. అలాగే మీ పిల్లలను మిషనరీ సంస్థల్లో చదివించకండి అలా చేస్తే తల్లిదండ్రులను అవసాన దశలో వృద్ధాశ్రమాలకు పంపుతారు, స్వార్థపరులుగా మారిపోతారంటూ.. షాకింగ్ కామెంట్లు చేశారు. పిల్లలకు ధర్మం గురించి, శాస్త్రల ప్రాముఖ్యత గురించి తెలియజేయండి. తద్వారా పిల్లలు మన సంస్కృతి, విలువలు గురించి తెలుసుకుంటారని ప్రగ్యా సింగ్ ఠాకూర్ అన్నారు. (చదవండి: నడి రోడ్డుపై అడ్డగించి మరీ...మహిళపై ఓ వ్యాపారి యాసిడ్ దాడి..) -
వెపన్స్ ఇస్తేనే విధులు నిర్వర్తిస్తామంటున్న అటవీ ఉద్యోగులు
-
శ్రద్ధా కేసు: ఐదు కత్తులు స్వాధీనం, వెలుగులోకి మరో ట్విస్ట్
న్యూఢిల్లీ: యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురిచేసిన శ్రద్ధా హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. దర్యాప్తు చేసే కొద్దీ పలు ఆసక్తికర విషయాలు బయటకీ వస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు అఫ్తాబ్ అమీన్ పునావాలా తన ప్రియురాలు శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని కోయడానికి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 5 నుంచి 6 అంగుళాల మధ్య ఉన్న ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేగాదు ఈ ఆయుధాలను ఉపయోగించాడా? లేదా అని తెలుసుకోవడం కోసం వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించినట్లు తెలిపారు. ఐతే అఫ్తాబ్ పోలీసులు విచారణలో శ్రద్ధా శరీర భాగాలను కోసి దాదాపు 300 లీటర్ల ఫ్రిజ్‌లో ఉంచి సమీపంలోని అడవిలో పడేసినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీసులు మృతదేహాన్ని కోయడానికి ఉపయోగించిన ఆయుధాలు కోసం ముమ్మరంగా గాలించారు. ఐతే ఈ దర్యాప్తు సమయంలో పోలీసులకు మరో షాకింగ్ ట్విస్ట్ తగిలింది. అప్తాబ్ ఆ రోజు శ్రద్ధా వాకర్ని హత్య చేసిన తదనంతరం ఒక వైద్యురాలితో డేటింగ్ చేసినట్లు తేలింది. ఆమెకు శ్రద్ధా ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అఫ్తాబ్ తీహార్ జైలులో ఉన్నాడని, అతన్ని గట్టి భద్రత నడుమ బహు జాగ్రత్తగా ఉంచినట్లు జైలు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: చంపి ముక్కలుగా నరికేస్తానని అఫ్తాబ్ బెదిరించాడు.. వెలుగులోకి 2020 నాటి ఫిర్యాదు) -
28 ఏళ్ల కిందట ఆయుధాలు రద్దు.. అటవీ సంరక్షకులకు రక్షణ ఏదీ?!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఇటీవల కుమ్రంభీం జిల్లా సార్సాల గ్రామంలో అటవీశాఖ అధికారిణి అనితపై ఓ ప్రజాప్రతినిధి సోదరుడి ఆధ్వర్యంలో దాడి. మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం మడగూడెంలో పోడు భూముల సాగును అడ్డుకున్న డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కర్ణానాయక్‌పై దాడి. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలంలోని గుండాలపాడు సమీపంలో సెక్షన్ ఆఫీసర్ నీలమయ్య, బీట్ ఆఫీసర్ భాస్కరరావులపై కర్రలతో దాడి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ ఎర్రబోరు అటవీప్రాంతంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు దారుణ హత్య. తెలంగాణ రాష్ట్రంలో అడవుల సంరక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తున్న అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై జరుగుతున్న వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుపై పగ పెంచుకున్న గొత్తికోయలు మంగళవారం ఆయనపై దాడి చేసి హత్య చేసిన నేపథ్యంలో.. ‘అటవీ సిబ్బందికి ఆయుధాలు’ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అడవుల సంరక్షణ కోసం విధులు నిర్వహించే అటవీశాఖ సిబ్బందికి మళ్లీ ఆయుధాలు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. తాజాగా శ్రీనివాసరావు హత్యతో చలించిన ఎఫ్ఆర్ఓల సంఘం నాయకులు ఆ యుధాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేదంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘అర్హులైన గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ’కార్య క్రమం సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు. మావోయిస్టుల కార్యకలాపాల నేపథ్యంలో 28 ఏళ్ల కిందట అటవీ, ఆబ్కారీ శాఖలకు చెందిన ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఆయుధాలు, వైర్లెస్ సెట్ల కోసం మావోయిస్టులు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గత పదేళ్లుగా రెండు శాఖల అధికారులు, సిబ్బందికి స్మగ్లర్లు, అక్రమార్కుల ఆగడాలు, పోడు భూముల సాగు నియంత్రణ సమస్యగా మారింది. 2013 సెప్టెంబర్ 15న నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం పెంబిలో అటవీ భూముల ఆక్రమణను అడ్డుకునేందుకు 11 మంది సిబ్బందితో వెళ్లిన ఎఫ్ఆర్ఓ గంగయ్య (42)పై.. అక్కడున్న జనం గొడ్డళ్లతో దాడి చేసి చంపేశారు. మరో ఏడుగురిని గాయపరిచారు. అప్పుడున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అప్పటి అటవీశాఖ పీసీసీఎఫ్ బీఎస్ఎన్ రెడ్డితో ఆయుధాల అప్పగింతపై చర్చలు జరిపారు. ఆ తర్వాత కూడా అనేక దాడులు జరగ్గా.. దాడులు జరిగినప్పుడు ఆయుధాల విషయం చర్చించడం ఆ తర్వాత మరిచిపోవడం ఓ తంతుగా మారింది. ‘పోడు’నేపథ్యంలో పెరుగుతున్న దాడులు ఒక వైపు అర్హులైన గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పించే అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తుండగా.. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల అటవీ ప్రాంతాల్లో పోడు కోసం అడవులు నరుకుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై దాడులు జరుగుతున్నట్లు కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12.46 లక్షల ఎకరాల పోడు భూములపై హక్కుల కల్పనకు సంబంధించి గిరిజనుల నుంచి 4,14,219 దరఖాస్తులు రాగా.. అందులో 10.36 లక్షల ఎకరాలకు సంబంధించిన 3.59 లక్షల దరఖాస్తులను పరిశీలించారు. భద్రాద్రి నుంచి 2,99,478 ఎకరాలపై 305 గ్రామాల నుంచి 83,663 అర్జీలు ఉన్నట్లు వరంగల్ సీసీఎఫ్ ప్రకటించారు. భద్రాద్రి జిల్లాలో ఎఫ్ఆర్ఓ హత్యకు పోడు భూముల సర్వే నేపథ్యం కూడా ఉండటంతో..ఈ అంశం భవిష్యత్తులో సర్వే ప్రక్రియకు అంతరాయం కలిగించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. చదవండి: మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’ ఆయుధాలు ఇస్తేనే పోడు భూముల సర్వే అడవుల సంరక్షణ కోసం పనిచేస్తున్న అటవీశాఖ సిబ్బంది ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్‌రావు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హ్యత నేపథ్యంలో ఎఫ్ఆర్ఓల సంఘం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. మా ప్రాణాలకు రక్షణ కల్పించకుండా పోడు భూముల సర్వేకు వెళ్లేది లేదు. ఆయుధాలు ఇవ్వాలని, మా ప్రాణాలకు రక్షణ కల్పించాలని మా ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. – షౌకత్ అలీ, రాష్ట్ర అధ్యక్షుడు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల సంఘం -
ఆయుధ అలజడి...తరచూ తుపాకులు, తూటాలు కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తరచూ తుపాకులు ‘దొరుకుతున్నాయి’. అక్రమ ఆయుధాలు వినియోగిస్తున్న, రవాణా చేస్తున్న, కలిగి ఉన్న వారితో పాటు లైసెన్స్ ఉన్న ఆయుధాలను దుర్వినియోగం చేసిన వారిని పట్టుకోవడం నాణేనికి ఒక వైపైతే... చెత్త కుప్పలు, చెట్ల పొదల్లో అక్రమాయుధాలు, తూటాలు లభిస్తుండటం మరో వైపైంది. తాజాగా శుక్రవారం అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉన్న పబ్లిక్ గార్డెన్స్‌లో లభించిన రెండు తపంచాలు, ఓ కంట్రీమేడ్ రివాల్వర్ తీవ్ర కలకలం సృష్టించాయి. గతంలో రెండు సందర్భాల్లో ఇలా ఆయుధాలు, బుల్లెట్లు బయటపడ్డాయి. ఆ కేసులు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. తాజా ఉదంతంతో సహా మొత్తం మూడూ శుక్రవారాల్లోనే చోటు చేసుకోవడం గమనార్హం. మొదటగా గాంధీ ఆస్పత్రి సమీపంలో... సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సమీపంలో 2013 ఫిబ్రవరి 15న (శుక్రవారం) ఆయుధాలు, తూటాలు లభించాయి. చిలకలగూడ ఠాణా పరిధిలో ఉన్న రెండు ప్రాంతాల్లో ఇవి దొరికాయి. ఈ ప్రాంతాల మధ్య కేవలం కిలోమీటరు దూరమే ఉండటంతో ఒకరి పనిగానే అనుమానించారు. సదరు తుపాకులు, తూటాలు దాదాపు 40 ఏళ్ల క్రితం నాటివిగా అంచనా వేశారు. పద్మారావునగర్‌లో ఆ రోజు ఉదయం 6.30 గంటలకు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికులు చెత్తను డబ్బాలో వేసేందుకు వెళ్లారు. అందులో ప్లాస్టిక్ గోనెసంచిలో కట్టిన రెండు తుపాకులు (రైఫిల్స్ మాదిరివి) కనిపించాయి. దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన సిబ్బంది వెంటనే చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కలకలం కొనసాగుతుండగానే... మరో అరగంటకు షాబాద్‌గూడ నుంచి మరో సమాచారం వచ్చింది. రామచంద్రయ్య అనే వ్యక్తి చెత్త పడేసేందుకు తన ఇంటి సమీపంలోని డబ్బా వద్దకు వెళ్లగా... అందులో తూటాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ తుపాకులు, తూటాలు సైతం అమెరికాలో తయారైనవిగా వెల్లడైంది. రెమింగ్టన్ కంపెనీకి పాయింట్ 410 ఎంఎం, 0.38 ఆర్మీడ్, 3.57 రేంజర్ క్యాలిబర్లతో కూడిన తూటాలు మొత్తం వంద వరకు, మరికొన్ని ఖాళీ క్యాట్రిడ్జ్‌లు (కాల్చేయగా మిగిలినవి) ఉన్నట్లు గుర్తించారు. కొన్నింటిని పాన్ల్లో వినియోగించే ఖాళీ జర్దా డబ్బాలో, మరికొన్ని ప్రముఖ మిఠాయి దుకాణం కర్నూలు బ్రాంచ్‌కు చెందిన డబ్బాలో ఉంచి చెత్తడబ్బాలో పడేశారు. మూడేళ్ల క్రితం రైల్వేస్టేషన్ వద్ద... హైదరాబాద్ రైల్వే స్టేషన్ (నాంపల్లి) సమీపంలోని ఓ సులభ్ కాంప్లెక్స్‌లో 2019 డిసెంబర్ 20న (శుక్రవారం) రెండు రివాల్వర్లు దొరికాయి. ఆ రోజు రాత్రి మరుగుదొడ్లను శుభ్రం చేసే సిబ్బంది వీటిని గుర్తించారు. దీంతో కాంప్లెక్స్ నిర్వాహకులు నాంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు సంఘటనాస్ధలానికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. అవి రివాల్వర్లు కాదని, తపంచాలని పోలీసులు నిర్ధారించారు. తపంచాలు వదిలిపెట్టిన వ్యక్తుల కోసం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను సైతం పరిశీలించారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులే సులభ్ కాంప్లెక్స్‌లో స్నానం చేసి ఉంటారని, వాళ్లే ఇక్కడ వదిలిపెట్టి వెళ్లినట్టుగా భావించి ఆ కోణంలోనూ ఆరా తీశారు. అక్రమ రవాణా ముఠాలు, దోపిడీ దొంగలు, రౌడీ షీటర్లు, మావోయిస్టులు, మాజీ నక్సలైట్లు.. వీళ్లల్లో ఎవరైనా తీసుకువచి్చ, సులభ్ కాంప్లెక్స్‌లో వీటిని మరిచిపోయారని అంచనా వేశారు. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు జటిలమే... సాధారణంగా కంపెనీల్లో తయారయ్యే మారణాయుధాలకు కొన్ని సీరియల్ నెంబర్లు, బ్యాచ్ నెంబర్లు తదితరాలు ఉంటాయి. ఇవి ఎక్కడైనా లభిస్తే ఈ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు అధికారులు ముందుకు వెళ్లి బాధ్యలను గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే నాటు తుపాకులు, తపంచాలకు ఇలాంటి లేకపోవడంతో పాటు విదేశాల్లో తయారైన వాటికి ఇవి ఉన్నా ఫలితం ఉండట్లేదు. నగరానికి నాటు తుపాకులు, తపంచాలు ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌ల్లోని వివిధ ప్రాంతాల నుంచి సరఫరా అవుతున్నాయి. ఇలాంటివి లభించినప్పుడు వాటి రూపం, పిడి ఉన్న తీరుతెన్నుల్ని బట్టి బాలిస్టిక్ నిపుణులు సైతం ఏ ప్రాంతంలో తయారైందో మాత్రమే చెప్పలగరు. ఇంతకు మించి ముందుకు వెళ్లడానికి సీసీ కెమెరాలు వంటి వాటిపై ఆధారపడాల్సిందే. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో వాటిలోనూ సరైన ఆధారాలు లభించట్లేదు. ఫలితంగా ఈ అక్రమ ఆయుధాల కేసులు బాధ్యులు గుర్తించడం జరగకుండానే పెండింగ్‌లో ఉండి క్లోజ్ అయిపోతున్నాయి. (చదవండి: రామోజీపై భూకబ్జా కేసు పెట్టాలి.. ఆ 70 ఎకరాలు..) -
ఉక్రెయిన్‌కి హ్యాండ్ ఇచ్చిన ఇజ్రాయెల్...షాక్‌లో జెలెన్ స్కీ
Israel's failure to give Kyiv anti-missile systems: యుద్ధంతో అట్టడుకుతున్న ఉక్రెయిన్‌కి అమెరికా దాని మిత్రదేశాలు ఆయుధ సాయం అందించి, మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఐతే ఇజ్రాయెల్ మాత్రం మాటలకే పరిమితమైంది. చేతల విషయానికి వచ్చేటప్పటికీ మొండి చేయి చూపిస్తోంది ఇజ్రాయెల్. దీంతో జెలెన్ స్కీ ఇజ్రాయెల్ తీరుపై చాలా అసంతృప్తిగా ఉండటమే కాకుండా చాలా షాక్‌కి గురయ్యానని అని అన్నారు. యుద్ధ ప్రారంభ కాలంలోనే ఐరన్‌డోమ్ వ్యవస్థ గురించి ప్రస్తావించాడు జెలెన్ స్కీ. ఈ ఆయుధాన్ని ఇజ్రాయెల్ గాజాలో పాలస్తీనియన్ మిలిటెంట్లు కాల్చే రాకెట్లను అడ్డుకునేందుకు ఉపయోగిస్తుంది. ఐతే ఇజ్రాయెల్ మాత్రం ఉక్రెయిన్‌కి ఆయుధాలను అందించేందుకు నిరాకరిస్తోంది. అయినా తాము ఆయుధ సాయం చేసే విషయమై కట్టుబడిలేము గానీ ఉక్రెయిన్‌కి సాయం చేస్తామని మాత్రమే చెప్పాం అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇజ్రాయెల్. తాము రష్యా దాడిని కచ్చితంగా ఖండిస్తున్నామంటూనే మాస్కోతో సంబంధాలు దెబ్బతినకుండా ఉండేలా అత్యంత జాగురతతో వ్యవహరిస్తోంది. వాస్తవానికి ఇజ్రాయెల్ దళాలు ఇరానియన్ అనుకూల మిలీషియాపై దాడి చేస్తూ ఉంటాయి. అదీగాక ఇజ్రాయెల్ సిరియా విషయమై రష్యాతో కొంత విపత్కర పరిస్థితిని కూడా ఎదర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఉక్రెయిన్‌కి ఆయుధ సాయం అందించేందుకు ముందుకు రాలేకపోతోంది. (చదవండి: భారత సంతతి యూకే మంత్రి సుయెల్లాకు క్వీన్ అవార్డు) -
మారణాయుధాలతో తిరుగుతున్న ఇద్దరికి జైలు
సాక్షి, చిలకలగూడ: మారణాయుధాలతో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష విధించిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేష్, డీఐ నాగేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ మెట్రోస్టేషన్ ఫుట్‌పాత్‌పై నివసిస్తున్న జంజర్ల ప్రేమ్, లోయర్‌ట్యాంక్‌బండ్ గోశాల ప్రాంతానికి చెందిన కైత నాగరాజు చిత్తుకాగితాలు, ప్లాస్టిక్ బ్యాటిల్స్ ఏరుకుని జీవనం సాగించేవారు. ఈనెల 21న రాత్రి గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని గస్తీ పోలీసులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. అదుపులోకి తీసుకుని సోదా చేయగా వారి వద్ద కత్తి, చాకు లభించాయి. ఈ పెట్టీ కేసులు నమోదు చేసి గురువారం సికింద్రాబాద్ 15వ స్పెషల్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపర్చగా, ఐదు రోజుల చొప్పున జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. (చదవండి: దారి కాచి...దాడి చేసి) -
ఆయుధం: మాటతో మానసిక దాడి?!
‘కత్తికన్నా మాటకు పదునెక్కువ’ అంటారు. సన్నిహిత సంబంధాలలో ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో ‘మాట’ను మించిన ఆయుధం లేదు. ఒక్క మాటతో తమకు తామే బంధం మధ్య ఇనుప గోడగా మారచ్చు. చట్టం గృహహింసను మాత్రమే నేరంగా పరిగణించినప్పటికీ మానసిక దాడి అంతకుమించిన పరిణామాలకే దారితీస్తుందని, బంధాల నడుమ ఇది అత్యంత ప్రమాదకరం అంటున్నారు మనస్తత్వ నిపుణులు. కోవిడ్ సమయం నుంచి కుటుంబ బంధాలలో పెరుగుతున్న మానసిక దాడి గురించి .. నియంత్రించుకోదగ్గ ఆవశ్యకతను నొక్కి చెబుతున్నారు నిపుణులు. ’ది రోల్ ఆఫ్ జెండర్ అండ్ ఏజŒ 2020æఅధ్యయనం ప్రకారం గృహహింసలో శారీరక దాడికి సమానమైన భావోద్వేగ దుర్వినియోగం తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుంది. ► జోక్ చేస్తున్నామా... భాగస్వామిని జోక్‌గా ఓ మాట అనాలనుకోవచ్చు. కానీ, జోక్స్ కూడా కొన్నిసార్లు చెడు పరిమాణాలకు దారి తీయవచ్చు. ఉదాహరణకు.. ‘ఎందుకంతగా తింటావు.. ఇప్పటికే ఏనుగులా అయ్యావు. ఇంకెంతవుతావు’ ఇలాంటి రకరకాల వ్యంగ్య వ్యాఖ్యలు సాధారణంగా భాగస్వామి ప్రవర్తనను నియంత్రించడానికి సంకేతంగా వాడుతారు. ► ప్రమాదకరమే శారీరక లేదా లైంగిక హింసను అనుభవించిన వారి కంటే మానసికంగా బాధింపబడిన వ్యక్తులు తీవ్ర నిరాశ, ఆందోళన, ఒత్తిడి, కించపరిచిన వ్యక్తిత్వానికి గురవుతున్నారని తెలిసింది. దీనివల్ల డిప్రెషన్ బారిన పడుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోందంటున్నారు మానసిక నిపుణులు. వయసు ప్రకారంగా చూస్తే బాల్యంలో మానసికంగా గాయపడిన వారిలో చాలా కాలం పాటు ఈ లక్షణాలు ఉంటాయని అధ్యయనం వెల్లడించింది. యవ్వనంలో చాలా మంది వ్యక్తుల ప్రవర్తనపై బాల్యం ముద్ర అలాగే ఉండిపోయింది. లైంగిక, శారీరక వేధింపుల లాగానే భావోద్వేగ దుర్వినియోగం కూడా అత్యంత హానికరం. ► ప్రేమగా అవమానం.. ప్రేమతో అయినా అతను/ఆమె ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం ద్వారా భాగస్వామి తనను తాను ఆత్మస్థైర్యం కోల్పోయిన వ్యక్తిగా భావించడం ప్రారంభిస్తారు. తమ విశ్వాసం దెబ్బతింటుంది. ’నువ్వు ఇంత తెలివితక్కువ దానివి అనుకోలేదు...’ చాలా సర్వసాధారణంగా ఇళ్లలో వాడే మాట. ప్రపంచం ముందు తమను తాము గొప్పగా నిరూపణ చేసుకోవడానికి, తమ భాగస్వామిని మానసికంగా నియంత్రించడానికి, చాలా మంది వ్యక్తులు పెట్నేమ్స్తో అవమానకరంగా పిలుస్తుంటారు. ఆ మాటలు చాచి కొట్టినదానితో సమానంగా ఉంటాయి. ► జాప్యమూ లోపమేనా! భాగస్వామిని నియంత్రించడానికి చిన్న చిన్న విషయాలు లేదా వారి పనులను లక్ష్యంగా చేసుకుంటారు. ఉదాహరణకు.. ‘ఈ మాత్రం పని కూడా సరిగ్గా చేయడం చేతకాదా? ఎప్పుడూ లేటేనా..’ లాంటి మాటలు తరచూ అనేస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు తమ భాగస్వామికి ఏదీ రాదని ఎదుటివారి ముందు నిరూపించాలనుకుంటారు. ► అరిస్తే వింటారా.. చిన్న విషయాలకే భాగస్వామిని కించపరచడం, పళ్లు కొరకడం, తప్పుడు ప్రమాణాలు చేయడం, వస్తువులు పగులకొట్టడం.. లాంటివి బంధాలు బీటలువారడానికి సంకేతాలుగా నిలుస్తాయి. ► తామే గొప్పని.. కొందరికి తమ గొప్పతనాన్ని ప్రతీసారి చాటుకోవాలనిపిస్తుంటుంది. ఉదాహరణకు.. భార్య ఉద్యోగం/వ్యాపారం లో ఏదైనా చిన్న విజయం సాధిస్తే ’నా వల్ల నీకు జాబ్ వచ్చింది. నేను కనికరిస్తే నువ్వు కాలు బయట పెట్టగలుగుతున్నావు. ఇదేమీ నీ గొప్పతనం కాదు’ వంటి మాటలు అనేస్తుంటారు. ఇటువంటి వ్యక్తులను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు’ అంటారు మానసిక నిపుణులు. చిన్నమాటే.. కానీ, అది పదునుగా మనసుపై దాడి చేస్తుంది. సన్నిహితంగా ఉన్న వ్యక్తిని దూరంగా ఉంచేలా చేస్తుంది. ఒక్కో మాట పడుతున్నప్పుడు అది సమ్మెట దెబ్బలా బంధాన్ని చిధ్రం చేస్తూనే ఉంటుంది. అందుకే, హింస అంటే శారీరకమైనదే కాదు మానసికపరమైనది కూడా అని భావించి, ఎదుటివారిని నొప్పించేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్త పడటం మంచిది. మాట్లాడే ముందే ఆలోచన శారీరక దాడికన్నా భావోద్వేగపరమైన దాడి చాలా తీవ్రమైనది. ఒక చిన్న పదం చాలా తీవ్ర పరిమాణాలు చూపవచ్చు. ‘నువ్వు ఎందుకూ పనికిరావు’ అనే మాట ఎదుటివారి ఆత్మస్థైర్యాన్ని తగ్గించేస్తుంది. దీని వల్ల ఇద్దరి మధ్య బాంధవ్యం పలచబడటం మొదలవుతుంది. మానసిక దాడి కారణంగా ఆందోళన, రక్తపోటు వంటి సమస్యలు పెరగడంతో పాటు చిన్న చిన్న విషయాలకు కూడా కోప్పడిపోయి డిప్రెషన్ బారినపడిన వ్యక్తులను చూస్తుంటాం. కోవిడ్టైమ్లో ఈ సమస్య చాలా ఎక్కువ గమనించాం. కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం కలిసి ఒకే చోట ఉండేవారు. దీని వల్ల ఒకరినొకరు మాటలు అనుకోవడం కూడా పెరిగింది. ‘మానసిక దాడి’ భార్యభర్తలు, పిల్లలు–పెద్దలు మధ్య ఎక్కువయ్యింది. ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎవరికి వారు ఒక మాట అనే ముందు నియంత్రణ ఉండాలి. బంధాల మధ్య కమ్యూనికేషన్ సరిగా ఉండాలి. పెద్దలు ఒకరికొకరు కించపరిచేలా మాట్లాడుకుంటే ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంది. మాట జారిన తర్వాత వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి మాట్లాడే ముందే ఆలోచించాలి. ‘ముందు మన మైండ్‌లో నన్నెవరైనా ఇలాగే అంటే ఎలా అనిపిస్తుంది’ అనే ఆలోచన చేయాలి. కోపం వచ్చినప్పుడు 100 నుంచి 1 వరకు కౌంట్ చేయడం, ఆ ఆలోచనకు అక్కడ కట్ చేసి, మరో విషయంవైపు మైండ్‌ను డైవర్ట్ చేయడం, సహనాన్ని అలవర్చుకోవడం.. వంటివి పాటించాలి. – ప్రొఫెసర్ జ్యోతి రాజ, సైకాలజిస్ట్ట్, లైఫ్‌స్కిల్స్ ట్రైనర్ – నిర్మలారెడ్డి -
తపంచాతో బెదిరించి దోపిడీకి యత్నం..
రాజేంద్రనగర్/మైలార్‌దేవ్‌పల్లి: జువెలరీ, పాన్ బ్రోకర్ దుకాణంలోకి చొరబడిన ముగ్గురు యువకులు తపాంచాతో బెదిరించి దోపిడికి యత్నించారు. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. దుకాణం యజమాని తోటి వ్యాపారుల సహాయం కోరడంతో స్థానిక వ్యాపారులు ఇద్దరినీ పట్టుకొని దేహశుద్ధి చేశారు. మరో నిందితుడు పరారయ్యాడు. ఇద్దరు నిందితులతో పాటు తపాంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మధుబన్ కాలనీలో దిలీప్, దినేష్‌లు సరస్వతీ జూవెలరీ, పాన్ బ్రోకర్ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం దిలీప్ దుకాణంలో ఉండగా ముగ్గురు యువకులు ఆభరణాలు చూపించాలని కోరడంతో దిలీప్ చూపించేందుకు ప్రయత్నించాడు. రాజస్థాన్ భాషలో మాట్లాడుతుండడంతో రాజస్థాన్‌కే చెందిన దిలీప్ అప్రమత్తమైయ్యాడు. దిలీప్ సైతం రాజస్థాన్ భాషలో మాట్లాడుతుండగా నిందితుల్లో దినేష్ తపంచాతో బెదిరిస్తు దిలీప్ నుదుడిపై దాడి చేశాడు. దిలీప్ గట్టిగా నిందితుడు దినేష్‌ను పట్టుకోని కిందపడేయడంతో ఒక పక్క తపాంచా పడడం, మరో పక్క దినేష్ పడడంతో వెంట వచ్చిన మరో ఇద్దరు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దిలీప్ బచావ్ బచావ్ అని అరవడంతో పక్కనే ఉన్న స్వీటు షాపు యజమాని, కిరాణదుకాణం యజమానులు అప్రమత్తమై లోపలికి వస్తుండడంతో నిందితుల్లో ఒకరు తపాంచా చూపిస్తు తాను వచ్చిన ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. మరో యువకుడు పరిగెత్తేందుకు ప్రయత్నించగా స్వీటు షాపు యజమాని పట్టుకొని చితకబాదారు. దినేష్ పాటు మరో యువకుడు పట్టుబడడంతో స్థానికులు పట్టుకోని దేహశుద్ధి చేశారు. పోలీసులు నిందితుడు దినేష్ తోపాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకోని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో ఒక రౌండ్‌తో పాటు తపాంచాను స్వాదీనం చేసుకున్నారు. (చదవండి: నేటి నుంచి తెలుగు భాషా అమృతోత్సవాలు ) -
గొప్పలకు పోతున్న రష్యా!... కౌంటర్ ఇచ్చిన ఆర్మీ ఇంటెలిజెన్స్
Russia's Ministry of Defence Share Video Footage on its official Channel: రష్యా ఉక్రెయిన్ పై కొనసాగిస్తున్న దురాక్రమణ యుద్ధం వేళ రష్యా ఉక్రేనియన్ బలగాల నుంచి తాను స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ప్రదర్శించింది. రష్యాతో తలపడటానికి బ్రిటన్ అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు మిలటరీ సాయం తోపాటు శక్తివంతమైన ఆయుధ సామాగ్రిని కూడా పంపించి ఉక్రెయిన్‌కి సాయం అందించిన సంగతి తెలిసిందే. ఐతే తాము ఉక్రెయిన్ పై పట్టు సాధించేశాం అంటూ జబ్బలు చరుచుకుంటూ ఉక్రెయిన్ బలగాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను రష్యన్ సైనికులడు ఒక వీడియో ఫుటేజ్‌లో చూపిస్తున్నాడు. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తన అధికారిక టెలిగ్రామ్ ఛానెల్లో రెండు నిమిషాల 15 సెకన్ల నిడివి గల ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియోలో... రష్యా సైనికుడు యూఎస్, యూకే , పోలాండ్, స్వీడన్ దేశాల యాంటీ ట్యాంక్ గ్రెనేడ్ లాంఛర్లతో సహా వివిధ రకాల ఆయుధాలను పట్టుకుని మాట్లాడుతున్నాడు. పైగా ఉక్రెయిన్‌కి మిగతా దేశాలు అందించిన ట్రోఫీలు ఇవిగో అంటూ వెటకరిస్తూ ... ఉక్రెయిన్ బలగాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను చూపించాడు. ఐతే నివేదికలు ప్రకారం ఉక్రెయిన్ రష్యా నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలతో పోల్చితే మాస్కో స్వాధీనం చేసుకున్నవి తక్కువేనని పేర్కోన్నాయి. అదీగాక మిలటరీ ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా బలగాలు దాదాపు ఐదు వేల మిలటరీ వాహనాలను కోల్పోయినట్లు వెల్లడించింది. పాశ్చాత్య దేశాల మద్ధతుతో ఉక్రెయిన్ బలగాలు బాగా పోరాడటమే కాకుండా యుద్ధంలో చాలా వరకు విజయం సాధించినట్లు పేర్కొంది. కానీ రష్యా మాత్రం దీన్ని ప్రత్యేక సైనిక చర్యగా అభివర్ణించుకుంటూ రష్యాన్ మాట్లాడే వర్గాలను రక్షించడానికి సాగిస్తున్న యుద్ధంగా చెబుతుంది. ఐతే పాశ్చాత్య దేశాలు మాత్రం మాస్కో తన చర్యను సమర్థించుకుంటూ ఉక్రెయిన్ పై దూకుడుగా వ్యకవహరిస్తోందని మండిపడుతున్నాయి. (చదవండి: ఉక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రంపై బాంబుల వర్షం.. లక్కీగా తప్పిన పెను ప్రమాదం) -
హెల్ఫైర్ మిసైల్.. తిరుగులేని మారణాస్త్రం
అల్‌ఖైదా నంబర్ 2గా ఉన్న అహ్మద్ హసన్ అబూ ఖైర్ అల్‌మస్రీని 2017లో సిరియాలోని ఇద్లిబ్ ప్రావిన్స్‌లో విమానం ద్వారా ప్రయోగించిన హెల్ఫైర్ ఆర్9ఎక్స్‌తో చంపింది. దీన్ని ప్రయోగించడం అదే తొలిసారి. 2000లో యెమన్‌లో 17 మంది అమెరికా నావికులను బలి తీసుకున్న బాంబు దాడికి కారకుడైన జమాల్ అహ్మద్ అల్ బదావీని 2019లో హెల్ఫైర్ ఆర్9ఎక్స్‌తోనే సీఐఏ మట్టుబెట్టింది. ఉగ్ర దాడులకు నిధులు సమకూరుస్తున్న మొహిబుల్లా అనే ఉగ్రవాదిని 2019లో హెల్ఫైర్తోనే మట్టుబెట్టింది. 2020లో ఇరాన్‌కు చెందిన మేజర్ జనరల్ ఖాసిం సులేమానీని బలి తీసుకుంది కూడా హెల్ఫైరేనంటారు. ఇది అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఒకదశలో పరిస్థితి యుద్ధం దాకా వెళ్లింది. అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీని మట్టుబెట్టేందుకు సీఐఏ ఉపయోగించిన హెల్ఫైర్ శ్రేణి క్షిపణి అత్యంత అధునాతనమైన మారణాస్త్రం. దీన్ని అమెరికా అమ్ములపొదిలోని రహస్య అస్త్రంగా చెప్పవచ్చు. మిగతా క్షిపణుల్లా ఇది పేలడం, భారీ విధ్వంసం సృష్టించడం వంటివేమీ ఉండవు. కానీ కచ్చితత్వం విషయంలో దీనికి తిరుగు లేదు. నిర్ధారిత టార్గెట్‌ను నిశ్శబ్దంగా ఛేదించడం ద్వారా పని పూర్తి చేస్తుంది. అత్యంత వేగంగా వెళ్తున్న కార్లో కూడా డ్రైవర్‌ను వదిలేసి కేవలం వెనక సీటులో ఉన్న టార్గెట్‌ను మాత్రమే చంపే సత్తా దీనికుందని చెబుతారు. 2011లో ఒబామా హయాంలో అమెరికా రక్షణ శాఖ–సీఐఏ వీటిని సంయుక్తంగా రూపొందించాయి. లాక్‌హీడ్ మార్టిన్–నార్త్రోప్ గమ్మన్ ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించాయి. 2019లో వాల్‌స్ట్రీట్ జర్నల్ బయట పెట్టేదాకా వీటి గురించి బయటి ప్రపంచానికి తెలియదు. అమెరికా పాటిస్తున్న గోప్యత కారణంగా హెల్ఫైర్కు సంబంధించిన సాంకేతిక వివరాలేవీ పెద్దగా అందుబాటులో లేవు. ఇందులో పలు రకాలున్నాయి. జవహరీపై దాడికి వాడింది అమెరికా ఇటీవలే అభివృద్ధి చేసిన ఆర్9ఎక్స్ రకం. ఇది వార్‌హెడ్ వంటిదేమీ లేకుండా ఐదడుగుల పై చిలుకు పొడవు, 45 కిలోల బరువుతో చాలా తేలిగ్గా ఉంటుంది. దీన్ని విమానం నుంచి గానీ, డ్రోన్ నుంచి గానీ ప్రయోగిస్తారు. అత్యంత వేగంతో లక్ష్యాన్ని తాకే సమయంలో దీని ముందు భాగం నుంచి ఆరు అత్యంత పదునైన బ్లేడ్లు బయటికొస్తాయి. దాన్ని పూర్తిస్థాయిలో ఛిద్రం చేస్తూ దూసుకెళ్తాయి. పరిసరాలకు గానీ, పక్కనుండే వారికి గానీ ఎలాంటి నష్టం లేకుండా పని చక్కబెట్టడం వీటి ప్రత్యేకత. దీన్ని నింజా బాంబ్ అని, బ్లేడ్ల కారణంగా ఫ్లయింగ్ జిన్సు అని పిలుస్తారు. అగ్ర స్థాయి ఉగ్రవాద నేతలు తదితరులను ఇతర ప్రాణనష్టం లేకుండా చంపాలనుకున్నప్పుడు మాత్రమే వీటిని ఉపయోగిస్తుంటారు. 2011లో అప్పటి అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ హత్యకు ప్లాన్ బీగా హెల్ఫైర్ క్షిపణులను కూడా సిద్ధంగా ఉంచారట. కానీ హెల్ఫైర్ క్షిపణులæ అవసరం లేకుండానే నేవీ సీల్స్ విజయవంతంగా పని పూర్తి చేశారు. -
వంద రోజుల యుద్ధంలో దాదాపు 20% ఉక్రెయిన్ రష్యా హస్తగతం
100 Days Of War Russia Now Holds 20% Ukraine Territory: ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణకు దిగి నేటికి వంద రోజులైంది. ఈ వందరోజుల నిరవధిక దాడుల్లో రష్యా 20 శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని అధీనంలో ఉంచుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ పేర్కొన్నారు. 2014లో స్వాధీనం చేసుకున్న డాన్‌బాస్‌లోని కొన్ని భూభాగాలతో సహా ఉక్రెయిన్ భూభాగంలో ఐదవ వంతు మాస్కో నియంత్రణలో ఉందని కీవ్ ప్రకటించింది. అదీగాక ఉక్రెయిన్ దళాలు రష్యా బలగాలను రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరిమికొట్టడంతో తూర్పు ఉక్రెయిన్‌ని స్వాధీనం చేసుకోవడం పై మాస్కో దృష్టి సారించింది. ఈ యుద్ధ భూమిలో ప్రతి రోజు సుమారు 100 మంది దాక ఉక్రెయిన్ సైనికులు నేలకొరుగుతున్నారని జెలెన్ స్కీ పేర్కొన్నారు. ఈ మేరకు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన సమావేశ అనంతరం నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఉక్రెయిన్ మిత్రదేశాలు ఈయుద్ధం క్షీణించేలా ఆయుధాలను అందించాలని పిలుపునిచ్చారు. తాము రష్యాతో నేరుగా యుద్ధానికి దిగాలనుకోవడంలేదని పునరద్ఘాటిస్తూ... ఈ యుద్ధంలో రష్యా బలగాలు ఊహించనిదానికంటే ఎక్కువగానే పురోగమిస్తున్నాయని అన్నారు. యూఎస్ నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు సైతం ఉక్రెయిన్‌కి ఆయుధాలను, సైనిక సామాగ్రిని అందజేశాయి. అంతేగాదు ఉక్రెయిన్‌కి యూఎస్ రాయబారి బ్రిడ్జేట్ బ్రింక్ రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ విజయం సాధించేలా యూఎస్ సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే యూఎస్ ఉక్రెయిన్‌కి సుమారు 700 మిలియన్ డాలర్ల ఆయుధా సామాగ్రి ప్యాకేజిని ప్రకటించింది. దీంతో మాస్కో ఉక్రెయిన్ విషయంలో యూఎస్ అగ్నికి ఆద్యం పోస్తున్నట్లుగా వ్యవహరిస్తోందంటూ అమెరికా పై విరుచుకుపడుతోంది. ఈ మేరకు రష్యా ఆర్థిక పరిస్థితిని ఉక్కిబిక్కిర చేసేలా అమెరికా దాని మిత్రదేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా చమురు సరఫర పై కూడా యూరప్ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా ఈ పాక్షిక చమురు నిషేధానికి భారీ మూల్య చెల్లిస్తారంటూ యూరప్ దేశాలను హెచ్చరించింది. ఐతే ప్రపంచంలోని ధాన్యాల ఉత్పత్తిదారుల్లో ఉక్రెయిన్ పాత్ర కీలకం కావడంతో ఈయుద్ధం ప్రపంచ ఆహార సంక్షోభాన్ని ప్రేరేపించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఇప్పటికే తృణధాన్యాలు, సన్‌ఫ్లవర్ ఆయిల్ నుంచి మొక్కజోన్న వరకు అన్ని అధిక ధరలు పలుకుతుండటం గమనార్హం. (చదవండి: మరింత మద్దతు.. ‘రష్యా పని పట్టడానికి అత్యాధునిక ఆయుధాలిస్తాం’) -
ఆయుధాలను నిషేధించాలన్న బైడెన్... కుదరదు అని చెప్పేసిన రిపబ్లికన్లు
Biden asked How Much More Carnage: టెక్సాస్ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో జరిగిన మారణహోమం మరువుక మునుపే సెయింట్ ఫ్రాన్సిస్ ఆసుపత్రిలో ఒక దుండగుడు కాల్పులు జరిపి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంకా ఇలాంటి ఎన్ని మారణహోమాలను చూడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన అమెరికాలో తుపాకీలను నిషేధించాలంటూ పిలుపు నివ్వడమే కాకుండా ఈ తుపాకీ హింస పై తగిన చర్యలు తీసుకోవాలని అమెరికా చట్ట సభ సభ్యులను కోరారు. అంతేకాదు కఠినతరమైన తుపాకీ చట్టాలను తీసుకువచ్చే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు కూడా. ఐతే అందుకు రిపబ్లికన్ సెనెటర్లలోని మెజారిటీ సభ్యలు నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో బైడైన్ యూఎస్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక కాల్పులను చూస్తున్నప్పటికీ ఈ చట్టాలకు మద్దతు ఇవ్వడానికి ముందకు రాలేకపోతున్నారంటే మీకు మనస్సాక్షి అనేదే లేదంటూ ఆక్రోశించారు. కనీసం పాఠశాలల్లో, ఆసుపత్రులలో హింసాత్మక చర్యలు జరగకుండా ఉండేలా ఆయుధాలను కొనుగోలు చేసే వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని చట్టసభ సభ్యులను కోరారు. గత రెండు దశాబ్దాలుగా విధులు నిర్వర్తిస్తూ చనిపోతున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది కంటే చిన్నారులే ఈ తుపాకీలకు బలవుతున్నారని ఆవేదనగా చెప్పారు. ఆయుధాలను సురక్షింతంగా ఉంచడం తప్పనిసరి చేస్తూ...హింసాత్మక నేరాలు జరుగతున్నప్పుడు ఆ తుపాకీలను రూపొందించిన తయారీదారులను సైతం ఈ నేరాలకు బాద్యులుగా చేసి చర్యలు తీసుకోవాలని చట్టసభ సభ్యులను కోరారు. అంతేకాదు ప్రొటెక్టింగ్ అవర్ కిడ్స్ యాక్ట్"ను ఆమోదించాలని, తుపాకీలను కొనుగోలు చేసే వయసు కూడా పెంచాలని నొక్కిచెప్పారు. ఐతే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆత్మరక్షణ కోసం తుపాకీలు వాడకాన్ని అనుమతించాలని, స్కూళ్లలల్లో ఇలాంటి హింసాత్మక కాల్పుల జరగకుండా గట్టి భద్రత కోసం కృషి చేయాలని చెబుతుండటం గమనార్హం. (చదవండి: అఫ్గన్ గడ్డపై భారత బృందం.. తాలిబన్ల విన్నపాలు) -
ప్రధాని మోదీ పర్యటన.. కొద్ది రోజుల్లోనే కీలక నిర్ణయం తీసుకున్న జపాన్ ప్రభుత్వం
ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన భారత రక్షణ వ్యవస్థని మరింత బలోపేతం చేసేందుకు కీలకంగా మారనుంది. ఈ పర్యటన జరిగిన వారంలోపే.. భారత్‌కు క్షిపణులు, జెట్లతో సహా శక్తివంతమైన సైనిక పరికరాలను ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది జపాన్ ప్రభుత్వం. నివేదిక ప్రకారం.. భారతదేశం, ఆస్ట్రేలియాతో పాటు కొన్ని యూరోపియన్, ఆగ్నేయాసియా దేశాలకు ఆయుధాలను ఎగుమతులు చేయడానికి జపాన్ ప్రభుత్వ ఆ దేశ ఆయుధాలపై ఎగుమతులపై ఉన్న నిబంధనలను సడలించనుంది. కాగా మంగళవారం టోక్యోలో జరిగిన సమావేశంలో రక్షణ తయారీతో సహా ద్వైపాక్షిక భద్రత, రక్షణ సహకారాన్ని మెరుగుపరచడానికి క్యాడ్ సమ్మిట్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. జపాన్ ప్రధాని ప్యూమియో కిషిదాను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం జరిగిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం జరగడం విశేషం. గతంలో దాదాపు 47 సంవత్సరాల తర్వాత 2014లో జపాన్ ప్రధాని షింజో అబే పరిపాలన రక్షణ ఎగుమతులను నిషేదించే నిబంధలను సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ, ఇది ఇప్పటికీ ప్రాణాంతక ఆయుధాల ఎగుమతులను నిషేధిస్తుంది. తాజాగా జపాన్ ప్రభుత్వం ఈ చట్టానికి మరిన్ని సడలింపులు తీసుకురానుంది. దీని ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. జపాన్ స్వీయ-రక్షణ దళాలు, భారత సైన్యం మధ్య అక్విజిషన్ క్రాస్-సర్వీసింగ్ అగ్రిమెంట్ సెప్టెంబర్ 2020లో పలు ఒప్పందాలు జరిగాయి. చదవండి: Elon Musk: అప్పుడు డేటింగ్‌తో చిచ్చు రాజేశావ్! ఇప్పుడేమో ఇలా.. -
అమెరికా నిర్మించిన రాడార్ స్టేషన్‌ని ధ్వంసం చేసిన రష్యా
it would consider NATO transport carrying weapons in Ukraine: ఉక్రెయిన్‌లోని జోలోట్ పట్టణం సమీపంలో అమెరికా నిర్మించిన రాడార్ స్టేషన్‌ను ధ్వంసం చేసినట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్‌లో ఆయుధాలను మోసుకెళ్లే నాటో రవాణాను నాశనం చేసేందుకు ఉద్దేశించిన లక్ష్యంలో భాగంగా ఆ స్టేషన్‌ని ధ్వంసం చేసినట్లు రష్యా మంత్రిత్వశాఖ పేర్కొంది. అంతేకాదు రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ సాధించిన విజయానికి గుర్తుగా రష్యా బలగాలు ఈ ఘటనకు పాల్పడినట్లు స్పష్టం చేసింది. పైగా మే 9 రష్యా విక్టరీ డే పురస్కరించుకుని మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైనిక బలగాలకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వ్లాదిమిర్ పుతిన్ తన బలగాలను ఉద్దేశించి ..."మీరు మాతృభూమి కోసం, భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. పైగా మీరు రెండవ ప్రపంచ యుద్ధం నుంచి నేర్చుకున్న పాఠాలను ఎప్పటికీ మర్చిపోరు. అయినా ఈ గడ్డ పై ఉరితీసేవారికి, వేధించేవారికి, నాజీలకు చోటు ఉండదు." అని అన్నారు. మరోవైపు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్ స్కీ కూడా రష్యా విక్టరీ డే సంర్భంగా ఓ వీడియోను విడుదల చేస్తూ... ఉక్రెయిన్‌కు రెండు విక్టరీ డేస్‌లు ఉంటాయని చెప్పడం కొసమెరుపు. పైగా జెలన్ స్కీ కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో తమ పూర్వీకులు చేసిన వాటిని ఎప్పటికీ మరచిపోం అని వ్యాఖ్యానించడం విశేషం. అంతేకాదు ఇక్కడ 8 మిలియన్లకు పైగా ఉక్రేనియన్లు మరణించడమే కాకుండా ప్రతి ఐదవ ఉక్రేనియన్ ఇంటికి తిరిగి రాలేదన్నారు. ఈ మేరకు ఈ యుద్ధం దాదాపు 50 మిలియన్ల మంది ప్రాణాలను బలిగొందని జెలెన్ స్కీ అన్నారు. అదీ గాక ఉక్రెయిన్ పై రష్యా నిరవధిక దాడుల జరిపి నేటికి 75వ రోజుకు చేరుకుంది. ఐతే రష్యా ప్రధాన సంధానకర్త వ్లాదిమిర్ మెడిన్స్కీ ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు ఆగలేదని కాకపోతే మెక్కుబడిగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. (చదవండి: అంచనాలను తలకిందులు చేస్తూ.. ఉక్రెయిన్‌లోని ‘మాతృభూమి’ రక్షణ కోసమే పోరాటం: పుతిన్) -
ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం.. అమెరికాకు రష్యా హెచ్చరిక
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఉధృతం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు సైనిక సహాయం అందిస్తామన్న అమెరికా ప్రకటనపై రష్యా స్పందించింది. యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌కు ఆమెరికా సైనికసాయం అందిస్తే.. తీవ్రమైన పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని రష్యా హెచ్చరించినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌కు ఆయుధాలు పంపిస్తామన్న జో బైడెన్ ప్రకటనపై రష్యా.. అమెరికా, నాటోను తీవ్రంగా వ్యతిరేకించింది. ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధసాయం చేస్తే అనూహ్యమైన పరిణామాలు నెలకొంటాయని హెచ్చరించింది. అయితే అమెరికా అధ్యక్షడు జో బైడెన్.. ఉక్రెయిన్‌కు రూ.80 కోట్ల హెలికాప్టర్లు, హెవిట్జర్లు, సాయుధ సిబ్బంది క్యారియర్లను సాయంగా అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే రష్యా.. అమెరికాను హెచ్చరించడం గమనార్హం. అయితే మరోవైపు.. ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను ఉక్రెయిన్‌కు ఇచ్చేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ను ఆయుధపరంగా శక్తిమంతం చేసేందుకు అమెరికా యత్నిస్తున్నట్లు సమాచారం. ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ల పరిధి 1,850 కిలోమీటర్లు ఉంటుంది. ఇవి గరిష్ఠంగా గంటకు 482 కిలోమీటర్ల వేగంతో పయనిస్తాయి. సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దుల్లో పలు ఆపరేషన్లలో వీటిని యూఎస్ఏ ఉపయోగించిన విషయం తెలిసిందే. ఐసిస్, అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక కమాండర్లను హతమార్చడంలో ఈ డ్రోన్లు కీలకపాత్ర పోషించిన సంగతి విదితమే. చదవండి: Russia-Ukraine war: మాస్క్వా మునిగింది -
అత్యాచారాన్ని ఆయుధంగా ఉపయోగిస్తోంది!: ఉక్రెయిన్
Ukrainian human rights group accused Russian troops: ఉక్రెయిన్ పై రష్యా నెలరోజలకు పైగా నిరవధిక యుద్ధం కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌ని అధినంలోకి తెచ్చుకునే క్రమంలో రష్యా యుద్ధ నేరాలకు, అత్యాచారాలకు పాల్పడుతోంది. అంతేగాక యూఎన్ భద్రతా మండలిలో ఉక్రెయిన్ మానహక్కుల సంఘం ప్రస్తుతం రష్యా బలగాలు అత్యాచారాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించాయి. అదీగాక ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు లైంగిక దాడులు, అత్యాచారాలు వంటి అకృత్యాలకు పాల్పడుతున్నారంటూ పెద్ద ఎత్తున్న ఆరోపణలు వస్తున్నాయని యూఎన్ అధికారి భద్రతా మండలికి తెలిపారు. ఉక్రెయిన్ మానవహక్కుల సంఘం నాయకురాలు కాటెరినా చెరెపాఖా రష్యా సైనికులు తొమ్మిది మందిపై అత్యాచారం కేసులు ఉన్నాయని, సుమారు 12 మంది మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని భద్రతా మండలిలో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు ఇప్పుడూ హింస, అత్యాచారాలను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని అన్నారు. తమ ఆవేదనను వినాలని అభ్యర్థించారు. గతవారమే ఐక్యరాజ్యసమితి రష్యన్ దళాల లైంగిక హింస ఆరోపణలను ధృవీకరించడానికి యూఎన్ మానవ హక్కుల పర్యవేక్షకులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్ దళాల పై కూడా లైంగిక ఆరోపణలు వస్తున్నట్లు యూఎన్ పేర్కొంది. కానీ దానిపై ఉక్రెయిన్ మానవ హక్కుల సంఘం ఇంకా స్పందించలేదు. మరోవైపు రష్యా ఎప్పటికీ పౌరుల పై దాడి చేయదని కేవలం రష్యన్ సైనికులను శాడిస్టులుగా చూపించాలనే దురుద్దేశంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నాయని రష్యా యూఎన్ రాయబారి డిమిత్రి పోలియన్స్కీ ఉద్ఘాటించారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి మహిళా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బహౌస్ మాట్లాడుతూ, న్యాయం, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి అన్ని ఆరోపణలను స్వతంత్రంగా దర్యాప్తు చేయాలి. మేము ఎక్కువగా అత్యాచారం, లైంగిక హింస గురించి వింటున్నాము" అని ఆమె కౌన్సిల్లో అన్నారు. ఉక్రెయిన్ యూఎన్ రాయబారి సెర్గీ కిస్లిత్సా రష్యన్ సైనికుల అత్యాచార కేసులకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌కి ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం ప్రారంభించిందని భత్రతా మండలికి తెలిపారు. (చదవండి: రష్యా అరాచకం.. గుంతలు తవ్వి మృతదేహాల ఖననం..!) -
చైనా, రష్యాలతో సహవాసం భారత్‌కే ముప్పు: యూఎస్
Russian weapons cheaper: రష్యా ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడటంతో ప్రపంచ దేశాల ఆగ్రహానికి గురైంది. రష్యా ఉక్రెయిన్ దేశాన్ని నేలమట్టం చేసేలా దాడులు చేయడమే కాకుండా యుద్ధ నేరాలకు పాల్పడింది. దీంతో యూఎస్ దాని మిత్ర దేశాలు రష్యా ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా రష్యాతో మిత్రత్వం సాగిస్తున్న దేశాలపై కూడా కన్నెర్రజేసింది. అంతేకాదు ప్రపంచ దేశాలన్ని ఆర్థిక ఆంక్షలు విధించడంతో రష్యా భారత్‌తో చమురు, తదితర వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలనుకుంది. అందులో భాగంగా ఇటీవల రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. దీంతో యూఎస్ వెంటనే భారత్‌కి హెచ్చరికలు జారీ చేసింది. తాము విధించిన ఆంక్షలు రష్యాకు అనుకూలంగా వ్యవహరించే దేశాలకు వర్తిస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్ సంక్షోభం సమయంలో భారత్ వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అదీగాక రష్యాతో ఆయుధా సామగ్రి కొనుగోలు, చైనాతో గల సరిహద్దు సమస్యలు గురించి భారత్ యూఎస్‌కి తెలిపింది. అంతేగాక రష్యాతో గల చారిత్రక సబంధాల గురించి కూడా వివరించింది. తాము భద్రతా దృష్ట్యా చౌకగా లభించే రష్యా ఆయుధ సామాగ్రి పైనే ఆధారపడుతున్నట్టు భారత్ యూఎస్‌కి స్పషం చేసింది. అయితే భారత్ రక్షణ సామాగ్రి ప్రత్యామ్నయ పరిస్థితి గురించి భయపడనవసరం లేదని అందుకు యూఎస్ సాయం చేస్తుందని అమెరికా సహాయ కార్యదర్శి విక్టోరియా నులాండ్ పేర్కొన్నారు. అంతేగాకుండా రష్యా కంపెనీ భారత్ కంపెనీలతో భాగస్వామ్య వ్యాపారం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, అందువల్లే యూఎస్ రక్షణ శాఖ విముఖంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు విక్టోరియా నులాండ్ ఈ విషయమై భారతదేశానికి వచ్చి విదేశాంగ కార్యదర్శి హర్ష్ ష్రింగ్లాతో సంప్రదింపులు జరిపారు. అయినా రష్యా చైనా ఇరు దేశాలు నిరంకుశ దేశాలని వాటితో సహవాసం భారత్‌కి మంచిదికాదని అన్నారు. ఈ సమయంలో రష్యా, చైనా దేశాలకి వ్యతిరేకంగా భారత్ నిలబడాలని నొక్కి చెప్పారు. అయితే యూఎస్ సైనిక సహకారానికి సంబంధంచి ద్వంద వైఖరి పట్ల భారత్ కాస్త అసంతృప్తిగా ఉంది. రష్యాతో ఎలాంటి సాన్నిహిత్యంగానీ భాగస్వామ్య వ్యాపారాలు గానీ సాగించొద్దుని భారత్‌కి యూస్ బహిరంగంగానే చెప్పింది. (చదవండి: వార్నింగ్ ఇచ్చినా హ్యాండ్ ఇచ్చిన భారత్.. పుతిన్ రెస్పాన్స్‌పై టెన్షన్!) -
Russia-Ukraine war: ఉక్రెయిన్‌లో రష్యా ఉక్కిరిబిక్కిరి
చిన్న దేశం.. చిదిపేద్దాం! అనుకొని ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాకు నెల దాటినా విజయతీరం కనిపించడం లేదు. ఫాస్ఫరస్ బాంబుల నుంచి హైపర్ సోనిక్ క్షిపణుల వరకు పలు ఆయుధాలను ప్రయోగించినా ఫలితం కనిపించడంలేదు. చాలా నగరాలు ఇలా స్వాధీనమై, అలా చేజారుతున్నాయి. విజయం సాధించలేదన్న ఉక్రోషంతో రష్యా మరింత భయానక మారణాయుధాలు ప్రయోగిస్తాయన్న భయాలు కూడా పెరిగాయి. రష్యాకు సునాయాస విజయం దక్కకపోవడానికి కారణాలనేకమని యుద్ధ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రపంచ సూపర్ పవర్స్లో ఒకటైన రష్యాకు ఉక్రెయిన్‌పై దాడిలో ఎదురవుతున్న భంగపాటు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రోజుల్లో ముగిసిపోతుందనుకున్న యుద్ధం నెలదాటినా కొలిక్కిరాకపోవడంతో రష్యాలో అసహనం పెరుగుతోంది. స్వదేశీయుల జాతీయాభిమానానికి పాశ్చాత్య దేశాల అండదండలు తోడవడంతో రష్యాకు ఉక్రెయిన్ చుక్కలు చూపుతోంది. చిన్నపాటి యుద్ధంగా అందరూ భావించిన ఈ దాడిలో రష్యా ఎదురుదెబ్బలు తినడానికి కారణాలు చాలా ఉన్నాయంటున్నారు నిపుణులు. కోల్డ్‌వార్ ముగిసిన అనంతరం రష్యా ఆయుధీకరణపై పెద్దగా ఫోకస్ చేయకపోవడం, పలు ఆయుధాలను ఆర్థికావసరాలకు విక్రయించడం, రష్యా నేతల ఆలోచనలకు తగినట్లు యుద్ధ భూమిలో వ్యూహాలు లోపించడం, ఉక్రెయిన్ ప్రతిఘటనను తక్కువగా అంచనా వేయడం, మిలటరీ అగ్రనేతల్లో పేరుకుపోయిన అవినీతి, ఇష్టంలేని యువతను సైన్యంలో బలవంతంగా చేర్చుకోవడం తదితర చర్యలు రష్యా మిలటరీని బలహీనపరిచాయని విశ్లేషిస్తున్నారు. అసలు సమస్యలు ఇవే! సంస్థాగత లోపాలు, ఆయుధాల పేలవ ప్రదర్శన, వైమానిక సమన్వయ లోపం, ఆర్థిక ఇబ్బందులు.. రష్యా భంగపాటుకు కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి రష్యా వ్యూహాత్మకంగా సైనిక బెటాలియన్లను సరిహద్దులకు తరలించడం ఆరంభించింది. రష్యా పంపిన తొలి బెటాలియన్లలో అనుభవం తక్కువగా ఉన్న లేదా కాంట్రాక్టు సైనికులు అధికంగా ఉంటారు. ఇలాంటి బెటాలియన్లు చిన్నతరహా లేదా స్వల్పకాలిక యుద్ధాలకు పనికివస్తారు. కానీ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఈ బెటాలియన్లు వృ«థా అవుతాయి. అలాగే సమన్వయ లోపం రష్యా మిలటరీకి శాపంగా మారింది. కాంట్రాక్టు బెటాలియన్ సైనికులకు, నిజ సైనిక బెటాలియన్‌కు మధ్య సమన్వయం కుదర్చడానికి రష్యా కమాండర్లు నానా తంటాలు పడుతున్నారు. అలాగే మిలటరీ– వైమానిక సిబ్బంది మధ్య కూడా సమన్వయం లోపించింది. దీనివల్ల వైమానిక దాడులతో సాధించే పురోగతిని మిలటరీ కొనసాగించలేకపోయింది. నేలపై శత్రురాడార్ వ్యవస్థలను, డ్రోన్లను అనుకున్న సమయంలో రష్యన్ మిలటరీ ధ్వంసం చేయలేకపోవడం వైమానిక దాడులకు అవరోధంగా మారింది. ఇక సరుకులు, మందుగుండు సరఫరా, రిపైర్ వర్క్‌షాపుల కొరత, వైద్యసాయం అందకపోవడం అన్నింటి కన్నా ప్రధాన సమస్యలుగా మారాయి. యూఎస్ సహా పలు దేశాల ఆంక్షలు రష్యా ఆర్థిక పరిస్థితిని పాతాళానికి తీసుకుపోతున్నాయి. దీనివల్లనే సొంతసైన్యానికి రష్యా తగినంత సాయం అందించలేకపోతోందని కొందరి అంచనా. మరోవైపు ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు భారీగా ఆయుధాలను, నిధులను అందిస్తున్నాయి. దీంతో రష్యాను ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అంతిమ విజయం ఎవరిది? రష్యా వెనుకంజ కేవలం పాశ్చాత్య మీడియా సృష్టని యుద్ధ నిపుణుల్లో కొందరు భావిస్తున్నారు. యుద్ధ సమయంలో కూడా రష్యా సహజవాయు సరఫరా కొనసాగిస్తూనే ఉందని, ఆంక్షలను ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు ముందే తీసుకుందని గుర్తు చేస్తున్నారు. దీనికితోడు చైనా, బెలారస్ వంటి దేశాలు రష్యాకు సాయం చేస్తున్నాయని, భారత్ లాంటి కీలక దేశాలు తటస్థ వైఖరిని అవలంబించడం కూడా రష్యాకు కలిసివచ్చే అంశమని చెబుతున్నారు. ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవడం పుతిన్ ఉద్దేశం కాదని, కేవలం తనకు అనుకూల ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్ ఎంత ప్రతిఘటించినా చివరకు పుతిన్ అనుకున్నది సాధించే తీరతాడని విశ్లేషిస్తున్నారు. త్వరలో ఇరు పక్షాల మధ్య జరిగే చర్చల్లో రష్యాకు అనుకూల ప్రతిపాదనలు రావచ్చని వీరి అంచనా. యుద్ధంలో విధ్వంసకాలు రష్యా వాడుతున్న ఆయుధాలు: 1. ఫాస్ఫరస్ బాంబులు: భారీగా ఫాస్ఫరస్ పొగను విడుదల చేస్తాయి. ఈ రసాయనం గాల్లో విడుదలైనప్పుడు ప్రకాశవంతంగా మండుతుంది. దీనివల్ల శత్రు టార్గెట్లను సులభంగా గుర్తించవచ్చు. అలాగే ఇవి పేలినప్పుడు దగ్గరలో ఉన్న జీవజాలం చర్మంపై బొబ్బలు వస్తాయి. 2. కింజల్ మిసైల్స్: ఇవి హైపర్సోనిక్ క్షిపణులు. మిగ్ విమానం నుంచి ప్రయోగిస్తారు. ధ్వని వేగానికి ఐదురెట్లు వేగంతో పయనిస్తాయి. 2వేల కిలోమీటర్ల పరిధిలో ప్రయోగించవచ్చు. 3. ఇస్కాండర్ మిసైల్: స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు. 500 కిలోమీటర్ల దూరంలో టార్గెట్‌ను కూడా ధ్వంసం చేయగలవు. ఉక్రెయిన్‌పై ఎక్కువగా రష్యా వీటినే ప్రయోగిస్తోంది. ఇవి బంకర్ బస్టర్లుగా, థర్మోబారిక్ బాంబుగా, ఈఎంపీగా ఉపయోగపడతాయి. 4. వాక్యూమ్ బాంబ్: థర్మోబారిక్ బాంబ్ అంటారు. అత్యంత ప్రమాదకరమైన బాంబులు. పేలినప్పుడు భారీ విధ్వంసాన్ని సృష్టిస్తాయి. ప్రయోగప్రాంతంలో ఆక్సిజన్‌ను పీల్చుకొని అత్యంత పెద్ద పేలుడును ఉత్పత్తి చేస్తాయి. 5. క్లస్టర్ బాంబు: ఉక్రెయిన్ స్కూల్‌పై రష్యా ప్రయోగించిందన్న ఆరోపణలున్నాయి. పేలినప్పుడు చిన్న బాంబ్లెట్స్గా మారి చుట్టుపక్కలున్నవారిని గాయపరుస్తాయి. సిరియాలో కూడా రష్యా వీటిని వాడిందన్న విమర్శలున్నాయి. 6. బాంబర్ ప్లేన్స్: ఉక్రెయిన్ ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేయడానికి ఉపయోగించారు. వీటి నుంచి మిసైల్స్‌ను, క్లస్టర్ బాంబులను ప్రయోగించవచ్చు. ఉక్రెయిన్ వాడుతున్నవి: 1. జావెలిన్ మిసైల్: ఉక్రెయిన్ వాడుతోంది. యూఎస్ తయారీ. రష్యా మిలటరీ వాహనాలను హడలుగొడుతున్నాయి. ప్రయోగించిన తర్వాత వాటంతటవే టార్గెట్‌ను ఎంచుకోవడం వీటి ప్రత్యేకత. 2. టీబీ2 డ్రోన్: దీన్ని కూడా ఉక్రెయిన్ విరివిగా వాడుతోంది. టర్కీ తయారీ. 27 గంటల పాటు గాల్లో ఉండగలవు. 3. ఎన్ఎల్ఏడబ్ల్యూ: స్వల్ప దూరంలో లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. ఒక్కరే ఆపరేట్ చేయవచ్చు. ఒక్క షాట్‌తో ట్యాంకును మట్టికరిపిస్తుంది. 4. స్టింగర్ మిసైల్: ఉక్రెయిన్‌కు యూఎస్ సరఫరా చేసింది. భూమి మీద నుంచి గాల్లోకి ప్రయోగిస్తారు. వీటివల్లనే రష్యా వైమానిక దళం ఆధిపత్యం ప్రదర్శించలేకపోతోంది. పలు రష్యన్ హెలికాప్టర్లను ఈ క్షిపణులు కూల్చివేశాయి. – నేషనల్ డెస్క్, సాక్షి. -
మాకు మరింత ఆయుధ సంపత్తిని ఇవ్వండి! జెలెన్ స్కీ విజ్ఞప్తి
Russian Phosphorus Bombs Were Used: ఉక్రెయిన్ పై రష్యా నిరవధికంగా గత మూడు వారాలకు పైగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. రష్యా ప్రపంచ దేశాల ఆంక్షలను, అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఖతరు చేయకుండా మరింతగా బాంబుల వర్షంతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఫాస్ఫరస్ వంటి ప్రమాదకరమైన బాంబులతో మరింతగా విరుచుకుపడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ ఆవేదనగా చెప్పారు. మళ్లీ ఈ భయానక విధ్వంసంలో పెద్ద ఎత్తున్న పిల్లలు, పెద్దలు మృతి చెందారని అన్నారు. పైగా రష్యా తన భయంకరమై ఆయుధ సంపత్తితో ఎలాంటి ఆంక్షలు లేకుండా యథేచ్ఛగా దాడి చేస్తోందని తెలిపారు. అందువల్ల తమకు విస్తృత ఆయుధ సాయాన్ని అందించాలని నాటోని కోరారు. ఉక్రెయిన్‌లోని నగరాలను ప్రజలను రక్షించుకునేందకు ఉక్రెయిన్‌కి ఆంక్షలు లేని సైనిక సహాయం అవసరం అని నొక్కి చెప్పారు. ఇంతవరకు ఆయుధ సామాగ్రిని సమకూర్చిన పాశ్చాత్య సైనిక కూటమి సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ ...మీ యుద్ధ విమానాల్లో ఒక శాతం మాకు ఇవ్వండి. మీ ట్యాంకులలో ఒక శాతం ఇవ్వడం అని కోరారు. అంతేగాక రష్యా తమ దేశంలో ఫాస్ఫరస్ ఆయుధాలతో మోహరించిందని చెప్పారు. రష్యన్ దాడులను ఎదుర్కొనేలా దురాక్రమణకు గురికాకుండా తమ దేశాన్ని రక్షించుకునేందుకు విస్తృతమైన ఆయుధ సాయాన్ని అందించి ఉక్రెనియన్ల మరణాన్ని నిరోధించాలని నాటోకి విజ్ఞప్తి చేశారు. (చదవండి: భారత్ ఆ నిర్ణయం తీసుకుంటే...నేను సంతోషకరమైన రాయబారిని అవుతా!) -
Ukraine Russia War: మరో 10 రోజుల్లో... రష్యా ఖల్లాస్!
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలు పెట్టి మూడు వారాలు గడుస్తోంది. యుద్ధ వ్యయం ఇప్పటికే తడిసి మోపెడవుతోంది. ఈ భారానికి ప్రపంచ దేశాల ఆంక్షలు తోడై ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దిశగా వెళ్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై దండయాత్రలో పాల్గొంటున్న రష్యా సైనికులు కూడా ఆత్మ స్థైర్యం కోల్పోయి అసహనంలోకి కూరుకుపోతున్నారు. భీకరమైన దాడుల నేపథ్యంలో రష్యా వనరులు క్రమంగా కరిగిపోతున్నాయా? వీటన్నింటికీ మించి... యుద్ధమిలాగే కొనసాగితే మరో పది రోజుల్లో రష్యా ఆయుధ భాండాగారం ఖాళీ అయిపోనుందా? అవుననే అంటున్నారు అమెరికా సైనిక నిపుణులు... – మాస్కో/కీవ్ ఉక్రెయిన్‌పై రష్యా ఇప్పటివరకు ఎన్నో ప్రమాదకరమైన ఆయుధాల్ని వాడింది. క్లస్టర్ బాంబులు, వాక్యూమ్ బాంబులు కూడా ప్రయోగించింది. అయినా ఉక్రెయిన్ ఇప్పటికీ శక్తికి మించి పోరాడుతూనే ఉంది. ఈ స్థాయి ప్రతిఘటన రష్యా ఊహించనిదే. ఈ నేపథ్యంలో, రష్యా దగ్గరున్న ఆయుధాలు మరో పది రోజులు, మహా అయితే రెండు వారాల కంటే సరిపోకపోవచ్చని అమెరికా లెఫ్ట్‌నెంట్ జనరల్ బెన్ హోడ్జెస్ అంటున్నారు. ఆ తర్వాత దాడి చేయడానికి చెప్పుకోదగ్గ ఆయుధాలంటూ ఏమీ మిగలకపోవచ్చన్నారు. దీనికి తోడు రష్యా సైనికులు కూడా బాగా అలిసిపోయారని విశ్లేషించారు. చైనాను రష్యా సాయుధ సాయం అర్థిస్తోందన్న వార్తలు ఇందుకు బలం చేకూర్చేవేనంటున్నారు. డ్రోన్లతో రష్యాకు చెక్ ఉక్రెయిన్‌పైకి రష్యా వందలాది 9కె720 ఇస్కాండర్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. 500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఈ శక్తిమంతమైన క్షిపణులతో ఇళ్లు, ఆస్పత్రులు, పాఠశాలలపై ప్రయోగించి ధ్వంస రచన సాగించింది. 3ఎం–14 కాలిబర్ ఉపరితల దాడికి వినియోగించే క్రూయిజ్ క్షిపణిని కూడా ప్రయోగించింది. ఏకంగా 2,500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణుల్ని భారీగా వాడుతోంది. 6 కి.మీ. దూరంలో ఏమున్నా సర్వనాశనం చేసే టీఒఎస్–1 బురాటినో హెవీ ఫ్లేమ్ థ్రోయర్ అనే ప్రాణాంతక ఆయుధ వ్యవస్థనూ రంగంలోకి దించింది. ఇక టి–90, టి–72 బీఎం3 యుద్ధ ట్యాంకులు సరేసరి. కానీ రష్యా దాడుల్ని ఉక్రెయిన్ అనూహ్యంగా డ్రోన్లతో సమర్థంగా అడ్డుకుంటోంది. టర్కీ తయారీ టీబీ2 డ్రోన్లను విస్తృతంగా వినియోగిస్తోంది. భూ ఉపరితలం మీదుగా రష్యా సైనికుల ఆనవాళ్లు గుర్తించి అడ్డుకుంటోంది. ‘‘మా సైన్యం అపారమైన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తోంది. చెచెన్యాలో ఏళ్ల తరబడి రెండు యుద్ధాలు చేసిన దాని కంటే ఈ 20 రోజుల యుద్ధంలో రష్యా ఎక్కువగా నష్టపోయింది’’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. తమపై రష్యా భూతల యుద్ధం దాదాపుగా ముగిసినట్టేనన్నారు. 15 వేల మందికి పైగా మృతి ? రష్యా సైనికుల మృతిపైనా రకరకాల లెక్కలు ప్రచారంలో ఉన్నాయి. 5 వేల నుంచి 9 వేల మంది రష్యా సైనికులు మరణించారని అమెరికా లెక్కలు వేస్తుంటే, 15 వేల మందికి పైగా ప్రాణాలు తీశామని ఉక్రెయిన్ చెబుతోంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో పలు ప్రాంతాల్లో లక్షన్నర సైన్యాన్ని యుద్ధానికి చాలా ముందునుంచే రష్యా మోహరించడం తెలిసిందే. కానీ యుద్ధానికి వారిని ముందస్తుగా పూర్తిస్థాయిలో సిద్ధం చేయపోవడంతో సైనికుల్లో అసహనం అంతకంతకు పెరిగిపోతోంది. ఉక్రెయిన్‌లో విపరీతమైన చలి, ఆహారం, అత్యవసరాల లేమి తదితరాలు వారి పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. మే కల్లా యుద్ధం సమాప్తం! రష్యా వనరులన్నీ కరిగిపోతున్నందున తమతో సంధి మినహా మరో మార్గం లేదని ఉక్రెయిన్ ధీమాగా ఉంది. ‘మే తర్వాత యుద్ధం చేయడానికి రష్యా దగ్గర ఏమీ మిగలదు. రెండు మూడు రోజుల నుంచి వారం లోపు మాతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటుంది’ అని అంటోంది. దీన్ని రష్యా కొట్టిపారేస్తోంది. త్వరలో లక్ష్యాన్ని చేరుకుంటామని అధ్యక్షుడు పుతిన్ వ్యక్తిగత భద్రతా ఇన్చార్జి విక్టర్ జోలోటోవ్ అన్నారు. యుద్ధంలో ఇప్పటిదాకా రష్యాకు సాయుధ నష్టం (ఉక్రెయిన్ వెల్లడించిన మేరకు...) యుద్ధ ట్యాంకులు - 404 సాయుధ వాహనాలు - 1279 యుద్ధ విమానాలు - 81 హెలికాప్టర్లు - 95 శతఘ్నలు - 140 రాకెట్ లాంచర్లు - 64 డ్రోన్లు - 9 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వెపన్స్ - 36 నౌకలు - 3 -
శత్రువుని సైలెంట్‌గా లేపేసే అస్త్రం!...ఒక్క బాంబు, బుల్లెట్ పేలకుండానే అయిపోతుంది
Biological weapons in the Ukraine war: జీవాయుధాలనగానే జేమ్స్‌బాండ్ సినిమా నుంచి దశావతారం సినిమా వరకు కళ్లముందు కదలాడతాయి. ఒక్క బుల్లెట్ పేలకుండా, ఒక్క బాంబు పేలకుండా శత్రు దేశాన్ని, ముఖ్యంగా శత్రుదేశంలోని మనుషులందరినీ సైలెంట్‌గా లేపేయడానికి వీటిని విలన్లు వాడుతుంటారు. అయితే సినిమాల్లో కన్నా నిజజీవితంలో వీటి వాడకం అత్యంత విలయాన్ని సృష్టిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి సూక్ష్మజీవులు లేదా కీటకాలను కృత్రిమంగా వృద్ధి చేసి వాటిలో హానికారక లక్షణాలను పెంపొందించి శత్రువులపై ప్రయోగిస్తారు. వీటినే జీవాయుధాలంటారు. వీటి ప్రయోగంతో శత్రుప్రాంతంలో కావాల్సిన జీవజాతిని టార్గెట్ చేసుకొని నాశనం చేయవచ్చు. ఇలా చేసే యుద్ధాన్నే బయోలాజికల్ వార్ఫేర్ లేదా జీవాయుధ యుద్ధం అంటారు. ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో జీవాయుధాల ప్రయోగ అవకాశాలున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా ఒక ప్రమాదకరమైన ల్యాబ్‌లో జీవాయుధాలు సృష్టిస్తోందని అమెరికా ఆరోపిస్తోంటే, అమెరికానే ఉక్రెయిన్‌లో రహస్యంగా బయోవెపన్స్ తయారు చేస్తోందని రష్యా ప్రత్యారోపణ చేస్తోంది. తాజాగా ఐరాసలో అమెరికా రాయబారి మాట్లాడుతూ ఉక్రెయిన్‌పై రష్యా జీవాయుధాలు ప్రయోగించే అవకాశం ఉందని చెప్పడంతో అందరి దృష్టి ఈ ల్యాబ్లపైకి మరలింది. అటు ఉక్రెయిన్ తరఫున అమెరికా కానీ, ఇటు రష్యా కానీ జీవాయుధాలు ప్రయోగిస్తాయన్న భయాలు ఒక్కమారుగా పెరిగాయి. వెక్టార్ ల్యాబ్ ద స్టేట్ సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ... పేరు వినగానే ఏదో పేద్ద పరిశోధనా శాల అనుకుంటారు. కానీ ఇది పుతిన్ బయోవెపన్స్ ఖజానా అని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. సైబీరియాలో ఉన్న ఈ జీవాయుధశాల జగత్ ప్రసిద్ధం. ఇందులో స్మాల్‌పాక్స్ నుంచి ఆంత్రాక్స్ వరకు పలురకాల వైరస్‌లను జాగ్రత్తగా నిల్వ ఉంచారు. దీని చుట్టూ కట్టుదిట్టమైన కాపలా ఉంటుంది. 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బిల్డింగ్‌ను రష్యన్లు వెక్టర్ ఇనిస్టిట్యూట్ అని పిలుచుకుంటారు. ప్రపంచంలోని సుప్రసిద్ధమైన, అత్యంత భద్రతాయుక్తమైన 59 బయోలాబ్స్లో ఇది ఒకటి (కరోనాతో సంబంధమున్న వూహాన్ ల్యాబ్ వీటిలో ఒకటి). ఇందులో మానవాళికి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లను నిల్వ చేసి పరిశీలించేందుకు అనుమతులున్నాయి. రష్యా 1992 తర్వాత దేశంలోని బయోవెపన్ ల్యాబ్స్‌ను మూసివేస్తూ వచ్చింది. ఈ క్రమంలో దీన్ని కూడా మూసివేస్తామని గతంలోనే రష్యా ప్రకటించింది. ప్రస్తుతం దీంట్లో కేవలం వ్యాక్సిన్లను మాత్రమే తయారు చేస్తున్నట్లు రష్యా చెబుతుంది. కానీ ఇందులో జీవహననానికి అవసరమైన బయో వెపన్ ప్రోగ్రామ్‌ను రష్యా నిర్వహిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. దీన్ని వెంటనే మూసివేయాలని పలుమార్లు అమెరికా డిమాండ్ చేసింది. అయితే జీవాయుధాల తయారీ అమెరికానే చేస్తోందని, ఉక్రెయిన్‌లో అమెరికా రహస్య ల్యాబులు నెలకొల్పిందని రష్యా ఆరోపించింది. అయితే ఉక్రెయిన్‌లోని ల్యాబులు కేవలం బయోవెపన్లను గుర్తించి నిరోధించేపని మాత్రమే చేస్తాయని అమెరికా వివరిస్తోంది. ఏమున్నాయి? వెక్టర్ ల్యాబ్‌లో స్మాల్‌పాక్స్ వైరస్‌తో పాటు మార్బర్గ్ వైరస్ కూడా ఉంది. ఇది సోకిన వారిలో 88 శాతం మంది మృత్యువాత పడతారు. అలాగే ఇందులో ఎబోలా వైరస్ కూడా నిల్వ ఉంచారు. గతంలో ఈ సంస్థకు అధిపతిగా ఉన్న ప్రొఫెసర్ డ్రొజ్డోవ్ 2017లో అదృశ్యమయ్యాడు. అతని వద్ద ఈ ల్యాబ్‌కు, ఇందులోని ఆయుధాలకు సంబంధించిన అనేక వివరాలున్నాయని అనుమానం. కానీ ఇంతవరకు అతని ఆచూకీ తెలియరాలేదు. 2019లో ఈ ల్యాబ్‌లో గ్యాస్ సిలెండర్ పేలుడు సంభవించింది. అప్పుడు చెలరేగిన మంటలనార్పేందుకు చాలా సమయం పట్టింది. ఆ సమయంలో ల్యాబ్ నుంచి ఎలాంటి జీవాయుధ రసాయనాలు విడుదల కాలేదని అధికారులు చెప్పారు. తమ ల్యాబులో కేవలం ప్రాణాంతక వ్యాధులకు యాంటీడోసులను తయారు చేయడం మాత్రమే జరుగుతుందని చెప్పారు. బీడబ్ల్యూసీ ఏం చెబుతోంది జీవాయుధాల ప్రయోగాన్ని నిషేధించే ఉద్దేశంతో ప్రపంచ దేశాలు ద బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ (బీడబ్ల్యూసీ)ని రూపొందించుకున్నాయి. దీని ప్రకారం ఏ దేశం కూడా జీవాయుధాలను తయారు చేయడం, నిల్వ చేయడం నిషిద్ధం. 1975లో అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందంపై 2022 నాటికి 183 దేశాలు సంతకాలు చేశాయి. పది దేశాలు మాత్రం దీనిపై సంతకాలు చేయలేదు. సంతకాలు చేసిన దేశాల్లో యూఎస్, రష్యా కూడా ఉన్నాయి. ఈ ఒప్పందంలోని 1, 2 అధికరణల్లోని అంశాలను రష్యా ఉల్లంఘిస్తోందని అమెరికా ఆరోపణ. నిజానికి ఈ ఒప్పందానికి అనుగుణంగానే రష్యా అధికారికంగా తన బయోవెపన్ ల్యాబులను మూసివేసింది. ప్రస్తుతం ఈ వెక్టర్ ల్యాబ్‌లో 1500మంది సిబ్బంది ఉన్నారు. అలాగే ప్రపంచంలో స్మాల్‌పాక్స్ వైరస్‌ను నిల్వ ఉంచేందుకు అనుమతులున్న రెండు కేంద్రాల్లో వెక్టర్ కేంద్రం ఒకటి. రెండో కేంద్రం అమెరికాలోని సీడీసీ సంస్థ. వీటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తుంటారు. (చదవండి: రష్యా అణు చెలగాటం) -
Vladimir Putin: రష్యాకి ఎక్కడిదీ బరి తెగింపు!.. వాటిని చూసుకొనేనా..?
అగ్రరాజ్యం అమెరికా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నా, దీటుగా ప్రతిదాడి ఉంటుందని నాటో స్పష్టం చేసినా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లక్ష్య పెట్టకుండా ఉక్రెయిన్‌పై పంజా విసిరారు. సైనిక చర్యకు దిగారు. పాశ్చాత్యదేశాల నుంచి ఎంతగా ఒత్తిడి వచ్చినా.. పెడచెవిన పెడుతూ తాను అనుకున్నది చేసేసే మొండి ధైర్యం, పట్టుదల... రష్యా అధ్యక్షుడికి ఎక్కడి నుంచి వచ్చాయి. ఆయన లెక్కలు, సమీకరణాలు ఎలా ఉన్నాయి. ఎవరి అండ ఉందనే భరోసాతో పుతిన్ ఈ సాహసానికి ఒడిగట్టారో చూద్దాం.. ‘రిస్క్’తో కూడిన నిర్ణయం తూర్పు ఉక్రెయిన్‌లో నివసిస్తున్న సాధారణ పౌరులు, రష్యన్లను రక్షించడానికి సైనిక చర్య తప్పలేదని పుతిన్ దాడికి దిగేముందు పేర్కొన్నారు. ఎవరైనా ఈ యుద్ధంలో జోక్యం చేసుకంటే ఇదివరకెన్నడూ చూడనంతటి తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని గట్టి హెచ్చరికలు జారీచేశారు. అమెరికా, బ్రిటన్లు బ్యాంకుల లావాదేవీలపై నిషేధం విధించడం, రష్యా చమురు దిగ్గజాలుగా పేరొందిన వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం తదితర ఆర్థికపరమైన ఆంక్షలకు దిగాయి. ఆర్థిక నిల్వలు వేగంగా ఆవిరి నాలుగైదు నెలలుగా యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉండటం ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూసింది. రాజధాని కీవ్‌లో వివిధ దేశాల రాయబార కార్యాలయాలు ఒక్కొక్కటిగా మూతపడుతూ పోయాయి. కొద్ది వారాల వ్యవధిలో వందలాది మిలియన్ డాలర్ల పెట్టుబడులు వెనక్కుమళ్లాయి. ఆర్థిక వ్యవస్థను అష్టదిగ్బంధన చేయడం ఉక్రెయిన్ను దారికి తేవాలనేది క్రెమ్లిన్ ఎత్తుగడ. దీన్నే ఉక్రెయిన్ ‘హైబ్రిడ్ యుద్ధ తంత్రం’గా అభివర్ణించింది. చెదలు పట్టినట్లుగా దేశ ఆర్థిక వ్యవస్థను లోపలి నుంచి తినేయడమే పుతిన్ లక్ష్యమని విమర్శించింది. చదవండి: (Russia vs Ukraine: బాహుబలితో తలపడగలదా?) పుతిన్ ముఖ్యంగా మూడు అంశాలను బలంగా నమ్ముకున్నారు. అవి.. 1. శరవేగంగా పతనమవుతున్న ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి. 2. రష్యా వద్ద ఉన్న భారీ ఆయుధ సంపత్తి. 3. చైనా అండగా నిలవడం. ఆర్థికంగా దెబ్బతీయాలనే లక్ష్యంతో ఉక్రెయిన్ మీదుగా వెళుతున్న చమురు నౌకలను (ఎగుమతులను) నిలిపివేయడం, పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరాను ఆపేయడంతో ట్రాన్సిట్ చార్జీలుగా వసూలయ్యే వందలాది బిలియన్ల డాలర్లు రాలేదు. ఫలితంగా గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా ఉక్రెయిన్ కరెన్సీ విలువపడిపోయింది. ఒకవైపు యుద్ధానికి కాలుదువ్వుతూనే.. మరోవైపు ఉక్రెయిన్ ఆర్థికరంగాన్ని పిండివేసే ప్రయత్నం చేసింది రష్యా. ఉక్రెయిన్ గ్యాస్ సరఫరా కూడా ఎన్నడూ లేనంతగా పడిపోయింది. ఉక్రెయిన్‌కు అండగా నిలబడి ప్రత్యక్ష యుద్ధాన్ని అమెరికా లేదా నాటో దేశాలు కోరుకోవనే గట్టి నమ్మకంతో పుతిన్ పావులు కదుపుతున్నారు. చదవండి: (Russia Ukraine War Effect: ప్రపంచం చెరి సగం.. భారత్ ఎందుకు తటస్థం?) సమృద్ధిగా విదేశీ మారకద్రవ్య నిలువలు సాధారణంగా ఆర్థిక ఆంక్షలు పెడితే.. ఆయా దేశాల్లోకి వచ్చే డాలర్లు, ఇతర విదేశీ మారకద్రవ్యం నిలిచిపోతుంది. రిజర్వు నిధుల్లోనుంచి వాడి తాత్కాలికంగా నెట్టుకొచ్చినా.. దీర్ఘకాలంగా ఆంక్షల చట్రంలో ఉంటే దిగుమతులకు డబ్బులు చెల్లించలేక అవస్థపడాల్సి వస్తుంది. రష్యా విదేశీ మారకద్రవ్య నిల్వలు గత ఏడాది డిసెంబర్ నాటికి రికార్డు స్థాయిలో 6.3 లక్షల మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కాబట్టి ఆర్థికంగా దిగ్బంధించినా రష్యాకు తక్షణం వచ్చే ముప్పేమీ లేదు. మరోవైపు రష్యా– చైనాల మధ్య ఇటీవలి కాలంలో మరింత సన్నిహితమవుతున్నాయి. ప్రపంచ శక్తుల పునరేకీకరణ జరుగుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా, యూఎస్, యూకేల మధ్య ఇటీవల ఆకస్ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ప్రాంతీయంగా బలాలను సరిచేయాలనే ఉద్దేశంతో చైనా.. రష్యాకు దగ్గరవుతోంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
Russia vs Ukraine: బాహుబలితో తలపడగలదా?
Military Strengths of Russia and Ukraine, Compared: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక బలం కలిగిన దేశాల్లో ఒకటైన రష్యా ముందు ఉక్రెయిన్ నిలబడడమే కష్టం. రెండు దేశాల మిలటరీ బలాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. రష్యా బాహుబలి అయితే, దాని ముందు ఉక్రెయిన్ ఒక మరుగుజ్జు కిందే లెక్క. 2014లో రష్యా క్రిమియాని ఆక్రమించుకున్నప్పటితో పోల్చి చూస్తే ఉక్రెయిన్ మిలటరీ బాగా బలపడింది. సైన్యం బాగా శిక్షణ పొంది గట్టి పోరాట పటిమను ప్రదర్శిస్తోంది. గత కొద్ది వారాలుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ సైన్యాన్ని మూడు వైపుల నుంచి మోహరించారు. క్షిపణి వ్యవస్థలో ప్రపంచంలోనే రష్యా కింగ్. ఉక్రెయిన్ రక్షణ స్థావరాలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే క్షిపణులు రష్యా దగ్గర ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆయుధ మార్కెట్‌ను పరిశీలించే స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) గణాంకాల ప్రకారం రక్షణ బడ్జెట్‌పై ఉక్రెయిన్ వ్యయంతో పోల్చి చూస్తే రష్యా 10 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తోంది. 2020లో రష్యా రక్షణ రంగంపై 6,170 కోట్ల డాలర్లు ఖర్చు పెడితే, ఉక్రెయిన్ 590 కోట్ల డాలర్లు వెచ్చించింది. ప్రపంచ దేశాల సైనిక బలాబలాలను విశ్లేషించే గ్లోబల్ ఫైర్ పవర్ ప్రకారం మిలటరీ పవర్లో 140 దేశాల్లో రష్యాది రెండో స్థానమైతే, ఉక్రెయిన్ 22వ స్థానంలో ఉంది. యుద్ధ భయంతో ఉక్రెయిన్ ప్రధాని జెలెన్స్కీ ఈ మధ్య కాలంలో మిలటరీ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకున్నారు. ఉక్రెయిన్ సైనిక సిబ్బందిని 3,61,00కి పెంచారు. చదవండి: ('ఇది వినాశనానికే.. రష్యాకు ఏ మాత్రమూ మేలు చేయదు') ఉక్రెయిన్‌కి పశ్చిమ దేశాల అండ ఇలా.. పశ్చిమాది దేశాలు రష్యాపై విమర్శలు గుప్పిస్తూ ఉక్రెయిన్‌కి అండగా ఉంటామని చెబుతున్నాయి. అయితే ఉక్రెయిన్ ఆయుధాలతో పాటుగా సైనిక బలగాలను ఇతర దేశాల నుంచి ఆశిస్తోంది. అమెరికా 2014 నుంచి ఉక్రెయిన్ మిలటరీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సహకారం అందిస్తూ వస్తోంది. 250 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం ఇప్పటివరకు చేసింది. గత డిసెంబర్ నుంచి జావెలిన్ యాంటీ ట్యాంకు క్షిపణులు, నిఘా నౌకలు, హమ్వీస్, స్నిపర్ రైఫిల్స్, డ్రోన్లు, రాడార్ వ్యవస్థ, నైట్ విజన్, రేడియో పరికరాలు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిస్సైల్స్ , ఆయుధాలు, మరబోట్లు వంటివి సరఫరా చేసింది. ప్రస్తుతం తమ దేశం నుంచి ఎలాంటి బలగాలు పంపించబోమని అమెరికా స్పష్టం చేసింది. గత మూడు నెలల్లో దాదాపుగా 90 టన్నుల ఆయుధాలను అమెరికా పంపింది. దీంతో ఉక్రెయిన్ దగ్గరున్న మిలటరీ ఆయుధాలు 1300 టన్నులకు చేరుకున్నాయి. బ్రిటన్ 2,000 షార్ట్ రేంజ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్స్‌ని పంపడంతో పాటు వాటిని వినియోగించడంలో శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక నిపుణుల్ని కూడా పంపించింది. టర్కీ బేరట్కార్ టీబీ2 డ్రోన్లను విక్రయించింది. ఎస్టోనియా జావెలిన్ యాంటీ ఆర్మర్ క్షిపణులు, లుథానియా స్ట్రింగర్ క్షిపణులు, చెక్ రిపబ్లిక్ 152ఎంఎం ఫిరంగులు పంపించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. జర్మనీ ఆయుధాలు సరఫరా చేయడానికి నిరాకరించినప్పటికీ, యుద్ధభూమిలో ఆస్పత్రులు, ఇతర శిక్షణ కోసం 60 లక్షల డాలర్ల ఆర్థిక సాయం చేయడానికి అంగీకరించింది. చదవండి: (Russia- Ukraine war: తెల్లవారుతూనే నిప్పుల వాన) -
కశ్మీర్ సరిహద్దుల్లో ఆయుధాలు జారవిడిచిన డ్రోన్
జమ్మూ: కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో డ్రోన్ జారవిడిచిన ఆయుధాలను సకాలంలో భద్రతా బలగాలు గుర్తించడంతో లష్కరే తోయిబా కుట్ర భగ్నమైంది. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, ది రెసిస్టాన్స్ ఫోర్స్(టీఆర్ఎఫ్)అనే ఉగ్రసంస్థలు పంపిన ఆయుధాలతో సరిహద్దులకు సమీపంలో డ్రోన్ సంచరిస్తోందన్న సమాచారం మేరకు బలగాలు గాలింపు చేపట్టాయి. జమ్మూ జిల్లా ఆర్‌ఎస్‌పురా–ఆర్నియా ప్రాంతంలోని ట్రెవా గ్రామం సమీపంలో భద్రతా బలగాలకు ఒక పిస్టల్, రెండు మ్యాగజీన్లు, మూడు ఐఈడీలు, మూడు బాటిళ్ల పేలుడు పదార్థాలు తదితరాలు లభ్యమయ్యాయి. సరిహద్దు అవతల నుంచి వచ్చిన డ్రోన్ వీటిని అక్కడ జారవిడిచి వెళ్లినట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. చదవండి: ('ఇది వినాశనానికే.. రష్యాకు ఏ మాత్రమూ మేలు చేయదు') -
రష్యా అణు విన్యాసాలు
మాస్కో: యూరప్‌లో కాస్త చల్లారాయనుకుంటున్న యుద్ధ భయాలను, ఉద్రిక్తతలను రష్యా మళ్లీ పెంచేస్తోంది. తమ బలగాల సన్నద్ధతను, అణు, సంప్రదాయ ఆయుధాలను పరీక్షించుకునేందుకు శనివారం భారీ సాయుధ కసరత్తుకు దిగుతున్నట్టు రష్యా సైన్యం పేర్కొంది. అణు వార్హెడ్లను మోసుకెళ్లగల ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లు, క్రూయిజ్ మిసైళ్లతో పాటు పూర్తిస్థాయి సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ జరిగే ఈ విన్యాసాలను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారని రక్షణ శాఖ పేర్కొంది. యుద్ధమే జరిగితే వినాశనానికే దారితీస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ శుక్రవారం హెచ్చరించారు. మరోవైపు నాటో సభ్య దేశాల రక్షణ మంత్రులు బ్రెసెల్స్‌లో సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు. రష్యాలో అమెరికా దౌత్యాధికారి బ్రాట్ గార్మన్ను రష్యా బహిష్కరించింది. తాము కూడా దీటుగా స్పందిస్తామని యూఎస్ చెప్పింది. తూర్పు ఉక్రెయిన్‌లో నానాటికీ పెరుగుతున్న కాల్పుల నేపథ్యంలో అక్కడి వేర్పాటువాద ప్రభుత్వం స్థానికులను రష్యాకు తరలిస్తోంది. -
ఇంకా యుద్ధ మేఘాలే
వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం తప్పదన్న వార్తల నడుమ నాటో ఆయుధాలు ఉక్రెయిన్‌కు భారీ సంఖ్యలో చేరుకుంటున్నాయి. రాజధాని కీవ్‌కు నాటో దేశాల నుంచి ఆయుధాల రాక ఆదివారం నుంచీ జోరందుకుంది. వైమానిక దాడులను తిప్పికొట్టడంతో కీలకమైన యూఎస్ తయారీ స్టింగర్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్స్, సంబంధిత సామగ్రి కూడా నాటో సభ్య దేశం లిథువేనియా నుంచి కీవ్ చేరింది. రష్యా దూకుడును సమర్థంగా అడ్డుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సోమవారం అన్నారు. రష్యా ఆక్రమిత క్రిమియా సరిహద్దుల సమీపంలో ఉక్రెయిన్ దళాల కవాతులో ఆయన సోమవారం సైనిక దుస్తుల్లో పాల్గొన్నారు. తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఆయన గంటపాటు ఫోన్లో మాట్లాడారు. మరోవైపు రష్యా దళాలు ఉక్రెయిన్ను ఉత్తర, తూర్పు, దక్షిణ దిశల నుంచి చుట్టుముడుతున్నాయి. సరిహద్దుల్లో సైన్యం సంఖ్య కూడా లక్షన్నరను దాటిందని అమెరికా రక్షణ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం ఉక్రెయిన్ తలపెట్టిన సైనిక కవాతును లక్ష్యం చేసుకుని దాడికి రష్యా శ్రీకారం చుట్టొచ్చని అమెరికా, యూరప్ నిఘా వర్గాలంటున్నాయి. అయితే ‘‘దాడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయించుకున్నదీ లేనిదీ ఇప్పుడప్పుడే చెప్పలేం. యుద్ధమా, శాంతా, లేక ప్రతిష్టంభన ఇంకొంత కాలం ఇలాగే కొనసాగుతుందా అన్నది ఈ వారంలో తేలిపోతుంది’’ అని రక్షణ నిపుణులు అంటున్నారు. మిత్ర దేశమైన బెలారుస్‌లో రష్యా మోహరించిన భారీ సైన్యం పెద్ద ఎత్తున కవాతులు చేస్తోంది. ఈ దళాల కదలికలను బట్టి పుతిన్ ఉద్దేశాలు స్పష్టమవుతాయని అభిప్రాయపడుతున్నారు. అయితే, సంక్షోభ నివారణకు అమెరికా, యూరప్ దేశాలతో మరిన్ని చర్చలు జరపడం మేలని పుతిన్‌కు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ తాజాగా సూచించడం విశేషం! రష్యా ఉద్దేశాలకు ఇది ఒకరకంగా అద్దం పడుతోందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. యూఎస్ సంకేతాలు రష్యా బుధవారమే యుద్ధానికి దిగవచ్చని నిఘా సమాచారాన్ని ఉటంకిస్తూ బైడెన్ జాతీయ భద్రతా సలహాదారు సలివన్ జోస్యం చెప్పడం తెలిసిందే. దీన్ని నివారించేందుకు యూరప్ దేశాలు మరిన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ పుతిన్‌తో గత సోమవారం ఐదారు గంటలపాటు చర్చలు జరిపారు. సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షునితో చర్చించిన జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కుల్జ్ మంగళవారం పుతిన్‌తోనూ భేటీ కానున్నారు. యూరప్‌లో శాంతికి పెను ప్రమాదంలో పడిందని కీవ్ నుంచి ఆయన ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ నుంచి అమెరికా, పలు యూరప్ దేశాల దౌత్య సిబ్బంది ఉపసంహరణ ముమ్మరంగా సాగుతోంది. ఉక్రెయిన్, మాజీ సోవియట్ సభ్య దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వొద్దని రష్యా పట్టుబడుతుండటం తెలిసిందే. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను ఆపేయాలని, తూర్పు యూరప్ నుంచి నాటో దళాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తోంది. ఇందుకు యూఎస్ ససేమిరా అనడమే గాక యుద్ధానికి దిగితే ఆర్థిక ఆంక్షలతో పాటు తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని రష్యాను హెచ్చరిస్తోంది. అయితే యూరప్‌లో క్షిపణుల మోహరింపును, సైనిక కవాతును తగ్గించడం వంటి విశ్వాస కల్పన చర్యలకు సిద్ధమని యూఎస్ తాజాగా సంకేతాలిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షునికి ఇంటిపోరు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఇంటి పోరు ఎక్కువవుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనకు ప్రజాదరణ బాగా తగ్గిపోతోంది. మరోవైపు విపక్షాలు కూడా కత్తులు నూరుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని ఆయనను తొలగించి ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలను గద్దెనెక్కించాలని రష్యా ప్రయత్నిస్తున్నట్టు ఇంగ్లండ్ నిఘా వర్గాలు చెబుతున్నాయి. -
తుపాకులా.. పప్పుబెల్లాలా?!
