కామంతో కళ్లు మూసుకుపోయి... | Florida Teacher Arrested for Molest School Student | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 2 2018 7:54 PM | Last Updated on Fri, Nov 9 2018 5:06 PM

Florida Teacher Arrested for Molest School Student - Sakshi

వాషింగ్టన్‌ : తన కామ వాంఛ తీర్చుకోవడానికి ఓ టీచర్‌ ఓ బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడింది. పరీక్షల్లో ఫెయిల్‌ చేస్తానని బెదిరిస్తూ బలవంతంగా అతనితో లైంగిక వాంఛలు తీర్చుకుంది. ఎట్టకేలకు ఆ టీచర్‌ యవ్వారం బయటపడటంతో ఇప్పుడు ఊచలు లెక్కిస్తోంది. ఫ్లోరిడాలోని న్యూ స్మైండ్రా బీచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే... వోలుసియా కంట్రీ స్కూల్స్‌లో 14 ఏళ్ల బాలుడు చదువుతున్నాడు. అదే స్కూల్‌లో పాఠాలు బోధించే స్టెఫానీ ఫెర్రీ(27) అనే టీచర్‌ అతనిపై కన్నేసింది. ఫెయిల్‌ చేస్తానని.. తాను చెప్పినట్లు వినాలంటూ అతని బెదిరించింది. ఈ క్రమంలో మెల్లిగా గంజాయి అలవాటు చేసింది. ఆపై అతనికి నగ్న ఫోటోలు పంపటం.. భర్త ఇంట్లో లేని సమయంలో ధైర్యం కోసం అని బాలుడి పేరెంట్స్‌ను నమ్మించి ఆ బాలుడిని తన వెంట తీసుకెళ్లింది. అలా అతనితో పలుమార్లు శృంగారంలో పాల్గొంది. 

చివరకు ఆ వేధింపులు భరించలేని విద్యార్థి తెగించి ఓ టీచర్‌కు విషయం మొత్తం చెప్పాడు. ఆయన ఆ విషయాన్ని కాల్‌ చేసి విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేశాడు. అయితే దాన్నో ఫ్రాంక్‌ కాల్‌గా భావించిన పేరెంట్స్‌ ఇంటికొచ్చిన విద్యార్థిని నిలదీశారు. ‘నన్నేంటి.. మిమల్ని కూడా ఎవరైనా లైంగికంగా వేధించొచ్చు’అంటూ రోదిస్తూ ఆ బాలుడు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశాడు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. వారు స్టెఫానీని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గతేడాది నవంబర్‌ నుంచి ఆమె అతనిని లైంగికంగా వేధిస్తున్నట్లు కేసు దర్యాప్తు చేపట్టిన డిటెక్టివ్‌లు తెలిపారు.

                                                         నిందితురాలు స్టెఫానీ ఫెర్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement