
సైన్యానికి 1.85 లక్షల రైఫిళ్లు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సైనికులకు భారీగా ఆయుధాలను అందించనుంది. దాదాపు 1.85 లక్షల రైఫిళ్లను సరఫరా చేయాలని దేశంలోని వివిధ ఆయుధ కర్మాగారాలను కోరింది. భారత సైన్యానికి అత్యంత శక్తివంతమైన 65 వేల రైఫిళ్లు తక్షణం సమకూర్చాలని విజ్ఞప్తి చేసింది.
ఇందుకు దేశ విదేశాల్లోని దాదాపు 20 ఆయుధ ఉత్పత్తి సంస్థలు కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించాయి. వీటికి సంబంధించి టెండర్లు త్వరలోనే ఖరారు కానున్నాయి. ప్రస్తుతం సైన్యం దేశీయ ఆయుధాలైన ఐఎన్‌ఎస్‌ఎస్ (ఇండియన్ న్యూ స్మాల్ ఆర్మ్ సిస్టం) రైఫిళ్లను ఉపయోగిస్తోంది. వీటి స్థానంలోనే కొత్త ఆయుధాలు సైనికులకు అందనున్నాయి.