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: పోలీస్ కార్యాలయంలో దాచిన ఆయుధాలను పట్టుకుపోయారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 582 పైచిలుకు ఆయుధాలను పంచేసుకున్నారు. ఈ పనిచేసింది ఎవరో దొంగలు కాదు.. ఏకంగా పోలీసులే. పోలీస్ అధికారులు స్థాయిని బట్టి ఇది నీకు.. అది నాకు.. అన్నట్టుగా తలా ఒకటి తీసేసుకున్నారు. విషయం బయటపడకుండా అంతా పక్కాగా టెండర్లు పిలిచినట్టు ఓ నాటకానికి తెరతీసి రక్తి కట్టించారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. 1969 నుంచి జిల్లా కేంద్రం కాకినాడ పోలీస్ కార్యాలయం ఆర్మర్డ్ రిజర్వులో భద్రపరిచిన 582 ఆయుధాలను నామ్‌కే వాస్తేగా వేలం వేసి పోలీస్ అధికారులు పంచేసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది. చట్ట విరుద్ధంగా ఆయుధాలను కలిగి ఉన్న వారి నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకులు, అలాగే లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న తుపాకులను తీసుకెళ్లకపోవడం.. వంటి వాటిని ఆర్మ్డ్ రిజర్వులో భద్రపరుస్తారు. డీజీ అనుమతితో వాటిని వేలం వేస్తుంటారు. అయితే వాటిని వేలం వేయాలంటే.. డీజీపీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. డీజీ కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. అనంతరం వేలం వేస్తున్నట్టుగా పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. ఇవన్నీ జరిగాక సీల్డ్ కమ్ ఓపెన్ టెండర్లు పిలవాలి. ఆయుధాలు ఎన్ని వేలం వేస్తున్నారు.. వాటి ఖరీదు ఎంత.. అనేది నిర్ధారించాక, నిర్దేశించిన తేదీన వేలం వేయాలి. అలాగే వేలంలో అత్యధికంగా కోడ్ చేసిన ఆయుధాలు కొనుగోలు, విక్రయ లైసెన్స్ కలిగిన వారి టెండర్‌ను ఖరారు చేయాలి. ఆ వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి. నిబంధనలకు పాతర నిబంధనలన్నింటికీ పోలీసులు పాతశారు. లైసెన్స్ ఉన్న ఓ కాంట్రాక్టర్‌తో కుమ్మక్కయ్యారు. 17 చలానాలు తీయించి నామ్‌కే వాస్తేగా టెండర్లు వేయించారు. హైదరాబాద్ అబిడ్స్‌కు చెందిన రాజధాని ఆరŠమ్స్ మేనేజింగ్ పార్టనర్ అఫ్జల్ పేరుతో 2021 ఏప్రిల్‌లో టెండర్ ఖరారు చేశారు. టెండర్లో రూ.8 లక్షలు వచ్చినట్టుగా రికార్డు చేసి ఖజానాలో జమ చేశారు. అసలు టెండర్లు పిలవకుండానే, ఆయుధాలకు ధర నిర్ణయించకుండానే రూ.8 లక్షలకు ఖరారు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఆ విధంగా రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకూ ఖజానాకు కన్నం వేశారు. ఇందులో అప్పటి పోలీస్ అధికారులు చక్రం తిప్పి ఆయుధాలను సొంతం చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. పోలీసులు పంచేసుకున్న వాటిలో ఫిస్టళ్లు, రివాల్వర్లు, ఎస్బీబీఎల్(సింగిల్ బ్యారెల్ బీచ్‌లోడెడ్), డీబీబీఎల్ (డబుల్ బ్యారెల్ బీచ్‌లోడెడ్) తుపాకులు, కార్బన్.. ఇలా పలు రకాల ఆయుధాలున్నాయి. వీటిలో రష్యా, బ్రెజిల్, బెల్జియం, యూఎస్ దేశాల్లో తయారైన అత్యంత ఆధునిక ఆయుధాలు చాలానే ఉన్నాయి. రూ.ఆరు లక్షలు, రూ.ఏడు లక్షల విలువైన ఆయుధాలూ కొన్ని ఉన్నాయి. అఫ్జల్‌తో మాట్లాడుకుని ఇవన్నీ కలిపి వేలం వేస్తున్నట్టు రికార్డులు సృష్టించి.. ఒక పోలీస్ అధికారి, స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన ఓ డీఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్.. ఇలా వివిధ స్థాయిల్లో పోలీసులు తమకు నచ్చినవి ఎత్తుకెళ్లిపోయారు. ఆ ఫిర్యాదుతో వెలుగులోకి.. గన్ లైసెన్సు రెన్యువల్ కోసం చేసుకున్న దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా తుపాకీ తిరిగి ఇవ్వడం లేదని అనపర్తికి చెందిన రెడ్డి అనే వ్యక్తి ఇటీవల జిల్లా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బెల్జియానికి చెందిన అత్యంత ఖరీదైన తుపాకీ కోసం అతను పదే పదే అడగడంతో ప్రస్తుత జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆరా తీస్తే.. ఈ ఆయుధాల కుంభకోణం బయటపడింది. వాస్తవంగా ఆయుధాలకు వేలం వేసే ముందు సీజ్ చేసిన ఆయుధాలు, లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తుచేసుకున్న వారికి కూడా నోటీసులివ్వాలి. అలా ఎవరికీ నోటీసులిచ్చిన దాఖలాలు లేకపోవడాన్ని గుర్తించారు. ఈ కుంభకోణంలో నిజాలు నిగ్గు తేల్చే దిశగా కాకినాడ స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆధారాలతో కాకినాడ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ ఫిర్యాదుతో ఆయుధాల మాయంపై కేసు నమోదైంది. లోతుగా విచారిస్తున్నాం.. ఆయుధాల టెండర్ల వ్యవహారం మా దృష్టికొచ్చింది. అన్ని విషయాలనూ లోతుగా విచారిస్తున్నాం. – ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఎస్పీ.. తూర్పుగోదావరి జిల్లా -
8వేల కోట్ల ఆయుధాల కొనుగోలుకు ఓకే
న్యూఢిల్లీ: దాదాపు రూ.8 వేల కోట్ల విలువైన తేలికపాటి బహుళ ప్రయోజన హెలికాప్టర్లు, సైనిక సంబంధ ఆయుధాలు, పరికరాల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదముద్ర వేసింది. ఆయుధాల సమీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు ఢిల్లీలో జరిగిన రక్షణ ఆయుధాలు, ఉపకరణాల కొనుగోలు మండలి(డీఏసీ) సమావేశంలో ఆమోదం పొందాయని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సైన్యం అవసరాల కోసం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 12 హెలికాప్టర్లను, నావికా దళం కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచి లైనెక్స్ నావల్ గన్‌ఫైర్ నియంత్రణ వ్యవస్థను కొనుగోలుచేయనున్నారు. నావికాదళ గస్తీ విమానాలైన డార్నియర్ ఎయిర్క్రాప్ట్లను హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌తో అప్‌గ్రేడ్ చేయించాలని డీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ‘‘స్వావలంభనతోనే ఆయుధాల సమీకరణలో ‘ఆత్మనిర్భర్’ సాధించే దిశగా ముందడుగు వేయాలని నిర్ణయించారు. ఇందులోభాగంగానే విదేశాల నుంచి నావికాదళ గన్స్ కొనుగోళ్లను అర్ధంతరంగా ఆపేశారు. అందుకు ప్రత్యామ్నాయంగా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(భెల్) నుంచి అప్‌గ్రేడెడ్ సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్(ఎస్ఆర్జీఎం)లను తెప్పించాలని సమావేశంలో నిర్ణయించారు’’ అని రక్షణశాఖ ప్రకటనలో పేర్కొంది. యుద్ధనౌక ముందుభాగంలో ఠీవీగా కనబడే ఎస్ఆర్జీఎంతో ఎదురుగా ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో చేధించవచ్చు. రూ.7,965 కోట్ల విలువైన ఆయుధసంపత్తి కొనుగోలు ప్రధానాంశంగా జరిగిన ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. త్రివిధ దళాల అత్యవసరాలు, నిర్వహణ, ఆధునీకరణ, నిధుల కేటాయింపుల అంశాలను సమావేశంలో చర్చించారు. సైన్యం అవసరాల కోసం సమకూర్చుకోనున్న ఆయుధాలు, ఉపకరణాల డిజైన్, ఆధునికీకరణ, తయారీ మొత్తం ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో కొనసాగాలని సమావేశంలో నిర్ణయించారు. ఇటీవల కాలంలో తూర్పు లద్దాఖ్‌లో చైనా సైనికులతో ఘర్షణల తర్వాత భారత సైన్యం కోసం అధునాతన ఆయుధాల సమీకరణ జరిగింది. -
పాక్ జిమ్మిక్కు.. తాలిబన్లకే టోకరా!
‘రండి అన్న రండి.. మేడిన్ అమెరికా గన్లు ఉన్నాయి. బుల్లెట్ల దగ్గరి నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల దాకా అన్నీ సరసమైన ధరలకే అమ్ముతున్నాం’ (తెలుగీకరించాం) అంటూ పాకిస్థాన్ మార్కెట్లలో ఇప్పుడు కోలాహలం కనిపిస్తోంది. ఈ అత్యాధునిక ఆయుధాలన్నీ అమెరికా అఫ్గనిస్తాన్ నుంచి పోతూ పోతూ వదిలేసి పోయినవే కావడం విశేషం!. కరాచీ, లాహోర్, పెషావర్, గుజ్రన్‌వాలా.. పాకిస్థాన్ గన్మార్కెట్లలో అమెరికాకు చెందిన అడ్వాన్స్డ్ వెపన్స్ కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ ప్రముఖ మీడియాహౌజ్ కథనం ప్రకారం.. అక్కడి మార్కెట్లలో వీటి అమ్మకాలు తారాస్థాయిలో నడుస్తున్నాయి. ‘‘తాలిబన్లు మేమూ భాయి భాయిలం. వాళ్ల దగ్గరి నుంచి వీటిని కొనుగోలు చేయడాన్ని, మా దేశంలో పౌరులకు అమ్ముకోవడాన్ని మేం గర్వంగా భావిస్తున్నాం’’ అంటూ అక్కడి అమ్మకందారులు చెప్తున్నారు. అడ్వాన్స్డ్ పిస్టోల్స్, రైఫిల్స్, గ్రెనేడ్స్, నైట్ విజన్ గగూల్స్, బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్లు, స్పై కెమెరాలు, నార్మల టేజర్ గన్స్, టేజర్ స్టిక్స్, ఇతరత్ర మారణాయుధాలు పాక్ గన్ మార్కెట్లలో జోరుగా అమ్ముడుపోతున్నాయి. ప్రతీకాత్మక చిత్రం తాలిబన్ల ఖండన.. అయితే ఈ కథనాలను తాలిబన్లు ఖండిస్తున్నారు. తాలిబన్(Islamic Emirate of Afghanistan) ప్రతినిధి బిలాల్ కరిమి పేరిట న్యూయార్క్ టైమ్స్‌లో తాజాగా ఓ కథనం ప్రచురితమైంది. ‘‘ఆ కథనాల్ని మేం ఖండిస్తున్నాం. ఆయుధాల విషయంలో మేమేం అంత నిర్లక్క్ష్యంగా లేము. అక్రమ రవాణా కాదుకదా.. కనీసం సింగిల్ బుల్లెట్‌ను మేం బయటవాళ్లకు అమ్ముకోలేదు’’ అని కరిమి తెలిపాడు. అమెరికన్లు వదిలేసిన వెళ్లిన ప్రతీ ఆయుధాన్ని, వస్తువుల్ని సీజ్ చేసి భద్రపరిచామని, ఆ ఆయుధాల్ని భవిష్యత్తులో తమ(తాలిబన్ల) సైన్యం అవసరాల కోసమే ఉపయోగిస్తామని కరిమి పేర్కొన్నాడు. అయినప్పటికీ అనుమానాల నేపథ్యంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపడతామని తాలిబన్ సంస్థ ప్రకటించింది. ప్రతీకాత్మక చిత్రం లూట్ కా మాల్! అయితే పాక్ వీధుల్లో అమ్ముడుపోతున్న ఆయుధాలు.. అమెరికా వదిలి వెళ్లిన ఆయుధాలే అని నిర్ధారణ అయ్యింది. అమెరికా భద్రతా బలగాల పహారా సాగినంత కాలం.. తాలిబన్లు-పాక్ సాయంతో కలిసి అమెరికా-నాటో బృందాలపై దాడులకు తెగపడిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనూ ఆయుధాల్ని ఎత్తుకెళ్లిపోయేవాళ్లు. ఈ తరుణంలో ఇప్పుడు వదిలేసి వెళ్లిన ఆయుధాల్ని అక్రమంగా తరలించడమో లేదంటే ఆదాయం కోసం అమ్ముకోవడమో తాలిబన్లు చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాలిబన్లు మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తుండగా.. పాక్ వ్యాపారులు మాత్రం అంతా పద్దతిగానే జరిగిందని చెప్తుండడం విశేషం. దీంతో దొడ్డిదారిన ఆ ఆయుధాలు తరలిపోయి ఉంటాయన్న కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సైన్యం ఉపసంహరణలో భాగంగా.. అఫ్గనిస్తాన్ బాగ్రమ్ ఎయిర్‌బేస్‌కు పవర్‌కట్ చేసి గప్‌చుప్‌గా వెళ్లిపోయాయి అమెరికా దళాలు. వెళ్తూ వెళ్తూ అఫ్గన్ గడ్డపై 83 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ సంపత్తిని వదిలేశాయి. చదవండి: అలా చేయకండి.. అమెరికాకు తాలిబన్లు వార్నింగ్ -
మూడో ప్రపంచ యుద్ధం గ్రహాంతరవాసులతోనే అటా!
న్యూయార్క్: ఇప్పటి వరకు దేశాల మధ్య పారిశ్రామిక ఒప్పందం, అణ్యాయుధాల ఒప్పందం, సరిహద్దుల ఒప్పందం విఫలం కావడం వంటి కారణాలు మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుందేమోనని దేశాధి నేతలు భయపడుతున్నారు. పరిస్థితి మరీ దిగజారకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సంప్రదింపులు, చర్చలు జరిపి పరిస్థితిని అదుపు చేసేవారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది గ్రహాంతరవాసులతోటే అంటున్నారు యూఎస్ మిలటరీ ఆఫీసర్ రాబర్ట్ సలాస్ అంటున్నారు. (చదవండి: వెలుగులోకి 1,500 ఏళ్ల నాటి పురాతన వైన్ కాంప్లెక్స్) ఇంతకీ అసలు విషయం ఏమిటంటే గ్రహాంతరవాసులు అణు క్షిపణులను ట్యాంపరింగ్ చేస్తున్నట్లు తాను గుర్తించానని సలాస్ అంటున్నారు. ఈ మేరకు గ్రహాంతరవాసులు వేరోక గ్రహం నుంచి వచ్చి అణు లక్ష్యాల వద్ద ఆయుధ వ్యవస్థలను తారుమారు చేసి, వాటిని నిలిపివేసినట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో అవి కొన్ని క్షిపణులను యాక్టివేట్ చేయడం మొదలు పెట్టడమే కాకా దాదాపు పది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు నిర్విర్యం చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు ఈ విషయానికి సంబంధించి నలుగురు యూఎస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లు త్వరలో పత్రాలను విడుదల చేస్తారని కూడా సలాస్ అన్నారు. సలాస్ యూఎస్ ఆధునిక విధ్వంసక అణు క్షిపణి కార్యక్రమంగా పేరుగాంచిన టైటాన్ 3 ప్రోగ్రామ్‌లో ఎయిర్ ఫోర్స్ క్షిపణి ప్రొపల్షన్ ఇంజనీర్‌గానూ, యూఎస్ వెపన్ కంట్రోలర్‌గానూ పనిచేస్తున్నాడు. అంతేకాదు 1971నుంచి 1973 వరకు స్పేస్ షటిల్ డిజైన్ ప్రతిపాదనలకు సంబంధించిన మార్టిన్-మారిటా ఏరోస్పేస్, రాక్వెల్ ఇంటర్నేషనల్ సంస్థలకు అత్యంత విశ్వసనీయత కలిగిన ఇంజనీర్‌గా కూడా సేవలందించాడు. (చదవండి: ఆ కెమికల్ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి) -
డ్రోన్ ద్వారా ఆయుధాల తరలింపు యత్నం భగ్నం
జమ్మూ: జమ్మూకాశ్మీర్ లోని సౌజానా గ్రామంలో పాకిస్తాన్ నుంచి పంపినట్లు భావిస్తున్న ఆయుధాల బాక్సును పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. అందులో ఏకే అస్సాల్ట్ రైఫిల్, మూడు మేగజీన్లు, 30 రౌండ్లు, ఓ టెలిస్కోప్ ఉన్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దుకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఇవి దొరకడం గమనార్హం. శనివారం రాత్రి డ్రోన్ శబ్దం వినిపించిందని ఓ గ్రామస్తుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు గ్రామాన్ని ఖాళీ చేయించారు. అనంతరం పరిశీలించి చూడగా, ఓ పసుపుపచ్చ ప్యాకెట్ కనుగొన్నారు. అందులో చెక్కతో చేసిన బేస్‌మెంట్‌తో కూడిన డబ్బాలో ఆయుధాలు, ఇతర సామగ్రి కనిపించాయి. వాటిని స్వా«దీనం చేసుకొని ఇందుకు సంబంధించి కేసు నమోదు చేశారు. భారత్‌లో వాటిని ఎవరు తీసుకోవాల్సి ఉందో గుర్తించేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా భారత్‌లోని ఉగ్ర ముఠాలకు ఆయుధాల సరఫరా పెరుగుతున్న సంగతి తెలిసిందే. -
హుజురాబాద్: తుపాకులు అప్పగించాలె.. లేదంటే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో లైసెన్స్ తుపాకులపై పోలీసులు దృష్టిపెట్టారు. లైసెన్సు కలిగిన తుపాకులను వెంటనే సరెండర్ చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఆదేశాలు జారీచేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికకు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో పోలీసుశాఖ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఆయుధాలచట్టం 1959 సెక్షన్ 21 ప్రకారం.. కమిషనరేట్ పరిధిలో నివసిస్తూ, లైసెన్సు తుపాకులు కలిగి ఉన్నవారంతా సమీపంలోని పోలీసుస్టేషన్లో డిపాజిట్ చేయాలి. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా, ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల సందర్భంగా ముందస్తుగా ఆయుధాలు డిపాజిట్ చేస్తారు. చదవండి: పత్తి ఏరాల్సిన చోట.. చేనులో చేపల వేట అలా చేయని వారిపై కేసులు పెట్టేందుకు వెనకాడమని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సీపీ స్పష్టంచేశారు. డిపాజిట్ చేసిన ఆయుధాలను ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి నవంబరు 6వ తేదీన తీసుకోవచ్చని సూచించారు. ఈ విషయంలో జాతీయబ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే భద్రతాసిబ్బంది, గార్డు డ్యూటీలో ఉన్నవారికి మినహాయింపు ఉంటుందని వివరించారు. కమిషరేట్ పరిధిలో 101 లైసెన్స్డ్ తుపాకులు ఉండగా అందులో 73 తుపాకులు వ్యక్తిగతమైనవి కాగా.. మిగిలిన 28 గన్స్ భద్రతాసిబ్బంది వద్ద ఉన్నాయి. చదవండి: హుజురాబాద్.. ప్రతి గడప తొక్కుదాం.. ఒక్క ఓటు వదలొద్దు -
పోటాపోటీగా ఉభయ కొరియాలా క్షిపణి పరీక్షలు
సియోల్: ఉభయ కొరియాలు పోటా పోటీగా తమ ఆయుధ సంపత్తిని పెంచుకొని ప్రాంతీయంగా ఉద్రిక్తతలకు తెరతీస్తున్నాయి. బుధవారం కొద్ది గంటల తేడాలో రెండు దేశాలు క్షిపణి పరీక్షలు నిర్వహించాయి. ఉత్తర కొరియా మళ్లీ దిగువ శ్రేణి క్షిపణి ప్రయోగాలు రెండు చేయడంతో.. దక్షిణ కొరియా దానికి పోటీగా ఏకంగా సముద్రగర్భంలో క్షిపణి ప్రయోగాలు చేసి తన సత్తా చాటింది. జలాంతర్గామి నుంచి క్షిపణి పరీక్షలు నిర్వహించగలిగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్న ఏడో దేశంగా నిలిచింది. కొత్తగా నిర్మించిన సబ్‌మెరైన్ అహ్ చంగ్ హో ద్వారా సముద్రగర్భంలో ఈ క్షిపణి పరీక్షలు నిర్వహించినట్టుగా ద.కొరియా అధ్యక్ష భవనం వర్గాలు వెల్లడించాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన 3 వేల టన్నుల బరువున్న సబ్‌మెరైన్ నుంచి నిర్దేశిత లక్ష్యాలను ఈ క్షిపణి కచి్చతంగా ఛేదించింది. అంతకు ముందు ఉత్తర కొరియా రెండు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. కాగా, ఇదిలాగే కొనసాగితే ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్ర విఘాతం కలగడం ఖాయమని ఉత్తరకొరియా అధినేత కిమ్ సోదరి యో జాంగ్ హెచ్చరించారు. -
2.78 లక్షల అక్రమ గన్ లైసెన్స్‌లు!
శ్రీనగర్/న్యూఢిల్లీ: ఆయుధాల అక్రమ లైసెన్స్‌ల వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణను ముమ్మరం చేసింది. జమ్మూకశ్మీర్‌తోపాటు దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఒకేరోజు 40 చోట్ల సోదాలు నిర్వహించింది. 2012 నుంచి 2016 దాకా ఐదేళ్లపాటు జమ్మూకశ్మీర్‌లో ఏకంగా 2.78 లక్షలకు పైగా ఆయుధ లైసెన్స్‌లను స్థానికేతరులకు జారీ చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగాయని, అనర్హులు ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించి లైసెన్స్‌లు పొందినట్లు సీబీఐ గుర్తించింది. ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించేందుకు సీబీఐ అధికారులు జమ్మూ, శ్రీనగర్, ఉధంపూర్, రాజౌరీ, అనంతనాగ్, బారాముల్లా, ఢిల్లీలలో 40 చోట్ల సోదాలు జరిపారు. ఆయుధాల లైసెన్స్‌ల రాకెట్‌ను ఛేదించేందుకు కొందరు ఐఏఎస్‌లతోపాటు ప్రభుత్వ అధికారుల నివాసాలు, కార్యాలయాలు, 20 ఆయుధాల దుకాణాల్లో ఈ సోదాలు చేపట్టామని సీబీఐ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. జమ్మూకశ్మీర్ ప్రభుత్వ గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి షాహిద్ ఇక్బాల్ చౌదరి, మరో ఐఏఎస్ అధికారి, ఢిల్లీలో అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ ఆఫ్ యూటీ నీరజ్ కుమార్ నివాసాలు, ఆఫీసుల్లో సోదాలు సాగినట్లు తెలిపారు. స్థానికేతరులకు లైసెన్సులు రాజౌరీ జిల్లా మాజీ కలెక్టర్, రిటైర్డ్ అధికారి షబ్బీర్ అహ్మద్ భట్ నివాసంతోపాటు పూంచ్, కుప్వారా, బందీపురా, బారాముల్లా, రాంబన్ జిల్లాల్లో 2012–2016లో అదనపు మేజిస్ట్రేట్లుగా పని చేసిన ఆరుగురు అధికారుల ఇళ్లల్లోనూ సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. ఆయుధాల లైసెన్సుల జారీలో అక్రమాలపై సీబీఐ 2018 అక్టోబర్ 16న రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 2019 డిసెంబర్లో శ్రీనగర్, జమ్మూ, గుర్గావ్, నోయిడాలలో పలువురు అధికారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. జమ్మూకశ్మీర్‌లో పలు జిల్లాల్లో మేజిస్ట్రేట్లుగా పనిచేసిన అధికారులు ఆయుధాల లైసెన్సుల జారీలో పెద్ద ఎత్తున అవినీతి ఆక్రమాలకు పాల్పడినట్లు, అనర్హులకు వీటిని అందజేసినట్లు ఫిర్యాదులొచ్చాయి. చాలామంది స్థానికంగా నివాసం ఉండకుండానే ఉన్నట్లు తప్పుడు పత్రాలు సమర్పించిన లైసెన్సులు పొందినట్లు తమ పరిశీలనలో తేలిందని, ఇందులో పలువురు ఆయుధ డీలర్ల పాత్ర ఉందని సీబీఐ ప్రతినిధి ఆర్.సి.జోషీ చెప్పారు. స్థానికేతరులకు ఆయుధ లైసెన్సులు ఇవ్వడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో 22 జిల్లాల్లో ఈ తరహా అక్రమాలు జరిగాయన్నారు. అక్రమ లైసెన్సుల కుంభకోణాన్ని తొలుత 2017లో రాజస్తాన్ ఏటీఎస్ బహిర్గతం చేసింది. అప్పట్లో 50 మందిని అరెస్టు చేసింది. సైనిక సిబ్బంది పేరిట 3,000కు పైగా లైసెన్సులు జారీ చేశారని రాజస్తాన్ ఏటీఎస్ వెల్లడించింది. ఏటీఎస్ సేకరించిన ఆధారాలను బట్టి అప్పటి జమ్మూకశ్మీర్ గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రా ఈ కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐకి పూర్తిగా సహకరిస్తా: షాహిద్ ఇక్బాల్ చౌదరి ఆయుధాల లైసెన్స్‌ల కేసులో తన ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు జరిపిన మాట నిజమేనని షాహిద్ ఇక్బాల్ చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కేసులో నేరారోపణకు సంబంధించి ఎలాంటి ఆధారాలు సీబీఐకి లభించలేదని చెప్పారు. సీబీఐకి పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. 2012–2016 మధ్యకాలంలో ఉధంపూర్‌లో 36,000 లైసెన్స్‌లు జారీ చేశారని, తన హయాంలో కేవలం 1,500 లైసెన్సులే జారీ అయ్యాయని స్పష్టం చేశారు. తన హయాంలో ఇచ్చిన లైసెన్స్‌లకు తాను జవాబుదారీగా ఉంటానని అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ల కంటే తానే తక్కువ లైసెన్స్‌లు జారీ చేశానని చెప్పారు. ఈ కేసు విషయంలో సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని తెలిపారు. తాను 2012–2016 మధ్య జమ్మూకశ్మీర్‌లోని రియాసీ, కథువా, ఉధంపూర్ జిల్లాల మేజిస్ట్రేట్‌గా పనిచేశానని గుర్తుచేశారు. ఈ మూడు జిల్లాల్లో కలిపి 2012–2016 మధ్యకాలంలో మొత్తం 56,000 ఆయుధ లైసెన్స్‌లు జారీ చేశారని, తన హయాంలో కేవలం 1,720 లైసెన్సులు ఇచ్చారని, మొత్తం లైసెన్సుల్లో ఇవి 3 శాతమేనని పేర్కొన్నారు. -
‘బయో’త్పాతం: చైనాపై అనుమానాలు ఎందుకంటే?
ప్రపంచవ్యాప్తంగా ‘కరోనా’ మహమ్మారి ఉధృతి ఒకవైపు కొనసాగుతుండగానే, భవిష్యత్ ‘బయో’త్పాతాలపై అనుమానాలూ పెరుగుతున్నాయి. ‘కరోనా’ వైరస్ వ్యాప్తి వెనుక చైనా పాత్రపై అనుమానాలను బలపరచే కథనాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అలాగని, జీవాయుధాలపై ప్రయోగాలు జరుపుతున్న దేశం చైనా ఒక్కటి మాత్రమే కాదు. అంతర్జాతీయ ఒడంబడికలను ఏమాత్రం లెక్కచేయకుండా దాదాపు పదహారు దేశాలు జీవాయుధ ప్రయోగాలను కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. భవిష్యత్తులో ఏవైనా దేశాలు గాని, ఉగ్రవాద సంస్థలు గాని జీవాయుధాలతో దాడులకు తెగబడితే, అప్పుడు వాటిల్లే నష్టం ఊహకందని పరిస్థితులు ఉన్నాయి. దాదాపు ఏడాదిన్నరగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ‘కరోనా’ మహమ్మారి ఇప్పటికే పెద్దసంఖ్యలో ప్రాణనష్టం కలిగించింది. ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసింది. చైనాలోని వుహాన్ ప్రాంతంలో మొదలైన ‘కరోనా’ వైరస్ పుట్టుకపై తొలినాళ్లలోనే కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది చైనా సృష్టేనని అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాహాటంగానే విమర్శలు గుప్పించారు. అప్పట్లో ట్రంప్ మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఇటీవల ఆధారాలతో సహా వెలుగులోకి వస్తున్న కథనాల కారణంగా ‘కరోనా’ సృష్టి వెనుక చైనా హస్తం ఉండవచ్చనే దానిపై అనుమానాలు నానాటికీ బలపడుతున్నాయి. ప్రపంచంలో ‘బయో’త్పాతం సృష్టించే ఉద్దేశంతో చైనా తయారు చేసుకున్న జీవాయుధాల్లో ‘కరోనా’ వైరస్ ఒకటి కావచ్చని వివిధ దేశాలకు చెందిన శాస్త్రనిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో తుపాకులు, ఫిరంగులు, బాంబుల వంటి ఆయుధాలతో కాకుండా, మహమ్మారి రోగాలతో విజృంభించే జీవకణాలనే ఆయుధాలుగా ప్రయోగించే యుద్ధాలు జరగవచ్చని, అలాంటి పరిస్థితుల్లో శత్రువు ఎవరో గుర్తించడం కూడా కష్టమవుతుందని, శత్రువును గుర్తించేలోగానే జరగరాని నష్టం జరిగిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో జరగబోయే యుద్ధాల్లో ధూర్త దేశాలు ఏవైనా జీవ రసాయనిక ఆయుధాలను ప్రయోగించే ప్రమాదం లేకపోలేదనే ఆలోచనతోనే, యుద్ధాల్లో జీవాయుధాలను ఉపయోగించరాదంటూ ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితిలో 1972లోనే ‘బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్’ (బీడబ్ల్యూసీ) పేరిట ఒక ఒడంబడికను కుదుర్చుకున్నాయి. ఇది 1975 మార్చి 26 నుంచి అమలులోకి వచ్చింది. ఈ ఒడంబడికపై 2013 నాటికి తైవాన్ సహా 183 దేశాలు సంతకాలు చేశాయి. ఒకవైపు ఈ అంతర్జాతీయ ఒడంబడికపై సంతకాలు చేసినా, కొన్ని దేశాలు రహస్యంగా జీవాయుధాలను పోగు చేసుకుంటున్నాయి. తీవ్రస్థాయిలో ప్రాణనష్టం కలిగించగలిగే జీవకణాలను తమ లాబొరేటరీల్లో సిద్ధం చేసుకుంటున్నాయి. జీవాయుధ ప్రయోగ నిరోధక ఒడంబడికపై తొమ్మిదో సమీక్ష సమావేశం ఈ ఏడాది నవంబర్‌లో జరగనుంది. ఇటీవలి జీవాయుధ దాడులు ఇరవయ్యేళ్ల కిందట అల్–కాయిదా ఉగ్రవాద సంస్థ 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రం జంట సౌధాలను కూల్చివేసిన కొద్ది రోజులకే, అమెరికాలోని ఇద్దరు సెనేటర్లకు, కొన్ని వార్తాసంస్థలకు ‘ఆంత్రాక్స్’ సూక్ష్మజీవులతో కూడిన లేఖలు అందాయి. వాటి ప్రభావానికి ఐదుగురు మరణించగా, మరో పదిహేడు మంది తీవ్ర అస్వస్థులై ఆస్పత్రుల పాలయ్యారు. ఆ తర్వాత చికిత్సతో కోలుకున్నారు. దాదాపు ముప్పయ్యేళ్ల కిందట జపాన్‌లోని ‘అవుమ్ షిన్నిక్యో’ అనే ముఠా ఆంత్రాక్స్, బోటులినమ్ క్రిములను ఆయుధాలుగా వాడి తీవ్ర ప్రాణనష్టం కలిగించింది. ఈ సంఘటనల తర్వాత ఉగ్రవాద సంస్థలు జీవాయుధాలను ప్రయోగించిన దాఖలాలు ఇప్పటికైతే లేవు గాని, భవిష్యత్తులో ప్రయోగించబోవనే భరోసా మాత్రం ఏదీ లేదు. ఎవరైనా జీవాయుధాలను ఉద్దేశపూర్వకంగా ప్రయోగించినా, భవిష్యత్తులో ప్రయోగించే ఉద్దేశంతో వాటిపై జరిపే ప్రయోగాలు వికటించినా, ‘కరోనా’ వంటి మహమ్మారి రోగాలు ప్రపంచాన్ని ముంచెత్తే అవకాశాలు లేకపోలేదు. చైనాపై అనుమానాలు ఎందుకంటే? ‘కరోనా’ వ్యాప్తికి సంబంధించి చైనాపై ప్రపంచ దేశాల్లో అనుమానాలు పెరుగుతుండటానికి బలమైన కారణాలే ఉన్నాయి. ‘కరోనా’ తొలి కేసు చైనాలోని వుహాన్ నగరంలో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వుహాన్ నగరంలో ఈ వ్యాధి సోకిన వారు గుర్తుతెలియని కారణంతో న్యుమోనియా లక్షణాలతో బాధపడుతున్నట్లు 2019 డిసెంబర్ 31న చైనా అధికారుల నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థకు (డబ్ల్యూహెచ్‌వో) సమాచారం అందింది. ఈ వ్యాధికి కొత్త తరహా కరోనా వైరస్ కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు చైనా అధికారులు 2020 జనవరి 7న గుర్తించారు. గబ్బిలాల కారణంగా జనసమ్మర్దం గల వుహాన్ చేపల మార్కెట్లో ఈ వ్యాధి మొదలైనట్లు చైనా మీడియా తొలుత కథనాలను ప్రసారం చేసింది. ప్రపంచమంతా అంతే కాబోలనుకుంది. ‘కరోనా’ మహమ్మారి తొలి విడత ఉధృతి సద్దుమణిగి, రెండో విడత ఉధృతి మొదలవుతున్న నాటికి చైనాపై అనుమానాలు రేకెత్తించే కథనాలు కొన్ని వెలువడ్డాయి. ‘కరోనా’ మహమ్మారి వ్యాప్తి మొదలవడానికి కొన్ని నెలల ముందే, అంటే– 2019 నవంబరులో వుహాన్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేసే ముగ్గురు శాస్త్రవేత్తలు ఈ వ్యాధి లక్షణాలతోనే ఆస్పత్రి పాౖలయ్యారని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసినట్లు‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ వెలుగులోకి తెచ్చిన కథనం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఇదిలా ఉంటే, వుహాన్ లాబ్‌లో గబ్బిలాలపై ప్రయోగాలు జరపడం లేదని, అసలు లాబ్‌లో గబ్బిలాలే లేవని చైనా అధికారులు తమపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. అయితే, వుహాన్ లాబ్‌లో పరిశోధనల కోసం గబ్బిలాలను బోనుల్లో బంధించి ఉన్న దృశ్యాల వీడియో ఇటీవల వెలుగులోకి రావడంతో ‘కరోనా’ వైరస్ వ్యాప్తి వెనుక చైనా హస్తంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. జీవాయుధాల సృష్టిలో భాగంగానే వుహాన్ శాస్త్రవేత్తలు వైరస్‌లో కృత్రిమంగా ఉత్పరివర్తనలు తీసుకొచ్చే ప్రయోగాలు జరిపి ఉంటారని, పొరపాటున ఆ ప్రయోగాలు వికటించడం వల్లనే ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వ్యాపించి ఉంటుందని పలు దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ కథనాన్ని చైనా అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ‘కరోనా’ వైరస్ పుట్టుకకు చైనాలో గల మూలాలపై దర్యాప్తు నిగ్గు తేల్చాలని అమెరికా డబ్ల్యూహెచ్‌వోపై ఒత్తిడి తెస్తోంది. ‘కరోనా’ వైరస్ జన్మరహస్యం తేలాల్సిందేనంటూ అమెరికా సహా జీ–7 దేశాలు పట్టుబడుతున్నాయి. ‘కరోనా’ మూలాలు తెలుసుకునే అంశంపై ఒకవైపు ప్రపంచదేశాలతో గొంతు కలుపుతూనే, మరోవైపు ‘కరోనా’ మూలాలను తెలుసుకోవడానికి అమెరికా తన సొంత ప్రయత్నాలనూ సాగిస్తోంది. దీనిపై నిశితంగా పరిశోధించి నివేదిక ఇవ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ తమ ఇంటెలిజెన్స్ అధికారులకు తొంభై రోజుల గడువు విధించారు. అయితే, కంటికి కనిపించని ఒక వైరస్ పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించి అట్టుగుట్టు ఆనవాళ్లు కనిపెట్టడం గడువు విధించినంత తేలికకాదు. ‘కరోనా’ జన్మరహస్యం ఎప్పటికి బయటపడుతుందో వేచిచూడాల్సిందే! ‘బయో’దాడుల చరిత్ర శత్రువులపై ‘బయో’దాడులు జరిపే పాడు పద్ధతి ఇప్పటిది కాదు. చరిత్రలో తొలిసారిగా పద్నాలుగో శతాబ్దిలోనే ఇలాంటి దాడి ఒకటి జరిగింది. మంగోల్ బలగాలు 1347లో ప్లేగుతో మరణించిన వారి శవాలను నల్లసముద్ర తీరంలోని తమ శత్రువులు ఉండే కాఫా నగరంలో (ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని ఫియోడోసియా) పడవేశారు. ఫలితంగా నల్లసముద్ర తీరంలోని ఇటాలియన్ నౌకల్లో ఉండేవారికి ప్లేగు సోకింది. ఈ నౌకలు తిరిగి ఇటలీకి చేరుకున్నాక, యూరోప్ అంతటా ప్లేగు విజృంభణ మొదలైంది. అప్పటి ప్లేగు ధాటికి ఏకంగా రెండున్నర కోట్లకు పైగా– అంటే అప్పటి యూరోప్ జనాభాలో మూడోవంతు ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. రష్యన్ సైన్యం కూడా 1710లో ఇదే పద్ధతి అమలు చేసింది. స్వీడిష్ దళాలతో యుద్ధం జరుగుతున్నప్పుడు రష్యన్ బలగాలు ప్లేగుతో మరణించిన వారి శవాలను రేవల్ నగరం (ప్రస్తుతం ఎస్టోనియాలోని టాలిన్) గోడల మీదుగా పడవేశారు. పాంటియాక్ తిరుగుబాటు సమయంలో 1763లో ఫోర్ట్పిట్ను (ప్రస్తుతం పిట్స్బర్గ్) ముట్టడించిన బ్రిటిష్ సేనలు, ఆ తిరుగుబాటులో పాల్గొన్న భారతీయులకు మశూచి వైరస్ ఉన్న దుప్పట్లు అందేలా చేయడంతో అప్పట్లో తీవ్రస్థాయిలో మశూచి వ్యాపించి, భారీనష్టం వాటిల్లింది. మొదటి ప్రపంచయుద్ధంలో భారీనష్టం దరిమిలా, యుద్ధాలలో ‘బయో’త్పాతాలను అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ 1925లో జెనీవాలో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం యుద్ధాలలో జీవాయుధాలను, రసాయనిక ఆయుధాలను ఉపయోగించరాదు. ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలేవీ జీవ, రసాయనిక ఆయుధాల తయారీకి ప్రయోగాలు, పరిశోధనలు కూడా చేపట్టరాదు. అయితే, ఈ ఒప్పందంపై సంతకం చేసిన జపాన్, దీనిని ఉల్లంఘించి భారీస్థాయిలో జీవ, రసాయనిక ఆయుధాల తయారీ కోసం ప్రయోగాలు సాగించింది. అంతటితో ఆగకుండా, చైనాలో మోహరించిన మిత్రబలగాలపై 1937–45 మధ్యకాలంలో జీవాయుధాలను ప్రయోగించి, భారీ నష్టానికి కారణమైంది. తమకు పట్టుబడిన దాదాపు మూడువేల మందికి పైగా యుద్ధఖైదీలపై జీవాయుధాల ప్రయోగాలు జరిపి, వారిని హతమార్చింది. జపాన్ అప్పట్లో ప్రయోగించిన జీవాయుధాల్లో ప్లేగు, ఆంత్రాక్స్, యెల్లో ఫీవర్, హెపటైటిస్, కలరా, మశూచి వంటి మహమ్మారి వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జీవాయుధాలు ప్రయోగించారనేందుకు ఎలాంటి ఆధారాలు లేకపోయినా, యుద్ధసమయంలో వివిధ దేశాలు వీటి తయారీకి విస్తృతంగా పరిశోధనలు సాగించినట్లు దాఖలాలు ఉన్నాయి. రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిన సమయంలో అమెరికా, సోవియట్ రష్యా, వాటి మిత్రదేశాల్లో కొన్ని అప్పట్లో జీవాయుధాలపై విస్తృతంగా పరిశోధనలు సాగించాయి. సోవియట్ యూనియన్ 1991లో పదిహేను దేశాలుగా విడిపోయిన తర్వాత రష్యా అధ్యక్షుడు బోరిస్ యెల్త్సిన్ సోవియట్ యూనియన్ బయోలాజికల్ వార్ కన్వెన్షన్‌ను (బీడబ్ల్యూసీ) ఉల్లంఘించినట్లు బహిరంగంగా అంగీకరించారు. అయితే, సోవియట్ హయాంలో జరిగిన ప్రయోగాల్లో ఉపయోగించిన జీవాయుధాలన్నింటినీ పూర్తిగా నాశనం చేయనున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఆ తర్వాత రష్యాలో చాలా మార్పులే జరిగాయి గాని, జీవాయుధాలను నాశనం చేసినట్లుగా అక్కడి నుంచి ఇన్నాళ్లలో ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. జీవాయుధ ప్రయోగాలు చేస్తున్నట్లుగా ఏ దేశమూ బహిరంగంగా చెప్పుకోకపోయినా, పదహారు దేశాలు ఈ ప్రయోగాలు సాగిస్తున్నట్లు అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. జీవాయుధాలపై రహస్య ప్రయోగాలు సాగిస్తున్న దేశాల సంఖ్య మరింత ఎక్కువగా కూడా ఉండవచ్చని కొందరు పరిశీలకుల అంచనా. పసిగట్టడం కష్టమే! తుపాకులు, బాంబులు వంటి ఆయుధాలను ప్రయోగించే వారిని, చివరకు అణ్వాయుధాలను ప్రయోగించే వారిని సైతం గుర్తించడం తేలికే గాని, జీవాయుధాలను ప్రయోగించే వారిని గుర్తించడం అంత తేలిక కాదు. జీవాయుధ ప్రయోగాల ఆనవాళ్లను పసిగట్టడం దుస్సాధ్యమైన పని. బీడబ్ల్యూసీని ఉల్లంఘించి ఇప్పటికీ కొన్ని దేశాలు జీవాయుధాలపై ప్రయోగాలు సాగిస్తున్నట్లుగా అంతర్జాతీయ నిఘా సంస్థలు చెబుతున్నా, ఆ ప్రయోగాలను నిర్ధారించే సాక్ష్యాధారాలను కనిపెట్టి, బయటపెట్టే పని మాత్రం చేయలేకపోతున్నాయి. వ్యాక్సిన్ల రూపకల్పన పేరిట, ఔషధాల తయారీ పేరిట కొన్ని సంస్థలు నిర్వహించే ప్రయోగశాలల్లో జీవాయుధాల ప్రయోగాలు గుట్టుగా సాగుతుంటాయి. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే ఇలాంటి ప్రయోగాలకు అండదండలు అందిస్తుంటాయి. మరోవైపు అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలు సైతం జీవాయుధాల తయారీ కోసం ప్రయోగాలు నిర్వహించే అవకాశాలు లేకపోలేదని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వక దాడుల వల్ల కాకపోయినా, ప్రయోగలశాలల్లో కట్టుదిట్టమైన భద్రతలో ఉన్న జీవాయుధాల్లో ఏవైనా పొరపాటుగా వాతావరణంలోకి చేరితే జరగబోయే బీభత్సం మామూలుగా ఉండదు. పెద్దసంఖ్యలో ప్రాణనష్టం కలిగించే మహమ్మారి రోగాలుగా విరుచుకుపడే వీటిని వెంటనే అదుపు చేయడమూ కష్టమే. ప్రయోగాలు కారుచౌక అణ్వాయుధాలు, ఇతర రసాయనిక ఆయుధాల తయారీతో పోల్చుకుంటే జీవాయుధాల తయారీ ప్రక్రియ కారుచౌక అనే చెప్పుకోవచ్చు. ఒక లాబొరేటరీ, డజను మంది శాస్త్రవేత్తలు, కొద్దిపాటి పరికరాలు ఉంటే చాలు. ఏదో ఒక మారుమూల గుట్టుచప్పుడు కాకుండా వీటి తయారీ కొనసాగించవచ్చు. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవులను భద్రపరచడానికి విశాలమైన గిడ్డంగులేవీ అక్కర్లేదు, కొన్ని పరీక్షనాళికలు చాలు. కారుచౌకగా భారీ విధ్వంసాలను సృష్టించగల అవకాశాలు ఉండటం వల్లనే కొన్ని దేశాలు అంతర్జాతీయ ఒడంబడికలను ఉల్లంఘించి మరీ జీవాయుధ ప్రయోగాలకు తెగబడుతున్నాయి. రక్షణ అంతంత మాత్రమే జీవాయుధాల దాడుల నుంచి జనసామాన్యానికి రక్షణ అంతంతమాత్రమే. జీవాయుధాల బారిన పడకుండా తప్పించుకోవడం, ఒకవేళ వాటి బారిన పడినా ఆరోగ్యంగా బయటపడటం అంత తేలిక కాదు. జీవాయుధాలుగా పేరుపొందిన సూక్ష్మజీవుల్లో కొన్నింటికి ఇప్పటికే వ్యాక్సిన్లు ఉన్నాయి. వ్యాక్సిన్లు లేని వాటికి రకరకాల ఔషధ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇవి ఒకేసారి మహమ్మారిలా విరుచుకుపడితే, జనాలందరికీ తగిన స్థాయిలో వ్యాక్సిన్ డోసులు, మందులు అందుబాటులో లేవు. ఉదాహరణలు చెప్పుకోవాలంటే– జీవాయుధ దాడుల్లో అతి తేలికగా ఉపయోగించగలిగే ఆంత్రాక్స్, మశూచి సూక్ష్మజీవులు ప్రధానమైనవి. మశూచి నుంచి రక్షణ కోసం అమెరికా వద్ద తన పౌరులందరికీ తగినన్ని వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయి. ఆంత్రాక్స్ విషయంలో అలా కాదు. కేవలం తన సైన్యానికి మాత్రమే తగినన్ని వ్యాక్సిన్ నిల్వలు అమెరికా వద్ద ఉన్నాయి. జీవాయుధ దాడిలో అమెరికా పౌరులకు కూడా ఆంత్రాక్స్ తీవ్రస్థాయిలో వ్యాపిస్తే పరిస్థితి అదుపు చేయడం కష్టమే. ఇంకా కొన్ని వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్ల తయారీ ప్రక్రియలు ఇంకా వివిధ దశల పరీక్షల స్థాయిలోనే ఉన్నాయి. ‘ఇన్వెస్టిగేషనల్ న్యూ డ్రగ్’ కేటగిరీలోకి వచ్చే ఈ వ్యాక్సిన్లకు ఇంకా ఎఫ్‌డీఏ అనుమతులు లభించాల్సి ఉంది. వీటిలో ‘క్యూ’ఫీవర్, టులారెమియా, వెనిజువెలియన్ ఈక్విన్ ఎన్‌సెఫిలైటిస్, వైరల్ హెమరేజ్ ఫీవర్, బొటులిజమ్ వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్లు ఉన్నాయి. ఇక గ్లాండెర్స్, బ్రుసెల్లాసిస్, స్టాఫిలోకోక్సల్, ఎంటరోటాక్సిన్–బి, రైసిన్ వంటి వాటికి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్లూ అందుబాటులో లేవు. వ్యాక్సిన్లు లేని జీవాయుధాలను, జన్యు ఉత్పరివర్తనలు జరిపిన జీవాయుధాలను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రయోగిస్తే జరగబోయే బీభత్సం ఊహాతీతంగా ఉంటుంది. జీవాయుధాలు కలిగించే నష్టాలు జీవాయుధాలు మనుషులకు మాత్రమే కాదు, భూమ్మీద నివసించే పశుపక్ష్యాదులకు, వృక్షజాతులకు తీరని నష్టాన్ని కలిగించగలవు. జీవాయుధ ప్రయోగం జరిగాక, అదేమిటో గుర్తించే లోగానే జరగరాని నష్టం జరిగిపోతుంది. జీవాయుధ ప్రయోగాల వల్ల తీవ్రస్థాయిలో ప్రాణనష్టం జరగడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేని రీతిలో దెబ్బతింటాయి. జీవాయుధాల వల్ల సంభవించే పర్యావరణ నష్టాలు కరువుకాటకాలకు దారితీస్తాయి. శాస్త్ర పరిశోధనల సాయంతో వాటిని నిర్వీర్యం చేసినా, పర్యావరణానికి అప్పటికే వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేయడానికి దశాబ్దాలు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మనుషులకు, పశుపక్ష్యాదులకు తీవ్రస్థాయిలో ప్రాణనష్టం కలిగించే ఉద్దేశంతో జీవాయుధాలతో జరిపే దాడులను ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ‘బయోటెర్రరిజం’గా నిర్వచించింది. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు, అవి కలిగించే రోగాలు మానవాళికి కొత్త కాదు. అయితే, ఆధునిక శాస్త్రపరిజ్ఞానాన్ని ఆసరా చేసుకుని, వీటికి కృత్రిమంగా జన్యుఉత్పరివర్తనలు జరిపే అవకాశాలు ఉండటం ఆందోళనకరం. మరింత నష్టాన్ని కలిగించేలా వీటికి జన్యు ఉత్పరివర్తనలు జరిపి ప్రయోగిస్తే, అప్పుడు జరగబోయే నష్టం అంచనాలకు అందదు. జీవాయుధ దేశాలు దాదాపు పదహారు దేశాలు జీవాయుధాలను పోగు చేసుకుంటున్నట్లు ‘న్యూక్లియర్ థ్రెట్ ఇనీషియేటివ్’ (ఎన్టీఐ) సహా పలు అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ఎన్టీఐ సమాచారం మేరకు జీవాయుధ ప్రయోగాలు సాగిస్తున్న దేశాలు ఇవీ: కెనడా, చైనా, క్యూబా, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, జపాన్, లిబియా, ఉత్తర కొరియా, రష్యా, దక్షిణాఫ్రికా, సిరియా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా. ఒకవేశ యుద్ధం ముంచుకొస్తే వీటిలో ఒక దేశం మరో దేశంపై జీవాయుధాలను ప్రయోగించే అవకాశాలను కొట్టిపారేయలేం. ఎన్టీఐ లెక్కల ప్రకారం ప్రపంచంలో అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశాల కంటే జీవాయుధాలను కలిగి ఉన్న దేశాల సంఖ్యే ఎక్కువ. దేశాల మధ్య జరిగే యుద్ధాల్లో జీవాయుధాల ప్రయోగాల సంగతి ఎలా ఉన్నా, ఇవి ఉగ్రవాద బృందాలకు చేరితే, అవి బాంబులకు బదులుగా వరుసగా జీవాయుధాలతో దాడులకు తెగబడితే పరిస్థితి ఏమిటనేదే ప్రశ్న! కొన్ని ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే జీవాయుధ దాడులు చేశాయి. అవి చాలా చిన్నస్థాయి దాడులు కావడంతో స్వల్పనష్టమే తప్ప పెను ప్రమాదమేమీ జరగలేదు. జీవాయుధాల రకాలు జీవాయుధాలుగా ప్రయోగించేవాటిలో ప్రధానంగా రోగకారక సూక్ష్మజీవులు, జంతువులు, కీటకాలు, మొక్కల నుంచి సేకరించే విషపదార్థాలు ఉంటాయి. ఇవి వివిధ స్థాయిల్లో ప్రాణనష్టానికి కారణమవుతాయి. జీవాయుధాల్లోని రకాలు ఇవీ: బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఏకకణజీవి. ఉదాహరణకు ఆంత్రాక్స్, ప్లేగు వంటి మహమ్మారి రోగాలకు బ్యాక్టీరియా కణాలే కారణం. యాంటీబయోటిక్స్‌తో బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధులకు సమర్థంగా చికిత్స చేయవచ్చు. వైరస్ వైరస్ పూర్తికణం కాదు. ఇది కణంలోని సూక్ష్మభాగం. వైరస్ పరిమాణం బ్యాక్టీరియాలో నూరోవంతు ఉంటుంది. వైరస్లు కలిగించే వ్యాధులు యాంటీబయోటిక్స్‌కు లొంగేవి కావు. ఇప్పటి ‘కరోనా’, ఎయిడ్స్ సహా చాలా ప్రాణాంతక వ్యాధులు వైరస్ల వల్లనే కలుగుతాయి. రికెట్సీ ఇది కూడా బ్యాక్టీరియాను తలపించే సూక్ష్మజీవి. రికెట్సీ తన కణాల లోపలే పునరుత్పత్తి చేసుకోగల అంతర్కణ పరాన్నజీవి. ‘క్యూ’ఫీవర్, టైఫస్ వంటి వ్యాధులు రికెట్సీ వల్లనే కలుగుతాయి. ఫంగస్ ఫంగస్ జీవులు మనుషల ప్రాణాలకు పెద్దగా ప్రమాదం కలిగించవు గాని, పర్యావరణానికి తీరని చేటు చేస్తాయి. వరి, గోధుమలు, బంగాళదుంపలు వంటి ఆహారపంటల మొక్కలను తీవ్రంగా నష్టపరుస్తాయి. బయో టాక్సిన్స్ మొక్కలు, జంతువులు, కీటకాల నుంచి సేకరించే విషపదార్థాలు కూడా జీవాయుధాలే. వీటితో ఒక్కొక్కసారి పెద్దసంఖ్యలో జనం అనారోగ్యం పాలవడం, ప్రాణాలు కోల్పోవడం జరగవచ్చు. -
నాటు బాంబుల నుంచి రాకెట్ల దాకా..
