అమెరికాలో 11 ఏళ్ల చిన్నారి బెదిరింపులు
సంకెళ్లు వేసి జైలుకు పంపిన పోలీసులు
ఫ్లోరిడా: రెండు స్కూళ్లలో కాల్పులు జరిపి, చంపాల్సిన ‘కిల్ లిస్ట్‌ను తయారు చేసుకున్నాడు. అందుకు రకరకాల రైఫిళ్లు, పిస్టళ్లతోపాటు, కత్తులను సైతం సిద్ధం చేసుకున్నాడు. కిల్ లిస్ట్‌తోపాటు ఆయుధ సామగ్రి ఫొటోలను ఆన్‌లైన్‌లో తన క్లాస్‌మేట్‌లకు గొప్పగా చూపించుకున్నాడు. అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన 11 ఏళ్ల బాలుడి ఘన కార్యమిది. .! అసలే స్కూళ్లలో కాల్పుల ఘటనలతో జనం గగ్గోలు పెడుతున్న సమయం. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. దీంతో, వారు ‘కార్లో కింగ్‌స్టన్’ డొరెల్లి’ కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్లారు. అతడు పోగేసిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
‘క్రీక్ సైడ్ మిడిల్ స్కూల్‌లో చదువుకుంటున్న కార్లో అనే బాలుడు క్రీక్ సైడ్, సిల్వర్ శాండ్ మిడిల్ స్కూళ్లలో వాళ్లను కాల్చి చంపేందుకు పథకం వేశాడు. పేర్లు, లక్ష్యాలతో జాబితాను సైతం సిద్ధం చేసుకున్నాడు. వీటిని ఆన్‌లైన్‌లో పెట్టాడు. ఇదేమని అడిగితే ఒట్టి జోక్ మాత్రమే అంటున్నాడు’ అని ఒలూసియా కౌంటీ షరీఫ్ మైక్ చిట్వూడ్ తెలిపారు. అధికారులు బాలుడికి సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్తున్న వీడియోను ఆయన ‘థ్రెడ్’లో షేర్ చేశారు. అతడిపై శిక్షార్హమైన నేరం కింద కేసు నమోదు చేశామన్నారు. ‘ఉత్తుత్తిగా లేదా నిజంగానే బెదిరింపులకు గురిచేసే పిల్లల ఫొటోలతో వివరాలను బహిర్గతం చేస్తాం. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి’అని తల్లిదండ్రులను హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment