భారత్‌లో పాక్ ఉగ్ర మూకల వేట కొనసాగుతోంది. జమ్మూ ప్రాంతంలో సుమారు 40 నుంచి 50 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు కేంద్ర నిఘూ వర్గాలు గుర్తించాయి. దీంతో భద్రతా బలగాలు ఉగ్ర మూకల్ని ఏరిపారేసేందుకు కూంబింగ్ ప్రారంభించాయి..
పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. జమ్మూ ప్రాంతంలోకి చొరబడిన ఉగ్రవాదులు అత్యున్నత శిక్షణ పొందారు. వారి వద్ద అమెరికా తయారు చేసిన ఎం4 కార్బైన్ రైఫిల్స్‌తో పాటు అత్యంత ఆధునిక, అధునాతన ఆయుధాలు ఉన్నట్లు సమాచారం. బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లోకి సైతం చొచ్చుకుపోయే సామర్థ్యం ఉన్న బుల్లెట్లను ఉన్నాయని తేలింది.
జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదులు యాక్టీవ్‌గా ఉన్నారు. ముఖ్యంగా పర్వతాలు, అడవుల కేంద్రంగా ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. వారి ఏరివేత కోసం ఆర్మీ దళాలు కార్డన్, సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.
Comments
Please login to add a commentAdd a comment