దుబాయ్: ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా హమాస్ పాలకుల మధ్య నాలుగో యుద్ధం మొదలయ్యింది. ఇరు వర్గాలు భీకరస్థాయిలో తలపడుతున్నాయి. అత్యాధునిక ఆయుధ శక్తి కలిగిన ఇజ్రాయెల్ సైన్యానికి హమాస్ మిలటరీ ధీటుగా బదులిస్తోంది. వైమానిక దాడులకు జవాబుగా రాకెట్లను ప్రయోగిస్తోంది. 10 రోజుల క్రితం ఇజ్రాయెల్, హమాస్ నడుమ ఘర్షణ ప్రారంభమయ్యింది. హమాస్ ఇప్పటిదాకా ఇజ్రాయెల్‌పై 4,000కు పైగా రాకెట్లను ప్రయోగించింది. వీటిలో చాలా రాకెట్లను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ నిర్వీర్యం చేసింది. అయితే, యూదు దేశంతో పోలిస్తే బలహీనం అని అంతర్జాతీయ సమాజం భావిస్తున్న హమాస్ ఆయుధ బలం ఇప్పుడు భారీగా పెరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సరైన కచ్చితత్వంతో హమాస్ రాకెట్లు ప్రయోగించడం గమనార్హం. కొన్ని రాకెట్లు తీరప్రాంత నగరమైన టెల్ అవీవ్ వరకు చేరుకున్నాయి. హమాస్ డ్రోన్ దాడులు చేసింది. సముద్ర గర్భంలో జలాంతర్గామి(సబ్‌మెరైన్) ద్వారా ఇజ్రాయెల్‌ను దెబ్బకొట్టేందుకు ప్రయత్నించింది. ఆంక్షలను ధిక్కరించి.. దశాబ్దాలుగా యుద్ధాల్లో మునిగితేలి, అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న హమాస్ సొంతంగానే ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేసుకుందని పరిశీల కులు చెబుతున్నారు. అందరూ ఊహిస్తున్న దాని కంటే హమాస్ బాంబింగ్ వ్యవస్థ చాలా పెద్దది, కచ్చితమైనదని గాజా సిటీలోని అల్–అజార్ యూనివర్సిటీకి చెందిన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఖైమర్ అబూసదా చెప్పారు. ఈజిప్టు సహా పలు దేశాలు కఠినమై న ఆంక్షలు, నిబంధనలు విధించినప్పటికీ హమాస్ తన ఆయుధాగారాన్ని బలోపేతం చేసుకోవడం ఆసక్తికరమైన అంశం. ఇరాన్ అండదండలు అంతర్జాతీయంగా ప్రస్తుతం మార్మోగుతున్న హమాస్ 1987లో ఏర్పాటయ్యింది. నాటు›బాంబులతో మొదలైన హమాస్ ప్రస్థానం ఇప్పుడు లాంగ్రేంజ్ రాకెట్ల దాకా చేరింది. ఒక రాజకీయ సంస్థగా ప్రారంభమైన హమాస్ తదనంతరం వ్యవస్థీకృత సైన్యాన్ని నిర్వహించే స్థాయికి చేరిందని శత్రుదేశం ఇజ్రాయెల్ అంగీకరిస్తోంది. ప్రారంభంలో హమాస్ ఇజ్రాయెల్ పౌరులపై కాల్పులు జరిపేది, వారిని అపహరించేది. 2000వ దశకంలో ఆత్మాహుతి దాడుల్లో వందలాది మంది ఇజ్రాయెల్ వాసులను బలితీసుకుంది. 2005లో గాజాపై పట్టు బిగించాక ఇరాన్, సిరియా నుంచి ఆధునిక ఆయుధాలు కూడగట్టుకోవడం మొదలుపెట్టింది. ఇరుగు పొరుగు ముస్లిం దేశాలు హమాస్‌కు అక్రమంగా ఆయుధాలను సరఫరా చేశాయి. ఇందుకోసం అండర్‌గ్రౌండ్ సొరంగాలను హమాస్ ఉపయోగించుకుంది. ఆధునిక సాంకేతికతను, ఆయుధ తయారీ పరిజ్ఞానాన్ని హమాస్ సొంతం చేసుకుంది. ఆయు«ధ ఉత్పత్తి ప్రారంభించింది. 2012లో ఈజిప్టు అధ్యక్షుడిగా మోర్సీ ఎన్నిక కావడం హమాస్‌కు బాగా కలిసొచ్చింది. మోర్సీ హమాస్‌కు పూర్తిస్థాయిలో సహకరించారు. 2012లో మోర్సీ పదవీచ్యుతుడైన తర్వాత హమాస్‌ను ఇరాన్‌ను ఆదుకుంది. ఇరాన్ ఏటా హమాస్‌కు 100 మిలియన్ డాలర్ల మేర సాయం అందిస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ అంచనాల ప్రకారం.. హమాస్ వద్ద 7,000కు పైగా రాకెట్లు ఉన్నాయి. ఇజ్రాయెల్‌లో ఏమూలనైనా లక్ష్యంగా చేసుకోగల దూరశ్రేణి క్షిపణులు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే 300 యాంటీ ట్యాంక్, 100 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్స్‌ను సైతం సొంతం చేసుకుంది. అంతేకాకుండా 30 వేల మంది సుశిక్షితులైన సైనికులు, 400 మంది నేవీ కమెండోలున్నారు. -
పాకిస్తాన్లో హిందూ కుటుంబం దారుణ హత్య!
కరాచీ: పాకిస్తాన్‌లోని ముల్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రహీమ్‌యార్‌లోని అబుదాబి కాలనీలో హిందూ సామాజిక వర్గానికి చెందిన రామ్ చంద్ టైలరింగ్ చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం నాడు గుర్తు తెలియని దుండగులు అతడి ఇంట్లోకి చొరబడి పదునైన ఆయుధాలతో కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ దాడిలో కుటుంబంలోని ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఘటనా స్థలంలో నిందితులు వాడిన కత్తులు, గొడ్డళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా సంచలనం రేపిన ఈ హత్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వీరి కుటుంబం ప్రశాంతమైన జీవనం గడుపుతూ, అందరితోను కలిసిమెలిసి ఉండేవారని బిర్బల్డాన్ అనే సామాజిక కార్యకర్త తెలిపాడు. చదవండి: రెండు వారాలుగా ‘లైంగిక దాడి’ -
ఆయుధాల నవీకరణకు నిధులేవి?
దేశీయంగా ఆయుధ సేకరణ కోసం రక్షణరంగానికి చేసిన భారీ కేటాయింపు.. భారత రక్షణ పారిశ్రామిక పునాదిని విస్తృతపరుస్తుందని, మధ్యతరహా, చిన్న, సూక్ష్మ స్థాయి పరిశ్రమలను ప్రోత్సహించడంపై బహువిధ ప్రభావం వేస్తుందని రక్షణమంత్రి ఘనంగా ప్రకటించారు. ఎంచుకున్న లక్ష్యాలను చూస్తే ఆయన ప్రకటనను తప్పుపట్టలేం. కానీ చేదు నిజం ఏమిటంటే, దేశీయంగా రక్షణ కొనుగోళ్లకు కేటాయించిన రూ. 70,221 కోట్లలో అధికభాగం గతంలో రక్షణశాఖ హామీపడిన చెల్లింపులకు ఖర్చు కావడమే. అంటే పాత చెల్లింపులు పోతే కొత్త కొనుగోళ్లకు మిగిలేది అత్యంత తక్కువ మొత్తమేనని అర్థమవుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన భారీ మొత్తాన్ని పూర్తిగా స్థానిక రక్షణ విక్రేతలకు, నూతన ఒప్పందాల కింద ఆయుధాలు, పరికరాల సరఫరాదారులకు చెల్లిస్తారని భ్రమలు పెట్టుకోవలసిన పనిలేదు. రక్షణ సామగ్రి అవసరాల్లో ఆత్మనిర్భర్ లేక స్వావలంబన సాధించటానికి అధికశాతం ఆయుధ సామగ్రిని దేశీయంగానే సేకరించబోతున్నట్లు కేంద్రప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటనలో స్థానికతకు ఏమాత్రం చోటు లేదనిపిస్తోంది. ఈ ప్రతిపాదనలో కొత్త విషయమూ లేదు. అలాగని అసాధారణమైన అంశమూ లేదు. దీర్ఘకాలంగా వాయిదాలో ఉంటున్న ఈ లక్ష్య సాధనకు తోడ్పడటానికి రక్షణ మంత్రిత్వ శాఖకు కేటాయిస్తున్న ఆర్థిక కేటాయింపుల్లో అతి స్వల్పమాత్రంగానే పెంచడం అనే గత కాలపు ధోరణికి కేంద్రప్రభుత్వ తాజా ప్రకటన ఒక కొనసాగింపే తప్ప దీంట్లే మరే కొత్త విషయమూ లేదు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి దేశ రక్షణకోసం రూ.70,221 కోట్లు లేదా మొత్తం మూలధన కొనుగోలు బడ్జెట్లో 63 శాతం వరకు త్రివిధ దళాలకు దేశీయంగా సేకరించిన రక్షణ సామగ్రిపైనే వెచ్చించనున్నట్లు గత నెలలో రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దిగుమతులను బాగా తగ్గిం చుకుని మేక్ ఇన్ ఇండియా అనే ప్రభుత్వ భావనను బలోపేతం చేసే లక్ష్యం నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,35,061 కోట్ల మూలధన వ్యయంలో రక్షణ రంగంలో కొనుగోలు బడ్జెట్ కింద కేటాయించిన రూ.1,11,714 కోట్ల మొత్తం చిన్న భాగం మాత్రమే. ప్రస్తుత సంవత్సరం సవరించిన రక్షణ కొనుగోళ్ల వ్యయంలో వాస్తవానికి రూ. 2,551 కోట్లను తగ్గించడం గమనార్హం. ప్రధానంగా యుద్ధవిమానాలు, ఏరో ఇంజిన్లు, భారీ, మధ్యతరహా సైనిక వాహనాలతోపాటు త్రివిధ దళాలకు ఇతర పరికరాలను కొనడానికి ఈ మొత్తాన్ని కేటాయించారు. అనేక అధునాతన రక్షణ ప్లాట్‌ఫాంలు, వాటితో ముడిపడిన ప్రోగ్రామ్‌లు, భారతీయ వాయుసేనకు చెందిన ఇతర ప్రత్యేక ప్రాజెక్టుల కొనుగోలుకోసం ఈ కేపిటల్ అక్విజిషన్ బడ్జెట్ (సీఏబీ) నుంచి నిధులు కేటాయిస్తారు. ఈ రక్షణ కొనుగోలు బడ్జెట్ నుంచి చిన్న మొత్తాన్ని దేశీయంగా ఆయుధాల సేకరణపై వెచ్చించడం అనేది అసాధారణం కాదు. ఉదాహరణకు 2014–15 నుంచి 2018–19 (డిసెంబర్ 2019 వరకు) మధ్య కాలంలో రక్షణ రంగంపై చేసిన వ్యయం సీఏబీలో 60 శాతంగా ఉండిందని గ్రహించాలి. న్యూఢిల్లీలో ఈ సంవత్సరం ఒక వెబినార్ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన మొత్తం కంటే ఇది 3 శాతం మాత్రమే తక్కువ. ఈ కేటాయింపు భారత రక్షణ పారిశ్రామిక పునాదిని విస్తృతపర్చడంపై, మధ్యతరహా, చిన్న, సూక్ష్మ స్థాయి పరిశ్రమలను ప్రోత్సహించడంపై బహువిధ ప్రభావం వేస్తుందని రక్షణమంత్రి ఘనంగా ప్రకటించారు. అలాగే రక్షణ రంగ అవసరాలను తీర్చే స్టార్టప్‌లు, దేశీయ ఉపాధి అవకాశాలను కూడా ఇది గణనీయంగా పెంచుతుందని మంత్రి పేర్కొన్నారు. ఎంచుకున్న లక్ష్యాలను చూస్తే రక్షణమంత్రి ప్రకటనను తప్పుపట్టలేం. కానీ ప్రకటిత ఉద్దేశాలకు, అసలు వాస్తవానికి మధ్య కాస్త అంతరం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయితే చేదు నిజం ఏమిటంటే, దేశీయంగా రక్షణ కొనుగోళ్లకు కేటాయించిన రూ. 70,221 కోట్లలో అధికభాగం గతంలో రక్షణశాఖ హామీపడిన చెల్లింపులకు ఖర్చు కావడమే. లేదా గతంలో కొన్న రక్షణ ప్లాట్‌ఫాం, ఆయుధాల కొనుగోళ్లకు చెల్లించాల్సిన అసలు చెల్లింపులకు ఈ కేటాయింపులో అధిక భాగం సరిపోవచ్చు. విశ్వసనీయ అంచనా ప్రకారం ఇలా గతంలోని కొనుగోళ్లకు చెల్లించాల్సిన మొత్తం ప్రభుత్వం తాజాగా ప్రకటించిన రక్షణ కొనుగోళ్ల మొత్తంలో 80 నుంచి 90 శాతం వరకు ఉండటమే. అంటే పాత చెల్లింపులు పోతే కొత్త కొనుగోళ్లకు మిగిలేది అత్యంత తక్కువ మొత్తమేనని మనకు అర్థమవుతుంది. అంటే కేంద్రప్రభుత్వం తాజాగా ప్రకటించిన రూ. 70,221 కోట్ల మొత్తాన్ని పూర్తిగా స్థానిక రక్షణ విక్రేతలకు, నూతన ఒప్పందాల కింద ఆయుధాలు, పరికరాల సరఫరాదారులకు చెల్లిస్తారని భ్రమలు పెట్టుకోవలసిన పనిలేదు. ఈ వాస్తవ పరిస్థితి గురించి మన త్రివిధ బలగాలకు స్పష్టంగా తెలుసు. 2018 సంవత్సరంలోనే అప్పటి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్ నాటి రక్షణరంగంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి స్పష్టంగా ఒక విషయం తెలిపారు. సీఏబీలో భారత సాయుధ బలగాలకు కేటాయించిన అతి స్వల్ప మొత్తం కారణంగా 2018–19 ఆర్థిక సంవత్సరానికి గానూ, చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఆధునీకరణ ప్రక్రియపై భారత సైన్యం పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా హరీమన్నాయని ఆయన తేల్చిచెప్పారు. భారత సైనిక అవసరాలకు కేటాయించిన ఆర్థిక పొడిగింపు అనేది ద్రవ్యోల్బణాన్ని, పన్నుల పెంపుదలను తటస్థీకరించడానికి మాత్రమే సరిపోతుందని, మేకిన్ ఇండియా ప్రాజెక్టులకు, మౌలిక వనరుల అభివృద్ధికి, సైన్యం చెల్లించాల్సిన చెల్లింపులకు చాలా కొద్దిమొత్తమే మిగులుతుందని నాటి లెఫ్టినెంట్ జనరల్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి మొరపెట్టుకున్నారు. అంతకుమించి పొరుగు దేశంతో నిత్య ఘర్షణల నేపథ్యంలో జరూరుగా అవసరమైన మందుగుండు సామగ్రి, ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సమర్థ నిర్వహణకు ఇది తూట్లు పొడుస్తుందని శరత్ చంద్ వాపోయారు. అలాగే, సైన్యం వద్ద ఉన్న ఆయుధాల్లో 68 శాతం వరకు పురాతన కేటగిరీలో ఉంటున్నాయని, సమకాలీన అవసరాలకు సరిపోయే ఆయుధాలు 28 శాతం మాత్రమే ఉన్నాయని, అందులోనూ అత్యధునాతన ఆయుధ సామగ్రి 8 శాతం మాత్రమే భారత సైన్యం వద్ద ఉందని, ఈ పరిస్థితుల్లో రక్షణ రంగానికి కేటాయింపులు క్షీణిస్తూ పోతే భారత సాయుధ బలగాల ఆధునీకరణ ప్రక్రియనే అది సవాలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన మొత్తం ఎంత అనేది రక్షణ మంత్రి వెబినార్ సమావేశంలో పేర్కొనలేదు. రక్షణ శాఖ వద్ద ఈ సమాచారం ఉన్నప్పటికీ, పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీకి ఈ విషయం ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నప్పటికీ చెల్లించాల్సిన మొత్తం ఎంత అనేది రక్షణ శాఖ బహిరంగపర్చలేదు. రక్షణ బడ్జెట్లలో చెల్లింపులకు తక్కువ కేటాయింపులను చేస్తూ పోవడం వల్ల ఒక దశలో రక్షణ శాఖ ఇకేమాత్రం చెల్లింపులు చేయలేని స్థితికి దిగజారిపోవచ్చని రక్షణపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవలి నివేదికలో హెచ్చరించింది కూడా. దీంతో ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయ రక్షణ పరిశ్రమను ప్రోత్సహించడానికి అతి తక్కువ మాత్రమే కేటాయించాల్సి వచ్చింది. భారతీయ, విదేశీ రక్షణరంగ పరిశ్రమాధిపతులకు కూడా భారత రక్షణ శాఖ బడ్జెట్ వాస్తవాల గురించిన అవగాహన ఉంది. వెబినార్‌లో తాజాగా రక్షణశాఖ ప్రకటన వీరిలో కాస్త ఉత్సాహాన్ని కలిగించిందంటే దానికి కారణం.. సైనిక సామగ్రి కోసం ప్రపంచ మార్కెట్లో పనిచేస్తున్న ఆయుధాల విక్రేతలు భారతీయ రక్షణరంగ చీకటి జోన్లో ఏదో ఒకరకంగా మనుగడ సాగించాల్సి ఉండటమే. వీరి పరిస్థితి ఎలా ఉంటుం దంటే ద్రవరూప ఆక్సిజన్‌లో వీరు కూరుకుపోయినట్లు ఉంటుంది. దీన్ని మరింత స్పష్టంగా చెప్పాలంటే ద్రవరూప ఆక్సిజన్ వీరిని బతకనీయదు. ఆదే సమయంలో ఆక్సిజన్ వీరిని చావనివ్వదు. ఎందుకంటే జారీ చేసిన టెండర్లు, బహుకరించిన కాంట్రాక్టుల కోసం వీరు నిరంతరం వేచి ఉండాల్సి ఉంటుంది. దశాబ్దాలుగా రక్షణ రంగ వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఎలాంటి సత్ప్రయత్నాలు జరగటం లేదు. పైగా ఈ వ్యవస్థలో ఉంటున్న ప్రతి ఒక్కరూ యథాతథ స్థితిని కొనసాగిస్తూ ఉండిపోయారు. ఓ ఒక్కరి ఆచరణలోనూ సాహసోపేతమైన అడుగులు వేయలేదు. వీరిలో చాలామంది రంగం నుంచి తప్పుకున్నారు. పరస్పర ఆరోణలతో మంత్రిత్వ శాఖలోని పౌర సైనిక విభాగాలను మరింత నిరంకుశత్వం వైపు నెట్టేశారు. ప్రతిసారీ లక్ష్య సాధనవైపు అడుగేయడం, లోపభూయిష్టమైన పథకంతో కుప్పగూలడం.. దీంతో సర్వత్రా అనిశ్చితి రాజ్యమేలడం.. జరుగుతూ వస్తున్న క్రమం ఇదే మరి. అమిత్ కౌషిశ్, ఆర్థిక సలహాదారు రాహుల్ బేడీ, సీనియర్ జర్నలిస్ట్ -
అవమానించారు.. డబ్బులడిగారు: మను భాకర్
న్యూఢిల్లీ: ఒలంపియన్, షూటర్ మను భాకర్‌కు ఢిల్లీ ఇందిరా గాంధీ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదరయ్యింది. ఆయుధాలు తీసుకెళ్లడానికి వీలు లేదంటూ ఎయిర్ ఇండియా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. అంతేకాక డబ్బులు కూడా డిమాండ్ చేశారు. చివరకు మంత్రి కిరెణ్ రిజుజు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఈ మేరకు మను భాకర్ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘‘షూటింగ్ ట్రైనింగ్ నిమిత్తం నేను మధ్యప్రదేశ్ భోపాల్‌లోని షూటింగ్ అకాడమీకి వెళ్లాల్సి ఉంది. ఈ సమయంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని నాతో పాటు తీసుకెళ్లడం తప్పని సరి. ఈ క్రమంలో నేను ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాను. ఏఐ 437 విమానంలో నేను ప్రయాణించాల్సి ఉంది. కానీ ఎయిర్‌పోర్టు సిబ్బంది నన్ను విమానం ఎక్కడానికి అనుమతించలేదు. అన్ని పత్రాలు చూపించినప్పటికి వారు నన్ను డబ్బులు అడిగారు. డీజీసీఏ అనుమతి ఇచ్చినప్పటికి వారు 10,200 చెల్లించాలని తెలిపారు’’ అన్నారు ‘‘వారిలో ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఇన్ చార్జ్ మనోజ్ గుప్తా, మిగతా సిబ్బంది నన్ను దారుణంగా అవమానించారు. నన్ను క్రిమినల్ కన్నా దారుణంగా చూశారు. కాస్త మర్యాదగా ప్రవర్తించమని నేను వారిని కోరాను. ప్రతిసారి ఇలా ఆటగాళ్లను అవమానించకండి.. వారి దగ్గర డబ్బులు అడగకండి’’ అంటూ ట్వీట్ చేశారు మను భాకర్. దాంతో పాటు కేంద్ర మంత్రి కిరెణ్ రిజుజు, హర్దీప్ సింగ్ పూరిని ట్యాగ్ చేశారు. IGI Delhi .Going to Bhopal (MP Shooting Acadmy For my training i need to carry weapons and ammunition, Request @airindiain Officials to give little respect or at least don’t Insult players every time &please don’t ask money. I Have @DGCAIndia permit @HardeepSPuri @VasundharaBJP pic.twitter.com/hYO8nVcW0z — Manu Bhaker (@realmanubhaker) February 19, 2021 ఈ ట్వీట్‌పై కిరెణ్ రిజుజు స్పందించారు. ఎయిర్ ఇండియా సిబ్బందితో మాట్లాడి వివాదానికి ముగింపు పలికారు. అనంతరం కిరెణ్ రిజుజుకు కృతజ్ఞతలు తెలిపారు మను భాకర్. ప్రస్తుతం ఈ వివాదంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘‘దేశాన్ని దోచుకుని.. దొంగ పత్రాలతో ఇక్కడి నుంచి పారిపోయే వారికి మర్యాద ఇస్తారు.. అంతర్జాతీయ వేదిక మీద దేశ ఖ్యాతిని ఇనుమడింపచేసేవారి విషయంలో ఇలా ప్రవర్తించడం దారుణం’’ అంటూ విమర్శిస్తున్నారు నెటిజనులు. దీనిపై ఎయిర్ ఇండియా సిబ్బంది స్పందించింది. డబ్బులు అడిగిన మాట వాస్తవమే కానీ అది లంచం కాదని .. ఆయుధాలను తీసుకెళ్లేందుకు చెల్లించాల్సిన చార్జీలుగా పేర్కొన్నది. అంతేకాక ఎయిరిండియా క్రీడాకారులను ఎన్నటికి అవమానించదని.. వారిని ప్రోత్సాహిస్తుందని.. గౌరవిస్తుందని తెలిపింది. చదవండి: ‘ఎవరికీ క్రీడలంటే పరిజ్ఞానం లేదు’ 'టాటా' యుద్ద విమానాలు వచ్చేస్తున్నాయి! -
భారత్ అద్భుత విజయానికి 50ఏళ్ళు పూర్తి.. ఆంద్రా ఆర్మీ వేడుకలు
-
చైనాతో ముప్పు.. భారత్‌కు డ్రోన్లు!
న్యూఢిల్లీ: ప్రస్తుతం చైనాకి భారత్‌కి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉద్రక్తిత వాతావరణం నెలకొంది. అందుకే భారత్ భారీగా సరిహద్దులో బలగాలను మొహరిస్తోంది. ఇప్పుడు భారత్ తన శక్తి సామర్ధ్యాలను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. పనిలో పనిగా ఆధునిక పరిజ్ఞానం కలిగిన ఆయుధాలను భారత అమ్ములపొదిలో చేరుస్తోంది. ముఖ్యంగా డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించింది. ఈ మధ్యకాలంలో అధిక సంఖ్యలో డ్రోన్లను కొనుగోలు చేస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన హెరాన్, అమెరికాకు చెందిన మినీ డ్రోన్లు త్వరలోనే భారత్ చేతికి అందనున్నాయి. ఈ డ్రోన్లు భారత్ కు తీసుకొని వచ్చే ఒప్పందం తుది దశలో ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ నెలలో ఈ కీలక ఒప్పందం కుదిరే అవకాశముంది. ఈ డ్రోన్లను భారత్ తూర్పు లద్దాఖ్‌తో పాటు చైనా సరిహద్దుల్లో వీటిని మొహరించనుంది. ఈ డ్రోన్లను ముఖ్యంగా ఓ ప్రాంతంలోని నిర్దిష్ట సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగించనున్నారు. ఈ మధ్యకాలంలో సరిహద్దులో చైనా బరితెగింపు చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు రక్షణ శాఖ అత్యవసర కొనుగోళ్లకు అనుమతులివ్వడంతో అనేక రకాల ఆయుధాలను అత్యవసరంగా భారత సైన్యంలోకి తీసుకొని వస్తున్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాలు తమ ఆయుధ సంపత్తిని మరింత బలోపేతం చేసుకుంటున్నాయని విశ్లేషకులు అంటున్నారు. -
పాక్ కుట్రను తిప్పి కొట్టిన భారత్
శ్రీనగర్: భారత్‌లో పేలుళ్లే లక్ష్యంగా పాక్ పన్నిన కుట్రల్ని భారత ఆర్మీ భగ్నం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి కశ్మీర్‌లోని కెరాన్ సెక్టార్‌కు భారీ ఎత్తున ఆయుధాలు తరలించడానికి చేసిన ప్రయత్నాలను ఆర్మీ తిప్పికొట్టినట్టు సైనిక అధికారి ఒకరు వెల్లడించారు. కెరాన్ సెక్టార్లో నాలుగు ఏకే74 రైఫిళ్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కిషన్‌గంగ నది మీదుగా ఒక తాడు సాయంతో ఇద్దరు, ముగ్గురు దుండగులు ఒక పెద్ద ట్యూబులో ఆయుధాలను ఉంచి తరలిస్తుండగా జవాన్లు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగి రైఫిల్స్, 8 మ్యాగజైన్స్‌తో పాటుగా రెండు పెద్ద సంచుల నిండా ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతమంతా అణువణువునా గాలిస్తున్నట్టుగా లెఫ్ట్‌నెంట్ జనరల్ బీఎస్ రాజు వెల్లడించారు. ‘అప్రమత్తంగా ఉంటూ పాక్ చేసిన ఏ పనినైనా తిప్పి కొడతాం’అని చెప్పారు. కెరాన్, టాంగ్ధర్, జమ్మూ, పంజాబ్ సెక్టార్లలో కశ్మీరీ యువతని ఉగ్రవాదం వైపు మళ్లించడానికి పాక్ నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉందని ఆ కమాండర్ తెలిపారు. కాగా, కశ్మీర్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గామ్ జిల్లాలోని చింగామ్‌లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు సోదాలు చేపట్టాయి. నక్కి ఉన్న ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరపగా, భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దదూరా ప్రాంతంలో ఇదే రీతిలో జరిగిన మరో ఎన్కౌంటర్లో కూడా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. -
ఇరాన్‌పై వీగిన అమెరికా తీర్మానం
ఐక్యరాజ్యసమితి: ఇరాన్‌పై ఐక్యరాజ్య సమితి విధించిన ఆయుధ ఆంక్షలను నిరవధికంగా కొనసాగించాలని కోరుతూ అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం భద్రతా మండలిలో వీగిపోయింది. అమెరికా తీర్మానానికి అనుకూలంగా కేవలం డొమినికన్ రిపబ్లిక్ నుంచి మాత్రమే మద్దతు లభించింది. తీర్మానాన్ని ఆమోదించడానికి భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల్లో కనీసం 9 దేశాలు మద్దతు పలకాల్సి ఉంటుంది. అమెరికా తీర్మానానికి అనుకూలంగా రెండు ఓట్లు, వ్యతిరేకంగా రెండు ఓట్లు రాగా, 11 మంది సభ్యులు ఓటింగ్‌కి దూరంగా ఉన్నారు. ఈ తీర్మానాన్ని రష్యా, చైనా తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే, తమ వీటో పవర్‌ని ఉపయోగించే అవసరం ఆ దేశాలకు రాలేదు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తీర్మానం ఓడిపోయినట్లు ప్రకటించారు. 2015లో ఇరాన్‌కీ, ఆరు పెద్ద దేశాలైన రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల మధ్య, అణ్వాయుధ నిరాయుధీకరణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తూ, నిరాయుధీకరణకు కృషిచేయాలి. ఈ ఒప్పందం నుంచి 2018లో ట్రంప్ ప్రభుత్వం వైదొలిగింది. -
సాయుధులుగానే ఉన్నారు
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల్లో గస్తీ విధుల్లో ఉన్న భారతీయ సైనికుల వెంట ఆయుధాలు కూడా ఉంటాయని, వారు తమ పోస్ట్‌ను వదిలి బయటకు వెళ్లే ప్రతీసారి ఆయుధాలను కూడా తీసుకునే వెళ్తారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం స్పష్టం చేశారు. ‘ఆయుధాలు ఇవ్వకుండా సైనికులను మృత్యుఒడికి పంపిస్తారా?’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు జైశంకర్ సమాధానమిచ్చారు. ‘1996లో, 2005లో భారత్, చైనాల మధ్య కుదిరిన రెండు ద్వైపాక్షిక ఒప్పందాల్లోని నిబంధనల ప్రకారం.. రెండు దేశాల సరిహద్దు గస్తీ బృందాలు ఆయుధాలను ఉపయోగించకూడదు’ అని జై శంకర్ వివరించారు. సోమవారం రాత్రి గాల్వన్ లోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణల సమయంలోనూ.. విధుల్లో ఉన్న భారతీయ సైనికులు సాయుధులుగానే ఉన్నారని తెలిపారు. ‘నిరాయుధులైన భారతీయ సైనికుల ప్రాణాలు తీసి చైనా పెద్ద నేరం చేసింది. ఆ సైనికులను నిరాయుధులుగా ప్రమాద ప్రాంతానికి ఎవరు, ఎందుకు పంపించారు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?’ అని రాహుల్ గాంధీ ఒక వీడియో సందేశంలో ప్రశ్నించారు. భారతీయ సైనికుల త్యాగంపై రెండు రోజుల తరువాత రక్షణమంత్రి రాజ్‌నాథ్ స్పందించారని రాహుల్ విమర్శించారు. అది కూడా, తన నివాళి ట్వీట్లో చైనా పేరును ప్రస్తావించకుండా, భారత సైన్యాన్ని రాజ్‌నాథ్ అవమానించారని ఆరోపించారు. భారత సైనికులు చనిపోవడం చాలా బాధాకరం. విధుల్లో భాగంగా మన సైనికులు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి అమరులయ్యారు’ అని బుధవారం ఉదయం రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. -
ఎనిమిదేళ్ల క్రితం అపహరించిన ఆయుధాలు లభ్యం
భద్రాద్రి కొత్తగూడెం, చర్ల: సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఎనిమిదేళ్ల క్రితం పోలీసుల వద్ద నుంచి అపహరించిన ఆయుధాల్లో కొన్ని ఇటీవల లభ్యమయ్యాయి. 2013, మే 25న సుకుమా–జగదల్‌సూర్ మార్గంలోని 30వ నంబర్ జాతీయ రహదారి (గతంలో 221 నంబర్ జాతీయ రహదారి)లో ఉన్న జెర్రూం ఘాట్ రోడ్లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పరివర్తన్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న సల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మ కాన్వాయ్‌ను మావోయిస్టులు అడ్డుకున్నారు. శక్తిమంతమైన మందుపాతరను పేల్చి 27 మందిని హతమార్చారు. మహేంద్రఖర్మతోపాటు 8 మంది పోలీస్ సిబ్బంది, 12 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇద్దరు కార్యకర్తలు, నలుగురు గ్రామస్తులు ఉన్నారు. ఈ ఘటనలో మావోయిస్టులు పోలీసు బలగాలకు చెందిన తొమ్మిది ఏకే 47 తుపాకులు, 7 ఇన్శాస్ రైఫిళ్లు, 2 ఎస్ఎల్ఆర్ తుపాకులు, 4 నైన్ ఎంఎం పిస్టళ్లు అపహరించుకుపోయారు. ఈ ఆయుధాలను నాటి నుంచి మావోయిస్టులు వినియోగిస్తూనే ఉన్నారు. ఇటీవల రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని మన్పూర్కు సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్దోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటన స్థలంలో పోలీసులు నాలుగు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక ఏకే 47 కూడా ఉంది. ఆ ఆయుధాలన్నీ మహేంద్రఖర్మ హత్య జరిగిన రోజు మావోయిస్టులు అపహరించినవేనని రాజ్‌నంద్‌గావ్ జిల్లా ఎస్పీ జితేంద్ర శుక్లా తెలిపారు. -
డబ్బులు తీసుకుని పాత ఆయుధాలిచ్చారు
చండీగఢ్: రెండు దశాబ్దాల క్రితం కార్గిల్ యుద్ధ సమయంలో ఆకస్మిక సైనిక అవసరాలను తీర్చడానికి అవసరమైన ఉపగ్రహ చిత్రాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి కోసం కొన్ని దేశాలు భారత్ నుంచి అధిక చార్జీలు వసూలు చేశాయని రిటైర్డ్ ఆర్మీ చీఫ్ వీపీ మాలిక్ పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో వీపీ మాలిక్ భారత సైన్యానికి నాయకత్వం వహించారు. మిలిటరీ లిటరేచర్ ఫెస్టివల్లో ‘మేక్ ఇన్ ఇండియా అండ్ ది నేషన్స్ సెక్యూరిటీ’పై చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. ‘కార్గిల్ యుద్ధ సమయంలో ఇతర దేశాల నుంచి అత్యవసరమైన ఆయుధాల కొనుగోళ్లలో వారు మమ్మల్ని దోపిడీ చేశారు. మేము తుపాకుల కోసం ఒక దేశాన్ని సంప్రదించినప్పుడు వారు మొదట్లో ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత పాత ఆయుధాలను ఆధునీకరించి సరఫరా చేశారు. మందుగుండు సామగ్రి కోసం మరొక దేశాన్ని సంప్రదించినప్పుడు 1970 నాటి పాతకాలపు మందుగుండు సామగ్రిని ఇచ్చారు’అని తెలిపారు. అలాగే కార్గిల్ సమయంలో భారతదేశం కొనుగోలు చేసిన ప్రతి ఉపగ్రహ చిత్రానికి రూ.36 వేలు చెల్లించాల్సి వచ్చిందని, ఆ చిత్రాలు కూడా తాజావి కావని, మూడేళ్ల క్రితం చిత్రాలని వీపీ మాలిక్ పేర్కొన్నారు. -
మహిళలు కోరితే ఆయుధాలు ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్ : ఆత్మరక్షణ కోసం మహిళలు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ఆయుధాలిస్తుందా? ఈ దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఆలోచన చేస్తుందా? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు కేటాయించిన గన్మెన్లను తొలగించి, మహిళా రక్షణకు వారికి గన్మెన్లను ఇవ్వాలని లేదా వారికి ఆయుధాలైనా ఇవ్వాలని ఆయన సూచించారు. ఎన్కౌంటర్లతో హత్యాచారాలకు ఫుల్స్టాప్ పడుతుం దని ప్రభుత్వం భావించవద్దని, అసలు హత్యాచారాలు నిరోధించడానికి చర్యలు తీసుకుంటేనే ఉత్తమమని ఆయన శనివారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఎన్కౌంటర్ ముఖ్యమంత్రి చేయించారనే విధంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారని, ఆ చర్యను ప్రోత్యహించే విధంగా ఆయన మాట్లాడటం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. -
అమెరికాతో భారత్ భారీ ఆయుధ డీల్
వాషింగ్టన్: అమెరికా నుంచి భారత్ భారీగా ఆయుధాలు కొనుగోలు చేయనుంది. ఈ ఆయుధ ఒప్పందం విలువ రూ. 7 వేల కోట్లు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్‌కు సమాచారం అందించారు. భారత నౌకాదళానికి 13 ఎమ్కే45, 5 ఇంచ్/62 కేలిబర్ (మోడ్ 4) నావల్ గన్స్ అమ్ముతున్నట్లు ట్రంప్ చెప్పారు. వీటిని బీఏఈ సిస్టమ్స్ అండ్ ఆర్మామెంట్స్ సంస్థ తయారుచేస్తోంది. ఈ ఆయుధాల ద్వారా భారత్ పొరుగు దేశాల నుంచి తనకున్న ప్రమాదాలను ఎదుర్కోగలదని ట్రంప్ అధికార కార్యాలయం తెలిపింది. ఈ డీల్ ద్వారా అత్యాధునిక ఆయుధాలు కలిగిన దేశంగా భారత్ మారిందని చెప్పింది. -
జైల్లో ఇవేమిటి?
కర్ణాటక, బనశంకరి: బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార జైలంటే ఎంతో భద్రత కలిగిన కారాగారం. కానీ జైల్లో కత్తులు, సిగరెట్లు, గంజాయి తదితరాలు సులభంగా చేరిపోతున్న వైనం మరోసారి బయటపడింది. జైల్లో బుధవారం సీసీబీ పోలీసులు చేసిన దాడుల్లో వీటితో పాటు మొబైల్ సిమ్‌కార్డులు దొరికాయి. పలువురు ఖైదీల వద్ద, సెల్లలోను, బాత్రూంలు, రహస్య ప్రాంతాల్లో ఇవి లభించాయి. పరప్పన అగ్రహార జైలు నుంచి కొందరు ఖైదీలు నగరంలో నేర కార్యకలాపాలను తమ అనుచరుల ద్వారా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సీసీబీ జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్‌పాటిల్ నేతృత్వంలో జైలులో సోదాలు చేశారు. పలువురు ఖైదీలు దాచుకున్న 37 చాకులు,డ్రాగర్లు, గంజాయి, గంజాయి తాగే పైపు లు, మొబైల్సిమ్కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎలా వెళ్తున్నాయి బెంగళూరు నగరంలో రౌడీ కార్యకలాపాల అణచివేతకు అప్పుడప్పుడు జైలులో తనిఖీలు చేస్తామని సందీప్‌పాటిల్ తెలిపారు. జైలులో ఉన్న బెంగళూరు రౌడీలను విచారిస్తున్నట్లు తెలిపారు. జైలులో స్వాదీనం చేసుకున్న వస్తువులు, సిమ్‌కార్డులు గురించి జైలులో ఉన్న ఉన్నతాధికారులతో సమాచారం సేకరిస్తున్నామని సందీప్‌పాటిల్ తెలిపారు. పరప్పన జైలులో ఎంతమంది సిబ్బందితో కాపలా పెట్టినా ఖైదీలు, రిమాండు ఖైదీలు సెల్ఫోన్ల ద్వారా నగరంలో నేర కలాపాలను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జైలు సిబ్బంది కుమ్మక్కు కావడంతో సులభంగా మొబైళ్లు, గంజాయి, కత్తులను కూడా లోపలికి వెళ్లిపోతున్నట్లు ఆరోపణలున్నాయి. కొందరు పేరుమోసిన ఖైదీలు జైలులో ఉంటూ మొబైల్ ద్వారా అండర్‌వరల్డ్ డాన్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. జైల్లో ఉండి నేరాలు చేయిస్తే సాక్ష్యాధారాలు దొరకవని నేరగాళ్ల ధీమా. -
డ్రోన్లతో భారత్‌లోకి పాక్ ఆయుధాలు
చండీగఢ్: పాకిస్థాన్‌లోని ఖలిస్థాన్ ఉగ్రమూకలు సెప్టెంబర్ 9 నుంచి 16 వరకు డ్రోన్ల ద్వారా 80 కేజీల బరువుగల ఆయుధాలూ, మందుగుండు సామాగ్రిని సరిహద్దులగుండా భారత్‌లోనికి జారవిడిచినట్టు భారత భద్రతాదళాలూ, పంజాబ్ పోలీసులు ధృవీకరించారు. కశ్మీర్లో ఉగ్రవాదుల కార్యకలాపాలను ప్రేరేపించడం కోసం పాకిస్తాన్ గూఢచారి వ్యవస్థ మద్దతుతో ఖలిస్థాన్ తీవ్రవాద శక్తులు ఈ చర్యకు పాల్పడినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన అమృత్‌సర్‌లోని తరన్ తరన్ జిల్లాలో డ్రోన్ల ద్వారా జారవిడిచిన ఆయుధసామగ్రిపై విచారణ జరపడంతో విషయంవెలుగులోకి వచ్చింది. పంజాబ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను ముమ్మరం చేయడం కోసం పాకిస్తాన్, జర్మనీ మద్దతుతో ఖలిస్తాన్ జిందాబాద్ ఉగ్రమూకలు కుట్రపన్నుతున్నట్టు భారత భద్రతాదళాలు వెల్లడించాయి. పాకిస్థాన్ సరిహద్దుల్లో 2 కిలోమీటర్ల దూరం నుంచి ఈ డ్రోన్లను పంపించారు. అయితే ఇవి 2000 అడుగుల ఎత్తులో ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించి, 1200 అడుగుల కిందకి దిగి ఆయుధాలను జారవిడిచినట్టు వెల్లడయ్యింది. డ్రోన్ల ద్వారా జారవిడిచిన వాటిలో ఐదు ఏకే – 47 తుపాకులు, 16 మ్యాగజైన్స్, 472 రౌండ్లకు సరిపడా మందుగుండ్లు, చైనాలో తయారైన నాలుగు 30 బోర్ పిస్టల్స్ తదితర సామాగ్రితో పాటు ఐదు సాటిలైట్ ఫోన్లు, రెండు మొబైల్ ఫోన్లు, రెండు వైర్లెస్ సెట్లు, 10 లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వా«ధీనం చేసుకున్నారు. డ్రోన్లు వస్తే పేల్చేస్తాం హిసార్: ఇతర దేశాల సరిహద్దుల నుంచి భారత్‌లోకి ఎలాంటి డ్రోన్లు, అనుమానిత పరికరాలు ప్రవేశించినా వెంటనే పసిగట్టే సత్తా మన సైనిక దళాలకు ఉందని సౌత్ వెస్ట్రన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అలోక్‌సింగ్ క్లేర్ చెప్పారు. భారత్–పాక్ సరిహద్దు వెంట ఉగ్రవాదులు డ్రోన్ల సాయంతో ఆయుధాలను జార విడుస్తున్నా రంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. పాకిస్తాన్ భూభాగం నుంచి భారత్‌లోకి వైపు డ్రోన్లు ప్రవేశిస్తే వెంటనే పేల్చేస్తామని స్పష్టం చేశారు. డ్రోన్ల గురించి ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న డ్రోన్ల సామర్థ్యం పరిమితమేనన్నారు. -
మిలటరీ నవీకరణకు 9.32 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఓవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా నుంచి భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్న వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాబోయే 5–7 ఏళ్లలో ఏకంగా రూ.9.32 లక్షల కోట్ల(130 బిలియన్ డాలర్ల)ను ఖర్చుపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. ఈ విషయమై కేంద్ర ఉన్నతాధికారి ఒకరు మట్లాడుతూ.. భారత సైన్యం, వాయుసేన, నౌకాదళంలో ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు కీలకమైన ఆయుధాలు, మిస్సైళ్లు, యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, యుద్ధ నౌకలను సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇందులో భాగంగా పదాతి దళాలను ఆధునీకరించడంతో పాటు ఆర్మీ కోసం 2,600 పదాతిదళ పోరాట వాహనాలు(ఐఎఫ్వీ), 1,700 అత్యాధునిక పోరాట వాహనాలను సమకూర్చుకోనున్నట్లు పేర్కొన్నారు. ఐఏఎఫ్‌కు 110 ఫైటర్ జెట్లు.. అలాగే వాయుసేన(ఐఏఎఫ్) కోసం 110 మల్టీరోల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని ముఖ్యమైన నగరాలపై శత్రుదేశాల క్షిపణి దాడులు జరగకుండా గగనతలాన్ని సురక్షితంగా ఉంచేందుకు మరో మెగా ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టిందని సీనియర్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే 5,000 కి.మీ దూరం లోని శత్రు లక్ష్యాలను ఛేదించే అణ్వస్త్ర సామర్థ్యమున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని–5’ భారత అమ్ములపొదిలో చేరనుందన్నారు. -
పోలీసు బలగాలకు అన్నీ కొరతే
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పోలీసు బలగాల ఆధునీకరణ కోసం కేంద్రం 2019–2020 వార్షిక బడ్జెట్లో గత ఏడాది కన్నా ఎనిమిది శాతం నిధులను పెంచింది. టెలిఫోన్స్, వైర్లెస్ డివైసెస్, వాహనాలు, ఆధునిక ఆయుధాల కోసం ఈ నిధులను వినియోగించాలని, మ్యాచింగ్ గ్రాంట్లను విడుదల చేసిన వెంటనే గ్రాంటులను విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధమని ప్రకటించింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు బలగాల ఆధునీకరణకు ఎలాంటి శ్రద్ధ తీసుకోవడం లేదు. పోలీసు బలగాల ఆధునీకరణ నిధులు ఏడాదికేడాది మురుగి పోతున్నాయి. ‘బ్యూరో ఆఫ్ పోలీస్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్’ ప్రకారం దేశంలోని 267 పోలీసు స్టేషన్లకు టెలిఫోన్ సౌకర్యం లేదు. 129 స్టేషన్లకు వైర్లెస్ కమ్యూనికేషన్ పరికరాలు లేవు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పెట్రోలింగ్ జరపడానికి, ఆపదలో ఉన్నాం, ఆదుకొనమని ఫోన్లు వస్తే స్పందించేందుకు ప్రతి వంద మంది పోలీసులకుగాను ఎనిమిది వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2012 నాటికి దేశంలో వైర్లెస్ కమ్యూనికేషన్ పరికరాలు లేని పోలీసు స్టేషన్లు 39 ఉండగా, 2016 నాటికి వాటి సంఖ్య 129కి చేరుకున్నాయి. 2017 సంవత్సరం నాటికి దేశంలో 273 పోలీసు స్టేషన్లకు ఒక్క వాహనం కూడా లేదు. మణిపూర్‌లో 30, జార్ఖండ్‌లో 22, మేఘాలయ 18 పోలీసు స్టేషన్లకు వైర్లెస్ కమ్యూనికేషన్ డివైస్ ఒక్కటి కూడా లేదు. 2012లో టెలిఫోన్ సదుపాయంలేని పోలీసు స్టేషన్లు 296 ఉండగా, 2017 నాటికి వాటి సంఖ్య 269కి తగ్గాయి. ఉత్తరప్రదేశ్‌లోని 51 పోలీసు స్టేషన్లు, బీహార్‌లోని 41 స్టేషన్లకు, పంజాబ్‌లో 30 పోలీస్ స్టేషన్లకు టెలిఫోన్ సౌకర్యం లేదు. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో క్రైమ్ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు స్టేషన్ల ఆధునీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇక ఆయుధాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆత్యాధునిక ఆయుధాలను పక్కన పెడితే సాధారణ తుపాకుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. పశ్చిమ బెంగాల్‌కు 71 శాతం, కర్ణాటకకు 37 శాతం, పంజాబ్‌కు 36 శాతం ఆయుధాల కొరత ఉంది. పోలీసు బలగాల ఆధునీకరణ కోసం 70 కోట్ల రూపాయల ప్రతిపాదనలు రాగా, అందులో 38.31 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరుకాగా, 32.99 కోట్ల రూపాయలు మాత్రమే ఉపయోగించినట్లు ఐదు రాష్ట్రాల బడ్జెట్‌ను 2014 నుంచి 2018 వరకు సమీక్షించిన కాగ్ వెల్లడించింది. దాదాపు మిగతా రాష్ట్రాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. -
అటవీ సిబ్బందికి ఆయుధాలు
విశాఖపట్నం, నర్సీపట్నం: ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించేందుకు అటవీ సిబ్బందికి ఆయుధాలు అందజేస్తామని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ మహమ్మద్ ఇలియాస్ రిజ్వీ తెలిపారు. గురువారం ఆయన నర్సీపట్నం అటవీ డివిజన్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. అనంతరం అటవీ రేంజ్ కార్యాలయం వద్ద విశాఖపట్నం, విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల డీఎఫ్‌వోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అటవీ సిబ్బందికి 125 రివాల్వర్లను ఇప్పటికే అందజేశామన్నారు. త్వరలో 250 వరకు డబుల్ బార్ గన్స్ అందజేయనున్నట్టు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్న కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ముఖ్య అధి కారులతో త్వరలో ఉమ్మడి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎర్రచందనం రవాణా నిరోధానికి తీసుకోవలసిన చర్యలపై చర్చిస్తామన్నారు. పోలీసు, కస్టమ్స్, ఎక్సై జ్, రెవెన్యూ, అటవీశాఖ సమన్వయంతో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధిస్తామని ఆయన స్ప ష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 శాతం అడవుల విస్తీర్ణం ఉందని, దీనిని 33 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకు కోసం రహదారులకు ఇరువైపులా, పాఠశాలలు, కాలు వ గట్లు, ప్రతి ఇంటి ముందు మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతరించిపోతున్న అటవీ వనాల అభివృద్ధికి ప్రత్యేక ప్లాంటేషన్లు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో 32 వేల హెక్టార్లలో రూ.27 కోట్లతో వనాల పెంపకం చేపడుతున్నామని వివరించారు. ఈ పర్యటనలో సీసీఎఫ్ రాహుల్‌పాండే పాల్గొన్నారు. -
న్యూజిలాండ్‌లో తుపాకులపై నిషేధం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ సిటీలో ఇటీవల ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో ఇకపై దాడిలో వాడే తుపాకులపై ఆ దేశం గురువారం తక్షణ నిషేధం విధించింది. తుపాకులు, సైన్యం వాడే గన్ల మాదిరి ఉండే సెమీ–ఆటోమేటిక్ తుపాకులను అన్నింటినీ తక్షణం నిషేధిస్తున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తెలిపారు. క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదులపై ఓ శ్వేతజాతీయుడు గత శుక్రవారం కాల్పులు జరిపి 50 మంది చంపేయడం తెల్సిందే. ‘శుక్రవారం నాటి దాడి కోసం ఉగ్రవాది వాడిన రకం తుపాకులపై నిషేధం విధిస్తున్నాం. వాటిని కొనాలనుకుంటే పోలీసుల అనుమతి తప్పనిసరి. గతంలో కొన్నవాటికి వెనక్కిఇస్తే డబ్బు చెల్లిస్తాం’ అని ప్రధాని చెప్పారు. ఇక అమెరికాలో తుపాకులపై నిషేధం విధించాలని ఎప్పటినుంచో డిమాండ్లు ఉండటం తెలిసిందే. న్యూజిలాండ్ నిర్ణయంతో తాజాగా అమెరికాలో ఆ డిమాండ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. పలువురు అమెరికా రాజకీయ నేతలు సహా తుపాకుల విచ్చలవిడి వినియోగాన్ని వ్యతిరేకిస్తున్న వారంతా అమెరికా కూడా తుపాకులపై నిషేధం విధించాలని కోరుతున్నారు. బతికున్న వ్యక్తిని చనిపోయాడన్నారు.. బతికున్న ఓ వ్యక్తి పేరును క్రైస్ట్‌చర్చ్ కాల్పుల ఘటనలో చనిపోయిన వారి జాబితాలో పోలీసులు పొరపాటున చేర్చారు. కాల్పులు జరిపిన బ్రెంటన్ టారంట్‌పై పోలీసులు తయారుచేసిన అభియోగప త్రంలో బతికున్న ఓ వ్యక్తి పేరును చేర్చి పోలీసులు దానిని కోర్టుకు సమర్పించారు. ఆ వ్యక్తితో మాట్లాడి క్షమాపణ కోరామనీ, అభియోగపత్రంలో అతని పేరును తొలగించామని పోలీసులు చెప్పారు. -
న్యూజిలాండ్ సంచలన నిర్ణయం
న్యూజిలాండ్ ప్రధామంత్రి జసిండా అర్డెర్న్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. గతవారం క్రైస్ట్‌చర్చ్ మసీదులో కాల్పుల మారణహోమం ఉదంతాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రధాని జసిండా అసాల్ట్ రైఫిల్స్, సెమీ ఆటోమెటిక్ రైఫిళ్ల అమ్మకాలపై నిషేధం విధిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. సెమీ ఆటోమెటిక్ రివాల్వర్లతోపాటు బ్రెంటన్ వాడిన అన్ని రకాల ఆయుధాలపైనా నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందంటూ ప్రధాని ఒక అధికారిక ప్రకటన జారీ చేశారు. అలాగే కఠినమైన తుపాకీ చట్టాల చట్టం ఏప్రిల్ 11 నాటికి తీసుకురానున్నామని చెప్పారు. ఈ తుపాకీ చట్టం అమల్లోకి రావడానికంటే ముందు మధ్యంతర చర్యగా ఆయుధాల అమ్మకాలపై బ్యాన్ విధించినట్టు జసిండా వివరించారు. మార్చి 15న క్రైస్ట్‌చర్చ్‌లోని మసీదుల్లో బ్రెంటన్ అనే ఆస్ట్రేలియా యువకుడి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 50మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే త్వరితగతిన స్పందించిన న్యూజిలాండ్ ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. ఇకపై రైఫిళ్లను ఎవరు బడితే వాళ్లు కొనే ఛాన్స్ లేకుండా కట్టడి చేసింది. ఇందుకు సంబంధించి మిలిటరీలో వాడే అన్ని రకాల తుపాకులనూ బయటి మార్కెట్లో అమ్మడాన్ని నిషేధిస్తున్నట్లు ఆమె తెలిపారు. అసాల్ట్ రైఫిల్స్, ఎక్కువ శక్తిమంతమైన రైఫిళ్లతో పాటూ ఫైర్ ఆర్మ్‌ను మిలిటరీ తరహా ఆటోమేటిక్ తుపాకులుగా మార్చే పరికరాలను కూడా ఇకపై ఎవరూ అమ్మడానికి వీల్లేదన్నారు. ఈ చర్యలతో న్యూజిలాండ్‌లో ఉగ్రవాద చర్యలను దాదాపు పూర్తిగా అడ్డుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. -
అబద్ధాలు చెప్పేందుకు సిగ్గుపడట్లేదా?
సాక్షి, న్యూఢిల్లీ: అమేథి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అబద్ధాలు చెప్పారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘2010లో నేనే స్వయంగా అమేథిలో ఆయుధాల ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశాను. గత కొన్నేళ్లుగా అక్కడ చిన్న తరహా ఆయుధాలు తయారవుతున్నాయి. ఆదివారం మీరు (మోదీ) అమేథి వెళ్లి అలవాటైన రీతిలో అబద్ధాలు చెప్పారు. మీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా?’అంటూ రాహుల్ ట్విటర్లో ప్రశ్నించారు. అమేథీలో ప్రధాని మోదీ భారత్–రష్యా సంయుక్తంగా నిర్మించిన ఏకే 203 కలాష్నికోవ్ అసాల్ట్ రైఫిల్ తయారీ ఫ్యాక్టరీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మోదీ మాట్లాడుతూ.. 2007లో ఆయుధాల తయారీ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి 2010లో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉండగా అలాంటిదేమీ జరగలేదన్నారు. స్థానిక ఎంపీ (రాహుల్ గాంధీ) అమేథీలో ఉపాధి కల్పనలో విఫలమయ్యారని విమర్శించారు. రాహుల్ ఆరోపణల్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తిప్పికొడుతూ అమేథీలో అభివృద్ధిని చూసేం దుకు రాహుల్ భయపడుతున్నారని అన్నారు. -
భారత్ v/s పాక్: ఎవరి బలం ఎంత?
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం తెల్లవారుజామున భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని జైషే మహమ్మద్ ఉగ్ర క్యాంపులపై మెరుపు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోవాలని పాక్‌ను ఎన్ని సార్లు కోరిన.. అటు నుంచి సరైన స్పందన రాకపోవడంతో భారత్ మెరుపు దాడుల రూపంలో ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు పంపింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరిని చేయాలని భారత్ నిర్ణయించింది. మరోవైపు సరైన సమయంలో భారత్‌ను దెబ్బకొడతామని పాక్ వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇరు దేశాల సైనిక బలాబలాలు చర్చనీయాంశంగా మారాయి. ఇరుదేశాలు కలిగిన సైన్యం, ఆయుధాల వివరాలు.. భారతదేశం పాకిస్తాన్ సైన్యం 14,00,000 6,53,800 క్షిపణులు అగ్ని–3 సహా 9 రకాలు షహీన్–2సహా 2 రకాలు అణు బాంబులు 130-140 140-150 యుద్ధ ట్యాంకులు 3,565 2,496 యుద్ధ విమానాలు 814 425 విమాన వాహక నౌకలు 1 0 జలాంతర్గాములు 16 8 -
పాక్ అమ్ములపొదిలో 600 యుద్ధ ట్యాంకులు
న్యూఢిల్లీ: భారీ స్థాయిలో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకునే దిశగా పాకిస్తాన్ చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లో భారత దేశ సరిహద్దు అయిన వాస్తవాధీన రేఖ వెంట మోహరించే లక్ష్యంతో యుద్ధ ట్యాంకులు, ఆధునిక తుపాకీలను పలు విదేశాల నుంచి కొనుగోలు చేస్తోంది. రష్యా నుంచి టీ–90లు సహా దాదాపు 600 యుద్ధ ట్యాంకులను సమకూర్చుకుంటోంది. వీటిలో 3 కిమీల నుంచి 4 కిమీల దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగల అత్యాధునిక కంప్యూటరైజ్డ్ ఫైర్ కంట్రోల్ వ్యవస్థ ఉంది. విదేశీ కొనుగోళ్లే కాకుండా, 2025 నాటికి దాదాపు 220 ట్యాంకులను చైనా సహకారంతో దేశీయంగా ఉత్పత్తి చేసుకోవాలని పాక్ నిర్ణయించింది. చైనా నుంచి వీటీ–4, ఉక్రెయిన్ నుంచి అప్లాడ్–పీ ట్యాంకులనూ కొనుగోలు చేస్తోంది. 150ఎంఎం ఎస్పీ మైక్–10 ఆధునిక తుపాకులను సైతం సమకూర్చుకుంటోంది. ఇటలీ నుంచి 245 ఈ తరహా తుపాకులను పాక్ కొనుగోలు చేస్తోంది. పాక్ క్షిపణి వ్యవస్థలను సైతం బలోపేతం చేసుకుంటోంది. విధానపరమైన జాప్యం కారణంగా ఆయుధ సంపత్తి పెంచుకునే విషయంలో భారత్ నత్త నడకన నడుస్తోందనే విమర్శలున్నాయి. అయితే, ఇప్పటికైతే, టీ–90, టీ–72, అర్జున యుద్ధ ట్యాంకులతో భారత్ పాక్ కన్నా బలంగానే ఉంది. -
అమ్మకానికి తుపాకీ..!
సాక్షి, హైదరాబాద్: ఆయుధాన్ని అక్రమంగా బిహార్ నుంచి తీసుకువచ్చి వాట్సాప్ ద్వారా రూ.60 వేల రేటుకు అమ్మకానికి పెట్టిన ఓ మిత్రుల బృందం గుట్టును హైదరాబాద్ వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. అక్కడి ఛాబ్రా ప్రాంతంలో తయారైన ఆయుధాన్ని ఎక్కువ రేటుకు అమ్మేందుకు ఓ వ్యక్తి ఖరీదు చేయగా... అది అనేక చేతులు మారి ఓ ఆభరణాల వ్యాపారి వద్దకు వచ్చింది. అతను ఓ వ్యక్తికి తాను ఇచ్చిన అప్పునకు గాను తుపాకీని జమ చేసుకోవడం కొసమెరుపు. ఈ జట్టుకు చెందిన మొత్తం ఆరుగురిని పట్టుకుని, నాటు తుపాకీ , మూ డు తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ గురువారం తెలిపారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి ఆయన విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. టీ తాగి వచ్చేలోపు... బిహార్ రాజధాని పట్నాకు 30 కిమీ దూరంలోని ఛాబ్రా ప్రాంతం అడవికి దగ్గరలో ఉంటుంది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఇక్కడ నాటు తుపాకుల్ని తయారు చేసే కొన్ని కార్ఖానాలు వెలిశాయి. అక్కడ నాటు రివాల్వర్, పిస్టల్స్‌కు చెందిన విడి భాగాలను తయారు చేసి ఛాబ్రా వరకు తీసువచ్చి భద్రపరుస్తా రు. కొనుగోలుదారుడు ఎవరైనా వచ్చి తుపాకీకి డ బ్బు చెల్లిస్తే... దాదాపు కిలోమీటరు దూరంలో ఉన్న ఓ దుకాణానికి వెళ్లి టీ తాగి రమ్మంటారు.దానికి పట్టే పావు గంటలో విడిభాగాలను అసెంబుల్ చేసి తుపాకీ సిద్ధం చేసి అందిస్తారు. ప్రస్తుతం మహారాష్ట్ర లోని పుణేలో ఆటోడ్రైవర్‌గా జీవిస్తున్న హుస్సేన్ గౌస్ మహ్మద్ ఖాన్ స్వస్థలం ఛాబ్రా. కొన్నాళ్ల క్రితం అక్కడకు వెళ్లిన ఖాన్ రూ.20 వేలు వెచ్చించి ఓ నాటు పిస్టల్, మూడు తూటాలు కొన్నాడు. విక్రయం కోసం సిటీకి తీసుకువచ్చి... మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పి.ప్రకాష్ కుటుంబం కొన్నేళ్ల క్రితమే పుణేకు వలసపోయింది. అక్కడ ఉండగా తమ ఇంటి సమీపంలో నివసించే ఖాన్‌తో ఇతడికి పరిచయం ఏర్పడింది. ఆరు నెలల క్రితం ప్రకాష్ హైదరాబాద్‌కు వచ్చేసినా వారి మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇలా ఖాన్ తాను ఖరీదు చేసిన తుపాకీ విషయం ఇతడికి చెప్పి విక్రయించమన్నాడు. అలా వచ్చిన మొత్తం ఇద్దరం పంచుకుందామని చెప్పాడు. అంగీకరించిన ప్రకాష్ ఆయుధం తీసుకువచ్చాడు. అతనికి ఓ వివాహ సందర్భంలో పరిగికి చెందిన జె.మోహన్‌తో పరిచయమైంది. దీంతో తుపాకీని అమ్మిపెట్టమని,లాభం పంచుకుందామంటూ అతనికి అందించాడు. ఇలా ముగ్గురూ దీని అమ్మకంపై దృష్టి సారించి ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. చిత్రంగా జ్యువెల్లరీ షాపు యజమాని వద్దకు... ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మోహన్ కొన్నాళ్ల క్రితం పరిగికి చెందిన అజయ్ జ్యువెల్లర్స్ యజమాని నరేంద్ర చౌదరి వద్ద కొంత మొత్తం అప్పుగా తీసుకున్నాడు. అది తీర్చాలని నరేంద్ర ఇటీవల ఒత్తిడి చేశాడు. దీంతో విసిగిపోయిన మోహన్ తన వద్ద ఓ నాటు తుపాకీ ఉందని, దాన్ని అమ్మి ఆ డబ్బుతో అప్పు తీరుస్తానని చెప్పాడు.సమ్మతించిన నరేంద్ర తానే విక్రయిస్తానని, వచ్చిన మొత్తంలో తన బాకీ మినహాయించుకుని మిగిలింది ఇస్తాననడంతో మోహన్ పిస్టల్‌ను అతనికి అప్పగించాడు. కొన్నాళ్లకు నరేంద్ర దాన్ని భద్రపరచమని సికింద్రాబాద్‌కు చెందిన తన స్నేహితులు నేమి చాంద్, గన్పత్ జట్లకు ఇచ్చాడు. వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసేసరికి... కొన్నాళ్లుగా ఈ పిస్టల్ ఖరీదు చేసే కస్టమర్ల కోసం తీవ్రంగా ప్రయత్నించిన నరేంద్ర తన స్నేహితుల బృందానికి చెందిన ఓ వాట్సాప్ గ్రూప్‌లో ‘రూ.60 వేలకు వెపన్ ఫర్ సేల్’అంటూ పోస్టింగ్ పెట్టాడు. నిజమా? కాదా? అంటూ కొందరు చాట్ చేయడంతో ఆధారాలకోసం పిస్టల్ ఫొటో, తూటాల చిత్రం పెట్టాడు. ఈ విషయం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు దృష్టికి వచ్చింది. ఆయన నేతృత్వంలో పోలీసు బృందాలు వరుసదాడులు చేశాయి. ఫలితంగా ఆరుగురు నిందితులు అరెస్టు కావడంతో పాటు తుపాకీ, తూటాలు రికవరీ అయ్యాయి. -
సైన్యానికి రూ.3వేల కోట్లతో సామగ్రి
న్యూఢిల్లీ: రక్షణ మంత్రిత్వ శాఖ రూ.3,000 కోట్ల విలువైన సైనిక సామగ్రి కొనుగోలుకు శనివారం ఆమోదం తెలిపింది. నావికా దళం కోసం రెండు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, ఆర్మీకి చెందిన ముఖ్యమైన అర్జున్ యుద్ధ ట్యాంకుల కోసం ఆర్మ్డ్ రికవరీ వాహనాలు కొనుగోలు చేస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈమేరకు సామగ్రి కొనుగోలుకు సంబంధించి రక్షణ కొనుగోలు మండలి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ‘రక్షణ శాఖ మంత్రి నిర్మల అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశంలో సామగ్రి కొనుగోలుకు ఆమోదం తెలిపారు’ అని అధికారి పేర్కొన్నారు. -
గుడిలోకి తుపాకులు, బూట్లతో వెళ్లొద్దు!
న్యూఢిల్లీ: ఒడిశాలో ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలోకి పోలీసులు తుపాకులు, బూట్లతో ప్రవేశించరాదని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. పూరీ ఆలయంలో క్యూ పద్ధతిని నిరసిస్తూ ఈ నెల 3న చెలరేగిన ఆందోళనపై అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది. ఈ సందర్భంగా ఒడిశా ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఈ ఘర్షణకు సంబంధించి ఇప్పటివరకూ 47 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. జగన్నాథ ఆలయానికి 500 మీటర్ల దూరంలోని పరిపాలన కార్యాలయాన్ని అల్లరిమూకలు ధ్వంసం చేశాయనీ, ఆలయం లోపల ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు. అయితే ఆలయం తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఘర్షణ సందర్భంగా పోలీసులు ఆయుధాలు, బూట్లతో ఆలయంలోకి ప్రవేశించారని ఆరోపించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ఇకపై అలా జరిగేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. జగన్నాథ ఆలయంలో క్యూ పద్ధతిని నిరసిస్తూ శ్రీ జగన్నాథ సేన అనే సంస్థ ఇచ్చిన అక్టోబర్ 3న పన్నెండు గంటల బంద్ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. -
ఆయుధమున్నా .. ఫలితం సున్నా!
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో రైళ్లను టార్గెట్ చేసుకుని రెచ్చిపోతున్న ముఠాలు పెరుగుతున్నాయి. మొన్న బెంగళూరు ఎక్స్‌ప్రెస్... నిన్న హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్... తాజాగా యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్... ఇలా వరుసపెట్టి దుండగులు పంజా విసురుతున్నారు. వీటిని నిరోధించడంతో పాటు ప్రయాణికులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో రైళ్లల్లో విధుల్లో ఉంటున్న గవర్నమెంట్ రైల్వే పోలీసు (జీఆర్పీ) సిబ్బంది సఫలీకృతులు కాలేకపోతున్నారు. ఇదిలా ఉండగా... రైళ్లలో దోపిడీకి యత్నించే దొంగలను కాల్చివేయాలని రైల్వే పోలీస్ (జీఆర్పీ), రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) సంయుక్త సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే వాస్తవ పరిస్థితులు వేరుగా ఉంటున్నాయి. ప్రతి రైలులోనూ అవసరమైన సంఖ్యలో పోలీసు సిబ్బంది ఉండట్లేదు. నాలుగైదు బోగీలకు కలిపి కేవలం ఒకరో ఇద్దరో కానిస్టేబుళ్లను నిమమిస్తున్నారు. దీంతో ఏదైనా చోరీ జరిగినప్పుడు ఆ సమాచారమే వీరికి తెలియడం లేదు. ఒకవేళ తెలిసినా... వారు అప్రమత్తమయ్యే లోగా దొంగలు తమ ‘పని’ పూర్తి చేసుకుని వెళ్లిపోతున్నారు. దీంతో పాటు రైలు బోగీల్లో భద్రతా విధుల్లో ఉండే సిబ్బందికి ఇస్తున్న ఆయుధం కూడా కొత్త సమస్యలకు కారణమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఈ సిబ్బందికి కార్బైన్ తుపాకులు ఇస్తున్నారు. వీటిని భుజానికి తగిలించుకుని పని చేయడం వరకు ఇబ్బంది లేదు. అయితే ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురై ఆ ఆయుధాన్ని జన సమర్థ ప్రాంతంగా ఉండే రైలు బోగీలో వినియోగించాలంటే మాత్రం పోలీసులే భయపడాల్సి వస్తోంది. పోలీసు విభాగం వాడే ఆయుధాల్లో అఫెన్సివ్, డిఫెన్సివ్ వెపన్స్ వేర్వేరుగా ఉంటాయి. జన సమర్థ ప్రాంతాల్లో రక్షణావసరాల కోసం అఫెన్సివ్ వెపన్స్ వినియోగించకూడదు. కార్బైన్ మెషిన్ గన్ అఫెన్సివ్ వెపన్ కోవలోకే వస్తుంది. ప్రముఖుల వెంట ఉండే గన్‌మెన్స్ భుజాలకు ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. 30 తూటాలు నింపే సామర్థ్యం ఉన్న మ్యాగ్జైన్తో కూడిన ఈ గన్ రేంజ్ 50 మీటర్ల వరకు ఉంటుంది. రైలు బోగీలు వంటి మూసి ఉన్న, జనం ఎక్కువగా ఉన్న చోట్ల దీనిని వినియోగించి ఓ దొంగని టార్గెట్ చేస్తూ కాల్పులు జరపడం ప్రమాదహేతువు. ఏమాత్రం కంగారుపడి కాల్పులు ప్రారంభించినా దొంగ మాట అటుంచి బోగీలోని ప్రయాణికులకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే జీఆర్పీ పోలీసులు తమ వద్ద ఉన్న కార్బైన్‌ను కేవలం అలంకార ప్రాయంగా మాత్రమే మార్చుకుంటున్నారనే విమర్శ ఉంది. ఇలాంటి చోట విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి కచ్చితంగా షార్ట్ వెపన్స్‌గా పిలిచే రివాల్వర్, పిస్టల్ మాత్రమే అందించాల్సి ఉందని అధికారులు అంగీకరిస్తున్నారు. అయితే ఆ తరహా ఆయుధాల కొరత నేపథ్యంలో ప్రతి రైలులో ఉండే జీఆర్పీ బృందానికి నేతృత్వం వహిస్తున్న అధికారికి మాత్రమే షార్ట్ వెపన్స్ ఇస్తూ మిగిలిన వారిలో కొందరికి కార్బైన్స్ ఇవ్వక తప్పలేదన్నారు. భద్రతా విధుల్లో ఉండే సిబ్బంది మాత్రం తమకు కచ్చితంగా షార్ట్ వెపన్స్ కేటాయించడంతో పాటు సిబ్బంది సంఖ్యను పెంచితేనే రైళ్లను టార్గెట్ చేస్తున్న ముఠాల ఆట కట్టించడం, అధికారులు ఆదేశించినట్లు కాల్చి పారేయడం సాధ్యమవుతుందని సిబ్బందే పేర్కొంటున్నారు. -
చూస్తే నిజం.. తాకితే డమ్మీ
జూబ్లీహిల్స్: గది నిండా తుపాకులు, మెషిన్గన్లు.. కుప్పలు తెప్పలుగా పడేసిన కత్తులు, కటార్లు, శిరస్త్రాణాలు.. ఇదేదో ఆయుధాల గోదాం కాదు.. కదనరంగం కోసం సిద్ధం చేసిన ఏర్పాట్లు అంతకంటే కాదు. అన్నీసినిమాల్లో వాడేందుకు సిద్ధం చేసిన డమ్మీఆయుధాలు. చిత్రాలకు ఎప్పటినుంచో సినీఆయుధాలు సరఫరా చేసే ‘శ్రీశైల మహానంది’ కార్యాలయంలోకి అడుగు పెడితే.. ఆయుధాల లోకంలోకి వెళ్లినట్టు ఉంటుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాషూటింగ్లకు కావాల్సిన రకరకాల పరికరాలు సరఫరా చేసే ‘మహానంది’ యూసుఫ్‌గూడ, కృష్ణానగర్‌లో అందరికి సుపరిచితుడే. కర్నూలు జిల్లాకు చెందిన మహానంది దాదాపు రెండు దశాబ్దాల క్రితమే ఉపాధి కోసం నగరానికి వలస వచ్చాడు. సినీరంగంలో చిన్నాచితకా పనులు చేస్తూ క్రమంగా సినిమా షూటింగ్‌ల్లో వినియోగించే పలు రకాల వస్తువులను అందించే సప్లయర్‌గా నిలదొక్కుకున్నాడు. రెండు దశాబ్దాలుగా వందలాది సినిమాలకు ఆయన పలురకాల వస్తువులు సరఫరా చేస్తున్నాడు. అదరహో ‘బాహుబలి’ తెలుగు చలనచిత్ర రంగంలో రికార్డులు తిరగరాసిన ‘బాహుబలి’ అంటే ప్రేక్షకులకే కాదు.. సినీరంగానికి చెందిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన క్రేజ్. ఆ చిత్రంలో ఒక్క చిన్న వేషం వేసినా చాలనుకున్న నటులు చాలామందే ఉన్నారు. అలాంటి చిత్రానికి రెండు భాగాల్లో వాడిన కత్తులు, యుద్ధ సామగ్రిని మహానందే సరఫరా చేశాడు. ‘ఈ సినిమా కోసం వందలాది కత్తులు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించాం. తాజాగా చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నర్సింహారెడ్డి’కి కావాల్సిన యుద్ధ సామగ్రిని సైతం మేమే సరఫరా చేస్తున్నాం’ అని గర్వంగా చెబుతాడు మహానంది. తాకితేనే తెలిసేది.. ‘డమ్మీ’ అని పోలీస్ ట్రైనింగ్‌లో భాగంగా కానిస్టేబుల్స్, హోంగార్డులకు డమ్మీ తుపాకులతో శిక్షణ ఇస్తారు. శిక్షణ ప్రారంభంలో నిజమైన తుపాకులతో శిక్షణ ఇస్తే ప్రమాదవశాత్తు పేలితే ప్రాణనష్టం. కాబట్టి ఈ ఏర్పాట్లు చేస్తారు. ఏ చిత్రం షూటింగ్లో పోలీసుల శిక్షణ ఉందంటే అందుకు అవసరమైన డమ్మీ తుపాకులను కూడా ఇక్కడి నుంచి సరఫరా చేస్తారు. చెక్క బరువుగా ఉంటే ఇబ్బందని.. తేలికైన బూరుగు చెక్కతో తుపాకులను రూపొందిస్తారు. వాటికి మధ్యలో ఇనుప ముక్కలు అమర్చి నిజమైన తుపాకుల్లా కనిపించేలా చేస్తారు. ఇక కత్తులనైతే పూర్తిగా రబ్బరుతో రూపొందించి రంగులు వేస్తారు. తాకితే అవి డమ్మీ అని చెప్పగలరు కానీ.. చూసినవాళ్లు మాత్రం అవి నిజమైనవే అని భ్రమపడతారు. వృత్తినే నమ్ముకున్నా.. ఈ నగరం నన్ను ఆదరించింది. రెండు దశాబ్దాలుగా సినిమాలకు అవసరమైన పరికరాలు సప్లయ్ చేస్తూ ఉపాధి పొందుతున్నాను. ‘బాహుబలి’ సినిమాకు పనిచేయడం జీవితంలో మర్చిపోలేను. దర్శకుడు రాజమౌళి ప్రత్యేక శ్రద్ధతో కత్తులు తయారు చేయించారు. కొన్ని వందల సినిమాలకు రకరకాల పరికరాలు అందించాను. ఈ వృత్తి సంతృప్తికరంగా ఉంది. – శ్రీశైలం మహానంది -
‘ఉగ్ర’ సమిధలుగా చిన్నారులు: ఐరాస
ఐరాస: పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఉగ్రవాద సంస్థలు జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వేందుకు, అల్లర్లు సృష్టించేందుకు చిన్నారులను ఆయుధాలుగా వాడుకుంటున్నాయని ఐక్యరాజ్యసమితి (ఐరాస) నివేదికలో వెల్లడించింది. చిన్నారులు, సాయుధ దాడులు అనే అంశంపై ఐరాస వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2017 జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా అల్లర్ల కారణంగా మరణించిన, గాయాలపాలైన చిన్నారుల సంఖ్య పదివేలకు పైగా ఉంది. అంతేకాకుండా ఉగ్ర సంస్థలు అల్లర్లు సృష్టించడానికి ఎనిమిది వేల మంది బాలలను నియమించుకున్నాయని నివేదిక స్పష్టం చేసింది. సిరియా, అఫ్గానిస్తాన్, యెమెన్, భారత్, ఫిలిప్పీన్స్, నైజీరియాలతో పాటు 20 దేశాలకు సంబంధించి ఈ నివేదికను తయారు చేశారు. భారత్‌లో ముఖ్యంగా జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులకు.. భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో చిన్నారులు ఎక్కువగా బలైపోతున్నారని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో మావోయిస్టులు కూడా చిన్నారులనే ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు ప్రత్యేకంగా చిన్నారులను నియమించుకొని వారిచేత అల్లర్లు చేయిస్తున్నారని, అలాగే పిల్లలను ఇన్ఫార్మర్లు, గూఢచారులుగా ఉపయోగించుకుంటున్నారని వెల్లడించారు. పాకిస్తాన్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని నివేదిక వెల్లడించింది. -
శిక్షణ ఇచ్చి హత్యలు చేయమని ప్రోత్సహిస్తారా?
రాజ్గర్హ్, మధ్య ప్రదేశ్ : మధ్య ప్రదేశ్‌లోని రాజ్‌గర్హ్‌లో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మారణాయుధాల వినియోగ శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో బీజేపీని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్‌కు మరో అవకాశం దొరికినట్లు అయింది. హిందూవుల రక్షణ పేరుతో భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషద్ ఈ నెల 3 నుంచి జూన్ 1 వరకూ రాజ్‌గర్హ్‌లోని బవారాలో స్థానిక యువతకు తుపాకీ వంటి ఆయుధాలను ఎలా వాడాలో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణకు సంబంధించిన వీడియోలను భజరంగ్ దళ్ జిల్లా కన్వినర్ దేవి సింగ్ సోందియా సోషల్ మీడియాలో పోస్టు చేయడమే కాక ‘1984 నుంచి మేము ఈ శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. దేశ విద్రోహక శక్తులు, లవ్ జిహాద్ వంటి వాటి నుంచి హిందూవులకు రక్షణ కల్పించడానికి యువతకు శిక్షణ ఇస్తున్నట్లు’ తెలిపారు. ఈ వీడియోలు, ఫోటోలు బీజేపీ పై దాడి చేయడానికి కాంగ్రెస్ పార్టీకి మంచి ఆయుధాలుగా మారాయి. ఈ విషయం గురించి ‘మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఈ శిక్షణా కార్యక్రమానికి అనుమతిచ్చిందా..?. డీజీపీ కానీ, రాజ్గర్హ్ ఎస్పీ కానీ ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చారా..? అని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. అలానే దిగ్విజయ్ సింగ్ కుమారుడు, రాఘోగర్హ్ ఎమ్మెల్యే జైవర్ధన్ ‘జాతీయవాదం పేరుతో భజరంగ్ దళ్ యువతకు మారణాయుధాల వినియోగంలో శిక్షణ ఇచ్చి హత్యలు చేయమని ప్రేరేపిస్తుంది. ఈ ఫొటోలు చూసి నేను షాకయ్యాను’ అని ట్వీట్ చేశాడు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి రజ్నిష్ అగ్రావాల్ స్పందిస్తూ... ఎవరైనా స్వీయ రక్షణ శిక్షణా తరగతులు నిర్వహించుకోవచ్చు. కానీ దానికి ఎవరు అనుమతిచ్చారనే విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది అన్నారు. -
జనరేషన్ నెక్ట్స్ వార్‌కు సై...!
అత్యాధునిక యుద్ధతంత్రానికి భారత్ సై అంటోంది. దీనిలో భాగంగా ‘రాబోయే తరం’ యుద్ధరీతులకు త్రివిధ దళాలను సిద్ధం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికంగా వస్తున్న మార్పుచేర్పులకు అనుగుణంగా సైనికబలగాలు, ఆయుధాలను నవీకరిస్తోంది. సైనికపరంగా పొరుగునే ఉన్న పాకిస్తాన్, చైనాల నుంచి ఎదురయ్యే సవాళ్లను అంత కంటే సమర్థంగా తిప్పికొట్టేందుకు సమాయత్తమవుతోంది. ఈ రెండు దేశాలతో భారత్‌కున్న సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తోంది. మానవరహిత మిలటరీ ట్యాంకులు, ఇతర యుద్ధ వాహనాలు, రోబోటిక్ ఆయుధాలతో సాయుధబలగాలకు కొత్త శక్తి చేకూరుస్తోంది. దీనితో పాటు కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా ఆర్మీ, నేవి, ఎయిర్‌ఫోర్సులకు ‘నవతరం’ ఆయుధాలు సమకూరుస్తోంది. సైనిక అవసరాల కోసం కృత్రిమ మేధ వినియోగం ద్వారా నూతన ఆవిష్కరణలకు చైనా పెద్దమొత్తంలో పెట్టుబడి పెడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా దానికి తీసిపోని విధంగా ‘జనరేషన్ నెక్ట్స్’ యుద్ధతంత్రానికి తుది మెరుగులు దిద్దుతోంది. సైనికఅవసరాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఐరోపాసంఘం భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. అప్థనిస్తాన్, పాకిస్తాన్లలోని ఉగ్రవాద శిబిరాలను కృత్రిమమేథ ద్వారా పనిచేసేమానరరహిత డ్రోన్ల ద్వారా అమెరికా సమర్థవంతంగా ధ్వంసం చేస్తోంది. ఐటీ పారిశ్రామిక రంగంలో భారత్‌కు గట్టి పునాదులు ఉండడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడం మరింత సులువు కానుంది. ఈ కీలక ప్రాజెక్టులో డిఫెన్స్ రిసెర్చీ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ›ప్రధాన భూమిక పోషించనుంది. భూమి,ఆకాశం, సముద్రంలో.... ప్రతిష్టాత్మక రక్షణ ప్రాజెక్టులో భాగంగా కీలకమైన మూడురంగాల్లో ( భూమి, ఆకాశం, సముద్రం) యుద్ధసన్నద్ధతను మరింత మెరుగుపరిచేందుకు కృత్రిమ మేథ ప్రాజెక్టులను భారత్ ప్రారంభించింది. మానవరహిత ట్యాంకుల వంటి యుద్ధవాహనాలు, ఆకాశం నుంచి, నీటిలోనా ఉపయోగించేలా రోబోటిక్ ఆయుధాలు సమకూరుస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్ యుద్ధాలకు సంసిద్ధమయ్యేందుకు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీల్లో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ ప్రవేశపెడుతున్నట్టు ఇటీవల సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ప్రోడక్షన్ అజయ్‌కుమార్ వెల్లడించారు. ఇందుకోసం సైనిక బలగాలు, ప్రైవేట్‌రంగం మధ్య భాగస్వామ్యనమూనా అమలుచేస్తున్నట్టు చెప్పారు. రాబోయే నవ తరం యుద్ధరీతులను అందిపుచ్చుకోవాల్సి ఉన్నందున, భవిష్యత్ నిర్ణేతలో కృత్రిమమేథదే కీలకస్థానమన్నారు. ‘భవిష్యత్ అంతా అత్యాధునిక సాంకేతికత నేతృత్వంలోనే సాగాల్సి ఉంది. మరింతగా ఆటోమెటిక్ పద్ధతులు, రోబోటిక్ వినియోగాన్ని పెంచుకోవాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ‘ప్రపంచంలో సైనికశక్తులుగా గుర్తింపు పొందిన దేశాల మాదిరిగానే భారత్ కూడా కృత్రిమమేథ ద్వారా సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను మరింత పెంచుకుంటోంది. భవిష్యత్ యుద్ధాల్లో మానవరహిత యుద్ధవిమానాలు, నౌకలు,ట్యాంకులు,రోబోటిక్ రైఫిల్స్‌లను ఆయుధ వ్యవస్థలుగా భారత్ విస్తృతంగా ఉపయోగించబోతోంది. ప్రపంచ సైనికశక్తులతో పోల్చదగిన విధంగా దీని కోసం అవసరమైన శక్తియుక్తులు సమకూర్చుకుంటోంది’ అని అజయ్‌కుమార్ వెల్లడించారు.–సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రష్యా భారీ స్కెచ్..!!
