middle school
-
ఆ రెండు స్కూళ్లలో వాళ్లని కాల్చి చంపేస్తా!
ఫ్లోరిడా: రెండు స్కూళ్లలో కాల్పులు జరిపి, చంపాల్సిన ‘కిల్ లిస్ట్‌ను తయారు చేసుకున్నాడు. అందుకు రకరకాల రైఫిళ్లు, పిస్టళ్లతోపాటు, కత్తులను సైతం సిద్ధం చేసుకున్నాడు. కిల్ లిస్ట్‌తోపాటు ఆయుధ సామగ్రి ఫొటోలను ఆన్లైన్లో తన క్లాస్మేట్లకు గొప్పగా చూపించుకున్నాడు. అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన 11 ఏళ్ల బాలుడి ఘన కార్యమిది. .! అసలే స్కూళ్లలో కాల్పుల ఘటనలతో జనం గగ్గోలు పెడుతున్న సమయం. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. దీంతో, వారు ‘కార్లో కింగ్స్టన్’ డొరెల్లి’ కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్లారు. అతడు పోగేసిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ‘క్రీక్ సైడ్ మిడిల్ స్కూల్లో చదువుకుంటున్న కార్లో అనే బాలుడు క్రీక్ సైడ్, సిల్వర్ శాండ్ మిడిల్ స్కూళ్లలో వాళ్లను కాల్చి చంపేందుకు పథకం వేశాడు. పేర్లు, లక్ష్యాలతో జాబితాను సైతం సిద్ధం చేసుకున్నాడు. వీటిని ఆన్లైన్లో పెట్టాడు. ఇదేమని అడిగితే ఒట్టి జోక్ మాత్రమే అంటున్నాడు’ అని ఒలూసియా కౌంటీ షరీఫ్ మైక్ చిట్వూడ్ తెలిపారు. అధికారులు బాలుడికి సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్తున్న వీడియోను ఆయన ‘థ్రెడ్’లో షేర్ చేశారు. అతడిపై శిక్షార్హమైన నేరం కింద కేసు నమోదు చేశామన్నారు. ‘ఉత్తుత్తిగా లేదా నిజంగానే బెదిరింపులకు గురిచేసే పిల్లల ఫొటోలతో వివరాలను బహిర్గతం చేస్తాం. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి’అని తల్లిదండ్రులను హెచ్చరించారు. -
వ్యవసాయం ఇక పాఠ్యాంశం
న్యూఢిల్లీ: పాఠశాల స్థాయిలోనే వ్యవసాయాన్ని ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టడానికి కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా జాతీయ విద్యా విధానం 2020లో సంస్కరణలు తీసుకువస్తామని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భవనా లను ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన ప్రధాని అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి, వంట నూనె దిగుమతులు తగ్గించి ఫుడ్ ప్రాసెసింగ్‌ను పెంచడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ‘‘వ్యవసాయ రంగానికి సంబంధించిన విజ్ఞానం ప్రతీ విద్యార్థికి ఉండాలి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గ్రామాల్లో మాధ్యమిక స్థాయిలో వ్యవసాయాన్ని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెడతాం’’అని ప్రధాని స్పష్టం చేశారు. అలా చేయడం వల్ల దేశంలో వ్యవసాయ రంగంలో పారిశ్రామిక ప్రగతి సాధ్యపడుతుందని వ్యవసాయం, దాని మార్కెటింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటివి చిన్నప్పట్నుంచి ప్రతీ ఒక్కరూ నేర్చుకుంటే వ్యవసాయదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. వ్యవసాయం, పరిశోధనల అనుసంధానం వచ్చే ఆరేళ్లలో వ్యవసాయాన్ని, పరిశోధనల్ని అనుసంధానం చేయడానికి కేంద్రం ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు. గ్రామాల స్థాయిలో చిన్న, సన్నకారు రైతులకి కూడా వ్యవసాయ రంగం పరిశోధనలు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. ఈ అంశంలో యూనివర్సిటీ విద్యార్థులు విస్తృత పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మాధ్యమిక విద్య స్థాయిలోనే వ్యవసాయాన్ని ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెడితే ఆచరణలో ఎవరైనా బాగా రాణించడానికి ఉపయోగపడుతుందన్నారు. సాగులో సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నామని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. 30 ఏళ్ల తర్వాత భారత్‌పై దాడి చేసిన మిడతల దండుని తరిమి కొట్టడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించామన్నారు. వివిధ నగరాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి, డ్రోన్లు తదితర ఆధునిక పరిజ్ఞానం సాయంతో మిడతలపై మందులు పిచికారీ చేయడంతో పంటలకు నష్టం జరగలేదన్నారు. -
కామంతో కళ్లు మూసుకుపోయి...
వాషింగ్టన్ : తన కామ వాంఛ తీర్చుకోవడానికి ఓ టీచర్ ఓ బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడింది. పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరిస్తూ బలవంతంగా అతనితో లైంగిక వాంఛలు తీర్చుకుంది. ఎట్టకేలకు ఆ టీచర్ యవ్వారం బయటపడటంతో ఇప్పుడు ఊచలు లెక్కిస్తోంది. ఫ్లోరిడాలోని న్యూ స్మైండ్రా బీచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... వోలుసియా కంట్రీ స్కూల్స్‌లో 14 ఏళ్ల బాలుడు చదువుతున్నాడు. అదే స్కూల్లో పాఠాలు బోధించే స్టెఫానీ ఫెర్రీ(27) అనే టీచర్ అతనిపై కన్నేసింది. ఫెయిల్ చేస్తానని.. తాను చెప్పినట్లు వినాలంటూ అతని బెదిరించింది. ఈ క్రమంలో మెల్లిగా గంజాయి అలవాటు చేసింది. ఆపై అతనికి నగ్న ఫోటోలు పంపటం.. భర్త ఇంట్లో లేని సమయంలో ధైర్యం కోసం అని బాలుడి పేరెంట్స్‌ను నమ్మించి ఆ బాలుడిని తన వెంట తీసుకెళ్లింది. అలా అతనితో పలుమార్లు శృంగారంలో పాల్గొంది. చివరకు ఆ వేధింపులు భరించలేని విద్యార్థి తెగించి ఓ టీచర్‌కు విషయం మొత్తం చెప్పాడు. ఆయన ఆ విషయాన్ని కాల్ చేసి విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేశాడు. అయితే దాన్నో ఫ్రాంక్ కాల్‌గా భావించిన పేరెంట్స్ ఇంటికొచ్చిన విద్యార్థిని నిలదీశారు. ‘నన్నేంటి.. మిమల్ని కూడా ఎవరైనా లైంగికంగా వేధించొచ్చు’అంటూ రోదిస్తూ ఆ బాలుడు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశాడు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. వారు స్టెఫానీని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గతేడాది నవంబర్ నుంచి ఆమె అతనిని లైంగికంగా వేధిస్తున్నట్లు కేసు దర్యాప్తు చేపట్టిన డిటెక్టివ్లు తెలిపారు. నిందితురాలు స్టెఫానీ ఫెర్రీ -
ఆ వీడియో చూపించిన టీచర్‌కు 20 వేల ఫైన్
న్యూయార్క్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తల నరికివేస్తున్న దృశ్యాలను స్కూల్ విద్యార్థులకు చూపించినందుకు ఓ టీచర్‌కు భారీ ఫైన్ వేశారు. అమెరికాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2014-15లో అమెరికాలోని సౌత్ బ్రాంక్స్ అకాడమీలో లెక్సిక్ నైజారియో అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. అతడి ఏడాది సంపాధన దాదాపు రూ.60లక్షల పైనే. ఆయన ఉగ్రవాదులకు సంబంధించిన పాఠాలు బోధిస్తూ ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒక భయంకరమైన వీడియో చూపించాడు. అందులో సముద్రం ఒడ్డున కొంతమంది బందీల తలలు ఏ విధంగా ఉగ్రవాదులు నరికేస్తున్నారో రికార్డయిన దృశ్యాలు ఉన్నాయి. వాటిని చూసిన విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం బయటకు తెలిసి ఆ ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదుచేయగా పలు దఫాలుగా విచారించిన కోర్టు చివరకు రూ.20 వేల ఫైన్ వేసింది.