మాస్కో : రష్యా తన ఆయుధ సంపత్తిని బలోపేతం చేసుకునే పనిలో పడిందా?. జలాంతర్గాములతో శత్రు దుర్భేద్యమైన రక్షణను ఏర్పాటు చేసుకుంటోందా?. ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే చెప్పాలి. గత మార్చి నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ స్టేట్ ఆఫ్ ది నేషన్‌లో చేసిన ప్రసంగం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. జలాంతర డ్రోన్‌ను అభివృద్థి చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే . రెండు మెగా టన్నుల బరువైన అణ్వాయుధాలను 70 నాటికల్ మైళ్ల దూరానికి ప్రయాణించగలిగే ఓ జలాంతర డ్రోన్‌ను రష్యా తయారు చేయనున్నట్లు సమాచారం. దేశ రక్షణతో పాటు శత్రువుల జలాంతర్గాములను ధ్వంసం చేసే విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రష్యా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని రష్యా న్యూస్ ఏజెన్సీ ‘టాస్’ తెలిపింది. ప్రధాని పుతిన్ స్టేట్ ఆఫ్ ది నేషన్ వార్షిక సమావేశంలో జలాంతర డ్రోన్‌కు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. గ్రాఫిక్స్‌తో కూడిన ఈ వీడియోలో కొత్త ఆయుధానికి సంబంధించిన శక్తి, సామర్థ్యాలు వివరించడం జరిగింది. -
భానుకిరణ్‌కు ఏడాది జైలు
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో ఎం.భానుకిరణ్‌కు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించింది. భానుకిరణ్ మద్దెలచెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు. అక్రమ ఆయుధాల కేసుకు సంబంధించి భానుతో పాటు రాజశేఖర్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, డి.వినోద్లకు కూడా ఏడాది జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ బుధవారం కోర్టు తీర్పునిచ్చింది. జరిమానాను చెల్లించని పక్షంలో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని వెల్లడించింది. సూరి హత్య జరగకముందే భాను తదితరులను అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో 2009 మార్చి 11న సికింద్రాబాద్‌లో బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో వారి నుంచి 8 పిస్తోళ్లు, 12 తపంచాలు, 42 తూటాలు, 12 మ్యాగజైన్లు (తూటాలు పెట్టుకునే కవచం), ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు తీర్పు వెలువరించింది. కాగా మద్దెలచెరువు సూరి హత్య కేసు ఇంకా విచారణ కొనసాగుతోంది. భాను ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. -
3డీ ముప్పు తప్పదా..?
కార్మికులు బండరాళ్లను పగలగొట్టేందుకు చెమటోడుస్తుంటే.. దాన్ని గమనించిన ఓ శాస్త్రవేత్త బాంబును కనిపెట్టాడట. మానవుడి శ్రమను తగ్గించడానికి కనిపెట్టిన అవే బాంబులు ఇప్పుడు మనిషి వినాశనానికి కారణమవుతున్నాయి. ఇలా ఎన్నో మంచి ఆవిష్కరణలు కూడా çసద్వినియోగం కంటే ఎక్కువగా దుర్వినియోగమవుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ కూడా చేరుతుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాక్షి, ప్రత్యేకం : పెరుగుట.. విరుగుట కొరకేనన్న మాట ఇక్కడ సరిగ్గా సరిపోతుందేమో. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతాలను సృష్టిస్తున్న శాస్త్రవేత్తలు.. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో ఎన్నో అసాధ్యాలను సుసాధ్యాలుగా మారుస్తున్నారు. యంత్ర సామగ్రిని, మానవ అవయవాలను, చివరికి ఆహార పదార్థాలను కూడా 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో తయారుచేస్తున్నారు. ఫలితంగా ఎంతో సమయం ఆదా కావడంతోపాటు ఎన్నో ప్రాణాలు నిలబడుతున్నాయి. అయితే ఈ టెక్నాలజీని మానవాళి సంక్షేమానికి ఉపయోగించినన్ని రోజులూ ఏ ముప్పూ లేదని.. ఆలోచనలు పక్కదారి పడితే మాత్రం అది మానవ వినాశనానికే దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఆయుధాల తయారీతో ముప్పే.. ఆటబొమ్మలు, యంత్ర సామగ్రి, కృత్రిమ అవయవాలు, రకరకాల ఆకారాల్లో ఆహార పదార్థాలు.. ఇలా ఎన్నింటినో తయారుచేస్తున్న 3డీ ప్రింటర్‌కు ఆయుధాలను తయారు చేయడం పెద్ద లెక్కకాదు. ఆయుధాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడే దేశాలకు ఈ టెక్నాలజీ ఓ వరంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వేల కోట్ల రూపాయలను విదేశాలకు చెల్లించాల్సిన అవసరం లేకుండా సొంతంగానే ఆయుధాలను తయారుచేసుకోవచ్చని చెబుతున్నారు. దీనివల్ల మిగిలే ప్రజాధనాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ టెక్నాలజీ అక్రమార్కుల చేతిలో పడితే.. చిన్న చిన్న దేశాలు కూడా విచ్చలవిడిగా ఆయుధాలు తయారు చేసుకుంటే.. ఉగ్రవాదులు, తీవ్రవాదులు కూడా సొంతంగా ఓ 3డీ యంత్రాన్ని కొనుక్కొని తమ ఆయుధాలను తామే తయారు చేసుకుంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. వినాశనమే తప్ప మిగిలేదేమీ ఉండదు.. పెద్దగా ఆయుధాలు అందుబాటులో లేని రెండో ప్రపంచ యుద్ధం సమయంలోనే ఎంతగా వినాశనం జరిగిందో మనకు తెలుసు. ఇప్పటికే ప్రపంచ దేశాలు తమ ఆయుధ సంపత్తిని ఇబ్బడిముబ్బడిగా పెంచేసుకున్నాయి. ఇక చిన్న చిన్న దేశాలు కూడా ఆయుధాలను సమకూర్చుకొని, యుద్ధాలకు కాలు దువ్వితే.. ఊహకందని నష్టం జరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బూడిదే తప్ప మనుషులెవరూ మిగలరంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాంబో బాణాలు.. రాకెట్ బాంబులు
న్యూఢిల్లీ: భద్రతా దళాలపై దాడులు చేయడం కోసం నక్సలైట్లు సరికొత్త ఆయుధ సంపత్తిని సమకూర్చుకున్నారు. రాంబో బాణాలు, రాకెట్ బాంబులు వంటి ఆధునిక, ప్రాణాంతక సామగ్రితో భద్రతా దళాలకు సవాలుగా నిలుస్తున్నారు. ఈ మేరకు వామపక్ష తీవ్రవాద శిబిరంలో నెలకొన్న ధోరణులపై అధ్యయనం చేసిన ఉమ్మడి భద్రతా దళం (జేఎస్సీ) తాజా నివేదిక వెల్లడించింది. భద్రతా బృందాలకు చెందిన స్నిఫర్ డాగ్స్‌ను ఏమార్చేందుకు మావోయిస్టులు ముడి బాంబులను జంతువుల మలంలో దాచేస్తున్నారని తెలిపింది. 2017 తొలి త్రైమాసికంలో భద్రతా దళాల స్నిఫర్ డాగ్స్ ఈ కారణంగానే గాయపడటం లేదా మృతి చెందాయంది. నక్సల్స్ దాడులకు ఉపయోగించే సరికొత్త పద్ధతుల్లో ప్రముఖమైంది.. పేలుడు పదార్థంతో కూడిన రాంబో బాణం అని పేర్కొంది. గన్ పౌడర్ లేదా మందుగుండు కలిగిన ఆ బాణం లక్ష్యాన్ని తాకగానే పేలుతుంది. రాంబో బాణాలు ఎక్కువ నష్టాన్ని కలిగించకపోయినా భద్రతా సిబ్బందిలో ఆందోళన కలిస్తాయని.. తద్వారా దాడి చేయడానికి మావోలకు ఉపయోగపడతాయంది. -
భారత్‌కు కిల్లర్ డ్రోన్లు
వాషింగ్టన్: భారత్ సహా మిత్ర దేశాలకు ఆయుధాలు అమ్మడానికి ఉన్న అడ్డంకులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలగించారు. అధునాతన డ్రోన్లు సహా ఇతర సంప్రదాయ ఆయుధ సంపత్తి ఎగుమతులను వేగవంతం చేయాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు. అమెరికా నుంచి అధిక సంఖ్యలో నిఘా డ్రోన్లు కొనుగోలు చేయాలనుకుంటున్న భారత్‌కు ఈ నిర్ణయం మేలుచేయనుంది. అమెరికా కిల్లర్ డ్రోన్లు సమకూర్చుకోవడం సులభం కానుంది. ఈ మేరకు అణుయేతర ఆయుధాల బదిలీ(సీఏటీ) నూతన విధానంపై ట్రంప్ సంతకం చేశారు. అధ్యక్షుడి జాతీయ భద్రతా విధాన ప్రాధమ్యాలకు అనుగుణంగా సీఏటీని రూపొందించినట్లు శ్వేతసౌధం ప్రెస్ సెక్రెటరీ శాండర్స్ చెప్పారు. తాజా నిర్ణయం అమెరికా మిత్ర దేశాల సైన్యాలను బలోపేతం చేస్తుందన్నారు. మిత్ర దేశాలకు అధునాతన ఆయుధాలను సమకూర్చడం ద్వారా అవి ఇకపై చైనా, రష్యాలపై ఆధారపడవని ట్రంప్ అసిస్టెంట్ పీటర్ చెప్పారు. -
నగ్నత్వమే ఆమె ఆయుధం
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆదివాసి తెగకు చెందిన ఓ సంతాల్ యువతిని పోలీసు స్టేషన్లో పోలీసులు వరుసగా అత్యాచారం చేస్తారు. వారు తమ కామక్రీడను ముగించుకున్నాక ఆమెకు కట్టుకోవడానికి బట్టలిస్తారు. ఆమె ఆ బట్టలను చించిపారేసి తొడల మధ్య నుంచి రక్తం కారుతుండగా వీధిలోకి నగ్నంగా పరుగెత్తుతుంది. ఎదురు పడిన ఓ పోలీసు ఉన్నతాధికారి చేతుల్లోకి ఒంట్లో శక్తిలేక ఒరిగి పోతుంది. భయమంటే తెలియని ఆ పోలీసు అధికారి ఆమె పరిస్థితి చూసి జీవితంలో తొలిసారి భయపడతారు.’ ఇది ప్రముఖ రచయిత్రి మహాశ్వేతా దేవీ రాసిన ‘ద్రౌపది’ షార్ట్ స్టోరీ ముగింపు సన్నివేశం. అలా ఆమె బట్టలు చించేసి వీధిలోకి పరుగెత్తి రావడానికి కారణం సిగ్గులేని ప్రపంచాన్ని సిగ్గుపడేలా చేయడం కోసం. ఇంతవరకు ఇది కథయితే నిజ జీవితంలో కొంత మంది మణిపూర్ మహిళలు 2004లో తమ నగ్న శరీరాలనే ఆయుధంగా చేసుకున్నారు. అస్సాం రైఫిల్స్‌కు చెందిన పోలీసులు మనోరమ అనే యువతిని రేప్ చేసి చిత్రహింస పెట్టినందుకు సంఘీభావంగా వారంతా నడి వీధిలో, రైఫిల్స్ భవనం ముందు నగ్నంగా నిరసన ప్రదర్శన చేశారు. దమ్ముంటే ఇప్పుడు తమపై అత్యాచారం చేయడంటూ సవాల్ విసిరారు. ఆనాడు ఈ సంఘటన దేశాన్నే కుదిపేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా చేసింది. ఇప్పుడు టాలీవుడ్‌కు చెందిన నటి శ్రీరెడ్డి హైదరాబాద్ రోడ్డుపై పట్ట పగలు బట్టలు విప్పుకొని తెలుగు సినీ పరిశ్రమ గుడ్డలూడదీశారు. ఇక్కడ కూడా నగ్న శరీరమే ఆయుధంగా మారింది. ‘మీరంతా వినాలంటే నాకు ఇదొక్కటే మార్గంగా కనిపించింది. సినీ పరిశ్రమలో పాత్రల కోసం నేను ఎంతో మంది ముందు నగ్నంగా నిలబడాల్సి వచ్చింది. పాత్రలు ఇస్తానన్న వారు మోసం చేశారు. నాకు జరిగిన అన్యాయం గురించి గొంతెత్తి అరిచాను. నా ఒక్కదానికే కాదు, సినిమా ఛాన్స్‌లు ఇస్తామంటూ ఎంతో మంది మహిళలను మోసం చేస్తున్నారు. సినిమా కళాకారుల సంఘం నుంచి సరైన సమాధానం ఇప్పటికీ రాకపోవడంతో ఈ విషయం అందరి దృష్టికి తీసుకరావడం కోసమే నేను పబ్లిగ్గా బట్టలిప్పడానికి సిద్ధపడ్డాను’ అంటూ శ్రీరెడ్డి మనో వ్యధను వెల్లడించారు. అందుకని ఆమెకు సంస్కారం లేదంటూ ఉంటున్న ఇంటి నుంచి ఖాళీ చేయమన్నారు. శ్రీరెడ్డికి జరిగిన అన్యాయం సినిమా ఇండస్త్రీలో ఎంతో మందికి జరిగే ఉంటుంది. వారంతా ఒక్కొక్కరుగానైనా బయటకు వచ్చినప్పుడే పరిశ్రమలో ప్రక్షాళన ప్రారంభం అవుతుంది. అమెరికా ప్రముఖ నిర్మాత హార్వి వైన్‌స్టీన్ సెక్స్ స్కామ్ గురించి న్యూయార్క్ టైమ్స్ గతేడాది బయటపెట్టగానే ఇప్పటివరకు 85 మంది బాధితులు ‘మీ టూ’ అంటూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. వారిలో ఎంజెలినా జోలి, కేట్ బెకిన్సలే, లిసెట్టి ఆంథోని, గ్వినెథ్ పాల్ట్రో, మీరా సార్వినో, డెరిల్ అన్నా లాంటి ప్రముఖ తారలెందరో ఉన్నారు. ప్రస్తుతం వైన్‌స్టీన్ మీద లాస్ ఏంజెలిస్, న్యూయార్క్ సిటీ, లండన్ నగరాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. - నరేందర్ రెడ్డి -
ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న పాక్
ఇస్లామాబాద్ : తమ సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు, ఆయుధ సామాగ్రిని అందుబాటులోకి తెచ్చేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రష్యా నుంచి యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు కొనుగోలు చేసేందుకు పాక్ నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆయుధాల కోనుగోలు కోసం రష్యా అధికారులతో నేరుగా సంప్రదింపులు మొదలుపెట్టింది. స్వయంగా పాక్ మీడియానే ఈ విషయాలను బహిర్గం చేయడంతో భారత్, చైనాలు ఈ విషయంపై అప్రమత్తం అవుతున్నాయి. రష్యాతో ఆయుధ సంపత్తి సహకారం, ఆయుధాల కొనుగోలు చేస్తున్నామని పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రి ఖుర్రమ్ దస్తగిర్ ఖాన్ కూడా అంగీకరించారు. గగనతల భద్రతతో పాటు కొన్ని రకాల ఆయుధాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు పాక్ సన్నద్ధమైనట్లు తెలిపారు. ఆయుధాల విషయంలో రష్యా ఉన్నతస్థితిలో ఉందని, మాస్కో నుంచి టీ-90 యుద్ధ ట్యాంకులు దిగుమతి చేసుకుంటామన్నారు. ఏక కాలంలో కొనుగులు చేయడం లేదని, దీర్ఘకాలికంగా రష్యాతో ఆయుధాల కొనుగోలు కోసం పాక్ ఒప్పందం చేసుకుంటున్నట్లు వివరించారు. రష్యా మీడియాలో ఇటీవల పలు కథనాలు రావడంతో ఆయుధాల కొనుగోలు వెలుగుచూసింది. -
ఆత్మరక్షణ కోసం దళితులకు ఆయుధాలివ్వాలి
ఒంగోలు ఒన్‌టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత, గిరిజనులకు రక్షణ కల్పించలేని దుíస్థితిలో ఉన్నాయని, అందుకే చట్ట ప్రకారం దళిత, గిరిజనుల ఆత్మరక్షణకు ఆయుధాలు ఇస్తే వారిని వారే కాపాడుకుంటారని విప్లవ రచయితల సంఘం నేత జి.కళ్యాణరావు వ్యాఖ్యానించారు. మార్చి 20న సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పు దేశంలో ఎస్సీ,ఎస్టీ ప్రజలు జీవించే హక్కుకు అత్యంత ప్రమాదకరమైందని, అట్రాసిటీ చట్టాన్ని చట్టబద్ధంగా చంపేసిందని, ఈ తీర్పుకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మాంచాల్సిన బాధ్యత, చట్టాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘ జిల్లా అధ్యక్షుడు ఓర్సు శ్రీనివాసరావు అధ్యక్షతన స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం సాయంత్రం సదస్సు నిర్వహించారు. ప్రధాన వక్తగా కళ్యాణరావు హాజరై మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో 11 మంది దళితులు హిందూ మతోన్మాద కాషాయమూకల తూటాలకు బలయ్యారని, వారి పోరాట స్ఫూర్తితో చట్టం మరింత పటిష్టతకు ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందని కళ్యాణరావు పేర్కొన్నారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో అమానుష నిచ్చనమెట్ల కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించిన పూలే, అంబేడ్కర్, పెరియార్ రామస్వామి వంటి మహనీయుల పోరాటం ఫలితంగా వచ్చిన అనేక చట్టాలను పాలకులు తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. దళిత వ్యతిరేక మతోన్మాద శక్తులు రాజ్యంలోకి వచ్చి రిజర్వేషన్లు ఎత్తేయాలని, రాజ్యాంగాన్ని సవరించాలని, దాని స్థానంలో మనుస్మృతిని అమలు చేయాలని కుట్రలు పన్నుతున్నాయని, సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా పీడిత కులాలు ఐక్యంగా ఉద్యమించాలని ప్రభాకర్ పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు దుడ్డు విజయ్సుందర్, డాక్టర్ నూకతోటి రవికుమార్, నక్కల వీరాంజనేయులు, పాలడుగు విజయేంద్ర బహుజన్ మాట్లాడారు. సదస్సును దుడ్డు వెంకట్రావు పర్యవేక్షంచారు. -
నాజీల ‘గాలి’ తీసేశారు..
రెండో ప్రపంచ యుద్ధ కాలం.. అటువైపు.. అరివీర భయంకరమైన నాజీ సైన్యం.. ట్యాంకులు, తుపాకులతో గుంపులు గుంపులుగా.. అచ్చంగా.. బాహుబలి చిత్రంలోని కాలకేయుల్లాగా.. మరి ఇటువైపు.. కేవలం 1,100 మంది కళాకారులు.. వీరి వద్ద తుపాకులు లేవు.. ట్యాంకులు అసలే లేవు.. ఉన్నదల్లా.. సైకిల్ పంపులు.. కలర్ బాక్సులు.. సౌండ్ సిస్టమ్‌లు.. ఇదేమి చిత్రం.. ఇదేమి యుద్ధం.. ఇంతకీ గెలుపెవరిది? ఘోస్ట్ ఆర్మీ.. రెండో ప్రపంచ యుద్ధంలో వేల మంది అమెరికా, ఇతర మిత్ర దేశాల సైనికుల ప్రాణాలను కాపాడిన సైన్యం.. జర్మనీ సైనికులకు ‘సినిమా’చూపించిన మాయా సైన్యం.. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేయడం కళాకారులకే సాధ్యం.. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా, మిత్ర దేశాలు దాన్నే తమ ఆయుధంగా మలుచుకున్నాయి. జర్మన్ సైనికులను మభ్యపెట్టడానికి ‘ఘోస్ట్ ఆర్మీ’ని సృష్టించాయి. అధికారికంగా దీన్ని 23వ హెడ్ క్వార్టర్స్ స్పెషల్ ట్రూప్స్గా పిలిచేవారు. ఇందులో పనిచేసేవారి నియామకమంతా రహస్యంగా జరిగింది. న్యూయార్క్, ఫిలడెల్ఫియా ఆర్ట్ స్కూల్స్ నుంచి తమకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకున్నారు. వీరిలో మిమిక్రీ ఆర్టిస్ట్స్, చిత్రకారులు, సౌండ్ టెక్నీషియన్లు ఉన్నారు. ఇంతకీ వీరేం చేశారు జస్ట్ మాయ చేశారు.. అసలైన ట్యాంకర్లకు బదులుగా గాలితో నింపిన బెలూన్ టైపు ట్యాంకర్లను తయారుచేశారు. నిజమైన ఆయుధాలుగా భ్రమింపజేసేలా వాటికి రంగులు అద్దారు.. ట్యాంకులు, విమానాలు, శతఘ్నులు ఒకటేమిటి.. ఇలా అన్నీ ‘గాలి’ఆయుధాలను తయారుచేశారు. తమ సౌండ్ బాక్సులతో ఉన్నది వేయి మందైనా.. వేల మంది సైన్యం.. వందల సంఖ్యలో ట్యాంకర్లు వస్తున్న ఎఫెక్ట్‌ను సృష్టించారు. జర్మన్ సైనికులను లక్ష్యంగా చేసుకుని ఇలా మొత్తం 20 ఆపరేషన్లు చేశారు.. వీళ్ల పని ఒక్కటే.. సైనికుల దుస్తులు వేసుకుని.. అలా పరేడ్ చేసుకుని పోవడమే.. ముందే రికార్డు చేసిన.. ట్యాంకుల సౌండ్లు, వేలాది మంది సైనికుల పరేడ్ ఎఫెక్ట్ వంటి వాటిని భారీ స్పీకర్లతో వినిపించడమే.. అయితే.. ఈ నకిలీ ఆయుధాలు, సౌండ్ ఎఫెక్ట్‌ల వల్ల.. వందలాది ట్యాంకులతో వేలాది మంది సైనికులు తమ మీదకు దండెత్తి వస్తున్నారంటూ జర్మన్లు హడలిపోయేవారు.. ఉంటున్న స్థావరాలను విడిచి.. పారిపోయేవారు.. అంతేకాదు.. జర్మన్ గూఢచారులకు తెలిసేలా స్థానిక కాఫీ షాపుల్లో కూర్చుని.. వేల సంఖ్యలో అమెరికన్ల సైన్యం దండెత్తి వచ్చేస్తోందంటూ భయపెట్టించేలా మాట్లాడేవారు. ఇలా వీరు తమ గాలి సైన్యంతో వేలాది మంది అమెరికా, మిత్రదేశాల సైనికుల ప్రాణాలను కాపాడారు.. 1945, మార్చి నెల.. ఘోస్ట్ ఆర్మీకి అసలైన పరీక్ష.. రైన్ నదిని దాటి.. జర్మనీలోకి ప్రవేశించాలని అమెరికా, మిత్ర దేశాల సైన్యాలు భావించాయి. జర్మన్ సైన్యాల దృష్టిని మళ్లించడానికి వెంటనే ఘోస్ట్ ఆర్మీని రప్పించాయి. దీంతో వారు ఇక తమ టాలెంట్ చూపించారు. 600 గాలి ట్యాంకులను రంగంలోకి దింపారు. వేల మంది సైనికుల పదఘట్టనల సౌండ్ ఎఫెక్ట్‌ను వినిపించారు. అంతే.. జర్మన్ సైన్యం దృష్టి.. ఈ రబ్బర్ సైన్యం మీదకు మళ్లింది.. అటు అమెరికా సైన్యాలు అతి తక్కువ ప్రతిఘటనతో విజయవంతంగా రైన్ నదిని దాటేశాయి. ఇక యుద్ధం ముగిసిన తర్వాత ఇందులో పనిచేసిన వారు తమతమ వృత్తుల్లోకి వెళ్లిపోయారు. వీరిలో పలువురు ఆయా రంగాల్లో పేరుప్రఖ్యాతులు కూడా సంపాదించారు. యుద్ధం ముగిసిన చాన్నాళ్ల వరకూ ఈ ఘోస్ట్ ఆర్మీకి సంబంధించిన వివరాలను రహస్యంగా ఉంచారు. ఆ పత్రాలు బయటకి రాలేదు. దాదాపు 40 ఏళ్ల తర్వాత వీరి గురించి ప్రపంచానికి తెలిసింది. నాటి 1100 మంది ఘోస్ట్ ఆర్మీలో ప్రస్తుతం ఓ 50 మంది బతికి ఉన్నారు. 2013లో తీసిన ది ఘోస్ట్ ఆర్మీ డాక్యుమెంటరీలో వీరిని ఇంటర్వ్యూ చేశారు కత్తి కన్నా కలం గొప్పదంటారు.. కానీ వీరంటారు.. కత్తి కన్నా మా ‘కళ’ గొప్పది అని.. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
ఫ్యాక్షనిస్టుల పాత ఆయుధాలు నిర్వీర్యం
కర్నూలు: కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో ఫ్యాక్షనిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న 1,575 తుపాకులను పోలీసులు నిర్వీర్యం చేశారు. కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై ఉన్న పోలీస్ శిక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. 1976 నుంచి 2009 వరకు పలు కేసుల్లో ఎస్బీబీఎల్ గన్స్ 260, ఎస్బీఎంఎల్ గన్స్ 256, బీబీఎల్ గన్స్ 78, పిస్టల్స్ 522, రివాల్వర్లు 364, రైఫిల్స్ 93, స్టెన్ గన్స్, తపంచ, ఎయిర్ గన్స్, ఎయిర్ పిస్టల్స్.. మొత్తం 1,575 తుపాకులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆయుధాల సీజ్ 1998లో ఎక్కువ జరిగిందని వివరించారు. పై అధికారుల అనుమతితో పాత ఆయుధాలను రోడ్డు రోలర్‌తో తొక్కించి పూర్తిగా నాశనం చేశామని, తర్వాత కాల్చి ఇక్కడే గుంతలో పూడ్చి పెట్టినట్లు చెప్పారు. మరో 12 పాత ఆయుధాలను నిర్వీర్యం కమిటీ ఆదేశాల మేరకు ఎగ్జిబిషన్ ప్రదర్శన నిమిత్తం ఉంచామన్నారు. -
ఆయుధాల దిగుమతిలో మళ్లీ మనమే నెంబర్ వన్
దేశ రక్షణకు అవసరమైన ఆయుధాలను దిగుమతి చేసుకోవడంలో ప్రపంచ దేశాల్లో మళ్లీ మనమే నెంబర్ వన్‌గా నిలిచాం.. 2008–12, 2013–17 మధ్య కాలంలో భారత్ ఆయుధాల దిగుమతి 24 శాతం పెరిగినట్టు స్టాక్‌హోమ్‌కు చెందిన ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఒకవైపు చైనా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఆయుధాలను రూపొందించే దిశగా అడుగులు వేస్తుంటే... పాకిస్తాన్ ఆయుధాల దిగుమతిని గణనీయంగా తగ్గించుకుంటే భారత్ మాత్రం ఇతర దేశాల మీదే ఆధారపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా గతఅయిదేళ్ల కాలంలో దిగుమతుల్ని పరిశీలిస్తే 12 శాతం భారత్ చేసుకుంటున్నవే. రష్యా, అమెరికా, యూరప్, ఇజ్రాయెల్, దక్షిణకొరియా దేశాల నుంచి ఎక్కువగా ఆయుధాల్ని కొనుగోలు చేస్తోంది. ఆయుధాల దిగుమతిలో భారత్ తర్వాత స్థానాలలో సౌదీ అరేబియా, ఈజిప్టు, యూఏఈ, చైనా, ఆస్ట్రేలియా, ఇరాక్, పాకిస్తాన్, ఇండోనేసియా నిలిచాయి. ఇక మన దేశానికి అత్యధికంగా ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశం రష్యా.. దేశానికి అవసరమయ్యే ఆయుధాల్లో రష్యా నుంచి 62శాతం, అమెరికా నుంచి 15 శాతం, ఇజ్రాయెల్ నుంచి 11 శాతం ఆయుధాలను దిగుమతి చేసుకున్నట్టు ఆ నివేదిక తెలిపింది. అమెరికా నుంచి 550 శాతం పెరిగిన దిగుమతులు ఒకవైపు పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటుంది. మరోవైపు డ్రాగన్ దేశం బుసలు కొడుతూ ఉంటుంది.. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మన రక్షణ బడ్జెట్ క్రమంగా పెరిగిపోతోంది. ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా, సౌదీ అరేబియా తర్వాత రక్షణ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నది భారత్ దేశమే. ఎప్పుడో ఏ దేశం నుంచి ముప్పు ఉంటుందో తెలీని పరిస్థితుల్లో మనం ఆయుధాలను దిగుమతి చేసుకోక తప్పడం లేదు. సైనికులు వాడే తుపాకులు దగ్గర్నుంచి యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, జలాంతర్గాములు వంటివి రష్యా నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటే, ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇక అమెరికా నుంచి రికార్డు స్థాయిలో 550శాతం దిగుమతులు పెరిగాయి. బోయింగ్ ఏపీ–8 పెసిడోన్ యాంటీ సబ్‌మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్, సీ–17 రవాణా విమానం, ఏహెచ్–64ఈ అపాచి అటాక్ హెలికాప్టర్ల దిగుమతికి ఒప్పందం కుదుర్చుకుంది. గత 15, 16 ఏళ్ల కాలంలో ఆయుధాల ఒప్పందం కోసమే 7,500 కోట్ల డాలర్లకు పైగా ఖర్చు చేసింది. ఇక 2018–19 సంవత్సరానికి 2.95 లక్షల కోట్లు రక్షణ రంగానికి కేటాయించారు. మరో 1.08 లక్ష కోట్లు రక్షణ రంగంలో పెన్షన్లకు కేటాయించారు. మేకిన్ ఇండియా ఫలితాన్ని ఇవ్వడం లేదా ? మన రక్షణ రంగంలో ఆయుధాలన్నీ ఎప్పుడో తాతలకాలం నాటివి. అత్యంత పురాతన యుద్ధవిమానాలనే మనం ఇంకా వాడుతున్నాం. అందుకే రక్షణ రంగాన్ని ఆధునీకరించడానికి, యుద్ధవిమానాలు, జలాంతర్గాములు, తుపాకులు వంటివి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడానికి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. మేకిన్ ఇండియా వంటి కార్యక్రమంతో ఆయుధాల తయారీ రంగంలో స్వయంప్రతిపత్తి సాధించడానికి ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం 25 వేల కోట్ల డాలర్లు ఖర్చుచేయడానికి కూడా సిద్ధమైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తేజాస్ వంటి యుద్ధ విమానాన్ని భారత్ రూపొందించినప్పటికీ దేశ అవసరాలను తీర్చగలిగే స్థాయికి ఇంకా చేరుకోలేకపోయింది. 2014 తర్వాత విదేశీ ఆయుధ కంపెనీలతో 1.3లక్షల కోట్ల విలువ చేసే ఒప్పందాలు కుదుర్చుకుంటే, స్వదేశీ సంస్థలతో 1.17 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది. 15 లక్షల మంది సాయుధ దళాల నిర్వహణకే అత్యధిక నిధులు ఖర్చు అయిపోతూ ఉండడంతో రక్షణ రంగంలో పరిశోధనలు, అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించలేకపోతోంది. అందుకే విదేశాల నుంచి ఆయుధాల దిగుమతి తప్పనిసరైపోతోంది. -- (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
‘అమెరికాను మించిన ఆయుధాలున్నాయి’
వాషింగ్టన్: అణు క్షిపణులు సహా అత్యంత శక్తిమంతమైన, అజేయమైన ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. తమ ఆయుధాల ముందు అమెరికా ఆయుధ సంపత్తి దిగదుడుపేనని పేర్కొన్నారు. వార్షిక స్టేట్ ఆఫ్ ద నేషన్ ప్రసంగంలో పుతిన్ మాట్లాడారు. ఆయుధాలకు సంబంధించిన కొన్ని ప్రతీకాత్మక వీడియోలనూ ఆయన చూపించారు. వీడియోల్లో ఆయుధాలు అమెరికా వైపునకు గురిపెట్టినట్లుగా ఉన్నాయి. శత్రు దేశాల రక్షణ వ్యవస్థలు తమ ఆయుధాలను గుర్తించేలోపే అవి విధ్వంసం సృష్టిస్తాయని పుతిన్ చెప్పారు. కాగా, పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా మండిపడింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి ఒప్పందాలను ఉల్లంఘించి రష్యా శక్తిమంతమైన ఆయుధాలను తయారుచేస్తోందని ఆరోపించింది. ఈ విషయాన్ని తాము ఎప్పటినుంచో చెబుతున్నా రష్యా తోసిపుచ్చిందనీ, కానీ ఇప్పుడు ఆ దేశాధ్యక్షుడే స్వయంగా ఆ విషయం బయటపెట్టారని అమెరికా పేర్కొంది. -
చండీపూర్‌కు అరుదైన ఘనత
బాలాసోర్(ఒడిశా): చండీపూర్‌లోని క్షిపణి ప్రయోగకేంద్రం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇక్కడి బీచ్‌లో దేశంలోనే మొట్టమొదటి ఆయుధ ప్రదర్శనశాల ఏర్పాటైంది. భారత నావికా దళం, వైమానిక దళాలు వినియోగించిన ప్రముఖ ఆయుధ వ్యవస్థలను ప్రజల సందర్శనార్థం ఇందులో ఉంచారు. డిఫెన్స్ రీసెర్చి, డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) డాక్టర్ ఎస్. క్రిస్టొఫర్ మంగళవారం దీనిని ప్రారంభించారు. మొత్తం 14 రకాల ఆయుధాలను ప్రస్తుతం ప్రదర్శిస్తున్నామని, భవిష్యత్తులో మరికొన్ని ఇందులో ఉంచనున్నట్టు తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటానికి సైన్యం ఎలాంటి ఆయుధాలను, ఆయుధ వ్యవస్థలను వాడుతుందనే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించటానికి ఇది ఉపయోగపడుతుందని క్రిస్టొఫర్ తెలిపారు. మనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటి చెప్పటానికి.. ముఖ్యంగా యువతలో స్ఫూర్తి నింపేందుకు కృషి చేస్తున్నామన్నారు. చండీపూర్‌లో సైన్యం వినియోగించే ట్యాంకులు, క్షిపణులు, ఫీల్డ్‌గన్స్, మోర్టార్లు తదితరాలను పరీక్షిస్తుంటారు. ఈ ప్రదర్శనలో 1971 వ సంవత్సరంలో పాక్‌తో జరిగిన యుద్ధంలో కీలక పాత్ర పోషించిన వైజయంత ట్యాంక్ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు దేశం బంకర్లను, సైన్యాన్ని నిలువరించటం ఈ ట్యాంక్ దీని ప్రత్యేకత. దీనితో పాటు డబ్ల్యూఎం-18 రకం రాకెట్ లాంఛర్, 105 మిమీ ఫీల్డ్‌గన్, 122 మిమీ బీఎం-21 రాకెట్ లాంఛర్, 57 మిమీ యాంటీ ట్యాంక్ గన్, 40 ఎంఎం లైట్గన్ తదితరాలను కూడా ప్రదర్శనలో ఉంచారు. -
కారునిండా ఆయుధాలతో వైట్‌హౌస్‌కు..
వాషింగ్టన్ : ఓ గుర్తుతెలియని వ్యక్తి కారు నిండా ఆయుధాలతో ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌కు బయలుదేరడం కలకలం రేపింది. అధ్యక్ష భవనం సమీపంలో మూత్రవిసర్జన చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ఆపై అతడు చెప్పిన విషయాలు విని అధికారులు షాకయ్యారు. వైట్ హౌస్ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుతో ఓ వ్యక్తి కొన్ని విషయాలు చర్చించాలనుకున్నాడు. ఆదివారం తన కారులో ఏకే 47 సహా తొమ్మిది తుపాకులు, మూడు కత్తులు, మరికొంత ఆయుధసామాగ్రితో వైట్‌హౌస్ కు బయలుదేరాడు. వైట్ హౌస్ సమీపానికి రాగానే బహిరంగ ప్రదేశంలో మూత్రవిసర్జన చేస్తూ ఆ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. అతడి కదలికలను గుర్తించిన పోలీసులు అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. కారును తనిఖీ చేయగా అందులో ప్రమాదకర ఆయుధాలు ఉండటంతో షాకవ్వడం అధికారుల వంతైంది. తాను వైట్ హౌస్‌కు వెళ్లి రక్షణశాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్, జాతీయ భద్రతా సలహాదారు అడ్మైరల్ మైక్ రోజర్స్‌తో మాట్లాడేందుకు వైట్‌హౌస్‌కు వెళ్తున్నట్లు చెప్పాడు. మిస్సయిన పే చెక్స్‌ను ఎలా గుర్తించాలో.. తన మైండ్‌లోని చిప్‌ను బయటకు తీస్తే తెలుస్తుందంటూ విచిత్రమైన బదులిచ్చాడు. అనుమానిత వ్యక్తి మానసిక స్థితి సరిగా ఉందో లేదో తెలుసుకునేందుకు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ వ్యక్తిని డీసీ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఆయుధాలు, తుపాకులు కలిగిఉన్నాడన్న కారణంగా ఆయుధాలచట్టం కింద కేసు నమోదు చేశారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న ఇదే వ్యక్తి 2009లో సిల్వర్ నిస్సాన్ కారులో ప్రయాణిస్తూ పోలీసుల చేతికి చిక్కినట్లు సమాచారం. -
అటవీ సిబ్బందికి ఆయుధాలు: జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్ : అటవీశాఖ సిబ్బందికి ఆయుధాలు ఇచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని అటవీశాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరులైన అటవీశాఖ సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏడాది సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా ‘అటవీ అమరవీరుల సంస్మరణ దినం‘ జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. 1984 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 22 మంది అటవీ సిబ్బంది అమరులయ్యారన్నారు. విధి నిర్వహణలో అటవీ శాఖ అధికారులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. -
ఆయుధాలు అప్పగించిన ‘డేరా’ అనుచరులు
ఛండీగఢ్: డేరా బాబా అనుచరులు తమ వద్ద ఉన్న ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. సిర్సాలోని డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయంలో ఉన్న వివిధ రకాలైన 33 లైసెన్స్డ్ ఆయుధాలను అనుచరులు సిర్సా సదర్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ఎస్‌హెచ్‌వో దినేష్‌కుమార్ తెలిపారు. రేప్ కేసులో డేరా సచ్ఛా సౌదా ఛీఫ్ గుర్మీత్ రాంరహీం సింగ్‌కు ఇరవయ్యేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం రహటక్లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. గుర్మీత్ అరెస్ట్ అనంతరం ఆయన అనుచరులు పాల్పడిన అల్లర్లలో 41 మంది చనిపోవటంతోపాటు భారీ మొత్తంలో ఆస్తినష్టం సంభవించింది. ఈ నేపథ్యంలోనే సచ్ఛాసౌదా కార్యాలయాన్ని పోలీసులు దిగ్బంధించారు. ఆశ్రమంలో ఉన్న పలువురు బాలలను విడిపించారు. అక్కడ జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను వెలుగులోకి తెచ్చారు. దీంతోపాటు డేరా అనుచరుల వద్ద ఉన్న ఆయుధాలను వెంటనే అప్పగించాలని పోలీసులు అల్టిమేటం ఇచ్చారు. దీనికి స్పందించిన డేరా అనుచరులు సోమవారం తమ వద్ద ఉన్న సింగిల్ బ్యారెల్, డబుల్ బ్యారెల్ తుపాకులతోపాటు 9మిమీ పిస్టళ్లను పోలీసులకు అప్పగించారు. -
సైన్యానికి 1.85 లక్షల రైఫిళ్లు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సైనికులకు భారీగా ఆయుధాలను అందించనుంది. దాదాపు 1.85 లక్షల రైఫిళ్లను సరఫరా చేయాలని దేశంలోని వివిధ ఆయుధ కర్మాగారాలను కోరింది. భారత సైన్యానికి అత్యంత శక్తివంతమైన 65 వేల రైఫిళ్లు తక్షణం సమకూర్చాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకు దేశ విదేశాల్లోని దాదాపు 20 ఆయుధ ఉత్పత్తి సంస్థలు కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించాయి. వీటికి సంబంధించి టెండర్లు త్వరలోనే ఖరారు కానున్నాయి. ప్రస్తుతం సైన్యం దేశీయ ఆయుధాలైన ఐఎన్ఎస్ఎస్ (ఇండియన్ న్యూ స్మాల్ ఆర్మ్ సిస్టం) రైఫిళ్లను ఉపయోగిస్తోంది. వీటి స్థానంలోనే కొత్త ఆయుధాలు సైనికులకు అందనున్నాయి. -
ఆయుధాలు ప్రదర్శించిన మావోలు
సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి అనంతరం విజయోత్సవ సభ చింతూరు: తీవ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుపాతర్లు స్వాధీనం చేసుకున్నప్పుడు పోలీసులు వాటిని ప్రదర్శించడాన్ని మనం చూస్తుంటాం. ఇందుకు భిన్నంగా ఛత్తీస్‌గఢ్ పోలీసుల నుంచి అపహరించిన ఆయుధాలు, మందు గుండు సామగ్రిని మావోయిస్టులు ప్రజల ఎదు ట ప్రదర్శించారు. ఆ చిత్రాలను ఛత్తీస్‌గఢ్ మీడియాకు మావోయిస్టు సానుభూతిపరులు విడుదల చేశారు. గత నెల 24న సుక్మా జిల్లా బుర్కాపాల్ వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసిన మావోయిస్టులు 25 మందిని హతమార్చి పలు ఆయుధాలను, మందుగుండు సామగ్రిని అపహరించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం మావోయిస్టులు గత నెల 27న సుక్మా జిల్లాలోని సాలాతోంగ్ అనే గ్రామం వద్ద భారీ విజయోత్సవ సభ నిర్వహించారు. బుర్కాపాల్ ఘటనకు మాస్టర్‌మైండ్ అయిన మిలట్రీ బెటాలియన్ కమాండర్ హిడ్మా ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో అపహరించిన ఆయుధాలను ఆదివాసీలకు ప్రదర్శించినట్లు మావోయిస్టులు తెలిపారు. -
అంతరిక్షంలో మేటి.. మరి రక్షణలోనో..!
అంతరిక్ష రంగంలో దూసుకుపోతున్న భారత్.. రక్షణ ఆయుధాల విషయంలో బాగా వెనుకబడింది. ప్రపంచంలోనే ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ప్రధమ స్ధానంలో నిలిచింది. గత ఐదేళ్లుగా ఇదే పొజిషన్లో భారత్ ఉంటోందని స్టాక్‌హోమ్‌కు చెందిన అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్ధ(ఎస్ఐపీఆర్ఐ) పేర్కొంది. 2012 నుంచి 2016 మధ్య ప్రపంచంలో ఎగుమతైన ఆయుధాల్లో 13శాతం భారతే దిగుమతి చేసుకున్నట్లు తమ సర్వేలో వెల్లడైందని చెప్పింది. 2007-2011ల మధ్య ఇది 43 శాతంగా నమోదైనట్లు తెలిపింది. ఇది ప్రపంచదేశాలన్నింటిలో కల్లా చాలా ఎక్కువని చెప్పింది. సొంతంగా ఆయుధాలను తయారు చేసుకుంటూ చైనా ఆయుధాల దిగుమతిని చాలా వరకూ తగ్గించుకుందని తెలిపింది. కానీ భారత్ మాత్రం అందుకు విభిన్నంగా రష్యా, అమెరికా, యూరప్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియాల్లాంటి దేశాలపై ఆయుధాల కోసం ఆధారపడుతోందదని చెప్పింది. కోల్డ్‌వార్ తర్వాతి నుంచి ఆయుధాల రంగంలో గుర్తించదగిన మార్పులు వచ్చినట్లు పేర్కొంది. భారత్ తర్వాత సౌదీ అరేబియా, ఖతార్‌లు ఆయుధాల దిగుమతిలో ముందున్నట్లు తెలిపింది. గతంతో పోలిస్తే 2012-2016ల మధ్య సౌదీ ఆయుధాల కొనుగోళ్లు 212 శాతం పెరగ్గా.. ఖతార్ కొనుగోళ్లు 245 శాతం పెరిగాయి. ఆయుధాలను ఎగుమతి చేస్తున్న దేశాల్లో అమెరికా ముందుంది. ప్రపంచంలో ఎగుమతి అవుతున్న ఆయుధాల్లో అమెరికా షేర్ మూడింట ఒక వంతుగా ఉంది. ఆ తర్వాతి స్ధానంలో రష్యా ఉంది. 2012-2016ల మధ్య ఆయుధాల ఎగుమతిలో రష్యా 23 శాతం వృద్ధిని చూసింది. రష్యా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న వారిలో భారత్, వియత్నాం, చైనా, అల్జీరియాలు వరుసగా ఉన్నాయని వెల్లడించింది. -
నకిలీ నక్సలైట్ అరెస్టు...
-
నకిలీ నక్సలైట్ అరెస్టు...
ఎనిమిది ఆయుధాలు, 50 బుల్లెట్లు స్వాధీనం జడల నాగరాజుకు దగ్గరి బంధువు కరీంనగర్ క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఆయుధాలు చూపుతూ బెదిరింపులకు పాల్పడుతున్న నకిలీ నక్సలైట్ తోట రాములును అరెస్టు చేసి అతని నుంచి ఎనిమిది ఆయుధాలు, 50 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి ఈ మేరకు వివరాలను వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కేశనపల్లికి చెందిన తోట రాములు(36) మాజీ నక్సలైట్ జడల నాగరాజుకు దగ్గరి బంధువు. ఇద్దరు కలసి పలు సెటిల్మెంట్లు, బెదిరింçపులకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఆ సమయంలో జడల నాగరాజుపై పోలీసుల నిఘా పెరగడంతో తనవద్ద ఉన్న ఆయుధాలను దాచాలని రాములుకు అప్పగించాడు. 2012లో జడల నాగరాజు అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత రాములు తన వద్ద ఉన్న ఆయుధాలు చూపిస్తూ పలుచోట్ల సెటిల్మెంట్లు చేయడం మొదలుపెట్టాడు. రాములు ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న సమాచారంతో 2015 మేలో కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి అతనిపై క్రైం నంబర్ 232/16 కేసు నమోదు చేశారు. అతడి నుంచి అధునాతమైన జర్మన్ మేడ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. జైలునుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రాములు పలు భూ పంచాయితీల్లో తలదూర్చి బెదిరింపులకు గురిచేసి రూ.లక్షలు వసూలు చేశాడు. ఇటీవల కమిషనరేట్ ఏర్పాటు చేసిన తర్వాత కమిషనర్ కమలాసన్‌రెడ్డి కార్డెన్ సెర్చ్‌లు ప్రారంభించారు. తనిఖీల్లో ఆయుధాలు బయటపడతాయనే భయంతో వాటిని కరీంనగర్ మండలం తీగలగుట్లపల్లి గ్రామం విద్యారణ్యపురి కాలనీలో సమీపంలో ఉంటున్న తన అన్న ఇంటి సమీపంలో గల ముళ్ల పొదలున్న స్థలంలో 200 మీటర్ల లోతున దాచి పెట్టాడు. తన బెదిరింపులకు అప్పుడప్పుడు డంపులో ఉన్న ఆయుధాలు వినియోగించేవాడు. ఈ సమాచారంతో తోట రాములుపై పోలీసులు పక్కాగా నిఘా పెట్టారు. శుక్రవారం ఉదయం రాములు అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా డంపు విషయం బయటపడింది. ఆ డంపులో నుంచి ఒక 8ఎంఎం రైఫిల్, ఎస్బీబీఎల్ (సింగిల్‌బోర్ తుపాకీ) ఒకటి, డబుల్బోర్ తుపాకీలు మూడు, 9ఎంఎం కార్బన్ గన్ ఒకటి, 32పిస్టల్ ఒకటి, ఒక 8ఎంఎం తపంచాతోపాటు 50 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
నేవీ స్థావరంలోకి అగంతకులు?
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని తూర్పు నావికాదళం ప్రధాన కేంద్రంలోకి ఇద్దరు అగంతకులు ప్రవేశించారన్న ప్రచారం కలకలం రేపుతోంది. నౌకాదళ స్థావరంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారని సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డరుునట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న నిఘా వర్గాలు అప్రమత్తమయ్యారుు. వీరు నావికాదళం ప్రధాన కేంద్రంలోకి గోడ దూకి ప్రవేశిం చినట్టు అనుమానిస్తున్నారు. వారు ఆయుధాలు కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. వీరి ఆచూకీని కనుగొనేందుకు నావికాదళ స్థావరంలో అణువణువూ గాలిస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో గగన తల మార్గంలోనూ అన్వేషిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచే నేవీ ఉద్యోగులను, సివిల్ ఉద్యోగులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. విశాఖ తూర్పు నావికాదళ స్థావరంలో సుమారు వెరుు్య మందికి పైగా సివిల్ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బంది, ఇతరులు నిత్యం వెళ్లి వస్తుంటారు. వీరితోపాటు వేల సంఖ్యలో నావికులు, నేవీ అధికారులు విధులు నిర్వహిస్తుంటారు. రేరుుంబవళ్లు సాయుధులైన నావికులు గస్తీ విధుల్లో ఉంటారు. వీరందరి కళ్లు గప్పి అగంతకులెలా ప్రవేశించారన్నది ప్రశ్నార్థకం గా మారింది. అగంతకులు నావికాదళ ప్రధాన స్థావరానికి ఆవల ఉన్న యారాడ కొండవైపు వెళ్లిపోయే అవకాశం ఉంది. దీంతో ఆ ప్రాంతంతోపాటు వారు తప్పించుకునేందుకు అవకాశాలున్న అన్ని మార్గాల్లోనూ నేవీ, పోలీసు, నిఘా వర్గాలు గాలిస్తున్నారుు. అరుుతే చొరబాటు వార్తలపై ఉన్నతాధికారులు నోరు మెదపడం లేదు. -
కలంతోపాటు కత్తి కూడా!!
• కొలరాడో టీచర్ల చేతిలో ఇక ఆయుధాలు • ఉగ్రదాడుల నుంచి పిల్లలను కాపాడేందుకే.. • నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న మిగతా పాఠశాలలు డెన్వర్: వేయి కత్తులు చేయలేని పనిని ఓ కలం చేస్తుందంటారు. అందుకే కత్తికంటే కలం గొప్పదని చెబుతారు. కత్తి పట్టినవాడిని మార్చే శక్తి కలానికి ఉందంటారు. కానీ ఇవన్నీ ఒకప్పటి సమాజానికి సరిపోయే మాటలే. ఇప్పటి పరిస్థితుల్లో ఏది గొప్పదో చెప్పలేని దుస్థితి నెలకొంది. ఎందుకంటే ఉగ్రవాదులు పాఠశాలలపై విరుచుకుపడి.. అమాయకులైన చిన్నారులను బలిగొంటుంటే.. ఉపాధ్యాయులు నిశ్చేష్టుల్లా నిలబడిపోవాల్సి వస్తోంది. అందుకే కలంతోపాటు కత్తి ఉంటేనే మేలంటున్నారు అమెరికాలోని కొలరాడో జిల్లాలోని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు. అంతేనా... పాఠశాలలకు వెళ్లే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది తమ విద్యార్థుల రక్షణ కోసం, స్వీయ రక్షణ కోసం ఆయుధాలను కూడా వెంట తీసుకొచ్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ నిర్ణయానికి ఇప్పటికే ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఓటేశారు. అయితే ఆయుధాల వినియోగంపై ముందుగా శిక్షణ ఇచ్చిన తర్వాతే వాటిని పాఠశాలకు తీసుకెళ్లేందుకు అనుమతిని ఇవ్వాలనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇది స్వచ్ఛందంగా అమలు చేయాల్సిన నిర్ణయంగానే ఉండాలని కోరారు. అయితే కొంతమంది మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బడిపిల్లల్ని కాపాడేందుకు సాయుధులైన, శిక్షణ పొందిన సిబ్బందిని నియమించుకుంటే సరిపోతుందని చెప్పారు. మరికొంతమంది నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. కేవలం ఆయుధాలు ఉన్నంత మాత్రాన ఉపాధ్యాయులు తమ పిల్లల్ని కాపాడుకోలేరని, అందుకు వారికి శిక్షణ ఎంతో అవసరమన్నారు. కొలరాడోతోపాటు టెక్సాస్, ఒక్లహోమా, కాలిఫోర్నియా జిల్లాలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కాగా కొలరాడోలోని కొన్ని పాఠశాలల బోర్డులు ఈ నిర్ణయాన్ని సమర్థించాయి. భారీగా ఖర్చుచేసి, భద్రతా సిబ్బందిని నియమించుకోలేమని, తాము మాత్రం వచ్చే వార్షికోత్సవం నాటికి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని తేల్చిచెప్పాయి. -
నేవీ స్థావరంలోకి అగంతకులు?
-
జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితుల అరెస్ట్
–మారణాయుధాలు, ఆటో స్వాధీనం –మరో తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్న పోలీసులు ఏలూరు అర్బన్ ః జిల్లాలో సంచలనం సృష్టించిన హత్యకేసులో నలుగురు నిందితులను ఏలూరు టూ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి స్థానిక ఏలూరు సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 13వ తేదీన పట్టపగలు స్థానిక టూ టౌన్ పరిధిలోని చింతచెట్టు సెంటర్ రోడ్లో శివకేశవ స్వామి ఆలయం వద్ద చేపలతూము సెంటర్‌కు చెందిన కంచి నరేంద్ర కుమార్ అలియాస్ పెద కృష్ణ (37) అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు కత్తులతో నరికి చంపి పరారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో తరచూ జరుగుతున్న హత్యలు, హత్యాయత్నాలను సీరియస్‌గా పరిగణించిన ఎస్పీ భాస్కర్‌భూషణ్ నిందితులను ఇరవై నాలుగు గంటల్లో పట్టుకుంటామని ప్రకటించారు. డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు నేతత్వంలో టూ టౌన్ సీఐ బంగార్రాజు, ఎసై ్సలు ఎస్ఎస్ఆర్ గంగాధర్, అల్లు దుర్గారావులో ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించిన సీఐ ఉడతా బంగార్రాజు బందం ఎట్టకేలకు నిందితులు దెందులూరు మండలం సోమవరప్పాడు గ్రామం సమీపంలో సంచరిస్తున్నారని తెలుసుకుని మాటు వేసి వెంకటాపురం పంచాయితీకి చెందిన బొట్టా చంద్రశేఖర్, అదే గ్రామానికి చెందిన బొట్టా దుర్గాప్రభాకరరావు అలియాస్ దుర్గారావు, నగరంలోని పాండురంగపేటకు చెందిన కోమాకుల శ్రీను అలియాస్ పూల శీను, స్థానిక వైఎస్ఆర్ కాలనీకి చెందిన పిల్లా ప్రశాంత కుమార్ అనే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారని డీఎస్పీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. – ఇది ప్రతీకార హత్యే కంచి నరేంద్ర కష్ణ హత్య ప్రతీకార హత్యేనని డీఎస్పీ స్పష్టం చేశారు. మతుడు నరేంద్ర కష్ణ కుమార్ అలియాస్ పెద కష్ణ 2012లో బొట్టా గంగాధరరావు అనే వ్యక్తిని హత్య చేశాడు. దాంతో గంగాధర తమ్ముళ్ళు (ప్రస్తుతం పెద కష్ణ హత్యకేసులో ప్రధాన నిందితులు బొట్టా చంద్రశేఖర్, బొట్లా దుర్గాప్రభాకరరావులు) అన్న గంగాధరరావును కిరాతకంగా హత్య చేసిన పెద కష్ణపై ప్రతీకారం తీర్చుకోవాలనే పగతోనే ఈ హత్యకు పాల్పడ్డారని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. – హత్యకు సహకరించిన మరో 9మంది నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉంది. కంచి పెద కష్ణ హత్యకు పరోక్షంగా సహకరించిన మరో తొమ్మిదిమంది నిందితులను ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ వివరించారు. నిందితులలో నగర కార్పొరేటర్ భర్త భీమవరపు సురేష్ కుమార్, తాబేలు ధనుంజయ, టోని అలియాస్ మిండాల నాగ శివ, అక్కి మురళి, దండా నాని, వనమాల సతీష్ అలియాస్ కోకిల, దండా చినశేఖర్, రెల్ల, వాసు, మాడుగుల ప్రేమ్కుమార్లు పరారీలో ఉన్నారని వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. -
పోలీసులపై దాడి, ఆయుధాలతో పరారీ
అనంతనాగ్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు అనంత్‌నాగ్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడి చేసి ఆయుధాలతో పరారయ్యారు. దల్విశ్ గ్రామంలో టీవీ టవర్ వద్ద పహారా కాస్తున్న పోలీసులపై గతరాత్రి దాడి చేసి, వారి వద్ద ఉన్న అయిదు తుపాకులను లాకెళ్లారు. మరోవైపు ముష్కర మూకల వరుస దాడుల నేపథ్యంలో ఆర్మీ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. -
ఆయుధాలు తరలిస్తున్నఇద్దరి అరెస్ట్
ఇల్లందు: అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం కొమరారం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ కారులో తరలిస్తున్న 9 ఎంఎం కార్బన్‌తో పాటు 5 బుల్లెట్లను గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. -
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నయీమ్ ఆయుధాలు
-
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నయీమ్ ఆయుధాలు
షాద్‌నగర్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఉపయోగించిన ఆయుధాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సీఐ రామకృష్ణ తెలిపారు. నయీమ్ ఎన్కౌంటర్ తరువాత అతను ఉపయోగించిన ఆయుధాలు ఏకే 47, మూడు రివాల్వర్లు, ఇతర మందుగుండు సామగ్రిని అదేరోజు పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. ఏకే 47, 3 రివాల్వర్లను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు తెలి సింది. శనివారం షాద్‌నగర్ మెజిస్ట్రేట్ సీఎచ్ఎన్ మూర్తి సమక్షంలో ఆయుధాల ను సీజ్ చేసి ల్యాబ్‌కు పంపించారు. సంఘటన స్థలంలో లభించిన బుల్లెట్లు, మందుగుండు సామగ్రిని కూడా తీసుకెళ్లారు. -
నయీమ్‌కు ఆయుధాలెక్కడివి?
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు జరుపుతున్న సోదాల్లో అత్యాధునిక తుపాకులు బయటపడుతున్నాయి. నయీమ్ ఇళ్లతోపాటు అతని అనుచరుల వద్ద కూడా భారీగా ఆయుధాలు లభిస్తున్నాయి. ఇప్పటివరకు 19 వెపన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోగా వాటిలో ఎక్కువ భాగం జర్మనీ, బెల్జియం, రష్యా తయారీవే కావడం గమనార్హం. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఏకే 47తోపాటు 9 ఎమ్ఎమ్ పిస్టళ్లు, తపంచాలు, భారీగా తూటాలు, జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, గొడ్డళ్లు, కత్తులు ఉన్నాయి. వాటిలో కొన్ని వెపన్స్‌ను నయీమ్ గ్యాంగ్ ఉపయోగించినట్లు గుర్తించారు. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి నయూమ్‌కు సమకూరాయనేది పోలీసులకు అంతబట్టడం లేదు. దాదాపు 4 రోజులు విస్తృతంగా గాలిస్తున్నా ఆయుధాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించడం లేదు. పట్టుబడిన నయీమ్ అనుచరులను ప్రశ్నిస్తున్నా ‘అంతా భాయ్’ చూసుకునే వాడంటూ సమాధానం ఇస్తున్నారు. ఆయుధాలు సమకూర్చిందెవరు..? నయీమ్‌కు వివిధ రంగాలలో ఉన్న వారితో విస్తృత పరిచయాలున్నాయి. మాజీ మావోయిస్టు నేత కావడంతో నక్సల్స్‌తో కూడా పరిచయాలున్నాయి. దీంతో నక్సల్స్ నుంచి ఆయుధాలు సరఫరా అయ్యాయా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే నయీమ్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి. ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధాలున్నట్లు గతంలోనే పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అంతేకాదు హిజ్బుల్ నేత ముజీబ్‌తో కలసి నయీమ్ అక్రమంగా ఆయుధాల వ్యాపారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒకసారి పాకిస్తాన్ వెళ్లి దావుద్ ఇబ్రహీంను కలసి చర్చించినట్లు సమాచారం. మరోసారి దుబాయ్ వెళ్లి అక్కడ డీ-గ్యాంగ్ సభ్యులతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలిసింది. -
భారీగా డబ్బు.. ఆయుధాలు
-
భారీగా డబ్బు.. ఆయుధాలు
పోలీసుల తనిఖీల్లో వెలుగు చూస్తున్న గ్యాంగ్ ఆగడాలు సాక్షి, హైదరాబాద్: నయీమ్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పోలీసు ఎన్కౌంటర్లో నయీమ్ ఖతమైన విషయం తెలిసిందే. అనంతరం అతడి నివాసాలతోపాటు అనుచరుల ఇళ్లల్లో రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా కట్టల కొద్దీ డబ్బు.. పెద్ద ఎత్తున ల్యాండ్ డాక్యుమెంట్లు బయటపడుతున్నాయి. వాటి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించారు. ఇప్పటి వరకు వెలుగు చూసిన అక్రమాలు.. * షాద్‌నగర్ మిలీనియం కాలనీలోని నయీమ్ స్థావరాల్లో జరిపిన తనిఖీల్లో నాలుగు రివాల్వర్లు, ఒక స్టెన్‌గన్, రెండు ఏకే 47 రైఫిళ్లు, వాటి బుల్లెట్లు, మందుగుండు సామాగ్రి లభ్యమయ్యాయి. 17 సెల్ఫోన్లు, మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు, హోండా అమేజ్ కారు, స్కూటీ, రూ.3.74 లక్షల నగదు, ఐదున్నర తులాల బంగారు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలకు సంబంధించి 121 డాక్యుమెంట్లు లభించాయి. నయీమ్ భార్య హసీనాబేగంతోపాటు భువనగిరిలోని ఖాజామహల్లాకు చెందిన సలీమా బేగం, మిర్యాలగూడలోని అశోక్ నగర్‌కు చెందిన అబ్దుల్ మతీన్.. అతని భార్య ఖలీమా మతీన్‌లను అరెస్టు చేసి షాద్‌నగర్ పీఎస్‌లలో కేసులు నమోదు చేశారు. * నల్లగొండలోని చైతన్యపురి కాలనీలో నయీమ్ దగ్గరి బంధువు అస్మత్ తజాముల్ అరా ఇంట్లో జరిపిన తనిఖీల్లో ఒక దేశవాళీ రివాల్వర్, ఐదు చెక్‌బుక్‌లు, ఆరు పాస్ పుస్తకాలు, భూములకు సంబంధించి 36 జిరాక్స్ డాక్యుమెంట్లు, ఐదు ఒరిజినల్ డాక్యుమెంట్లు, నాలుగు ప్రామిసరీ నోట్లు, 19 తులాలకు సంబంధించిన 8 గోల్డ్‌లోన్ డాక్యుమెంట్లు, 20 సెల్ఫోన్లు, తల్వార్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ హార్డు డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ పీఎస్ పరిధిలో కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. * భువనగిరి ఎంపీపీ తోటకూరి వెంకటేశం స్వగ్రామం పగిడిపల్లిలో జరిపిన తనిఖీల్లో ఒక దేశవాళీ తపంచాతోపాటు నాలుగు రౌండ్ల బులెట్లు, ల్యాండ్ డాక్యుమెంట్, టైటిల్‌డీడ్, పాస్‌పుస్తకం స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు. * భువనగిరికి చెందిన 27వ వార్డు కౌన్సిలర్ ఎండీ నాజర్ నివాసంలో దేశవాళీ తపంచా, నాలుగు రౌండ్ల బుల్లెట్లు, రూ.77,500 నగదు స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు. * వలిగొండ మండలం కాసిరెడ్డి గూడెంలోని కోనపురి శంకర్, కోనపురి శ్రీశైలం, దండు వెంకటయ్య నివాసాల్లో దేశవాళీ తపంచా, ఆరు రౌండ్ల బుల్లెట్లు, హాండ్ గ్రెనేడ్, డిటోనేటర్లు రెండు, రూ.5.50 లక్షల నగదు, మూడు సెల్ఫోన్లు, భూ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని వారిని అరెస్టు చేశారు. * హాలియా మండలం నాయుడుపాలెంలో రౌడీ షీటర్ గుమ్మడవెల్లి శ్రీను అలియాస్ టమాట శ్రీను నివాసంలో తపంచా, తొమ్మిది భూ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు, 6 పాస్ పుస్తకాలు, నాలుగు ప్రామిసరీ నోట్లు, రెండు ఒరిజినల్ ఒప్పంద పత్రాలు, 12 ల్యాండ్ పట్టా సర్టిఫికెట్లు, ఒక ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకోగా.. నిందితుడు పరారీలో ఉన్నాడు. * మాన్యం చెల్కకు చెందిన రౌడీ షీటర్ షేక్ జహంగీర్ నివాసంలో ఒక తల్వార్, 13 ప్రామిసరీ నోట్లు, మూడు సెల్ఫోన్లు దొరకగా నిందితుడు పరారీలో ఉన్నాడు. * ఈదులగూడకు చెందిన సయ్యద్ ఫర్జానా, సయ్యద్ సాధిక్, సుల్తానా నివాసాల్లో 240 ల్యాండ్ డాక్యుమెంట్లు, 72 ఫోన్లు, 2 తులాల పుస్తెలతాడు, 4 జతల చెవిదుద్దులు, మూడు వరసల చంద్రహారంతో పాటు ఒక దేశవాళీ రివాల్వర్, నాలుగు డిటోనేటర్లు, 4.05 లక్షల నగదు, స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు. * రంగారెడ్డి జిల్లా నెక్నాంపూర్ పరిధిలోని అల్కాపురి టౌన్షిప్ 105 ప్లాట్‌లో రెవెన్యూ అధికారులతో కలసి పోలీసులు సంయుక్త తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ ప్రకాశ్‌నగర్ చెందిన ఫర్హానాతోపాటు నయీమ్ డ్రైవర్ భార్య అఫ్సాను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి నాలుగు పిస్తోళ్లు, ఒక డమ్మీ రివాల్వర్, 227 రౌండ్ల బులెట్లు, ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, మూడు వేట కొడవళ్లు, రెండు గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 2.08 కోట్ల నగదు, 1.09 కిలోల బంగారు ఆభరణాలు, 873 గ్రాముల వెండి వస్తువులు, 258 సెల్ఫోన్లు, 10 జెలిటిన్ స్టిక్స్, ఒక ఆడి కారు, రెండు మోటారు సైకిళ్లు, మూడు స్కూటీలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 203 ఒరిజినల్ రిజిస్టర్ డాక్యుమెంట్లు, పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. మరో తొమ్మిది మంది పిల్లలను గుర్తించి రెస్క్యూ హోమ్‌కు తరలించారు. * నయీమ్ సమీప బంధువు ఫయీమ్కు డ్రైవర్‌గా పనిచేసిన రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్కు చెందిన నీల శ్రీధర్గౌడ్తోపాటు సరూర్‌నగర్ హరిపురి కాలనీకి చెందిన నయీమ్ అనుచరుడు పున్నా బలరాం నివాసాల్లో జరిపిన తనిఖీల్లో రూ.35.50 లక్షల నగదు, మూడు పిస్టోళ్లు, 25 రౌండ్ల బుల్లెట్లు, 30 ల్యాండ్ డాక్యుమెంట్లు, సీపీయూ, బ్యాంకు పుస్తకాలు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు. -
యూపీ ముఠా అరెస్టు
ఆయుధాలు స్వాధీనం.. డీఎస్పీ తిరుపతన్న వెల్లడి సంగారెడ్డి రూరల్: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ముఠాను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం విలేకరుల సమావేశంలో సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న వెల్లడించారు. సంగారెడ్డి పట్టణం లాల్‌సాబ్‌గడ్డకు చెందిన మహ్మద్‌రీయాసద్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఇదే క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాజుయాదవ్ కులబ్‌గూర్‌లోని ఓ డెయిరీ ఫామ్‌లో కూలీగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో రీయాసద్‌కు రాజుయాదవ్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు కలిసి ఆయుధాలతో ధనవంతులను బెదిరించి డబ్బులు సంపాదించాలన్న పథకం వేశారు. ఆందుకు అవసరమైన ఆయుధాలను ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన అజయ్‌కుమార్ యాదవ్, వికాశ్ యాదవ్ ద్వారా రాజు యాదవ్ తెప్పించాడు. ఈ క్రమంలో ఈ నెల 8న సాయంత్రం పసల్వాది వద్దగల దాబాలలో రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన ఈ నటుగురిని అదుపు లోకి తీసుకుని తనిఖీ చేయగా వారి నుంచి 2 దేశీయ తపంచాలు, 3బుల్లెట్లు, రెండు కత్తులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి విచారించగా ఈ ఆయుధాలతో ధనికులను బెదిరించాలనే పథకం వేసినట్లు నిందితులు తెలిపారని డీఎస్పీ పేర్కొన్నారు. సోమవారం అరెస్ట్ చేసిన ముఠా సభ్యులను మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. సమావేశంలో రూరల్ సీఐ నరేందర్, యస్ఐ శివలింగం తదితరులు పాల్గొన్నారు. -
స్విస్ తమిళుల నుంచి ఎల్టీటీఈ వసూళ్లు
బెర్న్: స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న ప్రవాస తమిళుల నుంచి భారీగా విరాళాలు వసూలు చేస్తున్న ఎల్టీటీఈ వర్గాలు వాటిని కొరియర్ల ద్వారా సింగపూర్, దుబాయ్‌లాంటి దేశాలకు తరలిస్తూ ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. శ్రీలంకలో 2009లో ఎల్టీటీఈ ఓటమితో నిలిచిపోయిన ఈ ప్రక్రియ మళ్లీ ప్రారంభమైనట్లు స్విడ్జర్లాండ్ అటార్ని జనరల్ కార్యాలయం అభిప్రాయపడింది. స్విడ్జర్లాండ్లోని కొంతమంది తమిళులు ఆధునిక మైక్రో క్రెడిట్ వ్యవస్థ ద్వారా ఎల్టీటీఈకి నిధులు చేరవేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. అలా నిధులు బదిలీ చేసిన 13 మంది తమిళులపైనా స్విడ్జర్లాండ్ అటార్ని జనరల్ కార్యాలయం కేసులు దాఖలు చేసింది. కేసులు దాఖలు చేసినప్పటికీ ఆ 13 మందిని అరెస్టు చేయలేదని, వారు ఎప్పుడంటే అప్పుడు విచారణకు అందుబాటులో ఉండేందుకు అంగీకరించడం వల్ల వారిని అరెస్ట్ చేయలేదని అటార్ని జనరల్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. వీరి నుంచి దాదాపు కోటిన్నర డాలర్లు ఎల్టీటీఈ చేతుల్లోకి తరలిపోయాయని ఆ వర్గాలు చెప్పాయి. విరాళాలు ఇచ్చే తమిళుల నుంచి నిధులు నేరుగా ‘వరల్డ్ తమిళ్ కోఆర్డినేటింగ్ కమిటీ’కి వెళుతున్నాయని, అక్కడి నుంచి ఎల్టీటీఈ చేతుల్లోకి వెళుతున్నాయని ఆ వర్గాలు వివరించాయి. విరాళాలు ఇస్తున్న వారికి, తీసుకుంటున్న వారికి మధ్యన ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేకపోవడం వల్ల నిధుల తరలింపు వ్యవహారం బయటకు వచ్చిందని ఆ వర్గాలు చెబుతున్నాయి. 2006కు సంవత్సరానికి ముందు స్విడ్జర్లాండ్ తమిళుల నుంచి భారీగా విరాళాలు ఎల్టీటీఈకి తరలిపోయేవని, ఎల్టీటీఈని టైస్టు సంస్థగా బ్రిటన్ ప్రకటించినప్పటి నుంచి విరాళాలు గణనీయంగా తగ్గిపోయాయని చెప్పాయి. 2009 నుంచి దాదాపు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపాయి. ఎల్టీటీఈ ప్రవాస తమిళుల నుంచి ఆ వర్గాలు బలవంతంగా కూడా విరాళాలు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, విరాళాలు ఇవ్వకపోతే బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని అటార్ని వర్గాలు పేర్కొన్నాయి. -
ఆయుధాలు అమ్ముతున్న ముఠా అరెస్ట్
న్యూడెమొక్రసీ దళానికి ఆయుధాలు విక్రయిస్తోన్న ఓ ముఠాను ఇల్లందు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి మూకమామిడి గ్రామానికి వెంకన్న, మల్లేపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, బయ్యారం మండలం కాచనపల్లికి చెందిన ఐలయ్యను అరెస్ట్ చేసి వారి నుంచి 3 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సీఐలు నరేందర్, రవి, రమేశ్, ఎస్ఐలు అనిల్, రమేశ్బాలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. -
ఐఎస్ఐఎస్ ఆయుధాలు మనవేనా..?
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ ఉగ్రవాదులు భారతీయ కంపెనీలు తయారుచేసిన ఆయుధాలను వాడుతున్నారా? ఇండియాలో తయారయ్యి పొరుగు దేశాలకు చేరుతున్న ఆయుధాలు ఐస్ఐస్కు ఎలా చేరుతున్నాయి? ఈ విషయాలను మంగళవారం లోక్‌సభకు స్వతంత్ర విచారణ బృందం తెలియజేసింది. దాదాపు ఏడు భారతీయ కంపెనీలు తయారుచేస్తున్న ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్(ఐఈడీ) ఆయుధాలు ఐఎస్ఐఎస్కు చేరుతున్నట్లు తెలిపింది. ఈ అంశంపై సభలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ హోం శాఖ సహాయమంత్రి హరీ భాయ్.. భారత్ కంపెనీ తన ఉత్పత్తులను లెబనాన్, టర్కీ దేశాలకు ఒప్పందాల మేరకే పంపుతుందని తెలిపారు. ఐఎస్ఐఎస్కు భారత్ నుంచి నేరుగా ఎటువంటి ఆయుధాలు చేరుతున్నట్లు ఆధారాలు లేవన్నారు. యూరోపియన్ యూనియన్‌కు చెందిన సీఏఆర్ ఉగ్రవాద సంస్థలు, సంఘ విద్రోహశక్తులకు ఆయుధాలు ఎలా చేరుతున్నాయన్నదానిపై నిఘా వేస్తుంది. ఇందులో భాగంగానే ఇండియా నుంచి ఐఎస్ఐఎస్కు ఆయుధాలు చేరుతున్నట్లు ఆన్లైన్లో ఉంచిన డాక్యుమెంట్లలో పేర్కొంది. ఐఎస్ఐఎస్ ఉపయోగించిన 700కు పైచిలుకు ఆయుధాలను సీఏఆర్ సేకరించి ప్రపంచంలోని ఏ దేశమైన వీటిని ఉపయోగిస్తుందా? అనే అంశంపై రెండేళ్ల పాటు సాగిన పరిశోధనలో అవి ఇండియాలోని ఏడు కంపెనీలు తయారుచేసినవి అని తేలింది. -
ఎర్ర కూలీలను అరెస్టు చేసిన పోలీసులు
చిత్తూరు జిల్లా శేషా చలం అడవుల్లో పోలీసులు నిర్వహించిన కూబింగ్ లో ఎర్ర చందనం కూలీలు పట్టుబడ్డారు. పాల పల్లి వద్ద అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఎర్ర చందనం కూలీలు ఎదురు పడ్డారు. పోలీసులను చూసి వీరు పారిపోగా.. నలుగురు కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన కూలీల వద్ద ఆయుధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. -
మన బలం
-
130 అణ్వాయుధాలతో భారత్‌పై గురి!
-
'ఆయుధాలను వెంటనే వెనక్కి ఇచ్చేయండి'
చాదర్‌ఘాట్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో లైసెన్స్డ్ ఆయుధాలు కలిగి ఉన్న వారు వెంటనే సరెండర్ చేయాలని చాదర్‌ఘాట్ ఇన్స్పెక్టర్ సత్తయ్య కోరారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... స్టేషన్ పరిధిలో 52 మంది ఆయుధాలు కలిగి ఉన్నారని, వారందరూ రెండు, మూడు రోజుల్లో ఆయుధాలు అప్పగించాలని సూచించారు. అదే విధంగా స్టేషన్ పరిధిలో ఉన్న 27 మంది రౌడీషీటర్లు స్టేషన్‌కు వచ్చి బైండోవర్ అవ్వాలని పేర్కొన్నారు. స్టేషన్ పరిధిలో 39 పోలింగ్ స్టేషన్లు, బూత్‌లు 101 ఉన్నాయని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉందని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. -
ఉత్త చేతులు డొక్కు బండ్లు
► ఆయుధాలు లేవు... ► దూసుకుపోయే వాహనమూ లేదు ► మెదక్‌లో దోపిడీ ముఠాదే పైచేయి ► చేజింగ్‌లో వెనుకబడ్డ బలగాలు ► పోలీసుల బలహీనతను బయటపెట్టిన ► మెదక్ ఘటన కాలం మారినా పోలీసుల తీరు మారలేదు. దుండగులు అధునాతన ఆయుధాలు, ఎత్తుగడలతో చెలరేగిపోతోంటే.. కాలం చెల్లిన ఆయుధాలు, సరైన వాహనాలు లేక పోలీసులు నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. మెదక్ పట్టణంలో ఏటీఎంపై దాడి ఘటనలో పోలీసులు సకాలంలో స్పందించారు. వారిని దాదాపు 25 కిలోమీటర్లు చేజ్ చేశారు. కానీ వీరి వద్ద సరైన వాహనం లేకపోవడంతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. - మెదక్ దోపిడీ దొంగతనాలు.. చోరీలు.. తర చూ జరుగుతున్నాయి. దుండగులు ఎప్పటికప్పుడు తమ స్టైల్ మార్చి పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు పూర్తిస్థాయిలో సాయుధులు కాకపోవడంతో దుండగులే పైచేయి సాధిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున మెదక్ పట్టణంలోని ప్రధాన రహదారిలో గల ఎస్బీఐ ఏటీఎంను దుండగులు ధ్వంసం చేశారు. లోనికి చొరబడి ఏటీఎంను పెకిలిస్తున్న విషయాన్ని గస్తీ పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను పసిగట్టిన దుం డగులు బొలేరో వాహనంలో పరారయ్యారు. పురాతన వాహనంలో ఉన్న పోలీసులు వారిని దాదాపు 25 కిలోమీటర్ల మేర వెంబడించారు. సరిహద్దులోని నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించినా అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. అక్కడి పోలీసులకు కూడా వారు చిక్కలేదు. దుండగులు అధునాతన వాహనాన్ని ఉపయోగించడంతో పోలీసులు వారిని పట్టుకోలేకపోయారు. సిబ్బంది కొరత... మెదక్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 14 పోలీ స్ స్టేషన్లు ఉండగాఅందులో 100 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. ఒక్క మెదక్ పట్టణంలోనే 15 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పట్టణంలో రోజూ రాత్రి పోలీస్ సిబ్బంది ఏడు బృందాలుగా విడిపోయి గస్తీకాస్తుంటారు. ఇందులో సుమారు 18 మంది వరకు గస్తీకే పోతున్నారు. మెదక్ పట్టణానికి నెలకు 25రోజులపాటు వీఐపీలు వచ్చి వెళ్తుంటారు. వీరి భద్రతకోసం కనీసం 8 నుంచి 10మంది అవసరం.పట్టణంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐలో భక్తుల రద్దీగా బాగానే ఉంటుంది. రాష్ట్రంలోనే పేరుగాంచిన ఏడుపాయలకు పోలీసులు బందో బస్తుకోసం వెళ్తుంటారు. ఇప్పటికే 43మంది సిబ్బందిగాను 15మంది తక్కువగా ఉన్నారు. దొంగలకు అలుసు.. పోలీసు సిబ్బంది కొరతను అదనుగా చేసుకున్న దొంగలు గత ఏడాది కొల్చారం మండ లం రంగంపేట బ్యాంకు దోపిడీకి యత్నిం చా రు. పెద్దశంకరంపేట పట్టణంలోని ఎస్బీహెచ్ ఏటీఎం, టేక్మాల్‌లోని ఆంధ్రాబ్యాంకు ఏటీఎం, అల్లాదుర్గంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ కి యత్నించారు. మెదక్ పట్టణంలోని ఆటోనగర్ ఎస్బీఐ ఏటీఎంలో రెండోసారి చోరీకి య త్నం జరిగింది. ఇవేకాకుండా బ్యాంకుల్లో సై తం పలుమార్లు దోపిడీకి యత్నించారు. ఇంత జరుగుతున్నా.. సిబ్బంది కొరతను అధిగమిం చకపోవడం ఆ శాఖను తీవ్రం గా వేధిస్తోంది. బ్యాంకర్ల నిర్లక్ష్యం.. నిత్యం లక్షలాది రూపాయల్లో లావాదేవీలు నిర్వహించే బ్యాంకర్లు కనీసం రాత్రి వేళలో ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేయడం లేదు. తమ ఏటీఎం కేంద్రాలను ఓ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించామని, ఏం జరిగినా బీమా ఉంటుందని బ్యాంకు నిర్వాహకులు చెప్పడం గమనార్హం. దోపిడీ, దొంగతనాలను అరికట్టాలంటే పోలీస్ శాఖలో సరిపడా సిబ్బందిని నియమించడంతోపాటు గస్తీకాసే పోలీసులకు ఆయుధాలతోపాటు అధునాతన వాహనాలు ఇవ్వాలని ప్రజలు సూచిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున మెదక్ పట్టణంలో జరిగిన ఏటీఎం చోరీ యత్నంలో పోలీసుల వైఫల్యం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి గస్తీ తిరిగే పోలీస్ సిబ్బందికి కండిషన్లో ఉన్న వాహనాలతోపాటు ఆయుధాలు సమకూర్చాలని, సిబ్బంది కొరతను అధిగమించి దోపిడీ, దొంగతనాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
మారణాయుధాలతో వెళుతున్న నలుగురు అరెస్ట్
తలుపుల (అనంతపురం) : మారణాయుధాలతో సంచరిస్తున్న నలుగురు అనుమానితుల్ని అనంతపురం జిల్లా తలుపుల మండలం బట్రేపల్లి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. కదిరి నుంచి పులివెందుల వైపు వెళుతున్న ఇండికా కారును పోలీసులు ఆపి తనిఖీ చేయగా అందులో కత్తులు, కొడవళ్లు, గొడ్డళ్లు దర్శనమిచ్చాయి. కారులో ఉన్న నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరణాయుధాలతో సహా కారును స్వాధీనం చేసుకున్నారు. -
ఆయుధం అడ్డగోలుగా వినియోగం
జిల్లాలో విచ్చలవిడిగా ఆయుధాల వినియోగం హిట్‌లిస్టులో లేనివారి చేతుల్లో తుపాకులు జాబితాలో ముగ్గురు వైద్యులు, చోటామోటా నేతలు రియల్ దందా, సెటిల్మెంట్లు, స్టేటస్ సింబస్కూ వినియోగిస్తున్న వైనం రాజకీయ, పోలీసుల అండదండలే కారణం కరీంనగర్ క్రైం:జిల్లాలో తుపాకుల వినియోగం పెరిగిపోతోంది. వీటిని అడ్డుపెట్టుకుని రియల్ దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. నక్సల్స్ హిట్‌లిస్టులో లేనప్పటికీ ఏదో ఒకసాకుతో ఆయుధాలను పొందుతూ దాదాగిరికి ఉపయోగించుకుంటున్న చోటామోటా నేతలూ జిల్లాలో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సుమారు 220 మంది వద్ద లెసైన్స్డ్ తుపాకులున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు అక్రమ పద్ధతిలో తుపాకులను ఉపయోగిస్తున్న వారి సంఖ్య కూడా రెట్టింపు సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో ఎల్లారెడ్డిపేట, చందుర్తి మండాలల్లో నాటు తుపాకులు లభ్యం కావడమే ఇందుకు నిదర్శనం. కొద్ది రోజుల క్రితం గంగాధర మండలం కురిక్యాల వద్ద ఏకంగా ఏకే 47కు చెందిన బానేట్ దొరకడం కూడా అక్రమ ఆయుధాల వినియోగం విచ్చలవిడిగా జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో నక్సల్స్ ప్రభావం తగ్గింది. అయినప్పటికీ గతంలో నక్సల్స్ పేరుతో ఆయుధాలు పొందిన వారు వాటిని వెనక్కు ఇవ్వలేదు. పోలీసు శాఖ సైతం వివిధ రకాలుగా వస్తున్న ఒత్తిళ్లతో వారి నుంచి ఆయుధాలను వెనక్కు తీసుకోలేకపోతోంది. గతంలో నక్సల్స్ హిట్‌లిస్టులో ఉన్న పోలీసుల నుంచి ఆయుధాలను ఇటీవల అధికారులు వెనక్కు తీసుకున్నారు. అదే తరహాలో మిగిలిన వారి నుంచి ఆయుధాలను వెనక్కు తీసుకోవాలని, లేనిపక్షంలో దుర్వినియోగమయ్యే ప్రమాదముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. లెసైన్స్‌లకు మించి ఆయుధాలు...? జిల్లాలో 220 ఆయుధాల లెసైన్స్‌లు ఉండగా, వీటిలో బ్యాంక్ సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీల వద్ద 70 ఆయుధాలున్నాయి. వీటిలో ఎక్కువగా డీబీబీఎల్ తుపాకులే ఉన్నాయి. రాజకీయ, నక్సల్స్ టార్గెట్లు, బడా వ్యాపారుల వద్ద మరో 50కి పైగా ఉన్నాయి. జిల్లాకు చెందిన ముగ్గురు వైద్యుల వద్ద కూడా ఆయుధాలున్నాయి. ఇవికాకుండా ఎలాంటి టార్గెట్ లేని చోటామోటా లీడర్ల వద్ద ఏకంగా 97 అయుధాలున్నాయి. వీటిలో చాలా వరకూ 0.32 పిస్టళ్లు, రివాల్వర్లు ఉన్నాయి. ఇవికాకుండా అక్రమంగా ఆయుధాలు కలిగిన నేతలు, వ్యాపారులు, రియల్టర్లు వందల మంది ఉన్నట్లు సమాచారం. వీటితో కేవలం సెటిల్మెంట్లు, దందాలకు పాల్పడుతున్నటు తెలిసింది. తాము చెప్పినట్లు వినకుంటే చంపుతామంటూ తుపాకులతో బెదిరింపులకు దిగున్నారనే ఆరోపణలున్నాయి. కొన్నిసార్లు లెసైన్స్‌దారుల పేరు చెప్పుకుని అనుమతి లేని అయుధాలు కూడా వినియోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలో ఓ చోటా నేత ఎక్కడికి వచ్చినా తనవద్ద ఉన్న ఆయుధం అందరికీ కన్పించేలా ప్రదర్శిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. గతంలో నక్సల్స్ హిట్‌లిస్టులో ఉన్న కారణంగా సుమారు 70 మందికి పైగా పోలీసులకు ఆయుధాలిచ్చారు. ప్రస్తుతం నక్సల్స్ ప్రభావం తగ్గిందని భావించిన పోలీసు ఉన్నతాధికారులు ఆరు నెలల క్రితం వాటిని తిరిగి వెనుక్క తీసుకున్నారు. నిత్యం అసాంఘికశక్తులతో తలపడే పోలీసుల అయుధాలు వెనుక్కు తీసుకున్న పోలీసుశాఖ... ఎలాంటి టార్గెట్ లేకుండా లెసైన్సు పొంది స్వప్రయోజనాలకు ఉపయోగిస్తున్న వారి నుంచి వాటిని వెనుక్కు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. అక్రమ ఆయుధాల తయారీ అడ్డా జిల్లాకు సరిహద్దులుగా ఉన్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి ఆధునిక ఆయుధాలు సులభంగా జిల్లాకు చేరుతున్నాయని సమాచారం. జిల్లాలో నాటు తుపాకులు తయారు చేస్తున్న సంఘటనలు బయటపడడం అందోళన కల్గించే విషయం. జగిత్యాల, సిరిసిల్ల, గోదావరిఖని, పెద్దపల్లి, కరీంనగర్ డివిజన్లలో ఆయుధాలు వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోందని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. గతంలో ఎల్లారెడ్డిపేట మండలంలో అత్యాధునికమైన పెన్గన్తో పాటు 16కు పైగా ఆయుధాలు లభించాయి. ఇదే మండలం వెంకటాపూర్ గ్రామంలో అయుధాలు తయారు చేస్తూ పట్టుబడ్డారు. రెండు నెలల క్రితం ఎల్లారెడ్డిపేటలో అటవీ జంతువులను హతమార్చుతున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి పలు నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి స్థానికంగానే తయారు చేస్తున్నారని తెలిసింది. ఇప్పటికే ఇక్కడ నుంచి జిల్లాలోని పలు ప్రాంతాలకు పదుల సంఖ్యలో నాటు తుపాకులు సరఫరా చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తుపాకులు వినియోగించి భూదందాలు, బెదిరింపులు, దొంగతనాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలోనే సుమారు 60 మందికి పైగా సామాన్యుల వద్ద లెసైన్స్ ఆయుధాలున్నాయని సమాచారం. నేతల అండదండలతో... గన్ లెసైన్స్ అనేది స్టేటస్ సింబల్‌గా మారడంతో రాజకీయ అండదండలు, పలుకుబడి గలవారు సులభంగా లెసైన్స్‌లు పొందుతున్నారనే ఆరోపణలున్నారుు. మూడేళ్ల క్రితం జిల్లాలో విచ్చలవిడిగా అయుధాల లెసెన్స్‌లు జారీ చేశారు. రెండేళ్ల నుంచి వీటిని నియంత్రించినప్పటికీ గతంలో పొందిన లెసెన్స్లతో యథేచ్చగా వీటిని వినియోగిస్తున్నారు. ప్రధాన రాజకీయ పక్షాల ముఖ్యనాయకుల అనుచరులు తుపాకీ లెసైన్స్‌లతో దందాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. నిత్యం సివిల్, భూతగాదాల్లో జోక్యం చేసుకుంటూ తుపాకులతో బాధితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపణలున్నాయి. అనేక మంది నేరస్తుల వద్ద కూడా అక్రమంగా ఆయుధాలున్నాయని సమాచారం. మొత్తం మీద సుమారు 20 మందికి పైగా లెసైన్స్ లేకుండా షార్ట్ వెపన్ కలిగి ఉంటారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. లెసైన్స్‌దారులు మాత్రం అక్రమంగా బుల్లెట్లు తెప్పించుకొని కాల్పులకు వాడుతున్నట్లు తెలుస్తోంది. పలు శివారు ప్రాంతాల్లో పార్టీల్లో ఫ్యాషన్ కోసం కాల్పులకు దిగుతున్నారని సమాచారం. ఈ సంఘటనలకు లెక్కల్లోలేని బుల్లెట్లు వాడుతున్నారని తెలిసింది. రెండేళ్ల క్రితం వేములవాడ వద్ద పోలీసులు తనిఖీ చేస్తున్న కేంద్రాన్ని దాటుకుని వెళ్లిన వ్యక్తులు ప్రభాకర్‌రావు అనే వ్యక్తిని కాల్చి చంపారనే ఆరోపణలున్నాయి. మాజీ నక్సలైట్లు కూడా విచ్చలవిడిగా ఆయుధాలను వినియోగిస్తున్నారని సమాచారం. గతంలో చందుర్తి మండలంలో చిక్కన మాజీ నుంచి మూడు అయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిపై ఫిర్యాదులొస్తున్నా పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తుపాకీ పొందాలంటే.... అయధాలు పొందాలంటే మొదట కలెక్టర్‌కు దరఖాస్తు పెట్టుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి అయుధం ఇవ్వచ్చో లేదో విచారించి నివేదిక ఇవ్వమని కలెక్టర్ పోలీసు శాఖకు పంపుతారు. పోలీసులు విచారించి నివేదిక ఇస్తారు. దీని ఆధారంగా ప్రభుత్వం లెసెన్స్ జారీ చేస్తుంది. లెసెన్స్ పొందే వ్యక్తి నక్సల్స్, టైస్టులు టార్గెట్ అయి ఉండాలి. లేదా శత్రువుల వల్ల తన ప్రాణాలకు ప్రమాదం ఉందని నిరూపించగలగాలి. దాడులకు గురి కావడం, టైస్టుల హిట్ లిస్టులో ఉండడం, ప్రాణాలకు ప్రమాదం జరిగన సంఘటనలు జరిగి ఉండటం వంటి సందర్భాల్లో లెసైన్స్ ఇస్తారు. లెసెన్స్ పొందే వ్యక్తి గతంలో నేరచరిత్ర ఉన్న వ్యక్తి కాకూడదు. అయుధం పొందే సమయంలోనే పొందుతున్న అయుధాన్ని ఎక్కడ వినియోగిస్తారో స్పష్టంగా పేర్కొనాలి. తాను పొందిన అయుధం తన ప్రాణాపాయస్థితిలో తప్ప మరో విధంగా వినియోగించనని ఆఫిడవిట్ సమర్పించాలి. అయుధం తన పరిధిని దాటి వెళ్లితే అక్కడున్న పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఆలయాలు, నిషేధిత ప్రాంతాలకు అయుధాలను తీసుకుని వెళ్లకూడదు. అలాంటి సమయంలో వాటిని పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచాలి. ప్రతి నెలకోసారి అయుధం వినియోగంపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి. తన వద్ద ఉన్న అయుధాన్ని ప్రజలకు కనిపించేవిధంగా, బయటకు కనబడే విధంగా ప్రదర్శించకూడదు. ఎన్నికల సందర్బాల్లో ముందుగానే పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేయాలి. ప్రతి ఏడాది రెన్యువల్ చేసే సమయంలో, లెసెన్స్ తీసుకునే సమయంలోనూ ఈ నిబంధనలే వర్తిస్తాయి. -
ఆయుధాలు బయట పెట్టి రండి!
- పోలీసు శాఖ కార్యాలయానికి వచ్చే వారికి డీజీపీ ఆదేశం - సీనియర్ అధికారుల భద్రత కోసమేనని వెల్లడి - సీఎం అంగరక్షకులైనా ఆయుధాలతో అనుమతి నో.. సాక్షి, ముంబై: రాష్ట్ర పోలీసు శాఖ ప్రధాన కార్యాలయంలోకి ఎవరూ ఆయుధాలతో రాకూడదని డీజీపీ సంజీవ్ దయాల్ ఆదేశాలు జారీచేశారు. ఇక్కడ పనిచేసే సీనియర్ పోలీసు అధికారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆయన తెలిపారు. దీంతో ఇక నుంచి కార్యాలయానికి వచ్చే మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇతర రంగాల ప్రముఖులు తమ వద్ద, అంగరక్షకుల వద్ద ఉన్న ఆయుధాలను ప్రవేశద్వారం దగ్గర ఇచ్చిన తర్వాతే లోనికి ప్రవేశం లభిస్తుంది. ఏటీఎస్, ఏసీబీ, సీఐడీ మినహా రాష్ట్రానికి నిఘా విభాగం మొదలుకుని పోలీసు శాఖకు చెందిన అన్ని ప్రముఖ విభాగాల సీనియర్ అధికారులు ఇక్కడ పనిచేస్తారు. అంతేగాక హోం శాఖ, వివిధ శాఖల మంత్రులు, సహాయ మంత్రులు, సీనియర్ అధికారుల సమావేశాలు తరుచూ జరుగుతూనే ఉంటాయి. పోలీసు అధికారులు, కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు భేటీ అయ్యేందుకు వస్తుంటారు. ప్రముఖులతో వారి అంగరక్షకులతో రివాల్వర్లు, ఎస్ఎల్ఆర్ తదితర ఆధునిక ఆయుధాలుంటాయి. ప్రధాన కార్యాలయానికి వచ్చే ముందు ప్రముఖులు, వారి అంగరక్షకుల మానసిక పరిస్థితి ఒకేలా ఉండదు. మానసిక ఒత్తిడికి గురై ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం కష్టం. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను పరిగణనలోకి తీసుకున్న దయాల్.. పోలీసు ప్రధాన కార్యాలయంలోకి ఆయుధాలతో అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. రాష్టంలోని 12 కోట్ల ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించేందుకు చేపట్టాల్సిన ప్రణాళికలను ఈ ప్రధాన కార్యాలయంలోనే రూపొందిస్తారు. అలాంటి కార్యాలయానికే భ ద్రత మరింత కట్టుదిట్టం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
గుంటూరు జిల్లాలో బాంబుల మోత
గుంటూరు: పాడుబడిన ఇంట్లో దాచిపెట్టిన నాటు బాంబులు పేలిన సంఘటన గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో గురువారం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పాపాయపాలెం గ్రామానికి చెందిన రిటైర్డు టీచర్ మద్దిగ రామిరెడ్డి ఇంట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు దాచి పెట్టగా అవి ఎండ తీవ్రతకు పేలాయి. రామిరెడ్డి ప్రస్తుతం గుంటూరులో నివాసం ఉంటున్నారు. సంఘటన జరిగిన ఇంట్లో ప్రస్తుతం ఎవరూ నివాసం ఉండటంలేదు. అక్కడున్న ఆరు బాంబులను, పలు మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఆ బాంబులు ఎవరివి? గ్రామంలో ఏడాది నుంచి వర్గ విబేధాలతో గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయి. మద్దిగ రామిరెడ్డి గత ఏడాది హత్యకు గురైన సింగరెడ్డి వెంకటరామిరెడ్డి సమీప బంధువు కావడంతో ఆ బాంబులు తెలుగుదేశం పార్టీ వారివేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఆరోపిస్తున్నారు. (బెల్లంకొండ) -
మన తీరం భద్రమేనా..
తూర్పు తీరంలో కీలకంగా మారిన విశాఖ నిరంతర నిఘాతో కోస్టు గార్డు అప్రమత్తం భరోసా ఇస్తున్న నౌకాదళం విశాఖపట్నం: గుజరాత్ తీరంలో శుక్రవారం జరిగిన సంఘటన ప్రజానీకాన్ని కలవరపర్చింది. ఆయుధాలతో పాక్ పడవొకటి తీరంలోకి చొరబడేందుకు చేసిన యత్నం గగుర్బాటు కలగించింది. తీరంతో అల్లుకున్న విశాఖ భద్రతపై ఒక్కసారిగా ఇక్కడి ప్రజానీకం ఉలికిపడింది. ఇదే సందర్భంలో విశాల తీరమున్న విశాఖలో భద్రత ఎలా ఉందనే ప్రశ్న అందరిలో మెదిలింది. నిరంతరం కంటికి రెప్పలా తీరాన్ని పరిరక్షిస్తున్న కోస్టుగార్డు..మెరైన్ పోలీసు బలగాలు మాత్రం అప్రమత్తమై ఎలాంటి ఢోకా లేదంటూ భరోసానిస్తున్నాయి. జిల్లాలో 170 కిలోమీటర్లు మేర తీర ప్రాంతం ఉంది. నగర కమిషనరేట్ సరిధిలో 45 కిలో మీటర్ల తీరముంది. దీని రక్షణకు నగరంలో కోస్ట్‌గార్ట్ స్టేషన్‌ను 1987లో రిషికొండ వద్ద నెలకొల్పారు. కోస్ట్ గార్ట్కు 200 మీటర్ల పొడవున్న సొంత జెట్టీ కూడా ఉంది. తీరరక్షణ దళం 24గంటలూ తీరంపై డేగకన్ను వేస్తుంది. కొంత కాలంగా మెరైన్ పోలీస్ వ్య వస్థను కూడా పటిష్టపరిచేందుకు ప్రభుత్వం తీసుకుంటోంది. అయితే ఈ వ్యవస్థను ఇంకా బలోపేతం చేయాల్సి ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆదిలో చేసిన హడావిడి ఇప్పుడు కనిపించడం లేదు. ఈ విభాగం సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. తీర రక్షణకు మెరైన్ పోలీస్ స్టేషన్‌ను రుషికొండ, ఒన్‌టౌన్‌లోని విశాఖ టెర్మినల్ వద్ద, పూడిమడక ప్రాంతంలో ఏర్పాటు చేశారు. విశాఖ మెరైన్ పోలీస్ స్టేషన్లకు ఓ ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీ, 42 మంది కానిస్టేబుళ్లను మంజూరు చేస్తే ప్రస్తుతం ఏఎస్పీ తో పాటు 25 మంది కంటే తక్కువగా కానిస్టేబుళ్లు ఉన్నారు. అన్నిటినీ మించి మెరైన్ పోలీస్ వింగ్ ప్రధానాధికారి ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉన్నారు. తీరమే లేని రాజధా ని నుంచి దీని ఆపరేషనుకు చర్యలేమిటనే విమర్శ వినిపిస్తోంది. రాష్ట్ర మెరైన్ పోలీస్ వింగ్ ప్రధాన కేంద్రానికి 2012 నవంబర్ నుంచి హరీష్‌కుమార్ గుప్తా టాప్ బాస్‌గా ఉన్నారు. విశాఖలో ఐజి శ్రీనివాసరెడ్డి ఉండేవారు. కానీ దినేష్‌రెడ్డి డీజీపీగా ఉన్నప్పుడు ఆయన కూడా హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. రాష్ట్ర విభజన జరిగినా మన రాష్ట్రానికి ప్రధానాధికారిని ప్రత్యేకంగా కేటాయంచలేదు. మెరైన్ పోలీస్‌కు కేటాయించిన జెట్టీని నిలిపేందుకు కూడా పోర్టులో అనుకూల స్థలం లేదు. సంఘటన జరగకమునుపే ఇలాంటి వ్యవహారాలపై స్పందించాల్సిన అవసరముంది. తూర్పు నౌకాదళం కేంద్రం: తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రం నగరంలోనే ఉండటం తీరరక్షణకు సానుకూలాంశం. భారీ బలగమున్న ఈ నౌకాదళం ఇప్పటికే ఎన్నో విజయాలను నమోదు చేసుకుంది. నాలుగు దశాబ్దాల కిందటే పాకిస్తానుకు తన సత్తాను చూపించిందీ శౌర్యదళం. 1971లో విశాఖలో చొరబడటానికి పాకిస్థాన్ తీవ్రవాదులు ప్రయత్నించారు. అయితే మన నౌకాదళం మన రక్షక దళం ప్రాణాలొడ్డి పోరాడి విజయం సాధించింది. దానికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 5న నేవీ డే నిర్వహిస్తున్నారు. ముష్కరులు దాడి చేస్తే ఏ విధంగా ఎదుర్కోడానికి మన దగ్గర ఉన్న సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఆనాటి యుద్ధానికి చిహ్నంగా బీచ్ రోడ్డులో ‘విక్టరీ ఎట్ సీ’ పార్కును 1996లో నిర్మించారు. ఆనాటి నుంచీ విశాఖ తీరం శత్రు దుర్భేధ్యంగానే ఉంది. ఎలాంటి చొరబాట్లకు అవకాశం లేకుండా సముద్రంలో కోస్ట్ గార్డ్, ఉపరితలంపై పోలీస్ విభాగాలు నిరంతరం పహారా కాస్తున్నాయి. -
11 మంది సీపిఐఎమ్‌ఎల్ న్యూడెమోక్రసీ సభ్యుల అరెస్ట్
పశ్చిమ గోదావరి జిల్లా: పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం పడమర రేగులకుంటలో 11 మంది సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జల్లేరు వాగు వద్ద సమావేశమయ్యారనే సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. వీరి నుంచి 8 తుపాకులు,బుల్లెట్లు ,మందుగుండు సామాగ్రి, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు చంద్రన్న ,అశోక్ వర్గాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరిని జంగారెడ్డిగూడెం పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
ఈ వైరుధ్యమే కారణం!
ఆశీర్వాదాలు అందడంలో ఆలస్యానికి గొల్యాతు అనే ఫిలిష్తీయుని దేహదారుఢ్యం, పెడబొబ్బలకు జడిసి ఇశ్రాయేలీయుల్లో ఎవరూ అతన్నెదుర్కోవడానికి సాహసించడం లేదు. అయితే చాలా చిన్నవాడు, బలహీనుడు, యుద్ధ విద్యలేవీ రాని గొర్రెల కాపరియైన దావీదు, విశ్వాసియైన తన ముందు అన్యుడైన గొల్యాతు ఎంత? అన్న రోషంతో కేవలం తన వడిసెలతో చిన్నరాయితో అతన్ని పడగొట్టి చంపి గొప్ప విజయం సాధించి పెట్టాడు (1 సమూ 17:17-54). విజయ సాధనలో ఆయుధాలు, సామర్థ్యం కన్నా దృక్పథమే కీలకం. ‘నేను గొప్పవాణ్ణి’ అని కాకుండా ‘నా దేవుడెంతో గొప్పవాడు’ అన్న దృక్పథం గలవాడే విజయుడవుతాడు. బల్బు వెలగడానికి మూలం అదృశ్యంగా ఉండే విద్యుచ్ఛక్తిలో ఉన్నట్టే, విశ్వాసి శక్తికి మూలం, ప్రాప్తి స్థానం దేవుడే! దేవుడు తన తెలివిని, సామర్థ్యాన్నంతా మనిషిలో నిగూఢపర్చాడు. వాటితో అతడు తన జీవితాన్ని, చుట్టూ ఉన్న లోకాన్ని పరలోకానందమయం చేసుకోవాలని సంకల్పించాడు. కాళ్లు, చేతులు లేని వారిని ఈ లోకం వికలాంగులంటుంది. కాని తాను దేవుని వాడనని, దేవుని రూపమే కాదు శక్తి కూడా తనదేనన్న గ్రహింపులేక జీవితాన్ని నిరర్థకం చేసుకునేవాడే నిజమైన వికలాంగుడు. మనిషి ప్రజ్ఞకు, సామర్థ్యానికి దేవుని కృప అనే నేల, పరిశుద్ధాత్మ సహవాసం అనే తేమతోనే సృజనాత్మక శక్తి రూపం వస్తుంది. ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. తనకేది ఉత్తమమైనదో మనిషికి తెలియదు. ఉత్తమమైనది తప్ప మనిషికి మరొకటివ్వడం దేవునికిష్టం ఉండదు. మనకు ఆశీర్వాదాలు రావడంలో ఆలస్యానికి ఈ వైరుధ్యమే కారణం. అందువల్ల దేవుని సమయానికి, సంకల్పానికి తలవంచే ఆత్మీయ క్రమశిక్షణను అలవర్చుకోవాలి. దైనందిన జీవన స్థితిగతులు, పరిణామాలను పరలోకపు దృష్టితో చూడగలిగితే విశ్వాసి జీవితమంతా విజయపథమే. దేవుని నిర్ణయాల్లో పొరపాట్లుండవు. ఆయన శక్తిని, పద్ధతులను మనం అర్థం చేసుకోవడంలోనే పొరపాట్లుంటాయి. - రెవ. టి.ఎ. ప్రభుకిరణ్ -
పది ఏకే-47 తుపాకుల లూటీ
సుకుమా: ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలో సీఆర్పీఎఫ్ పై దాడికి పాల్పడిన తర్వాత మావోయిస్టులు జవానుల నుంచి అత్యాధునిక ఆయుధాలు ఎత్తుకెళ్లారు. 10 ఏకే-47, 56 తుపాకులు తీసుకెళ్లారు. 3 ఏకే-47 తుపాకుల్లో అత్యాధునిక సదుపాయాలున్నాయి. వీటిని అంబర్ బ్యారెల్ డ్రెనేడ్ లాంఛర్స్ కు ఫిట్ చేసినట్టు సీఆర్పీఎఫ్ వెల్లడించింది. మావోయిస్టులు ఎత్తుకెళ్లిన ఆయుధాల్లో ఒక సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఐఎన్ ఎస్ఏఎస్ రైఫిల్, 400 రౌండ్ల బుల్లెట్లు ఉన్నాయని తెలిపింది. మావోయిస్టుల ఏరివేతకు వెళ్లిన జవాన్లలో చాలా మంది అడవిలో ఉన్నారని, ప్రస్తుతానికి కూంబింగ్ నిలిపి వేశామని సీఆర్పీఎఫ్ ప్రకటించింది. సుకుమా జిల్లాలో సోమవారం మావోయిస్టులు జరిపిన దాడిలో 14 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. -
మన రక్షణకు తొలగిన చెర
కీలకమైన ఆయుధాలను దేశంలోనే తయారు చేసేందుకు వీలు కల్పిస్తూ రక్షణశాఖ భారీ కొనుగోళ్లకు పచ్చజండా ఊపటం శుభపరిణామం. కానీ కుంభకోణాలకు తావులేని వ్యవస్థను రూపొందించనంతవరకు రక్షణరంగంలో మౌలిక మార్పులను ఆశించలేం. మనోహర్ పారికర్ నిజాయితీ మాత్రమే దేశాన్ని కాపాడలేదు. దేశీయ రక్షణావసరాలపై సుదీర్ఘకాలంగా గడ్డ కట్టు కుపోయిన మంచు కాస్త కరుగుతోందా? బోఫోర్స్ భూతం వెంటాడుతున్న రక్షణ శాఖకు ఉపశమనం కలిగేలా ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొం ది. భారత సైన్యానికి అత్యవసరమైన 814 శతఘు్న ల కొనుగోలుకు నూతన రక్షణమంత్రి మనోహర్ పారికర్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి ఆమోదముద్ర వేసింది. వీటి విలువ రూ.15,750 కోట్ల. 1980ల చివరలో బోఫోర్స్ తుపాకుల కుంభ కోణం తర్వాత మన సైన్యం ఒక్క ఫిరంగిని కూడా కొనుగోలు చేయలేదు. ఈ కుంభకోణంతో గత ప్రభుత్వాలు ఆయుధాల కొనుగోలుపై తీసుకున్న కీలక నిర్ణయాలు గాలికెగిరిపోయాయి. పాతికేళ్ల పాటు నీరసించిపోయిన మన సైన్య ఆయుధ పాట వానికి కొత్త జవసత్వాలు కల్పిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. కొనడం తయారు చేయడం విధానం కింద 155 ఎం.ఎం/52 క్యాలిబర్ ఉన్న 100 శతఘు్నలను నేరుగా కొనుగోలు చేయడా నికి, మిగిలిన 714 శతఘు్నలను మన దేశంలోనే తయారు చేయడానికి నిర్ణయించింది. అయితే గతానికి భిన్నంగా భారతీయ కంపెనీ లకు కూడా బిడ్ దాఖలు చేయవచ్చు. దీంతో దేశీ యంగా ఎల్ అండ్ టి, టాటా, భారత్ ఫోర్గే కంపె నీలు ఈ భారీ ప్రాజెక్టులో పాలుపంచుకోను న్నా యి. ఇవి బిడ్‌లో గెలిచినట్లయితే స్వయంగా కానీ లేదా విదేశీ కంపెనీలతో పొత్తు కుదుర్చుకుని కానీ, శతఘు్నలను ఇక్కడే తయారు చేయవచ్చు. భార తీయ వాయుసేన కోసం టాటా సన్స్, ఎయిర్ బస్ సంయుక్తంగా నిర్మించతలపెట్టిన 56 రవాణా విమా నాల తయారీ ప్రాజెక్టు ఆమోదం కోసం రక్షణ శాఖ అదనపు సమాచారం కోరింది. రూ.8,200 కోట్ల విలువైన 106 స్విస్ పిలాటస్ ప్రాథమిక శిక్షణ యుద్ధ విమానాల కొనుగోలును వాయిదా వేశారు. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద సైనిక సం పత్తి కలిగిన భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆయు ధాల కొనుగోలుదారు కూడా. తాజాగా కేంద్ర ప్రభు త్వం నూరు బిలియన్ డాలర్ల విలువైన రక్షణ వ్యవ స్థల నవీకరణకు ప్రయత్నాలు చేపట్టింది. దీంతో దేశీయ రక్షణ పరిశ్రమకు నూతనోత్సాహం కలుగ నుందని నిపుణుల అంచనా. చైనా సైనిక శక్తితో పోటీ పడేందుకోసం భారతీయ సైన్యం ఆధునీకర ణకు నరేంద్రమోదీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. దేశ పశ్చిమ సరిహద్దుల్లో తిష్టవేసి ఉన్న పాకిస్తాన్ సైన్యాలతో మన బలగాలు పేలవమైన ఆయుధా లతో తలపడుతున్నాయి. చివరకు వివాదాస్పద మైన హిమాలయా సరిహద్దుల్లో చైనా గస్తీ బలగాల ముందు కూడా మన సైనిక దళాలు తేలిపోతున్నా యి. ఈ నేపథ్యంలోనే కేంద్రం మన రక్షణ పాట వాన్ని బలోపేతం చేయడానికి నడుం బిగించింది. కానీ రక్షణ కొనుగోళ్లలో వరుస కుంభకోణాలు మన సైనికపాటవాన్ని ఘోరంగా దెబ్బతీస్తూ వచ్చా యి. దేశ చరిత్రలో అతిపెద్ద రక్షణ కుంభకోణాల్లో ఒకటైన బోఫోర్స్ చేదు జ్ఞాపకాలు నేటికీ దేశాన్ని వెంటాడుతున్నాయి. 30 కిలోమీటర్ల పరిధి కలిగిన హోవిట్జర్ తుపాకుల కోసం భారతీయ సైన్యం ప్రక టించిన టెండర్‌ను స్వీడిష్ ఆయుధాల కంపెనీ బొఫోర్స్ సంస్థ భారీ ముడుపులిచ్చి హస్తగతం చేసు కుందని 1987 ఏప్రిల్ 16న స్వీడిష్ రేడియో బాంబు పేల్చింది. ఖత్రోచీ ఈ ఒప్పందం కుదిర్చినందుకు 3 శాతం కమిషన్ పుచ్చుకున్నారని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాధినేత రాజీవ్‌గాంధీకి కూడా ఈ కుంభకో ణంలో భాగముందని ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా 2012-13లో వెలుగులోకి వచ్చిన అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం మన రక్షణశాఖ ముడుపుల వాటం ఏమాత్రం తగ్గకుండా కొనసాగిం దని తేల్చి చెప్పింది. టెక్నాలజీ తస్కరణకు పాల్పడినట్లు భావి స్తున్న బిఇఎమ్ఎల్ కుంభకోణంతో సహా స్కార్పెన్ సబ్‌మెరైన్, బోఫోర్స్, శవపేటికల కుంభకోణం, ఆగస్టా.. ఇవి మన రక్షణశాఖ నిర్వాకానికి పరాకాష్ట లుగా నిలిచిన కుంభకోణాలు. ఇవి సివిలియన్ కుం భకోణాల కంటే ప్రమాదకరంగా మన రక్షణకు తూ ట్లు పొడిచిన కుంభకోణాలు. వీటన్నిటి సారాంశం ఏమంటే రక్షణ శాఖలో, సాయుధ బలగాల్లో లంచ గొండులైన అధికారులు లెక్కకు మించి ఉన్నారనే. వీరి ముడుపుల వ్యవహారాలకు గాను విచారించి భారీ జరిమానాలు, కఠిన శిక్షలతో జైలుకు పంపిన ప్పుడే మన వ్యవస్థ మొత్తం పరిశుభ్రం కాగలదు. టైజం గురించి మాట్లాడుతుంటాం. ఉగ్రవాదు లను ఉరి తీయాలని గావుకేకలు పెడుతుంటాం. కానీ యావజ్జాతిని లోపలనుంచే ధ్వంసం చేస్తున్న ఇలాంటి వేరుపురుగుల జోలికి మాత్రం మనం పోం. ఇది సాగినంతవరకు రక్షణ రంగం కుంభకో ణాలకు అతీతంగా ఉండటం అసాధ్యమే. మనోహర్ పారికర్ రూపంలోని ఒక నిజాయితీపరుడి చిత్తశుద్ధి మాత్రమే రక్షణ శాఖను శుద్ధి చేస్తుందని భావించ డం మనందరి పేరాశే అవుతుంది. -కె.రాజశేఖరరాజు -
ఆశ్రమం కాదు.. ఆయుధాగారం!
చండీగఢ్: హర్యానాలోని హిస్సార్ జిల్లా, బల్వారాలో ఉన్న వివాదాస్పద స్వామీజీ రాంపాల్ ఆశ్రమం ఆధ్యాత్మతకు కాకుండా ఆయుధాలకు నిలయంగా కనిపిస్తోంది. రాంపాల్ అరెస్ట్ అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) జరుపుతున్న సోదాల్లో భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి బయటపడింది. వాటితో పాటు పెట్రోల్ బాంబులు, యాసిడ్ సిరంజీలు, చిల్లీ గ్రెనేడ్లు కుప్పలుగా కనిపించాయి. రాంపాల్ గది పక్కనే ఉన్న మరో గదిలో గర్భ నిర్ధారణ పరికరం కూడా కనిపించింది. ఆశ్రమంలో మూడు .32 బోర్ రివాల్వర్లు, 19 ఎయిర్ గన్లు, 4 రైఫిళ్లు, వివిధ తుపాకులకు వినియోగించే 100కు పైగా క్యాట్రిడ్జ్‌లు లభించాయి. చాలావరకు ఆయుధాలను రెండు ప్రత్యేక గదుల్లోని బీరువాల్లో దాచారు. మందుగుండు సామగ్రిని మాత్రం ఎవరికీ అనుమానం రాకుండా ఆశ్రమం మధ్యలో ఒక వేదికలాంటి దాన్ని నిర్మించి దానిలోపల దాచిపెట్టారు. ఆ వేదికపై స్వామీజీ ఆసనం ఉండటం వల్ల ఎవరి దృష్టి దానిపై పడదని వారు భావించి ఉంటారని పోలీసులు తెలిపారు. ఆశయం చుట్లూ 50 అడుగుల ఎత్తై ప్రహారీ గోడ, ఆ ప్రహారీ మధ్యలో అక్కడక్కడా వాచ్ టవర్లు, లోపలికి వచ్చేవారిని పరీక్షించేందుకు మెటల్ డిటెక్టర్లు, ఆశ్రమం అంతటా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆశ్రమంలో భారీ స్విమింగ్‌పూల్, 24 ఏసీ గదులు, అందులో స్వామీజీ కోసం ప్రత్యేకంగా మసాజ్ రూం కూడా ఉంది. 800 లీటర్ల డీజిల్, భారీ సంఖ్యలో కర్రలు, హెల్మెట్లు, నల్లరంగు దుస్తులు కూడా లభించాయి. లక్షమందికి నెల రోజుల పాటు భోజనం సమకూర్చగల స్థాయిలో ఆహార నిల్వలు కూడా ఉన్నాయి. 1000 బ్రెడ్లను ఒకేసారి తయారుచేయగల మెషీన్ కూడా ఉంది. మొత్తం ఆశ్రమాన్ని సోదా చేసేందుకు మరో రెండు, మూడు రోజులు పడుతుందని సిట్ ప్రతినిధి తెలిపారు. 50 వేల మంది కూర్చోగల ప్రార్థనామందిరంలో ప్రవచనాలు ఇచ్చేందుకు స్వామీజీ కోసం ప్రత్యేకంగా హైడ్రాలిక్ కుర్చీ, దాని చుట్టూ బుల్లెట్‌ప్రూఫ్ ఎన్‌క్లోజర్ ఉంది. తనిఖీల సందర్భంగా.. స్నానాల గదిలో అపస్మారక స్థితిలో ఉన్న మహిళను రక్షించి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆశ్రమంలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. -
ఆయుధాలిస్తే అక్రమాలకు చెక్‌పెడతాం
నర్సాపూర్ : అటవీ శాఖ అధికారులకు, సిబ్బందికి ఆయుధాలు ఇస్తే అక్ర మాలను అడ్డుకుంటామని అటవీ శాఖ నిజామాబాద్ సర్కిల్ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ వై.బాబురావు పేర్కొన్నారు. సోమవారం ఆయన నర్సాపూర్ అటవీశాఖ రేంజ్ పరిధిలో పర్యటించిన అనంతరం నర్సాపూర్‌లో స్థానిక విలేకరులతో మాట్లాడారు. రా త్రి పూట అడవుల్లో చెట్లు నరికివేతను, అక్రమ కలప రవాణను అడ్డుకునేందు కు ప్రయత్నించే సమయంలో తమకు సరైన ఆయుధాలు లేకపోవడంతో అక్రమార్కులు తమ సిబ్బంది, దాడులు చేస్తున్నారని, కొన్ని సందర్భాల్లో ప్రమా దాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గతంలో నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో తమ సిబ్బందిపై దాడులు జరిగినపుడు తమకు ఆయుధాలు ఇవ్వాలని కోరు తూ ప్రభుత్వానికి లేఖ రాశామ న్నారు. మహారాష్ట్రలో అటవీ శాఖకు ఆయుధా లు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. అటవీ శాఖ నిజామాబాద్ సర్కిల్ పరిధిలోని మెదక్, నిజామాబాద్ జిల్లా ల్లో ఎంపిక చేసిన అడవుల్లో సుమారు 916 హెక్టార్లలో మొక్కుల నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. హరితహారం కోసం కృషి సీఎం కేసీఆర్ ప్రకటించిన హరితహా రం కార్యక్రమాన్ని విజయవంతం చే సేందుకు అటవీ శాఖ తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని బాబురావు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా అవసరమైన మొక్కలను పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. అక్రమ రవాణాపై ప్రత్యేక చర్యలు నర్సాపూర్ మీదుగా రాత్రిపూట అక్రమంగా కలప రవాణా జరుగుతున్న వి షయాన్ని ఆయన దృష్టికి తీసుకవెళ్లగా అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని బాబురా వు ప్రకటించారు. అక్రమ కల ప రవాణాను అడ్డుకునేందుకు మరో వాహనా న్ని రేంజ్‌కు కేటాయిస్తామన్నారు. అక్ర మ రవాణాను అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, రాత్రి పూట ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని అక్కడే ఉన్న మెదక్ డీఎఫ్ఓ సోనిబాల తదితర అధికారులను ఆదేశించారు. -
ఎక్కుపెట్టండిలా..!
పోలీసులు, వెపన్లు అంటే ఆమడదూరంలో ఉండే విద్యార్థులు ఆయుధాల ప్రదర్శనపై ఆసక్తి కనబర్చారు. పోలీసులు ఉపయోగించే వస్తువులు, ఆయుధాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం తాడేపల్లిగూడెం జెడ్పీ హైస్కూల్లో పోలీసులు ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యాధునిక ఆయుధాలు 303, సెల్ఫ్ లోడెడ్ రైఫిల్ (ఎస్ఎల్ఆర్), కార్బన్, ఏకే 47, ఇన్సాస్, డీబీబీఎల్ (రబ్బర్ బుల్లెట్ ) గ్యాస్ గన్, రివాల్వర్, పిస్టల్, గ్రెనేడ్, బాంబ్లను ప్రదర్శించారు. వాటిని ఆసక్తిగా తిలకించిన హైస్కూల్ విద్యార్థులు అవి ఎలా పనిచేస్తాయో అడిగి తెలుసుకున్నారు. పలువురు విద్యార్థినులు ఆయుధాలను చేతుల్లోకి తీసుకుని ముచ్చటపడ్డారు. ఆయుధాలు, వైర్లెస్ సెట్ పనితీరు, ప్రయోజనాలపై పోలీసు అధికారులు అవగాహన కల్పించారు. సీఐ జి.దేవకుమార్, ఆర్ఐ పీఎం రాజు, ఎస్సైలు ఎస్‌సీహెచ్ కొండలరావు, వి.శ్రీనివాసరావు, కమ్యూనికేషన్ ఎస్సై కె.గవిర్రెడ్డి, జెడ్పీ హైస్కూల్ ఇన్చార్జి హెచ్ఎం సుబ్బారావు, ఏలూరు ఏఆర్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. - తాడేపల్లిగూడెం -
ఆయుధమే లేదు..యుద్ధమెలా?
శేషాచలం అడవులు ఆధ్యాత్మికతకు, ఎర్రచందనం వృక్షాలకు పెట్టింది పేరు. ఇక్కడి వృక్షాలు ఎంతో విలువైనవి. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు స్మగ్లర్లకు, ఎర్ర కూలీలకు స్థావరాలుగా మారాయి. ఎక్కడ చూసినా గొడ్డళ్ల చప్పుళ్లే. మోడువారిన వృక్షాలే.. తమిళ తంబీల దాటికి పోలీసులు సైతం అశువులు బాసుతున్నారు. బండలు ఎర్రబడుతున్నాయి. వీరిని కట్టడి చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అడవుల్లో సీసీ కెమెరాల నుంచి పోలీసులకు అత్యాధునిక ఆయుధాల వరకు సమకూర్చుతామని నాయకులు మాటిచ్చారు. అయితే ఇంతవరకు ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. కూంబింగ్‌కు వెళ్లిన అధికారులు, పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై ఎర్రచందనం దొంగలు మారణాయుధాలతో తెగబడుతున్నారు. వారిపై ఆయుధాలు లేకుండా యుద్ధమెలా సాధ్యమో ఆ దేవుడికే తెలియాలి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేస్తామని సీఎం చంద్రబాబు.. అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రకటనలిచ్చారు. స్మగ్లర్లు.. వారికి సహకరించే అధికారులపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించి జైళ్లలో పెడతామని హెచ్చరిం చారు. అటవీ, పోలీసుశాఖలతో ప్ర త్యేక దళాన్ని ఏర్పాటుచేసి శేషాచలం అడవులను జల్లెడ పడతామన్నారు. ఇస్రో(భారత అంతరిక్ష పరిశోధన సం స్థ) సహకారంతో శేషాచలం అడవులపై శాటిలైట్‌తో నిఘా వేసి.. ఎర్రచందనం వృక్షాలను నరికివేయకుండా అ డ్డుకట్ట వేస్తామన్నారు. వృక్షాలు విస్తారంగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి.. వాటిని అనుసంధానం చేసి నిఘా ఏర్పాటుచేస్తామని స్పష్టీకరించారు. అటవీశాఖ అధికారులకు అధునాతన ఆయుధాలను అం దిస్తామన్నారు. ఎర్రచందనం స్మగ్లిం గ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఎన్‌కౌం టర్లకు కూడా వెనుకాడమని సంకేతాలు పంపారు. వారి మాటలన్నీ కార్యరూపం దాల్చి ఉంటే ఒక్క ఎర్రచందనం దుంగా శేషాచలం అడువుల నుంచి బయటకు వచ్చేది కాదని అటవీశాఖ అధికారవర్గాలే చెబుతున్నారు. అధికమైన స్మగ్లింగ్.. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడడం కాదు కదా.. నాలుగు నెలల్లో మరింత అధికమైంది. వృక్షాలను నరకివేస్తున్న కూలీలను అడ్డుకోవడానికి వెళ్లిన అటవీశాఖ అధికారులపై దాడులకు పాల్పడుతున్నారు. అటవీ అధికారుల వద్ద ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో కూలీలను అడ్డుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇద్దరు అటవీ అధికారులు కూలీల చేతిలో హతమయ్యారు. అటవీ అధికారులను ఎర్ర కూలీలు, స్మగ్లర్లు పొట్టన పెట్టుకున్నాక పోలీసులు ఎన్‌కౌం టర్లకు తెరతీశారు. ఇప్పటిదాకా మూడు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఎర్ర కూలీలను కాల్చి చంపారు. కానీ.. ఎర్రచందనం వృక్షాల నరికివేతకు మాత్రం అడ్డుకట్ట పడలేదు. దీనికి ప్రధాన కారణం.. శేషాచలం అడవులపై నిఘా లేకపోవడమే. శేషాచలం అడవులపై శాటిలైట్‌తో నిఘా వేయించడానికి ఇప్పటికీ ఇస్రో సహకారం కోరకపోవడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. ఇక సీసీ కెమెరాల ఏర్పాటు ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. అటవీ అధికారులకు అధునాతన ఆయుధాలను అందించలేదు. కూంబింగ్‌ను దాదాపుగా నిలిపేశారు. ఫలితంగా స్మగ్లర్లు తమిళ కూలీలతో యథేచ్ఛగా ఎర్రచందనం వృక్షాలను నరికివేయిస్తున్నారు. చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లె అడవుల్లో ఎర్రచందనం వృ క్షాలను నరుకుతున్న 75 మంది తమిళ కూలీలను అడ్డుకోవడానికి అటవీశాఖ అధికారులు మంగళవా రం రాత్రి ప్రయత్నించారు. ఆయుధాలు లేకపోవడంతో అటవీ అధికారులపై కూలీలు దాడి చేశారు. రెండు రోజుల క్రితం మురకంబట్టు వద్ద శేషాచలం అడవుల్లో ఎర్రచంద నం వృక్షాలను నరికివేయడానికి వస్తున్న తమిళ కూలీలను అడ్డుకోవడానికి పోలీసులు విఫలయత్నం చే శారు. కూలీలు పోలీసులు దాడిచేసి తప్పించుకుని శేషాచలం అడవుల్లో కి అడుగుపెట్టి యథేచ్ఛగా ఎర్రచందనం వృక్షాలను నరికేస్తున్నారు. కూలీలకు అడ్డుకట్ట వేయలేరా? తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా లో జివ్వాజిమలై, పోలూరు, తిరువళ్లూరు జిల్లాలో ఆర్కే పేట, పుదుమే డు, విల్లుపురం జిల్లాలో శంకరాపురం, వేలూరు జిల్లాలో గుడియాత్తం, పేర్నంబట్టు ప్రాంతాల్లోని గిరిజనులను ఎర్రచందనం వృక్షాలను నరికి.. రవాణా చేయడానికి స్మగ్లర్లు కూలీలు గా వాడుకుంటున్నారు. ఎర్రచందనం వృక్ష సంపదను పరిరక్షించడానికి ఏడాదిగా శేషాచలం అడవులను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎర్రకూలీల దా డి.. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఇప్పటిదాకా ఎనిమిదిమంది కూలీలు, ఇద్ద రు అటవీశాఖ అధికారులు మృతి చెందారు. ఎర్రచందనం కూలీలను శేషాచలం అడవుల్లోకి ప్రవేశించకుండా చేసేందుకు ప్రధాన రహదారులు, రైల్వే స్టేషన్లపై పోలీసులు నిఘా వే శారు. కూలీలు నివాసం ఉంటున్న ప్రాంతాలకు వెళ్లి.. ఎన్కౌంటర్ చేసిన ఫొటోలతో కూడిన వాల్‌పోస్టర్లను పోలీసులే అతికించారు. ఎర్రకూలీ లుగా వస్తే ఎన్కౌంటర్ చేస్తామని ెహ చ్చరించి.. గిరిజనులను చైతన్యం చేయడానికి ప్రయత్నించామని పో లీసులు చెబుతున్నారు. పోలీసులు వేసిన ఎత్తును ఎర్రదొంగలు ధనాస్త్రంతో చిత్తు చేస్తున్నారు. ఎన్కౌంటర్ లో చనిపోయిన కూలీ కుటుంబానికి రూ.పది లక్షల వంతున పరిహారం చెల్లిస్తున్నారు. గాయపడిన కూలీకి రూ.50 నుంచి రూ.లక్ష చొప్పున పరిహారం అందిస్తున్నారు. రోజువారీ కూలీ కింద రూ.ఐదు వేలను ఒక్కో కూలీకి చెల్లిస్తున్నారు. ఎర్రకూలీలు నివాసం ఉండే ప్రాంతంలో రోజువారీ కూలీగా రూ.150కి మించి ఇవ్వడం లేదు. స్మగ్లర్ల ధనాస్త్రానికి ఎర్రకూలీలు లొంగుతున్నారు. పోలీసుల ఎత్తులను చిత్తు చేస్తూ శేషాచలంలోకి ప్రవేశించి.. స్మగ్లర్ల కనుసైగల మేరకు ఎర్రచందనం వృక్షాలను నరికేసి, అక్రమ రవాణాకు సిద్ధం చేస్తుండడం గమనార్హం. -
తెలుగు వణిజులు
గణపతిదేవుని జైత్రయాత్రల వల్ల 12వ శతాబ్దిలో కోస్తాంధ్ర కాకతీయుల ఆధిపత్యంలోకి వచ్చింది. వరంగల్లు ఆంధ్రనగరి అయింది. 5వ శతాబ్దంలో అడుగంటిన విదేశీ వాణిజ్యం 10వ శతాబ్దికి మళ్ళీ పుంజుకుంది. కళింగపట్టణం (ముఖలింగం), భీమునిపట్టణం, కోకండిపర్రు (కాకినాడ), నరసాపురం, హంసలదీవి, మోటుపల్లి, కాల్పట్టణం (ఒంగోలు వద్ద పాదర్తి), కృష్ణపట్నం, గండగోపాలపట్టణం (పులికాట్) మొదలైనవి ప్రముఖ ఓడరేవులుగా ఎదిగాయి. ఆంధ్రవర్తకులు సంఘాలుగా ఏర్పడి బర్మా, థాయ్‌లాండ్, మలేసియా, ఇండోనేసియా, వియెత్నాం, చైనా దేశాలతో నౌకా వాణిజ్యం సాగించారు. ఎర్రసముద్రం, గల్ఫ్ దేశాల నుండి వచ్చే అరబీ వర్తకులు గుర్రాలు, తగరం, దంతం, ఆయుధాలు ఆంధ్రరేవులకి తెచ్చి ఇక్కడి నుంచి సుగంధ ద్రవ్యాలు, నూలు, పట్టువస్త్రాలు కొనుగోలు చేసేవారు. ఆంధ్రతీరాన్ని పరిపాలించిన రాజులకు రేవు వర్తకం నుంచి కస్టమ్స్, సేల్స్ టాక్స్ ద్వారా వచ్చే ఆదాయం చాలా ముఖ్యమైనది. అడ్డపట్టం, చీరాను, గండం, పవడం, పట్టి అనే పేర్లతో అనేక పన్నులు ఉండేవి. బంగారం విలువ నిర్ణయించేందుకు పొన్ను వెలగాళ్ళనే అధికారులు ఉండేవారు. ప్రతి రేవు వద్దా సుంకాధికారులతో కూడిన అధికార యంత్రాంగం ఉండేది. వర్తకులకు పన్నుల వివరాలు, వర్తకాన్ని ప్రోత్సహించే స్కీముల వివరాలు తెలిపే శాసనాలు రేవు పట్టణాలలో కనిపిస్తాయి. క్రీ.శ. 1150లో కాకతీయ గణపతిదేవుడు, 1280లో రెడ్డిరాజు అనపోతయరెడ్డి మోటుపల్లిలో వేయించిన శాననాలు వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు వర్తకులకు ఇచ్చిన సదుపాయాలు, హామీలు, పన్నులపై మినహాయింపులు తెలుపుతాయి. మోటుపల్లికి వచ్చిన వర్తకులకి ఉచితంగా గృహాలు, గిడ్డంగులకి భూములూ ఇచ్చి ప్రోత్సహించారు. హరవిలాసం అంకితం తీసుకున్న అవచి తిప్పయశెట్టి గురించి శ్రీనాథుడు చెప్పిన ఈ పద్యం ఆనాటి వైశ్యులు సాగించిన విదేశీ వాణిజ్యానికి అద్దం పడుతుంది. తరుణాసీరి తవాయి గోప రమణా స్థానంబులం జందనా గరు కర్పూర హిమంబు కుంకుమ రజఃకస్తూరికా ద్రవ్యముల్ శరధిస్ కల్పలి, జోంగు, వల్లి వలికా సమ్మన్ల, దెప్పించు నే ర్పరియై వైశ్యకులోత్తముం డవచి తిప్పండల్పుడే యిమ్మిహన్ ఇందులో తరుణసీరి బర్మాలోని తెన్నసెరిం, తవాయి థాయ్‌లాండ్, రమణా అంటే బర్మాలో రామన్న దేశం అనే రంగూన్ ప్రాంతం. ఇవేగాక, పంజారం అంటే సుమత్రాదీవిలోని పాన్సార్, యాంప అంటే శ్రీలంకలోని జాఫ్నా, బోట అంటే భూటాన్, హరుమూజి అంటే గల్ఫ్‌లోని హోర్ముజ్; ఇలా అనేక విదేశీ రేవుల ప్రస్తావన హరవిలాసంలో కనిపిస్తుంది. కప్పలి, జోంగు మొదలైనవి ఆనాటి ఓడల్లో రకాలు. కప్పలి నేటి తమిళనాడులో కనిపించే కప్పళ్, జోంగ్ ఇంగ్లిష్‌లో జన్క్ అనబడే చైనా నౌక, వల్లీ, వలికా అనేవి వణిజ అనే పదం నుండి వచ్చిన తెలుగు వర్తకుల నావలు. సమ్మన్ అంటే చైనావాళ్ళ చిన్న నౌక సాంపాంగ్. క్రీ.శ. 1194లో రుద్రమదేవి పాలనలో ఉన్న మోటుపల్లిలో దిగిన వెనిస్ యాత్రికుడు మార్కోపోలో, చైనా రేవుల్లో ఇండియా నౌకలే అతి పెద్దవి అన్నాడు. అప్పు ఎగవేస్తే అది వసూలు చేసుకునేందుకు దొరికిన వాడి చుట్టూ గిరిగీసి వీధిలో నిలబెట్టడం అనే ఆచారాన్ని మోటుపల్లిలో చూసినట్లు మార్కోపోలో రాశాడు. ఎంతటి రాజయినా సరే అప్పు తీర్చడమో లేదా ఏదైనా పరిష్కారమో చూపి ఋణదాత ఒప్పుకుంటేనే తప్ప ఆ గీసిన గీత దాటలేడని చెప్పాడు. -
ఆబ్కారీకి ఆయుధాలు
ఆదిలాబాద్ క్రైం : తెలంగాణ ప్రభుత్వం ఆబ్కారీ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వనుంది. గుడుంబా, గంజాయి స్మగ్లర్ల నుంచి ప్రాణాపాయం లేకుండా వీరికి తుపాకులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ఆబ్కారీ శాఖ నుంచి వివరాలు కోరింది. ఈ మేరకు అధికారులు ఎంత మంది సిబ్బంది ఉన్నారు? ఎన్ని ఆయుధాలు అవసరం అనే నివేదికలు ప్రభుత్వానికి పంపించారు. ఆయుధాలు ఎందుకు? జిల్లాలో గుడుంబా తయారీ, గంజాయి సాగు అధికంగా ఉంది. వీటిని అరికట్టడానికి ఆబ్కారీ అధికారులు వెళ్లినప్పుడు స్మగ్లర్లు దాడులు చేసిన సంఘటనలూ అనేకం ఉన్నాయి. చేతుల్లో ఆయుధాలు లేకపోవడంతో వారి దాడులను ఎదుర్కోవడం లేదు. ఆయుధాలు లేకపోవడంతో పోలీసుల సహాయం తీసుకోవాల్సి వస్తోంది. పోలీసులు విధి నిర్వహణలో బిజీగా ఉన్నప్పుడు స్మగ్లర్లు తప్పించుకు పోతున్నారు. పోలీసు శాఖపై ఆధారపడకుండా ఆబ్కారీ శాఖకు ఆయుధాలు ఇవ్వాలని గత ప్రభుత్వాలు భావించినా అమలుకు నోచుకోలేదు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మేరకు చొరవ చూపుతోంది. ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు ఇవ్వనున్నట్లు నిర్ణయించినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లోనే.. జిల్లా వ్యాప్తంగా 11 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. ఒక డిప్యూటీ కమిషనర్, ఇద్దరు ఎక్సైజ్ సూపరిటెం డెంట్లు, 11 మంది సీఐలు, 20 మంది ఎస్సైలు 50 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 160 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. జిల్లాలోని గుడుంబా తయారయ్యే సమస్యాత్మక ప్రాంతాల్లోనే ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో చెన్నూరు, లక్సెట్టిపేట, ఉట్నూర్, ఇచ్చోడ, నిర్మల్, మంచిర్యాల స్టేషన్ల పరిధిలో గుడుంబా స్థావరాలు అధికంగా ఉంటాయి. ఈ స్టేషన్ల పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో పెద్ద ఎత్తున గుడుంబా తయారవుతోంది. అయితే ఈ స్టేషన్లో పరిధిలో పనిచేసే ఎక్సైజ్ సిబ్బందిపై గుడుంబా తయారీదారులు, గంజాయి సాగు చేసేవారు దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత ఎక్సైజ్ అధికారులతోపాటు సిబ్బందికి కూడా ఆయుధాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. నివేదిక పంపాం.. - శివరాజు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గుడుంబా తయారీ నియంత్రణలో ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని ఇదివరకే ప్రభుత్వానికి నివేదించాం. శాఖపరంగా అన్ని సమగ్ర వివరాలు అందజేశాం. ఆయుధాలు లేకపోవడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. గుడుంబా స్థావరాలపై దాడులు చేసే సమయంలో పోలీసుల సహాయం తీసుకుంటున్నాం. దీనిపై ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఇంక ఎలాంటి ఆదేశాలు రాలేదు. -
ఆబ్కారీ చేతిలో ఆయుధం
ఖమ్మం క్రైం : ఎక్సైజ్ సిబ్బంది చేతికి ఇక ఆయుధాలు రాబోతున్నాయి. సాయుధ పోలీసు దళంలో వీరూ చేరబోతున్నారు. గుడుంబా తయారీదారులు, గంజాయి స్మగ్లర్ల నుంచి ప్రాణాపాయం లేకుండా వీరికి తుపాకులు అప్పగించే కార్యక్రమానికి రంగం సిద్ధమవుతోంది. ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు ఆ శాఖ మంత్రి పద్మారావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఏయే ప్రాంతాల్లో సిబ్బందికి ఆయుధాలు అవసరముంటాయో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు నివేదికలు తయారు చేస్తున్నారు. ఎందుకు ఇలా..? జిల్లాలో గుడుంబా తయారీ ఎక్కువగా ఉండడం, ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తుండడం తెలిసిందే. వీటిని అరికట్టడానికి వెళ్లిన ఎక్సైజ్ సిబ్బందిపై దాడులు జరిగాయి. చేతుల్లో ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో సిబ్బంది ఈ దాడులను ఎదుర్కొలేక ఇబ్బందు లు పడుతున్నారు. గాయాలకు గురై ఆస్పత్రుల్లో చేరిన సందర్భాలూ ఉన్నాయి. గుడుంబా తయారీదారులు, గంజాయి సాగుదారుల దాడులను ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక వైపు శాంతిభద్రతల విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు ఎక్సైజ్ సిబ్బందితో కలిసి దాడుల్లో పాల్గొనడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. పోలీస్ శాఖపై ఆధార పడకుండా ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు ఇవ్వాలని గత ప్రభుత్వాలు భావించినా అది అమలుకు నోచుకోలేదు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మేరకు చొరవ చూపుతోంది. ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు ఇవ్వాలని నిర్ణయించింది. సమస్యాత్మక ప్రాంతాల్లోనే... జిల్లాలో గుడుంబా తయారయ్యే సమస్యాత్మక ప్రాంతాల్లోనే సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఏయే ప్రాంతాల్లో ఎక్సైజ్ సిబ్బందిపై గుడుంబా తయారీదారులు, గంజాయి స్మగ్లర్లు దాడులు చేసే అవకాశముందో ఆ సిబ్బంది సంఖ్య గురించి నివేదిక పంపించాలని భావిస్తున్నారు. జిల్లాలో పని చేస్తున్న ఎక్సైజ్ అధికారులతో పాటు సిబ్బందికి కూడా ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఎవరెవరికి... జిల్లాలో ఒక డిప్యూటీ కమిషనర్, ఒక అసిస్టెంట్ కమిషనర్, ఇద్దరు ఈఎస్‌లు, ముగ్గురు ఏఈఎస్‌లు, 19 మంది సీఐలు, 42 మంది ఎస్సైలు, 38 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 194 మంది కానిస్టేబుళ్లు ఆయుధాలు చేపట్టే అవకాశం ఉంది. వీరిలో అధికారుల వరకు 9 పాయింట్ 38 రివాల్వర్లు మిగతా సిబ్బందికి 303 తుపాకులు ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే వీరిలో కొద్దిమంది సీఐలు, ఎస్సైలు, జూనియర్ అసిస్టెంట్ల స్థాయి నుంచి పదోన్నతిపై రావడంతో వారికి వెపన్ ట్రైనింగ్‌పై అవగాహన లేదు. మిగతా వారు ఎక్సైజ్ ఎస్సై స్థాయి నుంచి రావడంతో వారికి శిక్షణలో భాగంగానే ఎక్సైజ్ అకాడమీలో వెపన్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. వెపన్ ట్రైనింగ్‌పై అవగాహన లేనివారి గురించి వివరాలను ఎక్సైజ్ ఉన్నతాధికారులు తయారు చేస్తున్నారు. ఈ సిబ్బందిలో ఎంత మందికి ఆయుధాలు ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాత ఎక్సైజ్ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.